గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామివారి రతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారితో పాటు అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిని గుట్ట పైన ఆలయం నుంచి కిందకు తోడ్కొని వచ్చారు. పూజల అనంతరం విద్యుత్ దీపాలు, రంగుల కాగితాలతో సుందరంగా అలంకరించిన రథంలో దేవతామూర్తులను కుర్చుండబెట్టారు. ‘కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గోవిందా’ అంటూ భక్తి పారవశ్యంతో నినాదాలు చేస్తూ రథాన్ని గుట్టచుట్టూ తిప్పారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్, అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి పాల్గొన్నారు.


