బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ భామ కృతి సనన్ తన సిస్టర్ నుపుర్ సనన్ పెళ్లిలో సందడి చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అంతకుముందే వీరిద్దరు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన చెల్లి పెళ్లిలో హంగామా చేస్తూ కనిపించింది. కాగా.. నుపుర్ సనన్.. తన ప్రియుడు, సింగర్ అయిన స్టెబిన్‌ను పెళ్లాడింది. ఉదయపూర్‌లో జరిగిన వివాహ వేడుకలో కృతి సనన్ ప్రియుడు కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.
నుపుర్ సనన్ సినీ కెరీర్..
నుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్‌లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం.
Kriti Sanon walks sister Nupur down the aisle as she weds Stebin Ben in dreamy Christian & Hindu ceremonies!#kritisanon #stebin #nupursanon #marriage #ptcpunjabigold pic.twitter.com/hNpgUbEeFo
— PTC Punjabi Gold (@PtcGold) January 12, 2026


