డిజిటలైజేషన్‌ త్వరితగతిన పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

డిజిటలైజేషన్‌ త్వరితగతిన పూర్తి చేయాలి

Mar 11 2026 8:35 AM | Updated on Mar 11 2026 8:35 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

దర్శి: పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా డిజిటలైజేషన్‌ త్వరితగతిన పూర్తి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, కృషి చేయాలని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సూచించారు. స్థానిక నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, గ్రామాల నాయకులతో మంగళవారం విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ డిజిటలైజేషన్‌ దాదాపుగా పూర్తి కావచ్చిందని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా అందరూ నాయకులు తమ ఫొటోలను తీసుకుని డిజిటల్‌ చేసేందుకు త్వరితగతిన ముందుకు రావాలని సూచించారు. అందరూ కలసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement