గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ సంప్రదింపులు | PM Narendra Modi Holds Talks with Gulf Leaders | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ సంప్రదింపులు

Mar 2 2026 6:50 PM | Updated on Mar 2 2026 7:15 PM

PM Narendra Modi Holds Talks with Gulf Leaders

న్యూఢిల్లీ: అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల నేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరుపుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ.. ఆ దేశాల నేతలకు ఫోన్లు చేసి చర్చిస్తున్నారు.  

ఈ యుద్ధం సెగ గల్ఫ్‌ దేశాలపై తీవ్రంగా ఉంది. ప్రధానంగా ఎనిమిది అరబ్‌ దేశాలపై పడింది. అమెరికా దళాలకు ఆశ్రయం కల్పించిన అరబ్‌ దేశాలను టార్గెట​ చేస్తూ ఇరాన్‌ దాడులను ఉధృతం చేసింది.  ఇది అమెరికాపై ప్రత్యక్ష ప్రభావం కంటే గల్ఫ్‌ దేశాలు అత్యంత ప్రభావితమవుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

అమెరికాను యుద్ధం నుంచి ఉపసంహరించుకోవడానికి  ఇరాన్‌ వేసిన ఎత్తుగడగా ఈ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.. వారి మాటల్ని బట్టి ఇప్పుడు ప్రభావితమయ్యే గల్ప్‌ దేశాలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మొరపెట్టుకుని యుద్ధం ఆపేలా చేయాలనేది ఇరాన్‌ వ్యూహంగా కనబడుతోంది. దీనిలో భాగంగా గల్ఫ్‌ దేశాలను టార్గెట్‌ చేసింది ఇరాన్‌. 

దాంతో గల్ఫ్‌ దేశాల్లో విదేశీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  ఏ ముప్పు పొంచి ఉందో అర్థం కాకండా ఉంది వారి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయా దేశాధినేతలతో ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే పరిస్థితిపై చర్చిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement