● మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్: మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ శివనగర్‌లోని సాయి కన్వెన్షన్‌హాల్‌లో శనివారం మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి మహిళలను సన్మానించారు. డిప్యూటీ కమిషనర్ ప్రపన్నరాణి, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు పల్లం పద్మ, సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్, పోశాల పద్మ, గుండు చందన, ముష్కమల్ల అరుణ, వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, నాయకులు మీసాల ప్రకాశ్, గోపాల నవీన్‌రాజు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. శివనగర్‌లోని స్టేషన్‌రోడ్డుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్టేషన్‌రోడ్డుకు ఇరువైపులా మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి చెత్త తొలగించారు.


