మెరుగైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలందించాలి

Feb 13 2026 5:27 AM | Updated on Feb 13 2026 5:27 AM

మెరుగైన సేవలందించాలి

మెరుగైన సేవలందించాలి

నల్లచెరువు: పౌరులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నల్లచెరువు సచివాలయం–1 వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామసభలో పాల్గొన్నారు. మండలంలో మిగులు భూములుగా క్లెయిమ్‌ చేయని వాటిపై అధికారులతో చర్చించారు. అనంతరం గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పలు కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్య ఉందని, అలాగే సీసీ రోడ్లు లేవని తెలిపారు. బస్టాండ్‌ వద్ద సరైన సౌకర్యాలు లేక మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచ్‌ పంచరత్నమ్మ కలెక్టరుకు తెలిపారు. స్పందించిన కలెక్టర్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్‌ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మింగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి, సిబ్బంది పనితీరు గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వైద్యాధికారి అలేఖ్యను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతుండటంతో వెంటనే మరమ్మతులు చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ మౌర్యా భరద్వాజ్‌, కదిరి ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, తహసీల్దార్‌ రవినాయక్‌, ఎంపీడీఓ అశోక్‌ కుమార్‌రెడ్డి, ఏఓ అశోక్‌రెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ డీటీ వెంకటరెడ్డి, డాక్టర్‌ కల్పనరెడ్డి పాల్గొన్నారు.

హక్కుదారులదరికీ న్యాయం చేస్తాం..

కదిరి టౌన్‌: రైల్వే ఓవర్‌ బ్రిడ్జి భూ సేకరణలో భాగంగా మున్సిపల్‌ పరిధిలోని కుటాగుళ్ల వద్ద లేఅవుట్‌లో స్థలం కోల్పోతున్న హక్కుదారులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ హామీ ఇచ్చారు. కుటాగుళ్ల వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కోసం భూమిని సేకరించినా తక్కువ ధర ప్రకటించారని, ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా పరిహారం పెంచాలని హక్కుదారులు గురువారం కలెక్టర్‌ను కలిసి కోరారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ప్రశాంతి నిలయం: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీహాలులో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల మౌలికసదుపాయాలన్నీ కల్పించాలన్నారు. అనంతరం రేషన్‌ పంపిణీ, పాఠశాల విద్య, మధ్యాహ్న భోజన పథకం అమలు, కాలేజీ విద్య, కాలుష్య నియంత్రణ, గృహ నిర్మాణం తదితర శాఖలపై సమీక్షించారు. ఆయా శాఖలు అందించే సేవల్లో నాణ్యత, పారదర్శకత పెరగాలన్నారు.

రెవెన్యూ గ్రామసభలో

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement