యశ్ టాక్సిక్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ | Yash Toxic Movie Makers Announce Trailer Release Date, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Toxic movie: యశ్ టాక్సిక్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

Mar 1 2026 1:44 PM | Updated on Mar 1 2026 4:44 PM

Yash Toxic movie makers announce trailer release date

కేజీఎఫ్ హీరో, కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటించిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్‌. ఇటీవలే టీజర్‌, గ్లింప్స్ చేయగా అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ గ్లింప్స్‌ మరింత బోల్డ్‌గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి.  కేజీఎఫ్‌ 2 వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత యష్‌  నటిస్తున్న  పాన్‌ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మార్చి 8న టాక్సిక్ ట్రైలర్‌ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.

కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కన్నడ, ఆంగ్లంలో ఓకేసారి చిత్రీకరించారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం కూడా రిలీజ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement