'నా కూతురిని ఒకరి భార్యగా పెంచలేదన్నాడు'.. సుస్మితా సేన్ | Sushmita Sen revisits legal battle to adopt daughter Renee as a single mom | Sakshi
Sakshi News home page

Sushmita Sen: 'నా కూతురిని ఒకరి భార్యగా పెంచలేదన్నాడు'.. సుస్మితా సేన్

Oct 14 2025 8:00 PM | Updated on Oct 14 2025 8:07 PM

Sushmita Sen revisits legal battle to adopt daughter Renee as a single mom

బాలీవుడ్ భామ సుస్మితా సేన్‌ పరిచయం అక్కర్లేని పేరు. తనకు 18 ఏళ్ల వయసులోనే విశ్వసుందరిగా ఘనతను సొంతం చేసుకుంది. తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుస్మితా సేన్.. బాలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ నటించింది. తెలుగులో నాగార్జునతో కలిసి 'రక్షకుడు' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తోంది.

‍అయితే స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సుస్మితా సేన్ తన ‍వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పలువురితో డేటింగ్‌ చేసిన ఆమె..ఏ ఒక్కరిని పెళ్లాడలేదు. ఆమె రిలేషన్స్‌ మున్నాళ్ల ముచ్చటగానే మారాయి. ప్రేమాయణం కొనసాగించడం.. కొన్నేళ్లకు బ్రేకప్ ఆమె లైఫలో సర్వసాధారణంగా మారిపోయింది.

ఇద్దరు పిల్లలకు తల్లిగా..

అయితే సుస్మితా సేన్ పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. 24వ ఏట రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకుంది. తన తల్లిదండ్రుల మద్దతుతో కొన్నాళ్లకు ఇంకో బిడ్డ (అలీసా)నూ దత్తత తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ పిల్లలను దత్తత తీసుకోవడంలో ఎదురైన ఇబ్బందులను పంచుకుంది. తన తండ్రి సుబీర్ సేన్ తిరుగులేని మద్దతువల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. 2000 సంవత్సరంలో  రెనీని దత్తత తీసుకున్నప్పుడు జరిగిన సంఘటలను పంచుకుంది. ఒంటరి మహిళలు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవడాన్ని జువెనైల్ జస్టిస్ చట్టాలు ఎప్పుడు నిషేధించలేదని వెల్లడించింది.

సుస్మితా మాట్లాడుతూ.. 21 ఏళ్ల వయసులో చట్టబద్ధంగా ఏం చేయాలో నాకు తెలుసు. రెనీ కోసం చట్టపరమైన పోరాటం చేసే సమయంలో నాలో ఆందోళన మొదలైంది. రెనీ విషయంలో కుటుంబ కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే.. వారు బిడ్డను తిరిగి తీసుకుంటారు. అప్పటికే రెనీ నన్ను అమ్మా అని పిలవడం ప్రారంభించింది. అప్పు నాకు ఓ ఐడియా వచ్చింది. పాపను తీసుకుని కారులో నువ్వు పారిపో అని నాన్నతో చెప్పాను. మనం అలాంటి పని చేయకూడదు. కానీ బిడ్డను మా నుంచి ఎవరు తీసుకోలేరని గట్టిగా అనుకున్నాం."అని అన్నారు. అయితే ఈ కేసు మాకు అనుకూలంగా రావడంతో తన తండ్రి పెద్ద పాత్ర పోషించారని పంచుకుంది. నా తండ్రి  వల్లే నాకిప్పుడు పిల్లలు ఉన్నారు.. నా బిడ్డను పోషించడానికి కోర్ట్ చెప్పినట్లుగా సగం ఆస్తిని రెనీ పేరిట రాసిచ్చారని తెలిపింది.

ఆ సమయంలో న్యాయమూర్తి తనను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించింది. మంచి కుటుంబంలోని అబ్బాయి ఎవరూ కూడా నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడరని న్యాయమూర్తి నా తండ్రిని కూడా హెచ్చరించారని వివరించింది.  నేను ఆమెను ఎవరి భార్యగా పెంచలేదని నాన్న జడ్జితో చెప్పారని వెల్లడించింది. ఆ తీర్పే నా జీవితాన్ని మార్చేసిందని సుస్మితా సేన్ తెలిపింది. కాగా.. సుస్మితా సేన్ 1975 నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో  జన్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement