breaking news
Prakasam
-
అంతర్జాతీయ ఫెన్సింగ్ పోటీలకు ఇద్దరు బాలికలు
ఒంగోలు: అంతర్జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలు ఎంపికయ్యారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానిలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్ 17 (క్యాడెట్) పోటీల్లో చెరువుకొమ్ముపాలేనికి చెందిన పూసపాటి లిఖితారెడ్డి, చీమకుర్తికి చెందిన పుత్తూరి చక్రిక సత్తా చాటారు. అంతర్జాతీయ పోటీలకు ఏపీలోని పశ్చిమ గోదావరి నుంచి నలుగురు, కర్నూలు నుంచి ముగ్గురు, ప్రకాశం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. వీరికి ప్రస్తుతం ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 19 నుంచి ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో నిర్వహించనున్న అంతర్జాతీయ(ఏషియన్ ఫెన్సింగ్) పోటీల్లో వీరు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికై న బాలికలతోపాటు కోచ్ రాజును జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జీఎస్వీ కృష్ణమోహన్, జిల్లా కార్యదర్శి జి.నవీన్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రభుత్వమే నిర్వహించాలి
మార్కాపురం మెడికల్ కాలేజీనిమార్కాపురం టౌన్: మార్కాపురం మెడికల్ కాలేజీని పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని, ప్రభుత్వమే కాలేజీని నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు డిమాండ్ చేశారు. సీపీఎం బృందం ఆదివారం సాయంత్రం మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పశ్చిమ ప్రాంతానికి మెడికల్ కాలేజీ అత్యంత అవసరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెడికల్ కాలేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మాటతప్పిందన్నారు. యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి ప్రాంతాల్లోని పేద, దళిత, గిరిజన ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే మెడికల్ కాలేజీ అవసరమన్నారు. పీపీపీ విధానం వల్ల కాలేజీ ప్రైవేట్ పరమైతే అన్ని రకాల వైద్యసేవలకు డబ్బు చెల్లించాల్సి వస్తుందన్నారు. కాలేజీ పేరుతో జరుగుతున్న రాజకీయాలను ఆపి నిర్మాణంపై దృష్టిపెట్టాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సోమయ్య, పట్టణ కార్యదర్శి రఫీ, మండల కార్యదర్శి బాలనాగయ్య, రూబెన్, నన్నేసా, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకుల డిమాండ్ పీపీపీ విధానంతో పేదలకు తీవ్ర నష్టమని ఆందోళన -
‘సాక్షి’పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
కీలకమైన పత్రికా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టడం దారుణం. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారన్న కోపంతో సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డితోపాటు ఇతర రిపోర్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. ప్రజాస్వామ్యంలో పత్రికలపై కేసులు పెట్టడం మంచి సాంప్రదాయం కాదు. పత్రికా వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పాలకులకు నచ్చని వార్తలొస్తే ఖండన ఇవ్వొచ్చు. అంతేకానీ ఇలా వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యంలో మంచిదికాదు. – జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు -
రైలు నుంచి జారిపడి మహిళ మృతి
ఒంగోలు టౌన్: వేగంగా వెళ్తున్న రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని ఓ మహిళ మృతి చెందింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు–కరవది రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని ఒక మహిళ ఆదివారం ఉదయం రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మరణించింది. సుమారు 30 ఏళ్లకుపైగా వయసు కలిగిన ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతురాలు పూల డిజైన్ కలిగిన నిండు పచ్చరంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉంది. రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్సై కె.మధుసూధన రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఆర్పీ ఎస్సై 9440627647ను సంప్రదించాలని కోరారు. కంభం: జేసీబీ వాహనంలో విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన కంభం మండలంలోని యర్రబాలెం సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మార్కాపురానికి చెందిన ఎన్.వెంకటరామిరెడ్డి గిద్దలూరులో పనుల నిమిత్తం జేసీబీని తీసుకెళ్లారు. అక్కడ పనులు ముగిసిన తర్వాత శనివారం అర్ధరాత్రి గిద్దలూరు నుంచి మార్కాపురం వెళ్తుండగా యర్రబాలెం–నల్లకాల్వ మధ్య వాహనంలో వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు అదుపుచేశారు. అప్పటికే వాహనం మొత్తం దగ్ధమైందని, సుమారు రూ.14 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయారు. -
ముద్దెనహళ్లిలో జననం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మోక్షగుండం(ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లాలో ఉంది) గ్రామం నుంచి 18వ శతాబ్దంలో విశ్వేశ్వరయ్య పూర్వీకులు కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. అప్పటి మైసూర్ రాజ్యంలోని కోలార్ జిల్లా చిక్‌బళ్లాపూర్ తాలూకా ముద్దెనహళ్లిలో 1861 సెప్టెంబర్ 15వ తేదీన శ్రీనివాసశాస్త్రి, వెంకట లక్ష్మమ్మ దంపతులకు విశ్వేశశ్వరయ్య జన్మించారు. తండ్రి శ్రీనివాసశాస్త్రి ఆయుర్వేద వైద్యుడు, సంస్కృత పండితుడు. చిక్‌బళ్లాపుర ప్రైమరీ స్కూల్లో విశ్వేశ్వరయ్య ్డప్రాథమిక విద్య పూర్తి చేశారు. 15 ఏళ్ల వయసులో ఉండగా తండ్రి మరణించడం ఆయన్ను బాగా కుంగదీసింది. దానికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు కావడంతో చదువును కొనసాగించే పరిస్థితులు కనింపిచలేదు. అయినా సరే పట్టువదలకుండా చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తన మేనమామ హెచ్.రామయ్య సహకారంతో బెంగళూరులోని వెస్లియన్ మిషన్ హైస్కూల్లో ఉన్నత విద్య అభ్యసించారు. 1880లో బెంగళూరు నగరంలోని సెంట్రల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. ప్రఖ్యాత కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పుణేలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. -
రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక
ఒంగోలు: రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్లను ఆదివారం ఒంగోలులోని మినీ స్టేడియంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎన్.చంద్రమోహన్‌రెడ్డి, కార్యదర్శి కుర్రా భాస్కరరావు మాట్లాడుతూ.. బాలుర జట్టుకు కొత్తపట్నంలో, బాలికల జట్టుకు పాకలలో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన జట్లు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ శిబిరాల్లో వసతులను కబడ్డీ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ నల్లూరి సుబ్బారావు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అఽసోసియేషన్ కార్యదర్శి యామారపు పూర్ణచంద్రరావు, కోశాధికారి డి.రమేష్, ఉపాధ్యక్షుడు సిరిగిరి రంగారావు, గడ్డం శ్రీను, సుమతి తదితరులు పాల్గొన్నారు. బాలుర జట్టు : రాఘవేంద్ర(కొత్తపట్నం), కె.దశరథుడు(మార్కాపురం), కె.రామకృష్ణ(గిద్దలూరు), వి.నాగచైతన్య(రాజుపాలెం), పి.వినీల్‌రెడ్డి(కొత్తపట్నం), ఆర్.అభిషేక్‌రెడ్డి(కంభం), కె.బ్రహ్మశివాజీ(వేమవరం), కె.ఆకాష్(గొట్లగట్టు), బి.హరినాథ్(మడనూరు), ఎం.లాలశివ(దోర్నాల), టి.బాబి(ఒంగోలు), జె.రామాంజనేయులు(ఈదర), బి.అయ్యప్ప(ఒంగోలు), బి.సుబ్బారెడ్డి(ఈతముక్కల), స్టాండ్‌బైలుగా పి.రుత్విక్(కనిగిరి), కె.షణ్ముఖ్రాజ్(ఒంగోలు), ఎస్కె అజ్మల్(సీఎస్‌పురం), సీహెచ్ సంతోష్(కొత్తపట్నం), ఆర్.శివనాయక్(మార్కాపురం). బాలికల జట్టు : వి.అర్చన, కె.భూమిక, కె.నందిని, కె.త్రిపుర, కె.త్రిగుణ, కె.సౌమ్య, కె.విజయలక్ష్మి , నందిని(పాకల), డి.హసన్బీ, ఎన్.కాశీశ్వరి(మార్కాపురం), డి.జ్యోత్స్న(వై.డి.పాడు), ఎం.శ్రీలత(గొట్లగట్టు), ఎం.పల్లవి(కనిగిరి), కె.కీర్తన(ఒంగోలు), స్టాండ్‌బైలుగా యు.రూతు(వై.డి.పాడు), టి.నాగమణి(ఒంగోలు), కె.మహిమ(మర్రిపూడి). -
వెలుగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం కపటనాటకాలు ఆపి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో మార్కాపురం ప్రచార సభకు వచ్చినప్పుడు తానే వెలుగొండను పూర్తిచేస్తానని హామీ ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. వెలుగొండ పూర్తిచేస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, కరువు పోతుందన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు వెంటనే నిధులు విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవడంతోపాటు పునరావాస కాలనీల్లో గృహాలు పూర్తిచేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. మూడు జిల్లాల్లో శాశ్వతంగా కరువును నివారించే వెలుగొండ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఒంగోలు టౌన్: భూస్వామ్య దోపిడీని ఎదిరించి నిలిచిన వీరనారి ఐలమ్మ, బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంలో మరణించిన రామకృష్ణల స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలను నిర్మిస్తామని రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి రాయల మాలకొండయ్య చెప్పారు. ఆదివారం నగరంలోని ఎల్బీజీ భవనంలో ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గ్రామాల్లో భూ కబ్జాలు పెరిగిపోయాయని, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని చెప్పారు. ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు టంగుటూరి రాము మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో 2000 సంవత్సరంలో విపరీతంగా పెంచిన కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బషీర్‌బాగ్ పోలీసు కాల్పుల్లో అమరులైన రామృష్ణ, విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డా.కృష్ణయ్య, చీమకుర్తి కోటేశ్వరరావు, చందలూరు శ్రీనివాసులు, యోగమ్మ, బొప్పరాజు హరిబాబు, రాయల్ల కాశయ్య పాల్గొన్నారు. శ్రీనివాసరావు ఒంగోలు సిటీ: జిల్లాలో ఈనెల 18, 19 వ తేదీల్లో జరిగే యూటీఎఫ్ రణభేరి జాతాను జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలు, ఆర్థిక అంశాల మీద ఉపాధ్యాయులను చైతన్యవంతం చేసేందుకు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం రణభేరి బైకు జాతాను ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రూపొందించిందని తెలిపారు. దీనికి జిల్లాలోని ఉపాధ్యాయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, సీపీఎస్ 90 శాతం బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, 12వ పీఆర్సీ కమిషన్ నియమించడం, 30 శాతం ఐర్ ప్రకటించడం, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఎన్‌క్యాష్‌మెంట్ తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీ వీరాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో రణభేరి బైకు జాతా ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం కనిగిరిలోకి ప్రవేశిస్తుందని గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం, మార్కాపురం, పొదిలి, దర్శి, చీమకుర్తి మీదుగా ఒంగోలుకు 19 తేదీ సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుందని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఓవీ వీరారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ రవి, జిల్లా సహాధ్యక్షురాలు జి ఉమామహేశ్వరి, జిల్లా కోశాధికారి ఎన్ చిన్నస్వామి, జిల్లా కార్యదర్శి ఎం సత్యనారాయణ రెడ్డి, పీ బాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
22 నుంచి భైరవకోనలో శరన్నవరాత్రి ఉత్సవాలు
సీఎస్‌పురం(పామూరు): ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన భైరవకోనలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం ఈఓ డి.వంశీకృష్ణారెడ్డి, ముప్పాళ్ల శ్యామ్‌సుందర్‌రాజు పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, ఇతర వసతులు కల్పిస్తామని ఈఓ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. త్రిముఖదుర్గాదేవి ప్రత్యేక అలంకారాలు.. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భైరవకోన త్రిముఖదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు 22వ తేదీ సోమవారం బాలా త్రిపుర సుందరీదేవిగా, 23న శ్రీరాజరాజేశ్వరీదేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న శ్రీగాయత్రీదేవి, 26న మోహినీదేవి, 27న శ్రీగజలక్ష్మీదేవి, 28న సరస్వతీదేవి, 29న మహిషాసురమర్దిని, 30న శ్రీదుర్గాదేవి, అక్టోబర్ 1వ తేదీన లలితాదేవిగా దర్శనమిస్తారని ఈఓ వివరించారు. 2న విజయదశమి పూజలతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఒంగోలు టౌన్: వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి మోపెడ్ మీద వెళ్తున్న ఒక వృద్ధుడిని ఢీకొన్న ఘటన ఆదివారం ఉదయం జరిగింది. నగరంలోని సమతా నగర్లో నివశించే రాయని శేషయ్య (54) మోపెడ్ మీద ఒంగోలు నుంచి పేర్నమిట్టకు వెళుతున్నారు. కర్నూలు రోడ్డులో టుబాకో బోర్డు వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శేషయ్యను జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు మరో ఇద్దరు సీఐలు బలయ్యారు. ఒంగోలు డీటీసీ సీఐ షేక్ షమీవుల్లాను సస్పెండ్ చేస్తూ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. రెండేళ్ల క్రితం పల్నాడు జిల్లా మాచర్ల సీఐగా పనిచేసిన సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయనతో పాటు బాపట్ల ఐటీ కోర్లో సీఐగా పనిచేస్తున్న జయకుమార్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈయన కారంచేడు సీఐగా పనిచేసి ప్రసుతం బాపట్ల ఐటీ కోర్లో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఘటనలను సాకుగా చూపి ఈ ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వీరిని సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరిని లూప్లైన్లో పెట్టారని, అయినప్పటికీ వదిలిపెట్టకుండా వెంటాడి మరీ చివరికి సస్పెండ్ చేసినట్లు పోలీసు శాఖలో చెవులు కొరుక్కొంటున్నారు. -
నేర నియంత్రణలో రాజీపడేది లేదు
ఒంగోలు టౌన్: నేరాల నియంత్రణలో ఎలాంటి రాజీ పడేది లేదని, అసాంఘిక శక్తుల ఆటకట్టించి నేరరహిత జిల్లాగా మార్చేందుకు తనదైన శైలిలో పనిచేస్తానని ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు చెప్పారు. జిల్లా ప్రజలకు మరింతగా అందుబాటులో ఉంటానని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం నూతన ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అలాంటి వారిని ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రతలకు, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. శక్తి యాప్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తామని, యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆపద సమయాల్లో సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని చెప్పారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి కార్యాచరణ రూపొందించి నూతన ప్రణాళికలు అమలు పరుస్తామన్నారు. సిబ్బంది నుంచి అధికారుల వరకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తానని చెప్పారు. తొలుత స్వాతంత్య్ర యోధుడు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారుల అభినందనలు: సాధారణ బదిలీల్లో భాగంగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హర్షవర్థన్ రాజును జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, డీపీఓ ఉద్యోగులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఏఎస్పీ (అడ్మిన్) నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్ యశ్వంత్, వన్‌టౌన్ సీఐ నాగరాజు, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు తదితరులు ఎస్పీని కలిసి అభినందనలు తెలిపారు. డీపీఓ ఏవో రామ్మోహనరావు, డీసీఆర్బీ, డీటీసీ అధికారులు, సిబ్బంది ఎస్పీకి అభినందనలు తెలిపారు. -
సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధికి బాటలు
ఒంగోలు టౌన్: జిల్లా ఉన్నతాధికారులు, అన్నీ శాఖలకు చెందిన ఉద్యోగుల సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధికి బాటలు వేసేందుకు కృషి చేశానని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళుతున్న తమీమ్ అన్సారియాను జిల్లా అధికారులు ఆదివారం రిమ్స్ ఆడిటోరియంలో ఘనంగా సత్కరించారు. పలువురు అధికారులు కలెక్టర్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆయా సమస్యలపై వారికి అవగాహన కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే తన అభిమతమన్నారు. గత 14 నెలల కాలంలో ఇదే విధానాన్ని పాటించినట్లు చెప్పారు. గత ఏడాది జూన్ 27న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తాను జిల్లాలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించినట్లు తెలిపారు. స్పష్టమైన అవగాహనతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేసినట్లు చెప్పారు. డ్వామా ఆధ్వర్యంలో నీటి సంరక్షణకు చేపట్టిన పనులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో జేసీ ఆర్.గోపాల కృష్ణ, డీఆర్ఓ చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్థన్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు మాట్లాడారు. -
జిల్లా ప్రజల సహకారాన్ని మరచిపోలేను
ఒంగోలు టౌన్: జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది అందించిన సహకారాన్ని ఎన్నటికీ మరచిపోలేనని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. జిల్లాను వదిలివెళుతున్నప్పటికీ తన పరిధిలో సాయం అందించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన విజయనగరానికి వెళుతున్న సందర్భంగా ఆదివారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో కవాతు నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేరనియంత్రణ, గంజాయి నిర్మూలన, మహిళలు, బాలికలు, చిన్నారులపై నేరాలను అరికట్టడంలో సిబ్బంది కృషిని అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, రమణ కుమార్, కె.శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘ రాష్ట్ర కార్యదర్శి హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసు కళ్యాణ మండపంలో... పోలీసు శాఖపై ప్రజల నమ్మకం పెరిగేలా నిబద్దతగా పనిచేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. బదిలీపై విజయనగరం వెళుతున్న ఆయనను పోలీసు కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత 14 నెలల కాలంలో ప్రజలకు ఉత్తమ సేవలందించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చూపిన చొరవ అభినందనీయమన్నారు. జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, విద్యార్థులకు గంజాయి మీద అవగాహన కల్పించామన్నారు. -
ప్రైవేట్ పెత్తనం!
సీనరేజ్పైమీ సొంత స్థలం నుంచి.. ఇంటి అవసరాల కోసం మట్టి, ఇసుక తరలిస్తున్నా సరే ఇకపై పన్ను వసూలు చేస్తారు. సీనరేజి వసూళ్ల బాధ్యతను ప్రైవేటుకు కట్టబెట్టడంతో వసూళ్ల పర్వం ఇష్టారాజ్యంగా సాగనుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండేళ్ల పరిమితికి రూ.1136 కోట్లకు ఏఎంఆర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇకపై ఆ సంస్థే సీనరేజి వసూలు చేసి ప్రభుత్వానికి కట్టనుంది. ఈ ప్రైవేటు సైన్యం పెత్తనంతో గ్రానైట్ క్వారీల యజమానులు, ఫ్యాక్టరీల యజమానులు, కంకర మిల్లుల నిర్వాహకులతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా వసూలు చేయడం వలన గ్రానైట్ క్వారీల యజమానులు, ఫ్యాక్టరీల యజమానులు, కంకర మిల్లుల నిర్వాహకులకు అదనపు ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వం రాయల్టీ ప్రకారం సీనరేజీ వసూళ్లలో ఎంతోకొంత సానుభూతి ఉంటుంది. దాని వలన గ్రానైట్ రాళ్లల్లో రాయల్టీ వసూళ్లలో ఉదార స్వభావం ఉంటుంది. అదే ప్రైవేటు ఏజెన్సీలకి ఇస్తే రాళ్ల స్లాబులు, కంకర, చివరకు మట్టి మీద కూడా రాయల్టీ సీనరేజీ వసూలు చేయడంలో ఏజెన్సీ నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తారని గ్రానైట్ తయారు గ్రానైట్ పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వసూళ్లు చేసిన సీనరేజీ నిధులను ప్రభుత్వానికి జమ చేసే లోపే నిధుల దుర్వినియోగం కూడా జరిగే అవకాశం ఉంది. – ఆర్ లక్ష్మీనారాయణ, వీటీసీ కేంద్రం అధ్యక్షుడు, రామతీర్థం ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి. సంపద సృష్టిస్తాం అంటూ ఏదో రకంగా ప్రజలపై భారం మోపుతోంది. సొంత పొలంలో ఇంటి అవసరాల నిమిత్తం మట్టి, కంకర వంటివి తరలించినా పన్నులు చెల్లించాల్సిందే. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటి వరకూ మైన్స్ అధికారులు గ్రానైట్, ఇతర క్వారీల నుంచి నెలకు సుమారు రూ.36 కోట్లు వసూలు చేస్తున్నారు. తాజాగా టెండరు దక్కించుకున్న సంస్థ రూ.47.3 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. రెండేళ్ల పరిమితికి రూ.1136 కోట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఇతర క్వారీల నుంచి సీనరేజ్ వసూలు చేసి రెండేళ్లలో ప్రభుత్వానికి రూ.1136 కోట్లు చెల్లించేలా ఏఎంఆర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ లెక్కన సదరు సంస్థ నెలకు రూ.47.3 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇంటి అవసరాలకు, క్వారీల్లో చిన్న తవ్వకాలు చేసినా ముక్కుపిండి సీనరేజ్ వసూలు చేస్తారు. సదరు సంస్థ మైన్స్ అధికారులు వసూలు చేస్తున్న రూ.36 కోట్లు కంటే అదనంగా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు వసూలు చేసేలా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ మైన్స్ అధికారులు సంవత్సరానికి రూ.435 కోట్లు వసూలు చేస్తున్నారు. తాజాగా ప్రైవేటు సంస్థ దాదాపు రూ.600 కోట్ల వరకూ వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు, క్వారీ నిర్వాహకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి సీనరేజ్ వసూలు చేసే బాధ్యతను టెండరు దక్కించుకున్న సంస్థకు అప్పగించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 600 వరకూ గ్రానైట్ క్వారీలతో పాటు చిన్నా, పెద్దా కంకర, గ్రావెల్ క్వారీలు ఉన్నాయి. క్వారీ నుంచి రాళ్లు, గ్రావెల్ వంటివి బయటకు తరలించాలంటే నిబంధనల ప్రకారం సీనరేజీ చెల్లించాలి. ప్రస్తుతం గనులశాఖ అధికారుల స్థానంలో ప్రైవేటు సిబ్బంది ఈ బాధ్యతలు చేపడతారు. ఇప్పటి వరకూ మైన్స్ అధికారులు గ్రానైట్ క్వారీలో ముడిరాయి క్యూబిక్ మీటరుకు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం టెండరు దక్కించుకున్న సంస్థ కొలత ప్రకారం ఎంత ముడిసరుకు బయటకు వెళ్లిందో లెక్కించి అందుకనుగుణంగా పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఈ నెల కొంతే పన్నులు వసూలయ్యాయని తప్పించుకోకుండా చెల్లించాల్సిందే. సీనరేజీ అంచనా వేసిన మేరకు విభాగాల వారీగా ఆయా ప్రభుత్వ ఖాతాలకు నెల వారీ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. గ్రానైట్, కంకర తదితరాల మాదిరే గ్రామాల్లో మట్టి, గ్రావెల్ వంటివి తరలించినా పన్ను రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. జిల్లాలో నిత్యం సుమారు 2 వేల నుంచి 3 వేల వరకు చిన్న పెద్ద భవన నిర్మాణాలు జరుగుతుంటాయి. వీటికి భారీగా మట్టి, గ్రావెల్ అవసరం ఉంటుంది. గ్రావెల్, మట్టిలకు సంబంధించి సీనరేజీలను ప్రైవేటు వ్యక్తులు ముక్కుపిండి వసూలు చేస్తారు. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు చేపట్టే నిర్మాణాలపై భారం పడనుంది. -
మాటలేనా.. చేతలేవీ?
వెలిగొండ ప్రాజెక్టుపై మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రకటనలు, వాగ్ధానాలకే పరిమితమైనట్లుగా ఉందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జె.జయంత్ బాబు విమర్శించారు. ఆదివారం మార్కాపురం మండల రైతు సంఘం 8వ మహాసభ పెద్దనాగులవరం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 వరద సీజన్ నాటికి నీరు విడుదల చేస్తామన్న హామీ అమలు చేస్తారా అని ప్రశ్నించారు. త్వరితగతిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ, నీటి పారుదల రంగాన్ని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. వెలిగొండ పనులు ప్రారంభించి 30 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తిచేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పండించిన పంటలకు ఏడాది కాలంగా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చినప్పుడే రైతుల ఆత్మహత్యలు నివారించగలమన్నారు. యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కాగా, మండల రైతు సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా ఓర్సు అడివయ్య, గంగిరెడ్డిని ఎన్నుకున్నట్లు సంఘ నాయకుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. సమావేశంలో రైతు సంఘ నాయకులు సోమయ్య, రూబెన్, బాల నాగయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మిగులు పనులు చేపట్టకుండా 2026లో నీళ్లెలా ఇస్తారు? సాగును లాభసాటిగా మారిస్తేనే రైతుల చావులు ఆగుతాయ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంత్ బాబు -
ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తాం.. దిక్కున్నచోట చెప్పుకోండి..
దర్శి: తమ పొలాన్ని ఆక్రమించుకునేందుకు పత్తిపైరును దున్నేశారని, అడ్డం వస్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తామని, దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరించారని ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తానం చింతల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు విలపించారు. కూటమి నేతల అండతో దౌర్జన్యం చేస్తున్నారని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు యన్నాబత్తిన యలమంద భార్య ధనమ్మ, మేకల గురవారావు భార్య మేకల లక్ష్మీదేవి తెలిపారు. వారి కథనం మేరకు.. సర్వే నంబరు 132/2లో యన్నాబత్తిన ధనమ్మకు 79 సెంట్లు, సర్వే నంబరు 225/2 లో మేకల గురవారావుకు 1.32 ఎకరాల భూమి ఉంది. దశాబ్దాలుగా వారు ఈ భూమిని సాగుచేసుకుంటున్నారు. ప్రస్తుతం పత్తిపంట వేశారు. గ్రామానికి చెందిన మేకల రుక్మిణీదేవి, ఆమె కుమారుడు ప్రసన్నకుమార్ కోతదశకు చేరిన ఆ పైరును శుక్రవారం దున్నేశారు. గ్రామంలోని కూటమి నాయకుల ద్వారా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మితో అధికారులకు ఫోన్ చేయించి, పొలాలను దున్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. ఇదేమని అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తామని బెదిరించారు. గ్రామంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని తమ పంటలు చెడగొట్టి తమ నోటికాడ కూడు లాగేశారని, రూ.50 వేల విలువైన పంటను నాశనం చేశారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో తమను పిలిపించి మాట్లాడిన సీఐ, ఎస్ఐ, తహశీల్దార్.. తమవైపు న్యాయం ఉండటంతో మౌనంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఆక్రమణకు యతి్నంచి పైరును దున్నటంపై ఫిర్యాదు చేశామని, పోలీసులు న్యాయం చేస్తారని ఆశగా చూస్తున్నామని వారు తెలిపారు. -
ప్రజల ఆందోళనతో కదిలిన ఎకై ్సజ్ శాఖ
● మంచికలపాడును సందర్శించి బెల్టు షాపులు నిర్వహించకుండా చూస్తామన్న ఈఏఎస్ వెంకట్ చీమకుర్తి రూరల్: మండలంలోని మంచికలపాడు గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని, గ్రామంలో ఎక్కడా మద్యం విక్రయించకూడదని స్థానిక ప్రజలు శుక్రవారం ఆందోళన చేసి రెండు బెల్టు షాపులను ధ్వంసం చేయడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పందించారు. శనివారం ఆ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకట్ మాట్లాడుతూ గ్రామ ప్రజల అభీష్టం మేరకు మంచికలపాడులో బెల్టు షాపులు నిర్వహించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామం నుంచి పక్క గ్రామమైన బండ్లమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బెల్టు షాపుల వద్ద ఆకతాయిల ఆగడాల కారణంగా భయాందోళన చెందుతున్నారని తెలిపారు. పొలాలకు వెళ్లాలంటే మహిళలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అందువలన బెల్టు షాపులను మూసివేయించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పెరికల నాగేశ్వరరావు, ఎంపీటీసీ అత్యాల అంకయ్య, మాజీ సర్పంచ్‌లు శేషమ్మ, శ్రీనివాసరావు, పొన్నపల్లి సుబ్బారావు, అత్యాల ఏసేపు, పొన్నపల్లి ఏడుకొండలు, కోరా సుబ్బారావు, పొన్నపల్లి శ్రీనివాసరావు, పొన్నపల్లి వెంకటరావు, ఉల్లి సుబ్బారావు, సాలువ సుబ్బారావు, చీమకుర్తి ఎకై ్సజ్ ఎస్ఐ నాగేష్, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలి
● 5కే రన్‌ను ప్రారంభించిన డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ఒంగోలు టౌన్: ఎయిడ్స్ నియంత్రణపై యువత సరైన అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం నగరంలోని ప్రకాశం భవన్ నుంచి ప్రగతి నగర్ మీదుగా పాత రిమ్స్ వరకు నిర్వహించిన 5కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్, మాదక ద్రవ్యాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎయిడ్స్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తపడాలని చెప్పారు. ఒకవేళ ఎవరికై నా ఎయిడ్స్ సోకినప్పటికీ ఆందోళన చెందకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని చెప్పారు. జిల్లా లెప్రసీ అధికారి శ్రీవాణి మాట్లాడుతూ ఎయిడ్స్, హెచ్ఐవీపై ఏవైనా సందేహాలుంటే 1097 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. జిల్లా స్పోర్ట్స్ అధికారి రాజరాజేశ్వరి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా చక్కటి ఆలోచనలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం హెచ్ఐవీ, ఎయిడ్స్, మాదక ద్రవ్యాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించారు. బాలుర విభాగంలో సంతోష్, ఎల్.నాని, బాలికల విభాగంలో ఐశ్వర్య, రమ్య జాయ్‌లకు ప్రథమ, ద్వితీయ బహుమతులుగా ఒక్కొక్కరికి రూ.10 వేలు, రూ.7 వేల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ పందింటి కిరణ్, సీఎస్ఓ సాయి, చంద్రమోహన్, గ్రో ఎన్జీఓ మేనేజర్ పీర్ బాషా, సినార్డ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ ప్రోగ్రామ్ జిల్లా వనరుల అధికారి జి.స్వరూప్ కుమార్, షేర్ ఇండియా పీఓ అమీన్, డాప్కూలేట్ రమేష్, పీపీఎన్ నెట్వర్స్ ప్రతినిధి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆటల్లో అదరగొట్టు..!
గొట్లగట్టు.. కొనకనమిట్ల: మండలంలోని గొట్లగట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులకు, ఆటల పోటీల్లో పతకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆట ఏదైనా పాఠశాల క్రీడాకారులు సత్తాచాటుతూ పతకాలు సాధిస్తున్నారు. సుమారు 60 మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. ఇటీవల నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన క్రీడా ప్రతిభా అవార్డుల ఎంపికలో జిల్లా స్థాయిలో గొట్లగట్టు జెడ్పీ పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది. చదువుతో పాటు క్రీడల్లోనూ పాఠశాల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. హెచ్ఎం, పీడీ, ఉపాధ్యాయులు క్రీడాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని వారికి అందిస్తుండటంతో ఏ పోటీలకు వెళ్లినా పతకంతో తిరిగి వస్తున్నారు. గతంలో ఈ హైస్కూల్లో పనిచేసిన పీడీ యరగొర్ల బాలగురవయ్య ఇచ్చిన శిక్షణతో కబడ్డీ, హ్యాండ్‌బాల్, రగ్బీ, రెజ్లింగ్, సెపక్తక్రా, అథ్లెటిక్స్ పోటీల్లో రాణిస్తూ ఎన్నో పతకాలు సాధించారు. ఆటల పోటీల్లో బాలురే కాదు.. బాలికలు సైతం సత్తాచాటుతూ తామేం తక్కువ కాదని నిరూపించారు. నిరంతర సాధనతో క్రీడా ప్రతిభా అవార్డుకు ఎంపిక... గొట్లగట్టు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేసి ప్రస్తుతం మార్కాపురం మండలం పెదనాగులారం జెడ్పీ పాఠశాల పీడీగా పనిచేస్తున్న వై.బాలగురవయ్య ఒకప్పుడు ఈ పాఠశాల పూర్వ విద్యార్థే. పాఠశాలలో చదువుతున్న కొంతమంది క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ఆటల పోటీల్లో మెళకువలు నేర్పించారు. క్రీడలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి నిరంతరం సాధన చేయించారు. వారిలో పెండెం నరహరి, మొలకా చిరుత, దుర్బాకుల ఉమాశంకర్, వెన్నా విష్ణువర్దన్‌రెడ్డి, కోలా ఆకాష్, వరప్రసాద్, దుర్గాప్రసాద్, వెంకటయ్య, నవీన్, యువరాజు, దీప్తి, ఆర్.లక్ష్మీకల్పన, వి.మహేశ్వరి, చంద్రలిఖిత, గురులక్ష్మి, జస్సీలు పలు క్రీడా పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యారు. అక్కడ కూడా సత్తాచాటి అవార్డులు, పతకాలు దక్కించుకున్నారు. గతేడాది ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలతో పాటు విజయవాడ, తెనాలి, ఒంగోలు, కమలాపురం, బాపట్ల, కావలి, ఏలూరులో నిర్వహించిన జాతీయ, రాష్ట్ర స్థాయి రెజ్లింగ్, కబడ్డీ, రగ్బీ, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.. సమన్వయం, సహకారంతోనే పతకాలు... 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రకటించిన క్రీడా ప్రతిభా అవార్డుల ఎంపికలో గొట్లగట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో హెచ్ఎం టి.ఆదినారాయణ, పాఠశాల పూర్వ పీడీ యరగొర్ల బాలగురవయ్యను జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు. డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ సోమా సుబ్బారావు, జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, జిల్లా క్రీడా సమైక్య కార్యదర్శి హజీరాబేగం చేతుల మీదుగా క్రీడా ప్రతిభా అవార్డు, ప్రశంస పత్రం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఆదినారాయణ మాట్లాడుతూ గొట్లగట్టు జెడ్పీ పాఠశాల క్రీడాకారులు ఆటల పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటడానికి అందరి సమన్వయం, సహకారం ఎంతో తోడ్పడ్డాయని తెలిపారు. అందువలనే తమ పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇటీవల బదిలీ అయిన పీడీ బాలగురవయ్య, హెచ్ఎం విజయలక్ష్మి సహకారం అభినందనీయమని అన్నారు. క్రీడా ప్రతిభా అవార్డుల్లో గొట్లగట్టు జెడ్పీ హైస్కూల్‌కు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం కబడ్డీ, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, రగ్బీ, సెపక్తక్రా, అథ్లెటిక్స్ పోటీల్లో రాణించిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సుమారు 60 మంది క్రీడాకారులు -
ప్రతి విభాగంలో లక్ష్యాలు సాధించాలి
● బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలని జిల్లా నూతన కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా నూతన కలెక్టర్‌గా శనివారం బా ధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత వివిధ శాఖల అధికారులను పేరుపేరునా పరిచయం చేసుకున్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న ప్రాధాన్యతా కార్యక్రమాల వివరాలడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు జవాబుదారీగా ముందుకుసాగాలని హితవు పలికారు. నిజా యితీగా, బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని జవాబుదారీతనంతో అర్జీదారులకు సంతృప్తికరమైన పరష్కారం చూపాలని సూచించారు. పరిష్కారం కాని సమస్య అంటూ ఉండదని, ఆ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్రంగా పరిశీలన చేసి పరిష్కార మార్గాలు, సమస్య మూలాలు తెలుసుకుని శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు అధికారులు వివరించారు. సమీక్ష సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో బి.చినఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్దన్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గాలికుంటు వ్యాధిపై అవగాహన పెంచాలి పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధిపై పశుపోషకుల్లో అవగాహన కల్పించాలని నూతన కలెక్టర్ రాజాబాబు సూచించారు. ప్రకాశం భవన్‌లోని తన చాంబర్లో పశుసంవర్థకశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.రవికుమార్‌తో కలిసి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమ పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సుమారు 6,02,250 డోసులు ఉచితంగా వేయనున్నట్లు డాక్టర్ బి.రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యులు డి.సురేంద్రప్రసాద్, పారా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు 8 గొర్రెలు మృతి
పామూరు: పిడుగుపాటుకు 8 గొర్రెలు మృతిచెందిన సంఘటన పామూరు మండలంలోని రేణిమడుగు గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని కొనికి రత్తయ్యకు చెందిన గొర్రెలు దొడ్లో ఉండగా పిడుగు పడింది. దీంతో 8 గొర్రెలు మృతిచెందగా, రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని గొర్రెల యజమాని రత్తయ్య కోరారు. ఒంగోలు, టాస్క్‌ఫోర్స్: నిన్నటిదాకా ఒక లెక్క.. నేడు మరో లెక్క అన్న సినిమా డైలాగులాగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల మత్స్యకారు లు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సోనాబోటుతో కడలూరు బోట్లను తరమికొట్టి విజయగర్వంతో తిరిగివచ్చారు. కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు ప్రాంతానికి చెందిన సోనాబోట్ల కారణంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయారు. కడలూరు బోట్ల కారణంగా లక్షలాది రూపాయల విలువ గల వలలు తెగిపోవటంతో పాటు సముద్రంలో మత్స్యసంపదనంతా నిబంధనలకు విరుద్ధంగా వేటాడుతూ దోచుకుపోతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు మత్య్సకారులే రంగంలోకి దిగారు. తమ సమస్యను తామే పరిష్కరించుకోవడానికి నడుం బిగించారు. ఆ ప్రకారం రెండు జిల్లాల్లోని మత్స్య కారులు మూడు రోజుల పాటు చేపల వేట నిషేధమని మత్స్యకారపాలెంలో దండోరా వేయించి చేపల వేటను బహిష్కరించారు. శుక్రవారం రాత్రి రెండు జిల్లాలకు చెందిన మత్స్యకారులు సుమా రు 80 మంది వరకు హైస్పీడ్ సోనాబోటులో కర్రలు, టపాసులు, ఇతర ఆయుధాలు సమకూర్చుకుని కడలూరు బోట్ల వేట మొదలుపెట్టారు. ఈలోగా సమాచారం అందుకున్న కడలూరు బోట్లు ఈ ప్రాంతంలో వేటాడకుండా కనిపించ నంతదూరం వెళ్లిపోయాయి. శుక్రవారం సాయంత్రం కూడా సింగరాయకొండ మండల పరిధిలోని తీరప్రాంతంలో సుమారు 6 సోనాబోట్లు తీరానికి దగ్గరగా చేపల వేట సాగించాయి. మత్స్యకారులు నెల్లూరు జిల్లా పరిధిలోని సోనా బోటు తీసుకుని బాపట్ల జిల్లా చీరాల మండలంలోని ఓడరేవు వరకు వెళ్లారు. కానీ, వారికి ఒక్క సోనాబోటు కూడా కనబడకుండా జారుకున్నా యి. గతంలో చిన్నబోటుతో చేపల వేటకు వెళితే సముద్రంలో 60 నుంచి 80 వరకు సోనాబోట్లు చేపలవేట సాగిస్తూ మత్స్యసంపద కొల్లగొట్టడంతో పాటు లక్షలాది రూపాయల విలువైన వలలు ధ్వంసం చేసేవని, దీంతో ఆర్థికంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఇవాళ వారిపై సమిష్టిగా దాడికి వెళితే ఒక్క బోటు కూడా లేదని, అన్నీ పరారయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. సముద్రంలో నిబంధన ల ప్రకారం కడలూరు బోట్లు చేపల వేట చేసేంత వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
నయా భూ మాయ..!
కనిగిరి రెవెన్యూలో కనిగిరి రూరల్: కనిగిరి రెవెన్యూ కార్యాలయంలో భూ మాయాజాలం జరుగుతోంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే కొందరు వీఆర్వోలను ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒకరిద్దరు రెవెన్యూ అధికారులను సస్పెండ్ కూడా చేశారు. అయినా అధికార పార్టీ నేత అండతో ఇన్చార్జిగా వచ్చిన ఓ రెవెన్యూ కీలక అధికారి భూముల ఆన్లైన్ అక్రమాలకు తెరలేపి జోరుగా దోచుకుంటున్నాడు. రెవెన్యూ వ్యవస్థపై పట్టు, అవగాహన లేని ముదాంల నుంచి పదోన్నతిపై వీఆర్వోలుగా వచ్చిన వారిని మండలంలో చేర్చుకుని వారికి చిల్లర నజరానాలిస్తూ.. తాను భారీ మొత్తంలో దోచుకుంటూ రెవెన్యూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. నాన్ రిఫండబుల్ ఒప్పందంతో భూ వెబ్‌ల్యాండ్ పోర్ట్ల్లో ఆన్లైన్లో పేర్ల మార్పు, వారసత్వ ధృవీకరణ హక్కు పత్రాలు, పొజిషన్ సర్టిఫికెట్ల మంజూరు వంటి అనేక అక్రమాలకు పాల్పడి లక్షలు దోచుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. రాత్రికిరాత్రే ఆన్లైన్లో పేర్ల మార్పు... కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు అమ్యామ్యాలు తీసుకుని రాత్రికి రాత్రే ఆన్లైన్లో భూ హక్కుదారుల పేర్లు మార్పుచేయడం, అవసరమైతే తొలగించి ఇతరుల కింద పెట్టడం, కొత్త పేర్లు ఎక్కించడం వంటి ప్రక్రియ జోరుగా సాగుతోంది. అందుకు భూమి విలువను బట్టి వీఆర్వోలు, అవసరమైతే నేరుగా కీలక రెవెన్యూ అధికారే డీల్ కుదుర్చుకుంటున్నాడు. అందిన సమాచారం మేరకు.. కనిగిరి మండలం చల్లగిరిగిల్ల రెవెన్యూ పరిధిలోని రెండు సర్వే నంబర్లకు సంబంధించి 20 ఎకరాల్లో సుమారు 15 మంది రైతులు సాగులో ఉన్నారు. ఆ రైతులు గతంలో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే, ఆ భూమిని సుమారు 25 ఏళ్ల క్రితం అమ్మిన వ్యక్తుల పేర్లు ఇంకా ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్నట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకుని చల్లగిరిగిల్ల రెవెన్యూ పరిధిలో టుబాకో బోర్డు వెనుక గల సుమారు 25 ఎకరాలు, 2 సర్వే నంబర్లకు చెందిన 9 ఎకరాలు, 16 ఎకరాల భూమిని ఐదుగురి పేర్లతో ఆన్లైన్ చేశారు. ఈ అక్రమ తంతులో సుమారు రూ.25 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. గుప్పుమన్నదిలా... సుమారు 20 రోజుల క్రితం జరిగిన ఈ అక్రమ ఆన్లైన్ తంతు విషయాన్ని నాలుగు రోజుల క్రితం రైతులు పసిగట్టారు. వెంటనే రెవెన్యూ కార్యాలయంలోని కీలక అధికారిని ప్రశ్నించారు. తగురీతిలో స్పందన లేకపోవడంతో గతంలో లోకేష్ టీంలో పనిచేసి ప్రస్తుతం సీఎంఓలో ఉంటూ ఓ ఎమ్మెల్యేకు పీఏగా వ్యవహరిస్తున్న కనిగిరి మండలానికి చెందిన వ్యక్తి నేరుగా కనిగిరి రెవెన్యూ కీలక అధికారికి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో కంగుతిన్న ఆ కీలక అధికారి రాత్రికి రాత్రి తిరిగి వెబ్‌ల్యాండ్ పోర్టల్‌లో ఆన్లైన్లో ఎక్కించిన పేర్లను తొలగించినట్లు సమాచారం. అంతేగాకుండా చల్లగిరిగిల్లకు చెందిన కొందరి వ్యక్తుల పేర్లను ఒక సర్వే నంబర్లో రాత్రికి రాత్రి ఎక్కించి, మరో నంబర్లో ఇంకొందరి పేర్లు ఎక్కించనున్నట్లు తెలిసింది. ఇవి కాకుండా ఇటీవల కలగట్ల రూట్లో ఓ యువ న్యాయవాదికి సంబంధించిన భూమిని కూడా మరొకరి పేరుపై ఆన్లైన్ చేసినట్లు, పేరంగుడిపల్లికి చెందిన ఓ కళాశాలకు చెందిన వ్యక్తి భూమిని మరొకరి పేరుపై ఆన్లైన్ చేసినట్లు, పునుగోడు రెవెన్యూ పరిధిలోని కొందరి భూములను అక్రమంగా మరికొందరి పేర్లపై ఆన్లైన్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు బాధితులు నేరుగా రెండ్రోజుల క్రితం గత కలెక్టర్ తమీమ్ అన్సారియాకు, జేసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నాన్‌రిఫండబుల్ ప్రక్రియపై పెద్ద ఎత్తున చర్చ... భూముల రేటును బట్టి మాకు రేటు కడితే ఏమైనా చేస్తామని రెవెన్యూ కీలక అధికారి నేరుగా దందా చేస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ నమోదు, పేర్ల మార్పిడి, వారసత్వపు భూములు ఆన్లైన్ చేయడం.. ఇలా ఒక్కోదానికి ఒక్కోరేటు పెట్టినట్లు తెలిసింది. ఎక్కడైనా భూముల వివాదాలపై ఫిర్యాదులొస్తే అక్కడికి తన సిబ్బందిని పంపించడం, వివాదంలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంటే ఓ రేటు.. లేకపోతే మరో రేటు నిర్ణయించడం, కింది స్థాయి అధికారులతో బేరం సాగించడం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల బల్లిపల్లిలో పంచాయతీలో ఓ రహదారి విషయం తమకు న్యాయం జరగడం లేదని బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక అధికారి నాన్‌రిఫండబుల్ విధానం పాటిస్తూ.. అందుకు ఇష్టపడిన వారితోనే దందా సాగించడం గమనార్హం. మీకు కావాల్సింది నేను చేస్తా.. అధికార పార్టీ నుంచి వత్తిడి వచ్చినా.. పైఅధికారులు విచారణ చేసినా.. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే రద్దు చేస్తా.. ఆన్లైన్ నుంచి పేర్లు కూడా తొలగిస్తా.. అయితే, మీరు ఇచ్చిన నగదును రిటన్ చేయను.. దానికి ఇష్టపడితేనే పనిచేస్తా.. అంటూ ముందే ఒప్పందం కుదుర్చుకోవడంతో బాధితులు బయటకు చెప్పుకోలేని దుస్థితి నెలకొంది. ఈ నాన్‌రిఫండబుల్ ప్రక్రియపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నాన్‌రిఫండబుల్ ఒప్పందంతో ఆన్లైన్ అక్రమాలు చల్లగిరిగిల్లకు చెందిన 25 ఎకరాల భూమికి ఆన్లైన్లో పేర్ల మార్పు లోకేష్ టీం వ్యక్తి ఫోన్‌తో తిరిగి పేర్ల తొలగింపు రెవెన్యూ కీలక అధికారి అక్రమాలపై కలెక్టర్‌కు పలువురి ఫిర్యాదు అధికారం అండతో ఇన్చార్జిగా కొనసాగుతున్న వైనం? వీఆర్వోకు రూపాయి.. కీలక అధికారికి వంద..! కనిగిరి మున్సిపాలిటీతో పాటు మండలంలోని 15 పంచాయతీలకు సుమారు 32 (అర్బన్ 12, రూరల్ 20) మంది వీఆర్వోలు ఉన్నారు. 16 మంది మాత్రమే వీఆర్వోలు ఉన్నారు. మిగతా రెవెన్యూ విలేజ్ అంతటికి ఇన్‌చార్జిలే. అందులో నేరుగా వీఆర్వోలుగా వచ్చిన వారు 5 లేదా 6 మంది మాత్రమే ఉండగా.. మిగతా వారంతా ముదాంలుగా ఉండి పదోన్నతులు పొందిన వారే కావడం విశేషం. వీరికి సరైన అవగాహన ఉండకపోవడంతో ప్రధాన రెవెన్యూ గ్రామాల్లో వీరిని ఇన్చార్జిలుగా పెట్టుకుని కీలక అధికారి కనుసన్నల్లో నడిపిస్తూ జోరుగా అక్రమ దందా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
నల్లమలలో గుండ్లకమ్మ ఉధృతం
రాచర్ల: గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా గుండ్లకమ్మ పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శనివారం నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులకు నిరాశ ఎదురైంది. భారీ వర్షాలతో గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలతో పాటు దేవస్థానం సమీపంలోని నీటి గుండం వద్ద భక్తులు స్నానాలు చేయకుండా దేవస్థానం సిబ్బంది, పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. కొండ చెరియలు విరిగిపడటంతో దర్శనం నిలిపివేత: ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్ష్మమ్మవనం నుంచి నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానం వెళ్లే మార్గంలో శనివారం మధ్యాహ్నం 11:50 గంటల సమయంలో కొండ చెరియలు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామి దర్శనం పూర్తిగా నిలిపేసినట్లుగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య తెలిపారు. -
ఆక్రముంచేశారు!
సాగు, తాగు నీరందించే సాగర్ కాలువ అడుగడుగునా ఆక్రమణలకు గురైంది. చాలా ప్రాంతాల్లో కాలువ కుంచించుకుపోవడంతో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. ఫలితంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు అడ్డగోలుగా ఆక్రమించేస్తున్నాయి. ఇదంతా తెలిసినా ఇరిగేషన్ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణలపై తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనైనా అధికారుల్లో చలనం వస్తుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కారుమంచి కాలువకట్టపై గ్రానైట్రాళ్ళతో వెళ్తున్న ట్రాలీలు(ఫైల్) చీమకుర్తి: సాగర్ జలాలు జిల్లాకు ప్రధాన నీటి వనరు. త్రిపురాంతకం వద్ద సాగర్ జలాలు జిల్లాలోకి అడుగిడుతాయి. అక్కడ నుంచి దొనకొండ, కురిచేడు, దర్శి, చీమకుర్తి, సంతనూతలపాడు మీదుగా రామతీర్థం చేరుతాయి. అక్కడ నుంచి ఒంగోలు నగరానికి, కిందన వెయ్యి ఎకరాలకు సాగు నీరు సరఫరా అవుతుంది. ఇంత కీలకంగా ఉన్న కాలువపై అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రధానంగా చీమకుర్తి మండల పరిధిలో ఉన్న పలు గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడ్డారు. సంబంధిత అధికారులకు మామూళ్లు ముట్టజెబుతుండడంతో అటువైపు కన్నెత్తి చూడడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీస్ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు కన్నెర్ర చేసింది. నాలుగు రోజుల కిందట క్వారీ యజమానులకు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాలలోగా సమాధానమివ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఆక్రమణలు ఇలా.. రామతీర్థం సమీపంలోని నల్లకొండ నుంచి వర్షం నీరు, పైనున్న ఓబీసీ కాలువ నుంచి సాగర్ మేజర్లు కర్నూల్‌రోడ్డును దాటుకొని హంస మినరల్స్, జయమినరల్స్, ఎన్వీ ఎక్స్‌పోర్ట్‌ల పరిధిలోని దాదాపు 18 ఎకరాల పరిధిలో సాగర్ కాలువలను ఆక్రమించుకోవడం ద్వారా ఆయా కాలువలకు దిగువనున్న బూదవాడ, ఆర్.ఎల్.పురం, మైలవరం, చినరావిపాడు గ్రామాల వైపు సాగరు నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. హైకోర్టులో పిల్ వేయటంతో ఆ మూడు క్వారీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానీ ఆ మూడు క్వారీలకు దిగువనున్న పలు గ్రానైట్ క్వారీల వారు సాగర్ కాలువలతో పాటు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన సహజ వాగులను ఆక్రమించుకొని డంపింగ్‌లు, గ్రానైట్ క్వారీలు, వేస్ట్ రాళ్లతో ఆక్రమించేయడంతో సాగునీటి ప్రవాహానికి తీవ్రంగా ఆటంకం కలుగుతోంది. బూదవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 106/1,2,3 లలో 10.74 ఎకరాలు, అలాగే సర్వే నంబర్లు 107, 108లో 6.61 ఎకరాలు, ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని 66/1, 67/1ఏ, 67/2, 67/2బీ, 69/2, 70/2, 70/3 లలో 0.82 ఎకరాలు మొత్తం కలిపి 18.71 ఎకరాల ప్రభుత్వ భూమిలోని సాగర్ కాలువలు, వాగులను ఆక్రమించుకున్నట్లు హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. ఇవే కాకుండా రామతీర్థం పరిధిలోని నల్లకొండ నుంచి వచ్చే వర్షపు నీరు, సాగర్ కాలువలలోని వరద వృథా నీరు అంతా కలిసి ఆర్.ఎల్.పురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 24, 23, 14, 15, 16లలోని రామతీర్థం ఆలయం దేవుడి మాన్యం, పోకర్ణా గ్రానైట్ క్వారీల పరిధిలో నుంచి కర్నూల్ రోడ్డును దాటి బూదవాడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 10, 105, 106, 107, 108, 109 మీదుగా బూదవాడ చెరువు సర్వేనంబర్ 110లోకి వచ్చి చేరుతాయి. ఈ మధ్యలో పోకర్ణా గ్రానైట్ యాజమాన్యం కూడా వాగునీటి ప్రవాహాన్ని అడ్డుకొని ఆక్రమించుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు రోడ్డు దాటిన తర్వాత బూదవాడ చెరువులోకి పోయే ప్రవాహాన్ని జయమినరల్స్, హంస గ్రానైట్ యాజమాన్యం ఆక్రమించుకున్నాయి. సాగు, తాగునీటి సరఫరాకు ఆటంకం ఇలా సహజ సిద్ధంగా ప్రవహించే వాగులను, ప్రభుత్వం రైతుల పంటల సాగుకు నీటిని అందించే సాగర్ కాలువలను గ్రానైట్ యజమానులు ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటే ఇరిగేషన్ అధికారులకు ఇవేమీ పట్టనట్లుగా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు బ్రాంచ్ కెనాల్ నుంచి కారుమంచి కాలువ ద్వారా సుమారు 30–40 గ్రామాలకు సాగు, తాగునీరు సరఫరా అవుతుంది. కూనంనేనివారిపాలెం, గోనుగుంట, మువ్వవారిపాలెం, ఎనికపాడు, మద్దులూరు ద్వారా చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లోని పలు గ్రామాలకు కారుమంచి కాలువ ద్వారా 119 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దానిని మధుకాన్ గ్రానైట్ యాజమాన్యం బఫర్ జోన్ నిబంధనలకు తిలోదకాలిచ్చి కారుమంచి కాలువ ఒడ్డు సమీపం వరకు తవ్వుకోవడం వలన కాలువ ఒడ్డు విరిగి మధుకాన్ క్వారీలో పడింది. దాని ఫలితంగా దిగువనున్న 30కు పైగా గ్రామాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. ఆయా గ్రామాల ప్రజలు, పశువుల తాగునీటి అవసరాలకు ఉపయోగించే చెరువులకు కారుమంచి నుంచి సక్రమంగా నీటిని అందించటంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గ్రానైట్ రాళ్లతో ఇష్టం వచ్చినట్లు పెద్దపెద్ద ట్రాలీలు కారుమంచి కాలువ కట్ట మీద తిరుగుతున్నా మామూళ్లు మత్తులో జోగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. చీమకుర్తి ఇరిగేషన్ డివిజన్, సబ్‌డివిజన్‌కు సంబంధించిన అధికారులందరూ చీమకుర్తిలోనే ఉంటున్నా వారికేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. హైకోర్టు ఆగ్రహించడంతో ఇరిగేషన్, మైన్స్ అధికారులు ఎలా స్పందిస్తారోనని స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
సమన్వయంతో ముందుకెళతా
ఒంగోలు సబర్బన్: ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ప్రకాశం జిల్లా 39వ కలెక్టరుగా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ముందుగా కుటుంబ సమేతంగా ఎన్ఎస్పీ గెస్ట్‌హౌస్‌కు వచ్చిన కలెక్టరుకు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్వో బి.చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య కలెక్టరుగా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై తాను దృష్టి సారిస్తానని కలెక్టర్ అన్నారు. అనంతరం పలువురు జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. -
జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
ఒంగోలు టౌన్: జిల్లా ఎస్పీగా వి.హర్షవర్థన్ రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన విజయవాడ డీసీపీగా, సీఐడీ ఎస్పీగా పనిచేశారు. అన్నమయ్య జిల్లా తొలి ఎస్పీగా చేశారు. నెల్లూరు జిల్లా కావలి గ్రామానికి చెందిన హర్షవర్థన్ జేఎన్టీయూసీలో బీటెక్ చేశారు. ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన ఏఆర్ దామోదర్‌ను విజయనగరం బదిలీ చేశారు. ఒంగోలు సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 11వ తరగతిలో చేరేందుకు అడ్మిషన్లకు దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారని ప్రిన్సిపల్ సి.శివరాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు జవహర్ నవోదయ పాఠశాలలో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే పూర్తి వివరాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ ఆఫీస్‌లో సంప్రదించాలని, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 23 వరకు గడువు పెంచారని తెలిపారు. వివరాలకు 77802 08733 నంబరును సంప్రదించాలని కోరారు. ఒంగోలు: జిల్లావ్యాప్తంగా 25 బెంచీలలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో శనివారం 6729 కుపైగా కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి తెలిపారు. 167 సివిల్, 6558 క్రిమినల్ వ్యాజ్యాలతోపాటు ప్రీలిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కరించారన్నారు. మోటారు వాహన ప్రమాద బీమా కేసుల్లో, కొన్ని ఇతర రకాల కేసుల్లో దాదాపుగా రూ.2 కోట్లు పరిష్కారం రూపంలో చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సహకరించిన న్యాయవాదులకు, పోలీసువారికి, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులకు, బ్యాంకు అధికారులకు, బీమా అధికారులకు న్యాయసేవాధికార సంస్థ తరఫున జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.భారతి అభినందనలు తెలిపారు. ఒంగోలు సిటీ: 12వ వేతన సంఘాన్ని నియమించి, 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ డిమాండ్ చేశారు. శనివారం ఒంగోలు వీఐపీ రోడ్డులోని ప్రధానోపాధ్యాయుల భవనంలో బీటీఏ ఒంగోలు జిల్లా కార్యవర్గ సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కె.దేవసహాయం అధ్యక్షతన, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకటరావు మాట్లాడుతూ 11వ పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మాధవరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల మీద యాప్ ల భారం ఎక్కువైందని, దాని వలన బోధన కుంటుపడిందని, ప్రభుత్వం వెంటనే యాప్ ల భారం తగ్గించి బోధనపై దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జాలరామయ్య, రాష్ట్ర కార్యదర్శి యం.శరత్ చంద్ర బాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్నాథం ప్రసాదరావు, జిల్లా కోశాధికారి గంటనపల్లి శ్రీనివాసులు, జిల్లా ప్రచార కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, జిల్లా నాయకులు గాలిమోటు భాస్కరరావు, బొంత కళ్యాణ్, నూకతోటి కుమార్ స్వామి, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియా శనగలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఒంగోలు టౌన్: శనగల దిగుమతులపై ఉన్న 30 శాతం సుంకాన్ని మోదీ ప్రభుత్వం ఎత్తివేయడంతో దేశంలోకి లక్ష టన్నుల శనగలు దిగుమతి అయ్యాయని, దాంతో దేశ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి చెప్పారు. స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని ఇటీవల ప్రధాని మోదీ ఇచ్చిన మాటకు ఆయనే తూట్లు పొడిచారన్నారు. ఫలితంగా నిన్నటి దాకా క్వింటా శనగలు రూ.10 వేలకు కొనుగోలు చేశారని, ఇప్పుడు కేవలం రూ.6 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో శనివారం రైతు సంఘాల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన దేశ రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేసి కార్పొరేట్లకు లాభాలు తెచ్చేలా దిగుమతి సుంకాలు ఎత్తివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించలేని దుస్థితిలో ఉందన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా శనగలు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతులను ఆదుకుంటామని పత్రికా ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణలో అలాంటిదేమీ లేదన్నారు. రైతుల వద్ద ఉన్న పంటలను కొనుగోలు చేసేంత వరకు రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం శనగ పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శనగ పండించే గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించిన మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలకు వినతి పత్రాలను అందజేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశానికి రైతు నాయకులు వడ్డే హనుమారెడ్డి అధ్యక్షత వహించగా దేవరపల్లి సుబ్బారెడ్డి, బి.సుబ్బారావు, మహేష్, టీవీ శేషయ్య, సీహెచ్ వాసు, ఆంజనేయులు, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కులు కావాలా.. చెప్పినట్లు చేయాల్సిందే!
కొమరోలు: ప్రాక్టికల్స్, పరీక్షల్లో మార్కుల నెపంతో అధ్యాపకులు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించడం, బాలురతో మద్యం సీసాలు తెప్పించుకోవడం, నగదు వసూలు చేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్, సబ్ కలెక్టర్, విలేకరులకు లేఖల రూపంలో మొరపెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొంతమంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న బైపీసీ విద్యార్థినులకు జరుగుతున్న ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయాలంటే తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు గురిచేస్తున్నట్టు లేఖలో ఆరోపించారు. బాలురు అయితే మద్యం బాటిళ్లు, నగదు ఇవ్వాల్సిందేనని తేల్చిచెబుతున్నట్లు వాపోయారు. పబ్లిక్ పరీక్షల సమయంలోనూ అధ్యాపకులకు చేయి తడపాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఈ పరిణామాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి తీవ్రగాయాలు
పెద్దదోర్నాల/కొనకనమిట్ల: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం చోటుచేసుకున్న రెండు ప్రమాదాల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దదోర్నాల మండలంలో కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిలోని కొర్రప్రోలు ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో ఆటో ఆదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గుడ్డెపోగు రమేష్, జీనేపల్లి హరిశ్చంద్రప్రసాద్, వెంకటేశంకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఎండు కట్టెల కోసం నల్లగుంట్ల నుంచి పెద్ద మంతనాల వైపు ఆటోలో వెళ్తుండగా కొర్రప్రోలు చెక్ పోస్టు సమీపంలో బోల్తా పడింది. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన యువకులు తలకు తీవ్ర గాయమైన వెంకటేశంను గుంటూరు తరలించగా, మిగిలిన ఇద్దరిని 108 అంబులెన్స్‌లో పెద్దదోర్నాల ఆస్పత్రిలో చేర్చారు. వీరిని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పోలీసులు పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీని ఢీకొట్టిన బైక్ పొదిలి బెస్తపాలేనికి చెందిన పెరమసాని మల్లికార్జున కొనకనమిట్ల మండలం గనివానిపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయనకు ఇటీవల గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శిగా ప్రమోషన్ దక్కింది. ఈ నేపథ్యంలో కనిగిరి మండలంలో కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్న పంచాయతీల వివరాలు తెలుసుకునేందుకు శుక్రవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో చినారికట్ల జంక్షన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని చీకట్లో గమనించక వెనక భాగంలో ఢీకొట్టారు. బైక్ నుంచి ఎగిరి కింద పడిన మల్లికార్జున తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించినట్లు మల్లికార్జున బంధువులు తెలిపారు. -
నకిలీ వలలో గెలగిల!
త్రిపురాంతకం: అరటి సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరైపోయాయి. నకిలీ కాటుకు రైతులు ఆర్థికంగా బలయ్యారు. అరటి చెట్లు ఏపుగా పెరిగినా దిగుబడి రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురాంతకం మండలంలో రైతులు గత ఏడాది కాలంగా అరటి తోటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. గతంలో మిరప, వరి, ఇతర పంటలను సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అరటి సాగుపై దృష్టి సారించారు. మండలంలో సుమారు 150 ఎకరాల వరకు అరటి తోటలు సాగవుతుండగా ముందస్తుగా నాటిన తోటలు కాపుదశకు చేరుకున్నాయి. ఏపుగా పెరిగిన అరటి చెట్లను చూసి ఆనందించిన రైతులు.. రోజులు గడుస్తున్నా అరటి గెలలు కాయకపోతుండటంతో ఆందోళనకు గురయ్యారు. సోమేపల్లి, శ్రీనివాసనగర్, మిరియంపల్లి, వెల్లంపల్లి గ్రామాల్లో సాగు చేసిన 15 ఎకరాల తోటల్లో ఒకటీ అరా గెలలు తప్ప పూర్తి స్థాయిలో కాపు రాలేదు. పంట చేతికొస్తే పెట్టుబడి సొమ్ము రూ.2 లక్షలకు పైగా పోను ఎకరాకు కనీసం రూ.2 లక్షల లాభం వస్తుందని ఆశించిన రైతులు.. ప్రస్తుత పరిస్థితి చూసి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అరటికి ఈ క్రాప్ చేయించామని, పంట నష్ట పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి ఒక్కో అరటి మొక్కను రూ.12 నుంచి రూ.15 వరకు వెచ్చించి కొనుగోలు చేసిన రైతులు ఎకరాకు 1200 నుంచి 1400 మొక్కలు నాటారు. మొక్కలకు అవసరమైన గెడలు, సేద్యం ఖర్చులు, ఎరువులు, కూలీల ఖర్చు ఇలా మొత్తం రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట రాకపోతే నేనేం చేస్తా? పది నెలల క్రితం సాగు చేసిన అరటి మొక్కలు ప్రస్తుతం 12 అడుగుల వరకు పెరిగాయి. గెలలు వస్తాయని ఎదురుచూస్తున్న రైతులు ఇటీవల అనుమానం రావడంతో ఉద్యానశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తోటలను పరిశీలించిన అధికారులు అరటి మొక్కలకు కాపురాదని చెప్పడంతో రైతులు విస్తుపోయారు. ‘నర్సరీ యజమాని మంచి కాపు వస్తుందని చెప్పడంతో వాటిని ఎంపిక చేసుకుని అందించా. ఫలసాయం రాకపోతే నేనేం చేస్తా’ అని దళారి మాట దాటవేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 150 ఎకరాల్లో అరటి సాగు తోటలు ఏపుగా పెరిగినా దిగుబడి రాకపోవడంతో ఆందోళన ఎకరాకు రూ.3 లక్షలు నష్టపోయామని రైతుల ఆవేదన మొక్కలు విక్రయించిన దళారి చేతులెత్తేసిన వైనం నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి -
కుమార్తె మృతిపై తల్లి అనుమానం
కంభం: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో అనారోగ్యంతో చికిత్సపొందుతూ తెలుగు వీధికి చెందిన మోదులార్ సుమతి(35) మృతి చెందింది. కుమార్తె మృతిపై అనుమానం ఉందని తల్లి సుశీల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్లున్నట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. మృతురాలికి భర్త రాముడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్కాపురం: మార్కాపురం అటవీ శాఖ నూతన డిప్యూటీ డైరెక్టర్ గా అబ్దుల్ రావుఫ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ డీఎఫ్ఓగా పనిచేస్తూ బదిలీపై మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన సందీప్ కృపాకర్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఈయనను డీఆర్ఓ పిచ్చిరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజుగౌడ్, సిబ్బంది కలిసి అభినందించారు. ఒంగోలు టౌన్: ౖరెల్వే స్టేషన్లలో సెల్ఫోన్లను దొంగలిస్తున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. వేటపాలెం గ్రామానికి చెందిన ఆసాది చంగల్రావు గత కొంతకాలంగా సెల్ఫోన్లను దొంగలిస్తున్నాడు. రైలు ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను తస్కరిస్తున్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జీఆర్పీ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. శుక్రవారం చంగల్రావును అదపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.1.49 లక్షల విలువైన 12 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐ కొండయ్య, జీఆర్పీ ఎస్సై కె.మధుసూదన్‌రావు పాల్గొన్నారు. కొత్తపట్నం: మండలంలోని వజ్జిరెడ్డిపాలెం గ్రామ పరిధిలో ఇద్దరు బాలికలపై పెదనాన్న వరుసయ్యే దొడ్ల వీరారెడ్డి అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదైంది. శుక్రవారం ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్ వజ్జిరెడ్డిపాలెం గ్రామంలో విచారణ చేపట్టారు. నిందితుడు వీరారెడ్డి ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను, స్థానికులను విచారించారు. అదే విధంగా బాలికల తల్లిదండ్రులను పరామర్శించి చట్టపరంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట కొత్తపట్నం ఎస్సై వేముల సుధాకర్‌బాబు, సిబ్బంది ఉన్నారు. చీమకుర్తి రూరల్: మండలంలోని గోనుగుంట–గుండువారి లక్ష్మీపురం గ్రామాల మధ్య కారుమంచి సాగర్ కాలువ పక్కన పొలంలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, సిమెంట్ రంగు నెక్ టీషర్ట్, లేత నీలం రంగు షార్ట్ ధరించి ఉన్నాడని సీఐ సుబ్బారావు తెలిపారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు 9121104179, 9121102113ని సంప్రదించాలని సూచించారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఒంగోలు టౌన్: ఒంగోలు శ్రీనగర్ కాలనీ గణేశ్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటకు సంబంధించి అక్రమ కేసులో అరెస్టయి జిల్లా జైల్లో ఉన్న ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఆ పార్టీ నేతలు శుక్రవారం పరామర్శించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు తదితరులు శుక్రవారం ములాఖత్ ద్వారా జైలులో ఉన్న పార్టీ కార్యకర్తలను కలిసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జైలు వెలుపల ఉన్న వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావుపాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి, తాటిపర్తి, ఒంగోలు ఇన్చార్జి చుండూరి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలకు పరామర్శ బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బత్తుల బ్రహ్మానందారెడ్డి తదితరులు -
మద్యం మత్తులో బీర్‌బాటిల్‌తో దాడి
ఒంగోలు టౌన్: పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మరో యువకుడిపై బీట్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం ఒంగోలు నగరంలోని కల్యాణి బార్ అండ్ రెస్టారెంట్లో చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెళ్లూరుకు చెందిన కోణంకి అయ్యప్ప శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి మద్యం సేవించేందుకు నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని కళ్యాణి బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చాడు. అప్పటికే బార్లో నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన షేక్ అనిల్ మద్యం తాగుతున్నాడు. పూటుగా తాగిన మత్తులో ఉన్న అనిల్ విచక్షణ కోల్పోయాడు. చేతిలోని బీర్ బాటిల్ పగలగొట్టి పక్కన గున్న అయ్యప్ప మీద దాడి చేశాడు. అయ్యప్పకు గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. భార్యతో మనస్పర్ధల కారణంగా గత కొంతకాలంగా అనిల్ చిత్తుగా తాగి తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంకొల్లు(చినగంజాం): ఇంకొల్లు– పావులూరు రోడ్డులో నాగులు చెరువు కట్టపై ఉన్న సుమారు వందేళ్ల నాటి భారీ మర్రి చెట్టు కొమ్మలు శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా విరిగి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై చెట్టు కొమ్మలు విరిగి పడటంతో సాయంత్రం మూడు గంటల నుంచి ట్రాఫిక్ స్తంభించింది. పంచాయతీ కార్యదర్శి అడ్డగడ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెట్టు కొమ్మలను తొలగించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
ఉప్పలపాడులో టీడీపీ నేతల దుశ్చర్య
పొదిలి రూరల్: అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో టీడీపీ కార్యకర్తలు దుశ్చర్యకు ఒడిగట్టారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ అక్రమ కేసులు బనాయించే కుట్రలకు తెరదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి మండలంలోని ఉప్పలపాడులో సర్పంచ్ గుంటూరి ఏసోబు, పంచాయతీ కార్యదర్శి శేషగిరి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేస్తున్నారు. జేసీబీతో ఆక్రమణలు తొలగించి, కాలువ పుడీకతీత పనులు చేసే క్రమంలో అప్పటికే శిథిలావస్థలో ఉన్న టీడీపీ జెండా దిమ్మె పగిలిపోయింది. స్థానిక టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో పొరపాటున తగిలిందని చెప్పి హుటాహుటిన నూతన దిమ్మె నిర్మించారు. అయితే దీనికి టీడీపీ నేత, ఉప్పలపాడు సొసైటీ అధ్యక్షుడు ఉలవా గోపి రాజకీయాలు ఆపాదించాడు. మద్యం మత్తులో ఉన్న టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పడంతో కొమ్ము లక్ష్మీనారాయణ, గుంటూరి బ్రహ్మయ్యతోపాటు మరికొందరు కలిసి గురువారం అర్ధరాత్రి వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను గడ్డపారలతో ధ్వంసం చేశారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించిన వారిని శ్రీపగలగొడతాం. ఏం చేసుకుంటారో చేసుకోండిశ్రీ అంటూ వెళ్లిపోయారు. దీనిపై శుక్రవారం ఉదయం గ్రామంలో ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన పెద్దలు కొందరు తమవాళ్లదే తప్పని అంగీకరించడంతోపాటు వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను కట్టిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమనిగింది. వైఎస్సార్ సీపీ జెండా దిమ్మె ధ్వంసం -
ఎడిటర్ మీద కేసులు సహేతుకం కాదు
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రమాదకరంగా పరిణమించేలా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను విశ్లేషిస్తూ వార్తలు రాయడం నేరమైతే ఇక ప్రజాస్వామ్యం ఏముంటుంది. ప్రశ్నించే నైజాన్ని సహించలేకపోవడం దేనికి సంకేతం. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. ‘సాక్షి’పై కేసులను ఎత్తివేయాలి. పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలి. – తోటా సుధారాణి, న్యాయవాది, ఒంగోలు బార్ అసోసియేషన్ మహిళా రిప్రజెంటేటివ్ -
అధిక ఫీజు వసూలుపై విద్యార్థుల ఆందోళన
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని గౌతమి డిగ్రీ కళాశాల యాజమాన్యం తమ వద్ద అధికంగా పరీక్ష ఫీజు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శుక్రవారం కళాశాల నుంచి మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. యూనివర్శిటీ నిర్ణయించిన విధంగా పరీక్ష ఫీజు ఒకే విధంగా ఉండాలని, కళాశాలలో మాత్రం అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మిగిలిన ఫీజులు కూడా చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంటుతో తమకు సంబంధం లేదని, కళాశాల సిబ్బంది చెప్పారని, దీంతో 3, 5వ సెమిస్టర్ ఫీజులతోపాటు కళాశాల పీజు కూడా కట్టాలని బలవంతం చేస్తున్నారన్నారు. 3వ సెమిస్టర్ ఫీజు ప్రభుత్వం నుంచి జమ అయినప్పటికీ తమ వద్ద మళ్లీ ఫీజులు వసూలు చేస్తున్నారని, దీంతో తాము ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత -
20, 21న అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర మహాసభలు
ఒంగోలు టౌన్: ఈ నెల 20, 21 తేదీల్లో ఒంగోలులో నగరంలోని కాపుకళ్యాణ మండపంలో నిర్వహించే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర 11వ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీలు, హెల్పర్లకు ఉద్యోగ భద్రతలేకుండా పోయిందని చెప్పారు. సుప్రీం కోర్టు సైతం అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించినట్లు గుర్తు చేశారు. మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నా అంగన్వాడీలకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి నిధులు పెంచకుండా, ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి వేతనాలు పెంచలేదని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పాలకులు ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంగన్వాడీల అభివృద్ధికి తగినంతగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈదర అన్నపూర్ణ, ఎం.రమేష్, ఎన్.ధనలక్ష్మి, బి.శేషమ్మ, సుబ్బమ్మ, కె.మున్నా తదితరులు పాల్గొన్నారు. -
3 వేల పెన్షన్లు కావాలనే కక్షపూరితంగా తీసేశారు: దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
3 వేల పెన్షన్లు కావాలనే కక్షపూరితంగా తీసేశారని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు కొత్త రీవెరిఫికేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, సదరన్ క్యాంపులు మండలాల వారీగా, జిల్లా వారీగా, నియోజకవర్గాల వారీగా పెడతారా అని డీఎంఅండ్‌హెచ్‌ఓను ప్రశ్నించారు. నియోజకవర్గాల వారీగా సదరమ్ క్యాంపులు పెట్టేటప్పుడు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలన్నారు. అధికారులు పదిహేను రోజుల ముందుగా నోటీసుబోర్డులో పెడితే తమ పరిధిలోని పింఛన్లు ఇప్పించుకోవడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త వితంతువు పింఛను కూడా ఇవ్వలేదని అధికారులే చెబుతున్నారన్నారు. మలేరియా, డెంగీ జ్వరాల బారిన పడినవారి ఎటువంటి చర్యలు చేపడుతున్నారో అధికారులు తెలియజేయాలన్నారు. విద్యుత్ పోల్స్ వచ్చినప్పుడు కండెక్టర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కండెక్టర్లను ఎవరు అమ్ముకున్నారో చెప్పాలని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వాడితే ఫ్రీ ఉందా లేదా అని ప్రశ్నించారు. మోటుపల్లి ఒక చిన్న గుడిసెలో ఉంటున్న పేదవారిని విద్యుత్ బకాయి రూ.7 వేలు ఉంది కట్టాలంటూ ఇబ్బంది పెడుతున్నారని, దీనిని పరిశీలించాలని విద్యుత్ అధికారులను కోరారు. రైతులకు కావాల్సినంత డీఏపీ, యూరియా సరఫరా చేయాలని కోరారు. బ్లాక్ మార్కెట్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
అన్నీ ఏకపక్ష తీర్మానాలే
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అన్నీ ఏకపక్ష తీర్మానాలే జరిగిపోయాయి. ప్రజా వ్యతిరేక తీర్మానాలపై వైఎస్సార్ సీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలినా చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగా ఉంది తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచనే కూటమి సభ్యులు చేయలేదు. శుక్రవారం ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం ఇన్చార్జ్ మేయర్ వేమూరి సూర్య నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో 64 అంశాలను ఆమోదానికి పెట్టారు. వాటిలో సగానికి పైగా ముందస్తు అనుమతులుగా పెట్టుకున్నవే. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయకుండా రూ.కోట్ల అభివృద్ధి పనులు మేయర్ ముందస్తుగా ఆమోదిస్తే వాటిని కౌన్సిల్ ఆమోదానికి పెట్టారు. దీనిపై వైఎస్సార్ సీపీ సభ్యులు గళమెత్తారు. అయినా లెక్క చేయకుండా మంద బలంతో అన్నింటినీ ఆమోదం చేసుకున్నారు. ట్రంకు రోడ్డు, ముస్లిం బరియల్ గ్రౌండ్ విషయంలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ అడుగడుగునా అడ్డుతగిలారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు వైఎస్సార్ సీపీ కో ఆప్షన్ సభ్యురాలు రషీదా కూడా ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ గళం వినిపించారు. ఇరువురూ కలిసి రెండు సార్లు టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గొంతెత్తి నిలదీశారు. ముస్లిం బరియల్ గ్రౌండ్ విషయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.. ఒంగోలు అర్బన్ తహశీల్దార్ పిన్నిక మధుసూదన్ రావును కౌన్సిల్ సమావేశానికి హుటాహుటిన పిలిపించారు. ముస్లిం బరియల్ గ్రౌండ్‌కు కమ్మపాలెం తరువాత దశరాజుపల్లి రోడ్డు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలం కాకుండా ముక్తినూతలపాడు రోడ్డులో మూడు ఎకరాలు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే కౌన్సిల్లో ప్రకటించారు. దాంతో వైఎస్సార్ సీపీతో పాటు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీకి చెందిన జనసేన నాయకుడు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు కూడా ఆ స్థలం విషయంలో అడ్డుతగిలారు. అయినా తహశీల్దార్ పిన్నిక మధుసూదనరావు కుంట పోరంబోకులో మెరక ఉంది దానిని కేటాయిస్తున్నామన్నారు. కన్వర్షన్ లేకుండా ఏవిధంగా కేటాయిస్తారు...అందుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని అడిగినా సమాధానం లేకుండా పోయింది. దాంతో పాటు యాదవ భవన్ విషయంలో కూడా ఎమ్మెల్యే మాట మార్చారు. దిబ్బల రోడ్డు యాదవ భవన్ స్థలం ప్రస్తావన తీసుకొచ్చారు. ట్రంకు రోడ్డు విస్తరణ విషయం కోర్టు పరిధిలోకి పోయింది కాబట్టి నగర ప్రజల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే దాటేశారు. మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ విషయం కూడా వ్యాపారులు, స్థానికుల ఆలోచనల మేరకు ఏకాభిప్రాయంగానే నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ‘సాక్షి’ దిన పత్రికలో శుక్రవారం వచ్చిన కథనంపై అక్కసు వెళ్లగక్కారు. సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర రావు, ఎంఈ ఏసయ్య, ఏసీపీ సుధాకర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి
ఒంగోలు సిటీ: జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ సంబంధిత పనులు ఊపందుకుంటున్నందున వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. ప్రకాశం జిల్లా డీఆర్వో బి.చిన ఓబులేసు, జెడ్పీ సీఈవో చిరంజీవి, బాపట్ల జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర గౌడ్, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఉమ్మడి ప్రకాశం జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, డీఆర్డీఏ, విద్యుత్, రోడ్లు – భవనాలు, వైద్య, వ్యవసాయ శాఖల్లోని సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ చీమకుర్తి మండలంలో ఎంతో మంది వికలాంగులు తమకు పింఛన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. వికలాంగులను పెన్షన్ కోసం ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమన్నారు. మన జిల్లాలో ఒక మహిళ పెన్షన్ కోసం ఆఫీస్‌కు వెళితే ఆమె చనిపోయినట్లు రాశారన్నారు. బతికి ఉన్న మనిషిని కూడా చనిపోయినట్లు రాశారంటే ఒకసారి అందరూ ఆలోచించాలన్నారు. వికలాంగులు, వితంతువులను పింఛన్ల కోసం ఇబ్బంది పెట్టడం తగదన్నారు. అర్హత ఉన్నా వికలాంగ పింఛన్ తొలగించారు..: యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ 70 శాతం వికలాంగుడిగా సర్టిఫై చేసిన వ్యక్తిని 40 శాతంగా ఎవరు నిర్ధారించారు ? ఎలా నిర్ధారించారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అధికారులను నిలదీశారు. టీడీపీ వారు చెప్పారని ఆ పనిచేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వై.చెర్లోపల్లికి చెందిన 70 ఏళ్ల వికలాంగురాలికి సైలెన్ కూడా మంచంలోనే పెట్టి ఉందని, ఇటువంటివారి పింఛన్‌ను కూడా తీసేశారని, ఆ హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 30 విడో పింఛన్లు తొలగించారని, ఆ వివరాలు ఆన్లైన్లో కనిపిస్తాయని, వేలిముద్ర వేయడానికి వెళ్తే వేసుకోరని విమర్శించారు. 2,896 మంది వికలాంగులను ఏ డాక్టరు వచ్చి చెక్ చేశారనీ, ఏ డాక్టరు సర్టిఫై చేశారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు మాట్లాడే సమయంలో మంత్రి లేకపోవడం శోచనీయమన్నారు. అధికారులు మళ్లీ మీటింగుకు వచ్చే వరకు కనపడరని, మెసేజ్ లకు అధికారులు రెస్పాండ్ కావడంలేదని ఆరోపించారు. కలెక్టర్, మంత్రి ఓఎస్డీ దృష్టికి తీసుకెళ్లామని ఈ సమస్య ఎట్లా తీరుతుందనీ, సమస్య తీరనప్పడు ఈ వ్యవస్థలు, మీటింగ్‌లు ఎందుకు అని ప్రశ్నించారు. మీరు అడ్డగోలుగా అక్రమంగా పింఛన్లు తీసేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ 2,896 మందితో మీ ఆఫీస్ వద్దకు వచ్చి ధర్నా కూర్చుంటామని హెచ్చరించారు. ఒకే నియోజకవర్గంలో ఇంతమంది ఉంటారా అని, ఈ సమస్యను పీడీ నారాయణ త్వరగా పరిష్కరించాలని కోరారు. అర్హత లేని వ్యక్తిని ఎంపీడీఓగా నియమిస్తున్నారని, కలెక్టర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఉపయోగం లేదన్నారు. యర్రగొండపాలెం పంచాయతీ, త్రిపురాంతకం పంచాయతీల్లో గ్రేడ్–1 ఈఓను నియమించాల్సిందిపోయి గ్రేడ్–3 ఆఫీసర్ ని నియమిస్తున్నారని ఇలా చేస్తే వ్యవస్థలు ఎలా నడుస్తాయని ధ్వజమెత్తారు. కాలువలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. నీరు పారేలా కాలువలను శుభ్రం చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దోర్నాలలోని గండి చెరువు నుంచి నీరు లీకు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోర్నాల కమ్యూనిటీ ఆస్పత్రి, యర్రగొండపాలెం ఏరియా ఆస్పత్రుల్లో అవసరమైన వైద్యులు లేరని, దోర్నాల ఆస్పత్రిలో నీటి సమస్య నెలకొందని, యర్రగొండపాలెం ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ లేదని అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి యర్రగొండపాలెం కేంద్రానికి అనుసంధానమైన రోడ్లలో మరమ్మతు పనులు వేగవంతం చేయాలని ఆయన కోరారు. గతంలో పెన్షన్లు పొందిన వారు ప్రస్తుతం పెన్షన్లకు దూరమయ్యారని, అర్హులైన తమకు అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన చెందుతున్నారని దర్శి, వైపాలెం ఎమ్మెల్యేలతో పాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా సందర్భంగా అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై డీఆర్డీఏ పీడీ నారాయణ మాట్లాడుతూ అర్హులందరికీ పెన్షన్లు వస్తాయని, మెడికల్ రీ అసెస్మెంట్ జరుగుతోందని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని చెప్పారు. ఇతర జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా రోడ్ల విషయంలో స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. స్థానికంగా జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని ఆర్అండ్బీ అధికారులు వారికి వివరించారు. తమ ప్రాంతంలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని, ట్రాన్ఫార్మర్ల కోసం డీ.డీ.లు కట్టిన రైతులు వాటి కోసం ఎదురు చూస్తున్నారని ప్రజా ప్రతినిధులు చెప్పగా, ట్రాన్స్ఫార్మర్లు త్వరగా అందేలా చూస్తామని, విద్యుత్ తీగలను సరి చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాల్లో చేసిన తీర్మానాలను సమావేశం ఈ సందర్భంగా ఆమోదించింది. -
మూడు రోజుల పాటు చేపల వేట బహిష్కరణ
ఒంగోలు, టాస్క్ ఫోర్స్: తమిళనాడులోని కడలూరు నుంచి వచ్చే సోనాబోట్ల అక్రమ చేపల వేటను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని గురువారం రాత్రి ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో దండోరా వేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామ పరిధిలో బుధవారం చేపల వేటకు వెళ్లిన సమయంలో కడలూరు బోట్లు వీరి బోట్లను చేపల వేట చేయనీయకుండా అడ్డుకున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు గురువారం సమావేశమై మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని దండోరా వేసి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రెండు జిల్లాల్లో మత్స్యకార గ్రామాల్లో దండోరా వేయించి శుక్రవారం చేపల వేటను బహిష్కరించారు. దీంతో బోట్లన్నీ తీరంలోనే ఉన్నాయి. ఇటీవల కడలూరు బోట్ల కారణంగా తమ వలలు తెగిపోవటంతో పాటు తీరానికి దగ్గరగా వేట చేయటంతో చేపలు కూడా సక్రమంగా లభించడం లేదని వాపోతున్నారు. దీంతో వేటకు వెళ్లిన ప్రతిసారీ ఖర్చులు, కూలీ డబ్బులు రావటం లేదని, ఇలా అయితే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కడలూరు బోట్లను పూర్తిగా అడ్డుకోవాలని మత్స్యకారులు పట్టుబడుతున్నారు. -
నారా సురాపానంపై మహిళలు కన్నెర్ర
చీమకుర్తి రూరల్: కూటమి ప్రభుత్వంలో మద్యం బెల్ట్ షాపుల వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మంచికలపాడు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం సీసాలు పగులగొట్టారు. మూడు వేల జనాభా ఉన్న తమ గ్రామంలో ఏకంగా 8 బెల్ట్ షాపులు పెట్టారని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినా స్పందన లేకపోవడంతో శుక్రవారం వారే ఏకంగా రంగంలోకి దిగారు. గ్రామస్తుల కథనం మేరకు.. మంచికలపాడు గ్రామంలో అధికార టీడీపీకి చెందిన వారు 8 బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. దీంతో తమ కుటుంబాలు గుల్లవుతున్నాయని మహిళలు కొద్ది నెలలుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా గ్రామంలోంచి బెల్టుషాపులు తీసేయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శుక్రవారం పార్టీలకు అతీతంగా గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గ్రామంలో ఎక్కడా మద్యం విక్రయించకూడదని గ్రామ నాయకులు, పంచాయతీ అధికారుల సమక్షంలో తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే ఎక్సైజ్ అధికారులకు పట్టిస్తామని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ పొన్నపల్లి సుబ్బారావు మాట్లాడుతూ తమ గ్రామంలో 8 మద్యం బెల్టుషాపులు పెట్టారని, వాటిని తొలగించాలని కోరుతూ స్పందనలో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌కు కూడా ఈ సమస్యపై అర్జీ ఇచ్చామని చెప్పారు. గ్రామసభ అనంతరం.. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు బెల్టుషాపుల వద్దకు వెళ్లి అక్కడ మద్యం సీసాలను పగులగొట్టి, మద్యాన్ని పారబోశారు. మద్యం దుకాణం చుట్టూ ఉన్న గ్రీన్ మ్యాట్లను ధ్వంసం చేశారు. నిరసనలోమహిళలతో పాటు సర్పంచ్ పెరికల నాగేశ్వరరావు, ఎంపీటీసీ అత్యాల అంకయ్య, మాజీ సర్పంచులు చలువాది శేషమ్మ, శ్రీను, అచ్చాల ఏసోబుతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు. -
కలెక్టర్‌గా రాజాబాబు
● గుంటూరు బదిలీ అయిన తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: జిల్లా కలెక్టర్‌గా పి.రాజా బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల బదిలీల్లో భాగంగా ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏ.తమీమ్ అన్సారియాను గుంటూరుకు బదిలీ చేశారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అయిన రాజాబాబు ప్రస్తుతం ఏపీపీఎస్సీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒంగోలు సిటీ: ఒంగోలు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఒంగోలు: ఈనెల 13న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఇరువర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారానికి కక్షిదారులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయ స్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, కేసుల పరిష్కారం కోసం 25 బెంచీలు ఏర్పాటు చేశారన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లాలో 9 వేల కేసులు పరిష్కారానికి అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారపు చెల్లింపు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, అన్ని రకాల సివిల్ కేసులు ఇరువురి ఆమోదంతో పరిష్కరిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల్లో ఉన్నవారు ఉపయోగించుకుని తమ వ్యాజ్యాలను పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమ తీర్పు అని, కోర్టుల్లో చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చన్నారు. ప్రీసిట్టింగ్ రూపంలో ఇరువర్గాల ఆమోదంతో ముందస్తుగా వ్యాజ్యాలు పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారన్నారు. పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పేర్కొన్నారు. -
పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడతారా?
ఒంగోలు టౌన్: మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. వైద్యశాలలను ప్రైవేటుకు అప్పగిస్తే పేదలను జలగల్లా పీల్చిపిప్పి చేస్తారని, పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షలా మారిపోతుందని స్పష్టం చేశారు. గురువారం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనకబడిన ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రజలకు వైద్య వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కాపురంలో వైద్య కళాశాలను మంజూరు చేశారని చెప్పారు. జగనన్న హయాంలో వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఒంగోలులో రిమ్స్ పేరుతో ఆస్పత్రి నిర్మించారని, ఈ రోజు రిమ్స్‌లో పేద ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. జగనన్న పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో మంజూరు చేసిన వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేస్తే పేదలు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2,360 మెడికల్ సీట్లు ఉన్నాయని జగనన్న తెచ్చిన మెడికల్ కాలేజీల్లో కొత్తగా 2550 మెడికల్ సీట్లు పేద పిల్లలు చదువుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఇప్పుడు కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదల సీట్లు పెద్దలకు వెళ్లిపోతాయని చెప్పారు. వైద్య విద్య కోసం ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలతో పాటుగా చైనా, రష్యాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా తీసేసి బీమా పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3600 కోట్లు ఖర్చవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.4500 కోట్ల బకాయిలుంటే కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఆరోగ్యశ్రీ డబ్బులే ఇవ్వలేని చంద్రబాబు రేపు బీమా కంపెనీలకు కట్టాల్సిన డబ్బులను చెల్లించకపోతే పరిస్థితి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం అయ్యాక సుమారు రూ.2 లక్షల అప్పు తీసుకొచ్చారని, అమరావతి పేరుతో రూ.70 వేల కోట్లతో టెండర్లు పిలిచారని చెప్పారు. ఇందులోంచి కేవలం రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలోని వైద్య కళాశాలలను పూర్తి చేయవచ్చని, పేదలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లా అంటే ఎందుకంత చిన్నచూపు: ప్రకాశం జిల్లా అంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు ప్రశ్నించారు. వెనకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లాకు దివంగత సీఎం రాజశేఖర రెడ్డి పుణ్యమా అని వెలుగొండ ప్రాజెక్టు వచ్చిందని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్పారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు తీసుకొని రాలేకపోయారని ప్రశ్నించారు. మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణం ఫౌండేషన్ వరకు మాత్రమే వేశారని కూటమి పాలకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం పశ్చిమ ప్రజలను ద్రోహం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. మార్కాపురంలో ఎవరికై నా అనారోగ్యం వస్తే వందల కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. అదే మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటే ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. పీపీపీ వలన వైద్యం ఎక్కడకూ పోదని కథలు చెబుతున్నారని, ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ప్రభుత్వమే నేరుగా మార్కాపురం వైద్య కళాశాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, జిల్లా పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రవీంద్రా రెడ్డి, సీనియర్ నాయకులు క్రాంతి కుమార్ పాల్గొన్నారు. -
14న జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక
ఒంగోలు: జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 14న స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. 75 కేజీలలోపు బరువున్న బాలురు, 65 కేజీల లోపు బరువున్న బాలికలు, 2006 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఎంపికై న క్రీడా జట్లు ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగే 51వ రాష్ట్ర స్థాయి బాల బాలికల పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిసాయి. వివరాల కోసం సెల్: 9948343232 ని సంప్రదించవచ్చు. సింగరాయకొండ: మండలంలోని ఊళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థినిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై బీ మహేంద్ర గురువారం తెలిపారు. డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. బేస్తవారిపేట: ఎస్సీ కాలనీలోని బడిని రద్దు చేసి దూరంగా ఉన్న మోడల్ స్కూల్లో విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేసిన ఘటన బేస్తవారిపేటలో గురువారం జరిగింది. మండలంలోని ఖాజీపురం ఎస్సీ కాలనీలో 1వ తరగతి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాల నిర్వహించేవారు. ప్రభుత్వం 3, 4, 5 తరగతులను రద్దు చేసి ఎస్సీ కాలనీకి దూరంగా ఉన్న మోడల్ స్కూల్లో విలీనం చేశారు. దాదాపు 40 ఏళ్లుగా ఎస్సీ కాలనీలో ఉన్న పాఠశాలను తీసేయడంతో పిల్లలను దూరంగా ఉన్న బడికి పంపాల్సి రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలోనే 1 నుంచి 5 తరగతులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
అభివృద్ధి ముసుగేస్తూ!
స్థలాలు కొట్టేస్తూ.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు నగరవాసులు నయవంచనకు గురవుతున్నారు. ఒకవైపు అభివృద్ధి పేరుతో మాయాజాలం చేస్తుండగా, మరోవైపు వర్గాల వారీగా ప్రజలను పాలకులు మోసం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మాటలకు అధికారులు తందానా అంటున్నారు. శుక్రవారం జరగనున్న కౌన్సిల్ సమావేశం వేదికగా పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. నగరంలోని ట్రంక్ రోడ్డు విస్తరణకు సంబంధించి గత కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ గట్టిగా వ్యాపారుల పక్షాన నిలిచింది. అలాగే ట్రంక్ రోడ్డు బాధితులు, వ్యాపారులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దాంతో రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ బెనిఫిట్స్ కింద బాధితులను నగదు రూపంలో ఆదుకోవాలని నగరపాలక సంస్థకు హైకోర్టు సూచించింది. 73 మంది బాధితులను నగదు రూపంలో ఆదుకోవాలని ఉత్తర్వులిచ్చింది. ట్రంకు రోడ్డులో వ్యాపారులు అన్ని రకాల అనుమతులు తీసుకుని ఒంగోలు నగరపాలక సంస్థకు అన్నిరకాల పన్నులు చెల్లిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇన్‌కం ట్యాక్సు, జీఎస్టీ, ఇతర అన్ని ప్రభుత్వ విభాగాలకు చెల్లించాల్సిన పన్నులు చెల్లిస్తున్నారు. టీడీఎస్ బాండ్లు ఇస్తాము.. రూ.కోట్ల విలువ చేసే స్థలాలు రోడ్డు విస్తరణకు ఇవ్వండని మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారు. అందుకే కోర్టు మెట్లెక్కి బాధితులు ఆర్డర్ తీసుకొచ్చారు. వారికో న్యాయం.. వీరికో న్యాయమా..? ట్రంకు రోడ్డు విస్తరణలో ప్రాపర్టీ కోల్పోయే వారంతా కూడా ప్లాన్ అప్రూవల్ కోసం మున్సిపల్ శాఖకు పన్నులు, లేబర్ సెస్ వగైరా చెల్లించారు. అలాగే ప్రాపర్టీ, కొళాయి పన్ను చెల్లిస్తున్నారు. వీళ్లకే నోటీసులిచ్చి మరీ కూలగొట్టేందుకు నగర పాలక సంస్థ అధికారులు మార్కింగ్ కూడా ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ప్లాన్ చార్జీగానీ, లేబర్ సెస్గానీ చెల్లించకుండా బండ్లమిట్ట – అద్దంకి బస్టాండ్ రోడ్డులో భారీ కాంప్లెక్స్‌లు నిర్మించుకుని రూ.లక్షల్లో అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. వారి వైపు కార్పొరేషన్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ, బినామీ పట్టాలతో భారీ కాంప్లెక్స్‌లు నిర్మించుకుని రూ.లక్షల్లో అద్దెలు తీసుకుంటుండగా.. నేటికీ ఇంకొన్ని నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ముందువైపు కాకుండా రోడ్డుకు వెనుక ఊరచెరువు వైపు చూస్తే ఒక్కొక్క బిల్డింగ్ లోతు 250 నుంచి 300 అడుగులు సొరంగాల మాదిరిగా ఉన్నాయి. బండ్లమిట్ట–అద్దంకి బస్టాండ్ (ట్రావెలర్స్ బంగళా రోడ్) 100 అడుగుల రోడ్డు కాస్తా 40 అడుగుల వరకు అక్రమ నిర్మాణాలతో కుంచించుకుపోయింది. మరి అధికారులు వాటిజోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యాదవ భవన స్థలం రద్దు దుర్మార్గం... శ్రీకృష్ణ కళ్యాణ మండపం, యాదవ భవనానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 19వ డివిజన్లో స్థలం కేటాయించారు. దాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు రద్దు చేశారు. ఆ స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ విషయం తెలుసుకుని ఆలిండియా యాదవ మహాసభ నాయకులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లను కలిస్తే యాదవ భవన్, కళ్యాణ మండపానికి ఆ స్థలం ఇచ్చిన విషయం తెలియదని చెప్పుకొచ్చారు. చివరకు యాదవ భవన్‌కు ఇచ్చిన స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్డర్ కూడా జారీ చేసింది. గతేడాది ఏప్రిల్ 24వ తేదీ కౌన్సిల్ ఆమోదం పొందిన స్థలాన్ని ఏ విధంగా రద్దు చేస్తారని యాదవ మహాసభ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం శ్మశానవాటిక పరిస్థితీ అంతే... ఒంగోలు నగరంలో ముస్లిం శ్మశాన వాటిక విషయంలో కూడా కూటమి ప్రజాప్రతినిధులు కుట్రలకు తెరతీశారు. కమ్మపాలెం దాటిన తర్వాత దశరాజుపల్లి రోడ్డులో గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2 ఎకరాల 40 సెంట్ల భూమిని ముస్లిం శ్మశాన వాటికకు కేటాయించింది. కమ్మపాలేనికి ఆనుకుని ఉందని ఆ సామాజిక వర్గం ప్రజలకు, ఆయన అనుయాయులకు ఆ స్థలాన్ని కట్టబెట్టాలని కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ స్థలాన్ని రద్దు చేసి ముక్తినూతలపాడు సర్వే నంబర్ 15లో 3 ఎకరాల భూమి కేటాయిస్తున్నామని దాటవేత ధోరణితో కాలయాపన చేస్తూ ముందుకుపోతున్నారు. ఆ స్థలం పూర్తిగా కుంట పోరంబోకు కావడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కళాక్షేత్రానికి అడ్డగోలుగా రూ.10 లక్షలు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ కళాక్షేత్రానికి ప్రజల సొమ్ము అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. గత కౌన్సిల్ సమావేశంలో కళాక్షేత్రాన్ని టెండర్ ద్వారా ఒకరికి కేటాయించారు. అతనికి అప్పజెప్పిన నగర పాలక సంస్థ తిరిగి కళాక్షేత్రం పునరుద్ధరణ పనుల పేరిట రూ.10 లక్షలకు టెండర్ పిలిచింది. కౌన్సిల్ ఆమోదం తెలిపినప్పుడు పునరుద్ధరణ పనుల ప్రస్తావనే లేదు. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ పొందిన వ్యక్తి గతంలో కళాక్షేత్రాన్ని లీజుకు తీసుకుని రూ.25 లక్షలు ఒంగోలు నగర పాలక సంస్థకు పంగనామం కూడా పెట్టాడు. -
అట్టహాసంగా ‘కళా ఉత్సవ్–25’
ఒంగోలు సిటీ/చీమకుర్తి రూరల్: సంతనూతలపాడు మండలం మైనంపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్ కాలేజీ)లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కళా ఉత్సవ్–2025 పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 6 కళలకు సంబంధించి 12 విభాగాల్లో పోటీలు నిర్వహించగా ఒంగోలు, పర్చూరు డివిజన్లలోని 39 ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల నుంచి 311 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు మాట్లాడుతూ.. కళా ఉత్సవ్‌కు విశేష స్పందన లభించిందని, పోటీలకు భారీగా విద్యార్థులు హాజరవడం డైట్ చరిత్రలోనే ఇదే ప్రథమని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో కళా సృజనను వెలికితీసేందుకు, విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహిస్తున్న పోటీల్లో కందుకూరు, మార్కాపురం డివిజన్ల విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను పోటీలకు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, న్యాయ నిర్ణేతలు, ఉమ్మడి జిల్లాలోని రెండు డివిజన్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ర్యాంకులు!
అవినీతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అవినీతి జబ్బు చేసింది. పైసా లేనిదే ఫైళ్లు కదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఏఎన్ఎం పదోన్నతుల విషయంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడం తెలిసిందే. జిల్లా సెలక్షన్ కమిటీ పరీక్షల్లో వచ్చిన ర్యాంకులను రాత్రికి రాత్రే మార్చేసి పదోన్నతులు చేసినట్లు కొందరు ఏఎన్ఎంలు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బందికి సెలవు కావాలన్నా సరే బల్లకింద చేతులు తడపకుండా పనికావట్లేదన్న ఆరోపణలు రావడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వైద్యారోగ్య శాఖలో 826 మంది గ్రేడ్–3 ఏఎన్ఎంలు ఉన్నారు. వారిలో 215 మందికి గ్రేడ్–2 ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. 2024 ఫిబ్రవరిలో సినియార్టీ లిస్ట్ ప్రకటించారు. తెరవెనుక ఏం జరిగిందో కానీ అదే ఏడాది ఆగస్టులో సీనియారిటీ లిస్టులో మార్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లా సెలక్షన్ కమిటీకి ఎలాంటి సమాచారం లేకుండానే సీనియారిటీ లిస్టు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత ఏడాది దాటాక 2025 మార్చి 17వ తేదీన జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే జిల్లా సెలక్షన్ కమిటీ ఇచ్చిన ర్యాంకుల ప్రకారం పదోన్నతులు చేపట్టాల్సిన అధికారులు దానికి భిన్నంగా ర్యాంకుల్లో మార్పులు, చేర్పులు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ర్యాంకులు మారడంతో ఏడుగురు ఏఎన్ఎంలు పదోన్నతులు కోల్పోయారు. ఇందులో ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే అధికారులు వారి దృషికి తీసుకొని రావాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఆ నలుగురు ఎవరు... ఇదిలా ఉండగా పదోన్నతుల వ్యవహారంలో భారీ మొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలోని ఓ నలుగురు పదోన్నతుల అక్రమాలకు తెరదీసినట్లు ప్రచారం జరిగింది. లిస్టులో ర్యాంకుల మాయ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే 250 ర్యాంకు వచ్చిన వారికి సీనియారిటీ లిస్టులో 142వ ర్యాంకు, 288వ ర్యాంకు వచ్చిన వారికి సీనియారిటీ లిస్టులో 162వ ర్యాంకు ఇచ్చారు. గతంలో మండ్లమూరు మండలంలోని పులిపాడు సచివాలయంలో విధులు నిర్వహించిన గ్రేడ్–3 ఏఎన్ఎంకు డీఎస్సీ ర్యాంకుల్లో 206వ ర్యాంకు కేటాయించారు. పదోన్నతుల దగ్గరకు వచ్చే సరికి ర్యాంకు 213కు చేరుకుంది. ఇదేలా సాధ్యమో అర్థం కాక ఆమె తలపట్టుకున్నారు. ఒకసారి ర్యాంకు ఇచ్చిన తరువాత మధ్యలో ర్యాంకు మారడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా 3517 ర్యాంకు వచ్చిన ఏఎన్ఎంకు సీనియారిటీ లిస్టులో 845వ ర్యాంకు రావడంతో పలువురు ఏఎన్ఎంలు విస్మయానికి గురయ్యారు. నష్టపోయామని భావించిన ఏఎన్ఎంలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వాయిదాల మీద వాయిదా... బాధిత ఏఎన్ఎంలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. అప్పటి డీసీఎం మాధురిని విచారణాధికారిగా నియమించారు. అయితే ఇక్కడ కూడా ఏదో జరిగిందన్న పుకార్లు షికార్లు చేశాయి. ఎందుకోకానీ డీసీఎం మాధురి విచారణ సక్రమంగా జరగలేదు. ఒకసారి మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత విచారణ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. డీసీఎం మాధురి మీద ఒత్తిడి వచ్చిందని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు గుసగుసలాడుకున్నారు. ఈ లోపు మాలమహానాడు అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. తర్వాత జాయింట్ డైరక్టర్ సునీల్ నాయక్‌ను విచారణాధికారిగా నియమించారు. గురువారం జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలో సునీల్ నాయక్ విచారణ చేపట్టారు. ర్యాంకింగ్ మార్పుతో పదోన్నతులు కోల్పోయిన ఏఎన్ఎంలు, ఫిర్యాదుదారులు విచారణాధికారిని కలిసి వాదన వినిపించారు. శుక్రవారం కూడా అయన విచారణ జరపనున్నట్లు సమాచారం. జేడీ విచారణలోనైనా అక్రమాలు బయటపడతాయా లేదా అని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అసలు ఉద్యోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఆ నలుగురు ఎవరు, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా నర్సుల డ్యూటీల విషయంలోనూ చేతివాటం చూపిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణ చేసినట్టు తెలిసింది. ఫోన్ పే ద్వారా డబ్బు వసూలు... పదోన్నతులు, కోరిన చోటికి బదిలీలు చేయడానికి ఆ నలుగురు పైసా వసూళ్లకు తెగబడ్డారని ఆరోపణలు వచ్చాయి. నేరుగా డబ్బులు వసూలు చేస్తే ఏమవుతుందోనని కొత్త తరహాలో లంచాల వసూళ్లకు తెరదీసినట్లు ప్రచారం జరిగింది. తన కుటుంబ సభ్యులు, మిత్రుల ఫోన్ల నంబర్లు ఇచ్చి వారి పేరు మీద ఫోన్ పే చేయించుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం డీఎంహెచ్ఓ కార్యాలయంలోని మరో గ్రూపు సమాచారాన్ని లీక్ చేయడంతో అక్రమాల గుట్టు రట్టయింది. ఏఎన్ఎంలు కూడా తమ వద్ద ఫోన్ పే చేయించుకున్నారని చెప్పడంతో వైద్య శాఖలో సంచలనం సృష్టించింది. దీంతో కథ కలెక్టర్ వద్దకు చేరింది. -
అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
● ఫారెస్ట్ డీడీ సందీప్ కృపాకర్ మార్కాపురం: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.సందీప్ కృపాకర్ పేర్కొన్నారు. గురువారం అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా స్థానిక అటవీశాఖ కార్యాలయంలో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డీడీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ స్మగ్లర్ల చేతిలో అటవీ సిబ్బంది చనిపోయారన్నారు. ప్రాణత్యాగం చేసిన వారి సేవలను ఆదర్శంగా తీసుకుని సిబ్బంది పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ పిచ్చిరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు నాగరాజు, ప్రసాద్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కురిచేడు: మండలంలోని ఆవులమంద గ్రామం నుంచి 30 మందితో త్రిపురాంతకం మండలం ఇసుక త్రిపురాంతకం గ్రామానికి వెళుతున్న టాటా ఏస్ వాహనం మండలంలోని పాత నాంచారపురం గ్రామం వద్ద తిరగబడింది. ఈ ఘటనలో 18 మందికి స్వల్పగాయాలు కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పల్లె సామ్రాజ్యానికి తలకు బలమైన గాయం కాగా, పల్లె అంకమ్మకు చేయి నుజ్జునుజ్జయింది. వారిని స్థానిక ప్రైవేటు వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి అనంతరం 108 వాహనాల్లో వినుకొండకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. -
బెడిసికొట్టిన భూకబ్జా ప్లాన్
ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల జేసీబీతో చదును చేస్తున్న అక్రమార్కులు సింగరాయకొండ: జాతీయ రహదారి పక్కనే సుమారు కోటిన్నర రూపాయల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించేందుకు టీడీపీ నేతలు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. ఆక్రమణదారులకు ఆది నుంచే సంపూర్ణ సహకారం అందించిన రెవెన్యూ అధికారులు.. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్లేటు ఫిరాయించి అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు. అందిన సమాచారం మేరకు ఈ భూ కబ్జా బాగోతం వివరాలిలా ఉన్నాయి. సింగరాయకొండ మండలంలోని కనుమళ్ల పంచాయతీ చిన్న కనుమళ్ల ఎస్సీ కాలనీ సమీపంలో ఊళ్లపాలెం–వేములపాడు జాతీయ రహదారి పక్కనే సర్వే నంబర్ 70లో సుమారు 0.77 ఎకరాలు చెరువు పోరంబోకు స్థలం ఉంది. ఇది కనుమళ్ల చెరువుకు వర్షం నీరు ప్రవహించే ఒరవ. గత ఆదివారం ఈ స్థలాన్ని టీడీపీ సానుభూతిపరుడు, మండల రెవెన్యూ కార్యాలయంలో చక్రం తిప్పే ప్రైవేట్ వ్యక్తితోపాటు మరికొందరు కలిసి జేసీబీతో చదును చేశారు. స్థలంలో తొలగించిన చిల్లచెట్లు, తాటిచెట్లను తగలబెట్టారు. దీంతో చినకనుమళ్ల గ్రామస్తులు కొందరు స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని వీఆర్వో విజయ దృష్టికి తీసుకెళ్లారు. ఆ స్థలాన్ని గతంలో కంకణాల ఆనంద్ అనే వ్యక్తికి అసైన్మెంట్ కింద పట్టా ఇచ్చినట్లు రికార్డు ఉందని, అతని వారసులు బాగు చేసుకుంటున్నారని వీఆర్వో సమాధానం ఇవ్వడంతో కనుమళ్ల వాసులు అవాక్కయ్యారు. ‘అది చెరువు పోరంబోకు స్థలం. ఒకవేళ ఆనంద్‌కు పట్టా ఇస్తే అతను చాలా కాలం క్రితమే చనిపోయారు. అతనికి వారసులు ఎవరూ లేరు. స్థలాన్ని బాగు చేస్తోంది ఆనంద్ మరదలు తాలూకు వ్యక్తులు. వారు ఆనంద్‌కు వారసులు ఎలా అవుతార’ని స్థానికులు నిలదీశారు. వీఆర్వో తీరుపై అనుమానాలు కనుమళ్ల రెవెన్యూ సర్వే నంబర్ 70లో సెంటు స్థలం సుమారు రూ.2 లక్షలు ఉంది. దీంతో ఈ స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క రంగంలోకి దిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు పోరంబోకు స్థలంలో అసైన్మెంట్ పట్టా ఇచ్చారని వీఆర్ఓ చెప్పడం స్థానికంగా చర్చనీయాంశం కావడంతో ఆక్రమణదారులతోపాటు రెవెన్యూ అధికారులు సైతం వెనకడుగు వేయక తప్పలేదు. దీనిపై డిప్యూటీ తహసీల్దార్ తానికొండ ప్రసాద్‌ను వివరణ కోరగా.. సర్వే నంబర్ 70లో ఉన్నది ప్రభుత్వ భూమి. అందులో ఎవరికి పట్టా ఇవ్వలేదు. గురువారం ఒక వ్యక్తి రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఎన్నో ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్నాం, హక్కు కల్పించాలని కోరాడు. పట్టా లేదని చెప్పడంతో హక్కు కల్పించడానికి వీలుపడదని తెలియజేశామ’ని వివరించారు. హైవే పక్కన చిన్న కనుమళ్ల సర్వే నం.70లో విలువైన ప్రభుత్వ భూమి -
ఇద్దరు బాలికలపై మృగాడి లైంగిక దాడి
నిందితుడిపై పోక్సో కేసు నమోదు కొత్తపట్నం: అభంశుభం తెలియని ఇద్దరు బాలికలపై పెదనాన్న వరుసయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బాలికలను బెదిరించడంతో మిన్నకుండిపోయారు. పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కొత్తపట్నం పోలీసులను ఆశ్రయించగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అందిన సమాచారం మేరకు.. కొత్తపట్నం మండలంలో ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికలు ఇద్దరిపై అదే గ్రామానికి చెందిన దొడ్ల వీరారెడ్డి ఈ నెల 7వ తేదీ ఆదివారం లైంగికదాడికి పాల్పడ్డాడు. వీరారెడ్డి తన ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారం చేసినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావమైన బాలికలను వీరారెడ్డి చంపేస్తానని బెదిరించడంతో తల్లిదండ్రులకు చెప్పేందుకు కూడా సాహసించలేదు. పాఠశాలలో నీరసంగా ఉన్న బాలికలను ఉపాధ్యాయులు గుర్తించి ఆరా తీయడంతో విషయం బయటపడింది. టీచర్ల ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కొత్తపట్నం పోలీసులను ఆశ్రయించగా ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించినట్లు ఎస్సై వేముల సుధాకర్‌బాబు తెలిపారు. కాగా నిందితుడు దొడ్ల వీరారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
గిరిజన ప్రజా చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు వన్‌టౌన్: గిరిజన ప్రజా చైతన్య యాత్ర గోడ పత్రికను రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ గురువారం ఆవిష్కరించారు. ఒంగోలులోని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో గిరిజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన జిల్లాలోని అన్ని గిరిజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చైతన్య యాత్ర ఇప్పటికే మూడు జిల్లాలో పూర్తయిందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు గడిచినా గిరజనుల బతుకులు ఏ మాత్రం మారలేదన్నారు. గిరిజనుల హక్కులను కాపాడుకునేందుకు ఏక తాటిపై కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు ఆర్.సైదా నాయక్, పి.సత్యం, ఆర్.హనుమానాయక్, ఎ.కోటి నాయక్, హరినాయక్, ఎ.శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28న జిల్లాలో గిరిజన సంఘాల సదస్సు గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ వెల్లడి -
పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి
● అపస్మారక స్థితిలోకి మరో ఇద్దరు.. కొండపి: పిడుగుపాటుకు ఒకరు మృతి చెందిన సంఘటన కొండపి పంచాయతీలోని కట్టవారిపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బెజవాడ రామారావు(45), బెజవాడ రమేష్ మామిళ్లపల్లి లక్ష్మయ్య రోజూ మాదిరిగానే గొర్రెలు మేపడానికి నేతివారిపాలెం సమీపంలో పొలాలకు వెళ్లారు. బుధవారం సాయంత్రం వర్షం కురుస్తుండటంతో ముగ్గురూ ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడటంతో బెజవాడ రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న రమేష్,లక్ష్మయ్య అపస్మారక స్థితిలో పడిపోయారు. సమీపంలో ఉన్నవారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా రామారావు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న రమేష్, లక్ష్మయ్యకు కొండపి వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం రమేష్‌ను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు రామారావుకు భార్య రుక్మిణి, కుమారుడు వెంకట సాయి, కుమార్తె బ్రాహ్మణి ఉన్నారు. పిడుగుపాటుతో మృతి చెందిన రామారావు కుటుంబాన్ని తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రామాంజనేయులు పరామార్శించి వివరాలు తెలుసుకున్నారు. వీరి వెంట వీఆర్వో సుశీల, పంచాయతీ సెక్రటరీ రామ్మోహన్రావు ఉన్నారు. -
పొగాకు పంట నియంత్రణ పాటించాలి
టంగుటూరు: రైతులు పొగాకు పంట సాగులో నియంత్రణ పాటించాలని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్, వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య అన్నారు. టంగుటూరు పొగాకు బోర్డును బుధవారం సందర్శించి పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా 2025–26 పంట కాలానికి పొగాకు పంట నియంత్రణ మీద నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులతో మాట్లాడారు. దేశీయంగా, విదేశాలలో ఎఫ్ సీవీ పొగాకుకు ఉన్న గిరాకీని, నిల్వలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో 2025–26 పంట కాలానికి 142 మిలియన్ కేజీల ఉత్పత్తికి అనుమతించినట్లు తెలిపారు. దక్షిణ ప్రాంత నల్ల రేగడి నేలలు (ఎస్బీఎస్) బ్యారన్ ఒక్కింటికి 3565 కేజీల పంట సాగుకు అనుమతించారన్నారు. అలాగే వివిధ దేశాల్లో 2025–26 పంట కాలానికి పండించిన పొగాకు ఉత్పత్తి గణాంకాలను వివరించి, రైతులు రాబోయే పంట కాలానికి రైతులు తమకు కేటాయించిన మేరకే పొగాకు సాగు చేపట్టాలని సూచించారు. అధిక ధరలతో భూమి, బ్యారన్లు కౌలుకు తీసుకొని పొగాకు సాగు చేయరాదన్నారు. అలాగే కొత్తగా అనధికారికంగా బ్యారన్ లు నిర్మించవద్దని చెప్పారు. వాణిజ్య సరళిలో ఎఫ్ సీవీ పొగాకు నారుమడి సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా వారి పరిధిలోని పొగాకు బోర్డు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, పొగాకు రైతు సంఘం నాయకులు పోతుల నరసింహారావు, పొగాకు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. -
గుంభనంగా విచారణ!
రూ.కోట్లు కొల్లగొట్టినా..సాక్షి టాస్క్‌ఫోర్స్: సుమతి శతక పద్యంలోని ’’చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైనట్లు..’’ వాక్యం.., అలాగే ‘‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేముంది’’ అన్న తెలుగు సామెత అతికినట్లు సరిపోయే సంఘటన ఇది. పొగాకు వ్యాపారం చేసి, అక్రమ మార్గాలను అనుసరించి టంగుటూరు టీడీపీ నేత కూడబెట్టిన సొమ్ములో రూ.20 కోట్లను తన కింద పనిచేసే గుమస్తా కాజేసిన వ్యవహారం, అందుకు సంబంధించిన విచారణపై రోజుకో కథనం బయటకొస్తోంది. చిన్న చోరీ జరిగితే తక్షణమే అక్కడ వాలిపోయి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టే పోలీసులు.. టీడీపీ నేత పొగాకు కంపెనీలో రూ.20 కోట్లు గోల్మాల్ అయిన విషయంపై పెద్దగా స్పందించడం లేదు. మంత్రి ఆదేశాలతో ఫిర్యాదు లేకుండానే రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులకు బాధిత టీడీపీ నాయకుడే అడ్డు తగిలినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. మోసగాడే మోసపోయాడు! తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడన్న సామెత పొగాకు కంపెనీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో నిజమైంది. పొగాకు కంపెనీలో గుమస్తా చేతివాటం చూపించి రూ. 20 కోట్లు డబ్బులు కాజేయగా, గుమస్తా వద్ద సైబర్ నేరగాళ్లు రూ.7 కోట్లు మాయం చేశారు. ఆరు నెలల క్రితమే స్కెచ్ టీడీపీ నేత సింగపూర్‌లో ఒక వివాహానికి వెళ్లడం, కొద్ది రోజుల తర్వాత తండ్రి మృతి చెందడం, పొగాకు కంపెనీల కార్యక్రమానికి విదేశానికి వెళ్లడం, తన కూతురు, భార్య అమెరికా వెళ్లే పనులను చక్కబెడుతూ ఆరు నెలలుగా వ్యాపార లావాదేవీలు పట్టించుకోలేదు. ఇదే అదనుగా భావించిన గుమస్తా క్రమంగా రూ.20 కోట్లు దారి మళ్లించాడు. అయితే ఒక లావాదేవీలో గుమస్తా బ్యాంకు ఖాతాకు రూ.90 వేలు జమ కావడాన్ని గుర్తించిన టీడీపీ నేత విషయం ఆరా తీయడంతో గోల్మాల్ వ్యవహారం బయటపడింది. ఓ మంత్రి సహకారంతో సిట్ అధికారులు, జిల్లా పోలీసులకు సమాచారం అందించి విచారణకు పూనుకున్నారు. గుమస్తాను బంధించి, అతని బావమరిదికి చెందిన టెంటు హౌసుకు తాళం వేశారు. మూడు డీజే వాహనాలను స్వాధీనం చేసుకుని పొగాకు కంపెనీలో ఉంచారు. ప్రస్తుతం యజమాని, గుమస్తా మధ్య శాంతి చర్చలు జరుతున్నాయని సమాచారం. పొగాకు కంపెనీలో పనిచేసే సిబ్బందిని సైతం రెండు రోజులపాటు పనికి రావద్దని చెప్పడం అందుకు బలం చూకూరుస్తోంది. కొండపి మండలం గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి గుమస్తా రూ.2 కోట్లు బదిలీ చేసినట్లు తేలడంతో అతనిని కూడా పొగాకు కంపెనీలో గోప్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు గుమస్తా నుంచి 1.900 కిలోల బంగారం, అతని ఇంట్లో బెడ్ కింద దాచిన కొంత ధనం.. వెరసి మొత్తం రూ.8 కోట్ల మేర రికవరీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని టంగుటూరు పోలీసులు చెబుతుండటం గమనార్హం. టంగుటూరు ఎస్సైపై హైకోర్టుకు ఫిర్యాదు అధికార టీడీపీ నాయకుల ఒత్తిడితో టంగుటూరు గ్రామానికి చెందిన గుమస్తాను ఎస్సై నాగమళ్లీశ్వరరావు రెండు రోజులపాటు విచారణ పేరులో చిత్రహింసలు పెట్టారని, కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు అందుకున్న ఎస్సై హైర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరైనట్లు సమాచారం. టంగుటూరు టీడీపీ నేత పొగాకు కంపెనీలో రూ.20 కోట్ల సొమ్ము గోల్మాల్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఫిర్యాదు లేకుండానే విచారణకు పూనుకున్న పోలీసులు అక్రమ వ్యాపారం గుట్టు రట్టవుతుందని పోలీసులను సైడ్ చేసిన వైనం తన కంపెనీ గోడౌన్లోనే గుమస్తాను గోప్యంగా విచారిస్తున్న టీడీపీ నేత 1.9 కేజీల బంగారం, రూ.8 కోట్ల నగదు రికవరీ చేసినట్లు జోరుగా ప్రచారం ఇప్పటికీ ఫిర్యాదు అందలేదంటున్న టంగుటూరు పోలీసులు గుమస్తాను రెండు రోజులు చిత్రహింసలు పెట్టినట్లు టంగుటూరు ఎస్సైపై హైకోర్టుకు ఫిర్యాదు అక్రమాల గుట్టు రట్టవుతుందనేనా? గత నాలుగైదేళ్లుగా టంగుటూరు టీడీపీ మండల అధ్యక్షుడి తమ్ముడు పొగాకు వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలోనే లాభాలు ఆర్జించినట్లు సమాచారం. అక్రమ మార్గాలు అనుసరించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం, పొగాకు బోర్డుకు చెల్లించాల్సిన రుసుముకు ఎగనామం పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా రైతుల వద్ద అతి తక్కువ ధరకు పొగాకు కొనుగోలు చేసి స్వదేశీ, విదేశీ కంపెనీలకు విక్రయించడం లాంటి వ్యవహారాలతో టీడీపీ నేత రూ.కోట్లు కూడబెట్టినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. కంపెనీలో రూ.20 కోట్లు దారి మళ్లించిన గుమస్తాను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అక్రమాల బాగోతం బట్టబయలవుతుందని భావించిన టీడీపీ నేత.. గుమస్తాను విచారించేందుకు తనే రంగంలోకి దిగినట్లు తెలిసింది. గత కొద్దిరోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుమస్తాను విచారించి లావాదేవీల లెక్కలు తేల్చి, సాయంత్రానికి గుమస్తాను తన ఇంటికి పంపిస్తున్నట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. -
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై విచారణ చేయండి
ఒంగోలు సబర్బన్: ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల విషయంపై భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టరేట్ గోపాల కృష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రకాశం భవన్‌లోని ఆయన ఛాంబర్లో బుధవారం కలిసిన డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంపికై న అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరైతే ఎంపికయ్యారో వివాహమైన మహిళ అయితే ఆమె భర్త ఇన్కమ్ సర్టిఫికెట్, పురుషులు అయితే వారి లేటెస్ట్ సర్టిఫికెట్స్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ సబ్జెక్టుకు ఎంపికై న వాళ్లలో కొంతమంది భూములు, పెళ్లిళ్లు అయిన తర్వాత భర్తలకు సొంత కంపెనీలు, ఆస్తులు ఉన్నప్పటికీ ఈడబ్ల్యూఎస్ తెచ్చుకుని ఉద్యోగానికి ఎంపికయ్యారన్నారు. ఇటువంటి వారి సర్టిఫికెట్స్‌పై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చారో అటువంటి వారిని అనర్హులను చేసి తొలగించాలన్నారు. అదేవిధంగా అటువంటి వారిపై క్రిమినల్ కేసులు, నమోదు చేయాలన్నారు. అర్హులైన వారికి టీచర్ పోస్టులు ఇవ్వాలని కోరారు. దీనిపై జేసీ గోపాల కృష్ణ స్పందించి ఫేక్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసి ఉన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు పి.నరేంద్ర, పి.రాంబాబు, జీ శ్రీనివాసులు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. నకిలీ సర్టిఫికెట్స్ ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి జేసీకి వినతి పత్రం ఇచ్చిన డీవైఎఫ్ఐ నాయకులు -
పత్రికల మీద కేసులు తగవు
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏదైనా వార్తల విషయంలో నచ్చని అంశాలు ఉంటే వాటిని ఖండించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా నష్టం కలిగించింది అనుకున్న సందర్భంలో న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇన్ని మార్గాలు ఉండగా అక్రమంగా కేసులు నమోదు చేయడం, పాత్రికేయులను అరెస్టు చేయడం సమర్థనీయం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చెడు సంప్రదాయానికి దారితీస్తాయి. – బి.శ్రీనివాసరావు, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరమ్ కన్వీనర్ -
రైతు బజార్లను పరిశీలించిన జేసీ
ఒంగోలు సబర్బన్: జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఒంగోలు నగరంలోని మూడు రైతు బజార్లను బుధవారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తున్న కర్నూలు ఉల్లిపాయాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను, వినియోగదారులను కూరగాయల ధరలను అడిగి తెలుసున్నారు. ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు బజార్ల పరిసరాలు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. జేసీ వెంట ఇతర అధికారులు ఎం.వరలక్ష్మీ, ప్రతాప్ రాజ్ కుమార్, డీఈఈ టి.పవన్ కుమార్‌తో పాటు రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు పాల్గొన్నారు. -
వాస్తవాలను దాచలేరు
పత్రికా స్వేచ్ఛ గురించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమాత్రం బాగాలేదు. పాత్రికేయుల మీద తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు బనాయించడం సహేతుకం కాదు. ప్రభుత్వ విధానాల మీద ఎలాంటి వార్తలు రాయకూడదు, మాట్లాడకూడదు అంటే ఎలా? పాలకులు ప్రజలకు జవాబుదారిగా వ్యవహరించాల్సిన బాధ్యత లేదా ? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా అసాధ్యమో వాస్తవాలను దాచిపెట్టాలనుకోవడం కూడా అంతే అసాధ్యం. పత్రికలు ప్రజల గొంతు వినిపించడం సహజం. దానికి ఉలికిపడటం సమర్ధత అనిపించుకోదు. – నగరికంటి శ్రీనివాసరావు, న్యాయవాది, ఒంగోలు బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ -
మోదీ పాలనలో రైతుల పరేషాన్
ఒంగోలు టౌన్: కేంద్రంలో మోదీ అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల ఫలితంగా దేశంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి విమర్శించారు. రైతు సంఘం జిల్లా సమితి సమావేశం స్థానిక మల్లయ్యలింగం భవనంలో బుధవారం నిర్వహించారు. సమావేశానికి వడ్డే హనుమారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్లచట్టాల రద్దుకు పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి మోదీ మాటనిలుపుకోలేదన్నారు. స్వామి నాథన్ కమిషన్ సూచనల మేరకు మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు విధించడంతో అమెరికాలో మనదేశానికి చెందిన ఉత్పత్తులను కొనుగోలు చేయడంలేదని తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తికి 11 శాతం ఉన్న పన్నులను ఎత్తి వేయడం పత్తి రైతులకు శరాఘాతంగా మారిందన్నారు. మోదీ పాలనలో నాలుగున్నర లక్షల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికీ రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి రైతుల సంతకాలతో మోదీకి వినతి పత్రం పంపించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతు నాయకులు డి.శ్రీనివాస్, బి.రామయ్య, పుల్లయ్య, టివీ శేషయ్య, సీహెచ్ వాసు, ప్రసాద్, లెనిన్, ప్రభాకర్, వెంకటరావు, సాంబశివరావు పాల్గొన్నారు. -
పల్లె జనానికి అనంత కష్టాలు
ఒంగోలు టౌన్/మార్కాపురం: కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సక్సస్ సభ పల్లెజనానికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకవైపు ఎండవేడి, మరో వైపు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించి అవస్థలు పడ్డారు. ప్రధానమైన రూట్లలో బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రతిరోజూ వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారి ఓపికను అధికారులు పరీక్షించారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో సభ జరుగుతుంటే ఇక్కడ నుంచి బస్సులను తరలించడమేమిటని ప్రయాణికులు మండిపడుతుతున్నారు. ప్రజల సొమ్ముతో సొంత కూటమి సభలు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు పడిన అవస్థలు వర్ణనాతీతం. రెండు రోజుల నుంచి బస్సు సర్వీసులు తగ్గించడంతో ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. పశ్చిమ ప్రకాశం మార్కాపురం, గిద్దలూరు నుంచి నంద్యాల, కడప, కంభం, రాచర్ల, కొమరోలు, ఒంగోలు తదితర ప్రాంతాలకు ఎక్కువ మంది వెళ్తుంటారు. మార్కాపురం, గిద్దలూరు, పొదిలి డిపోల నుంచి 101 సర్వీసులను అనంతపురం సభకు పంపారు. దీంతో రెండు రోజులుగా పశ్చిమ వాసులు పడరాని అగచాట్లు పడ్డారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో మొత్తం 74 పల్లె వెలుగు బస్సులున్నాయి. అందులో 52 ఆర్టీసీ బస్సులు కాగా మిగిలిన 22 బస్సులు అద్దె బస్సులు. ఈ 52 బస్సుల్లో 38 బస్సులను అనంతపురంలో జరిగిన సభకు తరలించారు. మిలిగిన 14 బస్సులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రాప్తాడు, సింగనమలకు జిల్లా బస్సులు: అనంతపురం సభకు జిల్లాలోని ఒంగోలు, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులను పంపించారు. ఈ ఐదు ఆర్టీసీ డిపోల్లో మొత్తం 452 బస్సులు ఉన్నాయి. ఇందులో 315 బస్సులను సీ్త్ర శక్తికి కేటాయించారు. ఈ మొత్తంలో సుమారు 160కు పైగా బస్సులను అనంతపురం సభకు తరలించామని అధికార వర్గాలు చెబుతుండగా 300పైగా బస్సులు వెళ్లాయని ఆర్టీసీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ఈ బస్సులకు అనంతపురం జిల్లా రాప్తాడు, సింగనమల మండలాలు కేటాయించారు. మంగళవారం జిల్లా నుంచి బయలు దేరిన బస్సులు రాత్రికి ఆయా మండలాల్లో కేటాయించిన గ్రామాలకు చేరుకుని బుధవారం ఉదయం ఆయా గ్రామాల నుంచి సమీకరించిన జనాలను అనంతపురంలోని సభావేదిక వద్దకు చేర్చాయి. సభ అయిన తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు చేర్చాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. జిల్లాపై రూ.5 కోట్ల భారం: అనంతపురం సభకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్నిటినీ తరలించాల్సి రావడంతో ఆర్టీసీకి భారీగా కన్నం పడినట్లుంది. సహజంగా అయితే సీటింగ్ ప్రకారం రానుపోను లెక్కేసి అద్దె చెల్లిస్తారు. ఒక్కో పల్లెవెలుగు బస్సుకు రోజుకు రూ.55 వేల ఖర్చు వస్తుంది. ఈ లెక్కన ఒక్క ఒంగోలు డిపోకు సుమారు కోటి రూపాయల వరకు నష్టం వస్తుందని యూనియన్ నాయకులు లెక్కలేస్తున్నారు. జిల్లాలోని 5 డిపోలకు కలుపుకొని రూ.5 కోట్ల ప్రజల సొమ్ము కూటమి పాలైనట్లేనని చెబుతున్నారు. ప్రభుత్వం పేరుతో కూటమి పాలకులు కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. -
అసమర్థత పెనాల్టీలై!
పొగాకు రైతు ఉక్కిరిబిక్కిరై..గిట్టుబాటు ధర రాక ఒకవైపు..వేలం కేంద్రాల్లో తిరస్కరణకు గురౌతున్న బేళ్లతో మరోవైపు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పొగాకు రైతును పాలకులు కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. కూటమి పాలకులు, బోర్డు అధికారులు కంపెనీలతో కుమ్మకై ్క పొగాకు రైతును నట్టేట ముంచేశారు. అది చాలదన్నట్టు అదనపు కొనుగోళ్లపై జరిమానా వసూలు చేస్తామని బోర్డు అధికారులు షాక్ ఇస్తున్నారు. అదనపు కొనుగోళ్లపై గరిష్టంగా మూడు శాతం, బోర్డు అనుమతి లేకుండా పండించిన పొగాకు అమ్మకాలపై 6 శాతం జరిమానా వసూలు చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. కొనుగోళ్లు ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేయలేని బోర్డు నేడు రైతులపై భారం మోపడం సరికాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యతో అదనపు పొగాకు అమ్మకాలపై పూర్తి జరిమానాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కానీ ప్రస్తుత ప్రభుత్వ అసమర్ధత వల్ల తిరిగి జరిమానాలు అమల్లోకి వచ్చాయన్న ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతోంది. రైతుల వద్ద ఉన్న అనధికార ఉత్పత్తి పొగాకును అపరాధ రుసుము లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. అసలకే ఈ ఏడాది నష్టాలు పాలవుతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే అపరాధ రుసుము భయం పట్టుకుంది. అపరాధ రుసుము విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులను ఆదుకోవాలి. కేవలం 10 శాతమే కొనుగోలు చేస్తామని బోర్డు అధికారులు చెబుతున్నారు. – రాయపాటి సురేష్, నేతివారిపాలెం గ్రామం, కొండపి మండలం, పొగాకు రైతు. -
జగనన్నకే సాధ్యం
రాజన్న రైతు రాజ్యం దర్శి: ఆనాటి రాజన్న రైతు రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్నకే సాధ్యమవుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని బసిరెడ్డిపల్లె గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి హాజరైన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలకు పూలు చల్లుతూ డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలోకి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు లేనివారికి నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను దారుణంగా మోగించారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మహిళలను మోసం చేశారన్నారు. మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని అరకొర విదిలించి మోసం చేశారన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని మాట తప్పి రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన మోసాలే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా చేస్తున్నారన్నారు. ఈ పథకాలు ఎవరికైనా వచ్చాయా అని నిరుద్యోగులు, మహిళలను ప్రశ్నించారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, అప్పుడు అందరి కష్టాలు తీరుస్తారని అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడిన సామెతగా ఎరువులు కొరత తెచ్చి వచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. ప్రభుత్వం సబ్సిడీలో ఇవ్వాల్సిన యూరియా ఇవ్వక పోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యూరియా అక్రమ నిల్వలు గుర్తించారే కానీ ఆ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రైతలకు ఇబ్బందులు లేకుండా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ కేసరి రాంభూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ బండి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపాలిటీ కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, మాజీ నెడ్కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అమీన్ బాషా, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, గ్రామ నాయకులు శ్రీనివాసరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో రైతుల అగచాట్లు..
కనిగిరిరూరల్: వైఎస్సార్ సీపీ రైతుకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వైఎస్సార్ పాలనలో, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలో రైతులను రాజుగా చూశారని.. కానీ నేటి కూటమి ప్రభుత్వంలో రైతులకు కనీసం ఎరువులు అందించకుండా నానా అగచాట్లు పెడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రైతన్నకు అండగా నిలిచేందుకు చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం మంగళవారం కనిగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులు కష్టాల్లో కూరుకుపోయారన్నారు. రైతులకు గిట్టుబాటు ధరల లేదని, బీమా లేదు, పంట నష్ట పరిహారం లేదు, ఎరువులు, కాంప్లెక్స్, యూరియా కొరత ఇలా అనేక ఇక్కట్లకు గురవుతున్నట్లు వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అయినా.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో అయినా రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. రైతుల కోసం అండగా నిలిచింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండి పోరాటం సాగిస్తోందన్నారు. రాష్ట్రంలో గతేడాది 40 లక్షల మెట్రిక్ టన్నులు, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు వచ్చాయని తెలిపారు. కానీ ఏ ఈడాది 7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తగ్గించారన్నారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ఏడాది 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉందని తెలిసి కూడా.. రాష్ట్ర ప్రభుత్వం యూరియా, డీఏపీ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో విఫలమైందన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులను, డీఏపీలను సంవృద్ధిగా తెప్పించి ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. కూటమి పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం: దద్దాల నారాయణయాదవ్ వైఎస్సార్ హాయంలో, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. కూటమి సర్కార్‌లో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లేవని, రైతు భరోసా పథకాన్ని అరకొరకగా అందించి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు ఎరువుల కోసం పడి గాపులు కాస్తుంటే.. వ్యవసాయ శాఖ మంత్రి బఫే సిస్టమ్ లాగా వచ్చారంటూ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. రైతులకు అన్ని రకాల ఎరువులను సంవృద్ధిగా అందించాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర పాలనలోనే రాష్ట్ర ప్రజలు కూటమి సర్కార్ పై తీవ్రంగా మండిపడుతున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వైఎస్సార్ సీపీని అధికారంలోకి తెచ్చేందుకు రైతులు, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకు వినతి పత్రం అందజేశారు. తొలుత స్థానిక మున్సిపల్ చైర్మన్ గఫార్ ఇంటి వద్ద నుంచి, పామూరు బస్టాండ్ వరకు రైతులు, నాయకులు ర్యాలీగా వచ్చారు. అక్కడి నుంచి, పార్టీ నేతలు, రైతులు, రైతు నాయకులు, ప్రతినిధులు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు కసుకుర్తి ఆదెన్న, పీడీసీసీబీ మాజీ చైర్మన్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎం ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటక తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గఫార్, మడతల కస్తూరిరెడ్డి, గంగసాని లక్ష్మి హుస్సేన్‌రెడ్డి, గాయం సావిత్రి, పులి శాంతి గోవర్ధన్‌రెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, మూడమంచు వెంకటేశ్వర్లు, తమ్మినేని సుజాతరెడ్డి, ఆవుల భాస్కర్‌రెడ్డి, పోలక సిద్దారెడ్డి, డాక్టర్ రసూల్, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, గంగసాని హుస్సేన్ రెడ్డి, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, గయాజ్, దుర్గారెడ్డి, జీ శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కటికల వెంకట రత్నం, జీ ఆదినారాయణరెడ్డి, మేడికొండ జయంతి, ఓమోగా రామిరెడ్డిలు ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు చప్పిడి సుబ్బయ్య, నుసుం వెంకటరెడ్డి, టీ రత్నరాజు, పార్టీ నాయకులు జీ బొర్రారెడ్డి, యక్కంటి శ్రీను, గజ్జల వెంకటరెడ్డి, ఓకేరెడ్డి, పాలగొల్లు మల్లి కార్జునరెడ్డి, పోలు జయరాంరెడ్డి, గట్లా విజయభాస్కర్‌రెడ్డి, మితికల గురవయ్య యాదవ్, భువనగిరి వెంకటయ్య, పొల్ల సుబ్రహ్మణ్యం, తాతపుడి సురేష్, నానీ, దుగ్గిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, రాచపుడి మాణిక్యరావు, సిరుప వెంకట గోవర్దన్‌రెడ్డి, సుంకర సునీత బ్రమరాంరెడ్డి, కే కృష్ణా, చింత శ్రీనివాసులరెడ్డి, వీ వెంకటరెడ్డి తూము వెంకట రెడ్డి, సుబ్బయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
పోరు సింహాలై!
రైతు నేస్తాలై..సాక్షిప్రతినిధి, ఒంగోలు: పోలీసులను అడ్డంపెట్టుకొని ప్రభుత్వం బెదిరింపులకు దిగినా ఎక్కడా తగ్గకుండా, సర్కారు కళ్లుతెరిపించేలా వైఎస్సార్ సీపీ శ్రేణులు రైతులతో కలసి జిల్లా వ్యాప్తంగా ‘అన్నదాత పోరు’ నిర్వహించాయి. జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లలో జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని హోరెత్తించారు. అన్నదాతలకు అండగా వైఎస్సార్ సీపీ రైతు పోరు కార్యక్రమానికి పోలీసులు జిల్లా వ్యాప్తంగా అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. జిల్లాలో 30 పోలీసు యాక్టు అమలులో ఉందంటూ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత ఎస్సైలందరూ వాట్సప్‌లలో మెసేజులు పెట్టారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతులు లేవని పేర్కొన్నారు. తెల్లవారగానే పోలీసులు ముఖ్య నాయకుల ఇళ్ల వద్దకు వచ్చి రైతు పోరు కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నోటీసులు ఇచ్చారు. ముఖ్యమైన కూడళ్లు, ఊరి బయట, రహదారుల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మూడు విడతలుగా పోలీసుల అడ్డంకులు: ఒంగోలు నగరంలో అన్నదాత పోరు కార్యక్రమానికి పోలీసులు మూడు విడతలుగా అడ్డంకులు సృష్టించారు. అంబేడ్కర్ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంబేడ్కర్ భవన్ రోడ్డులోనే రైతులను, వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ నుంచి పరిమితిగా వెళ్లాలంటూ ఆంక్షలు పెట్టారు. వందలాది మందిగా వచ్చిన పార్టీ శ్రేణులు, రైతులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా పోలీసుల విధులను ఆటకం కలిగించకుండా పూర్తిగా సహకరించారు. అయినా మధ్యలో ఒకసారి, ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా పరిమిత సంఖ్యలో వచ్చిన వారిని కూడా లోనికి పోనీయకుండా పోలీసులు అడ్డుకోవటంతో ఆర్డీఓ కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కనిగిరిలో ఆరంభంలోనే కట్టడి.. కనిగిరి డివిజన్ కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్, మున్సిపల్ చైర్మన్ గఫార్ ఇంటి మలుపు వద్ద నుంచి బయటకు వచ్చి రైతులు, ప్రజలతో కలసి రోడ్డుఎక్కగానే సీఐ ఎస్కే ఖాజావలి, ఎస్సైలు అడ్డుకున్నారు. ఇంత మందికి అనుమతి లేదని నిలిపారు. శాంతియుతంగా బస్టాండ్ వరకు ర్యాలీగా వస్తామని.. ఆ తర్వాత మీ నిబంధనల ప్రకారమే మీరు అనుమతిచ్చిన వారినే ఆర్డీఓ కార్యాలయంలోకి పంపుతామని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. దాన్ని కూడా పోలీసులు సమ్మతించలేదు. 30 యాక్ట్ అమలులో ఉందని సీఐ చెప్పడంతో.. శాంతి యుతంగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్చి సెంటర్ వరకు వస్తామని పార్టీ నేతలు చెప్పారు. కొద్ది సేపు నేతలకు, పోలీసులకు వాదన జరిగింది. అనంతరం అక్కడే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి రైతులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత చర్చి సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు అంగీకారం తెలిపారు. చర్చి సెంటర్ నుంచి కేవలం అనుమతి పొందిన పేర్ల జాబితాలో ఉన్న ప్రజా ప్రతినిధులను, రైతులను, నాయకులను, మాత్రమే ఆర్డీఓ ఆఫీసులోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం వారు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. అడుగడుగునా ఆంక్షలు మార్కాపురం పట్టణంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. వైఎస్సార్ సీపీ అన్నదాత పోరు కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించారు. అయినా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల ద్వారా నాయకులు, రైతులు, ప్రజలు, కార్యకర్తలు మార్కాపురం పట్టణానికి తరలివచ్చారు. పోలీసు ఆంక్షలను కూడా లెక్కచేయకుండా రైతులు కార్యకర్తలు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రైతు బాగుంటేనే అందరమూ బాగుంటాము. మీరు కూడా రైతు బిడ్డలే అంటూ పోలీసులకు నచ్చచెప్పి రైతు పోరు కార్యక్రమానికి వచ్చారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలోకి ఎవరూ ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఐదుగురిని మాత్రమే సబ్‌కలెక్టర్ కార్యాలయం లోకి వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వారి సూచనలు పాటిస్తూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు, గిద్దలూరు ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి సబ్‌కలెక్టర్ కార్యాలయానికి తమ అనుచరులతో వచ్చారు. పాత బస్టాండులోని వైఎస్సార్ విగ్రహానికి, కోర్టుసెంటరులోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, అన్నా రాంబాబు పూల మాలలువేసి నివాళులర్పించారు. సబ్‌కలెక్టర్ త్రివినాగ్‌కు తాటిపర్తి చంద్రశేఖర్, అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి ఇతర నాయకులు వినతిపత్రం అందచేశారు. రైతుల సమస్యలను వారు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ఆర్థికంగా చితికిపోయి విలవిల్లాడుతున్న రైతన్నకు అండగా నిలిచేందుకు ఎరువుల కొరత, పంటలకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం అసమర్థ పాలన, వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ సీపీ చేపట్టిన అన్నదాత పోరుకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో ఎన్ని ఆంక్షలు పెట్టినా..ర్యాలీలకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టినా.. కర్షకులతో కలసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కదంతొక్కారు. కూటమి ప్రభుత్వంపై రణభేరి మోగించారు. అర్ధరాత్రి నుంచే నోటీసులతో పోలీసులు హడావుడి సృష్టించినా మంగళవారం ఒంగోలు, మార్కాపురం, కనిగిరి డివిజన్ కేంద్రాల్లో పోరుబాట చేపట్టారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో రైతులు, కార్యకర్తలను రానీయకుండా బారికేడ్లతో అడ్డుకుంటున్న పోలీసులుమార్కాపురంలో ఆర్డీఓ కార్యాలయం బయట భారీగా చేరుకున్న రైతులు, కార్యకర్తలు -
అక్రమ కేసుల వెనుక మంత్రి డోలా
ఒంగోలు టాస్క్‌ఫోర్స్: టంగుటూరు మండలం మర్లపాడులో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని రణరంగంగా మార్చేందుకు టీడీపీ కార్యకర్త ఈదర ప్రవీణ్‌కు మద్యం తాపించి ఉసిగొల్పడమే కాకుండా వినాయక మందిరం వద్ద నానా యాగీ చేయించడం వెనుక మంత్రి డీబీవీ స్వామి హస్తం ఉందని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. గొడవ సృష్టించేందుకు కారణమైన టీడీపీ కార్యకర్తను వదిలేసి కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై అక్రమంగా నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను ఆదిమూలపు సురేష్ పరామర్శించి ధైర్యం చెప్పారు. తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మర్లపాడులో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం వద్దకు మద్యం మత్తులో వచ్చి రచ్చ చేసినా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనం పాటించాయని గుర్తు చేశారు. అయితే గ్రామంలోని గణేశ్ మండపం వద్ద దుస్తులు విప్పి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రవీణ్‌కు దేహశుద్ధి చేశారని చెప్పారు. ఇదే అదనుగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు బనాయించి ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించి, చివరకు నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. తొలుత బెయిలబుల్ సెక్షన్లు పెట్టిన పోలీసులు ఎవరి మెప్పు కోసం నాన్‌బెయిలబుల్‌గా మార్చారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉందా ప్రశ్నించారు. ఈదర ప్రవీణ్‌ను రెండోసారి ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయడం వెనుక ముమ్మాటికీ మంత్రి స్వామి హస్తం ఉందని ఆరోపించారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఆయన వెంట టంగుటూరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.మర్లపాడు ఘటనలో వైఎస్సార్ సీపీ నాయకులకు రిమాండ్ ఒంగోలు టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 2వ తేదీన టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఐదుగురిపై పోలీసులు ఈ నెల 3న కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వినాయక విగ్రహ కమిటీ సభ్యులైన శింగమనేని బ్రహ్మయ్య, ఈదర అమరనాథ్ చౌదరి, మరో ముగ్గురిని ఘటన జరిగిన రోజే అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం సింగరాయకొండలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచేందుకు ప్రయత్నించగా న్యాయమూర్తి ఆదేశాలతో మంగళవారం హాజరుపరిచారు. ఐదుగురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ ధ్వజం సింగరాయకొండ కోర్టు ఆవరణలో బాధితులకు పరామర్శ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా -
యూరియాను నిర్ధిష్ట ధరలకు అందించాలి
● ఎరువుల ప్రైవేటు డీలర్లను ఆదేశించిన కలెక్టర్ ఒంగోలు సబర్బన్: రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు, ముఖ్యంగా యూరియాను నిర్ధిష్ట ధరలకు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రైవేటు డీలర్లు కూడా నిబంధనల మేరకు పని చేస్తూ అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆమె కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లతో మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎరువుల లభ్యతకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఐ.ఎఫ్.ఎం.ఎస్. సైట్లో నమోదు చేస్తూ ఉండాలని, ఇదే విషయాన్ని వాటి ధరలతో సహా రైతులకు తెలిసేలా షాపుల ముందు కూడా డిస్ప్లే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు ‘అనంత’ అగచాట్లు
ఒంగోలు టౌన్/పొదిలి: రాష్ట్ర ప్రభుత్వం అనంతపురంలో బుధవారం నిర్వహించనున్న సూపర్ సిక్స్, సూపర్ సక్సస్ సభకు జిల్లా నుంచి 250 ఆర్టీసీ బస్సులను తరలించారు. జిల్లాలో 5 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా మొత్తం 452 బస్సులున్నాయి. ఇందులో 315 బస్సులను సీ్త్ర శక్తికి కేటాయించారు. ఒంగోలు డిపోలో 75 బస్సులకు గాను 35 హయ్యర్ బస్సులను మినహాయించి మిగిలిన మొత్తం బస్సులను అనంతపురం సభకు తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు డిపో బస్సులను అనంతపురం జిల్లాలోని కొన్ని మండలాల ప్రజలను సభకు తరలించడానికి కేటాయించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒంగోలు నుంచి బయలుదేరిన బస్సులు రాత్రికి తమకు కేటాయించిన మండలాల్లోని గ్రామాలకు చేరుకుంటాయని, బుధవారం ఉదయం జనాలను ఎక్కించుకొని సభావేదికకు చేరుకుంటాయని, సభ అయిపోయిన తరువాత తిరిగి ప్రజలను చేరవేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కన మూడు రోజుల పాటు బస్సులు అనంతపురం సూపర్ సిక్స్ సభ డ్యూటీలోనే ఉంటాయి. ఈ మూడు రోజులు జిల్లా ప్రజలకు చుక్కలు తప్పవని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఒంగోలు నుంచి అనంతపురం సుమారు 500 కిలోమీటర్లకు పైగానే ఉంది. రాను పోను వేయి కిలో మీటర్లు ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించదని, చివరికి ఆర్టీసీ నెత్తి మీద వేస్తుందని ఆర్టీసీ యూనియన్ నాయకులు చెబుతున్నారు. సహజంగా ఏదైనా ఫంక్షన్‌కు ఆర్టీసీ బస్సు అద్దెకు తీసుకోవాలంటే 18 గంటలకు గాను రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు రుసుము వసూలు చేస్తుందని, 320 కిలో మీటర్లకు మించి ప్రయాణించకూడదని షరతు విధిస్తుందని చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే మూడు రోజులకు కలిపి రూ.5 కోట్ల భారం ప్రజలపై పడుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును ఎంతగా దుర్వినియోగం చేస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ అధికారులు మాత్రం జిల్లా నుంచి కేవలం 120 బస్సులు మాత్రమే అనంతపురం సభకు తరలించినట్లు చెప్పడం గమనార్హం. బస్సులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం జిల్లాలోని ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. గంటల తరబడి వేచి ఉన్నా బస్సులు లేవు. వచ్చిన బస్సు ఎక్కువదామంటే మహిళలు, వృద్దులు, పిల్లలకు వీలుపడలేదు. ప్రధానంగా ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. జిల్లా నుంచి 250 ‘ఉచిత బస్సు’లు అనంతపురం సభకు.. మూడు రోజులకు కానీ తిరిగి రాని బస్సులు జిల్లాకు రూ.5 కోట్ల నష్టం బస్సుల కొరతతో ప్రయాణికుల ఇక్కట్లు -
చిన్నారులకు విద్య తప్పనిసరి
● జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ ఒంగోలు: చిన్నపిల్లలకు చదువు తప్పనిసరి అని, బాలబాలికలు ఏదో ఒక విద్యా సంస్థలో చదవాలని జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో లీగల్ సర్వీస్ టు చిల్డ్రన్ అంశంపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ప్రభుత్వ విభాగం తమ పరిధిలో బాల్య వివాహాల నిర్మూలనకు, విద్యార్థులకు సరైన వైద్య సదుపాయాలు అందించేందుకు, మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు యత్నించాలన్నారు. మెరుగైన బాల సమాజానికి సహకరించాలని బాలుర కోసం సేవలు అందించే స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు లక్ష్మానాయక్, కార్మిక ఽశాఖ అధికారులు ఎలిజబెత్, పవన్‌కుమార్, వైద్య శాఖ అధికారులు డాక్టర్ భగీరథి, సీడబ్ల్యూసీ చైర్మన్ రామాంజనేయులు, ఇతర జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కట్టా శ్రీనివాసరావు, వాసాని అంకబాబు, పీర్‌బాషా పాల్గొన్నారు. -
రైతులకు అన్నీ కష్టాలే
మార్కాపురం/మార్కాపురం టౌన్: కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే అని, దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మార్కాపురం, గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో మంగళవారం వారు పాల్గొని మాట్లాడారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు: ఎమ్మెల్యే చంద్రశేఖర్ చంద్రబాబు రైతు వ్యతిరేకి అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవని విమర్శించారు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కజొన్న, వరి వేస్తున్నారని, దీంతో యూరియా, ఇతర ఎరువులు అవసరమవుతున్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇలాంటి ఎరువులన్నీ బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎరువులను 50 శాతం మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు అందుబాటులోనికి తెచ్చారని ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, రైతులకు గ్రామాల్లోనే లభించాయని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎరువులు పక్కదారి పట్టాయని అన్నారు. దీంతో రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కారని చెప్పారు. అధికారంలోకి రాగానే వెలుగొండ పూర్తిచేస్తామని చెప్పి 15 నెలలు గడిచినా రూ.100 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదన్నారు. వెలుగొండ పూర్తయితేనే కరువు పోతుందన్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం టీడీపీ నాయకులు మట్టి, ఇసుక, మైనింగ్ దేనినీ వదిలిపెట్టడంలేదని విమర్శించారు. రైతులకు అండగా వైఎస్సార్ సీపీ: అన్నా రాంబాబు వైఎస్సార్ సీపీ రైతులకు అండగా ఉంటుందని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్నదాతకు అండగా అన్నీ ఉన్నాయని, గిట్టుబాటు ధరలు, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం పంటలబీమా ఇలాంటి పథకాలన్నీ ఉండటంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతును కంటికి రెప్పలా చూసుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు భరించలేని కష్టాలు వచ్చాయని అన్నారు. యూరియా బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లిపోవడంతో పంటలకు ఎరువు దొరకదన్న ఆందోళన రైతుల్లో నెలకొందని అన్నారు. రైతుల పథకాలు నిర్వీర్యం: కేపీ నాగార్జునరెడ్డి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారని అన్నారు. ఏటా రైతు భరోసా, సున్నావడ్డీకే రుణాలు, పైసా ఖర్చులేకుండా పంటల బీమా అమలు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్ఎస్కేలను నిర్వీర్యం చేసిందని, ఏడాదికి రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానని చెప్పి మొదటి ఏడాది ఇవ్వలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతు సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరే షన్ మాజీ చైర్మన్ డాక్టర్ షంషేర్ ఆలీబేగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ సభ్యుడు వెన్న హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి
ముండ్లమూరు(దర్శి): నీళ్ల మోటారు స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన నంబూరి పెద్ద జక్రయ్య(67) తన ఇంటిలో నీళ్ల మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై పడిపోయాడు. కుటుంబ సభ్యులు స్పందించి రక్షించేలోగా మృతి చెందాడు. మృతునికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. మృతుడి కుమారుడు నంబూరి జాన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ హనుమంతరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కూటమి గద్దె దిగాలి
రైతులు బాగుపడాలంటే సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత కోల్పోయిందని వైఎస్సార్ సీపీ కొండపి ఇన్చార్జి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆక్రందనలు ఈ ప్రభుత్వానికి వినపడటం లేదా.. కనపడడం లేదా.. లేదంటే నిద్ర నటిస్తోందా అని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రం ఒంగోలులో మంగళవారం రైతులకు అండగా అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రం ఒంగోలులో పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వందలాదిగా రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పరిపాలనలో తీవ్రంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో 40 శాతానికి పైగా ఎరువుల కొరత ఉన్నట్లు స్పష్టమవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర నటిస్తోందని ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా యూరియాతోపాటు ఇతర ఎరువుల కొరతను నివారించాలని, బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలన్నారు. రైతు పండించే ప్రతి పంటకు మద్దతు ధర కల్పించాలని, ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలని, ఉచిత పంటల బీమాను ఏర్పాటు చేయాలని, అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబుకు రైతులంటేనే ఏహ్య భావం ఉందన్నారు. రైతు కన్నీరు పెడితే ఆ ఉసురు పాలకులకు తగలకపోదని బత్తుల ఆక్షేపించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కావాలని అడిగితే 40 మంది రైతులను 45 రోజుల పాటు జైలులో పెట్టించిన ఘనుడు చంద్రబాబును అని నిప్పులు చెరిగారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవికుమార్ మాట్లాడుతూ.. యూరియా కావాలంటే డీలర్లు కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కోవాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సబబన్నారు. వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్న యువత మొత్తం చంద్రబాబు సీఎం అయ్యాక వెనకడుగు వేసే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రస్తుత పరిణామాలతో గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను సీఎం చంద్రబాబు ఆత్మహత్యలప్రదేశ్‌గా మారుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికీ రైతు వ్యతిరేకమేనని మరోసారి రుజువు చేశారని దుయ్యబట్టారు. తొలుత జాతీయ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు, అనంతరం చర్చి సెంటర్లోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నకు రైతు సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, ఆళ్ల రవీంద్రా రెడ్డి, పాలడగు రాజీవ్, మన్నె శ్రీనివాసులు, లంకపోతు అంజిరెడ్డి, మలిశెట్టి దేవేంద్ర, దానం కరుణాకర్, మీరా వలి, వేమా శ్రీనివాస రావు, భూమిరెడ్డి రమణమ్మ, యనమల మాధవి, ప్రమీల, ప్రసన్న, రమణమ్మ, మసనం వెంకట్రావు, పిన్నిక శ్రీనివాసరావు, బచ్చల కోటేశ్వర రావు, చింతపల్లి ఫణీంద్ర, ఇనకొల్లు సుబ్బారెడ్డి, దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలను అన్నివిధాలా వేధిస్తున్న కూటమి ప్రభుత్వం పాలించే అర్హత కోల్పోయింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ ధ్వజం ఒంగోలులో వైఎస్సార్ సీపీ ‘అన్నదాత పోరు’కు అడుగడుగునా పోలీసుల అడ్డంకులు -
ఇన్చార్జి ప్రభుత్వ ప్లీడర్‌గా శివరామకృష్ణ
ఒంగోలు: ఇన్చార్జి ప్రభుత్వ ప్లీడర్‌గా బీవీ శివరామకృష్ణను నియమిస్తూ కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్లీడర్‌గా డి.శ్రీనివాసమూర్తి వ్యవహరిస్తున్నారు. ఆయన వద్ద నుంచి బాధ్యతలు చేపట్టాలని బీవీ శివరామకృష్ణను ఆదేశించారు. శివరామకృష్ణ ప్రస్తుతం సహాయ ప్రభుత్వ ప్లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు: చెక్ బౌన్స్ కేసులో నిందితునికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ మొబైల్ మేజిస్ట్రేట్ వి.వెంకటేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాది నంబూరి సుబ్బారావు వద్ద టంగుటూరు మండలం కందులూరు వాసి జి.ఏడుకొండలు రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కొంతకాలం తరువాత కొంతమేర బకాయి తీర్చేందుకుగాను ఫిర్యాదికి రూ.5 లక్షలకు చెక్కు ఇచ్చాడు. ఫిర్యాది చెక్కును బ్యాంకులో దాఖలు చేయగా బౌన్స్ అయింది. ఈ మేరకు ఫిర్యాది కోర్టును ఆశ్రయించగా ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి నిందితునిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ నిందితునికి ఏడాది జైలుశిక్ష, రూ.7.60 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అందులో రూ.7.50 లక్షలు నష్టపరిహారం కింద ఫిర్యాదికి చెల్లించాలని, మిగిలిన రూ.10 వేలు జరిమానా కింద ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు. ● పొలంలో ఉన్న భర్తకు ఆహారం తీసుకెళ్తుండగా గుండెపోటు.. పెద్దదోర్నాల: పొలంలో వ్యవసాయ పని చేస్తున్న భర్త ఆకలి తీర్చేందుకు రొట్టెలు తీసుకెళ్తున్న వృద్ధురాలు మార్గమధ్యంలో గుండెపోటుకు గురై బైక్ నుంచి జారిపడి మృతి చెందింది. ఈ విషాద ఘటన పెద్దదోర్నాల మండలంలోని ఐనముక్కల వద్ద మంగళవారం చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు.. ఐనముక్కలకు చెందిన దర్శనం కాశయ్య, నాగమ్మ(59) భార్యాభర్తలు. బలిజేపల్లి గూడేనికి సమీపంలో ఉన్న సొంత వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న భర్తకు రొట్టెలు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరిన నాగమ్మ అదే మార్గంలో బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని యడవల్లి సమీపంలో వదిలిపెట్టాలని కోరింది. ఈ క్రమంలో ఐనముక్కల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు వచ్చేసరికి తీవ్రమైన గుండెపోటు రావటంతో నాగమ్మ కిందపడిపోయింది. దీంతో ఆమె కుమారుడు, బైక్‌పై వెళ్తున్న యువకుడు ఇద్దరూ కలిసి ఓ ఆటోలో నాగమ్మను దోర్నాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేస్తుండగా ఆమె మృతి చెందింది. గుండెపోటు వల్లే నాగమ్మ బైక్‌పై నుంచి జారి పడినట్లు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేయలేదు. -
మాతా, శిశు మరణాలు నివారించాలి
● వైద్యశాఖాధికారులతో సమీక్షలో కలెక్టర్ ఒంగోలు సబర్బన్: మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రతీఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఎండీఆర్ సమావేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ మూడు నెలల కాలంలో ఒక బాలింత మృతి చెందినట్లు అధికారులు వివరించగా, మృతికి కారణాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న వసతులు, వైద్యుల గురించి ప్రశ్నించారు. బాలింత మృతిపై వైద్యారోగ్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి సమగ్ర నివేదికను అందజేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం గర్భాశయ శస్త్రచికిత్సలపై కలెక్టర్ సమీక్షించారు. -
బతక నీవక!
సాగు నీవక..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో 2024–25 రబీ సీజన్లో సాధారణంగా 3,97,880 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేయాల్సి ఉంది. అయితే, కేవలం 2,99,331 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో కూడా దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో నిలువునా ఎండిపోయాయి. మిగతా 1.99 లక్షల ఎకరాల్లో కూడా సగానికిపైగా ఎకరాల్లో దిగుబడి మరీ దారుణంగా పడిపోయింది. ఇక ఖరీఫ్ సీజనూ అంతే. జిల్లాలో 1,29,102 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా 20 శాతం కూడా సాగుకాలేదని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది కాలంలో మిర్చి, పొగాకు, వరి, శనగ, పత్తి ఇలా అన్ని రకాల రైతులు కనీస మద్దతు రాక ఆర్థికంగా కుదేలయ్యారు. కనీస పెట్టుబడులు రాక, చేసిన అప్పులు తీర్చలేక 13 నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 13 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫలితంగా ఆ కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాల్లేవు. దర్శిలో పక్కదారి..కొండపిలో ఖాళీగా ఆర్ఎస్కేలు..గిద్దలూరులో అరకొరగా.. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 24 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నారు. మరో పక్క వెయ్యి టన్నుల యూరియా జిల్లాకు వస్తుందంటూ జేసీ ప్రకటించడం గమనార్హం. మరో వైపు ఆర్ఎస్కేల్లో నిల్వఉన్న యూరియాను పచ్చనేతలు చెప్పిన వారికే ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శి నియోజకవర్గంలో ఆర్ఎస్కేలకు చేరాల్సిన యూరియా అధికార పార్టీ నేతల దుకాణాలకు వెళుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా దుకాణాలకు 30 శాతం, ఆఎస్కేలు, సొసైటీలకు 70 శాతం యూరియా అందాల్సి ఉంది. వచ్చిన డైబ్బె శాతం యూరియాను కూడా టీడీపీ అనుకూల ఎరువుల దుకాణాదారులు నేరుగా తమ గోడౌన్లలో దింపుకుని బ్లాక్ మార్కెట్లో గుట్టు చప్పుడు కాకుండా అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ధర ప్రకారం రూ.266.50 కు విక్రయించాలి. అయితే దర్శి నియోజకవర్గంలో యూరియా ధరలు బ్లాక్ మార్కెట్లో రూ.450 నుంచి రూ.500 వరకు ఉంది. అయితే నియోజకవర్గంలో యూరియా కొరత సృష్టించి మొత్తం బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేపట్టారు.ఇక కొండపిలో అయితే మండల స్థాయి వ్యవసాయాధికారులు రైతు సేవా కేంద్రాల్లో యూరియా పుష్కలంగా ఉందని చెబుతున్నా ఆర్ఎస్కేల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. నియోజకవర్గం మొత్తంలో కేవలం మర్రిపూడి మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో మాత్రమే యూరియా అందుబాటులో ఉంది. ప్రైవేటు దుకాణాల్లో యూరియా బస్తా ధర రూ.266 రూపాయలకు అమ్మాల్సి ఉండగా రూ.350 కు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో యూరియా ఆర్ఎస్కేలకు పూర్తి స్థాయిలో అందడంలేదు. అరకొరగా రావడంతో రైతులు అధిక ధరకు దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. గిద్దలూరులోని ఉయ్యాలవాడ, గడికోట ఆర్ఎస్కేలలో 25 టన్నులకు 12 టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. అర్థవీడు మండలంలో ప్త్రెవేట్ దుకాణాల్లో గుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తున్నారు. 12 టన్నులకు ఆర్డర్ పెడితే నేటికి రాలేదు. కంభం, రావిపాడు రైతు భరోసా కేంద్రాలకు 12 టన్నుల యూరియా ఆర్డర్ పెడితే ఆరు టన్నులే వచ్చింది. బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్లలో రైతులకు సరఫరా చేయాల్సిన యూరియాలో ఇప్పటి వరకు సగమే ఇచ్చారు. రాచర్ల మండలంలో గడిచిన రెండు నెలలుగా జేపీ చెరువు రైతు సేవా కేంద్రంలో ఇప్పటి వరకూ యూరియా స్టాక్ లేకపోవడంతో రైతులు ప్రైవేటు ఎరువుల షాపుల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. ఇలా అరకొరగా యూరియా పంపిణీ చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన ఉండాలి
● ఐసీడీఎస్ పీడీ సువర్ణ ఒంగోలు సబర్బన్: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టం–2013 గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీ సువర్ణ పేర్కొన్నారు. సోమవారం మీ కోసం భవన్లో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి–సంకల్ప్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ఈ కార్యక్రమంలో ప్రొటెక్షన్, ప్రివెన్షన్, రెడ్రసెల్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్‌కు సంబంధించి జిల్లాలో పని చేస్తున్న ఏ కార్యాలయంలోనైనా, ఏ శాఖలోనైనా, పదిమంది లేదా అంతకంటే ఎక్కువమంది మహిళా ఉద్యోగులు ఉంటే కచ్చితంగా లోకల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సదరు వివరాలను పీడీ ఐసీడీఎస్ వారికి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. కార్యక్రమంలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఎంతమంది సభ్యులు ఉండాలి, కమిటీ ఆవశ్యకతను గురించి వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ, డీఆర్ఓ, ఒంగోలు ఆర్డీవో, వన్ స్టాప్ సెంటర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ‘కళాఉత్సవ్–2025’ ను జిల్లా స్థాయిలో సెప్టెంబరు 11, 12 తేదీల్లో ఆయా ఉమ్మడి జిల్లాల్లోని డైట్ లలో నిర్వహించనున్నట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, కళాకౌశలం తదితర అంశాలను వెలికితీసి వారికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మంచి గుర్తింపును అందించే ప్రక్రియే ఈ ‘కళాఉత్సవ్–2025’ అని అన్నారు. ఇందులో 6 ప్రధాన, 12 ఉపప్రధాన అంశాల్లో ఈ పోటీలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల పరిధిలోని 9,10,11,12 తరగతులు చదివే ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు గల ప్రైవేట్, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్, సంక్షేమ గురుకులాలు, విద్యార్థినీ విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈ నెల 11వ తేదీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, పర్చూరు డివిజన్లు, 12వ తేదీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కందుకూరు డివిజన్లలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. -
అక్రమ కేసులు.. వేధింపులు
ఒంగోలు టౌన్: వినాయక నిమజ్జనం ఊరేగింపు వివాదంలో అక్రమ కేసులతో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గణేష్ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న భక్తులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై హత్యాప్రయత్నం కేసులు నమోదు చేయడమే కాకుండా ఆరుగురు కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అంతే కాకుండా మరో 50 మందిపై కూడా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా న్యాయవాదులు, పరామర్శకు వెళ్లిన పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టడం విమర్శలపాలవుతోంది. జగన్ పాటలు పెట్టడమే నేరమా... నగరంలోని శ్రీనగర్ కాలనీ 4వ లైనులో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల అనుమతితో ఆదివారం నిమజ్జనానికి బయలుదేరారు. భక్తులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంలో ఉన్న కొందరు యువకులు ఊరేగింపులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన పాటలు పెట్టారు. ఇదే పెద్ద నేరమైపోయిందని కాలనీ వాసులు, గణేష్ భక్తులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వాపోతున్నారు. నిజానికి ఈ నిమజ్జన ఊరేగింపు కర్నూలు రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, అద్దంకి బస్టాండు సెంటర్, కొత్తపట్నం బస్టాండు సెంటర్ల మీదుగా కొత్తపట్నం బీచ్‌కు వెళ్లాల్సి ఉంది. ఊరేగింపులో రెండు డీజేలను కూడా ఏర్పాటు చేశారు. ఊరేగింపు మొదలైనప్పటి నుంచి పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం మొదలు పెట్టినట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. ఊరేగింపు ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గరకు రాగానే ట్రాఫిక్ ఎస్సై దాసరి శ్రీనివాసరావు, కానిస్టేబుల్ జి.రవికుమార్ అడ్డుకున్నారు. డీజే ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు కొందరు గణేష్ భక్తులు చెబుతున్నారు. దీంతో గణేష్ భక్తులు, మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, భక్తులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళ ఎత్తుకొని ఉన్న చిన్నారి కిందపడిపోయింది. ఆందోళనకు గురైన మహిళలు చిన్నారిని కాపాడుకునే ప్రయత్నంలో పోలీసులను పక్కకు తోశారు. ఈ ప్రయత్నంలో మరికొందరు మహిళలు కూడా కిందకు పడిపోయారు. తోపులాట జరుగుతున్న సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేయడంతో పలువురు మహిళలు, చిన్నారులకు దెబ్బలకు తగిలాయి. వాహనంపై అమర్చిన డీజేలను కూడా పోలీసులు తీసుకెళ్లారు. అయినా భక్తులు ఊరేగింపుగా కొత్తపట్నం బయలుదేరారు. ఈ ఘటనను మనసులో ఉంచుకున్న పోలీసులు కొత్తపట్నంలో నిమజ్జనం చేయకుండా అడ్డుకున్నట్లు భక్తులు చెబుతున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీనగర్ కాలనీలో భయాందోళనలో భక్తులు.. వినాయక నిమజ్జనం ఊరేగింపు ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆరుగురు భక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మరో 50 మందిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొనడంతో శ్రీనగర్ కాలనీలో భక్తులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బిక్కుబిక్కుమంటున్నారు. డివిజన్లోని 1వలైనులో నివసించే ఒక టీడీపీ నాయకుడు చెప్పిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సదరు టీడీపీ నాయకుడు ఎవరి పేరు చెబుతారోనన్న ఆందోళన కనిపిస్తోంది. దేవుడి ఊరేగింపును కూడా రాజకీయాలు చేయడమేమిటని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. పరామర్శకు వెళ్లిన వారిపై కేసులు... వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి తాలూకా పోలీసు స్టేషన్‌కు తీసుకొస్తున్నారన్న సమాచారంతో నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు కొంతమంది న్యాయవాదులతో కలిసి పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లారు. అక్కడ వారు లేకపోవడంతో డీఎస్పీని కలిసి మాట్లాడదామని డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆయన ముందే పోలీసు వ్యానులో పార్టీ కార్యకర్తలను తీసుకొని రావడంతో వారిని పరామర్శించేందుకు ప్రయత్నించారు. ఈలోపు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తన చాంబర్ నుంచి బయటకు వచ్చారని, వచ్చీ రాగానే ఆగ్రహంతో కేకలు పెడుతూ చుండూరి రవిబాబు, ఒంగోలు బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు నగరికంటి శ్రీనివాసరావు, జయచంద్ర నాయక్, షేక్ హిదాయతుల్లాపై అగ్గిమీద గుగ్గిలమయ్యారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. న్యాయవాదులనుద్దేశించి కులం పేరుతో దూషించారని, ఇక్కడేం పనిరా అంటూ బూతులు తిట్టారని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా చుండూరి రవిబాబు, ముగ్గురు న్యాయవాదులపై విధులను అడ్డుకున్నట్లు 132 బీఎన్ఎస్ఎస్ కేసులు నమోదు చేయడంపై న్యాయవాదుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేవుడి బొమ్మ గిఫ్ట్ ఇచ్చినందుకు అరెస్టు చేస్తారా... వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయంలో పోలీసుల మీద దాడి చేసినందుకు ఆరుగురి మీద హత్యాప్రయత్నం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్న మాటలు నిజం కాదని స్థానికులు చెబుతున్నారు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న మురుక నారాయణ రెడ్డిని వినాయకుడి విగ్రహం గిఫ్ట్‌గా ఇచ్చినందుకు అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. దేవుడి బొమ్మ గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా నేరమేనా అని పలువురు గణేష్ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరుగురి మీదే కాకుండా మరో 50 మంది మీద కూడా కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరెంత మంది అమాయకులను అరెస్టు చేస్తారోనని విమర్శిస్తున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి తప్పుడు కేసులు నమోదు చేయవద్దని కోరుతున్నారు. -
కారు ఢీకొని వృద్ధుడు మృతి
ఒంగోలు టౌన్: రాంగ్ రూట్లో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మోటారు బైకును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన త్రోవగుంట బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు మండలంలోని అల్లూరు సీవై కాలనీకి చెందిన తొలవల శ్రీను, ఇండ్ల శ్రీను, అద్దూరి బ్రహ్మయ్య(60) బైక్‌పై ఒంగోలు నుంచి త్రోవగుంట వెళ్తున్నారు. త్రోవగుంట బ్రిడ్జి దిగిన వెంటనే ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన కారు వీరి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్య అక్కడికక్కడే మరణించాడు. త్రగాత్రులు తొలవల శ్రీను, ఇండ్ల శ్రీనును జీజీహెచ్‌కు తరలించారు. తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.బైకు ఢీకొని మరో వృద్ధుడు..మార్కాపురం: బైకు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్టేట్ వద్ద చోటుచేసుకుంది. పట్టణ పోలీసుల కథనం మేరకు.. ఎస్టేట్‌లో నివసించే ఎన్.వీరారెడ్డి (60) సోమవారం సాయంత్రం రోడ్డు దాటుతుండగా కొనకనమిట్ల వైపు నుంచి మార్కాపురం వస్తున్న బైకు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలైన వీరారెడ్డిని స్థానికులు జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా కలుజువ్వలపాడు వద్ద వీరారెడ్డి మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ పోలీసులు తెలిపారు.కావలి వద్ద ఒంగోలు వాసి ఆత్మహత్య!ఒంగోలు టౌన్: కావలి రైల్వే స్టేషన్లో ఒంగోలు పరిసర ప్రాంతాలకు చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. కావలి స్టేషన్లో దక్షిణం వైపున గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పూరి ఎకై ్సప్రెస్ రైలు కింద పడి మరణించాడు. మృతుడి వయసు 55 ఏళ్లు ఉంటుంది. తెలుపు రంగు చొక్కా, పిస్తా గ్రీన్ కలర్ లుంగీ ధరించి ఉన్నాడు. అతడి వద్ద చైన్నె సెంట్రల్ నుంచి ఒంగోలు వరకు తీసుకున్న టికెట్ లభ్యం కావడంతో అతను ఒంగోలు పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. వివరాల కోసం 94406 27648ను సంప్రదించాలని జీఆర్పీ ఎస్సై కె.వెంకటరావు సూచించారు. -
స్నేహితుడే కాలయముడు!
బేస్తవారిపేట: బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య(25)ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రేమించిన యువతి తండ్రికి తన గురించి చెడుగా చెప్పాడన్న అనుమానంతో మృతుడికి స్నేహితుడైన యువకుడు, తన మరో ఇద్దరు మిత్రులతో కలిసి హత్యకు పూనుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సోమవారం బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. బ్రహ్మయ్య, గడ్డం వెంకట సాయి తేజ(రవి) ఇద్దరు స్నేహితులు. రవి అదే గ్రామంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇష్టపడిన అమ్మాయికి చెడుగా చెప్పడంతోపాటు తన ప్రేమను చెడగొట్టాడని బ్రహ్మయ్యపై రవి కక్ష పెట్టుకున్నాడు. జంక్షన్ సమీపంలో త్రిలోక పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ ప్లాట్లలో తరచూ ఫోన్ మాట్లాడుతున్న బ్రహ్మయ్యను అక్కడే చంపాలని నిర్ణయించుకున్నాడు. హత్య చేయడానికి 15 రోజులుగా ముందుగానే ఓ కత్తిని ఖాళీ ప్లాట్లలో దాచిపెట్టాడు. ఒక్కడినే హత్య చేయలేనని భావించి, అతని వాటర్‌ప్లాంట్‌లో గతంలో పనిచేసిన బాలుడికి డబ్బు ఆశ చూపాడు. ఈనెల 3వ తేదీన బ్రహ్మయ్యను హత్య చేసేందుకు పథకం సిద్ధం చేశానని, వాటర్ ప్లాంట్‌లో పనిచేసిన వ్యక్తికి చెప్పాడు. అతను మరో స్నేహితుడితో కలిసి సాయిబాబా ఆలయానికి వెళ్లే రోడ్డులో కాపుకాశారు. హత్య జరిగిన రాత్రి 10 గంటల సమయంలో బ్రహ్మయ్య, రవి ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో యువతితో ప్రేమను చెడగొట్టిన విషయం, ఆ యువతి తండ్రికి చెడుగా చెప్పడంపై రవి ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుసుకుంది. మద్యం మత్తులో ఉన్న బ్రహ్మయ్యపై రవి తన ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి బండరాయితో దాడి చేశాడు. అనంతరం ఛాతీపై ఆరుసార్లు కత్తితో పొడిచారు. బ్రహ్మయ్య మృతదేహాన్ని చిల్లచెట్లలోకి ఈడ్చుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. బ్రహ్మయ్యకు చెందిన సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన వస్తువులను చిన్నకంభం సమీపంలోని ఉప్పువాగులో పడేశారు. ప్రధాన నిందితుడు రవి, తన ఇద్దరు మైనర్ స్నేహితులను ఆదివారం మధ్యాహ్నం జేబీకే పురం రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో కంభం సీఐ మల్లికార్జున, బేస్తవారిపేట, కంభం ఎస్సైలు ఎస్వీ రవీంద్రారెడ్డి, బి.నరసింహారావు పాల్గొన్నారు. దరగా గ్రామానికి చెందిన బ్రహ్మయ్య హత్య కేసులో ముగ్గురు అరెస్టు యువతిని ప్రేమించే విషయంలో గొడవే హత్యకు కారణం నిందితుల్లో ఇద్దరు మైనర్లు కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు -
పోలీసు గ్రీవెన్స్‌కు 49 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 49 ఫిర్యా దులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాదితులు పోలీసు అధికారులను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. బా ధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు అధికారులు ఆయా పోలీసు స్టేషన్ అధికారులకు పోన్ చేసి చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీటీసీ ఇన్స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.చెన్నకేశవుని హుండీ ఆదాయం రూ.12.45 లక్షలుమార్కాపురం టౌన్: శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవస్వామి హుండీ ఆదాయం రూ.12.45 లక్షలు వచ్చిందని ఈఓ జి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం చెన్నకేశవస్వామి ఆలయంలో 4 నెలల 16 రోజులకుగానూ హుండీ కానుకలు లెక్కించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ పర్యవేక్షకులు సీహెచ్ వేణుగోపాల్‌రావు, రాజ్యలక్ష్మి సేవా సంఘం భక్త మహిళా సమాజం, అర్చక సిబ్బంది పాల్గొన్నారు. -
ఇదేమి కవరింగ్ నానోయ్!
దర్శి: యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు సెలవిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అదేమంటే.. ఈ ఏడాది ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పాలసీ తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. మంత్రుల దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యేల వరకు అందరూ ఇదే పాట పాడుతున్నారు. వాస్తవానికి ఒక ఎకరా విస్తీర్ణంలో సాగు చేసే పంటల రకాన్ని బట్టి ఎరువులు ఎంత మోతాదులో వినియోగించాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తారు. నిర్దేశిత పరిమాణంలో రైతులకు ఎరువులు సరఫరా చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభంలోనే చేతులెత్తేసింది.ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రైతు సేవా కేంద్రాలకు గానీ, సొసైటీలకు గానీ ఎరువులు పూర్తి స్థాయిలో చేర్చకుండా పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగు ఇప్పటి వరకు 45 శాతం మించలేదు. అయినప్పటికీ ఎరువుల కొరత ఉత్పన్నమవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ఎరువులను సైతం ఎమ్మార్పీ ధరకు ఇవ్వలేకపోవడంపై రైతులు మండి పడుతున్నారు.బ్లాక్ దందాను కప్పెట్టేందుకే..రైతులకు అందించాల్సిన యూరియాను అక్రమంగా నిల్వ చేయడం, అత్యధికంగా వరి, ఇతర పంటలు సాగు చేస్తున్న ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడం, పరిశ్రమల అవసరాలకు తరలిపోతున్న యూరియాను అడ్డకోకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు దాపురించాయి. యూరియా కొరత ఏర్పడే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టకుండా చోద్యం చూసిన ప్రభుత్వం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పస లేని వాదనలు తెరమీదికి తెస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన వారిలో కూటమి నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం, రైతులు, రైతు సంఘాల నాయకులు ధర్నాలకు దిగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో నానో యూరియా పేరుతో కూటమి నేతలు సహా వ్యవసాయాధికారులు కవర్ డ్రైవ్‌లు చేస్తుండటం చర్చనీయాంశమైంది.పాడి రైతుల గోడు పట్టేదెవరికి?పంటకు యూరియా దొరక్క రైతులు అల్లాడుతుంటే.. పాడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గేదెలకు ఆహారంగా అందించే సొప్ప, పచ్చి గడ్డి లాంటి రకాలకు యూరియా తప్పనిసరి. ఇతర రకాల ఎరువులు అధిక ధరకు కొని వేసినా యూరియాతో వచ్చే పెరుగుదల రాదని పాడి రైతులు చెబుతున్నారు. పచ్చిగడ్డి కొరత కారణంగా పాల దిగుబడి కూడా తగ్గిపోతోందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కూటమి పాలనలో రైతు కంట కన్నీరే..
● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రవర్తనే ఇందుకు నిదర్శనమని, ఎరువుల కోసం రైతులు పడుతున్న బాధలే సాక్ష్యమని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సింగరాయకొండలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రామన్ని విజయవంతం చేయాలని రైతులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏటా 16 లక్షల టన్నుల ఎరువులు అవసరమైతే కేవలం 11 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల వెల్ఫేర్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఏపీలో 40 శాతం ఎరువుల కొరత ఉందన్నారు. యూరియా వాడితే క్యాన్సర్ సోకుతుందని సీఎం చంద్రబాబు చెప్పడాన్ని తప్పుబట్టారు. కేంద్రం సరఫరా చేసే ఎరువులను మనకు ఎంత అవసరమో తెప్పించకుండా, బ్లాక్‌మార్కెట్‌ను ప్రోత్సహిస్తూ ఎరువుల వాడకం తగ్గించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రూ.266 యూరియా బస్తాను బ్లాక్మార్కెట్లో రూ.450 అమ్ముతుంటే సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బాపట్ల, కృష్ణా, కడప జిల్లాలో ఎరువుల కొరత ఉందని సాక్షాత్తు చంద్రబాబే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఈఎస్సై ఆస్పత్రుల కుంభకోణం, వ్యవసాయ పరికరాల కొనుగోలు కుంభకోణాల్లో నిండా మునిగిన అచ్చెన్నాయుడు ఇప్పుడు ఎరువుల వ్యవహారంలో రూ.300 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సంవత్సరం మార్కెఫెడ్ ద్వారా సొసైటీలు, ఆర్బీకేలు, మార్కెట్ కమిటీల ద్వారా సరఫరా చేసే ఎరువుల కన్నా ప్రైవేటుకు అధనంగా పంపిణీ చేశారని, ఇందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నదాత పోరులో భాగంగా ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా చూడాలని, బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపి ఎరువులను ప్రక్కదారి పట్టిస్తున్న వారిపై ఎస్మా చట్టం విధించాలని, పంటలకు గిట్టుబాటు ధర, భీమా కల్పించాలని, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మంగళవారం ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేస్తామని, ఈ కార్యక్రమానికి రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అన్నదాత పోరు వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండాబత్తిన మాధవరావు, పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల రామారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆలయాల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు అరెస్టు
ఒంగోలు టౌన్: దేవాలయాల తాళాలు పగలగొట్టి చోరీ చేయడంతోపాటు మోటారు బైకులను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను ఒంగోలు సీసీఎస్, తాళ్లూరు పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. సోమవారం సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ జగదీష్ వెల్లడించారు. పామూరు మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన పసుమర్తి లక్ష్మీ నారాయణ, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన పులి అంజిరెడ్డి స్నేహితులు. దొంగతనాలు చేయగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. వీరిపై జిల్లాలోని పుల్లలచెరువు, కనిగిరి, సిఎస్ పురం, పొదిలి, ఒంగోలు టూ టౌన్, ఒంగోలు తాలుకా, త్రిపురాంతకం, దర్శి, టంగుటూరు, మద్దిపాడు, పల్నాడు జిల్లాలోని వినుకొండ, రొంపిచెర్ల, పిడుగురాళ్ల, వినుకొండ, గుంటూరు జిల్లాలోని అరండల్ పేట, తాడేపల్లి, కర్నూలు జీఆర్పీ, నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి. ఈ నెల ఒకటో తేది రాత్రి తాళ్లూరు మండలం సోమవరప్పాడు గుంటిగంగ దేవాయలంలో శివాలయం గేటు తాళాలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. గత నెల ఆగస్టు 30వ తేదీన దర్శిలోని అద్దంకి రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిలిపి ఉన్న మోటార్ సైకిల్‌ను అపహరించారు. నరసరావుపేట, గుంటూరులోనే ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు సీసీఎస్ సీఐ జగదీష్, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున రావు, ఏఎస్ఐ మోహనరావు, సీసీఎస్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి గుంటిగంట ఆలయంలో చోరీ కేసు దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం గుంటిగంగ ఆలయ పరిసరాల్లోని వడియరాజుల సత్రం వద్ద ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7,060 నగదు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. -
‘లాయరైతే ఏంట్రా.. నా కొడకా!’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘లాయరైతే ఏంట్రా.. నా కొడకా!. నువ్వో లాయర్వి. నీదొక ప్రాక్టీస్. ట్రైబల్ నా కొడకా. వీడితోపాటు మీరు కూడా వచ్చారా. మర్యాదగా బయటకు పొండి’ అని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు న్యాయవాదులపై బూతులతో రెచి్చపోయారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఒంగోలు శ్రీనగర్ కాలనీ 4వ లైనులో వినాయక చవితి సందర్భంగా కాలనీకి చెందిన ప్రజలు, వైఎస్సార్సీపీ సానుభూతిపరులు పోలీసుల అనుమతి మేరకు ఆదివారం ఉదయం 9 గంటలకు వినాయక నిమజ్జన ఊరేగింపు చేపట్టారు.మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటలు పెట్టారన్న అక్కసుతో పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఊరేగింపు కర్నూలు రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగా ట్రాఫిక్ ఎస్సై, కానిస్టేబుళ్లు ఊరేగింపును అడ్డుకున్నారు. విగ్రహం ఉన్న వాహనాన్ని ముందుకు కదలనివ్వకుండా ట్రాక్టర్‌కు అడ్డుగా నిలబడ్డారు. దీంతో పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దాంతో తాలూకా పోలీసులు లాఠీచార్జి చేశారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా లాఠీలు ఝళిపించారు.ఊరేగింపులో పెట్టిన డీజేలు తీసుకెళ్లారు. తరువాత నిమజ్జనం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏడుగుర్ని అదుపులోకి తీసుకొని డీఎస్పీ కార్యాలయం వెనక ఉన్న పాత పోలీసు క్వార్టర్స్‌లో నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ నాయకులు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, జయచంద్ర నాయక్, షేక్ హిదాయతుల్లాతో కలిసి సాయంత్రం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఇది చూసిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు రెచ్చిపోయారు. కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేయించి.. లాఠీలు, కర్రలతో చుండూరి రవిబాబు, న్యాయవాదుల మీదకు వచ్చారు.న్యాయవాది జయచంద్ర నాయక్‌ను ఉద్దేశించి కులం పేరుతో దూషించారు. ‘న్యాయవాదులైతే ఇక్కడేం పని. బయటకు దెం..య్యండని’ బూతులు లంకించుకున్నారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వచి్చన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, న్యాయవాదులు నగరికంటి శ్రీనివాసరావు, జయచంద్ర నాయక్, షేక్ హిదయతుల్లాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులపై పోలీసు విధులకు ఆటంకం కలిగించినట్టు కేసు నమోదు చేశారు. దీంతో తనను కులం పేరుతో దూషించారని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుపై టూటౌన్ పోలీసు స్టేషన్లో న్యాయవాది జయచంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. -
బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో చిన్నారుల సత్తా
ఒంగోలు: ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో ఒంగోలు తైక్వాండో అసోసియేషన్ చిన్నారులకు ఆదివారం బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరైన చిన్నారులు సత్తా చాటి వివిధ రకాల బెల్ట్‌లను కై వసం చేసుకున్నారు. బాలుర విభాగంలో రుత్విక్ కృష్ణ, రోహిత్, షాదాబ్, శివ సూర్యప్రకాష్, జితేష్రెడ్డి, ముస్తఫా, లోహిత్, షియాబ్, మోహిత్ రెడ్ బెల్టులు, హేమంత్ నాగసాయి బ్లాక్ బెల్టు కై వసం చేసుకున్నారు. బాలికల విభాగంలో రవితరణి, సహస్ర రెడ్ బెల్టులు, సాదియా అన్జుం, యశస్వి ఎల్లో బెల్టులు సాధించారు. ఎగ్జామినర్‌గా మాస్టర్ షేక్ కరిముల్లా వ్యవహరించగా, చిన్నారులను జాతీయ తైక్వాండో మాస్టర్ బీవీ రమణయ్య, షేక్ ఖలీఫాతుల్లా బాషా అభినందించారు. కార్యక్రమాన్ని బ్లాక్ బెల్ట్ 2వ డాన్ షేక్ ఆరిఫ్, బ్లాక్ బెల్ట్ ఒకటో డాన్లు షేక్ షబ్బీర్, అభిషేక్, విఘ్నేష్ పర్యవేక్షించారు. ఒంగోలు: క్రికెట్ అండర్–14 బాలుర జిల్లా జట్టును ఆదివారం స్థానిక మంగమూరు రోడ్డులోని ఏసీఏ సబ్ సెంటర్ నెట్స్‌లో ఎంపిక చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 90 మందికిపైగా క్రీడాకారులు హాజరవగా, వారి నైపుణ్యాలను పరీక్షించి 39 మందిని ప్రాథమికంగా ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయి మాజీ క్రీడాకారుడు సీహెచ్ విజయ్‌కుమార్ పరిశీలించారు. ప్రాథమికంగా ఎంపికై న 39 మందికి బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలోని క్రికెట్ స్టేడియంలో పలు మ్యాచ్‌లు నిర్వహించి బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్, ఫీల్డింగ్ అంశాలలో నైపుణ్యాలను పరిఽశీలించిన అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. తుది జట్టుకు ఎంపికై న 16 మంది అక్టోబరు నెలలో జరిగే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం, నల్లూరి రవి, ఉండవల్లి రాము, నాదెండ్ల శ్రీను, కొప్పోలు సుధాకర్, లెఫ్ట్ శ్రీను, బాబూరావు తదితరులు పాల్గొన్నారు. జరుగుమల్లి(సింగరాయకొండ): ప్రమాదవశాత్తు ముసి వాగులో పడి వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం...జరుగుమల్లి మండలం పాలేటిపాడు పంచాయతీ పీఎంవీ కండ్రిక గ్రామానికి చెందిన వెంకటేష్ ఈ నెల 5న ఇంటి పందిరి కర్రల కోసం వాగు అవతలకు వెళుతున్నానని సోదరుడు వెంకట్రావుకు చెప్పి వెళ్లాడు. ఆ సమయంలో వెంకటేష్ మద్యం మత్తులో ఉన్నాడు. అయితే ఆ తరువాత నుంచి వెంకటేష్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు శనివారం వాగు వెంబడి వెతికినా ప్రయోజనం లేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వాగు ఒడ్డున మృతదేహం ఉందని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా వెంకటేష్ మృతదేహంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. -
బోధన సామర్థ్యాలు పెంచుకోవాలి
ఒంగోలు సిటీ: మారుతున్న కాలానికి అనుగుణంగా టీచర్స్ తమ బోధనా సామర్థ్యాలను పెంచుకొని విద్యార్థులకు నైపుణ్యం, నైతికతతో కూడిన విద్యను అందజేసి వారిని ఉన్నత శిఖరాలకు చేరుకొనేలా మీ భోధన కొనసాగాలని డీఈఓ ఏ.కిరణ్‌కుమార్ అన్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళా క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్ మాట్లాడారు. ఉపాధ్యాయులు కాలపరీక్షకు తట్టుకొని నిలబడాలని తాము బోధించే విద్య ద్వారా సమాజ స్థితిగతులను మార్చగలుగుతారన్నారు. రాబోవు కాలంలో కృత్రిమమేధ ద్వారా విద్యాబోధన జరిగే అవకాశం ఉందని దానికి తగిన విధంగా ఉపాధ్యాయులు తమ సామర్ధ్యలను మెరుగుపరచుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన అపుస్మా జిల్లా అధ్యక్షుడు కొల్లా మాధవరావు మాట్లాడుతూ అపుస్మా యూనియన్ ప్రతిసంవత్సరం క్రమం తప్పకుండా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారికి సన్మానం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అపుస్మా జోన్–3 ప్రెసిడెంట్ ఏ.వి.సుబ్బారావు, ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఆవుల వెంకటరమణారెడ్డి, జిల్లాలోని అన్ని నియోజకవర్గ అధ్యక్షులు, 100 మందికి పైగా కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పార్టీ కార్యకర్తల మీద చేయిపడితే సహించం
ఒంగోలు టౌన్: పార్టీ కార్యకర్తల మీద పోలీసులు చేయివేస్తే సహించేది లేదని, కార్యకర్తల కోసం ఎందాకై నా వెడతానని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు స్పష్టం చేశారు. అవసరమైతే తనపై ఎన్నికేసులు పెట్టినా పర్వాలేదుకానీ, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. వినాయక నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టు సమాచారం తెలుసుకొని డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన కొత్తపట్నం బస్టాండులో మీడియాతో మాట్లాడారు. 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రజలు వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహిస్తుంటే పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారని తెలిపారు. కొత్తపట్నంలో నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా బయలు దేరిన వాహనంపై ఏర్పాటు చేసిన డీజేని పగులగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. డీజేని పగులగొట్టకుండా అడ్డుకున్న మహిళలు, పిల్లలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. నిమజ్జనాన్ని వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి, సతీష్, సిద్దార్ద రెడ్డితో పాటుగా విగ్రహాన్ని దానం చేసిన వెంకటరెడ్డి (దేవుడు), ఆయన కుమారుడు కార్తిక్ రెడ్డిలను అరెస్టు చేశారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న వెంటనే వారిని పరామర్శించడానికి తాలుకా పోలీసు స్టేషన్‌కు వెళ్లి చూస్తే అక్కడ వారు లేరని చెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారో తెలుసుకుందామని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. తాము అక్కడున్నప్పుడే పార్టీ కార్యకర్తలను పోలీసు వ్యానులో తీసుకొచ్చారని తెలిపారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన తనతో పాటుగా లీగల్‌సెల్ న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించారని, న్యాయవాదులతో మాట్లాడిన తీరు దుర్మార్గమని చెప్పారు. న్యాయవాదులను దూషించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పోలీసు కస్టడీలో ఉన్న పార్టీ కార్యకర్తలను పరామర్శించడం నేరం కాదుకదా అని ప్రశ్నించారు. పోలీసు కస్టడీలో ఉన్న వారిని బలవంతంగా తీసుకొనిపోలేను కదా అని నిలదీశారు. పార్టీ కార్యకర్తలను కొట్టడానికే డీఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారని అందరూ చెబుతున్నారని, కార్యకర్తలపై పెట్టిన కేసు వివరాలను అడిగి తెలుసుకునే హక్కు తమకుందని స్పష్టం చేశారు. దానికి బదులుగా పరామర్శించడానికి వచ్చిన తమ మీదనే కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఈ దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, పార్టీ సీనియర్ నాయకులు వెన్నపూస వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, రవీంద్రా రెడ్డి, మహిళా నాయకులు భూమిరెడ్డి రమణమ్మ, వడ్లమూడి వాణి, టి.మాధవి, గోనెల మేరి, తాతా నరసింహ గౌడ్, కిరీటి, కరుణాకర్, డివిజన్ అధ్యక్షులు దేవా, శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘అన్నదాత పోరు’
చంద్రబాబు కళ్లు తెరిపించేందుకే ఒంగోలు టౌన్: రైతుల సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు వ్యవసాయం ఎందుకు చేయాలని చెబుతుంటే, ఎరువుల కోసం క్యూలో నిలబడితే తప్పేముంది..భోజనాల కోసం నిలబడడంలేదా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు రైతులతో వేళాకోళాలాడుతున్నారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపించేందుకు ఈ నెల 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లి వినతి పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని తెలిపారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ జిల్లా పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ‘అన్నదాత పోరు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని, పంటలు కొనే నాథుడులేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎరువులు కొనాలంటే మాత్రం అధికధరలు వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. రైతులు ఎరువులు దొరక్క అగచాట్లు పడుతుంటే కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. రైతు సమస్యల మీద రోడ్డుక్కితే లాఠీలతో జవాబు చెప్పాలని, కేసుల పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. మార్క్‌ఫెడ్ ద్వారా 50 శాతం ఎరువులను అందించాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తుల చేతికి చేరిందని, దీనికి కూటమి పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్‌పుడ్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర సాయంతో సంబంధం లేకుండా రూ.20 వేలు అదనంగా అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు కేవలం రూ.5 వేలు రైతుల చేతిలో పెట్టి ఒట్టి చేతులు చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు దగా పడ్డారని చెప్పారు. రాష్ట్రంలో పొగాకు, శనగ, మిర్చి, ధాన్యంకు గిట్టుబాటు ధరలు లేవని, ఉల్లి పంటను రైతులే పారవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల గురించి మాట్లాడితే తోకలు కట్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారని, ఇలా బెదిరించి పాలన ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు. కూటమి పాలకులకు యూరియా ఎరువులను అందుబాటులో ఉంచడం చేతకావడం లేదని విమర్శించారు. జిల్లా పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా అన్నీ డివిజన్లలో ఆర్డీఓలకు వినతి పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. నేడు ఆరోగ్యశ్రీని రద్దు చేసి బీమాను తీసుకొస్తున్నారని, మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి పేదలకు స్పెషాలిటీ వైద్యసేవలు అందకుండా కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నకరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు, మద్దిపాడు ఎస్సీ సెల్ అధ్యక్షుడు రావిపాటి విల్సన్, సంతనూతలపాడు, ఎన్జీపాడు మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, శ్రీమన్నారాయణ, పార్టీ నాయకులు కంకణాల సురేష్, దుంపా యలమందారెడ్డి, నటారు జనార్ధన రెడ్డి, కిరీటి, మలిశెట్టి దేవా, శ్రీకాంత్ వేముల తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీలపై కూటమి చిన్నచూపు
● ముస్లింలకు ఇచ్చిన హామీలు విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం ● 11 నెలలుగా ఇమామ్, మౌజన్లకు అందని గౌరవ వేతనం ● ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 400కు పైగా ఇమామ్, మౌజన్లు ● మూలన పడిన సంక్షేమ పథకాలు ● నేడు కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వనున్న వైఎస్సార్ సీపీ మైనారిటీ నేతలుకంభం: ముస్లిం మైనారిటీల ఓట్లు రాబట్టుకునేందుకు ఎన్నో హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం మైనారిటీల ఓట్లతో గద్దెనెక్కిన అనంతరం వారిని విస్మరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మసీదుల్లో నమాజ్ చదివించేందుకు ఇమామ్, అజాన్ ఇవ్వడం, మసీదు బాగోగులు చూసుకునేందుకు మౌజన్ ఉంటారు. ముస్లింల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో రూ.5 వేలుగా ఉన్న ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు, రూ.3 వేలుగా ఉన్న మౌజన్ ల గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు పెంచారు. మౌజన్, ఇమామ్‌లు మసీదులే జీవనాధారంగా వారికి వచ్చే గౌరవ వేతనం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజన్ లకు సుమారు 11 నెలలుగా జీతాల నిధులు విడుదల చేయకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు మైనారిటీలకు ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఒకసారి మాత్రమే ఇమామ్‌లు, మౌజన్లకు సంబంధించిన జీతాలు విడుదల చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన సుమారు 400కు పైగా మసీదుల్లో ఇమామ్‌లు, మౌజన్ లు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా పలు మసీదులకు సంబంధించి ఇమామ్‌లు, మౌజన్లు గౌరవ వేతనాల కోసం దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు దుల్హన్ పథకం, వడ్డీలేని రుణాలు, పెన్షన్ల ఊసే లేదని మైనారిటీలు వాపోతున్నారు. ముస్లింల డిమాండ్లు ఇవీ.. 50 ఏళ్ల వయస్సు ఉన్న మైనారిటీలకు పెన్షన్. ఈద్గాలు, ఖబరస్తాన్లకు స్థలాల మంజూరు, హజ్ హౌస్ ఏర్పాటు, రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనంతో పాటు మసీదుల నిర్వహణకు ఆర్థిక సాయం, దుల్హన్ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. మైనారిటీలకు అండగా వైఎస్సార్ సీపీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా ముస్లిం, మైనారిటీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచకపోవడంపై గళమెత్తేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్ లకు వినతి పత్రాలు అందజేసే కారక్రమం చేపట్టనున్నారు.చందాలపైనే ఆధారపడాల్సి వస్తోంది మసీదుల్లో నమాజు చదివించే ఇమామ్, మసీదు బాగోగులు చూసుకునే మౌజన్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన గౌరవ వేతనం నెల నెలా రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది. చందాలతో వారికి కొంత మేర వేతనాలు ఇస్తున్నాం. – సయ్యద్ ఖాసిం, మహబూబియా మసీదు కమిటీ అధ్యక్షుడు, కంభం -
‘రైతుల ఆత్మహత్యలు.. మంత్రుల హేళన వ్యాఖ్యలేంటి?’
సాక్షి, ప్రకాశం: ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం. కానీ, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో యూరియా అడుగుతున్న రైతులపై మంత్రులు హేళనగా మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం మానుకోమంటున్నారు. 280 రూపాయల యూరియా బస్తా బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలకు అమ్ముతున్నారు. ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.రైతు భరోసా 40వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం.. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. -
ఉపాధ్యాయునిపై విచారణ
మద్దిపాడు: మండలంలోని వెల్లంపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గోపనబోయిన రవికుమార్‌పై డిప్యూటీ డీఈఓ చంద్రమౌళేశ్వరరావు, జిల్లా బాలికల సంరక్షణ అధికారి దినేష్‌కుమార్, ఇతర ిసిబ్బంది శనివారం విచారణ చేపట్టారు. మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులను విచారించారు. బంగారు బాల్యం కార్యక్రమంలో వెల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులు కొందరు గోపనబోయిన రవికుమార్ తీరుపై అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అతనిపై విచారణ నిర్వహించడానికి విద్యార్థినుల తల్లిదండ్రులను గోప్యంగా పిలిపించారు. ఐసీడీఎస్ మద్దిపాడు ప్రాజెక్టు సూపర్వైజర్లు ఆయా విద్యార్థినులను విచారించారు. విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో ఒంగోలు ఎంఈఓ కిషోర్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు నాగరాజ, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని...
సీఎస్ పురం (పామూరు): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎనిమిది గేదెలు మృతిచెందిన సంఘటన శనివారం వేకువజామున 167బీ జాతీయ రహదారిపై సీఎస్ పురం మండలంలోని కోవిలంపాడు – కంభంపాడు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది. అయితే, ఈ సంఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇంకా ఫిర్యాదు అందలేదు.మార్కాపురం: పాఠశాలకు వెళ్తున్నానని చెప్పిన రెండో తరగతి విద్యార్థి నేరుగా రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలు ఎక్కి వెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. మార్కాపురం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలుడు శనివారం మధ్యాహ్నం భోజనానికి పాఠశాల నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో భోజనం చేసిన అనంతరం పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి పాఠశాలకు వెళ్లకుండా మార్కాపురం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో వచ్చిన రైలు ఎక్కి గిద్దలూరు రైల్వేస్టేషన్లో దిగాడు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న బాలుడిని చూసిన రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వివరాలు తెలుసుకుని మార్కాపురంలోని బాలుడి తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వారు గిద్దలూరు వెళ్లి బాలుడిని తీసుకొచ్చారు.కొమరోలు: పెళ్లికి నిరాకరించారనే కారణంతో క్షణికావేశంలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లె గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాలదాగి పెద్దనరసింహులు (24) తల్లిదండ్రులు అతని మేనమామ కూతురినిచ్చి పెళ్లిచేయాలనే ఉద్దేశంతో వారింటికి వెళ్లి అడిగారు. కానీ, వారు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన పెద్దనరసింహులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికందివచ్చిన కుమారుడి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.బేస్తవారిపేట: జాతీయ రహదారిపై స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో శనివారం ఎదురెదురుగా రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. బేస్తవారిపేటలోని టైలర్స్‌కాలనీకి చెందిన కత్తి వేణుగోపాల్ పిల్లలను స్థానిక జంక్షన్‌లోని స్కూల్లో వదిలిపెట్టి బేస్తవారిపేట వైపునకు స్కూటీపై వెళ్తున్నాడు. ఒందుట్లకు చెందిన నాగూరు మీరావలి జంక్షన్వైపు వెళ్తుండగా, ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వేణుగోపాల్ తల కు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. నాగూర్‌మీరావలి స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేణుగోపాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీస్ వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు గిద్దలూరు తీసుకెళ్లారు. -
హిజ్రాలకు శిక్షణ కార్యక్రమాలు
ఒంగోలు వన్‌టౌన్: హిజ్రాలకు పోటీ పరీక్షలు, నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా లు, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా సహాయ సంచాలకులు సువార్త శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ సెంచరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆధ్వర్యంలో పూర్తి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ఐటీ, ఐటీఈఎస్ రంగాలలో ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు సహాయపడతాయన్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్/డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని ఆసక్తి గల హిజ్రాలు సంబంధిత కార్యాలయం నుంచి దరఖాస్తులు పొంది పూర్తిచేసి తిరిగి అదే కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు 08592–281310 నంబర్‌ను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు. -
మెడికల్ కళాశాలలపై ప్రభుత్వ నిర్ణయం బాధాకరం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి ఒంగోలు సిటీ: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 12 మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా స్థాపించలేదని, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎవరూ చేయని విధంగా ఒక్కసారిగా 17 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని వివరించారు. గత ఎన్నికల సమయానికి 5 కళాశాలు పూర్తి చేసి రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడమే కాకుండా పేద ప్రజలకు ఉచిత వైద్యం కల్పించారన్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాదాపు 70 శాతం పనులు పూర్తయి అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన 12 కళాశాలను పీపీపీ ముసుగులో భారీగా కమీషన్లకు కక్కుర్తిపడి దొడ్డిదారిన బినామీదార్లకు కట్టబెట్టడం వలన పేదలకు ఉచితంగా వైద్య విద్యతో పాటు వైద్యాన్ని కూడా దూరం చేయడం అన్యాయమన్నారు. వైద్య కళాశాలలన్నీ చంద్రబాబు అనుచరుల కబంధ హస్తాలలో ఉన్నాయని, ఈ 12 కళాశాలలు కూడా టీడీపీ అనుచరుల చేతుల్లోకి పోతే వైద్య విద్యలో టీడీపీ మాఫియా పేట్రేగిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయంతో వెనుకబడిన, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మార్కాపురం డివిజన్లలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాల కూడా ప్రైవేటుపరమై సరైన వైద్యం అందించే హాస్పిటల్ లేక దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి వెళ్తుందన్నారు. ఇప్పటికై నా ఆ ప్రాంత ప్రజల అభిష్టాన్ని గౌరవించి తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. -
రైతులకు బాసటగా నిలుద్దాం
● అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున మద్దిపాడు: రాష్ట్రంలోని రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయాల వద్ద చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. మద్దిపాడు మండల కేంద్రం సమీపంలోని ఘడియపూడి కాలనీలో పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారీ రైతులు, మహిళలు మోసానికి గురవుతున్నారని గుర్తు చేశారు. రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు కదలిరావాలన్నారు. యూరియాతో సహా ఇతర ఎరువులు వెంటనే పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నియోజకవర్గ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు పల్లపాటి అన్వేష్, పైనం శ్రీనివాసరావు, కంకణాల సురేష్, సన్నపురెడ్డి రమణమ్మ, కాకర్లపూడి రజని, మండవ బాలచంద్రమౌళి, మంద ప్రసాద్, రాయపాటి విల్సన్, కావూరి ఏసేబు, డాకా రాజీవ్‌రెడ్డి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
స్టాఫ్ నర్సులపై మెడికల్ ఆఫీసర్ల పెత్తనం
ఒంగోలు టౌన్: అర్బన్ వైద్యశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్ నర్సులపై మెడికల్ ఆఫీసర్లు పెత్తనం చలాయిస్తున్నారని, వైద్యారోగ్య శాఖ అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్టాఫ్ నర్సులు ఆరోపించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ ఆదివారాలు, పండుగ రోజులు కూడా పనిచేస్తున్నప్పటికీ డే ఆఫ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, కొందరు మెడికల్ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని యూనియన్ సభ్యులు, నాయకులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు యూపీహెచ్‌సీలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పదవీ విరమణ సౌకర్యాలు కల్పించాలని, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా కె.హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏ సుధాకర్, కోశాధికారిగా షేక్ ఖాజావలి, అర్గనైజింగ్ సెక్రటరీగా అరుణ కుమారి, వైస్ ప్రెసిడెంట్లుగా జి.శ్రీనివాసరావు, నిర్మలకుమారి, వాసవి, కార్యర్శులుగా సుభాషిణి, జి.రామారావు, కో ట్రెజరర్‌గా ఆంజనేయులును ఎన్నుకున్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాస్ అక్షర ఆంధ్రపై శిక్షణ
తర్లుపాడు: ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద ఉపాధ్యాయులకు స్థానిక వెలుగు కార్యాలయంలో శనివారం శిక్షణ ఇచ్చారు. ఎంఈఓ–2 అచ్యుత సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యత అవసరాన్ని స్వచ్ఛంద ఉపాధ్యాయులకు ఆయన వివరించారు. అవసరమైన పాఠశాలల్లో స్వచ్ఛంద ఉపాధ్యాయులను వినియోగించుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పర్యవేక్షకుడు వెంకటరెడ్డి అధికారులను కోరారు. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత గురించి వారికి వివరించారు. నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఏపీఎం రమేష్ ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు, వెలుగు, సీసీలు, వీఓఏలు, పాల్గొన్నారు. -
కార్పొరేట్లకు అప్పగిస్తే నష్టమే
మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విచారకరం. ప్రభుత్వ నిర్వహణలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అదే కార్పొరేట్లకు అప్పగించడం వలన సామాన్య నిరుపేద ప్రజలకు వైద్య సేవలు భారమవుతాయి. ప్రభుత్వ వైద్య కళాశాలగా కొనసాగితే మెరిట్ విద్యార్థులకు మాత్రమే సీట్లు వస్తాయి. లేకపోతే మేనేజ్మెంట్ కోటా పేరుతో సీట్లను అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. ఎటు చూసినా ప్రైవేటు కళాశాల వలన ప్రజలకు నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. – డా.అజయ్ కుమార్ రెడ్డి, జీజీహెచ్, ఒంగోలు డాక్టర్ కలను నాశనం చేసిన బాబు ఎంబీబీఎస్ చదివి గొప్ప డాక్టర్లు అవ్వాలనే పేద విద్యార్థుల కలలను సీఎం చంద్రబాబు నాశనం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య విద్యను నిర్వీర్యం చేసింది. విద్యా, వైద్యం అందరికీ అందాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. వైద్య పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య తోపాటు, పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలన్న లక్ష్యంగా కళాశాల నిర్మాణాలను వేగవంతం చేశారు. అయితే చంద్రబాబు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం సరికాదు. కొన్ని వేల మంది విద్యార్థులు డాక్టర్ కావాలనే ఆశలు ఆడియాశలయ్యాయి. – నందకిషోర్, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ వింగ్ జిల్లా అధ్యక్షుడు -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వైఎం.ప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యెనుముల మారుతి ప్రసాద్ రెడ్డి (బన్ని)ని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. జోన్–4 కింద ప్రకాశం జిల్లా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలకు ఆయన్ను నియమించారు. కనిగిరికి చెందిన వైఎం.ప్రసాద్‌రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్ర ఎన్ఎస్యూఐ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2001 సంవత్సరంలో జెడ్పీటీసీ గా గెలుపొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో చురుకుగా పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర నుంచి ఆయన వెంటే నడిచారు. వైఎం.ప్రసాద్‌రెడ్డి భార్య యొనుముల సరిత ఏఎంసీ చైర్మన్ గా పనిచేశారు. డీసీసీబీ చైర్మన్ గా వై.ఎం.ప్రసాద్‌రెడ్డి పనిచేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల తరఫున పోరాడి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (ఒంగోలు పార్లమెంట్) కేవీ రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, బొట్లరామారావు, కసుకుర్తి ఆదెన్నలను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. కేవీ రమణారెడ్డికి గిద్దలూరు, యర్రగొండపాలెం, వై వెంకటేశ్వరరావుకు ఒంగోలు, కొండపి, బొట్ల రామారావుకు దర్శి, సంతనూతలపాడు, కసుకుర్తి ఆదెన్నకు కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలు కేటాయించారు. వీరు కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ రీజినల్ కోఆర్డినేటర్, పార్లమెంట్ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారని పేర్కొంది. మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని షణ్ముఖ ట్రేడర్స్‌లో అనుమతిలేకుండా విక్రయానికి సిద్ధంగా ఉన్న 10–26–26 రకం 89 బ్యాగుల ఎరువుల అమ్మకాలను నిలిపివేసినట్లు మార్కాపురం ఏఓ బుజ్జిబాయి తెలిపారు. దీని విలువ రూ.1,60,200 అని ఆమె తెలిపారు. ఎవరైనా వ్యాపారులు అనుమతిలేకుండా ఎరువులు విక్రయిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఒంగోలు సిటీ: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరం (సౌత్ బైపాస్‌రోడ్డు)లో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. ఒంగోలు: హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా క్రీడాశాఖ, రెడ్ రిబ్బన్ క్లబ్ సంయుక్తంగా 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులకు 5 కిలోమీటర్ల పరుగుపందెం (మారథాన్) నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారి జి.రాజరాజేశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ విభాగాలకు వేర్వేరుగా జరుగుతాయి. ఒక్కో విభాగంలో ప్రథమ విజేతకు రూ.10 వేలు, ద్వితీయ విజేతకు రూ.7 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 12న ఉదయం 6 గంటలకు స్థానిక కలెక్టరేట్ వద్ద తమ కాలేజీ ఐడీ కార్డుతో హాజరుకావాల్సి ఉంటుంది. వివరాలను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సెల్ నంబర్: 9493554212 కు కాల్ చేయవచ్చు. -
రూ. లక్ష పలికిన గణేష్ లడ్డు
యర్రగొండపాలెం: వినాయక చవితి సందర్భంగా స్థానిక కొలుకుల సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహాన్ని శనివారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కోలాటం, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళలు పల్లకి సేవలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ముందుగా 9 రోజుల పాటు పూజ కార్యక్రమాల్లో స్వామి ఎదుట ఉంచిన లడ్డూ ప్రసాదం, కలశంలతోపాటు వివిధ వస్తువులను నిర్వాహకులు వేలం నిర్వహించారు. ఈ వేలంలో లడ్డూ ప్రసాదం రూ 1. లక్షకు కొత్త హరిబాబు దక్కించుకున్నాడు. కై పు వెంకటరెడ్డి కలశం వేలంలో పాల్గొని రూ.90 వేలకు సొంతం చేసుకున్నారు. అకౌంట్ బుక్స్ రూ.90 వేలకు ఆవుల బాలిరెడ్డి, పెన్ను రూ.18 వేలకు చెంగళ్ నాగయ్య పాడుకున్నారు. కొలుకుల సెంటర్ నుంచి బస్టాండ్, పోలీస్ స్టేషన్, మండల రెవెన్యూ కార్యాలయంల మీదుగా త్రిపురాంతకంలో ఉన్న నాగార్జున సాగర్ కాలువ వద్దకు వినాయకుడిని తరలించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాఛనీయ సంఘటనలు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సీఐ సీహెచ్ ప్రభాకరరావు ఆధ్వర్యంలో పోలీసులు శాంతిభద్రతలను కాపాడారు. -
కలకలం..!
ప్రైవేటు జపం..పశ్చిమ ప్రకాశం వాసులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కావాలన్న కల ఏడు దశాబ్దాలనాటిది. ఆ కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేసింది. గతేడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాలరాసేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్యకళాశాల నిర్మాణ పనులను నిలిపేసింది. గతేడాది మొదటి సంవత్సరం అడ్మిషన్లను అడ్డుకుంది. తాజాగా ఈ కళాశాలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్) విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై పశ్చిమ వాసులు మండిపడుతున్నారు. దాదాపు పది లక్షల మంది ప్రజల ఆశలపై చంద్రబాబు నీళ్లు జల్లారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను నిర్మించినట్లయితే పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందేవి. ప్రైవేటుపరం చేయడం వలన ప్రతి సేవకు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటు యాజమాన్యం లాభం గురించే ఆలోచిస్తుంది. అందరికీ సమానమైన వైద్యసేవలు అందుబాటులోకి రావడం కష్టం. సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులు ర్యాంకులు సాధించినా భారీ ఫీజులు చెల్లించుకోలేక వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మార్కాపురం: మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ప్రజలు చిన్నపాటి జ్వరం వచ్చినా అటు నెల్లూరు, నంద్యాల, కర్నూలుకు ఇటు గుంటూరు, విజయవాడలకు పరిగెత్తాల్సి వచ్చేంది. ఈ పరిస్థితిని మార్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణం కట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రూ.475 కోట్లు నిధులు విడుదలచేశారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద 41.97 ఎకరాల విస్తీర్ణంలో కాలేజీ మంజూరు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 75 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సిబ్బంది క్వార్టర్స్, నర్సింగ్ కళాశాల, జంట్స్, లేడీస్ హాస్టల్స్, సెంట్రల్ క్యాంటీన్ పూర్తిచేశారు. విద్యుత్ వైరింగ్, ప్లంబింగ్, రంగులతోపాటు కొన్ని భవనాల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఇదే సమయంలో స్థానిక గుండ్లకమ్మ వద్ద ఉన్న జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి 450 బెడ్లను సిద్ధం చేశారు. ఇందులో జనరల్ సర్జరీ కోసం 100, జనరల్ మెడిసిన్ కోసం 100, ఆర్ధోపెడిక్ విభాగానికి 40, ఆప్తమాలజీ 20, డెర్మటాలజీ 10, సైక్రియాట్రిక్ విభాగానికి 10, ఈఎన్టీకి 20, ఐసీయూ 20, పీడియాట్రిక్స్ 50, గైనకాలజీకి 50 బెడ్లు కేటాయించారు. ఇలా మార్కాపురం జీజీహెచ్ రూపురేఖలు మార్చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 75 మంది వైద్యులను నియమించారు. ఒక వైపు కళాశాల జోరుగా పనులు మరో వైపు జీజీహెచ్‌లో అభివృద్ధి జరుగుతుంటే పశ్చిమ ప్రకాశం వాసుల వైద్య కష్టాలు తీరినట్టేనని దాదాపు పది లక్షల మంది ప్రజలు సంబరపడ్డారు. 2024 విద్యా సంవత్సరం నుంచే 150 మంది విద్యార్థులతో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. తమకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని, తమ పిల్లలు ఇక్కడే ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకుని డాక్టర్లు అవుతారని కన్న కలలన్నీ కల్లలయ్యాయి. పశ్చిమంపై బాబు కపట ప్రేమ: ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం మెడికల్ కళాశాలకు గడ్డు రోజులు మొదలయ్యాయి. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో మార్కాపురం మెడికల్ కాలేజీని చేర్చకుండా తీరని నష్టం చేశారు. గత ఏడాది, ఈ ఏడాది నీట్ కౌన్సెలింగ్‌లో మార్కాపురం మెడికల్ కాలేజీని చేర్చలేదు. ఫలితంగా 300 మెడికల్ సీట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఇక్కడ నియమించిన వైద్యులను నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా బదిలీ చేశారు. అంతటితో ఆగలేదు. అప్పటి వరకూ 75 మంది వైద్యులు ఉండగా అధికారంలోకి వచ్చిన వెంటనే 50 మందిని ఇతర ప్రాంత వైద్యశాలకు బదిలీ చేశారు. ఫలితంగా పశ్చిమ ప్రకాశం ప్రజలకు 2014– 2019 మధ్య నాటి గడ్డురోజులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రాణం మీదకు వస్తే అటు గుంటూరు, ఇటు ఒంగోలు, కర్నూలుకు పరుగులు పెట్టాల్సిన దయనీయ పరిస్ధితులు ఏర్పడ్డాయి. పుల్లలచెరువు, యర్రగొండపాలెం, కొమరోలు, గిద్దలూరు, పెద్దారవీడు, అర్ధవీడు, పెద్దదోర్నాల, రాచర్ల మండలాల్లో సుమారు 72 చెంచుగూడేలు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది గిరిజనులు నివాసముంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గిరిజనులందరికీ ఇక్కడే మంచి వైద్యసేవలు అందాయి. ఇప్పుడు వైద్యులు లేకపోవడంతో నామమాత్రపు వైద్యసేవలు లభిస్తున్నాయి. పీపీపీతో ఇబ్బందులే.. ప్రభుత్వమే వైద్యశాల నిర్మాణం చేపట్టి వైద్యులను నియమిస్తే ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా లభిస్తుంది. పీపీపీ వలన వైద్యశాల నిర్వహణతో పాటు వైద్య విద్య సీట్లు కూడా ప్రైవేటు మేనేజ్మెంటులో ఉంటాయి. దీంతో సాధారణ ప్రజలకు వైద్యం కావాలంటే డబ్బు చెల్లించాల్సిందే. కార్పొరేట్ వైద్యసేవలు కావాలంటే మరికొంత డబ్బు చెల్లించాల్సిందే. ఫీజులు చెల్లించే కొద్దీ ప్రై వేటు వైద్యశాలలోలాగా ఇక్కడ కూడా వైద్యసేవలు అందుతాయి. ప్రభుత్వ ఆధిపత్యం, వైద్యశాల, మెడికల్ కళాశాలపై తగ్గుతుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చినా చికిత్స ఖర్చుల భారం ప్రజలపై పడుతుంది. పశ్చిమ ప్రకాశంలో నియోజకవర్గాలు: 4 పశ్చిమ నియోజకవర్గాల ప్రజలు:10 లక్షలు (సుమారు) -
రాకెట్ బాల్ రాష్ట్ర జట్లు ఇవే
ఒంగోలు: రాకెట్ బాల్ రాష్ట్ర స్థాయి బాలబాలికల జట్ల ఎంపిక శనివారం స్థానిక హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఆవరణలో నిర్వహించారు. అండర్ 19 బాలబాలికలు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు. వారికి ప్రతిభా పోటీలు నిర్వహించి తుది జట్లను ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్‌బాషా, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉద్దేశించి హైదరాబాద్ పబ్లిక్ స్కూలు కరస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేయాలన్నారు. బాలుర జట్టు: వరుణ్, ఒత్నిల్, దిలీప్, సాత్విక్, సంజయ్ కార్తీక్, లాక్షిత్, అక్షయ్, హనీష్, పునీత్, సాత్విక్, శ్రీకాంత్. బాలికల జట్టు: గాయత్రి, సహస్ర, పూర్వి, సాహిత్య, పూజ, షాహీన, ధన్విత, అర్చన, లోహిత, మనీషా. -
అన్నదాత పోరు వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన తలపెట్టిన అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ పోరు వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శనివారం నియోజకవర్గానికి చెందిన ఐటీ వింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. రైతుల పక్షన నిలబడి పోరుకు పిలుపునిచ్చిన జగనన్నకు తమ అండదండలు ఉంటాయని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, నియోజకవర్గ విభాగం అధ్యక్షుడు దుద్యాల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు అల్లు సదాశివారెడ్డి, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల ఐటీ వింగ్ అధ్యక్షులు కందుల వెంకటసుబ్బారెడ్డి, పతంగి అంజిరెడ్డి, కొల్లి నాగేశ్వరరెడ్డి, మూల హర్షవర్ధన్‌రెడ్డి, వెన్నా కాశీశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
అమెరికా సుంకాలపై నోరు మెదపని మోదీ
ఒంగోలు టౌన్: అమెరికా విధిస్తున్న 50 శాతాల సుంకాలపై ప్రధాని మోదీ నోరుమెదపకపోవడం సిగ్గుచేటని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ విమర్శించారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించడం, బెదిరింపులకు తెగబడుతున్నప్పటికీ మోదీ మౌనంగా ఉండటాన్ని దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అమెరికా విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా నగరంలోని ఆర్టీసీ డిపో వద్ద సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్, సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ అప్పుల కుప్పగా మారిన అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలపై సుంకాల పేరుతో వాణిజ్య యుద్దానికి దిగిందని చెప్పారు. అమెరికా సుంకాలతో భారతదేశం ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం పడిందన్నారు. ఆక్వా రంగంతోపాటుగా ఆహార ఉత్పత్తులు, వస్త్రాల ఎగుమతులు నిలిచిపోయాయని, రైతులు, పారిశ్రామికవేత్తలు సంక్షోభంలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ రొయ్యల ఎగుమతిపై సుంకాలు పెంచడంతో ఎగుమతులు నిలిచిపోయాయని చెప్పారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, దీనివల్ల దేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీపీఎంఎల్ నాయకురాలు లలిత కుమారి మాట్లాడుతూ ట్రంప్ టారిఫ్‌ల కారణంగా వ్యవసాయరంగం సామ్రాజ్యవాదుల హస్తగతమయ్యే ప్రమాదం నెలకొందన్నారు. సీపీఎంఎల్ న్యూ డెమోక్రసి నాయకుడు సాగర్ మాట్లాడుతూ ప్రపంచ పోలీసు అమెరికా వాణిజ్య యుద్దానికి దిగిందని, ప్రజలంతా ముక్తఖంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు జీవీ కొండారెడ్డి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, కంకణాల రమాదేవి, ఆదిలక్ష్మి, బాలకోటయ్య, కేఎఫ్ బాబు, బంకా సుబ్బారావు, సీహెచ్ వినోద్, శ్రీరాం శ్రీనివాస్, ఎంఏ సాలార్, ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల కొరత సృష్టించింది చంద్రబాబే
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో యూరియా కొరత సృష్టించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది 39.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉపయోగించారని, అయితే ఈ ఏడాది ఉద్దేశపూర్వకంగానే కేవలం 322 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తెప్పించారని వివరించారు. రైతులకు అవసరమైన 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి అవసరం లేదని కేంద్రానికి నివేదిక ఇచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు దొరక్క నానా అగచాట్లు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. నల్లబజారులో ఎరువులు విక్రయిస్తున్నారని, వారి వద్ద ఎరువులు ఎక్కడి నుంచి వచ్చాయో పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైనంత మేర ఎరువులను తెప్పించి అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఎరువుల సమస్యపై ఈ నెల 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు నాయకులతో వినతి పత్రం అందిస్తామని చెప్పారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైద్య విద్య ప్రైవేటుపరం చేయడం దారుణం: ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయనున్నట్లు నిర్ణయం తీసుకోవడంపై బూచేపల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగనన్న హయాంలో దాదాపుగా పూర్తయిన మెడికల్ కాలేజీలను కుట్రపూరితంగా పక్కన పెట్టేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు పీపీపీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు పన్నాగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు కళాశాలల్లో భారీగా ఫీజులు కట్టి చదివే స్థోమత లేని నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అవసరం ఉందన్నారు. సామాన్య ప్రజలకు వైద్యం, నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేయడానికి కూటమి పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్యశాలలను, వైద్య కళాశాలలను నిర్వహించగలిగే స్థితిలో పాలకులు లేరన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఆరోగ్య శ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు ఉన్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ను రద్దు చేసి బీమా కిందకు తీసుకొస్తున్నారని, ఒకవేళ ప్రభుత్వం బీమా కంపెనీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు అందిస్తోందని, ఇప్పుడు దానితో కలిపేసి ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీని ఎత్తివేసే కుట్రలు మానుకొని రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించాలని డిమాండ్ చేశారు. దోపిడీదారుల ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యం: చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల, రైతుల సంక్షేమం పట్టడం లేదని, కేవలం దోపిడీదారుల ప్రయోజనాలే ముఖ్యమని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక వ్యూహం ప్రకారమే ఎరువుల కొరత సృష్టిస్తున్నారని తెలిపారు. ఎరువులు సరిపడా అందుబాటులో ఉంటే రైతులు వరి పండిస్తారని, అప్పుడు ప్రభుత్వం వరి కొనాల్సి వస్తుందని, ఇది ఇష్టం లేకనే ఎరువులను లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పొగాకుకు డిమాండ్ ఉన్నా కంపెనీలతో కుమ్మకై ్కన ప్రభుత్వం గిట్టుబాటు లేకుండా చేసిందని, తాజాగా కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించి రైతులను నిలువుగా దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, లిగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పీడీసీసీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీంద్రా రెడ్డి, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి రొండా అంజిరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు, జిల్లా నాయకులు దేవరపల్లి అంజిరెడ్డి, దాసరి కరుణాకర్, మన్నెం శ్రీధర్ బాబు, షేక్ మీరావలి, టి.మాధవి, వడ్లమూడి వాణి, గోనెల మేరి, బత్తుల ప్రమీల, దేవా, కిరీటి, పెట్లూరి ప్రసాద్, గౌతం కూనం, నాటారు జనార్ధన రెడ్డి, పిగిలి శ్రీనివాసరావు, ఆనం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పక్కన వెంకాయమ్మ, బత్తుల, చుండూరి రవిబాబు తదితరులు -
బాబు ప్రభుత్వంలో రైతులకు కష్టాలే
చీమకుర్తి రూరల్: చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ముందుగా మోసపోయేది, నష్టపోయేది రైతులు, మహిళలే అని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని పిడతలపూడి, రామచంద్రపురం, బూసరపల్లి, జీఎల్‌పురం గ్రామాల్లో శుక్రవారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పిడతలపూడిలో బాబూ ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి రైతన్న పంట పండిస్తే మద్దతు ధర కల్పించలేని దయనీయ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మద్దతు ధర కల్పించాలని ధర్నాలు చేస్తేకాని, మద్దతు ధర పెంచే ఆలోచన కూటమి ప్రభుత్వానికి రాలేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు రైతుల పక్షాన పోరాడితే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నా రైతుల ఆవేదన బాబుకు పట్టదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు చీదర్ల శేషు, మండల ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి జీ ఓబులరెడ్డి, కౌన్సిలర్ పాటిబండ్ల గంగయ్య, ఎం రాజేంద్ర, మేకల వీరారెడ్డి, డీ శేషారెడ్డి, బొడ్డు కోటేశ్వరరావు, తిరుపతిస్వామి, మల్లికార్జున, బాలాజి, నియోజకవర్గ యూత్ అన్వేష్, కంకణాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శనీయుడు సర్వేపల్లి
ఉపాధ్యాయులను సత్కరిస్తున్న జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి, చుండూరి రవిబాబు, బత్తులఒంగోలు టౌన్: ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి తొలి రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన డా. సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, తరగతి గదిలో దేశ నిర్మాణానికి పునాదులు వేసే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం గర్వంగా ఉందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్మాతలను తయారు చేసే ఉపాధ్యాయుడిగా పనిచేసిన రాధాకృష్ణ దేశానికే తొలి పౌరుడిగా ఎన్నికయ్యారని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉపాధ్యాయులను సన్మానించే సంప్రదాయానికి తెరదీశారని చుండూరి రవిబాబును అభినందించారు. జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే ఉపాధ్యాయులు వారికి బంగారు భవిష్యత్తు ఇస్తారని చెప్పారు. నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ గురువులను పార్టీ కార్యాలయంలో సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. దేశాభివృద్ధికి ఉపాధ్యాయులు చేసిన సేవలు మరిచిపోలేమన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఓబుల రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట రెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, ముప్పవరపు శ్రీనివాసులు, ఉపాధ్యాయిని నత్తల రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివ ప్రసాద్ సన్మాన గ్రహీతలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, కఠారి శంకర్, బొట్ల సుబ్బారావు, వైఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ), రొండా అంజిరెడ్డి, కరుణాకర్, నగరికంటి శ్రీనివాసరావు, బంగారుబాబు, ప్రసాద్, రవీంద్రా రెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, టి.మాధవి, వాణి, గోనెల మేరి, ప్రమీల, దేవా, జనార్ధన్ రెడ్డి, కిరీటి పాల్గొన్నారు. -
సమాజానికి దిశానిర్దేశం చేసేది గురువులే
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న గురువులుఒంగోలు సబర్బన్: సమాజానికి దిశా నిర్దేశం చేసేది గురువులేనని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత వారిపై ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో జిల్లా విద్యాధికారి ఏ.కిరణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి వారు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఉన్నత విలువలు కలిగిన భావిపౌరులను తయారు చేసేది ఉపాధ్యాయులేనని అన్నారు. మంచి బోధనపై ఉపాధ్యాయులు మరింత దృష్టి సారించాలని సూచించారు. డీఆర్ఓ బీసీహెచ్ ఓబులేసు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఉన్నతి ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుందన్నారు. ఉత్తమ సేవలు అందించిన 53 మంది ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇతర అతిథులుగా పాల్గొన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయ్ కుమార్, రాష్ట్ర మారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డీఆర్ఓ ఓబులేసుతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
ఆక్వా రైతులను కాపాడాలి
కొత్తపట్నం: సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో రైతు సంఘ నాయకులు శుక్రవారం మండలంలో ఉన్న రొయ్యల చెరువుల దగ్గరకు వెళ్లి ఆక్వా యజమానులను కలుసుకున్నారు. ఈ నెల 8వ తేదీ ఒంగోలు ఎల్బీజీ భవనంలో ‘‘రొయ్యల ఎగుమతులపై అమెరికా ఆంక్షలు – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత – ప్రత్యామ్నాయ మార్గాలు’’ అనే అంశంపై ఆక్వా రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారని, సమావేశాన్ని ఆక్వా రైతులు జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అమెరికా విధించిన అధిక టారిఫ్‌ల వల్ల రాష్ట్రంలో ఆక్వా రంగంలో ఉన్న రెండున్నర లక్షల రైతులపై ప్రభావం పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్ స్వామి రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
గిద్దలూరు రూరల్: పక్షవాతంతో మంచంపట్టిన ఓ మహిళ ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. ఆపదలో ఉన్న తనను మనసున్న మహారాజులు ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటోంది. విధి వక్రీకరించి అనారోగ్య సమస్యల కారణంగా మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గిద్దలూరు పట్టణంలోని పాములపల్లె రోడ్డులో సత్యనారాయణ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ బేగ్మున్నిషా గత మూడు సంవత్సరాలుగా పక్షవాతంతో కుడి చేయి, కుడి కాలు పడిపోయి అనేక ఇబ్బందులు పడుతోంది. ఒక వైపు శరీరం సహకరించక అనారోగ్యానికి గురై మంచానపడగా.. మరో వైపు ఆర్థిక స్థోమత లేకపోవడంతో కడుపు నిండా తిండి తినే పరిస్థితి కూడా లేకుండాపోయిందని వాపోతోంది. సరైన వైద్యం అందక పక్షవాతం నుంచి కోలుకోలేని పరిస్థితి ఏర్పడటంతో విలపిస్తోంది. 12 సంవత్సరాల క్రితం భర్త దూరం... కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగించే బేగ్మున్నిషాకు 12 సంవత్సరాల క్రితమే భర్త దూరమయ్యాడు. ఒక కుమార్తె ఉండగా, కూలీనాలీ చేసుకుని జీవించే వ్యక్తికిచ్చి వివాహం చేసింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న బేగ్మున్నిషాకు పక్షవాతం వ్యాధి పెద్ద శాపంగా మారింది. దిక్కుతోచని పరిస్థితిలో ఒంటరిగా మంచానికే పరిమితమైంది. పక్షవాతంతో మంచం పట్టిన మున్నిషాను చూసి చుట్టుపక్కల వారు, సమీప బంధువులు కొందరు ఆహారం అందిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆమైపె దయతలచి వైద్యుల వద్దకు తీసుకెళ్లి చూపించడంతో ఆమె హార్ట్‌బీట్ 30 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఆమె చికిత్సకు నెలకు రూ.10 వేల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. అంత నగదు ఆమె వద్ద లేకపోవడంతో వైద్యం చేయించుకోలేక మంచంలోనే ఉండిపోయింది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయిన తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని ఆమె వాపోతోంది. దాతలు ఎవరైనా సహృదయంతో ముందుకొచ్చి తనకు ఆర్థికసాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది. పక్షవాతంతో మంచంపట్టిన మహిళ దీనస్థితి -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
● అదుపుతప్పి బోల్తాపడిన టెంపో ట్రావెలర్ వాహనం ● పలువురికి స్వల్ప గాయాలు పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని చింతల గిరిజనగూడెం సమీపంలో ఓ టెంపో ట్రావెలర్ వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శుక్రవారం దోర్నాల నుంచి శ్రీశైలం వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న పలువురు స్వల్పంగా గాయపడటంతో శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ● రూ.3.90 లక్షల విలువైన సొత్తు రికవరీ దర్శి: విద్యుత్ తీగ చోరీ కేసులో ముగ్గురు నిందితులు, ఇద్దరు జువైనెల్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.90 లక్షల విలువైన 11 కేవీ విద్యుత్ వైరు (7.7 కి.మీ) రికవరీ చేశారు. వారి వద్ద ఉన్న కారు, కట్టర్లను సీజ్ చేశారు. దర్శి సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆగస్టు 29వ తేదీ చందలూరు పంచాయతీ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ వద్ద గుర్తు తెలియని దొంగలు 11 కేవీ విద్యుత్ వైరును చోరీ చేశారు. విద్యుత్ రూరల్ ఏఈ బండారు వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు దర్శి ఎస్ఐ మురళీ కేసు నమోదు చేశారు. టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 4.30 గంటలకు దర్శి పట్టణంలో కాలువ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా శ్రీరుక్మిణీపురంకు చెందిన ఫలితే హనుమనాయక్, ఫలితే చందర్ నాయక్, బట్టుల మహేష్, మరో ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. కోర్డులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఒంగోలు వన్‌టౌన్: భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించేందుకు ఏజెంట్లను ఎంపిక చేసేందుకు ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ ఎండీ జాఫర్ సాధిక్ శుక్రవారం రఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న ఏజెంట్లకు పాలసీలను బట్టి ఆకర్షణీయమైన కమీషన్ చెల్లించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాసై ఉండాలని, 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలని సూచించారు. ప్రాంతీయంగా పరిచయాలు ఉండి ఇన్సూరెన్సు రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్ఎస్సీ, ఇంటర్ సర్టిఫికెట్లు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డుతో ప్రకాశం సీనియర్ సూపరింటెండెంట్ కార్యాలయం, భాగ్యనగర్ 2వ లైన్, ఒంగోలు చిరునామాలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు రూ.5 వేల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని తెలిపారు. ఒంగోలు టౌన్: సకాలంలో న్యాయం జరగక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోని బాధితులకు ఈ నెల 7వ తేదీ స్థానిక ఎల్బీజీ భవనంలో న్యాయవాదులతో న్యాయసలహాలు ఇవ్వనున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ రఘురాం, జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాఘవులు, వి.మోజేస్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. దళిత గిరిజనుల మీద అత్యంత క్రూరంగా దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిందితులకు 41 సీఆర్పీ పేరుతో స్టేషన్ బెయిలిచ్చి పంపిస్తున్నారని, మరికొన్ని కేసులలో నేరుగా పోలీసులే ముద్దాయిలుగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోందని అన్నారు. దళితుల హత్యలు జరిగినప్పుడు నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖకు సమాచారం ఇవ్వకుండా పంచనామాలు నిర్వహించి సంతకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదైన తర్వాత బాధితులకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితులకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం న్యాయవాదులతో విచారణ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల నుంచి బాధిత దళితులు హాజరవుతారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదై న్యాయం కోసం తిరుగుతున్న బాధితులు ఈ న్యాయ సలహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రూ.1.05 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
చీమకుర్తి: చీమకుర్తిలోని శ్రీకృష్ణుడి వద్ద వినాయకుడి విగ్రహం చేతిలో ఉంచిన లడ్డూకు శుక్రవారం వేలంపాట నిర్వహించగా రూ.1.05 లక్షలు పలికింది. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంలో బత్తుల వెంకటేశ్వర్లు వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూను రూ.1.05 లక్షలకు దక్కించుకోగా, కలశం లడ్డూను మురళీధర్ రూ.20 వేలకు పాడుకున్నారు. ఆయా లడ్డూలను భక్తులతో కలిసి ఊరేగింపుగా ఇళ్లకు తీసుకెళ్లారు. సింగరాయకొండ: స్థానిక ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో శుక్రవారం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషులు, మహిళల జిల్లా జట్లను ఎంపిక చేశారు. వీరు ఈ నెల 13, 14 తేదీల్లో కోససీమ జిల్లా మండపేటలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా అసోసియేషన్ సెక్రటరీ ఎన్టీ ప్రసాద్ తెలిపారు. ట్రెజరర్ శంకర్రావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సింగరాయకొండ: అర్ధరాత్రి ఇంట్లో పడుకుని ఉన్న తన్నీరు ప్రతాప్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కిటికీలో నుంచి పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున సింగరాయకొండ మండలంలోని కనుమళ్ల పంచాయతీ చిన్న కనుమళ్ల గ్రామం వడ్డెపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా ప్రతాప్, అతని భార్యకు మనస్పర్థలు ఉండటంతో ఆమె పుట్టింట్లో ఉంటోంది. ఇటీవల ప్రతాప్ తల్లి చనిపోవడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటున్నారు. రోజూలాగే ప్రతాప్ కింద పడుకోగా, ఇద్దరు పిల్లలతో భార్య మంచంపై పడుకుని ఉంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రతాప్‌పై కిటికీలో నుంచి పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. దీంతో ప్రతాప్ కాళ్లు, చేతులు, మొహానికి స్వల్పంగా గాయాలయ్యాయి. అతను కందుకూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొమరోలు: మండలంలోని పలు గ్రామాల్లో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి 20 మందిని కరిచి గాయపరిచింది. కొమరోలు, గోపాలునిపల్లె, సూరవారిపల్లె గ్రామాల్లో గురువారం రాత్రి నుంచి పిచ్చికుక్క తిరుగుతూ కనిపించిన వారందరిపై దాడి చేసింది. దీంతో 20 మంది గాయపడి కొమరోలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందారు. మండలంలో అధిక సంఖ్యలో కుక్కలు ఉండటం, ప్రజలను కరుస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కందిపప్పు.. ఏది చెప్పు..!
మార్కాపురం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ షాపుల ద్వారా బియ్యం మినహా అదనపు సరుకులు ఇవ్వకపోతుండటంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గత 7 నెలల నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ వచ్చి నిత్యావసర సరుకులు అందించగా కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులు షాపుల వద్దకు వెళ్లి పడిగాపులు కాసినా బియ్యం, చక్కెర తప్ప ఏమీ ఉండకపోతుండటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దసరాకు కూడా పప్పన్నం లేనట్లే..! ఈ నెలలోనే దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 2వ తేదీ విజయదశమి పండుగ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటు కందిపప్పు, తదితర సరుకులేమైనా ఇస్తారేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ, కనీసం కందిపప్పు కూడా ఇవ్వకపోవడంతో దసరాకు కూడా పప్పన్నం తినలేని పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు అందించే కందిపప్పు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిలిచిపోయింది. ఏ నెలకు ఆ నెల వినియోగదారులు ఎదురుచూస్తున్నప్పటికీ రేషన్ షాపులకు కందిపప్పు మాత్రం సరఫరా కావడం లేదు. జిల్లాలో మొత్తం 6,61,141 రేషన్ కార్డులు ఉండగా, 1,392 రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందిస్తున్నారు. ప్రభుత్వం కిలో 67 రూపాయలకు కార్డుదారులకు కందిపప్పు ఇవ్వాల్సి ఉంది. అయితే, 7 నెలలుగా కందిపప్పు ఇవ్వడం నిలిపివేశారు. బయట మార్కెట్లో కిలో 120 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో అంత పెట్టి కొనలేక పేదలు లబోదిబోమంటున్నారు. కందిపప్పు కేటాయింపు చేయాల్సింది ఇలా... పౌరసరఫరాలశాఖ మార్కాపురం గోడౌన్ పరిధిలో మార్కాపురం, తర్లుపాడు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాలు ఉన్నాయి. ప్రతి నెలా ఆయా మండలాల్లోని రేషన్‌షాపులతో పాటు దొనకొండలో 8 షాపులకు, కొనకనమిట్లలో 6 షాపులకుగానూ మొత్తం 150 రేషన్ దుకాణాలకు 78 టన్నుల కందిపప్పు రావాల్సి ఉంది. ఈ నెలలో దసరా నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ నబీ పండుగలున్న నేపథ్యంలో కార్డుదారులందరూ బయట మార్కెట్లో కిలో 120 రూపాయలు పెట్టి కందిపప్పు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ పప్పన్నం తినాలనే ఆశతో తమకు కందిపప్పు కావాలని డీలర్లను అడుగుతున్నారు. వారు మాత్రం ప్రభుత్వం నుంచి సరఫరా లేదంటూ సమాధానమిస్తున్నారు. పేదల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు ఎండగడుగున్నారు. ఈ నెల కూడా రేషన్‌లో కందిపప్పు సరఫరా చేయని ప్రభుత్వం ఏడు నెలలుగా కందిపప్పు సరఫరా నిల్ బయట మార్కెట్లో కిలో కందిపప్పు రూ.120 జిల్లాలో 6,61,141 రేషన్ కార్డులు, 1,392 రేషన్ దుకాణాలు -
ఎమ్మెల్యేగారూ.. మీకిది తగునా.?
సీఎస్ పురం (పామూరు): సీఎస్ పురం మండలంలోని సి.నాగులవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం శుక్రవారం రాజకీయ వేదికగా మారింది. పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం అనంతరం చింతపూడు, చెన్నపునాయునిపల్లెకు చెందిన పలువురికి టీడీపీ కండువాలు వేసి స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఇటీవల ఉత్తర్వులిచ్చినప్పటికీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఇలా చేయడంపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జెడ్పీ హైస్కూల్లో టీడీపీలోకి చేరికల కార్యక్రమం నిర్వహించిన ఉగ్రపై తీవ్ర విమర్శలు -
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు?
బేస్తవారిపేట: వైఎస్సార్ సీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్యను కత్తులతో పొడిచి పెట్రోల్ పోసి నిప్పంటించి అతి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కంభం మండలం దరగకు చెందిన బ్రహ్మయ్యను బుధవారం రాత్రి మద్యం పార్టీకి పిలిచి హత్య చేయగా, గురువారం ఉదయం వెలుగులోకి వచ్చిన విషయం విధితమే. ఈ కేసులో బ్రహ్మయ్యతో కలిసి మద్యం తాగిన ఇద్దరితో పాటు అనుమానంతో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వీరిలో ఇద్దరిని గురువారం సాయంత్రం విడిచిపెట్టగా, ఒకరు పోలీసుల అదుపులోనే ఉన్నారు. మృతుడు బ్రహ్మయ్య యువకుడు, శారీరకంగా బలమైన వ్యక్తి. అతన్ని హత్య చేయాలంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసి ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. మృతుడితో రాత్రిపూట కలిసి ఉన్న వ్యక్తి, జేబీకే పురానికి చెందిన మరొకరితో కలిసి హత్య చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఫోరెన్సిక్, క్లూస్ టీమ్, పోలీస్ జాగిలం, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లి ఆక్రందన వర్ణణాతీతం.. గాలి వీరభద్రుడు, రమణమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, కుమారుడు బ్రహ్మయ్య అంటే తల్లికి ప్రాణం. ఏడేళ్ల క్రితం భర్త మరణించగా, కుమారుడే కుటుంబానికి అండగా నిలబడతాడని ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తోంది. చేతికందివచ్చిన కొడుకు మరణంతో గురువారం ఉదయం నుంచి దిక్కులు పిక్కటిల్లేలా ఆమె రోదిస్తోంది. ఇక నాకు దిక్కెవరంటూ కుమిలికుమిలి ఏడుస్తోంది. ఆ తల్లికి సర్దిచెప్పడం ఎవరి వల్లా కావడం లేదు. ఆ తల్లి బాధను చూసి గ్రామస్తులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. -
కఠినంగా శిక్షించాలి
నిందితులను కంభం: దారుణ హత్యకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్త గాలిబ్రహ్మయ్య కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా వెంకట రాంబాబు శుక్రవారం ఉదయం కంభం ప్రభుత్వ వైద్యశాలలో పరామర్శించారు. మండలంలోని దరగా గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య (25) గురువారం హత్యకు గురికాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం పోలీసులతో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త మృతి బాధాకరమని వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా దరగా లో అంత్యక్రియలు నిర్వహించారు. వారి వెంట ఎంపీపీలు ఓసూరారెడ్డి, వెంకట్రావు, ఏరువ రంగారెడ్డి, మండల కన్వీనర్లు గొంగటి చెన్నారెడ్డి, ఆవుల శ్రీధర్ రెడ్డి, స్టేట్ మైనారిటీ సెల్ సెక్రటరీ గఫార్ అలిఖాన్, చేగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, రవికుమార్, సాంబశివారెడ్డి, సయ్యద్ ఖాసిం, సలీం, హుస్సేన్‌బాష, గురుమూర్తి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు. -
పూరీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: పోలీసుల తనిఖీల్లో పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మరోసారి 11 కిలోల గంజాయి పట్టుబడింది. శుక్రవారం పూరీ నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు నుంచి సింగరాయకొండ మధ్యలో తనిఖీ చేయగా, చైన్నెకు చెందిన ప్రేమ్ చంద్, సాకార్పేట్కు చెందిన మనీష్ వద్ద ఒక కిలో గంజాయి దొరికింది. అదే రైలులోని మరొక బోగీలో ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. ప్రత్యేక పోలీసుల బృందం, ఈగల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో పాటు మాదక ద్రవ్యాలను పసిగట్టే పోలీసు జాగిలం కూడా ఈ తనిఖీల్లో పాల్గొంది. ఒంగోలు మీదుగా ప్రయాణించే పలు రైళ్లతో పాటుగా రైల్వేస్టేషన్లలోని ప్లాట్‌ఫారాలు, పార్శిల్ కేంద్రం, ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను విచారించారు. ఈ తనిఖీలలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, ఎస్సైలు శ్రీకాంత్, ఆంజనేయులు, చెంచయ్య, జీఆర్పీ ఎస్సై మధుసూదన్‌రావు, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు కొరడా
చీమకుర్తి: ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఆక్రమించుకొని దొడ్డిదారిలో అక్రమ మైనింగ్ చేస్తున్న గ్రానైట్ క్వారీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు కొరడా ఝుళిపించింది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ అనే స్వచ్ఛద సంస్థ జిల్లా అధ్యక్షుడు పి.హేబేలు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. బుధవారం ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాగూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ తమ వాదనలు వినిపించారు. చీమకుర్తి మండలంలోని ఆర్ఎల్ పురం పంచాయితీలోని సర్వే నంబర్ 66/1లో జయమినరల్స్, సర్వే నంబర్లు 67/1ఏ, 67/2ఏ, 69/2, 70/2, 70/3 లలో హంస గ్రానైట్ , బూదవాడ పంచాయతీలోని సర్వేనెంబర్లు 107, 108 లో ఎన్వీ ఎక్స్‌పోర్ట్‌లో అన్ని గ్రానైట్ గ్రానైట్ క్వారీలన్నీ కలిపి మొత్తం 18.17 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు పిటిషనర్ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దాని వల్ల కలిగే అనర్థాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించకపోవడంతో చేసేది లేక ఫిర్యాదుదారుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో స్పందించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరుగుతుంటే అధికారులు ఎందుకు స్పందించలేదని, ఈ ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో 6 వారాల లోగా నివేదిక తమ ముందు ఉంచాలని కలెక్టర్, జిల్లా రెవెన్యూ, మైనింగ్ అధికారులను ఆదేశిస్తూ గ్రానైట్ కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేశారు. ఇరిగేషన్ భూములతో మాకేం సంబంధం గ్రానైట్ క్వారీల యాజమాన్యం ఆక్రమించుకున్న భూములు ఇరిగేషన్ శాఖకు చెందినవి. ఆ భూముల గురించి ఆ శాఖ ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈలు చూసుకోవాలి. మాపై బురద చల్లే పనులు చేస్తున్నారే తప్ప ఇరిగేషన్ శాఖ వారిని అడగాలి. కాలువలు, వాగులు, వంకల భూములు ఆక్రమించుకొని క్వారీయింగ్ చేస్తుంటే మాకేం సంబంధం. – రాజశేఖర్, మైన్స్ డీడీ, ఒంగోలు సాగర్ నీటి పరీవాహక కాలువలు, భూములపై గ్రానైట్ క్వారీల అక్రమ మైనింగ్ హంస గ్రానైట్, జయమినరల్స్, ఎన్వీ ఎక్స్‌పోర్ట్స్‌కి చెందిన క్వారీ యాజమాన్యంపై హైకోర్టు సీరియస్ స్వచ్ఛంద సంస్థ తరఫున హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం 6 వారాల లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్, మైన్స్ డీడీ, రెవెన్యూ అధికారులకు హైకోర్టు నోటీసులు -
బైక్ మెకానిక్ గంజాయి వ్యాపారం
● గంజాయి తరలిస్తూ ఒంగోలు పోలీసులకు చిక్కిన నిందితుడు ● 10 కేజీల గంజాయి స్వాధీనం ఒంగోలు టౌన్: విశాఖపట్నం నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఈఎస్ జనార్దన్ వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు చెందిన పాండిరాజన్ మోటార్ బైకు మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతడి స్నేహితుడైన భాస్కరన్ సెంట్రింగ్ పనులకు వెళుతుంటాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. విశాఖపట్నంలోని పూజారి బుచ్చిబాబు దగ్గర కిలో రూ.3,500 చొప్పున 10 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. మధురైకి చెందిన తంబియన్కు కిలో రూ.12,500లకు విక్రయించడానికి ఒప్పందం చేసుకున్నారు. రైలు మార్గం ద్వారా విశాఖపట్నం నుంచి తమిళనాడుకు వెళుతున్న క్రమంలో ఒంగోలు రైల్వేస్టేషన్ ఎదరుగా రైల్వే కోచ్ రెస్టారెంట్ వెనక ఆటోస్టాండ్ వద్ద ఉండగా అనుమానం వచ్చిన ఎకై ్సజ్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐలు ఆర్.నరహరి, ఎస్.రామారావు, ఎస్సైలు రాజేంద్ర, మౌలాలీలు బ్యాగులు తనిఖీ చేశారు. అందులోని 10 కేజీల గంజాయితో పాటుగా రెండు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను ఒంగోలు ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, కానిస్టేబుళ్లు జయసూర్య, శ్రీనివాస్, నాగరాజు, బాల సుబ్బయ్య, వెంకటరావు, రామిరెడ్డి, చలపతి, హర్ష, కొండలరావు పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ కె.హేమంత నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ అభినందించారు. -
300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
కనిగిరిరూరల్: పట్టణంలోని ఓ రేషన్ దుకాణం నుంచి టెంపో లారీలో అక్రమంగా తరలిస్తుండగా 300 బస్తాల రేషన్ బియ్యాన్ని ప్రజాసంఘాల నాయకులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని 15వ రేషన్ షాపు నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు అడ్డుకోవడంతో అక్రమార్కులు లారీని వదిలేసి పరారయ్యారు. రేషన్ బియ్యం లారీలో ఉన్న 300 బస్తాల్లో సుమారు 136 బస్తాలు ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసినవిగా గుర్తించారు. దీంతో ప్రజా సంఘాల నాయకులు రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫోన్ చేసిన సమాచారం ఇచ్చారు. దీంతో ఎన్ఫోర్సుమెంట్ డీటీ ఆర్ భూపతి, ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోహర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని బియ్యాన్ని పరిశీలించి సీజ్ చేశారు. రేషన్ అక్రమార్కులను తప్పిస్తున్నారా..? ఓ వైపు ప్రజా సంఘాల నాయకులు షాప్ నంబర్ 15 నుంచి లోడింగ్ చేస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. కానీ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టుకున్నది రేషన్ బియ్యమేనని. అయితే ఆ బియ్యం బేస్తవారిపేటకు చెందిన మిల్లు, బియ్యం వ్యాపారి రమేష్వి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఓనర్ రమేష్‌పై లారీ డ్రైవర్‌పై 6ఏ కేసులు నమోదు చేసి లారీని, బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈమేరకు గోడోన్ అధికారులకు అప్పగించి జేసీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. రేషన్ షాపులో ఆన్లైన్ ప్రకారం అన్ని పరిశీలించామని ఎటువంటి తేడాలు లేవని చెప్పారు. మరీ 15వ నంబర్ నుంచి రేషన్ బియ్యాన్ని ఎత్తుతున్నట్లు వీడియోపై ప్రశ్నించగా..దీనిపై విచారిస్తున్నామని ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆర్ భూపతి తెలిపారు. 15 నంబర్ డీలర్ అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలా చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తామని సీఐటీయూ నాయకుడు కేశవరావు హెచ్చరించారు. రేషన్ షాపులో అంతా బాగుందంటున్న ఎన్ఫోర్స్మెంట్ డీటీ లారీ ఓనర్, డ్రైవర్‌పై 6ఏ కేసు నమోదు లారీ, బియ్యం సీజ్ -
మద్యానికి డబ్బులివ్వలేదని.. గొడ్డలితో భార్యపై దాడి
యర్రగొండపాలెం: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండలంలోని వీరాయపాలెంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన రామయ్య మద్యం తాగేందుకు భార్య అంజమ్మను డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని ఆమైపె దాడి చేశారు. ఈ సంఘటన చూసిన అంజమ్మ చెల్లెలు తిరుమల అనంతమ్మపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిద్దరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీహెచ్ ప్రభాకర్‌రావు తెలిపారు. ఒంగోలు సిటీ: జిల్లాలో ఏఓలుగా పనిచేస్తున్న 9 మంది, గుంటూరు జిల్లాలో ఏఓగా పనిచేస్తున్న ఒకరు ఎంపీడీఓలుగా పదోన్నతి పొందినట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. కె. ఖయిమ్పీరా, కె.సీతారామారావు, డి.అబ్ధుల్ ఖాదర్, ఎస్.సత్యమ్, జీవీ కృష్ణారావు, ఎస్.జాన్సుదరం, వి.ప్రతాప్‌రెడ్డిలను ప్రకాశం జిల్లాకు, కె.ధనలక్ష్మిని బాపట్ల జిల్లాకు, డీవీ రమణారెడ్డి, వై.శంకరరావులను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. కొత్తపట్నం: ఇంటి రుణం కోసం తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన మేడికొండ అంకయ్య ఇంటి రుణం కోసం మధ్యవర్తి రఫీ అనే వ్యక్తిని సంప్రదించాడు. వీరిద్దరూ వెళ్లి ఒంగోలు 60 అడుగుల రోడ్డులో ఓ ప్రైవేట్ ఫైనాన్సీ కంపెనీని వెళ్లారు. అక్కడ కంపెనీ ప్రతినిధులు ఏఏ డాక్యుమెంట్లు కావాలో చెప్పి పంపించారు. ఈ క్రమంలో అంకయ్య సదరు డాక్యుమెంట్ల కోసం బాష అనే వ్యక్తిని సంప్రదించగా..బాష కొత్తపట్నం తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చాడు. ఈ క్రమంలో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు డాక్యుమెంట్లు పరిశీలిస్తుండగా..కొత్తపట్నం తహసీల్దార్ సంతకం ఉన్న డాక్యుమెంట్ ఉన్న అనుమానం వచ్చి నేరుగా తహసీల్దార్ శాంతిని కలిశారు. అయితే ఆ డాక్యుమెంట్ చూసిన తహసీల్దార్ శాంతి..అది తన సంతకం కాదని, ఫోర్జరీ చేశారని చెప్పారు. వెంటనే తహసీల్దార్ ఎస్సైకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ డాక్యుమెంట్లు గత నెలలో తయారు చేసినట్లు తెలిసింది. దీనిపై గత రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. -
ఎవరికి పట్టేను ఈ వేదన.. ఏ గుండెను తాకేను ఈ రోదన..
మార్కాపురం: విధి ఆడిన నాటకంలో ఆ అమ్మాయి అనాథగా మారింది. నా అనేవారు లేక ఒంటరిగా ఉంటూ మనోధైర్యంతో పాఠశాలకు వెళ్తూ పదో తరగతి చదువుతోంది. తలిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, ఇలా ఒకరు తరువాత ఒకరు ఆ అమ్మాయిని వదిలి వెళ్లిపోవడంతో ఒంటరైంది. అయినా పట్టుదలతో పాఠశాలకు వెళ్తూ చదువుకుంటోంది. ప్రస్తుతం పెదనాన్న సంరక్షణలో ఉన్న ఆ అమ్మాయి దీనగాథ. మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం గ్రామానికి చెందిన కాటంరాజు, సావిత్రిల కుమార్తె లక్ష్మిలలిత. సరిగ్గా 6 ఏళ్ల క్రితం కూలీపనులకు వెళ్లే నిమిత్తం తండ్రి కాటంరాజు ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే గుండ్లకమ్మపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా చిన్నప్పటి నుంచి అలవాటైన వాగే కదా అని ధైర్యంగా దిగి నడుస్తుండగా వరద ఉధృతి పెరిగి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. తండ్రిని కోల్పోయిన లలిత తల్లి ఉందనే ధైర్యంతో పాఠశాలకు వెళ్లేది. భర్త పోయిన మనోవేదన, అనారోగ్యంతో సావిత్రి కూడా నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో లక్ష్మిలలిత అనాథగా మారింది. చిన్న వయసులోనే అనాథగా మారానని బాధపడింది. అదే సమయంలో అమ్మమ్మ నరసమ్మ చేరదీసి ఆలనాపాలనా చూసింది. సవ్యంగా జీవితం సాగిపోతుందనుకున్న సమయంలో మూడేళ్ల క్రితం ఆమె కూడా కాలం చేయడంతో లక్ష్మీ లలిత జీవితం మొదటికొచ్చింది. నాయనమ్మ అల్లూరమ్మ మళ్లీ దగ్గరకు తీసుకుని మనవరాలిని ఆలనా పాలనా చూస్తూ పాఠశాలకు పంపేది. మళ్లీ దేవుడు ఆ కుటుంబంపై పగ పట్టినట్టుగా అనారోగ్యంతో అల్లూరమ్మ కూడా మృతి చెందింది. దీంతో లలిత మళ్లీ ఒంటరైంది. అమ్మా నాన్న లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే తల్లికి వందనం కూడా రాలేదు. ప్రస్తుతం పెదనాన్న ఆంజనేయులు సంరక్షణలో ఉంటోంది. ప్రతి రోజు ఇంటిపనులు చేసుకుని ఇల్లు చక్కదిద్దుకుని గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్లి పదో తరగతి చదువుతోంది. తన పెదనాన్న కూడా ప్రతిరోజూ కూలీ పనికి వెళ్తున్నాడని, ఇబ్బందులు పడుతూనే చదివిస్తున్నాడని చెప్పింది. దాతలు ఎవరైనా స్పందించి తనకు ఆర్థిక సాయం అందించాలని లక్ష్మిలలిత చేతులు జోడించి ప్రార్థించింది. తనకు సాయం చేయాలనుకునేవారు పెదనాన్న ఆంజనేయులును సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. తల్లిదండ్రులు లేక సాయం కోసం బాలిక ఎదురుచూపులు -
నెల్లూరు పీఆర్ ఎస్ఈగా వైకే
టంగుటూరు: మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన యరమాల కోటేశ్వరరావు (వైకే) నెల్లూరు పంచాయతీరాజ్ విభాగం ఎస్ఈగా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ ఆయన కందుకూరు ఈఈగా, ఒంగోలు ఇన్చార్జి ఈఈగా పనిచేశారు. వైకేకి ఇటీవల ఎస్ఈగా పదోన్నతి లభించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్ఈగా నియమితులయ్యారు. చిన్ననాటి నుంచి చదువుపై మక్కువ పెంచుకున్న ఆయన ఇంజినీరింగ్‌పై ఆసక్తితో కష్టపడి చదువుకున్నారు. ఏఈగా, డీఈగా, ఈఈగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రతీ దశలో ఉన్నతాధికారుల మన్ననలు అందుకుని ఎస్ఈ స్థాయికి ఎదిగారు. విధి నిర్వహణలో తన కింది స్థాయి సిబ్బంది, అధికారులను సమన్వయం చేసుకుంటూ తమ శాఖలో చక్కని ప్రతిభ కనబరిచారు. భవిష్యత్‌లో ఇంజినీర్ ఇన్ చీఫ్ స్థాయికి ఎదగాలని అనంతరం ఎంప్లాయీస్ యూనియన్ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె.అనిల్‌కుమార్, కె.అంజయ్య, ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు ఓఎన్జీసీ వెంకటేశ్వర్లు, కె.చిరంజీవి, నాయకులు వై.జయబాబు, వై.కృష్ణారావు, వై.రాజు, వై.ఎలీషా ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందించారు. వైకేని వైఎస్సార్ సీపీ అనంతవరం నాయకులు ఏవీఎస్ రాజు, శారీమందిర్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కసుకుర్తి కోటేశ్వరరావు, సర్పంచ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, సుబ్బరాజు, నాగరాజు, కె.చినబాలకోటయ్య, కె.వెంకట్రావు తదితరులు అభినందించారు. -
ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: జాతీయ స్థాయిలో అండర్–17 విభాగంలో జరగనున్న ఫెన్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ఎంపికై న క్రీడాకారుల జాబితాను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పుత్తూరి చక్రిక (చీమకుర్తి–సాబర్ విభాగం బ్రాంజ్), పూసపాటి లిఖితారెడ్డి (చెరువుకొమ్ముపాలెం–ఈపీ విభాగం–బ్రాంజ్) ఎంపికై నట్లు తెలిపారు. వీరు ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్వానీ పట్టణంలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్న 20వ క్యాడెట్ అండర్–17 జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు జిల్లా నుంచి ఎంపికయ్యారని వివరించారు. క్రీడాకారులిద్దరితో పాటు వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ రాజును ఫెన్సింగ్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫెన్సింగ్ రాష్ట్ర అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు అభినందించారు. ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని బి.ఎడ్ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 10,936 మంది విద్యార్థులు నమోదు కాగా, వారిలో 95.38 ఉత్తీర్ణత శాతంతో 10,431 మంది విద్యార్థులు పాసైనట్లు యూనివర్సిటీ సీఈ ప్రొఫెసర్ సోమశేఖర్ తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు, సీఈ సోమశేఖర్, తదితరులు అభినందించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి, ఓఎస్డీ ప్రొఫెసర్ రాజమోహన్‌రావు, ఏసీఈ డాక్టర్ ఏ భారతీదేవి, పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, పరీక్షల విభాగం పర్యవేక్షకుడు సూడా శివరామ్, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు వన్‌టౌన్: మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ నెల 15 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 19 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. మహిళలు తమ పూర్తి వివరాలతో కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9573363141 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. చీమకుర్తి: స్థానిక యూటీఎఫ్ భవన్లో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ప్రజానాట్యమండలి జిల్లా స్థాయి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా కార్యదర్శి పొత్తూరి సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టీవీ, సినిమాల విష సంస్కృతికి వ్యతిరేకంగా సాంస్కృతికోద్యమ నిర్మాణానికి వినూత్నంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక మేళాలు, వీధి నాటకాలు, జానపద ఉత్సవాలు, భవిత కోసం బాలోత్సవం, కోలాటం, చెక్కభజన దళాల ఏర్పాటు, నెలనెలా ఓ పూట ఓ పాట నేర్చుకుందాం అనే కార్యక్రమాలతో పాటు కవితా గోష్టులు, డప్పుల దరువులు వంటి కళలపై మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రజాకళాకారులంతా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సురేష్ కోరారు. -
సారు ఎమ్మెల్యే ఫ్రెండ్ మరి.. కాసులివ్వకుంటే సరేసరి!
మార్కాపురం: ‘నాకు మీ ఎమ్మెల్యే మంచి ఫ్రెండు.. చిన్ననాటి స్నేహితుడు.. నేనెంత చెబితే అంత. నా స్థాయి ఏంటో మీరు ఆలోచించండి’ అంటూ అటు పంచాయతీ కార్యదర్శులను.. ఇటు సర్పంచ్‌లను బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ దందాలకు పాల్పడతున్న ఒక మండల పరిషత్ అధికారి తీరు పశ్చిమ ప్రకాశం మొత్తం చర్చనీయాంశమైంది. మార్కాపురం డివిజన్ కేంద్రంలో నివాసముంటున్న సదరు ఎంపీడీఓ వ్యవహారశైలిపై సర్పంచ్‌లు, కార్యదర్శులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, మరికొందరు ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం రాగానే పక్క జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన.. ‘నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిని. నేను చెప్పినట్టు వినకుంటే మీ పనులు కావు’ అంటూ అందరినీ బెదరగొట్టేశాడు. ఎవరైనా సర్పంచ్ వచ్చి తాము చేసిన పనిని పరిశీలించి బిల్ చేయాలని కోరితే కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నాడు. దీంతోపాటు ఆయన తిరిగే కారుకు పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయించాల్సిందే. లేదంటే ఆ సర్పంచ్‌తో ఎమ్మెల్యే పేరుచెప్పి బెదిరింపులకు దిగుతున్నాడు. ‘మీరు చేసిన వర్కుకు ఎమ్మెల్యే బిల్ చేయవద్దని చెప్పారు. నేను ఏమీ చేయలేను’ అంటూ తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగితో రాయ్ఙబేరం’ పెట్టడం సదరు ఎంపీడీఓకు రివాజుగా మారింది. దీంతో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పరిస్థితిని తలచుకుని భయపడుతున్నారు. టీడీపీ సర్పంచ్‌తో వివాదం టీడీపీ సానుభూతిపరుడైన సర్పంచ్ తన గ్రామంలో చేపట్టిన పనులను చూసి బిల్ చేయమని కోరగా ఎంపీడీఓ రూ.80 వేలు డిమాండ్ చేశాడు. దీంతో నివ్వెరపోయిన ఆ సర్పంచ్ వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. ఎంపీడీఓ చేసేదేమీ లేక ఆ సర్పంచ్‌తో తన కారుకు పెట్రోల్ ట్యాంకు ఫుల్ చేయించుకుని వెనుదిరిగాడు. ● 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్ చేయాలంటే ప్రతి సర్పంచ్ దగ్గర నుంచి కనీసం రూ.50 వేలు డిమాండ్ చేస్తున్నాడు. లేదంటే ఎమ్మెల్యే వద్దన్నాడని ఆ సర్పంచ్‌లకు సమాచారం చేరవేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. దీంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. ● ఉపాధి హమీ పథకం బిల్లుల్లో తనకెవరితో సంబంధం లేకుండా 10 శాతం కమీషన్ ఇవ్వాలంటూ హుకుం జారీ చేశాడు. దీంతో అటు టీడీపీ నాయకులు, ఇటు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఎంపీడీఓ తీరుపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ● ఉపాధి హామీలో భారీ అవకతవకలు జరిగినట్టు వార్తలు రాగానే సంబంధిత సిబ్బందిని పిలిచి ‘చర్యలు తీసుకోకుండా ఉండాలంటే నాకు కమీషన్ ఇవ్వాలి’ అంటూ బహిరంగంగానే డిమాండ్ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇలా ఎమ్మెల్యే పేరు చెప్పి కమీషన్లు వసూలు చేస్తున్న అధికారి తీరుపై అటు పంచాయతీ కార్యదర్శులు, ఇటు సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మార్కాపురం పట్టణంలోని పలు కార్యాలయాల్లో సదరు అధికారి లంచావతారంపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సిబ్బంది సదరు అధికారి తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కందుల పేరుతో ఓ ఎంపీడీఓ వసూళ్ల దందా సర్పంచ్ల నుంచి లక్షల రూపాయలు డిమాండ్ పనుల బిల్ చేయాలంటే కారు ఫుల్ ట్యాంక్ చేయాల్సిందే.. ఎంపీడీఓ మైండ్ గేమ్‌తో చిర్రెత్తిపోతున్న సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● ఒంగోలు జీజీహెచ్ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష ఒంగోలు సబర్బన్: అవసరమైన వైద్యసిబ్బందిని నియమించుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించాలని ఒంగోలు జీజీహెచ్ అధికారులను కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గురువారం ఆమె క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగం ద్వారా అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న సిబ్బంది – ఖాళీలు, తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఖాళీగా ఉన్న పోస్టులలోకి డిప్యుటేషన్ ప్రాతిపదికన వైద్యులను తీసుకోవాలని, ఆ దిశగా ఆసక్తి గల వారి నుంచి విల్లింగ్ లెటర్లు తీసుకోవాలని చెప్పారు. వాటి ఆధారంగా జిల్లాలోని పరిస్థితిని తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ ఆదేశించారు. పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ అయ్యి ఎలాంటి ఆమోదం లేకుండా సెలవు పెట్టిన వారిని తొలగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఐసీయూ, ఎంఎన్సీయూ విభాగాలలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యాలరావు, ఆయా విభాగాల వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
8న ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్షిప్ మేళా
ఒంగోలు సిటీ: స్థానిక ప్రభుత్వ ఐటీఐ (బాలురు) కళాశాలలో ఈ నెల 8వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన మంత్రి అప్రంటీస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు సహాయ అప్రంటీస్షిప్ అడ్వైజర్, ప్రిన్సిపాల్ సీహెచ్ఎస్వీ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో జిల్లాలోని ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు, శ్రీ సిటీలోని ఎంఎన్సీ కంపెనీలు, హైదరాబాదు నుంచి ఫార్మాసూటికల్ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొని ఐటీఐ పాసైన అభ్యర్థులను అప్రంటీస్ శిక్షణకు ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఆయా కంపెనీల పారిశ్రామికవేత్తలు పాల్గొని వారి కంపెనీల ప్రాముఖ్యతను తెలియజేస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు శిక్షణాభృతి చెల్లిస్తారని తెలిపారు. ఐటీఐ పాసై ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు పూర్తి వివరాలకు 97031 65456 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఒంగోలు టౌన్: విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ వినోద్ విమర్శించారు. గురువారం స్థానిక సెయింట్ జేవియర్స్ పాఠశాల నుంచి రంగా భవన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రంగా భవన్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 28 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలు సరిపోక అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవని, సిబ్బంది కొరత వేధిస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే హాస్టళ్లు మూతపడటం ఖాయమని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వీటిపై నోరుతెరిచి మాట్లాడటం లేదని విమర్శించారు. విద్యారంగంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ నెల 6వ తేదీ విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
బేస్తవారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హతమార్చారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... కంభం మండలం దరగ గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య (25) వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. బుధవారం రాత్రి 10గంటల సమయంలో బ్రహ్మయ్యకు ఫోన్ రావడంతో హడావుడిగా బయటకు వెళ్లాడు. అతను గురువారం ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి రమణమ్మ గ్రామస్తులకు తెలియజేసింది. గ్రామంలోని యువకులు చుట్టుపక్కల గాలించగా.. బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో సాయిబాబా ఆలయానికి వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ ప్లాట్లలో బ్రహ్మయ్య చెప్పులు కనిపించాయి. అక్కడే రక్తపు మరకలు, ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని చిల్లచెట్ల పొదల్లో బ్రహ్మయ్య పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. అతడ్ని కత్తులతో పొడిచి, ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు స్థానికులు గుర్తించారు. వినాయక నిమజ్జనం సమయంలో వివాదం వల్లే?గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వివాదం జరిగిందని, దీనిపై కక్ష పెట్టుకుని బ్రహ్మయ్యను హత్య చేసి ఉంటారని అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. గ్రామంలో ఒకరిపై తమకు అనుమానం ఉందని కంభం సీఐ మల్లికార్జున, ఎస్ఐ ఎస్వీ రవీంద్రారెడ్డికి చెప్పారు. కాగా, బ్రహ్మయ్య హత్య కేసులో రాజకీయ కోణం లేదని మార్కాపురం డీఎస్పీ నాగరాజు చెప్పారు. ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్లీజ్ నాన్న.. చంపొద్దు..
నాగర్‌కర్నూల్ జిల్లా: తెలంగాణలో దారుణం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లల్ని చంపి ఆపై తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన వ్యక్తి మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెలుగుచూసింది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు (36) ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. గతనెల 30న తన భార్య దీపికతో ఇంట్లో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలు మోక్షిత (8), రఘువర్షిణి (6), శివధర్మ (4) పాఠశాల నుంచి ఇంటికి రాగానే.. ద్విచక్ర వాహనంపై వారిని ఎక్కించుకొని బయలుదేరాడు. వారంతా శ్రీశైలం మీదుగా తమ ప్రయాణాన్ని సాగించారు. చివరకు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో హైదరాబాద్–శ్రీశైలం రహదారి పక్కనున్న వ్యవసాయం పొలంలో వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకంటే ముందే తన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీశాడు. పొలంలో వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని వెల్దండ ఎస్ఐ కురుమూర్తి పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బైక్ నంబర్ ఆధారంగా వివరాల గుర్తింపు..ఇంట్లో గొడవపడి పిల్లలతో సహా వెంకటేశ్వర్లు అదృశ్యం కావడంతో అతడి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడ ఉన్న బైక్ నంబర్ ఆధారంగా ఇక్కడి పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే వెంకటేశ్వర్లు, అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. అక్కడ పిల్లలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.శ్రీశైలం నుంచి హైదరాబాద్ రోడ్డులో వారు ప్రయాణించినట్లు తెలుసుకొని మార్గమధ్యంలోని పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్రీశైలం–హైదరాబాద్ మార్గంలోని అజీపూర్ వద్ద ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు గుర్తించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోనేటీపూర్ టోల్‌ప్లాజా వద్ద మాత్రం పెద్ద కుమార్తెతో మాత్రమే కనిపించాడని పోలీసులు నిర్ధారించారు. మిగిలిన మరో కూతురు, కుమారుడు కనిపించకపోవడంపై విచారణ చేస్తున్నారు. వెల్దండ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ.. పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు పిల్లల ఆచూకీ మిస్టరీగా మారింది. మృతుడి తమ్ముడు మల్లికార్జున్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. -
సోషల్ మీడియాలో చైన్ స్నాచింగ్ చూసి
ఒంగోలు టౌన్: డెలివరీ బాయ్‌గా సంపాదనతో సంతృప్తి పడలేకపోయాడు. బట్టల షాపు పెట్టి బాగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో దొంగగా మారి చివరికి జైలు పాలయ్యాడు. బుధవారం ఒంగోలు సీసీఎస్ పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ జగదీష్ వెల్లడించిన వివరాల ప్రకారం...గుంటూరు పట్టణానికి చెందిన తాళ్లూరి రాజ్ కుమార్ రత్నపూరి కాలనీలో నివాసం ఉంటాడు. డెలివరీ బాయ్‌గా పనిచేసే రాజ్ కుమార్‌కు అంతంత మాత్రం సంపాదనతో సరిపోక ఇబ్బందులు పడసాగాడు. బట్టల షాపు పెట్టాలని ప్రయత్నించాడు కానీ చేతిలో డబ్బులు లేకపోవడంతో విరమించుకున్నాడు. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలనుకున్న రాజ్ కుమార్ సోషల్ మీడియాలో చైన్ స్నాచింగ్ చేసే విధానాన్ని చూసి దొంగగా మారాడు. మొదటిసారి తెనాలిలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా సరే పట్టువదలకుండా బాపట్లలో చైన్ స్నాచింగ్ చేసి బంగారాన్ని దొంగిలించాడు. అప్పటి నుంచి వరసగా చైన్ స్నాచింగ్ చేయసాగాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాపట్ల పట్టణంలోని జండా చెట్టు వీధి ఫిష్ మార్కెట్ ఒక మహిళ మెడలో బంగారు గొలుసు దొంగిలించాడు. అదేనెల 24వ తేదీ చీరాలలోని మేడవారి వీధి బొమ్మలతోటలో మహిళ మెడలో బంగారు చైను లాక్కొని పారిపోయాడు. జూలై నెలలో ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు లేడీస్ హాస్టల్ వద్ద నిలబడి ఉన్న మహిళ మెడలో చైను దొంగిలించాడు. ఆగస్టు 8వ తేదీ పల్నాడు జిల్లా వినుకొండ మెయిన్ బజారులో కాకుమాను పూర్ణచంద్రరావు గోల్డ్ షాపు వద్ద నిలబడి ఉన్న మహిళ మెడలో బంగారు చైనుతో పాటుగా నల్లపూసల దండ దొంగిలించాడు. ఒంగోలు చోరీకి సంబంధించి తాలుకా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ చోరీలను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ సీసీఎస్ సీఐ జగదీష్, తాలుకా సీఐ టి.విజయ కృష్ణ, తాలుకా ఎస్సై ఫీరోజ్, సీసీఎస్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం బుధవారం నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ వద్ద రాజ్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న రూ.20 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సై ఫిరోజ్ పాల్గొన్నారు. -
దేవుడి భూముల్లోనూ తవ్వకాలు..
సింగరాయకొండ మండలంలోని శానంపూడి పంచాయతీ పరిధిలో నెల్లూరు జిల్లా ఉలవపాడు పంచాయతీలోని నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 30 ఎకరాల భూమిలో అక్రమ గ్రావెల్ దందా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దేవదాయశాఖకు చెందిన ఆర్జేసీ స్థాయి అధికారి వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్రమ మైనింగ్ జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి బోర్డు ఏర్పాటు చేసి వెళ్లారు. అయినా అక్రమార్కులు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలో పచ్చతమ్ముళ్ల ఆధ్వర్యంలో భారీగా అక్రమ మైనింగ్ జరగటంతో ఆ ప్రాంతంలో ఉన్న కొండలు కాస్తా ప్రస్తుతం పొలాలుగా, చెరువుల్లాగా మారాయని, వాటిల్లో పచ్చనేతలు జామాయిల్ తోటలను పెంచుతూ ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. టంగుటూరు మండల పరిధిలోని యరజర్ల పంచాయతీ పరిధిలోని కొండల్లో ప్రతిరోజు సుమారు 300 ట్రిప్పర్లు, 50 ట్రాక్టర్లలో గ్రావెల్ దందా యథేచ్ఛగా జరుగుతోంది. ప్రతిరోజు సుమారు రూ.20 లక్షల విలువైన గ్రావెల్‌ను తరలిస్తుండటంతో కొండలు కరిగిపోతున్నాయి. ఈ ప్రాంతంలో మైనింగ్ అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసినా వాహనాల్లో మట్టి తరలిపోతోంది. మైనింగ్ అధికారులు జేబులు నిండుతుండడంతో మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు సైతం మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
దాహం తీర్చండి మహాప్రభో
పొదిలి: నీటి సమస్య పరిష్కారం కాకపోవటంతో సహనం నశించిన మహిళలు రాస్తారోకో చేసిన ఘటన పొదిలి బాప్టిస్ట్‌పాలెంలో బుధవారం రాత్రి జరిగింది. నీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసన చేపడతామని భీిష్మించుకుని ఒంగోలు–కర్నూలు రహదారిపై కూర్చొని నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మహిళలు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వేసవి, వర్షాకాలం అనే తేడా లేదు, గత సంవత్సర కాలంగా నీటి సమస్య వెంటాడుతోంది. దాహం తీర్చండి మహాప్రభో అని ఎంత మంది అధికారులు, నాయకుల వద్ద మొరపెట్టుకున్నా ఒక్కరూ కనికరం చూపలేదు. దీంతో నీరు కొనుక్కోవాల్సి వస్తోంది. ఇంటికొకరు పని మానుకుని నీరు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. మరి కొంత మంది బోర్నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. ఆ బోర్లు కూడా అడుగంటిపోవటంతో ఏం చేయాలో పాలు పోవటంలేదు. నీటి కోసం పడుతున్న ఇబ్బందులు తెలియచెప్పేందుకే రోడ్డు ఎక్కినట్లు’’ మహిళలు చెప్పారు. సమాచారం అందుకున్న ఎస్సై వేమన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కమిషనర్‌ను కలిసి సమస్య చెప్పాలని మహిళలకు సూచించారు. తాము కూడా కమిషనర్ దృష్టికి సమస్య తీసుకెళ్తామని చెప్పటంతో సుమారు అర్థగంట పాటు చేపట్టిన నిరసనను విరమించారు. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
దోపిడీ సహజంగా!
కొండపి నియోజకవర్గంలో సహజ సంపదను అధికార పార్టీ నేతలు కొల్లగొట్టేస్తున్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువుల్లో ఇసుక, మట్టిని ఎడాపెడా తవ్వేస్తున్నారు. భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. నదీగర్భాలకు తూట్లు పొడుస్తున్నారు. కొండలు, గుట్టల స్వరూపాలే మారిపోతున్నాయి. పచ్చపార్టీ నేతల అండదండలతో పగలూ, రాత్రి అన్న తేడా లేకుండా దోపిడీ సాగుతోంది. అడ్డగోలుగా రూ.కోట్లు విలువజేసే సంపదను దోచేస్తున్నా సంబంధిత అధికారులకు మాత్రం కనిపించడం లేదు. తమ జేబులు నిండుతుండడంతో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తవ్వకాలు జోరుగా..సాక్షి టాస్క్‌ఫోర్స్: కొండపి నియోజకవర్గంలో పచ్చ తమ్ముళ్ల ఇసుక, గ్రావెల్ దందా జోరుగా సాగుతోంది. ప్రధానంగా జరుగుమల్లి, పొన్నలూరు మండలాల పరిధిలోని పాలేరు నదిలో, సింగరాయకొండలోని మన్నేరులో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిరోజు వెయ్యికి పైగా ట్రాక్టర్లు, 50 కిపైగా టిప్పర్లలో ఇసుక తరలిస్తూ కోట్లాది రూపాయల సహజ సంపదను కొల్లగొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో అక్రమ తవ్వకాలు చేస్తుండడంతో పాలేరులో భారీ గుంతలు ఏర్పడి నది రూపురేఖలే మారిపోయాయి. అక్రమ రవాణా కారణంగా భారీగా వాహనాలు తిరుగుతుండడంతో పొలాలకు వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నియోజకవర్గ పెద్దల సహకారంతో అక్రమ దందా నడుస్తుండటంతో మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సామాన్యుడు రీచ్లోకెళ్లి ఇసుక తెచ్చుకోవాలంటే పచ్చ తమ్ముళ్ల అనుమతి తప్పనిసరి. వీరు ట్రాక్టరు లోడింగ్‌కు ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మట్టి దందా సింగరాయకొండ మండలంలో శానంపూడి, పాతసింగరాయకొండ, సోమరాజుపల్లి, టంగుటూరు మండలంలో యరజర్ల, కొణిజేడు, మర్లపాడు, కందులూరు, సర్వేరెడ్డిపాలెం, వల్లూరు ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. సింగరాయకొండ మండల పరిధిలో గతంలో ప్రతిరోజు సుమారు రూ.10 లక్షల వరకు గ్రావెల్ దందా జరగగా, ప్రస్తుతం సుమారు రూ.2 లక్షల వరకు, టంగుటూరు మండల పరిధిలో సుమారు రూ.15 లక్షల వరకు జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. -
గురువులకు గుర్తింపు
ఒంగోలు సిటీ: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబరు 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం అందించే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 53 మంది ఎంపికై నట్లు డీఈఓ కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తర్లుపాడు జెడ్పీ హైస్కూల్లో గ్రేడ్–2 హెచ్ఎంగా పనిచేస్తున్న ముత్తోజు సుధాకర్, వెలిగండ్ల మండలం మొగళ్లూరు జెడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న బి.సరోజనిదేవి, పీసీపల్లి జెడ్పీ హైస్కూల్ సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న జీ ఈశ్వరమ్మ, మర్రిపూడి మండలం తంగెళ్ల జెడ్పీ హైస్కూల్ హిందీ టీచర్‌గా పనిచేస్తున్న గుంటగాని భాస్కరరావు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న ఉపాధ్యాయులకు ఈనెల 5వ తేదీ విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవంలో అవార్డులు అందజేస్తారన్నారు. తరగతి గది రూపు మార్చి... తర్లుపాడు: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న తర్లుపాడు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎం.సుధాకర్ మూడేళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యనందించడంలో ముందున్నారు. పూర్వ విద్యార్థుల ద్వారా రూ.50 లక్షలకుపైగా విరాళాలు సేకరించి తాను పనిచేస్తున్న పాఠశాలలో తరగతి గదుల ఆధునికీకరణ, వంటగది, తరగతి గదిలో బెంచీల ఏర్పాటు, పెయింటింగ్‌తో పాఠశాల రూపురేఖలు మార్చేశారు. కొన్నేళ్లుగా ఆ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న సందర్భంగా సుధాకర్‌కు డివిజన్లోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రయోగాత్మకంగా విద్యాబోధన వెలిగండ్ల, (కనిగిరిరూరల్): వెలిగండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక రసాయన శాస్త్రాల ఉపాధ్యాయురాలు బీ సరోజనీదేవి రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. సరోజనీదేవి మొగళ్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల జరిగిన బదిలీల్లో వెలిగండ్ల పాఠశాలకు వెళ్లారు. రసాయన శాస్త్రంలో ప్రయోగాత్మకంగా విద్యాబోధన, సైన్స్ ప్రయోగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆమె ముందున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న సరోజనీదేవిని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు. డ్రాప్అవుట్లను బడిబాట పట్టించి.. మర్రిపూడి: మండలంలోని తంగెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గుంటగాని భాస్కర్‌రావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. డ్రాప్అవుట్లను నిరోధించడం, విద్యార్థుల రోల్ పెంచడం, పదో తరగతి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో ఆయన ముందున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై న సందర్భంగా ఆయనకు సహచర ఉపాధ్యాయులు, ఎంఈవో రంగయ్య అభినందనలు తెలిపారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూత పీసీపల్లి: మండల పరిధిలోని పీసీపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గడ్డం ఈశ్వరి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. దాతల సహకారంతో తాను పనిచేసే పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివించేందుకు చేయూతనందించడం, తాను తొలిసారి ఉపాధ్యాయురాలిగా చేరిన అంక భూపాలపురంలో ఎంతోమంది పేద విద్యార్థులు నవోదయ సీట్లు సాధించేలా ఆమె కృషి చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న ఈశ్వరిని ఎంఈఓ ఆర్ శ్రీనివాసచారి, సహచర ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా స్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 53 మంది ఎంపికయ్యారు. వారిలో 10 మంది ప్రధానోపాధ్యాయులు, 23 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 20 మంది స్కూల్అసెస్టెంట్లు ఉన్నారు. ఎంపికై న ప్రధానోపాధ్యాయుల్లో గిద్దలూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎం.సిద్దేశ్వరశర్మ, తాళ్లూరు మండలం తూర్పు గంగవరం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం వై.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బేస్తవారిపేట జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం మన్నం శ్రీదేవి, కొండపి మండలం, పెదకండ్లగుంట జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం పి.మహబూబ్ ఖాన్, కనిగిరి గరల్స్ హైస్కూల్ హెచ్ఎం జి.సంజీవి, మార్కాపురం మండలం, కంబాలదిన్నె జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఆర్.మాలకొండయ్య, యర్రగొండపాలెం మండలం, గంజివారిపాలెం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం వి.సుబ్బారెడ్డి, కనిగిరి మండలం, చాకిచర్ల జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం టి.పెద్దిరెడ్డి, కొత్తపట్నం మండలం, ఈతముక్కల జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం సీహెచ్.చెంచుపున్నయ్య, నాగులుప్పలపాడు మండలం, వినోదరాయునిపాలెం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎల్.వి.ఎన్.రమేష్ లకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. -
రాత్రి వేళల్లో అక్రమ రవాణా
రాత్రి వేళల్లో మాత్రమే ఈ అక్రమ మైనింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు యథేచ్ఛగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక, మట్టిని తరలించుకుపోతున్నారు. సింగరాయకొండ మండలంలో దేవదాయ, అసైన్డ్ భూముల్లో సైతం దందాలకు పాల్పడుతున్నారు. గత మార్చి నెల చివరి వారంలో ప్రజాసంఘాలు, కుల సంఘాల ఫిర్యాదుతో మైనింగ్ అధికారులు దాడులు జరిపి సుమారు రూ.5 లక్షల వరకు జరిమానా విధించారని తెలిసింది. తరువాత కొద్దిరోజులకే అక్రమ రవాణా చేస్తున్న గ్రావెల్ టిప్పర్‌ను మైనింగ్ అధికారులు ఏప్రిల్ మొదటి వారంలో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించి జరిమానా రూ.లక్షల్లో విధించగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో కేవలం వేలల్లో జరిమానా కట్టారన్న ప్రచారం జోరుగా సాగింది. శానంపూడి పంచాయతీ పరిధిలో మన్నేరు నుంచి ప్రతి రోజు 30 నుంచి 40 ట్రాక్టర్ల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇక్కడి నుంచి సింగరాయకొండ, ఉలవపాడు మండలాలకు ఇసుకు రవాణా అవుతోంది. ట్రాక్టరు ఇసుక రూ.1,200 నుంచి రూ.1,500 వరకు అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. పచ్చతమ్ముళ్లు మాత్రమే ఇసుక రవాణా చేయాలన్న ఆంక్షలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. జరుగుమల్లి మండలంలో కే బిట్రగుంట, జరుగుమల్లి, చింతలపాలెం, సతుకుపాడు, కామేపల్లి గ్రామాల పరిధిలో పాలేరులో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. పచ్చ నేతల పర్యవేక్షణలోనే ఇసుక రీచ్‌లు నిర్వహిస్తుండగా రీచ్‌లలో ప్రాంతాలను బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ట్రాక్టరు యజమానులు ఆరోపిస్తున్నారు. సతుకుపాడు, కామేపల్లి ప్రాంతాల్లో అయితే ట్రాక్టర్ల ద్వారా కేవలం పచ్చతమ్ముళ్లు మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నారని, ఎవరైనా ఇంటి అవసరాలకు ట్రాక్టరు తీసుకెళ్లి ఇసుక తెచ్చుకోవాలంటే పచ్చనేతలకు కప్పం కట్టాల్సిందే. లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జరుగుమల్లి వద్ద పాలేరు నదిలో ఇసుకను పొక్లయినర్‌తో తవ్వి ట్రాక్టర్‌కు లోడ్ చేస్తూ.. -
ఏఆర్ ఏఎస్పీగా కొల్లూరు శ్రీనివాసరావు
ఒంగోలు టౌన్: జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీగా కొల్లూరు శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కొల్లూరు శ్రీనివాసరావు 1991లో ఆర్ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. తొలి పోస్టింగ్ నెల్లూరు లో చేశారు. 2001లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది విజయవాడకు బదిలీ అయ్యారు. అక్కడ నుంచి 2003లో ఒంగోలు పీటీసీకు వచ్చారు. ఆ తరువాత 2003 నుంచి 2009 వరకు ఆర్ఐ హోంగార్డుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహించారు. 2009లో అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా టీటీడీలో పనిచేశారు. 2011లో డీఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన గ్రే హౌండ్స్ విభాగంలో హైదరాబాద్, వైజాగ్‌లలో 2013 వరకు విధులు నిర్వహించారు. 2014లో నెల్లూరు డీటీసీ వైస్ ప్రిన్సిపాల్‌గా, 2014–18లో నెల్లూరు, ప్రకాశం హోంగార్డ్స్ డీఎస్పీగా పనిచేశారు. ఆ తరువాత విజిలెన్స్ డీఎస్పీగా ఏపీ జెన్కోకు బదిలీ అయిన ఆయన కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరులలో ఆరున్నరేళ్లు విధులు నిర్వహించారు. 2024 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కడప డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఏఎస్పీగా పదోన్నతిపై ఒంగోలు ఏఆర్‌లో బాధ్యతలు చేపట్టారు. కనిగిరిరూరల్: విద్యుత్ శాఖలోని కార్మిక సంఘాల ప్రకాశం జిల్లా జేఎసీ చైర్మన్ సీహెచ్ హరికృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక విద్యుత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీహెచ్ హరి కృష్ణ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం తీవ్ర కాలయాపన చేస్తోందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 15వ తేదీ నుంచి సమ్మె చేపట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. సమ్మెను విజయవతం చేసేందుకు కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఒంగోలు టౌన్: ఒంగోలు మెడికల్ కాలేజీకి 30 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ఇప్పటి వరకు 120 సీట్లు ఉండగా పెరిగిన సీట్లతో 150 కు చేరింది. ఇందులో ఇండియా కోటాలో 22 సీట్లు, స్టేట్ కోటాలో 128 సీట్లు వస్తాయి. దీంతో మన రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. అదనంగా మరో 50 సీట్లు కేటాయించాలని ఎన్ఎంసీకి ఇటీవల ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. పరిశీలన అనంతరం ఎన్ఎంసీ 30 సీట్లు పెంచుతూ నిర్ణయం తీసుకొందని వివరించారు. సీట్ల పెంపు కోసం పనిచేసిన కళాశాల సిబ్బందికి, ప్రొఫెసర్లకు ప్రిన్సిపాల్ అశోక్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అభినందనలు తెలిపారు. మార్కాపురం: మార్కాపురానికి చెందిన హాస్యబ్రహ్మ శంకర్‌నారాయణ వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు. బుధవారం హైదరాబాదులోని త్యాగరాయ గానసభ కళావేదికలో త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి వండర్బుక్ ఆఫ్ రికార్‌ుడ్స ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బీ నరేంద్రగౌడ్ శంకరనారాయణకు రికార్డును అందజేశారు. ఈ సందర్భంగా శంకర్‌నారాయణ మాట్లాడుతూ తాను 27 ఏళ్ల నుంచి దేశ విదేశాల్లో వేలాది హాస్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 550 హాస్యావధానాలు చేశానని, త్యాగరాయ గానసభలోనే 25 గంటలపాటు నిర్విరామ ప్రజా హాస్యావధానం నిర్వహించినట్లు చెప్పారు. దీంతో వండర్బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో నమోదుచేసి తనకు అందజేశారన్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడు మృతి
కొనకనమిట్ల: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని నాగంపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గొట్లగట్టు ఎస్సీ కాలనీకి చెందిన ఎండూరి ప్రభాకర్, దీనమ్మ దంపతుల కుమారుడు రాకేష్(18) పదో తరగతి వరకు చదువుకున్నాడు. పైచదువులకు ఆర్థికస్థోమత లేకపోవడం, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు కూలి పనులకు వెళుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం టెంట్ హౌస్ పని నిమిత్తం నాగంపల్లి ఎస్సీ కాలనీలో జరిగే ఓ వేడుకకు స్టేజీ ఏర్పాటు చేసేందుకు రాకేష్, గొంగటి బన్ని, విష్ణులు గొట్లగట్టు నుంచి వెళ్లారు. ముగ్గురు స్టేజీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో పైప్ పైన ఉన్న విద్యుత్ తీగలకు తగలటంతో ముగ్గురు విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ మృతి చెందగా, బన్నీ, విష్ణులు గాయపడ్డారు. క్షతగాత్రులను పొదిలి ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో కుమారుడు రాకేష్ మృతి చెందటంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ముల్లా మహ్మద్ తెలిపారు. రాకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జేఎల్ఎంకు తీవ్ర గాయాలు హనుమంతునిపాడు: విద్యుత్ షాక్‌కు గురై ట్రాన్స్ఫార్మర్ నుంచి కిందపడి సచివాలయ జేఎల్ఎంకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..సీతారాంపురం సచివాలయంలో శ్రావణ్‌కుమార్ జేఎల్ఎంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో హనుమంతునిపాడు సచివాలయంలో విద్యుత్ శాఖలో జేఎల్ఎం లేకపోవడంతో విద్యుత్ అధికారులు చెప్పిన ప్రకారం హనుమంతునిపాడులో డిప్యూటేషన్ కింద పనిచేస్తున్నాడు. బుధవారం పెద్దిరెడ్డి తోటలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తూ 11 కెవీ ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి హెడ్ ఫీజులు వేస్తున్నాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా కావడంతో ట్రాన్స్ఫార్మర్ నుంచి కిందపడ్డాడు. ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. విద్యుత్ షాక్‌తో స్పృహ కోల్పోవడంతో కనిగిరి ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం ఒంగోలుకు తరలించారు. మరో ఇద్దరికి గాయాలు -
యువ వ్యాపారి ఆత్మహత్య
యర్రగొండపాలెం: తన ముగ్గురు పిల్లలను బైక్‌పై ఎక్కించుకుని ఇంటి నుంచి వెళ్లిన యువ వ్యాపారి బుధవారం శవమై కనిపించాడు. ఈ విషాద వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టగా.. పిల్లలు ఏమయ్యారో అంతుచిక్కక బంధువులతోపాటు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి గ్రామానికి చెందిన ఫెర్టిలైజర్ దుకాణం యజమాని గుత్తా వెంకటేశ్వర్లు(35), దీపిక దంపతులకు ముగ్గురు పిల్లలు. వెంకటేశ్వర్లు బోయలపల్లిలో వ్యవసాయం చేస్తూనే ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో వెంకటేశ్వర్లు తన కుమార్తెలు దీపిక(8), వర్షిణి(6), కుమారుడు శివధర్మ(4)ను బైక్‌పై ఎక్కించుకుని బయటికి వెళ్లాడు. పిల్లలను బైక్‌పై కాసేపు తిప్పి ఇంటికి వస్తాడని కుటుంబ సభ్యులు భావించారు కానీ రాత్రి పొద్దుపోయాక కూడా ఇంటికి చేరలేదు. ఒకటో తేదీన శ్రీశైలంలో ఉన్నట్లు తెలుసుకున్న బంధువులు అక్కడ వెతికారు. అయినప్పటికీ వారి జాడ తెలియకపోవడంతో శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వెల్దండి మండలం పెద్దాపూర్ గ్రామ సమీపాన హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిలోని బూరకుంట వద్ద వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ ప్రాంత పోలీసులు బుధవారం వేకువజామున గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గత మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి భార్య దీపిక, తల్లి వెంకటలక్ష్మి, అత్త పాలడుగు రాధ బోరున విలపిస్తున్నారు. కాగా వెంకటేశ్వర్లుకు ఆర్థిక ఇబ్బందులు లేవని, అందరితో బాగుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. చిన్నారుల ఆచూకీ చిక్కేనా? వెంకటేశ్వర్లు తన కుమార్తెలు, కుమారుడితో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా డిండి ప్రాజెక్ట్, హాజీపూర్ పరిసరాల్లో బైక్‌పై తిరిగినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ ప్రాంత పోలీసులు గుర్తించారు. హాజీపూర్ వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు సమీపంలో రెండో కుమార్తె, కుమారుడిని వదలి పెట్టినట్లు తెలుస్తోంది. పెద్ద కుమార్తెను బైక్‌పై తీసుకెళ్లిన వెంకటేశ్వర్లు బూరకుంట వద్ద శవమై కనిపించాడు. మోక్షితను ఎక్కడ వదలి పెట్టాడు? పెట్రోల్ బంక్ వద్ద వదిలి వెళ్లిన ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఎక్కడనే విషయంపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ జెండా పోలు తీస్తావా.. రౌడీషీట్ ఓపెన్ చేయమంటావా
చీమకుర్తి రూరల్: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై ఎస్సై వేధింపులు ఆగడం లేదు. వివరాల్లోకి వెళితే..మండలంలోని తొర్రగుడిపాడు గ్రామంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయం కూడలిలో ఉన్న వైఎస్సార్ సీపీ జెండా పోలు వద్ద వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి వెళ్లిపోయారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో ఎస్సై కృష్ణయ్య తొర్రగుడిపాడు వచ్చి వైఎస్సార్ కార్యకర్తల గృహాలకు వెళ్లి..వైఎస్సార్ సీపీ జెండా పోలు తీసివేయాలని, లేకుంటే రౌడీషీట్ ఓపెన్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసేది లేక జెండా పోలు తీశారు. ఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులను టార్గెట్ చేసుకొని రౌడీషీట్ ఓపెన్ చేస్తానంటూ భయభ్రాంతులకు గురిచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తొర్రగుడిపాడులో ఎస్సై బరితెగింపు -
మానసిక వికాసానికి కళలు దోహదం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశమని, దేశ సంస్కృతిని చాటి చెప్పే నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించడం అభినందనీయమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో బుధవారం జరిగిన నవోదయ విద్యాలయం రీజనల్ స్థాయి కళా ఉత్సవ్ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఎస్పీ మాట్లాడుతూ...విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను కళా ఉత్సవాలు వెలికి తీస్తాయని చెప్పారు. చదువుతో పాటు కళల్లో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కళలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పారు. సమాజంలో మనుషుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు. భరత నాట్యం, కూచిపూడి వంటి నృత్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒంగోలుకు తరలిరావడం సంతోషం కలిగిస్తుందన్నారు. కళా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అబినందించారు. రెండో రోజు కళా ఉత్సవాలు ఉల్లాసభరిత వాతావరణంలో జరిగాయి. పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటుగా అండమాన్ నికోబార్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి 165 మంది విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, తాలుకా సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్ సీఐ నాగరాజు, నవోదయ ప్రిన్పిపాల్ సి.శివరామ్ , వివిధ జిల్లాలకు చెందిన నవోదయ ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, విద్యార్థుల తలిదండ్రులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్: స్థానిక కోర్టు ఆవరణలో పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన పిచ్చిరెడ్డి, అతడి భార్య నాగమణిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ కె.సురేష్ తెలిపారు. మండలంలోని అక్కల్‌రెడ్డిపల్లె గ్రామానికి చెందిన పిచ్చిరెడ్డి అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డితో పాటుగా మరి కొందరిపై ఘర్షణ పడ్డారు. ఈ విషయలంలో పోలీస్‌స్టేషన్‌లో తనకు న్యాయం జరగలేదని ఆత్మహత్య యత్నానికి పాల్పడినందుకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
త్రిపురాంతకం: అమరావతి–అనంతరం నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని పాత అన్నసముద్రం గ్రామానికి చెందిన పి. రాజు, కొండమ్మ దంపతులు స్వగ్రామం నుంచి మేడపికి సరుకులు కొనుగోలు చేసేందుకు బైక్‌పై వెళుతున్నారు. అదే సమయంలో వినుకొండ వైపు వెళుతున్న టాటా ఏసీ వాహనం ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో భార్యభర్తలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో వీరు అనాథలుగా మారారు. భార్యభర్తల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలాన్ని సీఐ అసాన్, ఎస్సై శివ బసవరాజు సందర్శించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పీసీపల్లి: తెల్లరాయి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు దాడులు చేశారు. మండల పరిధిలోని మురుగమ్మి, తురకపల్లి గ్రామాల్లో తెల్లరాయి అక్రమంగా తవ్వేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న విజిలెన్స్, మైనింగ్ అధికారులు రెండు గ్రామాల్లో దాడులు చేశారు. ఆయా ప్రాంతాల్లో తవ్వుతున్న వాహనాలను సీజ్ చేశారు. ఆర్వీఎస్ ఒంగోలు రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఆర్ఐ శంకరయ్య, తిరుపతిరావు, కృష్ణారావు, పోలిరెడ్డిలు దాడులు చేశారు. అక్రమంగా తవ్వి తరలించేందుకు సిద్ధంగా ఉన్న రాయిని సీజ్ చేశామని పేర్కొన్నారు. గిద్దలూరు రూరల్: పట్టణంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ట్రేడర్స్‌లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో విక్రయాల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం, ఎరువుల నిల్వల్లో అవకతవకలు గుర్తించి 256 బస్తాల యూరియా, 15 బస్తాల 24–24 ఎరువులను సీజ్ చేశారు. దుకాణ నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేశారు. చక్రవర్తి ట్రేడర్స్‌లో 12.75 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. నరవ, పొదలకుంటపల్లె గ్రామాల్లోని రైతుసేవా కేంద్రాల్లోని గౌడోములలో నిల్వ ఉన్న స్టాక్ రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సీహెచ్.రవిబాబు, ఎస్సై జి.నాగేశ్వరరావు, ఏఓ విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, రెండో ఓటు ఉంటే పోటీకి అర్హత ఉండదని డీఆర్ఓ ఓబులేసు అన్నారు. స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాలులో జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ కేంద్రాలను 2183 నుంచి 2263కు పెంచామన్నారు. త్వరలో ఇంటింటి సర్వే చేసి తప్పులు ఉన్న వాటిని సరిచేస్తామని తెలిపారు. రెండు ఓట్లు ఉన్న వారు వెంటనే రెండో ఓటును తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ప్రతినిధి రామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ రెండేసి ఓట్లు ఉన్న వారు వేలల్లో ఉన్నారని, వాటిని ఆధార్ అనుసంధానం చేసి తొలగించాలని కోరారు. సమావేశంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్‌రెడ్డి, ఈఆర్వోలు వెంకట శివరామిరెడ్డి, జాన్సన్, వరకుమార్, జిల్లా ఎలక్షన్ సెల్ శ్రీనివాసరావు, డీటీ రాజశేఖర్‌రెడ్డి, ఉపేంద్ర, ఒంగోలు డీటీ సలోమి, కృష్ణమోహన్, తహసీల్దార్లు శాంతి, బ్రహ్మయ్య, ఆంజనేయరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. త్రిపురాంతకం మండలం అన్నసముద్రం సమీపంలో దుర్ఘటన -
విద్యుత్ లైన్ ఏర్పాటు నిలిపివేత
బేస్తవారిపేట: మండలంలోని పెంచికలపాడులో రైతుల పొలాల్లో నుంచి అక్రమంగా ఇండస్ట్రీయల్ అవసరాల కోసం లాగుతున్న విద్యుత్ లైన్‌ను నిలిపేశారు. ఈనెల 1వ తేదీన ‘విద్యుత్ లైన్ ఏర్పాటు అడ్డగింత’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కొమరోలు మండలం ముత్తరాసుపల్లెలో మొక్కజొన్న ఇండస్ట్రీ కోసం పెంచికలపాడు నుంచి రైతుల పొలాల్లోంచి హైవేరోడ్డు పక్క నుంచి విద్యుత్ స్తంభాలు వేస్తున్నారు. ఈ విషయంపై రైతులు ఎటువంటి అనుమతులు లేకుండా మా పొలాల్లో విద్యుత్ లైన్ ఏలా ఏర్పాటు చేస్తారని అడ్డుకున్నారు. కలెక్టర్, తహసీల్దార్, విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ లైన్ ఏర్పాటు పనులను నిలిపివేశారు. కొమరోలు: బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని దద్దవాడ గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం పొదలకొండపల్లె గ్రామానికి చెందిన కప్పల కొండయ్య(23) పని నిమిత్తం బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామానికి వెళ్లాడు. తన బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో దద్దవాడ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కొండయ్య తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సింగరాయకొండ: స్థానిక ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఈనెల 5వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీ్త్ర, పురుషుల అండర్–18 జట్లను ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి ఎన్టీ ప్రసాద్ తెలిపారు. ఎంపికై న జట్లు ఈనెల 13, 14వ తేదీల్లో కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ సమర్పించాలని, వివరాలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ పీడీ శంకరరావును సంప్రదించాలని సూచించారు. -
ఎరువుల దుకాణాలపై ఆకస్మిక దాడులు
ఒంగోలు టౌన్: జిల్లాలోని ఎరువుల దుకాణాలు, గోడౌన్లలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లాలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరియా, ఇతర ఎరువుల కొరత ఏర్పడినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మంగళవారం పోలీసులు, వ్యవసాయాధికారులు సమన్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాలోని 121 ఎరువుల దుకాణాల మీద దాడులు నిర్వహించారు. ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట 2, మంగమూరు రోడ్డు 1, త్రోవగుంట 1, పేర్నమిట్ట, కవరది వ్యవసాయ పరిపతి సంఘంలో ఒక దుకాణాలను తనిఖీలు చేశారు. సీఐలు నాగరాజు, విజయకృష్ణ, వ్యవసాయాధికారులు, పోలీసు సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. స్టాక్ నమోదు, పీఓఎస్ యంత్రాల్లో నమోదైన వివరాలు, పంపిణీ రిజిస్టర్లు, విక్రయపత్రాలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఎరువుల దుకాణాల్లో వాస్తవ నిల్వలు, పీఓఎస్ యంత్రాల్లో నమోదైన స్టాక్ మధ్య తేడాలున్నాయా అనే కోణంలో రికార్డులను పరిశీలించారు. యూరియాను ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారా లేదా అని దుకాణాల వద్ద ఎరువుల కోసం వచ్చిన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు, అధికారులు దాడులు చేయడంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఎరువుల విక్రయాలపై రసీదులు తప్పకుండా ఇవ్వాలని ఆదేశించారు. మున్ముందు కూడా తనిఖీలు కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. ఎరువుల విక్రయాల్లో ఏదైనా అక్రమాలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు కానీ, వ్యవసాయాధికారులకు కానీ సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 121 ఎరువుల దుకాణాల తనిఖీ -
పోటాపోటీగా లడ్డుల వేలం పాటలు
● రూ.1.56 లక్షలు పలికిన గణేష్ లడ్డు చీమకుర్తి: వినాయక నిమజ్జనం సందర్భంగా పలు వినాయకుడి విగ్రహాల వద్ద లడ్డు వేలం పాటలు పోటాపోటీగా జరుగుతున్నాయి. పద్మశాలీయుల ఆధ్వర్యంలో చీమకుర్తిలోని శ్రీభావనారుషి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద లడ్డును అనుముల చలపతి రూ.1.56 లక్షలకు పాడుకున్నారు. స్వామి వారి వద్ద పూజలు అందుకున్న 25 కేజీల లడ్డును పాడుకున్న అనంతరం బంధువులతో కలిసి ఊరేగింపుగా ఇంటికి ఉత్సాహంగా తీసుకెళ్లారు. చీమకుర్తిలోనే రెడ్డిబజార్లో ఏర్పాటు చేసిన వినాయుడి ఊరేగింపులో ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి పాల్గొన్నాడు. రెడ్డిబజారులో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డును బీమనాథం శేషిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి రూ.1.12 లక్షలకు పాడుకున్నారు. ఒంగోలు వన్‌టౌన్: నక్కల గిరిజనులకు పక్కా గృహాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద నక్కల గిరిజనుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి నక్కల గిరిజన సంఘం అధ్యక్షుడు ఆర్ రాణెమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అయినా నక్కల వారికి కనీస మౌలిక వసతులను పాలకులు కల్పించలేదన్నారు. దీంతో వారు రోడ్లమీదనే జీవనం కొనసాగిస్తున్నారన్నారు. గతంలో నగరంలోని నక్కల వారికి అల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ముంపు ప్రాంతంలో 55 కుటుంబాలకు నివేశన స్థలాలు ఇచ్చారన్నారు. వారు ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలు ముంపునకు కొట్టుకుపోయారన్నారు. దీంతో వారు తిరిగి రోడ్లమీదనే నివసిస్తున్నారన్నారు. కార్యక్రమానికి ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఆల్ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణి కోట లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి టి.వెంకటస్వామి, రచయిత పిన్నిక శ్రీనివాస్, గిరిజన నాయకులు జెమిని, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. సీఐ, తహసీల్దార్ ఇచ్చిన హామీతో ధర్నా విరమించారు. ● స్పృహ కోల్పోయిన గర్భిణి పీసీపల్లి: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో గర్భిణి స్పృహ కోల్పోయిన ఘటన పీసీపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పీసీపల్లి మండలం మల్లేనివారిపల్లికి చెందిన బత్తుల లక్ష్మీ తిరుపతమ్మ 8వ నెల గర్భిణి కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించుకునేందుకు వచ్చింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన అభిమానులు వైద్యశాలలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, ఎమ్మెల్యే మెప్పు పొందేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది అంతా రోగుల గురించి పట్టించుకోకుండా ఎమ్మెల్యే చుట్టూ చేరారు. రోగులు కూర్చునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఆ సమయంలో గర్భిణి లక్ష్మీ తిరుపతమ్మ కళ్లు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోయింది. అప్పటికి గానీ వైద్య సిబ్బందిలో చలనం రాలేదు. గర్భిణిని తీసుకెళ్లి సైలెన్ పెట్టి చికిత్స అందించారు. దీనిపై స్థానిక డాక్టర్ యశ్వితను వివరణ కోరగా తిరుపతమ్మ ఆరో నెల గర్భిణి అని, అంతమందిని చూసి భయపడి కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పారు. తిరుపతమ్మ భర్త బత్తుల బాబు మాట్లాడుతూ తన భార్య 8వ నెల గర్భిణి అని, అది కూడా వైద్యులకు తెలియలేదని, ప్రభుత్వాస్పత్రిలో అసలు రోగుల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. వచ్చిన రోగులు కూర్చునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో బీపీ డౌన్ అయి కిందపడిపోయిందని చెప్పాడు. -
చదువుతోపాటు కళలూ ముఖ్యం
● నవోదయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ బండి చక్రపాణి ఒంగోలు టౌన్: విద్యార్థులు చదువుతోపాటు కళల్లోనూ రాణించాలని, సహపాఠ్య కార్యకలాపాలైన నృత్యం, గానం, చిత్రలేఖనం, శిల్పకళ, లలిత కళలపై తగినంత శ్రద్ధ చూపాలని నవోదయ విద్యాలయ సమితి అసిస్టెంట్ కమిషనర్ బండి చక్రపాణి సూచించారు. మంగళవారం ఒంగోలులోని జీజీహెచ్ ఆడిటోరియంలో నవోదయ విద్యాలయం రీజినల్‌స్థాయి కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన చక్రపాణి మాట్లాడుతూ.. ఒంగోలుకు సాహిత్య, సాంస్కృతిక నేపథ్యం ఉందని, సినీనటి భానుమతి, ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన దర్శకులు టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య, బాబ్జీ, బి.గోపాల్, రామానాయుడు లాంటి దిగ్గజాలకు ప్రకాశం పుట్టినిల్లు అని పేర్కొన్నారు. అందుకే ఒంగోలులో కళా ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ...విద్యార్థుల మెదడు చురుగ్గా పనిచేయడానికి, భావోద్వేగాలను అదుపుల వుంచుకోవడానికి కళలు దోహదం చేస్తాయని చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, అండమాన్ నికోబార్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి 165 మంది విద్యార్థులు, వారి తలిదండ్రులు తరలివచ్చారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థిని కుమారి నేహా చేసిన భరత నాట్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో నవోదయ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభాకర రెడ్డి, రీజియన్ పరిధిలోని వివిధ నవోదయ పాఠశాలల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్, పార్వతి, పి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసులు, మ్యూజిక్ టీచర్లు రవిశంకర్, శాంతిశ్రీ, మహాదేవ నాయక్, సనద్ సాహు, ఆర్ట్ టీచర్లు నాగమల్లేశ్వరరావు, జేమ్స్, వీర రాఘవ, ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ సి.శివరామ్ తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల అధ్యాపకులు చెరుకూరి అయ్యన్న, గుంటూరు నవోదయ ప్రిన్సిపాల్ పి.శ్రీనివారసరావు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. -
పవన్‌కళ్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలు
● వైపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అవకాశవాద రాజకీయాలకు తెరతీసినట్లు సుగాలీ ప్రీతి కేసులో తేటతెల్లమైందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని చేజిక్కించుకోవటానికి పవన్ కల్యాణ్ సుగాలీ ప్రీతి కేసును వారధిగా వాడుకున్నాడని అన్నారు. గిరిజన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని డబ్బుతో వెలకట్టినట్లు మాట్లాడిన తీరు ఆయన అగ్రకుల అహంకారాన్ని బయటపెట్టిందన్నారు. తన కుటుంబాన్ని దూషించారని కేసులు కట్టి జైళ్లలో పెట్టించిన ఈ పెద్దమనిషి అతి క్రూరంగా అభం శుభం తెలియని బిడ్డను అత్యాచారం, హత్య చేసిన సంఘటనపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక్క మాట మాట్లాడలేదన్నారు. 2024 ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఈ వ్యవహారాన్ని ఎంచుకున్నాడని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచి పొలం, స్థలం, ఉద్యోగాన్ని బాధ్యతగా ఇచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని, అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని నిందించడమే లక్ష్యంగా చేసుకున్నాడని అన్నారు. ఈ కేసులో ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు లోను కాకుండా విచారణ జరిపించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి సీబీఐకి అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కేసుతో రాజకీయ లబ్ధిపొందిన పెద్దమనిషి పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగురాలైన ప్రీతి తల్లి గర్భ శోకాన్ని అవహేళన చేయడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సహాయాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని మాట్లాడటం హేయమైన చర్య అని అన్నారు. సీబీఐకి వనరులు ఇవ్వకుండా ఆ కేసులో అరెస్ట్ అయిన వారితో డీఎన్ఏ మ్యాచ్ కాలేదని లాజిక్‌లేని అసంబద్ధమైన వ్యాఖ్యలతో తప్పించుకునే ప్రయత్నం చేయడం డీసీఎంతోపాటు సీఎం చంద్రబాబు అసమర్ధతకు అద్దం పడుతోందని అన్నారు. డీఎన్ఏ ఇప్పుడు ఉన్న నిందితులతో మ్యాచ్ కావడంలేదంటే ఈ కేసులో ఇంకెవరో నిందితుడు తప్పించుకున్నాడన్న నిజం తెలిసినా కూడా పవన్ కల్యాణ్ ప్రజల దృష్టిని మళ్లించటానికి జనసేన నేతలతో దివ్యాంగురాలైన ప్రీతి తల్లి అవమానపరిచేలా మాట్లాడించారని అన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.అరుణాబాయి, పుల్లలచెరువు జెడ్పీటీసీ వాగ్యా నాయక్, నాయకులు కె.సురేష్ నాయక్, పి.మంత్రూనాయక్ పాల్గొన్నారు. -
పచ్చ నేతల పత్తేపారం!
పొన్నలూరు: అధికారం చేతిలో ఉండగానే నాలుగురాళ్లు వెనకేసుకోవడానికి టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి నిర్మాణాల కోసం మట్టి తీసుకెళ్తున్న సామాన్య ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్ల దందాకు తెరలేపారు. ఇదేమని ప్రశ్నించిన వారిని పోలీస్ కేసులు పెట్టిస్తామని బెదిరించి అందినకాడికి దోచుకుంటూ జేబులు నింపుకొంటున్నారు. ఈ తంతు పొన్నలూరు మండలంలోని కె.అగ్రహరంలో గత నెల రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కె.అగ్రహరం గ్రామ శివారులో కొంత నాణ్యమైన మట్టి దిబ్బలు ఉన్నాయి. అయితే స్థానిక ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు వారి ఇంటి నిర్మాణాలతో పాటు ఇళ్ల ముందు మెరకలు చదును చేయడానికి ట్రాక్టర్లతో మట్టి తీసుకెళ్తుంటారు. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా, డబ్బు చెల్లించకుండా స్థానికులు తమ గృహావసరాల కోసం మట్టి తోలుకుంటుంటారు. అయితే స్థానిక టీడీపీ నాయకుల కన్ను మట్టి తోలుకునే వారిపై పడింది. మట్టి దిబ్బలు తమ సొంతమైనట్టు భావించి ఆంక్షలకు తెరలేపారు. గృహావసరాల కోసం మట్టిని తీసుకెళ్తున్న వారిని బెదిరించి వసూళ్ల పర్వాన్ని ప్రారంభించారు. స్థానికులు తమ అవసరాల నిమిత్తం మట్టి తీసుకెళ్లాలంటే ట్రాక్టర్ ట్రక్కుకు రూ.200 చెల్లించాల్సిందేనని టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత నెల రోజులుగా అక్రమ దందా సాగుతున్నా ఏ అధికారీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. కేసులు పెట్టిస్తామని బెదిరింపు మట్టి తీసుకెళ్లే వారు డబ్బు ఇవ్వని పక్షంలో అక్రమ కేసులు బనాయిస్తామని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నట్లు సమాచారం. అలాగే సంబంధిత పంచాయతీ అధికారులతో స్థానికంగా మట్టి తోలుకునే వారి దగ్గరకు పంపించి బెదిరిస్తున్నారు. ఇదేమి పద్ధతి అని ఎదురు ప్రశ్నించిన వారిని దుర్భాషలాడటమే కాకుండా దాడికి ప్రయత్నిస్తుండటంతో మిన్నకుండిపోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మట్టి మాటున వేల రూపాయలు పోగేసుకున్న టీడీపీ నాయకులు.. సొంత పార్టీ సానుభూతిపరుల వద్ద కూడా డబ్బు వసూలు చేయడంతో వారు సైతం లోలోన రగిలిపోతున్నారు. పొన్నలూరు మండలం కె.అగ్రహారంలో టీడీపీ నేతల వసూళ్ల దందా ఇళ్లకు మట్టి తోలుకునే వారిని బెదిరించి మరీ డబ్బు వసూలు మట్టి తోలితే ట్రక్కుకు రూ.200 ఇవ్వాలని డిమాండ్ ఇవ్వకుంటే పోలీసు కేసులు పెట్టిస్తామని బెదిరింపులు టీడీపీ నేతల అక్రమ వసూళ్లపై గ్రామస్తుల ఆగ్రహం -
బ్లాక్ మార్కెట్‌కు రేషన్ బియ్యం!
కంభం: యథేచ్చగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కోమటికుంట వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని వేగంగా వెళ్తున్న మినీ ట్రక్ ఢీకొట్టబోయింది. ప్రమాదం బారి నుంచి తృటిలో తప్పించుకున్న సదరు వ్యక్తి వెంటనే జంగంగుంట్ల గ్రామంలో ఉన్న అతని స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో మినీ ట్రక్‌ను అడ్డగించారు. వాహనంలో సుమారు 60 క్వింటాళ్ల రేషయం బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. డ్రైవరు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. బియ్యాన్ని యర్రగొండపాలెం నుంచి బేస్తవారిపేట తీసుకెళ్తున్నట్లు స్థానికులు అడిగిన ప్రశ్నకు డ్రైవర్ సమాధానమిచ్చాడు. ఇంతలోనే బియ్యం తరలించే వారు అక్కడికి చేరుకొని వాహనాన్ని తమ వెంట తీసుకెళ్లిపోవడం గమనార్హం. ప్రతినెలా ఒకటో తేదీ రాగానే కార్డుదారులకు రేషన్ బియ్యం చేరుతున్నాయో లేదో తెలియదు కానీ అక్రమ రవాణా మాత్రం దర్జాగా సాగుతోందనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. నిత్యం రేషన్ షాపుల నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు మాముళ్లు తీసుకుని చోద్యం చూస్తున్నారన్న విమర్శలకు ఈ ఘటన బలం చేకూరుస్తోంది. ● 44 మోటారు సైకిళ్లు, 7కోళ్లు స్వాధీనం జరుగుమల్లి(సింగరాయకొండ): జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామ శివారులో కోడి పందేల శిబిరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఎస్సై బి.మహేంద్ర తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకునేలోగా జూదరులు మొత్తం అక్కడి నుంచి పరారయ్యారు. జూద శిబిరం వద్ద ఉన్న 44 మోటార్ సైకిళ్లు, 7 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బడుగు వర్గాల ఆరాధ్య దైవం వైఎస్సార్
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఒంగోలు టౌన్: విద్య, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలను బడుగు, బలహీన వర్గాల ముంగిళ్లకు తెచ్చిన ఆరాధ్య దైవం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ మరచిపోరని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులతో కలిసి వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజారంజక పరిపాలన అందించారని కొనియాడారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్సార్ ఒక్కరికే దక్కుతుందన్నారు. ఏ ఒక్క పేద విద్యార్థి చదువు ఆగిపోకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. దాంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది నిరుపేద బిడ్డలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇంటింటికో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉన్నాడంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమేనన్నారు. కార్పొరేట్ విద్యను పేదల ముంగిళ్లకు తెచ్చిన రాజశేఖర రెడ్డిని విద్యాదాతగా ఎంతోమంది గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారన్నారు. కులమతాలకతీతంగా సమాజంలోని అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి దైవంగా నిలిచాడన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడానికి జగనన్న నాయకత్వంలో కలిసి మెలసి పనిచేస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో రాజన్న పాలన తెస్తామన్నారు. చంద్రబాబు పాలనలో అధోగతిలో రాష్ట్రం... చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. వ్యవసాయం దండగన్న పాలకుల రాజ్యంలో దుర్భర పరిస్థితి నెలకొందని, రైతులు గిట్టుబాటు ధరలు రాక అల్లాడి పోతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పొగాకు, పత్తి రైతుల గోడు వినేనాథుడే లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న మరణించిన 16 ఏళ్లయినా నేటికీ ప్రజలు ఆయనను మరిచిపోలేదని, గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని చెప్పారు. అందుకు ఆయన చేసిన సేవలే కారణమన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రాజెక్టులు నిర్మించారని, ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో రైతులకు కరువు దిగులు ఉండదన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో ఎప్పటికీ నిలబడి పోతారని చెప్పారు. ఒంగోలు పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఒక స్వర్ణయుగంగా నడిచిందని, ప్రజలు సంతోషంతో జీవించారన్నారు. అలాంటి పాలన కోసం జగనన్నను సీఎం చేసుకుందామన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. రాజన్న సంక్షేమ రాజ్యం అనేది ప్రజల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, బొట్లా రామారావు, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర జనరల్ సెక్రటరీ రొండా అంజిరెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు పాల్గొన్నారు. -
మూర్తిమత్వమై..
మది మదిలో ఒంగోలు టౌన్: గుండె గుండెలో చెరిగిపోని జ్ఞాపకాలైం.. అభిమానం పూలమాలలై.. పట్టణాల నుంచి పల్లెల దాకా ప్రతి ఊరు రాజన్న జ్ఞాపకాలతో పరవశించింది. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతలు, కన్నీళ్లతో తడిసిన పూలదండలై రాజన్న విగ్రహాలను హత్తుకున్నాయి. ప్రజా సంక్షేమానికి, ప్రగతి ప్రస్థానానికి వేసిన పునాదులు ఆ దివ్య తేజోమూర్తి పాలన నేటికీ జనం గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆయన పాలనా దక్షత స్ఫూర్తి తరతరాలకు అజరామరంగా చిరస్మరణీయంగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి మారుమూల పుల్లల చెరువు మండలం వరకు ప్రతి పట్టణంలోను, గ్రామంలోనూ రాజన్నకు ఘనంగా నివాళలర్పించారు. బరువెక్కిన గుండెలతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు రాజన్న చేసిన సంక్షేమ పాలనను మననం చేసుకొన్నారు. తమ భవిష్యత్ కోసం పునాదులేసిన ప్రజానేత ప్రవేశ పెట్టిన పథకాలను నేటికీ అమలవుతున్న తీరును స్మరించుకున్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో.. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు తదితరులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, బొట్ల రామారావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజేష్, రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీంద్రా రెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని పలు డివిజన్లలో పేదలు, మానసిక వికలాగులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదానాలు చేపట్టారు. చర్చి సెంటర్లో ఉన్న వెస్లీ విగ్రహానికి పార్టీ నాయకులు నివాళులర్పించారు. దర్శి నియోజకవర్గంలో... దర్శి నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలసి పాల్గొన్నారు. రాజన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వైఎస్సార్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తరెడ్డి పాలెం, తూర్పు వీరాయపాలెం గ్రామాల్లో మహానేత రాజన్న విగ్రహాలకు పూలమాలలు వేశారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లోనూ వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలో... కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపి నియోజకవర్గ ఇన్చార్జి , మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సింగరాయకొండలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మూలగుంటపాడు పంచాయతీలోని ఐటీఐ కాలేజీలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ నుంచి కందుకూరు సెంటర్, బాలయోగి నగర్ సెంటర్లలోని వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. జరుగుమల్లి, పొన్నలూరులో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యాక్రమాలను ఆయన ప్రారంభించారు. అలాగే కొండపి, మర్రిపూడి, టంగుటూరు మండలాల్లో కూడా పార్టీ శ్రేణులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. మార్కాపురం నియోజకవర్గంలో.. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి, తర్లుపాడు, కొనకనమిట్ల మండల కేంద్రాలతో పాటుగా అన్నీ గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్కాపురం పట్టణంలోని పాత బస్టాండు సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి, తూర్పు వీధుల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ అలీ బేగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ సభ్యుడు వెన్నా హనుమారెడ్డితో పాటు పలువురు జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. తర్లుపాడులో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కొనకనమిట్లలో జరిగిన రక్తదాన శిబిరాన్ని అన్నా రాంబాబు ప్రారంభించారు. అనంతరం అన్నదానం చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో... గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ఇన్చార్జి కుందురు నాగార్జున రెడ్డి అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా ఏర్పాటు చేసిన అన్నదానం చేశారు. రాచర్ల మండలంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కనిగిరి నియోజకవర్గంలో... కనిగిరి నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కనిగిరి పట్టణంలోని చెక్‌పోస్టు సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పీడీసీసీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సరిత ప్రసాద్ రెడ్డి, చింతంగుంట్ల సాల్మన్ రాజ్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పల్లి శాంతి గోవర్ధన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి టి.సుజాత రెడ్డి పాల్గొన్నారు. యర్రగొండపాలెంలో.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పుల్లలచెరువులో వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. పెద్దదోర్నాల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పెద్దారవీడులో పేదలకు అల్పాహారం సమకూర్చారు. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి సెంటర్లో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చీమకుర్తిలోని బూచేపల్లి కళ్యాణ మండపం, పోలీస్‌స్టేషన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అన్నదానం చేశారు. పలువురు యువకులు రక్తదానం చేశారు. సంతనూతలపాడు, చీమకుర్తి మండలం ఇలపావులూరు, నాగులుప్పలపాడుల్లో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లోనూ మేరుగు నాగార్జున పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు. జరుగుమల్లిలో అన్నదానం చేస్తున్న మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దర్శిలో అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌లో ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి ఓబులరెడ్డి, ఆర్య వైశ్య సంఘం నాయకులు పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్‌కుమార్, యువజన విభాగం నాయకుడు ఆళ్ల కృష్ణారెడ్డి ఉన్నారు. -
గడపదాటని బేళ్లు.. దగా కొనుగోళ్లు !
చీమకుర్తి/టంగుటూరు/కొండపి: పొగాకు కొనుగోళ్లు మొదలై ఆరు నెలలు గడిచినా నోబిడ్ పేరుతో పొగాకు బేళ్లను తిరస్కరిస్తున్న సంఖ్య నానాటికీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తేలికరకం నేలల్లో పొగాకు పండించే ప్లాట్‌ఫాంలలో సోమవారం జరిగిన వేలానికి 1873 బేళ్లు రాగా వాటిలో 41.27 శాతం అంటే 773 పొగకు బేళ్లును నోబిడ్ పేరుతో తిరస్కరించారు. ప్రతి రోజు నోబిడ్ పేరుతో రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో వందలాది బేళ్లు తిరస్కరిస్తుండటంతో రైతులు పెట్టిన పెట్టుబడి ఎలా వస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తిరస్కరించిన బేళ్లను మరొకసారి వేలానికి తీసుకురావడానికి ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు.పడిపోతున్న ధరలు2024–25 సీజన్‌కు సంబంధించి పొగాకు వేలం మార్చి పదో తేదీన ప్రారంభమైంది. ప్రారంభ రోజు పొగాకు గరిష్ట ధర కేజీ రూ.280, కనిష్ట ధర కేజీ రూ.260 గా నమోదయింది. దీంతో రైతులందరూ ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరుగుతాయని భావించారు. అయితే నానాటికీ ధరలు పతనమవుతూ వస్తున్నాయి. రైతులు ఆందోళన చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. రైతులను ఆదుకుంటున్నామని కూటమి ప్రభుత్వం పెద్ద ఆర్భాటంగా ప్రకటనలు చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. 11వ రౌండ్ ప్రారంభానికి వచ్చేసరికి కనిష్ట ధర రూ.130 కు పడిపోయింది. వేలం కేంద్రాలకు వచ్చిన పొగాకులో కొద్ది వాటికి మాత్రమే అధిక ధర చూపిస్తున్నారు. మిగతావన్నీ తక్కువ ధరకే చూపించి సరాసరి మాత్రం రూ.250 వరకూ చూపిస్తూ మాయచేస్తున్నారని రైతులు ధ్వజమెత్తుతున్నారు.93.72 మిలియన్ కేజీలు కొనుగోలు..రైతుల నుంచి 104.63 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేస్తామని బోర్డు (ఆథరైజ్డ్ క్వాంటిటీ) రైతులకు పాగాకు సాగుకు ముందు తెలియజేశారు. కాని రైతులు మాత్రం దానిని(ఎస్టిమేషన్ క్వాంటిటీ) 158 మిలియన్ కేజీలు వరకు పండించినట్లు బోర్డు లెక్కలు కట్టింది. ఆ లెక్కన 158 మిలియన్ కేజీలలో ఇప్పటి వరకు కేవలం 93.72 మిలియన్ కేజీలను మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా కొనుగోలు చేయాలసిన పొగాకు 64.2 మిలియన్ కేజీల పొగాకు రైతుల వద్దే మగ్గిపోతుంది. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకూరు–1, 2, కలిగిరి, డీసీపల్లి, జిల్లా పరిధిలోని కనిగిరి ప్లాట్ ఫాంల్లో కొనుగోళ్లు ముగిసినట్టు అధికారరులు చెబుతున్నారు. అదనపు పొగాకు కొనుగోలు చేయటానికి అనుమతి కోరుతూ ఢిల్లీకి సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి సమాచారం వస్తే గానీ మూసివేసిన 5 ప్లాట్‌ఫాంలలో రైతులు అదనంగా పండించిన పొగాకును కొనుగోలు చేయటానికి వీలు కాదని బోర్డు అధికారులు చెబుతున్నారు.ఈ ఏడాది నష్టాలే మిగులుతాయిఇప్పటి వరకు వేలం కేంద్రానికి పొగాకు బేళ్లు తీసుకొనిపోతే సగం పైగా తిరస్కరణ గురవుతున్నాయి. కేవలం హై గ్రేడు పొగాకునే కొనుగోలు చేస్తున్నారు. లోగ్రేడ్ పొగాకు వైపే కన్నెత్తి చూడటం లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది ఇలా కొనసాగితే నష్టాలే.– రాయిండ్ల వెంకట నారాయణ, పొగాకు రైతు, పొందూరు గ్రామం, టంగుటూరు మండలం.ఈ ఏడాది పెట్టుబడులు ఎక్కువయ్యాయిగత ఏడాది కంటే పెట్టుబడి ఖర్చులు, కూలీల ఖర్చులు, మిగిలినవి ఎక్కువయ్యాయి. దానికి అనుగుణంగా పొగాకు రేట్లు లేవు. గత ఏడాది మేలిమి రకం రూ.360 కొనుగొలు చేస్తే ఇప్పుడు రూ.280 కొనుగోలు చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా రూ.300కు కొనుగోలు చేస్తున్నారు. కానీ లోగ్రేడు పొగాకు మాత్రం రూ.125కు దించారు. ఇప్పటికై నా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.– సింగమనేని బ్రహ్మయ్య, పొగాకు రైతు, మర్లపాడు గ్రామం, టంగుటూరు మండలం. -
గణేష్ లడ్డు రూ.1.23 లక్షలు
దర్శి: పట్టణంలోని గాంధీనగర్ రామాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద నిమజ్జన ఊరేగింపు సందర్భంగా గణేష్ లడ్డు వేలం పాట పెట్టారు. వేలం పాటలో ముల్లంగి, దుగ్గిరెడ్డి బ్రదర్స్ కలసి రూ.1.23 లక్షలకు పాటపాడి ఈ లడ్డును దక్కించుకున్నారు. ఒంగోలు టౌన్: సంక్షేమ సారథి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జిల్లా అంతటా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మంగళవారం ఉదయం ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని బూచేపల్లి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులందరూ హాజరవుతారన్నారు. చీమకుర్తిలో మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి, దర్శిలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నామని పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్ తెలిపారు. కార్యక్రమాల్లో ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జి చుండూరి రవిబాబు హాజరవుతారన్నారు.