నేడు జెడ్డా నుంచి 10 విమానాల రాక
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందుకోసం మంగళవారం నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి పది ఇండిగో విమాన సరీ్వసులను ఆరంభించనుంది. జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు సర్వీసులు ఆరంభం కానున్నాయి. ‘‘ప్రత్యేక విమానాల్లో సౌదీ నుంచి భారతీయులను మంగళవారం నుంచి తీసుకొస్తాం.
జెడ్డాలోని ఇండియా కాన్సులేట్ జనరల్‌తో ఇండిగో సమన్వయంతో పనిచేస్తుంది’’ అని పౌర విమానయాన శాఖ పేర్కొంది. వారిని వీలైనంత త్వరగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. జల్నా ఎంపీ కల్యాణ్ కాలే, మరో 9 మంది పర్యాటకులు దుబాయ్, అబూదాబిలో చిక్కుకున్నారని ఎంపీ సోదరుడు జగన్నాథ్ చెప్పారు.
పుణె సమీప పింప్రీ చింద్వాడ్‌లోని ఇందిరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన నలుగురు అధ్యాపకులు, 84 మంది విద్యార్థులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 26న పుణె జిల్లా నుంచి వెళ్లిన 300 మంది ప్రయాణికులూ దుబాయ్‌లోనే చిక్కుకున్నారు. కన్నడిగులను ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు.


