పుణే: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డాడంటూ ఆరోపణము భగ్గుమన్నాయి. ఈ కుంభకోణంలో అజిత్ పవార్ కుమారుడి హస్త ఉందన్న ఆరోపణల నేపత్యంలమహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది.1800 క కోట్ల రూపాయల విలువైన భూమిని రూ.300 కోట్లకే విక్రయించారన్న కేసులో ఒక రెవెన్యూ అధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ కమిటీకి అదనపు చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) వికాస్ ఖర్గే సారథ్యం వహించనున్నా రు. కమిటీ తుది నివేదిక ఎనిమిది రోజుల్లోగా వచ్చే అవకాశం ఉంది.
ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) రూ.1,800 కోట్ల ఆస్తి లావాదేవీలో తీవ్రమైన అవకతవకలను వివరిస్తూ మధ్యంతర నివేదికను సమర్పించిన తర్వాత, పార్థ్ పవార్ పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ కుంభకోణంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇది చాలా తీవ్రమైన విషయమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పుణేకు చెందిన తహసీల్దార్ సూర్యకాంత్ యెవా లెను సస్పెండ్ చేశారు. బీజేపీ, అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష మహాయుతి తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
పుణేలోని ముంధ్వారాలో ఉన్న 40 ఎకరాల ప్రభు త్వ భూమిని రూ.300 కోట్ల కు పార్థసారథి భాగ స్వామిగా ఉన్న ఓ ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అమ్మేశారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే రూ. 21 కోట్ల స్టాంప్ డ్యూటీని కేవలం రూ. 500 కు తగ్గించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ డీల్ విలువ రూ. 300 కోట్లు అయినప్పటికీ, పన్నులతో సహా మొత్తం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 21 కోట్లు ఉండాలని అదికారులు తెలిపారు.


