breaking news
Jaya Krishna
-
జయ కృష్ణ సినిమా.. నిర్మాత, దర్శకుడు ఎవరంటే..
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో నటుడు చిత్రపరిశ్రమలోకి వస్తున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని గ్రాండ్ లాంచ్ కానున్నారు. తన బాబాయి మహేష్ బాబు ఆశీస్సులతో తొలి సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100, మంగళవరం చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌తో అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.గతంలో సూపర్ స్టార్ కృష్ణతో కల్ట్ బ్లాక్‌బస్టర్ అగ్ని పర్వతం చిత్రాన్ని నిర్మించి, తరువాత రాజకుమారుడుతో ప్రిన్స్ మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్విని దత్, ఇప్పుడు ఘట్టమనేని నుంచి మరో వారసుడిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. అజయ్ భూపతితో కలిసి మూడవ తరం స్టార్ జయ కృష్ణ ఘట్టమనేనితో ఒక మంచి ప్రేమకథను అశ్విని దత్ నిర్మిస్తున్నారు.జయ కృష్ణ ఇప్పటికే నటనతో పాటు పైట్స్, డ్యాన్స్ వంటి ఇతర నైపుణ్యాలలో శిక్షణ పొందాడు. ఈ ప్రాజెక్ట్ ఇదే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. టైటిల్ వంటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. తెలుగు సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ప్రేమకథను ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. జయ కృష్ణ తండ్రి రమేశ్ బాబు అనారోగ్యం కారణంగా 2022లో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడి కెరీర్‌ను చూడాల్సిన బాధ్యత మహేష్ బాబు మీద ఉంది.With a Great Story comes Greater Responsibility...Thrilled and honoured to introduce #JayaKrishnaGhattamaneni through my next film 😇🤩From the heart of the hills, a raw, intense and realistic love story, #AB4 Title announcement soon❤️🔥Presented by @AshwiniDuttChProduced by… pic.twitter.com/Fmn2AoYeEU— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 9, 2025 -
చాలా మందికి అన్నదాత సుఖీభవ రావడం లేదు: జయకృష్ణ
-
నందమూరి కుటుంబంలో విషాదం
నందమూరి ఇంట విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె ఈ తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన చెల్లెలు ఆపై హీరో నందమూరి చైతన్య కృష్ణకు తల్లి అని తెలిసిందే.సుమారు రెండేళ్ల క్రితం చైతన్యకృష్ణ హీరోగా బ్రీత్ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తన తండ్రి జయకృష్ణ నిర్మిచారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 5 లక్షలు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. -
ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మరో హీరో... మహేశ్ బాబు భారీ స్కెచ్!
టాలీవుడ్లో ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసానికి, మంచితనానికి కేరాఫ్‌గా నిలిచారు సూపర్‌స్టార్ కృష్ణ ఈ ప్యామిలీ నుంచి వచ్చిన వాడే. ఆ తర్వాత కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు(Mahesh Babu) హీరో అయ్యాడు. తనదైన శైలీలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో రాబోతున్నాడు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, మహేశ్ అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది.ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా హెల్మ్ చేయనున్నారని తాజా సమాచారం. RX 100 వంటి బ్లాక్‌బస్టర్‌తో తన ప్రతిభను చాటిన అజయ్ భూపతి, ఇటీవల థ్రిల్లర్ "మంగళవరం"తో మళ్ళీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం "మంగళవరం 2" ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, మరో హై-ప్రొఫైల్ లాంచింగ్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నాడు.ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారని తెలియడంతో చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.జయకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ప్రొఫెషనల్ నటనా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల ద్వారా అతని లుక్ పై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌ను జయకృష్ణ బాబాయి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంచి లాంచ్ కోసం అవసరమైన నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలపై మహేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.


