దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ | US Woman Praises Indians For Inventing Dupatta | Sakshi
Sakshi News home page

దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ

Feb 8 2026 5:04 PM | Updated on Feb 8 2026 5:34 PM

US Woman Praises Indians For Inventing Dupatta

మన వస్త్రధారణ, సంస్కృతి విదేశీయలును ఎంతగా ఆకట్టుకుట్టుందో పలు ఘటనల్లో చూశాం. వాళ్లు మన సంస్కృతి, వేషధారణని ఇష్టపడి మరి ఇక్కడే ఉండిపోతున్న వాళ్లు ఉన్నారు. ఇంకొందరు మన దుస్తులను ఇష్టపడటమేగాక..వారి ఆహార్యాన్ని కూడా మార్చుకుంటున్నారు. పైగా మనలా  నిండుగా కప్పుకునే దుస్తులే వేసుకునేందుకు ఇష్టపడటం విశేషం. ఇక్కడొక యూఎస్‌ మహిళ ఆ విషయమే చెబుతూ..ధన్యవాదాలని చెబుతోంది. ఇంతకీ దేనికి ఈ ధన్యవాదాలంటే..

భారత సాంప్రదాయ వస్త్రమైన దుపట్టాపై తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ కేమి అను అమెరికన్‌ మహిళ షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో భారత ప్రజలారా మీకు చాలా చాలా ధన్యవాదాలు. స్కార్ఫ్ లాంటి దుపట్టాను వారు తమ భుజం లేదా ఛాతీపై కప్పుకుంటారు. 

అది తన దుస్తులను అక్షరాల పదిరెట్లు మెరుగుపరిచిందంటూ సంబరపడింది. తాను ఈ దుపట్టాను భారతీయులే కనిపెట్టారని నమ్ముతున్నా..ఒకవేల్ల తప్పు అయితే రిచేయండి అని పేర్కొంది కేమి. నెటిజన్లు కూడా అవును మీరు చెప్పింది నిజమే. దీనిని భారతీయులే కనుగొన్నారు. కానీ దక్షిణాసియా అని ఏడుస్తున్నవారు ఉన్నారు. అయితే వాళ్లు భారతదేశంలో భాగమేనని మర్చిపోవడం బాధకరం అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!)

Advertisement
 
Advertisement
Advertisement