breaking news
Rain
-
AP: పలు జిల్లాల్లో భారీ వర్షం.. ఎల్లో అలెర్ట్ జారీ
సాక్షి, విజయవాడ: రాగల మూడుగంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పల్నాడు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా ప్రస్తుతం విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. -
సూపర్ ఎల్ నినో.. ఈ ప్రభావం 2027 వరకు వర్షాలు కష్టమే..!
-
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం..
-
‘ముంబై లోకల్’: వర్షం గొడవలో యువకుడి దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ.. లోకల్ ట్రైన్లో ఊహించని దారుణం జరిగింది. రైలు కోచ్ తలుపు తెరిచి ఉంచే విషయమై ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం.. చివరికి ఒకరి ప్రాణాలను బలిగొంది. తోటి ప్రయాణికుడిపై ఆగ్రహంతో ఊగిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి, పదునైన ఆయుధంతో కడుపులో పొడవడంతో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.తలుపు వివాదం.. ప్రాణాంతక దాడిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయాంక్ లోహర్ (22) అనే యువకుడు చర్చిగేట్ నుంచి నల్లాసోపారా వెళ్లే ఫాస్ట్ లోకల్ రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నాడు. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోచ్ తలుపును తెరిచి ఉంచాలా లేదా మూసివేయాలా అనే విషయమై మయాంక్‌కు, మరో ప్రయాణికుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సదరు గుర్తుతెలియని దుండగుడు అకస్మాత్తుగా పదునైన ఆయుధాన్ని తీసి, మయాంక్ కడుపులో బలంగా పొడిచాడు. రాత్రి 11:04 గంటలకు రైలు బోరివలీ స్టేషన్‌కు చేరుకోగానే, రైలు పూర్తిగా ఆగకముందే నిందితుడు జనం రద్దీలోకి దూకి పారిపోయాడు.రైల్వే అధికారుల తక్షణ స్పందనరైలు బోరివలీ స్టేషన్లో ఆగడమే ఆలస్యం.. పశ్చిమ రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. తీవ్రంగా గాయపడిన మయాంక్‌ను పోర్టర్ల సహాయంతో అత్యవసరంగా బోరివలీ స్టేషన్‌లోని మెడికల్ రూమ్‌కు తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు రాత్రి 11:42 గంటలకు కందివలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ మాట్లాడుతూ.. క్షతగాత్రుడికి వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించామన్నారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపుఈ దారుణ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ముంబై సెంట్రల్), సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బోరివలీ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి జీఆర్పీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అందులో భాగంగా అంధేరి, మలాడ్, బోరివలీ రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆనవాళ్లను సేకరించి, అతడు ఏ మార్గంలో పారిపోయాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వర్షం పడింది.రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. -
వడగండ్ల వాన బీభత్సం.. గోడకూలి ఇద్దరు మృతి
సాక్షి,మహబూబ్‌నగర్: దేవరకద్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పక్కన కారును పార్క్ చేయగా, రెండు అంతస్తుల ఎత్తులో ఉన్న గోడ భారీ గాలులకు కూలిపోయి కారుపై పడింది.ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవగా, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి తీవ్రంగా శ్రమించి వారిని బయటకు తీశారు.అనంతరం తీవ్ర గాయాలపాలైన వారిని అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో దేవరకద్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను సివిల్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి, డ్రైవర్ సంతోష్‌గా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. -
ఏపీలో 4 జిల్లాల్లో భారీ వర్షం
-
నేను చెప్పినా.. నిర్లక్ష్యమేనా?
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో జూన్ 9న భారీ వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సైబరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లను వరద ముంచెత్తి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం, నగరవాసులు ఇబ్బందులు పడటంపై మండిపడ్డారు. వర్షంతో పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు తాను అనేక సూచనలు చేశానని..అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ తేదీన వర్షం సమయంలో, ఆ తర్వాత మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌లను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆదివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ కమిషనర్, అవసరమైతే నేనూ.. ‘అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇకపై వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి. వర్షం సమయంలో పురపాలక, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు పోలీసులూ క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందే. అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తా. ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను డీజీపీ తక్షణమే భర్తీ చేయాలి. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలి. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలి. అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. వర్షం సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలి. ఇంజనీర్లు ప్రాజెక్టుల వద్దే ఉండాలి వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలి. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలి. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెంటనే మంజూరు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. విత్తనాలు, యూరియాపై దృష్టి పెట్టండి ‘వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలలి. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలి. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలి. యూరియా నిల్వ, పంపణి కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలి. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన 8 రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. తాగునీరు కలుషితం కావొద్దు.. వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలి. గతంలో తాగునీటి కాలుష్యంతో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలి. నీటి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలి. వర్షాలతో నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పురపాలక, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌ను ఆదేశించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. సమీక్షలో డీజీపీ, సీఎస్‌లతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. తమన్ లైవ్ కన్సర్ట్ రద్దు
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక లైవ్ కన్సర్ట్ రద్దయింది. భారీ వర్షాల కారణంగా బీజీఎం కింగ్ తమన్ ఆధ్వర్వంలో జరగాల్సిన 'ఓజీ టూర్ ఇండియా' లైవ్ కాన్సర్ట్‌ను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోజు జరగాల్సిన ఈవెంట్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తమన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.భారీ వర్షంతో వేదిక వద్ద పెద్దఎత్తున నీరు నిలిచి ఉందని నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా ఈవెంట్‌కు సంబంధించిన సామగ్రి, పరికరాలు కూడా తడిసి ముద్దైపోయాయని తెలిపారు. అందుకే ఈవెంట్‌ను పూర్తిగా రద్దు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మ లైవ్ కాన్సర్ట్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ నిర్వహణకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. It’s Heartbreaking for Me & My 56 Member Team To Work on this #OgtourIndia .. from last 45 days Tirelessly Taking all the Feedback backs In A positive Manner We as a Team Took all the Good Energy in this World to Make this Concert happen In a Positive Manner . Sometimes It has…— thaman S (@MusicThaman) June 13, 2026 #OGTourIndia show which was supposed to happen today was cancelled due to heavy rains and a storm!! #Thaman pic.twitter.com/C642kt20Wo— LAKSHMIVENUGOPAL 🌞 (@venupro) June 13, 2026 -
కాసేపట్లో మ్యాచ్.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ధర్మశాల వేదికగా తొలి వన్డేలో భారత్-అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో భారత్ తమ వన్డే ప్రపంచకప్-2027 ప్రిపరేషన్స్‌ను ప్రారంభించనుంది. విరాట్ కోహ్లి అందుబాటులో లేకపోయినప్పటికి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ప్లేయర్ల ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచింది. శనివారం మ్యాచ్ జరిగే సమయం (మధ్యాహ్నం 1:30)లో భారీ వర్షం పడేందుకు అస్కారముందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. అక్యూవెదర్.కామ్ ప్రకారం.. ధర్మశాలలో ఈరోజు రోజంతా భారీ వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య 90 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని అక్యూవెదర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆ తర్వాత సాయత్రం వర్షం తగ్గుతుందని తెలిపింది. అయితే మళ్లీ రాత్రి వేళ వర్షం పడే అవకాశం 65 శాతం ఉండడంతో మ్యాచ్ పూర్తిగా జరిగే సూచనలు కనిపించడం లేదు.కాగా ఈ సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. కోహ్లి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్‌తో భర్తీ చేశారు. కానీ హార్దిక్ పాండ్యా రిప్లేస్మెంట్ను బీసీసీఐ ప్రకటించలేదు. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ తిరిగి జట్టులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్చదవండి: IND vs AFG: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు? -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, చింతల్, బాలానగరల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో భారీ వర్షం కురవగా, మళ్లీ ఈరోజు(శుక్రవారం, జూన్ 12వ తేదీ) భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్ విమానం వెనక్కి మళ్లింపుహైదరాబాద్లో భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి విమానం తిరిగి వెనక్కి మళ్లించారు. సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరు మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరు మళ్లించారు. -
AP: కాసేపట్లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ
సాక్షి, విశాఖపట్నం: వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మరికొద్ది సేపట్లో విశాఖతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని పేర్కొంది. ది. వీటితో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.భారీ స్థాయిలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందునవ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడనుంది. ముఖ్యంగా రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట, జంగావు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక ఉత్తర–తూర్పు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 41–43°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 37–40 డిగ్రీల సెల్సియస్‌తో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం కొనసాగనుంది. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ అంతరాయాలు, నీటి నిల్వలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదని, నదులు, వాగుల వద్దకు చేరకూడదని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. వర్షాల తీవ్రత గంటల వ్యవధిలోనే పెరిగే అవకాశం ఉండటంతో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.INTENSE THUNDERSTORM ALERT for South, Central, East TG - June 10⚠️🌩️⛈️Today, HOT and HUMID conditions (like summer) expected in entire Telangana. North East TG - 41-43°C, Hyderabad 37-40°C, dry till afternoon ⚠️Thereafter, POWERFUL THUNDERSTORMS and HEAVY RAINS expected in…— Telangana Weatherman (@balaji25_t) June 10, 2026 -
రాగానే దంచికొట్టింది
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం‘నైరుతి’ వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అడిక్‌మెట్, విద్యానగర్, అంబర్పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచింది. పలు జంక్షన్లు చెరువులను తలపించాయి. సాయంత్రం 5 గంటల సమయంలో ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే వేళ వర్షం పడటంతో ఐటీ కారిడార్ సహా పలు మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.దీంతో గంటల తరబడి వాహనదారులు నరకయాతన అనుభవించారు. మల్కాజ్‌గిరిలో 12.9 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్‌పేటలో 8.7 సెం.మీ., విఠల్‌వాడీలో 7.8 సెం.మీ. వాన పడింది. మొత్తం 14 ప్రాంతాల్లో 5 సెం.మీ.కుపైగా వర్షం నమోదైంది. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. భారీ సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఊడి పడటంతో కార్లు, బైక్‌లు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వందల కాలనీలు గంటల తరబడి చీకట్లో మగ్గాయి. టీ తాగుదామని వచ్చి.. బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జహంగీరాబాద్‌కు చెందిన అఫ్రోజ్(30), జాఫర్(15) పరిచయస్థులు. వీరు మంగళవారం సాయంత్రం టీ తాగేందుకు బండ్లగూడ చౌరస్తా సమీపంలోని రాయల్ సి హోటల్‌కు ఆటోలో వచ్చారు. అప్పటికే అక్కడ ఓ స్ట్రీట్‌లైట్‌కు సంబంధించిన విద్యుత్ వైరు తెగిపడి ఉంది. నీరు నిలిచి ఉండటంతో గమనించలేకపోయారు. ఈ క్రమంలో మొదట ఆటో దిగిన జాఫర్.. షాక్ తగిలి కింద పడిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో అఫ్రోజ్ నేరుగా వైర్‌కు తగలడంతో విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న జాఫర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఒవైసీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాల్లో తడిసిన ధాన్యం నిర్మల్ జిల్లాలో సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున మోస్తరు వర్షం కురిసింది. కుంటాల మండలంలోని జామున ఓల, లింబా(కె), కల్లూరు, కుంటాల, పెంచికల్‌పాడ్‌లో 6.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో జొన్న, వరి ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్, సొనాల మండలాల్లో భారీ వర్షం ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సొనాల మండలం పెద్దగూడ సరిహద్దులో వాగు ఉధృతికి వంతెన సమీపంలోని రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
జల్లంత.. తుళ్లింత.. మరింత..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ విస్తరించి సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు శనివారం నాటికి పశ్చిమ–మధ్య, తూర్పు–మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, గోవా అంతటా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మెజారిటీ ప్రాంతాలకు విస్తరించాయి.శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అధికంగానే నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 23.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరోవైపు శనివారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో కురవడంతో ట్రాఫిక్ జామ్‌తో జనం ఇబ్బందులు పడ్డారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,ఫిల్మ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాలలో భారీగా వాన కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం కురువడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పలుచోట్ల తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అప్పటి దాకా ఎండ వేడిమికి తల్లడిల్లిపోయిన పట్టణవాసులకు అకాల వర్షాలు కొంతమేర ఉపశమనం కలిగించాయి. -
భారీ వర్షం.. పిడుగుపడి కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. పలు జిల్లాల్లో భారీగా వర్షం పడుతోంది. నాగర్‌కర్నూల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. గద్వాలలో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. మామిళ్లపల్లిలో పిడుగుపడి రాజు అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. మరోవైపు విజయవాడలోనూ భారీ వర్షం పడుతోంది. పెద్దఎత్తున వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విస్సన్నపేట, మైలవరంలో ఈదురుగాలులలో కూడిన జల్లులు పడుతున్నాయి. -
తిరుమలలో కుండపోత వర్షం
తిరుమల: తిరుమల కొండపై కుండపోతగా వర్షం కురుస్తోంది. రెండు గంటలకు పైగా వర్షం కురుస్తోంది. దాంతో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన ప్రాంతాలన్నీ జలమయంగా మారడంతో భక్తులు అగచాట్లు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నా.. తిరిగి వసతి ప్రాంతాలకు వెళ్లాలన్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమలలో ఉన్నపళంగా వాతావరణం మారిపోయి వర్షం పడటం ఆరంభించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో తిరుపతి నగరంలో కూడా రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ప్రజలకు హెచ్చరిక.. రానున్న మూడు గంటల్లో భారీ వర్షం
ఏపీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, మన్యం విజయనగరం జిల్లాల్లో మరో మూడు గంటల్లో తీవ్ర స్థాయిలో పిడుగులు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలన్నాయంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద హోర్డింగుల వద్ద ప్రజలు నిలబడకూడదని కీలక సూచనలు చేసింది. కాగా ఇదివరకే పలాసలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు మెరుపులతో భారీ వానలు పడుతుండడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణలో రేపు పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
విజయవాడ: ఏపీలో అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. రోహిణి కార్తె ప్రారంభానికి ముందే ఏపీలో పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించగా, మళ్లీ ఏపీకి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు. ప్రధానంగా పల్నాడు, ప్రకాశం,. నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గంటకు 50కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెండు రోజుల క్రితం చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
విశాఖలో వాన బీభత్సం..
సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన విశాఖవాసులకు గురువారం ఉదయం వర్షం ఊరటనిచ్చింది. అయితే కాసేపటికే వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోగా.. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు సమాచారం.ఇదిలా ఉండగా విశాఖ నగరానికి సమీపంలో సముద్రం వైపు అకస్మాత్తుగా సీ స్టార్మ్ ఏర్పడినట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ద్వారకానగర్, మధురవాడ, సీతమ్మధార, జగదాంబ జంక్షన్‌తో పాటు బీచ్‌రోడ్ సమీప ప్రాంతాల్లో వచ్చే 30 నుంచి 40 నిమిషాల్లో మరోసారి వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు.ఈ స్టార్మ్ నెమ్మదిగా కదులుతుండటంతో భారీ వర్షం కంటే ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అవసరం లేకుండా బయటకు రావొద్దని, బీచ్ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ఇంకా వర్షాలు కొనసాగొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.#Visakhapatnam rains alert - Sudden sea storm development near the city can give a spell of rains across Dwaraka Nagar, Madhurawada, Seethammadhara, Jagadamba and areas close to Beach road (like Mahalakshminagar) during next 30-40 minutes. Slow moving storms and rains will be…— Andhra Pradesh Weatherman (@praneethweather) May 28, 2026 -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. లింగంపల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, మియాపూర్, మాదాపూర్ చందానగర్ తదితర ప్రాంతాలలో భారీగా జల్లులు పడుతున్నాయి. దీంతో రోడ్లన్ని జలమయ్యాయి. తీవ్రమైన ఎండలతో తల్లడిల్లిపోయిన ప్రజలకు.. ఈ భారీ జల్లులు కొంత మేర ఉపశమనం కలిగించాయి. అర్ధరాత్రి వర్షం కురవడంతో రోడ్లపై వాహనాల రద్దీ పెద్దగా లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలగలేదు. నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అర్థరాత్రి భారీగా వర్షం కురిసింది. సంగారెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, సిద్దిపేట, తదితర జిల్లాలలో అర్ధరాత్రి భారీ వర్షం పడింది. -
ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం
విజయవాడ: ఏపీలో ఒకవైపు తీవ్రమైన ఎండలు.. మరొకవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండతో కాసింత ఉపశమనం పొందామనుకునే లోపే పిడుగులతో కూడిన వర్ష బీభత్సంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ రోజు(మంగళవారం, మే 26వ తేదీ) చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. మండల పరిధిలోని కారుమంచివారి కండ్రిగ గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతిచెందాడు. - గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడు కారుమంచి వారు కండ్రిగ గ్రామానికి చెందిన తోప్పని యశ్వంత్(22) గా గుర్తింంచారు. అదేవిధంగా పట్టణంలోని ఎల్ ఏ సాగరం గిరిజన కాలనీలోని పాఠశాల ఆవరణంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు పడి ఆ చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అయితే సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్: నగర వాసులకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం కల్గింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. దీంతో హైదరాబాద్ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే రోహిణి కార్తె ప్రారంభం కూడా ఈరోజే కావడంతో రేపట్నుంచి ఎండలు ఎలా ఉంటాయో అనే ఆందోళన కూడా జనాల్లో ఉంది. రోహిణి కార్తె ప్రారంభంలో సాధారణంగా చినుకులు పడటం జరుగుతూ ఉంటుంది. ఆపై భానుడు మరింత సెగలు కక్కుతాడు. ఈ వర్షం అందుకే సంకేతమైతే నగరవాసులకు మరింత హీట్‌వేవ్‌ను చూడాల్సి ఉంటుంది. -
AP: మరి కొద్ది సేపట్లో వర్షం?.. వాాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం జిల్లాలో సైతం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.ప్రజలందరూ ఈ సూచనలను పాటించాలని తెలిపింది. 50 నుంచి 60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్లు, పోల్స్,హోర్డింగ్స్ క్రింద ఎట్టిపరిస్థితుల్లో నిలబడకూడదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ హెచ్చరికలను జారీ చేశారు. -
యూపీలో తుపాన్ బీభత్సం.. 56 మంది మృతి
-
బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజులు భారీ వర్షాలు
-
బెంగళూరు చరిత్రలో అదే భారీ వర్షం
బనశంకరి: కర్ణాటక రాజధాని బెంగళూరు చరిత్రలో గత నెల 29న అత్యధిక వర్షపాతం నమోదైన రోజుగా రికార్డుల్లోకి ఎక్కింది. బుధవారం సాయంత్రం బెంగళూరు మధ్య భాగంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలి, వడగండ్లతో 11 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పోటెత్తిన వరద నీరు అకాల వర్షానికి బెంగళూరులో వరదనీరు పోటెత్తినట్టు అధికారులు గుర్తించారు. 200 చదరపు కిలోమీటర్లు పరిధిలో భారీ వర్షం కురిసిందని గ్రేటర్ బెంగళూరు ప్రాధికార సంస్థ తెలిపింది. 20 నుంచి 22 మిలియన్ ఘనపు మీటర్ల నీరు వచి్చందని అంచనా వేశారు. భౌగోళికంగా 900 మీటర్ల ఎత్తులో ఉన్న బెంగళూరులో వార్షికంగా 95 సెంటీమీటర్ల నుంచి 110 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. ఐఎండీ వివరాల ప్రకారం బెంగళూరులో వార్షికంగా కురిసే వర్షం కన్నా సుమారు 10 శాతం అధిక వర్షం కురిసిందని తెలిపింది. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు..
విశాఖ : ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమిలి, తగరపువలస, అనకాపల్లి, మాడుగులలో కుండపోత వాన పడింది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పద్మనాభంలో పిడుగుపడి ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఉదయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఫలితంగా వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు.ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు. -
చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం(ఏప్రిల్ 18వ తేదీ) సాయంత్రం వేళ హైదరాబాద్‌లో వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా పలు చోట్ల వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉండొచ్చని అంటున్నారు సంబంధిత శాఖ అధికారులు. మరొకవైపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అకాల వర్షం పడింది. డిచ్ పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్ పల్లి, సిరికొండ, మోపాల్, రూరల్ మండలాల్లో వర్షం కురిసింది. ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వడగండ్లు వాన పడింది. ఈ అకాల వర్షంతో పలుచోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. ఇదిలా ఉంచితే, తెలంగాణలో ఎండలు కూడా హడలెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీ సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. -
ఈసారి వానలు తక్కువే: ఐఎండీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగానే కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఎల్ నినో పరిస్థితులు జూన్‌లో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావం నైరుతి రుతు పవనాలపై పడనుందని అంచనా వేసింది. సాధారణంగా జూన్ నుంచి సెపె్టంబర్ వరకు సాధారణ వర్షపాతం సరాసరిన 87 సెంటీమీటర్ల కాగా, ఈసారి 80 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని ఐఎండీ చీఫ్ మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో ఇవే పరిస్థితులుంటాయన్నారు. అయితే, ఈశాన్య, వాయువ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
మండుటెండ.. జోరువాన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల భానుడు ప్రతాపం చూపగా, కొన్ని ప్రాంతాల్లో జోరువాన ఉపశమనం కలిగించింది. విజయవాడ, చుట్టు పక్కల ప్రాంతాల్లో సాయంత్రం వరకూ మండుటెండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అక్కడక్కడా చిరు జల్లులు కురవడంతో సేదతీరారు. అలాగే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరువాన కురిసింది. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 5.2, ఏలూరు జిల్లా తదువైలో 4.7, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి తణుకులోనూ జోరువాన కురిసింది. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అదే సమయంలో అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెంలో 41.9, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 40.7, నంద్యాల జిల్లా పేరుసోమలలో 40.6, నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 40.3, అన్నమయ్య జిల్లా గోపిదిన్నెలో 40.1, కర్నూలు జిల్లా తోవిలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్లే...రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇదేవిధమైన విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని వివరించారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గూడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో ఎండ తీవ్రత, వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. -
వరుణుడి ఖాతాలో...
కోల్‌కతా: ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఆట ప్రారంభమైన 15 నిమిషాలకే వర్షం ముంచెత్తింది. మైదానం మొత్తాన్ని కవర్స్‌తో కప్పినా... ఎంతకూ వరుణుడు తెరిపినివ్వకపోవడంతో ఆట సాధ్యపడలేదు. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్ధ ఉన్న ఈడెన్ గార్డెన్స్‌లో కటాఫ్ సమయానికి ముందే వరుణుడు శాంతించాడు. అయితే బౌండరీకి దగ్గర నీరు ఎక్కువగా నిలిచింది. దాంతో ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు కటాఫ్ సమయానికల్లా మైదానం సిద్ధమయ్యే పరిస్థితి కనిపించలేదు. ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి కాగా... ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గతేడాది కూడా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. సొంతగడ్డపై టాస్ గెలిచిన కోల్‌కతా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా... వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (6), కామెరాన్ గ్రీన్ (4) విఫలం కాగా... కెప్టెన్ అజింక్య రహానే (8 నాటౌట్), అంగ్క్రిష్ రఘువంశీ (7) అజేయంగా నిలిచారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో పంజాబ్ పేసర్ జేవియర్ బార్ట్లెట్ ఈ ఇద్దరినీ కీపర్ క్యాచ్‌ల ద్వారా వెనక్కి పంపాడు. -
ఏపీలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో తొమ్మది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షంతో పాటు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం , విజయనగరం , అల్లూరి సీతారామరాజు ,తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి , ఏలూరు , ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళొద్దు. చెట్లకింద నిలబడొద్దని తెలిపింది. -
ఇక మంటలే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గతం కంటె ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని తెలిపింది. ప్రధానంగా వచ్చే ఐదు రోజుల్లో వేడి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మరోవైపు కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి 28వ తేదీ వరకూ ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 27, 28 తేదీల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు.‘ఎల్‌నినో’నే కారణంఈ వాతావరణ మార్పులకు ఎల్‌నినో ప్రభావమే కారణమని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ ప్రక్రియ వల్ల ఈ వేసవి గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించి పంట కోత సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
బిగ్ అలర్ట్.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు
-
ఏపీలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఒకరి మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అమరావతిలో భారీ వర్షం కురిసింది. తుళ్లూరులోని మేరీ మాత హై స్కూల్‌కు సమపీంలో పిడుగుపడి ఓ విద్యార్థి తండ్రి మృతిచెందారు. కృష్ణాజిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరులో వర్షం పడింది. విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఇంటి టెర్రస్ పైన పిట్టగోడ పాక్షికంగా ధ్వంసమైంది.రాగల మూడు గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు.తెలంగాణనూ వదలని వానలు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు కురిసిన వర్షానికి పలుచోట్ల పెద్దఎత్తున పంట నష్టం తలెత్తింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెద్దపెల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేటల్లో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలరాలింది.కరీంనగర్ జిల్లా వీణవంకలోనూ అపార పంటనష్టం జరిగింది. నర్సింగాపూర్లోనూ మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు.. చేతికొచ్చిన పంట నేలరాలింది. భారీగా పంట నష్టం తలెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడారు. మిర్చి కుప్పలపై టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకుంటున్నారు రైతులు. -
ఇటు ఎండ.. అటు వాన!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న మూడు రోజులూ ఓ వైపు ఎండలు, మరోవైపు ఆకాశం మేఘావృతమై విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకస్మిక వర్షాల సమయంలో పడే పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ రేపటి నుండి భారీ వర్షాలు
-
వడగండ్లా... బండరాళ్లా...
పిల్లలూ...వడగండ్ల వాన అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. మన దేశంలో వేసవిలో ఎక్కువ పడుతుంటుంది. చిన్న చిన్న గోలీల వంటి వడగళ్లు (Hailstones) పడుతుంటాయి. కొన్ని చోట్ల ఇంకాస్త పెద్ద వడగండ్లు పడుతుంటాయి. వడగండ్లు ఎందుకు పడతాయి? వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి, ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు.అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకూ, పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం.ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్షఅయితే అమెరికాలోని ఇలినాయిస్‌లో ఎంత పెద్ద వడగండ్లు పడ్డాయో. ఒక్కోటి పెద్ద రాయంత ఉంది. నాలుగు అంగుళాల వెడల్పుతో ఉంది. కంకాకీలో 6 అంగుళాల వడగళ్లను గుర్తించారు. రాష్ట్రంలోనే ఒక కొత్త రికార్డు వడగండ్లుగా NWS బుధవారం తెలిపింది. అందుకే వడగండ్ల వానలో చిక్కుకుని చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్) -
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
-
హైదరాబాద్‌లో చిరుజల్లులు
సాక్షి హైదరాబాద్: భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో నగరవాసులతో పాటు వాహనదారులు కాసేపు సేదతీరారు. కొద్దిరోజులుగా ఎండవేడిమి బాగా పెరిగిపోవడంతో చల్లటి వాన జల్లులకు పట్టణవాసులకు కొంత ఉపశమనం లభించింది. అయితే నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పాకిస్తాన్, న్యూజిలాండ్ ‘సూపర్–8’ మ్యాచ్ రద్దు
టి20 వరల్డ్ కప్ ‘సూపర్ ఎయిట్స్’ దశ పోటీలు వర్షం ప్రభావంతో మొదలయ్యాయి. గ్రూప్–2లో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. టాస్ నెగ్గిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత సమయానికే మ్యాచ్ ఆరంభమవుతున్నట్లు కనిపించిన దశలో ఒక్కసారిగా వాన ముంచెత్తింది. స్వల్పంగా చినుకులతో మొదలైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది.ప్రేమదాస స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా వాన తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సూపర్–8లో పాక్ తమ తర్వాతి మ్యాచ్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో... న్యూజిలాండ్ బుధవారం శ్రీలంకతో తలపడతాయి. నేటి సూపర్ – 8 మ్యాచ్లుశ్రీలంక X ఇంగ్లండ్‌వేదిక: పల్లెకెలె ; మ.3.00 గంటల నుంచి భారత్ X దక్షిణాఫ్రికావేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే!
ఆకాశమంత మందిరి, భూదేవి అంత పీట అన్నట్టు జరుగుతున్నాయి ప్రస్తుతకాలంలో పెళ్లిళ్లు. పెళ్లి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలి పోవాలని కోరుకుంటారు ఇందుకోసం చాలా ఆర్భాటాన్ని ప్రదర్శిస్తుంటారు. పంజాబ్ పెళ్లిలో వధువుపై నోట్ల వర్షం కురిపించిన కుటుంబం చిక్కుల్లో పడింది.విషయం ఏమిటంటే..తమ ఇంట పెళ్లిన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆరాటంతో వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించడం ప్రస్తుతం నెట్టింట తెగ చర్చకు దారి తీసింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను పెళ్లి కుమార్తెపై వెదజల్లారంటూ సోషల మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. (జస్ట్ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!)పంజాబ్‌లోని తర్న్ తరణ్ జిల్లాలో వాలంటైన్స్ డే రోజు ఒక జంట వివాహం చేసుకుంది. వీరి వివాహ రిసెప్షన్ సందర్భంగా పెళ్లికూతురిపై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను పూలవర్షంలా కురిపించారట. ఇదిఆన్లైన్లో షేర్ అయిన వెంటనే దావానలంలా వ్యాపించింది. అటు వధూవరుల కుటుంబంనుంచిగాన,ఈ ఇటు వివాహంలో పాల్గొన్న ఎవరి నుండి నిజమైన నిర్ధారణ లేనప్పటికీ గ్రాండ్ క్యాష్ పార్టీ అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలురూ. 8.5 కోట్లు కాదు, లక్షలేఈ వీడియో వైరల్‌గా మారడంతో వరుడి కుటుంబం స్పందించింది. ఈ వాదనలను వరుడి కుటుంబ సభ్యులు , వివాహ కార్యక్రమ నిర్వాహకులు తోసిపుచ్చారు.ఈ కార్యక్రమంలో జంటపై రూ.3–4 లక్షల నగదును మాత్రమే కురిపించామన్నారు. రూ. 8.5 కోట్లు అని జరుగుతున్న ప్రచారం అవాస్తమని వరుడి సోదరుడు సికందర్ సింగ్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవెంట్ మేనేజర్, DJ కూడా వైరల్ అయిన రూ. 8.5 కోట్ల వాదనను తోసిపుచ్చారు. మొత్తం నగదు సుమారు రూ. 4 లక్షలు అని కొన్ని డాలర్ నోట్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పడం గమనార్హం View this post on Instagram A post shared by PunjabInsta.in (@punjabinsta.in)ఇదీ చదవండి: థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా! -
ఎడారి దేశంలో వడగళ్ల వాన.. వీడియోలు వైరల్
ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఉత్తర ప్రాంతాల్లోని రాస్ అల్ ఖైమా, అల్ రామ్స్ పరిసరాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. అనేకచోట్ల రోడ్లన్నీ మంచు ముక్కలతో నిండిపోయాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉపరితల అల్పపీడన ప్రభావం వల్ల ఈ వడగళ్ల వర్షం కురిసినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. జెబల్ జైస్ వంటి పర్వత ప్రాంతాల్లో అత్యల్పంగా 4.7°C ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం కూడా యూఏఈలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొగమంచు కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.దీంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా గత నెలలో కూడా యూఏఈలో కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షాల వల్ల.. అబుదాబీ, దుబాయ్‌తో పాటు నగరాల్లో జనజీవనం స్తంభించింది. కానీ ఇప్పుడు ఈ వడగళ్ల వానను అక్కడి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by مركز العاصفة لمراقبة الطقس والتغير المناخي المؤسس omar alnauimi (@storm_ae) -
ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షం
ఢిల్లీ: ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి చీకటి అలుముకుంది. వర్షం, పొగ మంచు కారణంగా ఢిల్లీలో వాతావరణం మరింత చల్లగా మారిపోయింది. భారత వాతావరణ విభాగం (IMD) ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, గాలివేగం గంటకు 40–60 కిమీ వరకు చేరే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుండి వచ్చే వాతావరణంలో అవంతారాలు(వెస్ట్రన్ డిస్టబెన్స్) కారణంగా ఈ ఆకస్మిక వర్షానికి కారణమని ఐఎండీ స్పషం చేసింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో వర్షం, మంచు, చలి ఉంటుందని తెలిపింది. హిమాలయ పర్వత రాష్ట్రాలలో భారీ వర్షాలు, మంచు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. జనవరి 27 వరకు వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. -
సంక్రాంతి సంబరాలకు ఎఫెక్ట్?.. దూసుకొస్తున్న తుపాన్!
సాక్షి,అమరావతి: సంక్రాంతి పండుగకు ముందు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తుపాను ముప్పు నెలకొననుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉందని సమాచారం. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఇది తుపానుగా మారి తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 60–100 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. తుపాను కారణంగా ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాలు ఒడిశా తీర ప్రాంతాలు, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు.తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.1891–2024 మధ్యకాలంలో సంక్రాంతి సమయానికి 12 సార్లు తుపానులు ఏర్పడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈసారి కూడా అదే తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ముందు తుపాను ముప్పు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేసి, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
-
మ్యాచ్ రద్దు... మన ఖాతాలో సిరీస్
బ్రిస్బేన్: వర్షంతో మొదలైన భారత్, ఆ్రస్టేలియా టి20 సిరీస్ చివరకు వర్షంతోనే ముగిసింది. శనివారం ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టి20 మ్యాచ్ వాన కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన వర్షం ఎంతకీ తగ్గలేదు. దాంతో చివరకు ఆటను అంపైర్లు రద్దు చేయక తప్పలేదు. ఆడింది 29 బంతులే అయినా ఓపెనర్లు అభిషేక్ శర్మ (13 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (16 బంతుల్లో 29 నాటౌట్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో అభిషేక్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి ఓవర్లోనే 5 పరుగుల వద్ద అతను ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ వదిలేయగా, 11 పరుగుల వద్ద మరో క్యాచ్‌ను డ్వార్షుయిస్ అందుకోలేకపోయాడు. మరో వైపు డ్వార్షుయిస్ ఓవర్లోనే 4 ఫోర్లు బాది గిల్ ధాటిని చూపించాడు. 161.38 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 163 పరుగులు చేసిన అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్ తొలి మ్యాచ్ రద్దు కాగా, మెల్బోర్న్లో జరిగిన రెండో పోరులో ఆసీస్ గెలిచింది. ఆ తర్వాత హోబర్ట్, కరారాలలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి పైచేయి సాధించిన భారత్ చివరకు 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది. భారత్ తమ తర్వాతి పోరులో సొంతగడ్డపై నవంబర్ 14 నుంచి జరిగే టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగనుండగా... నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్‌తో ‘యాషెస్’లో ఆసీస్ తలపడుతుంది. ‘తొలి మ్యాచ్ ఓడిన తర్వాత కోలుకొని గెలిపించిన జట్టు సభ్యులకు అభినందనలు. ప్రతీ ఒక్కరికి తమ బాధ్యతపై స్పష్టత ఉంది. పేసర్లు, స్పిన్నర్లు అంతా సమష్టిగా రాణించారు. దాని వల్లే మేం అనుకున్న ప్రణాళికలను సమర్థంగా అమలు చేయగలిగాం. ప్రపంచ కప్ కోసం సిద్ధంగా ఉన్న ఎంతో మంది ప్లేయర్లు మా జట్టులో ఉండటం చాలా మంచి విషయం. వరల్డ్ కప్‌కు ముందు ఉన్న 2–3 సిరీస్‌లు సన్నాహకంగా ఉపయోగపడతాయి. జట్టులోని ప్రతీ ఒక్కరికి తమదైన ప్రత్యేక ప్రతిభ ఉండటం కెపె్టన్‌గా నా అదృష్టం. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా గత కొన్ని నెలలుగా మంచి ఫలితాలు సాధించగలిగాం. ఎలాంటి లోపాలు లేవని చెప్పను. ఎందుకంటే నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది’ –సూర్యకుమార్ యాదవ్, భారత కెప్టెన్ 528 ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో అత్యంత వేగంగా (528 బంతుల్లో) 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, చందానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, జవహార్ నగర్ ప్రాంతాల్లో వర్షం ముమ్మరంగా కురవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.వర్షం తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడిన చోట్ల పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. #HYDTPinfo 🚨 Traffic Update 🚨Water logging reported infront of Praja Bhavan. Vehicle movement is affected in the area. Commuters are advised to take alternative routes to avoid delays. #HyderabadTraffic #TrafficUpdate #DriveSafe pic.twitter.com/yXZ2Dj3ASR— Hyderabad Traffic Police (@HYDTP) November 2, 2025 Water logging reported near Virinchi Hospital, Road No. 1/10, Banjara Hills, Hyderabad.Vehicle movement is affected in the area. Commuters are advised to take alternative routes to avoid delays.#HyderabadTraffic #TrafficUpdate #DriveSafe #hyderabad #hyderabadrains #Indtoday pic.twitter.com/1LFx7zCMDW— indtoday (@ind2day) November 2, 2025 హైదరాబాద్‌తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లింది. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యం తడిసిన ఘటన రైతులను ఆందోళనకు గురిచేసింది. అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని కాపాడే చర్యలు చేపట్టారు.వాతావరణ శాఖ ప్రకారం, ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. అత్యవసర సేవల కోసం నగర పాలక సంస్థ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. -
వదలని వరద.. బురద
వరంగల్ అర్బన్/హన్మకొండ: సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్కన్నపేట(హుస్నాబాద్): డిండి: వరంగల్ నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గి మూడు రోజులు గడిచినా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండటం వల్ల తాము ఏమీ చేయలేమని బల్దియా అధికారులు చేతులెత్తేయడం పట్ల కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లో మోంథా తుపానుతో 45 కాలనీలు నీట మునిగాయి. అందులో 39 కాలనీల్లో నీటి ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఇళ్లల్లోకి చేరుకున్నారు. కానీ, ఇళ్లన్నీ బురదతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద మేటలను తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నయ్యారు.హనుమకొండ పరిధిలోని వివేక్‌నగర్, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, కుడా కాలనీ, నందితా నగర్, రాంనగర్, రాజాజీ నగర్లో ఏ ఇంటిని చూసినా పేరుకు పోయిన ఒండ్రు మట్టిని తొలగిస్తూ కనిపించారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు బయట ఆరబెట్టారు. వరంగల్ ఎగువన ఉన్న చెరువులు మత్తళ్లు పోస్తుండటంతో వరద కొనసాగుతోంది. దీంతో హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, బృందవన కాలనీ, అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్ కాలనీల్లో ఇళ్లు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. సూమారు 300 కుటుంబాలు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నాయి. వరద తాకిడికి నగరంలోని పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. హనుమకొండలోని 100 ఫీట్ల రోడ్డు గోపాల్పూర్ చెరువు నుంచి సమ్మయ్య నగర్ క్రాస్ వరకు పూర్తిగా పాడైంది. శాంతించిన మున్నేరు: మోంథా తుపాను కారణంగా ఖమ్మంలో ఉప్పొంగి ప్రవ హించిన మున్నేరు వాగు శుక్రవారం శాంతించింది. గురు వారం రాత్రి ఖమ్మం కాల్వొడ్డు సమీపాన 26 అడుగుల మేర ప్రవహించగా, శుక్రవారం 15 అడుగులకు తగ్గింది. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. మున్నేరు పరీవాహకంలో ఖమ్మం నగరంలోని కాలనీలతోపాటు ఖమ్మంరూరల్ మండలం జలగం నగర్ లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.బ్యాక్ వాటర్‌తో పలు కాలనీలు నిండిపోయాయి. మరోపక్క ఆకేరు నదికి భారీగా వరద చేరింది. గురువారం తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వద్ద సీతారామ అక్విడక్ట్‌ను ఆనుకుని నది ప్రవహించింది. వరద తగ్గినా కాలనీల్లోని రోడ్లు, ఇళ్లలో బురద చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో వరి, పత్తితో పాటు ఇతర పంటలు దాదాపు 62,400 ఎకరాల్లో దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమి కంగా అంచనా వేశారు. అనధికారికంగా మరో 15 వేల ఎకరాలపై ప్రభావం చూపినట్లు సమాచారం.శ్రీశైలం హైవేపై బ్రిడ్జికి మరమ్మతునల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై కోతకు గురైన బ్రిడ్జి పునురుద్ధరణ పనులు శుక్రవారం కొనసాగాయి. వరద ప్రవాహం తగ్గటంతో అధికారులు రోడ్డు మరమ్మతు పనులను వేగవంతం చేశారు. ఈ మార్గం గుండా నాలుగు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో హైదరాబాద్, దేవరకొండ, కల్వకుర్తి, శ్రీశైలం, మద్ది మడుగు, ఉమామహేశ్వరం, అచ్చంపేట, తెల్కపల్లి, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం‘అమ్మ, చెల్లితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొందామని భర్తతో కలిసి బైక్‌పై బయలుదేరి, సిద్దిపేట జి ల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి శివారులో వా గు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయిన దంపతులు ప్రణయ్, కల్పన మృతదేహాలు శుక్రవారం ల భించాయి. దీంతో మృతదేహాల వద్ద బంధువులు, కు టుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కల్పన పుట్టిన రోజే డేత్డేగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషా దాన్ని నింపింది. ఘటనపై ప్రణయ్ తండ్రి ఇసంపల్లి ప్ర భాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపారు. -
‘కోట్లు కుమ్మరించారు.. ఢిల్లీలో వర్షం కురవలేదు’
ఢిల్లీ: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్‌కు బ్రేక్ పడింది. కాలుష్య రాజధానిగా మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ ఫెయిల్ అయ్యింది. మేఘాలను చల్లబరిచి వర్షింపజేసే రసాయనాలను చల్లే విమానాలను రంగంలోకి దింపింది. ఐఐటీ–కాన్పూర్ సహకారం, సమన్వయంతో నిన్న (అక్టోబర్ 28, మంగళవారం)రాజధానిలో మేఘావృత గగనతలంలో మేఘమథన క్రతువుకు శ్రీకారం చుట్టింది. మరికొన్ని రోజుల పాటు ఈ విమానాలు రసాయనాలను వెదజల్లే ప్రక్రియ కొనసాగుతుందని కూడా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మేఘాల్లో తగినంత తేమ లేకపోవడంతో వర్షం కురవలేదు. దీంతో ఈ ప్రక్రియను రాష్ట ప్రభుత్వం నిలిపివేసింది.ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వర్షించని మేఘాల నుంచి చినుకులు కురిసేలా చేసే ఈ ప్రక్రియను సాధారణంగా క్లౌడ్–సీడింగ్ అంటారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.3.21 కోట్లు కేటాయించింది. అయితే, ఇది వాయు కాలుష్యానికి తాత్కాలిక ఉపశమనంగా పనిచేస్తుందని, ఖరీదైన ఈ ప్రక్రియను శాశ్వత పరిష్కారంగా భావించకూడదని పలువురు పర్యావరణవేత్తలు అంటున్నారు.ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ ఇవాళ(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ద్వారా కృత్రిమ వర్షం రాలేదు కానీ భవిష్యత్తు ప్రయత్నాలకు ముఖ్యమైన సమాచారం లభించిందని తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 15 మానిటరింగ్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం, PM 2.5, PM 10 మలినాల స్థాయిల్లో 6–10 శాతం తగ్గుదల కనిపించిందని ఆయన చెప్పారు.కాగా, ఢిల్లీ స్థానిక ప్రాంతాలను కృత్రిమ వర్షాలతో తడిసి ముద్దచేసేందుకు ప్రత్యేక విమానాలు మంగళవారం(అక్టోబర్ 28) కాన్పూర్ నుంచి బయల్దేరాయి. ఢిల్లీలోని బురారీ, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాల మీది మేఘాలపై ఈ విమానాలు సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ మిశ్రమాలను చల్లాయి. దాదాపు 20 శాతం తేమ ఉన్న మేఘాలను కృత్రిమ వర్షాల కోసం ఎంపిక చేశారు. సెస్నా రకం విమానం ఒక్కోటి 2–2.5 కేజీల బరువైన రసాయన మిశ్రమాన్ని వేర్వేరు చోట్ల వెదజల్లింది. దాదాపు 8 ప్రాంతాల్లో క్లౌడ్–సీడింగ్‌ను చేపట్టారు. -
భారత్- ఆస్ట్రేలియా తొలి టీ20 వర్షార్పణం
కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ అహ్హనించాడు. అయితే భారత ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ ముగిసిన వెంటనే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆటను ప్రారంభించారు. అయితే మ్యాచ్‌ను మాత్రం 18 ఓవర్లకు కుదించారు. తిరిగి క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు బ్యాటర్లు మంచి జోరు మీద ఉన్న సమయంలో వర్షం మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. భారత్ స్కోర్ 97/1(9.4 ఓవర్లు) వద్ద ఆటను నిలిపివేశారు.అయితే ఈసారి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితం తేలని ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(39 నాటౌట్), శుభ్‌మన్ గిల్(37 నాటౌట్), అభిషేక్ శర్మ 19 పరుగులు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మెల్బోర్న్ వేదికగా శుక్రవారం జరగనుంది.తుదిజట్లు:టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్ -
ఏపీకి తుపాను ముప్పు..!
విశాఖ: ఏపీకి తుపాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అతాలకుతాలమైన ఏపీలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈనెల 27వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. రేపటికి(శనివారం, అక్టోబర్ 25వ తేదీ నాటికి వాయుగుండంగా బలబడే అవకాశం ఉందని తెలిపిది. ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈరోజు(శుక్రవారం), రాయలసీమ, దక్షిణ కోస్తాలో బారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్ల తెలిపింది. దాంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హచ్చరించింది. నిండా ముంచిన వాన.. -
దక్షిణకోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
విశాఖ : ఏపీపై ఉపరితల ఆవర్తనాల ప్రభావ కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. దీనిలోభాగంగా ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 24 గంటలపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తుఫాన్ హెచ్చరికల కేంద్ర ముఖ్య అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
మూడో వారంలో ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఉత్తర, మధ్య భారతాన్ని వీడిన నైరుతి.. ఈ నెల 14 నాటికి రాష్ట్రం నుంచి, 15 నాటికి దేశవ్యాప్తంగా నిష్క్రమించనుంది. ఇదే సమయంలో ఈ నెల మూడో వారంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి మార్గం సుగమమైంది. 17 నుంచి 20వ తేదీ మధ్యలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఇవి తమిళనాడు, పాండిచ్చేరి, ఏపీ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత వాతావరణ నమూనాలు స్పష్టం చేస్తున్నాయి.అయితే ప్రపంచ వాతావరణ విశ్లేషణలు మాత్రం.. పసిఫిక్ మహాసముద్ర పరిస్థితుల కారణంగా ఈశాన్య రుతుపవనాలకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయని, దీంతో కాస్త ఆలస్యమయ్యే సూచనలున్నాయని అంచనా వేస్తున్నాయి. 1998, 2005, 2021లో ఈశాన్య రుతుపవనాలు సాధారణం కంటే అధిక వర్షపాతాన్ని అందించాయని, ఈసారి కూడా అదే తరహాలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, కర్ణాటక, కేరళ, తెలంగాణలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.ఈశాన్య రుతుపవనాల రాకతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయి. 2 లేదా 3 తుపాన్లు కూడా రానున్నాయని, ఇవి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వద్ద తీరందాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు నైరుతి నిష్క్రమణ కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు సాక్షి, అమరావతి: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ కోస్తా వరకూ విస్తరించి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం చిత్తూరు పట్టణంలోని దొడ్డిపల్లిలో 3.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 3.1, శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో 2.6 సెం.మీ. వర్షం కురిసింది. ఆదివారం అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
ICC WC 2025: టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ (ICC Womens World Cup 2025)ను వరుణుడు వీడటం లేదు. ఇప్పటికే పలు మ్యాచ్‌లకు స్వల్పంగా ఆటంకం కలిగించిన వర్షం... శనివారం పూర్తి మ్యాచ్‌ను తుడిచిపెట్టేసింది. కొలంబో వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా- శ్రీలంక ( Sri Lanka W vs Australia W) మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దు అయింది. మ్యాచ్ సమయం కంటే ముందు నుంచే భారీ వర్షం ముంచెత్తడంతో... కనీసం టాస్ కూడా వేసే అవకాశం దక్కలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు దాయాది పాకిస్తాన్‌తో భారత మహిళల జట్టు తలపడనుంది. ఇదీ చదవండి: ఒంటిచేత్తో ఆసీస్‌ను గెలిపించిన మార్ష్మౌంట్ మాంగనీ: మిచెల్ మార్ష్ (52 బంతుల్లో 103 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్‌పై మూడో టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల ‘చాపెల్–హ్యాడ్లీ’ సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన ఆఖరి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. తద్వారా 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది.తొలి మ్యాచ్‌లో మార్ష్ మెరుపులతో ఆసీస్ అలవోకగా గెలవగా... రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అంతర్జాతీయ టి20ల్లో మార్ష్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. వికెట్ కీపర్ టిమ్ సైఫెర్ట్ (35 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మిచెల్ బ్రేస్‌వెల్ (22 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), నీషమ్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.గత మ్యాచ్ సెంచరీ హీరో టిమ్ రాబిన్సన్ (13) ఈ సారి విఫలం కాగా... డెవాన్ కాన్వే (0), మార్క్ చాప్మన్ (4), డారిల్ మిచెల్ (9) ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్ 3 వికెట్లు పడగొట్టగా... జోష్ హాజిల్‌వుడ్, జేవియర్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో మార్ష్ మెరుపులు మెరిపించడంతో ఆ్రస్టేలియా 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా, మార్ష్ ఒంటి చేత్తో జట్టును విజయపథాన నడిపాడు.ట్రావిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (7), టిమ్ డేవిడ్ (3), అలెక్స్ కారీ (1)మార్కస్ స్టొయినిస్ (2) పేలవ ప్రదర్శన కనబర్చారు. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా... మార్ష్ ఏమాత్రం వెరవకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతడు 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో 73 ఇన్నింగ్స్‌లు ఆడిన మార్ష్‌కు ఇదే తొలి మూడంకెల స్కోరు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 4 వికెట్లు పడగొట్టాడు. మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
వర్షంలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ‘రెయిన్ ఫీజు’పై జీఎస్టీ
జోరువానలో బయటకు వెళ్లలేక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. జొమాటో, స్విగ్గీ.. వంటి ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ల ఆర్డుర్లు ఇకపై మరింత భారం కాబోతున్నాయి. వర్షం వస్తున్నప్పుడు ఆర్డర్ బుక్ చేస్తే దానిపై రెయిన్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆ రెయిన్ ఫీజుపై జీఎస్టీ సైతం విధిస్తున్నారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో వెలసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) కౌన్సిల్ తన ఇటీవలి సంస్కరణల్లో స్థానిక ఈ-కామర్స్ డెలివరీ సేవలను సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9(5) కిందకు తీసుకువచ్చింది. దాంతో ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ప్లాట్‌పామ్‌లు వసూలు చేసే ఫీజులు ప్రభావితం అయ్యాయి. డెలివరీ ఫీజుపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి.సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ ప్రకారం.. ‘జీఎస్టీ క్రమబద్ధీకరణ తర్వాత వర్షం కురిపించే ఇంద్ర దేవుడు కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చాడు. నేను చేసిన ఓ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్‌పై రూ.25 రెయిన్ ఫీజు వసూలు చేస్తూ.. దానిపై 18 శాతం జీఎస్టీ..రూ.4.5 విధించారు. తర్వాత సన్‌లైట్ కన్వినెయెన్స్ ఫీజు, ఆక్సీజన్ మెయింటనెన్స్ ఫీజు..మనం తీసుకునే శ్వాసపై కూడా ట్యాక్స్ వేస్తారేమో!’ అని అశిష్గుప్తా అనే వ్యక్తి రాసుకొచ్చారు. ఇదికాస్తా వైరల్‌గా మారింది. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.After historic GST reforms, even Lord Indra has been brought under the tax net.Now when it rains, you get ₹25 Rain Fee + 18% GST = ₹29.50 😂Next up:👉Sunlight Convenience Fee 🌞👉Oxygen Maintenance Charge 💨👉GST on Breathing, Pay as you inhale pic.twitter.com/JdtHfr715G— Ashish Gupta (@AshishGupta325) September 22, 2025ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..నెటిజన్ల స్పందన..1. తర్వాత వారు స్మైలింగ్ ట్యాక్స్ విధిస్తారు.2. డెలివరీ బాయ్స్ అందుకే వర్షంలోనూ యాప్స్ స్విచ్ఆఫ్ చేయడం లేదు. ఇలాంటి సందర్భంలో సర్వీస్ చేస్తే వారికి డబ్బు వస్తుంది కదా.3. రూ.25 ఫీజు తీసుకుంటున్నా డెలివరీ భద్రంగా చేస్తున్నారా? అని కామెంట్ రాశారు. -
ఏపీకి మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక
విజయవాడ: ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల కొన్ని గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్యూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్యూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ.ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ జిల్లాలకు అరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్: నగరాన్ని వరుణుడు వీడటం లేదు. రోజూ ఏదొక సమయంలో వర్షం నగరాన్ని పలకరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లో వర్షం కుమ్మేసింది.. సోమవారం(సెప్టెంబర్ 22వ తేదీ) సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి భారీ వర్షంగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఫిల్మ్‌నగర్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది . నగరంలొని పలు చోల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయింది. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లక్డీకాపూల్, నాంపల్లి, అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిమిషనిమిషానికి వర్ష తీవ్రత పెరుగుతోంది. నగరంలోని పలుచోట్ల కుండపోత వర్షం పడింది. మరో రెండు గంటల పాటు భారీగా వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యల్లో నిమగ్నమైంది. డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీస్ లాగౌట్ కావడంతో ఎవరూ బయటకు రావొద్దని అధికారులు అదేశించారు. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. #HYDTPInfo🚧 Traffic Alert – Water Logging 🚧Water logging reported from VV Statue towards Shadan College. Vehicle movement is slow in the area.Commuters are advised to take alternate routes and drive with caution.#HyderabadTraffic #TrafficUpdate #WaterLogging #DriveSafe pic.twitter.com/4R4PGhwIdA— Hyderabad Traffic Police (@HYDTP) September 22, 2025 Siever downpour at kamlapuri colony near Srinagar colony, requesting @gadwalvijayainc @CommissionrGHMC to please solve this issue,which is been facing from many years coz of heavy rainfall @balaji25_t pic.twitter.com/SqBba72A8W— piyush jain (@piyush_khater) September 22, 2025 హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు.. -
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరాన్ని వరుణుడు వీడటం లేదు,. రోజూ ఏదో మూల వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో వర్షం కురుస్తోంది. దిల్‌షుఖ్‌నగర్, కొత్తపేట, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగట్టలో వర్షం పడుతోంది. -
హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో మళ్లీ క్లౌడ్ బరస్ట్
డెహ్రాడూన్/సిమ్లా: హిమాలయాల్లోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మళ్లీ మేఘ విస్ఫోటం సంభవించింది. సోమవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఘటనల్లో ఉత్తరాఖండ్‌లో 15 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు చనిపోయారు. వీరిలో యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు ట్రాక్టర్ ట్రాలీలో డెహ్రాడూన్‌లో టాన్స్ నదిని దాడుతుండగా వచ్చిన వరదలో కొట్టుకు పోయినవారున్నారు. ఉత్తరాఖండ్‌లో గల్లంతైన 16 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఫైర్ సిబ్బంది రంగంలోకి అన్వేషణ చేపట్టారు.వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జఝ్రా ప్రాంతంలో చిక్కుకుపోయిన మరో ఎనిమిది మందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొండప్రాంతాల నుంచి వచ్చి పడుతున్న వరదల్లో కార్లు కొట్టుకుపోగా, ఇళ్లు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్‌లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. గంగ, యమున నదులు ప్రమాద స్థాయికి దగ్గర్లో ప్రవహిస్తున్నాయి. వివిధ ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. టామ్సా నది ప్రమాద స్థాయికి చేరుకుంది.దీంతో–ముస్సోరి రోడ్డుపై పలు ప్రాంతాల్లో వరద చేరడంతో పర్యాటకులు, సందర్శకులు ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ పరిస్థితి దాదాపు ఇంతే తీవ్రంగా ఉంది. సిమ్లాలో 12 గంటల వ్యవధిలో 14.2 సెంటీమీటర్ల వాన కురిసింది. అతిభారీ వర్షం కురియడంతో మండి జిల్లాలోని ధరంపూర్లో ప్రధాన బస్‌స్టాండ్ వరదలో మునిగిపోయింది. ఒక వర్క్‌షాప్, పంప్ హౌస్‌తోపాటు దుకాణాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 20 బస్సులు నీట మునిగిపోయాయి. ఒక వ్యక్తి గల్లంతైనట్లు చెబుతున్నారు. పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.మండి జిల్లా బ్రాగ్టా గ్రామంలో ఇల్లు కూలి ఇద్దరు మహిళలు, చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు. గల్లంతైన మరో నలుగురి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా గాలింపు చేపట్టారు. సిమ్లాలోని హిమ్‌ల్యాండ్ సమీపంలో మట్టి చరియలు విరిగి ప్రధాన రహదారి మూసుకుపోయింది. పలు వాహనాలను మట్టి, బురద కప్పేశాయి. ధరంపూర్లో వరద కారణంగా ఆర్టీసీ బస్సులకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లిందని డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్ని హోత్రి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కొనసాగు తున్న ప్రకృతి బీభత్సం వె -
బొమ్మలాట
ఒక ఊర్లో ఓ మోతుబరి రైతు ఉండేవాడు. బాగా సంపాదించిన అతడికి వయసుపైబడింది. వృద్ధాప్యం సమీపించే కొద్దీ అతడిలో ప్రాణ భయం పట్టుకుంది. ఒక రోజు పొలం పనుల మీద పక్క ఊరికెళ్ళాడు. చిన్నగా మొదలైన వాన చినుకులు కొద్దిసేపటికే పెద్ద వర్షంగా మారింది. అటూ ఇటూ చూశాడు. దూరంగా పెద్ద మర్రిచెట్టు కనిపించింది. గబగబా నడుచుకుంటూ వెళ్ళి చెట్టుకింద నిలబడ్డాడు. ఆ మర్రి చెట్టు కింద మట్టితో బొమ్మలు తయారు చేసే కుమ్మరి ఉన్నాడు. రకరకాల అందమైన బొమ్మలు తయారు చేసి అమ్మకానికి పెట్టి ఉన్నాడు.ఇంతలో వాన ఉధృతమయ్యింది. వానకి మట్టి బొమ్మలు కొన్ని చిన్నచిన్నగా కరిగిపోసాగాయి.దాన్ని కళ్ళారా చూసిన రైతు, ఆ కుమ్మరి దగ్గరకు వెళ్ళి ‘‘నీకు బాధగా లేదా?’’ అని అడిగాడు. ‘‘బాధగా లేదు. ఇది సహజం!’’ అని బదులిచ్చాడు కుమ్మరి. ‘‘ఎందుకు బాధ లేదని చెబుతున్నావు? నీకు నష్టం జరుగుతోంది కదా’’ అని మళ్ళీ ప్రశ్నించాడు రైతు.‘‘ఈ మట్టి బొమ్మలు ఆకాశంలో నుంచి ఊడి పడలేదు. అవి మట్టితో తయారు చేసినవి. మట్టినుంచి వచ్చినవి మట్టిలోకే కదా పోతాయి. దానికెందుకు బాధపడాలి. నాకు దేవుడిచ్చిన శరీరం ఉంది. మరింత కష్టపడి మరిన్ని బొమ్మలు తయారు చేయగలను, ఈ జానెడు పొట్ట నింపుకోగలను.నిజంగా ఈ మట్టిబొమ్మల మీద నాకు ఏ హక్కూ లేదు. కారణమేమిటంటే అవి ప్రకృతిలో ఉచితంగా దొరికిన మట్టితో తయారు చేయబడినవి. అది ప్రకృతి నాకిచ్చిన అవకాశం. ఈ మట్టిని బొమ్మలుగా మార్చి నా పొట్ట గడుపుకుంటున్నానని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటాను. అందుకే నేను లాభాలకు పొంగిపోను, నష్టాలకు క్రుంగి పోను. నిజం చె΄్పాలంటే ఈ కరిగిపోతున్న మట్టిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అవి పుట్టింటికి వెళ్తున్నాయన్న స్పృహ నాకుంది’’ అని బదులిచ్చాడు.కుమ్మరి చెప్పిన జీవిత సత్యం విని రైతు ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని తనకి అన్వయించుకున్నాడు. ‘మన జీవితం కూడా మూన్నాళ్ళ ముచ్చటే కదా. దేవుడు ఆడించే బొమ్మలాటే కదా. ఎక్కడినుంచి వచ్చామో, అక్కడికి వెళ్ళడం ఎవ్వరికైనా తప్పదు కదా’ అని గుర్తు తెచ్చుకున్నాడు. ఇంతలో వాన నిలవడంతో అక్కడినుంచి కదిలాడు రైతు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు1 -
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
-
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం(సెప్టెంబర్ 11వ తేదీ) సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, శామీర్‌పేట్, అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హయత్ నగర్-విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్‌నగర్ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరద నీరు చేరింది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.ఇక మెదక్ జిల్లాలో ఈరోజు మూడు గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షంపడింది. మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ అతి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్‌ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, షేక్‌పేటలో కుండపోత వర్షం కురిసింది.తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని చోట్ల కుండపోత వర్షం కురిసింది. సెప్టెంబర్‌లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో పాటు.. వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడే చాన్స్!
విజయవాడ: ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. ప్రజలు చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదన్నారు. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
ఏపీకి మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
విజయవాడ: మరో రెండు రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మంగళవారం(సెప్టెంబర్ 2వ తేదీ) నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు అనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి సగటును 1.5 మరియు 5.8 కి.మీ ఎత్తులో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.ఈ నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 48.1అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11.47 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 6 గంటలకు 2.25 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా మరో నాలుగు,ఐదు రోజులు ఉండొచ్చని పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రతలు తీసుకోవాలన్నారు. -
సెలవొస్తే.. సిటీబస్సు ట్రిప్పులకూ బ్రేక్!
రామంతాపూర్‌కు చెందిన ఆంజనేయులు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం రాత్రి 8.30 గంటలకు బంజారాహిల్స్ నుంచి బయలుదేరి 9 గంటలకు లక్డీకాపూల్ చేరుకున్నారు. రాత్రి 10.30 వరకు ఎదురుచూసినా రామంతాపూర్ బస్సు రాలేదు. అప్పటికే అక్కడ 30 మంది వరకు ప్రయాణికులు జమయ్యారు. ఓవైపు బోరున వర్షం కురుస్తుండటం, ఇటు బస్సు రాకపోవటంతో వారి అవస్థలు వర్ణనాతీతం. రెండుగంటలపాటు ఎదురుచూస్తే గానీ బస్సు రాలేదు. ఇది ఒక్క ఆంజనేయులుకు ఎదురైన పరిస్థితే కాదు.. ఆదివారం సాయంత్రం నుంచి నగరవ్యాప్తంగా వేలాదిమంది ప్రయాణికులు ఎదుర్కొన్న దుస్థితి. వర్షం కురిసే సమయం...సెలవు రోజుల్లో ఇదే పరిస్థితి ఎదురుకానుంది. సాక్షి, హైదరాబాద్: ఆదాయం పెంపుపై దృష్టి సారిస్తున్న ఆర్టీసీ.. మరోవైపు ఖర్చులను కూడా నియంత్రించుకునే పనిలో నిమగ్నమైంది. ఇప్పుడు ఈ ఆలోచన నగరవాసులపై పెద్ద ప్రభావమే చూపబోతోంది. వానలు కురిసిన సమయంలో, పండుగల వేళ రద్దీ అంతంత మాత్రమే ఉంటోందని భావిస్తున్న ఆర్టీసీ, ఆయా సమయాల్లో బస్సులను పరిమితంగానే నడపాలని యోచిస్తోంది. ఇటీవల వర్షం కురిసిన ఓ రోజు కొన్ని ప్రాంతాల్లో తక్కువ రద్దీతో బస్సులు తిరగటాన్ని గుర్తించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆ సమయంలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుందని, అలాంటి సమయాల్లో బస్సుల సంఖ్య తగ్గించి తిప్పాలని డిపో మేనేజర్లను మౌఖికంగా ఆదేశించారు. శనివారం మరోసారి పరిశీలించిన అధికారులు, రద్దీ తక్కువగా ఉన్నా.. ఎక్కువ బస్సులు ఎందుకు తిప్పుతున్నారంటూ సిటీ అధికారులను ప్రశ్నించారు. దీంతో సంబంధిత అధికారులు అందరు డిపో మేనేజర్లకు మరోసారి సీరియస్‌గా మౌఖికంగానే ఆదేశాలిచ్చారు. ఆదివారం నుంచి బస్సుల సంఖ్య తగ్గించాలని పేర్కొన్నారు. దీంతో డిపో మేనేజర్లు ఆదివారం దాదాపు 20 శాతం బస్సు ట్రిప్పులను తగ్గించేశారు. రాత్రి పూట ఎక్కువ బస్సులను రద్దు చేశారు. రాత్రి 9 తర్వాత సింహభాగం బస్సులను డిపోలకే పరిమితం చేసి అతి పరిమితంగా నడిపారు. దీంతో ఆ సమయంలో రోడ్లపై మిగిలిపోయిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచి్చంది. 2019లోనూ ఇదే తరహాలో... 2019లో దీర్ఘకాల సమ్మె తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ తీరుపై సమీక్షించిన సమయంలోనూ ఇదే తరహా నిర్ణయం జరిగింది. నగరంలో రద్దీ లేని సమయాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో బస్సులు తిప్పుతున్నారని, ఇది డీజిల్ దుబారాకు కారణమవుతోందని పేర్కొన్న ప్రభుత్వం, నగరంలో 2 వేల బస్సులు తగ్గించాలని ఆదేశాలిచ్చింది. అప్పుడు అంతమేర బస్సులను రద్దు చేసిన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. నగరంలో కేవలం 3 వేల బస్సులు మాత్రమే ఉండగా, హైదరాబాద్ నగర జనాభాతో సమంగా ఉన్న బెంగళూరులో ప్రస్తుతం 8,900 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. అసలే తక్కువ బస్సులున్న తరుణంలో ఒకేసారి 2 వేల బస్సులు తగ్గించటంతో ఏర్పడిన కొరత ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ తరుణంలో రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఆ సంఖ్యను మరింత తగ్గించి నడిపితే, రోడ్లపై ఉన్న ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి వస్తుంది. కానీ, ప్రయాణికుల అవస్థల కంటే ఆదాయమే ముఖ్యమన్న తరహాలో ఆర్టీసీ వ్యవహరిస్తుండటం ఇప్పుడు నగర ప్రయాణికులకు శాపంగా మారబోతోంది. గత్యంతరం లేని స్థితిలో, జేబులో బస్‌పాస్ ఉండి కూడా ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. మహాలక్ష్మి పథకం ఉండి కూడా మహిళలు భారీ మొత్తం చెల్లించి ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాల్సి వస్తోంది. రద్దీ లేకుంటే రద్దు చేయమన్నారు రోడ్లపై ప్రయాణికుల సంఖ్యను గమనిస్తూ తక్కువగా ఉన్న రోజుల్లో 10 నుంచి 15 శాతం సర్వీసులు నడపొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ఆదివారం మా డిపో పరిధిలో సాయంత్రం తర్వాత కొన్ని సర్వీసులను రద్దు చేశారు. సెలవు రోజుల్లో ఇలాగే కొనసాగించాలని సూచించారు. – ఓ కండక్టర్ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు రాత్రి 9:30 గంటల సమయంలో బస్సుల కోసం గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఎదురుచూసే పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ సమయంలో 113 నంబరు బస్సు కోసం గమ్యం యాప్ చూస్తే వాటి జాడే లేదు. రాత్రి పదిన్నర సమయంలో ఒక బస్‌స్టాప్‌లో 30 మంది ప్రయాణికులు జమయ్యారంటే సర్వీసుకు సర్వీసుకు మధ్య విరామం ఎంత ఎక్కువగా ఉందో అవగతమవుతుంది. –ఆంజనేయులు, రామంతాపూర్ -
ఒక్కరోజే 30 సెంటీమీటర్ల వాన
ముంబై: ముంబై వరుసగా రెండో రోజూ తడిసిముద్దయింది. మంగళవారం రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు సంబంధించిన వివిధ ఘటనల్లో మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు. మిత్తి నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వానల కారణంగా రోడ్డు, రైలు, విమాన సర్విసులపైనా ప్రభావం తీవ్రంగా పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధులు నదులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు నడుముల్లోతు వరదలోనే ముందుకు సాగాల్సి వచి్చంది. రైలు మార్గాలపై కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల మేర వరద చేరడంతో సెంట్రల్ రైల్వే నడిపే అత్యంత కీలకమైన సబర్బన్ సర్విసులను రద్దు చేసింది. దీంతో, ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. రైళ్లు పట్టాలపైనే నిలిచిపోవడంతో జనం బయటకు దూకి వరద నీళ్లలోనే గమ్యస్థానాలకు కాలినడకన బయలుదేరారు. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12.30 గంటల వరకే పనిచేసింది. సెంట్రల్ రైల్వే దూరప్రాంత రైలు సర్విసులను రీషెడ్యూల్ లేదా రద్దు చేసింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్–థానే మధ్యలో దాదాపు 8 గంటల తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సీఎస్ఎంటీ–మన్‌ఖుర్ద్ హార్బర్ లైన్లో రైళ్లు మాత్రం నిలిచిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి 253 విమానాల టేకాఫ్, మరో 163 విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. దృగ్గోచరత సరిగాలేక 8 విమానాలను దారి మళ్లించినట్లు ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.నిలిచిన మోనో రైళ్లు సుమారు 700 మందితో మంగళవారం సాయంత్రం బయలుదేరిన మోనో రైళ్లు రెండు అర్థంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. మైసూర్ కాలనీ–భక్తి పార్క్ స్టేషన్ల మధ్యన ఉండగా 6.15 గంటల వేళ విద్యుత్ సరఫరా లోపంతో అర్థంతరంగా నిలిచిపోయింది. ఏసీ పనిచేయకపోవడంతో అందులో ఉన్న 582 మంది గంటపాటు ఉక్కిరిబిక్కిరియ్యారు. స్పృహతప్పిన కనీసం 15 మందిని ఆస్పత్రిలో చేర్పించారు.ఫైర్, మున్సిపల్ సిబ్బంది ప్రయాణికులందరినీ సురక్షితంగా ఖాళీ చేయించి, బస్సులో గమ్యస్థానాలకు పంపించారని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. వడాలా స్టేషన్‌కు సమీపంలో 200 మంది ప్రయాణికులతో నిలిచిపోయిన మరో మోనోరైలును అధికారులు విజయవంతంగా వెనక్కి తీసుకెళ్లారు. కాగా, వచ్చే 48 గంటలు అత్యంత కీలకమైన సమయమని సీఎం అన్నారు. ముంబై, థానె, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించామని చెప్పారు. -
Mumbai: వర్ష బీభత్సం.. రెండు రోజులు రెడ్ అలర్ట్.. విద్యాసంస్థలకు సెలవు
ముంబై: ముంబైలో వరుసగా మూడవ రోజు సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. Be it an epidemic, a storm, bad weather or heavy rains, Mumbai Police officers and soldiers are always ready to help the common people, Salute Mumbai Police.❤️❤️🙏🏻🙏🏻🙏🏻#Mumbaipolice pic.twitter.com/2mfoh3NiCM— Krishna Kant Mishra (@KKMishraOffice) August 18, 2025దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా పలు రోడ్లు జలమయం అయ్యాయి. అంధేరి సబ్వే , లోఖండ్వాలా కాంప్లెక్స్ తదితర లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.🚨 Dadar majorly waterlogged.. 🔴Avoid unnecessary travel in Mumbai! Flashfloods in many parts of Mumbai after consistent heavy rains 🌊⚠️ pic.twitter.com/XF1pZ6FaXi— Mudassir Goenka (@MudassirGoenka7) August 18, 2025సబర్బన్ రైళ్లు 15 నుండి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైతో పాటు సమీప జిల్లాలైన థానే, రాయ్‌గడ్‌లలో మంగళవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముంబై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి దృశ్యమానత తగ్గిందని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని వాహనదారులు తెలిపారు. వర్షం కారణంగా పలు రోడ్లు నీట మునిగాయి.అంధేరి సబ్వే, లోఖండ్వాలా కాంప్లెక్స్ ప్రాంతాలలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ముంబై జీవనాధారంగా పరిగణించే సబర్బన్ రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నట్లు అధికారులు, ప్రయాణికులు తెలిపారు. శనివారం నుండి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుండి వర్షాల తీవ్రత మరింత పెరిగిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
కుండపోత వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు
-
బుడమేరులో బోగస్ ఆపరేషన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వర్షం కురిసిందంటే చాలు బెజవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా బుడమేరు ప్రాంత నివాసులు గతేడాది విలయం తలుచుకుని గజగజ వణికిపోతున్నారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు ఏడాదిగా ఉత్త మాటలుగానే మిగిలిపోయాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు స్థానికంగా కురిసిన వర్షాలకే బుడమేరుకు 5,000 క్యూసెక్కులపైగా వరద వచ్చింది. ఏలూరు కాలువకు వెయ్యి క్యూసెక్కులు, మిగిలిన నీటిని బుడమేరు కాలువ ద్వారా బయటికి పంపే యత్నం చేస్తున్నారు. బుడమేరు పరిధిలో ఆక్రమణల మాట దేవుడెరుగు కనీసం పూడికతీత కూడా సక్రమంగా చేయలేదు. గుణదల, నిడమానూరు, రామవరప్పాడు, గూడవల్లి ప్రాంతాల్లో బుడమేరు వంతెనలను వెడల్పు చేయకపోవడంతో పైనుంచి నీరు ప్రవహిస్తోంది. నీళ్లు నిలువ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయి ఇళ్లలోకి ప్రవహిస్తోంది. రోడ్లు కోతకు గురి అవుతున్నాయి. బుడమేరు కాలువ సామర్థ్యం ఐదు వేల క్యూసెక్కులని చెబుతున్నా ఆక్రమణలు, పూడికతో కాలువ కుంచించుకుపోయింది. మూడు వేల క్యూసెక్కులకే కాలువ పొంగి లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవేశించే పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురవకపోవటం, బుధవారం వరకు వెలగలేరు వద్ద వరద లేకపోవడంతో బెజవాడ ఊపిరి పీల్చుకుంది. గురువారం ఉదయం వెలగలేరు వద్దకు 3 వేల క్యూసెక్కుల వరద రాగా డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి పంపారు. 10,500 క్యూసెక్కుల వరకు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణాలోకి పంపే అవకాశం ఉంది. అయితే ఇదే వర్షం కొనసాగి ఉంటే బుడమేరు వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యేవి. మాయ మాటలతో సరి..! బెజవాడ దుఃఖదాయినిగా మారిన బుడమేరు ఆధునికీకరణపై కూటమి సర్కారు మాయ మాటలతో మభ్యపెట్టింది. గతేడాది విరుచుకుపడ్డ వరదకు 32 డివిజన్ల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారమే 2.62 లక్షల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకక వారం రోజులపాటు వరద నీటిలోనే విలవిల్లాడాయి. పెద్దఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి, నష్టం జరిగింది. ముంపు నివారణకు రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని ప్రకటించిన సీఎం చంద్రబాబు చివరకు రూ.39.47 కోట్లతో సరిపెట్టారు. ఆ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. విజయవాడను ముంపు రహిత నగరంగా మార్చేలా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ అంటూ మంత్రులు కొద్ది రోజులు హడావుడి చేశారు. తొలిదశలో బుడమేరు సామర్థ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. 13.25 కిలోమీటర్లు మేర బుడమేరు ఆక్రమణలకు గురైంది. విద్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఎకరాలు ఆక్రమణకు గురికాగా వీటిలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటికి సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించే ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు, యూటీల సామర్థ్యం పెంపు ప్రతిపాదన బుట్టదాఖలైంది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలో మీటర్ల మేర కాలువ గట్ల పటిష్టానికి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం కొద్దిపాటి వర్షాలకే బుడమేరు ముంపు ప్రాంతాల్లో 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన స్థితి ఉంది. 660 మందిని ఆ కేంద్రాలకు తరలించారు. గతంలో కృష్ణలంకలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని నగర వాసులు వాపోతున్నారు.పుట్టగుంట వంతెన వద్ద ఉధృతి.. పుట్టగుంట వంతెన వద్ద బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా వంతెన వద్ద 17.5 అడుగుల మేర వరద ఉంది. 20.5 అడుగులకు చేరితే మచిలీపట్నం–నూజివీడు–కల్లూరు జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేసే అవకాశం ఉంది. నందివాడ మండలంలో ఇప్పటికే 6 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. బుడమేరు ప్రవాహం మరింత పెరిగితే పరీవాహక గ్రామాలు గతేడాది మాదిరిగా ముంపు బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వంతెన వద్ద ఎంఎన్‌కె రహదారి కోతకు గురవడంతో సగం మేర ధ్వంసమైంది. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకునే ఆస్కారం ఉన్నా పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు.వర్షం పడితే వణుకే.. బుడమేరు వరద విలయానికి ఏడాది అవుతున్నా ఆ బీభత్సం ఇంకా కళ్లెదుట మెదులుతూనే ఉంది. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాం. వర్షం పడుతుంటే మా కాలనీ వాసులకు వణుకొస్తోంది. సంవత్సరం గడిచినా వరద నీరు మళ్లీ మా ఇళ్లల్లోకి రాదనే భరోసాను ప్రభుత్వం కల్పించలేకపోయింది. బుడమేరులో ఆక్రమణలు, పూడికలు తొలగించాలి. ప్రజలను అప్రమత్తం చేయడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటుపై సమాచారం సరిగా లేదు. – టి.బాల, అరుణోదయనగర్, 57వ డివిజన్, విజయవాడ కొద్దిపాటి వానకే ఇళ్లల్లోకి నీళ్లు.. సింగ్‌నగర్, నందమూరినగర్‌లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయినేజీ నీళ్లు.. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతోంది. గతేడాది వచ్చిన వరదలను మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇల్లు మునిగిపోయి సర్వస్వం కోల్పోయాం. ఇప్పుడు రెండు రోజుల వర్షానికే 68 ఇళ్లకుగానూ 30 ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేశాయి. రోడ్లన్నీ మునిగిపోవడంతో మోటార్లు పెట్టి తోడుతున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా డ్రెయినేజీ నీరు సక్రమంగా పారేలా, వర్షపునీరు నిలవకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పెద్దలు నందమూరినగర్పై దృష్టిపెట్టి ముంపు ముప్పును తొలగించాలి. – వై.ప్రసాదరావు, నందమూరినగర్, 58వ డివిజన్, విజయవాడ -
రాత్రి నుంచి ముంబైని వదలని వర్షం.. నేడు కూడా..
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారత వాతావరణశాఖ అధికారులు ఆగస్టు 18 వరకు ముంబై కి ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. #WATCH | Mumbai witnesses heavy rain as IMD sounds 'yellow' alert for the city today pic.twitter.com/qxjwO0QxaI— ANI (@ANI) August 14, 2025ఈరోజు(గురువారం)కూడా ముంబైని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాల్ఘర్, థానే, ముంబై, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. #WATCH | Mumbai witnesses heavy rain as IMD sounds 'yellow' alert for the city today pic.twitter.com/qxjwO0QxaI— ANI (@ANI) August 14, 2025 -
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్: కొన్ని రోజులుగా హైదరాబాద్‌ను వరుణుడు అతలాకుతలం చేస్తున్నాడు. ఏదొక సమయంలో నగరాన్ని ముంచెత్తుతున్నాడు వరుణుడు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 11వ తేదీ) మహా నగరాన్ని వర్షం తడిపేసింది. వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్‌లో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం వేళ చినుకు చినుకుగా మొదలైన భారీ వర్షంగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. మెహిదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో సైతం కుండపోత వర్షం పడింది. అల్వాల్, మల్కాజ్గిరి, తార్నాక, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, అమిర్‌పేట, ఎర్రగ్డ, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. -
మహా నగరాన్ని వదలని వరుణుడు
హైదరాబాద్: మహా నగరాన్ని వరుణుడు పగబట్టినట్లే ఉన్నాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. చినుకు చినుకుగా మొదలైన వాన.. భారీ వర్షంగా మారడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాసేపు విరామం ఇచ్చి హమ్మయ్యా అనుకునేలోపే మళ్లీ నగరంలోని ఏదో మూలన భారీ వర్షం మొదలవుతోంది. శనివారం(ఆగస్టు 9వ తేదీ) రాత్రి సమయంలో నగరాన్ని భారీ వర్షం ముంచెత్తగా, ఆదివారం(ఆగస్టు 10వ తేదీ) మధ్యాహ్న సమయానికే మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్లో భారీ వర్షం కురుస్తోంది. పీర్జాదిగూడ, మేడిపల్లి సహా పలు చోట్లు భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా ఉప్పల్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. -
ఉరిమిన వరుణుడు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్‌పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
Hyderabad: దారి తప్పిన ప్లానింగ్
సాక్షి, హైదరాబాద్: చిన్న వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయం... ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోవాల్సిందే.. ఇక ఎక్కడైనా ప్రమాదం జరిగినా.. రోడ్డు గుంత పడినా.. వాహనం బ్రేక్‌డౌన్ అయినా గంటల తరబడి ట్రాఫిక్ జామే.. వీటన్నింటికీ ప్రధాన కారణం ఇంజినీరింగ్ లోపాలే. రహదారులు, కూడళ్లను శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్మించకపోవడం. ట్రాఫిక్ కానీ, నాలాల విషయంలో కానీ మన అధికారులు, పాలకులు ఇంజినీర్ల పాత్ర విస్మరించడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయి. నాటి నివేదికలే ఇప్పటికీ దిక్కు.. నిజానికి ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత పూర్తిగా పోలీసులదే అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ప్రధాన కూడళ్లలో సిగ్నళ్ల వద్ద నిలబడి ట్రాఫిక్ క్రమబద్ధంగా వెళ్లేందుకు మాత్రమే వారు దోహదపడతారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించడం వంటివి అదనంగా చేస్తారు. ట్రాఫిక్ సజావుగా, సాఫీగా సాగిపోయేందుకు రోడ్లు, కూడళ్లలోని జంక్షన్లు, ఫ్లైఓవర్లు, ప్రధాన రోడ్లను కలిపే యాక్సెస్ రోడ్లు వంటివి ప్రణాళికాబద్ధంగా రూపొందించకపోవడంతోనే నగరంలో ఈ సమస్యలంటున్నారు ట్రాఫిక్ నిపుణులు. నాలాల విషయంలో ఇంజినీరింగ్ ప్రముఖుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1920లో రూపొందించిన నివేదికలే ఇప్పటికీ పనికి వస్తున్నట్లే.. రోడ్ల విషయంలో అలాంటి ప్రణాళికలు లేకపోవడమే ఈ సమస్యకు మూలకారణమని స్పష్టం చేస్తున్నారు. లోపాలతోనే వేగానికి తూట్లు... నగరంలో వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేల కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. విపరీతంగా విస్తరిస్తున్న ప్రధాన రోడ్లు, వాటిని కలిపే యాక్సెస్ రోడ్లు, చిన్నా చితకా రోడ్లతో పాటు చిన్నచిన్న గల్లీలనూ లెక్కేస్తే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటి నిర్మాణంలో ఎలాంటి ప్రణాళిక లేదన్నది నిపుణులు చెబుతున్న వాస్తవం. అత్యంత ప్రధానమైన రోడ్లలోనూ నానాటికీ రద్దీ పెరిగిపోతోంది. వాటికి సమాంతర రోడ్ల అభివృద్ధి అనే ఊసే లేకపోవడంతో ట్రాఫిక్ అనేక పద్మవ్యూహంలా మారిపోతోంది. వాస్తవానికి నగరంలోని ప్రధాన ఆరీ్టరియల్ రోడ్లు (ప్రధాన రహదారులు) అయిన పంజగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక తదితర రోడ్లన్నీ వాహనాలు కనీసం గరిష్టంగా 60 కి.మీ. వేగంతో వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న పెద్దరోడ్లే. కానీ కేవలం ఇంజినీరింగ్ ప్రమాణాల లోపాలతోనే ఇప్పుడీ రోడ్లన్నీ ట్రాఫిక్ వలయంలో చిక్కిపోతూ సరాసరిన గంటకు కనీసం 30 కిమీ వేగంతోనూ వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాయి. కిర్లోస్కర్ కమిటీ నివేదికా బుట్టదాఖలే.. నగరంలో 2000వ సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షం–వరద తీవ్రత ప్రజలతో పాటు ప్రభుత్వానికీ ముచ్చెమటలు పట్టించింది. దీంతో వరద నివారణ చర్యలు సిఫార్సు చేయడానికి 2003లో కిర్లోస్కర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అప్పట్లో ఉన్న ఎంసీహెచ్ పరిధిలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను 170 కిలోమిటర్ల మేర విస్తరణ తక్షణం చేపట్టాలని, అందుకు రూ.264 కోట్లు వ్యయం అవుతుందని తేలి్చంది. 2007లో నగర శివార్లలోని పన్నెండు మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పోరేషన్లో విలీనమై జీహెచ్ఎంసీ ఏర్పడింది. ఇలా 625 చ.కి.మీల్లో విస్తరించిన గ్రేటర్‌కు సమగ్ర మాస్టర్ ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల, మేజర్, మైనర్ వరద నీటి కాలువ ఆధునీకరణ కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి అప్పట్లోనే రూ. 6247 కోట్లు అవసరం అవుతాయని తేలి్చంది. ఈ నివేదికలు ప్రాథమిక స్థాయిలోనూ అమలు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు. అన్నీ ఉన్నా అధ్యయనమేది? రోడ్ల నిర్మాణంలో సరైన ప్రణాళిక అవలంబించకపోవడంతోనే అసలు సమస్య వస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఒక ప్రదేశంలో రోడ్డు నిర్మించాల్సి వస్తే దాని వల్ల ఎక్కువగా ఎవరి ప్రయోజనం... అంటే స్కూల్ జోనా? వాణిజ్య ప్రాంతమా? తదితర విషయాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి. దానికి తగ్గట్టు మార్పుచేర్పులతో రహదారి నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సిటీలో మాత్రం ఆరీ్టరియల్ రోడ్లు, ఇన్నర్ రోడ్లు, ఇంటర్మీడియట్ రోడ్లు దేనికీ సరైన ప్రణాళిక, అధ్యయనం లేకుండానే నిర్మితమవుతాయి. అందుకే ట్రాఫిక్ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది.ఆ ‘భుజం’కు ఊతమేది? నగరంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా, బస్సు వంటివి బ్రేక్ డౌన్ అయినా గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. నిజానికి ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు ఒక్కోటి 2.5 మీటర్ల వెడల్పుతో కనీసం నాలుగు లైన్లుగా ఉండాలి. దీనితో పాటు ఆ రోడ్డుకు సాంకేతికంగా ‘షోల్డర్స్’ అని పిలిచే ఖాళీ ప్రదేశం ఉండాలి. ఎందుకంటే ఆ మార్గంలో ఏదైనా వాహనం పాడయితే అది మిగతా వాహనాలకు అవాంతరం కాకుండా ఉండేందుకు దాన్ని షోల్డర్స్‌లో నిలిపి వేస్తారు. కానీ మనదగ్గర ఇవి ఏ ప్రాంతంలోనూ మచ్చుకు కూడా కనిపించవు. ఫుట్‌పాత్‌లుగా పిలిచే కాలిబాటలపై ఉన్న ఆక్రమణలను తొలగించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలంటూ అనేకసార్లు హైకోర్టు, లోకాయుక్త వంటి వ్యవస్థలు హెచ్చరించాయి. రహదారికి పక్కన తప్పనిసరిగా కాలిబాటలు ఉండాలి. ఫలితంగా పాదచారులు వీటిని ఆశ్రయిస్తే ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు ప్రమాదాలు అదుపులోకి వస్తాయి. సిటీలో ప్రధాన రోడ్లతో పాటు యాక్సెస్ రోడ్లకూ ఉన్న ఫుట్‌పాత్‌లు ఆక్రమణలో ఉన్నాయి. ఇలా జరగడానికి ఇంజినీరింగ్ లోపమే ప్రధాన కారణం. -
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
#HyderabadRains : భారీ వర్షానికి వణికిన మహానగరం.. జల దిగ్బంధంలో పలు కాలనీలు (ఫొటోలు)
-
Rain: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షం ధాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కురిసిన వర్షంతో రోడ్లు చెరువల్ని తలపించాయి.సికింద్రాబాద్,కోఠితో పాటు అన్నీ ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆస్పత్రి వరకు భారీ ట్రాఫ్రిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లిహిల్స్‌లో 7.4సెంటీమీటర్లు, మెహిదీపట్నంలో 5.3సెంటీమీటర్లు, బంజారాహిల్స్‌లో 4.6, యూసఫ్ గూడా 3.9,ఖైరతాబాద్ 3.6, మైత్రీవనం 3.4, కూకట్పల్లి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటు ఈదురు గాలులు నగర వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో నగర వాసులు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హయత్‌నగర్, వనస్థలీపురం, అబ్ధుల్లాపూర్ మెట్లలో వర్షం కురుస్తుండగా.. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, ఉప్పల్, రామాంతపూర్, నాచారం, తార్నాకలో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి,అబిడ్స్,మలక్‌పేట్‌లో దంచికొడుతోంది. రాజ్ భవన్ రోడ్, తెలంగాణ సెక్రటరియేట్ ఎదుట వరద నీరు రోడ్డు మీదకు చేరింది.తెలంగాణను భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వర్షం దాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రానున్న మరో రెండు గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ ,హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. -
India vs England: ఇంకా ఉంది!
ఆఖరి టెస్టుకు, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు నాలుగో రోజే తెరపడాలి. కానీ వెలుతురు మందగించడంతో ఆగిన ఆట... తర్వాత జోరు వాన కురవడంతో ఎంతకీ కొనసాగలేదు. నాటకీయ ముగింపునకు తెరలేచిన ఈ పోరు తుది ఫలితం నేటికి వాయిదా పడింది. ఆతిథ్య ఇంగ్లండ్ 3–1 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకునేందుకు మరో 35 పరుగుల దూరంతో దగ్గరైంది. అలాగే భారత్ కూడా 2–2తో సమం చేసేందుకు అంతే దగ్గరగా ఉంది. ప్రధాన బ్యాటర్లంతా అవుట్‌కాగా 35 పరుగులు చేసేలోపు 4 వికెట్లు తీస్తే టీమిండియా సమం చేసుకొని సగర్వంగా తిరిగొస్తుంది. లండన్: నాటకీయత మొదలవగానే... ఉత్కంఠ అంతకంతకు పెరగకముందే... ప్రతికూల వాతావరణం ఆటకు ‘రెడ్ సిగ్నల్’ ఇవ్వడంతో ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’ సిరీస్ ఫలితం నాలుగో రోజు తేలలేదు. ఇన్నాళ్లు జరిగిన నాలుగు టెస్టుల అసలు మజా కంటే చివరి ఐదో టెస్టు ‘కొసరే’ ఇరు జట్లను ఊరిస్తోంది. ఇంగ్లండ్ 374 పరుగులు ఛేదన కాస్తా 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్ (152 బంతుల్లో 105; 12 ఫోర్లు) శతక్కొట్టారు. జేమీ స్మిత్ (2 బ్యాటింగ్), ఓవర్టన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్‌కు ఒక వికెట్ దక్కింది. ‘టాప్’ లేపడంతో ఉత్సాహం తొలి సెషన్ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. లక్ష్యఛేదన జట్టులోని ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఓవర్‌నైట్ స్కోరు 50/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన డకెట్ (54, 6 ఫోరు), కెప్టెన్ ఒలీ పోప్ (34 బంతుల్లో 27; 5 ఫోర్లు) నిలకడను ప్రదర్శించారు. ఓవర్‌నైట్ బ్యాటర్ డకెట్ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ని్రష్కమించాడు. మళ్లీ ఐదు ఓవర్ల లోపలే సిరాజ్ చక్కని డెలివరీతో కెపె్టన్ పోప్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ 106/3 స్కోరే చేసింది. తర్వాత రూట్, బ్రూక్ పరుగుల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలి సెషన్లోనే బ్రూక్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడి భారత బౌలర్లకు మింగుడుపడిని ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టేశాడు. ఇంగ్లండ్ 164/3 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. బ్రూక్, రూట్ శతకాలు నాలుగో ఇన్నింగ్స్‌లో తొలి సెషన్లోనే రెండు కీలక వికెట్లు పడిపోవడం బౌలింగ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అయితే క్రీజులో పాతుకుపోయిన రూట్‌తో అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న బ్రూక్ సాఫీగా పరుగులు సాధిస్తుండటంతో భారత శిబిరంలోని ఆత్మవిశ్వాసం కాస్తా సన్నగిల్లింది. ఇదే అదనుగా ఇద్దరు లక్ష్యాన్ని కరిగించే పనినిలో ముందడుగు వేశారు. ఈ సెషన్ భారత్ ఆశల్ని చిదిమింది. వన్డేను తలపించే ఆటతీరుతో బ్రూక్ 91 బంతుల్లోనే శతకం సాధించాడు. అతను ని్రష్కమించాక... ఆఖరి సెషన్లో రూట్ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. లక్ష్యానికి చేరువైన దశలో బెథెల్ (5), రూట్ అవుటవడంతోనే డ్రామా మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 54; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసి«ద్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్‌దీప్ 111; బెథెల్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 5; స్మిత్ బ్యాటింగ్ 2; ఓవర్టన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (76.2 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 20–4–85–1, ప్రసి«ద్‌కృష్ణ 22.2–3–109–3, సిరాజ్ 26–5–95–2, సుందర్ 4–0–19–0, జడేజా 4–0–22–0. -
వాన పడితే వావ్! ఈ గ్యాడ్జెట్స్ ఉంటే రెయిన్ టెన్షన్ ఉండదిక..
వాన పడితే చాయ్, పకోడీతో ‘వావ్’ అనాలా? లేదా తడి బట్టల టెన్షన్‌తో ‘ఓహ్ నో!’ అనాలా?. ఇప్పుడు వావ్ మాత్రమే అనిపించేలా, వాన తెచ్చే టెన్షన్‌కి బై.. బై చెప్పే గాడ్జెట్స్ వచ్చేశాయి. అవే ఇవి.ఇంట్లోనే ఆరేసేయ్!ఇంట్లో బట్టలు ఆరేయడానికి చోటు లేదు, బయట గాలి లేదు, లాండ్రీకి వేసేందుకు టైమ్ లేదు.. ఇలా వానాకాలంలో బట్టలు అన్నవే బాధగా మారిపోయాయా? కూల్! ఇప్పుడు మార్కెట్లోకి చిటికెలోనే దుస్తులను ఆరబెట్టే అద్భుతమైన పరికరం వచ్చేసింది. పేరు ‘ఎక్స్‌ప్రెస్ డ్రైయర్ ఔరేట్ ప్రో మ్యాక్స్’. చిన్న బాటిల్ సైజులో ఉండే ఈ పరికరం, ఒకేసారి నాలుగు పెద్ద దుస్తులను ఆరబెట్టగలదు. అంతేకాదు, దీనిని ఆన్ చేసుకుంటే, ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి దుస్తులపై ఉండే సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. దీని వల్ల దుస్తుల మురుగు వాసన తొలగి, అచ్చం బయట ఎండలో ఆరవేసినంత శుభ్రంగా తయారవుతాయి. పవర్ ఆన్‌చేసి, ఒక్కసారి టైమర్ పెడితే, పని అయిపోగానే ఆదే ఆగిపోతుంది. ఈ డ్రైయర్‌ను మడతపెట్టి సూట్‌కేస్‌లో పెట్టుకోవచ్చు కూడా. దీని ధర రూ. 4,712.కవర్ వేసి కూల్‌గా నడవండి వర్షం రాగానే చాలామంది హెల్మెట్, గొడుగు, రెయిన్ కోట్ వేసుకొని ఫుల్ ప్రొటెక్షన్ మోడ్‌లోకి వెళ్తారు. ముఖం తడవదు, జుట్టు తడవదు కాని, చెప్పులు? కొత్తగా కొన్న బ్రాండెడ్ షూస్ బురదలో మునిగి, మురికి నీళ్లలో నానిపోయి, ఇంట్లోకి అడుగు పెట్టే సరికి వాసనతో బరువెక్కిపోతుంటాయి. ఇప్పుడు ఆ బాధకు ఫుల్స్టాప్ పెట్టేందుకు మార్కెట్లోకి వచ్చాయి వాటర్‌ప్రూఫ్ షూ కవర్స్. పీవీసీ మెటీరియల్‌తో తయారైన ఇవి జిప్పర్, డ్రాస్ట్రింగ్ డిజైన్లతో షూస్‌కి నాలుగు వైపులా కవచంలా ఉంటాయి. వర్షం, మంచు, మట్టి, బురద నుంచి రక్షణ ఇస్తాయి. నాన్‌స్లిప్ సోల్ వల్ల వీటితో నడిచేటప్పుడు జారిపోయే ప్రమాదం ఉండదు. వీటిని మడతపెట్టి పాకెట్లో వేసుకోవచ్చు. ధర వివిధ కంపెనీలను బట్టి రూ. 200 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది.సురక్షితమైన వెలుగు సువాసనతోవర్షం వచ్చినప్పుడల్లా పవర్ కట్ కామన్! టీవీ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది, ఇల్లంతా చీకటి కమ్మేస్తుంది. అప్పుడు మనం క్యాండిల్స్ వెలిగిస్తాం. అది మామూలు క్యాండిల్ అయితే, చేతుల మీద కరిగిన మైనం పడి మండుతుంది. గాజు జార్లో ఉన్న క్యాండిల్ చీకట్లో పగిలిపోతుంది. అందుకే, ఇలాంటి సమయాల్లో నిజంగా పనికొచ్చేవి మామూలు క్యాండిల్స్ కాదు, ‘సాండ్ వాక్స్ క్యాండిల్స్’. ఈ క్యాండిల్ వాక్స్ మామూలు వాక్స్ కాదు. సువాసనతో కూడిన పౌడర్ వాక్స్. ఇది రీఫిల్లబుల్, నాన్ టాక్సిక్. చేతులపై కరిగి పడదు, పొగతో చికాకు పెట్టదు. మీకు ఇష్టమైన గిన్నెలో వేసుకుని, అందులో ఒత్తి పెట్టి వెలిగించుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా ఒత్తి తీసి మళ్లీ వాడుకోవచ్చు. ధర. రూ.309 మాత్రమే! -
చినుకు చినుకుల జీవధార
ప్రకృతి సహజ పరిణామమైన రుతుచక్ర భ్రమణంలో ఏటా వర్షర్తువు వస్తుంది. వర్షాకాలం ఏటా రావడం తథ్యమే అయినా, వాన రాకడలో తరచుగా ముందు వెనుకలు జరుగుతుంటాయి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అని మనకో సామెత ఉంది. ఎప్పుడు కురుస్తాయో తెలియని వాన రాక కోసం ఒక్కో ఏడాది రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కో ఏడాది వానలు పుష్కలంగా కురుస్తుంటాయి. ఒక్కో చోట అనావృష్టి కరవు కాటకాలను సృష్టిస్తుంది. ఒక్కో చోట అతివృష్టి వరదలతో ముంచెత్తి పెనునష్టాన్ని కలిగిస్తుంది. వానలు తెచ్చిపెట్టే కష్టనష్టాలు ఎలా ఉన్నా, వానలు లేనిదే మనుగడ సాగించడం అసాధ్యం. ఈ భూమ్మీద మనుషులతో పాటు పశుపక్ష్యాదులు, చెట్లు చేమలు వంటి సమస్త జీవులు బతకాలంటే, వానలు కురవాల్సిందే!వానలే లేకుంటే మనం నివసించే ఈ భూమి కూడా మిగిలిన గ్రహాల మాదిరిగా జీవరహిత గోళంగానే మిగిలి ఉండేది. వానల వల్లనే భూమి మీద జీవజాలం ఏర్పడింది. వానల వల్లనే భూమి మీద నాగరికతలు ఏర్పడ్డాయి. తొలినాటి మానవులకు వాన ఒక ప్రకృతి అద్భుతం. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, చిటపట చినుకులతో మొదలై, క్రమంగా పుంజుకుని జడివానగా మారే దృశ్యం ఇప్పటికీ ఒక అద్భుతమే! నాగరికతలు ఏర్పడిన కాలం నుంచి వివిధ సంస్కృతులలో వర్షారాధన ఉండేది. వానాకాలంలో ప్రత్యేకంగా జరుపుకొనే పండుగలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు వర్షవర్ణన కనిపిస్తుంది. వైదిక సాహిత్యంలోని ‘పర్జన్యసూక్తం’, ‘వరుణస్తుతి’ వంటివే కాకుండా, లౌకిక సాహిత్యంలోనూ కవులు మేఘవర్ణన, వర్షవర్ణన చేశారు.‘ఆనందదో వర్షతు మేఘ వృందఃఆనందదా జలధరా స్సంతతం భవంతుఆనందదోవుణ ఏష సదాస్తుమహ్యంఆనందినీ రోషధయో భవంతు’అని ‘వరుణస్తుతి’ వర్షానందాన్ని స్తుతించింది.‘విరిసెను మేఘ పరంపరమెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్పరచెను ఝంఝానిలములుకురిసెను వర్షము కుంభగుంభితరీతిన్’అంటూ మబ్బులతో మొదలై కుంభవృష్టిగా మారే వర్షదృశ్యాన్ని ఆవిష్కరించారు గుంటూరు శేషేంద్రశర్మ.నాగరికతలతో పాటు సంగీత సాహిత్యాది కళలను కూడా ప్రభావితం చేసిన ప్రకృతి పరిణామం వాన. వానలు లేనిచోట జీవం ఉండదు. జీవానికి తావులేని చోట మనుగడ ఉండదు. మనుగడ లేని చోట ఇక నాగరికతలెక్కడ? సంగీత సాహిత్యాది కళావైభవాలెక్కడ? భూమ్మీద వానలు కురిసే తావులతో పాటు అక్కడక్కడా చినుకు కురవని ఎడారులు కూడా ఉన్నాయి.ఇప్పటి ఎడారులు ఒకనాడు పచ్చని నేలలేనని, ప్రకృతి మార్పుల ఫలితంగానే అవి ఎడారులుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడేదని; ఒకప్పుడు అక్కడ జలకళతో అలరారే సరోవరాలు, నదులు ఉండేవని; వాటి ఒడ్డున పచ్చని సవన్నా గడ్డిభూములు ఉండేవని; ఆ గడ్డిభూముల్లో అనేక జంతువులు జీవించేవని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. వేలాది సంవత్సరాల పరిణామంలో భూకక్ష్యలో వచ్చిన మార్పుల వల్ల సహారా ప్రాంతంలో వానలు కురవడం ఆగిపోయి, పూర్తిగా ఎడారిగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో సహారా ఎడారిలో అక్కడక్కడా తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తోంది. ‘ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్’ ఉత్తర దిశవైపు కదిలినప్పుడు సహారా ఎడారిలో అక్కడక్కడా నాలుగు చినుకులు కురుస్తున్నాయి. ఆ చినుకుల వల్లనే ఈ ఎడారిలో తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వర్షారాధన సంస్కృతిప్రాచీన నాగరికతలు విలసిల్లిన ప్రతిచోట వర్షారాధన సంస్కృతి ఉంది. అన్ని నాగరికతలలోనూ వర్షాలకు అధిదేవతలు ఉన్నారు. భారత ఉపఖండంలో వైదికార్యులు ఇంద్రుడిని, వరుణుడిని వర్షాధిదేవతలుగా కొలిచేవారు. మన పురాణాల్లో ఇంద్ర వరుణుల ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీన గ్రీకు ప్రజలు వర్షాల కోసం జూస్ అనే వర్షాధిదేవుడిని, హైయడీస్ అనే అప్సరసలను ఆరాధించేవారు. వర్షాల కోసం ప్రాచీన రోమన్లు దేవతలకు రాజైన జూపిటర్ను, సముద్రాధిదేవత అయిన నెప్ట్యూన్‌ను పూజించేవారు. ప్రాచీన ఈజిప్షియన్ ప్రజలు టెఫ్నట్ అనే వర్షదేవతను ఆరాధించేవారు. సుమేరియన్ నాగరికతలోని ప్రజలు ఇష్కుర్ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు.ఇష్కుర్కు ‘అదాద్’ అనే మరోపేరు కూడా ఉన్నట్లు అకాడియన్ పురాణాల కథనం. మధ్య అమెరికాలోని మాయన్ నాగరికత ప్రజలు చాక్ అనే వర్షాధిదేవుడిని పూజించేవారు. ఉత్తర అమెరికాలో మూలవాసులైన నవాజో ప్రజలు టొనీనిలీ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. దక్షిణ అమెరికాలో పురాతన మూయిస్కా మతస్థులు వర్షాల కోసం చిబ్చాకూమ్ అనే దేవుడిని పూజించేవారు. ప్రాచీన చైనీస్ ప్రజలు యుషి అనే వానదేవుడిని పూజించేవారు. జపాన్‌లోని షింటో మతస్థులు కురాఒకామి అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. ఆస్ట్రేలియాలోని మూలవాసులు వాంజినా అనే వర్షాధిదేవతను పూజించేవారు. వానల కోసం దేవుళ్లను, దేవతలను పూజించడం, వారి ప్రీతి కోసం రకరకాల నైవేద్యాలు సమర్పించడం, పండుగలు జరుపుకోవడం పురాతన కాలం నుంచే ఉంది. చాలాచోట్ల ఇప్పటికీ వానల కోసం ప్రత్యేకంగా పూజలు జరపడం, వేడుకలు జరపడం వంటి ఆచారాలు కొనసాగుతున్నాయి.మన వానాకాలం పండుగలుమన దేశంలో వానాకాలంలో వచ్చే పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకొంటే, మరికొన్నింటిని వేర్వేరు ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రజలు జరుపుకొంటారు. వానాకాలంలో వచ్చే జగన్నాథ రథయాత్ర, కృష్ణాష్టమి, వినాయకచవితి పండుగలను దాదాపు దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. అలాగే, తెలంగాణలో బోనాల పండుగ, కేరళలో ఓనం పండుగ, తమిళనాడులో ఆదిపెరుక్కు తదితర పండుగలు జరుపుకొంటారు. ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీజ్, లద్దాఖ్‌లో హెమిస్ సెచు, మేఘాలయలో భేడియేంఖ్లామ్, గోవాలో సావో జొవావో వంటి పండుగలను జరుపుకొంటారు. ఇవేకాకుండా, దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి పూజలు జరుపుతారు.అత్యధిక వర్షపాతంప్రపంచంలో కొన్నిచోట్ల దాదాపు ప్రతి ఏడాది అధిక వర్షాలు కురుస్తుంటాయి. ఇంకొన్ని చోట్ల అరుదుగా అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. మేఘాలయలోని మౌసిన్రామ్ గ్రామంలో 11,872 మిల్లీ మీటర్ల వార్షిక వర్షపాతం నమోదవడంతో ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఒకే సంవత్సరంలో అత్యధిక వర్షపాతం రికార్డు కూడా మౌసిన్రామ్ గ్రామానికే దక్కడం విశేషం. ఈ గ్రామంలో 1985 సంవత్సరంలో ఏకంగా 26,471 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఫ్రెంచ్ ప్రభుత్వం అధీనంలోని రీయూనియన్ దీవిలోని ఫోక్ ఫోక్ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అత్య«ధిక వర్షపాతం నమోదైంది. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్కు తూర్పున ఉన్న రీయూనియన్ దీవిలో సముద్రమట్టానికి 2,990 మీటర్ల ఎత్తులో ఉండే ఫోక్ ఫోక్ ప్రాంతంలో 1966 జనవరి 7–8 తేదీల నడుమ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 1870 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.వానాకాలం వెతలుసెగలు రేపే వేసవి తర్వాత వచ్చే వర్షాలు కొంత హర్షాన్ని తెచ్చినా, తెరిపిలేని వానలు వరుసగా వెతలను కూడా మోసుకొస్తాయి. మన దేశంలోని పరిస్థితులనే చూసుకుంటే, వానలు కురిస్తే చాలు నగరాలు, పట్టణాల్లోని రహదారులన్నీ జలమయంగా మారుతాయి. మురుగునీటి ప్రవాహంతో నిండిన రోడ్లపై వాహనాల రాకపోకలకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడతాయి. ఒక్కోసారి రోజుల తరబడి ముసురు విడిచిపెట్టని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు రోజువారీ కూలీలు ఉపాధి దొరకక ఇబ్బంది పడతారు. జలమయమైన రోడ్ల మీదుగా రాకపోకలు సాగించడానికి ఉద్యోగులు, విద్యార్థులు నానా ఇక్కట్లు పడతారు. అధిక వర్షాలు కురిసినప్పుడు నదుల్లో వరద పోటెత్తి, నదీ తీరాలలో ఉండేవారికి ప్రాణనష్టం, ఆస్తినష్టం వంటి తీవ్రనష్టాలు వాటిల్లుతాయి.వానాకాలంలో వీథులు, ఇళ్ల పరిసరాలన్నీ బురదమయంగా మారడంతో రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి. పలుచోట్ల చిట్లిన మంచినీటి పైపులైన్లలోకి మురుగునీరు ప్రవేశించడంతో నీరు కలుషితమై, కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు పెరుగుతాయి. మురుగునీరు నిలిచిపోవడంతో ఈ కాలంలో దోమల బెడద పెరిగి, వాటి వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు సోకుతాయి. వాతావరణంలో తేమకు తోడు కాలుష్యం పెరగడం వల్ల జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు ఎక్కువవుతాయి. వానాకాలంలో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుంటాయి.చాలా చోట్ల వీ«థుల్లోనే తినుబండారాలు అమ్మే దుకాణాలు, టీ షాపులు ఉంటాయి. వానాకాలంలో వీటి చుట్టూ మురుగునీరు, బురద చేరి ఉంటుంది. ఈగలు, దోమలు ముసురుతూ ఉంటాయి. పరిసరాలు అంత దారుణంగా ఉన్నా, ఉపాధి కోసం ఆ చిరువ్యాపారులు వ్యాపారాలు సాగిస్తుంటారు. అలాంటి చోట్ల తినుబండారాలు తినేవారికి వానాకాలంలో జీర్ణకోశ సమస్యలు, పరిసరాల శుభ్రత లోపించడం వల్ల రకరకాల అంటువ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువవుతాయి.వర్షాలు అతిగా కురిస్తే రైతులకు పంటనష్టం తప్పదు. పొలాల్లో నీరు నిలిచిపోయి, నాట్లు వేసే సమయంలో అతిగా వర్షాలు కురిస్తే, సజావుగా పెరగాల్సిన మొక్కలు కుళ్లిపోతాయి. పంట చేతికి వచ్చే సమయంలో అతిగా వర్షాలు వస్తే, రైతులకు శ్రమ దండగై, పంటనష్టం జరుగుతుంది.వానాకాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంటుంది. దీనివల్ల జనాల రోజువారీ పనులు దెబ్బతింటాయి. వ్యాపార లావాదేవీలకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. గాలి వానల ధాటికి ఒక్కోసారి స్తంభాల నుంచి విద్యుత్ తీగలు నేల మీదకు పడి ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి.చినుకు కురవని నేలప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఆఫ్రికాలో ఉంది. మన దేశంలో థార్ ఎడారి ఉంది. ఈ ఎడారులు ఇసుక మేటలతో పొడి పొడిగా ఉంటాయి. వీటిలో అరుదుగా కనిపించే ఒయాసిస్సుల్లో మాత్రమే కాస్త నీటిజాడ కనిపిస్తుంది. ఇలాంటి ఎడారుల్లో కూడా అతి అరుదుగా కొద్దిపాటి చినుకులు కురుస్తుంటాయి. అయితే, ఈ భూమ్మీద చినుకు కురవని నేల ఏదైనా ఉందా అంటే, అది చిలీలోని అటకామా ఎడారి మాత్రమే! అటకామా ఎడారిలోని పలు ప్రదేశాల్లో చరిత్రలో ఏనాడూ చినుకు కురిసిన దాఖలాల్లేవు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశంగా రికార్డులకెక్కింది.వర్షాధార దేశాలుభూమధ్య రేఖకు ఉత్తర, దక్షిణ దిశలలోని కర్కాటక, మకర రేఖల నడుమనున్న చాలా దేశాలకు, వాటికి కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు వర్షాలే ఆధారం. భారత్, చైనా సహా అత్యధిక జనాభా కలిగిన పలు దేశాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏటా వర్షాకాలం వస్తుంది. అలాగని, ప్రతి ఏడాది ఒకేలా వర్షాలు కురుస్తాయనే భరోసా ఉండదు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఈ దేశాలు చక్కని పంట దిగుబడులతో కళకళలాడతాయి. తగినంత వానలు కురవనప్పుడు కరవు కాటకాలతో అల్లాడిపోతాయి. వానలు మితిమీరి కురిసినప్పుడు వరదలు ముంచెత్తి, పంటనష్టమే కాకుండా, ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని కూడా చవిచూస్తాయి. వరదలు ముంచెత్తకుండా పలుచోట్ల ఆనకట్టలు కడుతున్నా, అనావృష్టిని ఎదుర్కోవడానికి వీలుగా నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు కడుతున్నా ఈ ప్రాంతాలకు తరచుగా అతివృష్టి, అనావృష్టి బాధలు తప్పడం లేదు.భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణాలలో ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఏటా రుతుపవనాలు వస్తాయి. రుతుపవనాల రాకతో ఈ ప్రాంతాల్లో వానాకాలం మొదలవుతుంది. పశ్చిమ, దక్షిణ ఆఫ్రికా దేశాల్లోను; ఉత్తర అమెరికా, ఆసియా దేశాలతో పాటు యూరోప్ దేశాలలో ఏటా జూన్ నెలాఖరులోగా వానాకాలం మొదలవుతుంది. దక్షిణార్ధగోళంలోని ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలలో సెప్టెంబర్ నుంచి వానాకాలం మొదలవుతుంది. వానాకాలంలోనే సముద్రంలో అల్పపీడనాలు, తుఫానులు వంటివి ఏర్పడుతుంటాయి. తుఫానుల వంటి ప్రకృతి విపత్తుల వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కోసారి అపారనష్టం వాటిల్లుతూ ఉంటుంది. వర్షాధార దేశాలకు తఫాను ముప్పు వెన్నంటే ఉన్నా, వర్షాలు లేకుండా ఈ దేశాలు మనుగడ సాగించలేవు. ఇటీవలి కాలంలో పెరిగిన వాతావరణ కాలుష్యం, అడవుల నరికివేత వంటి చర్యల వల్ల అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తరచుగా తలెత్తుతున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటేనే సకాల వర్షాలు సజావుగా కురుస్తాయి. మానవాళికి హర్షాతిరేకాన్ని తీసుకొస్తాయి.వానాకాలం జాగ్రత్తలువానాకాలంలో పుష్కలంగా వానలు కురవడం వల్ల నదులు, జలాశయాలు నీటితో నిండుతాయి. అయితే, వానాకాలంలో నీటితోనే జాగ్రత్తగా ఉండాలి. వానల ఉద్ధృతి వల్ల చెరువులు, బావుల్లో మురికి నీరు పైకి తేలుతుంది. చిట్లిన మంచినీటి పైపులైన్ల ద్వారా మురుగునీరు తాగునీటిలోకి చేరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వానాకాలంలో నీటిని బాగా వడగట్టి, కాచి, చల్లార్చి తాగడం మంచిది. వానాకాలంలో నీటి పట్ల జాగ్రత్తలు తీసుకునేటట్లయితే చాలా వ్యాధుల నుంచి ముప్పు తప్పించుకోవచ్చు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వానాకాలంలో వాతావరణ కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు వంటి ఇబ్బందులను తప్పించుకోవడం కష్టం. కాలంలో మార్పుల వల్ల వచ్చే ఇలాంటి సామాన్యమైన ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్–సి వంటి పోషకాలు ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి.వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాలంలో వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడమే మంచిది. పరిశుభ్రమైన ఆహారం, ఇంట్లో వండుకున్న పదార్థాలు మాత్రమే తినడం అలవాటు చేసుకుంటే, వానాకాలంలో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ కాలంలో ఆరుబయట విక్రయించే తినుబండారాలను తినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.వాన కురిసే సూచన ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పకుండా గొడుగు లేదా రెయిన్‌కోటు వెంట తీసుకువెళ్లడం క్షేమం. నీరు నిండిన రోడ్లపై నడవడానికి అనువైన వాటర్‌ప్రూఫ్ చెప్పులు ధరించడం మంచిది. అనుకోకుండా తోవలో ఎక్కడైనా వానలో తడిస్తే, ఇంటికి రాగానే తడిబట్టలను విడిచి పొడి దుస్తులను ధరించడం మంచిది. తడిసిన దుస్తులతో ఎక్కువసేపు ఉన్నట్లయితే, చర్మంపై ఫంగస్ పెరిగి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.తోవలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాన మొదలైతే, విద్యుత్ స్తంభాలు, వేలాడుతూ కనిపించే విద్యుత్ తీగలు లేని సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకోవడం మంచిది. వాన కురిసేటప్పుడు విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదాలను నివారించుకోవచ్చు. వానలో చెట్ల కింద తలదాచుకోవడం కూడా మంచిది కాదు. గాలి తీవ్రత ఎక్కువైతే భారీ కొమ్మలు విరిగి మీదపడే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం..జనజీవనం అస్తవ్యస్తం (ఫొటోలు)
-
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
వాయుగండం
సాక్షి, హైదరాబాద్: ‘ముందస్తు’గా మురిపించిన వర్షాలు కీలక సమయంలో ముఖం చాటేయటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్ లో సమృద్ధిగా వానలు కురవాల్సిన సమయంలో.. మొగులు కోసం రైతన్న దిగులుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాల కదలికలు మందగించడం, నిలకడలేని తీవ్రగాలుల ప్రభావంతో వర్షాలు జాడ లేకుండా పోయాయి. ఇదే సమయంలో తెలంగాణ ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో ఈ సీజన్లో వర్షాలు జోరుగా ఉంటాయని అంచనా వేశారు. ఈ అంచనాలు తలకిందులు కావటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. నైరుతి రుతుపవనాల సీజన్లోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో సగటున 24.34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 17.59 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సీజన్లో కేవలం జూన్, జూలై నెలల్లోనే ఎక్కువ వర్షాలు కురుస్తుంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా రెండు నెలలపాటు లోటు వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం అని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ⇒ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగతా 32 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. ⇒ ఏడు జిల్లాల్లో 20 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ⇒ 24 జిల్లాల్లో వర్షపాతం భారీ లోటు నమోదైంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగుడెం, హబుబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నారాయణపేట జిల్లాల్లో 20 నుంచి 60 శాతం లోటు ఉంది. ⇒ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏకంగా 62 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. వేసవి ఎండలు తక్కువగా ఉండడంవల్లే.. రాష్ట్రంలో సాధారణంగా వేసవి సీజన్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది వేసవిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 20 సంవత్సరాల్లో మే నెలలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఈ సారి నమోదు కావడం గమనార్హం. ఎండల తీవ్రత తక్కువగా ఉంటే వర్షాలు సైతం తక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మే నెలలో వర్షాలు అధికంగా కురవడం కూడా ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు మరో కారణమని అంటున్నారు. రాష్ట్రంలో వానలు బాగా కురవాలంటే బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు కీలకమని నిపుణులు చెబుతున్నారు. గాలుల తీవ్రతతో వానలకు ఆటంకం నైరుతి సీజన్లో గాలుల తీవ్రత విపరీతంగా ఉంది. నిలకడలేని గాలుల కారణంగా వర్షాలు కురవడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం లాంటివి ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉండేవి. కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు అలాంటివేవీ నమోదు కాలేదు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం లాంటివి కనీసం రెండుమూడు రోజుల పాటు కొనసాగితే వర్షాలు సమృద్ధిగా కురిసేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వానలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ... తెలంగాణలో మాత్రం తక్కువగా ఉన్నాయి. మరో వారం తర్వాత పరిస్థితులు మారుతాయని అంచనా వేస్తున్నాం. – జీఎన్ఆర్ఎస్ శ్రీనివాసరావు, వాతావరణ శాస్త్రవేత్త, హైదరాబాద్ వాతావరణ కేంద్రం -
వర్షం లోటు..సాగు తడబాటు!
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.. ఈ ఏడాది వ్యవసాయానికి తగ్గట్టుగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. నాతో పాటు చాలామంది రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పంట వేశారు. కానీ వర్షాలు సరిగా లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. నేను మూడున్నర ఎకరాల్లో రెండుసార్లు గింజలు పెడితే ఎకరన్నరలోనే ఓ తీరుగా మొలిచినయ్. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – మురావత్ రాంసింగ్, లోక్యతండా, వేలేరు మండలం, హనుమకొండ జిల్లాసాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ వానాకాలం సీజన్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జూలైలో పది రోజులు దాటినా ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మేలో వర్షాలు కురవడంతో మురిసిపోయిన రైతాంగం.. గతేడాదిలా ఈసారి కూడా సాగు సాఫీగా సాగుతుందని భావించారు. కానీ వానాకాలం సీజన్ ముగింపు దశకు చేరుకున్నా ఇంకా లోటు వర్షపాతమే ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 42.48 శాతం విస్తీర్ణంలోనే పంటల సాగు జరిగింది.ఈ సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 56,26,243 (42.48 శాతం) ఎకరాల్లోనే రైతులు వివిధ పంటలు వేశారు. అయితే సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. లోటు వర్షపాతంతో కష్టకాలం గత సీజన్లో ఈ సమయానికి రాష్ట్ర సగటు వర్షపాతం 191.90 సె.మీ.లు ఉండాల్సి ఉండగా..అంతకు మించి 224.90 సె.మీ.లు నమోదు అయ్యిది. అయితే ఈ సీజన్లో మాత్రం అతి తక్కువగా కేవలం 165.5 సె.మీ.లే నమోదు కావడం గమనార్హం. గత సీజన్లో కరీంనగర్, ములుగు, ఖమ్మం, బి.కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాలలలో 60 శాతానికి పైగా (లార్జ్ ఎక్సెస్) వర్షం పడగా, 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.అయితే ఈసారి మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట, యాదగిరి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షాపాతం ఉంది. తక్కిన 23 జిల్లాల్లో 19 శాతం వరకు లోటు వర్షం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగు నెమ్మదించిందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఒక్క ఆదిలాబాద్‌లోనే 95% మించి సాగు ఈ వానాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో సాగు అంచనా 5,77,255 ఎకరాలు అయితే 5,51,573 (95.55 శాతం) ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. అంటే ఆదిలాబాద్‌లో దాదాపు అంచనాలకు తగినట్టుగా సాగు జరిగిందన్న మాట. ఆ తర్వాతి స్థానాల్లో కేబీ ఆసిఫాబాద్ (76.33 శాతం), సంగారెడ్డి (66.81 శాతం), నిజామాబాద్ (65.36 శాతం), బి.కొత్తగూడెం (61.85 శాతం) జిల్లాలు ఉన్నాయి. ఇక అతి తక్కువ విస్తీర్ణంలో సాగైన జిల్లాల్లో వనపర్తి 2,46,582 ఎకరాలకు గాను 17,879 (7.25 శాతం) ఎకరాల్లో సాగుతో మొదటి స్థానంలో ఉంది.ఇక సూర్యాపేటలో 5,81,915 ఎకరాలకు 44,195 (7.59 శాతం) ఎకరాలలో, మెదక్‌లో 3,37,641 ఎకరాలకు 32,789 (9.71 శాతం) ఎకరాలలో, ఎం.మల్కాజిగిరిలో 23,430 ఎకరాలకు గాను 2,583 (11.02 శాతం) ఎకరాల్లో, ములుగులో 1,26,973 ఎకరాలకు 19,877 (15.65 శాతం) ఎకరాల్లో పంటలు వేశారు. కాగా ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు పత్తి పంటపైనే ఆసక్తి చూపారు. పత్తి సాగు అంచనా 48,93,016 ఎకరాలకు గాను 36,30,988 (74.21 శాతం) ఎకరాలలో సాగయ్యింది. వరిసాగు అంచనా 62,47,868 ఎకరాలకు గాను కేవలం 5,01,129 (8.02 శాతం) ఎకరాల్లోనే సాగయ్యింది. వర్షాలు లేకపోవడం వరిసాగుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ప్రత్యామ్నాయంగా తృణ ధాన్యాలు, ఆహారేతర పంటలు... వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఈసారి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రధాన తృణ ధాన్యాలు (మిల్లెట్స్), ఆహారేతర పంటలపై దృష్టి పెట్టినట్లు సాగు విస్తీర్ణాన్ని బట్టి అవగతమవుతోంది. మేజర్ మిల్లెట్స్ (జొన్న, మొక్కజొన్న, రాగులు) 5,73,643 ఎకరాల్లో సాగవచ్చని అంచనా వేయగా అంచనాలకు తగినట్టుగా 5,61,240 (97.84 శాతం) ఎకరాల్లో ఈ పంటలు వేశారు. మొక్కజొన్న 5,21,206 ఎకరాలకు గాను 5,34,318 (102.52 శాతం) ఎకరాలలో సాగైంది. ఆహారేతర పంటలు 1,02,576 ఎకరాలు అంచనా వేయగా రెట్టింపునకు మించి 2,35,614 (229.70 శాతం) ఎకరాల్లో రైతులు దైంచా, పిల్లిపెసర, సన్ హెంప్, పారాగ్రాస్, మేత జోవార్లు సాగు చేశారు. నారు పోసిననప్పటి నుంచి వానలు లేవు.. మే నెలలో వానలు పడితే ఈసారి కాలం మంచిగనే అయితది అనుకున్నం. ఆ వానలు తప్ప మల్ల చినుకు పడలేదు. ఆలస్యంగనైన వరి ఏద్దమని ఆగినం. పది రోజుల కింద మబ్బులు చేసి తుంపురు తుంపురు వానలు పడ్డయి. కాలం మంచిగైతే నాట్లు వేసుకోవచ్చని నమ్మి నారు పోసినం. ఇగ వర్షాలు పడుతలేవు. చెరువులు, కుంటలల్ల కూడా నీళ్లు లేవు. ఎటూ తోస్తలేదు. – యెడబోయిన పద్మ, మహిళా రైతు, గ్రామం బేతోల్, మహబూబాబాద్ జిల్లా వానాకాలం 2025 సాగు ప్రణాళిక.. సాగైన విస్తీర్ణం (ఎకరాలలో) – ఈ వానాకాలం సాగు అంచనా ః 13244305 – ఇప్పటివరకైన సాగు విస్తీర్ణంః 5626243 – పత్తి సాగు అంచనాః 4893016 – సాగైన పత్తి విస్తీర్ణంః 3630988 – వరిసాగు అంచనాః 6247868 – సాగైన వరి విస్తీర్ణంః 501129 – మొక్కజొన్న సాగు అంచనాః 521206 – సాగైన మొక్కజొన్న విస్తీర్ణంః 534318 -
వరద విలయం.. 80000 మంది..
-
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఒకవేళ అదే జరిగితే?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలిటెస్టు తుది అంకానికి చేరుకుంది. గత నాలుగు రోజుల నుంచి హోరా హోరీగా సాగుతున్న ఈ మ్యాచ్ ఫలితం మంగళవారం తేలిపోనుంది. తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సత్తాచాటారు.దీంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. లక్ష్య చేధనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. దూకుడుగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్టోక్స్ సేన భావిస్తుంటే.. భారత జట్టు మాత్రం ప్రత్యర్ధిని ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.వర్షం ముప్పు..అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశముంది. ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యూవెధర్, బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో లీడ్స్‌లో వర్షం పడటానికి 40 శాతం ఆస్కారం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 11:00 గంటలకు ఆఖరి రోజు ఆట ఆరంభం కానుంది. ఒకవేళ రిపోర్ట్స్ ప్రకారం.. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తే తొలి టెస్టు డ్రాగా ముగిసే ఛాన్స్ ఉంది.ఆక్యూ వెదర్ రిపోర్ట్..మధ్యాహ్నం 2:30 (స్దానిక కాలమానం ఉదయం 10 గంటలకు 55% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 3:30 (స్దానిక కాలమానం ఉదయం 11 గంటలకు 40% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 4:30 (స్దానిక కాలమానం ఉదయం 12 గంటలకు 43% వర్షం పడే అవకాశం)సాయంత్రం 6:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 2 గంటలకు 47 % వర్షం పడే అవకాశం)సాయంత్రం 7:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 3 గంటలకు 52 % వర్షం పడే అవకాశంరాత్రి 8:30-10:30( స్ధానిక కాలమనం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 50 % వర్షం పడే అవకాశం)చదవండి: చరిత్ర సృష్టించిన కిరాన్ పొలార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
వర్షాకాలం వచ్చే.. తడిసి ముద్దయిపోతున్న రష్మీ (ఫొటోలు)
-
48 గంటల్లో వర్షాలు
మహారాణిపేట (విశాఖ): రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ నేపథ్యంలో బలమైన గాలులు గంటకు 40–50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా,రాయలసీమ తదితర ప్రాంతాల్లో ఇదే వాతావరణం కొనసాగుతుందని వెల్లడించింది. -
మండే ఎండ.. విపరీతంగా ఉక్కపోత
సాక్షి, హైదరాబాద్: ముందస్తుగా మురిపించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం కాస్త నెమ్మదించాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్‌ను జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు పరిగణిస్తారు. కానీ ఈసారి వారం రోజుల ముందే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తొలి నాలుగు రోజులు అత్యంత చురుకుగా కదిలాయి. దీంతో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీవర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. కానీ వాస్తవ సీజన్ ప్రారంభం(జూన్ 1వ తేదీ) నుంచి రుతుపవనాల కదలికలు కాస్త మందగించాయి.దీంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకొని ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణంగా రోహిణి కార్తె చివర్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రస్తుతం పొద్దంతా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడినా వర్షాలు మాత్రం కురవటంలేదు. ఈ నెల తొలి వారంరోజుల్లో 26 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా.. అందులో సగం కూడా కురవలేదు.రెండోవారం తర్వాతే..: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా లేవు. మరో నాలుగైదు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. జూన్ రెండోవారం తర్వాతే వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్ల ప్రభావంతోనే నైరుతి సీజన్ వర్షాలు ఎక్కువ కురుస్తాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు బంగాళాఖాతంలో అలాంటి పరిస్థితులు ఏర్పడలేదు.ప్రస్తుతానికి వాతావరణ శాఖ సైతం ఎలాంటి అంచనాలను విడుదల చేయలేదు. శుక్రవారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యాయి. అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 40 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత హనుమకొండలో 23ల డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. -
ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే..
గౌహతి: అస్సాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొదటి రోజున రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరంగా పేరొందిన సిల్చార్(Silchar)లో 24 గంటల్లో ఏకంగా 415.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 1893 తర్వాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం. జూన్ 1న సిల్చార్‌లో కురిసిన వర్షపాతం 132 ఏళ్ల కిత్రం నాటి 290.3 మి.మీ వర్షపాతం రికార్డును బద్దలు కొట్టింది.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఎగువకు వీస్తున్న గాలి ప్రభావం, అల్ప స్థాయి ద్రోణుల కలయిక ఈ అస్థిర వాతావరణానికి కారణంగా నిలుస్తోంది. 2022లో సిల్చార్ వరదల్లో చిక్కుకుంది. నాడు పట్టణంలోని 90 శాతం ప్రాంతం నీటితో నిండిపోయింది. కాగా గత మూడు రోజుల్లో అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 34 మంది మృతిచెందారు.గడచిన ఐదు రోజుల్లో మేఘాలయ అంతటా భారీ వర్షపాతం నమోదైంది. మేఘాలయలోని 10 జిల్లాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10 వేల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. మణిపూర్‌లో నదులు పొంగిపొర్లడం, కరకట్టలు తెగిపోవడం వల్ల సంభవించిన వరదల కారణంగా 19 వేల మందికి పైగా ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. వరదల కారణంగా 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి.ఇది కూడా చదవండి: ‘స్పైడర్స్ వెబ్’ సక్సెస్: దాడుల వివరాలు షేర్ చేసిన జెలెన్స్కీ -
గౌహతి నీట మునక.. అంతటా రెడ్ అలర్ట్
గౌహతి: అస్సోంలోని గౌహతి(Guwahati)లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఫలితంగా నగరంలో జనజీవనం స్థంభించిపోయింది. చాంద్‌మరి, హతిగావ్, సిజుబారి, రుక్మినిగావ్, బెల్టోలా, నబిన్ నగర్, రాజ్‌గఢ్ తదితర ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలు, సంభవిస్తున్న వరదలు రహదారులను ముంచెత్తుతున్నాయి. In view of artificial floods caused by heavy rains across the city, GMC’s teams and pumps have swung into action.Sharing visuals from Harabala Path where pumps are working at full capacity to drain floodwaters.Our Guwahati, Our Responsibility!Guwahati Municipal Corporation… pic.twitter.com/se4C7u8DjH— Guwahati Municipal Corporation (@gmc_guwahati) May 30, 2025నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, శిథిలమైన రోడ్లు పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా విధిస్తున్న విద్యుత్ నిలిపివేతలు గౌహతివాసులను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. గత రెండు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నడుము లోతు వరకూ నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్(Traffic) పూర్తిగా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను తరలించేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్)రబ్బరు పడవలను ఉపయోగిస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జల రవాణా శాఖ గౌహతి, ఉత్తర గౌహతి మధ్య అన్ని ఫెర్రీ సేవలను నిలిపివేసింది.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మే 31 వరకు అస్సాం అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని, గంటకు 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్డీఎంఏ) కొండచరియలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అధికారులను అక్కడి ప్రజలను అప్రమత్తం చేసింది. Relentless rains have caused artificial floods in various places. In continuation of this, today we visited Anil Nagar, Nabinnagar, Lakhimi Path, Satsang Vihar & Bhangagarh to assess the ground situation.@gmc_guwahati teams are working round the clock on water drainage! pic.twitter.com/Icy1NXUSpW— Mrigen Sarania (@mrigen_sarania) May 30, 2025ఇది కూడా చదవండి: గుంతలో పడిన కారు.. ఐదుగురు మృతి -
వచ్చే నెలలో మంచి వర్షాలే
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించాయి. రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం తెలియజేసింది. దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 166.9 మిల్లీమీటర్లు కాగా, వచ్చే నెలలో అంతకంటే 108 శాతం అధిక వర్షం కురిసే పరిస్థితులు ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు.దేశవ్యాప్తంగా సాధారణం నుంచి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య, వాయవ్య, దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఈశాన్యం, వాయవ్య ప్రాంతాలు మినహా దేశమంతటా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగానే రికార్డు అవుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. సాధారణ వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ దాకా 106 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే వీలుందని తెలిపారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్‌లో మంచి వర్షాలు కురుస్తాయని వివరించారు. పంజాబ్, హరియాణా, కేరళ, తమిళనాడుల్లో సాధారణ కంటే తక్కువ వర్షం పడుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో 2020లో 958 మిల్లీమీటర్లు, 2021లో 870, 2022లో 925, 2023లో 820, 2024లో 934.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. -
పలకరించిన తొలకరి
సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభాన్ని సూచిస్తూ రాష్ట్రంలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వారం ముందే పలకరించాయి. దీని ప్రభావంతో వివిధ జిల్లాల్లో తొలకరి జల్లులు కురిశాయి. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1.1 సెం.మీ. మేర సగటు వర్షపాతం నమోదైంది.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో అత్యధికంగా 5.98 సెం.మీ. వర్షం కురిసింది. అదే జిల్లాలోని షాబాద్ మండలం చందన్వెల్లిలో 5.68 సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లాపల్లిలో 5.4 సెం.మీ., మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్‌లో 3.78 సెం.మీ., వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో 3.10 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఇప్పటికే అడపాదడపా వర్షాలతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్న వేళ రుతుపవనాలు ముందుగానే పలకరించడంతో వ్యవసాయ పనులను కూడా ముందస్తుగానే ప్రారంభించొచ్చని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి సాధారణం కంటే 10 శాతం అధిక వర్షాలు నైరుతి సీజన్లో నాలుగు నెలలపాటు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 73.86 సెంటీమీటర్లు. గతేడాది సీజన్లో 96.26 సెం.మీ. వర్షం (సాధారణ కంటే 30 శాతం అధికం) కురవగా ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కనీసం 10 శాతం అధికంగా వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనం.. ఆపై వానలు.. దక్షిణమధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన మర్నాడే అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ, ఇంకొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. -
రాష్ట్రాన్ని తాకిన నైరుతి
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి వేగాన్ని బట్టి మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు 16 ఏళ్ల తర్వాత ముందస్తుగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. సాధారణంగా ఇవి జూన్ ఒకటో తేదీన కేరళను తాకి, ఆ తర్వాత మూడు రోజుల్లో (జూన్ 4) ఏపీలోకి ప్రవేశిస్తాయి.ఒక్కోసారి కేరళను తాకిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితులు మారడంతో ఏపీకి రావడానికి ఆలస్యమైన సందర్భాలున్నాయి. కానీ, ఈసారి మాత్రం పది రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. లానినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల గమనాన్ని బట్టి ఈ ఏడాది అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కూల్ సమ్మర్ వాతావరణంలో అనూహ్య మార్పులు, రుతుపవనాలు ముందస్తుగా పలకరించడంతో ఈ ఏడాది వేసవి ప్రభావం రాష్ట్రంలో పెద్దగా కనిపించలేదు. మామూలుగా మే నెలలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. రోహిణీ కార్తెలో ఎండతోపాటు ఉక్కపోతతో జనం అల్లాడిపోయేవారు. కానీ ఈ మే నెలలో అనిశి్చత వాతావరణం వల్ల ఎండతోపాటు వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ వేసవిలో ఎక్కడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాలేదు. ఆదివారం నుంచి రోహిణీ కార్తె మొదలైనా, ఎండల తీవ్రత మాత్రం లేకుండాపోయింది. రోళ్లు పగిలే రోహిణీ కార్తెలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి.నేటి నుంచి వర్షాలు..ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. సోమవారం పలు ప్రాంతాల్లో వానలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాచపనుకులులో 56 మిల్లీమీటర్లు, విజయనగరంలో 42.7 మి.మీ, మారేడుమిల్లిలో 41.5 మి.మీ, గంపరాయిలో 34 మి.మీ, నెల్లిమర్లలో 33 మి.మీ, అన్నమయ్య జిల్లా ఎంగిలిబండ, కర్నూలు జిల్లా కామవరంలో 31.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
నేడు రాష్ట్రానికి ‘నైరుతి’ ఆగమనం
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకనున్నాయి. కేరళ రాష్ట్రాన్ని శుక్రవారం రాత్రి తాకిన ఈ రుతుపవనాలు శని, ఆదివారాల్లో కర్ణాటక వ్యాప్తంగా విస్తరించాయి. అక్కడ నుంచి దాదాపు రాయలసీమకు అతిచేరువలోకి సమీపించగా, మన రాష్ట్రంలోకి సోమవారం ప్రవేశించనున్నాయి. దీంతో ఈ ఏడాది వారం రోజులు ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వారంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు అల్పపీడనం..మరోవైపు.. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి∙ఉత్తర ఒడిశా వరకు, మధ్య మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది 27వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అలాగే, సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆ సంస్థ పేర్కొంది. -
కేరళను తాకిన నైరుతి
సాక్షి, విశాఖపట్నం: మే చివరి వారంలో భానుడు భగ్గుమనలేదు... రోహిణి కార్తెలో రోళ్లు పగలనివ్వలేదు. ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు పలకరిస్తూ.. వేసవి ప్రతాపానికి మే నెలలోనే తెర వేశాయి. 2009 తర్వాత తొలిసారిగా నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళని తాకాయి. శనివారం మధ్యాహ్నం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళకు వస్తాయని, కానీ ఈసారి 8 రోజుల ముందుగానే ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది.ఈ నెల 26 నాటికి రాయలసీమలో ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 29 నాటికల్లా రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. మరోవైపు ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా తేలికపాటి వానలు, అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
వర్షమే ఆ రెండు జంటలను కలిపింది..!
కొన్ని సంఘటనలు భలే గమ్మత్తుగా జరుగుతాయి. ఆఖరికి ప్రకృతి కూడా మనమంతా ఒక్కటే అని చెప్పేలా ఘటనలు సృష్టిస్తుంది. ఒక్క తొలకరి జల్లుతో ఎలా మతసామరస్యానికి పీట వేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వరుణుడే సాక్షిగా..రెండు వేర్వేరు మతాలకు చెందిన జంటలను ఒక వేదికపైనే పెళ్లి చేసుకునేలా చేశాడు. ఈ ఘటన పూణేలోని వాన్వోరిలో చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే..పూణేలోని వాన్వోరిలో మంగళవారం సాయంత్రం ఒక హాలులో ముస్లిం పెళ్లి జరుగుతుండగా.. అక్కడకు సమీపంలోని మైదానంలో హిందూ జంట పెళ్లితంతు జరుగుతోంది. ఇంతలో వర్షం పడటంతో వారి వివాహానికి ఆటంకం ఏర్పడింది. సరిగ్గా ఆ హిందూ జంట సాయంత్రం 6.56 గంటలకు అలంకారన్ లాన్స్‌లో వివాహం చేసుకోవలసి ఉంది. ముహర్తం మించి పోతుంది వర్షం ఆగేట్టు లేదు. దాంతో ఒక్కసారిగా ఆ హిందూ వివాహ వేడుకలో గందరగోళం ఏర్పడింది. పక్కనే హాలులో వలీమా(ముస్లిం ఆచారంలో జరిగే పెళ్లి) జరగుతోంది. ఇక వాళ్లనే రిక్వస్ట్ చేసి సప్తపది నిర్వహించాలనుకున్నారు కుటుంబ సభ్యులు. అందుకు ముస్లీం కుటుంబం కూడా అంగీకరించి..వాళ్లు ఖాళీ చేసి వేదికను ఇచ్చారు. అలాగే హిందూ ఆచారాల కోసం చేసే ఏర్పాట్లకు ముస్లీం కుటుంబం సాయం కూడా చేసింది. ఒకరి సంప్రదాయాలనుల ఒకరు గౌరవించుకుంటూ..ఆ జంటలు ఘనంగా వివాహం చేసుకున్నారు. అంతేగాదు రెండు వర్గాల ప్రజలు ఉమ్మడి విందును ఆనందంగా ఆస్వాదించారు. ఇక కొత్తగా పెళ్లైన ముస్లిం జంట మహీన్, మోమ్సిన్ కాజీలు హిందూ జంట నరేంద్ర, సంకృతిలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒకరకంగా ప్రకృతి మతసామరస్యంగా ఉండండిరా.. అని పిలుపునిచ్చినట్లుగా వేర్వేరు మతాలకు చెందిన ఆ జంటలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది కాబోలు.(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్‌చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..) -
రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: అరేబియా సముద్రంలోని దక్షిణ కొంకణ్–గోవా తీర ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడి శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని, అదేవిధంగా జగిత్యాల, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతా ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, రానున్న రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తగ్గిన ఉష్ణోగ్రతలు గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో అత్యధికంగా 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో అత్యధికంగా 20.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6–10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. -
మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు!
న్యూఢిల్లీ: రైతాంగానికి శుభవార్త. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళకు చేరుకొనే అవకాశం ఉందని భారత వాతవరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. పరిస్థితులు అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ గతంలో ప్రకటించింది. కానీ, అంతకంటే రెండు రోజుల ముందే రానున్నాయని మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి తాజాగా అంచనా వేసింది. అదే జరిగితే 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు త్వరగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది.2009లో మే 23న కేరళలో అడుగుపెట్టాయి. సాధారణంగా ఈ రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1వ తేదీ కల్లా కేరళలో ప్రవేశిస్తాయి. జూన్ 8 నాటికి దేశమంతటా వ్యాపిస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాల ప్రభావం తగ్గడం మొదలవుతుంది. అక్టోబర్ 15 కల్లా పూర్తిగా తగ్గిపోతుంది. అయితే, ఈసారి దాదాపు ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తుండడంవిశేషం. 2018లో మే 29, 2019లో జూన్ 8, 2020లో జూన్ 1, 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న రుతుపవనాలు కేరళలో అడుగుపెట్టాయి.ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. ఎల్–నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు లేవని తెలియజేసింది. భారత్‌లో వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా జలాశయాలు నిండడానికి, విద్యుత్ ఉత్పత్తికి ఇవి దోహదపడుతుంటాయి. దేశంలో 42.3 శాతం జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారం. దేశజీడీపీలో ఈ రంగం వాటా 18.2%నైరుతి రుతుపవనాల రాక కంటే ముందు దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాదిన ఈ పరిణామం కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మరో రెండు రోజుల్లో తుపానుగా మారనుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనవల్ల నైరుతి రుతుపవనాలు కేరళ దిశగా వేగంగా ముందుకు కదులుతాయని అంటున్నారు. ఉత్తర కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్, కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, పాలక్కాడ్, మలప్పురం, త్రిసూర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. -
ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)
-
Rain Alert: వారం రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు
-
చిన్న వర్షానికే .. మునిగిన అమరావతి
-
అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)
-
కాలుష్య భూతంపై ‘వారుణాస్త్రం’!.. ఢిల్లీలో రూ. 3 కోట్లతో మేఘమథనం
ఢిల్లీ: చినుకు కోసం మేఘాలను చిలకబోతోంది దేశ రాజధాని ఢిల్లీ నగరం. కాలుష్య రక్కసిని సంహరించడానికి వరుణుడినే ఓ అస్త్రంగా సంధించబోతోంది. సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో ఢిల్లీ నగరం కాలుష్య భూతంతో పోరాటానికి సిద్ధమవుతోంది. ఢిల్లీలో ఈ నెలాఖరు నుంచి ఐదు ప్రదేశాల్లో మేఘమథనం ట్రయల్స్ నిర్వహించనున్నారు.మేఘాలు, తేమ ఆధారంగా ఆ ఐదు ప్రాంతాలను అప్పటికప్పుడు నిర్ణయిస్తారు. సరైన తేమ ఉంటేనే మేఘాలు వర్షిస్తాయి. అందుకే అనువైన మేఘాలు, సరిపోను తేమ వంటి అంశాలను గమనించి ఆ ఐదు ప్రదేశాలను ఎంపిక చేయనున్నారు. భద్రతా కారణాల రీత్యా లుట్యెన్స్ ఢిల్లీ, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతాలను మేఘమథనం నుంచి మినహాయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.కాన్పూర్ ఐఐటీ సాంకేతిక సహకారంతో ఢిల్లీ శివార్లలో అమలయ్యే ఈ ప్రాజెక్టు వ్యయం రూ.3.21 కోట్లు. 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కృత్రిమ వర్షం తొలి ట్రయల్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రయోగం వ్యవధి గంట నుంచి గంటన్నర. వేర్వేరు రోజుల్లో జరపనున్న ఈ మేఘమథనం కోసం 13 కేంద్ర, రాష్ట్ర (ఢిల్లీ) ప్రభుత్వ సంస్థల నుంచి లాంఛనపరమైన అనుమతులు లభించాల్సివుంది. ఢిల్లీలో కృత్రిమ వాన కురిపించాలనే ప్రతిపాదనలు తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2023 శీతాకాలంలో ఈ ప్రతిపాదనను ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ఆ కార్యక్రమాన్ని అప్పట్లో అది విరమించుకుంది.నిరుడు శీతాకాలంలోనూ మేఘమథనం కోసం ‘ఆప్’ సర్కారు పాకులాడింది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదంటూ ఆ ప్రయత్నం నుంచి మరోమారు వెనక్కు తగ్గింది. ఈ ప్రయోగంలో వర్షించడానికి అనుకూలమైన, సరిపోను తేమ గల మేఘాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తారు. వాటిని గుర్తించాక సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ (ఉప్పు), డ్రై ఐస్ (ఘనీకృత కార్బన్ డై ఆక్సైడ్) వంటి రసాయన పదార్థాలను విమానంలో తీసుకెళ్లి ఆ మేఘాలపై చల్లుతారు. అలా మేఘాలు వర్షిస్తాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి పలు దేశాల్లో ఇలాంటి ‘స్వల్పకాలిక’ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వీటితో ఉపయోగమెంత అనేది ఓ చర్చనీయాశంగానే మిగిలింది! - జమ్ముల శ్రీకాంత్ -
నేడు అండమాన్‌లోకి నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున మంగళవారం (13వ తేదీ) సాయంత్రానికి అండమాన్–నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అండమాన్–నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.ప్రస్తుతం అండమాన్–నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్‌లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుందని వెల్లడించింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడురోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వర్షాలు తెలంగాణలో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరాఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి బలహీన పడింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.ఖమ్మంలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.3 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. రానున్న రెండురోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. -
రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకా శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తె లంగాణ ప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటు న 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరా ల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్ లో 40.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెద క్లో 22.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రా ష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. హనుమకొండలో గరిష్ట ఉష్ణో గ్రత సాధారణం కంటే 4.1 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. అలాగే భద్రాచలంలో 3.8 డిగ్రీల సెల్సి యస్ తక్కువగా నమోదు కాగా.. మిగిలిన ప్రాంతాల్లో 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా న మోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా ఉంది. రానున్న 3 రోజులు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది.పిడుగుపాటుతో రైతు మృతి అశ్వారావుపేట రూరల్: పిడుగుపాటుతో ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లికి చెందిన సాధనం రాజారావు (42) శుక్రవారం సాయంత్రం తన బంధువుల పిల్లలతో కూరగాయల తోటకు వెళ్లాడు. కూరగాయలు కోస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పిల్లలు సాయిల తేజ, బాలుతో పాటు రాజారావు సమీపంలోని వేపచెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో రాజారావు మృతిచెందగా, కొంచెం దూరంలో ఉన్న తేజ, బాలు అస్వస్థతకు గురయ్యారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడైన మృతుడు రాజారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. -
ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఎండలు మండిపోగా, సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షంఅనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం రాకతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. Raining in Nampally #HyderabadRains pic.twitter.com/Np4eJ5jUlN— Weatherman Karthikk (@telangana_rains) May 5, 2025 #Hyderabadrains Now scattered intense thunder storm rains for going in Hyderabad City not good news for #SRHvsDC Hope after 10:30 rain reduce chance high let's see ⛈️⚠️ pic.twitter.com/I6KNqEDfYK— Telangana state Weatherman (@tharun25_t) May 5, 2025 Lighting caught on camera in Tolichowki SHAIKPET Manikonda Golconda areas#tolichowki#manikonda#Hyderabad #hyderabadrains@balaji25_t @Hyderabadrains pic.twitter.com/jOWHSnLLSH— TajKeProperties (@Mawt777) May 5, 2025 -
హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత
హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉప్పల్, చిలూకానగర్, కంటోన్మెంట్, బోడుప్పల్, మేడిపల్లలో భారీ వర్షం కురిసింది. #Hyderabadrains!!Now scattered isolated rains lashes in few parts of Hyderabad City place at Ramanthapur pic.twitter.com/B1ljpuHMiU— Telangana state Weatherman (@tharun25_t) May 3, 2025సికింద్రాబాద్, బేగం పేట్ కుండపోతగా వర్షం కురిసింది. మరికొన్ని చోట్లు తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. నగరంలో కురిసిన వర్షానికి వావాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. -
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు.కోస్తాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణంకోస్తాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఏపీ ప్రజలకు చల్లని కబురు.. రానున్న 3 రోజులపాటు వర్షాలు
-
‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
కోల్‌కతా: ఈ మ్యాచ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్ బ్యాటింగ్ వండర్‌గా సాగింది. మైదానంలో జోష్ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్ వరకే పరిమితమైంది. కోల్‌కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్‌కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్‌కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్‌తో మొదలైన పంజాబ్ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్‌ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్‌లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్ 50 స్కోరును దాటింది. హర్షిత్ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్ 11వ ఓవర్‌ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్ కొడితే... ప్రభ్‌సిమ్రన్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్ ఓపెనింగ్ జోడీకి చెక్ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్‌కు యత్నించి వైభవ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్ వేసిన 14వ ఓవర్‌ను పూర్తిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ అవుట్ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్‌వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఏ మ్యాచ్ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్ ఆరంభానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) వైభవ్ (బి) రసెల్ 69; ప్రభ్‌సిమ్రన్ (సి) పావెల్ (బి) వైభవ్ 83; శ్రేయస్ నాటౌట్ 25; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 7; యాన్సెన్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 3; ఇన్‌గ్లిస్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–34–2, చేతన్ సకారియా 3–0–39–0, హర్షిత్ రాణా 2–0–27–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–1, సునీల్ నరైన్ 4–0–35–0, రసెల్ 3–0–27–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ నాటౌట్ 1; నరైన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్ కోల్పోకుండా) 7. బౌలింగ్: యాన్సెన్ 1–0–6–0. మాల్దీవుల్లో సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్‌రైజర్స్ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్... మిగిలిన ఐదు మ్యాచ్‌లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అన్నదాతను ముంచిన అకాల వర్షం
నల్లగొండ/జనగామ రూరల్/వేములపల్లి: రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో మామిడి, వరి వంటి పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుతో ఓ రైతు మరణించాడు. జనగామ, ములుగు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో భారీ పంట నష్టం జరిగింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. జనగామ మండలంలోని పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల, గానుగుపహాడ్.. చిల్పూర్ మండలం ఫత్తేపూర్.. జఫర్‌గఢ్ మండలం ఓబులాపూర్.. పాలకుర్తి మండలం వావిలాల, నారబోయినగూడెంలో వరి పంట దెబ్బతింది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులోని ఐకేపీ సెంటర్లో సుమారు 20 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో 150 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు వందల ఏళ్ల నాటి మామిడి వృక్షాలు నేలకూలాయి. శాలిగౌరారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని అనంతారం, తొండ.. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, కోడూరు తదితర గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జాజిరెడ్డిగూడెంలో నోముల నరేష్ ఇంట్లో చెట్టుకొమ్మ విరిగి గేదెపై పడటంతో అది మృత్యువాత పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాని పలు మండలాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలో గోపు సుధాకర్‌రెడ్డి (63) అనే రైతు తన పొలం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
అకాల వర్షం.. ఆగమాగం
సాక్షి, నెట్వర్క్: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు జిల్లాల్లో అకాలవర్షం కురిసింది. గురువారం గాలి దుమారంతో ప్రారంభమై.. ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగండ్లతో రైతులకు కడగండ్లు మిగిలాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మూడుచోట్ల పిడుగులు పడి ముగ్గురు చనిపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసింది. వడగండ్ల వానకు మామిడి కాయలు నేలరాలాయి. వరి చేలు నేలకొరిగాయి. ఆత్మకూర్(ఎం)లో కరెంట్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి దుమారానికి పలుచోట్ల ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. గుండాలలో బండపై రైతులు ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఎడపల్లి మండలం బాపూనగర్‌లో వడగండ్లు పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులకు ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులతో వరితోపాటు మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా: పలు మండలాల్లో ఈదురుగాలులు, వర్షానికి ధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. మొక్కజొన్న నేలవాలింది. గంభీరావుపేట మండలం గజసింగవరంలో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. వేములవాడ మండలం నాగాయపల్లి శివారులో గాలివానకు పడిపోయిన చెట్లను బ్లూ కోల్ట్స్ తొలగించారు. జనగామ జిల్లా: జనగామ వ్యవసాయ మార్కెట్లో 600 బస్తాల వరకు ధాన్యం తడిసిపోగా, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట దెబ్బతింది. గాలి దుమారంతో 11 కేవీ విద్యుత్ లైన్లపై చెట్లు విరిగి పడిపోవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా నంగునూరు, చిన్నకోడూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకూలగా, పొలాల్లోనే గింజలు రాలడంతో వరి మొక్కకు పిలకలే మిగిలాయి. మొక్కజొన్న, మిర్చి, టమాట, కూరగాయ పంటలు నేలకొరిగాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా : దేవరకద్ర మార్కెట్లో వేలం వేసిన ధాన్యం కుప్పలు తడిపోయాయి. రైతులు కవర్లు కప్పినా.. అప్పటికే చాలా ధాన్యం తడిసి ముద్దయ్యిది. కొల్లాపూర్‌లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. నిర్మల్ జిల్లా: పలు మండలాల్లో ఈదురు గాలులతోపాటు రాళ్ల వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన పంటలు నేలవాలాయి. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. మొక్కజొన్న తడిసి ముద్దయ్యింది.కల్లాల్లో అరబెట్టిన మక్కలు కొంత మేరకు తడిసిపోయాయి. రైతు ఆత్మహత్యాయత్నం ములుగు జిల్లా మొట్లగూడెం గ్రామానికి చెందిన యాలం నర్సింహారావు తనకున్న ఐదెకరాలతోపాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేశాడు. మరో మూడు రోజుల్లో వరి పంట కోయాల్సి ఉండగా.. ఈనెల 7న సాయంత్రం వడగళ్ల వాన పడింది. దీంతో వరి చేనులో గింజకూడా లేకుండా రాలిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. అప్పులు తీర్చే మార్గం లేక నర్సింహారావు బుధవారం రాత్రి తన ఇంటికి సమీపాన ఉన్న పొలం వద్దకు పురుగుల మందుతాగాడు. ఉదయాన్నే స్థానికులు గుర్తించి ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్‌రెడ్డి ఆకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు వివిధ జిల్లాల్లో కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. ముగ్గురి ప్రాణం తీసిన పిడుగులు వేర్వేరు జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన రైతు మందాడి రవీందర్‌రెడ్డి(55) రోజు మాదిరిగానే గురువారం గేదెలను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు సంకీర్తరెడ్డి వ్యవసాయబావి వద్దకు వెళ్లి చూడగా విగతజీవుడై పడి ఉన్నాడు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో పిడుగు పడిందని, దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు. – సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారాం గ్రామానికి చెందిన సంపత్‌కుమార్ అలియాస్ సతీశ్(19), జశ్వంత్, కార్తీక్‌లు సదాశివపేట మండల పరిధిలోని గొల్లగూడెంలోన ఓ కాలేజీలో ఐటీఐ చదువుతున్నారు. క్లాస్‌లు ముగిశాక ఒకేపై ముగ్గురూ స్వగ్రామానికి బయలు దేరారు. వర్షం ఎక్కువ కావడంతో సిద్దాపూర్–గొల్లగూడెం శివారులోని మైసమ్మ కట్ట వద్ద బైక్‌ను నిలిపి సంపత్‌కుమార్, జశ్వంత్ చింత చెట్టు కింద నిల్చున్నారు. కార్తీక్ మరో చెట్టు కింద నిలబడ్డాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడి సంపత్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, జశ్వంత్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. – నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మేకల రాములు(55) గ్రామ సమీపంలో తన గొర్రెలను మేపుతుండగా.. అకస్మాత్తుగా గాలి దుమారంతో వర్షం కురిసింది. రాములు పక్కనే పిడుగుపడడంతోఅక్కడికక్కడే మృతిచెందగా ఆయన కుమారుడు నరసింహకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలేరు మండలం మంతపురిలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర దిశగా మయన్మార్ తీరం వైపు ప్రయాణిస్తుందని పేర్కొంది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.దీని ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళ, బుధవారాల్లో కూడా కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం ఏలూరు జిల్లా బూట్టాయగూడెం మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. మరోవైపు పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.సోమవారం నంద్యాలలో అత్యధికంగా 41.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా నడిచాగిలో 41.1, వైఎస్సార్ జిల్లా బలపనూరులో 41, ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 40.8, తిరుపతి జిల్లా గూడూరు, విజయనగరం జిల్లా నెలివాడలో 40.6, చిత్తూరు జిల్లా నగరిలో 40.5, అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె 40.4, పల్నాడు జిల్లా రావిపాడులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
హైదరాబాద్: దక్షిణ మధ్య బంగాళాఖాతాంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు బీహార్ నుంచి ఈశాన్య జార్ఖండ్, చత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఫలితంగా వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణంహైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఈరోజు(సోమవారం) హైదరాబాద్ తో పాటు మహబూర్ నగర్, మేడ్చల్, మల్కాజగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రేపు(మంగళవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. -
ఉరుములు, మెరుపులు...అధిక ఉష్ణోగ్రతలు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గురువారం భిన్న వాతావరణం కనిపించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో ఎండ ప్రతాపాన్ని చూపించింది. రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో ఇదే విధంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. 5 వరకూ వానలు.. ఆ తర్వాత ఎండల తీవ్రత ఉత్తర కోస్తాంధ్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక మీదుగా లోతట్టు ప్రాంతాల్లో గాలుల కలయిక ప్రాంతం ఏర్పడింది. ఈ కారణంగా సముద్రం నుంచి తేమ గాలులను తీసుకువస్తుండటంతో.. అకాల వర్షాల ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం, గాలుల ప్రభావంతో..శుక్రవారం, శనివారం ఉదయం వరకూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాత్రి సమయంలో రాయలసీమలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్నారు. చిత్తూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వానలు ఉంటాయనీ..గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని చెప్పారు. 5వ తేదీ నుంచి ఎండల తీవ్రత గరిష్టంగా ఉంటుందన్నారు. సాధారణం కంటే 3– 5 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. గురువారం రాళ్లపల్లిలో 84.5 మి.మీ, సానికవారంలో 77.75, ములకల చెరువులో 72, యర్రగొండపాలెంలో 72, పెదఅవుటపల్లిలో 68.75, పెరుసోమలలో 60.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
3, 4 తేదీల్లో వర్షాలు
సాక్షి, అమరావతి: వేసవిలో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. మరోవైపు సోమవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది.నంద్యాల గోస్పాడులో 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.2, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని 6 మండలాలు, విజయనగరం జిల్లా–6, పార్వతీపురం మన్యం జిల్లా–10, అల్లూరి సీతారామరాజు జిల్లా–3, తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. -
KKR Vs RCB: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే పరిస్థితి?
మెగా క్రికెట్ సమరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ సీజన్‌కు శనివారం తెరలేవనుంది. తారల సందడితో ఈడెన్ గార్డెన్స్‌లో క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌ను ఆరంభించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)- ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరుతో ఈ క్రీడా సంబరం మొదలుకానుంది.పొంచి ఉన్న వర్షం ముప్పుఅయితే, ఆరంభ వేడుకలతో పాటు మ్యాచ్‌కు వర్షం అడ్డుతగిలే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం కోల్‌కతాలో శనివారం భారీ వాన పడే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో సాయంత్రం 6.20 నిమిషాల నుంచి 6.45 నిమిషాల వరకు జరగాల్సిన ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లు సజావుగా సాగడం కష్టమే. సాయంత్రం ఆరు గంటల తర్వాత వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. టాస్ సమయానికి అంటే ఏడు గంటల సమయంలో పదిశాతం వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక రాత్రి పదకొండు గంటల తర్వాత ఇందుకు డెబ్బై శాతం ఆస్కారం ఉన్నట్లు వెల్లడించింది.రెండు రోజులుగా వానఈ నేపథ్యంలో కేకేఆర్- ఆర్సీబీ మధ్య ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్ సాఫీగా సాగడం కష్టమే అనిపిస్తోంది. కోల్‌కతాలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కేకేఆర్- ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. మరోవైపు.. శుక్రవారం కూడా వాన పడగా.. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌స్టాఫ్ కవర్లతో మైదానాన్ని కప్పి ఉంచారు.అంతేకాదు.. ఎప్పటికప్పుడు మైదానం నుంచి నీటిని క్లియర్ చేసేందుకు డ్రైనేజీ సిస్టమ్ సిద్ధంగానే ఉంది. అయితే, ఎడతెరిపిలేని వర్షం పడితే మాత్రం మ్యాచ్ జరగడం సాధ్యం కాదు. మరి వర్షం వల్ల కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?జరిగేది ఇదే..ప్లే ఆఫ్స్, ఫైనల్ మాదిరి ఐపీఎల్ గ్రూప్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. అయితే, వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే.. మ్యాచ్ ముగియడానికి నిర్ణీత సమయం కంటే అరవై నిమిషాల అదనపు సమయం ఇస్తారు.ఫలితం తేల్చేందుకు ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ టైమ్ రాత్రి 10.56 నిమిషాలు. అర్ధరాత్రి 12.06 నిమిషాల వరకు మ్యాచ్‌ను ముగించేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ మరీ ఆలస్యమైతే ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.ఇంత చేసినా ఫలితం తేలకుండా.. మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అయితే, టైటిల్ రేసులో నిలిచే క్రమంలో ఈ ఒక్క పాయింట్ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే.. ఇటు కేకేఆర్.. అటు ఆర్సీబీ అభిమానులు మ్యాచ్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 ఆరంభ వేడుకలో శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని తదితరులు ఆట, పాటలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!A little rain won’t stop us! 🌧 The ground’s got its cozy cover, and the drainage system will be ready to save the day 𝘒𝘺𝘶𝘯𝘬𝘪 𝘠𝘦𝘩 𝘐𝘗𝘓 𝘩𝘢𝘪, 𝘺𝘢𝘩𝘢𝘯 𝘴𝘢𝘣 𝘱𝘰𝘴𝘴𝘪𝘣𝘭𝘦 𝘩𝘢𝘪!#IPLonJioStar 👉 SEASON OPENER #KKRvRCB | SAT, 22nd March, 5:30 PM | LIVE on… pic.twitter.com/UwdonS9FeN— Star Sports (@StarSportsIndia) March 21, 2025 -
ఇరాన్ బీచ్‌లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియో
ఇరాన్లో జరిగిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఒకటి వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజనులను ఆశ్చర్యపరిచింది. ఇరాన్లో లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఈ భారీ వర్షం తర్వాత ఎర్రగా మెరిసే బీచ్ వీడియోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలామంది దీనిని "రక్త వర్షం (Blood Rain)" అని భయపడిపోతోంటే, మరికొందరు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి ముగ్దులైపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే..టూర్ గైడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై ఎర్రటి ధూళితో చేరింది. ఆ తరువాత ఎర్ర రంగులో బీచ్‌లోకి ప్రవహిస్తోంది. మెరిసిపోయే ముదురు ఎరుపు రంగులో నీరు సముద్రంలోకి చేరుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. View this post on Instagram A post shared by جزیره هرمز | امید بادروج (@hormoz_omid) రెయిన్ బో ఐలాండ్‌లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్ చేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన బ్లడ్ రెయిన్ జలపాతంలా కిందకు దూకుతుంటే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. దీనిపై నెటిజన్ల కమెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. "ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది మరియు ప్రత్యేకమైనది.", పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ, "దేవునికి మహిమ ఎంత అందం. నిజానికి, దేవుడు రెండు ప్రపంచాలకూ అత్యుత్తమ చిత్రకారుడు" ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కమెంట్స్ పెడుతున్నారు. What’s going on here? Alien weather phenomenon? Horror from beyond the deep? It looks like this beach is bleeding, with the rains turning blood red and oozing back out into the sea, and indeed, it’s even called the “Blood Rain”. Fortunately, it’s not actually blood.. It’s rust! pic.twitter.com/dbqMdtF7qG— briefchaatindia (@briefchaatindia) March 13, 2025 కాగా హార్ముజ్ జలసంధిలోని రెయిన్బో ద్వీపంలోని బీచ్, అధిక స్థాయిలో ఇనుము , ఇతర ఖనిజాలను కలిగి , సహజంగా ఎర్ర నేల కారణంగా ఇరాన్లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ అగ్నిపర్వత నేలలో అధిక ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఖనిజాలు భారీ ఆటుపోట్లతో కలిసి తీరప్రాంతానికి ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటుంది. ఇది ఎవరో సముద్రంలో పెద్ద బకెట్‌తో ఎరుపు పెయింట్‌ను కుమ్మరించినట్టు కనిపిస్తుంది. రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. -
ఒక్క బంతి పడకుండానే...
రావల్పిండి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో హోరాహోరీగా సాగాల్సిన మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో రావల్పిండిలో పసందైన క్రికెట్ విందును ఆస్వాదించాలని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రెండు పటిష్ట జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనుకున్న సమరం సర్వత్రా ఆసక్తిని రేపింది. గెలిచిన జట్టు సెమీఫైనల్ వైపు నడిచేది. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ ఒక్క బంతికైనా నోచుకోలేకపోయింది. తెరిపినివ్వని వానతో మైదానమంతా చిత్తడిగా మారడంతో బ్యాట్లు, బంతులతో కుస్తీ చేయాల్సిన ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. చివరకు చేసేదేమీ లేక ఫీల్డ్ అంప్లైర్లు క్రిస్ గఫాని (ఆస్ట్రేలియా), రిచర్డ్ కెటిల్‌బొరొ (ఇంగ్లండ్)లు అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించి మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. వెంటనే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ల్లో శుభారంభం చేశాయి. ఫలితమివ్వని ఈ మ్యాచ్ వల్ల గ్రూప్‌లోని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్... అన్ని జట్లు ఇప్పుడు రేసులో నిలిచినట్లయ్యింది. ఎందుకంటే మూడేసి పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు మిగిలింది ఒక్కటే మ్యాచ్ కాగా... పాయింట్ల పట్టికలో ఖాతా తెరువని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్లకు రెండేసి మ్యాచ్‌లున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో నేడుఇంగ్లండ్ X అఫ్గానిస్తాన్వేదిక: లాహోర్, మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వరణుడి కారణంగా టాస్ ఆలస్యమైంది. రావల్పిండి(Rawalpindi)లో వర్షం కురుస్తున్న కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.టాస్ సమయానికి(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు)మధ్యలో కాస్త తెరిపినివ్వగా కవర్లు తీయగా.. మళ్లీ కాసేపటికే చినుకులు పడ్డాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లనిమబ్బులు కమ్ముకుని ఉండటంతో ఆసీస్- ప్రొటిస్ మ్యాచ్ సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు.ఇంగ్లండ్‌కు తలపోటుఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే మాత్రం ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి రెండేసి విజయాలతో భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చెరో విజయంతో పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాల్లో కొనసాగుతున్నాయి.టాప్‌లో సౌతాఫ్రికాతమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్‌ను ఏకంగా 107 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఆసీస్ ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఒక్కో విజయం ద్వారా ఈ రెండు జట్లకు చెరో రెండు పాయింట్లు లభించినప్పటికీ.. నెట్ రన్‌రేటు(+2.140) పరంగా సౌతాఫ్రికా ప్రథమ స్థానం ఆక్రమించింది.ఒకవేళ మంగళవారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా ఖాతాలో మూడు, ఆసీస్ ఖాతాలో మూడు పాయింట్లు చేరతాయి. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన బట్లర్ బృందం.. తదుపరి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికాలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో నెగ్గితే మాత్రం నేరుగా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్తుంది. ఆస్ట్రేలియా మాత్రం ఇంగ్లండ్ మాదిరి ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తేలేదాకా వేచి చూడాల్సి ఉంటుంది.నాడు సెమీ ఫైనల్లోఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా చివరగా 2023లో ఐసీసీ(వన్డే) ఈవెంట్లో తలపడ్డాయి. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో నాడు సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను 212 పరుగులకు కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఆఖరి పోరులో టీమిండియాపై విజయం సాధించి టైటిల్ విజేతగా అవతరించింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో విజయానికి రెండు పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.సౌతాఫ్రికా జట్టుర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంసీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్.Update: వర్షం వల్ల టాస్ పడకుండానే ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్ రద్దుచదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం -
మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు(సోమవారం) నుండి రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడనుంది. సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 7 గంటలకు దృశ్యమానత 200 మీటర్లుగా నమోదైంది. పాలంలో ఉదయం 4 గంటలకు 50 మీటర్లుగా ఉంది.జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షం, హిమపాతం కారణంగా వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా మంచు గాలులు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను తాకాయి. దేశంలోని 12 రాష్ట్రాల్లో విపరీతంగా కురుస్తున్న పొగమంచు పలు సమస్యలను సృష్టిస్తోంది. పంజాబ్, హర్యానాలలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.పొగమంచు కారణంగా కోల్‌కతాలో 13 విమానాల రాకపోకలకు(flight arrivals) అంతరాయం కలిగింది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, బెంగాల్, బీహార్, ఒడిశా సహా 12 రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిశా, అస్సాం, మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో సోమవారం కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోనుందని వాతావరణశాఖ తెలిపింది.మంగళవారం పొగమంచు నుండి కొంత ఉపశమనం లభిస్తుందని, రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. పొగమంచు కారణంగా పంజాబ్‌లోని అమృత్సర్-ఖేమ్కరన్ రహదారిపై ఒక కారు- బస్సు ఢీకొన్నాయి. అమర్‌కోట్ బస్తీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేవిధంగా హర్యానాలోని మంగళ్‌పూర్-దరౌలి రోడ్డుపై దట్టమైన పొగమంచు కారణంగా, ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.ఇది కూడా చదవండి: America: 10 సురక్షిత రాష్ట్రాలు.. కాల్పుల మోతకు దూరం.. ప్రాణహానికి సుదూరం -
వాన చినుకులలో వడ్డన..!
ఒకవైపు వాన చినుకులు పడుతుంటే, మరోవైపు పక్కనే వేడి వేడి టీ, పకోడీలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది! ‘అయితే, అలా తినాలంటే రోజూ కుదరదు కదా!’ అని బాధపడేవారికి ఒక చక్కని వార్త. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని సియోంగ్ ప్రాంతంలో ఉన్న ‘రెయిన్ రిపోర్ట్ క్రాయిసెంట్’ హోటల్లో ప్రతిరోజూ వానాకాలాన్ని ఆస్వాదించొచ్చు. రెస్టారెంట్ ఇంటీరియర్ మొత్తం వాతావరణ వార్తలు, వర్షం పడే దృశ్యాలతో నిండి ఉంటుంది. హోటల్లో మొత్తం నిరంతరం వాన తుంపరలు పడేలా సెట్ చేశారు. వెదురు చెట్ల చుట్టూ కుర్చీలు, బల్లలు వేసి, పాదాలకు నీటి ప్రవాహం తగిలేలా అక్కడి ఫ్లోర్‌ను సెటప్ చేశారు. ఇక పక్కనే ప్రవహించే నీటిలో నేలపై కుర్చునే వీలుంది. అంతేకాదు, కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేయడానికి రెండో అంతస్తులో ఒక మినీ సినీ థియేటర్ కూడా ఉంది.సౌకర్యవంతమైన కుషన్స్‌లో పడుకొని సినిమా చూడొచ్చు. అక్కడ దొరికే మెన్యూ ఐటమ్స్‌లోని పానీయాలు, వంటకాల పేర్లన్నీ కూడా రెయిన్ రిపోర్ట్ స్టయిల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ‘సన్ షైన్’, ‘క్లౌడ్’, ‘రెయిన్ డ్రాప్’ ఇలా వివిధ వాతవరణ సూచనల పేర్లతో ఉండే క్రాయిసెంట్స్, ‘రెయిన్బో మిల్క్’, ‘సెసేమ్ క్లౌడ్’, ‘వెట్ క్లౌడ్’, ‘వైట్ లాట్టే’ వంటి పానీయాలు ఉన్నాయి. బాగుంది కదా! వానాకాలాన్ని ఆస్వాదించాలంటే వెంటనే ఈ రెయిన్ రిపోర్ట్ రెస్టరెంట్‌కి వెళ్లాల్సిందే మరి. (చదవండి: ఘోస్ట్ కోసం బీస్ట్ పిరమిడ్ వాసం) -
పంటలకు వానలా నీళ్లు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాలువలు, బోరు బావుల పైప్లైన్లు వంటివి సాంప్రదాయ సాగునీటి పద్ధతులు... డ్రిప్‌లు, స్పింక్లర్లు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూక్ష్మ సేద్య విధానాలు.. కానీ ఇందుకు భిన్నంగా పంటలపై వాన కురిసినట్టుగా, అవసరానికి తగినట్టే నీళ్లు అందేలా ‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అవలంబిస్తున్నారు. విదేశాల్లో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా సాగు చేస్తున్న పంటలకు ఈ విధానంలో నీళ్లు అందిస్తున్నారు. మొత్తం పొలమంతా కాకుండా... కావాల్సిన చోట మాత్రమే, అనుకున్న సమయంలో పంటలకు వర్షంలా నీళ్లు అందించగలగడం దీని ప్రత్యేకత.తక్కువ ఎత్తులో పెరిగే పంటలకు..ప్రస్తుతం ఇక్రిశాట్లో వేరుశనగ, శనగ కొత్తవంగడాలపై పరిశోధనల కోసం సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఈ‘సెంట్రల్ పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలా తక్కువ ఎత్తుండేపంటల సాగుకు ఈ విధానంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీటరుకన్నా తక్కువ ఎత్తుతోనే పండే పంటలకు ఎక్కువ మేలు అని పేర్కొంటున్నారు. భారీ విస్తీర్ణంలో పంటలు వేసే భూకమతాలు, ఒకేచోట వందల ఎకరాల్లో ఒకేతరహా పంటలు సాగుచేసే భారీ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుంటారని చెబుతున్నారు. యంత్రాలతో కూడిన పద్ధతిలో కేవలం ఒకరిద్దరు వ్యక్తులతోనే వందల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని భారీ వ్యవసాయ క్షేత్రాల్లో పివోట్లీనియర్ ఇరిగేషన్ విధానం ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు.ప్రయోజనాలు ఎన్నెన్నో...ఈ విధానంలో పంటలకు సాగునీరు అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో విద్యుత్ వినియోగం కూడా తక్కువని, నీటి వృథాను తగ్గిస్తుందని.. తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. నీటిని పారించే కూలీల అవసరం ఉండదని.. నేల కోతకు గురికావడం వంటి నష్టాలు కూడా ఉండవని వెల్లడించారు. పంటల అవశేషాలు తిరిగి మట్టిలో కలసి కుళ్లిపోవడానికి ఈ విధానం వీలు కలి్పస్తుందని, తద్వారా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుందని వివరించారు.⇒ పొలంలో కొన్ని పదుల నుంచి వందల మీటర్ల వరకు దూరంలో రెండు భారీ రోలర్లు, వాటి మధ్య పైపులతో అనుసంధానం ఉంటుంది. ఆ పైపులకు కింద వేలాడుతున్నట్టుగా సన్నని పైపులు ఉంటాయి. వీటి చివరన నాజిల్స్ ఉంటాయి.⇒ పొలంలోని బోరు/ మోటార్ ద్వారా వచ్చే నీటిని పైపుల ద్వారా రోలర్ల మధ్యలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానం చేస్తారు. దీనితో బోరు/మోటార్ నుంచి వచ్చే నీరు.. రెండు రోలర్ల మధ్యలో ఉన్న పైపులు, వాటికి వేలాడే సన్నని పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. నాజిల్స్ నుంచి వర్షంలా పంటలపై నీరు కురుస్తుంది.⇒ ఈ రోలర్లు పొలం పొడవునా నిర్దేశించిన వేగంలో ముందుకు, వెనక్కి కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో పంటపై వర్షంలా నీరు పడుతూ ఉంటుంది.⇒ రోలర్లను రిమోట్ ద్వారా నడపవచ్చు. లేదా కంప్యూటర్, సెల్‌ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటకు ఎంత పరిమాణంలో నీటిని అందించాలన్నది నియంత్రించవచ్చు.‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ఇదీ..⇒ కావాలనుకున్న చోట ఎక్కువగా, లేకుంటే తక్కువగా నీటిని వర్షంలా కురిపించవచ్చు. వేర్వేరు పంటలను పక్కపక్కనే సాగు చేస్తున్న చోట ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.⇒ వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణాన్ని బట్టి, ఏర్పాటు చేసుకునే పరికరాలను దీనికి అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు కాకుండా.. సమష్టి వ్యవసాయం చేసేందుకు ఈ విధానం మేలని పేర్కొంటున్నారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
సాక్షి, విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి,అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు,తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. -
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
-
ధాన్యం వర్షార్పణం
దాచేపల్లి(పల్నాడు జిల్లా): ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. నడికుడి వ్యవసాయ మార్కెట్‌యార్డులోని ఫ్లాట్‌ఫారాలపై రైతులు ఆరబోసిన ధాన్యం గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. పలువురు రైతులు పొలంలో పండించిన వరి పంటని యంత్రాల ద్వారా కోసి నడికుడి మార్కెట్‌యార్డుకి ఆరబోసేందుకు తీసుకొచ్చారు. సుమారు మూడు వేలకుపైగా ధాన్యపు బస్తాలను సిమెంట్ ఫ్లాట్‌ఫారాలపై రైతులు ఆరబోశారు. ఆకస్మాత్తుగా తెల్లవారుజామున వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. వర్షపు నీటిలో కొంత ధాన్యం కొట్టుకుపోయింది. వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల వద్ద నుంచి రైతులు యార్డుకు చేరుకునేలోపే ధాన్యం వర్షంలో తడిసింది. వర్షపునీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని రైతులు అతికష్టం మీద ఒబ్బిడి చేసుకున్నారు. ఫ్లాట్‌ఫారంపై ఉన్న ధాన్యపు బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. రెండు, మూడు రోజులు ఆరబోసి అమ్ముకుందామని ఆశపడిన అన్నదాత తడిసిన ధాన్యం చూసి నీరుగారిపోయాడు. యార్డులో ఆరబోసిన ధాన్యం సైతం తడిసిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
AP: స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.18వ తేదీన ఉదయం తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
వర్షం కురిసినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తరు గురించి తెలుసా..!
రకరకాల పెర్ఫ్యూమ్లు వాడుతంటాం కదా. తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తర్ గురించి విన్నారా..!. అలాంటి అత్తరును మనదేశంలోని పెర్ఫ్యూమ్కి రాజధానిగా పిలిచే ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతం తయారు చేస్తుంది. నిజానికి ఈ మట్టివాసనను 'పెట్రికోర్' అంటారు. అయితే కన్నౌజ్ ప్రాంతంలో దీన్నే "మిట్టి అత్తర్" పేరుతో ఈ పెర్ఫ్యూమ్ని తయారుచేస్తున్నారు. దీన్ని పురాత భారతీయ సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. చెప్పాలంటే ఇది అత్యంత శ్రమ, సమయంతో కూడిన పద్ధతి. అందుకోసం వాళ్లు ఎలాంటి కెమికల్స్ వంటి వాటిని ఉపయోగించరు. మరీ వర్షం కురిసినప్పుడు వచ్చే నేల వాసనను పోలిన అత్తరు తయారీకీ ఏం ఉపయోగిస్తారంటే..గంగా నది ఒడ్డున ఉండే మట్టిని, గులాబి రేకులు లేదా మల్లెపువ్వులతో ఈ అత్తరుని తయారు చేస్తారు. తయారీ విధానానికి ఉపయోగించే పాత్రలు సింధులోయ నాగరికత టైంలో ఉపయోగించినవి. ఈ అత్తరు తయారీ విధానం దాదాపు ఐదువేల ఏళ్ల నాటిది. కానీ ఇప్పటికీ అదే పద్ధతిలోనే అత్తరు తయారు చేయడం కన్నౌజ్ ప్రాంతవాసుల ప్రత్యేకత. అంతేగాదు తయారీ మొత్తం పర్యావరణ హితంగానే చేస్తారు. కనీసం ప్రాసెసింగ్ పద్ధతుల్లో కూడా కేవలం కట్టెల పొయ్యలతో మండిస్తారు. ఇక ప్యాకింగ్ వద్దకు వస్తే చిన్న లెదర్ బాటిల్ రూపంలో ఈ అత్తర్లను మార్కెట్లోకి తీసుకువస్తారు. అయితే ప్రస్తుతం ఈ అత్తరు తయారీ పద్ధతిని సవరించి.. బొగ్గులు, కట్టెల పొయ్యలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మరింత అనుకూలమైన పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్డిసి) డైరెక్టర్ శక్తి వినయ్ శుక్లా చెబుతున్నారు. శుక్లా ఈ "మిట్టి అత్తర్"ని సహజమైన డీ-మాయిశ్చరైజర్‌గా అభివర్ణిస్తున్నారు. (చదవండి: దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!) -
ఇంగ్లండ్, విండీస్‌ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
2 రోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.6 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారిన తర్వాత పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక వైపుగా పయనిస్తూ..14వ తేదీ రాత్రి లేదా 15వ తేదీ ఉదయం తీరం దాటనుందని తెలిపారు. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు, రేపు మోస్తరు నుంచి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. -
ఏపీలో 3 రోజులపాటు భారీ వర్షాలు
-
స్పెయిన్‌ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు
మాడ్రిడ్ : భారీ వర్షానికి ఆకస్మికంగా సంభవించిన వరదలు స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా భారీ సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.ఓ వైపు వర్షం.. మరోవైపు వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారి జాడ కోసం బాధిత కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. బురద నీరు ముంచెత్తడంతో రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.దీంతో స్పెయిన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా, పదుల సంఖ్యలో మృతదేహాల్ని గుర్తించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా ఇతర అన్నీ రంగాలకు చెందిన కార్యకలాపాల్ని గురువారం వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావాన్ని అంచనా వేసేలా కేంద్ర క్రైసిస్ కమిటీ ఉన్నతాధికారులకు ప్రధాని అప్రమత్తం చేశారు. -
దానా ఎఫెక్ట్..రద్దయిన 34 రైళ్లు ఇవే
అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న దానా తుపాను ముప్పు నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈస్ట్‌కోస్ట్ పరిధిలోని భువనేశ్వర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు సేవలందించే 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలూ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం సోమవారం ఉదయం అల్పపీడనంగా.. 22న వాయుగుండంగా బలం పుంజుకుని బుధవారం (23న) ఇది దానా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తీర్పు తీర ప్రాంతాల దానా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తరుణంలో తీర్పుతీర ప్రాంతాలకు రైల్వే సేవలందించే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన 34రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే నోట్‌ను విడుదల చేసింది. -
భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తం
బెంగళూరు: భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన కర్నాటకలోని బెంగళూరు నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది.నీటి ప్రవాహం కారణంగా పలు రహదారులును అధికారులు మూసివేశారు. బాధితులను రక్షించేందుకు అధికారులు పడవలను వినియోగిస్తున్నారు. మరోవైపు పలువురు బెంగళూరువాసులు సోషల్ మీడియాలో అధికారులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు మేరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Karnataka | Residents of an Apartment in Yelahanka are being rescued through boats.Due to incessant heavy rain, waterlogging can be seen at several places in Bengaluru causing problems for the residents in Allalasandra, Yelahanka pic.twitter.com/AekmTVOAlW— ANI (@ANI) October 22, 2024మీడియాకు అందిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం వరకు బెంగళూరు రూరల్ పరిధిలో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 20కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి మళ్లించారు. నగరంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు -
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
-
ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందిబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది. -
నాలుగు రోజులు భారీ వర్షాలు..
-
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి భారీ వర్ష సూచన
-
Rain Alert: రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి,అమరావతి: రానున్న 3-4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు పడతాయని చెప్పారు. ఆదివారం కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటల వ్యవధిలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.భారీ వర్షాల కారణంగా 24 గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉందని ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్,హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశామని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఆర్పీ సిసోడియా విజ్ఞప్తి చేశారు. -
ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈరోజు(శనివారం) కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో అక్టోబర్ 12న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో అస్సాం, మేఘాలయలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల నుండి దాటనున్నాయి. యూపీలోని కొన్ని చోట్ల తేలికపాటి పొగమంచు కమ్ముకుంది. అక్టోబర్ 16 వరకు ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గానూ ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు


