ఒక్కనైట్ హోటల్ రూ. 11 లక్షలు..? | Delhi Global AI Summit Effect Five-Star Hotel Price Hike | Sakshi
Sakshi News home page

ఒక్కనైట్ హోటల్ రూ. 11 లక్షలు..?

Feb 10 2026 11:38 AM | Updated on Feb 10 2026 11:47 AM

Delhi Global AI Summit Effect Five-Star Hotel Price Hike

ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (AI)కి  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడాబడా కార్పోరేట్ కంపెనీలతో పాటు సాధారణ ప్రజలు సైతం ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే భారత్ ఈనెలలో  దీనికి సంబంధించి ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. దీంతో దీని కున్న క్రేజ్ దృష్యా ఢిల్లీలో హోటళ్ల ధరలు ఆకాశాన్నంటాయి.

సాధారణంగా న్యూఇయర్ సందర్భంగానో లేదా క్రికెట్ మ్యాచులు, సెలబ్రేటీల ఈవెంట్స్ సాధారణంగా ఇటువంటి సందర్భంలోనే హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. అది కూడా వేలల్లో లేదా రూ. లక్ష ఉంటుంది. అయితే ఫిబ్రవరి 16 నుంచి 20 వరకూ ఢిల్లీలోని భరత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారు. ఇందులో పెద్ద ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా? 

ఏఐ సమ్మిట్ దృష్ట్యా ఆ రోజుల్లో ‍అక్కడి ఢిల్లీలోని హోటళ్ల ధరలు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పెరిగిపోయాయి.  ది ఇంపీరియల్ అనే ఫైవ్‌స్టార్ హోటల్‌లో బాత్‌హాబ్‌తో ఉన్న లగ్జరీ సూట్ ధర అక్షరాల రూ. 11.64 లక్షలుగా ఉంది. దీంతో కస్టమర్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. లీలా మహాల్‌లోని మహారాజ సూట్ ధర రూ.7.34 లక్షలు పలికింది. అదేవిధంగా ఒబేరాయిలో రూ.5.84లక్షలు, తాజ్‌ ప్యాలెస్‌లో రూ.4 లక్షలుగా ఉంది. ఈ కామర్స్ వెబ్‌సైట్ మేక్ మైట్రిప్‌లో ధరలు ఈ విధంగా చూపించాయి దీంతో యూజర్స్ ఆ ధరలు చూసి కంగుతిన్నారు.

అయితే ఏఐ సమ్మిట్ దృష్యా  ఆ ప్రాంతంలోని అన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో విపరీతంగా పెరిగాయని ఇక్సిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలోక్ బాజ్‌పేయ్ తెలిపారు.కాగా ఫ్రాన్స్‌లో జరిగిన AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్‌లో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈసమ్మిట్  గ్లోబల్ సౌత్‌లో నిర్వహించబడుతున్న మొట్టమొదటి గ్లోబల్ AI సమ్మిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement