breaking news
Bollywood Actress
-
పెళ్లైన 12 ఏళ్లకు తల్లి అయిన నటి ( ఫోటోలు)
-
సినిమాలకు గుడ్‌బై.. సీరియల్స్‌లోకి హీరోయిన్.. ఎందుకిలా?
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. హిట్ వచ్చిన వెంటనే వరుస అవకాశాలు వస్తాయి. వాటిల్లో ఒకటి, రెండు ఫ్లాపులొస్తే.. వెంటనే దూరం పెట్టేస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువ జరుగుతుంది. వరుస హిట్స్ ఇచ్చి.. ఒక ఫ్లాప్ వస్తే చాలు ఆమెను దూరం పెట్టి..కొత్త వాళ్లను పరిచయం చేస్తుంటారు. అందుకే హీరోయిన్లు.. అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు చేసేసి.. త్వరగానే కెరీర్‌కి గుడ్‌బై చెప్పేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం అవకాశాలు ఉన్నా..పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తారు. మరికొంతమంది మాత్రం పెళ్లి అయిన తర్వాత అవకాశాలు రాకపోవడంతో మెల్లి మెల్లిగా వెండితెరకు కనుమరుగు అవుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించిన అవికా గోర్.. ఇప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పింది. పెళ్లి తర్వాత అవకాశాలు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే నటనను మాత్రం కొనసాగించబోతుంది. మళ్లీ సీరియల్స్‌కి రాబోతున్నట్లు తెలుస్తోంది.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్. ఆ తర్వాత తెలుగు సినిమా ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు,హిందీ, కన్నడ చిత్రాల్లోనూ వరుస సినిమాలు చేసింది. అయితే ఆమె కెరీర్ మొత్తంలో మిడియం రేంజ్ హీరోలతో నటించే అవకాశాలు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోతో నటించలేదు. 2025లో ప్రియుడు నటుడు, వ్యాపారవేత్త మిళింద్ చద్వానీని పెళ్లి చేసుకొని..ఇటీవల బ్యాంకాక్‌లో స్థిరపడింది. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెప్పింది. కానీ అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో మళ్లీ ఈ బ్యూటీ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమే అన్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.‘మన ప్రయాణం ఎక్కడ మొదలైయిందో మళ్లీ అక్కడికే చేరుకోవడం అందమైన విషయం. దీని గురించి ఎక్కువ చెప్పదల్చుకోలేదు. మనం కొత్త దారుల్లో వెళ్లినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ జీవితం అప్పుడప్పుడు మన మూలాల దగ్గరకు తీసుకెళ్తుంది. అలాఅని అది వెనక్కి తగ్టినట్లు కాదు. ఒక కొత్త కోణంలో అర్థం చేసుకునేంతగా మనం ఎదిగామాని అర్థం’ అని ఆమె ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.కాగా, అవికా గోర్ ఇటీవల ‘ఎస్జే స్టూడియోస్’కి వెళ్లింది. అప్పటినుంచే ఆమె కొత్త టీవీ ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారన్న ప్రచారం మొదలైంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌తో అది నిజమే అన్నట్లుగా తెలిసిపోతుంది. -
బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)
-
'నిన్ను పొరపాటున తీసుకున్నారు'.. రాజమౌళి హీరోయిన్ ఆవేదన
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇండియన్ మూవీలో నటిస్తోంది. మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసిలో హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ముద్దుగుమ్మ తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కేవలం ఒక్క క్షణంలోనే సినిమా చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమందిని మెప్పించలేకపోయాననే కారణంతో తనను సినిమా నుంచి తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయని ప్రియాంక తెలిపింది.ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను వాళ్లతో ఏకీభవించలేదని.. నన్ను సినిమాల నుంచి తీసేశారు. 2007లో ఓ సినిమాకు నన్ను ఎంపిక చేశారు. సలామ్-ఎ-ఇష్క్ షూటింగ్ సమయంలో మరో సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సమయంలో హీరో ఒకరోజు నా సెట్‌కు వచ్చారు. తర్వాత నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసి నాకు మద్దతుగా వచ్చాడని అనుకున్నా. కానీ ఆయన ఊహించని మాట చెప్పారు. దర్శకుడు పొరపాటున నిన్ను సెలెక్ట్ చేశారు. నిజానికి ఈ రోల్ మరో హీరోయిన్ చేయాల్సింది. మనం భవిష్యత్తులో మరో సినిమా చేద్దాం. ఈ విషయం నీకు చెప్పాలనే వచ్చా’ అని చెప్పారని గుర్తు చేసుకుంది. అంతేకాకుండా కొందరు అగ్ర హీరోలు నన్ను ఉద్దేశపూర్వకంగా సినిమాల నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. -
ఆ నిర్మాత ఒంటరిగా హోటల్‌కి రమ్మన్నాడు : నటి
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. కానీ గతంలో దీని గురించి బహిరంగంగా మాట్లాడేందుకు నటీనటులు భయపడేవాళ్లు. అవకాశాలు రావనో..లేదంటే వేరేలా అనుకుంటారేమోననని భయంతో బయటకు చెప్పేందుకు నిరాకరించేవాళ్లు. ఈ మధ్య మాత్రం మార్పు వచ్చింది. తమను వేధింపులకు గురి చేస్తే.. వెంటనే మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ.. కొత్తగా వచ్చే వాళ్లు అలాంటి వేధింపులను ఎలా ఎదుర్కోవాలో సలహా ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలు, లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి సింపుల్ కౌల్ కూడా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను, వాటిని ఎలా ఎదుర్కొన్నారో వివరించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోని వ్యక్తులను ఎప్పుడు , ఎక్కడ, ఎలా కలవాలనే విషయంలో నాకు స్పష్టత ఉండేది. కెరీర్ ప్రారంభం నుంచే ముక్కు సూటిగా ఉండేదాన్ని. ఎవరైన హద్దులు దాటి వ్యవహరిస్తే సహించేదాన్ని కాదు. అందుకే క్యాస్టింగ్ కౌచ్ నాకు ఎదురవ్వలేదు’ అని అన్నారు.నిర్మాత హోటల్‌కి రమ్మన్నాడు.. ఇదే ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ సంఘటన గురించి సింపుల్ కౌల్ వివరించారు. ‘ఓ సినిమా కోసం నిర్మాత కాల్ చేశాడు. సాయంత్రం ఒంటరిగా హోటల్‌కి రమ్మని చెప్పాడు. నేను స్నేహితులతో కలిసి వెళ్లా. ఈ విషయం హోటల్‌కి వెళ్లాక ఆయనకు చెప్పాను. నన్ను ఒంటరిగా గదిలోకి రమ్మని ఆహ్వానించాడు. నేను రానని చెప్పా. కలవాలనుకుంటే హోటల్ లాబీలోనే కలుసుకోవచ్చు అని అతని చెప్పా. అంతే కానీ అవకాశం వస్తుంది కదా అని అతను చెప్పినట్లుగా వెళ్లలేదు.టాలెంట్‌ని నమ్ముకోండి..నా ఇన్నేళ్ల సినీ కెరీర్లో అనౌకర్యంగా అనిపించే సీన్లో ఎప్పుడూ నటించలేదు. చర్చల కోసం ఆహ్వానించినా.. ఒంటరిగా వెళ్లేదాన్ని కాదు. చిత్రబృందం సమక్షంలోనే కథను వినేదాన్ని. కొత్తగా వచ్చే వాళ్లకు నా సలహా ఏంటంటే.. ‘అసౌకర్యంగా అనిపించే ఏ పనినైనా చేయకండి. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా.. అంతరాత్మ చెప్పిందే వినండి. రాజీ పడితేనే అవకాశాలు వస్తాయని అనుకోకండి. నైపుణ్యాన్ని పెంచుకోండి. వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టండి’అని సింపుల్ కౌల్ సలహా ఇచ్చారు. 2002లో ఏక్తా కపూర్ నిర్మించిన ' కుసుమ్' సీరియల్‌తో నటనారంగంలోకి అడుగుపెట్టారు సింపుల్ కౌల్. ఆ తర్వాత 'షరారత్' , 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పెందారు . -
పింక్ శారీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ అందాలు.. ఫోటోలు
-
ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు
-
'మా ముందే దుస్తులు వేసుకోవచ్చుగా?'.. హీరోయిన్‌కు చేదు అనుభవం
సల్మాన్ ఖాన్ 'వీర్' (2010) సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఐటం సాంగ్స్‌తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత హౌజ్‌ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. ఇక తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలో జరీన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించింది.ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో పెద్దగా చేయకపోయినా జరీన్ ఖాన్.. తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్లో మెరిసింది. ఓ క్లాత్ స్టోర్ ఓపెనింగ్‌కు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా డ్రెస్సులు చూస్తున్న జరీన్ ఖాన్‌ను ఓ ఫొటోగ్రాఫర్ అసభ్యకర ప్రశ్న వేశారు. ఈ డ్రెస్ మీరు ట్రయల్ వేయొచ్చుగా అని అడగాడు. దీంతో ఆమె వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి.. మీ ముందేనా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.. మీ హద్దులు దాటొద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #ZareenKhan slammed the paparazzi after one of them allegedly asked her to "try the dress" in front of everyone at a Mumbai event.She immediately shut it down, saying, "Hadd mein rehna," and made it clear she won't tolerate such comments.Being a celebrity doesn't mean someone… pic.twitter.com/GsiIhprgnB— Anjali (@Vada_paaww) July 14, 2026 -
శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..
-
సిస్టర్ పెళ్లిలో ఖుషీ కపూర్ స్టైలిష్ అవుట్‌ఫిట్.. ఫోటోలు
-
ప్రియుడిపై జాన్వీ కపూర్ ప్రేమ.. ఏకంగా మెహందీలో కూడా..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇటీవలే పెద్ది మూవీ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా మెప్పించింది ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో అచ్చియమ్మ పాత్రతో అభిమానులను ఆకట్టుకుంది.ఇక సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ ఇటీవలే బోనీ కపూర్ మొదటి భార్య కూతురైన అన్షులా కపూర్ పెళ్లిలో సందడి చేసింది. తన సిస్టర్ ఖుషీ కపూర్‌తో కలిసి ఈ వేడుకకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వరుసకు తన సోదరి అయిన అన్షులా కపూర్ వివాహ రిసెప్షన్లో జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె వేసుకున్న మెహందీలో తన ప్రియుడైన శిఖర్ పహారియాను పేరును రాసుకుంది. ఆమె ముద్దుగా పిలిచే శికు అంటూ మెహందీలో రాసుకొచ్చింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.శిఖర్ పహారియాతో డేటింగ్..కాగా.. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా చాలా ఏళ్లుగా ఫ్రెండ్షిప్లో ఉన్నారు. వీరిద్దరూ 2016లో డేటింగ్ ప్రారంభించి.. 2018లో జాన్వీ బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత విడిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 2023లో వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు. దీంతో మళ్లీ డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా జాన్వీతోనే శిఖర్ కనిపిస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో జాన్వీ, శిఖర్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఖండించారు. -
మూడు జనరేషన్లతో హీరోయిన్ మెమరబుల్ ట్రిప్ (ఫొటోలు)
-
పెళ్లి రోజున సర్ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు: సెలీనా జైట్లీ
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగంగా స్పందించింది. సెలీనా ఆస్తులన్నింటినీ తన భర్త పీటర్ హాగ్ బదలాయించుకున్నారని ఆమె ఆరోపించింది. తన వైవాహిక బంధం అత్యంత వివాదాస్పదమైంది. దాంతో పెళ్లి చేసుకునే యువతులకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. సెలీనా జైట్లీ మాటల్లో.. మీకు సొంతంగా ఆస్తులు ఉంటే దయచేసి పెళ్లికి ముందే అతడితో ఓ ఒప్పందం చేసుకోండి. మీ ఆస్తులను ఎప్పుడూ విడిగానే ఉంచుకోండి. ఎందుకంటే చివరికి అంతా ఆస్తుల చుట్టూనే తిరుగుతుందని చెప్పింది. 2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను సెలీనా వివాహం చేసుకుంది. వీరికి విన్స్టన్, విరాజ్, ఆర్థర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. మరో కుమారుడు షంషేర్ గుండె సమస్యతో చిన్న వయసులోనే మరణించాడు. తన 15వ వివాహ వార్షికోత్సవం రోజే విడాకుల పత్రాలు “బహుమతి”గా అందాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా రూ. 20 కోట్ల విలువైన ఆస్తులను హాగ్ తన పేరిట రాయించుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల్నీ కూడా హాగ్ బదలాయించుకున్నాడని సెలీనా ఆరోపిస్తోంది. ఇక సెలీనా సినీ రంగంలో ఆరేళ్ల విరామం తర్వాత ‘సిస్టర్ నివేదిత’ సినిమాతో బాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది. సెలీనా గతంలో తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించింది.ఈ సందర్భంలో ఆమె ఇచ్చిన సలహా పెళ్లి చేసుకునే ముందు ముఖ్యంగా సొంత ఆస్తులు ఉన్న యువతులు, తప్పనిసరిగా ప్రీ-నప్షియల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. తద్వారా భవిష్యత్తులో భర్తతో మోసపోకుండా ఉండగలరని సూచించింది. -
కుందనపు బొమ్మలా జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
మా దుస్తులపై కూడా వాళ్లదే నిర్ణయం..: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆదిపురుష్ భామ కృతి సనన్ ఈ ఏడాది ప్రారంభంలో కాక్టెయిల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో షాహిద్ కపూర్ సరసన మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి సనన్.. సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై మాట్లాడింది. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేసింది.సినీ పరిశ్రమలో లింగ వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతుందని కృతి సనన్ అన్నారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉంటే స్టార్డమ్ చాలా ప్రత్యేకమన్నారు. హీరోయిన్ల విషయానికి వస్తే ఎలాంటి గుర్తింపు ఉండదని తెలిపారు. సెట్లో పురుషులకు అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తెరపై రాసే పాత్రల విషయంతో పాటు సెట్లో పురుష, మహిళా నటీనటులను వేర్వేరుగా చూసే విధానంలో కూడా సినీ పరిశ్రమ పురుషులకే అనుకూలంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటివీ ఎక్కువగా చూశానని తెలిపారు. ఒక మహిళా నటి ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు సెట్లో వ్యతిరేకత పెరిగిపోతుందని కృతి సనన్ పంచుకుంది. కృతి సనన్ మాట్లాడుతూ..' సెట్లో దర్శకుడిని ప్రశ్నలు అడగడం నాకు అలవాటు. నాకు ఆసక్తి ఎక్కువ. ఎప్పటినుంచో అంతే. అలానే నేను ఎదిగాను. నేను నటనలో ఎప్పుడూ శిక్షణ తీసుకోలేదు. ఏమీ తెలియనట్టు ఉండటం కన్నా ప్రశ్నలు అడగడమే మేలు అనుకుంటా. నేను ఏదైనా సలహా ఇస్తే.. నువ్వు దీన్ని అనవసరంగా విశ్లేషిస్తున్నావ్ అంటారు. సెట్స్‌పై ఉండే మేనేజ్మెంట్కు హీరోల టైమింగ్స్ అంటే ఒక రకమైన భయం, గౌరవం. అందుకే వాళ్లను షాట్ పెట్టాక పిలుస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్‌లో కూర్చోబెడతారని' ఆమె తెలిపింది.కృతి సనన్ ఇంకా మాట్లాడుతూ.. 'చాలాసార్లు హీరోయిన్లకు దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం దక్కదు. చెప్పింది చెయ్ అంటూ అవమానిస్తారు. ఇక హీరోయిన్లు ఏ ఏ ప్రమోషన్లలో పాల్గొనాలి.. ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారు. చివరకు మేం వేసుకునే దుస్తులు కూడా వాళ్లే చెబుతారు. అందుకే హీరోయిన్లకు ప్రాధాన్యత లేని పాత్రలు చేయడానికి తాను ఇష్టపడట్లేదని' చెప్పుకొచ్చింది. -
యానివర్సరీ గిఫ్ట్‌గా విడాకుల నోటీసులు: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ దాదాపు పదిహేనేళ్ల తర్వాత తిరిగి సినీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు హీరోగా వి. సముద్ర దర్శకత్వం వహిస్తోన్నసూర్యం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. 2004లో వచ్చిన ఈ మూవీ తర్వాత సెలీనా తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేసింది. ఆమె హీరోయిన్గా నటించిన చివరి చిత్రం శ్రీమతి. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ కన్నడ సినిమా 2011 జూలై 8న విడుదలైంది. అదే ఏడాది ఆమె పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. అలా దాదాపు 15 ఏళ్ల పాటు వెండితెరకు దూరమైంది. తాజాగా బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సెలీనా.. తన పర్సనల్ లైఫ్, పెళ్లి జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతోనే తాను ఇండియాకు తిరిగి వచ్చానని తెలిపింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొద్దిమంది స్నేహితుల మద్దతుతో నా లైఫ్ తిరిగి ప్రారంభించానని చెప్పారు. ఆస్ట్రియాలో ఉన్నప్పుడే తన 15వ వివాహ వార్షికోత్సవానికి ముందు విడాకుల నోటీసులు వచ్చాయని తెలిపింది. ఆ నోటీసులు కూడా తాను చదవలేదని.. నా ఇద్దరు కవలలే చదివి వినిపించారని వెల్లడించింది. ఈ సందర్భంగా తన వైవాహిక సమస్యల గురించి మాట్లాడుతూ సెలీనా జైట్లీ కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్లి రోజు గిఫ్ట్‌గా విడాకుల నోటీసులు పంపాడని తన బాధను వ్యక్తం చేసింది.విడాకుల కేసు విచారణ సమయంలో కూడా వేధింపులు ఎదుర్కొన్నానని సెలీనా జైట్లీ తెలిపింది. ఆ సమయంలో నా బ్యాంకు ఖాతాలో చాలా తక్కువ డబ్బు ఉందని వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులతో ఒక పీడకలలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు అనిపించిందని సెలీనా చెప్పుకొచ్చింది. పిల్లల శ్రేయస్సు దృష్ట్యా తాను స్నేహపూర్వకంగా విడిపోవడానికి అంగీకరించానని.. తన ఆస్తులు, తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బు, పిల్లల ఉమ్మడి సంరక్షణ తప్ప మరేమీ తనకు అవసరం లేదని వెంటనే తన భర్త న్యాయవాదులకు ఒక అభ్యర్థన పంపానని తెలిపింది.విడాకుల కేసు సమయంలో ఒంటరిగా పోరాటం చేయాల్సి వచ్చిందని వివరించింది. తన భర్త ఇంటి పై అంతస్తులో నివసిస్తుండగా.. నేను పిల్లలతో కలిసి మధ్య అంతస్తులో ఉండేదాన్ని అని తెలిపింది. పిల్లలకు వారి జీవితంలో స్థిరపడే వరకు కొంతకాలం అక్కడే నివసించడానికి అనుమతి కూడా కోరానని ఆమె చెప్పింది. కానీ పిల్లలతో అక్కడే ఉండాలంటే ఉద్యోగం చేయాలని నాకు అర్థమైందని తెలిపింది. ఆ తర్వాత సూపర్మార్కెట్లో క్లీనర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని తనతో భర్త చెప్పిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది.ఇండియాలోని తన ఆస్తులను విక్రయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడే పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. దీంతో తాను అర్ధరాత్రి ఆస్ట్రియా నుండి తిరిగి వచ్చానని వెల్లడించింది. ఇల్లు లేకుండా భారతదేశానికి తిరిగి రావడం.. పది రోజుల పాటు హోటల్లో ఉంటూ తన జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రీతి జింటాతో పాటు ఇతర ఫ్రెండ్స్‌పై ఆధారపడ్డానని గుర్తు చేసుకుంది.కాగా.. సెలీనా జైట్లీ 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్ వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో విన్స్టన్, విరాజ్ అనే కవలలు జన్మించారు. ఆ తర్వాత 2017లో ఆర్థర్ అనే మరో కుమారుడు జన్మించారు. గతంలో ఓ కుమారుడు షంషేర్ గుండె సంబంధిత వ్యాధితో చనిపోయిందని తెలిపారు. 2025 నవంబర్‌లో గృహ హింస, భర్త వేధింపులకు తట్టుకోలేక ముంబయిలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. -
బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు ఎలా తీస్తారు? నటి సీరియస్
సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్స్‌కి వచ్చినప్పుడు వారిని మీడియా కవర్ చేయడం సహజమే. ఇక సినిమా తారలు అయితే ఎక్కడ కనిపించినా కెమెరాలు ‘క్లిక్’ అంటూనే ఉంటాయి. అయితే కొంతమంది ఫోటోగ్రాఫర్లు మాత్రం వారిని కెమెరాలను రకరకాల యాంగిల్స్‌లో పెట్టి సినీ తారలను అభ్యంతరకంగా చూపించే ప్రయత్నాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై బాలీవుడ్ నటి నేహా ధూపియా ఫైర్ అయింది. అలా ఫోటోలు తీస్తున్న మీడియా ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పదే పదే చెబుతున్నా వినరా?తాజాగా ముంబైలో ఈ ఈవెంట్‌కు హాజరైన నేహా ధూపియా.. అక్కడ తనను ఫోటోలు తీస్తున్న మీడియా ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అయింది. ‘మీలో ఎవరు వెనుకవైపు నుంచి ఫోటోలు , వీడియోలు తీస్తున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు. నన్నే కాదు ఏ హీరోయిన్ని కూడా వెనుక నుంచి ఫోటోలు తీయొద్దు. బ్యాగులు సర్దుకుంటుంటే.. పుస్తకాలు తీసుకుంటున్నా.. చివరకు నార్మల్‌గా నడచుకుంటూ వెళ్తే కూడా వెనక నుంచి ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు? ఇలాంటి పనులు చేయొద్దని పదే పదే చెబుతున్నా ఫోటోగ్రాఫర్లు వినడం లేదు. మీడియాతో ఎంతో గౌరవంగా మాట్లాడతాం. మీరు కూడా అంతే మర్యాదగా నచుడుకోండి’ అని నేహా సీరియస్ అయింది.అందుకే సీరియస్..నేహా ధూపియా ఈ స్థాయిలో సీరియస్ అవ్వడానికి గల కారణం కూడా ఉంది. గతంలో ఆమె రన్నింగ్ ట్రాక్‌పై పరుగెడుతుండగా.. కొంతమంది ఇబ్బందికరమైన యాంగిల్స్‌లో ఫోటోలు, వీడియోలు తీశారు. అవి నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. నెటిజన్స్ దారుణమైన కామెంట్స్ పెట్టారు. తాజా ఈవెంట్లో కూడా అలా నడుస్తుండగా..వెనుక నుంచి ఫోటోలు తీయడంతో పాత విషయాన్నిగుర్తు చేస్తూ ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.సెలబ్రిటీలను కవరేజ్ చేసేటప్పుడు ఒకరి వ్యక్తిగత పరిధులు దాటకుండా చూసుకోవడం అవసరమని ఆమె పేర్కొన్నారు. పదే పదే హెచ్చరించినా వినకపోవడం వల్లే తాను ఈ విధంగా అందరి ముందు స్పందించాల్సి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఆమె తీసుకున్న స్టాండ్‌కు నెటిజన్స్ మద్దతు ఇస్తూ కామెంట్స్ పెడుతున్నారు. Actress Neha Dhupia strongly scolded the paparazzi for taking back shots from behind.She said, "These paparazzi have become disrespectful. All they do is take back shots from behind. We're tired of telling them again and again - this needs to stop completely."Recently, Neha… pic.twitter.com/uEgE2c3ikV— Saffron Chargers (@SaffronChargers) June 30, 2026 -
రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)
-
ప్రముఖ బుల్లితెర జంట విడాకులు
సినీ ఇండస్ట్రీలోనే విడాకులు పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్స్ విజయ్, జయం రవి లాంటి వాళ్లు విడాకుల కేసులతో వార్తల్లో నిలిచారు. సినిమా రంగంలోనే ఎక్కువగా ఇలాంటి వార్తలొస్తున్నాయి. తాజాగా మరో స్టార్ జంట విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ప్రముఖ బాలీవుడ్ జంట గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నటి ఆకాంక్ష తాజాగా లాక్ అప్ సీజన్-2 ప్రీమియర్‌లో అఫీషియల్‌గా చెప్పేసింది. గతేడాదిగా తాము విడివిడిగా ఉంటున్నామని.. ఇప్పుడు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఆమె వెల్లడించింది.ఈ విషయాన్ని 'లాక్ అప్ సీజన్ 2' ప్రీమియర్‌లో ఆకాంక్ష ధృవీకరించింది. గత ఏడాదిగా తాము విడివిడిగా ఉంటున్నామని, ఇప్పుడు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఆమె అక్కడ వెల్లడించింది. దీంతో 10 ఏళ్ల వివాహ బంధం తర్వాత గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా విడాకులు తీసుకోబోతున్నారు.ఈ రియాలిటీ షోలో ఆకాంక్ష మాట్లాడుతూ.. "నేను, గౌరవ్ విడాకులు తీసుకుంటున్నాం. మేము గతేడాదిగా విడివిడిగానే ఉంటున్నాం. ఈ విషయం బయటికి చెప్పలేదు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. నాకు, గౌరవ్‌కు మధ్య పరిస్థితులు బాగానే ఉన్నాయి. మేము ఇప్పటికీ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాం. భాగస్వాములుగా మేము ఒకరికొకరు సెట్ కాలేదని అనుకుంటున్నాం., ఎందుకంటే మేమిద్దరం చాలా భిన్నమైన ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాం. కానీ మేమిద్దరం కలిసి కాదు" అని విడాకులపై తేల్చేసింది. కాగా.. గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా చాలా ఏళ్ల ప్రే తర్వాత నవంబర్ 24, 2016న కాన్పూర్‌లో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరిద్దరు బాలీవుడ్ సీరియల్స్‌లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. -
అతన్ని కొట్టాను..ఇప్పటికీ బాధపడుతున్నా: అలియా భట్
సినిమాల్లో ఒకప్పుడు యాక్షన్ సన్నివేశాలు కేవలం హీరోలు మాత్రమే చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్లు సైతం గాల్లోకి ఎగిరి ఫైట్ చేస్తున్నారు. రెండు చేతుల్లో గాన్స్ పట్టి ఫైర్ కూడా చేస్తున్నారు. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే అందాల భామ అలియా భట్ కూడా హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌తో అలరించడానికి రెడీ అవుతుంది. ఆమె ప్రధాన పాత్రలో, శివ్ రావేల్ తెరకెక్కించిన చిత్రం ‘ఆల్ఫా’. జులై 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్ల కోసం ప్రాక్టీస్ చేస్తున్న సయమంలో ఓ కొరియోగ్రాఫర్‌ని కొట్టానని చెప్పింది. అలా కొట్టినందుకు ఇప్పటికీ బాధ పడుతున్నానని అలియా తెలిపింది. ‘ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అనుకోకుండా అతన్ని కొట్టాను. వెంటనే సారీ కూడా చెప్పాను. కానీ నా వల్ల ఒకరికి దెబ్బ తగిలినందుకు చాలా బాధేసింది. ఇప్పటికీ అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతాను. యాక్షన్ సీక్వెన్స్ తెరపై సహజంగా చూపించడానికే అలా ప్రాక్టీస్ చేశాం. ఆల్ఫాలో యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఈ చిత్రం ఇచ్చింది’ అని అలియా చెప్పకొచ్చింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాబీ డియోల్ కూడా అలియా యాక్షన్ సీన్స్ చూసి భయపడిపోయానని చెప్పాడు. అలియా చాలా సన్నగా ఉంటారని.. ఎక్కడ దెబ్బ తగులుతుందోననే భయంతో జాగ్రత్తగా షూటింగ్ చేశామని ఆయన చెప్పుకొచ్చాడు. -
కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు
-
గోల్డెన్ అనార్కలీ డ్రెస్‌లో రాకుమారిలా షెహనాజ్ గిల్
-
ఛావా డైరెక్టర్ మరో సినిమా.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ ఈత. స్త్రీ-2 బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆమె పీరియాడికల్ స్టోరీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రణ్‌దీప్ హుడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తుంటే విఠాబాయి భావు మాంగ్ నారాయణ్గావ్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిననట్లు తెలుస్తోంది. బ్రిటీష్ కాలం నుంచే డ్యాన్సర్‌గా ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కొందనే కోణంలో ఈ మూవీ ఉండనుందని అర్థమవుతోంది. ఈ టీజర్లో నిండు గర్భిణిగా ఉన్న ఆమె డ్యాన్స్ చేయడం అంచనాలు పెంచుతోంది. ఈ టీజర్ చూస్తుంటే ఛావా మూవీలాగే మరో బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది. -
పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పెద్ది మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ అచ్చియమ్మ పాత్రలో మెప్పించింది బాలీవుడ్ భామ. అయితే ఆమె రోల్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆమె సీన్స్‌ను కొన్నింటిని తొలగించారు. పెద్ది మూవీతో తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది.ఇక సినిమా సంగతి పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ తన ప్రేమ, ప్రియుడి గురించి హింట్ ఇచ్చింది. తాను ధరించిన టీ షర్ట్‌పై క్యూట్ కొటేషన్ రాసుకొచ్చింది. ఒకవేళ నేను తప్పిపోతే నా ప్రియుడికి అప్పజెప్పండి ప్లీజ్.. శిఖర్ పహారియా పేరు రాసిన టీ షర్ట్‌ను ధరించింది. చూసేందుకు ఇదంతా ఫన్నీగా ఉన్నా.. ఈ ముద్దుగుమ్మ తన లవ్ గురించి ఓపెన్‌గానే చెప్పినట్లు ఉందంటున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో జాన్వీ కపూర్.. ప్రియుడు శిఖర్ పహారియానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్
-
సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు
-
లక్ష ఆఫర్.. కమిట్మెంట్ అడిగారు: ప్రముఖ నటి
సినీ ఇండస్ట్రీలో కామన్‌గా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకునే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఈ అనుభవం ఎదుర్కొనే ఉంటారు. ఈ విషయాన్ని కొందరు బయటికి చెబితే.. మరికొందరు లైట్ తీసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ వివరాలేంటో తెలుసుకుందాం.బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాన్ని తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే సమయంలో కాంప్రమైజ్ అడిగారని గుర్తు చేసుకుంది. ఒప్పుకుంటే రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేశారని వెల్లడించింది. అందుకే బయటి వారికి బాలీవుడ్ ఎంత కష్టమో ఈ సంఘటనే సాక్ష్యమని ఆమె అన్నారు. అప్పట్లో కాంప్రమైజ్ అనే పదానికి తనకు అర్థం తెలియదని పేర్కొంది.సినిమా ఆఫర్ కోసం ఒక రోజు ఒక వ్యక్తి నుంచి తన ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని తెలిపింది. అందులో రూ. 1 లక్ష ప్లస్ కాంప్రమైజ్ అని రాసి ఉందని పేర్కొంది. కానీ అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త కావడం వల్ల కాంప్రమైజ్‌కు అర్థం తెలియక...కాంప్రమైజ్ అంటే ఏంటి?’ అని రిప్లై కూడా ఇచ్చానని వివరించింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తన కాస్టింగ్ డైరెక్టర్‌కు చూపించగా.. అతను వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, మెసేజ్ డిలీట్ చేయమని చెప్పాడని తెలిపింది.కాగా.. మాన్వీ గాగ్రూ.. పీకే, ఉజ్దా చమాన్, శుభ్ మంగళ్ జ్యాద సావధాన్, ఆమ్రాస్: ద స్వీట్ టేస్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఎ క్వశ్చన్ మార్క్, గాయ్ ఇన్ ద స్కై, ఉజ్దా చామన్, 377 అబ్నార్మల్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, పిచర్స్, ట్రిప్లింగ్స్, తామశ్రీ వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ కనిపించింది. ఆమె 2023లో కమెడియన్ కుమార్ వరుణ్‌ను పెళ్లాడింది. -
మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు
-
ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
-
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఛావా నటి బలవన్మరణం
ప్రముఖ బుల్లితెర నటి సంచితా ఉగలే(22) బలవన్మరణానికి పాల్పడింది. బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించిన ఆమె ముంబయిలోని తన నివాసంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకుంది. ఆమె చివరిసారిగా ఓ రీల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఆమె మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సంచితా హిందీలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు. 'కుంకుమ్ భాగ్య', 'సాజన్ ఘర్', 'దిల్వాలీ దుల్హా లే జాయేగీ' లో కనిపించారు. టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కుంకుమ్ భాగ్య' సీరియల్లో దియా టాండన్ పాత్రకు ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా 'వాగ్లే కి దునియా' సీరియల్లో రుచితా.. జైట్లీ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 'దిల్వాలీ దుల్హా లే జాయేగీ'లో సోరబ్ బేడీ సరసన సుకూన్ అనే ప్రధాన పాత్రను పోషించింది. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' మూవీలో ఆమె తారాబాయి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Sanchita Ugale (@sanchita_ugale) -
పాక్ నటుడితో అమీషా పటేల్ రొమాంటిక్ డ్యాన్స్.. వీడియో వైరల్
బద్రి, నాని, నరసింహుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అమీషా పటేల్. 51 ఏళ్ల వయసులోనూ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటుడు ఇమ్రాన్ అబ్బాస్.. అమీషా పటేల్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పాత రొమాంటిక్ డ్యాన్స్ వీడియో అది. జూన్ 9న అమీషా పటేల్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఆమెకు విషెస్ తెలియజేస్తూ..గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘క్రాంతి’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘దిల్ మే దర్ద్ సా జగా హై’ పాటకు సంబంధించిన వీడియో క్లిప్పుని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. గతంలో వీరిద్దరూ ఒక ఈవెంట్ నిమిత్తం బహ్రెయిన్‌లో కలుసుకున్నప్పుడు ఈ వీడియోను చిత్రీకరించారు. ‘నాకెంతో ఇష్టమైన పాటల్లో ఒకటైన ఈ సాంగ్‌కు నీతో కలిసి వీడియో చేయడం మర్చిపోలేని అనుభూతి’ అంటూ ఇమ్రాన్ అబ్బాస్ ఈ వీడియోను షేర్ చేస్తూ అమీషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పాకిస్తానీ నటుడితో అమీషా పటేల్ అంత క్లోజ్‌గా మూవ్ అవ్వడం, రొమాంటిక్ వీడియోలు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ గతంలో నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని అమీషా, ఇమ్రాన్ అబ్బాస్‌తో ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తలపై ఆమె గతంలోనే స్పందించారు. తామిద్దరం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, ఇద్దరం ఒంటరిగా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని, వాటిని చూసి నవ్వుకున్నానని ఆమె కొట్టిపారేశారు. ఏదేమైనప్పటికీ, భారత్-పాక్ సరిహద్దులను దాటిన వీరి స్నేహం, ఈ క్యూట్ రొమాంటిక్ వీడియో ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు ఇరు దేశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. View this post on Instagram A post shared by Mera FM 107.4 (@merafmofficial) -
ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి సురభి జ్యోతి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 13న తనకు కుమార్తె జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. మా ఇంటికి కుమార్తె వచ్చేసింది.. ఈ సమయంలో మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు, స్నేహితులు సురభికి అభినందనలు చెబుతున్నారు.కాగా.. సురభి జ్యోతి బాలీవుడ్లో 'ఖుబూల్ హై' అనే సీరియల్‌తో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగిని-3 సీరియల్స్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భవతి అని ప్రకటించిన బుల్లితెర భామ తాజాగా బిడ్డకు వెల్కమ్ చెప్పింది. ఆమె తన ప్రియుడు సుమిత్ సూరిని అక్టోబర్ 27, 2024న వివాహం చేసుకుంది. వీరి వివాహం ఉత్తరాఖండ్‌లోని ఆహానా రిసార్ట్‌లో గ్రాండ్‌గా జరిగింది.కాగా.. ఆమె భర్త సుమిత్ రిషికేశ్ నటుడిగా మాత్రమే కాదు.. నిర్మాత కూడా రాణిస్తున్నారు. పలు వాణిజ్య ప్రకటనలలో నటించాడు. అంతేకాకుడా గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన 'వార్నింగ్' చిత్రంతో బాలీవుడ్లో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 'ఖత్రోన్ కే ఖిలాడి' 4వ సీజన్లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. -
'రాముడి పాత్రకు సుశాంత్‌ను మించినవారు లేరు'.. సోదరి ఎమోషనల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి గుర్తు చేసుకుంది. ఇవాళ సుశాంత్ వర్ధంతి కావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సోదరుడిని గుర్తు చేసుకుని ఎమోషనలైంది. కాలం గడిచినా తన సోదరుడి ఉనికి ఇంకా తమతోనే ఉందని శ్వేత రాసుకొచ్చింది. నువ్వు లేకుండా ఆరేళ్లయినా నువ్వు జీవించిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సుశాంత్ శ్రీరాముడిలా ఉన్న ఏఐ ఫోటోను షేర్ చేసింది.శ్వేత తన ఇన్‌స్టాలో రాస్తూ.. "ఆరేళ్ల కాలం గడిచిపోయింది.. అయినా కొన్ని ఆత్మలు కాలానికి అతీతంగా ఎదుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అతను ఎలా మరణించాడో కాకుండా.. ఎలా జీవించాడో గుర్తుంచుకోవాలనుకన్నా.. అతను జిజ్ఞాస, కరుణ, గౌరవంతో నిండిన వ్యక్తి' అని అభివర్ణించారు. ఎవరైనా సరే చాలా గౌరవించేవాడని శ్వేత తెలిపింది. కరుణ, దయ లేకపోతే విజయానికి అర్థం లేదని తన చుట్టూ ఉన్నవారికి నేర్పించాడని ఆమె రాసుకొచ్చారు. అందుకే తన సోదరుడు జీవితమే తనకు ఆదర్శమని ఆమె అన్నారు. రాముడిలా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..నితేష్ తివారీ రామాయణం టీజర్ విడుదలైన తర్వాత.. సుశాంత్‌ను శ్రీరాముడిగా ఊహించకున్నానని తెలిపింది. రాముడు కేవలం వ్యక్తి మాత్రమే కాదని.. ఆయన అమూల్యంగా భావించే విలువలకు ప్రతీక అని పేర్కొంది. మర్యాద, కరుణ, గౌరవం, ధైర్యం, సత్యం సీతామాతపై ఆయనకున్న స్వచ్ఛమైన ప్రేమ రాముడి పాత్రకు సంబంధించిన అమాయకత్వం, స్వచ్ఛత, ఔన్నత్యం సుశాంత్ కనిపించాయని అన్నారు. ఈ రోజుల్లో భాయ్ పోషించినంత అద్భుతంగా రాముడి పాత్రను ఎవరూ పోషించలేరని కూడా శ్వేత అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. View this post on Instagram A post shared by ♾️Shweta Singh Kirti (@shwetasinghkirti) -
'నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్ నటి ఆవేదన
బాలీవుడ్ భామ మౌనీ రాయ్ బాలీవుడ్లో సుపరిచమైన పేరు. ఇటీవలే ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కానీ ఆ తర్వాత మౌనీ రాయ్‌పై పెద్దఎత్తన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. చాలా దారుణంగా కొందరు కామెంట్స్ చేశారు. ఆమెను గే అంటూ రూమర్స్ సృష్టించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మౌనీ రాయ్ తనపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్‌పై స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. తనపై గే అన్న రూమర్‌పై రియాక్ట్ అయింది. తాను విన్న వాటిలో అత్యంత అసంబద్ధమైన రూమర్ ఇదేనని మౌనీ రాయ్ వెల్లడించింది.విడాకుల ప్రకటన తర్వాత తన చుట్టూ బలమైన మద్దతుగా నిలబడే వాళ్లు ఉండడం తన అదృష్టమని మౌనీ రాయ్ చెప్పింది. నాకు ఎల్లప్పుడూ ఒక కొండంత అండగా నిలిచే స్నేహితులు, కుటుంబం ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. కష్ట సమయాల్లో నాకు సహాయం చేయడంలో నా స్నేహితులు ముఖ్యమైన పాత్ర పోషించారని మౌని చెప్పుకొచ్చింది. నా ఫ్రెండ్స్ మంచి, చెడు సందర్భాల్లోనూ నాకు తోడుగా నిలిచారని మౌనీ రాయ్ పంచుకున్నారు.కాగా.. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత 2022లో సూరజ్‌ను వివాహం చేసుకున్నారు. ఇటీవలే 2026లో అతనితో విడిపోయారు. మౌని, సూరజ్ ఇద్దరూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (2026) చిత్రంలో కనిపించారు. -
'కాక్టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు)
-
సినిమాల్లోకి కత్రినా కైఫ్ రీఎంట్రీ..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె టీమ్ పూర్తిగా ఖండించింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది.కొడుకు విహాన్ కౌశల్ జననం తర్వాత కత్రినా పూర్తిగా తన కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. గత రెండేళ్లుగా కత్రినా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన భర్త విక్కీ కౌశల్, కొడుకు విహాన్‌తో విహార యాత్రలు చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఆనందిస్తోంది.తాజాగా 2027 ద్వితీయార్థంలో వెండితెరపైకి తిరిగి వస్తారనే ఊహాగానాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్రాజెక్ట్‌తో అడుగుపెడతారనే వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని ఆమె టీమ్ స్పష్టం చేసింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది. దాంతో రీఎంట్రీ లేదని తేలిపోయింది. ఇక తన నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా కత్రినా విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె సొంత కాస్మోటిక్స్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ భారతీయ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, వ్యాపార రంగంతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా కత్రినా బిజీగా ఉన్నారు. -
ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోన్న లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా. లేడీ ఓరియంటెడ్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ్ రావేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ తన యాక్షన్‌తో అదరగొట్టనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన టీజర్లో ఆలియా భట్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ పాత్ర హైలెట్‌గా ఉండనుంది. స్పై యూనివర్స్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన మొదటి మహిళా గూఢచారి సినిమా ఇదే కావడం ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ కీలక పాత్ర పోషించారు. -
పనివాళ్లు మనుషులు కారా?: నటి ఆగ్రహం
పనివాళ్లు మనుషులు కారా? వాళ్లకు హెయిర్ కట్ చేస్తే సొమ్మేమైనా అరిగిపోతుందా? అని మండిపడుతోంది బాలీవుడ్ నటి సంధ్య మృదుల్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. నటి తల్లి తన ఇంట్లో పని చేసే ఓ యువతిని సెలూన్‌కు తీసుకెళ్లి జుట్టు కట్ చేయించాలనుకుంది. కానీ అందుకు ఒకటీరెండు సెలూన్లు అసలు అంగీకరించనేలేదట! డబ్బులు ఎక్కువిస్తామన్నా సరే ససేమీరా కుదరదని తేల్చి చెప్పేశాయట!బెదిరించినా, బతిమాలినా..ఈ విషయం విని సంధ్యకు ఒళ్లు మండిపోయింది. ఆ ఆక్రోశాన్నే తను సామాజిక మాధ్యమాల్లో వెళ్లగక్కింది. 'అమ్మ.. తన ఇంట్లో పనిమనిషికి మంచి హెయిర్ కట్ చేయించాలనుకుంది. దగ్గర్లో ఒక సెలూన్‌కు తీసుకెళ్లింది. కానీ వాళ్లు చేయమన్నారు. మరో సెలూన్‌కు వెళ్లగా వాళ్ల దగ్గరా అదే సమాధానం. ఎందుకు చేయరని ప్రశ్నించింది. కావాలంటే ఎక్కువ డబ్బులిస్తానని అభ్యర్థించింది. అయినప్పటికీ వాళ్లు కుదరదని వెనక్కు పంపించేశారు. ఇంకా ఏ కాలంలో ఉన్నాం?ఇదంతా చూసి ఆ పనిమనిషి మనసు నొచ్చుకుంది. చివరకు ఒక సెలూన్ వాళ్లు ఒప్పుకోవడంతో ఆమెకు హెయిర్ కట్ చేయించి తనను అమ్మ లంచ్‌కు తీసుకెళ్లింది. అసలు మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? పనివాళ్లు సెలూన్స్‌కు రాకూడదా? వాళ్లేమైనా అంటరానివాళ్లా? వాళ్లను లోపలకు రానివ్వకపోవడానికి వీరికేం హక్కుంది? నిజంగా ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇక్కడ తప్పు కేవలం సెలూన్లది, అందులో పనిచేసేవారిదే కాదు.. మనది కూడా! ఇకనైనా మారండిమనలో చాలామంది పనివాళ్లను అన్నిచోట్లా అడుగుపెట్టనివ్వరు, కనీసం లిఫ్ట్ కూడా ఎక్కనివ్వరు. ఇలాంటి నీచమైన కండీషన్స్ పెట్టే మనుషులు మారాల్సిన సమయం ఆసన్నమైందని నా అభిప్రాయం' అని ఆవేదన వ్యక్తం చేసింది. 'పనివాళ్లు మన ఇంటిని, మన కుటుంబాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటివారికి మనమిచ్చే గౌరవం ఇదా? హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్న 26 ఏళ్ల అమ్మాయిని ఇంత బాధపెట్టాలా? అని క్యాప్షన్ ఇచ్చింది. సంధ్య చివరగా తమిళంలో 'పరాశక్తి' సినిమాలో ఇందిరా గాంధీగా నటించింది. View this post on Instagram A post shared by Sandhya Mridul (@sandymridul) చదవండి: విషాదం.. దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత -
'సాంగ్ షూట్.. హీరో ముద్దులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు'
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్‌తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయి. కథకు తగ్గట్టుగా కొన్ని సీన్స్ తప్పకుండా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ముద్దు సీన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా నటీనటులు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితేనే ముద్దు సీన్ అంత బాగా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. అలాంటి ఈ సీన్స్‌లో ఒక్కోసారి అభ్యంతరం రావడం కూడా సహజమే. తాజాగా ఓ నటి ముద్దు సీన్లో తనకెదురైన అనుభవాన్ని షేర్ చేసుకుంది.ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా బాపత్.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఓ సాంగ్ షూట్లో హీరో తనను పదేపదే ముద్దు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తాను చాలా అసౌకర్యానికి గురైనట్లు వెల్లడించింది. ఆ టైమ్‌లో తాను ఎలా స్పందించాలో.. ఎలా సమర్థించుకోవాలో తెలియలేదని అన్నారు. షూటింగ్ తర్వాత కూడా ఆ సీన్ తన మైండ్‌లో నుంచి పోలేదని చెప్పారు. అయితే ఆ ముద్దు సన్నివేశంపై తాను మొదటి నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేశానని ప్రియా తెలిపారు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్లలో దాని అవసరం గురించి దర్శకుడిని ప్రశ్నించానని ప్రియా బాపత్ వెల్లడించారు. ఆ సన్నివేశం కంటే సహనటుడి ప్రవర్తన హద్దులు దాటిందని ఆమె ఆరోపించారు.అంతేకాకుండా చిత్రీకరణ సమయంలో తామిద్దరూ ఒకే హోటల్లో బస చేశామని వెల్లడించింది. తాను చాలాసార్లు వద్దని చెప్పినప్పటికీ నా సహనటుడు అల్పాహారం, రాత్రి భోజనానికి తనతో కలిసి చేయాలని పదేపదే అడిగాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవం తనను తీవ్రంగా కుంగదీసిందని తెలిపింది. తన పరిస్థితి గురించి ప్రతి రాత్రి తన భర్త ఉమేష్ కామత్‌కు ఫోన్ చేసేదాన్నని చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె భర్త కామత్ ముంబయి నుంచి సినిమా షూటింగ్ జరుగుతున్న భోపాల్‌కు వచ్చి మూడు రోజుల పాటు ఆమెతో పాటే ఉన్నారని వెల్లడించింది.కాగా.. ప్రియా బాపత్ మరాఠీ చిత్రసీమలో ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా ఓటీటీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. 'కాక్‌స్పర్శ్', 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్‌లో నటనకు ఆమె బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా హ్యాపీ జర్నీ (2014), ఆమ్హీ దోగీ (2018), అంధేరా, రాత్ జవాన్ హై లాంటి ప్రాజెక్ట్‌ల్లో కనిపించింది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. -
పోల్కా-డాట్ చీరలో చందమామలా కంగనా రనౌత్..!
-
ఎంబ్రాయిడరీ డెనిమ్ చీరలో మాధురి దీక్షిత్ స్టన్నింగ్ లుక్..!
-
కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బుల్లితెర నటి సంభావనా సేథ్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమె తాజాగా కవల బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమెకు ఓ పాప, బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తల్లిదండ్రులుగా మారే ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సంభావనకు శుభాకాంక్షల చెబుతున్నారు.నటి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ సంవత్సరం మహా దీపావళి ముందుగానే వచ్చింది. లక్ష్మీదేవి, గణేశుడు ఇద్దరూ మా ఇంటికి వచ్చేశారు. ఈ సమయంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. హర హర మహాదేవ్' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. కాగా.. నటి సంభావన సేథ్.. నటుడు-రచయిత అవినాష్ ద్వివేదిని పెళ్లాడారు.కాగా.. గతంలో సంభావనా సరోగసీ ద్వారా బిడ్డను ఆశిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక ఒత్తిడి గురించి సంభావన మాట్లాడింది. ఈ ప్రక్రియలో భాగంగా మూడు నెలల పాటు 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు సంభావన, అవినాష్‌ల వివాహం జూలై 14, 2016న జరిగింది. View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) -
'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)
-
నర్సుగా కంగనా రనౌత్.. భారత్ భాగ్య విధాత ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ లేడీ స్టార్ కంగనా రనౌత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ భారత్ భాగ్య విధాత(ది అన్‌సీన్ హీరోస్). ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరమాన్స్ క్రియేషన్స్, యునోయా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో భారత్ భాగ్య విధాత ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ కథ నర్సుల జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కంగనా నర్సు పాత్రలో కనిపించనుంది. 26/11 టెర్రరిస్ట్ ఎటాక్ జరిగిన సమయంలో నర్సుల పోరాటం గురించే ఈ మూవీలో చూపించనున్నట్లు ట్రైలర్లోనే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో గిరిజా ఓక్ గాడ్బోలే, స్మితా తాంబే, సుహిత తట్టే, ఆశా షెలార్, ప్రియా బెర్డే, ఈషా డే, రసిక అఘాసే, అమృత నామ్‌దేవ్, ఆదిత్య మిశ్రా, జాహిద్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
పెళ్లి వేడుకలో దీపిక- రణ్వీర్ సింగ్ జంట.. పిక్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తమ బంధువుల పెళ్లి వేడుకలో వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో దీపికా భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. రణవీర్ ఎరుపు రంగు కుర్తా పైజామాలో కనిపించగా.. దీపిక కలర్‌ఫుల్ సంప్రదాయ చీరలో మెరిసింది. ఇది రణ్వీర్ సింగ్ కజిన్ వెడ్డింగ్ అని తెలుస్తోంది. దీపిక- రణ్వీర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే వీరిద్దరు తమ రెండో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఇటీవలే తమ కుమార్తె దువాతో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ జంట నవంబర్ 2018లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు 2024లో దువాకు స్వాగతం పలికారు. ఇక సినిమాల విషయానికొస్తే దీపిక అట్లీ దర్శకత్వం వహిస్తోన్న 'రాకా' చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు, రణ్వీర్ సింగ్ సైతం కల్యాణి ప్రియదర్శన్‌తో కలిసి జాంబీ అడ్వెంచర్ చిత్రం 'ప్రళయ్'లో నటించనున్నారు. అయితే 'డాన్ 3' నుంచి రణ్వీర్ తప్పుకుంటున్నారనే వార్తలొచ్చాయి. ఇటీవలే దురంధర్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. Glimpses of #DeepVeer at Ranveer's cousins wedding 😍✨️🧿Emo babies 🥹 pic.twitter.com/CjmGcKy1n2— Versatile Fan (@versatilefan) June 2, 2026 -
జాక్వెలిన్, సుకేశ్‌లపై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు లో మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మరో 15మందిపై అభి యోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు శనివా రం ఆదేశించింది. నిందితులందరిపైనా ప్రాథ మికంగా బలమైన సాక్ష్యాధారాలున్నా యని అదనపు సెషన్స్ జడ్జి (ఏఎస్జే) ప్రశాంత్ శర్మ పేర్కొన్నారు. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3, 4కింద వీరిపై అభియోగాలు నమోదు చేయా లన్నారు. దీంతో, ఈ కేసు విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కేసులో పలుమార్లు జాక్వెలిన్‌ను ప్రశ్నించిన ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్లో మొదటిసారిగా ఆమె పేరును చేర్చింది. పింకీ ఇరానీ ద్వారా సుకేశ్ నుంచి ఆమె ఖరీదైన బహు మతులను పొందినట్లు రెండో సప్లిమెంటరీ చార్జి షీట్లో పేర్కొంది. సుకేశ్ నేర కార్యకలాపాలు తెలిసిన తర్వాత కూడా అతడితో జాక్వెలిన్ సంబంధాలు కొనసాగించిందని, మనీలాండరింగ్‌తో ఆమెకూ సంబంధాలున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఆమె బాధితురాలు కాదని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు సుకేశ్‌ను 2017లో అరెస్ట్ చేయగా, 2021లో ఈడీ అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో సుకేశ్ భార్య లీనా, దీపక్ రమ్నానీ, ప్రదీప్ రమ్దానీ, బి. మోహన్‌రాజ్, అరుణ్ ముత్తు, డి.కమ్లేశ్ కొఠారి, పింకీ ఇరానీలతోపాటు మరికొందరు కూడా నిందితులుగా ఉన్నారు. -
చాలామందితో ఫిజికల్ రిలేషన్.. నా పార్ట్నర్స్కు ముందే తెలుసు: నటి షాకింగ్ కామెంట్స్
ప్రముఖ నటి షహానా గోస్వామి తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఆమె గుర్తు పట్టేస్తారు. హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. 2008లో 'రాక్ ఆన్!' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఫిరాక్', 'మిడ్నైట్స్ చిల్డ్రన్', 'డెస్పాచ్' వంటి చిత్రాలలో కూడా నటించారు. ఆమె చివరిసారి 'సంతోష్' అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీని 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యుకు హాజరైన 40 ఏళ్ల ముద్దుగుమ్మ రిలేషన్, ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను రిలేషన్షిప్లో ఎల్లప్పుడు ఓపెన్‌గానే ఉన్నానని షహానా వెల్లడించారు. తాను ఇతరులతో కూడా శారీరకంగా సన్నిహితంగా ఉంటాననే విషయం.. తనతో రిలేషన్లో ఉన్న వ్యక్తులకు పూర్తిగా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు సంబంధాలను కొనసాగించే విధానంలో పారదర్శకత చాలా ముఖ్యమని.. అందుకే నా రిలేషన్స్‌లో ఎలాంటి రహస్యాలు ఉండవని ఆమె కుండబద్దలు కొట్టారు.ప్రస్తుతం తనకు భాగస్వామి ఎవరు లేరని కూడా గోస్వామి వెల్లడించారు. తన జీవితంలోని సంబంధాలు సాంప్రదాయమనే ముద్ర కాకుండా.. ప్రేమ, స్నేహం మీద నిర్మించబడ్డాయని తెలిపారు. తన రిలేషన్స్ సంప్రదాయాలను అనుసరించకపోయినా.. అవి సాధారణమైనవి కావని అన్నారు.ప్రేమ అనేది నిర్బంధంగా ఉండకూడదనేది తన నమ్మకమని గోస్వామి అన్నారు. తాను భావోద్వేగ స్వేచ్ఛకు ఎంతో విలువ ఇస్తానని తెలిపారు. సంబంధాలు అనేవి కట్టుబాట్లలోకి బలవంతంగా నెట్టబడకుండా సహజంగా అభివృద్ధి చెందాలని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు. ప్రేమ స్వేచ్ఛగా ఉండాలని నేను ఎప్పుడూ భావిస్తానని వెల్లడించారు. ఈ ఆలోచన తాను ఎంచుకునే సంబంధాలను.. అలాగే కాలక్రమేణా అవి అభివృద్ధి చెందే విధానాన్ని కూడా ప్రభావితం చేసిందని షహానా అభిప్రాయం వ్యక్తం చేశారు.మిలింద్ సోమన్‌తో డేటింగ్..బ్రేకప్గతంలో మిలింద్ సోమన్‌తో రిలేషన్, విడిపోవడంపై కూడా షహానా గోస్వామి స్పందించారు. మోడల్ మిలింద్ సోమన్‌తో తన సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను టీనేజర్‌గా ఉన్నప్పుడు అతన్ని సినిమాల్లో చూసి ఆకర్షితురాలినయ్యానని తెలిపింది. చివరికి ఆన్లైన్లో అతని కాంటాక్ట్ వివరాలను కనుగొన్నానని వెల్లడించింది. కాగా.. వీరిద్దరు డేటింగ్ ప్రారంభించడానికి ముందు, దాదాపు ఆరు సంవత్సరాల పాటు టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారని తెలిసింది. అయితే మిలింద్, షహానాల రిలేషన్‌కు 2013లో ఎండ్ కార్డ్ పడింది. -
ప్రముఖ సినీ జంట గుడ్ న్యూస్.. పెళ్లైన నాలుగేళ్లకు..!
ప్రముఖ బాలీవుడ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెరతో పాటు సినిమాల్లో రాణిస్తోన్న ఆదిత్య సీల్- అనుష్క రంజన్ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ దంపతులు ప్రగ్నెన్సీని ప్రకటించారు. ఈ జంట తమ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అందమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక క్షణం కోసం వందేళ్లుగా వేచి ఉన్నామని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.ఆదిత్య, అనుష్క జంట ప్రెగ్నెన్సీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో నటి బేబీ బంప్ ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ జంటకు అనన్య పాండే, మౌనీ రాయ్, సోనాక్షి సిన్హా, వాణి కపూర్, మనీష్ మల్హోత్రా, నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్, రాకుల్ ప్రీత్ సింగ్, కుశాల్ టాండన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.కాగా.. ఆదిత్య, అనుష్క మొదటిసారి వారి కుటుంబం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆ తర్లాత వీరి మొదటి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత.. అనుష్క పుట్టినరోజున పారిస్‌లో ఆదిత్య ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఆదిత్య చివరిగా అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను నటించిన 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Aditya Seal (@adityaseal) -
బ్లాక్ డ్రెస్‌లో ప్రెట్టీ లుక్‌లో ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
-
మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి...‘ధురంధర్’ ప్రొడక్షన్ డిజైనర్‌పై కేసు
చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆడిషన్ల పేరుతో, షూటింగ్ లొకేషన్స్‌లో, వర్కింగ్ కండిషన్స్‌లో మహిళా నటీనటులు మాత్రమే కాదు టెక్నీషియన్లు కూడా నిరంతరం వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’మూవీకి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన ఓ యువతిని ఆ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ సైనీ జోహ్రే లైంగిక వేధింపులకు గురి చేశాడు. పని పేరుతో హోటల్‌కి పిలిపించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాజాగా ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.మత్తుమందు ఇచ్చి.. యువతి ఫిర్యాదు ప్రకారం.. గతేడాది సెప్టెంబర్ 10న సినిమాకు సంబంధించిన చర్చల కోసం సైనీ ఆమెను ఛండీగడ్‌లోని హోటల్‌కి రమ్మని చెప్పాడు. టీమ్ మీటింగ్ అనుకొని రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె అక్కడకు వెళ్లింది. గదిలోకి వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు. ప్లాన్ ప్రకారం సైనీ జోహ్రే ఆమెను మాత్రమే ఆహ్వానించాడు. ఆమె రాగానే వైన్‌లో మత్తుమందు కలిపి తాగమని బలవంతం చేశాడు. ఆమె అది సేవించగానే తలతిరిగినట్లుగా అనిపించింది. అదే సమయంలో ఆమెతో అసభ్యకరంగా ప్రవరించాడు.(చదవండి: చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు)కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులుతనకు అనారోగ్యంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. బాత్రూంకి వెళ్లి వాంతులు చేసుకున్నా. అక్కడ కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లనీయకుండా బలవంతం చేశాడు. రాత్రంతా అక్కడే ఉన్నా. మరసటి రోజు ఉదయమే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయా. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెప్తే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపులు రోజు రోజుకి ఎక్కువైపోయాయి. అందుకే ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నా’ అని సదరు యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్
-
చీరలో యువరాణిలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
-
గ్రీన్ డ్రెస్‌లో బుట్టబొమ్మ పూజా హేగ్డే అందాలు (ఫొటోలు)
-
ప్రామిస్.. అలా పెళ్లి చేసుకోను : కంగనా
బాలీవుడ్ నటి కంగానా రనౌత్‌కు సంబంధించిన ఓ వీడియో గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో కంగనా మెడలో నల్ల పూజల దండా, చేతికి మట్టిగాజులు ఉన్నాయి. దీంతో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ కొంతమంది ఆ వీడియోని షేర్ చేస్తున్నారు. తాజాగా దీనిపై కంగనా స్పందించింది. తనకు సీక్రెట్ పెళ్లి చేసుకునే అవసరం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే కచ్చితంగా అందరికి చెప్పే చేసుకుంటానని తనదైన శైలీలో ఇన్‌స్టా స్టోరీలో బదులిచ్చింది.‘నేను ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆ వీడియో,ఫోటో తీశారు. అది సినిమాలో నా క్యారెక్టర్. అది చూసి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న మహిళగా నటించాను. అందులో తప్పేముంది? నటీనటులు అన్నాక అన్ని పాత్రలు చేయాలి. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటా. ఇది నా ప్రామిస్’ అని కంగనా చెప్పుకొచ్చింది. కంగనా ప్రస్తుతం క్వీన్ మూవీ సీక్వెల్లో నటిస్తోంది. ‘క్వీన్’లో వివాహం రద్దయి విదేశాలకు వెళ్లిన మహిళగా కనిపించిన కంగనా.. సీక్వెల్లో పెళ్లైన మహిళగా కనిపించబోతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మెడలో నల్లపూసల దండ.. చేతికి మట్టిగాజులు.. కంగనా షాకివ్వనుందా?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కంగనా రనౌత్. కేవలం సినిమాలే కాదు.. రాజకీయాల్లోనూ రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ బాలీవుడ్ భామకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఆమె మెడలో నల్లపూసలు, చేతులకు మట్టిగాజులు ఉండడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. కంగనా ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? అని తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కంగన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా? అని ఒకరు కామెంట్ చేయగా.. ఒకవేళ ఆమె పెళ్లి చేసుకుంటే గ్రాండ్‌గానే చేసుకుంటారని మరొకరు రాసుకొచ్చారు. అయితే ఏదైనా సినిమా షూటింగ్ కోసం అలా వేసుకున్నారా? మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కంగనా నల్లపూసల దండ, మట్టిగాజులతో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ పెళ్లి గురించి చర్చ ఆగేలా కనిపించడం లేదు.ఇక కంగనా సినిమాల విషయానికొస్తే తన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ సీక్వెల్లో నటిస్తున్నారు. ‘క్వీన్ 2’ అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని క్యారెక్టర్ లుక్ కోసమే ఆమె ఇలా తయారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న కంగనా.. మళ్లీ బాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. Kangana Ranaut was seen wearing a mangalsutra today.Has Kangana secretly got married? pic.twitter.com/wBCoNCZVLL— Mr SP (@Lonely_prabh) May 21, 2026 -
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
-
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
-
విడాకులపై ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్..!
ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని అభిమానులను కోరింది. నాలుగేళ్ల పాటు బంధంలో ఉన్న ఈ జంట సంయుక్త ప్రకటన రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చారు.అయితే అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు ఇప్పటికే సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకున్నారు. కానీ తాజాగా ఈ జంట మళ్లీ ఒకరినొకరు అనుసరిస్తున్నారు. దీంతో ఈ జంట తమ విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మళ్లీ ఫాలో కావడంతో ఈ జంట కలవబోతున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వీరిద్దరు కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. మౌనీరాయ్ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. -
ఎట్టకేలకు మౌనం వీడిన మౌనీ రాయ్.. నాలుగేళ్లకే గుడ్ బై
అనుకున్నదే జరిగింది. గత రెండు రోజులుగా వస్తోన్న రూమర్సే నిజమయ్యాయి. బాలీవుడ్ హీరోయిన్, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అభిమానులను కోరింది. విడాకుల విషయాన్ని మౌనీరాయ్‌తో పాటు ఆమె భర్త సూరజ్ నంబియార్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పెళ్లైనా నాలుగేళ్లకే తమ బంధానికి ముగింపు పలికారు.తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో, పరస్పర గౌరవంతో విడిపోయి వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని.. స్నేహపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే విడిపోయినప్పటికీ భవిష్యత్తులో స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.తమ వ్యక్తగత జీవితాలపై మీడియా అత్యుత్సాహంపై మౌనీ రాయ్ దంపతులు మండిపడ్డారు. తమ ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించి వస్తున్న తప్పుడు వార్తలను, కల్పిత కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రిలేషన్ గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. ప్రస్తుతానికి ఈ కష్ట కాలంలో తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తమ గోప్యతను గౌరవించాలని అభిమానులను విజ్ఞప్తి చేశారు.కాగా.. మౌని రాయ్, సూరజ్ నంబియార్ జనవరి 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గోవాలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో డివోర్స్ రూమర్స్ మొదలయ్యాయి. మౌని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో సూరజ్‌తో ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు కనిపించడం లేదని అభిమానులు విడాకుల చర్చకు దారితీసింది.ఇక మౌనీ రాయ్ సినీ కెరీర్ విషయానికొస్తే 'కస్తూరి', 'దేవోం కే దేవ్...మహాదేవ్', 'నాగిన్' వంటి సీరియల్స్‌తో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా 'నాచ్ బలియే 6', 'ఝలక్ దిఖ్లా జా 7', 'జరా నాచ్కే దిఖా' వంటి రియాలిటీ షోలలో కూడా కనిపించింది. ఇటీవలే 'టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా'కు హోస్ట్‌గా వ్యవహరించింది. 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ', గోల్డ్, మేడ్ ఇన్ చైనా లాంటి చిత్రాల్లో కూడా నటించింది. View this post on Instagram A post shared by mon (@imouniroy) -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన నటి ఊర్వశీ రౌతేలా (ఫొటోలు)
-
దేవ కన్యలా ఊర్వశి.. డ్రెస్ ధర రూ. 1500 కోట్లా?
ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కాన్స్ చిత్రోత్సవంలో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన సీనీ తారలు పాల్గొని, తమ అందచందాలతో అదరగొడుతున్నారు. మంగళవారం ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి బాలీవుడ్ నటి అలియా భట్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. మరో నటి ఊర్వశీ రౌతేలా కూడా క్రిస్టల్ గౌను ధరించి ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం ఊర్వశీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వియత్నాంకు చెందిన ఫ్యాషల్ లేబుల్ జోలీ పొలీ కోచర్ ఈ గౌనుని డిజైన్ చేసినట్లు ఊర్వశీ రౌతేలా వెల్లడించింది. గౌనుతో పాటు ఆమె ధరించిన వెండి ఎంబ్రాయిడరీతో, క్రిస్టల్స్, పూసల వర్క్‌తో డిజైన్ చేసిన సిల్వర్ కలర్ ఫ్రాక్ అందర్నీ ఆకట్టుకుంది. అలాగే చోకర్ నెక్లెస్, భారీ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, కేశాలంకరణలో పక్షి ఆకారంలో ఉన్న ఆభరణం, చేత్తో పట్టుకున్న అద్దాలు, రంగుల రాళ్లు పొదిగిన క్లచ్... వంటివన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయనే అభినందనలు దక్కించుకున్నాయి. ఊర్వశి దేవ కన్యలా ఉందని పలువురు అభినందించారు. ఊర్వశి గౌను, ఆభరణాలు, బ్యాగు విలువ ఫ్యాషన్ నిపుణుల అంచనా ప్రకారం దాదాపు 155.87 మిలియన్ డాలర్లు అట. భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1500 కోట్లు. వీటిని తయారు చేయడానికి 8 నెలలు పట్టిందట. ఇప్పటివరకూ ఊర్వశి పాల్గొన్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అత్యంత ఖరీదైనది ఇదే అని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. -
పూజా హెగ్డే ‘అందాల’ అస్త్రం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
ఎవరేమనుకున్నా కథానాయికల్లో 99 శాతం మంది గ్లామర్ తోనే గుర్తింపు పొందాలని భావిస్తారు. అవకాశాల వేటకు గ్లామరస్ ఫొటోలనే వాడుతుంటారు. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదనే సాహసం ఎవరు చేయలేరు. అందాల పోటీల్లో పాల్గొని ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసిన బ్యూటీ ఈమె. 2012 లో ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినా, ఈ అమ్మడి పేరు వెలుగులోకి వచ్చింది. అలా టాలీవుడ్ లో అవకాశాలు అందుకున్నారు. అక్కడ మొదట్లో యువ హీరోలతో జత కట్టి, ఆ తరువాత మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి ప్రముఖ హీరోలతో నటించి స్టార్ డమ్‌ను పొందారు.అయితే ఆ మధ్య పూజా హెగ్డే నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అక్కడ డిమాండ్ తగ్గింది. అదే విధంగా హిందీలో నటించిన చిత్రాలేవీ సక్సెస్ కాలేదు. కోలీవుడ్‌లోనూ ఈ భామకు అదే పరిస్థితి. ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారు. అందులో భాగంగా తన ఆదిలో తీసుకున్న గ్లామరస్ ఫొటోలను తన ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు నెటిజన్ల విమర్శలను గట్టిగానే ఎదుర్కొంటున్నాయి. ఇంతకు రెట్రో వంటి చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే నేనా ఈమె అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ‘పూజాహెగ్డే కాస్తయినా సంసార పక్షంగా కనిపించేది ఇక్కడేననీ(సౌత్ సినిమాల్లో), బాలీవుడ్లో అయితే వేరే లెవెల్ అంటూ తన ఎక్స్‌ఫోజింగ్ ఫొటోల గురించి చాలా బోల్డ్‌గా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
ఆరు నెలలు నరకం చూశా.. కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేదాన్ని : నటి
తల్లి అయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది అంటుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. తాజాగా ఆమె ప్రముఖ పాడ్‌కాస్ట్ హోస్ట్ రాజ్ షమానికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భగా పోస్ట్‌పార్టమ్ (ప్రసవం తర్వాత తల్లి శరీరం, మానసిక స్థితిలో వచ్చే మార్పు) గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయింది.‘పాప పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలలు నరకం చూశా. నాపై నాకే జాలి చూపించుకోవడం కష్టంగా అనిపించింది. చిన్న చిన్న విషయాలకే ఏడ్చేదాన్ని. నా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. నా మనసులోని భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టింది. ఇంతకాలం కుటుంబం, పని, ఇతరుల గురించి మాత్రమే ఆలోచించిన నేను.. నా కోసం కూడా సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం మాతృత్వం నేర్పింది. ఈ కష్ట సమయంలో నా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా చాలా సపోర్ట్ చేశాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి రోజు రాత్రి నా దగ్గరకే వచ్చేవాడు. డ్రైవ్‌కి తీసుకెళ్లేవాడు. ఆ చిన్న డ్రైవ్స్ కూడా నాకు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగించేవి’ అంటూ కియారా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, కియారా, సిద్ధార్థ్లది ప్రేమ వివాహం. 2023లో వీరి పెళ్లి జరిగింది. 2025 జులైలో కుమార్తె జన్మించింది. కెరీర్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత కూడా కియారా సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె నటించిన టాక్సిక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. -
రెండో కుమారుడి నామకరణం.. పేరు రివీల్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ఇటీవలే రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఏప్రిల్ 29న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తనకు రెండోసారి కుమారుడు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇప్పటికే ఆమెకు వాయి కపూర్ అహుజా అనే బాబు ఉన్నారు. తాజాగా తన రెండో కుమారుడి నామకరణ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా తన కుమారుడి పేరు రివీల్ చేసింది.తన రెండో కుమారుడికి రుద్రలోఖ్ కపూర్ అహుజా అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పేరుకు తన అన్నయ్య వాయుతో కలిసి వేదపరమైన రిలేషన్ ఉందని పేర్కొంది. ఈ పేరు వెనుక లోతైన, ఆధ్యాత్మిక అర్థం ఉందని తెలిపారు. రుద్ర అంటే మెరుపు, శ్వాస, స్వస్థత, పునరుద్ధరణతో ముడిపడి ఉన్న ఒక శక్తివంతమైన, పరివర్తన శక్తికి ప్రతీక అని సోనమ్ అన్నారు.. వాయువు జీవశక్తికి ప్రతీక కాగా.. రుద్ర శక్తికి, పరివర్తనకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. కాగా.. 2018లో వివాహం చేసుకున్న ఆనంద్ ఆహుజాను సోనమ్ కపూర్ పెళ్లాడింది. వీరిలో 2022లో మొదటి బిడ్డ జన్మించాడు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
రెండోసారి తల్లైన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి, బాలీవుడ్ భామ ఆస్కా గోరాడియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతేడాడి డిసెంబర్లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ బాబు పుట్టాడని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు పుట్టగా.. తాజాగా రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందారు. మే 1న తేదీన బిడ్డకు జన్మనివ్వగా.. వారం రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ బాలీవుడ్ బ్యూటీ అమెరికాకు చెందిన యోగా టీచర్, వ్యాపారవేత్త అయిన బ్రెంట్ గోబుల్ 2017లో పెళ్లాడింది. 2017లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2023లో కుమారుడికి జన్మనిచ్చారు. అతనికి విలియం అలెగ్జాండర్ అని పేరు పెట్టారు. గతేడాది ఈ జంట తమ ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు.ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. ఆస్కా గోరాడియా హిందీలో 'కుసుమ్', 'లాగీ తుఝ్సే లగన్', 'నాగిన్' వంటి సీరియల్స్‌తో మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ సీజన్-6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) -
'బాలీవుడ్లో మర్యాద ఇవ్వరు'.. సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్..!
గతేడాది టూరిస్ట్ ఫ్యామిలీతో రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్. ఈ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఫ్యామిలీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో తెలుగులో స్టార్ హీరోల సినిమాలు చేసింది. హర్జై అనే హిందీ చిత్రంతో 1995లో కెరీర్ ప్రారంభించింది సిమ్రాన్.. బాలీవుడ్లో కన్నా సౌత్‌లోనే ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బాలీవుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.బాలీవుడ్ దక్షిణ నటులకు గౌరవం ఇవ్వరని సిమ్రాన్ అన్నారు. సౌత్ నటీనటులకు కేటాయించే హోటళ్లు, టికెట్లు, స్టాఫ్ విషయంలో కూడా బేరసారాలు చేస్తారని కామెంట్స్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో హీరో దుల్కర్ సల్మాన్ కూడా ప్రస్తావించారని ఆమె గుర్తు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో దక్షిణాది నటులకు సరైన గౌరవం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో మాకు ఎంత గుర్తింపు వచ్చినా బాలీవుడ్లో పట్టించుకోరని అన్నారు. తాను హిందీ సినిమాలకు దూరంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని వెల్లడించారు. తాజాగా సిమ్రాన్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. -
'పతి పత్నీ ఔర్ వో దో' మూవీ ప్రమోషన్ (ఫొటోలు)
-
మొన్న పూజ హెగ్డే.. నేడు సాయి పల్లవి.. ఎందుకిలా?
దక్షిణాది వెండితెరపై వెలిగిపోతున్న తారలు బాలీవుడ్‌కు వెళ్లేసరికి ఎందుకో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నారు. తాజాగా సాయి పల్లవి నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో, ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడంలో సౌత్ భామలు ఎదుర్కొంటున్న సవాళ్లపై మరోసారి చర్చ మొదలైంది.టాలీవుడ్, కోలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు.. బాలీవుడ్లో మాత్రం అడుగు పెట్టగానే తడబడుతున్నారు. కోట్లాది మంది అభిమానం, అద్భుతమైన నటన ఉన్నప్పటికీ, అక్కడ సక్సెస్ రేటు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.తనదైన నటనతో నేచురల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి.. హిందీ డెబ్యూ మూవీ ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి నటించినా, ఈ సినిమా సాయి పల్లవికి బాలీవుడ్లో శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది.కేవలం సాయి పల్లవి మాత్రమే కాదు, గతంలో అనేకమంది సౌత్ స్టార్ హీరోయిన్లు ఇదే బాటలో ఇబ్బందులు పడ్డారు. సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేశ్ కూడా 'బేబీ జాన్' అనే హిందీ సినిమాలో కనిపించింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పూజా హెగ్డే , తమన్నాలు గ్లామర్ పరంగా అక్కడ మార్కులు కొట్టేసినా, భారీ విజయాలు మాత్రం వీరికి దక్కలేదు. ఇక దక్షిణాదిలో చాలా ఏళ్లుగా స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న త్రిష, నయనతారలు కూడా బాలీవుడ్లో రాణించలేకపోయారు. 'ఖట్టా మీఠా' అనే మూవీతో త్రిష బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత త్రిషలో అక్కడ పెద్ద అవకాశాలేవి రాలేదు. నయనతార తొలి హిందీ సినిమా ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కానీ ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్‌ని తీసుకురాలేకపోయింది. అయితే సౌత్ తారలు అందరూ విఫలమవుతున్నారని చెప్పలేం. తాప్సీ పన్ను సౌత్‌లో కంటే బాలీవుడ్లోనే ఎక్కువ స్థిరపడింది. అలాగే రష్మిక మందన్నా కూడా ‘యానిమల్’ సినిమాతో అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసి, మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటోంది. -
'యశ్‌తో ఇంటిమేట్ సీన్స్.. అదంతా నాన్సెన్స్'
కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ఊహించని వివాదాలతో వాయిదా పడింది. జూన్ 4న రావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా టాక్సిక్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కియారా తన ఇంటిమేట్ సీన్స్ కట్ చేయాలని మేకర్స్ కోరినట్లు తెగ హల్చల్ చేస్తోంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ కియారా అద్వానీ దీనిపై స్పందించింది. యశ్‌తో ఇంటిమేట్ సీన్స్ తొలగించాలని తాను కోరలేదని తెలిపింది. ఇవన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటివీ ఎవరు కూడా నమ్మవద్దని హితవు సూచించారు. ఈ మూవీ ఫైనల్ కట్ చూసిన కియారా.. కొన్ని బోల్డ్ తొలగించాలని పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హీరోయిన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. -
అతనితోనే జాన్వీ కపూర్ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానుంది. అయితే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌పై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది జాన్వీ పెళ్లి చేసుకోనుందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాను పెళ్లాడనుందని ఊహాగానాలొస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జాన్వీ కపూర్ పెళ్లి పీటలెక్కనుందని లేటేస్ట్ టాక్. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించారు.తన కూతురు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలను బోనీ కపూర్ ఖండించారు. జాన్వీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో పెద్ది బ్యూటీపై వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పడింది. అయితే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన జాన్వీ కపూర్.. శిఖర్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు అర్థమైపోయింది. గతంలో శిఖర్ గురించి జాన్వీ కపూర్ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అతను నాతో ఉంటే సేఫ్‌గా ఉంటాననే ఫీలింగ్ వస్తుందని జాన్వీ తెలిపింది. అతనికో నేను ఒక చిన్నపిల్లలా ఉండగలనని చెప్పింది. శిఖర్‌తో తప్ప మరెవరితోనూ నేను ఇంత సరదాగా గడపలేనని పేర్కొంది. -
ప్రియుడితో బ్రేకప్.. హీరోతో డేటింగ్..!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ అనే పదాలు ఎక్కువగా వింటుంటాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియాకు సంబంధించిన ఓ న్యూస్ బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఆమెకు తన బాయ్‌ఫ్రెండ్ వీర్ పహారియాతో బ్రేకప్ అయిందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు తారా కానీ.. పహారియా కానీ స్పందించలేదు. విడిపోవడంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదుఅయితే అంతలోనే తారా సుతారియాపై మరో రూమర్ వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ఆమె డేటింగ్లో ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజా నివేదిక ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు ఒకరినొకరు కలుసుకుంటున్నారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడిది బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా.. గతంలో ఆదిత్య రాయ్ కపూర్.. హీరోయిన్ అనన్య పాండేతో రిలేషన్ కొనసాగించారు. అయితే గతేడాది చివర్లో ముంబైలో జరిగిన కచేరీ వివాదం తర్వాత తారా, వీర్ పహారియాపై బ్రేకర్ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ఈ బాలీవుడ్ భామ యశ్ చిత్రం టాక్సిక్‌లో కనిపించనుంది. -
ఆడవాళ్ల శరీరం లైంగిక ఆకర్షణ కోసమే కాదు.. ట్రోలర్స్‌పై నటి ఫైర్!
మహిళలపై బాడీ షేమింగ్ చేసేవాళ్లపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్వరా భాస్కర్ మరోసారి ఫైర్ అయింది. ఆడవాళ్ల శరీరం కేవలం గ్లామర్ ప్రదర్శించడానికి, లైంగిక ఆకర్షణ కోసమే కాదని.. ఒకరికి ప్రాణం పోయడం వంటి గొప్ప పని కూడా చేస్తుందని, అలాంటప్పుడు శరీరంలో మార్పులు రావడం చాలా సహజమని, వాటిని స్వీకరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.తను వెడ్స్ మను’, ‘రాంజనా’ వంటి సినిమాలతో బాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్..2023లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. బరువు పెరిగి కాస్త లావుగా మారింది. అయితే తాజాగా తన పాత ఫోటోని, ప్రస్తుత ఫోటోని కలిపి ఒక కొలాజ్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటో కాస్త వైరల్ కావడం.. కొంతమంది నెటిజన్స్ ‘గుర్తుపట్టలేనంత మారిపోయింది’. ‘ఇక ఆమె కెరీర్ క్లోజ్’ అంటూ బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు.వీటిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘ఒక ప్రాణానికి జన్మనివ్వడం సాధారణ విషయం కాదు. ఆ సమయంలో బాడీ ఎన్నో మార్పులకు గురవడం చాలా సహజం. బిడ్డ పుట్టిన తర్వాత కూడా మళ్లీ ఇంతకుముందులానే ఉండాలని ఒత్తిడి చేయడం సరికాదు. ఆడాళ్లు షోకేస్‌లో పెట్టే అందాల బొమ్మలు అసలే కాదు’ అంటూ ఇన్‌స్టాలో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది.‘నేను ఈ మాటను పదే పదే ప్పాలనుకుంటున్నాను. మహిళల శరీరం కేవలం ఆకర్షణ కోసం లేదా గ్లామర్ కోసం కాదు. నాకు బిడ్డ పుట్టిన తర్వాత మునపటిలా మారాలని అనుకోలేదు. ఎందుకంటే మీకు బిడ్డ పుట్టాక, మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. మీరు జీవితాంతం తల్లిదండ్రులుగానే ఉంటారు. జీవితం పూర్తిగా మారిపోతుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. నిజమే.. మనం మన పాత జీవితాన్ని, చిన్ననాటి స్వేచ్ఛా లైఫ్ ను, సన్నగా ఉన్న శరీరాన్ని మిస్ అవుతాం. కానీ మన చిన్ననాటిలాగే ఉండాలని అనుకోవడం, మన శరీరాన్ని గతంలోకి బలవంతంగా నెట్టడం ఒకరకమైన క్రూరత్వం.మన శరీరం మరో మనిషికి జన్మనిచ్చింది. కనుక శరీరం మారడం సహజం. కెమెరాల కోసం, అపరిచితుల కోసం ఆకర్షణీయంగా కనిపించాలని ఒత్తిడి పెంచుకోవడం తెలివి తక్కువ పని. డెలీవరీ తర్వాత బరువు పెరిగిన మహిళలపై బాడీ షేమింగ్ చేయడం నీచమైన పని.ఒక మహిళ..తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా బతకాలి. అలా అని నేను ఫిట్నెస్గా ఉండకూడదని చెప్పడం లేదు. మన శరీరాలను గౌరవించుకోవడానికి, మనకు సరిపోని పరిమితుల్లో మనల్ని మనం బంధించుకోవడం ఆపడానికి చేసే వాదన. జీవితం అనేది మన అంతరాత్మలోకి, ముందుకు సాగే ఒక ప్రయాణం. మన శరీరాలకు కూడా ఆ గౌరవాన్ని ఇవ్వడంలో తప్పులేదు’ అని స్వరా భాస్కర్ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.ఇక నటీనటులు గ్లామర్‌గా ఉండాలని చెప్పేవాళ్లకు కూడా ఆమె కౌంటర్ ఇచ్చింది.‘నటన అనేది టాలెంట్‌కు సంబంధించిన విషయం. దానికి మనిషి బరువుతోనో, గ్లామర్తోనో అస్సలు సంబంధం లేదు’ అని స్వరా భాస్కర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. పలువురు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యలు సామాన్యులకు నిత్యకృత్యం కావచ్చు. కానీ, ఐదు గంటల పాటు వాహనాల మధ్య చిక్కుకుపోవడం అంటే అంటే మాటలు కాదు. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి తాజాగా అలాంటి భయంకరమైన అనుభవాన్నే ఎదుర్కొన్నారు. ముంబై నుంచి పుణె వెళ్తుండగా మన్‌ఖుర్ద్ వంతెనపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఆమె తన నిస్సహాయతను, ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.పూర్తిగా చిక్కుకుపోయాం..సోనాలి కులకర్ణి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె తన ముందు, వెనుక ఆగిపోయిన వందలాది వాహనాలను చూపిస్తూ పరిస్థితి తీవ్రతను వివరించారు. ‘మేము ఇక్కడ మన్‌ఖుర్ద్ వంతెనపై ఉన్నాం. మేము ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి సరిగ్గా ఐదు గంటలు అయింది. కదలడానికి వీలులేని పరిస్థితి. వెనక్కి వెళ్దామంటే అదీ సాధ్యం కాదు. దయచేసి మా కోసం ప్రార్థించండి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యంపై అసహనంట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించినప్పుడు తమకు ఎదురైన అనుభవాన్ని కూడా సోనాలి బయటపెట్టారు. ‘మేము సహాయం కోసం ట్రాఫిక్ అధికారులను ఫోన్ చేసి అడిగాం. వారు ఓపిక పట్టండి అని మాత్రమే చెబుతున్నారు. అసలు ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, ముందు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. కనీసం పోలీసులు పరిస్థితిని అంచనా వేయడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం లేదా మాకు కనీసం సమాచారం అందించడం వంటివి చేస్తే బాగుంటుంది’ అని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Sonali Kulkarni (@sonalikul)నెటిజన్ల స్పందనసోనాలి షేర్ చేసిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఆమె అనుభవంతో ఏకీభవిస్తున్న నెటిజన్లు నగరాల్లో ట్రాఫిక్ వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మేము కూడా అదే సమయంలో రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం’, ‘విపత్తు నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు’, ‘ప్రణాళికా లోపం వల్ల ప్రజలు నరకం చూస్తున్నారు’ అంటూ పలువురు నెటిజన్లు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. -
సాహో నటి విడాకులు.. పెళ్లైన ఐదేళ్లకే బంధానికి గుడ్ బై
ప్రముఖ నటి ఎవలీన్ శర్మ తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. తమ ఐదేళ్ల వివాహా బంధానికి గుడ్ బై చెప్పనుంది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయంపై ఓ ఛానెల్లో మాట్లాడిన ఆమె.. అవును మేమిద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. పిల్లల విషయంలో ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి మేము గోప్యతను కోరుకుంటున్నామని అన్నారు. కాగా.. నటి ఎవలిన్ శర్మ 2021 మే 15న డెంటల్ సర్జన్ అయిన తుషాన్ బిందీని పెళ్లాడారు. వీరికి కుమార్తె ఆవా, కుమారుడు ఆర్డెన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. పెళ్లైన ఐదేళ్లకే ఈ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. స్నేహపూర్వకంగా తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఎవలీన్ తెలిపారు. తమ పిల్లలను మాత్రం కలిసే పెంచుతామని కూడా స్పష్టం చేశారు. కాగా.. ఎవలీన్ శర్మ 2012లో హిందీ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. 2019 వరకు పలు హిందీ చిత్రాలలో కనిపించారు. ఆమె 2013లో విడుదలైన 'యే జవానీ హై దీవానీ' మూవీలో మెప్పించింది. అంతేకాకుండా 2014లో విడుదలైన 'యారియాన్', 'మై తేరా హీరో' చిత్రాల్లో కూడా నటించింది. తెలుగులో ప్రభాస్ మూవీ సాహోలో ఐషా పాత్రలో ఆకట్టుకుంది. -
మైక్ కిందపడేసి వెళ్లిపోయాడు.. అవమానంగా అనిపించింది: ప్రియాంక
చాలా మంది తారల మాదిరే తాను కూడా కెరీర్ తొలినాళ్లలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను అంటోంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం మహేశ్ బాబు-రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రియాంక..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది. ‘కెరీర్ ప్రారంభంలో డ్యాన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. నటన పరంగా ఓకే కానీ..డ్యాన్స్ వచ్చేది కాదు. కొరియోగ్రాఫర్ చెప్పిన మూమెంట్స్ మరిచిపోయేదాన్ని. నా పక్కన ఉన్న కోస్టార్ ఆ స్టెప్పులు అద్భుతంగా చేసేవారు. నేనేమో వారికి సరిపోయేలా స్టెప్పులు వేయలేక ఇబ్బంది పడేదాన్ని. ఓసారి దక్షిణాఫ్రికాలో ఓ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ నాపై సీరియస్ అయ్యాడు. నువ్వు అందాల పోటీ నుంచి వచ్చిండొచ్చు, అందంగా ఉండొచ్చ.. కానీ నటి కావాలంటే ముందు డ్యాన్స్ నేర్చుకో అంటూ మైక్ కిందపడేసి సెట్ నుంచి వెళ్లిపోయాడు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది. దీన్ని సవాలుగా తీసుకొని డ్యాన్స్ నేర్చుకున్నా. అప్పట్లో ప్రతి రోజు దాదాపు ఆరు గంటల పాటు కత్రినా కైఫ్‌తో కలిసి ప్రాక్టీస్ చేశా’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.ఇక హాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ‘బాలీవుడ్లో స్టార్ అయినంత మాత్రాన అక్కడి వాళ్లు ఆదరిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఒక దేశంలో మీకు పేరు ప్రఖాత్యులు ఉన్నంత మాత్రాన మరో దేశంలో కూడా అదే విధంగా గౌరవం పొందాలని ఆశించకూడదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులను సంపాదించుకోవాలి. ప్రజల నుంచి గౌరవం పొందాలంటే బాగా కష్టపడాలి. ఇప్పుడు నేను అక్కడ సూపర్ స్టార్ కాదు. కానీ నటిగా మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకున్నా’ అని ప్రియాంక పేర్కొంది. -
సరోగసీ ప్రెగ్నెన్సీ ప్రకటించిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ, నటి సంభావన సేథ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను సరోగసీ (అద్దె గర్భం) ద్వారా మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సరోగసీ ద్వారా తమ బిడ్డను ఆహ్వానించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సంభావన సేథ్, ఆమె భర్త అవినాష్ ద్వివేది తెలిపారు.కాగా.. ఈ జంట చాలాసార్లు ఐవీఎఫ్ ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాకపోవడంతో సరోగసీ ద్వారా తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. 2024లో సంభావనకు మొదటి త్రైమాసికంలోనే ఓసారి గర్భస్రావం జరిగింది. ఆ టైమ్‌లో తాను శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడించింది. అప్పుడు మూడు నెలల వ్యవధిలో తాను 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అది చాలా బాధాకరంగా అనిపించిందన్నారు. సినీ కెరీర్ పరంగా చూస్తే సంభావన సేత్ 2025లో వచ్చిన 'మండల మర్డర్స్' చిత్రంలో చివరిసారిగా కనిపించింది. View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) -
సుశాంత్ సింగ్ కేసు.. ప్రియురాలికి బిగ్ రిలీఫ్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఆమె ఇప్పటికే నిర్దోషిగా బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ముంబైలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె సోదరుడు షోవిక్, తల్లి సంధ్యలకు చెందిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ డెత్ కేసులో వీరి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.కాగా.. 2020లో హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతి తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్‌లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్‌లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. -
గ్లోబల్ స్పా అవార్డ్స్ వేడుకలో గ్లామర్ క్వీన్స్ (ఫోటోలు)
-
'మా ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే': అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. గతేడాది కాళిధర్ లపట్టా, హౌస్‌ఫుల్-5 చిత్రాలతో మెప్పించారు. అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన బచ్చన్.. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఉండగానే నటి ఐశ్వర్య రాయ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈనెల 21న బాలీవుడ్ జంట తమ 19 వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్.. ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఐశ్వర్యతో రిలేషన్, ప్రేమ ఎలా మొదలైందన్న సీక్రెట్‌ను అభిషేక్ పంచుకున్నారు. 2000 సంవత్సరంలో ధాయ్ అక్షర్ ప్రేమ్ కే' సెట్స్‌లో ఐశ్వర్యను మొదటిసారి కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు మా మధ్య రిలేషన్ కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే ఉండేదన్నారు. అప్పుడు తనతో లవ్ అనే ఆలోచనే నాకు రాలేదన్నారు. కానీ 2006లో 'ఉమ్రావ్ జాన్' సినిమా చిత్రీకరణ సమయంలో మా మధ్య ప్రేమ చిగురించిందని అభిషేక్ తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'గురు' సినిమా టైమ్‌లో మా బంధం మరింత బలపడిందన్నారు. దర్శకుడు మణిరత్నం మా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని.. ఆయన ఒక స్నేహితుడిగా మాత్రమే కాదు.. గాడ్‌ఫాదర్ అని ప్రశంసించారు. తమ కూతురు ఆరాధ్యను సరైన విలువలతో పెంచిన పూర్తి ఘనత ఐశ్వర్యకే దక్కుతుందన్నారు. ఐశ్వర్య కేవలం నా కూతురికి తల్లి మాత్రమే కాదు.. నా సోల్‌మేట్ కూడా అని కొనియాడారు. కాగా.. న్యూయార్క్‌లో జరిగిన 'గురు' ప్రీమియర్‌లోనే అభిషేక్, ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు. ఇది వారి లైఫ్‌లో ఓ అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. నిశ్చితార్థం తర్వాత ఏప్రిల్ 2007లో వీరిద్దరి వివాహం జరిగింది. -
రాజా శివాజీ ట్రైలర్ రిలీజ్.. జెనీలియా దంపతుల కన్నీళ్లు..!
బొమ్మరిల్లు మూవీతో టాలీవుడ్ ప్రియుల మనసు దోచుకున్న బ్యూటీ జెనీలియా. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ అక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్ రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న జెనీలియా.. గతేడాది సితారే జమీన్ పర్, జూనియర్ చిత్రాల్లో మెరిసింది.జెనీలియా సంగతి పక్కన పెడితే ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ చారిత్రక మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజా శివాజీ పేరుతో వస్తోన్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రితేశ్ దేశ్ముఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాకుండా రితేశ్ తన తండ్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను గుర్తుచేసుకున్నారు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వేదికపైనే చిన్న పిల్లలా ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కన్నీళ్లు..చాలా రోజుల నిరీక్షణ తర్వాత 'రాజా శివాజీ' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సందర్భంగా తన కల సాకారం చేసుకోవడంలో సాయపడిన చిత్ర బృందానికి రితేశ్ ధన్యవాదాలు తెలిపారు. వేదికపై రితేశ్ ఎమోషనల్ కావడంతో.. జెనీలియా దేశ్‌ముఖ్ భావోద్వేగానికి గురైంది. ఈ మాటలు విన్న సంజయ్ దత్ సైతం ఎమోషనల్‌గా కనిపించారు. ఈ కథను తీసుకురావడంలో తనకు మద్దతుగా నిలిచిన జెనీలియాకు సైతం రితేశ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ లాంటి స్టార్స్ హాజరయ్యారు. వీరంతా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 'రాజా శివాజీ' చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించారు, ఆయన జీవ మహాల అనే పాత్రను పోషించారు. ఈ మూవీలో సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మరాఠీ, హిందీ భాషల్లో ఓకేసారి తెరకెక్కించారు. ఈ హిస్టారికల్ మూవీ మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది. #RiteishDeshmukh and #GeneliaDeshmukh share a heartfelt moment during a press interaction 🥺❤️#pinkvilla pic.twitter.com/Ixsxjc4p1m— Pinkvilla (@pinkvilla) April 20, 2026 -
రూ.10 కోట్లతో అపార్ట్మెంట్ కొన్న టబు.. ప్రత్యేకతలు ఇవే!
సీనీ తారల్లో చాలా మంది తమ సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు విలాసవంతమైన భవనాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత మంచి ధర వస్తే..వాటిని అమ్మి.. వచ్చిన డబ్బుతో మరో చోట పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబు కూడా ముంబైలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. ముంబైలోని వెర్సోవా ఏరియాలో ఉన్న ఆ అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ. 10.40 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసమే టబు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందంట. ఆ అపార్ట్మెంట్ సముద్ర తీరానికి సమీపంలోనే ఉండడమే కాదు.. నగరం మొత్తం అందంగా కనిపించేలా ఉంటుందట. ఆ వెంచర్లో మొత్తం 2 టవర్స్ ఉన్నాయట. ఒక్కో టవర్ 24 అంతస్తులు ఉంటుంది. మొత్తం 126 నివాసాలు ఉండగా..అందులో ఒకటి టబు కొనుగోలు చేసింది. జిమ్, స్వీమ్మింగ్ పూల్తో పాటు రెండు కార్లు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ స్తలం వచ్చిందట. ముంబైలో టబుకి ఇప్పటికే ఓ ఫ్లాట్ ఉంది. ఇది రెండోది. హైదరాబాద్‌లో కూడా టబుకి సొంతిల్లు ఉంది.టబు సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బూత్ బంగ్లా’ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే విజయ్ సేతు పతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న `స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` లో నటిస్తోంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ నటి శివాలికా ఒబెరాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త, డైరెక్టర్ అభిషేక్ పాఠక్‌తో కలిసి ఈ శుభవార్త పంచుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. మా ఇంటికి చిన్నారి లక్ష్మీ దేవి ఈ శుభ దినాన మా జీవితంలోకి అడుగుపెట్టింది.. ఇది స్వచ్ఛమైన రూపంలో లభించిన ఒక వరం' క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. శివాలికా తాను గర్భవతి అయిన విషయాన్ని గతేడాది డిసెంబర్లో రివీల్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. నటి శివాలికా, డైరెక్టర్ అభిషేక్ పాఠక్ ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. 2020లో 'ఖుదా హాఫిజ్' సినిమా నిర్మాణ సమయంలో వీరిద్దరు మొదటిసారి కలుసుకున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నిర్మించగా.. శివాలికా హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఈ జంట టర్కీలో నిశ్చితార్థం చేసుకున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య శివాలికాకు అభిషేక్ ప్రపోజ్ చేశారు.కాగా.. కిక్, హౌస్‌ఫుల్-3 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా శివాలికా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత యే సాలీ ఆషికి (2019) చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఖుదా హఫీజ్ చిత్రంలో తన పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. ఇక అభిషేక్ పాఠక్ హిందీలో దృశ్యం -2, ఉజ్డా చమన్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ప్యార్ కా పంచ్‌నామా, ఖుదా హాఫిజ్, సెక్షన్ 375 లాంటి ప్రాజెక్టులను నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) -
గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొణె.. రెండోసారి ప్రెగ్నెన్సీ
దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. రెండోసారి దీపికా ప్రెగ్నెన్సీతో ఉందన్న శుభవార్తను పంచుకున్నారు. ఓ క్యూట్ పిక్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ముద్దుల కూతురు దువా పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు.కాగా.. వీరిద్దరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకు దువా అని నామకరణం చేశారు. కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న దీపికా, రణవీర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకలో ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే రణ్వీర్ ప్రస్తుతం 'ధురందర్ 2' మూవీతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. ఇకపోతే దీపిక సైతం చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఆమె ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన 'కింగ్' చిత్రంలో నటించనుంది. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో రాకా మూవీలోనూ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
హీరోయిన్ రాశీ ఖన్నాకు చేదు అనుభవం..!
హీరోయిన్ రాశి ఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న ఓ మూవీ షూటింగ్లో ఆమె నగదు చోరీకి గురైంది. రాశీ హ్యాండ్ బ్యాగ్ నుంచి రూ.50 వేలను తస్కరించినట్లు తెలుస్తోంది. మూవీ సెట్స్‌లోని వానిటీ వ్యాన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అతన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని చితకబాది.. బయటికి గెంటేశారు.ఈ చోరీతో మూవీ సెట్స్‌లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మూవీ షూటింగ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇలాంటి సంఘటనలు జరగడం పరిశ్రమకు సిగ్గుచేటన్నారు. కానీ ఎలాంటి చోరీ జరగలేదని రాశీ ఖన్నా టీమ్ చెప్పడం విశేషం. ఈ విషయంపై మాట్లాడటానికి రాశీ ఖన్నా మేనేజర్ నిరాకరించారు. కాగా.. రాశీ ఖన్నా ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్లతో కనిపించనుంది. -
స్టార్ హీరోయిన్ సిస్టర్ ఎంగేజ్మెంట్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్లో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. చివరిసారిగా జిగ్రా మూవీలో కనిపించిన ఆలియా.. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'లవ్ అండ్ వార్' (2027) చిత్రంలో కనిపించనుంది.ఇదిలా ఉండగా ఈ బాలీవుడ్ బ్యూటీ సిస్టర్ షాహీన్ భట్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ ఇషాన్ మెహ్రీతో తన నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ జంట తమ బంధం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మేము ఒకరినొకరు ఇష్టపడటంలో కాస్త అతిగా చేశామేమో అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న షాహీన్ తల్లి, ఆలియా అత్త నీతూ కపూర్, సోనీ రజ్దాన్, అనన్య పాండే, నీనా గుప్తా, మసాబా గుప్తా, జోయా అక్తర్, షనయా కపూర్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.కాగా.. మహేష్ భట్, సోనీ రజ్దాన్ల పెద్ద కుమార్తె షాహీన్ భట్. ఆమె స్క్రీన్ రైటర్‌తో పాటు మానసిక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు. షాహీన్ కాబోయే భర్త ఇషాన్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ కోచ్‌గా రాణిస్తున్నారు. ఆమెతో పాటు ఆలియా భట్, పూజా భట్, రాహుల్ భట్ అనే మరో ముగ్గురు వీరికి సంతానం. ఆలియా భట్ ఇప్పటికే రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడగా.. వీరికి రాహా అనే మూడేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Shaheen Bhatt (@shaheenb) -
భూత్ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్ (ఫోటోలు)
-
'ముంబయిలో ఆడిషన్.. సౌత్ డైరెక్టర్ చాలా అసభ్యంగా..'
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కొత్త కాదు. ఇండస్ట్రీలోకి వచ్చినవారిలో చాలామందికి దాదాపు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు హీరోయిన్స్ బయటికి చెబుతుంటారు. మరికొందరు తమ బాధను చెప్పేందుకు భయపడుతూ ఉంటారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమైపోయింది.తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా తాను ఎదుర్కొన్న సంఘటనను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. దక్షిణాది డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. కాస్టింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు.. అనుచితంగా తన శరీరాన్ని తాకాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని పేర్కొంది. ముంబయిలో జరిగిన క్యాస్టింగ్ మీట్లో ఈ సంఘటన జరిగిందని పంచుకుంది.డైసీ షా మాట్లాడుతూ..'దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ నన్ను చాలా అసభ్యంగా తాకారు. ఆయన కాస్టింగ్ కోసం ఓసారి ముంబైకి వచ్చారు. అతన్ని కలవడానికి ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలం వెళ్లాం. అక్కడ ఆయన మమ్మల్ని ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా శరీరాన్ని తాకారు.. నా చేయి కూడా పట్టుకున్నారు. నన్ను ఎవరైనా తాకితే చాలా భయంగా ఉంటుంది. అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ కూడా నన్ను తాకడం ఇష్టం లేదు. అదే ఒక పురుషుడు నన్ను తాకితే ఎలా ఉంటుంది. అందుకే నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత అతనికి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పా. కానీ చేయలేదు' అని వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.కాగా.. డైసీ షా.. సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' (2014) చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 3' (2015)లో కనిపించింది. మొదట కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. 'భద్ర', 'బాడీగార్డ్' వంటి చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనతో పాటు, డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. పలు టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించింది. ఇటీవలే 'రెడ్ రూమ్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో వస్తోన్న థ్రిల్లర్ మూవీలో డైసీ హీరోయిన్గా నటిస్తోంది. -
'భర్త పోయాక మొదటి మ్యారేజ్ డే'.. ప్రముఖ నటి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా కపూర్ తన తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను గుర్తు చేసుకుంది. ఆయన మరణించిన తర్వాత వచ్చిన మొదటి వివాహా వార్షికోత్సవం కావడంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన పెళ్లి ఫోటోలతో పాటు ఓ లేఖను ఆమె పంచుకున్నారు. తమ బంధం ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పంజాబీ సాంప్రదాయంలో జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు.ప్రియా కపూర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'హ్యాపీ యానివర్సరీ జే . గతేడాది మన 8వ వార్షికోత్సవాన్ని నీ స్నేహితులతో కలిసి జరుపుకున్నాం. ఆ వేడుక చాలా సందడిగా, ఆత్మీయంగా, నవ్వులతో నిండిపోయింది. నువ్వు నా వైపు చూసి, మనం రాబోయే 7 జన్మల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పావు. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా. మన ఏడ వార్షికోత్సవం రోజు నువ్వు నా కోసం అందమైన లేఖ రాశావు. అత్యంత అమూల్యమైన బహుమతి. అందులోని ప్రతి పదాన్ని నేను నా హృదయంలో పదిలపరుచుకున్నా. నువ్వు కేవలం నా భర్తవి మాత్రమే కాదు. నువ్వు నా ఆత్మబంధువువి. నా హృదయ స్పందనవి. నిన్ను ప్రేమించడం అనేది నాకు తెలిసినంతలో అత్యంత సులభమైన విషయం. నువ్వు సాధారణమైనదాన్ని కూడా అద్భుతంగా మార్చావు.' అంటూ రాసుకొచ్చింది.నటి ప్రియా సచ్దేవ్ కపూర్ తన లేఖను అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. సంజయ్ కపూర్ కేవలం తన గతం మాత్రమే కాదని.. తన భవిష్యత్తులో కూడా ఒక భాగమని ఆమె తెలిపారు. మా కథ ఇంకా ముగియలేదని.. మాబంధం శాశ్వతమైనదని కూడా ఆమె పేర్కొన్నారు. మనం అనేక జన్మల పాటు కలిసి ఉంటామని అతను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రియా గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలన్నీ తిరిగి తీసుకువస్తే.. మళ్లీ నీతోనే జీవిస్తానని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. జూన్ 12, 2025న, ఇంగ్లాండ్‌లో ఒక పోలో మ్యాచ్ ఆడుతుండగా సంజయ్ కపూర్ మరణించారు. ఆయన 2017లో ప్రియ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. అంతకుముందు సంజయ్‌కు కరిష్మా కపూర్‌తో గతంలో జరిగిన వివాహం జరిగింది. వీరిద్దరికి సమైరా, కియాన్ అనే పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Priya S Kapur (@priyasunjaykapur) -
కరీనకపూర్ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్ స్టైలిష్ లుక్..!
-
పిల్లలను ఎలా పెంచాలి?..ఆలియాకు సద్గురు సలహా ఇదే
ఆమె ఒక అగ్రగామి బాలీవుడ్ ప్రముఖుడి కుమార్తె..ఆ తర్వాత అందాల బాలీవుడ్ నటి బోలెడన్ని విజయాలు చవిచూసింది. బోలెడు మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే మాత్రమేం... నిన్నటి బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ గత కొన్ని వారాలుగా అయోమయానికి గురవుతోంది. తన నాలుగేళ్ల చిన్నారిని ఎలా పెంచాలో తెలీక సతమతమవుతోంది. గత నవంబర్ 6, 2022న మాతృత్వంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి, ఆమె తాను చదువుతున్న పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను ఇన్ స్ట్రాగామ్ వేదికగా తరచు పంచుకుంటూ ఉండడం దీనికో నిదర్శనం. ఈ నేపధ్యంలోనే ఆమె తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్ (సద్గురు)తో సంభాషణలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సద్గురు ముందు తాను ఎదుర్కుంటున్న సమస్య... పిల్లల పెంపకంపై సలహా ఇవ్వమని కోరడం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. అయితే దానికి సద్గురు ఇచ్చిన సలహా ఇంటర్నెట్ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెఐటిఓ) చెన్నైప్లస్ ఆధ్వర్యంలో ఇన్ కన్సర్వేషన్ విత్ మిస్టిక్ అనే థీమ్‌తో నిర్వహించిన ఈకార్యక్రమానికి హాజరైన ఆలియా భట్, సద్గురువుతో ఒక వ్యక్తి ఎంత సమయం నిద్రపోవాలి అనే అంశం మొదలుకుని ప్రధానంగా పిల్లల పెంపకం, ఇంటర్నెట్ యుగం, ట్రోల్స్, వైఫల్యం పట్ల భయం, అనే విషయాలపై చర్చించారు.ఈ సందర్భంగా ‘మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తమ లాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?‘ అని ఆలియా భట్ సద్గురువును అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. ‘ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు.‘ ఆందోళన చెందే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వారు అంతగా ఆందోళన చెందడం ద్వారా తమకు తామే హాని చేసుకుంటారు’’ అంటూ సద్గురు అలియాకు స్పష్టం చేశారు. దీనికి స్పందిస్తూ, ఆలియా భట్, ‘పిల్లల పెంపకం అనే ఆందోళనను తల్లిదండ్రుల్లో తొలగించగలమని నేను అనుకోను. మీరు కూడా దీనిని అంగీకరిస్తారని భావిస్తున్నాను,‘ అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె రాహాకు ఏం నేర్పించాలనే అంశంపై కూడా తాను మధనపడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దాంతో సద్గురు స్పందిస్తూ పిల్లలకు సంతోషంగా ఉండడం సహజంగానే వస్తుందని వారికి మీరు నేర్పించేంది ఏముంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించారు. మీ కుమార్తె రాహాకు కష్టపడి ఏదేదో నేర్పించే బదులు సంతోషంగా ఎలా జీవించాలో తన కుమార్తె రాహా నుంచి నేర్చుకోమని సద్గురు ఆలియా భట్‌కు ఎదురు సలహా ఇచ్చారు. అనవసరమైన హడావిడి లేని తల్లిగా ఉండమని,జీవితంలోని ఆనందాలు ఎలా ఆస్వాదించాలో తన కుమార్తె నుంచి నేర్చుకోమని ఆలియా భట్‌కు సద్గురు సూచించారు. ఆ సంభాషణలో భాగంగా అలా నేర్చుకోవడం ఎలా అనేది కూడా సద్గురు ఆమెకు వివరించారని ఆయన అధికారిక యూట్యూబ్ ఛానెల్ వెల్లడించింది. ఏది ఏమైనా పిల్లల పెంపకంపై నిత్యం ఆందోళన చెందే తల్లిదండ్రుల ఆలోచనలకు అద్దం పడుతూ అలియాభట్ వేసిన ప్రశ్నకు సద్గురు ఇచ్చిన సమాధానం ఓ పెద్ద చర్చనే లేవనెత్తిందని చెప్పాలి. -
భర్తతో విడాకులు.. అందుకే భరణం వదులుకున్నా: బుల్లితెర నటి
ప్రముఖ బాలీవుడ్ నటి డెల్నాజ్ ఇరానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. హిందీలో పలు సీరియల్స్‌తో పాటు మూవీస్‌లో మెప్పించిన నటి వైవాహిక బంధం, విడాకులపై నోరు విప్పారు. తన భర్త రాజీవ్ పాల్‌తో విడాకుల సమయంలో తాను భరణం కంటే మనశ్శాంతికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తనకు డివోర్స్ తర్వాత ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె వెల్లడించారు. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమానికి హాజరైన ఈ విషయాన్ని పంచుకున్నారు.తన విడాకుల వ్యవహారం చాలా కష్టంగా సాగిందని డెల్నాజ్ ఇరానీ తెలిపారు. పార్సీ కుటుంబం నుంచి వచ్చిన తాను మొదట్లో విడిపోవాలని అస్సలు అనుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఒకరినొకరు తేలికగా తీసుకోవడంతోనే మా బంధం విచ్ఛిన్నమైందని పంచుకుంది. వ్యక్తిగత సవాళ్ల వల్ల నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. అదే సమయంలో నా తండ్రి గుండెపోటుకు గురై మరుసటి ఏడాదే మరణించారని తెలిపింది.మాలో ఒకరు విడాకుల కోసం ఒత్తిడి చేయగా.. మరొకరు పూర్తిగా సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి భరణం కోరకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. వివాదాల కంటే శాంతినే కోరుకున్నా.. స్వతంత్రంగా తన జీవితాన్ని మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.కాగా.. డెల్నాజ్, రాజీవ్ 1993లో 'పరివర్తన్' సీరియల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా సాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2010లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2012లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో కనిపించారు. ప్రస్తుతం నటి డెల్నాజ్.. డీజే పెర్సీ కర్కారియా అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. -
ప్రియుడితో హీరోయిన్ బ్రేకప్.. ఏడాదికే ఎండ్ కార్డ్..!
అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దంగల్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్యా మల్హోత్రా. ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాలు, షోలలో కనిపించింది. గతేడాది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి, బేబీ జాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ లాంటి చిత్రాల్లో కనిపించింది. హిందీలో సినిమాలు చేస్తూ బిజీ ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ టోస్టర్, సుందర్ పూనమ్ అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే రిలీజ్ కానున్నాయి.అయితే తాజాగా సన్యా మల్హోత్రాకు సంబంధించి బాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఏడాదిగా డేటింగ్లో ఉన్న సన్యా తన ప్రియుడు రిషబ్ రిఖిరామ్ శర్మ బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడంతో బాలీవుడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. సన్యా మల్హోత్రా గతేడాది నుంచి ప్రముఖ సితార్ ప్లేయర్ రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్లో ఉన్నారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి సందడి చేసేవారు. అయితే వీరిద్దరి రిలేషన్‌పై ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు. తాజాగా వీరిద్దరు ఏడాదిలోనే తన రిలేషన్‌కు గుడ్ బై చెప్పేశారు. రిషబ్ వేరొకరితో డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అందుకే సన్యా బ్రేకప్ చెప్పేసినట్లు బీటౌన్‌లో లేటేస్ట్ టాక్. గతంలోనూ ఓసారి తనకు బ్రేకప్ అయినట్లు సన్యా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నాలుగేళ్ల లాంగ్ రిలేషన్ తర్వాత బ్రేకప్ అయినట్లు తెలిపింది.రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్‌లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్‌లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు. -
కాలి నడకన తిరుమలకు.. ఎందుకు వెళ్తానంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్వీకపూర్‌కు తిరుమలను తరచుగా సందర్శిస్తూ ఉంటారు. అమ్మ శ్రీదేవి బాటలోనే ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఎప్పుడు తిరుమలకు వెళ్లినా కాలి నడకనే కొండపైకి చేరుకుంటుంది జాన్వీ. సెలబ్రిటీ అయినప్పటికీ కాలి నడకన వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. దీని వెనుక గల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.తాను తిరుమలకు కాలి నడకన వెళ్లేందుకు గల కారణాలను వివరించింది జాన్వీ కపూర్. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. కాలినడకన ప్రయాణించడం వల్ల కలియుగ దైవం బాలాజీకి మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని తెలిపింది. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవమని తనకు చాలా ఇష్టమని పేర్కొంది. భక్తితో మెట్లు ఎక్కి ఇష్టదైవమైన శ్రీవారి చెంతకు చేరడాన్ని ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తానని జాన్వీ కపూర్ వెల్లడించింది. -
'అశ్లీల సైట్లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు'
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్‌లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్‌లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది. అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్ తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్లైన్లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. -
నేను గర్భవతిని కాదు.. సీరియస్‌గా తీసుకోవద్దు: హీరోయిన్
నెటిజన్స్ ఊహించే నిజమైంది. నటి పూనమ్ పాండే గర్భవతి కాదు.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ముందే ఊహించారు. తాజాగా అదే నిజమని సదరు నటి ఒపుకుంది. అంతేకాదు బేబీ బంప్ ఫోటో పెట్టి.. ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా వివరించింది.అసలేం జరిగింది?మోడల్, నటి పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో తనకు తానే సాటి. గతంలో సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) పై అవగాహన కోసమని.. తాను మరణించినట్లుగా తప్పుడు వార్తలను ప్రచారం చేయించుకుంది. తాజాగా 'ప్రెగ్నెన్సీ' పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. నిన్న ఉదయం(మార్చి 31) తన ఎక్స్ ఖాతాలో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. అది చూసి చాలా మంది షాకయ్యారు. భర్తతో విడిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ ఎలా అయిందని కొంతమంది కామెంట్ చేశారు. మరికొంతమంది అయితే ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనని అభిప్రాయపడ్డారు.అవును..నేను ప్రెగ్నెంట్ కాదునెటిజన్స్ ఊహించనట్లే..తాను ప్రెగ్నెంట్ కాదని ప్రకటించింది పూనమ్. ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ కోసమే ఇలా చేశానంటూ మరో వీడియోని రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అందరినీ కాసేపు అలరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆమె తెలిపారు. ‘నన్ను సీరియస్‌గా తీసుకోవద్దు.. లైఫ్ ని చిల్ చేయండి’అంటూ అభిమానులకు సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూనమ్ పాండే సినీ కెరీర్ విషయాలకొస్తే.. హిందీలో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్ కర్మ, టచ్ ద ఫైర్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో హీరోయిన్గా నటించింది. 2020 సెప్టెంబర్ 1న ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు. April 🌹 pic.twitter.com/veBJvaDCKo— Poonam Pandey (@iPoonampandey) April 1, 2026 -
నాలుగు పదుల వయస్సులో తల్లైన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ రెండోసారి తల్లిగా ప్రమోషన్ కొట్టేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రోజు మార్చి 29, 2026న మాకు బాబు పుట్టాడని తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని రాసుకొచ్చింది. ఇప్పటికే ఆమెకు వాయు అనే కుమారుడు ఉన్నారు. తాజాగా రెండోసారి కూడా సోనమ్ కపూర్‌కు మగబిడ్డ జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోనమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' అపారమైన కృతజ్ఞతతో.. ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29న మా బాబు రాకను ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబం మరింత పెద్దదైంది. బాబు రాకతో మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి. వాయు తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఇప్పుడు నలుగురితో ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు మేము కృతజ్ఞతతో ఉన్నాం. ఇట్లు ప్రేమతో సోనమ్, ఆనంద్ అండ్ వాయు' అంటూ పోస్ట్ చేసింది.వ్యాపారవేత్తతో పెళ్లి..ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో 'సావరియా' మూవీతో సోనమ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ రతన్ ధన్‌పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
నాపై డేటింగ్ రూమర్స్.. చివరికీ వాడు కూడా నవ్వుతున్నాడు..!
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చకుంది. షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిసిన ముద్దుగుమ్మ.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథి మూవీలో ప్రత్యేక గీతంతో టాలీవుడ్‌ను పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా రాణిస్తోంది.అయితే మలైకా పర్సనల్ లైప్ ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలొచ్చాయి.తాజాగా తనపై వస్తున్న రూమర్స్‌పై మలైకా అరోరా స్పందించింది. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపింది. వాటిని చూసి నా కుమారుడు అర్హాన్ ఖాన్, నేను జోకులు వేసుకుంటున్నామని పేర్కొంది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన మలైకా.. తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వాటిని చూసి నా ఫ్యామిలీ కూడా నవ్వుతూ సరదాగా తీసుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం తాను ప్రేమ విషయంలో తొందరపడటం లేదని.. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటున్నట్లు మలైకా చెప్పింది.స్వయంకృషితో ఎదిగా..మలైకా మాట్లాడుతూ.. ' సింగిల్‌గా ఉండడమే నాకు ప్రేరణ. మొదటి నుంచి అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. సహవాసం, భాగస్వామి, అవన్నీ అందమైనవే. కానీ నాకు ఒక భాగస్వామి కావాలి అన్నట్టుగా నేను వాటి కోసం వెతకడం లేదు. నేను స్వయంకృషితో ఎదిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. నా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి నాకు ఏ పురుషుడి అవసరమూ లేదు. ఒకవేళ నేను ఎవరితోనైనా కలిసి ఉండాల్సి వస్తే.. అది నా సొంత రూల్స్ ప్రకారమే ఉంటుంది." తెలిపింది. -
పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ.. గ్రాండ్‌గా బుల్లితెర నటి సీమంతం..!
ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి ఇటీవలే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. వివేక్ దహియాను పెళ్లాడిన ముద్దుగుమ్మ దాదాపు పదేళ్లకు శుభవార్త పంచుకుంది. తాము త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించింది. ఉగాది పండుగ రోజే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దివ్యాంక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.తాజాగా ఈ బ్యూటీ సీమంతం వేడుక గ్రాండ్‌గా జరిగింది. సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను బేబీ షవర్‌ను సెలబ్రేట్ చేసుకుంది దివ్యాంక త్రిపాఠి. తాజాగా తన సీమంతం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్తతో పాటు కుటుంబ సభ్యుల్లాంటి స్నేహితులతో చేసుకున్న ఈ గోధ్ బరాయి(సీమంతం) వేడుకను ఎప్పటికీ మర్చిపోలేనని ఆనందం వ్యక్తం చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.2016లో ప్రేమ పెళ్లి..కాగా.. దివ్యాంక, వివేక్.. యే హై మొహబ్బతే సీరియల్ సెట్లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్ బలియే 8వ సీజన్లో పాల్గొని విజేతగా నిలిచింది. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.సీరియల్ నటిగా రికార్డ్..దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్, యాంకర్ కూడా! 2005లో మిస్ భోపాల్ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్ సీరియల్‌తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్‌తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్ నటిగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) -
జస్ట్ నిమిషాల్లో, దోసకాయ పచ్చడి : నటి వీడియో వైరల్
ప్రముఖ బాలీవుడ్ నటిఅశ్విని కల్సేకర్ దోసకాయపచ్చడి తయారు చేసి చూపించారు. అదీ జస్ట్ నిమిషాల్లోనే అంటూ ఆమె చేసిన పోస్ట్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అశ్విని కల్సేకర్ మరెవ్వరో కాదు ప్రముఖ నటుడు మురళి శర్మ భార్య. పదండి మరి కమ్మని దోసకాయ పచ్చడి మేకింగ్ కథ ఏంటో తెలుసుకుందాం.గోల్మాల్ అంధాధున్, జోధా అక్బర్ లాంటి పాపులర్ మూవీలు, టీవీ షోలతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్ నటి అశ్విని కల్సేకర్. తరచుగా సోషల్ మీడియాలో పలు వంటల గురించి ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా నిమిషాల్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిన వీడియో వైరల్‌గా మారింది.దోసకాయ పచ్చడి రెసిపీ ఈ సాంప్రదాయ ఆంధ్ర-శైలి చట్నీ పుల్ల పుల్లగా, పంటి కింద పచ్చదోసకాయ ముక్కలు తగులుతూ ఉండే రుచిని అందరూ ఇష్టపడతారు. దీనిని సాంప్రదాయకంగా పసుపు దోసకాయ (దోసకాయ), కొత్తిమరీ, చింతపండు , వేయించిన దినుసులతో తయారు చేస్తారు.ఇదీ చదవండి: 45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్అశ్విని షేర్ చేసినరెసిపీ : ముందుగా దోసకాయ తొక్క తీసి, గింజలు తొలగించి (కొంతమంది గింజలు వేసుకుంటారు), చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత, ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి, 2 టేబుల్ స్పూన్ల మినప పప్పు వేసి, ఎర్రగా వేగాక, కొద్దిగా మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఎండు, పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని ఇంగువ వేసి వేయించాలి. ఆ తరువాత స్టఫ్ ఆఫ్ చేసి, ఈ పోపులోనే కొద్దిగా చింతపండు గుజ్జు , ఒక చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. View this post on Instagram A post shared by Ashwini kalsekar (@ashwinikalsekar)తరువాత కొత్తి మీర, దోసకాయ ముక్కల్ని పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఉండేలా మిక్సీ పట్టాలి. అంతే ఈ మిశ్రమాన్ని పోపులో వేసి కలుపుకోవడమే. ఈ చట్నీని అన్నం, రోటీతో గానీ ఆస్వాదించవచ్చు అంతకు ముందు కూడా అశ్విని అన్నం లేదా పూరీతో కలిపి తినే,, కొంకణి శైలి బంగాళదుంప కూర అంబట్ బటాటా రెసిపీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.థఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
ధురంధర్ 2కి బ్లాక్‌బస్టర్ టాక్.. ట్రెండింగ్‌లో హీరోయిన్ సారా (ఫోటోలు)
-
మహేశ్‌బాబుతో యాక్టింగ్.. సెట్లో ఎలా ఉంటారంటే?
కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కితే ఆ కిక్కే వేరంటోంది బాలీవుడ్ నటి నీరూ సెహగల్. ఈమె కీలక పాత్రలో నటించిన కొహ్రా వెబ్స సిరీస్ రెండో సీజన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది నీరూ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటులుగా సినిమా, సిరీస్‌ల కోసం మేం ఎంతో కష్టపడతాం. ఎప్పటికీ మర్చిపోనుఅవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిసినప్పుడు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది? నేను అమెరికాలో పెరిగినప్పటికీ పంజాబీ సాంప్రదాయాలకు ఎప్పుడూ కట్టుబడే ఉన్నాను. నా మూలాల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆడిషన్ ద్వారానే కొహ్రా సీజన్‌కు ఎంపికయ్యాను. నా పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. ఇలాంటి బలమైన రోల్స్ మరిన్ని చేయాలనుంది. కథ బాగుండి, మంచి పాత్ర ఆఫర్ చేస్తే దక్షిణాదిలోనూ నటించడానికి రెడీ.. మహేశ్‌బాబుతో యాక్టింగ్రెండేళ్ల క్రితం ఓ యాడ్‌లో మహేశ్‌బాబుతో కలిసి పని చేశాను. ఆయన పెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ సెట్లో చాలా వినయంగా ఉంటాడు. డెడికేషన్‌తో పని చేస్తాడు. దానివల్ల షూట్ అంతా చాలా సౌకర్యంగా జరిగింది. ఆయన ఏకాగ్రత, క్రమశిక్షణ.. ఇలా తనను చూసి చాలా నేర్చుకోవచ్చు అని నీరూ సెహగల్ చెప్పుకొచ్చింది.చదవండి: ధురంధర్ 2 విజయం వెనక తెలుగు సినిమా: ఆదిత్య ధర్ -
నడిరోడ్డుపై వేధింపులు.. తాగొచ్చి కారు ఆపి..: నటి
బాలీవుడ్ నటి నిమిషా నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై బాంద్రాలో క్యాబ్‌లో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తనను ఇబ్బందిపెట్టారంటోంది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉదయం 4.50 గంటల సమయంలో నేను క్యాబ్‌లో వెళ్తున్నాను. ఆ సమయంలో డ్రైవర్ ఓ బైక్‌ను ఓవర్టేక్ చేశాడు. ఆ బైక్‌పై ఉన్నవారు బాగా తాగినట్లున్నారు. వాళ్లను దాటేసినందుకు కోపంతో ఊగిపోయారు. కొట్టడానికి రెడీ..క్యాబ్ డ్రైవర్‌కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. హైవే మధ్యలో మా కారును అడ్డుకున్నారు. కారు ఎదుటే బైక్ నిలిపి ముందుకు వెళ్లనీయకుండా చేశారు. ఆవేశంతో ఎగబడ్డారు, దుర్భాషలాడారు. డోర్స్ తెరిచేందుకు ప్రయత్నించారు. నన్ను విండోస్ కిందకు దించమన్నారు. వాళ్లెంత రెచ్చగొట్టినా సరే మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే అతడు డ్రైవర్‌ను కొట్టడానికే మా కారు ఆపాడని నాకు బాగా తెలుసు.. మా రక్షణ కోసం మేము సైలెంట్‌గా ఉండిపోయాం. వీడియో తీస్తున్నానని..మమ్మల్ని చాలాసేపు వేధించారు. నేను వీడియో తీస్తున్నానని గ్రహించి కారు ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు అని పేర్కొంది. వీరిపై చర్యలు తీసుకోమని పోలీసులను కోరింది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నిమిషా నాయర్.. అమర్ కాలనీ, 8 ఏఎమ్ మెట్రో సినిమాల్లో నటించింది. 'ట్రయల్ బై ఫైర్' వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nimisha Nair 🌸 (@nimnair) చదవండి: యాక్టింగ్ రాదని ట్రోలింగ్ చేశారు: రష్మిక ఎమోషనల్ -
'అలా చేయడం సిగ్గుచేటు'.. ఆస్కార్ నివాళిపై హేమ మాలిని ఆగ్రహం..!
ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు.అయితే తాజాగా ధర్మేంద్రకు ఆస్కార్ నివాళి అర్పించడంపై ఆయన భార్య హేమ మాలిని స్పందించారు. ఆస్కార్ వేదికపై ప్రసారం చేసిన మెమోరియంలో ధర్మేంద్ర ఫోటోలు లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ఇలా ప్రదర్శించడం ఆ అవార్డుల వేడుకకే సిగ్గు చేటని హేమ మాలిని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గౌరవించకపోయినా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని ఆమె అన్నారు. కేవలం అవార్డులు మాత్రమే ఆయన కెరీర్‌ను నిర్ణయించలేవని తెలిపారు.హేమ మాలిని మాట్లాడుతూ.. 'ఆయన తన జీవితకాలంలో ఎప్పుడూ ఎక్కువ అవార్డులు పొందలేదు. అలాంటప్పుడు ఆయన ఆస్కార్ల గురించి ఎందుకు పట్టించుకోవాలి? మా ఇద్దరికీ మన దేశంలో లభిస్తున్న ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. లాల్ పత్తర్, మీరా చిత్రాలలో నా ఉత్తమ నటనకు కూడా ఎటువంటి అవార్డు రాలేదు' అని తెలిపింది.అయితే ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా డయాన్ కీటన్, కేథరీన్ ఓహారా, రాబర్ట్ రెడ్ఫోర్డ్, ఉడో కీర్, రాబ్ రైనర్, రాబర్ట్ డువాల్, జీన్ హాక్మన్, వాల్ కిల్మర్లతో లాంటి అంతర్జాతీయ సినీ ప్రముఖులకు మాత్రమే అకాడమీ నివాళులర్పించింది. ఆ తర్వాత ధర్మేంద్రతో పాటు మరో నటుడు మనోజ్ కుమార్‌లను అధికారిక ఆస్కార్ వెబ్సైట్లో ఇన్ మెమోరియం జాబితాలో చేర్చారు. కాగా.. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకు సైతం ఆస్కార్ అకాడమీ నివాళులర్పించింది. -
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మృతి.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైంది. అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రాస్తూ..'సినిమా సెట్లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లం. వానిటీ వ్యాన్‌లో ప్రవేశించిన ప్రతిసారీ కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ ఉందని ఆటపట్టించేదాన్ని. నీతో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించేది. నీతో కలిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇక నుంచి నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతాను. గత రెండు సంవత్సరాలుగా నా సృజనాత్మక ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు నీ ముఖాన్ని చూడటం నా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి. లవ్ యూ.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా…' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.అసలు మార్స్ పెడ్రోజో ఎవరు?మార్స్ పెడ్రోజో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది స్టార్స్‌తో కలిసి పనిచేశారు. ఫిల్మ్ షూటింగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోని సృజనాత్మక నిపుణులతో కలిసి పనిచేశాడు, అతని నైపుణ్యాలు, సెట్లో తన వర్క్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. అతని మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెడ్రోజోను గుర్తుచేసుకున్నారు. వరుణ్ ధావన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ పరిశ్రమకు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
52 ఏళ్ల మలైకాతో డేటింగ్.. 32 ఏళ్ల కుర్రాడు ఏమన్నాడంటే..
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా.. వ్యక్తిగత జీవితంపై ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసి.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. ఆ కుర్రాడు మలైకా కంటే 20 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. అతని పేరు సోరబ్ బేడి. మోడల్, టీవీ నటుడు. మలైకా వయసు 52 ఏళ్లు అయితే.. సోరబ్ వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ పార్టీలో హగ్ చేసుకొని సెల్ఫీ దిగడంతో డేటింగ్ రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్‌ని సోరబ్ కొట్టి పడేశాడు. మలైకా, తాము మంచి స్నేహితులం మాత్రమే అని..అంతకు మించి తమ మధ్య ఏమీ లేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మలైకాతో స్నేహం ఎలా ఏర్పడిందో వివరించాడు.అలా పరిచయం.. డెల్నాజ్ దారువాలా, వాహ్బిజ్ మెహతా అనే ఇద్దరు వ్యక్తులు నా మోడలింగ్ రోజుల్లో ర్యాంప్‌పై నడిచే అవకాశం ఇచ్చారు. నేను వారితో స్నేహం చేశాను. వారితో కలిసి పార్టీలకు వెళ్లడం ప్రారంభించాను. ఒక పార్టీలో, నేను నా గురువుల ద్వారా మలైకాను కలిశాను. ఆమె డెల్నాజ్, వాహ్బిజ్లకు కూడా సన్నిహితురాలు. అందువల్ల, మలైకా, నేను స్నేహితులమయ్యాం. అంతకు మించి మా మధ్య ఏమి లేదు’ అని సోరబ్ చెప్పుకొచ్చాడు.మలైకాతో పార్టీ.. తొలిసారి కాదుఒక అమ్మాయి గురించి మాట్లాడే ముందు వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇలాంటి రూమర్స్ వల్ల వాళ్లు మానసికంగా ఇబ్బంది పడతారు. ట్రోల్ చేసే ప్రతిఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. అయినా మలైకాతో పార్టీ చేసుకోవడం నాకు ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇద్దరం కలిసి పార్టీలకు వెళ్తున్నాం. ఇంతకు ముందు కూడా మలైకాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అప్పుడు నేను ఫేమస్ కాదు. ఎవరికీ తెలియకపోవడంతో అవి వైరల్ కాలేదు. ఇప్పుడు నేను కూడా తెలిసిన ముఖం కావడంతో డేటింగ్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం కూడా ఉండొచ్చు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. కానీ కొంతమంది దాన్ని భిన్నంగా చూస్తున్నారు’ అని సోరబ్ మండిపడ్డారు.మలైకా..స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్90వ దశకంలో బాలీవుడ్లో మలైకా తన హవాను కొనసాగించింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌కి స్పెషలిస్ట్‌గా పేరు సంపాదించుకుంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథిలో ప్రత్యేక గీతంతో తెలుగువారిని పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా రాణిస్తోంది. -
రిలీజ్‌కు ముందే రికార్డులు.. దురంధర్-2 ప్రభంజనం..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ తెలిపింది.ఈనెల 19న దురంధర్ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్‌లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. -
ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
సినీ తారలు మాత్రమే కాదు.. ఎవరికైనా బాల్యం అనేది ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులు తిరిగి వస్తే బాగుంటుందని అందరం అనుకుంటాం. కానీ అది జరగదని మనకు కూడా తెలుసు. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగుతాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. అక్క జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా తనతో ఉన్న చిన్నప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఈ ఫోటోలు చూస్తుంటే అస్సలు జాన్వీకపూర్ చిన్నప్పుడు ఇలా ఉండేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చాలా క్యూట్ క్యూట్‌గా కనిపించారు. జాన్వీతో చిన్నప్పటి ఫోటోలు, అమ్మ శ్రీదేవితో ఉన్న పిక్స్‌ను షేర్ చేసింది. నా సోదరి, నా ప్రాణ స్నేహితురాలు, నా సలహాదారు, నా గురువు, నా క్రైమ్ పార్ట్నర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు నా జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండి..ఈ రోజు ఒక వ్యక్తిగా మారడానికి నన్ను పెంచడంలో సహాయపడినందుకు ధన్యవాదాలు తెలిపింది. నువ్వు లేకుండా నేను జీరో.. నా జీవితంలో ఎల్లప్పుడు నీతోనే ఉండాలని ఆశిస్తున్నాను.. లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మరో సినిమా చేస్తోంది. రామ్ చరణ్- బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) -
జాన్వీ కపూర్ బర్త్ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్
పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌కు మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. పెద్ది మూవీ సెట్లో జాన్వీ కపూర్‌తో ఉన్న స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్‌ను చెర్రీ పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్‌లో కనిపిస్తూ సందడి చేశారు. ఆమెకు తన వృత్తి పట్ల ఆమెకున్న మక్కువ, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది.. ఈ ఏడాది తనకి మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ చికిరి చికిరి అభిమానులను ఓ ఊపు ఊపేయగా.. ఇటీవల రిలీజైన రైరై రారా అంటూ సాగే పాట కూడా అదే రేంజ్లో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
పెద్ది హీరోయిన్ బర్త్ డే.. కాలి నడకన తిరుమలకు..!
బాలీవుడ్ భామ, పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. ఈ శుక్రవారం ఆమె బర్త్ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్‌తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారుబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా కనిపిచంనుంది. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)
-
పదేళ్ల తర్వాత దొరికిన అరుదైన గిఫ్ట్ ఆ సినిమానే: తాప్సీ
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలే అస్సీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించగా.. మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్రలో మెప్పించింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత తాప్సీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవల ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ తన కెరీర్ గురించి మాట్లాడింది. షారూఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలో ఆఫర్ రావడంపై స్పందించింది. డంకీ లాంటి భారీ కమర్షియల్ చిత్రంలో అవకాశం రావడం మంది నటులకు కష్టమని తెలిపింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం తన కెరీర్లో అరుదైన క్షణమని వెల్లడించింది. సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఆ పాత్ర అవసరమని.. అందుకే తనకు వచ్చిందని ఆమె అన్నారు.తాప్సీ పన్ను మాట్లాడుతూ..'డంకీ లాంటి అవకాశాలు తనకు మాత్రమే కాదు. పరిశ్రమలోని చాలా మంది నటులకు కూడా కష్టమే. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం నా కెరీర్లో అరుదైన క్షణం. చాలా సంవత్సరాల నాకు లభించిన సినిమా డంకీ. దశాబ్దానికి పైగా సినిమాల్లో నటించిన తర్వాత అందుకున్న బహుమతి డంకీ. నాలాంటి వారికి డంకీ లాంటి సినిమా దొరకడం కష్టం. అస్సీ, గాంధారి లాంటి సినిమాలు చేయడం వల్లే డంకీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలు నాకు పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చాయని' పంచుకుంది. తన కెరీర్‌ను మాస్ ఎంటర్టైనర్లతో ప్రారంభించానని తెలిపింది. దక్షిణాదిలో నా కెరీర్‌ను మాస్ చిత్రాలతో ప్రారంభించా.. ఆ తర్వాత నా హిందీ సినిమా అరంగేట్రం డేవిడ్ ధావన్‌తో జరిగిందని పేర్కొంది.కాగా.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
'అందుకే బాలీవుడ్ వదిలేయాల్సి వచ్చింది.. కానీ'.. వారణాసి బ్యూటీ
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక ప్రస్తుతం ది బ్లఫ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ది బ్లఫ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక హాలీవుడ్‌కి వెళ్లడంపై మాట్లాడింది. నేను బాలీవుడ్‌ను వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగానే ఫీలయ్యానని పేర్కొంది. అందువల్లే హాలీవుడ్లో అడుగుపెట్టాల్సి వచ్చిదంని వెల్లడించింది. ఇండియన్ సినిమాల్లో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని.. వారణాసిలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా తెలిపింది.ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..' నేను హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగా భావించా. నా కెరీర్ మరింత విస్తరించాలనుకున్నా. అందుకే హాలీవుడ్లో పనిచేశా. కానీ బాలీవుడ్‌ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పరిమితమైన అవకాశాలే రావడంతో ప్రాజెక్టుల విషయంలో కొంత ఒత్తిడికి గురయ్యా. అలాంటి పరిస్థితుల్లోనే హాలీవుడ్‌లోకి అడుగుపెట్టా. నాకు భారతీయ సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు రాజమౌళి సార్‌తో వారణాసి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపింది. -
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్‌కు చెక్ పెట్టిన నటి
హిందీ బిగ్‌బాస్ సీజన్ 1 ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్, భర్త అపూర్వ పడ్‌గోయంకర్ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరు విడిపోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టింది దివ్య. పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.హ్యాపీ యానివర్సరీ మై లవ్నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావ్.. అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నేనేంటో, ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు. నన్ను అది మార్చుకో, ఇది మార్చుకో అని నువ్వెప్పుడూ చెప్పలేదు. నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. హ్యాపీ యానివర్సరీ మై లవ్.. ఇలాంటి పెళ్లిరోజులు మనమెన్నో జరుపుకోవాలి. నా ప్రతి ఆలోచన తనకు తెలుసు, కాబట్టి తనకు నాగురించి ఎటువంటి భయం లేదు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ హ్యాపీ యానివర్సరీ అని కామెంట్లు చేస్తున్నారు.అసలేమైంది?దివ్య ఇటీవలే ద 50 అనే రియాలిటీ షోకి హాజరైంది. అయితే ఈ షోలోని మరో కంటెస్టెంట్ భవ్య సింగ్.. దివ్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె భర్తతో కలిసుండటం లేదని ఆరోపించింది. తను షోకి వచ్చినప్పటికీ భార్య కోసం అపూర్వ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, ఇక్కడే వారి దాంపత్య జీవితం ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శలు గుప్పించింది. దీంతో దివ్య దంపతులు విడిపోతున్నారంటూ రూమర్స్ రాగా వాటిని నటి టీమ్ కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Divyaa Agarwal (@divyaagarwal_official) -
మగాళ్లకి వర్జిన్ భార్యలే కావాలి : నటి సంచలన కామెంట్స్
ఛోళీకే పీఛే క్యాహై అనే ఖల్నాయక్లో పాట గుర్తున్నవాళ్లకి మాధురీ దీక్షిత్, సంజయ్ దత్‌లతో సమానంగా గుర్తుండే మహిళ నీనాగుప్తా. సినిమాల్లో నటనకు మాత్రమే కాదు అత్యంత స్వేఛ్చాయుత వ్యక్తిగత జీవితం ద్వారా బాలీవుడ్ టాప్ స్టార్స్ కన్నా మిన్నగా ఆమె గుర్తొస్తారు. మహిళల వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రంపై ఆమె తరచుగా వెల్లడించే అభిప్రాయాల సందర్భంలో నీనా వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఆమె 30 సంవత్సరాల వయసులో పెళ్లికాకుండానే ఒంటరి తల్లి అయ్యింది. ఆమె కుమార్తె మసాబా రాకను సంతోషంగా స్వాగతించింది. వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తన బిడ్డకు తండ్రి అని ఆ తర్వాత వెల్లడించింది. ఆ తర్వాత కూడా ఆమె అంతే స్వేఛ్చగా తన జీవితం గడుపుతూ వస్తోంది. అయితే తన నిర్ణయాలతో తనకు బాగుండవచ్చునని, అందరినీ అదే దారి ఎంచుకోవాలనే సలహా తాను ఇవ్వబోనని తరచుగా ఆమె స్పష్టం చేస్తుంటారు. ఈ నేపధ్యంలో...మన దేశంలో మహిళలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న వివక్షాపూరిత వాస్తవాల గురించి ప్రముఖ నటి నీనా గుప్తా మరోసారి కుండ బద్ధలు కొట్టారు. ఆధునిక సమాజపు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందనీ, విశాల థృక్పధం గణనీయంగా అభివృద్ధి చెందిందనే ఆమె నిర్ధ్వందంగా తిప్పికొట్టారు. ఇటీవల ఓ మీడియాతో జరిపిన సంభాషణలో, ఈ సీనియర్ నటి పితృస్వామ్యం, పురుషాధిక్యత ఇప్పటికీ వివాహం తర్వాత మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆమె ఎత్తి చూపారు. ఈ సంభాషణ సందర్భంగా భారతీయ సంప్రదాయ సమాజంలో వధువు కన్యత్వం పట్ల ఇంకా కొనసాగుతున్న వ్యామోహాన్ని నీనా ప్రస్తావించారు. నేటికీ కన్యత్వం అంత ముఖ్యమైన అంశంగా ఉందా అని అడిగినప్పుడు, భారతదేశం గురించి మాట్లాడుతున్నావా? ఇక్కడ ఇప్పుడు ఏం మారింది? అంటూ ఎదురు ప్రశ్నించారు. ‘మగ వారు భార్యను కన్యగానే కోరుకుంటున్నారు‘ అని ఆమె అన్నారు. కొంత వరకూ నగరాల్లో, ఇంగ్లీష్ మాట్లాడే మగ వారు చూడడానికి చాలా విశాల మనస్తత్వం ఉన్నట్టు కనిపిస్తారని అయితే అది నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ’వారు కూడా కన్యనే భార్యగా కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారామె.పరిస్థితులు మారిపోయాయనే ఊహను నీనా ప్రశ్నించింది. ‘మన దగ్గర జనం ఓపెన్‌గా ఉంటారని ఎలా అంటున్నారు? అదొక్కటే కాదు మన దేశంలో చాలా విషయాలు ఇప్పటికీ మారలేదు. మహిళలు ఇప్పటికీ తలపై కొంగు కప్పుకుని ఆ తర్వాత మామగారి పాదాలను తాకుతారు. ఇక్కడ నువ్వూ నేనూ మైనారిటీలం, మనం నిజమైన భారతదేశం కాదు. చక్కగా దుస్తులు ధరించి, చక్కగా మాట్లాడే మనలాంటి వారు భారతదేశం కాదు.‘ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారామె. తన అభిప్రాయాన్ని బలపరిచేలా నీనా తన సొంత కుటుంబంలోని కొన్ని సంఘటనలను పంచుకున్నారు.‘నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నా తండ్రి వైపు ఉన్న ఒక బంధువుల అమ్మాయి ముంబైలో ఒక పెద్ద సంస్థలో పనిచేసే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఒకసారి నా తండ్రి ఆ అబ్బాయి, అమ్మాయి ఆమె కుటుంబాన్ని తన ఇంటికి మాట్లాడటానికి పిలిచాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ముంబైలో ఆ అబ్బాయి, అతని కుటుంబంతో ఇకపై నివసించడానికి నిరాకరించింది. ఆ అమ్మాయి అలాంటి వివక్ష ఎదుర్కుంది మరి. కనీసం తనకు నచ్చిన దేవుడ్ని పూజించడానికి కూడా ఆ అమ్మాయిని అనుమతించలేదట. ఆ అమ్మాయి సాయి బాబా అంటే ఇష్టం కాబట్టి బాబా ఫొటోను తన గదిలో ఉంచితే ఆమె అత్తగారు దానికి కూడా అనుమతించలేదు. తాము పూజించే ఓ గురువు ఫొటోనే పెట్టాలని ఆదేశించింది‘ అని ఆమె గుర్తు చేసుకున్నారు.తర్వాత ఆమె మరొక సంఘటనను ఉదహరించారు. ‘నేను మీకు మరో ఉదాహరణ ఇస్తాను. ఇది నా మేనకోడలికి సంబందించింది. ఆమెను ఆమె అత్తగారు తన కుటుంబ ఫోటోను తన పడక టేబుల్‌పై పెట్టుకోవద్దని అడ్డుకున్నారు’’ అంటూ పంచుకున్నారామె. ఏదేమైనా దేశంలోని మహిళల స్థితిని మార్చే విషయంలో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు. -
రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి.. ఇప్పుడు ప్రముఖ నటి..!
బాలీవుడ్ తారలకు ఇటీవల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలైన రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు బెదిరింపులొచ్చాయి. తాజాగా మరో నటికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ నటి హిమాన్షీ ఖురానాకు బెదిరింపులొచ్చాయి. పది కోట్లు ఇవ్వాలని ఓ దుండగుడు డిమాండ్ చేశాడు. దీంతో నటి పంజాబ్‌లోని మొహాలీ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ మెయిల్ ద్వారా వాయిస్ నోట్ వచ్చిందని.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని హిమాన్షీ తన ఫిర్యాదులో పేర్కొంది. జీషన్ అక్తర్ అనే పేరుతో మెయిల్ వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. నటి హిమాన్షీ ఖురానీ పంజాబీ మూవీ సద్దా హక్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు. జోడీ బిగ్డే పార్టీ, నా.. నా.. నా లాంటి ఆల్బమ్స్‌తో అలరించారు. అంతేకాకుండా హిందీ బిగ్‌బాస్ సీజన్- 13లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన నాగిని బ్యూటీ.. సోషల్ మీడియాలో పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర భామ సురభి జ్యోతి నాగిన్ సీరియల్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అంతే కాకుండా ఖుబూల్ హై, ఇష్క్ బాజ్, కోయి లౌట్ కే ఆయా హై సీరియల్స్‌తో మెప్పించింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు నటుడు సుమిత్ సూరితో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2024లో పెళ్లి పీటలెక్కి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో మా ఇంటికి కొత్త మెంబర్ రానున్నారని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. మా గొప్ప సాహసయాత్ర ప్రారంభమవుతుంది.. ఈ జూన్‌లో లిటిల్ లవ్ మా ఇంటికి వస్తోందంటూ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. సురభి- సుమిత్ హాంజి-ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆమె భర్త సుమిత్ సూరి 2013లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలు.. ద టెస్ట్ కేసు, హోమ్ వెబ్ సిరీసుల్లోనూ నటించాడు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) -
కారణం లేకుండా బూతులు తిట్టేవాళ్లు : నటి షాకింగ్ కామెంట్స్
కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమనాలు ఎదుర్కొన్నానని, కొంతమంది దర్శకులతో బూతులు కూడా తిట్టించుకున్నానని చెబుతోంది బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన కొన్ని సంఘటలను పంచుకుంది. ‘చాలా మంది నటీనటులాకే నాకు కూడా కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురైయ్యాయి. సెట్లో అవమానించేలా మాట్లాడేవారు. కొంతమంది దర్శకులు కారణం లేకుండా బూతులు తిట్టేవారు. అప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. డబ్బులు కావాలి. అందుకే వాళ్లు అసభ్య పదాలతో దూషించినా.. సైలెంట్‌గా ఉండిపోయా. కొన్ని సినిమాలు అయితే కేవలం డబ్బుల కోసమే నటించా. షూటింగ్ అయిపోయాక ఈ చిత్రాలను ఎందుకు అంగీకరించానా అని చాలా బాధపడేదాన్ని. అవి విడుదల కావొద్దని దేవుడ్ని కోరుకున్నా. అవకాశాలు రాకపోవడంతో ఆ చిత్రాలను అంగీకరించా. ఒకవేళ ఆ సమయంలో నాకు వేరే చిత్రాలు వచ్చి ఉంటే.. కొన్ని సినిమాలను వదిలేదాన్ని’ అని నీనా గుప్తా చెప్పుకొచ్చింది. సినిమాలతో పాటు సిరియళ్లలోనూ నటించింది నీనా గుప్తా.‘ఇష్క్’, ‘ఎలోన్’, ‘ముల్క్’, ‘83’, ‘డయల్ 100’, ‘గుడ్‌బై’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా అలరించింది. -
హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ.. నటాషా స్టాంకోవిచ్ బోల్డ్ లుక్స్..!
ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ..మరింత హాట్ హాట్‌గా నటి నటాషా స్టాంకోవిచ్..పాయల్ రాధాకృష్ణ స్టన్నింగ్ వీడియో..గతవైభవ మూవీ జ్ఞాపకాల్లో ఆషిక రంగనాథ్..గోవాలో చిల్ అవుతోన్న హీరోయిన్ శ్రద్ధా దాస్.. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్ ఇన్ ఏ మెట్రో, వేకప్ సిద్, ‘మెట్రో ఇన్ దినో’ లాంటి సినిమాల్లో నటించారు. Meera's living her dream life. Will a secret turn it into a nightmare?Watch Accused, starring Konkona Sensharma and Pratibha Rannta, out 27 Feb, only on Netflix. #AccusedOnNetflix pic.twitter.com/J1Nuk2x3f1— Netflix India (@NetflixIndia) February 9, 2026 -
వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)
-
అడ్జస్ట్మెంట్ తప్పదు.. అమ్మతో చెప్పేసరికి!: స్పైడర్ నటి
మలయాళ నటి కని కుస్రుతి సొంత భాషతో పాటు తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో స్పైడర్ మూవీలో విలన్ తల్లిగా యాక్ట్ చేసింది. తాజాగా ఈ నటి అస్సి అనే హిందీలో సినిమా యాక్ట్ చేసింది. ఇందులో అత్యాచార బాధితురాలిగా కనిపించనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.అంత ఈజీ కాదుఅయితే కుస్రుతి ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకుంది. గతంలో ఈ విషయం గురించి కని మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. తీరా ఇక్కడికి వచ్చాక అదంత ఈజీ కాదని తెలుసుకున్నాను. కొందరు దర్శకనిర్మాతలు లైంగిక వాంఛలు తీర్చితే అవకాశాలిస్తామన్నారు. ఓపక్క అడ్జస్ట్ అవమని ఒత్తిళ్లు, మరోపక్క నటిగా పరిమితులు విధించేవారు. అమ్మతోనూ అదేమాటకొందరైతే నేరుగా మా అమ్మతో మాట్లాడారు. ఫలానా సినిమాలో మీ కూతురు కనిపించాలంటే తను అడ్జస్ట్ అవ్వాల్సిందే అన్నారు. ఇవన్నీ భరించలేకపోయాను. ఈ ఇండస్ట్రీలో బతకడం కష్టమని వెనక్కు వచ్చేశాను. థియేటర్ డ్రామాలు చేసుకుంటూ పోయాను. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.సినిమాకని కుస్రుతి సినిమాల విషయానికి వస్తే.. 2003లో అన్యర్ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బిర్యానీ, కేరళ కేఫ్, గర్ల్స్ విల్ బి గర్ల్స్, ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కిల్లర్ సూప్, పోచర్, నాగేంద్రాస్ హనీమూన్ వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది.చదవండి: నా కొడుకు దుబారా ఖర్చు చేస్తున్నాడా? బిల్లు చూపించు: సునీల్ శెట్టి -
నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)
-
’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఇంత సెన్సేషన్ ఊహించలేదు, ఇకనైనా అవకాశాలొస్తే బాగుండు!
'రంభ హో హోహో..' ఈ పాట ఒకప్పుడు చాలా ఫేమస్. ధురంధర్ సినిమాలో ఈ సాంగ్‌ను వాడుకోవడంతో మరోసారి వైరల్ అయింది. అయితే ఈ పాటకు 70 ఏళ్ల నటి కల్పనా అయ్యర్ హుషారుగా స్టెప్పులెయ్యడం అంతకంటే ఎక్కువ వైరలవుతోంది. 1981లో వచ్చిన అర్మాన్ సినిమాలోని పాటే రంభ హో హో. ఈ డిస్కో సాంగ్‌లో కల్పనా అయ్యర్ స్టెప్పులేసింది. పెళ్లిలో డ్యాన్స్దాదాపు 45 ఏళ్ల తర్వాత మరోసారి ఈ పాటపై కాలు కదిపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కల్పనా అయ్యర్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ కుమారుడి పెళ్లికి వెళ్లాను. అతడిని నా కొడుకులాగే భావిస్తాను. అందుకే ఫ్యామిలీతో కలిసి ఆ పెళ్లికి హాజరయ్యాను. అందరూ డ్యాన్స్ చేయమని కోరితే అప్పటికప్పుడు స్టెప్పులేశా.. అదేమీ ముందుగా ప్లాన్ చేసుకోలేదు.చాలా స్పెషల్ఆ వీడియోను సాధారణంగా సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఇంకేముంది, కొద్ది గంటల్లోనే చాలా వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే వీడియో కనిపిస్తోంది. అందరూ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందులోనూ నాలుగు దశాబ్దాల కిందట డ్యాన్స్ చేసిన పాట మరోసారి గుర్తింపు తెచ్చుకుంటుంటే మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది. అవకాశాలు వస్తే అంతే చాలుఈ సాంగ్‌ను ధురంధర్ మూవీలో వాడారని విన్నాను. అందుకు దర్శకుడు ఆదిత్య ధర్‌కు కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే! ఆయన వల్లే ఇప్పటి జెనరేషన్ ఆ పాటను మళ్లీ పాడుకోగలుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీని చాలా మిస్ అయ్యాను. ఈ వైరల్ పాపులారిటీ మూలాన అవకాశాలు వస్తే కెమెరా ముందు నటిస్తాను అంటోంది. మరి కల్పనా కోరిక నెరవేరుతుందా? మరోసారి వెండితెరపై కనిపిస్తుందా? అన్నది చూడాలి! వందకు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన కల్పనా.. చివరగా హమ్ సాత్ సాత్ హై (1999) మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by RISE & INSPIRE 💫 (@rise_and_inspire_org) చదవండి: కవలలు పుట్టాక రామ్‌చరణ్ ఫస్ట్ పోస్ట్. -
బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)
-
కుమారుడి పేరు రివీల్ చేసిన ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ కమెడియన్ భారతి సింగ్, హర్ష్ లింబాచియా దంపతులు తమ కుమారుడి పేరును రివీల్ చేశారు. డిసెంబర్ 19న రెండో బిడ్డకు జన్మనిచ్చిన భారతి సింగ్ ఇవాళ తన కొడుకు నామకరణ వేడుకను నిర్వహించారు. తమ ముద్దుల కుమారుడికి యశ్వీర్ అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేక్ చేశారు. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు నైస్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. వీరికి ఇప్పటికే లక్ష్ అనే కుమారుడు ఉన్నారు. ఈషా సింగ్, కరిష్మా తన్నా, అదా ఖాన్, కిష్వర్ మర్చంట్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.కాగా.. నటి, కమెడియన్ భారతి సింగ్ పలు సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోస్‌లోనూ పాల్గొంది. ది కపిల్ శర్మ షో, ఇండియాస్ గాట్ టాలెంట్ లాంటి షోలలో మెరిసింది. ఇటీవల ప్రసవం తర్వాత వెంటనే లాఫ్టర్ చెఫ్స్ ఫన్ అన్లిమిటెడ్ సీజన్- 3 సెట్స్‌లో కనిపించింది. ఈ దంపతులకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు లక్ష్ సింగ్ లింబాచియా ఉన్నాడు. వీరికి 2022లో మొదట కుమారుడు జన్మించాడు. ఈ జంట కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Bharti Siingh (@bharti.laughterqueen) -
స్టేజ్‌పై నటికి చేదు అనుభవం.. ఫోలీసులకు ఫిర్యాదు
ప్రముఖ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ప్రదర్శన ఇస్తుండగానే నిర్వాహకులు తనను అవమానించారని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగింది?పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా, బొంగావ్‌లో 'నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ్ క్లబ్' ఆధ్వర్యంలో ఈ నెల 25న అర్ధరాత్రి ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. మిమీ చక్రవర్తి ప్రదర్శన ఇస్తున్న సమయంలో నిర్వాహకులలో ఒకరైన తన్మయ్ శాస్త్రి అకస్మాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి కార్యక్రమాన్ని ఆపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను స్టేజ్ దిగి వెళ్ళిపోవాలని ఆదేశించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ అనుచిత ప్రవర్తనపై మిమీ చక్రవర్తి సోమవారం బొంగావ్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కళాకారుల పట్ల ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.ఈ ఘటనపై మిమీ చక్రవర్తి ఎక్స్ (ట్విటర్) వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. మైకులో అందరి ముందూ తనను అవమానించేలా మాట్లాడారని, ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రిపబ్లిక్ డే వేళ స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుకుంటాం కానీ, మహిళా కళాకారులకు కనీస గౌరవం, భద్రత కరువయ్యాయని’ అంటూ తనకు ఎదురైన చేదు ఘటన గురించి వివరించింది.As we celebrate Republic Day, we speak of freedom and equality.But the independence and dignity of women and artists are still too easily violated.I have built my image and career on my own over the years. Staying silent today would only normalise the humiliation of artists.…— Mimi chakraborty (@mimichakraborty) January 26, 2026 -
ప్రియాంక చోప్రా జనవరి జ్ఞాపకాలు.. కూతురు, భర్తతో చిల్ మోడ్ (ఫొటోలు)
-
అలా అయితేనే పెళ్లి.. వింత కండిషన్ పెట్టిన నటి
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి, నటుడు అర్బాజ్ పటేల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై తాజాగా నిక్కీ తంబోలి స్పందించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తమ పెళ్లికి ఓ వింత కండీషన్ కూడా పెట్టుకున్నారట. అదేంటే.. నిక్కీ లేదా అర్బాజ్.. ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రియాల్టీ షోలో విన్నర్‌గా గెలిస్తే పెళ్లి చేసుకుంటారట. గెలుపు అనేది పాజిటివ్ ఎనర్జీ అని.. విజయం తర్వాతే వివాహ బంధంలోకి అడుగుపెడతామని నిక్కీ చెప్పుకొచ్చింది.కాగా, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న 'ది ఫిఫ్టీ' రియాలిటీ షోలో ఈ జంట కలిసి పాల్గొంటోంది. ఇందులో మొత్తం 50 మంది సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. ఈ షోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
ప్రియుడితో ప్రముఖ బుల్లితెర నటి ఎంగేజ్మెంట్..!
ప్రముఖ బుల్లితెర నటి అద్రిజా రాయ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అనుపమ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో నిశ్చితార్థం చేసుకోనుంది. ఈనెల 25న వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరగనుంది.కాగా.. 'అనుపమ' సీరియల్లో రాహి పాత్రతో నటి అద్రిజా రాయ్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇమ్లీ, కుండలి భాగ్య, దుర్గ ఔర్ చారు లాంటి సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్‌ఫ్రెండ్స్ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో జనవరి 25న ఫామ్‌హౌస్‌లో నిశ్చితార్థానికి రెడీ అయిపోయింది. ఈ నిశ్చితార్థం వేడుకకు కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు.అయితే తాము పెళ్లి విషయంలో తొందరపడటం లేదని ఆద్రిజా రాయ్ వెల్లడించింది. మేము ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయడం లేదని చెప్పింది. వచ్చే రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లి ఎప్పుడు జరిగినా బెంగాలీ, దక్షిణ భారత (తమిళ) సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకోవడం నా కల అని వెల్లడించింది. ఇటీవల తన నిశ్చితార్థానికి ముందు ఆద్రిజా తన కాబోయే భర్తతో కలిసి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకుంది. -
యానిమల్ బ్యూటీ యాక్షన్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
షాహిద్ కపూర్ హీరోగా వస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఓ రోమియో. ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ హిందీలో కాకుండా ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేయడం విశేషం. ఈ చిత్రంలో అవినాష్ తివారి, విక్రాంత్ మస్సే, నానా పటేకర్, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ: యంగ్ హీరోయిన్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అర్జున్ ఇటీవలే దురంధర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన యుఫోరియా మూవీతో అలరించేందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. టాలీవుడ్ మీ ఫేవరేట్ హీరో అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ ఆసక్తికరమైన పేరు చెప్పింది. తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.కాగా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా చిత్రంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటింటారు. ఈ సినిమాకు నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించారు. డ్రగ్స్ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. -
పెళ్లయిన నిర్మాతతో డేటింగ్ రూమర్స్.. స్పందించిన ఐటమ్ బ్యూటీ..!
బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా పేరు సంపాదించుకున్న బ్యూటీ నోరా ఫతేహీ. పలు సూపర్ హిట్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో అభిమానులను మెప్పించింది. తన గ్లామర్‌తో బాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కన్నడ చిత్రం కేడీ: ది డెవిల్, తమిళ చిత్రం కాంచన 4లో కనిపించనుంది.అయితే సినీ కెరీర్ సంగతి పక్కన పెడితే.. ఇటీవల నోరాపై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ టి సిరీస్ ఛైర్మన్, ఎండీ భూషణ్ కుమార్‌తో రిలేషన్‌పై ఉన్నారని వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నోరా స్పందించింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. తనపై వచ్చిన వీడియోను చూసి వావ్ అంటూ స్మైలీ ఎమోజీని జోడించింది. దీంతో నోరా ఫతేహీ టాపిక్ బాలీవుడ్ చర్చనీయాంశంగా మారిపోయింది.కాగా.. 2005లో నటి దివ్య ఖోస్లాను భూషణ్ కుమార్ వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో ఒక కొడుకు జన్మించారు. అయితే తనపై వస్తున్న రూమర్స్‌పై భూషణ్ కుమార్ మాత్రం స్పందించలేదు. నోరా ఫతేహి వ్యక్తిగత జీవితం గురించి కొత్త కొత్త ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. గతంలో మొరాకో ఫుట్‌బాల్ క్రీడాకారుడు అచ్రాఫ్ హకీమి రిలేషన్లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. -
తన వల్లే నా పెళ్లి జరిగింది: నుపుర్ సనన్
బాలీవుడ్ భామ, హీరోయిన్ కృతి సనన్ సిస్టర్ నుపుర్ సనన్ ఇటీవలే పెళ్లి చేసుకుంది. తన ప్రియుడైన స్టీబిన్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. మొదటి క్రిస్టియన్ సంప్రదాయంతో వివాహం చేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలోనూ గ్రాండ్‌గా పెళ్లి వేడుకను జరుపుకుంది. ఈ పెళ్లిలో ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ సందడి చేసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ముందుండి నడిపించింది.అయితే వీరిద్దరిదీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లికి నుపుర్ సనన్ మదర్ ఒప్పుకోలేదు. ఆమె ససేమిరా అనడంతో కృతి సనన్ రంగంలోకి దిగింది. సిస్టర్ కోసం అమ్మను ఒప్పించి మరీ ఈ పెళ్లి జరిపించింది ముద్దుగుమ్మ. తాజాగా తన అక్క స్టీబిన్ గురించి తల్లిని ఎలా ఒప్పించిందో కూడా నుపుర్ సనన్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నుపుర్ ఈ విషయాన్ని పంచుకుంది.నుపుర్ సనన్ మాట్లాడుతూ.. "స్టీబిన్ గురించి నేను మొదట చెప్పింది నా సోదరికే. మా ఇద్దరి మధ్య ఐదేళ్ల వయస్సు తేడా ఉన్నప్పటికీ మేము చాలా క్లోజ్‌గా ఉంటాం. అంతేకాదు ప్రాణ స్నేహితులం కూడా. స్టీబిన్ వృత్తిపరంగా ఇప్పుడే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి కెరీర్ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. నేను అతని గురించి ఒక వ్యక్తిగా ఎక్కువగా చెప్పా. తనకు అతని పాట వినిపించా. వెంటనే అతను అపారమైన ప్రతిభ ఉన్నవాడని కృతి చెప్పింది." అని తెలిపింది."కొన్ని నెలల తర్వాత ఈ విషయం మా అమ్మకు చెప్పా. చాలా మంది తల్లులలాగే ఆమె కూడా కొంచెం సంకోచించింది. అప్పుడే నా సోదరి రంగంలోకి దిగింది. నేను స్టీబిన్‌ను కలిశాను.. అతని పాటలు కూడా విన్నాను.. చాలా ప్రతిభావంతుడు.. కష్టపడి పనిచేసేవాడని అమ్మతో చెప్పింది. అలా తన మాటలతో అమ్మను మార్చేసింది. అక్కడి నుండి అంతా సజావుగా జరిగిపోయింది" అని పంచుకుంది. కాగా.. నుపుర్ సనన్- స్టీబిన్ పెళ్లి ఉదయపూర్ జరిగింది. ఈ వేడుకలకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. -
బాలీవుడ్ పీఆర్ కల్చర్‌పై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతి దానికీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లలో బాలీవుడ్లో పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పీఆర్ అంటే మన గురించి, మన సినిమాల గురించి మంచి మాటలు ప్రచారం చేయడం. ఇప్పుడు ప్రమోషన్ అనేది ఇతరులను తక్కువగా చూపించే స్థాయికి వెళ్లింది. ఇతరులను కిందికి లాగడానికి కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మన ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడుతున్నారు’’ అని హీరోయిన్ తాప్సీ(Taapsee Pannu) పేర్కొన్నారు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పీఆర్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ‘‘నేను నా పనులతో చాలా బిజీగా ఉన్నాను. రెండేళ్లుగా వర్క్‌లో స్పీడ్ తగ్గించాను. ఏడాదిన్నర నుంచి ఇండస్ట్రీలోని పీఆర్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ ప్రతి దానికి డబ్బు చెల్లించాలని గ్రహించాను. ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడతారు. మీ విజయం వేరొకరి వైఫల్యంపై ఆధారపడి ఉంటుందనేలా కొత్త వెర్షన్స్ సృష్టించారు. కానీ, నా మనస్తత్వం పూర్తి భిన్నమైనది. మన పనే మన గురించి చెప్పాలనుకుంటాను. అందుకే ఇలాంటి వాటి కోసం డబ్బులు ఖర్చు చేయను. నా ప్రయాణాలు, నా కోసం, నా కుటుంబంపై, నాకు దగ్గరైన వాళ్లపై ఖర్చు చేయడానికే ఇష్టపడతాను. నన్ను ప్రశంసిస్తూ ఆర్టికల్స్ రాయడానికి, నన్ను పొగడడం కోసం మాత్రమే సోషల్ మీడియా ఖాతాలకు వేలల్లో చెల్లించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు’’ అని స్పష్టం చేశారామె. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తాప్సీ. -
గ్రాండ్‌గా సిస్టర్ పెళ్లి.. సందడి చేసిన ఆదిపురుష్ హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ భామ కృతి సనన్ తన సిస్టర్ నుపుర్ సనన్ పెళ్లిలో సందడి చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందే వీరిద్దరు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన చెల్లి పెళ్లిలో హంగామా చేస్తూ కనిపించింది. కాగా.. నుపుర్ సనన్.. తన ప్రియుడు, సింగర్ అయిన స్టెబిన్‌ను పెళ్లాడింది. ఉదయపూర్‌లో జరిగిన వివాహ వేడుకలో కృతి సనన్ ప్రియుడు కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.నుపుర్ సనన్ సినీ కెరీర్..నుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) Kriti Sanon walks sister Nupur down the aisle as she weds Stebin Ben in dreamy Christian & Hindu ceremonies!#kritisanon #stebin #nupursanon #marriage #ptcpunjabigold pic.twitter.com/hNpgUbEeFo— PTC Punjabi Gold (@PtcGold) January 12, 2026 -
పార్టీలో జాన్వీ కపూర్ చిల్... గోల్డెన్ గ్లోబ్లో ప్రియాంక చోప్రా లుక్..!
మలేసియాలో టాలీవుడ్ నటి రోహిణి..పార్టీలో చిల్ అవుతోన్న జాన్వీ కపూర్..బికినీ పోజుల్లో బాలీవుడ్ బ్యూటీ నికితా శర్మ..గోల్డెన్ గ్లోబ్స్‌లో మెరిసిన ప్రియాంక చోప్రా..బీచ్‌లో ఫ్యామిలీతో బిపాసా బసు చిల్..సముద్రంలో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
చావు తప్ప మరో దారి లేదు.. విడాకులిచ్చా: నటి
ఒకరు మన తోడుంటేనే జీవితం పరిపూర్ణం అని చెప్పారు తప్ప నీకు నవ్వు ముఖ్యం.. ఒంటరిగా అయినా సంతోషంగా ఉండగలవు అని ఎవరూ చెప్పలేదు అంటోంది బాలీవుడ్ నటి షెఫాలి షా. హిందీ సినిమాలు, సిరీస్‌లతో అలరించే షెఫాలికి రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటగా బుల్లితెర నటుడు హర్ష్ చయ్యను పెళ్లాడింది. రెండు పెళ్లిళ్లుకానీ, వీరి బంధం ఎంతోకాలం కొనసాగలేదు. 2000వ సంవత్సరంలో దంపతులిద్దరూ విడిపోయారు. తర్వాత అదే ఏడాది దర్శకుడు విపుల్ అమృత్లాల్ షాను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన మొదటి వైవాహిక జీవితపు తాలూకు చేదు అనుభవాలను నటి గుర్తు చేసుకుంది. ఎన్నో దారుణాలుషెఫాలి మాట్లాడుతూ.. నీకు భర్త, స్నేహితుడు, అన్న, చెల్లి.. ఇలా ఎవరి అవసరమూ లేదు, నీకు నువ్వు చాలు అని ఎవరూ నాతో చెప్పలేదు. ఒకవేళ మీరు మంచి రిలేషన్‌లోనే ఉంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. కానీ ఆ రిలేషన్షిప్ బాగోలేకపోతే మాత్రం అంతకన్నా నరకం మరొకటి లేదు. ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది. ఆ రిలేషన్‌ను కొనసాగించాలా? వదిలేయాలా? అన్న అంతర్మథనంలో పడతారు. చావు తప్ప..చివరకు ఒకరోజు వస్తుంది. ఇక సహించడం నా వల్ల కాదనిపిస్తుంది.. దీన్నలాగే వదిలేస్తే రేపు నా ప్రాణాలు పోవచ్చేమో అనిపిస్తుంది. అలాంటి సందర్భం నా జీవితంలోనూ ఎదురైంది.. అది నా ఫస్ట్ మ్యారేజ్ సమయంలో! అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఓ ప్రశ్న అడిగింది. నీ జీవితంలో మళ్లీ నిన్ను ప్రేమించే వ్యక్తి తారసపడకపోతే ఏం చేస్తావ్? రిస్క్ తీసుకుంటావా? లేదా ఈ బంధాన్ని కంటిన్యూ చేస్తావా? అని అడిగింది. రిస్క్ తీసుకోవడానికే మొగ్గు చూపాను.రిస్క్ చేశాఅవసరమైతే నా జీవితాన్ని ఒంటరిగానైనా గడుపుతానన్నాను. అంతేకానీ నాకు విలువ లేని చోట, ఏమాత్రం ఆనందం దొరకని చోట శిలలా బతకలేనని బదులిచ్చాను. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేందుకు నేనేం పిజ్జాను కాదని చెప్పా.. అని గుర్తు చేసుకుంది. షెఫాలి చివరగా ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఛాన్సులు కూడా -
దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్.. వైరల్ ఫోటోలు ఇవే
-
సినిమా ఫెయిల్.. నాకు బాగా కలిసొచ్చింది: నటి
హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.ట్రై చేశా..సినిమా రిజల్ట్ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్‌కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్డ్ గేమ్స్, అభయ్ వంటి ప్రాజెక్టులలో సీరియస్ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్‌గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. నేనే ధైర్యం తెచ్చుకుని..ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు.నా లైఫ్ నాదిమస్తీ 4 మూవీలోని అడల్ట్ జోక్స్పై జరిగిన ట్రోలింగ్‌ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్‌ను నా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్ చెప్పుకొచ్చింది. చదవండి: 'మా జీవితాల్లో విలన్ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు' -
సూర్యకుమార్ యాదవ్‌పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో సూర్యకుమార్ యాదవ్ తనకు తరచూ మెసేజ్‌లు చేసేవాడని బాంబు పేల్చింది. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి సంభాషణ జరగడం లేదని తెలిపింది.ఓ ఈవెంట్ సందర్భంగా ఎవరైనా క్రికెటర్‌తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా అని రిపోర్టర్ అడగగా ఖుషి ఇలా బదులిచ్చింది. "నేను ఎలాంటి క్రికెటర్‌తో డేట్ చేయాలనుకోవడం లేదు. చాలా మంది క్రికెటర్లు నన్ను ఫాలో అవుతున్నారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ తురుచూ మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు. నాకు లింక్ అప్స్ అస్సలు నచ్చవు" అని స్పషం చేసింది. సూర్యకుమార్ యాదవ్ గురించి ఖుషి బయటపెట్టిన ఈ సంచలన విషయాలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. తరుచూ భార్యతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లే సూర్యకుమార్ యాదవ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.ఇవాళే సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీషా శెట్టితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి పూజలు చేశాడు. స్కై సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, ఖుషి వ్యాఖ్యలు బయటికి రావడం ఆసక్తికరంగా మారింది.కోల్‌కతాలో జన్మించిన ఖుషి ఎంటీవీలో ప్రసారమయ్యే Splitsvilla రియాలిటీ షో ద్వారా బాగా పాపులరైంది. మోడల్ కూడా అయిన ఖుషి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. నితిన్‌తో కలిసి హార్ట్ అటాక్.. ఆకాశ్‌తో కలిసి దొంగ ప్రేమ తదితర సినిమాల్లో లీడ్ రోల్లో యాక్ట్ చేసింది.సూర్యకుమార్ యాదవ్ విషయానికొస్తే.. అతని సారథ్యంలో భారత టీ20 జట్టు ఇటీవలే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1 తేడాతో విజయం సాధించింది. త్వరలో స్కై నేతృత్వంలోని టీమిండియా స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సూర్యకుమారే సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్, టీ20 వరల్డ్‌కప్‌ల కోసం టీమిండియాను ప్రకటించారు. పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా నడిపిస్తున్న సూర్యకుమార్.. వ్యక్తిగతంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. -
ఆ అందాల నటి వయసు 92 ...ఆరోగ్య రహస్యం ఇదే...
చాలా మందికి కదలడం కూడా కష్టంగా ఉండే వయస్సులో ఆ నటి నృత్యం చేస్తున్నారు. చురుకైన కదలికలు, వన్నె తరగని ముఖ వర్ఛస్సుతో ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఆమె ప్రముఖ సీనియర్ నటి–నర్తకి వైజయంతిమాల బాలి. ప్రస్తుతం 92 ఏళ్ల ఈ ఐకానిక్ సంగం స్టార్ ఇప్పటికీ తరగని తేజస్సుతో కళాత్మక శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ట్వింకిల్ టోస్ అని ప్రేమగా పిలువబడే ఆమె, ఒక ప్రదర్శనకారిణి, గురువు, పండితురాలు సాంస్కృతిక సంరక్షకురాలిగా బహుళ పాత్రలను సజావుగా సమతుల్యం చేసుకుంటున్నారు. ప్రేక్షకులను తన ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేశారు, భావోద్వేగ లోతు శాస్త్రీయ వైభవంతో నిండిన ప్రదర్శన సమర్పించారు.నాట్యమే...ఆరోగ్యంఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా , తన శారీరక బలాన్ని మానసిక స్పష్టతను నిలబెట్టిన సూత్రాల గురించి వైజయంతిమాల మీడియాతో పంచుకున్నారు. నిర్మాణాత్మక జీవనం, బుద్ధిపూర్వక ఆహారం వీటన్నింటితో పాటు భరతనాట్యం పట్ల అచంచలమైన నిబద్ధత తదనుగుణ శారీరక శ్రమల సమ్మేళనమే తన దీర్ఘాయువు రహస్యం అంటారామె. తన జీవితంలో భరతనాట్యం కేంద్ర శక్తిగా మిగిలిపోయిందని వైజయంతిమాల వివరించారు. ప్రస్తుతం ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోవచ్చు, కానీ ఎంపిక చేసిన యువ విద్యార్థుల బృందానికి శిక్షణ ఇవ్వడం ద్వారా తన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. తన రోజులో మిగిలిన గంటలు పరిశోధనలో పెట్టుబడి పెడతారు, ఇది ఆమె దశాబ్దాలుగా అనుసరించిన కళారూపంతో మేధోపరంగా నిమగ్నమై ఉండటానికి వీలు కల్పిస్తుంది.మితాహారం...యోగా ధ్యానం...ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె దినచర్య గురించి మరింత విపులంగా వెల్లడయింది. ఆ ఛానల్ ప్రకారం, వైజయంతిమాల తన ఉదయాలను క్రమం తప్పని నడకలతో ప్రారంభిస్తుంది, ఈ అలవాటు శరీరాన్ని అప్రమత్తంగా శక్తివంతం చేస్తుందని ఆమె నమ్ముతుంది. ఆమె ఆరోగ్య దినచర్యలో స్థిరమైన యోగాభ్యాసం ధ్యానం కూడా భాగమై ఉంటాయి, ఆహారం కూడా ఆమె చురుకైన జీవనశైలిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె సాంప్రదాయ శాఖాహార దక్షిణ భారత భోజన శైలికి కట్టుబడి ఉంటారు. ఆమె ఉదయం పూట తరచుగా దోస, ఊతప్పం లేదా ఉప్మా వంటి సుపరిచితమైన అల్పాహారాలను తీసుకుంటారు, అదే విధంగా తాజా పండ్ల రసంతో పాటు. పోషకాలతో నిండిన తేలికపాటి భోజనం చేస్తారు. భోజనంలో సాధారణంగా బియ్యంతో రసం లేదా పప్పు చావల్ వడ్డిస్తారు. సాయంత్రం వేళలో ఆమె పండ్ల రసం లేదా కొద్దిగా పొడి పండ్ల వంటి తేలికపాటి రిఫ్రెష్మెంట్లను ఇష్టపడతారు. రాత్రి పూట ఆహారం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా తన డిన్నర్ కూరగాయలతో రోటీ లేదా పప్పు చావల్ లలో ముగుస్తుంది. నమ్మిన వృత్తి పట్ల నిబద్ధత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి నిత్యనూతనంగా ఉంచే అభిరుచులు కలగలిపిన మనిషి వయసుతో సంబంధం లేని ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు అనే దానికి వైజయంతిమాల బాలి జీవితం ఓ నిదర్శనం. -
నిర్మాత బర్త్ డే.. బాలీవుడ్ అంతా ఇక్కడే కనిపించారు (ఫొటోలు)
-
ఐటమ్ సాంగ్స్ భామకు రోడ్డు ప్రమాదం.. వీడియో రిలీజ్
బాలీవుడ్ బ్యూటీ, ఐటమ్ సాంగ్స్ ఫేమ్ నోరా ఫతేహీ కారు ప్రమాదానికి గురైంది. ముంబయిలో ఆమె ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నోరా కారు పూర్తిగా దెబ్బతినగా.. హీరోయిన్‌కు స్వల్పంగా గాయాలపాలైంది. ఈ ప్రమాదంలో నోరా ఫతేహీ తలకు దెబ్బ తగలడంతో కాస్తా మతిభ్రమించినట్లు తెలుస్తోంది. అయితే వెంటేనే ఆస్పత్రికి వెళ్లడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే సన్‌బర్న్ సంగీత కచేరీ- 2025 ఈవెంట్‌కు హాజరైన ప్రదర్శనలో పాల్గొన్నారు.తాజాగా తన ఆరోగ్యంపై నోరా ఫతేహీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని తెలిపింది. నిన్న కారు ప్రమాదంతో చాలా భయపడ్డానని పేర్కొంది. తాగిన మత్తులో కారు నడిపిన వ్యక్తి తప్పిదం వల్లే తన కారు ప్రమాదానికి గురైందని వెల్లడించింది. ఇలాంటి వాళ్లతో ప్రజల ప్రాణాలకు ముప్పుందని ఆవేదన వ్యక్తం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులను కోరింది.కాగా.. ప్రస్తుతం నోరా ఫతేహీ కాంచన 4, కేడీ: ది డెవిల్’ వంటి భారీ సౌత్ ప్రాజెక్ట్స్‌ల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ది రాయల్స్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. Actress Nora Fatehi injured in road accident,while heading to the #SunburnFestival for #DavidGuetta’s concert#NoraFatehi @MumbaiPolice pic.twitter.com/AIVMieHSNb— Indrajeet chaubey (@indrajeet8080) December 20, 2025 #NoraFatehi suffers a car accident while travelling to the Sunburn Festival for her scheduled appearance with David Guetta, after a drunk driver rams into her vehicle. A source reveals, “Nora Fatehi was involved in an unfortunate car accident, while on her way to the Sunburn… pic.twitter.com/dejnizbh8z— Filmfare (@filmfare) December 20, 2025 -
'దక్షిణాది నిర్మాత హోటల్‌కు రమ్మన్నాడు'..: క్యౌస్టింగ్ కౌచ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. సినీతారలు ఏదో ఒక సందర్భంలో అలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. కొందరు వాటిని బహిరంగంగా మాట్లాడితే.. మరికొందరు బయటికి చెప్పలేక సతమతమవుతుంటారు. గతంలో చాలామంది హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా మరో నటి తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసింది.బాలీవుడ్ నటి, స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి అయిన మాల్టీ చాహర్ ఇటీవలే సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ సీజన్-19లో కనిపించింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన మాల్టీ చాహర్ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు తెలిపింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులు, క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి మాట్లాడింది.తనకు క్యాస్టింగ్ డైరెక్టర్లతో ఎలాంటి సమస్య రాలేదని మాల్టీ చాహర్ తెలిపింది. ఏ క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించలేదని వెల్లడించింది. అయితే ఓ దర్శకుడు మాత్రం వర్క్ పరంగా మాట్లాడే సమయంలో అనుచితంగా ప్రవర్తించాడని వివరించింది. ఆ వేధింపులు ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండేవి కావని.. వారి ఉద్దేశ్యాన్ని బయటికి చెప్పకుండా అలాంటి హింట్స్ ఇస్తారని మాల్టీ తెలిపింది. ఓ దక్షిణాది నిర్మాతతో సమావేశమైనప్పుడు అతని హోటల్ రూమ్ గది నంబర్ తనకు ఇచ్చాడని ఆ అనుభవాన్ని పంచుకుంది. అలాంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఆ సమయంలో నేను అర్థం కానట్లు నటించానని.. ఆ తర్వాత మేము మళ్లీ కలుసుకోలేదని మాల్టీ చెప్పుకొచ్చింది.మాల్టీ చాహర్ మాట్లాడూతూ..'ఒక ఆఫీస్ మీటింగ్‌లో వీడ్కోలు సమయంలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సాధారణ ఆలింగనం అని భావించా. కానీ అతను నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. వెంటనే అతన్ని అడ్డుకుని.. ఆ తర్వాత అతనితో అన్ని సంబంధాలను తెంచుకున్నా. అక్కడే అతన్ని నిలదీశా. అతన్ని నా తండ్రిలా భావించా. ఆ సంఘటన నాకు ఒక గుణపాఠం నేర్పింది. ఎవరినీ కూడా ఉన్నత స్థానంలో ఉంచొద్దు. 'అని అన్నారు. మహిళలు అవకాశాల కోసం ఇలాంటి వాటికి అంగీకరించవద్దని సూచించింది. మనపై మనకు నియంత్రణ ఉండాలని కోరింది.కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్‌స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్‌లతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్‌లో మిస్టరీ గర్ల్‌గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది. -
మినీ ఎక్స్ ఎస్క్వైర్ ఇండియా ఈవెంట్ లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
ప్రముఖ బుల్లితెర భామ, బిగ్‌బాస్ బ్యూటీ రూపాలి త్యాగి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు నోమిష్ భరద్వాజ్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ డిసెంబర్ 5న జరిగింది.కాగా.. రూపాలి త్యాగి సప్నే సుహానే లడక్పన్ కే సీరియల్లో గుంజన్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్- 9లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. కాగా.. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ముంబయిలో స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ముంబయికి చెందిన నోమిష్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో యానిమేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.రూపల్ త్యాగి కెరీర్..హమారీ బేటియూన్ కా వివాహ్ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన రూపాలి త్యాగి..బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. ఏక్ నయీ చోటి సి జిందగీ, రంజు కి బేటియాన్, కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ -9 తో పాటు 2015లో ఝలక్ దిఖ్లా జా -8 లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొంది. View this post on Instagram A post shared by Roopal Tyagi (@roopaltyagi06) -
డేంజర్ జోన్లో బాలీవుడ్ భామలు!
మొన్నటి వరకు వెండితెరపై బాలీవుడ్ భామలదే హవా. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వాళ్లే నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్‌ని సౌత్ బ్యూటీస్ ఏలేస్తున్నారు. రష్మిక, సమంత, నయనతార లాంటి తారలు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంటే.. బాలీవుడ్ భామలు మాత్రం కెరీర్ విషయంలో తడబడుతున్నారు. వరుస అపజయాల కారణంగా పాన్ ఇండియా సినిమాల్లోనే కాదు బాలీవుడ్‌లోనూ అవకాశాలు రావట్లేదు. ఇక దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లు మాత్రం కండీషన్ల కారణంగా చేతికి వచ్చిన ప్రాజెక్టులను కోల్పోతూ.. కెరీర్‌ని నాశనం చేసుకుంటున్నారు.అలియా చేతితో ‘ఆల్ఫా’ ఒక్కటేబాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియాభట్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆ స్థాయిలో మరో హిట్ మాత్రం పడలేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా చిత్రం భారీ అంచనాల మధ్య 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 80 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం 32 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలియా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చిత్రంగా మిగిలిపోయింది. దీంతో అలియా చేతికి మరో భారీ ప్రాజెక్టు రాలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఆల్ఫా’ చిత్రం మీదే పెట్టుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో మొదటి ఫీమేల్-లెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.హిట్ కోసం కృతి ఎదురుచూపులుబాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఖాతాలో కూడా భారీ హిట్ లేదు. ధనుష్‌తో కలిసి నటించిన 'తేరే ఇష్క్ మే' ఈ మధ్య రిలీజై హిట్ టాక్ని సంపాదించుకుంది. అయితే కృతి చేతిలో మాత్రం ప్రస్తుతం భారీ ప్రాజెక్టులేవీ లేవు.కియారాకు వరుస షాకులుఅందం, అభినయం ఉన్న కియారా అద్వానీకి బాక్సాఫీస్ వద్ద వరస షాకులు తగులుతున్నాయి.‘భూల్ భులయ్యా 2’ తర్వాత కియరా ఖాతాలో హిట్ అనేదే లేదు. ‘జగ్ జగ్ జియో’ మొదలు గేమ్ ఛేంజర్ వరకు ఇలా ఆమె నటించిన భారీ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కియరాకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రసుత్తం ఆమె చేతిన ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా.. వాటిపై పెద్ద అంచాలు అయితే లేవు.‘కండీషన్ల’తో రిస్క్ చేస్తున్న దీపికబాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొణెది విచిత్రమైన పరిస్థితి. మిగతావాళ్లంతా భారీ ప్రాజెక్టులకు కోసం ఎదురు చూస్తుంటే..దీపికా పదుకొణె మాత్రం చేతికి వచ్చిన అవకాశాలను వదులుకొని కెరీర్‌ని రిస్క్‌లో పెడుతోంది. స్పిరిట్‌లో ప్రభాస్‌కు జోడీగా నటించే అవకాశం మొదట్లో దీపికా పదుకొణెకే వచ్చింది. అయితే ఆమె పెట్టిన పని గంటల కండీషన్ నచ్చక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ ప్రాజెక్టు నుంచి దీపికను తప్పించాడు. ఆ తర్వాత 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.ప్రస్తుతం దీపికా రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి షారుఖ్ ఖాన్ ‘కింగ్’. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరొకటి అల్లు అర్జున్-అట్లీ మూవీ. ఈ రెండింటిపైనే దీపికా ఆశలు పెట్టుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కండీషన్స్ అంటూ దీపికా తన కెరీర్‌ని ప్రమాదంలోకి తీసుకెళ్తోంది. ఒవైపు సౌత్ స్టార్ల డామినేషన్..మరోవైపు కొత్త భామల దూకుడు కారణంగా ఈ బ్యూటీస్ కెరీర్ డేంజర్ పడింది. బాలీవుడ్లో తమ స్థానాన్ని కాపాడుకోవాలంటే..వీళ్లందరికి అర్జెంట్‌గా భారీ హిట్ పడాల్సిందే.


