విరోష్ వెడ్డింగ్‌.. పాన్ ఇండియా ఫ్యాన్స్‌కు కొత్త జంట సర్‌ప్రైజ్‌ | vijay and rashmika Treat To pan india Fans after grand wedding | Sakshi
Sakshi News home page

Vijay -Rashmika: విరోష్ వెడ్డింగ్‌.. పాన్ ఇండియా ఫ్యాన్స్‌కు కొత్త జంట సర్‌ప్రైజ్‌

Mar 1 2026 7:11 AM | Updated on Mar 1 2026 7:16 AM

vijay and rashmika Treat To pan india Fans after grand wedding

టాలీవుడ్ కొత్త జంట విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా  జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు.  పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

తాజాగా అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్‌ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మార్చి 1వ తేదీన ఆదివారం మిఠాయిలు పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద స్వీట్స్ పంపిణీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆలయాల వద్ద అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement