శ్రీ శ్యామ్ మందిర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ బాబా శ్యామ్ నిషాన్ రథయాత్ర కన్నుల పండువగా సాగింది. చార్మినార్ లోని మహాదేవ్ మందిర్ నుంచి శ్రీ శ్యామ్ మందిర్, వీరన్నగుట్ట, కాచిగూడ వరకు రథయాత్రను చేపట్టారు. గులాబీ, పసుపు, కాషాయ వర్ణాల జెండాలతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు.


