జోధ్‌పూర్‌లో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 12 ఏళ్లుగా కన్న కూతుళ్లపై ఒక తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తల్లీ కూతుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం జోధ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల బాలిక గత 12 ఏళ్లుగా తన తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. తన తండ్రి తనపై అత్యాచారం చేయడం ప్రారంభించినప్పుడు ఆమె వయస్సు కేవలం ఆరేళ్లు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. చివరికి తన 15 ఏళ్ల చిన్న కుమార్తెపై కూడా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన సోదరితో చెప్పింది. దీంతో వారు తమ తల్లికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత, వారు పోలీసులకు ఒక ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జనవరి 13న ఒక ఈమెయిల్ ఫిర్యాదు అందిందని నాగౌరి గేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) దినేష్ కుమార్ తెలిపారు.
ఆరోపణల తీవ్రత దృష్ట్యా, పోలీసులు వెంటనే ఫిర్యాదుదారురాలిని సంప్రదించి, ఆ తర్వాత ఆమె నుండి అధికారిక లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. సహాయ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) మంగ్లేష్ చుండవత్ ప్రకారం,తనపై ఫిర్యాదు నమోదైన విషయం తెలియడంతో నిందితుడు, కూలీగా పనిచేసే 45 ఏళ్ల తండ్రి పరారయ్యాడు. కానీ గురువారం అదుపులోకి తీసుకున్నారు.శుక్రవారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోలీసులు ఇప్పటికే బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.సెక్షన్ 65(2) (అత్యాచారం) ,లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి


