యాదగిరిగుట్ట: సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యాదగిరిగుట్ట టెంపుల్ రన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహించగా, భారీ సంఖ్యలో అథ్లెట్స్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడమే లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట ఆలయ పరిసరాల్లో నిర్వహించిన ఈ పరుగుల పోటీలు భక్తులు, యువతలో విశేష ఉత్సాహాన్ని నింపాయి. విజేతలకు నిర్వాహకులు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు.


