తిరువనంతపురం: కేరళ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోకి సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సాంకేతికత కలిగిన గ్లాసులు ధరించి వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతికత కలిగిన కలిగిన వస్తువులతో ఆలయంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకున్నరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అధికారులు ఐదెంచెల భద్రత కల్పిస్తారు. డ్రోన్, స్మార్ట్ సెన్సార్లు వంటి ఆధునాతన పరికారలతో నిరంతంరం నిఘా నేత్రాలలో ఉంచుతారు. అయితే ఆలయంలోకి మెుబైల్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.
ఈ నేపథ్యంలోనే ఏఐ మెటా సాంకేతికత కలిగిన గ్లాసులను ధరించి వచ్చిన విదేశీ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయ నిబంధనలు తెలియక తాను గ్లాసులు ధరించానని ఆ భక్తుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పి వదిలి వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరస్టైన వ్యక్తి పేరు తిరుపనీన్ అని ప్రస్తుతం ఆయన శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం సింగపూర్‌లో నివాసం ఉంటున్నారని తెలిపారు.


