breaking news
Sri Sathya Sai
-
రైతు సమస్యలపై మరీ ఇంత అలసత్వమా?
● పెట్రోల్ బాటిళ్లతో బ్యాంక్ మేనేజర్ ఎదుట రైతుల బైఠాయింపు బ్రహ్మసముద్రం: రైతు సమస్యలపై అలసత్వం తగదని పలువురు మండిపడ్డారు. మండలంలోని వేపులపర్తి యూనియన్ బ్యాంక్‌లో పంట రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వడ్డీ చెల్లించినా రెన్యూవల్ చేయలేదంటూ మంగళవారం బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయకుంటే పెట్రోల్ పోసుకుంటామని రైతులు హెచ్చరించారు. వీరికి వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి సంజీవయ్య మద్దతుగా నిలిచారు. కాయకష్టం చేసుకునే రైతులను వేధించడం తగదన్నారు. రూ.3 లక్షలకు ఏడాది వడ్డీ రూ.21 వేలే అయినా రూ. 31 వేలు కట్టించుకుని రైతులను మోసం చేస్తున్నారన్నారు. మేనేజర్ శ్రీను మాట్లాడుతూ బ్యాంక్‌లో ఇంతకు ముందు పనిచేసిన సిబ్బంది తప్పిదంతో ఇలా జరిగిందని రైతులకు తెలియజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి బాధిత రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మాజీ మండల కన్వీనర్ కేపీ బసవరాజు, నాయకులు పడమటి కోడిపల్లి మోహన్, గౌడప్ప, చంద్ర, గొల్లబసవరాజు, నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల ప్రారంభించండి సారూ..
కదిరి అర్బన్: తమ గ్రామంలో మూతపడిన పాఠశాలను పునఃప్రారంభించాలని కదిరి మండలం బడవాండ్లపల్లికి చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎంఈఓ చెన్నక్రిష్ణను కలిసి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో తమ పిల్లలు సుదూరంలో ఉన నల్లచెరువు మండలం తూపల్లి పాఠశాలకు అవస్థలు పడుతూ వెళ్తున్నారని వాపోయారు. ప్రతి రోజూ రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంఈఓ చెన్నక్రిష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తనిఖీ ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని తరగతి గదులతోపాటు రికార్డులు పరిశీలించారు. కళాశాలలో సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వనితవాణి, విద్యాశాఖ సహాయకుడు మారుతీరావు పాల్గొన్నారు. పట్టపగలే ఇంట్లో చోరీ గుడిబండ: మండల పరిధిలోని దిన్నెహట్టి గ్రామంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... దిన్నెహట్టికి చెందిన కరియన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పొలంలోకి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వారు తాళాన్ని ఎవరో పగులగొట్టినట్లు గుర్తించారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా, బీరువాలోని జత కమ్మలు, రెండు ఉంగరాలు, రెండు చైన్లు, రూ.50 వేలు కనిపించలేదు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ రమేష్‌బాబు ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఎస్ఐ అనిల్ కుమార్ ఇంట్లో వేలిముద్రలను సేకరించారు. బాధితుడు కరియన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవ● పోలీస్ స్టేషన్ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం మడకశిర: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరికి పోలీసుస్టేషన్‌కు చేరింది. ఈ క్రమంలోనే భర్త బ్లేడుతో శరీరాన్ని కోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వివరాలు.. మడకశిర మండలం యూ.రంగాపురం గ్రామానికి చెందిన సోమశేఖర్, శశికళ భార్యాభర్తలు. చాలాకాలం బెంగళూరులో జీవనం సాగించిన వీరు ఇటీవల సొంత గ్రామానికి వచ్చారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం మళ్లీ గొడవ పడడంతో భార్య శశికళ మడకశిర పోలీస్ స్టేషన్‌కు వచ్చి సోమశేఖర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న సోమశేఖర్ బ్లేడుతో తన శరీరంపై ఎక్కడ పడితే అక్కడ కోసుకున్నాడు. పోలీసులు వెంటనే అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. చెరువుల్లో పశుగ్రాసం పెంపకానికి ప్రణాళిక అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొన్నందున పశు, జీవసంపదకు గడ్డి కొరత ఏర్పడకుండా అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు చెరువుల్లో గ్రాసం పెంపకానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. రైతుల ద్వారా జొన్న విత్తనాలు చల్లించడానికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. -
రేపు సాగునీటి సాధన పాదయాత్ర
కనగానపల్లి: రాయలసీమకు దక్కాల్సిన సాగు, తాగునీటి హక్కుల కోసం గురువారం చేపట్టనున్న పాదయాత్రకు రైతులు తరలిరావాలని వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తోపుదుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ నీటి హక్కుల సాధన కోసం చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల సమీపంలోని హంద్రీ–నీవా కాలువపై 34వ కి.మీ రాయి వద్ద నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు హాజరవుతారన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. చెరువు ఆక్రమణలు తొలగించాలి ప్రశాంతి నిలయం: జిల్లాలో ఆక్రమణలకు గురైన చెరువుల్లో సర్వే చేసి ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వాచ్ డాగ్ కమిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ నీటి వనరుల హద్దులను సర్వే చేసి ఆక్రమణ దారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. ధర్మవరం చెరువు, కొట్నూరు చెరువు, గోరంట్ల రావికుంట చెరువు తదితర ప్రధాన చెరువుల్లో జరిగిన ఆక్రమణలు, ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సమీక్షించారు. నిబంధనల మేరకే ఆక్రమణలు తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. అర్హత ఉన్నా తల్లికి వందనండబ్బులు పడలేదు మడకశిర రూరల్: ‘మాకు సెంటు భూమి లేదు. కూలి పనులు చేస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాను. అయినా మాకు తల్లికి వందనం పడలేదు’ అని మారుతి, లక్ష్మీనరసప్ప తెలిపారు. తమ ఆధార్ కార్డుకు 10 ఎకరాల భూమి ఉందని చూపిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లెడుగుంటకు చెందిన లక్ష్మీనరసప్ప, రాధమ్మ దంపతులకు పవన్ 6వ తరగతి, రంజిత్ 1వ తరగతి పిల్లలు ఉన్నారు. అలాగే మారుతి, నాగమ్మ దంపతులకు నిహాల్ 6వ తరగతి, తేజ్ 1వ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారు. అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వారు చదువుతున్నారు. అయితే తల్లికి వందనం డబ్బులు పడకపోవడంతో మారుతి కుమారుడితో కలిసి తహసీల్దార్ పూజారి ముకుందకు వినతిపత్రం అందజేశారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా ‘సర్’ప్రశాంతి నిలయం: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ‘సర్’ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ‘సర్’ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం 1576 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 210 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరణించిన ఓటర్ల సంఖ్య 55,068, శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారిన వారు 49,466, ఇప్పటికే నమోదు అయినవారు 35,212, అందుబాటులో లేని ఓటర్లు సంఖ్య 30,686, ఇతరులు 152 ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 14,23,839 మంది ఓటర్లు ఉండగా ఈనెల 24 నాటికి 12,53,255 (88.02 శాతం) డిజిటలైజేషన్ పూర్తి చేశామన్నారు. 11,98,278 మ్యాపింగ్ అయ్యాయని, 5,48,650 సెల్ఫ్ మ్యాపింగ్ అయినట్లు పేర్కొన్నారు. 54,976 మంది మ్యాపింగ్ కాని వారు ఉన్నారు. -
ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
పరిగి: ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన పరిగి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. తొలుత స్టేషన్లో లాకప్ గదులు, స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంకిత భావంతో పనిచేయండి పుట్టపర్తి టౌన్: పోలీస్ శాఖలో హోంగార్డు వ్యవస్థ ఎంతో కీలకమని ప్రతి హోంగార్డు క్రమ శిక్షణ, అంకిత భావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో హోంగార్డుల ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు విధులతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలన్నారు. చట్ట వ్యతిరేక వ్యవహారాలకు దూరంగా ఉండాలన్నారు. సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో హోంగార్డుల కమాండెంట్ హనుమంతప్ప, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, హోంగార్డుల డీఎస్పీ హరికృష్ణ, ఆర్ఐలు వలి పాల్గొన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
హిందూపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. హిందూపురం సమీపంలోని మణేసముద్రం వద్ద ఈ ఘటన జరిగింది. వివరాలు.. మండలంలోని రోకలిపల్లికి చెందిన గోవిందు (28) ఇంటికి సరుకులు తెచ్చేందుకు మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంలో హిందూపురానికి బయలుదేరాడు. మణేసముద్రం వద్ద ఏ–1 స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో బైకును క్యాంటర్ గూడ్స్ వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన గోవిందు అక్కడికక్కడే మృతి చెందాడు. హిందూపురం అప్‌గ్రేడ్ ఏఎస్ఐ శ్రీరాములు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య గంగరత్న, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. లాలేపల్లిలో నెమళ్ల మృత్యువాత? చిలమత్తూరు: మండల పరిధిలోని లాలేపల్లిలో నెమళ్లు పదుల సంఖ్యలో మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టుగా చర్చ సాగుతోంది. విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలు మధ్యవర్తిత్వం వహించి సెటిల్మెంట్ చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గుంతకల్లులో కరోనా కలకలం గుంతకల్లు/ గుంతకల్లు టౌన్: కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. సెకండ్ వేవ్ తర్వాత తొలిసారి జిల్లాలో వెలుగు చూసిన కేసు కలకలం రేపింది. గుంతకల్లులోని బెంచ్ కొట్టాలకు చెందిన 64 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంతకల్లు రైల్వే ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు రోజులుగా శ్వాసకోశ సమస్యతోపాటు జర్వంతో బాధపడుతున్న వృద్ధురాలిని కుటుంబ సభ్యులు రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు మంగళవారం ర్యాపిడ్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు విషయాన్ని జిల్లా వైద్యాధికారులకు తెలియజేయడంతో పాటు వృద్ధురాలిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. సమాచారం అందుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు సాయంత్రం బాధితురాలిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వృద్ధురాలికి ర్యాపిడ్ టెస్ట్ ద్వారా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఆమెతో పాటు ఇంట్లో ఉంటున్న కుమారుడికి నెగిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం వృద్ధురాలు యాక్టివ్గానే ఉన్నారని, ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
ప్రసవం కోసం వెళ్తే.. కాటికి పంపారు
హిందూపురం టౌన్: ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణిని వైద్యులు తమ నిర్లక్ష్యంతో కాటికి పంపారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాలమేరకు... పరిగి మండలం బీచగానిపల్లికి చెందిన నాగేంద్ర, రమ్యశ్రీ దంపతులు. సోమవారం మధ్యాహ్నం రమ్యశ్రీకి పురిటి నొప్పులు రావడంతో ఆశా వర్కర్‌తో కలిసి హిందూపురం పట్టణానికి వచ్చారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ బాబు బుడెన్ ప్రైవేటు క్లినిక్‌లో ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రి అయిన ‘మాతృవందన ఆస్పత్రి’ వద్దకు ఆశా కార్యకర్త వారిని తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన ౖవైద్యుడు బాబు బుడెన్.. సిజేరియన్ చేయాలని చెప్పాడు. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనించింది. కొద్ది సేపటికి బాలింత సృహకోల్పోవడంతో అక్కడి వైద్యులు రెఫర్ చేయగా, ప్రైవేటు ఆస్పత్రి నుంచి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు బాలింత మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో బాధితురాలు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలోని డాక్టర్ నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని, ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని బాధితుల మాట్లాడారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు, డాక్టర్‌తో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రితో బాలింతకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం మాతృ వందన ఆస్పత్రి సీజ్ బాలింత మృతి విషయాన్ని తెలుసుకున్న డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం మంగళవారం మాతృవందన ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని లేబర్ రూమ్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడం, ఆపరేషన్ థియేటర్ కలిపి ఉండటం వలన లేబర్ రూమ్, ఓటీలను సీజ్ చేశారు. ఆస్పత్రి నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ బాలింత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. ఆస్పత్రిలో రోగులు ఉన్నందున ఆస్పత్రిని పూర్తిగా సీజ్ చేయడం లేదని, నిబంధనల మేరకు మూడు రోజుల లోపల షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. -
ఉద్యానం.. ఇలా చేస్తే భద్రం
పుట్టపర్తి అర్బన్: జిల్లావ్యాప్తంగా 40 వేల హెక్టార్ల మేర ఉద్యాన తోటలు విస్తరించాయి. మామిడి 20,540 హెక్టార్లు, చీనీ 15,257, జామ 520, దానిమ్మ 2,084, సపోటా 200, ఇతర పండ్ల తోటలు 850 హెక్టార్లలో సాగులో ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నెలన్నర నుంచి వర్షాలు సక్రమంగా కురవని నేపథ్యంలో ఉద్యాన రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఫారం పాండ్లు తవ్వకం, చెట్ల మొదళ్లలో వీడ్ మ్యాట్లు ఏర్పాటు చేయడం, అంతర పంటలు సాగు చేయడం, మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు పీఎండీఎస్ పద్ధతిలో గుళికలు విత్తుకోవాలని సూచిస్తున్నారు. ఫారంపాండ్లు.. పొలంలో ఫారం పాండు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటిని నిల్వ చేసుకొని కీలక సమయంలో పంటలకు వదులుకోవచ్చు. 20‘‘20‘‘3 సైజు ఫారం పాండుకు రూ.1.80 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో 50 శాతం సబ్సిడీ మొత్తం రూ.90 వేలు ప్రభుత్వం అందిస్తుంది. ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ కోతల సమయంలోనూ పంటలకు నీటిని పారబెట్టవచ్చు. వీడ్మ్యాట్: పండ్ల మొక్క చుట్టూ వీడ్ మ్యాట్ ఏర్పాటు చేసుకుంటే కలుపును నివారించవచ్చు. తేమ కూడా ఆవిరి కాకుండా ఉంటుంది. రసాయన మందులు కొట్టకుండా ఖర్చు తగ్గించుకోవచ్చు. సమయమూ ఆదా అవుతుంది. ఎండ అధికంగా ఉన్న సమయంలో వేడిని నియంత్రిస్తుంది. ఒక చదరపు అడుగుకు రూ.25 సబ్సిడీ అందజేస్తున్నారు. ఎకరాకు రూ. లక్ష వరకూ సబ్సిడీ పొందవచ్చు. పీఎండీఎస్ గుళికలు.. చెట్ల కింద పీఎండీఎస్ విత్తన గుళికలు చల్లుకోవడంతో చెట్టుకు కావాల్సిన సారంతో పాటు వేడిని తగ్గిస్తుంది. వర్షాలు ఆలస్యమైనా చెట్టు ఎండిపోదు. పీఎండీఎస్ పద్ధతిలో 20 రకాల విత్తన గుళికలు అందుబాటులో ఉన్నాయి. సేంద్రియ ఎరువుగా దీన్ని ఉపయోగించవచ్చు. మైక్రో ఇరిగేషన్.. మైక్రో ఇరిగేషన్‌తో తక్కువ నీటితోనే పండ్ల తోటలను కాపాడుకోవచ్చు. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలను కాపాడుకోవచ్చు. పెద్ద రైతులకు 75 శాతం, సన్న, చిన్న కారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్పు, స్ప్రింక్లర్లను అందజేస్తున్నారు. పంటల బీమా పథకం.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే బీమా ఆదుకుంటుంది. మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో చీనీ, దానిమ్మ పంటలకు పరిహారం పొందవచ్చు. కొత్తచెరువు మండలం తిరుమలదేవరపల్లి వద్ద ఓ రైతు తోటలో ఏర్పాటు చేసిన ఫారంపాండు తాడిమర్రిలో చీనీ చెట్టు వద్ద ఏర్పాటు చేసిన వీడ్ మ్యాట్ ఎల్‌నినో నేపథ్యంలో కురవని వర్షాలు జాగ్రత్తలు పాటించాలని రైతులకు అధికారుల సూచన సద్వినియోగం చేసుకోండి ఉద్యాన రైతులు ఎల్‌నినో ప్రభావం నుంచి తప్పించుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే నెలన్నరకు పైగా వర్షాలు కురవలేదు. ఫారంపాండ్లు, వీడ్ మ్యాట్లు, మైక్రో ఇరిగేషన్, పీఎండీఎస్ పద్ధతితో పాటు పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. – జయకుమార్ బాబు, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.లక్ష జరిమానా
గోరంట్ల/పెనుకొండ రూరల్: తాగి వాహనం నడిపిన 10 మందికి రూ.లక్ష జరిమానా విధించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెనుకొండ, గోరంట్ల పోలీసులు ఆయా ప్రాంతాల్లో మంగళవారం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే తాగి వాహనాలు నడుపుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానాల్లో హాజరుపరిచారు. ఒక్కొక్కరి నుంచి రూ. 10 వేల చొప్పున మొత్తంగా రూ. లక్ష జరిమానా వసూలు చేశారు. ● గోరంట్ల వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున న్యాయమూర్తి జరిమానా విధించినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు హిందూపురం: చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రమణయ్య మంగళవారం తీర్పు చెప్పారు. హిందూపురం పట్టణానికి చెందిన డాక్టర్ ఎం.మధుకర్ రెడ్డి టి.రంజిత్ కుమార్ అనే వ్యక్తితో రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. రుణం తిరిగి ఇవ్వమని కోరడంతో 2024 జనవరి 1న చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కును రంజిత్ కుమార్ బ్యాంకులో ఇవ్వగా, మధుకర్ రెడ్డి ఖాతాలో డబ్బు లేదని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో బాధితుడు హిందూపురం ప్రత్యేక కోర్టులో కేసు దాఖలు చేశాడు. పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి రమణయ్య.. నేరం రుజువు కావడంతో మధుకర్ రెడ్డికి 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 2 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, న్యాయస్థానంలో మధుకర్ రెడ్డి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పిటిషన్ దాఖలు చేయడంతో అనుమతించి విడుదల చేశారు. కేజీబీవీలో టీచర్ల ఘర్షణ ఎన్పీకుంట: స్థానిక కేజీబీవీ పాఠశాలలో ఇరువురు ఉపాధ్యాయినులు మంగళవారం గొడవ పడ్డారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు అసభ్య పదజాలంతో ఒకరినొకరు దూషించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై పాఠశాల ఎస్ఓ రిహానా మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు గురించి కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా హిందీ ఉపాధ్యాయిని రూపారాణి తనపై దుర్భాషలాడిందని చెప్పారు. హిందీ ఉపాధ్యాయిని రూపారాణి మాట్లాడుతూ ఎస్ఓ రిహానా తన వ్యక్తిగత విషయాలను వేరే ఉపాధ్యాయిని ద్వారా అడిగించి బ్లాక్మెయిల్ చేసేలా వ్యవహరించడంతో సహనం కోల్పోయి దుర్భాషలాడినట్లు తెలిపారు. గతంలో కూడా పాఠశాలలో ఉపాధ్యాయినుల మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఫళారంలో దాహం కేకలు
గుడిబండ: నాయకులు, అధికారుల నిర్లక్ష్యంతో మడకశిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, పట్టించుకునేవారు లేకపోవడంతో ప్రతి మండలంలోనూ తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా దళిత కాలనీల్లోని ప్రజలకు గుక్కెడు నీటి కోసం నిత్యం ఎక్కడోచోట రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. గుడిబండ మండల పరిధిలోని ఫళారం గ్రామంలోని కొత్త దళిత కాలనీకి చెందిన మహిళలు తాగునీటి కోసం మంగళవారం రోడ్డెక్కారు. గుడిబండ – రొళ్ల మండలం వైపునకు వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మహిళలు మాట్లాడుతూ... కాలనీలో నీళ్లు రాక 15 రోజులవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి దళితుడైనా తమకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు -
గడువులోపు ఫిర్యాదులు పరిష్కరించండి
● ఎస్పీ సతీష్‌కుమార్ పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ సతీష్‌కుమార్ 70 వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపుతామని తెలిపారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సీఐ బొజ్జప్ప, లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు ఎస్కేయూ ఆవిర్భావ దినోత్సవంఅనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 45వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. భువన విజయం ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ ముఖ్య అతిథిగా, శలాక రఘునాథ శర్మ విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. ● విజయనగర రాజుల్లో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయలు పేరున 1981 జులై 27న విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఎస్వీయూ అనుబంధంగా 1968లో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1976లో స్వయంప్రతిపత్తి హోదా లభించింది. 1981లో పూర్తిస్థాయి వర్సిటీగా రూపాంతరం చెందింది. ఎస్కేయూలో చదివిన పలువురు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు, మాజీ డీజీపీ జేవీ రాముడు ఎస్కేయూలో పీజీ చదివారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాద్ రావు ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. మాజీ డీజీపీ అరవింద రావు ఇంగ్లిష్ విభాగంలో పీజీ చదివారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస రెడ్డి ఎస్కేయూలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఇలా ఎంతో మంది పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. -
తల్లిని బెదిరించిన కుమారుడికి జైలు
పెనుకొండ రూరల్: తల్లిని దూషించి, బెదిరింపులకు పాల్పడిన కుమారుడికి న్యాయస్థానం మూడు నెలలు జైలు శిక్ష విధించింది. కియా ఎస్ఐ డి. రాఘవయ్య తెలిపిన మేరకు.. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి 2024లో కుంభకర్ణ హోటల్‌కు భోజనానికి వెళ్లింది. కుటుంబ విభేదాలు, కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో సోదరుడితో కలసి అక్కడికి చేరుకున్న పెద్ద కుమారుడు పీవీ జగన్నాథ్ తల్లి వెంకటలక్ష్మిని అసభ్య పదజాలంతో దూషించాడు. చంపేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి కియా ఎస్ఐ రంగడు కేసు నమోదు చేసి ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టారు. పూర్వాపరాలు విచారించిన అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం జగన్నాథ్‌కు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష, రూ. 8 వేల జరిమాన విధించింది. ధర్మమే దిక్సూచిగా మానవ జీవితం సాగాలి ప్రశాంతినిలయం: ధర్మమే దిక్సూచిగా అంతరంగాన్ని మేల్కొలుపుతూ ప్రతి మనిషి తన జీవిత గమనాన్ని సాగించడం ద్వారా సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రశాంతినిలయంలో సత్యసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయ సంస్కృతీ, ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల్లో భాగంగా రెండో రోజు సోమవారం చర్చా గోష్టి నిర్వహించారు. సాయికుల్వంత్ సభా మందిరంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన మహిళా ఉపన్యాసకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం మహిళా క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీఎల్ రాణి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో యువత ధర్మాన్ని ఆచరించడం పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఇందికా సంస్థ ప్రోగ్రాం లీడర్ సాయి స్వరూప, లోయస్ ఇండియా సాప్ట్వేర్ సంస్థ సీనియర్ డైరెక్టర్ సాయి గీత, సత్యసాయి జనరల్ ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లతాశ్రీ, యూకేకు చెందిన విద్యుల్లతా నారాయణ్ మాట్లాడారు. అమ్మమ్మ ఊరికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకుశాంతిపురం: అమ్మమ్మ ఊరికి వెళ్లిన ఓ బాలుడు తిరిగి రాని లోకాలకు చేరాడు. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన సాత్విక్ (5) తన తల్లి దీపతో కలిసి కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. సోమవారం ఇంటి అవసరాల కోసం రోడ్డు పక్కన ట్యాంకర్ నుంచి గ్రామస్తులు నీరు పడుతుండగా, తోటి చిన్నారులతో సరదాగా సాత్విక్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ టెంపో వీరిపై దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన సాత్విక్‌ను కుప్పం ఏరియా ఆస్పత్రిఇకి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
‘లెన్స్‌కార్ట్ షోరూమ్‌తో తీరని నష్టం’
ధర్మవరం అర్బన్: పట్టణంలో లెన్స్‌కార్ట్ షోరూమ్ ఏర్పాటుతో స్థానిక ఆప్టికల్స్ నిర్వాహకులకు తీరని నష్టంం జరుగుతుందని ధర్మవరం ఆప్టికల్స్ అసోసియేషన్ యజమానులు, వామపక్ష నాయకులు మండిపడ్డారు. పట్టణంలోని సెరికల్చర్ కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న లెన్స్‌కార్ట్ షోరూమ్ వద్ద సోమవారం ధర్నా చేశారు. పట్టణంలో దాదాపు 200 కుటుంబాలు ఆప్టికల్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. లెన్స్‌కార్ట్ లాంటి పెద్ద కార్పొరేట్ దుకాణాల కారణంగా చిరు వ్యాపారులు నష్టపోతారన్నారు. అభివృద్ధి పేరుతో చిన్న వ్యాపారాలను నాశనం చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు నోరు మెదపకపోవడం దారుణమని వాపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షోరూమ్ వద్ద ధర్నా చేపట్టిన ఆప్టికల్స్ యజమానులు, నిర్వాహకులు, పీఎస్‌యూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, సురేష్చౌదరిలకు టూ టౌన్ సీఐ జయనాయక్, ఎస్ఐ ఖాదర్‌భాష సర్దిచెప్పారు. మాట వినకపోవడంతో ధర్నా చేస్తున్న బలవంతంగా వారిని స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో ఆప్టికల్స్ అసోసియేషన్ ప్రతినిధులు గుడిపాటి సురేష్, శ్రీకాంత్, హరికృష్ణ, శివ, ఆసిఫ్, రాజు, పీఎస్‌యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, వినయ్‌కుమార్, పోలా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
లోకేష్ రాజీనామా చేయాల్సిందే
● అనంతపురానికి చెందిన జూటూరు రెడ్డప్ప టీచర్ పోస్టు కోసం తీవ్రంగా శ్రమించాడు. కష్టపడి పరీక్ష రాసి మంచి మార్కులు సాధించాడు. ఎస్సీ గ్రూప్–3 కేటగిరీలో 57 మార్కులు సాధించి 219వ ర్యాంకులో నిలిచాడు. ఉద్యోగం ఖాయం అనుకుని బంధుమిత్రులందరికీ చెప్పుకున్నాడు. తీరా చూస్తే.. రెడ్డప్పకు రావాల్సిన ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఎవరో అభ్యర్థి ఎగరేసుకుపోయాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఒక స్వప్నం. అహోరాత్రులు శ్రమించి, తిండీ తిప్పలు మాని.. కుటుంబాలకు దూరంగా అరకొర వసతుల మధ్య పరీక్షల కోసం కష్టపడుతుంటారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చాక కష్టపడి పరీక్షలు రాస్తే అర్హత ఉన్న వారికి కాకుండా దొంగదారిలో వచ్చిన వారు ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు. తొలి సంతకమే.. భారీ స్కాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీ. రాష్ట్ర వ్యాప్తంగా 16,437 పోస్టులను భర్తీ చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఇందులో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు అన్ని అర్హతలూ ఉన్నా పట్టించుకోకుండా.. అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు సార్.. మా అర్హతను పరిగ ణనలోకి తీసుకుని ఉద్యోగాలు ఇవ్వండని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. 811 పోస్టులకు నోటిఫికేషన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 811 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. సుమారు 46 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 39,943 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎంపికై న అభ్యర్థులకు నేరుగా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చారు. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత సెలక్షన్ లిస్టులో మీ పేర్లు లేవంటూ అధికారులు చావుకబురు చల్లగా చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని.. అంతా విజయవాడ నుంచే అభ్యర్థుల జాబితా వస్తోందని జిల్లా విద్యాశాఖాధికారులు చేతులెత్తేశారు. స్పోర్ట్స్ కోటాలో 22 పోస్టులు ఉమ్మడి జిల్లాలో మొత్తం 811 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇందులో 22 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద కేటాయించారు. అయితే స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. నేడు భారీ ర్యాలీ డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టి.. అర్హులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు మంగళవారం జిల్లా కేంద్రం పుట్టపర్తిలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేసి తన నైతికతను నిరూపించుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేటి భారీ ర్యాలీకి విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. విజయవంతం చేయండి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తిలోని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమవుతుంది. గణేష్ సర్కిల్ వరకూ కొనసాగుతుంది. విద్యార్థులు, యువత భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలి. డీఎస్సీలో అవకతవకలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు న్యాయం జరిగే వరకూ పార్టీ తరఫున పోరాడతాం. – గంగుల సుధీర్‌కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యత వహిస్తు నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో విచారణ చేయించాలి. అర్హత ఉండీ ఉద్యోగం రాని అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున భృతి చెల్లించాలి. ఈ డిమాండ్లపై మంగళవారం చేపట్టే భారీ ర్యాలీకి నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. – పురుషోత్తం రాయల్, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కనగానపల్లి మండలం కుర్లపల్లి తండాకు చెందిన సుగాలి గోపాల్‌నాయక్ స్కూల్ అసిస్టెంట్ (సోషల్) పరీక్ష రాసి 71.65 మార్కులతో జనరల్‌లో 121వ ర్యాంకు సాధించాడు. ఎస్టీ కేటగిరిలో కచ్చితంగా ఉద్యోగం వస్తుందని సంతోషపడ్డాడు. అయితే తనకు రావాల్సిన ఉద్యోగాన్ని స్పోర్ట్స్ కోటాకు కేటాయించామని.. ఏమైనా అభ్యంతరాలుంటే మంగళగిరిలోని విద్యాశాఖాధికారులను సంప్రదించాలని చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇలా డీఎస్సీ పేరుతో దగా చేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అర్హులకు చేసిన అన్యాయంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. -
వైభవంగా ముత్యాలమ్మ గ్రామోత్సవం
ధర్మవరం అర్బన్: పట్టణంలో సోమవారం ముత్యాలమ్మ గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీచెన్నకేశవపురంలోని మేడాపురం రోడ్డు సమీపంలో ఉన్న ముత్యాలమ్మకు సోమవారం నిర్వాహకులు నాయనిగారి నరసింహారెడ్డి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక రథంపై ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. గ్రామోత్సవంలో కళాకారులు నృత్యాలు, కోలాటాలు, చెక్కభజనలతో ఆకట్టుకున్నారు. పలువురు విచిత్ర వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అడుగడుగునా అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణవాసులు తరలివచ్చారు. మంగళవారం ముత్యాలమ్మకు మహిళలు బోనాలు తీసుకెళుతున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు నరసింహారెడ్డి స్వామి తెలిపారు. -
మోదీ ప్రభుత్వంలో పెరిగిన పేదరికం
లేపాక్షి: కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో పేదరికం పెరిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సోమవారం లేపాక్షిలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ 12 సంవత్సరాల కాలంలో పేదలకు చేసిన మేలు శూన్యమన్నారు. వ్యవస్థలను అంగట్లో సరుకుల్లా కొనుగోలు చేసి ఆర్భాటం చేయడం సిగ్గుచేటన్నారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల 16 మంది విద్యార్థులు మరణిచండం బీజేపీ పాపమేనన్నారు. ఢిల్లీని గడగడలాడించి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించడంలో యువత, విద్యార్థుల పాత్ర గొప్పదన్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాదం పెరిగిపోయిందని విమర్శించారు. 2014లో రూపాయి విలువ పడిపోయిందని మాట్లాడిన మోదీ ప్రస్తుతం ఏ స్థాయిలో వుందో కళ్లు తెరిచి చూడాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల కడుపుకొట్టారన్నారు. అదానీ, అంబానీలే దేశ సంపదలో ముందున్నారని విమర్శించారు. మోదీ రాజకీయాలకు పనికిరాడని చెప్పిన చంద్రబాబు ఈ రోజున దేశానికి విశ్వగురువు అని మాట్లాడడం రాజకీయ స్వార్థమే అన్నారు. రాష్ట్రంలో భూకబ్జాలు, దందాలు, అధికార అరాచకాలు పెరిగి పోయాయని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పులు ఎన్ని, చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన అప్పెంత అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 శాతం మంది ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగి పోయారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీష్, రామాంజినేయులు, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కనిశెట్టిపల్లి వినోద్‌కుమార్, శివప్ప, మధు, నరసింహమూర్తి, రాజా, చలపతి నాయుడు, బాలస్వామి, వెంకటేష్, మండల కార్యదర్శి గౌతమ్‌కుమార్, నాయకులు కమల్భాషా, బాబు, చాంద్‌బాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరిగిన అరాచకాలు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ -
దారి దోపిడీ దొంగల అరెస్ట్
చందానగర్(హైదరాబాద్): దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రామచంద్రాపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీధర్‌కుమార్ వివరాలు వెల్లడించారు. కదిరి మండలం కురుమామిడికి చెందిన ఉజర్ల విష్ణు వర్ధన్ నగరంలోని మంగళ్‌హట్ శివలాల్ నగర్లో నివాసముంటూ మేసీ్త్ర పని చేస్తున్నాడు. బోడుప్పల్ బంగారు మైసమ్మ టెంపుల్లో నివాసముండే దండగుల భాను ప్రసాద్ ప్రస్తుతం శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీలో నివాసముంటూ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 22వ తేదీన వీరిద్దరూ కలిసి చందానగర్ హుడాకాలనీలోని ఓ గుడిసెలోకి వెళ్లి మంచినీళ్లు కావాలని అడిగి సెల్‌ఫోన్ లాక్కొని ఇంట్లో వారిపై దాడి చేసి పారిపోయారు. బాధితులు చందానగర్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను గుర్తించిన పోలీసులు సోమవారం పాపిరెడ్డి కాలనీలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరిపై 11 దొంగతనాల కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. దారి దోపిడీలకు పాల్పడేవారని తెలిసింది. ఈ క్రమంలో నిందితుల నుంచి ఒక రెడ్మీ నోట్ 11 సెల్‌ఫోన్‌తో పాటు బజాజ్ పల్సర్ 220, బజాజ్ పల్సర్ 150, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, కేటీఎం డ్యూక్ 200, యమహా ఫ్యాసినో బైకులు స్వాధీనం చేసుకున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ అందజేసి.. చేతులెత్తేసి
పుట్టపర్తి అర్బన్: మామూళ్లు ఇచ్చేదాకా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వబోమన్న రీతిలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, తీగలు, ఇతర పరికరాలకు డీడీలు తీసి పంపితే కనెక్షన్ ఇవ్వాల్సిన అధికారులు పొలం వైపు కన్నెత్తి చూడడం లేదు. వివరాలు.. గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాకు చెందిన రైతులు శివమూర్తి నాయక్, కుల్లాయినాయక్, జగదీష్ నాయక్‌లు బోర్లు వేసి గతంలోనే విద్యుత్ కనెక్షన్ కోసం డిపాజిట్ చెల్లించారు. ఏడాది క్రితం ట్రాన్స్ఫార్మర్ను తీసుకొచ్చి తండాలోని రోడ్డు పక్కన రచ్చబండపై ఉంచి వెళ్లిన విద్యుత్ శాఖ అధికారులు ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇప్పటి వరకూ అమర్చలేదు. అడిగినంత ఇవ్వలేక పోవడంతోనే ఇలా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ● గోరంట్ల మండలంలోనే గంగంపల్లికి చెందిన మరో రైతు చాకల గోవింద్‌ది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. గోవింద్ బోరు వేసి పంటలు సాగు చేస్తున్నాడు. డిపాజిట్ చెల్లించి చాలా కాలమైంది. ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో చేసేది లేక ఇతర రైతుల బోరు బావుల నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకొని పంటను కాపాడుకుంటున్నాడు. విద్యుత్ తీగలను కట్టెల సహాయంతో మోటార్ వద్దకు లాగాల్సి వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పంటలు ఎలా సాగు చేయాలో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
బియ్యం కోసం వెళ్లి దొరికిపోయారు
ధర్మవరం రూరల్: ఓ ఇంట్లో దూరి బియ్యం బస్తాలు చోరీ చేసి వాటిని ద్విచక్రవాహనంపై తరలిస్తున్న దొంగలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మండల పరిధిలోని కుణుతూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... రావులచెరువు గ్రామానికి చెందిన బోయ అక్కులప్ప, కురుబ చంద్ర సోమవారం సాయంత్రం కుణుతూరు గ్రామంలోని చిన్నన్న గారి నారాయణరెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఇంట్లో ఉన్న నారాయణరెడ్డి కూతురు జ్వోతికారెడ్డిని నాన్నగారులేరా అని ప్రశ్నించారు. అందుకు ఆ అమ్మాయి లేరని చెప్పగానే... ‘‘మీ నాన్న మా ఇంట్లోని రెండు బియ్యం ప్యాకెట్లు తీసుకోండి’’ అని మాతో చెప్పాడంటూ ఇంట్లోకి దూరారు. దీంతో అనుమానం వచ్చిన జ్వోతికారెడ్డి గట్టిగా నిలదీయడంతో వారు ఆమె గొంతు పట్టుకొని ‘‘అరిస్తే చంపేస్తాం జాగ్రత్త’’ అంటూ బెదిరించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి రెండు బియ్యం బస్తాలను ఎత్తుకొని ఇంటి బయట అప్పటికే నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనంపైకి వేశారు. సరిగ్గా ఆ సమయంలోనే జ్వోతికారెడ్డి గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి ధర్మవరం రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. దొంగలకు దేహశుద్ధి చేసిన కుణుతూరు వాసులు -
సుందరేశ్‌చారి ఎక్కడ?
మడకశిర: నకిలీ బంగారు నగలు తాకట్టుపెట్టి బ్యాంకుకు టోకరా వేసిన కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ సుందరేశ్‌చారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మడకశిర రూరల్ సర్కిల్ సీఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కృష్ణారెడ్డి తదితరులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ కూడా ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిసింది. స్వగ్రామం, బంధువుల ఇళ్ల వద్ద ఆరా.. మడకశిర కెనరా బ్యాంకులో ఈనెల 25న తేదీ (శనివారం) ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను పరిశీలించగా, 12 ఖాతాలకు సంబంధించిన ఆభరణాలు నకిలీవని గుర్తించారు. అంతేకాకుండా నకిలీ బంగారు ఆభరణాలతో ఏకంగా రూ.70.66 లక్షలు రుణాలు తీసుకున్నట్లు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై అనంతపురం కెనరా బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా..బ్యాంక్ అప్రైజర్ సుందరేశ్‌చారితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రధాన నిందితుడు సుందరేశ్‌చారిని పట్టుకోవడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుందరేశ్‌చారి స్వగ్రామమైన గుడిబండ మండలం ఎస్ రాయాపురంతో పాటు అతని బంధువుల గ్రామాల్లోనూ పోలీసులు ఆరా తీశారు. కుటుంబ సభ్యులనూ విచారించారు. అంతేకాకుండా నిందితుడు హిందూపురం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం ఫోన్ లొకేషన్ ఆధారంగా సుందరేశ్‌చారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది పాత్రపైనా ఆరా.. నకిలీ బంగారు బాగోతంలో గోల్డ్ అప్రైజర్ సుందరేశ్చారికి బ్యాంకు సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గోల్డ్ లోన్లు మంజూరు చేసిన సమయంలో ఉన్న బ్యాంకు సిబ్బంది తీరు గురించి ఆరా తీస్తున్నారు. మొత్తంగా సుందరేశ్‌చారి పట్టుబడితే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ కేసును ఒక కొలిక్కి తెస్తామని తెలిపారు. నకిలీ బంగారు ఆభరణాల తాకట్టు కేసు దర్యాప్తు ముమ్మరం కీలక నిందితుడైన సుందరేశ్‌చారి కోసం పోలీసుల గాలింపు ఫోన్ లొకేషన్ ఆధారంగా పట్టుకోవడానికి ప్రయత్నాలు బ్యాంకు సిబ్బంది పాత్రపైనా ఆరా తీస్తున్న పోలీసులు -
అప్పులు అధికమై ఆత్మహత్య
కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లికి చెందిన అశోక్ కుమార్ రెడ్డి(40) అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. అలాగే పొలంలో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల కరెంట్ పనులు లేక, పంటలు సరిగా పండక అప్పులపాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తండ్రి మందలించారని కుమారుడు.. యాడికి: మద్యానికి బానిసైన ఓ యువకుడు తండ్రి మందలించాడని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాడికి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. మండల కేంద్రంలోని చౌడేశ్వరీ కాలనీకి చెందిన బద్దల రామ్మోహన్, బద్దల కృష్ణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అజయ్‌కుమార్ (23) ఉన్నారు. ఇటీవల అజయ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. తండ్రిని ఆదివారం రాత్రి కొంత డబ్బు ఇవ్వాలని అడిగాడు. ‘ఇంత కాలం నీవు ఏ పని చేయకున్నా మేమే నెట్టుకొస్తున్నామం’టూ తండ్రి కుమారుడిపై ఆగ్రహం చేయగా.. మనస్తాపానికి గురైన అజయ్‌కుమార్ గ్రామ సమీపంలోని వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. రామ్మోహన్ ఫిర్యాదు కేసు నమోదు చేశారు. అజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
● రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీసిన ఎన్‌క్యూఏఎస్ బృందం సభ్యులు ఎన్పీ కుంట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల నాణ్యత, పారిశుధ్యం, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తనిఖీలు నిర్వహించే నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ బృందం (ఎన్‌క్యూఏఎస్) సభ్యులు సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి కమలాకర్, డాక్టర్ సత్యనారాయణస్వామి తదితరులతో కూడిన బృందం సభ్యులు ఆస్పత్రిలోని అన్ని విభాగాలను సందర్శించారు. ఓపీ, ఐపీ సేవలను ఆరా తీశారు. అలాగే ప్రసూతి గది, ల్యాబ్, ఔషధ నిల్వలు, రికార్డుల గది, పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సౌకర్యం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పాటించవలసిన నాణ్యత ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, తదితర సేవల మెరుగుదలకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట వైద్యులు ఎంఎస్ దీప్తి, బాలాజీ నాయక్, సీహెచ్ఓ నాగలక్ష్మి ఉన్నారు. -
‘పరిష్కార వేదిక’కు 332 అర్జీలు
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి సమీపంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో ‘పరిష్కార వేదిక’ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు.. వివిధ సమస్యలపై 332 అర్జీలు అందించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి అందే అర్జీలను క్షుణ్ణంగా చదివి అర్హత మేరకు పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఏదశలోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ సువర్ణ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం ● ధర్మవరం నూతన ఆర్డీఓ రాంభూపాల్‌రెడ్డి ధర్మవరం అర్బన్: ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందేలా తనవంతు కృషి చేస్తానని ధర్మవరం నూతన ఆర్డీఓ రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ ఏఓ ఖతిజున్‌కుఫ్రా, పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ మహేష్ నాలుగు నెలల క్రితం బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జ్ ఆర్డీఓలు కొనసాగారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రభుత్వం నంద్యాలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాంభూపాల్‌రెడ్డిని ధర్మవరం ఆర్డీఓగా బదిలీ చేసింది. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. డివిజన్ పరిధిలోని సమస్యలపై ఆరా తీశారు. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ పెనుకొండ రూరల్: దళిత బాలికపై అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చేందుకు కారణమైన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. ఓ మహిళ హోంమంత్రిగా రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోవడం చూస్తే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గోరంట్ల మండంలోని ఓ గ్రామంలో అభం, శుభం తెలియని బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేయగా... బాలిక గర్భం దాల్చిందని, ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకే కాదు బాలికలకు కూడా రక్షణ కరువైందన్నారు. ఇప్పటికే జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయన్నారు. అయినా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. అందువల్లే బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. ఇప్పటికై నా ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డీటీ ప్యానల్ విడుదల అనంతపురం అర్బన్: తహసీల్దారు పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 92 మందితో డీటీ (డిప్యూటీ తహసీల్దార్) ప్యానల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వారంలోగా సమర్పించాలని సూచించింది. 2018–19కు సంబంధించి 15 మంది డీటీలు, 2019–20కు 16 మంది, 2020–21కు 31 మంది, 2021–22కు ముగ్గురు, 2022–23కు 18 మంది, 2023–24కు నలుగురు, 2024–25కు సంబంధించి ఐదుగురు మొత్తం 92 మందితో ప్యానల్ విడుదల చేసింది. పోస్టుల ఖాళీలను అనుసరించి సీనియారిటీ ప్రకారం వీరికి తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పట్టవా?
ప్రశాంతినిలయం: ఇటీవల విజయవాడ వేదికగా తమ డిమాండ్లు పరిష్కరించాలని 45 రోజుల గడువు విధించినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రెవెన్యూ భవన్లో జరిగిన పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారానికి జూన్ 17న ధర్నా నిర్వహించి 45 రోజుల గడువు ఇచ్చామని అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించక పోగా కనీసం చర్చలకు కూడా పిలవలేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకూ 100 శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలన్నారు. మరణించిన ఉద్యోగికి సంబంధించి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిబ్బంది జ్యోతి, క్షమత, సుమ, శివమ్మ, చరణ్, రాకుమార్, చంద్రకళ ఉన్నారు. కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్టు తనకల్లు: కిడ్నాప్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. వివరాలు... చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం జెట్టిపల్లికి చెందిన గల్లా హేమచంద్ర మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి 2019లో గందోడివారిపల్లికి చెందిన నరేష్, నైనాను కిడ్నాప్ చేసి రూ. 3 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు అప్పట్లోనే ఇద్దరిని అరెస్టు చేశారు. గల్లా హేమచంద్ర పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల గల్లా హేమచంద్ర చిత్తూరు–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎస్ఐ తన సిబ్బందిని పంపి అతన్ని అరెస్టు చేశారు. సోమవారం కదిరి కోర్టులో హాజరుపరచగా నిందితుడికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. కర్ణాటక మద్యం ధ్వంసంరామగిరి: రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రూ. 3.47 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు ఎస్ఐ ప్రదీప్ రాజ్ తెలిపారు. 8,213 లిక్కర్ ప్యాకెట్లు, 789 లీటర్ల వివిధ మద్యం బాటిళ్లతో పాటు బీర్ బాటిళ్లు ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో డీపీ అండ్ఈఓ గోవిందనాయక్, ఎకై ్సజ్ సీఐ ఫరూక్ అజం, ఎస్ఐ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నీరు కరువై.. జీవాలతో వలసగాండ్లపెంట: తీవ్ర వర్షాభావంతో నీరు కరువవడంతో కాపర్లు జీవాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఎన్పీ కుంట మండలం పుల్లగూర్లపల్లికి చెందిన గంగయ్యకు 50 ఆవులు ఉన్నాయి. ఇటీవల జీవాలకు పశుగ్రాసంతో పాటు తాగునీరు కరువైంది. కదిరి రూరల్ మండలంలోని విఠలరాయుని చెరువులో కొద్దిపాటి నీటితో కొండ గుట్టల్లో పశుగ్రాసం అందుబాటులో ఉందని తెలుసుకున్న ఆయన సోమవారం తన స్వగ్రామం నుంచి ఆవులను అక్కడికి తీసుకెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేసి పశువులను సంరక్షించాలని రైతు సంఘం మండల కార్యదర్శి కేకే రాజారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి శ్రీరాములునాయుడు డిమాండ్ చేశారు. రౌడీషీటర్ అరెస్ట్ అనంతపురం సెంట్రల్: యువకుడిపై దాడి చేసిన రౌడీషీటర్ సుధీర్ అలియాస్ పులి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో ఉమానగర్‌కు చెందిన రౌడీషీటర్ దాసరి సుధీర్ ఈనెల 23న పాతూరు కూరగాయల మార్కెట్ సమీపంలో మహమ్మద్ ఫైజాన్ అహ్మద్‌పై కర్రతో దాడి చేశాడు. దీంతో ఫైజాన్ ముక్కు వద్ద తీవ్ర గాయమైంది. ఎముక విరిగింది. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం నిందితున్ని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు పంపామన్నారు. -
వంచించిన ‘వందనం’
చిలమత్తూరు: ఆమె ఆ గ్రామ మాజీ వార్డు మెంబర్. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని కష్టపడి ఇంటర్ చదివిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన తల్లికి వందన (అమ్మఒడి) పథకానికి ఆమె అన్ని విధాలా అర్హురాలు. కానీ ఆమెకు ఆ నిధులు అందలేదు. ఎందుకని ఆరా తీసేందుకు సచివాలయానికి వెళితే...ఎవరూ పట్టించుకోలేదు. గంటల తరబడి వేచిచూసిన ఆమె అస్వస్థతకు గురై అక్కడే పడిపోయారు. వివరాల్లోకి వెళితే...చిలమత్తూరు 1వ వార్డు మాజీ సభ్యురాలు విజయలక్ష్మి భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. కుమారుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆమె ‘తల్లికి వందనం’ పథకానికి పూర్తి అర్హురాలైనా నగదు ఖాతాలో జమ చేయలేదు. ఎన్నిసార్లు అధికారులను అడిగినా ‘నీ భర్త అకౌంట్లో నగదు పడింది’ అంటూ పో అంటూ పంపిస్తున్నారు. అయితే తన భర్త మృతి చెందగానే.. ఆయన ఖాతాను బ్యాంకు అధికారులు రద్దు చేశారని, అలాంటిది ఆ ఖాతాకు నగదు ఎలా జమ అవుతుందని ఆమె ప్రశ్నించినా...సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి గ్రామ సచివాలయానికి వచ్చిన విజయలక్ష్మి...గంటల తరబడి అక్కడే నిల్చోవాల్సి రావడంతో సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే అక్కడున్న వారు ఆమెకు నీరు తాగించి సపర్యలు చేసి ఇంటికి పంపారు. ఇలా విజయలక్ష్మి మాత్రమే కాదు...జిల్లాలో వేలాది మంది అర్హులైన మహిళలు తల్లికివందనం డబ్బులు జమకాక సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘తల్లికివందనం’ డబ్బులు పడకపోవడంతో సచివాలయానికి వచ్చిన మహిళ సమాధానం చెప్పేవారు లేక గంటల తరబడి వేచి చూసిన వైనం చివరకు సొమ్మసిల్లి పడిపోయిన మాజీ వార్డు మెంబర్ -
ప్రొఫెసర్ల పదోన్నతులకు ఆమోదం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పాలకమండలి సమావేశం సోమవారం వీసీ జ్యోతికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులు నేరుగా, ఎక్స్ అఫిషియో అధికారులు ఆన్లైన్లో హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలకు అమోదం తెలిపారు. ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. కెరీర్ అడ్వాన్సెమెంట్ స్కీం (సీఏఎస్) కింద పదోన్నతికి ఇవ్వనున్నారు. యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న మినిమం స్కేలు ఉద్యోగులకు నెలకు రూ.4 వేల జీతం పెంపుదలకు పాలకమండలి సమ్మతించింది. అకడమిక్ అసిస్టెంట్లు, టీచింగ్ అసిస్టెంట్లు, అడ్హాక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అడ్హాక్ ప్రిన్సిపాళ్ల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలనే నిర్ణయాన్ని పాలకమండలి తిరస్కరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలే పదవీ విరమణ అని స్పష్టం చేసింది. దూరవిద్య విభాగం నుంచి బీఈడీ కళాశాలకు బదలాయించిన అధ్యాపకులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో తిరిగి వారు దూరవిద్య విభాగంలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పరీక్షల విభాగం ఉద్యోగులు నేరుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారనే కారణంతో గత వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి సదరు ఉద్యోగులందరికీ ఒక ఇంక్రిమెంట్ కోత విధించారు. తాజాగా ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కోత విధించకుండా ఇవ్వాలని పాలకమండలి ఆమోదం తెలిపింది. -
దళిత బాలికపై అత్యాచారం
సాక్షి, పుట్టపర్తి/గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లాలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దళిత బాలికపై అత్యాచారం జరిగింది. పదోతరగతి చదువుతున్న ఆ బాలిక ప్రస్తుతం ఐదునెలల గర్భంతో ఉన్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బొంబాయి బాబు (55)ను గోరంట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ గ్రామానికి చెందిన బొంబాయి బాబు అదే కాలనీలోకి చెందిన దళిత బాలికను మాయమాటలతో లొంగదీసుకున్నాడు.అనారోగ్యంగా ఉన్న బాలికను హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఐదునెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు గోరంట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బొంబాయి బాబుపై పోక్సో కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం మరిన్ని సెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని గోరంట్ల సీఐ బోయ శేఖర్ చెప్పారు. తనతోపాటు ఇంకొందరు ఆ బాలికపై అత్యాచారం చేశారని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. మద్యం మత్తులో ఉన్న బొంబాయి బాబు ఆ వ్యక్తులు ఎవరనేది చెప్పలేదని, అతడిని మరోసారి విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
వైభవంగా భూతప్ప ఉత్సవాలు
భూతప్పల స్పర్శకోసం బోర్లా పడుకున్న భక్తులు భక్తులపై కాలు మోపుతూ ముందుకు వస్తున్న భూతప్ప మడకశిరరూరల్: ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆదివారం మినీ భూతప్ప ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తొలుత లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నవారు, సంతానం లేని మహిళలు తడి బట్టలతో భూతప్పలు వచ్చేదారిలో బోర్లా పడుకున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తూ భూతప్పలు భక్తులపై కాలుమోపుతూ ఆలయానికి చేరుకున్నారు. భూతప్పలు కాలుమోపితే రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అనంతరం భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. భూతప్పల స్పర్శకోసం ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి -
యువతలో చైతన్యం రావాలి
ప్రశాంతి నిలయం: ఆధునిక యువత భారతీయ సంస్కృతీ ఆధ్యాత్మికతపై చైతన్యం పెంపొందించుకొని సమ సమాజస్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పిలుపునిచ్చారు. ఏటా సత్యసాయి విద్యాంస్థల విద్యార్థులకు భారతీయ సంస్కృతీ ఆధ్యాత్మికతపై అవగాహన పెంపొందించడానికి నిర్వహించే వేసవి శిక్షణా తరగతులను ఆదివారం ప్రారంభించారు. పూర్ణ చంద్ర ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ఆర్జే రత్నాకర్రాజు, ట్రస్ట్ సభ్యులు సత్యసాయి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాఘవేంద్రప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సంస్కృతీ సాంప్రదాయాలను ఆచరిస్తూ తర్వాతి తరానికి వాటిని అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. ఆధ్యాత్మికత, మానవతా విలువలు పాటించడం యుక్తవయస్సు నుంచే అలవర్చుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించే వేసవి శిక్షణ తరగతులు సోమ, మంగళవారం ప్రశాంతి నిలయంలో జరగనున్నాయి. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోండి యువత నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని సమాజాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆర్జే రత్నాకర్ రాజు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సాయికుల్వంత సభా మందిరంలో గ్లోబల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘స్వీయ పరివర్తన కోసం నాయకత్వ లక్షణాలు’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయి ఇ–సేవా సంస్థలు నిర్వహించిన కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం భారతీయ పౌరాణిక ఇతిహాసాల నుంచి ధర్మసారాలను బోధించే పలు ఘట్టాలను ప్రదర్శించారు. -
భార్యలతో గొడవ .. ఇద్దరు యువకుల బలవన్మరణం
గోరంట్ల: భార్యలతో గొడవ కారణంగా ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మండల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు... మండల పరిధిలోని కళ్లగేరి తండాకు చెందిన రమేష్‌నాయక్ (33) శనివారం అర్ధరాత్రి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలోకి వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శేఖర్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాలమేరకు... రమేష్‌నాయక్ తాగుడుకు బానిసై తరచు భార్యతో గొడవ పడేవాడన్నారు. శనివారం రాత్రి కూడా భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నాడని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మసీదు సర్కిల్ ఏరియాలో మరొకరు.. మండల కేంద్రమైన గోరంట్లలోని మసీద్ సర్కిల్ ఏరియలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన పానీపూరి వ్యాపారి జోగేంద్ర సింగ్ (42) శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ శేఖర్ తెలిపారు. జోగేంద్ర సింగ్, అతని భార్య రేఖారాణి ఇద్దరూ శనివారం రాత్రి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన జోగేంద్ర సింగ్ క్షిణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేఖారాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
ఆరుగురి జీవితాల్లో రమా‘ కాంతులు’
అనంతపురం సిటీ: జీవించినంత కాలమూ వృత్తినే దైవంగా భావిస్తూ వచ్చిన మాజీ జర్నలిస్ట్ ఎస్ఆర్ రమాకాంతరెడ్డి (50) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆరుగురి జీవితాలకు... శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన రమాకాంతరెడ్డికి భార్య సరస్వతి, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె భావన, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు విఖ్యాత్ ఉన్నారు. గతంలో టీవీ 9, సాక్షి టీవీల్లో కెమెరామెన్‌గా పని చేశారు. వివాదాలకు దూరంగా ఉంటూ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సచివాలయ సిరికల్చర్ టెక్నీషియన్ అసిస్టెంట్‌గా ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఈ నెల 20న అనంతపురంలోని టీవీ టవర్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న రమాకాంత్‌రెడ్డిని యూ–టర్న్ వద్ద వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు నిర్ధారించారు. అంతటి విషాదంలోనూ కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవదానానికి ముందుకు వచ్చారు. కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమన్వయంతో ఆయన కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయాన్ని దానం చేశారు. దీంతో ఆరుగురికి కొత్త జీవితం లభించింది. పిల్లల చదువులకు పూర్తి సహకారంతో పాటు కారుణ్య నియామకం కింద ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జర్నలిస్టులు, సహచర ఉద్యోగులు కోరుతున్నారు. సోమవారం పెనుకొండలోని హిందూ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఉత్సాహంగా ఉట్ల పరుష
పరిగి: భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న బాలిరెడ్డిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఉట్లమాను పరుష ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతసేవ, సహస్రనామార్చన, కుంకుమార్చన, ఆకు పూజలు చేపట్టారు. రైతులు ఎద్దుల బండ్లను విశేషంగా అలంకరించి ఊరేగింపుగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సాయంత్రం ఉట్లపరుష కోలాహలంగా సాగింది. ఉట్లమాను ఎక్కేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో వారు చేసిన విన్యాసాలు ఆసక్తి రేకెత్తించాయి. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
వినియోగదారులకు షాక్
అనంతపురం టౌన్: విద్యుత్ చార్జీలు పెంచబోమంటూనే చంద్రబాబు ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోంది. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో అల్లాడిపోతున్న ప్రజలపై డెవలప్మెంట్ చార్జీల పేరిట మరో భారం మోపింది. వినియోగం అధికంగా ఉందంటూ గృహ విద్యుత్ వినియోగదారులపై బిల్లుతోపాటు అదనంగా డెవలప్మెంట్ చార్జీలను కిలో వాట్‌కు రూ.2,350 చొప్పున బాదుతోంది. వినియోగాన్ని బట్టి కొంతమంది వినియోగదారులకు రెండు నుంచి మూడు కిలోవాట్లకు డెవలప్మెంట్ చార్జీల భారం వేస్తోంది. నెలవారీ బిల్లుతోపాటే డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. లక్ష మందిపై భారం అనంతపురం జిల్లాలో 8.15 లక్షలు, శ్రీసత్యసాయి జిల్లాలో 6.79 లక్షల గృహ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఈ జూలై నెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష మంది వినియోగదారులకు పైగానే డెవలప్మెంట్ చార్జీల భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం మోపింది. ఒక్కో వినియోగదారునికి రూ.2,350 నుంచి రూ.8వేల వరకు డెవలప్మెంట్ చార్జీల పేరుతో షాక్ ఇచ్చింది. ఓ వైపు ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ తీసుకువచ్చామంటూ విద్యుత్ శాఖ మంత్రి ఊదరగొడుతున్నారు. విద్యుత్ బిల్లుపై యూనిట్‌కు పైసల్లో తగ్గించి.. డెవలప్మెంట్ పేరిట వేలాది రూపాయాలు వసూళ్లు చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ నెల బిల్లుతోపాటే డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలని, లేకుంటే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామంటున్నారని వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డెవలప్మెంట్ చార్జీలను వేయాలని కోరుతున్నారు. వినియోగం మేరకు చార్జీలు విద్యుత్ వినియోగించిన మేరకే డెవలప్మెంట్ చార్జీల వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా అధికంగా విద్యుత్ వినియోగించిన వినియోగదారులకు మాత్రమే చార్జీలు వేశారు. తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న వారికి డెవలప్ మెంట్ చార్జీలు వేసి ఉంటే.. అలాంటి వారు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. బిల్లుల చెల్లింపులో వినియోగదారులు విద్యుత్ ఉద్యోగులకు సహకరించాలి. – శేషాద్రి శేఖర్, ఎస్ఈ, విద్యుత్ శాఖ అనంతపురం రూరల్ మండలం తపోవనం శివాలయం దగ్గర ఉన్న ఈ షాపు రెండేళ్లుగా మూతపడింది. షాపు యజమాని ఈశ్వరమ్మ ప్రతి నెలా కరెంటు (సర్వీస్ నంబర్ 7111201048364) బిల్లు చెల్లిస్తోంది. విద్యుత్ వినియోగం లేని ఈ షాప్‌కు డెవలప్మెంట్ చార్జీలు రూ.4,550 చెల్లించాలంటూ బిల్లు జారీ చేశారు. వినియోగం పెరిగిందని చార్జీల మోత ఒక కిలో వాట్‌కు రూ.2,350 మేర డెవలప్మెంట్ చార్జీ ఇదేం బాదుడు బాబోయ్ అంటున్న వినియోగదారులు అనంతపురంలోని బళ్లారి రోడ్డు వేదగాయత్రి దేవాలయం దగ్గర నివాసముంటున్న వి.తేజానాయక్ ఇంటికి విద్యుత్ (సర్వీస్ నంబర్ 7111201208300) వినియోగం అధికంగా ఉందంటూ ఇప్పటికే అధికారులు రెండు పర్యాయాలు డెవలప్మెంట్ చార్జీలు వేశారు. ఈ జూలైలో మరోసారి డెవలప్మెంట్ చార్జీల కింద రూ.4,550 వేశారు. ఓ వైపు బిల్లు.. మరోవైపు డెవలప్మెంట్ చార్జీలబాదుడుతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రొద్దం: మండల పరిధిలోని పెద్దమంతూరు పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నాలుగు ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి హిందూపురం: మండలంలోని అప్పలకుంట గేట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. హిందూపురం రూరల్ పోలీసుల వివరాలమేరకు.. సంతేబిదనూరుకు చెందిన ముబారక్ (30)తో పాటు మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై తూమకుంట నుంచి హిందూపురం వైపునకు వస్తున్నారు. అయితే అప్పలకుంట గేట్ వద్ద తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఘటనలో ముబారక్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన మరో వ్యక్తిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన ప్రదేశాన్ని హిందూపురం రూరల్ ఏఎస్ఐ శ్రీరాములు, సిబ్బంది పరిశీలించారు. గొర్రెల కాపరి ఆత్మహత్య డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): డీ.హీరేహాళ్ మండలంలోని బాదనహాళ్ గ్రామ శివారులో గొర్రెల కాపరి బోయ శివరుద్ర (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాలమేరకు... శివరుద్ర గొర్రెలు మేపుతూ జీనవం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన, బాదనహాల్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పొలంలో వేపచెట్టుకు లుంగీతో ఉరివేసుకొని కనిపించాడు. విషయాన్ని గమనించిన గొర్రెల కాపరులు గ్రామస్తులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి ఇద్దరు కుమారైలు ఉన్నారు. మృతుడి భార్య అమృత ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్‌కు తరలించారు. మృతుడి తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనారోగ్యంతో మహిళ .. రాప్తాడు రూరల్: అనారోగ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాప్తాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పామిడి మండలం ఖాదర్‌పేటకు చెందిన లేట్ బుసా చంద్రశేఖర్‌రెడ్డి భార్య బుసా చంద్రకళ (50) ప్రస్తుతం రాప్తాడు మండలం ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. పది రోజులుగా ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆహారం కూడా సరిగా తీసుకోలేకపోతున్నారు. దీంతో కుమార్తె బుసా వీర భార్గవి, మేనత్త ఉషారాణి కలిసి వివిధ ఆస్పతుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. మనస్తాపానికి గురైన చంద్రకళ శనివారం రాత్రి ఇంటి హాలులోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలాన్ని ఆదివారం పరిశీలించారు. భార్గవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ‘టెట్’కు హాజరయ్యే టీచర్లకు ఓడీ ఇవ్వాలిఅనంతపురం ఎడ్యుకేషన్: టెట్–2026 పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ (ఓడీ) సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాఖాపరమైన (డిపార్ట్మెంటల్) పరీక్షలకు హాజరయ్యే సమయంలో ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తోందని వారు గుర్తు చేశారు. -
ఫుట్‌బాల్ టోర్నీ విజేత ‘శ్రీసత్యసాయి’
అనంతపురం: అనంతపురం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏడీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగిన ఏపీ రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా శ్రీసత్యసాయి జిల్లా జట్టు నిలిచింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ టోర్నీ ఆదివారంతో ముగిసింది. ఫైనల్స్‌లో తూర్పుగోదావరి జట్టుతో తలపడిన శ్రీసత్యసాయి జట్టు క్రీడాకారులు ఆఖరి క్షణం వరకూ విజయం కోసం శ్రమించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి క్షణంలో శ్రీసత్యసాయి జట్టు ఒక్క గోల్ సాధించి విజయకేతనం ఎగురవేసింది. అలాగే మూడో స్థానం కోసం అనంతపురం, కర్నూలు జట్లు తలపడగా.. అనంతపురం బాలికలు ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. కర్నూలు క్రీడాకారులను ముప్పుతిప్పలు పెడుతూ 0–4 గోల్స్ తేడాతో విజయకేతనం ఎగుర వేశారు. దీంతో నాల్గో స్థానంతో కర్నూలు జట్టు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముగింపు కార్యక్రమానికి ఎన్ఐసీ కోచ్ ఇస్మాయిల్ (పోలీస్ ఇన్స్పెక్టర్), ఏడీఎఫ్‌ఏ అధ్యక్షుడు దాదాఖలందర్,ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కోశాధికారి మల్లేష్, కృష్ణా జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ హాజరై, విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేసి, అభినందించారు. మడకశిర: మడకశిర కెనరా బ్యాంక్‌లో వెలుగు చూసిన దా‘రుణ’ బాగోతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని ఇతర బ్యాంకుల అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కెనరా బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి వందలాది మంది రుణాలు తీసుకున్నారు. ఈ ఆభరణాలను ఏటా ఆడిట్ అధికారులు పరిశీలిస్తారు. అందులో భాగంగానే ఇటీవల ఆభరణాలను తనిఖీ చేయగా బండారం బయటపడింది. సూత్రధారి బ్యాంక్ అప్రైజరే.. మడకశిర కెనరా బ్యాంక్ అప్రైజర్ సుందరేశ్ చారి కొంతమందితో కుమ్మక్కై నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు.గుడిబండ మండలం ఎస్.రాయాపురం గ్రామానికి చెందిన సుందరేశ్ చారి కొన్నేళ్ల నుంచి బ్యాంకులో అప్రైజర్‌గా పని చేస్తున్నాడు. ఇతను 12 మంది ఖాతాదారులకు నకిలీ బంగారు ఆభరణాల ద్వారా రూ.70.66 లక్షల రుణాలు మంజూరు చేయించి బ్యాంకుకు టోకరా వేశాడు. మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామానికి చెందిన బీ.సత్యనారాయణ పేరున రెండు ఖాతాలు తెరిచి రూ.8.49 లక్షలు కాజేశాడు. అలాగే, మడకశిరకు చెందిన ఎస్.బాలక్రిష్ణ పేరున రెండు అకౌంట్లు తెరిచి రూ.13.58 లక్షలు, హరేసముద్రం గ్రామానికి చెందిన ఏజీ రత్నమ్మ పేరున రెండు ఖాతాలు తెరిచి రూ.9.70 లక్షలు, గొల్లహట్టికి చెందిన జీ.ప్రకాశ్ పేరున రెండు ఖాతాలు ఓపెన్ చేసి రూ.15.80 లక్షలు, హరే సముద్రం గ్రామానికి చెందిన ధనుంజయ పేరుపై రెండు ఖాతాలు తెరిచి రూ.11.39 లక్షలు, జిల్లేడుగుంట గ్రామానికి చెందిన డీ. అడివన్న ఖాతా ద్వారా రూ.5 లక్షలు, హరేసముద్రం గ్రామా నికి చెందిన చిన్నపూజారి ధనుంజయ ఖాతా ద్వారా రూ.6.70 లక్షలు.. ఇలా మొత్తం 12 మందికి రూ.70.66 లక్షలు మంజూరు చేయించాడు. ఆ తర్వాత అందరూ కలిసి పంచుకుతిన్నారు. మడకశిర నియోజకవర్గంలో వివిధ బ్యాంకుల బ్రాంచ్‌లు దాదాపు 30 ఉన్నాయి. అన్ని బ్యాంకుల్లో బంగారు ఆభరణాలపై రూ.కోట్లలో రుణాలు మంజూరు చేశారు. కెనరా బ్యాంకులో బాగోతం నేపథ్యంలో ఆయా బ్యాంకుల అధికారులు అప్రమత్తమైనట్లు తెలిసింది. బంగారు ఆభరణాలను పరిశీలించడానికి ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. పరారీలో నిందితులు.. నకిలీ ఆభరణాల తాకట్టు వ్యవహారంపై కెనరా బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసులు మడకశిర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అప్రైజర్ సుందరేశ్‌చారితో పాటు రుణాలు పొందిన సత్యనారాయణ, చిన్నపూజారి ధనుంజయ, అడివన్న, ధనుంజయ, ప్రకాశ్, రత్నమ్మ, బాలక్రిష్ణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. బాగోతం వెలుగులోకి రాగానే నిందితులందరూ పరారయ్యారు. నిందితులను పట్టుకుంటాం కెనరా బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. త్వరలోనే అరెస్ట్ చేస్తాం. –కృష్ణారెడ్డి, ఎస్ఐ, మడకశిర -
ఎల్‌నినో పడగలో పాడి
చిలమత్తూరు: ఎల్‌నినో మహమ్మారి జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు సైతం అడుగంటిపోతుండటంతో పంటల సాగు అంతకంతకూ తగ్గిపోతోంది. ఈ క్రమంలో పాడి రంగం కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పశుగ్రాసం కొరత, దాణా సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో వేలాది మంది పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 38.10 లక్షల పశువులు ఉన్నట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రైతులు ఉద్యాన పంటల వైపు వెళుతుండటంతో గ్రాసం కొరత వేధిస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే మేత లభిస్తుండగా, రానున్న రోజుల్లో అంతటా పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రాసం కొరతతో పాడి ఉత్పత్తి తగ్గడమే కాకుండా, పశువుల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కమ్యూనిటీ ఫాడర్ డెవలెప్మెంట్ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది కాగితాల్లోనే కనిపిస్తోంది. అధికారులు కాన్ఫరెన్స్‌లకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశు సంవర్ధకశాఖ ద్వారా ఈ సారి దాణా పంపిణీ కూడా ఉండదని తెలిసింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో పశు గ్రాసం కోసం రైతులు మరింత అల్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మొద్దునిద్ర రెండు నెలలుగా ఎల్‌నినో దుష్ప్రభావంపై వాతావరణశాఖ హెచ్చరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది. రాయితీతో సైలేజ్ గడ్డి, దాణామృతం (టీఎంఆర్) ఇవ్వడం లేదు. పశుదాణా (కాన్సట్రేటెడ్ క్యాటిల్ ఫీడ్) ఊసే లేదు. దీంతో పాడి రైతులు జీవాలను ఇతర ప్రాంతాలకు మేత కోసం తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పరిస్థితి విషమించాక చివర్లో కంటితుడుపు చర్యలు చేపట్టినా ఫలితం ఉండదని రైతులు, కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంచుకొస్తున్న పశు గ్రాస సంక్షోభం ముందస్తు చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం తీవ్ర ఆందోళనలో రైతాంగం -
45 ఏళ్ల తర్వాత అ‘పూర్వ’ సమ్మేళనం
హిందూపురం టౌన్: పట్టణంలోని నేతాజీ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో 1980–81 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక సువర్ణ భారతి కళాశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు నాలుగు దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ చిన్ననాటి అనుభవాలు, పాఠశాల జ్ఞాపకాలు, గురువులతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అప్పట్లో వారికి సోషల్ స్టడీస్ బోధించిన ఉపాధ్యాయులు కల్లూరు జానకిరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు కల్లూరు జానకీ రామారావు తెలుగులో అనువదించిన మంకుతిమ్మన కగ్గ పద్యకావ్యం 2వ భాగాన్ని పట్టణ వన్‌టౌన్ సీఐ రాజగోపాల్‌నాయుడు, టూటౌన్ సీఐ కరీం, తదితర విశ్రాంత ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. సమ్మేళనంలో కల్లూరు రాఘవేంద్రరావు, సువర్ణ భారతి కళాశాల ఏఓ అనిల్ కుమార్, కేకే వెంకటేష్, డాక్టర్ రామచంద్రరావు పాల్గొన్నారు. -
సాగునీటి హక్కుల కోసం పోరాటం
కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): రాయలసీమ ప్రాంతానికి దక్కాల్సిన సాగు, తాగునీటి హక్కుల కోసం కలసికట్టుగా పోరాటాన్ని సాగిద్దామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. నీటి హక్కుల సాధన కోసం ఈ నెల 30న చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం ఆయన న్యామద్దలకు వెళ్లి పార్టీ నాయకులు, రైతులతో చర్చించారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా మన ప్రాంతానికి దక్కాల్సిన నీటిని దక్కకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. హంద్రీనీవా జలాల వాటా పెంచకపోవటంతో పాటు లైనింగ్ పనులతో ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టికొట్టారన్నారు. సాగు, తాగునీరు లేక ఈ ప్రాంత రైతులు, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేసేందుకు పాదయాత్రను చేపడుతున్నామన్నారు. న్యామద్దల సమీపంలోని హంద్రీనీవా కాలువపై 34 కి.మీ. రాయి వద్ద నుంచి ప్రారంభించే ఈ పాదయాత్రలో జిల్లాలోని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, సమన్వకర్తలతో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరవుతున్నారన్నారు. పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు న్యామద్దల రామకృష్ణారెడ్డి, వెంకటంపల్లి సత్యనారాయణరెడ్డి, ఎర్రోనిపల్లి చన్నప్పయ్య, ప్యాదిండి నరసింహారెడ్డి, చెన్నేకొత్తపల్లి ఎస్టీడీ శీనా, చిన్నా, ప్రకాష్, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 30న చలో న్యామద్దలను విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపు -
నాడు ఆదర్శం.. నేడు అధ్వానం
పుట్టపర్తి టౌన్: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 2020లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశారు.వ్యవసాయం, పట్టు, పాడి, పశుపోషణ, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్, ఏపీఎంఐపీ తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రైతులను ఆదుకున్నారు. ‘విత్తు నుంచి విపత్తు వరకు’ నినాదంతో పక్కాగా ప్రణాళికలు అమలు చేస్తూ అడుగడుగునా అన్నదాతలకు అండగా నిలిచారు. అప్పట్లో ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవలను దేశంలో ఉన్న పలు రాష్ట్రాల ప్రతినిధులు, అలాగే విదేశీ బృందాలు పరిశీలించి ప్రశంసలు గుప్పించారు. చంద్రబాబువన్నీ ప్రగల్బాలే.. చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన ప్రభుత్వం ఆర్బీకేలను ఆర్‌ఎస్‌కేలుగా పేరు మార్చేసింది. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ఆర్ఎస్కేలను నిర్వీర్యం చేస్తోంది. ఏడాది క్రితం హేతుబద్ధీకరణ పేరుతో ఆర్ఎస్కేల సంఖ్యను తగ్గించేసింది. గతంలో విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు, రైతు భరోసా, పీఎం కిసాన్, పశువుల మందులు, ఈ–క్రాప్, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పావలా వడ్డీ, సున్నా వడ్డీ... ఇలా రైతులకు సంబంధించి ఏది కావాలన్నా అక్కడికి వెళితే తెలిసేవి. దీంతో రైతులతో ఆర్బీకేలు కళకళలాడేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రైతులు పెద్దగా అటువైపు వెళ్లడం లేదు. రెండేళ్లు తిరగకుండానే పరిస్థితి ఒక్కసారిగా తలకిందులు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంపై మండిపడుతున్నారు. జగన్ హయాంలో రైతులకు విశిష్ట సేవలందించిన ఆర్బీకేలు అధికారంలోకి వచ్చాక అధ్వానంగా మార్చిన చంద్రబాబు ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో రైతు సేవలకు కత్తెర వేసిన వైనం -
చెట్లకు నిప్పు .. పర్యావరణానికి పెనుముప్పు
వజ్రకరూరు: మండల కేంద్రమైన వజ్రకరూరు సమీపంలోని ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారు. దీంతో పచ్చని చెట్లు కాలిపోతున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లకు కావాలనే నిప్పు పెడుతున్నారా, లేక ఇతర కారణాల వల్ల నిప్పు పెడుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. అధికారులు తక్షణమే స్పందించి ఉరవకొండ – గుంతకల్లు ప్రధాన రహదారిలో ఉన్న చెట్లను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆరోగ్యకర దేహంతోనే స్వచ్ఛమైన ఆలోచనలు
ప్రశాంతినిలయం: శరీరం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే స్వచ్ఛమైన ఆలోచనలు పుడతాయని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పేర్కొన్నారు. పుట్టపర్తిలో ఆదివారం నిర్వహించిన ‘శ్రీ సత్యసాయి 5కే రన్ అండ్ రైడ్–ఏ స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ఉదయం 5.30 గంటలకు ఆర్జే రత్నాకర్ రాజు, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండేలు లాంఛనంగా జెండా ఊపి రన్ అండ్ రైడ్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ అమోల్ మంజుందార్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ సువర్ణ, హిమవాహినీ రత్నాకర్, కమలాపాండ్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ దేశంలోని 45 ప్రధాన నగరాల్లో ఇప్పటి వరకూ నిర్వహించిన రన్ అండ్ రైడ్‌లో 1.20 లక్షల మంది పాల్గొన్నారన్నారు. తాజాగా పుట్టపర్తిలో 19 వేల మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. పని ఒత్తిడి కారణంగా చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, సత్యసాయి బాబా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ● హిల్‌వ్యూ స్టేడియంలో ప్రారంభమైన 5కే రన్ అండ్ రైడ్ ఎనుములపల్లి గణేష్ సర్కిల్, పెట్రోలు బంకు, పెద్ద కమ్మవారిపల్లి రోడ్ మీదుగా తిరిగి హిల్‌వ్యూ స్టేడియం చేరుకుంది. దారి వెంబడి భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా చర్యలు తీసుకున్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్ సేవలు, తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పుట్టపర్తిలో ఉల్లాసంగా 5కే రన్ అండ్ రైడ్ గ్లోబల్ మెడికల్ క్యాంప్ ప్రారంభంప్రశాంతినిలయం: గురుపౌర్ణమిని పురస్కరించుకుని పుట్టపర్తి ప్రశాంతినిలయంలో గ్లోబల్ మెడికల్ క్యాంప్‌ను ఆదివారం ప్రారంభించారు. ప్రశాంతినిలయంలోని నార్త్ –1 భవన్లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు సత్యసాయి బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు వైద్య శిబిరం కొనసాగు తుందన్నారు. దేశ విదేశాలకు చెందిన 70 మందికి పైగా వైద్యులు, 40 మంది పారామెడికల్ నిపుణులు, 80 మంది ఆరోగ్య సిబ్బంది సేవలందిస్తారన్నారు. ఈఎన్టీ, గుండె జబ్బులు, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, కంటి, దంత వైద్యం, మానసిక ఆరోగ్యం, పిల్లల వైద్యం, పాదాల వైద్యం, మధుమేహంతో పాటు అవసరమైన ల్యాబ్ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రత్నాకర్ రాజు కోరారు. -
నేడు పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: మామిళ్లకుంట క్రాస్‌లోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meeskosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. నేడు ఎస్కేయూ పాలక మండలి సమావేశం ● ఎజెండాలో లేని రిజిస్ట్రార్ నియామకం అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ (ఎస్కేయూ) పాలక మండలి సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రార్ నియామకం జరిగింది. అయితే అసోసియేట్ ప్రొఫెసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో ఉన్న వారిని రిజిస్ట్రార్‌గా నియమించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా రీసెర్చ్ కమ్ స్టాటస్టికల్ ఆఫీసర్‌గా ఉన్న రమేష్‌బాబును నియమించడం విమర్శలకు తావిచ్చింది. ప్రాధాన్యత లేని పోస్టు నుంచి ఏకంగా రిజిస్ట్రార్ పదవిలోకి వచ్చి.. అధికార దుర్వినియోగానికి పాల్పడు తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు పదవీ కాలం కూడా ముగుస్తోంది. కొత్త రిజిస్ట్రార్ నియామకంపై నేటి పాలక మండలి సమావేశంలో చర్చిస్తారని అందరూ భావించగా.. అజెండాలో ఆ అంశమే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీబీ డ్యాంలో 31 టీఎంసీల నీరు బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుండటంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం 31.18 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 1,633 అడుగులకు గాను 1,606.50 అడుగల మేర నీటిమట్టం ఉంది. ఇన్‌ఫ్లో 12,869 క్యూసెక్కులుండగా.. 3,561 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,625.43 అడుగులతో 77.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రధానితో చర్చలో ‘అనంత’ యువతఅనంతపురం అర్బన్: వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమంపై ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన చర్చావేదికలో అనంతపురం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 20 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. వీరితో ప్రధాని ముచ్చటించారు. సరిహద్దు గ్రామాల్లో వారు పొందిన అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతకు కలెక్టర్ ఆనంద్ అభినందనలు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమంలో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించిన మైత్రి అనే అమ్మాయిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ‘మై భారత్ ప్రోగ్రాం’ సూపర్వైజర్ జి.శ్రీనివాసులు, కో–ఆర్డినేటర్ బిసాతి భరత్, ఆన్సెట్ మేనేజర్ సి.శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాతి జీవన్‌కుమార్, జయమారుతి, వలంటీర్లు అంబరీష్, రాము, సాయికార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
నేర నియంత్రణలో రాజీ లేదు
పుట్టపర్తి టౌన్: ‘‘నేరస్తులకు పోలీసులంటే భయం ఉండాలి. నేర నియంత్రణలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రజల భద్రతే మన తొలి బాధ్యత కావాలి’’ అని ఎస్పీ సతీష్‌కుమార్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. శనివారం స్థానిక సాయి ఆరామంలో ఎస్పీ సతీష్‌కుమార్ అధ్యక్షతన పోలీసుశాఖ అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, చోరీలు, గ్రేవ్, నాన్‌గ్రేవ్, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, పెండింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. అనంతరం పెనుకొండ జాతీయ రహదారిపై జరిగిన దోపిడీ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన పోలీసులకు, గ్యాంగ్ రేప్ కేసులో కీలకంగా పనిచేసిన పోలీస్ అధికారులతో పాటు వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ... పెండింగ్ ఉన్న వివిధ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. చోరీల నియంత్రణలో మరింత కఠినంగా వ్యవహరించడంతో పాటు ప్రాపర్టీ కేసుల రికవరీ పెంచాలన్నారు. సమాజానికి హానికరంగా మారే పాత నేరస్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని, అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేసేందుకు వెనకాడవద్దని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నేరాలు, ప్రాపర్టీ నేరాలు, చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాల కేసుల్లో దర్యాప్తులో వేగవంతం చేయాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేయాలన్నారు. పాత నేరస్తులు, నూతన వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. సీసీ కెమెరాలపై అవగాహన కల్పించి దేవాలయాల్లో, వీధుల్లో, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ శ్రీరామ్‌నాయక్ మాట్లాడుతూ... భారతీయ నాగరిక సురక్ష సంహితతోపాటు కొత్తగా వచ్చిన చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలన్నారు. సాక్ష్యాలు శాసీ్త్రయంగా సేకరించి కోర్టులో దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, డీఎస్పీలు కేవీ మహేష్, శివన్నారాయణస్వామి, పోలీసు న్యాయ సలహాదారు సాయినాథ్‌రెడ్డి, ఏఓ వేణుగోపాల్, పబ్లిక్ ప్రాసెక్యూటర్లు దర్గాదేవి, శ్రీనివాసులు, నాగేష్, భాను, సుచిత్ర, ఆదినారాయణమ్మ, ప్రత్యూష,తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భద్రతే పోలీసుల తొలి బాధ్యత నేర సమీక్షలో ఎస్పీ సతీష్‌కుమార్ -
విస్తృతంగా మొక్కలు నాటుదాం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో పచ్చదనం మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఆయన పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లిలో అధికారులు, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్, తహసీల్దార్ సంహిత, ఏపీడీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రశాంతి నిలయం: యువతలో వృత్తి నైపుణ్యాలను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న ‘ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్–2026’కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన యువత tinyurl.com లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి హరికృష్ణతో కలిసి ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్ పోస్టర్లు ఆవిష్కరించారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారన్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఇతర సంప్రదాయ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి హిందూపురం టౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. పట్టణంలోని డీబీ కాలనీలోని మినీ మార్కెట్ ఆవరణలో సుజాత నిర్వహణలో ఏర్పాటు చేసిన ‘మల్టీ–ప్రొడక్ట్ స్టోర్ హంస’ ఎకో షాప్‌ను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు మానవ ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. ‘ప్లాస్టిక్ నిషేధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం‘ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు, స్వయం ఉపాధి ద్వారా పర్యావరణ అనుకూల వ్యాపారానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఎకో షాపుల ద్వారా ప్రత్యామ్నాయ ఉత్పత్తులను ప్రజలకు తక్కువ ధరలోనే అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మెప్మా పీడీ నాగరాజు, తహసీల్దార్ వెంకటేశు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం కనగానపల్లి: కనగానపల్లి సమీపంలో శనివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం అక్కంపల్లికి చెందిన శ్రీనివాసులు (39) ద్విచక్ర వాహనంపై తగరకుంట వైపు నుంచి కనగానపల్లికి వెళ్తున్నాడు. అదే సమయంలో యలకుంట్ల గ్రామానికి చెందిన బాలరాజు (26) మరో ద్విచక్ర వాహనంపై కనగానపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. తీరా కనగానపల్లి వద్ద పండమేరు బ్రిడ్జి దాటిన తర్వాతా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరూ కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శ్రీనివాసులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, బాలరాజును స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ప్రమాద ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేత గోరంట్ల: ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 240 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. శనివారం మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. అనంతపురానికి చెందిన సతీష్‌ను అరెస్టు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని, ఐచర్‌ను సీజ్ చేశారు. దాడుల్లో డీటీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. రథోత్సవం
హిందూపురం: ముదిరెడ్డిపల్లి వెలసిన రుక్మిణీ పాండురంగ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తొలి ఏకదశిని పురస్కరించుకుని రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం మూలవిరాట్ పాండురంగస్వామికి పంచామృతాభిషేకాలతో విశేష అలంకరణలు చేశారు. అలాగే రుక్మిణీ పాండురంగస్వామికి మడుగుతేరు, మండల పూజ, నవగ్రహ, మృత్యుంజయ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం రథం ఎదుట పూజలు నిర్వహించి మేళతాళాలతో లక్ష్మీ సమేత పాండురంగస్వామి ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం నిర్వహించి రథంలో కొలువుదీర్చారు. వేదపండితుల పూజల అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. భారీగా హాజరైన భక్తులు రథం లాగేందుకు పోటీపడ్డారు. సాయంత్రం హరినామ సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ జయప్ప, పల్లా లక్ష్మీకుమార్, రామాంజనేయులు, బాలాజీ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సర్.. అంతా అంకెల గారడీ
పుట్టపర్తి అర్బన్: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో అధికార యంత్రాంగం అంకెల గారడీ చేస్తోంది. ఈ నెల 18వ తేదీ నాటికే జిల్లాలో 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ పూర్తయ్యిందని ఘనంగా ప్రకటించింది. అంటే ఆ రోజుకు ఉన్న ఓటర్ల లెక్కలే ఫైనల్ కావాలి. కానీ తాజాగా శనివారం విడుదల చేసిన ఓటరు జాబితాలోని లెక్కలు చూస్తే భారీ తేడాలున్నాయి. దీంతో ఈనెల 31న విడుదల చేస్తున్న ముసాయిదా ఓటరు జాబితాపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పెరిగిన మృతుల సంఖ్య.. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన జాబితాలో డెత్ ఓటర్లు 53,791 మంది ఉండగా... శనివారం విడుదల చేసిన జాబితాలో 55,068 ఉన్నట్లు చూపారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత కొత్తగా 1,277 మంది మృతులు ఎక్కడి నుంచి వచ్చారని జనం చర్చించుకుంటున్నారు. ఇతరులూ పెరిగి...తరిగారు.. రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఇతర ఓటర్ల సంఖ్య 72 మాత్రమే ఉండేది. కానీ ఈ నెల 18వ తేదీ నాటికి ఇతర ఓటర్ల సంఖ్య 305కి చేరింది. అయితే శనివారం నాటికి వారి సంఖ్య 152 మాత్రమే ఉంది. ఇంటివద్ద లేని ఓటర్ల సంఖ్యలోనూ తేడాలు.. జిల్లాలో ‘సర్’ కార్యక్రమానికి ముందు జిల్లాలో మొత్తం 14,23,839 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈనెల 18వ తేదీన విడుదల చేసిన జాబితాలో ఇంటి వద్ద లేని ఓటర్లు 33,476 మంది ఉన్నట్లు గుర్తించారు. శనివారం విడుదల చేసిన జాబితాలో 30,686 మంది ఉన్నట్లు చూపారు. అయితే ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత కొత్తగా 2,790 మంది తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈనెల 18 నాటికి పత్తా లేని ఓటర్లు (శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఆల్ రెడీ ఎన్రోల్ చేయించుకున్న వారు, ఇంటి వద్ద లేని ఓటర్లనంతా కలిపి) 1,15,364 మందిని చూపారు. శనివారం నాటికి వారి సంఖ్య 1,09,108 మందికి తగ్గించారు. ఇలా అధికారుల విడుదల చేస్తున్న అంకెల్లో భారీ మార్పులు ఉండడంతో ముసాయిదా జాబితా నాటికి జాబితాలో ఎంత మందిని ఓటర్లుగా తేలుస్తారో...ఎంత మందిని తగ్గిస్తారోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 31న ముసాయిదా జాబితా.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ పూర్తి కావడంతో ఈనెల 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. అనంతరం నెల రోజులు గడువు విధించి ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి వాటికి పరిష్కారం చూపనున్నారు. అభ్యంతరాలు తీసుకునేందుకు జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకూ గడువు విధించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు పరిష్కరించడానికి అభ్యంతరాలు స్వీకరించిన నాటి నుంచి సెప్టెంబర్ 28 వరకూ గడువు ఉంది. తుది ఓటరు జాబితా అక్టోబర్ 3వ తేదీన ప్రచురించనున్నారు. జిల్లా ఓటర్లు ఇలా.. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,23,839 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మడకశిర నియోజక వర్గంలో 2,13,309 మంది, హిందూపురం నియోజక వర్గంలో 2,53,239 మంది, పెనుకొండ నియోజక వర్గంలో 2,38,566 మంది, పుట్టపర్తి నియోజక వర్గంలో 2,13,345 మంది, ధర్మవరంలో 2,48,185 మంది, కదిరి నియోజక వర్గంలో 2,57,195 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాలో ఎంత మంది ఓట్లు గల్లంతవుతాయోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. ఓటు లెక్కలు.. అన్నీ తప్పులు! రోజురోజుకూ పెరిగిన మృతుల సంఖ్య వారం రోజుల్లో పెరిగిన మృతులు 1,277 మంది ఇంటివద్దలేని ఓటర్లలోనూ 2,790 మంది తగ్గింపు అధికారుల పొంతన లేని లెక్కలపై జనం పెదవి విరుపు ముసాయిదా ఓటరు జాబితాపై సర్వత్రా ఆందోళన సర్ సర్వే తర్వాత అందుబాటులో లేని వారి జాబితా ఇలా... -
తొలి పండుగ.. ఆధ్యాత్మికం మెండుగ
కదిరి టౌన్: హిందువులు విశిష్టమైన పర్వదినంగా భావించే తొలి ఏకాదశి సందర్భంగా శనివారం వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే ఆలయాల ఎదుట బారులు తీరిన భక్తులు... ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనంతో పులకించిపోయారు. ఆయా ఆలయ కమిటీల సభ్యులు భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ చేశారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తొలి పండుగ రోజు జిల్లా ఆధ్యాత్మికశోభతో కాంతులీనింది. నమో నారసింహ కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ‘ఓం నమో నారసింహ’ నామస్మరణతో ప్రతిధ్వనించింది. శనివారం, తొలిఏకాదశి కలిసి రావడంతో కదిరి పరిసరాల ప్రాంతాల నుంచే కాకుండా చిత్తూరు, వైస్సార్ కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఖాద్రీశున్ని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వైభవంగా తొలిఏకాదశి... ఆలయాలకు పోటెత్తిన భక్తులు -
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించాలి
● చంద్రబాబు ప్రభుత్వం వెంటనే అర్హులకు న్యాయం చేయాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుకొండ రూరల్: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత, విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. విద్యార్థుల డిమాండ్ మేరకు నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారన్నారు. రాష్ట్రంలో కూడా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలిచ్చి వేలాది మంది భవిష్యత్‌ను అంధకారం చేసిందన్నారు. ఇప్పటికే పలువురు అర్హుల వయస్సు దాటిపోయిందని, వారు మరో డీఎస్పీ రాసే అవకాశం కూడా లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన తప్పు సరిదిద్దుకుని అర్హులకు న్యాయం చేయాలని, లేకపోతే జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలు రాష్ట్రంలోనూ జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ధర్మేంద్ర రాజీనామా మోదీ ప్రభుత్వ పతనానికి నాంది ● మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మడకశిర: మోదీ ప్రభుత్వ పతనానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నాంది అని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శనివారం ఆయన తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో విలేకర్లతో మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. జంతర్ మంతర్ వద్ద సాగిన ఉద్యమం విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చిందన్నారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరు ఎంతో అమోఘమని కొనియాడారు. నీట్ పేపర్ లీక్‌తో పాటు ఇతర పేపర్ లీకులు, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. ఇందులో బీజేపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పాము కాటుతో వీఆర్ఏ మృతి తలుపుల: మండలంలోని పులిగుండ్లపల్లి వీఆర్ఏ దేవదాసు (46) పాముకాటుకు గురై శనివారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన మేరకు.. దేవదాసు శనివారం విధులు ముగించుకొని నేరుగా తన పొలం వద్దకు వెళ్లారు. పనులు చేస్తున్న క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. వెంటనే ఇంటికి వచ్చి తలుపులలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందేలోపు మృతి చెందాడు. మృతుడికి భార్య సలేమా సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మా నాన్నను చంపి మాపైనే కేసు పెట్టారు
పుట్టపర్తి టౌన్: ‘‘అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన మా నాన్నను టీడీపీ నాయకులు కొట్టి చంపితే...పోలీసులు మాపై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు స్థానిక పోలీసులు తలొగ్గారు. మీరైనా మాకు న్యాయం చేయండి’’ అని ఇటీవల హత్యకు గురైన కనగానపల్లికి చెందిన అంకె నగేష్ కుటంబీకులు అఖిల, కావ్య, పురుషోత్తం, లక్ష్మణ్, గోపాల్, అశోక్ తదితరులు ఎస్పీ సతీష్‌కుమార్‌ను కోరారు. శనివారం వారు పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ.. విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరిని వదిలేశారు.. ఈ ఏడాది జూలై 21వ తేదీన అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన పాపానికే తమ తండ్రిని టీడీపీ కార్యకర్తలు కొట్టి చంపారని అంకె నగేష్ పిల్లలు ఆరోపించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడారు. తమ తండ్రి హత్య కేసుకు సంబంధించి తాము 11 మంది టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశామన్నారు. 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అఽధికార టీడీపీ నాయకుల ఒత్తిళ్ల తలొగ్గి 9 మందిని మాత్రమే అరెస్ట్ చేసి ఇద్దరిని వదిలేశారు. అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులు, సోదరులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపై కూడా అక్రమ కేసుసు బనాయించారు. బాధిత కుటుంబమైన తమకు అండగా ఉండి న్యాయం చేయకుండా... అక్రమ కేసు పెట్టారని వాపోయారు. అందుకే న్యాయం చేయాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ను కోరినట్లు వారు వెల్లడించారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గారు న్యాయం చేయాలని ఎస్పీని కోరిన అంకె నగేష్ కుటుంబీకులు -
బ్యాంకుకు గోల్డ్ అప్రైజర్ టోకరా
మడకశిర: స్థానిక కెనరా బ్యాంకులోని గోల్డ్ అప్రైజర్ సుందరాచారి అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం వేశాడు. నకిలీ బంగారంతో బ్యాంకును మోసం చేసి వివిధ ఖాతాల ద్వారా రూ.71 లక్షలు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కెనరా బ్యాంకులో సుందరాచారి గోల్డ్ అప్రైజర్‌గా పని చేస్తున్నాడు. నకిలీ బంగారంతో ఏడుగురికి రూ.71 లక్షలు బంగారు రుణాలు మంజూరు చేయించాడు. అనంతరం 12 ఖాతాల నుంచి రూ.71 లక్షలు డ్రా చేసుకుని అందరూ కలిసి పంచుకున్నారు. శనివారం బ్యాంకుకు వచ్చిన ఆడిట్ అధికారులు బంగారు రుణాలకు సంబంధించిన ఆభరణాలు తనిఖీ చేయగా...నకిలీ బంగారం బయటపడింది. దీంతో గోల్డ్ అప్రైజర్ సుందరాచారి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బ్యాంకు అధికారులు గోల్డ్ లోన్లకు సంబంధించిన ఆభరణాలన్నీ పరిశీలించి ఏడుగురు తనఖా పెట్టిన ఆభరణాలు మాత్రం నకిలీవని తేల్చారు. వెంటనే బ్యాంకు మేనేజర్ గోల్డ్ అప్రైజర్ సుందరాచారితో పాటు నకిలీ బంగారం తాకట్టుపెట్టిన ఏడుగురు ఖాతాదారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సీఐ రాజ్‌కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఈ ఘరానా మోసంపై ఇంకా కేసు నమోదు చేయలేదని సమాచారం. నకిలీ బంగారంతో రూ.71 లక్షల మోసం -
బడికి వెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు నిండకనే ఆలిగా, తల్లిగా బాధ్యతలు మోస్తున్నారు. సంసార సాగరం ఈదలేక కష్టాలతో సావాసం చేస్తున్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు
● జిల్లాలో పెరిగిపోతున్న బాల్య వివాహాలు ● అధికారులు అడ్డుకుంటున్నా.. ఆగని తంతు ● నగర, పట్టణాల కంటే గ్రామాల్లోనే అధికంగా ● ఆర్థిక ఇబ్బందులు.. పిల్లల ప్రవర్తనతో పెళ్లిళ్లు సాక్షి, పుట్టపర్తి: ఆడపిల్లలకు వయసు రాగానే పెళ్లి చేయాలనే ఆరాటం తల్లిదండ్రుల్లో ఎక్కువగా పెరిగిపోతోంది. ఆడపిల్ల పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని చాలా మంది భావిస్తూ వివాహాలు చేసేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అధికారులు పక్కా సమాచారంతో బాల్య వివాహాలను అడ్డుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా చాలామంది తీరులో మార్పు రావడం లేదు. ఏటా 100 పైగా బాల్య వివాహాలను అధికారులు అడ్డుకుంటున్నా.. అంతకు మించి వివాహాలు జరుగుతున్న అంచనా. గత ప్రభుత్వ చర్యలతో మార్పు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బాలికా విద్యకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారు. ఫలితంగా డ్రాపౌట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి తోడు జగనన్న చేయూత లాంటి పలు పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. పథకాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. వలసలు సైతం పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇలాంటి తరుణంలో బాలికలను చదివించేందుకే తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యతనిస్తూ రావడంతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడుతూ వచ్చింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు, యువతులపై అత్యాచారాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయి. టీడీపీ అల్లరి మూకల చేష్టలతో తమ బిడ్డల భద్రతపై తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్థిక ఇబ్బందులు.. పిల్లల ప్రవర్తనతో.. చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. పది, ఇంటర్ పూర్తి కాగానే చాలా గ్రామాల్లో అమ్మాయిలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. నగర, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరికొందరు సోషల్ మీడియాకు ప్రభావితులై చిన్న వయసులోనే పెడదోవ పడుతున్న కారణంగా బాల్యంలోనే వివాహం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శిక్షలు ఇలా.. అమ్మాయి తండ్రితో పాటు అబ్బాయి తండ్రికి రూ.లక్ష చొప్పున జరిమానాతో పాటు రెండేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. అబ్బాయి మేజర్ అయితే అతడు కూడా శిక్షార్హుడే. మైనర్ అయితే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. గతేడాది ఏప్రిల్‌లో ఇద్దరమ్మాయిలతో ఓ యువకుడి పెళ్లి పేరుతో ఓ వివాహ పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించగా.. ఆ ఇద్దరూ కవల పిల్లలని, అది కూడా మైనర్లని తేలింది. అధికారులు జోక్యం చేసుకుని పెళ్లి జరగకుండా అడ్డుకున్నారు. అయితే బాల్య వివాహాలు నేరమని ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా ఏమీ తెలియని వయసులోనే పెను భారాన్ని మోపుతున్నారు. చట్టరీత్యా నేరం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలి. గంటల వ్యవధిలో వచ్చి అడ్డుకుంటాం. బాల్య వివాహాల నియంత్రణ, బాలల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎలాంటి సమాచారం అయినా 1098 నంబరుకు తెలియజేయండి. – ప్రమీల, ఐసీడీఎస్ పీడీ -
మంచి విద్యే ఉన్నత జీవితానికి పునాది
● ఎస్పీ సతీష్‌కుమార్ రామగిరి: మంచి విద్య, ఉన్నత విలువలే పిల్లల భవిష్యత్‌కు బలమైన పునాదని ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నసనకోట సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో మెగా పేరెంట్స్ – టీచర్ మీట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదన్నారు. ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, తన తల్లిదండ్రులు ఆరో తరగతి వరకే చదివినా తాను పట్టుదలతో చదివి ఎస్పీ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ మహమ్మద్ అలీ, ఎస్ఐ ప్రదీప్రాజ్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మృతి హిందూపురం టౌన్: స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రాజగోపాల్ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. డాక్టర్ రాజగోపాల్ కుమార్తె విదేశాల నుంచి ఇంటి రావడంతో సెలవుపై ఆయన తన స్వగ్రామమైన తిరుపతికి వెళ్లారు. ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో తిరుపతిలో ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి స్థానిక వైద్యులు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఏడాది మేలో ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ నేత వేధింపులే కారణమా? ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రాజగోపాల్‌ను టీడీపీ నేత చింటు తీవ్రంగా వేధించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. శానిటేషన్ విభాగంలో చింటు కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. ఆర్థిక విషయాల్లో రాజగోపాల్‌ను వేధించారంటున్నారు. కొన్ని రోజులుగా ఇదే విషయంపై ఆస్పత్రి ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరిగింది. ఆకస్మికంగా సూపరింటెండెంట్ మృతి చెందడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. చింటు ప్రభుత్వాస్పత్రిలో తన మాటే జరగాలనేలా వ్యవహరించడం, బిల్లుల వ్యవహారంలో సూపరింటెండెంట్‌కు చింటుకు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం హిందూపురం టౌన్: ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న సంక్షేమ, వైద్య కార్యక్రమాల లక్ష్య సాధనలో ఎలాంటి నిర్లక్ష్యం, ఉదాసీనతనూ సహించబోమని డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం స్పష్టం చేశారు. పెనుకొండ, హిందూపురం డివిజన్ల పరిధిలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో శుక్రవారం పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలోని డీఈఐసీ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య కార్యక్రమాలను వంద శాతం అమలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్దేశించిన పనితీరు సూచికలలో పూర్తిస్థాయి పురోగతి సాధించాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ మంజువాణి, ఎన్టీఆర్ వైద్యసేవల జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, డీపీఎంఓ పద్మజ, జిల్లా క్షయ నివారణ అధికారి అనుపమ, జిల్లా మలేరియా అధికారి చెన్నారెడ్డి, ఎన్సీడీ జిల్లా అధికారి సునీల్, డీపీఓ నాగరాజు, ఏఎంఓ లక్ష్మీనాయక్, డీపీహెచ్ఎన్ వీరమ్మ, సీహెచ్ఓ వన్నప్ప తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతి నిలయానికి ఆషాఢ ఏకాదశి శోభ
ప్రశాంతి నిలయం: ఆషాఢ ఏకాదశి వేడుకలు శుక్రవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి నెలకొంది. ఉదయం మహారాష్ట్ర, గోవాకు చెందిన బాలవికాస్ విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమృతం కంటే తియ్యనైన వాడివంటూ పాండు రంగడిని కొనియాడుతూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన నృత్య ప్రదర్శన భక్తులను పరవశింపజేసింది. ‘ఆర్టిఫిషియల్ టు హార్టిఫిషియల్’ పేరుతో మహారాష్ట్ర సాయి యువత ఆధునిక సాంకేతిక యుగంలో మానవుడి జీవన విధానాన్ని వివరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ప్రశాంతి నిలయానికి ఆషాఢ దిండి యాత్ర ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మహారాష్ట్ర, గోవా భక్తులు చేపట్టిన ఆషాఢ దిండి యాత్ర శుక్రవారం ప్రశాంతి నిలయం చేరుకుంది. గోవా , మహారాష్ట్రకు చెందిన 2 వేల మంది భక్తులు దిండి నుంచి బయలుదేరి రైలు మార్గంలో ధర్మవరం చేరుకొని అక్కడి నుంచి పాదయాత్రగా 50 కిలోమీటర్లు నడిచి పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే వారికి ఘనంగా స్వాగతం పలికారు. విఠల రుక్మాయి పల్లకీని మోస్తూ ప్రశాంతి నిలయంలో జరిగిన ప్రదక్షిణలో పాల్గొన్నారు. -
విద్యాసంస్థల బంద్ ప్రశాంతం
పుట్టపర్తి టౌన్: విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రైవేటు పాఠశాల యజమానులు స్వచ్ఛందంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థి సంఘాల నాయకులు పుట్టపర్తి పట్టణంలో గణేష్ కూడలిలో ఉరితాడుతో నిరసన తెలిపిన తర్వాత దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న నీట్ వంటి జాతీయస్థాయి పరీక్షలో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు యువజన సంఘాలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కార్యక్రమంలో విద్యార్థిఽ సంఘం నాయకులు అక్షయ్, దినేష్ పవన్, యస్వంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
మడకశిరలో కర్ణాటక పోలీసుల హల్చల్
మడకశిర: పట్టణంలో శుక్రవారం కర్ణాటక పోలీసులు హల్చల్ చేశారు. దొంగలు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలను రికవరీ చేయడానికి కర్ణాటక పోలీసులు ఇక్కడికి వచ్చారు. పట్టణంలోని ఓ బంగారు కుదవ అంగడి వద్దకు వెళ్లి దొంగలు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. వివరాలు... మడకశిర మండలానికి చెందిన అన్నదమ్ములు నాగరాజు, రాజు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు గొలుసులను దొంగిలించేవారు. కర్ణాటక ప్రాంతంలోని మధుగిరి, మిడిగేశి, హొసకెర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వారిని మిడిగేశి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణలో దొంగిలించిన బంగారు ఆభరణాలను మడకశిరలోని ఓ అంగడిలో కుదవ పెట్టినట్లు దొంగలు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు దొంగలను బందోబస్తుతో మడకశిరకు తీసుకువచ్చారు. కుదవ పెట్టిన షాపును దొంగలు చూపించారు. సదరు వ్యాపారి నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. దొంగలు కుదవపెట్టిన బంగారు ఆభరణాల రికవరీ -
ప్రకృతి వ్యవసాయం రైతుకు శ్రేయస్కరం
మడకశిర రూరల్: ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే రైతులకు శ్రేయస్కరమని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ఈ ఏడాది నెలకొన్న కరువు పరిస్థితులు వ్యవసాయం, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే ఆవకాశం ఉందన్నారు. గురువారం ఆయన అధికారులతో కలిసి ఆమిదాలగొందిలో పర్యటించారు. రైతులు అంజనప్ప, ఓబుళప్ప ప్రకృతి వ్యవసాయంలో భాగంగా విత్తన గుళికలతో ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విత్తన గొర్రు తోలి రైతుల్లో ఉత్సాహం నింపారు. అదే విధంగా రమేష్, లోకేష్, ఓంకారమ్మ తదితర రైతులు అమలు చేస్తున్న పీఎండీఎస్ విధానాన్ని, రైతు రజని ఏ–గ్రేడు కాటన్ మోడల్లో సాగు చేసిన పత్తి పంటను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి తగ్గుతుందని, పంటల నాణ్యత మెరుగ్గా ఉండటంతో పాటు వాతావరణ మార్పులకు పంట తట్టుకుంటుందన్నారు. తద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. అందువల్లే రైతులంతా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పూజారి ముకుంద, జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు డీపీఎం లక్ష్మానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) కృష్ణయ్య, ఏడీ కృష్ణమీనన్, సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ నవీన్, మాస్టర్ ట్రైనర్ రమేష్, ఏఓ వీరనరేష్, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి నుంచి గెంటేశారు● ఎమ్మెల్మే కందికుంట, కదిరి రూరల్ సీఐ నాగేంద్ర నా ఇంటికి కంచె వేయించారు ● సెల్ఫీ వీడియో విడుదల చేసిన భాగ్యరాజ్ ● కుటుంబంతో కలిసి రైలు పట్టాలపై నిరసన గాండ్లపెంట: ‘‘నమస్కారం సార్.. డిప్యూటీ సీఎం గారు, సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు. మమ్మల్ని మా ఇంటి నుంచి వెలేశారు. కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మమ్మల్ని ఇంటి నుంచి ఖాళీ చేయించి..దౌర్జన్యంగా కంచె కట్టించి బయటకు పంపించారు. మా చావుకు బాధ్యులు ఎమ్మెల్యే వెంకటప్రసాద్, సీఐ నాగేంద్రే’’ అంటూ గాండ్లపెంట మండల పరిధిలోని కమతంపల్లికి చెందిన భాగ్యరాజ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అనంతరం నేరుగా రైలు పట్టాలపై కుటుంబంతో సహా పడుకుని మరో వీడియో విడుదల చేశాడు. తాము ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నామని, అయితే అధికారులు, ఎమ్మెల్యే ఏకమై తన ఇంటికి కంచె వేయించి, తమను ఇంటినుంచి వెళ్లగొట్టారని, దిక్కులేని పరిస్థితుల్లో సెల్ఫీ వీడియో విడుదల చేసి చావాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హద్దులు ఏర్పాటు చేశాం...కంచె వేయలేదు ఈ ఘటనపై తహసీల్దార్ నరసింహులు, వీఆర్వో రమణ స్పందించారు. కమతంపల్లి సర్వే నంబర్ 118లోని 44 సెంట్ల స్థలంపై సూర్యనారాయణరెడ్డికి, భాగ్యరాజ్ తండ్రి శ్రీనివాసులుకు మధ్య వివాదం నడుస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న సూర్యనారాయణరెడ్డి సర్వే కోసం చలానా కట్టడంతో సర్వే చేశామని, ఆర్ఎస్ఆర్ (రీ సెటిల్మెంట్ రికార్డు) వివరాల మేరకు ఎల్పీఎం 730లో 44 సెంట్లు సూర్యనారాయణరెడ్డి స్థలమని నిర్ధారించి హద్దులు ఏర్పాటు చేశామన్నారు. అంతేకానీ తాము కంచె ఏర్పాటు చేయలేదని, భాగ్యరాజ్ కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పలేదని వివరణ ఇచ్చారు. -
పుట్టింది రైతు కుటుంబంలో అయినా పట్టుదల, క్రమ శిక్షణతో కూడిన విద్య ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిన విక్రమ్ –1 రాకెట్ విజయంలో కీలక పాత్ర పోషించేలా చేసింది. జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటిన మారక సుష్మ విజయగాథపై ‘
అనంతపురం ఎడ్యుకేషన్: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఇటీవల విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ప్రయోగ విజయంలో రాప్తాడు మండలం ఎం. బండమీదపల్లికి చెందిన యువ ఇంజినీర్ మారక సుష్మ కీలక పాత్ర పోషించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. శభాష్.. సుష్మ అంటూ జిల్లా వాసులందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్‌లో కీలక బాధ్యతలు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్ అండ్ ల్యాబ్‌వ్యూ ఇంజినీర్‌గా పని చేస్తున్న మారక సుష్మ, రాకెట్ ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక సాంకేతిక పరీక్షలు, గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్, ల్యాబ్‌వ్యూ సాఫ్ట్వేర్ అభివృద్ధి వంటి విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. విక్రమ్–1 ప్రయోగ బృందంలో సభ్యురాలిగా శ్రీహరికోటలో జరిగిన ప్రయోగ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రైతు కుటుంబం నుంచి... మారక సుష్మ వయస్సు 26 సంవత్సరాలు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన రైతు మారక సుబ్బారెడ్డి, మారక సుజాత దంపతుల కుమార్తె. రైతు కుటుంబంలో జన్మించిన సుష్మ చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచి క్రమశిక్షణతో ముందుకు సాగారు. వారి కుటుంబం ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటోంది. అభినందనల వెల్లువ రైతు కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి, దేశ చరిత్రలో నిలిచిపోయే అంతరిక్ష ప్రయోగంలో భాగస్వామ్యం కావడంతో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, యువత సుష్మను అభినందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సుష్మ నిరూపించిందంటున్నారు. దేశానికి సేవ చేయడమే లక్ష్యం : సుష్మ భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మకమైన విక్రమ్–1 ప్రయోగంలో భాగస్వామ్యం కావడం తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని సుష్మ తెలిపారు. భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరిన్ని విజయవంతమైన ప్రయోగాల్లో పాల్గొని దేశానికి సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. విక్రమ్–1 రాకెట్ ప్రయోగంలో కీలక పాత్ర రైతు కుటుంబంలో పుట్టి జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటిన వైనం యువతకు స్ఫూర్తిగా నిలిచిన ప్రతిభ దేశానికి మరిన్ని సేవలు అందిస్తానంటున్న యువ శాస్త్రవేత్త -
మృతదేహంతో ధర్నా
పెనుకొండ (సోమందేపల్లి): శ్మశానానికి దారి చూపాలంటూ సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీ కొనతట్టుపల్లి గ్రామానికి చెందిన పలువురు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద మృతదేహంతో ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే... కొనతట్టుపల్లికి చెందిన మాల నారాయణప్ప గురువారం మృతి చెందాడు. కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని పూడ్చడానికి శ్మశానానికి తీసుకువెళ్తుండగా... శ్మశానానికి దారి ఇది కాదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నారాయణప్ప కుటుంబీకులతో పాటు స్థానిక సీీపీఐ నాయకులు బాలస్వామి, రాజ్‌గోపాల్, నారాయణస్వామి, చాంద్‌బాషా తదితరులు మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. శ్మశానానికి దారి చూపాలని డిమాండ్ చేశారు. అయితే వారి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అధికార కూటమి పార్టీల వారితో వాగ్వాదం చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చగా.. తహసీల్దార్ మారుతి, పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. నారాయణప్ప మృతదేహాన్ని తిరిగి గ్రామానికి పంపి, రస్తా సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. దీంతో నారాయణప్ప కుటుంబీకులు దహన సంస్కారాలు పూర్తి చేశారు. శ్మశానానికి దారి చూపాలని డిమాండ్ -
చంద్రబాబుకు ఎమ్మెల్యే గుమ్మనూరు ఝలక్
● శిలఫకంలో సీఎం పేరు గల్లంతు గుంతకల్లు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసి పెద్ద ఝలక్ ఇచ్చారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. వివరాలు.. స్థానిక భాగ్యనగర్‌లోని ఎస్జేపీ హైస్కూల్ సమీపంలో డీఎంఎఫ్ నిధులు దాదపు రూ.50 లక్షలతో ఉర్దూ హైస్కూల్‌ను ఆధునికీకరణ చేశారు. గురువారం జరిగిన భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే స్టేజ్‌పై వెనుకల ఏర్పాటు చేసిన భారీ బ్యానర్లో కానీ, శిలాఫలకం మీద కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఎక్కడా కనపడలేదు. స్టేజ్‌పై ఏర్పాటు చేసిన బ్యానర్లో కేవలం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి చిత్రాలు మాత్రమే దర్శనమిచ్చాయి. శిలాఫలకంలో జయరాం చిత్రపటంతో పాటు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తదితరుల పేర్లు ఉన్నాయిగాని సీఎం చంద్రబాబు పేరు మాత్రం గల్లంతవడం చర్చనీయాంశమైంది. -
దాహార్తి తీర్చేందుకు రూ.24 కోట్లతో పనులు
మడకశిర: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ.24 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో తాగునీటి సమస్యలు, ఎల్‌నినో ప్రభావంపై అనుసరించాల్సిన చర్యల గురించి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలోని 600పైగా గ్రామాల్లోని ఓహెచ్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్ ట్యాంకుల మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాగునీటి పథకాల పైప్‌లైన్ లీకేజీలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నీటి ప్రవాహం తగ్గినా, పూడిక చేరినా, తక్షణమే బోరు బావులను ఫ్లషింగ్ చేయాలని ఆదేశించారు. తాగునీటి పథకాలకు సంబంధించిన మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సమీక్షలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మురళీధర్, డీపీఓ సమత, పట్టు పరిశ్రమ శాఖ జేడీ శోభారాణి, డీఏఓ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ వెల్లడి -
‘సర్’లో మీ పేరుందా?
రాయదుర్గం టౌన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్–స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటర్లు తమ వివరాలు తెలుసుకునేందుకు బీఎల్ఓలను సంప్రదిస్తున్నారు. కొందరైతే బీఎల్ఓలు నమోదు చేశారా? లేదా? అనే సందేహంలో ఉన్నారు. సందేహాలన్నింటికి చాలా సులభమైన పరిష్కారాన్ని ఎన్నికల సంఘం చూపించింది. మొబైల్ ఫోన్‌తోనే ఇంటి నుంచే కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఓటు వివరాలు సర్‌లో నమోదు అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా ఈ సేవను సాధారణ ఫోన్‌తో కూడా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలంటే... ఎస్ఐఆర్లో మీ పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఎస్ఐఆర్ పూర్తయిందా.. లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఎస్ఐఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ తర్వాత ఓటర్ ఐడీ నంబర్ నమోదు చేయాలి. అనంతరం 1950 నంబర్‌కు మెస్సేజ్ పంపించాలి. మెస్సేజ్ పంపగానే సెకన్లలోనే ఈసీ నుంచి మెస్సేజ్ వస్తుంది. అందులో మీ పేరు, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం, పార్ట్ నంబర్, నియోజకవర్గం వివరాలు ఉంటాయి. ఈ వివరాలు వస్తే పేరు ఎస్ఐఆర్లో నమోదైనట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ మెస్సేజ్‌లో వివరాలు తప్పుగా ఉన్నా లేదా మెస్సేజ్ రాకపోయినా బూత్ లెవర్ ఆఫీస్ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలి. ఒక్క ఎస్ఎంఎస్తో వెంటనే వివరాలు నేటితో ముగియనున్న సర్ గడువు -
కేజీబీవీలో సమస్యల పరిష్కారం
అగళి: మండల పరిధిలోని కేజీబీవీలో ఎట్టకేలకు అపరిశుభ్రత తొలగిపోయింది. ‘ కేజీబీవీలో సమస్యల తిష్ట’ అన్న శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా అధికారులు స్పందించారు. అపరిశుభ్రంగా మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. డోర్లు లేని స్నానపు గదులకు డొర్లు ఏర్పాటు చేయించారు. తాగు నీటి సమస్యను పరిష్కరించారు. ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని, కథనం రావడంతోనే తమ సమస్యలు పరిష్కారయ్యాయంటూ ‘సాక్షి’కి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా బాలిక సంరక్షణ సహాయ అధికారిణి అనిత గురువారం కేజీబీవీని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. విద్యార్థినులకు సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్ నాగరత్నమ్మ , ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట ఎంఈఓ–1 నాగేంద్ర, ఎంఈఓ–2 చంద్రశేఖర్‌నాయుడు ఉన్నారు. యువకుడి ఆత్మహత్యపెనుకొండ: నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లిలో ప్రేమ్‌కుమార్ (25)) బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలమేరకు.. చెన్నేకొత్తపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్ 3 నెలల క్రితం వెంకటరెడ్డిపల్లికి చెందిన లిఖితను వివాహం చేసుకుని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అనుమానంతో భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు తలెత్తడంతో మనస్తాపం చెందిన ప్రేమ్‌కుమార్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విషయమై మృతుడి బంధువులు, అమ్మాయి కుటుంబీకుల మధ్య గురువారం ఉదయం స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. అయితే సకాలంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహం అప్పగించలేదని మృతుని బంధువులు వాపోయారు. బీఎల్ఓ సస్పెన్షన్అగళి: మండల పరిధిలోని ఇరిగేపల్లిలోని బూత్ నంబర్ 156 బీఎల్ఓగా విధుల నిర్వహిస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మొహమ్మద్ నయాజ్పై సస్పెండ్ వేటు పడింది. సర్ ప్రక్రియలో అలసత్వం, నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ... మొహమ్మద్ నయాజ్‌ను సస్పెండ్ చేసినట్లు తహసీల్దార్ హరికుమార్ పేర్కొన్నారు. బీఎల్ఏ నాగేష్ హత్య కేసులో 9 మంది అరెస్టుకనగానపల్లి: రెండు రోజుల క్రితం జరిగిన వైఎస్సార్సీపీ బీఎల్ఏ అంకె నాగేష్ హత్య కేసులో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. రామగిరి సీఐ ఎస్ మహమ్మద్ అలీ తెలిపిన వివరాల మేరకు... కనగానపల్లిలో ఈ నెల 21వ తేదీన హత్యకు గురైన అంకె నాగేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కనగానపల్లి సమీంలోని మారెమ్మగుడి వద్ద 9 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో వడ్ల దస్తగిరి బాబు, నితీష్‌కుమార్, వన్నూరప్ప, అంకె మురళీ, సురేష్, అక్కులప్ప, నాగమణి, జ్యోతి, లక్ష్మిదేవి ఉన్నారు. అనంతరం వారిని ధర్మవరం కోర్టుకు తరలించారు. రోడ్డుపై బైక్ స్టంట్లు● యువకులకు పోలీసుల కౌన్సెలింగ్ పుట్టపర్తి టౌన్: పట్టణ సమీపంలో ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తున్న షేక్ ఉమర్‌ఫరూక్, షేక్ సమీర్, వక్కల జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు అర్బన్ సీఐ యువరాజ్ తెలిపారు. గురువారం పోలీసుస్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం రహదారులపై ప్రమాదకర విన్యాసాలు చేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. ఇలాంటి చర్యలతో సామాన్యుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. అదుపులోకి తీసుకున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే బైక్ స్టంట్స్, వీలింగ్, రేసింగ్ వంటి చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
నేడు విద్యా సంస్థల బంద్
పుట్టపర్తి టౌన్: విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గురువారం పుట్టపర్తి పట్టణంలో విద్యార్థి సంఘాల నాయకులు విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న నీట్ వంటి జాతీయస్థాయి పరీక్షలో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. నీటి పేపర్ లీకేజీలకు భాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం విద్యా సంస్థల బంద్‌కు పిలుపిచ్చామన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పోతులయ్య, నిరంజన్‌యాదవ్, పవన్‌కుమార్, బండి శివ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా పోస్ట్ కేసులో యువకుడికి బెయిల్ చిలమత్తూరు: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై సోషిల్ మీడియాలో పోస్టు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన వీర ప్రతాప్‌రెడ్డికి హిందూపురం స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మడకశిరకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేసి హిందూపురంలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. బాధితుడికి వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అండగా నిలిచారు. ఆమె సూచన మేరకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వెంకటరెడ్డి బాధితుడి తరుఫున వాదనలు వినిపించారు. ఈ మేరకు న్యాయమూర్తి బాధితుడి సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. కాగా బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా మడకశిర పోలీసులు బాధితుడిని పోలీసు జీపులో తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెంటనే బాధితుడిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక డిమాండ్ చేశారు. -
చదవలేక.. చావుకోరి
● మడకశిరలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య ● చదవడం ఇష్టంలేక హాస్టల్లోనే ఉరివేసుకున్న వైనం మడకశిర: హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రొళ్ల మండలం చిగమతిగట్ట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నళినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్రేగౌడ్(18) అగళి మండలం ఇనగలూరు జెడ్పీ హైస్కూల్లో 385 మార్కులతో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో (ఎంపీసీ) చేరినా అక్కడ ఉండటం ఇష్టంలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చంద్రేగౌడ్ను మడకశిరలోని వెంకటేశ్వర కళాశాలలో చేర్పించారు. రోజూ ఇంటివద్దనుంచే కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 399 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కళాశాలలోని హాస్టల్లోనే ఉంచితే చదువుకునేందుకు సమయం ఉంటుందని, మార్కులు కూడా పెరుగుతాయని భావించిన కుటుంబీకులు ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఇష్టంలేకపోయినా చంద్రేగౌడ్ ఒప్పుకున్నాడు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం లగేజీతో హాస్టల్‌కు వచ్చిన చంద్రేగౌడ్..రాత్రి వేళ హాస్టల్లోని వాష్‌రూంకు వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి దూరంగా ఉంటూ ఒత్తిడితో కూడిన చదువులు తనకు ఇష్టంలేదని చంద్రేగౌడ్ తరచూ చెప్పేవాడని, ఈక్రమంలోనే చదవలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం చెందాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. చంద్రేగౌడ్ మృతితో స్వగ్రామం చిగమతిగట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మడకశిర ఎస్ఐ కృష్ణారెడ్డి కళాశాల హాస్టల్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. కళాశాల యాజమాన్యం, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా... పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా.. చేతగాని వారంతా చావును వెతుక్కుంటున్నారు. తాజాగా మార్కుల ఒత్తిడి తట్టుకోలేక.. హాస్టల్లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకున్నాడు. హాస్టల్లో చేరిన గంటల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు. -
కన్నీటి సేద్యం
పేరూరు సమీపంలో ఆముదం పంటకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న రైతువరుణుడు తొలకర్లతో పలకరించగా మురిసిపోయిన రైతన్నలు ఉత్సాహంగా విత్తనం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వాన జాడే కరువుకావడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పుడప్పుడే భూమిని చీల్చుకుని మొలకెత్తిన పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే రామగిరి మండలం పేరూరు సమీపంలో ఆముదం, కంది పంటలు ఎండుతుండడంతో రైతులు ఇలా ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువెళ్లి మొక్కలకు పెడుతూ కన్నీటి సేద్యం చేస్తున్నారు. రైతన్న కష్టం పండుతుందా... పంట ఎండుతుందా.. ఆపై వాడికే తెలియాలి. – రామగిరి: -
వేతనం అందక.. పూటగడవక..
● ‘శ్రీరామరెడ్డి’ పథకం కార్మికుడి ఆత్మహత్యాయత్నం గుడిబండ: వేలాది గ్రామాల్లోని లక్షలాది మందికి తాగునీరందించే శ్రీరామరెడ్డి పథకం కార్మికులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా 13 నెలలుగా వేతనం అందకపోవడంతో ఇప్పటికే తెలిసిన వారి వద్ద అప్పులు చేశారు. చివరకు అప్పులు ఇచ్చే వారు కూడా లేక జీవనం దుర్భరమై దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తాజాగా ఓ కార్మికుడు శ్రీరామరెడ్డి పథకం వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మడకశిర నియోజకవర్గంలోని 375 గ్రామాలకు శ్రీరామరెడ్డి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకం కింద పనిచేసే 145 మంది కార్మికులకు 13 నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబ భారం మోయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గురువారం గుడిబండ మండలం కదిరేపల్లి గ్రామం పంచాయతీ గుర్రపుకొండ గ్రామానికి చెందిన సుబ్బరాజు బూదిపల్లి గ్రామం సమీపంలోని శ్రీరామరెడ్డి ఓవర్ హెడ్ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని సుబ్బరాజును నిలువరించి కిందకు దింపారు. ఈ సందర్భంగా కార్మికుడు సుబ్బరాజు మాట్లాడుతూ... తాను 14 ఏళ్లుగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పంప్‌హౌస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, 13 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానన్నారు. కనీసం కుటుంబానికి భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యే శరణ్యమని భావించి పైనుంచి కిందకు దూకేందుకు వాటర్ ట్యాంకు ఎక్కానన్నాడు. రాత్రనక, పగలనక కష్టపడి పనిచేస్తే కనీసం జీతం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తమకు సకాలంలో వేతనాలను అందించాలని కోరాడు. -
మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలు డుమ్మా
పుట్టపర్తి అర్బన్: అసలే మారుమూల ప్రాంతం , గ్రామంలో అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే. ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసే నిర్వాహకులు ఉన్నఫలంగా పాఠశాలకు రాకుండా మానేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు... పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో 53 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి మధ్యాహ్న భోజనం చేసేందుకు ఎస్ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో రత్నమ్మ అనే మహిళకు బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆమెను వంట చేస్తోంది. అయితే ఇటీవల వేసవి సెలవులు ముగిసినప్పటి నుంచి ఆమె సరిగా వండకపోవడం, తరచూ పురుగులు, బొద్దింకలు భోజనంలో వస్తుండటంతో విద్యార్థులు పలుమార్లు హెచ్ఎం రమేష్‌కు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం భోజనంలో బొద్దింక రావడం చూసిన హెచ్ఎం ఆమెను గట్టిగా మందలించాడు. దీంతో మూడు రోజుల నుంచి ఆమె వంట చేయడానికి రాలేదు. విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో కావడంతో మొదటి రోజు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బుధ, గురువారాలు హెచ్ఎం రమేష్ కూరగాయలు తీసుకొచ్చి తోటి ఉపాధ్యాయులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయించి విద్యార్థులకు వడ్డించారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో గురువారం వారంతా పాఠశాలకు వచ్చి ఆందోళన చేపట్టారు. రెండేళ్ల క్రితం వైఎస్ జగన్ హయాంలో పాఠశాలలో 110 మంది ఉన్న విద్యార్థులు 53కు వచ్చారని, ఇలాగే భోజనాలు పెట్టకపోతే అందరినీ వేరే పాఠశాలలకు పంపిస్తామని చెప్పారు. విషయాన్ని హెచ్ఎం... ఎంఈఓ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులంతా ఆందోళనకు దిగడంతో మధ్యాహ్న ఏజెన్సీని రద్దు చేసి కొత్తగా ప్రతిపాదనలు తీసుకొని ఒకరిని ఎన్నుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రలకు నచ్చజెప్పారు. మరోసారి మధ్యాహ్న భోజనం సరిగా లేదని , అన్నం పెట్టలేదని ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని అందరినీ హెచ్చరించారు. ఇబ్బందుల్లో గంగిరెడ్డిపల్లి పాఠశాల విద్యార్థులు రెండు రోజులుగా ఉపాధ్యాయులే వంట చేస్తున్న వైనం -
కొనసాగుతున్న ఎంపీఈఓల సమ్మె
పుట్టపర్తి అర్బన్: డిమాండ్ల పరిష్కారం కోసం ఎంపీఈఓల చేస్తున్న సమ్మె గురువారం కూడా కొనసాగింది. పట్టణంలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద రిలే నిరాహార దీక్షల్లో ఎంపీఈఓలు నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ వ్యవసాయశాఖలో ఇంకెంత కాలం ఒప్పంద ఉద్యోగులుగా పని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల నుంచి కేవలం రూ.12 వేల జీతాలకు అధికారులతో పాటు పని చేశామని ఇక చేసేది లేదని స్పష్టం చేశారు. డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూరను కలిసి తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు జాఫర్ వళీ, రాజేష్‌బాబు, సోమశేఖర్, గంగరాజు, అనిత, భవ్య, మీనా, ముబీనా, తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే భారీ చోరీ ● ‘నీట్’ ఫీజు చెల్లించేందుకు ఉంచిన డబ్బు, బంగారం అపహరణ ● లబోదిబోమంటున్న విద్యార్థి తల్లిదండ్రులు పుట్టపర్తి అర్బన్: విద్యార్థి చదువు కోసం ఉంచుకున్న డబ్బుతో పాటు బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్ద తండాలో చోటు చేసుకుంది. లక్ష్మీరాంనాయక్ ,లక్ష్మీబాయి దంపతులు పెడపల్లి పెద్ద తండాలోని పెనుకొండ రోడ్డు వద్ద నివాసం ఉంటున్నారు. లక్ష్మీబాయి తన తల్లి సంవత్సరీకం ఉండగా ధర్మవరం మండలం నేలకోటకు రెండు రోజుల క్రితం వెళ్లింది. లక్ష్మీరాంనాయక్ పశువుల మేత కోసం గురువారం మధ్యాహ్నం తండా సమీపంలోని తోట వద్దకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు నేరుగా ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారు నగలు, డబ్బు ఎత్తుకెళ్లారు. కుమారుడు పునీత్‌కుమార్ నాయక్‌కు ఇటీవల విడుదల చేసిన నీట్లో ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ కోసం ఇటీవల డ్వాక్రా సంఘంలో వచ్చిన రుణాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. రూ.1.5 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉన్న సొత్తు దొంగలు ఎత్తుకెళ్లడంతో తన కుమారుడి చదువు ఏమవుతుందోనని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సీఐ సురేష్ , పుట్టపర్తి రూరల్ ఎస్ఐ క్రాంతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ద్విచక్ర వాహనాల ఢీ● మహిళ మృతి తలుపుల: మండలంలోని పూలవాండ్లపల్లి సమీపంలో ఎర్రిపల్లి క్రాస్ వద్ద గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో బి.రవణమ్మ (48) మృతి చెందింది. వివరాలు.. పెద్దన్నవారిపల్లికి చెందిన రామ్మోహన్ తన భార్య రవణమ్మ, మనవడు మానిత్తో కలసి ద్విచక్ర వాహనంలో తలుపుల నుంచి స్వగ్రామం బయలుదేరారు. ఎర్రిపల్లి క్రాస్ వద్ద అటు నుంచి వచ్చిన బైక్ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఘటనలో రామ్మోహన్, మాన్విత్ గాయాలతో బయట పడ్డారు. అయితే రవణమ్మకు తీవ్ర గాయాలు కాగా అనంతపురం తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీ కింద పడి వృద్ధురాలి మృతి తాడిపత్రి రూరల్: మండలంలోని ఆలూరుకు చెందిన లక్ష్మీదేవి (60)పై ట్రాక్టర్ ట్రాలీ టైరు వెళ్లడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ట్రాక్టర్ ట్రాలీ కింద ఉన్న నీడలో లక్ష్మీదేవి పడుకొని ఉండగా అదే గ్రామానికి చెందిన రామనాథ్‌రెడ్డి ట్రాక్టర్‌ను నడపగా ఆమైపె టైరు ఎక్కింది. ఆమె కేకలు విన్న రామనాథ్ ట్రాక్టర్ నిలిపి వెనక్కి వచ్చి చూడగా తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవి కనపడింది. చికిత్స నిమిత్తం హుటాహుటిన అనంతపురం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
నేతన్నకు నేస్తం జగనన్నే..
ధర్మవరం: ‘‘చేనేతలపై సీఎం చంద్రబాబుది కపట ప్రేమ. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ‘నేతన్న నేస్తం’ పథకం పేరు మార్చి ‘నేతన్న సేవ’ పేరుతో రూ.25 వేలు అందిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. చేనేతల సంక్షేమంపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత రెండేళ్లుగా అటకెక్కించిన నేతన్న నేస్తం పథకం నిధులతో కలిపి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.75 వేల సాయం ఒకేసారి ఖాతాల్లో జమ చేయాలి’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన చేనేత కార్మికులు, వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కేతిరెడ్డితో కలిసి చేనేతలు, కార్యకర్తలు బైక్‌లపై స్థానిక శివానగర్ శివాలయం నుంచి నేతన్న విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌లపై గాంధీనగర్, కళాజ్యోతి సర్కిల్, కాలేజ్ సర్కిల్ మీదుగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా.. ఇంత వరకూ చేనేతలకు పైసా సాయం అందించిన పాపాన పోలేదన్నారు. ‘నేతన్న నేస్తం’ పథకం సాయాన్ని రూ.25 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు హామీలిచ్చిన కూటమి పార్టీల నాయకులు.. అధికారంలోకి వచ్చాక చేనేతలను పూర్తిగా విస్మరించారన్నారు. తీరా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడే సరికి పథకం పేరు మార్చి గడచిన రెండేళ్లు ఎగ్గొట్టి ఈ ఏడాది మాత్రం తూతూమంత్రంగా రూ.25 వేలు సాయం అందిస్తామని గొప్పలు చెప్పడం చేనేతలను వంచించడమేనన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోచేనేత రంగ సంక్షోభంలో చిక్కుకుపోయిందని, ఉపాధి కోల్పోయిన కార్మికులు అప్పుల పాలై వాటిని తీర్చలేక బలవన్మరణం చెందారన్నారు. రెండేళ్లలో 52 మంది ఆత్మహత్యలు చేసుకున్నా... ఈ మొద్దు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పైసా సాయం ఇవ్వలేదన్నారు. 2014– 2019 మధ్య కాలంలో అప్పుల బాధతో చేనేతలు ఆత్మహత్య చేసుకుంటే... అప్పుడు కూడా చంద్రబాబు చోద్యం చూశారన్నారు. దీంతో తాను చేనేతల పక్షాన పట్టణంలో భిక్షాటన చేసి బాధిత చేనేత కుటుంబాలకు సాయం అందించానని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక 52 మంది బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం తరఫున అందించామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చిత్తశుద్ధితో నేతన్నల సమస్యలు పరిష్కరించి చేనేత రంగానికి ప్రాణం పోయాలని కోరారు. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంతో ఒక్క చేనేత కార్మికుడు బలవన్మరణం చెందినా ఆ కార్మికుడి పాడెతోనే నిరసన తెలుపుతామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేనేత మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని కేతిరెడ్డి అన్నారు. పెరిగిన ముడిపట్టు ధరలు, పట్టుచీరలకు మద్దతు ధర లేక అవస్థలు పడుతుంటే మరోవైపు వ్యాపారులు సైతం షోరూం నిర్వాహకుల మోసాలతో అల్లాడిపోతున్నారన్నారు. షోరూంల నిర్వాహకులు వ్యాపారుల నుంచి రూ.కోట్ల విలువైన చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినా... ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో లీలా కళానికేతన్, ప్రస్తుతం ముగ్దా వంటి షోరూం నిర్వాహకులు చేస్తున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనమన్నారు. చేనేతల కోసం ఎంతకై నా... ఎందాకై నా సిద్ధమని కేతిరెడ్డి స్పష్టం చేశారు. నేతన్నలకు ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేనేత రంగ పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారిణి ఖతిజన్ఖుప్రాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, చేనేతలు, చేనేత సంఘం నాయకులు, ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో లబ్ధికోసమే ‘నేతన్న సేవ’ పేరుతో హడావుడి చిత్తశుద్ధి ఉంటే మూడేళ్ల నిధులు రూ.75 వేలు ఒకేసారి ఇవ్వాలి చంద్రబాబు పాలనలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అండగా నిలవాలి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేనేతల సమస్యల పరిష్కారం కోసం ధర్మవరంలో భారీ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన ‘చేనేత’ మనుగడ ప్రశ్నార్థకం.. అండగా ఉంటా.. పోరాడతా.. తన హయాంలో ముడిపట్టు రాయితీ ప్రతినెలా రూ.600 ఇచ్చేందుకు కూడా చంద్రబాబుకు మనసు రాకపోతే... చేనేతల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేశామన్నారు. అప్పట్లో తన ఆధ్వర్యంలోనే చేనేతలు ఏకంగా 37రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే... ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్మవరం వచ్చి సంఘీభావం తెలిపారన్నారు. అంతేకాకుండా ప్రతినెలా ఇచ్చే రూ.600 పరిహారాన్ని రూ.2 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని కేతిరెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు 2019 డిసెంబర్ 21న తన పుట్టినరోజు కానుకగా చేనేతలకు ‘నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టి ఒకేసారి రూ.24 వేలు అందించారన్నారు. నిజంగా నేతన్నల నేస్తం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కార్మికుల పాడెతోనే నిరసన తెలుపుతాం.. -
నేతన్నకు శఠగోపం
ధర్మవరం: పట్టుచీరలకు ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలో 20 వేలకుపైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేనేత కేంద్రాలైన ధర్మవరం, గోరంట్ల, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, ఉరవకొండ తదితర ప్రాంతాలలో 48 వేల మందికి పైగా చేనేత రంగంపై ఆధార పడి పని చేస్తున్నారు. గతంలో వీరికి చేతినిండా పని ఉండేది. ప్రభుత్వాల సాయమూ ఉండటంతో నేతన్నలు హాయిగా ఉండేవారు. కానీ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తిరగబడింది. రేషం, వార్పు, జరీ ధరలు 40 శాతం పెరిగిపోయాయి. అమ్మకాలు భారీగా తగ్గాయి. సర్కారు నుంచి సాయం నిలిచిపోయింది. ఉపాధి కరువైన చేనేత కార్మికులు వలస బాట పట్టారు. అప్పుల బాధతో ఎందరో నేతన్నలు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. దీంతో నేతన్నల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండగా... చంద్రబాబు ప్రభుత్వం మరో మోసానికి తెరతీసింది. ‘నేతన్న భరోసా’ పేరుతో ఒక్కో చేనేత కుటుంబానికి రెండేళ్ల నుంచి ఇవ్వాల్సిన రూ.50 వేలు ఎగ్గొట్టి అరకొర నిధులతో తూతూ మంత్రంగా మమ అనిపించేందుకు సిద్ధమైంది. జగన్ చొరవతో ‘నేతన్న నేస్తం’ 2014 – 2019 మధ్య కాలంలో చేనేత రంగాన్ని అప్పటి సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేశారు. ప్రతినెలా ముడిపట్టుపై ప్రభుత్వం చేనేతలకు ఇచ్చే రాయితీ రూ.600 సక్రమంగా అందించలేదు. దీనికి తోడు తాము అధికారంలోకి వస్తే పరిహారాన్ని రూ.వెయ్యికి పెంచుతామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సక్రమంగా అమలు చేయక పోగా 20 నెలల ముడిపట్టు రాయితీ బకాయిలను పెండింగ్‌లో పెట్టి చేనేతలను ఇబ్బందులకు గురి చేశారు. అప్పట్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నేతన్నలు పోరాటం ఉధృతం చేశారు. ధర్మవరంలో ఏకంగా 37 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. నేతన్నల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్మవరానికి వచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని ప్రతినెలా రూ.2 వేలు ఇస్తామని 2017 అక్టోబర్ 17న నేతన్నల సాక్షిగా ధర్మవరంలో హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి రాగానే తన పుట్టిన రోజున (డిసెంబర్ 21న) ‘నేతన్న నేస్తం’ పథకం పేరుతో ఒకేసారి రూ.24 వేలు నేతన్నల ఖాతాలో ముడిపట్టు రాయితీని జమ చేశారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు ఏటా సాయం అందించారు. ఈ విధంగా ఐదేళ్ల పాటు ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షల సాయాన్ని అందించారు. ఇలా జిల్లాలోని చేనేత కార్మికులకు రూ.178 కోట్లు, అందులోనూ ధర్మవరం నియోజకవర్గంలోని చేనేత కార్మికులకే రూ.136 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. పేరు మార్చి, నేతన్నలను ఏమార్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024, 2025 సంవత్సరాల్లో ‘నేతన్న నేస్తం’ పథకాన్ని అటకెక్కించారు. నేతన్నల నుంచి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో తాజాగా పథకం పేరును ‘నేతన్నకు భరోసా’గా మార్చారు. రెండేళ్ల సాయాన్ని పక్కనపెట్టి ఈ ఏడాది నుంచి రూ.25 వేలు ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఒక్కో చేనేత కుటుంబం రెండేళ్ల సాయం రూ.50 వేలు నష్టపోతోంది. పథకం అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం రూ.252 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద చేనేతలతో పాటు అనుబంధ రంగాలైన రంగుల అద్దకం, బోట్లు చుట్టేవారు, పాలిష్ చేసే వారు నేత కార్మికులు అందరికీ సాయం వర్తింపజేస్తామని చెబుతున్నారు. ఇన్ని వేల మందికి రూ.252 కోట్లు ఏ మూలకు సరిపోతాయని నేతన్నలు ప్రశ్నిస్తున్నారు. పైగా ఆగస్టు 7న చేనేత దినోత్సవం రోజున కార్మికుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని చెప్పగా.. ఇంత వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు కాకపోవడంతో పథకం అమలుపై సందేహాలు నెలకొన్నాయి. ఆందోళనకు సిద్ధమైన వైఎస్సార్సీపీ.. చంద్రబాబు ప్రభుత్వ మోసాన్ని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆందోళనకు సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన విధంగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున మూడేళ్లకు కలిపి రూ.75 వేలు జమ చేయాలన్న డిమాండ్‌తో నేడు (గురువారం) ధర్మవరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ‘నేతన్న నేస్తం’ ఊసెత్తని చంద్రబాబు తాజాగా ‘నేతన్న భరోసా’ పేరుతో ఏడాదికి రూ.25 వేలంటూ ప్రచారం అరకొర నిధులతో పథకం తూతూమంత్రంగా ముగించేలా ప్లాన్ చంద్రబాబు మోసంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో నేడు భారీ నిరసన ర్యాలీ తీవ్రమైన ఆర్థిక మాంద్యం.. పెరిగిన ముడిపట్టు ధరలతో ధర్మవరం పట్టుచీర మెరుపు తగ్గింది. నేతన్న బతుకు దుర్భరమైంది. ఆదుకుని అండగా నిలవాల్సిన చంద్రబాబు నేతన్నలను మోసం చేశారు. ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా అందించే ఆర్థిక సాయాన్నీ రెండేళ్లుగా నిలిపి వేశారు. నేతన్నల నుంచి ఒత్తిడి పెరగడంతో ‘నేతన్నకు భరోసా’ అంటూ కొత్త రాగం అందుకున్నారు. అరకొర విదిల్చి ప్రచారం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిస్తూ నేతన్నలకు అండగా నిలిచేందుకు గురువారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. -
పక్కాగా ‘సర్’ : జేసీ మౌర్యభరద్వాజ్
హిందూపురం: నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 157–హిందూపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎస్ఐఆర్ ఎలా చేస్తున్నారో సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్, మ్యాపింగ్, ఏఎస్డీ, డీఎస్ఈతో పాటు ఓటరు వివరాల నమోదు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. తర్వాత బీఎల్ఓలకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నాణ్యత, పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరును గుర్తించి జాబితాలో నమోదు చేయడంతో పాటు, అనర్హులైన నమోదులను నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన గడువులను తప్పనిసరిగా పాటిస్తూ ప్రతి బీఎల్ఓ తన పోలింగ్‌స్టేషన్ పరిధిలో పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. గంజాయి కేసులో నిందితుడి అరెస్టు రాప్తాడు రూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని రాప్తాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాప్తాడు పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైం నం.62/2026 కేసులో పరారీలో ఉన్న అనంతపురం రూరల్ తపోవనంకు చెందిన అరుణ్ జాకబ్ అలియాస్ అరుణ్ రాస్తాను రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. వివరాలను సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి డ్రగ్స్ వినియోగానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలు, హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు. -
రెండో రోజూ ఎంపీఈఓల నిరసన
పుట్టపర్తి అర్బన్: కనీస వేతనం కింద నెలకు రూ.35 వేలు జీతాలు పెంచాలి, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలి, తదితర డిమాండ్లతో జిల్లాలో ఎంపీఈఓలు చేపట్టిన సహాయ నిరాకరణ, నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. బుధవారం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. వారికి ఏపీ రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దిగి రావాలి చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య కార్యాలయంలోకి వెళ్లకుండా కొంత సేపు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం రూ.35 వేలు చెల్లించేలా జీఓ విడుదల చేయాలన్నారు. అలాగే నాన్ శాంక్షన్ పోస్టు నుంచి శాంక్షన్ పోస్ట్‌కు కన్వర్ట్ చేయాలని, హెల్త్ కార్డుల సదుపాయం కల్పించాలని , ప్రమాద బీమా, విధి నిర్వహణలో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ వర్షా కాలంలో రైతులకు అండగా నిలవాలని, ఇన్సూరెన్స్ చేయించే కార్యక్రమంతో పాటు క్రాప్ బుకింగ్ చేయాలని వెంటనే సమ్మెను రద్దు చేసుకొని విధులకు హాజరు కావాలని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఉద్యోగులు ససేమిరా అంటూ తిరిగి శిబిరానికి చేరుకొని నిరసనను కొనసాగించారు. కార్యక్రమంలో ఎంపీఈఓ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షుడు చెన్ననాయక్, జనరల్ సెక్రెటరీ నాగార్జున, గౌరవాధ్యక్షుడు జాఫర్, షామీర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గంగరాజు, రాజేష్, రామమోహన్‌రెడ్డి, నాగరాజు, జిల్లాలోని ఎంపీఈఓలు పాల్గొన్నారు. -
దొంగ అరెస్ట్
అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు పాల్పడుతున్న దొంగను అనంతపురం ఫోర్త్‌టౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. బుధవారం నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో వివరాలను నాల్గవ పట్టణ సీఐ మస్తాన్, సీసీఎస్ సీఐ జయపాల్‌రెడ్డి, ఎస్ఐ గోపి వివరించారు. కక్కలపల్లి కాలనీకి చెందిన సాయికిరణ్ మద్యం, జూదం వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పగటి పూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ ఏడాది జూన్ నెల నుంచి నగర పరిసరాల్లో మూడు చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనాలపై నిఘా పెట్టి నిందితున్ని నగర శివారులో అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 7 లక్షలు విలువజేసే 3.14 తులాల బంగారం, 203. 5 గ్రాములు వెండి , రూ. 8 వేలు నగదు, టీవీ, గ్యాస్ సిలిండర్, నాలుగు చేతి గడియారాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఎండుతున్న ఆశలు
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో తీవ్ర వర్షా పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ ప్రారంభం నుంచి వరుణ దేవుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో మాత్రమే వర్షాలు నైరుతీ రుతుపవనాలు జిల్లాలో ప్రవేశించగానే మంచి వర్షాలు కురిశాయి. ఆ వర్షాలకు ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే రైతులంతా భూమిని దున్ని సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే వర్షాలు కురవలేదు. జూలై నెలలో ఇప్పటి వరకూ ఒక్క నల్లమాడ, బుక్కపట్నం మండలాలు తప్ప ఎక్కడా పదును వర్షం కురవలేదు. సుమారు నెల రోజుల నుంచి వర్షాలు కురవక పోవడంతో ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ, జొన్న, కంది తదితర పంటలు ఎండిపోతున్నాయి. వలస బాటలో అన్నదాతలు జూన్‌లో 58.2 మి.మీ వర్షపాతం నమోదుకాగా, జూలై నెలలో 95 మి.మీకు గాను ఇప్పటి వరకూ కేవలం 5.2 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయా లేదా అనే సందేహంలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సమయాను కూలంగా వర్షాలు కురవక పోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించక పోవడం, సంక్షేమ పథకాలు అందించకపోవడంతో జిల్లాలో వ్యవసాయం చేయడం కత్తి మీద సాములా మారింది. దీంతో చేసేదిలేక బెంగళూరు, హైదరాబాద్‌కు వలస వెల్లడానికి సిద్ధమవుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గింది ఖరీఫ్ ప్రారంభం నుంచి వర్షాలు కురవకపోవడంతో రైతులు సాగుపై మక్కువ చూపలేదు. జిల్లాలో వ్యవసాయ బోర్ల కింద, మెట్ట భూమిలో కేవలం 44,396 హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. వర్షాలు రాక పోతే వేరుశనగ సాగు చేయడం మంచిది కాదు. పీఎండీఎస్ ద్వారా సాగు చేసిన పంటలు మొలక శాతం పెరిగింది. ఇప్పటికీ పీఎండీఎస్పైనే రైతులు సాగు చేస్తున్నారు. – కృష్ణయ్య, జిల్లా వ్యవసాయాధికారి బోరు ఎండిపోయింది ఎంతో కాలంగా మామిడి తోటను, పశువుల గడ్డిని, పంటను కాపాడిన బోరు బావి ఈ నెలలో నీళ్లు రాకుండా పోయాయి. దీంతో మామిడి తోట ఎండిపోతుందోమోనని భయంగా ఉంది. పశువుల కోసం సాగు చేసిన గడ్డికి పక్కన ఉన్న వ్యవసాయ బోరు నుంచి నీళ్లు పెడుతున్నాను. పశువులను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నాను. వర్షాలు కురవకపోతే వేల సంఖ్యలో బోర్లు ఎండిపోతాయి. – లక్ష్మీపతి, సుబ్బరాయనిపల్లి, పుట్టపర్తి మండలం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌లో వేసిన పంటలు ఎండుముఖం ఆందోళనలో అన్నదాతలు -
సగర కార్పొరేషన్ చైర్మన్ దురహంకారం
పెనుకొండ (సోమందేపల్లి): రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత ప్రధాన అనుచరుడు, సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరాముడు దురహంకారం ప్రదర్శించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన దళితులను నేలపై కూర్చోబెట్టి వారి ఎదురుగా కుర్చీలో కూర్చుని దర్జా చూపారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో దళిత సంఘాలన్నీ భగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళితే.. సోమందేపల్లి మండలం మాగేచెరువు ఎస్సీ కాలనీ వాసులు తమ సమస్యలు చెప్పుకునేందుకు రంగేపల్లి గ్రామంలోని సగర కార్పొరేషను చైర్మన్ రంగేపల్లి వెంకటరాముడు ఇంటికి వెళ్లారు. అయితే సగర కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు అక్కడున్న సోమందేపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు, మాగేచెరువు ఉప్పర వెంకటేసులు, ఇతర టీడీపీ నాయకులు దళితుల పట్ల దారుణంగా వ్యహరించారు. సామాజిక సమానత్వం మరచి దళితులను నేలపై కూర్చోబెట్టి వారంతా ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. తమకు అవమానం జరుగుతోందని తెలిసినా ఏం చేయలేని దళితులు తమ సమస్యలు చెప్పుకుని అక్కడి నుంచి భారంగా ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే దళితులను నేలపై కూర్చోబెట్టి టీడీపీ నాయకులు దర్జా చూపుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దళిత సంఘాల నేతలు భగ్గుమన్నారు. అహంకార పూరితంగా వ్యవహరించి దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాముడు, టీడీపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని, టీడీపీ అధిష్టానం వెంకటరాముడును పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. దళితులను నేలపై కూర్చోబెట్టి అధికార దర్పం భగ్గుమన్న దళిత సంఘాలు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు ?
రాయదుర్గం–తుమకూరు నూతన రైలుమార్గ నిర్మాణ పనులు దశాబ్ద కాలానికిపైగా కొనసాగుతూనే ఉన్నాయి. 206.52 కి.మీలో ఇప్పటికీ 109 కి.మీ మాత్రమే పూర్తి చేశారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గంటౌన్: రాయదుర్గం – తుమకూరు నూతన రైలుమార్గ నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. అనంతపురం జిల్లాతో పాటు దక్షిణ కర్ణాటక ప్రజల రవాణా అవసరాలతో పాటు గార్మెంట్స్, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా, రైల్వే వ్యవస్థ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని 2007–08లో ఈ రైలుమార్గం నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. 206.53 కి.మీ రైలుమార్గం నిర్మాణానికి రూ.1714.50 కోట్ల అంచనాతో 2012లో శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం, కంబదూరు, దొడ్డహళ్లి, మడకశిర, కోతాళం, పావగడ, దొడ్డబెట్ట, హొసకెరె, మధుగిరి మీదుగా కర్ణాటకలోని తుమకూరు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. 2016లో కళ్యాణదుర్గం వరకు, 2017లో కదిరిదేవరపల్లి వరకు రైలుమార్గం పూర్తికావడంతో తిరుపతి–కదిరిదేవరపల్లి రైలు సర్వీసును ప్రారంభించారు. ప్రస్తుతం ఇటీవల కంబదూరు, దొడ్డహళ్లి, పావగడ వరకు (99 కి.మీ), అటు వైపు నుంచి తుమకూరు–ఉరుకెర వరకు 10 కి.మీ మేర మొత్తం 109 కిలోమీటర్ల వరకు రైలుమార్గ నిర్మాణం పూర్తయింది. మరో 97 కిలోమీటర్ల మేర కర్ణాటక రాష్ట్రంలో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయం పనుల్లో తీవ్ర జాప్యం, ఇతరాత్ర కారణాలు, దీర్ఘకాలంగా సాగుతుండడంతో నిర్మాణ అంచనా వ్యయం అమాంతం రూ.4 వేల కోట్లు దాటినప్పటికీ ప్రాజెక్ట్ పూర్తికాకపోవడం విచారకరం. ఇంకా కోతాళం, మడకశిర, దొడ్డబెట్ట, హొసకెరె, మధుగిరి, కొరటగెరె మార్గంలో భూ సేకరణతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు, అండర్‌పాస్ నిర్మించేందుకు దీర్ఘకాలం పట్టవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వేసహాయ మంత్రి సోమన్న 2027 డిసెంబర్ నాటికి రైలు మార్గం నిర్మాణాన్ని పూర్తచేస్తామంటున్నా అది అసాధ్యమని రైల్వే అధికారులే చెబుతున్నారు. తగినన్ని నిధులు బడ్జెట్లో విడుదల చేస్తే తప్ప రైల్వేమార్గం నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఎలాంటి జాప్యం లేకుండా, నిధుల విడుదలతో పాటు అన్ని పనులు సక్రమంగా జరిగితే 2031 నాటికి రైలుమార్గం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. 14 ఏళ్లుగా నిర్మాణ దశలోనే రాయదుర్గం – తుమకూరు రైలుమార్గం 206.52 కి.మీలో నేటికీ 109 కి.మీ మాత్రమే పూర్తి నిర్మాణ పనుల్లో జాప్యంపై అన్ని వర్గాల ప్రజల అసంతృప్తి -
కేజీబీవీలో సమస్యల తిష్ట
అగళి: స్థానిక కేజీబీవీలో సమస్యలు తిష్టవేశాయి. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు స్నానపు గదులకు కనీసం డోర్లు కూడా లేకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంఈఓ–1 నాగేంద్ర, ఎంఈఓ–2 చంద్రశేఖర్ బుధవారం కేజీబీవీని తనిఖీ చేయడంతో సమస్యలు బయటకు వచ్చాయి. ప్రధానంగా మరుగుదొడ్లు శుభ్రంగా లేవని, నీటి సమస్య ఉందని, స్నానపు గదులకు డోర్లు లేవని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపాల్ నాగరత్నమ్మను ఎంఈఓలు ఆదేశించారు. అనంతరం ఎంఈఓ నాగేంద్ర మాట్లాడుతూ కేజీబీవీపై ఇటీవల పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. విద్యార్థినులకు సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్ నాగరత్నమ్మ, ఉపాధ్యాయులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అపరిశుభ్రంగా మరుగుదొడ్లు డోర్లు లేని స్నానపు గదులు -
తాగునీటి కోసం ఆందోళన
గుడిబండ: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మండల పరిధిలోని మోపరుగుండు గ్రామంలోని దళిత కాలనీకి చెందిన మహిళలు, ప్రజలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. మడకశిర నుంచి అమరాపురం రహదారిపై బిందెలను అడ్డుపెట్టి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళలు మాట్లాడుతూ కొన్ని రోజులుగా కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సంబంధిత శాఖాధికారులకు పలుమార్లు విన్నపించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు బావులకు విద్యుత్ సమస్యతో తాగునీటికి తీవ్ర ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
‘సర్’ సకాలంలో పూర్తి కావాలి
అమడగూరు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని కస్సముద్రం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి ఎదురువుతున్న సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులకు తెలిపి ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. తొలుత ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్–పేషెంట్ వార్డు, లేబర్‌రూం, మందుల నిల్వ గదిని పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవలు, మందులు, పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. అనంతరం కలెక్టర్ స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవల గురించి ఆరా తీశారు. వివిధ సమస్యలపై అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. అక్కడే ఉన్న ప్రజలతో మాట్లాడి అధికారులు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. అలాగే ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదులను, రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం, పాఠశాలలోని సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మధ్యాహ్న పథకం అమలు తీరును, వంటగది పరిశుభ్రతను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మారుతీ ప్రకాశ్, ఎంపీడీఓ శకుంతల, వైద్యాధికారి అపర్ణ, ఏపీఓ మధుసూదన్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ అనిల్‌కుమార్, ఏఓ వెంకటరమణాచారి, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. అధికారులకు కలెక్టర్ ఆదేశం కస్సముద్రం రగ్రామ సచివాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆదర్శ పాఠశాల తనిఖీ -
మోసం చంద్రబాబు నైజం
చంద్రబాబు ‘నేతన్న భరోసా’ పేరుతో చేనేతలను ఆదుకుంటామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినా రెండేళ్ల పాటు అమలు చేయకుండా చేనేతలను మోసం చేశారు. ఇప్పుడు రెండేళ్ల సాయాన్ని ఎగ్గొట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చేనేత సంక్షోభంలో చిక్కుకుపోయింది. వేలాదిమంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి దినసరి కూలీలుగా దుర్భర జీవనం అనుభవిస్తున్నారు. మరికొంత మంది అప్పుల బాధ తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చేనేతలపై ప్రభుత్వ నిర్లక్ష్య తీరును వైఎస్సార్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం చేనేత కుటుంబాలకు మూడేళ్ల సాయాన్ని రూ.75 వేలు అందించాల్సిందే. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తాం. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఽవైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త -
జెడ్పీ ప్రగతికి పాటుపడతాం
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా జి. కృష్ణమూర్తి బుధవారం బాధ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త డిప్యూటీ సీఈఓ మీడియాతో మాట్లాడుతూ బాధ్యతగా పనిచేద్దాం.. జిల్లా పరిషత్ ప్రగతికి పాటుపడుదామంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న మల్లికార్జున, ఏఓలు భాస్కర్ రెడ్డి, లెక్కల శ్రీనివాసులు, షేక్ నియాజ్ పలువురు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసం ● పోలీసుల అదుపులో కేటుగాళ్లు అనంతపురం సెంట్రల్: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ పుల్లయ్య బుధవారం మీడియాకు ఆ వివరాలు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం చెంచుగారిపల్లికి(ప్రస్తుతం దేవహనహళ్లి, బెంగళూరులో ఉంటున్నాడు) చెందిన కొర్రా విజయనాయక్, అనంతపురంలోని రహమత్‌నగర్‌కు చెందిన షేక్ ముజీమ్ మిల్, తాడిపత్రికి చెందిన పల్లా నారాయణస్వామి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇస్రో అనుబంధ సంస్థ అయిన ఎన్ఏఆర్ఎల్ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అలాగే రిజర్వ్‌బ్యాంకులో తమకు రూ.కోట్ల డబ్బు ఉందని, విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని, తొలుత డబ్బులు ఇస్తే తిరిగి ఎక్కువ ఇస్తామని చెప్పి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు. ఇలా నగరంలోని అరవింద్నగర్కు చెందిన ఓ వ్యక్తికి ఎన్‌ఏఆర్‌ఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలు, రిజర్వ్ బ్యాంకులో డబ్బులు డ్రా చేయడ కోసమంటూ రూ. 6 లక్షలు చొప్పున మొత్తం రూ. 20 లక్షలు తీసుకొని మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఆదర్శనగర్ సమీపంలో నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో కొర్రా విజయ్‌కుమార్, షేక్ ముజీమ్ మిల్‌ను అరెస్ట్ చేశారు. పల్లా నారాయణస్వామి అలియాస్ బన్ని పరారీలో ఉన్నట్లు సీఐ పుల్లయ్య పేర్కొన్నారు. అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): అప్పుల భారం తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన డీ.హీరేహాళ్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన గౌరీశంకర్ (27) సాయి బాలాజీ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ పనిచేస్తున్నాడు. ఆన్లైన్ గేమింగ్, ట్రేడింగ్‌లకు అలవాటు పడిన గౌరీశంకర్ తెలిసిన వారి వద్ద అప్పులు చేసి అందులో డబ్బు పెట్టాడు. తీవ్ర నష్టాలు రావడంతో చేసిన అప్పులు తీరేమార్గం లేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి తన ఇంటి బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. లక్ష్మీకి ఇద్దరు కుమారులు ఉండగా గౌరీశంకర్ చిన్న కుమారుడని, ఇంకా వివాహం కాలేదన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి రాయదుర్గంటౌన్: కర్ణాటకలోని గుడేకోట వద్ద బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి ఆర్టీసీ డ్రైవర్ ఎం.కరిబసప్ప (54) దుర్మరణం పాలయ్యారు. బంధువుల వివరాల మేరకు ... కరిబసప్ప దాదాపు 17 ఏళ్లుగా రాయదుర్గం ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తిరుపతి సర్వీస్ డ్యూటీ ముగించుకుని వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం సాయంత్రం కర్ణాటకలోని గుడేకోటలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. గుడేకోట సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొన్నాడు. ఘటనలో కరిబసప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మొలకాల్మూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
26న పుట్టపర్తిలో ఐక్యతా పరుగు
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురష్కరించుకుని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ‘5కే రన్ అండ్ రైడ్’ (ఐక్యతా పరుగు) చివరి దశకు చేరుకుంది. ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 26న పుట్టపర్తిలో నిర్వహించనున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే తెలిపారు. బుధవారం వారు ఐక్యతా పరుగుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అందించే టీ షర్టు , మెడళ్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఐక్యత, ఆరోగ్యం, మానవతా విలువలు, ఫిట్ ఇండియా ఉద్యమానికి ప్రేరణగా ‘5కే రన్ అండ్ రైడ్’ దేశ వ్యాప్తంగా నిర్వహించామన్నారు. 45 నగరాల్లో విజయవంతంగా నిర్వహించిన ఐక్యతా పరుగులో 1.10 లక్షల మంది యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26న సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియం నుంచి ఉదయం 5.30 గంటలకు ‘5కే రన్ అండ్ రైడ్’ ప్రారంభమవుతుందని, పుట్టపర్తి ప్రధాన రహదారి, గణేష్ సర్కిల్, విమానాశ్రయం సమీపంలోని పెట్రోలు బంక్ మీదుగా సాగి తిరిగి హిల్ వ్యూ స్టేడియం చేరుకుంటుందన్నారు. ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి ఈనెల 24, 25 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇండోర్ స్టేడియంలో ఉచితంగా టీ షర్టు, పంపిణీ చేస్తామన్నారు. 5కే రన్‌కు తమ సొంత సైకిళ్లను తీసుకురావాలన్నారు. వివరాలకు 8897369392, 7411455705 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలి
పరిగి: మండలంలోని పెన్నా, జయమంగళి నదుల నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, ఇందుకోసం రెవెన్యూ, పోలీసు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. బుధవారం ఆయన పరిగి మండలంలో పర్యటించారు. మండలంలో స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుకను ఉచితంగా పొందవచ్చని, అలాకాకుండా కర్ణాటక, ఇతర ప్రాంతాలకు తరలిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తవ్వితే ఉపేక్షించబోమన్నారు. ఇక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి నిర్వహిస్తున్న సమగ్ర రీసర్వే పారదర్శకంగా జరగాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని ఊటుకూరు, శిరేకోలం, పి నరసాపురం గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఉమ్మడి ఖాతాల విభజన, నమోదులో సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉరివేసుకొని నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య పుట్టపర్తి అర్బన్: మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపం చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం పుట్టపర్తి మండలం బడేనాయక్ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బడేనాయక్ తండాకు చెందిన అంబాజీ నాయక్, కళావతీబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె యువతీ బాయి(24) కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ (ఆప్తమాలజీ) చివరి సంవత్సరం చదువుతోంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. నిత్యం దీర్ఘాలోచనలో ఉండేది. కుటుంబ సభ్యులతోనూ సరిగా మాట్లాడకుండా ముభావంగా ఉండేది. ఏమైందో ఏమో గానీ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి కుమార్తె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దించి చూడగా..అప్పటికే మృతి చెంది ఉంది. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. రూరల్ ఎస్ఐ క్రాంతి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి అంబాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి ప్రశాంతి నిలయం: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూమికి సంబంధించిన పరిహారం వెంటనే అందించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలిసి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిలమత్తూరు మండలం టేకులోడు పరిధిలో 607.06 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించామని, ఆయా భూములను సాగుచేసుకుంటున్న వారికి రూ.76.85 కోట్ల పరిహారం అందించే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇక పట్టా భూముల సేకరణలో 132.21 ఎకరాలకు మార్కెట్ విలువ ప్రకారం రూ.23.18 కోట్లు చెల్లింపుల ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. అలాగే మలుగూరు వద్ద 119.84 ఎకరాలకు రూ.15.25 కోట్ల పరిహారం ఇస్తామన్నారు. కొండూరు వద్ద 1,074 ఎకరాలకు సంబంధించిన సర్వే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. లేపాక్షి వద్ద 313.31 ఎకరాల సేకరణకు పబ్లిక్ నోటీసులు ఇచ్చామన్నారు. గౌడనహళ్లి గ్రామంలో 571 ఎకరాల భూ సేకరణకు ఆమోదం లభించిందని, ముదిగుబ్బ మండలం బండ్లపల్లి వద్ద 224.35 ఎకరాల భూమికి డీకేటీ నోటీసులు జారీ చేసి ఎక్స్‌గ్రేషియా నివేదికల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 చెరువులకు నీళ్లు అందించే ప్రక్రియలో భాగంగా 6 మండలాల పరిధిలో 37 గ్రామాల్లో 141.50 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే 119 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయిందన్నారు. -
‘ప్రైవేటు’ చదువే దిక్కు
ఈ చిత్రంలోని విద్యార్ధి పేరు లోకేష్. ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. ఇప్పుడు డిగ్రీ చదవాలనుకున్నా.. హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన లోకేష్ అప్పులు చేసి ప్రైవేటు కళాశాలలో అడ్మిషన్ పొందాడు. కానీ ఇలా అప్పు చేసే ధైర్యం కూడా లేక చాలా మంది నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. హిందూపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బాలురకు ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలలు అందుబాటులో లేవు. దీంతో ఇక్కడి విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలే ప్రత్యామ్నాయంగా మారాయి. అయితే వేలాది రూపాయల ఫీజులు, ఇతర ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువులను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ హిందూపురం వాణిజ్య పరంగా, విద్య పరంగా జిల్లాలోనే పేరుగాంచింది. పట్టణంలో 2 లక్షల దాకా జనాభా ఉన్నారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ కూడా. నియోజకవర్గంలోని రూరల్ మండలంతోపాటు లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసించడానికి ఇక్కడికే రావాలి. అయితే ఇప్పటి వరకు పట్టణంలో బాలురకు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం ఇక్కడ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రభుత్వ కళాశాల అందుబాటులో ఉంటే పేద విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఉన్నత విద్యలో చేరికలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రైవేటు చదువే దిక్కు.. హిందూపురంలో 14 వరకు ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో 15 వేల మంది దాకా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలున్నాయి. ఇందులో 1,200 నుంచి 1,300 మంది వరకూ విద్యార్ధినులు చదువుతున్నారు. అయితే బాలురకు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో ప్రైవేటు కళాశాలలే దిక్కవుతున్నాయి. దీంతో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం పరిసర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యను కొనసాగించే నిరుపేద విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోంది. హామీని అటకెక్కించిన బాలకృష్ణ.. హిందూపురం ప్రజలు టీడీపీ స్థాపించినప్పటి నుంచి టీడీపీ అభ్యర్థులను, నందమూరి వంశాన్ని ఆదర్శిస్తూ వస్తున్నారు. అయినా వారు హిందూపురానికి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ... ఎన్నికల సమయంలో హిందూపురంలో ప్రభుత్వ బాలుర జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. నేటికీ ఆ హామీని నేరవేర్చలేకపోయారు. బాలుర ప్రభుత్వ కళాశాలలకు నోచుకోని హిందూపురం ‘ప్రైవేటు’ ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమవుతున్న నిరుపేదలు ఏళ్లుగా విన్నవిస్తున్నా కనీసం పట్టించుకోని ఎమ్మెల్యే బాలకృష్ణ -
అర్హులందరూ ఓటు హక్కు పొందేలా చర్యలు
పుట్టపర్తి టౌన్: ఎన్యుమరేషన్ ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా చేపట్టి నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలోని 6, 7 వార్డుల సచివాలయాలకు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఏ విధంగా సాగుతోందనే దానిపై బీఎల్ఓలతో ఆరాతీశారు. అలాగే ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తప్పులు లేకుండా సర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు పొందేవిధంగా చూడాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధిగా కార్యాలయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలు అందించాలని ఆదేశించారు. సచివాలయాలపై నిరంతరం నిఘా ఉంటుందని విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఆర్డీఓ సువర్ణ ఉన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
హత్యలు .. అరాచకాలు
సాక్షి, పుట్టపర్తి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా దాడులు, దారుణాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, వేధింపులు పెరిగిపోయాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యవస్థలను చెప్పచేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎదురించినా.. ప్రశ్నించినా.. ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రెండేళ్ల వ్యవధిలో పదుల సంఖ్యలో వెలుగు చూశాయి. ఆరంభం నుంచి అల్లకల్లోలమే.. గతంలో ఆర్ఓసీ (రీ ఆర్గనైజింగ్ కమిటీ) పేరుతో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరాచకాలు సృష్టించారు. వందల మందిని హతమార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే మద్దెలచెరువు టీవీ బాంబు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పరిటాల రవి హత్యా తర్వాత జిల్లాలో కొన్నేళ్ల పాటు ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా రెండేళ్ల నుంచి అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. వేధింపులు.. దందాలు.. రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులందరూ దౌర్జన్యాలకు.. భూ దందాలకు దిగుతున్నారు. ఎదురించిన వారిని పోలీసులతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. ఈనెల 20న అనంతపురం రూరల్ మండలం ఆలమూరుకు చెందిన అంకె నరేంద్ర పోలీసుల వేధింపులతో పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన మరణానికి పరిటాల సునీత అనుచరులే కారణమని సెల్ఫీ వీడియో తీసి బయటికి విడుదల చేశాడు. రక్షణ కరువు.. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు మండలాల్లో టీడీపీ వెంట తిరిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీలో ఉంటే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సామాన్యులు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లోనే అరాచకాలు జరుగుతున్నాయని స్పష్టంగాా తెలుస్తోంది. 2025 మార్చి 30 – రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యుల ఇళ్లపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. ఇది పద్ధతి కాదని మందలించిన కురుబ లింగమయ్యను టీడీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది పండుగ రోజున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దౌర్జన్యాలను అడ్డుకునేందుకు వెళ్లిన వారిని అంతమొందించడాన్ని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాపిరెడ్డిపల్లికి వచ్చి లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. 2025 మే 17 – భూ తగాదాలో చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులను రాప్తాడులో దారుణంగా హత్య చేశారు. పరిటాల సునీత అండతోనే రాప్తాడుకు చెందిన 15 మంది వేట కొడవళ్లతో దారుణంగా చంపేశారు. భూ తగాదా కారణంగా కోర్టులో ఉన్న భూమిని పరిటాల సునీత అండతో రూ.4 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఆ భూమి విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుంది. ఈ క్రమంలో యజమానులు ఎదురు నిలిచారు. దీంతో ఆ భూమి తమదేనంటూ దౌర్జన్యంగా పొలంలోకి వచ్చి.. నారాయణరెడ్డి దంపతులను నరికి చంపారు. 2026 జూలై 21 – ఇవ్వాల్సిన అప్పు అడిగినందుకు కనగానపల్లి మండల కేంద్రంలో అంకె నగేష్‌ను అదే గ్రామానికి చెందిన బోయ అక్కులప్పతో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలు రాళ్లతో కొట్టి చంపారు. మమ్మల్నే డబ్బులు తిరిగి అడుగుతావా? అంటూ బెదిరించారు. డబ్బులు ఇవ్వకుంటే పోలీసులను ఆశ్రయిస్తానని నగేశ్ సమాధానం చెప్పగా.. వెంటనే అక్కులప్ప కుటుంబ సభ్యులందరూ కలిసి నగేశ్‌పై దాడి చేసి చంపేశారు. -
కొందరికే ‘తల్లికి వందనం’
పుట్టపర్తి అర్బన్: తల్లికి వందనం పథకం కింద నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఊదరకొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక అది కాస్తా రూ.13 వేలే అయింది. అందులోనూ నిబంధనల పేరుతో వేలాది మందికి మొండి చేయి చూపారు. మొదటి విడతలో మాదిరిగానే రెండో ఏడాది సైతం ఎంతో మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. నేడు నిధులు విడుదల.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు మొత్తాన్ని తల్లి ఖాతాలకు నేడు జమ చేయనున్నారు. ఎన్నికల్లో రూ.15 వేలు ప్రకటించినా కేవలం రూ.13 వేలు మాత్రమే జమ చేస్తుండటం విశేషం. తక్కిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క పాఠశాలకు కూడా అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లాలోని ఎన్నో పాఠశాలల భవనాలు అధ్వానంగా మారాయి. 14,061 మందికి ఎగనామం.. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్, మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ పథకం కింద నగదు జమ చేయనున్నారు. ఒకటి నుంచి పది వరకూ 2,33,701 మంది ఉన్నారు. ఇంటర్లో 23,255 కలిపి మొత్తం 2,56,956 మంది ఉన్నారు. వీరందరికీ నిధులు జమ చేయాల్సి ఉంది. అయితే కేవలం 2,42,895 మందికి మాత్రమే నిధులు జమ చేస్తున్నారు. దీంతో సుమారు 14,061 మంది విద్యార్థులకు మొండిచేయి చూపినట్లవుతోంది. పథకానికి అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు 1,56,296 మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. మొదటిరోజు జమ కాక పోతే అంతే.. తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రభుత్వం బుధవారం విద్యార్థుల తల్లుల ఖాతాలకు నిధులు జమ చేయనుంది. మొదటి రోజు ఖాతాలకు నిధులు జమ కాకుంటే మళ్లీ డబ్బులు పడే పరిస్థితి లేదంటున్నారు. నిధులు జమ కాకపోతే పాఠశాల, ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల్లోనూ సమాచారం ఉండదు. సచివాలయాలు ఇతర కార్యాలయాల్లోనూ తల్లికి వందనం గురించి చెప్పేనాథుడే ఉండరు. గత ఏడాది డబ్బులు నేటికీ జమకాని వారు వేలాది మంది ఉన్నారు. వారంతా కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు. నిబంధనల పేరుతో 14,061 మందికి డబ్బులు కట్ నేడు తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమచేస్తామన్న ప్రభుత్వం జిల్లాలో 2,42,895 మందికి లబ్ధి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో జిల్లాలోని 2,42,895 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తల్లులు సుమారు 1,56,296 మంది ఉన్నారు. వారి ఖాతాలు సక్రమంగా ఉంటే పథకాన్ని ప్రారంభించిన వెంటనే నిధులు జమ అవుతాయి. ఖాతాలకు ఆధార్, లింక్, ఏపీసీఐ ప్రక్రియ, ఆధార్‌కు ఫోన్ లింకు చేసుకోవాలని ఇప్పటికే సూచించాం. – శ్రీలక్ష్మీ, జీఎస్డబ్ల్యూస్ జిల్లా అధికారి -
మద్యం తాగి వాహనం నడిపిన యువకుడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
పెనుకొండ: మద్యం సేవించి వాహనం నడిపిన యువకుడి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు... సీఐ రాఘవన్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి పెనుకొండ పట్టణ శివార్లలో ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఆల్విన్ కాలనీకి చెందిన ఎ.వెంకటేష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. ఇందులో భాగంగానే వెంకటేష్‌కు రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఏ మాత్రం ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపడతామని ఎస్ఐ తెలిపారు. గోరంట్లలో ఇద్దరికి జరిమానా గోరంట్ల: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి పెనుకొండ కోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. వివరాలు... గోరంట్ల పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓడీ చెరువు మండలానికి చెందిన బండి అనిల్, పుట్టపర్తికి చెందిన సాయికుమార్ నాయక్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రూ.20 వేలు జరిమానా విధించారు. అలాగే ఇద్దరి డ్రైవింగ్ లైసెన్స్‌లు మూడు నెలల పాటు రద్దు చేసినట్లు ఆర్టీఓ కరుణాసాగర్‌రెడ్డి పేర్కొన్నారు. -
24న కదిరిలో జాబ్‌మేళా
ప్రశాంతి నిలయం: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24న కదిరి ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాబ్‌మేళా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళాకు 11 బహుళ జాతీయ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. పది నుంచి బీటెక్, డిగ్రీ చదివిన విద్యార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు జీతం రూ.15 నుంచి రూ.25 వేల వరకూ ఉంటుందన్నారు. వివరాలకు 9390176421, 9440074407ను సంప్రదించాలన్నారు. ధర్మవరం, మడకశిర ఆర్డీఓల నియామకం ధర్మవరం అర్బన్/మడకశిర: ధర్మవరం ఆర్డీఓగా రాంభూపాల్‌రెడ్డితో పాటు మడకశిర ఆర్డీఓగా నాగప్రసన్నలక్ష్మిని నియమించినట్లు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ధర్మవరం ఆర్డీఓగా పనిచేసిన మహేష్ నాలుగు నెలల క్రితం బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ఇన్చార్జ్ ఆర్డీఓగా వ్యవహరిస్తున్నారు. నంద్యాలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాంభూపాల్‌రెడ్డిని ధర్మవరం ఆర్డీఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మడకశిర ఆర్డీఓగా నాగ ప్రసన్న లక్ష్మిని నియమించారు. ఇటీవలే మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. అయితే అప్పట్లో రెగ్యులర్ ఆర్డీఓను ప్రభుత్వం నియమించలేదు. ఇన్నిరోజులుగా పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్ ఇన్చార్జ్ ఆర్డీఓగా కొనసాగారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న నాగ ప్రసన్నలక్ష్మిని మడకశిర ఆర్డీఓగా నియమించారు. త్వరలోనే వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు హాజరుకండి కదిరి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తూ ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు రెన్యూవల్ కోసం బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయం వద్ద హాజరు కావాలని జిల్లా ఐడీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సలీంబాషా ఒక ప్రకటనలో తెలిపారు. మడకశిర ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ● పౌష్టికాహార పంపిణీలో జరిగిన అవకతకలపై విచారణ మడకశిర: మడకశిరలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ సీఐ జయమ్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా 2021లో ప్రాజెక్ట్ పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం పక్కదారి పట్టిపట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో సీడీపీఓగా విజయకుమారి పని చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్పట్లో విచారణకు ఆదేశించారు. ఏసీబీ అధికారులు అప్పట్లోనే విచారణ చేపట్టి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన విచారణ తుది దశకు చేరుకుంది. ఈక్రమంలో ఏసీబీ అధికారులు మరోసారి ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి పలు రికార్డులను పరిశీలించారు. 2021లో పనిచేసిన ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది కూడా హాజరయ్యారు. అయితే గత విచారణకు ఇది కొనసాగింపు అని, మీడియాకు తెలపాల్సిన విషయాలు ఏమీలేవని సీఐ జయమ్మ పేర్కొన్నారు. -
తండ్రి కళ్లెదుటే కుమారుడి దుర్మరణం
రాప్తాడు రూరల్: ఒక్కగానొక్క కొడుకు.. వ్యాపారంలో తండ్రికి తోడుగా.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్నారు.. తండ్రీ కుమారుడు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై హైదరాబాద్ నుంచి సొంతూరు లేపాక్షి మండలం పిల్లిగుండ్ల కాలనీకి బయల్దేరారు.. రాప్తాడు మండలం మరూరు సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద నెమ్మదించిన కొడుకు బైక్‌ను ఐచర్ వాహనం మృత్యువు రూపంలో కబళించింది. కళ్లెదుటే కన్నకొడుకు ప్రాణాలు విడుస్తుంటే.. ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. ఈ హృదయ విదారక ఘటన గొల్లపల్లి టోల్గేట్ సమమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. లేపాక్షి పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్లకాలనీకి చెందిన వెంకటస్వామి, ఆయన కుమారుడు విశాక్‌రాజ్ (24) ఔషధ మూలికలు, టూత్ బ్రష్‌లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపార నిమిత్తం తండ్రీకొడుకులు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై హైదరాబాద్‌కు వెళ్లి తిరుగు పయనమయ్యారు. తీరా రాప్తాడు మండలం గొల్లపల్లి టోల్గేట్ దాటిన తర్వాత మరూరు సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద విశాక్‌రాజ్ తన బైక్‌ను నెమ్మదించగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఐచర్ వాహనం అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో విశాక్‌రాజ్ రోడ్డుపై పడిపోగా, అతడి మీదుగా ఐచర్ వాహనం దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్ది సేపటికే వెనుక వచ్చిన తండ్రి వెంకటస్వామి.. తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి బోరున విలపించాడు. కుటుంబానికి ఏకై క కుమారుడైన విశాక్‌రాజ్ మృతితో తల్లిదండ్రులు, ముగ్గురు సోదరీమణులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పిల్లిగుండ్లకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాక్‌రాజ్ (ఫైల్) హైదరాబాద్ నుంచి బైక్‌లో వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం కొడుకు మృతదేహం వద్ద విలపించిన తల్లిదండ్రులు -
అందరూ ‘ప్రైవేటు’ స్టార్లే!
పుట్టపర్తి అర్బన్: పది, ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్వహించిన ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానం అపహాస్యమైంది. సగానికిపైగా అవార్డులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కట్టబెట్టడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. తమ విద్యార్థులు మంచి మార్కులతో మండల ఫస్ట్ వచ్చినా ‘షైనింగ్ స్టార్స్ అవార్డు’ ఇవ్వలేదని, వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వాపోయారు. దారి తప్పిన లక్ష్యం.. పది, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ‘షైనింగ్ స్టార్స్’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి రానున్న రోజుల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయని భావించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో మెడల్, ప్రశంసాపత్రం, రూ.20 వేలు చెక్కు అందివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో పది, ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 237 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. వారిని పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మాహి శ్రీనివాస గార్డెన్స్‌లో అవార్డులతో సత్కరించారు. ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర, డీఈఓ కిష్టప్ప తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. పదో తరగతికి సంబంధించి మొత్తం 201 మందికి గాను ఏకంగా 104 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవార్డులు అందజేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ ప్రోత్సాహానికి దూరమయ్యారు. ఇక ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 36 మందికి అవార్డులివ్వగా.. అందులోనూ 22 మంది ప్రైవేటు కళాశాలల విద్యార్థులున్నారు. దీంతో అధికారుల తీరును ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పుబట్టారు. సర్కారు సొమ్మును ప్రైవేటు విద్యాసంస్థలకు మేలు చేసేలా ఖర్చు చేశారంటూ మండిపడ్డారు. అలాగే ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన అధికారులు తీరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యక్రమం ప్రారంభించారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో ఎండీఎం ఏడీ వినయ్‌కుమార్, డీఐఈఓ చెన్నకేశవప్రసాద్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానంలో వివక్ష మండల ఫస్ట్ వచ్చిన సర్కారు బడుల విద్యార్థులకూ మొండిచేయి అపహాస్యమైన అవార్డుల కార్యక్రమం -
‘పరిష్కార వేదిక’కు 421 అర్జీలు
ప్రశాంతి నిలయం: సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తూతూమంత్రంగా పరిష్కారం చూపుతుండటంతో ప్రజలు మళ్లీ అదే సమస్యపై అర్జీ ఇచ్చేందుకు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. సోమవారం పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’కు జనం భారీగా తరలివచ్చారు. వివిధ సమస్యలపై 421 అర్జీలిచ్చారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య, ఎస్డీసీ విజయ కుమారి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ‘టెట్’ రద్దుకు చట్ట సవరణ చేయాలి ● జేసీకి వైఎస్సార్ టీఏ నాయకుల వినతి పుట్టపర్తి: దేశంలో ‘టెట్’ విధానం అమల్లోకి రాకముందే పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉపాధ్యాయులుగా నియమితులైన వారు..ప్రస్తుతం టెట్ నిబంధనలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల ‘టెట్’ రద్దుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని వైఎస్సార్‌టీఏ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు రామమోహన్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ... సీనియర్ ఉపాధ్యాయులకు ‘టెట్’తో సంబంధం లేకుండా వెంటనే ప్రమోషన్లు కల్పించాలన్నారు. చట్ట సవరణ జరిగే వరకూ ఉపాధ్యాయులు ప్రయోజనాలు కోల్పోకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. టీబీ డ్యాంలో 25.77 టీఎంసీల నీరు బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం డ్యాంలో 25.77 టీఎంసీల నీరు ఉంది. ఇటీవల బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు నారుమళ్లు, ఎండుమిర్చి, పత్తి పంటలు విత్తుకున్నారు. టీబీ జలాశయం నుంచి నీరు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే, మొన్నటి వరకు ఊరించిన వరద ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 79.90 టీఎంసీల నీరు నిల్వ ఉండి 38,079 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 39,009 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు కావడం గమనార్హం. -
మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి
అధిక జ్యేష్టం, ఆషాఢం, అన్‌సీజన్ కారణంగా పట్టుచీరల అమ్మకాలు బాగా తగ్గాయి. 4 నెలలుగా ఇదే పరిస్థితి. ప్రభుత్వం సొసైటీల ద్వారా అన్‌సీజన్‌లో పట్టు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరిశ్రమల శాఖ నుంచి రాయితీ రుణాలిస్తే వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే చేనేత కార్మికులకు ముడిపట్టు రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పట్టుచీరల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. – రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరంవ్యాపారం బాగా తగ్గింది పట్టుచీరల వ్యాపారం బాగా తగ్గింది. చేనేత సంక్షోభం కారణంగా పట్టుచీరల ఉత్పత్తి కూడా తగ్గింది. అన్‌సీజన్ కారణంగా రూ.లక్షల పెట్టుబడి స్తంభించిపోతోంది. దీనికి తోడు షోరూం నిర్వాహకులు డిస్కౌంట్ సేల్‌తో ఇస్టానుసారం చీరల ధరలు తగ్గిస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – రవితేజారెడ్డి, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం -
రైలు ఢీకొని విద్యార్థిని మృతి
గుడిబండ: కర్ణాటక రాష్ట్రం తుమకూరు పట్టణ రైల్వేస్టేషన్లో రైలు ఢీకొని విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గుడిబండకు చెందిన నాగరాజు, రాధమ్మ దంపతుల కుమార్తె నవ్య (25) బెంగళూరులోని సప్తగిరి యూనివర్సిటీ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతోంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నవ్య తుమకూరులో పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూనే విద్యను అభ్యసిస్తోంది. అయితే సోమవారం ఉదయం బెంగళూరులోని కళాశాలకు బయలుదేరి వెళ్లే సమయంలో తుమకూరు పట్టణంలోని రైల్వేస్టేషన్లో ఉన్న రైల్వే పట్టాలను దాటుతుండగా అటు నుంచి వచ్చిన రైలు నవ్యను ఢీ కొట్టింది. మృతురాలిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. నవ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పాము కాటుకు మహిళ బలి లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షి బీసీ కాలనీకి చెందిన నాగమ్మ (40) పాముకాటుతో మృతి చెందింది. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం మృతురాలు గడ్డి కోసం పొలంలోకి వెళ్లింది. గడ్డి కోసి కట్ట కట్టే సమయంలో మోపులో ఉన్న పాము నాగమ్మ ఎడమ చేతి వేళ్లకు కాటేసింది. దీంతో అక్కడున్న కొంతమంది గమనించి వైద్య పరీక్షలు నిమిత్తం ఆమెను లేపాక్షి పీహెస్సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగమ్మ మృతి చెందింది. మృతురాలికి భర్తతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం హిందూపురం: మండలంలోని కగ్గల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓడీ చెరువు మండలానికి చెందిన నాగార్జున (30) మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. నాగార్జున ద్విచక్ర వాహనంలో మడకశిర నుంచి కొడికొండ–సిరా హైవేపై లేపాక్షి వైపు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు. పోలీసులు శవాన్ని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హిందూపురం అప్‌గ్రేడ్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిప్పంటుకొని వృద్ధుడి మృతి కదిరి టౌన్: పట్టణానికి చెందిన వృద్ధుడు మంటలు అంటుకొని మృతి చెందాడు. పోలీసుల వివరాలమేరకు... నానాదర్గాకు చెందిన అబ్దుల్ ఘని (70) ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. కొద్ది రోజుల నుంచి కాళ్లు నడవడానికి వీలుకాని దుస్థితి నెలకొంది. అయితే ఘని ఇంట్లో బీడి తాగి పక్కకు వేయడంతో పక్కనే ఉన్న పేపర్లు అంటుకున్నాయి. మంటలు అబ్దుల్ ఘనికి వ్యాపించాయి. పెద్దగా కేకలు వేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో అతను చనిపోయాడు. సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. అబ్దుల్ ఘని భార్య, పిల్లలు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. -
మా పొట్టకొట్టొద్దు
● డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన పుట్టపర్తి: తమ ఉపాధిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396ను వెంటనే రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్ల డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తప్పుల్లేకుండా రాస్తూ ప్రభుత్వానికి, భూముల అమ్మకం, కొనుగోలుదారులకు వారధిగా ఉన్నామన్నారు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో ఉన్న తమకు తీవ్ర అన్యాయం చేసే విధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే జీఓ విడుదల చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసే జీఓ 396ను రద్దుచేయాలన్న డిమాండ్‌తో ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకూ నిరవధికంగా పెన్‌డౌన్ చేస్తున్నామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే జీఓను రద్దు చేసే వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో శాంతమూర్తి, బాబు, మహేష్, గురుమూర్తి, రామమూర్తి, హరి, రామకృష్ణ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ‘బైండోవర్’ ఉల్లంఘనపై జరిమానాకనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): ఘర్షణ కేసులో నిందితుడిగా ఉండి బైండోవర్ అయిన ఓ వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించటంతో పోలీసులు జరిమానా విధించారు. చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపల్లి గ్రామానికి చెందిన నరేంద్రరెడ్డి తన బంధువుల ఇంటిపై దాడి చేసి సామగ్రిని ధ్వంసం చేసిన సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా అతన్ని స్థానిక తహసీల్దార్ వద్ద హాజరు పరచి తన సొంత పూచికత్తు కింద రూ.5 లక్షల విలువైన సెక్యూరిటీ బాండు రాయించుకున్నారు. కానీ అతను నిబంధనలు ఉల్లంఘించి తిరిగి సదరు వ్యక్తులపై బెదిరింపులు పాల్పడ్డాడని ఫిర్యాదు అందటంతో పోలీసులు సోమవారం అతన్ని తహసీల్దార్ వద్ద హాజరుపరచి రూ.25 వేల జరిమానా విధించారు. -
జీవితాలతో ‘ఆట’లు
సాక్షి, పుట్టపర్తి జూదం జిల్లాలో జూలు విదుల్చుతోంది. అరికట్టాల్సిన వారే ఆడిస్తుండటంతో రాత్రింబవళ్లు పేకాట జోరుగా జరుగుతోంది. కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లోనే పేకాట దందా కొనసాగుతుండగా... పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. అయితే ఉన్నతాధికారులు మందలించినప్పడు, పేపర్లలో కథనాలు వచ్చినప్పుడు మాత్రం హడావుడిగా దాడులు చేసి అడపాదడపా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా... కూటమి పార్టీల్లోని కొందరు నేతలు సిండికేటుగా మారి రోజుకో చోట పేకాట ఆడిస్తున్నారు. ఈ మేరకు పేకాటరాయుళ్లకు ముందుగానే సమాచారం ఇస్తున్నారు. దీంతో ఉదయం 7 గంటలకే వారి స్థావరానికి చేరిపోతుండగా...అప్పుడే మొదలయ్యే ఆట..అర్ధరాత్రి వరకు జరుగుతోంది. హిందూపురం, మడకశిర, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, తాడిమర్రి, రామగిరి చుట్టుపక్కల రాత్రింబవళ్లు పేకాట జరుగుతోందని సమాచారం. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు వస్తున్నట్లు తెలిసింది. నగదు తెచ్చుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల రంగు రంగుల కాయిన్లను ఇచ్చి.. ఒక్కో రంగుకు రేటు ఫిక్స్ చేసి ఆడిస్తున్నారు. అందుకే పోలీసులు ఎక్కడైనా పేకాట స్థావరంపై దాడి చేసినా నగదు పెద్దగా దొరకడం లేదు. జీవితం ‘ముక్క’లు కర్ణాటక ప్రాంతానికి చెందిన పేకాటరాయుళ్లు ఆటపై ఆసక్తితో సరిహద్దు దాటి రూ.లక్షలు చేత పట్టుకుని జిల్లాకు వస్తున్నారు. ఏజెంట్లకు కమీషన్లు ముట్టజూపి యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. పోలీసుల అలసత్వంతోనే.. పేకాట శిబిరాలు ఎక్కడపడితే అక్కడ వెలిసినట్లు తెలుస్తోంది. సరదాగా మొదలయ్యే పేకాట... వ్యసనంగా మారి ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా దెబ్బ తీస్తోంది. అక్కడక్కడా పోలీసులు దాడులు చేస్తున్నా... అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో మొక్కుబడిగా కేసులు కట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఆట కట్టిస్తాం పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచుతున్నాం. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదు. పేకాటరాయుళ్ల ఆగడాలు అరికట్టేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపాం. – ఎస్.సతీష్‌కుమార్, ఎస్పీ ఈనెల 19వ తేదీన రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 మొబైల్స్‌తో పాటు రూ.1.06 లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆలయానికి ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక నుంచి ప్రతి మంగళ, ఆదివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇదే అదనుగా కొందరు పేకాట స్థావరాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీన తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జనావాసాల మధ్యలో ఓ ఇంట్లోనే స్థావరం ఏర్పాటు చేసి పేకాట ఆడుతున్నట్లు సమాచారంతో రాత్రి 11 గంటల సమయంలో దాడులు నిర్వహించి పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘మామూళ్ల’తో కన్నెత్తి చూడని పోలీసులు కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తోన్న పేకాటరాయుళ్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న పేకాట -
డిస్కౌంట్ సేల్‌తో తీవ్ర నష్టం
ధర్మవరం: పట్టుచీరలకు ధర్మవరం పెట్టింది పేరు. ఇక్కడి చేనేత కార్మికులు అత్యాధునిక డిజైన్లతో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచారు. అందుకే ఇక్కడి నేసేపేటలోని 1,650 దుకాణాల (సిల్క్హౌస్లు) నుంచి పట్టుచీరలు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. ఈ సిల్క్హౌస్ల యజమానులు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని చేనేత కేంద్రాలైన ధర్మవరం, హిందూపురం, సోమందేపల్లి, గోరంట్ల, సిండికేట్ నగర్, యాడికి, నార్పల, కోటంక, ముదిరెడ్డిపల్లి, అన్నమయ్య జిల్లా మదనపల్లె తదితర ప్రాంతాల్లోని చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్ల నుంచి పట్టుచీరలను కావాల్సిన డిజైన్లలో నేయించుకుని కొనుగోలు చేస్తారు. వీటిని దేశంలోని వివిధ పట్టణాలు, నగరాలలోని పట్టుచీరల షోరూంల యజమానులకు హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటారు. విదేశాల్లోని షోరూంల యజమానులు కూడా ధర్మవరం వచ్చి తమకు నచ్చిన డిజైన్లతో చీరలు నేయించి తీసుకువెళ్తుంటారు. చేనేత మగ్గంపై తయారైన పట్టుచీరలు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతుంటాయి. ముఖ్యంగా ముహుర్తాల సీజన్లో ధర్మవరం మార్కెట్లో చీరల విక్రయాలు జోరుగా సాగుతాయి. దెబ్బతీసిన సెంటిమెంట్.. ధర్మవరం పట్టుచీరలపై సెంటిమెంట్ దెబ్బకొట్టింది. ఆర్థిక మాంద్యంతో పాటు అఽధిక జ్యేష్టం, ఆషాఢమాసం కారణంతో నాలుగు నెలలుగా శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో పట్టుచీరల విక్రయాలు బాగా తగ్గాయి. శుభకార్యాల సీజన్లో ప్రతి వారం సగటున రూ.40 కోట్ల లావాదేవీలు జరిగేవని, ప్రస్తుతం రూ.20 కోట్ల పట్టుచీరల విక్రయాలు కూడా జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో నేత కార్మికులు తయారు చేసిన పట్టు చీరలను వ్యాపారులు నిల్వ చేసుకోవాల్సి వస్తోందని, కార్మికులకు డబ్బులు కూడా సకాలంలో అందించలేని దుస్థితి నెలకొందంటున్నారు. నగదు వ్యాపారానికే ప్రాధాన్యం.. ధర్మవరం వ్యాపారులు దేశంలోని వివిధ నగరాల్లోని షోరూంలకు పట్టుచీరలను అరువుకు ఇచ్చేవారు. చీరలు ఇచ్చిన రెండు, మూడు నెలల తర్వాత డబ్బులిచ్చినా సర్దుకునేవారు. అందుకే వ్యాపారమూ బాగా జరిగేది. అయితే పలు ప్రాంతాల్లోని పట్టుచీరల షోరూం యజమానులు డబ్బులు ఎగ్గొట్టడంతో.. లాభం తక్కువైనా నగదు వ్యాపారానికే మొగ్గు చూపుతున్నారు. ముహూర్తాల సీజన్‌పైనే ఆశ.. రానున్న శ్రావణం, దసరా, దీపావళి పండుగలపై వ్యాపారులు గంపెడు ఆశపెట్టుకున్నారు. ముహూర్తాల సీజన్లో తప్పకుండా పట్టుచీరల విక్రయాల జోరందుకుంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి పంటలు సక్రమంగా పండే అవకాశం లేదన్న వార్తలతో వ్యాపారుల్లో కలవరం మొదలైంది. పట్టుచీరల ఎగుమతుల్లో ధర్మవరం మార్కెట్ దేశంలోనే పేరుగాంచింది. ఇతర రాష్ట్రాల వ్యాపారుల రాకపోకలతో నిత్యం కళకళలాడుతూ ఉండేది. కానీ నేడు కొనుగోలుదారులు రాక వెలవెలబోతోంది. వరుసగా అధిక జ్యేష్టం, ఆషాఢ మాసం సెంటిమెంట్ దెబ్బకు సిల్క్హౌస్లన్నీ కళా విహీనంగా మారాయి. శుభకార్యాలు లేక పోవడంతో పట్టుచీరల అమ్మకాలు మందగించాయి. ధర్మవరంలోని నేసేపేటలోని ఏ షాపులో చూసిన పట్టుచీరల నిల్వలు పేరుకుపోయాయి. దీంతో వ్యాపారులు రానున్న శ్రావణంలో వచ్చే ముహూర్తాల సీజన్‌పై ఆశలు పెట్టుకున్నారు. పట్టుచీరపై సెంటిమెంట్ దెబ్బ నిరాశాజనకంగా ధర్మవరం సిల్క్ మార్కెట్ మందగించిన చీరల అమ్మకాలు ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు అధిక జ్యేష్టం, ఆషాఢం ప్రభావమే కారణం షోరూంల డిస్కౌంట్ సేల్‌తో వ్యాపారులకు తీవ్ర నష్టం పలు నగరాల నుంచి వస్తున్న షోరూం నిర్వాహకులు ఆషాఢం డిస్కౌంట్ సేల్ పేరుతో చీర అసలు ధరలోనే 20 శాతం కోత విధించి కొనుగోలు చేస్తుండటంతో స్థానిక పట్టు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టాలను కార్మికులకుపై మోపితే వ్యవస్థ నడవడమే కష్టమౌతుండటంతో వ్యాపారులే నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
మంత్రి సవితను బర్త్‌రఫ్ చేయాలి
పరిగి: ‘‘కియా పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పరిగికి చెందిన వడ్డే సునీల్‌ను గతేడాది ఆగస్టు 14న కొందరు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన మంత్రి సవిత...హంతకులను రక్షించారు. ఆమెను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. సోమవారం ఆమె పరిగి పోలీస్‌స్టేషన్ వద్ద మృతుడు సునీల్ తల్లి లక్ష్మీదేవి, కుటుంబసభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సునీల్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి నిందితులపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడం చూస్తే పోలీసుల వైఖరి ఏమిటో తెలుస్తోందన్నారు. ఘటన జరిగిన మూడ్రోజులకు మృతుడు సునీల్ తల్లిదండ్రులను మంత్రి సవిత పెనుకొండకు పిలిపించుకుని ఇల్లు, డబ్బులు, ఉద్యోగం ఇస్తామని చెప్పడంలో ఆంతర్యమేమిటన్నారు. దీన్ని బట్టి చూస్తే మంత్రి సవిత అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. హత్యకు, మంత్రి సవితకు ఉన్న సంబంధం ఏమిటో పోలీసులు తేల్చాలన్నారు. సుద్దగుంటపల్లి మారుతి అనే వ్యక్తి ఈ కేసును తప్పుదోవ పట్టించారన్నారు. బాధిత కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కాంప్రమైజ్ కావాలని భయాందోళనలకు గురి చేసిన మారుతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మంత్రి సవితపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలన్నారు. పెనుకొండలో ఇటీవలే టెంపో శీన అనే దళితుడిపై టీడీపీకి చెందిన త్రివేంద్ర నాయుడు దాడి చేసిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ ఆగడాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అనంతరం మృతుడి తల్లి లక్ష్మీదేవి మాట్లాడుతూ...తన కుమారుడు సునీల్‌ను కొట్టి చంపి, ఉరి వేసిన వారిని వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరారు. అంతకుముందు ఉషశ్రీచరణ్ బాధిత కుటుంబంతో కలిసి పరిగి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్ఐని కలిశారు. నిందితులను అరెస్ట చేసి సకాలంలో కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేయాలని కోరారు. వడ్డే సునీల్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు కేసులోని నిందితులకు మంత్రి అండగా నిలిచారు టీడీపీ ఆగడాలపై న్యాయపోరాటం చేస్తాం మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
ఘనంగా జగన్నాథ రథయాత్ర
అలంకరణలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవిధర్మవరం అర్బన్: ఇస్కాన్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి బలిజ కళ్యాణ మండపం వరకు ప్రత్యేక రథంపై జగన్నాథస్వామి, బలరాముడు, సుభద్రాదేవి ఉత్సవమూర్తులను అలంకరించి పురవీధుల్లో రథయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని జగన్నాథుడిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రథయాత్రలో ఇస్కాన్ ప్రతినిధులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. -
వర్షం కోసం రైతుల రామదండు
కనగానపల్లి: సకాలంలో వర్షాలు పడకపోవటంతో పంటలన్నీన్నీ ఎండిపోతున్నాయి. దీంతో వర్షం కోసం గ్రామాల్లో రైతులు దేవాలయాల్లో పూజలు, రామ భజనలు చేస్తున్నారు. మండలంలోని మద్దెలచెరువు గ్రామంలో సోమవారం రైతులు సంజీయరాయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రైతులంతా కలసి శ్రీరామ కీర్తనలతో భజనలు చేసుకుంటూ గ్రామాల వెంట రామదండుగా వెళ్లారు. ఈ విధంగా భక్తితో రామభజనలు చేసుకుంటూ రామదండు నిర్వహిస్తే వానలు పడతాయని ఒక నమ్మకంతో ఇలా చేస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. దీంతో పాటు వర్షంలో కోసం మంగళవారం గ్రామంలో పౌరాణిక నాటకాల ప్రదర్శనలు వేస్తున్నట్లు వారు తెలిపారు. న్యామద్దలలో... చెన్నేకొత్తపల్లి న్యామద్దల గ్రామంలోనూ సోమవారం రైతులు వర్షం కోసం రామదండు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహించి తర్వాత రామభజనలు చేసుకుంటూ పురవీధులతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో తిరిగారు. సకాలంలో వర్షాలు పాడి పంటలు బాగుండాలని ఈ విధంగా రామదండు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం
గత ప్రభుత్వంలో జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా ఏటా పది వేల రూపాయలు బ్యాంక్ ద్వారా రుణం అందించేవారు. ప్రభుత్వం అందించిన పెట్టుబడితో వ్యాపారాలు చేసి బ్యాంక్ కంతులు చెల్లించి ఉన్న సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. అన్నిరకాల వస్తువుల ధరలు పెరగడంతో పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నాము. వ్యాపారాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. పెట్టుబడి, వడ్డీలు పోయి కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆదుకోవాలి. – బాబా, చిరు వ్యాపారి, కదిరి -
పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నాం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా 10 వేల రూపాయలు బ్యాంక్ ద్వారా వడ్డీ లేని రుణాన్ని అందించేది. మాలాంటి చిరు వ్యాపారులకు అది ఎంతగానే ఉపయోగపడేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఆర్థిక భరోసా కరువైంది. పెట్టుబడికి ప్రైవేటు వ్యాపారులపై ఆధార పడాల్సి వస్తోంది. వచ్చిన డబ్బంతా వడ్డీకే పోతే ఎలా బతకాలి? – హైదర్‌వలి, చిరు వ్యాపారి, పుట్టపర్తి హామీలు నీట మీద రాతలే.. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు గత ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు ఏమి పథకాలు అమలు చేశారో, అలాగే ఆదుకుంటామని గొప్పగా హామీలు ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న చిరు వ్యాపారులను పట్టించుకొన్న పాపాన పోలేదు. వారిచ్చిన హామీలన్నీ నీతి మీద రాతలుగానే మిగిలిపోయాయి. – మనోహర్, చిరు వ్యాపారి, ప్రశాంతి గ్రామం -
స్కానింగ్ సెంటర్ల తనిఖీ
ధర్మవరం అర్బన్: పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోని స్కానింగ్ సెంటర్లను సోమవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ భాగ్యలక్ష్మి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి ఒక్క స్కానింగ్‌కు రెఫరెల్ స్లిప్ ఉండాలని, లేకపోతే స్కానింగ్ చేయకూడదని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు సూచించారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ పోస్టర్లు అందరికీ కనిపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధరల పట్టిక డిస్ప్లేలో ఉంచాలన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తనిఖీల్లో కమ్యూనిటీ ఆర్గనైజర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలిపుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై 102 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా వికలాంగులు వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. అర్జీలు పునారావృతమైతే చర్యలు తప్పవని పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. కుక్కల దాడిలో వ్యాపారికి తీవ్ర గాయాలుపావగడ: పట్టణంలోని ఆదర్శనగర్ వాసి, పండ్ల వ్యాపారి అయిన నరసింహరాజు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. నరసింహరాజు పండ్ల వ్యాపారాన్ని ముగించుకుని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో బాపూజీ పాఠశాల మార్గంలో ఇంటికి బయలుదేరాడు. అయితే ఒక్కసారిగా సుమారు 15 వీధి కుక్కలు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. కేకలు వేయడంతో చుట్టు పక్కన ఉన్న జనం కుక్కల్ని అదిలించి అతని ప్రాణాలు కాపాడారు. తీవ్రంగా గాయపడిన నరసింహరాజును చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు. ఎంపీఈఓల పెన్‌డౌన్● ఉమ్మడి జిల్లాలో 334 మంది నిరసన అనంతపురం అగ్రికల్చర్: సమస్యల పరిష్కరించాలంటూ ఎంపీఈఓలు పెన్‌డౌన్‌కు దిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 334 మంది సోమవారం నుంచి ఐదు రోజుల పాటు పెన్‌డౌన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఎక్కడిక్కడ మండల, డివిజన్, జిల్లా గ్రీవెన్స్‌లో, వ్యవసాయశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ పరిధిలో, ఆర్బీకేలకు అనుబంధంగా అనంతపురం జిల్లాలో 189 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 145 మంది... వెరసి 334 మంది ఎంపీఈఓలు సరైన వేతనం లేక, ఎలాంటి ఉద్యోగ భద్రత, ఇతరత్రా సదుపాయాలు లేక అతికష్టమ్మీద జీవితాలను నెట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటిి ప్రోత్సాహం లేకపోవడంతో 334 మంది ఎంపీఈఓలు నిరసనకు దిగారు. చైన్ స్నాచర్ల అరెస్ట్ బుక్కరాయసముద్రం: మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరించిన ఇద్దరు అంతరాష్ట్ర చైన్స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాలమేరకు.. గత నెల 23న బుక్కరాయసముద్రంలో ప్రభావతి అనే మహిళ గ్రామ శివారులో ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె అడ్డుకొని మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాయన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అనంతపురము రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసులు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో బెంగళూరుకు చెందిన గణేష్, సూర్యలే దొంగతనం చేసినట్లు గుర్తించి శనివారం అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 35 గ్రాముల బంగారు గొలుసు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం జిల్లా కోర్టులో హాజరు పర్చగా జడ్జి నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
ధర్మవరం అర్బన్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థులను, టెట్ పరీక్షల పేరుతో ఉపాధ్యాయులను మానసిక ఇబ్బందికి గురిచేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, కార్యదర్శి అమర్‌నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరివరకుమారి, నాగేంద్రమ్మలు డిమాండ్ చేశారు. పట్టణంలోని అబ్దుల్ కలాం విగ్రహం వద్ద సోమవారం యూటీఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఎన్ఐఏను రద్దు చేసి నీట్ పరీక్షను రాష్ట్రాలు నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. నీట్ పరీక్ష రద్దు, విద్యారంగ ప్రక్షాళన, విద్యామంత్రి రాజీనామా చేయాలని కోరుతూ పర్యావరణ, సామాజిక విద్యావేత్త సోనమ్యాంగ్ చుక్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల ఆందోళనకు కారణమైన విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1) సవరణ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆ పదవికి అనర్హుడన్నారు. టెట్ నుంచి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నాయకులు రామంజినేయులు, పెద్దకోట్ల సురేష్, వెంకట కిషోర్, రాంప్రసాద్, నాగిరెడ్డి, గోపాలరావు, మణిమాల తదితరులు పాల్గొన్నారు. -
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ఇంజినీర్ ఇన్ చీఫ్
లేపాక్షి: మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రజా ఆరోగ్య, పురపాలక ఇంజినీరింగ్‌శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.ప్రభాకర్‌రావు, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ నాగేష్‌బాబు సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా అర్చకులను అడిగి ఆలయ విశిష్టతను తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. వారి వెంట అనంతపురం ప్రజారోగ్య, పురపాలక ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ రామమోహన్‌రెడ్డి, హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ ఇంజినీర్ గంగప్ప, డిప్యూటీ ఇంజినీర్లు మదన్మోహన్, లోకేశ్వరరెడ్డి, అసిస్టెంట్ ఇంజినీర్ జనార్దన్ తదితరులున్నారు. -
నేడు షైనింగ్ స్టార్స్‌కు సన్మానం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పది, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరుతో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మాహి శ్రీనివాస గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండలం నుంచి ఆరుగురిని ఎంపిక చేశామన్నారు. ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ విద్యార్థులతో పాటు జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని 32 మండలాల నుంచి మొత్తం 195 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన విజేతలకు మెడల్, ప్రశంసాపత్రం, రూ.20 వేలు నగదు బహుమతి (చెక్ రూపంలో) అందిస్తామన్నారు. పలు మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. గాలివేగం తగ్గడంతో కొంత సేపు వర్షం పడింది. పుట్టపర్తి, పెనుకొండ, కొత్తచెరువు, నల్లమాడ, ముదిగుబ్బ, ఓడీసీ తదితర మండలాల్లో తుంపర కురిసింది. ఒకటి రెండు చోట్ల మాత్రం మోస్తరు వర్షం వచ్చింది. అయితే ఈ వర్షంతో ఎలాంటి ఉపయోగం లేదని రైతులు చెబుతున్నారు. కనీసం చెట్ల కింద కూడా నానడం లేదన్నారు. పంటలు సాగు చేసిన రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తోంది. పోలీసులకే బురిడీ ● లాకప్ నుంచి తప్పించుకున్న నిందితుడు కదిరి టౌన్: ఓ చోరీ కేసులో పట్టుబడిన నిందితుడు పోలీసులనే బురిడీ కొట్టించాడు. ఏకంగా పోలీసుస్టేషన్‌లోని లాకప్ నుంచి పరారయ్యాడు. కదిరి పట్టణ పోలీసుస్టేషన్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఈ మధ్యనే పట్టణంలోని శివాలయంలో హుండీ పగలకొట్టి నగదు చోరీ చేసిన ఘటనలో మేకల నరసింహులు అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పట్టణ పోలీసుస్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు. అయితే పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మేకల నరసింహులు లాకప్ నుంచి పరారయ్యాడు. లాకప్‌కు తాళాలు వేయకపోవడంతో శనివారం మధ్యాహ్నం సమయంలో నిందితుడు సులువుగా తప్పించుకున్నాడని తెలుస్తోంది. విధుల్లో ఉన్న సిబ్బంది ఆ సమయంలో అసలు పోలీసుస్టేషన్లో ఉన్నారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే లాకప్‌లో ఉన్న నిందితుడు పారిపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పేకాట రామగిరి: మండలంలో ప్రసిద్ధిగాంచిన నసనకోట ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. 18 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,06,030 నగదు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మహమ్మద్ అలీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ముత్యాలమ్మ ఆలయ సమీపంలో కొన్ని నెలలుగా భారీస్థాయిలో పేకాట జరుగుతోంది. ఈ ఆలయం ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోనూ అత్యంత ప్రసిద్ధి గాంచడంతో ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇదే అదనుగా అక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు రావడంతో ఆదివారం దాడి చేశారు. జూదరులను అరెస్టు చేసి.. నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎస్ఐ ప్రదీప్రాజ్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాధనాన్ని కొల్లగొట్టారు
పోరాడి సాధించుకుందాం అనంతపురం: రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై రైతులు కదం తొక్కారు.తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించారని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పేరుతో రూ.3,500 కోట్ల ఖర్చు చూపించి వందలాది కోట్లను చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ కాంట్రాక్టర్లు దోపిడీ చేశారని దుయ్యబట్టారు. గ్రేటర్ రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న పార్టీ నిర్ణయం మేరకు ఆదివారం వైఎస్సార్సీపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హంద్రీ–నీవా ప్రాజెక్ట్ పరిరక్షణ పోరుబాట విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, రైతులు ఉత్సాహంగా తరలివచ్చారు. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు కూడేరు మండలం చోళసముద్రం సమీపంలో హంద్రీ–నీవా కాలువలో రెండు కిలోమీటర్ల మేర రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి లైనింగ్‌ను పరిశీలించారు. పార్టీ అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్, పీఏసీ సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, టాస్క్‌ఫోర్స్ కమిటీ జిల్లా కో ఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యులు నదీం అహమ్మద్, మీసాల రంగన్న, కోగటం విజయభాస్కర్ రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్‌గౌడ్, చిత్తూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రగా వెళ్తున్న మాజీ ఎంపీ రంగయ్యకాలువను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వ‘హంద్రీ–నీవా’ లైనింగ్ మాటున ప్రజాధనాన్ని చంద్రబాబు, లోకేష్ లూటీ చేశారు కుప్పానికి నీరు తరలించడానికి జిల్లా రైతులకు శాశ్వత సమాధి కట్టారు నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కాలువ వెడల్పు చేస్తామని స్పష్టీకరణ వైఎస్సార్ సీపీ పిలుపుతో కదం తొక్కిన అన్నదాతలు గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ కమిటీ కాలువ పరిశీలన పాదయాత్ర విజయవంతంఉద్యమాన్ని తీవ్రం చేస్తాం జిల్లాకు గతంలో తుంగభద్ర జలాలు కీలకంగా ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వచ్చాయి. గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం వైఎస్సార్ సీపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. రైతులకు అండగా నిలవడమే ఈ కమిటీ లక్ష్యం. చంద్రబాబు ప్రజాకంటక పాలన సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో రాయలసీమ వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమిస్తాం. –నార్పల సత్యనారాయణరెడ్డి, గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ జిల్లా కోఆర్డినేటర్పట్టుకుంటే ఊడిపోయే లైనింగ్ పట్టుకుంటే కూడా ఊడిపోయే స్థితిలో హంద్రీ–నీవా లైనింగ్ ఉంది. వేల కోట్లు ఖర్చు చేశామని, 200 రోజులు నీరు వచ్చిందని చెబుతున్నా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి. డబ్బు మూటలన్నీ అమరావతికి తీసుకెళ్తున్నారు. హంద్రీ–నీవా లైనింగ్‌తో రైతన్న బాగుపడలేదు కానీ కాంట్రాక్టర్లకు మాత్రం రూ. వందల కోట్లు దోచిపెట్టారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ ముసుగులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి. – సాకే శైలజనాథ్, మాజీ మంత్రి, గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ కన్వీనర్ రైతులకు సమాధి కట్టారు కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టు చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దూరదృష్టితో గండికోట రిజర్వాయర్‌కు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. గాలేరి, నగరి కాలువను పటిష్టం చేశారు. చంద్రబాబు కేవలం కుప్పం ప్రాంతానికి నీటిని తరలించేందుకు రైతుల ఆశలను అడియాసలు చేశారు. ఈ ప్రాంత రైతులకు శాశ్వత సమాధి కట్టారు. హంద్రీ–నీవా లైనింగ్ వల్ల ఈ ప్రాంతంలో బోర్లు వట్టిపోయి చీనీ, మామిడి చెట్లు ఎండిపోయాయి. – వై. విశ్వేశ్వర రెడ్డి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడుహంద్రీ–నీవా కాలువ వెడల్పు, లైనింగ్ పనులను అత్యంత నాసిరకంగా చేశారు. రూ.3,800 కోట్లు విలువ చేసే పనుల్లో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎలా దోపిడీ చేశారో స్పష్టంగా కనిపిస్తోంది. కాంట్రాక్టర్లుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. కుప్పానికి నీరు తీసుకెళ్లే క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అన్నదాతలకు శాశ్వత సమాధి కట్టారు. సక్రమంగా పనులు జరిగి ఉంటే అనంతపురం జిల్లాకు 80 టీఎంసీల నీరు వచ్చేవి, మరి ఆ మేరకు నీళ్లు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి వల్లే హంద్రీ–నీవా ప్రాజెక్టు సాధ్యమైంది. కరువు ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలన్న ఉద్దేశంతో పనులు శరవేగంగా చేపట్టారు. చంద్రబాబు హంద్రీ–నీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి తీరని ద్రోహం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటే ఈ సారి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి మళ్లీ 3,850 క్యూసెక్కులకే పరిమితం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే హంద్రీ–నీవాను 11,500 క్యూసెక్కులకు విస్తరిస్తాం. జిల్లా రైతులు ధైర్యంగా ఉండాలి. –అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడుసీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి రాజధాని హైదరాబాద్‌ను వదిలేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపడం లేదు. హంద్రీ–నీవా ప్రాజెక్టు పనులను నాసిరకంగా చేపట్టి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. దోచుకోవడం.. దాచుకోవడమే చంద్రబాబు సిద్ధాంతం. రాయలసీమకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోం. మన ప్రాంత పరిరక్షణకు ఏకమవుదాం. ఒకరికొకరు సహకరించుకుని పోరాడి సాధించుకుందాం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు -
లెక్క తేలింది సర్
పుట్టపర్తి అర్బన్: ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా జిల్లా అధికారులు, బీఎల్ఓలు చేపట్టిన ఇంటింటి సర్వే ఈనెల 24తో పూర్తి కానుండగా నాలుగు రోజుల ముందే లెక్క తేలింది. జిల్లాలో 14,23,839 మంది ఓటర్లను గుర్తించిన ఎన్నికల సంఘం వారికి ఎన్యుమరేషన్ ఫారాలు అందించడం, సేకరించడం పూర్తి చేసి డిజిటలైజేషన్ కూడా పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఇందు కోసం జిల్లాలో 1576 మంది బీఎల్ఓలు నెల రోజుల పాటు రేయింబవళ్లు పని చేశారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు తనిఖీలు చేపట్టి సర్ కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. ఈఎఫ్ ఫారాలు డిజిటలైజేషన్ ఈనెల 24తో ముగియాల్సి ఉన్నా... ఇంకా నాలుగు రోజుల సమయం ఉండగానే వాటి లెక్క తేల్చి మీడియాకు వివరాలు తెలియజేశారు. 1,19,108 మంది ఓటర్లు ఎక్కడ? జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, కదిరి, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో 14,23,839 మంది ఓటర్లలో 1,19,108 మంది ఓటర్ల ఆచూకీ తెలియడం లేదు. ఇందులో జిల్లా నుంచి శాశ్వతంగా వలస వెళ్లి వారు 45,562 మంది ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలోనో లేక ఇతర రాష్ట్రాల్లోనో ఓటు హక్కు ఉన్నట్లు గుర్తించిన వారు 30,070 మందిగా, ఆచూకీ లేని వారిగా 33,476 మంది ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే మృతి చెందిన వారు 53,791 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇతరుల కింద 305 మంది ఉన్నారంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో అత్యధికంగా 16,385 మంది ఓటర్లు పత్తా లేనట్లు గుర్తించారు. అలాగే ఇక్కడే 7,615 మందికి డబుల్ ఓట్లు ఉన్నట్లు తేల్చారు. కదిరి నియోజక వర్గంలో శాశ్వత వలస ఓటర్లుగా సుమారు 10 వేల మందిని చూపారు. ఇందులో చాలా వరకూ బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లకుండానే వివరాలు సేకరించారన్న విమర్శలున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఓటర్ల సంఖ్యకు ప్రస్తుతం సర్ కార్యక్రమంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ల సంఖ్యకు తేడా ఉంది. గతంలో 14,06,204 మంది, ఇతరుల కింద 76 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సర్ కార్యక్రమంలో స్త్రీ,పురుష ఓటర్లు 14,23,839 ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ, ఇప్పటి సుమారు 17,635 ఓట్లు పెరిగినట్లు చూపారు. ఇతరుల కింద 305 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోరు. ఇంత వ్యత్యాసం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. తప్పొప్పులు సరి దిద్దుకునేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. 24తో ముగియనున్న ఇంటింటి సర్వే వందశాతం డిజిటలైజేషన్ పూర్తి పత్తా లేని 1,19,108 మంది ఓటర్లు -
అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మహిళ ఫిర్యాదు
కదిరి అర్బన్: తన అక్క స్థలంలో వేసుకున్న రేకులషెడ్డును ధ్వంసం చేసి, తమను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపరిచిన మొటుకుపల్లికి చెందిన ప్రభాకర్‌రెడ్డి, మల్లిరెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని బాధితురాలు శాంతమ్మ డిమాండ్ చేసింది. ఆదివారం కదిరి రూరల్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాల మేరకు.. మొటుకుపల్లిలో గత శనివారం రాత్రి 11 గంటల సమయంలో శాంతమ్మ, తన కుమార్తెతో కలిసి అక్క లక్ష్మీబాయి స్థలంలో వేసిన రేకులషెడ్డులో నిద్రించారు. అదే గ్రామానికి చెందిన మల్రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి మద్యం సేవించి ఈ స్థలం తమదేనని, రేకులషెడ్డు పడగొట్టి కులం పేరుతో దూషించారని తెలిపింది. గతంలో మల్రెడ్డి తన అక్క లక్ష్మీబాయిని వ్యభిచార కూపంలో నెట్టాడని, తనను కూడా ముంబాయిలో సేట్ ఇంట్లో పనికి కుదుర్చినట్లు చెప్పి, రూ.50 వేలకు విక్రయించాడని ఆరోపించింది. 2000లో ప్రభుత్వం తన అక్క పేరిట రెండు సెంట్ల స్థలం మంజూరు చేసిందని, తన అక్కకు చదువు రాకపోవడంతో ఆమె భర్త పేరు మల్రెడ్డి అని పేరు రాయించుకున్నాడని తెలిపింది. తన అక్కకూ మల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, తన అక్క అనారోగ్యంగా ఉన్నప్పుడు బాగోగులు తానే చూసుకున్నానని, ఆమె మరణించిన తర్వాత మల్రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన చెందింది. -
సమ్మోహనం.. నృత్య వైభవం
ప్రశాంతినిలయం: పౌరాణిక ఘట్టాలను కళ్లకు కడుతూ భక్త కోటిని మంత్రముగ్దులను చేసే నాట్య భంగిమలతో బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. తమిళనాడు భక్తుల పర్తియాత్ర ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకల్లో భాగంగా ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో అంతరంగ సాయి పేరుతో మహిళా భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. భక్తి గీతాలతో సత్యసాయిని కీర్తించారు. తమిళనాడులో పలు భజన మండళ్లను, స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. సాయంత్రం చైన్నెకి చెందిన బాలవికాస్ చిన్నారులు శివశక్తి స్వరూపం పేరుతో శివపార్వతుల లీలా విశిష్టత, వినాయకుడి వైభవాన్ని వివరిస్తూ నృత్య రూపకాలను ప్రదర్శించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
● ఐదుగురికి గాయాలు ముద్దనూరు: ముద్దనూరు– తాడిపత్రి జాతీయ రహదారిలో చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. రాయదుర్గం నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చెన్నారెడ్డిపల్లె వద్దకు వెళ్లగానే ముందువైపు గొర్రెలు అడ్డు రావడంతో బస్సును డ్రైవర్ స్లో చేశాడు. ఇంతలో వెనుక వస్తున్న లారీ.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు వెనుకవైపు పాక్షికంగా దెబ్బతినింది. బస్సులో సుమారు 67 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలవడంతో వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకొని వెళ్లిపోయారు. కమలాపురానికి చెందిన వెంకట సుబ్బరాయుడును 108 వాహనంలో జమ్మలమడుగుకు తరలించారు. లారీ డ్రైవరుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవరు మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. -
చెన్నబసవ రాజేంద్రస్వామికి కన్నీటి వీడ్కోలు
ఉరవకొండ: గవిమఠం సంస్థానం 8వ పీఠాధిపతి జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామికి భక్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. స్వామి వారి పార్థివ దేహన్ని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, కల్యాణస్వామి, సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో స్వామి వారి పార్థివ దేహాన్ని విశేష పుష్పాలతో అలంకరించిన అనంతరం వాహనంలో పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఓం నమఃశివాయ నామస్మరణ చేస్తూ ముందుకు కదిలారు. పార్థివదేహంపై పూలు చల్లి భక్తిభావాన్ని చాటుకున్నారు. క్లాక్‌టవర్ మీదుగా పాత గాంధీబజారు నుంచి వెలిగొండ రోడ్డులోని స్వామి వారి విడిది మంటపం వరకు వెళ్లి తిరిగి గవిమఠానికి తీసుకొచ్చారు. మూడేళ్ల క్రితమే సమాధి నిర్మాణానికి భూమి పూజ.. గవిమఠంలోని పూర్వ పీఠాధిపతుల సమాధులు ఉన్న సముదాయం ఆవరణలోనే తన అంతిమ సంస్కారాలు నిర్వహించేలా మూడేళ్ల క్రితమే జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి నిర్ణయించారు. అంతే కాకుండా తన సమాధికి భూమి పూజ కూడా చేయడం గమనార్హం. పూర్వ పీఠాధిపతుల వారి గద్దెల ప్రదేశంలోనే స్వామి పార్థివదేహాన్ని ఉంచి సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి వారి అంతిమ సంస్కారాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైఎస్సార్ సీపీ యువ నాయకుడు వై.భీమిరెడ్డితో పాటు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలోని వివిధ మఠాల నుంచి 48 మంది పీఠాధిపతులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వామి పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. -
‘దారి’ తప్పిన యువత
సాక్షి, పుట్టపర్తి: బెంగళూరు – పెనుకొండ జాతీయ రహదారి రేసింగ్‌లకు అడ్డాగా మారింది. కొందరు యువకులు బైక్‌లతో ప్రమాదకర ఫీట్లు, స్టంట్లు చేస్తున్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలను కొనితెచ్చుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా హరించే దుస్థితిని కల్పిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ వ్యూవ్స్, లైక్స్ కోసం దేనికైనా తెగిస్తున్నారు. వారాంతపు రోజుల్లో బెంగళూరు నుంచి బుల్లెట్ బైకుల్లో రయ్ .. రయ్ మంటూ మెరుపు వేగంతో కొందరు గుంపుగా కొడికొండ చెక్‌పోస్టు, లేపాక్షి.. అటు నుంచి పెనుకొండ కోట వరకూ వచ్చి వెళ్తుంటారు. బెంగళూరు నుంచి గంటలోపే కొడికొండ చెక్‌పోస్టు చేరుకుంటారు. అక్కడి నుంచి లేపాక్షి వరకూ వెళ్లి.. ఆలయాన్ని సందర్శించుకొని ఆ తర్వాత పెనుకొండ కోటపైకి వెళ్తారు. తిరుగు పయనంలో మరింత వేగంతో దూసుకెళ్తున్నారు. యువకులే అధికం కంటెంట్ ఎలా ఉన్నా.. ఒక్క వీడియో వైరల్ అయితే రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు. ఫాలోవర్లు పెరిగితే ప్రమోషన్లతో పాటు డబ్బు సంపాదించవచ్చు. అంతకు మించి నలుగురిలో ప్రత్యేకంగా ఉండవచ్చు. ఇలా కారణం ఏదైనా.. మద్యం, జూదం, గంజాయికి బానిస అవుతున్న తరహాలోనే చాలామంది యువత తెలిసీ తెలియని వయసులో రీల్స్ మోజుతో ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తున్నారు. నిరంతరం ఏదో రూపంలో గుర్తింపు పొందాలనే భావనతో పోస్ట్ చేసిన వెంటనే లైక్‌లు, వ్యూవ్స్ రాకపోతే ఒత్తిడికి లోనవుతున్న వారు కూడా ఉన్నారు. బైక్ రేసింగ్లలో పాల్గొనే వారిలో 15 – 25 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. జాతీయ రహదారుల్లో బైక్ రేసింగ్‌లు బెంగళూరు నుంచి లేపాక్షి, పెనుకొండ వరకూ.. స్పోర్ట్స్ బైకుల్లో వందకు పైగా స్పీడ్‌తో దూసుకెళ్తున్న వైనం సోషల్ మీడియాపై మోజుతో పెడదోవ పోలీసుల ప్రత్యేక నిఘా ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. పలువురు ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడుతూ జరిమానా రూపంలో భారీగా మూల్యం చెల్లించుకుంటున్నారు. పదే పదే పట్టుబడితే సెక్షన్ – 125, 184 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు కూడా పంపవచ్చు. అధిక శబ్ధం చేసే పొగ గొట్టాలతో రోడ్డెక్కితే మూల్యం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరు నుంచి బుల్లెట్ బైకుల్లో అతి వేగంగా అధిక శబ్ధాలతో వస్తున్న 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. అక్కడికక్కడే మెకానిక్ షాపునకు తీసుకెళ్లి.. సైలెన్సర్లు తీయించారు. అలాగే కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించారు. ఆ తర్వాత వారు జరిమానా చెల్లించి వాహనాలు తీసుకెళ్లారు. ఈ ఘటన గతేడాది నవంబరులో పెనుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. లేపాక్షికి రావాలని కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బెంగళూరు నుంచి బయలు దేరారు. అతి వేగంతో వస్తూ.. ఒక చేతిలో మొబైల్ పట్టుకుని వీడియోలు తీస్తుండగా కొడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అందరికీ జరిమానా వేసి పంపించారు. తిరుగు ప్రయాణంలో నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. పోలీసులు గస్తీ నిర్వహించగా తిరుగు ప్రయాణంలోనూ పట్టుబడ్డారు. ఈ ఘటన మూడు నెలల క్రితం వెలుగు చూసింది. తల్లిదండ్రులపైనా కేసులు చాలా మంది రేసర్లు వారి తల్లిదండ్రుల వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా.. లైసెన్సు లేని వారు బైక్‌లతో పట్టుబడినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. బైకర్‌తో పాటు వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తాం. – ఎస్.సతీశ్ కుమార్, జిల్లా ఎస్పీ -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ సీమకు అన్యాయమే జరుగుతోంది. దివంగత నేత వైఎస్సార్ పోతిరెడ్డిపాడును 88 వేల క్యూసెక్కుల స్థాయికి పెంచితే చంద్రబాబు అడ్డుపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 శాతం పూర్తి చేస్తే ఆ పనులకూ అడ్డు తగిలారు. చంద్రబాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్టు పనులను ఆపేయించానని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినా ఖండించ లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం పోరాటం ఉధృతం చేస్తాం. –కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు -
డీపీఓలో నేడు ‘పరిష్కార వేదిక’
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం వీడియో కాన్సరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో ఇచ్చుకోవచ్చని తెలియజేశారు. ఫిర్యాదుదారులు తమ ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. వరుస చోరీలతో ప్రజల బెంబేలు రామగిరి: మండలంలోని కలికివాండ్లపల్లి, పోలేపల్లి గ్రామాల్లో శనివారం రాత్రి వరుస చోరీలు జరిగాయి. కలికివాండ్లపల్లి గ్రామ నడిబొడ్డునగల సత్తెమ్మ ఆలయంలో 15 తులాలకుపైగా వెండి ఆభరణాలు, పోలేపల్లిలో రైతు రామకృష్ణారెడ్డి పొలంలో రెండు బోరు మోటార్లను గుర్తుతెలి యని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపా రు. ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామాల్లో దౌర్జ న్యా లు, దోపిడీలు, జూదాలు, దొంగతనాలు అధికమయ్యాయని, అధికారులు చొరవచూపి ఇలాంటివి పూర్తి స్థాయిలో అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. దర్జాగా బైక్ అపహరణహిందూపురం: పట్టణంలోని బైపాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని పట్టపగలే దర్జాగా అపహరించారు. ఆదివారం మధ్యాహ్నం ముదిరెడిపల్లికి చెందిన నగేష్ హనుమేపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి బైక్‌పై రెస్టారెంట్‌కు వచ్చాడు. ద్విచక్రవాహనాన్ని పార్క్ చేసి లోపలికి వెళ్లడాన్ని ముగ్గురు దుండగులు గమనించారు. ఇదే అదునుగా భావించి ఒకరు ఫోన్లో మాట్లాడుతూ పరిసరాలు గమనిస్తుండగా.. మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై కొంతసేపు కూర్చొని నకిలీ తాళాలతో బైక్‌ను అపహరించారు. ఈదృశ్యాలన్నీ రెస్టారెంట్ సీసీ కెమెరా ల ఫుటేజీలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకు హత్య కేసులో తల్లికి రిమాండ్ కదిరి టౌన్: కొడుకును హత్య చేసిన కేసులో తల్లి డక్కా నందినిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు.. కదిరి పట్టణంలోని మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న తనకల్లు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు విజయబాబు భార్య డక్కా నందిని తన ఐదేళ్ల కుమారుడు వర్షిత్‌ను చున్నీతో గొంతు బిగించి ఫిబ్రవరి 12న హత్య చేసినట్లు విషయం విదితమే. ఈ కేసులో డక్కా నందినిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భార్యాభర్తల మధ్య కలహాలతోనే తన కుమారుడిని డక్కా నందిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆదివారం సాయంత్రం డక్కా నందినిని పోలీసులు అరెస్టు చేసి కదిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఆమెకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించగా, అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. భూమి కోసం ఇరువర్గాల ఘర్షణ● ఆత్మహత్యాయత్నం చేసిన రైతు లేపాక్షి: మండలంలోని నాగేపల్లికి చెందిన రైతు బెల్లం సురేష్ (40) ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. గ్రామానికి చెందిన బెల్లం సురేష్ తండ్రి శ్రీనివాసులు గతంలో తనకున్న 3 ఎకరాల పొలం హిందూపురానికి చెందిన శ్రీనివాసులు, భరత్‌కు విక్రయించాడు. కొనుగోలుదారులు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే బెల్లం సురేష్ భూమిలోకి ప్రవేశించి పంట సాగుకు యత్నించాడు. ఇంతలోనే భూమి కొనుగోలుదారులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఈభూమిలో తనకూ సగం వాటా ఉందని, ఇప్పటికీ సాగు చేస్తున్నామని శ్రీనివాసులు తెలియజేశాడు. అయితే ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో రైతు సురేష్.. తన వెంట తెచ్చుకున్న క్రిమి సంహారక మందు తాగేందుకు యత్నించాడు. అంతేకాకుండా డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వెంటనే 108 వాహనం ద్వారా రైతును హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే రైతుకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఎస్ఐ నరేంద్రను అడగ్గా, ఇంత వరకూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఇరువర్గాల వారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, విచారిస్తామన్నారు. గంజాయి రవాణాదారుల అరెస్టు ఎర్రగుంట్ల: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అదివారం ఆయన విలేకరులకు వివరాలు తెలియజేశారు. ఎస్పీ నచికేత్ విశ్వనాఽథ్, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల వై జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా, అక్రమంగా గంజాయి రవా ణా చేస్తున్న ముగ్గురు పట్టుబడ్డారు. వారిలో పొద్దుటూరుకు చెందిన ఎస్.జహీర్, గుంతకల్లుకు చెందిన షేక్ మహ్మద్ తాహీర్, షేక్ ఆసిఫ్ ఉన్నారు. వీరు గుంతకల్లు షికారి కాలనీ చెందిన కమల, మఽధుమతి, జీవా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. వీరి నుంచి 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
సిబ్బంది కొరత..తీరని వెత
మడకశిర: మడకశిర విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటేనే అంతరాయం లేకుండా నాణ్యమైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే సబ్ డివిజన్ పరిధిలో ప్రధాన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడు మండలాలకు రెగ్యులర్ జేఈలో లేరు. పనిఒత్తిడితో సిబ్బంది సతమతమవుతున్నారు. దీనికితోడు సబ్ స్టేషన్ల నిర్వహణ సరిగాలేదు.. పర్యవేక్షణ కొరవడింది. దీంతో విద్యుత్ వినియోగదారులకు శాపంగా మారింది. సబ్‌డివిజన్ పరిధిలోని మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో దాదాపు 28 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులు, దాదాపు 60 వేలకుపైగా గృహ విద్యుత్ సర్వీసులు, వేలాదిగా కమర్షియల్ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. సబ్ డివిజన్ పరిధిలో 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 25 ఉన్నాయి. 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు అమరాపురం, జంబులబండ, మడకశిర మండలంలోని గొల్లపల్లిలో ఉన్నాయి. సబ్ డివిజన్ పరిధిలో ప్రధాన పోస్టులన్నీ ఖాళీనే.. మడకశిర విద్యుత్ సబ్ డివిజన్‌కు రెగ్యులర్ డీఈ లేరు. ప్రస్తుతం హిందూపురానికి చెందిన డీఈనే మడకశిర విద్యుత్ సబ్ డివిజన్‌కు కూడా ఇన్చార్జ్ డీఈగా కొనసాగుతున్నారు. ఇంతకు మునుపు ఇక్కడ డీఈగా పని చేస్తున్న రఘు సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్పటి నుంచి మడకశిరకు రెగ్యులర్ డీఈ లేరు. మడకశిర,అగళి,రొళ్ల మండలాలకు రెగ్యులర్ జేఈలు లేరు. మడకశిర మండలానికి గుడిబండ జేఈ ఇన్చార్జ్గా ఉన్నారు. ఇంతకు మునుపు మడకశిర రెగ్యులర్ జేఈగా ఉన్న విశ్వనాథ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. రొళ్ల మండలానికి కూడా జేఈ లేక సబ్ ఇంజినీరు ఇన్చార్జ్ జేఈగా ఉంటున్నారు. అగళి మండలానికి కూడా రెగ్యులర్ జేఈ లేకపోవడంతో రొళ్ల మండల సబ్ ఇంజినీరు అగళి మండలానికి కూడా జేఈ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో లైన్మెన్ల కొరత అధికంగా ఉంది. రాజకీయ ఒత్తిడితోనూ సతమతం.. మడకశిర విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో సిబ్బంది పని ఒత్తిడితో పాటు రాజకీయ ఒత్తిడితో సతమవుతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సర్వీసుల మంజూరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించడం, బిల్లులు వసూలు చేయడం, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం తదితర పనులు ప్రస్తుత అధికారులపైనే అదనపు భారం పడుతోంది. దీనికితోడు రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న డీఈ,ఏఈలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక్కడికి బదిలీపై రావడానికి అధికారులు జంకుతున్నారు. ఇటీవల మడకశిర మండలానికి రెగ్యులర్ జేఈని నియమించినా ఆయన విధుల్లో చేరలేదు. మడకశిర విద్యుత్ సబ్ డివిజన్లో వేధిస్తున్న సిబ్బంది కొరత విద్యుత్‌శాఖ డివిజనల్ ఇంజినీర్ పోస్టు ఖాళీ మూడు మండలాలకు రెగ్యులర్ జేఈలు లేరు.. పని ఒత్తిడితో విద్యుత్ సిబ్బంది సతమతం -
భూమిని బీడు పెట్టాల్సిందే
నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. హంద్రీ –నీవా కాలువలో కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ఇటీవల కొత్తగా మూడు బోర్లు వేయించినా నీరు పడలేదు. రూ. 1.2 లక్షల వరకు ఖర్చయింది. సాగు చేసిన బ్యాడిగ మిర్చి, మొక్కజొన్న పంటలకు పక్క రైతు బోరు నుంచి నీరు పెట్టుకొని నూర్పిడి చేసుకున్నా. పంటలకు నీరు సరిగా అందక దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. ఇకపై భూమి బీడు పెట్టాల్సిందే. – పవన్ కుమార్, రైతు, ముద్దలాపురం -
బీఎల్ఏపై పచ్చమంద దాడి
పుట్టపర్తి: ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో తమ ఎత్తుగడలు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నాడన్న కారణంతో వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్ఏ సుదర్శన్‌పై, అతని కుటుంబ సభ్యులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ సంఘటన కొత్తచెరువులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...‘సర్’ కార్యక్రమం ప్రారంభం నుంచి చురుగ్గా ఉన్న వైఎస్సార్సీపీ బీఎల్ఏ సుదర్శన్ టీడీపీ వర్గీయుల కుయుక్తులకు అడ్డుపడుతూ వచ్చాడు. దీంతో అతన్ని ఎలాగైనా నియంత్రించాలనుకుని టీడీపీ కార్యకర్తలు భావించారు. ఈ క్రమంలోనే సుదర్శన్ ఇంటి సమీపంలో ఉన్న మల్లిగంగాద్రి, తులశమ్మల పెంపుడు కుక్క అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. అయితే సుదర్శన్ కుటుంబమే కుక్కను చంపిందని ఆరోపిస్తూ శుక్రవారం సుదర్శన్ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలైన మల్లి గంగాద్రి, తులశమ్మ, వారి కుమారులు హేమంత్, గణేష్, గణేష్ భార్య దండగల అరుణ, మరో ఇద్దరు ఎరుకల నాగమణి, అనూషబాయి తదితరులు సుదర్శన్ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. సుదర్శన్‌తో పాటు అతని తండ్రి జయరాం, భార్యను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. స్థానికులు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా సర్ది చెప్పారు. తీవ్ర గాయాలపాలైన సుదర్శన్ కుటుంబ సభ్యులు కొత్తచెరువులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఇంతలోనే టీడీపీ కార్యకర్తలు స్థానిక నాయకులతో కలిసి ముందుగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సుదర్శన్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయించారు. దాడి చేసి మాపైనే కేసులు తనతో పాటు కుటుంబీకులపై దాడి చేసి రక్త గాయాలు చేసిన టీడీపీ నాయకులే తిరిగి తమపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని సుదర్శన్ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శనివారం సుదర్శన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీతో పాటు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకూ రక్త గాయాలు బాధితులపైనే కేసు నమోదు చేయించిన టీడీపీ నేతలు -
చెక్ బౌన్స్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్
అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో చెక్‌బౌన్స్ కేసులపై శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రత్యేక లోక్ అదాలత్‌కు అనంతపురము కోర్టు ప్రాంగణంలో మూడు బెంచులు ఏర్పాటు చేశారు. 47 చెక్ బౌన్స్ కేసుల్లో రూ. 36,62,000 మేర పరిష్కరించినట్టు ఉమ్మడి జిల్లా ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఈ. భీమారావు తెలిపారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్ శాశ్వత చైర్పర్సన్ శైలజాదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్, న్యాయసేవాధికార సంస్థ సభ్యులు సి. భాగ్య, ఎన్.రాధ తదితరులు పాల్గొన్నారు. దీన్ని కోడిగుడ్డు అంటారా? ● మంత్రి సవిత ఆగ్రహం రొద్దం: ‘‘ఇదేంది... దీన్ని కోడిగుడ్డు అంటారా..మరి ఇంత చిన్నగా ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఎన్ని గ్రాములు ఉండాలి... ఎంత ఉంది’’ అంటూ బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె కలెక్టర్ శ్యాంప్రసాద్‌తో కలిసి మండల పరిధిలోని తురకలాపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులతో ఆరాతీశారు. కోడిగుడ్లు పరిమాణం తక్కువగా ఉందని, భోజనం కూడా సరిగా లేదని తెలుస్తోందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడిస్తే సహించేది లేదన్నారు. ఇకపై ఇలాంటివి తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బెట్ట పరిస్థితులను తట్టుకునే పంటలు మేలు బత్తలపల్లి: బెట్ట పరిస్థితులను తట్టుకునే పంటలు సాగు చేయడమే మేలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు తెలియజేశారు. శనివారం దంపెట్లలో వారు పర్యటించారు. కరువు, బెట్ట పరిస్థితులను తట్టుకునే పంటల సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు చేశారు. లీటరు నీటికి పొటాషియం నైట్రేట్(13–0–45) ఐదు గ్రాములు లేదా యూరియా లీటరు నీటికి 20 గ్రాములు లేదా 19–19–19(ఎన్.పి.కె) లీటరు నీటికి ఐదు గ్రాములు కలిపి పిచికారీ చేయాలన్నారు. పరిశోధన విభాగం సంచాలకులు డాక్టర్ వి.సుమతి, డీన్ డాక్టర్ సంపత్‌కుమార్, కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బీవీ భాస్కర్‌రెడ్డి, పుట్టపర్తి డాట్ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె.రామసుబ్బయ్య, డీఏఓ కృష్ణయ్య పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి తాడిమర్రి: సోదరుని ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు స్వగ్రామం వెళ్లిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఏకపాదంపల్లి గ్రామానికి చెందిన కూచి ఆది నరసింహులు(45), మునిలత దంపతులకు ఇద్దరు కూతుళ్లు నిత్య భార్గవి, రాజస్వి సంతానం. ధర్మవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసే ఆది నరసింహులు మకాంను అక్కడికే మార్చాడు. శనివారం ఏకపాదంపల్లిలో తన పెదనాన్న కుమారుడు కూచి నారాయణస్వామి కుమార్తె శ్వేత సీమంతం ఉండటంతో కూచి ఆది నరసింహులు కుటుంబంతో కలిసి గ్రామానికి వెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ అందరితో సంతోషంగా, సరదాగా గడిపాడు. భోజనాల అనంతరం సాయంత్రం 4.30 గంటల సమయంలో తన ఇంటి వద్దకు వెళ్లి మోటార్ ఆన్ చేసి మొక్కలను నీరు పెడుతున్నాడు. ఈ క్రమంలో పైపు జాయింట్ ఊడిపోగా, దాన్ని సరిచేస్తున్న క్రమంలో నీరు ఎగిసి మోటర్‌కు బిగించిన విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ ప్రసరణ జరిగి ఆది నరసింహులు కుప్ప కూలిపోయాడు. వెంటనే గమనించిన బంధుమిత్రులు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు గ్రామానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. -
ప్రజల భద్రతకు ప్రాధాన్యం
హిందూపురం: ప్రజల భద్రతకే పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ప్రతి ఆటోకు సదరు ఆటో పూర్తి వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ ిస్టిక్కర్లను అతికిస్తున్నామన్నారు. శనివారం ఆయన హిందూపురం ఎంజీఎం క్రీడా మైదానంలో 196 ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి యాప్ పనితీరు గురించి వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..ప్రయాణికులు ఆటోల్లో ఏదైనా వస్తువు మరచిపోయినా...ఇంకేదైనా సమస్య తలెత్తినా ఆటోలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్షణాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. అలాగే డ్రైవర్ వివరాలతోపాటు లైవ్ లొకేషన్ సహా 8 భద్రతా సేవలు అందుబాటులో వస్తాయన్నారు. నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 10 వేల ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అతికించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆటో డ్రైవర్లు కూడా గడువులోపు తమ ఆటోలకు క్యూఆర్‌కోడ్ స్టిక్కర్లను అతికించుకోవాలని, లేకపోతే పోలీసుల తనిఖీల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, రవాణా శాఖ అధికారి శ్రీనివాసులు, సీఐలు రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, జనార్దన్, అబ్దుల్ కరీం, ఎ్స్ఐలు, మున్సిపల్, రవాణా శాఖ సిబ్బంది, 13 ఆటో యూనియన్ యూనియన్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడి ‘పురం’లో ఆటోలకు క్యూర్ కోడ్ స్టిక్కర్లు -
రైతుల పొలాల్లో విద్యుత్ టవర్లు
ముదిగుబ్బ: పరిహారం తేల్చకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా పొలాల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు విద్యుత్ అధికారులు సిద్ధం కాగా రైతులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. మండల పరిధిలోని మలకవేమల క్రాస్ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్‌కు వైకొత్తపల్లి సబ్ స్టేషన్ నుంచి 132 కేవీ లైన్ లాగేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం మలకవేమల, ఎనుములవారిపల్లి, సానేవారిపల్లికి చెందిన 15 మంది రైతుల పొలాల మీదుగా హైటెన్షన్ విద్యుత్ లైను వెళ్లనుండగా పలుచోట్ల పొలాల్లో విద్యుత్ టవర్లు నిర్మించాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. అయితే రైతుల అనుమతులు లేకుండానే శనివారం లక్ష్మీనారాయణమ్మ, రంగారెడ్డి, రామకృష్ణ పొలాల్లో మూడు హైటెన్షన్ టవర్ల నిర్మాణం కోసం విద్యుత్ శాఖ అధికారులు 150 మంది పోలీసులను మోహరింపజేసి పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని పనులు అడ్డుకున్నారు. పంటకు, భూమికి పరిహారం ఎంతనేది తేల్చకుండా టవర్ల నిర్మాణ పనులు చేయడం అన్యాయమన్నారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు పనులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె పొలంలో జేసీబీలతో టవర్ నిర్మాణం కోసం గుంతలు తీయగా.. మిగతా రైతులు బైఠాయించారు. పరిహారం తేల్చాకే పనులు చేసుకోవాలన్నారు. అంతవరకూ కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. బలవంతంగా పనులు చేపడితే ప్రాణత్యాగాలకు సిద్ధమని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పనులను అడ్డుకున్న రైతులు.. పరిహారం తేల్చాలని డిమాండ్ -
తాగిస్తారు.. తాట తీస్తారు!
సాక్షి, పుట్టపర్తి మందుబాబును సర్కార్ నిలువుదోపిడీ చేస్తోంది. ఊరూరా వైన్‌షాపు...వీధికో బెల్ట్షాపుతో 24 గంటలూ మద్యాన్ని అందుబాటులో ఉంచిన జనంతో తాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం..తాగి రోడ్డెక్కిన మందుబాబులను జరిమానాతో లూటీ చేస్తోంది. మద్యం విక్రయాలకు టార్గెట్ విధించిన సీఎం చంద్రబాబు...డ్రంకెన్ డ్రైవ్ కేసులనూ టార్గెట్ విధించారు. దీంతో సాయంత్రమైతే చాలు పోలీసులు స్టేషన్లు వదిలి రోడ్లపైకి వస్తున్నారు. సుక్కేసుకుని బండెక్కిన వారికి సుక్కలు చూపుతున్నారు. అలాగే సబ్ డివిజన్‌కు ఓ డ్రోన్ చొప్పున ఎగరేస్తున్నారు. అదేవిధంగా నైట్ విజన్ డ్రోన్లతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిని పట్టేస్తున్నారు. గతంలో కేవలం జరిమానాతో వదిలిపెట్టేవారు. ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ‘మత్తు’లో బండెక్కి బుక్ అవుతున్నారు.. ఊరూరా మద్యం షాపులు.. వీధివీధినా బెల్టుషాపుల ఏర్పాటుతో ఊళ్లకు ఊళ్లే మత్తులో జోగుతుండగా...రాష్ట్ర ఖజానాకు చేరే సొమ్ము భారీగా పెరిగింది. దీంతో మద్యం అమ్మకాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగానే ఆదేశాలిస్తున్నారు. అంతేకాకుండా టార్గెట్లు ఇస్తున్నారు. లక్ష్యం చేరుకునే క్రమంలో మద్యం దుకాణాల నిర్వాహకులు బెల్టు షాపులపై ఆధారపడ్డారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా.. గుడి, బడి అనే సంగతి మరిచి మద్యం విక్రయిస్తున్నారు. దీంతో ఏ గ్రామంలో చూసినా మద్యం తాగే వారి సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం తాగి బైక్‌లపై రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో పోలీసుల తనిఖీల్లో దొరికిపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి కనీసంగా రూ.10 వేలు జరిమానా విధిస్తుండగా..సర్కార్ ఖజానాకు చేరే సొమ్ము డబుల్ అవుతోంది. కూలి పనులు చేసుకుని ఇంటిదారిన పట్టిన దినసరి కూలి దారిలో కనిపించిన బెల్ట్‌షాపులో మద్యం తాగి పోలీసులకు చిక్కి నెలరోజుల శ్రమను జరిమానా రూపంలో చెల్లించుకుంటున్నాడు. ఊదితే 200 దాటిపోతోంది.. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం మానవ శరీరంలో ఉండే వంద మిల్లీలీటర్ల రక్తంలో 35 శాతం వరకు ఆల్కహాల్ ఉండవచ్చు. పోలీసులు నిర్వహించే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ శాతం ఉంటే కేసు నమోదు చేయవచ్చు. ఇటీవల చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 150 శాతం నుంచి 200 శాతం వరకు ఆల్కహాల్ నమోదు కావడం చూసి పోలీసులే బిత్తరపోతున్నారు. ‘‘ఎంత తాగినావ్ నాయనా’’ అంటూ బుద్ధి చెబుతున్నారు. ఊరారా వైన్స్.. వీధికో బెల్ట్‌షాపు తాగి ఊగుతూ వాహనాలతో రోడ్డెక్కుతున్న మందుబాబులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు దొరికిపోతే రూ.10 వేలకుపైగా జరిమానా, జైలు శిక్ష మద్యంతో చిత్తయిపోతున్న మందుబాబులు హత్య నేరం కింద కేసు నమోదు.. ఈనెల 11వ తేదీన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేసి బహిరంగంగా మద్యం సేవిస్తున్న 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచగా.. జడ్జి ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. అదే రోజున మద్యం సేవించి వాహనం నడుపుతూ మరో నలుగురు పట్టుబడ్డారు. వారందరినీ కోర్టు ముందు హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున కోర్టు జరిమానా విధించింది. జూన్ 12వ తేదీన కనగాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. మద్యం సేవించిన ఓ యువకుడు బైక్‌పై వస్తూ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి ధర్మవరం కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రూ.10 వేల జరిమానా విధించారు. మే 21వ తేదీన హిందూపురం టూ టౌన్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. మద్యం సేవించిన ఓ వ్యక్తి తుపాన్ వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రూ.10 వేల జరిమానా విధించారు. అదే రోజు లేపాక్షి సమీపంలో తనిఖీలు చేస్తుండగా.. మద్యం సేవించి వాహనం నడుపుతూ నలుగురు పోలీసులకు పట్టుబడ్డారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడపడం నేరం. దీనివల్ల మద్యం తాగిన వ్యక్తితో పాటు ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాహనదారుడూ ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశాం. మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడిపితే హత్యా నేరం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తాం. నిందితులకు కఠిన శిక్ష పడుతుంది. ప్రమాదం జరిగి ఎదుటి వారు మరణిస్తే డ్రైవర్‌పై హత్యా నేరానికి సమానమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాం. – ఎస్.సతీష్‌కుమార్, ఎస్పీ -
11 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: వాతావరణంలో మార్పులు చోటుచేసుకోగా జిల్లాలోని 11 మండలాల్లో వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ 11 మండలాల పరిధిలో మొత్తం 165.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్లమాడ మండలంలో 68.2 మి.మీ, బుక్కపట్నం 30.4, సోమందేపల్లి 18.4, కదిరి 13, తాడిమర్రి 10.2, నల్లచెరువు 8.4, పుట్టపర్తి 5.2, గాండ్లపెంట 4.8, ఓడీచెరువు 4.4, అమడగూరు 1.4, ధర్మవరంలో 1 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాకు మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 20న షైనింగ్ స్టార్లకు సత్కారం పుట్టపర్తి: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ‘షైనింగ్ స్టార్స్–2026’ పేరుతో సత్కరించనున్నట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మాహి శ్రీనివాస గార్డెన్స్‌లో సత్కార కార్యక్రమం ఉంటుందన్నారు. పురస్కారానికి ఎంపికై న ప్రతి విద్యార్థికి రూ.20 వేల నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం, మెడల్ అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులంతా తల్లిదండ్రుల వెంట తీసుకుని సకాలంలో కార్యక్రమానికి రావాలని సూచించారు. -
రౌడీషీటర్ల కదలికపై నిఘా ఉంచండి
● పోలీసులకు ఎస్పీ ఆదేశం గోరంట్ల: రౌడీ షీటర్లు, నేర చరితులు, వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి బెయిల్‌పై బయట ఉన్న వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీసులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే బైండవర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన గోరంట్ల అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, లాకప్ గదులు, రికార్డుల నిర్వహణ పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతి, సర్కిల్ పరిధిలో సమస్యాత్మక గ్రామాల తాజా పరిస్థితిని సీఐ శేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ...రాత్రి వేళ గస్తీ, బీట్ పోలీసింగ్, వాహన తనిఖీలను మరింత పటిష్టంగా నిర్వహించి నేరాలను నియంత్రించాలన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలు చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం గోరంట్ల ప్రధాన రహదారులను ఆయన పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఐ శేఖర్‌ను ఆదేశించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి ● అధికారులకు ఏపీఎస్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఆదేశం బత్తలపల్లి: ‘‘దేశానికే అన్నం పెట్టే రైతన్నకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. ముఖ్యంగా పంటల సాగులో కరెంటు కష్టాలు అస్సలు రానివ్వకూడదు. ఆ దిశగా విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి’’ అని ఏపీ ఎస్పీడీసీఎల్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్, విశ్రాంత జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి విద్యుత్ అధికారులకు సూచించారు. శుక్రవారం బత్తలపల్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పుట్టపర్తి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఆపరేషన్స్) శివరాములు అధ్యక్షతన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస ఆంజనేయమూర్తి మాట్లాడుతూ..రైతులు, విద్యుత్ వినియోగదారుల సమస్యలను మానవత్వంతో అర్థం చేసుకుని పరిష్కరించాలన్నారు. అంతకుముందు బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం రూరల్ మండలాల్లోని విద్యుత్ వినియోగదారుల కోసం విద్యుత్ అదాలత్ నిర్వహించారు. 14 మంది తమ సమస్యలను విద్యుత్ అదాలత్ దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటిని 15 రోజుల్లోపు పరిష్కరించాలని చైర్మన్ ఆదేశించారు. అదాలత్‌లో ఏపీఎస్పీ డీసీఎల్ ఆర్థిక సభ్యుడు మధుకుమార్, సాంకేతిక సభ్యుడు శ్రీనివాసబాబు, స్వతంత్ర సభ్యురాలు విజయలక్ష్మి, జిల్లా ఎస్ఈ మోసెస్, ఎస్ఏఓ బాలాజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బైండోవర్ నిబంధనల ఉల్లంఘనపై జరిమానా చిలమత్తూరు: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మరోమారు ఘర్షణకు దిగిన టి.నరేంద్ర అనే వ్యక్తికి రూ.50 వేలు భారీ జరిమానా విధించినట్టు సీఐ జనార్దన్, ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. గతంలో భూ వివాదాల నేపథ్యంలో నరేంద్రను బైండోవర్ చేశామన్నారు. అయితే అతను మళ్లీ గొడవలకు దిగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘన విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన నిందితుడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని, నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో రూ.50 వేలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. -
నేతన్నకు నిజమైన నేస్తం వైఎస్ జగన్
ధర్మవరం: చేనేత కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు, నేతన్నలకు నిజమైన నేస్తం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. అందుకే చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి ‘నేతన్న నేస్తం’ పేరుతో ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.25 వేలు ఇస్తామని చెప్పి ఇంత వరకు అమలు చేయకుండా మోసం చేస్తోందని, ఈ విషయాన్ని చేనేత కార్మికులకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ వార్డు ఇన్‌చార్జ్‌లపైనే ఉందన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని తన స్వగృహంలో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... ప్రతిఒక్కరూ జగన్ 2.0 సూపర్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. చేనేతలకు మంచి జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. ఇందుకోసం అందరం కష్టపడదామని పిలుపునిచ్చారు. గతంలో నేతన్న నేస్తం అందుకున్న కార్మికులను చైతన్య పరిచి ఈనెల 20వ తేదీన ప్యాదిండి ఆంజనేయస్వామి ఆలయం నుంచి భారీ బైకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. చేనేత కార్మికులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేనేత కార్మికులకు అండగా 20న భారీ బైకు ర్యాలీ జగన్ 2.0 సూపర్ యాప్ కరపత్రాల విడుదల -
‘నీట్’గా రాణించారు
నల్లచెరువు/పెనుకొండ/ఓడీచెరువు: ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ‘నీట్’ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. శుక్రవారం ర్యాంకులు ప్రకటించగా...రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ జిల్లా విద్యార్థులు మెరుగైన ర్యాంకులు దక్కించుకున్నారు. శ్వేతరాయల్కు 1,750 ర్యాంకు నల్లచెరువు మండలం కళ్లిపల్లికి చెందిన కమ్మల బాలాజీ, మీనాక్షి దంపతుల కుమార్తె కమ్మల శ్వేత రాయల్ ‘నీట్’లో ఆల్ ఇండియాలో జనరల్ కేటగిరీలో 1,750 ర్యాంక్ సాధించింది. దీంతో కుటుంబీకులు, బంధువులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పలువురు గ్రామస్తులు రాజకీయ నాయకులు శ్వేతను అభినందించారు. పెనుకొండ విద్యార్థికి 2,105 ర్యాంకు పెనుకొండకు చెందిన కాడిశెట్టి శ్రీనివాసులు, ఆనందమ్మ దంపతుల కుమారుడు కాడిశెట్టి పవన్‌్ కుమార్్ ‘నీట్’లో ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 2,105 ర్యాంక్ సాధించాడు. దీంతో స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు పవన్‌కుమార్‌ను అభినందనలతో ముంచెత్తారు. మెరసిన ఓడీసీ విద్యార్థి.. ఓడీచెరువుకు చెందిన కమ్మల బాలాజీ, మీనాక్షి దంపతుల కుమార్తె శ్వేత ‘నీట్’లో ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 3,598 ర్యాంకు దక్కించుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షలో సైతం 980 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. దీంతో శ్వేతను ఆమె తల్లిదండ్రులు అభినందించారు. దిలీప్... సూపర్ సోమందేపల్లి మండలం కదిరేపల్లికి చెందిన కురుబ దిలీప్ ‘నీట్’లో ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 29,925 ర్యాంకు దక్కించుకున్నాడు. దిలీప్ తండ్రి కురుబ రామాంజనేయులు చిల్లర అంగడితో పాటు వ్యవసాయం చేస్తుండగా.. తల్లి శోభారాణి అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. తల్లిదండ్రులు కష్టాన్ని చూసిన దిలీప్.. కష్టపడి చదివి నీట్లో మెరుగైన ర్యాంక్ సాధించాడు. దీంతో దిలీప్‌ను తల్లిదండ్రులతో పాటు స్థానికులు అభినందించారు. గ్రామంలో స్వీట్లు పంచుకున్నారు. జాతీయస్థాయి పరీక్షలో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు -
కార్యకర్తకు రక్ష ‘జగన్ 2.0’యాప్
ఓడీచెరువు: వైఎస్సార్ సీపీ తీసుకువచ్చిన ‘జగన్ 2.0’ సూపర్ యాప్ కార్యకర్తలకు రక్షణ కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఓడీచెరువు మండల పరిధిలోని ఎంబీ క్రాస్‌లో జెడ్పీటీసీ దామోదర్‌రెడ్డి రైస్ మిల్లో ‘జగన్ 2.0’ సూపర్ యాప్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు బంగారు భవిష్యత్తుకు జగనన్న బాటలు వేస్తున్నాడని, అందులో భాగంగానే కార్యకర్తల కష్టాలు తెలుసుకుని తోడుగా నిలిచేందుకు ‘జగన్ 2.0’ యాప్ అందుబాటులోకి తెచ్చారన్నారు. కార్యకర్తలంతా ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని జగనన్న డిజిటల్ ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అన్యాయం చేసిన వారి భరతం పడతామన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలు, నేతల ప్రెస్మీట్లు యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి -
ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం
తలుపుల: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రైతులంతా ప్రకృతి వ్యవసాయం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. దీనివల్ల పెట్టుబడితో పాటు నీటి అవసరం కూడా తగ్గుతుందన్నారు. శుక్రవారం ఆయన తలుపుల మండలంలోని పెద్దపల్లి గ్రామంలో పర్యటించారు. పీఎండీఎస్ విధానంలో మహిళా రైతు ఎన్.సంధ్యారాణి తనకున్న 1.60 ఎకరాల్లో పీఎండీఎస్ పద్ధతిలో సాగు చేసిన పంటలను పరిశీలించారు. పీఎండీఎస్ సాగు విధానం, రైతులకు కలిగే ఉపయోగాలను జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) కృష్టయ్య ఈ సందర్భంగా కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ రైతులతో మాట్లాడి పంటల సాగు, పెట్టుబడుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ యంత్రాంగం రైతులకు అండగా ఉంటుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ రైతులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలో విత్తన వేరుశనగ పంపిణీని పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాన్నే పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కళావతి, ఏఓ నాగ మధుసూదన్, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాసులురెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేజీబీవీలో కలెక్టర్ పాఠాలు.. పుట్టపర్తి అర్బన్: కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయుడిగా మారారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి కేజీబీవీలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కేజీబీవీని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, విద్యార్థినుల వసతి గదులను నిశితంగా పరిశీలించారు. భోజన వసతిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు తెలుసుకునే క్రమంలో ఆయన ఉపాధ్యాయుడిలా మారారు. పదో తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఎస్ఓ సుప్రజ, టీచర్లు ఉన్నారు. -
అయ్యో రామా.. ప్రజాధనానికి ‘పచ్చని’ పేర్లా..!
రాప్తాడు నియోజకవర్గంలో అధికార టీడీపీ పచ్చ నేతల పైత్యం కరెంట్ స్తంభాలపైకెక్కుతోంది. మండలంలోని బాలేపాళ్యంలో టీడీపీ నాయకులు కరెంట్ స్తంభాలకు ఆ పార్టీ నాయకుడు పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్లు రాయించుకుంటున్నారు. విద్యుత్ శాఖ ద్వారా రూ.లక్షలు వెచ్చించి ఈ మధ్యనే గ్రామంలో ఆర్డీఎస్ఎస్ పథకం కింద కొత్తగా విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేశారు. ఈ స్థంభాలపై అధికారులు ఇంకా విద్యుత్ సర్వీసులు, మీటర్ల నంబర్లు కూడా సరిగా వేయకనే స్థానిక టీడీపీ నాయకులు వాటికి పచ్చ రంగులు వేసి వారి పార్టీ నేతల పేర్లు రాసుకుంటున్నారు. దీనిపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన స్తంభాలపై రాజకీయ పార్టీ నేత పేర్లు రాసుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. – కనగానపల్లి: -
సన్మార్గంతోనే దైవ దర్శనం
ప్రశాంతి నిలయం: యుగాలు మారినా... మానవుడు దైవాన్ని చేరే మార్గం ఒక్కటేనని, సన్మార్గంలో జీవితం గడపడం ద్వారా దైవాన్ని దర్శించవచ్చని సత్యసాయి సౌతాఫ్రికా భక్తులు నృత్యరూపంలో వివరించారు. పర్తి యాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన సౌతాఫ్రికా భక్తులు శుక్రవారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణాఫ్రికాలోని శ్రీ సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన చిన్నారులు ‘అక్రాస్ ది ఏజెస్– టైం అండ్ ట్రూత్ ’ పేరుతో నిర్వహించిన నృత్య రూపకం భక్తులను మైమరపింపజేసింది. యుగయుగాలుగా మానవుడు వివిధ రూపాల్లో దేవుళ్లను పూజిస్తున్నారని, ఎన్ని యుగాలు మారినా దైవాన్ని చేరేందుకు అనుసరిస్తున్న మార్గం మాత్రం ఒక్కటేనన్న సత్యాన్ని వివరిస్తూ పలు ఘట్టాలను ప్రదర్శించారు. ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగంలో అవతరించిన అవతార పురుషులు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, సత్యసాయిల లీలలను చక్కగా వివరించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు
కదిరి అర్బన్: ప్రత్యామ్నాయ పంటలు సాగుతోనే రైతులకు మేలు అని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా. వీ సుమతి, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్స్ డాక్టర్ సంపత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సత్యసాయి జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిశీలించేందుకు వారు కదిరి వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చారు. ఇక్కడ శాస్త్రవేత్తలతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై చర్చించారు. వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. బీవీ భాస్కర్‌రెడ్డితో కలిసి తలుపుల మండలం వేపమానిపేట, తొగటవాండ్లపల్లి, ఓడీసీ మండలం మిట్టపల్లి,పులగం పల్లి గ్రామాల్లో పంటల సాగును పరిశీలించారు. ప్రసుత్తం జూలై రెండో పక్షం నుంచి వేరుశనగ సాగు ఆశాజనకంగా ఉండదని, ప్రత్యామ్నాయ పంటలైన ఆముదం, కంది, పెసర, కొర్ర, సజ్జ పంటలను సాగు చేసుకోవాలని రైతులను సూచించారు. -
నీటి సమస్య తీర్చాలని నిరసన
గుడిబండ: మండల పరిధిలోని బీటీపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య తీర్చాలని మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం తాళికెర సచివాలయం ఎదుట బైఠాయించారు. తాళికెర పంచాయతీలోని బీటీపల్లి గ్రామంలో రోజూ తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య తీర్చాలని పలు సార్లు అధికారులకు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోలేదని మహిళలు ఆవేదన చెందారు. దీంతో నీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ఆందోళన చేశారు. చెక్‌బౌన్స్ కేసులో వ్యక్తికి ఆరునెలల జైలుధర్మవరం అర్బన్: చెక్‌బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ధర్మవరం అడిషనల్ జ్యుడీయల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ వెంకట హరీష్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. వివరాలు..చిలకం రమణారెడ్డి అనే వ్యక్తి ఆదినారాయణకు రూ.8.50 లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఆదినారాయణ ఇచ్చిన చెక్కును బ్యాంకులో వేశాడు. ఆదినారాయణ అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో చిలకం రమణారెడ్డి నవంబర్ 2019లో ఎన్ఐ యాక్ట్ కింద కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేశాడు. విచారించిన న్యాయమూర్తి ఆదినారాయణను దోషిగా తేల్చి ఆరునెలల జైలుతోపాటు రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో మూడు నెలలు సాధారణ జైలు అనుభవించాలని తీర్పు వెలువరించారు. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్‌కు జరిమానా చిలమత్తూరు: మద్యం సేవించి వాహనం నడిపిన లారీ డ్రైవర్‌కు హిందూపురం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రూ.12,500 జరిమానా విధించినట్టు సీఐ జనార్దన్, ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. గురువారం మండలంలోని 44వ నెంబరు జాతీయ రహదారి కొడికొండ చెక్‌పోస్ట్‌లో వాహనాల తనిఖీలు చేస్తుండగా, ఢిల్లీకి చెందిన పవన్ సింగ్ మద్యంతాగి లారీ నడుపుతూ పట్టుబడ్డాడన్నారు. డ్రైవర్‌ను ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా రూ. 12,500 జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు. బురుజు చుట్టూ అపరిశుభ్రత తొలగింపు మడకశిర: పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఉన్న బురుజు నిర్వహణపై ఎట్ట కేలకు పురావస్తుశాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఇటీవల ‘సాక్షి’లో ‘నిద్రావస్థలో పురువస్తుశాఖ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆశాఖ అధికారులు స్పందించారు. బురుజు చుట్టూ పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించడానికి శుక్రవారం చర్యలు తీసుకున్నారు. గడ్డి,పిచ్చి మొక్కలను తొలగించి బురుజు చుట్టూ శుభ్రం చేశారు. ఇంతకు మునుపు గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో బురుజు తన అందాన్ని కోల్పోయింది. దీంతో పర్యాటకులు కూడా బురుజు వద్దకు వెళ్లడానికి ఇష్టపడే వారు కాదు. దూరం నుంచే బురుజును తిలకించేవాళ్లు. వ్యక్తిపై కత్తితో దాడికదిరి టౌన్: మున్సిపల్ పరిధిలోని రైల్వేస్టేషన్ సమీపంలోని ఉన్న ఇంతియాజ్‌పై ముజాయిద్ అలియాస్ ముజ్జు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి కత్తితో దాడి చేశాడు. అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన మేరకు.. ఇంతియాజ్ తన ఇంటి సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తుండగా వారించాడు. దీంతో మత్తులో ఉన్న ముజాయిద్ (ముజ్జు) ఇంతియాజ్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతియాజ్‌కు గొంతు వద్ద తెగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని కదిరి ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ముజాయిద్(ముజ్జు) గంజాయి కేసులో గతంలో పలుమార్లు జైలుకు వెళ్లినట్లు సమాచారం.అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన దంపతులు
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తిలో ప్రమాదాల నివారణకు పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములు భార్యాభర్తల మృతికి కారణమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బోయ నరేంద్రబాబు (40), బోయ లత (37) శుక్రవారం మృతిచెందారు. వివరాలు.. ఇటీవల పుట్టపర్తి అర్బన్ పోలీస్టేషన్ సీఐ యువరాజు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పట్టణ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రహదారిపై వాహనాల వేగనియంత్రణకు డ్రమ్ములు వేయించారు. బుధవారం సాయంత్రం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామానికి చెందిన బోయ నరేంద్రబాబు, భార్య లత సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు ముగించుకొని సత్యసాయి విద్యాసంస్థల్లో చదువుతున్న తమ పిల్లల వద్దకెళ్లి ఇంటికి బయల్దేరారు. అదే సమయంలో సత్యసాయి సూపర్ ఆసుపత్రి నుంచి పుట్టపర్తికి వెళ్తున్న బొలెరో వాహన డ్రైవర్ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములు కనిపించక ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై వెళ్తున్న నరేంద్రబాబు, లత దంపతులు కిందపడిపోయారు. బలమైన గాయాలతో పడి ఉన్నవారిని చికిత్స నిమిత్తం సత్యసాయి సూపర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. రెండు రోజుల పాటు బెంగళూరులో మృత్యువుతో పోరాడి శుక్రవారం మృతిచెందారు. మృతిచెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ యువరాజ్ కేసు నమోదు చేశారు. పుట్టపర్తిలో వేగ నియంత్రణకు పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములు తరచూ ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు -
దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
బత్తలపల్లి: దైవదర్శనానికి వెళ్తుండగా కారు వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న లారీని ఢీ కొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వేల్పుమడుగు క్రాస్ వద్ద అనంతపురం–కదిరి జాతీయ రహదారి శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లా చింతామణి తాలూకా శ్రీనివాసపురానికి చెందిన మంజునాథ కారులో ఆయన స్నేహితులు భాస్కర్, నరసింహప్ప, చరణ్, ధనుష్, శ్రీకాంత్, కారు డ్రైవర్ కృష్ణారెడ్డి గురువారం బయల్దేరి మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి కదిరి వెళ్తుండగా .. కారు బత్తలపల్లి జాతీయ రహదారి బైపాస్‌లో వేల్పుమడుగు క్రాస్ వద్ద ముందు వెళ్తున్న హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో వెనుకవైపున ఢీకొనింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను తగిలి రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ సమయంలో కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అందులోని భాస్కర్, నరసింహప్ప, ధనుష్, కారు డ్రైవర్ కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించారు. బత్తలపల్లి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కారును రోడ్డుపైనుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెలూన్లు ఓపెన్ కావడంతో తప్పిన పెనుప్రమాదం నలుగురికి తీవ్రగాయాలు -
సుస్థిర పాలనకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ
హిందూపురం: సుస్థిర పాలనకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ అని పలువురు కొనియాడారు. శుక్రవారం హిందూపురంలోని ప్రధాన రహదారిలో శివాజీ సేవాట్రస్టు అధ్యక్షుడు చలపతి, వానరసేన ఆధ్వర్యంలో అట్టహాసం వైభవంగా మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా శివాజీ విగ్రహం వద్ద వేదపడింతులతో హోమాలు, పూజలు నిర్వహిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయ ప్రచారకర్త కమలనంద భారతీస్వామిజీ, శివసాయిబాబా, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడారు. అన్నివర్గాలకు సుస్థితర పాలన అందించిన ఏకై క హిందూ సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. శివాజీ విగ్రహం ఒక శిల్పం కాదని దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ, మంచి పాలన, ప్రజాసేవకు స్ఫూర్తి అని కొనియాడారు. అనంతరం చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పలువురు రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా ఏఎస్పీ మహేష్ నేతృత్వంలో సీఐలు రాజగోపాల్ నాయుడు, జనార్దన్, అబ్దుల్కరీం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఎంపీహెచ్ఈఓల సమ్మెబాట
పుట్టపర్తి అర్బన్: వ్యవసాయ శాఖలోని మల్టీ పర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (ఎంపీహెచ్ఈఓలు) సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20వ తేదీ నుంచి విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కృష్ణయ్యకు సమ్మెనోటీసు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో కేవలం రూ.12 వేల జీతం, రూ.3 వేల ఇన్సెంటివ్‌తో 12 ఏళ్లుగా పని చేస్తున్నా.. ఇప్పటి వరకూ జీతాల పెంపులేదని, ఉద్యోగ భద్రత కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అందుకే ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకూ సహాయ నిరాకరణ చేయడానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నెలకు రూ.35 వేల వేతనంతో పాటు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే నాన్ శాంక్షన్ పోస్టు నుంచి శాంక్షన్ పోస్ట్‌కు కన్వర్ట్ చేయాలని, హెల్త్ కార్డుల సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా సదుపాయం కల్పించాలని, మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షుడు చెన్న నాయక్, ప్రధాన కార్యదర్శి నాగార్జున, కార్య నిర్వాహక కార్యదర్శులు మీన, గంగరాజు, కార్యవర్గ సభ్యులు రామ్మోహన్, జయరాం, మారుతి, లోక్ష్మీబాయి, భాగ్య, ముబీనా, రాజేశ్వరి, అరుణ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ధర్మవరంలో భారీ చోరీ ధర్మవరం అర్బన్: పట్టణంలోని రంగా సినిమా థియేటర్ సమీపంలోని ఎరుకల మీనాక్షి ఇంట్లో దొంగలు పడి రూ.4.50 లక్షలు నగదు, నాలుగు బంగారు, వెండి ఉంగరాలు ఎత్తుకెళ్లారు. వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని రంగా సినిమా థియేటర్ పక్కనున్న రెండో వీధిలోని ఎరుకల మీనాక్షి గురువారం కుటుంబ సభ్యులతో కలిసి పెనుకొండ దగ్గరున్న కొండపల్లికి వెళ్లారు. శుక్రవారం రాత్రి ధర్మవరానికి వచ్చి ఇంటి తలుపులు తీయగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని రూ.4.50లక్షల నగదు, బంగారు ఉంగరాలు, వెండి ఉంగరాలను ఎత్తుకెళ్లారు. వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు 20వ తేదీ నుంచి విధుల బహిష్కరణ డీఏఓకు సమ్మె నోటీసు అందజేసిన ఉద్యోగులు -
నిత్యావసరాలు సకాలంలో తరలించాలి
ప్రశాంతినిలయం: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ లబ్ధిదారులకు అందించే బియ్యం, చక్కెర, పప్పులు తదితర నిత్యావసర సరుకులను ఎఫ్పీ షాపులకు సకాలంలో తరలించాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులు, కంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ గోడౌన్ ఇన్‌చార్జ్‌లు, స్టేజ్–2 కాంట్రాక్టర్ల సమన్వయంతో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సరుకులు తరలించాలన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా, అవకతవకలకు తావు లేకుండా బాధ్యాతాయుతంగా వ్యవహరించాలన్నారు. సరుకుల పంపిణీని గోడౌన్ ఇన్‌చార్జ్‌లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమస్యాత్మకంగా ఉన్న కొన్ని గోడౌన్లలో హమాలీ మేసీ్త్రలతో మాట్లాడి సరుకుల లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘భారత్ టెక్స్’లో మెరిసిన ధర్మవరం పట్టు చీరలుధర్మవరం: న్యూఢిల్లీలో ఈనెల 13 నుంచి 17 వరకు భారత్ మంటపంలో జరిగిన అంతర్జాతీయ వస్త్ర వినియోగదారుల సమ్మేళనంలో ధర్మవరం పట్టుచీరల ప్రత్యేకత చాటుకున్నట్లు జాతీయ అవార్డు గ్రహీత జుజారే నాగరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సమ్మేళనంలో పట్టుచీరలను నాగరాజు ప్రదర్శించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులకు ధర్మవరం పట్టుచీరలు, పట్టు పావడాల విశిష్టతలను డిజైనర్ విశదీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి చేనేత మగ్గాల ద్వారా తయారు చేసి అందిస్తున్న వస్త్రాల ప్రత్యేకతలను వివరించారు. ఈసమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత శాఖమంత్రి సవిత ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథులకు డిజైనర్ నాగరాజు వెంకటేశ్వరస్వామి ప్రతిమలను అందించారు. చెక్ బౌన్స్ కేసులపై నేడు ప్రత్యేక లోక్ అదాలత్ అనంతపురం: చెక్ బౌన్స్‌కు సంబంధించి నమోదైన కేసులపై ఈ నెల 18 ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ భీమారావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెక్ బౌన్స్ కేసులపై ఉమ్మడి జిల్లాలలోని ప్రతి కోర్టు ఆవరణలోనూ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
జనగణనకు గౌరవం ఏదీ?
జిల్లాలో గృహగణన నిర్వహించిన ఎన్యుమరేటర్లు అనంతపురం అర్బన్: జనగణన–2027లో భాగంగా గృహగణన కార్యక్రమం జిల్లాలో మే 1వ నుంచి 30వ తేదీ వరకు జరిగింది. జిల్లాలోని రూరల్, పట్టణ ప్రాంతాల్లో నెల రోజుల పాటు 3,425 మంది ఎన్యుమరేటర్లు, 583 మంది సూపర్వైజర్లు, నగర పాలక సంస్థ పరిధిలో 436 మంది ఎన్యుమరేటర్లు, 70 మంది సూపర్వైజర్లు మొత్తం 4,514 మంది గృహగణన ప్రక్రియ నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి గౌరవ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. జిల్లాలో జనగణన విధులను సిబ్బందితో గౌరవంగా చేయించుకున్న అధికారులు వారికి గౌరవంగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదు. గృహగణన ప్రక్రియ ముగిసి నెలన్నర దాటినా ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం చెల్లించలేదు. రూ.4.60 కోట్లు ఇవ్వాలి గృహగణన విధులు నిర్వర్తించిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఒకొక్కరికీ రూ.9 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. అదే విధంగా శిక్షణకు హాజరైనందుకు రూ.1,200 ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కరి మొత్తం రూ.10,200 చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం 4,514 మంది ఎన్యురేటర్లు గౌరవ వేతనం రూ.4,06,26,000 చెల్లించాల్సి ఉంది. శిక్షణ హాజరైనందుకు రూ.54,16,800 ఇవ్వాలి. మొత్తం రూ.4,60,42,800 చెల్లించాల్సి ఉంది. కలెక్టర్ పద్దుకు నిధులు జనగణన కార్యక్రమాలకు సంబంధించిన నిధులను కలెక్టర్ల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం మే నెల 12న జారీ చేసింది. జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణన ప్రక్రియ పూర్తయితే వెంటనే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు గౌరవ వేతనం చెల్లించాలని పేర్కొంది. ప్రక్రియ ముగిసి నెలన్నర దాటినా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం చెల్లించలేదు. ఎందుకయ్యా అంటే గృహగణనలో నమోదైన ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇళ్లకు సంబంఽధించి ఎందుచేత ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను యాప్‌లో చేయాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు సంబంఽధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానందున గౌరవ వేతనం చెల్లించలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం చెల్లించాల్సిన అంశాన్ని ఇప్పటికీ కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లపోవడం ఇందులో కొసమెరుపు. 653 మంది 4,514 మంది 10,2004.60 కోట్లు 3,861 మంది విధులు నిర్వర్తించిన ఎన్యుమరేటర్లు, సూపరవైజర్లు నెలన్నర దాటినా అందని గౌరవ వేతనం కలెక్టర్ పద్దులోనే రూ.4.60 కోట్ల నిధులు -
ట్రాక్టర్ కింద పడి హమాలీ మృతి
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాక్టర్ కింద పడి దూదేకుల మౌలాలి (45) మృతి చెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాలమేరకు.. పెద్దవడుగూరు మండలం గుత్తి వెంకటాంపల్లికి చెందిన దూదేకుల మౌలాలి ట్రాక్టర్‌కు హమాలిగా వెళ్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గుత్తి శివారులో ట్రాక్టర్లో ఎర్ర మట్టి లోడ్ చేసుకుని జి.వెంకటాంపల్లికి వెళ్తున్నారు. అయితే కొత్తపేట శివారులోని బైపాస్ బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ వెళ్తుండగా కుదుపులకు ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చున్న మౌలాలి చేయి పట్టు జారి వెనుక చక్రం కింద పడ్డాడు. ట్రాక్టర్ ట్రాలీ అతడిపై నుంచి ఎక్కి వెళ్లడంతో మౌలాలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లాలుబీ, కుమార్తె రేష్మా, కుమారుడు మహమ్మద్ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 10 ఎకరాల్లో అరటి తోట దగ్ధం కూడేరు: ఓ రైతు తన పొలంలో చెత్తాచెదారానికి నిప్పు పెట్టడంతో ఆ మంటలు గాలికి పక్కనే ఉన్న ముగ్గురు రైతులకు చెందిన అరటి పంటకు వ్యాపించాయి. అరటి చెట్లు, డ్రిప్ పైపులు, పరికరాలు కాలి బూడిదయ్యాయి. వివరాలు.. కూడేరు మండలం కడదరకుంటలో వెంకటనాయుడు రెండున్నర ఎకరాల్లో , శ్రీలత 6 ఎకరాల్లో, నరేంద్ర ఒకటిన్నర ఎకరాల్లో అరటి తోట సాగు చేశారు. ప్రస్తుతం ఏడాదిన్నర చెట్లు. పక్క రైతు పొలంలో నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో మంటలు చెలరేగాయి. గమనించిన రైతులు వెంటనే ఫైరింజన్‌కు సమాచారమిచ్చారు. ఫైరింజన్ వచ్చే లోపు మంటలకు అరటి చెట్లు , డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.10 లక్షలు వరకూ నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. పోలీసుల అదుపులో చైన్ స్నాచర్స్ తాడిపత్రిటౌన్: పట్టణంలో రెండు రోజుల క్రితం గాంధీకట్ట వద్ద ఇద్దరు చైన్‌స్నాచర్స్ మహిళ మెడలో గొలుసులాక్కోని వెళ్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ ఇద్దరు గతం ఎక్కడెక్కడ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడారు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీఐ ఆరోహణరావును వివరణ కోరగా పూర్తీ వివరాలు త్వరలోనే వెళ్లడిస్తామన్నారు. జూనియర్ అసిస్టెంట్‌పై జేడీఏకు ఫిర్యాదు అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ జేడీఏ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రమణారెడ్డిపై అదే కార్యాలయంలో టెక్నికల్ ఏఓగా పని చేస్తున్న ఉద్యోగిని గురువారం జేడీఏ ఎన్.సాలురెడ్డికి ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై ఇన్చార్జ్ ఏడీఏ వెంకటకుమార్తో కలిసి జేడీఏ విచారించారు. రూరల్ పరిధిలోని కక్కలపల్లిలో ఉన్న ఏడీఏ కార్యాలయంలో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన రమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు జేడీఏ తెలిపారు. గత రెండు మూడేళ్లుగా ఇద్దరూ కలిసి అక్కడ పనిచేస్తున్నా ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని ఆశాఖ వర్గాలు తెలిపాయి. తాజా ఫిర్యాదుకు సంబంధించి ఉమెన్ సెల్‌కు సిఫార్సు చేసినట్లు జేడీఏ తెలిపారు. -
సిమెంట్ లారీ ఢీ కొని యువకుడి మృతి
మడకశిర: పట్టణంలోని హిందూపురం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీన్ (19) మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు... మృతుడు మడకశిర పట్టణానికి చెందిన వాడు. నవీన్ తండ్రి గోవిందరాజులు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని చిన్న కుమారుడు నవీన్ పట్టణంలోని తన ఇంటి నుంచి వ్యవసాయమార్కెట్ యార్డు వద్ద ఉన్న అంగడి వద్దకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. అయితే హిందూపురం రోడ్డులో సిమెంట్ లారీ ఢీకొనడంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన సిమెంట్ లారీని పోలీసులు మండలంలోని బుళ్లసముద్రం వద్ద స్వాధీనం చేసుకున్నారు. లారీని వదిలి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నవీన్ మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. దంపతులకు తీవ్రగాయాలు ● బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం బత్తలపల్లి: సమీప బంధువు ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని నల్లబోయనపల్లి బస్‌స్టాప్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలమేరకు.. బత్తలపల్లికి చెందిన వడ్డె మధు, శైలజ దంపతులు ఇద్దరూ సమీప బంధువు ఒకరు మృతి చెందడంతో తలుపుల మండలం ఈరయ్యగారిపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అంత్యక్రియలు అనంతరం తిరిగి బత్తలపల్లికి వస్తుండగా మార్గమధ్యంలోని మండలంలోని నల్లబోయనపల్లి బస్‌స్టాఫ్ దాటిన తరువాత వెనుక నుంచి వస్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్రకు చెందిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మధు ఐచర్ డ్రైవర్ కావడంతో ఐచర్ వాహనాల అసోసియేషన్ నాయకులు పుల్లయ్య, బగ్గిరి రామ్మోహన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. కోడి పందేల కేసులో 30 మంది అరెస్ట్ పుట్లూరు: మండలంలోని మడుగుపల్లి సమీపంలో ఈ నెల 12న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేసి 39 ద్విచక్ర వాహనాలు, మూడు పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గురువారం 30 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యబాబు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.45 వేలు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన 9 మందిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. పేకాట, మట్కా, కోడి పందెలు తదితర జూదాలను ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
కంపెనీలతో మాట్లాడతా
ఈ ఏడాది జిల్లాలో 14 వేల హెక్టార్లకు డ్రిప్పు, స్ప్రింకర్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అయితే రెండేళ్ల నుంచి కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లుల విషయం నాకు తెలియదు. నేను కొత్తగా వచ్చాను. 2024లో సగం బిల్లు వచ్చినట్లు తెలుసు. పూర్తి విషయం కనుక్కుంటాను. ఈ ఏడాది డ్రిప్పుకు రైతులు ముందుకు వస్తున్నా ఫినోలెక్స్, మెటాఫిన్, జైన్ వంటి కంపెనీలు సుముఖత చూపడం లేదు. ఆయా కంపెనీలతో మాట్లాడుతా. రైతులకు పూర్తి స్థాయిలో డ్రిప్పు అందేలా చర్యలు తీసుకుంటా. – దేవానందకుమార్, పీడీ, ఏపీఎంఐపీ -
తాగునీటి ప్రతిపాదనలను వెంటనే పంపండి
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురంలోని 63 మండలాల్లో తాగునీటి ఎద్దడి నివారణ కోసం వెంటనే ప్రతిపాదనలను పంపాలని, వాటికి మాత్రమే ఆమోదం లభిస్తుందని జిల్లా పరిషత్ సీఈఓ పి.విజయలక్ష్మి అన్నారు. నగరంలోని జెడ్పీ ప్రాంగణంలోని సమావేశ భవనంలో గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన ఎంపీడీఓల మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో మంజూరై ఇంకా ప్రారంభం కాని, ప్రాధాన్యత లేని పనులను రద్దు చేసి, వాటి స్థానంలో పూర్తి నిధులను కేవలం తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపీడీఓలందరూ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆదేశాల మేరకు కేవలం తాగునీటి పనులను మాత్రమే ప్రతిపాదించాన్నారు. ఒకవేళ ఎవరైనా గడిచిన మూడేళ్ల కాలంలో ప్రారంభం కాని సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, భవనాల నిర్మాణం పనులను రద్దు చేయకపోతే మాత్రం ఎంపీడీఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నిధులు, జెడ్పీ సాధారణ నిధుల వినియోగం, సాసా కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు, జెడ్పీ ఏఓలు, ఉమ్మడి జిల్లా ఎంపీడీఓలు హజరయ్యారు. ఎంపీడీఓలను కోరిన జెడ్పీ సీఈఓ -
మహిళా సాధికారతే లక్ష్యం
ప్రశాంతి నిలయం: ‘మహిళా సాధికారతే లక్ష్యంగా సత్యసాయి పలు కార్యక్రమాలు చేపట్టారని అందులో భాగంగానే మహిళా విద్యను ప్రోత్సహిస్తూ అనంతపురంలో ప్రత్యేకంగా సత్యసాయి మహిళా క్యాంపస్‌ను ప్రారంభించారు. ఆయన మార్గంలోనే నేడు ట్రస్ట్ సైతం చక్కటి వసతులతో నూతన వసతి గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది’ అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పేర్కొన్నారు. 1968లో అనంతపురంలో సత్యసాయి స్థాపించిన మహిళా క్యాంపస్‌లో మహిళా విద్యార్థినులకు చక్కటి వసతులు కల్పించడానికి నూతన వసతిగృహ నిర్మాణానికి ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. గురువారం రత్నాకర్ రాజు నిర్మాణ పనులను ప్రారంభించారు. 1500 మంది విద్యార్థినులకు ఆధునిక సౌకర్యాలతో వసతి కల్పించేందుకు ఈ వసతి గృహాన్ని నిర్మిస్తున్నారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రాజు మాట్లాడుతూ ప్రపంచ నలుమూలలా సత్యసాయి సంస్థల ద్వారా అందుతున్న సేవా కార్యక్రమాల్లో మహిళా మణులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ వైస్ చాన్సిలర్ డాక్టర్ పీ రాఘవేంద్రప్రసాద్ , క్యాంపస్ సిబ్బంది, సత్యసాయి భక్తులు ధనేష్ గడియా, సంజయ్ గదియా తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ -
ఘనంగా వన భోజనాలు
● రోజంతా ఊరు వదిలి గ్రామం బయటే పూజలు, భోజనాలు ● చెట్టు దేవునికి విశేష పూజలు విషవాయువు పీల్చి ఉద్యోగి మృతి భూదాన్‌పోచంపల్లి: తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని హెజిలో లేబోరేటరీస్‌లో గురువారం రియాక్టర్‌ను శుభ్రం చేస్తుండగా వెలువడిన రసాయన వాయువు పీల్చి కెమిస్ట్రీ మృతి చెందాడు. అనంతపురం జిల్లా శింగనమల మండలం ఉల్లికల్లుకు చెందిన పాలమూరు కృష్ణారెడ్డి (43) హెజిలో లేబోరేటరీస్‌లో కొంత కాలంగా కెమిస్ట్రీగా పనిచేస్తున్నాడు. గురువారం కొత్త మందుల బ్యాచ్ తయారీకిగాను రియాక్టర్‌ను శుద్ధి చేస్తుండగా అందులోంచి విడుదలైన విషవాయువు పీల్చడంతో స్పృహతప్పి కిందపడిపోయాడు. వెంటనే కృష్ణారెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రొళ్ల: మండల పరిధిలోని దొమ్మరహట్టిలో వన భోజనాల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగానే ఊరిని వదిలి .. గ్రామం వెలుపల వనభోజనాలు చేసుకున్నారు.వివరాలు.. గురువారం మండల పరిధిలోని దొమ్మరహట్టిలో నివాసం ఉన్న ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉదయాన్నే పిల్లా పాపలతో పాటు పెంచుకున్న జీవాలు, వంట సామగ్రితో సహా గ్రామం బయట తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నారు. ముందుగా ఊరి ప్రధాన రోడ్డుకు ముళ్ల కంచెను అడ్డుగా చేశారు. తర్వాత చెట్టు దేవునికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి జీవాలను బలిచ్చారు. ఏడాది ఒకసారి ఆషాఢ మాసంలో గ్రామాన్ని బహిష్కరించి చెట్టు దేవునికి పూజలు చేసి వంటకాలు చేసిన తర్వాత నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండటంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. -
‘నేనుండగా నీకేల భయం’
ప్రశాంతి నిలయం: భక్తులకు అండగా నిలిచి అభయమిచ్చిన సత్యసాయిని వర్ణిస్తూ యువత నిర్వహించిన ‘వై ఫియర్ వెన్ అయాం హియర్’ నృత్య రూపకం భక్తులను రంజింపజేసింది. పర్తి యాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన సౌతాఫ్రికా భక్తులు గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సత్యసాయి నేనున్నానంటూ ప్రపంచం నలు మూలలా ఉన్న భక్తులకు అభయమిస్తూ వారిని ముందుకు నడిపారన్న సందేశాన్ని ఇస్తూ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌కు చెందిన యూత్ బృందం సాంస్కృతిక నృత్య రూపకం నిర్వహించింది. అభాగ్యులకు అండగా నిలిచేందుకు సత్యసాయి చేపట్టిన గ్రామ సేవ, విద్య , వైద్య, సేవా కార్యక్రమాలను యువత చక్కగా వివరించారు. మానసికంగా కృంగిపోయిన ఎందరో...సత్యసాయి బోధనలతో చైతన్యవంతులై తమ జీవితాలను చక్కగా తీర్చి దిద్దుకున్న తీరును ప్రదర్శించారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. ఆకట్టుకున్న చిన్నారుల నృత్యరూపకం సత్యసాయి సేవలను వివరిస్తూ సాగిన ప్రదర్శన -
వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల్లో.. జిల్లా వాసులకు చోటు
పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి పార్టీ అనుబంధ కమిటీల్లో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పుట్టపర్తికి చెందిన ఎం. శ్రీనివాస నాయక్, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా మడకశిరకు చెందిన ఈ.జయరాం, ఫణి యాదవ్‌లను నియమించారు. జిల్లా సోషల్ మీడియా కమిటీలో... వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడిగా ధర్మవరానికి చెందిన దేవరపల్లి అశోక్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాచం శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శిగా కుణుతూరు దివాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా నగిరి రంజిత్ నాయుడు, కార్యనిర్వాహక సభ్యులుగా ముత్యాల నాగరాజు, దినేష్ కుమార్‌రెడ్డి, సీకే హరికృష్ణ, ఎం. లోకేష్ కుమార్‌ను నియమించారు. -
టీడీపీ నేత గోడౌన్‌పై విజిలెన్స్ దాడులు
పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఏ రూపంలోనైనా సరే ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతుల కడుపు కొట్టి ఓడీ చెరువుకు చెందిన టీడీపీ నేత బాలకృష్ణారెడ్డి అక్రమంగా సబ్సిడీ విత్తనకాయలను తన గోడౌన్లో నిల్వ ఉంచుకున్నాడు. విషయం తెలుసుకున్న విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గురువారం ఎస్ కొట్టాలలోని బాలకృష్ణారెడ్డి గోడౌన్లో దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉన్న 68 బస్తాలు (ఒక్కోటి 30 కేజీలు) సీజ్ చేశారు. ప్రభుత్వం రాయితీతో ఇచ్చే వేరుశనగ కాయలను స్వాహా చేసి అధిక ధరకు అమ్ముకునేందుకు గోడౌన్లో ఉంచుకోవటంపై అన్నదాతలు మండిపడుతున్నారు. సీఐ జమాల్ బాషా, ఏఓ వాసుప్రకాశ్ తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 68 బస్తాల సబ్సిడీ విత్తన వేరుశనగ సీజ్ -
సూక్ష్మం.. లేదా మోక్షం!
పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్ పంటల సాగు ఈసారి ప్రశ్నార్థకంగా మారింది. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందిన జిల్లాలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోనే రైతులు పంటల సాగు చేసేవారు. ఈ సారి ఎల్–నినో దెబ్బకు వర్షం జాడలేకుండా పోయింది. దీంతో అరకొర నీటి వనరులున్న వారంతా బిందు, తుంపర సేద్యానికి సిద్ధం కాగా, సర్కార్ మొండి చేయి చూపుతోంది. బిల్లులు బంద్..ఆగిన రిజిస్ట్రేషన్లు.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూక్ష్మ సేద్యం కింద సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేశారు. తొలి సంవత్సరం 11,988 హెక్టార్లకు, రెండో ఏడాది 14,305 హెక్టార్లు కలిపి ఇప్పటిదాకా 26,293 హెక్టార్లకు డ్రిప్పు, స్ప్రింక్లర్ పరికరాలను అందజేశారు. మొదటి ఏడాది సుమారు రూ.118 కోట్లు, రెండో ఏడాది రూ.143 కోట్ల మేర ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లించాల్సి ఉండగా... నేటికీ నయాపైసా మంజూరు చేయలేదు. బకాయిలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆయా కంపెనీల ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జైన్, ఫినోలెక్స్, మెటాఫిన్ లాంటి పెద్ద కంపెనీలు ఈ ఏడాదిలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. జిల్లాలోని 34 డ్రిప్పు కంపెనీల్లో పెద్ద కంపెనీలు ముందుకు రాకపోగా.... చిన్న చిన్న కంపెనీలు అరకొరగా రిజిస్ట్రేషన్లు ఇప్పుడిప్పుడే ప్రారంభించాయి. గతమెంతో ఘనం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుకు ఎలాంటి కష్టం కలగకుండా చూశారు. విత్తు వేసే దగ్గర నుంచి పంట విక్రయించుకునే వరకూ రైతు వేసే ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు. ఈ క్రమంలోనే తన హయాంలో వేలాది మంది రైతులకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు అందించి వేలాది ఎకరాలను సాగులోకి తెచ్చారు. వైఎస్సార్ సీపీ హయాంలో సుమారు 39,647 హెక్టార్లకు సరిపడా డ్రిప్పు, స్ప్రింక్లర్లకు సుమారు రూ.254.54 కోట్లు వెచ్చించారు. ఇందులో 10 శాతం రైతులు చెల్లిస్తే... 90 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఆదుకుంది. అలాగే జగన్ హయాంలో వరుణుడూ కరుణించడంతో సాగు పండుగలా సాగింది. రైతు 10 శాతం చెల్లిస్తే చాలు.. ఏపీఎంఐపీ ద్వారా ప్రభుత్వం రైతులకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు అందజేసేది. రైతులు ముందుగా పది శాతం వాటా చెల్లిస్తే కంపెనీలు డ్రిప్పు, స్ప్రింక్లర్ పరికరాలను రైతుల పొలాల్లో అమర్చేవారు. అనంతరం రైతు పొలంలో అమర్చిన డ్రిప్పు, స్ప్రింకర్ల ఫొటోలు యాప్‌లో అప్లోడ్ చేస్తే ప్రభుత్వం 90 శాతం మొత్తం ఆయా కంపెనీ ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఏడాది లక్ష్యం 14 వేల హెక్టార్లు.. ఈ ఏడాది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) ద్వారా 14 వేల హెక్టార్లకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు అందించాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే వీటిని సకాలంలో అందించడానికి కంపెనీలు ముందుకు వస్తాయా లేదా అనేది పెద్ద సందేహంగా మారింది. పెద్ద కంపెనీలు ముందుకు రాకపోవడంతో చిన్న కంపెనీలు వచ్చినా... నాసిరకం మెటీరియల్ అంటగడతారని రైతులు భయపడుతున్నారు. అంతేకాకుండా డ్రిప్పు పరికరాలు అందించడంలో భాగంగా డ్రిప్పు సిస్టం, ల్యాటర్, మూడు రకాల పీవీసీ పైపులు ఇస్తారు. అయితే ఈ ఏడాది నుంచి మెయిన్ లైనుకు వేసే రెండున్నర ఇంచి పీవీసీ పైపులు ఇవ్వడం మానేశారు. వీటికి ఖర్చు అధికమైందని కంపెనీ డీలర్లు వాపోతున్నారు. నాసిరకం ఇస్తే భూమిలోకి వేసిన తర్వాత పగిలి పోతే రైతులు ఇబ్బందులు పడతారని ఇవ్వడం లేదని ఓ డీలర్ చెప్పడం విశేషం. ఈ మేరకు రైతులు చెల్లించే మొత్తాన్ని తగ్గించామంటున్నారు. బిందు, తుంపర సేద్యంపై నీలి నీడలు అనావృష్టితో సూక్ష్మ సేద్యానికి సిద్ధమైన రైతులు రెండేళ్లుగా డ్రిప్పు కంపెనీలకు బిల్లులు చెల్లించని సర్కార్ సామగ్రి అందించేందుకు విముఖత చూపుతున్న కంపెనీలు ఆగిన రిజిస్ట్రేషన్లు... ఇబ్బంది పడుతున్న రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ కకావికలమైంది. కీలకమైన సమయంలో వరుణుడి జాడలేక విత్తనం కూడా పడక పొలాలన్నీ తెల్లబోయాయి. కాస్తోకూస్తో నీటి వసతి ఉన్న రైతులు సూక్ష్మ సేద్యానికి సిద్ధం కాగా, సర్కార్ తీరుతో డ్రిప్పు కంపెనీలు సామగ్రి ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
హరే కృష్ణ.. హరే హరే
హిందూపురం: ‘‘హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే’’ అంటూ భక్తులు తన్మయత్వంలో శ్రీకృష్ణుడిని కీర్తించగా పురం వీధులు కృష్ణనామంతో ప్రతిధ్వనించాయి. మేళతాళాలు.. సంకీర్తనలు..కోలాటాలు.. భజనలతో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో గురువారం హిందూపురంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. తొలుత ముదిరెడ్డిపల్లిలోని చౌడేశ్వరీ ఫంక్షన్ హాలులో శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవి విగ్రహాలకు పూజలు నిర్వహించి ప్రత్యేకంగా సిద్ధం చేసిన రథంపై కొలువుదీర్చారు. అనంతరం ఇస్కాన్ ప్రతినిధి శ్రీకృష్ణ మాధవదాస్ ప్రభు ఆధ్వర్యంలో అశేష భక్త జనం నడుమ జగన్నాథుని రథయాత్ర నిర్వహించారు. ముదిరెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన రథయాత్ర పురవీధుల గుండా భక్త జనులు ఆనందోత్సవాలతో మేళాపురం, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సర్కిల్, రైల్వేరోడ్డు మీదుగా వాసవీ ధర్మశాల ఫంక్షన్ హాలు వరకూ సాగింది. అనంతరం రథానికి పూజలు చేసిన అర్చకులు శ్రీకృష్ణ బలరామ సుభద్రదేవి ఉత్సవ మూర్తులను కల్యాణ మండపంలో కొలువుదీర్చి పూజలు చేశారు. ప్రత్యేక భజనలు, తులసీపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐలు రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. హిందూపురంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర మార్మోగిన శ్రీకృష్ణ నామం.. పరవశం చెందిన భక్తజనం -
టీబీ డ్యాంలో 25 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజలకు వరప్రదాయిని తుంగభద్ర జలాశయంలో 25.82 టీఎంసీల నీటి నిల్వ ఉంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, తీర్థనహాళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1,633 అడుగులు కాగా, గురువారం నాటికి 1,603.12 అడుగలకు నీరు చేరింది. 105.788 టీఎంసీలకు గాను 25.82 టీంఎసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ప్లో 4,814 క్యూసెక్కులుండగా 522 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోవైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,626.06 అడుగులతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉండి 40,117 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 29,607 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. రెండు ఇసుక టిప్పర్లు సీజ్ ముదిగుబ్బ: ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝుళిపించారు. సరైన పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను సీజ్ చేశారు. మండలంలోని చిత్రావతి నుంచి సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రెండు రోజుల క్రితం ‘కూటమి చెర...చిత్రవధ’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నే గురువారం మైనింగ్ శాఖ అధికారులు ముదిగుబ్బ – పుట్టపర్తి రహదారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రవాణా బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు షేక్ అమీర్‌బాషా, రాయల్టీ ఇన్స్పెక్టర్ ఖాజావలి సీజ్ చేశారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్రొళ్ల: చంద్రబాబు సర్కార్ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ నిరంకుశ పాలన సాగిస్తోంది. హామీలు అమలు చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించిన పలువురిని ఇప్పటికే జైళ్ల పాలు చేసింది. తాజాగా నియోజకవర్గంలోని ముగ్గురు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. రాజకీయాలు మాని.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ప్రశ్నిస్తూ గుడిబండ ఎస్సీ కాలనీకి చెందిన భోజన్న సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు పెట్టారు. దాన్ని రొళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన సురేష్‌తో పాటు జీజీ హట్టి గ్రామానికి చెందిన మంజునాథ్ షేర్ చేశారు. దీనిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయగా ముగ్గురినీ గురువారం అరెస్టు చేసినట్లు మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. కాగా, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప తెలిపారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం సంయుక్త కార్యదర్శి, రొళ్ల జెడ్పీటీసీ బి.అనంతరాజు కూడా అక్రమ అరెస్టును ఖండించారు. పార్టీ తరఫున వారికి అండగా ఉంటామన్నారు. అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం అర్బన్: భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్ (మేడ్ అసిస్టెంట్), అగ్నివీర్ (కాంబటెంట్) పోస్టుల నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు యువతకు సూచించారు. భారతీయ పురుషులను ఎయిర్‌మెన్ (మేడ్ అసిస్టెంట్), అగ్నీవీర్లుగా శాశ్వత కేడర్‌లో నియమించేందుకు ఐఏఎఫ్ ఎంపిక పరీక్ష నిర్వహిస్తోందని తెలిపారు. ఆసక్తి కలిగిన యువత ఈనెల 26వ తేదీ రాత్రి 11 గంటల్లోపు http://iafrecruitment.edci.co.in వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రొవిజనల్ అడ్మిట్ కార్డు పొందిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక పరీక్షకు అనుమతిస్తారన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
రమణీయం.. రథోత్సవం
పుట్టపర్తి టౌన్: సాయి జగన్నాథుని నామస్మరణతో పుట్టపర్తి ప్రతిధ్వనించింది. గురువారం సత్యసాయి భక్తులు, స్థానిక ప్రజలు పట్టణంలో సాయి జగన్నాథ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిని కీర్తి పాడిన సంకీర్తనలు, భజనలతో భక్తులు మైమరచిపోయారు. కీర్తనలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, చిన్నారుల నాట్యం నడుమ హనుమాన్ కూడలిలో ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర ఆర్టీసీ బస్టాండ్, విద్యాగిరి ఆర్చ్, గోకులం గణేష్‌కూడలి వరకు సాగింది. అంతకుముందు రథోత్సవాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే రత్నాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం సాయిభక్తులతో కలసి రథాన్ని లాగారు. అనంతరం రత్నాకర్ మాట్లాడారు. పుట్టపర్తిలో జగన్నాథ రథోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, మానవతా విలువలను ప్రతికి ఒక్కరికీ అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితోపాటు సాయిభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అగళి: మండలంలోని అగళి, ఇరిగేపల్లి వద్ద సువర్ణముఖి నదిపై వంతెన కూలిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అగళి నుంచి ఇరిగేపల్లి, నందరాజునపల్లి తదితర గ్రామలకు వైపునకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో భారీ సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కూలిపోయింది. దీంతో వంతెనపై వాహనాల రాకపోకలకు నిషేధించారు. వాహనాల రాకపోకలకు వీలుగా పక్కనే డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే వర్షాకాలంలో ఆ రోడ్డులో బురద ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. 27ఎండీకెఎస్203: ధ్వంసమైన ఇరిగేపల్లి వంతెన


