పాముతో చెలగాటం వద్దు అని చెప్పినా వినలేదు. అందులోనూ విషపూరితమైన సర్పం..జాగ్రత్త అని ఎంత మొత్తుకున్నా పెడచెవిన పెట్టాడు. చివరికి విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Ghar Ke Kalesh @gharkekalesh అనే ఎక్స్ ఖాతాలో షేర్ అయిన వీడియో ప్రకారంఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల రాజ్ సింగ్ నాగుపాము కాటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నింపింది. ‘నాకంటే వీరుడు ఈ ప్రపంచంలో ఉన్నాడా’ అంటూ విన్యాసాలు మొదలు పెట్టాడు. అది చాలా పవర్ ఫుల్.. విషనాగు, దాన్ని వదిలేయ్ అని చాలామంది హెచ్చరించారు.
ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి
అయినా పట్టించుకోకుండా, ఆరడుగుల నాగుపామును మెడకు చుట్టుకుని రోడ్డుపై విన్యాసాలు చేశాడు. పామును తన మెడలో స్కార్ఫ్ లాగా చుట్టుకుని, నవ్వుతూ, కెమెరా ముందు పోజులిచ్చాడు. ఈ క్రమంలో ఆ పామును అతడిని మూడుసార్లు కాటు వేసింది. విషం వేగంగా శరీరమంతా పాకింది. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నిర్లక్ష్యానికి తన ప్రాణాన్నే బలిపెట్టాడు.
ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనం
50-year-old Raj Singh caught a 6-ft venomous cobra on the road, ignored warnings, wrapped it around his neck & did stunts. Snake bit him 3 times. Venom acted fast — declared de@d on arrival at hospital🐍😔
pic.twitter.com/728XgFGqVz— Ghar Ke Kalesh (@gharkekalesh) January 15, 2026


