ప్రధాని మోదీతో సీషెల్స్ అధ్యక్షుడి భేటీ | Seychelles President meets with Prime Minister Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో సీషెల్స్ అధ్యక్షుడి భేటీ

Feb 9 2026 12:59 PM | Updated on Feb 9 2026 1:07 PM

Seychelles President meets with Prime Minister Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్ హౌస్ లో సీషెల్స్  అధ్యక్షుడు పాట్రిక్ హెర్మీనితో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడు మోదీతో కలిసి రాజ్ ఘాట్ వద్ద మహత్మాగాంధీకి నివాళులర్పించారు.

అంతకుముందు సీషెల్స్ అధ్యక్షుడితో భేటీ ఎంతో ఆనందంగా ఉందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఎక్స్ లో  పోస్ట్ చేశారు. సముద్ర పొరుగు దేశాలుగా, ఈ ప్రాంతంలో ఆర్థిక శ్రేయస్సు మరియు భద్రత కోసం విజన్ మహాసాగర్ ని విజయవంతం చేయడంతో ఆయన మద్దతు చాలా విలువైనదిగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.

ప్రస్తుతం సీషెల్స్ అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు.  ఇందులో భాగంగా చైన్నై, ముంబైలలో పర్యటించిన వివిధ పలువురు వ్యాపార వేత్తలతో సమావేశమయ్యారు. పరిశ్రమలు, కోస్టల్ మేనెజ్ మెంట్, ఆరోగ్యం తదితర రంగాలలో సహాకారాన్ని బలోపేతం చేయడానికి చర్చలు జరిపారు.

కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలాతో  పాట్రిక్ హెర్మీని భేటీ అయ్యారు.  ఇరు దేశాల మధ్య సముద్ర వాణిజ్యం తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. భారత పర్యటన నిమిత్తం వచ్చిన పాట్రిక్ హెర్మీని ఫిబ్రవరి 10 వరకూ దేశంలో ఉండనున్నారు. ఇటీవల భారత్, సిీషెల్స్ ద్రైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement