ఏఐతో వ్యాక్సిన్ రెడీ.. జీవ ఆయుధాల ముప్పు తప్పదా? | Man uses ChatGPT to develop cancer treatment for dog | Sakshi
Sakshi News home page

ఏఐతో వ్యాక్సిన్ రెడీ.. జీవ ఆయుధాల ముప్పు తప్పదా?

Apr 4 2026 9:15 AM | Updated on Apr 4 2026 9:35 AM

Man uses ChatGPT to develop cancer treatment for dog

ఆధునిక సాంకేతికత సాయంతో అసాధ్యం సుసాధ్యం అవుతుందని మరోసారి నిరూపితమైంది. సైన్స్ లేదా మెడిసిన్ నేపథ్యం లేని ఒక సామాన్యుడు కేవలం కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో శాస్త్రవేత్తగా మారి, తన పెంపుడు కుక్కను ప్రాణాపాయం నుండి కాపాడుకున్న వైనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

చాట్‌ జీపీటీతో వ్యాక్సిన్ రూపకల్పన
ఈ ఆసక్తికరమైన ఉదంతాన్ని ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ స్వయంగా ‘మోస్ట్లీ హ్యూమన్’ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి తన పెంపుడు కుక్క క్యాన్సర్‌తో బాధపడుతుంటే, దానిని రక్షించేందుకు చాట్‌ జీపీటీని ఆశ్రయించాడు. ఎటువంటి వైద్య పరిజ్ఞానం లేకపోయినా, ఏఐ టూల్ సాయంతో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సంక్లిష్టమైన ‘mRNA వ్యాక్సిన్’ను రూపొందించే విధానాన్ని అర్థం చేసుకున్నాడు.

ప్రయోగం విజయవంతం
వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన జన్యు క్రమాలను (Genetic sequences) గుర్తించడంలో చాట్‌ జీపీటీ అతనికి పూర్తిస్థాయిలో మార్గనిర్దేశం చేసింది. ఒక పెద్ద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేయాల్సిన పనిని అతను ఒంటరిగా ఏఐ సాయంతో పూర్తి చేయడం విశేషం. అనంతరం యూనివర్సిటీ పరిశోధకుల సహకారంతో ల్యాబ్‌లో ఆ వ్యాక్సిన్‌ను సిద్ధం చేసి, తన కుక్కకు చికిత్స అందించాడు. ఈ ప్రయోగం విజయవంతమై, ఆ మూగజీవి ప్రాణాలు నిలబడటంతో, ఇప్పుడు ఇదే పద్ధతిని ఇతర జంతువుల చికిత్స కోసం కూడా ఉపయోగించే మార్గాలను అతను అన్వేషిస్తున్నాడు.

అవకాశాలు.. అంతకు మించిన ఆందోళనలు
ఈ విజయం ఏఐకున్న అపారమైన సామర్థ్యాన్ని చాటిచెబుతున్నప్పటికీ, దీనివల్ల కలిగే ముప్పుల గురించి కూడా చర్చ మొదలైంది. సామాన్యులు కూడా వ్యాక్సిన్లు తయారు చేయగలిగే స్థాయికి సాంకేతికత చేరితే, ఇదే పరిజ్ఞానంతో ప్రమాదకరమైన జీవ ఆయుధాలను (Biological agents) సృష్టించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ విషయంలో భద్రతా పరమైన అంశాలపై సామ్ ఆల్ట్‌మాన్ స్పందిస్తూ.. ‘ఏఐ రెసిలియెన్స్’ (స్థితిస్థాపకత) పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేలా భద్రతా వలయాలను రూపొందించడమే కాకుండా, ఏదైనా పొరపాటు జరిగితే తక్షణమే గుర్తించి చికిత్సలు అందించేలా వ్యవస్థలను సిద్ధం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: ‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement