ఘట్టమనేని జయకృష్ణ సినిమాలో మోహన్‌ బాబు.. లుక్‌ అదిరింది! | Mohan Babu As Venkatappayya Naidu In Srinivasa Mangapuram Movie, First Look Released Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘వెంకటప్పయ్య నాయుడు’ గా కలెక్షన్‌ కింగ్‌.. మోహన్‌ బాబు లుక్‌ అదిరింది!

Feb 28 2026 12:19 PM | Updated on Feb 28 2026 12:25 PM

Mohan Babu As Venkatappayya Naidu In Srinivasa Mangapuram Movie, First Look Released

‘ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే బాలీవుడ్‌ నటి రాషా తడాని తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అశ్వినీదత్‌ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్‌  నిర్మిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

తాజాగా ఆయన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో ఆయన ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పాత్రలో నటిస్తున్నాడు.ఈ పోస్టర్‌లో మోహన్ బాబు సాధారణ తెల్లటి కుర్తా-ధోతీ ధరించి పవర్ ఫుల్‌గా, గంభీరంగా కనిపిస్తున్నాడు.  పోస్టర్‌ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో మోహన్‌ బాబు నటించినట్లు తెలుస్తుంది.  చాలాకాలం తర్వాత మోహన్‌ బాబు మళ్లీ ఇలాంటి పాత్రలు చేయడం  పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్‌​‍’లోనూ మోహన్‌ బాబు విలన్‌గా నటిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement