నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ స్వయంభు. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన విజువల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీ విజువల్స్ బాహుబలి రేంజ్‌లో ఉన్నాయంటూ ప్రశంసలొచ్చాయి. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన హీరో తన కొత్త సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది తాను మూడు చిత్రాలు చేస్తున్నట్లు ప్రకటించారు. స్వయంభుతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు. స్వయంభు తర్వాత ఇండియా హౌస్ అనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారని నిఖిల్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వా కార్తికేయ-3 కూడా వస్తుందని నిఖిల్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా మాట్లాడారు.
కాగా..స్వయంభు చిత్రంలో సంయుక్తమీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగాయ.. రవి బస్రూర్ సంగీతమందించారు.
గ్లోబల్ స్టార్ మెగా పవర్ రామ్ చరణ్ - ఇండియా హౌస్ మూవీ ప్రొడ్యూసర్ #RamCharan #Nikhil #Swayambhu #Peddi pic.twitter.com/R9Q4rjvKkn
— NAVEEN CHERRY 😎🤏 (@naveenpari2) February 28, 2026


