breaking news
father
-
రైలు కిందపడి తండ్రి,కొడుకు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు.. కేసు ట్రయల్‌కు రావడంతో తమకు ఎలాగైనా శిక్ష తప్పదని భావించారు. ఈ క్రమంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్ (52), అతని కుమారుడు నాగరాజు (32) ఇద్దరూ కలిసి 2024లో జయశంకర్ భూపాలపల్లిలో వీఆర్వోగా పనిచేసిన గుల్లకోట గ్రామానికి చెందిన మల్లేశ్ తోడళ్లుడు రమేశ్‌ను హత్యచేశారు. ఈ కేసులో ఇద్దరూ భూపాలపల్లి జైలుకు వెళ్లారు. భర్త, కుమారుడు జైలుకు వెళ్లడంతో మల్లేశ్ భార్య సువర్ణ అనారోగ్యానికి గురై అదే ఏడాది మృతి చెందింది. జైలు నుంచి బయటకు వచ్చిన తండ్రీ కొడుకులను ఎవరూ ఆదరించడం లేదు. దీంతో కొద్దిరోజులుగా వారు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో పనిచేసుకుంటున్నారు. మరోవైపు హత్యకేసు ట్రయల్‌కు వచ్చింది. తమకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన తండ్రీ కొడుకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నివాసముంటున్న మల్లేశ్ సోదరుడు శ్రీనివాస్ ఇంటికి శుక్రవారం వచ్చారు. శనివారం ఇంటి నుంచి బయలుదేరిన వారు ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ సమీపంలో కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని జీఆర్పీ ఎస్సై తెలిపారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్
జగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. అంతర్గాం గ్రామానికి చెందిన బందెల ప్రశాంత్ 15రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం సీతారాంపలి్లకి చెందిన కావ్యను ప్రేమవివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. యువతి మేజర్ కావడంతో ప్రశాంత్‌తోనే పంపించారు. అప్పటినుంచి ప్రశాంత్, కావ్య అంతర్గాంలో కాపురం పెట్టారు. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు, బంధువులు బుధవారం ఉదయం రెండు కార్లలో అంతర్గాం వచ్చి ప్రశాంత్ తల్లి భారతమ్మపై దాడిచేసి కావ్యను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. జరిగిన ఘటనను భారతమ్మ జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. -
రీల్స్‌తో పరువు తీస్తోందని కన్నతండ్రే కొడుకుతో కలిసి!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మరో పరువు హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రీల్స్‌తో పరువు తీస్తోందని, తండ్రీ కొడుకు కలిసి తమ ఇంటి ఆడబిడ్డను మట్టుబెట్టారు. తొలుత హిట్ అండ్ రన్ కేసుగా భావించి నప్పటికీ అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. కన్న తండ్రి, సోదరుడు కలిసి చేసిన 'పరువు హత్య' గా తేలడంతో కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బాధితురాలు సోఫియా (22) ఒక ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. అయితే బైక్ యాక్సిడెంట్ సంఘటనను లోతుగా విచారించగా అసలు విషయం తెలిసి పోలీసులే నివ్వెర పోయారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని పోలీసులు వెల్లడించారు.సుమారు మూడు నెలల క్రితం సోఫియాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సమాజంలో తమ కుటుంబ గౌరవం దెబ్బతింటుందంటూ ఆగ్రహంతో రగిలి పోయిన తండ్రి, కొడుకుతో కలిసి ఆమెను అంత మొందించడానికి కుట్ర పన్నినట్టు నిర్ధారణ అయింది.ఇదీ చదవండి: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్తమ పథకం ప్రకారం తండ్రి మహ్మద్ ఫారూక్, సోదరుడు మహ్మద్ హబీల్ సోఫియాను బైక్‌పై బయటకు తీసుకెళ్లారు. ఘెల్జీపురా గ్రామం వద్ద ఉన్న ఒక నిర్జనమైన బాటలోకి బైక్‌ను మళ్లించి, హబీల్ తన ప్యాంట్లో దాచుకున్న సుత్తితో సోఫియా తలపై మూడుసార్లు తీవ్రంగా దాడి చేశాడు. దాడి అనంతరం, ఆమెను తిరిగి ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చి, బైక్‌ను ధ్వంసం చేసి తీవ్ర వేగంతో వచ్చిన వాహనం ఢీకొట్టినట్లుగా సీన్ క్రియేట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసుగా భావించి సోఫియాను సోలా సివిల్ ఆసుపత్రికి తరలించగా, మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించింది. వేగంగా వచ్చిన వాహనం వెనుక నుంచి ఢీకొట్టిందని హబీల్ పోలీసులకు చెప్పినప్పటికీ, విచారణలో వారి మర్డర్ ప్లాన్ బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితులైన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని, వారిపై హత్య కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు -
పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలకు ముగ్గురు ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారకార్థం ఏటా అందిస్తోన్న... పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలకు ఈఏడాది ముగ్గురిని ఎంపిక చేసినట్లు పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్టు ప్రకటించింది. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, సాహిత్య రంగంలో వెలిచాల కొండలరావు, కళారంగంలో విశేష సేవలందిస్తున్న గొట్టే కనకవ్వలను ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ట్రస్టు ఉపాధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు.అవార్డుల జ్యూరీ కమిటీ కన్వీనర్ డా. పొన్నం రవిచంద్ర సారథ్యంలో కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, ప్రముఖ పాత్రికేయులు దిలీప్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డైరెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపుడి శ్రీలక్ష్మి సభ్యులుగా ఉన్న జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపిక చేసిన జాబితాను ఈ రోజు (ఆదివారం) ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ పొన్నం ప్రభాకర్ కు అందజేసింది.గత నాలుగు సంవత్సరాలుగా సాహిత్య రంగంలో నాలేశ్వరం శంకరం, నలిమెల భాస్కర్, చంద్రబోస్, అంపశయ్య నవీన్‌లకు, కళారంగంలో ఒగ్గు ధర్మయ్య, కామ్రేడ్ విమలక్క, బలగం కొమురమ్మ, అంతడుపుల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు.ఈ ఏడాది నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా పురస్కారాల పరిధిలోకి తీసుకువచ్చి తొలిసారిగా వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి అవార్డును అందజేస్తున్నారు.పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డులకు ఎంపికైన ముగ్గురికి రూ.50 వేల నగదు పురస్కారంతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు.పొన్నం సత్తయ్య ఆశయాలను కొనసాగిస్తూ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.ఈ అవార్డును పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్టు ఏటా అందజేస్తోంది. -
ఈ వారం కథ: 'ఆత్మబలం'
‘నేను ఇప్పట్లో ఇండియా రాలేను. ఫుల్ బిజీగా ఉన్నాను. మీరే చూసుకోండన్నయ్యా!’ ఇక అంతకన్నా చెప్పాల్సిందేమీ లేదన్నట్లు ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘అది కాదురా రాఘవా! నాన్న సంవత్సరీకానికయినా రాకపోతే ఎలారా? ఒకసారి ఆలోచించు.!’ ‘లేదన్నయ్యా! అర్థం చేసుకో! కావాలంటే వీడియో కాల్లో అటెండ్ అవుతానులే!’ అంటూ ఫోన్ కట్ చేశాడు రాఘవ.మాధవరావు, సుమతి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రామారావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. చిన్న కొడుకు రాఘవ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకుని, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్లిళ్లయి ఎవరికి వారు జీవిస్తున్నారు. తల్లి సుమతి పెద్ద కొడుకు రామారావు వద్దనే ఉంటుంది.మాధవరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొంది, అంతా సెటిల్ అయ్యారు అనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో సంవత్సరం క్రితం కాలం చేశాడు.యాభై సంవత్సరాల పాటు ఏమాత్రం అరమరికలు లేకుండా, అన్యోన్యంగా జీవించిన తమ బంధం భౌతికంగా వీడటంతో ఆనాటి నుంచి కుమిలి కుమిలి రోదిస్తూనే ఉంది సుమతి. అంత్యక్రియలు, కర్మకాండలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తే తన భర్త ఆత్మ శాంతిస్తుందని, ఆ విధంగానే శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని కొడుకులను కోరింది సుమతి. పెద్ద కొడుకు రామారావు ఆచార వ్యవహారాలను అనుసరిస్తుంటాడు. కానీ చిన్న కొడుకు రాఘవ మాత్రం ఆస్తికులకు నాస్తికులకు మధ్యలో ఉండి, కొన్నింటిని అనుసరిస్తూ, కొన్నింటిని త్యజిస్తూ ఉండే స్వభావం. అదీగాక తన తండ్రి తనకేమీ చేయలేదనే కోపంతో ఉంటుంటాడు. అన్నను చూసుకున్నట్లుగా తనను చూసుకోలేదని బాధపడుతుంటాడు. మాధవరావు చనిపోయిన రోజు అన్న రామారావు బలవంతం మీద అమెరికా నుంచి వచ్చి చివరి చూపు చూసి, అంత్యక్రియల్లో పాల్గొని, వెంటనే వెళ్లిపోయాడు.అంత్యక్రియల తర్వాత మాధవరావు కుటుంబ స్నేహితుడు నారాయణ శాస్త్రిగారితో మిగతా కర్మకాండల విషయమై చర్చించిన విషయాలు ఒక్కొక్కటిగా రామారావు మదిని తొలుస్తున్నాయి.ప్రతి నెలా మాసికం పెడుతూ, శాస్త్రోక్తంగా సంవత్సరీకం వరకు జరపాలని అమ్మ కోరడంతో పాటు, శాస్త్రిగారు కూడా శాస్త్రం ప్రకారం నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించాడు. దీనికి అసహనానికి గురైన రాఘవ, ‘శాస్త్రిగారూ! మళ్లీ ఇండియా నేను రాలేను. నన్ను ఇబ్బంది పెట్టకండి’ అనడంతోశాస్త్రిగారికి కోపం వచ్చి, ‘చిన్నపిల్లోడిలా మాట్లాడకు రాఘవా! నాన్న ఎంత నిష్టాగరిష్ఠుడో అందరికీ తెలుసు. నాన్న ఆత్మ శాంతించాలంటే సంవత్సరం వరకు అన్ని తిథులూ పెట్టాల్సిందే. ఆ విధంగా చేయకపోతే మీ కుటుంబానికే అరిష్టం.’ అని హెచ్చరించారు.‘భయపెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ఇక్కడ ఉన్నవాళ్లు చేస్తే చేసుకోండి.. నాకవసరం లేదు.’ అని రాఘవ కరాఖండిగా చెప్పాడు.‘కర్మాధికారంతో పెద్దవాడు కర్మ చేస్తున్నప్పటికీ, ఒకే చోట అన్నదమ్ములిద్దరూ ఈ క్రతువును చేయాల్సిందే. అంతేకాదు ఏటి సూతకం కూడా ఉంటుంది. సంవత్సరం పాటు మరే శుభకార్యాలు చేపట్టకూడదు. పితరుల ఆత్మశాంతికి, కుటుంబ సభ్యుల అభివృద్ధికి తర్పణాలు విడవాల్సిందే రాఘవా!’ హెచ్చరించాడు శాస్త్రిగారు.‘శాస్త్రిగారూ! ప్రతినెలా మాసికం, మధ్యలో వచ్చే తిథులు, ఇవన్నీ కాకుండా సంవత్సరానికి ఒకసారే పెట్టుకోవచ్చు కదా! మాకంతా టైం వేస్ట్. వ్యయ ప్రయాసలతో కూడినది. కాస్త ఆలోచించండి మా వైపు కూడా!’ రాఘవ తనకు అనుకూలమైన సమాధానాన్ని తెప్పించుకునేందుకు ప్రయత్నించాడు.‘పురాణాల ప్రకారం అంత్యక్రియలు, కర్మ కాండలు మరణానంతరం జీవికి శాంతి చేకూర్చడమే కాక, కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ధార్మిక సంప్రదాయాన్ని చాటుతాయి. సంవత్సరం వరకు కూడా ఆత్మ కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూనే ఉంటుంది. విధిగా అన్ని తిథులలో శ్రాద్ధాలు పెట్టాల్సిందే. సంవత్సర దీక్ష తప్పదు.’ అని శాస్త్రిగారు మరింత వక్కాణించడంతో, గుటకలు మింగిన రాఘవ..‘సరేలెండి! ఏం చేస్తాం!? నేను లేకపోయినా ప్రతినెలా అన్నయ్య ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. నేను సంవత్సరీకానికి వస్తాను. వీలైతే ప్రతి నెలా నేనక్కడ పెట్టుకుంటాలేండి.’ అసహనంగా చెప్పాడు రాఘవ.‘లేదు రాఘవ! అన్నదమ్ములిద్దరూ ఒకే చోట కలిసి చేయాల్సిందే. ఇది శాస్త్రమే కాదు. కలిసి మెలిసి ఉండే కుటుంబ ఐక్యత సూత్రం, మాసిక ధర్మాన్ని చాటుతుంది. నాన్నగారి ఆత్మశాంతికి ఆ మాత్రం సమయం కేటాయించలేవా..?‘ నిలదీస్తున్నట్లు ప్రశ్నించడంతో, చేసేది చేయొచ్చు ఈయనతో వాదనెందుకని మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవ.కొత్తగా పెళ్లయిన తన తమ్ముడిని ఇబ్బంది పెట్టటం ఎందుకనుకుని..‘సరే రాఘవ! కనీసం నాన్నగారి సంవత్సరీకానికైనా తప్పనిసరిగా నువ్వు, వనజ వచ్చేయండి.’ అన్నాడు. ముసిరిన జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాడు రామారావు. సంవత్సరీకానికైనా తమ్ముడొస్తే బాగుండు అనుకుంటూ, వచ్చే నెలలో వున్న నాన్న సంవత్సరీకం ఏర్పాట్ల ఆలోచనలో నిమగ్నమయ్యాడు.∙∙ ‘ఏవండీ! మామగారి సంవత్సరీకం వచ్చేనెల ఉంది కదా! ఇండియా వెళ్దామండి.’‘నీకేమైనా పిచ్చా? ఇక్కడ బోలెడన్ని పనులున్నాయి. అదేదో వాళ్లే చేసుకుంటారు. ఏదో ఒక సాకు చెప్పొచ్చులే.’ విసుగ్గా అన్నాడు రాఘవ.‘అదేంటండి అలా అంటారు? తండ్రికి శ్రాద్ధ కర్మలు పెట్టకపోతే, మనకు మంచిది కాదండి. ప్లీజ్ కొన్ని పాటించాలి. అయినా తండ్రి ఋణం తీర్చుకోవడం, ఆయన ఆత్మశాంతికి ఈ మాత్రం చేయడానికి వెనుకాడటం ఏమాత్రం బాగోలేదు.’ వనజ గట్టిగానే అంది.‘వనజా...నీకేం తెలియదు ఊరుకో! నాకేం చేశాడని మా నాయన? అందరిలాగే చదువుకున్నాను. సొంతంగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను. అన్నయ్యను చూసినట్లు నన్నేమైనా చూశాడా? ఆ రోజు ఏదో ఒకటి చెప్పి, అక్కడి కార్యక్రమం వీడియో కాల్లో చూసి ఓ నమస్కారం పెట్టేద్దాం సరిపోతుంది. ఎటువంటి సంస్కారాలు చేయనవసరం లేదు. ఇక నన్ను విసిగించకు.’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు రాఘవ.‘జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏంచేస్తే ఋణం తీరుతుంది? జీవించినంత కాలం సేవ చేయాలి. చనిపోయిన తర్వాత శ్రాద్ధకర్మలు పెట్టి వారి ఆత్మను శాంతింపచేయాలి.’ అంటూ రాఘవను కన్విన్స్ చేయబోయింది వనజ.‘ఏమోలే! పనికిరాని టాపిక్. ఎట్టి పరిస్థితుల్లో నాన్న తిథికి తిరిగి ఇండియాకు వెళ్ళేది లేనేలేదు.ఉన్నాడుగా అన్న... ఆయన చూసుకుంటాడులే. ఇక దాని గురించి వదిలేయ్! అవునూ! నాన్న అంత్యక్రియలకు వెళ్లినప్పుడు హైదరాబాదులో ఒక విల్లా చూశాను కదా! దానికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ వారం రోజుల్లో చెల్లిస్తాను.’ ‘అదేమిటండీ! మీకు మొన్ననే ఉద్యోగం కూడా పోయింది కదా, మళ్లీ ఇంకో ఉద్యోగం వచ్చేవరకు ఆగుదాం. పైగా మామగారు పోయి సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం లోపు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కదా! ఇప్పుడు డబ్బు కట్టడం అంత శ్రేయస్కరం కాదు, ఆలోచించండి.’ భర్తకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది వనజ.‘ఛత్! చాదస్తం మాటలు మాట్లాడకు. ఇవన్నీ ట్రాష్. మానసిక బలహీనతతో ఆడుకునే శాస్త్రాలు. వీటిని నమ్మను. సిద్ధాంతాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢత్వాలతో ప్రాక్టికల్ లైఫ్‌కు అడ్డం చెప్పకు. ఇప్పటివరకు నేను దాచుకున్న డబ్బుతో వచ్చేవారం అడ్వాన్స్ చెల్లిస్తాను.’ అంటూ ఒంటి కాలిపై లేచాడు రాఘవ. ఇక ఆ విషయం కొనసాగిస్తే భర్త సీరియస్ అవుతున్నాడని గ్రహించింది వనజ.‘సర్లేండి... రేపు ఆదివారం ఎక్కడికో వెళ్దామని చెప్పారు.’ టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేసింది వనజ.‘యస్. బాగా గుర్తు చేశావు. మనం రేపు పిక్నిక్కి వెళ్దామనుకున్నాము. కాస్త మనసన్నా రిలాక్స్డ్గా ఉంటుంది, వెళదాం.’ ఉద్యోగం, సంవత్సరీకం ఈ రంధి నుంచి కాస్తంత ఉపశమనం కావాలనుకున్నాడు రాఘవ.∙∙ ఆరోజు ఆదివారం సమీపంలోని వాటర్ ఫాల్ సైట్ సీయింగ్‌కు వచ్చారు రాఘవ, వనజలు. వాటర్ ఫాల్స్ సమీపంలో ఓ నది ప్రవహిస్తోంది. అందులో పర్యాటకులు బోటింగ్ షికారు చేస్తున్నారు.‘ఏవండీ..! మనం కూడా బోటింగ్ చేద్దామండి.‘ గోముగా అడిగింది వనజ.‘వామ్మో! నాకు నీళ్లంటే భయం. ఆడపిల్లవైనా మీ నాన్న నీకు ఈత నేర్పాడు. మీ మామగారున్నారే– అదే– మా నాయన– మా ఊరి చెరువులో కొన్ని రోజులే సగం వరకే ఈత నేర్పారు. పూర్తిగా నేర్చుకోకముందే నుమోనియా రావడంతో, ఇక నేర్పలేకపోయాడు. దాంతో నాకు ఈత రాకుండా పోయింది. అందులో కూడా ఆయన వల్లే ఫెయిలయ్యాను.’ అని గతాన్ని గుర్తు చేసుకుంటూ...‘వెళితే నువ్వు వెళ్ళు. నేను ఇక్క డే ఉంటాలే’ అన్నాడు.‘అదేంటండి చోద్యం కాకపోతే! షికారు ఎవరైనా ఒక్కరే చేస్తారా? జంటగా వెళితేనే సరదా ఉంటుంది. అయినా ప్రతి ఒక్కరికి బెల్టు పెడతారు. భద్రంగానే ఉంటుంది. మగవారయుండి అంత భయపడితే ఎలా? పదండి పోదాం.’ అనగానే తన ఇగో పనిచేసి, బోటింగ్‌కు సిద్ధమయ్యాడు రాఘవ.బోట్లో నదిలో కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట ప్రవాహం ఉద్ధృతమై, బోటులో చివర కూర్చున్న రాఘవ బెల్టు ఊడి అదుపు తప్పి నీళ్లలో పడిపోయాడు. పడీ పడగానే నీటిలో మునుగుతూ హాహాకారాలు చేస్తున్నాడు. భర్త ప్రమాదాన్ని గమనించిన వనజ వెంటనే నీటిలో దూకింది. కానీ ఇద్దరికీ పోను పోను చాలా దూరం పెరగడంతో, ఆమె రాఘవను అందుకోలేకపోతుంది. రాఘవ నీటిలో మునుగుతూ తేలుతూ, నీళ్లు మింగుతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.కాకతాళీయంగా పైకి ఒక్కసారి ఆకాశం వైపు చూపు పడిన రాఘవకు నాన్న ఆకారం కనిపించినట్లయింది. ఆనాడు తమ ఊరి చెరువులో నాన్న ఈత నేర్పిన దృశ్యం గుర్తుకొచ్చింది. టైరు మధ్యలో తనను కట్టి ఈత ప్రాక్టీస్ చేయించిన దృశ్యం కళ్ళ ముందు కదలాడింది.పైనుంచి నాన్న...‘కమాన్ రాఘవా! కమాన్! అలాగే చేతులు, కాళ్లు ఆడించి పైకి తేలు... మునగకు... శరీరాన్ని తేలికగా చేసుకో... కాళ్లు చేతులు వేగంగా ఆడించు కమాన్... కమాన్... అలాగే... ఇంకా ముందుకు... ఇంకా ముందుకు... అంటున్నట్లుగా, ఉత్సాహపరుస్తూ, తనకు మరోసారి ఈత నేర్పుతున్నట్లుగా అనిపించి తన శక్తినంత కూడ తీసుకొని ఈత కొడుతూనే ఉన్నాడు రాఘవ. ‘నీకు ఈత బాగా వచ్చు... బాగా ఈదుతున్నావు. వెరీ గుడ్... అలాగే వచ్చేయ్..! అలాగే...’ అంటూ వెన్ను తడుతున్నట్లుగా నాన్న ఆత్మదర్శనంతో రాఘవ మరింత బలాన్ని కూడతీసుకొని చేతులు కాళ్లు వేగంగా కదిలిస్తూ, నీటిపై తెలియాడటం మొదలెట్టాడు. ఇంతలో ఎవరో ఒకరు బలంగా ఒక్క తోపు తోసినట్లు అనిపించడంతో, ఒక్కసారిగా ఒడ్డు సమీపంలోని చిన్న చెట్టును అందుకోగలిగాడు. ఆ చెట్టు ఆసరాతో నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు రాఘవ. ఒడ్డుకు చేరిన రాఘవ అంత చల్లదనంలో కూడా చెమటలు కక్కుతూ, ప్రాణ భయంతో వణుకుతూ ఆయాసపడుతూ కూర్చున్నాడు. ఇంతలో వెనకనుంచి వచ్చి భర్తను పట్టుకున్న వనజకు దుఃఖం కట్టలు తెంచుకుంది.లోపల నుంచి పీలగా వస్తున్నట్లుగా, జీర గొంతుతో, రోప్పుతూ...‘వనజా... వనజా..! నాన్న కనిపించాడు. ఆత్మదర్శనమైంది.’ అంటూ తల పైకెత్తి చూపించాడు.‘నన్ను రక్షించింది... పునర్జన్మ నిచ్చింది నాన్నే వనజా..! ఆనాడు సగం నేర్పిన ఈత, ఈనాడు పైనుంచి పూర్తిగా నేర్పాడు. అంతేకాకుండా అదృశ్య శక్తిగా, నేను కొట్టుకుపోకుండా బలంగా ఒడ్డుకు నెట్టడంతో నేను బతికాను వనజా..!’ అంటూ వల వల ఏడుస్తున్న భర్త వైపు లాలనగా చూసింది వనజ.అంత బాధలోనూ ఆమె మోములో ఓ చిరుదరహాసం మెరిసింది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, ‘మీ సంకల్పం గొప్పది మామగారు..! ఎవరితో ఏ పని చేయించాలో ఆ పని చేయించే ఆత్మబలం మీది. మీ కుమారుడిని కాపాడటానికి ఆత్మ శక్తిగా సగం మీరు పనిచేస్తే, వేగంగా డైవ్ చేసుకుంటూ నా భర్తను రక్షించుకునే మిగతా సగం బాధ్యతను నేను పూర్తి చేశాను. నేను చేసిన ఆ సగం మీ అదృశ్య శక్తిగా విశ్వసిస్తున్న నా భర్తకు, మీపై కలకాలం అదే గౌరవం, నమ్మకం ఉండే విధంగా, ఈ విషయాన్ని మనసులోనే దాచుకుంటాను మామగారు.’ అంటూ వనజ చేతులెత్తి నమస్కరించింది.∙∙ ‘అన్నయ్యా..! నాన్న తిథికి నేనూ వనజ ఇద్దరం వచ్చేస్తున్నాం! అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయండి..! టికెట్లు కూడా తీసుకున్నాం.’ రామారావుకి ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘వనజా..వనజా.’ అంటూ గట్టిగా పిలిచాడు రాఘవ.‘ఏంటండీ..! ప్రతిదానికి హడావుడే... మీకు ఏదొచ్చినా తట్టుకోలేము. ఏంటో చెప్పండి.’ అంటూ వంటింట్లో నుంచి వచ్చింది వనజ.‘ఏం లేదు వనజా! గత నెల నాకు లేఆఫ్‌లో ఉద్యోగం పోయిందిగా... ఈ రోజు మెయిల్ వచ్చింది వేరే కంపెనీలో మరింత ప్యాకేజ్‌తో పైస్థాయి ఉద్యోగం వచ్చింది.’ అంటూ సంతోషంతో వనజను కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేశాడు రాఘవ.‘ఓహ్! సూపర్... మంచి వార్త చెప్పారు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. హైదరాబాదులో విల్లాకు అడ్వాన్స్ చెల్లించవద్దని మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అదేదో డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంలో ఉందట.’ వనజ చెప్పడంతో మరింత ఆనందంతో మరోసారి నాన్నను మనసులో తలచుకున్నాడు రాఘవ.‘యస్... వనజా..! సంవత్సరంలోపు శుభకార్యం మన చేత చేయించకుండా అడ్డుపడి, మనకు మేలు చేసింది మీ మామగారే. శాస్త్రాన్ని నమ్మకపోవడంతో చేయాల్సిన కర్మలు సరిగా చేయలేదేమో, అందుకే ఆ రోజున నాకు ఉద్యోగం పోయింది. నాన్న ఆత్మ దర్శనం కావడంతో, నాన్నపై విశ్వాసం పెరగడంతో, మళ్లీ పాత దానికన్నా పెద్ద ఉద్యోగం వచ్చింది. నిజంగా ఇది నాన్న ఇచ్చిన వరప్రసాదమే కదా వనజ!’ అంటూ ఆత్మ సంతృప్తితో ఆనందాన్ని వ్యక్తం చేశాడు రాఘవ. మంచి పరివర్తనతో తన భర్తలో వచ్చిన మార్పుకు వనజ లోలోన సంతోషించి, మామగారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మాధవరావు సంవత్సరీకానికి రాఘవ, వనజలు ఇండియా బయలుదేరారు.∙∙ ఇల్లు చేరీ చేరగానే అమ్మను పట్టుకొని, కుమిలి కుమిలి ఏడ్చాడు రాఘవ. ‘నాన్నను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా! నాకు నాన్న ఆత్మ దర్శనమైంది.’ అంటూ జరిగిందంతా చెప్పాడు. నేను మళ్ళీ బతికి నీ ముందున్నాను అంటే, నాన్న ఇచ్చిన పునర్జన్మేనమ్మా!’ అంటున్న రాఘవను పొదివి పట్టుకుని ఓదార్చింది సుమతి.‘నీకు ఇంకో విషయం చెప్పనా రాఘవా! నాన్న విషయంలో ఇంకోటి కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు. నాన్న నీకు చెరువులో ఈత నేర్పుతున్న కాలంలో, నాన్నకు న్యుమోనియా వచ్చింది. దాంతో పూర్తిగా ఈత నేర్పలేకపోయాడు.కాలం గడుస్తున్నా కొద్దీ, వ్యాధి ముదిరి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితుల్లోనే నీ అమెరికా ప్రయాణం రావడంతో చికిత్సకు వెచ్చించాల్సిన డబ్బును నీ అమెరికా ప్రయాణానికి, చదువుకు పెట్టాడు. సరైన సమయంలో చికిత్స లేకపోవడంతో, వ్యాధి ముదిరి ప్రాణాంతకమైంది. ఒక రకంగా తన ప్రాణాన్ని నీ చదువు, ఉన్నతికి పణంగా పెట్టాడు.అంతే కాదు రాఘవా..! నువ్వు అనుకున్నట్లు అన్నయ్యను ఎక్కువగా ఏమీ చూడలేదు. ఇంకా.. అన్నయ్యే నీకోసం త్యాగం చేశాడు తెలుసా..? మీ ఇద్దరికీ సమానంగా వచ్చిన వాటాలో, అన్నయ్యకు వచ్చిన ఎకరం పొలంలో సగం అమ్మి నీ చదువుల ఖర్చుకు పెట్టాడు. నీకు నాన్న, అన్నయ్యల పట్ల అపోహలు ఉండటంతో, ఇప్పటివరకు ఈ విషయాలు చెప్పలేకపోయాను. నీ అంతట నీవే పరివర్తన చెందావు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు చెప్పగలిగాను.’ అమ్మ చెబుతున్న విషయాలు వింటున్న రాఘవ ఒక్కసారిగా నిలువెల్లా ద్రవించిపోయాడు. అంతలో అప్పుడే అటుగా వస్తున్న రామారావును పరుగు పరుగున వెళ్లి గాఢంగా హత్తుకున్నాడు.‘నన్ను మన్నించు అన్నయ్యా...! నన్ను క్షమించు నాన్నా..!’ అంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతూ గుక్కపట్టి ఏడుస్తుంటే, అమ్మ, అన్నయ్యలు మరింత ప్రేమ పూర్వకంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు.‘ఇదే రాఘవా..! మన ఆత్మ బలం’ అని రామారావు తమ్ముడిని ఆప్యాయంగా నిమిరాడు.మాధవరావు సంవత్సరీకానికి కావలసిన ఏర్పాట్లను చర్చించటానికి అక్కడికి వచ్చిన నారాయణ శాస్త్రిని చూసిన రాఘవ కన్నీటిని ఆపుకోలేకుండానే‘శాస్త్రిగారూ...! నా మూర్ఖత్వానికి మన్నించండి.’ అంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. జరిగిందంతా తెలుసుకున్న నారాయణ శాస్త్రి ‘మాధవా..నీ ఆత్మ సంకల్పం గొప్పది.’ అనుకుంటూ మనసులోనే అభినందించాడు.‘కర్మాణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచనా... కర్తవ్యాన్ని చేయడమే నీ బాధ్యత, ఫలములపై ఎప్పుడూ హక్కు లేదు. ఇది నిష్కామ కర్మ సిద్ధాంతం రాఘవా!’ అంటూ వేదాంత ధోరణిలో వివరించాడు నారాయణ శాస్త్రి. ‘అంతేకాదు..! శాస్త్రం, శాస్త్రీయత, విశ్వాసం, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, విలువలు, కుటుంబ బంధాల మేళవింపే జీవిత సారం..! అదే మన ఆత్మబలం..!’ అని సత్ జీవన విధాన బోధ చేసిన నారాయణ శాస్త్రికి వినమ్రంగా నమస్కరించారు అందరూ.- మంత్రిప్రగడ శ్రీనివాసరావుఇవీ చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ -
‘డాడీ గుర్తొస్తున్నావ్..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్‌స్టా పోస్ట్!
అర్ధరాత్రి వేళ కుమార్తె పంపిన ఆ సందేశం చూసి, ఆమె తండ్రి ఏకంగా 14 గంటల పాటు ప్రయాణించి, ఆమె దగ్గరకు చేరుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ఆపిల్.కైవల్య’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన తండ్రి ముకేశ్ హీరో తనపై చూపిన అనురాగాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు.రాత్రి సుమారు 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి ‘డాడీ చాలా గుర్తొస్తున్నావ్’ అంటూ ఓ సందేశం పంపారు. కుమార్తె నుంచి వచ్చిన ఆ ఒక్క మాటే ఆయనను వెంటనే ప్రయాణానికి పురికొల్పింది. మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీసి చూసేసరికి, వీపున బ్యాగ్‌తో తండ్రి గుమ్మం ముందు నిల్చుని కనిపించారు. కేవలం ఎనిమిది గంటల పాటు కుమార్తెతో గడపడం కోసం ఆయన 14 గంటల పాటు ప్రయాణించి వచ్చారు. ఆయన తిరిగి తాను ఉండే చోటుకు వెళ్లడానికీ మరో 14 గంటల సమయం పడుతుంది.ఆ కొద్దిపాటి సమయంలోనే ఆ తండ్రీకూతుళ్లు ఎంతో విలువైన క్షణాలను పంచుకున్నారు. ఆమెతో కలిసి బైక్ రైడ్‌కు వెళ్తూనే ఆయన ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడారు. వినోద కేంద్రానికి వెళ్లి సరదాగా సమయం గడిపారు. అనంతరం రెస్టారెంట్లో భోజనం చేశారు. కేవలం బయటకు వెళ్లడమే కాకుండా, కుమార్తె వంటగదిలోని గిన్నెలు కడగడం సహా పలు చిన్నపాటి పనులను ఆయనే స్వయంగా చేసిపెట్టారు.ఈ వీడియోను పంచుకుంటూ.. ‘నిన్ను చూడాలని ఉందని చెప్పాను.. వెంటనే వచ్చేశారు. 14 గంటల ప్రయాణం, ఒక్క రోజు కలయిక, అడగకుండానే చేసిపెట్టిన ఎన్నో పనులు’ అని ఆ యువతి రాసుకొచ్చారు. తల్లిదండ్రులు తమ మాటల్లో ఎప్పుడూ తోడుంటామని చెప్పకపోవచ్చు కానీ, చేతల్లో ఆ ప్రేమను చాటుతారని ఆమె భావోద్వేగంతో వివరించారు. అనంతరం ఆయన స్లీపర్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మాటల కంటే చేతలే గొప్పవని నిరూపించిన ఈ వీడియో నెటిజన్ల మనసులను అమితంగా హత్తుకుంటోంది.ఇది కూడా చదవండి: ఆ ముగ్గురిలో అయోధ్య సీఈవో.. నేడు వెల్లడి? -
'చనిపోవడానికి అనుమతించండి’.. కలెక్టర్‌కు ఓ తండ్రి రాసిన లేఖ!
‘ఓ పెద్దాయనా.. పెద్ద సారు రావడానికి చాలా టైం పడుతుంది. పోయి రేపు రా’ అన్న అటెండర్ మాటలతో ఆయన ఆ లోకంలోకి వచ్చాడు. వయసు 70 పైబడి ఉంటాయి.. ముఖంలో వయసు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెరిసిన జుట్టు, కళ్లజోడు, పెద్ద గళ్ల చొక్కా, పాతకాలపు ప్యాంటు, భుజాన గుడ్డ సంచి.. అందులో కొన్ని పేపర్లు, సుగర్, బీపీ ట్యాబ్లెట్లు.. నడిచినప్పుడు పట్టు తప్పకుండా ఉండేందుకు ఊతకర్ర. ఇవే ఆయన ఆస్తి.‘వస్తావ్.. వెళతావ్.. ఏనాడైనా టీ తాగమని పది రూపాయలైనా ఇచ్చావా? పైసల్లేకుండా పని ఎలా అవుతుందనుకుంటున్నావ్’ అన్న అటెండర్ మాటలకు ఓ నిట్టూర్పు విడిచాడు. ఒకప్పుడు ఎంతోమందికి సాయం చేసిన ఈ చేయి ప్రస్తుతం అదే సాయం కోసం దీనంగా అర్ధించే స్థితిలో ఉండటం చూసుకుని నిర్వేదం ఆవహించింది. కలెక్టర్ ఆఫీసులోని ఆ పాత గోడ గడియారం రెండు గంటల సమయాన్ని సూచిస్తోంది. ఇక చేసేదేమీ లేక భారంగా పైకి లేచి అంతే భారంగా అడుగులు బయటకు వేశాడు.ఆయన పేరు రాఘవరావు. తహశీల్దార్ ఆఫీసులో క్లర్క్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఓ కూతురు, ఇద్దరు కొడుకుల బాధ్యతలు అన్నీ నెరవేర్చాడు. భార్య ఉన్నంత కాలం ఆయన జీవితం బానే గడిచింది. కానీ బ్లడ్ కేన్సర్ ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. తన సహ ధర్మచారిణిని కాపాడుకుందామని రాఘవరావు ఎంతగా తపించినా, బ్లడ్ కేన్సర్ ముందు ఓడిపోయాడు. ఆమె కాలం చేసినప్పటి నుంచి అందరూ ఉన్న అనాథయ్యాడు. ఎప్పుడో ఓసారి కూతురు నుంచి వచ్చే ఫోన్ పలకరింపు తప్ప ఇతర బంధాలేవీ ఆయన దరిదాపుల్లో లేవు.ఇద్దరు కొడుకులు ఉన్నా తండ్రిని పట్టించుకునే తీరిక, పట్టించుకోవాలనే బాధ్యత లేనట్టుగా ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు. దీంతో ఆయన జీవితంలాగే రోజులు కూడా చాలా భారంగా గడుస్తున్నాయి. నెలనెలా వచ్చే కాసిని పింఛను డబ్బులతోనే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో తినీ తినక అలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు.కలెక్టరాఫీసు నుంచి బయటకు వచ్చిన రాఘవరావు.. కాస్త అలసటగా అనిపించి ఓ టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగాడు. జేబులో నుంచి రూ.20 నోటు తీసి ఇచ్చి వెళ్లబోయాడు. రాఘవరావులాగే చాలా ముడతలు పడి మాసిపోయి, చిరిగి ఉన్న నోటు వంక టీకొట్టు యజమాని తేరిపార చూసి, ‘ఈ నోటు మారదు మరొకటి ఇవ్వండి’ అంటూ వెనక్కి ఇచ్చాడు.జేబు మొత్తం వెతికి చిల్లరంతా తీసినా కూడా రెండు రూపాయలు తగ్గింది. టీకొట్టు యజమాని వాటిని తీసుకుని.. ‘డబ్బుల్లేకుండా టీ ఎందుకు తాగుతారు’ అంటూ గొణుక్కున్నాడు.రెండు రూపాయలు తగ్గాయని ఆ హోటల్ యజమాని ముఖం తిప్పుకునేసరికి రాఘవరావు మనసు చివుక్కుమంది. కళ్లలో వస్తున్న నీళ్లను బలవంతంగా అదిమి పెట్టుకుని రోడ్డు పైకి వచ్చాడు. జేబులో డబ్బుల్లేవు. ఇంటికి నడిచి వెళ్లేంత ఓపిక అసలే లేదు. ఓ వైపు ఎండ నిప్పులు చెరుగుతోంది. రోడ్డు తారు కరిగి కాళ్లను గుంజుతున్నట్లుంది.అప్పుడే ఆ రోడ్డుపై నుంచి పోలీస్ జీపు వస్తోంది. అందులో ఉన్న ఎస్సైని రాఘవరావు గుర్తుపట్టారు. ఆయన ఉండేది తమ కాలనీలోనే.. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఎస్సైకి తెలిసిన వాళ్ల ఫైల్ ఒకదానిని త్వరగా పరిష్కరించి సహాయం చేసిన సంగతి గుర్తొచ్చింది. దీంతో లిఫ్ట్ ఇస్తారేమో ఆశతో.. ‘సార్.. కాస్త ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తారా?’ అని చేయి ఊపాడు. కానీ ఆ ఎస్సై కనీసం జీపు ఆపలేదు సరికదా, కళ్లద్దాల వెనుక నుంచి ఒక చులకన భావంతో చూస్తూ స్పీడుగా వెళ్లిపోయాడు. జీపు వెదజల్లిన ధూళి రాఘవరావు కళ్లల్లో పడింది. అయితే, ఆ బాధ కంటే ఆ ఎస్సై చూసిన చూపు తీవ్రమైన బాధ కలిగించింది.అలా అతికష్టమ్మీద నాలుగడుగులు వేశాడు. ఓ వైపు ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వయసు సహకరించడం లేదు. గొంతు ఎండిపోతోంది. శ్వాస భారమైంది. కంటి చూపు మసకబారుతోంది. రోడ్డు పక్కన ఎవరైనా నీళ్లు ఇస్తారేమోనని చూశాడు. కానీ ఎవరి బిజీలో వాళ్లున్నారు. ఆ నడిరోడ్డుపైనే ఆయన కాళ్లు తడబడ్డాయి. చేతిలోని ఊతకర్ర జారిపోయింది. భుజాన ఉన్న గుడ్డ సంచితో సహా రాఘవరావు అక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఆ మసకబారుతున్న చూపుల వెనుక.. ఆయన జీవితం మొత్తం సినిమా రీలులా గిర్రున తిరిగింది.తహశీల్దార్ ఆఫీసులో రోజంతా ఫైళ్లతో నడుము విరగ్గొట్టుకుని పనిచేసి, సాయంత్రం కాగానే విశ్రాంతి ఎరుగకుండా మరొక చిన్న ఉద్యోగం కోసం పరుగెత్తిన రోజులు గుర్తొచ్చాయి. ‘పిల్లలకు లోటు రాకూడదు.. వాళ్ల చదువులు ఆగకూడదు.. రేపు వాళ్లు గొప్ప స్థాయికి వెళ్లాలి’ అనే తపనతో ఎంత కష్టపడ్డాడో సగం తెరిచిన కళ్లలో కదలాడింది.సాయంత్రాలు టీ కొట్టు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకునే స్నేహితులు గుర్తొచ్చారు. ‘రారా రాఘవా.. కాసేపు కూర్చో’ అని పిలిచినా, ‘లేదురా.. అర్జెంట్ పని ఉంది’ అంటూ నవ్వుతూ దాటవేసిన క్షణాలు కళ్లముందు కదిలాయి. రూపాయి రూపాయి కూడబెట్టే ఆ తాపత్రయంలో ఏనాడూ తనకోసం, తన సంతోషం కోసం ఆయన బతకలేదు. పిల్లలే ముఖ్యమనుకుని, వారి కోసమే జీవితం మొత్తం అంకితమయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఆత్మీయులు, స్నేహితులు ఒక్కరొక్కరుగా దూరమయ్యారు. ఆనాడు పిల్లల భవిష్యత్తు కోసం స్నేహాన్ని, సరదాలను త్యాగం చేస్తే, ఈనాడు కనీసం ‘బాగున్నావా’ అని పలకరించడానికి ఒక్క స్నేహితుడు కూడా లేని నిశ్శబ్దం మిగిలింది.కొడుకులు, కూతురు చిన్నతనంలో తన భుజాలెక్కి ఆడుకున్న రోజులు కనిపించాయి. ‘నాన్నే నా హీరో’ అన్న పెద్దోడి మాటలు చెవుల్లో రింగుమన్నాయి. ‘నాన్నా! నేను పెద్దయ్యాక నిన్ను మహారాజులా చూసుకుంటా’ అన్న చిన్నోడి మాటలు ఇంకా మరచిపోలేదు. వారి ముద్దుముద్దు మాటలకు ఎంతో మురిసిపోయిన రాఘవరావు– రెక్కలు ముక్కలు చేసుకుని వారిని ప్రయోజకులను చేశాడు. కానీ వారు మాత్రం పెద్దయి, పెళ్లిళ్లు చేసుకున్నాక కన్న తండ్రిని పూర్తిగా పక్కన పెట్టేశారు.‘ఇలా రెండు ఉద్యోగాలు చేస్తూ సరిగా తిండి కూడా తినకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి’ అంటూ ప్రేమతో కోప్పడే భార్య గుర్తొచ్చింది. ‘నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు. అందుకే వారికి ఏ లోటూ రాకూడదని ఇంత కష్టపడుతున్నా. రేపు వాళ్లు పెద్దయ్యాక మన ఇద్దరినీ నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు’ అంటూ భార్యతో అన్న మాటలు గుర్తొచ్చి, ఆయన కళ్లల్లో నుంచి చివరి కన్నీటి చుక్క చెంపల మీదుగా జారి రోడ్డుపై పడి ఆ వేడికి ఆవిరైపోయింది.మరుక్షణం తన తండ్రి వెంకటరామయ్య గుర్తొచ్చారు. ఆయన అవసాన దశలో తాను సరిగా చూసుకోని సంగతులు లీలగా మెదిలాయి. ‘ఒరేయ్.. రాఘవా? ఈ మధ్య అస్సలు నువ్వు నాతో మాట్లాడటంలేదురా.. ఏం అడిగినా బిజీ, టైం లేదు అంటున్నావ్. కళ్ల ముందే మీరంతా ఉన్నా ఒంటరితనం బాధిస్తోందిరా. చేవలేని ఈ ముదిమి వయసులో చేతికర్రలా ఉండాల్సిన నువ్వు.. కనీసం నా ముఖం కూడా చూడటంలేదనే బాధ నా గుండెను పిండేస్తోంది. ఈ వయసులో మాకు కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదురా.. నాన్నా ఎలా ఉన్నావు అనే ఆత్మీయమైన పిలుపు. మీ అనురాగాలు మాత్రమే. మీ అమ్మ అదృష్టవంతురాలు.. నా కంటే ముందే వెళ్లిపోయింది.ఇంకా ఈ కట్టె ఎన్నిరోజులు ఇలా ఉండాలో’ అంటూ మథనపడిన సంగతి గుర్తొచ్చింది. ఇక కన్నీటి చుక్కలు రావడానికి ఆయన ఒంట్లో నీళ్లు కూడా లేవు. ఆ వయసులో తన తండ్రి అనుభవించిన బాధే ఇప్పుడు తాను అనుభవిస్తున్నా అని అర్థమైంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే తాను.. ఎందుకు ఇలా చేశానా అనే పశ్చాత్తాపం మూసుకుపోతున్న కళ్లల్లో కనిపించింది. బలవంతంగా కళ్లు తెరిచి ఆకాశంలో ఎక్కడో ఒకచోట ఉండే తండ్రికి క్షమాపణ చెప్పాలని రాఘవరావు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. ఆ కళ్లు అలా నెమ్మదిగా మూతపడ్డాయి.త్యాగానికి నిర్వచనమైన ఓ సగటు తండ్రి ఆఖరి శ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది.క్షణాల మీద అక్కడ జనం చేరారు. ‘అయ్యో.. ఎవరో పెద్దాయన పాపం శోష వచ్చి పడిపోయినట్టున్నాడు. పక్కన కూర్చోబెట్టి నీళ్లివ్వండి’ అని గుంపులో ఎవరో అన్నారు. ‘వడదెబ్బ తగిలినట్టుంది.. అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి’ అని మరొకరు.. ఇలా మాటలు చెబుతున్నారే తప్ప ఎవరూ ముందుకు రావడంలేదు.ఇంతలో ఆ గుంపులోకి ఒక జేబుదొంగ చొరబడ్డాడు. ఓ పెద్దాయన లాల్చీ జేబులో నుంచి పర్సు కొట్టేశాడు. ఈ రోజు నా అదృష్టం బాగుంది అనుకుంటూ.. ఇంకా ఎవరి దగ్గరైనా కొట్టేసే అవకాశం ఉందా అని పరిశీలిస్తున్నాడు. అప్పుడే ఆ టీకొట్టు యజమాని అక్కడ జనాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాఘవరావు ముఖం చూడగానే షాక్ అయ్యాడు. ‘అయ్యో.. ఇందాకే నా కొట్టు దగ్గర టీ తాగాడు. రెండు రూపాయలు తక్కువయ్యాయని కాస్త గింజుకున్నాను. ఆ చిల్లరంతా నేను తీసుకోకుండా ఉంటే బస్సు ఎక్కి ఇంటికి వెళ్లేవాడేమో..’ అన్న భావన అతని గుండెను పిండేసింది.అప్పుడే అటుగా వెళ్తున్న ఎస్సై జీపు జనాలను చూసి ఆగింది. కాసేపటి క్రితం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్లిన అదే ఎస్సై జీపు దిగి గంభీరంగా జనాన్ని తోసుకుంటూ వచ్చాడు. రాఘవరావు శవాన్ని చూసి, ‘అరే.. ఇందాక లిఫ్ట్ అడిగింది ఈయనే కదా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే చనిపోయేవాడు కాదేమో’ అని మనసులో ఉలిక్కిపడ్డాడు.సరిగ్గా అదే సమయానికి సైరన్ మోగుతూ కలెక్టర్ కారు వచ్చి ఆగింది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కలెక్టర్ స్వయంగా కారు దిగి వచ్చారు. జనమంతా పక్కకు తప్పుకున్నారు. రాఘవరావు అచేతనంగా పడి ఉండటాన్ని చూశారు. పక్కనే పడి ఉన్న గుడ్డసంచి, అందులోంచి రోడ్డుపై పడిన కాగితాలు కలెక్టర్ దృష్టిని ఆకర్షించాయి. ఒక తెల్లటి కాగితంపై పెద్ద అక్షరాలతో ‘అర్జీ’ అని రాసి ఉంది.కలెక్టర్ వంగి ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని చదవడం ప్రారంభించారు:గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి...అయ్యా,నా పేరు రాఘవరావు. రిటైర్డ్ క్లర్క్.ఒకప్పుడు నా సంతకం పడితే కానీ ఆఫీసుల్లో ఫైళ్లు ముందడుగు వేసేవి కావు. కానీ ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయలేని స్థితికి వచ్చేశాను. రెక్కలు ముక్కలు చేసుకుని, తినీ తినక పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేశాను. సంపాదించినదంతా వారి కోసమే ఖర్చు చేశాను. కానీ వారికి రెక్కలొచ్చాక తల్లిదండ్రులనే భావన కూడా వారికి లేకుండా పోయి అనాథల్లా వదిలేశారు.నా భార్య కాలం చేశాక, ఆకలి కంటే ఈ ఒంటరితనమే నన్ను రోజురోజుకూ నమిలి మింగేస్తోంది. ఎంతో ఆశగా పెంచి పెద్ద చేసిన నా పిల్లల ఇళ్లలోనే కాదు.. వారి మనసులో కూడా నాకు చోటు లేదు. వారి సమయాన్ని, ప్రేమను కొనుక్కోవడానికి నా దగ్గర ధనం లేదు.నేను బతికి ఉన్న ప్రతి క్షణం వారికి భారంగా మారింది. నా పింఛను డబ్బులు నా పొట్ట నింపగలవేమో కానీ, నా మనసు పడే ఆక్రందనను ఆపలేకపోతున్నాయి. రోజంతా ఖాళీ గోడల వైపు చూస్తూ బతుకును భారంగా ఈడుస్తున్నాను. ఏనాడైనా ఎవరో ఒకరు నా తలుపు తట్టి ’బాగున్నావా నాన్నా’ అని అడగరా అని ఎదురుచూసి చూసి అలసిపోయాను.అందరికీ బరువుగా ఉన్న ఈ జీవితం నాకు అంతకుమించిన భారంగా అనిపిస్తోంది. చావలేక బతుకుతున్న నేను.. ఇలా బాధలు పడుతూ చస్తూ బతకడం కంటే చనిపోవడమే మేలు అని నిర్ణయానికి వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగంలో అడుగు పెట్టినప్పటి నుంచి చట్టాన్ని గౌరవిస్తూ.. ఒక్క తప్పు పని కూడా చేయలేదు. ఆత్మహత్య చేసుకోవడం నేరమని తెలుసు. అందుకే ఆ తప్పు కూడా చేయకూడదనే భావనతో ఈ అర్జీ పెట్టుకుంటున్నాను.అక్కడి వరకు చదివిన కలెక్టర్‌కు ఆపై అక్షరాలు కాస్త మసకబారినట్టు అనిపించాయి. కళ్లజోడు తీసి, కళ్లలో నుంచి ఉబికివస్తున్న నీళ్లను తుడుచుకుని.. మళ్లీ దానిని చదవడం ప్రారంభించారు.ఒక పౌరుడిగా, ఒక నిస్సహాయ తండ్రిగా, అంతకంటే బాధ్యతాయుతమైన మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను... నేను చనిపోవడానికి చట్టబద్ధమైన అనుమతి ప్రసాదించండి. కారుణ్య మరణం పొందడానికి వీలు కల్పించండి. ఈ వయసులో ఇంతకుమించి నేను ఏమీ అడగలేను. మీ అనుమతి కోసం.. ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను.ఇట్లు,ఆకలితో కాదు.. అనురాగానికి అలమటించి చనిపోతున్న ఒక నిస్సహాయ తండ్రి రాఘవరావు.ఉత్తరం చదవడం ముగిసేసరికి కలెక్టర్ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయారు. గాలికి కలెక్టర్ చేతిలోని కాగితం ఎగిరి అక్కడే ఉన్న 10 ఏళ్ల పిల్లాడిపై పడింది. అతడు దానిని తీసుకుని పైకి చదవడం ప్రారంభించాడు. అది పూర్తయ్యే సరికి అక్కడ నిశ్శబ్దమే రాజ్యమేలింది.మొదటగా టీకొట్టు యజమాని కళ్లు రాఘవరావు నెరసిన జుట్టు వైపు చూశాయి. అతనికి ఊళ్లో ఉన్న తన ముసలి తండ్రి గుర్తొచ్చాడు. ‘నా తండ్రి కూడా ఇలాగే ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాడేమో? నేను డబ్బు సంపాదనలో పడి నాన్నను సరిగ్గా చూసుకోవడం లేదు’ అనిపించి అతని గుండె బరువెక్కింది. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి, వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ నాన్న నంబర్‌కు డయల్ చేశాడు.ఎస్సై ఆ అర్జీ వైపు, రాఘవరావు చేతికర్ర వైపు చూశాడు. అతని కళ్లముందు తను నిర్దాక్షిణ్యంగా జీపు పోనిచ్చిన దృశ్యం కదిలింది. ‘నన్ను పెంచి పెద్ద చేసి, పోలీస్ ఆఫీసర్‌ను చేసిన నా తండ్రి కూడా ఇవాళ ఊళ్లో ఒంటరిగా ఉంటున్నారు. నేను హోదా పెరిగాక బిజీబిజీ అంటూ ఆయనతో మాట్లాడటమే మానేశాను. ఇకపై నేను ఇలా ఉండకూడదు’ అని మనసులో అనుకుని.. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి తండ్రికి కాల్ చేశాడు.ఇక దొంగ ఆ మందు బిళ్లల వైపు చూశాడు. అతడికి జబ్బుతో మంచాన పడ్డ తన తండ్రి గుర్తొచ్చాడు. ‘దొంగ సొమ్ము మంచిది కాదురా.. కష్టపడి పనిచేసి సంపాదించినదాంట్లో ఎంతో తృప్తి ఉంటుందని పదేపదే చెప్పే నాన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇక దొంగతనాలు ఆపేసి నాన్న చెప్పినట్టే చేయాలి’ అని కళ్ల నీళ్లు తుడుచుకున్నాడు. తాను కొట్టేసిన పర్సును మళ్లీ ఆ పెద్దాయన జేబులో పెట్టేసి గుండెల నిండా తృప్తితో ఇంటికి పరుగెత్తాడు. నాన్నతో మాట్లాడాలనే ఆరాటం అతడి కళ్లల్లో స్పష్టంగా కనిపించింది.చివరగా కలెక్టర్ ఆ అర్జీని పిల్లాడి దగ్గర నుంచి తీసుకుని తన డైరీలో భద్రపరచుకున్నారు. ఈ పెద్దాయన చావుకు కారణం ఎవరు? ఆస్తులన్నీ పంచుకుని గుప్పెడు అనురాగాన్ని కూడా పంచకుండా ఆయన్ను అనాథలా వదిలేసిన కన్నపిల్లలా? ఇలాంటి కొడుకులను సరిగా గాడిలో పెట్టలేకపోతున్న ఈ వ్యవస్థా? బంధాలు, అనుబంధాలను చాలా తేలికగా తీసుకుంటున్న నేటి తరం ఆలోచనలా? అని మథనపడ్డారు. ఇలాంటి పెద్దలను ఆదుకోవడానికి ఏదైనా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.అలాగే.. ఆ క్షణంలో తాను చేసిన తప్పేంటో గుర్తొచ్చి కుమిలిపోయారు. వెంటనే ఫోన్ తీసి.. ఓ నెంబర్ డయల్ చేశారు. అక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న అవతల వ్యక్తి ఫోన్ తీయగానే.. కలెక్టర్ నోటి నుంచి వచ్చిన మాట.. ‘నాన్నా..’ఈలోగా అంబులెన్స్ వచ్చింది. కలెక్టర్‌తో పాటు ఎస్సై, టీకొట్టు యజమాని అంతా కలిసి రాఘవరావు భౌతికకాయాన్ని అందులోకి ఎక్కించారు. బతికుండగా ఎన్నో కష్టాలు అనుభవించిన రాఘవరావు.. ఇప్పుడు చలనం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు.అప్పుడు వెంకట రామయ్య... ఇప్పుడు రాఘవరావు.. రేపు రాఘవరావు కొడుకులు...!!- కొండ్రెడ్డి సత్యకిషోర్ఇవి కూడా చదవండి: దెయ్యమా? మనిషేనా? హాలోవీన్ హత్యలో ఊహించని ట్విస్ట్! -
తండ్రిని కాపాడిన 10 ఏళ్ల కూతురు.. కథ తెలిస్తే కన్నీళ్లు వస్తాయి!
ఒక చిన్న గ్రామంలో రాము, అతని పదేళ్ల కూతురు చైత్ర నివసిస్తున్నారు. రాముకు చదువు రాదు. ఊళ్లో చిన్న కిరాణా కొట్టు నడుపుతుంటాడు. కానీ, అతనికి ఒక చెడ్డ అలవాటు ఉంది. రోజంతా సంపాదించిన డబ్బుతో సాయంత్రం కాగానే స్నేహితులతో కలిసి పేకాట ఆడుతూ కూతురు చదువు గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు.కానీ చైత్ర చాలా చురుకైన పిల్ల. ఎలాగైనా చదువుకుని గొప్ప ఆఫీసర్ అవ్వాలని, నాన్నను మార్చాలని అనుకునేది. ఒకరోజు రాము పేకాటలో ఓడిపోయి, ఇంటికి వచ్చాడు. చైత్ర చేతిలో ఒక స్టాంప్ కాగితం పెట్టి, ‘చైతూ.. ఇందులో ఏముందో చదువు. మా స్నేహితుడు దీనిపై సంతకం పెడితే వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు‘ అన్నాడు. చైత్ర ఆ కాగితం చదివి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అది వాళ్ల కిరాణా కొట్టును ఆ స్నేహితుడికి రాసిచ్చే పత్రం!చైత్ర నాన్న చేతులు పట్టుకుని, ‘నాన్న! చదువుకోకపోతే సమాజం మనల్ని ఎలా మోసం చేస్తుందో చూశావా? నువ్వు సంతకం పెడితే మనకున్న ఒకే ఒక్క ఆధారం పోయేది. నువ్వు మారాలి నాన్న‘ అంటూ ఏడ్చేసింది. రాముకు ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నాయి. ఆ రోజు నుంచి రాము పేకాట మానేశాడు. ప్రతి సాయంత్రం చైత్ర పక్కన కూర్చుని, కూతురి దగ్గరే అక్షరాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కూతురిని బాగా చదివించాడు. కొన్నేళ్ల తర్వాత చైత్ర పెద్ద ఆఫీసర్ అయ్యింది. ఆ రోజు రాము అందరితో, ‘నన్ను దారికి తెచ్చిన నా గురువు నా కూతురే‘ అని గర్వంగా చెప్పుకున్నాడు.ఇవి కూడా చదవండి: నిచ్చెన ఎక్కేప్పుడు కాళ్లు ఎందుకు వణుకుతాయి? -
"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!
-
బహూకరించిన ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు తండ్రికి ఉందా?
కొన్ని సంవత్సరాల క్రితం మా తండ్రి తన స్వార్జిత ఆస్తులతో పాటు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను కూడా నాకు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా బహూకరించారు. అనంతరం మా తల్లి మరణించడంతో మా తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. తన రెండోభార్య ప్రభావంతో ఇటీవల ఆ గిఫ్ట్‌డీడ్‌ను రద్దు చేస్తానని నన్ను బెదిరిస్తున్నారు. తండ్రికి ఇష్టమొచ్చినప్పుడు ఇలాంటి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసే అధికారం ఉంటుంది అని అంటున్నారు. ఆయన అలాంటి చర్య తీసుకోకుండా కోర్టు ద్వారా రక్షణ పొందగలనా?– విశ్వసాగర్, మహబూబ్ నగర్చట్టపరంగా ఒకసారి చెల్లుబాటయ్యే విధంగా బహుమతి పూర్తయి, దానిని స్వీకరించిన అనంతరం, కేవలం దాత మనసు మార్చుకున్నందుకు లేదా కుటుంబ పరిస్థితులు మారాయనే కారణంతో ఆ బహుమతిని ఏకపక్షంగా రద్దు చేయడం అంత సులువేం కాదు.ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882లోని సెక్షన్ 122 ప్రకారం, బహుమతి అంటే ప్రతిఫలం లేకుండా స్వచ్ఛందంగా ఆస్తిని బదిలీ చేయడం; అదే చట్టంలోని సెక్షన్ 126 ప్రకారం గిఫ్ట్‌ను రద్దు చేసే అవకాశం చాలా పరిమితమైన సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, గిఫ్ట్ డీడ్లోనే దాత ఇష్టానుసారం కాకుండా, ఒక నిర్దిష్ట సంఘటన సంభవించినప్పుడు బహుమతి రద్దు కావచ్చని చట్టబద్ధంగా అంగీకరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. అయితే ‘‘నాకు నచ్చినప్పుడు గిఫ్ట్‌ను రద్దు చేసుకుంటాను’’ అంటే కుదరదు. అలా రాసుకున్నా చట్టం ఒప్పుకోదు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే సూత్రాన్ని పునరుద్ఘాటించాయి.మీ తండ్రిగారు ఏం చేస్తారో చెప్పలేదు. ఆయనకు ఆస్తులు ఉన్నాయా? ఉద్యోగస్తుడా? ఎందుకంటే, ఒకవేళ గిఫ్ట్ డీడ్‌లో తండ్రిని జీవితాంతం పోషించాలి, నివాసం కల్పించాలి లేదా ఇతర థమిక అవసరాలు తీర్చాలి అనే షరతు స్పష్టంగా ఉన్నదా లేదా అన్నది పరిశీలించాలి. తండ్రి సీనియర్ సిటిజెన్ అయితే, మెయింటెనెన్స్ అండ్ వెల్పేర్ ఆఫ్ సీనియర్ సిటిజెన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్, 2007లోని కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఆస్తి బదిలీని రద్దు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. బదిలీ గ్రహీత తల్లిదండ్రికి ప్రాథమిక అవసరాలు, భౌతిక అవసరాలు తీర్చాలనే షరతు ఉన్నప్పుడు, ఆ బాధ్యతను నిర్వర్తించనప్పుడు ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు. కాబట్టి ఆయనకు వాస్తవంగా మెయింటెనెన్స్ అవసరమా లేదా, ఆయన ఆదాయం ఎంత, గిఫ్ట్ డీడ్‌లో ఏమైనా మెయింటెనెన్స్ ఉందా వంటి అంశాలను వాస్తవాల ఆధారంగా పరిశీలించాలి. అలాగని కేవలం మెయింటెనెన్స్ కోరే హక్కు ఉండటం వల్లనే ఇప్పటికే పూర్తయిన గిఫ్ట్ డీడ్‌ను స్వయంచాలకంగా రద్దు చేసే హక్కు దాతకు ఏర్పడదు. సెక్షన్ 126 లేదా సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ లోని వర్తించే నిబంధనల కింద చట్టపరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే బహుమతి రద్దుచేసే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.అదలా ఉంటే కోర్టులో ఇంజక్షన్ సూట్ వేసే అవకాశం ఉన్నప్పటికీ మీ తండ్రిగారు బెదిరిస్తున్నారనే కారణంతో మీరు వెంటనే కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ముందుగా గిఫ్ట్ డీడ్‌ను న్యాయపరంగా పరిశీలించి, అందులో రివోకన్స్, మెయింటెనెన్స్, లైఫ్ ఇంటరెస్ట్ లేదా ఇతర షరతులు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి. బెదిరింపులకు భయపడటం కంటే ముందుగా గిఫ్ట్ డీడ్ పూర్తి కాపీని న్యాయ నిపుణుడితో పరిశీలించి, అవసరమైతే ముందస్తు న్యాయపరమైన రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. దగ్గరలోని మంచి లాయరు గారిని కలవండి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
ఐఫోన్ ఈఎంఐ మరణాల కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు గుట్టు విప్పిన పోలీసులు
ముంబై: ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేకనే మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మృతుడు కునాల్ పిన్ని పల్లవి పాటిల్ స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఎలాంటి ఫోన్ ఈఎంఐ వ్యవహారం లేదని, దయచేసి తప్పుడు ప్రచారాలు ఆపేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా తీస్గావ్లో ఆగస్టు 21న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల కునాల్ చంద్‌గుడే ఈఎంఐ పద్ధతిలో యాపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే నెలవారీ వాయిదాలు చెల్లించలేక కుటుంబ సభ్యుల సహాయం కోరాడు. ఈ చిన్న విషయమే కుటుంబంలో వివాదానికి దారితీసింది.ఆవేశంతో ఖావడ్యా కొండపైకి వెళ్లిన కునాల్, తాను కొండపై నుంచి దూకేస్తానని బెదిరించాడు. కొండ అంచున ఉన్న కునాల్‌ను కాపాడేందుకు తండ్రి మురళీధర్ ప్రయత్నించగా.. ఇద్దరూ ప్రమాదవశాత్తూ అదుపుతప్పి 400 నుంచి 500 అడుగుల లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. భర్త, కుమారుడు కళ్లెదుటే లోయలో పడిపోవడాన్ని తట్టుకోలేక తల్లి సంగీత కూడా అదే కొండపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.ఐఫోన్ ప్రచారంపై పిన్ని ఆవేదన కుటుంబ సభ్యుల అస్థికలను ఇంటికి తీసుకొచ్చే సమయంలో పల్లవి పాటిల్ ఒక వీడియో విడుదల చేశారు. ‘ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేకనే వారు ప్రాణాలు తీసుకున్నారనేది పూర్తిగా అవాస్తవం. మా కుటుంబం గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేసి మమ్మల్ని మరింత వేదనకు గురిచేయవద్దు. వృద్ధులైన మా తల్లిదండ్రులకు ఈ సోషల్ మీడియా ప్రచారాలు తెలిస్తే తట్టుకోలేరు’ అంటూ ఆమె కన్నీటిపర్యమంత అయ్యారు.భార్యాభర్తల మధ్య విభేదాలే కారణమా?మరోవైపు,ఐఫోన్ ఈఎంఐ కట్టలేకే కునాల్ ప్రాణాలు తీసుకున్నారనే అంశంలో వాస్తవం లేదని పోలీసులు సైతం గుర్తించారు. అందుకు సంబంధించిన ఆధారాల్ని సేకరించారు. ఆ ఆధారాల్లో కునాల్ తండ్రి మురళీధర్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, సంగీత గృహిణి. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో పెద్ద కుమారుడిని కోల్పోవడం వల్ల వీరి కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు విడివిడిగా ఉంటున్నారు. గత మూడు నెలలుగా దూరంగా ఉన్న మురళీధర్.. ఘటనకు రెండు రోజుల ముందే ఇంటికి రావడంతో గొడవలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీతకు సంబంధించిన ఒక పాత వీడియో పోలీసులకు లభించింది. ‘ఆస్తి కోసం నాకు, నా కొడుక్కి దక్కాల్సిన హక్కును నిరాకరించారు. నా సంతోషకరమైన కుటుంబాన్ని నాశనం చేశారు. దీనికి కారణమైనవారు రాబోయే ఏడు తరాలు మూల్యం చెల్లించుకుంటారు’ అంటూ ఆ వీడియోలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలోని అంతరార్థంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కునాల్ తల్లి సంగీత ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలిస్తే.. ఈ కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. (👉ఇదీ చదవండి: నీ తల్లికోసమైనా బ్రతకాల్సింది కదరా!) -
తండ్రికి మూడు.. కూతురికి మొదటి ర్యాంక్.. ‘లా’లో తండ్రిని మించిన తనయి
పాలంపూర్: హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా ఆలంపూర్కు చెందిన తండ్రీకూతుళ్లు అరుదైన విజయాన్ని నమోదు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం (హెచ్‌పీయూ) నిర్వహించిన మూడేళ్ల ఎల్ఎల్బీ (లా) కోర్సు పరీక్షల్లో వీరిద్దరూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో అగ్ర ర్యాంకులు కైవసం చేసుకున్నారు. హెచ్‌పీయూ రీజినల్ సెంటర్ (ధర్మశాల)లో 2023 నుంచి 2026 జూన్ వరకు ఇద్దరూ కలిసి న్యాయవిద్యను అభ్యసించారు.23 ఏళ్ల కుమార్తె అన్షికా రాణా రెగ్యులర్ విధానంలో చదువుకోగా, ఆమె తండ్రి ప్రవీణ్ రాణా కరస్పాండెన్స్ విధానంలో కోర్సును పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన ఆరో సెమిస్టర్ తుది ఫలితాల్లో అన్షికా యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి మొదటి ర్యాంకు సాధించగా, ఆమె తండ్రి ప్రవీణ్ మూడో ర్యాంకును దక్కించుకున్నారు. ప్రవీణ్ రాణా ప్రస్తుతం దరోహ్లోని హిమాచల్ ప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆయన మళ్లీ చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. పోలీసు శాఖలో బాధ్యతలు ఎంతో శ్రమతో కూడుకున్నవైనప్పటికీ, విధులను సమర్థంగా నిర్వర్తిస్తూనే క్రమం తప్పకుండా చదువుకు సమయం కేటాయించారు.మూడేళ్ల పాటు తండ్రీకూతుళ్లు ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ తరగతులకు హాజరయ్యారు. తండ్రితో కలిసి చదువుకోవడం మరచిపోలేని అనుభవమని అన్షికా పేర్కొనగా, నేర్చుకోవాలనే తపన ఉంటే వయసు ఏనాడూ అడ్డంకి కాదని ప్రవీణ్ స్పష్టం చేశారు. ఏ వయసులోనైనా కొత్త లక్ష్యాలను సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఈ అపూర్వ విజయంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులతో పాటు పలువురు విద్యావేత్తలు ప్రశంసలు కురిపించారు.ఇది కూడా చదవండి: ఐఫోన్ ఈఎంఐ కట్టలేక ‘యమున’లో దూకి.. -
కూతుర్లే.. ‘ఆ నలుగురై’..
కృష్ణాజిల్లా: తమ తండ్రి అంత్యక్రియలు తామే జరుపుకుంటామని ముందుకొచ్చిన కుమార్తెలు సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పామర్రు గ్రామంలోని అరండాల్ పేటకు చెందిన పలగాని వెంకట నారాయణ(65) గుండె పోటుతో సోమవారం మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి అంత్యక్రియలు జరిపేందుకు కుమారుడు లేకపోవడంతో బంధు మిత్రులు ఆందోళన చెందుతుండగా , ఈ విషయాన్ని గ్రహించిన మృతుడి కుమార్తెలు ముందుకొచ్చి తమ తండ్రి అంత్యక్రియలు తామే నిర్వహించి తమ తండ్రి రుణం తీర్చుకుంటామని ముందుకు రావడం పలువురిని ఆశ్చర్యపర్చింది. మృతుడి ఇద్దరు కుమార్తెలైన లత, ప్రసన్న తండ్రి పాడెను మోశారు. పెద్ద కుమార్తె జ్యోతి దహన సంస్కారాలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించింది. తండ్రి పాడెను పట్టే సందర్భంలో తమ తండ్రిని ఇక చూడలేమని తలచి బాధా తప్త హృదయాలలో నడుస్తూ శ్మశాన వాటికకు వెళ్లడంతో పలువురి కళ్లు చెమ్మగిల్లాయి. స్థానిక హిందూ శ్మశాన వాటిలో అంత్య క్రియలను పూర్తిచేశారు. -
20 లక్షలిస్తే.. నా కూతురు తిరిగివస్తుందా..! మోసం చేసావ్ చంద్రబాబు..
-
సెల్ఫీ పేరుతో.. కుమార్తెను యమునా నదిలో విసిరేసిన తండ్రి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పసికందును ఎత్తుకుని వంతెనపైకి వచ్చిన ఒక తండ్రి, సెల్ఫీ తీసుకునే నెపంతో కన్న కూతురిని యమునా నదిలోకి విసిసేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర ప్రాంతంలో ఒక వ్యక్తి తన చిన్నారి కుమార్తెతో కలిసి వంతెనపైకి వచ్చాడు. అక్కడ సెల్ఫీ దిగేందుకు కొద్దిసేపు ఆగాడు. అయితే, చుట్టూ ఎవరూ గమనించని సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ, ఆ పసికందును ప్రవహిస్తున్న యమునా నదిలోకి విసిసేశాడు. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గాలింపు జరిపి నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగానే అతను ఈ అరాచకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి జాడ కోసం గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో అన్వేషణ కొనసాగిస్తున్నారు. కనికరం లేకుండా పసిబిడ్డను బలిగొన్న తండ్రి దుర్మార్గపు బుద్ధిని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. -
రెండు రోజుల్లో బర్త్‌డే : 11 నెలల చిన్నారిని యమునలో విసిరేసిన తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో సికంద్రా సమీపంలోరింకూ అనే వ్యక్తి తన 11నెలల కుమార్తెను యమునా నదిలో విసిరేసి హత్య చేశాడు. సరిగ్గా ఆమె పుట్టిన రోజుకు మూడు రోజులు ముందు ఇంత అమానుషానికి పాల్పడ్డాడు.ఆగస్టు 17న కుమార్తె బర్త్ డే ఉండటంతో, బట్టలు కొనేందుకు బైక్‌పై భార్య, పాపతో కలిసి ఆగ్రాకు బయల్దేరాడు. ముందుగానే పథకం వేసుకున్నాడో, ఏమో తెలియదుగానీ దారిలో, అక్బరీ బ్రిడ్జ్ దగ్గర బండి ఆపాడు. సెల్ఫీ తీసుకుందామని చెప్పి భార్య లక్ష్మిని నమ్మించాడు. అకస్మాత్తుగా పాపను తల్లి ఒడిలోంచి లాక్కొని మరీ సెల్ఫీ తీస్తున్నట్టుగా నటించి, యమునా నదిలోకి విసిరేశాడు. దీంతో హతాశురాలైన ఆమె, ఎందుకిలా చేశావని ప్రశ్నింస్తుండగానే ఆమెను కూడా నదిలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె గట్టిగా అరిచి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. రింకూని చితకబాది పోలీసులకు అప్పగించారు.In Agra, Uttar Pradesh, a man identified as Rinku threw his 11-month-old daughter into the Yamuna River. He was about to throw his wife in as well when onlookers confronted him and rescued her. Efforts are being made to rescue the body of the infant. https://t.co/b5RxupqjU1— Piyush Rai (@Benarasiyaa) August 14, 2026ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్‌కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియోఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలుసంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడైన రింకును అదుపులోకి తీసుకున్నారు. పాప ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను పిలిపించారు, కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. నిందితుడు రింకుపై హత్య కేసు నమోదు చేసినట్లు డీసీపీ సిటీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు. పాపను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిగిందని భార్య లక్ష్మి పోలీసులకు తెలిపింది. భర్తకు తనపై అనుమానంతో తరచూ గొడవపడేవాడని, దీంతో తాను ఆరు నెలల పాటు తన పుట్టింట్లో ఉండిపోయానని చెప్పింది. కూతురి విషయంలో తరచూ తనతో గొడవపడేవాడని లక్ష్మి వాపోయింది. అయితే ఈ మధ్య కాలంలో చిన్నారిపై ప్రేమానురాగాలుచూపుతున్నట్లు నటిస్తూనే ఈ దురాగతానికి పాల్పడ్డాడని ఆమె కన్నీరు పెట్టుకుంది.ఇదీ చదవండి: రూ. 11.5 కోట్ల ఆస్తి, 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్లాన్సా? నెట్టింట ఒకటే చర్చ -
ఎవరిని కాపాడటం కోసం చూస్తున్నారు! ఏపీ ప్రభుత్వం పై ప్రియాంక తండ్రి సంచలన కామెంట్స్
-
ఆస్తి దాహం.. కొడుకు చేసిన పని వైరల్
ఆస్తి కోసం బంధాలను మరిచిపోయిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. మంచాన పడ్డ తండ్రికి వైద్యం చేయిస్తానంటూ అందరినీ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. ఆపై ప్రాణం పోయాక.. ఛీ కొట్టే పనికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో వైరల్ అవుతోంది. యూపీ లక్నోలోని ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు మహేంద్ర, కోడలు లక్ష్మి ఛత్రపాల్‌ను వేధించసాగారు. దీంతో ఆయన తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగించారు. ఈ క్రమంలో.. ఓరోజు తన ఆస్తిని కూతుళ్లకు సమానంగా పంచుతున్నానని, కొడుకు-కోడలును బహిష్కరిస్తున్నట్లు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామంతో మహేంద్ర, అతని భార్య రగిలిపోయారు. అయితే జులై 7న ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో మహేంద్రకు అతని సోదరి సమాచారం ఇచ్చింది. దీంతో మహేంద్ర తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి, వైద్యం చేయిస్తానంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ రెండు రోజులకే అంటే జులై 9న ఛత్రపాల్ మృతి చెందారు.తండ్రి అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్న కుమార్తెలకు మరో షాక్ ఎదురైంది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మహేంద్ర తన మృత తండ్రి బొటనవేలిని ఖాళీ కాగితాలపై ముద్రిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పత్రాలపై తీసుకున్న వేలిముద్రలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకుంటారోనని అనుమానం వ్యక్తం చేశారు.ఆపై ఊహించిందే జరిగింది. ఆస్తంతా తనదేనంటూ గొడవకు దిగాడు మహేంద్ర. దీంతో ఛత్రపాల్ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి శవంతో ఖాళీ పేపర్లపై వేలిముద్ర వేయించుకున్న దృశ్యాల్ని పోలీసులకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
కొడుకుని క్రికెటర్ చేయాలని తండ్రి కిడ్నీ దానం
హైదరాబాద్, లక్డీకాపూల్: 16 ఏళ్ల వర్ధమాన క్రికెటర్‌కు అతని తండ్రి మూత్రపిండాన్ని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఈ వివరాలు గురువారం యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున వెల్లడించారు. మలక్‌పేటకు చెందిన బాలుడు చిన్నప్పటినుంచీ విరాట్ కోహ్లీని ఆరాధిస్తూ బౌలర్‌గా రాణిస్తున్నాడు. అయితే పుట్టుకతోనే మూత్రనాళ సమస్యతో బాధపడుతున్నాడు. ’ప్రీ–ఎంటివ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’ చేయాలని ఏఐఎన్‌యూ వైద్యులు సూచించారు. బాలుడి తండ్రి ఖాజా అసీముద్దీన్ తన ఒక మూత్రపిండాన్ని కుమారుడికి దానం చేయాలని నిర్ణయించారు. డాక్టర్ మల్లికార్జున నేతృత్వంలో శస్త్రచికిత్స నిర్వహించారు. -
నా కూతురిని చంపిన వాడికి సహాయం చేస్తే.. చంద్రబాబు గుర్తుపెట్టుకో.. ప్రియాంక తండ్రి స్ట్రాంగ్ వార్నింగ్
-
నలుగురి పిల్లలను ఒంటరిగా పెంచాడు.. చివరికి..
భోపాల్: నలుగురు పిల్లల చేతులు పట్టుకుని నడిపించాడు. వారి జీవితాల్ని తీర్చిదిద్దాడు. కానీ ఆ తండ్రి మరణించినప్పుడు.. చివరి చూపు కోసం కూడా ఎవరూ రాలేదు. భార్య చనిపోయిన తర్వాత నలుగురు పిల్లలను కంటికి రెప్పలా పెంచిన 70 ఏళ్ల ఘనశ్యామ్.. చివరకు అనారోగ్యంతో వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. ఘనశ్యామ్ పెద్దగా ఆస్తిపాస్తులు వదిలి వెళ్లలేదు. ఇండోర్‌లో చిన్న సైకిల్ టైర్లు, ట్యూబుల వ్యాపారం చేసేవారు. ఒక చిన్న ఇల్లు ఉండేది. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. నలుగురు పిల్లలను కష్టపడి పెంచారు. పిల్లలు చిన్నవయసులోనే ఆయన భార్య మరణించింది.జీవితంలోని చివరి నాలుగేళ్లను ఆయన భోపాల్‌లోని ఓ వృద్ధాశ్రమంలో గడిపారు. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆదరణకు దూరంగా ఉన్న ఆయన 70 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి పిల్లలు వస్తారేమోనని అధికారులు రెండు రోజుల పాటు ఎదురుచూశారు. కానీ ఒక్కరూ రాలేదు. ఘనశ్యామ్ ఆగస్టు 4న మరణించారు.వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించడమే కాకుండా.. భోపాల్‌కు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనాలని పలుమార్లు కోరారు. అయితే వారు రకరకాల కారణాలు చెప్పారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించి.. మరణ ధ్రువీకరణ పత్రాన్ని తమకు పంపించాలని కుటుంబ సభ్యులు చెప్పారు. తాము ఘనశ్యామ్జీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆయన కుటుంబానికి ఇచ్చేది లేదని మాధురి మిశ్రా తేల్చి చెప్పారు. ఆయన బతికున్నప్పుడు చూడటానికి రాలేదు. ఆయన చనిపోయినప్పుడు కూడా రాలేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని వారికి ఎందుకు ఇవ్వాలంటూ మిశ్రా ప్రశ్నించారు.‘‘మేము ఒకసారి ఘనశ్యామ్ ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా ‘నాకు ఆయన ఎవరో తెలియదు. నేను ఆయనను వదిలేశాను. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ కుమారుడు సమాధానం ఇచ్చాడు. వారి తండ్రి ఇంటి నుంచి వచ్చిన డబ్బును అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు పంచుకున్నారని.. ఇక తమ తండ్రితో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారంటూ మిశ్రా పేర్కొన్నారు. అప్పటికే ఘన శ్యామ్ పాక్షిక పక్షవాతంతో బాధపడుతున్నారు. మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేవారు. నడవడం కూడా చాలా కష్టంగా ఉండేదన్నారు. -
‘నా పిల్లలు ఇలాంటి తల్లితో పెరగకూడదు’.. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన తండ్రి
సాక్షి, బెంగళూరు: నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. వారి తండ్రి తీవ్ర గాయాలతో కనిపించాడు.పోలీసుల వివరాల ప్రకారం.. 40 ఏళ్ల ఎస్జీ ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హోటల్‌కు వచ్చాడు. ఆ తర్వాత గదిలో చిన్నారులు మృతి చెందగా.. ఇమ్రాన్ బాత్రూమ్లో రక్తపు మడుగులో పడి కనిపించాడు. అతని మెడపై కత్తితో కోసుకున్న గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన చిన్నారుల వయస్సు 10, 5 సంవత్సరాలుగా గుర్తించారు. తండ్రి నుంచి కొద్ది దూరంలోనే మంచంపై వారి మృతదేహాలు కనిపించాయి.హోటల్ సిబ్బంది సమాచారం అందించడంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఇమ్రాన్‌ను బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడిని బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.భార్యపై అనుమానమే కారణమా?ప్రాథమిక దర్యాప్తులో ఇమ్రాన్ తన భార్యపై అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని భావించినట్లు వెల్లడించారు. ‘నాపిల్లలు ఇలాంటి తల్లితో పెరగకూడదని అనుకున్నాను. అందుకే వారిని చంపి, నేను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాను’ అని ఇమ్రాన్ చెప్పినట్లు సమాచారం.గదిలోకి వెళ్లిన సిబ్బందికి షాక్డీసీపీ జీకే మిథున్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హోటల్లో ముందురోజు సాయంత్రం చెక్ఇన్ చేశాడు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో శుభ్రం చేసే సిబ్బంది గది తలుపు తట్టినా స్పందన రాలేదు. దీంతో వారు తలుపు తెరిచి చూడగా.. ఇద్దరు చిన్నారులు మంచంపై మృతిచెంది కనిపించారు. తండ్రి కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన స్థితిలో ఉన్నాడు అని పోలీసులు తెలిపారు.చిన్నారులను తానే చంపినట్లు అంగీకారంఇమ్రాన్ తన కుమార్తెలను తానే చంపినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అతడు స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అతడు నాగవార ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించాం’అని స్థానిక పోలీసులు వెల్లడించారు. -
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్‌ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
-
ఈ కేసులో రాజకీయ హస్తం ఉంది..!? ప్రియాంక తండ్రి సంచలన వ్యాఖ్యలు
-
నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది..! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రియాంక తండ్రి ఫైర్
-
నా బిడ్డ గురించి సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం
-
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు సర్కార్‌పై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల అన్యాయమైపోతే మహిళా హోంమంత్రి మనసు కరగలేదా? అంటూ ప్రియాంక తండ్రి మండిపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని మా పాపను చదివించుకున్నాం. మా పాపను బతికించుకోవాలనే తపనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. మా కడుపుకోత లోకేష్‌కు అర్థం కావడం లేదా?’’ అంటూ ప్రియాంక తండ్రి నిలదీశారు.‘‘ఆడపిల్లను చంపేసి హాయిగా తిరగొచ్చా.. మీ చట్టాలు సరిగా పనిచేస్తున్నాయా?. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కనీసం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పట్టించుకోలేదు. ప్రతినెల హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి గాని, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు. నా బిడ్డ అవయవదానం చేసే ఆలోచన లేదు. బతికించుకునే ప్రయత్నమే చేస్తున్నాం’’ అని ప్రియాంక తండ్రి పేర్కొన్నారు.కాగా, రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. -
కంటిరెప్పే కాటేసింది!
సనత్‌నగర్ (హైదరాబాద్): సొంత కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడిన తండ్రిపై సనత్‌నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న భార్యాభర్తలకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి (45) హౌస్ కీపింగ్ పనులు చేస్తుండేవాడు. మద్యం తాగే అలవాటున్న తండ్రి రోజూ ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో ఘర్షణ పడుతుండేవాడు.ఈ క్రమంలో తన రెండో కుమార్తెపై కన్నేసిన నిందితుడు.. భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు పరువు పోతుందనే భయంతో నోరు విప్పలేదు. ఇటీవల రోజూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య, పిల్లలపై దాడి చేయడం, దుర్భాషలాడుతుండడాన్ని భరించలేని రెండో కుమార్తె (16) గురువారం సాయంత్రం సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి తనపై చేసిన అకృత్యాలను బయటపెట్టింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. -
నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసి ఆపై డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన పూర్ణ.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తన తండ్రి చనిపోయి తొమ్మిదేళ్లు అయిన సందర్భంగా ఆయనని మరోసారి గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది. ఆయనని ఎప్పటికీ మర్చిపోలేమని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా)'ప్రియమైన ఉప్పా(నాన్న) ఈ లోకాన్ని విడిచి అల్లా సన్నిధికి చేరి తొమ్మిదేళ్లు గడిచినా, ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యుల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఆయనని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించకపోయినా, ఆయన ప్రేమ, దయ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చూసుకునే స్వభావం గురించి ఎన్నో కథలు విన్నాను. అవి విన్న ప్రతిసారీ ఆయనని ఒకసారి అయినా కలిసుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది'నా రెండో బిడ్డ కళ్లలో ఆయన ప్రతిబింబాన్ని చూస్తున్నా. అల్లా మా కుటుంబానికి ఆయన జ్ఞాపకాన్ని గుర్తుచేసే అందమైన వరంగా ఈ బిడ్డని ప్రసాదించాడనిపిస్తోంది. ఆయన ప్రేమ, ఆశీర్వాదం ఇప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఉప్పా(నాన్న) అల్లా దగ్గరకు చేరి తొమ్మిదేళ్లు అయినప్పటికీ, ఉమ్మాకు(అమ్మ) మాత్రం అది నిన్న జరిగినట్లే అనిపిస్తోంది. కాలం గడిచినా ఆయన లేని లోటు, ఆయనపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ ఆయనని తలుచుకుంటూనే ఉన్నాం. ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎప్పటికీ మరచిపోలేము' అని పూర్ణ ఎమోషనల్ అయింది.పూర్ణ ఫ్యామిలీ విషయానికొస్తే.. కేరళకు చెందిన ఈమె దుబాయిలో ఉండే షనీద్ అసిఫ్ అలీ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. చివరగా ఈమె గతేడాది డిసెంబరులో రిలీజైన 'అఖండ 2' మూవీలో కనిపించింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
తండ్రికి ఆన్లైన్లో అంత్యక్రియలు.. కూతుళ్లూ భలే 'అప్డేట్' అవుతున్నారుగా!
హర్యానా: ఓ తండ్రి తన జీవితాన్ని అంకితం చేసి ముగ్గురు కుమార్తెలను పెంచి, ఉన్నత విద్య అందించి, వివాహాలు చేశారు. అయితే ఆయన మరణించినప్పుడు కడసారి చూసేందుకు కుమార్తెలు రాకపోవడం, అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా వీక్షించడం హర్యానాలోని సోనిపట్‌లో చర్చనీయాంశమైంది.వృద్ధాశ్రమ నిర్వాహకుల కథనం ప్రకారం, కుమార్తెలు రూ.5,100 పంపించి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘోరం చూసిన నెటిజన్లు.. ‘కంటే కూతుళ్లను కనమని అంటారా’ అంటూ సదరు కుమార్తెలపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దహన సంస్కారాలు జరుగుతుండగా, వీడియో కాల్లో ముగ్గురు కుమార్తెలు వీక్షిస్తున్న దృశ్యాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి.వీడియో కాల్‌లోనే చివరి వీడ్కోలుదహన సంస్కారాలు జరుగుతుండగా ముగ్గురు కుమార్తెలు వీడియో కాల్ ద్వారా వీక్షిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైకి చెందిన వస్త్ర వ్యాపారి శివచరణ్ రామ్ రతన్ గుప్తాకు భార్య మీనా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వివాహాల అనంతరం వారు నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైల్లో స్థిరపడ్డారు. వారిలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.రెండేళ్ల క్రితం రతన్ గుప్తా దంపతులు హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో చేరారు. కొంతకాలం క్రితం ఆయన భార్య మీనా మృతి చెందారు. అనంతరం దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ గుప్తా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణించిన విషయం వృద్ధాశ్రమ నిర్వాహకులు ముగ్గురు కుమార్తెలకు తెలియజేశారు.అంత్యక్రియలకు రాలేమన్న కుమార్తెలుసోనిపట్కు రావడం సాధ్యం కాదని కుమార్తెలు ఆశ్రమ నిర్వాహకులకు చెప్పారు. దీంతో వృద్ధాశ్రమ సిబ్బంది, స్థానికులు కలిసి రతన్ గుప్తా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కుమార్తెలు వీడియో కాల్ ద్వారా వీక్షించారు. ఆశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ ప్రకారం, రతన్ గుప్తా అక్కడ చేరినప్పటి నుంచి ప్రతిరోజూ తన కుమార్తెలతో ఫోన్లో మాట్లాడేవారు. అయితే ఆరోగ్యం క్షీణించిన తర్వాత వారి నుంచి ఫోన్ కాల్స్ తగ్గిపోయాయని చెప్పారు. మరణానికి సుమారు 20 రోజుల ముందే ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుమార్తెలకు సమాచారం ఇచ్చినా, వారు వచ్చి చూడలేదని ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.రూ.5,100 పంపిన పెద్ద కుమార్తెరతన్ గుప్తా మృతి తర్వాత మరోసారి సమాచారం అందించి, ఆశ్రమానికి వస్తే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సిబ్బంది సూచించారు. అయితే తాము రావడం కుదరదని కుమార్తెలు చెప్పినట్లు ఆనంద్ కుమార్ వివరించారు. నేపాల్‌లో నివసిస్తున్న పెద్ద కుమార్తె అనిత యూపీఐ ద్వారా రూ.5,100 పంపించి, తండ్రి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమం పూర్తయ్యాక వీడియోలను పంపించాలని కూడా అభ్యర్థించారు. వైరల్ అవుతున్న వీడియోల్లో ఒక కుమార్తె “ఇంకెంత సమయం పడుతుంది? మేము స్నానం చేసి భోజనం చేయాలి” అని మాట్లాడినట్లు వినిపిస్తుండటంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కుమార్తెల భవిష్యత్తు కోసం శ్రమించిన తండ్రిరతన్ గుప్తా తన ముగ్గురు కుమార్తెల చదువు, భవిష్యత్తు కోసం జీవితమంతా శ్రమించారని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. వారికి ఉన్నత విద్య అందించి, మంచి స్థాయికి చేరుకోవడం పట్ల ఎంతో గర్వపడేవారని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, ముగ్గురూ వివాహం చేసుకుని తమ తమ కుటుంబాలతో జీవిస్తున్నారు. మరణానంతరం తొలుత అస్థికలను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే అనంతరం సోనిపట్‌కు వచ్చే అవకాశం లేదని చెబుతూ, వాటిని గంగానదిలో నిమజ్జనం చేయాలని ఆశ్రమ నిర్వాహకులను కోరినట్లు సమాచారం.మరణానంతరం కూడా ఇద్దరికి చూపురతన్ గుప్తా మరణానికి ముందు తన కళ్లను దానం చేయాలని ఆకాంక్షించినట్లు ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు. ఆయన కోరిక మేరకు కంటి దానం చేయడంతో మరణానంతరం కూడా ఇద్దరికి చూపు అందే అవకాశం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై రతన్ గుప్తా కుమార్తెల స్పందన ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు ఆశ్రమ నిర్వాహకుల కథనం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగానే ఉన్నాయి. -
‘నాన్న జ్ఞాపకం’ చోరీ.. తెచ్చిస్తే రూ. 5 లక్షలు, ఉద్యోగం!
కొచ్చి: కేరళలోని కొచ్చికి చెందిన 80 ఏళ్ల ఎంబీ ప్రకాశన్ తన తండ్రి జ్ఞాపకంగా మిగిలిన 1957 మోడల్ రాలే హంబర్ సైకిల్ చోరీకి గురికావడంతో తీవ్ర వేదనకు గురయ్యారు. కలమస్సేరికి చెందిన ప్రకాశన్‌కు ఈ సైకిల్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. సుమారు 70 ఏళ్ల క్రితం కలకత్తా లాటరీలో వచ్చిన బహుమతి మొత్తంతో ఆయన తండ్రి ఎంఆర్ బాలకృష్ణన్ ఎర్నాకులంలో ఈ సైకిల్‌ను కొనుగోలు చేశారు. 2003లో తండ్రి మరణించారు. ఆ సైకిల్‌ను ప్రకాశన్ ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు.జూలై 22న ఎడపప్పల్లి టోల్ జంక్షన్ సమీపంలో ఇన్సూరెన్స్ పత్రాలు జారీ చేసే సమయంలో కీని సైకిల్‌కే వదిలివేయడంతో గుర్తుతెలియని వ్యక్తులు సైకిల్‌ను అపహరించారు. తండ్రి 23వ వర్ధంతికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ ఘటన జరగడంతో ప్రకాశన్ తీవ్రంగా కుంగిపోయారు. ‘ఇది నాకు కేవలం ఒక సైకిల్ కాదు, నా తండ్రి జ్ఞాపకం. దానిని పోగొట్టకుని నేను నా తండ్రిని రెండోసారి కోల్పోయాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై కలమస్సేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన తెలిసిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ ఈ సైకిల్‌ను సురక్షితంగా తిరిగి తెచ్చిచ్చిన వారికి ఐదు లక్షల రూపాయల నజరానా ప్రకటించడంతో పాటు, దొంగిలించిన వ్యక్తికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. కాగా పాఠశాల విద్యార్థులు, స్థానికులు కూడా ఈ సైకిల్ ఆచూకీ కోసం స్వచ్ఛందంగా గాలిస్తుండటం విశేషం. సైకిల్‌ను తిరిగి ఇచ్చేస్తే తాను ఎలాంటి పోలీసు కేసులు పెట్టబోనని, ఫిర్యాదును ఉపసంహరించుకుంటానని ప్రకాశన్ తెలిపారు.ఇది కూడా చదవండి: జంక్ ఫుడ్ మాన్పించేందుకు డాడీ ‘అల్ట్రాసౌండ్’ ఐడియా! -
తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డ బిడ్డలు!
కన్నతండ్రి చివరి ప్రయాణానికి కూడా ఆస్తి లెక్కలు అడ్డుగా నిలిచాయి. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన ఓ తండ్రి మృతదేహం.. వారసుల మధ్య వివాదానికి సాక్షిగా మారింది. ఆస్తి పంపకాలపై పేచీ తేలేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ కొడుకులు పట్టుబట్టడంతో.. సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజంలో బంధాల విలువపై తీవ్ర చర్చకు దారితీసింది.సాక్షి, సూర్యాపేట: అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుడిగ భద్రయ్య మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదం అడ్డుగా మారింది. ఆస్తి పంపకాల విషయంలో స్పష్టత వచ్చే వరకు తండ్రి అంత్యక్రియలు జరగనివ్వబోమని కన్నబిడ్డలు పట్టుబట్టారు.చివరి వీడ్కోలుకూ వారసత్వ వివాదం అడ్డంసాధారణంగా తల్లిదండ్రుల చివరి చూపు కోసం కుటుంబం మొత్తం ఒక్కటవుతుంది. కన్నీళ్లతో వీడ్కోలు పలకాల్సిన సమయంలో.. ఇక్కడ మాత్రం ఆస్తి తగాదా తెరపైకి వచ్చింది. తండ్రి మృతదేహం ముందు కూడా వివాదం పరిష్కారం కాకపోవడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.పురుగుల మందు డబ్బాలతో.. వివాదం తీవ్రరూపం దాల్చడంతో కొందరు వారసులు పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడతామని బెదిరించారు. దీంతో ఆ విషాద వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. పంచాయితీ పెద్దలు, బంధువులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.బంధాల కంటే ఆస్తే ముఖ్యమా?జీవితమంతా పిల్లల భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులకు చివరి దశలో కూడా ప్రశాంతత దక్కకపోవడం విషాదకరం. ఆస్తులు, ఆస్తి పంపకాల కోసం బంధాలు బలహీనపడుతున్నాయా? అనే ప్రశ్నను ఈ ఘటన మరోసారి తెరపైకి తెచ్చింది. తండ్రి అంతిమ సంస్కారాలు సైతం వివాదానికి వేదికగా మారడం స్థానికుల్లో ఆవేదన కలిగించింది. -
రూ. 40 లక్షల ఎదురు కట్నం కావాలంటూ, కూతురిపైనే తండ్రి దాడి
కర్ణాటకలోని బెంగళూరులో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి, వివాహం, డబ్బు విషయంలో విభేదాలతో ఓ తండ్రి తన కూతురిని అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కర్కశంగా వ్యవహరించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది లక్ష్మీ దుర్గ. ఆమె తండ్రి నాగేంద్ర క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. ఇటీవల నాగేంద్ర తన కుమార్తె పెళ్లి కోసం ఒక సంబంధం ఖాయం చేశాడు. అయితే, కూతురి చదువు, కెరీర్ కోసం తాను భారీగా ఖర్చు చేశాననే నెపంతో వరుడి కుటుంబం నుండి రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడు.అంతేకాదు లక్ష్మీ దుర్గ ప్రతి నెలా వచ్చే తన జీతం మొత్తాన్ని తనకే ఇవ్వాలని నాగేంద్ర ఒత్తిడి తెచ్చేవాడు. దీన్ని నాగేంద్ర భార్య, కుమార్తె లక్ష్మీ దుర్గ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు పెళ్లివారిని రూ. 40 లక్షలు ఎదురు కట్నం డిమాండ్ చేశాడు. దీన్ని లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె మీద పగబట్టాడు. జూలై25 న కన్నకూతురిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇదీ చదవండి: చిన్నప్పటి ఆసక్తే .. రూ. 96 లక్షల ప్రైజ్ తెచ్చిపెట్టింది!కుమార్తెను కలిసే నెపంతో కాలేజిలోని హెచ్ఓడి (HOD) ఛాంబర్లో ఉన్న లక్ష్మీ దుర్గ వద్దకు వెళ్లిన నాగేంద్ర, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపు, ఛాతీ, మెడలో తీవ్రంగా పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ దుర్గ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దాడికి కుటుంబంలో దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలుఇదీ చదవండి: 144 ఏళ్ల క్రితం దుబాయ్ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా? -
వైరల్ అవుతున్న తండ్రి–కూతురు బంధం..
అదొక పెళ్లి సందడి.. అతిథులు, బంధువుల హడావుడితో హాలంతా నిండిపోయింది. పెళ్లికూతురిలా షనాన్ లూయిస్ ముస్తాబవుతోంది. అమెరికాలో పెళ్లికూతురుగా ముస్తాబయిన అమ్మాయిలను మొదటిసారి వాళ్ల నాన్నలే చూసి మురిసిపోతారు. ఈ పద్ధతిని అక్కడ ఫస్ట్ లుక్ అని పిలుస్తారు.పక్క రూమ్‌లో లూయిస్ వాళ్ల నాన్న గ్యారీ మెక్అఫే కూడా ఎప్పుడెప్పుడు కూతురు తన ముందుకొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. అలంకరణ పూర్తయిన తర్వాత లూయిస్ తన తల్లితో పాటు గ్యారీ వద్దకు వచ్చింది. తండ్రి చేతులను తీసుకుని తన వెడ్డింగ్ గౌనును స్పృశింపజేసి డిజైన్ ఎలా ఉందని అడిగింది. గ్యారీకి మాటల్లేవు. తర్వాత లూయిస్ శిరోజాలను, తన ఆభరణాలను తాకుతూ బాగుందని గ్యారీ చెబుతుండగా, లూయిస్ ‘మీ పెళ్లికి అమ్మ వేసుకున్న గౌన్ డిజైన్‌లానే నా గౌన్ని కూడా డిజైన్ చేయించా నాన్న’ అంటూ చెప్పింది.మరి చెప్పాలి కదా.. కన్నరోజు నుంచి కంటిరెప్పలా కాపాడుకుంటున్న ఆ తండ్రికిప్పుడు చూపు లేదు మరి..! లూయిస్ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో గ్యారీ ప్రమాదవశాత్తు చూపు కోల్పోయాడు. పోయింది చూపే కానీ ప్రేమ కాదు కదా! అందుకే. తన చేతుల్లో పెరిగిన బిడ్డను కళ్లారా చూడలేకపోయినా మనసారా స్పృశిస్తూ కళ్లనిండా ఆనంద బాష్పాలు నింపుకున్నాడు ఆ తండ్రి. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించిన ఈ చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది. -
ఫ్యామిలీ స్టార్స్
సూపర్ పవర్స్ లేని సూపర్ హీరో నాన్న. అయినా కుటుంబం కోసం సూపర్ కష్టాలను తట్టుకుని మరీ కుటుంబ సంక్షేమం కోసం తపన పడతాడు... ఒక్కోసారి తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తాడు. బాధ్యతలనే ఇష్టంగా చేసుకుంటాడు. కుమారుడు, కుమార్తెల సంతోషమే తన ఆస్తిగా ఫీలవుతాడు. అందుకే ప్రతి కుటుంబానికి నాన్నే ఫ్యామిలీ స్టార్. ఇలా తండ్రి ఎమోషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే... ఫాదర్ ఎమోషన్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ జానర్లో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నేడు (ఆదివారం) నేషనల్ పేరెంట్స్ డే. ఈ సందర్భంగా తండ్రి ఎమోషన్‌తో రానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేయండి.గ్యాంగ్‌స్టర్ నాన్న కూతురు సంరక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ తండ్రి కథ వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషనే అని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట.కొన్ని సీన్స్‌లో చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలోని కొంత భాగం గోదావరి నేపథ్యంలో, మరికొంత భాగం కోల్‌కతా నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల పాత్రలో చిరంజీవి, మలయాళ నటి అనశ్వర రాజన్ నటిస్తున్నారని టాక్. నివేతా పేతురాజ్ మరో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి భార్యగా నివేతా పేతురాజ్ కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో చిత్రయూనిట్ షూటింగ్ చేస్తోందని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటు క్లాస్... అటు మాస్ సమాజంలో వారిది ‘ఆదర్శ కుటుంబం’. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, ఈ కుటుంబం పెద్ద అయిన తండ్రి గన్ పడతాడు? తన కుటుంబ సభ్యుల చేత ఫైట్ చేయిస్తాడు. ఈ మాస్ ఫాదర్ డీటైల్స్ ఏంటో తెలుసుకోవాలంటే అక్టోబరు 2 వరకు ఆగాల్సిందే. వెంకటేశ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47’ (ఏకే 47). ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఫాదర్ రోల్ చేస్తున్నారు వెంకటేశ్. అలాగే వెంకటేశ్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. క్లాస్‌గా ఉంటూనే తన కుటుంబం ఆపదలో ఉందంటే మాత్రం ఫైర్ అయి పోయే మాస్ ఫాదర్ రోల్ చేస్తున్నారట వెంకటేశ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ ఫిల్మ్స్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం.కూతురు కోసం... రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ తండ్రి పాత్రలో నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్ నటించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది. ఏదో మానసిక బాధలో ఉన్న తండ్రిని మందు మానేయమని కూతురు రిక్వెస్ట్ చేయడం, కుమార్తె కోసం ఆ తండ్రి తనను తాను మార్చుకోవాలనుకోవడం, ఆ కుమార్తె రక్షణ కోసం తన ప్రాణాలనైనా లెక్క చేయని తండ్రి సాహసం... వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘ఇరుముడి’ సినిమా కథనం సాగుతుందని టాక్. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. తండ్రి ఆదేశం తన తండ్రి లక్ష్యం కోసం రుద్ర ఓ సాహసోపేతమైన ప్రయాణం మొదలుపెట్టాడు. కాలానికి అతీతంగా ఖండాల మధ్య ప్రయాణం చేస్తున్నాడు. మరి... రుద్రకు అతని తండ్రి అప్పగించిన మిషన్ ఏంటి? తండ్రి కోసం రుద్ర ఏం చేశాడు? అన్న అంశాల నేపథ్యంలోనే ‘వారణాసి’ సినిమా కథనం రూపొందుతోందనే ప్రచారం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంక చో్ర పా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, అడ్వెంచరస్ అంశాలు ఉన్నప్పటికీ ‘వారణాసి’ ప్రధాన కథాంశం తండ్రీ కొడుకుల అనుబంధమే అని ఇటీవల పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు రాజమౌళి. దీంతో ‘వారణాసి’ సినిమా కథపై విభిన్న ప్రచారాలు తెరపైకి వచ్చాయి. పైన పేర్కొన్న కథాంశం కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు...ఈ చిత్రంలో మహేశ్‌బాబు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారని భోగట్టా. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు పాల్గొంటుండగా కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.ఓ తండ్రి... ఇద్దరు కొడుకులు ఓ తండ్రి తన ఇద్దరు కొడుకుల కోసం ఎలాంటి త్యాగం చేశాడు? ఈ ఇద్దరు కొడుకులకు, తండ్రికి మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? అనే అంశాల ఆధారంగా ‘రాకా’ సినిమా తెరకెక్కుతోందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ తండ్రీ కొడుకుల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని సమాచారం. అంతే కాదండోయ్..‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ చేస్తున్న మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్ విలన్ అని టాక్. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ‘రాకా’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మేజర్‌గా ఈ సెట్స్‌లోనే ఈ సినిమాను షూట్ చేస్తున్నారు అట్లీ అండ్ టీమ్. కాగా, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో భాగంగా ఆస్ట్రియాలో ఉన్నారు అల్లు అర్జున్. ఈ వెకేషన్ పూర్తి కాగానే, ముంబై చేరుకుని ‘రాకా’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందట. ఎందుకంటే... ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించారు దర్శకుడు అట్లీ. అందుకోసం చాలా వీఎఫ్ఎక్స్ పనులు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే ‘రాకా’ సినిమా విడుదల వచ్చే ఏడాది ఉంటుంది. నటీమణులు దీపికా పదుకోన్, ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవాల్ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ఈ సినిమాలో భాగమయ్యారని బాలీవుడ్ సమాచారం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి హీరో... కొడుకు విలన్? ఏ తండ్రికైనా తన కొడుకే హీరో. కానీ ఓ తండ్రి పాలిట ఓ కొడుకు విలన్ అయ్యాడు. మరి... ఈ తండ్రీ కొడుకుల కహానీ ఏంటి? కొడుకు తనపై పెంచుకున్న ద్వేషాన్ని ప్రేమగా మార్చేందుకు ఓ తండ్రి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు? అన్న అంశాలతో ‘టాక్సిక్’ సినిమా రూపొందుతోందని సమాచారం. యశ్ ద్వి పాత్రాభినయం చేసిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్) చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అండ్ అప్స్’. గోవా నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రాయ, టాక్సిక్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు యశ్.‘టాక్సిక్’ కథనం తండ్రీ కొడుకుల ప్రతీకారం, అనుబంధం నేపథ్యంలో సాగుతుందని, 1940–1970 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రధానాంశం తండ్రిపై కొడుకు ప్రతీకారమే అయినా, క్లైమాక్స్‌లో వీరిద్దరూ కలిసి మెయిన్ విలన్‌ను ఓ ఆటాడిస్తారట. మరి... ఈ సినిమా కథనం ఇలానే సాగుతుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం ఆగస్టు 26 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.ఇక ఈ చిత్రంలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కా రోల్లో తారా సుతారియా, మెలిస్సాగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో కలిసి ఈ సినిమాకు కథ అందించారు యశ్. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను నిర్మించారు. సంజయ్ విశ్వనాథ్ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టైటిల్లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఉండటం, ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య నటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ కూడా ఈ చిత్రంలో సూర్య చేసినది ఫాదర్ రోల్ అని స్పష్టం చేస్తున్నాయి. మరి... సంజయ్ విశ్వనాథ్‌గా తండ్రి పాత్రలో సూర్య ఎలా నటించారు? ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ బాండింగ్స్ ఏంటి? అన్న అంశాలు తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించగా, హీరోయిన్గా మమితా బైజు నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు.⇒ కార్తీ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఈ సినిమాలో ఢిల్లీ పాత్రలో కార్తీ అద్భుతమైన నటన కనబరచారు. పదేళ్ల పాటు జైలు జీవితం గడిపి, తన కుమార్తె అముదను కలసుకునేందుకు ఢిల్లీ తిరిగి వస్తాడు. మరి... ఈ తండ్రీకూతుళ్ల కథ ఏంటి? ఢిల్లీ భార్యకు ఏం జరిగింది? డ్రగ్స్ మాఫియా నుంచి అముదకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఢిల్లీ ఏ విధంగా అడ్డుకుంటాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘ఖైదీ 2’ చిత్రంలో చూడాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఏఆర్ ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ ‘ఖైదీ 2’ కూడా రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేసే పనిలో ఉన్నారు లోకేష్. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణను షురూ చేస్తారు కార్తీ, లోకేష్.⇒ మదర్ సెంటిమెంట్‌తో ‘బిచ్చగాడు’ సినిమా తీసి, బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ ఆంటోనీ. తాజాగా ఆయన ఫాదర్ సెంటిమెంట్‌తో చేస్తున్న సినిమా ‘నాన్న కుట్టి’. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, చిత్ర లక్ష్మణన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ము. మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మిస్తుండగా, రామాంజనేయులు జవ్వాజీ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇలా తండ్రి భావోద్వేగాలతో కూడిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే తల్లి ఎమోషన్‌తో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ
తమను ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కన్నబిడ్డలు కృతజ్ఞతగా ఉండటం అనేది ఒక భావోద్వేగ అనుభూతి. అలా కన్నవారి పట్ల అమితమై ప్రేమానురాగాలు చూపించడం, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించేలా చేయడంతోపాటు వారి చిన్న చిన్న కలల్ని గుర్తు పెట్టుకుని మరీ నెరవేర్చే పిల్లలు చాలామందే ఉన్నారు. అలా తన తండ్రిని తొలిసారి 'వందే భారత్' రైలులో తీసుకెళ్లి ఆనందింప చేసిన వీడియో ఒకటినెట్టింట విశేషంగా నిలుస్తోంది.'భుక్కడ్ ముసాఫిర్' అనే ఇన్స్టాగ్రామ్ ఐడీ ఉన్న ఒక ట్రావెలర్, ఇన్ఫ్లుయెన్సర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ వృద్ధుడైన తండ్రి ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉండటం, రైలు ఎక్కి తన సీటులో కూర్చోవడం, రైలు కిటికీలోంచి అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ మురిసిపోవడం కనిపిస్తుంది. ఆయన ముఖంలోని నవ్వును చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా కనిపించారు. ఈ సందర్భంగా కుమారుడు మాట్లాడుతూ "ఒకప్పుడు మా నాన్న రూ. 5 ఆదా చేయడం కోసం ఆటో ఎక్కకుండా ఆఫీసుకు నడిచి వెళ్లేవారు. అందుకే ఇప్పుడు నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడానికి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నాను" అని ఆ కుమారుడు వీడియో కింద రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Bhukkhad Musafir | Shrikant & Noopur ❤️ (@bhukkhad_musafir) ఇదీ చదవండి: రూ. 5 లక్షల వెండి పాత్ర పొరపాటున చెత్తలో.. చివరికినెటిజన్ల స్పందనఈ వీడియో చూసి నెటిజన్లు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. నిజమైన ఆనందం ఇదే... పిల్లల బాధ్యతలు నెరవేర్చడంలో తమ సంతోషాలను త్యాగం చేసిన తల్లిదండ్రులకు తిరిగి ఆ సుఖసంతోషాలను అందించడం లోనే నిజమైన గెలుపు ఉంది వ్యాఖ్యానించారు. రైలు టికెట్ ధర ఎంతో తండ్రికి తెలిస్తే తిడతారేమో అని కొందరు సరదాగా కామెంట్ చేయడం విశేషం.ఇదీ చదవండి: రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలువందే భారత్, రైల్వే రాయితీలు ఉండవా?వందే భారత్ రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఎటువంటి టికెట్ రాయితీలు ఉండవు. కరోనా సమయంలో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే సాధారణ రాయితీలను కూడా రద్దు చేసింది. అయితే, ఐఆర్సిటిసి (IRCTC)లో క్యాన్సర్, థాలసేమియా, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు లేదా క్షయ (టిబి) వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న రోగులకు, అలాగే దివ్యాంగులకు 75శాతం వరకు టికెట్ రాయితీని అందిస్తోంది. కానీ, ఈ రాయితీలు వందే భారత్ రైళ్లకు వర్తించవు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
‘కంటే కూతుర్నే కనాలి’.. ఆస్పత్రిలో తండ్రి సందడి
ఝాన్సీ: కూతురు పుట్టిన వేళ.. ఒక తండ్రి చూపిన ప్రేమాభిమానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఒక ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తోంది. తన ఇంట్లోకి మహాలక్ష్మి లాంటి కూతురు వస్తే, ఆ వేడుకను కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా, ఆస్పత్రిలోని వారందరితో కలిసి పంచుకోవాలని ఆ తండ్రి ముందే మొక్కుకున్నాడు. అనుకున్నట్లే కూతురు జన్మించగానే, ఆనందంతో ఆస్పత్రి వార్డులో ఉన్న రోగులకు, మహిళలకు, సిబ్బందికి స్వయంగా మిఠాయిలు పంచిపెట్టాడు. అంతేకాకుండా, వారికి బట్టలు, ఇతర కానుకలను కూడా అందజేశాడు.ఆ తండ్రి చేస్తున్న ఈ వేడుకను చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. కూతురు పుడితే వివక్ష చూపే వారికి, ఈ తండ్రి ప్రవర్తన ఒక పాఠంలా నిలుస్తోంది. ప్రభుత్వం ‘బేటీ బచావో-బేటీ పఢావో’ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నా, సమాజంలో పూర్తిస్థాయిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్ల పుట్టడం అనేది అదృష్టమని, అది ఒక గొప్ప పండుగ అని చాటిచెప్పిన ఈ తండ్రి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది మనసులను గెలుచుకుంటోంది. ఇలాంటి ఆలోచన ప్రతి ఇంట్లో ఉండాలని, అప్పుడే సమాజంలో లింగ వివక్ష తగ్గుతుందని నెటిజన్లు అంటున్నారు. View this post on Instagram A post shared by Life Of Student 📚 (@_life.of.student_) -
ప్రధాని ఇందిర దిగివచ్చేలా.. వాంగ్‌చుక్ తండ్రి పోరాటం!
న్యూఢిల్లీ: 1984లో లడఖ్ ప్రజల రాజ్యాంగ గుర్తింపు, షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం సోనమ్ వాంగ్చూక్ తండ్రి సోనమ్ వాంగ్యాల్ చేపట్టిన నిరాహార దీక్షా ఉదంతం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వాంగ్యాల్ దీక్ష చేస్తున్న సమయాన, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా లేహ్ వెళ్లి ఆయనకు హామీ ఇచ్చారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత, ఇప్పుడు సోనమ్ వాంగ్చూక్ కూడా అదే బాటలో నిలిచారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాంగ్చూక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే సామాజిక బాధ్యతతో ఆయన ఈ నిరసనను కొనసాగిస్తున్నారు. లడఖ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వాంగ్చూక్, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. కాగా, 1984లో వాంగ్యాల్ డిమాండ్ చేసిన విధంగానే, 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం లడఖ్‌కు ఎస్టీ హోదా కల్పించింది. తండ్రి పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న వాంగ్చూక్, ప్రస్తుతం తన దీక్షతో సంచలనం సృష్టిస్తున్నారు.ఇది కూడా చదవండి: లిఫ్ట్‌లో శశిథరూర్ విలవిల.. -
మద్యం మత్తు.. తండ్రి చేతిలో తనయుడి హత్య
కోనేరు సెంటర్: మద్యం మత్తులో ఉన్న తండ్రీకొడుకులు గొడవ పడగా..ఆగ్రహంతో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బందరు మండలం బోట్లవానిపాలెంకు చెందిన బొల్లా రామ్మోహనరావు తాపీ పని, అతడి పెద్ద కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి (30) పెయింటింగ్ పని చేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం కళ్యాణ్‌కు గూడూరు మండలానికి చెందిన దుర్గాభవానితో వివాహం కాగా, తన భార్యతో పాటు అతడు తన అత్తవారి ఊర్లో ఉంటున్నాడు. మంగినపూడి బీచ్‌కి సమీపంలో పెయింటింగ్ పనులకు వచ్చిన కళ్యాణ్..రెండు రోజులుగా తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. గురువారం రాత్రి తండ్రీకొడుకులు మద్యం తాగారు. అనంతరం కళ్యాణ్ తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. ఓ దశలో తీవ్ర ఆగ్రహంతో తండ్రి రామ్మోహనరావు మంచంపై పడుకుని ఉన్న కళ్యాణ్ తలపై సరుగుడు బాదుతో బలంగా కొట్టగా తలకు గాయాలై కళ్యాణ్ స్పృహ కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో బంధువులు అతడిని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఆసుపత్రికి వచ్చి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుని భార్య దుర్గాభవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సియా గోయల్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
పూణే: కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కేసు దర్యాప్తుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ.. తమ కుటుంబాన్ని పదే పదే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన దుకాణంపై సోదాలపై ఆయన మాట్లాడుతూ.. జూలై 14వ తేదీ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి నమూనాలను సేకరించారని తెలిపారు.లైసెన్స్‌కు సంబంధించిన ఈ తనిఖీలు జరిగాయని.. ఇప్పటికే తాము కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.. మరో ఎనిమిది నుండి పది రోజుల్లో అది వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికారులు ఆదేశించిన ప్రకారం ప్రస్తుతానికి దుకాణాన్ని మూసి ఉంచామని.. అయితే దుకాణాన్ని సీజ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన కుమార్తె కేసు గురించి ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని తాము గౌరవిస్తామన్నారు.‘‘నా కుమార్తె చేసిన తప్పుకు మమ్మల్ని శిక్షిస్తున్నారు. ఒకవేళ ఆమె దోషిగా తేలితే ఆమెను ఉరితీయండి.. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను న్యాయవ్యవస్థకు, చట్టానికి కట్టుబడి ఉన్నాను. దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తాను. కానీ దయచేసి మమ్మల్ని శిక్షించకండి. మమ్మల్ని రోజురోజుకూ చంపేస్తున్నట్లు అనిపిస్తోంది. నేను తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నానని కన్నీటిపర్యంతమయ్యారు.కొందరు వ్యక్తులు కావాలనే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని.. తప్పు చేయకపోయినా తాము శిక్ష అనుభవిస్తున్నామని ఆయన వాపోయారు. పూణే మార్కెట్ యార్డ్‌లోని ప్రవీణ్ గోయల్‌కు చెందిన దుకాణంపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ.. జూలై 14న దాడులు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనల కింద రూ. 8.14 లక్షల విలువైన 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 18న లోనావాలా సమీపంలోని లోహగడ్ కోట ట్రెక్కింగ్ సమయంలో కేతన్ అగర్వాల్ మృతి చెందగా.. మొదట ప్రమాదంగా భావించారు. అయితే, సియా గోయల్, చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ ప్రకారం కేతన్‌ను కొండపై నుంచి నెట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.ట్రెక్కింగ్‌కు వెళ్లాలని సియా పదే పదే ఒత్తిడి చేయడం, బాలి పర్యటనకు ముందు కేతన్ పాస్‌పోర్ట్ అదృశ్యం కావడం.. వీరి వెంట హుడీ ధరించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీసీటీవీ విజువల్స్ లభించడంతో ఈ కేసులో కీలక ఆధారాలు లభించాయి. నిందితులిద్దరిపై హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసి పోలీస్ కస్టడీకి తరలించారు. -
రూ. 150 కోట్ల ఆస్తి, తండ్రిని కాల్చి చంపిన పెద్ద కొడుకు
ఆస్తి వివాదం ఒక తండ్రి ప్రాణాలు తీసింది. 32 ఏళ్ల కొడుకు తన తండ్రిని పిస్టల్‌తో కాల్చి చంపేశాడు. రూ. 150 కోట్ల ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన వివాదం ఈ విషాదానికి దారి తీసింది. ఘాజియాబాద్‌లోని మోదీనగర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుదానా గ్రామానికి చెందిన 52 ఏళ్ల హరిఓం చౌదరిగా గుర్తించారు. ఆయన ఆ ప్రాంతంలోనే అత్యంత సంపన్న రైతులలో ఒకరు.హరిఓం చౌదరికి మోదీనగర్‌లో 75 బిగాల భూమితో పాటు ఢిల్లీ-మీరట్ రోడ్డులో ఒక మార్కెట్ కూడా ఉంది. అలా ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ. 150 కోట్లు ఉంటుందని అంచనా.గొడవకు కారణంహరిఓం చౌదరి తన పెద్ద కుమారుడైన నిఖిల్‌కు ఇప్పటికే మార్కెట్లోని కొన్ని షాపులను, 25 బిగాల భూమిని ఇచ్చారు. అయితే, మిగిలిన భూమిని కూడా తన పేరు మీద రాయాలని నిఖిల్ గొడవ పడేవాడు. నిఖిల్‌కు మద్యపాన వ్యసనం ఉండటంతో, ఆస్తి ఇస్తే తాగుడుకు, జల్సాలకు తగలేస్తాడని తండ్రి నిరాకరించాడు. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య తరచూ వాగ్వాదం నడుస్తూ ఉండేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి హరిఓం చౌదరి తన భార్య అనిత, చిన్న కుమారుడు నీషుతో కలిసి భోజనాలుముగించాక, పెద్ద కుమారుడు నిఖిల్ మద్యం మత్తులో ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తాగి వచ్చినందుకు తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన నిఖిల్ తన వద్ద ఉన్న పిస్టల్ తీసి తండ్రిపై కాల్పులు జరిపాడు. మొదట ఒక బుల్లెట్ హరిఓం ముఖానికి తగలడంతో ఆయన కింద పడిపోయారు. ఆ తర్వాత నిందితుడు ఆయన ముఖం, ఛాతి, పొత్తికడుపు భాగాలపై మరికొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం ఆయుధంతో సహా ఘటనా స్థలం నుండి పరారయ్యాడు.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్గతంలోనూ ఇలాపోలీసుల ప్రాథమిక విచారణలో నిఖిల్‌కు తాగుడు విషయంలో తరచూ తల్లిదండ్రులతో గొడవలు జరిగేవి. అంతేకాకుండా, 2018లో కూడా ఒక గొడవ సందర్భంగా నిఖిల్ తన తమ్ముడు నీషుపై కాల్పులు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు ఆ పాత కేసును కూడా రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అతనిని అరెస్టు చేయడానికి పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశంఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్, మరో ఇద్దరు భారతీయ నిపుణులు -
తండ్రి కాదు కీచకుడు.. 22 ఏళ్ల చీకటి నిజం బట్టబయలు!
తండ్రి అంటే ఓ నీడలా కాపాడే వ్యక్తి.. కానీ అదే నీడ భయంగా మారితే? నమ్మకానికి ప్రతిరూపమైన బంధమే అనుమానంగా మారితే? ఒడిశాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. రక్షణ ఇవ్వాల్సిన తండ్రే తన జీవితంలో భయంకరమైన అధ్యాయంగా మారాడని ఆమె చేసిన ఫిర్యాదుతో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏళ్ల తరబడి సొంత కుమార్తెను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో 57 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడి వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక 22 ఏళ్ల వివాహిత కుమార్తె తీవ్ర నిర్ణయం తీసుకుంది. అత్తింట్లోనే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమెకు 75 శాతం కాలిన గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న సమయంలో బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో స్టేట్మెంట్ రికార్డు చేసే సమయంలో తన తండ్రితో పాటు మరో ఇద్దరి పేర్లను ఆమె వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.బాధితురాలి ఆరోపణల ప్రకారం.. పెళ్లికి ముందే తండ్రి తనను లైంగికంగా వేధించాడని, పెళ్లి తర్వాత కూడా ఈ వేధింపులు కొనసాగాయని తెలిపింది. అంతేకాకుండా, కుటుంబ సమస్యలను అడ్డుపెట్టుకుని తనను మానసికంగా వేధించాడని ఆరోపించింది. మరోవైపు.. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నిందితుడు బాధితురాలి మామ వద్ద రూ.10 లక్షల అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అత్తింటివారు ఒత్తిడి చేయడంతో, డబ్బులు చెల్లించకుండా కుమార్తెను బెదిరింపులకు గురిచేశాడని పోలీసులు తెలిపారు.A 57-year-old school teacher was arrested in Ganjam, Odisha, for allegedly sexually abusing his daughter for years, even after her marriage. 22-year-old woman, who sustained 75% burn injuries after allegedly setting herself on fire, is undergoing treatment.#Ganjam #Odisha… pic.twitter.com/YeRb36YtDH— Orissa POST Live (@OrissaPOSTLive) July 11, 2026తన వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానంటూ బెదిరించాడని బాధితురాలు ఆరోపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మానసిక వేధింపులు, బెదిరింపులు భరించలేకే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, బెర్హంపూర్ అదనపు ఎస్పీ అలోక్ జెనా మాట్లాడుతూ.. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన ఒక మొబైల్ ఫోన్, బాధితురాలి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిమాఖండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం మరింత కలవరపెడుతోంది. -
నాన్నకు ప్రేమతో..! వైరల్‌గా కూమార్తె పోస్ట్..
అందర్నీ ఆలోచింపచేసేలా నెట్టింట చక్కెర్లు కొడుతున్న పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతలా తమ సర్వస్వం ధారపోస్తారో తెలియజేసే ఓ కూతురు పోస్ట్ ఇది. ఆమె పోస్ట్‌లో నాన్న త్యాగాలు గురించి రాసిన విధం చూడగానే ఠక్కున జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీలోనిఏ కష్టమేదురోచ్చినాకన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో..నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం అనే పాట గుర్తుకొస్తుంది. అంత భావోద్వేగంగా నాన్న గురించి రాసుకొచ్చిందామె పోస్ట్‌లో.ఇన్స్టాగ్రామ్ 'Growing with Artha' అనే ఖాతాలో షేర్ చేసిన వీడియలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ వీడియో వేలాదిమంది మనసులను తాకింది. ఆ కూతురు పోస్ట్‌లో తన తండ్రి గురించి ఇలా రాసుకొచ్చింది. " మా నాన్న 35 ఏళ్లకు పైగా ఆటో రిక్షాని నడుపుతున్నారు. అందువల్లే తనకు తనకు మంచి విద్య, స్వతంత్ర, మంచి కెరీర్ లభించాయని అంటోంది. నర్సరీ స్థాయి నుంచి డిగ్రీ వరకు నా చదువు ఆయన కఠిన శ్రమ వల్లే సాధ్యమైంది. మా చుట్టుపక్కల చాలా మంది తమ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం డబ్బు దాచుకుంటున్న సమయంలో, మా నాన్న మాత్రం మా చదువుపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన నాకు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి విద్య కాదు, స్వతంత్రత. నాకు ఒక ఒక సోదరి కూడా ఉంది. ఆడపిల్లలమని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఒంటిరిగా ప్రయాణించడం నుంచి సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ఎదుర్కోవడం వంటి విషయాల వరకు ప్రతిదాంట్లో మాపై నమ్మకం ఉంచారు. తాను తన సోదరి ఇద్దరం కెరీర్లో బాగా రాణించాం. కోవిడ్ మహమ్మారి సమయంలో, తమ తల్లిదండ్రులకు ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒక వ్యవసాయ క్షేత్రాన్ని (ఫామ్) ప్రారంభించాం అప్పటి నుంచి, ఆయన దాని బాగోగులు స్వయంగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత నాకు పెళ్లై తల్లిగా మారాక ఉద్యోగం కొనసాగించాలా వద్ద అనే క్లిష్టమైన నిర్ణయం తీసుకునే సమయంలో కూడా నాకు అండగా నిలిచారు. పైగా నా కెరీర్‌ని వదులుకోవద్దని ప్రోత్సహించారు. బిడ్డ పెంపకంలో మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగం మానేయకు' అని చెప్పారు. అంతేకాకుండా, నాతో ఉండటానికి మా అమ్మను పంపించారు. నేను ఆఫీసుకి వెళ్ళినప్పుడు నా కూతురిని చూసుకోవడానికి మా అమ్మ ప్రతి వారం బెంగళూరుకు వస్తుంటారు. ఆమె తల్లి బిడ్డను చూసుకోవడంలో సహాయం చేస్తుండగా, ఆమె తండ్రి ఇంట్లో అన్ని పనులూ ఒంటరిగా చూసుకుంటారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి చెందిన కిరాణా దుకాణాన్ని నడుపుతారు, పొలాన్ని చూసుకుంటారు, వంట చేస్తారు, దాంతోపాటు పగటిపూట తన ఆటో నడుపుతూ సాయంత్రం తిరిగి వచ్చి దుకాణాన్ని తెరుస్తారు. దీన్ని బట్టి నాకో విషయం అర్థమైది. తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు కాదు, ఒక బిడ్డను స్వతంత్రంగా పెంచి తర్వాత వారికి అండగా నిలబడటమే. నాకు మాత్రం ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు అందుకు మా నాన్న సదా ధన్యావాదాలు. అంటూ పోస్ట్‌ని ముగించింది. నెటిజన్ల సైతం ఆమె పోస్ట్ మద్దతిస్తూ..నిజమైన హీరో నాన్నే అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Growing with Artha (@arthasfirstbites) (చదవండి: యుద్ధం భర్తను దూరం చేస్తే..సాంకేతికత చేరువ చేసింది!) -
నా కొడుకు చనిపోయే గంట ముందు ఏం జరిగిందంటే..
-
సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
చంద్రబాబు సభలో ఘోరం.. తండ్రిని ఈడ్చుకెళ్లిన పోలీసులు!
సాక్షి,నెల్లూరు: నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న ప్రజావేదిక సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ పాఠశాలలో తౌశిక్ అనే విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తన కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం సభ వద్దకు చేరుకోవడంతో ఈ కలకలం రేగింది. చంద్రబాబుకు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన బాధిత తండ్రి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.నెల్లూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల తౌశిక్ అనే విద్యార్థి మరణించాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం,అనుమానాస్పద పరిస్థితులే తన కుమారుడి మృతికి కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అతని తండ్రి కోరుతున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు తన గోడును వెళ్లబోసుకుని, వినతిపత్రం సమర్పిస్తే న్యాయం జరుగుతుందనే ఆశతో ఆయన సభా ప్రాంగణానికి వచ్చారు.సీఎం చంద్రబాబుకు కేవలం వినతిపత్రం మాత్రమే ఇస్తానని, దయచేసి అనుమతించాలని బాధిత తండ్రి అక్కడున్న పోలీసులను వేడుకున్నారు. అయితే, భద్రతా కారణాల నెపంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను సభా ప్రాంగణం నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో అక్కడి నుండి తరలించారు.కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై సభకు వచ్చిన పార్టీ కార్యకర్తలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
మృత్యుంజయులు వీరు
కారకస్: జంట భూకంపాల తాకిడికి అల్లాడిపోయిన వెనెజువెలా తేరుకుంటోంది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు జరుపుతున్న సహాయక చర్యలూ ఊపందుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం 7.2, 7.5 తీవ్రతలతో సంభవించిన భూకంపాల కారణంగా ఇప్పటివరకూ 1,700 మంది మరణించగా సుమారు 3,150 మంది గాయపడ్డారు. ఇంకో 50,000 మందికిపైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. భూకంపాల తాకిడికి సుమారు 189 భవనాలు ధ్వంసమయ్యాయి. భవన శిథిలాల కింది నుంచి ఇప్పటివరకూ 33 మంది ప్రాణాలతో కాపాడటం విశేషం. తాజాగా ఆదివారం రాజధాని కారకస్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని కారాబెల్లెడా వద్ద ప్రాంతంలో ఫ్రాన్స్, వర్జీనియాలకు చెందిన సహాయక బృందాలు తండ్రీ కొడుకులు ఇద్దరిని శిథిలాల నుంచి వెలికితీశాయి. నాలుగు రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుపోయిన ఆ తండ్రి కాళ్లను చూసిన సహాయకులు నెమ్మదిగా అతడిని బయటకు తీశారు. తిండితిప్పల్లేకపోవడంతో చాలా బలహీనంగా ఉన్న ఆయన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను గట్టిగా పట్టుకుని కనిపించారు. రక్షించిన వెంటనే అతడికి అత్యవసర వైద్యం అందించారు. కొంత సమయానికే ఆ ప్రాంతంలోనే ఒక యువకుడిని సైతం గుర్తించి రక్షించారు. వీరిద్దరూ తండ్రీకొడుకులని తెలిసింది. సహాయక బృందాల హర్షాతిరేకాల మధ్య తండ్రీకొడుకులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. బుధవారంనాటి జంట భూకంపాల తర్వాత వేలాది మంది గల్లంతైన నేపథ్యంలో సామాన్య పౌరులు శిథిలాల కింద క్షతగాత్రుల కోసం అన్వేíÙంచడం మొదలుపెట్టారు. ఒకట్రెండు రోజుల తరువాత పలు దేశాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో శనివారం లా గుయేరా నగరంలో కూలిపోయిన అపార్ట్మెంట్ శిథిలాల నుంచి పలువురు పసికందులు, 12 ఏళ్ల బాలుడిని రక్షించినట్లు సమాచారం. వీరితోపాటే ఓ పెంపుడు కుక్క సురక్షితంగా బయటపడింది. లా గువైరాలో మళ్లీ ప్రకంపనలు భూకంపం తీవ్ర ప్రభావం చూపిన లా గువైరా రాష్ట్రంలో సోమవారం మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం దీని తీవ్రత 5.1దాకా ఉందని తెలిపింది. వెనెజువెలా కరీబియన్ తీరంలోని కారాబల్లెడాకు 27 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనం సంభవించినట్లు అధికారులు తెలిపారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కారకస్‌లో భారత్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ ఆపరేషన్ అమిస్తాడ్లో భాగంగా భారత ఆర్మీ వెనెజువెలా రాజధాని కారకస్‌లో 24 గంటలూ సేవలందించే ఫీల్డ్ హాస్పిటల్‌ను ప్రారంభించింది. ఇంటర్నేషనల్ లా రింకోనాడా రేస్ ట్రాక్ వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని భారత దౌత్యకార్యాలయం తెలిపింది. అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు భూకంప బాధితులకు అన్ని సేవలను ఉచితంగా అందజేస్తారంది. -
తండ్రీకొడుకులు ఒక్కటైతే.. కూతురిలో అసంతృప్తి!
సాక్షి,చెన్నై: పీఎంకేలో గత ఏడాదిన్నర కాలంగా తండ్రీకొడుకుల మధ్య సాగుతున్న అధికార పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్, ఆయన కుమారుడు , పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ల మధ్య వివాదం కారణంగా గత శాసనసభ ఎన్నికల్లో ఇరువర్గాలు విడివిడిగా పనిచేశాయి. అయితే, రామదాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కుటుంబ కలహాలు సమసిపోయాయి. అయితే, ఈ పరిణామాలతో రాందాసు కుమార్తె శ్రీగాంధితో పాటుగా ముఖ్య నేతలలో తీవ్ర అసంతృప్తి అన్నది బయలు దేరింది. కుటుంబ సభ్యుల సమక్షంలో భావోద్వేగ కలయిక: గత ఎన్నికల్లో రామదాస్ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, అన్బుమణి భార్య సౌమ్య అన్బుమణితో సహా నలుగురు పీఎంకే ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత పారీ్టపై అన్బుమణి పట్టు బిగిసింది. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకులను కలపడానికి కుటుంబ పెద్దలు, ముఖ్య నేతలు రాయబారం నడిపారు. రామదాస్ – సరస్వతి దంపతుల 61వ వివాహ వార్షికోత్సవాన్ని ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. బుధవారం తైలాపురం తోటలోని రామదాస్ నివాసానికి అన్బుమణి, ఆయన భార్య సౌమ్య, కుమార్తెలు సంయుక్త, సంగమిత్ర, సంజుత్ర, అల్లుళ్లు, మనవళ్లతో కలిసి వచ్చారు. రామదాస్ వర్గీయులు వారికి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఏడాదిన్నరగా కొడుకును దూరం పెట్టిన రామదాస్, అన్బుమణిని చూడగానే కన్నీళ్లతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కుటుంబం అంతా కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.దీనిపై అన్బుమణి మాట్లాడుతూ, అమ్మ, నాన్నల 61వ పెళ్లిరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వచ్చి ఆశీస్సులు తీసుకున్నాం. ఇకపై అంతా మంచిదే జరుగుతుందన్నారు. ఇంత వరకు అంతా బాగానే సాగినా అసలు ట్విస్టు తాజాగా బయలు దేరింది. తెరపైకి కొత్త వివాదం: సోదరి శ్రీగాంధి అసంతృప్తి తండ్రీకొడుకులు ఒకటవ్వడం పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపినప్పటికీ, కుటుంబంలో మాత్రం మరో వివాదం నివురు గప్పిన నిప్పులా మారింది. రామదాస్‌ను అన్బుమణి కలిసిన సమయంలో ఆయన చిన్న చెల్లెలు కవిత ఉన్నారు. కానీ, పెద్ద కుమార్తె, పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షురాలు) శ్రీగాంధి, ఆమె కుమారుడు ముకుందన్ ఈ వేడుకను బహిష్కరించారు. గతంలో కొడుకుపై కోపంతో అన్బుమణిని పక్కన పెట్టిన రామదాస్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పెద్ద కుమార్తె శ్రీగాంధికి అప్పగించారు. అయితే ఆమె ను బలవంతంగా ఈ పదవిలో కూర్చోబెట్టారని టాక్. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన శ్రీగాంధి ఎలాగైనా ఎంపీ లేదా ఎమ్మెల్యే కావాలన్న పట్టుదలతో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తనను రాజకీయాల్లోకి బలవంతంగా తీసుకొచ్చి , ఇప్పు డు తండ్రీకొడుకులు రాజీ పడటంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు మద్దతు వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీపై మళ్లీ అన్బుమణి పూర్తి పట్టు సాధించిన పక్షంలో తన రాజకీయ భవిష్యత్తు , అధికార కలలు కల్లలుగానే మిగిలిపోతాయని శ్రీగాంధి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో శ్రీగాంధి పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతుండటం వల్ల, తండ్రీకొడుకులు ఒకటైనా పార్టీలో అంతర్గత వివాదాలు కొనసాగుతూనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
తండ్రి చివరి కోరిక : వీడియో కాల్‌లోనే పెళ్లి, అంతలోనే..!
ఒకవైపు కన్నకూతురి పెళ్లి కళ్లారా చూడాలన్న కన్నతండ్రి కోరిక, మరవైపు అనూహ్యంగా తీవ్ర అనారోగ్యం బారిన తండ్రి. చివరికి ఆసుపత్రి బెడ్‌పై నుంచే వీడియో కాల్లో కూతురి పెళ్లి చూసి సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చాడు. కానీ అంతలోనే తీవ్ర విషాదం అలుముకుంది.బిహార్‌లోని సీతామఢీ జిల్లా సోన్బర్సాకు చెందిన లాల్‌బాబు మహతో ఒక ట్రావెల్ కంపెనీలో బస్సు కండక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. తన చిన్న కూతురు నిధి కుమారి వివాహాన్ని ఘనంగా జరిపించాలని ఎన్నో కలలు కన్నారు. ఈ శుభఘడియ కోసం ఏళ్లుగా ఎదురు చూశారు. అయితే పెళ్లికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీనితో ఆయన్ను లక్నోలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. లాల్‌బాబు మహతో చివరి కోరిక తీర్చేందుకు కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన భార్య మీనూ దేవి, కుమారుడు రాజేష్ కలిసి ఆసుపత్రి నుండే వీడియో కాల్ ద్వారా నిధి పెళ్లి చూసే ఏర్పాటు చేశారు.అలా కూతురి వివాహ వేడుకను ఆసుపత్రి బెడ్‌పై నుండి వీడియో కాల్ ద్వారా వీక్షించారు. ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని హల్దీ వేడుక, పూలదండలు మార్చుకోవడం, ప్రధాన వివాహ ఘట్టం వరకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూసి తన కోరిక నెరవేర్చుకున్నారు. కొత్త పెళ్లికూతురిగా కుమార్తె అలా అత్తగారింటికి వీడ్కోలు తీసుకున్న మరుక్షణమే ఒక తండ్రి గుండె ఆగిపోయింది. ఆసుపత్రి నుండే వీడియో కాల్ ద్వారా ఆమె కూతురి వీడ్కోలు వేడుక ముగిసి, ఇల్లు వదిలి వెళ్తుండగా ఆ తండ్రి కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అలాగా చివరి శ్వాస విడిచారు. ఈ ఊహించని పరిణామం కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది కంట కన్నీరు తెప్పించింది. (ఆపరేషన్ సింధూర్‌లో అసువులు బాసిన సైనికులు వీరే!)ఒకేరోజు చెల్లి పెళ్లి.. తండ్రి మరణంలాల్బాబు కుమారుడు రాజేష్ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఒకవైపు చెల్లి వీడ్కోలును, మరోవైపు తండ్రి మరణాన్ని చూడాల్సి వచ్చింది. నిధి సీతామఢీ జిల్లాలోని మోహన్పూర్కు చెందిన తన భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అత్తగారింటికి బయలుదేరి వెళ్లడం, మరోవైపు తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆ అన్న ఆవేదనకు అంతులేకుండా పోయింది. లాల్‌బాబు మహతోకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇదీ చదవండి: కాటేసిన పామును బిస్కెట్ డబ్బాలో బంధించి.. వీడియో వైరల్ -
మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా, స్టాలిన్ గట్టి కౌంటర్
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (నటుడు విజయ్) చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ ఒక కథను చెబుతూ, మాజీ సీఎం స్టాలిన్ కుమారుడు, ఉదయనిధిని ఉద్దేశించి "మీ నాన్న ఎక్కడ?" అంటూ పరోక్షంగా సెటైర్ వేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరఫున పోటీ చేసిన మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్, తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో టీవీకే (TVK) పార్టీ చేతిలో ఊహించని పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ ఉదయనిధిని ఉద్దేశించి "మీ నాన్న ఎక్కడ?" అంటూ ప్రశ్నించడం, అటు ఈ రాజకీయ రగడ కాస్తా వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం కలకలం రేపింది.సీఎం విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే నేత స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలు ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా సీఎం వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ.. "నేను అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో ఉన్నాను. ప్రజలు నన్ను ఎక్కడ వెతికినా నేను అక్కడే ఉంటాను" అని కౌంటర్ ఇచ్చారు.డీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే కేఎన్ నెహ్రూ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. "మా నాయకుడిని చూసి మీ నాన్న ఎక్కడ అని అడిగారు కదా? ఆయన వస్తారు.. చాలా త్వరలోనే అసెంబ్లీలోకి అడుగు పెడతారు. మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారు" అంటూ రాబోయే ఉప ఎన్నికల్లో స్టాలిన్ పోటీ చేయబోతున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు.మరోవైపు సీఎం విజయ్ వ్యాఖ్యలపై కూటమి భాగస్వామి, వీసీకే (VCK) అధినేత తిరుమావళవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సభామర్యాద కాదని హితవు పలికారు.సీఎం విజయ్ వ్యాఖ్యలకు ప్రతిసవాల్‌గా ఉదయనిధి స్టాలిన్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. "చెంగల్పట్టు కోర్టులో భార్య తన భర్త కోసం వెతుకుతోంది" అంటూ విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్‌కు సంబంధించిన వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఇలా వ్యక్తిగత జీవితాలను లాగడంపై విశ్లేషకులు ఇరుపక్షాలనూ తప్పుబడుతున్నారు.ప్రస్తుతం తమిళనాడులో 6 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సీఎం విజయ్ తాను గెలిచిన రెండు సీట్లలో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయగా, ఐదుగురు ఏఐఏడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఈ రాబోయే ఉప ఎన్నికలు స్టాలిన్ తిరిగి అసెంబ్లీకి రావడానికి డీఎంకేకు ఒక పెద్ద అవకాశంగా మారనున్నాయి. "మీ నాన్న ఎక్కడ?" అన్న విజయ్ ఎద్దేవా చేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే ఉప ఎన్నికల ద్వారా మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు! -
తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా పట్టాళి మక్కల్ కట్చి (PMK)పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగతున్నవేళ ఎట్టకేలకు ఈ రోజు బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్, తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్‌ను కలిశారు. వివాహ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చానన్నారు. ఈ సందర్బంగా ఎస్. రాందాస్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.పీఎంకే (PMK) పార్టీలో 2024 డిసెంబర్లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ వ్యవస్థాపకుడు డా. ఎస్. రామదాస్ ఆయన కుమారుడు ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు డా.అన్బుమణి రామదాస్ మధ్య తలెత్తిన అధిపత్యం విషయమై తలెత్తిన వివాదం పార్టీ చీలికకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం డా. అన్బుమణి రామదాస్ నేతృత్వాన్ని గుర్తించి పార్టీ అధికారిక పేరు ‘పాట్టాలి మక్కల్ కట్చి’ (PMK) దాని ప్రధాన గుర్తును ఆయనకు కేటాయించాయి.ఈ రాజకీయ ఉద్రిక్తలను నడుమ ఈ రోజు తన తండ్రి ఎస్. రామదాస్‌ను విల్లుపురం జిల్లాలోని తిండివనం సమీపంలో ఉన్న తైలపురంలోని తమ కుటుంబ నివాసంలో డా. అన్బుమణి రాందాస్ కలిశారు. తమ తల్లిదండ్రుల 61వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ "నా తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రోజున వారి ఆశీస్సులు తీసుకోవడానికే థైలాపురం వచ్చాను. ఇకపై మంచి విషయాలే జరుగుతాయి" అని ఆయన పేర్కొన్నారు.కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ రెండు వర్గాలుగా పోటీ చేసింది – కొడుకు నేతృత్వంలోని ఒక వర్గం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగం కాగా, తండ్రి నేతృత్వంలోని మరో వర్గం వి.కె. శశికళ నేతృత్వంలోని కూటమితో జతకట్టింది. ఈ ఎన్నికల్లో అన్బుమణి వర్గం నాలుగు స్థానాలను గెలుచుకుంది.Videos of the meeting between Anbumani and Ramadoss have been released. note : There is no connection between me and the song playing in the background. pic.twitter.com/zxmnPsx3NB— Vignesh Theni (@Vignesh_twitz) June 24, 2026 -
పెద్ద కూతురు రాసిన మరణ శాసనం.. ట్రిపుల్ మర్డర్ కలకలం!
సాక్షి,బెంగళూరు: సహజీవనం తప్పమ్మా?. అన్ని లక్షలు అప్పు ఎందుకైంది? అని ప్రశ్నించినందుకు పెద్ద కుమార్తె ఇంటికి శాపంగా మారింది. కనీపెంచిన తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన సొంత చెల్లెల్ని ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. పెద్ద కుమార్తె ఘాతుకానికి పాల్పడుతుంటే ప్రాణాలు కాపాడుకునేందుకు అటు తల్లిదండ్రులు, ఇటు చెల్లెల్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే వెంటపడి మరి ప్రాణాలు తీసింది. ఒళ్లు గగుర్పొడిచే ఘటన సిలీకాన్ వ్యాలీ సిటీగా పేరొందిన బెంగళూరులో చోటు చేసుకుంది.సోమవారం జరిగిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ, కుటుంబ విభేదాలు, అప్పుల భారం, ఆవేశం.. ఇవన్నీ కలిసి చివరకు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు పోలీసులు.కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీగేహళ్లి ప్రాంతంలోని సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సోమసుందర్ (55), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), చిన్న కుమార్తె సుప్రియ (20) సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబంలోని పెద్ద కుమార్తె శ్వేత,ఆమె ప్రియుడు కెన్నెత్ ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారు.ప్రేమకు కుటుంబం అడ్డుగా మారిందా?శ్వేత కొంతకాలంగా కెన్నెత్‌తో సహజీవనం చేస్తోంది. తీరు మార్చుకోవాలని పెద్ద కుమార్తెను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఇదే కుటుంబంలో తరచూ గొడవలకు కారణమైంది. ప్రేమ వ్యవహారం ఒక్కటే కాదు.. శ్వేత దాదాపు రూ.30 లక్షల వరకు అప్పులు చేసింది. ఈ అప్పుల గురించి తల్లిదండ్రులు తరచూ ప్రశ్నించడంతో కుటుంబంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ముత్తులక్ష్మి ఒక్కరే ఉన్న సమయంలో శ్వేత, కెన్నెత్ అక్కడికి వెళ్లారు. ముగ్గురి మధ్య మాట మాట పెరిగింది. ముత్తులక్ష్మిని కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. హత్య అనంతరం కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేశారు. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన చెల్లెలు సుప్రియపై కూడా దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్వేత ఆమెను అడ్డుకోగా, కెన్నెత్ కత్తితో దాడి చేసి హత్య చేశాడని అనుమానిస్తున్నారు.అనంతరం ఇంటికి చేరుకున్న సోమసుందర్‌పై కూడా అదే ఆయుధంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలైనప్పటికీ సోమసుందర్ ఇంటి బయటకు పరుగెత్తి సహాయం కోసం ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా ఆయన కూడా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజులో భార్య, ఇద్దరు కుమార్తెలు, తండ్రి మధ్య చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఒకప్పుడు ప్రేమగా పెంచిన కూతురిపైనే ఇప్పుడు హత్య ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రేమకు వ్యతిరేకత, అప్పుల ఒత్తిడి, కుటుంబ కలహాలు... ఏది అసలు కారణమో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పరారీలో ఉన్న శ్వేత, కెన్నెత్‌ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించినప్పటికీ, మరిన్ని వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ట్రిపుల్ మర్డర్ వెనుక అసలు నిజం ఏమిటి? ప్రేమా... అప్పులా... లేక ఇంకేదైనా కారణమా? అనే ప్రశ్నలకు సమాధానం దర్యాప్తు పూర్తయ్యాకే తెలిసే అవకాశం ఉంది. -
ఉదయ రాగం.. నాన్న యోగం!
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు నగర జీవనశైలిలో నాన్న అంటే.. ఉదయం ఇంటినుంచి బయలుదేరి, ట్రాఫిక్‌తో పోరాడి, ఆఫీస్ బాధ్యతలు మోసి, రాత్రి అలసటతో ఇంటికి చేరే వ్యక్తి. పిల్లలతో గడిపే సమయం ‘వీకెండ్ ఆప్షన్’గా మిగిలేది. కానీ.. ఇప్పటి నాన్నలు కొంచెం విభిన్నంగా, వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఉన్న సమయాన్ని అనువుగా వినియోగించుకుంటూ ఆరోగ్యం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల వైపు కొత్తదారులు వెతుక్కొంటున్నారు.ఇటీవలి కాలంలో ఉదయపు పార్కులు, అపార్ట్మెంట్ టెర్రస్‌లు, కమ్యూనిటీ హాళ్లలో పిల్లలతో కలిసి యోగా మ్యాట్‌పై కనిపిస్తున్నారు. ఐటీ, ఫార్మా, స్టార్టప్‌ల హబ్‌గా పేరొందిన కార్పొరేట్ నగరంలో పని ఒత్తిడి సహజం. ఈ పరుగుల మధ్య తండ్రితనం కూడా ఒక ‘రెస్పాన్సిబిలిటీ లిస్ట్’గా మారడంతో ఉదయాన్నే యోగాతో పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటు మానసికంగా, అటు శారీరక మేలు కోసం అన్నింటికీ మించి పిల్లలకు సమయం ఇవ్వాలనే కోరిక దీనికి ప్రధాన కారణం. నేడు ఫాదర్స్ డే, యోగా డే రెండూ ఒకే రోజున కలిసి రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇలా నాన్న– పిల్లలు నిత్యం చేస్తున్న యోగా వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారికి ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. డాడ్– కిడ్ యోగా రీల్స్.. యోగా.. ఇక్కడ కేవలం ఫిట్నెస్ ట్రెండ్ కాదు.. ఇది ఒక న్యూ ఏజ్ ఫాదర్‌హుడ్ స్టేట్మెంట్. ‘శ్వాసపై దృష్టి పెట్టడం, నిశ్శబ్దాన్ని వినడం, శరీరంతో పాటు మనసును సర్దుకోవడం’ ఈ అలవాట్లు తండ్రులను మరింత సమతుల్యంగా మార్చుతున్నాయి. పిల్లలతో కలిసి సూర్య నమస్కారాలు చేయడం, ప్రాణాయామం నేర్పడం.. ‘క్వాలిటీ టైమ్’ కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. ఫలితంగా తండ్రి–పిల్లల మధ్య సంభాషణ పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఈ మార్పు డాడ్–కిడ్ యోగా రీల్స్, ఫ్యామిలీ ఫిట్నెస్ చాలెంజ్లుగా ట్రెండ్ అవుతున్నాయి. పిల్లలు తండ్రిని కేవలం సంపాదించే వ్యక్తిగా కాకుండా, మార్గదర్శిగా చూడటం మొదలుపెడుతున్నారు. నాన్నలు సమయమిచ్చి పిల్లలతో కలిసి యోగా చేయడమే నిజమైన ఫాదర్స్ డే గిఫ్ట్ అని చెబుతున్నారు.కూతురుతో కలిసి యోగా ఆనందకరంఉద్యోగం, బిజీబిజీ నగర జీవన శైలితో అలసిపోయే నాకు యోగాతో ఒక చక్కని పరిష్కారంతో పాటు నాన్నగా కూతురుతో అద్భుత క్షణాలను ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. ఇది అలవాటుగా మారకముందు మా దినచర్య వేరేలా ఉండేది. కానీ.. ప్రస్తుతం వినోదం, వి/ê్ఞనం, ఆరోగ్య వికాసం.. ముఖ్యంగా నాన్నగా ఆతీ్మయ సంతృప్తి పొందుతున్నా. మొబైల్స్, టీవీలకు అతుక్కు పోయే బాల్యం ఇలా నాన్నతో, ఆరోగ్యంగా కొనసాగడం సంతోషంగా ఉంది. నా పాప అని్వక కూడా అందరి పిల్లల్లా కాకుండా వినూ త్న ఆలోచనా విధానంతో పెరుగుతోంది. – నవీన్ కుమార్, సరూర్‌నగర్ -
నాన్నకు ప్రేమతో..
నాన్న అంటే ఓ భావోద్వేగం... నాన్న అంటే నమ్మకం... నాన్న అంటే భరోసా... నాన్న అంటే సూపర్ హీరో... నాన్న అంటే ప్రేమకు నిర్వచనం... ఆ ప్రేమ అనంతం.. అందుకే సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఫాదర్ ఎమోషన్ ఎవర్ గ్రీన్. వర్కౌట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కాసులు వర్షం కురిపిస్తారు. అందుకే ఫాదర్ ఎమోషన్‌తో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా ఉంది. మరి... ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఫాదర్ ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న సినిమాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ కాకాజీ చిరంజీవి ‘డాడీ’ సినిమా గుర్తుందిగా..! ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ వంటి చిత్రాల్లో తండ్రీకూతుళ్ల ఎమోషన్ భావోద్వేగభరితంగానే సాగుతుంది. ఇక చిరంజీవి హీరోగా నటించిన గత చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’లోనూ ఫాదర్–డాటర్ ఎమోషనల్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జానర్లో మరో సినిమాను ఓకే చేశారట చిరంజీవి.‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు కేఎస్ రవీంద్ర కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘చిరు158’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉంటాయని తెలిసింది. కథలో చిరంజీవి, అనశ్వర రాజన్ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారని టాక్. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.తొలి షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్‌ను పొల్లాచ్చిలో పూర్తి చేశారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైందని తెలిసింది. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, హీరో క్యారెక్టరైజేషన్స్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణను త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్.కూతురు కోసం..! కూతురు కోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధమయ్యారు హీరో నాగార్జున. ఏం చేశారు? అనేది ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో చూడొచ్చని తెలిసింది. నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘కింగ్ 100’. ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని తెలిసింది. నాగార్జున కెరీర్‌లోని ఈ 100వ సినిమాలో టబు, సుష్మితా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టెక్నాలజీ సాయంతో పాతికేళ్ల వయసు ఉన్న వ్యక్తిగా నాగార్జున కనిపించనున్నట్లు తెలిసింది.ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఈ దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉన్నారట. అంతేకాదు... ఈ ‘కింగ్ 100’ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు కూడా నటిస్తారని తెలిసింది. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నాగార్జున హీరోగా నటించిన ‘ఆఫీసర్’ చిత్రంలో తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఉన్న విషయం ఆ సినిమా చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది.ఇరుముడి రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ప్రధానంగా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ కుమార్తెగా చైల్డ్ ఆర్టిస్టు నక్షత్ర నటిస్తోంది.రవితేజ భార్యగా ప్రియాభవానీ శంకర్ నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెర పాలెం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘విక్రమార్కుడు’లో మంచి ఫాదర్–డాటర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిన సంగతి తెలిసిందే.ఇటు స్పిరిట్... అటు సలార్... దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాలు ‘అర్జున్ రెడ్డి, యానిమల్’. ఈ రెండు చిత్రాల్లోనూ అంతర్లీనంగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. ఈ తరహా ఎమోషనల్ బాండింగ్ సందీప్ తాజా చిత్రం ‘స్పిరిట్’లోనూ కనిపించనుందని తెలిసింది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్, ప్రకాష్‌రాజ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని భోగట్టా.ప్రకాష్‌రాజ్ సైతం పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్‌కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా నుంచి తొలి భాగం ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’వచ్చింది. ఈ చిత్రంలో దేవ పాత్రలో నటించారు ప్రభాస్.తొలి భాగంలో ప్రభాస్ తండ్రి పాత్ర గురించి పెద్దగా ప్రస్తావన లేదు. కానీ రెండో భాగంలో దేవ తండ్రి ధారా ప్రస్తావన పెద్ద స్థాయిలో ఉంటుందని తెలిసింది. సలార్ రెండో భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవ–ధారాల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని తెలిసింది. వచ్చే ఏడాది ‘సలార్ 2’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి డ్రాగన్ అయితే కొడుకు లూగర్?ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో డ్రాగన్, లూగర్... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారని, కథ రీత్యా సినిమాలో డ్రాగన్, లూగర్లు తండ్రీ కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, అన్షుమాన్, సిద్ధాంత్ గుప్తా, బిజు మీనన్, ఖుష్బూ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దేవర, వర... ఇలా తండ్రీకొడుకుల పాత్రల్లో నటించారు ఎన్టీఆర్. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర 2’ రూపొందనుంది. ‘దేవర’ని నిర్మించిన కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ రెండో భాగాన్ని కూడా నిరిస్తారని చెప్పోచ్చు.తండ్రి... ఇద్దరు కొడుకులు! అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇందులో తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నారని తెలిసింది. ఇలా అల్లు అర్జున్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. దీపికా పదుకోన్, మలయాళ నటి ఫెమీనా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని తెలిసింది. ఈ ‘రాక’ చిత్రంలో రష్మిక, అల్లు అర్జున్‌ల క్యారెక్టరైజేషన్స్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 డిసెంబరులో రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇతర భాషల్లో రూపొంది, తెలుగు తెరకూ రానున్న కొన్ని చిత్రాల్లోనూ తండ్రి ఎమోషన్ ప్రధానాంశంగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే... ⇒ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ చిక్కుల వల్ల విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానాంశంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ ‘జన నాయకుడు’ ఉండబోతున్నట్లు ట్రైలర్‌లోని విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి.ఈ సినిమాలో విజయ్, మమితా బైజు తండ్రీ కుమార్తెలుగా నటించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, ప్రియమణి, నాజర్, సునీల్, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు సూపర్ హిట్ సినిమా ‘భగవంత్ కేసరి’ ఆధారంగా ‘జన నాయకుడు’ సినిమా తీశారనే వార్తలు ఉన్నాయి. ‘భగవంత్ కేసరి’ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల తండ్రీ కూతుళ్లుగా నటించారు. ⇒ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఇదో ఫాదర్ ఎమోషన్‌తో అల్లుకున్న సినిమా కథ అని టైటిల్ స్పష్టం చేస్తోంది . ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ⇒ విజయ్ ప్రకాష్ తండ్రి సర్దార్. సమాజం నిందిస్తున్నట్లు తన తండ్రి ఓ దేశద్రోహి అనే భావనలో ఉంటాడు పోలీస్ ఆఫీసర్ విజయ్‌ప్రకాష్. కానీ సర్దార్ ఒక ఇండియన్ స్పై ఏజెంట్ అని, నిజమైన దేశభక్తుడు అని విజయ్‌ప్రకాష్ ఆ తర్వాత తెలుసుకుంటాడు. తండ్రి బాటలోనే తాను ఇండియన్ స్పై ఏజెంట్‌గా మారతాడు. మరి... నెక్ట్స్ ఏం జరిగింది? అంటే ‘సర్దార్’ సినిమాలో చూడాలి. విజయ్‌ప్రకాష్, సర్దార్... ఇలా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన తమిళ సినిమా ‘సర్దార్’. 2022లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రదర్శకుడు పీఎస్ మిత్రన్, హీరో కార్తీ కలిసి ‘సర్దార్2’ సినిమాని కూడా పూర్తి చేశారు. ఈ సినిమా ఈ దీపావళికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్‌జె సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ⇒ షారుక్ ఖాన్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న హిందీ సినిమా ‘కింగ్’. నిజ జీవితంలో తండ్రీ కూతుళ్లైన షారుక్, సుహానా ఖాన్ ‘కింగ్’ సినిమాలోనూ ఫాదర్–డాటర్ రోల్స్‌లో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటిస్తుండగా రాణీ ముఖర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. అలాగే ఇది సుహానా ఖాన్ నటిస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం. సిల్వర్ స్క్రీన్‌పై తన డెబ్యూ మూవీలోనే తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఏ కుమార్తెకు అయినా ఇంతకంటే స్పెషల్ ఏం ఉంటుంది? నిజంగా యాక్టర్‌గా సుహానా లక్కీ అని చెప్పవచ్చు.⇒ ఆహార కల్తీ అనేది చిన్నారుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అన్న అంశం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. కూతురి ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ తండ్రి చేసిన అసాధారణమైన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో శ్రేయాస్ తల్పాడే నటించగా, న్యాయవాది పాత్రలో కాజల్ అగర్వాల్ నటించారు. చేతన్ డీకే దర్శకత్వంలో సాగర్ బి. షిండే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మించారు. ఈ చిత్రం జూలై 24న రిలీజ్ కానుంది. స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైదానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషిలు సహ–నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సంగీతం: మంగేష్ ధాక్డే. ⇒ కుమార్తెకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఏదైనా మంచి బహుమతి ఇస్తాడు? కానీ ఓ తండ్రి తన కుమార్తె చేతికి గన్ ఇచ్చాడు. ఎవర్నో చంపిన తర్వాత హ్యాపీ బర్త్ డే చెప్పాడు. నిజంగా అతను ఆమెకు తండ్రేనా? లేక తండ్రిలా ఆ అమ్మాయిని పెంచి, తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడా? అనేది హిందీ సినిమా ‘ఆల్ఫా’లో చూడాలి. ఆలియా భట్, శార్వరి, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఆల్ఫా’. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు.– ముసిమి శివాంజనేయులు -
ఫీజు కోసం ఎద్దుని అమ్మి...
కాలం వక్రిస్తే ఓడలు బళ్లవుతాయి అంటారు. ఆ మాట మా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. వారసత్వంగా వచ్చిన 300 ఎకరాల భూమి అకస్మాత్తుగా ఆవిరైపోతే..? బెదరకుండా పరిస్థితులకు బెదిరిపోకుండా మొండితనంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు మా నాన్న లక్షీనరసింహరావు. అది 1972 తీవ్రమైన కరువు..ఇంట్లో అమ్మతో పాటు నేను నా ఇధ్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. ఆకలి మంటలు మొదలయ్యాయి.వరి గింజ లేక వణుకు పుట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో దేవదారు ఆకులు తినిపించి మా ప్రాణాలను కాపాడాడు మా నాన్న..పొద్దున్నే 4 గంటలకు నిద్రలేచి కూలి పనులకు వెళ్లడం, వ్యవసాయాన్ని చూసుకోవడం కాస్త సమయం ఉంటే మాతో గడపడం. రోజుకి 18 గంటలు పొలంలోనే గడిపేసిన రోజులు లెక్కలేనన్ని.. అయినా ఎప్పుడూ ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. మా చదువుల్ని మాన్పించలేదు. ఏది కావాలన్నా వెనకడుగు వేయలేదు.కాని నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది. కరువు పరిస్థితులు ఇంకా కుదురుకోలేదు.. ఇంట్లో దమ్మిడీ లేని పరిస్థితి. చదువుకి ఇక స్వస్తి చెప్పినట్టేనని అనుకున్నా. కాని మా నాన్న చేసిన పనిని నేను జీవితంలో మరిచిపోలేను. అసలే కరువు పరిస్థితులు, అప్పు కూడా పుట్టని రోజులు, ఉన్నవే రెండు కాడెద్దులు..అందులో ఒక ఎద్దుని 370 రూపాయలకు అమ్మేశాడు మా నాన్న.. 170 పరీక్ష ఫీజు పోను మిగిలిన 200 రూపాయలతో మరొక బక్క ఎద్దుని కొన్నాడు.దాన్ని కాస్త మేపి కాడి దున్ని వ్యవసాయం చేద్దామని అనుకున్నాడు. కాని వారం తిరక్కముందే అది కాస్తా చనిపోయింది. మా నాన్న ఆశ తిరగబడింది. అసహనం, అశక్తత ఆవహిస్తే ఏ మనిషైనా కుంగిపోక తప్పదు కాని మా నాన్న మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరింత కష్టపడ్డాడు. పరిస్థితులు అనుకూలించాయి. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈరోజు నేను నా తమ్ముళ్లు, చెల్లెలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో రాణించినా, మా వంశ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చినా అదంతా కష్టాలకు వెన్నుచూపని మా నాన్న గుండె చలవే. - జగపతిరావు విశ్రాంత అధ్యాపకులు, మహబూబ్‌నగర్ జిల్లాతండ్రి లక్షీనరసింహారావు---పచ్చ ఇంకు కలం సాకారమైంది!మా స్కూల్ హెడ్మాస్టర్ జేబులో ఓసారి పచ్చ ఇంకు పెన్ను చూసి మా నాన్న ఏదో ఒకరోజు నువ్వు కూడా అలాంటి పెన్ను జేబులో ఉంచుకునే స్థాయికి వెళ్లాలిరా అన్నాడు. ఆయన చదువుకోలేదు.. కాని ఆయన బిడ్డ మాత్రం అందరూ గౌరవించే స్థాయిలో ఉండాలన్నదే ఆయన ఆశ. అదే నాలో పట్టుదల రేకెత్తించింది. అహర్నిశలు శ్రమించేలా చేసింది.ఈ లక్షణం కూడా మా నాన్న భవనం వెంకటేశ్వర్లు నుంచి వచ్చిందే. అర ఎకరం భూమి మాత్రమే వారసత్వంగా వచ్చినా చెమటోడ్చి వ్యవసాయం చేసి 30 ఎకరాల ఆసామిగా మారాడు మా నాన్న. ఆయనే నాకు తొలి గురువు. 21 ఏట ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చేరినా, నాన్న చెప్పిన మాట మాత్రం మర్చిపోలేదు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి హోదాను పొందాను. మా నాన్న కలను సాకారం చేశాను. ఆయన సేవా గుణాన్ని స్పూర్తిగా తీసుకుని 24 లక్షల వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేశాను.- భవనం బద్రిరెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, వేటపాలెం, బాపట్లతండ్రి భవనం వెంకటేశ్వర్లు -
ప్రకాశం: కన్నబిడ్డల్ని కాటేసిన కుటుంబ కలహాలు..!
ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలం కేవీ అగ్రహారంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్నారులైన కూతుళ్లను హతమార్చి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కేవీ అగ్రహారానికి చెందిన సుధాకర్ కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో తన కూతుళ్లు అచ్యుత (11), పూజిత (9), లోహిత (8)లను హతమార్చాడు. తినే తిండిలో విషం పెట్టి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం సమీపంలోని పొలంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానికులు, బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.కుటుంబ కలహాలే కారణమా?ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబంలో నెలకొన్న విభేదాలు, కలహాల కారణంగానే సుధాకర్ ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.గ్రామంలో విషాద ఛాయలుఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అల్లారుముద్దుగా పెరిగిన ముగ్గురు చిన్నారులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటన గురించి తెలిసినవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
Hi నాన్న.. కష్టాల కొలిమిలో... నవ్వుల కలిమి
నా ఇరవయ్యవ ఏట అరవై కూడా దాటకుండా వెళ్లిపోయాడు మా నాన్న. ఒక చిన్న సంసారం... భార్య జయమ్మ, ముగ్గురు పిల్లలు సుజాత, నరసింహమూర్తి, గోపి, అమ్మ సుబ్బమ్మ, తమ్ముడు రాములు.. వీళ్ల కోసం ఆయన జీవితమంతా పోరాడాడు. తెనాలి మసోడి షెడ్ మా నాన్న కొంజేటి వెంకటేశ్వర్లు ఆఫీస్. ఆయన నడిపే లారీతో పాటు ఆయన స్నేహితులు ఉండే చోటు కూడా అదే.ఎనిమిదేళ్లుంటాయ్ నాకప్పుడు. వర్షం పడ్డ కాసేపటికి నాన్న చేయి పట్టుకుని షెడ్డుకి వెళ్లా. మా నాన్న స్నేహితుడితో ‘‘ఒరేయ్ ఇవ్వాళ నీ డ్యూటీకి నేను వెళతాను. నా కూతురు పుట్టినరోజు వస్తోంది. దానికి ఏమైనా ఇవ్వడం మాట సరే కనీసం భోజనం..’’ దుఃఖం ఎక్కువైతే గొంతు మూగబోతుంది. నా తండ్రి గొంతు బరువుగా మాట్లాడిన ఆ క్షణం నాకింకా గుర్తుంది. అప్పటికే నాలుగు రోజులు డ్యూటీ చేసిన మనిషి. అయినా మళ్లీ స్నేహితుడి దగ్గర లారీ తాళం తీసుకుని, తెనాలి అంబమ్మ హోటల్ భోజనం కట్టించుకుని ఇంటికొచ్చాడు. అమ్మ వడ్డిస్తుంటే నేను గబగబా తింటున్నా. వాకిట్లో ఉన్న నాన్నని చూసి ‘నాన్నా! నువ్వు రావేం’ అన్నాను. భుజం మీదున్న తువ్వాలుతో కళ్లు తుడుచుకుంటున్నాడు. అర్థం కాలేదు నాకు.. ఆ వయసులో ఆకలి మీదున్న దృష్టి మా నాన్న కళ్ల మీదకి పోలేదు..ఎర్ర పరికిణీ వేసుకుని స్కూలుకి వెళ్లడం, ఆపై కాలేజీ దాని తర్వాత పెళ్లి, పిల్లలు.. ఇలా నా చుట్టూ అల్లిన జీవితపు మల్లెతోటలో ఆనందాన్ని మాత్రమే నింపిన ఆయన, తన జీవితంలోని కష్టాల ముళ్ల కంచెల్ని మాత్రం నాకు తెలియకుండా దాచేశాడు. తన స్నేహితులు ఆయన్ని సావిత్రి అంటూ పిలిచేవారు. సతీనాటకంలో సావిత్రి వేషంలో చాలా బాగా చేశాడని అలా అంటారంతా.. కాని మేం పెద్దవాళ్లవుతున్న కొద్దీ ఆయన నాటకాలకు దూరమయ్యాడు. మాకోసమే నాటకాలొద్దనుకున్నాడని, మాకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు తనొక్కపూటే తింటున్నాడని, ఆయన మాతో ఉన్నన్నినాళ్లూ తెలియలేదు. కష్టాల కొలిమిలో కాలుతున్నా నిలువెత్తు చిరునవ్వుకి చిరునామాగా నిలిచి నా ఎదుగుదలని చూడకుండానే వెళ్లిపోయావు నాన్నా!.. నీకంటూ మేమేమీ ఇవ్వలేకపోయినా.. నువ్విచ్చిన మొండిధైర్యం, పట్టుదల, శక్తి మాకు వరం.– సి. సుజాత, రచయిత్రి, జర్నలిస్ట్నిర్వహణ: శ్రావణ్ జయమీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ కింది నంబర్‌కు మెయిల్ లేదా వాట్సాప్ చేయండి. 9281020501, sakshifamily3@gmail.com -
HI నాన్న
‘లేదు’ అనే మాటని ఇంట్లో పిల్లల ముందు పలకడు నాన్న. అడిగితే ఆయన జవాబు ఒక్కటే ‘తీసుకో నాన్నా’. నాన్న జేబుకి చిల్లు ఉంటుంది. కానీ కొడుకు పాకెట్ మనీకి లోటు ఉండదు. నాన్న చెప్పులు అరిగిపోతాయి, కానీ కూతురి స్కూల్ షూస్ కొత్తగా మెరుస్తూ ఉంటాయి. నాన్న తన కలల్ని ష్యూరిటీగా ఇచ్చి, పిల్లల కలలకి డౌన్ పేమెంట్ కడతాడు. ఫాదర్స్ డే జూన్ 21న. ఈ సందర్భంగా సమాజంలో ఎందరో సామాన్య అసామాన్య నాన్నలను గుర్తు చేసుకుందాం.శిక్షణ కోసం రిక్షా అమ్మి..!కొందరి కలలు నిద్రకే పరిమితమవుతాయి. మరికొందరి కలలు చరిత్రలో నిలిచిపోతాయి. కల సాకారం చేసుకోవాలన్న తపన ఎన్ని కష్టాలనైనా దిగమింగి, ఎంతటి అవాంతరాన్నైనా దాటేందుకు సిద్ధమైనప్పుడు విజయం కాళ్ల దగ్గరకు వస్తుంది. ఇందుకు ఉదాహరణే వారణాసికి చెందిన నారాయణ జైస్వాల్ జీవితం. జైస్వాల్ జీవితమంతా రిక్షాల చుట్టూతానే తిరిగింది. పగలంతా రిక్షా తొక్కడం, అద్దెలకు ఇవ్వడం, రాత్రయితే భార్యాపిల్లలతో భోంచేసి నిద్రపోవడం తప్ప వేరే ధ్యాసలేదు తనకి... కాని జైస్వాల్ కొడుకు గోవింద్ జైస్వాల్ కల మాత్రం చాలా పెద్దది. చిన్నప్పటి నుంచి తను ఐఏఎస్ అధికారి కావాలని ఆశపడ్డాడు. ఐఏఎస్ కావాలంటే ఆశ ఉంటే సరిపోదు ఆశయం కూడా కావాలి. కాని ఆ ఆశయానికి ఇంధనం కూడా డబ్బే... ఢిల్లీలోని మంచి సివిల్స్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటే తప్ప గోవింద్ ఐఏఎస్ పాస్ కాలేడని జైస్వాల్ తెలుసుకున్నాడు. రిక్షా తొక్కితే వచ్చే ఆదాయం కంటే వాటిని అమ్మేస్తే వచ్చే డబ్బుతో మాత్రమే శిక్షణ ఇప్పించవచ్చని అనిపించింది. అంతే... తన కుటుంబానికి ఆధారమైన రిక్షాలన్నింటినీ అమ్మేసి కోచింగ్ ఇప్పించాడు. కాని జైస్వాల్ కష్టం ఊరికే పోలేదు. 22 ఏళ్ల గోవింద్ జైస్వాల్ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ ర్యాంకు సాధించి చూపించాడు.కిడ్నీ అమ్మి చదివిస్తా..!తాను దెబ్బతిన్నా తన బిడ్డ బాగుండాలని కోరుకునే ఓ తండ్రి ప్రేమకు అద్దం పట్టే మరో సంఘటన ఇది. గుజరా™Œ లోని నవసారి జిల్లాకు చెందిన జయేష్ పటేల్ ఓ ప్రమాదం వల్ల చూపు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఉపాధి లేకపోవడంతో భార్యాపిల్లల్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితి. కాని తన కుమారుడు సాహిల్ పటేల్ ఎప్పటికైనా డాక్టర్ కావాలన్నది తన కల. ఆ కల తన పేదరికం వల్ల మరుగునపడిపోకూడదని భావించిన జయేష్ తన కిడ్నీని అమ్మేసి తన కుమారుడిని చదివిస్తానని ప్రకటించాడు. నా కంట్లో వెలుగు పోయింది. కాని బిడ్డ బతుకు మాత్రం చీకట్లోనే మగ్గిపోకూడదు అంటూ బాధపడ్డాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పలువురు వచ్చి సాహిల్ చదువుకి తమ వంతు సహకారం అందించారు. అలాగే భవిష్యత్‌లో కూడా సాహిల్‌కి అన్ని విధాల అండగా ఉంటామని మాటిచ్చారు. కొడుకు భవిష్యత్ బాగుండాలని అందుకు తను ఏమైపోయినా పర్లేదని మాట్లాడిన ఆ తండ్రి ఆవేదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.వైభవ్ కోసం భూమిని అమ్మి..!దేశవ్యాప్తంగా క్రికెట్ పేరు చెబితే మొదట వినేమాట బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్ టీంలో తన అప్రతిహత ప్రతిభను చాటి భళా అనిపించుకున్నాడు. కాని వైభవ్ అంతలా రాణించడం వెనుక అతని తండ్రి సంజయ్ సూర్యవంశీ కృషి ఉంది. బీహార్ లోని తాజ్ పూర్‌కి చెందిన ఈ మైథాలీలది మధ్య తరగతి కుటుంబం. అయితే చిన్నప్పటి నుంచి వైభవ్ క్రికెట్ పట్ల విపరీతమైన ఆసక్తి చూపేవాడు. ఇది గమనించిన అతని తండ్రి మరింత ఉన్నత శిక్షణ కోసం తమ పూర్వీకుల భూములను అమ్మేశాడు. తాజ్పూర్కి, ట్రెయినింగ్ సెంటర్ మధ్య దాదాపు వంద కి.మీ దూరం ఉండేది. వైభవ్ కోసమే ఓ కారుని కూడా కొని అతనికి అన్ని విధాల వెన్నుదన్నుగా నిలిచాడు సంజయ్.. తరతరాల ఆస్తి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు..అది అనాదిగా వచ్చే వారసత్వం, బాధ్యత. కానీ అదేది అక్కర్లేదని, కేవలం తన బిడ్డ కలని నిజం చేయడమే లక్ష్యమని సంజయ్ సూర్యవంశీ భావించాడు కాబట్టే ఇండియాకి ఈరోజు వైభవ్ లాంటి చిచ్చరపిడుగు దొరికాడు.మీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి. 9281020501మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com -
బిర్యానీ తినిపించి.. తెప్పలో తీసుకెళ్లి
నిజాంసాగర్(జుక్కల్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గొడవల కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనచోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన బోయి కృష్ణ (34), సవిత దంపతులకు ఇద్దరు పిల్లలు అనన్య (5), రక్షిత్ (9) ఉన్నారు. వీరిది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. సరైన ఉపాధి లేక కృష్ణ, సవిత దంపతులు ఇద్దరు పిల్లలతో నాలుగు నెలల కిందట రామచంద్రపురం వలస వెళ్లారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సవిత హోటల్లో లేబర్ పని చేస్తోంది.కృష్ణ మద్యం సేవిస్తూ సరిగ్గా పనిచేయకపోవడంతో భార్య మందలించేది. ఇదేవిషయమై ఇద్దరూ తరచూ గొడవలు పడేవారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో కృష్ణ జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో పిక్నిక్ వెళ్దామని చెప్పి గురువారం పిల్లలను బైక్‌పై పటాన్ చెరు నుంచి నిజాంసాగర్ప్రాజెక్టు వద్దకు తీసుకు వచ్చాడు. ప్రాజెక్టువద్ద పర్యాటక ప్రదేశాలను పిల్లలకు చూపించి, హోటల్ నుంచి తీసుకు వచ్చిన బిర్యానీ తినిపించాడు. ప్రాజెక్టు పరిసరాల్లో విహరించిన ఫొటోలు తన అల్లుడు నవీన్‌కు వాట్సాప్‌లో పంపించాడు. అలాగే ప్రాజెక్టు నీటిలోకి తెప్పపైన పిల్లలతో కలిసి వెళ్తున్న వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సందేశం పంపాడు.మత్య్సకార్మికులు చేపల వేటకు ఉపయోగించే తెప్పపైన ప్రాజెక్టు మధ్య భాగంలోకి వెళ్లిన తర్వాత పిల్లలను నీటిలోకి తోసేశాడు. ఆ తర్వాత కృష్ణకూడా తెప్పపై నుంచి నీటిలోకి దూకి తనువు చాలించాడు. సాయంత్రం వరకు పిల్లలతో పాటు భర్త ఇంటికి రాకపోవడంతో సవిత బంధువులకు ఫోన్ చేయగా ఆత్మహత్య విషయం తెలిసింది. కుటుంబీకులు, బంధువులు నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై శివకుమార్ హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి చూడగా బైక్‌తో పాటు పిల్లల చెప్పులున్నాయి. జాలర్లు, రెస్క్యూ టీం బృందాలు ప్రాజెక్టు నీటిలో గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఇల్లు దక్కలేదని.. నడిరోడ్డుపైనే 82 ఏళ్ల తండ్రి హత్య
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కోర్టులో తండ్రికి వ్యతిరేకంగా ఆస్తి కేసు ఓడి పోయాననే ఆగ్రహంతో ఒక వ్యక్తి తన 82 ఏళ్ల తండ్రిని నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది.ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉంటున్న జలవనరుల శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి జాఫర్కమరుద్దీన్ సయ్యద్ పటేల్‌కు, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న కుమారుడు అబ్దుల్ రెహమాన్‌తో చాలాకాలంగా వివాదం నడుస్తోంది. నిత్యం కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, వారిపై దాడిచేసేవాడు. దీంతో బాధితుడు జాఫర్ కొడుకు ప్రవర్తనతో విసుగు చెంది, ఇంటి కోసం కేసు వేయడానికి ముందు పూణేలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిపోయాడు.కుమారుడి ప్రవర్తనతో వేగలేక, అతడిని ఇల్లు ఖాళీ చేయించడానికి కోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లపాటు న్యాయపోరాటం చేశాడు. చివరికి కోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, కుమారుడిని ఇల్లు ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఆస్తి యాజమాన్యాన్ని తండ్రికి పునరుద్ధరించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో విచక్షణ మరిచిన కొడుకు ఉత్తర్వులతో కోర్టు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా జాఫర్‌పై ఎటాక్ చేశాడు. తండ్రి ప్రయాణిస్తున్న ఆటోరిక్షాను ఆపి, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపాడు. పటేల్‌తో పాటు ఆయన కుమార్తె కూడా ఈ దాడిలో గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
వంతెనపై భయానక ఘటన.. కెమెరాకు చిక్కిన దృశ్యం
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పలాసుని వంతెనపై జరిగిన ఓ భయంకర ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన ట్రక్కు.. తండ్రీకూతుళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన నుంచి వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తండ్రీ కుమార్తె కారులో ప్రయాణిస్తుండగా.. వంతెన దాటుతున్న సమయంలో వెనుక నుంచి ట్రక్కు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కును ఆపకుండా డ్రైవర్.. కారును రోడ్డుపై అలాగే నెట్టుకుంటూ.. ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇది కారులో తండ్రీకుమార్తెలతో పాటు రోడ్డుపై ఇతర వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు భారీగా దెబ్బతిన్నప్పటికీ.. తండ్రీకూతుళ్లు ఇద్దరూ స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ట్రాఫిక్ నిబంధనల అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి.ట్రక్కు.. కారును నెట్టుకుంటూ వెళ్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగర పరిధిలో తిరిగే భారీ వాహనాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు నొక్కి చెప్పారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు.సదరు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన తీరును కచ్చితంగా తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను, అలాగే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడా? నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? ఏదైనా మత్తులో ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 📍Bhubaneswar–Cuttack, Odisha: Chaos erupted on the highway after a dispute over giving side reportedly turned dangerous between a car and a Hyva truck. The truck allegedly dragged the car for nearly 200 meters while trying to flee the spot, creating panic on the road. Police… pic.twitter.com/eN5ubZJ3ps— Deadly Kalesh (@Deadlykalesh) May 30, 2026 -
ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం
ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఈమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రంభ.. తండ్రి తలుచుకుని చాలా భావోద్వేగానికి గురైంది. నా హృదయంలో నీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ నీ ముఖంపై చిరునవ్వు మాత్రం చెరిగిపోనివ్వలేదు. నువ్వు వెళ్లిపోవడంతో నా ప్రపంచం శూన్యమైపోయింది అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) విజయవాడకు చెందిన రంభ అసలు పేరు యూది విజయలక్ష్మి. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈమెకు తొలుత మలయాళంలో అవకాశమొచ్చింది. 1992లో 'సర్గామ్' మూవీతో ఈమె హీరోయిన్ కెరీర్ మొదలైంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ హిట్ తర్వాత అదే ఏడాది 'ఆ ఒక్కటి అడక్కు'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అయింది. దీంట్లోనే ఆమె స్క్రీన్ నేమ్ రంభగా ఫిక్స్ అయింది. తర్వాత సూపర్ కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భోజ్‌పూరి, బెంగాలి భాషల్లోనూ రంభ సినిమాలు చేసింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ని పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఇండస్ట్రీకి దూరమైనా రియాలిటీ టీవీ షోలకు ఈ మధ్య జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది. ఇంతలోనే తండ్రి చనిపోవడంతో దుఖంలో మునిగిపోయింది.(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్) -
సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..!
పుణె జిల్లాలోని దౌండ్‌లో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కేవలం స్కూల్ మార్కుల విషయంలో వచ్చిన గొడవ కారణంగా తొమ్మిదేళ్ల బాలికను ఆమె తండ్రే కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ప్రకంపనలు రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు శాంతారామ్ దుర్యోధన్ చవాన్ కుమార్తె అనామిక (9 ఏళ్లు). ఇటీవల స్కూల్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో అనామిక తమ్ముడు (సవతి తల్లి కుమారుడు) సంస్కార్‌కు ఫస్ట్ ర్యాంక్ రాగా, అనామికకు రెండో ర్యాంక్ వచ్చింది. దీనిపై ఇంట్లో వాళ్లంతా ఆమెను ఎగతాళి చేశారు. ఆ అవమానంతో అనామిక తన తమ్ముడి మార్కుల జాబితాను మార్చేసింది. తద్వారా తనదే ఫస్ట్ ర్యాంక్ అని నిరూపించుకోవాలని చేసింది. అంతే .. ఇది తెలిసి తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. తెలిసీ తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులను అర్థం చేసుకొని, అవగాహన కల్పించాల్సింది పోయి, విచక్షణ మరిచి తండ్రి శాంతారామ్, చెక్క కోసే యంత్రం (wood-cutting machine)తో చిన్నారిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు, మృతదేహాన్ని వస్త్రంతో చుట్టి నిప్పంటించాడు.దీనిపై పోలీసులకు సమాచారం అందడంతోవారు ఘటనా స్థలానికి చేరుకుని, పాక్షికంగా కాలిపోయిన అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాన్ని డీఎన్ఏ పరీక్షలు, తదుపరి విచారణ నిమిత్తం పుణేలోని సాసూన్ ఆసుపత్రికి తరలించారు.ప్రధాన నిందితుడు తండ్రి శాంతారామ్ చవాన్‌తో పాటు, అతనితో కలిసి ఉంటున్న సవతి తల్లి చింకీ భోంస్లేను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేరం గురించి తెలిసి కూడా అధికారులకు సమాచారం ఇవ్వనందుకు ఆమెపై కూడా కేసు నమోదైంది. చిన్నారి మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల కోసం పుణెలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొన సాగుతోంది.మరోవైపు వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనల నేపత్యంలో పూణేలో పిల్లల భద్రతపై ఆందోళన తలెత్తింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి విషాదాలను నివారించేందుకు కఠినమైన చట్టాల అమలు, జవాబుదారీతనం, తక్షణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.ఇదీ చదవండి: కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం.. ఎవరీయన? -
విజయ్ గెలిచాక అన్‌ఫాలో చేశాడా?.. అసలు నిజమేంటి?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దళపతిపై పడింది. ఈ ఎలక్షన్స్‌లో అత్యధిక సీట్లు సాధించాడు. పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చిన టీవీకే అధినేత విజయ్ సీఎం పీఠ ఎక్కనున్నారు. ఈ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యామిలీ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ముందే ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విజయ్ గెలుపుతో జేసన్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడా లేదా అనే దానిపై నెట్టింట చర్చ నడుస్తోంది.ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం 38 మందిని ఫాలో అవుతున్నారు. ఇటీవల కొంతమంది నెటిజన్స్ జేసన్ విజయ్ను అన్‌ఫాలో చేశాడని చెబుతున్నారు. అయితే మరికొందరేమో అతను మొదటి నుంచే విజయ్ను ఫాలో అవ్వలేదని అంటున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ముందే ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్‌పై జూన్‌లో విచారణ జరగనుంది. -
చరిత్ర సృష్టించకపోగా.. నవ్వుల పాలయ్యారు!
ఎన్నికల టైంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు సాధారణంగా కనిపించే వ్యవహారమే. అయితే అది అతిగా ఉంటేనే జనాల్లో నవ్వుల పాలయ్యేది. కేరళలో ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులది అదే తరహా పరిస్థితి. ఎలక్షన్ టైంలో ఈ ఇద్దరూ తమ నోటికి పని చెప్పడంతో.. వాళ్ల కలను తారుమారు చేసి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు!.. పీసీ జార్జ్.. కేరళ రాజకీయాలపై నాలుగు దశాబ్దాలుగా ప్రభావం చూపించిన నేత. పూన్జార్ నియోజవకర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. కేరళ కాంగ్రెస్(జోసెఫ్ గ్రూప్), అటుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగానూ నెగ్గిన ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి వ్యక్తి సొంత పార్టీ పెట్టాడు. ఓటమి చవిచూశాడు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. బీజేపీ నుంచి పోటీ చేసి తాను ఓడడమే కాదు.. తన తనయుడ్ని ఓడగొట్టారు. పీసీ జార్జ్ ఎన్నికల ముందు తన విజయంపై ఎంతలా ధీమా వ్యక్తం చేశారంటే.. ‘‘నేను పూన్జార్లో భారీ మెజారిటీతో గెలుస్తా. నేనే కాదు.. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా. నా తనయుడు షోన్ జార్జ్ కూడా గెలుస్తాడు. మేం ఇద్దరం కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టిస్తాం. ఎవరికైనా సందేహం ఉంటే ఒక కోటి రూపాయల పందానికి రెడీ’’ అంటూ సవాల్ విసిరాయాన. కట్ చేస్తే.. పూన్జార్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీ జార్జ్ చిత్తుగా ఓడారు. అక్కడ యూడీఎఫ్ అభ్యర్థి ఎం.జె. సెబాస్టియన్ నెగ్గారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సెబాస్టియన్ కులతుంకల్ రెండో స్థానంలో నిలవగా.. పీసీ జార్జ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇటు పాళాలో షోన్ జార్జ్‌కు వరుసగా రెండోసారి పరాభవం తప్పలేదు. 2021లో కేరళ కాంగ్రెస్(ఎం) ఎమ్మెల్యే జోస్ కే మణి రాజ్యసభకు వెళ్లారు. ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగ్గా.. షోన్ జార్జ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అయితే.. మణి సి కప్పన్ చేతిలో షోన్ ఓడారు. ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థిగా మరోసారి పోటీ చేసినా షోన్ నెగ్గలేకపోయారు. మళ్లీ మణి సి కప్పన్ నెగ్గగా.. ఇక్కడ కూడా షోన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఆ తండ్రీకొడుకుల మీద ‘కోటి రూపాయలెక్కడ?’ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. పీసీ జార్జ్ ఒకప్పుడు కేరళ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతనే. అయితే గత కొంతకాలంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నానుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మతపరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేశాయి. ఒకవైపు బీజేపీ కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ఈ తండ్రీకొడుకులు మాత్రం తమ నోటికి పని చెబుతూ ముస్లిం ఓట్లను దూరం చేశారు. దీంతో.. బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంకు దూరంగా ఉండడంతో పాటు ఒకేసారి కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆ తండ్రీకొడుకుల కల చెదిరినట్లైంది. అయితే గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఈ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకోవడం ఆ పార్టీకి కాస్త ఊరట ఇచ్చే అంశమే!. -
ఈవెంట్లో పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు పంజాబీలో చాలా సినిమాలు చేయడంతో పాటు హిందీ సీరియళ్లలో నటించారు. ఇటీవలే పంజాబీ ఫిల్మ్ ఖుష్ కబరీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ టైమ్(01-01-01) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ సినిమాతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు.పాయల్ కన్నీటి పర్యంతం..ఈ ఈవెంట్‌కు పాయల్ రాజ్‌పుత్ సినీ కెరీర్, ఆరోగ్య సమస్యల గురించి ప్రశ్నించారు. దీనికి పాయల్ స్పందించింది. తన అనారోగ్యంతో జైపూర్‌లో పది రోజులు చికిత్స తీసుకున్నానని వెల్లడించింది. ఆ సమయంలో మా ఫాదర్‌కు క్యాన్సర్ సోకిందని తెలిపింది. నా లైఫ్‌లో రియల్ హీరో మా నాన్నే అంటూ ఎమోషనలైంది. తన తండ్రిని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది. నా సినిమాలు చూడాలని నాన్న ఎప్పుడు ఆసక్తిగా ఎదురు చూసేవాడని తెలిపింది. నా చిత్రాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ ఆయనేనని పాయల్ వెల్లడించింది. తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని వేదికపై బోరున ఏడ్చేసింది. దీంతో అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. కాగా.. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ గతేడాది జూలై 28న క్యాన్సర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. Actress Payal Rajput gets emotional while answering and walks away pic.twitter.com/ysuvKFdaxZ— idlebrain.com (@idlebraindotcom) April 28, 2026 -
నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు! లాయర్ సూసైడ్ నోట్ కలకలం
కాన్పూర్‌లో ఒక 24 ఏళ్ల యువ న్యాయవాది తన తండ్రి వేధింపుల కారణంగా కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, తల్లితండ్రుల ప్రవర్తన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. సూసైడ్ నోట్లో అతను పేర్కొన్న విషయాలు చూసి పోలీసులే షాకయ్యారు. హృదయవిదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ప్రియాంషు శ్రీవాస్తవ అనే యువ న్యాయవాది కాన్పూర్ కోర్టు భవనం ఐదవ అంతస్తు నుండి దూకేశాడు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆయనను హుటా హుటిన ఉర్సులా హార్స్‌మన్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.బాల్యంలో చేదు అనుభవాలు వారి మనసుపై చెరగని ముద్ర వేస్తాయి, తద్వారా అపరాధ భావం, న్యూనతా భావం, ఒత్తిడి పెరిగిపోతాయని మనస్తత్వ నిపుణులు చెపుతారు. తన తండ్రి చిన్నతనం నుండి తనను ఎలా మానసిక వేదనకు గురిచేశారో వివరిస్తూ ఆత్మహత్యకు ముందు ప్రియాంషు తన వాట్సాప్ స్టేటస్‌లో రెండు పేజీల సూసైడ్ నోట్‌ను పోస్ట్ చేశాడు. శ్రీవాస్తవ తాను రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్లో, తన బాల్యం , కౌమార దశలో తన తండ్రి తనను మానసికంగా వేధించిన వైనాన్ని వివరించాడు. పెరుగుతున్న కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్న తండ్రి వల్ల మానసిక ఒత్తిడిని కూడా ప్రస్తావించాడు.మ్యాంగో జ్యూస్ తాగినందుకు శిక్షప్రియాంషుకు 6 ఏళ్ల వయసున్నప్పుడు, ఫ్రిజ్‌లో ఉన్న మామిడి జ్యూస్‌ను అనుమతి లేకుండా తాగినందుకు తండ్రి ఆయన బట్టలు విప్పదీసి ఇంటి నుండి బయటకు గెంటివేశారని పేర్కొన్నాడు. ఈ ఘటన తనను చాలా బాధించిందని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: అంత్యక్రియల్లోబార్ గర్ల్స్ డ్యాన్స్.. అసలు విషయం ఇదీ!2016లో 9వ తరగతిలో ఉన్నప్పుడు ప్రియాంషు 'ఫిజికల్ ఎడ్యుకేషన్' తీసుకోవాలని అనుకున్నప్పటికీ తండ్రి బలవంతం చేసి 'కంప్యూటర్' సబ్జెక్టు తీసుకోవాలని ఒత్తిడి చేశారని, మాట వినకపోతే పాత శిక్షలే వేస్తానని బెదిరించారని నోట్లో రాశాడు.తండ్రిపై ఆగ్రహంతండ్రి ప్రవర్తన ప్రియాంషు మనసుని చిన్నాభిన్నం చేసింది. అందుకే తన తండ్రి లాంటి వ్యక్తి ఎవరికీ వద్దు దేవుడా అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తన మరణం తర్వాత తండ్రి, తన దేహాన్ని తాకడానికి వీల్లేదని కోరుకున్నాడు. అలాగే తన ఆత్మహత్యకు ఎవరినీ బాధ్యులను చేయవద్దని కోరుతూనే, తన మరణం తర్వాత తన తల్లిని వేధించవద్దని వేడుకున్నాడు. ఇదీ చదవండి: చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!పోలీసుల దర్యాప్తుమృతుడి ఆత్మహత్య లేఖలోని విషయాలను పరిశీలిస్తున్నామని పోలీసు కమిషనర్ రఘుబీర్ లాల్. కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా సమీక్షిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: 10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్ -
చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!
గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్‌లో నాలుగేళ్ల కుమార్తె కోసం ప్రాణాలకు తెగించి మరీ ఒక తండ్రి చేసిన పోరాటం ప్రశంసలు దక్కించుకుంటోంది. అసాధారణ ధైర్యం ప్రదర్శించి, ఒట్టి చేతులతో చిరుతతో పెనుగులాడి కుమార్తెను మృత్యు ముఖం నుంచి కాపాడుకున్నాడు. ఈ సంఘటన ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాలోని ఒక చిన్న బుధవారం సాయంత్రం పావి జెట్పూర్ తాలూకాలోని రస్లీ గ్రామంలో జరిగింది. తల్లి దగ్గర్లో పని చేస్తుండగా, ఆ బాలిక ఇంటి పెరట్లో ఆడుకుంటోంది. సాయంత్రం వేళ, మసకబారుతున్న వెలుతురులో, ఒక చిరుత మెల్లగా వచ్చి అకస్మాత్తుగా చిన్నారిపై ఎటాక్ చేసింది. ఇది చూసిన తల్లి భయంతో కేకలు వేసింది. దీంతో ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తుకొచ్చిన తండ్రి సురేష్ రత్వా చిరుత నోట కరుచుని తన బిడ్డను లాక్కెళ్లుతుండడాన్ని చూశాడు. భయంతో క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు. కానీ వెంటనే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. చిరుతపులి వైపు పరుగెత్తి, కేవలం ఒట్టి చేతులతోనే పోరాడాడు. ఎలాంటి ఆయుధం లేదు. భయం అంతకన్నా లేదు. చిరుతపై ఎగబడ్డాడు. బాలికను పట్టుకుని, మరో చేతితో దాని శరీరంపై పదేపదే పిడిగుద్దులు కురిపించాడు. దాని దవడలు విరిచాడు. చివరికి, చిరుత తన పట్టును సడలించి, బాలికను వదిలిపెట్టి, రత్వా ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి పారిపోయింది. అలా అత్యంత సాహసంగా తన నాలుగేళ్ల కుమార్తెను మృత్యుముఖం నుండి రక్షించాడు. బాలిక ముఖం, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, అయితే స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్సకు బాగా స్పందిస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై పావి జెట్పూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జయదీప్ సోలంకి స్పందిస్తూ రత్వా పోరాటాన్ని వివరించారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ తీవ్రమైన పోరాటంలో, చిరుత వెనక్కి తగ్గలేదు. రత్వాను పదేపదే గోళ్లతో రక్కింది. అయినా రత్వా పట్టు వీడలేదు.. మరో చేత్తో తన కుమార్తెను గట్టిగా పట్టుకుని, చిరుత పారపోయిందాకా పోరాడాడు అని తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో గ్రామస్తులు చిరుతలను చూశారు, కానీ మనిషిపై దాడి జరగడం ఇదే మొదటిసారని సోలంకి చెప్పారు.ఆహారం కోసం సమీపంలోని నదీ లోయ నుండి గ్రామంలోకి దారితప్పి వచ్చి ఉండవచ్చన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత చిరుత మళ్లీ కనిపించిందని స్థానికులు తెలిపారు. దాని జాడ పట్టుకుని, బంధించడానికి గ్రామం చుట్టూ ట్రాప్ కెమెరాలతో పాటు మూడు బోనులను ఏర్పాటు చేశారు.నాన్న అంటే అంతే... నెటిజన్లు ప్రశంసలుతండ్రి అంటే అంతే..ఇలాగే ఉంటాడు. తన కుటుంబం, పిల్లలు కాపాడుకునే విషయంలో క్రూరంగా మారిపోతాడు, ఎదురుగా ఎవరున్నా లెక్కచేయడు అంటూ అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)
-
పోలిక లేదని సొంత కొడుకును చంపిన తండ్రి
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో ఘోర దురంతం చోటు చేసుకుంది. తన పోలిక లేదనే అనుమానంతో సొంత కొడుకును నదిలోకి తీసుకెళ్లి ఓ తండ్రి నీటిలో ముంచి దారుణంగా చంపిన ఘటన జిల్లాలోని నాగఠాణ గ్రామంలో చోటు చేసుకుంది. నాగఠాణకు చెందిన సిద్ధార్థ (6) హత్యకు గురైన చిన్నారి. బాలుడు తండ్రి మల్లికార్జున అరకేరిని పలువురు మీ కుమారుడు సిద్ధార్థ చూడటానికి నీలాగా లేడని ఎద్దేవా చేసేవారు. దీన్ని రోజు వింటున్న మల్లికార్జున అక్కసుతో సొంత బిడ్డను నదిలో ముంచి చంపాడు. మహారాష్ట్రలోని కరాడ్ జిల్లా వడోలి వద్ద కృష్ణా నదిలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్చి 16న కుమారుడిని సదరు నదిలోకి తీసుకెళ్లి ముంచి చంపి తిరిగి ఊరికి వచ్చిన మల్లికార్జునను కొడుకు గురించి ఆరా తీయగా సింధగి వద్ద స్కూల్లో చేరి్పంచి హాస్టల్లో పెట్టానని నాటకమాడాడు. ఇక మే 1న సిద్ధార్థ్ పుట్టిన రోజు ఉంది. తీసుకొని రమ్మని తల్లి భాగ్యశ్రీ పట్టుబట్టింది. కొడుకు ఏడి? అని నిలదీయగా నిందితుడు మల్లికార్జున పరారయ్యాడు. దీంతో తల్లి భాగ్యశ్రీ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమారుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడని, దీంతో మల్లికార్జునను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్ (ఫోటోలు)
-
ఆడపిల్లలు పుట్టడమే శాపమా..? కూతుళ్లతో గడ్డి మందు తాగించి..
-
నాలుగేళ్ల కవలల్ని హత్య చేసిన కసాయి తండ్రి
-
కసాయి తండ్రి.. ఐదేళ్ల కవల కూతుళ్ల ప్రాణం తీశాడు..
సాక్షి, కరీంనగర్ : రూరల్ మండలం జూబ్లీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఇద్దరు కుమార్తెలను హత్య చేసి బావిలో పడేశాడు.పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం శ్రీశైలం తన భార్యతో గొడవపడ్డాడు. కోపోద్రికుడైన అతడు ఐదేళ్ల కవల కూతుళ్లకు గడ్డి మందు తాగించి అనంతరం బావిలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పిల్లల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక కూతురు మృతదేహం లభించగా, మరో కూతురు కోసం గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు శ్రీశైలంపై దాడి చేశారు. భార్యతో గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వారు చెబుతున్నారు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?
స్వల్ప వివాదానికే ముక్కపచ్చలారని చిన్నారిపై దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబైకి ఆనుకుని ఉన్నవసాయి ప్రాంతంలో, తండ్రితో వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని దారుణండి కొట్టాడు. చిన్నపిల్లాడు అన్న కనికరం కూడా లేకుండా తీవ్రంగా దాడి చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ ప్రకారం నిందితుడు సందీప్ పవార్, ఒక చిన్న విషయంపై బాలుడి తండ్రితో గొడవడ్డాడు. తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో.. క్షణికావేశంతో చేశాడో గానీ అక్కడే ఆడుకుంటున్న బాలుడు విఘ్నేష్ తన ప్రతాపాన్ని చూపించాడు. పసుపు రంగు టీ-షర్టులో విఘ్నేష్ అక్కడే ఆగి ఉన్న ఆటో-రిక్షాలో కూర్చుని ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ నిందితుడు బాలుడు కాళ్లు పట్టుకుని ఆటోలోంచి బయటకు లాగాడు. బాలుడిని నేలపై ఒకసారిగా విసిరి కొట్టాడు. తరువాత భవనం లోపలికెళ్లి, చిన్నారి తలను ఇనుప రాడ్‌కు కొట్టి, మళ్లీ నేలపై పడేశాడు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మీరా రోడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్య అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య ఇదీ చదవండి : భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు -
ఒకే సీటు కోసం తండ్రి, కుమార్తెల ఫైట్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏమిటంటే, అటు డీఎంకే లోనూ, ఇటు కాంగ్రెస్‌లోనూ ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన తండ్రీకూతుళ్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. డీఎంకేలో స్టాలిన్ సమక్షంలో ఇంటర్వ్యూ: చెన్నైలోని అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. సోమవారం ఈ ప్రక్రియ ముగియనుంది. ఆదివారం కోయంబత్తూరు జిల్లా డీఎంకే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో ఆర్.ఎస్.పురం ప్రాంత డీఎంకే కార్యదర్శి, 72వ వార్డు కౌన్సిలర్ కార్తీక్ సెల్వరాజ్ కోయంబత్తూరు దక్షిణం స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె కృపా శబరినాథన్ కూడా అదే సీటు కోరుతూ దరఖాస్తు సమరి్పంచారు. దీంతో పరిణామం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసిన స్టాలిన్, మీలో ఎవరికి సీటు ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారా? అని ప్రశ్నించడం గమనార్హం. ఇందుకు వారు స్పందిస్తూ, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామని, కొంగు మండలంలో వంద శాతం విజయం సాధించడమే తమ లక్ష్యమని తెలపడంతో స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ అదే సీన్ డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోయంబత్తూరు కార్పొరేషన్ మాజీ మేయర్ కలాలి వెంకటాచలం, ఆయన కుమార్తె గాయత్రి (ప్రస్తుత 44వ వార్డు కౌన్సిలర్) ఇద్దరూ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే కుటుంబానికి చెందిన తండ్రీ, కుమార్తె ఓ వైపు, కాంగ్రెస్ కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె మరో వైపు పోటీ పడుతుండటంతో ఇంతకీ ఈ సీటు కమల్ పార్టీ ఖాతాలోకి చేరేనా అన్న చర్చ ఊపందుకుంది. కమల్ ఖాతాలో పడేనా.. గత ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ పోటీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కోయబత్తూరు దక్షిణం నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఆయన సుమారు రెండు వేల లోపు ఓట్లతో బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసన్ చేతుల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా మక్కల్ నీది మయ్యం డీఎంకే కూటమిలో చేరింది. ఈ దృష్ట్యా, ఈసారి ఈసీటు ఆ పార్టీ ఖాతాలో పడేనా అన్నది వేచిచూడాల్సిందే. కమల్ తాజాగా ఎంపీ కావడంతో ఈ స్థానంలో ఆయన తరపున పార్టీ ప్రతినిధి పోటీ చేస్తారా..? లేదా, డీఎంకేకు వదలి పెడుతారా? అన్న చర్చ ఊపందుకుంది. ఒక వేళ కమల్ వదులకుంటే, ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే, మరో వైపు కాంగ్రెస్ మధ్య సమరం తప్పదేమో అన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
ఈ వారం కథ: అమ్మ పుట్టినరోజు
భాద్రపద మాసం, ఋషి పంచమి. నిండా పూలతో మందారం చెట్టు ఆకుపచ్చ చీరలో అప్పుడే కుంకుమ పూజ చేయించుకున్న అమ్మవారిలా ఉంది. ఇంటిముందు విరజాజి మొక్క రోజూ ఫోన్లో పలకరించే కూతురిలా పరిమళం వెదజల్లుతోంది.అటూ ఇటూ ఉన్న మామిడి, పనస సీజనల్ చెట్లు అప్పుడప్పుడూ వచ్చిపోయే కొడుకుల్లా గంభీరంగా ఉన్నాయి.‘‘అమ్మా రావాలి కేక్ కరిగిపోతోంది’’ చిన్నోడు తొందరపెట్టాడు.‘‘అయిపోయిందిరా వచ్చేస్తున్నాం’’ గదిలోంచి అమ్మకి పట్టుచీర కట్టి తీసుకొచ్చింది కూతురు. పెద్ద కొడుకు కవర్లోంచి శాలువా తీసి ట్యాగ్ చింపి పట్టుకుని రెడీగా ఉన్నాడు. జయంతి సోఫాలో కూర్చుంది. ఎదురుగా టీపాయ్ మీద ‘బిస్కఫ్’ కేక్ ఆమె వయసు డెబ్బై ఐదుగా ప్రకటిస్తోంది. కొడుకులిద్దరూ, కోడళ్ళు, కూతురు ఆమె చుట్టూ కూర్చున్నారు. అదే వీధిలో ఉంటున్న చిన్ననాటి స్నేహితురాలు శాంతమ్మ కూడా వచ్చింది. అల్లుడు కొంచెం దూరంగా కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. అతనికీ అత్తగారంటే అభిమానమే కాని, ఇలాంటి ఆర్భాటాలు అంతగా నచ్చవు. ఎక్కడెక్కడో ఉన్న మనవలు వీడియో కాల్లో చూస్తుండగా కేక్ కట్ చేసింది. పెద్దకొడుకు శాలువా కప్పాడు. పెద్దకోడలు అక్షింతలు కలిపి తెచ్చింది. ఒక్కొక్క జంటా కాళ్ళకి నమస్కారం పెడితే, బట్టలమూటతో వీధి వీధి తిరిగే బంగారయ్య దగ్గర కొన్న లుంగీ, తువ్వాలు, డజను జేబురుమాళ్ళు, ఆడవాళ్ళకి చీర జాకెట్టుతోబాటు పసుపు కుంకుమ, కవర్లో కొంత డబ్బు సర్ది ఉంచి కూతురిచేత అందరికీ ఇప్పించి, తనని కూడా తీసుకోమంది. వాళ్ళు సంతోషంగా తీసుకున్నారు. చిన్నోడు అక్క చేసిన మామిడికాయ పులిహోర క్యాన్‌తో తీసుకెళ్లి పక్కవీధిలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇచ్చి వచ్చాడు. జయంతి ఆరోజు ఉపవాసం ఉండటంతో మిగిలిన వాళ్లంతా కలిసి భోంచేస్తూ కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం టీ తాగి రాత్రికి ఇంత పులిహోర బాక్స్ కట్టుకుని ఎవరి ట్రైన్‌కి వాళ్ళు వెళ్లిపోయారు. దగ్గరే కాబట్టి కూతురు అల్లుడు కార్లో బయలుదేరారు. అలా ఆ ఏడు కూడా జయంతి పుట్టినరోజు వినాయకచవితి మర్నాడు ఘనంగా జరిగింది. జయంతి, ఆమె పెంచుకున్న వనం, పనమ్మాయి మిగిలారు. ∙∙ ‘‘ఏవండీ అత్తయ్యగారి ఫోను. చాలాసార్లు చేశారు’’ అంది రాధ ఫోన్ చిన్నోడి చేతికిస్తూ.‘‘టైం లేదు, దార్లో మాట్లాడతాలే’’ అన్నాడు టక్ సరిచేసుకుంటూ.‘‘చాలాసార్లు చేశారు. ఏం అర్జెంటో? ఒకసారి మాట్లాడొచ్చు కదా’’ అంది రాధ కొంచెం ఆందోళనగా ‘పోనీ నేనెత్తనా’ అన్నట్టు సైగ చేస్తూ.‘‘అదేం లేదు. సెప్టెంబర్ లో ఆవిడ పుట్టినరోజు కదా. మళ్ళీ టిక్కెట్లు దొరకలేదంటామని అరవైరోజుల ముందే చెప్పటాని కయ్యుంటుంది’’ అన్నాడతను లంచ్ బాక్స్ బ్యాగ్‌లో పెట్టుకుంటూ.‘‘అవును కదూ. అయితే మనం ఊరెళ్తున్నామోచ్’’ అంది రాధ చిన్నపిల్లలా. ‘‘లేదు, లేదు. ఈసారి వెళ్ళటానికి కుదరదు’’ అన్నాడతను విసుగ్గా.‘‘అదేంటండీ, ప్రతీ ఏడూ వెళ్తున్నాం. పేరుకి ఆవిడ పుట్టినరోజైనా ఎంజాయ్ చేసేది మనమే కదా. ఓ వేడుకలా జరుగుతుంది. నాకెంతో ఇష్టం అలా గడపటం’’ అందామె గుర్తుచేసుకుంటూ.‘‘నీకేం, చక్కగా ఆవిడిచ్చిన చీర కట్టుకుని డబ్బులు తీసుకుంటావు’’ అంటూ ఉండగానే రాధ అడ్డుపడి, ‘‘పాపం పెద్దావిడ అంత అభిమానంగా పిలిస్తే అలా అంటారేంటి’’ అంది.దానికతను సోఫాలో కూర్చుని షూ వేసుకుంటూ, ‘‘నిజమే. ఆవిడదేం పోయింది? అందరూ రావాలంటుంది. మన నలుగురూ ఫ్లైట్‌లో వెళ్ళొస్తే కనీసం ఏభైవేలవుతుంది. పిల్లలతో రైల్లో రోజున్నర కూర్చోగలమా. పోనీ వాళ్ళని వదిలేసి వెళదామా అంటే మనం ఎదురుగా ఉంటేనే చదవట్లేదు. ఇంక వదిలి వెళితే ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలిచి గందరగోళం చేస్తారు. పైగా చవితి మర్నాడు వర్కింగ్ డే. అమ్మ పుట్టినరోజుకి ఆఫీస్‌లో వారం సెలవంటే నవ్వుతారు. వెళ్లినంతకాలం వెళ్ళాం. ఇక చాల్లే. నువ్వు కూడా ఓ రెండు రోజులు ఫోనెత్తకు. తర్వాత ఫోన్ చేసి టికెట్స్ అయిపోయాయి అని చెబుదాం. పండక్కి ఎలానూ వెళతాం కదా.’’ అన్నాడు.‘‘పోనీ ఇప్పుడెళ్ళి పండక్కి మానేయొచ్చుగా?’’ అందామె.‘‘పండక్కి నా ఫ్రెండ్స్ అంతా వస్తారు. వాళ్ళని కూడా కలవొచ్చు’’ అన్నాడతను కార్ కీస్ తీసుకుని బయల్దేరుతూ. ఆమె చేతిలో ఫోన్ మోగుతూనే ఉంది. భర్త వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది రాధ.∙ ‘‘చెప్పమ్మా’’ అంది పద్మ భర్తకి ఇడ్లీలోకి రెండో పచ్చడి మిక్సీ చేస్తూ. ‘‘అదేనే ఈ ఏడు చవితి సెప్టెంబర్ ఆరున పడింది. ఆ మర్నాడే నా పుట్టిన రోజు. ఓ నాలుగు రోజులు ముందుగా వస్తే, జంతికలు, మిఠాయి చేసుకుందాం. మీరు చవితి ఇక్కడే చేసుకోవచ్చు’’ అంది జయంతి.‘‘అమ్మా ఆయనతో ఈ టాపిక్ ఎత్తాలంటేనే భయంగా ఉంది. ‘అస్తమానూ మీ ఇంటికి నన్ను రమ్మనకు, కావాలంటే నువ్వెళ్లిరా’ అని తిడుతున్నారమ్మా’’ అంది పద్మ మిక్సీ జార్లోని పచ్చడి బాక్స్‌లోకి ఒంపుతూ.‘‘అదేంటే, పెళ్ళై నలభై ఏళ్లయినా ఇంకా అత్తవారింటికి వెళ్లే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. ఉన్న వారం రోజులూ ఎంత మర్యాదగా చూస్తాం. అక్కడైనా అతను ఇంట్లో కూర్చోవటమేగా. అదేదో ఇక్కడే కూర్చోమను. అల్లుడుగారికి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతా’’ అనగానే టిఫిన్ ప్లేట్‌తో బాటు ఫోన్ కూడా భర్తకిచ్చింది పద్మ. దగ్గరి బంధువే కావటంతో జయంతికి అల్లుడంటే అభిమానంతో బాటు చనువెక్కువ. ‘‘నమస్తే అత్తయ్యా. మీ ఆరోగ్యం బావుందా?’’ అన్నాడతను.‘‘బావున్నాను అల్లుడుగారూ. అదే.. వినాయకచవితికి మీరు అమ్మాయిని తీసుకుని రావాలి, ఆ మర్నాడు నా పుట్టినరోజుకి కూడా ఉండి వెళ్ళాలి’’ అంది జయంతి అభిమానంగా. ‘‘శుభం అత్తయ్యా. మీరు ఇలా నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలి’’ ‘‘అది సరే, అల్లుడూ మీరు రావాలి’’దానికతను ‘‘అత్తయ్యా, నేనూ పెద్దవాడినైపోయాను. ఎక్కడివాళ్ళు అక్కడ ఇంత తిని రెస్ట్ తీసుకుంటే మంచిది. మీ జనరేషన్ వాళ్లకి ఇమ్యూనిటీ ఎక్కువ. మా దినచర్యలో చిన్న మార్పు వచ్చినా దగ్గో, జలుబో వచ్చేస్తోంది. ఈ తిరుగుళ్లు వల్ల, నీరు మార్పిడి వల్ల ఏమైనా వస్తే మీ పిల్లలు దేశంలోనే ఉన్నారు, వస్తారు. నా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, రాలేరు, అక్కడ స్థిమితంగా ఉండలేరు. అంచేత మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ అమ్మాయికి నచ్చచెప్పండి. మీరు పెద్దవారు, నొప్పిస్తే క్షమించండి’’ అన్నాడు అనునయంగా. జయంతి మరేం మాట్లాడలేకపోయింది. జయంతి పెద్దకొడుకు ఇల్లు. ‘‘ప్రశాంతీ’’ పిలిచాడు సాగర్.‘‘మీకు రెండోసారి కాఫీ ఇచ్చేసినట్టు గుర్తు. కావాలంటే మళ్ళీ ఇస్తాను’’ అంది ప్రశాంతి పూజకి ఏర్పాటు చేసుకుంటూ. ‘‘అదికాదు నీతో ఓ విషయం మాట్లాడాలి’’‘‘నేను దేవుళ్ళని తోముకోవాలి. ఓ గంట పడుతుంది. అంతవరకూ టిఫిన్ చెయ్యను. టాబ్లెట్ కూడా వేసుకోటానికి లేదు. ఈ మూడ్‌లో మీరు చెప్పే విషయం నాకు నచ్చినదైతే పరవాలేదు, నచ్చనిదైతే కొంచెం నెగటివిటీ పెరుగుతుంది. అదే టిఫిన్ చేసి మాత్ర వేసుకున్నాక ప్రశాంతంగా వింటే ఒకవేళ నచ్చకపోయినా మనం శాంతంగా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి ఏమిటి విషయం’’ అంది ప్రశాంతి దగ్గరకొచ్చి. ‘‘అర్జెంటేమీ లేదులే. నీ పని చూడు. తర్వాత మాట్లాడుదాం’’ అన్నాడతను పేపర్ తిరగేస్తూ. ఓ గంట పోయాక అతనికి టిఫిన్ ఇచ్చి, తనూ తెచ్చుకుని ఎదురుగా కూర్చుని ‘‘ఇప్పుడు చెప్పండి’’ అంది ప్రశాంతి. ‘‘అదే అమ్మ ఫోన్ చేసింది’’‘‘అవునా! ఏమిటట? బావున్నారా?’’ ‘‘హా! బావుంది. అదే భాద్రపద మాసంలో ఆవిడ పుట్టినరోజు కదా. ఎప్పటిలానే రమ్మంటోంది’’ అన్నాడు నసుగుతూ. ‘‘మీరేమన్నారు?’’ అడిగింది ‘‘నిన్నడిగి చెబుతానన్నాను’’ ‘‘దానికి ఆవిడేమన్నారు?’’ అతనేం మాట్లాడలేదు. ‘‘పర్లేదు చెప్పండి’’ ‘‘భార్యకి సమాన విలువ ఇవ్వటం, ఏదైనా నిర్ణయం కలిపి తీసుకోవటం, ఇవన్నీ నేనూ సమర్థిస్తానురా. కానీ ఇంత చిన్న విషయం కూడా ఆవిడని కనుక్కుని చెబుతాను అనటం అన్యాయంరా’’ తల్లి అన్న మాటలు గుర్తు చేసుకుని తలదించుకున్నాడు. ‘‘అర్థమైంది’’ అంది ప్రశాంతి నెమ్మదిగా ఎరుపెక్కుతూ. ‘‘అలా అని కాదు శాంతీ, ఆవిడ అన్నది కూడా నిజమేగా, ఇది చాలా చిన్న విషయం’’ అన్నాడతను నెమ్మదిగా.‘‘నిజమే. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. మామూలుగా అయితే వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు. రాత్రి స్వామి పవళింపు సేవ అనంతరం ఎక్కితే సుప్రభాత సేవ టైంకి దిగిపోతాం. చక్కగా మీకూ నాకూ బట్టలు పెడతారు, మనం కూడా ఓ చీర, స్వీట్స్ కొని పట్టికెళతాం, ఓ పూట అందరం కలుస్తాం. కానీ ఆ ముందురోజు వినాయక చవితి. ఇంట్లో వినాయకుణ్ణి పెట్టుకుని దీపం, నైవేద్యం పెట్టకుండా ఇల్లు తాళం పెట్టటం మంచిది కాదు. అలా అని మీరొక్కరూ వెళితే ఇప్పటికే గడుసుదానిగా పడిన ముద్ర మరింత బలపడుతుంది. పోనీ మీరు నా తరఫున బలంగా చెబుతారా అంటే ఏమీ మాట్లాడరు. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం’’ అని, ఇలా కొనసాగించింది. ‘‘ఈ వయసులో ఆవిడకి ఈ సరదాలు అవసరమా అని నేననను. చెప్పానుగా ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం?’’ సాగర్ ఏమీ మాట్లాడలేదు. ∙∙ మరో నాలుగు సంవత్సరాల తర్వాత భాద్రపద మాసం, ఋషి పంచమి.పనమ్మాయి సాయంతో జయంతి తలస్నానం చేసింది. పెద్దకోడలు కేక్ ఆర్డర్ పెట్టింది. చిన్న కొడుకు ఫ్లవర్స్ పంపాడు. కూతురు ఆన్లైన్లో చీర పంపింది. అందరూ వీడియో కాల్లోకి వచ్చారు. జయంతి కేక్ కట్ చేసింది, ఆమె ఎడం కన్ను అదే పనిగా నీరు కారుతోంది. మొహం పొంగి ఉండటం గమనించి కాళ్ళ వాపు చూసి, తనకున్న సోషల్ మీడియా పరిజ్ఞానంతో డై యూరెటిక్ టాబ్లెట్ వేసుకోమన్నాడు చిన్నోడు. పండక్కి వచ్చినప్పుడు టోటల్ బాడీ చెకప్ చేయిద్దామన్నాడు పెద్దోడు. అంతా ఫోన్ పెట్టేసారు. మూణ్నెల్లు ముందే ఎవరి కవర్లలో వాళ్ళకి సర్ది ఉంచిన బట్టలు, పసుపు కుంకుమ ఎదురింటి అబ్బాయికిచ్చి కొరియర్ చేయించింది. డబ్బులు కూడా అతనికే ఇచ్చి యాప్ ద్వారా పంపమంది. కేక్‌ని వీధిలో పిల్లలందరికీ పంచింది పనమ్మాయి. ∙∙ ధనుర్మాసం.జయంతికి వొంట్లో బాగోలేకపోవటంతో అందరూ పండక్కొచ్చారు. అంతకుముందు హాల్లోనే కూర్చుని హడావిడి చేసే జయంతి గదిలో మంచానికి పరిమితమైంది. పెద్దగా తిండి సహించటం లేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు, వార్ధక్యం మినహా పెద్దగా జబ్బులేవీ బయటపడలేదు. ఆకలి పెరగటానికి టానిక్ రాసి పంపేశారు. ‘పుట్టినరోజు జరుపుకోకపోతే ఇంతలా బెంగ పడిపోవాలా’ అని పిల్లలు బాధపడ్డారు. ‘బర్త్‌డే బ్లూస్’ గురించి, ‘నార్సిజం’ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అంతలో శాంతమ్మ మనవడి సాయంతో వచ్చింది. జయంతిని పలకరించి హాల్లోకొచ్చింది. జయంతి పిల్లలు ముగ్గురూ ఆవిడని బాగా ఎరుగుదురు. ఆవిడకి కాఫీ ఇచ్చి కూర్చున్నారు. ‘‘అదే పిన్నీ, టెస్ట్‌లు చేయిస్తే అంతా నార్మల్‌గానే ఉంది అన్నారు. ఎనభై వచ్చాయి, ఇంకా ఒంటరిగా ఉండొద్దు, వచ్చెయ్యమంటే వినదు. ఈమధ్య ఏవో కారణాలవల్ల ముగ్గురం రాలేక పోయాం. అప్పటి నుంచి ఇలా మంచం పట్టింది. మా చిన్నప్పుడెప్పుడూ అమ్మ తన పుట్టినరోజు జరుపుకున్నట్టు గుర్తులేదు. అదేంటో మేమంతా వేరే ఊళ్ళల్లో స్థిరపడ్డాకే మొదలెట్టిందీ అలవాటు’’ అని విసుక్కున్నారు. శాంతమ్మ అంతా విని, నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టింది. ‘‘మనుషుల మధ్య ఇప్పటికీ గోడలుగా ఉన్న కులం అప్పట్లో కోటలుగా ఉండేది. ఒకర్నొకరు ఇష్టపడ్డ కారణానికి రెండు కుటుంబాలనీ వదులుకోవలసి వచ్చింది. అప్పుడు మీరు చిన్నపిల్లలు. మీ నాన్న పుట్టినరోజున శాంతి ఆశ్రమానికి వెళ్లొస్తూ ఉండగా ఓ కారు గతితప్పి దూసుకొచ్చింది. మీ అమ్మని తప్పించబోయే ప్రయత్నంలో మీ నాన్న ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో రెండు నెలలు ట్రీట్మెంట్ జరిగినా లాభం లేకపోయింది. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు దూరమైన బాధ ఆ క్షణం అతనిలో స్పష్టంగా తెలిసింది. చివర్లో వాళ్ళు వచ్చినా ఐసీయూలో ఒకరి తర్వాత ఒకరిని, అదీ కొన్ని నిమిషాలపాటు మాత్రమే చూడగలిగారు. అప్పుడే ఆయన తన చివరి కోరికగా మీరంతా పెద్దయ్యాక ఎక్కడెక్కడ స్థిరపడినా కనీసం ఏడాదికోసారైనా కలిసి సంతోషంగా గడిపేలా చూడమని మీ అమ్మకి చెప్పాడు. పండక్కి కలుద్దామంటే ఆడపిల్ల వాళ్ళ అత్తవారింటికి వెళుతుంది. పెద్దోడిని అతని భార్య తన పుట్టింటికి తీసుకువెళ్తుంది. చిన్నోడు వచ్చినా వాడి స్నేహితులతో గడపటానికే సరిపోతుంది’’ అనగానే ముగ్గురూ తలదించుకున్నారు. ఆమె కొనసాగించింది. ‘‘మీ నాన్న పుట్టినరోజు వేడుకంటే ఎవరైనా ఆక్షేపిస్తారేమోనని అదే రోజు మీ అమ్మ తన పుట్టినరోజుగా మిమ్మలందర్నీ రప్పిస్తోంది. ఆ రోజు మీరంతా కలిస్తే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుందని తన నమ్మకం. ఈమధ్య మీరు రావటం మానేశారు. బహుశా అదే ఆమె బెంగకి కారణం కావొచ్చు. ఈ విషయాలేవీ మీ అమ్మెప్పుడూ మీకు చెప్పాలనుకోలేదు. నేను చెప్పినట్టు తనకి తెలియనివ్వకండి’’ అని, కాసేపాగి ఆయాసం తగ్గాక పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కొద్దిగా తాగింది.ఇదంతా విని అందరి కళ్ళూ చెమర్చాయి. తండ్రి మరణం, తల్లి కారుణ్య నియామకంలో ఉద్యోగంలో చేరి తమని పెంచి ప్రయోజకులని చెయ్యటం, ఇదంతా తెలుసు. కానీ ఈ పుట్టినరోజు వేడుకలు అమ్మ సరదా అనే అనుకున్నారు ఇంతకాలం. వయసు, బాధ్యతలూ, పెరుగుతున్నకొద్దీ పుట్టినరోజుకి తను చేసే ఆర్భాటాన్ని చూసి విసుక్కుని రాకుండా తప్పించుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయం శాంతమ్మ ద్వారా తెలిశాక అంతా ఓ నిర్ణయానికొచ్చారు. ముందుగా చిన్నవాడు మొదలుపెట్టాడు. ‘‘మనకి అమ్మే నాన్న. రాబోయే పుట్టినరోజు అమ్మకి ఎనభై నిండుతాయి. ఘనంగా చేద్దాం.’’ అన్నాడు. ‘‘వీలైంతమందికి అన్నదానం చేద్దాం’’ అంది కూతురు. ‘‘వస్త్రదానం కూడా చేస్తే మంచిది. అది కూడా ప్లాన్ చేద్దాం’’ అంది పెద్ద కోడలు.అందరూ సంతోషంగా లేచి వెళ్లి తల్లికి ఈ విషయం చెప్పారు. జయంతి సంతోషించింది. లేచి కొంత అన్నం తింది. తమతో రమ్మని ఎంత బతిమిలాడినా జయంతి రాలేనంది. ‘ముక్కనుమ’ అవగానే అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు. భాద్రపద మాసం – ఋషి పంచమి.ముందురోజు చవితి కావటంతో ‘పత్రి’ కోసం కొమ్మల్ని అర్పించుకోవటం వల్లో, మరో కారణం చేతో, చెట్లన్నీ బోసిపోయినట్లున్నాయి. అనుకున్నట్టుగానే అందరూ వచ్చారు. పేదలకీ, పనివాళ్ళకీ భోజనాలు పెట్టి, బట్టలు పంచారు. ప్రతీ ఏటా అందరూ ఇలా కలవాలని మాట్లాడుకున్నారు. కానీ ఇవేవీ చూడ్డానికి జయంతి లేదు. పిల్లలు ఏడాదికొకసారైనా కలవాలనే భర్త కోరిక తీర్చలేకపోయాననే లోటు తప్ప ఆమెదేమీ అకాలమరణం కాదు. తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి, సంపూర్ణమైన జీవితం గడిపాకే శివైక్యం పొందింది. జగమంత పందిరేసినా ‘జయంతి’ జన్మదినం కాబోదు. జన్మంత ప్రేమ ఒలకపోసినా పోయినవాళ్ళు తిరిగిరారు. ఏదైనా ఉన్నప్పుడే! ∙ఉమా మహేష్ ఆచాళ్ళ -
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
సిద్ధిపేట జిల్లా: ఒకే బస్సులో తండ్రీకొడుకు విధులు నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నా బాద్ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. హుస్నాబాద్‌కు చెందిన బంధనాపురం ఎల్లయ్య 34 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఆయన కుమారుడు బంధనాపురం ప్రేమ్ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకు ఇద్దరూ ఒక్కటే బస్సులో డ్యూటీ చేయడం ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. ఎల్లయ్య ఆర్టీసీ డ్రైవర్‌గా సేవలు అందిస్తూ ఉత్తమ డ్రైవర్‌గా పలుసార్లు అవార్డులు అందుకున్నాడు. ప్రమాదరహిత డ్రైవర్‌గా సేవలు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒకే బస్సులో విధులు నిర్వహించడంపై తండ్రి ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశాడు. -
పరీక్ష రోజే తండ్రి మరణం.. శోకాన్ని దిగమింగుతూ
సాక్షి, మెదక్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడి పరీక్ష రోజే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. దీంతో పుట్డెడు దుఃఖాన్ని దిగమింగుతూ. అంతటి శోకంలోనూ ఆ పిల్లాడు పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు.. ఈ ఘటన పలువురిని కంటతడికి గురిచేసింది. శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో ఈ రోజు ( శనివారం) అర్ధరాత్రి శివాoపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా నేడు అతని అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే అంతటి దుఃఖంలోనూ అతని కుమారుడు కుమ్మరి ధనుష్ తన బాధను దిగమింగుకుంటూ తూప్రాన్ లోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు అతను ఇప్పుడు భౌతికంగా తమవద్ద లేకపోయినటప్పటికీ నాన్న కష్టం వృధా కాకూడదని పరీక్షలకు హాజరవుతున్నానని విలపించాడు. ఈ ఘటన అక్కడి స్థానికులను ఎంతగానో కలిచివేసింది. -
లేటు వయసులో తండ్రైన హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా 50 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. ఆయన భార్య లిన్ లైస్రామ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు, అభిమానులు అభినందలు చెబుతున్నారు. హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లోనూ మెప్పించిన రణ్‌దీప్ గతేడాది వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్‌గా అలరించాడు. ఈరోజు నేను తండ్రి అయినందుకు మా నాన్న పట్ల నా కృతజ్ఞత మరింత పెరిగిందని రణ్‌దీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా నన్ను తండ్రిని చేసినందుకు.. మన చిన్న అమ్మాయిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు నా భార్య లిన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఈ జంటకు మొదటి బిడ్డగా పాప పుట్టడంతో ఆనందం మరింత రెట్టింపైంది.కాగా.. 2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్‌దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. కాగా.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్‌ని మణిపురి సంప్రదాయంలో రణ్‌దీప్ పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం
టాప్-3 బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట విషాదం నెలకొంది. ఈ విషయాన్ని పవన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీ నాన్న నీతో లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్ షో సమయంలో కూడా తన తండ్రి ఆరోగ్యం బాగలేదని డీమాన్ పవన్ చెప్పారు. వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇంతలోనే ఆ కుటుంబంలో ఈ విషాదం నెలకొంది. అయితే పవన్ తండ్రి నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.కాగా.. బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ టాప్-3లో నిలిచాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన టాలెంట్‌తో అదరగొట్టేశాడు. రెండుసార్లు కెప్టెన్ కూడా అవ్వడమే కాకుండా తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. -
పసికందు మృతదేహంతో 20 కిలోమీటర్లు నడక
జార్ఖండ్‌లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొద్దిసేపటికే మృతిచెందిన పసికందును ఆసుపత్రి వర్గాలు అంబులెన్స్‌లో తరలించడానికి నిరాకరించాయి. దీంతో ఆ పాప మృతదేహాన్ని తండ్రి చేతపట్టుకొని 20 కిలోమీటర్ల వరకూ నడుస్తూ తీసుకెళ్లాడు. ఈ ఘటన పలువురిని ఆవేదనకు గురిచేసింది.పశ్చిమ సింగ్ఫూమ్, బాంగ్రాసాయ్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి గర్భిణీ అయిన తన భార్యను చక్రధర్ పుర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు. శనివారం రోజు ఆ మహిళ ప్రసవించింది. అయితే కొద్దిసేపటికే ఆ పాప మృతిచెందింది. అయితే ఆ వెంటనే ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందు మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిందిగా అతనిపై ఒత్తిడి తెచ్చారు. అయితే దానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా సదరు సిబ్బంది కోరగా వారు నిరాకరించారు.అయితే పేదరికం రీత్యా ఇతర వాహనాన్ని ఏర్పాటు చేయడానికి డబ్బులు లేకపోవడంతో ఆ పసికందు మృతదేహాన్ని తన తండ్రి ఒక బాక్సులో పెట్టి తీసుకెళ్లాడు. 20 కిలోమీటర్ల దూరం ఉన్న తన ఇంటికి నడుస్తూ వెళ్లాడు. ఈ బాధాకర సన్నివేశం అక్కడున్న వారిని ఆవేదనకు గురి చేసింది. అయితే డెలివరీ సమయంలోనూ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.కాగా ఈ ఘటనపై ఆసుపత్రి డాక్టర్ అనుష్మాన్ శర్మ భిన్నంగా స్పందించారు. అంబులెన్స్ కావాలని ఆ పాప తండ్రి గాని బంధువులు గానీ తమను సంప్రదించలేదని ఒకవేళ సంప్రదిస్తే తప్పనిరిగా అంబులెన్స్ ఏర్పాటు చేసేవారిమని డాక్టర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది. -
ముగ్గురు బిడ్డలను పోషించలేక కన్న తండ్రి దారుణం
-
కామారెడ్డిలో దారుణం.. ముగ్గురు పిల్లల్ని హతమార్చిన కన్న తండ్రి
-
పెంచలేక ముగ్గురు పిల్లల్ని చెరువులోకి తోసేసిన తండ్రి
సాక్షి,కామారెడ్డి: ముగ్గురు చిన్నారుల అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. పెంచలేక తన కుమార్తెలను చెరువులోకి తోసేసినట్లు తండ్రి ఇస్మాయిల్ అంగీకరించాడు.పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి ఆర్బీ నగర్‌కు చెందిన ఇస్మాయిల్,షబీనా దంపతులు. వారికి షీపత్(8), ఆయత్ (7), మరియం(5) కుమార్తెలు. ఇస్మాయిల్ ఆటో నడుపుతుండగా.. షబీనా కూలి పనులకు వెళ్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. అయితే, ఇటీవల ఇస్మాయిల్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రూ.5లక్షలకు పైగా అప్పులు ఉన్నాయి. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి, మరోవైపు పిల్లల్ని పెంచడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఇస్మాయిల్ దారుణానికి ఒడిగట్టాడు. పిల్లల్ని పెంచలేక స్థానిక చెరువులో తోసేశాడు. ప్రాణాలు పోయాయా? లేవా? అని నిర్ధారించుకునేందుకు అరగంట సేపు అక్కడే ఉన్నాడు.పిల్లల అదృశ్యంపై ఇస్మాయిల్ భార్య షబీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. తండ్రి ఇస్మాయిల్‌ను సైతం ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో తండ్రి ఇస్మాయిల్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. విచారణలో కుమార్తెలను తాను ప్రాణం తీసినట్లు అంగీకరించాడు. చెరువులో నుంచి పిల్లల్ని వెలికి తీశారు. -
కన్న తండ్రే కాలయముడయ్యాడు..
కామారెడ్డి క్రైం: పోషించడం చేతకాక కన్న తండ్రే తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తన చేతులతోనే అభం శుభం ఎరుగని చిన్నారులను చెరువులో తో సేసి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డిలో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీలో నివాసం ఉండే ఇస్మాయిల్, షహీబాలకు ముగ్గురు కుమార్తెలు షీపత్(8), అయాత్(7), మరియం(5) ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా కుమార్తెలను దుకాణంలో తినుబండారాలు కొనిస్తానని తీసుకెళ్లాడు. దగ్గర్లోని దుకాణానికి వెంట తీసుకువెళ్లిన తండ్రి, పిల్లలలు ఇంటికి తిరిగి రాలేదు. కొద్ది సేపటికి షబీనా భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదని అడిగింది. తాను పిల్లలకు తినుబండారాలు కొనిచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాలని సూచించి ఆటో నడిపేందుకు బయటకు వెళ్లిపోయాన ని బుకాయించాడు. పిల్లలు తప్పిపోయినట్లు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నాటకమాడాడు. అందరూ కలిసి చాలా సేపు సమీప ప్రాంతాల్లో పిల్లల కోసం గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాయంత్రం చీకటిపడే వరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించినా పిల్లల ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు ఇస్మాయిల్‌ను విచారించగా తానే పిల్లలల్ని చెరువులో తోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు వెంటనే పెద్ద చెరువు వద్దకు చేరుకుని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 10 గంటల ప్రాంతంలో అయాత్, మరియంల మృతదేహాలు లభించాయి. షీపత్ మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అర్ధరాత్రి కనుగొన్నారు. విషయం బయటకు తెలియడంతో పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోషణ భారమై పిల్లలను తానే హత్య చేసినట్లు ఇస్మాయిల్ అంగీకరించాడని పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. -
"నేను మంచి తండ్రిని కాలేకపోయా"
ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఇతరులు యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. అయితే నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగ ప్రకటన చేశారు. తను ఒక మంచి తండ్రిగా ఉండలేక పోయానన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మెుదలయ్యి నాలుగేళ్లు గడిచింది. ఈ సంగ్రామంలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ‘సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్ఐఎస్)’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ యుద్ధం ముగింపుకోసం ఎన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా పలు దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగ ప్రకటన చేశారు.ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ " ఈ యుద్ధ సమయంలో నేను మంచి తండ్రిగా ఉండలేకపోయా, ఎందుకంటే నాపిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోయా, ఎందుకంటే నేను ఉక్రెయిన్ అధ్యక్షున్ని, నామెుదటి ఎంపిక ఎప్పుడూ దేశమే" అని జెలెన్స్కీ ఉద్వేగభరితంగా మాట్లాడారు. మా ప్రజలు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.అయితే రష్యా దాడులతో దేశంలో ఎలక్ట్రిసిటీ లేక దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని జెలెన్స్కీ తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా వాతావరణం మైనస్ 30 డిగ్రీలకు చేరుకుందని దీంతో ప్రజలంతా అవస్థలు పడుతున్నారన్నారు. అయితే యుద్ధం వల్ల పాడైపోయిన విద్యుత్ వ్యవస్థ తిరిగి పునరుద్దరిద్దామంటే రష్యా దాడులతో అది సాధ్యపడడం లేదన్నారు.ట్రంప్‌కు థ్యాంక్స్కొద్దిరోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడానని శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలని తెలిపారు. అయితే తమ దేశానికి చెందిన భూభాగాలని రష్యా తమదని ప్రచారం చేసుకోవడంతో విభేదాలు సాగుతున్నాయని తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడితో ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేయాలని జెలెన్స్కీ కోరుతున్నారు. అయితే రష్యా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దాని బదులు జెలెన్స్కీని మాస్కోకు రావాలని ఆహ్వానించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోలేదు. -
ప్రేమిస్తే చంపేస్తారా..? కూతురితో బలవంతంగా పురుగుల మందు తాగించి
-
రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
-
ఓ కూతురు తండ్రికి రాసిన మరణశాసనం
వేలూరు (తమిళనాడు): కుమార్తె ప్రేమ వివాహాన్ని ప్రశ్నించిన వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో వెలుగు చూసింది. వివరాలు.. అరసమరపేటకు చెందిన యోగనాథన్(63) సత్‌వచ్చారిలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి పదవీ విరమణ చేశాడు. బుధవారం ఉదయం యోగనాథన్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. బంధువులకు విషయం తెలిసి వేలూరు సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై విచారణ చేపట్టారు. యోగనాథన్ కుమార్తె వినోదిని ఏడాది కిందట ప్రేమవివాహం చేసుకుంది. విషయం తండ్రికి తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇంట్లో తండ్రికి తన భర్త కనిపించకుండా చూసుకునేది. ఈ విషయం యోగనాథన్కు తప్పా మిగతా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఇటీవల ప్రేమ వివాహం గురించి యోగనాథన్కి తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో యోగనాథన్ ఇంట్లో మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించారు. విచారణలో యోగనాథన్ది హత్య అని తేలడంతో పోలీసులు మృతుడి భార్య విమలాదేవి, కుమారుడు గోవిందరాజ్, స్నేహితులు అశ్వథామన్, శివదాస్, కుమార్తె వినోదినిని గురువారం అరెస్ట్ చేశారు. -
ఫోన్ చూడొద్దన్న తండ్రి... కొడుకు ఆత్మహత్య
బంజారాహిల్స్: ఫోన్లో వీడియోలు చూడవద్దని, గేమ్స్ ఆడవద్దని స్కూల్‌కు క్రమం తప్పకుండా వెళ్లాలని తండ్రి హితవు పలకడంతో భరించలేని 12 సంవత్సరాల విద్యార్ధి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఫస్ట్‌లాన్సర్, సయ్యద్ నగర్లో నివసించే మహ్మద్ అఫాన్ ఖాన్ (12) సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మారు తల్లి వద్ద పెరుగుతున్నాడు.తండ్రి ఇర్ఫాన్ ఖాన్ వాల్ పెయింటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిస్తున్నాడు. మొండివాడిగా ముద్రపడ్డ అఫాన్ ఖాన్ తండ్రి చెప్పినా వినకుండా ఫోన్లో వీడియోగేమ్ చూస్తూ స్కూల్‌కు డుమ్మా కొడుతున్నాడు. ఇప్పటికే మూడు స్కూల్స్ మారాడు. స్కూల్‌కు సక్రమంగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వీడియో గేమ్స్ చూస్తుండడంతో తండ్రి మందలించాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇర్ఫాన్ ఖాన్ తన భార్యతో కలిసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న అఫాన్ తన గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పరిధిలోగల ఆషియానాలో సభ్యసమాజం తలదించుకునే ఘోరం చోటుచేసుకుంది. తండ్రీకొడుకుల మధ్య చదువు విషయంలో తలెత్తిన వివాదం చివరకు తండ్రి ప్రాణాలను బలిగొంది. మద్యం వ్యాపారంతో పాటు పాథాలజీ ల్యాబ్‌ను నిర్వహిస్తున్న మన్వేంద్ర సింగ్ (49)ను అతని కుమారుడు, బీకామ్ విద్యార్థి అక్షత్ సింగ్(21) అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఫిబ్రవరి 20న జరిగిన ఈ ఘటన పోలీసుల విచారణలో వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది.పోలీసుల కథనం ప్రకారం.. అక్షత్ సింగ్‌ను ‘నీట్’ పరీక్షకు సిద్ధం కావాలని తండ్రి మన్వేంద్ర సింగ్ కోరేవాడు. అయితే అక్షత్, బీకామ్ చదవాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే గత ఏడాది మీరట్‌లో జరిగిన ఒక హత్య ఉదంతం (సౌరభ్ రాజ్‌పుత్ కేసు) గురించి సోషల్ మీడియాలో చదివిన అక్షత్, తన తండ్రిని కూడా అదే తరహాలో వదిలించుకోవాలని ప్లానింగ్ చేశాడు.ఫిబ్రవరి 20 తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో తండ్రీ కొడుకుల మధ్య చదువు విషయమై మరోసారి ఘర్షణ చెలరేగింది. ఆగ్రహంతో అక్షత్ తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రైఫిల్‌తో అతనిపై కాల్పులు జరిపాడు. ఈ ఘోరం అక్షత్ చెల్లెలి ముందే జరిగింది. ఆ సమయంలో నోరు విప్పితే చంపేస్తానని చెల్లెలిని చంపేస్తానని అక్షత్ బెదిరించాడుహత్య అనంతరం సాక్ష్యాలను రూపుమాపేందుకు అక్షత్ మూడవ అంతస్తులో ఉన్న మృతదేహాన్ని కిందకు ఈడ్చుకొచ్చి, ఇంట్లోని పనిముట్లతో శరీర భాగాలను ముక్కలు చేశాడు. తల, మొండెం భాగాలను ఒక నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి, చేతులు, కాళ్లను తన కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతమైన సద్రౌనాలో పడేశాడు. ఆ తర్వాత తన తండ్రి ఢిల్లీ వెళ్లారని, ఫోన్ కలవడం లేదంటూ, అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తండ్రి కనిపించడం లేదంటూ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడు.అక్షత్ పొంతన లేని సమాధానాలు, కారును అత్యంత శుభ్రంగా కడగడం తదితర చర్యలపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్షత్‌ను తమదైన శైలిలో విచారించారు. మొదట తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని బుకాయించినప్పటికీ, చివరకు అక్షిత్ నిజం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఫోరెన్సిక్ బృందాలు సద్రౌనా ప్రాంతంలో మన్వేంద్ర సింగ్ శరీర భాగాల కోసం గాలిస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘చుక్కలు చూపిస్తా’: అమెరికా అధ్యక్షుని హెచ్చరిక -
మద్యం మత్తులో తండ్రిని నరికి చంపిన తనయుడు
కొండిపర్రు(పామర్రు): పొయ్యిలో మంట ఎందుకు ఎక్కువగా పెట్టావని తిట్టిన తండ్రిని మద్యం మత్తులో ఉన్న కుమారుడు హత్య చేశాడు. ఈ ఉన్మాదం కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పామర్రు పోలీసుల కథనం మేరకు.. కొండిపర్రు గ్రామశివారు డీపీగూడెంలో చదువుల సురేష్(45)కుమారుడు చంద్ర మహేష్ నివసిస్తున్నారు. సురేష్ భార్య గతంలో మృతి చెందింది. 22 ఏళ్ల చంద్రమహేష్ పనీపాట చేయకుండా తాగి తిరుగుతుంటాడు. ఆదివారం రాత్రి చంద్ర మహేష్ పొయ్యి వెలిగించి నీరు కాస్తున్నాడు.ఆ సమయంలో తండ్రి సురేష్ వేడి నీరు తోడుతూ ఎందుకు ఇంత పెద్ద మంట పెట్టావు అని తిట్టాడు. మద్యం మత్తులో ఉన్న చంద్రమహేష్ ఆగ్రహంతో అక్కడే ఉన్న కత్తి తీసి తండ్రి మెడతో పాటు ఇంకా రెండు చోట్ల నరికాడు. సురేష్ రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా స్థానికులు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యంలోనే సురేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు సీఐ సుభాకర్ తెలిపారు. -
మరో ‘బ్లూ డ్రమ్’ తరహా హత్య.. తండ్రి ప్రాణాలు బలితీసిన కుమారుడు
లక్నో:21ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేసిన ఘటనతో లక్నో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తండ్రికి కుమారుడ్ని డాక్టర్ని చేయాలని కోరిక. కుమారుడిది తనకు నచ్చిన రంగంలో స్థిరపడాలనే కోరిక. ఈ సంఘర్షణే చివరికి తండ్రి హత్యకు కారణమైంది.పోలీసుల వివరాల మేరకు..49 ఏళ్ల మన్వేంద్ర సింగ్ లక్నోలో ఫార్మాస్యూటికల్, మద్యం వ్యాపారం చేస్తున్నాడు. అయితే,మన్వేంద్ర తన కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ను చేయాలనే కోరిక ఉండేది. ఇదే విషయంలో గతంలోనూ తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తండ్రిని విభేదించి రెండు మూడుసార్లు ఇంట్లో నుంచి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి.ఫిబ్రవరి 21న సాయంత్రం 4.30 గంటల సమయంలో కుమారుడు అక్షత్‌కు తండ్రి మన్వేంద్ర సింగ్‌కు ఇదే విషయంపై మరోసారి వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగింది. ఈ క్రమంలో కోపోద్రికుడైన అక్షత్ ఇంట్లో ఉన్న రివాల్వర్ని తెచ్చి తండ్రిపై కాల్పులు జరిపాడు.అనంతరం మూడో అంతస్తు నుంచి శరీరాన్ని కిందికి తీసుకువచ్చి, ఖాళీ గదిలో ముక్కలు చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతని సోదరి చూసినా, ఆమెను బెదిరించి మౌనంగా ఉంచాడు.శరీర భాగాలను ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసి, కొన్నింటిని సమీప ప్రాంతంలో పారేశాడు. మిగతా భాగాలను ఇంట్లోని బ్లూ డ్రమ్‌లో ఉంచాడు. పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని పిలిచి, ఇంట్లో సాక్ష్యాలు సేకరిస్తున్నారు. శరీర భాగాలను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.అక్షత్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. లభించిన ఆధారాల ఆధారంగా సంబంధిత న్యాయ విభాగాల కింద కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లక్నో అషియానా ప్రాంత సీనియర్ అధికారి విక్రాంత్ వీర్ తెలిపారు. -
తలశిల రఘురాం తండ్రి పాడె మోసిన పేర్ని నాని
-
తలశిల రఘురాం తండ్రి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తండ్రి తలశిల చంద్రశేఖరరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం వైఎస్ జగన్.. విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఇది జరిగినప్పటికీ.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలోనే హిందీ సెలబ్రిటీలు అందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నివాళి అర్పిస్తున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు)స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, షేర్ షా తదితర సినిమాలతో హీరోగా కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా.. ఫిబ్రవరి 14న ఢిల్లీ తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భార్య కియారా అడ్వానీతో కలిసి ఢిల్లీ వెళ్లిన సిద్ధార్థ్.. అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కష్టకాలంలో కుటుంబంతో కలిసి ఉన్నారు. నాన్న చనిపోయిన విషయాన్ని మర్చిపోలేకపోతున్న సిద్ధార్థ్.. మంగళవారం రాత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని బోలెడన్ని ఫొటోలని పంచుకున్నాడు.'ఆయన నిజాయతీ కలిగిన వ్యక్తి. ఎప్పుడూ తలవంచలేదు. జీవితం ఆయన్ని పరీక్షించినప్పుడు కూడా బలంగా నిలబడ్డారు. మర్చంట్ నేవీ కెప్టెన్‌గా సముద్రాన్ని శాసించడం దగ్గర నుంచి అనారోగ్యాన్ని ఎదుర్కోవడం వరకు ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. స్ట్రోక్ వల్ల ఆయన వీల్ ఛైర్‌కే పరిమితమైనప్పటికీ బలంగా నిలబడ్డారు. మీ పాజిటివిటీ ఇప్పటికీ ఈ కుటుంబాన్ని కలిపి ఉంచుతోంది. నిద్రలోనే మమ్మల్ని మీరు వదిలి వెళ్లారు. మీరు లేని లోటు తీరనిది. మీ వల్లే నేను ఇలా ఉన్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను నాన్న' అని సిద్ధార్థ్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: సరైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
ఢిల్లీ రోడ్డు ప్రమాదం.. మాది తప్పే
కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో 17 ఏళ్ల టీనేజర్ నిర్లక్ష పూరితంగా కారు నడిపిన ఉదంతంలో 23 ఏళ్ల యువకుడు సాహిల్ ధనేశ్ర ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనలో ‘రీల్స్’ కోణం లోనే అని బహిర్గతమైంది. దీంతో ఆయువకుడి తల్లి తీవ్ర ఆవేదనకు గురైంది. సంపన్నుల పిల్లలు సరదాగా చేసే ‘రీల్స్’కు తన ఒక్కగానొక్క కుమారుడు బలయ్యాడని మృతుని తల్లి ఇనా మాకెన్ కన్నీటిపర్యంతమైంది. అయితే ఈ ఘటనపై నిందితుడి తండ్రి క్షమాపణలు తెలిపాడు.టీనేజర్ తండ్రి మాట్లాడుతూ.. "ఇది చాలా తప్పు ఆరోజు నా భార్యకు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది. నా కుమారుడికి యాక్సిడెంట్ జరిగినట్లు తెలిసింది. దీంతో ఎంతో భయానికి గురయ్యా. నా భార్యను అడిగా ఇది ఎలా జరిగిందని, అప్పుడు తను చెప్పింది. కారుతో ప్రమాదం జరిదిందని చెప్పింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను." అని ఆయన అన్నారు.మైనర్ బాలుడికి కారు ఇవ్వడం కరెక్టేనా?ఆ సమయంలో నేను అక్కడ లేను. ఆయనకు కారు ఇవ్వడం తప్పేకారుపై 13 చలాన్లు ఉన్నాయిగా?అది బిజినెస్ కోసం తిరిగే కారు దానిపై చలాన్లు ఉండడం సహజంమీరు మీ మైనర్ కుమారున్ని డ్రైవింగ్ చేయకుండా ఆపలేదా?అసలు అతను డ్రైవ్ చేస్తున్నట్లు నాకు తెలియదు. అతను నన్ను చూసి చాలా భయపడేవారు. ఆ కారులో మీ కూతురు రీల్స్ చేస్తున్నారుగా?లేదు వారు రీల్స్ చేయడం లేదు ఫోటోలతో పాటు వీడియోలు తీసుకుంటున్నారు. అని ఆయన బదులిచ్చారు.అయితే డబ్బున్న వాళ్లు చేేసే సరదాలకు తన కుటుంబం రోడ్డుపాలయిందని ప్రమాదంలో మృతిచెందిన సాహిల్ ధనేశ్ర తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కారుతో ఢీకొట్టాక కనీసం వారు బ్రేకులు కూడా వేయలేదని అంత నిర్లక్షంగా ఉన్నారని తెలిపింది.. ‘‘మాకున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మా అబ్బాయి ఎంతో కష్టపడుతుంటాడు. చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటాడు. స్పోర్ట్స్‌లో ఎన్నో మెడల్స్ తెచ్చుకున్నాడు. నైనిటాల్లో సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీబీఏ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాడు. మాంచెస్టర్‌లో లగ్జరీ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసేందుకు త్వరలో బ్రిటన్‌కు వెళ్లాల్సినవాడు ఇలా ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’అని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే ప్రస్తుతం ఆ టీనేజర్ బెయిల్ పై ఉన్నాడు. పదో తరగతి బోర్డ్ పరీక్షలు రాయల్సి ఉన్నందున అతనికి జువెనైల్ జస్టిస్ బోర్డ్ మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.ఇప్పటికే ఒంటరిగా జీవిస్తున్న తల్లి జీవితం కుమారుడి మరణంతో ఏకాకిగా మారిందని పొరుగింటి వాళ్లు చెప్పారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సమీపంలో కారును పార్క్చేసిన డ్రైవర్ అజిత్ సింగ్ జీవితం సైతం కష్టాల కడలిలో పడింది. టీనేజర్ ఆ యువకుడి బైక్‌ను ఢీకొట్టాక నేరుగా వచ్చి అజిత్‌కు చెందిన క్యాబ్‌నూ ఢీకొట్టాడు. దీంతో అజిత్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిపాలయ్యాడు. ‘‘కాళ్లు, చేతులు, తల, వెన్నుపూసకు గాయాలయ్యాయి. మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు సూచించారు. -
జ్యోతికతో ప్రేమ పెళ్లి.. నాన్నను ఒప్పించేందుకు సూర్య ఏం చెప్పాడంటే? (ఫొటోలు)
-
బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు
హన్మకొండ: ఆడపిల్ల అదృష్టమంటారు. తన విజయానికి తన కూతురే (బంగారు తల్లి) కారణమని ఓ తండ్రి మున్సిపల్ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా గెలుపొందాక తన కూతురు కాళ్లు మొక్కాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 19వ వార్డునుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు 584 ఓట్లు రాగా, 207 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్న తరువాత కౌంటింగ్‌హాల్‌నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా తన కోసం వేచి చూస్తున్న కూతురు సహస్ర రెండు కాళ్లను మొక్కాడు. అనంతరం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, శ్రీనివాస్ మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు తన కూతురు సహస్ర పుట్టడంతో తన అదృష్టంగా భావించాడు. ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాడు. అందుకే గెలుపొందగానే తన కూతురు కాళ్లు మొక్కినట్లు అనుచరులు తెలిపారు. -
పిల్లలూ.. నాన్ననురా..
కంటోన్మెంట్(హైదరాబాద్): ముదిమి వయసులో భార్య మరణించగా ఒంటరైన ఆ వ్యక్తి, తన ఇద్దరు కూతుళ్లే సర్వస్వంగా భావించి ఉన్న ఆస్తినంతా వారికి ఇచ్చేశాడు. అయితే 70 ఏళ్లు పైబడిన ఆ వృద్ధ తండ్రిని ఆదరించాల్సిన కూతుళ్లు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆవేదనకు గురైన తండ్రి, కూతుళ్ల నుంచి తన ఆస్తిని తిరిగి ఇప్పించాల్సిందిగా అధికారులకు లేఖ రాయడం గమనార్హం. మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌కు చెందిన 70 ఏళ్ల రాజలింగం భార్య 2020లో మరణించింది. రాజలింగంకు ముగ్గురు కూతుళ్లు కాగా, తన పేరిట ఉన్న 130 గజాల ఇంటిని ఆయన ఇద్దరు పెద్ద కూతుళ్లు భాగ్యలక్ష్మి, ఝాన్సీలకు చెరిసగం పంచుతూ రిజి స్ట్రేషన్ చేశారు. తన భార్యకు చెందిన 15 తులాల బంగారు ఆభరణాలను సైతం ఇద్దరు కూతుళ్లకు పంచారు. అయితే కొంతకాలంగా ఆ ఇద్దరు కూతుళ్లు తండ్రి పోషణ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. పెద్ద కూతురు భాగ్యలక్ష్మి తన ఇంట్లోని బాత్రూమ్ సమీపంలోని స్థలాన్ని తనకు కేటాయించిందని ఆయన వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన రెండో కూతురు తాను పంచి ఇచ్చిన ఇంటిని విక్రయించే ప్రయత్నంలో ఉందన్నారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, తాను పంచి ఇచ్చిన ఆస్తి తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆర్డీఓకు లేఖ రాశానని రాజ లింగం చెప్పారు. ఇందుకు స్పందించిన రెవెన్యూ అధికారులు రాజలింగం ఇద్దరు కూతుళ్లకు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. -
ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి..
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల భారత్ సిటీ సొసైటీలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు బాలికల తండ్రి చేతన్ కుమార్‌కు చెందిన పాత నేర చరిత్ర తెలియవచ్చింది. 2015లో చేతన్ కుమార్‌తో సహజీవనం చేసిన ఒక మహిళ, భవనంపై నుంచి పడి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం అది ఆత్మహత్యగా తేలడంతో ఆ కేసును మూసివేశారు.ప్రస్తుత ఘటన నేపథ్యంలో పాత కేసు వివరాలను పోలీసులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. చేతన్ కుమార్‌కు సుజాత, హీనా, టీనా అనే ముగ్గురు భార్యలు ఉండగా, వీరు ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లే కావడం గమనార్హం. మరణించిన బాలికలలో నిషిక (16) సుజాత కుమార్తె కాగా, ప్రాచి (14), పాఖీ (12) హీనా కుమార్తెలు. ఈ అసాధారణ కుటుంబ వాతావరణం, ఇంటి పరిస్థితులు పిల్లల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.బాలికలు రాసిన ఆత్మహత్య లేఖలో కేవలం తండ్రి ప్రస్తావన మాత్రమే ఉందని, తల్లుల గురించి ఏమీ రాయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. బాలికల ఆత్మహత్యకు తండ్రి వారి మొబైల్ ఫోన్లను లాక్కోవడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో తొమ్మిది పేజీల డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్, ఫోరెన్సిక్ బృందాలు.. ఆ చిన్నారులు వినియోగించిన ఫోన్లోని డిజిటల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ బబితా సింగ్ బాధిత కుటుంబాన్ని సందర్శించి, ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. చదువుల ఒత్తిడితో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. పిల్లల మానసిక స్థితిని సరైన సమయంలో గుర్తించడంలో కుటుంబం విఫలమైందని పేర్కొంటూ, జిల్లా యంత్రాంగం, పోలీసుల నుండి సమగ్ర నివేదిక కోరారు. ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు.. -
ఒకటి నుంచి 50 వరకూ రాయలేదని..
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగు చూసింది. కేవలం హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో ఓ కసాయి తండ్రి తన నాలుగేళ్ల కూతురిని అతి కిరాతకంగా హతమార్చాడు. బల్లబ్గఢ్కు చెందిన కృష్ణ జైస్వాల్ (31) తన కుమార్తె వంశిక (4) హోంవర్క్‌లో ఒకటి నుండి 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో విచక్షణ కోల్పోయాడు. చపాతీలు చేసే కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆ చిన్నారి కుప్పకూలిపోయింది.అనంతరం, నిందితుడు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను బల్లబ్‌గఢ్‌లోని సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి, మెట్లపై నుంచి జారిపడిందని వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె శరీరంపై పలు గాయాలు, ఫ్రాక్చర్లు, తలకు తీవ్రమైన దెబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ మార్చురీకి తరలించారు.ఈ ఘాతుకం జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న నిందితుని ఆరేళ్ల కుమారుడు నిజాన్ని బయటపెట్టాడు. తన సోదరి అంకెలు రాయలేకపోయినందుకు తండ్రి ఎలా కొట్టాడో ఆ బాలుడు తన తల్లికి, ఆపై పోలీసులకు వివరించాడు. భార్య ఫిర్యాదు, బాలుని వాంగ్మూలం ఆధారంగా నిందితుడు కృష్ణ జైస్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన పోలీసులు అతనిని ఫరీదాబాద్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అతడిని ఒక రోజు పోలీస్ రిమాండ్‌కు పంపింది. -
తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది
సాక్షి, అమరావతి: ఒక వ్యక్తి కులంతో అధికారులు విభేదిస్తున్నప్పుడు, అతడు ఫలానా కులానికి చెందిన వ్యక్తి కాదని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆ అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యక్తి తన కులాన్ని రుజువు చేసే డాక్యుమెంట్లు సమర్పించలేదన్న కారణంతో అతడు ఫలానా కులానికి చెందినవాడుకాదని చెప్పలేరని పేర్కొంది. తండ్రిది ఏ కులమైతే పిల్లలకు అదే కులం వర్తిస్తుందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పాయని గుర్తుచేసింది. పిటిషనర్ అట్లపాకాల రామకృష్ణ తండ్రి, నాయనమ్మ కొండకాపు కులానికి చెందిన వారనేందుకు ఆధారాలున్నా.. భూ రికార్డులను మాత్రమే ఆధారంగా చేసుకుంటూ రామకృష్ణ కొండకాపు కులానికి చెందినవ్యక్తి కాదంటూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. రామకృష్ణ కొండకాపు (ఎస్టీ) కులస్తుడు కాదు, కాపు అంటూ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లాస్థాయి పరిశీలన అధికారి హోదాలో తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు చెప్పారు. ఏకపక్షంగా కులధ్రువీకరణ రద్దుపై పిటిషన్ కొండకాపు (ఎస్టీ) కులానికి చెందిన అట్లపాకాల రామకృష్ణ పూర్వీకులు తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో నివశించారు. వారు ఎస్టీగానే చెలామణి అయ్యారు. రామకృష్ణ విద్యాభ్యాసం మొత్తం ఎస్టీగానే సాగింది. రామకృష్ణ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుతున్న సమయంలో అధికారులు అతడి కులధ్రువీకరణపై విచారణ జరిపారు. అతడు ఇచి్చన డాక్యుమెంట్లను కాకుండా 1938 సంవత్సరానికి చెందిన భూ రికార్డులను ఆధారంగా చేసుకుని రామకృష్ణ కొండకాపు కులస్తుడు కాదంటూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి తెలిపారు.తరువాత రామకృష్ణకు నోటీసు కూడా ఇవ్వకుండానే అతడి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని 2005లో కలెక్టర్ రద్దుచేశారు. దీనిపై రామకృష్ణ అప్పీలు చేయగా.. కలెక్టర్ ఉత్తర్వులను సమర్థిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి 2009లో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తుది విచారణ జరిపారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ తండ్రి, నాయనమ్మ కొండకాపులంటూ 1966లోనే అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచారని తెలిపారు. గిరిజన సంక్షేమ డిప్యూటీ కలెక్టర్ 2004లో జారీచేసిన ఉత్తర్వుల్లో కూడా రామకృష్ణ తండ్రి, నాయనమ్మలను గిరిజనులుగా పేర్కొన్నారని చెప్పారు. ఈ ఆధారాలన్నీ చూపినా అధికారులు పట్టించుకోకుండా, కేవలం 1938 నాటి రెవెన్యూ రికార్డును ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుబట్టారు. రామకృష్ణ కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ జాయింట్ కలెక్టర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేశారు. -
కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి
జోధ్‌పూర్‌లో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 12 ఏళ్లుగా కన్న కూతుళ్లపై ఒక తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తల్లీ కూతుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.పోలీసుల సమాచారం ప్రకారం జోధ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల బాలిక గత 12 ఏళ్లుగా తన తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. తన తండ్రి తనపై అత్యాచారం చేయడం ప్రారంభించినప్పుడు ఆమె వయస్సు కేవలం ఆరేళ్లు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. చివరికి తన 15 ఏళ్ల చిన్న కుమార్తెపై కూడా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన సోదరితో చెప్పింది. దీంతో వారు తమ తల్లికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత, వారు పోలీసులకు ఒక ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జనవరి 13న ఒక ఈమెయిల్ ఫిర్యాదు అందిందని నాగౌరి గేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) దినేష్ కుమార్ తెలిపారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా, పోలీసులు వెంటనే ఫిర్యాదుదారురాలిని సంప్రదించి, ఆ తర్వాత ఆమె నుండి అధికారిక లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. సహాయ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) మంగ్లేష్ చుండవత్ ప్రకారం,తనపై ఫిర్యాదు నమోదైన విషయం తెలియడంతో నిందితుడు, కూలీగా పనిచేసే 45 ఏళ్ల తండ్రి పరారయ్యాడు. కానీ గురువారం అదుపులోకి తీసుకున్నారు.శుక్రవారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోలీసులు ఇప్పటికే బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.సెక్షన్ 65(2) (అత్యాచారం) ,లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో..
హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారులు అనాథలయ్యారు.. హత్యకేసులో తండ్రి జైలుకు వెళ్లగా.. తల్లి నిర్దయగా పిల్లలను వదిలి వెళ్లింది. దీంతో 40 రోజులుగా ఆ చిన్నారులు స్థానికులు ఇచ్చే ఆహారం తిని బతుకుతున్నారు. ఇలా ఎన్నాళ్లు? అని ఆలోచించిన ఓ న్యాయవాది సహకారంతో.. కోర్టు ఆదేశంతో చిన్నారుల బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంది. సోమవారం కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సత్తు రవీందర్, సిడబ్ల్యూసి మేడ్చల్ జిల్లా చైర్మన్ రాజారెడ్డితో కలిసి వెల్లడించారు. మల్లాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు (13) కూతురు (9), చిన్న కూతురు (2). తండ్రి హత్య కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇక పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన తల్లి వారిని వదిలివెళ్లి అనాథలుగా మార్చింది. దీంతో అభం శుభం ఎరుగని ఆ పిల్లలు చుట్టు పక్కలవారు ఏమైన పెడితే తింటూ అర్థాకలితో గత 40 రోజులుగా కాలం గడుపుతున్నారు. ఇరుగు పొరుగువారు, ఇంటి యజమాని పిల్లల దుస్థితిని గోపాల్‌రెడ్డి అనే న్యాయవాది సాయంతో మేడ్చల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జిల్లా న్యాయమూర్తి పిల్లల బాగోగులు చూసుకోవాలంటూ మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్ రాజారెడ్డి ముగ్గురు పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇద్దరిని హోంకు తరలించగా మరో చిన్నారి ఆరు సంవత్సరాల లోపు కావడంతో అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ శిశువిహార్‌లో అప్పగించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురుదుష్టకరమని, అనాథలు, అభాగ్యులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను కానీ.. న్యాయసేవాధికార సంస్థలను కాని ఆశ్రయిస్తే తగిన న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్ స్పష్టం పేర్కొన్నారు. పిల్లల దీనస్థితిపై స్పందించి చేరదీసిన పెంటయ్య, శ్రీనివాస్, అనితలను అభినందించారు. ప్రజల్లో అవగాహన పెరగాలి చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. చట్టంపై సరైన అవగాహన కొరవడి ఉచిత న్యాయసేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి అనాథ పిల్లలు, దిక్కులేని అభాగ్యులను ఆశ్రయం కలి్పంచే అనేక మార్గాలున్నాయి. అలాంటి వారు ఏవరైనా ఉంటే స్థానిక పోలీస్స్టేషన్లు, న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయిస్తే వారికి తగిన న్యాయం జరుగుతుంది. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరగాలి. – బాల భాస్కర్, మేడ్చల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
‘ఒక్క కొడుకు కోసం’.. 10మంది ఆడపిల్లల్ని కన్నాడు.. ట్విస్ట్ ఏంటంటే?
చండీగఢ్: ఓ వ్యక్తి 19 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. మొదటి సంతానంగా కుమార్తె పుట్టింది. కానీ కుమారుడు కావాలనే కోరికతో.. కొడుకు పుట్టేవరకు సంతానాన్ని కొనసాగించాడు. అలా 10 మంది కుమార్తెలు పుట్టగా.. చివరికి 11వ సంతానంగా కుమారుడు జన్మించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే? హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాలోని ఉచానా పట్టణంలో 37 ఏళ్ల మహిళ తన 11వ సంతానంగా కుమారుడికి జన్మనిచ్చింది. అంతకుముందు ఆమెకు 10 మంది కుమార్తెలు ఉన్నారు. ఈ డెలివరీ వైద్యపరంగా ప్రమాదకరంగా ఉన్నప్పటికీ, తల్లీబిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.డాక్టర్ నర్వీర్ శియోరాన్ ప్రకారం..ఈ డెలివరీ ఓజాస్ హాస్పిటల్ అండ్ మేటర్నిటీ హోమ్‌లో జరిగింది. డెలివరీ సమయంలో తల్లికి మూడు యూనిట్ల రక్తం ఇవ్వాల్సి వచ్చింది. జనవరి 3న మహిళను ఆసుపత్రిలో చేర్చగా.. జనవరి 4న శిశువు జన్మించాడు. ఆ రోజే తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా గ్రామానికి తిరిగి వెళ్లారు. మహిళ, ఆమె భర్త సంజయ్ కుమార్ (రోజువారీ కూలీ) 19 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇప్పటివరకు వారికి 10 మంది కుమార్తెలు ఉన్నారు. ఈసారి కుమారుడు పుట్టడంతో కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.ఇక్కడ విచిత్రం ఏంటంటే? కుమారుడు పుట్టినందుకు సంతోషంగా ఉన్నప్పటికి.. ‘మేము పితృస్వామ్యాన్ని ప్రోత్సహించడం లేదు’అని తండ్రి స్పష్టం చేశారు. ‘మాకు కుమార్తెలు కూడా సమానమే. కానీ ఒక కుమారుడు ఉండాలని ఆశించాం. ఇప్పుడు ఆ ఆశ నెరవేరింది’ అని ఆయన అన్నారు.ఈ సంఘటనతో మాతృ ఆరోగ్యంపై ఉన్న ప్రమాదాలు మళ్లీ చర్చకు వచ్చాయి. కుమారుడి కోసం నిరంతరం గర్భధారణలు చేయడం మహిళల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంకా కొంతమంది కుటుంబాల్లో కుమారుడి కోసం ఉన్న పట్టుదల సమాజంలో పితృస్వామ్య భావజాలం కొనసాగుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఘోరం.. కొడుకు, కుమార్తెను ఉరేసి చెరువులో పడేసిన తండ్రి
సాక్షి,హైదరాబాద్: పిల్లా,పాపలతో హాయిగా సాగిపోతున్న సంసారంలో కుటుంబ సమస్యలు ఘోర విషాదాన్ని నింపాయి. కొడుకు,కుమార్తెను ఉరేసి చెరువులో పడేశాడో తండ్రి. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరికల్ మండలం తీలేరు గ్రామంలో మంగళవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన శివరాములు తన కూతురు రితిక, కొడుకు చైతన్యను ఉరిసే స్థానిక చెరువులో పడేశాడు. అనంతరం, విద్యుత్ తీగను పట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు స్పందించి అతడిని మహబూబ్ నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల మృతదేహాలను చెరువులో నుండి వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీలేరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, చిన్నారుల అమాయక ప్రాణాలు ఇలా బలైపోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.తీలేరు గ్రామంలో జరిగిన ఈ ఘటన కుటుంబ సమస్యలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో మరోసారి స్పష్టంచేసింది. శివరాములు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా, గ్రామం మొత్తం ఈ దారుణంతో కన్నీటి సంద్రమైంది. -
నాన్న రాసిన మరణ శాసనం..!
-
ఉయ్యాలవాడలో ఘోరం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి..
ఉయ్యాలవాడ: ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో విషం తాగించి చంపడంతో పాటు తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బంధువుల కథనం మేరకు.. తుడుమలదిన్నెకి చెందిన వేములపాటి సురేంద్ర(35), మహేశ్వరి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. మహేశ్వరి తీవ్ర అనారోగ్యంపాలై ఆ బాధతో గతేడాది ఆగస్టులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.భార్య చనిపోయినప్పటి నుంచి తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్న సురేంద్ర.. కూలి పనులకు వెళ్తూ, పిల్లలు కావ్యశ్రీ(7), జ్ఞానేశ్వరి(5), సూర్య గగన్(1)తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది, బుధవారం రాత్రి తన ముగ్గురు పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి తాగించి, చంపాడు.ఆపై తానూ ఉరేసుకుని తనువు చాలించాడు. గురువారం ఉదయం 8 గంటలైనా ఇంటి తలుపులు తెరవకపోవడంతో సురేంద్ర తల్లి కృష్ణమ్మ అక్కడికి వెళ్లి చూడగా కుమారుడు, మనవరాళ్లు, మనవడు విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. -
నంద్యాలలో దారుణం..
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను హత్య చేసి చివరకు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మద్యం మత్తులను పిల్లలను తండ్రి హత్య చేసినట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నెలో విషాదం నెలకొంది. తండ్రి సురేంద్ర.. మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను దారుణం హత్య చేశాడు. అనంతరం, సురేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన పిల్లలను కావ్య(7), రాజేశ్వరి(4), సూర్యగగన్(2)గా గుర్తించారు. అయితే, ఎనిమిది నెలల క్రితమే సురేంద్ర భార్య చనిపోయారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
రాయదుర్గం: ఇద్దరు కూతుళ్లను చంపిన తండ్రి
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు కూతుళ్లను చంపిన కసాయి తండ్రి కల్లప్ప.. బళ్లారి సమీపంలోని హైలెవల్ కెనాల్లో తోసేశాడు. చిన్నారుల అనసూయ (9), చంద్రకళ (10) మృతి చెందారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులో ఘటన జరిగింది.దైవ దర్శనం కోసమని చెప్పి ఇద్దరు కూతుళ్లను చంపిన కల్లప్పకు దేహశుద్ధి చేసిన స్థానికులు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. వేరేకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న దురహంకారంతో కన్నకూతుర్ని హతమార్చాడో తండ్రి. ఆరు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కన్నబిడ్డను అత్యంత పాశవికంగా చేసిన హత్య ఆధునిక సమాజంలో కూడా వేళ్లూనుకొనిపోయిన కుల అహంకారానికి అద్దం పట్టింది.హుబ్బళ్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల మాన్య పాటిల్ కులాంతర వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ ఏడాది మేలో ప్రేమికుడిని పెళ్లాడింది. చంపేస్తారేమోననే భయంతో స్వగ్రామానికి దూరంగా 100 కి.మీ దూరంలో ఉన్న హవేరి జిల్లాలో భర్తతోకలిసి నివసిస్తోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఊర్లో ఉంటున్న అత్తమామల వద్దకు ఆదివారం నాడు వచ్చింది. ఇది పసిగట్టిన ఆ యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడికి దిగారు. ముందు ఆమె భర్త, మామ వ్యవసాయ పొలంలో ఉన్నప్పుడు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకోవడంతో, సాయంత్రం 6 - 6:30 గంటల మధ్య, ఇనుప పైపులతో సాయుధులైన దుండగులతో కలిసి బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు తండ్రి. ఆరు నెలల గర్భవతి మాన్యపై దారుణంగా ఎటాక్ చేశారు. దీంతో ఆమె ప్రాణాలొదిలింది. సంఘటనా స్థలంలోనే ఉన్న అత్తమామలు రేణుకమ్మ, సుభాష్ ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు.వారిపై కూడా దారుణంగా దాడి చేశాడు. వారు తీవ్ర గాయాలతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సంఘటనలో పోలీసులుమాన్య తండ్రి ప్రకాష్ ఫక్కిర్గోడా, మరో ఇద్దరు దగ్గరి బంధువులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ వివాదంలోగతంలఘీ రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదర్చడానికి , ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారించడానికి గతంలో ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా చివరికి కన్నబిడ్డనే హతమార్చిన ఘటన తీవ్ర ఆందోళన రేపింది. -
కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే..
-
భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు.ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
కొడుకులు కాదు.. దుర్మార్గులు
ఆ పెద్దాయన్ని పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. హమ్మయ్యా.. అనుకుంటున్న టైంలో వారం వ్యవధిలోనే మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఈసారి ఆస్పత్రికి వెళ్లడం బాగా ఆలస్యమై ప్రాణం పోయింది. అయితే కొడుకుల దొంగ చూపులు.. పొంతన లేని సమాధానాలు.. వాళ్ల కాల్ డాటా.. తండ్రి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం పడ్డ తాపత్రయం.. ఇది పక్కా స్కెచ్చేసి చేసిన హత్య అని బయటపెట్టాయి. తండ్రికి రూ.3 కోట్ల దాకా బీమా చేయించి.. ఆపై పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. రకరకాల వ్యాపారాలు చేసి.. అప్పుల పాలైన ఇద్దరు తనయులు తమ స్నేహితుల సాయంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు నిర్ధారించారు. ఒకసారి స్థానికులు తండ్రిని రక్షించగా.. మరోసారి ఎలాంటి ఆటంకం లేకుండా తమ ప్లాన్‌ను అమలు పరిచారు ఈ దుర్మార్గులు. ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. పొదటూర్పేట్ గ్రామానికి చెందిన ఈపీ గణేశన్(56).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 22వ తేదీన పాము కాటుతో ఇంట్లోనే ఆయన చనిపోయారు. అయితే.. వారం తిరగకుండానే కుటుంబం ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడంతో ఆ కంపెనీ వాళ్లకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఈ విషయం చేరవేయడం.. వాళ్లు దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. గణేష్ కొడుకు మోహన్‌రాజ్(26), హరిహరన్(27) ప్రైవేట్ ఉద్యోగులు. అయితే ఆన్లైన్ బెట్టింగ్‌లు, ఇతర విలాసాల కోసం అడ్డగోలుగా అప్పులు చేసి ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి పేరిట ఇన్సూరెన్స్‌లు చేయించి హతమార్చాలనే దుర్మార్గపు ఆలోచన చేశారు. దీనికి నలుగురు స్నేహితుల సాయం కోరారు. అక్టోబర్ 15వ తేదీన ఒక పామును గణేశన్ మీదకు వదిలారు. అది కాలి మీద కాటేయడంతో.. ఆయన నొప్పితో అరిచారు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి రక్షించారు. వారం తర్వాత ఈసారి మరింత విషపూరితమైన పామును తెచ్చి మెడ మీద కాటు వేయించారు. ఈసారి ఆయన అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. తలుపులు వేసి ఉండిపోయారు. ఆపై చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో పాము పగ బట్టి చంపిందంటూ స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే.. వారం తిరగకుండానే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొడుకులు క్లెయిమ్‌కు దిగడంతో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చింది. ఏజెంట్‌తో దర్యాప్తు చేయించే క్రమంలో వరుసగా పాము కాటుకు గురికావడం, ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడం లాంటి విషయాలు తెలిశాయి. దీంతో పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. డిసెంబర్ 6వ తేదీన నార్త్ జోన్ ఐజీ అస్రా గార్గ్.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ ఇద్దరు కొడుకుల ఫోన్ కాల్స్ రికార్డింగులు.. ఆర్థిక లావాదేవీల ఆధారంగా తండ్రిని పాము కాటుతో హత్య చేయించినట్లు నిర్ధారించుకున్నారు. నిందితులిద్దరితో పాటు వాళ్లకు సహకరించిన నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేశారు. -
పిల్లల్ని కలిసే హక్కు తండ్రిగా నాకు లేదా?
నాకు ఇద్దరు కూతుళ్ళు. వయసు 8ఏళ్ళు, 6 ఏళ్ళు. మేము విడిపోయి 2 సంవత్సరాలవుతోంది. పిల్లలు నా భార్య వద్దనే ఉన్నారు. వాళ్లని చూడాలని ఉంది కానీ ఆమె నాకు చూపించకపోగా నామీద క్రిమినల్ కేసు, మెయింటెనెన్స్ కేసు వేసింది. పిల్లల్ని చూడాలంటే వారికి నానుంచి హాని ఉంది అని చెప్తుంది. పిల్లల్ని ఒకసారి కోర్టుకు తెస్తే, జడ్జిగారికి పిల్లల చేత ‘మా నాన్న మంచివాడు కాదు’ అని చెప్పించారు. నిజానికి పిల్లలు నాతో చాలా బాగా ఉండేవారు. తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా? నాతో ఎంతోబాగుండే పిల్లలు ఇలా అయ్యారు అంటే, తనే నేర్పించింది అని అనిపిస్తుంది. ఏం చేయాలో చెప్పగలరు.– సంపత్, విశాఖపట్నంఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. చాలా కేసులలో ఇలాంటి ధోరణి చూస్తుంటాము. అనేక కారణాలు ఉంటాయి. ‘‘తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా?’’ అని అడిగారు. తల్లిదండ్రులకి పిల్లలపై హక్కు మాత్రమే కాదు బాధ్యత ఉంటుంది. తల్లితండ్రుల ప్రేమ, ఆదరణ సమానంగా పొందే హక్కు పిల్లలకు ఉంటుంది. అంటే ప్రథమంగా అది పిల్లల హక్కు. మీ హక్కు కాదు. చట్టాలు చిన్నపిల్లల శ్రేయస్సు కోసమే ఉన్నాయి. వారి శ్రేయస్సు ముందు ఎవరి హక్కు అయినా చిన్నదే! భార్యాభర్తలు విడిపెయిన సందర్భాలలో పిల్లలను ఆయుధంగా వాడుకోవాలి అనుకోవడం దాదాపుగా అన్ని కేసులలో చూస్తుంటాము. అది తప్పు. భార్యాభర్తలు ఒకరికొకరు మంచివారు కాక΄ోయి ఉండొచ్చు. అంతమాత్రాన మంచి తల్లిదండ్రులు కాదని చెప్పలేము. విడి΄ోయిన తర్వాత పిల్లలు ఎవరి దగ్గర అయితే ఉంటారో వారు సాధారణంగానే అవతల వారిపై వ్యతిరేక భావనను పిల్లలలో పెంచుతుంటారు. విజ్ఞత కోల్పోతుంటారు. చిన్నారుల పసి హృదయాలపై వారు ఎంత ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోలేనంత స్థాయిలో ప్రవర్తన మారి΄ోతూ ఉంటుంది. మీ విషయానికి వస్తే, రెండు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్న మీరు పిల్లలు కావాలి అని కేసు ఎందుకు వేయలేదు? పిల్లల శ్రేయస్సు కోసం మీరు ఏం చేశారు? మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తున్నారా? ఇలాంటివి కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. కేసులో లబ్ధి కోసం ఉన్నట్లుండి పిల్లలపై ప్రేమ ఉన్నట్టు చూపించుకోవాలి అనుకుంటే కోర్టులు నమ్మవు! ఇప్పటికైనా పిల్లలపై బాధ్యతను నెరవేరుస్తూ, వారికి కస్టడీ మీకు కూడా కావాలి అని గార్డియన్స్ అండ్ వర్డ్స్ చట్టం కింద కేసు వేయవచ్చు. పిల్లల అభిప్రాయాలను బలవంతంగా మార్చారు అని మీరు ఖచ్చితంగా అనుకుంటే, మీ ఇద్దరు పిల్లలను సైకాలజిస్ట్ వద్దకు పంపాలి అని మధ్యంతర దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన కారణాలను చూపాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని వారితో మాట్లాడాలి. తల్లిపైన లేదా తండ్రిపైన విష ప్రచారం చేయకూడదు. అలా చేస్తున్నవారికి నా విన్నపం ఏంటంటే: మీరు కేసులు గెలవచ్చు కానీ మున్ముందు పిల్లల భవిష్యత్తును కోల్పోతారు. జాగ్రత్త వహించాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!) -
తండ్రీకొడుకుల పనే
సిడ్నీ: ప్రశాంత ఆస్ట్రేలియాలో రక్తపుటేరులు పారించింది పాక్ జాతీయులైన తండ్రీకొడుకులని తేలింది. ఇద్దరు సాయుధులు ఆదివారం సిడ్నీలోని బాండీ బీచ్‌ను ఆనుకుని ఉన్న చిన్న పార్క్‌లో వేడుకల్లో మునిగిపోయిన యూదులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించి 15 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని ఆదివారమే నవీద్ అక్రమ్గా గుర్తించగా మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు సోమవారం వెల్లడించారు. సాజిద్‌ను పోలీసులు ఆదివారం ఘటనాస్థలిలోనే అంతంచేయగా నవీద్‌కు బుల్లెట్ గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్పించి ప్రశ్నిస్తున్నామని న్యూ సౌత్‌వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ చెప్పారు. సోదాల్లో నవీద్‌కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జెర్సీ ధరించినట్లుగా కార్డ్‌పై ఫొటోలో కన్పిస్తోంది. కార్డ్ ప్రకారం నవీద్ ఆస్ట్రేలియాలోనే 2001 ఆగస్ట్ 12న జన్మించారు. దీంతో నవీద్‌కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. తండ్రి సాజిద్ విద్యార్థి వీసాతో పాకిస్తాన్ నుంచి 1998లో ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లో ఆ వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. తర్వాత దానిని ‘రెసిడెంట్ రిటర్న్’ వీసాగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి టోనీ బుర్కీ సోమవారం వెల్లడించారు. గతంలో ఇచ్చిన వీసా గడువు ముగిసేలోపే ఆస్ట్రేలియాను వీడినా లేదా ఆస్ట్రేలియాకు ఆవల ఉన్నప్పుడు వీసా గడువు ముగిసిన పక్షంలో అలాంటి వాళ్లకు తిరిగి ఆస్ట్రేలి యాలోకి అడుగుపెట్టాక ‘రెసిడెంట్ రిటర్న్’ వీసా జారీచేస్తారు. ఆ వీసాతో ప్రస్తుతం సాజిద్ ఆస్ట్రేలియాలో ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలి యాకు వచ్చిన ఇన్నేళ్లలో సాజిద్ మూడు సార్లు మాత్రమే దేశం దాటాడు. గతంలో నిఘా పరిధిలో ఉన్నా..యువ నవీద్‌పై గతంలో కొన్ని నెలలపాటు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి. ఐఎస్ఐఎస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 2019 అక్టోబర్‌లో తొలిసారిగా నవీద్‌పై ఆస్ట్రేలియా నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. ఉగ్రవాదంతో సంబంధమున్న ఇద్దరికీ జైలుశిక్ష పడింది. వీళ్లతో నవీద్‌కు సంబంధం ఉన్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. దీంతో ఇతను సైతం ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడా లేదా అని తెల్సుకునేందుకు 2019 ఏడాదిలో దాదాపు ఆరునెలలపాటు అతని కదలికలపై ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్(ఏఎస్‌ఐవో) అధికారులు నిఘా పెట్టారు. అయితే తనపై నిఘా ఉందని ముందే పసిగట్టిన నవీద్ ఏళ్ల తరబడి ఎలాంటి ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా మంచివాడిలా నటించాడు. దీంతో వేర్పాటువాద లక్షణాలు, ప్రవర్తన ఇతడిలో లేవని భావించి నవీద్‌ను నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకోలేదు. అదను చూసి ఆదివారం ఇలా దుశ్చర్యకు పాల్పడటంతో ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థలో లోటుపాట్లపై మరోసారి సమీక్ష అవసరమనే వాదనలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం నవీద్‌ను మేస్త్రీ పని నుంచి ఒక సంస్థ తొలగించింది. ఆ సంస్థ ఇటీవల దివాలా తీయడంతో వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా నవీద్‌ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 🚨 Here’s a full 10 minute video of the terrorist attack that happened today in Bondi beach Australia. How utterly terrifying pic.twitter.com/KNr8Xo6lRU— Queen Natalie (@TheNorfolkLion) December 14, 2025 -
అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్సై రాజేష్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
కంగ్రాట్స్ డాడీ..
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి తన కుమారుడైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శుక్రవారం నాగారంలోని తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్‌రెడ్డి తన తండ్రి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి, శాలువాతో సన్మానించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు రామచంద్రారెడ్డిని సన్మానించారు. -
ఇండిగో సంక్షోభం.. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి సాహసం
కనీవినీ ఎరుగని రీతిలో ఇండిగో విమానాల రద్దు, ప్రయాణీకుల కష్టాలకు సంబంధించిన ఇప్పటికే పలు హృదయవిదారక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. హరియాణాలోని రోహ్తక్ నుండి పంఘల్ కుటుంబాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. కుమారుడి పరీక్ష కోసం తండ్రి చేసిన సాహసం వైరల్‌గా మారింది.హర్యానాలోని రోహ్తక్కు చెందిన యువ షూటర్ ఆశీష్ చౌధరిపంఘాల్, ఇండోర్‌లోని డాలీ కళాశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. ప్రీ-బోర్డ్ పరీక్ష (XII ) రాసేందుకు ఇండోర్‌కు వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుండి విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్. కానీ అనూహ్యంగా ఇండిగో విమాం రద్దు అయింది. రైలులో సీటు అందుబాటులో లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని తండ్రి రాజ్‌నారాయణ్ పంఘాల్ సాహసపోతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకు పరీక్షకు హాజరుకావాలంటే రాత్రంతా కారులో ప్రయాణించాలని ఎంచుకున్నాడు. దాదాపు 800కిలోమీటర్లు కారులో ప్రయాణించి కాలేజీకి చేరుకున్నాడు. సరిగ్గాపరీక్ష సమయానికి ఇండోర్‌కు చేరడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసిందిదీనిపై తండ్రి రాజ్ నారాయణ్ స్పందిస్తూ డిసెంబర్ 8న పరీక్షలు రాయాల్సి ఉంది. అంతకుముందు, డిసెంబర్ 6 సాయంత్రం ఇండోర్‌లోని కళాశాలలో అబ్బాయికి సత్కారం జరగాల్సి ఉంది. ఢిల్లీ నుండి ఇండోర్‌కు అతని విమానం ఇప్పటికే బుక్ చేశాం. అతణ్ని ఢిల్లీ విమానాశ్రయంలో దింపడానికి వెళ్ళాను, విమానం రద్దు కావడంతో సత్కారం మిస్ అయింది. కానీ పరీక్ష మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సమయానికి తీసుకెళ్ల గలిగాను అంటూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో గ్రేట్ ఫాదర్, నాన్న ప్రేమ అలా ఉంటుంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
తండ్రైన టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో అభిమానులను మెప్పించాడు. అంతేకాకుండా జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇటీవలే రిలీజైన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిత్రంతో అభిమానులను అలరించారు. టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా తిరువీర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రైనట్లు సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. నాయినొచ్చిండు అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తిరువీర్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్. తెలంగాణకు చెందిన తిరువీర్ 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతను.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, పరేషాన్, మోక్షపటం చిత్రాల్లో నటించారు.గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తిరువీర్. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఆగస్టులో తన తిరువీర్ భార్య కల్పన సీమంతం వేడుక చేశారు. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది. నాయినొచ్చిండు ❤️ pic.twitter.com/7IzM5OAE03— Thiruveer (@iamThiruveeR) December 12, 2025 -
ఇండిగో సంక్షోభం : తండ్రి చితాభస్మం కలశంతో కుమార్తె నమిత ఆవేదన
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో నెలకొన్న సంక్షోభం ఎంతో ప్రయాణీకుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దేశవ్యాప్తంగా విమానాల అంతరాయాలు వేలాది మంది ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ఒక టెకీ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్‌ను వీడియో కాల్‌తో సరిపెట్టుకోవాల్సింది. మరో సంఘటన తన బిడ్డకు అధిక రక్తస్రావం అవుతోంది, కనీసం శ్యానిటరీ ప్యాడ్లు ఇవ్వండి అని వేడుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముందస్తు నోటిఫికేషన్ లేకుండా విమానాల్ని రద్దు చేయడం ఒకెత్తు అయితే, ఈ గంగరదోఠం మధ్య మానసిక ఆందోళనతోపాటు, గమ్య స్థానాలకు చేరుకునేందుకు, అక్కడి ఖర్చులు మరింత భారంగా మారడం మరో ఎత్తు. ఇదే అదును ఇతర విమానయాన సంస్థలు తమ ధరలను విపరీతంగా పెంచేయడం దారుణం.బెంగళూరుచెందిన ఒక మహిళది మరో హృదయ విదారక గాథ. వేలాది మంది ప్రయాణీకులలో ఒకరైన నమిత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. తండ్రి అస్థికలను పుణ్య నదిలో నిమజ్జనం చేసేందుకు హరిద్వార్‌కు బయలుదేరిన నమిత మహిళ బెంగళూరులో చిక్కుకుంది. చేతుల మధ్య కలశం పట్టుకుని, చితాభస్మాన్ని అత్యవసరంగా నిమజ్జనం చేయాలి, హరిద్వార్ చేరుకోవడానికి సాయం చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంది."నా తండ్రి చితాభస్మాన్ని నాతో తీసుకెళ్తున్నాను. బెంగళూరు నుండి ఢిల్లీకి విమానంలో డెహ్రాడూన్‌కు వెళ్లాల్సి ఉంది. అక్కడి నుండి నా తండ్రి చితాభస్మాన్ని నిమజ్జనం చేయడానికి హరిద్వార్‌కు వెళ్లాలి" అని నమిత చెప్పింది. అంతేకాదు మరో విమానం టికెట్ బుక్ చేయాలంటే ఒక్కొక్కరికీ 60 వేలుఅవుతుంది. తాము ఐదుగురం ఉన్నామని వాపోయింది. ఇప్పుడు రైలు లేదా బస్సు టిక్కెట్లు అందుబాటులో లేవని కూడా నమిత పేర్కొంది. మరోవైపు నుంచి హరిద్వార్ నుండి తన స్వస్థలమైన జోధ్‌పూర్‌కు రిటన్ ఇప్పటికే రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంది. విమానాల ఆలస్యం కారంగా అవి కూడా రద్దయ్యే పరిస్థితి.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్ -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
కామారెడ్డి క్రైం: మగ సంతానం లేకపోతే ఏంటి నేను లేనా అంటూ ఓ కుమార్తె తన తండ్రికి తలకొరివిపెట్టింది. ఈ ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో జరిగింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అలకుంట్ల సుదర్శన్‌కు భార్య, ముగురు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజులుగా తన కుటుంబంతో కలిసి జిల్లాకేంద్రంలోని స్నేహపురి కాలనీలో అద్దెకు ఉంటున్నాడు.స్వగ్రామంలో తనకు ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో సుదర్శన్ మృతి చెందగా సోమవారం పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తలకొరివి పెట్టడానికి వారసుడు లేకపోవడంతో పెద్ద కూతురు దేవిజ్ఞ తన తండ్రికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు వచ్చింది. కొడుకులు లేక కూతురే అంత్యక్రియలు నిర్వహించడం అక్కడున్న అందర్నీ కంటతడి పెట్టించింది. -
జోష్ రవి కుటుంబాన్ని పరామర్శించిన పూరి జగన్నాధ్ తనయుడు.. వీడియో వైరల్!
టాలీవుడ్ నటుడు, కమెడియన్ జోష్ రవి కుటుంబాన్ని డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరి పరామర్శించారు. స్వయంగా రవి ఇంటికి వెళ్లి అతన్ని హత్తుకుని ధైర్యం చెప్పారు. అనంతరం జోష్ రవి తల్లిని ఓదార్చారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని.. ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవలే జోష్ రవి తండ్రి మరణించారు. గుండె పోటుకు గురైన ఆయన కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఈ సంఘటన కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. View this post on Instagram A post shared by Ravi universe (@iamravi.josh_official) -
తండ్రీకొడుకులు ‘డబుల్స్’ జంటగా...
సిడ్నీ: మాజీ వరల్డ్ నంబర్‌వన్, రెండు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత లీటన్ హెవిట్ (ఆ్రస్టేలియా) రిటైర్మెంట్ను వదిలి ఐదేళ్ల విరామం తర్వాత టెన్నిస్ కోర్టులోకి మళ్లీ అడుగు పెట్టాడు. అయితే ఈ పునరాగమనానికి ప్రత్యేక కారణం ఉంది. 44 ఏళ్ల హెవిట్ తన 16 ఏళ్ల కొడుకు క్రజ్ హెవిట్ జోడీగా ఏటీపీ చాలెంజర్ టోర్నీ న్యూసౌత్‌వేల్స్ ఓపెన్ ‘డబుల్స్’లో బరిలోకి దిగాడు. ఈ ద్వయానికి వైల్డ్ కార్డ్ దక్కింది. హెవిట్ ముగ్గురు కుమారుల్లో క్రజ్ ఒకడు. బుధవారం మొదటి పోరులో సత్తా చాటిన ఈ తండ్రీ కొడుకుల జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో లీటన్ హెవిట్–క్రజ్ హెవిట్ 6–1, 6–0తో ఆ్రస్టేలియాకే చెందిన హేడెన్ జోన్స్–పావ్లె మరింకోవ్‌ను 47 నిమిషాల్లో చిత్తు చేశారు. మరోవైపు సింగిల్స్‌లో కూడా వైల్డ్ కార్డ్‌తో బరిలోకి దిగి తొలి రౌండ్ నెగ్గిన క్రజ్ హెవిట్ రెండో రౌండ్లో 7–5, 3–6, 5–7తో హయటో మట్సుకోవా (జపాన్) చేతిలో ఓడి నిష్క్రమించాడు. ప్రొఫెషనల్ కెరీర్లో 30 సింగిల్స్ టైటిల్స్ సాధించిన లీటన్ హెవిట్ 2001లో యూఎస్ ఓపెన్, 2002లో వింబుల్డన్ నెగ్గాడు. సొంతగడ్డపై 2005 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను వరల్డ్ నంబర్‌వన్‌గా 80 వారాల పాటు ఉన్నాడు. 2016లో సింగిల్స్‌నుంచి, 2020లో డబుల్స్‌నుంచి హెవిట్ రిటైర్ అయ్యాడు. హెవిట్ తర్వాత పురుషుల విభాగంలో ఏ ఆ్రస్టేలియన్ ఆటగాడు కూడా ఇప్పటి వరకు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ గెలవలేకపోయాడు. -
ఎందుకిలా చేశావు తండ్రీ!
వెన్నలాంటి మనసుండే ‘నాన్న’ కన్నపిల్లల పాలిట ఇంత కర్కశంగా ప్రవర్తించడమేమిటి? వేలు పట్టి నడిపించడానికి బదులు మెడపట్టి నదిలోకి గెంటేయడమేమిటì ? ఒక జీవితకాలం భరోసా ఇవ్వాల్సిన తండ్రే జీవితాన్ని చిదిమేయడమేమిటి? నాన్నతనానికి మచ్చ తెచ్చిన ఈ ఘటనలు మానవత్వాన్ని ఎగతాళి చేశాయి.మలికిపురం: తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచవలసిన తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు వారిని ఎందుకు చంపాలను కున్నాడో అర్థంకాక జనం ఆశ్చర్యపోతున్నారు. తాను చని పోవడంతో పాటు అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులను గోదావరిలోకి నెట్టేయడం పలువురిని కలచివేసింది. రెండు గ్రామాల్లో విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి శిరిగినీడి దుర్గాప్రసాద్ (38) తన ఇద్దరు సంతానాన్ని సోమవారం సాయంత్రం దిండి – చించినాడ వంతెన పై నుంచి నదిలోకి తోసి తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు గాలించగా దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్(14) మృతదేహాలు మంగళవారం లభ్యం అయ్యాయి. కుమార్తె జాహ్నవి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రెండు గ్రామాలలో విషాదం రోజూ పాఠశాలలకు అందరితో కలిసి ఎంతో సరదాగా వెళ్లే ఆ చిన్నారులు గోదావరిలో పడిపోయారనే దుర్వార్త రెండు గ్రామాలలో పెను విషాదం నింపింది. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, పక్కనే ఉన్న విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన రేకపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు, బంధువులు చెబుతున్నారు. పక్కపక్క గ్రామాలు కావడంతో అత్తింటి వద్ద, పుట్టింటి వద్ద కూడా భార్యాభర్తలు, పిల్లలు ఉండేవారు. కుమారుడు మోహిత్ తొమ్మిదో తరగతి, కుమార్తె జాహ్నవి నాలుగో తరగతి చదువుతున్నారు.పలు అనుమానాలు దుర్గాప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. దుర్గాప్రసాద్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అతను ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదా? లేక తాను ఎక్కడైనా తెచ్చిన డబ్బు ఇవ్వలేక ఇబ్బంది పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోవడానికి ముందు రోజు కూడా అత్త వారింటి వద్ద కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. సోమవారం సాయంత్రం ఆధార్ కార్డుల అప్డేట్ అంటూ చిన్నారులను బైక్‌పై తీసుకెళ్లిన దుర్గాప్రసాద్ దిండి– చించినాడ వంతెనపై బైక్, సెల్‌ఫోన్, పర్సు ఉంచి పిల్లలను నదిలో తోసేసి తాను కూడా దూకేశాడు. కారణాలు తెలియనప్పటికీ ఇద్దరు చిన్నారులను చంపాలనుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై రాజోలు సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక విచారణ చేశామని, కుటుంబ కలహాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని తాము భావిస్తున్నట్లు చెప్పారు. -
'గుండెలో బాధను దిగమింగుకుని'.. తండ్రి మరణం వేళ జోష్ రవి ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు, జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జోష్ రవి తండ్రి మరణించారు. గుండె పోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గతవారమే ఈ సంఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తన తండ్రి మరణంతో జోష్ రవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా అనేది నీకు సరదా..నాకు సినిమానే బతుకుదెరువు.. సినిమా నాకు సెంటిమెంట్.. అది నీకు జస్ట్ ఎంటర్టైన్మెంట్.. సినిమా అనేది నీకు వీకెండ్.. నాకు టిల్ మై లైఫ్ ఎండ్..అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నువ్వు కష్టాలు మర్చిపోవడానికి థియేటర్‌కు వస్తావ్.. నేను తండ్రి చనిపోయినా ఆ బాధను దిగమింగుకుని నవ్విస్తాను.. నీకు బాధ వస్తే ఏడుస్తావ్.. అదే నాకు వస్తే సినిమా చూస్తా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. తన తండ్రి చనిపోయినా కూడా బాధను దిగమింగుకుని షూటింగ్ పూర్తి చేశారు. ఇది చూస్తుంటే ఆయనకు సినిమాపై ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు జోష్ రవికి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. 'జోష్' సినిమాతో నటుడిగా పరిచయమైన రవి.. తర్వాత జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించాడు. 'జబర్దస్త్' కామెడీ షోలోనూ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. View this post on Instagram A post shared by Ravi universe (@iamravi.josh_official) -
తెలుగు కమెడియన్ జోష్ రవి ఇంట్లో విషాదం
'జోష్' సినిమాతో నటుడిగా పరిచయమైన రవి.. తర్వాత జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు తెలుగు చిత్రాల్లో నటించాడు. 'జబర్దస్త్' కామెడీ షోలోనూ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఇతడి ఇంట్లో ఇప్పుడు విషాదం చోటుచేసుకుంది. రవి తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గతవారమే ఈ సంఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది.(ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు)పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో రవి తల్లిదండ్రులు ఉంటున్నారు. మూడో కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో అభిషేకాలు చేయడానికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఇంటికి తీసుకెళ్లగా.. దారిలోనే గుండెపోటు రావడంతో చనిపోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత) -
కరీంనగర్లో దారుణం.. తండ్రి ఎంత పనిచేశాడంటే?
సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు(17), కూతురు(15)ను గొంతు నులిమి చంపేందుకు తండ్రి యత్నించాడు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా.. కుమారుడు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి మల్లేశం పరారయ్యాడు.పని మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ గమనించిన తల్లి పోచమ్మ ఆసుపత్రిలో చేర్పించింది. వీళ్ళిద్దరికీ మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటరావుపేట కాగా.. గత ఏడేళ్ల నుంచి కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం కుటుంబం కిరాయికి ఉంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఘోరం.. కన్న కుమార్తెను చంపి కుమారుడిపై దాడి చేసి
కరీంనగర్ సాక్షి. వావిలాల పల్లిలో బాలిక అర్చన మృతిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికను తన తండ్రి మల్లేశమే దాడి చేసి చంపినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. తన కుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నించగా తన భార్య పోశవ్వ అడ్డకుందని తెలిపారు. పిల్లలని ఎందుకు చంపాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. వివరాలు. కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న అర్చన అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఆమె సోదరుడు ఆశ్రిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించగా వారి తల్లి పోశవ్వ కూలీ పనికి వెళ్లివచ్చేసరికి ఇద్దరు పిల్లలు అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారని తెలిపారు. దీంతో స్థానికులసాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అర్చన మృతిచెందినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసు విచారణలో వారి తండ్రే కుమార్తె అర్చనని చంపి, కుమారుడిపై దాడి చేశారని తేలింది. తండ్రి దాడి చేసిన ఇద్దరు పిల్లలు మానసిక దివ్యాంగులని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం– పోశవ్వ దంపతులు ఏడేళ్లక్రితం కరీంనగర్ వచ్చారు. వాలివాలపల్లిలో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. -
ఢిల్లీ పేలుడు: ‘మహిళా డాక్టర్’ను ‘డీకోడ్’ చేసిన సన్నిహితులు
లక్నో: అది.. యూపీలోని లక్నోకు చెందిన జనసాంద్రత కలిగిన దాలిగంజ్ ప్రాంతం.. అక్కడి ఒక ఇరుకైన సందులో సయ్యద్ అహ్మద్ అన్సారీ ఇల్లు ఉంది. అతని కుమార్తె డాక్టర్ షాహీన్ సయీద్‌ను ఢిల్లీలో జరిగిన పేలుడు కేసుతో పాటు ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అందరి దృష్టి డాక్టర్ షాహీన్ సయీద్వైపు మళ్లింది.‘మాట్లాడి నాలుగేళ్లయ్యింది’పాకిస్తాన్‌కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ (జెఎం) మహిళా నియామక విభాగాన్ని భారతదేశంలో నెలకొల్పేందుకు డాక్టర్ సయీద్ పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికిన దరిమిలా డాక్టర్ సయీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లక్నోలో ఉంటున్న సయీద్ మొహమ్మద్ షోయబ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, ఏటీఎస్ అధికారులు తమ ఇంటికి వచ్చారని, మర్యాద పూర్వకంగా వ్యవహరించారని తెలిపారు. తన సోదరి నాలుగేళ్లుగా తమతో తమతో మాట్లాడలేదన్నారు. అయితే తన సోదరి గురించి తాను ఆందోళన చెందుతున్నానన్నారు. ఆమెకు ఐఐఎం రోడ్దులో ఎక్కడో ఒక ఇల్లు ఉందని మాత్రమే తెలుసని, అయితే అది ఎక్కడ ఉందో తనకు తెలియదన్నారు. ఆమె తప్పు చేసినట్లు తాను ఎప్పుడూ అనుమానించలేదని పేర్కొన్నారు. ఆమె మెడిసిన్ చదువుతున్నప్పుడు కూడా అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇప్పటికీ ఈ ఆరోపణలను నమ్మలేక పోతున్నానని అన్నారు.‘చిన్న కొడుకును అరెస్ట్ చేశారు’డాక్టర్ సయీద్ తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ మాట్లాడుతూ తన కుమార్తె అలాంటి కార్యకలాపాలలో పాల్గొన్నదంటే తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. తన పెద్ద కుమారుడు షోయబ్ నాతో ఇక్కడే ఉంటున్నాడని, రెండవ కొడుకు షాహీన్ సయ్యద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. తన చిన్న కొడుకు పర్వేజ్ అన్సారీ చాలా కాలం క్రితమే నగరం విడిచి వెళ్లాడన్నారు. తాను చివరిసారిగా తన కుమార్తె షాహీన్‌తో నెల రోజుల క్రితం మాట్లాడానన్నారు. సయీద్ మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నదని, ఆ తరువాత విడాకులు తీసుకున్నాదని అహ్మద్ అన్సారీ తెలిపారు.‘విడాకుల తర్వాత...’క్రైమ్ బ్రాంచ్ అధికారులు డాక్టర్ సయీద్ మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయత్‌ను విచారించారు. తాము 2023, నవంబర్‌లో వివాహం చేసుకున్నామని, అయితే తమకు విడాకులు 2012 చివరిలో అయ్యాయన్నారు. ఆమె మనసులో ఏముందో తనకు తెలియదని, మా మధ్య ఎప్పుడూ ఎలాంటి వివాదం లేదన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో ఆమె ప్రమేయం ఉందనే సంగతి తనకు తెలియదని, తమ విడాకుల తర్వాత ఆమె ఏమి చేస్తున్నదో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఢిల్లీ పేలుడు తర్వాత జరిగిన నిఘా సమాచారం ఆధారంగానే క్రైమ్ బ్రాంచ్ అధికారులు డాక్టర్ హయత్‌ను విచారించారని కాన్పూర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రఘుబీర్ లాల్ మీడియాకు తెలిపారని ‘ఎన్డీటీవీ’ పేర్కొంది.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘నడిపింది’ అతనే.. డీఎన్ఏ పరీక్షలో వెల్లడి -
'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...
కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. "ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్‌నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్ కథేంటో చూసేద్దామా..!చైనాకు చెందిన లీ బింగ్డ్ అనే టీనేజర్ జిలిన్ ప్రావిన్స్‌లో జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్ తన యూనివర్సిటీ క్యాంటిన్లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపన్ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్ ట్యూటర్‌గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్‌లో జోడించింది. వెంటనే ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్‌స్టాల్ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.లాభం కంటే కూతుర చెంత చాలు..స్టాల్ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది కూతురు బింగ్డ్.(చదవండి: హాట్‌టాపిక్‌గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?) -
తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం
మంచి ఉద్యోగం సంపాదించి, ఖరీదైన కారు తెచ్చి, ఇంటిముందు నిలిపి, గర్వంగా ఈ కారు నీదే నాన్నా చెప్పాలనే డ్రీమ్ దాదాపు పిల్లలందరికీ ఉంటుంది. తన చదువు, ఉన్నతి కోసం కష్టపడిన తండ్రి రుణం తీర్చుకోవాలనేది వారి ఆశ. అలా బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఉద్యోగి తన తండ్రిని సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.టూవీలర్ మీదే ఎక్కువ జీవితాన్ని గడిపేసిన తన తండ్రి సుఖం కోసం సరికొత్త టాటా పంచ్‌ను బహుమతిగా ఇచ్చాడు సత్యం పాండే అనే ఐటీ ఉద్యోగి. ఇన్నేళ్ల ఆయన కృషి , త్యాగానికి ప్రతిఫలంగా అభివర్ణించాడు.🥹❤️🙏🏽 https://t.co/Bv7xYPesQk pic.twitter.com/Y3gDOAOpQb— Satyam Pandey (@fittwithsatyam) November 5, 2025 బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఇటీవల తన తండ్రిని కారుతో ఆశ్చర్యపరిచాడు, మరియు ఈ ప్రక్రియలో వేలాది మంది ఇంటర్నెట్ అపరిచితులను భావోద్వేగానికి గురిచేశాడు. పాట్నా సివిల్ కోర్టులో సహాయకుడిగా పనిచేసే తన తండ్రి ముగ్గురు పిల్లల చదువు, సంక్షేమం కోసం, కొన్ని సౌకర్యాలను త్యాగం చేశాడని ,ముఖ్యంగా 14 ఏళ్లనుంచి హీరో హోండా స్ప్లెండర్తోనే గడిపాడని చెప్పాడు సత్యం. ముగ్గురు పిల్లల్లో పెద్దవాడిగా, తమ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుననీ, తమది సాధారణ దిగువ-మధ్యతరగతి కుటుంబం, డబ్బు ప్రాముఖ్యత నేర్పించారని గుర్తు చేసుకున్నాడు. తనకు 14 యేళ్ల వయసులోతండ్రి బక్సర్‌లో పనిచేసేవాడు. కుటుంబం పాట్నాలో ఉండేది . 120 కి.మీ. దూరం ప్రతిరోజూ జిల్లా కోర్టులో పని కోసం రైలులో ప్రయాణించేవాడు. తెల్లవారకముందే వెళ్లి, రాత్రి ఆలస్యంగా తిరిగి వచ్చేవార, తన చదువు కోసం చాలా కష్టపడ్డారంటూ ఆయనకు కృతజ్ఞత తెలిపారు.కాగా బిట్స్-పిలానీ నుండి పట్టభద్రుడయ్యాక, సత్యంపాండే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. దీంతపాటు ఫిట్నెస్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. తద్వారా తన ఎడ్యుకేషన్ లోన్‌ను తీరుస్తున్నాడు. అలాగే MBBS డిగ్రీ చదువుతున్న తన చెల్లెలికి కూడా మద్దతు ఇస్తాడు. ఇపుడిక తండ్రి కోసం కారు కొనాలని కలలు కన్నాడు. అంతేకాదు చిన్ని చిన్న యాక్సిడెంట్లనుంచి తండ్రి తప్పించుకున్నపుడు తనకు చాలా భయం వేసిందని, అందుకే బడ్జెట్లో, సేప్టీలో మెరుగైన టాటా పంచ్ కొన్నానని తెలిపాడు. ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు సత్యంను అభినందిస్తున్నారు. ప్రతీ కొడుకు కల ఇదే కదా , అభినందనలుబ్రో అంటూ కమెంట్ చేయడం విశేషం -
ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా పటేలా..
వికారాబాదు జిల్లా: నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేది.. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది పటేలా? అంటూ.. తనూష, సాయిప్రియ, నందిని తండ్రి ఎల్లయ్యగౌడ్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారం అందుకున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలివి. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన బాధిత తల్లిదండ్రులను వారి స్వగ్రామమైన పేర్కంపల్లిలో.. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం మృతులు ఒక్కొక్కరికి ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు, ఆర్టీసీ తరపున రూ.2 లక్షల చెక్కులను మొత్తం రూ.21 లక్షల విలువైన చెక్కులను ఎల్లయ్యగౌడ్‌కు ఆయన అందజేశారు. -
హరీష్‌రావుకు పరామర్శ
సాక్షి, గుంటూరు: బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించారు. హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు ఈ వేకువజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో వైఎస్ జగన్ ఆయనతో ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలియజేశారు. అంతకు ముందు.. హరీష్‌రావు పితృవియోగంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతాపం తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సత్యనారాయణ రావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సత్యనారాయణ రావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 28, 2025హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ వేకువజామున కన్నుమూశారు. దీంతో హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
‘యాసిడ్’ దాడి.. అమ్మాయి తండ్రి ప్లానే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన అనూహ్య మలుపు తిరిగింది(Delhi Acid Attack). ప్రకారమే ఆమె టాయిలెట్ క్లీనర్‌ను యాసిడ్ అంటూ కథ అల్లినట్లు పోలీసు విచారణలో తేలింది. అంతేకాదు, తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళపై ప్రతీకారంతో యాసిడ్ దాడికి పాల్పడ్డాడంటూ ఆమె భర్తను ఇరికించేందుకే బాధిత విద్యార్థిని తండ్రి అకీల్ ఖాన్ ఈ కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఆదివారం ఉదయం బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ప్రైవేట్ క్లాసుకోసం వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనపై యాసిడ్ చల్లారని ఆరోపించింది. జితేందర్‌తోపాటు అతడి మిత్రులు ఇషాన్, అర్మాన్ అనే వారి పేర్లు చెప్పింది. అయితే, ఇషాన్, అర్మాన్ అనే ఇద్దరు సోదరులు బాధితురాలికి బంధువులని పోలీసులకు తెలిసింది. ఘటన సమయంలో జితేందర్ తన భార్యతో కలిసి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని కరోల్ బాగ్‌లో ఉన్నట్లు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తులో తేలింది. ఘటన సమయంలో వాడినట్లు చెబుతున్న బైక్ కూడా కరోల్ బాగ్‌లోనే ఉన్నట్లు సీసీకెమెరాల ద్వారా తెలుసుకున్నారు. దీంతోపాటు, అకీల్ ఖాన్ తనపై అత్యాచారం చేసినట్లు జితేందర్ భార్య పోలీసులు ఈ నెల 24, 25 తేదీల్లో మౌఖికంగా చేసిన ఫిర్యాదు చేసిన విషయం బయటకు వచ్చింది. ఆమె ఇదివరకు అకీల్ ఖాన్ నడిపే సాక్స్ దుకాణంలో పనిచేసేది. అప్పట్లో ఆమెపై అత్యాచారానికి, వేధింపులకు పాల్పడి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. జితేందర్ భార్య చేసిన ఆరోపణల మేరకు పోలీసులు అకీల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడి పేరుతో జితేందర్‌ను కేసులో ఇరికించి, అతడి భార్యపై కక్ష తీర్చుకునేందుకు ఇదంతా చేసినట్లు అకీల్ అంగీకరించాడు. కాలేజీకి ఈ–రిక్షాలో బయలుదేరిన తన కుమార్తె ప్రణాళిక ప్రకారం ముందుగానే కిందికి దిగిందని, ఇంట్లో నుంచి తీసుకెళ్లిన టాయిలెట్ క్లీనర్‌ను పోసుకుని కేకలు వేసిందని అకీల్ తెలిపాడు. అంతేకాదు, యాసిడ్ చల్లారని బాధితురాలు ఆరోపించిన ఇషాన్, అర్మాన్లు సైతం ఆ సమయంలో తమ తల్లి షబ్నంతోపాటు ఆగ్రాలో ఉన్నట్లు విచారణలో గుర్తించారు.2018లో షబ్నం కూడా అకీల్ ఖాన్‌పై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఈ రెండు కుటుంబాలకు మంగోల్‌పురిలో ఉన్న ఈ స్థలం విషయమై వివాదం నడుస్తోంది. షబ్నమ్‌పై అకీల్ యాసిడ్ దాడికి పాల్పడినట్లు మంగోల్‌పురి పోలీస్ స్టేషన్లో మరో ఎఫ్ఐఆర్ నమోదై ఉంది.ఇదీ చదవండి: పౌరుల పాలిట పెనుముప్పుగా డిజిటల్ అరెస్ట్! -
హరీష్‌రావుకు పితృవియోగం.. రాజకీయ ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ వేకువజామున కన్నుమూశారు. దీంతో హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. కేసీఆర్ సంతాపం హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తన బావ సత్యనారాయణరావుతో (కేసీఆర్ 7వ సోదరి (అక్క) లక్ష్మి భర్త)తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.సీఎం రేవంత్ సంతాపంహరీష్రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఒక ప్రకటనలో హరీష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.హరీష్ కుటుంబానికి కవిత సానుభూతిమాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.మంచి వ్యక్తి: బండి సంజయ్మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాప ప్రకటన విడుదల చేశారు. సత్యనారాయణ చాలా మంచి వ్యక్తి. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనతో ఎంతో కాలంగా నాకు సాన్నిహిత్యముంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. హరీష్ రావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని అమ్మ వారిని వేడుకుంటున్నా’ అని బండి సంజయ్ ఆ ప్రకటనలో తెలిపారు. -
కూతురికి ప్రేమతో..
-
నా కొడుకుని పొట్టన పెట్టుకొని మీరు ఏం సాధించారు
-
Siddipet: తండ్రికి తలకొరివి పెట్టేందుకు కూడా రాని కొడుకులు
-
పట్టించుకోని కొడుకు.. ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చిన తండ్రి
-
కోనసీమలో దారుణం.. ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య
సాక్షి, కోనసీమ జిల్లా: ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలకు బాదంపాలులో పురుగుల మందు తాగించి చంపిన తండ్రి పావులూరి కామరాజు.. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదేళ్ల క్రితం కామరాజు భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న కామరాజు.. తనను ముగ్గురు వ్యక్తులు దారుణంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీనివాస్, దుర్గారావు అనే వ్యక్తుల వల్లే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
'నా కూతురిని ఒకరి భార్యగా పెంచలేదన్నాడు'.. సుస్మితా సేన్
బాలీవుడ్ భామ సుస్మితా సేన్ పరిచయం అక్కర్లేని పేరు. తనకు 18 ఏళ్ల వయసులోనే విశ్వసుందరిగా ఘనతను సొంతం చేసుకుంది. తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుస్మితా సేన్.. బాలీవుడ్, టాలీవుడ్‌లోనూ నటించింది. తెలుగులో నాగార్జునతో కలిసి 'రక్షకుడు' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది.అయితే స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుస్మితా సేన్ తన వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పలువురితో డేటింగ్ చేసిన ఆమె..ఏ ఒక్కరిని పెళ్లాడలేదు. ఆమె రిలేషన్స్ మున్నాళ్ల ముచ్చటగానే మారాయి. ప్రేమాయణం కొనసాగించడం.. కొన్నేళ్లకు బ్రేకప్ ఆమె లైఫలో సర్వసాధారణంగా మారిపోయింది.ఇద్దరు పిల్లలకు తల్లిగా..అయితే సుస్మితా సేన్ పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. 24వ ఏట రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకుంది. తన తల్లిదండ్రుల మద్దతుతో కొన్నాళ్లకు ఇంకో బిడ్డ (అలీసా)నూ దత్తత తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ పిల్లలను దత్తత తీసుకోవడంలో ఎదురైన ఇబ్బందులను పంచుకుంది. తన తండ్రి సుబీర్ సేన్ తిరుగులేని మద్దతువల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. 2000 సంవత్సరంలో రెనీని దత్తత తీసుకున్నప్పుడు జరిగిన సంఘటలను పంచుకుంది. ఒంటరి మహిళలు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవడాన్ని జువెనైల్ జస్టిస్ చట్టాలు ఎప్పుడు నిషేధించలేదని వెల్లడించింది.సుస్మితా మాట్లాడుతూ.. 21 ఏళ్ల వయసులో చట్టబద్ధంగా ఏం చేయాలో నాకు తెలుసు. రెనీ కోసం చట్టపరమైన పోరాటం చేసే సమయంలో నాలో ఆందోళన మొదలైంది. రెనీ విషయంలో కుటుంబ కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే.. వారు బిడ్డను తిరిగి తీసుకుంటారు. అప్పటికే రెనీ నన్ను అమ్మా అని పిలవడం ప్రారంభించింది. అప్పు నాకు ఓ ఐడియా వచ్చింది. పాపను తీసుకుని కారులో నువ్వు పారిపో అని నాన్నతో చెప్పాను. మనం అలాంటి పని చేయకూడదు. కానీ బిడ్డను మా నుంచి ఎవరు తీసుకోలేరని గట్టిగా అనుకున్నాం."అని అన్నారు. అయితే ఈ కేసు మాకు అనుకూలంగా రావడంతో తన తండ్రి పెద్ద పాత్ర పోషించారని పంచుకుంది. నా తండ్రి వల్లే నాకిప్పుడు పిల్లలు ఉన్నారు.. నా బిడ్డను పోషించడానికి కోర్ట్ చెప్పినట్లుగా సగం ఆస్తిని రెనీ పేరిట రాసిచ్చారని తెలిపింది.ఆ సమయంలో న్యాయమూర్తి తనను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించింది. మంచి కుటుంబంలోని అబ్బాయి ఎవరూ కూడా నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడరని న్యాయమూర్తి నా తండ్రిని కూడా హెచ్చరించారని వివరించింది. నేను ఆమెను ఎవరి భార్యగా పెంచలేదని నాన్న జడ్జితో చెప్పారని వెల్లడించింది. ఆ తీర్పే నా జీవితాన్ని మార్చేసిందని సుస్మితా సేన్ తెలిపింది. కాగా.. సుస్మితా సేన్ 1975 నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. -
నాన్నా.. నువ్వు లేని లోకం వద్దు
కర్ణాటక: తండ్రి లేని లోకంలో ఉండలేనంటూ ఓ కూతురు తనువు చాలించింది. వివరాలు.. నగరానికి సమీపంలో ఉన్న నాగయ్యరెడ్డి కాలనీలో నివాసముంటున్న స్వర్ణ (22) బెంగళూరులోని మహారాణి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. పలు సమస్యల వల్ల ఆమె తండ్రి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వర్ణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనను తలచుకుంటూ బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం బెంగళూరులోని హాస్టల్లో పురుగుల మందును తాగి, ఇంటికి వచ్చింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికాగా తల్లి ఈమెను చిక్కబళ్ళాపురం ఆస్పత్రిలో చేరి్పంచగా అక్కడ మరణించింది. కొన్నినెలల్లోనే భర్త, కుమార్తె దూరం కావడంతో తల్లి హృదయ విదారకంగా విలపించింది. బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కేసు దాఖలు చేసుకొని దర్యాప్తు చేబట్టారు.మరో యువతి... మైసూరు: జీవితంపైన విరక్తి కలిగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల పట్టణం మంజునాథ్ నగరలో జరిగింది. యువతి రక్షిత (19) మృతురాలు. ఆమె తండ్రి బెంగళూరులో పని చేస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న యువతి అవ్వ తాత వద్ద ఉంటోంది. బీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.కులగణనలో టీచర్‌కు గుండెపోటు బనశంకరి: బెంగళూరులో కులగణనలో ఉపాధ్యాయురాలు గుండెపోటుకు గురైంది. ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో ఆదివారం యశోద అనే టీచర్ కులగణన సర్వేలో ఉండగా గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే కొందరు సమీప హెల్త్‌సిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి స్టంట్‌ను అమర్చారు. యశోద బొమ్మసంద్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్‌గా పనిచేస్తోంది. -
'రుక్మిణీ వసంత్' తండ్రి వీరమరణం పొందారని తెలుసా?
కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఒక హీరోయిన్గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ, ఆమె దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ కూతురు అని కొందరికి మాత్రమే తెలుసు. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. పఠాన్‌కోట్, సిక్కిం, రాంచీ, జమ్మూ కాశ్మీర్ వంటి కీలక ప్రదేశాల్లో ఆయన సేవలు అందించారు. అయితే, రుక్మిణీకి ఏడేళ్ల వయసు ఉన్న సమయంలో దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన రుక్మిణీ జీవితంలో ఒక మలుపు. అందుకే ఆమె తన తండ్రి పేరు ఎప్పటికీ గుర్తుండేలా రుక్మిణీ వసంత్‌గా మార్చుకుంది.రుక్మిణీ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ 2007లో మరణించారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి ప్రాంతంలోకి చొచ్చుకుని వస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను అడ్డుకుంటూ ఆయన వీరమరణం పొందారు. భారీ ఆయుధాలతో 8 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక ట్రక్ సాయంతో భారత్‌లోకి ప్రవేశించారు. దానిని గమనించిన వసంత్ టీమ్ వారిని అడ్డుకుంది. ముఖ్యంగా రుక్మిణీ తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి వారిని ఎదుర్కొన్నారు. చొరబడిన ఉగ్రవాదులను పూర్తిగా హతమార్చే వరకు ఆయన పోరాడారు. ఈ క్రమంలో ఆయన శరీరంలోకి సుమారు 7కు పైగా తూటాలు దిగాయి. కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన ధైర్యసాహాసాలను మెచ్చి అశోక చక్ర పతకంతో భారత ప్రభుత్వం గౌరవించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ పతకం అందుకున్న మొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. రుక్మిణీ తండ్రి ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌లో కఠణమైన శిక్షణ పొందారు. అందుకే 9 మరాఠా లైట్ త్రిదళంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. ఇలా ఆయన ఇండియన్ ఆర్మీలో చాలా కీలకంగా పనిచేశారు. వసంత్ వేణుగోపాల్ మరణం తర్వాత.., ఆయన భార్య సుభాషిణి వసంత్ "వీర్ రత్న ఫౌండేషన్" అనే సంస్థను స్థాపించి యుద్ధ వీరుల భార్యలు, కుటుంబాలను ఆదుకుంటున్నారు. తన వంతుగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సుమారు 120కి పైగా కుటుంబాలకు చెందిన పిల్లల చదువు కోసం ఆమె పాటు పడుతున్నారు. -
50 కోట్ల బీమా కోసం భార్య, తల్లిదండ్రుల హత్య.. నాలుగో భార్య ఫిర్యాదుతో బీమా స్కామ్ వెల్లడి
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో రూ. 50 కోట్ల బీమా కోసం ఒక వ్యక్తి తన మొదటి భార్య, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హతమార్చాడు. అయితే అతని నాల్గవ భార్య ఈ మరణాలపై అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు సాగించిన భారీ బీమా స్కామ్ వెలుగుచూసింది.ఒక పథకం ప్రకారం హత్యలుఉత్తరప్రదేశ్లోని మీరట్‌కు చెందిన విశాల్ సింఘాల్(37) తన మొదటి భార్య, తల్లిదండ్రులను హత్య చేసినందుకు హాపూర్‌లో అరెస్టు చేశారు. అతని నాల్గవ భార్య.. విశాల్ సింఘాల్ ఇంటిలో జరిగిన అనుమానాస్పద మరణాలపై పోలీసులను అప్రమత్తం చేశారు. సింఘాల్ తండ్రి ముఖేష్ పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి. వీటిపై కన్నేసిన విశాల్ ఒక పథకం ప్రకారం తండ్రిని హత్య చేసి, ఇప్పటికే రూ.1.5 కోట్ల క్లెయిమ్‌లను అందుకున్నాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించిన దరిమిలా నివ్వెరపోయే పలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.నాల్గవ భార్యపై పాలసీ కోసం ఒత్తిడిపోలీసుల దర్యాప్తులో విశాల్ సింఘాల్.. తన రెండవ, మూడవ భార్యలు తనను విడిచిపెట్టివెళ్లిపోయారని తెలిపాడు. అయితే పోలీసులు ఈ మాటపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరట్‌లోని గంగానగర్‌కు చెందిన సింఘాల్, తన నాల్గవ భార్య శ్రేయను అధిక విలువ కలిగిన జీవిత బీమా పాలసీలపై సంతకం చేసేందుకు ఒప్పించాడు. అయితే సంభాల్‌లో దర్యాప్తు జరుగుతున్న బీమా స్కామ్ గురించి తెలుసుకున్న శ్రేయ అనుమానంతో.. తన భర్త బీమా పాలసీ కోసం తనపై చేస్తున్న ఒత్తిడి గురించి పోలీసులకు తెలిపారు. ‘విశాల్ పాలసీలపై సంతకం చేయమని తనను నిరంతరం ఒత్తిడి చేస్తూ వచ్చాడని, ఇదే సమయంలో అతని కుటుంబంలో గతంలో చోటుచేసుకున్న మరణాలపై తనకు అనుమానాలు వచ్చాయని శ్రేయ పోలీసులకు తెలిపారు.భారీ బీమా స్కామ్‌లో ఎందరున్నారో.. విశాల్ తండ్రి కూడా తన సహాయం కోరాడని, తనకు ప్రాణ భయం ఉందని చెప్పారన్నారు. విశాల్ తండ్రి చనిపోయిన తర్వాత, తాను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయానని శ్రేయ పోలీసులకు వివరించారు. శ్రేయ ఫిర్యాదును పరిశీలించిన సంభాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కృష్ణకాంత్ బిష్ణోయ్ తాము ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న భారీ బీమా స్కామ్‌లో ఇది ఒక భాగమేనని గుర్తించామని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. ఇంటిలోని వారిని హత్య చేసిన దరిమిలా విశాల్ సింఘాల్ వారిపైనున్న బీమా మొత్తాన్ని పొందేందుకు వారు పలు ప్రమాదాల్లో మరణించినట్లు ఆధారాలు సృష్టించాడు. వీటి ఆధారంగా ఇప్పటికే రూ. 1.5 కోట్లు క్లెయిమ్ అందుకున్నాడని బిష్ణోయ్ తెలిపారు.ఆస్పత్రి యాజమాన్యంపై అనుమానాలుసింఘాల్ తన ఇంటిలోని వారి పేరుతో పలు జీవిత బీమా పాలసీలను తీసుకొని, వారిని రోడ్డు ప్రమాదానికి బలిచేసి, బాధితులను మీరట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేవాడు. తరువాత బీమా చెల్లింపును క్లెయిమ్ చేసేవాడు. సింఘాల్ భార్య, అతని తండ్రి ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో మృతి చెందారు. ఇది అనుమానాలకు తావిస్తున్నదని, ఈ విషయంలో ఆస్పత్రి యాజమాన్యం పాత్రను పరిశీలిస్తున్నామని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. సింఘాల్ తండ్రి ముఖేష్ మరణించే సమయంలో అతని పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి.రికార్డులపై అనుమానంతో ఫిర్యాదు2024 మార్చిలో హాపూర్ పోలీస్ స్టేషన్లో సింఘాల్ తండ్రికి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదయ్యింది. దీనిలో అతను గర్హ్ముక్తేశ్వర్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడని పేర్కొన్నారు. అయితే అతని బీమా క్లెయిమ్ పత్రాలలో 2023, మార్చి 27న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని ఉంది. అయితే అతను అడ్మిట్ అయిన నవజీవన్ ఆసుపత్రి రికార్డులతో అతను రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చారని నమోదయ్యింది. దీంతో అనుమానం తెలెత్తిన ఒక బీమా సంస్థ ప్రతినిధి సంజయ్ కుమార్ సెప్టెంబర్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘విశాల్ సింఘాల్ తెలిపిన వివరాలకు.. ఆసుపత్రి వర్గాలు అందించిన సింఘాల్ తండ్రి పోస్ట్‌మార్టం రిపోర్టుతో సరిపోలలేదు సంజయ్ కుమార్ పోలీసులకు తెలిపాడు.తండ్రి మరణించాక వాహన రుణాలు తీర్చేసిన నిందితుడుకాగా విశాల్ సింఘాల్ సమర్పించిన పత్రాలలో తండ్రి వయస్సు,ఐడీ వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయని, వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించడంలో విశాల్ విఫలమయ్యాడని హాపూర్ ఎస్పీ కున్వర్ జ్ఞానేందర్ సింగ్ తెలిపారు. ఈ కేసు మూసివేశామని, అయితే ఇప్పుడు కేసును తిరిగి తెరవడానికి కోర్టు అనుమతి లభించిందని తెలిపారు. భారీ బీమా స్కామ్ దర్యాప్తుకు సారధ్యం వహిస్తున్న సంభాల్ అదనపు ఎస్పీ అనుకృతి శర్మ మాట్లాడుతూ తండ్రి మరణానికి రెండు నెలల ముందు విశాల్ సింఘాల్ పేరుమీద టయోటా లెజెండర్, నిస్సాన్ మాగ్నైట్, బ్రెజ్జా, రాయల్ ఎన్ఫీల్డ్కు సంబంధించిన రుణాలు ఉన్నాయని, అయితే అవి అతని తండ్రి మరణం తర్వాత క్లియర్ అయ్యాయని అనుకృతి శర్మ తెలిపారు. విశాల్ సింఘాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. -
దడ పుట్టిస్తున్న పరువు హత్య: 17 ఏళ్ల యువతిని కాల్చేసి, మృతదేహాన్ని నదిలో తోసేసి..
మోరెనా : మధ్యప్రదేశ్‌లో మరో అత్యంత దారుణ పరువు హత్య వెలుగు చూసింది. ఉన్నత కులానికి చెందిన 17 ఏళ్ల యువతి.. వెనుకబడిన కులానికి చెందిన యువకునితో స్నేహం చేసిందని ఆరోపిస్తూ, ఆ యువతి కుటుంబీకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. యువతి మృతదేహం అనుమానాస్పద స్థితిలో నదిలో పోలీసులకు కనిపించిన దరమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.బాధితురాలిని 17 ఏళ్ల దివ్య సికార్వర్గా, ఆమె మోరెనా జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. 12వ తరగతి చదువుతున్న దివ్య శనివారం నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, దివ్య మృతదేహం ఒక నదిలో కనిపించింది. ఆమె తండ్రి భరత్ సికార్వర్ కుమార్తె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి, దానిని రాయికి కట్టి, వారి ఇంటికి 30 కి.మీ దూరంలో ఉన్న కున్వారీ నదిలో విసిరేశాడని పోలీసుల విచారణలో తేలింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దివ్య ఉన్నత కులానికి చెందినది. అయితే ఆమె వెనుకబడిన కులానికి చెందిన యువకుడితో స్నేహం చేస్తూ వచ్చింది. దీంతో ఆ అగ్రకులానికి చెందినవారు దివ్య కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి, ఆ యువకుని హత్యకు పురిగొల్పివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత పోలీసుల విచారణలో మృతురాలి తల్లిదండ్రులు విరుద్ధమైన సమాధానాలిచ్చారు. దివ్య విద్యుత్ షాక్ కారణంగా మరణించిందని చెప్పారు. తరువాత ఆత్మహత్య చేసుకున్నదన్నారు. అయితే పాక్షికంగా కుళ్లిపోయిన ఆమె శరీరాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, మృతురాలి తలపై తుపాకీతో కాల్చిన గాయం ఉందని గుర్తించారు.అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సురేంద్ర పాల్ సింగ్ దబార్ మీడియాతో మాట్లాడుతూ.. దివ్య మృతదేహాన్ని కున్వారీ నది నుండి వెలికితీసి, పోస్ట్‌మార్టం కోసం పంపామని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాత మాత్రమే మరణానికి గల కారణాన్ని నిర్ధారించగలమన్నారు. మృతురాలి తండ్రి భరత్ సికార్వార్ మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన తన కుమార్తెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించిందని, దీంతో భయపడి తాను మృతదేహాన్ని నదిలో పారవేశానని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యాపేటలో దారుణం .. మద్యం మత్తులో కసాయి తండ్రి ఘాతుకం
సూర్యాపేట జిల్లా: మద్యం మత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞని తండ్రి (వెంకటేష్) నేలకేసి కొట్టిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో ఓ కసాయి తండ్రి 12 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన సంఘటన కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం సేవించి వచ్చిన భర్తను భార్య మందలిస్తున్న క్రమంలో చిన్నారి ఏడుస్తుండగా ఆగ్రహానికి గురైన తండ్రి వెంకటేష్ చిన్నారి భవిజ్ఞను రెండు కాళ్లు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అపస్మారక చితికి చేరుకుంది. ఇక కొన ఊపిరిలో ఉన్న పాపను తల్లి, ఆమె బంధువులు ఆసుపత్రికి తీసుకపోగా చికిత్స పొందుతున్న చిన్నారి ఆసుపత్రిలో మృతి చెందింది. హత్య చేసి పరారైన కసాయి తండ్రిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు. మద్యం మత్తులో 12 నెలల చిన్నారి (భవిజ్ఞ) మృతి చెందడంతో బంధువులు విలపిస్తున్న తీరు నలుగురిని కలిచివేసింది. -
కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య!
కుత్బుల్లాపూర్: ఓ వ్యక్తి కుమార్తెతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బïÙరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కాలేజీ వెనక ఉన్న చెరువులో గురువారం ఉదయం ఓ వ్యక్తి, బాలిక మృతదేహాలను గుర్తించిన స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి. విచారించగా బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్(50), అతని కుమార్తె దివ్య(05)గా గుర్తించారు. నాలుగేళ్లుగా అశోక్, అతడి భార్య సోనీ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. అశోక్ వంట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూడేళ్ల క్రితం రోడ్డు అతడి భార్య సోనీ రోడ్డు దాటుతుండగా లారీ ఢీనడంతో ఎడమ కాలు కోల్పోయింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మూడు క్రితం అశోక్ ఆత్మహత్య చేసుకునేందుకు ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీక్ చేశాడు. దీనిని గుర్తించిన అతడి భార్య సోనీ కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆరి్పవేసినట్లు సమాచారం. ఆ మర్నాడు సాయంత్రం అశోక్ కుమార్తెను తీసుకుని ఇంటి నుండి వెళ్లిన అశోక్ కుమార్తెతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


