తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు! | Father And Son Work Together In Same RTC Bus In Siddipet District, Know Their Story Inside | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!

Mar 14 2026 11:34 AM | Updated on Mar 14 2026 1:06 PM

father and son work together in same rtc bus in siddipet district

సిద్ధిపేట జిల్లా: ఒకే బస్సులో తండ్రీకొడుకు విధులు నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నా బాద్‌ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. హుస్నాబాద్‌కు చెందిన బంధనాపురం ఎల్లయ్య 34 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఆయన కుమారుడు బంధనాపురం ప్రేమ్‌ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. 

ఈ క్రమంలో తండ్రీకొడుకు ఇద్దరూ ఒక్కటే బస్సులో డ్యూటీ చేయడం ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. ఎల్లయ్య ఆర్టీసీ డ్రైవర్‌గా సేవలు అందిస్తూ ఉత్తమ డ్రైవర్‌గా పలుసార్లు అవార్డులు అందుకున్నాడు. ప్రమాదరహిత డ్రైవర్‌గా సేవలు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒకే బస్సులో విధులు నిర్వహించడంపై తండ్రి ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశాడు.  

Advertisement
 
Advertisement
Advertisement