వాషింగ్టన్: సముద్ర గర్భంలో భారీ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై ఏకంగా 7.2 తీవ్రత.. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనూటు దీవుల ప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS) ప్రాథమిక సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం సముద్రంలో సొలా ప్రాంతానికి పశ్చిమాన సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలు సంభవించినట్లు గుర్తించారు.
మరోవైపు, అదే ప్రాంతంలో 6.9 తీవ్రతతో మరో రీడింగ్ కూడా నమోదైంది. ఇవి రెండు వేర్వేరు భూకంపాలా? లేక ఒకే ఘటనకు సంబంధించిన ప్రాథమిక అంచనాలా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. వనౌటు దీవుల ప్రాంతం భూకంపాలు సంభవించే చురుకైన భౌగోళిక మండలంలో ఉంది. ఇక్కడ భూమి లోపల ఉన్న టెక్టానిక్ పలకల కదలికల కారణంగా తరచూ ప్రకంపనలు నమోదవుతుంటాయి. తాజా భూకంపం కూడా సముద్ర గర్భంలో చోటుచేసుకోవడం గమనార్హం. భూకంప కేంద్రం సొలా ప్రాంతానికి పశ్చిమాన సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
🌊 M7.2 earthquake 200 km west of Sola, Vanuatu. At just 10 km deep, this shallow quake was likely felt across a wide area and may produce strong shaking near the source. Tsunami risk is possible, follow official advisories and local authorities. This is the largest of 68 earthquakes recorded in the region over the past 30 days. #earthquake #GeoShake #Vanuatu
— GeoShake | Community Seismic Network (@geoshake_ai) October 24, 2026
25 సెకన్ల వ్యవధిలో మరో రీడింగ్!
భూకంప పర్యవేక్షణ సంస్థల ప్రాథమిక సమాచారంలో 7.2 తీవ్రతతో పాటు 6.9 తీవ్రతతో మరో రీడింగ్ కూడా కనిపించింది. ఈ రెండు రీడింగ్స్ మధ్య సుమారు 25 సెకన్ల వ్యవధి ఉన్నట్లు ప్రాథమిక కథనాలు పేర్కొన్నాయి. అయితే, వీటిని రెండు వేర్వేరు భూకంపాలుగా పరిగణించాలా? లేక ఒకే భూకంపానికి సంబంధించిన ప్రారంభ అంచనాలుగా చూడాలా? అన్నది అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. తదుపరి సీస్మిక్ విశ్లేషణతోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సునామీ ముప్పు ఉందా?
భూకంపం సంభవించిన వెంటనే సునామీ ముప్పుపై ఆందోళనలు సహజం. ముఖ్యంగా సముద్ర గర్భంలో, తక్కువ లోతులో సంభవించే బలమైన భూకంపాల విషయంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తారు. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాథమిక నివేదికల్లో సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. అలాగే ప్రాణనష్టం, ఆస్తి నష్టం లేదా మౌలిక సదుపాయాలపై ప్రభావానికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా వెల్లడికాలేదు.
ఇదీ చదవండి: అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?


