breaking news
Warangal
-
కారులో వచ్చి 50 కోతులు కొన్న వ్యాపారి.. ఎన్ని లక్షలంటే?
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని కోతులను పట్టుకున్న కాంట్రాక్టర్ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించినట్లు ఆదివారం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఎర్టిగా కారులో ఒకరు 50 కోతులకు ఓ కాంట్రాక్టర్‌కు రూ.2 లక్షల వరకు సొమ్ము చెల్లించి తరలించినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టుకున్న కోతులను ఏటూరునాగారం అడవుల్లోకి తర లించాల్సిన కాంట్రాక్టర్ వ్యాపారికి విక్రయిస్తు న్నారనే సమాచారం మేరకు ఓ జర్నలిస్టు బల్దియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించగా.. కుక్కలను వదిలి భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. కోతుల విక్రయాలకు సంబంధించిన కార్యకలాపాలు బల్దియా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం సీసీ కెమెరాల్లో రికా ర్డు అయినట్లు చర్చ జరుగుతోంది. ఈవిషయ మై సీఎంహెచ్ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. తనకు కూడా సమాచారం అందిందని, సోమ వారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాల యంలోని సీసీ కెమెరాలను పరిశీలించి వివరా లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కోతు లను విక్రయించినట్టు తేలితే సదరు కాంట్రాక్ట ర్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఉర్సు రంగలీల మైదానంలో నరకాసుర వధ
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం సాయంత్రం నరకాసుర వధ కనులపండువగా జరిగింది. కృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని బాణసంచాతో సంహరించిన వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసింది. మైదాన పరిసరాల్లోకి వాహనాలు రాకుండా కిలోమీటర్ల దూరంలోనే నలువైపులా ప్రత్యేక పార్కింగ్ వసతి అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన ఘట్టంగా రథయాత్ర.. ఉర్సు ప్రతాప్‌నగర్ నుంచి ప్రత్యేక రథంపై కృష్ణుడు, సత్యభామ ఉత్సవ మూర్తులతోపాటు యువతులు ధనస్సు చేతబట్టి శ్రీకష్ణుడు, సత్యభామ వేషధారణతో వచ్చారు. కళాకారుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, భజనల నడుమ వారు రంగలీల మైదానానికి చేరుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి, సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల నరకాసుర ప్రతిమను మేయర్ గుండు సుధారాణి స్విచ్ ఆన్‌చేసి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పరికరంతో దహనం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు.. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కృష్ణుడు, సత్యభామ నాటకం, నృత్యాలు, పేరిణ, శివతాండం, కూచిపూడి నృత్యాలు విశేషంగా అలరించాయి. జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. భారీ బందోబస్తు.. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏఎస్పీ శుభంప్రకాశ్ పర్యవేక్షణలో మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత, ఎస్సైలు, 100 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. 58 అడుగుల ప్రతిమను దహనం చేసిన మేయర్ సుధారాణి బాణసంచా మోతతో దద్దరిల్లిన ప్రాంగణం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించాలి.. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే న్యాయం పోరాటం చేయాలి. బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛ హరించడమే. ఏపీ ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – ఆడెపు రవీందర్, అధ్యక్షుడు దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం, వరంగల్వేధింపులు మానుకోవాలి.. నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – గుగులోత్ భీమానాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు సరికాదు తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
విజయానికి చిహ్నమే దీపావళి
చెడుపై మంచి సాధించిన విజయంతో ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. నరకాసుర ప్రతిమను దహనం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించిన రోజున ప్రజలందరు ఇంటింటా దీపాలు వెలిగించారని గుర్తుచేశారు. శ్రీరంగనాఽథుడి సన్నిధిలో రంగలీల మైదానంలో 100 ఏళ్లుగా దసరా ఉత్సవాలు, 20 ఏళ్లుగా నరకాసుర వధ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఉత్సవ కమిటీతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం నగర ప్రజలకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పల్లం పద్మ, పోశాల పద్మ, పలు శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు..
స్టేషన్‌ఘన్‌పూర్: పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి మీడియాలో ఏపీ ప్రభుత్వం పోలీసులతో సోదాలు, దాడులు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికారంగంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న దాడి అనాగరికం. పత్రికా స్వాతంత్య్రం అత్యంత కీలకం. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదు. – మంగు జయప్రకాశ్, టీఎస్ యూటీఎఫ్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు, స్టేషన్‌ఘన్‌పూర్ -
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
న్యూశాయంపేట: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ సత్యశారద జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి జరుపుకుంటామన్నారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖశాంతులతో పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. వికసించిన బ్రహ్మకమలంనర్సంపేట: హిందు సంస్కృతిలో బ్రహ్మకమలం మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. బ్రహ్మకలాలను శివుడికి సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పట్టణంలోని ఎర్ర జగన్మోహన్రెడ్డిఊర్మిళ దంపతుల ఇంట్లో బ్రహ్మ కమలం ఆదివారం రాత్రి వికసించింది. దీంతో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ నర్సంపేట: పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం భక్తి శ్రద్ధల నడుమ పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు దేవేష్మిశ్రా బృందం ఆధ్వర్యంలో కట్కూరి స్వప్నరాంరెడ్డి కుటుంబ సభ్యులు పడిపూజలో పాల్గొని పూజలు చేశారు. అయ్యప్పస్వామిని గురుస్వాములతో అలంకరణ చేసి పసుపు, కుంకుమ, పుష్పాలు, పాలకాయ సమర్పించారు. పంచలోహ విగ్రహాన్ని శిరస్సుపై ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పాలు, పెరుగు, తేనె, పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో శింగిరికొండ మాధవశంకర్, సైఫా సురేష్, దొడ్డ రవీందర్, బండారుపల్లి చెంచారావు, ఇరుకుళ్ల వీరలింగం, పాలకుర్తి శ్రీనివాస్, అనంతుల రాంనారాయణ, మల్యాల రాజు, దొడ్డ వేణు, తదితరులు పాల్గొన్నారు. పాకాలలో పర్యాటకుల సందడిఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు. పాకాల అందాలను వీక్షించి లీకేజీ నీటిలో, పార్కులో సరదాగా గడిపారు. బోటింగ్ చేస్తూ సందడి చేశారు. కష్టపడిన వారికే పదవులు నర్సంపేట: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తకే పదవులు లభిస్తాయని ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోత్ పట్నాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని సిటిజన్ క్లబ్లో ఆదివారం డీసీసీ ఎన్నిక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వారు డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తుంటారన్నారు. జిల్లా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేది డీసీసీలేనన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకుంటే అధిష్టానం పరిశీలిస్తుందన్నారు. ప్రతీఒక్కరూ సమన్వయంతో పని చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ముందుగా నర్సంపేట క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు, ఎమ్మెల్యే మాధవరెడ్డి సమావేశమయ్యారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ పరిశీలకులు రేణుక, ఆదర్శ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం. – ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి -
అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథఽనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికై నా సాక్షిపై అక్రమంగా పెట్టిన కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి. –గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి -
కిక్కు రాలే..!
సాక్షి ప్రతినిధి,వరంగల్/కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తులు, ఆదాయం రెండింతలు వస్తుందనుకున్న ప్రభుత్వ లక్ష్యం ఈసారి నెరవేరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్‌కు 2023–25 టెండర్లలో 16,039 దరఖాస్తులతో 318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–27కు శనివారం చివరి తేదీగా మొదట ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు 9,754 దరఖాస్తులతో 292.4 కోట్ల ఆదాయం లభించింది. కాగా, గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు, 28.16 కోట్ల ఆదాయం తగ్గింది. కాజీపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ వైన్స్‌కు అత్యధికంగా 114 దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మూడు వైన్స్‌లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. చివరి రోజు వరంగల్ అర్బన్‌లో 1,577, వరంగల్ రూరల్‌లో 910, జనగామలో 950, మహబూబాబాద్‌లో 735, భూపాలపల్లిలో 1,036 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు పెంపుదలే కారణం.. వైన్స్ దరఖాస్తులకు నాన్ రీఫండబుల్‌గా గత టెండర్లలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులు చేసేందుకు మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ముందుకురాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు.రూ.3 లక్షల నాన్ రీఫండ్ ఫీజుతో దరఖాస్తు చేసే బదులు రెండున్నర తులాల బంగారం కొనుగోళ్లకు మధ్య తరగతి కుటుంబాల వారు ఆసక్తి కనబరిచారు. రూ.320.7 కోట్ల టార్గెట్.. 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న టెండర్ల ప్రక్రియ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల చివరి తేదీ తొలుత నిర్ణయించారు. కాగా, అక్టోబర్ 18 చివరి రోజు వరకు కేవలం 9,754 దరఖాస్తులు, రూ.292.2 కోట్ల ఆదాయం వచ్చింది. గత టెండర్ల రూ. 320.7 కోట్ల ఆదాయ టార్గెట్‌ను దాటేందుకు ఈనెల 23 చివరి తేదీగా మరోఐదు రోజుల అవకాశం కల్పించింది. ఈనెల 27వ తేదీన లక్కీడ్రా తీయనున్నారు. కాగా, రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో దరఖాస్తుతో పాటు ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఖజానాకు ఆదాయం కిక్కు పొందేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఉమ్మడి జిల్లాలో తగ్గిన వైన్స్ దరఖాస్తుల ఆదాయం 294 షాపులకు 9,754 అర్జీలు, రూ.292 కోట్ల రెవెన్యూ టెండర్ల గడువు 23 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వందరఖాస్తుల స్వీకరణ మూడు రోజులే.. వైన్స్ టెండర్ల గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఐదు రోజులు పొడిగించినా ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు ఉన్నాయి. కాగా, మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉంది. -
గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాయపర్తి: గ్రామాల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్డీఓ రాంరెడ్డి తెలిపారు. మండలంలోని మైలారం, జగన్నాథపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన స్థలాన్ని ఏడీఆర్డీఓ రేణుకాదేవితో కలిసి శనివారం పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల కోసం స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, మండల అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో డీపీఎం దాసు, ఏపీఎం రవీందర్, సీసీలు స్వామి, సుధాకర్, ఎంఎస్ అధ్యక్షురాలు నీరజ, వీఓఏ నాగమణి, చందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ నల్లబెల్లి: హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ తెలిపారు. పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై గోవర్ధన్‌తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 15న రాత్రి కొండాపూర్ గ్రామానికి చెందిన మేరుగుర్తి రమేశ్ ఇంటి జాగ పంచి ఇవ్వాలని తల్లి సమ్మక్కతో వాదనకు దిగాడు. అదే సమయంలో తమ్ముడు సురేశ్ అప్పుగా ఇచ్చిన రూ.10 వేలు అన్న ఇవ్వడం లేదు. పైగా అమ్మతో గొడవెందుకు పడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అన్నదమ్ముల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన సురేశ్ కత్తితో రమేశ్‌పై దాడి చేస్తుండగా.. రమేశ్ భార్య స్వరూప అడ్డుకుంది. దీంతో ఆమైపె కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. గాయపడిన రమేశ్, స్వరూపను స్థానికులు 108 వాహనంలో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప అదే రోజు రాత్రి మృతి చెందగా రమేశ్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. చేసిన నేరాన్ని అంగీకరించడంతో శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. పందెం కోళ్ల అపహరణ ఖానాపురం: మండలంలోని పెద్దమ్మగడ్డలో పందెం కోళ్లను అపహరించుకెళ్లిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచం వెంకన్న ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆగంతకులు బయట తలుపులు బిగించారు. ఇంటి ఆవరణలో ఉన్న రూ.20 వేల విలువ చేసే 6 పందెం కోళ్లను దొంగిలించారు. తెల్లవారిన తర్వాత వెంకన్న ఇంటి తలుపులు తీయగా రాలేదు. చుట్టుపక్కల వారి సహకారంతో బయటకు వచ్చి చూడగా కోళ్లు దొంగతనం చేసినట్లు గుర్తించాడు. ఇటీవల వల్లెపు ఎల్లయ్య ఇంట్లోనూ పందెం కోళ్లను చోరీ చేశారు. దొంగతనంపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వెంకన్న తెలిపాడు. -
పశువులకు టీకాలు వేయించాలి
దుగ్గొండి: పాడిరైతులు, పశుపోషకులు, జీవాలకాపరులు తప్పనిసరిగా పశువులు, జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి బాలకృష్ణ సూచించారు. మండలంలోని నాచినపల్లి, శివాజీనగర్, స్వామిరావుపల్లి గ్రామాల్లో పశువుల టీకాల శిబిరాన్ని శనివారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు గ్రామాల్లో నవంబర్ 15 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. టీకా వేసిన ప్రతి పశువుకు ట్యాగ్ వేయాలని, రెండు నెలలకు మొదటి టీకా, నెల తర్వాత బూస్టర్ డోస్, తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి తప్పనిసరిగా టీకా వేయించాలని కోరారు. పశువైద్యాధికారులు సోమశేఖర్, శారద, బాలాజీ, గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధరప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్వర్క్కక్షసాధింపు చర్యలు మానుకోవాలి నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. – ఎం.వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు కేసుల నమోదు సరికాదు ములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – పోలురాజు, టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు దాడులు ఖండిస్తున్నాం.. జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కారు తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. –పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్, రాష్ట్ర నాయకుడు, జనగామ ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిదికాదు సాక్షి దినపత్రిక, ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ -
నేడు నరకాసుర వధ
సాక్షి, వరంగల్ /ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం నరకాసుర వధ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలతో డీసీపీలు, ఏసీపీ శుభం ప్రకాశ్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నా యి. ప్రత్యేకంగా వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పా టు చేశారు. అధికారుల సహకారంతో చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ శుభం ప్రకాశ్, ఉత్సవకమిటీ అధ్యక్షుడు మరుపల్లి రవి, ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఏఈ సుకృత, తహసీల్దార్ ఇక్బాల్, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పరిశీలించారు. 23 ఏళ్లుగా.. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో గత 23 ఏళ్లుగా నరకాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం కరీమాబాద్ ఉర్సు ప్రతాప్‌నగర్ నుంచి శ్రీకృష్ణ సత్యభామ ఉత్సవ మూర్తులు, పిల్లల వేషధారణతో భారీ ఊరేగింపుతో రంగలీల మైదానానికి చేరుకుంటారు. అక్కడే శ్రీకృష్ణ, సత్యభామ డిజిటల్ బొమ్మలను ఏర్పాటు చేయగా.. బాణసంచాతో కాల్చే పక్రియను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఈఏడాది 58 అడుగుల నరకాసుర ప్రతిమను సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6గంటలకు వేదికపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రాత్రి 8గంటలకు నరకాసుర ప్రతిమను మంత్రి కొండా సురేఖ స్విచ్ ఆన్‌చేయగానే శక్తివంతమైన బాణసంచాతో దహనమవుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు.. నరకాసుర ప్రతిమ దహనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాలప్రకారం వేదిక, బారీకేడ్లు నాలుగు వైపులా పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపడుతున్నాం. – శుభం ప్రకాశ్ ఏఎస్పీ, వరంగల్ వరంగల్ రంగలీల మైదానంలో 58 అడుగుల ప్రతిమ ఏర్పాటు సాయంత్రం 6 గంటల నుంచి వేదికపై సాంస్కృతిక కార్యక్ర మాలు మంత్రి సురేఖ చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి దహనం -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో వైద్య, ఆరోగ్యశాఖ, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల లభ్యత, వైద్యుల హజరు, పరీక్ష పరికరాల వినియోగం, మాతాశిశు సంరక్షణ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ సర్వే నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సిజేరియన్లు కాకుండా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. ప్రైవేట్ డాక్టర్లు విధిగా సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలన్నారు. సీజనల్ వ్యాధులు మలేరియా, పైలేరియా డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధులను చికిత్స అందించాలని కోరారు. వ్యాధి గ్రస్తుల సమీపంలో ఉన్న వారిని స్క్రీనింగ్ చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి. సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగాం అధికారులు రవీందర్, ఆచార్య, విజయ్‌కుమార్, మోహన్‌సింగ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ జేఏసీ బంద్ సక్సెస్
వరంగల్ చౌరస్తా: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చి పిలుపుమేరకు శనివారం జిల్లాలో బంద్ విజయవంతమైంది. వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో బీసీ, ప్రజాసంఘాలు, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ర్యాలీలు, నినాదాలతో హోరెత్తించారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్, రహదారులు, కూడళ్లు బోసిపోయి కనిపించాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా : బీజేపీ బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ స్పష్టం చేశారు. వరంగలో జరిగిన బంద్‌లో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బీసీలపై రేవంత్‌రెడ్డి సర్కారుది కపట ప్రేమ అని విమర్శించారు. నాడు జయలలిత తమిళనాడులో 9వ షెడ్యూల్ ప్రకారం 58% శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. బంద్‌కు బీజేపీ మద్దతు సిగ్గుచేటు : వామపక్షాలు బీసీ జేఏసీ బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని వామపక్షాల నాయకులు విమర్శించారు. వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పార్టీలు ద్వంద్వ విధానాలను విడనాడాలని ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి, రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు. తెగించి పోరాడుదాం.. బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి పోరాడుదామని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా వరంగల్ శివనగర్‌లోని తమ్మెర భవన్ నుంచి సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరి అండర్ బ్రిడ్జి రోడ్డు, స్టేషన్ రోడ్డు, పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి నాయకులు మేకల రవి, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, గన్నారపు రమేశ్, నేతలు పాల్గొన్నారు. సీపీఎం నాయకుల ప్రదర్శన.. సీపీఎం నాయకులు వరంగల్ పోస్టాఫీస్ సెంటర్ నుంచి వరంగల్ చౌరస్తా, బట్టలబజార్, బీట్ బజారులో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అరూరి రమేశ్, జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకమాడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల ర్యాలీ.. వరంగల్ ఎంజీఎం, పోచమ్మమైదాన్, మండిబజారు, ఆర్ఎన్టీ రోడ్డు, వరంగల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు రాజనాల శ్రీహరి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణా వ్యవస్థ స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల మూసివేత కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకుల ర్యాలీలు, రాస్తారోకోలునర్సంపేట : పట్టణంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్ష, టీజేఎస్, పలు కుల సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. చెన్నారావుపేట : బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. దుగ్గొండి : గిర్నిబావిలోని నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నల్లబెల్లి : తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. మండల కేంద్రంలో కాంగ్రెస్, బీసీ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఖానాపురం : బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయాన్ని మూసివేశారు. కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. నెక్కొండ : రాజకీయ, కుల, యువజన సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు వేర్వేరుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. రాయపర్తి : మండల కేంద్రంలోని దుకాణాలను రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు మూసివేయించారు. వర్ధన్నపేట : పట్టణంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. పర్వతగిరి : కిరాణాషాపులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేశారు. సంగెం : మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. గీసుకొండ : స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పలు పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహించారు. -
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినులు
నల్లబెల్లి: రాష్ట్రస్థాయి అండర్–19 రెజ్లింగ్ పోటీలకు నల్లబెల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థినులు ఎంపికై నట్లు ఎస్ఓ సునీత తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను పీఈటీ సుజాత, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థినులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 17న హన్మకొండ జేఎన్ఎస్లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అజ్మీరా మానస, పెంట అర్చన ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరు ఈ నెల 21 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో జరుగనున్న పోటీల్లో పాల్గొంటారు. వాలీబాల్ పోటీల్లో సిల్వర్ మెడల్ రాయపర్తి: రాష్ట్రస్థాయి అండర్–17 వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ద్వితీయస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు కోచ్ పుట్ట సమ్మయ్య తెలిపారు. పటాన్చెరులో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ క్రీడల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఫైనల్లో ఖమ్మం జట్టుతో పోరాడి ద్వితీయస్థానంలో నిలిచినట్లు చెప్పారు. -
రైతుల కష్టం.. వ్యాపారులకు లాభం
● అధిక వర్షాలకు దెబ్బతిన్న బంతిపూల తోటలు ● కిలోకు రూ.50 మాత్రమే చెల్లించడంతో నష్టాలు గీసుకొండ: జిల్లాలో బంతిపూల తోటలు సాగు చేసిన రైతుల కష్టం వ్యాపారులకు లాభదాయకంగా మారింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 20 ఎకరాల్లో బంతి తోటలు వేశారు. అధిక వర్షాలకు తోటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలు తోటల్లో పూలు వర్షాలకు కుళ్లిపోయాయని రైతులు చెబుతున్నారు. అలాగే, బంతి పూలను తెంపడానికి కూలీలు సరిగా రావడం లేదు. చాలా మంది పత్తి ఏరడానికి వెళ్తుండటంతో చేతికొచ్చిన పూలను మార్కెట్లో అమ్మడానికి తీసుకుని వెళ్లడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. ఈ ఏడాది గణపతి, దుర్గామాత నవరాత్రులు, దసరా ఉత్సవాలకు బంతిపూలకు బాగానే గిరాకీ ఉంది. వరంగల్ నగరంలోని వ్యాపారులు కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు కొనుగోలు చేసి పండుగ సమయాల్లో కిలోకు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈసారి దీపావళి నోముల సందర్భంగా బంతి పూల అవసరం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో రైతుల నుంచి వ్యాపారులు కిలో బంతి పూలను రూ.40 నుంచి రూ.50 లోపు కొనుగోలు చేసి రూ.100 నుంచి 120కి పైగా అమ్మడానికి సిద్ధమవుతున్నారు. కిలోకు రూ.80 చెల్లిస్తేనే గిట్టుబాటు తన ఎకరం చేనులో బంతిపూల పంట సాగు చేస్తే వర్షాలతో దెబ్బతింది. పెట్టిన పెట్టుబడి మినహా లాభం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మార్కెట్లో కిలో పూలకు రూ.80 వరకు వ్యాపారులు చెల్లిస్తే తమకు కొంత గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. దీపావళి పండుగ ముగిసిన వెంటనే పంటను తొలగించి వేరే పంట సాగుచేస్తా . – ఎరుకల ప్రవీణ్, గంగదేవిపల్లి రైతు -
బీసీ బంద్ సక్సెస్
వాటా కోసం పిడికిలెత్తిన సకల జనులుప్రజలు రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తే పాలకవర్గాలకు ప్రమాదకరం ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తే అది పాలకవర్గాలకు ప్రమాదకరం. కాంగ్రెస్ ద్రోహం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పించాయి. మేమెంతో మాకంత వాటా కల్పించాల్సిందే. –మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించం బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేదిలేదు. బీసీలకు రిజర్వేషన్ల కల్పించాలనే ఆలోచన సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్యానికి అద్దంపట్టే నిర్ణయం. – ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిబీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లకు మద్దతు పలుకుతున్న పార్టీలు పార్టీ పదవుల్లో 50 శాతం పదవులు ఇవ్వాలి. అప్పుడే పార్టీల నిజాయితీ, చిత్తశుద్దిని నమ్ముతాం. – ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్హన్మకొండ: హనుమకొండ జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది. శనివారం జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీలు రోడ్డెక్కారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ర్యాలీలు తీయడంతో పోరు హోరెత్తింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు వేకువజామునే ఆర్టీసీ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వరంగల్–1 డిపో గేట్లో బైఠాయించి బస్సులు అడ్డుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో బంద్ ప్రశాంతంగా సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేశాయి. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు వరంగల్ మహానగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ కూడలి నుంచి ములుగు క్రాస్ రోడ్డులోని జ్యోతిబా పూలే విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహంనుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, దొడ్డిపల్లి రఘుపతి, బొనగాని యాదగిరిగౌడ్, తమ్మెల శోభారాణి, మూగల కుమార్ యాదవ్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు చింతం సదానందం, శోధన్, పులి రజనీకాంత్, పోలెపల్లి రామ్మూర్తి, ముత్తిక రాజు, శ్రీధర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, నాయకులు తోట వెంకటేశ్వర్లు, రవీందర్, పోతుల శ్రీమాన్, విజయశ్రీ, పల్లకొండ సతీశ్, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలాల్లో ఇలా.. ఎల్కతుర్తి: ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో శనివారం బంద్ సంపూర్ణంగా కొనసాగింది. ఎల్కతుర్తి వామపక్ష పార్టీల నాయకులు బస్టాండ్ నుంచి సమీప కూడలి ప్రాంతం వరకు బైక్ ర్యాలీలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, చిరువ్యారులు, పలు షాపుల యజమానులు తమ తమ షాపులు మూసివేసి బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఐనవోలు: మండలంలోని పున్నేలు క్రాస్ వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ తక్కళ్లపెల్లి చందర్రావు, నాయకులు ఉస్మాన్ అలీ, పల్లకొండ సురేష్, మిద్దెపాక రవీందర్, దుప్పెల్లి కొంరయ్య, దేవదాసు, రామారావు, రాజు, సుదర్శన్, ప్రభాకర్, రాములు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకులు. మండల కేంద్రంలోని పలు దుకాణాలతో పాటు బీఓబీ బ్యాంకును మూసి వేయించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో కాడబోయిన లింగయ్య, మడిగె నాగరాజు మహేందర్, నారాయణరెడ్డి, ఉప్పలయ్య, యాకూబ్, నాగరాజు, రాంకుమార్, రాజేశ్వర్‌రావు, చిన్న రాజు, రాజు, నర్సయ్య, గోపాల్, యాకయ్య, రాజిరెడ్డి పాల్గొన్నారు. దామెర/వేలేరు/ఆత్మకూరు: దామెర, వేలేరు, ఆత్మకూరు మండలకేంద్రాలతో పాటు పలుగ్రామాల్లో బీసీ బంద్ విజయవంతమైంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించడంతో బంద్ శాంతియుత వాతావరణంలో కొనసాగింది. కమలాపూర్ : కమలాపూర్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక బస్టాండ్ కూడలి వద్ద హుజూరాబాద్–పరకాల ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇన్స్పెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఈ బంద్‌లో బీసీ సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పరకాల: పరకాలలో విద్యాసంస్థలకు యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. దుకాణాల మూసివేతతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, కాంగ్రెస్ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు బండి సారంగపాణి పాల్గొన్నారు. నడికూడ : మండలంలోని పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బీసీ బంద్ ఫొటోలు మరిన్ని : 9లో గ్రేటర్లో వ్యాపార, వాణిజ్య సంస్థల మూసివేత డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు బీసీ సంఘాలు, వివిధ పార్టీల ర్యాలీలు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ కేంద్రం మెడలు వంచైనా.. బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి శనివారం చేపట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. సకలజనుల సమ్మె తరహాలో బీసీ సమాజమంతా రోడ్లపైకి వచ్చి బంద్ సక్సెస్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధం అవుతాయి. తెలంగాణలోని బీజేపీ నాయకత్వం ప్రధాని ఒప్పించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలాకృషి చేయాలి. సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి తాడోపేడో తేల్చుకోవాలన్నారు. కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తాం. బంద్‌కు సహకరించిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు. – బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ -
మానసిక దివ్యాంగులకు సత్వర న్యాయసేవలు
హనుమకొండ జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు హన్మకొండ అర్బన్: మానసిక దివ్యాంగులకు సత్వర నాయసహాయం అందించేందుకు మనో న్యాయ్ లీగల్ క్లినిక్‌లు ఎంతో ఉపయోగ పడతాయని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే అధ్యక్షత మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మనోన్యాయ్ లీగల్ సర్వీస్ క్లినిక్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మానసిక వికలాంగులకు న్యాయసేవలు ముఖ్యంగా సైకియాట్రి సేవలు, ఆధార్, సోషల్ ఎంటైటిల్ సదుపాయాలు అందించేందుకు తగిన చర్యలు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చేపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, అనితా రెడ్డి, డాక్టర్ ఎస్. స్సాగ్నిక్ ముఖర్జీ, డాక్టర్ కె. ప్రహసిత్, సీడబ్ల్యూసీ సభ్యుడు సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జ్ ఎస్.ప్రవీణ్ కుమార్, మల్లికాంబ నిర్వాహకురాలు బండ రామలీల, పద్మ, శ్రీకాంత్. సీనియర్ న్యాయవాది గోపు వనజ పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులో.. విద్యారణ్యపురి: కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులోని శంకర్‌నగర్‌లో వారిధి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌ను హనుమకొండ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణదేవి శనివారం ప్రారంభించారు. హనుమకొండ జిల్లా న్యాయసేవాధికారి సంస్థ సెక్రటరీ క్షమాదేశ్‌పాండె, కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు. -
‘ఐనవోలు’ పునరుద్ధరణ పనుల పరిశీలన
మల్లన్నను దర్శించుకున్న రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు కె.అర్జున్‌రావు, డిప్యూటీ డైరెక్టర్లు నర్సింగరావు, నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ డి.బుజ్జి సందర్శించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు వారిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈసందర్భంగా ఆలయం నుంచి గతంలో ప్రతిపాదించిన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. తూర్పు, దక్షిణ ఆర్చ్గేట్ల మరమ్మతు, బాదామి చాళుక్యుల కాలంనాటి శిఽథిలమైన నిర్మాణ పునరుద్ధరణ, నాట్య మండపం, ఆలయంలో నీరు కురవడం, డ్రెయినేజీ ఏర్పాటు తదితర పనుల ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయించి పురాతన ఆలయానికి రూ.2కోట్ల వరకు పనులు చేయిస్తామని పురావస్తు శాఖ అధికారులు తెలిపారని ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, నందనం మధు శర్మ, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా పోటీలతో స్నేహపూర్వక సంబంధాలు
వరంగల్ స్పోర్ట్స్: క్రీడా పోటీలతో వ్యక్తుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడుతాయని హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్‌కుమార్ అన్నారు. హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలోని టెన్నిస్ గ్రౌండ్లో శనివారం లాన్‌టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో అశోక్‌కుమార్ మాట్లాడారు. అనంతరం విజేతలుగా నాగయ్య(ఏసీపీ), శ్రీధర్(ఆర్ఐ) జట్టు నిలవగా, రన్నరప్‌గా నిలిచిన రడం శ్రీనివాస్, తిప్పాని సాత్విక్‌ల జట్టుకు అఽతిథులు ట్రోపీలు అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ నర్సింహరావు, టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నల్ల సురేంద్‌రెడ్డి, ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి, సంఘం ప్యాట్రన్ రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు. వరంగల్: పంజాబ్ రాష్ట్రంలోని తల్వండిలోని గురు కాశి విశ్వవిద్యాలయంలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ చాంపియన్‌షిప్–2025 పోటీలకు దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్సైన్న్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి మహమ్మద్ తన్వీర్ కౌసర్ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఈ పోటీలు అక్టోబర్ 24–31వరకు జరుగుతాయని పేర్కొన్నారు. కేయూ క్యాంపస్: తెలంగాణ బంద్ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన వివిధ పరీక్షల నిర్వహణ తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ పరీక్షల విభాగం అధికారులు శనివారం ప్రకటించారు. దూరవిద్య సీఎల్ఐఎస్సీ పరీక్షలను ఈనెల 24న, మూడేళ్ల లాకోర్సు మొదటి, ఐదవ సెమిస్టర్ పరీక్షలు, ఐదేళ్ల లాకోర్సు ఐదవ, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 21న నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం తెలిపారు. ఐదేళ్ల ఎమ్మెస్సీ బఝెటెక్నాలజీ, కెమిస్ట్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25న, ఎంటెక్ రెండవ సెమిస్టర్ పరీక్షను ఈనెల 31న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. హన్మకొండ: బీసీ బంద్‌తో ఆర్టీసీకి నష్టం జరిగింది. బస్సులన్నీ మధ్యాహ్నం వరకు డిపోలోనే ఉండిపోవడంతో ఒక్క రోజులో రూ.1.50 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 950 బస్సులు ప్రతీరోజు 4 లక్షల కిలో మీటర్లు తిరిగి సగటున రూ.2.30 కోట్ల ఆదాయం వస్తుంది. మధ్యాహ్నం తర్వాత బస్సులు తిరిగినా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీపావళి పండుగ సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లాలని బస్ స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. అధిక చార్జీలు చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. హన్మకొండ అర్బన్: జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షుడు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు శనివారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలిపిన వారిలో యూనియన్ బాధ్యులు పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేష్, శ్యామ్ సుందర్, లక్ష్మీప్రసాద్, రాజేష్ ఖన్నా, కలకోట్ల భారత్, ప్రణయ్, పృథ్వి,సుధాకర్, నాగరాణి, గ్రేస్ ఉన్నారు. -
అసైన్డ్ ల్యాండ్ స్వాఽధీనం
దామెరలో 17.09, ముస్త్యాలపల్లిలో 4.06 ఎకరాలు దామెర: భూమిలేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేందుకు అసైన్డ్ చట్టం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం భూమిని కేటాయించారు. కాగా, అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ సదరు రైతులు ఇతరులకు అమ్మారు. దీంతో అధికారులు తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దామెర మండలకేంద్రంలోని సర్వేనంబర్ 362లోని 17. 09 ఎకరాలు, ముస్త్యాలపల్లిలోని సర్వేనంబర్ 224, 255లోని 4.06 ఎకరాలు మొత్తం 21.15 ఎకరాల అసైన్డ్ భూమిని కొంతమంది పట్టాలు చేయించుకున్నారు. ఈ వ్యవహారం ఇటీవల వెలుగులోకి రావడంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసి పట్టాలు చేయించుకున్నట్లు రుజువు కావడంతో ఆ పట్టాలు రద్దుచేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా ఉత్తర్వులను అధికారులు దామెర, ముస్త్యాలపల్లి జీపీల్లో శనివారం ప్రదర్శించారు. ఈ విషయమై తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవిని వివరణ కోరగా అసైన్డ్ చట్టాన్ని అతిక్రమించి పట్టాలు చేయించుకున్న వారి పట్టాలు రద్దుచేసినట్లు తెలిపారు. కాగా, కోట్ల రూపాయలు విలువచేసే భూమిని రక్షించిన రెవెన్యూ అధికారులను పలువురు అభినందిస్తున్నారు. -
నేడు నరకాసుర వధ
● ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ, ఏఎస్పీ సాక్షి, వరంగల్ /ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం నరకాసుర వధ ఉత్సవం జరగనుంది. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలతో డీసీపీలు, ఏసీపీ శుభం ప్రకాశ్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6గంటలనుంచి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 56 అడుగుల నరకాసుర ప్రతిమను మంత్రి కొండా సురేఖ స్విచ్ ఆన్ చేసి బాణసంచాతో దహనం చేయనున్నారు. పలు ప్రభుత్వ శాఖల సహకారంతో చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ శుభ ప్రకాశ్, ఉత్సవకమిటీ అధ్యక్షుడు మరుపల్లి రవి, ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఏఈ సుకృత, తహసీల్దార్ ఇక్బాల్, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పరిశీలించారు. -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్వర్క్కేసుల నమోదు సరికాదు ములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – పోలు రాజు, టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు కక్షసాధింపు చర్యలు మానుకోవాలి నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం వల్ల సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. – ఎం.వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు దాడులను ఖండిస్తున్నాం.. జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కార్ తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శకంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. –పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్ రాష్ట్ర నాయకుడు, జనగామ ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు సాక్షి దినపత్రిక, ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ -
రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి కృషి
● రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జునరావు ఆత్మకూరు: రాష్ట్ర రక్షిత కట్టడమైన రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జునరావు కుతాడి అన్నారు. మండలంలోని కటాక్షపూర్‌లోని ఆలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పురావస్తు శాఖ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా అర్జున్‌రావు మాట్లాడుతూ భక్తులు, పర్యాటకులకు ఆలయాల చరిత్ర తెలిసేలా సూచిక బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ గోడలపై ఉన్న వైట్‌వాష్‌ను రసాయన శుద్ధిచేసి శిల్పసంపదను భక్తులు స్పష్టంగా చూసేలా చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి కావాల్సిన అంచనాలను తయారుచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఉపసంచాలకులు డాక్టర్ నాగరాజు, నర్సింగ్‌నాయక్, సాయి కిరణ్, గందె సంపత్, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, రాజన్న, కమిటీ అధ్యక్షుడు నిమ్మల నాగరాజు, వెంకటేశ్, రాజేందర్, సతీశ్, చిన్ని రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. శాయంపేట: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన మరొకరిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పరకాల ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. శా యంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారుల ఫిర్యాదు మేరకు శాయంపేట ఐకేపీ సెంటర్ ఇన్చార్జ్ బలభద్ర హైమావతిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ఎంట్రీలు చేయడానికి ఆమె ఉపయోగించిన ట్యాబ్, ధాన్యం టోకెన్ బుక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. ఆయన వెంట శాయంపేట సీఐ రంజిత్ రావు, ఎస్సై పరమేశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
ప్రజల గొంతుకపై ఆంక్షలు సరికాదు
వరంగల్/న్యూశాయంపేట: ప్రభుత్వాలు, ప్రజలకు వారధిగా ఉన్న పత్రికలపై ఆంక్షలు విధించడం సరికాదని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై అనుసరిస్తున్న వైఖరి, ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన విషయాలపై కథనాలు రాసినా, ప్రచురించినా ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే వివరణ కోరాలే తప్ప కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు. వరంగల్ ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం హరిస్తోందని, ‘సాక్షి’ చీఫ్ ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘సాక్షి’ మీడియాపై అనుసరిస్తున్న దమననీతికి వ్యతిరేకంగా ప్రజా, ఉద్యోగ సంఘాలతో ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ వాంకే శ్రీనివాస్, జర్నలిస్టు సంఘాల నా యకులు నల్లాల బుచ్చిరెడ్డి, పొడిశెట్టి విష్ణువర్ధన్, కంకణాల సంతోశ్, సాయిరాం, బోల్ల అ మర్, అలువాల సదాశివుడు, కొల్ల కృష్ణకుమార్, అహ్మద్, రాధాకృష్ణ, డి.రమేశ్, జి.రమేశ్, ఎ.నరేందర్, వెంకట్, జాఫర్, నరేశ్, సునేందర్, రవి, అనిల్, సబ్ ఎడిటర్లు ఓంకార్, ఉమామహేశ్, బోనాల రమేశ్, బండి రాజు, రాంచందర్, డి.రాజు, అశోక్, మహ్మద్ సాజీత్, దాసరి బాబు, సంపెట శ్రవణ్, శివ, సంపెట వెంకటేశ్వర్లు, వీకే రమేశ్ పాల్గొన్నారు.సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంటాయి. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను బయటపెడుతుంటాయి. ఇది సహించలేని ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం, కాలరాయడం తీవ్రంగా ఖండిస్తున్నా. సాక్షి మీడియాపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. సాక్షి పత్రిక, ఎడిటర్, సిబ్బందిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నా. – తాటిపాముల వెంకట్రాములు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు● ‘సాక్షి’ మీడియా, ఎడిటర్‌పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
విధుల్లో నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్
వేలేరు: వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని కలెక్టర్ స్నేహ శబరీష్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీచర గ్రామంలోని పల్లె దవాఖాన, గొల్లకిష్టంపల్లిలోని కేజీబీవీని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. మొదట పీహెచ్సీలో ఫార్మసీ, రికార్డులు పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీ పరిధిలో ఎన్ని సబ్‌సెంటర్లు ఉన్నాయని ఆరా తీశారు. హెల్త్ సబ్‌సెంటర్ గురించి ఆరోగ్య విస్తరణ అధికారిని అడుగగా ఆయన పీచరలోని పల్లె దవాఖానకు తీసుకెళ్లాడు. పల్లె దవాఖానకు ఎందుకు తీసుకువచ్చారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె దవాఖానలో డ్యూటీ డాక్టర్ ఎవరి అనుమతి అడిగి సెలవు పెట్టిందని ప్రశ్నించారు. ఇద్దరు ఏఎన్ఎంలు ఆలస్యంగా రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా చేస్తే మెమో జారీ చేసి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అనంతరం గొల్లకిష్టంపల్లిలోని కేజీబీవీని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. డైనింగ్ హాల్, భోజనం, కూరగాయలు, ఇతర సాకర్యాలు పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈఓ వాసంతి, తహసీల్దార్ హెచ్ కోమి, డాక్టర్ మేఘన, ఏఓ కవిత, ఎంపీఓ భాస్కర్, ఎంఈఓ చంద్రమౌళి ఉన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావు అలియాస్ ఆశన్న
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్: దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 61 మంది సహచరులతో ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు, డీకేఎస్జెడ్సీ ప్రతినిధి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ శుక్రవారం అనుచరులతో అడవిబాటను వదిలారు. 208 మంది (110 మంది మహిళలు, 98 మంది పురుషులు)తో కలిసి 153 ఆయుధాలతో ఆయన జగ్దల్పూర్లో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాగా.. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇంద్రావతి ఏరియాను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆశన్న కార్యక్రమాలు కొనసాగించారు. చర్చల కోసం ప్రయత్నించి.. ‘ఆపరేషన్ కగార్’ ఉధృతం కావడంతో చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఈనేపథ్యంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామ ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మార్చి 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక దశలో ఓకే అన్నప్పటికీ.. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా నో చెప్పారు. ఆ తర్వాత మే నెలలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చర్చలను ప్రతిపాదిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మీడియా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా సంఘాలు చొర వ చూపాలని ఆయన కోరారు. అయినప్పటికీ దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్ కొనసాగి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా పలువురు అగ్రనాయకులు, కేడర్ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఇక చర్చల ప్రతిపాదనలతో ఫలితం లేదనే భావనతోపాటు పలు కారణాలతో లొంగుబాటును ఎంచుకున్న కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అ భయ్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపే శ్ సహచరులు, ఆయుధాలతో సరెండర్ అయ్యారు. మావోయిస్టు నేత తాతతో కలిసి పనిచేసిన ఆశన్న 1993–94లో అన్నసాగర్ ఏరియా డిప్యూటీ కమాండర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. శేషగిరిరావు అలియాస్ గోపన్నతో కలిసి పనిచేసిన ఆయన నల్లగొండ జిల్లాలోనూ కొంతకాలం దళనేతగా ఉన్నారు. ఆతర్వాత అనతి కాలంలోనే 1999లో పీపుల్స్‌వార్ పార్టీ నాయకత్వం యాక్షన్ టీంకు ఇన్చార్జ్గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక యాక్షన్లకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి కారును పేల్చి చంపిన ఘటనలో కీలకమని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్‌ని క్లైమోర్మైన్ పేల్చిన ఘటనతోపాటు హైదరాబాద్ సంజీవరెడ్డినగర్‌లో ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్రను పట్టపగలే కాల్చిచంపిన ఘటనకు ఈయనే నాయకత్వం వహించినట్లు రికార్డులున్నాయి. ఆ తర్వాత నిర్బంధం పెరగడంతోపాటు ఉద్యమ నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆశన్న కేంద్ర మిలటరీ కమిషన్‌కు కూడా కొంతకాలం ఇన్చార్జ్గా పనిచేసినట్లు ప్రచారం ఉంది. కాగా, దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నేత వరకు ఎదిగి.. ఛత్తీస్‌గఢ్, సౌత్‌బస్తర్, మాడ్ డివిజన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేట శివారు పోలోనిపల్లి (నర్సింగాపూర్) స్వగ్రామం. తల్లి సరోజన, తండ్రి భిక్షపతిరావు, తమ్ముడు సహదేవరావు, అక్క సౌమ్య. తండ్రి భిక్షపతిరావు 2012లో గొంతు క్యాన్సర్‌తో మృతిచెందగా, తమ్ముడు సహదేవరావు రైల్వేశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తూ హనుమకొండలోని గోపాల్‌పూర్‌లో స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. కాగా, వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాజీపేటలోని సెయింట్‌గ్యాబ్రియల్ స్కూల్లో సెకండరీ విద్యనభ్యసించారు. భువనగిరిలో ఐటీఐ కూడా చేసిన ఆయన, కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ.. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌కు (ఆర్ఎస్యూ) నాయకత్వం వహించారు. ఆతర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1991 నుంచి ఆర్ఎస్యూలో పని చేసి అజ్ఞాతంలోకి వెళ్లాక దళ సభ్యుడి నుంచి నాలుగున్నర దశాబ్దాల్లో కేంద్ర కమిటీ అగ్రనేత వరకు ఎదిగారు. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి.. నాలుగున్నర దశాబ్దాలు అడవిలో.. దళసభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆశన్న ఉద్యమ ప్రస్థానం -
ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు పెంచాలి
కమలాపూర్: ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని అంబాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని (పల్లె దవాఖాన) శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్, గత నెలలో జరిగిన ప్రసవాల సంఖ్య, డ్రైడే, సీజనల్ వ్యాధులు, టీబీ, హెచ్ఐవీ, లెప్రసీ తదితర వ్యాధుల గురించి అడిగి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో విద్యుత్ సరఫరా లేదని, తాగునీటి వసతి, మౌలిక వసతులు కల్పించాలని సిబ్బంది కోరారు. విద్యుత్ శాఖ సిబ్బందిని పిలిపించుకుని విద్యుత్ కనెక్షన్‌కు అవసరమైన అంచనా ఇవ్వాలని కోరారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, వైద్య సిబ్బందికి, పల్లె దవాఖానకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. వైద్యురాలు మానస, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్‌షాపులకు శుక్రవారం రాత్రి 9:35 గంటలకు 895 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు 1,435 దరఖాస్తులు వచ్చాయి. కాగా, శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. గత టెండర్లలో 5,859 దరఖాస్తులకు రూ.117 కోట్ల ఆదాయం ఎక్సైజ్ ఖజానాకు వచ్చింది. 2025–27 సంవత్సరం టెండర్ల ప్రక్రియలో గత టార్గెట్ చేరుకుంటుందా.. లేదా? ప్రభుత్వం దరఖాస్తుల గడువు పొడిగిస్తుందా? అని వేచి చూడాలి. ధర్మసాగర్: భర్తను హత్య చేసిన భార్యను శుక్రవారం ధర్మసాగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద పెండ్యాలకు చెందిన రాజారపు అశోక్‌కు చిల్పూరు మండలానికి చెందిన యాదలక్ష్మితో 2013లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అశోక్ కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి బానిసైన అశోక్‌కు, యాదలక్ష్మికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొన్నాళ్లుగా అతడు హైదరాబాద్‌లోని ఓ టీస్టాల్లో పనిచేస్తున్నాడు. ఈనెల 10న పెద్దపెండ్యాలకు వచ్చాడు. ఈక్రమంలో గురువారం మళ్లీ వీరి మధ్య గొడవ జరిగింది. అనుమానపడడంతో, భర్తను చంపితే ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చని యాదలక్ష్మి తన మెడలోని చున్నీతో ఉరేసినట్లు పోలీసులకు చెప్పింది. అనంతరం ఇంటి నుంచి పారిపోయి రాంపూర్ వెళ్లే దారిలోని కపిల్ వెంచర్లో ఎవరికీ కనబడకుండా నిద్రించి ఉదయం రాంపూర్‌కు వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికై నా పారిపోదామనుకుంది. ఈక్రమంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను శుక్రవారం అరెస్ట్ చేశారు. మృతుడి తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో, యాదలక్ష్మి తరఫున బంధువులెవరూ లేకపోవడంతో, ఆమె బెయిల్‌పై వచ్చే వరకు నలుగురు పిల్లలని ధర్మసాగర్ పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. సమావేశంలో సీఐ శ్రీధర్‌రావు, ఎస్ఐ జానీ పాషా, నరసింహరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి రోడ్డులోని శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి భక్తసేవాశ్రమంలో ఈనెల 22 నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభంకానున్నాయని అర్చకుడు గణపతిశర్మ తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకుడు, గురుస్వామి టీఆర్ బాలస్రుబహ్మణ్యశర్మ ఽఆధ్వర్యంలో భక్తులకు క్యూలెన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
మత్స్యశాఖకు దిక్కెవరు?
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ, వరంగల్ జిల్లాల మత్స్యశాఖ కార్యాలయాలకు పెద్ద దిక్కు కరువైంది. సుమారు ఏడాదిన్నర క్రితం హనుమకొండ డీఎఫ్ఓ డాక్టర్ విజయభారతి బదిలీ కావడంతో ఆ సీటు ఖాళీ అయిపోయింది. వరంగల్ డీఎఫ్ఓ నరేశ్‌నాయుడు బదిలీ కాగా, ఆయన స్థానంలో నాగమణి బాధ్యతలు చేపట్టారు. కాగా, హనుమకొండ ఖాళీగా ఉండడంతో మత్స్యశాఖ ఉన్నతాధికారులు నాగమణికి ఇన్చార్జ్ డీఎఫ్ఓ బాధ్యతలను అప్పగించారు. ఏడాదిన్నరగా రెండు జిల్లాల అధికారిగా కొనసాగుతున్న నాగమణి తాజాగా ఏసీబీ కేసులో అరెస్ట్ కావడంతో రెండు జిల్లాలకు అధికారులు లేకుండా పోయారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ఎలా? ఏటా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ ఇప్పటికే ఆలస్యమైంది. గత నెల వరంగల్, హనుమకొండ జిల్లాలకు టెండర్లను ఆహ్వానించగా, బిడ్లు కూడా ఖరారైనట్లు ఇటీవల నాగమణి వెల్లడించారు. ఇప్పుడు ఆమె అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో చేప పిల్లల పంపిణీపై ప్రభావం పడే అవకాశాలున్నాయని పలువురు మత్స్య సహకార సొసైటీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న హరీశ్ వరంగల్ ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ ఈఏడాది ఆగస్టు 15న వరంగల్ కలెక్టర్ సత్యశారద, మేయర్ సుధారాణి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవా ర్డు అందుకున్నారు. ఆ ఉత్తమ ఉద్యోగి శుక్రవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధి కారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. డీఎఫ్ఓ నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ ఏడాదిన్నరగా అవకాశం ఉన్న ప్రతీ అంశంలో అవినీతికి పాల్పడుతున్నారని మత్స్యశాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. లంచాల కోసం ప్రతి ఒక్కరినీ పీడించే వార ని బాహాటంగానే మాట్లాడుకోవడం వినిపించింది. ఏడాదిన్నర క్రితం హనుమకొండ డీఎఫ్ఓ బదిలీ హనుమకొండ ఇన్చార్జ్ డీఎఫ్ఓగా నాగమణి ఏసీబీ అరెస్ట్‌తో రెండు జిల్లాలు ఖాళీ -
అడవి విడిచి జనంలోకి
లొంగి పోయే ముందు ఆశన్నఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావుసాక్షిప్రతినిధి, వరంగల్: దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 61 మంది సహచరులతో ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు, డీకేఎస్జెడ్సీ ప్రతినిధి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ శుక్రవారం అనుచరులతో అడవిబాటను వదిలారు. 208 మంది(110మంది మహిళలు, 98మంది పురు షులు)తో కలిసి 153 ఆయుధాలతో ఆయన జగ్దల్పూర్లో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. ప్రధానంగా దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇంద్రావతి ఏరియాను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆశన్న కార్యక్రమాలు కొనసాగించారు. ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. చర్చల కోసం ప్రయత్నించి.. ఆపరేషన్ కగార్ ఉధృతం కావడం.. చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఈనేపథ్యంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మార్చి 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక దశలో ఒకే అన్నప్పటికీ.. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా నో చెప్పారు. ఆ తర్వాత మే నెలలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చర్చలను ప్రతిపాదిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా సంఘాలు చొరవ చూపాలని ఆయన కోరారు. అయినప్పటికీ దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్ కొనసాగి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా పలువురు అగ్రనాయకులు, కేడర్ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఇక చర్చల ప్రతిపాదనలతో ఫలితం లేదనే భావనతోపాటు పలు కారణాలతో లొంగుబాటును ఎంచుకున్న కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేశ్ సహచరులు, ఆయుధాలతో సరెండర్ అయ్యారు. మావోయిస్టు నేత తాతతో కలిసి పనిచేసిన ఆశన్న 1993–94లో అన్నసాగర్ ఏరియా డిప్యూటీ కమాండర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. శేషగిరిరావు అలియాస్ గోపన్నతో కలిసి పనిచేసిన ఆయన నల్లగొండ జిల్లాలోనూ కొంతకాలం దళనేతగా ఉన్నారు. ఆతర్వాత అనతి కాలంలోనే 1999లో పీపుల్స్‌వార్ పార్టీ నాయకత్వం యాక్షన్ టీంకు ఇన్చార్జ్గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక యాక్షన్లకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి కారును పేల్చి చంపిన ఘటనలో కీలకమని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్‌ని క్లైమోర్మైన్ పేల్చిన ఘటనతోపాటు హైదరాబాద్ సంజీవరెడ్డినగర్‌లో ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్రను పట్టపగలే కాల్చిచంపిన ఘటనకు ఈయనే నాయకత్వం వహించినట్లు రికార్డులున్నాయి. ఆ తర్వాత నిర్బంధం పెరగడంతోపాటు ఉద్యమ నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆశన్న కేంద్ర మిలటరీ కమిషన్‌కు కూడా కొంతకాలం ఇన్చార్జ్గా పనిచేసినట్లు ప్రచారం ఉంది. కాగా, దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నేత వరకు ఎదిగి.. ఛత్తీస్‌గఢ్, సౌత్‌బస్తర్, మాడ్ డివిజన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.ఆశన్న అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం మాకు తెలియదు. ఆశన్న తండ్రి భిక్షపతిరావు ఆ కాలంలోనే హనుమాన్ గుడి నిర్మాణానికి గుంట భూమిని విరాళంగా ఇచ్చాడు. వాసుదేవరావు మావోయిస్టు పార్టీలో పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసినందుకు గ్రామస్తులం సంతోషిస్తున్నాం. వాసుదేవరావును చూడాలని ఉంది. స్వగ్రామానికి వస్తే స్వాగతం పలుకుతాం. – గొర్రె రాజయ్య, నర్సింగాపూర్ భిక్షపతిరావుకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. అందులో వాసుదేవరావు పెద్దోడు, సహదేవరావు చిన్నోడు, సౌమ్య ఇద్దరి కంటే పెద్దది. చిన్నప్పుడే వాసుదేవరావు అన్నల్లోకి పోయిండని తెలుసు. అప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. భిక్షపతిరావు చనిపోయాక వాళ్లు ఇక్కడ ఉండడం లేదు. ఇక్కడ పుట్టిన వాసుదేవరావు అన్నల్లో నుంచి బయటకు వచ్చిండని తెలిసింది. – గాజవేన ఓదెలు, నర్సింగాపూర్ ●కీలక దాడులకు వ్యూహకర్త ఆశన్న.. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి.. నాలుగున్నర దశాబ్దాలు అడవిలో.. దళసభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆశన్న ఉద్యమ ప్రస్థానంతక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట శివారు పోలోనిపల్లి (నర్సింగాపూర్) స్వగ్రామం. తల్లి సరోజన, తండ్రి భిక్షపతిరావు, తమ్ముడు సహదేవరావు, అక్క సౌమ్య. తండ్రి భిక్షపతిరావు 2012లో గొంతు కేన్సర్‌తో మృతిచెందగా, తమ్ముడు సహదేవరావు రైల్వేశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తూ హనుమకొండలోని గోపాల్‌పూర్‌లో స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. కాగా, వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివారు. అనంతరం కాజీపేటలోని సెయింట్‌గ్యాబ్రియల్ స్కూల్లో సెకండరీ విద్యనభ్యసించారు. భువనగిరిలో ఐటీఐ కూడా చేసిన ఆయన, కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ.. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌కు (ఆర్ఎస్యూ) నాయకత్వం వహించారు. ఆతర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1991 నుంచి ఆర్ఎస్యూలో పని చేసి అజ్ఞాతంలోకి వెళ్లాక దళ సభ్యుడి నుంచి నాలుగున్నర దశాబ్దాల్లో కేంద్ర కమిటీ అగ్రనేత వరకు ఎదిగారు. -
ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి
న్యూశాయంపేట: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి ఆదేశించారు. వరంగల్ డివిజన్లో ధాన్యం కొనుగోలుపై సన్నాహక, శిక్షణా కార్యక్రమాన్ని హనుమకొండ డీసీసీబీ భవన్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వానాకాలం 2025 –26కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పక్కాగా చేపట్టాలన్నారు. కేంద్రాలను లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయొద్దని, కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. అవసరమైన గన్నీ సంచులు, టార్పలిన్లు, తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. పశుసంపదను కాపాడుకోవాలిరాయపర్తి: పశువులు రోగాలబారిన పడకుండా కాపాడుకుంటూ పశుసంపదను పెంచుకోవాలని రైతులకు వరంగల్ జిల్లా డీవీఏహెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణ సూచించారు. మండలంలోని మైలారం గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల బారినుంచి పశువులను కాపాడుకునేందుకు ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ శ్రుతి, మక్బుల్, జేవీఓ వెంకటయ్య, ఎల్ఎస్ఏ గణేష్, వీఏ.కపిల్, గోపాల మిత్రలు రమేష్, రైతులు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఆర్డీఎఫ్ విద్యార్థినిపర్వతగిరి: వరంగల్ జిల్లా పరిధిలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్ –19 బాలికల వాలీబాల్ ఎంపికలో మండలంలోని కల్లెడ ఆర్డీఎఫ్ వనితా అచ్యుతా పాయి విద్యాలయ జూనియర్ కళాశాల విద్యార్థిని జి.వెన్నెల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన పోటీల్లో జి.మహేశ్వరి, జి.కళ్యాణి, జి.వెన్నెల, ఎం.శిరీష, యశస్విని, ఎం.అమృత, పి.సౌమ్య పాల్గొనగా జి.వెన్నెల అద్భుత ప్రతిభ కనబర్చి మూడో స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఆడెపు జనార్ధన్, ఉపాధ్యాయులు అభినందించారు. అకడమిక్ హెడ్ ప్రవీణ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, ఏఓ సతీష్, అధ్యాపకులు మహేశ్వర్, జయశంకర్, సంతోష్‌కుమార్, శ్రీధర్, ధన్య, పీటీ కోకిల, సైదులు, గుంశావళి, తిరుమల, ధనలక్ష్మి పాల్గొన్నారు. ఆత్మరక్షణకు కరాటే దోహదంనెక్కొండ: విద్యతోపాటు ఆత్మరక్షణ కోసం కరాటేలోనూ విద్యార్థినులు రాణించాలని టీజీ రెసిడెన్సియల్ స్కూల్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి సూచించారు. కరాటేలో ప్రతిభ చాటిన వారిని పాఠశాలలో గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 16న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 69వ ఎస్జీఎఫ్ కరాటే పోటీలు ములుగు జిల్లాలో జరగగా, తమ విద్యార్థులు 16 మంది వివిధ విభాగాల్లో పాల్గొన్నారని తెలిపారు. కరాటే అండర్ –17లో విభాగంలో టి.శ్రీలక్ష్మి ప్రథమ స్థానంలో నిలవగా, మరో ఏడుగురు విద్యార్థులు ద్వితీయ, ఇంకో ఐదుగురు విద్యార్థులు తృతీయ స్థానాల్లో నిలిచారని ప్రిన్సిపాల్ వివరించారు. కార్యక్రమంలో పీఈటీ కమల కుమారి, కరాటే మాస్టర్ రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎయిర్‌పోర్ట్‌తో పారిశ్రామికాభివృద్ధి
న్యూశాయంపేట: వరంగల్‌లో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ప్రజల ఆక్షాంక్ష అని, హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మామునూరు ఎయిర్పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ పనుల పురోగతిపై ల్యాండ్ అక్విజేషన్ రిటైర్డ్ ఓఎస్టీ మనోహర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎయిర్పోర్ట్ మేనేజర్ తులసి మహాలక్ష్మి, లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు 220 ఎకరాల వ్యవసాయ భూమి సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. ఎయిర్పోర్ట్ స్థలంలోని చెరువులు కుంటలు, విద్యుత్ హైపోల్స్, సెల్‌టవర్లు, ఎత్తుగా ఉన్న భవనాలు, చెట్లను గుర్తించి నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను సత్యశారద ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో, వరంగల్ ఇన్చార్జ్ ఆర్డీఓ విజయలక్ష్మి, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, ఆర్డీఓ కార్యాలయ డీఏఏ ఫణికుమార్, ఎస్ఈ ఇరిగేషన్ వరంగల్ హెచ్వీ.రాంప్రసాద్, మిషన్ భగీరథ డీఈ జీవన్, ఎన్పీడీసీఎల్ ఏడీఈ చంద్రమౌళి, లీగల్ మెట్రాలజీ శ్రీనివాస్‌రావు, డీఎఫ్ఓ సృజనకుమారి, సర్వేయర్ రజిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి ఖానాపురం: విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మండలంలోని అశోక్‌నగర్ కేజీబీవీని శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలు, తరగతి గదులు, భవనాలు, స్టోర్ రూం, వంటగది, కూరగాయల నాణ్యత, మధ్యాహ్న భోజనం, అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను తెరిచి పరిశీలించారు. ప్రిన్సిపాల్ మేనకపై అనేక ఫిర్యాదులు రావడంతో ఆమెను కలెక్టర్ మందలించారు. భవనంపై నిరుపయోగంగా ఉన్న బెంచీలను ఇతర పాఠశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు చెప్పారు. వారిని ప్రత్యేక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జీఈసీఓ ఫ్లోరెన్స్, తహసీల్దార్ రమేష్, టీఈడబ్ల్యూఐడీసీ డీఈ అశోక్, ఎంఈఓ శ్రీదేవి, ఎస్ఓ మేనక పాల్గొన్నారు. ఎంఈఓపై విచారణకు ఆదేశం మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవిపై విచారణకు కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. మండలంలో ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు, ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు పత్రికా విలేకరులు.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఎంఈఓపై విచారణ చేసి నివేదిక అందించాలని జీఈసీఓ ఫ్లోరెన్స్‌ను ఆదేశించారు. -
ప్రజల గొంతుకపై ఆంక్షలు సరికాదు
వరంగల్/న్యూశాయంపేట: ప్రభుత్వాలు, ప్రజలకు వారధిగా ఉన్న పత్రికలపై ఆంక్షలు విధించడం సరికాదని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై అనుసరిస్తున్న వైఖరి, ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన విషయాలపై కథనాలు రాసినా, ప్రచురించినా ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే వివరణ కోరాలే తప్ప కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు. వరంగల్ ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం హరిస్తోందని, ‘సాక్షి’ చీఫ్ ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘సాక్షి’ మీడియాపై అనుసరిస్తున్న దమననీతికి వ్యతిరేకంగా ప్రజా, ఉద్యోగ సంఘాలతో ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ వాంకే శ్రీనివాస్, జర్నలిస్టు సంఘాల నాయకులు నల్లాల బుచ్చిరెడ్డి, పొడిశెట్టి విష్ణువర్ధన్, కంకణాల సంతోష్, సాయిరాం, బోల్ల అమర్, అలువాల సదాశివుడు, కొల్ల కృష్ణకుమార్, అహ్మద్, రాధాకృష్ణ, డి.రమేశ్, జి.రమేశ్, ఎ.నరేందర్, వెంకట్, జాఫర్, నరేశ్, సునేందర్, వీరస్వామి, రవి, అనిల్, సబ్ ఎడిటర్లు ఓంకార్, ఉమామహేశ్, బండి రాజు, రాంచందర్, డి.రాజు, అశోక్, సాజిద్, దాసరి బాబు, సంపెట శ్రవణ్, శివ, సంపెట వెంకటేశ్వర్లు, వీకే రమేశ్, తదితరులు పాల్గొన్నారు.సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంటాయి. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను బయటపెడుతుంటాయి. ఇది సహించలేని ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం, కాలరాయడం తీవ్రంగా ఖండిస్తున్నా. సాక్షి మీడియాపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. సాక్షి పత్రిక, ఎడిటర్, సిబ్బందిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నా. – తాటిపాముల వెంకట్రాములు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు● ‘సాక్షి’ మీడియా, ఎడిటర్‌పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
వరంగల్
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025వెంకటాపురం(ఎం): మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నను తామెప్పుడూ చూడలేదని నర్సింగాపూర్ గ్రామస్తులు పేర్కొన్నారు. ఆశన్న లొంగిపోయిన విషయం టీవీల్లో మాత్రమే చూశామని వారు తెలిపారు. హనుమకొండలోని గోపాలపూర్‌లో నివాసముంటున్న ఆశన్న సోదరుడు సహదేవరావు దగ్గర తల్లి సరోజన ఉంటుందని పేర్కొన్నారు. ఆశన్న అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తమకు తెలియదని, జనజీవన స్రవంతిలో కలవడం సంతోషంగా ఉందని వివరించారు. -
మత్స్యశాఖకు దిక్కెవరు?
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ, వరంగల్ జిల్లాల మత్స్యశాఖ కార్యాలయాలకు పెద్ద దిక్కు కరువైంది. సుమారు ఏడాదిన్నర క్రితం హనుమకొండ డీఎఫ్ఓ డాక్టర్ విజయభారతి బదిలీ కావడంతో ఆ సీటు ఖాళీ అయిపోయింది. వరంగల్ డీఎఫ్ఓ నరేశ్‌నాయుడు బదిలీ కాగా, ఆయన స్థానంలో నాగమణి బాధ్యతలు చేపట్టారు. కాగా, హనుమకొండ ఖాళీగా ఉండడంతో మత్స్యశాఖ ఉన్నతాధికారులు నాగమణికి ఇన్చార్జ్ డీఎఫ్ఓ బాధ్యతలను అప్పగించారు. ఏడాదిన్నరగా రెండు జిల్లాల అధికారిగా కొనసాగుతున్న నాగమణి తాజాగా ఏసీబీ కేసులో అరెస్ట్ కావడంతో రెండు జిల్లాలకు అధికారులు లేకుండా పోయారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ఎలా? ఏటా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ ఇప్పటికే ఆలస్యమైంది. గత నెల వరంగల్, హనుమకొండ జిల్లాలకు టెండర్లను ఆహ్వానించగా, బిడ్లు కూడా ఖరారైనట్లు ఇటీవల నాగమణి వెల్లడించారు. ఇప్పుడు ఆమె అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో చేప పిల్లల పంపిణీపై ప్రభావం పడే అవకాశాలున్నాయని పలువురు మత్స్య సహకార సొసైటీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న హరీశ్ వరంగల్ ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ ఈఏడాది ఆగస్టు 15న వరంగల్ కలెక్టర్ సత్యశారద, మేయర్ సుధారాణి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవా ర్డు అందుకున్నారు. ఆ ఉత్తమ ఉద్యోగి శుక్రవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధి కారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. డీఎఫ్ఓ నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ ఏడాదిన్నరగా అవకాశం ఉన్న ప్రతీ అంశంలో అవినీతికి పాల్పడుతున్నారని మత్స్యశాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. లంచాల కోసం ప్రతి ఒక్కరినీ పీడించే వార ని బాహాటంగానే మాట్లాడుకోవడం వినిపించింది. ఏడాదిన్నర క్రితం హనుమకొండ డీఎఫ్ఓ బదిలీ ఇన్చార్జ్ డీఎఫ్ఓగా నాగమణి ఏసీబీకి చిక్కడంతో రెండు జిల్లాలు ఖాళీ -
భవన మరమ్మతు పనులను పూర్తిచేయాలి
● డీఈఓ రంగయ్య నాయుడు కాళోజీ సెంటర్: వరంగల్ ఎల్బీ నగర్‌లోని భవిత సెంటర్‌ను భవిత జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్‌తో కలిసి డీఈఓ రంగయ్య నాయుడు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మౌలాలి ప్రాథమిక పాఠశాలలోని భవిత సెంటర్లో జరుగుతున్న భవన మరమ్మతు పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల (సీడబ్ల్యూఎస్ఎన్)తో కొద్దిసేపు మాట్లాడారు. మౌలాలి ప్రభు త్వ ఉన్నత పాఠశాల, మాసూమ్ అలీ పాఠశాల ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, ఉపాధ్యాయుల సెలవు పత్రాలు, విద్యార్థుల పురోగతి, తల్లిదండ్రుల సమావేశాలు వంటి అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం జయబాల రెడ్డి, ప్రాథమిక పాఠశాల మౌలాలి హెచ్ఎం జోసెఫ్, భవిత సెంటర్ సమ్మిళిత విద్యా ఉపాధ్యాయులు స్వాతి పాల్గొన్నారు. -
‘కొండా’ వివాదం సమసినట్లేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన సురేఖ.. కీలకమై కేబినెట్ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్‌ను హీటెక్కించాయి.సుమంత్ కోసం పోలీసులు..కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు..మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్ సీఎం రేవంత్‌రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.కేబినెట్‌కు ఎందుకు వెళ్లలేదు..అసలేం జరుగుతోంది..?రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత.. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడ కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌లను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌తో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్‌కు హాజరుకాకపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇచ్చారు? అక్కడినుంచి కేబినెట్ మీటింగ్‌కు వెళ్లాల్సిన ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైన ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
హైదరాబాద్ నుంచి వస్తుంది వాస్తవమే..
● విధులకు రాని రోజు సెలవు తీసుకుంటున్నారు ● ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్ ఎంజీఎం: ‘వారానికి రెండు రోజులే’ శీర్షికన ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్ స్పందించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కొంత మంది వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వచ్చి వెళ్తూ విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని ఆయన అంగీకరించారు. ప్రతీరోజు క్రమం తప్పకుండా విధులకు వస్తూ ఓపీ విభాగంలో రోగులకు సేవలందించడంతో పాటు, ఎంజీఎం ఆస్పత్రితో పాటు కళాశాల ప్రాంగణంలో వైద్యవిద్యార్థులకు సంబంధించిన అకడమిక్ విభాగాల్లో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల అటెండెన్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. వైద్య బోధన చేసే వైద్యులంతా తమ పేర్లతో పాటు ఫేస్ బేస్డ్ బయోమెట్రిక్ విధానానికి అనుసంధానం జరిగిందని తెలిపారు. కాగా, నిబంధనల ప్రకారం అత్యసవర పరిస్థితుల్లో ప్రాణాలు అందించే వైద్యులు హైదరాబాద్ నుంచి విధులకు రావొచ్చా? హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలా? అనే నిబంధన ఉందా.. అనే అంశంపై రాష్ట్ర స్థాయి అధికారులను అడిగి తెలుపుతామని సూపరింటెండెంట్ కిశోర్ పేర్కొన్నారు. కాజీపేట అర్బన్ : హనుమకొండ (వరంగల్ అర్బన్) జిల్లాలోని 67 వైన్స్‌కు గురువారం దరఖాస్తులు జోరందుకున్నాయి. గురువారం రాత్రి 8 గంటల వరకు దరఖాస్తులను మద్యం వ్యాపారులు అందజేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. టెండర్ల ప్రక్రియ వెలువడిన నాటి నుంచి గురువారం వరకు 540 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. -
‘సీఈఏ’ నియమాలు తప్పక పాటించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ క్లినిక్‌లు, ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం (సీఈఏ) నియమాలను తప్పనిసరిగ్గా పాటించేలా చూడాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ అప్పయ్య ఆధ్వర్యంలో ఐఎంఏ, తానా, గైనకాలజిస్ట్ అసోసియేషన్, డెంటల్, ఆయుర్వేదిక్, హోమియో, యునాని, ఫిజియోథెరపీ అసోసియేషన్ల ప్రతినిధులతో ప్రభుత్వ నిబంధనలపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు నిర్వహించవద్దని, చట్టం నియమాలకు అనుగుణంగా నిర్వహించడంలో అసోసియేషన్లు సహకరించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద పార్కింగ్ స్థలం ఉండేలా ఆస్పత్రుల యాజమాన్యాలు చూసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రులు నిబంధనల మేరకు నిర్మించాలని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రతీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, జిమ్ సెంటర్లు, అవసరమైన ఇతర చోట్ల సీపీఆర్ ప్రాముఖ్యాన్ని గురించి తెలియజేస్తూ శిక్షణ ఇవ్వడానికి అసోసియేషన్లు సహకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి, గైనకాలజిస్ట్‌ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాధిక, ఐడీఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రీతంరెడ్డి, ఆయుర్వేదిక్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ రవీందర్, హోమియో అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ సుధాకర్‌రావు, ఫిజియోథెరపీ అసోసియేషన్ ప్రతినిధి సురేశ్‌కుమార్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, డెమో అశోక్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హసన్‌పర్తి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ను గురువారం సీపీ సందర్శించారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్ ఆవరణను పరిశీలించి స్టేషన్ పరిఽధిలోని సమస్యాత్మక గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏయే గ్రామాల నుంచి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నాయని, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తుల వివరాలతో పాటు స్టేషన్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి తెలుసుకున్నారు. హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని స్టేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సిబ్బందికి సూచించారు. తొలుత సీపీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ పశాంత్రెడ్డి, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్, రవి పాల్గొన్నారు. -
దీపావళి పండుగకు ప్రత్యేక రైళ్లు
ఈనెల 20 నుంచి 10 సర్వీస్‌లు కాజీపేట రూరల్: దీపావళి పండుగను పురస్కరించుకుని దర్బాంగా–యశ్వంత్‌పూర్ మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే ఈ రైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 11 వరకు ప్రతీ సోమవారం దర్బాంగా–యశ్వంత్‌పూర్ (05541) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్‌కు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు యశ్వంత్‌పూర్–దర్బాంగా (05542) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. 3–ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్, సెకెండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీసులకు అప్ అండ్ డౌన్ రూట్లో సమస్థిపూర్, ముఝఫర్‌పూర్, హాజీపూర్, సోనాపూర్, చాప్రా, గ్రామీణ్, సివన్, డోరియోసాదర్, గోరఖ్‌పూర్, గోండా, బారబంకి, అశీశ్‌బాగ్, కాన్‌పూర్‌సెంట్రల్, ఓరియా, వీజీఎల్ ఝాన్సీ, బీనా, బోఫాల్, ఇటార్సీ, జోద్పూర్, కాబిన్, ఆమ్లా, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట జంక్షన్, కాచిగూడ, మహబూబ్‌నగర్, దోనే, ధర్మవరం, హిందుపూర్, ఎలహంకా స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. -
విభేదాలతో విడివిడిగా..!
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా వరంగల్‌లో గురువారం నిర్వహించిన సమావేశానికి వరంగల్, హనుమకొండ జిల్లాల ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాత్రమే హాజరయ్యారు. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరుకాలేదు. వారు హనుమకొండలోని డీసీసీ భవన్లో మరో సమావేశం ఏర్పాటుచేసి కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. దీంతో ముఖ్య నాయకుల మధ్య అనైక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వరంగల్ తూర్పులో కొండా వర్గం, కొండా వ్యతిరేక వర్గం ఉన్నట్లు జనాల్లోకి బలమైన సంకేతాలు వెళ్తున్నాయని కార్యకర్తలు అంటున్నారు. మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌లో ఉండడంతో సమావేశానికి హాజరుకాలేదు. ఉదయం వరంగల్, సాయంత్రం హనుమకొండలోని వరంగల్ డీసీసీ భవన్లో మరో సమావేశంలో నవజ్యోతి పట్నాయక్ పాల్గొని అభిప్రాయాలు సేకరించారు. మరోసారి ఎర్రబెల్లి స్వర్ణకే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఓ వర్గం నేతలు ఆయనకు ప్రతిపాదనలు సమర్పించారు. కార్యకర్తలు మెచ్చిన వారికే డీసీసీ పదవి ఏఐసీసీ వరంగల్, హనుమకొండ జిల్లాల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికలు ఏఐసీసీల పర్యవేక్షణలోనే జరుగుతాయని ఏఐసీసీ వరంగల్, హనుమకొండ జిల్లాల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు సూచించిన వ్యక్తులకే డీసీసీ అధ్యక్ష పదవి అప్పగించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరంగల్ తూర్పులోని 24 డివిజన్ల నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారి సూచనలు తీసుకుంటామని అన్నారు. ‘ఇక్కడ జరిగే ప్రతి విషయం టీపీసీసీ, ఏఐసీసీ దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ నేరుగా తనతో చెప్పొచ్చు’ అని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ . కొండా సురేఖ, మురళి చెప్పిన వారికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వరని, కార్యకర్తలు చెప్పిన వారికే అవకాశం దక్కుతుందన్నారు. అనంతరం నవజ్యోతి పట్నాయక్, టీపీసీసీ పరిశీలకులు కోఆర్డినేటర్లు డివిజన్ల వారీగా నాయకులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. టీపీసీసీ నాయకులు మీసాల ప్రకాశ్, గోపాల నవీన్రాజుతో ఒకటి, రెండు డివిజన్లలో అయూబ్‌ఖాన్, భాషిపాక సదానందం పేర్లు వచ్చినట్లు తెలిసింది. పీసీసీ పరిశీలకులు, కోఆర్డినేటర్లు భాస్కర్, రేణుక, ఆదర్శ్‌తో పాటు కార్పొరేటర్లు సురేష్‌జోషి, బస్వరాజు కుమారస్వామి, ఓని భాస్కర్, డివిజన్ నాయకులు రాజేశ్ కూచన రవీందర్, చిప్ప వెంకటేశ్వర్లు, యెలుగం సత్యనారాయణ, జారతి వెంకటేశ్వర్లు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వేర్వేరుగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక సమావేశాలు వరంగల్‌లో కొండా మురళి, హనుమకొండలో బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ మీటింగ్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల మధ్య కొరవడిన ఐక్యత వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితిడీసీసీ భవన్లో అభిప్రాయాల సేకరణ వరంగల్: తూర్పు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం గురువారం హనుమకొండ డీసీసీ భవన్లో జరిగింది. ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రస్తత అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకే మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, బస్వరాజు శ్రీమాన్, నాయకులు తత్తరి లక్షణ్, బిల్లా శ్రీకాంత్, దామెర సర్వేశం, జన్ను రవి, కరాటే ప్రభాకర్, కురిమి పరమేశ్వర్, గోరంట్ల రాజు, చాగంటి శ్రీనివాస్, ఎండీ అయూబ్, కోదాటి అనిల్, తాహేర్, బహీర్ పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ సర్కిల్ ఎస్ఈతో ఫోన్ ఇన్
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో భాగంగా సమస్యలు, సలహాలు తెలుసుకునేందుకు ఈనెల 17న ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈకార్యక్రమంలో జిల్లా వినియోగదారులు 87124 84818 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. జూనియర్ కాలేజీల సిబ్బందికి యూనిక్ ఐడీ కాళోజీ సెంటర్: జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల సిబ్బంది సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ల ఫిజికల్ వెరిఫికేషన్ గురువారం పూర్తయ్యిందని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్‌సుమన్ తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో స్వయంగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వివరాలు సరిగా లేకుండా తిరిగి కళాశాలకు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన నూతన సంస్కరణల్లో భాగంగా సిబ్బందికి శాశ్వత యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారని వివరించారు. యూనిక్ ఐడీ ద్వారా సిబ్బంది విద్యార్హతలు, అపాయింట్ మెంట్ తేదీలు, ఆధార్, బ్యాంకు ఖాతా తదితర అన్ని వివరాలు సత్వరమే పొందవచ్చని తెలిపారు. ఖాళీ బిందెలతో మహిళల నిరసనవర్ధన్నపేట: తాగునీరు రావడంలేదని గురువారం సాయంత్రం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వర్ధన్నపేట పట్టణంలోని ఒకటో వార్డులో ఒక బోరు బావి, నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కాగా, బోరు బావి మోటారును మున్సిపల్ సిబ్బంది మరమ్మతులకు తీసుకెళ్లారు. దీంతో నీటి సరఫరా నిలిచి పోయింది. వారం రోజులుగా మున్సిపల్ సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మహిళలు పేర్కొన్నారు. ఈ మేరకు ఖాళీ బిందెలతో నిరసన తెలిపినట్లు చెప్పారు. మోటారుకు మరమ్మతు పూర్తిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మహిళలు డిమాండ్ చేశారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని మైనారిటీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సనా సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు మహ్మద్ హుస్సేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. హనుమకొండ కేయు క్రాస్‌రోడ్డులోని (వరంగల్ జీ1), బాలికల గురుకులంలో జేఎల్ ఫిజిక్స్ (1), జేఎల్ కెమిస్ట్రీ (1), వరంగల్ శంభునిపేట దూపకుంటరోడ్డులోని (వరంగల్, జీ2) బాలికల గురుకులంలో జేఎల్ తెలుగు (1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 21లోగా హనుమకొండ నయీంనగర్ పాత ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న సనా ఏజెన్సీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 0870–3558 539 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. పేకాట శిబిరంపై దాడి నర్సంపేట రూరల్: పేకాడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు గురువారం పాపయ్యపేట గ్రామంలో పేకాట శిబిరంపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మురహరి రవి, కాట ప్రశాంత్, కొత్తపల్లి కృష్ణ, పరకాల సతీశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రూ. 2వేల నగదు, మూడు సెల్ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దాడుల్లో ఏఎస్సై లక్ష్మణమూర్తి, పోలీస్ సిబ్బంది సతీశ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓటరు గుర్తింపుకార్డులు అందించాలి న్యూశాయంపేట: తపాలా శాఖ ద్వారా నూతన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఆర్వో విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
.........
సాక్షిప్రతినిధి, వరంగల్ : సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన సురేఖ.. కీలకమై కేబినెట్ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్‌ను హీటెక్కించాయి.సుమంత్ కోసం పోలీసులు..కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు..మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్ సీఎం రేవంత్‌రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.కేబినెట్‌కు ఎందుకు వెళ్లలేదు..అసలేం జరుగుతోంది..?రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత.. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడ కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌లను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌తో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్‌కు హాజరుకాకపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇచ్చారు? అక్కడినుంచి కేబినెట్ మీటింగ్‌కు వెళ్లాల్సిన ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైన ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
ఆస్పత్రి పనులు పూర్తి చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఎంజీఎం: వరంగల్‌లో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి కలెక్టర్ గురువారం సందర్శించి సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. సివిల్, ఎలక్ట్రికల్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి అంతస్తులోని నిర్మాణ స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ కిశోర్, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆర్‌ఎంఓలు, వివిధ విభాగాల అధిపతులు, ఆర్అండ్బీ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టాలి న్యూశాయంపేట: పారదర్శకంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లను చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో ధాన్యం పత్తి, మొక్కజొన్నల కొనుగోళ్లపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ మద్దతు ధరలతో పంటల కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పాల్గొన్నారు. గడువులోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 9,457 ఇళ్లకు ఇప్పటివరకు 4,941 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. ఎస్‌హెచ్‌జీల నుంచి రుణాలు ఇప్పించి పెండింగ్‌లో ఉన్న 4,516 ఇళ్ల పనులు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీలో పని కల్పించుటకు జాబ్ కార్డులు అందించాలన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న, హౌసింగ్ పీడీ గణపతి, డీపీఓ కల్పన, పీఆర్ ఈఈ ఇజ్జగిరి పాల్గొన్నారు. -
‘విజిలెన్స్’లో అక్రమార్కుడు
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిని ఎండగట్టి.. అక్రమార్కులపై చర్యలకు సిఫార్సు చేసే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఓ అక్రమార్కుడు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా నడుస్తోంది. విజిలెన్స్‌లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారికి నమ్మిన బంటైన సదరు కానిస్టేబు ల్ను ఏరి కోరి డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నారు. ఇంకేముంది వసూళ్లకు పెట్టింది పేరైన సదరు కానిస్టేబుల్ పేరు చెబితే డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు కూడా చెమటలు పడుతున్నాయి! ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు విచారణలు, తనిఖీలకు ప్రాధాన్యం ఉన్న విజిలెన్స్‌లో ఈ అక్రమార్కుడి సంపాదన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇసుక క్వారీలు, రైస్ మిల్లులు, గ్రానైట్ క్వారీలు, ఫర్టిలైజర్స్, ఇలా ఎక్కడ చూసినా తన చేతికి పనిచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎంత చెబితే అంత! విజిలెన్స్‌లో ఉద్యోగం కానిస్టేబులే అయినప్పటికీ పెత్తనం మాత్రం అంతా ఇంతా కాదు. ఆ శాఖలో పనిచేస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఇతగాడి నోటి నుంచి ఏం వస్తుందో.. దాని వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో.. అనే భయంతో వణికిపోతున్నట్లు సమాచారం. ఆ శాఖలో ఆయనకు పనికాదు కదా.. ఎదురు చెప్పే ధైర్యం కూడా ఎవరూ చేయడం లేదు. తనను ఏరి కోరి తెచ్చుకున్న బాస్‌కు అన్నీ తానై చేయడంతో మిగిత అధికారులంతా గప్‌చుప్‌గా ఉంటున్నారు. మట్టి, ఇసుక, గ్రానైట్ లారీలను పట్టాలన్నా.. వాటికి జరిమానాలు విధించాలన్న ఆయన కనసన్నల్లోనే జరగడం గమనార్హం. తనకు అనుకూలంగా ఉండే లారీల యాజమానులకు ముందస్తుగా తనిఖీల సమాచారాన్ని చేరవేసి.. దానికి కాసుల రూపంలో ప్రతిఫలాన్ని పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా విజిలెన్స్ కార్యాలయంలో అధికారులను కలవాలంటే ముందుగా ఇతగాడిని ప్రసన్నం చేసుకున్న తర్వాతే దర్శనం దొరుకుతుంది. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కడ చూసినా ఆ కానిస్టేబుల్ పేరే వినబడుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా ఎక్కడికై నా, ఎప్పుడైనా వెళ్లి ఆయన పనులు గుట్టు చప్పుడు కాకుండా చేసుకుపోతున్నట్లు తెలిసింది. నెలవారీ మామూళ్లను సైతం తనకు ఇష్టం వచ్చినట్లు పెంచి.. ఇవ్వని క్వారీల, లారీల యాజమానుల వెంట పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈతతంగమంతా విజిలెన్స్ బాస్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వసూళ్లలో దిట్ట పేరుకే కానిస్టేబుల్.. పెత్తనం పెద్దది లీకులకు పెట్టింది పేరు అక్కడ ఆయనే బాస్ -
20న లక్ష్మీ పూజలు, 21న నోములు
హన్మకొండ కల్చరల్: ఈనెల 20న (సోమవారం) ఉదయం మంగళ హారతులిచ్చి, సాయంత్రం ధనలక్ష్మి పూజలు నిర్వహించి దీపావళి పండుగను జరుపుకోవాలని, 21న మంగళవారం కేదారేశ్వర నోములు నిర్వహించుకోవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ అర్చకుడు గంగు మణికంఠ అవధాని, వరంగల్ రాజరాజేశ్వరీదేవి దేవాలయం అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ, ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామం శ్రీపశుపతినాథ్ దేవాలయ అర్చకుడు సదానీరంజన్ సిద్ధాంతి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం రోజున సూర్యోదయ సమయానికి ఉన్న అమావాస్య తిథిని ప్రామాణికంగా తీసుకుని కేదారేశ్వర వ్రతాలు నిర్వహించుకోవచ్చని బుధవారం (అక్టోబర్ 22)న నోము ఎత్తుకోవచ్చని తెలిపారు. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం లేని కారణంగా కొత్త నోములు చేపట్టవద్దని, పడిపోయిన నోములు చేయరాదని వివరించారు. హన్మకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు ఈనెల 17 ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్‌రావు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈకార్యక్రమంలో హనుమకొండ జిల్లా వినియోగదారులు 87124 84506 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. వరంగల్ సర్కిల్ ఎస్ఈతో.. విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో భాగంగా సమస్యలు, సలహాలు తెలుసుకునేందుకు ఈనెల 17న ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా వినియోగదారులు శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈకార్యక్రమంలో 87124 84818 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. కేయూ క్యాంపస్: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–26ను నిర్వహించేందుకు కేయూలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ఎంపికై ంది. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు తమ పేర్లను ‘మై భారత్ పోర్టల్’లో నమోదు చేసుకోవాలని ఆ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ గురువారం తెలిపారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌ను జిల్లాలో నిర్వహించేందుకు కేయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రమణ, హనుమకొండలోని నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్ చింతల, కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ, ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శైలజ, ఎం. సౌజన్య పాల్గొన్నారు. అక్టోబర్ 20 నుంచి 10 సర్వీసులు కాజీపేట రూరల్: దీపావళి పండుగను పురస్కరించుకుని దర్బాంగా–యశ్వంత్‌పూర్ మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే ఈ రైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 11 వరకు ప్రతీ సోమవారం దర్బాంగా–యశ్వంత్‌పూర్ (05541) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు యశ్వంత్‌పూర్–దర్బాంగా (05542) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. 3–ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్, సెకెండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీసులకు అప్ అండ్ డౌన్ రూట్లో సమస్థిపూర్, ముఝఫర్‌పూర్, హాజీపూర్, సోనాపూర్, చాప్రా, గ్రామీణ్, సివన్, డోరియోసాదర్, గోరఖ్‌పూర్, గోండా, బారబంకి, అశీశ్‌బాగ్, కాన్‌పూర్‌సెంట్రల్, ఓరియా, వీజీఎల్ ఝాన్సీ, బీనా, బోఫాల్, ఇటార్సీ, జోద్పూర్, కాబిన్, ఆమ్లా, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట జంక్షన్, కాచిగూడ, మహబూబ్‌నగర్, దోనే, ధర్మవరం, హిందుపూర్, ఎలహంకా స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. -
హైదరాబాద్ నుంచి వస్తుంది వాస్తవమే..
ఎంజీఎం: ‘వారానికి రెండు రోజులే’ శీర్షికన సాక్షిలో ప్రచుతరితమైన కథనంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్ స్పందించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కొంత మంది వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వచ్చి వెళ్తూ విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని ఆయన అంగీకరించారు. ప్రతీరోజు క్రమం తప్పకుండా విధులకు వస్తూ ఓపీ విభాగంలో రోగులకు సేవలందించడంతో పాటు మధ్యాహ్నం సమయంలో ఎంజీఎం ఆస్పత్రితో పాటు కళాశాల ప్రాంగణంలో వైద్యవిద్యార్థులకు సంబంధించిన అకడమిక్ విభాగాల్లో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల అటెండెన్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. వైద్య బోధన చేసే వైద్యులంతా తమ పేర్లతో పాటు ఫేస్ బేస్డ్ బయోమెట్రిక్ విధానానికి అనుసంధానం జరిగిందని తెలిపారు. కాగా, నిబంధనల ప్రకారం అత్యసవర పరిస్థితుల్లో ప్రాణాలు అందించే వైద్యులు హైదరాబాద్ నుంచి విధులకు రావొచ్చా? హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలా? అనే నిబంధన ఉందా.. అనే అంశంపై రాష్ట్ర స్థాయి అధికారులను అడిగి తెలుపుతామని సూపరింటెండెంట్ కిశోర్ పేర్కొన్నారు. విధులకు రాని రోజు సెలవు తీసుకుంటున్నారు ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్ -
బైక్ అదుపు తప్పి రైతు మృతి
పరకాల: కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి పరకాల మున్సిపాలిటీ పరిధి సీతారాంపూర్‌కు చెందిన రైతు మేకల బాపురావు(55) గురువారం మృతి చెందాడు. బాపురావు బైక్‌పై యూరియా బస్తా వేసుకుని పొలానికి వెళ్తుండగా.. రాజీపేట వద్ద కుక్క అడ్డు వచ్చింది. అతడి వాహనం అదుపుతప్పడంతో తలకు బలమైన గాయమైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బాపురావు మృతి చెందాడు. కాగా.. హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతికేవాడేమో అని స్థానికులు చర్చించుకున్నారు. పరకాల పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆస్పత్రి పనులు పూర్తిచేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఎంజీఎం: వరంగల్‌లో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిని కలెక్టర్ గురువారం సందర్శించి సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. సివిల్, ఎలక్ట్రికల్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి అంతస్తులోని నిర్మాణ స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ కిశోర్, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆర్‌ఎంఓలు, వివిధ విభాగాల అధిపతులు, ఆర్అండ్బీ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టాలి న్యూశాయంపేట: పారదర్శకంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లను చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం పత్తి, మొక్కజొన్నల కొనుగోళ్లపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ మద్దతు ధరలతో పంటల కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పాల్గొన్నారు. గడువులోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 9,457 ఇళ్లకు ఇప్పటివరకు 4,941 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. ఎస్‌హెచ్‌జీల నుంచి రుణాలు ఇప్పించి పెండింగ్‌లో ఉన్న 4,516 ఇళ్ల పనులు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీలో పని కల్పించుటకు జాబ్ కార్డులు అందించాలన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న, హౌసింగ్ పీడీ గణపతి, డీపీఓ కల్పన, పీఆర్ ఈఈ ఇజ్జగిరి పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి విద్యార్థులకు నాణ్యమైన విద్యఅందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యార్థులకు కల్పించాలని కనీస సదుపాయాలపై మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దే దేవాలయాలుగా నిలవాలన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎస్ఓ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
‘విజిలెన్స్’లో అక్రమార్కుడు
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిని ఎండగట్టి.. అక్రమార్కులపై చర్యలకు సిఫార్సు చేసే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఓ అక్రమార్కుడు అడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా నడుస్తోంది. విజిలెన్స్‌లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారికి నమ్మిన బంటైన సదరు కానిస్టేబు ల్ను ఏరి కోరి డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నారు. ఇంకా ఏముంది వసూళ్లకు పెట్టింది పేరైన సదరు కానిస్టేబుల్ పేరు చెబితే డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు కూడా చెమటలు పడుతున్నాయంటే ఆయన లీలలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు విచారణలు, తనిఖీలకు ప్రాధాన్యం ఉన్న విజిలెన్స్‌లో ఈ అక్రమార్కుడి సంపాదన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇసుక క్వారీలు, రైస్ మిల్లులు, గ్రానైట్ క్వారీలు, ఫర్టిలైజర్స్, ఇలా ఎక్కడ చూసినా తన చేతికి పనిచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంత చెబితే అంత! ఉద్యోగం కానిస్టేబులే అయినప్పటికీ పెత్తనం మాత్రం అంతా ఇంతా కాదు. ఆ శాఖలో పనిచేస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఇతగాడి నోటి నుంచి ఏం వస్తుందో.. దాని వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో.. అనే భయంతో వణికిపోతున్నట్లు సమాచారం. తనను ఏరి కోరి తెచ్చుకున్న బాస్‌కు అన్నీ తానై చేయడంతో మిగి లిన అధికారులంతా గప్‌చుప్‌గా ఉంటున్నారు. మట్టి, ఇసుక, గ్రానైట్ లారీలను పట్టాలన్నా.. వాటి కి జరిమానా విధించాలన్న ఆయన కనుసన్నల్లోనే జరగడం గమనార్హం. తనకు అనుకూలంగా ఉండే లారీల యజమానులకు ముందస్తుగా తనిఖీల సమాచారాన్ని చేరవేసి.. దానికి కాసుల రూపంలో ప్రతిఫలాన్ని పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా విజిలెన్స్ కార్యాలయంలో అధికారులను కలవాలంటే ముందుగా ఇతడిని ప్రసన్నం చేసుకున్న తర్వాతే దర్శనం దొరుకుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లి ఆయన పనులు గుట్టు చప్పుడు కాకుండా చేసుకుపోతున్నట్లు తెలిసింది.వసూళ్లలో దిట్ట పేరుకే కానిస్టేబుల్.. పెత్తనం పెద్దది లీకులకు పెట్టింది పేరు అక్కడ ఆయనే బాస్ -
రేవంతన్నతో గొడవల్లేవ్.. నా బిడ్డ అందుకే అలా మాట్లాడింది: కొండా మురళి
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ(మాజీ) సుమంత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణల చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. సుమంత్ వ్యవహారం, కూతురు సుస్మిత వ్యాఖ్యలపై కొండా మురళి గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదు. సెక్రటేరియట్లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.నా బిడ్డకు(సుస్మితను ఉద్దేశించి..) మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నేను మంత్రుల వద్దకు వెళ్తాను. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను... నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే. వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం అని మురళి అన్నారు.ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాజీ ఓస్డీని అర్ధరాత్రి తన కారులో మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొండా మురళి పరోక్షంగా స్పందించారు. కొండా సురేఖ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. ఈరోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్‌తో ప్రోగ్రామ్ ఉందని, దానికి ఆమె హాజరవుతారని అన్నారాయన. ఇదీ చదవండి: మా అమ్మ అరెస్టుకు కుట్ర జరుగుతోంది: కొండా సుస్మిత -
పశువులకు టీకాలు వేయించాలి
● డీవీహెచ్ఓ బాలకృష్ణ ఖానాపురం: రైతులు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని డీవీహెచ్ఓ బాలకృష్ణ సూచించారు. మండల కేంద్రంలోని పశువైద్యశాలలో బుధవారం గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. టీకాల కార్యక్రమం నవంబర్ 14 వరకు జిల్లా వ్యాప్తంగా కొసాసాగుతుందని తెలిపారు. టీకాలు వేస్తే పశువుల్లో అనేక వ్యాధులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. దూడల పెరుగుదలకు జాగ్రత్తలు పాటించాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా నివారణ చర్యలకు గ్రామీణ ప్రాంతాల్లో గోపాలమిత్రలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అనంతరం టీకాల పంపిణీపై ముద్రించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఏడీఏ బీఎన్‌రెడ్డి, పశువైద్యాధికారులు సాధినేని శ్రీలక్ష్మి, వింధ్య, సిబ్బంది, గోపాలమిత్రలు పాల్గొన్నారు. -
కలిసిరాని సాగు
భారీ వర్షాలతో తగ్గిన పత్తి, మొక్కజొన్న దిగుబడి● జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం ● పెట్టుబడి కూడా రాని పరిస్థితి ● మార్కెట్లో పంటలకు లభించని మద్దతు ధరనర్సంపేట: ప్రకృతి విపత్తులు, పంటలకు తెగుళ్లు ఆశించడం, పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడం, మద్దతు ధర లేకపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయం అంటేనే బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది భారీ వర్షాల వల్ల జిల్లాలో పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులకు కోలుకోలేని నష్టం కలిగింది. పత్తి పంట ఎర్రబడి ఎదగకపోవడంతో గతం కంటే 80 శాతం దిగుబడి తగ్గింది. మొ క్కజొన్న పంటది కూడా అదే పరిస్థితి ఉండడంతో రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. 15 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు.. జిల్లాలో 15 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. పంట వేసిన మొదట్లో కత్తెర పురుగు సోకడంతో రైతులు పెట్టుబడి భారీగా పెట్టారు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిసి దిగుబడి తగ్గింది. ఎకరాలకు 30 నుంచి 40 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 15 నుంచి 20 క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా బుధవారం నుంచి కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించినా జిల్లాలో కనిపించని పరిస్థితి నెలకొంది. క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్‌కు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. 1,18,026 ఎకరాల్లో పత్తి.. జిల్లాలో 1,18,026 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పత్తి పంట సాగుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదట్లో కురిసిన కొద్దిపాటి వర్షానికి పత్తి గింజలను కొనుగోలు చేసి విత్తారు. వర్షాలు ముఖం చాటేయడంతో మొలక దశలోనే ఎండిపోయాయి. తిరిగి రెండోసారి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు పత్తి పంటను సాగు చేయగా పెట్టుబడి రెండింతలు అయ్యింది. భారీ వర్షాలతో పత్తి పంటలో పూత, కాత రాలిపోయి కొద్దిపాటి దిగుబడే వచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉంది. అప్పులు చేసి పత్తి పంట కాపాడుకున్నప్పటికీ మార్కెట్లో ధర రూ.5,500 వరకు మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. దీపావళి తర్వాత సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులు మాత్రమే పత్తిని విక్రయించుకునే పరిస్థితి ఉంది. -
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: బల్దియా ఆవరణలోని ప్లానిటోరియం పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లను ఆదేశించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులు బుధవారం మేయర్ తనిఖీ చేసి, ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాధికారులతో సమీక్షించారు. 15వ ఫైనాన్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతితో పాటు ప్లానిటోరియం పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, అకౌంట్స్ అధికారి శివలింగం, జేఏఓ సరిత, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, మహేందర్, డీఈలు కార్తీక్‌రెడ్డి, రోజారాణి, రాగి శ్రీకాంత్, ఏఈ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూసేకరణ పూర్తిచేయాలి
న్యూశాయంపేట: జిల్లా నుంచి వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేకు భూసేకరణ పూర్తిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో భూసేకరణపై కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ నిర్మించనున్న ఎన్‌హెచ్–163జీకి 165.11 హెక్టార్ల భూసేకరణకు ఇప్పటివరకు 159.96 హెక్టర్ల భూసేకరణ పూర్తి అయిందన్నారు. కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్న మిగిలిన 27.21 హెక్టార్ల భూసేకరణను ఈనెల 21లోగా పూర్తిచేయాలని, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం త్వరితగతిన చెల్లించి ల్యాండ్ అక్విజేషన్ పూర్తిచేయాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్య, ఏడీ సర్వేల్యాండ్స్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, గీసుకొండ, సంగెం, నెక్కొండ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు ఏర్పాట్లు ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఈసారి ఖరీఫ్‌లో 3,15 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు, కొనుకోళ్లకు 258 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాకు 120–0 అదనపు టార్పాలిన్లు కేటాయించాలని కోరారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 2,389, సాధారణ రకానికి 2,369 చెల్లించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, మేనేజర్ సంధ్యారాణి, వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
– 10లోuనర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గార్డెన్లో మాత యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందుగా కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు చల్లి మాధవరెడ్డిని పరామర్శించారు. అంతకుముందు సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ● డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గీసుకొండ: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో పల్లెదవాఖాన వైద్యులు, సూపర్వైజర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేని పిల్లలను గుర్తించి పీహెచ్‌సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలందించాలన్నారు. ప్రోగ్రాం అధికారులు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించి అనుకున్న ఫలితాలు రాబట్టాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు భూక్యా లక్ష్మి. చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామానికి చెందిన ఆమె తనకు ఉన్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసింది. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తదనుకుంటే భారీ వర్షాలతో 30 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. విక్రయించేందుకు నెక్కొండ వ్యవసాయ మార్కెట్‌కు మక్కలను తీసుకెళ్తే కుంటి సాకులు చెబుతూ క్వింటాలుకు రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర చెల్లించకపోవడంతో వ్యాపారులు, మార్కెట్ వర్గాలు కుమ్మకై ్క తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నారని లక్ష్మి వాపోతోంది. ఈ పరిస్థితి జిల్లాలో మొక్కజొన్న పంట సాగుచేసిన అనేక మంది రైతులు ఎదుర్కొంటున్నారు. -
మరో ఇద్దరి అరెస్ట్
ధాన్యం కొనుగోళ్లలో వెలుగుచూస్తున్న అక్రమాలుశాయంపేట: మండలంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన మరో ఇద్దరు వ్యక్తులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు శాయంపేట సీఐ రంజిత్ రావు, ఎస్సై పరమేశ్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో తేలిందని పేర్కొన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడైన బెజ్జంకి శ్రీనివాస్ సడ్డకుడు వరంగల్ కొత్తవాడకు చెందిన వడ్లూరి రాజేందర్, ప్రధాన నిందితుడికి సహకరించిన మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన బండ లలితను పట్టుకొని వారి వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రంజిత్‌రావు తెలిపారు. కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ క్యాంపస్‌లో ఓ విద్యార్థిపై బుధవారం కుక్కలు దాడి చేశాయి. తీవ్రగాయాలపాలు కాగా చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్యాంపస్‌లోని హాస్టల్, తరగతి గదులతోపాటు ఆడిటోరియం ప్రాంతాల్లో కోతులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
రైల్వే మల్టీ యూనిట్ పనులు వేగవంతం చేయాలి
కాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మల్టీ యూనిట్ నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఆర్.గోపాలకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కాజీపేట రైల్వే మల్టీ యూనిట్ నిర్మాణ పనుల్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రైల్వే మల్టిపుల్ యూనిట్ లేఔట్‌ను పరిశీలించి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులు సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్యపురం భూనిర్వాసితులు డీఆర్ఎం గోపాలకృష్ణన్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం కాజీపేట యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సైడింగ్, కాజీపేట ఎలక్ట్రిక్ లోకో షెడ్డుకు వెళ్లి అక్కడ యాంటీ కొలెజన్ డివైజ్ లోకో సిస్టంతో పాటు ఇతర విభాగాలను, డీజిల్ లోకోషెడ్డులో తనిఖీలు చేపట్టారు. వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ టెస్టింగ్, రూంను ప్రారంభించి, షెడ్డులో వేస్టేజ్ మెటీరియల్స్‌తో రైల్వే టెక్నీషియన్లు చేసిన స్క్రాప్ టు ఆర్ట్ గ్యాలరీని తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. డీజిల్ షెడ్డులో మొక్క నాటారు. అధికారులతో మాట్లాడి షెడ్డు అభివృద్ధి, సమస్యలు తెలుసుకున్నారు. కాజీపేట జంక్షన్లో జరుగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనుల్ని తనిఖీ చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీర్ఎం స్పిక్‌లో సికింద్రాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. డీఆర్ఎం వెంట సికింద్రాబాద్ సీనియర్ డీఓఎం సురేశ్‌రెడ్డి, సికింద్రాబాద్ కో–ఆర్డినేషన్ కె.రవీంద్రనాథ్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్, ఆర్వీఎన్ఎల్ జీజీఎం మురళీకృష్ణ, పవర్‌మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఏజీఎం సీహెచ్.కృష్ణ, పీఎంసీ శివరామకృష్ణ, కాజీపేట సీనియర్ డీఎంఈ వెంకటకుమార్, కాజీపేట సీనియర్ డీఈఈ సూర్యనారాయణ, ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ, స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే సూపర్వైజర్లు ఉన్నారు. సికింద్రాబాద్ డీఆర్ఎం గోపాలకృష్ణన్ అభివృద్ధి పనుల తనిఖీ డీజిల్ షెడ్డులో వీసీబీ రూం ప్రారంభం -
కేయూలో ఇక ఎఫ్ఆర్ఎస్ హాజరు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో, వర్సిటీ కాలేజీల్లోనూ తొలుత అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అటెండెన్స్‌ను అమలుచేయనున్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీలోని అకాడమిక్ కమిటీ హాల్లో కాలేజీల ప్రిన్సిపాళ్లతో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ డిజిటల్ కన్సార్టియం ప్రతినిధులు హాజరై ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పరికరాలు, మొబైల్ సిస్టమ్‌లో అటెండెన్స్ తీసుకునే విధానంపై డెమో ఇచ్చి అవగాహన కల్పించారు. తొలుత మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో.. క్యాంపస్‌లోని మహిళా ఇంజనీరంగ్ కాలేజీలో పైలెట్ ప్రాజెక్టుగా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో పరికరాలను కళాశాలలో ఏర్పాటుచేయనున్నారు. ఆ తరువాత టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తరువాత విద్యార్థులకు కూడా వర్తింపజేస్తారు. వెంటనే మిగతా యూనివర్సిటీ కళాశాలల్లో, వివిధ విభాగాలల్లో అమలు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా కొద్దిరోజుల్లోనే పూర్తిచేయాలనే యోచనలో యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. సమయపాలన పాటించడం లేదని.. కేయూలో టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు సమయం పాలన పాటించడం లేదు. అలాగే వివిధ విభాగాల్లో, కాలేజీల్లో విద్యార్థులు కూడా కొందరు సరిగా తరగతులకు హాజరుకావడం లేదు. ఇప్పటికే పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ సత్ఫలితాలిస్తున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నత విద్యాశాఖ అధికారులు వర్సిటీల్లోనూ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌ను అమలుకు చేయాలనే ఆదేశించారు. దీంతో కాకతీయ యూనివర్సిటీలో అమలు చేయనున్నారు. తొలుత టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు ఆ తర్వాత విద్యార్థులకు కూడా.. పైలెట్ ప్రాజెక్టుగా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అమలు -
మురుగు.. ఇక కనుమరుగు
పరకాల: ఇళ్ల ఎదుట మురుగునీరు, అస్తవ్యస్తమైన డ్రెయినేజీలతో దోమలు వృద్ధి చెంది జ్వరాలబారిన పడిన పరకాల మున్సిపాలిటీ ప్రజల కష్టాలు తీరాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్‌డీసీ) నుంచి రెండో విడత మంజూరైన రూ.15 కోట్ల నిధులతో పరకాల పట్టణంలో డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. దీంతో 30 సంవత్సరాలుగా వేధిస్తున్న డ్రెయినేజీ సమస్య పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.10.50 కోట్లతో పట్టణంలో సుమారు 10.5 కిలోమీటర్ల డ్రెయినేజీ, రూ.4.5 కోట్లతో మూడు కిలోమీటర్ల సీసీ రోడ్డు ని ర్మాణ పనులు చేపట్టారు. వర్షాకాలంలో ప్రజలు ఇ బ్బందులు పడకుండా డ్రెయినేజీ పనులు చేపట్టా లని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. దీందో ముంపు సమస్య ఉన్న ప్రాంతాల్లో 70 శాతం పనులు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో కాలనీల్లో పర్యటనకు వచ్చిన రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్నామని, చాలా సంవత్సరాల తర్వాత డ్రెయినేజీ సమస్య పరిష్కారమైందని ప్రజలు సంబురపడుతున్నారు. సమస్య పరిష్కారమైంది.. వాస్తవానికి మా కాలనీలో 30 ఏండ్ల క్రితం డ్రెయినేజీ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి మళ్లీ కొత్త డ్రెయినేజీల నిర్మాణ లేకపోవడంతో పాతవి మట్టిలో కూరుకుపోయాయి. దీంతో ఇళ్ల నుంచి మురుగునీరు బయటకు పోలేక ఇబ్బందులు పడ్డాం. కొత్త డ్రెయినేజీల నిర్మాణంతో సమస్య పరిష్కారమైంది. – బాలాజీ రవి, వడ్లవాడ, పరకాల వర్షకాలంలో మురుగునీరు వచ్చేది.. వర్షాకాలం వచ్చిందంటే చాలా భయపడేవాళ్లం. వర్షపునీటితో పాటు మురుగునీరు ఇండ్లలోకి చేరుకోవడం కారణంగా చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఈ విషయంపై సాక్షి ద్వారా అనేకసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నాం. కొత్త డ్రెయినేజీల నిర్మాణంతో సమస్యపోయి ఊపిరి పీల్చుకుంటున్నాం. – కురికాల జనార్దన్‌రావు, బ్రాహ్మణవాడ, పరకాల పరకాల పట్టణంలో డ్రెయినేజీల నిర్మాణం రూ.15 కోట్ల టీయూఎఫ్‌డీసీ నిధులతో పనులు 30 ఏళ్ల తర్వాత తీరిన డ్రెయినేజీ సమస్య హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీల ప్రజలు -
పరువు నష్టం దావా నోటీసులు
కమలాపూర్: మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసినట్లు బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బండి కళాధర్ తెలిపారు. కమలాపూర్‌లోని ఈటల నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో రాతలు రాసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పీఏ భోగం అజయ్, కమలాపూర్‌కు చెందిన మాట్ల రాజ్‌కుమార్, ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన జవ్వాజి కుమారస్వామి, ఇల్లందకుంటకు చెందిన దాంసాని కుమార్, జమ్మికుంటకు చెందిన పొంగంటి సంపత్, వీణవంక మండలం ఎలుబాకకు చెందిన ఎడ్ల రాకేశ్, వీణవంకకు చెందిన తాళ్లపెల్లి మహేశ్‌గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ఒక్కొక్కరిపై రూ.2 కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ఈటల రాజేందర్‌పై అసత్యపు ఆరోపణలు చేసినా, కించపర్చేలా మాట్లాడినా, దూషించినా సహించేది లేదని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాంకేతిక మహోత్సవానికి ఏర్పాట్లు
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–25న ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించేందుకు నిట్ విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2006లో ప్రారంభమైన టెక్నోజియాన్ టెక్నాలజీని పంచుకునేందుకు, నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఈవేడుకకు దేశవ్యాప్త వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సుమారు 7 వేల మంది హాజరుకానున్నారు. టెక్నోజియాన్–25లో నిర్వహించే పోటీలకు రూ.2 లక్షలు బహుమతులు అందజేయనున్నారు. టెక్నోజియాన్–25లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ కోసం https:// technozion. nitw.ac.in/ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీం.. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ చీఫ్ ప్యాటరన్‌గా, ప్యాటరన్స్గా డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్‌కుమార్, స్యాక్ ప్రెసిడెంట్ హరిప్రసాద్‌రెడ్డి, వెంకన్న ఉడుతలపల్లి, స్టూడెంట్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీలు సాయి వంశీ, కార్తీక్‌రెడ్డి, హర్ష, సమన్విత్రెడ్డి, జాయింట్ సెక్రటరీలు ధీరజ్, పవన్, అభిరామ్, వెబ్ టీం నితిన్, బి.రిషి, సాయిరుషిత్, అమన్, భరత్జౌన్తో కూడిన ప్రత్యేక టీం టెక్నోజియాన్–25ను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో... ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో సాంకేతిక మహోత్సవం ఈ ఏడాది కూడా ప్రత్యేక థీంతో ఈ నెల 23న ఆవిష్కరించనున్నారు. కాగా 2022లో టెక్స్టేసీగా, 2023లో ఇంజీనియస్‌గా, 2024లో టెక్నోజియాన్గా ప్రత్యేక థీంతో ముందుకు సాగింది. అలరించనున్న టెక్నోజియాన్–25.. టెక్నోజియాన్–25లో స్పాట్‌లైట్స్, ప్రాజెక్ట్ ఎక్స్పో, నియాన్ క్రికెట్, జహాజ్, హోవర్ మానియా, డ్రోన్ హంట్, హాకథాన్ వంటి 50కి పైగా ఈవెంట్స్‌తో పాటు సాంకేతిక విజ్ఞానాన్ని అందించనుంది. ఈనెల 24, 25 తేదీల్లో నిట్‌లో టెక్నోజియాన్–25 హాజరుకానున్న 7 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు 23న లాంఛనంగా ప్రారంభం -
కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయిక్ పరకాల: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా పదవులు వస్తాయని ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందని, పార్టీ నాయకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్హాల్లో మంగళవారం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నవజ్యోతి పట్నాయక్ నియోజకవర్గంలోని ముఖ్యనాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అదేవిధంగా కోసం కష్టపడేవారికి ఎలాంటి అన్యాయం జరుగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, పీసీసీ కోఆర్డినేటర్ ఆదర్శ్జైస్వాల్, పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక పాల్గొన్నారు. -
వరంగల్‌కు నేడు సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్‌లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్‌కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1 గంటకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని పీజీఆర్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్ నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీ వెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు.. 2 గంటలకు తిరుగు పయనం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న ముఖ్యమంత్రి -
చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ వరంగల్ లీగల్: స్వదేశీ వస్త్రాలు, చేనేత వస్రాలను ప్రోత్సహించాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం–వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం కేంద్రాన్ని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావుతో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి నిర్మలాగీతాంబ మాట్లాడుతూ మన వాతావరణానికి చేనేత వస్త్రాలు శాసీ్త్రయంగా చల్లదనంతో పాటు సౌలభ్యంగా ఉంటాయని తెలిపారు. సింఽథటిక్తో తయారుచేసిన విదేశీ వస్త్రాలు సౌకర్యవంతంగా ఉండవని పేర్కొన్నారు. చేనేత ప్రదర్శన, అమ్మకం కౌంటర్ నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, కార్యదర్శి రమాకాంత్, ఉపాధ్యక్షుడు జయపాల్, కోశాధికారి అరుణ, సీనియర్ న్యాయవాదులు జీవన్‌గౌడ్, ఆనంద్‌మోహన్, కొండబత్తుల రమేశ్‌బాబు, చిర్ర సాంబశివరాజు, రాచకొండ కృష్ణ, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ నడికూడ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. రాయపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆమె సందర్శించారు. పాఠశాలల్లో మధ్యాహ భోజనం, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన స్థాయిలను పరీక్షించారు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాల్లో మెనూచార్ట్, అంగన్వాడీ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి, ఉత్తమ ఫలితాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, తహసీల్దార్ రాణి, ఎంఈఓ కె.హనుమంతరావు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
మామునూరు హద్దుల స్థిరీకరణపై దృష్టి
సాక్షి, వరంగల్: వరంగల్వాసుల చిరకాలకోరిక అయిన మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయం పునరుద్ధరించడానికి అవసరమైన మరో 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం భూనిర్వాసితుల నుంచి సేకరించి కేంద్రానికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో భూనష్టపరిహారం నగదు జమ అవుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఆ భూముల హద్దుల స్థిరీకరణకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఏఏఐ ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 30 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బిడ్లను వేయడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే కొన్ని డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ బిడ్‌ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపాయి. త్వరలోనే ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ హద్దుల స్థిరీకరణ బాధ్యతలు అప్పగించి విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తారని విమానాశ్రయ అధికారులంటున్నారు. మిగిలిన పరిహారానికి ప్రతిపాదనలు.. ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 253 ఎకరాలను గుర్తించి ఆయా భూయజమానులతో దఫాలవారీగా సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూమి ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిసింది. మిగిలింది కూడా సాధ్యమైనంత తొందరగా ఇవ్వడం ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు అంటున్నారు. భూపరిహారానికి అదనంగా అవసరమయ్యే డబ్బుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవీ రాగానే అంతా క్లియర్ అవుతుందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏఏఐకి భూమి బదలాయించనున్నారు. పాత రోజులు గుర్తొచ్చేలా... కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్‌లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. మళ్లీ పాత రోజుల్లోలాగానే వరంగల్‌లో విమానం ఎగిరేలా అధికారులు పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మూడు గంటల ప్రయాణం ఉంటుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ సంస్థల ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణ, ఇతర వ్యాపారాల అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని మరింత ప్రగతి బాట పట్టించేందుకు ఈ విమానాశ్రయం పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది. కరీంనగర్‌తో పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడేలా ఆయా మార్గాల్లోని రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరో రెండేళ్లలో మాము నూరు విమానాశ్రయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. విమానాశ్రయం పునరుద్ధరణపై ప్రభుత్వ విభాగాల కసరత్తు ఇప్పటికే బిడ్లను పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 949.14 ఎకరాల హద్దులకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల ఆసక్తి ఇది ఫైనల్ కాగానే నివేదికను సిద్ధం చేసి ఏఏఐకి అప్పగింత -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు.. ఇద్దరి అరెస్ట్
శాయంపేట: మండలంలోని కాట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పరకాల ఏసీపీ సతీశ్ బాబు, శాయంపేట సీఐ రంజిత్‌రావు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కాట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలో తేలిందని పేర్కొన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు కాట్రపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ ట్యాబ్ ఆపరేటర్ వాంకుడోతు చరణ్ నుంచి రూ.20 వేల నగదు, సెల్‌ఫోన్, కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ అల్లె అనిత నుంచి ట్యాబ్, టోకెన్ షీట్ బుక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. -
84,654 మందికి పోలియో చుక్కలు
ఎంజీఎం: హనుమకొండ జిల్లాలో 84,654 మంది (100.4 శాతం) పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం 472 పోలియో కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్, మొబైల్ బృందాలతో పోలియో చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేసిన కార్యక్రమాన్ని పరిశీలించినట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, నర్సింగ్ విద్యార్థులు పాలుపంచుకున్నట్లు పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ద్వారా 1 జూలై 2017 నుంచి 31 అక్టోబర్ 2025 మధ్య కాలంలో సంస్థలో చేరిన, ఈపీఎఫ్‌లో నమోదు కాకపోయిన, ప్రస్తుతం జీవించి ఉన్న, ఉద్యోగంలో ఉన్నవారిని ఈపీఎఫ్ఓ అందించే ఆన్లైన్ సౌకర్యం ద్వారా సంస్థలు ఉద్యోగుల నమోదు చేసుకోవాలని వరంగల్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్–2 వైడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని ద్వారా ఉద్యోగుల సామాజిక భద్రత కవరేజీ పెరుగుతుందని, సంస్థలు తక్కువ ఆర్థిక, చట్టపరమైన భారంతో గత రికార్డులను సాధారణీకరించుకోవచ్చని, వ్యాపార నిర్వహణ సులభతరమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు వరంగల్ ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించాలని ఆయన సూచించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. మూడు నెలల 20 రోజుల హుండీ ఆదాయం 5,56,967 రూపాయలు, పూజా టికెట్ల ద్వారా రూ.6,30,000 వచ్చింది. మొత్తం ఆదాయం రూ. 11,86,967 సమకూరిందని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ విడుదల చేసిన జిమ్నాస్టిక్ డిప్లొమా ఇన్ కోచింగ్ 2024–25 ఫలితాల్లో వరంగల్ జిమ్నాస్ట్‌లు జాతీయస్థాయిలో టాప్ ర్యాంకులు సాధించారు. వరంగల్‌లోని ఉర్సుకు చెందిన పేర్న సూర్యదేవ్ 72.12 శాతం మార్కులతో మొదటి ర్యాంకు, హనుమకొండలోని గుడిబండల్‌కు చెందిన జంగా శివసాయి 68.07 శాతంతో నాలుగో ర్యాంకు, లష్కర్బజార్కు చెందిన తెల్లి ప్రశాంత్ 60.83 శాతంతో సెకండ్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిమ్నాస్టిక్ అకాడమీలో 2009 నుంచి 2021 వరకు ముగ్గురు క్రీడాకారులు శిక్షణ పొందారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి అనేక జాతీయస్థాయి జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వరంగల్ ఖ్యాతిని దేశం నలుమూలల చాటిన ముగ్గురు క్రీడాకారులను జిమ్నాస్టిక్స్ వరంగల్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ నెమరుగొమ్ముల రమేశ్‌రావు అభినందించారు. -
విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు విద్యారణ్యపురి: విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యా యమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని లష్కర్‌బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివితే ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. బాలికలకు సురక్షిత, ఆరోగ్యకర, సమానమైన భవిష్యత్ అందించడం మనందరి బాధ్యత అన్నారు. సదస్సులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు దామోదర్, జిల్లా బాలల పరిరక్షణ విభా గం ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్, సఖీవన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి.హైమవతి, మహిళా సాధికారిత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డి.కల్యాణి, హనుమకొండ సీడీపీఓ ఎం.విశ్వజ, భరోసా కేంద్రం ఎస్సై బి.మంగ, పాఠశాల హెచ్ఎం ఉమ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
వరంగల్
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025బాలికలకు భరోసా.. ఈ విద్యాసంవత్సరం పీఎంశ్రీ పాఠశాలల్లో బాలికల సాధికారత, కౌమార దశ భద్రత క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సమగ్రశిక్ష అధికారులు ఆదేశించారు. మామునూరు హద్దుల స్థిరీకరణపై దృష్టి విమానాశ్రయం పునరుద్ధరణపై ప్రభుత్వ విభాగాల కసరత్తు ఇప్పటికే బిడ్లను పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 949.14 ఎకరాల హద్దులకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఆసక్తి ఇది ఫైనల్ కాగానే నివేదికను సిద్ధం చేసి ఏఏఐకి అప్పగింత -
ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం
● ఏసీపీ అంబటి నర్సయ్య రాయపర్తి: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్స య్య అన్నారు. మంగళవారం రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో దాతల సహకారంతో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యా పార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మైలారం గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ముత్యం రాజేందర్, పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వడివడిగా..
సాక్షి, వరంగల్: జిల్లావాసుల చిరకాలకోరిక అయిన మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయం పునరుద్ధరించడానికి అవసరమైన మరో 253 ఎకరాలను ప్రభుత్వం భూనిర్వాసితుల నుంచి సేకరించి కేంద్రానికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో భూనష్టపరిహారం నగదు జమ అవుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఆ భూముల హద్దుల స్థిరీకరణకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఏఏఐ ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 30 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బిడ్లను వేయడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే కొన్ని డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ బిడ్‌ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపాయి. త్వరలోనే ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ హద్దుల స్థిరీకరణ బాధ్యతలు అప్పగించి విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తారని విమానాశ్రయ అధికారులంటున్నారు. మిగిలిన పరిహారానికి ప్రతిపాదనలు.. ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 253 ఎకరాలను గుర్తించి ఆయా భూ యజమానులతో దఫాలవారీగా సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూమి ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిసింది. మిగిలింది కూడా సాధ్యమైనంత తొందరగా ఇవ్వడం ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు అంటున్నారు. భూపరిహారానికి అదనంగా అవసరమయ్యే డబ్బుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవీ రాగానే అంతా క్లియర్ అవుతుందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏఏఐకి భూమి బదలాయించనున్నారు.పాత రోజులు గుర్తొచ్చేలా...కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్‌లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1,400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. మళ్లీ పాత రోజుల్లోలాగానే వరంగల్‌లో విమానం ఎగిరేలా అధికారులు పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మూడు గంటల ప్రయాణం ఉంటుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమల ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణ, ఇతర వ్యాపారాల అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని మరింత ప్రగతి బాట పట్టించేందుకు ఈ విమానాశ్రయం పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది. కరీంనగర్‌తో పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడేలా ఆయా మార్గాల్లోని రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరో రెండేళ్లలో మామునూరు విమానాశ్రయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. -
జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు
● జిల్లా వ్యవసాయాధికారి అనురాధ సంగెం: రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ అన్నారు. మంగళవారం సంగెం మండల రైతువేదికలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వీడియో కాన్ఫరెన్స్‌ను వీక్షించారు. అనంతరం వరి, పత్తి పంటల కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పత్తి నాణ్యత ప్రమాణాలను వివరించారు. మండలంలోని చింతలపల్లిలో క్షేత్రస్థాయిలో పత్తి పంటను సందర్శించి చీడపీడల నియంత్రణ, వరి, మొక్కజొన్న పంటలపై నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. నల్లబెల్లిలో పంటల నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నర్సింహరావు, ఏఓ జ్యోత్స్నభవాని, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ సత్యశారద ● నర్సంపేట బీసీ బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ నర్సంపేట: వసతి గృహాల్లో మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని బీసీ బాలు ర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వి ద్యార్థులు, సిబ్బంది వివరాలు, రిజిస్టర్లు, వంట గది, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ మెనూ ప్రకారం రుచి కర మైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులు హాస్టల్‌కు వచ్చివెళ్లే టప్పుడు కేర్‌టేకర్ వెంట ఉండాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం బీసీ హాస్టల్స్ విద్యార్థులు మెరుగైన ఫలితా లు సాధించేందుకు కృషిచేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులను సబ్జెక్టు వారీగా ప్రశ్నలు అడిగా రు. హాస్టల్ పరిసరాలు, ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి పుష్పలత, వసతి గృహ సంక్షేమ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు. -
వారానికి రెండ్రోజులే..!
ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల తీరుపై కొన్ని నెలలుగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో రోగులను ఈ ఆస్పత్రికి తీసుకురావడానికి పేదలు సైతం జంకే పరిస్థితి నెలకొంది. కీలక విభాగాల వైద్యులందరూ హైదరాబాద్‌నుంచి వరంగల్ నగరానికి అప్‌అండ్‌డౌన్ చేస్తున్నారు. దీనివల్ల ఆస్పత్రికి సమయానికి రాకపోవడం.. తొందరగా వెళ్తుండడంతో ప్రజలకు సరైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంజీఎంపై పేద ప్రజలకు భరోసా కల్పించడానికి కలెక్టర్ ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా, ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రాని పరిస్థితి. గతంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మూడు సార్లు పర్యటించి వైద్యుల గైర్హాజరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా నామమాత్రంగా మెమోలు జారీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిపై జిల్లా మంత్రి, ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించి పేదలు ప్రాణా లకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌పై చర్యలు శూన్యం ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది హాజరుశాతం కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు నామమాత్రంగా మారాయి. ఈపరికరాల ద్వారా నమోదైన హాజరుతో ఇంత వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం.. వేతనాల్లో కోత విధించకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రజాప్రతినిధులారా దృష్టి సారించండి.. వేలాది మంది వైద్యం కోసం ప్రాణాలు అరచేతిలో పట్టుకునే వచ్చే ఎంజీఎం ఆస్పత్రి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించాలని పేదలు వేడుకుంటున్నారు. మందుల సరఫరాతో పాటు వైద్యసేవలు, పూర్తిస్థాయి అధికారులను నియమించి పేదల ఆరో గ్యానికి భరసా కల్పించాలని వేడుకుంటున్నారు. ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు.. ఎంజీఎం ఆస్పత్రిలో పలు విభాగాల్లో విధులు నిర్వర్తించే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వేతనాలు ఇస్తోంది. వా రు యూనిట్ చీఫ్‌గా ఉన్నా.. వారానికి ఒకటి, రెండు రోజుల్లో కనీసం మూడు గంటల పాటు మాత్ర మే విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య చెప్పుకుందామని వెళ్తే ఆర్‌ఎంఓల కుర్చీలు ఎప్పుడు చూసినా ఖాళీగా దర్శనమిస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ఈ విష యం కలెక్టర్‌తోపాటు, ఎంజీఎం సూపరింటెండెంట్‌కు స్పష్టంగా తెలుసు. కానీ, వీరిపై చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని పరిపాలనాధికారులు పేర్కొంటున్నారు. వీరిపై రాష్ట్రస్థాయిలో డీ ఎంఈ స్థాయి అధికారి మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉండడం వీరికి వరంగా మారింది. హైదరాబాద్ నుంచి అప్అండ్డౌన్ఆస్పత్రిలోని కీలక మెడిసిన్, ఆర్థోపెడిక్, సర్జరీ, పిడియాట్రిక్, డెర్మటాలజీ, సైకియాట్రిస్ట్ వంటి విభాగాల్లోని సుమారు 25 మందికిపైగా వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి అప్‌అండ్‌డౌన్ చేస్తున్నారు. ప్రతీ విభాగంలో ముగ్గురునుంచి నలుగురు వైద్యులు ఈరకంగా ప్రయాణం చేస్తున్నారు. హాజరు శాతం కోసం వస్తూ లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. పేద ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా మిగతా జిల్లాల్లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులను బదిలీ చేసింది. ఈక్రమంలో ఎంజీఎంలో ఉన్న వైద్యులు నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, జనగామ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బదిలీ కాగా, హైదరాబాద్‌లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులు ఎంజీఎంకు బదిలీ అయ్యారు. అసలు సమస్య అప్పుడే మొదలైంది. సాధారణ బదిలీల తర్వాత పాలన ఎలా సాగుతుందనే విషయంపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల పేద ప్రజలకు శాపంగా మారింది. -
యువతలో మానసిక స్థైర్యం కల్పించాలి
నర్సంపేట: యువతలో మానసిక స్థైర్యం కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యు అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ సౌజన్యంతో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మారుతున్న అలవాట్లకు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు. మహిళా సాధికారిక విభాగం అధ్యక్షురాలు ఎస్.రజిత మా ట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. గెలుపొందిన వారికి త్వరలో బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిక విభాగం సభ్యులు డాక్టర్ సంధ్య, మాధవి, అకాడమీ కో ఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, ఎన్ఎస్ఎస్ జిల్లా బాధ్యులు డాక్టర్ ఎం.రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలి
రాయపర్తి: సాదాబైనామా దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. మంగళవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 22ఎ రిజిస్టర్లు, సాదాబైనామా దరఖాస్తులు పరిశీలించారు. రైతులు దరఖాస్తు చేసుకున్న సాదాబైనామాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ గంకిడి శ్రీనివాస్‌రెడ్డి, సర్వేయర్ వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి నర్సంపేట: నర్సంపేట పట్టణం మహబూబాబాద్ రోడ్డులో కబ్జాకు గురైన సర్వే నంబర్ 121 ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు మైసీ శోభన్, రాష్ట్ర నాయకుడు ఆరేపెల్లి బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకుల బృందం మంగళవారం కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత రెవెన్యూ అధికారులు అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలన్నారు. లేదంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నివేషణ స్థలాలు లేని నిరుపేదలతో గుడిసెలు వేయించి ధర్నా, రాస్తారోకోలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆకులపల్లి ఉప్పలయ్య, చిలపాక బాబు, స్వామి, నరేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి సెమినార్‌కు సుమలత దుగ్గొండి: రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సెమినార్‌కు మండలంలోని నాచినపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు వెలిదండి సుమలత ఎంపికయ్యారు. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఇంఫాక్ట్ ఆఫ్ కౌన్సెలింగ్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ క్యారీర్ చాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించింది. దీంతో బుధవారం జరిగే సెమినార్‌కు సుమలత ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎం జూలూరి జ్యోతిలక్ష్మీ, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక వర్ధన్నపేట: మండలంలోని ల్యాబర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న మంద నందిని రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ జలగం రఘువీర్ తెలిపారు. మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–17 వాలీబాల్ విభాగంలో అత్యున్నత ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోలీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నందిని పాల్గొననుందని తెలి పారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో నందినిని హెచ్ఎం లింగం శైలజ, పీఈటీ రఘువీర్ ఉపాధ్యాయులు, అభినందించారు. బీసీలను అణచివేసేందుకు కుట్ర నర్సంపేట రూరల్: బీసీలను అణచివేసేందుకు అగ్రకులాలు కుట్రలు పన్నుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీని వాస్ అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ మండల అధ్యక్షుడు యాక య్య ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా హైకోర్టులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు హైకోర్టులో పిటిషన్ చేశారన్నారు. తక్షణమే 42శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సంఘాలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రవి, మరుపాల వీరస్వామి, కడారి సురేష్, సంగెం రమేష్, మేరుగు శంకర్లింగం, ముత్యం చేరా లు, సుదర్శన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్‌కు నేడు సీఎం రేవంత్
● మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు ● 2 గంటలకు తిరుగు పయనం ● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న సీఎంసాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్‌లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంనుంచి డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్‌కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.00 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని పీజీఆర్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్య మంత్రి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీవెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
మార్పులకు అనుగుణంగా విద్యాబోధన
● డీఈఓ రంగయ్య నాయుడునర్సంపేట రూరల్: విద్యాపరంగా సాంకేతిక రంగా ల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబో ధన జరగాలని డీఈఓ రంగయ్యనాయుడు అన్నా రు. మంగళవారం నర్సంపేట మండలం బాలాజీ ఇంజనీరింగ్ కళాశాల, జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో డిజిటల్ లర్నింగ్‌పై గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ శిబిరాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడు తూ విద్యార్థులకు సాంకేతిక విద్యపై బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు సాంకేతికంగా కంప్యూటర్‌పై అవగాహన కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్య నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు కొర్ర సారయ్య, సరళ, శిబిరం ఇన్‌చార్జ్‌లు భిక్షపతి, పాపమ్మ, ఎస్ఆర్పీలు రాజప్రభు, సురేష్ కుమార్, సుధాకర్, గణేష్ కుమార్, ఉల్లాస్, రాజేంద్రప్రసాద్, డీఆర్పీలు, 13 మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించాలి
నెక్కొండ: పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ప్రతీ ఇంటికి సౌర విద్యుత్ వ్యవస్థను అందించేందుకు పాటుపడుతున్నాయని తెలంగాణ పునరుత్పాదక శక్తి ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ జిల్లా మేనేజర్ రాజేందర్ అన్నారు. స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సౌర విద్యుత్ అవగాహన సదస్సులో ఆయ న పాల్గొని మాట్లాడారు. సౌర విద్యుత్ పెంచడం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తాయన్నారు. జిల్లాలో తెలంగాణ రెడ్ కో పథకం కింద నెక్కొండ ఎంపిక కావడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ సబ్ఇంజనీర్ నరేశ్, సోలార్ ఫీల్డ్ అధికారి నవీన్, కార్యదర్శి సదానందం, కుసుమ చెన్నకేశువులు, కదురు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
భూ పరిహారం డిపాజిట్ చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూ సేకరణ పూర్తయిన రైతులకు పరిహారం చెల్లించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోజాతీయ రహదా రుల శాఖ, వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తి భరద్వా జ్, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. పరకాల డివిజన్ పరిధిలో సేకరించిన భూములకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆర్బిట్రేషన్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఇంకా ఆయా మండలాల పరిధి 10 గ్రామాలకు చెందిన 110 కేసుల్లో మొత్తం పరిహారం రూ.7.52కోట్లు, బావులు, చెట్లు, స్ట్రక్చర్‌కు సంబంధించి రూ.6.50 కోట్లు రావాల్సి ఉండగా వీటిపై కలెక్టర్ సమీక్షించారు. కాగా, పరిహారం పొందిన తర్వాత కూడా కొందరు రైతులు భూమి మోకాపై ఉండి పంటలు వేసుకున్నారని, ఆభూముల్ని జాతీయ రహదారుల శాఖకు అప్పగించాలని ఎన్‌హెచ్ పీడీ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రూ.15 లక్షలతో కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణం వరంగల్–ములుగు ప్రధాన రహదారిలో ఉన్న కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణ పనుల్ని రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణానికి సంబంధించి సాగునీటి పారుదల, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, సూపరింటెండెంట్ జగత్సింగ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జాతీయ రహదారుల శాఖ డీఈ కిరణ్‌కుమార్, ఏఈ చేతన్, సాగునీటిపారుదల శాఖ డీఈ సునీత, ఏఈ వేణుగోపాల్, అధికారులున్నారు. పోస్టర్ ఆవిష్కరణ‘సే నో టు డ్రగ్స్’లో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల ప్రమాదాలు, నిర్మూలనకు సంబంధించి చేపట్టే పలు అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణ, డీడబ్ల్యూఓ జయంతి, డీపీఆర్ఓ, ఎఫ్ఆర్ఓ, కమ్యూనిటీ ఎడ్యుకేటర్, సిబ్బంది పాల్గొన్నారు. -
వర్షంలోనూ బారులు
ఖానాపురం: పంటల సాగు చివరి దశకు చేరినా.. రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బారులు తీరారు. సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ గొడుగులతో వచ్చి టోకెన్లు తీసుకున్నారు. ఖానాపురం పరిధిలో బుధరావుపేటకు 444, మంగళవారిపేటకు 222, మనుబోతులగడ్డకు 222, అశోక్‌నగర్‌కు 333, దబ్బీర్‌పేటకు 222 బస్తాల యూరియా వచ్చింది. దీంతో రైతులు రైతువేదికలు, గ్రామ పంచాయతీల వద్దకు వెళ్లి వర్షంలో బారులుదీరి టోకెన్లు తీసుకున్నారు. -
మూక్స్ శిక్షణ ప్రారంభం
● నిట్ రాయపూర్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకువస్తున్న మూక్స్(మాసీవ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్)లను సద్వినియోగం చేసుకోవాలని నిట్ రాయపూర్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. నిట్ వరంగల్‌లోని సెమినార్‌హాల్ కాంప్లెక్స్‌లో వారం రోజుల మూక్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్వీ.రమణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకుని విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ప్రొఫెసర్ ఇందిరా కోనేరు యాలవర్తి, నిట్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పౌరుల భాగస్వామ్యమే కీలకం
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యమే అత్యంత కీలకమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా కార్యాలయంలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తిలకించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. బహిరంగంగా నిర్వహించే డంప్సైట్లతో ఉత్పన్నమయ్యే అంత్య ఉత్పన్నాలను విషపూరిత వాయువులను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యర్థాల నిర్వహణకు వరంగల్ ఒక బెంచ్‌మార్క్ నగరంగా అవతరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల ఆరోగ్యం ఘన వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడానికి ప్రముఖ జాతీయ పరిశోధన విధాన సంస్థల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఏసీపీలు ఖలీల్, ప్రశాంత్, రజిత, శ్రీనివాస్‌రెడ్డి, ఈఈలు రవికుమార్, మహేందర్, సంతోశ్‌బాబు, ప్రిన్సిపల్, సైంటిస్ట్ డా.ప్రతిభ గణేశన్ తదితరులు పాల్గొన్నారు. -
మా పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదు
న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ స్కీ (బీఎస్ఏ) కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నర్సంపేటకు చెందిన ఓ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ప్రజావాణిలో విద్యార్థి సంఘాలతో కలిసి కలెక్టర్ సత్యశారదకు మొరపెట్టుకున్నారు. నెలరోజులుగా పాఠశాలకు వెళ్లకుండా నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని డీఎస్‌డీఓను కలెక్టర్ ఆదేశించారు. అయినా సమస్యలను ఇప్పుడే పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కలెక్టర్ సమావేశ హాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు వారిని సముదాయించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో శాంతించారు. అనంతరం ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ సత్యశారద స్వీకరించారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 80 ఫిర్యాదులు రాగా రెవెన్యూ 40, జీడబ్ల్యూఎంసీ 6, హౌసింగ్ 4, డీఆర్డీఓ 4, మిగతాశాఖలకు సంబంధించి 26 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అలాగే తమ కుమారుడు (ప్రభుత్వ ఉద్యోగి) తమ బాగోగులు చూడటం లేదని కలెక్టర్‌కు విన్నవించారు. వర్ధన్నపేట సబ్ రిజిస్ట్రార్ ఏజెంట్ల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్య తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు ఈరెల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణం ఆపాలి వరంగల్ మట్టెవాడలోని సర్వేనంబర్ 442లోని ప్రభుత్వ భూమిలో కొంతమంది ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ సర్వే నంబర్లో జిల్లా కోర్టు ప్రభుత్వ భూమిగా గుర్తించినా.. నిర్మాణాలు జరుగుతున్నాయి. – బి.రాజు కొత్తవాడ, వరంగల్ ప్రజావాణిలో బీఎస్ఏ బాధితుల మొర వినతులు తక్షణమే పరిష్కరించాలి కలెక్టర్ సత్యశారద గ్రీవెన్స్‌లో 80 అర్జీలు -
ఆడపిల్లల హక్కుల గురించి తెలుసుకోవాలి
రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి హారిక గీసుకొండ: ఆడపిల్లలకు తమ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండాలని వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి హారిక అన్నారు. సోమవారం వంచనగిరి కేజీబీవీలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు విద్య, చట్టపరమైన హక్కులు, వైద్య సదుపాయం, సామాజిక భద్రత తదితర విషయాలపై అవగాహన కల్పించారు. లింగ వివక్షను రూపుమాపడానికి, మహిళా సాధికారతకు బాలికలు విజ్ఞానవంతులై చురుకుగా వ్యవహరించాలన్నారు. వేధింపులు, అత్యాచారాల బాధిత బాలికలు 1096,100, 9391907363 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఎస్సై రోహిత్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ సురేశ్, అసిస్టెంట్ కౌన్సిలర్ రజిని, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వర్షార్పణం..
జిల్లా వ్యాప్తంగా దంచికొట్టిన వానఈ ఫొటోలో తడిసిన మొక్కజొన్నను ఆరబెడుతున్న యువరైతు రెడ్డి కృష్ణ. దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామం. వ్యవసాయ భూమి లేకపోవడంతో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఎకరం భూమిలో మొక్కజొన్న వేశాడు. పంట బాగానే వచ్చింది. కంకి తీసుకువచ్చి మిషన్‌లో వేసి జొన్నలు వేరు చేశాడు. ఒకరోజు పాటు జొన్నలను ఆరబోశాడు. అకస్మాత్తుగా సోమవారం తెల్లవారు జామునుంచి కురుస్తున్న వర్షానికి మొన్నజొన్నలు తడిసిపోయాయి. దీంతో ఆరు నెలల పాటు చేసిన కష్టం ఒక్కరాత్రి నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కౌలు డబ్బులు, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. సాక్షి, వరంగల్: జిల్లాలో సోమవారం తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు మండలాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లగా మిరప తోటల్లో నీరు నిలిచింది. చేతికొచ్చిన మొక్కజొన్న తడిసి పోయింది. నల్లబెల్లి, దుగ్గొండి, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో భారీ వర్షం కురవగా, పర్వతగిరి, ఖానాపురం, నర్సంపేట, రాయపర్తి, వరంగల్‌లో మోస్తరు వర్షం కురిసింది. ఇతర మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మొత్తంగా జిల్లాలో 545.2 మిల్లీమీటర్ల వర్షం కురసింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న పంట తడవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మిరపతోటల్లో భారీగా నీరు నిలవడంతో ఆ పంటపై ఏమైన ప్రభావం చూపుతుందన్న ఆందోళన రైతుల్లో కనబడుతోంది. కొన్నిచోట్ల వరి పంట కూడా నేలకు ఒరిగిన పరిస్థితి ఉందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అలాగే వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నలు కొంతమేర తడిచినా.. వెంటనే అధికారులిచ్చిన టార్పాలిన్లతో రైతులు కప్పి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే.. ● భారీ వర్షంతో నల్లబెల్లి నుంచి మహమ్మద్ గౌస్‌పల్లి ప్రధాన రహదారిపై ఉన్న నందిగామ, రేలకుంట వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ● దుగ్గొండి మండలంలో మిరపతోటల్లో నీరు నిలిచింది. మొక్కజొన్న కల్లాలు తడిశాయి. పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. పంట చేతికి వచ్చే దశలో వర్షం పడడంతో దూది గింజ నాణ్యత తగ్గింది. కొన్నిచోట్ల దూది నేలపై పడింది. ఫలితంగా రైతులకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనబడడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ● నెక్కొండ నుంచి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం చెరువు మత్తడి పోయడంతో లోలెవల్ బ్రిడ్జిపై వరదనీరు ప్రవాహం పెరిగి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్రామస్తులు సహకారంతో లోలెవల్ బ్రిడ్జి దాటించారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికెళ్లి పరిశీలించారు. అలాగే చంద్రుగొండ గ్రామానికి చెందిన దాసరి సంపత్‌కు చెందిన రెండు గేదెలపై పిడుగు పడడంతో మృత్యువాత పడ్డాయి. ● వరంగల్ నగరంలోనూ చాలా కాలనీల్లోని రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. రాత్రి సమయంలోనే వర్షం నీరు క్లియర్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. పత్తి రైతులకు తీవ్ర నష్టం, మిరపతోటల్లో నిలిచిన వర్షపు నీరు తడిసిన మొక్కజొన్న -
ఐనవోలు పీఎస్‌ను సందర్శించిన కేంద్ర పోలీస్ అధికారి
● వివిధ కోణాల్లో పరిశీలించి సంతృప్తి ఐనవోలు: మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ దేశ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఉత్తమ పోలీస్ స్టేషన్లను గుర్తించి అవార్డులు, ప్రశంసపత్రాలు అందజేస్తుంది. అందులో భాగంగా 2025 గాను ప్రతీ రాష్ట్రంనుంచి మూడు, దేశ వ్యాప్తంగా 78 పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేయగా అందులో ఐనవోలు పోలీస్ స్టేషన్ ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం హోంశాఖ ఆధీనంలోని ఎవాల్యుయేషన్ అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ సోమవారం ఐనవోలు పోలీస్‌స్టేషన్‌ను ప్రత్యక్షంగా పరిశీలించారు. డాక్యుమెంటేషన్, రికార్డులు, ఇన్ఫ్రా, స్టేషన్ ప్రాంగణం, స్టాఫ్ ప్రవర్తన, ఇతరుల ఫీడ్‌బ్యాక్ తదితర అంశాలను స్వయంగా తెలుసుకున్నారు. పౌరులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరును గమనించారు. డిపార్ట్మెంట్ పరంగా 19 పారామీటర్లపై పలు ప్రశ్నలు సందించి సమాధానాలు తెలుసుకున్నారు. 100 డయల్‌కు 2024లో 1,207 ఫిర్యాదులు రాగా అన్ని కాల్స్ అటెండ్ చేయడమే కాకుండా సగటున 4.08 నిమిషాల్లో ఘటనా స్థలానికి వెళ్లినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. స్టేషన్లో 840 సన్నిహిత పిటిషన్లు రాగా, అందులో 236 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 60 రోజుల్లోగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా 8 అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీస్ స్టేషన్‌ను ఆహ్లాద భరిత వాతావరణంలో కొనసాగిస్తూ వృద్ధులు, మహిళలు, చిన్నారుల, దివ్యాంగుల పట్ల మానవీయ కోణంలో వేగంగా స్పందించినట్లు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎవాల్యుయేషన్ అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్త ఉత్తమ పోలీస్ స్టేషన్ ఎంపికలో భాగంగా సోమవారం ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల అంశాలను క్షుణ్ణంగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. డిసెంబర్లో దేశ వ్యాప్త ఉత్తమ పోలీస్ స్టేషన్లను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఐనవోలు పోలీస్‌స్టేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ, ఐపీఎస్ అధికారి అంకిత్ కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ రాజగోపాల్, ఐనవోలు ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నర్సంపేట: బీసీ వ్యతిరేక అగ్ర కులాలకు చెందిన నాయకులు బీసీల హక్కులను కాలరాసే విధంగా హైకోర్టులో పిటిషన్ వేసి స్టే వచ్చేలా చేశారని బీసీ సంఘాల జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు బీసీ సంఘాల జేఏసీ నాయకుడు డ్యాగల శ్రీనివాస్‌ముదిరాజ్, బీసీ సంఘాల జేఏసీ నాయకులు, కుల సంఘాల సభ్యులతో కలిసి సోమవారం అమరవీరుల జంక్షన్ వద్ద రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఆరు శాతం కూడా లేని వారికి ఈడబ్ల్యూఎస్ ద్వారా 10శాతం రిజర్వేషన్లను దొడ్డి దారిలో కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీల ఓట్లు అగ్రవర్ణ నా యకులకు వేయకుండా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. 42శాతం బీసీల రిజర్వేషన్లు సాధించుకునే వరకు ప్రతిఒక్కరూ బీసీ సంఘాల జేఏసీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జేఏసీ నాయకులు డ్యాగల శ్రీనివాస్‌ముదిరాజ్, కొల్లూరి లక్ష్మినారాయణ, చిలువేరు కొమ్మాలు, రుద్రారపు పైడి, మహాదేవుని జగదీష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్‌యాదవ్, నర్సంపేట పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, శ్రీనివాస్, సురేందర్, రవీందర్, సురేందర్, శ్రీనివాస్, రమేష్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్ష ఎంపికలో నూతన ఒరవడి
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ హన్మకొండ చౌరస్తా: దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్ష పదవుల ఎంపికలో నూతన ఒరవడికి ఏఐసీసీ శ్రీకారం చుట్టిందని ఏఐసీసీ హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. గుజరాత్లో రాహుల్‌గాంధీ పైలట్ ప్రాజెక్టుగా ఈకార్యక్రమాన్ని చేపట్టారని, అదే తరహాలో దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, పీసీసీ జిల్లా పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో–ఆర్డినేటర్ ఆదర్శ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటన ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ సోమవారం నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. విపక్ష కార్పొరేటర్లున్న 57వ డివిజన్ హనుమకొండ శ్రీకృష్ణ కాలనీ, 59వ డివిజన్ ఎకై ్సజ్ కాలనీలో డివిజన్ కార్యకర్తలు, స్థానికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకున్నారు. పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచించారు. సమావేశంలో పీసీసీ నాయకులు అనిల్‌కుమార్, ఈ.వి.శ్రీనివాస్‌రావు, బత్తిని శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరళ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్ : 2025–27 సంవత్సరానికిగాను వైన్‌షాపు(ఏ–4)ల టెండర్ల దరఖాస్తుల ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. దరఖాస్తు గడువు నేటి(మంగళవారం)తో మరో ఐదు రోజులే ఉంది. మద్యనిషేధ, ఆబ్కారీశాఖ గత నెల 26న ఉమ్మడి వరంగల్‌లో 296 దుకాణాలకు టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 18న సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ ఇచ్చి సుమారు 19 రోజులు గడిచినా.. సోమవారం నాటికి 296 మద్యం దుకాణాలకు దాఖలైన దరఖాస్తుల సంఖ్య 500 దాటలేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా తక్కువని చెబుతున్న అధికారులు.. మరో ఐదు రోజులు గడువు ఉండడంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. వైన్‌షాపులకు ఈసారి దాఖలవుతున్న దరఖాస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. 2023–25 టెండర్ల సందర్భంగా ఉమ్మడి వరంగల్‌లో 15,926 దరఖాస్తులు రాగా, ఈసారి శనివారం నాటికి కేవలం 258 వచ్చాయి. హనుమకొండ (వరంగల్ అర్బన్) జిల్లాలో 89, వరంగల్ (వరంగల్ రూరల్)లో 49, జనగామలో 34, మహబూబాబాద్‌లో 57, భూపాలపల్లి, ములుగు కలిపి 29 అప్లికేషన్లే వేశారు. సోమవారం కొంత స్పందన కనిపించినా.. ఉమ్మడి జిల్లాలో 457కే పరిమితమయ్యాయి. ఇందులో సోమవారం ఒక్కరోజే రాత్రి 8 గంటల వరకు 199 రాగా, హనుమకొండ జిల్లాలో 63, వరంగల్‌లో 46, జనగామలో 25, మహబూబాబాద్‌లో 56, భూపాలపల్లిలో 9 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీశాఖ అధికారులు తెలిపారు. కాగా గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని, దరఖాస్తుల ద్వారానే కేవలం రూ.318.52 కోట్ల ఆదాయం వచ్చిందన్న చర్చ ఉంది. రూ.2 లక్షలున్న దరఖాస్తు ధర ఈసారి రూ.3 లక్షలకు పెంచగా.. పోటీ కూడా గతేడాది మాదిరిగానే ఉండి అప్లికేషన్ల ఆదాయం రెట్టింపవుతుందని భావించారు. అందుకు భిన్నంగా దరఖాస్తులు తగ్గడం.. ఆబ్కారీశాఖను సైతం షాక్‌కు గురిచేస్తోంది. వ్యాపారుల వ్యూహం ఏంటి? వైన్‌షాపుల టెండర్ల విషయంలో మద్యం వ్యాపారుల వైఖరి ఏంటనేది అర్థం కావడం లేదు. ఇప్పటికే మద్యం ‘సిండికేట్’లనుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు పడాల్సి ఉన్నా చడీచప్పుడు లేదు. వరంగల్‌కు చెందిన కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా మారి వందల సంఖ్యలో దరఖాస్తులు వేశారు. ఒక గ్రూపు రూ.14 కోట్లు వెచ్చించి 700 దరఖాస్తులు వేస్తే.. మరో గ్రూపు 650 దరఖాస్తులకు రూ.13 కోట్లు వెచ్చించింది. గతేడాది రూ.12 కోట్లు వెచ్చించి 600 దరఖాస్తులు వేసిన జనగామకు చెందిన ఓ సిండికేట్ గ్రూపు ఈసారి ఇప్పటి వరకు స్పందించలేదని తెలిసింది. ఇలా మహబూబాబాద్, భూపాలపల్లితో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని మద్యం వ్యాపారులు పలువురు ఇంకా దరఖాస్తులు వేయలేదు. దీంతో వారి వైఖరి ఏంటన్న చర్చ జరుగుతోంది. నోటిఫికేషన్ ఇచ్చి 18 రోజులు గడిచినా టెండర్లకు స్పందన లేకపోవడంతో మద్యనిషేధ, ఆబ్కారీశాఖ అధికారులు సైతం ప్రస్తుతం షాపులు నడుపుతున్న వారికి, మద్యం వ్యాపారులకు ఫోన్లు చేస్తున్నారు. 2023–25 వైన్‌షాపుల టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ దెబ్బతింటున్న నేపథ్యంలో రియల్ఎస్టేట్, ఫైనాన్స్, కాంట్రాక్ట్ రంగంలో పలువురు మద్యం దందావైపు చూశారు. ఈ దందా కొందరికీ అనుకూలించగా, మరికొందరిని నిండా ముంచేసిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే గతేడాది మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టిన చాలా మంది ఈసారి దూరంగా ఉండడం వల్ల దరఖాస్తులు తగ్గినట్లుగా చెబుతున్నారు. అయితే ఆబ్కారీశాఖ అధికారులు మాత్రం మరో ఐదు రోజులు గడువు ఉండడంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఈ నాలుగైదు రోజుల్లోనే కచ్చితంగా పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తులు ఇలా.. మద్యం టెండర్లకు మందకొడిగా దరఖాస్తులు 296 వైన్‌షాపులకు 500లు కూడా దాటని వైనం మిగిలింది ఇంకా ఐదు రోజులే.. గతేడాది 15,928 దరఖాస్తులు.. రూ.318.52 కోట్ల ఆదాయం రూ.3 లక్షలకు పెంచడంతో ఈసారి ఆదాయం మరింత పెరుగుతుందని అంచనా ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు.. వ్యాపారుల తీరుపై అనుమానం.. ‘సిండికేట్’గా టెండర్లకు ప్రయత్నం? వేచిచూసే ధోరణిలో ఎకై ్సజ్ అధికారులు -
చెరువులను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలి
హసన్‌పర్తి: వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతీ చెరువు, కుంటలను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన చెరువులు, కుంటలు, కెనాల్ భూములు కబ్జా చేసిన అడ్డంకులు సృష్టించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వడ్లకొండ చెరువు కట్టను బలోపేతం చేయడమేకాకుండా కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. భూములను ఆక్రమిస్తే చర్యలు పర్వతగిరి: చెరువుకు సంబంధించిన భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మండలంలోని అన్నారం పెద్ద చెరువు తూము వెనుక భాగంలో ఉన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి తూమును వెంటనే రిపేరు చేయించి చెరువుకు సంబంధించిన భూములను ఎవరైన ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్.దిలీప్‌రాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి ఆర్చరీ క్రీడా పోటీలకు ఎంపికపర్వతగిరి: మండలంలోని కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ ఆర్చరీ అకాడమీలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐలయ్య, ఆర్డీఎఫ్ ప్రిన్సిపాల్ ఎ.జనార్దన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు మాట్లాడుతూ 80 మంది క్రీడాకారులు పాల్గొనగా అండర్ 19 విభాగంలో పి.వినయ్ 1వ ర్యాంకు, ఎం.అజయ్ 3వ ర్యాంకు, బి.కరుణాకర్ 4వ ర్యాంకు, బాలికల విభాగంలో టింకీ 1వ ర్యాంకులో నిలిచారు. అండర్–17 బాలుర విభాగంలో బి.వినయ్ 1వ, అశ్విత్ 2వ, అవినాష్ 3వ, రామ్‌చరణ్ 4వ ర్యాంకు, బాలికల విభాగంలో బి.మానస 1వ ర్యాంకు, పి.ఉషారాణి 2వ ర్యాంకుతో ప్రతిభ కనబర్చారు. అండర్–14 బాలుర విభాగంలో బి.సిద్దు 4వ ర్యాంకు, బాలికల విభాగంలో సహస్ర 1వ ర్యాంకు సాధించారు. విద్యార్థుల ప్రతిభను తీర్చిదిద్దడంలో అర్చరీ కోచ్ బండారి భరత్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని కోరారు. నాన్ మెడికల్ అధికారులను నియమించొద్దునర్సంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల పరిపాలన కోసం నాన్ మెడికల్ అధికారుల నియామకం చేయడం వైద్య రంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు. ఈ మేరకు పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆస్పత్రుల పరిపాలన బాధ్యతలను నాన్ మెడికల్ అధికారులకు అప్పగించాలని చేసిన ప్రతిపాదనలపై వైద్య వర్గాల్లో తీవ్రమైన అసహనం నెలకొందన్నారు. ఈ నిర్ణయం ఆరోగ్య వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్దమని, రోగి సేవల నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నాన్ మెడికల్ అధికారులకు అప్పగించే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో వైద్య వర్గాలను, రోగులను, ప్రజాస్వామ్య వర్గాలను సమీకరించి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరం
● రూ.60,610 నగదు.. 9 ఫోన్లు స్వాధీనం ● కార్పొరేటర్ భర్తతోపాటు 11మంది అరెస్ట్ ● వారిలో ముగ్గురు మహిళలువరంగల్ క్రైం: హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి కనకదుర్గ కాలనీలో ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసి 12మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు సోమవారం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారంతో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. పేకాడుతూ 12 మంది పట్టుబడినట్లు తెలిపారు. వారినుంచి రూ.60,610 నగదు, 9 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన వారిలో సిరిసిల్ల జిల్లా శాంతినగర్‌కు చెందిన ఇందిరియాల రాజేందర్, కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్‌కు చెందిన గడ్డం శ్రీనివాస్, హనుమకొండ వడ్డేపల్లికి చెందిన గీతం జితేందర్‌రెడ్డి, కనకదుర్గ కాలనీకి చెందిన వెల్దండి రమేశ్, హనుమాన్‌నగర్‌కు చెందిన ముస్కం ముత్తయ్య, కనకదర్గ కాలనీకి చెందిన గుజ్జుల మహేందర్‌రెడ్డి (కార్పొరేటర్ భర్త), వేముల శివాజీ, బాలసముద్రానికి చెందిన కల్వ రమ, వాణినగర్‌కు చెందిన పల్లె సుజాత, కేఎల్ఎన్రెడ్డి కాలనీకి చెందిన బీరం నీరజ, టీచర్స్ కాలనీకి చెందిన మడిశెట్టి భాస్కర్ ఉన్నారు. నిందితులను తదుపరి చర్యల కోసం సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. దాడిలో ఇన్స్పెక్టర్ రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టరేట్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆమె హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజవాణిలో జీడబ్ల్యూఎంసీ 16, పీడీ హౌసింగ్, ఆర్డీఓ హనుమకొండతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 80 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వర్షంతో రైతుల్లో ఆందోళన
హన్మకొండ: వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఆకాశం మేఘావృతం కావడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంట చేతికి వచ్చి కల్లాల్లో ఆరబోయగా, వర్షానికి తడిసిముద్దయ్యాయి. ముందుగా నాటు వేసిన వరి పంట కోతకు వచ్చింది. చేతికి వచ్చిన వరి.. ఈదురు గాలులు, భారీ వర్షం కురిసిన చోట నేలవాలుతోంది. దీంతో నీటిలో తడిసి ధాన్యం గింజలు మొలకెత్తి నష్టం చేకూరుతోందని రైతులు మొత్తుకుంటున్నారు. సోమవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి హనుమకొండ జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. కమలాపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో మోస్తరు వర్షం కురవగా.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో 62.3 మిల్లీమీటర్లు, కమలాపూర్‌లో 43, ఆత్మకూరులో 31.5, దామెరలో 18.8, పులుకుర్తిలో 7.3, పరకాలలో 7, ఎల్కతుర్తిలో 6.3, ధర్మసాగర్లో 5.5, కాజీపేటలో 5, నడికూడలో 5, హసన్‌పర్తి చింతగట్టులో 5, శాయంపేటలో 4.5, హసన్‌పర్తి నాగారంలో 3.3, ఐనవోలు కొండపర్తిలో 2.5, మడికొండలో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఫౌండేషన్ తరగతులు షురూ
నర్సంపేట రూరల్: ఈ విద్యా సంవత్సరంలో నర్సంపేట వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు సోమవారం నుంచి ఫౌండేషన్ కోర్సు ఆన్లైన్ తరగతులు ప్రారంభించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వం 50 సీట్లను కేటాయించగా రాష్ట్ర కోటాలో 42 సీట్లు, నేషనల్ కోటాలో 8 సీట్లతో మొత్తం 50 సీట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్ర కోటలో మొత్తం 42 సీట్లకు 42 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. నేషనల్ కోటలో 8 సీట్లకు గాను 5 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. మరో మూడు సీట్లు రానున్న కౌన్సెలింగ్‌లో భర్తీ కానున్నాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దామోదార రాజనర్సింహా, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా నర్సంపేట పట్టణంలోని సర్వాపురం శివారులో దాత స్వర్గీయ దొడ్డ మోహన్‌రావు అందించిన భూమిలో నూతనంగా నిర్మించిన 250 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనంలో ప్రారంభించారు. సీ బ్లాక్‌లో తాత్కాలికంగా వైద్య కళాశాల భవనాన్ని కేటాయించి 2024–25 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. విద్యార్థులు ఎంబీబీఎస్‌లో మొదటి సంవత్సరాన్ని సైతం పూర్తి చేసుకున్నారు. 2025–26 సంవత్సరంలో ఎంబీబీఎస్‌కు రెండో బ్యాచ్ అడ్మిషన్లు సైతం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర, నేషనల్ కోటా కింద మొత్తం 50 సీట్లకు గాను 47 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. సోమవా రం నుంచి వారికి తొలుత పౌండేషన్ కోర్సును ఆన్లైన్లో కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేషన ల్ కోటాలో కౌన్సెలింగ్‌లో మరో ముగ్గురు ఎంబీబీ ఎస్ విద్యార్థులు రావాల్సి ఉంది. ఈనెల 23 నుంచి కళాశాలలో నేరుగా తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మా ణం, వసతుల కోసం సుమారు రూ.180కోట్లు మంజూరు చేసిందని, ఇంత వరకు పనులు ప్రారంభించలేదని, తక్షణమే ప్రత్యేక భవన నిర్మాణం చేపట్టి వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు. ప్రారంభించిన నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ -
రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతర పనులకు రూ.251 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా రూ.101 కోట్లు మంజూరు చేయగా, వీటిలో రూ.71 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు.గతంలో మంజూరైన జాతర ఏర్పాట్ల నిధులు రూ.150 కోట్లు కలిపి దశలవారీగా శాశ్వత ప్రాతిపదికన ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మే డారం జాతరకు వచ్చే నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా జంపన్న వాగులో వరదలాగా జారిపోకుండా.. గిరిజనుల ఆరాధ్య దైవాల ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేలా కలెక్టర్, ఎస్పీలకు సూచనలు ఇచ్చామన్నారు. నాపై ఎవరూ ఫిర్యాదు చేసే చాన్సే లేదు.. మేడారం పనుల విషయంలో కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయని మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ‘నేనేంటో అందరికీ తె లుసు. రూ.70 కోట్ల కాంట్రాక్ట్ పనులకు తాపత్రయపడే అవసరం నాకు లేదు. నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదు. అధిష్టానానికి ఫిర్యాదు చేసే చాన్సే లేదు. ఆ వార్తలను నేను నమ్మడం లేదు’అని బదులిచ్చారు. జాతరలోపు నెలకు రెండుమూడు సార్లు జాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. తాను రాకున్నా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ పాల్గొన్నారు.అభివృద్ధి పనుల నమూనాను పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రి సీతక్క తదితరులు -
నిండా ముంచిన వాన
సాక్షి, వరంగల్ నెట్వర్క్/యాదాద్రి/భద్రాద్రి కొత్తగూడెం/చౌటుప్పల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పంటలు నీటమునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ఎనుమాముల మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో మిర్చితోటల్లోకి వర్షం నీరు చేరింది. నెక్కొండ మండలం చంద్రుగొండలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతిచెందాయి. మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన మక్కలు, బయ్యారం, గూడూరు మండలాల్లో రోడ్లవెంట, చెలకల వద్ద ఆరబోసిన మక్కలు తడిసిపోయాయి. మరిపెడ, కురవి, కేసముద్రం, గూడూరు, దంతాలపల్లి మండలాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. మహబూబాబాద్ పట్టణ సమీపంతో పాటు డోర్నకల్‌లో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏజెన్సీలోని కొత్తగూడలో వాగులు ఉరకలేస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల సమీపంలో పాకాల యేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కురవి, సీరోలు మండలాల్లోనూ వాగులు, వంకల ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ జిల్లా కటాక్షపూర్ చెరువు మత్తడి జాతీయ రహదారి 163పైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లోనూ బీభత్సం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పత్తి, వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. సుమారు 500 ఎకరాల్లో పత్తి చేలు దెబ్బతిన్నాయి. పలు మార్కెట్ యార్డుల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. ఆయా మండలాల్లో వాగులు ఉధృతంగా పారుతున్నాయి. నక్కలగూడెంలో కోళ్ల ఫారంలోకి భారీగా వరద నీరు చేరి.. 6 వేల బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో మొదలైన వాన సోమవారం ఉదయం వరకూ కొనసాగింది. ఈ వానతో వాగులు నిండి లోలెవల్ చప్టాలపైకి వరద చేరడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తి గరిష్ట స్థాయికి చేరడంతో.. ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద రావడంతో 25 గేట్లకు 11 ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. పలుచోట్ల పత్తి చేన్లలో నీరు చేరగా, వరి పొలాలు కూడా దెబ్బ తిన్నాయి. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం కురిసింది. -
ఎమ్మెస్సీ సైకాలజీ మరింత దూరం!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) విధానంలో పీజీ కోర్సుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ఈ విద్యాసంవత్సరం (2025–26)లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)అనుమతించలేదు. దేశవ్యాప్తంగా కూడా ఓడీఎల్మోడ్లో, ఆన్లైన్ మోడ్‌లో ఈ కోర్సు నిర్వహించకూడదని ఈఏడాది ఆగస్టులో యూజీసీ దూర విద్యవిధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులను నిర్వహిస్తున్న వర్సిటీలకు, ఓపెన్ వర్సిటీలను కూడా ఆదేశిస్తూ లేఖలను పంపింది. ఇప్పటికే 2025–26 విద్యాసంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య సీడీఓఈలో అన్ని పీజీ కోర్సులతోపాటు ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు ఇప్పటికే ఈకోర్సులో ప్రవేశాలు పొందారు. ప్రవేశాలు కొనసాగుతుండగానే ఈ సైకాలజీ కోర్సును నిర్వహించవద్దని యూజీసీ లేఖతో ఇక ఆకోర్సులో ప్రవేశాల కల్పన నిలిపేశారు. దూరవిద్య విధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు బాగా డిమాండ్ ఉంది. ప్రతీ విద్యాసంవత్సరంలో కేయూలోని దూరవిద్యలో సుమారు 150 నుంచి 200 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు పొంది చదువుతున్నారు. ప్రధానంగా యువతే కాకుండా వివిధ ఫ్రొఫెషనల్స్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో దూరవిద్య విధానం ద్వారా చదివారు. చదవుతున్నవారు ఉన్నారు. డిమాండ్ ఉన్న కోర్సు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య విధానంలో 2004 నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్లలో ఎంతోమంది ఈ కోర్సును పూర్తి చేశారు. సైకాలజీ కోర్సులు పూర్తి చేసిన వారు కొందరు వివిధ విద్యాలయాల్లో ఉద్యోగాలు పొందారు. సైకాలజీ కౌన్సెలర్లుగా కూడా ఉద్యోగాలు పొందారు. బాగా డిమాండ్ ఉన్న కోర్సుతో యూనివర్సిటీకి ఆదాయం కూడా బాగానే సమకూరుతోంది. ఇప్పుడు యూజీసీ ఈకోర్సును నిర్వహించవద్దని లేఖ పంపడంతో ఆకోర్సు చేయాలనుకునేవారికి ఇక అవకాశం లేకుండా పోయింది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలోనూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో కూడా ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఎమ్మెస్సీ సైకా లజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుండగానే ఆన్లైన్ కోర్సుగా నిర్వహించవద్దని యూజీసీ నుంచి ఈఏ డాది ఆగస్టు 12 అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి లేఖ పంపారు. దీంతో ప్రవేశాలు నిలిపేశారు. ఇప్పటికే సుమారు 340 మంది వరకు చేరిన విద్యార్థులకు మీరు ఇతర పీజీ కోర్సులకు చేరాలనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని సూచించగా అందులో కేవలం 60 మంది విద్యార్థులు మాత్రం ఇతర పీజీ కోర్సుల్లో చేరారు. మిగతా వారికి చెల్లించిన ఫీజును రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూ ట్రిషన్ తదితర కోర్సులకు ఓడీఎల్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడల్లో నిర్వహించకూడదని కూడా యూ జీసీ వర్సిటీలకు లేఖలు పంపినట్లు సమాచారం. ఫీజు రీఫండ్ చేస్తాం.. దూరవిద్యలో 2024–25 బ్యాచ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈకోర్సు యథావిధిగా కొనసాగనుంది. ఆయా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విద్యాసంవత్సరం (2025–26) ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును రీఫండ్ ఇవ్వబోతున్నాం. ఎవరైనా వేరే పీజీ కోర్సు చేస్తామంటే వారికి వేరే కోర్సులోకి మార్చతాం. ఎన్‌సీఏహెచ్‌పీ యాక్ట్ 2021 ప్రకారం ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును నిర్వహించేందుకు వీలులేదనేది యూజీసీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే రెగ్యులర్ కోర్సులుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును యథావిధిగా నిర్వహించనున్నారు. కేయూలో ఎమ్మెస్సీ సైకాలజీ రెగ్యులర్ కోర్సు యథావిధిగా కొనసాగనుంది. – వి.రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్ డీఎల్, ఆన్లైన్ మోడ్‌లో నిర్వహించొద్దు యూనివర్సిటీలకు లేఖలు ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీఫండ్ గత విద్యా సంవత్సరం విద్యార్థులకు యథావిధిగా.. -
రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత
● కలెక్టర్ సత్యశారద ● పుప్పాలగుట్ట పీహెచ్సీలో పల్స్‌పోలియో పర్యవేక్షణ ఖిలా వరంగల్: రెండు పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. పల్స్ పోలియో సందర్భంగా ఆదివారం వరంగల్ 35వ డివిజన్ పుప్పాలగుట్ట పీహెచ్సీ కేంద్రంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు ఆధ్వర్యంలో చిన్నారులకు చుక్కలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆదివారం చుక్కల మందు వేయించని చిన్నారుల ఇళ్లకు వెళ్లి బ్బంది పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన పిల్లలే రేపటి దేవానికి సంపదని పిల్లల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరినారు. గర్భిణులు, చిన్న పిల్లల్లో రక్తహీనత సమస్యలు ఉంటే వైద్యారోగ్య శాఖ సిబ్బంది ద్వారా పరీక్షలు నిర్వహించుకుని తగిన చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా వైద్యశాఖ అధికారి సాంబశివరావు మాట్లాడారు. జిల్లాలో 12 నుంచి 15వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్, స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, ఎస్ఎన్ఐ ప్రోగ్రాం ఇన్చార్జ్ ప్రసాద్, డీవైఓ ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, పుప్పాల గుట్ట హెల్త్‌సెంటర్ డాక్టర్ బజ్జూరి దిలిప్ పాల్గొన్నారు. పల్స్ పోలియో సక్కెస్.. గీసుకొండ: వరంగల్ నగర పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. 0–5 ఏళ్లలోపు చిన్నారులు నగరంలో 20,121 మంది ఉన్నట్లు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 20,128 (స్థానికేతరులతో కలిపి) మందికి చుక్కల మందు వేసినట్లు ఆయన వెల్లడించారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజావాణి
న్యూశాయంపేట: కలెక్టరేట్లో నేడు(సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశహాల్లో ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పంటపొలాల్లో మొసలి ఖానాపురం: పాకాల ఆయకట్టు పరిధిలో మొసళ్ల సంచారం పెరిగిపోయింది. కాల్వలు, పంట పొలాల్లోకి చేరుతుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన పల్నాటి రవీందర్ గ్రామశివారులోని దుంపిల్లగడ్డలో ఉన్న వరి పొలానికి ఆదివారం నీరుపెట్టడానికి వెళ్లాడు. వరి పొలంలో నీరుపెడుతూ తిరుగుతుండగా వరిలో మొసలి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న రైతులకు అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు మొసలిని అదుపులోకి తీసుకుని పాకాల సరస్సులోకి జారవిడిచారు. ఆయకట్టు పరిధిలో అనేక మొసళ్లు సంచరిస్తున్నాయని, పంటపొలాలకు వెళ్లే క్రమంలో మొసళ్ల దాడి జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేజీబీవీ ఎస్ఓ నీలిమకు అవార్డు సంగెం: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రత్యేకాధికారి కె.నీలిమ సావిత్రిబాయి పూలే అవార్డు–2025 అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, వావ్ మ్యూజిక్ హైదరాబాద్, కలాం విజన్, యువతేజం ట్రస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో సిటీ కల్చరల్ హాల్ ఆర్టీసీ ఎక్స్‌రోడ్ హైదరాబాద్‌లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆదివారం నీలిమ అవార్డు అందుకున్నారు. కలాం విజన్, యువతేజం ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు కరీముల్లా, అడ్మిన్ చైర్మన్ అంజనీకుమారి, వావ్ మ్యూజిక్ ఫౌండర్, చైర్పర్సన్ పీవీ.లక్ష్మి పాల్గొన్నారు. ఓరుగల్లును మరువలేను ● హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లుతో అనుబంధం మరువలేను. తన హృదయంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధుర జ్ఞాపకాన్ని ఆదివారం మరోసారి గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల క్రితం వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో తన సతీమణితో కలిసి చారిత్రక ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. ‘కోటలో ఖాకీబాస్’ శీర్షికతో అప్పుడు సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఇలా వరంగల్ నగరంపై తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. నేటి నుంచి క్రీడా ఎంపిక పోటీలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్ లో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. మొదటి రోజు వాలీబాల్, యోగా, టగ్‌ఆఫ్‌వార్, త్రోబాల్, టేబుల్ టెన్సిస్, మకంబ్, సాఫ్ట్‌టెన్నిస్, బీచ్‌వాలీబాల్, తంగ్తా మార్శల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్, షూ టింగ్, స్క్వాష్, రగ్బీ క్రీడలు, రెండో రోజు (14 వ తేదీన) హ్యాండ్‌బాల్, చెస్, రెజ్లింగ్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్డ్ రెజ్లింగ్, సైక్లింగ్ రోడ్, సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్, బేస్‌బాల్, లాన్టెన్ని స్, బాల్ బ్యాడ్మింటన్, తై క్వాండో, 15వ తేదీన క్రికెట్, క్యారమ్స్, కరాటే, సెపక్తక్రా, కురేష్, కలరిపాయట్టు, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, వెయి ట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బా క్సింగ్, ఖోఖో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఈత కొట్టేదెన్నడో?
వరంగల్ స్పోర్ట్స్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లేమి కారణంగా యువ స్విమ్మర్లు సాధనకు దూరమవుతున్నారు. నిత్యం సాధన చేస్తూ.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధపడే స్విమ్మర్లకు స్విమ్మింగ్‌పూల్ మరమ్మతులు అడ్డంకిగా మారాయి. సుమారు ఆరు నెలలుగా సాధన లేక మానసికంగా, శారీరకంగా కుదేలవుతున్నారు. రూ.41 లక్షలు కేటాయింపు.. హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా క్రీడా ప్రా ధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్ కొనసాగుతోంది. పూల్‌లో పలు మరమ్మతులు, వసతుల కల్పన కోసం డీఎస్ఏ నిధుల నుంచి రూ.41 లక్షలు కేటాయించారు. ఆయా పనుల్ని పూర్తి చేసేందుకు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి అప్పగించారు. సుమారు ఆరు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. త్వరతగతిన పూర్తి చేసి స్విమ్మర్లకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం.. టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఇంజనీరింగ్ అధికారులు అబివృద్ధి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులను చేస్తుండడంతో ఆరు నెలలు కావొస్తున్నా.. పూర్తి కాలేదు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది స్విమ్మింగ్ పూల్. అలాంటిది ఆరు నెలలుగా మూసివేయడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా పనుల్లో జాప్యం కారణంగా యువ స్విమ్మర్ల కెరియర్ నష్టపోతుంటే, ఆరోగ్య పరిరక్షణ కోసం స్విమ్మింగ్ పూల్‌కు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ మరమ్మతు పనులు 90 శాతం పూర్తయ్యాయి, రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ సైతం విజయవంతంగా పూర్తి చేశాం. చిన్న చిన్న పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో వారం రోజుల్లో డీఎస్ఏకు స్విమ్మింగ్ పూల్‌ను అప్పగిస్తాం. – రవీందర్, డీఈ, టీజీఈడబ్ల్యూఐడీసీ, హనుమకొండ ఆరు నెలలైనా పూర్తికాని మరమ్మతులు సాధనకు దూరమవుతున్న స్విమ్మర్లు -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్‌జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.● జనగామ సబ్‌జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్‌జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్‌జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్‌జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్‌జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్‌జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్‌జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు సబ్‌జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్‌జైలు ఖైదీ ఆత్మహత్య.. -
బీసీలు బలహీనులు కాదు
● ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ హన్మకొండ: రిజర్వేషన్లు బీసీల పౌర హక్కు అని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమకొండ రాంనగర్‌లోని బీసీ భవన్లో సుందర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. బీసీలు బలహీనులు కాదని, బాహుబలులన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం అవకాశం కల్పిస్తామని ఆశ చూపి మోసం చేశారన్నారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో పరిపాలించిన రెండు జాతీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సమావేశంలో ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఆయా సంఘాల నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, మౌనిక గౌడ్, పులి రజనీకాంత్, మేధావులు పాల్గొన్నారు. -
కారాఘోరం!
సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్‌జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది. ● జనగామ సబ్‌జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్‌జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్‌జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్‌జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్‌జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్‌జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్‌జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జైళ్లలో ఖైదీల సహజ మరణాలు, ఆందోళనకరంగా ఆత్మహత్యలు జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్‌జైలు ఖైదీ ఆత్మహత్య..సహజ మరణాలకు అనేక కారణాలు.. సబ్‌జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పో లీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ప్రాణాంతకమే.. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు -
ఎమ్మెస్సీ సైకాలజీ మరింత దూరం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) విధానంలో పీజీ కోర్సుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ఈ విద్యాసంవత్సరం (2025–26)లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)అనుమతించలేదు. దేశవ్యాప్తంగా కూడా ఓడీఎల్మోడ్లో, ఆన్లైన్ మోడ్‌లో ఈ కోర్సు నిర్వహించకూడదని ఈఏడాది ఆగస్టులో యూజీసీ దూర విద్యవిధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులను నిర్వహిస్తున్న వర్సిటీలకు, ఓపెన్ వర్సిటీలను కూడా ఆదేశిస్తూ లేఖలను పంపింది. ఇప్పటికే 2025–26 విద్యాసంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య సీడీఓఈలో అన్ని పీజీ కోర్సులతోపాటు ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు ఇప్పటికే ఈకోర్సులో ప్రవేశాలు పొందారు. ప్రవేశాలు కొనసాగుతుండగానే ఈ సైకాలజీ కోర్సును నిర్వహించవద్దని యూజీసీ లేఖతో ఇక ఆకోర్సులో ప్రవేశాల కల్పన నిలిపేశారు. దూరవిద్య విధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు బాగా డిమాండ్ ఉంది. ప్రతీ విద్యాసంవత్సరంలో కేయూలోని దూరవిద్యలో సుమారు 150 నుంచి 200 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు పొంది చదువుతున్నారు. ప్రధానంగా యువతే కాకుండా వివిధ ఫ్రొఫెషనల్స్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో దూరవిద్య విధానం ద్వారా చదివారు. చదవుతున్నవారు ఉన్నారు. డిమాండ్ ఉన్న కోర్సు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య విధానంలో 2004 నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సు నిర్వహిస్తున్నారు. సుమారు 21 ఏళ్లలో ఎంతోమంది ఈ కోర్సును పూర్తి చేశారు. సైకాలజీ కోర్సులు పూర్తి చేసిన వారు కొందరు వివిధ విద్యాలయాల్లో ఉద్యోగాలు పొందారు. సైకాలజీ కౌన్సెలర్లుగా కూడా ఉద్యోగాలు పొందారు. బాగా డిమాండ్ ఉన్న కోర్సుతో యూనివర్సిటీకి ఆదాయం కూడా బాగానే సమకూరుతోంది. ఇప్పుడు యూజీసీ ఈకోర్సును నిర్వహించవద్దని లేఖ పంపడంతో ఆకోర్సు చేయాలనుకునేవారికి ఇక అవకాశం లేకుండా పోయింది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలోనూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో కూడా ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఎమ్మెస్సీ సైకా లజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుండగానే ఆన్లైన్ కోర్సుగా నిర్వహించవద్దని యూజీసీ నుంచి ఈఏ డాది ఆగస్టు 12 అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి లేఖ పంపారు. దీంతో ప్రవేశాలు నిలిపేశారు. ఇప్పటికే సుమారు 340 మంది వరకు చేరిన విద్యార్థులకు మీరు ఇతర పీజీ కోర్సులకు చేరాలనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని సూచించగా అందులో కేవలం 60 మంది విద్యార్థులు మాత్రం ఇతర పీజీ కోర్సుల్లో చేరారు. మిగతా వారికి చెల్లించిన ఫీజును రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూ ట్రిషన్ తదితర కోర్సులకు ఓడీఎల్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడల్లో నిర్వహించకూడదని కూడా యూ జీసీ వర్సిటీలకు లేఖలు పంపినట్లు సమాచారం. దూరవిద్యలో 2024–25 బ్యాచ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈకోర్సు యథావిధిగా కొనసాగనుంది. ఆయా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విద్యాసంవత్సరం (2025–26) ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును రీఫండ్ ఇవ్వబోతున్నాం. ఎవరైనా వేరే పీజీ కోర్సు చేస్తామంటే వారికి వేరే కోర్సులోకి మార్చతాం. ఎన్‌సీఏహెచ్‌పీ యాక్ట్ 2021 ప్రకారం ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును నిర్వహించేందుకు వీలులేదనేది యూజీసీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే రెగ్యులర్ కోర్సులుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును యథావిధిగా నిర్వహించనున్నారు. కేయూలో ఎమ్మెస్సీ సైకాలజీ రెగ్యులర్ కోర్సు యథావిధిగా కొనసాగనుంది. – వి.రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్ డీఎల్, ఆన్లైన్ మోడ్‌లో నిర్వహించొద్దు యూనివర్సిటీలకు లేఖలు ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీఫండ్ గత విద్యా సంవత్సరం విద్యార్థులకు యథావిధిగా.. -
ఓరుగల్లును మరువలేను
● హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ● ఎక్స్‌లో ట్వీట్ చేసిన ‘సాక్షి’ క్లిప్పింగ్ ఖిలా వరంగల్: ‘చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లుతో అనుబంధం మరువలేను. నా హృదయంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధుర జ్ఞాపకాన్ని ఆదివారం మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల క్రితం వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో తన సతీమణితో కలిసి చారిత్రక ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. ‘కోటలో ఖాకీబాస్’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలా వరంగల్ నగరంపై తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. -
ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి
● గోపు జైపాల్‌రెడ్డి దుగ్గొండి: అగ్రకుల పేదలందరూ పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు జాతీయ, రాష్ట్రస్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని గిర్నిబావిలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అగ్రకుల పేదలైన రెడ్డి, బ్రహ్మణ, వెలమ, కమ్మ, వైశ్య, మా ర్వాడిలు ఐక్యం కావాలన్నారు. ఈనెల 19న హనుమకొండలో జరగనున్న అగ్రకుల పేదల సదస్సుకు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోలి బక్కారెడ్డి, చల్ల నర్సింహారెడ్డి, కంచరకుంట్ల నర్సింహారెడ్డి, తోకల శ్రీనివాసరెడ్డి, బొమ్మినేని శ్రీనివాసరెడ్డి, తోకల వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నిబద్ధత కలిగిన వారికే డీసీసీ పీఠం
హన్మకొండ చౌరస్తా: నిబద్ధత, సామర్థ్యం, కార్యకర్తల అభిమానం కలిగిన వారికే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పీఠం దక్కుతుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్నాయక్ మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల భర్తీ కార్యక్రమంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంఘటన శ్రీయన్ అభియాన్ పార్టీ పునఃనిర్మాణానికి మొదటి అడుగు పడిందన్నారు. నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం దరఖాస్తుల స్వీకరణతోపాటు నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ కార్యకర్త, ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. ఈ అభియాన్ ద్వారా అధికారం కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, యువత అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అధ్యక్ష నియామక ప్రక్రియలో భాగంగా సోమవారం డీసీసీ భవన్లో హనుమకొండ జిల్లాస్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 14న పరకాల, 16న వరంగల్ తూర్పు, 17న వర్ధన్నపేట, 18న నర్సంపేట నియోజకవర్గం పరిధి కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పీసీసీ జిల్లా పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో–ఆర్డినేటర్ ఆదర్శ్జైస్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, వెంకట్‌రెడ్డి, శ్రవణ్, సాగరిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ -
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై రాత పూర్వకంగా ఫిర్యాదులు అందించాలని కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు వాలీబాల్, యోగా, టగ్‌ఆఫ్‌వార్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, మకంబ్, సాఫ్ట్‌టెన్నిస్, బీచ్‌వాలీబాల్, తంగ్తా మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్, రగ్బీ క్రీడలు, రెండో రోజు (14వ తేదీన) హ్యాండ్‌బాల్, చెస్, రెజ్లింగ్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్ట్ రెజ్లింగ్, సైక్లింగ్ రోడ్, సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్, బేస్‌బాల్, లాన్‌టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో, 15వ తేదీన క్రికెట్, క్యారమ్స్, కరాటే, సెపక్తక్రా, కురేష్, కలరిపాయట్టు, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్, ఖోఖో క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హన్మకొండ: బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో రాకేశ్‌రెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 200 పాఠశాలల్లో రూ.180 కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 80 నుంచి 200కు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పెంచి, 8 వేల నుంచి 25 వేల మంది వరకు విద్యార్థుల సంఖ్య పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తున్నా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించడం లేదన్నారు. సమస్యను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చర్చించి బాధిత తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన భరోసా ఇచ్చారు. కాళోజీ సెంటర్: విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ‘ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ అనే కొత్త పాఠ్యాంశానికి సంబంధించిన కార్యక్రమంపై ఈనెల 14, 15, 16 తేదీల్లో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతికి బోధించే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, గణితం ఉపాధ్యాయులు ప్రభుత్వ, స్థానిక సంస్థల తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలు, కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు వీలైతే సొంత లాప్టాప్, ట్యాబ్ లేదా ఇటీవల విద్యాశాఖ అందించిన ఏ బుక్ ఆన్ డిజిటల్ ఆర్ని వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
పచ్చదనం పెంపొందించాలి
వరంగల్ అర్బన్: నగర ప్రధాన రహదారుల నడుమ ఉన్న సెంట్రల్ మీడియమ్స్‌లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఆదివారం హనుమకొండ అదాలత్, సుబేదారి ప్రాంతాల్లో మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థంగా చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య గ్రీనరీ ఉండేలా చూడాలని, పచ్చదనం కోసం గ్రీన్ బడ్జెట్ పేరిట 10% నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఏపుగా పెరిగేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. మేయర్ వెంట హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.మేయర్ గుండు సుధారాణి -
పచ్చదనం పెంపొందించాలి
వరంగల్ అర్బన్: నగర ప్రధాన రహదారుల నడుమ ఉన్న సెంట్రల్ మీడియమ్స్‌లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఆదివారం హనుమకొండ అదాలత్, సుబేదారి ప్రాంతాల్లో మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థంగా చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య గ్రీనరీ ఉండేలా చూడాలని, పచ్చదనం కోసం గ్రీన్ బడ్జెట్ పేరిట 10% నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఏపుగా పెరిగేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. -
యాదృచ్ఛికమా.. అధికారుల నిర్లక్ష్యమా..?
● నర్సంపేట సబ్ జైల్లో గతంలో ఇద్దరు ఖైదీల మృతి ● నెలల వ్యవధిలోనే ఘటనలు ● ప్రజలను తొలుస్తున్న అనేక ప్రశ్నలునర్సంపేట: నర్సంపేట మహిళా సబ్ జైల్లో ఇటీవల రిమాండ్‌లో ఉన్న ఇద్దరు ఖైదీలు మృతి చెందడం కలకలం రేపుతోంది. అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే జైల్లోకి అనుమతిస్తారు. అలాంటిది ఒకే జైల్లో నెలల వ్యవధిలో ఇద్దరు మహిళా ఖైదీలు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అనే ప్రశ్నలు ప్రజలను తొలుస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఖైదీలు అనారోగ్యంతోనే మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. చికిత్స పొందుతూ మృతి జైలు శిక్ష అనుభవిస్తున్న క్రమంలో రెండు మూడు రోజుల్లోనే అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేర్చిన మరుసటి రోజే ఇద్దరు మహిళలు మృతి చెందారు. హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసులో నిందితురాలైన పెండ్యాల సుచరిత జైల్లో బాత్రూంకు వెళ్లి కింద పడిపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందినట్లు జైలర్ లక్ష్మిశృతి తెలుపగా ఆమె నిర్లక్ష్యం వల్లనే మహిళా ఖైదీ మృతి చెందిందనే నెపంతో సస్పెండ్ చేశారు. తాజాగా శిశు విక్రయాల కేసులో సబ్ జైలుకు వచ్చిన కరీంనగర్ జిల్లా రాంపూర్‌కు చెందిన కల్పన ఎంజీఎంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. నర్సంపేట సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు రెండు నెలల వ్యవధిలో మృతి చెందడం చర్చనీయాంశమైంది. అయితే ఆమె ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రికి తీసుకెళ్లామని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆమె జైలుకు వచ్చిన 16రోజుల పాటు మౌనంగానే ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని తెలిపారు. జైలుకు వచ్చే ముందు చేసిన ఆరోగ్య పరీక్షల్లో ఆరోగ్యం బాగానే ఉందని.. జైలుకు వచ్చిన తర్వాత మౌనంగా ఉండడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకొని చికిత్స చేయించినట్లు తెలిపారు. ఏం జరిగి ఉంటుంది.. మహిళా జైలులో నెల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. జైల్లో ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు జరుగుతున్నాయా.. లేదా అధికారుల తప్పిదమా.. నిజంగానే అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందతున్నారా.. అనే కోణంపై పూర్తిస్థాయి విచారణ చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. -
– వెంకటాపురం(ఎం)
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్‌లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. ఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్‌గా ఇండియా కల్చర్‌పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్‌గా బాగుంది. – హమీద్ దాస్, కోల్‌కతా -
అత్యంత వైభవంగా నరకాసుర వధ
మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని మంత్రి స్వగృహంలో మంత్రి కొండా సురేఖను నరకాసుర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, కార్పొరేటర్ మరుపల్లి రవి కలిసి ఏర్పాట్లపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపావళి ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్‌కు చెబు తానని ఆమె పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉన్నారు హన్మకొండ కల్చరల్: రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన ‘పుంజు తోక’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం ఉదయం 10గంటలకు హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి కాలేజీ ఆడిటోరియంలో జరగనున్నట్లు మిత్రమండలి కన్వీనర్ వీఆర్ విద్యార్థి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ ఆధ్యక్షతన జరిగే కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేస్తారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ బన్న అయిలయ్య, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి పుస్తక పరిచయం చేస్తారని తెలిపారు. జిల్లా సాహితీవేత్తలు, అభిమానులు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నేడు ‘ఆరెపల్లి మట్టిబిడ్డలు’ పుస్తకావిష్కరణనయీంనగర్: నేడు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఆరెపల్లి గ్రామం సరళి అధ్యయన కేంద్రంలో ‘మట్టిబిడ్డల మావూరి యధార్థ జీవిత కథలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పుస్తక రచయిత, జర్నలిస్ట్ నాగబెల్లి జితేందర్ తెలిపారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మట్టిబిడ్డల పుస్తకాన్ని సాహితీవేత్త, మాజీ సంపాదకులు కె.శ్రీనివాస్–సుధ దంపతులకు అంకితమిచ్చి నట్లు తెలిపారు. కవులు, సాహితీమిత్రులు పుస్తకావిష్కరణ, అంకితోత్సవ సభకు రావాలని కోరారు. కార్యక్రమంలో రాకేశ్, రఘువీర్, దినేశ్, గోపాల్ పాల్గొన్నారు. విద్యారణ్యపురి: సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఏ బుక్ ఆఫ్ ఆన్ డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు జిల్లాలోని భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయుల్లో డిజిటల్ లెర్నింగ్, కోడింగ్, కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, 21వ శతాబ్ద నైపుణ్యాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శిక్షణ ఉపయోగడనుందని డీఈఓ వాసంతి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ తెలిపారు. ఈనెల 13న ఉదయం 9గంటలకు ల్యాప్‌టాప్‌లతో, 6 నుంచి 9వ తరగతి డిజిటల్ లెర్నింగ్ పుస్తకాలతో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు హాజరుకావాలన్నారు. ఉపాధ్యాయుల హాజరు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. మూడు రోజులపాటు శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఈ సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తారని వారు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎంటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈ నెల 16, 18, 22, 24, 27, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు. -
ధాన్యం సేకరణలో భారీ అక్రమాలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో అతి పెద్ద ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చిందని రాష్ట్ర సివిల్ సప్లై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శశిధర్‌రాజు, ఓఎస్డీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధాన్యం కొనుగోలులో గుర్తించిన అక్రమాలు, తీసుకున్న చర్యలపై ఎస్పీ మాట్లాడుతూ.. రబీ 2024–25 సీజన్లో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి కుట్ర చేసి, నకిలీ రైతులను సృష్టించి ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టి విచారణ జరిపి అక్రమాలు గుర్తించినట్లు తెలిపారు. శాయంపేట, కాట్రపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. కమలాపూర్‌కు చెందిన సాంబశివ మినీ మోడ్రన్ రైస్ మిల్ యజమాని బెజ్జంకి శ్రీనివాస్ ఈ మోసానికి ప్రధాన సూత్రధారిగా దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. నకిలీ ప్రొఫైల్.. బెజ్జంకి శ్రీనివాస్, అతడి కుటుంబ సభ్యులు, మధ్యవర్తులు, కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులతో కుమ్మకై ్క ఆన్లైన్ ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ పోర్టల్‌ను ఉపయోగించి 12 మంది నకిలీ రైతుల ప్రొఫైళ్లు సృష్టించాడని ఎస్పీ తెలిపారు. ఈ నకిలీ రైతులు 278 ఎకరాల భూమిని సాగు చేసినట్లుగా సదరు రైస్ మిల్లుకు 8,049.6 క్వింటాళ్ల ధాన్యాన్ని సరఫరా చేసినట్లుగా చూపించారన్నారు. వాస్తవానికి ఎక్కడా ధాన్యం సేకరించలేదని, రవాణా చేయలేదని తెలిపారు. ఈ అవకతవకల ద్వారా రూ.1,86,63,088 మొత్తాన్ని అక్రమంగా క్లెయిమ్ చేసుకున్నట్లు, ఆ నగదును నకిలీ లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. సహకరించిన అధికారులు అక్రమాలకు పాల్పడినవారిలో బండ లలిత నకిలీ ఎంట్రీల అక్రమ సృష్టికి మధ్యవర్తిగా వ్యవహరించారని, ప్రైవేట్ ఆపరేటర్ వాంకుడోత్ చరణ్ కీలక పాత్రధారిగా గుర్తించినట్లు తెలిపారు. శాయంపేట కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ బి.హైమావతి, కాట్రపల్లి కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ అనిత ఇతరులకు ట్యాబ్‌లు ఇచ్చి అక్రమాలకు సహకరించారన్నారు. వ్యవసాయ అధికారులు ఏఓ కె.గంగజమున, ఏఈఓలు బి.అర్చన, ఎం.సుప్రియ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు సహకరించారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సుధాటి రాజేశ్వర్‌రావు ధాన్యాన్ని భౌతికంగా రవాణా చేయకుండానే 27 లారీల చిట్టీలకు రవాణా ఛార్జీలను క్లెయిమ్ చేశారని గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 12 మంది నకిలీ రైతులు, 278 ఎకరాల భూమి, 8,049 క్వింటాళ్ల దాన్యం ద్వారా రూ.1,86,63,088 కొల్లగొట్టినట్లు విచారణలో తేలిందని తెలిపారు. విచారణ అనంతరం నగదు రికవరీ, పోర్టల్ నుంచి భూమి తొలగింపు, తదుపరి క్రిమినల్, శాఖాపరమైన చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.రూ.1.86 కోట్లు దుర్వినియోగం రికవరీ, క్రిమినల్ చర్యలకు ఆదేశం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు శాయంపేట: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఫిర్యాదుతో మిల్లు యజమాని శ్రీనివాస్, వారికి సహకరించిన బండ లలిత, వాంకుడోత్ చరణ్, బలబద్ర హైమావతి, అనిత, వ్యవసాయ అధికారులు గంగాజమున, అర్చన, సుప్రియ, రవాణా కాంట్రాక్టర్ సుధతి రాజేశ్వర్రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మైక్రోలైట్ విమానంలో ఎయిర్‌వింగ్ శిక్షణ
ఎన్సీసీ కేడెట్ల గగన విహారం మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయంలో తెలంగాణ 4వ ఎన్సీసీ ఎయిర్ వింగ్ బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం మైక్రోలైట్ విమానంలో ఎన్సీసీ కేడెట్లు ఉత్సాహంగా గగనంలో విహరించారు. మైక్రోలైట్ విమాన పనితీరు తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా ఎయిర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, వింగ్ కమాండర్ ఆశిష్ ధనాకే హాజరై మైక్రోలైట్ విమానంలో సంచరిస్తూ ఎన్సీసీ కేడెట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయంలో ఎన్సీసీ కేడెట్ల సేవల్ని దేశం కోసం ఉపయోగిస్తామని, అందుకే ఎయిర్ వింగ్ శిక్షణ ఇస్తున్నట్లు కమాండర్ ఆశిష్ధనాకే తెలిపారు. శిక్షణలో వర్ధన్నపేట జిల్లా పరిషత్ పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ నిమ్మ మనుజేందర్‌రెడ్డి, సార్జెంట్ రెడ్డి, సార్జెంట్ రాయ్, సుమాన్ సింగ్, హెచ్ఎం కాయిత శ్రీనివాస్, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. -
ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, వీటిని యాజమాన్యాలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్ ఈఈయూ కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్లో యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు వెంటనే గ్రేడ్ పదోన్నతి కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలన్నారు. కాగా, ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై హై దరాబాద్‌లో విద్యుత్ సంస్థల్లోని యూనియన్లతో చ ర్చించి జేఏసీ ఏర్పాటు చేశారన్నారు. ఆర్టిజన్ జేఏసీ చైర్మన్‌గా టీఎస్‌ఈఈయూ–327కు కేటాయించగా నాలుగు విద్యుత్ సంస్థలకు చైర్మన్లను ఎన్నుకున్న ట్లు తెలిపారు. ఎన్పీడీసీఎల్ చైర్మన్‌గా డి.సికిందర్, ఎస్పీడీసీఎల్ చైర్మన్‌గా ఎస్.సతీశ్‌రెడ్డి, జెన్కో చై ర్మన్‌గా రమేశ్‌కుమార్, ట్రాన్స్‌కో చైర్మన్‌గా కల్యాణ్ ను ఎన్నుకున్నట్లు వివరించారు. యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ శ్రీనివాస్, జెన్కో ప్రెసిడెంట్ మాధవరావు, రాష్ట్ర నాయకులు తులసి శ్రీమతి, ధరావత్ సికిందర్, సుంకు సతీశ్ రెడ్డి పాల్గొన్నారు. టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
మైక్రోలైట్ విమానంలో ఎయిర్‌వింగ్ శిక్షణ
మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయంలో తెలంగాణ 4వ ఎన్సీసీ ఎయిర్ వింగ్ బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం మైక్రోలైట్ విమానంలో ఎన్సీసీ కేడెట్లు ఉత్సాహంగా గగనంలో విహరించారు. మైక్రోలైట్ విమాన పనితీరు తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా ఎయిర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, వింగ్ కమాండర్ ఆశిష్ధనాకే హాజరై మైక్రోలైట్ విమానంలో సంచరిస్తూ ఎన్సీసీ కేడెట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయంలో ఎన్సీసీ కేడెట్ల సేవలను దేశం కోసం ఉపయోగిస్తామని, అందుకే ఎయిర్ వింగ్ శిక్షణ ఇస్తున్నట్లు కమాండర్ ఆశిష్ధనాకే తెలిపారు. శిక్షణలో వర్ధన్నపేట జిల్లా పరిషత్ పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ నిమ్మ మనుజేందర్‌రెడ్డి, సార్జెంట్ రెడ్డి, సార్జెంట్ రాయ్, సుమాన్ సింగ్, హెచ్ఎం కాయిత శ్రీనివాస్, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. -
రైతులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
గీసుకొండ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. శనివారం మండలంలోని కొనాయమాకుల రైతు వేదిక వద్ద పీఎం ధనధాన్య కృషి యోజన ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు, రైతులతో కలిసి కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు పంటలు సాగుచేయాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి కె, అనురాధ, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ బాలకృష్ణ, డీహెచ్ఎస్ఓ శ్రీనివాసరావు, డీసీఓ నీరజ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పలత, రాస్ శాస్త్రవేత్త మధు, ఏడీఏ నర్సింగం, ఏఓ హరిప్రసాద్‌బాబు, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్ పాల్గొన్నారు. గీసుకొండ : కొనాయమాకుల రైతువేదికలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యశారద -
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
దుగ్గొండి: విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంచి మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని పేర్కొన్నారు. గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల విద్యాలయాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, స్టోర్ రూం, కిచెన్ పరిశీలించారు. తరగతుల నిర్వహణ, హాజరు పట్టికలు తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకా రం భోజనం పెడుతున్నారా, కూరలు రుచిగా ఉంటున్నాయా అని అడిగారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్యూలో నిలబడి భోజనం తెచ్చుకుని భోజనం చేశారు. పాఠశాలలోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కరించా లని హెచ్ఎం మల్లయ్యను ఆదేశించారు. తరగతి గదిలో కాసేపు ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబ ట్టారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. బాస్కెట్‌బాల్ కోర్టు కావాలని విద్యార్థులు కోరడంతో వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి పుష్పలత, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద గిర్నిబావిలో ఎంజేపీ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ -
ఇక బోగస్ హాజరుకు చెక్
సంగెం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కూలీలకు ఈ–కేవైసీ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ మస్టర్ పర్యవేక్షణ వ్యవస్థ (ఎన్ఎంఎంఎస్) యాప్‌లో కూలీల వివరాలు, ఈ–కేవైసీ నమోదు చేయడం తప్పనిసరి చేసింది. ఈ విధానంలో కూలీల జాబ్‌కార్డులకు ఆధార్ అనుసంధానం చేయడం, వారి ఐరిస్ నమోదుతో ఒకరికి బదులుగా మరొకరు పనికి వచ్చే అవకాశం ఉండదు. మృతుల పేర్లు నమోదు చేసే వీలుండదు. దీంతో ఎక్కువ మంది కూలీలు పనికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మస్టర్లు రాసే అవకాశం ఉండదు. జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో ఉపాధి హామీ కూలీల ఈ–కేవైసీ నమోదు కొనసాగుతోంది. ఈ–కేవైసీ పూర్తి చేసుకోని కూలీలకు ఇక మీదట పనులు కల్పించే అవకాశం ఉండదు. అధికారులు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నూతన సంస్కరణలతో ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒకరి జాబ్‌కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,23,701 మంది కూలీలు.. జిల్లాలోని 325 గ్రామపంచాయతీల పరిధిలో 1.2 లక్షల జాబ్‌కార్డులు జారీచేయగా 2.39 లక్షల మంది కూలీలున్నారు. అందులో యాక్టివ్‌గా ఉన్న 74 లక్షల జాబ్‌కార్డుల్లో 1,23,701 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 1,23,698 మంది కూలీలకు ఆధార్ జాబ్‌కార్డుకు అనుసంధానం, 77,111 మందికి (62.34 శాతం) ఈ–కేవైసీ పూర్తి అయ్యింది. ఇంకా 46,590 మందికి ఈ–కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఎన్ఎంఎంఎస్ యాప్ తీసుకొచ్చిన కేంద్రం.. పనిప్రదేశం వద్ద కూలీల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో అప్లోడ్ చేసేవారు. కానీ, క్షేత్రసహాయకులు, మేట్లు నకిలీ ఫొటోలను అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయటపడడంతో వీటిని అరికట్టేందుకు కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్‌ను తీసుకొచ్చింది. దీనిని దుర్వినియోగం చేస్తున్నట్లు గ్రహించి నకిలీల హాజరు నమోదును అరికట్టేందుకు ఈ–కేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ–కేవైసీ పూర్తి అయిన తర్వాత పనులకు వచ్చిన కూలీల ఫొటోలను ఫోన్లో తీసి అప్లోడ్ చేస్తారు. నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. ఒకే వ్యక్తి రెండుసార్లు ఫొటో దిగి అప్లోడ్ చేయిస్తే కూలీల డబ్బులు విడుదల కావు. అక్రమాలకు ఆస్కారం లేకుండా.. గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల వివరాల నమోదుకు ఈ–ఎంబీ (ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పనిచేసే ప్రాంతాల వివరాలను గుర్తించి ముందుగా లెక్కించి కొలత పుస్తకంలో రాసి తర్వాత ఆన్లైన్, ఈ ఎంబీలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ప్రత్యేక యాప్‌తో అనుసంధానిస్తే ఆయా పనుల వివరాలను ఎప్పుడైనా చూసుకోవచ్చు. దీంతో ఒకే చోట రెండు పనులు చేయడం వంటి తప్పిదాలకు ఆస్కారం ఉండదు. సాంకేతిక సమస్యతో ఆలస్యం.. జిల్లాలో ఈ–కేవైసీ ప్రక్రియ ప్రారంభమై దాదాపు పది రోజులు అవుతోంది. సిగ్నల్స్ అంతరాయం కారణంగా ఈ–కేవైసీ నమోదులో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని సమయాల్లో యాప్ మొరాయిస్తుండడంతో ఆలస్యం అవుతున్నది. ఈ–కేవైసీ పూర్తికి చర్యలు.. అన్ని గ్రామాల్లో జాబ్‌కార్డు ఉన్న కూలీల వివరాలను ఈ–కేవైసీ చేయిస్తున్నాం. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఈ విధానం గురించి అవగాహన కల్పించాం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అడిగినవారందరికీ పనులు కల్పిస్తాం. నకిలీ మస్టర్లకు తావులేకుండా అర్హులైన కూలీలందరికి 100 రోజుల పని కల్పించేందుకు కృషి చేస్తున్నాం. – గణేశ్, ఏపీఓ, సంగెం ఉపాధి హామీ జాబ్‌కార్డుతో ఆధార్ అనుసంధానం పని ప్రదేశంలో కూలీలకు ఐరిస్ నమోదు ఈ–కేవైసీ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు -
బీట్ ఆఫీసర్ సస్పెన్షన్
నల్లబెల్లి: మండలంలోని గోవిందాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శోభన్‌బాబును సస్పెండ్ చేస్తూ అటవీశాఖ జిల్లా అధికారి అనూజ్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు నర్సంపేట ఎఫ్ఆర్వో రవికిరణ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బీట్ ఆఫీసర్ శోభన్‌బాబు రైతుల నుంచి డబ్బులు తీసుకుని పోడు చేయిస్తున్నాడని ఫిర్యాదులు అందాయి. విచారణ చేయగా డబ్బులు తీసుకున్నట్లు పోడు రైతులు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు విచారణ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేసినట్లు ఎఫ్ఆర్వో రవికిరణ్ పేర్కొన్నారు. రేపు ఉద్యోగమేళాకాళోజీ సెంటర్: హనుమకొండ అంబేడ్కర్ సెంటర్ సమీపంలోని ఐసీఎస్ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్లో సోమవారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఒకేషనల్, ఏ గ్రూపు విద్యార్థులైనా 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, ఓవరాల్‌గా 60 శాతం గణితంలో మార్కులు సాధించినవారు అన్ని సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు హెచ్‌సీఎల్ ప్రతినిధి శివ (7569177071, 7981834205)ను సంప్రదించాలని డీఐఈఓ సూచించారు. 6.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేతనర్సంపేట రూరల్: పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని రాజిరెడ్డి రైస్‌మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వచేశారన్న పక్కా సమాచారం అందింది. ఈ మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు శనివారం సంయుక్తంగా దాడులు చేసి 6.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి మిల్లు యజమాని సాయిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో నర్సంపేట రూరల్ ఎస్సై గూడ అరుణ్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాలిక అదృశ్యంనర్సంపేట రూరల్: బాలిక అదృశ్యమైన సంఘటన నర్సంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లారు. వారు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి బాలిక కనిపించలేదు. స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ మేరకు బాలిక తండ్రి శనివారం సాయంత్రం నర్సంపేట పోలీస్ స్టేషన్లో చేశారు. ఆటో టైరు అపహరణగీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ కీర్తినగర్‌లో ఆటో టైరును డిస్క్‌తో సహా దొంగలు ఎత్తుకుని వెళ్లారు. బాధితుడి కథనం ప్రకారం.. కీర్తినగర్‌కు చెందిన అనుమాండ్ల మహేశ్ ఈనెల 9న తన ఆటోను ఇంటిపక్కన నిలిపి నిద్రపోయాడు. తెల్లారి లేచి చూస్తే ఆటో వెనక టైరును డిస్క్‌తో సహా దొంగలు ఎత్తుకుపోయారని గుర్తించాడు. దీంతో తనకు రూ.4 వేల నష్టం వచ్చిందని, ఈ విషయాన్ని 112కు డయల్ చేసి చెప్పగా వారు కేసును గీసుకొండ పోలీసులకు అప్పగించారు. జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేయాలి నయీంనగర్: జనరల్ సీట్లన్నింట్లో బీసీలు పోటీ చేసి గెలవొచ్చని బీసీ నాయకులు ఉద్ఘాటించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీ చైతన్య వేదిక, ఆలిండియా ఓబీసీ జేఏసీ ఆధ్వర్యంలో ‘బీసీ రిజర్వేషన్లు – ఉద్యమ కార్యాచరణ’ అంశంపై శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో బీసీ చైతన్య వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఆలిండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్, జి.శ్రీనివాస్, సోమ రామమూర్తి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధనకు సబ్బండ వర్గాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బహుజనుల ఓట్లు బహుజనులకే వేసుకుందామని నినదించారు. బీసీ రిజర్వేషన్లకు ఎస్సీ, ఎస్టీల మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తాడిశెట్టి క్రాంతికుమార్, కుమార్ గాడ్గె, వీరస్వామి, వేణుమాధవ్, రామారావు, తిరుపతి, సంపత్, విద్యార్థులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. – వెంకటాపురం(ఎం) వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్‌లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. ఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్‌గా ఇండియా కల్చర్‌పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్‌గా బాగుంది. – హమీద్ దాస్, కోల్‌కతా -
అక్టోబర్ చివరినాటికి ‘ప్రాణహిత’ కొత్త డీపీఆర్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి/సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ కోసం సవరించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీని వేగవంతం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖపై సచివాలయంలో మంత్రి శనివారం సమీక్షించా రు. ఇటీవల తుమ్మిడిహెట్టి, సుందిళ్లను సందర్శించిన అధికారులు సమరి్పంచిన క్షేత్ర పరిశీలనల నివేదికలను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గతంలో నిర్మించిన ప్రధాన కాలువ, ఇతర నిర్మాణాలు చాలావరకు చెక్కుచెదరకుండా ఉన్నాయని, స్వల్ప మరమ్మతుల తర్వాత ఉపయోగించుకోవచ్చని అధికారులు వివరించారు. 71 కి.మీ.లు విస్త రించి ఉన్న ప్రధాన కాలువ నెట్వర్క్ ఉపయోగించదగిన స్థితిలో ఉందని, రెండు ప్రధాన అక్విడక్ట్‌లు 70 శాతం పూర్తయ్యాయని అధికారులు నివేదించారు.తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి అక్కడి నుంచి సుందిళ్ల బరాజ్ వరకు నీటిని గ్రావిటీతో తరలించొచ్చని ఇంజనీర్లు చేసిన సూచనను ఆయన స్వాగతించారు. దీనితో కొత్త పంప్‌హౌస్ నిర్మించి బహుళ దశల్లో లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు వివరించారు. సుందిళ్ల బరాజ్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని అధికారులు మంత్రికి తెలియజేశారు.తుమ్మిడిహెట్టి నుంచి 71 కి.మీ. ప్రధాన కాల్వలో 45 కి.మీ. కాల్వ తవ్వకం పూర్తయిందని, ఇతర పనులూ పాక్షికంగా పూర్తయ్యాయని క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలపై సమగ్ర ప్రతిపాదనలు సమర్పిస్తే నెలాఖరులోగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. వచ్చే వారం మళ్లీ సమీక్షిస్తానని, అక్టోబర్ చివరి నాటికి సవరించిన డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల స్థలాల్లో సౌర ప్లాంట్లు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన సాగునీటి ప్రాజెక్టుల భూములను గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఉత్పత్తి చేసే విద్యుత్‌ను సాగునీటి పథకాలు, పంపింగ్ స్టేషన్ల నిర్వహణకు ఉపయోగిస్తే పెద్ద మొత్తంలో విద్యుత్ చార్జీలను ఆదా చేయొచ్చని చెప్పారు. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నరు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే బద్నాం చేస్తున్నాడని, తమ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు, ఆల్మట్టి ఎత్తు పెంపునకు పూర్తిగా వ్యతిరేకమని మంత్రి ఉత్త మ్ స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు. గోదావరి, కృష్ణాజలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని పునరుద్ఘాటించారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ అరుదైన రికార్డుధాన్యం దిగుబడిలో తెలంగాణ అరుదైన రికార్డు నమోదు చేసుకోనుందని మంత్రి ఎన్.ఉత్తమ్ చెప్పారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా కోటీ 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై శనివారం సాయంత్రం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, అందులో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లా కేంద్రాలలో ఇప్పటికే 1,205 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు వెల్లడించారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఈనెల 16న హైదరాబాద్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు నీటిని ఎత్తిపోయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు వాడకున్నా, తెలంగాణ వరిసాగులో రికార్డు సృష్టించిందన్నారు. నర్సంపేట ఎమ్మె ల్యే దొంతి మాధవరెడ్డికి మాతృవియోగం జరగ్గా.. ఆయనను పరామర్శించేందుకు మంత్రి ఉత్తమ్ శనివారం హనుమకొండకు వచ్చారు. అనంతరం మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులతో కలిసి మీడియాతో మాట్లాడారు. -
Konda Surekha: రేవంత్‌కు ఫిర్యాదు.. ఖర్గేకు లేఖ
సాక్షి, హైదరాబాద్: అడ్లూరి-పొన్నం వివాదం మరువక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది(Telangana Ministers Clash). దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేడారం టెండర్ల విషయంలో ఈ ఇద్దరు మంత్రులకు వార్ మొదలైందని తెలుస్తోంది. ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అయితే.. తన శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనులను తన మనిషికి ఇప్పించుకునేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మంత్రి కొండా సురేఖ ఆరోపణ. ఈ క్రమంలో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పలుకీలక అంశాలతో లేఖ రూపేణా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని ప్రచారం బలంగా వినిపిస్తోంది(Konda Surekha Complaint Ponguleti). ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్య చేశారంటూ అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో రిలీజ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. పొన్నం క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారాయన. ఈ క్రమంలో సీఎం సూచనతో.. టీపీపీసీ చీఫ్ మధ్యవర్తిత్వం వహించడంతో పొన్నం క్షమాపణలు చెప్పగా ఆ పంచాయితీ ముగిసింది.ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలంటే లెక్కే లేదా? -
మిషనరీస్ ఆఫ్ చారిటీలో వైద్యశిబిరం
వరంగల్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) పురస్కరించుకుని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ అధ్యక్షతన కాశిబుగ్గలోని ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లోని మేధో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ హాజరై మాట్లాడుతూ.. ‘మానసిక దివ్యాంగులను చేరదీసి, వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు. న్యాయ సేవలు, సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. భవిష్యత్‌లో వీరికి కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలకు తమను సంప్రదించవచ్చని సూచించారు. దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని ఆమె అభినందించారు. అనంతరం మేధో దివ్యాంగులకు పండ్లు, స్వీట్లు అందించి, వారితో సరదాగా గడిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, ఇంతేజార్గంజ్ ఎస్ఐలు తేజ, వెంకటేశ్వర్లు, డాక్టర్ క్యూరీ, డాక్టర్ అనూహ్య, సిస్టర్ సవీన మరియా, సిస్టర్ అంజలిక మరియా పాల్గొన్నారు. -
మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభి రామారావు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని బన్ను న్యూరో హెల్త్ అండ్ రిహబిలిటేషన్ సెంటర్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా చిన్నారుల మానసిక ఆరోగ్య స్థితిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. వారు ఒత్తిడిని అధిగమించి మానసిక ఆరోగ్యం పొందేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి శ్రీనివాస్‌రావు, కేయూసీ ఈసీ సభ్యురాలు అనితారెడ్డి ఎంజీఎం ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగం డాక్టర్ చిమ్మి కృష్ణ, బన్ను ఆరోగ్య ది సేవా సొసైటీ అధ్యక్షుడు వీరమల్ల చంద్రజిత్రెడ్డి, బన్ను స్పెషల్ స్కూల్ ప్రిన్సిపాల్ వీరమల్ల కిరణ్‌కుమారి, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని 67 వైన్స్‌కు గాను శుక్రవారం 16 దరఖాస్తులను హనుమకొండ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌కు మద్యం వ్యాపారులు అందజేశారు. కాగా, వైన్స్ టెండర్ల ప్రకటన వెలువడినప్పటి నుంచి శుక్రవారం వరకు మొత్తం 65 దరఖాస్తులు అందాయి. వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ హతీరామ్ మే10న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య కీర్తికి శుక్రవారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈసందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేయాల్సిన బెనిఫిట్లను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ యాకుబ్ బాబా, సహాయకుడు తులసి పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ‘ది హైపోథీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేధస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్‌లో 700 మంది అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఏడాది 81.03 క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు సాధించడం నిట్‌కు గర్వంగా నిలుస్తోందన్నారు. హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు పెండ్యాల సందీప్‌శర్మ, పానుగంటి ప్రణవ్, శ్రవణ్ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని దేవాలయంలోని ఉత్తిష్ట గణపతికి అభిషేకాలు నిర్వహించారు. -
దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి కమలాపూర్: సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులతో పాటు రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులు, కార్యాలయాన్ని పరిశీలించి మండలంలోని ప్రభుత్వ భూముల వివరాలు అడిగి తెలుసుకునిన్నారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వితంతువుకు అండగా నిలిచిన పీఏసీస్ డైరెక్టర్ మండలంలోని వంగపల్లికి చెందిన వితంతువు జూపాక ఇందిరకు పీఏసీఎస్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు తక్కళ్లపెల్లి సత్యనారాయణరావు అండగా నిలిచారు. ఇందిర భర్త జలందర్‌కు రావాల్సిన వారసత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఒకరు 2018లో ఆర్ఓఆర్ ద్వారా పట్టా చేసుకోగా.. ఈ విషయమై ఇందిర అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తన భూమి తనకు ఇప్పించండని ఇందిర విలపిస్తుండగా.. గమనించిన సత్యనారాయణరావు చలించిపోయారు. మాజీ సర్పంచ్ శనిగరపు సమ్మయ్యతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి వద్దకు ఇందిరను తీసుకెళ్లి విషయాన్ని అదనపు కలెక్టర్‌కు వివరించారు. స్పందించిన అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని, బా ధ్యులపై చర్యలు చేపట్టి అక్రమ పట్టా రద్దు చేయాలని ఆదేశించారు. తనకు అండగా నిలిచిన సత్యనారాయణరావుకు ఇందిర కృతజ్ఞతలు తెలిపారు. -
బీసీ రిజర్వేషన్ల బాధ్యత ప్రభుత్వానిదే
కమలాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అది సాధించే వరకు కొట్లాడుదామని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీ ఈటలకు కమలాపూర్ మండలం అంబాల క్రాస్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘ఇవి జరిగే ఎన్నికలు కావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు దసరా దావతులు ఇవ్వొద్దు’ అని ఎంపీ ఈటల చేసిన సూచన మేరకు తాము ఎలాంటి ఖర్చు పెట్టలేదని, తాము కష్టాల పాలు కాకుండా చేసిన ఈటలకు ఆశావహులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారందరికి కలిపితే రూ.కోట్లు మిగిలాయని, దీంతో పోటీ చేయాలనుకున్న ఆశావహులమంతా సంతాషంగా ఉన్నామని ఈటలకు తెలిపారు. అనంతరం కమలాపూర్‌లోని తన నివాసంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఈటల సమావేశమై కాసేపు ముచ్చటించారు. అనంతరం మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను ఈటల పరామర్శించారు. సాధించే వరకు కొట్లాడుదాం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి
● బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ నర్సంపేట: అగ్రకులాల నాయకుల కుట్రలో భాగంగానే తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే విధించిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నర్సంపేటలోని అమరవీరుల జంక్షన్ వద్ద శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా బిల్లు కేంద్రానికి పంపినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును పార్లమెంట్లో చర్చించకుండా నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల జీఓ 9ని రద్దు చేయాలని రెడ్డి జాగృతి నాయకులు పిటిషన్ వేయడంతో హైకోర్టు స్టే విధించడం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక కుట్ర జరిగిందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు పోరాడాలని సూచించారు. పార్టీల జెండాలను పక్కన పెట్టి జిల్లా వ్యాప్తంగా పోరాటం చేసి రిజర్వేషన్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేశ్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేశ్, బీసీ జిల్లా నాయకులు డ్యాగల శివాజీ, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యాంకుమార్, పట్టణ కార్యదర్శులు గాండ్ల శ్రీని వాస్, బేతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి పంట పరిశీలన
వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామంలో శుక్రవారం పత్తి పంట క్షేత్రాలను విదేశీయులు సందర్శించారు. స్విట్లర్లాండ్ జెనీవాకు చెందిన హెలెన్, లండన్‌కు చెందిన అంజలినారస్.. ప్రజ్వల్ ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులతో కలిసి రైతుల పత్తి పంట క్షేత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పత్తి సాగులో క్రిమిసంహారక మందుల వినియోగంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అధిక దిగుబడి సాధించేందుకు ఉత్తమ యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. ప్రజ్వల్ ఫార్మర్స్ లిమిటెడ్ ప్రతినిధులు హర్ష, వంశీకృష్ణ, శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు. -
కలెక్షన్లో ‘కార్పొరేషన్’ ఫెయిల్
వరంగల్ అర్బన్: పన్నుల వసూళ్లలో గ్రేటర్ వరంగల్ చతికిల పడింది. ఫస్ట్ ఆఫ్ ఆరు నెలల వ్యవధిలో ఆస్తి పన్ను 25 శాతం, నీటి చార్జీలు 12 శాతం వసూళ్లతో సరిపెట్టుకున్నారు. గణాంకాలను పరిశీలిస్తే బల్దియా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)కి ప్రధాన ఆదాయ వనరు పన్నులు. డిమాండ్ మేరకు ఏటా ఆస్తి, నీటి పన్నులు కచ్చితంగా వసూలు చేస్తేనే స్థానిక సంస్థలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. కొత్త ఇంటి నంబర్ల జారీ, భవనాల రివైడ్జ్, పేరు మార్పిడుల పేరిట కాసుల కోసం వేట కొనసాగిస్తున్నారే తప్ప పన్ను వసూళ్లపై సరైన కార్యాచరణతో ముందుకు సాగట్లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో పన్నుల వసూళ్లను ఫస్ట్, ఆఫ్ సెకండ్ ఆఫ్‌గా వసూలు చేస్తుంటారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, రెండో దఫా అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు వర్గీకరించి పన్నులు వసూలు చేస్తుంటారు. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల ఆదేశాల మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ)సూచనల మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏడాదికి ఒకేసారి డిమాండ్ నోటీస్ జారీ చేశారు. కానీ, అందులో ఆర్నెళ్లకోసారి చెల్లించుకునే పొందుపర్చారు. వసూళ్లు ఇలా.. మహా నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను అసెస్మెంట్లు 2,28,901 కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.81.18 కోట్లు, వడ్డీ రూ.46.06 కోట్లు, పాత బకాయిలు రూ.43.60 కోట్లు మొత్తంగా రూ.170.80 కోట్లు వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఇప్పటి వరకు ఆస్తి పన్ను రూ.42.10 కోట్లు అంటే 25 శాతం వసూలు చేశారు. ఇకపోతే తాగునీటి నల్లా కనెక్షన్లు 1,77,567 ఉండగా.. రూ.49.70 కోట్లు కరెంటు, పాత బకాయిలు రూ.25.28 కోట్లు కాగా, మొత్తంగా రూ.74.99 కోట్లు డిమాండ్ నెలకొంది. ఇందులో 8.87 కోట్లు అంటే 12 శాతం మాత్రమే వసూలు చేశారు. సర్కారీ శాఖల నుంచి పెద్ద మొత్తంలో ఆస్తి, నీటి చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా, ఆ సొమ్మును రాబట్టుకునేందుకు చొరవ తీసుకునే నాథుడే బల్దియా యంత్రాంగంలో కరువయ్యారనే విమర్శలు నెలకొన్నాయి. లోపం యంత్రాంగానిదే... పన్ను బకాయిలు పెరిగిపోవడానికి, సక్రమంగా వసూలు కాకపోవడానికి యంత్రాంగం వైఫల్యమే ప్రధాన కారణం. ప్రజలకు నోటీసులు జారీ చేయడంతో సరిపెట్టకుకోకుండా ప్రజలు సక్రమంగా చెల్లిస్తున్నారా? చెల్లించని వారికి ఆ సొమ్ముపై 2శాతం వడ్డీ భారం తోడవుతుందని చెల్లింపుదారుల్లో చైతన్యం కల్పించడంతో విఫలమవుతున్నారు. కేత్ర స్థాయిలో పన్నుల వసూళ్లను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు కలిసి వసూళ్ల బాధ్యత ఇ–సేవా కేంద్రాల సిబ్బందికి వసూళ్ల బాధ్యతలను అప్పగిస్తూ ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారనే అరోపణలున్నాయి. ఆస్తి, నీటి చార్జీలు ఫస్ట్ ఆఫ్‌లో వెనుకబడిపోవడానికి పన్నుల విభాగం అధికారులను వివరణ కోరితే ఎవరికి వారు దాటవేస్తుండడం గమనార్హం. ఫస్ట్ ఆఫ్‌లో ఆస్తి పన్ను 25% నీటి చార్జీలు కేవలం 12% వసూలు నిద్రావస్థలో పన్నుల విభాగం అధికారులు జీడబ్ల్యూఎంసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం -
సాంకేతికతను రైతుకు చేరువ చేయాలి
● రైతు సదస్సులో కలెక్టర్ సత్యశారద గీసుకొండ: వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఎలుకుర్తిహవేలిలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల రావెప్ విద్యార్థులు, వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రైతు సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రానున్న కాలంలో వ్యవసాయంలో చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా రైతును సన్నద్ధంచేయాలని సూచించారు. వ్యవసాయ సహపరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి మాట్లాడుతూ మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వేయవద్దని, యాంత్రీకరణ అలవర్చుకోవాలన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరి, పత్తిలో ఎండు తెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ మాట్లాడుతూ పత్తి రైతులు తప్పనిసరిగా ‘కపాస్ కిసాన్ యాప్’లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రపంచ ఎగ్డే ఉత్సవాలు కూడా నిర్వహించారు. వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బీవీ రాజ్‌కుమార్, విశ్వతేజ, రమేశ్, జె.నరేందర్, గోపిక, ప్రజ్ఞ, సాయికిరణ్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఏఓ హరిప్రసాద్‌బాబు, అభ్యుదయ రైతులు, ఏఈఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. మార్కెట్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి వరంగల్: పత్తి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నాణ్యతా ప్రమాణాల ప్రకారం మద్దతు ధరలకు విక్రయించేలా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఒక హెల్ప్‌డెస్క్ వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద మార్కెట్ అధికారులను ఆదేశించారు. మార్కెట్‌ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, యార్డుల్లోని పంట ఉత్పత్తులు పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో రైతులు, వ్యాపారులు, కార్మికులకు కనీన వసతులు కల్పించేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, గ్రేడ్–2 కార్యదర్శులు ఎస్.రాము, జి.అంజిత్‌రావు, సహాయ కార్యదర్శి జి.రాజేందర్, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కోశాధికారి అల్లె సంపత్, కార్యవర్గ సభ్యులు గౌరిశెట్టి శ్రీనివాస్, కాటన్ సెక్షన్ కార్యదర్శి కట్కూరి నాగభూషణం పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు రావొద్దు న్యూశాయంపేట: రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్లో దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి 266 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో కంటే 65 కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా పెంచినట్లు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇన్చార్జ్ డీఆర్డీఓ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీసీఓ నీరజ, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ, ఆర్టీఓ శోభన్, లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, కోశాధికారి ఇరుకు కోటేశ్వర్రావు, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇక.. డీసీసీల ఎంపిక!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈమేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు.. వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్‌కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ పరిశీలకులతో భేటీ అయ్యి పలు సూచనలిచ్చారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ) దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. అదే విధంగా టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్‌కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్, జనగామ, మహబూబాబాద్‌కు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్‌జాదవ్, జువ్వాడి ఇందిరారావు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోటాపోటీగా ఆశావహులు.. ● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తథ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, కట్ల శ్రీనివాస్‌తోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్‌రావు, గోపాల నవీన్‌రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్‌రావు, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధులతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు) మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్‌గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్‌లో ఇప్పుడున్న జె.భరత్‌చంద్రా రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్ రాధ తోపాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్చార్జ్జులు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. డీసీసీ కోసం దరఖాస్తులు చేసుకోండి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలైందని, ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఏఐసీసీ పరిశీలకులు వస్తున్న సందర్భంగా దరఖాస్తుతోపాటు పార్టీకి చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొని బయోడేటా శనివారం మధ్యాహ్నంలోపు మీమీ జిల్లాల అధ్యక్షులకు అందజేయాలని తెలిపారు. ‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ 11 నుంచి 18వ తేదీ వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్‌తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
సంగెం: విద్యార్థినులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని జీసీడీఓ కె.ఫ్లోరెన్స్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నశముక్తు భారత్ అభియాన్ ఐదో వార్షికోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ దేశభవిష్యత్ విద్యార్థినుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. వైద్యశాఖ డిప్యూటీ డెమో అనిల్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థినులు ఆత్మ నిగ్రహంతో ఉండాలని, చెడు ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండాలన్నారు. అక్షరాస్యత, లింగసమానత్వం సాధిస్తే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే అన్నిరంగాల్లో విజయం వరిస్తుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం గురించి తెలిస్తే 1908, 14446కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం పలు పోటీలు నిర్వహించి విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఎంఈఓ రాము, డాక్టర్ రాకేశ్, ఎస్సై కె.వంశీకృష్ణ, కేజీబీవీ ప్రత్యేకాధికారి నీలిమ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!
‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు.. వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్‌కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్పరిశీలకులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ) దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. అదే విధంగా టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్‌కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్, జనగామ, మహబూబాబాద్‌కు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్‌జాదవ్, జువ్వాడి ఇందిరారావు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోటాపోటీగా ఆశావహులు.. ● డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు మార్పు తఽథ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, కట్ల శ్రీనివాస్‌తోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్‌రావు, గోపాల నవీన్‌రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్‌రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధుతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు) మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడి నుంచి సూర్య సీరియస్‌గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్‌లో ఇప్పుడున్న జె.భరత్‌చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్ రాధతోపాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్‌చార్జ్‌లు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దరఖాస్తు చేసుకోండి.. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలైందని, ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఏఐసీసీ పరిశీలకులు వస్తున్న సందర్భంగా దరఖాస్తుతోపాటు పార్టీకి చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొని బయోడేటా శనివారం మధ్యాహ్నంలోపు మీమీ జిల్లాల అధ్యక్షులకు అందజేయాలని తెలిపారు. నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 11 నుంచి 18 వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్‌తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి
కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ‘ది హైపోథీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేధస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్‌లో 700 మంది అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు సాధించడం నిట్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. -
స.హ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
న్యూశాయంపేట: సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అధికారులు సమాచార హక్కు చట్టంపై జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్‌ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ గ్రూప్–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై న నక్క శ్రుతిహర్షిత శుక్రవారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజే శారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించండి
వరంగల్ అర్బన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై–అర్బన్) 2.0 కార్యక్రమంపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సూచించారు. శుక్రవారం హనుమకొండ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఎంఏవై– అర్బన్–2.0 అవగాహనలో భాగంగా రూపొందించిన అంగీకార్–25 పోస్టర్‌ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. పీఎంఏవై–అర్బన్ 2.0 పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పేద, బలహీన వర్గాలకు మేలు జరిగేలా చూడడంతో పాటు, రుణ మేళాల ద్వారా లబ్ధిదారులకు గృహ రుణాలు అందేలా చూడాలని కమిషనర్ కోరారు. సమవేశంలో వరంగల్, హనుమకొండ జిల్లాల హౌసింగ్ పీడీలు గణపతి, హరికృష్ణ, బల్దియా డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్, హౌసింగ్ బోర్డు ప్రత్యేకాధికారులు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
రేపు వరంగల్‌లో పల్స్‌పోలియో
● డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గీసుకొండ: వరంగల్ నగరలో 0–5 ఏళ్లలోపు ఉన్న 20,121 మంది పిల్లలకు ఈ నెల 12న పోలియో చుక్కలు వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సబ్ నేషనల్ పోలియో వ్యాక్సినేషన్‌పై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం వరంగల్ నగర ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రజలు తమ పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకుని వెళ్లి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ నగరంలోని సీకేఎం, ఎంజీఎం, చింతల్, దేశాయిపేట, ఫోర్టు వరంగల్, కీర్తినగర్, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, కాశి బుగ్గలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చుక్కల మందు వేసే కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిధంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, ట్రాన్సిస్ట్ పాయింట్లు, మరో ఏడు మొబైల్ టీంలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, ట్రాన్సిస్ట్ సెంటర్లలో 24 గంటలపాటు చుక్కల మందు వేస్తారని చెప్పారు. సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ కోరారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారంతోనే ఆరోగ్యమైన సంతానం
● జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి శాయంపేట: గర్భిణులు పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతారని జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పరకాల సీడీపీఓ స్వాతి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి జాతీయ పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి పాల్గొని మాట్లాడారు. ప్రతీ సంవత్సరం పోషణ మాసం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆరోగ్యలక్ష్మి, ప్రీస్కూల్, లోప పోషణతో బాధపడే పిల్ల ల పోషణ స్థితిని మెరుగుపర్చే సేవలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఫణిచంద్ర, మండల వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ, వైద్యులు విద్య, శోభ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సునీత, పుణ్యవతి, పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ కళ్యాణి, బ్లాక్ కో–ఆర్డినేటర్ భిక్షపతి, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దు
● డీఎంహెచ్ఓ అప్పయ్య ఆత్మకూరు: విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని సెయింట్ థెరిస్సా హైస్కూల్లో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలన్నారు. చదువుతో పాటు ఆటపాటలపై శ్రద్ధ పెట్టాలన్నారు. మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ప్రహసిత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మానసిక సమస్యలుంటే 14416 టెలి మానస్‌కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి ఇక్తాదర్ అహ్మద్, మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన, పాఠశాల హెచ్ఎం జాయిస్, సిబ్బంది జునేడి, సంపత్, శ్రీనివాస్, నరేశ్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
ఐలోని మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు
ఆదాయం రూ.20.7 లక్షలు ఐనవోలు: ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం హుండీ లెక్కించారు. 2 ఆగస్టు 2025 నుంచి 10 అక్టోబర్ 2025 వరకు (69 రోజులకు) గాను హుండీలో రూ. 4,37,108, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.16,33,533 రాగా, మొత్తం రూ.20,70,641 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. హుండీలో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకులు డి.అనిల్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, ధర్మకర్తలు ఆనందం, కీమా, కుమారస్వామి, నర్సింహారెడ్డి, మహేందర్, కానిస్టేబుళ్లు రమేశ్, రాజు, జి.పరమేశ్వరి, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బీమా చెక్కు అందజేత
వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ హతీరామ్ మే10న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య కీర్తికి శుక్రవారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈసందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేయాల్సిన బెనిఫిట్లను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ యాకుబ్ బాబా, సహాయకుడు తులసి పాల్గొన్నారు. -
సమాచారహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
న్యూశాయంపేట: సమాచార హక్కు చట్టంపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాల్లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అధికారులు సమాచార హక్కు చట్టంపై జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్‌ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ గ్రూప్–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై న నక్క శ్రుతిహర్షిత శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రుతిహర్షిత జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ పొందనున్నారు.ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ వరంగల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, వీఓల అధ్యక్షురాళ్లకు డీఆర్డీఏ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి హాజరై పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తయిన ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తే వర్షాలు వచ్చినా ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన వెంటనే రైతు పేరు సీరియల్ బుక్‌లో రిజిస్టర్ చేసి, నంబర్ ఇచ్చి తూకం వేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, కామన్ గ్రేడ్‌కు రూ.2,369, సన్నధాన్యానికి అదనంగా బోనస్ రూ.500 చెల్లించనున్నట్లు తెలిపారు. అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు రజిత, కార్యదర్శి ఉమాదేవి, కోశాధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐతో సుపరిపాలన రామన్నపేట/కాళోజీ సెంటర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు ‘ఆర్టీఐ ద్వారా సుపరిపాలన’ అంశంపై జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాలలో పోటీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం–2005 ప్రజలకు వజ్రాయుధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్, కార్యక్రమ నిర్వాహకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు, అధ్యాపకులు అనిత, శ్రీధర్, శ్రీనివాస్, సంజీవ, గోపి పాల్గొన్నారు. లేఅవుట్లకు అనుమతి న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని లేఅవుట్ల అనుమతుల కోసం కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో లేఔట్ కమిటీ సమావేశం జరిగింది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఒక లేఅవుట్, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు అనుమతుల కోసం ప్రతి పాదనలను కమిటీ పరిశీలించి అనుమతి మంజూరు చేసింది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీటీసీపీ జ్యోతి, కుడా పీఓ అజిత్‌రెడ్డి, సిటీప్లానర్ రవీందర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఇజ్జగిరి, రోడ్లు, భవనాల అధికారి రాజేందర్, జిల్లా ఇరిగేషన్ అధికారి కిరణ్‌కుమార్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, భాస్కర్, అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కాళోజీ సెంటర్: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం డిప్యుటేషన్‌పై ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి సెల్ ఏర్పాటుకు అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు, హెచ్ఎంల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, సర్వశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ డీఈఓ, ఆర్జేడీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.