breaking news
Maharashtra
-
ఒకే ఫ్రేమ్‌లో మోదీ–పవార్–షా..
ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం.. సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.सुप्रिया सुळे यांची मुलगी रेवती सुळे आणि सारंग लखानी यांचा दिल्लीत रिसेप्शन सोहळा. यावेळी अमित शाह यांनी उपस्थित राहीले. रेवती आणि सारंग यांना आशिर्वाद दिले. #sharadpawar #amitshah pic.twitter.com/pSE3rg9UQL— Ramraje Shinde (@ramraje_shinde) August 10, 2026Prime Minister Modi ji attended the wedding reception of Sharad Pawar's granddaughter today. He blessed the newlyweds during the event. pic.twitter.com/0BVKo5YXZT— Avinash K S🇮🇳 (@AvinashKS14) August 10, 2026ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్న శరద్ పవార్ పార్టీ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ వివాహ వేడుకకు కొందరు కాంగ్రెస్ పెద్దలు, ఎన్సీపీ-ఎస్పీ మిత్రపక్షాల నేతలు కొందరు దూరంగా ఉండడమూ ఇందుకు మరో ప్రధాన కారణమైంది. అయితే ఇది కేవలం కుటుంబ కార్యక్రమంలో భాగమైన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం.. ఈ కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి.కొసమెరుపు: మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్ పవార్.. అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫొటోకు పోజివ్వడం కూడా చర్చకు దారితీసింది.If Sharad Pawar’s faction ever boards the NDA ship, Rohit Pawar will probably be the first passenger with his bags packed. 😂On social media, Rohit Pawar keeps claiming that he will never bow before the BJP. When it came to Delhi, he was among the first to meet PM Modi along…— Saffron Monk (@mangeshspa) August 11, 2026ఇక ఈ వివాహ వేడుకకు బీజేపీ అగ్రనేతలు హాజరు కావడం కంటే కొన్ని గంటల ముందే.. ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన లోక్‌సభ ఎంపీల బృందం ప్రధాని మోదీని కలిసింది. సుప్రియా సూలే నేతృత్వంలోని ఎనిమిది మంది ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వే ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై వినతిపత్రం అందించారు. పుణె–నాశిక్ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ఉల్లి ధరలు, చంద్రభాగా నది కాలుష్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.రాజకీయ మార్పులపై ఊహాగానాలుమోదీతో పవార్ వర్గం వరుస భేటీలు, కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై పార్టీ వైఖరి వంటి పరిణామాలు కొత్త చర్చలకు కారణమయ్యాయి. డీలిమిటేషన్ విషయంలో తమ నిర్ణయం తుది బిల్లు వచ్చిన తర్వాతే తీసుకుంటామని సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ఇండియా కూటమిలో ఉంటూనే.. ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెబుతోంది. మహారాష్ట్ర సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలపైనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేస్తోంది. గతంలోనూ శరద్ పవార్, సుప్రియా సూలేలు ప్రధాని మోదీని కలిసి విద్యార్థుల సమస్యలు, నీటి నిర్వహణ, రైతుల అంశాలపై చర్చించారు.ఒక ఫొటో.. ఎన్నో ప్రశ్నలు!ప్రస్తుతం రేవతి సూలే వివాహ రిసెప్షన్లో తీసిన ఈ చిత్రం కేవలం ఓ కుటుంబ వేడుక జ్ఞాపకమే అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో పవార్ సాన్నిహిత్యం పెరుగుతోందా? లేదంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ భేటీలా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫొటో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
పెరగనున్న గణేశ్ విగ్రహాల ధరలు
ముంబై: పెరిగిన కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇంధన ధరలతోపాటు ఈసారి గణేశ్ విగ్రహాల ధరలు కూడా ఏకంగా 20–30 శాతం పెరిగే అవకాశముండటంతో గణేశ్ భక్తులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. గణేశోత్సవాలు సమీపిస్తుండటంతో వర్క్ షాపుల్లో వినాయకుని విగ్రహాల తయారీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముఖ్మంగా రాయ్‌గడ్ జిల్లా పేణ్ తాలూకాలో తయారైన చిన్న, పెద్ద విగ్రహాలు విదేశాలకు ఏప్రిల్‌లోనే రవాణా అయ్యాయి. ప్రస్తుతం ముంబై, థానే, న్యూ ముంబై, కల్యాణ్, రాయ్‌గడ్, నాసిక్, పుణే తదితర నగరాలకు అవసరమయ్యే విగ్రహాల తయారీ పనులు జోరందుకున్నాయి. అయితే అనేక కారణాల వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వివిధ రకాల విగ్రహాల ధరలు 30 శాతం వరకు పెంచకతప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు.అదనపు ఆర్థిక భారానికి కారణాలివీ..పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (íపీఓపీ) తో తయారయ్యే విగ్రహాలకు స్వస్తి చెప్పాలని ఇదివరకే ప్రభుత్వం, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేశాయి. దీంతో వర్క్ షాపు యజమానులు బంక మట్టితో విగ్రహాలు తయారు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మట్టి ధరలు, వర్క్ షాపుల్లో పనిచేసే కార్మికులు, శిల్పకారుల వేతనాలు, విగ్రహాల తయారికి వినియోగించే ఇనుప చువ్వలు, రంగులు, షెడ్డు నిర్మాణానికి అవసరమైన వెదురు బొంగులు, ప్లాస్టిక్ పేపర్లు, వివిధ రకాల రంగులు, స్ధలం అద్దె, బీఎంసీ అనుమతి చార్జీలు కూడా పెరిగాయి.నీటి కొరతతో దెబ్బఅదేవిధంగా ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకూ ఆశించిన స్థాయి వర్షపాతం లేదు. గత నెలలో మినహా భారీ వర్షాలు మళ్లీ కురవలేదు. వర్షాలు అనుకున్నంతమేర కురవకపోవడంతో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ నీటికోత అమలులోనే ఉంది. కొని చోట్ల రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. దీంతో గణేశ్ విగ్రహాలు తయారుచేసే అనేక వర్క్‌షాపులు, షెడ్ల యజమానులు వాటర్ ట్యాంకర్లపై ఆధార పడాల్సిన పరిస్ధితి వచ్చింది.ఎండిపోయిన బంక మట్టిని విగ్రహాల తయారీకి అనుగుణంగా మెత్తగా పిసకాలంటే నీటి వినియోగం ఎక్కువ మోతాడులో అవరమైతుంది. దీన్ని అదనుగా చేసుకున్న వాటర్ ట్యాంకర్ యజమానులు చార్జీలు పెంచేశారు. ఇది కూడా విగ్రహాల తయారీదారులకు అదనపు ఆర్థిక భారంగా పరిణమించింది. ఇలా అనేక కారణాలతో విగ్రహాల ధరలను 20–30 శాతం వరకు పెంచాల్సిన పరిస్ధితి వచ్చిందని తయారీదారులంటున్నారు. ముఖ్యంగా గత నాలుగైదు నెలలుగా పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధం కారణంగా విదేశాల నుంచి దిగుమతి కావల్సిన కొన్ని ముడి సరుకులు సకాలంలో రవాణా కావడం లేదు.చదవండి: ఫడ్నవీస్ ప్రభుత్వంపై మరాఠా ఉద్యమ నేత ఫైర్ముఖ్యంగా విగ్రహాలకు అమర్చాల్సిన నకిలీ ముత్యాలు, పగడాలు, రంగురాళ్లు, కిరీటాలు, గిల్టు నగలు సమయానికి అందలేదు. సముద్ర మార్గం మీదుగా సామగ్రి రవాణాకు చాలా తక్కువగా ఖర్చవుతుంది. అదే విమానాల్లో దిగుమతి చేసుకుంటే నాలుగు రెట్లకుపైనే రవాణా చార్జీలు చెల్లించాల్సిఉంటుంది. దీంతో గత్యంతరం లేక ఎక్కువ ధర చెల్లించి విమానాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా ఖర్చులు పెరగడంతో 20–30 శాతం వరకు ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులంటున్నారు. -
వారే టార్గెట్.. ఫోన్లో 600కి పైగా వీడియోలు!
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్లు, యువకులకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకుని.. వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఫోన్లో 600కుపైగా అశ్లీల వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రైజింగ్పురాకు చెందిన చేతన్ ప్రకాశ్ కోలి (22).. 2022 నుంచి మైనర్లు, యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డబ్బులు ఇస్తానని నమ్మించి బాధితులను ఆకర్షించిన నిందితుడు.. వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా అందులో పెద్ద సంఖ్యలో అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటపడ్డాయని నందుర్బార్ ఎస్పీ అశ్విని సనప్ వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్లు తెలిపారు. వీడియోల్లో ఉన్న బాధితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం.. నిందితుడు 2022 నుంచి ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
నా ఇంట్లో మీ పెత్తనం ఏంటి?.. అభిజిత్ దీప్కే ఫైర్!
భద్రత కోసం వచ్చిన పోలీసు అధికారి తనపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అబిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. తన నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలుజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని దీప్కే నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బెదిరింపుల నేపథ్యంలో, అలాగే ఆయనను కలిసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ను అక్కడ నియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చే వారిని నియంత్రిస్తున్నారని దీప్కే ఆరోపించారు.‘ఎవరిని కలవాలో మీరు నిర్ణయిస్తారా?’వైరల్‌గా మారిన ఓ వీడియోలో.. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తూ కనిపించారు. తన ఇంటికి ఎవరు రావాలి.. ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. “నా ఇంట్లో మీ పెత్తన ఏంటి?. నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెబుతున్నప్పుడు.. వారిని ఎందుకు ఆపుతున్నారు? ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్య జరగలేదు. ఎవరిని కలవాలి.. ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పలేరు” అంటూ దీప్కే ప్రశ్నించారు.అంతేకాకుండా.. “మీరు బయటకు వెళ్లండి. నాకు మీ అవసరం లేదు” అంటూ ఆ పోలీసు అధికారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.Chhatrapati Sambhajinagar - Abhijit Dipke has made strong allegations against CID officers, accusing them of arrogant and rude behaviour towards people who come to meet him.Dipke, who flared up against the police officers, claimed that visitors arriving for meetings with him are… pic.twitter.com/5hCF6s7p8Y— NextMinute News (@nextminutenews7) August 7, 2026ఉన్నతాధికారికి ఫోన్లో ఫిర్యాదుమరో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడారు. సురేశ్ అనే పీఎస్ఐ తనను కలిసేందుకు వచ్చే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని పేర్కొన్నారు. వెంటనే అతడిని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. “నా ఇంటికి వచ్చే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కావాలనే చేస్తున్నారా?” అంటూ ఆయన ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తోంది.నిఘా ఆరోపణలుతన నివాసం సమీపంలో సీఐడీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో నిఘా పెట్టారని కూడా దీప్కే ఆరోపించారు. ఓ రిపోర్టర్ తనకు ఈ విషయం తెలిపారని చెప్పారు. ఓ సీఐడీ సిబ్బంది ఫోన్లో ‘హిట్ స్ప్రే’ పేరుతో వాట్సాప్ గ్రూప్ కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెంటనే రాలేదు. వాలుజ్ ఎంఐడీసీ పరిధి డీసీపీ పంకజ్ అతుల్కర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు. మరోవైపు.. అభిజిత్ యాటిట్యూడ్పైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన అబిజీత్ దీప్కే.. తాజాగా తన ఇంటి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. భద్రత పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించకూడదన్నది దీప్కే వాదన కాగా.. భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసులు వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
ఫడ్నవీస్ ప్రభుత్వంపై మరాఠా ఉద్యమ నేత ఫైర్
సాక్షి, ముంబై: మరాఠా రిజర్వేషన్‌కు సంబంధించిన కున్బీ కుల ధ్రువపత్రాలు, కుల ధ్రువీకరణ (వాలిడిటీ) పత్రాల రద్దు అంశం మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ (Manoj Jarange Patil) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వాటిని ఖండిస్తూ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.మనోజ్ జరాంగే మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కుళేపై తీవ్ర విమర్శలు చేశారు. కుల ధ్రువపత్రాల మంజూరులో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఒక కేసులో రూ.15 లక్షల లంచం కోరినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సంబంధిత అధికారులకు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. తనను రాజకీయంగా ఒంటరి చేసి జైలుకు పంపే కుట్ర జరుగుతోందని, అవసరమైతే రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాలను బయటపెడతానని హెచ్చరించారు.మరాఠా సమాజానికి అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని, చంద్రశేఖర్ బావన్‌కుళే ఒత్తిడితో కున్బీ ధ్రువపత్రాలను ఉద్దేశపూర్వకంగా రద్దు చేస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో మహాయుతికి గట్టి ఎదురుదెబ్బ కొడతామని హెచ్చరించారు. అవసరమైతే 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను ఓడించి చూపిస్తానని సవాల్ విసిరారు. శిందే మరాఠా సమాజం పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించిన జరాంగే.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన కంటే ఉద్ధవ్ ఠాక్రేయే మేలనుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.కమిటీ నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు: సీఎం ఫడ్నవీస్జరాంగే ఆరోపణలపై స్పందించిన సీఎం ఫడ్నవీస్.. కుల ధ్రువీకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ మంత్రి జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. కుల ధ్రువీకరణ కమిటీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. కుల ధ్రువీకరణలో అన్ని వర్గాలకు చెందిన దరఖాస్తుల్లో సాధారణంగా 10 నుంచి 25 శాతం వరకు తిరస్కరణకు గురవుతుంటాయని, బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు కూడా గతంలో ఇదే అనుభవం ఎదురైందని గుర్తుచేశారు. ధ్రుపపత్రాల తిరస్కరణపై చట్టపరంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని ఫడ్నవీస్ తెలిపారు. అవసరమైన పత్రాలు సమర్పించి మళ్లీ పరిశీలన కోరవచ్చని పునరుద్ఘాటించారు. చదవండి: ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వర్తించదు -
టీసీఎస్ నిదా ఖాన్ కేసు.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
ముంబై: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మతమార్పిడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలైన మాజీ టీసీఎస్ ఉద్యోగి నిదా ఖాన్‌కు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి మతీన్ పటేల్‌కు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గురువారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో పోలీసులు మతీన్ పటేల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం నాసిక్‌కు తరలించారు. అదే సమయంలో అధికారులు మతీన్ పటేల్ నివాసం, కార్యాలయాలపై బుల్డోజర్ చర్యలు కూడా ప్రారంభించారు. అతడి నివాసం, ఆఫీసును నేలమట్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.#WATCH | Chhatrapati Sambhaji Nagar: The Chhatrapati Sambhaji Nagar Municipal Corporation initiates the demolition of properties belonging to AIMIM Corporator Matin Patel. pic.twitter.com/JHrmuLf8ie— ANI (@ANI) May 13, 2026టీసీఎస్ కేసు ఇదే.. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్ కార్యాలయంలో పనిచేసిన నిదా ఖాన్‌పై మతమార్పిడి, మానసిక వేధింపులు, మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. ఆమె పేరు కేసులో వెలుగులోకి రావడంతో టీసీఎస్ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ కేసు 2022లో ప్రారంభమైన ఘటనతో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ తన సహోద్యోగి దానిష్ షేక్ పెళ్లి చేస్తానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, అయితే అప్పటికే అతడికి మరో మహిళతో వివాహం జరిగిన విషయం తర్వాత తెలిసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసుల దర్యాప్తులో దానిష్ షేక్ సోదరి నిదా ఖాన్ బాధితురాలిని మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు, ఆమె మతాన్ని అవమానించే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. అంతేకాకుండా బాధితురాలికి బుర్ఖా, ఇస్లామిక్ మత గ్రంథాలు అందించడం, మొబైల్ ఫోన్లో ఇస్లాం సంబంధిత యాప్‌లు ఇన్స్టాల్ చేయించడం, ఇంటికి వెళ్లి నమాజ్ చేసే విధానం నేర్పించడం, హిజాబ్ ధరించేలా ప్రోత్సహించడం వంటి ఆరోపణలను పోలీసులు తమ దర్యాప్తులో నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మహిళా ఉద్యోగులపై బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు తదితర అంశాలపై మొత్తం తొమ్మిది కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.#BREAKING 🚨 Hijaban Jihadi Nida Khan remanded in judicial custody till May 24 in TCS sexual harassment-forced conversion case. pic.twitter.com/cSe5AGv2xw— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) May 11, 2026సుమారు 25 రోజులపాటు పరారీలో ఉన్న నిదా ఖాన్‌ను ఈ ఏడాది మే 7న ఛత్రపతి సంభాజీనగర్‌లోని అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం తాను గర్భవతినని పేర్కొంటూ బెయిల్ కోరగా, ప్రసవ సమయంలో జైలులో ఉండటం ఏ మహిళకైనా తీవ్రమైన మానసిక వేదన కలిగిస్తుందని వ్యాఖ్యానించిన నాసిక్ కోర్టు గత నెల ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను టీసీఎస్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఉద్యోగులపై ఎలాంటి వేధింపులు, బలవంతం, వివక్షను సహించబోమని, సంస్థలో ఇటువంటి చర్యలపై జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉందని టీసీఎస్ స్పష్టం చేసింది. -
ఆ సినిమాకు ఆస్కార్ రావాల్సిందే! లేకుంటే..
ఓ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందే ఆస్కార్ చర్చకు దారితీసింది. ఆ సినిమా అవార్డుల బరిలో నిలవకపోతే తాను నిరాశ చెందుతానంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఆయన ఆ స్థాయిలో ఎందుకు ప్రశంసించారు? ఆ సినిమాపై ఆయనకున్న అంచనాలు ఏంటి?..ఆ సినిమా మరేదో కాదు.. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక ‘రామాయణం’. ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణం’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఆస్కార్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు.🚨BIG: Maharashtra CM Devendra Fadnavis on #Ramayana "I'll be VERY disappointed if Ramayana doesn't win an Oscar." pic.twitter.com/ylrzro3xE7— Daily Bollywood (@Bollywooz) August 6, 2026ముంబైలో ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘రామాయణం’కు ఆస్కార్ రాకపోతే అకాడమీ జ్యూరీపై తాను నిరాశ చెందుతానని అన్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ నటిస్తున్న ఈ చిత్రం “దశాబ్దపు సినిమా కాదు.. సహస్రాబ్దపు చిత్రం” అని ప్రశంసించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ చిత్రం భారతీయ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమని ఫడ్నవీస్ పేర్కొన్నారు. గతంలోనూ ‘రామాయణం’ విజువల్స్, సాంకేతిక ప్రమాణాలను ఆయన ప్రశంసించారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2026 నవంబర్ 6న దీపావళికి ముందు ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం 2027 దీపావళి సమయంలో విడుదల కానుంది.ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యంగా చిత్ర బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. మొన్నీమధ్యే అధికారికంగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. విశ్లేషణతో రకరకాల చర్చలు నడిచాయి. తాజాగా ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్‌నూ వదిలారు. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
నో మీన్స్ నో.. తెహల్కా మాజీ ఎడిటర్‌కు బిగ్ షాక్
ప్రముఖ జర్నలిస్టు, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును హైకోర్టు కొట్టివేసింది. తేజ్పాల్ను దోషిగా నిర్ధారిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. మధ్యాహ్నం శిక్ష ఖరారు కానుంది. అయితే తీర్పు అనంతరం.. కోర్టులో కాసేపు హైడ్రామా నడిచింది.2013 నవంబర్‌లో గోవాలో జరిగిన థింక్‌ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఓ హోటల్ లిఫ్ట్‌లో తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేయడంతో తేజ్పాల్పై కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది.ఈ కేసులో 2014లో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2017లో గోవాలోని మపుసా కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2021 మేలో కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్‌పై జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసందేకర్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పు వెలువడడాని కంటే ముందే తేజ్‌పాల్ కోర్టుకు వచ్చారు.బాధితురాలి ప్రవర్తనపై ముందస్తు అంచనాలు సరికాదురాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. లైంగిక దాడి బాధితురాలు ఎలా ప్రవర్తించాలనే ముందస్తు అభిప్రాయాలతో ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన వాదించారు. ప్రతి బాధితురాలి స్పందన ఒకేలా ఉండదని, వ్యక్తిగత పరిస్థితులు, సామాజిక నేపథ్యం, వ్యక్తిత్వం వంటి అంశాల ఆధారంగా మారుతుందని పేర్కొన్నారు.ట్రయల్ కోర్టు తన తీర్పులో బాధితురాలు లైంగిక దాడి అనంతరం సాధారణంగా కనిపించే ప్రవర్తనను ప్రదర్శించలేదని వ్యాఖ్యానించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తుషార్ మెహతా.. బాధితుల ప్రవర్తనను ఒకే కొలమానంతో అంచనా వేయలేమని తెలిపారు. ఇటు తేజ్‌పాల్ తరఫున సీనియర్ న్యాయవాది అబాద్ పొండా వాదనలు వినిపించారు.నో మీన్స్ నో.. అరెస్ట్‌కు డిమాండ్తేజ్పాల్ను దోషిగా నిర్ధారించిన అనంతరం ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని తుషార్ మెహతా కోర్టును కోరారు. బాధితురాలు తన కుమార్తె వయసులో ఉన్నప్పటికీ తేజ్‌పాల్ నేరానికి పాల్పడ్డారని, ఆమె నిరాకరించిన తర్వాత కూడా ముందుకు వెళ్లారని వాదించారు. “ఒక మహిళ ‘నో’ అంటే దాని అర్థం నోనే అని సమాజానికి స్పష్టమైన సందేశం వెళ్లాలి” అని తుషార్ మెహతా కోర్టులో పేర్కొన్నారు.మరోవైపు, తీర్పు అనంతరం తరుణ్ తేజ్‌పాల్ శిక్షలో ఉపశమనం ఇవ్వాలని కోరారు. “నాకు 62 ఏళ్లు. నేను కూడా బాధితుడిననే నమ్ముతున్నాను. నాకు భార్య ఉంది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తాను. దయచేసి నా విషయంలో కొంత సానుభూతి చూపించండి” అని కోర్టును అభ్యర్థించారు.తెహల్కా-తరుణ్ తేజ్‌పాల్ నేపథ్యంతెహల్కా భారత జర్నలిజం చరిత్రలో సంచలనాత్మక దర్యాప్తు కథనాలకు పేరుగాంచిన ప్రముఖ వార్తా మ్యాగజైన్. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ.. స్టింగ్ ఆపరేషన్లు, అవినీతి బహిర్గతాలు, రాజకీయ–కార్పొరేట్ వ్యవహారాలపై పరిశోధనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తెహల్కా వ్యవస్థాపకుల్లో తరుణ్ తేజ్‌పాల్ ఒకరు. జర్నలిస్టుగా, రచయితగా ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. 1990లలో జర్నలిజంలోకి వచ్చిన తేజ్‌పాల్.. పలు ప్రముఖ ప్రచురణ సంస్థల్లో పనిచేసిన అనంతరం 2000లో తెహల్కా డాట్‌కామ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత దానిని వార్తా మ్యాగజైన్‌గా తీర్చిదిద్దారు.తెహల్కా నిర్వహించిన కొన్ని స్టింగ్ ఆపరేషన్లు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా 2001లో వెలుగులోకి వచ్చిన “ఆపరేషన్ వెస్ట్ ఎండ్” రక్షణ రంగంలో అవినీతి ఆరోపణలపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కథనాలతో తెహల్కా పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే తర్వాతి కాలంలో తేజ్‌పాల్ వ్యక్తిగత జీవితం, సంస్థకు సంబంధించిన వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా 2013 లైంగిక దాడి కేసులో హైకోర్టు తీర్పుతో ఆయన పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
ఉధృతమవుతున్న ఉద్యమం
రాంచీ/ఛత్రపతి శంభాజీనగర్: జార్ఖండ్ పోటీ పరీక్షల్లో అక్రమాలకు చరమగీతం పాడి పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తేవాలన్న డిమాండ్‌తో గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారులకు మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. బుధవారం రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగార్థులు, ఉద్యమకారులకు మద్దతుగా పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. మరో ఐదుగురు ఉద్యమకారులు మంగళవారం రాత్రి నిరాహార దీక్షకు కూర్చున్నారు. ‘‘ఉద్యమానికి నైతిక బలాన్నిస్తూ ఇద్దరు మహిళలు సహా ఐదుగురు కొత్తగా దీక్షలో భాగస్వాములయ్యారు. డిమాండ్లను నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు’’అని జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(జేఎస్ఎస్సీ) సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి జీవన్ కుమార్ ప్రకటించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టినందుకే నిరాహార దీక్షలో కూర్చున్నానని నాయకురాలు సబితా కుమారి తెలిపారు. బుధవారం ఉద్యమకారుల దీక్షాస్థలిలో జాతీయజెండాలతో ‘తిరంగా యాత్ర’కార్యక్రమం చేపట్టారు. ‘జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ రిఫార్మ్ ్స మంచ్’పేరుతో ఉద్యోగార్థులు జూలై 25వ తేదీన ఈ నిరసనను మొదలెట్టిన విషయం తెల్సిందే. చర్చలకు ఆహ్వానించిన సర్కార్ చర్చలకు సిద్ధమని హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాంచీ సబ్ డివిజనల్ ఆఫీసర్ కుమార్ రజత్, అదనపు జిల్లా మేజి్రస్టేట్(శాంతిభద్రతలు) ధనంజయ్ కుమార్‌లు దీక్షా స్థలికి వచ్చారు. సీఎం అధికార నివాసంలో చర్చలకు రావాలని ఐదుగురు ఉద్యమనేతలను అధికారులు ఆహ్వానించారు. కనీసం నీరైనా తాగండి: వాంగ్‌చుక్ లద్దాఖ్ సామాజిక వేత్త, ఇటీవల జంతర్‌మంతర్‌లో రోజులతరబడి నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్‌చుక్ బుధవారం రాంచీలో దీక్ష చేస్తున్న వారిని విజ్ఞప్తిచేశారు. దీక్షచేస్తున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా(జేఎల్కేఎం) నేత దేవేంద్రనాథ్ మహతోతో వాంగ్‌చుక్ బుధవారం మాట్లాడారు. ‘‘మీ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ స్థాయిలు పడిపోతున్నాయి. ఆరోగ్యం విషమించకుండా ఉండాలంటే కనీసం నీళ్లు అయినా తాగండి. అప్పుడు ఎక్కువ రోజులు నిరాహార దీక్ష సాధ్యం’’అని సూచించారు. వాంగ్‌చుక్ విజ్ఞప్తిమేరకు మహతో తర్వాత కొద్దిగా నీళ్లు తాగారు. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దుచేయాలని, జేఎస్ఎస్సీలో సంస్కరణలు తేవాలని, గత పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్ జడ్జీల నేతృత్వంలో స్వతంత్య్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్చేస్తున్నారు. అంతటా పేపర్ లీకేజీలు: సీఎం చర్చలకు సిద్ధమని సీఎం సోరెన్ ప్రకటించారు. ఉద్యమంపై ఆయన ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘‘యువత లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తాం. పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ మా రాష్ట్రానికే పరిమితంకాలేదు. ఇది దేశవ్యాప్తంగా యువతకు సమస్యగా తయారైంది. రాత్రిపగలు రాష్ట్రంలో దర్యాప్తు కొనసాగుతోంది. నేరస్తులను జైలుకు పంపిస్తాం. దర్యాప్తుతో మేం ఆగిపోం. యువత సమస్యలకు పరిష్కారం చూపిస్తాం’’అని సోరెన్ అన్నారు.జవాబుదారీగా ఉండాల్సిందే: దీప్కే ఉద్యమిస్తున్న వందలాది మంది విద్యార్థులకు తమ సహాయసహకారాలు, తోడ్పాటు ఎప్పుడూ ఉంటాయని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చీఫ్ అభిజీత్ దీప్కే స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పట్టణంలో సీజేపీ కీలక భేటీకి ముందు దీప్కే మీడియాతో మాట్లాడారు. ‘‘జార్ఖండ్‌లో పోటీపరీక్షల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేదాకా మేం ఊరుకోం. జవాబుదారీగా ఉంటామని ప్రకటించేదాకా ఒత్తిడిచేస్తూనే ఉంటాం. మేం జార్ఖండ్‌కు వెళ్తాం. ఆ విద్యార్తుల ప్రతి డిమాండ్ సాధనకు కలిసి పోరాడతాం’’అని దీప్కే ప్రకటించారు. -
అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం
ఊహాగానాలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తెర దించింది. ఆ పార్టీ భవిష్యత్‌పై వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీగా మారే ఆలోచన తమకు లేదని.. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ‘ప్రెజర్ గ్రూప్’గానే పనిచేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరుగుతున్న రెండు రోజుల వ్యూహ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.30 ఏళ్ల అభిజిత్ దీప్కే కేవలం రెండు నెలల క్రితమే వ్యంగ్య రూపంలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. తొలుత సోషల్ మీడియా వేదికగా సరదా ఉద్యమంలా కనిపించిన ఈ సంస్థ.. ఆ తర్వాత పరీక్షల అక్రమాలు, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన విద్యార్థి ఆందోళనలకు దీప్కే నాయకత్వం వహించారు. ఆ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.‘పార్టీ పెట్టే ఆలోచన లేదు’తమ భవిష్యత్ ప్రణాళికలపై దీప్కే మాట్లాడుతూ.. “రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. మీడియాకే ఆ అంశంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. మేము ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తాం” అని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలు, పరీక్షల నిర్వహణలో అక్రమాల వంటి అంశాలపై పోరాడడమే తమ లక్ష్యమని చెప్పారు.దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికCJP ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు దీప్కే తెలిపారు. యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ‘లిజనింగ్ టూర్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. “దేశంలోని ఏ ప్రాంతంలో విద్యార్థులు సమస్యలపై పోరాడినా.. వారికి అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం జార్ఖండ్‌లో జేపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే అక్కడికి వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పారు. జంతర్ మంతర్ ఆందోళన సమయంలో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తమ ఉద్యమానికి మార్గదర్శకుడిగా ఉన్నారని దీప్కే పేర్కొన్నారు. జార్ఖండ్ విద్యార్థి నేతలతో వాంగ్‌చుక్ ఇప్పటికే మాట్లాడి సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే.(అయితే ఈ మీటింగ్ జరుగుతున్న వేళ.. ఇవాళ అక్కడి ఆందోళలను విరమించడం గమనార్హం)యువత ఉద్యమానికి కొత్త దిశ?సీజేపీ వ్యూహ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, దాదాపు 50 మంది కీలక వాలంటీర్లు పాల్గొన్నారు. యువత సమస్యలను ఒక వేదికపైకి తీసుకురావడం, వాటిపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని వారు తెలిపారు. “యువత ఒక్కటైతే ఏదైనా సాధించగలరని ఈ ఉద్యమం నిరూపించింది” అని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు.కేవలం వ్యంగ్య వేదికగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు యువత సమస్యలపై జాతీయ స్థాయి ఉద్యమ వేదికగా మారే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్నికల రాజకీయాల్లోకి కాకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే శక్తిగా కొనసాగాలని అభిజిత్ దీప్కే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. -
E20 వివాదంలో గడ్కరీకి భారీ ఊరట
E20 పెట్రోల్ వివాదం నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టులో కీలక ఊరట లభించింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) విధానంతో అనుసంధానిస్తూ సోషల్ మీడియాలో ఆయనపై, కుటుంబ సభ్యులపై జరుగుతున్న ప్రచారానికి బుధవారం కోర్టు బ్రేకులు వేసింది. ఈ కంటెంట్‌ను “అసహ్యకరమైనది, దూషణాత్మకమైనది”గా అభివర్ణించిన ధర్మాసనం.. తక్షణమే తొలగించాలని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) అంశం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్, ఇంజిన్ పనితీరుపై ప్రభావం ఉంటుందా? పాత వాహనాలకు ఇది అనుకూలమా? అనే అంశాలపై వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో గడ్కరీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు, వీడియోలు ప్రచారం చేశారు. కేవలం తన కుటుంబ(కొడుకుల) వ్యాపారాలు బాగుండడం కోసమే ఆయన ఆ విధానం తెరపైకి తెచ్చారని జోరుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంపై గడ్కరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. E20 విధానం తన శాఖ పరిధిలోది కాదని, ఇది పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యక్రమమని స్పష్టం చేశారు. తన కుటుంబం చెరుకు పరిశ్రమలో ఏనాటి నుంచో ఉందని.. అయితే ఇథనాల్ పెట్రోల్ విధానం వల్ల తనకు గానీ, తన కుటుంబానికి గానీ పెద్దగా లాభం లేదని వివరణ ఇచ్చారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా గడ్కరీ తరఫు న్యాయవాదులు.. E20 విధానంపై విమర్శల పేరుతో మంత్రిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు.. మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు ఇతర మధ్యవర్తి సంస్థలకు ఆ పోస్టులు, వీడియోలను తొలగించాలని ఇవాళ ఆదేశించింది.ఇదిలా ఉంటే.. E20 విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల దేశ ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని, రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతోంది. మైలేజ్‌పై కొంత ప్రభావం ఉండొచ్చని అంగీకరిస్తూనే.. ఇంజిన్లకు నష్టం జరుగుతుందనే వాదనలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.గతంలో లోక్‌సభలో గడ్కరీ మాట్లాడుతూ.. వాహనం రకం, తయారీ సంవత్సరం ఆధారంగా మైలేజ్‌లో 2 నుంచి 6 శాతం వరకు మార్పు ఉండొచ్చని తెలిపారు. E20 అమలు శాస్త్రీయంగా, దశలవారీగా జరిగిందని పేర్కొన్నారు.మరోవైపు E20పై సుప్రీంకోర్టులోనూ చర్చ జరిగిన నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం E20ను కేవలం “ప్రయోగం”గా పేర్కొన్నట్లు వచ్చిన ప్రచారాన్ని న్యాయశాఖ ఖండించింది. మొత్తంగా E20 విధానంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా గడ్కరీ చేసిన న్యాయపోరాటంలో బాంబే హైకోర్టు ఆదేశాలు కీలక పరిణామంగా మారాయి. -
అనలాగ్ పనీర్ బ్యాన్.. తయారు చేసినా, అమ్మినా జైలు శిక్ష..
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ, కల్తీ పాల ఉత్పత్తులపై కఠిన చర్యలకు దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. అనలాగ్ లేదా నాన్-డెయిరీ పనీర్ (పాలు కాకుండా ఇతర పదార్థాలతో తయారు చేసే పనీర్) తయారీ, విక్రయం, పంపిణీపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారామ్ ముండే జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా అనలాగ్ పనీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, హోల్‌సేల్, రిటైల్ విక్రయాలు, పంపిణీ, అమ్మకానికి ఉంచడం వంటి అన్ని కార్యకలాపాలను నిషేధించారు. కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను అడ్డుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. దేశంలో ఇలాంటి నిషేధం విధించిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇంతకుముందు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా అనలాగ్ పనీర్‌పై నిషేధం విధించింది.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నేర తీవ్రత ఆధారంగా చర్యలు తీసుకుంటారు. అనలాగ్ పనీర్‌ను అసలు డెయిరీ పనీర్గా చూపించి విక్రయిస్తే వినియోగదారులను మోసం చేసినట్లుగా పరిగణిస్తామని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) హెచ్చరించింది. అనలాగ్ పనీర్ సాధారణంగా పాలు నుంచి కాకుండా.. కూరగాయల కొవ్వులు, నూనెలు, ఇతర నాన్-డెయిరీ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. చూడటానికి సంప్రదాయ పనీర్లానే కనిపించినప్పటికీ, దానిని అసలు పాలతో తయారు చేసిన పనీర్గా విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం (FSSAI).. అసలు పనీర్ పాలు ఆధారంగానే తయారు కావాలి. అందులో స్టార్చ్, నాన్-డెయిరీ కొవ్వులు లేదా సింథటిక్ పదార్థాలు కలపకూడదు. అయితే అనలాగ్ పనీర్‌ను విక్రయించడానికి FSSAI కొన్ని నిబంధనలతో అనుమతి ఇస్తుంది. అది అనలాగ్ ఉత్పత్తి అని స్పష్టంగా లేబుల్‌పై పేర్కొనాల్సి ఉంటుంది. అయితే మార్కెట్లో కొందరు వ్యాపారులు తక్కువ ఖర్చుతో తయారయ్యే అనలాగ్ పనీర్‌ను అసలు పాల పనీర్గా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.1,400 కిలోల నకిలీ పనీర్గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. అనలాగ్ పనీర్‌ను పూర్తిగా నిషేధించాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తాజాగా జూలై 30న జారీ చేసిన ఉత్తర్వులతో ఆ డిమాండ్‌కు అధికారిక రూపం వచ్చింది. కల్తీ పాల ఉత్పత్తులపై మహారాష్ట్రలో ఇప్పటికే విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. మే నెల నుంచి సింథటిక్ పాలు, నకిలీ పనీర్ తయారీ యూనిట్లపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. పుణేలోని మంజరి ఖుర్ద్ ప్రాంతంలో నిర్వహించిన ఓ భారీ దాడిలో అధికారులు సుమారు 1,400 కిలోల నకిలీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు లభించే ప్రత్యామ్నాయ పదార్థాలతో ఈ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.అదే సమయంలో భారీగా ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 1,800 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్, 400 కిలోల గ్లిసరాల్ మోనోస్టియరేట్ (GMS) పౌడర్, 718 లీటర్ల పామ్ ఆయిల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు కొన్ని లైసెన్సులు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ పనీర్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయం.. వినియోగదారుల ఆరోగ్య రక్షణలో కీలక అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. -
మనుషుల్ని ఇలా ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది?
ముంబైలోని కేల్కర్ కళాశాలలో జరిగిన ఓ సాధారణ పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విద్యార్థులు చేసుకున్న ఈ వేడుక తమ సహ విద్యార్థి పుట్టినరోజుకి సంబంధించింది కాదు. కాంటీన్లో పని చేసే ఉద్యోగికి పుట్టినరోజు వేడుక నిర్వహించి విద్యార్థులు ఆశ్చర్యపరిచారు. ఆ విద్యార్థులకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. దయ చూపాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదని, చిన్న మంచి పని చేసినా చాలని చాలామంది కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన పూర్వ విద్యార్థులు కూడా కళాశాల కాంటీన్తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అజింక్య భుజ్‌బల్ అనే యూజర్ షేర్ చేశారు. "ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచి వస్తాను" అని పేర్కొన్నారు.వీడియోలో కేల్కర్ కళాశాల విద్యార్థులు కాంటీన్ భయ్యా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ "హ్యాపీ బర్త్‌డే" పాట పాడారు. ఊహించని ఈ వేడుక చూసి ఆయన ఆప్యాయంగా చిరునవ్వు చిందించారు. విద్యార్థుల ప్రేమాభిమానాలకు ఆయన భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.వీడియోలో... "మా కాంటీన్ భయ్యా పుట్టినరోజు జరిపాం. #స్ప్రెడ్ లవ్ ఎఫ్టీ కేల్కరైట్స్" అని రాసి ఉంది. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో విద్యార్థుల ఆలోచనను చాలామంది ప్రశంసించారు. "అందరి ప్రేమను పొందిన వ్యక్తి.. అజాత శత్రువు" అని ఓ యూజర్ పేర్కొన్నారు. "భీమ్రాజ్ ఎంత ముద్దుగా ఉన్నాడు" అని మరో వ్యక్తి అనన్నారు. "ఈ కాంటీన్తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి" అని ఇంకొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Ajinkya Bhujbal (@bhujbal_ajinkya18) -
ఉద్యమ స్ఫూర్తి కోసం ఎటో చూడక్కరలేదు
ఛత్రపతి శంభాజీనగర్: విద్యార్థి లోకం ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన స్ఫూర్తి కోసం బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగుదేశాల వైపు చూడాల్సిన అగత్యంలేదని, మనకు మహాత్మాగాంధీ ఉన్నారని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. సోమవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పీటీఐకి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో దీప్కే పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి కణికలు దేశ నలుచెరుగులా ఎగసిపడుతుండగా మళ్లీ ఉద్యమస్ఫూర్తి కోసం విదేశాల వైపు చూడాల్సిన అగత్యం మన యువతరానికి పట్టలేదు. వాస్తవానికి బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన ఉద్యమాలకు భారత ప్రతిష్టను దిగజార్చేందుకు జరిగిన ప్రయత్నాలు. అక్కడ ఉద్యమాలు హింసాత్మక బాటలో కొనసాగాయి. కానీ భారత్‌లో మనం ప్రత్యేకం. రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాం. మన విద్యార్థుల విదేశీయుల మాదిరి అనవసరంగా ఉద్రేకాలకు లోనుకారు. సంయమంతో డిమాండ్ల సాధన కోసం పోరాడతారు. జంతర్ మంతర్‌లో ఎంతో మంది విద్యార్థులు, సీజేపీ కార్యకర్తల తలలు పగలాయి. కాళ్లు, చేతులు విరిగాయి. అయినాసరే సంయమనం కోల్పోకుండా మొక్కవోని దీక్షతో నీట్ ఉదంతం సహా పరీక్షల వ్యవస్థ, విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం శాంతియుతంగా పోరాడారు’’అని అన్నారు. విద్య ప్రధాన అజెండాగా మారాలి ‘‘దేశంలో ప్రతి ఎన్నికల్లోనూ కులం, మతం, ప్రాంతం వంటివి ప్రధానాంశాలుగా మారే సంస్కృతికి చరమగీతం పాడుదాం. ఎన్నికల్లో విద్య అనేది ప్రధాన అజెండాగా మారాలి. విద్యకు ఎన్నికల్లో ప్రధాన అజెండా హోదా దక్కకపోతే భవిష్యత్ గురించి ఆలోచన పెట్టుకోవడం వృథా. దేశ భవిష్యత్తకు విద్య అనేదే అసలైన పెట్టుబడి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీతో మనస్తాపం చెంది ప్రాణాలుతీసుకున్న బాధితుల కుటుంబాలకు హామీ ప్రకారం అందజేస్తామన్న నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు మంజూరుచేయకపోవడం దారుణం. రాత్రికిరాత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వందల అధికార పారీ్టల వద్ద కోట్లకొలదీ డబ్బు ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనేందుకు వందల కోట్ల నగదును సిద్ధంగా ఉంచుకుంటారు. తీరా నీట్ ఉదంతంలో బాధిత విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలంటే మాత్రం రూపాయి కూడా బయటకు తీయరు. ఇకనైనా బాధితులకు వీలైనంత త్వరగా నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్లీ ఉద్యమబాటలో పయనిస్తాం’’అని దీప్కే స్పష్టంచేశారు. బీజేపీ నేతల స్థాయి మాకు చేతకాదు‘‘బీజేపీ నేతలు పార్లమెంట్లో, సభలు, సమావేశాల్లో ఇష్టమొచి్చనట్లు మాట్లాడతారు. అంతటి తెలివితేటలు, స్థాయి మా జెన్ జీ తరానికి లేవు. అది మాకు చేతకాదు. గూండాలకు, విద్యార్థులకు చాలా తేడా ఉంది. ఆ తేడా ఎప్పుడూ ఉంటుంది’’అని బీజేపీపై వెటకారంగా మాట్లాడారు. జార్ఖండ్‌లో పోరుకు మా మద్దతు ‘‘జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో తీవ్రస్థాయిలో అవకతవకలు జరిగాయి. న్యాయం కోసం జార్ఖండ్‌లో పరీక్షార్థులు ఉద్యమిస్తున్నారు. వాళ్లకు మా సీజేపీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. పబ్లిక్ సరీ్వస్ పరీక్షలతోపాటు ఇతర నియామక పరీక్షల్లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందే. నియామక ఏజెన్సీల్లో సంస్కరణలు తేవాలి. జార్ఖండ్‌లో పరీక్షార్థుల ఉద్యమం ఏ రాజకీయ పారీ్టతో సంబంధంలేదు. లోపభూయిష్ట పరీక్ష వ్యవస్థమీదనే వాళ్లు పోరాడుతున్నారు. వాళ్ల డిమాండ్లకు మేం మద్దతిస్తున్నాం. విద్యావ్యవస్థ బాగు కోసం ఏ రాష్ట్రంలో ఉద్యమం ఆరంభమైనా సీజేపీ తన వంతు మద్దతు తెలుపుతుంది. అక్కడ ఏ పార్టీ అధికారంతో ఉంది అనేది మాకు సంబంధం లేదు’’అని దీప్కే స్పష్టంచేశారు. అక్కడ అద్భుతమైన వసతులు‘‘విద్యా వ్యవస్థ మౌలిక వసతుల దగ్గరికొచ్చేసరికి విదేశాల్లో అద్భుతమైన వనరులు, వసతులు ఉంటాయి. భారత్‌లో ఆ స్థాయిలో పరిస్థితులు లేనేలేవు. ఎంతో నేర్చుకుందామనుకుంటే అంతలా అక్కడి మౌలిక వసతులు విదేశీ విద్యార్థులను దోహదపడతాయి. మౌలికవసతుల రూపంలో విద్యార్థులకు ఎంతో తోడ్పాటుఅందుతుంది. భారత్‌లో ఇంకా పరిస్థితులు గ్రేడ్లు ఇవ్వడానికి పరిమితమయ్యాయి. నేను అమెరికా విద్యనభ్యసించేటప్పుడు ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్య, సిలబస్ ఉంది. భారత్‌లోనూ అలాగే ప్రాక్టికల్ అభ్యసన విధానం ఉంటే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత మోదీ సర్కార్ విద్యకు తక్కువ నిధులు కేటాయిస్తోంది. విద్యకు కేటాయింపులను కేంద్రప్రభుత్వం ఎందుకు తగ్గిస్తోందో అర్థంకావట్లేదు. కేటాయింపులు ఎంతగా పెరిగితే దేశ పునాదులు అంత పటిష్టంగా మారతాయి’’అని దీప్కే అన్నారు. ఆ నిధిని ఉపయోగించుకోవాలి ‘‘పీఎం కేర్స్ ఫండ్‌లో ఎంత నగదు ఉందో ఎవరికీ తెలీదు. వేల కోట్ల నగదు నిల్వలు మూలుగుతుంటే మాత్రం వాటిలో కొంత మేర విద్యాభివృద్ధికి తప్పకుండా కేటాయించాలి. నాణ్యమైన విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం సామాన్యుడికి అది అందని ద్రాక్ష అయింది’’అని దీప్కే ఆవేదన వ్యక్తంచేశారు. అది కీలక భేటీయే.. ‘‘రేపు(5న) ఛత్రపతి శంభాజీనగర్‌లో జరగబోయే సీజేపీ భేటీ కీలకమైంది. తాజా ఉద్యమం విజయవంతం కావడంతో మాపై బాధ్యత పెరిగింది. సీజేపీ దేశవ్యాప్తంగా ఎదిగి విద్యార్థుల కోసం పోరాడాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే సీజేపీని విస్తరించాలని భావిస్తున్నాం. ఆగస్ట్ ఐదునాటి భేటీలో మా తదుపరి కార్యాచరణను ఖరారుచేయాలని యోచిస్తున్నాం. మా ఇంట్లో సీజేపీ కీలక 10 లేదా 15 మంది సభ్యులతో పలు అంశాలపై చర్చించనున్నాం’’అని దీప్కే వెల్లడించారు. -
3 పిల్లలతో కారు ముందుకు పులి.. చూస్తే ఊపిరి ఆగినంత పని..
ముంబై: అడవి సఫారీకి వెళ్లిన ఒక కుటుంబానికి తిరిగి వస్తున్న సమయంలో జీవితాంతం మర్చిపోలేని ఓ దృశ్యం కనపడింది. మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో ఒక ఆడపులి తన మూడు చిన్న పిల్లలతో రోడ్డు దాటుతూ కనిపించింది. ఈ అరుదైన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ అంకుశ్ జిజిల్వార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జులై 15 సాయంత్రం తన కుటుంబం పద్మాపూర్ గేట్ నుంచి తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో సఫారీ కోసం ప్రవేశించిందని ఆయన తెలిపారు. అంకుశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు మొహర్లీ గ్రామం దగ్గరకు చేరుకున్నప్పుడు రోడ్డు పక్కన కొన్ని వాహనాలు నిలిపి ఉండటం చూశారు. మొదట పులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ సాయంత్రం 7.03 గంటలకు అకస్మాత్తుగా ఎత్తైన గడ్డి మధ్య నుంచి ఆడపులి ‘ఛోటీ మధు’ బయటకు వచ్చింది.కొన్ని సెకన్ల తర్వాత గడ్డి మధ్య నుంచి ఒక్కొక్కటిగా దాని మూడు పిల్లలు కూడా బయటకు వచ్చాయి. వీడియోలో ఆడపులి ఎంతో ప్రశాంతంగా తన పిల్లలను రోడ్డు దాటిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న వారంతా మంత్రముగ్ధులయ్యారు.ఈ సమయంలో ఒక బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా ఆడపులి వైపు వెళ్లడం ప్రారంభించాడు. అంకుశ్ వెంటనే తన కారు హెడ్‌లైట్‌ను వెలిగించి అతడిని అప్రమత్తం చేశారు. బైకర్ సమయానికి ఆగి సురక్షితంగా పులికి దూరం పాటించాడు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు.అంకుశ్ స్పందిస్తూ.. అడవి వాతావరణంలో ఇంత దగ్గరగా ఆడపులిని తన మూడు పిల్లలతో చూడటం తమ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవాల్లో ఒకటని తెలిపారు. ఇలాంటి క్షణాలు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తాయని చెప్పారు. Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి Ankush Jizilwar | Chandrapur Today (@ankushjizilwar) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
జెన్‌జీ టెన్షన్?.. CJI కార్యక్రమం వాయిదా!
విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టమైన కాన్వొకేషన్ వేడుక. అలాంటి వేడుకకు దేశ ప్రధాన న్యాయమూర్తి హాజరు కావడంపై వాళ్లు ఒకింత ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యారు. తల్లిదండ్రుల కోసం టికెట్లు.. హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేసుకుని కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలోనే అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడడంతో వందలాది మంది నిరాశకు లోనయ్యారు.మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) తన 86వ కాన్వొకేషన్ వేడుకను ఆకస్మికంగా వాయిదా వేసింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆగస్టు 2న జరగాల్సిన ఈ వేడుకను “అనుకోని పరిస్థితులు” కారణంగా వాయిదా వేస్తున్నట్లు TISS రిజిస్ట్రార్ విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక భద్రతా కారణాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.కాక్రోచ్ నిరసనల భయమేనా?TISS అధికారికంగా కారణాలను వెల్లడించకపోయినా.. క్యాంపస్‌లో భద్రతాపరమైన ఆందోళనలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమానికి సంబంధించిన నిరసనలు కాన్వొకేషన్ సమయంలో చోటుచేసుకునే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతో అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు ప్రముఖులు పాల్గొనే కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వేడుకను వాయిదా వేసినట్లు సమాచారం.CJIతో పాటు పలువురు ప్రముఖులు.. ఈ కాన్వొకేషన్‌కు జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అలాగే బాంబే హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దేశంలోని ప్రముఖ న్యాయవ్యవస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే కార్యక్రమం కావడంతో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాన్వొకేషన్ వాయిదాకు నిరసనలే కారణమని TISS అధికారికంగా ప్రకటించలేదు. భద్రతా పరిస్థితులు, అనుకోని పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే సంస్థ వెల్లడించింది.టికెట్లు బుక్.. చివరికి వాయిదాకాన్వొకేషన్ కోసం విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు విమాన టికెట్లు, మరికొందరు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. హోటల్ గదులు కూడా రిజర్వ్ చేసుకున్నారు. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడటంతో ప్రయాణ ఖర్చులు, వసతి కోసం చేసిన ఖర్చులు వృథా అయ్యాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారన్న ఆందోళన కూడా నెలకొంది.ఆర్థిక నష్టంపై పరిశీలనవిద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించిన TISS.. ఆర్థిక నష్టంపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని తెలిపింది. అవసరమైన వారికి తాత్కాలిక ధ్రువపత్రాలు అందిస్తామని, కొత్త కాన్వొకేషన్ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.బొద్దింకల వ్యాఖ్యలతోనే..అప్పట్లో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశిస్తూ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారని ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే.. కాక్రోచ్ జనతా పార్టీని మహారాష్ట్రకే చెందిన అభిజిత్ దీప్కే ప్రారంభించాడు. అది.. నీట్ నిరసన ఉద్యమంతో ఎంత పని చేసిందో అందరికీ తెలిసిందే. అయితే.. తాను యువతను ఉద్దేశించి అలా అనలేదని, నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లనే అన్నానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తరచూ వివరణ ఇస్తూ వస్తున్నారు. మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ మొన్నీమధ్యే ఆవేదన వ్యక్తం చేశారు. అంతెందుకు.. జంతర్ మంతర్ నిరసనల పిటిషన్‌ను కూడా ఆయన బెంచే ఇప్పుడు విచారణ జరుపుతుండడం గమనార్హం. ఈ తరుణంలో.. CJI హాజరు కావాల్సిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అలాంటి నిరసనలు జరుగుతాయనే అనుమానంతో చివరి నిమిషంలో వాయిదా పడటం కొత్త చర్చకు దారితీసింది. -
చెట్టు మీద భర్త.. వరదలో కొట్టుకుపోయిన భార్యాపిల్లలు
క్షణాల్లో వచ్చిన వరద ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా.. తండ్రి చెట్టును పట్టుకుని బయటపడగలిగాడు. కానీ.. అందులో ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం అతడి కళ్ల ముందే ప్రవాహంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. యవత్మాల్ జిల్లాలో వరద ఉధృతికి ఓ ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా.. తండ్రి మాత్రం సమయస్ఫూర్తితో చెట్టును పట్టుకుని బయటపడ్డాడు. అయితే తన కళ్ల ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి వెళ్తున్న అవినాశ్ ఖండారే కుటుంబం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. అవినాశ్ తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ.. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయడంలో పొరపాటు జరగడంతో వాహనం ముందుకు కదిలింది. వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి ఉధృతమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.కారు కొట్టుకుపోతున్న సమయంలో అవినాశ్ ఖండారే అప్రమత్తమై సమీపంలోని ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే కారులో ఉన్న భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలను మాత్రం రక్షించలేకపోయాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా.. ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గగా.. స్థానికులు చెట్టు మీద ఉన్న అవినాశ్‌ను గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం వరదలో కొట్టుకుపోయిన వాహనాన్ని గుర్తించారు. కారుతో పాటు మాధవి, కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
గాల్లోనే మాయమవుతోన్న నాలుగో వంతు వర్షం!
భారతదేశంలో కురిసే నైరుతి రుతుపవనాల వర్షంలో దాదాపు 25 శాతం (నాలుగో వంతు) వర్షపు నీరు అసలు నేలను తాకకముందే గాలిలోనే ఆవిరైపోతోందని పుణేలోని ఐఐటీఎం (ఇండియన్ ఇన్‌నిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ) శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. వర్షపు చుక్కలు గాల్లోనే ఆవిరైపోయే పరిమాణాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యక్ష పరిశీలనల ద్వారా కచ్చితంగా అంచనా వేయడం ఇదే మొదటిసారి. (IITM Pune Study)దశాబ్ద కాలపు పరిశోధన.. ఎలా గుర్తించారు? జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే రుతుపవనాలపై శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా పరిశోధనలు చేశారు. డేటా విశ్లేషణ: పదేళ్లుగా సేకరించిన వర్షపాతం, వాతావరణంలోని ఐసోటోప్ డేటాను క్షుణ్ణంగా విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ ముగింపునకు వచ్చారు.ప్రాంతాన్ని బట్టి మారుతున్న ఆవిరి శాతం ఈ వర్షపు నీటి ఆవిరీకరణ (Evaporation) దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను బట్టి ఇది మారుతూ ఉంటుంది: పశ్చిమ కనుమలు: ఇక్కడ తేమ ఎక్కువగా ఉండటం వల్ల కేవలం 4 నుంచి 6 శాతం వర్షం మాత్రమే గాల్లో ఆవిరవుతుంది.వాయవ్య భారతదేశం: రాజస్తాన్ వంటి పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో ఇది గరిష్టంగా 40 శాతం వరకు ఉంటోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? వర్షపు చినుకులు మేఘాల నుంచి పడుతున్న సమయంలో.. వాటి చుట్టూ ఉండే వేడి, పొడి గాలి కారణంగా కొంత నీరు నేలను తాకకుండానే గాలిలోకి ఆవిరి రూపంలో కలిసిపోతుంది. ముఖ్యంగా పరిమాణంలో చిన్నవిగా ఉండే చినుకులు ఇలా ఎక్కువగా ఆవిరైపోతుంటాయి.ఈ పరిశోధన వల్ల ఉపయోగం ఏంటి? ఈ సరికొత్త ఆవిష్కరణ వాతావరణ శాస్త్రంలో చాలా కీలకం కానుంది. కచ్చితమైన అంచనాలు: రుతుపవనాల గమనాన్ని, వర్ష సూచనలను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది.విపత్తుల నిర్వహణ: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా... దేశంలో వచ్చే వరదలు, కరువు పరిస్థితులను ముందే ఊహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ పరిశోధన శాస్త్రవేత్తలకు ఎంతో తోడ్పడుతుంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
స్పోర్ట్స్ బైక్‌తో ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లి..
ముంబై: గురు పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ మహిళను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. స్పోర్ట్స్ బైక్‌తో ఆమెను ఢీకొట్టిన యువకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సోమవారం రాత్రి ముంబైలోని మహిమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మహిమ్ కాజ్‌వేకు చెందిన మంగళ అశోక్ టాండెల్ (46) సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గురు పౌర్ణమి సందర్భంగా సోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్లో ఉన్న శ్రీ స్వామి సమర్థ మఠం దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణానికి సంబంధించిన సామాన్లు సర్దుకుని, బంధువులు సిద్ధమయ్యారా అని తెలుసుకోవడానికి ఆమె లేడీ జంషెడ్జీ రోడ్డును దాటుతుండగా ప్రమాదం జరిగింది.బాంద్రా వైపు అత్యంత వేగంగా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ బైక్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో మంగళను బైక్ దాదాపు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అనంతరం ఆమెను వెంటనే రాహేజా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగి కాగా, వారికి సలోనీ (22), సానియా (20) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు.ఇదే ప్రమాదంలో బైక్ నడుపుతున్న ధ్రువ్ గురవ్ (21) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మహిమ్ ఫిషర్మెన్ కాలనీకి చెందిన అతడిని భాభా ఆస్పత్రికి తరలించగా, చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.పోలీసుల సమాచారం ప్రకారం, ధ్రువ్ తన తల్లిని బాంద్రా నుంచి ఇంటికి తీసుకురావడానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతని తల్లిదండ్రులు గతంలో వివిధ ఆర్కెస్ట్రా బృందాలతో గాయకులుగా పనిచేసేవారని, ప్రస్తుతం వివిధ కార్యక్రమాల్లో పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు.ధ్రువ్, అతని అన్న ఇద్దరికీ స్పోర్ట్స్ బైక్‌లపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని, వారి కుటుంబం వద్ద ఒకటి కంటే ఎక్కువ స్పోర్ట్స్ బైక్‌లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ధ్రువ్ గతంలో కూడా ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు.ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణం కావడం), సెక్షన్ 281 (బహిరంగ రహదారిపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం)తో పాటు మోటారు వాహనాల చట్టంలోని ఇతర నిబంధనల కింద మృతుడైన ధ్రువ్ గురవ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా వైరలైన ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు..
ముంబై: ఇటీవల జరిగిన జెన్-జీ ప్రొటెస్ట్‌లో ముంబైలో ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని నిరసనకు ప్రతీకగా నిలిచిన మోడల్ రియా అహిర్ ఇప్పుడు తనపై ఆన్లైన్ వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్న ఘటన తర్వాతి నుంచి బెదిరింపులు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నానంటూ ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని, తన పోస్టులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై విద్వేష ప్రచారం సాగుతోందని, ఇందులో పరువునష్టం, బెదిరింపులు, మహిళలపై ద్వేషపూరిత దూషణలు, డీప్‌ఫేక్ వీడియోలు ఉన్నాయని కూడా ఆరోపించారు.వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. పరువునష్టం కలిగించే పోస్టుల స్క్రీన్షాట్లు, యూఆర్ఎల్లు, ఇతర ఆధారాలను కూడా సమర్పించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.జూలై 22న ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ సమీపంలో రియా అహిర్ పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులను ఆ వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు.బూడిద రంగు హూడీ ధరించి, పోలీసు వ్యాన్ బానెట్‌పై చేయి ఉంచి ధైర్యంగా నిలబడ్డ ఆమె దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో తాను సహజసిద్ధంగా స్పందించానని రియా అహిర్ చెప్పారు."పోలీసులు తప్పు చేస్తున్నారని నాకు తెలుసు కాబట్టే నేను అలా చేయగలిగాను. మీ హక్కుల గురించి మీకు తెలుసుండాలి" అని తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనది సహజ స్పందన మాత్రమేనని, కానీ ప్రజలు దాన్ని అసాధారణ ఘటనగా చూడటం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. -
పెరిగిన ఎయిడ్స్ మరణాలు
ముంబై: ప్రాణాంతక హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిని నిర్ములించేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వ్యాధి పీడితులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన నాలుగేళ్లలో ఎయిడ్స్‌తో మృతిచెందినవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గత రెండేళ్లలో వేయికిపైగా రోగులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.ఆ నివేదిక ప్రకారం కేవలం ముంబైలోనే 2022–23లో 958 మంది మృతి చెందగా, 2023–24లో 986 మంది, 2024–25లో 1,148 మంది, 2025–26లో 1,068 మంది మరణించారు. 2022–23తో పోలిస్తే 2025–26లో ఎయిడ్స్‌తో మృతి చెందిన రోగుల శాతం 19.83గా నమోదైంది. హెచ్ఐవీ, ఎయిడ్స్ మృతుల సంఖ్యను నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అవగాహనా, ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేసింది. అయినా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) వెల్లడించింది.అందరి సహకారంతోనే నియంత్రణ సాధ్యం: డా. విజయ్ కరంజ్కర్ఒకప్పుడు హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధి సోకిందంటే రోగులు ప్రాణాల మీద ఆశ వదులుకునే వారు. ఇక తాము కొద్ది రోజులు మాత్రమే జీవిస్తామనే ధోరణితో బతుకీడుస్తుండేవారు. కానీ ఇప్పుడు అనేక కొత్త కొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. జీవితాంతం మందులు వాడితే ప్రాణాలు నిలబడతాయి. ఇలాంటి రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు అనేక సేవా, స్వయం సేవా సంస్ధలు కృషిచేస్తున్నాయి. ఏఆర్టీ కేంద్రం అందులో ఒకటి. ఈ కేంద్రం ఎయిడ్స్ రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంటుంది. కానీ అనేక నెలలుగా రోగులు పరీక్షలు చేయించుకునేందుకుగాని, మందులు తీసుకునేందుకుగాని ఈ కేంద్రానికి రాలేదు. దీంతో వీరంతా ఎక్కడున్నారు..? ఏమయ్యారు.ఫాలో అప్‌కు ఎందుకు రావడం లేదన్న సందేహంతో గత రెండేళ్లుగా అంటే 2024, 2025 నుంచి ముంబై ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఆధ్వర్యంలో ‘లాస్ట్ టూ ఫాలో అప్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈమేరకు ఫోన్ ద్వారా రోగులు లేదా వారి బంధువులతో సంప్రదించడం, స్వయంగా ఇళ్లకు వెళ్లి వారినుంచి వివరాలను సేకరించడంతో రోగుల్లో అనేకమంది మరణించారని, వీరి వివరాలు ఏఆర్టీ కేంద్రంలో నమోదు కాలేదని తెలిసింది.చదవండి: ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు ఇలా రెండేళ్లలో మృతిచెందిన వారిగురించి తెలిసిందని ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు సంచాలకుడు డా.విజయ్ కరంజ్కర్ తెలిపారు. ఉచితంగా పరీక్షలు, మందులు పంపిణీ చేసినప్పటికీ హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు కేంద్రానికి రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని కరంజ్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సహకారం ఉంటేనే ఎయిడ్స్ నియంత్రణలోకి వస్తుందని అన్నారు. -
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ గురించి గత కొన్నాళ్లుగా నడుస్తున్న రచ్చ(చర్చ) సంగతి తెలిసిందే. అయితే నీట్ వ్యవహారంతో ఇన్నాళ్లు ఈ అంశం కాస్త పక్కకు జరిగిపోయింది. అయితే.. ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్(E20) విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని.. ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. E20 పెట్రోల్ విధానం కేవలం స్వార్థపూరితంగా ఆయన తెచ్చారని.. దాని వల్ల ఆయనకు, తన కుటుంబానికి లాభాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. తప్పుడు పోస్టులు, డీప్‌ఫేక్ కంటెంట్‌పై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.వీటిని పరువు నష్టం కలిగించే ప్రచారంగా పేర్కొన్న గడ్కరీ.. సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ విధానం వల్ల తనకు పైసా లాభం లేదని.. తమ కుటుంబం నిర్వహిస్తున్న చెరకు వ్యాపారంతో లాభాలు కూడా పెద్దగా రావని అందులో వివరించారు.సమగ్ర కథనం: ఇథనాల్ అంశం.. నా వాటా ఎంతంటే..: గడ్కరీబాంబే హైకోర్టును ఆశ్రయించిన గడ్కరీగడ్కరీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన బాంబే హైకోర్టు.. కేసు దాఖలుకు అనుమతి ఇచ్చింది. తనపై ప్రచారం జరుగుతున్న కంటెంట్ ముంబైలోనూ అందుబాటులో ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై నాగ్‌పూర్‌లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ20 ఇథనాల్ విధానానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత.. గడ్కరీనే టార్గెట్?ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. తదుపరి టార్గెట్ నితిన్ గడ్కరీనే అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ20 ఇంధనంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం, వాహనదారుల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే గడ్కరీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇటు కేంద్రం కూడా ఇథనాల్ పెట్రోల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేవని అంటోంది కూడా.అసలు ఈ20పై వివాదం ఏంటి?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ20 ఇంధనం అంటే.. 80 శాతం పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్‌ను కలిపిన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు మాత్రం పాత వాహనాలపై ఈ20 ప్రభావం, మైలేజీ తగ్గుదల వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.కోర్టు బాట పట్టిన గడ్కరీతనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు గడ్కరీ తీసుకున్న న్యాయపరమైన చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ20పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తప్పుడు ప్రచారాలపై చట్టపరంగా ఎదుర్కొంటాననే సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లు కనిపిస్తోంది. -
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి.. బిహార్‌లో దొరికాడు
గత కొంతకాలంగా పరారీలో ఉన్న మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు బిజేంద్ర గుప్తా ఎట్టకేలకు మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. బీహార్‌లో అదుపులో తీసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడు బీహార్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గుప్తా భార్యతో పాటు మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుప్తా మాత్రం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం పరారీలో ఉండటంతో మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలించారు. పేపర్ లీక్ రాకెట్‌తో బిజేంద్ర గుప్తా భార్యకు కూడా సంబంధం ఉందని.. సిండికేట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఈమె సమక్షంలోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, పాట్నాలలో ఆస్తుల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్నారు.బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా అనేక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులతో బిజేంద్ర గుప్తాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.జూన్ 28న జరగాల్సిన మహారాష్ట్ర టెట్ పరీక్షకు ముందు థానేలోని కొంగావ్ ప్రాంతంలో లీకైన ప్రశ్నపత్రాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఆకాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధీరజ్ సింగ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను వాయిదా వేసింది. ఆరు లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు బిజేంద్ర గుప్తాను ట్రాన్సిట్ రిమాండ్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్‌కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్‌గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్‌ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్‌తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్‌తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్‌లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్‌లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్‌తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్‌లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్‌లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్‌ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్‌ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్‌ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్‌తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్‌లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్‌ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిణామాలు వే గంగా మారిపోతున్నాయి. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లోని రెండు వర్గా లు ఒక్కటైపోయి, ఎన్డీయేలో చేరుతాయన్న ఊహాగానాలు నిజమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. మోదీతో భేటీ అనంతరం శరద్ పవార్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నీట్–యూజీ పేపర్‌పై విద్యార్థులు డిమాండ్లు, రైతుల సమస్యలు, వాటర్ మేనేజ్మెంట్, విద్యా రంగం సమస్యలపై తాము చర్చించినట్లు తెలిపారు. ఎన్సీపీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గానికి శరద్ పవార్, మరో వర్గానికి ఆయన కోడలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ నేతృత్వం వహిస్తున్నారు. సునేత్ర పవార్ పార్టీ ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతోంది. శరద్ పవార్ పార్టీ విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి. రెండు పార్టీలు విలీనమై, ఎన్డీయేలో చేరుతాయన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఈ మెజార్టీ కోసం ఎన్డీయే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్సీపీలోని వర్గాలను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్‌గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్‌ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్‌ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్‌లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్‌గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్‌ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్‌ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్‌లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
మాజీ ప్రియురాలి కాబోయే భర్తకు ఫోన్ చేసి..
"వైషు కథ ముగిసిపోయింది’’ అంటూ తన మాజీ ప్రియురాలు వైష్ణవిని దారుణంగా పొడిచి చంపిన తర్వాత.. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సాహిల్ లవ్హారే అనే యువకుడు ఫోన్ చేసి చెప్పిన మాటలివి. ఈ ఘోరం జరిగిన కొద్ది గంటలకే.. ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టుకు నిందితుడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఉన్మాద ప్రేమికుడి దారుణ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో వెలుగుచూసింది. తన మాజీ ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే కోపంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.నాసిక్‌లోని ఇందిరానగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో సాహిల్, వైష్ణవి కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య సుమారు 30 నిమిషాల పాటు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సాహిల్.. వైష్ణవిపై పదే పదే కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వైష్ణవిని హత్య చేసిన తర్వాత సాహిల్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు.ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. హత్య జరగడానికి కొన్ని నిమిషాల ముందు వైష్ణవికి కాబోయే భర్తతో సాహిల్ ఫోన్ మాట్లాడటం.. సాహిల్ ఇక్కడే ఉన్నాడు.. త్వరగా రా’ అంటూ వైష్ణవి ఫోన్లో తన కాబోయే భర్తకు చెప్పింది. ఆ మాట వినగానే ఆమె కాబోయే భర్త తన పనిని వదిలేసి వెంటనే ఆమె ఉన్న లొకేషన్‌కు బయలుదేరాడు. అయితే, అతను ఫోన్ కట్ చేయకుండా అలాగే లైన్లో ఉంచాడు. దాదాపు 22 నిమిషాల పాటు సాహిల్, వైష్ణవిల మధ్య జరిగిన గొడవను అతను ఫోన్లో వింటూనే ఉన్నాడు. కానీ అతను అక్కడికి చేరుకునే లోపే.. ‘ఆమెను చంపేశాను’ అని సాహిల్ చెప్పాడు. మృతురాలు వైష్ణవి అమరావతి జిల్లా, నిందితుడు సాహిల్ యావత్మాల్ ఉమర్‌ఖేడ్‌కు చెందినవారు. -
షిండే శివసేనలో ‘ఉద్ధవ్’ ఎంపీల విలీనం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన(ఉద్ధవ్)కు చెందిన ఆరుగురు ఎంపీలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో విలీనం చేయడానికి అంగీకారం తెలియజేశారు. అలాగే నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో చేరిన 20 మంది తిరుగుబాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎంపీలకు సభలో ప్రత్యేక సీటింగ్ కేటాయించడానికి ఆమోదం తెలిపారు. ఆరుగురు ఎంపీలు విలీనం కావడంతో షిండే నాయకత్వంలోని శివసేన బలం ఏడు నుంచి 13కు పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు తమ మాతృపార్టీకి సంబంధం లేకుండా సభలో ప్రత్యేకంగా ఆసీనులవుతారని వెల్లడించాయి. తమను నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో అంతర్భాగంగా గుర్తించాలన్న టీఎంసీ రెబల్ ఎంపీల వినతిపై స్పీకర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు. తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్), టీఎంసీ నాయకత్వం విజ్ఞప్తి చేయగా, స్పీకర్ దానిపై స్పందించలేదు. తాజా సమీకరణాలతో స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న తాజా నిర్ణయంలో లోక్‌సభలో అధికార ఎన్డీయే బలం మరింత పెరుగనుంది. సభలో ప్రస్తుతం 540 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభలో ప్రస్తుతం ఎన్డీయే బలం 318 కాగా>, విపక్ష ఇండియా కూటమిలో 181 మంది ఎంపీలు ఉన్నారు. 41 మంది ఇతర పార్టీలకు చెందినవారు. -
సీసీటీవీ, సీట్ బెల్టులు, జీపీఎస్..
ముంబై: విద్యార్థుల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం స్కూలు బస్సులకు కఠిన నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కూలు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, సీట్ బెల్టులు, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను తప్పని సరి చేసింది. స్కూలు బస్సులు, వ్యానులు, విద్యా సంస్థల బస్సుల కనీస చార్జీలను సైతం తామే నిర్ణయిస్తామని తెలిపింది. 2011 నాటి నిబంధనలను మారు స్తూ మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ (రెగ్యులే షన్ ఫర్ స్కూల్ బస్సెస్) (మొదటి సవరణ) నిబంధనలు–2026ను ఈ నెల 16వ తేదీన నోటిఫై చేసింది. కిలోమీటర్‌కు చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేసే చార్జీల బేస్ రుసుమును ఆర్టీఏలు ఖరారు చేస్తాయని తెలిపింది. గతంలో ఇలాంటి నిబంధనేదీ లేక పోవడం గమనార్హం. నెలవారీ లేదా మూడు నెలలకు గాను ప్రాంతీయ రవాణాధికారి నిర్ణయించే రుసుముకు 10 శాతానికి తక్కువ కాకుండా, 10 శాతానికి మించకుండా వసూలు చేయవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. నిబంధనల అమలు, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఫిర్యాదుల పరిష్కారం అంశాలపై స్కూల్ ట్రాన్స్పోర్ట్ కమిటీ పరిశీలన జరిపి జిల్లా స్కూల్ బస్ సేఫ్టీ కమిటీలకు మూడు నెలలకోసారి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా, కొత్తగా జీపీఎస్ లైవ్ ట్రాకింగ్, పానిక్ బటన్, సీసీటీవీ నిఘా, డిజిటల్ అటెండెన్స్, ఆటోమేటిక్ అలెర్టులు తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉంచటం తప్పనిసరి చేసింది. సీసీటీవీ ఫుటేజీని కనీసం 30 రోజులపాటు భద్రపర్చాలి. మొబైల్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాలని నోటిఫికేషన్లో సూచించింది. బస్సులోని అన్ని సీట్లకు బెల్టులను అమర్చేలా నవీకరించాలని కోరింది. బస్సుల్లో అగ్ని ప్రమాదం పై అలారమ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం తప్పనిసరని తెలిపింది. ఐదో తరగతి వరకు విద్యార్థుల కోసం బస్సుల్లో మహిళా అటెండెంట్‌ను నియమించడం, అవకరాలు కలిగిన చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి చేసింది. -
కార్పొరేటర్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు.. మళ్లీ జైలుకి!
ముంబై: వైద్యులు, ఇతర సిబ్బందిపై శివసేన( (ఏకనాథ్ షిండే వర్గం) ) కార్పొరేటర్ రమేష్ మహాత్రే జరిపిన దాడిని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కార్పొరేటర్ రమేష్ మహత్రే బెయిల్‌ను రద్దు చేసింది. అదే సమయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది బాంబే హైకోర్టు.జూలై 6వ తేదీన డోంబివిలిలోని మున్సిపల్ శాస్త్రి నగర్ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు, నర్సులపై కార్పొరేటర్ రమేష్ మహాత్రే, అతని అనుచరులు తీవ్రంగా దాడి చేశారు. దిగువ కోర్టు తీర్పు: ఈ కేసులో అరెస్టయిన రమేష్ మహాత్రేకు జూలై 14న కల్యాణ్ లోని స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. వారి బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. రమేష్ మహాత్రేపై గతంలో హత్య, హత్యాయత్నం వంటి సుమారు 18 నేరారోపణ కేసులు ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. వాటిలో 17 కేసులలో అతను నిర్దోషిగా విడుదలైనప్పటికీ, బెయిల్ ఇచ్చేటప్పుడు అతని నేర చరిత్ర తీవ్రతను మేజిస్ట్రేట్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ క్రమంలోనే వారి బెయిల్‌ను రద్దు చేసి తిరిగి పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది. ప్రభుత్వ, మున్సిపల్ ఆసుపత్రుల వైద్యులపై ఇలాంటి దాడులు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రమేష్ మహాత్రే నిర్ణీత సమయంలోగా లొంగిపోకపోయినా, పరారైనా ఆయన స్థిరాస్తులను జప్తు చేయడంతో పాటు చట్టపరమైన తదుపరి చర్యలకు తీసుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ ఘటనకు నిరసనగా జూలై 22 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన వైద్యులను ఆ సమ్మెను విరమించుకోవాలని కోరింది హైకోర్టు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ సమ్మెను విరమించుకోవాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. కాగా, వైద్యులపై దాడికి సంబంధించి జూలై 8వ తేదీన అరెస్టైన సదరు కార్పొరేటర్.. జూలై 14వ తేదీన బెయిల్‌పై బయటకొచ్చాడు. దీన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 22వ తేదీన మహారాష్ట్ర అంతటా ఆస్పత్రుల్లో 24 గంటల షట్‌డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో అత్యవసర సేవా విభాగాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది. -
లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కలకలం.. వీడియో వైరల్
ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కలకలం సృష్టించింది. ముగ్గురు మహిళలపై దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్‌లోని 'శేత్ ఐరీన్' టవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.లిఫ్ట్‌లో అప్పటికే ముగ్గురు యువతులు ఉండగా.. ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లోపలికి ప్రవేశించింది. లిఫ్ట్ తలుపులు మూసుకున్న కొద్దిసేపటికే.. ఆ కుక్క మూతికి మాస్క్ ఉన్నప్పటికీ.. ఒకస్కారిగా దూసుకెళ్తూ.. వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కుక్క ఒక్కసారిగా దాడికి దిగడంతో యజమాని కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఆ కుక్క యువతులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే యువతులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, మరో యువతి మాత్రం లోపలే చిక్కుకుపోయింది. ఆమెపైకి కుక్క మరింత అగ్రెసివ్‌గా దూసుకెళ్లింది.CCTV from Mumbai Malad West lift: Pet dog suddenly lunges aggressively at 3 young girls. Owner struggles to restrain it on leash as kids panic. No serious injuries, but sparks debate on pet control in shared spaces. pic.twitter.com/wvzhIwAM0y— Ghar Ke Kalesh (@gharkekalesh) July 17, 2026చివరకు లిఫ్ట్ నిర్దేశిత ఫ్లోర్‌కు చేరుకోగానే ఆ యువతి కూడా వేగంగా బయటకు వచ్చి తప్పించుకుంది. ఈ ఘటనపై మలాడ్ పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో బాలికలకు ఎలాంటి గాయాలు కాలేదని.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. సదరు నివాసికి తన పెంపుడు జంతువును లిఫ్ట్‌లో తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. అయితే, ఈ సీసీటీవీ వీడియో బయటకు రావడంతో అపార్ట్మెంట్ వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
అభిజిత్ దీప్కేకు రాజ్ ఠాక్రే వారసుడి మద్దతు
న్యూఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరాహారదీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించడంపై పౌర సమాజం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరదాలు అడ్డుపెట్టి ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంతానికి పోకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాంగ్‌చుక్ దీక్షను అడ్డుకున్నా ఉద్యమం ఆగబోదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. తాను నిరాహారదీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. సీజేపీ పోరాటానికి పలు పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నారు.మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు అమిత్ ఠాక్రే శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ చేరుకుని సీజేపీ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. నిరాహారదీక్ష చేపట్టిన అభిజిత్ దీప్కేను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్‌చుక్ పట్ల పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఇలాంటి అణచివేత చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. విద్యార్థుల కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించడం సరైంది కాదని అన్నారు. ప్రజలంతా సీజేపీ పోరాటానికి మద్దతు తెలపాలని ఆయన కోరారు.ప్రభుత్వం బాధ్యత వహించదా?నీట్ అవకతవకలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. "నీట్ పరీక్షల్లో అవకతవకల కారణంగా దేశంలో 20 మందికి పైగా యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ పరిస్థితికి ప్రభుత్వం బాధ్యత వహించదా? దేశంలో జవాబుదారీతనం లేదు. ఇలాంటి సమయంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాంట్లు వస్తున్నాయి. కచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందేనని అమిత్ ఠాక్రే అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని సీజేపీతో చర్చలు జరపాలని సూచించారు.చదవండి: ఆమిర్‌ఖాన్‌కు ఆదిత్య ఠాక్రే కౌంటర్ రాజ్ ఠాక్రే వారసుడుమహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రే కుమారుడే అమిత్ ఠాక్రే. ఎమ్మెన్నెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. 2020లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 34 ఏళ్ల అమిత్ ఠాక్రే.. ఎమ్మెన్నెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ముంబైలోని మహిం నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో మిథాలి బొరుడేను ఆయన వివాహం చేసుకున్నారు. తాజాగా సీజేపీ ఉద్యమానికి మద్దతు తెలిపి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. MNS leader @amitrthackeray met Abhijeet Dipke today to extend his support to the protest, conveying solidarity on behalf of MNS chief @RajThackeray He expressed deep anguish over the Delhi Police’s actions against Sonam Wangchuk Sir this morning. pic.twitter.com/Y6jWF1AuLq— Cockroach is Back (@Cockroachisback) July 18, 2026 -
ఆమిర్‌ఖాన్‌కు ఆదిత్య ఠాక్రే కౌంటర్
ముంబై: పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్పై బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ఘాటుగా స్పందించారు. సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా త్రీ ఇడియట్స్ సినిమాలో తాను పోషించిన పాత్రకు రూపకల్పన చేశారన్న ప్రచారాన్ని ఆమిర్‌ఖాన్ ఖండించారు. అసలు తమ సినిమాకు, వాంగ్చుక్కు సంబంధం లేదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఆమిర్‌ఖాన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యలపై తాజాగా ఆదిత్య ఠాక్రే స్పందించారు. విద్యార్థుల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి నిరాహారదీక్ష చేస్తున్న వారికి మద్దతు తెలపడం కనీస బాధ్యత అని అన్నారు. ''మీరు ప్రముఖులైనా కాకపోయినా.. దేశంలో యువత, విద్యార్థుల కోసం ఎవరైనా నిరాహార దీక్ష చేస్తుంటే, వారు ఎందుకు దీక్ష చేస్తున్నారు, ప్రభుత్వం వారి మాట ఎందుకు వినడం లేదని అడగడం మన బాధ్యత''ని ఆదిత్య ఠాక్రే అన్నారు. కాగా, సోనమ్ వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.వాంగ్చుక్కు హృతిక్ రోషన్ మద్దతువిద్యార్థుల కోసం నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్చుక్కు బాలీవుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్ సంఘీభావం ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో వాంగ్‌చుక్ వీడియో షేర్ చేసి, తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ''ఇది నిజమే అనిపిస్తోంది. నా సినిమాల్లో ఒకదాంట్లో ఉపాధ్యాయుడి పాత్ర పోషించినప్పుడు, విద్యార్థులు ఎదుర్కొనే మానసిక వేదన గురించి నేను తెలుసుకున్నాను'' అని కామెంట్ పెట్టాడు. వాంగ్చుక్కు మద్దతు తెలిపిన హృతిక్ రోషన్‌ను 'వెన్నెముక కలిగిన స్టార్' అని అభిమానులు కొనియాడుతున్నారు.బాలీవుడ్ ప్రముఖుల మద్దతుసోనమ్ వాంగ్చుక్కు ఇప్పటికే పలువురు నటీనటులు సంఘీభావం తెలిపారు. జీనత్ అమన్, కిరణ్‌రావు, అదితిరావు హైదరీ, ఫతిమా సనా షేక్, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ ఖాన్, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, ఓమి వైద్య, అతుల్ కులకర్ణి, షాయాజీ షిండే తదితరులు సోనమ్ వాంగ్చుక్కు మద్దతు ప్రకటించారు. బాలీవుడ్ అగ్రహీరోలైన ఖాన్ త్రయం మాత్రం స్పందించలేదు.చదవండి: కూతురి వీడియోను ప్రధానికి ట్యాగ్ చేసిన శత్రుఘ్న సిన్హా -
అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్ గేమ్!
మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తెర వెనుక కదలికలు మొదలయ్యాయా? కొంతకాలంగా దూరంగా ఉన్న రాజకీయ శిబిరాల మధ్య పెరుగుతున్న రాకపోకలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతలు అధికార కూటమి పెద్దలను కలుస్తుండటం.. కీలక నాయకుల మధ్య జరుగుతున్న భేటీలు.. భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న పవార్ కుటుంబం చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ నుంచి ముంబై వరకు హాట్‌టాపిక్‌గా మారాయి.ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో శరద్ పవార్ వర్గానికి చెందిన నేతల భేటీలు, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సమావేశాలు అధికారికంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసమేనని నేతలు చెబుతున్నప్పటికీ.. తెర వెనుక రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్చంద్ర పవార్) ఎన్డీఏ వైపు అడుగులు వేయబోతోందా? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ పరిణామాల వెనుక బీజేపీ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందన్న చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.బీజేపీ వ్యూహం ప్రకారం.. ముందుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వర్గాలను మళ్లీ దగ్గర చేయడం, ఆ తర్వాతే ఎన్డీఏతో సంబంధాలపై ముందుకు వెళ్లడం లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే కేవలం శరద్ పవార్ వర్గాన్ని కూటమిలోకి తీసుకోవడం కాకుండా.. మొత్తం ఎన్సీపీని ఒకే రాజకీయ శక్తిగా మార్చి ఎన్డీఏలోకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం.2023 జూలైలో అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది. శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) పేరుతో కొనసాగుతోంది.ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ వర్గం అధికారంలో భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు శరద్ పవార్ వర్గం ప్రతిపక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు దగ్గరవడం జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.బీజేపీ వ్యూహంలో మూడు దశలు?రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీజేపీ వ్యూహం మూడు దశల్లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మొదట పవార్ వర్గాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేయడం, రెండో దశలో ఎన్సీపీ పునరేకీకరణ, మూడో దశలో ఎన్డీఏతో అధికారిక అనుబంధం వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శరద్ పవార్ వర్గాన్ని నేరుగా ఎన్డీఏలోకి తీసుకోవడంపై బీజేపీలో కొంత సంకోచం ఉందని సమాచారం. ముందుగా పార్టీ అంతర్గత విభేదాలు పరిష్కారమైతేనే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.బీజేపీకి అసలు లాభం ఏంటి?ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీకి ఉన్న ప్రధాన రాజకీయ లాభం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో శరద్ పవార్‌కు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ ప్రభావం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న పట్టు బీజేపీకి కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీకి అధికార బలం ఉన్నప్పటికీ.. మరాఠా రాజకీయాల్లో పవార్ కుటుంబ ప్రభావాన్ని పూర్తిగా పక్కన పెట్టడం అంత సులువు కాదు. శరద్ పవార్ వర్గం ఎన్డీఏకు దగ్గరైతే.. ప్రతిపక్ష శక్తులను బలహీనపరచడంతో పాటు, భవిష్యత్ ఎన్నికల్లో కూటమికి అదనపు బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యంగా 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడం బీజేపీకి కీలక వ్యూహంగా మారనుంది. ప్రస్తుతం శరద్ పవార్ వర్గం ఇండియా కూటమిలో భాగంగా ఉండటం వల్ల ప్రతిపక్షాలకు ఓ రాజకీయ ఆధారం లభిస్తోంది. ఆ వర్గం ఎన్డీఏ వైపు వస్తే.. ఇండియా కూటమికి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్లమెంట్లో కీలక బిల్లులపై సంఖ్యాబలం కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. లోక్‌సభలో ఎనిమిది మంది సభ్యులు ఉన్న NCP(SP) మద్దతు లేదా అనుకూల వైఖరి కేంద్రానికి రాజకీయంగా ప్రాధాన్యత కలిగించవచ్చు.మరోవైపు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాల్లో కూడా పవార్ వర్గాల కలయిక బీజేపీ-షిండే-అజిత్ కూటమికి అదనపు బలం ఇవ్వగలదన్న అంచనాలు ఉన్నాయి.అయితే దీనికి మరో వైపు కూడా ఉంది. శరద్ పవార్ వంటి సీనియర్ నేతను ఎన్డీఏలోకి తీసుకురావడం వల్ల కూటమిలో అంతర్గత సమతుల్యత ఎలా ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గాల మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? అన్నదే అసలు సవాల్‌గా మారనుంది.కేంద్ర కేబినెట్ ఆశలు.. అజిత్ వర్గం ఎదురుచూపులుఇదిలా ఉండగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర స్థాయిలో మరింత ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తోంది. భవిష్యత్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీకి ప్రాతినిధ్యం రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్‌కు కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.ఆమె ఖండించినా.. కొనసాగుతున్న ప్రచారంమరోవైపు శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్డీఏలో చేరే ప్రచారాన్ని ఖండిస్తోంది. NCP(SP) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ఇలాంటి వార్తలను పలుమార్లు తోసిపుచ్చారు. తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోందని, అలాంటి ఊహాగానాల్లో వాస్తవం లేదని ఆమె వ్యాఖ్యానించారు.అయితే పార్లమెంట్ లెక్కలు, రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం ప్రాధాన్యతను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లోక్‌సభలో NCP(SP)కు ఉన్న ఎనిమిది మంది ఎంపీల సంఖ్య కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే.. మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ లెక్కలు కొత్త దిశలో సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. పవార్ కుటుంబంలో మళ్లీ ఐక్యత వస్తుందా? ఎన్సీపీ పునరేకీకరణ జరుగుతుందా? లేక ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. -
సియా గోయల్ కుటుంబానికి బిగ్ షాక్
యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్న కుటుంబానికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సియా కుటుంబం నిర్వహించే మసాలా, డ్రై ఫ్రూట్స్ వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం (FDA) చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలు, కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న బీజీ గోయల్ అండ్ కంపెనీ (M/s BG Goyal and Company) అనే సంస్థను సియా కుటుంబం నిర్వహిస్తోంది. ఈ షాపులో తాజాగా ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా మొత్తం 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSS Act) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని ఎఫ్‌డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. లైసెన్స్ వివరాల్లో అవసరమైన మార్పులు చేయాలని గతంలో సూచించినప్పటికీ.. సంస్థ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్పత్తుల లేబులింగ్‌లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు, కల్తీ జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా.. సియా గోయల్ పేరు దేశం అంతటికి తెలిసిందే. తన కాబోయే భర్త కేతన్ (25)ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగఢ్ కోట వద్ద నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. జూన్ 18న ఈ ఘటన జరగ్గా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు సియా, చేతన్ అరెస్ట్‌తో ఓ కొలిక్కి వచ్చింది. అయితే కేతన్‌ను తోసిందెవరు? అనే మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఈ విషయంలో నిందితులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇటు హత్య కేసు విచారణ కొనసాగుతున్న వేళ.. తాజాగా ఆమె కుటుంబ వ్యాపారంపై FDA చర్యలు తీసుకోవడం పుణెలో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తుకారాం ముండే కల్తీపై కొరడా ఝుళిపిస్తున్నారు. కల్తీ ఆహారం, నిషేధిత ఉత్పత్తులు, నాసిరకం మందులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కఠిన నిర్ణయాలతో గుర్తింపు పొందిన ముండే.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో అక్రమ తయారీ కేంద్రాలు, గుట్కా విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కేసులు, సీజ్ చర్యలు కొనసాగుతున్నాయి. -
2 వారాల పాటు అక్కడ చికెన్, మటన్ బంద్
సాక్షి ముంబై: ఆషాఢీ వారీ సందర్భంగా విఠోబా దర్శనం కోసం లక్షలాది మంది వార్కరీలు పండరీపూర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ నేటి నుంచి 29 వరకు మహారాష్ట్రలోని పండరీపూర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోలాపూర్ జిల్లా ఇంచార్జి మంత్రి జయకుమార్ గోరే సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.ఆషాఢీ వారీ సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా పండరీపూర్‌కు చేరుకుంటారని, ఈ పవిత్ర వేళలో మాంసం విక్రయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఆదేశాలను ఉల్లంఘించి మాంసం లేదా మటన్ అమ్మకాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వార్కరీ సంఘాలు స్వాగతించాయి.గజానన్ మహారాజ్ పల్లకీ యాత్రకు ముమ్మర ఏర్పాట్లు సోలాపూర్: శ్రీ క్షేత్ర షేగావ్ నుంచి పండరీపూర్ బయలుదేరిన శ్రీ గజానన్ మహారాజ్ పల్లకీ, వార్కారీల పాదయాత్ర ఈనెల 18న సోలాపూర్ చేరుకోనుంది. పల్లకీ, వార్కరీలు రెండు రోజులు ఇక్కడే బస చేయనున్న నేపథ్యంలో మేయర్ వినాయక కొండ్యాల్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట స్టాండింగ్ కమిటీ చైర్మన్ రంజిత చాకోతే, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సచిన్ ఓంబాసే, అదనపు కమిషనర్ వీణా పవార్, కార్పొరేటర్లు వందన గైక్వాడ్ , శ్రీదేవి పూలారే, కల్పన కదం , గౌతం కస్బే, దిలీప్ కొల్హె, సిటీ ఇంజనీర్ సారిక ఆకులువార్, అగ్నిమాపక విభాగం ప్రముఖ అధికారి రాకేష్ సాలుంకే, శ్రీ గజానన మహారాజ్ షేగావ్ సంస్థాన్‌కు చెందిన స్థానిక ప్రతినిధులు సునీల్ కులకర్ణి, సునీల్ ఫాల్కే, ఉద్యానవన అధికారి కోమల్ కాశిది సంబంధిత విభాగాల అధికారులు ఉన్నారు.రూప భవాని చౌక్, తుల్జాపూర్ వేస్, కస్తూర్బా మార్కెట్, సామ్రాట్ చౌక్ శ్రీ సద్గురు ప్రభాకర్ స్వామి మహారాజ్ మందిర్, బాలివేస్ టెలిఫోన్ భవన్, కుంబార్ వేస్, కౌంతం చౌక్, కన్నా చౌక్ మార్గాలతో పాటు పద్మశాలీ శిక్షణ సంస్థకు చెందిన కుఛన్ పాఠశాలల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే వార్కారీలు బస చేసే ఉపలపు కళ్యాణ మండపాన్ని, అక్కడి నుండి తరలి వెళ్లే మోదీ రైల్వే బ్రిడ్జి, ధమాని నగర్ మార్గాల వద్ద సన్నాహాలను సమీక్షించారు.చదవండి: ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు లేదువార్కరీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులను ఆదేశించారు. పల్లకి మార్గంలో అడ్డువచ్చే చెట్ల కొమ్మలను వెంటనే కొట్టివేయాలని అలాగే రోడ్లపై గుంతలను పూడ్చాలని, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పారు. కమిషనర్ డాక్టర్ సచిన్ ఓం బాసే పల్లకి మార్గాల వెంబడి అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని, అలాగే పారిశుధ్యం, నీటి సరఫరా, ఆరోగ్య, అగ్నిమాపక, అత్యవసర విభాగాల సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. -
ఆ షరతుకు ఒప్పుకుంటేనే ఎన్డీయేకు మద్దతు!!
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంటాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతల మధ్య అనూహ్య భేటీలు, మారుతున్న సమీకరణాలు అక్కడి రాజకీయాలను మరింత ఉత్కంఠగా మారుస్తుంటాయి. తాజాగా మరోసారి అలాంటి పరిణామమే తెరపైకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి మారే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు శరద్ పవార్ వర్గం సిద్ధమవుతోందన్న వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే ఈ మద్దతుకు ఓ షరతు ఉందని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాల పెంపు కల్పిస్తేనే బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని ఎన్సీపీ వర్గాలు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ.. ఎన్డీఏకు దగ్గరవుతోందా? అనే చర్చ మొదలైంది.ప్రతిపక్ష కూటమికి షాక్?గత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం అదే బిల్లుపై శరద్ పవార్ వర్గం భిన్నమైన వైఖరి తీసుకుంటే.. ప్రతిపక్ష ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.50 శాతం సీట్ల పెంపు ఉంటే మద్దతుఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ అంశంపై స్పందిస్తూ.. బిల్లులో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా స్పష్టమైన నిబంధనలు ఉంటే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. “అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపునకు అవకాశం కల్పిస్తే, అమలు విధానం స్పష్టంగా ఉంటే మద్దతు ఇస్తాం” అని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికీ నష్టం జరగకుండా లోక్‌సభ స్థానాలను పెంచేలా సవరణ తీసుకొస్తామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్డీఏలో భాగం కానప్పటికీ.. కీలక సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.అసలు డీలిమిటేషన్ బిల్లు ఏంటి?లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. రాజ్యాంగం (131వ సవరణ) బిల్లుగా పిలుస్తున్న ఈ ప్రతిపాదనలో లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే అంశం ఉంది. అయితే జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రహస్య భేటీలతో పెరిగిన చర్చతాజా రాజకీయ పరిణామాలకు మరో కారణం ఎన్సీపీకి చెందిన రెండు వర్గాల నేతల కదలికలు. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో శరద్ పవార్ మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నారా? ఎన్సీపీ రెండు వర్గాలు తిరిగి ఒక్కటయ్యే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే ఎన్సీపీ నేతలు మాత్రం ఈ భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.కాంగ్రెస్ ఆందోళనమరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఈ పరిణామాలపై స్పందిస్తూ.. శరద్ పవార్ ఎన్సీపీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని కోరారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.శరద్ పవార్ వ్యూహం ఏమిటి?మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ ఎప్పుడూ వ్యూహాత్మక నిర్ణయాలకు పేరుగాంచారు. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న పార్టీలతోనూ అవసరానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు మార్చుకోవడం ఆయన శైలిలో భాగమని విశ్లేషకులు చెబుతుంటారు. తాజా పరిణామాలు కేవలం ఒక బిల్లుపై మద్దతుకే పరిమితమా? లేదంటే భవిష్యత్ రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.డీలిమిటేషన్ బిల్లుపై వైఖరి మారితే.. అది మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి ప్రతిపక్ష కూటమితో కలిసి నడుస్తున్న శరద్ పవార్ ఎన్సీపీ.. కీలక సమయంలో మిత్రపక్షాలకు హ్యాండ్ ఇస్తుందా? లేక షరతులతో కూడిన మద్దతుకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాలి. -
సునేత్రా పవార్‌కు బిగ్ షాక్.. ఎన్సీపీలో కొత్త ట్విస్ట్!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఎన్నికైన విధానాన్ని సవాల్ చేస్తూ పార్టీ సీనియర్ నాయకుడు సచ్చిదానంద్ సింగ్ న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపించారు. అధ్యక్ష ఎన్నిక చెల్లదని, పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రక్రియ నిర్వహించారని ఆరోపిస్తూ, తాజాగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామం ఎన్సీపీలో నాయకత్వంపై కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.వివాదం ఎలా మొదలైంది?అజిత్ పవార్ మరణానంతరం పార్టీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సునేత్రా పవార్‌ను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియలో పార్టీ రాజ్యాంగం ప్రకారం సభ్యులకు నోటీసులు ఇవ్వలేదని, నామినేషన్లకు అవకాశం కల్పించలేదని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని సచ్చిదానంద్ సింగ్ ఆరోపిస్తున్నారు. ఎన్నిక పేరుతో కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమే నిర్వహించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.లీగల్ నోటీసులో డిమాండ్లు.. ఆమె ఎన్నికపై సింగ్ పంపిన నోటీసులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. సునేత్రా పవార్ ఎన్నికను రద్దు చేయాలి. పార్టీ రాజ్యాంగం ప్రకారం కొత్త ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. పార్టీలో అర్హులైన సభ్యులకు పోటీ చేసే అవకాశం కల్పించాలి. ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించాలి అని అన్నారు. అయితే, పార్టీ ఈ డిమాండ్లపై స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందని కూడా నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యలుఈ వివాదం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కూడా పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని అంగీకరించారు. పార్టీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సరిదిద్దే చర్యలు అవసరమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత అసంతృప్తి ఉందనే చర్చకు మరింత బలం చేకూర్చాయి. కాగా, సునేత్రా పవార్ నాయకత్వాన్ని న్యాయపరంగా సవాలు చేయడం వల్ల ఎన్సీపీలో నాయకత్వ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరిస్తే అధ్యక్ష ఎన్నికల చెల్లుబాటుపై విచారణ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా దీని ప్రభావం ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
డిప్యూటీ సీఎం కొడుకుతో నిశ్చితార్థం.. ఎవరీ కైనత్?
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఆమె పెద్ద కుమారుడు, రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్ పెళ్లి చేసుకోబోతున్నారు. మోడల్, వ్యాపారవేత్త కైనత్ ధర్‌ను ఆయన వివాహమాడనున్నారు. జులై 29న పుణెలో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుంది. నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పవార్ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవార్ ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టబోయే కైనత్ ధర్ గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.ఎవరీ కైనత్ ధర్?కైనాత్ ధర్ ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆమె మోడల్‌గా, వ్యాపారవేత్తగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే తన వృత్తి జీవితాన్ని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మోడలింగ్ రంగంలో చేసిన ప్రాజెక్టులు, వ్యాపార కార్యకలాపాలు లేదా విద్యార్హతల గురించి పూర్తి వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.పవార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలుపార్థ్ పవార్, కైనత్ ధర్ (Kaiynaat Dhar) బంధం గురించి కొంతకాలంగా ప్రచార మాధ్యమాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయాన్ని పార్థ్‌తో కలిసి కైనత్ సందర్శించిన ఫొటోలు వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఇటీవల జరిగిన ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ వేడుకల్లో కైనత్ పాల్గొనడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. పార్థ్ కుటుంబం కష్టకాలంలో ఉన్న సందర్భాల్లో కైనత్ వారి వెంట కనిపించారని, ఆమెకు పవార్ కుటుంబంతో సన్నిహిత అనుబంధం చాలా కాలంగా ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.జూలై 29న నిశ్చితార్థంపార్థ్ పవార్, కైనత్ ధర్ల నిశ్చితార్థం (Parth Pawar, Kaiynaat Dhar Engagement) జులై 29న పుణెలో జరగనుంది. ఈ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. అతిథుల జాబితా, వేదిక వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.చదవండి: ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యంఅజిత్ పవార్ రాజకీయ వారసుడుమహారాష్ట్ర రాజకీయాల్లో పార్థ్ పవార్ కుటుంబం కీలక పాత్ర పోషిస్తోంది. ఆయన తల్లి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి అజిత్ పవార్. మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆయన ఈ ఏడాది జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో అకాల మరణం చెందారు. అజిత్ పవార్ మరణానంతరం ఆయన సతీమణి సునేత్రకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. వీరి పెద్ద కుమారుడు పార్థ్ పవార్ ఈ ఏడాది ఏప్రిల్ 9న మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. -
ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం
సాక్షి ముంబై: ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పండరీపూర్‌కు వెళ్లే భక్తుల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పించింది. దీంతో ఉత్సవాలకు రాకపోకలు సాగించే భక్తులకు ఎంతో ఊరట లభించింది. ఈ సౌకర్యం సొంత వాహనాల్లో వెళ్లే భక్తులతోపాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, అద్దె కార్లు, ఇతర పికప్ వాహనాలు సహా గ్రూపు బుకింగ్ చేసుకున్న మహరాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (ఎమ్మెస్సార్టీసీ) బస్సులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందు నుంచి ముగిసేవరకూ.. ఈ నెల 25న పండరీపూర్‌లో ఆషాఢ ఏకాదశి (Ashadi Ekadashi) ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి భక్తులు పల్లకీలతో సహా కాలినడకన పక్షం రోజుల ముందే పండరీపూర్‌కు బయలుదేరతారు. ఏకాదశికి ముందు లేదా అదేరోజున అక్కడికి చేరుకుంటారు. కొందరు భక్తులు సొంత వాహనాల్లో మరికొందరు అద్దె వాహనాల్లో వస్తారు. దీంతో పండరీపూర్ సుమారు వారం రోజులపాటు భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముగిసేవరకు అంటే ఈ నెల 29 వరకు అన్ని రకాల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాస్ ఇలా పొందాలి... అయితే ఈ సౌకర్యాన్ని పొందాలనుకునేవారు కొ న్ని నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్ప ష్టం చేసింది. పండరీపూర్ వెళ్లే వాహనాలు ‘ఆషాఢి ఏకాదశి–2026’ అనే స్టిక్కర్ లేదా పాస్ కోసం ముందుగా స్ధానిక పోలీసు స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాఫిక్ ఫోలీసు శాఖ లేదా ప్రాంతీయ రవాణా కార్యాలయం అనమతి పొందాలి. ఈ స్టిక్కర్ లేదా పాస్‌ను వాహనం విండ్ షీల్డ్ (అద్దం ముందు భాగం) పై అతికించాలి. గ్రూపు బుకింగ్ చేసుకునే బస్సులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అప్పుడే టోల్ నాకాల మీదుగా ఉచితంగా ఒకసారి వెళ్లి , తిరిగి రావడానికి (వన్ టైం) వీలుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.చదవండి: బీజేపీ నాయకులపై రాజ్‌ఠాక్రే ధ్వజంఅన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి ఇదిలాఉండగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షం (Mumbai Rains) కారణంగా అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్సవాలకు ముందే మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వాహనాల్లో వెళ్లే వారితోపాటు పల్లకీలతో కాలిబాటన వెళ్లే భక్తులు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలని సూచించింది. వాహనాలను క్రమబద్దీకరించేందుకు మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులను నియమించాలని, రోడ్డు ప్రమాదానికి గురైన, రిపేర్లతో ఆగిపోయిన వాహనాలను తరలించేందుకు టోవింగ్ వ్యాన్లు అందుబాటులో ఉంచాలని స్ధానిక పోలీసు స్టేషన్లకు సూచించింది. -
మళ్లీ కరోనా వైరస్ కలకలం!
మళ్లీ కరోనా వైరస్ కలకలం దేశంలో గుబులు రేపుతోంది. ఇక కరోనా భయం లేదనుకుంటున్న సమయంలో ఆ వైరస్.. మళ్లీ మెల్లగా పాగా వేస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు కరోనాతో మృతి చెందగా, తాజాగా దిగ్గజ గాయకుడు కుమార్ సాను కుమారుడు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, గాయకుడు అయిన జాన్ కుమార్ సానుకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ఈరోజు( జూలై 12, ఆదివారం) సోషల్ మీడియాలో ప్రకటించారు. జాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ను జాన్ కుమార్ సాను సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.దేశంలో మళ్లీ అక్కడక్కడ కోవిడ్-19 మాట వినిపిస్తోంది. ఈ తరుణంలో జాన్ కుమార్ సాను కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన రేకెత్తిస్తోంది. చైనా నుంచి వచ్చిన కోవిడ్ స్నేహితుడికి సెల్యూట్. వూహాన్ నుంచి నాకు కోవిడ్ వచ్చింది. ఈరోజు నేను నా అభిమాన డిజైనర్ కోకిలాబెన్ రూపొందించిన దుస్తులు ధరించాను’ అని రాసుకొచ్చారు జాను కుమార్ సాను. గాయకుడు జాన్ కుమార్ సానుకి కోవిడ్-19 సోకడంపై అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అతను త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.ఇటీవల ఏపీలో కరోనా వైరస్ కలకలం రేగింది.వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్ బారినపడి మృతి చెందడంతో ఒక్కసారిగా వైద్య శాఖ ఉలిక్కి పడింది. View this post on Instagram A post shared by Jjaan Rita Sanu (@jaan.kumar.sanu) కరోనా మరణాలతో ఉలిక్కిపడిన ఏపీ -
కుంభమేళా ఏర్పాట్లకు ప్రకృతి బ్రేక్.. సాధుగ్రామ్‌కు కొత్త స్థలం!
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్–త్రయంబకేశ్వర్‌లో 2027లో జరగనున్న సింహస్థ కుంభమేళా ఏర్పాట్లలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధువుల కోసం ఏర్పాటు చేయనున్న సాధుగ్రామ్ స్థలాన్ని మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం పూర్తిగా నీటమునిగి, బురదమయంగా మారడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎత్తైన ప్రాంతంలో కొత్త స్థలాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు.త్రయంబకేశ్వర్ కుంభమేళా దేశంలోని అత్యంత పవిత్ర హిందూ ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటి. ఇక్కడ శైవ సంప్రదాయానికి చెందిన దశనామి అఖాడాల సాధువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. మరోవైపు నాసిక్‌లో వైష్ణవ సంప్రదాయానికి చెందిన సాధువులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ కారణంగా ప్రతి కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు, సాధువులు తరలివస్తారు. అయితే ఈసారి భారీ వర్షాలు ఏర్పాట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. రహదారుల నిర్మాణం, కుశావర్త తీర్థం అభివృద్ధి పనులు, సరస్సుల సుందరీకరణ వంటి ప్రాజెక్టులు మందగించాయి. ముఖ్యంగా సాధువుల నివాస శిబిరం ఏర్పాటు చేయాల్సిన స్థలం పూర్తిగా బురదమయంగా మారడంతో అక్కడ శిబిరం ఏర్పాటు చేయడం ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నారు.దీంతో వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నీరు నిల్వ కాకుండా ఉండే ఎత్తైన ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేస్తున్నారు. అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేసి, సాధువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పరిపాలనా వర్గాలు తెలిపాయి. 2027 సింహస్థ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. వర్షాల సవాళ్లు ఉన్నప్పటికీ, కుంభమేళా ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. -
పవన్‌కు ముంబైలో సర్జరీ పూర్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కుడి భుజానికి (రొటేటర్ కఫ్) జరిగిన ఈ సర్జరీ సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్య బృందం తెలిపింది.ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పవన్ కల్యాణ్ రెండు భుజాల కండరాలు (రొటేటర్ కఫ్) తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. అయితే రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, తొలిదశలో కుడి భుజానికే శస్త్రచికిత్స నిర్వహించారు. మరో భుజానికి దాదాపు రెండు నెలల తర్వాత మరో సర్జరీ చేయనున్నట్లు సమాచారం.పవన్ కల్యాణ్‌కు ఈ గాయాలు ఒక్కసారిగా ఏర్పడినవి కావని తెలుస్తోంది. దబాంగ్ రీమేక్ 'గబ్బర్ సింగ్' సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు భుజానికి గాయమైంది. అనంతరం 2019లో రాయలసీమ పర్యటనలో, ఎన్నికల టైంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా కూడా భుజాలపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకునే ముందు నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఫిజియోథెరపీతో పాటు పునరావాస చికిత్స కొనసాగనుంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.@PawanKalyan— N Chandrababu Naidu (@ncbn) July 11, 2026 -
అయోధ్య విరాళాల చోరీపై పశ్నించకూడదా?
సాక్షి, ముంబై: పుణే–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మిస్తున్న ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టు, అయోధ్య రామమందిరంలో కానుకల చోరీ, రైల్వేల్లో స్థానికుల ఉద్యోగాల అంశాలపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మహాయుతి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర నవనిర్మాణ రైల్వే కార్మిక్ సేన వార్షికోత్సవం, నూతన కార్యాలయం, లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బెదిరింపు ధోరణి తగదు ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజ్ ఠాక్రే విమర్శించారు. మహారాష్ట్ర శాసనసభలో మరాఠీ సభ్యుల మధ్య హిందీలో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిగా ఉండి ’చూసుకుంటాం’ అనే భాష ఉపయోగించడం సరికాదు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ బెదిరింపుల ధోరణి తగదు‘ అని వ్యాఖ్యానించారు. ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టులో చోటుచేసుకున్న లోపాలపై ప్రజలు ప్రశ్నిస్తే దానిని మహారాష్ట్రకు అవమానంగా చిత్రీకరించడం సరికాదని రాజ్ ఠాక్రే అన్నారు. ప్రజలు అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారని, అధికారంలో లేనప్పుడు ఇదే అంశాలపై బీజేపీ కూడా ఉద్యమాలు చేసిందని గుర్తుచేశారు.అన్నీ సహజమేనా?ప్రభుత్వం ప్రతి లోపాన్నీ ’సహజం’గా పేర్కొంటోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నందుకే అన్ని ఘటనలను సమర్థించుకోవడం సరికాదని, రేపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే వైఖరి అవలంబిస్తారా అని ప్రశ్నించారు. అయోధ్య రామమందిరంలో విరాళాలు, నిధుల చోరీ ఆరోపణలపై స్పందించిన రాజ్ ఠాక్రే.. భక్తుల దేవుడి సొమ్ము భద్రతపై ప్రశ్నిస్తే మతవ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదన్నారు. రామమందిర ట్రస్ట్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించిన సభ్యులు ఎక్కువ మంది ఉన్నారని పేర్కొంటూ, అలాంటి పరిస్థితుల్లో చోరీ ఎలా జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.చదవండి: ప్రజల మరణాలపై వెకిలి నవ్వులా?‘స్థానిక’ హక్కులపై అప్రమత్తంగా ఉండాలి 2008లో రైల్వే నియామకాల కోసం చేపట్టిన ఉద్యమాన్ని గుర్తు చేసిన రాజ్ ఠాక్రే.. ఆ పోరాటం వల్లే స్థానిక భాషల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా రైల్వే నియామకాలు, స్టాళ్ల కేటాయింపుల్లో స్థానికుల హక్కులు దెబ్బతినకుండా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. -
టీసీఎస్ కేసు.. జైల్లో ప్రసవ వేదన భరించలేనిది!
నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్‌కు నాసిక్ లోకల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలులోనే బిడ్డకు జన్మనివ్వాల్సి రావడం ఏ మహిళకైనా తీవ్రమైన వేదనతో కూడుకున్నదన్న కోర్టు.. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనన ప్రస్తావన తేస్తూ కీలక వ్యాఖ్యలు గమనార్హం. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన కేసులో నిదా ఖాన్ నిందితురాలిగా ఉంది. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యాక ఆమె పరారయ్యింది. అయితే.. దాదాపు 25 రోజుల తర్వాత మే 7న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేశారు. అయితే పరారీలో ఉన్న టైంలో తాను గర్భంతో ఉన్నానని.. ముందస్తు బెయిల్ కావాలని ఆమె వేసిన పిటిషన్‌ను నాసిక్ రోడ్ కోర్టు కొట్టేసింది. తాజాగా.. మరోసారి ఆమె గర్భధారణను ప్రధాన కారణంగా చూపిస్తూ బెయిల్ పిటిషన్ వేయగా.. జులై 6న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు రూ.75 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తానికి ఒక పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.నిదా ఖాన్ బెయిల్ వాదనను పోలీసులు, బాధితుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో తగిన ఆధారాలు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిదా ఖాన్ తరఫు న్యాయవాది రాహుల్ కస్లీవాల్ మాత్రం ఆమె నిర్దోషి అని, తప్పుడు కేసులో ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆమె ఉన్నత విద్యావంతురాలని, టీసీఎస్‌లో అసోసియేట్‌గా పనిచేసిందని పేర్కొన్నారు.జైలులో ప్రసవం వేదన భరించలేనిది..బెయిల్ తీర్పు సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి కేజీ జోషి తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. “శ్రీకృష్ణుడి జననం జైల్లో జరిగింది. అలాంటి పరిస్థితుల మాదిరిగా ఓ బిడ్డకు జైలులో జన్మనివ్వాల్సి రావడం వల్ల కలిగే మానసిక వేదన, సామాజిక కళంకం ఏ మహిళకైనా తట్టుకోలేనిది. కాబట్టి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి బాధాకర పరిస్థితులను నివారించేందుకు న్యాయ విచక్షణను ఉపయోగించడం సముచితమని కోర్టు భావిస్తోంది అంటూ తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా.. దర్యాప్తు పూర్తయి చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో ఆమెను జైలులో కొనసాగించడం వల్ల ప్రత్యేక ప్రయోజనం లేదని న్యాయస్థానం పేర్కొంది.టీసీఎస్ కేసులో ఆరోపణలు ఏమిటి?నాసిక్‌లోని టీసీఎస్ యూనిట్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, మత మార్పిడికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై పోలీసులు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిదా ఖాన్‌కు సంబంధించిన కేసులో.. మతపరమైన విషయాలతో ప్రభావితం చేయడం, బురఖా, మత గ్రంథాలు ఇవ్వడం, బాధితురాలి మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం, నమాజ్ నేర్పించడం, హిజాబ్ ధరించే విధానం వివరించడం వంటి ఆరోపణలు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు.. బాధితురాలు దళితురాలు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.టీసీఎస్ వివరణఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత టీసీఎస్.. వేధింపులు, బలవంతపు చర్యల విషయంలో తమ సంస్థకు జీరో టాలరెన్స్ విధానం(ఉపేక్షించేది లేదని) ఉందని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.శ్రీకృష్ణుడు దేవకి–వసుదేవులకు మధుర కారాగారంలో జన్మించాడు. కంసుడి నుంచి రక్షించేందుకు వసుదేవుడు ఆయనను గోకులానికి తీసుకెళ్లగా.. నందుడు, యశోద దంపతులు పెంచి పెద్ద చేశారు. అందుకే శ్రీకృష్ణుడిని జన్మనిచ్చిన తల్లి పేరుతో దేవకీనందనుడు, పెంచిన తల్లి–తండ్రుల పేర్లతో యశోదానందనుడు, నందలాలా అని కూడా పిలుస్తారు. -
మహా రాజకీయం.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య జరిగిన భేటీ తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమావేశం తర్వాత ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (MVA)లో విభేదాలు తలెత్తాయా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పరిణామంపై శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాగా, శరద్ పవార్ మహారాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఏక్నాథ్ షిండే కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం తన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా అక్కడే సమావేశమయ్యారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అధికార పక్షం-ప్రతిపక్షం మధ్య ఏదైనా కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడుతున్నాయా అనే చర్చ మొదలైంది.ఈ భేటీపై స్పందించిన సంజయ్ రౌత్..‘శరద్ పవార్‌పై మాకు పూర్తి గౌరవం ఉంది. ఆయన సిద్ధాంతంపై, ఆయన రాజకీయ నిబద్ధతపై మాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏక్నాథ్ షిండే కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించడం మాకు బాధ కలిగించింది. మా దృష్టిలో పార్టీని చీల్చిన వారు ద్రోహులు. అలాంటి వారికి గౌరవం, గుర్తింపు ఇచ్చినట్టుగా ఈ సమావేశం కనిపించింది. ఈ సమావేశానికి మరో స్థలం దొరకలేదా? తప్పనిసరిగా షిండే కార్యాలయంలోనే ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామం వల్ల శివసేన (UBT) కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా బాధపడ్డారు. ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు.ఎన్సీపీ నేతలు ఫైర్.. అయితే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(SP) నాయకులు మాత్రం ఈ విమర్శలను ఖండించారు. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని, ఎంవీఏ కూటమిని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి రాజకీయ రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ భేటీ రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అయితే శరద్ పవార్ వర్గం నుంచి మహా వికాస్ అఘాడీ కూటమిని వీడుతున్నట్లు లేదా అధికార కూటమితో చేతులు కలుపుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఊహాగానాలకే పరిమితమయ్యాయి. -
ఎన్డీయే వైపు శరద్ పవార్ అడుగులు?
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఆపరేషన్ టైగర్’అనంతరం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ‘ఆపరేషన్ తుతారీ’చర్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధికార ఎన్డీయే కూటమిలో చేరుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న కీలక నేతల వరుస సమావేశాలు ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే ఎన్డీయేతో తమ పార్టీ జతకట్టబోతోందన్న వాదనలు, విశ్లేషణలతో శరద్ పవార్ సోదరుని మనవడు, పార్టీ ఎమ్మెల్యే అయి రోహిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు. బుధవారం విధాన భవన్లో ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో వేడి రగిలించింది. పవార్ విధాన భవన్‌కు చేరుకున్నారన్న సమాచారం అందగానే, షిండే తాను నిర్వహిస్తున్న సమావేశాన్ని కాసేపు పక్కనపెట్టి బయటకు వచ్చి పవార్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందనే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవార్, షిండేల భేటీకి ముందే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేతో ఎన్సీపీ(ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సమావేశమయ్యారు. రోహిత్ పవార్ అసహనం పార్టీ ఎన్డీయే కూటమిలో చేరే అవకాశాలపై ఎన్సీపీ (ఎస్పీ) అంతర్గత వర్గాల్లో ఏకాభిప్రాయం లేదు. బీజేపీతో చేతులు కలపడాన్ని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఇలాంటి రాజకీయ నిర్ణయాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) పాత మిత్రపక్షాల కూటమి అయిన మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)తోనే కలిసి సాగాలని రోహిత్ గట్టిగా వాదిస్తున్నారు. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ త్వరలోనే తన బహిరంగ వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. ఆయన తీసుకోబోయే నిర్ణయంపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శరద్ పవార్ వేసే తదుపరి రాజకీయ అడుగులు మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఆపరేషన్ తుతారీ’అంటే ఏమిటి? అజిత్ పవార్ తెచ్చిన చీలికతో ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్ వర్గానికి మహారాష్ట్ర సంప్రదాయ బూర అయిన తుతారీ గుర్తును కేటాయించింది. మహారాష్ట్రలో గతంలో శివసేనను చీల్చిన తరహాలోనే, ఇప్పుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) వర్గాన్ని మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో విలీనం చేసుకునేందుకు లేదా ఆ పార్టీ మద్దతు కూడగట్టేందుకు తెరవెనుక జరుగుతున్న రాజకీయ ప్రయత్నాలకే రాజకీయ వర్గాలు ‘ఆపరేషన్ తుతారీ’అని పేరు పెట్టాయి. -
ఫడ్నవీస్‌ను కాదని షిండేతో భేటీ దేనికి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సాధారణ మర్యాదపూర్వక భేటీగానే ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఈ సమావేశం జరిగిన సమయం, కలిసిన నేతల ప్రాధాన్యం రాజకీయ చర్చలకు దారితీస్తోంది.మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు శరద్ పవార్ బుధవారం అసెంబ్లీకి వచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన నేరుగా ఏక్నాథ్ షిండే ఛాంబర్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వెంట ఎన్సీపీ (ఎస్పీ) నేతలు జయంత్ పాటిల్, జితేంద్ర అవ్హాద్, శశికాంత్ షిండే కూడా ఉన్నారు.ఆ సమయంలో షిండే క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు. పవార్ వచ్చిన విషయం తెలుసుకున్న షిండే సమావేశం నుంచి బయటకు వచ్చి ఆయనను కలిశారు. ఇద్దరు నేతలు దాదాపు 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం షిండే తిరిగి క్యాబినెట్ సమావేశానికి వెళ్లగా.. పవార్ కొంతసేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.అసలు చర్చంతా ఫడ్నవీస్ చుట్టూనే..ఈ భేటీలో ఆసక్తిని పెంచిన అంశం ఒక్కటే కాదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక నిర్ణయాధికారిగా ఉన్నప్పటికీ.. పవార్ ఆయనను కాకుండా షిండేను కలవడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. అయితే దీన్ని కేవలం ఫడ్నవీస్‌ను పక్కన పెట్టిన చర్యగా చూడలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండేకు ఉన్న ప్రత్యేక రాజకీయ స్థానం ఈ భేటీకి కారణంగా కనిపిస్తోంది.శివసేనలో చీలిక తర్వాత షిండే వర్గం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నుంచి పలువురు నేతలు షిండే శిబిరంలోకి వెళ్లడం, ఇటీవల ఆ వర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు.. షిండేను ఒక ప్రత్యేక రాజకీయ కేంద్రంగా నిలిపాయి.షిండే ఎందుకు కీలకం?శరద్ పవార్‌కు మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. ప్రత్యర్థి పార్టీల నేతలతోనూ రాజకీయ సంబంధాలు కొనసాగించడం ఆయన శైలిలో భాగం. ఈ నేపథ్యంలో షిండేతో భేటీని కూడా అదే రాజకీయ సంప్రదింపుల కోణంలో చూడాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు.. శివసేనలోని పరిణామాలు, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో నెలకొన్న అంతర్గత సమస్యల నేపథ్యంలో ఈ సమావేశం కొత్త ఊహాగానాలకు కారణమైంది.ఎంవీఏలో పెరుగుతున్న ఒత్తిళ్లుకాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) కలిసి ఉన్న మహా వికాస్ అఘాడీకి ఇటీవలి కాలంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలోకి వెళ్లడం ప్రతిపక్ష కూటమిలో కలకలం రేపింది. భవిష్యత్ రాజకీయ పోరాటాలకు ముందు కూటమి ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో పవార్–షిండే భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.రాజకీయ సంకేతమా? లేక..అయితే ఈ సమావేశంలో రాజకీయ సమీకరణాలపై చర్చ జరిగిందని ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షిండే కార్యాలయం దీనిని మర్యాదపూర్వక సమావేశంగానే పేర్కొంది. పవార్ కూడా భేటీ వివరాలను వెల్లడించలేదు. కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో నేతల మధ్య జరిగే ప్రతి భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా శరద్ పవార్ వంటి సీనియర్ రాజకీయ నాయకుడు.. అధికార కూటమిలో కీలకంగా ఉన్న షిండేను ప్రత్యేకంగా కలవడం సహజంగానే చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ఆపరేషన్ ఫడ్నవీస్.. షిండేకు బీజేపీ పెద్దల సాయం? -
కుండపోత వర్ష బీభత్సం.. 5000 సిలిండర్లు గల్లంతు..
ముంబై: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, తాజాగా రాయ్‌గఢ్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. భారీ వర్షాల కారణంగా సుమారు 5,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సిలిండర్లు కనిపిస్తే ప్రజలు వాటిని తాకవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే, వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సిలిండర్లు నివాస ప్రాంతాలు, రోడ్లు, నదీ ప్రవాహాల సమీపంలో కనిపించవచ్చని అధికారులు తెలిపారు. వాటిని తరలించేందుకు లేదా తెరవడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. సిలిండర్లలో గ్యాస్ మిగిలి ఉండే అవకాశం ఉన్నందున లీకేజీ, మంటలు లేదా పేలుడు వంటి ప్రమాదాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.Raigad,Maharashtra - Several empty cylinders of HPCL were washed away in a sudden flood at Chavane village in Khalapur taluka.The empty tanks had been brought to the HPCL plant in Chavane for processing and refilling. However, heavy rainfall on the hilltop caused a massive surge… pic.twitter.com/08PVx2k5XJ— NextMinute News (@nextminutenews7) July 8, 2026మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి సురక్షితంగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక యంత్రాంగం ప్రజల భద్రత కోసం పర్యవేక్షణ పెంచింది. ఇక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులు నెలకొన్నాయి. రాయ్‌గఢ్‌లో రవాణా, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు.ముంబైపై పంజా..ఇదిలా ఉండగా.. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గత ఏడు రోజుల్లో నమోదైన వర్షపాతం రికార్డు స్థాయికి చేరుకుంది. శాంతాక్రూజ్ వాతావరణ కేంద్రంలో 1,017.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత ఏడాది మొత్తం జూలై నెలలో కురిసిన వర్షపాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.मुंबई और उसके आसपास के इलाकों में मूसलाधार बारिश के कारण कई जगहों पर रेलवे ट्रैक जलमग्न हो गए हैं।भारी बारिश होने के कारण। pic.twitter.com/n0Jn1MFtRW— Cockroach Janta Party (@CJP_for_India) July 9, 2026భారత వాతావరణ శాఖ (IMD) ముంబై, థానే ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కొనసాగించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ఇక భారీ వర్షాలతో ముంబైకి తాగునీటిని అందించే విహార్, తులసి సరస్సులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో నగర నీటి సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంత మేర తగ్గినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. Mumbai rains giving no respite this time! Hope it stops soon. 🙁 Stay safe#MumbaiRain pic.twitter.com/o9OSpM6GA2— Puneet Kumar (@puneetiitm) July 8, 2026 -
రైలు బోగీనే హనీమూన్ సూట్!.. వైరల్ వీడియోపై విమర్శలు
ముంబై: కొత్తగా పెళ్లైన ఓ జంట తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం రైలులోని కూపేను ఏకంగా హనీమూన్ సూట్‌లా అలంకరించింది. గులాబీ బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, "ఐ లవ్ యూ" బోర్డుతో కూపేను అందంగా తీర్చిదిద్దింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే స్పందించాల్సి వచ్చింది.. జూలై 6న ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్–పండర్పూర్ నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ జల్నా స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బయటకు చెందిన డెకరేషన్ సిబ్బందిని రైలులోకి అనుమతించి, ప్రయాణికుల కూపేను ప్రత్యేకంగా అలంకరించారు. కొద్దిసేపటికే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వీడియోలు వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే వెంటనే విచారణకు ఆదేశించింది. ప్రయాణికులు తమ సీట్లు లేదంటే కూపేను చిన్నపాటి వ్యక్తిగత అలంకరణలతో అందంగా మార్చుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా బయటి వ్యక్తులను రైలులోకి తీసుకురావడం, భారీగా అలంకరణలు చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.ఈ ఘటనలో అసలు తప్పు కొత్త దంపతులది కాదని, భద్రతా నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులను అనుమతించిన సిబ్బందిదేనని రైల్వే భావిస్తోంది. దీంతో విధుల్లో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సస్పెండ్ చేశారు. అలాగే అనుమతి ఎలా ఇచ్చారు? భద్రతా తనిఖీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే అంశాలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.కొత్త దంపతులపై మాత్రం ఎలాంటి జరిమానా లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. రైల్వే దృష్టి మొత్తం భద్రతా నిబంధనల ఉల్లంఘనపైనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు "ఇలాంటి సర్ప్రైజ్ జీవితంలో ఒక్కసారే వస్తుంది" అంటూ కొత్త దంపతుల ఆలోచనను మెచ్చుకోగా, మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు సరదాగా ఈ రైలుకు "సుహాగ్రాత్ ఎక్స్‌ప్రెస్" అని పేరు పెట్టి మీమ్స్ సృష్టించారు.Hello @AshwiniVaishnaw, does Indian Railways permit passengers to use a First AC coach for a suhagraat? pic.twitter.com/nDUQMkxEyt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) July 8, 2026ఒక జంట తమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలన్న ప్రయత్నం.. చివరకు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తి అధికారుల విచారణ వరకు వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.Honeymoon coach on Indian Railways. Ticket checker suspended. South Central Zone A couple travelling in Train No. 11002 Nandigram express on 6/7/26 had privately engaged a decorator online to decorate their 1st AC coupe. The decorator's entry into the coach was… pic.twitter.com/1ati4A13G4— Rajendra B. Aklekar (@rajtoday) July 8, 2026 -
లోకల్ రైళ్లలో ఆకతాయిల ఆగడాలు
ముంబై: లోకల్ రైళ్లలో డోరువద్ద నిలబడి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో డోరువద్ద వేలాడుతున్న లేదా నిలబడిన 15,589 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి ఏకంగా రూ.40.81 లక్షలు జరిమానా వసూలు చేశారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఆఖరు వరకు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో డోరువద్ద నిలబడిన వారపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ముంబై లోకల్ రైల్వే బోర్డు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇందులో అత్యధికంగా భాయందర్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.ముంబైకర్లకు లైఫ్ లైన్‌గా లోకల్ రైళ్లలో నిత్యం 75–80 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. ఇందులో 80 శాతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కూలీలు ఉండగా మిగతా 20 శాతం సామాన్య జనాలుంటారు. ఉదయం, సాయంత్రం పీక్ హవర్స్‌లో దాదాపు అన్ని రైళ్లు కిక్కిరిసి ఉంటాయి. లోపలికి వెళ్లేందుకు స్థలం దొరకదు. కానీ గ్రూపులు ఏర్పడిన కొందరు ప్రయాణికులు డోరువద్ద, ఫుట్ బోర్డుపై నిలబడి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తారు.వీరు లోపలికెళ్లరు, తోటి ప్రయాణికులకు లోపలికెళ్లేందుకు అవకాశమివ్వరు. డోరు, ఫుట్ బోర్డుపై తిష్టవేసి నిలబడతారు. వీరు గ్రూపులుగా ఉండటంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఎవరైనా లోపలికెళ్లేందుకు దారి ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తే పెత్తనం చెలాయిస్తారు. చేయి చేసుకోవడానికి కూడా వెనకాడరు. దీంతో వీరి జోలికి పోకుండా, వాగ్వాదానికి దిగలేక ఎలాగో మెల్లమెల్లగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా తోటి ప్రయాణకులను ఇబ్బందులకు గురిచేస్తున్న అకతాయిలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే అదికారులు ఆర్పీఎఫ్, గర్నమెంట్ రైల్వే పోలీసు (జీఆర్పీ) బలగాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో వీరంతా పట్టుబడ్డారు. చదవండి: సీఎం ఫడ్నవీస్‌కు రాజ్ ఠాక్రే బహిరంగ లేఖ⇒ ఇదివరకే నడిచే లోకల్ రైళ్లలో అటు, ఇటూ తిరుగుతూ అక్రమ వ్యాపారం సాగిస్తున్న హాకర్లపై చేపట్టిన డ్రైవ్‌లో 7,765 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 7,748 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సెక్షన్ 144 ప్రకారం రూ.38.41 లక్షలు జరిమానా వసూలు చేశారు.⇒ అత్యధికంగా కేసులు నమోదుచేసిన స్టేషన్లలో వల్సాడ్‌లో 1,315 మంది, వాపీలో 830 మంది, పాల్ఘర్లో 774 మంది, నందుర్బార్లో 691 మంది, వసయి రోడ్లో 621 మంది ఉన్నారు. ⇒ ప్రత్యేక డ్రైవ్‌లో 482 ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలు, 181 రాష్ట్ర భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ⇒ 2026 జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో డోరువద్ద నిలబడిన 15,572 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.40.81 లక్షల జరిమానా వసూలు చేశారు.⇒ అక్రమ హాకర్స్ 7,765పై చర్యలు తీసుకోగా ఇందులో 7,748 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.38.41 లక్షలు జరిమానా వసూలు చేశారు. -
ఎన్డీఏ వైపు శరద్ పవార్ వర్గం..?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారానికి దూరంగా ఉన్న కారణంగా తమ నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్డీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ స్టార్ హోటల్లో ఎన్సీపీ (శరద్ పవార్) సీనియర్ నేత జయంత్ పాటిల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మధ్య సమావేశం జరిగినట్లు సమాచారం.శరద్ పవార్ వర్గం అధికారికంగా మహాయుతిలో చేరితే వారికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం, బాధ్యతలు లభించవచ్చనే అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే మహాయుతిలో నేరుగా చేరకుండా బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశంపైనా అభిప్రాయాలు పంచుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీతో మహావికాస్ అఘాడీలోని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)ను రాజకీయంగా ఒంటరి చేసే వ్యూహంలో భాగంగానే శరద్ పవార్ అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. తావడేతో సమావేశం అనంతరం జయంత్ పాటిల్ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.ఇదిలా ఉండగా, ఇటీవల ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మరావ్ బాబా అత్రామ్ మాట్లాడుతూ.. శరద్ పవార్ వర్గానికి చెందిన కనీసం ఐదుగురు ఎంపీలు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని, ఈ ఏడాది డిసెంబర్ 12లోపు వారి చేరిక జరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల కిందట శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల విలీనంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. అయితే పరిస్థితులు మారిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాలకు ఎలాంటి మలుపు తిప్పుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే జయంత్ పాటిల్, వినోద్ తావడే భేటీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.చదవండి: సీఎం ఫడ్నవీస్‌కు రాజ్ ఠాక్రే బహిరంగ లేఖ -
ముంబై జలమయం..పౌరుల నిర్లక్ష్యమే కారణం : బాంబే హైకోర్టు
ముంబై: నగరంలో ప్రతి ఏటా వర్షాలకు రోడ్లు చెరువులను తలపించడం అనేది పౌరులు స్వయంగా కొనితెచ్చుకున్న సంక్షోభమేనని బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజలు భూములను ఆక్రమించడం, మురుగు కాలువలను పూడ్చివేయడం, ప్రభుత్వ మౌలిక వసతులను దుర్వినియోగం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని కోర్టు పేర్కొంది .తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర వి. ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రజలు మురుగు కాలువలలో చెత్త వేయడం,నడిచే దారులను అక్రమ పార్కింగ్ స్థలాలుగా మార్చడం, ఫుట్‌పాత్‌లను ఫుడ్ స్టాళ్లతో ఆక్రమించడం వల్లే ముంబై నగరం మునిగిపోవడానికి కారణమవుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది .హైకోర్టు వెలుపల ఉన్న ఫుట్‌పాత్‌లను సైతం అక్రమ దుకాణాలతో ఆక్రమించేశారని జస్టిస్ ఘుగే ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన మాతృభూమిని మనమే దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నాం. అక్రమంగా భూములను ఆక్రమించుకోవడం, ఆ తర్వాత కూల్చివేత నోటీసులు వచ్చినప్పుడు మాత్రమే చట్ట పుస్తకాలను వెతకడం సరికాదు అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ఇల్లు మారాలనుకున్నారు : అంతలోనే కుటుంబం సజీవ సమాధి
దేశ వాణిజ్య నగరం ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక అక్రమ భవనం కూలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ముంబైలోని మాన్‌ఖుర్ద్ పరిధిలో గల మండాలా (జనతా నగర్) ప్రాంతంలో భారీ వర్షాల వల్ల ఒక నాలుగు అంతస్తుల అక్రమ కట్టడం పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. వారంతా ఆ మర్నాడే ఇల్లు మారాలనుకున్నారు. ఇంతలోనే మృత్యువు వారిని వెంటాడింది.ప్రమాదాన్ని ముందే ఊహించినారోజువారీ కూలిగా పనిచేసే మొయినుద్దీన్ వాజిద్ అలీ షా, ఆయన భార్య అక్తర్ జహాన్ తమ నలుగురు పిల్లలతో కలిసి ఒక రేకుల ఇట్లో నివసిస్తున్నారు. అయితే పక్కనే ఉన్న భవనం వర్షాలకు దెబ్బతిని, కూలిపోయేలా ఉందని వారు ముందే ప్రమాదాన్ని పసిగట్టారు. ఆదివారం నాడే ఆ ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు.. మనం బతికిపోతాం అని భార్యాబిడ్డలతో చెప్పాడు. ఫుడ్ తీసుకు రావడానికి అలా బయటికి వెళ్లాడో.. లేదో 10 నిమిషాల్లో అంతా ముగిసిపోయింది.శనివారం రాత్రి అక్తర్ జహాన్ ఇల్లు మారడానికి సామాన్లు ప్యాక్ చేసుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా వారి ఇంటిపై కూలిపడింది. మొయినుద్దీన్ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందే బయటకు వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఇంట్లోనే ఉన్న భార్య, నలుగురు పిల్లలు శిథిలాల క్రింద చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు చిన్న పిల్లలే ఉన్నారు. ఇందులో పొరుగింట చిన్నారి కూడా ఉంది. భవనం కూలిపోవడానికి కొన్ని గంటల ముందే అందులో స్పష్టమైన మార్పులు కనిపించాయని స్థానికులు తెలిపారు. గోడలకు పగుళ్లు రావడం, టైల్స్ ఊడిపడటం, భవనం ఒక పక్కకు వంగిపోవడంతో ఆ బిల్డింగ్‌లో ఉంటున్న కుటుంబాలు ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. అలా వారు ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ, ఆ భవనం పక్కనే ఉన్న పేదల రేకుల షెడ్లపై పడటంతో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఇదీ చదవండి: నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసింది. కూలిపోయిన ఆ అక్రమ కట్టడం యజమానిని, దానిని నిర్మించిన కాంట్రాక్టర్‌ను పోలీసులుఅరెస్ట్ చేశారు. భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముంబై మున్సిపల్ అధికారులు కూడా అది అనధికారిక కట్టడమేనని ధృవీకరించారు. మరోవైపు ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానిక మున్సిపల్ సిబ్బంది రాత్రంతా శ్రమించి శిథిలాల కింద ఉన్నవారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ఇదీ చదవండి: హాట్ టాపిక్‌గా బిగ్‌బీ అమితాబ్ రూ. 15 కోట్ల ల్యాండ్ డీల్ -
ఆమీర్ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కుండపోత వర్షాలు, బలమైన గాలుల మధ్య అంబానీ భద్రతా కాన్వాయ్ ముందు ఒక చెట్టు కూలిపోవడంతో, కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాపిక్‌లో కొద్దిసేపు ఆగిపోవాల్సి వచ్చింది. అంబానీ కుటుంబం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో వివాహ వేడుకకు వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
125 ఏళ్ల ‘డబ్బావాలా’ సేవలకు బ్రేక్
ముంబై: ముంబైలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదల కారణంగా నగరానికి జీవనాడి లాంటి ముంబయి ‘డబ్బావాలా’ల సేవలు సోమవారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. పలు ప్రాంతాలు జలమయం కావడం, డబ్బావాలాల రవాణాకు ప్రధాన ఆధారమైన సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో డెలివరీలను నిలిపివేయాల్సి వచ్చింది. తమ సిబ్బంది రక్షణను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్బావాలా అసోసియేషన్ తెలిపింది.డబ్బావాలా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉల్హాస్ ముకే మాట్లాడుతూ, విరార్-వసాయి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పలువురు డబ్బావాలాల ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక రైల్వే స్టేషన్లలో కూడా నీరు నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు సేవలను నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. ఈ తాత్కాలిక అంతరాయానికి వినియోగదారులకు అసోసియేషన్ క్షమాపణలు తెలిపింది.భారీ వర్షాల కారణంగా వెస్ట్రన్ రైల్వే పరిధిలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అసోసియేషన్ పేర్కొంది. ప్రతిరోజూ వేలాది లంచ్ బాక్సులను రవాణా చేయడానికి డబ్బావాలాలు ముంబయి సబర్బన్ రైల్వే నెట్వర్క్పైనే ఎక్కువగా ఆధారపడతారు. రైళ్లు ఆలస్యం కావడం వల్ల సకాలంలో డెలివరీలు చేయడం కష్టమవుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.గడిచిన 125 ఏళ్లకు పైగా ముంబయి ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ, తమ కార్మికుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యత అని డబ్బావాలా అసోసియేషన్ తెలిపింది. ‘మాకు 125 సంవత్సరాల సుదీర్ఘ సంప్రదాయం ఉన్నప్పటికీ, మా ఉద్యోగుల భద్రతే మాకు అన్నింటికంటే ముఖ్యం. అందువల్ల, ముందస్తు జాగ్రత్తగా ఈరోజు సేవలను నిలిపివేస్తున్నాం’ అని అసోసియేషన్ తెలిపింది.ముంబై డబ్బావాలాలు తమ అత్యంత సమర్థవంతమైన లంచ్ బాక్స్ డెలివరీ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రతి పనిదినం నగరవ్యాప్తంగా వేలాది ఇంటి భోజన డబ్బాలను ఎంతో ఖచ్చితత్వంతో వీరు చేరవేస్తారు. వీరి లాజిస్టిక్స్ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు అధ్యయనం చేశాయి. ఇది అత్యుత్తమ సప్లై చైన్ సిస్టమ్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముంబైలో అత్యంత నమ్మకమైన సేవగా పేరొందిన డబ్బావాలాల వ్యవస్థ నిలిచిపోవడం అక్కడి వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది. -
ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తూర్పు ముంబై పరిధిలో భవనం కూలి ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలగడంతో పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. VIDEO | At least six persons were killed and one sustained injuries when a three-storey chawl (row tenement) collapsed in Mumbai’s Mankhurd area amid heavy rains on Sunday night, officials said. Rescue operation is going on. Visuals are from the spot.#Mumbai #Mankhurd pic.twitter.com/IHXyvlRdyP— Press Trust of India (@PTI_News) July 5, 2026భారీ వర్షాల కారణంగా ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను నిలిపివేసి, రహదారిని మూసివేశారు. టన్నెల్ పైభాగం నుండి వర్షపు నీరు జలపాతంలా కిందకు పడటం, రహదారిపై రోడ్డు నిర్మాణ శిథిలాల చరియలు విరిగిపడిన దృశ్యాలు స్థానిక టెలివిజన్ ఛానళ్లలో ప్రసామవుతున్నాయి. రహదారి రవాణాతో పాటు విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంబై-పూణె మధ్య నడిచే దూరప్రాంత రైళ్లను సైతం అధికారులు రద్దు చేశారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత నెల చివర నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి నగరంలో చెట్లు విరిగిపడి ఇప్పటివరకు మరో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ముంబై నగరంలో సగటున 100 మిల్లీమీటర్ల (3.9 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 161 మిల్లీమీటర్ల (6.3 అంగుళాలు) వరకు వర్షం కురిసింది. ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం చాలా చోట్ల చాలా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.ఇది కూడా చదవండి: రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం! -
ప్రజల మరణాలపై వెకిలి నవ్వులా?
ముంబై: రాజకీయాల్లో విలువలు, సంస్కారం క్షీణిస్తున్నాయంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని, అదే ధోరణి ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లోనూ కనిపిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సున్నితత్వాన్ని కోల్పోయారని, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులను నియంత్రించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం ఫడ్నవీస్‌కు ఎక్స్ వేదికగా శనివారం బహిరంగ లేఖ రాశారు.''మహారాష్ట్ర రాజకీయాలకు ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేక గౌరవం ఉండేది. ఇతర రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే ఇక్కడి నాయకత్వం ఆలోచనాత్మకంగా, పరిణతితో వ్యవహరించేది. అయితే గత కొన్నేళ్లుగా ఆ ప్రత్యేకత కనుమరుగవుతోంది. ప్రజల మరణాలపై ఒక ఎమ్మెల్యే వెకిలిగా నవ్వుతూ వ్యాఖ్యలు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. “అధికారం అవినీతికి దారి తీస్తుంది, సంపూర్ణ అధికారం సంపూర్ణ అవినీతికి దారి తీస్తుంది” అనేలా ప్రస్తుత బీజేపీ నాయకుల ప్రవర్తన ఉంది.ఫడ్నవీస్‌ను ఒకప్పుడు సున్నిత మనసున్న, సంస్కారవంతమైన ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ప్రజలు భావించారు. నేను కూడా అదే అభిప్రాయంతో ఉండేవాడిని. అయితే ఇటువంటి సంఘటనలపై ఆయన మౌనం పాటించడం వల్ల ఆ అభిప్రాయాన్ని పునఃపరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బాలాసాహెబ్ ఠాక్రే, శరద్ పవార్, ప్రమోద్ మహాజన్ వంటి నాయకులు రాజకీయ నైతిక విలువలను కాపాడారు. ప్రస్తుతం మాత్రం అధికార పక్ష నేతలు ఎలాంటి తప్పులు చేసినా వారిని కాపాడే ధోరణి పెరిగింది. ఇది మహారాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది. మంత్రులు, ఇతర నాయకులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి స్పందించడం లేదు.చదవండి: శివసేన తరహా కష్టమే ఆ పార్టీకి!మీరు ఒకసారి కఠిన చర్యలు తీసుకుంటే అందరూ క్రమశిక్షణలోకి వస్తారు. కానీ మీ మౌనం వల్లే వారు మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి ప్రజలు స్పష్టమైన సంకేతాలు, నాయకత్వాన్ని ఆశిస్తున్నారు, దయ చేసి ఆ నమ్మకాన్ని దెబ్బతీయకండి. ఇలాంటి వ్యవహారాలపై రాజీనామాలు కోరాల్సిన స్థితిలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో తప్పు సంప్రదాయాలకు తావివ్వకండి. మీరు వివేకవంతులు. మీపై ఇంకా ప్రజలకు ఆశలు ఉన్నాయ''ని రాజ్ ఠాక్రే బహిరంగ లేఖలో పేర్కొన్నారు.ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలుకాగా, మహారాష్ట్రలో గత నాలుగు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో స్కూలు బస్సుపై చెట్టు కూలి 11 బాలుడు, మూత లేని మ్యాన్‌హోల్‌లో పడి 60 ఏళ్ల వృద్ధుడు మరణించారు. వీరి మరణాల మరణాలపై ముంబై బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అమీత్ సతమ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. "నిన్న ఒక చెట్టు వల్ల, ఈ రోజు ఒక మ్యాన్‌హోల్ వల్ల...'' అంటూ హేళనగా మాట్లాడారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ముంబైలో వర్ష బీభత్సం..‘రెడ్ అలర్ట్’ జారీ!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రంలో భారీ అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ, ఈ వారం ప్రారంభం నుండి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. ఐలాండ్ సిటీలో సగటున 99 మి.మీ, తూర్పు శివారు ప్రాంతాలలో 98 మి.మీ, పశ్చిమ శివారు ప్రాంతాలలో 94 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
శివసేన తరహా కష్టమే ఆ పార్టీకి!
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన ఎదుర్కొన్న ‘‘పార్టీ ఎవరిది?” అనే సంక్షోభం.. దేశ రాజకీయాల్లోనే పెద్ద మలుపుగా నిలిచింది. నాయకత్వం, గుర్తు, ఎమ్మెల్యేలు.. అన్నీ ఒకేసారి చీలిపోయి చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన తీరు అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు అదే తరహా రాజకీయ తుపాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చుట్టూ తిరుగుతుండడంతో.. బెంగాల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.తాజాగా కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిర్చాయి. రితాబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గం కార్యాలయంలోకి తాళాలు పగలగొట్టి ప్రవేశించడం.. లోపలే సమావేశాలు నిర్వహించడం.. “మాదే అసలు టీఎంసీ” అంటూ ప్రకటించుకోవడం.. మళ్లీ తాళాలు వేసుకుని వెళ్లడం వంటి చర్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. పార్టీ అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిరంగ బల ప్రదర్శన స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇది అప్పటి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన.. మహా పొలిటికల్ డ్రామాను తలపిస్తోంది.మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కూడా ఇదే తరహా రాజకీయ ఉత్కంఠకు దారి తీసింది. అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గానికి పెద్ద షాక్ తగిలింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాట పట్టి, అసెంబ్లీ సంఖ్యాబలం ఒక్కసారిగా మారిపోయింది. గోవా, గుజరాత్ క్యాంప్‌లలో జరిగిన రాజకీయ కదలికల తర్వాత చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఉద్ధవ్ వర్గం, మరోవైపు షిండే వర్గం అంటూ అసలు శివసేన ఎవరిదన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ గుర్తు, పేరు, అధికారిక హక్కులపై జరిగిన పోరులో.. షిండే పై చేయి సాధించారు. దీంతో బెంగాల్లోనూ సీన్ రిపీట్ కాక తప్పదా? అనే చర్చ జోరందుకుంది.ఇక బెంగాల్ టీఎంసీ సంక్షోభానికి కేవలం ఎమ్మెల్యేల స్థాయిలోనే కాకుండా ఎంపీల స్థాయిలో కూడా కొనసాగుతుందని తెలిసిందే. టీఎంసీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీల్లో 20 మంది సభ్యులు ఎన్సీపీఐ అనే రాజకీయ వేదికలో విలీనం కావడం.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించడం.. తెలిసిందే. ఇది జరిగిన కొద్దిరోజులకు..ఇదే తరహా రాజకీయం మహారాష్ట్రలోనూ కనిపించింది. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఎంపీల్లో కొందరు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధపడ్డారు. శివసేన సంక్షోభ సమయంలో ఎలా అయితే ఎమ్మెల్యేల మార్పు జరిగిందో.. ఇప్పుడు బెంగాల్లోనూ అదే తరహా చీలిక ఎపిసోడ్ నడుస్తోంది. అలాగే.. ఇరు చోట్ల “పార్లమెంటరీ షిఫ్టింగ్” ఒకేసారి చోటు చేసుకోవడం కొత్త చర్చకు దారి తీసింది. పార్టీలో అంతర్గత చీలిక.. ఎమ్మెల్యేల వేరు వర్గం.. ఎంపీల షిఫ్టింగ్.. మహారాష్ట్ర, బెంగాల్ రాజకీయాల్లో ఒకే ట్రెండ్ కొనసాగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద టీఎంసీ పార్టీ పేరు, గుర్తు, నిర్మాణంపై హక్కుల వివాదం పెండింగ్‌లో ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే శివసేన తరహా సంక్షోభమే ఇప్పుడు టీఎంసీకి కూడా ఎదురవుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. -
పోలీసులు రాజకీయ నాయకుల సేవకులేం కాదు
ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికీ ఉంటుందని చెబుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అలాగే.. పోలీసులు రాజకీయ నాయకులకు సేవకులు కాదని.. ప్రజా సేవకులని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రన చర్యలు తీసుకోవడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.ముంబై పోలీసులు ఒక రాజకీయ కార్యకర్తపై విధించిన నగర బహిష్కరణ (externment) ఆదేశాన్ని తాజాగా ముంబై హైకోర్టు రద్దు చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జందార్ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పౌరులు ప్రభుత్వానికి బానిసలు కారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు కూడా ఉంది. పోలీసులు ప్రజల సేవకులు.. అంతేకానీ రాజకీయ నాయకుల సేవకులు కారు’’ అని వ్యాఖ్యానించారు.సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ప్రధాన కార్యదర్శి సయ్యద్ వహీద్ చౌదరిపై ముంబై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. ఆయన 2019 నుంచి 2024 మధ్య వివిధ నిరసనల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ పోలీసులు పలు FIRలు నమోదు చేశారు. అందులో సీఏఏ, ఎన్ఆర్సీతోపాటు బాబ్రీ మసీదు–జ్ఞానవాపి వివాదాలు, ఇంధన ధరల పెరుగుదల వ్యతిరేక నిరసనల్లాంటివి ఉన్నాయి. ఈ కేసుల ఆధారంగా కొంకణ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ 2025 డిసెంబర్లో చౌదరిని ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక సంవత్సరం పాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను డివిజనల్ కమిషనర్ కూడా సమర్థించారు. ఈ బహిష్కరణ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, వాటిని పూర్తిగా కొట్టివేసింది. పోలీసులు తీసుకున్న చర్యలు చట్టబద్ధంగా నిలబడవని స్పష్టం చేసింది.కోర్టు ప్రధాన పరిశీలనలుకేవలం నిరసనల్లో పాల్గొన్నందుకే నగర బహిష్కరణ విధించడం సరైనదికాదు. ఇది పౌరుల భావప్రకటన స్వేచ్ఛ (Article 19), జీవించే హక్కు (Article 21)ను ఉల్లంఘిస్తుందని తేల్చింది. అలాగే, ఆ ఆరోపణలు ప్రజా భద్రతకు తీవ్రమైన ముప్పుగా పోలీసులు నిరూపించలేకపోయారు అని బాంబే హైకోర్టు పేర్కొంది. దీంతో ముంబై పోలీసులు జారీ చేసిన నగర బహిష్కరణ ఆదేశాన్ని, అలాగే అప్పీల్ స్థాయిలో ఇచ్చిన ఆమోదాన్ని కూడా హైకోర్టు రద్దు చేసింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కు మూలాధారం అని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం నేరం కాదని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
పుణే కేసు: అసభ్య సైగ చేసిన సియా.. వీడియో వైరల్
పుణే: యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. లోహగఢ్ ఫోర్ట్ సమీపంలోని లోయలో అతన్ని ఎవరు తోసి చంపారన్న అంశంపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, దర్యాప్తులో పరస్పర విరుద్ధమైన వాదనలు బయటపడుతుండటంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.క్రైమ్ రీక్రియేషన్‌లో భాగంగా.. పోలీసులు ఆమెను తన నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బయటకు తీసుకువస్తున్న సమయంలో మీడియా ఎదుట ఆమె మిడిల్ ఫింగర్(అసభ్య సైగ) చూపింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆమె ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. Pune, Maharashtra: Siya Goyal, accused in the Ketan Agarwal murder case, was taken by Pune Rural Police to her Market Yard residence for investigation. After the investigation was completed, while leaving the house, Siya Goyal allegedly made obscene gestures and showed the middle… pic.twitter.com/mHnQKlfRrq— IANS (@ians_india) July 2, 2026జూన్ 18న పుణే సమీపంలోని లోహ్‌గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. మొదట ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసినప్పటికీ.. దర్యాప్తులో ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. సియా గోయల్, కేతన్ అగర్వాల్ కుటుంబాలు ముందే వివాహాన్ని ఖరారు చేశాయి. నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను సియా హతమార్చింది. అయితే.. కేసులో ఎవరు నిజంగా కేతన్‌ను లోయలోకి తోశారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష అవసరమని కోర్టును అభ్యర్థించారు. నిందితులు మౌనం వహిస్తున్నందున దర్యాప్తుకు ఇది కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే నిందితురాలి సమ్మతి తప్పనిసరి అని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించబడవని, అవి కేవలం దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది.మరోవైపు దర్యాప్తులో కీలకంగా జనవరి నుంచి జూన్ వరకు సియా–చేతన్ మధ్య 2,000కు పైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. ఘటన అనంతరం కేతన్ మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న సీసీటీవీ దృశ్యాలు కూడా పోలీసులు గుర్తించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండు దశల్లో ఘటన స్థలంలో సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఒకసారి, చేతన్‌ను తీసుకెళ్లి మరోసారి లోహగఢ్ ఫోర్ట్ వద్ద సంఘటనను పునర్నిర్మించినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో ఫోరెన్సిక్ విశ్లేషణ, డిజిటల్ ఆధారాల రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (హత్య), 61 (కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. ఒకవైపు నిందితురాలి వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా, మరోవైపు లై డిటెక్టర్ టెస్ట్ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఈ కేసును మరింత కీలక దిశలోకి తీసుకెళ్లింది. -
ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి
సాక్షి ముంబై: ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు మహారాష్ట్రపై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ముంబైతో పాటు థానే, నవీ ముంబై, కల్యాణ్–డోంబివలీ, భివండి, పాల్ఘర్, రాయగడ్, కొంకణ్ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముంబైకి ఐదు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ , రత్నగిరికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 2న పాల్ఘర్, జూలై 3, 4 తేదీల్లో రాయగడ్, జూలై 4న థానే, జూలై 5న సతారా ఘాట్ ప్రాంతాలకు, జూలై 2 నుంచి 4 వరకు పుణే ఘాట్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.కొంకణ్, మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్రకూ హెచ్చరిక కొంకణ్ ప్రాంతంలోని చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. మరాఠ్వాడాలో చాలా ప్రాంతాల్లో, ఉత్తర మహారాష్ట్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ మహారాష్ట్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నట్లు అంచనా వేసింది.ముంబై జలమయం.. అంధేరి సబ్వే మూసివేత ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అంధేరి సబ్వేలో నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీరు చేరడంతో అధికారులు వాహనాల రాకపోకలను చాల సమయం పాటు పూర్తిగా నిలిపివేశారు. జోగేశ్వరి, గోరేగావ్, మలాడ్, కాందివలి, బోరివలి, కుర్లా, ములుండ్, శాంతాక్రూజ్, బాంద్రా తదితర ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.హైవేలపై భారీ ట్రాఫిక్.. లోకల్ రైళ్లకు అంతరాయం నవీ ముంబైలోని జూయినగర్ సమీపంలో సైన్–పన్వేల్ జాతీయ రహదారిపై భారీగా నీరు చేరడంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు భివండి బైపాస్ వద్ద ముంబై–నాసిక్ జాతీయ రహదారిపై కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. భారీ వర్షాల ప్రభావంతో సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాల్లో లోకల్ రైళ్లు 15–20 నిమిషాలు, వెస్ట్రన్ రైల్వేలో 5–10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ములుండ్‌లోని బీఎంసీకి చెందిన ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రైతులకు ఊరట.. ప్రజలకు అప్రమత్తత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ పంటల విత్తనాలు వేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ముంబై మహానగర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీటమునిగిన రహదారుల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.చదవండి: ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికులు ఫైర్కల్యాణ్–డోంబివలీ జంట నగరాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. శిల్ఫాటా ప్రాంతంలో రహదారి పక్కన నిలిపిన కార్లు దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కల్యాణ్ తూర్పులోని ఆడివలి, ఢోకళి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. భాండుప్ విలేజ్ రోడ్డులో కాలువలు పొంగిపొర్లడంతో విద్యార్థులు వరద నీటిలోనే ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. థానే జిల్లాలోని భివండీ, ఉల్హాస్నగర్, అంబర్నాథ్, బద్లాపూర్, షాహాపూర్, ముర్బాడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాగ్లే ఎస్టేట్‌లో చెట్టు కూలి ఓ వ్యక్తి గాయపడగా, పలు చోట్ల చెట్లు కూలి వాహనాలు దెబ్బతిన్నాయి. డోంబివలీ ఎంఐడీసీ ప్రాంతంలో విద్యుత్ లైన్లపై చెట్టు పడటంతో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడి..
ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. వర్షం మధ్య తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అంధేరి-సాకినాకా, జోగేశ్వరి ప్రాంతాలను కుర్లా, ఘాట్‌కోపర్‌తో కలిపే ఖైరానీ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అతడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు సమాచారం.ఘటనాస్థలిలో అతడి గొడుగు, చెప్పులు కనిపించాయి. ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టారు. దాదాపు 2 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న మరమ్మతుల పనుల వల్ల మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉంచారు. డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ సంబంధిత కాంట్రాక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్టు చెప్పారు.ఈ ఘటనకు 2 రోజుల ముందే ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో స్కూల్ బస్సుపై చెట్టు కూలి 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ ఘటనపై ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం బయటపడటంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ అధికారిని సస్పెండ్ చేసింది.ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలుగురువారం కూడా ముంబైలో భారీ వర్షం కొనసాగింది. దాదర్, పరేల్, హింద్మాతా, చార్కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరి సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.గురువారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో తూర్పు శివారు ప్రాంతాల్లో సగటున 189 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర ప్రధాన ప్రాంతాల్లో 172 మిల్లీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ముంబై జీవనాడిగా భావించే లోకల్ రైలు సర్వీసులపై కూడా వర్షం ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పట్టాలపై నీరు చేరడంతో ఉదయం రైళ్లు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడిచాయని ప్రయాణికులు తెలిపారు. అయితే రైల్వే అధికారులు మాత్రం రైలు సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా సాధారణంగానే నడుస్తున్నాయని వెల్లడించారు. -
పుణే కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్!.. తెరపైకి లై డిటెక్టర్ టెస్ట్
పుణే: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసిన కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలు సియాపై లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులు గురువారం పుణే కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీయడానికి ఈ పరీక్ష అవసరమని వారు వాదించినట్లు సమాచారం.కేతన్‌ను లోహన్‌గఢ్ కోట వద్ద ఎవరు లోయలోకి తోసి చంపారనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. తొలుత సియా ప్రియుడు చేతన్ తోశాడని.. తర్వాత సియానే తోసిందని.. ఆపై చేతన్ స్నేహితుడి ప్రమేయం ఉందని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఎవరు తోశారో కచ్చితంగా చెప్పగలిగే ఆధారం మాత్రం లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో నిందితులు మౌనం వహిస్తున్నారని వివరించారు. ఈ తరుణంలో లై డిటెక్టర్ పరీక్ష ఒక్కటే మార్గమని కోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే, సియా తరఫు న్యాయవాది విపుల్ దుషింగ్ మాత్రం లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలంటే కోర్టు అనుమతి మాత్రమే సరిపోదని, నిందితురాలి సమ్మతి కూడా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు, పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలను కోర్టు ప్రత్యక్ష సాక్ష్యంగా పరిగణించదని, అవి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆధారాలు, లీడ్స్ సేకరించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.కేసు ఇప్పటికే మిస్టరీగా మారిన నేపథ్యంలో, ఎవరి పాత్రపై కూడా ఇప్పటివరకు తేలికైన ఆధారాలు లభించకపోవడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. కోర్టు ఈ అభ్యర్థనపై ఎలా స్పందిస్తుందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, పుణె రూరల్ పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వివాహం విషయంలో అసంతృప్తిగా ఉన్న కేతన్‌ను ఆయన కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటో షూట్ సమయంలో కేతన్‌ను 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు అంతకు ముందు.. జూన్ 14న ఇదే కోట వద్ద జరిగిన మరో ప్రయత్నం విఫలమైనట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.దర్యాప్తులో కీలకంగా, 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ చౌదరి హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జనవరి నుంచి జూన్ మధ్యలో సియా–చేతన్ మధ్య 2,000కుపైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. కేతన్ మరణం అనంతరం అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాల నేపథ్యంలో జూన్ 23న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కేసు అత్యంత కీలక దశలో ఉండగా, దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసులో.. కేతన్ తరఫున ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్స్ 103 (హత్య), 61 (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.దర్యాప్తులో భాగంగా పోలీసులు జూన్ 28న సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఘటన పునర్నిర్మాణం (Crime Scene Recreation) నిర్వహించారు. జూలై 1న చేతన్ చౌదరిని నేరుగా లోహగఢ్ కోటకు తీసుకెళ్లి మరోసారి సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో గైట్ అనాలిసిస్, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, అలాగే డిలీట్ చేసిన డేటా రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఘటనకు ముందు.. మరో కోట వద్ద ఈ ఇద్దరూ కేతన్‌ను ఎలా తోసి చంపాలో రిహార్సల్స్ సైతం నిర్వహించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. లై-డిటెక్టర్ పరీక్షపై కోర్టు నిర్ణయం దర్యాప్తులో తదుపరి కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
మహా రాజకీయాల్లో బాంబు పేల్చిన జూనియర్ థాక్రే
మహారాష్ట్ర యువనేత ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ యూబీటీ(ఉద్దవ్ థాక్రే) శివసేన నుంచి జరుగుతున్న వరుస వలసలు యాదృచ్ఛికం కాదని, దీని వెనక పెద్ద కుట్ర దాగుందని అంటున్నారాయన. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ షిండే నేతృత్వంలో జరుగుతున్న ‘‘ప్లాన్డ్ పొలిటికల్ ఆపరేషన్’’లో భాగమని ఠాక్రే ఆరోపించారు.ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జూనియర్ థాక్రే.. మహారాష్ట్రలో గత కొంతకాలంగా జరుగుతుందని ఆపరేషన్ టైగర్ కాదని.. దానిని ఆపరేషన్ దేవేంద్ర ఫడ్నవిస్ అని అభివర్ణించారు. దీని వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహాత్మక హస్తం ఉందని, షిండేను ముందుంచి ఆ పెద్దలు ఈ డ్రామాను నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆపరేషన్ ఉద్దేశం.. ఫడ్నవిస్‌ను ఎదగకుండా అడ్డుకోవడమే సంచలన వ్యాఖ్యలు చేశారు.శివసేన (UBT) నుంచి ఇటీవల 9 మంది ఎంపీల్లో 6 మంది షిండే వర్గానికి చేరిన విషయాన్ని ప్రస్తావించిన ఆదిత్య ఠాక్రే.. తమ పార్టీని ఈ పెద్ద రాజకీయ ఎత్తుగడలో “కాలాటరల్ డ్యామేజ్”గా(లక్ష్యంగా కాకపోయినా దెబ్బతినడం) వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గానికి తరలించబడే అవకాశం ఉందని, ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు.‘‘బహుశా ఇది దేవేంద్ర ఫడ్నవీస్‌కు చివరి అసెంబ్లీ సెషన్ కావచ్చు’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. షిండే కూడా తిరిగి ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.వలసల వెనుక డబ్బు పాత్ర ఉందన్న ఆరోపణలను కూడా ఆదిత్య ఠాక్రే పునరుద్ఘాటించారు. కొన్ని వీడియోలు, మీడియా క్లిప్స్‌ను ఆధారంగా చూపుతూ, ఎమ్మెల్యేలు పార్టీ మారిన వెంటనే ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. “పార్టీ మారిన వెంటనే లగ్జరీ ఫ్లాట్లు, ఖరీదైన కార్లు ఎలా వస్తాయి?” అని ఆయన వ్యాఖ్యానించారు.అదేవిధంగా బీజేపీపై కూడా ఆదిత్య ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. రామమందిర ట్రస్ట్ నిధులపై వచ్చిన వివాదాలను ప్రస్తావిస్తూ, పారదర్శకతపై ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. బీజేపీని ‘‘బాబర్ జనతా పార్టీ’’గా అభివర్ణించారు.అయితే ఈ ఆరోపణలపై బీజేపీ, షిండే వర్గాలు ఇంకా స్పందించలేదు. అయితే.. ఉద్దవ్ శివసేన (UBT) రాజకీయంగా ఒత్తిడిలో ఉండటం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీని బాబర్జనతా పార్టీగా అభివర్ణించడమూ రాజకీయంగా పెద్ద దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. -
తెలుగు ఓటు ఎటువైపు?
సాక్షి ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామం వర్లీ నియోజకవర్గంలో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. శివసేన (యూబీటీ)కు చెందిన ఎమ్మెల్సీ, వర్లీ ప్రాంత సీనియర్ నాయకుడు సచిన్ అహిర్ ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనలో చేరడంతో వర్లిలోని తెలుగు ఓటర్ల రాజకీయ వైఖరి ఎలా ఉండబోతుందనే అంశం వర్లీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రేకు అండగా నిలిచిన తెలుగు ఓటు బ్యాంకు ఇప్పుడు ఏ దిశగా పయనిస్తుందన్న దానిపై ముఖ్యంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.వర్లి నియోజకవర్గంలో వర్లి నాకా, పద్మశాలీ చౌక్, బీడీడీ చాల్స్ 108 బిల్డింగ్‌తో పాటు పలు చుట్టు పక్కల ప్రాంతాల్లో వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబాలు స్థానిక రాజకీయాల్లో కూడా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగు ఓటు కీలకంగా మారడం వర్లి రాజకీయాల్లో సర్వసాధారణం. సచిన్ అహిర్ ఏ పార్టీలో ఉన్నా తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలుగు సంఘాల కార్యక్రమాలు, సామాజిక వేడుకలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొనడంతో ఆయనకు తెలుగు ప్రజల్లో వ్యక్తిగతంగా మంచి ఆదరణ ఏర్పడింది. అందుకే రాజకీయ పార్టీ కంటే సచిన్ అహిర్ వ్యక్తిత్వానికే ప్రాధాన్యం ఇచ్చే తెలుగు ఓటర్లు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ సునీల్ శిందే కూడా వర్లి తెలుగు ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలుగు సంఘాలు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, స్థానికులతో నిరంతరం మమేకమవుతూ ఆయన కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడిగా ఆయనకు కూడా మంచి ఆదరణ ఉందని స్థానిక రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే విజయంలో సచిన్ అహిర్, సునీల్ షిందే ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలుగు ఓటర్లను సమీకరించి ఆదిత్య ఠాక్రేకు అనుకూలంగా మద్దతు కూడగట్టడంలో ఈ ఇద్దరు నాయకుల పాత్ర ముఖ్యమైందని అప్పట్లో రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. సచిన్ అహిర్ శిందే శివసేనలో చేరగా, సునీల్ షిందే మాత్రం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లోనే కొనసాగుతున్నారు. దీంతో రాబోయే భవిష్యత్ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు ఇరు వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.దుకాణాలు, రోడ్లు చర్చావేదికలుగా.. ప్రస్తుతం వర్లిలో తెలుగు ప్రజలు వివిధ రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉన్నారు. కొందరు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు, మరికొందరు శిందే శివసేనకు, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తదితర పార్టీలకు అనుకూలంగా ఉన్నారు. అయినప్పటికీ, వ్యక్తిగతంగా సచిన్ అహిర్‌కు మద్దతుగా ఉండే తెలుగు ఓటర్ల సంఖ్య అలాగే సునీల్ శిందే మద్దతుగా ఉండే తెలుగు ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.మంగళవారం సాయంత్రం వర్షం కురుస్తున్నప్పటికీ వర్లి నాకా, పద్మశాలి చౌక్, 108 బిల్డింగ్ చుట్టూ ఉన్న పలు తెలుగు సంఘాల భవనాల్లో దుకాణాలలో రోడ్లపై తెలుగు ప్రజలు ఈ రాజకీయ పరిణామంపై చర్చించుకుంటూ కనిపించారు. ‘ఇకపై తెలుగు ఓటు ఎటువైపు?‘, ‘సచిన్ అహిర్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది?‘, ‘సునీల్ శిందే మద్దతుతో యూబీటీ తన పట్టు నిలబెట్టుకోగలదా?‘ వంటి అంశాలు ప్రధాన చర్చగా మారాయి.చదవండి: ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికులు ఫైర్రాబోయే రోజుల్లో సచిన్ అహిర్ శిందే శివసేన తరఫున ప్రచారం నిర్వహించే అవకాశం ఉండగా, సునీల్ శిందే ఉద్ధవ్ ఠాక్రే శివసేన తరఫున ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్లి తెలుగు ఓటర్లపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగు ఓటర్లు రెండు వర్గాలుగా చీలుతారా? లేక అభ్యర్థులు, స్థానిక పరిస్థితులు, ఎన్నికల నాటికి ఏర్పడే రాజకీయ సమీకరణాల ఆధారంగా ఒకే వైపు మొగ్గు చూపుతారా? అన్నది ప్రస్తుతం రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. దీనిపై స్పష్టత రావాలంటే రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు, స్థానిక నాయకుల వైఖరి, ఎన్నికల ప్రచార సరళిని వేచి చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ముంబైలో భారీ వర్షాలు.. అంధేరి సబ్వే బంద్
ముంబై : భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అంధేరి సబ్వేలో నీరు భారీగా నిలిచిపోవడంతో అధికారులు రవాణాను నిలిపివేసి, ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రోడ్లు దిగ్బంధనమయ్యాయి. డీఎన్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక భారీ వృక్షం బస్సుపై కూలగా, ఈస్టర్న్ ఫ్రీవేపై తక్కువ విజిబిలిటీ (కనిపించే సామర్థ్యం) కారణంగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సాధారణంగానే నడుస్తున్నప్పటికీ, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తీవ్రంగా నెమ్మదించింది. #WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai as monsoon intensifies across Maharashtra; visuals from the Eastern Freeway pic.twitter.com/c9fwaUNI70— ANI (@ANI) June 30, 2026ఈ వాన బీభత్సంలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. చేంబూరు రోడ్ నంబర్ 11 వద్ద యూనివర్సల్ హైస్కూల్, తిలక్ నగర్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సుపై భారీ చెట్టు కూలిపోవడంతో 11 ఏళ్ల విద్యార్థి మరణించాడు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స కోసం స్థానిక జెన్, జైన్ ఆసుపత్రులకు తరలించారు. కాగా, నగరంలో పాఠశాలలు, కళాశాలల సెలవులపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లేదా జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల యాజమాన్యాలను సంప్రదించి అప్డేట్స్ తెలుసుకోవాలని సూచించారు.వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరప్రాంత కోంకణ్ రీజియన్, పూణే ఘాట్ ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్షాల సూచనతో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయగా, పూణే సిటీకి ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని, బలహీనమైన నిర్మాణాలు, చెట్ల కింద ఉండవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం 12:35 గంటలకు 4.16 మీటర్ల ఎత్తులో సముద్రపు పోటు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. -
లోహగఢ్ కోటకు అమాంతం పెరిగిన రద్దీ
ఒక విషాద ఘటన.. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతాన్ని కొత్త కారణంతో వార్తల్లోకి తెచ్చింది. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అదే ఘటన జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్రలోని లోహగఢ్ కోటకు ఇప్పుడు పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కేతన్‌ను తోసేశారని చెబుతున్న ప్రదేశాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతుండటం చర్చనీయాంశంగా మారింది.కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్థానికులు, టూరిజం వర్గాలు చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల రద్దీ దాదాపు 25 శాతం పెరిగినట్లు సమాచారం. ఈ కేసులో నిందితురాలు సియా అనే యువతి పేరు పదేపదే వినిపించడంతో.. కేతన్‌ను లోయలోకి తోసేశారని ప్రచారంలోకి వచ్చిన ప్రాంతాన్ని సందర్శకులు ‘సియా పాయింట్’ గా పిలవడం ప్రారంభించారు. అధికారికంగా అలాంటి పేరు లేకపోయినా.. సోషల్ మీడియా ప్రభావంతో ఆ పేరు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.కోటకు వెళ్లే పర్యాటకులు అక్కడి గైడ్లను, స్థానికులను సియా పాయింట్ ఎక్కడ ఉంది? కేతన్‌ను తోసింది ఇదే ప్రదేశమా? అంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆ ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ధోరణిపై స్థానికులు, పర్యాటక రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన లోహగఢ్ కోటను ఒక నేర ఘటనతో గుర్తుపెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాల ఆధారంగా ప్రచారంలోకి వచ్చిన పేర్లను నిజాలుగా భావించొద్దని కూడా సూచిస్తున్నారు.మరో వైపు, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ లోహగఢ్ కోట కూడా అనూహ్యంగా దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారింది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ కోట.. ఇప్పుడు ఒక సంచలన హత్య కేసు కారణంగా కొత్త గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం. -
ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికుల ఫైర్
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహా నగరంలోని సెంట్రల్ రైల్వే మార్గంలో సోమవారం నుంచి కొత్తగా మరో 12 ఏసీ లోకల్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో ముంబైకర్ల ప్రయాణం మరింత కూల్‌గా మారనుంది. ఏసీ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య పెంచినట్లు అధికారులు తెలిపారు.ఈ ఏసీ రైళ్లను ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ)– కల్యాణ్ స్టేషన్ల మధ్య నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. దీంతో సెంట్రల్ రైల్వే మార్గంలో స్లో, ఫాస్ట్ మార్గంలో తిరుగుతున్న మొత్తం ఏసీ లోకల్ రైళ్ల ట్రిప్పుల సంఖ్య 120కి చేరింది. ఇందులో మెయిన్ లేన్‌లో 92 ట్రిప్పులు, హార్బర్ మార్గంలో 28 ట్రిప్పులున్నాయి. అలాగే కొంత కాలంగా కార్ షెడ్డులో నిలిపి ఉంచిన మరో ఏసీ లోకల్ రైలును నడపాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ఏసీ రైళ్ల ట్రిప్పుల సంఖ్య మరింత పెరగనుంది.ప్రయాణికుల వ్యతిరేకతఏసీ లోకల్ రైళ్లపై సాధారణ ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొత్తగా 12 ఏసీ లోకల్ రైళ్లను పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏసీ రైళ్ల కారణంగా నాన్ ఏసీ రైళ్ల సంఖ్య తగ్గిందని, ఫలితంగా వాటిల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ రైల్వే మార్గంలో ప్రతీరోజు మొత్తం 1,820 లోకల్ రైళ్లు తిరగ్గా అందులో ఏసీ రైళ్ల ట్రిప్పుల సంఖ్య 120 ఉంది. అయితే సోమవారం నుంచి కొత్తగా నడుపుతున్న ఈ ఏసీ రైళ్లను శని, ఆదివారాలతోపాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో నడపబోమని అధికారులు స్పష్టం చేశారు. విపరీతంగా లోకల్ రైళ్ల రద్దీ ఇప్పటికే సాధారణ లోకల్ రైళ్ల సంఖ్య తగ్గిపోవడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రారంభంలో ఏసీ లోకల్ రైళ్లకు ముంబైకర్ల నుంచి అనుకున్నంత మేర స్పందన రాలేదు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో కూడా ఖాళీగా తిరిగాయి. కానీ ఆ తరువాత ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడం మొదలైంది. ప్రస్తుతం పీక్ అవర్స్‌తోపాటు మధ్యాహ్నం, రాత్రి సమయంలో కూడా ఏసీ లోకల్ రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. ఈ రైళ్లు ముంబై రైల్వే బోర్డుకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, వ్యాపార వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులు ఇలా అన్ని రంగాల ప్రయాణికులను ఏసీ లోకల్ రైళ్లు ఆకట్టుకున్నాయి.ఏసీ రైళ్ల సంఖ్య 28కిఇదివరకే హార్బర్ మార్గంలో మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని మే ఒకటో తేదీన 14 ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో 14 రైళ్లను పెంచారు. దీంతో హార్బర్ మార్గంలో ఏసీ రైళ్ల సంఖ్య 28కి చేరింది. రైల్వే బోర్డు అదనంగా ఆదాయం రాబట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందని, పేద ప్రయాణికులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని సాధారణ రైళ్లలో ప్రయాణించేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: విషం మాత్రలతో 15,000 మంది హత్యకు కుట్రలోకల్ రైల్వే నెట్ వర్క్‌ను విస్తరించడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ముఖ్యోద్దేశమని అందులో భాగంగా ఏసీ రైళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఏసీ లోకల్ రైళ్లలో ఆటోమేటిక్ డోరు మూసుకోవడం, తెరుచుకోవడం సిస్టం ఉండటం వల్ల ప్రయాణికులు డోరు వద్ద, ఫుట్ బోర్డుపై నిలబడి లేదా వేలాడుతూ ప్రయాణించే ఆస్కారం ఏ మాత్రం ఉండదని.. ఫలితంగా నడిచే రైలు లోంచి అదుపు తప్పి కిందపడటం లాంటి సంఘటనలు గణనీయంగా తగ్గిపోయాయని అంటున్నారు. -
విషం మాత్రలతో 15,000 మంది హత్యకు కుట్ర
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా కనీసం 15,000 మందిని చంపేయడానికి కుట్ర పన్నిన ఫయాజ్ ప్రేమ్‌జీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎలుకలను చంపడానికి ఉపయోగించే జింక్ ఫాస్పైడ్ అనే రసాయనంతో వేలాదిగా విషపూరిత మాత్రలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొహర్రం ఊరేగింపులో పాల్గొనే జనానికి వీటిని పంచాలని ప్లాన్ చేశాడు. ఈ మాత్రలు నొప్పిని తగ్గిస్తాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నమ్మబలుకుతూ కొందరికి స్వయంగా పంపిణీ చేశాడు. అలాగే చాక్లెట్లు అని చెబుతూ జనంపైకి విసిరేశాడు. ఆ మాత్రలను మింగిన బాధితులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాత్రలను ఉచితంగా పంచడంపై అనుమానం వచ్చిన ఓ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు శనివారం నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీని అరెస్టు చేశారు. అతడి వద ్దనుంచి 15,000 విషపూరిత మాత్రలను స్వా«దీనం చేసుకున్నారు. ప్రేమ్‌జీ ఇచ్చిన మాత్రలను తీసుకున్నవారిలో 11 మంది తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఫయాజ్ పుణేలోని విమాన్ నగర్లో జన్మించాడు. ఉన్నత విద్య అభ్యసించాడు. గొడవల కారణంగా భార్యతో విడాకులు తీసుకున్నాడు. పెయింటింగ్ వృత్తిలో కొనసాగుతున్నాడు. 2019 నుంచి 2025 దాకా ఇరాన్, ఇరాక్‌లో పలుమార్లు పర్యటించి వచ్చాడు. అతడి తల్లి, సోదరి ఇరాన్లో నివసిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇరాన్, ఇరాక్‌లకు 19 సార్లు వెళ్లొచ్చాడు. అతడి ఆర్థిక లావాదేవీలు, మొబైల్ ఫోన్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. 15,000 మంది హత్య చేయాలన్న ఆలోచన అతడిదేనా? లేక ఉగ్రవాదుల హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫయాజ్ ఏకంగా 50 కిలోల జింక్ ఫాసై్పడ్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటిదాకా 15,000 క్యాప్సూల్స్‌లో ఒక్కో గ్రాము చొప్పున జింక్ ఫాసై్పడ్ను నింపాడు. మొత్తం 30,000 విషపు క్యాప్సూల్స్ తయారు చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. -
లోహగడ్ కోటపై ఏం జరిగింది?.. సీన్ రీక్రియేషన్
పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 10 రోజుల కిత్రం ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇవాళ (ఆదివారం) నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను లోహగడ్ కోటపైకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. జూన్ 18న జరిగిన ఈ హత్య ఉదంతంలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్‌ను కొండపై నుండి నెట్టేసిన సంగతి తెలిసిందే.పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. నిందితులను సరిగ్గా ఘటన జరిగిన లోహగఢ్ కోట ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ను రీక్రియేట్ చేశాం. వారు కోటకు ఏ మార్గంలో వచ్చారు, ఎక్కడెక్కడ నిలబడ్డారు? కేతన్‌ను ఎలా నెట్టేశారు అనే పూర్తి వివరాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నామని తెలిపారు.మరో సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బాధితుడిని ఏ పాయింట్ నుంచి అయితే కిందకు తోసేశారో.. సియా గోయల్‌ను సరిగ్గా అదే చోటుకి తీసుకెళ్లాం. ఆమె ప్రియుడు చేతన్‌ను విడిగా కోటపైకి తీసుకెళ్లి విచారించాం. సీన్ రీక్రియేషన్ ద్వారా నిందితులు చెబుతున్న వాదనల్లో నిజమెంత ఉందో తేలనుంది.క్రైమ్ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. నిందితులు కోటకు ఎలా చేరుకున్నారు? కేతన్‌ను తోసేయడానికి ముందు సియా తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు చేతన్ చౌదరి అసలు టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి, ఈ జంటను వెంబడించాడా అనే కోణాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణ సజావుగా సాగడం కోసం లోహగఢ్ కోటలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సియా పోలీసుల ఎదుట అంగీకరించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. శనివారం.. సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్, పూజలతో పాటు ఆమె సోదరుడు సాహిల్‌ను లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా సాహిల్‌ను 10 గంటల పాటు ప్రశ్నించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నివసించే గహుంజే ప్రాంతంలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీల పరంపరకు పుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. సంచలనం రేపిన నీట్ లీకేజీ వ్యవహారం మరువక మునుపే తాజాగా మహారాష్ట్రలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆదివారం, ఈ నెల 28న జరగాల్సిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (మహా–టెట్) 2026 ప్రశ్నపత్రం లీకైంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్‌సీఈ) చివరి నిమిషంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసుల ఆకస్మిక దాడులు.. మహారాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రాంతాల్లోని 1,728 కేంద్రాల్లో 6 లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సిన టెట్ పరీక్షకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే శనివారం తెల్లవారుజామున థానే జిల్లా పరిధిలోని భివండీలో కొందరి వద్ద టెట్ ప్రశ్నపత్రాలు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. వెంటనే పోలీసులు భివండీలోని ఓ కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో పరీక్షకు సంబంధించిన కీలకమైన పత్రాలు లభ్యం కావడంతో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఎంఎస్‌సీఈ అధికారుల నిర్ధారణ అనుమానితుల వద్ద లభ్యమైన పత్రాలను పరిశీలించేందుకు పోలీసులు వెంటనే పుణేలోని మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్‌సీఈ) ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న విద్యాశాఖ, పరీక్షల మండలి అధికారులు ఆ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వద్ద ఉన్న పత్రాల్లోని ప్రశ్నలు, ఆదివారం జరగాల్సిన అసలు టెట్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలుతున్నట్లు నిర్ధారించారు. దీంతో పేపర్ లీకైనట్లు అధికారికంగా స్పష్టమైంది. త్వరలో కొత్త తేదీల ప్రకటన .. పేపర్ లీకైనట్లు నిర్ధారణ కావడంతో ఆదివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి ప్రకటించింది. ఈ స్థాయిలో పరీక్షను నిర్వహించేందుకు కనీసం మూడు వారాల సమయం అవసరమవుతుందని ఎంఎస్‌సీఈ డిప్యూటీ కమిషనర్ ప్రియా షిండే చెప్పారు. పారదర్శకతను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అయితే, అభ్యర్థులు మరోసారి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. తదుపరి అధికారిక అప్డేట్స్ కోసం అభ్యర్థులు వేచిచూడాలని సూచించారు. కాగా, లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో కాలంగా సిద్ధమవుతున్న తరుణంలో ఇలా చివరి నిమిషంలో పరీక్ష రద్దు కావడంపై అభ్యర్థులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.ముగ్గురిపై క్రిమినల్ కేసు ఈ వ్యవహారంపై భివండీ పోలీస్ స్టేషన్లో ముగ్గురు అనుమానితులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ లీకేజీ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది.యువత భవిష్యత్తును దోచుకోవడమే: రాహుల్ గాంధీ మహారాష్ట్ర–టెట్‌ను లీకేజీ ఆరోపణలతో వాయిదా వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కేవలం పరీక్ష పత్రం లీక్ మాత్రమే కాదు..యువత భవితను దోచుకోవడమేనన్నారు. ‘మరో పేపర్ లీక్. మరో పరీక్ష రద్దు, ఈసారి మహారాష్ట్ర టెట్ వంతు..!’అంటూ ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. పరీక్షల విధానాన్ని వసూళ్ల దందాకు అడ్డాగా మార్చుకున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ విమర్శించారు. లీకేజీ సూత్రధారులు అన్ని రకాలుగా ప్రభుత్వం రక్షణలను పొందుతున్నారన్నారు. లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పత్రమే లీకైనప్పుడు ఇక ఏ పరీక్ష కూడా సురక్షితంగా కానేకాదని ఎన్సీపీ(ఎస్పీ) వ్యాఖ్యానించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులు, తల్లిదండ్రులకు వ్యవస్థలపై నమ్మకం కల్పించాలని పేర్కొంది. -
మరో పేపర్ లీకేజీ కలకలం.. మహా 'టెట్' పరీక్ష వాయిదా
మహారాష్ట్రలో మరో పేపర్ లీకేజీ కలకలం రేపింది. దీంతో మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) వాయిదా పడింది. భివాండీలో పరీక్షా పత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ (MSCE) ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,028 కేంద్రాల్లో జూన్ 28న టెట్ పరీక్ష జరగాల్సి ఉంది. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని, మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్ని భద్రతా చర్యలను ముందే కట్టుదిట్టం చేసిందని అధికారులు పేర్కొన్నారు. పేపర్ లీకేజీపై పోలీసులకు, రాష్ట్ర విద్యాశాఖకు సమాచారం అందగా తక్షణమే స్పందించిన పోలీసులు భివాండిలో టెట్ పేపర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం టెట్ పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. పేపర్-1 ఉదయం 10.30 గంటల నుంచి పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరగాల్సి ఉంది. -
దయచేసి ఇక ఆపండి! కేతన్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి
ఒక కుటుంబం జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వినోదంగా మారింది. చనిపోయిన కొడుకును టెక్నాలజీ సాయంతో మళ్లీ "బతికించినందుకు" సంతోషించాలా? లేక అతని హత్య కేసులో నిందితురాలితో కలిసి నవ్వుతూ, మాట్లాడుతున్నట్లు వీడియోలు సృష్టిస్తున్నందుకు బాధపడాలా? అనే వేదనలో కేతన్ అగర్వాల్ కుటుంబం మునిగిపోయింది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం జరుగుతున్న ఈ ఏఐ ట్రెండ్ వారికి మరోసారి తీరని మానసిక వేదనను మిగులుస్తోంది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే లోహగడ్ హత్య కేసు ఇప్పుడు మరో కారణంతో చర్చనీయాంశమైంది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సోషల్ మీడియా వేదికల్లో కేతన్ అగర్వాల్, నిందితురాలు సియా గోయల్ కలిసి ఉన్నట్లు చూపించే ఏఐ వీడియోలు, ఫోటోలు, రీల్స్ భారీగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు పూర్తిగా కల్పితమైనవే అయినప్పటికీ, లక్షలాది మంది వాటిని వీక్షిస్తూ, షేర్ చేస్తుండటంతో ఈ ట్రెండ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. "దయచేసి ఇలాంటి ఏఐ వీడియోలు చేయడం ఆపండి" అంటూ వారు సోషల్ మీడియా వినియోగదారులను భావోద్వేగంగా వేడుకుంటున్నారు. అలాగే.. కేతన్-సియాల వీడియోలను కూడా వైరల్ చేయడం ఆపమంటున్నారు.People out there are really making AI edits of Ketan and Siya, Instagram is full of it now pic.twitter.com/Rg6yy86Oyq— Shubham2.0 (@bhav_paaji) June 26, 2026పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిబ్రవరిలో సియా గోయల్‌తో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. అయితే సియాకు అప్పటికే చేతన్ చౌదరితో ప్రేమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులకు చెప్పకుండా, కేతన్‌ను అడ్డంకిగా భావించి హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.'Killing Ketan Was Easier Than Confronting My Family': Siya Goyal's Confession to Pune PoliceThe Ketan Agarwal murder investigation has taken a fresh turn after police claimed that accused Siya Goyal made a startling statement during interrogation.According to investigators,… pic.twitter.com/FZYImt2ZIm— upuknews (@upuknews1) June 26, 2026జూన్ 18వ తేదీన లోహగడ్ కోట వద్ద ఫొటోషూట్ కోసం తీసుకెళ్లి లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన, తర్వాత పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా మారింది. ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ విషాద ఘటనను ఇప్పుడు కొందరు ఏఐ కంటెంట్‌గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కేతన్, సియా మళ్లీ కలిసి మాట్లాడుకుంటున్నట్లు, ప్రేమలో ఉన్నట్లు, అలాగే ప్రియుడితో కలిసి కేతన్‌ను సియా ఎలా చంపిందోనంటూ వీడియోలు విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. కొంతమంది వాటిని నిజమని కూడా భావిస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది. అదే సమయంలో సియాకు సంబంధించినవంటూ కొన్ని వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.Meet Siya Goyal who is accused of murdering her fiancée businessman Ketan AgarwalLook closer story was posted on 2022She is 20 yo nowIt means she was consuming alcohol at 16 yo even before turning on 18This is women empowerment for feminists pic.twitter.com/FCsfL99RJB— aaru (@buttermasale) June 27, 2026ఈ వీడియోలను చూసిన కేతన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొడుకును కోల్పోయిన బాధ నుంచి బయటపడలేకపోతున్నామని, ఇప్పుడు ఇలాంటి ఏఐ వీడియోలు ప్రతిరోజూ ఆ బాధను మళ్లీ గుర్తు చేస్తున్నాయని వాపోయారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్ల కోసం ఒక కుటుంబం విషాదాన్ని వినోదంగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఆపండి.. Please Stop అంటూ సోషల్ మీడియా వినియోగదారులకు భావోద్వేగ పిలుపునిచ్చారు.ఈ ఘటనతో ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. మరణించిన వ్యక్తుల పేరుతో నకిలీ వీడియోలు తయారు చేయడం బాధిత కుటుంబాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సృష్టించిన ఫేక్ కంటెంట్‌ను నియంత్రించేందుకు సోషల్ మీడియా సంస్థలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వీడియోలను ప్రోత్సహించవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: కొండపై నుంచి తోసేసింది అతడుకాదు! -
కొండపై నుంచి తోసేసింది సియానే!
పుణే: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ స్వయంగా అతడిని కొండపై నుంచి తోసివేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ దారుణం వెనుక సియా చౌదరి ప్రియుడు చేతన్ చౌదరి ప్రోద్బలం ఉన్నట్లు బహిర్గతమయ్యింది. కేతన్ అగర్వాల్‌ను సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలంటూ చేతన్ చౌదరి తన ప్రియురాలు సియా చౌదరిపై పదేపదే ఒత్తిడి చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పూర్తిగా అతడి మైకంలో పడిపోయిన సియా చౌదరి మరో ఆలోచన లేకుండా.. కాబోయే భర్తను చేతులారా చంపేసిందని తెలిపారు. ఇద్దరు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియుడి ఒత్తిడి వల్లే చేతన్‌ను లోహగఢ్ కోటకు రప్పించి హత్య చేసినట్లు సియా గోయల్ ఒప్పుకుందని స్పష్టంచేశారు. ఆమె సోదరుడిని కూడా ప్రశ్నిస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ కేసులో ఫాస్ట్–ట్రాక్ కోర్టు ట్రయల్ నిర్వహించాలంటూ కేతన్ అగర్వాల్ కుటుంబం డిమాండ్ చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసుతోపాటు మరికొన్ని ముఖ్యమైన కేసుల్లో ఉజ్వల్ నికమ్ వాదించారు. 20 ఏళ్ల సియా గోయల్, 22 ఏళ్ల చేతన్ చౌదరి గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 18న కేతన్ అగర్వాల్(25)ను పుణే సమీపంలోని లోహగఢ్ కోటలో అంతమొందించిన సంగతి తెలిసిందే. హత్యకు పకడ్బందీగా ప్లాన్ కేతన్ అగర్వాల్ హ త్యకు నిందితులు పకడ్బందీగా ప్లాన్ చేశా రు. ఆధారాలు దొర క్కుండా జాగ్రత్తపడ్డా రు. హత్యకు ముందు, తర్వాత తమ సెల్ఫోన్లలో చాటింగ్ హిస్టరీని పూర్తిగా తొలగించారు. రీసైకిల్ బిన్లను కూడా ఖాళీచేశారు. వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. డిలీట్ చేసిన వివరాలను తిరిగి రప్పిస్తే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అన్నారు. సియా గోయల్, కేతన్ చౌదరి మధ్య ఫోన్లలో 238 గంటలపాటు సంభాషణ జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. వారిద్దరూ గత ఆరు నెలల వ్యవధిలో 2,004 ఫోన్‌కాల్స్ చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఓ హోటల్లో కలుసుకున్నారు. మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్నారు. కేతన్ బట్టతల నచ్చకనే హత్య! కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌కు బట్టతల ఉండడం, అది కనిపించకుండా విగ్గు లాంటిది ధరించడం తనకు నచ్చలేదని, అందుకు అడ్డు తొలగించుకున్నానని సియా చౌదరి చెబుతున్నట్లు సమాచారం. బట్టతల కారణంగానే కేతన్ హత్యకు గురయ్యాడంటూ ప్రచారం సాగుతోంది. అయితే, ఈ విషయాన్ని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఖండించారు. కేతన్కు బట్టతల ఉందన్న విషయంలో ఎంగేజ్మెంట్కు ముందే సియా గోయల్‌కు, ఆమె కుటుంబానికి తెలుసని అన్నారు. బట్టతల విషయంలో ఆమె ఏనాడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. తన కుమారుడు నిజంగా నచ్చకపోతే ముందే చెప్పాలి తప్ప ఇలా హత్య చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. కేతన్ హత్యకు అతడి బట్టతల అంశం ఒక్కటే కారణం కాదని పోలీసులు తెలిపారు. -
కేతన్ అగర్వాల్ కేసులో కొత్త మలుపు
పుణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ ఇవాళ(శుక్రవారం) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి.. తన కుమారుడి హత్యకు కారణమైన నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరారు. మరోవైపు, తన కుమారుడు తలకు విగ్గు (కృత్రిమ జుట్టు) వాడుతున్నాడనే కారణంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలను ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ ఖండించారు. నిశ్చితార్థానికి చాలా కాలం ముందే తన కుమారుడికి ఉన్న స్వల్ప జుట్టు రాలే సమస్య గురించి సియా గోయల్, ఆమె కుటుంబ సభ్యులతో బహిరంగంగానే చర్చించామన్నారు.కేతన్కు తలపై ఒక చిన్న భాగంలో జుట్టు రాలింది. కానీ వివాహం ఖాయం కావడానికి ముందే ఈ విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేశామని విశాల్ అగర్వాల్ అన్నారు. కాగా, కేతన్ అగర్వాల్ విగ్ పెట్టుకోవడం సియా గోయల్‌కు నచ్చలేదని ఓ పోలీసు అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అగర్వాల్ విగ్ పెట్టుకున్న మాట నిజమే.. కానీ సియాకు అతను నచ్చకపోవడానికి అది ఒక్కటే కారణమని చెప్పలేమని ఆ అధికారి పేర్కొన్నారు.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ.. జూన్ 18న లోహగడ్ కోటపై నుండి చౌదరి.. అగర్వాల్‌ను కిందకు నెట్టేయడానికి ముందు.. గోయల్ ముందుగా అనుకున్న ప్రకారం ఒక సంకేతాన్ని (సిగ్నల్) ఇచ్చిందని తెలిపారు. ఈ ఇద్దరూ పారిపోతే తమ కుటుంబాల ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో కేతన్ అగర్వాల్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొదట ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ప్రయత్నించారు. విచారణ సమయంలో నేరస్థులలో ఇలాంటి ధోరణి సాధారణంగా కనిపిస్తుంది. అయితే.. చివరకు తానే ఈ కుట్ర పన్నానని.. ఇందులో చేతన్ ప్రమేయం కూడా ఉందని సియా అంగీకరించిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.చౌదరి మొదట మాట్లాడుతూ.. తాను కోట వద్దే ఉన్నానని.. అయితే అగర్వాల్‌ను నెట్టేసిన ప్రదేశానికి తాను వెళ్లలేదని.. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని వాదించాడు. అయితే, అతను అబద్ధం చెబుతున్నాడని స్పష్టంగా తెలిసిందన్న అధికారి.. ఆ తర్వాత ఇద్దరు నిందితులూ తమ తప్పును అంగీకరించి.. ఘటన ఎలా జరిగిందో వివరించారని తెలిపారు.అగర్వాల్, గోయల్‌ల వివాహం నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒక ప్యాలెస్‌లో జరగాల్సి ఉంది. ఈ నేరానికి బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడాలని గోయల్ తండ్రి కూడా కోరారు. ఇందులో తన కూతురి ప్రమేయం ఉన్నా సరే, ఆమెకు కూడా అదే శిక్ష పడాలన్నారు. కేతన్ నాకు కొడుకు లాంటివాడు.. అతని మరణం మా రెండు కుటుంబాలను విషాదంలో ముంచేసింది. మేము పెళ్లి పనుల్లో ఎంతో ఆత్రుతగా ఉన్నాం. జరిగినదంతా చాలా విషాదకరం.ఈ రోజుకీ మేము దీన్ని నమ్మలేకపోతున్నాం’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సియా సంబంధాల గురించిన నిజాలను గోయల్ కుటుంబం దాచిపెట్టిందన్న అగర్వాల్ తండ్రి ఆరోపణలను ఆయన ఖండించారు. వారి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయనే విషయం కానీ.. సియాకు మరొకరితో సంబంధం ఉందనే విషయం కానీ తమకు తెలియదని ఆయన చెప్పారు.కాగా, సీఎం ఫడ్నవీస్ ఈ ఘటనను అత్యంత దిగ్భ్రాంతికరంగా అభివర్ణించారు. ఈ ఘటనను ఒక నేరంగానే కాకుండా.. సమాజం లోతుగా ఆలోచించాల్సిన విషయంగా చూడాలన్నారు. చదువుకుని, సమాజంలో మంచి స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల్లో ఇలాంటి ద్వేషపూరిత, వినాశకరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఈ మానసిక స్థితి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? దీనిపై మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
నా బిడ్డను కూడా అక్కడి నుంచే తోసేయండి: సియా తండ్రి
ముంబై: మహారాష్ట్రలో సంచలనం రేపిన లోహగడ్ కోట హత్యకేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తెపై ఆరోపణలు నిజమని కోర్టు తేల్చితే ఆమెకు అత్యంత కఠిన శిక్ష విధించాలన్నారు. ఇదే సమయంలో అవసరమైతే కేతన్ అగర్వాల్‌ను తోసేసిన అదే కోటపై నుంచి ఆమెను కూడా తోసేయాలని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ గోయల్..‘నా కుమార్తె ఇలాంటి ఘోరానికి పాల్పడిందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆమె ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పలేదు. కానీ పోలీసులు చూపుతున్న ఆధారాలు చూసిన తర్వాత నేను కూడా దిగ్భ్రాంతికి గురయ్యాను. నిజం ఏదైనా కోర్టే తేల్చాలి. చట్టం ముందు అందరూ సమానమే. నేను ముందుగా ఒక పౌరుడిని, తర్వాత తండ్రిని. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. నా కుమార్తె నేరం చేసినట్లు రుజువైతే ఆమెకు అత్యంత కఠిన శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. నా కూతురు అయినా న్యాయానికి అడ్డుకావద్దు. తండ్రిగా నాకు బాధ ఉన్నా, న్యాయం జరగాల్సిందే’ అని అన్నారు. కాగా, ఈ ఘటనతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, కుమార్తె అరెస్టు వార్త విన్న తర్వాత షాక్‌కు గురై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చిందని కూడా ఆయన వెల్లడించారు.Ketan Agarwal Siya Goyal this video proves:Not everything you see on SOCIAL MEDIA is real. Filters hide flaws. Edits hide truth. pic.twitter.com/OvfbL3zrt3— बुलेट bhaiya (@bullet_bhaiya_) June 25, 2026కేసు ఏమిటి?మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ జూన్ 18న తన నిశ్చితార్థమైన సియా గోయల్‌తో కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయి మరణించినట్లు తొలుత భావించిన పోలీసులు, అనంతర దర్యాప్తులో ఇది పక్కా హత్య అని నిర్ధారించారు. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందుగానే కుట్ర పన్ని కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరూ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు సందర్భంగా సియా, చేతన్ ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నారని, అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సియానే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అనే దిశగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపగా, బాధిత కుటుంబం కూడా నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. -
మనం కలిసే ఉన్నామా?.. ఉద్ధవ్ వ్యాఖ్యల కలకలం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తన పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు షిండే శిబిరంలో చేరిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే..‘మనం నిజంగానే కలిసి ఉన్నామా?’ అంటూ కూటమి భాగస్వాములనే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇటీవల శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార శివసేన నేత ఏక్నాథ్ షిండే వర్గంలో చేరడం ఉద్ధవ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిణామం తర్వాత పార్టీ శ్రేణులతో సమావేశమైన ఉద్ధవ్.. కేవలం పార్టీ అంతర్గత పరిస్థితులపైనే కాకుండా, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)తో కలిసి ఉన్న ఎంవీఏ కూటమి ఐక్యతపైనా సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.ఫిరాయింపుతో పెరిగిన ఒత్తిడి2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో పార్టీ చీలిన తర్వాత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే భారీ రాజకీయ నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు ఆరుగురు ఎంపీలు కూడా పార్టీని వీడటంతో ఆయన నాయకత్వంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష శిబిరం బలపడుతుందని భావించిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఉద్ధవ్‌కు ఇబ్బందికరంగా మారింది.ఎంవీఏలో సమన్వయం లోపిస్తోందా?ఉద్ధవ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం కేవలం ఎంపీల ఫిరాయింపులే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ వ్యూహాలు, నాయకత్వ అంశాల్లో ఎంవీఏ భాగస్వాముల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేదనే భావన శివసేన (యూబీటీ)లో పెరుగుతోందని చెబుతున్నారు. అందుకే మనం నిజంగానే కలిసి ఉన్నామా? అనే ప్రశ్న ద్వారా ఉద్ధవ్ తన మిత్రపక్షాలకు పరోక్షంగా హెచ్చరిక పంపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు షిండే వర్గం మాత్రం దీనిని ఉద్ధవ్ నాయకత్వ వైఫల్యంగా అభివర్ణిస్తోంది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరుసగా బయటకు వస్తుండటం ఉద్ధవ్‌పై విశ్వాసం తగ్గిపోవడానికే నిదర్శనమని ఆ వర్గం వాదిస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే-బీజేపీ కూటమి మరింత బలపడుతుండగా, ప్రతిపక్ష శిబిరంలో అనిశ్చితి పెరుగుతోందని పేర్కొంటోంది.ముందున్న సవాళ్లుఎంవీఏ కూటమికి రాబోయే స్థానిక ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఈ సమయంలో భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యతపై అనుమానాలు వ్యక్తమవడం ప్రతిపక్షానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఉద్ధవ్ థాక్రే పార్టీని కాపాడుకోవడమే కాకుండా, కూటమి భాగస్వాములను ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన సవాలు కూడా ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ఉద్ధవ్ వేసిన ప్రశ్న ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఇది కేవలం ఒక వ్యాఖ్య మాత్రమేనా? లేక ఎంవీఏలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
కుట్ర లవర్స్‌దే.. మరి తోసిందెవరు?
పెళ్లికి పెద్దల అంగీకారం.. ఒకరికొకరు ప్రేమలో మునిగి తేలడం.. బయటకు కనిపించిన కథ ఇదే. కానీ ఆ నవ్వుల వెనుక ఓ చీకటి కుట్ర నడిచింది. రహస్య ప్రేమ, కేఫ్‌లలో జరిగిన గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు, వేల ఫోన్ కాల్స్, వరుస విఫల హత్యాయత్నాలు... చివరకు లోహగడ్ కోట అంచున ఓ యువ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. పుణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కుట్ర వెనుక ఉన్న దాదాపు అన్ని కోణాలను పోలీసులు ఛేదించారు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తొలుత కనిపించిన దృశ్యం ఒక సాధారణ ప్రమాదం. ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు లోయలో పడి మృతి చెందాడు. కాబోయే భార్య కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కూడా ప్రమాద మరణంగానే కేసు నమోదు చేశారు. కానీ ఆ కథలో ఏదో తేడా ఉందనే అనుమానం మొదట కేతన్ కుటుంబ సభ్యులకే వచ్చింది. ముఖ్యంగా కేతన్ సోదరి సంజనా అడిగిన కొన్ని ప్రశ్నలకు.. నిందితురాలు సియా గోయల్ ఇచ్చిన సమాధానాలు దర్యాప్తును పూర్తిగా కొత్త దిశలోకి మళ్లించాయి. అక్కడి నుంచే ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు.. ప్రేమ, మోసం, కుట్ర, హత్యతో కూడిన భయంకర కథను వెలుగులోకి తీసుకొచ్చాయి.జూన్ 18న లోహగడ్ కోట వద్ద ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ సమయంలో జరిగిన ఘటన తర్వాత కేతన్ మృతదేహాన్ని వెలికితీశారు. తొలుత ప్రమాద మరణంగా కేసు నమోదైంది. అయితే అంత్యక్రియలు పూర్తైన నాలుగు రోజుల తర్వాత కేతన్ సోదరి సంజనా సియాకు ఫోన్ చేసింది. ఇంటికి రమ్మంటూ పిలిచింది. సోదరుడి గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. అలా.. అసలు ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్నించింది. సియా చెప్పిన వివరాల్లో తేడాలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు మళ్లీ మొదలైంది.విచారణలో బయటపడిన అంశాలు ఒక్కొక్కటిగా సియాపై అనుమానాలను పెంచాయి. కేతన్ మరణానికి ముందు ఆమె పలుమార్లు లోహగడ్‌కు రావాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 31న మొదటిసారి అక్కడికి తీసుకెళ్లింది. ఆ తర్వాత జూన్ 4న కూడా వెళ్లాలని పట్టుబట్టిందని, కానీ కేతన్ తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో అది జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మే 31న ప్రదేశాన్ని ముందుగా పరిశీలించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జూన్ 14న మరోసారి ఇద్దరూ లోహగడ్‌కు వెళ్లారు. అక్కడే మొదటి హత్యాయత్నం జరిగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లోయ అంచు వద్ద కేతన్‌ను నెట్టినప్పుడు అతడు పొదలను పట్టుకుని బయటపడ్డాడని, వెంటనే సియా పాము కనిపించిందంటూ నాటకం ఆడి పరిస్థితిని చక్కబెట్టిందని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో అది ప్రమాదంగా కనిపించినా.. ఇప్పుడు అదే ఘటన హత్యా కుట్రలో భాగమని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు బాలి ట్రిప్ కూడా కేసులో కీలక అంశంగా మారింది. ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం కేతన్, సియా ఇండోనేషియా వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణానికి ముందు కేతన్ పాస్‌పోర్ట్ కనిపించకుండా పోయింది. దీంతో ట్రిప్ రద్దయింది. ఈ ఘటన వెనుక కూడా సియా పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేతన్‌ను బాలి వెళ్లకముందే హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పాస్‌పోర్ట్‌ను మాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.దర్యాప్తులో మరో కీలక మలుపు సీసీటీవీ ఫుటేజీలతో వచ్చింది. టికెట్ కౌంటర్ వద్ద కేతన్, సియా నడుచుకుంటూ వెళ్తుండగా.. కొంత దూరంలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని వెంబడిస్తున్న దృశ్యాలు కనిపించాయి. 33 డిగ్రీల ఉష్ణోగ్రత.. అంతా వేడిలోనూ కూడా ముఖం కనిపించకుండా హుడీ, హెడ్‌సెట్‌తో తిరగడం పోలీసులకు అనుమానం కలిగించింది. తర్వాత అతడే చేతన్ చౌదరి అని గుర్తించారు.చేతన్ తన మొబైల్‌ను ఇంట్లో వదిలేసి, ఒక ఉద్యోగి ఫోన్‌తో ప్రయాణించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. లోకేషన్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడానికే ఈ ప్లాన్ వేసినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా ఫొటోలు, డిజిటల్ ఆధారాలను సరిపోల్చిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని కాల్ రికార్డులు మరింత బలపరిచాయి. జనవరి 1 నుంచి జూన్ 18 వరకు సియా, చేతన్ల మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంటల తరబడి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వ్యాపార పరిచయంతో మొదలైన సాన్నిహిత్యం ప్రేమగా మారిందని, కేతన్‌తో పెళ్లి విషయంలో సియా ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణమని దర్యాప్తులో తేలింది.పోలీసుల కథనం ప్రకారం.. సియా, చేతన్‌లు గత ఏడాది దీపావళి వేడుకల్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత తరచూ కేఫ్‌లలో కలుస్తూ హత్యా ప్రణాళికను రచించినట్లు అనుమానిస్తున్నారు. సియా పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేదని, కుటుంబ ఒత్తిడితో సంబంధాన్ని కొనసాగించిందని విచారణలో వెల్లడైంది. అయితే చేతన్‌తో పారిపోవడానికి కూడా ఆమె ఇష్టపడలేదని చెబుతున్నారు. నిశ్చితార్థం రద్దు చేసి ప్రేమికుడితో వెళ్లిపోతే కుటుంబ పరువు పోతుందని భావించిందని చేతన్ విచారణలో చెప్పినట్లు సమాచారం.కేతన్, సియా వివాహం నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో జరగాల్సి ఉంది. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ జూన్ 18న జరిగిన ట్రెక్కింగ్ ప్రయాణమే కేతన్ జీవితానికి చివరి ప్రయాణమైంది.పోలీసుల ప్రకారం, ఘటన రోజున చేతన్ ముందుగానే లోహగడ్‌కు చేరుకుని అక్కడ మాటు వేసి ఉన్నాడు. తర్వాత సియా, కేతన్‌లను అనుసరిస్తూ ఏకాంత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి కేతన్‌ను సుమారు 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టే ప్లాన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆపై సియా కేకలు వేస్తూ భద్రతా సిబ్బందిని పిలిచి, అది ప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదు చేశారు.ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. చేతన్ స్నేహితుడు నీరజ్‌ను కూడా అదుపులోకి తీసుకుని అతడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, ఘటనాస్థల పరిశీలన కొనసాగుతోంది.అయితే ఈ కేసులో ఇప్పటికీ ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కేతన్‌ను చంపాలన్న కుట్ర ఇద్దరిదేనని పోలీసులు చెబుతున్నారు. కానీ చివరి క్షణంలో లోయ అంచున నిలబడ్డ కేతన్కు నెట్టేసి చంపింది ఎవరు?.. పక్కనే నడుస్తున్న సియానా?.. లేక మాటు వేసి ఎదురుచూస్తున్న చేతనా?.. లేదంటే ఇద్దరూనా?. వీళ్లకు సహకరించిన నీరజా? ఈ విషయంలో నిందితుల నుంచి మౌనమే పోలీసులకు ఎదురవుతోంది. అదే సమయంలో.. వాళ్ల తల్లిదండ్రులు ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. దర్యాప్తు మొత్తం ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగి.. ఆ సమాధానం బయటపడే వరకు ఈ కేసు అతిపెద్ద మిస్టరీ అలాగే కొనసాగనుంది. -
పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీ.. ప్రభుత్వం కొత్త ప్లాన్
ముంబై: బాల్యవివాహాల నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిబంధనను పరిశీలిస్తోంది. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధన తీసుకురావాలని యోచిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ సభ్యుడు అతుల్ భత్ఖాల్కర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను సభకు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో బాల్యవివాహాల రేటును 10 శాతం కంటే కిందకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించే విధానం ఇప్పటికే రాజస్థాన్‌లో అమల్లో ఉందని, దీనిపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖలతో సంప్రదింపులు జరిపి, ఈ విధానాన్ని మహారాష్ట్రలోనూ అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. -
తిరుగుబాటు ఎంపీల లేఖ ఇవ్వండి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గంలో చేరిన తమ పార్టీకి చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు సమర్పించిన వినతిపత్రం ప్రతులను తమకు అందజేయాలని శివసేన (యూబీటీ) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరింది. బుధవారం సాయంత్రం స్పీకర్‌తో భేటీ అయిన అనంతరం ఆ పార్టీ ఎంపీలు అనిల్ దేశాయ్, అరవింద్ సావంత్ విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ నిబంధనలను నిలబెట్టాలని స్పీకర్‌ను అభ్యర్థించామని, తిరుగుబాటుదారులు ఇచ్చిన డిమాండ్ల ప్రతి ఇవ్వాలని కోరామని వారు వెల్లడించారు. రెబెల్స్ నుంచి ఇప్పటివరకు లిఖితపూర్వకంగా ఎలాంటి లేఖ అందలేదని స్పీకర్ చెప్పారని అరవింద్ సావంత్ పేర్కొన్నారు. ఒకవేళ రెబల్ ఎంపీలు తన కార్యాలయానికి ఏవైనా పత్రాలు సమర్పించి ఉంటే, ఆ వివరాలను పరిశీలించి అప్డేట్ ఇస్తానని స్పీకర్ హామీ ఇచ్చారని దేశాయ్ పేర్కొన్నారు. -
బంధం ముగిస్తే సరిపోదా?.. బలి ఎందుకు?
ఒకప్పుడు ప్రేమ విఫలమైతే దూరమయ్యేవారు. పెళ్లి బంధం సరిగా సాగకపోతే విడాకులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా?. ప్రేమించిన వారినే హత్య చేయడం, జీవిత భాగస్వామిని అంతమొందించడం, సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రాణాలు తీయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు బంధాలు ‘బ్రేక్’ అవ్వడం కాకుండా ఎందుకు బలైపోతున్నాయి?. కాస్త లోతుల్లోకి వెళ్తే..మేఘాలయ హనీమూన్ కేసునే పరిశీలిద్దాం. ఇండోర్‌కు చెందిన జంట.. హనీమూన్‌కు వెళ్లింది. దంపతులు మిస్ కావడం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు.. భర్త చనిపోవం.. భార్య దీనావస్థలో రోడ్డు మీద కనిపించడం.. చివరకు భార్య&ప్రియుడి చేతిలోనే హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపింది. మరోవైపు ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన సర్వేయర్ హత్య కేసులోనూ వివాహేతర సంబంధాల కోణం ప్రధానంగా చర్చకు వచ్చింది. అటు.. ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన మీరట్ "బ్లూ డ్రం" కేసులో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా పుణెలో పెళ్లికి సిద్ధమవుతున్న కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అది హత్య అని తేలడం సంచలనం సృష్టించింది. ఫొటోషూట్ పేరుతో ఓ కోటకు తీసుకెళ్లి కాబోయే వధువు, ఆమె ప్రియుడే అతన్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.These are Ketan Agarwal and Siya Goel. They were engaged and supposed to get married this year. Look how happy, in love, and comfortable they are with each other.They must have dreamed of a great future together, but cruel fate had other ideas. On June 18, Siya's birthday,… pic.twitter.com/4Av4OQvXuc— THE SKIN DOCTOR (@theskindoctor13) June 23, 2026ఈ ఘటనల్లో పరిస్థితులు, వ్యక్తులు, ప్రాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదే.. సంబంధాన్ని ముగించడం కంటే వ్యక్తినే శాశ్వతంగా తొలగించాలనే ప్రమాదకర ఆలోచన.మనస్తత్వ నిపుణుల ప్రకారం.. నేటి కాలంలో కొందరు ప్రేమను పరస్పర గౌరవంతో కూడిన బంధంగా కాకుండా, స్వాధీన భావంతో చూస్తున్నారు. నువ్వు నాకే చెందాలి.. లేదంటే ఎవరికీ దక్కకూడదు అనే ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.అలాగే, తిరస్కరణను అంగీకరించలేకపోవడం కూడా కీలక కారణమని నిపుణులు చెబుతున్నారు. సంబంధం కొనసాగకపోతే విడిపోవడం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం వంటి మార్గాలు ఉన్నప్పటికీ, కొందరు వాటిని పరాజయంగా భావిస్తున్నారని అంటున్నారు. పరువు పోతుందనే భయం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతామనే ఆందోళన, కుటుంబమో.. సమాజమో ఏమనుకుంటుందో అనే ఒత్తిడి కొందరిని తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా సంబంధాలపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ చిత్రాలతో తమ బంధాలను పోల్చుకోవడం, చిన్న చిన్న విభేదాలను కూడా పెద్ద సమస్యలుగా భావించడం వల్ల అసహనం పెరుగుతోందని చెబుతున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, కోపాన్ని ఆరోగ్యకరంగా వ్యక్తం చేయలేకపోవడం, కౌన్సెలింగ్ తీసుకోవడంపై ఇప్పటికీ ఉన్న అపోహలు కూడా సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. అయితే సంభాషణ, కుటుంబ సభ్యుల సహకారం, అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. బంధం కొనసాగించడం సాధ్యం కాకపోతే విడిపోవడం కూడా ఒక మార్గమే. కానీ ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది స్వాధీనం కాదు, బాధ్యత. బంధం అనేది నియంత్రణ కాదు, పరస్పర గౌరవం. ఆ గౌరవం, నమ్మకం కోల్పోయినప్పుడు బంధాలు బలహీనపడతాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మరొకరికి లేదన్న విషయాన్ని సమాజం మరచిపోకూడదు.::వెబ్ ప్రత్యేకం -
ముంబైపై వరుణుడి దండయాత్ర.. ఆర్థిక రాజధాని అతలాకుతలం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు రుతుపవనాల రాక ఉపశమనం కలిగించినప్పటికీ, ఒక్కసారిగా కురిసిన కుండపోత వానతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ శివారు ప్రాంతాల్లో అత్యధికంగా 190 మిల్లీమీటర్ల, తూర్పు శివారు ప్రాంతాల్లో 154 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, నగరవ్యాప్తంగా సగటున 184 మి.మీ. మేర భారీ వర్షం కురిసింది. దీంతో పలు కీలక రహదారులపై ట్రాఫిక్ నెమ్మదించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. #WATCH | Maharashtra | An underpass in Mumbai's Andheri area was closed after it was flooded due to severe water logging amid heavy rains in the city.A BMC Official Rhitik says, "... We have not been able to find a temporary solution for this severe water logging... Our… pic.twitter.com/QsN7WbXjYw— ANI (@ANI) June 23, 20262:15 AM - Mumbai is covered by rainbands from all sides! 🟠 Rain seems unstoppable and is likely to continue overnight leading to waterlogging in many areas. Rains likely to stay consistent moderate to heavy at least till morning ⛈️⚠️Stay tuned for live updates #MumbaiRains pic.twitter.com/DOb0oXnwWT— Mumbai Rains (@rushikesh_agre_) June 23, 2026అర్ధరాత్రి ముంచెత్తిన వాన.. జలమయమైన రోడ్లుమంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా హింద్మాతా, మాతుంగా, కుర్లా, అంధేరి వంటి ప్రాంతాల్లో వీధులన్నీ చెరువులను తలపించాయి. ఈ ఆకస్మిక వరద పరిస్థితి కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ ముంబైలోని నాయర్ హాస్పిటల్ పరిధిలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య అత్యధికంగా 78.96 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ఎన్ఎమ్ జోషి మార్గ్-లోయర్ పరేల్‌లో 78.4 మి.మీ, పరేల్ టీటీలో 72.63 మి.మీ, పశ్చిమ శివారులోని మలాడ్ బస్ డిపో వద్ద 61.8 మి.మీ వాన పడింది. Happy Monsoon, Mumbai 😄#MumbaiRainspic.twitter.com/VcxWA1lAde— Mumbai Rains (@rushikesh_agre_) June 23, 202613 రోజులు ఆలస్యంగా రుతుపవనాల ఎంట్రీసాధారణంగా జూన్ 10 నాడే ముంబైని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు, ఈసారి 13 రోజులు ఆలస్యంగా మంగళవారం నాడు నగరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ముంబై చరిత్రలో ఇది అత్యంత ఆలస్యమైన ప్రవేశం ఏమీ కాదు. 2023లో జూన్ 25న రుతుపవనాలు రాగా, అత్యంత సుదీర్ఘ ఆలస్యంగా 1958, 1974 సంవత్సరాల్లో జూన్ 28న రుతుపవనాలు ముంబైని తాకాయి. ప్రస్తుతం ఈ రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంతో పాటు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.#WATCH | Maharshtra | Heavy downpour continues across various parts of Mumbai city. pic.twitter.com/YYDSD1GObh— ANI (@ANI) June 24, 2026అప్రమత్తమైన అధికారులుభారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ముంబై నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. ప్రధాన సబ్వేలన్నీ తెరిచే ఉన్నాయని, సబర్బన్ రైల్వే సర్వీసులు, బెస్ట్ బస్సులు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయని తెలిపింది. అయితే, రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో, లోతట్టు ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: పిడుగుల ఊచకోత: ఒకే రోజు 11 మంది దుర్మరణం -
ఉద్ధవ్ ‘సేన’లో చీలిక
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ అధికారికంగా చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు అధికార పక్షం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. తాజా పరిణామంతో శివసేన (యూబీటీ) తిరుగుబాటు ఎంపీల రాజకీయ భవితవ్యంపై కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. తాజా పరిణామంతో శివసేనపై షిండే పట్టు మరింత బలపడటంతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం మరింతగా పెరిగింది. సోమవారం ముంబైలో షిండే, సీనియర్ నేతలు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఉద్ధవ్ వర్గంలోని ఆరుగురు ఎంపీలు శివసేనలో చేరారు. అనంతరం, ఆరుగురితో కలిసి షిండే మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ టైగర్ విజయవంతంగా పూర్తయిందని ఈ సందర్భంగా ప్రకటించారు. ‘ఈ రోజు ఇక్కడ నా పక్కన ఏకంగా ఆరు పులులున్నాయి. ఈసారి మేం సిక్స్ కొట్టాం’అని చెప్పారు. ఈ 6 ఎంపీలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన రాజకీయ దురంధరులు అంటూ పొగిడారు. వీరి చేరిక కోసం పక్కా ప్రణాళికతో చేపట్టిన ఆపరేషన్ టైగర్ విజయవంతంగా పూర్తయిందంటూ చెప్పుకొచ్చారు. 13కు చేరిన షిండే వర్గం ఎంపీలు ఢిల్లీలో ఐదు రోజుల క్రితం జరిగిన శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ భేటీకి మొత్తం 9 మంది ఎంపీలకుగాను ఆరుగురు డుమ్మాకొట్టగా ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఆ ఆరుగురే తాజాగా షిండే పార్టీలో చేరారు. వారు..సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దినా పాటిల్, నగేశ్ పాటిల్, ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్, భావుసాహెబ్ వాక్‌చౌరె ఉన్నారు. వీరంతా కలిసి బయటకు రావడంతో ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ ఈ వర్గానికి లభించినట్లయింది.ఉద్ధవ్ భేటీకి ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా శివసేన(యూబీటీ)లో మరో ముసలం మొదలయిందా అంటే, అవుననే అంటున్నారు. సోమ వా రం ఆరుగురు లోక్‌సభ ఎంపీలు షిండే శివసేనలో చేరారు. అదే సమయంలో ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఏర్పాటు చేసిన భేటీకి ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు మొహం చాటేయడమే ఇందుకు కారణంగా మారింది. వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శివసేన(యూబీటీ) ప్రధాన కార్యాలయం శివాలయ్లో ఉద్ధవ్ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. భేటీకి ఎమ్మెల్యేలు సంజయ్ పొట్నిస్, రాహుల్ పాటిల్, ఎమ్మెల్సీ సునీల్ షిండే డుమ్మా కొట్టారు. -
మహా రాజకీయం.. ఉద్ధవ్‌కు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(UBT)కు చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గానికి భారీ రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా సాగుతున్న ‘ఆపరేషన్ టైగర్’కు ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.గత కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎంపీలు వరుసగా షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ఆరుగురు ఎంపీలు.. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. షిండే వర్గంలో చేరుతున్న వారిలో ఎంపీలు సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాధవ్, భౌసాహెబ్ వక్చౌరే, నాగేశ్ పాటిల్ అష్టికర్, ఓంప్రకాశ్ రాజే నింబాల్కర్ ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే బహిరంగంగా షిండే నాయకత్వానికి మద్దతు ప్రకటించగా, మరికొందరు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అధికార పక్షంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.ఇటీవలే ఎంపీ ఓంప్రకాశ్ రాజే నింబాల్కర్ అధికారికంగా షిండే శివసేనలో చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ వెంటనే మరికొందరు ఎంపీలు కూడా అదే బాట పట్టడంతో ఉద్ధవ్ థాక్రే వర్గంలో ఆందోళన నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచిన యూబీటీకి ఇది ఊహించని పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర అధికార కూటమి ఈ పరిణామాన్ని తమ రాజకీయ విజయంగా ప్రచారం చేస్తోంది. అధికార పక్షంతో ఉంటేనే ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరించగలమనే అభిప్రాయంతో పలువురు ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారని పలువురు మంత్రులు చెబుతున్నారు.అయితే ఉద్ధవ్ థాక్రే వర్గం మాత్రం ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. కొందరు అసంతృప్త ఎంపీలు ఇంకా తమతోనే సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీని వీడిన వారిలో కొందరు తిరిగి వచ్చే అవకాశమూ ఉందని చెప్పారు. శివసేన (యూబీటీ) బలహీనపడలేదని, కార్యకర్తల మద్దతు తమకే ఉందని ఆయన స్పష్టం చేశారు.2022లో జరిగిన శివసేన చీలిక తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు అదే తరహాలో ఎంపీల స్థాయిలోనూ వలసలు కొనసాగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తాజా చేరికలతో మహారాష్ట్రలో షిండే వర్గం మరింత బలోపేతం అవుతుండగా, ఉద్ధవ్ థాక్రే వర్గం ముందు కొత్త సవాళ్లు నిలుస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
రియా కపూర్ రూ.1.35 కోట్ల చెవి రింగులు మాయం
ముంబై: ఇటీవల అమెరికా వెళ్లిన బాలీవుడ్ దర్శకురాలు, ఫ్యాషన్ స్టయిలిస్ట్ రియా కపూర్ అద్దెకు తెచ్చుకున్న రూ.1.35 కోట్ల విలువైన వజ్రపు చెవి రింగులను పోగొట్టుకున్నారు. ఈ మేరకు ఆమె సన్నిహితురాలు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై సహర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యూయార్క్‌లో జరిగే మెట్ గాలాలో పాల్గొనేందుకు రియా కపూర్ ముంబైలోని మెహతా జువెల్లర్స్ అండ్ గోయెంకా జువెల్లర్స్ వద్ద ఖరీదైన రెండు జతల చెవి రింగులను అద్దెకు తీసుకున్నారు. వాటిని సవ్లీన్ సింగ్‌కు ఇవ్వగా, ఆమె తన బ్యాగులో పెట్టుకున్నారు. రియా, సవ్లీన్ బృందం ఏప్రిల్ 17వ తేదీన ముంబై నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి న్యూయార్క్‌కు 28న చేరుకున్నారు. న్యూయార్క్‌లో బస చేసిన పియెర్రె హోటల్‌కు వెళ్లాక బ్యాగు తెరిచి చూడగా రెండు వేర్వేరు బాక్సుల్లో ఉన్న చెవి రింగులు కనిపించలేదు. వీటితోపాటు సుమారు రూ.లక్షన్నర విలువైన మరో రెండు జతల చెవిరింగులు బ్యాగులో లేవు. తిరిగి ముంబై వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆభరణాలు ముంబైలో మాయమయ్యాయా లేక దుబాయ్, అమెరికాలో ఎవరైనా దొంగిలించారా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శనివారం తెలిపారు. -
ఉద్ధవ్ థాక్రే సంచలన ప్రకటన
ముంబై: తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు ప్రకటించడంపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్ని సవాళ్లు, అవరోధాలు ఎదురైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సుమారు 13 ఏళ్లుగా పార్టీకి సారథ్యం వహిస్తున్నానంటూ ఆయన.. తన హయాంలోనే పార్టీ తీవ్ర సవాళ్లను, వ్యక్తిగత దాడులను ఎదుర్కొందని చెప్పారు. పార్టీ నన్ను వద్దనుకుంటే బాధ్యతల నుంచి వైదొలిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నానన్నారు.నాలుగేళ్లలో రెండుసార్లు పార్టీలో చీలిక రావడంపై ఆయన శుక్రవారం మొదటిసారిగా పైవిధంగా స్పందించారు. శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడారు. తనకు నాయకత్వ బాధ్యతల్లో కొనసాగాలన్న కాంక్ష లేదని చెప్పారు. ‘పార్టీకి చెందిన వారు తదుపరి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని ముందుకు వస్తే సంతోషిస్తా. అదే సమయంలో, ద్రోహులు, దొంగలకు పార్టీని అప్పగించబోను’ అని ఆయన పేర్కొన్నారు.అసలు సినిమా ముందుంది: ఏక్నాథ్ షిండేఅసలు సినిమా ముందుందంటూ శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ ఎంసీ ఏక్నాథ్ షిండే పరోక్షంగా ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు పులిగా మారిపోదంటూ ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే పక్షాన చేరారంటూ వస్తున్న వార్తల వేళ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధమవడం ఆ వర్గానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంతో షిండే వర్గం పార్లమెంటు స్థాయిలో మరింత బలోపేతం అవుతుండగా, ఉద్ధవ్ వర్గం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొత్తంగా చూస్తే, 2022లో జరిగిన శివసేన చీలిక తర్వాత మొదటిసారిగా ఉద్ధవ్ వర్గం మరో పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటుండగా, షిండే వర్గం మాత్రం దీనిని తమ రాజకీయ విజయంగా ప్రచారం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉద్దవ్ సేనలో చీలిక.. ఎవరీ సంజయ్ జాధవ్?
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్దవ్ థాక్రే శివసేన వర్గంలో చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఆ శిబిరంలో అంతర్గత అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టాయి. శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం పార్లమెంట్ భవనంలో జరిగింది. సమావేశానికి హాజరైన వారిలో అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే మాత్రమే ఉన్నారు. మిగతా ఎంపీలు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు పార్టీ శిబిరంలో మరోసారి కలకలం రేపింది. విలీనం జరగబోతందనే ప్రచారాన్నిఖరారు చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. మొత్తం తొమ్మిది మంది UBT లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేరే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గైర్హాజరును ఉద్ధవ్ ఠాక్రే సీరియస్‌గా తీసుకున్నారు. హాజరుకాని ఎంపీలపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే కొత్త పార్లమెంటరీ గ్రూప్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి శివసేన (షిండే) వర్గంలో తమ విలీనాన్ని గుర్తించాలని లేఖ సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే.. ఉద్ధవ్ శిబిరానికి పెద్ద రాజకీయ దెబ్బ తగలనుంది. మరోవైపు.. ఈ కొత్త ఫ్రాక్షన్‌కు నాయకుడిగా పర్భణీ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్) పేరు ముందుకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంజయ్ హరిభావు జాధవ్.. అందరూ ‘‘బండు భాయ్’’ అని పిలుచుకుంటారు. శివసేనలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత. పర్భణీకి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది.రెండుసార్లు పర్భణీ ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన.. ఆపై హ్యాట్రిక్ ఎంపీగా అదే లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. సాధారణ శివసేన కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన నేతగా ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అయితే గతంలోనే పార్టీ అంతర్గత అసంతృప్తి కారణంగా ఆయన పేరు వివాదాల్లో కూడా వినిపించింది. 2020లో మిత్రపక్షం ఎన్సీపీ వైఖరి కారణంగా కేడర్‌కు న్యాయం చేయలేకపోతున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. ఎంపీ పదవికి రాజీనామా చేయబోయారు. అయితే ఉద్దవ్ సర్దిచెప్పడంతో దానిని వెనక్కి తీసుకున్నారు.ఇప్పుడు శివసేన (UBT)లో జరుగుతున్న పరిణామాలు ఆయన చుట్టూ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు నిబద్ధమైన, పార్టీ కార్యకర్తల పక్షాన నిలిచే విధేయ శివసైనికుడిగా ఆయనను చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉద్దవ్ చీలిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.మరోవైపు, ఉద్దవ్ సేన నేత సంజయ్ రౌత్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ పార్టీ బలాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. “పార్టీకి రాని వారు మనవారు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే, శివసేన (UBT) లోక్‌సభ శిబిరంలో విభజన దాదాపు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. సంజయ్ బండు జాధవ్ వంటి అనుభవజ్ఞుడైన నేత పేరు ముందుకు రావడంతో శివసేన (UBT)లో చీలిక అంశం మరింత సీరియస్‌గా మారిదంటున్నారు. -
ఆ భర్త బాత్రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు!
అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా మారింది. చివరకు ఆ మానసిక వేదనను తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడి.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది.పుణే వైష్ణవి హగ్వానే కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అరకేజీ బంగారం, నగదు, కాస్ట్లీ కారు కట్నంగా ఇచ్చినప్పటికీ.. సరిపోలేదంటూ అత్తింటి కుటుంబం వైష్ణవిని బలి తీసుకుంది. ఈ ఘటన తర్వాత.. వరకట్నం విషయంలో కొన్ని కులాల పెద్దలు ‘తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే వివాహం చేయాలి’ అని తీర్మానాలు కూడా చేశారు. అయితే ఆ ఘటన మరువక ముందే.. అదే తరహాలో మహారాష్ట్రంలోనే మరో వరకట్న వేధింపులకు నవవధువు బలైన ఘటన చోటు చేసుకుంది. అంబర్‌నాథ్‌లో పెళ్లైన 48 రోజుల్లోనే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు.. దీనికి తోడు ప్రతీ చిన్న విషయానికి భర్త అనుమానించడం విశాఖ తిల్కర్(26)ను దారుణంగా కుంగదీశాయి. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు చెబుతోంది ఏంటంటే.. విశాఖకు ఈ ఏడాది ఏప్రిల్ 30న వైద్యుడు నితిన్ తిల్కర్‌తో వివాహమైంది. అడిగినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే అత్తింట అడుగు పెట్టిన మరుసటి రోజు నుంచే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. తాము అనుకున్నంత కట్నకానుకలు రాలేదని తల్లి, మరిది సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఇటు నితిన్ కూడా చీటికి మాటికి విశాఖను అనుమానించడం మొదలుపెట్టాడు. ఇంటి లోపల, బయట.. ఆఖరికి బాత్రూమ్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విశాఖ ప్రతి కదలికను గమనించాడట.... ఎవరితో మాట్లాడినా ప్రశ్నించడం, అనుమానించడం, దాడి చేయడం తరచూ జరిగేది. విశాఖ బలవన్మరణానికి పాల్పడే రెండు రోజుల ముందు పొరుగును ఉన్నవాళ్లతో మాట్లాడిందని నితిన్ తీవ్రంగా కొట్టాడు. అప్పటిదాకా మౌనంగా భరిస్తూ వచ్చిన ఆమె.. పుట్టింటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. దీంతో ఆమెను ఆ నరకం నుంచి బయటపడేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈలోపే.. ఏం జరిగిందో ఏమోగానీ జూన్ 16న ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త నితిన్ తిల్కర్‌తో పాటు అతని తల్లి ఛాయా, సోదరుడు నినాద్‌పై మానసిక, శారీరక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాల కింద కేసులు పెట్టారు. నితిన్‌ను అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పెళ్లై రెండు నెలలు కూడా పూర్తికాకముందే అనుమానం, నిఘా, వేధింపుల మధ్య తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిందంటూ ఆ తల్లిదండ్రులు పెట్టిన కన్నీళ్లు పలువురిని కదిలించాయి. -
షిండేకు షాక్.. ఢిల్లీ ప్లాన్ ఫెయిల్!
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. శివసేన (ఉద్ధవ్ బలాసాహెబ్ ఠాక్రే) వర్గంలో తిరుగుబాటు ఊహాగానాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు ఒక్కసారిగా ఢిల్లీ కేంద్రంగా కీలక మలుపు తిరుగుతాయని అంతా భావించారు. ఈ తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కీలకంగా భావించిన రాజకీయ భేటీ చివరి నిమిషంలో రద్దు కావడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. దీంతో షిండే వర్గం వ్యూహానికి ఉద్ధవ్ శిబిరం చెక్ పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.శివసేన (యూబీటీ)కి చెందిన కొంతమంది లోక్‌సభ ఎంపీలు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది. “ఆపరేషన్ టైగర్”లో భాగంగా ఉద్ధవ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆరుగురు ఎంపీలు విలీనం అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీ విభజనకు అవసరమైన రెండు మూడవ వంతు మెజారిటీకి ఈ సంఖ్య దగ్గరగా ఉండటంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 19న శివసేన ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి.ఈ నేపథ్యంలో ఢిల్లీలో శ్రికాంత్ షిండే నివాసంలో బుధవారం జరగాల్సిన కీలక భేటీ చివరి క్షణంలో రద్దు కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి ముందు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు విలీనంపై లేఖ సమర్పిస్తారని లీకులు అందాయి. అలాగే భేటీకి ఏక్నాథ్ షిండే కూడా ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో.. అనూహ్యంగా మొత్తం ప్లాన్ నిలిచిపోయింది. మరోవైపు ఉద్ధవ్ శిబిరం ముందస్తుగా అప్రమత్తమైంది. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేస్తూ ఢిల్లీలో జరిగే పార్టీ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే అనర్హత వేటు తప్పదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.ఉద్ధవ్ శిబిరం తరఫున సంజయ్ రౌత్ మాట్లాడుతూ తిరుగుబాటు ప్రయత్నానికి అవసరమైన సంఖ్య ప్రత్యర్థి వర్గానికి లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇది ఒత్తిడి రాజకీయాల భాగమని, ఎంపీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు చేశారు. రూ.15 కోట్ల ఆఫర్ అంశం కూడా రాజకీయ వేడిని పెంచింది. మొత్తం 50 కోట్ల రూపాయలతో ఎంపీలకు ఎర వేస్తున్నారని.. అడ్వాన్స్‌గా 15 కోట్లు చెల్లించారని సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడే సమయంలో వెంట కేవలం ముగ్గురు ఎంపీలే ఉండడం గమనార్హం. అంతకు ముందు.. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ పరిణామంపై స్పందించారు. 2022 శివసేన చీలిక సమయంలోనే పరిస్థితులను అర్థం చేసుకున్నానని, కానీ ఎవరిపైనా ఒత్తిడి చేయడం తన ఇష్టం లేదని అన్నారాయన. మరోవైపు పార్టీ నేతలు అనిల్ దేశాయ్, ఆదిత్య ఠాక్రే మాత్రం పార్టీ ఐక్యతపై నమ్మకం వ్యక్తం చేశారు.మొత్తం పరిస్థితిని చూస్తే ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ డ్రామాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే కనిపిస్తున్నప్పటికీ, మహారాష్ట్ర రాజకీయాల్లో అస్థిరతపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్ సమీకరణాలను మళ్లీ మార్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసిన ఎంపీలు.. ఢిల్లీకి జంప్!
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామాలు తప్పవా?. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఎంపీలు పార్టీని వీడబోతున్నారన్న ఊహాగానాలకు బలం చేకూరే వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు లోక్‌సభ ఎంపీలు 24 గంటలుగా అదిష్టానానికి అందుబాటులో లేకపోవడంతో ఉద్దవ్ శిబిరం ఆందోళన చెందుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా కొందరు ఎంపీలతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించినప్పటికీ వారు ఫోన్‌కు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ‘‘ఆరుగురు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఇంటికి వెళ్తే లేరనే సమాధానం వచ్చింది. ఎక్కడున్నారో ఆరా తీస్తే.. ఢిల్లీకి వెళ్లారని తెలిసింది. పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం కోసం వెళ్లామని వాళ్లు చెప్పారట. కానీ, మా అధిష్టానం మాత్రం అలాంటి మీటింగ్ ఏం నిర్వహించడం లేదు’’ అని ఉద్దవ్ వర్గానికి చెందిన ఓ నేత చెబుతున్నారు. అయితే.. ఏక్నాథ్ షిండే వర్గం ఆ మీటింగ్ నిర్వహిస్తుండడంతో.. తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నాగేశ్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వక్చౌరే, సంజయ్ జాధవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు రాజాభౌ వాజే కూడా చేరే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీలో శ్రికాంత్ షిండే నివాసంలో కొందరు యూబీటీ ఎంపీలు సమావేశమయ్యే అవకాశం ఉందని, ఆ సమావేశానికి ఏక్నాథ్ షిండే కూడా హాజరయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అనంతరం వారు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి, ముందుగా ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్‌గా ఏర్పడి, తర్వాత షిండే శివసేనలో విలీనం అయ్యే దిశగా అడుగులు వేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఢిల్లీ కేంద్రంగా రాజకీయ వ్యూహాలు..ఈ ఎంపీలు ముందుగా ప్రత్యేక లోక్‌సభ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత షిండే శివసేనలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో వారు లోక్‌సభ స్పీకర్‌ను కూడా కలిసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక షిండే వర్గం కూడా ఈ పరిణామాలపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ.. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను విశ్వసించే ప్రజాప్రతినిధులకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. దీంతో విలీనం ఖాయమనే చర్చా జోరందుకుంది.ఉద్ధవ్ వర్గం కౌంటర్2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు గెలుచుకోగా, ఏక్నాథ్ షిండే వర్గం 7 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం యూబీటీకి ఉన్న ఈ 9 మంది ఎంపీల్లో పలువురు షిండే శిబిరంతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి తొమ్మిది మంది ఎంపీల్లో కేవలం నలుగురే ప్రత్యక్షంగా హాజరు అయ్యారు. మిగిలిన వారు ఆన్లైన్, ఫోన్ ద్వారా పాల్గొన్నారని పార్టీ వర్గాలు చెబుతుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో ఉద్ధవ్‌కు అత్యంత సన్నిహితులుగా భావించే ఎంపీలు అర్వింద్ సావంత్, అనిల్ దేశాయ్ ఢిల్లీకి చేరుకోగా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఇప్పటికే అక్కడే మకాం వేశారు. మరోవైపు, ఇటీవల ఉద్ధవ్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాధవ్‌తో భేటీ కావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రచారాన్ని ఉద్ధవ్ వర్గం మొదటి నుంచి ఖండిస్తోంది.పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రేతోనే ఉన్నారని, పార్టీ చీలికపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. పార్టీకి ఎలాంటి తక్షణ ప్రమాదం లేదని, 60 ఏళ్ల చరిత్ర కలిగిన శివసేన ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కొందరు ఎంపీలను ఆకర్షించేందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున అడ్వాన్స్‌లు ఇస్తున్నారనే సంచలన ఆరోపణలు కూడా చేశారు.ఆపరేషన్ టైగర్2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన చీలిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో మరోసారి అసంతృప్తి సంకేతాలు కనిపిస్తుండటం, ఆ ఎంపీలను తమ గూటికి చేర్చుకునేందుకు షిండే వర్గం ప్రయత్నిస్తోందనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తోంది. ఈ రాజకీయ వ్యూహానికే "ఆపరేషన్ టైగర్" అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకవేళ ఈ వ్యూహం ఫలిస్తే ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి ఇది మరో భారీ రాజకీయ ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ వర్గాలు ఇటీవల పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌లో వెలుగుచూసిన అసంతృప్తి పరిణామాలతో పోలుస్తున్నాయి. అక్కడి పరిణామాల తరహాలోనే యూబీటీలోనూ తిరుగుబాటు జరుగుతుందా? లేదంటే ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితిని చక్కదిద్దగలరా? అన్న ఉత్కంఠ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. -
బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 14 మంది మృతి
సోలాపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో విషాదం జరిగింది. బావిలోకి వ్యాన్ దూసుకెళ్లడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్.. రహదారి పక్కనే ఉన్న పొలంలోని బావిలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను పండరపూర్ తాలూకాలోని రంజని గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లీక్ అయితే పరీక్షార్థికి పరిహారం
పుణె: ప్రతిష్టాత్మక నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీలు, సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్‌లో వైఫల్యాలు, క్యూట్ పరీక్ష నిర్వహణలో అసమర్థత వంటి పలు దారుణోదంతాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలి దఫాలో పుణెలో తొలి నిరసన కార్యక్రమాన్ని గురువారం మొదలెట్టింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సారథ్యంలో పుణెలోని సావిత్రీభాయ్ ఫూలే పుణె విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు, పార్టీ అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీజేపీ తమ ‘పరీక్షల మేనిఫెస్టో’ను విడుదలచేసింది. మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయకపోతే జూన్ 20వ తేదీన పుణె విద్యార్థులంతా ఢిల్లీకొచ్చి ఉద్యమిస్తారని దీప్కే స్పష్టంచేశారు. హిందూ–ముస్లిం విభజన అంశాలపై రాజకీయాలు నడుస్తున్నాయి. వీటి నుంచి దృష్టి మరలిస్తేనే స్తంభించిన దేశ ప్రగతి రథాలు ముందుకు కదులుతాయని దీప్కే అన్నారు. ‘‘హిందూ–ముస్లిం విభజన రాజకీయాలతో యువత విసిగెత్తిపోయారనేందుకు మా కాక్రోచ్ నిదర్శనం. ఇలాంటి రాజకీయాలతో సమాజం కంపుకొడుతోంది. ఈ కంపు పోగొట్టేందుకే బొద్దింకలొచ్చాయి. ప్రభుత్వంతో చర్చలకు మేం సిద్ధం. మాతో చర్చలకు ముందుకురాకుండా ప్రభుత్వం మా సోషల్‌మీడియా ఖాతాలను స్తంభింపజేయడంలో బిజీగా మారింది’’అని ఆయన వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు... → ఇకమీదట ప్రభుత్వాలు నిర్వహించే కోర్సులు, ఉద్యోగ సంబంధ పరీక్షల్లో ఒక ప్రశ్నపత్రం లీక్ అయినా సరే ఆ పరీక్ష రాసిన అభ్యర్థి/విద్యార్థికి రూ.10,000 నష్టపరిహారం ఇవ్వాలి → లక్షలాది మంది రాసే పరీక్షల వేళ అభ్యర్థులు వేగంగా, సమయానికి పరీక్షాకేంద్రానికి చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలి → పరీక్ష రద్దయితే ఆ రద్దయిన పేపర్ మాత్రమే 72 గంటల్లోపు మళ్లీ నిర్వహించేలా ‘షెడ్యూల్ చేసిన తేదీ’లను ముందే నిర్ణయించుకోవాలి. ఆ తేదీల్లో పరీక్ష కచ్చితంగా నిర్వహించాలి → ఆన్లైన్లో పేపర్లను దిద్దడం మానేసి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు స్వయంగా పేపర్లను దిద్దాలి. → రాసిన పరీక్ష రద్దయి తర్వాత పరీక్ష రాసేలోపు వయోపరిమితి దాటిపోయే అభ్యర్థులకు చివరి అవకాశం ఇవ్వాలి → కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాలను ఆడిటింగ్ చేయాలి → పరీక్షలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడో సంస్థకు ఇస్తే వాళ్ల గత చరిత్రను క్షుణ్ణంగా తనిఖీచేయాలి -
పాక్ నిషేధం లేదా?.. జాతరలో కొన్న బెడ్‌షీట్‌పై మేడ్ ఇన్ పాకిస్తాన్ ముద్ర
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ వెలుగుచూసింది. ఓ జాతరలో కొనుగోలు చేసిన బెడ్‌షీట్‌పై ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ (Made in Pakistan) అనే లేబుల్ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోను మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, పాకిస్తాన్‌కు చెందిన వస్తువులు భారత్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ పరిధిలో ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయంలో బుధవారం సంకష్ట చతుర్థి జాతర జరిగింది. ఈ జాతరకు పూణేకు చెందిన ఓ మహిళ వెళ్లింది. జాతరలో ఆమె.. బెడ్‌షీట్‌ను కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో దానిపై ఎలాంటి అనుమానాస్పద గుర్తులు లేవు. అయితే, ఇంటికి వెళ్లాక దానిని వాష్ చేయడంతో ఒక మూలన దాచిన లేబుల్ స్పష్టంగా కనిపించింది. దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని రాసి ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, వెంటనే దీన్ని ఫోన్లో రికార్డు చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పోలీసులు గుర్తించారు.पुणे के चिंचवड़ में मोरया गोसावी मंदिर के संकष्टी चतुर्थी के दिन मेले में मेड इन पाकिस्तान चीजों की बिक्रीहिंदू महिला ने किया उजागर वीडियो हुआ वायरल pic.twitter.com/JN859goEf9— Amrendra Bahubali 🇮🇳 (@TheBahubali_IND) June 5, 2026ఈ వైరల్ వీడియోపై తక్షణమే స్పందించిన పింప్రి-చించ్వాడ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెడ్‌షీట్‌ను అమ్మిన సదరు వీధి వ్యాపారి ఎవరు? అతడికి ఈ స్టాక్ ఎక్కడి నుంచి సరఫరా అయింది? స్థానిక మార్కెట్లోకి ఈ పాకిస్తాన్ వస్తువులు ఎలా ప్రవేశించాయి? అనే సప్లై చైన్ నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాశారు. అయితే, మహారాష్ట్రలోని శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో కూడా ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ అని ఉన్న కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జాతరలు, స్థానిక మార్కెట్లలో విక్రయించే వస్తువులపై నిఘా వర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.ఇదిలా ఉండగా.. 2019లో జరిగిన పుల్వామా అటాక్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా తగ్గాయి. భారత్.. పాకిస్తాన్‌కు ఇచ్చిన Most Favoured Nation (MFN) హోదాను రద్దు చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా అనేక భారతీయ వస్తువుల దిగుమతులపై పరిమితులు విధించింది. అందువల్ల ‘Made in Pakistan’ అనే లేబుల్ ఉన్న వస్తువు భారత మార్కెట్లో కనిపిస్తే అక్రమంగా దేశంలోని వచ్చేనట్టే లెక్క. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రత, దిగుమతి నియంత్రణలు, అక్రమ సరఫరా గొలుసులపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. -
డీఎంకే అవుట్.. టీవీకే ఇన్: రౌత్ వ్యాఖ్యలు
ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. కూటమి నుంచి డీఎంకే బయటకు వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీ టీవీకే చేరికతో భర్తీ అయ్యిందన్నారు. ఈ నెల 8వ ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ హాజరవుతున్నందున తాము రాలేమని డీఎంకే ప్రకటించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.ఈ సందర్భంగా రౌత్.. ‘ఇండియా కూటమిలో చీలిక ఉందనడం తప్పు. తమిళనాడు ఎన్నికల తర్వాతే డీఎంకే కొంత దూరం పాటించడం ప్రారంభించింది. బదులుగా, కూటమిలోకి టీవీకే వచ్చింది. కూటమిలో చీలిక ఉందని అనకండి. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయ మిత్రుడు ఉన్నాడని చెప్పండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఓటమి పాలై, సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి రావడం తెల్సిందే. దీంతో, డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలకడం తెల్సిందే. ఈ పరిణామం పట్ల డీఎంకే గుర్రుగా ఉంది. -
సారీ చెప్పి.. 15 వేలు ఫోన్‌పే చేశాడు!
డిజిటల్ చెల్లింపుల యుగంలో పొరపాట్లు జరగడం సహజం. అలాంటి పొరపాటుతో చాలా మంది నష్టపోతున్నారు కూడా. తక్షణ స్పందన.. ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో డబ్బులు వెనక్కి రాలేని పరిస్థితి. అలా ఓ కంపెనీ సీఈవో ఏమరపాటులో డబ్బు పంపిస్తే.. ఓ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు!. ముంబై మహానగరం. ఓ బిజీ సీఈవో(పేరు కావాలనే ప్రస్తావించలేదు) తన కారులో కాకుండా నిత్యం ఆటోలో ప్రయాణిస్తుంటాడు. అలా రైడ్ పూర్తయ్యాక డిజిటల్ పేమెంట్ ద్వారా ఛార్జీ చెల్లించే క్రమంలో పొరపాటు చేశాడు. ఆటో ఛార్జీకి బదులుగా ఏకంగా రూ.15,682 ఆటో డ్రైవర్ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఆఫీస్‌లోకి వెళ్లాక చాలా సేపటికి ఆయన ఆ విషయం గుర్తించాడు. ఆటో డ్రైవర్‌ను సంప్రదించాలా? వద్దా? అని అనుకుంటూ ఉండిపోయాడాయన. ఈలోపు.. ఆయన ఊహించనిది జరిగింది. డబ్బు పొరపాటున జమైందని తెలుసుకున్న ఆటో డ్రైవర్ వెంటనే స్పందించి మొత్తం డబ్బును తిరిగి ఫోన్‌పే ద్వారా పంపించాడు. సారీ సర్.. అంటూ మెసేజ్ కూడా పంపాడు. ఈ ఘటనను ఆ సీఈవో తన LinkedIn ఖాతాలో పంచుకున్నాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపాడు. అతడి పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది.ఈ కథ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. "ఇలాంటి సంఘటనలే మనుషులపై విశ్వాసాన్ని నిలబెడతాయి" అంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. మరికొందరు డిజిటల్ చెల్లింపుల్లో పొరపాట్లు పెరుగుతున్నప్పటికీ, నిజాయితీ ఇంకా సమాజంలో బతికే ఉందని వ్యాఖ్యానించారు. వైరల్ అవుతున్న వార్తల్లో ఎక్కువగా వివాదాలు, ఘర్షణలు కనిపించే ఈ కాలంలో.. ఓ సాధారణ ఆటో డ్రైవర్ చేసిన నిజాయితీ పని మాత్రం వేలాది మందిని ఆకట్టుకుంది. రూ.15 వేల కంటే విలువైనది మనిషి నమ్మకం, నిజాయితీ అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. -
లవర్స్ కోసం.. కుళాయిలు కొట్టేశారు
ప్రేమలో పడితే కొన్నిసార్లు ఆలోచనలకన్నా కోరికలే ముందుకు నడిపిస్తాయి. ప్రియురాళ్లకు గిఫ్ట్‌గా ఐఫోన్ ఇవ్వాలన్న చిన్న ఆశ ఆ యువకులను పెద్ద నేరం వైపు నెట్టేసింది. కానీ వారు వేసిన ప్లాన్ మాత్రం చివరికి ఊహించని మలుపు తిరిగి కటకటాల పాలు జేసింది.ఇద్దరు యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఐఫోన్లు కొనివ్వాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ ట్యాప్స్‌ను ఓ గోడౌన్ నుంచి దొంగిలించారు. కానీ ఆ ఖరీదైన వస్తువులు చివరికి కేవలం రూ.20 వేలకే స్క్రాప్ డీలర్‌కు అమ్మేయడం ఈ కేసులో మరో ట్విస్ట్‌గా మారింది.ఓ గోడౌన్ యజమాని ఫిర్యాదుతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. మే 27–28 మధ్య రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గోడౌన్ పైకప్పులోని టిన్ షీట్లు తొలగించి లోపలికి ప్రవేశించి ఖరీదైన సానిటరీ వేర్‌ను ఎత్తుకెళ్లారు. గోల్డ్ టోన్, రోజ్ గోల్డ్, సిల్వర్ ఫినిష్ ఉన్న ప్రీమియం ట్యాప్స్ సహా మొత్తం రూ.6.5 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి.కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 20కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సమాచారం, టెక్నికల్ ఇన్పుట్స్ ఆధారంగా కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించారు. విచారణలో ఇద్దరు మైనర్లు సహా ఒక ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. ప్రశ్నించగా షాకింగ్ నిజం బయటపడింది గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఐఫోన్లు కొనాలన్న కోరికతోనే ఈ దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నారు. దొంగిలించిన ఖరీదైన ట్యాప్స్‌ను కేవలం రూ.20 వేలకే అమ్మినట్లు కూడా తేలింది. ఆ వస్తువులు కొనుగోలు చేసిన 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం వేసిన “కాస్ట్లీ స్కెచ్” చివరికి చీప్ బేరంలో ముగిసి, పోలీసులు కేసును ఛేదించడంతో కథ ముగిసింది. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీ అభ్యర్థి కొడుకుతో సూలే కుమార్తె పెళ్లి
నాగ్‌పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్ లఖానీ కుమారుడు శరంగ్ లఖానీతో రేవతి వివాహం ఈ నెల 20న జరగనుంది. మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన అరుణ్ లఖానీ కుటుంబంతో సుప్రియా సూలే వియ్యమందుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే రాజకీయాలు, కుటుంబ వ్యవహారాలు వేర్వేరని అరుణ్ లఖానీ స్పష్టం చేశారు.మహారాష్ట్రలో పెద్ద రాజకీయ కుటుంబమైన పవార్ ఫ్యామిలీతో పెళ్లి సంబంధం కలుపుకుంటున్నామని వెల్లడించారు. పవార్ కుటుంబంతో తమకు బంధుత్వం కూడా ఉందని తెలిపారు. వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తాము ఆయా పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. బంధుత్వానికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగి ఎంపికైన తనకు సుప్రియా సూలే అభినందనలు చెప్పినట్టు మరాఠీ న్యూస్ చానల్‌తో అరుణ్ లఖానీ చెప్పారు.గెలుపుపై దీమాప్రజలు తమ కోసం పనిచేసే వారినే ఎన్నుకుంటారని అరుణ్ లఖానీ (Arun Lakhani) అన్నారు. చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రజలతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. లక్ష్మణరావు మాంకర్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.పారిశ్రామికవేత్తలకే బీజేపీ ప్రాధాన్యంఅరుణ్ లఖానీకి బీజేపీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత విజయ్ వడెట్టివార్ విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల కంటే పారిశ్రామికవేత్తలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేసిందని, పూర్తి స్థాయిలో పోటీకి దిగుతుందన్నారు. తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీ అంతర్గత ఆందోళనలకు సంకేతమని ఆరోపించారు. చంద్రపూర్ స్థానానికి కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ కార్యదర్శి, పలు రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్న శైలేంద్ర అగ్రవాల్‌ను అభ్యర్థిగా నిలబెట్టినట్లు విజయ్ వడెట్టివార్ తెలిపారు.18న ఎన్నికలుమహారాష్ట్రలో స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన 16 శాసన మండలి స్థానాలకు, నాగ్‌పూర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఉపఎన్నికకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా వ్యవహరించే ఈ ఎన్నికలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించనున్నారు. -
అవసరమైతే ‘సింధూర్ 2.0’కు సిద్ధం
పుణే: ఒకవేళ ‘ఆపరేషన్ సింధూర్ 2.0’ అవసరం తలెత్తితే అందుకు భారత సైనిక దళాలు సర్వసన్నద్ధం ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. భూతల, గగనతల, సముద్ర యుద్ధానికి అతీతంగా ఆధునిక బహుళ–రంగ యుద్ధం కోసం త్రివిధ దళాలు సమన్వయాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని పుణే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(డీఎన్ఏ)లో శనివారం పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తాత్కాలికంగా నిలిచి పోయినప్పటికీ.. మళ్లీ మొదలైతే అందుకోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. గత ఏడాది పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద వివరాలు, శిక్షణ కేంద్రాలను సైన్యం నేలమట్టం చేసింది. పలువురు ముష్కరులను హతమార్చింది. పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడు మొదలైనా సరే వెంటనే రంగంలోకి దిగేలా మన సైన్యం అన్ని రకాల సన్నాహాలతో సిద్ధంగా ఉందన్నారు. యుద్ధక్షేత్రాలు పారదర్శకం భవిష్యత్తులో యుద్ధం కేవలం భూమి, సముద్రం, గగనతలానికి పరిమితం కాదని జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. అంతరిక్ష యుద్ధాలు, సైబర్ సైబర్ యుద్ధాలు జరుగుతాయన్నారు. యుద్ధ రీతులు నానాటికీ మారిపోతున్నాయని గుర్తుచేశారు. ఆధునిక యుద్ధక్షేత్రాలు పారదర్శకంగా మారాయని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రతి కదలిక అవతలివారికి వెంటనే తెలిసిపోతుందన్నారు. అందుకే సైనిక మోహరింపులు, బలగాల రక్షణ చర్యల విషయంలో సైనిక వ్యూహకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రమబద్ధమైన, కచ్చితమైన, ప్రయోజనాత్మకమైన ప్రతిస్పందనలో భారతదేశ సంకల్పాన్ని, సాయుధ దళాల సామర్థ్యాన్ని ఆపరేషన్ సింధూర్ చాటిచెప్పిందని ఉద్ఘాటించారు. సమగ్ర ప్రణాళిక, రియల్ టైమ్ నిఘా, కచ్చితమైన లక్ష్య నిర్దేశం, పటిష్టమైన వాయు రక్షణ, సురక్షిత సమాచార మార్పిడి, వివిధ రంగాల మధ్య సమన్వయం ప్రాముఖ్యతను ఈ ఆపరేషన్ నొక్కిచెప్పిందని వివరించారు. భారత సైన్యం ఆధునీకరణ మార్గంలో ముందుకు సాగుతోందన్నారు. ‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శక్తి’గా మనం రూపాంతరం చెందుతున్నామని, ఇందులో యువతరం పాత్ర కీలకమని స్పష్టంచేశారు. -
అద్భుత చికిత్సల పేరుతో మోసం.. పతంజలి ఉత్పత్తులు సీజ్
ముంబై: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వ్యక్తులు, సంస్థలపై ఇకపై కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (FDA) స్పష్టం చేసింది. తప్పుడు వైద్య ప్రకటనలు, అద్భుత చికిత్సల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.73 లక్షల మందులను అధికారులు స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 33 మంది అరెస్ట్ చేసి 27 సంస్థలను సీజ్ చేశారు. కాగా, పతంజలి బ్రాండ్‌తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడటం గమనార్హం.ఈ సోదాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఇటీవల ఎఫ్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తుకారం ముండే ప్రజారోగ్య పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మే 25న బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, చట్టవిరుద్ధ ఔషధ తయారీ, విక్రయాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు మే 29న మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి భారీ తనిఖీలు నిర్వహించారు. ముంబై, కొంకణ్, పూణే, నాసిక్, అమరావతి, నాగపూర్, శంభాజీనగర్ ప్రాంతాల్లో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్) యాక్ట్-1954ను ఉల్లంఘిస్తున్న సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు.నివారణ పేరుతో మోసంపలు సంస్థలు తమ ఆయుర్వేద, హెర్బల్ ఔషధాలను ప్రచారం చేస్తూ క్యాన్సర్, మధుమేహం, లైంగిక సమస్యలు, స్థూలకాయం, వంధ్యత్వం వంటి తీవ్రమైన వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు "100 శాతం ఫలితం", "శస్త్రచికిత్స అవసరం లేదు", "కొద్ది రోజుల్లో వ్యాధి మాయం" వంటి వాదనలతో ప్రజలను ఆకర్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, సరైన వైద్య చికిత్సకు దూరం చేసే ప్రమాదం ఉందని ఎఫ్‌డీఏ పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్, స్థానిక టీవీ ఛానళ్లు, పత్రికలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఈ ప్రచారం సాగుతున్నట్లు గుర్తించారు.భారీగా స్వాధీనం..రాష్ట్రవ్యాప్తంగా అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం రూ.73.24 లక్షల విలువైన ఆయుర్వేద, అల్లోపతి ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.కొంకణ్ విభాగంలో – రూ.18.58 లక్షలుపుణే విభాగంలో – రూ.14.68 లక్షలునాగ్పూర్ విభాగంలో – రూ.7.26 లక్షలునాసిక్ విభాగంలో – రూ.7.10 లక్షలుగ్రేటర్ ముంబైలో – రూ.1.85 లక్షల మందులుఅదనంగా రూ.21.83 లక్షల విలువైన మిస్ బ్రాండెడ్ అల్లోపతి మందులు కూడా స్వాధీనం చేశారు.పతంజలి ఉత్పత్తులపైనా చర్యలుహరిద్వార్కు చెందిన దివ్యా ఫార్మసీ తయారు చేసిన, పతాంజలి బ్రాండ్‌తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడ్డాయి. తీవ్రమైన వ్యాధులకు హామీ చికిత్స ఇస్తామని ప్రచారం చేసిన నేపథ్యంలో వాటిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 60 రకాల ఉత్పత్తులను కలిపి రూ.28.78 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేశారు.కఠిన హెచ్చరికఈ సందర్భంగా కమిషనర్ తుకారం ముండే మాట్లాడుతూ..‘ప్రజల ఆరోగ్యంతో ఆటలాడేవారిని వదిలిపెట్టం. తప్పుడు ప్రకటనలు, అక్రమ ఔషధాలు, కల్తీ ఆహారంపై మరింత కఠిన చర్యలు తీసుకుంటాం’ అనిహెచ్చరించారు. మొత్తంగా కమిషనర్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడులు కల్తీ ఆహారం, తప్పుడు వైద్య ప్రకటనల మాఫియాకు గట్టి హెచ్చరికగా మారాయి. -
పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
ముంబై: పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. శివారు ప్రాంతమైన పింప్రి చించ్వాడ్లో ఈ ఘటన జరిగింది. పింప్రి చించ్వాడ్లోని వాన్వాడి ప్రాంతంలో అక్రమ మద్యం సేవించి గురువారం ఎనిమిది మంది మరణించగా.. ఇవాళ (శుక్రవారం) ఉదయం మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 11కి చేరింది. మద్యం సేవించిన తర్వాత బాధితులు స్పృహ తప్పి పడిపోయారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వారు మరణించినట్లు ప్రకటించారు.ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని స్థానిక ఎన్సీపీ నేత యోగేష్ బహాల్ డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారుల అండదండలతోనే అక్రమ, కల్తీ మద్యం బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల కళ్ల ముందే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని.,. చర్యలు తీసుకోవాల్సింది పోయి.. 11 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దందాలో వారు కూడా భాగమయ్యారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఎండతీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని పేర్కొంటూ... ఈ 11 మరణాలు కల్తీ మద్యం వల్లే జరిగాయని ధృవీకరించడానికి పోలీసులు నిరాకరించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారని.. దీని వెనుక ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. -
ముంబై ఇండియన్స్‌పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
సాక్షి,ముంబై: ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన స్నాతకోత్సవంలో ఒకవిద్యార్థి ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది. అందులోనూ ముంబై ఇండియన్స్‌ను ఉద్దేశించి చమత్కారంగా ప్రస్తావించడంతో ఊహించని విధంగా నవ్వుల పువ్వులై పోయారు. మరీ ముఖ్యంగా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ (Nita Ambani) కూడా నవ్వు ఆపుకోలేక పోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.2026 బ్యాచ్ స్నాతకోత్సవ వేడుకకు సంబంధించిన ఒక వీడియోలో అంబానీ కుటుంబానికి చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీపై ఆ విద్యార్థి సరదా వ్యాఖ్యలు విశేషంగా నిలుస్తున్నాయి. సాధారణంగా స్నాతకోత్సవ ప్రసంగాలు భావోద్వేగపూరితమైన స్మృతులు, భవిష్యత్ సలహాలతో నిండి ఉంటాయి. కానీ ఈ విద్యార్థి క్రికెట్ హాస్యాన్ని జోడించి, అక్కడున్నవారినందరినీ ఆకట్టుకున్నాడు.Student make fun of Mumbai Indians in front of Nita Ambani - Look at reaction of Nita Ambani. 🤣🤣 pic.twitter.com/xk3Ih0IhNP— Jeet (@JeetN25) May 24, 2026 ఈ సందర్బంగా ఆ హెడ్ బాయ్ విద్యార్థుల పాఠశాల ప్రయాణాన్ని ,తాము కలిసి పంచుకన్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నాడు. స్నాతకోత్సవం తర్వాత జీవితం గురించి మాట్లాడుతూ, "మన ప్రియమైన ముంబై ఇండియన్స్ (MI) లాగే, జీవితంలోనూ కష్టమైన కాలాలు (సీజన్స) ఉంటాయి’’ అని అనడంతో ఒక్కసారిగా అందరూ అలర్ట్ పోయారు. ఆ తర్వాత అతను ప్రసంగాన్ని కొనసాగిస్తూ, “ఏదీ సరిగ్గా జరగనట్లు అనిపించే సీజన్స్, మన శ్రమకు తగ్గ ఫలితాలు రానప్పుడు, ప్రతీదాన్నీ ప్రశ్నించుకునే చోట..ఈ ఫ్రాంచైజీ మనందరికీ నేర్పిన ఒక విషయం ఏమిటంటే, మీరెవరో ఎప్పటికీ మర్చిపోకూడదు. మీ వారసత్వాన్ని, మీకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు,” అని అతను వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. దీంతో కెమెరా నీతా అంబానీ వైపు మళ్లింది. ఆ ఊహించని వ్యాఖ్యకు ఆమె నవ్వుతూ ముఖం చేతులతో కప్పుకోవడం కనిపించింది.అక్కడితో ఆగిపోలేదు.. అతను ముంబై ఇండియన్స్ నినాదాన్ని ప్రస్తావిస్తూ, “'దునియా హిలా దేంగే హమ్' అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి” అనడంతో నీతా సహా అందరూ ఆప్యాయంగా నవ్వుతూ చప్పట్లు మారు మోగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పీవీ సింధుతో సహా పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేశారు. ఈ యువ పిడుగు చమత్కారానికి ఇంటర్నెట్ కూడా పాజిటివ్‌గా స్పందించింది. -
బ్రహ్మపురిః47.2
న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాలు మండుతున్న ఎండలతో అల్లాడుతున్నాయి. ఆదివారం మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో ఉన్న బ్రహ్మపురిలో దేశంలోనే అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత్ర రికార్డయ్యింది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు ఎక్కువ. యూపీలోని బాందాలో 46.8, రాజస్తాన్‌లోని గంగానగర్‌లో 46 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 46, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో 45.6, వార్థాలో 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రాజస్తాన్‌లో 47 డిగ్రీల వరకు నమదయ్యే అవకాశముందంది. కాగా, మే 29వ తేదీ తర్వాత క్రమేపీ ఎండల నుంచి ఉపశమనం కలగనుందని ఐఎండీ అంచనా వేసింది. -
దాహం తీర్చండయ్యా..
ఒక రోజంతా తిండిలేకుండా ఉండగలవేమోగానీ ఒకపూట అందులోనూ ప్రచండ ఎండల్లో ఆరుబయట చుక్కనీరులేకుండా తిరగడం అస్సలు సాధ్యంకాని పని. వేసవికాలంలో నోరులేని మూగజీవాల సంగతి చెప్పనక్కర్లేదు. అటవీప్రాంతాల్లోని వానరాలు, కొండముచ్చుల దాహార్తి ఇక ఎవరికీ పట్టదు. కొండ మీద స్వేచ్ఛగా తిరిగే కొండముచ్చులు మండే ఎండల ధాటికి తాగడానికి నీరులేక రహదారి సమీపానికి వచ్చాయి. ఒక కొండముచ్చు ప్రాణాలకు తెగించి రోడ్డుకు అడ్డంగా కూర్చుని దప్పిక తీర్చమని అరి్థంచింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో జరిగింది. పుసాద్ పట్టణం సమీపంలోని ఖండాలా ఘాట్ గుండా గురువారం మధ్యాహ్నం ప్రయాణికులతో మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా బస్సు ఖండాలా ఘాట్ అటవీప్రాంతం గుండా వెళ్తుండగా హఠాత్తుగా ఒక కొంచముచ్చు రోడ్డు మధ్యలోకి వచ్చి ఆగింది. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి కిందకు దిగొచ్చి ఎంతలా అదిలించినా అది అస్సలు అక్కడి నుంచి కదల్లేదు. చుక్క నీరులేక దప్పికతో ఉందని దానిని తేరిపారా చూశాక డ్రైవర్‌కు అర్థమైంది. వెంటనే నీళ్లసీసాతో దానికి నీళ్లు పట్టాడు. ఆబగా అది నీళ్లు తాగడం చూసి సమీపంలోని డజనుపైగా కొండముచ్చులు సైతం రోడ్డు మీద కొచ్చి ప్రయాణికుల వైపు నిస్సహాయంగా చూడడం మొదలెట్టాయి. ఇదంతా గమనించిన ప్రయాణికుల మనసు చివుక్కుమంది. వెంటనే ప్రతి ఒక్క ప్రయాణికుడు తమ వెంట తెచ్చుకున్న నీళ్లసీసాలతో కొండముచ్చులకు నీళ్లు పట్టే ప్రయత్నంచేశారు. ఈ హృదయవిదారక దృశ్యాలను లతా శ్రీవాస్ అనే ప్రయాణికురాలు వీడియో తీయగా ఇప్పుడది వైరల్‌గా మారింది. అటవీప్రాంతంలో మధ్యాహ్నం ఎండకు తాగునీటి కోసం వెతికి వెతికి అవన్నీ నీరసించిపోయి కన్పించాయని ప్రయాణికులు తెలిపారు. కరువు కోరల్లో చిక్కుకున్న విదర్భ ప్రాంతంలో జనం నీళ్లకోసం ఎంతగానో శ్రమిస్తుంటే ఇక అటవీప్రాంతంలోని మూగజీవుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మండు వేసవిలో అటవీప్రాంతంలోని కోతుల కోసం అటవీశాఖ సిబ్బంది కొన్ని చోట్ల కృత్రిమ నీటికుంటలను ఏర్పాటుచేస్తున్నా అవి ఎండలకు చుక్కనీరులేకుండా పోతున్నాయి. ఖంఢాలా ఘాట్‌లో కోతులకు కనీసం నీటిసదుపాయం కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సోషల్‌మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వడగాల్పుల వేసవిలో ఇళ్లలో ఉండే జనమే తిప్పలుపడుతుంటే ఇక కొండల్లో ఉండే కోతుల పరిస్థితి ఏంటి?. వన్యప్రాణాల గొంతులు పిడతగట్టుకుపోతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మారుతున్న వాతావరణ పరిస్థితుల ధాటికి వర్షాలు బాగా తగ్గిపోయి, పండ్ల చెట్లు నశించి అడవుల్లో వన్యప్రాణులకు సరైన తిండి కూడా దొరకట్లేదు’’అని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశాడు. – ముంబై -
నీట్ పేపర్ లీకేజీ కేసు.. లాతూర్‌లో కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కోచింగ్ సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. రేణుకాయీ కెమిస్ట్రీ క్లాసెస్(ఆర్సీసీ) పేరుతో కోచింగ్ సెంటర్ నెలకొల్పిన శివరాజ్ రఘునాథ్ మోటెగావొంకర్ ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ఫోన్లో ఈ నెల 3వ తేదీన లీకైన నీట్ ప్రశ్నపత్రం లభించింది. అంతకుముందు లాతూర్‌లోని శివనగర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌తోపాటు అతడి నివాసంలోనూ సోదాలు జరిపారు. శివరాజ్‌ను అతడి నివాసంలోనే దాదాపు 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. పేపర్ లీకేజీ ముఠాలో శివరాజ్ కీలకంగా ఉన్నాడని, ఇతడి కోచింగ్ సెంటర్‌కు 9 బ్రాంచీలుండగా, లాతూర్‌లోనిది ప్రధాన కేంద్రమని అధికారులు వెల్లడించారు. లీకేజీ కుట్రలో భాగంగా పరీక్షకు దాదాపు 10 రోజులు ముందుగానే, ఏప్రిల్ 23వ తేదీనే ప్రశ్నపత్రం, జవాబులు ఇతడికి అందాయన్నారు. వీటిని ఇతడు చేత్తో రాసిన నోట్స్ రూపంలో ఇతరులకు అందజేశాడని, పరీక్ష అనంతరం వీటిని తగులబెట్టారన్నారు. నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)తో సంబంధాలున్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకరి్ణకి శివరాజ్ సన్నిహితుడని వివరించారు. ఇతడి ఇల్లు, కోచింగ్ సెంటర్లలో జరిపిన సోదాల్లో 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలోని ప్రశ్నలున్న కెమిస్ట్రీ క్వశ్చన్ బ్యాంక్ లభించిందని చెప్పారు. ‘గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని ఐదు చోట్ల సోదాలు చేపట్టి, కీలక పత్రాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నాం. వీటిని విశ్లేషించే పని చురుగ్గా సాగుతోంది’అని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, పుణే, లాతూర్, అహల్యానగర్‌లలో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఇలా ఉండగా, సోమవారం శివరాజ్ రఘునాథ్ మొటెగావొంకర్ను సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టులో హాజరుపర్చారు. ఇతర ఆధారాలతోపాటు నీట్ పేపర్లోని ప్రశ్నలను తన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు వెల్లడిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను కూడా చూపారు. దీంతో, ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అజయ్ గుప్తా అతడిని 9 రోజుల సీబీఐ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. -
‘నీట్’ మరో మాస్టర్‌మైండ్ మనీషా అరెస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్–యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో మరో పెద్ద తలకాయను పోలీసులు అరెస్ట్‌చేశారు. జీవశాస్త్ర అధ్యాపకురాలిగా కొనసాగుతూ నీట్–యూజీకి సంబంధించిన నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్టీఏ) వారి పేపర్ సెట్టింట్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న పుణెకు చెందిన మనీషా గురునాథ్ మంధరేను సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్‌చేశారు. ఇప్పటికే అరెస్టయిన మరో మాస్టర్‌మైండ్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు పీవీ కులకర్ణిని లోతుగా ప్రశ్నించడంతో ఈమె పేరు బయటపెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు. బయాలజీ పేపర్ లీకేజీకి ఈమె ప్రధాన కారకురాలు అని సీబీఐ పేర్కొంది. మనీషాను ఢిల్లీకి తీసుకొచ్చి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విచారించి, ఆమె నేరాన్ని నిర్ధారించుకున్నాక అరెస్ట్‌చేశారు. నీట్–యూజీ పరీక్ష ప్రక్రియలో ఈమె భాగస్వామిగా ఉన్నారు. ఈమెను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా గతంలో ఎన్టీఏ నియమించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉండటంతో ఈమె బాటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలను నేరుగా పరిశీలించే అధికారం పొందారు. ఆ అధికారాన్ని దురి్వనియోగంచేసినట్లు తేలింది. ఈ ప్రశ్నలను తనకు లక్షల రూపాయలు చెల్లించిన కొద్దిమంది నీట్–యూజీ అభ్యర్థులకు చేరవేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఎవరీ మనీషా? మహారాష్ట్రకు చెందిన మనీషా వృత్తిరీత్యా బాటనీ లెక్చరర్. పుణెలోని మోడ్రన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఐదారేళ్లుగా ఎన్టీఏలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది నీట్–యూజీ ప్రవేశపరీక్షకు సంబంధించి బాటనీ, జువాలజీ విభాగంలో రావాల్సిన ప్రశ్నల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు. ఆయా ప్రశ్నపత్రాల తుదిరూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఇటు జాతీయస్థాయి సంస్థలో కీలకభూమిక పోషిస్తూనే పుణె కాలేజీతో సత్సంబంధాలు కొనసాగించడం గమనార్హం. రహస్యంగా ఉంచాల్సిన క్వశ్చన్ పేపర్లను తరచిచూసే సర్వాధికారం ఉండటంతో వాటిని ఈమె తస్కరించారు. ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థుల జాబితాను వాఘ్మరే అనే మరో నిందితుని ద్వారా తెప్పించుకుని వాళ్లకు ప్రశ్నలు, వాటి ఆప్షన్లను పుణెలోని సొంతింట్లో ప్రత్యేక కోచింగ్ క్లాసులపేరిట అందజేశారు. వాఘ్మరేను నాలుగు రోజుల క్రితమే సీబీఐ అరెస్ట్చేయడం తెల్సిందే. ఈ బాటనీ, జువాలజీ ప్రశ్నలు, వాటి ఆప్షన్లు, జవాబులు అచ్చుగుద్దినట్లుగా 2026 నీట్–యూజీ ఎంట్రన్స్ బయాలజీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలాయని సీబీఐ వెల్లడించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో అంతర్గత వ్యక్తులు మొదలు మధ్యవర్తులు, అభ్యర్థుల దాకా అన్ని స్థాయిలో పకడ్బందీ నెట్వర్క్ ద్వారా ప్రశ్నపత్రాలను లీక్చేశారు. కులకర్ణి, వాఘ్మరేలను 10 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తుర్వులిచ్చింది. వేట వేగవంతం ఈ ఉదంతంలో ఇంకెంత మంది సూత్రధారులు, పాత్రధారులు దాక్కున్నారనేది కనిపెట్టి సంకెళ్లు వేసేందుకు సీబీఐ విస్తృతస్థాయిలో దర్యాప్తును వేగవంతంచేసింది. గత 24 గంటల్లో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో చాలా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లను సీజ్చేసింది. డబ్బులు ఆన్లైన్లో లావాదేవీలు జరిగిన కొన్ని బ్యాంక్ ఖాతాల వివరాలు, నేరపూరిత డాక్యుమెంట్లను సేకరించింది. వీటన్నింటీ మధ్య ఉన్న సంబంధాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. వాఘ్మరీ ద్వారానే ప్రశ్నలను కులకర్ణి ఇతర పరీక్షార్థులకు చేరవేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహల్యానగర్‌లలో మొత్తం 9 మందిని అరెస్ట్‌చేశారు. వాళ్ల జాబితా.. 1. మనీషా గురునాథ్(బాటనీ లెక్చరర్) 2. పీవీ కులకర్ణి( రసాయనశాస్త్ర అధ్యాపకుడు) 3. వాఘ్మరే(విద్యార్థులను పోగుచేసిన వ్యక్తి) 4. ధనంజయ్ లోఖండా(అహల్యానగర్వాసి) 5. శుభం ఖైర్నర్( నాసిక్ వాసి) 6. మంగీ లాల్ బివాల్( జైపూర్‌వాసి) 7. వికాస్ బిలాల్( జైపూర్‌వాసి) 8. దినేశ్ బిలాల్( జైపూర్‌వాసి) 9. యశ్ యాదవ్(గురుగ్రామ్వాసి) -
సుధా భరద్వాజ్, వరవరరావు బెయిల్ రద్దు చేయాలి
ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో నిందితులుగా ఉన్న సుధా భరద్వాజ్, వరవరరావులకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కోర్టులో శుక్రవారం పిటిషన్ వేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరిస్తూ ‘అర్బన్ నక్సల్’మావోయిస్ట్ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరయ్యారని ఆరోపించింది. ఈ ఏడాది జనవరి 19వ తేదీన ముంబై ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ కేసులో సహనిందితులైన అరుణ్ పెరీరా, ఆనంద్ తెల్తుంబే, రొనా విల్సన్‌లు కూడా పాల్గొన్నారంది. ఈ కార్యక్రమం దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు, సమగ్రతకు ప్రత్యక్షంగా ప్రమాదకరమైందని తెలిపింది. కాగా, సుధా భరద్వాజ్‌కు సాంకేతిక కారణాలతో 2021లో బెయిల్ మంజూరు కాగా, వరవరరావుకు ఏడాది తర్వాత అనారోగ్య కారణాలపై బెయిల్ మంజూరైంది. దిగువ కోర్టు బెయిల్‌కు పలు షరతులు విధించింది. ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడరాదు, అనుమతి లేకుండా ముంబై విడిచి వెళ్లరాదనేవి అందులో ఉన్నాయి. ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వీరు బెయిల్ నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించడమే కాకుండా నిషేధిత సంస్థల లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించారంది. ప్రజా శాంతికి, దేశ భద్రతకు ముప్పు కలిగించే సమావేశాలు, కార్యకలాపాల్లో పాల్గొనరాదన్న షరతులను వీరు అతిక్రమించారని ఎన్ఐఏ తెలిపింది. వీరికి న్యాయ ప్రక్రియపై ఏమాత్రం గౌరవం లేదన్న విషయం దీనివల్ల రూఢీ అవుతోందని పేర్కొంది. పిటిషన్‌ను పరిశీలించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సుధా భరద్వాజ్, వరవరరావులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 22వ తేదీన చేపడతామంది. -
భార్య ముందు అవమానించారని..
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. భార్య ముందు తనను అవమానించారనే కోపంతో ఓ వ్యక్తి కన్న తల్లిదండ్రులనే రోకలితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన.. శుక్రవారం మధ్యాహ్నం ధూలే జిల్లాలోని శిర్పూర్లోని మహావీర్ సొసైటీలో జరిగింది. తమ కుమార్తె పెళ్లి ముగించుకుని తల్లిదండ్రులు అదే రోజు ఇంటికి తిరిగి రాగా.. ఇంటికి వచ్చిన తర్వాత వారు ఏదో కారణంతో తన కుమారుడిని మందలించడమే కాకుండా.. కోడలి ముందే అతడిని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు.. ఇంట్లో ఉన్న రోకలిని తీసుకుని తన తల్లిదండ్రుల తలపై బలంగా బాదాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి రంజుదేవి మహతో, తండ్రి ఇందారామ్ మహతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు చందన్ ఇందారామ్ మహతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టిక్.. టిక్.. టిక్.. సినీ ఫక్కీలో టైమ్ బాంబు నిర్వీర్యం
బాంబు ఉందని సమాచారం అందుకోవడం.. ముసుగులేసుకుని స్క్వాడ్లు అక్కడికి చేరుకోవడం.. ఏ వైర్ తెంపాలో అనే ఉత్కంఠ చివరిదాకా.. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. మహారాష్ట్ర పుణేలో ఈ తరహాలోనే ఓ ఘటన జరిగింది. ఓ ఆస్పత్రి ఆవరణలో లైవ్ బాంబు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.పుణే సిటీలోని హడప్సర్ కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం బాంబు బయటపడింది. తొలుత అనుమానాస్పద వస్తువుగా భావించినప్పటికీ.. ఆ తర్వాత అది టైమర్ బాంబ్ అని తేలడంతో అందరి గుండెలు గుభేల్మన్నాయ్. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌ను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసుపత్రి పరిసరాలను ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ పరిణామాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే.. పరిశీలనలో అది 7 గంటల తర్వాత పేలేలా టైమర్‌తో అమర్చిన లైవ్ బాంబు అని తేలింది. బీడీడీఎస్ సిబ్బంది బాంబును సురక్షిత ప్రదేశానికి తరలించి.. ఓపెన్ ఫీల్డ్‌లో నిర్వీర్యం చేశారు. బాంబులో తక్కువ శక్తి గల పేలుడు పదార్థం ఉందని నిర్ధారించారు."నగరంలో తక్కువ శక్తి గల IED (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) కనుగొనబడింది. దానిని నిర్వీర్యం చేశాం. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది." అని పుణే పోలీస్ కమిషనర్ నితేష్ కుమార్ తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
ఎట్టకేలకు చిక్కిన నిదాఖాన్
టీసీఎస్‌లో మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసు ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గురువారం చత్రపతి శంభాజీ నగర్ వద్ద పోలీసులను చూసి ఆమె తప్పించుకోబోగా.. సినీ ఫక్కీలో చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. నాసిక్(మహారాష్ట్ర) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బీపీవో యూనిట్లో వెలుగు చూసిన ఈ కేసు దేశాన్ని నివ్వెర పోయేలా చేసింది. తోటి ఉద్యోగులను మతం మారమని బలవంతం చేయడంతో పాటు మహిళా ఉద్యోగిణులకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. నాలుగేళ్ల పాటు సాగిన ఈ వ్యవహారంలో మేనేజర్ స్థాయి వ్యక్తులతో పాటు టీం లీడర్లు, సీనియర్ ఉద్యోగులు భాగమయ్యారు. సుమారు 9 మంది బాధితులు(ఇందులో ఒక పురుషుడు కూడా) ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కాగా.. ఇప్పటిదాకా(నిదాఖాన్‌తో కలిపి) 8 మంది అరెస్ట్ అయ్యారు. మత మనోభావాలు దెబ్బ తీయడం, మతమార్పిడికి ప్రయత్నించిన వాళ్లను ప్రొత్సహించడం, లైంగిక వేధింపులకు సహకరించడం.. నిదాఖాన్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. ఫిర్యాదులు చేయాలని ప్రయత్నించిన వాళ్లను బెదిరించి ఆపేయడంతో పాటు ఇస్లాం స్వీకరించాలని ఒత్తిళ్లు కూడా చేసేదని తేలింది. బాధితులను హిజాబ్, బుర్ఖా ధరించమని ఆమె బలవంతం పెట్టడం, వాళ్ల ఫోన్లలో మత సంబంధిత యాప్‌లు ఇన్స్టాల్ చేయడం చేసిందని ఆధారాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో దర్యాప్తు అనంతరం ఆమెను పోలీసులు ప్రధాన నిందితురాలిగా చేర్చింది. అయితే కేసు నమోదైనప్పటి నుంచి ఆమె జాడ లేకుండా పోయిందని. ఆమె భర్తను విచారించిన తర్వాత.. పోలీసులు బంధువుల ఇళ్లతో పాటు పలు చోట్ల తనిఖీ చేశారు. కొన్ని చోట్ల తాళాలు వేసి ఉండటం, మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఆమెను పట్టుకోవడం కష్టమైంది. ఈలోపు తాను గర్భవతినని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. అయితే ఇంటరాగేషన్ ఎదుర్కోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పరారీలో ఉన్న ఆమె కోసం కోసం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర అంతటా జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో 25 రోజుల తర్వాత పోలీసులకు చిక్కడం గమనార్హం. నిదాఖాన్ అరెస్ట్‌తో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే డానిష్ షేక్, టౌసిఫ్ అత్తర్, రాజా మెమోన్, షారూఖ్ ఖురేసీ; అసిఫ్ అన్సారీ, పోష్ కమిటీలో పని చేసిన అశ్విన్ చయ్నానీ అరెస్ట్ అయ్యారు. ప్రధాన సూత్రధారి నిదాఖాన్గా తేలగా.. హెచ్ఆర్ మేనేజర్ అని ప్రచారం జరిగింది. అయితే ఆమె టెలికాలర్ మాత్రమేనని స్పష్టత ఇచ్చిన టీసీఎస్ యాజమాన్యం.. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆమెతో పాటు నిందితులందరినీ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు!
ముంబై కుటుంబం మృతి కేసులో ట్విస్ట్ చేసుకుంది. ఆ నలుగురు పాడైపోయిన పుచ్చకాయ తినడం ద్వారా చనిపోలేదని నిర్ధారణ అయ్యింది. అయితే వాళ్ల శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ మాత్రం రంగు మారినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మిస్టరీ కేసు విచారణ మరో మలుపు తిరిగినట్లైంది. గత వారం ఆ కుటుంబం మటాన్ పులావ్ తిని.. ఆపై పుచ్చకాయ తిని తీవ్ర అస్వస్థకు లోనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక్కొక్కరుగా చనిపోయారు. అయితే వాళ్లలో ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయన్న వైద్యుల ప్రకటనతో కలకలం రేగింది. పులావ్ తిన్న మిగతా వాళ్లకు ఏం కాకపోవడంతో.. అందరి దృష్టి పుచ్చకాయ వైపునకు మళ్లింది. బహుశా.. కలుషితమైన పుచ్చకాయ తిని వాళ్లంతా మరణించి ఉంటారన్న ప్రచారం జోరందుకుంది. సమ్మర్లో చాలా మంది తినే పుచ్చకాయ ఇంత పని చేసిందా? అనే చర్చ నడిచింది. వాటర్‌మిలన్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇది మహారాష్ట్రలో పుచ్చకాయల సేల్ పడిపోవడానికి ఒక కారణం అయ్యింది కూడా. అయితే.. తాజాగా ఈ కేసు ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. అందులో పుచ్చకాయలో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు లేవని తేలింది. అలాగని ఇది సాధారణ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ నలుగురిలో గుండె, లివర్, బ్రెయిన్, పేగులు ఆకుపచ్చరంగులోకి మారిపోయి ఉన్నాయి. దీంతో వాళ్లపై విష ప్రయోగం ఏదైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అబ్దుల్లా శరీరంలో మోర్ఫిన్ అనే శక్తివంతమైన పెయిన్‌కిల్లర్ ఆనవాలు లభ్యమైంది. ఇది సాధారణంగా వైద్యులు చెబితేనే వాడాలి. దీంతో ఈ అంశంపైనా అధికారులు ఇప్పుడు దృష్టిసారించారు. పోస్ట్‌మార్టం అనంతరం.. ఆ అవయవాలను పరీక్షల(కెమికల్) కోసం పంపారు. ఫలితాలు వచ్చాకే ఏది అనేదానిపై ఓ క్లారిటీ రానుంది. మొబైల్ రిపేర్ షాప్ నడిపించే అబ్దుల్లా డొకాదియా.. అతని భార్య, ఇద్దరు పిల్లలు. గత శనివారం రాత్రి ఇంట్లో దావత్ చేశారు. మరో ఐదుగురు బంధువుల్ని పిలిచి మటావ్ పులావ్ పెట్టారు. వాళ్లు వెళ్లిపోయాక అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5గం. టైంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలో అంతా ప్రాణాలు కోల్పోయారు. పుచ్చకాయ ఆందోళనలపై.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ నాలుగు మరణాలకు పుచ్చకాయకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. అయితే పుచ్చకాయ కలుషితం కాకపోతే గనుక ఎవరైనా విషాన్ని ఇంజెక్ట్ చేసి ఉంటారా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. ఇదీ చదవండి: పుచ్చకాయ.. ఆ టైంలో తింటేనే సూపర్! -
తిక్క కుదిరింది.. కీలెరిగి వాత పెట్టిన న్యాయమూర్తి!
‘ఉత్తమే క్షణ కోపస్యాత్.. మధ్యమం ఘటికాద్వయం.. అథమస్య అహోరాత్రం.. పాపిష్టే మరణాంతకం’ అని ఆర్యోక్తి. కోపం విషయంలో మనం దానిని ఎంత కాలం కలిగి ఉండాలి.. కోపాన్ని విడిచిపెట్టి ఎంత త్వరగా మనం సానుకూల వైఖరిలోకి వస్తాం అనే దానిని బట్టి.. మన వ్యక్తిత్వాన్ని అంచనా వేసి చెప్పే మాట ఇది. ఉత్తములకు కోపమొస్తే క్షణమే ఉంటుందట.. మధ్యములకు రెండు ఘడియలు ఉంటుందట. అథములకు ఒక పగలు ఒక రాత్రి వరకు ఉంటుందట. పాపిష్టి వాళ్లకైతే చచ్చేదాకా ఆ కోపం కంటిన్యూ అవుతుందట. అంటే, కోపం విషయంలో మనం ఎంత త్వరగా దానిని మరచిపోగలిగితే అంత మంచిది అని ఈ సుభాషితం చెబుతుంది.ముంబైకి చెందిన తరిణిబెన్ దేశాయ్ రచయిత్రే గానీ.. బహుశా ఆమె ఈ శ్లోకం గురించి తెలుసుకుని ఉండకపోవచ్చు. తెలిసినా ఈ శ్లోకం చెప్పే నీతి ఆమెకు రుచించి ఉండకపోవచ్చు. అందుకే తమ హౌసింగ్ సొసైటీ వాళ్ల మీద వచ్చిన కోపాన్ని రోజుల్లో మరచిపోకుండా.. పదేళ్లుగా హైకోర్టులో దావా నడుపుతోంది. ఆమెకు తొంభయ్యేళ్లు వచ్చాయి గానీ.. ఇంకా కోపం తగ్గలేదు. ఇప్పట్లో కోపాన్ని విడిచిపెట్టను అని కూడా ఆమె సంకేతం ఇచ్చింది. అందుకే న్యాయమూర్తికి కూడా కోపం వచ్చి.. చిత్రమైన ఆదేశం ఇచ్చాడు. అహంభావంతో న్యాయమూర్తి చెప్పిన పరిష్కారాన్ని పట్టించుకోకుండా వ్యవహరించిన ఆమెకు తెలిసొచ్చేలా ఆ ఆదేశం ఉంది.ఆదేశం గుణపాఠమే.. ఎందుకని? ఈ కేసు ఇప్పుడు మొదలు కాలేదు. 2017 నాటిది. అంటే దాదాపు పదేళ్ల కిందట మొదలైంది. ముంబై మలబార్ హిల్స్ లోని ఒక హౌసింగ్ సొసైటీలో అప్పట్లో మరమ్మతులు చేపట్టారు. ఆ వ్యవహారంపై రచయిత్రి తరిణిబెన్ దేశాయ్, ఆమె కుమార్తె ధ్వని కలిసి హౌసింగ్ సొసైటీ సభ్యుల మీద హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. ఇన్నాళ్లుగా విచారణ సాగుతూనే ఉంది. ఈ విషయం ప్రతివాదులు కేవలం ‘మన్నింపు’ కోరితే సరిపోతుందని.. కేసు నడపవలసిన అవసరం లేదని హైకోర్టు న్యాయమూర్తి జితేంద్ర జైన్ సూచించారు. కానీ దావా వేసిన తరిణి బెన్ దేశాయ్ అందుకు అంగీకరించలేదు. దావా నడిపి తీరాల్సిందే అని పట్టుబట్టారు. దాంతో అసహనానికి గురైన న్యాయమూర్తి జితేంద్ర జైన్ వారికి గుణపాఠం లాంటి తీర్పు చెప్పారు. ఈ దావా తదుపరి విచారణను 20 ఏళ్ల తర్వాతకు వాయిదా వేశారు.The Bombay High Court judge got miffed with the plaintiff and adjourned the matter to 2046. The judge was of the view that the defamation suit could be resolved by tendering an unconditional apology. However, the plaintiff, who is close to 90 years old, still insists on pursuing… pic.twitter.com/pE8HeRQ0Ba— Paras Nath Singh (@parasnsingh95) April 28, 2026కేవలం ఇప్పట్లో దానిని మళ్లీ విచారించే పరిస్థితి తనకు ఎదురుకాకుండా ఉండేందుకే ఆయన వాయిదా వేశారు. కానీ తీర్పులో ఇంకా చాలా ఘాటుగానే పేర్కొన్నారు. పిటిషనర్లు సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అనే సానుభూతితో దానిని ముందుగా హియరింగ్ కోసం లిస్ట్ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2046కు ముందు హియరింగ్ తీసుకురావొద్దని తేల్చేశారు. పరువునష్టం పిటిషన్ వేసిన తరిణిబెన్ దేశాయ్ వయసు ఇప్పుడు 90 ఏళ్లు. మరో ఇరవై ఏళ్ల తర్వాత దావాకు హాజరై తన పంతం నెగ్గించుకోవాలంటే, తన అహం చల్లార్చుకోవాలంటే.. ఆమె 110 ఏళ్ల వయసు వరకు జీవించి ఉండాలి. కీలెరిగి వాతపెట్టడం అంటే ఇదే!. -
ఈ డెలివరీ బాయ్ చాలా మంచోడు
చిన్న చిన్న తప్పులు.. ఒక్కోసారి పెద్ద నష్టానికే దారి తీయొచ్చు. అలాంటి టైంలో ఎవరో ఒకరు కాపాడేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతి అలాంటి అనుభవం ఎదురైంది. డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఉబ్బితబ్బిబై నెట్టింట ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్లైన్లో ఓ పార్శిల్ ఆర్డర్ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్ దానిని బయట పెట్టి వెళ్తాడులే అని అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని అతను ఫోన్లో ఆమెకు తెలియజేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. ‘‘అతను కేవలం పార్సెల్‌ను వదిలి వెళ్లిపోలేదు. ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడు. నా పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడు. నేను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడు. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఈ డెలివరీ బాయ్‌కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంఘటనను దివ్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్ అయింది. అమ్జాద్ నిజాయితీ, బాధ్యతా భావం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Divya Unny (@divyaunnyfilms) -
పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న వార్త కొత్త ఆందోళనలకు దారి తీసింది. సీజన్‌తో సంబంధం లేకుండా చాలామందికి బిర్యానీ ఫేవరెట్ ఫుడ్. అలాగే వేసవిలో ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. అలాంటివి ప్రాణాలు తీసేంత ప్రమాదకరమా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు ఆ అపోహలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ముంబైలో జరిగిందేంటి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు శనివారం రాత్రి 10.30గం. ప్రాంతంలో మొదట బిర్యానీ తిన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న పుచ్చకాయ (వాటర్మెలన్)ను తిన్నారు. కొన్ని గంటల్లోనే వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలోనే ఆ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.ట్రీట్మెంట్ సమయంలో ఆ నలుగురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ జరిగిందనడానికి నిదర్శనమని వైద్యులు ప్రకటించారు. పోలీసులు మాత్రం దీన్నొక యాక్సిడెంటల్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లు తినగా మిగిలిన బిర్యానీ, పుచ్చకాయ ముక్కలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. పోస్ట్‌మార్టం.. హిస్టోపాథాలజీ రిపోర్టులు వచ్చాకే వాళ్లు ఎలా చనిపోయారన్న దానిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈలోపే.. బిర్యానీ తిన్న మిగతా బంధువులు బాగానే ఉండడంతో.. పుచ్చకాయనే ఈ మరణాలకు కారణమై ఉంటుందనే చర్చ(సోషల్ మీడియా రచ్చ) మొదలైంది. నిపుణులు చెబుతోంది ఏంటంటే.. పుచ్చకాయకు త్వరగా కలుషితమయ్యే గుణం ఉంటుందని. పుచ్చకాయ వేసవిలో తినడానికి అత్యంత ఆరోగ్యకరమైన పండు. ఇది 90% పైగా నీటితో నిండి ఉండి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, విటమిన్ A, C, లైకోపిన్, పొటాషియం వంటి పోషకాలు అందిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మం, కళ్లకు మేలు చేస్తుందని డైటీషియన్ డాక్టర్ అర్చనా బాత్రా అంటున్నారు. అయితే ముంబై కేసుపై ఆమె స్పందిస్తూ.. పుచ్చకాయలో సాల్మొనెల్లా, లిస్టీరియా, ఎస్టరేషియా కొలై లాంటి హానికరమైన పాథోజెన్లు చేరితే కలుషితం అవుతుందని.. అప్పుడు అది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుందని చెబుతున్నారు. ‘‘ఈ ప్రభావంతో తిన్న వ్యక్తులు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇన్ఫెక్షన్ సోకి అవయవాలపై ప్రభావం చూపవచ్చు. ట్రీట్మెంట్ ఆలస్యమైతే ప్రాణాల మీదకు రావొచ్చు’’ అని ఆమె అంటున్నారు. పుచ్చకాయలో అధిక నీరు, సహజ చక్కెర ఉండడం కూడా బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి కారణమని ప్రముఖ న్యూట్రీషనిస్ట్ రుపాలి దత్తా అంటున్నారు. కొన్నిసార్లు పుచ్చకాయల్లో తీపి పెంచడానికి గ్లూకోజ్ నీరు లేదంటే చక్కెర నీరు ఇంజెక్ట్ చేస్తారని.. ఆ సమయంలోనూ కలుషితం కావొచ్చని.. అలాంటివి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.అలాగని పుచ్చకాయ ప్రాణం తీస్తుందని కాదు. పండ్లు కలుషితం కావడం, సరిగా నిల్వ చేయకపోవడంతో కచ్చితంగా ప్రమాదకరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను కొనేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి తొక్కతో సహా బాగా కడగాలి.. చాలా మంది ఈ జాగ్రత్త పాటించరుపుచ్చకాయను కోయడానికి శుభ్రమైన కత్తులు, బోర్డులు వాడాలి.కట్ చేసిన పుచ్చకాయ గది ఉష్ణోగ్రత వద్ద త్వరగా చెడిపోతుంది పుచ్చకాయను కట్ చేశాక 2 గంటలకు మించి బయట ఉంచకూడదుకట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయను తింటే ప్రమాదమేం కాదని న్యూట్రీషనిస్ట్ రుపాలి దత్తా చెబుతున్నారుఅయితే ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ చేస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయను రెండు, మూడు రోజులకు మించి ఉంచకూడదని ఆమె సూచిస్తున్నారు.. సరైన పుచ్చకాయను ఎంచుకోవడం ఎలా..?1.తొక్క రంగు చూసుకోవాలిగాఢమైన ఆకుపచ్చ రంగులో ఉండి, గీతలు స్పష్టంగా కనిపిస్తే అది పండిన పుచ్చకాయ.చాలా మెరిసే తొక్క ఉంటే ఇంకా పండలేదని అర్థం.2. ఫీల్డ్ స్పాట్ (పసుపు మచ్చ) చూడాలినేలపై పెరిగిన చోట పసుపు లేదంటే క్రీమ్ రంగు మచ్చ ఉంటుంది. అది గాఢంగా ఉంటే పుచ్చకాయ బాగా పండింది.తెల్లగా లేదంటే లేతగా ఉంటే ఇంకా పండలేదు.3. తట్టి చూడాలిపుచ్చకాయను తట్టి చూసినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్టుగా “తక్కువ శబ్దం” వస్తే అది పండింది.ఎక్కువగా ఘనంగా శబ్దం వస్తే ఇంకా పండలేదని అర్థం.4. బరువు చూసుకోవాలిపరిమాణానికి తగినంత బరువుగా ఉంటే అది రసంతో నిండిన పుచ్చకాయ.తేలికగా ఉంటే లోపల నీరు తక్కువగా ఉంటుంది.5. ఆకారం గమనించాలిగుండ్రంగా, సమంగా ఉన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయి.పొడవుగా లేదంటే అసమంగా ఉన్నవి తక్కువ తీపి కలిగి ఉండే అవకాశం ఉంది.పుచ్చకాయ మాత్రమే కాదు.. రాత్రి ఆలస్యంగా ఏ పండ్లు తినడం జీర్ణక్రియను కష్టతరం చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదంటే మధ్యాహ్నా సమయంలోనే పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు. -
20 వంద కోట్ల హిట్స్.. అక్షయ్ కుమార్ అరుదైన ఘనత
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అక్షయ్ తన కెరీర్లో ఏకంగా 20 సినిమాలతో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఖాన్ త్రయం అయిన షారూక్, సల్మాన్, అమీర్లను ఈ విషయంలో మించి అక్షయ్ ముందంజలో నిలిచాడు. ఇక ఈ వరుసలో అక్షయ్ తర్వాత స్ధానంలో సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో ఉన్నాడు. ఇలా అజయ్ దేవగన్ 16 సినిమాలతో మూడో స్థానంలో, షారూక్ ఖాన్ 10 సినిమాలతో నాలుగో స్థానంలో, రణ్వీర్ సింగ్ 9 సినిమాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. 2012లో హౌస్‌ఫుల్ 2తో తొలిసారిగా 100 కోట్ల క్లబ్లో అక్షయ్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కరోనా తర్వాత కూడా ఆయన నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల మార్కును దాటాయి. తాజాగా విడుదలైన బూత్ బంగ్లాతో ఈ సంఖ్య 20కి చేరింది. రజనీకాంత్, విజయ్, ప్రభాస్ వంటి స్టార్లు కూడా 100 కోట్ల క్లబ్లో ఉన్నారు. కానీ అక్షయ్ స్థాయిలో వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు డెలివర్ చేయలేదు. ఎందుకంటే, హీరోలంతా ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అక్షయ్ మాత్రమే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ ఇలా రికార్డులు సృష్టిస్తున్నాడు. -
బిర్యానీ, పుచ్చకాయ తినే ఆ కుటుంబం చనిపోయిందా?
ముంబై: ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత. ఇది అత్యంత దురదృష్టకర ఘటన. విరోచనాలు, వాంతులతో కొద్దిసేటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబంలో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. శనివారం(ఏప్రిల్ 25వ తేదీ) ముంబైలోని పైధోని ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా ఫుడ్ పాయిజన్ బారిన పడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులందరూ రాత్రి గం. 10.30ని.లకు వీరంతా డిన్నర్లో బిర్యానీ తిన్నారు. అనంతరం ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి వారు ఇళ్లకు బయల్దేరి వెళ్లిపోయారు. సుమారు ఒంటి గంట ప్రాంతంలో(తెల్లవారితే ఆదివారం) తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత ఆ నలుగురికి ఆదివారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందనే అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ చూసిన తర్వాత వారిని జేజే ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. వారి డాక్టర్ సూచించిన విధంగానే జేజే ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లారు. వైద్య చికిత్స చేసినప్పటికీ, చిన్న కుమార్తె ఉదయం సుమారు 10:15 గంటలకు మరణించింది. ఆ రాత్రి సుమారు 10:30 గంటలకు తండ్రి కన్నుమూశారు. అటు తర్వాత తల్లి, మరొక సోదరి కూడా చికిత్స సమయంలోనే కన్నుమూశారు. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ రెండు స్పల్ప వ్యవధిలో తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా.. ? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్‌మార్టం తర్వాతే వారి మరణానికి కారణం తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా జేజే మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారు అబ్దుల్లా దొకాడియా(40), నస్రీన్ దొకాడియా(35), ఐషా(16), జైనబ్(13)లుగా పోలీసులు తెలిపారు. -
ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. మంత్రికే షాకిచ్చిన మహిళ
ముంబై: నగరంలో ఓ మహిళ.. ఏకంగా మంత్రిని నడిరోడ్డుపై నిలదీసిన ఘటన సంచలనం రేపింది. వర్లీ ప్రాంతంలో రాజకీయ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ మహిళా.. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్, స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నినాదాలు చేశారు. వర్లీలోని జంబోరి మైదాన్ నుండి డోమ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తన బిడ్డను స్కూలు నుండి తీసుకురావడానికి కారులో వెళ్తున్న ఒక స్థానిక మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ.. తన వాహనం దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి మహాజన్‌తో వాగ్వాదానికి దిగారు. రాజకీయ ర్యాలీల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యంపై ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి!" అంటూ ప్రదర్శనకారులపై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.Mumbai woman, who taught Maharashtra minister Girish Mahajan a lesson in civics sense, also lashed out at a cop who tried to shut her down. In reply, a chilling "Shut up" reverberated. https://t.co/fHwlntCQoJ pic.twitter.com/Dr4ZXX8YJl— Piyush Rai (@Benarasiyaa) April 22, 2026సమీపంలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ వందలాది మంది వేచి చూస్తున్నారు. అక్కడ ఖాళీ మైదానం ఉంది కదా! అంటూ మంత్రిపై ఆ మహిళ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆమె ముంబై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె ఒక పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ వాగ్వాదం తర్వాత, పోలీసులు ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆమె సమస్యను వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పిచ్చి పట్టినట్లుగా పిచ్ తొక్కించేశాడు.. మ్యాచ్ రద్దు!
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో మైదానంలోకి దూసుకువచ్చాడు.. పిచ్చి పట్టినట్లుగా క్రికెట్ పిచ్ మొత్తాన్ని ట్రాక్టర్‌తో తొక్కించేశాడు.. ఫలితంగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్లో జరిగింది. జలగావ్ రూరల్ ఎంఎల్ఏ కప్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ యువకుడు ట్రాక్టర్‌పై అకస్మాత్తుగా మైదానంలోకి వచ్చాడు.నిస్సహాయంగాఏం జరుగుతుందో అర్థం కాక ఆటగాళ్లు చెల్లాచెదురై పోయారు. ఇంతలో అతడు వేగంగా పిచ్ మీదకు దూసుకువచ్చి.. ట్రాక్టర్‌తో పిచ్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఆటగాళ్లు, అంపైర్లు ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు. దీంతో మైదానంలో గందరగోళం నెలకొంది.కాగా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వ్యక్తి ఒకరిని ఫైనల్ మ్యాచ్‌కు ఆహ్వానించకపోవడంతో సదరు వ్యక్తి ఇలా చేయించినట్లు సమాచారం. అనూహ్య ఘటనతో మ్యాచ్ రద్దైపోగా.. పిచ్‌ను తొక్కించిన వ్యక్తిపై మాత్రం ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ దృశ్యాలు వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఎవరిది బాధ్యత‘‘బహుశా ఆ మైదానం అతడిదే అయి ఉంటుంది. ఓనర్నే మ్యాచ్‌కు ఆహ్వానించకపోతే ఎలా? అందుకే ఇలా చేశాడు’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదు. ట్రాక్టర్‌తో వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. ఇలాంటి వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే’’ అని పేర్కొంటున్నారు. Tractor Driver plows the cricket pitch mid-final in Jalgaon after the driver wasn’t invited to the tournament 😭 pic.twitter.com/LLS61mkRWJ— Ghar Ke Kalesh (@gharkekalesh) April 18, 2026 -
దొంగ బాబా అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాంత్రిక పూజల పేరుతో పలువురు మహిళలను లైంగికంగా లోబర్చుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. అశోక్‌కు అత్యంత సన్నిహితుడు జితేంద్ర శెల్కే(55) హఠాన్మరణం చెందాడు. అయితే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.శుక్రవారం కుటుంబంతో కలిసి జితేంద్ర శెల్కే తన వాహనంలో థానే ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్నారు. ఆ టైంలో ధోత్రే గ్రామం వద్ద కారు ఓ కంటైనర్ ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జితేంద్ర, ఆయన సతీమణి అనురాధా అక్కడికక్కడే మరణించారు. శెల్కే తనయుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. జితేంద్ర శెల్కే అశోక్‌కు నమ్మిన బంటు మాత్రమే కాదు వ్యాపార భాగస్వామి కూడా. అశోక్ నిర్వహించిన ట్రస్ట్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటూ లావాదేవీలు మొత్తం చూసుకున్నాడు. అయితే లైంగిక వేధింపుల కేసు.. ఆపై అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు జితేంద్రను ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ట్రస్ట్ ఆస్తులు, భూ లావాదేవీలలో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగానే.. జితేంద్ర మరణించడం హాట్ చర్చకు దారి తీసింది. మార్చి నెలలో మహారాష్ట్ర నాసిక్ 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ ఉదంతం వెలుగు చూసింది. పూజల పేరుతో తనపై మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కలకలం మొదలైంది. ఈ కేసులో మార్చి 18న అశోక్ ఖరాత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై దర్యాప్తులో సంచలన విషయం వెలుగు చూసింది. పోలీసుల తనిఖీల్లో అశోక్ ఖరాత్కు సంబంధించిన డిజిటల్ పరికరాల నుంచి సుమారు 100-150 మధ్య అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాల పేరుతో మహిళలను లోబర్చుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్ చేసేవాడని తేలింది. ఈలోపు అందులోని కొన్ని వీడియోలు నెట్టింటకు చేరడంతో ఇటు సోషల్ మీడియాలోనూ ఈ బాబా కామ లీలలపై జోరుగా చర్చ నడిచింది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలురాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అశోక్ ఖరాత్ ప్రధానంగా దందాను సాగించినట్లు తెలుస్తోంది. ఈ పరిచయాలతోనే.. 2018లో అప్పటి మహారాష్ట్ర సర్కారు రూ.1.05 కోట్ల నిధులను మంజూరు చేసింది. అలాగే ఆశ్రమానికి పలువురు ప్రముఖులు తరచూ వెళ్తుండేవాళ్లు. వాళ్లలో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చాకంకర్, ఆమె సోదరి కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు.. ఈ సెక్స్ స్కాండల్‌కు రాజకీయ మరక అంటడడంతో ఫడ్నవిస్ ప్రభుత్వం.. ఐపీఎస్ అధికారణి తేజస్వి సత్పుటే నేతృత్వంలో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ టీం ఖరాత్‌పై లైంగిక దాడులు, మోసం, బ్లాక్మెయిల్, మూఢనమ్మకాల ప్రోత్సాహం, మనీ లాండరింగ్ అభియోగాలపై ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈడీ సోదాలుగడిచిన కొన్నేళ్లలో అశోక్ ఖరాత్ ఏకంగా రూ.1500 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ విచారణలో తేలింది. భారీగా భూములు, భవనాలు, విలాసవంతమైన వాహనాలు ఆయన, బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మారుపేర్లతో మహారాష్ట్రలోని రెండు సహకార రుణ సంఘాల్లో 132 ఖాతాలు ఉన్నాయని.. గత రెండేళ్లలో ఈ ఖాతాల కింద రూ.62.74 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు సిట్ నిర్ధారించుకుంది. దీంతో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మనీ లాండరింగ్ (PMLA) కేసు నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఏప్రిల్ 13వ తేదీన నాసిక్‌లో అశోక్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. తిరిగి 17, 18 తేదీల్లో తనిఖీలు జరిపి కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. కోపర్గావ్ పోలీస్ స్టేషన్లో జితేంద్ర శెల్కే, ఆయన భార్య మరణంపై కేసు నమోదు అయ్యింది. అయితే సిట్ అనుమానాల నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీవో, ఆటోమొబైల్ నిపుణుల సహకారంతో క్రాష్ అనాలిసిస్ చేయనున్నట్లు అహిల్యా నగర్ జిల్లా ఎస్పీ సోమనాథ్ ఘార్గే తెలిపారు. -
టీసీఎస్ కేసు.. ‘కడుపుతో ఉన్నా.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి’
మహారాష్ట్ర నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూనిట్లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశం ఉలిక్కి పడింది. గత నాలుగేళ్లుగా సీనియర్ ఉద్యోగులు ఈ ఘాతుకాలకు పాల్పడ్డారంటూ మొత్తం తొమ్మిది మంది ఫిర్యాదులు చేశారు. సంచలన కేసు కావడంతో సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతుండగా.. సంస్థపై మచ్చ పడడంతో టీసీఎస్ ఈ అంశాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ తరుణంలో.. సిట్‌కు ఈ కేసు నిందితురాలు నిదా ఖాన్(Nida Khan) ఝలక్‌లు ఇస్తోంది. ఇప్పటికే పరారీలో ఉన్న ఆమె.. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ నాసిక్ లోకల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాను గర్భవతినని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ముంబైలో తలదాచుకున్నట్లు సిట్‌కు సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారంలో నిదా ఖానే ప్రధాన నిందితురాలు అయ్యి ఉండొచ్చని సిట్ భావిస్తోంది. యాంటీసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేలోగా.. వీలైనంత త్వరగా ఆమెను అదుపులోకి తీసుకోవాలని సిట్ ప్రయత్నిస్తోంది. మరోవైపు.. వేధింపుల వ్యవహారంలో హెచ్ఆర్ హెడ్‌గా నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు బృందం భావించింది. అయితే.. ఈ విషయంలోనూ పోలీసులకు మరో ఝలక్ తగిలింది. ఆమె అసలు హెచ్ఆర్ హెడ్ కాదని టీసీఎస్ ప్రకటించింది. ఆమె సాధారణ టెలికాలర్ అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఆమెను హెచ్ఆర్ హెడ్‌గా పేర్కొనడం గమనార్హం.హైబ్రిడ్ టెర్రరిస్ట్ కుట్ర?నిదా ఖాన్‌కి ఢిల్లీ పేలుళ్ల నిందితులతో సంబంధం ఉందంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. జైషే (Jaish-e-Mohammed) ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ షాహీన్ షాహిద్‌తో సంబంధం ఉందని ఆ కథనాల సారాంశం. దీంతో.. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది.నాసిక్ టీసీఎస్ బీపీవో యూనిట్లో పని చేసే ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు, ఒక పురుష ఉద్యోగి తమపై జరిగిన మానసిక, శారీరక వేధింపులు, మత అవమానాలు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ప్రకారం.. టీమ్ లీడర్లు, కొంతమంది సీనియర్ ఉద్యోగులు.. ‘‘మహిళా ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా వేధించారు. తప్పుడు హామీలతో ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నారు.హిందూ దేవతలను అవమానించారు, పండుగల సమయంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను ఎగతాళి చేశారు.నమాజ్ చేయమని బలవంతపెట్టారు, మతాన్ని అవమానించారు. ఉద్యోగులను హోటళ్లకు, రిసార్ట్స్‌కి రావాలని ఒత్తిడి చేశారు. వీటన్నింటికి తోడు.. చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్ విభాగం ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితులనే ప్రొత్సహించింది.ఈ కేసులో ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇందులో ఆరుగురు పురుష ఉద్యోగులు, ఒక మహిళా ఉద్యోగిణి ఉన్నారు. నిదా ఖాన్ ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉపేక్షించేది లేదని TCS అంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కంపెనీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసు విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం అన్నారు. కంపెనీ సీవోవో ఆరతి సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ కొనసాగుతుందని తెలిపారాయన.ఈ కేసు దేశవ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో మత మార్పిడి, లైంగిక వేధింపులపై చర్చలకు దారితీసింది. సుప్రీం కోర్టులో కూడా బలవంతపు మత మార్పిడి నియంత్రణపై పిటిషన్ దాఖలైంది. ఈ ఉదంతం దేశంలోని సార్వభౌమత్వం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, ఐక్యతకు ముప్పుగా అభివర్ణించిన పిటిషనర్ లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్.. బలవంతపు మత మార్పిడిని ‘టెర్రరిస్ట్ యాక్ట్’గా ప్రకటించాలని కోర్టును కోరారు. -
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
సంచలనంగా మారిన టీసీఎస్ నాసిక్ క్యాంపస్ వ్యవహారంలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులు, మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కొంతమంది ఉద్యోగులను(మాజీ) పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులు ముందుకు వస్తుండడంతో విస్తుపోయే విషయాలే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఓ పురుష ఉద్యోగి మతం మారాలంటూ తననూ బలవంత పెట్టారని.. ఈ క్రమంతో తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ‘‘నేనొక హిందువుని. వాళ్లు నా మత విశ్వాసాలను ఎగతాళి చేసేవారు. నేను మొక్కే దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు చేసేవారు. నైట్ షిఫ్ట్‌ల సమయంలో బలవంతంగా బయటకు తీసుకెళ్లి నాన్ వెజ్ తినమని వేధించేవారు. వాళ్లకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా.. వదిలేవాళ్లు కాదు. 2023లో రంజాన్ టైంలో టీమ్ లీడర్ తౌసిఫ్ అట్టార్ ఓ రోజు తన ఇంటికి తీసుకెళ్లి.. నా నెత్తి మీద టోపీ పెట్టి నమాజ్ చేయమంటూ ఒత్తిడి చేశాడు. ఆ సమయంలో ఫొటోలు తీసి వాటిని కంపెనీ గ్రూపులో షేర్ చేశాడు. ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు.నా తండ్రి పక్షవాతం బారిన పడినప్పుడు.. ఇస్లాం మతం స్వీకరిస్తే ఆయన త్వరగా కోలుకుంటాడు అని చెప్పారు. అందుకు ఒప్పుకోకపోయేసరికి.. నాపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆ విషయంపైనా వెకిలిగా ప్రవర్తించేవాళ్లు. ‘పిల్లలు కావాలంటే నీ భార్యను పంపు’ అని అసభ్యంగా మాట్లాడేవారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే.. హెచ్ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్ వద్దని సర్దిచెప్పింది. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ ఉంటుందని.. ఉద్యోగం పోయినా పోవచ్చని బెదిరించేది అని బాధితుడు తన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. బీపీవో కార్యకలాపాలు నిలిపివేత..నాసిక్‌లో ఉన్న టీసీఎస్ క్యాంపస్‌లో బీపీవో(BPO) సెంటర్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి కేసుల వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను ఇంటినుంచే పని చేయాలని (Work From Home) గురువారం నుంచి ఆదేశించారు. తదుపరి సమాచారం వచ్చే వరకు ఈ తాత్కాలిక మూసివేత కొనసాగుతుందని తెలిపారు.ఆమెకూ 14 రోజుల రిమాండ్ఈ కేసులో హెచ్ఆర్ మేనేజర్ అసిఫ్ అన్సారీ సహా ఏడుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. టీమ్ లీడర్ తౌసిఫ్ అట్టార్, సహోద్యోగి డానిష్ షేక్‌లను ప్రధాన నిందితులుగా చేర్చారు. మరో ఇద్దరు మహిళా ఉద్యోగులను నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్ పరారీలో ఉంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశ్విని చయ్‌నాని కూడా కీలక పాత్ర పోషించినట్లు తేలింది. సిట్ విచారణలో.. అశ్విని చయ్‌నాని ప్రధాన నిందితుడు తౌసిఫ్ అట్టార్తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని.. 78 సార్లు ఈ వ్యవహారంపైనే ఈమెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపారని.. అందులో కుట్రకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తేలింది. మలేషియా నుంచి ఓ మత పెద్ద సూచనల మేరకు నిందితులు నడుచుకున్నారని తెలుస్తోంది. తాజాగా అశ్వినిని కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసు నిందితులంతా నాసిక్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా ఈ వ్యవహారంపై టీసీఎస్ స్పందించింది. అరెస్టయిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించినట్లు తెలిపింది. పని ప్రదేశంలో ఇలాంటి వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేసింది. పోలీసు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని తెలిపింది.ఉలిక్కిపడ్డ ఐటీ రంగం.. నాసిక్ క్యాంపస్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసే క్రమంలో మరో ఏడుగురు మహిళలు ముందుకొచ్చి.. తమపై జరిగిన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హెచ్ఆర్ మేనేజర్ సహా అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రముఖ కంపెనీలో జరిగిన ఈ వ్యవహారంతో దేశ ఐటీ రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. టీసీఎస్ సహా అన్ని సంస్థల్లో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిబంధనలు పాటించడంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను జాతీయ ఐటీ ఉద్యోగుల సంఘం కోరింది.తీవ్ర వేధింపులు..2022 ఫిబ్రవరి నుంచి నాలుగేళ్లపాటు వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఉద్యోగులు తమ ఫిర్యాదుల్లో పేర్కొనడం గమనార్హం. అనుచితంగా తాకడం, అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్, నాన్ వెజ్ తినాలని ఒత్తిడి చేయడం వంటివి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై హెచ్ఆర్ విభాగానికి మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయితే ఏజీఎం అశ్విని ఆ ఫిర్యాదులను తీసుకోకుండా పక్కన పెట్టారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మారు వేషంలో.. ఈ వ్యవహారంపై నాసిక్ పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. ఏడుగురు మహిళా పోలీసులు మారు వేషంలో టీసీఎస్ క్యాంపస్‌లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆపై సీసీఫుటేజీల ఆధారంగా కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. -
సుర లోకానికి అమర స్వరం
‘ఈనా మీనా డీకా’.. ఆమెది రాక్ ఎన్ రోల్ స్వరం. ‘పియా తూ అబ్ తో ఆజా’.. ఆమెది నర్తించే గళం. ‘ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా’.. ఆమెది యుగళ గీతం. ‘దిల్ చీజ్ క్యా హై ఆప్ మేరే జాన్ లీజియే’... ఆమెది బరువైన వేదనా జాలం. ఆశా భోంస్లే. డాన్సింగ్ వాయిస్ ఆఫ్ ఇండియా. నర్తించే గళం. 12000 పాటలు పాడి దశాబ్దాల పాటు భారతీయ శ్రోతల జీవితాల్లో హుషారును నింపి నేడు స్వరసుర లోకానికి బయలుదేరింది. దివ్య పుష్పమై దేవలోక ‘లత’కు చేరింది. బాలీవుడ్ గోల్డెన్ ఎరా ముగింపుకొచ్చింది. ఆశా భోంస్లే మరణ వార్త విని అభిమానులు చేస్తున్న వేడుకోలు– ‘అభీనా జావో ఛోడ్కర్ కె దిల్ అభీ భరా నహీ’....ముంబై: దశాబ్దాలుగా శ్రోతలను అలరించిన అద్భుత గాత్రం మూగబోయింది. కోట్లాది అభిమానులను ఉర్రూతలూగించిన అసమాన స్వర ఝరి శాశ్వతంగా ఆగిపోయింది. ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల ఆశా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఛాతీలో ఇన్ఫెక్షన్తోపాటు శ్వాస సంబంధిత సమస్యతో శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారని ఆశా భోంస్లే మనవరాలు జనై భోంస్లే ప్రకటించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆశా అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోయర్ పరేల్‌లోని కాసా గ్రాండ్లో అభిమానులు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించవచ్చని కుమారుడు ఆనంద్ తెలిపారు. ఆశా మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. లెజెండరీ సింగర్ దూరం కావడం చిత్ర పరిశ్రమలకు, అభిమానులకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పాడిన రికార్డు ఆశా భోంస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో సంప్రదాయ మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆమె సోదరీమణుల్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఉన్నారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ప్రోత్సాహంతో ఆశ సంగీతం నేర్చుకున్నారు. 1943లో పదేళ్ల వయసులో మరాఠీ చిత్రం ‘మజా బల్’లో తొలి గీతం ఆలపించారు. 2010 దశకం వరకూ పాడుతూనే ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటలు పాడిన సింగర్‌గా రికార్డుకెక్కారు. గాయనిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాలే్క, 2008లో పద్మభూషణ్, 2018లో బంగ భూషణ్, 2021లో మహారాష్ట్ర భూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. జాతీయ అవార్డులు, గౌరవాలకు లెక్కేలేదు. ఆశా భోంస్లే 1949లో 16 ఏళ్ల వయసులోనే గణపతిరావు భోంస్లేను వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు పుట్టాక వారు విడిపోయారు. అనంతరం ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్ను పెళ్లాడారు. 80 ఏళ్లలో 14 భాషల్లో 12,000కు పైగా పాటలతో అభిమానులను రంజింపజేశారు. యాదోం కీ బారాత్, హమ్ దోనో, హరే రామ హరే కృష్ణ, డాన్, నమక్ హలాల్, ఉమ్రావ్ జాన్, కిస్మత్, మేరా సాయా, తీస్రీ మంజిల్, మేరా జీవన్ సాథీ తదితర చిత్రాల్లో ఆశ పాడిన పాటలు దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఆశ వంట కూడా అద్భుతంగా చేస్తారన్న పేరుంది. ‘ఆశాస్’పేరిట ఇంటర్నేషనల్ రెస్టారెంట్ చైన్‌ను ఏర్పాటు చేశారు. చాలా దేశాల్లో రెస్టారెంట్లు నెలకొల్పారు. భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారు: ముర్ము ఆశా భోంస్లే మరణం సంగీత ప్రపంచంలో ఒక తీరని లోటును సృష్టించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. దిగ్గజ గాయనిగా ఆశ సాగించిన అద్భుత ప్రస్థానం భారత సంగీత చరిత్రలో ఒక యుగాన్ని సృష్టించిందని కొనియాడారు. ఆమెతో వ్యక్తిగతంగా సంభాషించిన తీపి జ్ఞాపకాలు తనకున్నాయని వెల్లడించారు. మధురమైన, చిరస్థాయిగా నిలిచిపోయే స్వరంతో దశాబ్దాల పాటు భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారని ప్రశంసించారు. ఆమె సంగీతం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆశా భోంస్లే వైవిధ్యమైన స్వరం అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందని ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అన్ని రకాల పాటలు, హృద్యమైన గజల్స్, సంప్రదాయ భజనలతో ఆకట్టుకున్నారని తెలిపారు. భావి తరాలకు స్ఫూర్తి: మోదీ దిగ్గజ గాయని ఆశా భోంస్లే మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆమె పాటలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని ‘ఎక్స్’లో స్పష్టంచేశారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను స్పృశించిందని ఉద్ఘాటించారు. దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రఖ్యాత గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోంస్లే మరణం తనకు తీవ్ర విచారం కలిగించిందన్నారు. ఆమెతో తన సంభాషణలు మనసులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని వెల్లడించారు. ఆశా భోంస్లే కుటుంబానికి, అభిమానులకు, సంగీత ప్రియులకు ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. భవిష్యత్ తరాలకు ఆమె ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటారని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. ఆశా భోంస్లే మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు. భారతీయ సంగీత రంగంలో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు. ఆమె తన విలక్షణ గాత్రం ద్వారా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతారని వివరించారు. -
సునేత్ర పవార్‌కు కాంగ్రెస్ ఝలక్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సునేత్ర పవార్ విజ్ఞప్తిని కాంగ్రెస్ హైకమాండ్ తిరస్కరించింది. దీంతో, ఉన ఎన్నికను ఏకగ్రీవం చేయాలనుకున్న ఆమె ప్రయత్నం విఫలమైంది.కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ ఇటీవలే విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం కారణంగా బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, ఈ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీలో నిలబడ్డారు. అనంతరం, బారామతి నుంచి సునేత్ర.. ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో ఆమె చర్చలు జరిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్‌ను కలిశారు. పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి లేకుండా ఉండాలనే ప్రయత్నాలు చేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో దింపాలని నిర్ణయం తీసుకుంది.ఇక, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సునేత్ర పవార్‌పై కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యాయవాది ఆకాష్ విశ్వనాథ్ మోర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మరోవైపు, ఆమె ఉద్ధవ్ థాక్రేను కూడా సంప్రదించారు. అయితే, ఇప్పటికీ శివసేన యూబీటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆమె బీజేపీతో పొత్తులో ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.ఇదిలా ఉండగా.. నేడు సునేత్ర పవార్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బారామతి పవార్ కుటుంబానికి కంచుకోట. అజిత్ పవార్ మరణంతో సునేత్ర పవార్‌కు సింపతీ వర్క్ అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్ధవ్ వర్గం అభ్యర్థిని పోటీలో నిలుపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే!
చిన్న సమస్య అయితే రూ. 250, పెద్ద సమస్య అయితే ఐదు వందల రూపాయలు.. ఇవేమీ ఆస్పత్రుల్లో ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పెట్టిన ధరలు కావు. బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక సమస్యలు తీర్చడానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మరేంటి? సాటి మనుషుల బాధలను వినడానికి ఓ వ్యక్తి నిర్ణయించిన ధరలు ఇవి. ఏంటి సమస్యలు వినడానికి డబ్బులు ఇవ్వాలని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్‌కు వెళ్లాల్సిందే.ముంబై మహానగర సముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు పట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధలు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అతడి రెండు ఫోన్ నంబర్లతో పాటు ఏ సమస్యకు ఎంత మొత్తం తీసుకుంటాడనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆసక్తిగా అనిపించి ఓ వ్యక్తి అతడితో మాట కలిపాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది.కలిసి ఏడవడానికి రూ. 1000!చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రూ. 500 తీసుకుంటానని అతడు చెప్పాడు. సమస్యలు వినడమే కాకుండా కలిసి కూర్చుని తనివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలని తెలిపాడు. డబ్బు చెల్లించి ఇలా ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయరు'' అంటూ ప్రశ్నించాడు. తన సేవలకు మన్నన దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడతను. తన పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra) అని.. ప్రజల సమస్యలు వినేందుకే తానిక్కడ ఉన్నానని చెప్పాడు. తనకు ఇన్స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉందని వెల్లడించాడు. భావోద్వేగ మద్దతు కోసంపృథ్వీరాజ్ వీడియో వైరల్ కావడంతో నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంత మంది అతడి సేవలను మెచ్చుకుంటే, మరికొందరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మహానగరాల్లో ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవసరమన్న వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు, మనుసులోని భావాలు పంచుకునేందుకు మనుషులు కరవవుతున్న నగర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వారని పేర్కొంటున్నారు.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!కాగా, ఈ వైరల్ వీడియో తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా నగర జీవులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. తమ బాధలను ఎవరితో పంచుకోవాలో తెలియక పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లను ఆశ్రయిస్తున్నారని వివరించారు. నెటిజనుల స్పందనపృథ్వీరాజ్ బోహ్రా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్‌లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామని కొందమంది సరదాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మహా నగరాల్లో మనుషులను ఒంటితనం ఎంతగా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్లడిస్తున్నాయని, ఇక్కడ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజనులు అంటున్నారు. అయితే మనుషుల బాధలను అలుసుకుగా తీసుకుని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.REPORTER : Do people come? 🤯MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026 -
మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం..!
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ దుమారం చెలరేగింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్, స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అశోక్ ఖారత్‌తో ఆ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ రూపాలి చకాంకర్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ వివాదం చెలరేగింది. మహిళా చైర్‌పర్సన్స్ పదవికి రూపాలి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. చైర్పర్సన్ పదవికి చకాంకర్ తక్షణమే రాజీనామా చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రుపాలి చకాంకర్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో ఉన్నారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకురాలు. మహారాష్ట్ర అధికార పార్టీలో బీజేపీ, శివసేన(ఏక్నాథ్ షిండే), అజిత్ పవార్ ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇదిలా ఉంచితే, ఆ రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్ అశోక్ ఖారత్.. ఓ మహిళను ఆస్ట్రాలజీ పేరుతో మోసం అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె బెదిరించి, భయపెట్టి గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే బుధవారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక పెన్‌డ్రైవ్‌లో 58 వీడియోలు, అందులో కొన్ని అభ్యంతరకరమైన క్లిప్స్ కూడా ఉన్నట్లు కనుగొన్నారు. తన రాజకీయ-సామాజిక సంబంధాలను ఉపయోగించి, ఆధ్యాత్మిక కర్మకాండల పేరుతో వారిని దుర్వినియోగం చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారం, బెదిరింపు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదనంగా, మహారాష్ట్రలో అమలులో అఘోరి ఆచారాలు, నల్లమంత్రికలు వంటి అమానుష పద్ధతుల నిర్మూలన చట్టం కింద కూడా అతనిపై కేసులు పెట్టారు.అయితే ఇప్పుడు మహిళా చైర్పర్సన్ రూపాలి .. ‘కెప్టెన్’ అని చెప్పుకునే సదరు ఆస్ట్రాలజర్ అశోక్‌తో దిగిన ఫోటోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. -
11 మంది మావోయిస్టుల లొంగుబాటు
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 11 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిలో ఐదుగురు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. 11 మంది మావోయిస్టులు తూర్పు గడ్చిరోలిలో పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాల ముందు లొంగిపోయినట్లు పోలీసులు వివరించారు.ఆ మావోయిస్టులపై మొత్తం కలిపి రూ.68 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. గడ్చిరోలి జిల్లాలో వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) దాదాపు ముగింపునకు వచ్చిందని తెలిపారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు, అడవుల్లో చాలా మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. -
రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు
ఇటీవల హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు కారుణ్య మరణానికి (Euthanasia) అనుమతినిచ్చిన నేపథ్యంలో, హృదయాన్ని కలచివేసే మరో గాథ చర్చనీయాంశంగా మారింది. ముంబైకి చెందిన 35 ఏళ్ల ఆనంద్ దీక్షిత్ గత రెండున్నరేళ్లుగా పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ (Persistent Vegetative State) అంటే ప్రాణం ఉండి కూడా స్పందన లేని స్థితిలో ఉన్నాడు. హరీష్ రాణా తల్లిదండ్రులు తమ కుమారుడి బాధను చూడలేక కారుణ్య మరణం కోరగా, ఆనంద్ కుటుంబం మాత్రం తమ కొడుకును ఎలాగైనా బతికించుకోవాలని పోరాడుతోంది.తమ కొడుకు మరో హరీష్ రాణాగా మారకూడదని దీక్షిత్ తల్లి దండ్రులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే..కొత్త బండి కొన్న ఉత్సాహం ఆవిరి2023 డిసెంబర్ 29న గోరఖ్‌పూర్‌లో కొనుగోలు చేసిన కొత్త స్కూటర్‌పై వెళ్తుండగా జరిగిన ఘోర ప్రమాదం వారి జీవితాలను అతలాకుతలం చేసింది. గాయపడ్డ కుమారుడు అప్పటి నుండి కోమాలోనే ఉన్నాడు.ఆహారం కోసం, శ్వాస పూర్తిగా యంత్రాల పైనే. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య తమ కొడుకు గుండె కొట్టుకునేలా చేయడానికి దీక్షిత్ కుటుంబం పడని పాట్లులేవు. రూ. 4కోట్ల ఖర్చు, ఉన్నగూడూ పోయిందిఇప్పటివరకు వైద్యం కోసం 4 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. దీని కోసం పొలాలు, ఆస్తులు, సేవింగ్స్ అన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఒకవైపు ఆస్పత్రిలో కొడుకు ప్రాణాల కోసం పోరాడుతుంటే, మరోవైపు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నిర్దాక్షిణ్యంగా వీరి ఇంటిని కూల్చివేసింది.. బిల్డర్-బీఎంసీ మధ్య ఉన్న వివాదం కారణంగా వీరు నిలువ నీడలేని పరిస్థితిలోకి జారి పోయారు. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే కాలం గడుపుతూ ఆనంద్‌ను కంటికి రెప్పలా కాపాడు కుంటున్నారు. అటు 'కేర్ హెల్త్ ఇన్సూరెన్స్' సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించడంతో కుటుంబం మరో 50 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకు పోయింది.హరీష్ రాణా లాగా తమ కొడుకును వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమనీ, కానీ పరిస్థితులు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటూ ఆ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఆనంద్ తల్లి, కొడుకు గడియారాలు, మొబైల్ ఫోన్‌ను భద్రంగా దాచుకొంది. ఏదైనా అద్భుతం జరుగకపోతుందా, తమ బిడ్డ తమను మళ్లీ "అమ్మా", "నాన్నా" అని పిలవకపోతాడా అని తల్లిదండ్రులు ఆశతో కళ్లు కాయలు కాచేలా నిరీక్షస్తున్నారు. ప్రభుత్వం గానీ, దాతలు గానీ సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశిద్దాం. -
సాహసోపేతంగా... ముంబైకి చేరుకున్నషెన్‌లాంగ్ నౌక
ముంబై: సంకల్పంతో ముందుకెళితే మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు సరైన వ్యూహాలు అక్కరకొస్తాయంటారు. శత్రు నౌకలు, జలాంతర్గాముల సంచారాలను అడ్డుకునే సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్’ను హార్మూజ్ జలసంధిలో అక్కడక్కడా ఇరాన్ ఏర్పాటుచేసినా సరే దృఢనిశ్చయంతో అదే మార్గంలో ప్రయాణించి ముడి చమురునౌక షెన్లాంగ్ సూయిజ్‌మ్యాక్స్ సాహసోపేత యాత్రను పూర్తిచేసింది.పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ జలసంధి గుండా ఎలాంటి దాడుల బారిన పడకుండా సురక్షితంగా ముంబై చేరుకున్న తొలి నౌకగా షెన్లాంగ్ సూయిజ్‌మ్యాక్స్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. బుధవారమే నౌక ముంబైకి చేరుకున్నప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక మార్చినెల ఒకటో తేదీన సౌదీ అరేబీచియాలోని రాస్ తనూరా నౌకాశ్రయంలో ఏకంగా 1,35,335 మెట్రిక్ టన్నుల ముడిచమురును నింపుకుంది. మార్చి మూడో తేదీన అక్కడి నుంచి బయల్దేరి క్షేమంగా ముంబై పోర్ట్‌కు చేరుకుంది.ఏమాత్రం అనుమానం రాకుండా..అంతర్జాతీయ సముద్రజలాల గుండా వెళ్లే ముడి చమురు, సరకు రవాణా నౌకలు పొరపాటున ఎదురెదురుగా రాకుండా, ఢీకొనకుండా ఉండేందుకు వాటి స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో తెల్సుకునేందుకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంటారు. దీని సాయంతో నౌక ఎక్కడ, ఎంత వేగంతో, ఏ దిశలో వెళ్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. దీని సాయంతో నౌకల గుట్టుమట్లను ఇరాన్ తెల్సుకుని నౌకల మీదకు ఆత్మాహుతి డ్రోన్ లేదా క్షిపణులను ప్రయోగించే ప్రమాదముంది. వాటితోనూ పనిలేకుండా సీమైన్స్నూ అక్కడక్కడా అమర్చింది. ఈ ఆటంకాలను అధిగమించేందుకు షెన్లాంగ్ నౌక కెపె్టన్, భారతీయుడు సుఖ్శాంత్ సింగ్ సంధూ బృందం నౌకాయాన విధానమైన ‘డార్క్‌మోడ్’టెక్నిక్‌ను అవలంభించారు.నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఏఎస్ఐ) వివరాలు ఎక్కడా ట్రాకింగ్ డేటాలో నమోదుకాకుండా ఉండేందుకు ఏఐఎస్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఫలానా చోట నౌక ఉంది అనే విషయం ఇరాన్‌కు తెలీకుండా పోయింది. హార్మూజ్ జలసంధిలోకి షెన్లాంగ్ నౌక ప్రవేశించగానే దాని సిగ్నళ్లు ఆర్పేశారు. దీనికి తోడు నౌకలోని అన్ని విద్యుత్దీపాలను ఆర్పేశారు. నౌక సిగ్నళ్లు చివరిసారిగా మార్చి 9వ తేదీన కన్పించాయి. తర్వాత నౌక పత్తాలేకుండా పోయింది. దాడులకు గురై మునిగిపోయిందేమోననే భయాందోళనల నడుమ అనూహ్యంగా నౌక హార్మూజ్‌ను దాటింది. తర్వాత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను స్విచ్ఆన్ చేశారు. దీంతో నౌక క్షేమంగా గమ్యం దిశగా వస్తోందని అర్థమైంది.బుధవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు ఇది ముంబై పోర్ట్‌కు చేరుకుంది. తర్వాత జవహర్ ద్వీప్ వద్ద సాయంత్రం 6.06 గంటలకు లంగరువేసింది. గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరానికి చెందిన డైనాకామ్ ట్యాంకర్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ ఈ నౌకను నిర్వహిస్తోంది. ఈ నౌకలో 29 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశస్తులు ఉన్నారు. డార్క్‌మోడ్ విధానంలో మరో ఐదు నౌకలు తమ గమ్యస్థానాల దిశగా కదిలే ఆస్కారముందని నౌకల ప్రయాణాలను పర్యవేక్షించే ‘ట్యాంకర్‌ట్రాకర్స్.కామ్’సంస్థ పేర్కొంది. రెండు భారీ చమురు రవాణా నౌకలు, పనామా కాలువలో పట్టే మరో పనామామ్యాక్స్ ట్యాంకర్ నౌక, సూయిజ్కాలువలో పట్టే రెండు సూయిజ్‌మ్యాక్స్ ట్యాంకర్నౌకల జాడ సైతం గత 48 గంటలుగా కన్పించట్లేదని ఇవి కూడా డార్క్‌మోడ్‌లో సముద్రయానం చేస్తుండే అవకాశముందని సంస్థ అంచనావేస్తోంది. -
MH: అసెంబ్లీకీ బాంబు బెదిరింపు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు అసెంబ్లీలో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపడుతుంది. అక్కడున్న వారిని వెంటనే వేరే ప్రాంతాల తరలించింది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా తరుచుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ ఫేక్వా లేక నిజంగానే బాంబు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. -
మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం
బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) ముంబై నగరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అవుట్‌లెట్‌ని ముంబైలోని ఈరోస్, చర్చ్‌గేట్‌లో మార్చి 2న ప్రారంభించింది ఈ సందర్భంగా ముంబై వాసుల కోసం కేఫ్ యాజమాన్యం ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.రామేశ్వరం కేఫ్ పట్ల ఉన్న క్రేజ్‌తో ముంబై ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.ముంబైలో తన అరంగేట్రాన్ని పురస్కరించుకుని, రామేశ్వరం కేఫ్ నాలుగు రోజుల పాటు ఉచిత ఫుడ్ అంటూ ఇన్‌స్టాలో ప్రకటించింది. మార్చి 2 నుండి మార్చి 5వ తేదీవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ఫుడ్ అందివ్వనున్నట్టు ప్రకటించారు. రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఆస్వాదించేందుకు వందలాదిమంది బారులు తీరారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ప్రజలు తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య Hehe…for that 1 FREE dish 😄😄😄@RameshwaramCafe u really need this & those social influencers? Really? pic.twitter.com/ro6pquBCYU— Neeta Kolhatkar (@neetakolhatkar) March 3, 2026 రామేశ్వరం కేఫ్రామేశ్వరం కేఫ్ రామేశ్వరం కేఫ్‌ను 2021లో బెంగళూరులో భార్యాభర్తల ద్వయం రాఘవేంద్రరావు , దివ్య రాఘవేంద్రరావు స్థాపించారు. సాంప్రదాయ వంటకాలతో ప్రజాదరణ పొందింది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలానికి నివాళిగా, దక్షిణ భారత రుచులను , వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కేఫ్‌కు "రామేశ్వరం" అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by SANJAY | The Travel Freak 🇮🇳 (@sanjay_thetravelfreak) -
మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్
ముంబైలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గోరేగావ్ ఒకటి. ఆధునిక హై-రైజ్అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్ (Sushmita Sen), ఆమె తల్లి సుబ్రా సేన్ ముంబైలో తమ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. దీని నెలవారీ అద్దె రూ. 1.95 లక్షలతో 36 నెలల (3 ఏళ్లు) లీజ్ కిచ్చారు. అంటే ఈ ప్రాపర్టీ ద్వారా మొత్తం మూడేళ్లకు గాను సుమారు 74 లక్షలు (73.76 లక్షలు) ఆదాయం సమకూరనుందిఈ లగ్జరీ ఫ్లాట్ గోరేగావ్‌లోని ప్రముఖ 'ఓబెరాయ్ ఎక్స్‌క్విజిట్' (Oberoi Exquisite) ప్రాజెక్ట్‌లో ఉంది. లీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్సైట్లో స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం. ఈ ఒప్పందం అధికారికంగా ఫిబ్రవరి 2026లో నమోదు చేయబడింది. దీని ప్రకాం సెక్యూరిటీ డిపాజిట్ కింద 6 లక్షలు కాగా, స్టాంప్ డ్యూటీ కింద రూ.18,900, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 1,000 చెల్లించారు. ప్రతి ఏటా 5శాతం మేర అద్దె పెరుగుతుంది.ఈ ప్రాపర్టీ ప్రత్యేకతలు విషయానికి వస్తే కార్పెట్ ఏరియా 996 చదరపు అడుగులతో కలిపి మొత్తం ఏరియా 1,241 చదరపు అడుగులు. ఇందులో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియోసుస్మితా సేన్ గుర్తించి సంక్షిప్తంగా1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా సుస్మితా సేన్ చరిత్ర సృష్టించారు. 'బీవీ నంబర్ 1', 'మై హూ నా' వంటి సినిమాలతో మెప్పించిన సుస్మితా సేన్ ఇటీవల 'ఆర్య', 'తాళి' వంటి వెబ్ సిరీస్‌లతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్) -
ముంబై మహానగరంలో ‘గరీబీ దర్శన్’
ముంబై: ముంబై మహానగరం.. ఎంతో మందికి కలల నగరం. ఆకాశన్నంటుకునే భవనాలున్నట్టే.. అత్యంత పేదరికంలోని మురికి వాడలూ ఉన్నాయి. అందులో అందరికీ తెలిసింది ధారావి. ఇక్కడి పేదరికమే అమ్మకపు సరుకు. దాన్ని డాలర్లకు అమ్ముతున్నారు స్తానికులు. మన దేశంలో మురికి వాడల పర్యాటకం ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ధారావి ‘గరీబీ దర్శన్’కో (Gareebi darshan) ప్రత్యేకత ఉంది. అది ధనిక ముంబైకర్లకే కాదు.. పేద ధారావి వాసులకూ ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ధారావి ఇరుకు గల్లీల్లో విదేశీయులను ఓ రెండు గంటలు తిప్పితే చాలు.. రూ.15 వేల రూపాయలు మీ చేతికొస్తాయి. అవును.. ఒకప్పుడు ఇలాంటి పర్యటనలను శిక్షణ పొందిన గైడ్లే నిర్వహించేవారు. అదంతా వ్యవస్థీకృతంగా ఉండేది. కానీ ఇప్పుడు గైడ్లు ధారావి నిర్వాసితులు. ఎందుకంటే కిలోమీటర్ల మేర, మూడు అడుగుల వెడెల్పు మాత్రమే ఉన్న ఇరుకైన గల్లీలలో చాలా సులభంగా తీసుకెళ్లగలిగేది, బయటికి తీసుకురాగలిగేది వారు మాత్రమే. అలా తీసుకెళ్లి, ధారావిని చూపించి, క్షేమంగా బయటపడేసినందుకు వారు చేసే ఛార్జ్ ఒక్కొక్కరికి రూ.15,000. ఒక్కోసారి బృందాలుంటాయి.ఐదుగురు సభ్యులున్న బృందం వస్తే.. రూ.75 వేల రూపాయలు చేతికొచ్చినట్టే. ఇదో కార్పొరేట్ ఉద్యోగి నెల జీతం. ఒకప్పుడు గైడ్‌లకే పరిమితమైన ఈ వ్యాపారాన్ని ధారావికర్లు (Dharavikars) స్వయంగా చేస్తున్నారు. అయితే ఇలా మురికివాడలను చూడటానికి కేవలం విదేశీయులే రావడం లేదు.. ఇలాంటి చోట్లకు ఎప్పుడూ వెళ్లని కొందరు ముంబై వాసులు.. దేశంలోని ఇతర ప్రాంతాల వాళ్లూ ఆసక్తి చూపుతున్నారు. అయితే అలాంటి పర్యటనకు మన దేశం వాళ్లు వెళ్లే మాత్రం రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ‘వాయూరిజం’ అని పిలిచే ఈ పర్యాటకం ధారావి వాసులకు ఆదాయ మార్గమైంది. తమ ఇంటిని చూపించే.. ఇల్లు గడుపుతున్నారు. అయితే అక్కడి పరిస్థితుల ఫొటోలు తీసుకోవాలంటే మాత్రం వారి అనుమతి తీసుకోవాలి. అయితే ప్రారంభంలో ధారావికి సందర్శకులను తీసుకెళ్లే ఆలోచనను చాలా మంది వ్యతిరేకించారు. ఇది పేదరిక పర్యాటకంలా అనిపించింది. ఒకరి ఆకలి, పేదరికం మరొకరికి దర్శనీయం కావడం ఇబ్బందిగా అనిపించింది. కానీ.. యూరోపియన్ సామాజిక కార్యకర్త క్రిస్ వే, కృష్ణ పూజారి 2005లో ప్రారంభించిన రియాలిటీ టూర్స్ ఆలోచనా తీరును మార్చింది. గైడ్స్‌గా స్థానిక విద్యార్థులుంటే.. వారికి చదువుకోసం డబ్బు వారే సంపాదించుకోవచ్చని కొత్త ఆలోచనతో ‘ధారావి’ నడక ప్రారంభించారు. అలా ధారావిలో మురికివాడల పర్యాటకం ఒక కుటీర పరిశ్రమగా మారింది. ఇప్పుడు పనికొచ్చే రెండు ఇంగ్లిష్ మాట్లాడగలిగేవాళ్లు.. గైడ్‌గా మారిపోవచ్చు. అయితే, ధారావి పునరాభివృద్ధి తరువాత ఈ పరిస్థితిపై అనిశ్చితి ఉంది. -
సిక్కులకు న్యాయం కోసం కృషి
నవీ ముంబై: సిక్కులకు గౌరవం, న్యాయం దక్కేలా కృషి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే, 1984లో ఇందిర మరణానంతరం సిక్కులపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ జరిపేందుకు తమ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మూసివేసిన ఎన్నో కేసులను తిరిగి తెరిచి, విచారణ చేపట్టామని తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేశామన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్‌లో సిక్కులకు మరింత ప్రాముఖ్యతను కల్పించామన్నారు. గురు తేజ్ బహదూర్ అమరత్వం పొంది 350 ఏళ్లయిన సందర్భంగా ముంబైలోని ఖర్గార్‌లో ఆదివారం జరిగిన ‘హింద్–ది–చదర్’ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌లో పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ ప్రతులు, సిక్కు కుటుంబాల భద్రత ప్రమాదంలో పడగా ప్రభుత్వం తక్షణమే స్పందించి సురక్షితంగా స్వదేశానికి తరలించిందని గుర్తు చేశారు. అఫ్గాన్‌లో యాతనలు పడిన సిక్కులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సిక్కు కుటుంబాల పునరావాసానికి చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. వేలాది మంది సిక్కుల పేర్లను బ్లాక్ లిస్టు నుంచి తొలగించడంతోపాటు వీసా నిబంధనలను సడలించినట్లు ప్రధాని వివరించారు. భవిష్యత్తుకు బాటలు పరిచేవి..హింద్–ది–చాదర్ వంటి కార్యక్రమాలు కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి కాకుండా భవిష్యత్తుకు దారులు వేస్తాయన్నారు. ‘గురు తేజ్ బహదూర్ కాలంలో ధైర్యం, సత్యసంధతకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో, నేటికీ అంతే సందర్భోచితంగా ఉంది. మన కొత్త తరం ఇటువంటి విలువలని అందిపుచ్చుకున్నప్పుడు, సంప్రదాయం అనేది కేవలం ఒక జ్ఞాపకంలా మిగిలిపోదు; అది భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. మనం చరిత్రను కేవలం స్మరించుకోవడమే కాదు, దానిని మన జీవితాల్లోకి కూడా తెచ్చుకోవాలి’అని ప్రధాని మోదీ తన వర్చువల్ ప్రసంగంలో పేర్కొన్నారు.మన గురువుల త్యాగాలు..దేశ చరిత్ర పరాక్రమం, సమన్వయం మరియు సహకారంతో నిండి ఉందని ఆయన అన్నారు. గురువుల అత్యున్నత త్యాగం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసిందని ప్రధాని చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గం వారి నుంచి స్ఫూర్తిని పొందిందని, అది సమాజం సత్య మార్గంలో ముందుకు స్థిరంగా సాగడానికి సాయపడిందని ప్రధాని తెలిపారు. ‘దేశానికి సామాజిక ఐక్యత ఎంతో అవసరమైన ఈ సమయంలో, మన గురువులు, సాధువుల ఆశీస్సులు మనకు ఉన్నాయనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగిస్తోంది. ఈ ప్రయాణం గత ఏడాది నాగ్‌పూర్ నుంచి ప్రారంభమైంది, ఆ తర్వాత నాందేడ్ వరకు సాగింది. నేడు నవీ ముంబైలో ఈ ప్రయాణం ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది’అని ప్రధాని అన్నారు. -
నాగ్‌పుర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి
నాగ్‌పుర్: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో భారీ పేలుడు సంభవించింది. కటోల్‌లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ (SBL) కంపెనీలో ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నాగ్‌పూర్‌లోని ఆరెంజ్ సిటీ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాముందని అధికారులు భావిస్తున్నారు.ఈ పరిశ్రమలో డిటోనేటర్లతో పాటు భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో, 30 మందికి పైగా పరిశ్రమలో పని చేస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి. -
మహారాష్ట్రలో పేలుడు.. 15 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. నాగపూర్‌లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ (SBL) ఎనర్జీ లిమిటెడ్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 15 మంది చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగపూర్‌లోని కటోల్‌లో ఎస్బీఎల్ (SBL) ఎనర్జీ లిమిటెడ్‌లో ఆదివారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.అయితే, ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు వెల్లడించారు. ఉదయం ఇందులోని ఒక యూనిట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని, ఆ సమయంలో, 30 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పనిచేస్తున్నారని తెలిపారు. దీంతో, మరణాల సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. -
కూటమిలో మహా చిచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలల్లో జరగనున్న రాజ్య సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో విపక్ష కూటమైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో రాజకీయ చిచ్చు రేగుతోంది. విపక్ష కూటమికి దక్కే ఒకే ఒక్క సీటుపై అటు ఎన్సీపీ (శరద్ పవార్), ఇటు శివసేన (ఉధ్దవ్ బాల్‌ఠాక్రే) పార్టీలు పట్టుబడుతుండటంతో వివాదం ముదురుతోంది. అత్యధిక సీట్లున్న తమకే రాజ్యసభ సీటు దక్కాలని పవార్ వర్గం బలంగా డిమాండ్ చేస్తోంది. ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన కూటమిలోని కాంగ్రెస్ మౌనంగా ఉండిపోవడం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఎవరికి వారే..: మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, 7 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక రాజ్యసభ సీటుకు 37 ఓట్లు అవసరం కాగా, ప్రస్తుతం 235 సీట్లున్న ఎన్డీయేకు 6 స్థానాలు దక్కడం ఖాయం. మిగతా ఒక్క స్థానం మాత్రమే విపక్షాలకు దక్కనుంది. విపక్ష కూటమి అయిన ఎంవీఏలో సేన యుబీటీకి 20, కాంగ్రెస్‌కు 16, శరద్ పవార్ వర్గానికి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న పవార్ వర్గానికి చెందిన ప్రియాంక చతుర్వేదిని తిరిగి కొనసాగించాలని ఆ పార్టీ మొదట డిమాండ్ చేసింది. అయితే గతంలో రాజ్యసభ ఎన్నికలకు మళ్లీ పోటీ చేయనని గతంలో ప్రకటించిన శరద్ పవార్, తాజా పరిణామాల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నా రు. ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మర ణం తర్వాత మనసు మార్చుకున్న శరద్ పవార్ రాజ్యసభ కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పవా ర్ పార్టీ ఈ సీటు కోసం పట్టుబడుతోంది. దీనిపై పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే సైతం స్పందిస్తూ, ‘పవార్ రాజ్యసభకు వెళ్లాలన్నది పార్టీలో అందరి కోరిక’అని వ్యా ఖ్యానించారు. ఈ విషయమై ఆమె కాంగ్రెస అగ్రనేతలతో మంతనాలు సైతం ప్రారంభించారు. ఈ సమయంలోనే సేన యూబీటీ నేతలు పవార్ ఆరోగ్యాన్ని చర్చకు పెట్టారు. వృధ్ధాప్య సమస్యలతో తరుచూ ఆస్పత్రి పాలవుతున్న పవార్ నుంచి ప్రజా ప్రతినిధిగా ఏం ఆశించగలం అంటూ యూబీటీ నేతలు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే సైతం ఈ సీటుపై తమకే మొదటి హక్కు ఉందంటున్నారు. కూటమిలో విభజన వచ్చేలా మాటల మంటలు రేగుతున్నా కాంగ్రెస్ మాత్రం మౌనంగానే ఉంది. అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాట్లాడుతూ, కూటమి భాగస్వాములు కలిసి అభ్యర్థిని నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణా మాలతో శివసేన యుబీటీ, శరద్ పవార్ వర్గాల మధ్య సర్దుబాటు ఎలా కుదురుతుందో చూడాల్సి ఉంది. ఈ నిర్ణయం కూటమి భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. -
నిర్లక్ష్యం, కుట్రకోణంలోనూ దర్యాప్తు
పుణె/ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలను బలి తీసుకున్న బారామతి విమాన ప్రమాదం ఘటనలో ప్రధానంగా నిర్లక్ష్యం, కుట్ర కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) గురువారం తెలిపింది. జనవరి 28న జరిగిన విమాన ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ తన వాంగ్మూలమిచ్చారు. ఆ ప్రమాదం జరిగిన పరిస్థితులను ఆయన మొదటి నుంచీ ప్రశి్నస్తున్నారు. వీఎస్ఆర్ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం గురువారం రాష్ట్ర శాసన మండలిలోనూ ప్రస్తావనకు వచ్చింది. ప్రమాద ఘటనకు దారి తీసిన అన్ని అంశాలను సభ ముందుంచాలని ప్రభుత్వానికి కౌన్సిల్ చైర్మన్ సూచించారు. ఈ నేపథ్యంలో సీఐడీ అదనపు డీజీపీ సునీల్ రామానంద్ మీడియాతో మాట్లాడారు. బారామతి విషాద ఘటనపై శాస్త్రీయ పద్ధతిలో సవివరమైన దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా లేక నేరపూరిత నిర్లక్ష్యం దాగుందా అనేది తేలుస్తామని చెప్పారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక అందాక ఆ వివరాలను కూడా చేరుస్తామని వివరించారు. నేర పూరిత కోణం దాగుంటే కేసు నమోదు చేస్తామని కూడా ఆయన అన్నారు. ఇలా ఉండగా, అజిత్ పవార్ అన్న కుమారుడు రోహిత్ పవార్ గురువారం పుణెలో సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చారు. వీఎస్ఆర్ వెంచర్స్‌పై కేసు నమోదు చేయాలని సీబీఐ అధికారులను కోరినట్లు అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన విమానాలను నిలిపివేయాలంటూ మంగళవారం డీజీసీఏ ఆదేశాలిచ్చిన అంశంపై సీఐడీ మౌనంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ తదితరుల మృతికి కారణమైన లేజర్‌జెట్ 45 విమానం వీఎస్ఆర్ వెంచర్స్ కంపెనీదేనని ఆయన చెప్పారు. ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ టీడీపీకే చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. రోహిత్ పవార్, మరో నేత యోగేంద్ర పవార్‌తో కలిసి వీఎస్ఆర్ వెంచర్స్‌పై బారామతి తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీఎస్ఆర్ వెంచర్స్, ఆ సంస్థ డైరెక్టర్లపై బుధవారం ఆయన ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. -
పండ్లపై ఎలుకల మందు.. షాకవుతున్న జనం!
ముంబై: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పండ్ల వ్యాపారుల ఉదంతం వెలుగు చూపింది. అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందును పండ్లపై పూస్తున్న ఇద్దరు వ్యాపారులను ముంబైలోని మలాడ్ వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో స్థానికంగా కలకలం రేపింది. మలాడ్ పశ్చిమ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న పండ్ల దుకాణం వద్ద ఒక వ్యాపారి అరటి పండ్లపై ‘రాటోల్’ అనే క్రీమ్ తరహా విషపూరిత పదార్థాన్ని రాస్తుందటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన మలాడ్ పోలీసులు సదరు పండ్ల దుకాణంపై దాడి చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఘటనా స్థలంలో ‘రాటోల్’ అనే ఎలుకల మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులో ‘ఎల్లో ఫాస్ఫరస్’ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని అధికారులు తెలిపారు. నిందితులను మలాడ్ వెస్ట్‌లోని రాజన్పాడకు చెందిన మనోజ్ సంగంలాల్ కేసర్వానీ (42), రాహుల్ సదన్ లాల్ కేసర్వానీ (25)గా గుర్తించి, వారిపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. मालाडमध्ये परप्रांतीय फळ विक्रेताचा बेजबाबदारपणा शिखरावर! फळांवर Ratol सारखी क्रीम लावून थेट मुंबईकरांच्या जीवाशी खेळ. Ratol सारखे विषारी पदार्थ वापरल्याने उलटी, पोटदुखी, विषबाधा, लिव्हर नुकसान आणि जीवाला धोका निर्माण होऊ शकतो. या विक्रेत्यावर कार्यवाही झालीच पाहिजे.#MNS #mybmc pic.twitter.com/RFtulkwO4h— शेख जब्बार (राजसाहेबांचा जब्बार) | SHAIKH JABBAR (@jabbarsmns) February 24, 2026బుధవారం వీరిని బోరివలిలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆ పండ్ల దుకాణాన్ని పోలీసులు సీజ్ చేశారు.పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఎలుకలు తమ పండ్ల స్టాక్‌ను పాడు చేయకుండా ఉండేందుకే తాము ఆ మందును పూస్తున్నామని, వినియోగదారులకు హాని చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని వారు అన్నారు. కాగా ఆహార పదార్థాలపై ఇటువంటి విషపూరిత రసాయనాలను వాడటం క్షమించరాని నేరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఎల్లో ఫాస్ఫరస్ వంటి రసాయనాలు శరీరంలోకి చేరితే వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, కాలేయ సంబంధిత వ్యాధులు సంభవించడమే కాకుండా, అవయవాలు వైఫల్యం చెంది ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు నగరవ్యాప్తంగా పండ్ల దుకాణాలపై నిఘా ఉంచాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని ముంబై వాసులు కోరుతున్నారు.ఇది కూడా చదవండి: మోదీ స్టైల్లో నెతన్యాహు.. అంతటా ఇదే చర్చ! -
ఎఫ్ఐఆర్ నమోదు చేయరేం!
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మ రణానికి కారణమైన విమాన ప్రమాద ఉదంతంపై అను మానాలు నానాటికీ బలపడుతున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు. ఆ దుర్ఘటనపై కేసు నమోదు చేయడానికి ముంబై పోలీసులు నిరాకరించడమే ఇందుకు తాజా నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ ఉదంతా నికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో రోహిత్ పలు పోస్టులు పెట్టారు.‘‘అజిత్ ప్రయాణించిన లియర్‌జెట్ 45 (వీటీ–ఎస్ఎస్కే) విమానం సొంతదారైన వీఎస్ఆర్ వెంచర్స్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని డీజీసీఏ మంగళవారం తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. దాంతో ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి ఎఫ్ఐ ఆర్ దాఖలు చేయాల్సిందిగా సహచర ఎమ్మెల్యేలు అమోత్ మిత్కరీ, సందీప్ క్షీర్సాగర్, నేను మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డిమాండ్ చేశాం.కానీ ఎఫ్ ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించారు. లాంఛ నంగా మా ఫిర్యాదును స్వీకరించడంతో సరిపెట్టారు. విమా న ప్రమాదంపై మాకిప్పటికే ఉన్న అనుమానాలను పోలీ సుల తీరు మరింత బలపరుస్తోంది’’ అని పేర్కొన్నారు. అజి త్ విమాన ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలుకు డిమాండ్ చేసే ందుకు గురువారం ఉదయం బారామతి పోలీస్ స్టేషన్ కు వెళ్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫిర్యాదు ను దర్యాప్తు నిమిత్తం సీఐడీకి పంపినట్టు పోలీసులు తెలి పారు.వెనకేసుకొచ్చిన వైమానిక మంత్రివీఎస్ఆర్ వెంచర్స్‌కు క్లీన్చిట్ ఇచ్చేందుకు డీజీసీఏ తొలుత ప్రయత్నించిందంటూ రోహిత్ ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వీఎస్ఆర్ సంస్థను వెనకేసుకొచ్చారని ఆయన ఆరోపించారు. విమానంలో భద్రతా లోపాలేవీ లేవని, అన్ని పరీక్షల తర్వాత దానికి డీజీ సీఏ అనుమతులిచ్చిందని చెప్పారని గుర్తు చేశారు. ‘‘ఆ విమానంలో లోపాలున్నట్టు ఇప్పుడు డీజీసీఏ చెబుతోంది. అయినా అనుమతులిచ్చిందంటే ఇందులో ఆ సంస్థ తప్పు కూడా ఉన్నట్టే’’ అంటూ దుయ్యబట్టారు.వీఎస్ఆర్ సంస్థకు చెందిన నాలుగు విమాన సర్వీసులను తక్షణం నిలిపే యాలని డీజీసీఏ మంగళవారం ఆదేశించడం తెలిసిందే. ఇది తమ పోరాటానికి లభించిన పాక్షిక విజయమని రోహిత్ అన్నారు. ‘‘కానీ వీఎస్ఆర్ తప్పిదాలకు మా నాయకుడు బలయ్యారు. ఏదో ఒకనాటికి అజిత్ కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. వీఎస్ఆర్కు చెందిన ఇతర విమాన సర్వీసులను ఎందుకు కొనసాగి స్తున్నారని డీజీసీఏను ప్రశ్నించారు. వాటన్నింటినీ తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు.రామ్మోహన్ రాజీనామా చేయాల్సిందేవీఎస్ఆర్ వెంచర్స్‌కు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత వ్యాపార సంబంధాలున్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. వీటన్నింటిపైనా లోతుగా దర్యాప్తు జరగాలన్నారు. పౌర విమాన యాన మంత్రి రామ్మోహన్నాయుడుది కూడా అదే పార్టీ అని గుర్తు చేశారు. ఆయన రాజీనామా చేసి తీరాల్సిందేనని పునరుద్ఘాటించారు. అందుకోసం ఒత్తిడి తెస్తూనే ఉంటానని రోహిత్ స్పష్టం చేశారు.‘‘అంతేగాక వీఎస్ఆర్ వెంచర్స్ యజమానిపై తక్షణం కేసు నమోదు చేయాలి. డీజీసీఏలోని సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అజిత్ ప్రయాణించిన విమానం ఫిట్‌గా ఉందని మహా రాష్ట్రకు చెందిన వైమానిక సమన్వయ కంపెనీ ‘యారో’ తప్పుడు ధ్రువీకరణకు పాల్పడింది. అంతేగాక ప్రమాదం జరిగిన రోజు వాతావరణ పరిస్థితులు విమాన ప్రయాణానికి అనువుగా ఉన్నాయని కూడా పేర్కొంది. కనుక ఆ కంపెనీపైనా కేసు పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. -
అజిత్ కేసును నీరుగార్చేందుకే.. సీబీఐ దర్యాప్తు!
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి దారితీసిన విమాన ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) తీవ్రంగా తప్పు బట్టింది. దర్యాప్తును ఆలస్యం చేసి నీరుగార్చేందుకే ఫడ్నవీస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందంటూ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సోమవారం దుయ్యబ ట్టారు. సీబీఐ వద్ద ఇప్పటికే ఏకంగా 7 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. వాటిలో 2,500 కేసులకైతే ఏకంగా దశాబ్దానికి అతీగతీ లేదంటూ ఆక్షేపించారు. దర్యాప్తు పేరుతో కాలహరణం చేసే ఈ యత్నాలను తాము అంగీకరించే ప్రసక్తే లేదని రోహిత్ కుండబద్దలు కొట్టారు. విమాన ప్రమాదంపై సీఐడీతోనే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన వివరాల్లో 30 శాతాన్ని మాత్రమే బయటపెట్టారని కూడా ఆయన ఆరోపించారు. ప్రమాదంలో బ్లాక్‌బాక్స్ కాలిపోయిందని చెప్పడంపై పలు అనుమానాలు వెలిబుచ్చారు. ‘‘బ్లాక్‌బాక్స్‌ను సురక్షితంగా వెలికితీశారు. దాన్ని అందరూ చూశారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నా దగ్గరున్నాయి. ఇప్పుడు అది కాలిపోయిందని చెప్పడం వెనక మతలబు ఏమిటి?’’ అని ప్రశ్నించారు. దర్యాప్తులో ఏవైనా లోపాలు జరిగినట్టు తేలితే ఫడ్నవీస్ సర్కారు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అంతకుముందు అసెంబ్లీలో అజిత్ పవార్‌కు రోహిత్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో తన సాన్నిహిత్యాన్ని తలచుకుంటూ కంటతడి పెట్టారు.అజిత్ విమాన ప్రమాదం దర్యాప్తులో జరుగుతున్న జాప్యం పలు ప్రశ్నలకు తావిస్తోందని ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన మరో ఎమ్మెల్యే జితేంద్ర అవద్ కూడా పేర్కొన్నారు. ‘‘బ్లాక్‌బాక్స్ కాలిపోవడం ఏమిటి? ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కడా అలా జరగలేదు. ప్రమాద కారణాలను తేల్చేందుకు జరుగుతున్న దర్యాప్తే మరిన్ని అనుమానాలకు దారితీస్తే ప్రజలిక దేన్ని నమ్మాలి?’’ అని ప్రశ్నించారు. ప్రమాదానికి గురైన విమానానికి భారత్‌లో నడిచేందుకు అనుమతే లేదని అవద్ ఆక్షేపించారు. ‘‘ఆ విమానాన్ని మొత్తం జీవితకాలంలో గరిష్టంగా 5,000 గంటలకు మించి నడపరాదు. కానీ అప్పటికే అది 8,000 గంటల పాటు నడిచింది. ఇవన్నీ మొత్తం ఉదంతంపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి’’ అన్నారు. -
విషాదాన్ని నింపిన ట్రైనీ టెకీల బీచ్ ఔటింగ్
స్నేహితులతో బీచ్‌లో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి విధి తీవ్ర విషాదం మిగిల్చింది. శనివారం చెన్నైలో జరిగిన బీచ్ ప్రమాదంలో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయింది. మరొకరు ఆచూకీ ఇంకా దొరకలేదు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రకు చెందిన గోల్డెన్ బీచ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వారిలో 22 ఏళ్ల మయూరి హరిశ్చంద్ర చౌదరిగా ప్రాణాలు కోల్పోయింది. 24 ఏళ్ల మరొకరు కనిపించకుండా పోయారు.మూడో వ్యక్తిని జాలర్లు రక్షించారు. ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ సిరుసేరి క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ట్రైనీలు 26 మంది శనివారం సెలవు కావడంతో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ (పుదుచ్చేరి రోడ్) వెంబడి ఉన్న బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. అధిక ఆటుపోట్ల కారణంగా ప్రశాంతంగా ఉన్న సముద్రంలో దాదాపు 10 -15 అడుగుల ఎత్తులో అలలు రావడంతో ముగ్గురు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరి ఆచూకీ తెలియరాలేదు. మహారాష్ట్రకు చెందిన పదిహేను మంది ఇంటర్న్‌షిప్ కోసం చేరిన వారిలో వీరు ముగ్గురు కూడా ఉన్నారు.మృతురాలిని భండారా జిల్లాలోని మోహది తాలూకాలోని వర్తి గ్రామానికి చెందిన మయూరి హరిశ్చంద్ర చౌదరిగా గుర్తించారు. జల్గావ్ జిల్లాలోని జామ్నేర్‌కు చెందిన జై పాటిల్ ఆచూకీ కనిపించడం లేదు. ఒడ్డుకు దూరంగా నిలబడి ఉన్న పూణేకు చెందిన రాజ్ కేదారి చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కసారిగా అల విరుచుకుపడటంతో ముగ్గురం కొట్టుకు పోయామని, ఈత కొడుతూ మయూరిని బయటకు లాగగలిగాను కానీ జైని కనుగొనలేకపోయాను అని కేదారివిచారం వ్యక్తం చేశాడు. మయూరి చౌదరిని ఇంజంబక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని గుర్తుచేసుకున్నాడు.సంఘటన జరిగిన వెంటనే కనత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది గాలింపు, రక్షణ చర్యను ప్రారంభించారు.జై పాటిల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎంవో ప్రకటనలో తెలిపింది. జై పాటిల్ బంధువులు ,మయూరి చౌదరి కుటుంబ సభ్యులు చెన్నై చేరుకున్నారు.चेन्नई (तामिळनाडू) येथील गोल्डन बीचवर फिरण्यासाठी गेलेल्या महाराष्ट्रातील विद्यार्थ्यांच्या गटासोबत पाण्यात उतरताना दुर्घटना घडली असून या घटनेत महाराष्ट्रातील काही विद्यार्थी अडकल्याची माहिती समोर आली आहे. या घटनेची माहिती मिळताच मुख्यमंत्री देवेंद्र फडणवीस यांनी तात्काळ…— CMO Maharashtra (@CMOMaharashtra) February 22, 2026 -
అజిత్ విమాన ప్రమాదం: ‘వారంతా కుమ్మక్కయ్యారు’
ఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వెంటనే రాజీనామా చేయాలని ఎన్సీపీ (శరద్‌పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అజిత్ పవార్‌కు మోదీ, అమిత్ షా న్యాయం చేయాలన్నారు. విమానంలో పెట్రోల్ క్యాన్లు ఉన్నట్లు మాకు తెలుస్తుంది. దీని వల్లే విమానం మంటల్లో చిక్కుకుందన్నారు.‘‘విమానంలో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్ నింపారు. కుట్రపూరితంగానే ఎక్కువ ఫ్యూయల్ నింపినట్లు మాకు అనుమానం. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు జరిగాయి. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి’’ అని రోహిత్ పవార్ పేర్కొన్నారు.వీఎస్ఆర్ ట్రావెల్స్ వెనుక ఎవరున్నారో బయటకురావాలి. వీఎస్ఆర్ కంపెనీ మేనేజర్ వీకే సింగ్‌ను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు?. పైలెట్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు మాకు తెలుస్తోంది. డీజీసీఏలోని కొంతమంది ఉన్నతాధికారులు వీఎస్ఆర్ ట్రావెల్స్తో కుమ్మక్కయ్యారు. బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పడం కూడా పూర్తి అబద్ధం. రామ్మోహన్నాయుడు పదవిలో ఉంటే విచారణను ప్రభావితం చేస్తారు’’ అంటూ రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు.‘‘అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక రాజకీయ, కమర్షియల్ కుట్ర ఉంది. వీఎస్ఆర్ కంపెనీ వెనుక డీజీ సీఏ పెద్ద అధికారి హస్తం ఉంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు వీఎస్ఆర్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. వీఎస్ఆర్ కంపెనీను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తొలగించాలి. టీడీపీ మంత్రి నుంచి రాజీనామా తీసుకోవాలి. ఈ కేసులో నిజం బయట పెట్టేందుకు మోదీ, అమిత్ షా జోక్యం చేసుకోవాలి...అవసరానికి మించి ఇంధనం ఇందులో నింపారు. విమానంలో పెట్రోల్ క్యాన్స్ పెట్టారు. వీఎస్ఆర్ కంపెనీకి రామ్మోహన్నాయుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో శ్వేత సింగ్ దర్యాప్తును తప్పు దోవ పట్టిస్తున్నారు. బ్లాక్ బాక్స్ సీవీఆర్ పూర్తిగా తగలబడిందని చెప్పడం అబద్ధం. రామ్మోహన్నాయుడు ఈ పదవిలో ఉంటే దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదు. వీఎస్ఆర్ ఓనర్ వీకే సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?వీఎస్ఆర్ కంపెనీ నిర్వహణలో అనేక అవకతవకలు ఉన్నాయి. వీఎస్ఆర్ కంపెనీలో మహిళా పైలెట్లపై వేధింపులు జరిగాయి. అనేక అవకతవకలు జరుగుతున్నా డీజీసీఏ పట్టించుకోలేదు. ప్రమాదాలు, అవకతవకలు జరుగుతున్నా వీఎస్ఆర్ ఆపరేషన్స్ మాత్రం యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిజాలను సమాధి చేసేందుకు బ్లాక్ బాక్స్ తగలబడిందని చెపుతున్నారు. 2016లో రూ.10 కోట్ల కంపెనీ.. 2025కు 500 కోట్లకు చేరింది. కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్‌ను పట్టుకోకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రోహిత్ సింగ్‌కు డీజీసీఏ ఎందుకు మద్దతు ఇస్తుంది’’ అంటూ రోహిత్ పవార్ నిలదీశారు. -
‘అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం’
ముంబై: అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందంటూ ఎన్సీపీ నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. విమానయాన సంస్థ వీఎస్ఆర్ యజమాని రోహిత్ సింగ్‌కు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని.. విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. రామ్మోహన్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.అజిత్ పవార్‌ది ప్రమాదం కాదు.. ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య. రోహిత్‌సింగ్‌ను కాపాడే ప్రకటనలు చేస్తున్నారు. దర్యాప్తు నిష్ప్రక్షపాతంగా జరగాలంటే రామ్మోహన్నాయుడిని తప్పించాల్సిందేనని రోహిత్ పవార్ అన్నారు. ఈ కుట్రలో భారీ ఆర్థిక లావాదేవీల కోణం కూడా దాగి ఉందన్న రోహిత్.. రూ. 35 కోట్ల విలువచేసే విమానానికి రూ.210 కోట్లతో బీమా వెనుక మర్మమేంటి? అంటూ ప్రశ్నించారు.ప్రమాద సమయంలో ఫ్లైట్‌లోని ఇంధనాన్ని అక్రమంగా తరలించారని.. పైలట్‌ను బ్లాక్మెయిల్ చేసి ప్రమాదం చేయించి ఉండొచ్చు అంటూ రోహిత్ పవార్ ఆరోపించారు. విచారణ పూర్తికాకముందే రోహిత్ సింగ్‌ను దేశం విడిచి అమెరికా వెళ్లేందుకు ఎలా అనుమతిచ్చారు?. బ్లాక్ బాక్స్ సేఫ్‌గా ఉన్నా పాడైపోయిందని తప్పుడు ప్రచారం చేశారంటూ రోహిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ పవార్‌కు రోహిత్ పవార్ మేనల్లుగు. గతంలో అజిత్ పవార్‌తో కలిసి పని చేశారు. -
మహారాష్ట్రలో ముస్లిం కోటా రద్దు
ముంబై: మహారాష్ట్రలో విద్య, ఉద్యోగా వకాశాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వే షన్లను బీజేపీ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. 2014లో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్లు వాస్తవానికి ఎప్పుడూ అమలు కాలేదు. రాష్ట్రంలో ముస్లింలకు స్పెషల్ బ్లాక్‌వర్డ్ క్లాస్–ఏ (ఎస్బీసీ–ఏ) కేటగిరీ కింద ముస్లింలకు 5 శాతం రిజర్వేష న్లు కల్పిస్తూ నాటి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. కానీ అది చట్టరూపం దాల్చలేదు. దాంతో ఆ రిజర్వేషన్లకు ఎప్పుడో కాలదోషం పట్టింది. అయినా వాటిని లాంఛనంగా రద్దు చేస్తూ ఫడ్నవీస్ సర్కారు నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేగాక ఎస్బీసీ–ఏ కేటగిరీ కింద రాష్ట్రంలో ముస్లింలకు కుల, నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముస్లిం రిజర్వేషన్ల అమలుపై 2014 నవంబర్లోనే బాంబే హైకోర్టు స్టే విధించింది. అయితే విద్యా సంస్థల్లో వాటిని అమలు చేసేందుకు మాత్రం అనుమతించింది. కానీ ఆ తర్వాత నెల రోజులకే ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసింది. దాంతో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కూడా అటకెక్కాయి. అయినా ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు కూడా ఆ రిజర్వేషన్లు చెల్లవని ప్రకటించింది.భగ్గుమన్న విపక్షాలుముస్లిం రిజర్వేషన్ల రద్దుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఫడ్నవీస్ సర్కారు నిర్ణయం ముస్లింలను ప్రధాన స్రవంతికి దూరం చేస్తుందంటూ కాంగ్రెస్ ఆందోళన వెలిబుచ్చింది. ముస్లింలు అంటే బీజేపీకి ఏ మాత్రం విలువ లేదని ఎన్సీపీ (ఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ విమర్శించాయి. ముస్లిం యువత ఏ రంగంలోనూ ఎదగరాదన్నదే బీజేపీ ఉద్దేశమని మజ్లిస్, ఆరోపించింది. -
ఇండియాకు ఎప్పుడు వస్తానో చెప్పలేను: విజయ్ మాల్యా
ముంబై: భారత్‌కు కచ్చితంగా ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేనని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బాంబే హైకోర్టుకు తెలియజేశారు. స్వదేశానికి రావడా నికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం రద్దు చేసిన తన పాస్‌పోర్టును పునరుద్ధరించుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లు వెల్లడించారు.యునైటెడ్ కింగ్డమ్(యూకే) ను విడిచిపెట్టి వెళ్లిపోకుండా చట్టపరంగా నిషేధించారని, ఇంగ్లండ్, వేల్స్ కోర్టులు ఆదేశాలిచ్చాయని గుర్తుచేశారు. ఈ మేరకు విజయ్ మాల్యా స్టేట్మెంట్ను ఆయన తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ బాంబే హైకోర్టు నివేదించారు. విజయ్ మాల్యా 2016 నుంచి యూకేలోనే ఉంటున్నారు. తనను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి’గా గుర్తిస్తూ ఇచ్చిన ఉత్తర్వును, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ విజయ్ మాల్యా గతంలో బాంబే హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. భారత్‌కు కచ్చితంగా ఎప్పటిలోగా తిరిగి వస్తారో చెప్పాలని విజయ్ మాల్యాను ఆదేశించింది. స్వదేశానికి వచ్చి విచారణను ఎదుర్కొనే ఉద్దేశం ఉందా? లేదా? అని నిలదీసింది. లేకపోతే ఆయన పిటిషన్లను తిరస్కరిస్తామని తేల్చిచెప్పింది. దీనిపై విజయ్ మాల్యా తాజాగా స్పందించారు. స్వదేశానికి ఎప్పుడు వస్తానో చెప్పలేనన్నారు. భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు రుణంగా తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు విజయ్ మాల్యాపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. -
ఒక్కరోజే 75 ఫైల్స్ క్లియర్.. అజిత్ మృతి రోజున ఏం జరిగింది?
ముంబై: మహారాష్ట్రలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖ మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, మైనార్టీ శాఖ అజిత్ పవార్ వద్దే ఉండటం గమనార్హం. దీంతో, ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకేరోజు ఇలా ఫైల్స్ క్లియర్ చేయడంపై అటు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖలో మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ అయ్యాయి. ఈ ఫైళ్లలో మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు, ఆమోదాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అజిత్ పవార్ వద్దే మైనార్టీ శాఖ ఉంది. ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు రెండేళ్ల కాలంలో మైనార్టీ శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఆయన పక్కన పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తాజాగా ఈ పరిణామం రాజకీయంగా, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను అకస్మాత్తుగా క్లియర్ చేయడంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.రాష్ట్ర పరిపాలన అజిత్ పవార్ చుట్టూ ఉన్న బ్రేకింగ్ న్యూస్‌తో బిజీగా ఉన్న రోజున తక్కువ వ్యవధిలో 75 ఫైళ్లను ఎలా ప్రాసెస్ చేసి సంతకం చేశారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. మరోవైపు.. ఈ సమస్య పరిపాలనా చర్యకు కూడా దారితీసింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మహారాష్ట్ర మైనారిటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్‌ను బదిలీ చేశారు. దీంతో, ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా, ఒక ప్రముఖ రాజకీయ ఘటన(అజిత్ పవార్ మృతి) చర్చగా ఉన్న రోజున ఇంత పెద్ద పరిపాలనా కార్యక్రమం జరగడం సహజంగానే సందేహాన్ని రేకెత్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, తుది నిర్ణయాలు ప్రభుత్వ విచారణ ఫలితంపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, తదుపరి చర్యలు కూడా జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ప్రస్తుతం మైనార్టీ శాఖ ఆయన భార్య సునేత్రా పవార్ వద్ద ఉంది. ఆమె ఈ అనుమానాస్పద సర్టిఫికెట్లపై విచారణ ఆదేశించారు.ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.. అయితే, ఈ ప్రమాదంపై ఆది నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ ప్రాణాంతక ప్రమాదానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే.. అజిత్ పవార్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా పేర్కొన్నారు. -
ద్వైపాక్షిక బంధం... గ్లోబల్ స్థాయికి!
ముంబై: భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో నూతన శకానికి తెర లేచింది. అంతర్జాతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వాటిని ‘ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహత్మక భాగస్వామ్యం’గా తీర్చిదిద్దుకోవాలని నిశ్చయించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ జరిగిన చర్చల్లో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. రక్షణ, వర్తకం మొదలుకుని అరుదైన ఖనిజాల దాకా అన్ని రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నేతలు నిర్ణయించారు.ఈ దిశగా రక్షణ, అత్యంత అధునాతన టెక్నాలజీ, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఆరోగ్యం తదితరాలకు సంబంధించి ఇరు దేశాల నడుమ 21 కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచి రక్షణరంగ దిగ్గజం సఫ్రాన్ సంయుక్తంగా భారత్‌లో హమ్మర్ క్షిపణుల తయారీ, భారత, ఇరుదేశాల సైన్యంలో పరస్పరం అధికారుల నియామకం తదితరాలు వీటిలో ఉన్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచి్చన మాక్రాన్‌తో మంగళవారం సాయంత్రం మోదీ ముంబైలో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ లోతుగా చర్చించారు. భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని తీర్మానించారు. అనంతరం మోదీ, మాక్రాన్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కీలక భాగస్వామ్యం: మోదీ ప్రపంచం ప్రస్తుతం అత్యంత అస్థిర దశ గుండా సాగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితుల్లో స్థిరత్వ స్థాపనలో భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యం కీలకపాత్ర పోషించగలదని విశ్వాసం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ నైపుణ్యం, భారత వనరులు ఒక్కతాటిపైకి వస్తే అద్భుతాలు జరుగుతాయన్నారు. ఇరుదేశాలదీ ఎలాంటి హద్దులూ లేని ఆదర్శ భాగస్వామ్యం. ఇరు దేశాల మధ్య మొదటినుంచీ ప్రత్యేక సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి’’అని చెప్పారు.భారత్‌కు అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటని ఆయన గుర్తు చేశారు. ‘‘మాక్రాన్‌తో తాజా భేటీ ద్వారా ఈ బంధాన్ని ఎన్నడూ లేనంతగా ముందుకు తీసుకెళ్లాం. ఇరు దేశాలు పరస్పర విశ్వాసం, ఉమ్మడి విజన్‌తో కలసి సాగనున్నాయి. ఇది కేవలం వ్యూహాత్మక బంధం మాత్రమే కాదు. ప్రపంచ ప్రగతికి బాటలు పరిచే కీలక బంధం’’అని ప్రకటించారు. ఉగ్రవాదం కూడా మాక్రాన్‌తో చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచి్చనట్టు ప్రధాని తెలిపారు. దాన్ని అన్ని రూపాల్లోనూ తుదముట్టించేందుకు ఇరు దేశాలూ కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. సంస్కరణలతోనే సమాధానం ఉక్రెయిన్, పశి్చమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర చోట్ల యుద్ధ మేఘాలు ఇంకా తొలగలేదని మోదీ గుర్తు చేశారు. ‘‘ఈ కల్లోల పరిస్థితుల నుంచి గట్టెక్కించగలిగేది ప్రజాస్వామిక విలువలే అన్నదే భారత్, ఫ్రాన్స్ వైఖరి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలను సమూలంగా సంస్కరించినప్పుడే ఈ అంతర్జాతీయ సవాళ్లకు సజావైన పరిష్కారాలు లభిస్తాయి ఆ ప్రయత్నాలకు భారత్, ఫ్రాన్స్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాయి. ఎందుకంటే రెండు దేశాలూ బహుళ ధ్రువ ప్రపంచాన్నే కోరుతున్నాయి’’అని వివరించారు.యూరోపియన్ యూనియన్‌తో భారత్ ఇటీవలే తన చరిత్రలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని మోదీ గుర్తు చేశారు. అది భారత్, ఫ్రాన్స్ సంబంధాలకు కూడా ఎంతగానో ఊపునిచ్చే పరిణామమేనని ఆయన చెప్పారు. ‘‘ఇరు దేశాల ప్రజలు, కంపెనీలు ఇకపై రెండు పన్నులు కట్టాల్సిన దురవస్థ తప్పింది. పరస్పర వర్తకం, పెట్టుబడులు తదితరాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలకు ఈ ఒప్పందాలు సరికొత్త రోడ్‌మ్యాప్‌గా నిలిచాయి’’అన్నారు. హెలికాప్టర్ నిర్మాణ కేంద్రం ప్రారంభం కర్నాటకలోని వెమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్ల నిర్మాణ కేంద్రాన్ని ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య పరస్పరం నెలకొన్న లోతైన విశ్వాసానికి ఈ ప్లాంట్ ప్రారంభమే తాజా నిదర్శనమని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ‘‘మౌంట్ ఎవరెస్టును మించిన ఎత్తుల్లో ఎగరగల సామర్థ్యమున్న ఏకైక హెలికాప్టర్‌ను ఇరుదేశాలూ కలిసి భారత్‌లో సంయుక్తంగా తయారు చేయనుండటం నిజంగా గర్వకారణం. వాటిని ప్రపంచమంతటికీ ఎగుమతి చేయనున్నాం’’అని ప్రకటించారు. ఈ హెలికాప్టర్ల తయారీ ప్లాంటు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్, భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి: మాక్రాన్ఫ్రాన్స్కు భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి అని మాక్రాన్ పేర్కొన్నారు. రఫేల్యుద్ధ విమానాలు మొదలుకుని జలాంతర్గాముల దాకా రక్షణ రంగంలో ఇరు దేశాల నడుమ పరస్పర సహకారం నానాటికీ పెంపొందుతోందని హర్షం వెలిబుచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో కూడా భారత్, ఫ్రాన్స్ పరస్పరం మరింతగా సహకరించుకుంటాయని ప్రకటించారు. భారత్‌లో తనకు లభించిన అపూర్వ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. మాక్రాన్‌కు భారత్‌లో ఇది నాలుగో అధికారిక పర్యటన.ఇన్నొవేషన్ల సారథి భారత్: మాక్రాన్ ‘‘గ్లోబల్ ఇన్నొవేషన్‌లో భారత్ కేవలం భాగస్వామి కాదు. సిలికాన్ వ్యాలీ మొదలుకుని టెక్నాలజీ, సంస్కృతి దాకా అన్ని రంగాల్లోనూ సారథి స్థానంలో రాణిస్తోంది’’ అంటూ మాక్రాన్ ప్రశంసించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీతో కలిసి ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ను ఆయన ఆవిష్కరించారు. ఇరుదేశాల భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని నేతలు వివరించారు. ఇందులో భాగంగా పరిశ్రమలు, స్టార్టప్‌లు, చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, విద్యార్థులు, రక్షణ రంగంలో పరిశోధనలు, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం, నూతన టెక్నాలజీలు తదితర రంగాల్లో పరిశోధనలకు మరింత ఊపు లభిస్తుందని మోదీ అన్నారు. ఇన్నొవేషన్ ఇయర్లో భాగంగా ఆరోగ్యం, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇండో–ఫ్రెంచ్ ఏఐ సెంటర్లను స్థాపించనున్నారు. ఫ్రాన్స్‌లో భారత్ త్వరలో స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.మెరీన్ డ్రైవ్‌లో మాక్రాన్ జాగింగ్!ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మా క్రాన్ మంగళవారం ఉదయం బాంబేలోని మెరీన్ డ్రైవ్‌లో జాగింగ్ చేశారు. నీలిరంగు టీ షర్టు, నలుపు షార్ట్స్, రన్నింగ్ షూస్ ధరించిన ఆయన జాగింగ్ చేస్తున్న వారితో కలిసి పోటాపోటీగా పరుగు తీశారు. భద్రతా సిబ్బంది మారువేషాల్లో కాస్త వెనకగా ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మాక్రాన్‌ను గుర్తు పట్టిన పలువురు ఆయన్ను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. అవన్నీ వైరల్‌గా మారాయి. మాక్రాన్ విదేశీ పర్యటనల్లో కూడా జాగింగ్ కొనసాగిస్తుంటారు.బాలీవుడ్ తారలతో మాక్రాన్ దంపతుల భేటీఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనలో తారల తళుకులు చోటుచేసుకున్నాయి. పలువురు బాలీవుడ్ తారలతో మాక్రాన్, బ్రిగెటీ దంపతులు మంగళవారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమపరంగా భారత్, ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై వారితో రెండు గంటలకు పైగా చర్చించారు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో జోయా అక్తర్, షబానా అజ్మీ, మనోజ్ బాజ్‌పాయ్, అనిల్ కపూర్, కబీర్ ఖాన్, రిచా ఛద్దా తదితరులు పాల్గొన్నారు. 2008లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రమంటే తనకెంతో ఇష్టమని బ్రిగెటీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
ముంబై మేయర్‌గా రీతూ తావ్డే?
మహాయుతి కూటమి ముంబై మేయర్ అభ్యర్థిపై సందిగ్దత వీడింది. మేయర్ పదవికి బీజేపీకి చెందిన రీతూ తావ్డే అభ్యర్థిగా నామినేషన్ వేసింది. డిప్యూటీ మేయర్ పదవికి శివసేన (శిండే) అభ్యర్థి సంజయ్ శంకర్ గాదీని నిలిపింది. వీరి ఎంపిక దాదాపు లాంఛనమే కానుంది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా, శివసేన శిండే 29 చోట్ల గెలుపొందింది. బృహత్ ముంబయిలో మెుత్తం 227 మున్సిపల్ కార్పోరేషన్ స్థానాలకు ఎన్నికలు జరిగగా మహాయుతీ కూటమి 118 స్థానాల్లో గెలుపొంది స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాగా ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసిన రీతూ తావ్డే 132 వార్డు అభ్యర్థిగా గెలుపొందారు. 2012లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. గత పాతికేళ్లుగా ముంబై పీఠం శివసేన చేతుల్లో ఉంది. ఈ సారి ఆ పార్టీ కేవలం 65 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. బృహత్ ముంబై దేశంలోనే అతిపెద్ద కార్పోరేషన్ దీని గతేడాది బడ్జెట్ రూ.74,450 కోట్లుగా ఉంది.


