breaking news
Social Media
-
జుట్టు పట్టుకుని లాగి.. చెవిపోగులు చోరీ!
నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకుని బయటకు లాగిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె చెవులకు ఉన్న బంగారు పోగులను చోరీ చేశారు. దీనికి సంబంధించిన 41 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. నరాయణి నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహాన్ని 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరి గుర్తించారు. చెక్క దుంగల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు లాగిన వారు.. జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె రెండు చెవులకు ఉన్న పోగులను తొలగించి పక్కన పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు.ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించారు. గురువారం భరత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని పోఖరా బస్పార్క్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల పట్ల దోపిడీకి పాల్పడటం, అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు నేపాల్–టిబెట్ సరిహద్దులో వరదలు, కొండచరియలు బీభత్సం తీవ్ర విషాదం మిగిల్చాయి . ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 500 మంది మృతి చెందగా.. 1,400 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. భారీ బురద, కొండచరియల కారణంగా పలు గ్రామాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంప్-కిమ్ భేటీ ఇప్పుడు ఎంతో అవసరం! -
నేపాల్ ఫ్లాష్‌ఫ్లడ్స్.. ఆ ఆరోపణల్ని ఖండించిన చైనా
ఫ్లాష్ఫ్లడ్స్పై ఉద్దేశపూర్వకంగానే తమ దేశం ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్న నేపాల్ అధికారుల ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సహకారం మాత్రమే అవసరమని అభిప్రాయపడింది. అలాగే.. నేపాల్ జలవిలయంపై జరుగుతున్న ఓ ఫేక్ ప్రచారాన్ని కూడా తోసిపుచ్చింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం స్పందిచింది. తమ దేశం ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో సహకారంతోనే ప్రాణాలను కాపాడగలమని పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల కంటే సహాయక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి’’ అని పేర్కొంది.అలాగే చైనా వైపు ఉన్న ఓ డ్యామ్ కూలిపోయి.. నేపాల్‌లో ఈ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ‘ఫేక్ న్యూస్’ అని ఖాట్మాండులోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.భూకంపం.. హిమపాతమే కారణం: చైనాఆగస్టు 26 ఉదయం భూకంపమో, భూకంపం మాదిరిగా మంచు ఫలకాలు కూలిపోవడం వల్లనో.. భారీగా మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడంతో ఫ్లాష్‌ఫ్లడ్స్ విపత్తు చోటుచేసుకుందని పేర్కొంది. రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల వైపునా ఈ ప్రభావం కనిపించిందని చైనా వెల్లడించింది.175 మంది మృతి.. వందలాది మంది గల్లంతుహిమాలయ ప్రాంతంలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నీరు, మట్టి, రాళ్లు, మంచు కలిసి వచ్చిన భారీ ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటివరకు 175 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 1,300 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.నేపాల్ వైపు భిన్న వాదనలువర్షం లేకున్నా.. మెరుపు వరదలు ముంచెత్తడంపై రకరకాల థియరీలు తెరపైకి వచ్చాయి. తొలుత భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తాజా విశ్లేషణలో అది భూకంపం కాదని, గ్లేసియర్ కూలిపోవడం వల్లే భారీ ప్రకంపనలు, ఫ్లాష్‌ఫ్లడ్స్ సంభవించాయని వెల్లడించింది. భారత్‌కు చెందిన ఇస్రో మాత్రం తన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణతో.. వరదలకు ముందు సంభవించిన భూకంపం.. గ్లేసియర్ కూలిపోవడానికి ట్రిగ్గర్‌గా మారి ఉండొచ్చని అంచనా వేస్తోంది.మరోవైపు నేపాల్‌లో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరదలు టిబెట్ సరిహద్దు నుంచి నేపాల్ జిల్లాలకు చేరేందుకు రెండుగంటల సమయం పట్టిందని.. ఆ గ్యాప్‌లో చైనా నుంచి ముందస్తు హెచ్చరిక అందలేదని, దీనివల్ల నష్టం మరింత పెరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే చైనా ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఇరు దేశాల మధ్య విపత్తులపై సహకార వ్యవస్థ ఉన్నప్పటికీ.. సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, హిమపాతం వంటి ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక ద్వైపాక్షిక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మాత్రం లేదని తెలుస్తోంది.Deeply saddened by the devastating natural disaster in the Gyirong–Rasuwagadhi border region, which has caused significant casualties and losses on both the Chinese and Nepali sides.My deepest condolences to those who lost their lives, and my sincere sympathies to their…— Ambassador Zhang Maoming (@PRCAmbNepal) August 27, 2026రంగంలోకి దిగిన చైనానేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనపై చైనా త్వరగతిన స్పందించింది. ఈ విపత్తులో తమ వైపు కూడా నష్టం జరిగిందని పేర్కొంటూ.. సహాయక చర్యలను వేగవంతం చేసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగించాలని ఆదేశించారు. చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. టెంట్లు, దుప్పట్లు, ఇతర సహాయక సామగ్రిని తరలించడంతో పాటు అత్యవసర నిధులను కూడా కేటాయించింది.ఇదీ చదవండి: చైనా బ్రహ్మరాక్షసితో భారత్‌కే పెనుముప్పు? -
16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..
తండ్రిని పాకెట్‌మనీ అడిగే వయసులో తండ్రికే ఉపాధి ఇచ్చి..జీతం ఇస్తున్నాడో యువకుడు. పైగా తన తండ్రినే ఎందుకు నియమించుకున్నాడో ఇచ్చిన వివరణ సైతం అదుర్స్. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు. మరి పేరెంట్స్‌కే గర్వకారణమైన ఆ తనయుడు ఎవరంటే..అతడే కేరళలోని కొచ్చి, కున్నుంపురంకి చెందిన 16 ఏళ్ల రౌల్జాన్ అజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరుతెచ్చుకుంటున్నాడు ఈ యువకుడు. అతడు కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ చదువుతున్నప్పుడే ఏఐ కంపెనీని నడుపుతుండటం విశేషం. ఆ కంపెనీ సాయంతో ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడం, ఈ టెక్నాలజీలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తుంటాడు. నిజానికి అజుకి ఏఐ పట్ల ఉన్న అభిరుచే ఒక స్టార్టప్ కంపెనీకి దారితీసింది. పైగా తండ్రిపై ఆధారపడే టీనేజ్ యువకుల మాదిరిగా కాకుండా తన నాన్ననే తన కంపెనీలో ఉద్యోగిగా నియమించుకుని, నెలకు రూ. 2 లక్షల జీతం ఇస్తుండటం విశేషం. ఏఐలో పట్టు ఎప్పుడు సాధించాడంటే..తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఏఐ సాంకేతికతను నేర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఆ తర్వాత ఒక స్టార్టప్‌ను స్థాపించాడు. అందులో ప్రస్తుతం తన తండ్రితో సహా సుమారు 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతేగాదు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.అజు ఈ టెక్నాలజీని వీడియో ఎడిటింగ్ ద్వారా తెలుసుకున్నాడు. ఇక తండ్రి వల్ల తనకు ఈ ఏఐ సాంకేతికపై పట్టు సాధించగలిగినట్లు చెబుతున్నాడు. ఎలాగంటే..తన తండ్రికి అడోబ్‌లో ఉద్యోగం వచ్చినప్పుడు, తనకు అన్ని ప్రీమియం టూల్స్‌కు ఉచిత యాక్సెస్ లభించిందని, దానివల్ల ఏఐ గురించి పూర్తిస్థాయిలో నేర్చుకోగలిగానని అంటున్నాడు. ఆ తర్వాత స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీబాట్ అనే సొంత రోబోట్‌ను తయారు చేసినట్లు తెలిపాడు. ఇక తన తండ్రినే కంపెనీలో ఎందుకు నియమించుకున్నాడంటే..తాను ఫోన్ నుంచి కావల్సినంత జ్ఞానాన్ని ఆర్జించగలను కానీ, ఆయనకున్న అపార అనుభవం తనకు లేదని చెప్పుకొచ్చాడు. పైగా ఆయనకు అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉంది, అందువల్ల ఆయన నుంచి తాను మరిన్ని విషయాలు సులభంగా నేర్చుకోగలగడం తోపాటు ఆయన అనుభవం కంపెనీ మార్కెటింగ్‌కి చక్కగా ఉపయోగాపడుతుందని చెబుతున్నాడు. కాగా, అజు స్టార్టప్ ఏఐ టెక్నాలజీస్, థింక్క్రాఫ్ట్ అకాడమీని నడుపుతోంది. ఇవి ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, విదేశీ విద్యార్థులు చాలా సునాయాసంగా ఏఐ నైపుణ్యాలను పుణికి పుచ్చుకునేలా ట్రైన్ చేస్తాయి. అక్కడితో ఆగిపోలేదు అజు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో RESQ AI, MeBot, ZapGap, Investo AI, FeedFye, 15 AI సాధనాలను రూపొందించారు. అంతేగాదు అజు కంపెనీ ఏకంగా వరల్డ్‌వైడ్‌గా వివిధ రిమోట్ ఉద్యోగులను కలిగి ఉంటూ ఇంటర్నేషనల్ రేంజ్లో గుర్తింపు పొందుతుండటం విశేషం.(చదవండి: రోజువారీ కూలీ నుంచి ..రూ. 15 లక్షల వార్షిక వేతనం, పీహెచ్డీ..!) -
ఆకాశమే హద్దు అభద్రత వద్దు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింథ్వారా అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన పాయల్ అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా గేమింగ్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరు. ‘పాయల్ గేమింగ్’ పేరుతో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌లలో లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు. మన దేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ–స్పోర్ట్స్, గేమింగ్ రంగంలో దేశవ్యాప్త పాపులారిటీతోపాటు మొబైల్స్ అవార్డ్స్ జెడ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్నూ, గేమింగ్ క్రియేటర్ అండ్ ఫిమేల్ ఆఫ్ ది ఇయర్ గా జాతీయ స్థాయి గుర్తింపునూ దక్కించుకున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా జరిగిన గేమింగ్ ఇంటరాక్షన్, రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనడం ద్వారా వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించిన సంగీత–సాంకేతిక–గేమింగ్ ఉత్సవం రాయల్‌స్టాగ్ బూమ్బాక్స్లో పాల్గొన్న సందర్భంగా ఈ భారతీయ అగ్రగామి గేమర్... పాయల్ ధారే ‘సాక్షి’కి ఇచ్చినప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే..అమ్మ సంకోచం.. నాన్న సరే...సోషల్ మీడియా అమ్మాయిలకు మంచిది కాదనే అపనమ్మకాల మధ్య ఆన్ లైన్ గేమింగ్, యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేస్తానని చెప్పినప్పుడు మా అమ్మ అంగీకరించలేదు. అయితే నాన్న మాత్రం నా పట్టుదల గమనించాక నాకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత నిదానంగా అమ్మను కూడా ఒప్పించగలిగాను. వ్యతిరేకతను ఎదుర్కొన్నా...గేమింగ్ ప్రయాణం ప్రారంభించిన కొత్తలో చాలా వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొన్నాను. నా చుట్టూ వచ్చిన నెగెటివిటీ, ముఖ్యంగా మగవారి నుంచి వచ్చిన విమర్శలకు తొలిదశలో తడబడినా, ఆ తర్వాత పట్టించుకోకుండా ముందుకు సాగాను. గేమింగ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. ఎంటర్టైన్ చేయవచ్చు, క్యాజువల్ గేమింగ్ చేయవచ్చు, ముఖ్యంగా మనలా మనం ఉండొచ్చు.. అదే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. లక్షలాది మందికి నన్ను చేరువ చేసింది. ప్రధానితో భేటీ.. ప్రయాణంలో మేటి...నా గేమింగ్ ప్రయాణంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం అత్యంత ముఖ్యమైన మైలురాయి. ఆయనను వ్యక్తిగతంగా కలిసి దాదాపు రెండు గంటల పాటు మాట్లాడటం కలలో కూడా ఊహించని గొప్ప అనుభవం. గేమింగ్, గేమింగ్ పరిశ్రమ, ఈ–స్పోర్ట్స్‌తో పాటు భారత్‌లో గేమ్ డెవలప్మెంట్ గురించి ఆయన నాతో చర్చించారు. ఆ సంభాషణలోని ప్రతిమాటా జీవితంలో మరచిపోలేను.కెరీర్‌గా బెస్ట్... బ్యాకప్ ఫస్ట్...ప్రపంచవ్యాప్తంగా చూస్తే గేమింగ్ రంగంలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. మన దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే గేమింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువత ముందుగా తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. అదే సమయంలో చదువును వదిలిపెట్టకూడదు. నేను గేమింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దికొద్దిగా పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైనప్పటికీ కూడా చదువు కొనసాగిస్తూనే ఉన్నా. ఈ ఆటల పోటీ ప్రపంచంలో ఈ రోజు మీరు బాగా ఆడొచ్చు, రేపు మీకంటే మెరుగైన ఆటగాడు రావచ్చు. అందుకే గేమింగ్‌తోపాటు ఒక బ్యాకప్ ఆప్షన్ తప్పనిసరి. గేమింగ్‌ను సెకండరీగా తీసుకుని ముందుకెళ్లాలి. ఆన్ స్క్రీన్... ఆఫ్ స్క్రీన్... ఒకటే నేను‘పాయల్ గేమింగ్’గా అందరికీ తెలిసిన నాకు వ్యక్తిగత జీవితంలోని నాకు పెద్దగా తేడా ఉండదు. నా సహజమైన స్వభావాన్ని దాచుకోవాలనో, మార్చుకోవాలనో అనుకోను. ఇటీవల నేను పాల్గొన్న అలయెన్స్ రియాలిటీ షోలో చాలా మంది నా స్వభావాన్ని గమనించారు. నేను ఎప్పుడూ ఇలాగే అందరితో మాట్లాడతా. సరదాగా ఉంటానని అందరికీ అర్ధమైంది. అమ్మాయిలూ... అలా చేయండిఅమ్మాయిలకి నా సలహా ఒకటే...‘మీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయండి. చుట్టూ ఉన్నవాళ్లు చేసే విమర్శలు, మాటలను బట్టి అపోహలు, అభధ్రతా భావం పెంచుకోకండి. మీరు మీలా ఉండండి. మీరు ఎంచుకున్నది మీకు నచ్చినది ఒకటే అయినప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అభిమానుల ప్రేమే.. ఆశీర్వాదం..దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా వచ్చి ‘మీరు పాయల్ గేమింగ్ కదా.. మీరంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నాకు అత్యుత్తమ అనుభూతి. నాకు లభిస్తున్న ప్రేమ ఒక ఆశీర్వాదం. కుటుంబంతో ఉన్నప్పుడు అభిమానులు ఫొటో కోసం వస్తే మా వాళ్లు కూడా గర్వంగా ఫీలవుతారు. అందుకే పాపులారిటీ వల్ల ప్రైవసీ కోల్పోయానని అనుకోవడం లేదు. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను.– సత్యబాబు, సాక్షి -
నాన్న కల కోసం..29 ఏళ్లకే రిటైర్మెంట్! చివరికి ఇద్దరూ..
ఇటీవల ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజ్‌లలో చదివిన చాలామంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు వదిలి నచ్చిన పనిలో ఆనందం వెతుక్కుంటున్న వారిని ఎందరినో చూశాం. మరికొందరు లక్షల్లో జీతాలు ఆర్జించి..చీకు చింతా లేని రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ ప్లాన్ చేసుకుని మరి త్వరితగతిని పదవీవిరణమ చేస్తున్న వారిని చూశాం. కానీ అలా కాకుండా సంపాదన మొదలయ్యే స్టేజ్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఈ మహిళ ఏం చేస్తుందో తెలిస్తే..ఆశ్చర్యపోవడమే కాదు అభినందించకుండా ఉండరు కూడా. ఎందుకంటే..ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..మహారాష్ట్రకి చెందిన స్నేహా రాజ్‌గురు అనే మహిళ తాను ఆధునిక పోటీ ప్రపంచపు ఒత్తిడిని వద్దనుకుని మరి పెర్మాకల్చర్(కృత్రిమ ఎరువులు, రసాయనాలకు దూరంగా సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం)ను ఎంచుకున్నట్లు తెలిపింది. ఆ నిర్ణయం తనకు ఎన్ని విధాలుగా మేలు చేసిందో వివరిస్తూ..ఆ జర్నీ గురించి వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే 29 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను భూమిని ఎలా కొనుగోలు చేసి, పండ్లు, కూరగాయలు పండించడం ప్రారంభించిందో వీడియోలో వివరించారు. తాను ఒకప్పుడూ.. బాలీవుడ్లో పనిచేసేదాన్ని అని, తనకు ప్రయాణాలపై ఉన్న మక్కువ కారణంగా ఈ ఫెర్మాకల్చర్ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పండిందని వెల్లడించింది. ఇక తన తండ్రి టాటా మోటర్స్‌లో 30 ఏళ్లకు పైగా పనిచేశారని, పదవీవిరమణ తర్వాత ప్రకృతికి దగ్గరగా జీవించాలని ఆశించినట్లు చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా ఇద్దరం కలిసి ఫామ్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ఇక తన ఫెర్మాకల్చర్ జర్నీ గురించి మాట్లాడుతూ..ముందుగా తాను చిన్న భూభాగాన్ని కొనడమే తన మొదటి అడుగుగా పేర్కొంది. దానికి బాప్బేటీ ఫామ్(తండ్రి కూతుళ్ల) ఫామ్ అని పేరుపెట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత పండ్ల చెట్లను నాటినట్లు పేర్కొంది. దీనికి తక్కువ శ్రమ పైగా మనతోపాటే పెరుగుతాయి. పైగా ఏళ్ల తరబడి చక్కగా పండ్లను అందిస్తాయన్నారు. దీనివల్ల మన ఆహారాన్ని మనమే స్వయంగా పండించుకుని తింటున్న ఆనందం దక్కుతుందని అంటోంది. అలాగే లాక్డౌన్ లేదా యుద్ధం లాంటివి వచ్చినప్పుడూ ఎవ్వరిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడదని చెబుతోంది. అదీగాక అన్నింటి కన్నా ముఖ్యంగా కడుపు నింపుకునేలా మంచ ఆహారాన్ని అందించే స్థలాన్ని పొందామనే ఆనందం సొంతమవుతుందని అంటోంది. ఇక్కడ పదవీవిరమణ అనేది వయసుకి సంబంధించింది కాదని, ఒత్తిడిని వద్దని శాంతిని ఎంచుకోవడం గురించని నొక్కి చెబుతోంది. చివర్లో మీరు కూడా ఇలాంటి జీవితం గురించి కలలు కంటున్నారా అని ప్రశ్నిస్తూ.. తన సంభాషణను ముగించింది వీడియోలో. నెటిజన్లు కూడా 29 ఏళ్లకే పదవీ విరమణ చేయడం అద్భుతం!!. నిజంగా ఇది చాలా బాగుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ బాప్బేటీ ఫామ్ మహారాష్ట్రలోని కోయాలిలో, సరస్సు కనిపించే ఒక కొండప్రాంత వ్యవసాయ క్షేత్రం. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm) (చదవండి: 'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!) -
దొంగల భయంతో ఆస్పత్రికి నగలు తెస్తే..
ఆస్పత్రిలో లక్షల విలువైన నగల సంచి మాయమైంది. దొంగతనం కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నర్సు, ఆయమ్మలు.. సిబ్బంది ఇలా అందరినీ ప్రశ్నించారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు ‘దొంగ’ ఎవరన్నది తెలిసి ఖాకీలు సైతం అవాక్కయ్యారు. అది రెండు కాళ్ల మనిషి కాదు.. నాలుగు కాళ్ల కుక్క ఆ సంచిని నోట కరుచుకుని ఆస్పత్రి నుంచి దౌడు తీసింది.మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ జిల్లా ఆస్పత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కయాంపూర్కు చెందిన లతాబాయి తన కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఇంట్లో నగలు ఉంచి రావడం సురక్షితం కాదని భావించి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను తన వెంట తీసుకొచ్చింది. ఆమె వద్ద ఉన్న సంచిలో బంగారు మంగళసూత్రం, చెవి దుద్దులు, బంగారు పూసలు, వెండి పట్టీలు తదితర ఆభరణాలతో పాటు సుమారు రూ.2 వేల నగదు, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 24న తెల్లవారుజామున ఆ బ్యాగు కనిపించకుండా పోయింది.సంచి మాయమైన విషయాన్ని గుర్తించిన లతాబాయి వెంటనే కోత్వాలి పోలీసులను ఆశ్రయించింది. ఆస్పత్రిలోనే ఎవరో నగలను దొంగిలించి ఉంటారని అనుమానించారు. దీంతో పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. సర్జికల్ వార్డులోకి ఓ వీధి కుక్క వచ్చింది. అక్కడ ఉన్న సంచిని వాసన చూసి.. నోట కరుచుకుని మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సంచిలో ఉన్న ఆహార పదార్థాల వాసనకు ఆకర్షితమైన కుక్క దాన్ని తిండి సంచిగా భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఇక అక్కడి నుంచి మొదలైంది పోలీసుల ‘డాగ్ ట్రాకింగ్ ఆపరేషన్’. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ కుక్క ఎటువైపు వెళ్లిందో పోలీసులు పరిశీలించారు. చివరకు.. కుక్కను, అది తీసుకెళ్లిన సంచిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఇతర వస్తువులు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం వాటిని లతాబాయికి అప్పగించారు. తన విలువైన వస్తువులను తిరిగి అందించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సోసల్ మీడియాలో ఆ కుక్క వీడియో చూసి.. ‘‘అరేయ్ చింటూ బ్రో.. ఏంట్రా ఇది’’ అంటూ ఫన్నీ కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో దొంగతనం జరగకపోయినా.. ఆస్పత్రిలోకి వీధి కుక్క ఎలా ప్రవేశించింది? రోగులు, వారి వెంట వచ్చే వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటి? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తాయి.🚨 STRAY DOG TURNS THIEF IN MANDSAUR!A stray dog was caught on CCTV carrying away a bag containing jewellery worth ₹4 lakh and nearly ₹2,000 cash from Mandsaur District Hospital.Police traced its route and recovered everything. The belongings were later returned to the… pic.twitter.com/MjYAzeQfCH— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2026 ఇదీ చదవండి: వైరల్ కావాలనే ఆశతో గర్ల్‌ఫ్రెండ్‌తో అలా.. -
అధికార దర్పం.. 'వారికి' మాత్రమే సాధ్యం!
‘రాజు వెడలె రవితేజము లలరగ’ అని పూర్వాకాలంలో రాజులు తమ పరివారంతో బయలుదేరిన తీరును వర్ణించారు కవులు. వర్తమానంలోనూ ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు మనకు సాక్షాత్కరిస్తుంటాయి. అయితే ఇప్పుడు రాజులు లేరు కదా, ఇంత ఆర్భాటంగా బయట తిరిగేదెవరనే అనుమానం కలగడం సహజం. రాజులు, రాజ్యాలు లేకపోయినా పాలకులు ఉన్నారుగా! పాలకులకు అధికార దర్పం ఉంటుంది, పదర్శిస్తారు సరే. కానీ వారి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా అధికార దర్పం ప్రదర్శించడమే ఇప్పుడు వైచిత్రి. న్యాయస్థానాల్లో దోషులుగా తేలిన వారూ ఎటువంటి సంకోచం లేకుండా అధికార దర్పంతో వెలిగిపోతున్నారు. మచ్చుకు రెండింటి గురించి మాట్లాడుకుందాం.బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారన్న వాదన ఉండనే ఉంది. ఇటీవల ఆయన ఉదారంగా ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఫలితంగా నితీశ్‌కు రాజ్యసభ ఎంపీ, ఆయన కుమారుడు నిశాంత్‌కు బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి పదవి దక్కాయి. నిశాంత్‌ను బిహార్ భవిష్యత్తు ముఖ్యమంత్రిగా జేడీయూ పార్టీ నాయకులు స్తుతిస్తున్నారు. మరి కాబోయే సీఎం జనం మధ్యకు వస్తున్నారంటే ఎంత హడావుడి ఉండాలి!మంత్రి డాబు50పైగా వాహనాల కాన్వాయ్‌తో నిశాంత్ వెళుతున్న వీడియో ఒకటి తాజాగా ఎక్స్‌లో షేర్ అయింది. నిశాంత్ వాహనశ్రేణి వీధుల్లో దూసుకుపోతుండగా.. సామాన్య జనమంతా నిలబడి చూస్తున్నట్టుగా వీడియో ఉంది. వీణా జైన్ అనే యూజర్ ఈ వీడియో షేర్ చేశారు. 'బిహార్‌కు 9 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ పుత్రరత్నం 50కి పైగా వాహనాల కాన్వాయ్‌లో ప్రయాణించారు. వారికి ఓటు వేస్తూ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న ప్రజలు ఆయన కాన్వాయ్‌కు దారి ఇస్తూ అమితాశ్చర్యంతో చూస్తున్నారు' అని వ్యాఖ్యానాన్ని జోడించారు. ఇక వీడియో చూసిన నెటిజనులు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. భారతదేశానికి 'రాజులు వద్దు' అనే ఉద్యమం ఇప్పుడు నిజంగా అవసరం అంటూ పెట్టిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.బాబా.. దర్జాఇక సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి పదవి లేకపోయినా ఆయన కూడా.. ‘రాజు వెడలె రవితేజము లలరగ’ తరహాలోనే ఆర్భాటాలు ప్రదర్శిస్తుంటారు. తాజాగా మరోసారి పెరోల్‌పై హరియాణాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన లగ్జరీ కార్ల కాన్వాయ్‌లో సిర్సాకు చేరుకున్నారు.చదవండి: చక్కెర కొనాలంటే.. కిడ్నీ అమ్ముకోవాల్సిందే!లైంగిక వేధింపుల కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. 17వ సారి పెరోల్‌పై బయటకు రావడం.. బహుశా మనదేశంలో మాత్రమే సాధ్యమేమో! 2017 నుంచి కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన 435 రోజులు జైలు బయటే ఉండడం మరో విచిత్రం. ఇక, ఈయనగారి దర్జాపై సోషల్ మీడియాలో నెటిజనులు కారాలు మిరియాలు నూరుతున్నారు. గుర్మీత్‌కు హరియాణా ప్రభుత్వం రాఖీ కానుక ఇచ్చిందని జోకులు వేస్తున్నారు. 'పెట్టి పుట్టాడు' అంటూ నిష్టూరమాడుతున్నారు. 'ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే.. కొంత మంది మాత్రం ఎక్కువ సమానమ'నే నానుడిని గుర్తుచేసుకుంటున్నారు. 9 Times Bihar CM Nitish Kumar's Son Nishant Kumar travelling with 50+ vehicles convoyAnd the people who voted for them continuously and living Below poverty line watching it while giving way for his convoy 👀 pic.twitter.com/jEMRtMwvzY— Veena Jain (@Vtxt21) August 25, 2026#WATCH | Sirsa, Haryana: Rape convict Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh arrived at the Dera headquarters in Sirsa from Sunaria Jail after being granted 21-day parole pic.twitter.com/Q7WKr98dvG— ANI (@ANI) August 25, 2026ఇదీ చదవండి: నేనే నిరసనకు దిగుతా.. బాబా రామ్‌దేవ్ వార్నింగ్ -
Viral Video: గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు.. ఎగబడిన జనం
కాన్పూర్‌లోని పంకి పారిశ్రామిక ప్రాంతంలో ఓ చెత్తకుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు కోసం జనం ఎగబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీగా జనం ఓ చెత్త డంపింగ్ ప్రదేశం వద్ద గుమిగూడారు. గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం ప్రజలు ఎగబడటం చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్లు, టాఫీలు పడేసినట్లు సమాచారం అందగానే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కొందరు నేలపై పడిన స్వీట్లను చేతులతో ఏరుకుంటుండగా.. మరికొందరు బ్యాగులు, సంచులతో వచ్చి వీలైనన్ని చాక్లెట్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.ఓ ఫ్యాక్టరీ యజమాని గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల బ్యాచ్‌ను అక్కడ పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా వ్యాపించడంతో కొద్దిసేపటికే అక్కడ భారీగా జనం చేరుకుని చాక్లెట్లను తీసుకెళ్లారు. అయితే ప్రజలు తీసుకెళ్లిన చాక్లెట్లను నిజంగానే తినేందుకు ఉపయోగించనున్నారా? లేక మరేదైనా అవసరానికి తీసుకెళ్లారా? అనేది వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఈ ఘటన ఆహార భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. వాటిని తినడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.यूपी के कानपुर से एक वीडियो सामने आया है। पनकी इंडस्ट्रियल एरिया में डंपिंग साइट के पास किसी ने बड़ी मात्रा में एक्सपायरी चॉकलेट, टॉफी और बिस्किट फेंके जिसे देख देखकर वहां लोगों की भीड़ जुट गई और कई लोग सामान को बैग, बोरे और डिब्बों में भरकर ले जाते दिखाई दिए। pic.twitter.com/4NKFNVQYON— Yogesh Mishra (@iYogeshMishra) August 25, 2026కాగా, గడువు ముగిసిన, విక్రయించేందుకు అనర్హమైన ఆహార పదార్థాలను బహిరంగంగా పడేయకుండా.. నిర్దేశిత విధానంలో నాశనం చేయాల్సి ఉంటుంది. అవి తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా నియంత్రిత పద్ధతిలో వాటిని నిర్వీర్యం చేయడం అవసరం. ఈ ఘటనలో మాత్రం చాక్లెట్లను బహిరంగ ప్రదేశంలో పడేశారు. దీంతో ప్రజలు వాటిని తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదీ చదవండి: వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!! -
వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!!
సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఏదో ఒకటి తుంటరి పని చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అదే తరహాలో ఇక్కడో యువకుడు చేసిన వింత స్టంట్ చివరకు ఊహించని తీరానికి చేరింది. తన స్నేహితురాలి పెదాలతో కారు నిండా ముద్దులతో నింపేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏకంగా మిలియన్ల వ్యూస్ సాధించడంతో సంబురపడిపోయింది. ఇంతటితో ఆగితే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటుంది.. అసలు కథలోకి వెళ్దాం పదండి..గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులతో పూర్తిగా నిండిపోయిన స్విఫ్ట్ కారు కనిపించింది. ఆ కారును నగర రహదారిపై వేగంగా నడుపుతున్నట్లు కూడా వీడియోలో కనిపించడంతో పోలీసులు దృష్టి సారించారు. వాహనం వివరాలను సేకరించి దాని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని కూడా విచారణకు పిలిచారు.విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ట్రెండ్‌ను అనుసరించి వీడియోను వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టంట్ చేసినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. తన మహిళా స్నేహితురాలే కారుపై దాదాపు 3,400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు వేసిందని చెప్పాడు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడున్నర గంటలు పట్టిందని, లిప్‌స్టిక్ కోసం రూ.800–900 వరకు ఖర్చయిందని వివరించాడు. కారును మొత్తం ముద్దుల గుర్తులతో నింపి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు చెప్పాడు.యువకుడు అనుకున్నట్లుగానే వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్లింది. దాదాపు 55 లక్షల(5.5M) మంది వీడియోను వీక్షించినట్లు అతడు తెలిపాడు. అయితే అదే వైరల్ వీడియో అతడిని పోలీసుల వద్దకు తీసుకెళ్లింది. మధ్యప్రదేశ్ బోఫాల్‌లో జరిగింది ఈ ఘటన. ఆ కారు ఓనర్ పేరు ఆదిత్య సికర్వార్.స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభిషేక్ రఘువంశీ మాట్లాడుతూ.. సుమారు రెండు రోజుల క్రితం ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పటేల్‌నగర్–సిటీ సెంటర్ ప్రాంతంలో లిప్‌స్టిక్ గుర్తులతో ఉన్న స్విఫ్ట్ కారు వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందన్నారు. వీడియో ఆధారంగా వాహనాన్ని గుర్తించి థాటీపూర్లో పట్టుకున్నట్లు చెప్పారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కింద ఆదిత్యకు సుమారు రూ.5,500 చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన తప్పును అంగీకరించిన ఆదిత్య.. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే కారుపై ఉన్న వేలాది లిప్‌స్టిక్ గుర్తులను స్వయంగా శుభ్రం చేసుకున్నాడు. తన మహిళా స్నేహితురాలే ఈ ఆలోచన ఇచ్చిందని ఆదిత్య చెప్పాడు. తాను కారు పార్క్ చేసి వెళ్లిన సమయంలో ఆమె కారుపై ముద్దుల గుర్తులు వేసిందని వివరించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రెండ్ నడుస్తుండటంతో వీడియో చేస్తే వైరల్ అవుతుందని భావించామని, అనుకున్నట్లుగానే భారీగా వ్యూస్ వచ్చాయని తెలిపాడు. అయితే ఈ వీడియో కారణంగా ట్రాఫిక్ పోలీసుల నుంచి చర్యలు ఎదురవుతాయని ఊహించలేదని చెప్పాడు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తానని, ఇలాంటి స్టంట్‌ను పునరావృతం చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు.వైరల్ కోసం చేసిన వింత ప్రయోగం.. లక్షల వ్యూస్ తెచ్చిపెట్టినా, చివరకు చలాన్‌తో పాటు పోలీస్ స్టేషన్లో కారు కడిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. Love was in the air… and all over the car! 3,400 kisses got Gwalior's "Kissing Car" 5.5 million views and a ₹5,500 challan. He wanted to make a "reelationship" go viral. Traffic Police made sure it came with a "fine ending" @GargiRawat pic.twitter.com/d2GwGeHbUS— Anurag Dwary (@Anurag_Dwary) August 25, 2026 ఇదీ చదవండి: ఓనం హిందువుల పండుగ కాదా? -
తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..!
చేతులు పట్టుకుని నడిపించిన ఆ తల్లిదండ్రులనే మనం పెద్దయ్యాక వాళ్లను మనం దగ్గరుండి చూసుకుంటుంటే కలిగే సంతోషం అంత ఇంత కాదు. ఒకప్పడు వాళ్లను గట్టిగా పట్టుకుని నడిచిన మనం ఇవాళ చిన్నపిల్లలుగా మారి మన ఆసరాతో వెళ్తుంటే వాళ్లకళ్లల్లో కనిపించే దృశ్యానికి మాటల్లేవ్ అంతే. అలాంటి భావోద్వేగ దృశ్యమే నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ని నాన్సీ గుప్తా అనే అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె తన తల్లిదండ్రలును తొలిసారిగా విమానంలో తీసుకువెళ్తోంది. ఆ అనుభూతులని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తొలిసారి తన పేరెంట్స్ విమానం ఎక్కడంతో వారి ముఖాల్లో కనిపిస్తున్న సంతోష దృశ్యాలను కెమెరాలో బంధించింది. విమానం కిటికి కుండా దుప్పటిలా పరుచుకుని తేలుతూ కనిపిస్తున్న మేఘాలను చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతూ తిలకిస్తూ..సంబరపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె తల్లి కిటికీలోంచి చూస్తూ సంతోషంతో చిరునవ్వు చిందిస్తున్న దృశ్యం మనసుని తాకుతుంది. చిన్నప్పుడు నడక నేర్పించిన తల్లిదండ్రలను ఇవాళ ఆకాశంలోకి విహరించేలా చేస్తే కలిగే అనుభూతికి మించింది ఏం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని తానుపొందుతున్నా అన్నట్లుగా చివర్లో నవ్వుతూ తన సెల్పీని తీసుకుంటూ కనిపిస్తుంది నాన్సీ గుప్తా. ఈ వీడియోకి "మొదటి అడుగుల నుంచి మొదటి విమాన ప్రయాణం" వరకు అని క్యాప్షన్ జోడించి మరి ఇలా రాసుకొచ్చింది. ఏళ్లు గడిచే కొద్దీ..తల్లిదండ్రులు, పిల్లల మధ్య మారుతున్న పాత్రల గురించి ఈ క్షణం ఎలా చెబుతోందో చెప్పారు. ఆవేళ తనను చేయిపట్టుకుని నడిపించారు, ఇవాళ వాళ్లను తొలిసారిగా విమానంలో తీసుకువచ్చా. ఇదంతా చూస్తుంటే జీవితం ఒక వలయంలా పూర్తి అవుతోందనిపిస్తోంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చిందామె. నెటిజన్లు కూడా ఇది ఒక అందమైన పరిపూర్ణమైన క్షణం అని, చాలా భావోద్వేగ భరితంగా ఉంది అంటూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Nancy Gupta🍀 (@nancy.gupta18) -
చక్కెర కొనాలంటే.. కిడ్నీ అమ్ముకోవాల్సిందే!
పంచదార ధర సామాన్యులను బెంబేలెతిస్తోంది. ధరలు రోజు రోజుకు ఎగబాకుతుండడంతో చక్కెర వైపు చూడటానికి జనం జంకుతున్నారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడదామంటే దాని ధర కూడా దడ పుట్టిస్తోంది. తీపి అంటేనే హడలిపోయేలా రేట్లు షాక్ ఇస్తున్నాయి. ఉత్పత్తి పడిపోవడం, సరఫరాలో సమస్యల కారణంగా గత కొన్ని వారాలుగా చక్కెర, బెల్లం ధరలు బాగా పెరిగిపోయాయి.కొద్దిరోజుల క్రితం వరకు 45 రూపాయలు ఉన్న కిలో చక్కెర ధర ఇప్పుడు దాదాపు 70 రూపాయలకు చేరుకుంది. బెల్లం కిలో రేటు దాదాపు 20 రూపాయలు పెరిగి రూ.75కు వచ్చింది. పండగ సీజన్‌తో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండడంతో బెల్లం, చక్కెరకు ఫుల్ గిరాకీ ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో ధరలు చుక్కలనంటడంతో జనం విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వం ధరలు తగ్గించి, తమకు ఊరట కల్పించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: భారత్‌ను ముంచెత్తిన చక్కెర సంక్షోభం!చక్కెర ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు, మీమ్స్ పెద్ద ఎత్తున పోస్ట్ అవుతున్నాయి. గతంలో నాయకుల మాటలను కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కమలం గుర్తు బటన్ నొక్కండి, కిలో చక్కెర రూ.13కే పొందండి అంటూ 2019లో స్మృతి ఇరానీ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకుముందు ఐఫోన్ దక్కించుకోవానికి కిడ్నీ అమ్మాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు చక్కెర కోసం మూత్రపిండాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నట్టుగా ఉన్న వీడియో నవ్వులు పూయిస్తోంది.సోషల్ మీడియాపై చక్కెర ధరల పెరుగుదలపై షేర్ అయిన పోస్టులు మీ కోసం..कमल का बटन दबाओ, 13 रुपए किलो में शक्कर पाओ.- स्मृति ईरानी (2019 में)#Sugar pic.twitter.com/mOZE7VoWCH— Abdul Wahab (@AbdulWahabRs) August 23, 2026First it was iPhone, now it's SUGAR #Sugar pic.twitter.com/SiNybQqWJp— Indian (@MeIndian03) August 24, 2026Dhurandhar 3 on the way #Sugar https://t.co/9F5PCKM478 pic.twitter.com/1MNOcaIcgy— Indian (@MeIndian03) August 24, 2026మీ సైడు 50 రూపాయల షుగర్ ఇట్లా ఎట్లా ఇస్తారూ @NaperuShivaMani pic.twitter.com/dKOw7cYpBd— d కృష్ణ (@2029krisha) August 23, 2026#Sugar prices may be going UP… 🍬📈But this #Reel has sweetened the internet for free! And entertainment value is already OFF THE CHARTS! 😂🔥#SugarPriceHikes #BandhanDay #ReelOfTheDay #CreativeContent#NeverStopPlaying pic.twitter.com/GyZlLTVw6i— Zenith Chaudhary (@ZC_zenith) August 23, 2026 -
25 ఏళ్లకే కోట్లు సంపాదించా : ఫ్యూచర్లో ఏం చేయాలి?
25 ఏళ్లకే కోటీశ్వరుడిగా అవతరించిన ఒక యువకుడు రెడ్డిట్‌లో తన ఆకట్టుకునే పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను పంచుకున్నారు. మీమ్ పేజీలు, ఆన్లైన్ కంటెంట్‌పై కేంద్రీకృతమైన వ్యాపారాన్ని నిర్మించడం ద్వారా తాను రూ. 1.6 కోట్ల నికర సంపదను కూడబెట్టినట్లు ఆయన వెల్లడించారు.అయితే తన ఆదాయం బిజినెస్ ఆధారితం కావడం వల్ల హెచ్చుతగ్గులు ఉంటాయని, అందువల్ల భవిష్యత్తు కోసం (FIRE - Financial Independence, Retire Early) ఎలాంటి వ్యూహాలు పాటించాలో అని సలహాలు కోరిన వైనం నెట్టింట సందడిగా మారింది. అంతేనా అతను షేర్ చేసిన నెట్‌వర్త్ పోర్ట్‌ఫోలియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భారతదేశంలోని ఒక టైర్-2 నగరానికి చెందిన డిజిటల్ మీడియా బిజినెస్‌లో రాణిస్తున్న ఈ బిజినెస్‌మ్యాన్ సోషల్ మీడియాలో తన సక్సెస్ జర్నీని షేర్ చేశాడు. పెట్టుబడి విషయంలో తాను అనుసరించిన క్రమశిక్షణా విధానమే తన ఆర్థిక బలానికి, కోటిన్నర ఆర్థిక మైలురాయిని దాటడానికి సాయపడిందని యువ క్రియేటర్ వివరించారు. తాను 18 ఏళ్ల వయస్సులోనే ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆర్జన మొదలు పెట్టి, చివరికి ఒక డిజిటల్-మీడియా వ్యాపారాన్ని నిర్మించానని వివరించాడు. తన ఆస్తులు,పెట్టుబడుల వివరాలను కూడా పంచుకున్నాడు. ప్రస్తుత నికర సంపద సుమారుగా రూ. 1.6 కోట్లు అని , తనకు రూ. 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఉందని తెలిపాడు. అయితే తనకు గానీ, తన తల్లిదండ్రులకు గానీ ఆరోగ్య బీమా లేదని ప్రకటించాడు. రెండేళ్ల క్రితం రూ. 4 లక్షలతో సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేశాడు.ఆస్తి, పెట్టుబడులు మొత్తం ఆస్తి: రూ.1.6 కోట్లుభారతీయ ఈక్విటీలు : రూ 90 లక్షలుబ్యాంక్ డిపాజిట్లు & క్యాష్ రూ. 45 లక్షలురియల్ ఎస్టేట్ (Real Estate)రూ.15 లక్షలుయూఎస్ స్టాక్స్ : రూ 7.5 లక్షలుమ్యూచువల్ ఫండ్స్ : రూ 5 లక్షలుక్రిప్టో & ఫిక్స్డ్ డిపాజిట్లు : రూ 4 లక్షలురెడిటర్లను అడిగిన ప్రశ్నలువ్యాపారం స్థిరమైన ఆదాయాన్ని అందిస్తూనే ఉన్నప్పటికీ, తర్వాత ఏమి చేయాలా అంటూ ఆ వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. అందుకే భవిష్యత్తులో తన సంపద కరిగిపోకుండా, మరింత ఆర్థిక స్థిరత్వం కోసం,డిజిటల్ మీడియా బిజినెస్‌ను మరింతగా స్కేల్ చేయడం ఎలా? ఎలాంటి వ్యూహాలు పాటించాలో తెలపండి నెటిజన్లను సలహాలు కోరాడు. ముఖ్యంగా గత రెండుమూడేళ్లుగా రియల్ ఎస్టేట్ డీల్స్ పెద్దగా లేవు, కనుక బ్యాంక్‌లో ఉన్న రూ. 30-45 లక్షల మిగులు నగదును ఎక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పండి అంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేయడం విశేషం.ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్నెటిజన్ల స్పందన25 ఏళ్లకే ఇంత గొప్ప ఆర్థిక విజయాన్ని సాధించినందుకు పలువురు అభినందించారు."నిజంగా అద్భుతం, మిత్రమా అంటూ తెగ పొగిడేవారు. ఒక యూజర్ మీమ్ పేజీల ద్వారా సంపాదన ఎలా సాధ్యమో తెలపండి అంటూ ఆసక్తి చూపగా, మరికొందరు రియల్ ఎస్టేట్ ఆస్తులను కొని అమ్మడం లేదా కొన్నింటిని అద్దెకు ఇవ్వడం ప్రారంభించి, మీ డిజిటల్ వ్యాపారాన్ని నడుపుతూనే నెమ్మదిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించండి. తద్వారా నిలకడైన ఆదాయం పొందాలని సూచించారు.ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బు -
బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బు
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నిజంగా ఈ ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. అత్యంత పేదరికంలో జీవిస్తూ, భిక్షాటనతో రూపాయి రూపాయి కూడబెట్టి, లక్షలు పోగు జేసింది. కానీ ఏ లాభం? ఆ లక్షలేవీ ఆమెకు అక్కరకు రాలేదు. ఆ ధనాన్ని అనుభవించ కుండానే ఆమె కన్నుమూయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మాండ్యకు చెందిన 68 ఏళ్ల హూర్ (Hoor) అనే వృద్ధురాలు వయోభారంతో వచ్చిన అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఒక మహిళ ఇంట్లో లక్షల రూపాయల నగదుతో నిండిన సంచులు లభ్యమైన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.అనంతరం స్థానికులు ఆమె అద్దె ఇంటిని తనిఖీ చేయగా, దాదాపు 30కి పైగా గోనె సంచుల్లో నింపి ఉన్న వేలాది నాణేలు, రూ. 10,20,రూ 50 కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. స్థానికులు ఆ డబ్బును లెక్కించగా రూ.8,40,000 (ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు) నగదు చూసి అందరూ దిగ్భ్రాంతి పోయారు.At least 30 cash-filled sacks worth over ₹8 lakhs have been found at the house of a woman in Karnataka who spent all of her life begging. She died yesterday due to an age-related illness. The money was handed over to her brothers. One of the brothers took Rs 6 lakh while the… pic.twitter.com/Q0L89fM8d1— Piyush Rai (@Benarasiyaa) August 24, 2026ఇదీ చదవండి: రోజుకు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్ హూర్ తన సోదరితో కలిసి ఆ అద్దె ఇంట్లో నివసించేవారు. ఇద్దరికీ వివాహం కాలేదు. రెండేళ్ల క్రితమే ఆమె సోదరి కూడా మరణించారు. దీంతో ఈ సొమ్మును హూర్ సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు రూ. 6 లక్షలు తీసుకోగా, మరొక సోదరుడు తన వాటాకి వచ్చిన రూ. 2,40,000 లను స్థానిక మసీదుకు విరాళంగా ఇచ్చారు.ఇదీ చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత : ఎవరీ కేరళ బ్యూటీ -
సెల్ఫీ కోసం వచ్చి రాహుల్‌కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా!
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ యువతతో మమేకమయ్యే కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీల కోసం వేదికపైకి వచ్చిన ఓ యువ విద్యార్థిని.. అందరి ముందే రాహుల్ గాంధీ చెంపపై ముద్దుపెట్టుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మహారాష్ట్రలోని పూణేలో రాహుల్ గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ వేదికపై యువతతో మాట్లాడటంతో పాటు వారితో సెల్ఫీలు దిగారు. అదే సమయంలో ఓ విద్యార్థిని రాహుల్ వద్దకు వచ్చి ఆయన చెంపపై ముద్దు పెట్టింది. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో రాహుల్ షాకయ్యారు. అనంతరం రాహుల్ కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. తర్వాత భద్రతా సిబ్బందితో కలిసి వేదిక నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమం మొత్తం కచేరీ తరహా లైటింగ్, భారీ ఏర్పాట్లతో సాగింది.#rgtwt gurls are not not ready fr this 😭😭😭😭 pic.twitter.com/Q6t9RS2vpY— Snowbell (@Snowbel) August 23, 2026ఈ ఘటన అనంతరం, 11వ తరగతి చదువుతున్న సదరు యువతి మరియం మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీలా ఎదగడం నా కల. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవాలని, ఆయనలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం యువతలో రాహుల్ గాంధీ తనదైన ప్రభావాన్ని చూపుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన వదిలిన అంశాలనే పట్టుకుని ముందుకు సాగుతున్నారు’ అని వ్యాఖ్యలు చేసింది.It's my dream to become like Rahul Gandhi.♥️Mariyam, an 11th-grade student, aspires to walk in the footsteps of Rahul Gandhi.Rahul Gandhi flat-out owns the narrative among the youth right now. His rivals are just picking up whatever crumbs he leaves behind. 🔥💯 pic.twitter.com/VN3j1OwwzQ— Krishna Yadav (@Control_Krishna) August 24, 2026సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లుఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీతో మహిళలు, యువతులు ఎంత సౌకర్యంగా మెలుగుతున్నారో కొందరు ప్రస్తావించగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ‘మనుస్మృతి’ భావజాలాన్ని విమర్శించిన ఆయన.. మహిళలు పితృస్వామ్యాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు.రాహుల్ సభపై బీజేపీ ఫైర్రాహుల్ కార్యక్రమంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలపై సీరియస్‌గా మాట్లాడకుండా రాహుల్ సాధారణ రాజకీయ ప్రసంగానికే పరిమితమయ్యారని మహారాష్ట్ర బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. సభకు జనాన్ని సమీకరించేందుకు కాలేజీ బస్సులను ఉపయోగించారని కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం బీజేపీ విమర్శలను తిప్పికొట్టింది. రాహుల్ గాంధీ కార్యక్రమానికి వచ్చిన అపూర్వ స్పందనను చూసి బీజేపీ నేతలు అసహనంతో ఉన్నారని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ విమర్శించారు. LoP @RahulGandhi Ji's craze among GenZ 🔥A student kissed him with affection.....! This is how safe girls feel around him. It can never happen with any BJP leader. pic.twitter.com/shbLJi6QSK— Venisha G Kiba (@KibaVenisha) August 24, 2026 -
రూ. 150 కోట్ల అవినీతి : బార్ కౌన్సిల్ ఛైర్మన్‌పై సంచలన ఆరోపణలు
తెలంగాణాలోని నల్సార్ లా యూనివర్సిటీ 2026 విద్యార్థులపై చర్యల వివాదంలో భంగపడ్డ బీజేపీ ఎంపీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ న్యాయవాది, బీసీఐ కో-ఛైర్మన్ వై.ఆర్. సదాశివ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఛైర్మన్ మనన్ మిశ్రానాయకత్వంలో బీసీఏ ప్రతిష్ట, ప్రమాణాలు దిగజారిపోయాయని ఆరోపించారు.మిశ్రా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయనకు ఒక లేఖ రాయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ట్రస్ట్ పనితీరుపై కూడా రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ట్రస్ట్ నిష్క్రియంగా మారిందని, కౌన్సిల్ నిధులలో సుమారు రూ. 150 కోట్లు కొత్తగా సృష్టించబడిన ట్రస్ట్‌కు మళ్లించారని ఆరోపించడం సంచలనంగా మారింది. తక్షణమే లేదా కనీసం ఈ లేఖ అందిన 15 రోజుల్లోపు రాజీనామా చేయాలని సదాశివ రెడ్డి తన లేఖలో కోరారు. అలాగే తాను లేవనెత్తిన అంశాలను పరిశీలించడానికి BCI ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంబంధిత రికార్డులను ముందుగానే సభ్యుల ముందు ఉంచాలని కూడా ఆ లేఖలో కోరారు.నిధుల స్పెషల్ ఆడిట్బీసీఐ, బీసీఐ ట్రస్ట్ PEARL-First ఖాతాలపై కాగ్ (CAG - Comptroller and Auditor General of India) ప్యానెల్‌లోని స్వతంత్ర సంస్థతో ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ప్రతిపాదించారు. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నాటి నుండి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై ఈ ఆడిట్ జరగాలని, ఆ నివేదికను సభ్యులందరికీ అందించడంతో పాటు బహిరంగపరచాలని కూడా యాన డిమాండ్ చేశారు. అలాగే లా కాలేజీలు, యూనివర్సిటీలు లేదా మేనేజ్మెంట్ల నుండి ఎలాంటి విరాళాలు, ప్రాసెసింగ్ ఫీజులు లేదా చెల్లింపులను బిసిఐ లేదా దానికి అనుబంధ ట్రస్ట్‌లు స్వీకరించకుండా తక్షణమే నిలిపివేయాలన్నారు.ఛైర్మన్‌పై సదాశివ రెడ్డి ప్రధాన ఆరోపణలుబీసీఐలో నియామకాలను ఎటువంటి పారదర్శకమైన రిక్రూట్మెంట్ ప్రక్రియ లేకుండానే చేపట్టారని ఆరోపించారు.బిసిఐ ట్రస్ట్‌ను నిష్క్రియం చేసి, దాదాపు రూ.150 కోట్ల కౌన్సిల్ నిధులను కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు మళ్లించినట్లు పేర్కొన్నారు.అనుమతులు లేదా రెన్యూవల్స్ కోసం వచ్చే లా కాలేజీల నుండి నిరంతరం విరాళాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.బీసీఏ ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో కీలక పదవులను మనన్ మిశ్రా తన కుటుంబ సభ్యులకు కేటాయించారని విమర్శించారు.నాల్సార్ (NALSAR) లా యూనివర్సిటీ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌పై సరైన ఆధారాలు లేకుండానే బిసిఐ చర్యలు తీసుకుందని ప్రశ్నలు లేవనెత్తారు.రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో గ్రూపులు మరియు వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని కౌన్సిల్ నాయకత్వంపై ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి: దారుణం బిల్‌పై బాడీ షేమింగ్ వివాదం : స్పందించిన కెఫేమనన్ కుమార్ మిశ్రా స్పందనఆర్థిక అవకతవకలు, అనుమానాస్పద నియామకాలు,పారదర్శకత లోపం అంటూ తనపై వచ్చిన ఆరోపణలను చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తోసిపుచ్చారు. బీసీఐ సభ్యుడు వై.ఆర్. సదాశివ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు నిరాధారమైనవని , రాజకీయ ప్రేరేపితమన్నారు. -
జంతర్ మంతర్ చూమంతర్ కాళీ..!
కష్టాల్లో ఉన్న మనిషికి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓ హగ్ ఇస్తే చాలూ అన్నీ ఇట్టే ఎగిరిపోతాయ్ అని శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఓ డైలాగ్ చెబుతాడు. కానీ ఇక్కడో ఓ కౌగిలి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడికి ఆ ఆలింగనం ఎక్కడా లేని ధైర్యం ఇచ్చింది. అతనితో కన్నీరు పెట్టించింది. హృదయాన్ని తాకే ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.సైనిక శిక్షణ ముగింపు వేడుకలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తోటి సైనికులు తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటున్న సమయంలో.. ఒంటరిగా నిల్చున్న ఓ యువ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్ అతడికి దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.In a touching human moment in Indonesia, one soldier stood alone during the closing ceremony of a training exercise, while his colleagues celebrated with their families and loved ones.His commander noticed the situation from a distance and approached him, embracing him as if he…— The Actual Event (@Gazawins12) August 17, 2026ఇండోనేషియా ఆర్మీకి చెందిన ఓ రిక్రూట్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఈ భావోద్వేగ ఘటన జరిగింది. ఫస్ట్ TNI AD ఎడ్యుకేషన్ (ఇండోనేషియా ఆర్మీ శిక్షణ వ్యవస్థ) ముగింపు వేడుకలో భాగంగా సైనికులు పట్టాలు అందుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుక సందర్భంగా చాలామంది సైనికులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. కానీ ఓ యువ రిక్రూట్ మాత్రం అందరికీ దూరంగా ఒంటరిగా నిలబడి కనిపించాడు. చుట్టూ ఉన్నవారి ఆనందాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.అక్కడే ఉన్న కమాండర్ ఆ యువ సైనికుడి పరిస్థితిని గమనించాడు. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి ఎలాంటి మాటలు చెప్పకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అనుకోని ఆ ప్రేమాభిమానానికి ఆ రిక్రూట్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కమాండర్‌ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఓదారుస్తూ అధికారి కొద్దిసేపు అలాగే ఆలింగనం చేసుకున్నాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎడి కార్టోనో అనే వ్యక్తి.. ఆ యువ సైనికుడు తన కుటుంబాన్ని ఎంతో మిస్ అవుతున్నాడని పేర్కొన్నారు. ఇతర సైనికులు తమ కుటుంబాలతో కలిసి వేడుక జరుపుకుంటుండగా.. అతడు ఒంటరిగా నిలబడటం కమాండర్ గమనించారని తెలిపారు. ఆ ఒక్క ఆలింగనం ఆ సైనికుడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, కుటుంబ సభ్యుల నుంచి లభించే ప్రేమను గుర్తు చేసిందని పేర్కొన్నారు.నెట్టింట ప్రశంసలుఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కమాండర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సైనిక అధికారి కేవలం ఆదేశాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదని.. తన సిబ్బంది భావోద్వేగాలను అర్థం చేసుకునే నాయకుడిగా ఉండాలని పలువురు వ్యాఖ్యానించారు. “అది కేవలం ఓ కౌగిలి కాదు.. ఒంటరిగా ఉన్న సైనికుడికి ఇచ్చిన భరోసా” అంటూ పలువురు స్పందించారు. మరికొందరు ఈ ఘటనలో కమాండర్ మానవత్వాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. కఠినమైన సైనిక శిక్షణ మధ్య కూడా మానవత్వానికి చోటుందని చాటిచెప్పిన ఈ క్షణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంటోంది.జంతర్ మంతర్ చూమంతర్ కాళీ.. అని శంకర్‌దాదా చెప్పినట్టు ఇది ఏ మంత్రమో కాదు.. కానీ ఓ కౌగిలి చేసిన మ్యాజిక్. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్.. ఒక్క ఆలింగనంతో అతడికి ధైర్యం ఇచ్చాడు. ఆ హృదయాన్ని తాకే వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
నీ తల్లి కోసమైనా బతకాల్సింది కదరా!
మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు.ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్‌లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా.పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు.మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులుకునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద పోలీసులు వలతో సిద్దంగా ఉండడం గమనించి.. మరో అంచువైపు వెళ్లి దూకుతానంటూ బెదిరించాడు.చివరకు కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ కొండ అంచు వద్దకు వెళ్లి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కునాల్ బ్యాలెన్స్ తప్పి పడిపోతుండగా.. తండ్రిని పట్టుకుని లాగేశాడు. దీంతో కింద పడిపోతూ బలమైన గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటిదాకా అక్కడే కుప్పకూలి ఏడుస్తున్న సంగీత కూడా ఆ దృశ్యంతో షాక్ తింది. భర్త, కుమారుడు కళ్లముందే పడిపోవడాన్ని చూసిన ఆమె క్షణం ఆలస్యం కూడా చేయకుండా కొండపై నుంచి దూకింది. ఈ ఘటనలో ముగ్గురూ మృతి చెందారు.ఒక ఫోన్ కోసం మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ కుటుంబాన్నే బలి తీసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నోట్: వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు!Tragic news from Chhatrapati Sambhajinagar:19-yr-old Kunal Chandgude died after jumping from Khavdya Hill following a dispute with his parents over a phone.His parents, Murlidhar (48) and Sangita, died trying to save him despite a 3-hr rescue effort by police and fire… pic.twitter.com/1doWOAx5cv— Bhavesh Gujrati (@Bhaveshlivelife) August 21, 2026ఇదే జిల్లాలో మరో విషాదం..ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోనే గురువారం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. వైజాపూర్ తాలూకాలోని ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం సిద్ధమవుతున్నాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడితో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు రాసిన రెండు లైన్ల లేఖలో “సారీ అమ్మా, నాన్నా.. వచ్చే జన్మలో మీ కోసం కచ్చితంగా డాక్టర్ అవుతాను.. మీరు జాగ్రత్తగా ఉండండి” అని పేర్కొనడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఒకవైపు ఐఫోన్ EMI వివాదం.. మరోవైపు కెరీర్ ఒత్తిడితో నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో వరుస విషాద ఘటనలు కుటుంబాలు, యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై చర్చకు దారితీస్తున్నాయి.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: 105 ఏళ్ల దోషికి సుప్రీంకోర్టు సాయం -
ఉద్యోగం చేస్తూనే 64 ఏళ్ల వయసులో ఎంటెక్..!
పదవీవిరమణ వయసు వచ్చేటప్పటికీ కాస్త వేటిపై అంత ఆసక్తి ఉండదు. ముఖ్యంగా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి చాలా అరుదు. ఒకవేళ ప్రయత్నించినా మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఈ పెద్దయన రిటైర్ అయిపోయాక కూడా మరో ఉద్యోగంలో కొనసాగుతూ..ఎంటెక్ పూర్తి చేశాడు. అంతేకాదండోయ్ తన తరగతిలో టాప్ 10 విద్యార్థులలో ఒకరిగా నిలవడం విశేషం. అందుకు సంభందించిన విషయాన్ని ఆయన కుమారుడు శశాంక్ శ్రీవాస్తవ్ నెట్టిట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. శశాంక్ శ్రీ వాస్తవ సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు. “ 64 ఏళ్ల వయసులో మా నాన్నగారు ఎం.టెక్ పూర్తి చేశారు. గతనెలలోనే ఈ కోర్సుని పూర్తి చేశారు. ఆయన వయసులో సగం వయసున్న విద్యార్థులతో పోటీపడి మరీ..టాప్ 10లో నిలిచారు. ఆయన కేవలం రిటైర్డ్ వ్యక్తి మాత్రమే కాదని 2022లో పదవీవిరమణ చేసిన వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లను పర్యవేక్షంచే నియంత్రణ సంస్థలో డిప్యూటీ సీఈవోగా చేరారు. ఆయన ప్రతి వారం రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యికిలోమీటర్లు మేర జిల్లాలను సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో పనులను సమీక్షిస్తారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ..తన తండ్రి చదువుకోవడానికి సమయం కేటయించుకుంటారు. ఆ ప్రయాణాల మధ్యలోనే నోట్స్ రాసుకుని వాటిని చదివి, యువ విద్యార్థుల కంటే మెరుగ్గా పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మా నాన్న గారు" అని రాసుకొచ్చారు. అయినా జీవితం మరింత బిజీగా మారేక్దొద్దీ చాలామంది నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టిపెట్టడం మానేస్తుంటారని, అది తాను చూశానని అన్నాడు. అంతేగాదు జీవితంలో ఇక కొత్తగా నేర్చకోవాలనే ఆశ ఉన్నా..ప్రాధాన్యత మాత్రం ఇవ్వలేరని, వాస్తవికతలో అది ఆచరణసాధ్యం కూడానని చెప్పుకొచ్చాడు. అయితే తన తండ్రి అలాంటి ఆలోచనను దరిదాపుల్లోకి రానివ్వలేదని, ఆయన 40, 60ల కూడా నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టేవారని అన్నారు. ఇక తన తండ్రి ఎంటెక్‌తో ఆగడం లేదని, ఐఐఎం లక్నోలో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో చేరడం ఆయన తదుపరి లక్ష్యమని అన్నాడు. పైగా చాలామంది లక్ష్యాలు నిర్దేశించుకోవడం మానేసే వయసులో దరఖాస్తు పత్రాలు నింపుతారని అన్నాడు. అందువల్ల తనకు నైపుణ్యాను పెంపొందించుకోవడంలో ప్రేరణ పొందాల్సిన అవసరం ఏర్పడలేదని ఎందుకంటే అది అది తన డీఎన్ఏలోనే ఉందని చమత్కరిస్తూ.. పోస్ట్‌ని ముగించారు శశాంక్ శ్రీ వాస్తవ్. చాలామంది నెటిజన్లు చదువు కొనసాగించడంపై స్ఫూర్తిని నింపిందన్నారు. ఆయన్ను చూసి చాలా గర్వపడాలి, చాలా నేర్చుకోవాలి కూడా అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..!) -
సూపర్‌మ్యాన్ స్పీడ్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు!
ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం చిరుత. మరి మనుషుల్లో? జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పేరు ముందుగా గుర్తొస్తుంది. వేగానికి పర్యాయపదంగా మారిన బోల్ట్.. ఒక్కసారి పరుగు మొదలుపెడితే ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకెళ్లేవాడు. అలాంటి పరుగుల రారాజు నమోదు చేసిన గరిష్ఠ వేగం రికార్డు బద్ధలైంది!!.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. మనిషి సాధించలేనిది.. యంత్రం చేసి చూపించింది. చైనాకు చెందిన ‘సూపర్‌మ్యాన్’ హ్యూమనాయిడ్ రోబో బోల్ట్ గరిష్ఠ వేగాన్ని దాటి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రూపొందించిన రోబో.. సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తినట్లు సంస్థ వెల్లడించింది. అంటే గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగం అన్నమాట. 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన గరిష్ఠ వేగం సెకనుకు 12.42 మీటర్లు. దీంతో వేగం విషయంలో బోల్ట్‌ను రోబో అధిగమించినట్లయింది.Chinese humanoid robot named “Superman”, made by Unitree Robotics, surpassed Usain Bolt’s world record (12.42 meters/second) by running at 12.66 m/s (roughly 28.3 miles/h) pic.twitter.com/xobXzUPDI5— Massimo (@Rainmaker1973) August 18, 2026ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ పరుగులో ఆయన గరిష్ఠంగా సెకనుకు 12.42 మీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు యూనిట్రీ విడుదల చేసిన వీడియోలో ‘సూపర్‌మ్యాన్’ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో బోల్ట్ గరిష్ఠ వేగం కంటే రోబో వేగం స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. పరుగుల తర్వాత అది దారి తప్పి కింద పడిపోవడం గమనార్హం.నిలబడే రెండు మీటర్లు జంప్!పరుగులోనే కాదు.. జంప్‌లోనూ ‘సూపర్‌మ్యాన్’ తన సామర్థ్యాన్ని చాటింది. ఎలాంటి రన్అప్ లేకుండా నిలబడి ఉన్న చోటు నుంచే సుమారు రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదని యూనిట్రీ తెలిపింది. ఈ రోబో కాళ్ల పొడవు సుమారు 0.85 మీటర్లు. కేవలం మూడు నెలలకు పైగా వ్యవధిలోనే దీన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో దీని వేగం, సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలిపింది.వైరల్‌గా మారిన వీడియోయూనిట్రీ ఆగస్టు 17న ‘సూపర్‌మ్యాన్’ సామర్థ్యాలను చూపిస్తూ వీడియోను విడుదల చేసింది. వేగంగా పరుగెత్తడం, నిలబడి రెండు మీటర్ల వరకు ఎగరడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మనిషి వేగానికి ప్రతీకగా నిలిచిన బోల్ట్ గరిష్ఠ వేగాన్ని రోబో దాటిందన్న విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.18 వేల రోబోలు తయారు చేసిన యూనిట్రీచైనాలోని హాంగ్జౌ కేంద్రంగా పనిచేస్తున్న యూనిట్రీ.. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే వివిధ మోడళ్లకు చెందిన సుమారు 18 వేల బైపెడల్ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. మరోవైపు యూనిట్రీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లోని STAR మార్కెట్లో లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. ఐపీఓలో భాగంగా సుమారు 6.1 బిలియన్ యువాన్లు (దాదాపు 905 మిలియన్ డాలర్లు) సమీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘సూపర్‌మ్యాన్’ ప్రదర్శన సంస్థ సాంకేతిక సామర్థ్యాలపై మరింత ఆసక్తిని పెంచింది. -
‘బయటకు రా’ అంటూ పిలుపు.. ఒక్క కాల్‌తో ముగిసిన టిక్‌టాక్ స్టార్ కథ!
సోషల్ మీడియాలో ఆమె ఓ స్టార్.. లక్షలాది మంది ఆమెను ఫాలో అయ్యారు.. కోట్లాది లైక్స్ ఆమె సొంతం. కానీ ఓ ఫోన్ కాల్ ఆమె జీవితానికి చివరి కాల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. “బయటకు రా” అంటూ వచ్చిన పిలుపుతో ఇంటి నుంచి బయలుదేరిన 28 ఏళ్ల పాకిస్థాన్ టిక్‌టాక్ క్రియేటర్ షమ్సో బీబీ.. కొద్ది సేపటికే రక్తపు మడుగులో విగతజీవిగా మారారు. ఇస్లామాబాద్ సమీపంలోని టాక్సిలాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె కారును అడ్డగించి తుపాకీతో కాల్పులు జరిపారు. ఒక్క బుల్లెట్ ఆమె మెడలోకి దూసుకెళ్లింది.. కారు అదుపుతప్పి డంపర్‌ను ఢీకొట్టింది.. 13 లక్షల మంది ఫాలో అయ్యే ఆ సోషల్ మీడియా స్టార్ కథ అక్కడే ముగిసిపోయింది.ఆన్లైన్లో అయేషా గిలమానా పేరుతో గుర్తింపు పొందిన షమ్సో బీబీ గత మూడు, నాలుగేళ్లుగా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ భారీ క్రేజ్ సంపాదించారు. ఆమె ఖాతాకు 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, కోట్లాది లైక్స్ ఉన్నాయి. అయితే ఆగస్టు 14న జరిగిన ఈ దాడితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు ముందు కాశిఫ్ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్ చేసి ఇంటి బయటకు రావాలని చెప్పినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి కారులో బయలుదేరారు. మార్కెట్ సమీపానికి చేరుకోగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును అడ్డుకున్నారు. వారిలో ఒకరు తుపాకీ తీసి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్ షమ్సో మెడలోకి దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు డంపర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరి కూడా తీవ్రంగా గాయపడ్డారు.🚨 Pakistani TikTok Star Shot Dead🇵🇰 TikTok creator Shamsu Bibi, aka Ayesha Gilamana (28), was shot dead in Taxila, Punjab, on Pakistan Independence DayTwo bikers allegedly opened fire near a petrol station#Taxila #ShamsuBibi #بی_ایل_اے_کی_پھٹ_گئی #felizdiadelniño pic.twitter.com/64vjc06gW9— Daily Briefs (@Daily_Briefs_) August 17, 2026ఈ దాడికి సంబంధించిన CCTV దృశ్యాలు బయటకు వచ్చినట్లు సమాచారం. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును ఆపడం, ఒకరు తుపాకీ తీసి కాల్పులు జరపడం అందులో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది యాదృచ్ఛిక దాడి కాదని.. పక్కా ప్లాన్‌తోనే షమ్సోను టార్గెట్ చేశారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. షమ్సోకు ఇప్పటికే ప్రాణహాని బెదిరింపులు వచ్చినట్లు ఆమె తండ్రి చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమెను బెదిరించారని ఆరోపించారు. వారిలో ఒకరే హత్య వెనుక ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ముందే హెచ్చరికలు.. ఈ కేసులో పోలీసులు నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిలో షూటర్‌కు పారిపోవడానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కూడా ఉన్నారు. అయితే షమ్సోను చంపాలని ఆదేశించింది ఎవరు? ఆమెను ఇంటి నుంచి బయటకు రప్పించిన ఫోన్ కాల్ వెనుక ఎవరు ఉన్నారు? డబ్బుల వివాదమే కారణమా? అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.నిన్నటి వరకు ఆమె వీడియోలతో సందడి చేసిన టిక్‌టాక్ ఖాతా ఇప్పుడు లేదు. కుటుంబం ఆమె ఖాతాను తొలగించింది. యూట్యూబ్ పేజీ కూడా కనిపించడం లేదని సమాచారం. లక్షలాది మంది ఫాలోవర్లు.. కోట్లాది లైక్స్.. ఒక్క ఫోన్ కాల్‌తో మొదలైన ప్రయాణం.. బైక్‌పై వచ్చిన రెండు తుపాకీ గుళ్లతో విషాదాంతం. షమ్సో బీబీ హత్య వెనుక అసలు కథేంటన్నదే ఇప్పుడు పాకిస్థాన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. -
లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!
పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్లే స్ఫూర్తిదాయకం కాదు అని చెప్పే కథ. మన చుట్టూ చిన్న చితక పనులు చేస్తూ..నిరంతరం కష్టపడతూ ఉన్నతంగా బతికే స్థాయికి వచ్చినవాళ్లు ఉన్నారు. మనం అటుకేసి చూడం. గొప్ప గొప్పోళ్లు కంటికి కనిపించినట్లు..కష్టజీవులు వైపుకి దృష్టిసారించం. వాళ్లను ఒక్కసారి పలకరిస్తే..కష్టం అంటే ఏంటో..పైకి రావడం ఎలాగో కచ్చితంగా తెలుసుంది. అందుకు ఈ కంటెక్ క్రియేటర్ సోషల్ మీడియా షేర్చేసిన ప్రేరణాత్మక స్టోరీనే ఉదాహరణ. ప్రస్తుతం ఈ కథ నెట్టింట వైరల్‌గా మారింది. డిజిటల్ క్రియేటర్ ఉపేన్ వర్మ స్ఫూర్తిదాయక వీడియోని పంచుకున్నారు. అది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన లస్సీ వ్యాపారితో డిజిటల్ క్రియేటర్ ఉపేన్ వర్మ జరిపిన సంభాషణ కనిపిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో లస్సీ వ్యాపారి ఒక విషాదాన్ని దిగమింగుకుంటూ..సాగించిన తన అద్భుత జర్నీ గురించి మాట్లాడారు. తాను చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబా భారమంతా తనపై పడిందని చెప్పుకొచ్చాడు. తాను 11 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతను మోసినట్లు తెలిపాడు. అప్పటి నుంచే రోజు కషపడి పనిచేసేవాడినని చెప్పాడు. అప్పట్లో లస్సీ అమ్ముతూ రోజుకి కేవలం రూ. 250లు సంపాదించేవాడినని అన్నాడు. అలా సంపాదించిన డబ్బుతోనే తన తోబుట్టువుల పెళ్లిళ్లు చేశానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాను పెళ్లిచేసుకుని ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని వెల్లడించాడు. తన తండ్రి తమకంటూ ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదని బాధపడుతూనే చనిపోయాడని..ఆ నేపథ్యంలోనే ఆహర్నిశలు కష్టపడి తనకంటూ ఒక ఇల్లు కూడా నిర్మించుకోగలిగానని అన్నాడు. ప్రస్తుతం దేవుడి దయవల్ల బాగానే సంపాదిస్తున్నానని, ఇప్పుడు లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేల నుంచి రూ. 90 వేలు వరకు ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అదంతా విని కంటెంట్ క్రియేటర్ జీవితంలో అస్సలు ఏ అద్భుతం జరగదని అనుకునేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారని అడగగా..ఆ వ్యక్తి మిత్రులారా కష్టపడి పనిచేయండి, కష్టపడటం ఆపకపోతే..మిమ్మల్ని తప్పక దేవుడు ఆశ్వీరదిస్తాడు, అద్భుతం జరిగినట్లుగా గొప్పవారవుతారని అన్నాడు. ఆ వ్యక్తితో సంభాషణ ముగిసిన వెంటనే ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూ అనుభవాలలో ఇది అత్యంత అద్భుతమైనదని కంటెంట్ క్రియేటర్ వర్మ అన్నాడు. ఈ వ్యక్తి కథ మీరు ఏదైనా సాధించాలనుకుంటే, దాన్ని సాధించగలరని చూపిస్తుంది. ఇక్కడ విజయం సాధించడానికి మీకు కావలసిందల్లా దృఢ సంకల్పం ఒక్కటే అంటూ తన సంభాషణను ముగించాడు డిజిటల్ క్రియేటర్ వర్మ. నెటిజన్లు కూడా అద్భుతమైన కథను పంచుకున్నారని, కఠిన వాస్తవాలతో కూడిన ఇలాంటి కథలే మనసుని తాకుతాయంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Upen Verma (@upenverma) (చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..) -
ఫొటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్
పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో జరిగిన ఒక వివాహంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మరికొద్ది క్షణాల్లో పెళ్లి అనగా వరుడిని చూసిన వధువు హతాశురాలైంది. తనకు కాబోయే భర్త ఇతను కాదు అంటూ పెళ్లికి నిరాకరించడంతో వివాదం మొదలైంది.రాజస్థాన్‌లోని ఛత్తర్‌గఢ్ నుండి వచ్చిన పెళ్లి ఊరేగింపు, చివరకు వధువు లేకుండానే తిరిగి వెళ్ళిపోయిన ఘటన వైరల్‌గా మారింది.పోలీసుల సమాచారం ప్రకారం, బంధుమిత్రుల సందడి మధ్య వివాహ తంతు కొనసాగుతోంది. అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణలు చేసే వేడుక ప్రారంభానికి ముందు వరుడిని చూసిన వధువు షాకైంది. ఈ పెళ్లి నాకొద్దు అంటూ తెగేసి చెప్పేసింది. దీంతో అర్థాంతరంగా పెళ్లి ఆగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెళ్లికి ముందు తనకు వేరొక యువకుడి ఫోటో చూపించి, వివాహ వేదిక వద్ద వరుడిగా వేరే వ్యక్తిని తీసుకొచ్చారని వధువు ఆరోపించింది. అయితే, వరుడి కుటుంబం దీనికి భిన్నమైన వాదనను వినిపించింది. ఒక మ్యారేజ్ బ్రోకర్ ద్వారా ఈ పెళ్లి కుదిరిందని వరుడి కుటుంబం వాదించింది. రెండు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం నిశ్చయమైందని, పెళ్లికి ముందు ఇరు పక్షాలు ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయని వారు చెప్పారు. వరుడి ఫోటోలను ముందుగానే చూపించామని, మధ్యవర్తులు , వధువు తల్లి వరుడి తాత (తల్లి వైపు) మహేంద్ర సింగ్ తెలిపారు. అయినా సరే ససేమిరా అన్న వధువు మాత్రం పెళ్లికి గట్టిగా నిరాకరించింది. ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?మరోవైపు రెండు రోజుల క్రితమే వరుడి కుటుంబం నుండి ఫిర్యాదు అందిందని, దానిపై దర్యాప్తు ప్రారంభించా మని గురు హర్ సహాయ్ డీఎస్పీ తేజిందర్‌పాల్ సింగ్ తెలిపారు. విచారణ సమయంలో ఇరు పక్షాలు తమ వాదనలను వినిపించాయనీ, ఈ సమస్యను పరిష్కరించుకున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. అయితే ఈ వివాదం ఎలా ముగింసిందనే దానిపై స్పష్టత లేదు. ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే! -
ఆ ఒక్క పాటతో అన్ని వందల కోట్లు వచ్చాయా?
ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ఆ పాట.. 14 ఏళ్లు గడిచినా యూట్యూబ్‌లో తన జోరు కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా కోట్లాది మందిని అలరించిన ఆ సాంగ్ తాజాగా మరో రికార్డు సృష్టించింది. ఒకప్పుడు యూట్యూబ్‌లో బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా చరిత్ర సృష్టించిన అదే పాట.. ఇప్పుడు 6 బిలియన్ మార్క్‌ను అందుకుని తన సత్తా చాటింది. అంతటి ఆదరణ పొందిన ఈ పాట.. సింగర్ పీఎస్‌వైకి ఎంత ఆదాయాన్ని తెచ్చిపెట్టిందన్నదే ఇప్పుడు ఆసక్తికరం.దక్షిణ కొరియా పాప్ స్టార్ పీఎస్వై పాడిన ‘గంగ్నమ్ స్టైల్’ తాజాగా 6 బిలియన్ వ్యూస్ దాటి మరో సెన్సేషన్‌గా మారింది. 2012 జులైలో విడుదలైన ఈ పాట.. అదే ఏడాది డిసెంబర్లో యూట్యూబ్‌లో ఫస్ట్ బిలియన్ వ్యూస్ సాధించిన తొలి వీడియోగా చరిత్ర సృష్టించింది. 2013లో ఈ పాటకు సుమారు 1.23 బిలియన్ యూట్యూబ్ వ్యూస్ ఉన్న సమయంలో.. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నికేష్ అరోరా ఈ వీడియోకు 8 మిలియన్ డాలర్లకుపైగా యాడ్ రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అప్పటి లెక్కల ప్రకారం 8 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.50 కోట్లకుపైనే.6 బిలియన్ల వ్యూస్‌తో రెవెన్యూ ఎంతంటే..తాజాగా ‘గంగ్నమ్ స్టైల్’ 6 బిలియన్ వ్యూస్ దాటింది. 2023 డిసెంబర్లో 5 బిలియన్ మార్క్ చేరుకున్న ఈ వీడియో.. మరో బిలియన్ వ్యూస్ సాధించడానికి రెండేళ్ల ఏడు నెలల సమయం తీసుకుంది. అంటే.. విడుదలై దాదాపు 14 ఏళ్లు గడిచినా ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదన్నమాట.యాడ్ ఆదాయ రేటును కేవలం సూచికగా తీసుకుని 6 బిలియన్ వ్యూస్‌కు వర్తింపజేస్తే.. యూట్యూబ్ ప్రకటనల ద్వారా వచ్చే మొత్తం దాదాపు రూ.250–300 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే యూట్యూబ్ ప్రకటన రేట్లు, ప్రేక్షకులు ఉన్న దేశాలు, మానిటైజేషన్, యాడ్ వీక్షణలు తదితర అంశాల ఆధారంగా ఈ ఆదాయం మారుతుంది. ఇతర ఆదాయ మార్గాలను కూడా కలిపి చూస్తే.. ఎంత లేదన్నా ‘గంగ్నమ్ స్టైల్’ ద్వారా మొత్తం సంపాదన సుమారు రూ.800 కోట్లకుపైగా ఉండొచ్చన్నది అంచనా.ఆ మొత్తం మొత్తం పీఎస్వైకే దక్కుతుందా?‘గంగ్నమ్ స్టైల్’కు యూట్యూబ్ మాత్రమే ఆదాయ వనరు కాదు. డిజిటల్ డౌన్లోడ్లు, మ్యూజిక్ స్ట్రీమింగ్, లైసెన్సింగ్, ప్రకటనలు, ఇతర వాణిజ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి. 2013లోనే ఈ పాట డిజిటల్ డౌన్లోడ్లు, ప్రకటనలు, ఆన్-డిమాండ్ సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.అయితే యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పీఎస్‌వైకి దక్కదు. ప్లాట్‌ఫామ్ వాటాతో పాటు మ్యూజిక్, వీడియో హక్కుదారులు, రికార్డ్ లేబుల్, ఇతర భాగస్వాములకు కూడా ఆదాయం పంచబడుతుంది. అయినప్పటికీ.. అన్ని ఆదాయ మార్గాలను కలిపి చూస్తే పీఎస్‌వైకి ఈ పాట ద్వారా భారీ మొత్తమే దక్కినట్లు చెప్పొచ్చు. ఆ పాట ఎలా పుట్టిందంటే..‘గంగ్నమ్ స్టైల్’ పుట్టుక వెనుక దక్షిణ కొరియాలోని గంగ్నమ్ ప్రాంత జీవనశైలే ప్రధాన ప్రేరణ. గంగ్నమ్లో పుట్టి పెరిగిన పీఎస్వై.. అక్కడి ఉన్నతవర్గాల జీవనశైలి, వారి ఫ్యాషన్, హంగూ ఆర్భాటాలను తనదైన శైలిలో పాటగా మలిచారు. యూ జంగ్ హ్యుంగ్తో కలిసి సాహిత్యం రాయడంతో పాటు మ్యూజిక్‌ను రూపొందించిన పీఎస్వై.. సరదా పదాలు, వ్యంగ్యభరితమైన భావన, ఆకట్టుకునే బీట్‌ను జోడించారు. ఇక గుర్రపు స్వారీని తలపించే డ్యాన్స్ స్టెప్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఇలా పెద్దగా అంచనాలు లేకుండా రూపొందిన ఈ పాట.. ప్రపంచ సంగీత చరిత్రనే మార్చేసే సంచలనంగా మారింది.ప్రపంచాన్ని ఊపేసిన గుర్రపు స్టెప్పు2012లో విడుదలైన ‘గంగ్నమ్ స్టైల్’ కొరియన్ భాషలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పీఎస్వై వేసిన ప్రత్యేకమైన గుర్రపు స్వారీ తరహా డ్యాన్స్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అమెరికా బిల్బోర్డ్ హాట్ 100లో ఈ పాట ఏడు వారాల పాటు రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా యూట్యూబ్ చరిత్రలో 1 బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా ‘గంగ్నమ్ స్టైల్’ నిలిచింది. ఈ పాట తర్వాత.. పీఎస్వై నుంచి ఆ స్థాయి ఆల్బమ్ రాలేదు. కానీ, అప్పటి నుంచి ఆయన టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా క్రేజ్ లేని రోజుల్లోనే.. యూట్యూబ్‌తో గంగ్నమ్ స్టైల్ సంచనాలు సృష్టించడం, ఇప్పుడు 6 బిలియన్ వ్యూస్‌తో మరో మైలురాయిని అందుకోవడం.. క్రేజ్‌ను ఏదీ అడ్డుకోలేదని నిరూపించింది. -
ఫ్రీ పెట్రోల్ కోసం ఆశగా వెళ్తే..
కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇటీవలి కాలంలో జనాలను ఆకట్టుకునే పేరుతో చేసే ప్రచారాలు ఎంతవరకు నిజమో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్యం పేరిట డబ్బులు వసూలు చేసే స్కాములు, సాయం పేరుతో పెయిడ్ వీడియోలు ఇలా ఎన్నో ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియాలో ‘ఫ్రీ పెట్రోల్’ అంటూ వచ్చిన ఓ ప్రకటనను నమ్మి.. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీశారు. తీరా అక్కడ వారికి ఊహించని పరిణామం ఎదురైంది.రాకేశ్ ట్రెహాన్ అనే వ్యక్తి సోషల్ సర్వీస్ పేరిట నెట్టింట కాస్త ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే. అయితే.. ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తానంటూ ప్రకటించడంతో.. మంగళవారం సాయంత్రం ఛండీగడ్(పంజాబ్) వాహనదారులు బంకుల వద్దకు టూవీలర్లు, కార్లు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. అయితే అప్పటికే భారీ వర్షం మొదలైంది. ఉచితంగా వచ్చే పెట్రోల్ కోసం జనాలు దానిని పెద్దగా లెక్క చేయలేదు. ఈ లోపు క్యూ లైన్ భారీగా పెరిగిపోయింది.అయితే చెప్పిన టైంకి పెట్రోల్ పంపిణీ ప్రారంభం కాలేదు. ఈలోపు బంక్‌ల వద్ద పరిస్థితులు చేజారిపోతుండడంతో నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి వాహనదారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈలోపు బంక్వాళ్లు కేవలం 15 మందికి ఉచితంగా పెట్రోల్ కొట్టి.. మిగతావాళ్లకు నో చెప్పారు. ఫ్రీ టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో మిగతా వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉచిత పెట్రోల్ ఇస్తారన్న సమాచారంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినవారిని ఇలా వెనక్కి పంపడం ఏమిటని ప్రశ్నించారు. రాకేశ్‌ను బండ బూతులు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.Chandigarh: The city witnessed chaos after a video of a petrol langar organized by Amritsar-based Rakesh Trehan, alias Raja Di King, went viral. A large crowd had gathered at the spot before the police arrived, and after their arrival, the crowd was evacuated from the petrol… pic.twitter.com/pA1iPQ4mh8— IANS (@ians_india) August 18, 2026 ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసి వచ్చిన సుమన్ అనే మహిళ.. పెట్రోల్ ఇవ్వడానికి పంపు సిబ్బంది అనుమతించలేదని తెలిపారు. కేవలం 10–15 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చినట్లు చెప్పారు. అన్షు అనే మరో వ్యక్తి తాను దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షంలో పెట్రోల్ పంపు వద్ద వేచి చూసినట్లు తెలిపారు.రాకేశ్ రియాక్షన్పరిస్థితిపై రాకేశ్ ట్రెహాన్ స్పందించారు. సోషల్ మీడియాలో ‘రాజా ది కింగ్’గా గుర్తింపు పొందిన ఆయన.. భారీ వర్షం కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. వర్షంలో ప్రజలు ఇబ్బందులు పడటం, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండటంతో పెట్రోల్ పంపిణీని నిలిపివేసినట్లు తెలిపారు. అక్కడికి వచ్చినవారికి ఆయన క్షమాపణలు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.ఆగస్టు 21 నుంచి మళ్లీ.. మూడు రోజుల పాటు!తాజా ప్రకటన ప్రకారం ‘పెట్రోల్ లంగర్’ను ఆగస్టు 21న నిర్వహించనున్నట్లు రాకేశ్ ట్రెహాన్ తెలిపారు. అదే సమయం, అదే ప్రాంతంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెట్రోల్ పంపిణీ కోసం ఆగస్టు 21న కూపన్లు లేదంటే కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో మూడు రోజుల పాటు ఉచిత పెట్రోల్ పంపిణీ కొనసాగుతుందని ప్రకటించారు. -
విషపూరితమైన పాము కాటు : 150 చెంపదెబ్బలు కొట్టి కాపాడుకున్న అన్న
సోదరుడిని కాపాడుకోవాలనే తపనతో ఒక వ్యక్తి అతడిని ఏకంగా 150 సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. వైద్యుల సలహా మేరకు అలా చేశాడు. అదేంటి అనుకుంటున్నారా? అయితే నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్కి చెందిన 21 ఏళ్ల అరుణ్‌ని అత్యంత విషపూరితమైన పాము కాటు వేసింది. నీళ్లు తెచ్చుకోవడానికి పొలానికి వెళ్లినపుడు గడ్డి బస్తాను పైకి లేపుతుండగా, అందులో దాగి ఉన్న పాము అతన్ని కాటు వేసింది.దీంతో అతడు గట్టిగా కేకలు వేశాడు. క్రమంగా అతని పరిస్థితి విషమంగా మారిపోతోంది. అరుణ్ అరుపులు విన్న అతని అన్నయ్య ఆకాష్ వెంటనే అక్కడికి చేరుకుని, అతన్ని రోడ్డు వైపు తీసుకువెళ్లాడు. అరుణ్ పరిస్థితి మరింత క్షీణించడంతో అంబులెన్స్ ,పోలీసులకు సమాచారం అందించారు.మరోవైపు అరుణ్ పరిస్థితి తీవ్రతను గమనించిన ఒక మెడికల్ స్టోర్ యజమాని, ఆ సోదరులిద్దరినీ తన మోటార్‌సైకిల్‌పై మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడు. మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ విభాగంలో, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ (EMO) డాక్టర్ షేర్ సింగ్, ఆయన బృందం వెంటనే చికిత్స ప్రారంభించారు.రెండు గంటల వ్యవధిలో 15 డోసుల యాంటీ-వెనం (విష విరుగుడు మందు) ఇచ్చారు, ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఆ సమయంలో అతణ్ణి నిద్రపోనివ్వకుండా చూడాలని, మెలకువగా ఉంచాలను వైద్యులు సూచించారు. దీంతో ఆకాష్ తన సోదరుడి పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే, అతనిపై నీళ్లు చల్లుతూ, అరుణ్‌ని 150 సార్లకు పైగా చెంపదెబ్బలు కొడుతూ అతణ్ణి మెలకువతో ఉండేలా కాపాలా కాశాడు. ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్యపాము కాటు కేసుల్లో సాధారణంగా ఐదు డోసుల యాంటీ-వెనం ఇస్తామని డాక్టర్ షేర్ సింగ్ తెలిపారు. అయితే, అరుణ్‌పై విష ప్రభావం తీవ్రంగా ఉండటంతో, రెండు గంటల వ్యవధిలో మొత్తం 15 డోసుల యాంటీ-వెనం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అరుణ్ ప్రాణాలను కాపాడటంలో సహాయపడినందుకు కుటుంబ సభ్యులు వైద్యులకు , మెడికల్ స్టోర్ యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!నోట్ : పాము కాటుకు గురైనప్పుడు వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. సాధ్యమైనంత త్వరగా యాంటి వెనమ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. ఆందోళన,భయం అస్సలు మంచిది కాదు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
ఇక ఇన్స్టాగ్రామ్.. ఫేస్బుక్ మునుపటిలా ఉండవు!
సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు, రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాం. అయితే ఇంతగా అలవాటైన ఈ సోషల్ మీడియా అనుభవం అతిత్వరలో మారిపోనుందా?.. ఇది వరకులా అది మనకు వినోదం పంచడం సాధ్యం కాదా?. మెటాపై కేసు విచారణలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం, వారి వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అమెరికాలో మెటా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కీలక కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకుంది. ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇప్పటివరకు వినియోగదారులకు అత్యంత సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి వేసిన ఈ కేసు మెటాపై ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక జరిమానా విధించే పరిస్థితికీ దారితీయొచ్చు కూడా. ఏం జరిగింది?2023లో అమెరికాలోని 30 రాష్ట్రాలు మెటాపై కేసు దాఖలు చేశాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి కీలక రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను రూపొందించి, వారు ఎక్కువసేపు ఆ ప్లాట్‌ఫామ్‌లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేకాదు.. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులను పదేపదే యాప్‌లోకి తిరిగి తీసుకురావడానికి నోటిఫికేషన్లు, సిఫార్సు వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, అనంతంగా కంటెంట్ చూపించే విధానం వంటి ఫీచర్లను ఉపయోగిస్తోందని రాష్ట్రాలు చెబుతున్నాయి.నేటి నుంచే కీలక విచారణమెటాపై అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన ఈ కీలక కేసులో ప్రధాన విచారణ నేటి నుంచి(ఆగస్టు 18) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జ్యూరీ ఎదుట వాదనలు జరగనున్నాయి. విచారణ సుమారు 6–8 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రాలు మెటా యువతను ఎక్కువసేపు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండేలా డిజైన్ చేసిందని ఆరోపిస్తున్నాయి. దీంతో.. తీర్పు ఎలా రానుందా? అనే ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది.మెటా ఓడితే ఏం మారొచ్చు?ఈ కేసులో రాష్ట్రాలు కేవలం డబ్బు జరిమానా మాత్రమే కోరడం లేదు. పిల్లలు, టీనేజర్ల కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పనిచేసే విధానాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.అందులో ముఖ్యమైనవి..టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల ధ్రువీకరణ తప్పనిసరి చేయడం.పిల్లలు, టీనేజర్లు అనేక ఖాతాలు సృష్టించకుండా నియంత్రణలు విధించడం.యువ వినియోగదారులకు కనిపించే లైక్ కౌంట్లను తొలగించడం.ఒక కంటెంట్ తర్వాత మరొకటి నిరంతరం చూపించే ఇన్ఫినిట్ స్క్రోల్‌ను నిలిపివేయడం.టీనేజర్లను ఎక్కువసేపు యాప్‌లో ఉంచేలా పనిచేస్తున్న రికమెండేషన్ అల్గారిథమ్‌లలో మార్పులు చేయడం.ముఖం, శరీర రూపాన్ని మార్చే కొన్ని ఇమేజ్ ఫిల్టర్లను తొలగించడం.వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అయ్యే ఆటోప్లే ఫీచర్‌ను నిలిపివేయడం.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వంటి తాత్కాలికంగా కనిపించి మాయమయ్యే పోస్టులను పరిమితం చేయడం. ఇవన్నీ చూస్తే.. ఈ కేసు, మెటాకు రాబోయే తీర్పు ఎంతో కీలకమని స్పష్టమవుతోంది. వ్యతిరేకంగా వస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ప్రాథమిక వినియోగ అనుభవమే మారిపోయే అవకాశం ఉంది.పిల్లలను ‘యూజర్లు’గా మార్చడమే లక్ష్యమా?ఇదే ఈ కేసులో ప్రధాన ఆరోపణ. పిల్లలు, టీనేజర్లు ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువసేపు ఉండేలా మెటా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫీచర్లను రూపొందించిందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఒక వీడియో పూర్తయిన వెంటనే మరొకటి మొదలవడం, స్క్రోల్ చేస్తూనే కొత్త కంటెంట్ రావడం, తరచూ నోటిఫికేషన్లు రావడం వంటి అంశాలు వినియోగదారులను మళ్లీ మళ్లీ యాప్‌లోకి తీసుకువస్తాయని వాటి వాదన. అంటే.. యూజర్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడా? లేక యాప్ యూజర్‌ను ఉపయోగిస్తోందా? అనే పెద్ద ప్రశ్న ఈ కేసులో ముందుకు వస్తోంది.లైక్ బటనే కీలకం?సోషల్ మీడియాలో లైక్ అనేది సాధారణంగా కనిపించే చిన్న సంఖ్య. కానీ పిల్లలు, టీనేజర్లపై దాని ప్రభావం పెద్దదిగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎంతమంది లైక్ చేశారు? ఇతరుల పోస్టులకు తన పోస్టుకు వచ్చిన స్పందన ఎంత? ఇతరులతో పోలిస్తే తాను ఎలా ఉన్నాను? అనే ఆలోచనలు యువతలో సామాజిక పోలికలకు దారితీయొచ్చని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో మెటా స్వయంగా నిర్వహించిన పరిశోధనల నుంచి కూడా రాష్ట్రాల న్యాయవాదులు ఆధారాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. లైక్ కౌంట్లు సోషల్ కంపారిజన్*కు దారితీస్తాయని, ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి పోలికలు ఒంటరితనం, శరీర రూపంపై ప్రతికూల భావన, నెగెటివ్ మూడ్‌తో సంబంధం కలిగి ఉన్నాయని మెటా అంతర్గత పరిశోధనలు సూచించినట్లు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మెటా వాదన ఏంటి?అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండిస్తోంది. యువతకు మద్దతు ఇవ్వడంలో తమ సంస్థకు దీర్ఘకాలిక నిబద్ధత ఉందని, కేసులోని ఆధారాలు తమ వైఖరిని సమర్థిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే మరో రాష్ట్రంలో మెటాకు ఎదురుదెబ్బ తగిలింది. న్యూ మెక్సికోలోని ఒక కేసులో మెటాపై 942 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు యువ వినియోగదారులకు సంబంధించిన పలు మార్పులు చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లలోపు వినియోగదారులకు లైక్ కౌంట్లను తొలగించడం, నగ్న చిత్రాలకు సంబంధించిన మెసేజింగ్‌ను నిరోధించడం, పుష్ నోటిఫికేషన్లను నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం వంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. మెటా ఆ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసు చాలా పెద్దదే!న్యూ మెక్సికో కేసు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ తాజా కేసులో 30 రాష్ట్రాలు కలిసి మెటాను ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అమెరికా జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందువల్ల మెటా ఈ కేసులో ఓడిపోతే.. తీర్పు ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అమెరికా అంతటా ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పిల్లలు, టీనేజర్ల అనుభవాన్ని మార్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా భవిష్యత్తుపై ప్రభావం?ఈ కేసు మరో అసలు ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. పిల్లలను ఆకర్షించడానికి రూపొందించిన సోషల్ మీడియా ఫీచర్లకు ఎంతవరకు పరిమితులు ఉండాలి? కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే చిన్నారుల మానసిక ఆరోగ్యం, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలా? తల్లిదండ్రుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి?. మెటా ఓడితే.. లైక్‌ల సంఖ్య కనిపించని ఇన్స్టాగ్రామ్, నిరంతర స్క్రోల్ లేని ఫేస్బుక్, తల్లిదండ్రుల అనుమతి అవసరమయ్యే టీనేజర్ ఖాతాలు, పరిమితమైన నోటిఫికేషన్లు వంటి కొత్త సోషల్ మీడియా అనుభవం మొదలయ్యే అవకాశం ఉంది. -
14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్న కేజీఎఫ్ (KGF) స్టార్, యష్ (Yash)కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట సందడిగా మారింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత యష్‌పై క్రేజ్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో సౌత్ సూపర్ స్టార్ యష్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే. ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు (1.4 కోట్ల) పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యష్ కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతారని మీకు తెలుసా?అవును ఈ కన్నడ హీరో తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలో అయ్యేది కేవలం ఒకే ఒక్కరిని. ఇటీవల ఒకటీవీ షోలో యష్ తన రాబోయే చిత్రాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను కూడా పంచుకున్నారు. ఆ సమయంలో, ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఒక అమ్మాయి యష్‌ను ఒక ప్రశ్న అడిగింది. “మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు. ఎవరా వ్యక్తి, మీ జీవితంలో వారి విలువ ఏమిటి?” అన్న ప్రశ్నకు యశ్ ఇచ్చిన సమాధానం అతని లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.దీనికి సమాధానంగాయష్ నవ్వుతూ, “ఆమె నా భార్య” ఎంతో ప్రేమగా బదులిచ్చారు. ఇది విన్న స్టూడియో మొత్తం చప్పట్లతో మారుమోగింది. "ఆమె నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఒకవేళ నేను తనని కూడా ఫాలో అవ్వకుండా జీరో పెడితే నాకు ఇబ్బందులు తప్పవు" అని సరదాగా వ్యాఖ్యానించారు. "నిజం చెప్పాలంటే, ఆమె నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మేమిద్దరం కలిసి ఎదిగాము. ఆమె నాకు భార్యగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా జీవితానికి బలమైన ఆధారం." అంటూ చెప్పారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనంరెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రలో, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణునిగా, యశ్ రావణునిగా కనిపించనున్నారు. ఇక సన్నీ డియోల్ హనుమంతుని పాత్రను పోషిస్తున్నారు. 'రామాయణం మొదటి భాగం' విదేశాలలో నవంబర్ 6, 2026న, భారతదేశంలో నవంబర్ 8, 2026న విడుదల కానుంది. 'రామాయణం: రెండవ భాగం' 2027 దీపావళికి థియేటర్లలోకి రానుంది. 'రామాయణం'తో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ చిత్రంలో యష్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. యష్‌తో పాటు, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, నయనతార మరియు రుక్మిణి వంటి కథానాయికలు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చివరకు, ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది.ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరికకాగా యష్ రాధికా పండిట్ 2007లో 'నంద గోకుల' అనే కన్నడ సీరియల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి, 2016 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Coreculture (@coreculture.inn) -
ఇన్ఫ్లుయెన్సర్ కావడం ఇక ఈజీ కాదు!
సోషల్ మీడియా స్టార్ కావడం.. ఇక సరదా వ్యవహారం కాదు. కంటెంట్ క్రియేషన్‌ను ఓ ప్రొఫెషన్‌గా గుర్తిస్తూ ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం ఏకంగా డిగ్రీ కోర్సును ప్రారంభించింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వేదికలపై కెరీర్ నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ అందించేలా ఈ కోర్సును రూపొందించారు. ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో.. ప్రొఫెనల్ డిగ్రీ మస్ట్ అంటే ఎలా? అనే చర్చ జోరందుకుంది.ఇంటర్నెట్ తెరిస్తే చాలూ.. కంటెంట్ పేరిట బోలెడంత క్రింజ్ కనిపిస్తుంటుంది. అయితే దానికి చెక్ పెట్టాలని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ASU) నిర్ణయించింది. స్వచ్ఛమైన కంటెంట్ క్రియేషన్‌లో భాగంగా బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. యూనివర్సిటీలోని వాల్టర్ క్రాంకైట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ కోర్సు అందుబాటులోకి వచ్చింది. కేవలం వీడియోలు చేయడం, వైరల్ కావడం కాకుండా.. కంటెంట్ రూపకల్పన, పాడ్‌కాస్టింగ్, స్టూడియో ప్రొడక్షన్, కెమెరా ముందు ప్రెజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.వైరల్ అయితే చాలు అనుకోవద్దు..ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ భారీగా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించి ఆదాయం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ‘క్రియేటర్ ఎకానమీ’ కూడా వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇన్ఫ్లుయెన్సర్ జీవితం బయటకు కనిపించినంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం కొత్త కంటెంట్ సృష్టించడం, ప్రేక్షకులతో అనుసంధానం కొనసాగించడం, బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకోవడం, ఆదాయంలో అనిశ్చితిని ఎదుర్కోవడం వంటి సవాళ్లు ఉంటాయని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ విషయంలో కొత్త(కఠిన) రూల్స్ తెస్తున్న సంగతి తెలిసిందే.డిగ్రీతో స్టార్ అవుతారా?కంటెంట్ క్రియేషన్‌లో డిగ్రీ చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా స్టార్ కాలేరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరల్ కావడానికి ప్రతిభతో పాటు అదృష్టం, సరైన వ్యూహం, నిరంతర శ్రమ అవసరమని చెబుతున్నారు. అయితే ఈ కోర్సు ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మార్కెటింగ్, వ్యక్తిగత బ్రాండింగ్, నెట్వర్కింగ్ వంటి అంశాల్లో అవగాహన పెరుగుతుందని విశ్వవిద్యాలయం పేర్కొంది. సోషల్ మీడియా రంగంలోనే కాకుండా మీడియా, ప్రకటనలు, డిజిటల్ సంస్థల్లోనూ ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.క్రియేటర్ ఎకానమీకి కొత్త గుర్తింపుఅమెరికాలో కంటెంట్ క్రియేషన్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో బిలియన్ల డాలర్ల ఆదాయం చలామణి అవుతోంది. దీంతో ఇంతకాలం కేవలం ‘టైమ్‌పాస్’గా భావించిన సోషల్ మీడియా కంటెంట్ సృష్టి.. ఇప్పుడు ఓ అధికారిక కెరీర్ మార్గంగా గుర్తింపు పొందుతోంది. అందుకే ఇకపై ‘ఇన్ఫ్లుయెన్సర్ అవుతా’ అంటే చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని ఈ డిగ్రీ ఇస్తోంది. అయితే ఫాలోవర్ల సంఖ్య కంటే.. నాణ్యమైన కంటెంట్, సృజనాత్మకత, క్రమశిక్షణే విజయానికి అసలు ఆధారమని నిపుణులు గుర్తుచేస్తున్నారు. -
24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతుండగానే ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ ’ అనే పేరుతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు సంచలనంగా మారాయి. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఒక్క రోజులోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ అకౌంట్‌కు 62 పోస్ట్‌లను పోస్ట్ చేయగా, సుమారు 35 మందిని ఫాలో అవుతోంది. దీంతో సీజేపీ తరహాలోనే దిమాగీ నక్సల్ పార్టీ కూడా ఇప్పుడో ఉద్యమంగా మారుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరికల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ వెలుగులోకి రావడం విశేషం. మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో సాధించిన విజయాలు ,నీడలా పొంచి ఉన్న ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ, దేశానికి సమస్యగా మారిన నక్సల్స్ ను ఏరిపారేశామని, ఇపుడిక దిమాగీ నక్సల్స్‌ను పని పడతామని తన ప్రసంగంలో మోదీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.🇮🇳 DIMAAGI NAXAL JANTA PARTY — DJP 🇮🇳🚨🚨 01. NATION RE-BUILDING • ECONOMIC CONSTRUCTION🏗️ BUILD THE NATION. REBUILD THE ECONOMY.🇮🇳 $10 TRILLION ECONOMY BY 2035📈 Required nominal growth: ~10.5% CAGR⚙️ ECONOMIC RECONSTRUCTION🏭 Manufacturing: ~17% → 25% of GDP📈… pic.twitter.com/36APNRh3ua— Dimaagi Naxal Janta Party 🧠 (@DJPforINDIA) August 16, 2026 అయితే, ఈ దిమాగీ నక్సల్ జనతా పార్టీ ఖాతాను ఖచ్చితంగా ఎవరు నిర్వహిస్తున్నారనే దాని గురించి ఎలాంటి సమాచారం వెలుగులోకి రాలేదు. మరోవైపు "తెలివిగా ఉండండి.. మూర్ఖంగా ఉండకండి. ప్రశ్నలు అడగండి.. బానిసలా ఉండకండి" అంటూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక పోస్ట్‌ను 'దిమాగీ నక్సల్ జనతా పార్టీ' ఖాతా రీట్వీట్ చేసింది. ఇది ఇలా ఉండగా ప్రధానమంత్రి వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం, "నేను 'దిమాగీ నక్సల్' అయినందుకు గర్వపడుతున్నాను" అని స్పందించడం ఈ వివాదానికి మరింత అగ్గి రాజేసింది.కిరణ్ రిజుజు వివరణఈ వివాదం నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రకటనపై స్పష్టతనిచ్చారు. "ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులను నేరుగా 'మైండ్-మేడ్ నక్సల్స్' అని పిలవలేదని, మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారు, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచేవారు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవారు లేదా ఈశాన్య భారతదేశాన్ని మిగిలిన భారతదేశం నుండి వేరుచేసే 'చికెన్ నెక్' ప్రాంతం దిగ్బంధనానికి మద్దతు ఇచ్చేవారిని ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగించాదని పేర్కొన్నారు. కాగా దేశ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన బొద్దింకల వ్యాఖ్యలకు నిరసనగా పుట్టకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. దీనికి సోషల్ మీడియాలో జెన్‌జీ నుంచి భారీ ఆదరణ లభించింది. అంతేకాదు నీట్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతికబాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఉద్యమం, కేంద్రమంత్రి రాజీనామా దాకా కొనసాగిన సంగతి తెలిసిందే. -
ఓ ఫేక్ న్యూస్.. అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో కలకలం
క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియా వేదికలపైనా సాగుతోంది. తాజాగా ఓ తప్పుడు సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఇజ్రాయెల్, అమెరికా రాజకీయ వర్గాల్లోకి చేరి.. చివరకు అణు చర్చలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.ఆగస్టు 5న ‘ఎక్స్’ (X) వేదికగా ఓ గుర్తుతెలియని భారతీయ ఖాతా నుంచి ఓ సంచలన పోస్టు వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. ఇరాన్ కూడా తన అణు ఆయుధాల లక్ష్యాన్ని వదులుకోదు’’ అని వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి అణు పేలుడు మేఘాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా వహీది చేశారనే ఆధారాలు ఏవీ లేవు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసిందనే ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ పోస్టు వేగంగా వైరల్ అయింది.భారత్ టు అమెరికా వయా ఇజ్రాయెల్.. సుమారు 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆ భారతీయ ఖాతా నుంచి మొదలైన ఈ ప్రచారం.. కొన్ని గంటల్లోనే మరో భారతీయ ఖాతా ద్వారా హిందీలోకి అనువదించబడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు దీనిని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్‌లోని ఓ టీవీ ఛానల్ ఈ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. ‘‘ఇరాన్ తొలిసారి అణుబాంబు తయారీ లక్ష్యాన్ని అంగీకరించింది’’ అన్నట్టుగా కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ జెరూసలేంలోని మౌంట్ హెర్జెల్ వద్ద చేసిన ప్రసంగంలో కూడా దీనిని ఇరాన్ ఉద్దేశాలకు నిదర్శనంగా ప్రస్తావించారు.అమెరికాలోనూ ఈ ప్రచారం ప్రభావం చూపింది. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఈ పోస్టును షేర్ చేస్తూ.. ఇరాన్ అసలు ఉద్దేశాలను అంగీకరించిందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్ రిక్ స్కాట్ కూడా దీన్ని పంచుకున్నారు. అయితే తర్వాత మైక్ వాల్ట్జ్ తన పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.అణు చర్చలపై ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాము శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టెహ్రాన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో అణ్వాయుధాలపై ఇరాన్ నేత వ్యాఖ్యలంటూ వచ్చిన తప్పుడు ప్రచారం.. దౌత్య చర్చల వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫేక్ న్యూస్ పవర్ అది!ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారానికి ఉన్న ప్రభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన నిర్ధారణ లేని పోస్టు.. భాషలు, దేశాల సరిహద్దులు దాటి.. ప్రపంచ నాయకుల ప్రసంగాల్లోకి చేరింది. నిజానిజాలు నిర్ధారించకుండానే ప్రచారం జరిగితే.. అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ నిర్ణయాలపైనా ప్రభావం చూపగలదని ఈ ఉదంతం స్పష్టం చేసింది. -
ప్లీజ్ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ మహిళ
సాధారణంగా మనకు నచ్చిన వాళ్లు లేదా మనకు బాగా పరిచయం ఉన్న పొరుగింటి వాళ్లు శాశ్వతంగా వేరోచోటికి వెళ్లిపోతున్నారంటే బాధగా అనిపిస్తుంది. అది సహజం. పైగా ఒకే దేశం, ఒకే జాతికి సులభంగా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వెళ్లిపోతున్నప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్. కానీ దేశం కానీ దేశంలో భావోద్వేగంగా వీడ్కోలు చెప్పడం అసాధారణం. కానీ అలాంటి భావోద్వేగ సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాను విడిచివెళ్లిపోతున్న భారతీయ జంటకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది పొరగునే ఉండే అమెరికన్ మహిళ. ఒక్కక్షణం అది భావోద్వేగ వీడ్కోలుగా మారిపోయింది. విజయ్ కొక్కెరగడ్డ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోని పంచుకున్నారు. డెట్రాయిట్లో విమానాశ్రయానికి బయలుదేరుతుండగా ఈ దృశ్యం చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఆ వీడియోలో విజయ్ అమెరికాలోని తన ఇంటి బయట నిలబడి ఉండగా, పోరుగునే ఉండే అమెరికన్ మహిళ వాళ్లను పట్టుకుని భావోద్వగానికి గురవ్వుతుంది. ప్లీజ్ వెళ్లిపోకండి అని కన్నీటిపర్యంతమవుతుంది. అయితే విజయ్ నవ్వి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ వీడియో రికార్డు చేయడం గురించి విజయ్‌కి తెలియదట. తన స్నేహితుడు తనకి చెప్పకుండానే ఈ వీడ్కోలుని చిత్రీకరించినట్లు వెల్లడించాడు. అతనే తనకు ఈ వీడియో పంపడంతో షేర్ చేసినట్లు తెలిపాడు. ఒక రకంగా ఈ వీడియో తన వద్ద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. ఇది నిజమైన భావోద్వేగాలు, ప్రేమను చూపించిందని పేర్కొంటూ తన పోస్ట్‌ని ముగించాడు. నిజంగా గ్రేట్ కదూ..పరాయి దేశస్థులైనా..మనలానే వెళ్లిపోతుంటే భావోద్వేగానికి గురవ్వడం గ్రేట్ కదూ..!. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :(చదవండి: తొమ్మిది పదుల వయసులో అథ్లెటిక్‌గా బామ్మ..! ఆఖరికి వందేళ్ల తర్వాత కూడా..) -
ఐదు నిమిషాలు లేట్.. ఫోన్ లాక్కుని డెలివరీ బాయ్‌పై దాడి.. ఆపై బిగ్ ట్విస్ట్!
ఐదు నిమిషాల ఆలస్యం.. కస్టమర్‌కు కోపం కట్టలు తెంచుకుంది! ఆర్డర్ లేట్‌గా వచ్చిందన్న ఆగ్రహంతో ఓ డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడికి దిగాడు. ఫోన్ లాక్కొని, చెంపదెబ్బలు కొట్టి, తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు నిలిపివేస్తామని ప్రకటించి, నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గంగాసాగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ కస్టమర్ యమన్‌తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం జరిగింది. అమిత్ ప్రకారం ఆర్డర్ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యమైంది. కానీ యమన్ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటూ ఆరోపించినట్లు అమిత్ తెలిపాడు.ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సీసీటీవీ దృశ్యాల్లో యమన్.. అమిత్ ఫోన్ లాక్కొని, అతడిని కొట్టడం, తన్నడం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ ఫిర్యాదు ప్రకారం.. యమన్ తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. అంతేకాదు, తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. అమిత్‌ను గుర్తించి అతడిని సంప్రదించారు. అనంతరం అందరూ కలిసి భవన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.An FIR has been registered against the couple who beat up a Blinkit delivery boy in Meerut, UP. Both have fled after locking their flat. Police raids are ongoing. pic.twitter.com/Sfke34hWFj— subash kumar (@Krishan10_) August 15, 2026డెలివరీ ఏజెంట్ల బంద్..ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెలివరీ ఏజెంట్లు పనులు నిలిపివేశారు. అమిత్‌కు కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించారు. “ఆర్డర్ కొన్ని నిమిషాలు ఆలస్యమైతే దాడి చేసే హక్కు ఎవరికీ లేదు” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 34 ఏళ్ల యమన్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని భవన్‌పూర్ పోలీసులు తెలిపారు. ఐదు నిమిషాల ఆలస్యం.. ఆపై గొడవ.. చివరకు సీసీటీవీలో బయటపడిన దాడి! ఈ ఘటన ఇప్పుడు డెలివరీ ఉద్యోగుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
రూ. 11.5 కోట్ల ఆస్తి, 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్లాన్సా? నెట్టింట ఒకటే చర్చ
పూణేకు చెందిన డింక్ కపుల్ (DINKడబుల్ ఇన్కమ్, నో కిడ్స్) 38 ఏళ్లకే రిటైర్ మెంట్ ప్రకటించారు. రూ. 11.5 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, వచ్చే మూడేళ్లలో రిటైర్ కావాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అధిక పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా కెరీర్ కంటే వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతనిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ దంపతులు.ఒత్తిడికి దూరంగా వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు సమాచారం. వీరి కథను ఒక బంధువు ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా వీరి ఆస్థులు, జీవనశైలిపై నెట్టింట ఆసక్తి నెలకొంది. ఈ జంట సంవత్సరాల తరబడి సంపదను కూడ గట్టుకున్నారని, కానీ ఇప్పుడు నిజంగా ఎంత డబ్బు సరిపోతుందని ప్రశ్నించుకుంటున్నారని ఆ బంధువు పేర్కొన్నారు.ఆ పోస్ట్ ప్రకారం, ఈ జంట మొత్తం ఆస్తి రూ.11. 5 కోట్లు. ఈ ఆస్తులలో రియల్ ఎస్టేట్‌లో సుమారు రూ. 3.2 కోట్లు, ఇండియన్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 1.8 కోట్లు, యూఎస్ ఈక్విటీలలో రూ. 5 కోట్లు, నగదు, పదవీ విరమణ పొదుపుల రూపంలో దాదాపు రూ. 1.5 కోట్లు ఉన్నాయి. వారి వార్షిక గృహ ఖర్చులు సుమారు రూ. 22 లక్షలుగా అంచనా. అయితే పదవీ విరమణ చేసిన తమ తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం, ఈ జంట మొదట్లో తమ సంపదను పెంచుకుంటూనే ఉండాలని ప్రణాళిక వేసుకున్నారని ఆ పోస్ట్ పేర్కొంది. అయితే, ఎక్కువ పని గంటలు, నిరంతర ఒత్తిడి,పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు వారి ప్రాధాన్యతలను పునరాలోచించుకునేలా చేశాయట. అందుకే తాము రిటైర్ అయ్యే ముందు మరో రెండు, మూడేళ్లు పనిచేసి మరికొంత సొమ్మును దాచుకోవాలని భావిస్తున్నారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్నెటిజన్ల రియాక్షన్స్ ఈ నిర్ణయం ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు నెటిజన్లు రూ. 11.5 కోట్ల నెట్‌వర్త్ , పిల్లలు లేని కుటుంబానికి రూ. 22 లక్షల వార్షిక ఖర్చుల దృష్ట్యా ఈ రిటైర్మెంట్ ప్లాన్ సరైనదేనని సమర్థించారు. మరికొందరు ముందస్తు రిటైర్మెంట్ (Early Retirement)కు సుదీర్ఘమైన ఆర్థిక ప్రణాళిక, నిరంతర క్యాష్ ఫ్లో అవసరమని హెచ్చరించారు. కెరీర్ పురోగతి కంటే ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం , సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని చాలామంది అభిప్రాయపడటం విశేషం.ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్‌కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియోఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు -
పాల ప్యాకెట్ల కింద లిక్కర్ బాటిల్స్!.. క్లాస్‌రూంలోనే దావత్!!
యువతను మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయడమే లక్ష్యంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలో.. అదే రాష్ట్రంలో ఓ గవర్నమెంట్ స్కూల్లో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్లాస్‌రూంలో.. అదీ అమ్మాయిలు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయ్ సర్కార్ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కన్యాకుమారి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. తరగతి గది సమీపంలో ఇద్దరు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పాఠశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాలలోనే ఉండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.విజయ్ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా స్థాయిలో నిఘా వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తుక్కలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ వీడియోతో కదిలిన యంత్రాంగంమద్యం సేవిస్తున్న దృశ్యాలను మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో కన్యాకుమారి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. విద్యార్థినులు ఎవరు? పాఠశాల ప్రాంగణంలోకి మద్యం ఎలా వచ్చింది? పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా ఎవాంజెలిన్ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.రాజ్‌కుమార్ అరెస్ట్విద్యార్థినులకు మద్యం అందించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తోటి విద్యార్థులపై అనుమానం వ్యక్తమైనప్పటికీ.. వారి ప్రమేయం లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తక్కలై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పాలు సరఫరా చేసే వ్యక్తిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ విద్యార్థినికి పరిచయస్తుడైన రాజ్‌కుమార్.. ఆమె కోరడంతో మద్యం కొనిచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.కౌన్సెలింగ్‌కు ఆదేశాలుఘటన అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థినులకు కూడా మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మరోవైపు.. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణ, పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఇలాంటి ఘటనలు మరింత అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. -
సింగిల్ మదర్, రెండు జాబ్‌లు..!
మహిళలుగా మనం సాధించగల దానికి పరిమితి లేదు అని అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అని సదా నొక్కి చెబుతుంటారామె. అది నిజం అనేలా..మూసధోరణి పద్ధతులను చేధించి ముందుకు దూసుకుపోతున్న ఎన్నో స్ఫూర్తిదాయక కథలు మన కళ్లముందు కదలాడుతున్నాయి. అలాంటి స్ఫూర్తిదాయ కథే ఈ సింగిల్ మదర్ స్టోరీ. ఒక ప్రయాణికురాలు, మహిళా క్యాబ్ డ్రైవర్ మధ్య సాగిన సరదా సంభాషణా వీడియో కాస్తా..శక్తిమంతమైన మహిళా శక్తికి నిర్వచనంగా, స్ఫూర్తిదాయకంగా మారింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ వీడియోని నటి ఆయుషి లాహిరి షేర్ చేసుకున్నారు. ఆయుషి ఒక క్యాబ్‌ని బుక్ చేసుకోగానే 'హైలైట్ ఆఫ్ ది డే' అనే శీర్షికతో ఒక ప్రముఖ క్యాబ్ డ్రైవర్ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ ప్రకారం, క్యాబ్ డ్రైవర్ ఒక మహిళ అని ఆశ్చర్యపోతుందామె. ఆ తర్వాత వారి మధ్య సరదాగా సంభాషణ సాగుతుంది. ఆ మహిళ క్యాబ్ డ్రైవర్ తన పేరు శోభనా అవస్థి అని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయుషి ఎప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నారని ప్రశ్నించగా జూన్ నెల నుంచి అని సమాధానమిస్తుంది. అయితే తాను కేవలం క్యాబ్ డ్రైవర్ని మాత్రమే కాదని తాను ప్రముఖ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్‌ని అని కూడా చెబుతుంది. అయితే ప్రతిరోజు మేకప్ పని దొరకదని, పైగా తాను ఒంటరి తల్లినని పేర్కొంటుంది. తన కుటుంబాన్ని, పిల్లలను చూసుకునేందుకు ఇలా రెండు వృత్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక తనకు డ్రైవింగ్ అంటే మహా ఇష్టమని, తాను 15 ఏళ్ల వయసులోనే తండ్రి వద్ద నేర్చుకున్నానని, చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ఎస్‌యూవీలతో సహా సుమారు 80 కార్లను నడిపినట్లు పేర్కొంది. ఆ నటి ఈ హృద్యమైన వీడియోకి "నా రోజులోని ముఖ్యాంశం" అనే క్యాప్షన్‌ని జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నిజానికి పురుషాధిక్య రంగంలో తమకంటూ ఒక గుర్తింపును సృష్టించుకోవడానికి మహిళలు ఎంతగా కష్టపడగలరో ఈ ఘటన నిరూపిస్తుంది. అందులోనూ ఒక సింగిల్ మదర్‌గా అటు మాతృత్యం ఇటు వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతున్న ఆమె నిజంగా సూపర్ విమెన్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Aayushi Lahiri (@aayushmatibhava)(చదవండి: 'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..) -
33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్‌కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియో
పిల్లలకు తల్లిదండ్రుల తరువాత ఆప్తులు ఎవరు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపాధ్యాయులే అని కచ్చితంగా చెప్పవచ్చు. పాఠాలు నేర్పిన గురువులను అనుకరిస్తూ బాల్యంలో బెత్తం పట్టుకుని టీచర్ వేషం వేసిన వాళ్లమే అందరమూ. మనుషులుగా ఎదగడంలో, పరిణతి చెందడంలో గురువుల ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ.తాజాగా గురు శిష్యుల అనుబంధానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 33 ఏళ్లపాటు సేవలందించి, పదవీ విమరణచేసిన ఒక ప్రొఫెసర్‌కు విద్యార్థులు భావోద్వేగ వీడ్కోలు పలికారు. XLRI జంషెడ్‌పూర్‌లో సుదీర్ఘ అకాడమిక్ ప్రస్థానం ముగిసిన సందర్భంగా ప్రొఫెసర్ వేణుగోపాల్ పింగళికి వీడ్కోలు పలుకుతూ విద్యార్థులు,అధ్యాపకులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న ప్రొఫెసర్ మనీష్ సింఘాల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు. పదవీ విరమణ రోజు ప్రొఫెసర్ పింగళి చివరి క్లాస్ ముగించుకొని వచ్చీ రావడంతోనే సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు తరగతి గది వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. ఇది చూసిన ఆయన కూడా ఆశ్యర్యానికి గురైనారు. విద్యార్థులతో పాటు ప్రొఫెసర్‌కూడా ఎమోషనల్ అయ్యారు. ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్ ప్రొఫెసర్ పింగళితో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రొఫెసర్ మనీష్ సింఘాల్ ఈ భావోద్వేగ క్షణాన్ని తన పోస్ట్‌లో పంచుకున్నారు. 2006 ఏప్రిల్ 13న సింఘాల్ XLRIలో చేరినప్పుడు పింగళి డీన్ (అకాడమిక్స్)గా ఉన్నారు. సింఘాల్ థీసిస్ పూర్తి చేయడానికి ఐఐఎమ్ కలకత్తా వెళ్లేందుకు లీవ్‌ల విషయంలో ప్రొఫెసర్ పింగళి ఎంతో మద్దతుగా నిలిచారని మనీష్ సింఘాల్ తెలిపారు. విద్యార్థుల వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిపాలనా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు.భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రొఫెసర్ పింగళి రూపొందించిన ఫ్రేమ్‌వర్క్‌లు తరాల తరబడి ఎంబీఏ (MBA) విద్యార్థులకు మార్కెటింగ్‌పై అవగాహన పెంచాయని ఆయన రాసుకొచ్చారు.ఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలుసోషల్ మీడియా స్పందనఈ వీడియో నెటిజన్లు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. నిజంగా అపూర్వమైన క్షణాలు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆయన వద్ద చదువుకునే భాగ్యం లభించిందని ఆయన విద్యార్థులు, ఆయన నిజంగా ఒక లెజెండ్ అంటూ ఇతరులు స్పందించారు. -
ఒకే రోజు.. మూడు విపత్తులు.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా
అత్యంత శక్తివంతమైన భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. ప్రకంపనల ధాటికి భవనాలు పేకమేడల్లా ఒరిగిపోతూ నేల కూలాయి. అదే సమయంలో సముద్ర గర్భంలో అలజడి రేగడంతో సునామీ వస్తుందేమోనని వణికిపోయారు. మరోవైపు.. అగ్నిపర్వతం బద్దలు కావడం అలజడి రేపింది. ఫ్లోరెస్ దీవి, మరికొన్ని చోట్ల రికార్డైన భయానక దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వేకువ జామున 7.7 తీవ్రతతో వచ్చిన ప్రధాన భూకంపంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్టర్‌షాక్స్ భయపెట్టాయి. 6.1, 5.9, 5.6 తీవ్రతలతో వరుస ప్రకంపనలు కొనసాగడంతో ఫ్లోరెస్ తీర ప్రజలు భయం భయంగా గడిపారు. ఎండె నగరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదు కాగా.. తూర్పు నుసా టెంగారా, పశ్చిమ నుసా టెంగారా, దక్షిణ సులవేసి ప్రాంతాల్లో సైతం జనాలు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్ల మీదే గడిపారు. బలమైన ప్రకంపనలు పలు ప్రాంతాల్లో దాదాపు నిమిషం పాటు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.🚨 The earthquake in Indonesia was magnitude 7.7. For many people, the early morning began with disaster. 🇮🇩#Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert pic.twitter.com/c4edaQnCEh— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 15, 2026#BREAKING : New Footage shows the Aftermath of Flores Indonesia Following 7.7m earthquake. 10 Dead & More than 1000 injured: Reports #Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert #IndonesiaEarthquake #EarthquakeNews #NaturalDisaster https://t.co/2V8cg4oQ7m pic.twitter.com/NrAVUu5g5u— Indian Observer (@ag_Journalist) August 15, 2026🚨 7.7-MAGNITUDE EARTHQUAKE HITS INDONESIA 🇮🇩A powerful earthquake struck off the coast of Ternate, causing panic and evacuations. Authorities are assessing possible damage and casualties.#Indonesia #Earthquake #BreakingNews #Ternate pic.twitter.com/WdP3JgvAGF— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 14, 2026🚨🇮🇩 BREAKING | 7.7-Magnitude Earthquake Hits IndonesiaA powerful 7.7-magnitude #earthquake struck off #Flores Island in eastern #Indonesia early Saturday, causing buildings to collapse and triggering widespread panic and evacuations. A #tsunami warning was issued but later… pic.twitter.com/OKTgVxpBaH— pradhyumn sharma (@pradhyu78651514) August 15, 2026కుప్పకూలిన భవనాలు.. వీధుల్లోకి పరుగులుభూకంపం తీవ్రతకు ఫ్లోరెస్ దీవిలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. మౌమెరే ప్రాంతంలోని పోర్టు టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కూలిపోయింది. భవనాల శిథిలాలు పడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. “భూకంపం చాలా తీవ్రంగా అనిపించింది. ఇంట్లో ఉన్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశాం” అని స్థానికులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఆసుపత్రుల్లో కలకలం.. బయటే చికిత్సప్రకంపనలతో ఆసుపత్రుల్లోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోగులను భద్రత దృష్ట్యా బయటకు తరలించారు. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను బయట ఏర్పాటు చేసి తాత్కాలిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.సిక్కా ప్రాంతంలోని సెయింట్ పీటర్ మేజర్ సెమినరీలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. అందులోని విద్యార్థులు, నన్స్ భయంతో పరుగులు తీశారు. పాస్టర్ ఒకరు రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయపడ్డారు.సునామీ హెచ్చరిక.. ఎత్తివేతఫ్లోరెస్ సముద్ర గర్భంలో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొన్ని గంటల తర్వాత హెచ్చరికను ఉపసంహరించారు.INDONESIA 🇮🇩 | #EARTHQUAKE 7.7 📹 IMAGES OF PANIC: Fear broke out near the coast of Ternate, and people had to be evacuated to safe areas. Authorities are assessing possible damage and casualties. There is a tsunami alert 🌊 pic.twitter.com/CSjsv5ckqW— Elizabeth J Trump (@eliza_Trump212) August 15, 2026మరింతగా మృతులు?ఈ ప్రకృతి విలయంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి నష్టం అంచనా వేస్తున్నాయి. ప్రాణ నష్టంపై ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని ఓ అధికారి అంటున్నారు. ఇక ఆస్తి నష్టం భారీగానే జరగొచ్చని తెలుస్తోంది.బద్ధలైన అగ్నిపర్వతం.. బూడిద మేఘాలుహల్మహెరా దీవిలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం బద్దలై.. భారీగా బూడిదను వెదజల్లింది. ఏకంగా 5 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి.🚨 BREAKING: Double disaster strikes Indonesia!🌋 Mount Ibu erupted on Halmahera, blasting a massive 5 km ash plume into the sky.💥 Shortly after, a powerful 7.7-magnitude earthquake rocked Flores Island.🌊 A tsunami warning has been activated for coastal areas.Stay safe and… pic.twitter.com/xviRMcR5i6— Byte Brief (@Byte_brief) August 15, 2026రింగ్ ఆఫ్ ఫైర్..భూకంపాలు, అగ్నిపర్వతాలకు ఇండోనేషియా అత్యంత ప్రమాదకర ప్రాంతం. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉండటంతో అక్కడ తరచూ భారీ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 1992లో ఇదే ఫ్లోరెస్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం సునామీకి దారితీసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లో సుమత్రా సమీపంలో సంభవించిన భారీ భూకంపం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సునామీల్లో ఒకదానికి కారణమైంది. ప్రస్తుతం ఫ్లోరెస్ దీవిలో ఆఫ్టర్‌షాక్స్ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఇండిగో విమానం రద్దు : ఆగ్రహంతో రగిలిపోయిన మహిళ వీడియో వైరల్
ముందస్తు సమాచారం ఇవ్వకుడానే విమానం రద్దు కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు గ్రౌండ్స్టాప్తో గొడవకు దిగిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. బిడ్డ అనారోగ్యం కారణంగా ఆమె అత్యవసరంగా విమానంలో వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. తీరా ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో ఆమె ఆవేదన గురైంది. ఒడిశాలోని భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.ఆగస్టు 13న భువనేశ్వర్ నుండి కోల్‌కతా వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 7352) సాంకేతిక లోపం వల్ల రద్దయింది. ఫ్లైట్ క్యాన్సిలేషన్‌తో తీవ్ర నిరాశకు గురైన ఒక మహిళా ప్రయాణికురాలు విమానాశ్రయంలోని లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి మరీ గొడవ చేయడం వివాదానికి దారి తీసింది. ఇండిగో సిబ్బంది డెస్క్‌పై ఉన్న పేపర్లు, డాక్యుమెంట్లను విసిరికొడుతూ సిబ్బందిపై విరుచుకుపడింది. విమానంలో ప్రయాణించాల్సిన ఆ మహిళ బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని, ("ఇన్ కా బచ్చా బిమార్ హై") అందుకే ఆమె అంత ఆందోళన చెందిందని అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు చెప్పారు. తోటి ప్రయాణికులు నీళ్లు ఇచ్చి ఆమెను శాంతపరిచేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరికి సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది జోక్యం చేసుకుని, మీరు ఎయిర్పోర్ట్ ఆస్తికి నష్టం కలిగిస్తున్నారంటూ హెచ్చరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.🚨Woman travelling with her sick child creates ruckus at Bhubaneswar Airport after IndiGo cancelled the Kolkata-bound flight over technical glitch without updates pic.twitter.com/nfXZ8NC40F— The Tatva (@thetatvaindia) August 14, 2026 ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. గంటల తరబడి వేచి చూసిన తర్వాత సమాచారం సరిగ్గా ఇవ్వకుండా ఫ్లైట్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మరికొందరు ఇండిగోను తప్పుపట్టారు. ఆమె ప్రవర్తన తప్పే అయినప్పటికీ ఆమె కోపానికి కారణాన్ని, మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాలని కొందరు కోరారు.మరోవైపు విమానాలు రద్దయితే గ్రౌండ్ స్టాఫ్‌పై ప్రతాపం చూపడం సరికాదని, వారు కేవలం విధి నిర్వహణలో ఉంటారని నెటిజన్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు.ఎయిర్పోర్ట్ ఆస్తిని పాడుచేసినందుకు మరియు భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెను 'నో-ఫ్లై లిస్ట్' (విమాన ప్రయాణాల నుంచి నిషేధం)లో పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు.ఇండిగో స్పందనఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది."ప్రీ-డిపార్చర్ తనిఖీలలో సాంకేతిక లోపం గుర్తించడం వల్ల సురక్షిత చర్యల్లో భాగంగా విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ఆహారం, బస (అకామడేషన్), ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు లేదా పూర్తి రీఫండ్ వంటి సౌకర్యాలు కల్పించాం. విమానాశ్రయం ఆస్తికి నష్టం కలిగించి నియమాలు ఉల్లంఘించిన సదరు మహిళను 'అన్‌రూలీ ప్యాసింజర్' (Unruly Passenger) గా గుర్తించి నిబంధనల ప్రకారం భద్రతా సంస్థలకు అప్పగించామని తెలిపింది. -
కోటి రూపాయల జాబ్ వదులుకున్నాడు, కారణం తెలిస్తే షాక్!
ఐదంకెల జీతం, విలాసవంతైన జీవనశైలి, లగ్జరీ ఇల్లు, ఖరీదైన కారు ఇవే జీవితం అనుకొని పరుగులు తీసే కాలానికి ఇక చెల్లు అంటోంది నేటి యువత. ప్రస్తుత కాలంలో ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మస్కాన్ అటార్ అనే మహిళ లింక్డిన్లో షేర్ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారింది. జెన్ జీ డబ్బు, కెరీర్ వృద్ధి,పని-జీవిత సమతుల్యతను ఎలా చూస్తారనే దానిపై ఆన్లైన్లో చర్చకు దారి తీసింది.స్టోరీ ఏంటంటే..ఏడాదికి కోటీ రూపాయల వార్షికవేతనం అంటే ఎవరైనా ఆనందంతో ఎగిరి గంతేస్తారు. కానీ ఓ జెన్-జీ మాత్రం అంత భారీ ఆఫర్‌కు సింపుల్‌గా నో చెప్పేశాడు. అదేంటి పిచ్చా అని అనుకుంటున్నారా? ఆగండి ఇక్కడే ఉంది అసలు సంగతి. విషపూరితమైనదిగా భావించిన పని ప్రదేశంలో పనిచేయడానికి అతడికి ఇష్టం లేదట. అందుకే ఉద్యోగ అవసరం చాలా ఉన్నప్పటికీ, ఈ ఉద్యోగావకాశాన్ని తిరస్కరించాడు.‘టాక్సిక్ వర్క్‌ప్లేస్’లో పనిచేయడం కంటే తక్కువ జీతమైనా తనకు నచ్చిన పని చేసుకోవడమే మేలని తన స్నేహితుడు నిర్ణయించుకున్నాడనీ మస్కాన్ అటార్ చెప్పుకొచ్చారు. కెరీర్లో కీలక దశలో ఉన్న సమయంలో ఇంత భారీ మొత్తాన్ని వదులుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు . 25 ఏళ్ల వయసు లోనే అతడు అంత భారీ ఆఫర్‌ను వద్దనుకోవడానికి చూపిన స్పష్టత తానైతే ఆ వయసులో చూపించలేక పోయేదాన్నని ముస్కాన్ పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, లైఫ్‌స్టైల్ ఆకాంక్షలు, సమాజపు ఒత్తిడి వల్ల సాధారణంగా ఎవరైనా ఆ డబ్బు వైపే మొగ్గు చూపుతారని అన్నారు.నేటి తరం యువత (Gen Z) కేవలం ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాల వెనుక పడకుండా, పని ప్రశాంతత (Work-life balance), మానసిక ఆరోగ్యం మరియు దీర్ఘకాలిక లక్ష్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ఘటన తెలుపుతోందన్నారు.అంతేకాదు రాబోయే రోజుల్లో నిపుణులైన ఉద్యోగులను నిలుపుకోవాలంటే కంపెనీలు తమ పని సంస్కృతిని, వాతావరణాన్ని మార్చుకోక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోటి ఆఫర్‌ను తిరస్కరించడం వెనక ఆర్థికంగా బలమైన నేపథ్యం లేదా నెలకు కొంతకాలం ఆదాయం లేకపోయినా ఉండ గలిగే వెసులుబాటు ఉన్నవారికే సాధ్యమని కొందరు వ్యాఖ్యానించగా నా మిడిల్ క్లాస్ మెంటాలిటీకి 45 ఏళ్ల వయసులో కూడా నేను అంత పెద్ద ఆఫర్‌ను వదులుకోలేను. అలాంటి ఆఫర్లు ఉంటే నాకే రీడైరెక్ట్ చేయండి!" అని ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. భవిష్యత్తు పని సంస్కృతి రాబోయే రోజుల్లో కేవలం జీతం మాత్రమే కాకుండా ఉద్యోగి మానసిక ఆరోగ్యం, వర్క్ శాటిస్ఫేక్షన్కు ప్రాధాన్యత ఇచ్చే ఉద్యోగులే భవిష్యత్తు కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తారని మరికొందరు సమర్థించారు. ఇదీ చదవండి: లిప్త పాటులో సుఖ్బీర్ ప్రాణాలను కాపాడింది ఈయనే : సర్వత్రా ప్రశంసలు. -
'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..
పసిబిడ్డలు ఏడిస్తే సహజంగా ఏం చేస్తాం పాలు, లేదా డైపర్ వంటివి తనిఖీ చేస్తాం. ఒకవేళ అవి కాకపోతే భయపడ్డాడేమోనని దగ్గరకి తీసుకోవడం లేదా ఊయల్లో వేసి ఊపడం వంటివి చేస్తే ఆ పసివాడు ఏడుపు ఆపుతాడు. సహజంగా ఎవ్వరైనా ఇలానే చేస్తాం. కానీ ఈసారి నెట్టింట వైరల్ అవుత్తున్న వీడియోలో వ్యక్తి మాదిరి చేసి చూడండి. అంతేగాదు ఈ ఘటన మన ఆధ్యాత్మకి శక్తి గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఉండటం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో ఒక తండ్రి ఏడుస్తున్న బిడ్డను పట్టుకుని ..నెమ్మదిగా ఓం శబ్దాన్ని ఆలపిస్తాడు. క్షణాల్లో బిడ్డ ఏదో మత్తువచ్చినట్లుగా శాంతించి నిద్రపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య పేరెంటింగ్ హ్యాక్‌గా మారింది. కఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్ లైక్‌లు రావడమే గాక నెటిజన్ల మనసుని దోచుకుంది కూడా."ఓం" అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఒక పవిత్రమైన మంత్రం. దీనికి భారతీయ ఆధ్యాత్మికత, యోగ సంప్రదాయాలలో "ఓం"కు సుదీర్ఘ చరిత్ర ఉంది, అక్కడ దీనిని మంత్రంగా, ధ్యానం చేసేటప్పుడు ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ పద్ధతి భారతీయ తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే “ఓం” జపించడం వల్లనే శిశువు ఏడుపు ఆగిపోతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ లయబద్ధమైన శబ్దాలు, పునరావృతమయ్యే ఇంద్రియ అనుభూతి, కదలిక, సంరక్షకుని సాన్నిధ్యం వల్ల శాంతిని చేకూరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఈ ఓం మంత్రపై పరిశోధనలు పెద్దలపైనే జరిగాయి. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ధ్యానంలో ఎటువంటి అనుభవం లేని 33 మంది పెద్దలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఓం జపం చేయడం వల్ల, వాళ్లలో ప్రతికూల భావాలు తగ్గడమే గాక ఆలోచన విధానంలో కూడా మంచి మార్పు వచ్చింది.పేరెంట్స్ ప్రయత్నించొచ్చా?తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, శిశువులలో కడుపునొప్పి, మితిమీరిన ఏడుపు లేదా నిద్ర సమస్యలను 'ఓం' నయం చేస్తుందనడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. అలాగే, ఈ ధ్వని శిశువు నాడీ వ్యవస్థపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పడానికి కూడా తగినంత ఆధారాలు కూడాలేవు.అయితే శిశువులు తమ సంరక్షకుల స్వరాలకు లయబద్ధమైన ఇంద్రియ అనుభవాలకు అత్యంత వేగంగా స్పందిస్తారు. అందువల్ల, ఈ "ఓం", శిశువులకు జోలపాట లేదా గుసగుసలు లేదా "ష్ష్ష్" వంటి ఊహించదగిన శ్రవణ సంకేతంగా పనిచేయవచ్చునని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శిశువు ఏడుపు ఆపడానికి ఇలాంటి "ఓం" టెక్నిక్‌ని అనుసరించడంలో సమస్యల లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ దీన్ని ఓ అద్భుత పరిష్కారంగా మాత్రం చూడొద్దని హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by Siqueiros Bolado (@ck.bolado)గమనిక: ఇది కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. అలాగే కొన్ని శబ్దాలు సహజంగా ప్రభావం చూపిస్తాయని అవగాహన కల్పించేందుకు మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. (చదవండి: ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..) -
ఆస్తి దాహం.. కొడుకు చేసిన పని వైరల్
ఆస్తి కోసం బంధాలను మరిచిపోయిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. మంచాన పడ్డ తండ్రికి వైద్యం చేయిస్తానంటూ అందరినీ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. ఆపై ప్రాణం పోయాక.. ఛీ కొట్టే పనికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో వైరల్ అవుతోంది. యూపీ లక్నోలోని ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు మహేంద్ర, కోడలు లక్ష్మి ఛత్రపాల్‌ను వేధించసాగారు. దీంతో ఆయన తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగించారు. ఈ క్రమంలో.. ఓరోజు తన ఆస్తిని కూతుళ్లకు సమానంగా పంచుతున్నానని, కొడుకు-కోడలును బహిష్కరిస్తున్నట్లు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామంతో మహేంద్ర, అతని భార్య రగిలిపోయారు. అయితే జులై 7న ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో మహేంద్రకు అతని సోదరి సమాచారం ఇచ్చింది. దీంతో మహేంద్ర తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి, వైద్యం చేయిస్తానంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ రెండు రోజులకే అంటే జులై 9న ఛత్రపాల్ మృతి చెందారు.తండ్రి అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్న కుమార్తెలకు మరో షాక్ ఎదురైంది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మహేంద్ర తన మృత తండ్రి బొటనవేలిని ఖాళీ కాగితాలపై ముద్రిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పత్రాలపై తీసుకున్న వేలిముద్రలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకుంటారోనని అనుమానం వ్యక్తం చేశారు.ఆపై ఊహించిందే జరిగింది. ఆస్తంతా తనదేనంటూ గొడవకు దిగాడు మహేంద్ర. దీంతో ఛత్రపాల్ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి శవంతో ఖాళీ పేపర్లపై వేలిముద్ర వేయించుకున్న దృశ్యాల్ని పోలీసులకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
10 ఏళ్లకు స్టైల్ మార్చిన ఇన్‌స్టా, నెటిజన్ల స్పందన వైరల్
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ (Instagram) తన స్టైల్ మార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తన వర్డ్‌మార్క్ లోగో (అక్షరాల శైలి)ను రీఫ్రెష్ చేసింది. ఈ విషయాన్ని మెటా ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్‌గా మారాయి. గత 10 ఏళ్లుగా యాప్ పైన ఉండే వర్డ్‌మార్క్ మారలేదు. అందుకే ఈ మార్పు చేశాం. ఇది మరింత క్లీన్‌గా, మోడరన్‌గా ఉంటూనే ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ శైలిని ప్రతిబింబిస్తుంది అంటూ ఆదమ్ మోస్సేరి ఈ మార్పుపై వివరణ ఇచ్చారు. View this post on Instagram A post shared by Adam Mosseri (@mosseri) ఇన్స్టాగ్రామ్ పేరులోని అక్షరాల రూపాన్ని (Typography) పునఃరూపకల్పన చేశారు. పాత స్క్రిప్ట్ శైలినే కొనసాగిస్తూనే, అక్షరాలను మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే అందరికీ సుపరిచితమైన రంగుల గ్రాడియంట్ కెమెరా ఐకాన్ (Camera Icon)లో ఎలాంటి మార్పు లేదు. 2016లో క్లాసిక్ బ్రౌన్ కెమెరా స్థానంలో ఈ గ్రాడియంట్ ఐకాన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనఈ కొత్త డిజైన్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ అసలుగుర్తింపు దెబ్బతినకుండా చక్కగా మోడరనైజ్ చేశారని కొందరు యూజర్లు మెచ్చు కుంటున్నారు. మరికొందరు ఈ డిజైన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. వర్డ్మార్క్లోని 'r' అక్షరం చూడటానికి 'z' లాగా కనిపిస్తోందని, ఇన్స్టాగ్రామ్ కాస్త "Instagzam" లా మారింది అంటూ మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. స్టేషన్లో పెళ్లి.. గంటలోనే విషాదం!
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కోసం కుటుంబాన్ని ఎదిరించింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు రైల్వే స్టేషన్లోనే అతడి చేత సింధూరం పెట్టించుకుంది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కంటూ.. ఆ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఆమె జీవితం విషాదంగా ముగిసింది.బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 19 ఏళ్ల మానిషా కుమారి బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. దిల్ఖుష్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడితో ఆమెకు ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ ప్రేమకు కుటుంబం నుంచి అంగీకారం లభించలేదు. మానిషాకు మరో యువకుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మానిషా.. ప్రియుడు దిల్ఖుష్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆగస్టు 10న దిల్ఖుష్ మానిషాను అరారియా నుంచి తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ పూర్ణియా జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు లేరు.. బంధువులు లేరు.. పెళ్లి సందడి లేదు. అయినా తమ ప్రేమే తమకు అండగా భావించిన ఆ జంట.. రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే పెళ్లి చేసుకున్నారు. దిల్ఖుష్ మానిషా పాపిట్లో సింధూరం పెట్టాడు. ఇద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కానీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించిన కొద్దిసేపటికే కథ ఒక్కసారిగా మారిపోయింది.పెళ్లి తర్వాత ఇద్దరూ రాంబాగ్ నుంచి సిటీ కాళీ ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఎండ తీవ్రంగా ఉంది. మార్గమధ్యంలో మానిషాకు ఒక్కసారిగా కళ్లు తిరిగాయి. దీంతో, ఆమెను హుటాహుటిన పూర్ణియా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. మరోవైపు.. కుటుంబ సభ్యులు తమ కూతురి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఆసుపత్రిలో విషాద వార్త వినిపించింది. చికిత్స పొందుతూనే మానిషా మృతి చెందింది. కొన్ని గంటల క్రితం భర్త పక్కన నిలబడి సింధూరంతో పెళ్లి ఫొటో దిగిన యువతి.. అదే రోజు విగతజీవిగా మారింది. మానిషా కుటుంబ సభ్యులు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోలు చూసి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడుందో తెలుసుకునేలోపే.. ఆమె మరణవార్త కుటుంబానికి చేరింది.మానిషాకు అకస్మాత్తుగా ఏమైంది?ఎండ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైందా? లేక ఆమె మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? యువతి ఆకస్మిక మరణం అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేహాట్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. మానిషా భర్త దిల్ఖుష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరారియా నుంచి బయలుదేరినప్పటి నుంచి.. స్టేషన్లో జరిగిన పెళ్లి.. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడం.. ఆసుపత్రిలో మృతి చెందడం వరకు జరిగిన మొత్తం పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మానిషా మృతికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడనుంది. ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ.. చివరకు రైల్వే స్టేషన్లో పెళ్లిగా మారింది. ఆ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో మెరిసిన కొన్ని గంటల్లోనే.. అదే కథ విషాదంగా ముగిసింది. -
అదంతా ఫేక్?.. జెన్‌జీ ముసుగు వెనుక షాకింగ్ ‘లెక్క’!
సోషల్ మీడియాలో ఓ తరం.. వీధుల్లో మరో శక్తి.. అంటూ జెన్ జీ గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. భారత్‌లోనూ పరీక్షల వ్యవహారాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యవస్థలపై ప్రశ్నలతో జెన్ జీ యువత ఆందోళనలు చేపట్టిన సందర్భాలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. అయితే పోరాటాలు, ట్రెండ్స్, సోషల్ మీడియా యాక్టివిజంతో ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఈ తరం.. తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు విషయంలో ఎలా వ్యవహరిస్తోంది?.. ఓ తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రావెల్, లైఫ్‌స్టైల్, ఎక్స్‌పీరియన్స్‌లకు ప్రాధాన్యం ఇచ్చే తరం అంటూ కనిపించే జెన్ జీ.. నిజ జీవితంలో మాత్రం డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందట!. భారీ కొనుగోళ్లు, విహారయాత్రల కంటే రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.శాలరీసే(SalarySe) నిర్వహించిన ఈ అధ్యయనం కోసం 5.2 లక్షల మందికి పైగా జీతం పొందుతున్న Gen Z వినియోగదారుల యూపీఐ లావాదేవీలను విశ్లేషించారు. సాధారణంగా జెన్‌జీ అంటే ప్రయాణాలు, డిజిటల్ లైఫ్, అనుభవాల కోసం ఎక్కువ ఖర్చు చేసే తరం అనే అభిప్రాయం ఉంది. కానీ వాస్తవ ఖర్చుల లెక్కలు మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి.70 శాతం ఖర్చు.. ఈ ఐదు కేటగిరీలకే!జెన్‌జీ తమ నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ భాగం అవసరాలకే వెళ్తోంది. బిల్లులు, సబ్స్క్రిప్షన్లు అత్యధికంగా 20.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత కిరాణా సరుకుల కోసం 15.7 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సంబంధిత చెల్లింపులకు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం ఖర్చవుతోంది. ఈ ఐదు విభాగాలు కలిపి నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా ఆక్రమిస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్ లైఫ్ కంటే.. జీవితంలోని సాధారణ అవసరాలే వారి బడ్జెట్లో పెద్ద భాగాన్ని తీసుకుంటున్నాయి.ట్రావెల్‌కు కేవలం 5 శాతంజెన్జీకు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం అనే ప్రచారం ఉన్నప్పటికీ.. వారి నెలవారీ ఖర్చుల్లో ట్రావెల్ వాటా కేవలం 5 శాతమేనని అధ్యయనం చెబుతోంది. ప్రయాణాలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నా.. అవి వారి రెగ్యులర్ బడ్జెట్‌ను పెద్దగా ప్రభావితం చేయడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే వినోదం, ప్రయాణాలపై ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.OTTలకు కూడా చోటుడిజిటల్ వినోదానికి Gen Zలో ఆదరణ కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సబ్స్క్రిప్షన్ ఖర్చుల్లో జియోహాట్‌స్టార్ 12.4 శాతంతో ముందంజలో ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ 10.7 శాతం, స్పాటిఫై 5.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యూపీఐ, ఆటోపే వంటి డిజిటల్ చెల్లింపు విధానాలు యువత ఆర్థిక అలవాట్లను మార్చుతున్నాయని అధ్యయనం పేర్కొంది. బిల్లులు ఆటోమేటిక్‌గా చెల్లించడం, సబ్స్క్రిప్షన్లు డిజిటల్‌గా కొనసాగడం వంటి విధానాలు Gen Z జీవితంలో సాధారణంగా మారాయి.వయసు పెరిగేకొద్దీ..అధ్యయనం 18–23 ఏళ్ల వయసు, 24–29 ఏళ్ల వయసు ఉన్న Gen Z గ్రూపులను కూడా పరిశీలించింది. ఆసక్తికరంగా.. ఇరు వర్గాల్లోనూ విచక్షణతో చేసే ఖర్చులు (డిస్క్రెషనరీ స్పెండింగ్) 32 శాతంగానే ఉన్నాయి. అయితే వయసు పెరిగేకొద్దీ అవసరాలపై ఖర్చు పెరుగుతోంది. 18–23 ఏళ్ల వయసు వారిలో అవసరాల ఖర్చు 50 శాతం ఉండగా.. 24–29 ఏళ్ల వయసు వారిలో అది 59 శాతానికి పెరిగింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఖర్చుల ప్రాధాన్యతలు మారుతున్నాయని ఇది సూచిస్తోంది.డిజిటల్ ఫైనాన్స్ వైపు Gen Zశాలరీసే సహ వ్యవస్థాపకుడు పీయూష్ బగారియా ప్రకారం.. భారత జెన్‌జీ పూర్తిగా డిజిటల్ ఆధారిత ఆర్థిక జీవనశైలిని అభివృద్ధి చేసుకుంటోంది. యూపీఐ విస్తృతి కారణంగా డబ్బు నిర్వహణ, చెల్లింపుల విధానం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు.మొత్తంగా చూస్తే.. సోషల్ మీడియాలో కనిపించే ట్రావెల్, లైఫ్‌స్టైల్ ఇమేజ్‌కు భిన్నంగా జెన్‌జీ వాస్తవ ఖర్చుల తీరు కనిపిస్తోంది. కలలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక భద్రతకే యువత ప్రాధాన్యం ఇస్తోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
‘ఆపండి.. ప్లీజ్’.. క్షణక్షణానికీ పెరిగిన భయం.. ర్యాపిడో బైక్ నుంచి దూకిన యువతి
ఆఫీసుకు వెళ్లేందుకు బుక్ చేసుకున్న ర్యాపిడో బైక్.. కొద్దిసేపటికే ఆమెకు భయానక ప్రయాణంగా మారింది. తెలిసిన రోడ్డు కాస్తా నిర్మానుష్యమైన మార్గంగా మారింది. గమ్యం వైపు వెళ్తున్నామా.. లేక ఎక్కడికో తీసుకెళ్తున్నారా అన్న అనుమానం మొదలైంది. ‘బైక్ ఆపండి.. మరో రూట్లో వెళ్లండి’ అంటూ ఆమె ఎంత చెప్పినా డ్రైవర్ ఆపలేదని బాధితురాలు ఆరోపించారు. చివరకు ప్రాణాలపై భయంతో కదులుతున్న బైక్ నుంచే దూకేశారు. అనంతరం, ఓ వీడియో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.వీడియో ప్రకారం.. బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ ఆఫీసుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారు. తొలుత ప్రయాణం సాధారణంగానే సాగింది. కానీ కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ తాను గుర్తించలేని, నిర్మానుష్యంగా కనిపించే మరో మార్గంలోకి బైక్‌ను మళ్లించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. చుట్టూ చూస్తే పెద్దగా జనసంచారం కనిపించకపోవడంతో భయపడినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. అది విశ్వవిద్యాలయానికి వెళ్లే నేరుగా ఉన్న దారేనని చెప్పినట్లు ఆయేషా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమెకు నమ్మకం కలగలేదు. మరో మార్గంలో వెళ్లాలని, లేదంటే బైక్‌ను ఆపాలని పలుమార్లు కోరినప్పటికీ డ్రైవర్ స్పందించలేదని ఆరోపించారు.Gig worker shcoker: A Terrifying Ride: Demand for Accountability In Delhi Ayesha Srivastav had to jump off a moving Rapido bike. The driver ignored her requests, took an isolated route and refused to stop. She suffered injuries from the jump.Shockingly Rapido took action… pic.twitter.com/J463SCdg0B— Ramesh Tiwari (@rameshofficial0) August 12, 2026పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన ఆమె.. డ్రైవర్‌ను ఆపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీంతో తన భద్రతపై తీవ్ర భయానికి గురై.. చివరకు కదులుతున్న బైక్ నుంచి దూకేశారు. రోడ్డుపై పడిపోవడంతో ఆయేషా చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. వైద్య చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఘటన తర్వాత కూడా తనకు సరైన స్పందన లభించలేదని ఆమె ఆరోపించారు. ర్యాపిడో కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించినా సకాలంలో స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించారు. View this post on Instagram A post shared by ✩⋆ 🖤 𝒜𝓎𝑒𝓈𝒽𝒶 𝓈𝓇𝒾𝓋𝒶𝓈𝓉𝒶𝓋 🖤 ⋆✩ (@ayesha_srivastav96) ‘వేలాది మంది మహిళలు ప్రతిరోజూ ర్యాపిడోలో ప్రయాణిస్తున్నారు. మహిళల భద్రత విషయంలో మీరు ఏం చేస్తున్నారు? డ్రైవర్ వివరాలు ఇవ్వండి. అతడిపై చర్యలు తీసుకోండి’ అంటూ ఆమె సంస్థను ప్రశ్నించారు. ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపిన సంస్థ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. డ్రైవర్ వివరాలను ఆయేషాకు అందజేసినట్లు, అవసరమైన న్యాయపరమైన చర్యల్లో ఆమెకు సహకరిస్తామని తెలిపింది. వైద్య లేదా చట్టపరమైన సహాయం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. -
‘హగ్’ కామెంట్ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకున్నారు.RaGa is in full roast mode.🤣🔥Rahul Gandhi just gave the most savage demonstration of “hug diplomacy”.*Runs and hugs Sandeep Dikshit*The hall couldn’t stop laughing. This one will travel. pic.twitter.com/XodlA8MvS8— Rajat Jain (@RajatJain) August 13, 2026ఈ సమయంలో సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.మోదీ ‘హగ్ డిప్లమసీ’పై రాహుల్ సెటైర్పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.బీజేపీ–ఆర్ఎస్ఎస్పై రాహుల్ విమర్శలుఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.‘‘మోదీ, అమిత్ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.సందీప్ దీక్షిత్ నేపథ్యంసందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. షీలా దీక్షిత్ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్‌ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. In 2024, PM Modi publicly said he was PAINED by the way Sheila Dikshit was "INSULTED" with baseless Corruption allegations.Today her own son, Sandeep Dikshit, stands on stage with Rahul & mocks the same Prime Minister 💔> He reduces a diplomatic gesture to a cheap joke by… pic.twitter.com/tALdiFnJhd— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 13, 2026‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.ట్రెండింగ్‌లో మెలోనీప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్‌ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్ గాంధీ హగ్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. -
పాన్‌షాప్ యజమానికి రూ. కోటి ఆస్తి,కారు, మరి ఎంబీఏ చదివినోడికి?
చిన్న చిన్న బడ్డీ కొట్లు, చిన్నదుకాణాలు, చిన్న వ్యాపారాలు బయట నుండి నిరాడంబరంగా కనిపించవచ్చు. కానీ కొంతమంది భారీ స్థాయిలోనే ఆదాయాన్ని ఆర్జిస్తారు. దీని వెనుక ఏళ్ల తరబడి శ్రమ, నిబద్ధత ఉంటుంది. అయితే ఇటీవల తన పరిసరాల్లోని ఒక పాన్ దుకాణాన్ని సందర్శించిన 34 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన అనుభవాన్ని సోషల్‌మీడియాలో పంచు కోవడం నెట్టింట విశేషంగా నిలిచింది.రెడ్డిట్ యూజర్, ఎంబీఏ పట్టభద్రుడు,పంచుకున్న అనుభవం ప్రకారం తమ వీధిలోని ఒక సాధారణ పాన్ షాప్ యజమాని గురించి వివరిస్తూ. .‘‘నేను ఇటీవల సిగరెట్ తాగడానికి దగ్గర్లోని పాన్ షాపుకు వెళ్ళాను. అక్కడ యజమాని సుమారు కోటి రూపాయల విలువైన కారు, షాపు కొన్నాడని తెలిసింది. అతను తన ఇంటిని కూడా రెన్నోవేట్ చేస్తున్నాడు. ఆయన పని చాలా కష్టమైన పనే. ఒకసారి, తెల్లవారుజామున 2 గంటలకు ఒకరికి సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించినందుకు అతనిపై కత్తితో దాడి కూడా జరిగింది.” అంటూ రాసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతను చుట్టూ ఉన్న మరిన్ని చిన్నదుకాణాలు ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, జ్యూస్ అమ్మేవారిని గమనించడం మొదలు పెట్టాడట.మరోవైపు సదరు MBA గ్రాడ్యుయేట్ వెన్నునొప్పి కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సరైన పని దొరకక ఇబ్బంది పడుతున్నారు.తమ చుట్టూ ఉన్నపాన్ షాప్ యజమానులే కాకుండా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, జ్యూస్ సెంటర్లు, మొబైల్ విక్రేతలు కూడా స్వయంగా వ్యాపారం చేసుకుంటూ మంచి ఆస్తులు కూడబెట్టుకోవడం, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడం చూశారని పేర్కొన్నాడు. అలాగే తమ ప్రాంతంలో ఒకతను పెద్దగా చదువుకోకపోయినా, భారతదేశంలో ఖరీదైన మొబైల్ ఫోన్లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అమ్మి బాగా సంపాదిస్తున్నాడంటూ మరొక ఉదాహరణను పంచుకున్నాడు. వీరిని చూశాక చిన్న వ్యాపారం ప్రారంభించడం బెటర్ అనిపిస్తోంది. తనకు నడుము నొప్పి లేకపోయి ఉంటే, తాను కూడా వడా పావ్ లేదా రామెన్ కియోస్క్ ప్రారంభించి ఉండేవాడిని, లేదా ఆన్లైన్ స్టోర్ల కంటే మెరుగైన ధరలకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మడం మొదలుపెట్టి ఉండేవాడినన్నాడు. అంతేకాదు చిన్న వ్యాపార యజమానులు గత 15-20 ఏళ్లలో ఒక టైర్-2 లేదా టైర్-3 కాలేజీ గ్రాడ్యుయేట్ తన జీవితకాలంలో సంపాదించే దానికంటే ఎక్కువే సంపాదించారు అంటూ ఉన్నత చదువులు (ఉదాహరణకు టైర్-2, టైర్-3 MBAలు) నిజంగానే మెరుగైన ఆర్థిక అవకాశాలను ఇస్తున్నాయా? లేదా చిన్న వ్యాపారాలే నయమా?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందనలుఈ పోస్ట్‌పై రెడ్డిట్‌లో తీవ్ర చర్చ జరిగింది. యూజర్లు వేర్వేరు దృక్పథాలను పంచుకున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ "మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇది కేవలం సక్సెస్ అయిన యజమాని కథ మాత్రమే. ప్రతి పాన్ షాప్ యజమానీ కోటీశ్వరుడు కాలేడు. చాలామంది పూట గడవడానికే కష్టపడతారు. సాధారణంగా ఒక సగటు MBA గ్రాడ్యుయేట్, ఒక సగటు పాన్ షాప్ యజమాని కంటే మెరుగైన ఆర్థిక స్థితిలోనే ఉంటాడు అంటూ వివరణ ఇచ్చారు.“నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ మీ వైఖరి చాలా వర్గపరమైనది. అపారమైన లాభాలు సంపాదించేంత వ్యాపార చతురత ఉన్న పాన్ షాప్ యజమాని విలువైన వస్తువులు కొనుక్కోవడంలో తప్పేముంది’’ అని మరొకరు ప్రశ్నించారు. వ్యాపార ఆదాయానికి పరిమితులుండవు. ఉద్యోగాల్లో ఉండే పరిమితుల కంటే చిన్న వ్యాపారాల్లోనే ఎక్కువ సంపాదనకు అవకాశం ఉంటుంది. సరైన గ్రోత్ లేని తక్కువ జీతం ఉద్యోగాల్లో ఇరుక్కుపోయే కంటే, రిస్క్ తీసుకుని వ్యాపారం చేయడం మంచిదని మరొకరు అభిప్రాయపడ్డారు. అంతేకాదు వ్యాపార నైపుణ్యం ఉండి, శ్రమపడి సంపాదించిన వ్యక్తి కార్లు, ఆస్తులు కొనుగోలు చేయడంలో తప్పులేదని, ఏ పనినీ తక్కువగా చూడకూడదని మరికొందరు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటంచాలా మంది 20-30 లక్షల వార్షిక ఆదాయాన్ని అరుదైనదిగా భావించడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. వారు తమ ఉద్యోగ ప్రపంచం నుండి బయటకు వచ్చి, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే, 20-30 లక్షల వార్షిక ఆదాయం చాలా సాధారణం. మీరు భవిష్యత్తులో కెరీర్ వృద్ధి లేని తక్కువ జీతం గల ఉద్యోగంలో చిక్కుకుపోయి ఉంటే, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా వ్యాపార అవకాశాలను అన్వేషించడం ప్రారంభించండి ఇంకొకరు సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఉన్నత విద్య కేవలం ఉద్యోగ భద్రతను ఇచ్చే మార్గం మాత్రమే. స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారాలు చేసే శ్రమ, రిస్క్, కస్టమర్ మైండ్‌సెట్ ఉంటే చదువుతో సంబంధం లేకుండా గొప్ప ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. ఏమంటారు?ఇదీ చదవండి: రోడ్డుపై టైగర్ : సెల్ఫీలకు ఎగబడిన పర్యాటకులు, వీడియో వైరల్ -
రోడ్డుపై టైగర్ : సెల్ఫీలకు ఎగబడిన పర్యాటకులు, వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్ (Tadoba-AndhariTiger Reserve) సమీపంలోని రహదారిపై పులి కనిపించినప్పుడు పర్యాటకులు ప్రవర్తించిన తీరు, ప్రమాదకర ప్రవర్తనపై వన్యప్రాణి ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల పట్ల పర్యాటకుల ప్రవర్తనపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ప్రజలు తమ వాహనాల నుండి దిగి, ఫోటోలు తీయడానికి, వీడియోలు రికార్డ్ చేయడానికి, సోషల్ మీడియా రీల్స్ (Reels) కోసం పెద్ద పులికి ప్రమాదకరంగా దగ్గరగా వెళ్లడం కనిపిస్తుంది. వన్యప్రాణుల ప్రేమికులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు . జంగిల్ సఫారీల సమయంలో అన్ని భద్రతా మార్గదర్శకాలను పాటించాలని పర్యాటకులను కోరారు. సఫారీ ఉద్దేశం వన్యప్రాణులను సురక్షితమైన దూరం నుంచి పరిశీలించడమే తప్ప, వాటికి అంతరాయం కలిగించడం లేదా వాటిని రెచ్చగొట్టడం కాదని నిపుణులు తెలిపారు.ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు అటవీ అధికారుల సూచనలు:పులులు లేదా ఇతర అడవి జంతువులు సోషల్ మీడియా సెల్ఫీల కోసం వస్తువులు కావని అధికారులు స్పష్టం చేశారు.వాహనాలు దిగడం, జంతువులకు అడ్డంగా వెళ్లడం, వాటిని తారసపడటం లేదా గట్టిగా అరిచి శబ్దాలు చేయడం వల్ల అవి ఒత్తిడికి గురై దాడి చేసే ప్రమాదం ఉందన్నారు. View this post on Instagram A post shared by Responsible Sane (@thenewscurrenthq)నిజమైన వన్యప్రాణి అనుభూతికి దగ్గరగా వెళ్లడం అవసరం లేదని, కానీ జంతువు స్వేచ్ఛగా తిరగడానికి తగినంత స్థలం ఇచ్చి, దానిని దాని సహజ స్థితిలో ఉండనివ్వాలని పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులు గుర్తుంచుకోవాలని కోరారు.సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం క్రూర మృగాలను వేధించకుండా, అటవీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పర్యాటకులకు, సఫారీ గైడ్లకు విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటంవన్యప్రాణులను దగ్గరగా చూడటం కోసం లేదా వైరల్ వీడియో కోసం పర్యాటకులు వన్యప్రాణులకు దగ్గరగా వెళ్లి,ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న ఘటన ఇదే తొలిసారికాదు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు చాలానే ఉన్నాయి.జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (జనవరి 2026): ఉత్తరాఖండ్‌లోని ఫాటో ఎకో-టూరిజం జోన్లో ఒక పులిని సఫారీ వాహనాలు వేగంగా తరిమిన వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు గైడ్లపై అటవీశాఖ నిషేధం విధించింది.ముదుమలై టైగర్ రిజర్వ్ (నవంబర్ 2024): తమిళనాడులోని ఈ రిజర్వ్‌లో వాహనం దిగి జింకల మందను తరిమిన ముగ్గురు పర్యాటకులకు అటవీ అధికారులు రూ. 15,000 జరిమానా విధించారు.ఇదీ చదవండి: 360 ఎకరాల ‘దెయ్యాల నగరం’ : రూ. 13.3 కోట్లకు వ్యాపారవేత్త డీల్ -
టీచర్‌కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ఆల్ఫా
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్‌లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్‌జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్‌గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే..గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.జెన్ ఆల్ఫా గళం.. స్కూల్ రోడ్డు కోసం పోరు!ఉత్తరప్రదేశ్‌లోని చందూపూర్ గ్రామంలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యపై గళమెత్తారు. స్కూల్‌కు వెళ్లేందుకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలోనూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తి చేసినా తాత్కాలికంగా మట్టి పోసి వదిలేశారని, వర్షాలతో మళ్లీ దారంతా బురదగా మారిందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.జెన్ ఆల్ఫా అంటే ఎవరు?జెన్‌జీ తర్వాతి తరమే జెన్ ఆల్ఫా (Generation Alpha). సాధారణంగా 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫాగా పరిగణిస్తారు.ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ మధ్య పెరిగారు. అందుకే వీరిని కొందరు “డిజిటల్ నేటివ్స్” అని కూడా పిలుస్తారు. వీరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో భయం తక్కువగా ఉంటుందని, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే స్వభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కొందరు పిల్లలు రోడ్డెక్కడం గమనార్హం.#Jabalpur में Gen Alpha का धरना प्रदर्शन.चीन-अमेरिका हमारे देश की शिक्षा व्यवस्था सुधारने के लिए इन छात्रों को Funding कर रहा है- कट्टर अंधभक्त pic.twitter.com/3IVFzMuuFC— NEYU MADHYAPRADESH (@NEYU4MP) August 13, 2026ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువత నిరసనలు, సామాజిక ఉద్యమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ (సుమారు 1997–2012 మధ్య జన్మించిన తరం) ఉద్యమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు చిన్న వయసులోనే తమ హక్కులు, న్యాయం, విద్యా సమస్యలపై స్పందిస్తున్న జెన్ ఆల్ఫా పిల్లలు కూడా చర్చలోకి వస్తున్నారు. జార్ఖండ్ ఘటనలో విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి కోసం ఏకంగా రోడ్డెక్కడం.. ఈ కొత్త తరం వైఖరిపై మరోసారి చర్చకు తెరతీసింది. -
బీజేపీ ఆఫీస్‌లో అలా.. రైల్వే ఉద్యోగి ఇలా!
పంద్రాగస్టు వేడుకలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. జాతీయ పతాకం గౌరవంపై రెండు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కేరళలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాకాలు మూలన పడేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో వీడియో ద్వారా జాతీయ జెండా పట్ల గౌరవం, బాధ్యతపై చర్చ మొదలైంది.కేరళలోని కాసర్గోడ్ బీజేపీ జిల్లా కార్యాలయంలో కొన్ని త్రివర్ణ పతాకాలు ఒక మూలన పడేసినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ డీవైఎఫ్ఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టం ప్రకారం ‘Prevention of Insults to National Honour Act, 1971’ కింద నేరమని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే వైరల్ వీడియోపై బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.BJP faces allegations of disrespecting Indian flag in Kerala's KasaragodSeveral Indian national flags were allegedly found piled up at the BJP district office in Kasaragod after a Tiranga Yatra under the Har Ghar Tiranga campaign. DYFI sought strict action and filed a complaint… pic.twitter.com/munNIIQwcJ— South First (@TheSouthfirst) August 12, 2026మరోవైపు.. రైల్వే ఉద్యోగి చేసిన ఓ చిన్న పని మాత్రం ప్రశంసలు అందుకుంది. దుమ్ముతో నిండిపోయిన రైలింజిన్ ముందు భాగంలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఓ ఉద్యోగి నీటితో శుభ్రం చేసి, వస్త్రంతో తుడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ పతాకం పట్ల చూపిన గౌరవానికి నెటిజన్లు అభినందనలు తెలిపారు. సాధారణ విధుల్లో భాగంగా చేసిన పని అయినప్పటికీ.. జాతీయ చిహ్నాల పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని పలువురు స్పందించారు.Yes, there may be dirt on the locomotive but the flag should be clean. Small gesture, big message! 🙏🤎 #HarGharTiranga #IndianRailways pic.twitter.com/iGlLXEtMM3— Ananth Rupanagudi (@AnanthOnTrack) August 12, 2026ఒకవైపు పతాకాల నిర్లక్ష్యంపై వివాదం.. మరోవైపు పతాకానికి గౌరవం తెలిపిన చర్య.. జాతీయ జెండా పట్ల మన బాధ్యతపై మరోసారి చర్చకు దారితీశాయి. -
ఇల్లు రెంట్ కోసం వెళ్లారు.. ఒక్కసారిగా నరకం చూశారు!
ఇల్లు చూసేందుకు వెళ్లారు.. గేటు తెరిచారు.. అంతే! ఒక్కసారిగా లోపలి నుంచి దూసుకొచ్చిన పిట్‌బుల్ కుక్క భార్యపై విరుచుకుపడింది. ఆమెను కాపాడేందుకు భర్త ముందుకొచ్చినా.. అతడినీ వదల్లేదు. క్షణాల్లోనే ఆ ప్రదేశం భీతావహంగా మారిపోయింది. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దంపతులు.. చేతుల్లో కర్రలు పట్టుకుని కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు.. చివరకు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన భార్యాభర్తలు. ఈ భయానక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పంజాబ్‌లోని పాటియాలాలో ఘుమన్ నగర్లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.వివరాల మేరకు.. పాటియాలాకు చెందిన అంకిత్ సభర్వాల్ తన భార్య షిఫాలితో కలిసి ఓ ప్రాపర్టీ డీలర్‌తో ఇంటిని చూసేందుకు అక్కడికి వెళ్లారు. ఇంటి గేటు తెరవగానే లోపలి నుంచి పిట్‌బుల్ ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి షిఫాలిపై దాడి చేసినట్లు అంకిత్ తెలిపారు. కుక్క ఆమె చేతితో పాటు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రంగా దాడి చేయడంతో లోతైన గాయాలయ్యాయి. గాయాల తీవ్రత కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన అంకిత్‌పైనా కుక్క దాడి చేసింది. అతడి కాళ్లు, వీపుపై లోతైన కాటు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించినట్లు ప్రచారంలో ఉన్న సీసీటీవీ వీడియోలో కుక్క దంపతులపై దాడి చేస్తుండటం కనిపిస్తోంది. వారు దాని నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కుక్క వారిని వదలకుండా వెంటపడినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇక, కుక్క దాడిని ఆపేందుకు స్థానికులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. ఓ మహిళ చేతిలో కర్రతో ఇంటి నుంచి బయటకు వచ్చి కుక్కను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కర్రలతో అక్కడికి చేరుకుని కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు తీవ్రంగా గాయపడిన దంపతులను దాని నుంచి దూరంగా తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.Patiala | A couple was attacked by a pit bull when they went to see a house for rent. pic.twitter.com/wANMStPzJZ— Gagandeep Singh (@Gagan4344) August 12, 2026ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు అంకిత్ తెలిపారు. కుక్కను స్వేచ్ఛగా బయటకు రానిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంటి గేటు తెరిచిన వెంటనే ఇంతటి ప్రమాదకర దాడి జరగడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పాటియాలా మేయర్ కుందన్ గోగియా కూడా స్పందించారు. నగరంలో పిట్‌బుల్ వంటి దూకుడు స్వభావం కలిగిన కుక్క జాతులను పెంపుడు జంతువులుగా పెంచడాన్ని నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ సమావేశంలో చర్చించి ప్రత్యేక తీర్మానం తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
రూ. 50 లక్షలు, 15 ఏళ్ల కష్టం, కెనడాలో మాస్టర్స్ : చివరకు మిగిలింది!
సాక్షి, ముంబై: ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లడం, అక్కడ డాలర్లలో సంపాదించడం చాలామంది యువకుల కల. ఇంకా చెప్పాలంటే ప్రతీ తల్లిదండ్రుల కల. కానీ విదేశాల్లో చదువులు, లక్షల కొద్దీ లోన్లు, తద్వారా ఎదురయ్యే ఆర్థిక సవాళ్లపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ఆన్లైన్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. విషయం ఏమిటంటే.ఒక కుటుంబం తమ కొడుకు మాస్టర్స్ డిగ్రీ చదువు కోసం కెనడాకు పంపింది. ఇందుకోసం పదిహేళ్లనుంచి కష్టపడి దాచుకున్న రూ. 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను కరిగించింది. తీరా చూస్తే లక్షల్లో ఆదాయం ఏమోగానీ, ఆ గ్రాడ్యుయేట్ ఇప్పుడు టొరంటోలో అధిక పన్నులు, ఖరీదైన అద్దె, పెరుగుతున్న జీవన వ్యయాలతో సతమతమవుతున్నాడు. అనుకున్నంత పొదుపు చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని వ్యాపారవేత్త హర్ష్ గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఇదీ చదవండి: నిబంధనలు గాలికి,అపరిశుభ్రత : జెప్టోకు భారీ షాక్ప్రస్తుతం ఆ యువకుడు టోరంటోలో ఏడాదికి 55 వేల కెనడియన్ డాలర్లు (CAD) సంపాదిస్తున్నప్పటికీ , అక్కడి అధిక ఖర్చుల వల్ల, భారత్‌లోని ఏదైనా మధ్యస్థ నగరంలో ఉద్యోగం చేసుకుంటే వచ్చే పొదుపు కంటే ఇక్కడే తక్కువ మిగులుతోందని పోస్ట్‌లో పేర్కొన్నారు. రూ. 50 లక్షల్ని భారత్‌లోనే పెట్టుబడి రూపంలో ఉంచితే వచ్చే లాభాలను ఎవరూ పరిగణనలోకి తీసుకోరని, విదేశీ డిగ్రీలు కేవలం ఒక ఖరీదైన అనుభవంగా మిగిలిపోతున్నాయని గుప్తా అభిప్రాయపడ్డారు.వాస్తవానికి లెక్కలు వేసుకునేంత వరకు విదేశాలకు వెళ్లడం ఒక కలలా కనిపిస్తుంది. విపరీతమైన అద్దె, పన్నులు, జీవన వ్యయం వంటి వాటి మధ్య, డాలర్లు లేదా కెనడియన్ డాలర్లలో సంపాదించడం వల్ల, మన స్వదేశంలోని ఒక సాధారణ ఉద్యోగంతో పోలిస్తే చాలా తక్కువే పొదుపు చేయగలం అని వ్యాపారవేత్త హర్ష్ గుప్తా తెలిపారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా అంత మొత్తం ఖర్చు చేయడం ముమ్మాటికీ పొరపాటని కొందరు వ్యాఖ్యానించగా, ఈ అభిప్రాయాన్ని తప్పుబడుతూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.ఇదీ చదవండి: జస్ట్ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్ చేస్తే...! -
ట్రంప్‌కే షాక్ ఇచ్చిందా? ఐయామ్ ప్రెగ్నెంట్ అంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈసారి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయం కాదు.. ఆయన పక్కన నిల్చున్న ఓ మహిళ. ట్రంప్ కీలక ఆదేశంపై సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన కనిపించిన మహిళపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి. చివరకు ఆ మహిళే స్పందించి అసలు విషయం వెల్లడించాల్సి వచ్చింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో వ్యాక్సినేషన్ విధానానికి సంబంధించి కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళ ఆయన పక్కన నిల్చున్నారు. వీడియోలో ఆమె పదేపదే తల ఊపుతూ, ఒక చేయిని తన పొట్టపై ఉంచుకున్నట్లు కనిపించింది. ఆ వెంటనే మత్తులోకి జారుకున్నట్లు కనిపించిన ట్రంప్.. హఠాత్తుగా అప్రమత్తం అయ్యారు. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు విచిత్రమైన వాదనలు మొదలుపెట్టారు.Claims she has a button fitted on her belly, and when she gets the nod that he’s asleep she moves her hand and presses a button that wakes him. They’re calling her The Zapper. No idea if it’s true but it *appears* to line up. pic.twitter.com/hgx4x6iQp6— Tim Brannigan (@tim_brannigan) August 11, 2026ట్రంప్‌కు షాక్ ఇచ్చిందా?..కొందరు నెటిజన్లు ఆమె చేతిలో ఏదో పరికరం ఉందని, ట్రంప్‌ను అప్రమత్తం చేసేందుకు విద్యుత్ షాక్ ఇచ్చిందంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం వేగంగా వ్యాపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె పేరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ (Jayme Leagh Franklin). ఆమె అమెరికాలోని కన్జర్వేటివ్ మీడియా, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ది కన్జర్వేటర్ (The Conservateur) వ్యవస్థాపకురాలు, సీఈవో.నెట్టింట వస్తున్న వింత ఆరోపణలపై స్పందించిన ఫ్రాంక్లిన్.. తాను గర్భవతినని వెల్లడించారు. తన పొట్టపై చేయి పెట్టుకోవడానికి కారణం అదే అని స్పష్టం చేశారు. “నేను కేవలం గర్భవతిని మాత్రమే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ట్రంప్‌కు తాను షాకిచ్చి అప్రమత్తం చేశానంటూ తనపై వస్తున్న ఊహాగానాలను చూసి ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు.ఆ కార్యక్రమంలో ఎందుకు ఉన్నారు?వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ల మధ్య ఫ్రాంక్లిన్ నిల్చున్నారు. బాలల వ్యాక్సినేషన్ సిఫార్సుల్లో మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఫ్రాంక్లిన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ట్రంప్‌తో కలిసి ఓవల్ ఆఫీస్‌లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎవరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్?జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ గతంలో ట్రంప్ పాలనలో పనిచేశారు. నార్త్ కరోలినాకు చెందిన ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ నుంచి 2020లో పట్టా పొందారు. 2019లో అమెరికా సెనేట్‌లో లెజిస్లేటివ్ ఇంటర్న్‌గా పనిచేసిన ఆమె.. 2020 ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కోయలిషన్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అనంతరం ట్రంప్ తొలి వైట్‌హౌస్ పాలనలో కరస్పాండెన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె నడుపుతున్న ది కన్జర్వేటర్.. రాజకీయాలు, సంస్కృతి, విశ్వాసం, ఫ్యాషన్, బ్యూటీ అంశాలపై కంటెంట్ అందించే కన్జర్వేటివ్ మీడియా సంస్థగా కొనసాగుతోంది. అదీ అసలు ముచ్చట. -
జెన్‌జీపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియా, రీల్స్ యుగంలో పెరుగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించేందుకు షార్ట్‌కట్స్ వెతకవద్దని.. అది ఎంతో ప్రమాదమని.. కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలం సోషల్ మీడియా, రీల్స్ యుగంగా మారిందని ప్రధాని అన్నారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం సరైన మార్గం కాదని చెప్పారు.“ఇది రీల్స్ కాలం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటారు. కానీ ఈ షార్ట్‌కట్ యుగంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. రైల్వే స్టేషన్లలో రాసి ఉంటుంది.. ‘షార్ట్‌కట్స్ విల్ కట్ యూ షార్ట్’” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదవాలని సూచించారు. వారి ప్రయాణం, కష్టాలు, విజయాల నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు.ప్రధాని మోదీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది తెలిసిందే. జంతర్ మంతర్ నీట్ నిరసనల తర్వాత.. తొలిసారి సెల్ఫీ వీడియో సందేశం ఇచ్చారు ఆయన. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వివిధ అంశాలపై వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతను ఆకట్టుకోవాలని మంత్రులకు, ఎంపీలకు సైతం ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జెన్జీపైనా వివిధ కార్యక్రమాల్లో వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కోవింద్ జీవితం యువతకు స్ఫూర్తిఇవాళ్టి కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ కేవలం వ్యక్తిగత విజయాల కథ కాదని.. అది భారత ప్రజాస్వామ్యం, సమాజం అందించిన అవకాశాలకు ప్రతిబింబమని ప్రధాని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించారని గుర్తు చేశారు. ఆయన జీవితంలోని పోరాటాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పదవి నుంచి దిగినా దేశ సేవ కొనసాగింపురాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత కూడా కోవింద్ విశ్రాంతి తీసుకోకుండా కీలక అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’(వన్‌నేషన్.. వన్ ఎలక్షన్) అంశంపై ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మోదీ అన్నారు.కోవింద్ వినయం.. భారత విలువలకు ప్రతీకమాజీ రాష్ట్రపతి వినయం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని కూడా ప్రధాని గుర్తు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న సమయంలోనూ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి తనను కారు వరకు వచ్చి సాగనంపేవారని చెప్పారు. అలాగే తన గ్రామం పర్యటనలో కోవింద్ తన గురువుల పాదాలకు నమస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ.. అది భారతీయ సంస్కృతి విలువలను ప్రపంచానికి చాటిందని అన్నారు.“విజయాలు వ్యక్తిగతం కాదు.. సమాజం భాగస్వామ్యం”ఒక వ్యక్తి విజయాలను తన సొంత ఘనతగా భావించడం సాధారణమని.. కానీ సమాజం అందించిన సహకారాన్ని గుర్తించే వ్యక్తులే గొప్పవారని మోదీ అన్నారు. కోవింద్ ఆత్మకథలో ఇదే భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు వ్యక్తిగతమైనప్పటికీ.. వాటి నుంచి వచ్చిన విజయాలు భారత ప్రజాస్వామ్య విజయాలని అభివర్ణించారు.రీల్స్ వేగంలో జీవిత ప్రయాణాన్ని చిన్నదారిలో ముగించాలని చూస్తున్న యువతకు, మరీ ముఖ్యంగా జెన్‌జీకి.. అనుభవాల నుంచి నేర్చుకోవాలనే ప్రధాని మోదీ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీకి బిగ్ షాక్.. ‘ఎయిర్‌పోర్టుకు పడవలు వస్తాయా?’
నోయిడా: ఆకాశంలో ఎగరాల్సిన విమానాశ్రయం.. వర్షం పడితే నీట మునిగింది. ప్రారంభించి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే రూ.11,200 కోట్లతో నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ వర్షానికి టెర్మినల్-పార్కింగ్ మార్గంలో నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ‘అభివృద్ధి మోడల్’గా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది.మంగళవారం గ్రేటర్ నోయిడాలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు జేవర్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గం నీటితో నిండిపోయింది. ప్రయాణికులు, వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని తొలగించేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది రంగంలోకి దిగిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. భారీ పెట్టుబడులు, ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయంగా ప్రచారం పొందిన ప్రాజెక్టులో.. ఒక్క భారీ వర్షం పడితే నీరు నిలిచిపోవడమేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.Heavy rainfall today caused severe waterlogging at Noida International Airport in Uttar Pradesh, India. The airport was inaugurated by Prime Minister Narendra Modi on March 28, 2026. pic.twitter.com/mVu12u7B7Z— Weather Monitor (@WeatherMonitors) August 11, 2026విమర్శలకు తోడు రాజకీయ కౌంటర్లు కూడా మొదలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నేరుగా బీజేపీపై సెటైర్ వేశారు. “ఇక విమానాశ్రయంలో పడవలు నడుస్తాయా?” అంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు. బీజేపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అయితే ఎయిర్‌పోర్టు యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షపాతం నమోదవడంతో టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే మార్గంలోకి వర్షపు నీరు వచ్చిందని తెలిపింది. తమ సిబ్బంది వెంటనే స్పందించి 30 నిమిషాల్లోపే నీటిని తొలగించారని వెల్లడించింది.నీరు నిలిచిన సమయంలో ప్రయాణికులు, వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించారు. ప్రయాణికులను నేరుగా కర్బ్ వద్ద పికప్, డ్రాప్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. విమానాలు ఆగిపోయాయా లేదా అన్నది ఒక విషయం.. నీరు ఎందుకు నిలిచింది అన్నది మరో విషయం. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలో వర్షపు నీటి నిర్వహణ వ్యవస్థ ఎంత సమర్థంగా ఉంది? భవిష్యత్తులో ఇంతకంటే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.మరోవైపు సోషల్ మీడియాలో కొందరు ఈ ఘటనను వ్యంగ్యంగా తీసుకున్నారు. “ఇది ఎయిర్‌పోర్టా.. స్విమ్మింగ్ పూలా?” అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఒక్క ఘటన ఆధారంగా మొత్తం ప్రాజెక్టును తప్పుబట్టడం సరికాదని అంటున్నారు. వాస్తవానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పందించి తక్కువ సమయంలోనే నీటిని తొలగించడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28, 2026న విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.11,200 కోట్లు ఖర్చయ్యాయి. అయితే రెగ్యులర్ కమర్షియల్ విమాన కార్యకలాపాలు జూన్ 15 నుంచి ప్రారంభమయ్యాయి.Noida International Airport amidst Heavy rains today🚨 #DelhiRains pic.twitter.com/rp0Ur3jaed— Mumbai Nowcast (@s_r_khandelwal) August 11, 2026 -
ఆమె కండక్టర్‌తో వెళ్లిపోయింది.. అంతే!
వివాహేతర సంబంధాల మోజులో.. నేరాలు-ఘోరాలు జరుగుతున్న కాలం ఇది. కట్టుకున్న బంధాలను పక్కన పెట్టి క్షణిక సుఖాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. అనుమానాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో పలు ఘటనలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి.. అందునా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి, అందమైన తన భార్య ఓ కండక్టర్‌కి మనసిచ్చి వెళ్లిపోయిందంటూ నేరుగా వీడియో రిలీజ్ చేయడం సంచలన చర్చకు దారి తీసింది.మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటుడు అఖిల్ NRD వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన భార్య మేఘా ఓ కండక్గర్తో వెళ్లిపోయిందని నేరుగా ఆయనే వీడియో విడుదల చేయడం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. నైటీలో లగేజీతో ఆమె స్పీడ్‌గా వెళ్లి.. ఓ వ్యక్తితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వివాహేతర సంబంధాల నేరాల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. CCTV visuals are currently going viral on social media, claiming that Kerala YouTuber Akhil NRD's wife, Megha Nair, has run away with a bus conductor. Watch the video to see the reality behind it! 👇 pic.twitter.com/N9WUns571W— Vijitha (@Vijitha96) August 11, 2026అయితే భర్తను చంపకుండా వదిలేసి వెళ్లిపోయింది ఆమె గ్రేట్ అంటూ కొందరు.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇదేం పని? అని మరికొందరు.. ఆ కండక్టర్లో ఆమెకేం నచ్చిందో అని మరికొందరు ఇలా కామెంట్ల రచ్చతో చర్చకు దారి తీశారు. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామంపై అఖిల్ స్నేహితుడు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సాయి కృష్ణ స్పందించడంతో మరింత ఆసక్తి నెలకొంది. అఖిల్-మేఘా వివాహానికి తాను హాజరయ్యానని చెప్పిన సాయి కృష్ణ.. ఈ వార్త విని తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఈ విషయంపై అఖిల్‌తో మాట్లాడానని, అయితే ఈ విషయంలో ఎవరినీ నిందించేందుకు అఖిల్ ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.“ఆమె వెళ్లిపోయింది.. అంతే!”భార్య చేసిన నమ్మక ద్రోహంపై అఖిల్ రియాక్షన్‌ను సాయి కృష్ణ మీడియాకు వెల్లడించాడు. ఆమె వెళ్లిపోయింది అంతే అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ‘‘ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టను..నిందించను. దేవుడు నాకు ఇలా రాసిపెట్టాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలోనైనా ఎదురవుతాయి. నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిననే అనుకుంటున్నా. ఈ విషయాన్ని మరింతగా చర్చించడం ఇష్టం లేదు’’ అంటూ అఖిల్ అన్నాడట.సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై వస్తున్న చర్చలపై కూడా సాయి కృష్ణ స్పందించారు. పరిచయమైన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సంచలనంగా మార్చకుండా, కొంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.మెర్చంట్ నేవీ నుంచి సోషల్ మీడియా స్టార్..అఖిల్ ఎన్ఆర్డీ ప్రయాణం కూడా ప్రత్యేకమైనదే. తొలుత ఆయన మెర్చంట్ నేవీలో పనిచేశాడు. ఆ తర్వాత డిజిటల్ కంటెంట్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాడు. టిక్‌టాక్ ద్వారా వీడియోలు చేయడం ప్రారంభించి.. కామెడీ వీడియోలు, లైఫ్‌స్టైల్ కంటెంట్, వ్లాగ్స్‌తో భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. తర్వాత యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా పాపులారిటీతో నటుడిగానూ అవకాశాలు అందుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీసోషల్ మీడియా స్టార్ నుంచి మాలీవుడ్‌లో చిన్నాచితకా అవకాశాలు అందుకున్నాడు అఖిల్. 2026లో మలయాళ చిత్రం ‘ఆశకల్ ఆయిరం’ ద్వారా నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘మహారాజా హాస్టల్’ చిత్రంలోనూ నటించాడు. సోషల్ మీడియా స్టార్ నుంచి సినిమా నటుడిగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది.2024లో వివాహం..అఖిల్, మేఘా కొంతకాలం ప్రేమలో ఉన్న అనంతరం 2024లో వివాహం చేసుకున్నారు. మేఘా కూడా అఖిల్ సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించేవారు. వీరి జంటకు అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జరిగిన దానిపై మేఘగానీ, ఆమె కుటుంబంగానీ ఇంకా స్పందించలేదు. అయితే.. అఖిల్ వీడియో రిలీజ్ చేశాక ‘‘ఇది కూడా సోషల్ మీడియా స్టంటేనా?’’ అని కొందరు అనుమానం సైతం వ్యక్తం చేశారు. -
34 ఏళ్ల క్రితం ప్రేమికులుగా.. కాలం మారిందంతే!
నాగార్జునసాగర్ కేవలం ఓ పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత జీవితంలో ఓ ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోయిన ప్రదేశం. మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా.. ఆ ప్రాంతంతో ముడిపడిన అనుబంధం మాత్రం వాళ్లకు అలాగే ఉండిపోయింది. అందుకే ఆ జ్ఞాపకాలను మరోసారి ఆ జంట గుర్తు చేసుకుంది.34 ఏళ్ల క్రితం యువకుడు రేవంత్‌రెడ్డి, గీత దంపతుల జీవితంలో ప్రేమ జ్ఞాపకాలకు వేదికైన నాగార్జునసాగర్.. ఇప్పుడు మరోసారి వారిని ఆకర్షించింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. అప్పట్లో సాధారణ జీవితంలో ఉన్న వారు.. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రాంతానికి చేరుకున్నారు.వరుణయాగం తర్వాత.. సోమవారం నాగార్జునసాగర్‌లో నిర్వహించిన వరుణయాగంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం దంపతులు విజయవిహార్ అతిథిగృహం వద్ద కృష్ణానది తీరానికి వెళ్లారు. ఆ ప్రాంతంలో గడిపిన క్షణాలు, అప్పటి జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు తమ జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయానికి వేదికైన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మళ్లీ సందర్శించడం భావోద్వేగ క్షణంగా మారింది.ఒక ఫొటో.. రెండు కాలాల కథఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలకు సంబంధించిన పాత ఫొటోతో పాటు.. ప్రస్తుతం సీఎం దంపతులు సాగర్ వద్ద ఉన్న ఫొటోను కలిపి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “అప్పుడు ప్రేమ ప్రయాణం మొదలైన చోటే.. ఇప్పుడు జీవిత ప్రయాణంలో మరో మైలురాయి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజకీయాలకతీతంగా ఓ వ్యక్తిగత క్షణంసాధారణంగా రాజకీయ నేతల ప్రతి అడుగు రాజకీయ కోణంలోనే చర్చకు వస్తుంది. కానీ నాగార్జునసాగర్ పర్యటనలో మాత్రం రేవంత్‌రెడ్డి దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం తెరపైకి వచ్చింది. రాజకీయ పోరాటాలు, పదవులు, బాధ్యతలకు అతీతంగా.. జీవితంలో కొన్ని ప్రదేశాలు ప్రత్యేక గుర్తులుగా మిగిలిపోతాయి. నాగార్జునసాగర్ కూడా రేవంత్–గీత దంపతులకు అలాంటి ఓ భావోద్వేగ ప్రదేశంగా నిలిచింది.ప్రేమ నుంచి బాధ్యతల వరకు.. సాగర్ సాక్షిగాయువకుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో మలుపులు వచ్చాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో మారవు. ప్రేమకు సాక్షిగా నిలిచిన నాగార్జునసాగర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి దంపతుల పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసిన వేదికగా మారింది. -
డేట్ అయిపోయిందని పారేస్తే మీ జేబుకే నష్టం!
ప్యాకెట్‌పై ఉన్న తేదీ కనిపించగానే చాలామంది చేసే మొదటి పని.. ఆ ఆహారాన్ని చెత్తబుట్టలో పడేయడం. బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, సాస్‌లు, పాలు వంటి వాటిపై ఉన్న తేదీ దాటితే ఇక అవి పనికిరావని భావిస్తుంటారు. కానీ ప్రతి తేదీ వెనుక ఒకే అర్థం ఉండదు. కొన్ని సందర్భాల్లో తేదీ దాటినా ఆహారం సురక్షితంగా ఉండొచ్చు.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఆహార ప్యాకెట్‌పై ముద్రించిన తేదీని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలామంది అనవసరంగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో పొరపాటు నిర్ణయాలు ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. బెస్ట్ బిఫోర్(Best Before), ఎక్స్పైరీ డేట్(Expiry Date) మధ్య ఉన్న చిన్న తేడా తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. అసలు ఏ ఆహారం తినొచ్చు? ఏది పారేయాలి? తెలుసుకుందాం..ఇలా అయితే ఫర్వాలేదుఆహార ప్యాకెట్లపై కనిపించే ‘Best Before’ తేదీ అంటే.. ఆ పదార్థం అత్యుత్తమ నాణ్యతతో ఉండే గడువు. అంటే ఆ తేదీ వరకు ఆహారం రుచి, వాసన, రంగు, ఆకృతి వంటి లక్షణాలు మెరుగ్గా ఉంటాయని తయారీదారు హామీ ఇస్తాడు. ఆ తేదీ దాటిన వెంటనే ఆహారం విషపూరితం అయిపోతుందని అర్థం కాదు. ఉదాహరణకు.. కొన్ని ప్యాక్ చేసిన పదార్థాలు సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ‘Best Before’ తేదీ తర్వాత కూడా కొంతకాలం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే అసలు జాగ్రత్త అవసరం. తేదీ ఒక్కటే ఆహారం సురక్షితమా? కాదా? అని నిర్ణయించదు.ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ఎక్స్పైరీ డేట్ Expiry Date లేదా యూజ్ బై డేట్ Use-by Date అనేది ఆహార భద్రతకు సంబంధించిన హెచ్చరిక. ఈ తేదీ దాటిన తర్వాత ఆ పదార్థంలో హానికరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాల విషయంలో ఈ తేదీని తప్పక పాటించాలి. అందుకే ‘Best Before’ అంటే నాణ్యతకు సంబంధించిన సూచన.. ‘Expiry Date’ అంటే భద్రతకు సంబంధించిన హెచ్చరిక అని గుర్తుంచుకోవాలి.వీటి విషయంలో జాగ్రత్తపాలు, పెరుగు, తాజా మాంసం, చేపలు వంటి పదార్థాలు చాలా త్వరగా పాడయ్యే ఆహారాలు. వీటిని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే.. ప్యాకెట్‌పై ఉన్న తేదీ రాకముందే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ఆహార పదార్థాలను తేదీ దాటిన తర్వాత తీసుకునే విషయంలో మరింత జాగ్రత్త అవసరం.ఆహారాన్ని ఉపయోగించే ముందు ఈ విషయాలను గమనించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే దూరంగా పెట్టండిప్యాకెట్ ఉబ్బిపోయిందా?లీక్ అవుతోందా?వింత వాసన వస్తుందా?రంగు మారిందా?ఫంగస్ కనిపిస్తుందా?ఆకృతి మారిందా?.. ఇలాంటి మార్పులు కనిపిస్తే.. తేదీ ఉన్నా, లేకపోయినా ఆహారాన్ని తినకపోవడమే మంచిది.వాసన బాగుందని నమ్మొద్దు!చాలామంది ఆహారం చెడిపోయిందో లేదో తెలుసుకోవడానికి వాసన చూస్తారు. వాసన బాగుంటే తినేస్తారు. కానీ ఇది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. కొన్ని ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఆహారంలో ఉన్నా.. వాసన, రంగు, రుచిలో మార్పు కనిపించకపోవచ్చు. అందుకే అనుమానం ఉన్న ఆహారాన్ని రుచి చూసి పరీక్షించడం కూడా మంచిది కాదు.నిల్వ విధానమే కీలకంఆహారం ఎప్పుడు తయారైంది అన్నదే కాదు.. దాన్ని ఎలా నిల్వ చేశారన్నది కూడా చాలా ముఖ్యం. ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పదార్థాలను బయట ఎక్కువసేపు ఉంచితే.. గడువు తేదీ లోపలే అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి ప్యాకెట్ తెరిచిన తర్వాత ఆహారం ఉపయోగించే గడువు తగ్గవచ్చు.తినే ముందు ఈ ఆరు విషయాలు చెక్ చేయండి✅ ప్యాకెట్ సురక్షితంగా ఉందా?✅ ఎప్పుడైనా తెరిచారా?✅ సరైన విధంగా నిల్వ చేశారా?✅ ఆహారంలో మార్పులు కనిపిస్తున్నాయా?✅ అది త్వరగా పాడయ్యే పదార్థమా?✅ తేదీ దాటిన సమయం ఎంతైంది?చివరగా.. ఆహారంపై ఉన్న తేదీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ‘Best Before’ దాటిందని ప్రతి పదార్థాన్ని పారేయాల్సిన అవసరం లేదు. అలాగే తేదీ దాటిందని ప్రతి ఆహారాన్ని తినడం కూడా సరికాదు. ఆహారం రకం, నిల్వ విధానం, ప్యాకింగ్ పరిస్థితులు, పాడైన లక్షణాలు.. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. డేట్ చూసి భయపడొద్దు.. కానీ జాగ్రత్తను మాత్రం మర్చిపోవద్దు! -
సీజేఐ హైదరాబాద్ నల్సార్ ఈవెంట్‌పై ఉత్కంఠ!
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) చివరి సంవత్సరం విద్యార్థుల బృందం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వర్సిటీ యాజమాన్యాన్ని కోరింది.సీజేఐ చేతుల మీదుగా పట్టా తీసుకోవడం తమకు ఇష్టం లేదంటూ సుమారు 450 మంది విద్యార్థుల సంతకాలు చేసి కాలేజీ యాజమాన్యానికి సమర్పించారు. తమ అభ్యంతరం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, నిరసనలపై న్యాయవ్యవస్థ స్పందన వంటి అంశాలకు సంబంధించినదని వాళ్లు యాజమాన్యానికి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. కాన్వొకేషన్ వేదిక తమ విశ్వవిద్యాలయ విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.‘చలో సంసద్’ నిరసన నేపథ్యంలో..విద్యార్థుల అభ్యంతరానికి ప్రధాన కారణం.. జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్!. నీట్ పరీక్ష నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఆ సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి.ఈ అంశంపై అత్యవసర విచారణ కోరుతూ జులై 22న సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. న్యాయస్థానం స్పందనపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను చూపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులకు తగిన అవకాశం ఇవ్వలేదని వారు తమ వినతిలో పేర్కొన్నారు.170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని, ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని విద్యార్థులు ప్రస్తావించారు. పౌరుల హక్కులు, పోలీసు అధికారాల పరిమితులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు.“మేం నేర్చుకున్న విలువలకు విరుద్ధం”..NALSAR విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపకులకు ఇచ్చిన వినతిపత్రంలో.. కాన్వొకేషన్ ముఖ్య అతిథిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికను పునరాలోచించాలని కోరారు. “ప్రజల హక్కులు, న్యాయం అందుబాటులో ఉండటం, సమస్యలపై తర్కబద్ధమైన చర్చ” వంటి అంశాలను న్యాయ విద్యలో నేర్చుకున్నామని.. అలాంటి సమయంలో నిరసనకారుల ఆరోపణలపై స్పందన విషయంలో అసంతృప్తి ఉన్న వ్యక్తిని గౌరవ అతిథిగా ఆహ్వానించడం తమకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. అయితే అసలు సీజేఐని ఈ ఈవెంట్‌కు నల్సార్ నిజంగానే ఆహ్వానించిందా?.. ఈ అంశంపై వర్సిటీ అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించలేదు.మొన్న మహారాష్ట్రలోనూ..ఇదే సమయంలో మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)లోనూ జస్టిస్ సూర్యకాంత్ హాజరు కావాల్సిన కాన్వొకేషన్ కార్యక్రమం వాయిదా పడటం చర్చకు దారితీసింది. ఆగస్టు 2న జరగాల్సిన TISS 86వ కాన్వొకేషన్‌ను “అనుకోని పరిస్థితుల” కారణంగా వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం విద్యార్థులకు సమాచారం ఇచ్చింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినా.. భద్రతా కారణాలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారమే ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది.కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావమా?జస్టిస్ సూర్యకాంత్‌కు సంబంధించిన గత వ్యాఖ్యలు, CJP ఉద్యమం నేపథ్యంలో ఈ పరిణామాలను పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారనే ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను ఉద్దేశించినవని కొందరు భావించగా.. తాను నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడానని జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఏర్పడింది. అనంతరం NEET పరీక్ష అంశంపై ఆ సంస్థ చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.సౌరవ్ దాస్ ట్వీట్మరోవైపు నల్సార్లోకాక్రోచ్ల నిరసనపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఓ ట్వీట్ చేశాడు. అయితే గతంలోనూ ఆయన నల్సార్‌లో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండడంతో.. ఈ వ్యవహారం వెనుక సౌరవ్ హస్తం ఉందంటూ కొందరు విమర్శలకు దిగుతున్నారు.NALSAR student-lawyers with a spine. pic.twitter.com/rX0sDqDzhR— Saurav Das (@SauravDassss) August 9, 2026ఒకే అంశం.. రెండు పరిణామాలుహైదరాబాద్లో NALSAR విద్యార్థులు నేరుగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా.. ముంబైలో TISS కాన్వొకేషన్ వాయిదా చుట్టూ భద్రత, నిరసనల అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు న్యాయవ్యవస్థపై గౌరవం కొనసాగాలని భావించే వర్గాలు ఉండగా.. మరోవైపు పౌర హక్కులు, నిరసనలపై న్యాయస్థానాల స్పందనను ప్రశ్నించే కొత్త తరం విద్యార్థుల గొంతు వినిపిస్తోంది. కాన్వొకేషన్ వేదికలు కేవలం పట్టాలు అందించే కార్యక్రమాలేనా? లేదంటే రాజ్యాంగ విలువలపై చర్చ జరిగే వేదికలా? అనే కొత్త చర్చకు ఈ పరిణామాలు దారితీశాయి. -
Viral Video: 79 ఏళ్లకు.. వచ్చేసింది బుల్లోడా..!
స్వాతంత్య్రం వచ్చి దాదాపు 79 ఏళ్లు గడిచినా ఆ గ్రామానికి ప్రభుత్వ బస్సు మాత్రం రాలేదు. ఎట్టకేలకు తొలిసారి బస్సు కుర్తాల్ గ్రామంలోకి రావడంతో అక్కడి ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పూల వర్షం కురిపిస్తూ.. మంగళహారతులు ఇస్తూ.. డప్పుల మోతతో నృత్యాలు చేస్తూ గ్రామస్తులు బస్సుకు ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బస్సుకు భావోద్వేగంతో స్వాగతం పలికారు.బస్సు డ్రైవర్, కండక్టర్లకు తలపాగాలు చుట్టి.. పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రాజస్థాన్‌లోని కేక్రి ప్రాంతంలోని కుర్తాల్, కేరోట్ గ్రామాలకు ఈ బస్సు రాక చారిత్రక క్షణమని పలువురు సోషల్ మీడియాలో నెటిజన్లు అభివర్ణించారు. కుర్తాల్ సమీపంలోని కేరోట్ గ్రామాలు దశాబ్దాలుగా బస్సు సౌకర్యానికి దూరంగా ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేరుగా ఆ గ్రామానికి చేరుకున్న తొలి ప్రభుత్వ బస్సు ఇదే.पहली बार रोडवेज की बस गाँव में आई तो गांव वालों की खुशी का ठिकाना नहीं रहा.गांव में बस के प्रवेश करने पर ग्रामीणों ने फूल बरसाए, बस की आरती उतारी, पटाखे फोड़े और चालक-परिचालक का साफा व माला पहनाकर सम्मान किया. राजस्थान के केकड़ी जिले में स्थित केरोट और कूरथल गांव में उत्सव का… pic.twitter.com/Azwz4CVbhw— Ruby Arun रूबी अरुण (@arunruby08) August 6, 2026ఈ బస్సు రాకతో సమీప పట్టణాలు, మార్కెట్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు రవాణా సౌలభ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అంతకుముందు గ్రామస్థులు పూర్తిగా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వచ్చేది. ఈ హృదయానికి హత్తుకునే దృశ్యాలు వైరల్‌గా మారాయి. -
26 ఏళ్ల మిలియనీర్ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు? వీడియో వైరల్
ఎవరైనా అందంగా మారాలనుకుంటారు. మంచి ఒడ్డూ పొడుగు, శరీర సౌష్టవంతో ఆకర్షణీయంగా కనిపించేందుకు ఎత్తు పెరగాలని లేదా బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీ జపాన్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుక్కలా మారేందుకు అనేక సర్జరీలు చేయించు కున్నారు. ఇందుకోసం ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాడనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంత?సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న "జాసో (Jaso)" అనే 26 ఏళ్ల మిలియనీర్ వ్యాపారవేత్త దాదాపు రూ.220 కోట్లు ఖర్చు చేశాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కోటీశ్వరుడికి కుక్కలంటే మక్కువ ఎక్కువట. అందుకే కుక్కలా బాడీ మోడిఫికేషన్, ఆపరేషన్లు అంటూ పెద్ద మొత్తంలో ఖర్చుచేశాడనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆన్లైన్ పోస్టులు , వీడియోల ప్రకారం, జపాన్‌కు చెందిన "జాసో" అనే 26 ఏళ్ల యువ మిలియనీర్, అత్యంత ఖరీదైన శస్త్రచికిత్సల ద్వారా తనను తాను కుక్కలా మార్చుకున్నాడని, దీనికోసం రూ.220 కోట్లు ఖర్చు అయిందంటున్నవైరల్ వీడియోలలో ఒక వ్యక్తి కుక్క దుస్తులలో, కుక్కలాగే కదులుతున్నట్లు కనిపిస్తున్నాడు.ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా? इंसान से 'कुत्ता' बनने के लिए उड़ा दिए ₹220 करोड़🐕🦺ये कहानी सुन के होश उड़ जायेगे 😱सोशल मीडिया पर जापान के 26 साल के करोड़पति जासो का एक वीडियो है, जासो को कुत्ते जैसा दिखने और कुत्ते जैसी जिंदगी जीने का इतना शौक चढ़ा कि उन्होंने इसके लिए करीब ₹220 करोड़ खर्च कर दिए।जासो… pic.twitter.com/KEulnMShgO— Sachin Verma🐦 (@itSachinverma) August 8, 2026ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ ఫ్యాక్ట్ చెక్ఈ వార్తలో ఎలాంటి నిజం ఉన్నట్లు ఆధారాలు లేవు. "జాసో" అనే వ్యక్తి గుర్తింపు, ఆయన వయస్సు (26), ఆయన వ్యాపారవేత్త రూ. 220 కోట్లు ఖర్చు చేశారనే వాదనలకు సంబంధించి ఎటువంటి విశ్వసనీయమైన సాక్ష్యాలు లేవని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు తేల్చారు. ఇది పూర్తిగా కల్పితం. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ లైక్స్ కోసం క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీలలో ఇది ఒకటని, ఇప్పటివరకు రూ,220 కోట్ల ట్రాన్స్ఫర్మేషన్ వార్తకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదని స్పష్టమవుతోంది. ఇక ఈ క్లిప్‌లలో కనిపిస్తున్న జంతువు మనుషుల చర్మం లాంటి రూపం కలిగిన ఒక అరుదైన, ప్రాచీన 'హెయిర్‌లెస్' కుక్క జాతికి చెందినది.ఇదీ చదవండి: డ్యూప్లెక్స్ ఇంట్లో అస్తిపంజరమై తేలిన 57 ఏళ్ల దాక్షాయణి'జాసో డాగ్ ట్రాన్స్ఫర్మేషన్' స్టోరీ నిస్సందేహంగా ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి వివాదాస్పద స్టోరీలపై అధికారిక ప్రకటనలు లేదా విశ్వసనీయమైన నివేదికలు ఈ రెండు కథనాలలో దేనినైనా ధృవీకరించే వరకు అప్రమత్తంగా ఉండాలి.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్‌కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే! -
గర్ల్ ఫ్రెండ్‌కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే!
నచ్చిన నెచ్చెలి కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు ప్రేమికులు. తాజాగా తమ నిశ్చితార్థ కలను నిజం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఎంతటి కష్టానికైనా వెనుకాడడని నిరూపించాడు అమెరికాకు చెందిన బ్రాడ్లీ చో (Bradley Cho). తన ప్రియురాలికి విలువైన డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ గిప్ట్గా ఇవ్వాలనే కోరికతో చాలానే కష్టపడ్డాడు. ఒకపక్క పగలు కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే మరో పక్క రాత్రుళ్లు ఫుడ్ డెలివరీ బాయ్‌గా అదనపు పనిచేశాడు. చివరికి..బ్రాడ్లీ చో ఇటీవల తన ప్రియురాలితో కలిసి ఒక కాండో (ఇల్లు) కొనుగోలు చేశాడు. దీంతో అతని వద్ద ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చైపోయాయి. ఇక నిశ్చితార్థపు ఉంగరం కొనడానికి డబ్బులు లేకుండా పోయాయి. ఎలాగైనా ఆమెకు లగ్జరీ డైమండ్ రింగ్ కానుకగా ఇవ్వాని నిర్ణయించుకున్నాడు. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోర్‌డాష్ (DoorDash) ద్వారా డెలివరీ ఏజెంట్‌గా పనిచేశాడు. రోజూ పగటిపూట రెగ్యులర్ కార్పొరేట్ ఉద్యోగం ముగించుకుని, రాత్రి 2 గంటల వరకు డెలివరీలు చేసేవాడు. మళ్లీ ఉదయం 6 గంటలకే నిద్రలేచి ఆఫీస్‌కు వెళ్లేవాడు. ఇలా రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతూ ఇలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 8 నెలల పాటు కష్టపడ్డాడు. ఈ క్రమంలో రెండు వారాల పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు కూడా. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల వల్ల తన కార్పొరేట్ ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అయినా పట్టువీడలేదు. View this post on Instagram A post shared by Bradley Cho (@bradjcho) చివరికి 8 నెలల కష్టం తర్వాత 6,500 డాలర్లు (దాదాపు రూ. 6 లక్షలు) విలువైన డబ్బును సమకూర్చుకున్నాడు. దీంతో ల్యాబ్-గ్రోన్ డైమండ్‌తో (Lab-grown diamond) పాటు వారిద్దరి 'బర్త్ స్టోన్స్' (జన్మ రాశి రత్నాలు) అమర్చిన ప్రత్యేకమైన నిశ్చితార్థపు ఉంగరాన్ని తయారు చేయించాడు. View this post on Instagram A post shared by Bradley Cho (@bradjcho) ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ నెటిజన్ల స్పందన"డే 89.. మై గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ కొనేవరకు" అంటూ రోజూ తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసిన బ్రాడ్లీకి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభించింది. లక్షలాది మంది ఆయన పట్టుదలను, ప్రేమికురాలి పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు అందించడం విశేషం.ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా? -
ట్రెండింగ్‌లో వారణాసి.. మోదీ కంచుకోటలో ఇదేం సీన్?
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరం భారీ వర్షాలకు అతలాకుతలమైంది. రోడ్లు చెరువులను తలపించేలా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా రోడ్డు మధ్యలో వరద నీటిలో ఓ ఆటో బోల్తా పడటం, ఆ వెంటనే ఓ బైకర్ కూడా అదుపుతప్పి నీటిలో పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, అధికారులపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు 22 ప్రాంతాల్లో నీటిముంపు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. నీటిమట్టం పెరగడంతో రోడ్డు ఎక్కడుందో, గుంతలు ఎక్కడున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో నీరు బయటకు వెళ్లకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో నీటితో నిండిన రోడ్డుపై ఓ ఆటో ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరో బైకర్ కూడా బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో పడిపోయాడు. ఈ ఘటనల్లో డ్రైవర్, ప్రయాణికులకు గాయలైనట్టు తెలుస్తోంది.అయితే, వరద నీటిలో వాహనాలు బోల్తా పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు చర్చ మరో అంశంపై మొదలైంది. ‘స్మార్ట్ సిటీ’గా అభివృద్ధి చేస్తున్న వారణాసిలో ప్రతిసారీ వర్షానికి రోడ్లు ఎందుకు జలమయం అవుతున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో వారణాసిలో మౌలిక వసతుల అభివృద్ధిపై దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉంటుంది. అలాంటి నగరంలో భారీ వర్షం పడిన ప్రతిసారీ రోడ్లపై నీరు నిలిచిపోవడం, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న దృశ్యాలు ఇప్పుడు రాజకీయంగానూ, ప్రజా చర్చగానూ మారుతున్నాయి.Varanasi pic.twitter.com/4x2V5VrnW2— Piyush Rai (@Benarasiyaa) August 6, 2026భారీ వర్షాలు పడటం సహజమే అయినప్పటికీ.. వర్షం తగ్గిన తర్వాత కూడా నీరు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోతే మాత్రం డ్రైనేజీ, పట్టణ ప్రణాళికపై ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా వైరల్ అయిన ఆటో బోల్తా, బైకర్ ప్రమాద దృశ్యాలు వారణాసిలోని నీటిముంపు సమస్య తీవ్రతను మరోసారి బయటపెట్టాయి.Modi promised, he will make Varanasi like Kyoto of JapanBut even after he being the MP of it for 12 years, this is the condition of it 👇👀 pic.twitter.com/qMAUgixOAA— Veena Jain (@Vtxt21) August 7, 2026Agra, Uttar Pradesh Modi ji built roads with Space Technology Now those roads opening portal to the New Universe Modi hai toh mumkin hai ✊ pic.twitter.com/qxPXkkgykg— Veena Jain (@Vtxt21) August 7, 2026 -
గుజరాత్ అలల బావి మిస్టరీ వీడింది..!
సాధారణంగా బావుల్లో నీరు నిశ్చలంగా ఉంటుంది. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఓ వ్యవసాయ బావి మాత్రం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిచింది. సముద్రపు అలలను తలపించేలా నీరు రోజుల తరబడి ఊగుతూ కనిపిస్తోంది. అది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇది భూకంపానికి ముందస్తు సంకేతమేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే బావిని నిపుణులు పరిశీలించాక.. దీని వెనక కారణం ఏంటన్నది తెలిసిపోయింది!. విర్పర్డా గ్రామంలోని ఈ వింత బావి గురించి కొన్నిరోజులుగా దేశం చర్చించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అతీత శక్తులంటూ.. ఎవరికి తోచిన కథనాలు వాళ్లు ఇచ్చి పడేస్తున్నారు. అయితే బావిలో ఈ వింత వెనుక సైన్స్ తప్ప మరేయితర కారణాలు లేవని నిపుణులు తేల్చేశారు. అంతేకాదు.. ఎలాంటి ప్రకృతి విపత్తు కూడా రాబోవని అంటున్నారు. ఈ తరహా అలలు ఏర్పడడానికి సరైన కారణం ఏంటన్నది చెబుతున్నారు. An unusual mystery in India: water wildly swaying inside a well in Morbi, and no one can explain whyStrange phenomenon continues for a FIFTH DAY, baffling locals as authorities investigate pic.twitter.com/GykyazKKXi— RT (@RT_com) August 7, 2026సముద్రంలా ఎందుకు ఊగుతోందంటే..భారీ వర్షాల తర్వాత భూమిలోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతుంది. ఈ నీరు భూగర్భంలోని రాళ్ల పొరలు, ఖాళీ ప్రదేశాలు, జలాశయ ప్రాంతాల్లోకి ప్రవహిస్తుంది. ఈ సమయంలో భూమి లోపల ఉన్న గాలి, నీటి ఒత్తిడిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ఒత్తిడి మార్పుల ప్రభావంతో బావిలోని నీరు పైకి కిందికి కదులుతూ అలల మాదిరిగా కనిపిస్తోంది. ముఖ్యంగా లోతైన బావుల్లో ఇలాంటి కదలికలు ఎక్కువగా గమనించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.‘వెల్ సీష్’ కూడా ఓ కారణమేనా?ఈ ఘటనకు మరో శాస్త్రీయ వివరణగా ‘వెల్ సీష్’ (Well Seiche). ఒక నిర్దిష్ట ఆకారం, లోతు కలిగిన నీటి నిల్వలో చిన్నపాటి కదలిక కూడా సహజ తరంగాలుగా మారినప్పుడు.. నీరు కొంత సమయం పాటు ముందుకు వెనక్కి ఊగుతుంది. సరస్సుల్లో కనిపించే ఈ తరహా కదలికలు కొన్ని సందర్భాల్లో బావుల్లోనూ కనిపించవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.मोरबी के वीरपरडा गांव में एक कुएं में अचानक पानी छलकने और हिलने-डुलने लगा, जिसे देखने के लिए बड़ी संख्या में लोग इकट्ठा हो गए। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। #Morbi #GujaratNews #ViralVideo pic.twitter.com/hAd95ETbia— Bhoomi (@TheBPnova) August 6, 2026భూకంపం భయం..మోర్బీ ప్రాంతానికి భూకంప చరిత్ర ఉండటంతో ఈ బావిలోని వింత కదలికలు ప్రజల్లో భయాన్ని కలిగించాయి. ముఖ్యంగా 2001లో గుజరాత్‌ను కుదిపేసిన భారీ భూకంపం జ్ఞాపకాలు ఇంకా ప్రజలను వెంటాడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బావిలో కనిపిస్తున్న నీటి కదలికలకు భూకంప కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు, భూగర్భ శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. ప్రాంతంలో ఎలాంటి సీస్మిక్ యాక్టివిటీ లేదంటే క్రియాశీల ఫాల్ట్ లైన్ గుర్తించలేదని తేల్చేశారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.సముద్రపు ఆటుపోట్ల ప్రభావమా?మోర్బీ అరేబియా సముద్రానికి పూర్తిగా దూర ప్రాంతం కాదు. దీంతో కొందరు స్థానికులు బావి నీరు సముద్రపు ఆటుపోట్ల ప్రభావంతో కదులుతోందని భావించారు. భూగర్భ జల మార్గాలు సముద్రంతో అనుసంధానమై ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే దీనికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భ జలాల ఒత్తిడి మార్పులే దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.🚨 GUJARAT | MYSTERIOUS WELLAn unusual phenomenon has drawn crowds to Virparda village in Gujarat's Morbi district where water inside a roadside well has been continuously moving from one side to the other.According to local reports nearby wells remain completely calm while… pic.twitter.com/rJHvXjOZ8V— contentkikamii (@contentkikamii) August 6, 2026ఇలాంటి వింతలు ప్రపంచంలోనూ ఉన్నాయిబావులు, సరస్సుల్లో నీరు అసాధారణంగా కదలడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. సరస్సుల్లో నీరు ఒకే దిశలో ఊగడం, భూగర్భ జలాల్లో ఒత్తిడి మార్పులతో నీటి స్థాయిలు మారడం వంటి పరిణామాలను శాస్త్రవేత్తలు సహజ ప్రక్రియలుగానే వివరిస్తున్నారు. అయితే బావిలో నీరు కదలడం ఆధారంగా భూకంపాలను అంచనా వేయడం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. మన దేశంలో ఇలాంటివి జరిగినా.. ఇప్పుడు సోషల్ మీడియా జమానా కారణంగా మోర్బీ బావి ఉదంతం హైలైట్ అయ్యిందంతే!.భయపెట్టిన బావి.. ఇప్పుడు ఆకర్షణగా మారిందిమొదట ఈ దృశ్యం గ్రామస్తులను భయపెట్టినా.. ఇప్పుడు అదే బావి ఆసక్తికరంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వింతను చూసేందుకు వస్తున్నారు. అధికారులు మాత్రం ప్రజలు ఎలాంటి అపోహలు, పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నారు. గుజరాత్ మోర్బీ బావిలో కనిపిస్తున్న ఈ ‘సముద్రపు అలలు’ భూమి లోపల ఏదో పెద్ద మార్పు జరుగుతోందనే సంకేతం కాదు.. ప్రకృతి తనదైన రీతిలో చూపిస్తున్న అరుదైన జల భౌగోళిక పరిణామం మాత్రమే. -
నా ఇంట్లో మీ పెత్తనం ఏంటి?.. అభిజిత్ దీప్కే ఫైర్!
భద్రత కోసం వచ్చిన పోలీసు అధికారి తనపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అబిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. తన నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలుజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని దీప్కే నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బెదిరింపుల నేపథ్యంలో, అలాగే ఆయనను కలిసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ను అక్కడ నియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చే వారిని నియంత్రిస్తున్నారని దీప్కే ఆరోపించారు.‘ఎవరిని కలవాలో మీరు నిర్ణయిస్తారా?’వైరల్‌గా మారిన ఓ వీడియోలో.. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తూ కనిపించారు. తన ఇంటికి ఎవరు రావాలి.. ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. “నా ఇంట్లో మీ పెత్తన ఏంటి?. నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెబుతున్నప్పుడు.. వారిని ఎందుకు ఆపుతున్నారు? ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్య జరగలేదు. ఎవరిని కలవాలి.. ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పలేరు” అంటూ దీప్కే ప్రశ్నించారు.అంతేకాకుండా.. “మీరు బయటకు వెళ్లండి. నాకు మీ అవసరం లేదు” అంటూ ఆ పోలీసు అధికారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.Chhatrapati Sambhajinagar - Abhijit Dipke has made strong allegations against CID officers, accusing them of arrogant and rude behaviour towards people who come to meet him.Dipke, who flared up against the police officers, claimed that visitors arriving for meetings with him are… pic.twitter.com/5hCF6s7p8Y— NextMinute News (@nextminutenews7) August 7, 2026ఉన్నతాధికారికి ఫోన్లో ఫిర్యాదుమరో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడారు. సురేశ్ అనే పీఎస్ఐ తనను కలిసేందుకు వచ్చే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని పేర్కొన్నారు. వెంటనే అతడిని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. “నా ఇంటికి వచ్చే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కావాలనే చేస్తున్నారా?” అంటూ ఆయన ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తోంది.నిఘా ఆరోపణలుతన నివాసం సమీపంలో సీఐడీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో నిఘా పెట్టారని కూడా దీప్కే ఆరోపించారు. ఓ రిపోర్టర్ తనకు ఈ విషయం తెలిపారని చెప్పారు. ఓ సీఐడీ సిబ్బంది ఫోన్లో ‘హిట్ స్ప్రే’ పేరుతో వాట్సాప్ గ్రూప్ కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెంటనే రాలేదు. వాలుజ్ ఎంఐడీసీ పరిధి డీసీపీ పంకజ్ అతుల్కర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు. మరోవైపు.. అభిజిత్ యాటిట్యూడ్పైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన అబిజీత్ దీప్కే.. తాజాగా తన ఇంటి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. భద్రత పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించకూడదన్నది దీప్కే వాదన కాగా.. భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసులు వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
రూ. 20 లక్షల ఖర్చు, ప్రాణాలమీదకు తెచ్చిన ర్యాపిడో రైడ్ : వైరల్ స్టోరీ
సాక్షి, బెంగళూరు : క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడోపై ఒక మహిళ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల శని కృష్ణ అనే మహిళకు ర్యాపిడో బైక్ ప్రయాణం పీడకలగా మారింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితినుంచి బైటపడింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలోపోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. చివరికి దీనిపై కంపెనీ స్పందించింది.జూన్ 17న శని కృష్ణ ఆఫీసుకు వెళ్లడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నారు. బాగ్మానే టెక్ పార్క్ వద్ద రైడర్ ఒక ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడంతో బైక్ నియంత్రణ కోల్పోయింది. రోడ్డుపై పడిపోయిన ఆమెపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి, కాలేయం దెబ్బతింది, 9 పక్కటెముకలు విరిగాయి, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు ప్లీహం (Spleen) తొలగించాల్సి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను కేరళలోని ఆసుపత్రికి తరలించారు. ఈ తీవ్ర ప్రమాదంలో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకోగా, ఆసుపత్రి ఖర్చులు రూ. 20 లక్షలు దాటాయని, అయితే రాపిడో సంస్థ తనకు ఎలాంటి సహాయం అందించలేదని ఆమె ఆరోపించారు.రూ. 20 లక్షల ఖర్చుఅత్యవసర శస్త్రచికిత్సలు, వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటివరకు రూ. 20 లక్షలకు పైగా ఖర్చయిందని, ఇది తమ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారంగా మారిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.ర్యాపిడోపై ఆరోపణలుమహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటనలు ఇచ్చే రాపిడో, ప్రమాదం జరిగాక తనను పట్టించుకోలేదని శని కృష్ణ ఆరోపించారు. న్యాయపరమైన నోటీసులు పంపినప్పటికీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చూసుకోమంటూ కేవలం ఆటోమేటెడ్ ఇమెయిళ్ళు మాత్రమే పంపారని తెలిపారు. ఈ విషయమై తాను వినియోగదారుల కోర్టును (Consumer Court) ఆశ్రయించనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత View this post on Instagram A post shared by Sani Krishna (@sani_krishna) ఇదీ చదవండి: అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీర్యాపిడో స్పందన:శని కృష్ణ ఇన్స్టాగ్రామ్ వీడియోపై రాపిడో సంస్థ స్పందిస్తూ, తాము బాధితురాలితో సంప్రదింపుల్లో ఉన్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపడానికి కొంత సమయం కావాలని కోరింది.ఇదీ చదవండి: 'జెన్ జీ' పై ఎంపీ కంగనా రనౌత్ యూటర్న్: ఆసక్తికర వ్యాఖ్యలు -
బీఎండబ్ల్యూ బైక్‌పై వచ్చిన రైడర్ని చూసి విస్తుపోయిన వ్యాపారవేత్త..!
ఒక్కోసారి కొన్ని జీవిత పాఠాలు..కొన్ని ప్రయాణాల్లో ఊహించని విధంగా తెలుసుకుంటాం. మరికొన్ని మనకన్న వయసులో చిన్న వాళ్లైనా యువత నుంచి నేర్చుకుంటుంటాం. అలాంటి గొప్ప జీవిత పాఠాన్నే ఒక ఉబర్ రైడర్ నుంచి నేర్చుకున్నాడు ఓ వ్యాపారవేత్త. అసలేం జరిగిందంటే..ముంబై వ్యాపారవేత్త ఆఫీస్ నుంచి ఇంటి వెళ్లేందుకు రైడ్ బుక్‌చేసుకున్నాడు అప్పుడు ఎదురైన అనుభవాన్ని లింక్డ్ని పోస్ట్‌లో పంచుకున్నారు. అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో రాత్రి 8.25 గంటలకు రైడ్ ఖరారైందని తెలిపారు. తనను తీసుకువెళ్లడానికి బీఎండబ్ల్యూ బైక్ రావడం చూసి విస్తుపోయానని అన్నారు. ఆ రైడర్ రాగానే బ్రో మీరెందుకు ఉబర్ నడుపుతున్నారని ప్రశ్నించినట్లు చెప్పారు. దాని ఆ రైడర్ ఇచ్చిన సమాధానం..తనకు గొప్ప స్ఫూర్తిదాయకమైన పాఠాన్ని నేర్పిందంటూ రాసుకొచ్చారు పోస్ట్‌లో. ఆ రైడర్‌తో వ్యస్థాపకుడు జైన్‌తో సార్ ఇదే నా మొట్టమొదటి ఉబర్ రైడ్ అని చెబుతూ ఇది తాను డబ్బు కోసం చేయడం లేదని అన్నారు. అతను కొత్త వ్యక్తులను కలవాలని, సంభాషణలు ప్రారంభించాలని, విభిన్న దృక్కోణాలను అర్థంచేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే తన కథను కూడా పంచుకున్నట్లు తెలిపారు. తాను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని, వివిధ వ్యాపారాలు ప్రయత్నించినట్లు తెలిపాడన్నారు. అయితే కొన్ని డబ్బులు సంపాదించి పెట్టగా, మరికొన్ని జీవిత పాఠాలను నేర్పించాయన్నారు. ప్రస్తుతం తాను కొత్త అవకాశాలను అన్వేషిస్తూ..మాస్టర్ డిగ్రీ చేయాలని చూస్తున్నట్లు చెప్పాడని తెలిపారు. ఆ తర్వాత తాను కుతూహలంతో మరీ ఈ బీఎండబ్ల్యూ బైక్ గురించి అని ప్రశ్నించగా..అతడు చిరునవ్వుతో తన వ్యాపారాల ద్వారా సంపాదించిన కొంత సొమ్ము, అలాగే పేరెంట్స్ ఇచ్చిన కొద్దిపాటి సాయంతో దీన్ని కొన్నట్లు తెలిపాడు. ఆ విషయాన్ని కూడా అతడు చాలా సింపుల్‌గా చెప్పాడని అన్నారు. తన రైడ్ మగిశాక..అతడు తనకు ప్రజలతో కలిసి పనిచేయడం ఇష్టం అని, ఈవెంట్లు నిర్వహిడం తనకు సంతోషన్ని ఇస్తుందని చెప్పాడు. బదులుగా మిత్రమా మీ జర్నీలో అన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నానంటూ తన సంభాషణను ముగించినట్లు తెలిపారు. ఆయన ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఒక వాక్యం తన మదిలో అలాగే నిలిచిపోయిందన్నారు. "మీ కలలను వెంబడించే ధైర్యం, ఉత్సాహం మీకు ఉన్నంత వరకు, పెద్ద కలలు కనడంలో ఎలాంటి నష్టం లేదు.” అని అన్నారు. ఒక్కోసారి ఇలాంటి స్ఫూర్తి ఒక సీఈవో, పారిశ్రామికవేత్త, బెస్ట్ సెల్లింగ్ రచయితల పుస్తకాల ద్వారా రాదు అంటూ పోస్ట్‌ని ముగించారు. కాగా, ఆశీష్ జైన్ తన కెరీర్‌ను ఎయిర్‌టెల్‌లో ప్రారంభించారు. ఏళ్లుగా అతను విప్రోతో సహా వివిధ సంస్థలలో పనిచేశారు. ఆయన 2012లో తన సొంత కంపెనీని ప్రారంభించారు.(చదవండి: అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ ..కానీ జీతం రూ. 960!) -
అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ ..కానీ జీతం రూ. 960!
ఇవాళ ఐఐటీ, ఐఏఎం చేసిన వాళ్లు ఏం రేంజ్లో ప్యాకేజ్‌లు తీసుకుంటారో తెలిసిందే. ఎవరి నోట చూసినా.. ఇన్నేసి లక్షలు, కోట్లు అని మాత్రమే వింటుంటాం. అలాంటిది అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ చేస్తే..ఇంక ఏ రేంజ్లో జీతం ఉంటుంతో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది అతడు ఎంత జీతం తీసుకున్నాడో వింటే మతిపోవడం ఖాయం. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట షేర్ వైరల్‌గా మారింది. సిండికేట్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ అజయ్ నానావతి ఆ పోస్ట్‌ని షేర్ చేశారు. ఆయన లింక్డ్ఇన్ పోస్ట్‌లో తాను అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ చదివి భారతదేశానికి తిరిగి రాగానే తనను నియమించుకోవడానికి ఎన్నో కంపెనీలు ఎగబడతాయని అనుకున్నానంటూ రాశారు. కానీ తన మొదటి నియామక పత్రాన్ని పంచుకుంటూ..1977లో టాటాలో తన మొదటి ఉద్యోగ జీతం కేవలం రూ. 960లు అని చెప్పారు. అది తెలుసుకుని బహుళజాతి సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తన తండ్రి సైతం అవాక్కయ్యరని అన్నారు. కానీ ఆయన ఆ టాటా జాబ్ ఆఫర్‌ని అంగీకరించమనే ప్రోత్సహించారని తెలిపారు. అదే సమయంలో తనకు పలు కంపెనీల నుంచి అంతకుమించి ఎక్కువ జీతాలిస్తామని ఆఫర్లు కూడా వచ్చాయన్నారు. అయితే శాలరీ కంటే బాంబే హౌస్‌లో పనిచేసే అవకాశం ముఖ్యం కావడంతో తాను టాటానే ఎంచుకున్నట్లు వెల్లడించారు. కానీ ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే బహుశా అదే అత్యంత తెలివైన కెరీర్ నిర్ణయమని అన్నారు నానావతి. సామర్థ్యాన్ని అనుసరించే జీతం వస్తుందనేది తన నమ్మకమని నొక్కిచెప్పారు. అయితే ప్రస్తుత నియామకాల వాతావరణంలో చాలామంది యువ నిపుణులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కన్సల్టింగ్, ప్రైవేట్ ఈక్విటీ తదితర రంగాలను ముందుగా జీతం అనే కోణంలోనే చూస్తున్నారని నానావతి అన్నారు. అయితే, ఆయన మాత్రం కెరీర్ తొలినాళ్లలో సంపాదించడంపై కంటే నేర్చుకోవడంపైనే ఫోకస్ పెట్టమని అన్నారు. అధిక జీతం కోసం వెంపర్లాడే ముందు, యువ నిపుణులు తమ రంగంలో లోతైన నైపుణ్యాన్ని పెంచుకోవాలని, అసాధారణమైన నాయకులతో కలిసి పనిచేయాలని, సవాలుతో కూడిన వాతావరణాలను కోరుకోవాలని, సరైన విచక్షణ , విశ్వనీయతను పెంచుకోవాలంటూ తన పోస్ట్‌ని ముగించారు. అయితే ఈ పోస్ట్‌తో నెటిజన్లు ఏకభవించడమే గాక, అనుభవజ్ఞులైన ఉద్యోగులు సైతం జీతభత్యాలకు వాల్యూ ఇవ్వడం కంటే జిజ్ఞాస, అభ్యాసం, సంస్థాగత సంస్కృతి, లక్ష్యం, విలువలే ముఖ్యమని అన్నారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా ఆరోగ్యం, సంపద రెండూ కాలక్రమేణ పెరుగుతాయని అన్నారు.(చదవండి: 97 ఏళ్ల వయసులో ఆకాశంలోకి దూసుకెళ్లి..గిన్నిస్ రికార్డు!) -
గుజరాత్లో మిస్టరీ.. ఐదు రోజులుగా బావిలో ఏం జరుగుతోంది?
ఆ గ్రామంలోని ఓ సాధారణ బావి.. గత ఐదు రోజులుగా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేదు. గాలి లేదు.. వర్షం లేదు.. ఎవరూ తాకడం లేదు.. అయినా బావిలోని నీరు సముద్రంలా అలలు ఎగురేస్తూనే ఉంది. ఈ వింతను చూసిన గ్రామస్థులు మొదట భయంతో వణికిపోయారు. భూకంపం రాబోతోందా? అంటూ ఆందోళన చెందారు.గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఉన్న ఒక 18 అడుగుల లోతైన బావి గత ఐదు రోజులుగా నిరంతరం అలలు, తరంగాలతో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో, వార్త క్షణాల్లో వ్యాపించడంతో వందలాది మంది అక్కడికి చేరుకుని, ఆ అద్భుతాన్ని తమ కళ్లారా వీక్షిస్తున్నారు. మరోవైపు.. బావి యజమాని ప్రాంజీవన్ సదారియా తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 2న ఆయన పొలానికి వెళ్లినప్పుడు బావిలోని నీరు అలలతో కదులుతూ బయటకు పొర్లిపోతున్నట్లు గమనించారు. మూడు నెలల క్రితమే ఈ బావిని తవ్వినట్టు చెప్పుకొచ్చారు.అయితే, ఈ మిస్టరీకి నిపుణులు ఇచ్చిన వివరణ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు వేగంగా నిండిపోయాయి. రాళ్ల మధ్య చిక్కుకున్న గాలి బయటకు రావడంతో బావిలో నిరంతరం అలలు ఏర్పడుతున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. అయినా ఈ వింత వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి గాంధీనగర్ నుంచి నిపుణుల బృందం రంగంలోకి దిగుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన బావి... ఇప్పుడు అలలతో ఉప్పొంగుతోంది. ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతమా? లేక ఇంకా వెలుగులోకి రాని మరో రహస్యమా? సమాధానం కోసం అందరి చూపు ఇప్పుడు ఆ బావిపైనే ఉంది!Well Water Continues to Oscillate in #Morbi Village; Collector Orders Probe#Gujarat #India 🇮🇳 pic.twitter.com/eZYwUKNvqV— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) August 7, 2026ఇక, మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే ఈ ఘటనపై వెంటనే స్పందించి, బావిలో ఐదు రోజులుగా కనిపిస్తున్న అలల విషయాన్ని గుజరాత్ ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ ఘటనకు గల అసలు కారణాన్ని శాస్త్రీయంగా గుర్తించేందుకు గాంధీనగర్ నుంచి భూగర్భ శాస్త్ర నిపుణుల బృందాన్ని ఘటన స్థలానికి పంపించాలని ఆదేశించారు. నిపుణుల బృందం బావిని పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించిన తర్వాతే ఈ వింతకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారికంగా వెల్లడిస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది. -
రూ.4,200 కోట్ల రోడ్డుకు ప్యాచ్ వర్క్!
భారీ వ్యయంతో నిర్మించిన ఓ ప్రతిష్టాత్మక ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన కొద్ది రోజులకే దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది. రూ.4,200 కోట్లతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రారంభించిన మూడు వారాలకే పలు ప్రాంతాల్లో కుంగుదల, పగుళ్లు కనిపించడంతో అధికారులు ప్యాచ్ వర్క్ చేపట్టారు. మరోవైపు.. అనుకోని ఈ పరిస్థితుల్లో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎక్స్‌ప్రెస్‌వే అంతటా టోల్ వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది.సుమారు 63 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేను లక్నో–కాన్పూర్ మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నిర్మించారు. జూలై 13న దీన్ని ప్రారంభించగా.. కేవలం 13 రోజులకే జూలై 26న ఉనావ్ జిల్లాలోని 64వ కిలోమీటర్ వద్ద రహదారి కుంగిపోవడం, ఉపరితల పొర కొట్టుకుపోవడం బయటపడ్డాయి.మళ్లీ మళ్లీ అదే ప్రాంతంమొదట సమస్య కనిపించిన ప్రాంతంలో పరిమిత స్థాయిలో మరమ్మతులు చేపట్టారు. సుమారు 120 మీటర్ల ప్రాంతంలో సమస్య గుర్తించగా.. దాదాపు 100 మీటర్ల బిటుమెన్ పొరను మరమ్మతు చేశారు. మరో 20 మీటర్ల భాగాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించారు. అయితే కొద్ది కాలానికే సమస్య మళ్లీ తలెత్తడంతో అధికారులు మరింత విస్తృత స్థాయిలో పరిశీలన చేపట్టారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా సుమారు 300 మీటర్ల మేర రహదారిని తవ్వి తిరిగి నిర్మిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్డు పెచ్చులుగా ఊడడం కనిపించడంతో జేసీబీలు, రోలర్లతో పనులు కొనసాగుతున్నాయి.Pedestal fans being used to dry the patch work after the multiple portions of the Lucknow-kanpur expressway was damaged barely a forthnight after inauguration.#REDMINote17 #vivoS2#Investors_favorite_Stock#Avadhootadattapeetham #vivoseries pic.twitter.com/Y5vdl2gLz1— Cockroach Janta Party,Kanpur (@CJPknp) August 6, 2026ఒకే మార్గంలో రెండు వైపులా వాహనాలుమరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దెబ్బతిన్న క్యారేజ్‌వేలను మూసివేయడంతో లక్నో నుంచి కాన్పూర్, కాన్పూర్ నుంచి లక్నో వెళ్లే వాహనాలను ఒకే మార్గంలోకి మళ్లిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనదారులు యూ టర్న్ తీసుకుని వ్యతిరేక దిశలో ప్రయాణించాల్సి వస్తోంది.120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో డైవర్షన్లు, బ్యారికేడ్లు, మరమ్మతు ప్రాంతాల కారణంగా వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. అయితే అధికారికంగా వేగ పరిమితిని తగ్గించలేదని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు.టోల్ చెల్లించిన తర్వాతే డైవర్షన్ సమాచారంమరమ్మతుల కారణంగా మార్గం మార్చాల్సి వస్తున్నప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని పలువురు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. టోల్ చెల్లించిన తర్వాతే రూట్ మార్పు వివరాలు చెబుతున్నారని ఆరోపించారు. కొంతమంది ప్రయాణికులు రోడ్డులో కుంగిన ప్రాంతాల వల్ల వాహనాలు అదుపు తప్పే పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీంతో పాత రహదారుల వైపు మళ్లుతున్నట్లు చెప్పారు.నీరు చొరబడటమే కారణమా?ప్రాథమిక పరిశీలనలో వర్షపు నీరు రహదారి పొరల్లోకి చేరి కింద ఉన్న మట్టిని బలహీనపరిచినట్లు భావిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. తవ్విన ప్రాంతాల్లో తడి మట్టి కనిపించిందని, దీంతో రోడ్డు పైభాగం కుంగిపోయినట్లు ప్రాథమిక అంచనా వేశారు. రోడ్డు నాణ్యతను ప్రభావితం చేసే అంశాల్లో మట్టి నాణ్యత, పొరల కాంపాక్షన్, డ్రైనేజీ వ్యవస్థ, బిటుమెన్ నాణ్యత కీలకమని నిపుణులు చెబుతున్నారు. కారణాలను పూర్తిగా గుర్తించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు.నిర్మాణ సంస్థపై చర్యలుఈ ఘటనపై నిర్మాణ సంస్థ పీఎన్సీ ఇన్ఫ్రాటెక్పై ఎన్హెచ్ఏఐ చర్యలు ప్రారంభించింది. సంస్థను “నాన్-పర్ఫార్మర్”గా ప్రకటించే ప్రక్రియ మొదలుపెట్టడంతో పాటు, బాధ్యులపై జరిమానాలు, భవిష్యత్ ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా నిషేధం వంటి చర్యలను పరిశీలిస్తోంది. మరమ్మతు పనుల మొత్తం ఖర్చును నిర్మాణ సంస్థే భరించాల్సి ఉంటుందని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. సుమారు రూ.3 కోట్ల వరకు ఈ పనులకు ఖర్చవుతుందని అంచనా వేసింది.ఇంజినీర్లపై వేటుప్రాజెక్టు పర్యవేక్షణలో నిర్లక్ష్యంపై కొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు మేనేజర్ వివేక్ కుమార్ గుప్తా, ఇండిపెండెంట్ ఇంజినీర్ టీమ్ లీడర్ సురేంద్ర కుమార్, రెసిడెంట్ ఇంజినీర్ యతేంద్ర కుమార్‌లను ప్రాజెక్టు నుంచి తొలగించారు.టోల్ వసూళ్లకు బ్రేక్మరమ్మతులు పూర్తయ్యే వరకు కాన్పూర్–లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ వసూళ్లు నిలిపివేస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. టోల్ ఆదాయ నష్టాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేస్తామని వెల్లడించింది. రూ.4,200 కోట్లతో నిర్మించిన హైస్పీడ్ కారిడార్.. ప్రారంభమైన కొద్ది రోజులకే రిపేర్ల బాట పట్టడం ఇప్పుడు రహదారి నిర్మాణ నాణ్యతపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. -
చెత్తలో పారేసిన లాటరీ టికెట్..ఏకంగా అన్ని కోట్లా..! కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
ఒక్కోసారి పొరపాటున లేక ఏమరపాటున పెద్ద వాల్యు చేయదని పడేసిన లాటరీ టికెట్ ఒక్కోసారి ఊహకందని రేంజ్లో డబ్బును గెలుచుకుంటుంది. నిజమా కల అనిపించేంత సొమ్ముని అందిస్తుంటుంది. అయితే ఆ లాటరీ మన వద్ద ఉంటే..ఆ అదృష్టం మన చెంతే.. అదే చేజార్చుకుంటూ ఆ బాధ మాటలకందనిది. ఇక్కడొక మహళ కూడా చేజేతులారా లాటరీ టికెట్‌ని పోగోట్టుకుంది. కట్‌చేస్తే అది ఎంత మొత్తం గెలుపొందిందంటే..ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. దక్షిణ ఇటలీలోని బిటోంటోలో ఒక దుకాణంలో తన లాటరీ నంబర్లను సరిచూసుకున్నప్పుడు, అది అనర్హమైనది, (నాన్ పేబుల్) అని సందేశం రావడంతో మరో ఆలోచన లేకుండానే పారేసింది. నిజానికి అలా దుకాణం వద్ద చెల్లించలేనంత భారీ సోమ్ముని గెలుపొందినప్పుడే ఇలాంటి సందేశం వస్తుంది. అయితే సదరు మహిళ దుకాణం నుంచి ఇంటికి తిరిగి వచ్చాక..ఆమె తరుచుగా ఆడే నంబర్లే ఆమెను విజేతగా నిలిపాయని, కటుంబ సభ్యులు చెప్పాకగానే తెలియలేదు అసలు విషయం. ఆమె ఎంచుకునే నంబర్లన్నీ అత్యంత ఆప్తులైన వారికి సంబధించినవే. దీంతో ఆమె వెంటనే ఆ టికెట్ కోసం దుకాణానికి పరిగెత్తింది. అప్పటికే ఆ టికెట్ చెత్తలో పారేయబడటం, చెత్తను తరలించే వాహనంలో వెళ్లిపోవడం చకచక జరిగిపోయాయి. ఎలాగైనా టికెట్‌ని తిరిగిపొందేందుకు..ఆమె కుటుంబ సభ్యులు వ్యర్థాల నిర్వహణ సంస్థ 'SANB' నిర్వాహకుడు రాబర్టో నికోలా టోస్కానోను సంప్రదించారు. చెత్తను తీసుకువెళ్లే ట్రక్ అప్పటికే దానిని తీసుకెళ్లిపోవడంతో, అది దొరుకుతుందనే పెద్దగా ఆశ లేకుండానే టోస్కానో అతని బృందం ఆ ట్రక్‌ని గుర్తించి ఆపారు. చెత్తలో ప్రమాదకరమైన పదార్థాలు ఉండే అవకాశం ఉన్నందున, ప్రత్యేక సంరక్షణా సౌకర్యాలున్నా..సంస్థకు తరలించి, అక్కడి పారిశుధ్య కార్మికుల సాయంతో జల్లెడ పట్టారు. చివరికి ఆశ్చర్యకరంగా ఆ టికెట్‌ని గుర్తించారు. అదృష్టవశాత్తు చెక్కు చెదరకుండా ఉండటంతో ఆ విషయాన్ని టోస్కానో సదరు మహిళకు తెలియజేశారు. పాపం ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఆమెకు అదృష్టం తిరిగి వరించినా..ఒక షరతు వర్తిస్తుందామెకు. ఎందుకంటే..SANB ఒక ప్రభుత్వ సంస్థ కావడంతో, ఆ అన్వేషణ ప్రక్రియకు అయిన అదనపు ఖర్చులన్నింటినీ భరించేందుకు ఆ మహిళ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ టికెట్ ఎంత సొమ్ము గెలుపొందిదంటే..అక్షరాల రూ. 11 కోట్లు. ఏదీఏమైతేనేం కాలదన్నుకున్నది కోట్లు తెచ్చిపెట్టింది..తిరిగి చెంతకు చేరింది. రాసి పెట్టుంటే..అది మన చెంతకు ఏదో విధంగా వచ్చి తీరుతుంది అంటే ఇదే కదూ..!(చదవండి: షాపింగ్ కోసం ఏకంగా హెలికాప్టర్..!విస్తుపోయిన అధికారులు) -
షాపింగ్ కోసం ఏకంగా హెలికాప్టర్ ..!విస్తుపోయిన అధికారులు
షాపింగ్ కోసం ఇక్కడొక అమెరికా వ్యక్తి ఏకంగా హెలికాప్టర్లో ప్రయాణించాడు. ఈ ఘటన అమెరికాలోని రోసెండాల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్టానిక అవుట్ డోర్ సామాగ్రి దుకాణమైన 'కాబెలాస్'కు వెళ్లేందుకు విస్కాన్సిన్కు చెందిన 69 ఏళ్ల వ్యక్తి హెలికాప్టర్లో వెళ్లాడు. అతడు సుదీర్ఘ ప్రయాణాన్ని నివారించేందుకు ఇలా చేసినట్లు సమాచారం. అయితే ఆ హెలికాప్టర్‌ను నేరుగా పార్కింగ్ స్థలంలో ల్యాండ్ చేయడంతో ఒక్కసారిగా స్థానికులు, అధికారులు ఆశ్చర్యపోయారు. రోసెండాల్ గ్రామం నుంచి బయలుదేరిన పైలట్ తన అసాధారణ జర్నీ గురించి వివరిస్తూ.. హైవేపై డ్రైవింగ్ చేయడానికి చాలా సమయం పడుతుందని తేలికగా పేర్కొన్నారు. రిచ్‌ఫీల్డ్ గ్రామంలోని కాబెలాస్ పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ దిగినట్లు సమాచారం రావడంతో వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పైలట్‌తో మాట్లాడిన తర్వాత, రోసెండేల్కు చెందిన 69 ఏళ్ల వ్యక్తి ఇలా తన ప్రైవేట్ హెలికాప్టర్లో ప్రయాణించినట్లు గ్రహించారు. చాలా దూరం జర్నీ ఉంటుందని చెప్పడంతోనే ఇలా హెలికాప్టర్లో తీసుకువచ్చినట్లు అధికారులకు పైలట్ తెలిపాడు. అంతేగాదు ఆ పైలట్‌కు లైసెన్స్ ఉంది. అలాగే సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు కూడా. అన్ని నిబంధనలను పాటించే హెలికాప్టర్ని నడిపనట్లు తేలింది. అలాగే అతడు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తేలడంతో ఎటువంటి అరెస్టులు వంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు అధికారులు. నెటిజన్లు కూడా ప్రతి ఒక్కరికీ ఎగిరే విమానం ఉంటే ఎంత బాగుండును అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది -
E20 వివాదంలో గడ్కరీకి భారీ ఊరట
E20 పెట్రోల్ వివాదం నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టులో కీలక ఊరట లభించింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) విధానంతో అనుసంధానిస్తూ సోషల్ మీడియాలో ఆయనపై, కుటుంబ సభ్యులపై జరుగుతున్న ప్రచారానికి బుధవారం కోర్టు బ్రేకులు వేసింది. ఈ కంటెంట్‌ను “అసహ్యకరమైనది, దూషణాత్మకమైనది”గా అభివర్ణించిన ధర్మాసనం.. తక్షణమే తొలగించాలని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) అంశం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్, ఇంజిన్ పనితీరుపై ప్రభావం ఉంటుందా? పాత వాహనాలకు ఇది అనుకూలమా? అనే అంశాలపై వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో గడ్కరీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు, వీడియోలు ప్రచారం చేశారు. కేవలం తన కుటుంబ(కొడుకుల) వ్యాపారాలు బాగుండడం కోసమే ఆయన ఆ విధానం తెరపైకి తెచ్చారని జోరుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంపై గడ్కరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. E20 విధానం తన శాఖ పరిధిలోది కాదని, ఇది పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యక్రమమని స్పష్టం చేశారు. తన కుటుంబం చెరుకు పరిశ్రమలో ఏనాటి నుంచో ఉందని.. అయితే ఇథనాల్ పెట్రోల్ విధానం వల్ల తనకు గానీ, తన కుటుంబానికి గానీ పెద్దగా లాభం లేదని వివరణ ఇచ్చారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా గడ్కరీ తరఫు న్యాయవాదులు.. E20 విధానంపై విమర్శల పేరుతో మంత్రిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు.. మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు ఇతర మధ్యవర్తి సంస్థలకు ఆ పోస్టులు, వీడియోలను తొలగించాలని ఇవాళ ఆదేశించింది.ఇదిలా ఉంటే.. E20 విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల దేశ ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని, రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతోంది. మైలేజ్‌పై కొంత ప్రభావం ఉండొచ్చని అంగీకరిస్తూనే.. ఇంజిన్లకు నష్టం జరుగుతుందనే వాదనలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.గతంలో లోక్‌సభలో గడ్కరీ మాట్లాడుతూ.. వాహనం రకం, తయారీ సంవత్సరం ఆధారంగా మైలేజ్‌లో 2 నుంచి 6 శాతం వరకు మార్పు ఉండొచ్చని తెలిపారు. E20 అమలు శాస్త్రీయంగా, దశలవారీగా జరిగిందని పేర్కొన్నారు.మరోవైపు E20పై సుప్రీంకోర్టులోనూ చర్చ జరిగిన నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం E20ను కేవలం “ప్రయోగం”గా పేర్కొన్నట్లు వచ్చిన ప్రచారాన్ని న్యాయశాఖ ఖండించింది. మొత్తంగా E20 విధానంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా గడ్కరీ చేసిన న్యాయపోరాటంలో బాంబే హైకోర్టు ఆదేశాలు కీలక పరిణామంగా మారాయి. -
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
ఒక నాయకుడి అసలైన బలం.. జనం. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ పర్యటనకు వెళ్లినా ప్రజా స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంటుంది. జగన్ పర్యటనలను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ముందుంచి ఆంక్షలు విధిస్తోంది. అయితే, ప్రతిసారీ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆ ప్రయత్నాలకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పర్యటన మరోసారి ఇదే చర్చకు వేదికైంది. గత రెండేళ్లుగా.. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు జగన్ దేవరపల్లి పర్యటన చేపట్టారు. రైతులను పరామర్శించడంతో పాటు పొగాకు యార్డ్‌ను పరిశీలించారు. అయితే ఈ పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. జనసందోహం మాత్రం తగ్గలేదు.బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు, నియంత్రణ చర్యలు ఉన్నప్పటికీ జగన్‌ను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్ల వెంట, పర్యటన మార్గాల్లో జనం బారులు తీరడం కనిపించింది. ఈ క్రమంలో.. ఓ మహిళ ప్రదర్శించిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. “ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు” అంటూ జగన్ చిత్రాన్ని చూపించడం సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది. చుట్టుపక్కల మహిళలు, కార్యకర్తలు ఆ ఫొటోను పైకి ఎత్తి పట్టుకోగా.. పలువరు ఆ ఫొటోతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అదే సమయంలో.. రాసిపెట్టుకోండి 2029లో జగనే సీఎం, వైఎస్ జగన్ మా దేవుడు అంటూ కొందరు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. తమ నాయకుడిపై ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.జగన్ పర్యటనలపై ప్రభుత్వం గత రెండేళ్లుగా ఆంక్షలు విధిస్తోంది. కేసులు పెడతామని నేతలను, ఆ వైపు వెళ్లనీయకుండా సాధారణ ప్రజలను ఇబ్బండి పెడుతోంది. అదేసమయంలో సరైన భద్రత కల్పించకుండా.. డ్రామాలు ఆడుతోంది. అయితే బారికేడ్లు, ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసినా ప్రజల అభిమానం మాత్రం తగ్గడం లేదు. రాజకీయంగా చూస్తే.. ప్రతి పర్యటనలోనూ కనిపిస్తున్న జన స్పందన వైఎస్సార్సీపీకి బలాన్ని చేకూరుస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నాయకుడిపై అభిమానం ఉంటే జనాలు స్వచ్ఛందంగా తరలివస్తారనే వాదనకు జగన్ పర్యటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. -
కింద రొమాన్స్.. పైన హారర్!
పెళ్లి అనేది జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను మరింత అందంగా మలుచుకునేందుకు ఇప్పుడు చాలా మంది జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకమైన లొకేషన్లు, అద్భుతమైన విజువల్స్ కోసం కొందరు వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తూ.. దేశాలు దాటి మరీ ఫొటోషూట్లు చేయించుకుంటున్నారు. ప్రేమను, అనుబంధాన్ని అందమైన ఫ్రేమ్‌లలో బంధించేందుకు చేసే ఈ ప్రయత్నాలు ఒక్కోసారి ఊహించని మలుపులు తీసుకుంటాయి. అలాంటి ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందమైన ప్రేమ దృశ్యంగా ఉండాల్సిన ఆ చిత్రం.. చూసిన వారిని కాసేపు భయపెట్టించింది. ఫొటోలో కనిపించిన ఓ వింత దృశ్యం.. “అక్కడ ఎవరైనా వేలాడుతున్నారా?” అనే అనుమానాన్ని రేకెత్తించింది. అయితే అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇదంతా కెమెరా యాంగిల్ చేసిన మాయ అని తేలింది. అసలు ఆ ఫొటోలో ఏం కనిపించింది? నెటిజన్లు ఎందుకు షాక్ అయ్యారు?బాలికి చెందిన ఫొటోగ్రఫీ సంస్థ లెమురియాంట్స్(Lemuriarts).. టెడ్డీ, స్టెఫానీ అనే జంట ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా తీసిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందమైన ప్రదేశంలో ఆ జంట నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఫొటో మొదటి చూపులో చాలా సాధారణంగానే కనిపించింది. కానీ ఫొటో పైభాగాన్ని గమనించిన కొందరు నెటిజన్లకు మాత్రం ఓ వింత విషయం కనిపించింది. ఆకాశంలో గాల్లో వేలాడుతున్నట్లుగా కనిపించిన రెండు కాళ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి.“ఎవరైనా వేలాడుతున్నారా?”ఫొటో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “అక్కడ ఎవరో వేలాడుతున్నట్లు కనిపిస్తోంది” అంటూ కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు “మొదటిసారి చూసినప్పుడు భయమేసింది” అంటూ తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ఫొటో ఎక్స్ (X)లోనూ వైరల్‌గా మారింది. లక్షలాది మంది వీక్షించడంతో.. ఆ వింత దృశ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.రొమాన్స్ కింద.. హారర్ పైన!ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “ఒకే ఫొటోగ్రాఫర్.. కింద రొమాన్స్, పైన హారర్” అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు “ఇది క్రైమ్ సీన్ ఫొటోలా కనిపిస్తోంది” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అసలు నిజం ఏంటంటే..అయితే ఫొటోను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడింది. అవి ఎవరో వేలాడుతున్న కాళ్లు కాదని, కెమెరా యాంగిల్ వల్ల అలా కనిపించాయని నెటిజన్లు గుర్తించారు. కొంతమంది ప్రకారం.. ముందుభాగంలో నిచ్చెనపై నిలబడి ఉన్న వ్యక్తి కాళ్లు, ఫొటో తీసిన కోణం కారణంగా గాల్లో వేలాడుతున్నట్లుగా కనిపించాయి. జంటపై ఫోకస్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ దూరం కారణంగా ఈ వింత భ్రమ ఏర్పడింది.కెమెరా యాంగిల్ చేసిన మాయనిజానికి ఈ ఫొటోలో ఎలాంటి భయానక ఘటన లేదని స్పష్టమైంది. కేవలం సరైన కోణంలో పడిన చిత్రం.. వేలాది మందిని క్షణం పాటు అయోమయానికి గురిచేసింది. ప్రేమ జంట జ్ఞాపకంగా తీసిన ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటో.. చివరకు సోషల్ మీడియాలో “మిస్టరీ ఫొటో”గా మారడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
మా వాళ్లు 30 మంది ఖతమయ్యారు.. భారత్ పనే ఇది!
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఓ ఆపరేటివ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు, నాలుగేళ్లలో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో హతమైనట్లు ఆ సంస్థ ప్రతినిధి రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నాడు. అయితే ఈ హత్యల వెనుక భారత నిఘా సంస్థలు ఉన్నాయని అతడు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో రిజ్వాన్ హనీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో లష్కరే తోయిబా సభ్యులు లక్ష్యంగా దాడులకు గురయ్యారని పేర్కొన్నాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో తమకు చెందిన వ్యక్తులు మరణించారని చెప్పాడు.“గత మూడు నుంచి నాలుగేళ్లలో 30 మందికి పైగా మా సభ్యులు భారత నిఘా ఏజెంట్ల చేతిలో హతమయ్యారు” అని అతడు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ఘటనలను అతడు “తెలియని గన్‌మెన్ మోడల్”unknown gunman modelగా అభివర్ణించాడు.Lashkar-E-Taiba's First Ever Explosive Admission 🔥🔥🔥Lashkar-e-Taiba/JKUM terrorist Rizwan Hanif openly admits that more than 30 members of the outfit were eliminated by unknown gunmen (Indian agents), across Peshawar, Karachi, Rawalpindi, Rawalakot and Muzaffarabad over the… pic.twitter.com/gXr0jIeYmH— OsintTV 📺 (@OsintTV) August 3, 2026అయితే ఈ ఆరోపణలకు సంబంధించి భారత ప్రభుత్వంగానీ, ఇటు భద్రతా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్థాన్ తరచూ ఈ దాడులకు భారత్‌ను కారణంగా చూపుతుండగా.. న్యూఢిల్లీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నాయి.తొలిసారి.. ఒప్పుకోలులష్కరే తోయిబా అనుబంధ వ్యక్తి ఒకరు తమ సంస్థకు చెందిన ఇంతమంది సభ్యులు వరుసగా హతమైనట్లు బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి అని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో పలువురు ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎలా పుట్టింది లష్కరే తోయిబా?లష్కరే తోయిబా పాకిస్థాన్‌లో ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ. 1980ల చివర్లో హఫీజ్ మహ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్, అబ్దుల్లా అజామ్‌లు ఈ సంస్థను స్థాపించారు. తొలినాళ్లలో ఇది మర్కజ్-ఉద్-దవా-వల్-ఇర్షాద్ అనే సంస్థకు అనుబంధంగా పనిచేసింది. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఏర్పాటైన ఈ సంస్థ.. ఆ తర్వాత తన కార్యకలాపాలను జమ్మూ కశ్మీర్‌పై కేంద్రీకరించింది. కశ్మీర్లో సాయుధ పోరాటం పేరుతో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిందని భారత్ ఆరోపిస్తోంది.ముంబై దాడులతో ప్రపంచ దృష్టిలోకిలష్కరే తోయిబా పేరు 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు వచ్చింది. ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, నరిమన్ హౌస్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపించింది. అనంతరం ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పలు దేశాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాయి.భారత్, పాశ్చాత్య దేశాలు లష్కరే తోయిబాకు పాకిస్థాన్‌లోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని గతంలో ఆరోపించాయి. అయితే పాకిస్థాన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది.విద్వేష వ్యాఖ్యలపై వివాదంతాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన రిజ్వాన్ హనీఫ్.. గతంలోనూ ఇతర మతాలపై అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు.అసలు ఎవరి హస్తం?లష్కరే తోయిబా సభ్యులుగా చెప్పబడుతున్న వ్యక్తుల హత్యల వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. అయితే రిజ్వాన్ హనీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, వాటిపై జరుగుతున్న దాడులపై మరోసారి చర్చకు తెరలేపాయి. భారత్ షరామామూలుగానే ఈ ఆరోపణలను ఖండించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. -
మీ వాట్సాప్ పని చేస్తోందా?
మీ వాట్సాప్ పని చేస్తోందా?. మెసేజ్‌లు వెళ్లకపోయినా.. అందుకోకపోయినా కంగారుపడకండి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో పలువురు యూజర్లు అనూహ్య సమస్యను ఎదుర్కొన్నారు. భారత్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వాట్సాప్ అకౌంట్లు సోమవారం రాత్రి ఒక్కసారిగా ‘అకౌంట్ ఇన్ రివ్యూ’ అంటూ కనిపించడంతో యూజర్లు ఆందోళనకు గురయ్యారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ సమస్య మొదలైనట్లు పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తమ అకౌంట్లు నిలిచిపోయాయని, మెసేజ్‌లు పంపడం, ఇతర ఫీచర్లు ఉపయోగించడం సాధ్యం కావడం లేదని తెలిపారు. అయితే.. రివ్యూ పూర్తయ్యే వరకు వాట్సాప్‌లోని ఫీచర్లు అందుబాటులో లేకుండా పోయాయి.వాట్సాప్ స్క్రీన్‌పై “Account in review” అనే సందేశం కనిపించింది. యూజర్ల అకౌంట్ యాక్టివిటీ, డివైస్ వివరాలను తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, సాధారణంగా 24 గంటల్లో ఫలితం తెలియజేస్తామని అందులో పేర్కొంది.ఈ పరిణామంపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ.. సేవలను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా కొన్ని అకౌంట్లను నిషేధిస్తామని తెలిపారు. అయితే కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉందని, అలాంటి సందర్భాల్లో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి యూజర్లను తిరిగి చాటింగ్‌కు అనుమతిస్తామని చెప్పారు.కొంతమంది యూజర్లు తమ అకౌంట్లు ఎలాంటి కారణం లేకుండా డిసేబుల్ అయ్యాయని, అప్పీల్ చేసినా సాధారణ మెసేజ్ మాత్రమే వస్తోందని సోషల్ మీడియాలో వాపోయారు. అధికారిక వాట్సాప్ యాప్ మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ తమ అకౌంట్ నిలిపివేయడం అన్యాయమని కొందరు పేర్కొన్నారు.ప్రస్తుతం ప్రభావితమైన అకౌంట్లను వాట్సాప్ పరిశీలిస్తోంది. 24 గంటల్లో సమీక్ష పూర్తయిన తర్వాత అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. ఈ సమస్య మీ వాట్సాప్‌కూ ఎదురైందా? లేదా సాధారణంగా పనిచేస్తోందా అనే విషయాన్ని యూజర్లు చెక్ చేసుకోవచ్చు.అయితే ఈ పరిణామంపై కొంతమంది యూజర్లు తమ వ్యక్తిగత సమాచారం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇది ప్రైవసీ ఉల్లంఘనకు సంబంధించిన సమస్యగా ఎలాంటి ఆధారాలు లేవు. వాట్సాప్ నిబంధనల ఉల్లంఘన, అనుమానాస్పద యాక్టివిటీ వంటి అంశాల ఆధారంగా అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్ల వ్యక్తిగత చాట్లు లేదా మెసేజ్‌లను పరిశీలిస్తున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. -
గర్భంలోనే నాన్న మాటలకు స్పందించింది..షాక్‌లో తండ్రి! వీడియో వైరల్
సినిమాల్లోనూ, టీవీల్లోనూ చూస్తుంటాం ఇలాంటి ఘటనలు. హీరో ప్రెగ్నెంట్‌తో ఉన్న హీరోయిన్ కడుపు దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే..కిక్ ఇవ్వడం, స్పందించడం వంటివి చూస్తుంటాం. అలాంటి అరుదైన దృశ్యం రియల్‌గా చోటుచేసుకుంది. పేరెంట్స్ సైతం విస్తుపోయారు తమ పుట్టబోయే పాపాయి స్పందన చూసి..ఈ విచిత్ర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. లియా ఒలివెరా అనే మహిళ తన భాగస్వామితో కలిసి ఒక సాధారణ ప్రినేటల్ అల్ట్రాసౌండ్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఆ మహిళ భర్త ఎంతో ప్రేమగా ఆమె కడుపుపై ముద్దుపెట్టుకుని తమ కాబోయే పాపతో మాట్లాడడం ప్రారంభించారు. "గుడ్ మార్నింగ్.. హ్యాపీ శనివారం, నీకు ఆకలిగా ఉందా?" అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అయితే ఆ తండ్రి గొంతు విని వెంటనే.. అల్ట్రాసౌండ్ స్క్రీన్ పై కనిపించిన చిన్నారి ముఖంలో అద్భుతమైన మార్పు చూసి అక్కడున్ను వారంతా కంగుతిన్నారు. నాన్న మాటలకు ఆ పాపాయి చిరునవ్వుతూ స్పందించింది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించి..సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మేరకు తల్లి లియా ఒలివెరా మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం అంటూ భావోద్వేగానికి గురైంది. పుట్టబోయే బిడ్డతో పేరెంట్స్‌కి ఎంతలా బాండింగ్ ఉంటుందో ఈ ఘటన నిరూపించిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇది యాదృశ్చికమైనదే అయినా..ఈ అద్భుత దృశ్యం వేలాది మంది హృదయాలను గెలుచుకోని..అందరి ముఖాల్లో నవ్వులు విరిసేలా చేసింది. My heart ❤️❤️❤️Baby girl in mommy’s tummy smiles BIG the moment she hears her daddy’s voice during ultrasound.“Behold, children are a heritage from the Lord, the fruit of the womb a reward. Like arrows in the hand of a warrior are the children of one's youth. Blessed is the… pic.twitter.com/BYJkLDcnw1— MJTruthUltra (@MJTruthUltra) July 31, 2026 (చదవండి: తొలి లేడీ డిటెక్టివ్..! ఆఖరికి పెళ్లి గురించి కూడా...) -
ఐఐటీ స్టూడెంట్ కాదు.. కానీ ఏకంగా రూ..4.8 లక్షలు..!
మనం ఐఐటీ వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తేనే మంచి ప్యాకేజీ ఆఫర్లతో ఉద్యోగాలు చేస్తారని అనుకుంటాం. సర్వసాధారణంగా అందరూ ఇలానే భావిస్తారు. బాగా చదివి రాణిస్తే..లక్షల్లో వేతనం అని అందరూ విశ్వసిస్తుంటారు. కానీ అదొక ట్యాగ్ మాత్రమేనని, అంత పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా.. ఆ రేంజ్లో డబ్బులు సంపాదించొచ్చనని ఈ వ్యక్తి నిరూపించాడు.అతడే 22 ఏళ్ల లావణ్య జైన్. ఆయన తాను ఐఐటీ స్టూడెంట్ కాకపోయినా..ఆ రేంజ్లో ఎలా వేతనం ఆర్జిస్తున్నాడో అకౌంట్ స్క్రీన్ షార్ట్‌లతో సహా సోషల్ మీడియాలో ఎక్స్‌లో పంచుకున్నారు. తన కాలేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజీ కంటే ఎక్కువ ఆర్జిస్తున్నట్లు తెలిపారు. అలాగే తన బీటెక్ డిగ్రీని కూడా మధ్యలో వదిలేశానని అన్నారు. తన చివరి సెమిస్టర్లో ఇంజనీరింగ్‌ని వదిలేశానని అన్నారు. పైగా దాన్ని అతడు తన జీవింతంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటిగా పేర్కొనడం విశేషం. తనకు వేర్వేరు మార్గాల్లో ఆదాయ వనరులు ఉన్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆదాయం ఖర్చులకు సరిపోగా, మిగతావి పొదుపు చేస్తున్నట్లు తెలిపారు. ఆ పోస్ట్‌లో స్క్రీన్షాట్లలో అకౌంట్లో రెండు చెల్లింపు జమ అయినట్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి రూ. 3.74 లక్షలు , మరొకటి రూ. ₹1.12 లక్షలు. రెండూ కలిపి రూ. 4.8 లక్షలు అయ్యాయి. తాను ఒక పక్క పార్ట్‌టైమ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూనే..రనబుల్, కైరోస్ కంప్యూటర్ అండ్ ఫోల్డ్ వంటి స్టార్టప్‌ల గ్రోత్ అండ్ గో-టు- మార్కెట్(జీటీఎం) విభాగాలలో పనిచేస్తూ..ఇంతలా డబ్బులు ఆర్జిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఈ పోస్ట్ గొప్పలు చెప్పుకోవడానికి ఉద్దేశించింది కాదని, ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థ నుంచి పట్టభద్రులైతేనే విజయం సాధ్యమనే భావనను సవాలు చేసేందుకుని ఈ మార్కెటింగ్ నిపుణుడు లావణ్య జైన్ చెప్పారు. ఐఐటీలో చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను అంగీకరిస్తూనే, వృత్తిపరమైన విజయం అనేది చివరికి ఒక వ్యక్తి సాధించే దానిపైనే ఆధారపడి ఉంటుందని వాదిస్తున్నాడు. చివరగా ఆయన ఐఐటీ చేస్తేనే లక్షల్లో వేతనం అనేది కేవలం అపోహేనని, ఉద్యోగంలో ఉన్నతంగా ఎదగాలనే ఆకాంక్ష ఆ రేంజ్లో డబ్బులు ఆర్జించే స్థాయికి తీసుకొస్తుందంటూ తన పోస్ట్‌ని ముగించారు. ఏదీఏమైన ఈ వ్యక్తి పోస్ట్ కెరీర్ విజయానికి నిజంగా ఉన్నత కాలేజీ డిగ్రీలే ముఖ్యమా? అనే అంశంపై చర్చను లేవనెత్తింది.i’m not even from an IIT. in fact, i dropped out from my btech, majoring in electronics and communications engineering in my final semester. i think it was one of the best decisions of my life. i’m earning more than the highest placement of my college (100k USD) that too working… https://t.co/u09tfQorCd pic.twitter.com/5MKM2W4zaC— Lavanya Jain (lav) (@ilavanyajain) August 2, 2026 (చదవండి: నో రన్నింగ్, నో కార్డియో..! జస్ట్ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..) -
బాంబర్ బీభత్సం.. షాకింగ్ విజువల్స్ వైరల్!
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ మరోసారి ఉగ్రదాడితో వణికిపోయింది. శాంతి కోసం నిర్వహించిన ఓ నిరసన ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే దాడి దృశ్యాలు.. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. "మిలిటెన్సీని అంతం చేయాలి.. ప్రజలకు భద్రత కల్పించాలి" అంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించి, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో గేటు వద్దే పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.పోలీసులే టార్గెట్.. శాంతి ర్యాలీపై పంజాస్వాత్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రకారం ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బంది కూడా మృతి చెందారు. దాడి జరిగిన ప్రాంతం కిక్కిరిసి ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు శబ్దం వినిపించగానే ప్రజలు భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు స్థానికులు సహకరించారు.ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే ఖైబర్ పఖ్తున్ఖ్వాలో చురుకుగా ఉన్న తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఇక్కడే ఎందుకు దాడులు?పాకిస్థాన్‌లో ఉగ్రవాద సమస్యకు అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ఒకటి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం, కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కారణంగా ఈ ప్రాంతం చాలా కాలంగా ఉగ్రవాద గ్రూపులకు స్థావరంగా మారింది. గతంలో ఈ ప్రాంతం పాకిస్థాన్ తాలిబాన్ వంటి మిలిటెంట్ గ్రూపుల ప్రభావంలో ఉండేది. పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ఆపరేషన్లతో కొంతకాలం దాడులు తగ్గినా.. ఇటీవలి సంవత్సరాల్లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయి.TTP మళ్లీ పుంజుకుంటోందా?తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) లక్ష్యం పాకిస్థాన్‌లో తమకు అనుకూలమైన కఠిన ఇస్లామిక్ పాలన ఏర్పాటు చేయడం. ఈ సంస్థ భద్రతా బలగాలు, ప్రభుత్వ సంస్థలు, తమకు వ్యతిరేకంగా మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లోని కొన్ని మిలిటెంట్ గ్రూపులకు ధైర్యం పెరిగిందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం తమ భూభాగం నుంచి పాకిస్థాన్‌పై దాడులు జరగడం లేదని చెబుతోంది.శాంతి కోరుతున్న ప్రజలే ఎందుకు బలవుతున్నారు?ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని సాధారణ ప్రజలు ఏళ్లుగా ఉగ్రవాదం, సైనిక చర్యల మధ్య నలిగిపోతున్నారు. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా పేరున్న స్వాత్ లోయ కూడా ఉగ్రవాద ప్రభావాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు అక్కడి ప్రజలు మళ్లీ అలాంటి పరిస్థితులు రావద్దని కోరుతున్నారు. అయితే శాంతి కోసం గొంతెత్తుతున్న వారినే లక్ష్యంగా చేసుకోవడం ఉగ్రవాదుల వ్యూహంలో భాగమని నిపుణులు అంటున్నారు. ప్రజల్లో భయాన్ని పెంచడం, ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీయడం, భద్రతా వ్యవస్థను సవాలు చేయడమే ఇలాంటి దాడుల ప్రధాన ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్?పాక్‌కు పెరుగుతున్న భద్రతా సవాల్ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలు, మరోవైపు అంతర్గత ఉగ్రవాదం పాకిస్థాన్‌కు పెద్ద సవాల్‌గా మారాయి. కేవలం సైనిక చర్యలతోనే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడం సాధ్యం కాదని.. స్థానిక ప్రజల విశ్వాసం, అభివృద్ధి, సరిహద్దు నియంత్రణ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.శాంతి కోసం జరిగిన ర్యాలీపై జరిగిన ఈ దాడి.. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఉగ్రవాద సమస్య ఇంకా ఎంత తీవ్రంగా ఉందో మరోసారి బయటపెట్టింది. ప్రజలు భయంతో జీవించే పరిస్థితికి ముగింపు పలకడం పాకిస్థాన్ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది.BREAKING: A suicide blast struck Kabal Police Station in Swat district, Khyber Pakhtunkhwa, Pakistan, during a nearby peace rally. Reports indicate at least 16 people, including 10 police officers, were killed, with many others injured.#BreakingNews #Pakistan #Swat…— WorldNewsRank (@WNewsRankX) August 3, 2026 -
దోమలు, నల్లులు.. హైదరాబాద్ ఐఐటీలో చేదు అనుభవం!
భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హైదరాబాద్‌లో చేరిన ఓ జపాన్ విద్యార్థిని అనుభవాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భారత్‌కు వచ్చిన ఆనందంతో పాటు.. హాస్టల్ వసతిలో ఎదురైన సమస్యలను కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకోవడంతో ఈ అంశం వైరల్‌గా మారింది.ఐఐటీ హైదరాబాద్‌లో తాను తొలి జపాన్ విద్యార్థినినని చెప్పుకున్న హిరో(Japan Student Hiro).. భారత్‌లో తన మొదటి వారం అనుభవాలను వీడియో రూపంలో పంచుకుంది. విమాన ప్రయాణం నుంచి క్యాంపస్ చేరుకునే వరకు జరిగిన విషయాలను వివరించిన ఆమె.. ఐఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ నుంచి లభించిన స్వాగతంపై ప్రశంసలు కురిపించింది. భారత్‌కు రావడం ఎంతో ఉత్సాహంగా అనిపించిందని చెప్పిన హిరో.. క్యాంపస్‌లో తనకు మంచి స్వాగతం లభించిందని పేర్కొంది. కొత్త స్నేహాలు, కొత్త వాతావరణం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయని తెలిపింది.అయితే ఈ ఆనందంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని ఆమె వెల్లడించింది. హాస్టల్ గదిలో సమస్యలు ఉన్నాయని, మంచంపై చనిపోయిన పురుగులు కనిపించాయని చెప్పింది. అంతేకాకుండా దోమకాట్ల కారణంగా తీవ్ర ఇబ్బంది పడ్డానని, నల్లులతో అలర్జీ రావడంతో భారత్‌లో తొలిసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని వివరించింది.తన హాస్టల్ గది పరిస్థితులను చూపిస్తూ ఆమె చేసిన వీడియోలో వసతి సమస్యలను ప్రస్తావించింది. అయితే ఐఐటీ హైదరాబాద్ మొత్తం అనుభవాన్ని ప్రతికూలంగా చూపించకుండా.. ఒకవైపు సంస్థ నుంచి లభించిన సహకారాన్ని, మరోవైపు ఎదురైన సవాళ్లను సమతుల్యంగా వివరించింది. హిరో ఈ వీడియోతో పాటు తన అనుభవానికి సంబంధించిన రెండో భాగాన్ని కూడా త్వరలో పంచుకుంటానని తెలిపింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.హిరో వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆమెకు పలు సూచనలు చేశారు. కొత్త దేశంలో చదువుకునేందుకు వచ్చినప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఓపికగా ఎదుర్కోవాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఐఐటీ హైదరాబాద్ యాజమాన్యం, అంతర్జాతీయ విద్యార్థుల విభాగం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పరువు లాంటి సదుపాయాలు విద్యార్థులే ఏర్పాటు చేసుకుంటారని.. ఆమె కొన్న పరుపు సరైంది ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు.. హాస్టల్ పరిశుభ్రత, వసతి సమస్యలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే త్వరగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే భారతీయ సంస్కృతి, వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని హిరోకు సూచించారు. అదే సమయంలో ఇంకొందరు నెటిజన్లు మాత్రం విదేశీ విద్యార్థులు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలపై విద్యాసంస్థలు మరింత శ్రద్ధ పెట్టాలని అభిప్రాయపడ్డారు.ఐఐటీ హైదరాబాద్ స్వాగతానికి ఫిదా అయిన జపాన్ విద్యార్థిని.. హాస్టల్లో ఎదురైన దోమలు, పురుగుల సమస్యలను బయటపెట్టడంతో ఆమె అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నిర్వాహకులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. -
ఆవేళ ఆమె నడక నేర్పితే..ఈ రోజు ఆకాశంలోకి..!
తల్లినే విమానంలో ప్రయాణికురాలిగా తీసుకువెళ్లితే ఆ పైలట్‌కి కలిగే ఆనందం మాటలకందనిది. ఆ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. పైలట్ తనిష్ అరోరా ఈ వీడియోని పోస్ట్ చేశారు. కొడుకు కాక్‌పిట్‌లో కూర్చొని ఉండగా తల్లి విమానం ఎక్కుతున్న భావోద్వేగ కణాన్ని రికార్డు చేశారు. ఆ రోజుని తన కెరీర్‌లోని అత్యంత స్పెషల్‌డేగా పేర్కొన్నాడు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు, అతను తన తల్లిని ఈ ప్రయాణం గురించి ఎలా అనిపిస్తుందని అడగడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు ఆమె తన కొడుకు నడుపుతున్న విమానంలో మొదటిసారిగా ప్రయాణిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ ఉందని నవ్వుతూ చెబుతుంది. విమానాశ్రయానికి చేరుకుని, ఆమె చెక్-ఇన్ పూర్తి చేసిన తర్వాత, అరోరా విమానంలో తన తల్లిని మళ్లీ కలిశాడు. టేకాఫ్‌కు ముందు, తనకు ఏమైనా సలహాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా..సురక్షితంగా నడపమని చెబుతుండటం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. కానీ అరోరా చిన్నప్పుడు నడక నేర్పిన అమ్మను ఇవాళ ఆకాశంలోకి స్వయంగా తీసుకువెళ్లడం తనకు లభించిన గొప్ప అవకాశంగా పేర్కొన్నాడు. ఫ్లైట్ జర్నీ తర్వాత ఎలా అనిపించింది అని మళ్లీ అమ్మని అడగగా, నా కొడుకు నడిపే విమానంలో ప్రయాణించడం చాలా గర్వంగా ఉందని బదులిస్తుందామె. చివరగా తన కెరీర్లో వేలాది మంది ప్రయాణికులను విమానంలో తీసుకువెళ్లినప్పటికీ, తన తల్లి ఎప్పటికీ తనకిష్టమైన ప్రయాణికురాలిగానే ఉంటుందంటూ తన వీడియో సంభాషణను ముగించాడు. ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఆమె మొదటి అడుగులు ఎలా వేయాలో నేర్పితే..ఈరోజు ఆమెను ఆకాశంలోకి తీసుకువెళ్లే అవకాశం నాకు లభించింది. ఎప్పటికీ ఆమె నాకిష్టమైన ప్రయాణికురాలు అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. ఈ భావోద్వేగభరితమైన వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. View this post on Instagram A post shared by Tanish Arora (@tanisharora09) (చదవండి: అందాల పోటీల్లో తళుక్కుమన్న స్వగతికా పాణిగ్రాహి) -
గుండెపోటు అనుకుని ఎడాపెడా సీపీఆర్.. ఆసుపత్రిలో బిగ్ ట్విస్ట్!
ఓ ప్రాణాన్ని కాపాడాలన్న ఆత్రం.. ఓ పొరపాటు అంచనా.. చివరకు ఊహించని గాయాలకు దారితీసింది. రోడ్డుపై కుప్పకూలిన ఓ టీచర్‌ను గుండెపోటు వచ్చిందని భావించిన ఇద్దరు యువకులు ఆమెకు వెంటనే CPR చేశారు. కానీ, ఆసుపత్రికి వెళ్లాక అసలు విషయం బయటపడింది. ఆమెకు గుండెపోటు రాలేదు.. అయితే తప్పుడు విధానంలో చేసిన CPR కారణంగా రెండు పక్కటెముకలు విరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కైలారస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తీవ్ర ఎండ వేడిమి కారణంగా టీచర్ లలిత స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా తల తిరిగింది. దీంతో, వాహనంపై నుంచి అదుపుతప్పి కిందపడిపోయారు. క్షణాల్లోనే ఆమె చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు పరిస్థితిని చూసి ఆమెకు గుండెపోటు వచ్చిందని భావించారు. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని అనుకుని వెంటనే CPR చేయడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడాలనే ఆందోళనలో పదేపదే ఛాతీపై ఒత్తిడి చేశారు.Madhya Pradesh: A teacher, Lalita, collapsed from her scooter in Kailaras due to extreme heat. Bystanders mistook it for a heart attack and began CPR without checking her condition. Doctors later confirmed she had not suffered a heart attack, and unnecessary CPR allegedly left… pic.twitter.com/4BP0oGpVU8— investmoneymag.com (@InvestMoneyMag) July 31, 2026కానీ, వారికి CPR చేసే సరైన పద్ధతి తెలియకపోవడంతో అదే ఆమెకు మరో సమస్యగా మారింది. కొంత సమయం తర్వాత లలితను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. గుండెపోటు ఆనవాళ్లు కనిపించలేదు. ఎండ వేడి, నీరసం కారణంగానే ఆమె స్పృహ కోల్పోయినట్లు గుర్తించారు. అయితే, వైద్య పరీక్షల్లో మరో విషయం బయటపడింది. CPR సమయంలో అధిక ఒత్తిడి కారణంగా ఆమెకు రెండు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు.ప్రాణం కాపాడాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఆమెకు ఇలా ఊహించని గాయాలకు దారితీసింది. అత్యవసర పరిస్థితుల్లో CPR ఎంతో కీలకమైనప్పటికీ, దాన్ని సరైన పద్ధతిలో చేయడం అంతే ముఖ్యం. శిక్షణ లేకుండా చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాలను కాపాడటానికి బదులుగా కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.हे भगवान..चक्कर आने से गिरी शिक्षिका को हार्ट अटैक समझकर CPR दिया गया, जिससे उनकी दो पसलियां टूट गईं।मध्य प्रदेश के कैलारस में शिक्षिका ललिता गर्मी के कारण स्कूटी से गिर गईं। वहां मौजूद दो युवकों ने उन्हें हार्ट अटैक समझकर लगातार CPR देना शुरू कर दिया।#MPNews #मध्यप्रदेश… pic.twitter.com/ghvAmrxVuh— Om singh (@ompratapsingh0) July 31, 2026 -
తాతయ్య వేళకు మందులు వేసుకునేలా..మనవడి అద్భుత ఆవిష్కరణ!
మన అవసరాలు, ఇబ్బందులే ఒక్కోసారి ఆవిష్కరణకు దారితీస్తాయి. ఒక్కోసారి మన ప్రియమైన వాళ్ల కోసం కొంగొత్త ఆవిష్కరణలకు నాందిపలుకుతాయి. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి అన్ని తానై పెంచిన తాత బాగోగులు కోసం ఈ మనవడు ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. షాంఘైకి చెందిన 18 ఏళ్ల విద్యార్థి మాకై తన తాత వేళకు మందులు వేసుకునేలా గుర్తు చేయడానికి సహాయపడేలా ఓ యాప్‌ని రూపొందించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన తాతగారిపై ఉన్న అపారమైన ప్రేమ ఈ యాప్ రూపకల్పనకు దారితీసిందని చెబుతుండటం విశేషం. ఇటీవలే సెకండరీ స్కూల్ పూర్తి చేసిన మా కై, జూన్‌లో చైనా జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అయిన గావోకావోను రాశాడు.జూలై మధ్యలో షాంఘైలో జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC)కు హాజరైనప్పుడు షాంఘై మార్నింగ్ పోస్ట్ అతడిని ఇంటర్వ్యూ చేయడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌కు చెందిన ఏఐ కంపెనీ మోడల్బెస్ట్ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) అయిన మినీసీపీఎం (MiniCPM)ను ఉపయోగించి తాను ఈ యాప్‌ను రూపొందించినట్లు మా వివరించాడు. ఆ కాన్ఫెరెన్స్‌లో కంపెనీకి చెందిన కొంతమంది నిపుణులు వస్తారని తెలిసి, వారిని ప్రశ్నలు అడగడానికి వచ్చానని అతను చెప్పాడు. తాతగారి కోసం రూపొందించిన యాప్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఇందులో కేవలం కొన్ని లైన్ల కోడ్ మాత్రమే ఉందని వెల్లడించాడు. తాను రూపొందించిన యాప్ మందులు వేసుకోవాలని గుర్తు చేయడమే కాకుండా, యూజర్ ప్యాకేజింగ్ ఫోటోని అప్లోడ్ చేసినట్లయితే..మందుల గడువు ముగిసిందో లేదో కూడా ఈ యాప్ తనిఖీ చేయగలదుని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మందుల గడువు ముగిసినట్లయితే వేసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తుందని తెలిపాడు. చిన్ననాటి నుంచి అన్నీ తానై తాతగారే పెంచారని, ఆయనతో ఉన్న అనుబంధం మాటలకందనిదని పంచుకున్నాడు. ప్రస్తుతం 70 ఏల్ల వయసులో ఉన్న ఆయనకు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించాడు. తాను కాలేజ్‌కి వెళ్లిపోయినా..ఆయన వేళకు మందులు వేసుకోవాలనే ఆరోగ్య సంరక్షణ నిమిత్తమే ఈ యాప్‌ని రూపొందించానని అన్నాడు. తన తాతగారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం వల్ల మందులు వేసుకోవడం మర్చిపోతారేమో లేదా వాటిని తికమక పడతారేమో అని ఆందోళనతోనే ఇలా యాప్‌ని ఆవిష్కరించినట్లు వెల్లడించాడు. పొరపాటున గడువు మందులు తీసుకుంటే పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన, భయమే ఈ యాప్‌ని రూపొందించడానికి కారణమని చెప్పాడు. కాగా, తాను వచ్చే నెల సెప్టెంబర్‌లో మరో నగరంలోని విశ్వవిద్యాలయలంకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇష్టమనేది అవతలి వాడి బాధ్యత, సంరక్షణను హ్యాండిల్ చేయడమని తన జీవనశైలితో చాటి చెప్పాడు కదూ..!.(చదవండి: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్‌లాస్ జర్నీ..! ఓమాడ్‌తో ఏకంగా 18 కేజీలు..) -
నరసాయమ్మ.. మరో గీతాంజలి కాకూడదు!
రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి ఆయుధాలుగా మారుతాయి. ఒకరి వ్యాఖ్యలు మరొకరి ప్రచారానికి అస్త్రాలవుతాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్న మనిషి జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం చాలాసార్లు కనిపించవు. భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవహారంలో ఇప్పుడు చర్చకు వచ్చిన నరసాయమ్మ విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.దాదాపు పదేళ్ల క్రితం భోగాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు సర్కార్ చేపట్టిన భూసేకరణ, రైతులకు పరిహారం అంశాలను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే..నరసాయమ్మ తన భూమి కోల్పోతున్న ఆవేదనను వేదికపై వ్యక్తం చేసింది. ఎర్రబస్సు రాని చోటుకి ఎయిర్‌బస్ ఎందుకు? సర్.. అంటూ మాట్లాడింది( ఈ వ్యాఖ్యలనే జగన్ ప్రస్తావిస్తే.. జగనే ఆ మాట అన్నారని టీడీపీ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది). ఆనాడు అయ్యన్నపాత్రుడి భూముల జోలికి పోకుండా.. ప్రభుత్వం తన కుటుంబానికి ఉన్న రెండెకరాల భూమి బాబు సర్కార్ లాక్కుంటుందనే విషయం ప్రస్తావించి.. న్యాయం కావాలని జగన్ సమక్షంలో వేడుకుంది.అయితే భోగాపురం ఘనత ఎవరిది? అనే ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు, ప్రచారాలకు వేదికగా మారాయి. ఎయిర్‌పోర్టు విషయంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరి నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లింది? ఎలా పూర్తైంది? అనే క్రెడిట్ వార్‌లో నరసాయమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. నరసాయమ్మ ఎక్కడ?.. ఎయిర్‌బస్సు వచ్చింది చూడమ్మా?.. జగన్ నీ నెత్తిన చెయ్యి పెట్టాడు.. అంటూ ఇలా ఆమెపై అభ్యంతకర సందేశాలు కనిపిస్తున్నాయి పలు పేజీల్లో.భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో వైస్సార్సీపీ, కూటమి నేతలు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు భూసేకరణలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేశామని, పరిహారం సైతం ఇప్పించామని, శంకుస్థాపనతో పనులు ప్రారంభించిందే తమ ప్రభుత్వమని వైఎస్సార్సీపీ లెక్కలతో చెబుతుంటే.. మరోవైపు ప్రాజెక్టు ప్రతిపాదన చేసింది తమదే కాబట్టి ఎంటైర్ క్రెడిట్ తమదేనని చంద్రబాబు పార్టీ చెబుతోంది. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా.. బలవంతపు భూసేకరణతో రైతులకు అన్యాయం చేయడం ఎందుకని? మాత్రమే జగన్ అన్నారు. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ఏమాత్రం కాదు. ఆ ఉద్దేశమే ఉంటే.. ఉత్తరాంధ్రను అసలు పట్టించుకునేవారే కాదు కదా!. అధికారంలోకి రాగానే భోగారం ఎయిర్పోర్ట్ భూసేకరణను తగ్గించి.. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించి.. అన్ని అనుమతులతో శంకుస్థాపన చేసే వారా?.. అయితే ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య పాపం నరసాయమ్మ సోషల్ మీడియాకు ఎక్కింది.గతంలో తెనాలికి చెందిన గీతాంజలి ఘటనను గుర్తు చేసుకుంటే.. సోషల్ మీడియా చర్చలు, ట్రోలింగ్లు ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో అర్థమవుతుంది. వైఎస్ జగన్ వల్లే తన కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పినందుకు.. ఆమెను నెట్టింట తెగ ట్రోల్ చేశారు. అది చేసింది ఎవరో అందరికీ తెలుసు. అది తట్టుకోలేక మనస్థాపంతో బలన్మరణానికి పాల్పడిందామె. అంతకు ముందు బెండపూడి విద్యార్థిని విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు.. నరసాయమ్మను ఆ స్థాయిలోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సాధారణ మహిళ మాట్లాడిన మాటలను రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రమాదకర ధోరణి. భోగాపురం విషయంలోనూ నరసాయమ్మను ఒక రాజకీయ ప్రతీకగా మార్చకుండా.. ఆమె ఒక సాధారణ మహిళ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. కానీ ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం సాగకూడదు.క్రెడిట్ కోసం ఒక మహిళను పావుగా మార్చే రాజకీయ ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, నరసాయమ్మ విషయంలోనైనా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త అవసరం. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే సంస్కృతి ఎంతటి పార్టీకైనా, ఏ వర్గానికైనా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తుల జీవితాలపై కాదు. రాజకీయ లాభాల కోసం ఆమెను తెరపైకి తీసుకొచ్చి, తమకు అనుకూలమైన కథనాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగితే అది మరో అన్యాయమే అవుతుంది. -
ఎలుక ఎంత పనిచేసింది.. 10 లక్షల వజ్రాల నగలు..
సాక్షి, బెంగళూరు: తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. కానీ ఉదయం వచ్చి చూసేసరికి రూ.10 లక్షల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి. దీంతో నగల దుకాణం యజమాని గుండె ఆగినంత పనైంది. చివరకు సీసీటీవీ ఫుటేజీ చూస్తే అసలు దొంగను చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ 'మాస్టర్‌మైండ్' ఒక చిన్న ఎలుక!కర్ణాటకలోని తుమకూరు నగరంలోని కాల్టెక్స్ సర్కిల్లో ఉన్న విశ్వాస్ జ్యువెలరీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని, కౌంటర్‌పై ఉన్న 50 గ్రాములకు పైగా వజ్రాల నగలు, 10 ఉంగరాలు, మూడు నెక్లెస్‌లు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు.ఎవరూ లోపలికి రాకపోవడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. రాత్రి వేళ గోడలోని చిన్న రంధ్రం గుండా లోపలికి వచ్చిన ఓ ఎలుక, ఒక్కో నగను నోటితో లాక్కెళ్లి తన బొరియలో దాచిపెడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఎలుక జాడను అనుసరించి బొరియను తవ్వి చూడగా.. కనిపించకుండా పోయిన 10 ఉంగరాలు, మూడు నెక్లెస్‌లు సహా అన్ని వజ్రాల నగలు అక్కడే లభించాయి. దీంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. నగలన్నీ తిరిగి దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సినిమాల్లోనే కనిపించే సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🐀 Rat becomes 'gold thief' near Bengaluru, drags ₹10 lakh worth of jewellery into its burrow; all ornaments recovered! pic.twitter.com/QYZlFeM9zz— HOSUR UPDATES (@hosurupdates) July 30, 2026 -
ఒక్కసారిగా వేల మంది.. వలసల తుపానుతో షాక్‌లో స్పెయిన్
స్పెయిన్–మొరాకో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికా నుంచి యూరప్‌లోకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న వేలాది మంది వలసదారులు గురువారం స్పెయిన్‌కు చెందిన చిన్న భూభాగం సియుటా (Ceuta) లోకి ఒక్కసారిగా ప్రవేశించారు. దీంతో సరిహద్దు వద్ద పరిస్థితి అదుపుతప్పిందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.మొరాకోలోని టరాజల్ బీచ్ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సముద్రపు బ్రేక్వాటర్లను దాటి సియుటాలోకి ప్రవేశించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఎక్కువ మంది యువకులు ఉన్నప్పటికీ.. మహిళలు, చిన్నారులతో కూడిన కుటుంబాలు కూడా కనిపించాయి. స్పెయిన్ భూభాగంలోకి చేరుకున్న కొందరు వలసదారులు ఆనందంతో ‘‘వివా ఎస్పానా’’(స్పెయిన్‌కు జయహో) అంటూ నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో వలసదారులు సరిహద్దు దాటడానికి కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.INSANE FOOTAGE: Thousands of migrants continue crossing from Morocco into Spain’s Ceuta enclave, as local officials reportedly urge Madrid to declare a national emergency. pic.twitter.com/dlbbKOjBV1— Breaking911 (@Breaking911) July 30, 2026సియుటా సివిల్ గార్డ్ ఆఫీసర్స్ చీఫ్ రాచిడ్ స్బిహి మాట్లాడుతూ.. ‘‘పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారింది. ఎంతమంది సరిహద్దు దాటారో ఖచ్చితంగా చెప్పలేం కానీ వేల సంఖ్యలో ప్రజలు లోపలికి వచ్చారు. సరిహద్దు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది’’ అని తెలిపారు.సైన్యాన్ని దించాలని డిమాండ్సియుటా ప్రాంతీయ ప్రభుత్వ అధిపతి జువాన్ జీసస్ వివాస్.. తాజా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల రక్షణ, పౌరుల భద్రత కోసం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని కోరారు. సరిహద్దు వద్ద అదనపు పోలీసు బలగాలతో పాటు సైన్యాన్ని కూడా మోహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘సరిహద్దు భద్రతను కాపాడేందుకు, ప్రజల రక్షణకు మరిన్ని బలగాలు అవసరం’’ అని పేర్కొన్నారు.Thousands of migrants have streamed into the tiny Spanish territory of Ceuta in North Africa from Morocco, prompting local officials to call for help from Spain’s national government in Madrid to restore the border. pic.twitter.com/S2fTWapBzR— The Associated Press (@AP) July 30, 2026అయితే వలసల ప్రవాహాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించే అవకాశం లేదని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పరిస్థితిని వేగంగా అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.మొరాకోతో సమన్వయంసరిహద్దు పరిస్థితులను నియంత్రించేందుకు మొరాకో అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. అక్రమంగా సియుటాలోకి ప్రవేశించిన వారిని వీలైనంత త్వరగా తిరిగి పంపించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపింది. స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఫెర్నాండో గ్రాండే మార్లాస్కా శుక్రవారం సియుటాకు వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు.NEW: Spain is now deploying its military after thousands of military-aged men stormed over the border into Ceuta, Spain.Ceuta authorities are calling on Madrid to declare a national emergency after the border "totally collapsed.""The situation is absolute chaos. It’s not… pic.twitter.com/Mpe5Lc1xlK— Collin Rugg (@CollinRugg) July 30, 2026పెరుగుతున్న వలసల ప్రవాహంసియుటాలోకి వలసదారుల రాక గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతోంది. బుధవారం సముద్ర మార్గంలో సియుటాకు చేరుకునేందుకు ప్రయత్నించిన వారిలో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గత వారం రోజుల్లోనే 1,500 మందికి పైగా వలసదారులు సియుటాలోకి ప్రవేశించారని, అక్కడి ఆశ్రయ కేంద్రాలు ఇప్పటికే నిండిపోయాయని స్థానిక అధికారులు వెల్లడించారు.స్పెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 15 వరకు దాదాపు 3 వేల మంది వలసదారులు భూమి లేదా సముద్ర మార్గాల ద్వారా సియుటాకు చేరుకున్నారు.2021 సంక్షోభం మళ్లీ గుర్తుకు!తాజా పరిణామాలు 2021 మేలో చోటుచేసుకున్న భారీ వలస సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో కేవలం రెండు రోజుల్లోనే 8 వేల మందికి పైగా వలసదారులు సియుటాలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మొరాకో సరిహద్దు నియంత్రణలను సడలించిందనే ఆరోపణలు వచ్చాయి. స్పెయిన్‌లో చికిత్స పొందిన వెస్ట్రన్ సహారా వేర్పాటువాద నేత బ్రాహిం ఘాలీ వ్యవహారం కారణంగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి.యూరప్ ప్రవేశానికి కీలక ద్వారంఉత్తర ఆఫ్రికా తీరంలో ఉన్న సియుటా.. చారిత్రకంగా స్పెయిన్ ఆధీనంలోని ప్రాంతం. మెరుగైన జీవితం కోసం ఆఫ్రికాలోని వివిధ దేశాల నుంచి వచ్చే వలసదారులకు ఇది యూరప్‌లోకి ప్రవేశించే కీలక మార్గంగా మారింది. మొరాకోలోని ఫ్నిడెక్ పట్టణం నుంచి సుమారు 5 కిలోమీటర్ల సముద్ర మార్గాన్ని ఈదుకుంటూ పలువురు సియుటాకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు సరిహద్దు కంచెలను దాటేందుకు ప్రయత్నిస్తారు.తాజా భారీ వలసలతో సియుటా సరిహద్దులో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. స్పెయిన్ ప్రభుత్వం అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది. -
బెల్జియంలో గర్బా : పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా స్పందన
ఇటీవలికాలంలో విదేశాల్లో భారతీయులు చేసే కొన్ని నృత్యాల చుట్టూ జరుగుతున్న వివాదాలు రేగుతున్నాయి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో జనాలకు ఇబ్బంది కలిగించే ప్రదేశాలలో ‘గర్బా’ డ్యాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌర స్పృహ (Civic sense) పాటించడం లేదనే దుమారం రేగింది. అయితే 'గెంట్స్ ఫీస్టెన్ 2026' (Gentse Feesten 2026) పండుగ వేడుకలపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా ఒక ఇంట్రస్టింగ్ వీడియోను పంచుకున్నారు.జూలై 26న బెల్జియంలో జరిగిన ఈ ఈవెంట్ భిన్నంగా నిలిచింది. ఈ వీడియోలో భారతీయులతో పాటు స్థానిక విదేశీయులు కూడా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కలిసి గర్బా అడుగులు వేశారు అంటూ దీనికి సంబంధించిన వీడియోను గోయోంకా షేర్ చేశారు. గర్బా డ్యాన్స్‌పై నెట్టింట వెల్లువెత్తిన విమర్శల మధ్య ఐక్యత, సంబరం, కమ్యూనిటీ స్పిరిట్‌కు నిజమైన ప్రతీక గర్బా అని గుర్తుచేసే చక్కటి సంఘటన ఇది అని పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనలుఈవీడియోపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సంగీతంలో దమ్ముంటే విమర్శకులు కూడా సర్కిల్లో వచ్చి డ్యాన్స్ చేయాల్సిందే అని కొందరు వ్యాఖ్యానించారు. సార్వజనిక సాధారణ జీవితానికి ఆటంకం కలిగించనంత వరకు ఇది మంచిదే. ఎయిర్‌పోర్టులు, హైవేలపై డ్యాన్సులు చేయడం మాత్రం సరికాదు అని కొందరు సూచించారు. ఏ పనికైనా ఒక సమయం, సందర్భం ఉంటాయి అన్నారు మరికొందరు. బెల్జియంలో గర్బా ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాకపోయినా, ఇటీవల భారతీయుల పబ్లిక్ ప్రవర్తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ ఘటన భారతీయ సంస్కృతిని విదేశాల్లో ఎంతో అందంగా చాటిచెప్పేలా నిలిచింది.Amid the flood of Garba criticism online, here’s a heartwarming reminder that the true spirit of Garba is inclusion, celebration, and community. pic.twitter.com/CIlDcQrhEP— Harsh Goenka (@hvgoenka) July 29, 2026ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులుగతంలో విమర్శలకు దారితీసిన ఘటనలునిలిపి ఉంచిన విమానం పక్కన టార్మాక్‌పై ప్రయాణికులు గర్బా డ్యాన్స్ చేయడం.చైనాలోని చారిత్రాత్మక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద ప్రదేశంలో నృత్యం చేసిన ఘటనకొండచరియలు విరిగిపడి ఒకవైపు వాహనాలు నిలిచిపోయి ఒక వైపు జనం ఇబ్బందులు పడుతోంటే, మరోవైపు రోడ్డుపై డ్యాన్స్ చేయడం విమర్శలకు తావిచ్చింది. అలాగే కొచ్చి వాటర్‌లో కదులుతున్న ఫెర్రీ బోటులో గర్బా చేయడంపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు -
భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఆధునిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే తప్ప ఒక సాధారణ కుటుంబం సౌకర్యవంతంగా జీవించలేని పరిస్థితి. అందులో ఎంతో శ్రమ, ఓర్పు, సహనం దాగి ఉంటుంది. అలాంటిది ఒక స్టార్టప్‌ను విజయవంతంగా నడపాలంటే ఇద్దరూ వ్యక్తిగత జీవితంలో చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలా ఇద్దరు భాగస్వాములు ఒక స్టార్టప్‌ను నిర్మించడంలో పూర్తిగా నిమగ్నమై నప్పుడు జీవితం ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక స్టార్టప్ ఫౌండర్ తన భార్యతో గడిపే క్షణాల గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. జస్ట్ కొన్ని సెకన్ల పాటు విమానాశ్రయంలో తన భార్యను కలిసిన చిత్రాన్ని పంచుకుంటూ లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతపై కొత్త చర్చను రేకెత్తించారు.ఢిల్లీకి చెందిన, అట్-హోమ్బ్యూటీ, వెల్నెస్ ప్లాట్‌ఫామ్ (YesMadam) సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్య ఆర్య, (భార్య గరిమా శర్మ) తన పోస్ట్ ద్వారా వ్యక్తిగత జీవిత విశేషాలను షేర్ చేశారు. కలిసి గడపడానికి చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఆ కొన్ని క్షణాలను అర్థవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించామంటూ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: కంగనా రనౌత్‌లా మారిన సాయోని ఘోష్ : ఏకిపారేస్తున్న నెటిజన్లుబహుశా ఎవరూ వివాహాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. మాలో ఒకరం ల్యాండ్ అవుతున్నాం మరొకరం బయలు దేరుతున్నాం," అని ఆదిత్య ఆర్య తెలిపారు. అయినా, తామిద్దరం ఒకే గేట్ వద్ద 90 సెకన్ల పాటు చేతులు పట్టుకుని, ప్రపంచంలో ఉన్న సమయమంతా మాకే ఉన్నంత గొప్పగా ఫీలయ్యామని తెలిపారు. కేవలం ఈ ఒకటిన్నర భేటీలో తీసుకున్న ఒక పిక్‌ను షేర్ చేశారు. అంతేకాదు విమానాశ్రయంలో తన భార్యను ఇలా అనుకోకుండా కలవడం ఇది మొదటిసారి కాదని ఆయన పేర్కొన్నారు. నిజానికి, చాలా జంటలు డేట్లకు వెళ్తుంటే, తాము మాత్రం "లేఓవర్లు" (విమాన ప్రయాణాల్లో మధ్యలో ఆగడం) చేస్తుంటామని చెప్పారు.ఇది సంస్థ నేర్పిన పాఠం నిజానికి ఎవరూ తన దాంప్యత జీవితాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. కానీ కలిసి ఒక వ్యాపారాన్ని లేదా సంస్థను నిర్మిస్తున్నప్పుడు మీ జీవితం ఆటోమేటిక్‌గా ఈ రూపాన్ని సంతరించుకుంటుంది. తక్కువ సమయాన్ని కూడా గరిష్టంగా ఎలా ఉపయోగించుకోవాలో ‘యస్ మేడమ్’ మాకు నేర్పింది. ఫౌండర్లుగా ఉన్నవారి వివాహ బంధానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని తొమ్మిదేళ్ల వైవాహిక జీవితంపై ఆదిత్య వెల్లడించారు.గరిమా శర్మ స్పందనఆదిత్య ఆర్య భార్య కంపెనీ గరిమా శర్మ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె తన భర్త పోస్ట్‌పై స్పందిస్తూ, ఇతరులకు విచిత్రంగా అనిపించేది తమకు లభించే రొమాన్స్ అని పేర్కొన్నారు. ఒక కంపెనీని నిర్మించడం, ఉపాధిని సృష్టించడం, తామిద్దరం నమ్మే ఆశయం కోసం జీవించడం... మాటలతో మాత్రమే కాకుండా అవకాశాలను సృష్టించడం ద్వారా దేశానికి సేవ చేయవచ్చని తమ పిల్లలకు చూపించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. కొందరు ఎయిర్‌పోర్ట్‌లో పక్క పక్కనుంచి వెళుతున్న సాధారణ ప్రయాణీకులా తమని చూడొచ్చు. కానీ తాము మాత్రం ఒకేడ్రీమ్ వైపు అడుగులు వేస్తున్న ఇద్దరిని చూశాం అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు -
బోరున వర్షం.. వీఐపీనే గొప్ప!
జోరున వర్షం.. బస్ షెల్టర్‌లో నిల్చున్న ప్రజలు.. ఇంతలో వీఐపీ కాన్వాయ్ వస్తుందనే సమాచారం. అక్కడ ఉండకూడదంటూ ప్రజల్ని పోలీసులు పక్కకు తరిమేసిన దృశ్యాలు. దీనికి సంబంధించిన 23 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వర్షం కురుస్తున్న సమయంలో బస్ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతూ బయటకు పంపించారు. కొందరిని నెట్టివేస్తున్నట్లు వీడియోలో కనిపించడం వివాదానికి కారణమైంది. రాజస్థాన్ జైపూర్‌లోని జేఎల్ఎన్ మార్గ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.వీఐపీ ప్రోటోకాల్.. ప్రజల హక్కుల కంటే పెద్దదా?ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ షెల్టర్‌లోనే ప్రజలకు చోటు లేకుండా చేయడం ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీఐపీ భద్రత పేరుతో సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.Indian policemen are removing people from under the shed because some lowlife VIP is about to pass by. Feudalism is not a system. It is about the DNA. People don't rebel and vote for psychopaths. Policemen from the lower caste implement what they claimed to have suffered.…— Jayant Bhandari (@JayantBhandari5) July 29, 2026సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ స్పందిస్తూ..“ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ స్టాప్‌లో కూడా ప్రజలు నిలబడలేని పరిస్థితి వచ్చింది. కారణం.. వీఐపీ ప్రోటోకాల్” అంటూ విమర్శించింది. “భారీ వర్షంలో తలదాచుకునేందుకు బస్ షెల్టర్‌లో ఉన్న పాదచారులు, బైక్ రైడర్లను ప్రజల రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే బయటకు పంపించడం సిగ్గుచేటు. వీఐపీ ప్రోటోకాల్ మానవత్వం కంటే గొప్పదా? లేక సామాన్యుడికి ఆశ్రయం పొందే హక్కు లేదా?” అంటూ ప్రశ్నించింది.సోషల్ మీడియాలో దుమారంఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను వీఐపీ రాకపోకల కోసం అడ్డుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీఐపీ భద్రత అవసరమే అయినప్పటికీ.. సాధారణ ప్రజల పట్ల కనీస మానవత్వం, గౌరవం పాటించాల్సిందేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అలాగే ఆ కాన్వాయ్ ఎవరిదన్న వివరాలు కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. -
నిశబ్ద నిస్వార్థ వీరుడు..! అతడి సాయానికి సెల్యూట్ చెప్పాల్సిందే..
ఎలాంటి ఫలాప్రేక్ష లేకుండా నిస్వార్థంగా చేసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి ఒక్కో పద్ధతి. కొందరు దానధర్మాలు చేస్తే..ఇంకొందు సేవా మార్గం ఎంచుకుంటారు. అలాకాకుండా రోజువారీ సాదాసీదా విషయాల్లో తన వంతుగా సహాయ సహకారాలు అందించాలని భావించడమే గ్రేట్ అనుకుంటే..అందుకోసం సమయం కేటాయిస్తూ..నిస్వార్థంగా సేవ చేయడం అంటే మాటలు కాదుకదా..!. అలాంటి సేవతత్పతరతనే అందిస్తున్నాడు ఈ వ్యక్తి.ఆ మహానుభావుడే ముంబైకి చెందిన నరేంద్ర పాటిల్. లోకల్రైళ్లుపై ఆధారపడే ముంబై వంటి నగరాల్లో రైల్వే స్టేషన్లో ఎలాంటి గందరగోళ పరిస్థితి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చోట గమ్యం తెలియక ఇబ్బంది పడుతున్నవాళ్లకు దారిచూపుతాడు ఆయన. చాలా ఓపిగ్గా నవ్వుతూ వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..మార్గనిర్దేశం చేస్తుంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే మానవ సూచికగా అభివర్ణించొచ్చు. ఆయన ప్రతిరోజూ దాదర్ వంతెనపై రెండు గంటలు నిలబడి, గందరగోళానికి గురైన రైలు ప్రయాణికులను సరైన ప్లాట్‌ఫారమ్‌లకు మార్గనిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ఎక్కడ ఎక్కాలో లేదా మారాలో తెలియని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా సాయం అందిస్తారు. అందుకోసం రోజు రెండు గంటలపాటు అక్కడ ఉంటారు. పాటిల్ ఉదయం 9:30 నుండి 11:30 గంటల మధ్య అక్కడ నిలబడి ప్రయాణికులకు గైడెన్స్ ఇస్తుంటారు. ఉదయం రద్దీ తగ్గిన తర్వాత, పాటిల్ కూడా ఎవరినీ ఏమీ అడగకుండా తన పని ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఆయన ఏమి ఆశించకుండా నవ్వుతూ చేస్తారు ఈ పనిని. కొందరు ప్రయాణికులు ఆయన్ను గుర్తుపట్టి చేయి ఊపి వెళ్లిపోతుంటారు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాంటి నిశ్శబ్ద వీరులకు పెద్ద సెల్యూట్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Trainmerijaan (@_trainsofindia_) (చదవండి: హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్ అంతే..) -
ఈ జెన్‌జీ భాష కనిపెట్టింది ఎవరో తెలుసా?
నిన్నటి వరకు సోషల్ మీడియా మీమ్స్, చాటింగ్‌ల్లో మాత్రమే కనిపించిన జెన్ జీ భాష.. ఇప్పుడు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలోనూ వినిపించింది. రాజకీయ విమర్శలకు యువత వాడే స్లాంగ్ పదాలను ఎంపీలు ఉపయోగించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఆన్లైన్ సంభాషణల్లో కనిపించే పదాలు.. తాజాగా లోక్‌సభ చర్చలోనూ చోటు దక్కించుకున్నాయి.నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన చర్చలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తొలుత Gen Z పదజాలాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలను విమర్శిస్తూ.. ‘MIA’ (Missing In Action), ‘FOMO’ (Fear Of Missing Out), ‘Delulu’ (Delusional) వంటి పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ కూడా ‘Clock it’ అనే పదాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తేజస్వి సూర్య సైతం ‘Delulu’, ‘source code’ వంటి పదాలను ఉపయోగిస్తూ తన వాదనను వినిపించారు.It's raining Gen Z lingo in Loksabha.BJP MP Bansuri Swaraj said that PM Modi clocked by bringing a bill against the Paper leak. https://t.co/ovC4uz8QKs pic.twitter.com/o2cNJtUT4k— Political Kida (@PoliticalKida) July 28, 2026 "Congress was having FOMO and staying in DELULU".Dr. Shrikant Shinde of Shivsena just bodied Congress in Loksabha in GenZ style! 😂 pic.twitter.com/LMN5IRUQmt— Political Kida (@PoliticalKida) July 28, 2026 అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈ కొత్త భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది విద్యా వ్యవస్థలోని సమస్యలపై అని.. కేవలం కొత్త పదాల ప్రదర్శన కోసం కాదని సూచించారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా ‘Delulu’ పదాన్ని ఉపయోగిస్తూ.. యువత మొత్తం తమవైపే ఉందని భావించొద్దని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.'Delulu' takes over #LokSabha: #TejasviSurya, #SupriyaSule clash over who has Gen Z's support🌍 Catch the day's latest news here ➠ https://t.co/40gdOz6FIS 🗞️ pic.twitter.com/B9cr59wJTm— Economic Times (@EconomicTimes) July 28, 2026అసలు ఈ Gen Z భాష పుట్టింది ఎక్కడ?Gen Z స్లాంగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టిన భాష కాదు. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీమ్ సంస్కృతి, డిజిటల్ జీవనశైలి కలిసి సృష్టించిన కొత్త భాషా రూపం. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగింది. అందుకే వీరి సంభాషణల్లో వేగం, సంక్షిప్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది.ఎక్కువ భావాన్ని తక్కువ పదాల్లో చెప్పడం, సరదాగా స్పందించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం కోసం కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదట చిన్న ఆన్లైన్ గ్రూపులు, గేమింగ్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా చర్చల్లో మొదలైన ఈ పదాలు.. TikTok, Instagram, YouTube వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.మీమ్స్‌తో మొదలై..జెన్‌జీ భాష వ్యాప్తిలో మీమ్ కల్చర్ కీలక పాత్ర పోషించింది. ఒక సంఘటనను లేదంటే ఒక భావాన్ని సీరియస్‌గా కాకుండా సరదాగా చెప్పేందుకు యువత కొత్త పదాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్త పదాలు సినిమాలు, టెలివిజన్, సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్లేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని తీసుకుంది. ఒక వైరల్ వీడియో, ఒక మీమ్ లేదంటే ఒక ట్రెండ్ ద్వారా పుట్టిన పదం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇలా డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పదజాలం ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం, ప్రకటనలు వంటి రంగాల్లోకి కూడా ప్రవేశించింది.యువత ఎందుకు ఇష్టపడుతోంది?ఈ భాషలో కొన్ని పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ‘Delulu’ అంటే వాస్తవానికి దూరమైన ఊహల్లో ఉండటం, ‘FOMO’ అంటే ఏదైనా అవకాశం కోల్పోతామేమో అన్న భయం, ‘MIA’ అంటే కనిపించకుండా పోవడం, ‘Clock it’ అంటే ఒక విషయాన్ని గుర్తించడం లేదా నిజాన్ని బయటపెట్టడం. ‘Rizz’ అంటే ఆకర్షించే వ్యక్తిత్వం, ‘Slay’ అంటే అద్భుతంగా చేయడం, ‘No cap’ అంటే నిజం చెబుతున్నాను అనే అర్థం. సోషల్ మీడియా, మీమ్ కల్చర్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదాలు ఇప్పుడు యువత సంభాషణల్లో భాగమయ్యాయి.జెన్‌జీ భాషకు ప్రధాన ఆకర్షణ దాని సరళత, వేగం. సుదీర్ఘమైన భావాలను ఒకే పదంతో వ్యక్తం చేసే అవకాశం ఈ స్లాంగ్ ఇస్తోంది. అంతేకాదు.. ఒకే తరానికి చెందిన వారు ఒకే రకమైన పదాలను ఉపయోగించడం ద్వారా తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఇది కేవలం మాట్లాడే విధానంలో మార్పు కాదు.. డిజిటల్ యుగంలో ఒక తరం తన గుర్తింపును వ్యక్తం చేసుకునే మార్గంగా మారింది.వ్యాపారాలకు కూడా ఉపయోగమే..ఇప్పుడు కేవలం యువత సంభాషణలకే ఈ భాష పరిమితం కాలేదు. యువ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకునే కంపెనీలు, బ్రాండ్లు కూడా ఈ పదజాలాన్ని గమనిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల్లో యువతకు దగ్గరగా ఉండే భాషను ఉపయోగించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక తరం ఎలా ఆలోచిస్తోంది, ఎలా స్పందిస్తోంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ స్లాంగ్ ఒక సాధనంగా మారింది.విమర్శలు కూడా..అయితే Gen Z భాషపై విమర్శలు కూడా ఉన్నాయి. అధికారిక వేదికల్లో ఇలాంటి స్లాంగ్ పదాలను ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా విద్య, విధానాలు వంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో భాష మరింత గంభీరంగా ఉండాలని కొందరి అభిప్రాయం.భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఎన్నో పదాలు ఇప్పుడు సాధారణ వాడుకలోకి వచ్చాయి. టెక్నాలజీ, సినిమాలు, వీధి సంస్కృతి నుంచి గతంలో పదాలు వచ్చినట్లే.. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పదాలకు వేదికగా మారింది. Gen Z భాష వెనుక అసలు కథ కొన్ని విచిత్రమైన పదాల కథ కాదు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన ఒక తరం తన భావాలను, ఆలోచనలను, గుర్తింపును వ్యక్తం చేసుకునేందుకు సృష్టించుకున్న కొత్త శైలి. అందుకే మీమ్స్, చాటింగ్‌ల నుంచి మొదలైన ఈ భాష.. ఇప్పుడు పార్లమెంట్ చర్చల వరకూ చేరింది.:::వెబ్ ప్రత్యేకం -
అది ఉత్తుత్తి పెళ్లి...
అమ్రోహా: ఒకే వ్యక్తిని ముగ్గురు పెళ్లాడిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీనిపై ఆన్లైన్లో పెద్ద దుమారమే చెలరేగింది. స్పందించిన యూపీ మహిళా సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారులు ఆ ముగ్గురినీ సోమవారం పిలిపించారు. విచారణలో వారు చెప్పిన విషయాలను విని అధికారులు నోరెళ్లబెట్టారు. అదంతా వైరలయ్యేందుకు తీసుకున్న వీడియో మాత్రమేనని వారు అసలు విషయం వెల్లడించారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు తీసిన ప్రాంక్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అయితే, తమపై ఆన్లైన్ ట్రోలింగ్ ఘోరంగా ఉందని వాపోయారు. అది నిజంగా పెళ్లేనంటూ అబద్ధం చెప్పినందుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఇకనైనా వేధింపులను ఆపాలని వారు వేడుకున్నారు.ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వీడియోలో కనిపించిన ముగ్గురిలో ఒకరు మైనర్ అంటూ తమకు మూడు రోజుల క్రితం అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సీడబ్ల్యూసీ చైర్మన్ అతులేశ్ కుమార్ భరద్వాజ్ వివరించారు. ముగ్గురి నుంచి వాంగ్మూలాలను సేకరించామని, వీరిలో ఒకరు మైనర్ అని రూఢీ అయ్యిందని చెప్పారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామన్నారు. యూపీలోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన దేవిక, ఛావి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వారి బంధువు మెహర్పూర్కు చెందిన ఆల్కా కలిసి శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కును హసన్‌పూర్‌లోని చాముండ ఆలయంలో వివాహమాడినట్లు ఆన్లైన్లో వీడియో ప్రత్యక్షమైంది.వీరు నలుగురూ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ఆన్లైన్లో బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్లు. ఆరు నెలలుగా వికాస్ ముగ్గురికీ భర్తగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నాడు. అయితే, ముగ్గురు యువతులు ఒక్కరినే వివాహమాడటం సనాతన ధర్మానికి విరుద్ధమంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తాము మైనర్లమనీ, ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు తమకుందని, పురాణాల్లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయంటూ వారు మొదట్లో కొట్టిపారేశారు.అదేవిధంగా, ముగ్గురు యువతులు, ఒక యువకుడి పెళ్లి తాను జరిపించలేదని చాముండ ఆలయ పూజారి స్పష్టం చేస్తున్నారు. వివాదాస్పద వీడియోలో ఉన్న ఆ నలుగురినీ ఈ నెల 23వ తేదీన పిలిపించి, వారి వయస్సును నిర్ధారించే పత్రాలను సమరి్పంచాలని, లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కోరామని హసన్పూర్ సీనియర్ ఎస్సై అమిత్ కుమార్ తెలిపారు. అయితే, వారింకా వాటిని ఇవ్వలేదన్నారు. -
హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్ అంతే..
వృత్తి కొందరికీ ఒక ప్యాషన్ అయితే..వాళ్లు అందులో చూపించే క్రియేటివీ మాములగా ఉండదు. ఏ పనిచేసినా..అది అద్భుతంగా ఆలోచనాత్మకంగా ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ ఉపాధ్యాయురాలు. పెద్ద పెద్ద క్రియేటివిటీలతో పనిలేదు. కాస్త అభిరుచితో చాలా సింపుల్‌గా కూడా అద్భుతం సృష్టించొచ్చు. అదే చూపించింది ఈ ఢిల్లీ ఉపాధ్యాయురాలు. విద్యార్థులు రెగ్యులర్‌గా క్లాస్‌కి వచ్చేలా చేసేందుకు ఆమె సృజనాత్మకంగా ఆలోచించిన తీరు తెలిస్తే నోటమాటరాదు. అందుకోసం ఏం పెద్ద పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులేం ఉపయోగించలేదు. జస్ట్ ఒక పేపర్ బోర్డు, చిన్న చిన్న అగ్గిపెట్టెలతోటే అంతా చేశారామె. వాళ్లంతా తమ హాజరును తామే వేసుకునేలా అవకాశం ఇచ్చి..బాధ్యతగా వ్యవహరించేలా చేసింది. ముఖ్యంగా రోజూ వచ్చేలా నిబద్ధతను మెదళ్లులో నాటినట్లుగా చేసిన పని అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మొదట ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి ప్రవేశించగా..వెనుక విద్యార్థులు ఒక్కొక్కరుగా లోపలికి వచ్చారు.లోపలికి ప్రవేశించిన వెంటనే, ఆమె చేసిన మొదటి పని, చేతితో తయారు చేసిన ఆ స్వీయ-హాజరు బోర్డుపై తన హాజరును గుర్తించడం. ఆ టీచర్నే అనుసరిస్తూ..మిగతా విద్యార్థులంతా స్వీయంగా తమ హాజరును నమోదు చేసుకున్నారు. అందుకోసం ఒక పెద్ద బోర్డుపై చిన్న అగిపెట్టెలను పెట్టి..వాటిపై ప్రతి విద్యార్థి ఫోటో ఉండేలా చేశారు. దానిలోపల బాక్స్‌లో పీ "P" అనే అక్షరాన్ని ఉంచారు. క్లాస్‌కి వచ్చిన వాళ్లంతా ఆ బోర్డుపై ఉన్న అగ్గిపెట్టెని ఓపెన్ చేసి P" అనే అక్షరాన్ని బయటకు కనిపించేలా పెడతారు. రానివాళ్లు పెట్టేపై ఆటోమేటిగ్గా కనిపిస్తున్న "O" అనే అక్షరం కనిపిస్తుంది. ఆమె ఈ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంటూ నా చిన్నారులు బాధ్యత తీసుకుంటున్నారు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా అద్భుతమైన ఆలోచన..బాధ్యతా భావాన్ని పెంచేలా ప్రోత్సహిస్తున్నారంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..) -
ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..
మన కోసం ఎన్నో త్యాగాలు చేసే, సర్వసం మనకు ధారపోసే కన్నవాళ్లను ఎంతో బాగా చూసుకోవాలని కోరుకుంటారు చాలామంది పిల్లలు. అందుకోసం తమ వంతుగా చేయాల్సిదంతా చేస్తుంటారు బిడ్డలు. అలానే ఈ మహిళ కూడా తన పేరెంట్స్‌కి గొప్ప అనుభవం ఇవ్వాలని అనుకుంది. అందుకని వాళ్లని ఎప్పటికైన మంచి పర్యాట ప్రదేశానికి తీసుకువెళ్లాలనుకుంది. అనుకున్నట్లుగానే కల నేరవేర్చుకోవడంతో ఆ పట్టరాని సంతోషాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పంచుకుంది. ఆ మహిళా ప్రియాంక అనే ఎన్నారై. ఆమె ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తన తల్లిదండ్రులను అమెరికాలోని ప్రసిద్ధ నయగరా జలపాతానికి తీసుకువెళ్లాలని అనుకుంది. ఆ జలపాతాన్ని దగ్గరగా వీక్షించే అనుభవం ఇవ్వాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంది. ఆ డ్రీమ్ నెరవేరడమే గాక తన తల్లిదండ్రులు 'మెయిడ్ ఆఫ్ ది మిస్ట్' బోట్ టూర్లో పాల్గొంటూ ఉధృతంగా పడుతున్న జలపాతాన్ని చూస్తున్న వీడియోని ఇలా సోషల్ మీడియాలో పంచుకుంది. ఒక చల్లని తుంపర్లు, దట్టమైన పొగమంచు మధ్య అందమైన దృశ్యాన్ని వీక్షించారు. వర్షం నుంచి రక్షించే రెయిన్ పాంచోలు ధరించి ప్రియాంక తల్లిదండ్రులు పడవలో జలపాతం సమీపం వరకు వెళ్తున్న దృశ్యాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె పేరెంట్స్ కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ..ఉప్పొంగిపోయారు. ఆ ప్రకృతి అందాన్ని అంత దగ్గర చూసి సంతోషం, ఆశ్చర్యం కలగలసిన భావాలు వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించాయి వీడియోలో. ఆమె ఆ వీడియోని పోస్ట్ చేస్తూ..ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశా. పేరెంట్స్‌ని కచ్చితంగా ఇక్కడ తీసుకురావాలని అనుకున్నా. ఆ కల ఈవేళ నిజమైంది. ఇది అత్యంత హృద్యమైన క్షణం అంటూ క్యాప్షన్ ఇచ్చి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా చాలా బాగుంది మేడం, నిజంగా ఇది హృద్యంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyanka | Indian in the US (@thatbrownbanni.usa) (చదవండి: మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా) -
ఏడేళ్లు భర్త వేళ్లు కొరుకుతూ...చివరకు ‘ఐ లవ్యూ’ చెప్పాడు!
చైనాలో ఒక పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన భర్త పుర్రెకు తీవ్ర గాయం కావడంతో, అతని మెదడుకు కలిగిన తీవ్రమైన నష్టాన్ని తగ్గించడానికి ఒక మహిళ దాదాపు 7 సంవత్సరాలుగా ప్రతిరోజూ అతని కాలివేళ్లను కొరుకుతూనే ఉంది. అదేంటి విచిత్రంగా అనుకుంటున్నారా? అసలు ఏమైంది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.చైనాకు చెందిన సాంగ్ మెయి (Song Mei) అనే మహిళ, తన భర్త జావో జిన్కియాన్ (Zhao Jinqian) మెదడు దెబ్బతిని ఏడేళ్లుగా కోమా (vegetative state)లో ఉండగా, వైద్యుల సలహా మేరకు ఆయన నరాలను ఉత్తేజపరిచేందుకు ప్రతిరోజూ ఆయన కాలి వేళ్లను కొరుకుతూ సపర్యలు చేసింది. ఆమె చేసిన ఈ అంకితభావం వల్ల భర్త కోలుకుని "ఐ లవ్ యూ" అని మాట్లాడటంతో ఈ వార్త వైరల్ అయింది. స్టోరీ ఏంటంటే..2019 అక్టోబర్‌లో, వాటర్ప్రూఫింగ్ కార్మికుడైన జావో జిన్కియాన్ ఒక గిడ్డంగి పైకప్పుపైకి ఎక్కి, అందులో చిక్కుకున్న ఒక పసిబిడ్డను రక్షించాడు. మూడేళ్ల చిన్నారిని సురక్షితంగా కిందకు తీసుకువస్తుండగా, సుమారు 6 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయాడు.కానీ బిడ్డకు దెబ్బ తగలకుండా తన బాడీని అడ్డంగా పెట్టాడు. దీంతో ఆ బిడ్డకు ఎలాంటి గాయం కాలేదు కానీ జావో తలకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో అంతను కోమాలోకి వెళ్లిపోయాడు. సీటీ స్కాన్ సమయంలో అతనికి కొద్దిసేపు స్పృహ తిరిగి వచ్చినప్పుడు, బిడ్డ క్షేమంగా ఉందా? అడిగి మళ్లీ స్పృహ తప్పిపోయాడు.ఆయన మళ్లీ స్పృహలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చిచెప్పారు. కానీ అతని నరాల్లో చలనం (నరాల ఉద్దీపన) కోసం అతని పాదాలను, వేళ్లను తాకుతూ ఉత్తేజపరుస్తూ ఉండాలని సూచించారు. దీంతో సాంగ్ అతని కాలివేళ్లను మెల్లగా కొరికినప్పుడు, ఒక చిన్న స్పందనను గమనించింది. అంతే ఆ రోజే తన ఉద్యోగాన్ని వదిలేసి, అతని పక్కనే ఉంటూ, అతనికి స్నానం చేయిస్తూ, మసాజ్ చేస్తూ, ప్రతిరోజూ అతనితో మాట్లాడుతూ ఉండేది. ఆమె అతని పాదాన్ని ఒక ప్లాస్టిక్ సంచితో కప్పి, ఏడేళ్ల పాటు ప్రతిరోజూ అలాగే చేసింది. వారి ఇద్దరు పిల్లల పోషణ కోసం తన సొంత చిత్రాలను ఆన్లైన్లో అమ్ముకుంటూ గడిపింది.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్ఎట్టకేలకు ఏళ్ల తరబడి ఆమె చేసిన సేవలు ఫలించాయి! జావో నెమ్మదిగా స్పందించడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ 30న ఝావో "సాంగ్ మే, లవ్ యూ అని మెల్లిగా గుసగుసలాడటంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చికిత్స సమయంలో, అతను పలకగలిగే ఏకైక పదం ఆమె పేరే. దీంతో అతను తొందరలోనే సాధారణ స్థితికి వస్తాడనే ఆశలు చిగురించాయి. సోషల్ మీడియా స్పందననిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం సాంగ్ మెయ్ అంటూ నెటిజన్లు కొనియాడుతుండగా, జావో ధైర్యం , ఆయన భార్య త్యాగం మానవత్వంపై నమ్మకాన్ని పునరుద్ధరించాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ దంపతులు చాలా సాదాసీదాగా, దయాగుణంతో ఉండేవారు. ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నప్పటికీ, ఒక మారుమూల కొండ ప్రాంతానికి చెందిన విద్యార్థి చదువుకు స్పాన్సర్ చేసేవారు. కిండర్‌గార్టెన్ ఆర్ట్ టీచర్‌గా పనిచేసే సాంగ్ పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా పెయింటింగ్ పాఠాలు చెప్పేదట.ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ! -
వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా
సండే క్లాస్‌లో స్టూడెంట్స్ అందరూ బిజీగా ఉన్నారు. లంచ్ బ్రేక్ అవుతున్నా కూడా అందరూ క్లాస్‌లో మునిగి పోయారు. ఇది చూసిన ఒక ప్రొఫెసర్‌కి ఒక ఆలోచన తట్టింది. ఆ విద్యార్థుల కోసం ఏకంగా డామినోస్ (Domino’s) పిజాలను ఆర్డర్ చేశారు. ఈ స్వీట్ జెస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.IIM షిల్లాంగ్ విద్యార్థి రోహన్ సాహా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాధారణంగా ఐఐఎమ్‌లలో వీకెండ్స్‌లో కూడా క్లాసులు జరగడం సహజమే, కానీ ఈ సమయంలో కొందరు ప్రొఫెసర్లు ఆ కష్టాన్ని అర్థం చేసుకుంటారు అని రోహన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rohan Saha (@rohan_ntshh) వీకెండ్ క్లాసులను కొందరు ప్రొఫెసర్లు ఆ తరగతులను ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తారు! అలా ప్రొఫెసర్ అరుణి సర్ ఎంతో దయాహృదయుడు. షెడ్యూల్ వల్ల మేం లంచ్ మిస్ అవుతున్నామని తెలుసుకుని, మా అందరి కోసం పిజాలు ఆర్డర్ చేశారు. థాంక్యూ సర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. వీడియోలో క్లాస్‌రూమ్‌లో డామినోస్ పిజా బాక్సుల వరస కనిపిస్తుంది. విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా వచ్చి తమ పిజా స్లైసులను ఆరగించారు. నెటిజన్ల కామెంట్స్ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ప్రొఫెసర్ అరుణిపై ప్రశంసల వర్షం కురిపించారు. తమ పాత కాలేజ్ రోజులను గుర్తుచేసుకుంటూ రకరకాల కామెంట్లు చేశారు. చాలా అక్కీ స్టూడెండ్స్. నిజంగా ఆ ప్రొఫెసర్ చాలా గ్రేట్ అంటూ కొందరు ఆయన్ని పొగిడేశారు. "ఈ ప్రొఫెసర్ పూకీ (Pookie) లాంటివారు" అని మరొకరు కామెంట్ చేశారు.ఒకవేళ మీరు ఆ రోజే డైటింగ్ చేస్తుంటే పరిస్థితి ఏంటి?" అని ఒకరు జోక్ చేయగా, "నేను తప్పుడు సబ్జెక్టులను ఎంచుకున్నాను అని మరొకరు ఫన్నీగా స్పందించారు. మరికొందరు తమ ప్రొఫెసర్లతో పోల్చు కున్నారు. అదే మా ప్రొఫెసర్ అయితేనా మళ్లీ వచ్చే ఆదివారం కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయేవారు అని ఒకరంటే, మనకెందుకు దొరకరు భయ్యా ఇలాంటి ప్రొఫెసర్లు దొరకరు మరికొందరు సరదాగా జెలస్ ఫీలవ్వడం విశేషం. ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది -
రాజీనామా ఖుషీ.. హుషారుగా స్టెప్పులేసిన సీజేపీ లీడర్స్
నీట్ పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి రాజీనామా అంశంతో ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్లు నెరవేరడంతో రిలాక్స్ అయ్యింది. గత రాత్రి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆ పార్టీ నేతలు, పలువురు స్టూడెంట్స్ గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల వంటకాలతో.. డీజే పాటలతో హుషారెత్తించే స్టెప్పులేశారు. అయితే.. ఖుషీగా వాళ్లు చేసిన ఆ పార్టీపై ఇప్పుడు దుమారం రేగుతోంది.కొందరు అమ్మాయిలు(సీజేపీ ప్రతినిధులు/నీట్ అభ్యర్థులు?!) జోష్‌గా డ్యాన్సులు చేయగా.. అటు చర్చల్లో పాల్గొన్న అశుతోష్ రాంకా, సౌరబ్ దాస్ ఇద్దరూ కూడా హుషారుగా వాళ్లతో కలిసి స్టెప్పులు కలిపారు. అందరూ కలిసి హోటల్లో సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఓ మూలన కూర్చుని పార్టీ చూస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజీనామా సందర్భంగా ఖుషీ అంటూ ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ వీడియో(Resignation की ख़ुशी) పోస్ట్ కావడం గమనార్హం.Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026అయితే ఈ వీడియోపై పలువురు అభ్యంతరాలు.. ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులకు పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయాలైన సంగతి తెలిసిందే. వాళ్లు కోలుకోకముందే కాక్రోచ్ నాయకత్వంలో ఉన్నవాళ్లు ఇలా పార్టీ చేసుకోవడానికి కొందరు తీవ్రంగా తప్పు బడుతున్నారు. నీట్ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు ఉద్యమం ఉద్దేశాన్ని నీరుగార్చేలా వీళ్ల తీరు ఉందంటూ మండిపడుతున్నారు.అదే సమయంలో యాంటీ నెటిజన్లు మాత్రం.. ఇది కాక్రోచ్ల నిజ స్వరూపం అంటూ మండిపడుతున్నారు. నిరసనల్లో ఆందోళనకారులకు అరటిపండ్లు, బ్రెడ్ పకోడీలు పంచుతూ గుర్తింపు పొందిన జునైద్ అనే యువకుడి గురించి కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘అభిజీత్ దీప్కే నా కాల్స్‌కు స్పందించడం లేదు’.. అంటూ అతను కంటతడి పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. షాదాబ్ సైఫీ సైతం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ జోష్ పార్టీలో కనిపించకపోవడంతో.. ఇలాంటి కొందరిని కేవలం తమ అవసరాలే దీప్కే వాడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాంగ్‌చుక్ ప్రస్తావన లేకుండానే.. గత రెండ్రోజులుగా సీజేపీ వ్యవహరిస్తుండడమూ విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. అభిజీత్ దీప్కే తనకు టైఫాయిడ్ సోకిందని ట్రీట్మెంట్ ఫొటోలను వైరల్ చేశాడని.. కానీ సాయంత్రానికే ఇంటికి దగ్గర్లో ఉన్న హోటల్లో పన్నీర్ టిక్కా తింటూ ఎంజాయి చేస్తున్నాంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. అయితే ఇటు ఈ యువతకు మద్దతుగా పోస్టులు చేసేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. -
కింగ్ కోబ్రానే గడగడలాడించిన పిల్లి..!
పాము–ముంగిసల పోరాటాలు తరచూ కనిపిస్తుంటాయి. కానీ ఓ చిన్న పిల్లి ఏకంగా కింగ్ కోబ్రానే వెనక్కి తగ్గేలా చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పడగ విప్పి దాడికి దిగిన కింగ్ కోబ్రాను పిల్లి చాకచక్యంగా ఎదుర్కొన్న వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.'ఘర్ కే కలేష్' అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కింగ్ కోబ్రా, చిన్న పిల్లి ఎదురెదురుగా నిలుస్తాయి. పిల్లిని గమనించిన వెంటనే కింగ్ కోబ్రా పడగ విప్పి దాడికి సిద్ధమవుతుంది. అయితే సాధారణంగా జరిగేదానికి భిన్నంగా పిల్లి ఏమాత్రం భయపడకుండా పాము ముందే ధైర్యంగా నిలబడుతుంది.Kalesh b/w Cat and Snake Cat Survives a Face Off With a Striking Cobra pic.twitter.com/3HAHwcHrLp— Ghar Ke Kalesh (@gharkekalesh) July 21, 2026ఒక్కసారిగా కోబ్రా కాటు వేయడానికి ముందుకు దూసుకురాగా, పిల్లి మెరుపు వేగంతో తప్పించుకుని వెంటనే తన పంజాతో ఎదురుదాడి చేస్తుంది. పిల్లి చూపిన చురుకుదనం, ధైర్యానికి కింగ్ కోబ్రా కూడా వెనక్కి తగ్గి అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది.ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 48 వేలకుపైగా వీక్షణలు లభించగా, పిల్లి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. -
1949లో విడిపోయారు : మళ్లీ అనుకోకుండా ఇలా !
దశాబ్దాల క్రితం విడిపోయిన తన పూర్వీకుల కుటుంబాన్ని కలుసుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. ఒక పర్యాటక ప్రాంతంలో జరిగిన సాధారణ సంభాషణ ఇంత మ్యాజిక్ చేస్తుందని వారు అస్సలు ఊహించలేదు. చైనాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇంతకీ అసలు ఏమైంది?షాంఘైకి చెందిన చెన్ జీ (Chen Jie) తన బిజినెస్ పనిపై యున్నాన్ ప్రావిన్స్‌లోని లూగూ సరస్సు (Lugu Lake) వద్దకు వెళ్లాడు. జూలై 9 ఉదయం సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో తైవాన్‌కు చెందిన ఫే (Fei) అనే వృద్ధ పర్యాటకుడు అక్కడకు వచ్చాడు. ఇంత అందమైన ప్రదేశంలో తనకు ఒక ఫోటో తీసిపెట్టమని అడిగాడు. ఆ తరువాత అతనితో ఒక సెల్ఫీ తీసుకున్న చెన్ మాటలు కలిపాడు. తీరా చూస్తే, అతను అపరిచితుడు కాదని, చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కుటుంబ సభ్యుడని తరువాత తెలుసుకున్నాడు. తమ పూర్వీకుల ఊరు "పుయువాన్" (Puyuan) అని ఫే చెప్పడంతో చెన్ ఆశ్చర్య పోయాడు. ఎందుకంటే చెన్ సొంత ఊరు కూడా అదే కావడంతో ఈ విషయాన్ని చెన్ తన తండ్రికి చెప్పగా, ఫే తండ్రి పేరు "ఫే యున్‌ఫెంగ్" ఏమో అడగమన్నాడు. అలా ఫే తండ్రి చెన్ తాతగారు సొంత అన్నదమ్ములని తేలింది. దీంతో ఇద్దరూ సంతోషంగా ఉక్కిరిబిక్కిరయ్యారు. కుటుంబ వరస ప్రకారం ఫే, చెన్ జీకి బాబాయి అవుతారు.1949 నాటి చరిత్ర: ఎందుకు విడిపోయారు1949లో ఫే తండ్రి తైవాన్‌కు వెళ్లిపోగా, చెన్ తాతగారు వేరొక కుటుంబానికి దత్తత వెళ్లడం వల్ల వారి ఇంటిపేరు 'చెన్'గా మారింది. కాలక్రమేణా, ఫేయ్ తండ్రి, చెన్ తాత ఇద్దరూకన్నుమూశారు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ ఇపుడు యాదృచ్ఛికంగా కలుసుకున్నారు. ఫెయ్ తండ్రి స్వయంగా చైనాకు రాలేకపోయినా, 1991లో తన సోదరుడికి ఒక లేఖ పంపారు. ఆయన ఒకరి ద్వారా 200 డాలర్లు కూడా పంపారు. ఆ సమయంలో చైనా ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదని, 200 డాలర్లను ఒక గణనీయమైన మొత్తంగా పరిగణించే వారని చెన్ వివరించారు. ఆ లేఖలో ఇలా ఉంది, "ఈ డబ్బు నా ప్రేమకు,ఆప్యాయతకు గుర్తు. నేను ఈ సంవత్సరం చైనాకు రాలేకపోతున్నాను. వచ్చే ఏడాది మనం కలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. దేవుడు మీ కుటుంబంలోని వారందరినీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను." అని రాశారు. ఆ కుటుంబం ఇప్పటికీ ఆ లేఖను భద్రంగా దాచుకుంది. దశాబ్దాల పాటు ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయినప్పటికీ, 1980ల చివరలో తైవానీయులు చైనాలోని తమ బంధువులను సందర్శించడానికి అనుమతించడం ప్రారంభమైంది. కొన్నిసార్లు, జీవితంలో ఎదురయ్యే సంఘటనలు అచ్చం సినిమా కథలా అనిపిస్తాయి ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు మన రెండు కుటుంబాల మధ్య సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం బహుశా మన తరం బాధ్యత అంటూ చెన్ ఆనందం ప్రకటించారు. విధి వారి తర్వాతి తరాన్ని కలిపింది అని ఫేయ్ అన్నారు. లేదంటే అక్కడ ఎంతోమంది ఉన్నా ఫే తననే ఫోటో తీయమని అడగడం, ఎపుడో విడిపోయిన తన దగ్గరి బంధువు దొరకడం ఒక అద్భుతమని చెన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఫే తన సొంత ఊరైన పుయువాన్ సందర్శించి, ఎన్నో ఏళ్ల తర్వాత దొరికిన 20 మంది కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోబోతున్నారన్నమాట. కొన్నిసార్లు విధి నమ్మలేనంతటి వింత ఆటలు ఆడుతుంది అంటే ఇదేనేమో! -
ఎన్డీయే మంత్రి కూతురు.. కేంద్రంపై నిరసన స్వరం
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతుండగా.. తాజాగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.అస్సాం రెవెన్యూ మంత్రి కేశబ్ మహంతా కుమార్తె దిబిసా మహంతా గువాహటిలో జరిగిన విద్యార్థుల నిరసనలో పాల్గొందంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాచల్ ప్రాంతంలో గురువారం నిర్వహించిన ఈ ఆందోళనలో ఆమె విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.దిబిసా మహంతా నిరసనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసోం గణ పరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా.. బీజేపీ నేతృత్వంలోని అసోం ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. మిత్రపక్ష ప్రభుత్వంలో భాగమైన సీనియర్ నేత కుమార్తె.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై డిమాండ్లతో జరుగుతున్న నిరసనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కూతురి నిరసనపై తండ్రి స్పందించాల్సి ఉంది. అయితే ఢిల్లీలో కొనసాగుతున్న నీట్ నిరసనలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం తాజాగా స్పందించారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, వారి డిమాండ్లు, వాదనలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం అసోం వరదలతో తీవ్రంగా ప్రభావితమైందని, ప్రకృతి విపత్తుపై కూడా అందరూ దృష్టి పెట్టాలని కోరారు.ఇదిలా ఉండగా, నీట్ నిరసనలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు.. ఆందోళనలకు మద్దతుగా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నారు. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నీట్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో నిరసనకారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.#WATCH: Assam Cabinet Minister Keshab Mahanta's daughter, Dibisa Mahanta, was among those who joined the CJP protest in Guwahati, where demonstrators demanded education reforms and the resignation of Union Education Minister Dharmendra Pradhan.#Assam #CJPProtest… pic.twitter.com/CJP2hjZFIc— Northeast Now (@NENowNews) July 24, 2026 -
మోదీ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది మరి!
నరేంద్ర మోదీ.. ఈ పేరుకు ఉన్న గ్లోబల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతర్జాతీయ వేదికలపై మోదీకి లభించే ఆదరణకు ఇదే నిదర్శం కూడా. అలాంటి వ్యక్తి తొలిసారి జాతిని ఉద్దేశించి.. అదీ నీట్‌లాంటి నిరసనల మీద సెల్ఫీ వీడియో పోస్ట్ చేస్తే స్పందన ఎలా ఉంటుందో ఊహించగలరా?. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గురువారం రాత్రి మోదీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. పేపర్ లీక్‌పై ఆందోళనలను అర్థం చేసుకున్నామని, కఠిన చర్యలకు దిగుతున్నామని ప్రకటించారు. ఇకనైనా ఆందోళనలు విరమించాలి అంటూ పరోక్షంగా ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ వీడియోకు భారీ స్పందన లభించింది. కోట్లాది మంది వీక్షణలు, లక్షల సంఖ్యలో స్పందనలతో ఆ వీడియో వైరల్‌గా మారింది.ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ సెల్ఫీ వీడియోకు తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి. సుమారు 25 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా.. 10 లక్షలకు పైగా కామెంట్లు, కోటిన్నరకు పైగా లైక్స్‌తో దూసుకుపోతోంది. అయితే అన్ని ప్లాట్‌ఫారమ్‌లతో కలిపి ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026నీట్ వివాదంపై వీడియో సందేశంలో స్పందించిన ప్రధాని.. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలను సహించేది లేదని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత ఆశలు, భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని భరోసా ఇచ్చారు.ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి. ప్రధాని సందేశాన్ని స్వాగతించిన పలువురు.. ఇది విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం నీట్ వివాదంలో బాధ్యులపై చర్యలు, వ్యవస్థలో సమూల మార్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.శుక్రవారం రాత్రి మరో వీడియోను రిలీజ్ చేశారాయన. ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మోదీ.. “ధన్యవాదాలు మిత్రులారా. నిన్న (గురువారం) రాత్రి మీతో మాట్లాడే అవకాశం లభించింది. నా వీడియోను ఎంతోమంది చూసి, విలువైన సూచనలు అందించారు. మీ ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు. యువత నుంచి వచ్చిన సానుకూల స్పందన తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక మోదీకి ఉన్న వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్, సోషల్ మీడియా ప్రభావం మరోసారి ఈ వీడియోల ద్వారా చర్చకు వచ్చింది. దేశీయ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన మోదీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ స్థాయిలో ప్రజలతో అనుసంధానమవుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతకు చేరువ కావాలంటూ మంత్రులకు సైతం నిన్నటి కేబినెట్ భేటీలో మోదీ సూచించడం గమనార్హం. నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఈ సెల్ఫీ వీడియో.. కేవలం ఓ రాజకీయ సందేశంగానే కాకుండా, సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ప్రజాదరణకు మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. -
150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు
న్యూఢిల్లీ: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల కోసం నాగాలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి చేసిన వినూత్నసహాయం సోషల్ మీడియాలో పలువురి హృదయాలను గెలుచుకుంది. ఏకంగా 150 పిజాలు ఆర్డర్ చేసి, ఆకలిగా ఉన్నవారికి ఇవ్వండి అంటూ మానవత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలుస్తోంది.నాగాలాండ్‌కు చెందిన 'ఝా-లౌ' (Zha-Lhou) అనే వ్యక్తి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరి నుంచే డొమినోస్ యాప్ ద్వారా 150 "చీజ్ బర్స్ట్" (Cheese Burst) పిజాలను ఆర్డర్ చేసి నేరుగా జంతర్ మంతర్‌కే డెలివరీ చేయించారు. జులై 22న కొరియన్ స్వీట్ చిల్లీ, ఫార్మ్‌హౌస్ రకాలకు చెందిన పిజాలకు మొత్తం బిల్లు రూ. 67,734.18 అయింది. మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేశారు.పిజాలు డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్ ఈ ఆర్డర్ ఎవరికి ఇవ్వాలి? అని ఫోన్ చేసి అడగ్గా, అక్కడ ఇంకా ఆహారం తినకుండా ఆకలితో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే, వారికి ఇచ్చేయండి అని ఝా-లౌ చెప్పారు.అంతేకాదు ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడం వైరల్‌గా మారింది. "నేను నాగాలాండ్‌లో ఉన్నాను, వేలాది మంది విద్యార్థులు మంచి భవిష్యత్తు, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్నారు. ప్రత్యక్షంగా అక్కడ ఉండలేకపోయాను, కాబట్టి నా వంతుగా నేను చేయగలిగిన చిన్న సహాయం ఇది" అని ఆయన తన ఇన్స్టాగ్రామ్ (@adiespoems) ఖాతాలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీఅంతేకాకుండా, ప్రశంసల కోసం తాను ఈ పోస్ట్ పెట్టలేదని, ఇతరులకు కూడా తమకు తోచిన రీతిలో సహాయం చేసేందుకు ప్రేరణగా ఉంటుందని మాత్రమే షేర్ చేశానని తెలిపారు. ఆ తర్వాత విద్యార్థుల కోసం మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్ష -
20 ఏళ్లుగా భార్యతో మాటల్లేవ్.. కానీ కలిసే ఉన్నారు! కారణం తెలిస్తే కంగుతింటారు
ఇటీవల కాలంలో భార్యభర్తల సంబంధాలు ఎంత దారుణంగా వికృతంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. కొన్నింటిని చూస్తే..మనసు కలిచివేస్తుంది కూడా. అలాంటి తరుణంగా ఈ ఇద్దరి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న అభిప్రాయ భేదం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఏ సంబంధంలోనైనా..పొరపొచ్చాలు సహజం. కానీ ఈ ఆలుమగలు..మధ్య ఎదురైనా అత్యంత సాధారణ అభిప్రాయభేదం వాళ్లను వేరు చేయలేదు..కానీ వారి మధ్యమాటలను దూరం చేసింది. ఇరువురి మధ్య భౌతికంగా దూరం లేదు గానీ మానసికంగా కలిసి లేరు, మాటల్లేవ్. పాపం వాళ్లని కలిపేందుకు సిద్ధమయ్యాడు కూమారుడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా అంటే..ఈ విచిత్ర ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దాదాపు దశాబ్దం క్రితం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అద్భుతమైన ప్రేమకథ. అసాధారణ మలుపుతో భావోద్వేగంగా ముగిసినా..ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. 2017లో, 18 ఏళ్ల యువకుడు హోక్కైడోలోని ఒక టెలివిజన్ షోకు అసాధారణమైన విజ్ఞప్తి చేశాడు. తన జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక కుటుంబ సమస్యకు సహాయం చేయమని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు దాదాపుగా 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నప్పటికీ సరిగ్గా మాట్లాడుకోవడం ఎప్పుడు చూడలేదని అందువల్ల తాను మళ్లీ కలిపి చక్కగా మాట్లాడుకునేలా చేయాలనుకున్నట్లు తెలిపాడు. అందుకోసం సదరు టెలివిజన్ షోన్ని సహాయం చేయమని అర్థిస్తాడు. అతడి పేరెంట్స్ ఓటో కటాయమా ( యామా, భార్య యూమి ఒకే ఇంట్లో ఉంటున్నా..రెండు దశాబ్దాలుగా ఇద్దరి మధ్య మాటల్లేవ్. ముగ్గురు పిల్లలను పెంచారు, కలిసే భోజనం చేశారు. అయినా ఒకరితో ఒకరు అర్థవంతంగా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అంత నిశబ్ద వాతావరణం వెనుక ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం గానీ తీవ్రమైన ద్రోహం గానీ చోటు చేసుకోలేదు. కానీ ఎందుకని ఇద్దరి మధ్య సైలన్స్ చోటు చేసుకుందంటే..పిల్లల పట్ల భార్య చూపిస్తున్న శ్రద్ధ చూసి అసూయతో కటాయామా మాట్లాడటం మానేశారట. యామీ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా..అతను కేవలం తల ఊపడం, అవును అని మాత్రమే స్పందించి ఊరుకునేవారట. ఈ పరిస్థితిని చూసి వాళ్ల చిన్న కుమారుడు వాళ్లను తిరిగి కలిపేందుకు టెలివిజన్ సాయం కోరాడు. ఆ కార్యక్రమం నిర్వాహాకులు ఆ దంపతులు మొదట డేట్‌కు వెళ్లిన పార్కులోనే కలుసుకునేలా ఏర్పాటు చేసింది. ముగ్గురు పిల్లలు పేరెంట్స్‌ని దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల మౌనాన్ని వీడుతూ..కటాయమా తన భార్యతో ఇలా అన్నారు, "ఏదో తెలియని కారణం వల్ల మనం మాట్లాడుకుని చాలా కాలం అయ్యింది. నువ్వు పిల్లల గురించి చాలా ఆందోళన చెందావు. యూమి, ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టాలను భరించావు. నేను ఎందుకు మాట్లాడటం లేదో నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు పిల్లలను తనకంటే అత్యంత ప్రేమగా చూసుకోవడంతో అసూయపడ్డాను, అలిగాను. అందువల్ల మాట్లాడలేదు. జరిగిపోయినా కాలాన్ని వెనక్కి తేలేను కానీ..మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టడం మాత్రం సాధ్యమే మరి మాట్లాడుకుందామా.. అని అతను అడగడంతో..ఆ షోని చూస్తున్నవాళ్ల ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఈ భావోద్వేగమైన పునః కలయిక నెట్టింట త్వరగా వైరల్ అయ్యి..అందర్నీ అమితంగా ఆకర్షించింది. చాలా ఏళ్ల నిశబ్దం తర్వాత మళ్లీ కలవడానికి ఆ జంట చూపిన సుముఖతను చాలా మంది ప్రశంసించారు. అంతేగాదు ప్రస్తుతం మారుతున్న సంబంధాల ధోరుణుల కారణంగా ఈ దంపతుల కథ అందరి మనసులను తాకింది.(చదవండి: జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!) -
జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!
కంటెంట్ క్రియేటర్‌గా క్లిక్ అవ్వడం అంతఈజీ కాదు. ఒక్కోసారివీడియోలకు జనాధరణ లభించక, విమర్శలతో విసుగొస్తుంటుంది. జస్ట్ ఒక్క వీడియో షేర్ చేయగానే విజయవంతం కారు. ఆ రంగంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాక గానీ..మనకంటూ ఒక గుర్తింపు..స్టార్డమ్ రాదని చెబుతోంది ఒక మహిళా కార్పొరేట్ ఉద్యోగి. తాను ఎలా కంటెంట్ క్రియెటర్‌గా మారి సక్సెస్ అయ్యిందో పంచుకోవడమే కాదు దాని సాయంతో ఏ రేంజ్లో సంపాదిస్తుందో వెల్లడిస్తూ అందర్నీ ఆశ్చర్యపర్చింది. పైగా ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లకు స్ఫూర్తిగా నిలిచింది.బల్గేరియాకు చెందిన అలెక్స్ పెట్రాకియేవా అమెరికాకు వెళ్లిన తర్వాత తన సోషల్ మీడియా ప్రయాణం అయ్యిందంటూ ఇన్స్టాగ్రామ్ వీడియో షేర్ చేస్తుంది. ఆ వీడియలో తాను 2023లో అమెరికాకు వచ్చాక..ఆన్లైన్లో వీడియోలు పోస్ట్ చేస్తూ తన కంటెంట్ క్రియేటర్ కెరీర్‌ని ప్రారంభించినట్లు తెలిపింది. తాను కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే ఈ జర్నీని ప్రారంభించినట్లు పేర్కొంది. ఆ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నానని కూడా తెలిపింది. అయితే వాటిని అధిగమించేలా కొన్ని కీలకపాఠాలను కూడా నేర్చుకున్నట్లు చెప్పింది. అయితే ఎప్పుడు కూడా వదిలేద్దామని చేతులు ఎత్తేయాలని అనుకోలేదని..చివరి వరకు నిలకడగా ఉండేదుకు ప్రయత్నించానని వెల్లడించి. చివరిక తను కోరుకున్న విధంగా తన మార్గాన్ని మార్చుకుని కంటెంట్ క్రియేటర్‌గా సక్సెస్ అయ్యానని తెలిపింది. అందుకోసం తన జీవితాన్నే ఒక సీరిస్‌గా మార్చానని, వాటిని ఒక దృశ్యాల రూపంలో డాక్యుమెంట్ చేస్తూ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించానని వెల్లడించింది. ఫలితంగా రెండున్నర ఏళ్లలోనే ఏకంగా రూ. 8 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకున్నానని వెల్లడించింది. తాను అమెరికాకు వెళ్లి కార్పొరేట్ ఉద్యోగంలో విసుగుచెంది..యాదృచ్ఛికంగా టిక్‌టాక్‌లో కంటెంట్‌ను పోస్ట్ చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో ప్రజలను ఆకట్టుకునేలా వీడియోలను కంటెంట్‌ని క్రియేట్ చేయాలనే ఆసక్తి పెరిగిందని తెలిపింది. 2024లో సుమారు 57 విలువ చేసే బ్రాండ్‌తో కుదిరిన డీల్ తన జీవితాన్ని మార్చిందని, అదే క్రమంగా సొంత డిజిటల్ ఉత్పత్తులను క్రియేట్ చేసే స్థాయికి దారితీసిందని పేర్కొంది. అలా తాను 2024 చివరి నాటికి ఏకంగా రూ 1 కోటి రూపాయల పైనే కంటెంట్ ద్వారా ఆర్జించానని వెల్లడించింది. దాంతో ఆ మరుసటి రోజే కార్పొరేట్ ఉద్యోగానికి స్వస్తి పలికి, భర్తను కూడా చేర్చుకుని ఇద్దరం కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యామని తెలిపింది. ఆ తర్వాత జీవితంలో పరిస్థితులు మరింత మెరుగ్గా మారడం ప్రారంభించాయి. ఆ తర్వాత 2026 జూలైలో తన భర్తతో కలిసి రూ. 4 కోట్లు దాక పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అంతేగాదు తనకు కంటెంట్ క్రియేషన్‌లో కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఉపకరించిన మూడు విషయాలను కూడా వెల్లడించారు. అవి ఏంటంటే..సాధించాలనుకున్న లక్ష్యాలను స్పష్టంగా ఏర్పాటు చేసుకోవడం, మధ్యలో వదిలి పెట్టకూడదని నిర్ణయించుకోవడం, ఫ్లాప్ వచ్చినప్పుడల్లా..వ్యూహం మారుస్తూ ప్రయాగాలు చేస్తుండటం.. అవే తన సక్సెస్ సీక్రెట్ అని చెబుతోంది అలెక్స్. చివరగా సొంతంగా కంటెంట క్రియేటర్‌గా జర్నీని ప్రారంభించాలనుకునేవారికి చక్కటి సలహ ఇస్తూ తన పోస్ట్‌ని ముగించింది. అదేంటంటే ఒక వీడియో పోస్ట్ చేసేటప్పుడు చెడుగా ఏం జరుగుతుంది, మంచిగా అయితే ఏం జరుగుతుంది అనే దానిపై పూర్తి అవగాహనతో దిగండి అప్పుడు ఆటోపోట్లను అధిగమించే శక్తి వస్తుందని అంటోంది అలెక్స్. నెటిజన్లంతా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించడమే గాక అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్ బట్టలు..! వైరల్‌గా ఆ జంట ఆర్థిక సూత్రాలు.. -
విజయ్ బ్రో.. వెరీ రాంగ్ బ్రో!
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం కొత్త విషయం కాదు. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ నటుడిగా విజయ్‌కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఆయన నటించిన ‘చివరి చిత్రం’ జన నాయగన్ విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. ఈ కోలాహలం ఇటు రాజకీయ చర్చకూ దారితీసింది.‘జన నాయగన్’ విడుదల సందర్భంగా విజయ్ అభిమానుల నుంచి భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ అభిమానంలో పాలకులు సైతం పోటీ పడ్డారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు తమిళనాడు మంత్రులు, అధికార పార్టీ నేతలు థియేటర్లకు తరలివెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ నుంచి పలువురు మంత్రుల వరకు సినిమా వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు అభిమానులతో కలిసి థియేటర్లలో సందడి చేయగా.. మరికొందరు సోషల్ మీడియాలో సినిమాకు ప్రచారం చేశారు.మంత్రి టీకే ప్రభు సినిమా స్టిక్కర్లను ఇళ్ల తలుపులు, ఆటోలకు అంటించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరో మంత్రి సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో కీలక సమస్యలు బోలెడన్ని పెండింగ్‌లో ఉన్నాయని.. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సినిమా వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైందేనా? అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.నీట్ నుంచి రైతుల వరకు..నీట్‌పై అభ్యంతరాలతో మొదటి నుంచి కేంద్రం నుంచి పోరాడుతోంది తమిళనాడునే. అసలు ఆ పరీక్షను రద్ద చేయాలనే డిమాండ్ మొదలైంది కూడా అక్కడి నుంచే. అలాంటి రాష్ట్రంలో.. నీట్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో తమది మొదటి నుంచి ఒకే మాట అని విజయ్ టీవీకే చెబుతోంది.అయితే నిరసనల్లో మాత్రం ఆ పార్టీకి చెందిన నేతలెవరూ కనిపించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్న వేళ.. విజయ్ సినిమా వంకతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు, కావేరీ నీటి విడుదల, డెల్టా రైతుల సమస్యలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సినిమా విడుదల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించడం విమర్శలకు కారణమైంది.వెరీ రాంగ్ బ్రో.. ఇటీవల తమిళనాడులో వరుసగా కస్టడీ మరణాల ఆరోపణలు కలకలం రేపాయి. పోలీసుల వేధింపులతో నలుగురు మరణించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసు దౌర్జన్యాలపై గళమెత్తిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.గతంలో కస్టడీ బాధిత కుటుంబాలను కలిసిన విజయ్.. పోలీసు సంస్కరణలు తీసుకురావాలని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమా హీరో కావొచ్చు, కానీ..విజయ్ రాజకీయ ప్రయాణం మొత్తం ప్రజా సమస్యల చుట్టూనే సాగింది. అవినీతి, పరిపాలనా లోపాలు, ప్రజల హక్కుల కోసం పోరాడతానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ముందున్న అసలు పరీక్ష.. అభిమానుల సీఎంగా కాకుండా ప్రజల సీఎంగా నిరూపించుకోవడం. సినిమా విజయోత్సవాలు రాజకీయంగా నష్టం చేయకపోయినా.. ప్రజా సమస్యలపై స్పందన ఆలస్యమైతే ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సినీ మత్తు వీడి రంగంలోకి దిగాలనే అభిప్రాయమై వ్యక్తమవుతోంది. View this post on Instagram A post shared by Chennai Live (@chennailive1048) -
రాజుల కాలం కాదు.. ముగ్గురంటే ఎలా బాసూ!
“భయ్యా.. పెళ్లి చేసుకున్నావా?”“అవును..”“కంగ్రాట్స్.. సంతోషంగా ఉన్నావా?”“అదే అర్థం కావడం లేదు బాబూ.. సంతోషమో.. సవాలో!”“అదేందన్నా.. ఎందుకలా అంటున్నావ్?”“ఒక్కరిని మెప్పించడమే కష్టంగా ఉంటుంది కదా.. అలాంటిది ముగ్గురి మనసులు గెలవాలంటే రోజులో 24 గంటలు సరిపోతాయా చెప్పు!”ఇది ఏదో సినిమా కథ కాదు.. ఉత్తరప్రదేశ్‌లో వైరల్‌గా మారిన ఓ పెళ్లి కథ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పరిచయమైన ఓ యువకుడు.. ఆ పరిచయమే చివరకు పెళ్లి బంధంగా మారిందని చెబుతున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ పెళ్లి నిజమేనా? చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)కెమెరామెన్ నుంచి భర్త వరకు..ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లుగా పనిచేస్తున్నారు. వారి వీడియోలకు కెమెరామెన్‌గా పనిచేసిన వికాస్ అలియాస్ విక్కుతో పరిచయం ఏర్పడింది. మొదట రీల్స్‌లో భర్త పాత్ర పోషించిన వికాస్.. చివరకు నిజ జీవితంలోనే వారి జీవిత భాగస్వామిగా మారాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. మొదట అంతా ఇదేదో సోషల్ మీడియా స్టంట్ అనుకున్నారు. కానీ ముగ్గురు సోదరీమణులు స్వయంగా స్పందిస్తూ.. “ఇది నిజమైన పెళ్లి. మా ఇష్టంతో తీసుకున్న నిర్ణయం” అని తెలిపారు.విడిపోవడం ఎందుకని..ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు సొంత రక్తం. మరొకరు.. ఆ ఇంట్లోనే పెరిగారు. చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసే పెరిగామని చెబుతున్నారు. వేర్వేరు కుటుంబాల్లోకి వెళ్లిపోవడం ఇష్టం లేకే ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నామని వెల్లడించారు. “మేమంతా పెద్దవాళ్లమే. మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది” అంటూ వారు స్పష్టం చేశారు. వికాస్ కూడా వారి నిర్ణయానికి అంగీకరించాడని, అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వివాహం జరిగిందని తెలిపారు. సరే.. మనసులు కలిశాయి.. మరి చట్టం?ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. “ప్రేమకు హద్దులు ఉండవు” అని వారు చెబుతున్నా.. చట్టానికి మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి. భారతీయ చట్టాల ప్రకారం హిందూ వివాహ చట్టం ఒక వ్యక్తికి ఒకేసారి ఒక భార్య ఉండే విధానాన్ని గుర్తిస్తుంది. అంటే.. ఇలాంటి వివాహం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అధికారికంగా నమోదు జరిగిందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)“రాజుల కాలం వేరు.. ఇప్పటి చట్టాలు వేరు”ఈ పెళ్లిపై ప్రశ్నలు రావడంతో ముగ్గురు సోదరీమణులు పాతకాలపు ఉదాహరణలు చెబుతున్నారు. రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారని పేర్కొంటున్నారు. కానీ న్యాయ నిపుణుల ప్రకారం.. చారిత్రక ఆచారాలు, ప్రస్తుత చట్టాలు ఒకేలా ఉండవు.రీల్ లైఫ్ బాగుంది.. రియల్ లైఫ్ ఎలా?సోషల్ మీడియాలో ఓ వీడియోకు లక్షల వ్యూస్ రావచ్చు. కానీ నిజ జీవితంలో ఒక బంధాన్ని కొనసాగించాలంటే ప్రేమతో పాటు బాధ్యత, అవగాహన కూడా అవసరం. ఇప్పటివరకు ఈ కథలో అందరి మాట ఒక్కటే.. “మేము సంతోషంగా ఉన్నాం. సోషల్ మీడియా ఆదాయంతో కుటుంబాన్ని నడిపిస్తున్నాం. మొగుడి పేరిట కాస్త భూమి ఉంది” అని. కానీ అసలు పరీక్ష మాత్రం ముందుంది. రీల్లో కలిసి కనిపించడం సులువు.. రియల్ లైఫ్‌లో కలిసి నడవడమే అసలు సవాల్!. -
స్టీల్ సిటీ అందాలకు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ ఫిదా, వైరల్ వీడియో
పాపులర్ అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ టోనీ క్లోర్ (Tony Klor) స్టీల్‌సిటీ జమ్షెడ్పూర్ అందాలకు ఫిదా అయిపోయాడు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో వైరల్ వీడియోలతో ప్రసిద్ధి చెందిన ఈ కంటెంట్ క్రియేటర్, ఇటీవల జార్ఖండ్‌లోని 'స్టీల్ సిటీ' జమ్షెడ్పూర్ను మొదటిసారిగా సందర్శించి, ఎంతగానో ముగ్ధుడయ్యాడు. మొదట ఇది తన ఇండియా బకెట్ లిస్ట్‌లో లేకపోయినా, ఈ నగరాన్ని చూశాక తనకిష్టమైన ప్రదేశాలలో ఒకటిగా మారిందని ఆయన ప్రశంసించడం విశేషంగా నిలుస్తోంది.మెట్రో నగరాలు, ప్రశాంతమైన బీచ్‌లు, పర్వతాలు, ఎడారులు, దట్టమైన అడవుల వంటి ఊహించదగిన అన్ని రకాల ప్రకృతి దృశ్యాలకు భారతదేశం నిలయం. జైపూర్, గోవా, వారణాసి వంటి నగరాలు అంతర్జాతీయ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నప్పటికీ, అంతగా ప్రాచుర్యం లేని అనేక పట్టణాలు, వాటిలో చూడటానికి ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ, అవి పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించవు. కానీ అనుకోకుండా స్టీల్ సిటీని సందర్శించిన టోనీ క్లోర్ జమ్షెడ్పూర్ను "భారతీయ పిట్స్బర్గ్" అని అభివర్ణించారు. టాటా స్టీల్ నిర్వహణలోనే నగరం ఇంత శుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా నడవడం చూసి అబ్బురపడ్డారు. View this post on Instagram A post shared by Tony Klor (@tonykmontana) ఇక్కడ గోల్పహాడి ఆలయం, జూబ్లీ పార్క్, సాక్షి మార్కెట్, డిమ్నా లేక్ మరియు దొముహాని ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఇక్కడి పచ్చదనం, పరిశుభ్రత, సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , క్రీడా రంగానికి ఇది అందించిన ఒలింపియన్లను గురించి తెలుసుకొని అభినందించారు. అంతేకాదు జార్ఖండ్‌పై తన అభిప్రాయం, అపోహలను తారుమారు చేస్తూ ప్రజలు అనుకునేదానికంటే ఈ రాష్ట్రం చాలా అందంగా ఉందని, జమ్షెడ్పూర్ ఒక వెలుగులోకి రాని "అరుదైన రత్నం" (underrated gem) అని టోనీ పేర్కొన్నారు. "నేను ఈ నగరం గురించి నా పిల్లలకు కూడా చెబుతాను" అని సోషల్ మీడియాలో రాశారు. టోనీ షేర్ చేసిన వీడియో నెటిజన్లను, ముఖ్యంగా జమ్షెడ్పూర్ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. తమ నగర అందాలను ఇంత చక్కగా చూపించినందుకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
సీజేపీపై వివాదాస్పద పోస్ట్ : ఎవరీ ఇన్‌స్టా స్టార్ సోనియా
నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో రక్షణ విధులు నిర్వహించిన RAF (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) అసిస్టెంట్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ సోషల్ మీడియా పోస్ట్‌పై వివాదం రేగింది.ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలను ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.హర్యానాకు చెందిన ఈ అధికారిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, ఫిట్నెస్, ఆధ్యాత్మికత , బైక్ రైడింగ్‌కు సంబంధించిన అనేక గ్లామరస్ రీల్స్, పోస్టుల ద్వారా ఆమె నెట్టింట సందడి చేస్తూ ఉంటారు. ఇన్‌స్టా స్టార్ గా ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. తాజాగా సీజేపీ ఆందోళనపై ఒక చనిపోయిన బొద్దింక ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ "తమను తాము బాగుచేసుకోలేని వారు, దేశాన్ని బాగు చేయాలనుకుంటున్నారు" అని క్యాప్షన్ ఇవ్వడం ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు. CJP స్పందిస్తూ, పోలీసుల హింసను సమర్థిస్తూ నిరసనకారులను బొద్దింకలతో పోల్చడం దారుణం. అయినా బొద్దింకలు ఎప్పటికీ చనిపోవు అంటూ ఎక్స్ వేదికగా సీజేపీ కౌంటర్ ఇచ్చింది.ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చసోషల్ మీడియా పోస్ట్ ద్వారా సర్వీస్ నిబంధనల ఉల్లంఘించారని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు యూనిఫామ్ ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా వాడకూడదనే నియమం ఉన్నప్పటికీ, ఆమె తన '3star_Sonia' అకౌంట్లో యూనిఫామ్ ఫోటోనే ఉంచడం గమనార్హం. అయితే సీజేపీ నిరసనల్లో తనకు గాయాలయ్యాయని సోనియా మీడియాకు తెలిపారు. విద్యార్థుల మధ్యలో కొందరు అల్లరి మూకలు, వ్యతిరేక శక్తులు చొరబడి తమపై రాళ్లు, గాజు సీసాలు, చెప్పులు విసిరారని, మహిళలను కాపాడే ప్రయత్నంలో తన చేతికి దెబ్బతగిలి కట్టు పడిందని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్ బెదిరింపు వీడియో వైరల్ -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్‌కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్‌గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్‌ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చ
లక్షలకు లక్షలకు ఖర్చుపెట్టి ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం భారతదేశంలో చాలా సాధారణంగా మారిపోయింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, అద్భుతమైన వేదికలు, విలాసవంతమైన విందులు, ఖరీదైన బహుమతులు లేని మధ్య తరగతి పెళ్లి వేడుకలు ఇటీవలి కాలంలో లేవు అంటే అతిశయోక్తి కాదు. జీవితంలో ఒక్కసారే కదా పెళ్లి ముచ్చట అని కొందరు, బంధు మిత్రుల్లో పరువు పోతుంది, ఎంత విలాసవంతంగా పెళ్లి చేస్తే, అంత గౌరవం అని మరికొందరు ఎంతైనా ఖర్చుపెట్టేందుకు వెనుకాడరు.కానీ శక్తికి మించి చేసే ఈ వేడుకలు ముగిసిన తర్వాత, అంత ఖర్చు పెట్టడం, అప్పుల పాలు కావడం సబబేనా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అందుకే నవతరం జంటల ఆలోచనలో మార్పు వస్తోంది. ఒక రోజు కోసం ఒంత భారీ ఖర్చు పెట్టే బదులు, నిరాడంబరంగా పెళ్లి ముచ్చటను ముగించి ఆ డబ్బును ఇల్లు కొనడం లేదా తమ ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవడం వంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడిగా పెట్టేవైపు మొగ్గు చూపుతున్నారు. అలా యువత ఆలోచనలో మార్పు వస్తోంది అనడానికి ఒక టెకీ జంట పంచుకున్న స్టోరీనే నిదర్శనం.బెంగళూరుకు చెందిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్, రూ. 20 లక్షలు కేవలం రెండు రోజుల్లోనే ఎలా మాయమైపోతుందో, కానీ దాని ప్రభావం చాలా కాలం పాటు ఎలా ఉంటుందో వివరిస్తూ ఈ చర్చను మళ్లీ రాజేశారు. కేపీఎంజీ , డెలాయిట్ సంస్థలలో మాజీ ఉద్యోగి మీనల్ గోయల్, ఇటీవల రూ. 20 లక్షల వివాహానికి అయ్యే సాధారణ ఖర్చులను వివరిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు.పెళ్లి ఒక వేడుక మాత్రమే. కానీ ఆర్థిక భారంగా మారాల్సిన అవసరం లేదు. స్థోమతకు తగ్గట్టుగా వేడుక జరుపుకోండి, మంచి జ్ఞాపకాలను పదిలంగా దాచుకోండి. అప్పులతో కాదు. ఆర్థిక ప్రశాంతతతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించండి. అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని నిర్మించుకోండి అంటూ ఆమె పిలుపునిచ్చారు.ఆమె లెక్కల ప్రకారం రూ.20 లక్షల పెళ్లి ఖర్చు ఇలాభోజనాలకు – రూ.6 లక్షలు, వివాహ వేదిక (వెన్యూ) కోసం – రూ.5 లక్షలుఅలంకరణల కోసం – రూ.3 లక్షలు, ఫోటోగ్రఫీ కోసం – రూ.2 లక్షలువినోద కార్యక్రమాల కోసం – రూ.2 లక్షలు, ఇతర ఖర్చులు – రూ.2 లక్షలుతాను పెళ్లి వేడుకలకు వ్యతిరేకం కాదంటూ ఉన్నంతలో అనవసర ఆర్థిక ఒత్తిడి లేకుండా ఎలా పెళ్లి చేసుకోవాలో మీనల్ గోయల్ వివరించారు. ఈ ఖర్చుల్లో చాలా వరకు తాత్కాలిక మైనవేననీ, పెళ్లి అయ్యాక వేదిక ఖాళీ, అలంకరణలన్నీ తొలగిస్తారు, విందు ఆరగించాక అతిథులు కూడా తమ ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ ఆర్థిక భారం మాత్రం మిగిలిపోతుంది అని చెప్పుకొచ్చారు. అదే రూ.20 లక్షలు లేదా దాంట్లో కొంత మొత్తాన్ని ఈ క్రింది అవసరాలకు ఉపయోగింవచ్చో కూడా ఆమె సోదారణంగా వివరించారు. ఇంటి కొనుగోలుకు డౌన్ పేమెంట్, అత్యవసర నిధి (Emergency Fund), పెట్టుబడులు (Investments) భవిష్యత్తులో పిల్లల విద్య వంటి అవసరాల కోసం ఉంచుకోవచ్చని తెలిపారు.ఇదీ చదవండి: 30 ఏళ్ల క్రితం పేపర్ లీక్‌పై పోరు, ఎముకలు విరిగాయ్ : ఈయన్ని గుర్తు పట్టారా?నెటిజన్ల రియాక్షన్ ఆమె పోస్టు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. చాలా మంది, విలాసవంతమైన పెళ్లిళ్లు వ్యక్తిగత కోరిక కంటే సమాజ ఒత్తిడి వల్లనే జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు. ఒక మహిళ ఈ అభిప్రాయాన్ని చెప్పడం చాలా అభినందనీయం. ఇలాంటి ఆలోచన ఉన్న మహిళలు ఎక్కువైతే మధ్యతరగతి యువకులు, వారి కుటుంబాలు పెళ్లి ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని ఒకరంటే, కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. అందుకే అవసరమైనంత ఖర్చు చేస్తాను, సారీ అని మరొకరు కామెంట్ చేశారు. ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ -
గుజరాత్‌లోనూ నిరసనలు.. అహ్మదాబాద్‌లో ఆందోళనలు ఉధృతం
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు గుజరాత్‌కూ విస్తరించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు అహ్మదాబాద్‌లో నిరసనలకు దిగారు. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీలు నిర్వహిస్తూ తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. భద్రతా దృష్ట్యా అహ్మదాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సీజేపీ నేతలు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేరే వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, నిరసనలు చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.MUMBAI ❌️ DELHI ❌️ Now, visuals emerge from Ahmedabad, Gujarat — home of Modi and Shah. Students are protesting against a failed education system. 👇 pic.twitter.com/zxQaQC3QcP— Priya Purohit (@Priyaa_Purohit) July 23, 2026 ఇదిలా ఉండగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సీజేపీ నిరసనలు కొనసాగడం గమనార్హం. బీహార్, ఒడిషా, మహారాష్ట్ర, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో సైతం సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. The protest at Gujarat University in Ahmedabad remains ongoing, with students persisting in their demonstration despite considerable police mobilisation and the arrest of demonstrators.#StudentProtest #GujaratUniversity #NEETProtest #PoliceDetention #StudentVoice pic.twitter.com/BQTyKTp6au— Kumar R Talukdar🇮🇳 (@Kumarjyoti49291) July 22, 2026Ahmedabad, Gujarat 📍मोदी जी के गढ़ गुजरात में भी छात्र अब सड़को पर उत्तर आए हैं 🔥🔥 pic.twitter.com/KxbDWcd93L— Amit Mishra (@Amitjanhit) July 23, 2026 -
నీట్‌ను కంగాళి చేసి .. బిడ్డల్ని ఫారిన్లో చదివిస్తావా?
నీట్–యూజీ పరీక్ష నిర్వహణపై నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్ష పారదర్శకతపై ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన నీట్ వంటి కీలక పరీక్షపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. కాబట్టి నైతిక బాథ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో..నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘సామాన్య విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే.. పరీక్ష వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఎలా వస్తాయి?’’ అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.‘నీట్‌ను కంగాళి చేసి..’ అంటూ విమర్శలునీట్ వివాదంపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. నీట్ కోసం పోరాడుతున్న దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.కుమార్తె సోషల్ మీడియా ఖాతాపై చర్చసోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం ఇదేనని ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొందరు నెటిజన్లు దీనిని నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఒత్తిడిగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.విమర్శలు ఎటు వరకు?ప్రజా విధానాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని కొందరు అంటున్నారు. అయితే రాజకీయ విమర్శలు కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల వరకు వెళ్లకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షా ప్రక్రియలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.రాజకీయ రంగు పులుముకున్న నీట్ వివాదంనీట్ పరీక్ష వ్యవహారం ఇప్పుడు కేవలం విద్యార్థుల సమస్యగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ.. ఇంకోవైపు రాజకీయ ఆరోపణలు.. ఇలా నీట్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్ష వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది. -
హోటల్లో భోంచేసి, మిగిలిన ఫుడ్ తెచ్చుకుంటున్నారా? ఇది మీ కోసమే!
ఏదైనా హోటల్‌కు వెళ్లినపుడు మనం ఆర్డర్ చేసిన ఫుడ్మిగిలిపోతే ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చుకోవడం చాలామందికి అలవాటే కదా. అయితే ఒక స్టార్హోట్లో జరిగిన ఒక సంఘటన నెట్టింట నవ్వులు పూయిస్తోంది. అంతేకాదు ఆహార భద్రత, హోటల్ బాధ్యతలపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఐటీసీ మరాఠా (ముంబై) హోటల్‌కి వెళ్లిన ఒక కస్టమర్ అనుభవాన్ని ఎక్స్‌లో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. గౌరవ్ సబ్నిస్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వివరాల ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని (లెఫ్టోవర్స్) ఇంటికి తీసుకెళ్లడానికి ఒక కస్టమర్‌ను లీగల్ డిస్క్లైమర్పై సంతకం చేయమని చెప్పడం గమనార్హం. ఈ పోస్ట్‌తో పాటు ఆ డిస్క్లైమర్ ఫారమ్ ఫోటోను కూడా జత చేస్తూ, ఇది చాలా విచిత్రంగా ఉందని గౌరవ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీA friend had dinner at ITC Maratha and asked them to pack leftovers to go and they made him sign a disclaimer that the food will be eaten within 2 hours or discarded! Hilariously bizarre! pic.twitter.com/tgXRrVT3n5— Gaurav Sabnis (@gauravsabnis) July 21, 2026డిస్క్లైమర్ ఫారమ్‌లో ఏ ముందంటే...రిస్క్ కస్టమర్‌దే : ఈ సౌకర్యం కేవలం 'ఆ లా కార్ట్' (À la carte) మెనూ ద్వారా ఆర్డర్ చేసిన ఫ్రెష్ ఆహారానికి మాత్రమే వర్తిస్తుంది. బఫే ఆహారానికి ఇది వర్తించదు. అలాగే ప్యాక్ చేసిన ఆహారాన్ని 2 గంటల్లోపు తినాలి, లేదా పడేయాలి. ఆహారం హోటల్ ప్రాంగణం దాటిన తర్వాత దానిని ఎలా రవాణా చేస్తారు లేదా నిల్వ చేస్తారనే దానిపై హోటల్‌కు ఎలాంటి నియంత్రణ ఉండదు. కాబట్టి దాని భద్రతకు హోటల్ హామీ ఇవ్వదు. ఆహారం తిన్న తర్వాత ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే దానికి ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ గానీ, వారి యాజమాన్యం గానీ బాధ్యత వహించవని స్పష్టం చేశారు. అంతేకాదు పార్శిల్ తీసుకెళ్లే ముందు కస్టమర్ తమ పేరు, చిరునామా, తేదీ, సమయం, సంతకం పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 30 ఏళ్ల క్రితం పేపర్ లీక్‌పై పోరు, ఎముకలు విరిగాయ్ : ఈయన్ని గుర్తు పట్టారా?నెటిజన్ల స్పందనఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది చాలా తెలివైన నిర్ణయమని, హోటల్ తన బ్రాండ్ పేరు దెబ్బతినకుండా ఉండేందుకు తీసుకున్న ముందస్తు జాగ్రత్త అని కొందరు అభిప్రాయపడ్డారు. వండిన ఆహారంలో బ్యాక్టీరియా త్వరగా చేరే అవకాశం ఉంది. సరిగ్గా నిల్వ చేయకుండా కొన్ని గంటల తర్వాత తిని పుడ్ పాయిజన్ అయితే హోటల్‌ను నిందించడం సరికాదని కొందరు పేర్కొన్నారు. వేరే స్టార్ హోటళ్లలో కూడా ఇలాంటి నియమాలు ఉన్నాయని, బయటి నుండి తెచ్చుకునే ఆహారానికి కూడా కొన్ని హోటళ్లు ఫారమ్‌లు నింపిస్తాయని మరికొందరు తన అనుభవాన్ని గుర్తుచేశారు. హోటల్ తీరుపై స్పందిస్తూ, ఇంకా నయం.. గుర్తింపు కోసం ఆధార్ సంఖ్యను అడగలేదు అంటూ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
సెలవులో యమధర్మరాజు.. అందుకే బతికాడు!
కోల్‌కతా: వాహనదారులు డ్రైవింగ్ చేసే అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంతో అయితే మరింత జాగ్రత్తగా బండి నడపాలి. కొండ ప్రాంతాలు, ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదానికి గురైన బైక్ రైడర్.. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో వైరల్ అయింది.పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి-డార్జిలింగ్ మార్గంలో కుర్సియాంగ్ వ్యూ పాయింట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నీలం రంగు రెయిన్‌కోట్ ధరించిన ఓ యువకుడు వర్షంతో తడిసిన ఘాట్ రోడ్లో వేగంగా బైక్‌పై వేగంగా దూసుకుపోతున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మలుపు వద్ద అతడు వెనక్కి చూడడంతో బైక్ అదుపు తప్పింది. రైడర్ బైక్‌పై నియంత్రణ కోల్పోయి రహదారి పక్కనున్న రాయిని ఢీకొట్టాడు. ప్రమాదం తీవ్రతకు రైడర్ ధరించిన చెప్పు కూడా గాల్లోకి ఎగిరిపోయినట్లు వీడియోలో కనిపించింది. అనంతరం అతడు కొంతవరకు బైక్‌ను అదుపులోకి తెచ్చుకున్నప్పటికీ రహదారి మరోవైపు పడిపోయాడు.బైక్ కిందపడగా, రైడర్ పక్కనే ఉన్న గడ్డిపై నిలబడగలిగాడు. వెనుకే వస్తున్న మరో బైక్ రైడర్‌కు అతడికి సహాయం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అతడికి ఎలాంటి గాయాలు అయ్యాయన్న వివరాలు వెల్లడికాలేదు. బైక్ లోయలోకి పడిపోయివుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని వీడియో చూసిన వారు అభిప్రాయడుతున్నారు. బైక్ ఆ క్షణంలో ఆగకపోయి ఉంటే రైడర్ నేరుగా లోయలో పడిపోయేవాడని అంటున్నారు.చదవండి: డింపుల్ వీడియోలు వైరల్.. అఖిలేశ్ యాదవ్ అరెస్ట్నెటిజన్ల స్పందన"సేఫ్ డ్రైవ్.. సేవ్ లైఫ్" పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై పలువురు నెటిజనులు హస్యధోరణిలో స్పందించారు. ఈ రోజు యమధర్మరాజు సెలవులో ఉన్నట్టున్నారు అనే అర్థం వచ్చే హిందీ వ్యాఖ్యను జత చేశారు. షయమధర్మరాజు నుంచి మిస్డ్ కాల్ వచ్చింది.. కానీ రిసీవ్ కాలేదంటూ కామెంట్ పెట్టారు. మరికొందరు నెటిజనులు.. రైడర్ నిర్లక్ష్య డ్రైవింగ్‌ను తప్పుబట్టారు. "రైడర్ పూర్తిగా తప్పు చేశాడు. ముందు మలుపు ఉండగా వెనక్కి చూస్తూ ప్రయాణించాడు. బాధ్యతగా డ్రైవ్ చేయాలి" అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. "ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు తలను వెనక్కి తిప్పి చూడకూడదు అనేది మొదటి నియమం" అని మరొకరు తెలిపారు. రీల్స్ చేయబోయి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నాడని మరికొంత మంది అన్నారు. వర్షాకాలంలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని పలువురు హితవు పలికారు. View this post on Instagram A post shared by 𝐀ʀꜱᴜ⚡️ (@aarrshad1) -
వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ
తమను ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కన్నబిడ్డలు కృతజ్ఞతగా ఉండటం అనేది ఒక భావోద్వేగ అనుభూతి. అలా కన్నవారి పట్ల అమితమై ప్రేమానురాగాలు చూపించడం, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించేలా చేయడంతోపాటు వారి చిన్న చిన్న కలల్ని గుర్తు పెట్టుకుని మరీ నెరవేర్చే పిల్లలు చాలామందే ఉన్నారు. అలా తన తండ్రిని తొలిసారి 'వందే భారత్' రైలులో తీసుకెళ్లి ఆనందింప చేసిన వీడియో ఒకటినెట్టింట విశేషంగా నిలుస్తోంది.'భుక్కడ్ ముసాఫిర్' అనే ఇన్స్టాగ్రామ్ ఐడీ ఉన్న ఒక ట్రావెలర్, ఇన్ఫ్లుయెన్సర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ వృద్ధుడైన తండ్రి ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉండటం, రైలు ఎక్కి తన సీటులో కూర్చోవడం, రైలు కిటికీలోంచి అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ మురిసిపోవడం కనిపిస్తుంది. ఆయన ముఖంలోని నవ్వును చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా కనిపించారు. ఈ సందర్భంగా కుమారుడు మాట్లాడుతూ "ఒకప్పుడు మా నాన్న రూ. 5 ఆదా చేయడం కోసం ఆటో ఎక్కకుండా ఆఫీసుకు నడిచి వెళ్లేవారు. అందుకే ఇప్పుడు నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడానికి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నాను" అని ఆ కుమారుడు వీడియో కింద రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Bhukkhad Musafir | Shrikant & Noopur ❤️ (@bhukkhad_musafir) ఇదీ చదవండి: రూ. 5 లక్షల వెండి పాత్ర పొరపాటున చెత్తలో.. చివరికినెటిజన్ల స్పందనఈ వీడియో చూసి నెటిజన్లు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. నిజమైన ఆనందం ఇదే... పిల్లల బాధ్యతలు నెరవేర్చడంలో తమ సంతోషాలను త్యాగం చేసిన తల్లిదండ్రులకు తిరిగి ఆ సుఖసంతోషాలను అందించడం లోనే నిజమైన గెలుపు ఉంది వ్యాఖ్యానించారు. రైలు టికెట్ ధర ఎంతో తండ్రికి తెలిస్తే తిడతారేమో అని కొందరు సరదాగా కామెంట్ చేయడం విశేషం.ఇదీ చదవండి: రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలువందే భారత్, రైల్వే రాయితీలు ఉండవా?వందే భారత్ రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఎటువంటి టికెట్ రాయితీలు ఉండవు. కరోనా సమయంలో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే సాధారణ రాయితీలను కూడా రద్దు చేసింది. అయితే, ఐఆర్సిటిసి (IRCTC)లో క్యాన్సర్, థాలసేమియా, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు లేదా క్షయ (టిబి) వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న రోగులకు, అలాగే దివ్యాంగులకు 75శాతం వరకు టికెట్ రాయితీని అందిస్తోంది. కానీ, ఈ రాయితీలు వందే భారత్ రైళ్లకు వర్తించవు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
నిరసనలకు వెళ్లలేదు.. ర్యాంక్ కొట్టాడు!
నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యా సంస్కరణలు.. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ఓ టాపర్ మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. తోటి విద్యార్థుల్లా నిరసనల్లో పాల్గొనడం కంటే.. మళ్లీ పరీక్ష రాసి ర్యాంక్ కొట్టడంపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టాడు. అంతేకాదు ఆ ప్రయత్నంలో విజయమూ సాధించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అతని స్పందన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.NEET-UG 2026 రీ ఎగ్జామినేషన్‌లో ఆల్ ఇండియా ర్యాంక్-2 సాధించిన పంషుల్ బన్సల్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులకు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. నిరసనకు ఎందుకు వెళ్లాలి? దాని బదులు ఇంట్లో చదువుకుని స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చు కదా అని తాను అనుకున్నానని చెబుతున్నాడు. మొదట నేనూ బాధపడ్డా..ఢిల్లీ గ్రేటర్ కైలాష్‌లోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ విద్యార్థి అయిన పంషుల్.. మొదటి NEET పరీక్ష రద్దు కావడంతో తొలుత తీవ్ర నిరాశకు గురయ్యాడట. "మొదట బాధగా అనిపించింది. నేను బాగా రాశానని, మెడికల్ సీటు వస్తుందని అనుకున్నాను. కాసేపటికి దీనినే మరో అవకాశం లాగా మార్చుకోవాలనుకున్నా. ఆ ఫలితం ఆధారంగా నా పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు.706 నుంచి 715 మార్కులకు..నీట్ మొదటి పరీక్షలో పంషుల్ 706 మార్కులు సాధించాడు. అయితే రీ ఎగ్జామినేషన్‌లో అతని స్కోర్‌ను 715 మార్కులు. ఎగ్జామ్‌లో 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించాడు. ఈ విజయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు కూడా తెలియజేశారు. అదనంగా లభించిన సమయాన్ని కొత్తగా చదవడానికి కాకుండా.. తన పాత ప్రణాళికనే మరింత క్రమశిక్షణతో కొనసాగించానని చెప్పాడు. "నా షెడ్యూల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇదే రొటీన్‌ను కొనసాగించాను. చివరి నెలన్నరలో చేయగలిగినంత కష్టపడ్డాను. మిగతాది దేవుడిపై వదిలేశాను" అని పంషుల్ తెలిపాడు.నిరసనలపై నో కామెంట్NEET పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇప్పుడు నిరసనలపై తన అభిప్రాయం చెప్పాలని అడిగినప్పుడు.. పంషుల్ స్పందించేందుకు నిరాకరించాడు. "దానిపై నేను వ్యాఖ్యానించను" అని స్పష్టం చేశాడు.#NDTVExclusive | "I thought of the situation as an opportunity to improve my score. So I thought, why should I go to the protest? Instead I could be studying at home and improving my skill and score": NEET UG 2026 topper Panshul Bansal to NDTV's @ShivAroor on #IndiaMatters pic.twitter.com/G8c7O2KXHn— NDTV (@ndtv) July 21, 2026పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన NEET-UG పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న పరీక్షను రద్దు చేశారు. అనంతరం జూన్ 21న భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రీ ఎగ్జామ్ నిర్వహించి.. జులై 16న ఫలితాలు ప్రకటించారు.అయితే పంషుల్ బన్సల్ విజయ ప్రయాణంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన లక్ష్యంపై దృష్టి పెట్టి ర్యాంక్ సాధించిన అతని కృషిని పలువురు ప్రశంసిస్తుండగా.. మరోవైపు NEET వివాదంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పరిస్థితులను కొందరు గుర్తు చేస్తున్నారు.పంషుల్ వంటి సౌకర్యాలు ఉన్న విద్యార్థులకు మరో అవకాశం లభించడం ఒక కోణమైతే.. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా వ్యవస్థలోని లోపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళనకారులు చెబుతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం ఇప్పటికే ఒత్తిళ్లతో ఉన్న విద్యార్థుల్లో అసంతృప్తికి చివరి కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..! పాపం ఆ వధువు స్నేహితురాలు..
పెళ్లిళ్లలో సరదాగా ఆటపట్టించడం అనేది మాములు. ఆ వేడుకకు వచ్చినవారందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తే పర్లేదు..అది కాస్త సీరియస్ అయితేనే లేనిపోని తలనొప్పులు మొదలవుతాయి. అందుకే ఏదైనా శృతి మించకుండా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇక్కడ అది లోపించడంతో ఆ పెళ్లి బృందం, ఆ కొత్త దంపతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏ సరదా అయినా నష్టం చేకూర్చేలా ఉండకూదనే సత్యాన్ని నేర్పించే బాధకర ఘటన ఇది.చైనాలో చోటు చేసుకుంది ఈ ఘటన. అక్కడ పెళ్లిళ్లలో హున్నావో అనే పురాతన చైనీస్ ఆచారం ఉంది. ఇది వాస్తవానికి దుష్టశక్తులను తరిమికొట్టడానికి, నూతన వధూవరులు, అతిథుల మధ్య బిడియాన్ని తొలగించేందుకు ఏర్పాటు చేసిన సరదా ఆచారం. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్ది అది కాస్తా ప్రమాదకరమైన చిలిపి పనిగా మారిపోయింది. గతంలో కూడా ఇలాంటి ఆచారంతోనే ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు కూడా. ఈసారి మాత్రం మరింత సీరియస్‌గా మారింది. 2023 అక్టోబర్‌లో ఒక జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. వివాహ తంతులో భాగంగా ఓ ఫ్రాంక్ చేశారు. అది కాస్తా చూస్తుండగానే సీరియస్‌గా మారింది. ఆ ఫ్రాంక్‌లో భాగంగా వధువు స్నేహితురాలు జాంగ్ని పెళ్లి కొడుకు స్నేహితుల గదిలో ఒంటరిగా వదిలేశారు. ప్రాంక్‌లో భాగంగా ఆమెను అల్మరా నుంచి బయటకు లాగి మంచ మీదకు విసిరి ఆపై ఒక దుప్పటితో గాలిలోకి ఎగరవేస్తారు. ఆ క్రమంలోనే వధువు స్నేహితురాలిని ఒకసారి ఎగరువేసినప్పుడు పెళ్లికొడుకు బృందం పట్టుకుంది. ఆ తర్వాత విసిరినప్పుడు ఆమె నేల మీద సరాసరి పడిపోవడంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. దాంతో జాంగ్ సుమారు 18 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. ఆ ఫ్రాంక్ ఆమెకు తీవ్రమైన గాయంతోపాటు శాశ్వత వైకల్యాన్ని మిగిల్చిందామెకు. దాంతో జాంగ్ కోర్టుని ఆశ్రయించింది. ఆ నేపథ్యంలో ఆగస్టు 2024 ఫోరెన్సిక్ న్యాయ బృందం ఆమె గాయాన్ని విచారించి గ్రేడ్ 9 వైకల్యంగా వర్గీకరించింది. అంటే ఇది 20% శాశ్వత వైకల్య రేటింగ్‌కు సమానం. దాంతో ఈ ఘటనకు కారణమైన వధువువరులకు, మరో తొమ్మిది మందిపై వైద్య ఖర్చులు, మానసిక క్షోభకు పరిహారంగా 32 లక్షలు చెల్లించమని ఆదేశించింది చైనా కోర్టు. వివాహ నిర్వాహకులకు ఈ ఫ్రాంక్ గురించి తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలు లేదా ఆపడంలో ఎందుకు విఫలమైందంటూ చురకలంటించింది. ఈ దుశ్చర్యకు గానూ ఆ నష్టపరిహారాన్ని.. ఆ నూతన వధువరులకు 40%, అలా చేయమని సూచించిన వ్యక్తికి 20%, ఆ సమయంలో ఉన్న మిగతా తొమ్మిది మందికి 40% వంతున చెల్లించాలని పేర్కొంది.(చదవండి: Dr Deepti Sharma: ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..) -
సీజేపీ ప్రొటెస్ట్‌లో విద్యార్థినులపై పోలీసుల అసభ్య వైఖరి : నెట్టింట దుమారం
నీట్ పేపర్ లీక్, విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా, ఆత్మహతల్యకు పాల్పడ్డ నీట్ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారంలాంటి డిమాండ్స్‌లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ‘సంసద్ చలో’ మార్చ్ (పార్లమెంట్ మార్చ్) సందర్భంగా పోలీసులు ఉద్యమ కారులపై విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై స్వయంగా పోలీసులే రాళ్లు రువ్వడం, లాఠీలతో విరుచుకుపడటం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. ముఖ్యంగా మహిళా నిరసనకారులు, విద్యార్థినుల, పోలీసుల వైఖరి, ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మహిళలు, విద్యార్థినుపై పోలీసులు వారిపై అమానుషంగా ప్రవర్తించారని ప్రతిపక్షాలు, ఉద్యమకారులు ఆరోపణలు చేశారు. కొంతమంది విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్‌పై కావాలనే దాడిచేశారని సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇదేనా బేటీ బచావ్ అంటూ పలువురు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోపై దేశవ్యాప్తంగా మహిళల భద్రత మరియు ప్రజాస్వామ్య హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బాధ్యులపై పోలీసు అధికారులపై కఠిన చర్యలుతీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.मोदी सरकार का नारी सम्मान स्वयं देखिए।भाजपा को नारी केवल तब अच्छी लगती जब वह लाडली बहन योजना का धन लेके इनको वोट करे।जहां नारी अपने अधिकारों की बात करती है तब इनकी लाठी चलती है।#AAPHelplineForStudents#JointVenture#CJPProtestUpdate#OmegaStockWatch pic.twitter.com/EtLuNW368H— Cockroach Janta Party,Kanpur (@CJPknp) July 21, 2026నిరసనకారులను, విద్యార్థినులను పోలీసులు బలవంతంగా లాగి, వాహనాల్లోకి ఎక్కించే క్రమంలో పలువురు మహిళల దుస్తులు చిరిగిపోయాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అనుమతి లేకుండా మార్చ్ నిర్వహిస్తున్నారనే నెపంతో పోలీసులు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, బాష్పవాయువు ప్రయోగించి బాలికలపై తీవ్రంగా విరుచుకుపడ్డారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారులు మహిళలను తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారని ఒక మహిళా ఉద్యమకారిణి ఆరోపించింది. The Delhi Police intentionally attacked the private parts of girls, this is a shameful act by the police. Responsible police officer should be dismissed. pic.twitter.com/1g1gtCXgYQ— The Dalit Voice (@ambedkariteIND) July 21, 2026ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్అయితే ఈ ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ పరిసరాల్లో ఆంక్షలు ఉన్నాయని, నిరసనకారులు అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిరసనకారులలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారని, ఆ క్రమంలో గుంపును చెదరగొట్టడానికి కనీస బలప్రయోగాన్ని మాత్రమే ఉపయోగించామని స్పష్టం చేశారు. నెట్టివేతలు, బారికేడ్ల పైనుంచి పడిపోవడం మరియు తొక్కిసలాట లాంటి పరిస్థితుల వల్లే నిరసనకారులకు గాయాలయ్యాయని, కావాలని ఎవరిపై దాడి చేయలేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్
జమ్మూకాశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్, కేరళలోని శబరిమల లాంటి భారతీయ పుణ్యక్షేత్రాలలో నడవలేని వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్న భక్తులకు డోలీలు (Palkis/Palanquins) సేవ నిజంగా గొప్ప వరం. హిమాలయాల్లోని పవిత్ర స్థలాలు, కొండపై కొలువైన దేవాలయాలకు చేరుకోవడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. భక్తులు ఎంతో కొంత చెల్లించి, ఈ డోలీల ద్వారా దైవ దర్శనం చేసుకుంటారు. ఇది స్థానిక యువకులకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది కూడా. అయితే మానవ పల్లకి, లేదా డోలీ సేవ ఇపుడు నెట్టింట చర్చల్లో నిలిచింది.ఎందుకంటే..గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న గిర్నార్ పర్వతంపై ఉన్న ప్రముఖ దత్తాత్రేయ పీఠాన్ని దర్శించుకోవాలంటే భక్తులు 10 వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలామంది ఇక్కడ డోలీ సేవలను ఉపయోగించు కుంటారు. అలా ఒక భక్తుడిని తీసుకెళ్తున్న నలుగురు వ్యక్తులు పల్లకి (డోలీ) లో మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ కాయంతో ఉన్న అతడిని మోసుకుంటూ సన్నని మార్గంలో వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్న శారీరక శ్రమ, ఆయాసం చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోలో, తెల్లటి షర్టు, నల్లటి ప్యాంట్ ధరించిన ఒక భక్తుడిని నలుగురు డోలీ కార్మికులు మూదుల కర్రల సహాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ నిటారుగా ఉన్న రాతి మెట్లపై మోసుకెళ్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటన మానవులను మరో మానవుడు మోసే సాంప్రదాయంపై ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్If you don't have the health to go, why bother going??, better stay at home instead of using other fellow human like slaves 😡 pic.twitter.com/1iffGHX6su— BAKWAS FELLOW (@siva17subraman) July 20, 2026డబ్బు కోసం మనుషులను మోయడం సరైనది కాదని, కేవలం బద్ధకంతో లేదా సౌకర్యం కోసం యువకులు/ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఈ సేవలను వాడుకోవడం సరికాదని, అమానవీయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు లేదా తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారికి మాత్రమే ఈ సేవలను అనుమతించాలని కొందరన్నారు. కేవలం బద్ధకంతో మనుషులను మోయించుకోవడం అస్సలు సరికాదు. నడవలేకపోతే ఇంట్లోనే ఉండొచ్చుగా అని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలిమరికొంతమంది సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాంతాల్లో నివసించే ఎన్నో పేద కుటుంబాలకు ఈ పల్లకి సేవలే (డోలీ మోయడమే) ప్రధాన ఆదాయ వనరు. ఈ కష్టానికి గానూ వారు భారీ మొత్తంలోనే వసూలు చేస్తారని , ఈ ప్రాక్టీస్‌ను పూర్తిగా నిషేధిస్తే వారి పొట్ట కొట్టినట్లవుతుందని కొందరు వాదించారు. -
వైన్స్ షాపులో ఐదు గంటల హైడ్రామా! ప్రాణాలకు తెగించి..
ఉదయం వేళ.. అంతా సాధారణంగానే సాగుతోంది. షాప్‌లో పనులు చేసుకుంటున్న సిబ్బందికి కాసేపట్లో ఎదురుకాబోయే ప్రమాదం గురించి అసలు ఊహే లేదు. ఇంతలో ఒక్కసారిగా.. ఆకోశ్రంతో ఉన్న ఓ చిరుత అక్కడికి దూసుకొచ్చింది. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న ప్రదేశం భయానకంగా మారిపోయింది. ఎదురుగా క్రూర మృగం.. తప్పించుకునే అవకాశం దాదాపు లేదు. అప్పటికే చిరుత దాడిలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే.. ఆ సమయంలో ఓ సేల్స్‌మెన్ చూపించిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాణాలకు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయంతో అతడు పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటన రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా టోడారాయ్సింగ్ పట్టణంలో సోమవారం (జూలై 20) ఉదయం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో స్థానిక ప్రాంతంలోని పొదల్లో చిరుత దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. అటవీ వాలంటీర్ రాకేష్ దాన్ని గుర్తించి దగ్గరకు వెళ్లాడు. చిరుతను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగానే.. అది ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. చిరుత దాడితో స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే ఆ జంతువు అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని ఓ లిక్కర్ షాప్ వైపు పరుగులు తీసింది.చిరుత ఒక్కసారిగా షాప్‌లోకి దూసుకురావడంతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. మొదట షాప్ యజమాని ఫతే లాల్ కోలీపై అది దాడి చేసింది. ఆ తర్వాత లోపల ఉన్న సేల్స్‌మెన్ సంజయ్ గుర్జర్‌పై విరుచుకుపడింది. చిరుత దాడిలో సంజయ్‌కు ముక్కు, భుజం, చేతులపై గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు భయంతో కుప్పకూలిపోలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే తెగువ చూపి సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.చిరుతను బయటకు వదిలేస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ప్రమాదం తప్పదని సంజయ్ గ్రహించాడు. ఆ క్షణంలో తన ప్రాణాలను పణంగా పెట్టి షాప్ షట్టర్‌ను కిందికి దించాడు. దీంతో చిరుత లోపలే చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జైపూర్ నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పించారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత చిరుతకు మత్తు మందు ఇచ్చి సురక్షితంగా పట్టుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. షాప్‌లో చిరుత సంచరించిన తీరు, రెస్క్యూ ఆపరేషన్, సేల్స్‌మెన్ ధైర్యం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు నాలుగు కాళ్ల మృగం.. మరోవైపు గాయాలతో ఉన్న పరిస్థితి.. అయినప్పటికీ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయంతో సంజయ్ పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. చిరుతను బంధించింది అటవీ శాఖ బృందమే అయినా.. ఆ ఐదు గంటల హైడ్రామాలో తొలి హీరో మాత్రం సేల్స్‌మెన్ సంజయ్ గుర్జర్నే అని స్థానికులు ప్రశంసిస్తున్నారు. Leopard attacks man inside wine shop in Todaraisingh, Tonk, Rajasthan caught on CCTV pic.twitter.com/agUYH14EBL— Ghar Ke Kalesh (@gharkekalesh) July 20, 2026 -
10 ఏళ్లు ఇన్ఫీ మూర్తి చెప్పిన దానికి మించి చాకిరీ కానీ, టెకీ ఆవేదన
హైదరాబాద్‌కు చెందిన ఒక సీనియర్ టెక్నాలజీ ప్రొఫెషనల్ అర్జున్ సింగ్ (పేరు మార్పు) ఆవేదన నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ కన్సల్టింగ్ దిగ్గజం డెలాయిట్ (Deloitte) సంస్థలో పదేళ్ల పాటు నారాయణ మూర్తి చెప్పిన దానికంటే ఎక్కువ గంటలు పనిచేసినా, తీవ్రమైన మానసిక ఒత్తిడి తప్ప ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని వాపోయారు. చివరకు కంపెనీ నుండి బయటకు వచ్చేశారు.ఆయన తన ఉద్యోగ జీవితంలోనిఈ చేదు అనుభవాలను మనీకంట్రోల్‌తో పంచుకున్నారు. దీని ప్రకారం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటే అర్జున్ సింగ్ తాను అంతకంటే ఎక్కువగా, వారానికి కొన్నిసార్లు 74 గంటల పాటు పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇంత కష్టపడి పనిచేసినా, తనకు రావాల్సిన ప్రమోషన్ దక్కకపోగా.. కేవలం 5 శాతం జీతం పెంపు (Salary Hike) మాత్రమే లభించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.తీవ్ర ఒత్తిడిచదువు పూర్తి కాగానే డెలాయిట్‌లో చేరిన అర్జున్, తన కెరీర్ మొత్తం అక్కడే కొనసాగించాలనుకున్నారు. కానీ కాలక్రమేణా ఆయన కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. విపరీతమైన పని ఒత్తిడి భరించలేనిదిగా మారింది. ముఖ్యంగా సాధారణంగా ఆరు నెలల పాటు ఆరుగురు చేయాల్సిన ప్రాజెక్ట్‌లను, పోటీ తట్టుకునే క్రమంలో కేవలం నలుగురు ఉద్యోగులతో ఐదు నెలల్లోనే పూర్తి చేయాలని యాజమాన్యం ఒత్తిడి తెచ్చేది. క్లయింట్ పనులతో పాటు ఇంటర్నల్ రిక్రూట్మెంట్, కొత్త ప్రపోజల్స్ తయారు చేయడం వంటి అదనపు బాధ్యతలను ఉద్యోగులపై మోపేవారు. హోదా పెరిగేకొద్దీ ఈ ఉచిత పనుల భారం మరింత ఎక్కువయ్యేది. కంపెనీలు మారే చాలా మందిలా కాకుండా, తాను డెలాయిట్‌ను విడిచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని సింగ్ చెప్పారు. యంగస్టర్గా ఉన్నపుడు సీనియర్ నాయకులను చూసి, ఒక రోజు తాను కూడా ఆ స్థాయికి చేరుకోగలను అనుకోవడం చాలా సులభం. కానీ ఒక చోట చేరిన మొదటి రోజే 10 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించు కోకూడదన్నారు. అలాగే తన నిర్ణయం ఏదో ఒక ప్రాజెక్ట్ వల్లనో, లేదా ఒక కష్టమైన మేనేజర్ వల్లనో మార్పు రాలేదు, అది క్రమంగా జరిగింని చెప్పారు. అయితే ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, డెలాయిట్‌లో గడిపిన దశాబ్దం గురించి తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదనికూడా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్ఫ్యామిలీ జీవితానికి దూరంఆఫీస్ గంటలు ముగిసినా, పండగలు లేదా శుభకార్యాల్లో ఉన్నా సరే ఎప్పుడూ పనికి అందుబాటులో ఉండాల్సి వచ్చేది. పని నుండి డిస్కనెక్ట్ అవ్వడం అసలు సాధ్యపడేది కాదంటూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదని వాపోయారు. అర్జున్ మాటల్లో చెప్పాలంటే... "బాగా కష్టపడి అద్భుతంగా పనిచేసే వారికి, అలాగే నార్మల్‌గా పనిచేస్తూ లైఫ్ ఎంజాయ్ చేసే వారికి ఇచ్చే జీతాల పెంపులో పెద్దగా తేడా ఉండేది కాదు. మనం ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు రానప్పుడే ఉద్యోగి మానసికంగా కుంగిపోతాడు ." కోట్లాది రూపాయల విలువైన క్లయింట్ ప్రపోజల్స్‌ను రాత్రింబవళ్లు కూర్చొని టెక్నికల్ టీమ్ సిద్ధం చేస్తే, దానివల్ల వచ్చే లాభాల్లో వారికి ఎలాంటి వాటా దక్కేది కాదని ఆయన విమర్శించారు.ఇదీ చదవండి: షాకింగ్ జిప్‌లైన్ రైడ్ ప్రమాదం, 40 అడుగుల ఎత్తునుంచి..!కొత్త జీవితం వైపు అడుగులుఅలా టాక్సిక్ వాతావరణం మధ్య 35 ఏళ్ల వయసులో 22 ఏళ్ల వయసులో తనకు ఉన్న సక్సెస్ డెఫినిషన్ ఇప్పుడు మారి పోయిందని గ్రహించానని చెప్పారు. డబ్బు కంటే కూడా తన సమయం, మానసిక ప్రశాంతత ముఖ్యమని భావించి డెలాయిట్‌కు రాజీనామా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మరో కంపెనీలో చేరాననీ అక్కడ డెలాయిట్ కంటే మంచి ప్యాకేజీ రావడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితానికి, ఆఫీస్ జీవితానికి మధ్య సరైన సమతుల్యత (Work-Life Balance) లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: 50 సార్లు ట్రై చేశా డాడీ : బీటెక్‌లో గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య -
సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్‌కి..!
సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ ఫీల్ ఆ ఆనందం మాటలకందనిది. ఒక్కసారిగి వెనుతిరిగి చూసుకుంటే..ఇంత పెద్దస్థాయికి ఎలా చేరుకున్నాను అని ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలుగుతాయి. అంతేగాదు అందుకోసం మనవాళ్లు చేసిన త్యాగాలు కళ్లుముందు మెదలడమే కాదు..అందుకు తగ్గట్టుగా ప్రయోజకుడై వాళ్లను బాగా చూసుకుంటే..అంతకుమించిన సంతృప్తి ఇంకొకటి ఉండదు. ఆ ఆనందాన్నే ఓఎన్నారై ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.మధురకు చెందిన ఎన్నారై అమిత్ కశ్యప్ షేర్ చేసిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. భారతదేశంలోని సాధారణ బైక్ నుంచి అమెరికాలో బీఎండబ్ల్యూ కొనుగోలు చేసే రేంజ్‌కి తాను ఎలా చేరుకున్నాడో ఇన్స్టాగ్రామ్ రీల్లో పంచుకున్నాడు. ఒకప్పుడు భారతదేశంలో తన వద్ద ఒక బైక్ మాత్రమే ఉండేదని, కానీ ఈరోజు అమెరికాలో తన సొంత ఇంటి గ్యారేజ్‌లో కారుని పార్క్ చేస్తున్నానని అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది అన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన తాను ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్‌లో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన పేరెంట్స్ కోసం అమెరికాలో ఒక ఇల్లు కొన్నట్లు తెలిపాడు. అమెరికా రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడపడమే కాదు, అందులో మా అమ్మనాన్నలతో కలిసి ప్రయాణిస్తున్నానని అన్నారు. అంతేగాదు తాను కట్టిన ఇల్లుని అమ్మకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు కూడా. తను ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు తన పేరెంట్స్ చేసిన త్యాగాలేనని గుర్తుచేసుక్న్ననారు. డబ్బు ఆదా చేసేందుకు తన తల్లి మట్టిపొయ్యి మీద వంట చేయడంతో సహా, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తమ సొత ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేసి మరి మంచి స్కూల్‌కి పంపించారని, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల కోసం ప్రతి పైసాను ఎలా కూడబెట్టేవారో తాను ఇప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతేగాదు అలా మట్టిపోయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగతో ఆమె పడ్డ బాధ ఇప్పటికీ గుర్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు ఆ పరిస్థితుల్లో ఏదో ఒక రోజు మంచి స్థాయికి చేరుకుని మా కుటుంబానికి ఉన్న మధ్యతరగతి అన్న ముద్రను మార్చేయాలని ఎంత బలంగా అనుకునేవాడో నాటి సంఘటనలను గుర్తుతెచ్చుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ తాను మంచిహోదాకు చేరుకుని ఆ కలను నిజం చేసుకున్నా.. అని సగర్వంగా చెబుతూ వీడియోని ముగించారు. అంతేగాదు కశ్యప్ సక్సెస్ జర్నీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓపికగా, నిలకడగా ఉంటే విజయ తథ్యం అదే కశ్యప్ చేసి చూపించారని పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@amitkashyap._) (చదవండి: రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..) -
స్పెయిన్ చేతిలో ట్రోఫీ.. ట్రంప్‌ను ఆటాడుకున్నారు!
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో స్పెయిన్ చారిత్రక విజయం సాధించిన వేళ.. అసలు మ్యాచ్ కంటే ట్రోఫీ ప్రదానోత్సవమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదికపైకి రావడం, ఆ తర్వాత ట్రోఫీ లిఫ్ట్ సమయంలో అక్కడే నిలబడిపోవడం సోషల్ మీడియాలో సెటైర్లకు కారణమైంది.న్యూజెర్సీ: అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి స్పెయిన్ రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మ్యాచ్ అనంతరం న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవానికి ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో కలిసి ట్రంప్ మైదానంలోకి వచ్చారు. అయితే ట్రంప్ ఎంట్రీకి ప్రేక్షకుల్లోని ఓ వర్గం నుంచి భారీగా ‘బూస్’(నిరసన నినాదాలు) వినిపించాయి. కొద్దిసేపటికే ప్రేక్షకులు చల్లబడ్డా.. ఆ తర్వాత జరిగిన పరిణామం మాత్రం వైరల్‌గా మారింది.ట్రోఫీ ఇచ్చి అలాగే.. స్పెయిన్ కెప్టెన్ రోడ్రికి ట్రంప్ వరల్డ్‌కప్ ట్రోఫీ అందించారు. సాధారణంగా ట్రోఫీ అందుకున్న కెప్టెన్ తన జట్టుతో కలిసి దానిని ఎత్తి సంబరాలు చేసుకుంటాడు. అదే సమయంలో ట్రంప్ అక్కడి నుంచి తప్పుకోవాల్సి ఉండగా.. కొద్దిసేపు ఆటగాళ్ల మధ్యే నిలబడి ఉన్నారు. దీంతో అధికారులు సంకేతాలు ఇవ్వడంతో ట్రంప్ పక్కకు జరిగారు. ఆ తర్వాత రోడ్రి తన సహచరులతో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని పైకెత్తి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.President Donald J. Trump presents the World Cup Trophy to Spain, the 2026 @FIFAWorldCup Champions! 🏆 pic.twitter.com/SHsoBhYm1b— The White House (@WhiteHouse) July 19, 2026ఈ చిన్న ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ‘‘ట్రోఫీ ఇచ్చారు కానీ ఫోటోలో ఉండాలనుకున్నారు’’ అంటూ నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.క్లబ్ వరల్డ్‌కప్ ఘటన గుర్తొచ్చిందా?ఈ ఘటనపై గతంలో జరిగిన క్లబ్ వరల్డ్‌కప్ ఫైనల్ ట్రోఫీ వేడుకను కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనూ ట్రంప్ విజేత జట్టు ఆటగాళ్లతో కలిసి స్టేజ్‌పై ఎక్కువసేపు ఉండటంపై చర్చ జరిగింది. అయితే ఈసారి ఫిఫా ప్రోటోకాల్ ప్రకారం చివరకు ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.స్పెయిన్ చరిత్ర.. వేదికపై ట్రంప్ హైలైట్ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఫెర్రాన్ టోరెస్ అదనపు సమయంలో చేసిన గోల్‌తో స్పెయిన్‌కు విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ రెడ్‌కార్డ్‌తో బయటకు వెళ్లడంతో ఆ జట్టు 10 మందితో మ్యాచ్‌ను ముగించింది. లియోనెల్ మెస్సీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవాలన్న కల నెరవేరలేదు. స్పెయిన్ ఆటగాళ్లు చరిత్ర సృష్టించిన రాత్రి.. ట్రోఫీ వేడుకలో ట్రంప్ ఎపిసోడ్ కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. -
రూ. 38 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి టీ దుకాణం..! ఇప్పుడు ఏకంగా..
జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయడానికి చాలామంది భయపడతారు. పెట్టుబడి పెట్టి వ్యాపారం రన్ చేశాక..అనుకున్న విధంగా లాభలు రాకపోతే..పరిస్థితి కష్టం కదా అని రిస్క్ చేసేందుకు ప్రయత్నించం. కానీ ఈ వ్యక్తి కథ విన్నాక..ట్రై చేస్తే తప్పు లేదు అనే ధైర్యం కలుగుతుంది. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం..సదరు వ్యక్తి పొరుగున నివశించే వ్యక్తి స్వీట్ల బాక్స్‌తో తన వ్యాపార విస్తరణను సెలబ్రేట్ చేసుకోవడానికి రావడంతో ఈ విషయం తెలిసిందంటూ మొదలవుతుంది పోస్ట్. ఆ ఎదురింటి వ్యక్తి 'టెలిపెర్ఫార్మెన్స్'లో పనిచేస్తూ నెలకు సుమారు రూ. 38,000 సంపాదించేవాడు. మే నెలలో ఉద్యోగానికి రాజీనామ చేశారు. మరో కార్పొరేట్ ఉద్యోగానికి బదులుగా ఆటో స్టాండ్ దగ్గర టీ దుకాణం పెట్టడానికి దాదాపు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, సాధారణ టీని రూ. 10కి, ప్రీమియం టీని రూ. 20కి విక్రయించడం ప్రారంభించారు. అలాగే టీ తయారు చేయడానికి, వినియోగదారులకు అందించడానికి ఇద్దరు మహిళలను నియమించుకున్నారు. ప్రస్తుతం ఆ దుకాణంలో సుమారు 400 కప్పుల టీ అమ్ముడవుతోందని, తద్వారా రోజుకు రూ. 6,000 లేదా నెలకు రూ. 1.8 లక్షల ఆదాయం వస్తోంది. ఒక వేళ ఆ వ్యక్తి పాత ఉద్యోగంలోనే కొనసాగితే..వార్షిక జీతాల పెంపు (appraisals) కోసం ఎదురుచూస్తూ ఇప్పటికీ నెలకు రూ. 38,000 మాత్రమే సంపాదిస్తూ ఉండేవారు. అతడికి ఆ వ్యాపారానికి అద్దెకు రూ. 25,000, సిబ్బంది జీతాలకు రూ. 30,000, విద్యుత్, ముడి సరుకుల కోసం రూ. 25,000 ఖర్చులను మినహాయించిన తర్వాత కూడా వ్యాపారి నెలకు దాదాపు రూ. 1 లక్ష లాభాన్ని ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఆయన వ్యాపారం ఇప్పటికే మరింత వృద్ధి చెందింది. ఆ టీ దుకాణంలో ఇటీవల వడా పావ్, సమోసాలు, జిలేబీలు అందించే కౌంటర్‌ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ ఎదురింటి వ్యక్తి తనకు స్వీట్ల పంచడంతోనే ఈ విషయం తెలిసిందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు సదరు వ్యక్తి. నెటిజన్లు ఆ వ్యక్తి ధైర్యంగా తీసుకున్న రిస్క్‌ను ప్రశంసించడమే కాదు, మధ్యతరగతి వాళ్లకు ఇలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టే టీ వ్యాపారాలింటివే బెటర్..తొలిరోజు తక్కువ అమ్మకాలు వచ్చినా..క్రమంగా పుంజుకుంటుందంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!) -
కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!
గిగ్ ఎకానమీ చాలామంది ఎలాంటి అవకాశాలు అందిస్తోందో చెప్పే వైరల్ పోస్ట్ ఇది. చదువు కోకపోయినా ఆర్థికం ఎలా నిలదొక్కుకున్నాడో వివరిస్తూ..నెటింట వైరల్‌గా మారాడు ఆ ఆటోడ్రైవర్. ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కెర్లు కొడుతున్న ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. ఆకాశ్ అనే ప్రయాణికుడు షేర్ చేశాడు ఈ పోస్ట్‌ని. తాను సాధారణంగా క్యాబ్‌లోనే వెళ్తానని, ఆ రోజు ఎందుకనో ఆటోటో వెళ్లాలనుకున్నాడు. సాధారణంగా మొదలైన ప్రయాణం ఆ ఆటోడ్రైవర్‌తో జరిగిన సంభాషణతో ఆసక్తికరంగా మారింది. ఆకాష్ ఆ డ్రైవర్ని ఎంత సంపాదిస్తారని ప్రశ్నించాడు. దానికి అతడు చెప్పిన సమాధానం ఆకాశ్‌ని అమితంగా ఆశ్చర్యపరిచింది. తన ఆదాయం స్థూల అంచనాను చెబుతూ..ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 45 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. అలాగే గతంలో గురుగ్రామ్‌లో ఒక కంపెనీ రూ. 25 వేలు జీతంతో సూపర్వైజర్గా పనిచేసినట్లు తెలిపారు. రోజుకు రూ. 1500 నుంచి 2000 ఆర్జిస్తున్నాని, కేవలం ఎనిమిది గంటల డ్రైవింగ్ అని చెప్పాడు. నెలకు దగ్గర దగ్గర రూ. 50 నుంచి రూ 60 వేలు దాక సంపాదించగలనని అన్నారు. వాటిలో ఖర్చులోపోను కనీసం రూ. 40 వేలు దాక మిగలుతుందని అన్నారు. అంతేగాదు గిగ్ ఎకానమీ కల్పిస్తున్న ప్రయోజనాల గురించి అందరికీ తెలియాలంటూ పోస్ట్‌ని ముగించాడు. నెటిజన్లు సైతం ఆశ్చర్చపోతూ..నా జీతమే అతడికంటే తక్కువేమో అని ఒకరు, బెంగళూరు రండి అక్కడ ఆటోడ్రైవర్లు నెలకు కనీసం రూ. 2 లక్షల దాక సంపాదిస్తున్నారు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Akash Gupta | KaashSeAkash (@kaashseakash) (చదవండి: ఆ ఉద్యోగం వదిలేయడానికి.. ఏకంగా 74 లక్షల మూల్యం..!) -
తల తెగినా ఫైటింగ్ ఆగలేదు.. భవిష్యత్తు యుద్ధానికి జస్ట్ ట్రైలర్?
చైనాలో జరిగిన ఓ హ్యూమనాయిడ్ రోబో పోరాట కార్యక్రమం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పోటీలో పాల్గొన్న ఓ రోబో ప్రత్యర్థి దాడిలో తన తలను కోల్పోయినప్పటికీ, కొన్ని క్షణాల పాటు పోరాటాన్ని కొనసాగించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఘటన చైనాలో నిర్వహించిన హ్యూమనాయిడ్ రోబో కాంబాట్ ఈవెంట్లో చోటుచేసుకుంది. ఫైట్ సమయంలో రెండు రోబోలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ప్రత్యర్థి రోబో ఇచ్చిన బలమైన దెబ్బకు ఒక రోబో తల భాగం విరిగిపోయింది. సాధారణంగా యంత్రం పనిచేయడం ఆగిపోతుందని అందరూ భావించినప్పటికీ, ఆ రోబో తన కదలికలను కొనసాగిస్తూ పోరాటం చేసింది.Robot lost its head mid-fight and kept swinging anyway 😂pic.twitter.com/KnMaFDsr2n— Tansu Yegen (@TansuYegen) July 17, 2026రోబో తల భాగం లేకుండానే ముందుకు కదులుతూ దాడులు చేయడం చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు దీనిని సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ‘టెర్మినేటర్’ సన్నివేశాలను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఘటన రోబోటిక్స్ రంగంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని కూడా చూపిస్తోంది. హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల మాదిరిగా నడవడం, సమతుల్యత పాటించడం, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రోగ్రామ్ చేసిన విధంగా స్పందించడం వంటి సామర్థ్యాలను సాధిస్తున్నాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిపై టెక్నాలజీ కంపెనీలు, పరిశోధనా సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రోబోలు పరిశ్రమలు, సేవా రంగాలు, అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో జరిగిన ఈ రోబో ఫైట్ మాత్రం ఒక విషయం స్పష్టం చేసింది. యంత్రాల ప్రపంచం ఊహించిన దానికంటే వేగంగా ముందుకు సాగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. -
లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కలకలం.. వీడియో వైరల్
ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కలకలం సృష్టించింది. ముగ్గురు మహిళలపై దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్‌లోని 'శేత్ ఐరీన్' టవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.లిఫ్ట్‌లో అప్పటికే ముగ్గురు యువతులు ఉండగా.. ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లోపలికి ప్రవేశించింది. లిఫ్ట్ తలుపులు మూసుకున్న కొద్దిసేపటికే.. ఆ కుక్క మూతికి మాస్క్ ఉన్నప్పటికీ.. ఒకస్కారిగా దూసుకెళ్తూ.. వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కుక్క ఒక్కసారిగా దాడికి దిగడంతో యజమాని కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఆ కుక్క యువతులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే యువతులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, మరో యువతి మాత్రం లోపలే చిక్కుకుపోయింది. ఆమెపైకి కుక్క మరింత అగ్రెసివ్‌గా దూసుకెళ్లింది.CCTV from Mumbai Malad West lift: Pet dog suddenly lunges aggressively at 3 young girls. Owner struggles to restrain it on leash as kids panic. No serious injuries, but sparks debate on pet control in shared spaces. pic.twitter.com/wvzhIwAM0y— Ghar Ke Kalesh (@gharkekalesh) July 17, 2026చివరకు లిఫ్ట్ నిర్దేశిత ఫ్లోర్‌కు చేరుకోగానే ఆ యువతి కూడా వేగంగా బయటకు వచ్చి తప్పించుకుంది. ఈ ఘటనపై మలాడ్ పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో బాలికలకు ఎలాంటి గాయాలు కాలేదని.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. సదరు నివాసికి తన పెంపుడు జంతువును లిఫ్ట్‌లో తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. అయితే, ఈ సీసీటీవీ వీడియో బయటకు రావడంతో అపార్ట్మెంట్ వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
రెచ్చిపోయిన పోకిరీకి, యువతి గుణపాఠం : వీడియో వైరల్
మహారాష్ట్రలోని భూసావల్-వర్ధా ప్యాసింజర్ రైలులో ఒక యువతి తన ధైర్యసాహసాలతో నెట్టింట వైరల్‌గా మారింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోకిరీకి విచిత్రమైన రీతిలో, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. తోటి ప్యాసింజర్లు కూడా ఆమెకు తోడవడంతో, నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తద్వారా వేధింపులకు భయపడి మౌనంగా ఉండకుండా గట్టిగా ప్రతిఘటించాలనే ధైర్యాన్నిచ్చింది.కదులుతున్న రైలులో ఒక యువకుడు ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అంతే అసాధారణ ధైర్యం ప్రదర్శించి, తోటి ప్రయాణికుల సహాయంతో అతడిని పట్టుకుంది.ఆ పోకిరీకి చేతులకు గాజులు తొడిగి, పెదవులకు లిప్‌స్టిక్ పూసి అవమానించింది. ఆ కంపార్ట్మెంట్లోని చాలా మంది ఆ మహిళను చప్పట్లతో అభినందిస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారిందిA brave young woman on the Bhusawal-Wardha Passenger Train taught a sexual harasser a lesson he will never forget, in a unique and viral act of justice. When a young man behaved indecently with her inside the moving train, the woman showed remarkable courage and caught hold of… pic.twitter.com/PPOyN0YdKI— Pune Mirror (@ThePuneMirror) July 17, 2026 వేధింపులపై మౌనంగా ఉండకుండా నిలబడిన ఈ సాహసికి, ఆమె తోటి ప్రయాణికులకు విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారి తీసింది. అయితే గాజులు, బొట్టు పెట్టడం అంటే తిరిగి మనల్ని మనం అవమానించుకున్నట్టే.. కానీ ఏదో విధంగా ప్రతిఘటించడం అభినందనీయం అంటున్నారు కొంతమంది. మహిళలు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైనప్పుడు పక్కన ఉన్నవారు జోక్యం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను మరికొందరు నొక్కి చెప్పారు. ఇలాంటి పోకిరీలకు తగిన శిక్ష విధించేలా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీ -
స్టీరింగ్ చేతిలో.. సడన్‌గా డ్రైవర్ మాయం!
కొన్నిసార్లు ప్రమాదాలు కూడా నవ్వులు పూయిస్తాయి. అలాంటి ఓ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరదా ట్రిప్‌లో భాగంగా గోల్ఫ్ కార్ట్ నడుపుతున్న ఓ యువతి.. రోడ్డుపై ఫోకస్ కోల్పోవడంతో చివరకు వాహనం నేరుగా పొదల్లోకి వెళ్లిపోయింది.వైరల్‌గా మారిన 13 సెకన్ల వీడియోలో.. కొందరు గోల్ఫ్ కార్ట్‌లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆకులతో నిండిన సన్నని దారిలో కార్ట్ వెళ్తుండగా.. డ్రైవర్ ఒక్కసారిగా రోడ్డుపై దృష్టి కోల్పోయింది. పక్కనే ఉన్న యువతి కింద పడిపోగా.. డ్రైవింగ్ చేస్తున్న సంగతి మరిచిపోయి కంగారులో స్టీరింగ్ వదిలేసింది. కింద పడిన యువతి కోసం ఈమె కూడా దూకేసింది. వెనక కూర్చున్నవాళ్లు ఆ షాకింగ్ పరిణామాన్ని తొంగి చూస్తూ ఉండిపోయారు. మరి డ్రైవర్ మాయమైతే.. వాహనం నడిపేదెవరు?.. అందుకే వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రయాణికుల్లో ఒకరు ఒక్కసారిగా కిందకు జారిపడటం, ఆ వెంటనే డ్రైవర్ సీట్లో యువతి కూడా దూకేయడం.. ఆ వీడియోను మరింత వినోదంగా మార్చింది.did she forget she was the driver 🥲 pic.twitter.com/cjAKlyYGZR— Peché Africa 🇿🇦 (@pmcafrica) July 17, 2026వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. “డ్రైవర్ అని మర్చిపోయి పార్టీకి వచ్చిందా?” అంటూ కొందరు సరదాగా స్పందించగా.. మరికొందరు “రోడ్డుపై చూపు ఎప్పుడూ ముందే ఉండాలి” అంటూ జాగ్రత్తలు సూచించారు.మిలియన్లకు పైగా వ్యూస్.. కామెంట్ల వర్షంపెచే ఆఫ్రికా షేర్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో లైక్స్, షేర్స్ రావడంతో పాటు.. ఈ ఘటనపై మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. కొందరు దీనిని జీవితానికి ఉదాహరణగా పోల్చుతూ.. “దృష్టి ఎక్కడ ఉంటే ప్రయాణం కూడా అక్కడికే వెళ్తుంది” అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.ఈ ఘటన సరదాగా ముగిసినప్పటికీ.. వాహనం నడిపేటప్పుడు దృష్టి మరల్చడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తుచేసింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో.. ఈ గోల్ఫ్ కార్ట్ ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పండుగగా మారింది. “రోడ్డుపై డ్రైవింగ్.. పార్టీలో డ్యాన్స్ కాదు!” అంటూ నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ టచ్ ఇస్తున్నారు. -
రూ. 6.5 కోట్లు, 44 ఏళ్లకే ఉద్యోగానికి గుడ్‌బై : టెక్కీ ఫైర్ జర్నీ తెలిస్తే
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన 20 ఏళ్ల సక్సెస్ఫుల్ స్టార్టప్ కెరీర్‌కు స్వస్తి పలికారు. ఎందుకో తెలుసా? టెక్నాలజీపై ఆసక్తి లేకా? లేక పని ఒత్తిడి కారణంగానా? ఈ వివరాలు తెలియాలంటే రెడ్డిట్ (Reddit) పోస్ట్‌లో 44 ఏళ్ల టెకీ పంచుకున్న వివరాలు గురించి తెలుసుకోవాలి. "మై ఫైర్ జర్నీ: వాకింగ్ అవే ఎట్ 44" అనే పేరుతో ఉన్న ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈయను భార్య, 11 ఏళ్ల కుమారుడు ఉన్నారు. యూజీ, పీజీ, ఇంజనీరింగ్ టియర్-1 కాలేజీలో చదుకున్నారు. ఆ తరువాత చాలాకాలం స్టార్టప్‌లలో పనిచేశారు. కానీ ఏళ్ల తరబడి ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల డబ్బు కంటే ఎంతో విలువైన దాన్ని దూరం చేశాననే భావనతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనివెనుక పెద్ద ప్రణాళిక, ఆర్థిక విజయం ఉండటం విశేషం.స్టార్టప్ ప్రపంచంలో గడిపిన దాదాపు రెండు దశాబ్దాలను వెనక్కి తిరిగి చూసుకున్నారట. దీంతో స్టార్టప్‌లో వారానికి 6 రోజులు, రోజుకు 14 గంటల చొప్పున పనిచేయాల్సి రావడం, ఆఫీస్ రాజకీయాలతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా సరిగ్గా నిద్రలేక బోర్డర్ లైన్ డయాబెటిస్, అధిక రక్తపోటు (High BP),భారీ పొట్ట పలకరించడంతో ఆందోళన మొదలైంది. 2023లో తన ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకున్న తర్వాత ఆయనకు 'ఫైర్' (FIRE - Financial Independence, Retire Early) ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనకు ఆయన అప్పటికే పెట్టుబడులు, వాటి ఫలితాలు ఊతమిచ్చాయి.2018 నుండి ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో SIP లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. 2019లో ఆయన పనిచేస్తున్న స్టార్టప్‌ను వేరొక సంస్థ కొనుగోలు చేయడంతో రూ. 1.4 కోట్ల (ESOP) డబ్బు వచ్చింది. దాన్ని ఖర్చు చేయకుండా మళ్లీ ఇన్వెస్ట్ చేశారు. అలా 2026 ఏప్రిల్ నాటికి ఆయన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో రూ. 6.5 కోట్లకు చేరింది. ఇందులో 60శాతం ఈక్విటీలలో, మిగిలిన 40 శాతం డెట్ ఫండ్స్, లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్, పీఎఫ్ లలో ఉంది.సొంత ఇల్లు ఉంది. కుటుంబ వార్షిక ఖర్చులు దాదాపు రూ. 14 లక్షలు. ఇక కొడుకు ఉన్నత చదువుల ఖర్చును తాతయ్యగారే చూసుకుంటామని చెప్పడంతో భవిష్యత్తు భారం తగ్గింది.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‘‘పక్కా లెక్కలున్నాయి,సరిపడా డబ్బు ఉంది. అందుకే ఉద్యోగం మానేశాను. ఇంజనీరింగ్ నుండి రిటైర్ అవ్వలేదు, కేవలం పని ఒత్తిడి (Burnout) నుండి మాత్రమే రిటైర్ అయ్యాను," అంటారాయన.రిటైర్మెంట్ తరువాత ఆరోగ్యంఉద్యోగం మానేసిన మూడు నెలల్లోనే బరువు తగ్గారు, బీపీ అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన ధ్యానం, వ్యాయామం చేస్తూ, కుటుంబంతో గడుపుతున్నారు. అలాగే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) పై పరిశోధన చేస్తూ, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నారు.ఈ వయస్సులోనే రూ. 6.5 కోట్ల భారీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోతో, వచ్చే రాబడితో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాంతం సంతోషంగా అనుభవించ వచ్చని ఆయన నిరూపించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ముఖ్యమైన సూత్రాలు పంచుకున్నారు.కెరీర్ ప్రారంభంలోనే రిటైర్మెంట్కు ఎంత డబ్బు కావాలో (FIRE Target) లెక్క వేసుకోండి. తన కెరీర్లో ఎప్పుడూ జీతం గురించి నెగోషియేట్ చేయలేదు, దీనివల్ల కోట్ల రూపాయలు నష్టపోయాను.సొంత ఇల్లు ఉండటం వల్ల అద్దె భారం తగ్గి, రిటైర్మెంట్కు కావాల్సిన మొత్తం (Corpus) తగ్గింది.లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే విలాసాలకు దూరంగా ఉంటూ ఖర్చులను అదుపులో పెట్టుకోవడం వల్ల పెట్టుబడి పెట్టడం సులువైంది.భవిష్యత్తులో ఏదైనా మంచి అవకాశం వస్తే మళ్లీ పనిచేసే ఆలోచన ఉందని, ప్రస్తుతం మాత్రం తన జీవితాన్ని తన నిబంధనల ప్రకారమే గడుపుతున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చేశాం, భారీ నష్టం : ఇరాన్ ప్రకటన -
ఆ ఉద్యోగం వదిలేయడానికి.. ఏకంగా 74 లక్షల మూల్యం..!
కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. మరికొన్నింటికి ఏకంగా లక్షలు ఖర్చవుతాయి. అయినా కూడ వెనకగుడు వేయకుండా ముందుకు సాగాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. ఇక్కడ చోటు చేసుకుంది అలాంటి ఘటనే. అసలేం జరిగిందంటే.. సశాస్త్ర సీమా బాల్ (SSB) మాజీ అసిస్టెంట్ కమాండెంట్ అమిత్ సోని సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడానికి దాదాపు 74 లక్షలు ఎలా వదిలించుకోవాల్సి వచ్చిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తాను ఐఐఎం అహ్మదాబాద్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ (PGPX) చేయడం కోసం తన ప్రభుత్వ పదవికిఇ రాజీనామా చేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదా పునరాలోచన లేకుండా తనపై ఉన్న నమ్మకంతో తీసుకున్న నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించక తప్పలేదన్నారు. ఆ నిర్ణయం ఫలితంగా ఆర్థికంగా ఎంత ఖర్చు అయ్యిందో వివరించారు. PGPX ప్రోగ్రామ్ ఫీజు రూ. 37.10 లక్షలు కాగా, అంతర్జాతీయ ఇమ్మర్షన్‌కు రూ. 4.5 లక్షలు ఖర్చయ్యాయని అన్నారు. అతను తన ఒక ఏడాది జీవన వ్యయాలు సుమారు రూ. 2.5 లక్షలుగా అంచనా వేశాడు. అలాగే రూ. 9.80 లక్షల రాజీనామా బాండ్లు, అలాగే ఏడాది జీతం, ఉద్యోగ ప్రయోజనాల రూపంలో సుమారు 20 లక్షలు కలిపి దగ్గర దగ్గర రూ. 74 లక్షలు దాక వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక పరంగా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యినా..తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు అమిత్. ఆయన తన నిర్ణయాన్ని డబ్బుతో కొలవకూడదని అనుకుంటున్నాని, ఎందుకంటే..వ్యక్తిగత ఎదుగుదల, కొత్త అవకాశాలు కోసం సౌకర్యవంతమైన జీవితం వదులుకుంటున్నప్పడు ఆ మాత్రం ఖర్చు ఉంటుందని అన్నారు. అంతేగాదు ఆయన ఈ మార్పుని "యూనిఫాం నుంచి బోర్డురూమ్కు" మారడంగా అభివర్ణించారు. ఇది వృత్తి జీవితంలో ఒక కొత్త అధ్యయానికి నాందిగా పేర్కొంటూ తన పోస్ట్‌ని ముగించారు. ఇది నెటిజన్ల మనసును అమితంగా ఆకర్షించింది. కొందరు అతడి ధైర్యాన్ని, నిబద్ధతను ప్రశంసించగా, మరికొందరు ఉన్నత విద్య కోసం స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడం ఒక విలువైన పెట్టుబడా కాదా అని ప్రశ్నిస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: గర్భంలో పడినప్పుడే..ఆయుర్ధాయం ఖరారు..!: పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
క్లాస్‌రూంలోనే రాసలీలలు
విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే హద్దులు దాటారు. పాఠాలు చెప్పాల్సిన తరగతి గదిలోనే అనుచిత ప్రవర్తించారు. ఆ వీడియోలు కాస్త బయటకు రావడంతో.. తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇటు విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు.. తరగతి గదిలో హద్దులు దాటి ప్రవర్తించారు. విద్యార్థులు లేని టైం చూసుకుని ఏకాంతంగా కలుసుకున్నారు. ముద్దులతో, కౌగిలింతలతో.. రెచ్చిపోయారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. విద్యాశాఖ రంగంలోకి దిగింది. ఇద్దరు సీనియర్ టీచర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. నివేదికలో.. వాళ్లు తప్పు చేసినట్లు తేలింది.ప్రవర్తన ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని.. ఇలాంటి చర్యలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తేల్చింది. దీంతో విద్యాశాఖ వాళ్లను సస్పెండ్ చేసింది.ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్ జిల్లాలోని సౌరిక్ బ్లాక్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. నివేదిక ఆధారంగా జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఒక టీచర్‌ను గుగరాపూర్ బ్లాక్ రిసోర్స్ సెంటర్‌కు, మరో టీచర్‌ను తాల్గ్రామ్ బ్లాక్ రిసోర్స్ సెంటర్‌కు అటాచ్ చేశారు. చాలా కాలంగా వీళ్లిద్దరూ ఇలా చేస్తున్నట్లు తేలిందని ఆయన అంటున్నారు.అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో నిజమైనదేనా? ఎప్పుడు చిత్రీకరించారు? అనే అంశాలపై కూడా అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. వీడియోలో మాత్రం ఆ క్లాస్‌రూం రొమాన్స్.. ఈ ఏడాది జనవరిలో జరిగినట్లు డేట్ కనిపిస్తోంది. వీడియో ప్రామాణికతను నిర్ధారించే విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన గురువులే ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పాఠాలు చెప్పాల్సిన క్లాస్‌రూంలోనే అనుచిత ప్రవర్తనకు పాల్పడి.. చివరకు ఇద్దరు టీచర్లు తమ ఉద్యోగాలపై వేటు పడే పరిస్థితిని ఎదుర్కొన్నారు. -
ఏకంగా 10 అడుగుల కోబ్రా : చున్నీలా మెడలో చుట్టేసుకుంది
బిహార్‌లో వర్షాలతో నదుల నీటిమట్టం పెరగడం సర్వసాధారణం. ప్రస్తుతం పశ్చిమ చంపారన్ జిల్లాలో గండక్ నది నీటిమట్టం పెరుగుతుండటంతో, వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఏకంగా 10అడుగుల పొడవైన విషపూరితమైన కోబ్రా ఒకరి ఇంట్లోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడంతా ఆందోళన నెలకొంది. కానీ తక్షణమే 'స్నేక్ లేడీ' రంగంలో దూకడంతో అంతా సద్దు మణిగింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింగ తెగ చక్కర్లు కొడుతోంది. పశ్చిమ చంపారన్‌లోని వాల్మీకినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మున్నీ లాల్ అనే వ్యక్తి ఇంట్లోకి దాదాపు 10 అడుగుల పొడవైన భారీ విషసర్పం దూరింది. ఇంట్లో అంత పెద్ద పాము బుసలు కొట్టడం చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. ఆ శబ్దాలు విని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి.जिन महिला के गले में आप किंग कोबरा देख रहे हैं वो हैं बिहार के बगहा में वाल्मीकिनगर की जानकी देवी और लोग उन्हें 'स्नेक लेडी' के नाम से जानते हैं. वाल्मीकिनगर के विशाहा गांव में उस समय अफरा-तफरी मच गई, जब एक आदमी के घर में करीब 10 फीट लंबा जहरीला किंग कोबरा निकल आया. तुरंत… pic.twitter.com/hna8qso1S8— Kishor Joshi (@KishorJoshi02) July 16, 2026 ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్మహిళా స్నేక్ క్యాచర్ 'జానకి దేవి'ఇంట్లో పాము ఉన్న సమాచారం అందుకున్న స్థానిక మహిళా సర్ప మిత్ర (స్నేక్ క్యాచర్), స్నేక్ లేడీ తక్షణమే అక్కడికి చేరుకున్నారు. ఆమె ఏమాత్రం భయపడకుండా, చాలా చాకచక్యంగా ఆ భారీ కోబ్రాను పట్టుకున్నారు. పాము పొడవు చాలా ఎక్కువగా ఉండటంతో, ఆమె దాని తల భాగాన్ని చేత్తో పట్టుకుని, మిగిలిన శరీరాన్ని తన మెడలో దుపట్టా లాగా వేసుకుని అడవి వైపు బయలుదేరారు. ఈ దృశ్యం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ పామును సురక్షితంగా వాల్మీకినగర్ అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో అటు మనుషులకు, ఇటు ఆ వన్యప్రాణికి ఎలాంటి హాని జరగకుండా కథ సుఖాంతమైంది.ఇదీ చదవండి: రూ. 150 కోట్ల ఆస్తి, తండ్రిని కాల్చి చంపిన పెద్ద కొడుకుఅటవీ శాఖ అధికారుల విజ్ఞప్తినేపాల్ నుండి వచ్చే వరద నీరు, అడవుల్లో నీరు చేరడం వల్ల పాములు, ఇతర వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాల కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా, వెంటనే అటవీ శాఖకు లేదా శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం -
జడ్జి పదవిలో ఉంటూ సైడ్ బిజినెస్?
న్యాయ పీఠం అంటే కేవలం ఓ పదవి కాదు.. అది విశ్వాసానికి ప్రతీక. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై సమాజంలో అత్యున్నత నమ్మకం ఉంటుంది. అందుకే వారి వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకత, నైతికతకు పెద్దపీట వేయడం ఆనవాయితీ. అలాంటి విలువలకే ఓ న్యాయమూర్తి తిలోదకాలు ఇచ్చారనే వ్యవహారం ఇప్పుడు న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. దేశాన్ని కుదిపేసిన నోట్ల కట్టల జడ్జి ఘటన మరువక ముందే వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలోకి వెళ్తే.. మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, మణిపూర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్‌కు చెందిన ‘కిచెన్ ఫ్లేమ్’ ఎల్పీజీ డీలర్షిప్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనూ ఈ డీలర్షిప్ కొనసాగిందన్న అంశంపై వివాదం రేగింది. జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ 2008లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 అక్టోబర్‌లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. 2024 నవంబర్‌లో పదవీ విరమణ చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు రాజ్యాంగబద్ధమైన న్యాయ పదవుల్లో కొనసాగిన సమయంలోనే గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్ కొనసాగిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.న్యాయ పదవి.. వ్యాపార సంబంధం.. ఏంటి తప్పా?రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు వ్యక్తిగత వ్యాపారాలు, ఆర్థిక ప్రయోజనాలకు దూరంగా ఉండాలన్న నైతిక ప్రమాణాలు ఉన్నాయి. ప్రయోజన సంఘర్షణ (Conflict of Interest)కు అవకాశం లేకుండా వారి ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. కానీ, జస్టిస్ మృదుల్ విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ‘కిచెన్ ఫ్లేమ్’ ఏజెన్సీకి సంబంధించి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో డీలర్షిప్ ఒప్పందాలు పలుమార్లు రెన్యువల్ అయ్యాయి. 1995, 2005, 2010, 2015 సంవత్సరాల్లో ఒప్పందాల పునరుద్ధరణతో పాటు 2025లోనూ ఒప్పందం కొనసాగినట్లు సమాచారం. అయితే న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో ఈ వ్యాపార సంబంధం కొనసాగడం నిబంధనలకు విరుద్ధమా? అనే అంశంపై బీపీసీఎల్ వివరణ కోరింది.నోటీసులు.. స్పందన లేక సస్పెన్షన్ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన బీపీసీఎల్.. 2025 డిసెంబర్లో వచ్చిన ప్రజా ఫిర్యాదును ఆధారంగా చేసుకుని జస్టిస్ మృదుల్‌కు నోటీసులు జారీ చేసింది. న్యాయ పదవిలో ఉన్న సమయంలో ఎల్పీజీ డీలర్షిప్ కొనసాగించడం, ఆ సమయంలో అవసరమైన అనుమతులు తీసుకున్నారా? డీలర్షిప్ ఒప్పంద నిబంధనలు పాటించారా? అనే అంశాలపై సంస్థ వివరణ కోరింది. జనవరి 30, ఫిబ్రవరి 26 తేదీల్లోనూ బీపీసీఎల్ నుంచి లేఖలు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులకు సమాధానం రాకపోవడంతో.. జూలై 6న ‘కిచెన్ ఫ్లేమ్’ డీలర్‌షిప్‌ను సస్పెండ్ చేసి పారేసింది.మోనికా పిటిషన్.. కొత్త మలుపుఈ వ్యవహారంలో మరో కోణం కూడా తెరపైకి వచ్చింది. ‘కిచెన్ ఫ్లేమ్’ ఎల్పీజీ ఏజెన్సీని నిర్వహిస్తున్న దీపక్ యాదవ్ మరణం తర్వాత.. ఆయన భార్య మోనికా యాదవ్ డీలర్షిప్ యాజమాన్య మార్పు (reconstitution of proprietorship) కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గతంలో బీపీసీఎల్‌ను ఆదేశించింది. అయితే ఆ తర్వాత ఏజెన్సీని బీపీసీఎల్ సస్పెండ్ చేయడంతో మోనికా మరోసారి కోర్టును ఆశ్రయించారు. తాను అన్ని నిబంధనలు పాటించినప్పటికీ.. మాజీ యజమాని జస్టిస్ మృదుల్, బీపీసీఎల్ చర్యల కారణంగా తాను నష్టపోతున్నానని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.న్యాయవ్యవస్థపై వరుస వివాదాలుఈ వివాదంపై జస్టిస్ మృదుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇదే సమయంలో. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం మరోసారి న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయన అధికారిక నివాసంలో నగదు కట్టలు బయటపడిన ఘటన అనంతరం.. పార్లమెంట్ ద్వారా తొలగింపు ప్రక్రియ(అభిశంసన) ప్రారంభం కావడం, చివరకు ఒత్తిళ్లతో ఆయన జడ్జి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒకవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం.. మరోవైపు జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ ఎల్పీజీ ఏజెన్సీ వివాదం.. న్యాయమూర్తుల వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. న్యాయవ్యవస్థకు ప్రజల విశ్వాసమే ప్రధాన బలం. అందుకే ఉన్నత న్యాయ పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రతి అడుగు కూడా నైతిక ప్రమాణాల తూకంలోనే పరిశీలనకు వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
లేఆఫ్ అయిన 15 రోజుల్లోనే కొత్త జాబ్, టెకీ టిప్స్ వైరల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా పలు దిగ్గజ టెక్ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కంపెనీ పునర్నిర్మాణం, టెక్నాలజీలు అంటూ ఉద్యోగులపై వేటు వేస్తుండటంతో టెకీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. తాజాగా ఒక ఎంన్ఎసీలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న టెకీ, కేవలం 15 రోజుల్లొ తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కష్టకాలంలో తాను ఉద్యోగం ఎలా సాధించాడో వివరిస్తూ సదరు ఉద్యోగి రెడ్డిట్ (Reddit) వేదికగా కొన్ని కీలక చిట్కాలను పంచుకోవడం విశేషంగా నిలిచింది.కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఒక ఎంఎన్సీ కంపెనీ నుండి లేఆఫ్ అయ్యాడు. కేవలం రెండు నెలల క్రితమే చేరిన అతనికి, ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నాడనే కారణంతో ఎలాంటి పరిహారం కూడా ఇవ్వకుండా జూలై 31 వరకు మాత్రమే సమయం ఇచ్చి తీసేశారు. దీంతో అతను తీవ్ర ఆందోళనలో పడిపోయాడు. ఎందుకంటే ఇటీవల అతని ఇంటి లోన్ ఈఎంఐలు మొదలయ్యాయి. దీంతో ఇది ఎలా కట్టాలో అతనికి అర్థం కాలేదు. మొత్తానికి ఉద్యోగాన్ని సాధించానంటూ తన అనుభవాలను పంచుకున్నాడు.ఉద్యోగం సాధించడానికి చిట్కాలులింక్డ్ఇన్లో ఉద్యోగాలకు అప్లై చేయడంతో పాటు, తన స్నేహితులందరికీ ఫోన్ చేసి కంపెనీలలో రిఫర్ చేయమని కోరాడు. కోల్డ్-అప్రోచ్ (నేరుగా రిక్రూటర్లను సంప్రదించడం) పద్ధతిని కూడా వాడాడు. అన్నింటికంటే రిఫరల్స్ మాత్రమే తనకు బాగా పని చేశాయని పేర్కొన్నాడు. మొత్తం 5 కంపెనీలలో ఇంటర్వ్యూలు రాగా.. 2 కంపెనీలు తిరస్కరించాయి, 3 కంపెనీలలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇందులో పుణె బేస్డ్ స్టార్టప్ ఆఫర్లను తిరస్కరించి, నోయిడాలోని ఒక ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలో వచ్చిన ఉద్యోగాన్ని సంతోషంగా ఒప్పుకున్నాడు.ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్"ప్రస్తుతం జాబ్ మార్కెట్ చాలా క్రూరంగా ఉంది, భవిష్యత్తులో ఇంకా ఘోరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఉద్యోగం వచ్చినా సరే.. DSA (Data Structures and Algorithms) , సిస్టమ్ డిజైన్ (System Design) ప్రిపరేషన్‌ను ఎప్పుడూ ఆపకండి. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి." అంటూ టెకీలకు సూచించాడు.ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్ఈ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు ఒక్కసారి లేఆఫ్ అనుభవాన్ని ఎదుర్కొని, ఇంత త్వరగా ఉద్యోగం సాధిస్తే.. ఇకపై జీవితంలో లేఆఫ్స్ అంటే భయం పోతుందని ఒకరు, ఇంత బ్రూటల్ మార్కెట్లో గొప్ప కమ్‌బ్యాక్ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు ఆఫర్ వచ్చినప్పటికీ ప్రిపరేషన్ ఆపకూడదనే మాట వంద శాతం నిజం అనిమరికొందరు అతడిని అభినందించారు. ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ -
చీరతో విదేశీ వనిత పాట్లు..! ఆ మహిళా కానిస్టేబుల్..
నెట్టింట చక్కెర్లు కొడుతున్న వీడియో..మన దేశ ఆతిథ్యం తోపాటు, మన భారతీయ చీర గొప్పదనాన్ని చాటింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఆగ్రాలలోని తాజ్మహల్వద్ద ఒక అర్జెంటిన పర్యాటకురాలికి చీర సరిచేసుకోవడంలో సహాయం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. సాంప్రదాయ వస్త్రధారణ తెలియని ఆ పర్యాటకురాలు యూపీ పోలీసులకు ధన్యవాదాలు అని తెలపడంతో ఒక్కసారిగా ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన పోలీసులు విధులకు మించి సాయం చేయడానికి ముందుకు వచ్చిన సదరు కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేగాదు భారతదేశా అతిథ్యం, పర్యాటకుల పట్ల స్నేహపూర్వకమైన పోలీసింగ్‌ని హైలెంట్ చేశారు మేడం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురింపించారు. అలాగే కొందరు నెటిజన్లు తాజ్ మహల్ సందర్శన సమయంలో చీర ధరించి భారతీయ సంస్కృతిని స్వీకరించినందుకు ఆ విదేశీ మహిళను కూడా అభినందిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈఘటన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తాజ్‌మహల పశ్చిద్వారా వద్ద చోటు చేసుకుంది. దీనిపై యూపీ పోలీసు అధికారుల కూడా స్పందించారు. అవసరమైనప్పుడు దేశీయ , అంతర్జాతీయ పర్యాటకులిద్దరికీ సహాయం అందించేలా తాజ్ సెక్యూరిటీ పోలీస్ సిబ్బందిని ప్రోత్సహిస్తుందని అధికారులు తెలిపారు. View this post on Instagram A post shared by BENARAS GLOBAL TIMES (@benarasglobaltimes) (చదవండి: కుమారుడి సర్ప్రైజ్ గిఫ్ట్..! కన్నీటి సంద్రంలో తండ్రి) -
కుమారుడి సర్ప్రైజ్ గిఫ్ట్..! కన్నీటి సంద్రంలో తండ్రి
తలిదండ్రులు తమ పిల్లల చదవుల కోసం, వారి ఉన్నతి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమ పడతారు. ఆ బిడ్డ ప్రయోజకుడై వాళ్ల కష్టాన్ని గుర్తించి..కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలిగితే..ఆ పేరెంట్స్‌కి మించిన అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. అలాంటి ఆనందాన్నే తిరిగి ఇచ్చాడు కేరళకు దీప్ నీలమ్. అంతేగాదు కుమారుడి ఊహించని చర్యకు ఆ తండ్రి కళ్లలలో నీళ్లు తిరిగాయ్.అసలేం జరిగిందంటే..కేరళకు దీప్ నీలిమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్లకు తెగ ఆకట్టుకుంది. ఆ వీడియోలో తనను ఎప్పటికీ వీడిపోని జ్ఞాపకాలతో మొదలవుతుంది. అతన పాఠశాలలో చదువుతున్నప్పుడు తన తండ్రి తాను ఎప్పటికీ ఎస్‌యూవీని కొనని అమ్మతో చెప్పడం విన్నానని చెప్పుకొచ్చాడు.ఎందుకంటే తన చదువుకి పెట్టుబడి కోసం తక్కువ ఖరీదైన కారుతో సరిపెట్టుకున్నట్లు తెలిపాడు. అయితే తాను కచ్చితంగా ఆయన పదవీవిరమణ సమయానికి తన డ్రీమ్ వాహనాన్ని కొంటానని తండ్రికి వాగ్దానం చేసినట్లు చెప్పుకొచ్చాడు నీలిమ్. ఆరోజు నుంచే తన తండ్రి కోరికను ఎలాగైన నెరవేర్చాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడట. అయితే అనుకోకుండా తన జీవితం కాస్త ముందుగానే ఆ అవకాశం ఇచ్చిందని చెప్పాడు. తాను ఐఐఎం కోజికోడ్ నుంచి పట్టభద్రుడైన కేవలం ఆరు నెలలకే, తన చిన్ననాటి వాగ్దానం నిజం చేసుకోగలిగానని ఆనందంగా చెప్పాడు. ఎందుకంటే తాను కేపీఎంజీలో జాబ్ సంపాదించడంతో అది సులభమైందని అన్నాడు. అందుకే తన తండ్రి కోరికను నెరవేర్చిన క్షణం చిరస్మరణీయం ఉండేలా టెస్ట్ డ్రైవ్ చేద్దామనే నెపంతో ఆయనను ఒక కార్ షోరూమ్‌కు తీసుకువెళ్లినట్లు చెప్పాడు. ఆ ఎస్యూవీ వాహనం చూశాక గానీ ఆ తండ్రికి తెలియలేదు అప్పటికే కొడుకు ఆ కారుని కొనుగులు చేసినట్లు. అంతే ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేగాదు నీలమ్ ఇది తనకు జాబ్ ఆఫర్, ప్రమోషన్ కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే విషయం అంటూ తన పోస్ట్‌ని ముగించాడు. పైగా నీలమ్ ఆ వీడియోకి తమ కలల కన్నా పిల్లల కలలకే ప్రాధాన్యత ఇచ్చే ప్రతి తల్లిదండ్రులకు తలవంచి నమస్కరిస్తున్నా అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు నీలమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ఈ పోస్ట్ మా పేరెంట్స్ త్యాగాలను గుర్తు చేసిందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dip Nilim | IIM Kozhikode (@miles.and.mindset__) (చదవండి: స్లోవేకియా నాయకుడు రిచర్డ్ 'థేకువా స్వీట్'రుచికి ఫిదా! ఎలా తయారు చేస్తారంటే..) -
షాకిస్తున్న ఐటీ ఉద్యోగి క్యాబ్ డ్రైవింగ్ స్టోరీ!
సాఫ్ట్వేర్ రంగంలో స్థిరమైన ఉద్యోగం, గౌరవప్రదమైన జీతం.. ఇది ఎంతోమంది కల. అయితే 19 ఏళ్ల అనుభవం ఉన్న ఒక ఐటీ ఉద్యోగి అకస్మాత్తుగా ఆ జాబ్ మానేసి, క్యాబ్ డ్రైవర్‌గా మారారు. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, స్వేచ్ఛగా జీవిస్తున్నానని చెబుతున్న ఆయన అనుభవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో, ఒక వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌ను అతని ఆదాయం, వృత్తి మార్పు గురించి ప్రశ్నించారు. దీనికి స్పందించిన సదరు క్యాబ్ డ్రైవర్, తాను గతంలో ఐటీ రంగంలో పనిచేసేవాడినని, అప్పుడు నెలకు రూ. 40,000 జీతం వచ్చేదని వెల్లడించారు. ఇప్పుడు క్యాబ్ నడపడం ద్వారా నెలకు రూ. 80,000 నుంచి రూ. 90,000 వరకు సంపాదిస్తున్నానని చెప్పడంతో ఆ ప్రయాణికుడు విస్తుపోయాడు.ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ‘స్వేచ్ఛ’ అని ఆయన స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉండే ఒత్తిడి, సమయ పాలన బంధనాల నుండి విముక్తి కోరుకున్నానని తెలిపారు. క్యాబ్ డ్రైవర్‌గా తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్లవచ్చని, తనను ఎవరూ ప్రశ్నించే వారు లేరని పేర్కొన్నారు. తన భార్యకు సెలూన్ ప్రారంభించేందుకు సహకరించిన తర్వాత, తనకు నచ్చిన ఈ వృత్తిని ఎంచుకున్నట్లు చెప్పారు.ఆకాష్ గుప్తా అనే వినియోగదారుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ సంపాదన అంత సులభం కాదని కొందరు విశ్లేషిస్తున్నారు. పెట్రోల్ ఖర్చులు, వాహన నిర్వహణ, పన్నులు వంటివి పోను నికర ఆదాయం అంత ఉండకపోవచ్చని, రోజంతా వాహనం నడపడం వల్ల శారీరక శ్రమ కూడా ఎక్కువేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగ భద్రత కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తూ, గిగ్ ఎకానమీలో సంతోషంగా ఉన్న ఈ వ్యక్తి కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: నరకంలో అవిభాజ్య కవలలు సబా, ఫరా! -
ముద్రగడ మృతిపైనా ట్రోల్స్.. టీడీపీ, జనసేన నీచ రాజకీయం!
సాక్షి, విజయవాడ: రాజకీయ విభేదాలు సహజమే.. కానీ మరణించిన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని కించపరిచేలా టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఉద్యమ నేతగానూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆయన.. రెండు ప్రభుత్వాల్లో మంత్రిగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలుగా నిలిచాయి.తన రాజకీయ జీవితంలో పలు సందర్భాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉద్యమాలు చేపట్టారు. అరెస్టులు, నిరసనలు, దీక్షలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఆయన మరణం తర్వాత కూడా ఆయన రాజకీయ ప్రస్థానం, ఉద్యమాలపై చర్చ కొనసాగుతోంది.అయితే.. ఆయన రాజకీయ నిర్ణయాలు, కొన్ని పార్టీలతో ఉన్న అనుబంధంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలో చేరడం, ఆ తర్వాతి రాజకీయ పరిణామాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ రాజకీయ వైఖరిని విమర్శించడం వేరు.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం వేరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హద్దులు దాటేసి..ముద్రగడ పద్మనాభం జీవించి ఉన్న సమయంలోనే కాకుండా.. మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆయనపై దుష్ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన అనుబంధ పేజీల పోస్టులు, వ్యాఖ్యలపై అభిమానులు, అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ.. మరణించిన వ్యక్తిపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ సంస్కృతికి మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.రాజకీయాలకు అతీతంగా గౌరవం అవసరంఒక నాయకుడి విధానాలను, నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు, పోరాటాలను పూర్తిగా విస్మరించి.. కేవలం రాజకీయ అనుబంధాల ఆధారంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.ముద్రగడ పద్మనాభం జీవితంలో ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ప్రభుత్వాలను ఎదురించి ఉద్యమాలు చేశారు. తన నమ్మిన అంశాల కోసం పోరాడారు. ఆయనతో విభేదించిన వారూ ఉన్నారు.. ఆయనను సమర్థించిన వారూ ఉన్నారు. అయితే ప్రజా జీవితంలో ఉన్న ఒక నేత మరణించిన సమయంలో కనీస గౌరవం పాటించాలనే చర్చ.. తాజాగా సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో మరోసారి మొదలైంది. -
ఆ పిల్లల్ని చూస్తే..కన్నీళ్లు వచ్చేశాయ్!
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్ మన దేశంలోని పిల్లల బాల్యంపై దృష్టి సారించేలా చేసింది. కేరింతలు కొడుతూ సాగాల్సిన బాల్యం మన దేశంలో బ్యాగులు మోస్తూ..చదవడం, రాయడంతో బిజీబిజీగా సాగిపోతుంది. అదికాదు బాల్యం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. బాల్యం ఎలా సాగితే ప్రయోజకులవ్వుతారో అవగాహన కల్పించేలా ఉండటం విశేషం. ఆ పోస్ట్‌ని వినోద్ అనే యూజర్ పంచుకున్నారు. కేవలం మూడేళ్ల వయసున్న చాలామంది పిల్లలు అప్పటికే స్కూల్ బ్యాగులు మోస్తూ..అక్షరాలు గీస్తూ..అంకెలు లెక్కిస్తూ..వర్క్షీట్లను పూర్తి చేస్తుండటం చూస్తుంటాం. కానీ నార్వేలో అలా కాదు అంటూ పోల్చి చెప్పుకొచ్చారు. నార్వేలో నివశించడం వల్ల పిలల్లు పెంపకం పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. నార్వేలో, కిండర్ గార్టెన్ను పిల్లలు విద్యాపరంగా ముందుకు సాగే ప్రదేశంగా పరిగణించరని పోస్ట్‌లో రాశారు. అది పిల్లలు పిల్లల్లా ఉండటం నేర్చుకునే ప్రదేశమని అన్నారు. అక్కడ పిల్లలు ఏడాది పొడవునా గంటల తరబడి ఆరుబయట గడుపుతూ, అడవులు, పర్వతాలు, ఇతర సహజ ప్రదేశాలను అన్వేషిస్తారని ఆయన పంచుకున్నారు. వాళ్లు రాళ్లు ఎక్కడం, బురదలో ఆడటం, చేతులతో వస్తువులు నిర్మించడం, ప్రకృతిని సంరక్షించడం, విభేదాలను పరిష్కరించుకోవడం, స్వతంత్రంగా ఉండటం వంటి ఆచరణాత్మక జీవిత నైపుణ్యాలను నేర్చుకుంటారని అన్నారు. అదే భారత్‌లో కేవలం మూడేళ్ళ వయసున్న ఎంతోమంది అప్పటికే స్కూల్ బ్యాగులు మోస్తూ, అక్షరాలను గీస్తూ, అంకెలను లెక్కిస్తూ, వర్క్షీట్లను పూర్తి చేస్తున్నారని అన్నారు. పిల్లలు కేవలం పిల్లల్లా ఉండటానికి బదులుగా, వారిని అప్పుడే తర్వాతి తరగతికి సిద్ధం చేస్తున్నట్లుగా ఉంటుందని అన్నారు. తనకు అక్కడి పిల్లల ఆరుబయట కూర్చొని నేర్చుకునే దృశ్యాలను చూస్తూ..కళ్లు చెమ్మగిల్లాయని అన్నారు. చివరగా ఆయన తన పోస్ట్‌ని ముగిస్తూ..జీవితంలో మొదటి పాఠాలు.. అక్షరాలు, అంకెలు అవ్వాలా, లేక ఆత్మవిశ్వాసం, దయ, పట్టుదల, ఉత్సుకత, ఇంకా కేవలం పిల్లల్లా ఉండటంలోని ఆనందం అవ్వాలా అని అడిగారు. అంతేగాదు ప్రతి బిడ్డకు ఎలాంటి బాల్యం దక్కాలని ప్రశ్నించారు. బ్రో మనసును తాకింది..పిల్లల్లా పెరిగితేనే బాగుటుందంటూ పోస్ట్‌లు పెట్టారు.Living in Norway 🇳🇴 has quietly changed the way I think about children and their wellbeing.In Norway, kindergarten isn’t seen as a place to get ahead academically. It’s where children learn to become… children.They spend hours outdoors in every season - through snow,…— Vinod (@turiyatman) July 13, 2026 (చదవండి: వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్ డ్రైవింగ్ ..) -
ఆ సమయంలో ఒంటెలకు ఆహారంగా పాములు..ఎందుకు?
సాధారణంగా పాముల్ని చూస్తే ఎవరైనా దూరంగా జరిగిపోతారు. కానీ ఎడారి ఓడగా పిలుచుకునే ఒంటెకు బతికి వున్న పామును తినిపించడం చూస్తే ఎవరైనా షాక్‌కు గురి కావాల్సిందే. శాకాహారి అయిన ఒంటె నోరు బలవంతంగా తెరిచి మరీ ఒక బతికున్న విషపూరితమైన పాములను వెనుక ఉన్న రహస్యం ఏంటి? అరబ్ దేశాల్లో తరతరాలుగా ఈ ఆచారం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ ప్రశ్నలను మరింతగా తెరపైకి తీసుకొచ్చాయి.రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఒంటెల కాపరులు ఈ వింత పద్ధతిని పాటిస్తారు. ఒంటెలకు 'హయాం' (Hayam) అనే ఒక రకమైన వ్యాధి వస్తుంది (ఇది సాధారణంగా ఈగలు, దోమల ద్వారా వచ్చే పరాన్నజీవి వ్యాధి). ఈ వ్యాధి వచ్చినప్పుడు ఒంటె శరీరం వేడెక్కి, ఆహారం తీసుకోవడం మానేస్తుంది. ఆ సమయంలో దానికి బ్రతికున్న విషసర్పాలను తినిపిస్తే, ఆ విషం వల్ల ఒంటె ఒంట్లోని రోగం నయమవుతుందని, దాని కళ్ల వెంట నీళ్లు వచ్చి వ్యాధి బయటకు పోతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. తరతరాలుగా ఈ పద్ధతిని పాటస్తున్నప్పటికీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదు.అసలు నిజంఒంటెలు కేవలం శాకాహారులు (Herbivores). అవి సహజంగా పాములను తినవు. పశువైద్య నిపుణుల ప్రకారం, బ్రతికున్న పామును తినిపించడం వల్ల ఒంటెకు ఎటువంటి ఉపయోగం లేదు. పైగా ఇది ఆ ఒంటె ప్రాణాలకే ప్రమాదం. పైగా జంతు హింస కిందికి వస్తుంది. ఒకవేళ ఆ చికిత్స తర్వాత ఒంటె బ్రతికినా, అది దాని స్వయం నిరోధక శక్తి వల్ల బ్రతికిందే తప్ప పాము వల్ల కాదు.మన దేశంలో నాగపంచమి వంటి పండుగల సమయంలో పాములు పాలు తాగుతాయనే ఒక పెద్ద అపోహ ఉంది. పాములు క్షీరదాలు కావు, అవి సరీసృపాలు. వాటి శరీరంలో పాలను అరిగించుకునే శక్తి (Lactase enzyme) ఉండదు. పండుగలకు కొన్ని వారాల ముందు పాములవాళ్లు అడవి పాములను పట్టుకుని, వాటి విషపు పళ్లను పీకేసి, వాటికి ఆహారం, నీరు లేకుండా ఉంచుతారు. బాగా దాహంతో ఉన్న పాము, ఆకలి తట్టుకోలేక ఎదురుగా ఉన్న పాలను నీళ్లు అనుకుని తాగుతుంది. ఆ పాలు వాటి ఊపిరితిత్తుల్లోకి చేరి, ఇన్ఫెక్షన్ వచ్చి కొద్ది రోజుల్లోనే ఆ పాములు విలవిల్లాడుతూ చనిపోతాయి.భారతదేశంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ పాము కుడితే ఆసుపత్రికి వెళ్లేకంటే, సాంప్రదాయ పద్ధతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మంత్రగాళ్లు, నాటు నాటు వైద్యులు దగ్గరికి వెళ్లి మంత్రాలు వేయించడం, వేర్ల పసరు పూయించడం చేస్తుంటారు. దీనివల్ల రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమవుతుంది. విషసర్పం కుట్టినప్పుడు ప్రాణాలను కాపాడగలిగేది కేవలం యాంటీ-స్నేక్ వెనమ్ (Anti-Snake Venom) ఇంజెక్షన్ మాత్రమే. కొన్నిసార్లు విషం లేని పాములు కుట్టినప్పుడు మంత్రగాళ్ల వల్ల నయమైందని ప్రజలు నమ్మి, నిజంగా విషమున్న పాము కుట్టినప్పుడు కూడా అక్కడికే వెళ్లి ప్రాణాలు కోల్పోతుంటారు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఆ వీడియోలు ఎక్కడ నుంచి వచ్చాయి అనేది నిర్ధారణ లేదు. ఇలాంటిమ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. -
ప్లీజ్ పట్టుచీరను ఎలా ఉతకాలో చెప్పరు..!: ఓ విదేశీ మహిళ అభ్యర్థన
మహిళామణులకు పట్టు చీర అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదివాళ్లకు ఒక వస్త్రం మాత్రమే కాదు ఒక హుందాతనాన్ని, పండుగ వాతావరణాన్ని అందించే జ్ఞాపకాల చీర. ఆ చీరలో వాళ్లకు ఏళ్ల తరబడి పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి చీర భారతీయ మహిళలకే కాదు విదేశీ వనితల మనసులను సైతం గెలుచుకుంది. అలాంటి మన భారతీయ పట్టుచీరను కొనుకున్న ఓ విదేశీ మహిళ దాన్ని ఎలా ఉతకాలో తెలియక ఇబ్బందిపడుతున్నా..దయచేసి ఏదైన సలహా ఇవ్వరు అంటూ వీడియో రికార్డు చేసి మరి సోషల్ మీడియాలో షేర్ చేసింది.నెట్టింట పంచుకున్న వీడియోలో ఆ విదేశీ మహిళ భారతీయ మహిళలను ఉద్దేశించి ఒక అభ్యర్థన చేసింది. తన అందమైన పట్టు చీరను చూపిస్తూ..దాని లేబుల్‌పై డ్రైక్లీనింగ్ చేసి ఉతకాలని ఉంది. అయితే తాను ఉండే ఆస్ట్రేలియన్ బుష్‌లో డైక్లీనింగ్ సర్వీస్ సమీపంలో లేదని, అందువల్ల ఈ పట్టుచీరను ఎలా ఉతకాలో సలహా ఇవ్వరా ప్లీజ్ అని కోరింది. తాను ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉంటానని, అందువల్ల ఇది పాడవ్వకుండా ఎలా ఉతకాలో చక్కటి చిట్కా గానీ సలహా గానీ చెప్పమని అభ్యర్థించిందామె. తాను భారత పర్యటనలో ఈ అందమైన చీర కొన్నానని చెప్పింది. ఈ సున్నితమైన పట్టు వస్త్రంపై ఉన్న క్లిష్టమైన ఎంబ్రాయిడరీ కారణంగా ఉతకడానికి భయపడుతున్నట్లు పేర్కొంది. ఉతకడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా..చీర మొత్తం పాడైపోతుంది, అందువల్ల ఎలా ఉతకాలో నేర్పించరు అంటూ తన వీడియోని ముగించింది. అంతేగాదు అందుకు సంబంధించిన చిట్కాలు, సలహాలు కామెంట్ బాక్స్‌లో పంచుకోమని, తాను వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలాగే ఎల్లప్పుడూ తన అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసే ఆన్లైన్ కమ్యూనిటీకి ధన్యావాదాలు కూడా చెప్పారామె. ఆమె అభ్యర్థనకు నెటిజన్లు స్పందించడమే కాదు పలు రకాల సలహాలు, సూచనలు అందించారు. చాలామంది మహిళలు కఠినమైన డిటర్జెంట్‌కి బదులుగా షాంపుతో ఉతికి నీడలో ఆరేసి భద్రపరచుకుంటే సరిపోతుందని సలహాలు ఇచ్చారు. అంతేగాదు బ్రష్ ఉపయోగించొద్దని, చేతులతోనే సున్నితంగా రుద్దమని కూడా సూచించారు. View this post on Instagram A post shared by Lea Murray (@lea_murray90) (చదవండి: శస్త్ర చికిత్స లేకుండా ఏఐ ఎండోమెట్రియోసిస్‌ను నిర్థారించగలదా? బ్రయాన్ జాన్సన్ గర్లఫ్రెండ్..) -
ఆషామాషీ కాదు.. ఇక్కడ విమానం దించడమంటే సాహసమే!
విమానాశ్రయం అనగానే మన కళ్ల ముందు కనిపించేది.. పొడవైన రన్వేలు, భారీ టెర్మినల్స్, విమానాల రాకపోకల సందడి. కానీ ప్రపంచంలో ఓ చిన్న దీవిలో మాత్రం విమానాలు దిగే దృశ్యం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ విమానాలకు కాంక్రీట్ రన్‌వే లేదు.. తారు రోడ్డు కూడా లేదు. సముద్ర తీరంలోని ఇసుకే అక్కడ రన్‌వే! అలలు తాకే బీచ్‌పైనే ప్రయాణికుల విమానాలు ల్యాండ్ అవుతాయి.స్కాట్లాండ్ పశ్చిమ తీరానికి సమీపంలోని బర్రా దీవిలో ఉన్న బర్రా ఎయిర్పోర్ట్ (Barra Airport) ఈ అరుదైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం నడిచే వాణిజ్య విమానాలు నేరుగా బీచ్‌పై దిగే ప్రపంచంలోని ఏకైక విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొందింది.స్కాట్లాండ్లోని ఔటర్ హెబ్రిడ్స్ (Outer Hebrides) దీవుల సమూహంలో ఉన్న బర్రా ఐలాండ్‌లో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ విమానాలు ల్యాండ్ అయ్యే ప్రాంతం పేరు ట్రాయ్ మోర్ (Traigh Mhòr) బీచ్. సాధారణ విమానాశ్రయాల్లో కనిపించేలా ఇక్కడ కాంక్రీట్ లేదా తారు రన్‌వే ఉండదు. గట్టిగా ఉండే ఇసుకనే రన్‌వేగా ఉపయోగిస్తారు. బీచ్‌పై చెక్క స్తంభాలతో మూడు రన్‌వే మార్గాలను గుర్తిస్తారు.అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. కారణం.. సముద్రం. హై టైడ్ సమయంలో ఈ బీచ్ మొత్తం నీటిలో మునిగిపోతుంది. అందుకే విమానాల రాకపోకల సమయాలను సముద్ర ఆటుపోట్లను బట్టి నిర్ణయిస్తారు.విమానం దిగే ముందు.. బీచ్ ఖాళీ!బర్రా ఎయిర్‌పోర్ట్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విమానాలు లేని సమయంలో అదే బీచ్‌ను ప్రజలు సాధారణంగా ఉపయోగించుకోవచ్చు. పర్యాటకులు అక్కడ నడవొచ్చు.. ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు.కానీ విమానం ల్యాండ్ అయ్యే సమయం దగ్గరపడగానే దృశ్యం పూర్తిగా మారిపోతుంది. బీచ్‌ను ఖాళీ చేయించి.. విమాన రాకపోకలకు సిద్ధం చేస్తారు. ఆకాశం నుంచి విమానం వచ్చి ఇసుకపై సాఫీగా దిగే దృశ్యం పర్యాటకులకు ఓ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.పైలట్లకూ ప్రత్యేక సవాలే!సాధారణ రన్‌వేలతో పోలిస్తే బీచ్‌పై విమానాన్ని ల్యాండ్ చేయడం పైలట్లకు కూడా ప్రత్యేకమైన సవాల్. ఇసుక పరిస్థితి, గాలి వేగం, వాతావరణం, సముద్ర ఆటుపోట్లను పరిగణనలోకి తీసుకుని విమానాలను నడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్కాట్లాండ్కు చెందిన లాగనైర్ (Loganair) విమాన సంస్థ గ్లాస్గో నుంచి బర్రా వరకు ఈ ప్రత్యేక విమాన సేవలను నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by Amy 🇬🇧 Vanlife Adventure Family (@van_life_family_) ప్రయాణమే కాదు.. ఓ ప్రత్యేక అనుభవంబర్రా దీవి కేవలం ఈ ఎయిర్పోర్ట్ వల్లే కాకుండా తన ప్రకృతి అందాలతోనూ ప్రసిద్ధి చెందింది. తెల్లని ఇసుక తీరాలు, నీలిరంగు సముద్రం, తీర ప్రాంత నడక మార్గాలు, పురాతన కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడి ప్రసిద్ధ కిసిముల్ క్యాసిల్ (Kisimul Castle), సముద్ర జీవులు, సంప్రదాయ హెబ్రిడియన్ గ్రామీణ జీవనం సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి.మే నుంచి సెప్టెంబర్ వరకు ది బెస్ట్బర్రా దీవిని సందర్శించేందుకు సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ వరకు అనుకూల సమయంగా భావిస్తారు. ఈ సమయంలో వాతావరణం మెరుగ్గా ఉండటంతో పాటు.. బీచ్‌పై విమానం దిగే అరుదైన దృశ్యాన్ని చూసే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో అత్యాధునిక విమానాశ్రయాలు ఉన్నప్పటికీ.. ప్రకృతినే రన్‌వేగా మార్చుకుని విమానాలను ఆహ్వానించే బర్రా ఎయిర్పోర్ట్ మాత్రం ప్రత్యేకమే. -
పగ తీర్చుకుందా?.. అదే ఏనుగు.. అదే కుటుంబం!
ఓ కుటుంబం ప్రాణభయంతో ఊరు విడిచింది.. ఇక ఆ ప్రమాదం తమ దరిచేరదని భావించింది. కానీ కాలం గడిచినా ఆ విషాద జ్ఞాపకం వారిని వెంటాడుతూనే వచ్చింది. ఏకంగా 14 ఏళ్ల తర్వాత అదే ఏనుగు మళ్లీ వారి జీవితాల్లోకి వచ్చి పెను విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలిగొన్న ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.నేపాల్‌లోని చిత్వన్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన.. మనిషి–వన్యప్రాణి ఘర్షణ ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి చూపించింది. ఏళ్ల క్రితం జరిగిన విషాదం నుంచి బయటపడేందుకు ఊరు మార్చుకున్న ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ వెతుక్కుంటూ వచ్చినట్లు కనిపించడం స్థానికులను సైతం విస్మయానికి గురిచేసింది.2012లో మొదలైన విషాదం..షానిచర బోటే కుటుంబానికి ఈ విషాద ప్రయాణం 2012లో మొదలైంది. చిత్వన్ నేషనల్ పార్క్ సమీపంలోని మడి ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో.. ‘ధుర్బే’ అనే అడవి ఏనుగు దాడి చేసింది. ఆ ఘటనలో షానిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు.కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయిన షానిచర.. ఇక అక్కడ జీవించడం ప్రమాదకరమని భావించారు. కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్‌పూర్‌కు వలస వెళ్లారు. మధ్యలో రాప్తి నది కూడా ఉండటంతో.. ఇక ఆ ఏనుగు తమను చేరుకోలేదని భావించారు. అయితే విధి మరోలా రాసింది. 14 ఏళ్ల తర్వాత.. మళ్లీ అదే ఏనుగుఇటీవల జగత్‌పూర్‌లోని షానిచర కుటుంబం నివసిస్తున్న ప్రాంతానికి ధుర్బే ఏనుగు చేరుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ ఏనుగు దాడిలో షానిచర కోడలు అశికా బోటే (25), నాలుగేళ్ల మనవడు భారత్ బోటే మృతి చెందారు. “పెద్ద నదులు దాటి వెళ్లినా మేము సురక్షితంగా ఉంటామని అనుకున్నాం. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా అదే ఏనుగు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మా ఇంటిపై దాడి చేసి నా కోడలు, చిన్న మనవడిని తీసుకెళ్లిపోయింది. ఇక మాకు పారిపోవడానికి చోటు లేదు” అని షానిచర బోటే ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనతో ధుర్బే ఏనుగు కారణంగా ఒకే కుటుంబంలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 2012లో షానిచర తల్లిదండ్రులను బలిగొన్న ఇదే ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత ఆయన కోడలు, మనవడిని కూడా పొట్టన పెట్టుకుంది.‘పగ’ కాదు.. కానీ వెంటాడిన విషాదం!ఏనుగులు మనుషుల్లా పగ తీర్చుకుంటాయని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే ఒకే కుటుంబాన్ని 14 ఏళ్ల వ్యవధిలో రెండుసార్లు విషాదంలోకి నెట్టిన ధుర్బే ఘటన మాత్రం అందరినీ కలచివేస్తోంది. ఒకప్పుడు తమ నుంచి దూరంగా వెళ్లిపోయిన కుటుంబం వద్దకే మళ్లీ అదే ఏనుగు చేరుకోవడం.. స్థానికుల్లో.. ఇది పగేనా?, అసలు ఎందుకు పగ బట్టింది?? అనే ప్రశ్నలను రేకెత్తిస్తోంది.25 మంది ప్రాణాలు తీసిన ధుర్బేధుర్బే నేపాల్‌లోని అత్యంత ప్రమాదకరమైన అడవి ఏనుగుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చిత్వన్ నేషనల్ పార్క్ అధికారుల ప్రకారం.. 2010 నుంచి ఇప్పటివరకు ఈ ఏనుగు దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు పలుమార్లు ట్రాకింగ్ కాలర్లు అమర్చారు. 2016లో తొలిసారి కాలర్ అమర్చగా.. అది పనిచేయకపోవడంతో 2020లో మరోసారి, 2023లో మళ్లీ కొత్త కాలర్‌ను అమర్చారు. అయినప్పటికీ ధుర్బే కదలికలను పూర్తిగా నియంత్రించడం సవాల్‌గా మారింది.పెరుగుతున్న మనిషి–ఏనుగు ఘర్షణఅడవుల విస్తీర్ణం తగ్గడం, మానవ నివాసాలు అటవీ ప్రాంతాలకు చేరువ కావడంతో మనిషి–వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. ఆహారం, నీటి కోసం అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం.. ప్రజలు భయంతో జీవించాల్సి రావడం ఇలాంటి విషాదాలకు కారణమవుతోంది. 14 ఏళ్ల పాటు తప్పించుకున్నామని భావించిన ఓ కుటుంబాన్ని.. అదే ఏనుగు మళ్లీ విషాదంలోకి నెట్టిన ఘటన ఇప్పుడు నేపాల్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. -
మంటల్లో కారు.. ఢిల్లీ టన్నెల్లో టెక్నాలజీతో తప్పిన ముప్పు!
రోడ్డు ప్రమాదాలు, వాహనాల్లో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న వేళ.. సకాలంలో స్పందించడమే ప్రాణాలను కాపాడే కీలక అంశంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో మానవ ప్రమేయంతో అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి పరిస్థితి అదుపు తప్పుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు ఎంత వేగంగా పనిచేస్తాయో చూపించే ఘటన ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్–ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎయిర్పోర్ట్ టన్నెల్లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. అక్కడి ఆటోమేటిక్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ క్షణాల్లో స్పందించింది. టన్నెల్లో ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో టన్నెల్లో ఉన్న వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ప్రమాదాన్ని గుర్తించేందుకు మనుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. టన్నెల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ వెంటనే పనిచేసింది. మంటలు గుర్తించిన వెంటనే స్ప్రింక్లర్లు యాక్టివేట్ అయి నీటిని వెదజల్లాయి. దీంతో మంటలు పెద్దగా వ్యాపించకముందే అదుపులోకి వచ్చాయి.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే మంటల కారణంగా వెలువడిన పొగతో కొంతసేపు టన్నెల్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు.A car caught fire today inside the Airport Tunnel on the Gurugram–Dwarka Expressway, filling the tunnel with smoke.As visibility dropped, vehicles halted outside the tunnel, while the tunnel's automatic fire safety system activated immediately, switching on the sprinklers. The… pic.twitter.com/MfmL8Ouavb— Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2026టెక్నాలజీ ఉంటే ఎంత తేడా?సాధారణంగా టన్నెల్లలో అగ్నిప్రమాదాలు అత్యంత ప్రమాదకరమైనవి. పరిమిత స్థలం, పొగ వేగంగా వ్యాపించడం, అత్యవసర సమయంలో బయటకు రావడంలో ఇబ్బందులు కారణంగా పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్పందించడం వల్ల మంటలు విస్తరించకుండా అడ్డుకోవచ్చు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంటలు చెలరేగిన వెంటనే టన్నెల్ సేఫ్టీ సిస్టమ్ యాక్టివేట్ కావడం, స్ప్రింక్లర్లు పనిచేయడం చూసి.. అత్యవసర సమయాల్లో ఆధునిక టెక్నాలజీ ఎంత కీలకమో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
షుగర్ సూదులు, మందులు వద్దంటూ వైరల్ డైట్!
"మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.. ఇక ఇన్సులిన్, మందులు అవసరం లేదు!" అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ డైట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డైట్‌ను నమ్మి వేలాది మంది షుగర్ పేషెంట్లు వైద్యులు సూచించిన మందులు ఆపేయడంతో.. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.'ఎల్-తయ్యిబాత్' డైట్.. ఆ పదానికి అరబిక్‌లో "మంచివి" అనే అర్థం. ఈ డైట్‌ను ఈజిప్టుకు చెందిన మాజీ వైద్యుడు దియా ఎల్-అవాడీ (Diaa El-Awadi) విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన ప్రకారం.. తినే తిండిలో కొన్నింటిని దూరంగా పెడితే చాలూ.. డయాబెటిస్ దానంతట అదే తగ్గిపోతుందట!. మధుమేహానికి అసలు కారణం కొన్ని ఆహార పదార్థాలేనని, వాటిని పూర్తిగా మానేస్తే షుగర్ మందులు, ఇన్సులిన్ అవసరమే ఉండదని దియా ఎల్ అవాడీ చెప్పేవాడు. ఆ డైట్లో.. ఆకుకూరలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు బంద్ చేయాలని సూచించాడు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కావడంతో.. గుడ్డిగా ఆ మాటలు నమ్మి లక్షలాది మంది ఈ డైట్‌ను అనుసరించడం ప్రారంభించారు.మందులు ఆపేసి... ప్రాణాల మీదకుఎల్-తయ్యిబాత్ డైట్‌ను నమ్మి చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. యెమెన్‌లో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోంది. 67 ఏళ్ల మురాద్ అల్-అదిమి అనే మధుమేహి కూడా ఇదే డైట్‌ను నమ్మాడు. 15 ఏళ్లుగా షుగర్ మందులు వాడుతున్న ఆయన.. ఈ డైట్ పాటిస్తే మందులు అవసరం లేదని తెలిసి వాటిని ఆపేశాడు. మొదటి కొన్ని రోజులు బాగానే అనిపించడంతో స్నేహితులకు కూడా ఇదే డైట్‌ను సూచించాడు. కానీ పదో రోజుకే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.."మందుల ఖర్చు తగ్గుతుందని అనుకున్నా.. ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడూ మందులు ఆపొద్దు" అని హెచ్చరిస్తున్నాడు.క్యూ కడుతున్న షుగర్ పేషెంట్లుయెమెన్లోని తైజ్ రిపబ్లికన్ ఆస్పత్రి వైద్యుల ప్రకారం.. గత కొన్ని నెలలుగా అత్యవసర విభాగానికి వస్తున్న మధుమేహుల్లో చాలా మంది ఈ డైట్‌ను అనుసరించి మందులు మానేసినవారే. చాలామంది తీవ్రమైన షుగర్, డీహైడ్రేషన్, డయాబెటిక్ కీటోఅసిడోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులతో ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలుదేశాల్లోనూ ఈ తరహా డైట్ పాటించి పలువురు ఆస్పత్రి పాలవుతున్నారనే నివేదికలు వెలువడుతున్నాయి.ఈ డాక్టర్ ఎవరంటే..దియా ఎల్-అవాడీ ఒకప్పుడు ఈజిప్టులో వైద్యుడిగా పనిచేశారు. అయితే శాస్త్రీయ ఆధారాలు లేని వైద్య సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలతో ఈజిప్ట్ వైద్య మండలి ఆయన వైద్య అనుమతిని రద్దు చేసింది. ఆయన నిర్వహిస్తున్న రెండు క్లినిక్‌లను కూడా 2026 మార్చిలో మూసివేసింది. అనంతరం యూఏఈలో ఉన్న సమయంలో 2026 ఏప్రిల్‌లో ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించారు. యూఏఈ వైద్య నివేదిక ప్రకారం ఆయన మరణం సహజ కారణాలతోనే జరిగిందని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని ఈజిప్ట్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు వైరల్ కావడంతో.. ఆయన ప్రచారం చేసిన ‘ఎల్-తయ్యిబాత్’ (El-Tayyebat) డైట్‌కు మరింత ప్రచారం లభించింది.ధరలు కూడా కుప్పకూలాయి!ఈ డైట్ ప్రభావం అరబ్ దేశాల్లోని మార్కెట్‌పైనా పడింది. గుడ్లు, చికెన్, ఆ డైట్లో ఉన్న కూరగాయలు కొనేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. తైజ్లో గుడ్ల ట్రే ధర 3.5 డాలర్ల నుంచి 1.6 డాలర్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 20 కోళ్లు అమ్మే దుకాణాల్లో ఇప్పుడు ఐదు కూడా అమ్ముడవడం లేదని వారు వాపోతున్నారు.వైద్యులు ఏమంటున్నారు?వైద్యులు, పోషకాహార నిపుణులు మాత్రం ఈ డైట్‌కు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు వంటి ఆహారాల్లో శరీరానికి అవసరమైన.. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని పూర్తిగా మానేయడం వల్ల పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు, డైటీషియన్లు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.సోషల్ మీడియా సలహాలొద్దు"సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ అందరికీ సరిపోదు. కొందరికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. అదే అందరికీ చికిత్స కాదు. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధుల్లో డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపేయడం ప్రాణాలకు ప్రమాదం" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వైరల్ వీడియోను నమ్మి మందులు మానేస్తే.. షుగర్ తగ్గకపోగా ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.గమనిక: మన దేశంలోనూ సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్‌లో వైరల్ అయ్యే "షుగర్‌కు అద్భుత చికిత్స" వంటి వీడియోలను చూసి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేయడం ప్రాణాపాయానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కదులుతున్న రైలులో పూజలు..! వీడియో వైరల్..
రైలు బోగినే హనీమూన్ సూట్‌గా మార్చిన ఘటన మరువక ముందే మరో రైలు ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. కదులుతున్న రైలులో పూజ పరమైన కార్యక్రమాలు జరుగుతున్న వీడియో..నెట్టించ చర్చలకు దారితీసింది. భారతీయ రైల్వేలోనే ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియలోఓ ప్రయాణికులు రైలు కోచ్ లోపల మతపరమైన పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతోనే ఇలా కదులుతున్న రైలు ఇలాంటి ఆచారాలు నిర్వహించుకోవచ్చా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఉత్తర మధ్య రైల్వేలో చోటు చేసుకుంది. అయితే రైలులో ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తర రైల్వే ఇలా వివరణ ఇచ్చింది. ఈ వైరల్ వీడియో ఘటనతో ఉత్తరరైల్లే ఇలా వివరణ ఇచ్చింది. ఐఆర్సిటిసి (IRCTC) ద్వారా వాణిజ్య బుకింగ్ ద్వారా ప్రేవేట్‌గా బుక్ చేసుకున్న సెలూన్ కోచ్‌గా పేర్కొది. అందులోనే ఈ మతపరమైన ఆచారాలు జరిగినట్లు ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. ఆ కార్యక్రమం సాధారణ ప్యాసింజర్ కోచ్‌లో కాకుండా IRCTC ద్వారా ఒక ప్రైవేట్ వ్యక్తి బుక్ చేసుకున్న సెలూన్ కోచ్‌లో జరిగిందని తెలిపింది. ఈ సెలూన్ కోచ్ అనేది సీనియర్ రైల్వే అధికారులు, వీఐపీల కోసం ఉద్దేశించిన విలాసవంతమైన ప్రైవేట్ బోగీ. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బెడ్రూమ్లు, ఒక చిన్న వంటగది, లివింగ్, డైనింగ్ రూమ్‌ల తోకూడిన వాష్‌రూమ్ సౌకర్యాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఈ వాణిజ్య రిజర్వేషన్ కోసం అడ్వాన్స్‌గా రూ. 3 లక్షలకు పైగా జమ చేసినట్లు పేర్కొంది. ఈ సెలూన్ కోచ్‌ను జూలై 10న న్యూఢిల్లీ (NDLS) నుంచి ముంబై (BDTS)కి వన్-వే ప్రయాణం కోసం రైలు నెం. 12926 పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు జతచేయాల్సి ఉందని వెల్లడించింది. అదే సమయంలో ప్రయాణికుల భద్రత, రైళ్లు సజావుగా నడపడం తమ అత్యంత ప్రాధాన్యత అని రైల్వే అదికారులు నొక్కి చెప్పారు. Hello @AshwiniVaishnaw, was this approved by @RailMinIndia? If so, What is the procedure? pic.twitter.com/9VUJP53lJQ— Mohammed Zubair (@zoo_bear) July 12, 2026 (చదవండి: 15 ఏళ్లకే చదువుకి మానేసింది..! కట్‌చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..) -
డెలివరీ పేరుతో ఇంట్లోకి ఎంట్రీ.. వికృత చేష్టలతో ఖంగుతిన్న మహిళ
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళకు డెలివరీ ఏజెంట్ కారణంగా భయానక అనుభవం ఎదురైంది. పార్సిల్ డెలివరీ కోసం ఇంటికి వచ్చిన వ్యక్తి టాయిలెట్ ఉపయోగించుకోవాలని కోరగా, మహిళ అందుకు నిరాకరించింది. అయితే ఆమె మాటను పట్టించుకోకుండా అతడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. సాధారణ డెలివరీగా మొదలైన ఘటన చివరకు తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి పార్సిల్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ వెళ్లే ముందు టాయిలెట్ ఉపయోగించుకోవాలని అడిగాడు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్నందున ఆమె అందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆమె వద్దని చెప్పినా పట్టించుకోకుండా సదరు వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడని మహిళ ఆరోపించింది. ఆ తర్వాత జరిగిన ఘటనతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. తన ఎదుట ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఆమె ఎదుట తన దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె వెంటనే తలుపులు మూసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.एक महिला ना कहने पर भी एक लड़का उनका Washroom Use किया उनको उसका Private Part दिखाए 😡।एक Flipkart/Myntra का Delhivery Boy parcel लेेकर आता है एक लड़की के पास उसके बाद उन्होंने कहा कि आपका Washroom Use कर सकता हूं क्या ।लेकिन वो लेडीज अकेला रहता है इसलिए ना कहा लेकिन वो नहीं… pic.twitter.com/rJFaJVRUWT— Subhajit Das (@SantaniSubhajit) July 11, 2026ఈ ఘటన అనంతరం బాధితురాలు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో వెల్లడించింది. ఆమె పోస్టు వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫిర్యాదు అందించాలని బాధితురాలిని కోరిన పోలీసులు, ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాగా, ఇటీవలి కాలంలో డెలివరీ సిబ్బందితో సంబంధం ఉన్న కొన్ని వివాదాస్పద ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ ఘటన కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అపరిచితులకు ఇంట్లోకి ప్రవేశం కల్పించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బదిలీ ఉత్తర్వుల్లో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్యేను ట్రాన్స్ఫర్ చేస్తూ..
రాజస్థాన్‌లో ప్రభుత్వ రెవెన్యూ శాఖ విడుదల చేసిన పట్వారీల బదిలీ జాబితాలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బదిలీ కావాల్సిన పట్వారీ పేరు స్థానంలో ఏకంగా అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే పేరు అధికారిక ఉత్తర్వులో కనిపించడంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసే ముందు ఎంత జాగ్రత్త అవసరమో మరోసారి స్పష్టమైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో తీవ్రమైన చర్చ నడుస్తోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ సైనికుడు, ప్రస్తుతం పట్వారీగా పనిచేస్తున్న నరేంద్ర సింగ్‌ను బాలోత్రా జిల్లాలోని నవోడా నుంచి డీగ్ జిల్లాలోని సోన్గావ్కు బదిలీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. అయితే బదిలీ ఉత్తర్వులు సిద్ధం చేసే సమయంలో జరిగిన టైపింగ్ లేదా డేటా ఎంట్రీ పొరపాటు కారణంగా నరేంద్ర సింగ్ పేరు స్థానంలో డీగ్–కుమ్హేర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శైలేశ్ సింగ్ పేరు నమోదైంది. దీంతో అధికారిక ఉత్తర్వు చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఈ తప్పిదం బయటపడిన తర్వాత అసలు బదిలీ కావాల్సిన పట్వారీ నరేంద్ర సింగ్ కొత్త విధుల్లో చేరలేకపోయారు. సవరించిన ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది. ఒక చిన్న పరిపాలనా పొరపాటు ఉద్యోగి విధుల్లో చేరడానికే అడ్డంకిగా మారింది. ఈ విషయంపై ఎమ్మెల్యే శైలేశ్ సింగ్ కార్యాలయం స్పందిస్తూ.. ఇది పూర్తిగా సాంకేతిక లేదా టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఎమ్మెల్యేకు ఈ బదిలీలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అధికారులు కూడా తప్పిదాన్ని గుర్తించి సవరించిన ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.అయితే ఈ ఘటన ప్రభుత్వ శాఖల పని తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారిక ఉత్తర్వులను విడుదల చేసే ముందు సరైన పరిశీలన జరిగి ఉంటే ఇలాంటి పొరపాటు జరిగేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక పట్వారీ పేరు స్థానంలో ప్రజాప్రతినిధి పేరు అధికారిక పత్రంలో రావడం పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


