రద్దుల పర్వం | US-Israel-Iran conflict closes major West Asian airports | Sakshi
Sakshi News home page

రద్దుల పర్వం

Mar 3 2026 4:32 AM | Updated on Mar 3 2026 4:32 AM

 US-Israel-Iran conflict closes major West Asian airports

పశ్చిమాసియాలోమూతబడిన ఎయిర్‌పోర్ట్‌లు 

భారీగా సర్వీసుల రద్దు ఇబ్బందులు పడుతున్న 

లక్షలాది మంది ప్రయాణికులు

లండన్‌/దుబాయ్‌/న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమాసియాలో కమ్మేసిన యుద్ధమేఘాలతో విమాన సరీ్వసులు భారీగా రద్దయ్యాయి. దుబాయ్, అబుదాబి, దోహా ఎయిర్‌పోర్టులు మూతబడటంతో యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియాలకు విమానాలు ఆగిపోయాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలు, హోటళ్లు, రిసార్టుల్లో చిక్కుకుపోయారు. 

జర్మనీ నుంచే పశ్చిమాసియాకు వచి్చన 30,000 మంది పర్యాటకులు క్రూయిజ్‌ నౌకలు, హోటళ్లు, రిసార్ట్‌లలో చిక్కుకుపోయినట్టు విదేశాంగ మంత్రి జొహాన్‌ వేడ్‌ఫుల్‌ తెలిపారు. తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు చెక్‌ రిపబ్లిక్‌ రంగంలోకి దిగింది. సమీప ఈజిప్‌్ట, జోర్డాన్‌లకు రెండు విమానాలను పంపించింది. తమ పౌరులను ఈ దేశాలదాకా రప్పించి అక్కడి నుంచి స్వదేశాలకు తీసుకెళ్తామని చెక్‌ రిపబ్లిక్‌ ప్రధాని ఆండ్రేజ్‌ బాబీస్‌ చెప్పారు. 

మస్కట్, సలాహ్‌లకూ విమానాలను పంపారు. విమానాల రాకపోకలు ఆగిపోవడంతో ఇండోనేసియాలోని బాలి పర్యాటక ప్రాంతంలో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అబుదాబిలో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు రోజుకు మూడు గంటలు మాత్రమే ప్రత్యేక అనుమతితో 15 విమానాలను అతికష్టం మీద నడుపుతున్నట్లు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సోమవారం వెల్లడించింది. సౌదీలో 58,000 మంది ఇండోనేసియన్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.  

భారత్‌లోనూ వందలాది సర్వీసులు రద్దు 
సోమవారం భారత్‌లో 357 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఎయిర్‌పోర్టుల్లో 300కుపైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ‘‘పశ్చిమాసియాలో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. పరిస్థితి మెరుగుపడని కారణంగా సోమవారం ఇండిగో విమానాలు 163, ఎయిర్‌ఇండియా, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు 110కిపైగా, స్పైస్‌జెట్‌ విమానాలు 20, ఆకాశ ఎయిర్‌ సంస్థ తరఫున నుంచి 8 విమానాలు రద్దయ్యాయి. మొత్తంగా 357 సర్వీసులు నిలిచిపోయాయి. ఉత్తర అమెరికా, యూరప్‌లకు మాత్రం 20కిపైగా విమానాలు వెళ్లాయి. పశ్చిమాసియా గగనతలం మీదుగా కాకుండా వేరే మార్గంలో విమానాలు నడిచాయి’’అని పౌర విమానయాన శాఖ ‘ఎక్స్‌’లో పెట్టిన ఒక పోస్టులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement