breaking news
Warangal District News
-
దసరాను ప్రశాంతంగా నిర్వహించాలి
హసన్‌పర్తి: దసరా వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఉండేందుకు పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిఽధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల ప్రగతి తదితర అంశాలను స్టేషన్ల వారీగా సమగ్రంగా సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు గుర్తించి, వాటి దర్యాప్తుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పెండింగ్ కేసుల్లో నిందితుల అరెస్టు, పరారీలో ఉన్నవారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని పేర్కొన్నారు. కేసులు పెండింగ్ ఉండకుండా, ప్రతి కేసుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, ఆస్తి నేరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన తీవ్రమైన నేరాల తదితర కేసుల దర్యాప్తు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. సమీక్షలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, హన్మకొండ ఏసీపీ నరసింహారావు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కేసుల దర్యాప్తును పారదర్శకంగా చేపట్టాలి : సీపీ శ్వేత -
బతుకమ్మలతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
హన్మకొండ అర్బన్: జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె రెండో రోజు బుధవారం కొనసాగింది. రాష్ట్రంలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు, 78 కేడర్లకు చెందిన సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి, బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణతోపాటు వేతన సంబంధిత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా పలు జిల్లాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై అధికారులు ఒత్తిడి తేవడం ఆపాలని కోరింది. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మహేందర్ రావు పుట్ట డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె చేస్తామన్నారు. -
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు
జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.3.80 కోట్ల రాయితీతో 1,530 ఎకరాలకు 589 మంది రైతులకు స్పింక్లర్ల యూనిట్లను పంపిణీ చేశాం. ఇంకా 5వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. సీరియల్ విధానంలో అర్హులైన రైతులకు యూనిట్లు అందజేస్తున్నాం. ఆసక్తి గల రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలి. బిందు, తుంపర్ల సేద్యంతో శ్రమ ఆదా అవుతుంది. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేయవచ్చు. – ఆర్. శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి● -
రైతన్నకు వరం
– IIలోuబతుకమ్మలతో ఉద్యమం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మహిళలు బతుకమ్మలు చేతపట్టి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మహిళా నాయకులు అన్నారు.ఖిలా వరంగల్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సరిపడా వర్షాలు కురవక, చెరువులు, కుంటల్లో నీరులేక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్ల ద్వారా వచ్చే కొద్దిపాటి నీటితో ఆరుతడి పంటలు వేసుకునే రైతులకు బిందు, తుంపర సేద్యం వరంగా మారనుంది. ఈ క్రమంలో యాసంగిలో తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. బిందు, తుంపర పరికరాల ద్వారా మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు పంటకు నీరు అందుతుంది. దీంతో రెతులు బిందు, తుంపర పరికరాల (స్పింకర్ల) వైపు మొగ్గు చూపుతున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం.. బిందు, తుంపర్ల సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 1,530 ఎకరాలకు గాను 589 మంది రైతులకు రూ.3.80 కోట్ల విలువైన రాయితీ పరికరాలను అందించారు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా 5వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఆసక్తి గల రైతుల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో అధికారులు ఆహ్వానిస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో సాగు పెట్టుబడి వ్యయం తగ్గించుకొని, నాణ్యమైన పంటల దిగుబడులు సాధించగలిగే బిందు, తుంపర సేద్యాన్ని 2026 – 2027లో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోంది. జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఎక్కువే.. జిల్లాలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు, కాల్వలు లేవు. భారీ వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురవలేదు. మరో వైపు భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. దీంతో వేల ఎకరాల్లో వేసిన పత్తి, జొన్న, మిరప, ఆకుకూరలు, కూరగాయల పంటలు వాడిపోతున్నాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించి, ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసే విధానాలను అవలంభించాలని రైతులకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని బిందు, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. రాయితీలు ఇలా.. తెలంగాణ సూక్ష్మ నీటి పారుదల పథకం (టీజీఎంఐపీ) ద్వారా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేసుకునే బీసీ సన్నకారు, చిన్నకారు రైతులకు 80శాతం రాయితీ ఇస్తుండగా, ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం, తుంపర్ల సేద్యం అన్ని కేటగిరీలకు 65 శాతం రాయితీపై అవసరమైన పరికరాలను అధికారులు అందిస్తున్నారు. బిందు సేద్యంపై ఆసక్తి నీటి ఆదాతో పాటు మొక్కకు అవసరమైన మేరకే నీటి తడులు అందించే వనరు బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్). ఇప్పటికే జిల్లాలో 2వేల మంది రైతులు బిందు సేద్యంతో పంటలు పండిస్తున్నారు. ఆయిల్‌పామ్, మిరప, వేరుశనగ, ఉద్యాన తోటలకు అవసరానికి తగ్గట్టుగా వినియోగిస్తున్నారు. ఈ సేద్యంతో నీటి ఆదాతో పాటు కలుపు నివారణ ఖర్చులు తగ్గించుకోవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు వివరించారు.అన్ని డ్రిప్‌ల నుంచి ఒకేవిధంగా నీరు వస్తుందా..? లేదా..? అనేది సరిచూసుకోవాలి. అందుకోసం పొలంలోని కొలజారు, మధ్య, చివరి భాగాల్లోని డ్రిప్‌ల కింద లీటరు సామర్థ్యమున్న పాత్రలను ఉంచి నీటిని సేకరించాలి. సబ్ మెయిన్ వద్ద ఉన్న కవాటాన్ని నియంత్రించి ప్రతీ డ్రిప్ నుంచి నాలుగు లీటర్లు వచ్చే వరకు నీటిని వదలాలి. పాత్రల్లో సేకరించిన నీటిని కొలిచి వంద మీటర్ల లేటరల్ పైపుల్లో ఉన్న డ్రిప్‌ల మధ్యనీటి విడుదల 3శాతం కంటే ఎక్కువ తేడా లేకుండా చూడాలి. ఎక్కువ వ్యత్యాసం ఉంటే డ్రిప్‌లను శుభ్రం చేయడమో లేదా మార్చాలి. డ్రిప్‌లో ప్రధానంగా ఫిల్టర్లు, పైపులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. సాండ్ గ్రావెల్ ఫిల్టర్లలో కాలక్రమేణా మట్టి సేంద్రియ పదార్థాలు పేరుకుపోతాయి. దాంతో నీటి ప్రవాహం తగ్గి డ్రిప్‌లు మూసుకుపోతాయి. ఈ క్రమంలో వారానికి ఒకసారి బ్యాక్ వాష్‌లో పేరుకున్న మురికిని తొలగించాలి. పీవీసీ ప్రధాన పైపులు, సబ్ మెయిన్లు, లేటరల్ పైపుల్లో పేరుకుపోయే మట్టి, చెత్తను తీసేయాలి. ప్రతీవారం ప్లష్ వాల్ తెరిచి కొద్ది నిమిషాల పాటు నీటిని వదలాలి. నల్లని లేటరల్ చివర ఉన్న ఎండ్క్యాప్ తీసి కూడా ప్లషింగ్ చేయడంతో డ్రిప్‌లు మూసుకుపోవు. పైపులకు రంద్రాలు ఏర్పడితే గూప్ ప్లగ్‌లతో మరమ్మతులు చేయాలి. డ్రిప్‌లలో పాచి లవణాలు, కార్బోనేట్లు పేరుకుపోతే ఆమ్ల లేదా క్లోరిన్ ద్రావణంలో శుభ్రం చేయాలి. పంట కోత అనంతరం లేటరల్ పైపులను భద్రపర్చాలి. -
నమోదుపై నజర్!
పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించేందుకు ప్రధాన పార్టీల దృష్టిసాక్షి ప్రతినిధి, వరంగల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేవకముందే రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు ఓటర్ల నమోదును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడి పేరును ఓటరు జాబితాలో చేర్పించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా కసరత్తు చేస్తున్నాయి. మూడు పార్టీల అభ్యర్థులు ఖరారు.. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పేరు, బీఆర్ఎస్ ఏనుగుల రాకేశ్‌రెడ్డి, జనసేన మాజీ డీహెచ్ (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) గడల శ్రీనివాసరావును ఖరారు చేసింది. దీంతో మూడు పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని భావిస్తోంది. బీఆర్ఎస్ తన కేడర్‌ను పూర్తిస్థాయిలో రంగంలోకి దించి, గత ఎన్నికల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. జనసేన మాత్రం పట్టభద్రులు, యువతలో తనకు ఉన్న మద్దతును ఓట్లుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, బీజేపీ అభ్యర్థిత్వంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు ఎస్.ప్రకాశ్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, నూకల నర్సిరెడ్డి, రాణిరుద్రమ, కాసం వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. చివరకు ఆ పార్టీ నుంచి ఎవరిని బరిలోకి దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది. నమోదే తొలి మెట్టు.. గెలుపే టార్గెట్.. ప్రస్తుతం పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారం కంటే ముందుగా ఓటరు నమోదుపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఉద్యోగ వర్గాలు, యువత, పట్టణాలు, మండలాల వారీగా పట్టభద్రుల వివరాలను సేకరిస్తున్నారు. పార్టీ నాయకులు తమ పరిధిలోని పట్టభద్రులతో నేరుగా మాట్లాడి ‘ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?’ అంటూ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. అర్హత ఉన్న పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రధాన పార్టీల కార్యకర్తలు ఇంటింటికీ వెళ్తున్నారు. ముఖ్యంగా కొత్తగా డిగ్రీ పూర్తిచేసినవారు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఓటరు నమోదుపై ప్రచారం చేస్తున్నారు. పార్టీ నాయకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఎంతమంది అర్హులైన పట్టభద్రులు ఉన్నారు, ఎంతమంది ఇప్పటికే నమోదు చేసుకున్నారు, ఇంకా ఎంతమందిని నమోదు చేయించాలి అనే లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ రాకముందే కార్యాచరణ.. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. ఇందుకు సంబంధించి నవంబర్ 6 వరకు గడువు ఉంది. ఈ గడువు ముగిసేలోపు అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాయి. అధికార యంత్రాంగం ఒకవైపు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా.. రాజకీయ పార్టీలు మరోవైపు తమ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి నల్లగొండ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్‌ను ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా (ఈఆర్వో) నియమించారు. ఓటర్ల నమోదు, జాబితా తయారీ తదితర ఎన్నికల ప్రక్రియను ఆయన పర్యవేక్షించనున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా.. ఉమ్మడి వరంగల్‌లో రాజకీయ పార్టీలు మాత్రం తమదైన శైలిలో ముందస్తు మంత్రాంగం ప్రారంభించాయి. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ ట్రైసిటీ నుంచి పట్టభద్రుల ఓటరు జాబితాలో తమకు అనుకూలంగా ఉన్న వర్గాల నమోదు పెంచడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదీ ఓటర్ల నమోదు షెడ్యూల్.. నవంబర్ 6 వరకు గడువు.. గెలుపు కోసం నేతల మంత్రాంగం ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఖరారు కాని కమలం అభ్యర్థి -
భూముల రీసర్వేపై అపోహలు వద్దు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద పర్వతగిరి: భూముల రీసర్వేలో ఎలాంటి అపోహలు వద్దని, అధికారులకు రైతులు, భూ యజమానులు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మండలంలోని గోపనపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన భూముల రీసర్వే అవగాహన సదస్సులో కలెక్టర్ సత్యశారద పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా భూముల సరిహద్దులు, విస్తీర్ణం, భూ రికార్డుల్లో స్పష్టత, పారదర్శకత పెరుగుతాయని చెప్పారు. రికార్డుల్లో ఏమైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై ఎక్కువ ఉన్నందున రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్.కిశోర్‌కుమార్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసరావు, వరంగల్ ఆర్డీఓ సుమ, పర్వతగిరి తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ శంకర్‌నాయక్, పర్వతగిరి, చౌటపల్లి సొసైటీ చైర్మన్లు అనిల్‌రావు, కుమారస్వామి, మార్కెట్ డైరెక్టర్ గొడుగు భిక్షపతి, గోపనపల్లి, అనంతారం సర్పంచ్‌లు నాంపల్లి విజయ, శ్రీలత పాల్గొన్నారు. జగన్నాథపల్లిలో రీసర్వేపై గ్రామసభ రాయపర్తి: రాయపర్తి మండలంలోని జగన్నాథపల్లి గ్రామంలో భూముల రీ సర్వేపై బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, ప్రతీ గుంట భూమిని పక్కాగా సర్వే చేసి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ డీఐఓఎస్ రాజేంద్రాచారి, ఎంపీడీఓ పాక శ్రీనివాసులు, సర్పంచ్ బద్దం సుగుణమ్మ, దుబ్బతండా సర్పంచ్ దేదావత్ గోపాల్, ఆర్ఐ చంద్రమోహన్, సంధ్యారాణి, జీపీఓలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు
దామెర: నాగ్‌పూర్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోని ఊరుగొండలో బుధవారం చదునుచేసే పనులను రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కోర్టులో కేసులు పూర్తి అయ్యాయని చెప్పడంతో పత్తి, మిరప, అరటి, వరి పంటలు తొలగించారు. పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చేసినా పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. అనంతరం పనులు యథావిధిగా కొనసాగించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు, ఎన్‌హెచ్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
నమోదుపై నజర్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేవకముందే రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు ఓటర్ల నమోదును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడి పేరును ఓటరు జాబితాలో చేర్పించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా కసరత్తు చేస్తున్నాయి. మూడు పార్టీల అభ్యర్థుల ఖరారు వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పేరు, బీఆర్ఎస్ ఏనుగుల రాకేశ్‌రెడ్డి, జనసేన మాజీ డీహెచ్ (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) గడల శ్రీనివాసరావును ఖరారు చేసింది. దీంతో మూడు పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని భావిస్తోంది. బీఆర్ఎస్ తన కేడర్‌ను పూర్తిస్థాయిలో రంగంలోకి దించి, గత ఎన్నికల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. జనసేన మాత్రం పట్టభద్రులు, యువతలో తనకు ఉన్న మద్దతును ఓట్లుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, బీజేపీ అభ్యర్థిత్వంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు ఎస్.ప్రకాశ్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, నూకల నర్సిరెడ్డి, రాణిరుద్రమ, కాసం వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. చివరకు ఆ పార్టీ నుంచి ఎవరిని బరిలోకి దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది. నమోదే తొలి మెట్టు.. గెలుపే టార్గెట్ ప్రస్తుతం పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారం కంటే ముందుగా ఓటరు నమోదుపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఉద్యోగ వర్గాలు, యువత, పట్టణాలు, మండలాల వారీగా పట్టభద్రుల వివరాలను సేకరిస్తున్నారు. పార్టీ నాయకులు తమ పరిధిలోని పట్టభద్రులతో నేరుగా మాట్లాడి ‘ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?’ అంటూ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. అర్హత ఉన్న పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రధాన పార్టీల కార్యకర్తలు ఇంటింటికీ వెళ్తున్నారు. ముఖ్యంగా కొత్తగా డిగ్రీ పూర్తిచేసినవారు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఓటరు నమోదుపై ప్రచారం చేస్తున్నారు. పార్టీ నాయకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఎంతమంది అర్హులైన పట్టభద్రులు ఉన్నారు, ఎంతమంది ఇప్పటికే నమోదు చేసుకున్నారు, ఇంకా ఎంతమందిని నమోదు చేయించాలి అనే లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ రాకముందే కార్యాచరణ 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. ఇందుకు సంబంధించి నవంబర్ 6 వరకు గడువు ఉంది. ఈ గడువు ముగిసేలోపు అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాయి. అధికార యంత్రాంగం ఒకవైపు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా.. రాజకీయ పార్టీలు మరోవైపు తమ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి నల్లగొండ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్‌ను ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా (ఈఆర్వో) నియమించారు. ఓటర్ల నమోదు, జాబితా తయారీ తదితర ఎన్నికల ప్రక్రియను ఆయన పర్యవేక్షించనున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా.. ఉమ్మడి వరంగల్‌లో రాజకీయ పార్టీలు మాత్రం తమదైన శైలిలో ముందస్తు మంత్రాంగం ప్రారంభించాయి. ప్రధానంగా పట్టభద్రుల ఓటరు జాబితాలో తమకు అనుకూలంగా ఉన్న వర్గాల నమోదును పెంచడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.ప్రజా నోటీసు: సెప్టెంబర్ 28ఫారం–18 దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబర్ 28 నుంచి దరఖాస్తుల చివరి తేదీ: నవంబర్ 6ముసాయిదా ఓటర్ల జాబితా: నవంబర్ 25 క్లెయిమ్‌లు, అభ్యంతరాలు: నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం: డిసెంబర్ 25లోగా తుది ఓటర్ల జాబితా: డిసెంబర్ 30 పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించేందుకు ప్రధాన పార్టీల దృష్టి నవంబర్ 6 వరకు గడువు.. గెలుపు కోసం నేతల మంత్రాంగం ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఖరారు కాని కమలం అభ్యర్థిఇదీ ఓటర్ల నమోదు షెడ్యూల్.. -
ప్రజా ప్రభుత్వంలోనే ప్రారంభోత్సవాలు
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే శంకుస్థాపనలతోపాటు ప్రారంభోత్సవాలు కూడా చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పరకాల పట్టణంలోని రాజుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను బుధవారం ఆయన క్షణ్ణంగా పరిశీలించి కాంట్రాక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సమయానికి స్కూల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన పరకాల పట్టణంలోని శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణం, దామెర చెరువు కట్ట వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, వైస్ చైర్మన్ ఏకు దివ్య, మున్సిపల్ కమిషనర్ పి.పవన్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘భద్రకాళి’కి జలకళ
వరంగల్ అర్బన్: వరంగల్ నగర ప్రజల తాగునీటి వరప్రదాయిని భద్రకాళి చెరువులోకి దశాబ్ద కాలం తర్వాత గోదావరి జలాలు చేరుతున్నాయి. ధర్మసాగర్ నుంచి దేశాయిపేట ఫిల్టర్‌బెడ్, ఆటోనగర్ రా వాటర్ పంపుహౌస్ మీదుగా సెంట్రల్ జైలు సమీపం నుంచి భద్రకాళి చెరువులోకి గ్రావిటీ ద్వారా తరలిస్తున్నారు. ఐదు రోజులుగా ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు నీటిని మళ్లిస్తున్నారు. రాత్రి వేళల్లో ఽగ్రావిటీ నీటి మొత్తాన్ని ఫిల్టర్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. రెండేళ్లుగా నీరు లేక ఏడారిని తలపించిన భద్రకాళి చెరువు ఇక జలకళ సంతరించుకోనుంది. చెరువు పూర్తిస్తాయి సామర్థ్యం 150 మిలియన్ క్యూబిక్ ఫీట్లు (ఎంసీఎఫ్‌టీలు) కాగా.. ప్రస్తుతం 30 నుంచి 35 ఎంసీఎఫ్‌టీల నీరు చేరింది. దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌లో నీటిని శుద్ధి చేసి వరంగల్ ప్రాంత ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. ధర్మసాగర్ నుంచి దేశాయిపేట ఫిల్టర్ బెడ్‌కు వచ్చే మిగులు(ఎక్సెస్) నీటిని చెరువులోకి పంపిస్తున్నారు. దేవాదుల ఇన్‌టేక్ వెల్ నుంచి మోటార్ల ద్వారా భీంఘన్‌పూర్ చెరువు, చలివాగు, పులుకుర్తి నుంచి ధర్మసాగర్ చెరువులోకి గోదావరి జలాలతో సామర్థ్యం మేరకు నింపేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశాలతో బల్దియా ఇంజనీర్లు నీటి మళ్లింపు చర్యలకు ప్రత్యే చొరవ తీసుకుంటున్నారు. పర్యాటకులు, భక్తులకు కనువిందు.. ఒకవైపు గుట్టలు, చుట్టూ పచ్చందాలు, పక్కనే తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరొందిన భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు–హుస్సేన్‌సాగర్ తరహాలో భద్రకాళి బండ్ రూపుదిద్దుకుంది. చెరువు జలకళ సంతరించుకోవడంతో భక్తులు, పర్యాటకుల సందడి నెలకొంటుంది. అంతేకాకుండా ప్రతి దసరాకు భద్రకాళి ఆలయం వద్ద తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా ఆ వేడుక కల తప్పింది. ప్రస్తుతం చెరువులో చేరిన నీరు భక్తులను కనువిందు చేయనుంది.దశాబ్దం కాలం తర్వాత చెరువులోకి గోదావరి నీరు ధర్మసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా విడుదల భవిష్యత్ అవసరాల కోసం ఇరిగేషన్ శాఖ ముందస్తు చర్యలు25 ఏళ్లుగా చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు గతంలో వరంగల్, అండర్ రైల్వే గేట్ ప్రాంతాల ప్రజల తాగునీటిని భద్రకాళి చెరువు తీర్చేది. కాకతీయ కాల్వ ద్వారా వచ్చే నీళ్లను నింపేవారు. దశాబ్ద కాలంపై భద్రకాళి చెరువును నింపడం లేదు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు పలు కాలనీలు జలమయం కాకుండా బొంది వాగుకు సమీపంలో ఉన్న ప్వలింగ్ షట్టర్లను తెరిచి చెరువులోకి మళ్లించేవారు. హనుమకొండ పద్మాక్ష్మి గుట్ట వైపు మురుగునీరు కలుస్తోంది. అంతేకాకుండా 25 ఏళ్లుగా వ్యర్థాలు పేరుకుపోయాయి. చెరువులో గుర్రపు డెక్క, పచ్చగడ్డి ఏపుగా పెరిగింది. హెచ్ఎండీఏ వద్ద ఉన్న ప్రోటింగ్ గ్రాస్ కలెక్టింగ్ మిషన్ వరంగల్‌కు ఐదేళ్ల క్రితం తెప్పించారు. 33 రోజుల పాటు సుమారు 300 క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను తొలగించారు. గతంలో మిషన్ భగీరథ ద్వారా కొన్ని నెలలు పూడికతీత పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారు. రెండేళ్ల కిందట చెరువులో నీటి మొత్తాన్ని ఖాళీ చేయించారు. రూ.11 కోట్లతో పూడికతీత పనులు మొదలు పెట్టారు. 17 క్యూబిక్ మీటర్ల పూడిక తీయాలని ప్రతిపాదనలు చేసి 6 నెల క్రితం వరకు 10 క్యూబిక్ మీటర్ల పూడిక మాత్రమే తీసి తరలించారు. పూడికతీత పనులు పూర్తి కాలేదు. వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా.. ఎల్‌నినో ప్రభావంతో నగరంలో తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు, బావులు ఎండిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ముందుచూపుతో ధర్మసాగర్ నుంచి దేశాయిపేట ఫిల్టర్‌బెడ్ గ్రావిటీ నీరు చెరువులోకి చేరుతోంది. చెరువును సామర్థ్యం మేరకు నింపుతారా లేదా అనే స్పష్టత లేదు. చెరువులో నీరు సమృద్ధిగా ఉంటే సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తితే భద్రకాళి చెరువు నీటిని దేశాయిపేట ఫిల్టర్ బెడ్‌కు పంపింగ్ చేసి, నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు సమాలోచన చేస్తున్నారు. -
సార్.. ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వరా!
దుగ్గొండి: ‘సార్.. మా అమ్మానాన్న చనిపోయారు.. అనాథలుగా మిగిలాం.. అమ్మమ్మ, తాతయ్యలు ముసలివారు.. చేతిలో చిల్లిగవ్వలేని వారి జీవితం.. ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు.. ప్లీజ్ మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వండి’ అంటూ ఇద్దరు అనాథలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కోరిన సంఘటన మండలంలోని తొగర్రాయి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సదిరం వీరయ్య తన కూతురు కల్ప నను రేకంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ దంపతులకు కుమారుడు, కుమార్తె జన్మించారు. అనంతరం కల్పన ఆమె భర్త చనిపోయారు. దాంతో అనాథలుగా మిగిలిన పిల్లలు రిత్విక్, చిట్టిని తాత సదిరం వీరయ్య చేరదీశాడు. పేద కుటుంబానికి చెందిన వీరయ్య చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. తెలిసిన వారు అందిస్తున్న ఆర్థిక సహాయంతో ఆ ఇద్దరు పిల్లలను సాకుతున్నాడు. ఈ క్రమంలో తొగర్రాయి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని అనాథ బాలుడు రుత్విక్ కలిసి వెళ్లి తమ దీనగాథను వివరించాడు. ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దొంతి.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి కట్టించి అందిస్తానని, ఇద్దరి చదువులకు తనవంతు సహాయం అందిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే దొంతిని వేడుకున్న అనాథ బాలలు -
అమ్మవారికి సూర్యప్రభ, హంసవాహన సేవలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం అమ్మవారిని శ్రీమహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుఃషష్టి ఉపచార పూజలు, చండీహోమం నిర్వహించారు. అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం క్రూష్మాండిని క్రమంలో పూజలు జరిపి ఉత్సవమూర్తిని సూర్యప్రభవాహనంపై, సాయంత్రం గిరిజాక్రమంలో పూజలు జరిపి హంసవాహనంపై ఊరేగించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ఆలయంలో తయారుచేస్తున్న దారు రథాన్ని పరిశీలించారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయానికి రెండేళ్లకాలానికి 11 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012లో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయగా 2014 వరకు కొనసాగింది. అనంతరం 11 ఏళ్లుగా పాలకమండలి లేదు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ 2025, జూన్11న ఏడాదికాలానికి వంశపారంపర్యేతర ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసింది. తాజాగా పూర్తిస్థాయి నూతన ధర్మకర్తల మండలిని నియమించింది. మండలిలో కమటం వేణుగోపాల్, కల్లూరి పవన్‌కుమార్, కటకం రాములు, కరేంగుల సురేష్‌బాబు, గదే శ్రవణ్‌కుమార్‌రెడ్డి, చిదర అంజని, మాడిశెట్టి సతీశ్, పేరాల శ్రీనివాస్‌రావు, రమేశ్‌చంద్ బ్యాంగ్, చింతలపాని వాసవీరెడ్డి, మోత్కూరి మయూరి సభ్యులుగా ఉన్నారు. ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేసిన తేదీనుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. వరంగల్‌కు డీడీ గోవిందరాజు సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖలో పదోన్నతులు, పోస్టింగ్‌లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లకు డిప్యూటీ డైరెక్టర్లుగా తాత్కాలికంగా పదోన్నతి కల్పించింది. అందులో బి.గోవిందరాజును వరంగల్‌లోని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయంలో పూర్తికాలపు డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ జీఓ ఆర్టీ నంబర్ 185 ద్వారా బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వరంగల్ ఇన్చార్జ్ డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న జయరాజుపై ఆగస్టు 27న ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ దాడులు జరిపిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్‌కు గురికాగా, వనపర్తి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న బి.గోవిందరాజును ఇన్చార్జ్ డీడీగా నియమించారు. తెలంగాణ రాష్ట్ర, సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు – 1996లోని రూల్ 10(ఏ) ప్రకారం కల్పించిన పదోన్నతుల్లో భాగంగా పూర్తికాలపు డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. కేయూ క్యాంపస్: అతిథి అధ్యాపకుల ఉద్యోగ భద్రత, వేతనాల మెరుగుదల, న్యాయమైన డిమాండ్ల సాధనకు ఐక్యంగా కృషి చేయాలని టీజీసీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు, టీసీఈ – జేఏసీ చైర్మన్ డాక్టర్ సురేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అతిథి అధ్యాపకుల సమస్యలు, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యారంగంలో అతిథి అధ్యాపకుల సేవలు కీలకమని కొనియాడారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నవీన్, గెస్ట్ ఫ్యాకల్టీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ నవీన్, డాక్టర్ పెండ్యాల సురేశ్, డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సహకార సంఘం సందర్శన
భీమదేవరపల్లి; హనుమకొండ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తౌటం రోహిత్ నేత మంగళవారం ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకును సందర్శించారు. ఈసందర్భంగా ఆయనకు సంఘం జనరల్ మేనేజర్ ఎం.రాంరెడ్డి ఘన స్వాగతం పలికారు. సంఘం ద్వారా రైతులకు అందుతున్న సేవలు, విత్తనోత్పత్తి, రుణాల పంపిణీ, ఎరువుల సరాఫరా తదితర విధివిధానాలు, కార్యకలాపాలపై సమగ్రంగా వివరించారు. రైతాంగానికి సహకార రంగం ద్వారా అందిస్తున్న తోడ్పాటును ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదిరెడ్డి, భీమదేవరపల్లి మండల వ్యవసాయాధికారి పద్మ, ఏఈఓలు కమల్‌హాసన్, సంతోష్‌తో పాటు సంఘం వ్యవసాయ అధికారులు సంగ శ్రీనివాస్, ముచ్చ అచ్యుత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యకు టీపీఎస్
విద్యారణ్యపురి/కాజీపేట: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడిఝెట్ వరకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున అనుమతినిస్తూ వస్తోంది. మొదటి దశలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు గత నెలలో అనుమతినిస్తూ నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెండో దశలో హనుమకొండ జిల్లాలో మరో రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం కాజీపేట ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అనుమతిస్తూ ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. నిధులు మంజూరు పరకాల నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం జెడ్పీహెచ్ఎస్ పెద్దాపూర్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం రూ.9 కోట్ల 95 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలో స్టేషన్ ఘన్పూర్ నియోజవర్గం ధర్మసాగర్ మండలం నారాయణగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్‌పర్తి మండలం హసన్‌పర్తిలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో నాలుగు పబ్లిక్‌స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే, మహబూబాబాద్ జిల్లాలోనూ మరో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు అనుమతినిస్తూ నిధులు మంజూరు చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర జెడ్పీహెచ్ఎస్ చిట్యాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అనుమతినిస్తూ రూ.11.40 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో నెల్లికుదరు ప్రభుత్వ హైస్కూల్‌కు, నర్సింహులపేట జిల్లా పరిషత్ హైస్కూల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అనుమతినిస్తూ నిధులు మంజూరు చేసింది. దీంతో మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. మౌలిక వసతులు.. నాణ్యమైన విద్య ప్రస్తుతం ఉన్న హైస్కూళ్ల భవనాల్లోనే తరగతి గదులను యథావిధిగా ఉంచి అదనంగా అవసరమైన మేరకు తరగతి గదులను, సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా మైదానం, మోడల్ కిచెన్, లైబ్రరీ, డైనింగ్‌హాల్, తదితర మెరుగైన విద్యను అందించేలా అవసరమైన వసతులు కల్పించనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లిష్ మీడియంలోనే విద్యను అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు అవసరమైన స్థలం ఉన్న హైస్కూళ్లను ఎంపిక చేశారు. హనుమకొండ జిల్లాకు మరో రెండు స్కూళ్లు.. మహబూబాబాద్‌కు మరొకటి మంజూరు -
ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
కాశిబుగ్గ: ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్)లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని స్టేట్ ఎన్హెచ్ఎం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో జిల్లా ఎన్హెచ్ఎం ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యమిషన్‌లో పనిచేస్తున్న 17వేల మంది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తూ పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా వెట్టిచాకిరీ చేయిస్తోందని మండిపడ్డారు. సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంటినెంట్ ఉద్యోగుల నుంచి డాక్టర్ వరకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రవీందర్, నితిన్‌రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మోహన్‌రావు, డాక్టర్ మధు, డాక్టర్ యశస్విని, డాక్టర్ రమ్య, డైట్ మేనేజర్ అనిల్, రవీందర్, సునీ త, సంఘ అనిల్‌కుమార్, అంజి, నర్మద, జ్యోతి, గీత, వైకుంఠం, పలువురు ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ల బంద్‌తో ప్రజలకు ఇబ్బందులు.. నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. దీంతో వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 14 అర్బన్ హెల్త్ సెంటర్లను బంద్ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైద్య సేవల కోసం ఎంజీఎం, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్‌కుమార్ పోచమ్మమైదాన్ సెంటర్లో నిరవధిక సమ్మె ప్రారంభం -
కూలీలకు పనులు కల్పించాలి
● జెడ్పీ సీఈఓ ఎన్.వసంత నల్లబెల్లి: వీబీజీ రాంజీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలని జెడ్పీ సీఈఓ వసంత అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో పథకం అమలు తీరుపై పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. కూలీలకు పనులు కల్పించడంలో వెనుకబడిన గ్రామాల్లో చేపట్టాల్సి న చర్యలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో కూలీలు వలసబాట పట్టే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో కనీసం 60 మందికి తగ్గకుండా కూలీలకు పనులు కల్పించాలని, వేతనాలను సకాలంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆధికారులను హెచ్చరించారు. అంతకుముందు నందిగామ, రేలకుంట గ్రామాల్లో గ్రామైక్య సంఘాల భవనాల పనులు, జలసిరి కార్యక్రమ అమలును పరిశీలించారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధి కారులకు సూచించారు. ఎంపీడీఓ రమణారెడ్డి, ఎంపీఓ పసరగొండ రవి, ఏపీఓ వెంకట్‌నారాయణ, ఈసీ రాజు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
కరువుతో కబేళాకు పశువులు!
పరకాల: వర్షాలు సమయానుకూలంగా లేకపోవడంతో సాగు పనులు లేక కరువు పరిస్థితుల్లో పశుగ్రాసం దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో రైతులు తమ పశువులను అమ్మేస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుంటున్న బేరగాళ్లు తక్కువ ధరకు పశువులను కొని కబేళాలకు తరలిస్తున్నారు. పరకాల సంతలో ప్రతీ వారం వందలాది పశువులు కబేళాలకు తరలిపోతున్నాయి. ఇక్కడి నుంచే తరలింపు.. పశువుల విక్రయాల్లో పరకాల సంత మొదటి స్థానంలో నిలుస్తోంది. టెండర్ ప్రక్రియ ద్వారా ప్రతీ ఏడాది పరకాల మున్సిపాలిటీకి రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షలకు ఆదాయం వస్తుంది. వారానికి 100 నుంచి 200కు పైగా పశువులను, గేదేలను లారీలలో కబేళాలకు తరలిస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయ అవసరాల కోసమే పశువులను విక్రయించాలి. జంతువులపై క్రూరత్వ నిరో ధక చట్టం 2017ను కేంద్ర పర్యావరణ శాఖ గెజిట్ ప్రకారం సంతల్లో ఆవు, గేదె, ఎద్దులను కబేళాలకు అమ్మకూడదు.. కొనకూడదు. కొనుగోలుదారుడు వ్యవసాయాదారుడిగా రుజువు చేస్తూ సంత కమిటీ ధ్రువీకరణప్రతం అందజేయాల్సి ఉంటుంది. కానీ, పరకాల సంతలో ఇవేమీ పట్టడం లేదు. వ్యవసాయం లేక.. వ్యవసాయం లేదు. అడపాదడపా వేసిన వరి నీరు లేక ఎండిపోతోంది. ఉన్న అప్పులను తీర్చుకోవడానికి రైతులు పశువులను అమ్ముకోవడానికి సంత బాట పడుతున్నారు. ధర పెట్టే వారు లేక కోతలకే అమ్ముకోవాల్సి వస్తుంది. పశువులను అమ్ముకున్న వ్యవసాయానికి చేసిన అప్పులు తీరేలా లేవ ని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక వ్యవసాయం సాగక విక్రయాలు పరకాల పశువుల సంతనుంచి నేరుగా కోతలకు వారానికి వందలాది తరలింపు -
ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి
ఖిలా వరంగల్/న్యూశాయంపేట: ఎల్‌నినో ప్రభా వంతో వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ఆదేశించారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో కలెక్టర్ సత్యశారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల వారీగా పంటల పరిస్థతి, నీటి లభ్యతను అంచనా వేయాలని, పంటలు ఎండిపోయే పరిస్థితులున్న గ్రామాలు, నీటి కొరత ఏర్పడే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. వర్షపాతం, భూగర్భ జలాలు, సాగునీటి వనరుల లభ్యతపై సమగ్ర సమాచారం సేకరించాలని పేర్కొన్నారు. రబీలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన సూచనలు అందించి పంట నష్టాన్ని నివారించేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్, ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, డీఆర్డీఓ నాగ పద్మజ, పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ బాలాజీ, సీపీఓ చంద్రకళ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి నిర్మల తదితరులు పాల్గొన్నారు.అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
పండుగైనా పైసలిస్తలేరు!
సాక్షి, వరంగల్: జిల్లాలో రెండు నెలలుగా భూ రీసర్వే జోరుగా జరుగుతోంది. మండుటెండల్లో ఆ భూమిని కొలుస్తున్నా లైసెన్స్డ్ సర్వేయర్లకు మాత్రం పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ఇంటి అవసరాలు, కుటుంబ పోషణ కోసం ఉపయోగపడుతాయనుకున్న వేతనాలు సరిగా రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ప్రభుత్వ సర్వేయర్లు ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్లు మొరపెట్టుకుంటున్నా అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రీసర్వేపై ప్రభావం చూపే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర జిల్లాల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. వరంగల్ జిల్లాలోని 33 మంది సర్వేయర్లకు ఇంకా వేతన కష్టాలు రెండు నెలలుగా అలాగే ఉన్నాయి. 15 రోజులకొకసారి ఆయా సర్వేయర్లు చేసిన పని డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ఫలితంగా ఓ మండలంలోని గ్రామంలో రీసర్వే చేస్తున్న ఓ లైసెన్స్డ్ సర్వేయర్ వాట్సాప్ గ్రూపుల్లో వేతనాలివ్వాలని పోస్టు చేయడం, ఆ తర్వాత రోజు విధులకు దూరంగా ఉండడం వివాదాస్పదమవుతోంది. సర్వేయర్లు సర్వేకు దూరంగా ఉంటే ప్రభుత్వ ఉద్దేశం నీరుగారిపోయే ప్రమాదం ఉంది. దీనికితోడు మండుటెండల్లో భూములు కొలుస్తున్న సర్వేయర్లకు నీడ, నీటి సౌకర్యం, భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన కిట్లను ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాలు తీసుకొని నెలరోజులైనా.. ‘సర్వేయర్లకు కష్టాలు, ఎకరాకు రూ.60 మాత్రమే చెల్లింపు’ శీర్షికన గత నెల 12న సాక్షిలో కథనం ప్రచురితం కాగానే ఆయా సర్వేయర్ల నుంచి బ్యాంకు ఖాతాలు అధికారులు తీసుకున్నారు. నెలరోజులు గడిచినా ఇప్పటివరకు వేతనాలు డిపాజిట్ చేయలేదు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10,000 ఎకరాల వరకు కొలిచిన 33 మందికి కలిపి చెల్లించేది రూ.6 లక్షలవుతుంది. 33 మందికి కలుపుకుంటే ఒక్కొక్కరికి సరాసరి రూ.18,181 చెల్లించాల్సి ఉంటుంది. ‘ఉదయం ఫీల్డ్ మీదకి వెళ్లగానే 9 గంటల్లోపే ఆ భూమిపై రీ సర్వే ప్రారంభమైనట్లు ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో రైతులు గెట్టు విషయంలో సహకరించకున్నా వాళ్లను ఒప్పించేందుకు కూడా సమయం అయిపోతుంది. పురుషులతో పాటు సమానంగా మహిళా సర్వేయర్లు ఉండడంతో వారికి క్షేత్రస్థాయిలో మరింత ఇబ్బందిగా ఉంది. అన్ని విషయాల్లో నిబంధనలంటున్న అధికారులు తమ పనికి వేతనం ఇచ్చే విషయంలో మాత్రం పాటించడం లేదు’ అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సర్వేయర్ వాపోతున్నారు. ఎవరైనా ఈ విషయమై ప్రశ్నిస్తే సంబంధిత ప్రభుత్వ సర్వేయర్లకు నోటీసులు జారీ చేయడం పరిపాటిగా మారిందంటున్నారు. ఈ వేతనాల విషయమై జిల్లా సర్వే, భూరికార్డుల శాఖ ఏడీ శ్రీనివాస్‌ను ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. ‘మా ఆవిడకి ప్రెగ్నెన్సీ.. కనీసం ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు నా దగ్గర డబ్బులు లేవు. కాస్త మేం చేసిన పనికి డబ్బులు ఇ ప్పించండి’ అంటూ ఓ సర్వేయర్ రీసర్వే వాట్సాప్ గ్రూప్‌లో దీనంగా పోస్టు చేశారు. ‘వర్ధన్నపేట నక్ష సర్వే చేశాం. ఇప్పుడు భూముల రీ సర్వే చేస్తున్నాం. అయినా ఇప్పటివరకు ఆ నక్ష సర్వే పనులకు, ఇప్పుడు చేసిన పనికి వేతనాలు ఇవ్వలేదు. మాకు ఫ్యామిలీలు, పండుగలు ఉన్నాయి.. కాస్త ఇప్పించండి’ అంటూ మరొకరు వేదనతో పోస్టు చేశారు. రెండు నెలలవుతున్నా జిల్లాలోని సర్వేయర్లకు అందని వేతనాలు 10 వేల ఎకరాలు సర్వే చేసినా డబ్బులివ్వకపోవడంతో ఇబ్బందులు 33 మందికి రూ.6 లక్షలు చెల్లించేందుకు అధికారుల జాప్యం 15 రోజులకొకసారి ఇవ్వాలనే కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ -
దేవాలయ అభివృద్ధికి నివేదిక అందిస్తా
హన్మకొండ కల్చరల్: పురావస్తుశాఖ ఆధీనంలోని వేయిస్తంభాల ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ద్వారా కేంద్రానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పేర్కొన్నారు. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని మంగళవారం రాత్రి కమిషనర్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్ ఆలయమర్యాదలతో, మహిళలు కోలాటాలు, వేదమంత్రోచ్చాటనలతో ఘనంగా స్వాగతించారు. రుద్రేశ్వరీ అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. దేవాలయంలో విద్యుత్ అలంకరణ బాగుందని ఉత్సవాల ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. దేవాలయ ఉద్యోగుల, ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలు గంగు ఉపేంద్రశర్మ వివరించగా.. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు -
గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల అడ్డగింత
పరకాల: ‘మా కుటుంబాలకు జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోయాక ఏం చేసి బతకాలి. కనీసం ప్రభుత్వ మార్కెట్ ధర ప్రకారం న్యాయం చేయకుండా భూములను లాక్కోవాలనుకోవడం ఎంత వరకు న్యాయం’ అని గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరకాల మండలం పోచారంలో జరుగుతున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. భారీ బందోబస్తుతో చేరుకున్న గ్రీన్‌ఫీల్డ్ అధికారులు సర్వే చేసిన వ్యవసాయ భూముల్లో జేసీబీలతో చదును చేసే ప్రయత్నం చేయగా, సమాచారం అందుకున్న బాధిత రైతులు తమకు సరైన పరిహాం అందించకుండా పంటలను చదును చేయకూడదంటూ పనులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పోచారం గ్రామ శివారులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పరకాల ఆర్డీఓ వెంకన్న, ఏసీపీ సతీశ్‌బాబు బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు శాంతించడంతో గ్రీన్‌ఫీల్డ్ అధికారులు జేసీబీలతో పంటలను తొలగించి.. రోడ్డు పనులు ప్రారంభించారు. తమకు పరిహారం అందేంత వరకు చేతికొచ్చిన పంటలు నాశనం చేయకూడదని.. కానీ, అధికారులు బలవంతంగా పంటలు ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పోలీసు బలగాల మోహరింపు సాయంత్రం వరకు కొనసాగిన బాధిత రైతుల ఆందోళన -
దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించండి
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల ఆన్లైన్ దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని హనుమకొండ ప్రాజెక్ట్ సీడీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న 19 పోస్టులకు గాను వచ్చిన 953 ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈనెల 29వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనను సీడీపీఓలు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీడీపీఓ, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి విశ్వజ, సిబ్బంది పాల్గొన్నారు.దరఖాస్తుల్లో టాప్ హనుమకొండ.. హనుమకొండ జిల్లాలోని మూడు ప్రాజెక్టుల్లో హనుమకొండ, భీమదేవరపల్లి, పరకాలలో 788 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 55 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో భీమదేవరపల్లిలో 23, హనుమకొండలో 19, పరకాలలో 13 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకిగాను ఇచ్చిన నోటిఫికేషన్లో అత్యధికంగా హనుమకొండ ప్రాజెక్ట్‌కు 953 దరఖాస్తులు అందాయి. -
ఆక్రమణల కూల్చివేత
హసన్‌పర్తి: కేయూ జంక్షన్ నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన షాపులను బల్దియా అధికారులు మంగళవారం తొలగించారు. ఇటీవల కార్పొరేషన్ ప్రత్యేక అఽఽధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కమిషనర్ వెంకన్న భీమారంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులను సందర్శించిన విషయం తెలిసిందే. ఆసమయంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు కొనసాగిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో బల్దియా సిబ్బంది మంగళవారం 6గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. టీబీ ఆస్పత్రి, భీమారం, కేయూసీ జంక్షన్ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు.. అధికారులతో ఆందోళనకు దిగారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి యత్నించారు. రోడ్డునపడ్డ చిరు వ్యాపారుల కుటుంబాలు అధికారులు వ్యవహరించిన తీరుతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ షాపులను తొలగించడంపై వారు కన్నీంటి పర్యంతమయ్యారు. కాగా, కేయూసీ నుంచి ఎర్రగట్టు గుట్ట, ఎర్రగట్టు గుట్టనుంచి ముచ్చర్ల క్రాస్, ఎర్రగట్టు గుట్టనుంచి బాహుపేట క్రాస్ వరకు రోడ్డుకు ఇరువైపులా పాత్లను ఆక్రమించుకుని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తామని ఽఅధికారులు చెప్పారు. చిరువ్యాపారుల ఆందోళన.. అధికారులతో వాగ్వాదం కలెక్టర్ ఆదేశాలు అమలు -
పకడ్బందీగా రెండో దశ జన గణన
● బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్ : జనగణన రెండో దశను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి సంబంధిత నిబంధనలు, ప్రశ్నావళి, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. మంగళవారం వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో నగర పరిధిలోని చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనగణన రెండో దశపై రెండు రోజుల శిక్షణలో భాగంగా మంగళవారం కలెక్టర్ హాజరై దిశానిర్దేశం చేశారు. మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్ఓ) బ్లాకులను ఎన్యుమరేషన్ బ్లాకులుగా మార్చే విధానం, వెబ్ పోర్టల్ ద్వారా చేపట్టాల్సిన సాంకేతిక ప్రక్రియలు, ఎన్యుమరేషన్ బ్లాకుల కేటాయింపు, జనాభా గణనలో ఎవరూ మినహాయింపునకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించాల్సిన వివరాలతో పాటు మొదటిదశలో ఉన్న లోపాల సవరణపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ సెన్సస్ విభాగం అధికారి సీహెచ్ సతీశ్, జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్ ప్రశాంత్ వెబ్‌పోర్టల్ వినియోగం, బ్లాకుల మార్పులు, జనాభా వివరాల నమోదు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఓ సత్యనారాయణ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రేటర్’ యూజీడీకి రూ.5వేల కోట్ల రుణం
వరంగల్ అర్బన్ : మూడు దశాబ్దాలుగా అస్తవ్యస్త డ్రెయినేజీ వ్యవస్థతో పడుతున్న గ్రేటర్ వరంగల్ నగరవాసులకు శుభవార్త. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) వ్యవస్థ ఏర్పాటుకు రూ.5వేల కోట్ల రుణ మంజూరుకి గ్రీన్ సిగ్నల్ లభించింది. మన యూజీడీ ప్రతిపాదనలను జర్మనీ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ అంగీకరించింది. విదేశీ సంస్థ రుణ మంజూరుకి కేంద్ర ఆర్థిక శాఖ, గృహ, పట్టణాభివృద్ధి సంస్థలు తాజాగా జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేశాయి. మహానగర వ్యాప్తంగా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) కల సాకారం కానుంది. యూజీడీపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ.5,257కోట్ల ప్రతిపాదనలకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం రెండు దఫాలుగా స్థలాల సేకరణ ఆదేశాలిచ్చారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో పనులకు శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో బృహతర్త ప్రాజెక్టుకు అంకురార్పణ పడనుంది. మిగిలింది టెండర్లే.. యూజీడీకి రుణం మంజూరైనందున మిగిలిన ప్రక్రియ టెండర్ల నిర్వహణే. ఇప్పటికే నగరంలో యూజీడీని ఏడు జోన్లుగా విభజించారు. నగరం 407.7చదరపు కిలోమీటర్లు ఉండగా, 3,137కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఓపెన్ డ్రెయినేజీ వ్యవస్థ 2,780 చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన ఎన్కే బిల్డ్ కాన్ ప్రైవేట్ లిమెటెడ్ సంస్థ డీపీఆర్‌లను రూపొందించింది. 2027నాటికి నగర వ్యాప్తంగా ఉన్న 2,92,194 ఇళ్లకు సీవరేజ్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏడు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా రోజు 140–160 మిలియన్ లీటర్ ఫర్ డే (ఎంఎల్డీ) మురుగునీటిని శుద్ధిచేసే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారు. కీలకమైన ప్రాజెక్టును పబ్లిక్ హెల్త్‌శాఖ అధికారులకు అప్పగించనున్నారు. 1995లో ప్రారంభమైన యూజీడీ ప్రక్రియ ఎట్టకేలకు వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. నిధులను సమకూర్చనున్న జర్మనీ సంస్థ కేంద్ర ఆర్థిక, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖలు గ్రీన్ సిగ్నల్ త్వరలో టెండర్ల ప్రక్రియ.. సీఎంతో పనులకు శంకుస్థాపన వచ్చే ఏడాదినుంచి పట్టాలెక్కనున్న పనులు -
భద్రకాళి అమ్మవారికి సింహ, గజవాహన సేవలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవీశరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం అమ్మవారిని శ్రీగాయత్రీ మాతగా అలంకరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం చంద్రఘంటా క్రమంలో దుర్గార్చన చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై ఊరేగించారు. సాయంత్రం మహిషామర్ధిని క్రమంలో దుర్గార్చన జరిపి గజవాహనంపై ఊరేగించారు. సేవా సమితి కన్వీనర్ అయిత గోపీనాథ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం, రాత్రి భక్తులకు అన్నప్రసాదాల వితరణ జరిగింది. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ దేవాలయాన్ని సందర్శించి మాడవీధుల నిర్మాణ పురోగతిని, నూతనంగా తయారు చేస్తున్న దారురథాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట కుడా, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. హన్మకొండ అర్బన్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించడంతో పాటు అనర్హుల పేర్లు లేకుండా చూడడమే లక్ష్యంగా ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేనివారు, తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన వారు తమ పరిధి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత బూత్ స్థాయి అధికారులను లేదా జిల్లా ఎన్నికల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. హన్మకొండ అర్బన్ : జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. మంగళవారం ఆయన జిల్లాలోని పలు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాలు, రికార్డులను పరిశీలించా రు. చికిత్స రుసుముల వివరాలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని, వైద్యుల పేర్లు, అర్హతలు, విధుల వివరాలతో కూడిన జాబితా ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్ట నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లాలో గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలుకు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ (థానా) కమిటీ సభ్యులు అంగీకరించారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో పథకం అమలుకు యాజమాన్యాలు సహకరించాలని కోరారు. డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ.. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు వైద్యసేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో తానా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమేశ్, సభ్యులు డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ విజయ్, డాక్టర్ బి. మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బస్టాండ్ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
నయీంనగర్: వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులను, వాటి పురోగతిని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి పరిశీలించారు. బస్‌స్టేషన్ నిర్మాణ, అభివృద్ధి పనులకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు. పనుల పురోగతిని గురించి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుడా చైర్పర్సన్ మాట్లాడుతూ బస్ స్టేషన్ త్వరగా పూర్తయ్యేలా నిర్మాణ పనులు సాగాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అదనంగా మరింత మంది వర్కర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కాలమ్స్, స్లాబ్, రీటెయినింగ్ వల్ పనులు ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కుడా ఈఈ భీమ్ రావు, డీఈ జలాలుద్దీన్, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వరంగల్
బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2026ఆప్షన్ ఉద్యోగుల్లో ఆనందం రాష్ట్రంలో మూడో డిస్కం (టీజీ ఆర్పీడీసీఎల్) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యుత్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. సాక్షి, వరంగల్: జిల్లాలో సీజనల్ వ్యాధుల ఉధృతి కొనసాగుతోంది. వర్షాలు, దోమల వ్యాప్తి, కలుషిత నీరు, పరిసరాల అపరిశుభ్రతతో ప్రజలు జ్వరాలు, డెంగీ, టైఫాయిడ్, డయేరియా బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెంగీ కేసులు సెంచరీ దాటడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జిల్లావ్యాప్తంగా 121 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క సెప్టెంబర్‌లోనే 54 కేసులు వెలుగుచూడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ, సాధారణ జ్వరాలు, డయేరియా, టైఫాయిడ్‌తో చేరి న వారు వందల సంఖ్యలో ఉంటారని, దీన్ని క్యాష్ గా మలుచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 45 శాతం కేసులు సెప్టెంబర్‌లోనే నమోదు.. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు నమోదైన డెంగీ కేసులతో పోలిస్తే సెప్టెంబర్‌లోనే భారీగా కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి ఆగస్టు వరకు 67 కేసులు నమోదు కాగా.. సెప్టెంబర్‌లో మరో 54 కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తం కేసుల్లో దాదాపు 45 శాతం ఒక్క నెలలోనే వెలుగుచూశాయి. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉండడంతో డెంగీ వ్యాప్తిపై అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ జ్వరాలూ తక్కువేం కాదు.. జిల్లాలో సాధారణ జ్వరాల కేసులు సైతం భారీగానే నమోదవుతున్నాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 6,016 కేసులు వచ్చాయి. సెప్టెంబర్‌లోనే 622 మంది వైద్యసేవలు పొందారు. మరోవైపు డయేరియా కేసులు 9 నెలల్లో 3,694 నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 226 కేసులు వెలుగుచూశాయి. టైఫాయిడ్ కేసులు సెప్టెంబర్ వరకు 242 నమోదుకాగా.. సెప్టెంబర్‌లో ఏడు కేసులు గుర్తించారు. జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అప్రమత్తతే ఆయుధం.. వైద్యులను సంప్రదించాల్సిందే సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీహెచ్‌సీలు, యూపీహెచ్సీల పరిధిలో వైద్య సేవలు, నివారణ చర్యలు చేపడుతున్నాం. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కూలర్లు, పాత టైర్లు, నీటి తొట్టెలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ దోమల వృద్ధికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. నీటిని కాచి చల్లార్చి తాగడం, ఆహారాన్ని మూతపెట్టి ఉంచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు లేదా కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. డెంగీ అనుమానం ఉన్నప్పుడు వైద్యుల సలహాతో అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. పిల్లలు, వృద్ధుల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. –డాక్టర్ బి.రాజారెడ్డి, డీఎంహెచ్ఓ ●జిల్లాలో ఒక్క సెప్టెంబర్‌లోనే 54 కేసుల నమోదు జ్వరాలు, డయేరియాతోనూ ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల సూచనయూపీహెచ్సీలు, పీహెచ్‌సీల వారీగా నమోదైన డెంగీ కేసులు..54 డెంగీ కేసులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. కీర్తినగర్ యూపీహెచ్‌సీలో 9, ఎంజీఎం యూఎఫ్‌డబ్ల్యూసీలో 9, గీసుకొండ పీహెచ్సీ పరిధిలో ఆరు కేసులు వెలుగుచూశాయి. దేశాయిపేట, కాశిబుగ్గ, ఫోర్ట్ వరంగల్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఐదేసి కేసులు నమోదయ్యాయి. అలాగే, చింతల్ యూపీహెచ్‌సీలో 3, రంగశాయిపేట యూపీహెచ్‌సీలో ఒకటి, ఎస్ఆర్ఆర్ తోట యూపీహెచ్‌సీలో ఒక డెంగీ కేసు నమోదైంది. పీహెచ్‌సీల వారీగా చెన్నారావుపేటలో ఒకటి, కేశవపూర్‌లో ఒకటి, నెక్కొండలో రెండు, పర్వతగిరిలో ఒకటి, సంగెంలో రెండు, పైడిపల్లిలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. -
16న వరంగల్‌లో జాబ్ మేళా
కాళోజీ సెంటర్/కాశిబుగ్గ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఎల్ఎన్ గ్రూపులోని అసెంబ్లీ ఆపరేటర్ పోస్టులకు ఈనెల 16న ములుగు రోడ్డులోని జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాత్విక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని, ఎంపికై నవారు హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సుమారు వంద పోస్టుల్లో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో ఉదయం 11 గంటలకు ఇంటర్యూకు హాజరు కావాలని ఆమె సూచించారు. -
రబీ సీజన్లో వరిసాగు చేయొద్దు
దామెర: రబీ సీజన్లో రైతులు ఎట్టిపరిస్థితుల్లో వరి సాగు చేయొద్దని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఎల్‌నినో పరిస్థితులపై సోమవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అధికారులు, రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా దామెర రైతు వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు చేసిన సూచనలు రైతులు తప్పక పాటించాలన్నారు. ఎల్‌నినో పరిస్ధితుల కారణంగా నీటి లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. బిందు సేద్యంతో కూరగాయలు, పప్పుదినుసుల పంటలు సాగుచేయాలన్నారు. జలసిరి కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు, పారమ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాతావరణ ప్రతికూల పరిస్ధితులను దృష్టిలో ఉంచుకొని రైతులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్‌చంద్ర, డీఆర్డీఓ మేన శ్రీను, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఏఈ అల్లె రాకేశ్, సర్పంచ్ గరిగె కల్పన కృష్ణమూర్తి, దాడి వసంత రమేశ్, బొంకూరి రవియాదవ్, కేతిపల్లి శ్రీధర్‌రెడ్డి, దాసి శ్రీకాంత్, తోట రజిత శ్రీనివాస్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. అర్జీలు త్వరగా పరిష్కరించాలి..హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలు పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించిన ప్రతీ అర్జీపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీలు పెండింగ్‌లో ఉండకుండా చూడాలన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 98 అర్జీలు అందగా, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాల్లో 30, ఎంపీడీఓ కార్యాలయాల్లో 97 అర్జీలు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 225 అర్జీలు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన్.రవి, బి.శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ -
ఎస్ఐల ఎపిసోడ్ పూర్తి.. సర్కిల్ ఇన్స్పెక్టర్ల సీన్ మొదలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్ వర్గాల్లో బదిలీల కాక మొదలైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐల బదిలీల పర్వం ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్‌లపై పడింది. ఈ నెల 10న ఏకంగా 35 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. తదుపరి వంతు పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్న ఇన్స్పెక్టర్లదేనన్న ప్రచారం జరుగుతోంది. గత ఆగస్టులో 22మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ధర్మసాగర్, ఎల్కతుర్తి, పరకాల, ఆత్మకూరు, హనుమకొండ ఉమెన్ ఠాణాలతో పాటు పలుచోట్ల పోస్టింగ్ ఇచ్చారు. దసరా తర్వాత కమిషనరేట్ పరిధిలో పలువురు సీఐలకు స్థానచలనం ఉంటుందన్న చర్చ పోలీసు వర్గాల్లో వేడెక్కిస్తోంది. ‘కీలక’ ఠాణాల కోసం కుస్తీ.. కమిషనరేట్ సర్కిళ్ల పరిధిలో పట్టు.. కీలక స్టేషన్లో పోస్టింగ్.. ఇదే లక్ష్యంగా పలువురు సీఐలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేయూసీ, సుబేదారి, హనుమకొండ, ఇంతేజార్ గంజ్, మట్వాడా, కేయూసీ, మడికొండతో తొమ్మిది పోలీస్స్టేషన్లలో పోస్టింగ్‌లపై కొందరు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేయూసీ, సుబేదారి ఠాణాల కోసం ఓ ఎస్బీ ఇన్స్పెక్టర్, వర్ధన్నపేట నియోజకవర్గంలో పనిచేసిన ఓ సీఐ ఇప్పటికే సిఫారసు లేఖలు పొందారన్న చర్చ ఉంది. గ్రేటర్ వరంగల్‌లోని ఓ ట్రాఫిక్ సీఐకి కూడా స్థానచలనం తప్పనిసరి అని చెబుతున్నారు. పదవీకాలం ఏడాది పూర్తయిన వాటిపై, స్టేషన్‌కు కొచ్చి కొద్దిరోజులే అ యినా వివాదాస్పదంగా మారిన ఠాణాలపై కొంద రు కన్నేసినట్లు సమాచారం. ఆశించిన పోస్టింగ్ ద క్కించుకునేందుకు తమకున్న పరిచయాలు ఉపయోగించుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది. ఎవరికి ‘స్టేషన్’.. ఎవరికి ‘వీఆర్’? కమిషనరేట్‌లో పోస్టింగ్ కోసం స్థానిక అధికారులే కాకుండా పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు ఇన్స్పెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో కమిషనరేట్ పరిధిలో పనిచేసి పలు వివాదాలను ఎదుర్కొన్న వారు పరిస్థితులు మారడంతో మళ్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఐజీ అటాచ్డ్‌లో ఉన్న ఇద్దరు సీఐలు, 2012 బ్యాచ్‌కు చెందిన మరో ఇన్స్పెక్టర్లు తమకు అనుకూలమైన పోస్టింగ్ కోసం ఇప్పటికే సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తర్వులు వెలువడటమే తరువాయి అన్న ప్రచారం వారి సహచరుల్లో వినిపిస్తోంది. దీంతో స్థానికంగా పనిచేస్తున్నవారికి ఎలాంటి పోస్టింగ్‌లు దక్కుతాయి? బయట నుంచి వచ్చేవారికి ఏయే బాధ్యతలు అప్పగిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఎస్ఐల బదిలీలతో మొదలైన కదలిక.. సీఐల వరకు విస్తరిస్తుందన్న ప్రచారంతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దసరా తర్వాత బదిలీల జాబితా వెలువడుతుందా? కీలకస్ట్టేషన్లలో కొత్త ముఖాలు కనిపిస్తాయా? పొరుగు జిల్లాలనుంచి ఎంతమందికి అవకాశం దక్కుతుంది? అన్నది పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ కమిషనరేట్‌లో బదిలీల కలకలం కీలక ఠాణాలపై గురి.. కొందరి చేతిలో లేఖలు? పొరుగు జిల్లాలనుంచి ‘ఇన్’ అయ్యేందుకూ యత్నాలు.. దసరా తర్వాత మార్పులంటూ పోలీసు వర్గాల్లో చర్చకమిషనరేట్పై పట్టుబిగిస్తున్న సీపీ... వరంగల్ పోలీసు కమిషనర్‌గా జూలై 1న బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్వేత కమిషనరేట్‌పై పట్టు బిగించారు. సీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే మెజార్టీ పోలీస్ స్టేషన్లను విజిట్ చేసి పోలీసులు, అధికారులతో మాట్లాడి యోగక్షేమాలు, శాంతిభద్రతలపై ఆరా తీశారు. సబ్డివిజన్లు, పోలీసుస్టేషన్ల వారీగా నేరాల నమోదు, పరిశోధన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఆమె నేరుగా బాధితులతో మాట్లాడుతున్నారు. డ్రగ్స్ నియంత్రణకు మహిళా సంఘాల సమన్వయంతో ‘సంఘమిత్ర’ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆన్లైన్, మోసాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంకెన్‌డ్రైవ్, సైబర్‌క్రైంలపై విద్యాలయాలు, పౌరులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారుల పని తీరుపైనా ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేస్తున్నారు. బదిలీలు, పనిష్మెంట్లతో కట్టుదాటితే ఎవరిౖపైనెనా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇస్తున్నారు. -
అమ్మవారికి వాహన సేవలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం అన్నపూర్ణాలంకరణలో అమ్మవారిని అలంకరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో వేద పండితులు చండీహోమం నిర్వహించారు. అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం బ్రహ్మచారిణీ క్రమంలో పూజలు నిర్వహించి ఉత్సవమూర్తిని మకరవాహనంపై, సాయంత్రం దేవజాక్రమంలో పూజలు జరిపి చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు జరుపుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించుకున్నారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం మహా చండీహోమం నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి ప్రభాతసేవ, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, గణపతిపూజ, శ్రీరుద్రేశ్వరీ ఉత్సవమూర్తిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి బ్రహ్మచారిణి క్రమంలో దుర్గార్చన చేశారు. యాగశాలలో దశమహావిద్య యాగం, సుదర్శనహోమం, అరుణ రుద్రహోమం, మహాచండీహోమం నిర్వహించారు. సాయంత్రం చిన్నారుల కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఉత్సవ సమితి అధ్యక్షుడు బత్తిని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు రమేశ్ సేవలందించారు. విద్యారణ్యపురి: మలేసియాలోని కౌలాలాంపూర్ మీడ్ వ్యాలీలో ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన కామన్వెల్త్ ఇంటర్నేషనల్ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో హనుమకొండకు చెందిన లావుడ్య అక్షత్ చౌహాన్ పలు విభాగాల్లో ప్రతిభ చాటి మెడల్స్ సాధించాడు. ర్యాపిడ్, బ్లిట్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, క్లాసిక్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. మొత్తం 13 దేశాలకు చెందిన చెస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్పూర్లో నిర్వహించిన జాతీయ స్థాయి సబ్‌జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహించిన అఖిరానంద్ ప్రతిభ కనబర్చాడు. హనుమకొండలోని నయీంనగర్‌కు చెందిన అఖిరానంద్ డబుల్స్ విభాగంలో తృతీయ స్థానం, జట్టు విభాగంలో ఐదో స్థానంలో నిలవడానికి కీలక భూమిక పోషించినట్లు బాల్‌బ్యాడ్మింటన్ సంఘం హనుమకొండ జిల్లా కార్యదర్శి రడం శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు సోమవారం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎండీ అజీజ్‌ఖాన్ కలిశారు. జాతీయస్థాయిలో రాణించిన అఖిరానంద్ను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. అఖిరానంద్ వెంట పీఈటీ తిరుపతిరెడ్డి, అతని తండ్రి రవికుమార్ ఉన్నారు. -
రూ.3.50 కోట్ల బోనస్ పంపిణీ
హర్షం వ్యక్తం చేసిన సొసైటీ రైతులు భీమదేవరపల్లి: ప్రముఖ సహకార రంగ సంస్థ అయిన ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకు (సొసైటీ) పరిధి రైతులకు సోమవారం రూ.3.50 కోట్ల మేర బోనస్‌ను పాలకవర్గం పంపిణీ చేసింది. మొత్తం ఏడు వేల మందికిపైగా రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఏటా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లాభాలను బోనస్ రూపంలో అందించే సంప్రదాయాన్ని సొసైటీ కొనసాగించడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సహకార స్ఫూర్తితో పనిచేస్తూ ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ములుకనూరు సొసైటీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈబోనస్ ప్రస్తుత వ్యవసాయ పనులకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు కాశిరెడ్డి వసంత, జైపాల్ రెడ్డి, కొమురయ్య, రైతులు పాల్గొన్నారు. -
.. ఇక సీఐల వంతు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్ వర్గాల్లో బదిలీల కాక మొదలైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐల బదిలీల పర్వం ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్‌లపై పడింది. ఈ నెల 10న ఏకంగా 35 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. తదుపరి వంతు పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్న ఇన్స్పెక్టర్లదేనన్న ప్రచారం జరుగుతోంది. గత ఆగస్టులో 22మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ధర్మసాగర్, ఎల్కతుర్తి, పరకాల, ఆత్మకూరు, హనుమకొండ ఉమెన్ ఠాణాలతో పాటు పలుచోట్ల పోస్టింగ్ ఇచ్చారు. దసరా తర్వాత కమిషనరేట్ పరిధిలో పలువురు సీఐలకు స్థానచలనం ఉంటుందన్న చర్చ పోలీసు వర్గాల్లో వేడెక్కిస్తోంది. ‘కీలక’ ఠాణాల కోసం కుస్తీ.. కమిషనరేట్ సర్కిళ్ల పరిధిలో పట్టు.. కీలక స్టేషన్లో పోస్టింగ్.. ఇదే లక్ష్యంగా పలువురు సీఐలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేయూసీ, సుబేదారి, హనుమకొండ, ఇంతేజార్ గంజ్, మట్వాడా, కేయూసీ, మడికొండతో తొమ్మిది పోలీస్స్టేషన్లలో పోస్టింగ్‌లపై కొందరు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేయూసీ, సుబేదారి ఠాణాల కోసం ఓ ఎస్బీ ఇన్స్పెక్టర్, వర్ధన్నపేట నియోజకవర్గంలో పనిచేసిన ఓ సీఐ ఇప్పటికే సిఫారసు లేఖలు పొందారన్న చర్చ ఉంది. గ్రేటర్ వరంగల్‌లోని ఓ ట్రాఫిక్ సీఐకి కూడా స్థానచలనం తప్పనిసరి అని చెబుతున్నారు. పదవీకాలం ఏడాది పూర్తయిన వాటిపై, స్టేషన్‌కు కొచ్చి కొద్దిరోజులే అయినా వివాదాస్పదంగా మారిన ఠాణాలపై కొందరు కన్నేసినట్లు సమాచారం. ఆశించిన పోస్టింగ్ దక్కించుకునేందుకు తమకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎవరికి ‘స్టేషన్’.. ఎవరికి ‘వీఆర్’? కమిషనరేట్‌లో పోస్టింగ్ కోసం స్థానిక అధికారులే కాకుండా పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు ఇన్స్పెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో కమిషనరేట్ పరిధిలో పనిచేసి పలు వివాదాలను ఎదుర్కొన్న వారు పరిస్థితులు మారడంతో మళ్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఐజీ అటాచ్డ్‌లో ఉన్న ఇద్దరు సీఐలు, 2012 బ్యాచ్‌కు చెందిన మరో ఇన్స్పెక్టర్లు తమకు అనుకూలమైన పోస్టింగ్ కోసం ఇప్పటికే సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తర్వులు వెలువడటమే తరువాయి అన్న ప్రచారం వారి సహచరుల్లో వినిపిస్తోంది. దీంతో స్థానికంగా పనిచేస్తున్నవారికి ఎలాంటి పోస్టింగ్‌లు దక్కుతాయి? బయట నుంచి వచ్చేవారికి ఏయే బాధ్యతలు అప్పగిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఎస్ఐల బదిలీలతో మొదలైన కదలిక.. సీఐల వరకు విస్తరిస్తుందన్న ప్రచారంతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దసరా తర్వాత బదిలీల జాబితా వెలువడుతుందా? కీలకస్ట్టేషన్లలో కొత్త ముఖాలు కనిపిస్తాయా? పొరుగు జిల్లాలనుంచి ఎంతమందికి అవకాశం దక్కుతుంది? అన్నది పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐల ఎపిసోడ్ పూర్తి.. సర్కిల్ ఇన్స్పెక్టర్ల సీన్ మొదలు వరంగల్ కమిషనరేట్‌లో బదిలీల కలకలం కీలక ఠాణాలపై గురి.. కొందరి చేతిలో లేఖలు? పొరుగు జిల్లాలనుంచి ‘ఇన్’ అయ్యేందుకూ యత్నాలు.. దసరా తర్వాత మార్పులంటూ పోలీసు వర్గాల్లో చర్చ -
ఇన్స్పైర్ ప్రదర్శనలో జిల్లా విద్యార్థులు
కాళోజీ సెంటర్: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 12వ జాతీయ స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన, ప్రాజెక్టుల పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో తెలంగాణ నుంచి 52 ప్రాజెక్టులు ప్రదర్శిస్తుండగా.. వరంగల్ జిల్లా నుంచి ఆరు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పదర్శనలో పాల్గొన్నట్లు జిల్లా సైన్స్ అధికారి పెట్లొజు సురేష్ బాబు తెలిపారు. ఆకట్టుకుంటున్న ఆరు ప్రాజెక్టులు రైళ్లలో పై బెర్తులకు ఎక్కేందుకు మడత నిచ్చెన, సైకిల్ ద్వారా చెత్త సేకరణ, అపార్ట్మెంట్లలో మిగులు ఆహార పంపిణీ వ్యవస్థ, పోర్టబుల్ ధాన్యం ఆరబెట్టే యంత్రం, సురక్షితంగా పైకప్పులకు రంగులు వేసే పెయింటింగ్ రోలర్, పెడల్‌తో పనిచేసే హ్యాక్సా యంత్రం వంటి వినూత్న ప్రాజెక్టులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులు రోజువారీ సమస్యలకు తక్కువ ఖర్చుతో పరిష్కారాలు చూపడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆహార వృథా నివారణ, రైతులకు ప్రయోజనం, కార్మికుల భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ సందర్భంగా డీఈఓ రంగయ్యనాయుడు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, అకడమిక్ మానిటరింగ్ అధికారి మహేష్ నాయక్ విద్యార్థులు, గైడ్ టీచర్లను అభినందించి, పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఆరు వినూత్న ప్రాజెక్టుల ప్రదర్శన -
కమిషనరేట్‌పై పట్టుబిగిస్తున్న సీపీ..
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా జూలై 1న బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్వేత కమిషనరేట్‌పై పట్టు బిగించారు. సీపీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే మెజార్టీ పోలీస్ స్టేషన్లను విజిట్ చేసి పోలీసులు, అధికారులతో మాట్లాడి యోగక్షేమాలు, శాంతిభద్రతలపై ఆరా తీశారు. సబ్డివిజన్లు, పోలీస్ స్టేషన్ల వారీగా నేరాల నమోదు, పరిశోధన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఆమె నేరుగా బాధితులతో మాట్లాడుతున్నారు. డ్రగ్స్ నియంత్రణకు మహిళా సంఘాల సమన్వయంతో ‘సంఘమిత్ర’ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆన్లైన్, మోసాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్‌అండ్‌డ్రైవ్, సైబర్‌క్రైంలపై విద్యాలయాలు, పౌరులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారుల పని తీరుపైనా ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేస్తున్నారు. బదిలీలు, పనిష్మెంట్లతో కట్టుదాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇస్తున్నారు. -
కేసుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
ఖానాపురం: కేసుల వివరాలను ఎప్పటికప్పు డు ఆన్లైన్లో నమో దు చేయాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్ పరిసరాలు, స్టేషన్‌లోని గదులు, రికార్డులను పరిశీలించా రు. సన్నిహిత కేంద్రాన్ని పరిశీలించి ఫిర్యాదుల ఎంట్రీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రికార్డుల ను ఆన్లైన్ చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ శంకర్రావు, సిబ్బంది సీతారామరాజు, సుమన్, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన పెద్ది స్వప్న నర్సంపేట: మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నసుదర్శన్రెడ్డి సోమవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్‌గా శానబోయిన రాజ్‌కుమార్ ఎన్నికై న సందర్భంగా హరీష్‌రావు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర, తదితరులు ఉన్నారు. అడ్మిషన్ల గడువు పొడిగింపు కాశిబుగ్గ: వరంగల్ ములుగు రోడ్డులోని హనుమకొండ ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో మిగిలి ఉన్న కొత్త కోర్సుల సీట్ల భర్తీ కోసం ఐదో దశలో భాగంగా వాక్ ఇన్ అడ్మిషన్ల గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఇసారాఫ్ సురేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 సంవత్సరానికి గాను ఎలక్ట్రానిక్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, వెల్డర్, అధునాతన కోర్సులైన వర్చువల్ అనాలిసిస్, డిజైనర్ –ఎఫ్ఈఎం( పరిమిత మూలక పద్ధతి), ఇంజనీరింగ్ డిజైన్ టెక్నిషియన్, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నిషియన్ ట్రేడ్స్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమెటిక్, ఎలక్ట్రిక్ మెకానిక్ వాహనం, డ్రోన్ టెక్నిషియన్, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందని తెలిపారు. వేయిస్తంభాల దేవాలయంలో మహాచండీహోమం హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం మహా చండీహోమం నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి ప్రభాతసేవ, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, గణపతిపూజ, శ్రీరుద్రేశ్వరీ ఉత్సవమూర్తిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి బ్రహ్మచారిణి క్రమంలో దుర్గార్చన చేశారు. -
ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయండి
గీసుకొండ:ఎల్‌నినో ప్రభావంతో రాబోయే యాసంగి సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసి.. వరి సాగుకు దూరంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. తక్కువ నీటితో, స్వల్ప కాలంలో చేతికొచ్చే పప్పుధాన్యాలు, నూనెగింజ లు, కూరగాయల సాగుకు ప్రాధాన్యమివ్వాలన్నా రు. మండలంలోని కొనాయమాకుల రైతు వేదికలో సోమవారం ‘రెతు నేస్తం’ 110వ ఎపిసోడ్లో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని పేర్కొన్నారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అంది స్తుందని తెలిపారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. నవంబర్‌లో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నందున ‘రైతు నేస్తం’ ద్వారా ప్రతీ వారం వాతావరణ సమాచారాన్ని అందిస్తామన్నా రు. రైతులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దిశానిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ విజయభాస్కర్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, ఆర్డీఓ సుమ, మండల ప్రత్యేకాధికారి రమేష్, వర్ధన్నపేట ఏడీఏ నర్సింగం, తహసీల్దార్ రియాజుద్దీ న్, ఎంపీడీఓ శ్రీధర్‌గౌడ్, ఏఎంసీ ప్రియాంక, డైరెక్టర్ రుద్రప్రసాద్, హార్టికల్చర్ ఆఫీసర్ మానస, కొనాయమాకుల సర్పంచ్ వజ్ర రాజు, ఏపీఎం ఈశ్వర్, ఏపీఓ చంద్రకాంత్, ఏఈఓలు భరత్, కావ్య, స్మిత, రాజేష్, అఖిల ఉన్నారు. యాసంగిలో వరికి దూరంగా ఉండండి రైతులకు కలెక్టర్ సత్యశారద సూచన -
ప్రత్యేక లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి
డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె.పూజ వరంగల్ లీగల్: ఈ నెల 21న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ తెలిపారు. సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈప్రత్యేక లోక్ అదాలత్‌లో చెక్ బౌన్స్, ప్రీ–లిటిగేషన్‌తో పాటు ఇతర రాజీపడదగిన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌కు సంబంధించి అక్టోబర్ 12 నుంచి నవంబర్ 20 వరకు ప్రీ–లోక్ అదాలత్ ప్రక్రియ కొనసాగుతుందని, వరంగల్‌లో రెండు, నర్సంపేటలో ఒకటి చొప్పున మొత్తం మూడు బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చెక్ మొత్తంపై రాజీకి శ్రీరామ్ చిట్స్ ఫైనానన్స్ 30 శాతం, చోలమండలం ఫైనాన్స్ 50 శాతం డిస్కౌంట్ ప్రకటించినట్లు వెల్లడించారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియజేసి, న్యాయవాదులతో కలిసి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్‌లో అధిక కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, న్యాయవాదులు, బ్యాంకులు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఉద్యోగం ఇప్పించండి
నేను దివ్యాంగురాలి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్త కూలి పనిచేస్తాడు. ఇళ్లు గడవడానికి ఇబ్బంది పడుతున్నాం. కరోనా సమయంలో కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగం చేసేదాన్ని. ఆ ఉద్యోగాన్ని తీసేశారు. కేయూలో మళ్లీ ఉద్యోగం ఇప్పించాలి. – బి.దివ్యజ్యోతి, దేశాయిపేట, వరంగల్ గురుకులంలో సీటు ఇప్పించండి 2017లో నా తండ్రి అనారోగ్యంతో, ఇటీవల తల్లి మృతిచెందారు. చదువుకోవాలని ఉంది. కానీ డబ్బులు లేక ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులు లేని నాకు మహాత్మా జ్యోతిరావుపూలే గురుకులంలో సీటు ఇప్పించి ఆదుకోండి. – కత్తి శివసాయి, 8వ తరగతి, సంగెం ● -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో అర్జీలు సమర్పించిన ప్రజల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 153 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని అధికారులకు తగు సూచనలు చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 47, డీఆర్డీఏ 13, జీడబ్ల్యూఎంసీ 42, మిగితా శాఖలకు సంబంధించి 51 అర్జీలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిషోర్‌కుమార్, వై.వీ.గణేష్‌తోపాటు డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, హౌసింగ్ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఎంహెచ్ఓ రాజారెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద 153 అర్జీల స్వీకరణ -
నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ
పర్వతగిరి: నేరాల నియంత్రణలో నిఘా నేత్రాలు ఉపయోగపడతాయని మామునూరు ఏసీపీ వెంకటేష్ అన్నారు. మండలంలోని అన్నారంషరీఫ్ గ్రామంలో సోమవారం గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రమాదాల నివారణ, గ్రామంలోని భద్రతకు ప్రాముఖ్యం ఉంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పిన్నింటి అనిల్‌రావు, సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై బోగం ప్రవీణ్, మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు సావిత్రి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, అన్నారం సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, ఉపసర్పంచ్ గొడుగు ఏకాంతసారయ్య, ఏఎంసీ డైరెక్టర్ గొడుగు భిక్షపతి, దూపతండా సర్పంచ్ ధర్మసోత్ తిరుపతి పాల్గొన్నారు.మామునూరు ఏసీపీ వెంకటేష్ -
మా ప్రచురణ
మంగళవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2026శీతాకాలం వచ్చినా తగ్గని డిమాండ్.. పెరిగిన వినియోగం ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత దసరా సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో పిల్లలు పుస్తకాలు చదువుతున్నారా.. ఏమైనా ఆటలు ఆడుతున్నారా.. మీలోని సృజనాత్మకతతో బొమ్మలు గీస్తున్నారా.. సరదాగా అమ్మ మ్మ, నానమ్మ.. తాతయ్యతో గడుపుతున్నారా.. మీరు చేసే మంచి పనిని మాతో పంచుకోండి.. మేం ప్రచురిస్తాం. మీరు చేయాల్సిందల్లా మీరు చేసే మంచి పనిని సెల్ఫీతో ఫొటో తీసి మీ పేరు, ఊరు వివరాలను నాలుగు లైన్లలో రాసి ఫొటోతోపాటు ఈ కింది నంబర్‌కు వాట్సాప్ చేయండి. హన్మకొండ: శీతాకాలం వచ్చినా ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగు కోసం భూగర్భ జలాలు తోడేందుకు విద్యుత్ వినియోగం పెరిగింది. దీనికి తోడు గృహాలు, వ్యాపార వాణిజ్యసంస్థలు, పరిశ్రమల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత భరించలేక కూలర్లు, ఏసీల వినియోగం కొనసాగుతోంది. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ డిమాండ్ నిలకడగా కాకుండా రోజూ పెరుగుతూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. టీజీ ఎన్పీడీసీఎల్లో అధికశాతం వ్యవసాయానికి, గృహ అవసరాలు, వ్యాపార వాణిజ్య అవసరాలు, చిన్న చిన్న పరిశ్రమలకు విద్యుత్ వినియోగిస్తారు. భారీ పరిశ్రమలు పెద్దగా లేవు. అయినా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సెప్టెంబర్ 9న వేసవిని మించి రికార్డు స్థాయిలో 6,948 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. అంతకు ముందు మార్చి 27న నమోదైన 6,574 మెగావాట్ల డిమాండ్ అత్యధికం. దీన్ని బ్రేక్ చేస్తూ సెప్టెంబర్ 9న రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదైంది. రాష్ట్రంలో గరిష్టంగా 19,543 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. మార్చిలో అత్యధికంగా నమోదైన 18,548 మెగావాట్ల డిమాండ్‌ను అధిగమించి ఇప్పుడు ఆల్‌టైం రికార్డు నమోదైంది. వ్యవసాయ మోటార్లు ఆన్.. ప్రస్తుత వర్షాకాలమైనా చినుకు జాడలేదు. పంటలు పూర్తిగా భూగర్భజలాలపై ఆధారపడి సాగు చేశారు. భూగర్భజలాలు తోడి వరితో పాటు మెట్ట పంటలకు తడులు ఇస్తున్నారు. ఆరుతడి పంటలకు నీరు అవసరం కావడంతో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వానా కాలంలో అన్ని పంటలు కలిపి 14,48,052 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి 6,91,997 ఎకరాలు, మొక్కజొన్న 1,00,976, పత్తి 7,99,799 ఎకరాల్లో సాగు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలో విద్యుత్ డిమాండ్ ఈ నెల 6న 2,012 మెగావాట్లు, 7న 2,022, 8న 2,017, 9న 2,025, 10న 2,106, 11న 2,072 మెగావాట్లకు చేరుకుంది. గతేడాది అక్టోబర్ 6న 939 మెగావా ట్లు, 7న 1,026, 8న 1,206, 8న 1,364, 9న 1,269, ఈ నెల 11న 1,333 మె గావాట్ల డిమాండ్ నమోదైంది. విద్యుత్ వినియోగం చూస్తే ఈ నెల 6న 25.135, 7న 24.222, 8న 25.785, 9న 25.267, 10న 25.769, ఈ నెల 11న 28.552 మిలి యన్ యూనిట్లు వాడారు. గతేడాది అక్టోబర్ 6న 13.551 మిలియన్ యూనిట్లు, 7న 15.152. 8న 17.191, 9న 18.062, 10న 18.932, 11వ తేదీన 18.323 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.2072 మెగావాట్లుగతేడాది విద్యుత్ డిమాండ్ 18.932 మిలియన్ యూనిట్లు28.552 మిలియన్ యూనిట్లుప్రస్తుతం విద్యుత్ వినియోగం వివరాలు 2025లో(మిలియన్ యూనిట్లలో) జిల్లా అక్టోబర్ 8 9 10 11 హనుమకొండ 4.240 4.300 4.520 4.380 వరంగల్ 3.151 3.402 3.582 3.483 జనగామ 3.450 3.710 3.790 3.610 మహబూబాబాద్ 3.610 3.710 3.840 3.720 భూపాలపల్లి 2.740 2.900 3.200 3.130 విద్యుత్ డిమాండ్ 2025లో (మెగావాట్లలో) జిల్లా అక్టోబర్ 8 9 10 11 హనుమకొండ 268.7 251.19 268.7 259.4 వరంగల్ 247.56 230.35 247.56 272.34 జనగామ 264.96 214.53 264.96 264.96 మహబూబాబాద్ 323.52 301.4 323.52 340.97 భూపాలపల్లి 190.07 166.55 190.07 195.84మీ సృజన..విద్యుత్ వినియోగం వివరాలు 2026 అక్టోబర్(మిలియన్ యూనిట్లలో) జిల్లా 8వ తేదీ 9 10 11 హనుమకొండ 5.870 5.980 6.280 6.750 వరంగల్ 4.375 4.287 4.469 4.482 జనగామ 4.640 4.390 4.470 4.930 మహబూబాబాద్ 5.020 4.440 4.320 4.760 భూపాలపల్లి 3.080 3.300 3.290 4.010 ములుగు 2.800 2.870 2.940 3.620 డిమాండ్ (మెగావాట్లలో) హనుమకొండ 339.66 359.20 349.52 350.3 వరంగల్ 340.91 336.6 343.76 345,32 జనగామ 391.09 384.32 454.29 392.2 మహబూబాబాద్ 476.61 465.11 483.54 488.59 భూపాలపల్లి 257.90 265.73 262.19 259.55 ములుగు 209.74 213.50 211.63 236.55 పెరిగిన ఏసీలు, కూలర్ల వినియోగం గిరగిరా తిరుగుతున్న మీటర్లు -
యాసంగిపై ఎల్‌నినో ఎఫెక్ట్
2025 రబీలో 2,61,925 ఎకరాల సాగు.. ఈసారి 2,11,562 ఎకరాలే..సాక్షి, వరంగల్: ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు.. వర్షపాతంలో లోటు.. రానున్న నెలల్లో సాగునీటి లభ్యతపై సందేహాలు.. కరెంట్ వినియోగం.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని జిల్లా వ్యవసాయ శాఖ యాసంగి సీజన్ (రబీ) సాగు ప్రణాళికను సిద్ధం చేసింది. గతేడాది యాసంగిలో అన్ని పంటలు కలిపి 2,61,925 ఎకరాల్లో సాగు కాగా.. ఈ ఏడాది యాసంగికి 2,11,562 ఎకరాల్లో సాగు చేయొచ్చని అంచనా వేశారు. ఈసారి మొత్తం సాగు విస్తీర్ణాన్ని సుమారు 50,363 ఎకరాల మేర తగ్గించి అధికారులు నివేదిక రూపొందించారు. ముఖ్యంగా నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి సాగును గణనీయంగా తగ్గిస్తూ.. మొక్కజొన్నతోపాటు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగుకు వ్యవసాయ శాఖ ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం 19 శాతానికి పైగా తగ్గించి ప్రణాళిక రూపొందిచడం ఆందోళన కలగించే అంశంగా చెప్పవచ్చు. వరికి కోత.. మొక్కజొన్నకు ప్రాధాన్యం ● గతేడాది యాసంగిలో 1,16,541 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈసారి కేవలం 41,343 ఎకరాల్లోనే సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంటే దాదాపు 75,198 ఎకరాలు తగ్గనుంది. గతేడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం సుమారు 64.5 శాతం తగ్గనుంది. ● మొక్కజొన్న సాగును 1,43,764 ఎకరాల నుంచి 1,57,510 ఎకరాలకు పెంచాలని ప్రణాళిక రూపొందించారు. సుమారు 13,746 ఎకరాల మేర పెరగనుంది. వరి సాగు తగ్గుతుండగా.. మొక్కజొన్నకు ప్రాధాన్యం పెరుగుతుండటం ఈ యాసంగి ప్రణాళికలో ప్రధాన మార్పుగా కనబడుతోంది. అయితే మొక్కజొన్నకు కూడా కీలక దశల్లో తగినంత తేమ, నీరు అవసరమే. అందువల్ల పంట మార్పుతోపాటు నీటి వనరులకు అనుగుణంగా రైతులను సాగు చేయించడంపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 34 శాతం లోటు వర్షపాతమే.. ఈ ఏడాది వర్షపాత పరిస్థితులు.. 34 శాతం లోటు వర్షపాతం సాగు అంచనాలో కీలకంగా మారాయి. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 12 వరకు నర్సంపేట మండలంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 57 శాతం లోటు నమోదైంది. నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లో 49 శాతం చొప్పున, నెక్కొండలో 42 శాతం, ఖిలా వరంగల్‌లో 41 శాతం లోటు కనిపిస్తోంది. దుగ్గొండి, గీసుగొండ మండలాల్లో 35 శాతం, సంగెంలో 34 శాతం, పర్వతగిరిలో 32 శాతం, వరంగల్ మండలంలో 30 శాతం, చెన్నారావుపేటలో 28 శాతం లోటు ఉంది. రాయపర్తిలో 14 శాతం లోటు నమోదవగా, వర్ధన్నపేటలో సాధారణం కంటే 7 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే ఎల్‌నినోతో పూర్తిగా వర్షాలు తప్పనిసరిగా తగ్గుతాయని చెప్పలేమని కొన్నిసార్లు ఇతర వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వరి సాగు 41,343 ఎకరాలకు పరిమితం పెరగనున్న మొక్కజొన్న సాగు విస్తీర్ణం మక్కల దారిలోనే కూరగాయల సాగు.. పంటల వారీగా లక్ష్యాల నిర్ధారణతో యాసంగి సాగుకు వ్యవసాయశాఖ కార్యాచరణ సాగు విస్తీర్ణం తగ్గుతుంది.. గతేడాది యాసంగితో పోల్చుకుంటే ఈసారి వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం తగ్గుతుంది. చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు, బోర్లు, బావుల నీటి మట్టాలు, ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదలపైనే సాగు ఆధారపడి ఉంటుంది. అందుకే రైతులకు పంటల వారీగా నీటి అవసరాలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నాం. వర్షపాతం, నీటి లభ్యతను బట్టి క్షేత్రస్థాయిలో మార్పులు చోటుచేసుకోవచ్చు. – విజయభాస్కర్, డీఏఓ -
కల్యాణలక్ష్మితో తులం బంగారం ఇవ్వాలి
కమలాపూర్: ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమలాపూర్ రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు 81 మందికి రూ.81,09,396 విలువైన 81 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఇద్దరు మంత్రులు నిరుపేదలకు పంపిణీ చేశారని, అక్కడ కనీస వసతులు కల్పించక లేక ఏ ఒక్క కుటుంబం కూడా ఆ ఇళ్లల్లో ఉండడం లేదన్నారు. ఏ ఒక్కరైనా డబుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉంటున్నట్లు చూపిస్తే ముక్కు భూమికి రాస్తానన్నారు. వెంటనే టెండర్లు పిలిచి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కమలాపూర్ బస్టాండ్ నిర్మాణానికి రూ.కోటి, పెద్దమ్మ ఆలయానికి రూ.50 లక్షలు వెంటనే మంంజూరు చేయాలని కోరారు. మరో రెండేళ్లలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడే కరెంటు, నీళ్ల కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సతీశ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేశ్, ఏఎంసీ చైర్పర్సన్ ఝాన్సీరవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ బాబు, జీపీఓ శిరీష, గిర్దావర్ సమ్మయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి -
వితంతు పింఛన్ రావడంలేదు..
నా భర్త కరోనా కాలంలో చనిపోయాడు. నాకు ఇప్పటి వరకు వితంతు పింఛన్ రావడంలేదు. కుటుంబ జీవనం కష్టంగా మారింది. కష్టం చేయడానికి కూడా చేతకావడం లేదు. ఫించన్ ఇప్పించాలని దరఖాస్తు చేశా. – రజియా, ఎల్లంబజార్, వరంగల్ కరువు మండలాలను ప్రకటించాలి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు, కూలీలు కరువు నెలకొని అల్లాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి. అధికారులు త్వరగా పరిస్థితులను అంచనా వేసి నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. రైతులు, కూలీలను ఆదుకోవాలి. – తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం● -
ప్రీ–ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా జాబితా మాయం?
● ఎంపికై న అభ్యర్థుల్లో ఆందోళన కాళోజీ సెంటర్ : 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 48 పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు జూన్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సదరు పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన పని చేయడానికి ‘ప్రీ–ప్రైమరీ ఇన్స్టక్టర్’, ‘ఆయా’ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ డీఈఓ రంగయ్యనాయుడు జూన్‌లో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలు పూర్తిగా ఈ విద్యా సంవత్సరం చివరి వరకు తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా ఆయా గ్రామ పంచాయతీ, మున్సిపల్ డివిజన్ పరిధిలోనే నివాసం ఉండాలని.. స్థానికత, అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తులను స్క్రూటినీ చేసి ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో అభ్యర్థుల ఎంపిక తుది జాబితా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు శిక్షణ అనంతరం విధుల్లో చేరాలని రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జిల్లాలో కూడా శిక్షణ కొనసాగింది. మళ్లీ ఇంటర్వ్యూలు! అభ్యర్థుల ఎంపికలో ప్రజా ప్రతినిధుల జోక్యంతో కథ అడ్డం తిరిగింది. ఐదు నెలలు గడుస్తున్నా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కొంత మంది అభ్యర్థులు కలెక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్లడంతో మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం. జీఓకు విరుద్దంగా శుక్రవారం మళ్లీ ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిసింది. దీని కారణంగా గతంలో ఎంపికై న అభ్యర్థులు ఆందోళన పడ్డారు. ఎంపిక చేసిన జాబితా మాయం ? ప్రీ–ప్రైమరీ బోధకులు, ఆయా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన జాబితాను జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి కంప్యూటర్ నుంచి డిలీట్ చేయించినట్లు తెలిసింది. గతంలో ఎంపిక చేసిన అభ్యర్థులతోపాటు ఎంపికకాని అభ్యర్థులతో కలిపి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించడంతో మొదట ఎంపికై న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఎంపిక ప్రక్రియ జీఓకు అనుగుణంగా చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ విషయంపై ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా డీఈఓ అందుబాటులోకి రాలేదు. -
భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఐనవోలు: మండల కేంద్రంలోని శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఆదివారం ఆలయంలో అమ్మవారికి వేకువజామున సుప్రభాత సేవ, విఘేశ్వర పూజ, శైవశుద్ధి, పుణ్యహవచనం, పంచగవ్య ప్రాశన, ఋత్విక్ వరుణ దీక్షాధారణ, అఖండ దీపారాధన, త్రిశూలపూజ, అంకురారోపణ, మంటపారాధన, ప్రధాన కలశస్థాపన, అమ్మవారి నవ కలశ స్నపన సుగంధ పరిమళ ద్రవ్యాభిషేకంతో నవరాత్రి వ్రతారంభం చేసినట్లు అర్చకులు తెలిపారు. అత్యంత విశిష్టమైన అమ్మవారి నవదుర్గ అలంకరణలను 9రోజులు భక్తులు దర్శించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కందుల సుధాకర్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, వేద పండిట్ విక్రాంత్ జోషి, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, అర్చకులు భాను ప్రసాద్, నరేశ్, శ్రీనివాస్, దేవేందర్, సాయి వరుణ్, మణిశర్మ పాల్గొన్నారు. ఈసందర్భంగా సీనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, దేవాలయ సిబ్బంది రాజు, లడ్డు రాజు, రఘురాజు, భక్తులు రవితేజ, ప్రదీప్, ఉప్పల శ్రీనివాస్ అమ్మవారి మాలధారణ చేసినట్లు తెలిపారు.కాశిబుగ్గ: వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఎన్నికలు నవంబర్ 5న వరంగల్ ఐఎంఏ హాల్లో నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ డాక్టర్ నాగార్జునరెడ్డి, కోరిటర్నింగ్ ఆఫీసర్లు డాక్టర్ బందెల మోహన్‌రావు, డాక్టర్ కె.మల్లేశం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఫారాలను ఈ నెల 28 నుంచి అందజేస్తామని, 31 వరకు నామినేషన్లకు దాఖలు చేయాలని, నవంబర్ 2న నామినేషన్ల స్క్రూటిటీ, 3న విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు. తుది జాబితా విడుదల అనంతరం నవంబర్ 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐఎంఏ హాల్లో పోలింగ్ జరుగుతుందని వివరించారు. కాగా, నూతన కమిటీకి ఒక అధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ఒక జనరల్ సెక్రటరీ, నలుగురు జాయింట్ సెక్రటరీలు, ఒక ఫైనాన్స్ సెక్రటరీ, 24 మంది స్టేట్ కౌన్సిల్ మెంబర్లు ఎంపిక చేయనున్నారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రేవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులను అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హన్మకొండ కల్చరల్: పల్లె సీను సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆమూల్యమైన సాహితీ సంపద అని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. శ్రీలేఖ సాహితి వరంగల్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని పల్లె సీను ఐదు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రియాజ్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ దహగం సాంబమూర్తి అతిథులుగా హాజరై పల్లె సీను రచించిన గగన తరంగాలు, మైత్రీ భావ తరంగాలు, పల్లె అంతరంగం, నేను కవిత్వాన్ని, నా సాహిత్య సంబంధాలు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె సీను సాహిత్య యువతకు గొప్ప మార్గదర్శిగా ఉంటుందని, ఆయన ఆలోచనలు సాహిత్యం మూలలను పరిచయం చేస్తుందని, వచన కవిత్వంపై ఆయనకు గొప్ప పట్టు ఉందని అన్నారు. కందుకూరి శ్రీరాములు, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, టి.ఉడయవర్లు, డాక్టర్ పర్చా అంజనీదేవి, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, శంకేశి శంకర్రావు, వరిగొండ కాంతారావు, పల్లె నాగేశ్వరరావు, డాక్టర్ ఎన్వీఎన్చారి, డాక్టర్ పల్లేరు వీరస్వామి, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
ఐదు తరగతులు
ఒక్క టీచర్..సాక్షిప్రతినిధి, వరంగల్: ఐదు తరగతులు.. విద్యార్థులు 19 మంది లోపే.. కానీ, బోధనకు ఒక్క ఉపాధ్యాయుడు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఇదీ పరిస్థితి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయించే రేషనలైజేషన్ విధానం చిన్న పాఠశాలలకు భారంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,293 పాఠశాలలు ఉండగా.. 879 పాఠశాలల్లో సింగిల్ టీచర్ మాత్రమే పనిచేస్తున్నారు. అంటే మొత్తం 20.5 శాతం పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడితో బోధన సాగుతోంది. ప్రాథమికస్థాయిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే 83,771 మంది విద్యార్థులపై ఈ ప్రభావం పడుతుంది. జీఓ 25లో ఏం ఉంది?.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు, రేషనలైజేషన్ కోసం ప్రభుత్వం 2021 ఆగస్టు 12న జీఓ 25ను జారీ చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయించే విధానం ఇందులో ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 0–19 మంది విద్యార్థులుంటే ఒక ఎస్జీటీ, 20–60 మందికి ఇద్దరు, 61–90 మందికి ముగ్గురు, 91–120 మందికి నలుగురు ఎస్జీటీలను కేటాయించాలి. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే 0–19 మంది విద్యార్థులున్న బడికి ఒక్క ఎస్జీటీ ఉండడంతో.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి వస్తోంది. బోధనకే సమయం కరువు.. ఐదు తరగతుల విద్యార్థులకు ఒకే సమయంలో బోధన చేయడం సింగిల్ టీచర్‌కు పెద్ద సవాల్. ఒక తరగతికి పాఠం చెబుతున్న సమయంలో మిగిలిన తరగతుల విద్యార్థులను స్వయం పఠనానికి వదిలేయాల్సి వస్తోంది. దీనికితోడు హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాలు, శిక్షణలు, ఎన్నికల విధులు, ఇతర శాఖల పనులు వంటి అదనపు బాధ్యతలు కూడా ఉంటున్నాయి. దీంతో బోధనకు కేటాయించాల్సిన సమయం తగ్గిపోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 879 ఏకోపాధ్యాయ పాఠశాలలుపిల్లలు తగ్గితే.. టీచర్లు తగ్గాలా? గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి అనేక కారణాలున్నాయి. పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను తగ్గిస్తే పరిస్థితి మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. టీచర్లు తక్కువ.. బోధనపై ప్రభావం.. విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రుల్లో అనుమానాలు.. ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు.. ప్రభుత్వ బడుల్లో మరింతగా విద్యార్థుల సంఖ్య తగ్గడం.. ఇలా ఒక చక్రంలా మారే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే 83,771 మందిపై ప్రభావం జీఓ 25తో ప్రాథమిక విద్యకు ‘రేషనలైజేషన్’ ఉచ్చు ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు -
గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధితులకు న్యాయం చేస్తా
● మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరకాల: కేంద్ర మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చి గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధితులు ఆదివారం హైదరాబాద్‌లో ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పరిహారం బహిరంగ మార్కెట్లో కనీసం 10 శాతం కూడా మించకపోవడం అన్యాయమని అన్నారు. న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్లు, ఎంపీ ఈటల రాజేందర్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో బాధిత రైతులు బూర్గుల రామచంద్రరావు, నల్లల సతీశ్, పెళ్లి జనార్దన్, గోనె రాజిరెడ్డి, టైల్ సాంబయ్య, అబ్బాడి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కిష్కిందకాండ
ఎల్‌నినో దెబ్బతో వానరాల వీరంగంసాక్షి, వరంగల్: ఒకప్పుడు అడవులకే పరిమితమైన కోతులు ఇప్పుడు జనావాసాల్లో గుంపులుగా సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్లపైకి ఎక్కుతున్నాయి.. వంటగదుల్లోకి చొరబడుతున్నాయి.. చేతికందిన ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మీదపడుతున్నాయి.. గోళ్లతో రక్కుతూ, పళ్లతో కరుస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎండల తీవ్రత పెరిగి, నీటి వనరులు ఇంకిపోయాయి. దీంతో జంతువులకు సహజసిద్ధమైన ఆహారం కరువైంది. ఈక్రమంలో ఆహారం, నీటి కోసం కోతుల గుంపులు గ్రామాలు, పట్టణాల్లోని జనావాసల్లోకి చొచ్చుకొస్తున్నాయి. అసలే కరవు పరిస్థితులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ కోతుల దాడులు అదనపు శాపంగా మారాయి. ఇళ్లపైకి గుంపులుగా చేరి వస్తువులను ధ్వంసం చేయడం, ఎదిరిస్తే మనుషులపై, ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులకు తెగబడుతుండటంతో జనం జంకుతున్నారు. దీంతో వరంగల్ నగరమే కాదు పట్టణాలు, పల్లెల్లో వానరాల బెడదపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కోతుల సర్వేకు ఆదేశాలు.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన వైద్య గణాంకాలు కోతుల దాడుల తీవ్రతను చాటుతున్నాయి. అయితే ఈ–పంచాయతీ పోర్టల్ ద్వారా ‘మంకీ మెనేస్ సర్వే’ చేపట్టి గ్రామాల వారీగా కోతుల వివరాలు నమోదు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాల్లో కోతుల ఉనికి, పంట నష్టం, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై పంచాయతీ కార్యదర్శులు ఆన్లైన్లో సమాచారం నమోదు చేయాల్సి ఉంది. ఈ వివరాల ఆధారంగా సమస్య తీవ్రతను అంచనా వేసి, నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గతంలో ప్రవేశపెట్టిన మంకీ ఫుడ్ కోర్టులు సరిగ్గా పనిచేయలేదని, తక్షణమే స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు) కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి కోతులను అడవుల్లోకి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కరువైన నీరు, ఆహారం గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లలోకి చొరబడి దాడులు 9 నెలల్లో 279 మందికి కాట్లు సెప్టెంబర్‌లో 54 కేసులు.. కోతుల బెడదపై ఆన్లైన్ సర్వేకు ప్రభుత్వం ఆదేశాలు కుక్కలు, పిల్లులతోనూ టెన్షనే..! -
వరంగల్
సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2026వారసత్వ గుర్తింపు ఇంకెప్పుడు? ఓరుగల్లు కోటకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కాల్సి ఉన్నా.. యునెస్కో వారసత్వ హోదా దిశగా ప్రతిపాదనల పురోగతిపై నెలకొన్న స్తబ్ధత చర్చనీయాంశంగా మారింది.నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి శివారు బూల్యాతండాకు చెందిన రైతు బానోత్ భజ్య వరి పొలానికి నీరు పారించి వస్తుండగా.. ఆదివారం ఉదయం కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ముఖం, కాళ్లతోపాటు శరీరంపై విచక్షణారహితంగా కొరకడంతో తీవ్రగాయాలయ్యాయి. అటుగా వస్తున్న రైతులు కర్రలతో కోతులను బెదిరించడంతో పారిపోయాయి. భజ్యను 108 అంబులెన్స్‌లో నర్సంపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన పడాల యాదగిరి వ్యక్తిగత పనిమీద బయటకి వెళ్లి ఇంట్లోకి వస్తున్న క్రమంలో గుంపుగా ఉన్న కోతులు దాడి చేశాయి. దీంతో గాయపడ్డాడు. అలాగే తోటకూరి రక్షిత్ అనే బాలుడు ఇంటి ముందు ఉన్న సమయంలో కోతులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. -
పల్లె సీను సాహిత్యం యువతకు మార్గదర్శి
హన్మకొండ కల్చరల్: పల్లె సీను సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆమూల్యమైన సాహితీ సంపద అని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. శ్రీలేఖ సాహితి వరంగల్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని పల్లె సీను ఐదు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రియాజ్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ దహగం సాంబమూర్తి అతిథులుగా హాజరై పల్లె సీను రచించిన గగన తరంగాలు, మైత్రీ భావ తరంగాలు, పల్లె అంతరంగం, నేను కవిత్వాన్ని, నా సాహిత్య సంబంధాలు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె సీను సాహిత్య యువతకు గొప్ప మార్గదర్శిగా ఉంటుందని, ఆయన ఆలోచనలు సాహిత్యం మూలలను పరిచయం చేస్తుందని, వచన కవిత్వంపై ఆయనకు గొప్ప పట్టు ఉందని అన్నారు. కందుకూరి శ్రీరాములు, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, టి.ఉడయవర్లు, డాక్టర్ పర్చా అంజనీదేవి, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, శంకేశి శంకర్రావు, వరిగొండ కాంతారావు, పల్లె నాగేశ్వరరావు, డాక్టర్ ఎన్వీఎన్చారి, డాక్టర్ పల్లేరు వీరస్వామి, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ -
రామప్పలో పోర్చుగల్ దేశస్తులు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని పోర్చుగల్ దేశస్తులు ఆదివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయం చరిత్ర, శిల్పకళ వైభవాన్ని టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వారికి వివరించారు. ఈసందర్భంగా వారు కాకతీయుల నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని కొనియాడారు. వారి వెంట ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలిసులు అరుణ్ కుమార్, శ్రీనివాస్ ,శ్రీకాంత్, భద్రు దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు. -
శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో దేవీశరన్నవరాత్ర ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు అధ్వర్యంలో అర్చకులు సర్వశుభంకరి, మంగళప్రదాయినైన అమ్మవారికి నిర్మాల్యసేవ, అభిషేకాదులు నిత్యహ్నికం, ఉత్సవానుజ్ఞ ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవాచనం చేశారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, పర్యగ్నికరణం, భేరీపూజ, భేరీతాడనం, ధ్వజారోహణం చేసి కలశస్థాపన నిర్వహించారు. యూనియన్ బ్యాంకులో భద్రపరిచిన అమ్మవారి ఆభరణాల బాక్సులను పోలీస్ బందోబస్తుతో సిబ్బంది దేవాలయానికి తీసుకొచ్చి అమ్మవారికి ధరింపజేశారు. తర్వాత బాలత్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజలు చేశారు. శైలపుత్రి క్రమంలో పూజలు జరిపి వృషభవాహనంపై, యోగనిద్ర క్రమంలో పూజలు జరిపి మృగవాహనంపై ఊరేగించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. హైదరాబాద్‌కు చెందిన పొన్నలూరి వెంకటసుబ్రహ్మణ్యం, రాజ్యలక్ష్మి దంపతులు సుమారు రూ.1.50 లక్షలు ఖరీదు చేసే వంటపాత్రలను ఈఓ రామల సునీత సమక్షంలో అందజేశారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు ఆనందంగా పండుగలు జరుపుకోవాలని అన్నారు. బాలత్రిపురసుందరిదేవీగా భద్రకాళి అమ్మవారు శైలపుత్రి క్రమంలో, యోగనిద్ర క్రమంలో పూజలు వృషభవాహనంపై, మృగవాహనంపై సేవలు -
హెచ్టీకి ఏకరీతి సర్వీస్ లైన్ చార్జీలు
హన్మకొండ: హెచ్‌టీ విద్యుత్ సర్వీస్‌ల మంజూరులో ఏకరీతి విధానాన్ని విద్యుత్ సంస్థలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి 11 కేవీ స్థాయిలో అర్హత కలిగిన హై టెన్షన్ (హెచ్‌టీ) విద్యుత్ కనెక్షన్లు, అదనపు లోడ్‌కు ఏకరీతి సర్వీస్ లైన్ చార్జీలను అమలు చేసే విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. లైసెన్స్ డ్యూటీ ఫర్ సప్లయ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ రెక్వెస్ట్ నిబంధనలకు చేసిన మూడో సవరణగా రెగ్యులేషన్ నంబర్ 07 ఆఫ్ 2026ను టీజీ ఈఆర్సీ జారీ చేసింది. ఈ సవరణ ద్వారా అర్హత కలిగిన 11 కేవీ హెచ్‌టీ వినియోగదారులకు సర్వీస్ లైన్ చార్జీల విషయంలో స్పష్టమైన, ఏకరీతి విధానం ద్వారా మెరుగైన సేవలు అందనున్నాయి. పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం, వినియోగదారుల కేంద్రీకృత సేవలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగదారులకు సులభతరమైన, వేగవంతమైన విద్యుత్ సేవలు అందించే దిశగా నిరంతరం చర్యలు చేపడుతోంది. సర్వీస్ లైన్ వ్యయంపై ముందే స్పష్టత.. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉన్న 11 కేవీ విద్యుదీకరించిన కామన్ ఫీడర్ నుంచి ఓవర్‌హెడ్ లైన్ ద్వారా 1 కిలోమీటరు పరిధిలో ఉన్న 11 కేవీ హెచ్‌టీ కొత్త కనెక్షన్లు, అదనపు లోడ్‌కు సరఫరా కల్పించుటకు ప్రతి కేవీఏ కాంట్రాక్టెడ్ డిమాండ్‌కు రూ.4,078 సర్వీస్ లైన్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అర్హత కలిగిన వినియోగదారులకు సర్వీస్ లైన్ వ్యయంపై ముందే స్పష్టత వస్తుంది. దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్‌లో మరింత ఏకరూపత ఏర్పడుతుంది. గతంలో 11 కేవీ స్థాయిలో స్థల పరిశీలన, సాంకేతిక అంచనాల ఆధారంగా సర్వీస్ లైన్ వ్యయాన్ని నిర్ణయించే వారు. కొత్త విధానం అమలుతో అర్హత కలిగిన సర్వీసుల్లో అంచనాలపై ఆధారపడే అవసరం తగ్గి, దరఖాస్తుల ప్రాసెసింగ్ మరింత సరళంగా, వేగవంతంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ తదితర రంగాల్లో కొత్త విద్యుత్ కనెక్షన్లు లేదా అదనపు లోడ్ల కోసం దరఖాస్తు చేసే అర్హత కలిగిన వినియోగదారులకు వ్యయంపై ముందస్తు స్పష్టత ఏర్పడుతుంది. విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియలో పారదర్శకత, సమయపాలన పెరగడం ద్వారా వ్యాపారాలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన మరింత సులభతరం అవుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఏకరీతి సర్వీస్‌లైన్ చార్జీలు ఎంతగానో దోహదపడుతాయి. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఆధునిక సాంకేతికత, వేగవంతమైన సేవల ద్వారా నాణ్యమైన విద్యుత్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం. ఏకరీతి విధానంతో హెచ్‌టీ సర్వీస్‌ల మంజూరు సులభతరం. వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుంది. – కర్నాటి వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, వరంగల్: జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బతుకమ్మ, దసరా పండుగ వేళ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకుతోడు గాలిలో తేమ శాతం (హ్యుమిడిటీ) విపరీతంగా పెరగడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత రాత్రి వేళల్లోనూ కొనసాగుతుండటంతో ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలకు డిమాండ్ పెరిగింది. సంగెంలో అత్యధిక ఉష్ణోగ్రత.. శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలోనే అత్యధికంగా సంగెం మండలంలో 36.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్ మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ ఎండ తీవ్రత భారీగా నమోదైంది. ఖిలా వరంగల్, గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో ఉష్ణోగ్రతలు 35.1 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు రికార్డయ్యాయి. వరంగల్ మండలంలో కాస్త ఉపశమనం లభిస్తూ 33.1 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ట స్థాయికి హ్యుమిడిటీ.. ఉష్ణోగ్రతల కంటే కూడా జిల్లా ప్రజలను హ్యుమిడిటీ (ఉక్కపోత) తీవ్రంగా వేధిస్తోంది. వరంగల్ మినహా మిగిలిన దాదాపు అన్ని మండలాల్లో గరిష్ట హ్యుమిడిటీ 90.1 శాతం నుంచి 100 శాతం వరకు నమోదైంది. గాలి ఆడని పరిస్థితి ఏర్పడటంతో చెమట పడుతూ పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారు. వరంగల్ మండల పరిధిలో మాత్రం తేమ శాతం 70.1 నుంచి 90 శాతం మధ్యగా నమోదైంది. పండుగ వేళ జాగ్రత్తలు అవసరం.. ప్రస్తుతం దసరా పండుగ, బతుకమ్మ, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సెలవుల కారణంగా ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బంధువుల ఇళ్లకు, దేవాలయాలకు వెళ్లేందుకు బయటకు వస్తున్నారు. ఈ తరుణంలో పెరిగిన ఉక్కపోత, ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ద్రావణం, కొబ్బరిబొండాలు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యధిక మండలాల్లో హ్యుమిడిటీ ఎఫెక్ట్ సంగెం మండంలో 36.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరంగల్ మినహా మిగతా మండలాల్లో భానుడి ప్రతాపం -
ప్రైవేట్ హాస్పిటల్ సక్సెస్ ప్రకటనలకు చెక్
కాశిబుగ్గ: ఎన్నో కేసులు సక్సెస్ చేశామంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం చేయించుకునే ప్రకటనలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) చెక్ పెట్టింది. కొంతమంది కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు రోగులకు ఆకట్టుకునేందుకు చికిత్స చేయించుకున్నవారి అనుభవాలతో ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వివిధ స్పెషలిస్టు వైద్యులు తాము చేసే చికిత్సల విజయాలను చెప్పుకుంటూ పరోక్షంగా ప్రకటనలను గుప్పిస్తుంటారు. ఇంకొంతమంది రోగులకు సర్జరీ చేయక ముందు, చేసిన తర్వాత ఎలా ఉంటారో చూపేందుకు వారి క్లినిక్‌లు, నర్సింగ్ హోంల్లో పెద్దక్షరాలతో బొమ్మలతో పరోక్షంగా ప్రచారం చేసుకుంటారు. అవి కూడా కళ్లకు అద్దినట్లు రకరకాల రంగులతో దర్శనమిస్తా యి. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్, స్కిన్ తది తర క్లినిక్‌లలో ప్రచారం చేసుకోవడానికి ఇదో మార్గంగా ఎంచుకుంటారు. ఇక నుంచి ఇలాంటి వాటికి ప్రైవేట్ వైద్యులు దూరంగా ఉండాలి. ఈనెల 6 నుంచి నిబంధనలు అమలు.. ఆయా ఆస్పత్రుల వైద్యులు చేసే ప్రకటనలు, డిజిటల్ ప్రచారాలపై కఠినమైన మార్గదర్శకాలను ఈ నెల 6 నుంచి జాతీయ వైద్య మండలి అమలుల్లోకి తీసుకొచ్చింది. వైద్యసేవలను వాణిజ్యపరంగా ప్రచారం చేయడం, రోగులను ఆకట్టుకునేందుకు అతిశయోక్తితో కూడిన ప్రకటనలు చేయడం, వైద్యపరంగా తప్పుడు హామీలు ఇవ్వడం నిషేధంగా చెబుతోంది. వైద్య వృత్తిని కాపాడుకోవడానికి, రోగుల ప్రయోజనాలను పరిరక్షించడం లక్ష్యంగా పలు మార్గదర్శకాలను రూపొందించినట్లు ఎన్ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రచారాలకు దూరంగా ఉండాలి.. ఆయా ఆస్పత్రులు సోషల్ మీడియా, వెబ్సైట్లు, వాట్సాప్, ఇన్ఫ్లుయన్సర్ మార్కెటింగ్, డిజిటల్ ప్రచారాలు, స్పాన్సర్డ్ పోస్టులు, ఏఐ ఆధారిత ప్రచారాలు కూడా నిబంధనల పరిధిలో ఉన్నాయి. రోగుల ఫొటోలతో ప్రచారం చేసుకోకూడదు. పేషంట్ల చికిత్స ముందు, చికిత్స తర్వాత పేరుతో ఫొటోలు వాడొద్దు. ఇటీవల కాలంలో టీవీల్లో అధికంగా కనిపిస్తున్న చికిత్స పొందిన రోగుల ఫొటోలు, వీడియోలు, వైద్య రికార్డులు, క్లినికల్ చిత్రాలు, టెస్టిమోనియల్స్, వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రకటనలను నిషేధించింది. వ్యక్తిగత ప్రచారం బంద్.. కొంతమంది ప్రైవేట్ వైద్యులు వ్యక్తిగత విజయాలు, చికిత్స అందించిన రోగుల సంఖ్య, సాధించిన విజయాలను ప్రచారం చేసుకోకూడదు. ఇక బెస్ట్ డాక్టర్, నంబర్ వన్ డాక్టర్, నంబర్ వన్ స్పెషలిస్టు, వందశాతం సక్సెస్, గ్యారంటీడ్ క్యూర్, మిరాకిల్ ట్రీట్మెంట్, పెయిన్లెస్ ట్రీట్మెంట్, ఒక్కరోజులో మటుమాయం అనే చికిత్స పేరుతో ప్రచారాలను మానుకోవాలి. అలాగే, రోగులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, కూపన్లు, క్యాష్‌బ్యాక్, బహుమతులు, ఉచిత చికిత్సలు, రిఫరల్ ప్రయోజనాలు వంటి ప్రోత్సాహకాలను వాడుకోవద్దని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ఇక నుంచి ఇష్టానుసారంగా చేసే డిజిటల్ ప్రచారాలపై కఠిన నిబంధనలు ఆంక్షలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎన్ఎంసీ హెచ్చరికఎన్ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్యులపై చర్యలు తప్పవు. మొదటిసారి ఉల్లంఘిస్తే హెచ్చరికతో పాటు తప్పనిసరి నైతిక శిక్షణ పొందాల్సి ఉంటుంది. రెండోసారి మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. మూడోసారి అయితే 3 నుంచి 6 నెలలు రిజిస్ట్రేషన్ సస్పెన్షన్ చేస్తారు. అలాగే, తప్పుదోవ పట్టించే చికిత్స హామీలు, రోగులను ప్రోత్సాహకాలు, భారీ స్థాయిలో డిజిటల్ ప్రచారం చేసినట్లు రుజువైతే 6 నుంచి 12 నెలలు సస్పెన్సన్ విధించే అవకాశం ఉంది, పదేపదే ఉల్లంఘిస్తే 1 నుంచి 3 సంవత్సరాల పాటు వైద్య రిజిస్టర్ నుంచి తొలగించే చర్యలు తీసుకోవచ్చు. -
నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్
హన్మకొండ అర్బన్: ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈకార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ప్రసారం చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమ సమయాన్ని మార్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెనన్స్‌కు మండల అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు. ప్రజావాణి ఉదయం గంటన్నర మాత్రమే హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ -
ఐదు తరగతులు!
ఒక్క టీచర్..సాక్షిప్రతినిధి, వరంగల్: ఐదు తరగతులు.. విద్యార్థులు 19 మందిలోపే.. కానీ, బోధనకు ఒక్క ఉపాధ్యాయుడు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఇదీ పరిస్థితి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయించే రేషనలైజేషన్ విధానం చిన్న పాఠశాలలకు భారంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,293 పాఠశాలలు ఉండగా.. 879 పాఠశాలల్లో సింగిల్ టీచర్ మాత్రమే పనిచేస్తున్నారు. అంటే మొత్తం 20.5 శాతం పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడితో బోధన సాగుతోంది. ప్రాథమికస్థాయిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే 83,771 మంది విద్యార్థులపై ఈ ప్రభావం పడుతుంది. జీఓ 25లో ఏం ఉంది?.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు, రేషనలైజేషన్ కోసం ప్రభుత్వం 2021 ఆగస్టు 12న జీఓ 25ను జారీ చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయించే విధానం ఇందులో ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 0–19 మంది విద్యార్థులుంటే ఒక ఎస్జీటీ, 20–60 మందికి ఇద్దరు, 61–90 మందికి ముగ్గురు, 91–120 మందికి నలుగురు ఎస్జీటీలను కేటాయించాలి. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే 0–19 మంది విద్యార్థులున్న బడికి ఒక్క ఎస్జీటీ ఉండడంతో.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి వస్తోంది. బోధనకే సమయం కరువు.. ఐదు తరగతుల విద్యార్థులకు ఒకే సమయంలో బోధన చేయడం సింగిల్ టీచర్‌కు పెద్ద సవాల్. ఒక తరగతికి పాఠం చెబుతున్న సమయంలో మిగిలిన తరగతుల విద్యార్థులను స్వయం పఠనానికి వదిలేయాల్సి వస్తోంది. దీనికితోడు హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాలు, శిక్షణలు, ఎన్నికల విధులు, ఇతర శాఖల పనులు వంటి అదనపు బాధ్యతలు కూడా ఉంటున్నాయి. దీంతో బోధనకు కేటాయించాల్సిన సమయం తగ్గిపోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 879 ఏకోపాధ్యాయ పాఠశాలలు 1 నుంచి 5 తరగతి చదువుతున్న 83,771పై ప్రభావం జీఓ 25తో ప్రాథమిక విద్యకు ‘రేషనలైజేషన్’ ఉచ్చు ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలంటున్న ఉపాధ్యాయ సంఘాలుపిల్లలు తగ్గితే.. టీచర్లు తగ్గాలా? గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి అనేక కారణాలున్నాయి. పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను తగ్గిస్తే పరిస్థితి మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. టీచర్లు తక్కువ.. బోధనపై ప్రభావం.. విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రుల్లో అనుమానాలు.. ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు.. ప్రభుత్వ బడుల్లో మరింతగా విద్యార్థుల సంఖ్య తగ్గడం.. ఇలా ఒక చక్రంలా మారే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి.జీఓ 25ను సవరించాలి జీఓ 25 ప్రాథమిక పాఠశాలలకు ముప్పుగా పరిణమించింది. 19 లోపు విద్యార్థులుంటే ఒక్క ఉపాధ్యాయుడే ఉండాలన్న నిబంధన సరికాదు. 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే.. ప్రాథమిక స్థాయిలోని అన్ని సబ్జెక్టులను ఎలా బోధిస్తారు? వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఎస్ జీటీలను ఉన్నత పాఠశాలలకు పంపుతున్నా రు. పాఠశాలలను బలోపేతం చేయాలి. జీఓ 25ను తక్షణమే సవరించాలి. – పెండెం రాజు, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్ -
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు చట్టం తేవాలి
పరకాల: ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. పరకాలలోని ఆర్ఆర్ గార్డెన్లో శుక్రవారం సాయంత్రం ఓసీ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ ఆరోరా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి చేపట్టిన దేశ వ్యాప్త రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన కులసంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26న జనగామ, హనుమకొండ మీదుగా పరకాలకు సా యంత్రం చేరుకుంటుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఓసీ, జేఎసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహారెడ్డి, ప్రచార కార్యదర్శి కామిడి సతీశ్‌రెడ్డి, మేడ్చల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పైళ్ల హరినాథ్, కొలుగూరి రాజేశ్వర్‌రావు, ఐలినేని మల్లికార్జురెడ్డి, బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్, పరకాల ఓసీ జేఏసీ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓసీ ఐకాస ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు ఉన్నారు. ఓసీ జేఏసీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు పోలాడి రామారావు -
మహిళల రక్షణకు వందరోజుల ప్రణాళిక
కేయూ క్యాంపస్: మహిళలు తమ హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో బతుకమ్మ వేడుకల్లో ఆమె శుక్రవారం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతీ ఆడపడుచుకు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. విద్యార్థినులు విద్యార్థి దశనుంచే తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మహిళలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళల హక్కులపై విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమాన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచే ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, కేయూ పాలకమండలి సభ్యులు రమ, అనితారెడ్డి, నాయిని నీలిమ, మహిళా కమిషన్ సభ్యులు రాధాబాయి, రమాదేవి పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద -
ప్రజాసేవే పోలీసుల ధ్యేయం
భీమదేవరపల్లి: ప్రజాసేవే పోలీసుల ధ్యేయమని, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆమె ముల్కనూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. సీపీ శ్వేతకు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత పూలమొక్క అందించి స్వాగతం పలికారు. ఎస్సై ఎం.రాజు నేతత్వంలో సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ పరిధి వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సీపీ పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. న్యాయం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, సమస్యలను పరిష్కరించి వారి మన్ననలు పొందాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆమె మామిడి మొక్క నాటారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి, ఎల్కతుర్తి సీఐ కె.శ్రీను, స్థానిక ఎస్సై ఎం. రాజుతో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ సీపీ శ్వేత ముల్కనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ -
పూల వేడుకకు వేళాయె
నేడు ఎంగిలి పూల బతుకమ్మ హన్మకొండ కల్చరల్: ఆడపడుచులు ఆడిపాడి గౌరమ్మను భక్తిశ్రద్ధలతో కీర్తించే పండుగ రానేవచ్చింది. నేడు (శనివారం) పితృ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి సందడి చేయనున్నారు. వేయిస్తంభాల ఆలయంలో ఏర్పాట్లు వేయిస్తంభాల ఆలయంలో బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ లైట్లతో అలంకరించారు. మహిళలు ప్రశాంతంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ కోరారు. నగరంలో రోడ్లన్నీ రద్దీ.. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ నేపథ్యంలో బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన రంగులు, తంగేడుపూలు, గునుగు, వివిధ రంగుల్లో ముంచిన గునుగుపూలు, తామర పూలు, చామంతి, బంతి, సీతజడలు, గుమ్మడి ఆకులు మొదలైనవి కొనడానికి వచ్చిన వారితో శుక్రవారం గ్రేటర్ వరంగల్ నగరంలోని రోడ్లు కిక్కిరిసిపోయాయి. యువతులు గాజులు, తదితర అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తూ కనిపించారు. హనుమకొండ చౌరస్తా, కుమార్‌పల్లి, టైలర్‌స్ట్రీట్, అంబేడ్కర్ సెంటర్, అదాలత్ సెంటర్, వరంగల్‌లోని పిన్నావారి వీధి, రామన్నపేట, బట్టలబజార్, కాశిబుగ్గ, గోపాలస్వామి గుడి, హనుమకొండ చౌరస్తా, సుబేదారిలోని అమరవీరుల స్తూపం, కాజీపేటలోని బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లో పూల విక్రయాలు జోరుగా సాగాయి. -
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
డిపో వారీగా పోలైన ఓట్లుహన్మకొండ: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వరంగల్ రీజియన్‌లో రెండు కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. నువ్వా.. నేనా? అన్నట్లు జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. గుర్తింపు పొందడానికి 50శాతానికి పైగా మెజారిటీ సాధించాలి. అయితే ఏ కూటమి కూడా 50 శాతం కూడా ఓట్లు సాధించలేదు. దీంతో ఏ యూనియన్ క్లాస్–6 (రీజియన్)లో గుర్తింపు సాధించలేదు. గుర్తింపు సాధించడానికి 1,521 ఓట్లు అవసరం కాగా, ఏ ఒక్క కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. పోస్టల్ ఓట్లు, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందే కూటమిని బట్టి వరంగల్ రీజియన్ గుర్తింపు ఆధారపడి ఉంది. ఫలితాలను ఈ నెల 17న అధికారికంగా ప్రకటిస్తారు. ● వరంగల్ రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు ఉండగా 2,987 ఓట్లు పోలయ్యాయి. ● ప్రస్తుతం అందిన సమాచారం మేరకు క్లాస్–6 (రీజియన్)లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ 1,478 ఓట్లు రాగా, నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 1,438 ఓట్లు వచ్చినట్లు అంచనా. ● క్లాస్–6 (రాష్ట్ర)లో తెలంగాణ వర్కర్స్ యూనియన్‌కు 1,316 ఓట్లు, ఎంప్లాయీస్ యూనియన్‌కు 1,635 ఓట్లు వచ్చాయి. ● ప్రస్తుత పోలింగ్ సరళిని చూస్తే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ● క్లాస్–3లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలోని కూటమికి 1,478 ఓట్లు రాగా, క్లాస్–6లో 1,316 ఓట్లు వచ్చాయి. 162 ఓట్లు తక్కువ వచ్చాయి. ● క్లాస్–3లో ఎంప్లాయీస్ యూనియన్ నేతృత్వంలోని ఎన్ఎంయూకు 1,438 ఓట్లు రాగా, క్లాస్–6లో ఎంప్లాయీస్ యూనియన్‌కు 1,635 ఓట్లు వచ్చాయి. 198 తక్కువ వచ్చాయి. ● క్లాస్–3తో పోలిస్తే క్లాస్–6కు ఎంప్లాయీస్ యూనియన్ వైపు కార్మికులు మొగ్గు చూపారు. క్లాస్–3లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ వైపు మొగ్గు చూపారు. ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతం ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో గుర్తింపు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. చాలాకాలం తర్వాత ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు శుక్రవారం జరిగాయి. 98.19 శాతం పోలింగ్ నమోదైంది. రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు ఉండగా.. 2,987 ఓట్లు పోలయ్యాయి. 55 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. గుర్తింపు ఎన్నికల్లో పోటీ కోసం రెండు ఐక్య కూటములు చివరి ఓటరు వరకు మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. కార్మిక శాఖ పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనంతరం కౌంటింగ్ చేపట్టారు. దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారు.. ఇతర విధుల్లో ఉండి పోలింగ్‌కు హాజరు కాలేని వారి కోసం ఈనెల 15, 16 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత మొత్తం పోలింగ్ శాతంపై స్పష్టత రానుంది. డిపో మొత్తం పోలైనవిఓట్లువరంగల్–1 472 456 వరంగల్–2 258 255 హనుమకొండ 557 543 జనగామ 400 396 మహబూబాబాద్ 219 216 నర్సంపేట 280 273 పరకాల 242 240 భూపాలపల్లి 262 258 తొర్రూరు 302 300 ఆర్ఎం ఆఫీస్ 50 50 రెండు కూటములకూ దక్కని స్పష్టమైన మెజారిటీ వరంగల్ రీజియన్‌లో 98.19 శాతం పోలింగ్ మొత్తం ఓట్లు 3,042, పోలైన ఓట్లు 2,987 ఈ నెల 15, 16వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ -
బతుకమ్మ సంబురాలు కరపత్రం ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. శుక్రవారం వేయిస్తంభాల ఆలయంలోని కుడా గార్డెన్లో సాహితీవేత్త నాగపురి లక్ష్మి బతుకమ్మ పండుగపై వివిధ జిల్లాలను పర్యటించి శిలాశాసనాల ద్వారా సేకరించిన అంశాలతో కూడిన బతుకమ్మ సంబరాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ, జీడబ్ల్యూఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పుప్పాల ప్రభాకర్, వివిధ కులసంఘాల నాయకులు తొనుపునూరి వీరన్న, చొల్లేటి కృష్ణమాచారి, బోడ డిన్న, చీకటి వీరస్వామి, నాగ సోమేశ్వర్, సిద్దోజు వీరన్న, సదానందం, మాదేవిచ వీణ, ధనలక్ష్మి, రాజేశ్వరి, మనెమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమృత హస్తం ఆధ్వర్యంలో అన్నప్రసాదాలు వితరణ చేశారు. విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెటివ్ అసెస్మెంట్ (ఏస్ఏ–1) పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. బతుకమ్మ పండుగ దసరా నేపథ్యంలో.. ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈనెల 23న పాఠశాలలను పునఃప్రారంభించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలకు ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సంబంధిత ఇంటర్‌విద్య ఉన్నతాధికారులు సెలవులు ప్రకటించారు. ఈనెల 22వ తేదీ నుంచి తరగతులు యథావిఽధిగా కొనసాగనున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు కూడా ఈనెల 21వ తేదీ వరకు సెలవులను సంబంధిత అధికారులు ప్రకటించినట్లు సమాచారం. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10న నిర్వహించనున్న వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ శుక్రవారం తెలిపారు. దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10న నిర్వహించాల్సి ఉండగా.. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వాయిదా వేసినట్లు, ఆయా పరీక్షలను ఈనెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు నిర్వహిస్తామని ఆయన తెలి పారు. అలాగే ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10న జరగాల్సి ఉండగా.. వాటిని కూడా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలను మళ్లీ ఈనెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాశిబుగ్గ: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగంలో అసోసియేషన్ ప్రొఫెసర్ (నాన్ మెడికల్) రమేష్ వరుసగా ఐదోసారి ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో స్థానం పొందారు. ఇప్పటివరకు ఆయన వందకు పైగా పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ శారస్త్రీయ జర్నల్స్‌లో ప్రచురించారు. బయోకెమిస్ట్రీ, న్యూరో సైన్సెస్, వైద్య పరిశోధన రంగాల్లో ఆయన చేసిన కృషికి పలు గుర్తింపు లభించాయి. ఈ సందర్భంగా రమేష్‌ను సహచర అధ్యాపకులు అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు. ఈ గుర్తింపుపై ఆయన మాట్లాడుతూ.. వైద్య పరిశోధనల ద్వారా సమాజానికి ఉపయోగపడే శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. కేయూ క్యాంపస్: ఈఏడాది నవంబర్ 28న కేయూలో 24వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాను శుక్రవారం కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ హైదరాబాద్ లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, ప్రదానం చేయనున్న పీహెచ్డీ అవార్డు అభ్యర్థుల సంఖ్య, గోల్డ్‌మెడల్స్ ఇతర ఏర్పాట్లను గవర్నర్‌కు వివరించారు. స్నాతకోత్సవానికి గవర్నర్ వచ్చే అవకాశాలున్నాయి. -
మనసు మాట వినాలి
మౌనం వద్దు.. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరగాలికాళోజీ సెంటర్: శారీరక ఆరోగ్యంపై చూపుతున్న శ్రద్ధను మానసిక ఆరోగ్యంపైన కూడా చూపాల్సిన అవసరం ఉందని నిపుణులు, సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. జ్వరం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించే తాము.. ఆందోళన, నిరాశ, ఒంటరితనం, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతున్న వారిని మాత్రం పట్టించుకోకపోవడం ఆందోళనకరమని వారు పేర్కొంటున్నారు. కనిపించని గాయాలను గుర్తించాలి ప్రతి చిరునవ్వు ఆనందానికి సంకేతం కాదు.. ప్రతి నిశ్శబ్దం ప్రశాంతతకు చిహ్నం కాదు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల సంక్షోభం, ఉద్యోగ భద్రత, విద్యాపోటీ తదితర కారణాలతో ఎంతోమంది మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే, వారి బాధను చిన్న విషయంగా కొట్టిపారేయకుండా అర్థం చేసుకోవడం, ఓపికగా వినడం చాలా అవసరం. విద్యార్థులపై మార్కుల ఒత్తిడి పిల్లల చేతిలో పుస్తకాలు ఉన్నాయా..? ఎన్ని మార్కులు వచ్చాయి..? అనే విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్న తల్లిదండ్రులు.. నువ్వు ఎలా ఉన్నా వు..? అని కూడా అడగాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, పోటీలో ఓడిపోవడం లేదా ఉద్యోగం రాకపోవడం జీవితానికి ముగింపు కాదనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. విజయంతో పాటు వైఫల్యాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా నేర్పాలి. ఒత్తిడితో అలసట.. ఆధునిక జీవితం సౌకర్యాలను పెంచినప్పటికీ ఒత్తిడిని కూడా పెంచింది. విద్యార్థులకు చదువు, యువతకు ఉద్యోగం – కెరీర్, ఉద్యోగులకు పని భారం, కుటుంబాలకు ఆర్థిక సమస్యలు, వృద్ధులకు ఒంటరితనం వంటి అంశాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. మౌనం కాదు.. సంభాషణే తొలి అడుగు ఎవరైనా అకస్మాత్తుగా మౌనంగా మారితే ఏమైంది? అని అడగాలి. నేను నీతో ఉన్నాను అనే భరోసా ఇవ్వాలి. వారి సమస్యకు వెంటనే తీర్పు ఇవ్వకుండా వినాలి. ఒక్కోసారి పెద్ద ఉపన్యాసం కంటే శ్రద్ధగా వినే చెవి, ఆప్యాయమైన మాట, చిన్న చేయూతే ఒక వ్యక్తిలో ఆశను నింపగలదు. సాయం కోరడం అవమానం కాదు.. కౌన్సిలర్‌ను సంప్రదించడం, సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవమానం కాదు. మానసిక బాధ గురించి మాట్లాడటం ఓటమి కాదు. సమస్యను గుర్తించి సహాయం కోరడం జీవితంపై బాధ్యతతో తీసుకునే నిర్ణయంగా చూడాలి. శారీరక అనారోగ్యానికి వైద్యుడిని సంప్రదించడం ఎంత సహజమో.. మానసిక సమస్యలకు కూడా నిపుణుల సహాయం పొందడం అంతే సహజంగా మారాలి. సహాయం కోరడం బలహీనత కాదు.. ధైర్యానికి నిదర్శనం నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంకాశిబుగ్గ: మానసిక సమస్య అంటే అదొక కుంగదీసే జబ్బుగా పరిగణించరాదు. దాన్ని షుగర్, బీపీ లాంటి ఒక సాధారణ సమస్యగానే భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. ఎంజీఎంలో మానసిక వ్యాధులకు చికిత్స మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి తగిన చికిత్స అందించి, వారిలో మానసిక స్థైర్యం పెంపునకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కేంద్రాలు ఉన్నాయి. మానసిక ఆరోగ్య విభాగం, మానసిక చికిత్స వార్డుతో పాటు డీఅడిషన్ కౌన్సిలింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ముగ్గురు వైద్య నిపుణులు, 12 మంది పీజీలు, నలుగురు ఎస్‌ఆర్‌లు పనిచేస్తున్నారు. రోజు దాదాపు 80 నుంచి వంద వరకు ఓపీ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇన్‌పేషెంట్ కోసం ప్రత్యేకంగా 40 పడకల వార్డును ఏర్పాటు చేశారు. అలాగే, 20 పడకలతో ప్రత్యేకంగా డీఅడిక్షన్ సెంటర్‌ను సిద్ధం చేశారు. జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు వైద్య నిపుణులు, ఒకరు చొప్పున ఎస్‌ఆర్‌లు, భూపాలపల్లి, నర్సంపేటలలో ఒకరు చొప్పున వైద్య నిపుణులు బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.మనిషి యంత్రం కాదు. ఎప్పుడూ విజయవంతంగా, ఉత్పాదకంగా ఉండాల్సిన అవసరం లేదు. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. పిల్లల మాట వినాలి.. వృద్ధులను పలకరించాలి.. స్నేహితుడి మౌనాన్ని గమనించాలి.. సహోద్యోగి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. బాధలో ఉన్నవారిని ఎగతాళి చేయకుండా, తీర్పు ఇవ్వకుండా అండగా నిలవాలి. మానసిక ఆరోగ్యం విలాసం కాదు.. అది ప్రతి ఒక్కరి హక్కు. -
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
హన్మకొండ: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వరంగల్ రీజియన్‌లో రెండు కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. నువ్వా.. నేనా? అన్నట్లు జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. గుర్తింపు పొందడానికి 50 శాతానికి పైగా మెజారిటీ సాధించాలి. అయితే ఏ కూటమి కూడా 50 శాతం కూడా ఓట్లు సాధించలేదు. దీంతో ఏ యూనియన్ క్లాస్–6 (రీజియన్)లో గుర్తింపు సాధించలేదు. గుర్తింపు సాధించడానికి 1,521 ఓట్లు అవసరం కాగా, ఏ ఒక్క కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. పోస్టల్ ఓట్లు, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందే కూటమిని బట్టి వరంగల్ రీజియన్ గుర్తింపు ఆధారపడి ఉంది. ఫలితాలను ఈనెల 17న అధికారికంగా ప్రకటిస్తారు. ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతం ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో గుర్తింపు ఎన్నికల పోలింగ్ శుక్రజువారం ప్రశాంతంగా ముగిసింది. 98.19 శాతం పోలింగ్ నమోదైంది. రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు ఉండగా.. 2,987 ఓట్లు పోలయ్యాయి. 55 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. కార్మిక శాఖ పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనంతరం కౌంటింగ్ చేపట్టారు. దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారు.. ఇతర విధుల్లో ఉండి పోలింగ్‌కు హాజరు కాలేని వారి కోసం ఈనెల 15, 16 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత మొత్తం పోలింగ్ శాతంపై స్పష్టత రానుంది. వరంగల్ రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు ఉండగా 2,987 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు క్లాస్–6 (రీజియన్)లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ 1,478 ఓట్లు రాగా, నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 1,438 ఓట్లు వచ్చినట్లు అంచనా. క్లాస్–6 (రాష్ట్ర)లో తెలంగాణ వర్కర్స్ యూనియన్‌కు 1,316 ఓట్లు, ఎంప్లాయీస్ యూనియన్‌కు 1,635 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత పోలింగ్ సరళిని చూస్తే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. క్లాస్–3లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలోని కూటమికి 1,478 ఓట్లు రాగా, క్లాస్–6లో 1,316 ఓట్లు వచ్చాయి. 162 ఓట్లు తక్కువ వచ్చాయి. క్లాస్–3లో ఎంప్లాయీస్ యూనియన్ నేతృత్వంలోని ఎన్ఎంయూకు 1,438 ఓట్లు రాగా, క్లాస్–6లో ఎంప్లాయీస్ యూనియన్‌కు 1,635 ఓట్లు వచ్చాయి. 198 తక్కువ వచ్చాయి. క్లాస్–3తో పోలిస్తే క్లాస్–6కు ఎంప్లాయీస్ యూనియన్ వైపు కార్మికులు మొగ్గు చూపారు. క్లాస్–3లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ వైపు మొగ్గు చూపారు. డిపో మొత్తం పోలైనవి ఓట్లు వరంగల్–1 472 456 వరంగల్–2 258 255 హనుమకొండ 557 543 జనగామ 400 396 మహబూబాబాద్ 219 216 నర్సంపేట 280 273 పరకాల 242 240 భూపాలపల్లి 262 258 తొర్రూరు 302 300 ఆర్ఎం ఆఫీస్ 50 50 రెండు కూటములకు దక్కని స్పష్టమైన మెజారిటీ వరంగల్ రీజియన్‌లో 98.19 శాతం పోలింగ్ -
మార్కెట్లలో రైతులకు మెరుగైన సేవలు
● మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు ఖిలా వరంగల్: వ్యవసాయ మార్కెట్లలో రైతులకు మెరుగైన సేవలు అందించడం, రైతుల సమస్యల పరిష్కారానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, డీఎంఓ నాగరాజు, వైస్ చైర్మన్ బండి జనార్దన్, డైరెక్టర్ గజ్జల శ్యాంతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు పరిసరాలు, మిర్చి, పత్తి వేలం, తేమ, నాణ్యత, కొనుగోళ్లు, ధరల ప్రక్రియ, పీహెచ్సీలో వైద్యసేవలను పరిశీలించారు. అపరాల యార్డులో ఈ–నామ్ ద్వారా చేపట్టిన క్రయవిక్రయాలను తెలుసుకున్నారు. మొక్కజొన్నల నాణ్యత, వ్యాపారులు కోడ్ చేస్తున్న ధరలను రైతులు, వ్యాపారులను వేర్వేరుగా అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ పరిధిలోని పరిశ్రమలకు వెళ్లే గుంతల రోడ్ల పరిస్థితిని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి వివరించారు. అనంతరం గీసుకొండ మండలం కొమ్మాల శివారులోని విశ్వనాథపురం గ్రామంలోని ఫ్రూట్స్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదిత స్థలాన్ని లక్ష్మణుడు పరిశీలించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆకుల రుద్రప్రసాద్, బొడ్డు ప్రదీప్‌కుమార్, మహమ్మాద్ సాబేర్, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మడూరి వేదప్రకాశ్, అడ్తి సెక్షన్ అధ్యక్షుడు ఎన్రెడ్డి లింగారెడ్డి, కాటన్ సెక్షన్ అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, వేలం నిర్వాహకుడు సాగర్ల శ్రీనివాస్, మార్కెట్ సిబ్బంది రాజేందర్ పాల్గొన్నారు. -
తుగ్లక్ పాలనలోనే రైతులకు కరెంట్ కష్టాలు
వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నరసయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మల్లాడి తిరుపతి రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, శ్రీధర్ తదితరులు, బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులుమామునూరు: అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమమే లక్ష్యమని చెప్పిన కాంగ్రెస్ నేడు రాష్ట్రంలో తుగ్లక్ పాలన చేస్తూ కరెంట్ కష్టాలు తెచ్చిందని, ఇది రైతు ప్రభుత్వం కాదని.. రాబందుల ప్రభుత్వమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నరసయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, ప్రోగ్రాం కన్వీనర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి ఆరోపించారు. కరెంట్ కోతలను నిరసిస్తూ వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై తిమ్మాపురం సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్లకార్డులతో సబ్‌స్టేషన్ ముట్టడించి..ఖమ్మం హైవేపై ధర్నా నిర్వహించారు. పలువురు కార్యకర్తలు ఎడ్లబండ్లపై తరలివచ్చారు. జాతీయ రహదారిపై గంటపాటు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు నాయకులను అరెస్టు చేసి మామునూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దండు కిషన్, నాయకులు మల్లాడి రాంరెడ్డి, బన్న ప్రభాకర్ పాల్గొన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నరసయ్య వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై నాయకుల ధర్నా -
పాఠశాలలకు టాయిలెట్లు మంజూరు
కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా మరో ముందడుగుపడింది. పాఠశాలల వారీగా పనులు చేపట్టాలని విద్యాశాఖ డైరెక్టర్, సమగ్రశిక్ష ప్రాజెక్టు రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్‌నికోలస్ టీఎస్‌డబ్ల్యూఎస్ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో (6 నుంచి 12 తరగతులు) బాలురు, బాలికల కోసం మరుగుదొడ్లు (టాయిలెట్లు) మంజూరయ్యాయి. 9 పాఠశాలల్లోని 10 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.47.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను తగిన ప్యాకేజీలుగా విభజించి ఈ–ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో గుర్తించిన 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అవసరాన్ని బట్టి బాలుర, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వులు వచ్చాయి.. ఈ పనులు టీఎస్‌డబ్ల్యూఎస్ శాఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో చేపడతారు. ఒక్కో టాయిలెట్‌కు రూ.4.75 లక్షలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. – తాటిపల్లి విజయ్‌కుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ మండలం జెడ్పీహెచ్ఎస్ బాలుర బాలికల నిధులు టాయిలెట్లు (రూ.లక్షల్లో) దుగ్గొండి మహమ్మదాపూర్ 0 1 4.75 గీసుకొండ మచ్చాపూర్ 1 1 9.50 ఖానాపురం అశోక్‌నగర్ 1 0 4.75 నల్లబెల్లి రుద్రగూడెం 1 0 4.75 రాయపర్తి తిరుమలాయపాలెం 1 0 4.75 రాయపర్తి రాయపర్తి 0 1 4.75 రాయపర్తి ఊకల్ 1 0 4.75 వరంగల్ సుందరయ్యనగర్ 1 0 4.75 వర్ధన్నపేట ఇల్లంద 1 0 4.75 మొత్తం 7 3 47.50 రూ.47.50 లక్షల నిధులతో పనులు -
ఎయిడ్స్ నియంత్రణలో జాతీయస్థాయి గుర్తింపు
గీసుకొండ: ఎయిడ్స్ నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరిచినందుకు జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని డీఎంహెచ్ఓ రాజారెడ్డి తెలిపారు. నాకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) విడుదల చేసిన ర్యాంకుల్లో జిల్లాకు సురక్షిత్ స్థానం దక్కిందని, సురక్షిత్ ప్లస్ సాధించడానికి కృషి చేయాలన్నారు. శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఎయిడ్స్ నియంత్రణపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ సత్యశారద మార్గదర్శకంలో వైద్య, ఆరోగ్య శాఖ ఐ సీటీసీలు, ఏఆర్టీ కేంద్రం, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉ చితంగా యాంటీ రెట్రోవైరల్ మందులు, కౌన్సెలింగ్, సీడీ4, వైరల్ లోడ్ పరీక్షలు చేస్తోందన్నారు. పీఓ అరుణ్‌కుమార్ జోషి, ప్రాజెక్టు మేనేజర్ స్వప్నమాధురి, ఐసీటీసీ సూపర్వైజర్ రామకృష్ణ, ఏఓ కమలాకర్, ఐసీటీసీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘నాకో’ ర్యాంకింగ్‌లో జిల్లాకు సురక్షిత్ స్థానం : డీఎంహెచ్ఓ రాజారెడ్డి -
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆనంద్
దుగ్గొండి: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని మధిర గ్రామానికి చెందిన మడతలపాటి ఆనంద్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శుక్రవారం ఆయనకు నియామకపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ యువతను సంఘటితం చేస్తామన్నారు. వర్ధన్నపేట: పట్టణానికి చెందిన వన్నాల రిష్మిత జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శనకు ఎంపికైంది. న్యూఢిల్లీలో ఈనెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్న 12వ జాతీయస్థాయి ప్రదర్శన, ప్రాజెక్టుల పోటీలకు రిష్మిత ఎంపికవడం గర్వకారణమని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. వర్ధన్నపేటకు చెందిన వన్నాల నాగరాజు–సౌభాగ్య దంపతుల కుమార్తె రిష్మిత 2023–24 విద్యాసంవత్సరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌లో ప్రథమ స్థానం సాధించింది. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలుగీసుకొండ: మండలంలోని పలు ఆలయాలను శుక్రవారం దేవాదాయ శాఖ వరంగల్, ఖమ్మం జిల్లాల ఉప స్థపతి శివశంకర్ పరిశీలించారు. మచ్చాపూర్‌లోని హనుమాన్, సూర్యతండాలోని దుర్గమ్మ, ఊకల్‌లోని మడేలయ్య, శాయంపేటహవేలిలోని పాంచాల రాయస్వామి ఆలయాలను సందర్శించారు. ఆలయాల అభివృద్ధికి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఆయన పరిశీలనకు వచ్చారు. సూర్యతండా సర్పంచ్ బానోత్ రాఘవేంద్ర, మాజీ ఎంపీటీసీ వీరారావు, మాజీ సర్పంచ్ నాగార్జున, గ్రామ పెద్దలు నరేందర్, భాస్కర్, రమేశ్, సురేశ్, నాగరాజు, కుమారస్వామి, రవి, పరమేశ్ పాల్గొన్నారు. ‘సమాన పనికి సమాన స్టైఫండ్ ఇవ్వాలి’నర్సంపేట రూరల్: సమాన పనికి సమాన స్టైఫండ్ ఇవ్వాలని ఎఫ్ఎంజీఈ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఎఫ్ఎంజీఈ వైద్యులు శుక్రవారం నర్సంపేట కళాశాల, జనరల్ ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎఫ్ఎంజీఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ద్వారా మెరిట్ ప్రకారం నర్సంపేట వైద్య కళాశాలకు తమను కేటాయించారని పేర్కొన్నారు. నర్సంపేట ఆస్పత్రి తనిఖీనర్సంపేట రూరల్ : నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో గైనిక్ విభాగానికి చెందిన నాలుగు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఎన్ఎంసీ బృందం ప్రతినిధి డాక్టర్ ఫసిహా తస్నీమ్ అబ్దుల్ అజీజ్ శుక్రవారం జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్ బ్లాక్‌ను పరిశీలించారు. ఆస్పత్రిలో ఉండే సౌకర్యాలను, స్టాప్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంద్యారాణి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరబాయి తదితరులు పాల్గొన్నారు. -
రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
వర్ధన్నపేట: రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. చెన్నారం చేపట్టిన భూముల రీ సర్వేను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. సర్వే ఏ మేరకు పూర్తయ్యింది, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ సర్వేలో క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సర్వేను పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ విజయసాగర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ ఉన్నారు. ఈవీఎంల గోదాం తనిఖీ ఖిలా వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రతకు సంబంధించిన చర్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల సూపరింటెండెంట్ రజిని పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
రాహుల్ అరెస్టు కేంద్ర నిరంకుశ వైఖరికి పరాకాష్ట
● మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్ చౌరస్తా: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం ఆందోళన చేస్తున్న రాహుల్‌గాంధీని అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఓటు చోరీ, రాహుల్ అరెస్ట్‌ను నిరసిస్తూ కొండా సురేఖ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్ చౌరస్తా నుంచి పోచం మైదాన్ జంక్షన్ వరకు పాదయాత్ర చేశారు. పోచంమైదాన్ జంక్షన్లో రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, మాజీ కార్పొరేటర్లు జారతి రమేష్, కత్తెరశాల వేణుగోపాల్, ఎండీ ఫుర్కాన్, వస్కుల బాబు, బస్వరాజ్ కుమార్, బాలినే సురేశ్, చింతాకుల అనిల్, ఎలుగం లీలావతి, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, పల్లం పద్మ, కావేటి కవిత, భోగి సువర్ణ సురేష్, బత్తిని వసుంధర, నాగపురి కల్పన పాల్గొన్నారు. -
11నుంచి భద్రకాళి ఆలయ ుంలో నవరాత్రోత్సవాలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 21 వరకు శ్రీభద్రకాళిదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాల వితరణ, సాయంత్రం 5నుంచి రాత్రి 9గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 17వతేదీ అమ్మవారికి రథోత్సవం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.కోటి వ్యయంతో దారుమయ (టేకు) రథాన్ని దారుశిల్పులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ రోజూ ప్రాతఃకాల పూజలు, అర్చనలు, వివిధ క్రమాలలో అమ్మవారిని అలంకరించి విశేషసేవలు నిర్వహిస్తామని తెలిపారు. -
కార్పొరేట్ విద్యనందించడమే లక్ష్యం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: కార్పొరేట్ స్థాయి విద్యా వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. కట్య్రాల గ్రామ పరిధిలో ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. 16–11 ఎకరాల్లో రూ.200 కోట్ల ఖర్చుతో చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీలో సమావేశాల్లో ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి స్కూల్‌కు భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగించాలన్నారు. ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలోని విద్యార్థులకు ఆధునిక విద్య, వసతులు మరింత చేరువవుతాయన్నారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావు, పలు శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ ‘ఫైనల్’ చిక్కులు?
సాక్షి, వరంగల్: జీడబ్ల్యూఎంసీ జారీ చేస్తున్న లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ఫైనల్ ప్రొసీడింగ్స్ కాపీలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. 2015లో మాదిరిగా ఫైనల్ ప్రొసీడింగ్ ఉత్తర్వుల్లో రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్, సైట్ ప్లానన్, టోపో డిటెయిల్స్, మాస్టర్ప్లాన్్, ఎక్స్ట్రాక్ట్, లొకేషనన్ స్కెచ్, గూగుల్ మ్యాప్, నక్ష, సర్వేయర్ రూపొందించిన ప్లాన్న్.. 2026లో జారీ చేస్తున్న 2020 ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ కాపీల్లో లేకపోవడం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం సర్వే నంబర్, ప్లాట్ నంబర్, విస్తీర్ణంతో పాటు చార్జీలు మాత్రమే ఉండడం ప్లాట్ల యజమానులను కలవరపెడుతుండగా.. మరికొందరికి ప్లాట్ నంబర్ లేకుండానే ఓపెన్ ప్లాట్లతో రిజిస్టరైన ప్లాట్లకు ఓపెన్ ప్లాట్ పేరు మీదనే ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడనుంది. ఎందుకంటే నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని పలు వెంచర్లలో ప్లాట్ల నంబర్లు లేకుండా చాలా వరకు ఓపెన్ ప్లాట్లు సమాన పరిమాణంలో ఉండడమే ఆందోళనకు కారణం. ఉదాహరణకు వెంచర్లో సేమ్ సర్వే నంబర్, సేమ్ పరిమాణంలో ప్లాట్లు పదుల సంఖ్యలో ఉండడంతో ఒకటి రెండింటికీ మాత్రమే ఓపెన్ ప్లాట్ పేరుతో ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ తీసుకొని వాటితోనే అన్ని ప్లాట్లు విక్రయించే అవకాశం ఉంది. దీంతో కొన్ని సందర్భాల్లో కొనుగోలుదారులు, అవి నిజమని నమ్మి ఇంటి నిర్మాణ సమయంలో అధికారులు చార్జీలు తగ్గిస్తే ఇటు ఎల్ఆర్ఎస్ ఫీజు, అటు భవన నిర్మాణ చార్జీల రూపంలో ఆదాయం కోల్పోతుంది. వీటితో విలేజ్ నంబర్లు, మండలాలు సరిగా ఆన్లైన్లో తీసుకొని సమయంలో ఏదో ఒకటి పెట్టి దరఖాస్తు చేసినా అలాంటివి అధికారులు కరెక్షన్ చేయకుండానే యథావిధిగా ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడా ఎవరెవరికీ నష్టం కలుగుతుందంటే... నగర శివార్లలోని స్తంభంపల్లి, మామునూరు, ఖిలా వరంగల్, ఆరెపల్లి, దేశాయిపేట, మడికొండ వివిధ ప్రాంతాల్లో చాలా చోట్ల కొన్ని వెంచర్లలో ప్లాట్ నంబర్లు లేకుండానే ఓపెన్ ప్లాట్లతో రిజిస్టరై ఉన్నట్టుగా తెలిసింది. ఉదాహరణకు ఒక వెంచర్లో 200 గజా ల ప్లాట్లు 20, 250 గజాలవి మరో 30 ప్లాట్లు ఉన్నాయనుకుందాం. కొన్ని వెంచర్లలో ప్లాట్ నంబర్లు స రిగా లేకపోవచ్చు. మరికొన్ని చోట్ల వాస్తవ భూ మిపై వేసిన ప్లాటింగ్, పాత లేఅవుట్ కాపీలో ఉన్న ప్లాటింగ్ మధ్య తేడాలు ఉండే అవకాశం ఉంది. ఇ లాంటి పరిస్థితుల్లో ఒక ప్లాట్‌కు జారీ అయిన కాపీ ని అదే విస్తీర్ణంలోని మరో ప్లాట్‌కు అన్వయిస్తూ చూపించే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. ● కొనుగోలుదారుడికి : ఎల్ఆర్ఎస్ అయిందనే నమ్మకంతో డబ్బులు చెల్లించిన తర్వాత చూపించిన ప్లాట్ అదే క్రమబద్ధీకరించిన ప్లాట్ కాదని తేలితే వివాదం ఏర్పడవచ్చు. ● అసలు ప్లాట్ యజమానికి: తన ప్రొసీడింగ్‌ను మరొక ప్లాట్ లావాదేవీలో ఉపయోగించారనే వివాదం తలెత్తవచ్చు. ● ప్రభుత్వానికి: ఆమోదం పొందని మరో ప్లాట్‌ను క్రమబద్ధీకరించినదిగా చూపించి లావాదేవీ జరిగితే, ఆ ప్లాట్ ఎల్ఆర్ఎస్ చార్జీలు ప్రభుత్వానికి రాకపోయే అవకాశం ఉంటుంది. భవన నిర్మాణ సమయంలోనూ ఎల్ఆర్ఎస్ కాపీ జతచేయడం వల్ల చార్జీలు తగ్గే అవకాశముంది. ఇలా రెండు రకాలుగా సర్కారుకు నష్టం వాట్లినుంది. బ్యాంకులు కూడా భూడాక్యుమెంట్లతో పాటు ఈ ఎల్ఆర్ఎస్ కాపీని నమ్మి రుణాలు ఇచ్చే అవకాశముంది. రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్ లేకుండానే ప్రొసీడింగ్ కాపీలు సర్వే నంబర్, ప్లాట్ నంబర్.. కొన్ని చోట్ల ‘ఓపెన్్ ప్లాట్’ గానే వివరాలు ఒక ప్లాట్ ఎల్ఆర్ఎస్ కాపీని మరో ప్లాట్‌కు చూపించే అవకాశం కొనుగోలుదారులకు చిక్కులు.. ప్రభుత్వ ఆదాయానికి గండి ప్లాట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండాల్సిందే...గ్రేటర్ పరిధిలో ఎల్ఆర్ఎస్కు 1.06 లక్షల దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 18,526 దరఖాస్తులకు ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. వీటి ద్వారా బల్దియాకు సుమారు రూ.151 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం, వేలాది ప్లాట్ల హక్కులు ముడిపడి ఉన్న ప్రక్రియలో ఫైనల్ ప్రొసీడింగ్ రూపకల్పనలోనే ప్లాట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న వాదన వినిపిస్తోంది. -
గత పాలకులవి మోసపూరిత మాటలు
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల: గత బీఆర్ఎస్ పాలకుల మోసపూరిత మాటలతో పరకాల పట్టణం వెనుకబడిపోయిందని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాల పట్టణాన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. గురువారం పరకాల పట్టణంలో వాడవాడకు బైక్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరకాలను ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకమైన డీపీఆర్ వ్యవస్థతో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి వసతులతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునీల్‌కుమార్, వైస్ చైర్మన్ ఏకు దివ్య, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రవణ్‌కుమార్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
టీబీ వ్యాధి నియంత్రణకు కృషిచేయాలి
గీసుకొండ: టీబీ నియంత్రణ కోసం ప్రతిఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ (జోష్) టీంల కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురు వారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమట, బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అనుమానితులు సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కఫం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణ అయితే ప్రభుత్వ ఆస్పత్రులో ఉచితంగా అందించే చికిత్సను పూర్తిగా తీసుకుంటే వ్యాధి నయమవుతుందన్నారు. గ్రామాల్లో టీబీపై అవగాహన కల్పించడంతో పాటు స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించి అనుమానితులను గుర్తించడంలో జోష్ టీంలు, ఎన్్సీసీ కేడెట్లు, యువత కీలకపాత్ర పోషించాలని కోరారు. అనంతరం టీబీ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందిన చాపలబండ, దేశాయిపల్లి, చెన్నారం, కాశిగూడెం, లోహిత, నల్లబెల్లి గ్రామాల సర్పంచ్‌లను కలెక్టర్, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఐ. ప్రకాశ్, డాక్టర్ ఆర్.రాజమౌళి, డాక్టర్ సాజిదా, డాక్టర్ అరుణ్ జోషి, డిప్యూటీ డెమో ఎస్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
పక్కాగా పంటల లెక్క
నల్లబెల్లి: పంటలు సాగు చేయకుండా ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందుతున్న నకిలీలను అరికట్టి, అసలైన రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతులు సాగు చేసిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసేందుకు జిల్లాలో చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చివరి దశకు చేరుకుంది. 94 శాతం సర్వే పూర్తి చేసి నెక్కొండ మండలం మొదటి స్థానంలో ఉండగా.. రాయపర్తి మండలం 44 శాతంతో చివరి స్థానంలో ఉంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి ఎంపిక చేసిన సర్వే నంబర్లతో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను వలటీర్లు, సర్వేయర్లు, ఎన్యుమరేటర్ల ద్వారా జియో ట్యాగింగ్‌తో కూడిన మొబైల్ యాప్‌లో సేకరిస్తున్నారు. పంట విస్తీర్ణం, రకం, నీటి వసతి తదితర వివరాలతో పాటు సర్వేనంబర్లు, అక్షాంశాలు, రేఖాంశాలు, పంట ఫొటోలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. తక్షణమే రైతులకు ఫోన్ మెసేజ్.. గతంలో డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే సమయంలో కొన్ని చోట్ల వలంటీర్లు పొరపాటున వేరే పంటల పేర్లు నమోదు చేయడంతో సమస్యలు ఎదురయ్యేవి. దీంతో పంట విక్రయ సమయాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ ఏడాది సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వలంటీర్ ఆన్లైన్లో పంట వివరాలు నమోదు చేయగానే.. క్షణాల వ్యవధిలో సంబంధిత రైతు మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో కొత్త అలర్ట్ విధానాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల తన భూమిలో ఏ పంట నమోదైందనే అంశంపై రైతులకు తక్షణమే స్పష్టత వస్తుంది. తప్పులుంటే 72 గంటల్లో సవరణ వలంటీర్లు నమోదు చేసిన వివరాలు నేరుగా వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) లాగిన్‌కు వెళ్తాయి. ఒకవేళ తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌లో పంట వివరాలు తప్పుగా ఉన్నట్లుగా రైతులు గుర్తిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెసేజ్ అందిన నాటి నుంచి 72 గంటల లోపు సంబంధిత ఏఈఓను సంప్రదించి సవరణ కోరే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. రైతు ఫిర్యాదు మేరకు ఏఈఓ పరిశీలించి సరిచేయడానికి ఆదేశిస్తే.. వలంటీర్ మరోసారి క్షేత్రస్థాయికి వచ్చి పంటను పరిశీలించి ఆన్లైన్లో సరిచేస్తారు. రైతుల ప్రయోజనం కోసమే.. రైతుల ప్రయోజనం కోసం, పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతోంది. గతంలో సర్వే చేసినప్పుడు దొర్లిన చిన్నపాటి పొరపాట్లతో పంట విక్రయాలు, ప్రభుత్వ సాయం అందే సమయంలో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, కచ్చితమైన అంచనాతో మద్దతు ధర కల్పించడానికి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఈ డిజిటల్ సర్వే అత్యంత కీలకం. పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటల విక్రయాలు సాఫీగా సాగాలంటే డీసీఎస్‌లో వివరాలు పక్కాగా ఉండాలి. వలంటీర్లు గ్రామాలకు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి సరైన వివరాలు నమోదు చేయించుకోవాలి. ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లను పరిశీలించి ఏమైనా పొరపాట్లు ఉంటే నిర్ణీత 72 గంటల్లోగా ఏఈఓలను కలిసి పొరపాట్లను సరి చేసుకోవాలి. – విజయభాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో ముమ్మరంగా డిజిటల్ క్రాప్ సర్వే 94 శాతంతో నెక్కొండ మొదటి స్థానం, 44 శాతంతో రాయపర్తి చివరి స్థానం చివరి దశకు చేరిన పంటల నమోదు 72 గంటల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించిన ప్రభుత్వంమండలాల వారీగా డిజిటల్ క్రాప్ సర్వే వివరాలుమండలం మొత్తం ప్లాట్లు సర్వే పూర్తి నెక్కొండ 34,041 32,010 వరంగల్ 4,320 4,029 నల్లబెల్లి 27,148 24,942 నర్సంపేట 27,364 24,357 దుగ్గొండి 36,430 31,810 ఖిలా వరంగల్ 13,505 11,111 ఖానాపురం 15,337 12,182 పర్వతగిరి 34,894 25,458 చెన్నారావుపేట 23,814 16,167 సంగెం 38,848 20,518 వర్ధన్నపేట 39,307 19,923 గీసుకొండ 31,327 14,046 రాయపర్తి 47,721 20,894 -
‘ఐసీఏఆర్ ఏఐసీఈ’ లో శ్రావణికి 45వ ర్యాంకు
గీసుకొండ: మండలానికి చెందిన పొగాకుల శ్రావణి ప్రతిష్టాత్మక ఐసీఏఆర్ ఏఐసీఈ ప్రవేశ పరీక్ష (వ్యవసాయ విస్తరణ విద్యావిభాగం పీహెచ్డీ)లో జాతీయ స్థాయిలో 45వ ర్యాంకు సాధించింది. వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకున్న తల్లిదండ్రులు భిక్షపతి, సరిత ప్రోత్సాహంతో కష్టాలను అధిగమిస్తూ శ్రావణి ఉన్నత విద్యను కొనసాగించింది. ఆమె పట్టుదల, కృషి ఫలితంగా జాతీయస్థాయి ర్యాంకు సాధించడం గీసుకొండకు గర్వకారణమని పలువురు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్నర్సంపేట: తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నర్సంపేటకు చెందిన అంబటి శ్రీనివాస్‌ను రెండోసారి నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో ఏర్పడిన టీజేఎస్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్ వ్యవహరించారు. ధైర్యం, తెగువ, పట్టుదల గమనించిన ప్రొఫెసర్ కోదండరాం.. అంబటి శ్రీనివాస్‌ను రెండోసారి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. క్రీడా సామగ్రి సరఫరాకు టెండర్లు : డీఈఓకాళోజీ సెంటర్: జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలలకు క్రీడా సామగ్రి సరఫరా చేసేందుకు సీల్డ్ కొటేషన్లు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 9 నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు డీఈఓ కార్యాలయంలో టెండర్ ఫారాలు పొందవచ్చని పేర్కొన్నారు. పూర్తి చేసిన సీల్డ్ టెండర్ ఫారాలను 13న మధ్యాహ్నం 3 గంటల్లోగా సమర్పించాలని, టెండర్లను 14న కలెక్టర్ కార్యాలయంలో తెరవనున్నట్లు పేర్కొన్నారు. పోషకాహారం తీసుకోవాలిచెన్నారావుపేట: ప్రతిఒక్కరూ పోషకాహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అన్నారు. తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో గురువారం పోషణ మాస ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ చిరు ధాన్యాలు, పెరటి తోటల్లో పెంచిన ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని కోరారు. గ్రామంలో పోషకాహర స్టాళ్లను ఏర్పాటు చేశారు. సర్పంచ్ ధారావత్ రమేశ్, సెక్టార్ సూపర్వైజర్ రాధ, ప్రాజెక్టు ఏసీడీపీఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లు లేకుండా రీ సర్వే చేయాలి : ఆర్డీఓవర్ధన్నపేట: మార్గదర్శకాలకు అనుగుణంగా రీ సర్వే నిర్వహించాలని వరంగల్ ఆర్డీఓ సుమ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. చెన్నారం గ్రామంలో చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియను గురువారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. భూ వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా సర్వే పక్రియను పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్ విజయసాగర్, సర్వేయర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ‘సూపర్’ ఇన్చార్జ్గా మాధవరావు కొనసాగింపు కాశిబుగ్గ: కేఎంసీలో ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఇన్చార్జ్ (డిప్యూటీ సూపరింటెండెంట్) బాధ్యతలను నెలకు ఒక ప్రొఫెసర్ చొప్పున అప్పగించడంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయమై ఆగస్టు 24న ‘సూపర్’లో నెలకొకరు!, ఈ నెల 1న సూపర్ డిప్యూటీ బాధ్యతలెవరికో? అనే శీర్షికలతో సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించినట్లు తెలుస్తోంది. గతంలో అధికారులు నెలకు ఒకరు చొప్పున సీనియర్ ప్రొఫెసర్ ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తొలుత డాక్టర్ మాధవరావు ఆగస్టు 15న బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన సెప్టెంబర్ చివరి వరకు ఉండాలి. అక్టోబర్ నుంచి కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మమతారెడ్డి ఇన్చార్జ్గా వ్యవహరించాల్సి ఉంది. ఆమె ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రానట్లు సమాచారం. అలాగే, ఉన్నతాధికారులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో డాక్టర్ మాధవరావు ఇన్చార్జ్ గా కొనసాగుతున్నారు. -
ఫారం–8దే హవా ‘సర్’
సాక్షి, వరంగల్: సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఓటర్ల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల సవరణలు, పేర్ల తొలగింపునకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జూన్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఫారం–6, 6ఏ, 7, 8 కలిపి 21,558 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా ఫారం–8 కింద 11,963 దరఖాస్తులు రావడం గమనార్హం. అంటే కొత్తగా ఓటర్లను చేర్చడం కంటే ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు, చిరునామా మార్పులు తదితర అవసరాలు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 కింద 9,221 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ తూర్పులోనే భారీగా.. వరంగల్ తూర్పులోనే అత్యధిక దరఖాస్తులు నమోదయ్యాయి. ఇక్కడ ఫారం–6 కింద 5,001, ఫారం–6ఏ కింద 50, ఫారం–7 కింద 182, ఫారం–8 కింద 7,126 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 12,359 దరఖాస్తులతో తూర్పు నియోజకవర్గం ముందంజలో ఉంది. వర్ధన్నపేటలో మొత్తం 6,353 దరఖాస్తులు, నర్సంపేటలో 2,846 దరఖాస్తులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఫారం–8లో తూర్పు నియోజకవర్గంలో వచ్చిన 7,126 దరఖాస్తులు.. నర్సంపేట, వర్ధన్నపేట రెండింటిలో వచ్చిన దరఖాస్తుల మొత్తానికి కూడా మించి రావడం గమనార్హం. ఏ దరఖాస్తులు ఎన్నంటే.. ● కొత్తగా ఓటరుగా నమోదయ్యేందుకు ఉపయోగించే ఫారం–6 కింద జిల్లాలో 9,221 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే తూర్పులో 5,001, వర్ధన్నపేటలో 2,929, నర్సంపేటలో 1,291 ఉన్నాయి. దరఖాస్తులు వచ్చిన సంఖ్యకు, ఇప్పటివరకు నమోదైనట్లు చూపిన ‘ఎన్రోల్ అప్డేటెడ్’ సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉంది. జిల్లా మొత్తంలో ఫారం–6 కింద వచ్చిన 9,221 దరఖాస్తుల్లో 190 మాత్రమే ఎన్రోల్ అప్డేటెడ్గా నమోదయ్యాయి. మిగిలిన దరఖాస్తులు పరిశీలన/ప్రాసెసింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ● విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం–6ఏ కింద 55 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో వరంగల్ తూర్పులో 50, నర్సంపేటలో 2, వర్ధన్నపేటలో 3 ఉన్నాయి. అయితే మూడు నియోజకవర్గాల్లోనూ ఫారం–6ఏ కింద ‘ఎన్రోల్ అప్డేటెడ్’గా ఒక్క దరఖాస్తు కూడా నమోదుకాలేదు. ●ఓటరు జాబితాలోని పేర్లపై అభ్యంతరం లేదా పేరును తొలగించేందుకు ఉపయోగించే ఫారం–7 కింద 319 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో తూర్పు 182, వర్ధన్నపేట 116, నర్సంపేట 21 ఉన్నాయి. వచ్చిన 319 దరఖాస్తుల్లో 238 దరఖాస్తులకు ‘ఎన్రోల్ డిలీటెడ్’గా నమోదైంది. అంటే మొత్తం ఫారం–7 దరఖాస్తుల్లో దాదాపు 74.6 శాతం మేరకు తొలగించారు. అభ్యంతరం, పరిశీలన, నోటీసులు, విచారణ వంటి ప్రక్రియ అనంతరం మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటున్నారు. ● ఓటరు వివరాల సవరణలు, చిరునామా మార్పులు, ఓటరు కార్డు సంబంధిత మార్పులు తదితర అవసరాలకు ఉపయోగించే ఫారం–8 కింద 11,963 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 501 దరఖాస్తులు ‘ఎన్రోల్ అప్డేటెడ్’గా నమోదయ్యాయి. నియోజకవర్గాల వారీగా వరంగల్ తూర్పులో 7,126, వర్ధన్నపేటలో 3,305, నర్సంపేటలో 1,532 దరఖాస్తులు రాగా.. తూర్పులో 216, వర్ధన్నపేటలో 210, నర్సంపేటలో 75 ఎన్రోల్ అప్డేటెడ్ అయ్యాయి. వివరాల సవరణకు 11,963 మంది దరఖాస్తులు కొత్త ఓటర్ల నమోదుకు 9,221.. పేర్ల తొలగింపునకు 319 అర్జీలు -
విద్యుత్ సరఫరా వ్యవస్థ పటిష్టానికి చర్యలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి గీసుకొండ/నర్సంపేట: విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసి నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. గీసుకొండలోని 33/11కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు, మెగా టెక్స్టైల్ పార్కు, నర్సంపేటలోని 132/33 కేవీ సబ్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధిక లోడ్ ఉన్న ఫీడర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్్స్ఫార్మర్లను గుర్తించి అవసరమైన చోట లోడ్ బ్యాలెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్య పెంపు, అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో విద్యుత్ డిమాండ్‌పై అధికారులతో సమీక్షించారు. ఎస్ఈ ఎ.ఆనందం, డీఈలు దానయ్య, తిరుపతి, ఏడీఈ రవి, ఇంజినీరింగ్ అధికారులు, ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
బాలల స్నేహపూర్వక నగరమే లక్ష్యం
వరంగల్ అర్బన్/ఖిలా వరంగల్ : చిన్నారులు, తల్లిదండ్రులు, కుటుంబాలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన, పచ్చదనంతో కూడిన ప్రజా ప్రదేశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నర్చరింగ్ నైయిబర్ హుడ్స్–2.0’సిటీ లెవల్ వర్క్‌షాప్‌ను గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేలా, తల్లిదండ్రులు ప్రశాంతంగా సమయం గడిపేలా నగరంలోని ప్రజా ప్రదేశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్కులు కేవలం వినోదానికి పరిమితం కాకుండా చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడే విధంగా రూపుదిద్దుకోవాలని సూచించారు. ఇప్పటికే సుమారు 20 ప్రాంతాల్లో పార్కులు, పైప్‌లైన్‌న్ తదితర మౌలిక సదుపాయాల పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ జోనా, ప్రోగ్రామ్ మేనేజర్ అరుణిమా సేన్, సీనియర్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ శబ్నా సీమాము, సుఫియాన్ఖాజీ, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, హర్టికల్చర్ ఆఫీసర్ ప్రశాంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్ పాల్గొన్నారు.గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న -
లో ఓల్టేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
● ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ● భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలోని సబ్స్టేషన్ల పరిశీలనభీమదేవరపల్లి/ఎల్కతుర్తి: వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరాఫరా చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరణ్ రెడ్డి అన్నారు. గురువారం భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలోని 132/33 కేవీ, 33/11కేవీ సబ్స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా తీరు, సబ్ స్టేషన్‌లోని పరికరాల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రెండు మండలాల పరిధిలోని పలు ప్రాంతాల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న లో ఓల్టేజీ, ఓల్టేజీ హెచ్చుతగ్గుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. లో ఓల్టేజీ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి లోడ్ బ్యాలెన్సింగ్ పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట్ల అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఫీడర్లపై లోడ్ పర్యవేక్షణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. సబ్ స్టేషన్‌లోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్ల నిర్వహణపై నిరంతరం నిఘా ఉంచాలని, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉంటూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ సామ్యానాయక్, ఏఈడీ వంశీ, ఏఈ సుధాకర్, లైన్మెన్ సంజీవ్, సంబంధిత ఏఈలు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. -
రాహుల్ అరెస్టు కేంద్ర నిరంకుశ వైఖరికి పరాకాష్ట
వరంగల్ చౌరస్తా: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం ఆందోళన చేస్తున్న రాహుల్‌గాంధీని అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఓటు చోరీ, రాహుల్ అరెస్ట్‌ను నిరసిస్తూ కొండా సురేఖ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్ చౌరస్తా నుంచి పోచం మైదాన్ జంక్షన్ వరకు పాదయాత్ర చేశారు. పోచంమైదాన్ జంక్షన్లో రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్ రాజ్, వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్లు జారతి రమేష్ కత్తెరశాల వేణుగోపాల్, ఎండీ ఫుర్కాన్, వస్కుల బాబు, బస్వరాజు కుమార్, బాలినే సురేష్, చింతాకుల అనిల్, ఎలగం లీలావతి సత్యనారాయణ, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, పల్లం పద్మ, కావేటి కవిత భోగి సువర్ణ సురేష్, బత్తిని వసుంధర, నాగపురి కల్పన సంజయ్ పాల్గొన్నారు.మాజీ మంత్రి కొండా సురేఖ -
ఆర్టీసీ ఎన్నికల్లో ముఖాముఖి పోటీ
హన్మకొండ: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో రెండు ఐక్య కూటమిల మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. నేడు (శుక్రవారం) ఉదయం 5నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్లు లెక్కిస్తారు. కానీ, ఫలితాలు అధికారికంగా వెల్లడించరు. అధికారికంగా ఎన్నికల ఫలితాల కోసం ఈనెల 17 వరకు వేచి చూడాలి. కాగా అనధికారికంగా ఫలితాలు కౌంటింగ్ ముగిసిన వెంటనే తెలిసే అవకాశముంది. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో 12 యూనియన్లు పోటీ ఉన్నాయి. వరంగల్ రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు ఉండగా 9 డిపోల్లో ఒక్కో బూత్, ఆర్ఎం కార్యాలయంలో మరోటి ఏర్పాటు చేశారు. నాలుగు యూనియన్లు బలంగా ఉండగా అశ్వత్థామరెడ్డి నేతృత్వంలోని టీఎంయూ (వర్గం) తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌గా ఎస్‌డబ్ల్యూఎఫ్ కలిసి ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయూ మరో ఐక్య కూటమిగా బరిలో నిలిచింది. ఎన్నికల్లో విజయం కోసం డిపోల వారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు, చివరగా రెండు ఐక్య కూటములు రీజియన్ స్థాయి బహిరంగ సభలు నిర్వహించి గెలిస్తే ఏం చేయబోతున్నామో చెప్పారు. కార్మికుల ముందు రెండు ఐక్య కూటములు మేనిఫెస్టోను ఉంచాయి. నమ్మి ఓట్లు వేయాలని కూటమిల నాయకత్వాలు అభ్యర్థించాయి. వరంగల్ రీజియన్‌లో ఇలా.. వరంగల్ రీజియన్‌లో ప్రధానంగా రెండు ఐక్య కూటముల మధ్య పోటీ నెలకొనగా తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూటమి నుంచి క్లాస్–3 (రాష్ట్ర), క్లాస్–6 (రీజియన్)కు తెలంగాణ వర్కర్స్ యూనియన్ బరిలో ఉంది. అదే విధంగా ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయూ కూటమి నుంచి క్లాస్–3లో ఎంప్లాయీస్ యూనియన్ పోటీలో ఉండగా, క్లాస్–6లో ఎన్ఎంయూ పోటీ చేస్తుంది. ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాస్–3, క్లాస్–6కు ఓటు వేయాలి. వరంగల్ రీజియన్‌లో జరుగనున్న ఎన్నికల్లో బ్యాలెట్లో 9 గుర్తులు మాత్రమే ఉంటాయి. ఐక్య కూటముల నేపథ్యంలో బ్యాలెట్లో గుర్తులు సంఖ్య తగ్గింది. దీంతో ఎన్నికల్లో 12 యూనియన్లు పోటీలో ఉన్న బ్యాలెట్లో మాత్రం 9 గుర్తులు మాత్రమే కనిపిస్తాయి. పోలింగ్ సామగ్రి పంపిణీ.. పోలింగ్ నేపథ్యంలో గురువారం పోలింగ్ సామగ్రిని తీసుకుని సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పటికే అధికారులు పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల పకడ్బందీగా జరిగేలా కార్మిక శాఖ అన్ని చర్యలు తీసుకుంది. కార్మికుల మద్దతు కోసం చివరి వరకు యత్నం గెలుపే లక్ష్యంగా యూనియన్ నాయకులు ప్రతీ కార్మికుడిని స్వయంగా కలిసి తమకే ఓటు వేయాలని కోరారు. ప్రచారం ముగియడంతో పోటీలో ఉన్న యూనియన్ నాయకులు పోలింగ్‌పై దృష్టి సారించారు. కార్మికులు ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోను చివరి ప్రయత్వం చేయాలనే ఆలో చనలో నాయకులున్నారు. రెండూ కూటమలు తమదే గెలుపన్న విశ్వాసంతో ఉన్నాయి. మెజారిటీ కోసమే తమ తాపత్రయమని నాయకులు చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలోని కూటమికి అధికా ర కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలోని ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నేతృత్వంలోని కూటమి తరఫున ఆ కూటమిలోని యూనియన్ల నాయకులు మాత్రమే ప్రచారం చేశారు. టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి, ఈయూ, ఎన్ఎంయూ కూటమి మధ్యపోరు హోరాహోరీగా సాగిన ప్రచారం పోలింగ్‌పై దృష్టి సారించిన యూనియన్లు నేడే పోలింగ్.. అన్ని ఏర్పాట్లు పూర్తి -
నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకం
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో బహుళ త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోష కాలంలో నందీశ్వరుడికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం గర్భాలయంలో రుద్రుడికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలంలో శ్రీమల్లికార్జున స్వామి గర్భాలయానికి ఎదురుగా ప్రతిష్ఠితమైన నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకించారు. నందీశ్వరుడికి వస్త్రధారణ చేసి, ధూపం వేసి గంధం బొట్టుపెట్టి అలంకరించారు. వేదోక్తంగా పూజించి పండ్లు ఫలాలతో నైవేద్యం సమర్పించారు. శనిగల ప్రసాదం నందీశ్వరుడి మూతికి కట్టి, వడమాలను మెడలో వేసి సమర్పించారు. అనంతరం ఏక కాలంలో నందీశ్వరుడికి, గర్భాలయంలో రుద్రుడికి నక్షత్ర హారతి సమర్పణ కార్యక్రమం కనుల పండువగా జరిపించారు. ఆర్జిత సేవా టికెట్ భక్తులకు తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ సుధాకర్, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, వేద పారాయణదారులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ, సాయివరుణ్, మణిశర్మ, అర్చక సిబ్బంది పాల్గొన్నారు. -
11నుంచి శ్రీభద్రకాళిదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 21 వరకు శ్రీభద్రకాళిదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాల వితరణ, సాయంత్రం 5నుంచి రాత్రి 9గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 17వతేదీ అమ్మవారికి రథోత్సవం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.కోటి వ్యయంతో దారుమయ (టేకు) రథాన్ని దారుశిల్పులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ రోజూ ప్రాతఃకాల పూజలు, అర్చనలు, వివిధ క్రమాలలో అమ్మవారిని అలంకరించి విశేషసేవలు నిర్వహిస్తామని తెలిపారు. కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో గత రెండునెలల నుంచి సీబీపీ టెస్ట్‌లు బంద్ కావడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆఽశ్రయిస్తున్నారు. అదేవిధంగా ఆర్ఎఫ్టీ, ఎస్‌ఎల్‌ఈ, ఈస్ఆర్ టెస్ట్‌లు కూడా చేయకపోవడంతో రోగులు గత్యంతరం లేక ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లక తప్పడం లేదు. ఇదే క్రమంలో థైరాయిడ్‌తో పాటు ఇంకా కొన్నిరకాల పరీక్ష ష్యాంపిల్స్ తీసుకుని హనుమకొండలోని టీడయాగ్నొస్టిక్ సెంటర్‌కు పరీక్షల కోసం పంపితే అక్కడినుంచి రిపోర్టులు రావడంతో ఆలస్యం కావడంతో పేషంట్లకు చికిత్స సరిగా అందని పరిస్థితి నెలకొంది. ఈ రిపోర్టుల కోసం సదరు పేషంట్లు రెండు, మూడు రోజులు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. నిరుపేదలే ఎక్కువగా ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు. అలాంటి వారికి డబ్బులు పెట్టి ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకోవడం భారంగా మారింది. అధికారులు అన్ని రకాల పరీక్షలు ఇక్కడే చేయించి, సకాలంలో రిపోర్టులు ఇప్పించాలని కోరుతున్నారు. హన్మకొండ చౌరస్తా: పోలీస్ శాఖ ప్రతిష్ట గస్తీ విధులు నిర్వహించే సిబ్బంది పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం హనుమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై ప్రతీ సిబ్బంది తమకు అప్పగించిన విధులను అంకితభావం, క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని హితవు పలికారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మామిడి మొక్క నాటారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహరావు, ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌తో ఓ విద్యార్థి వాగ్వాదం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్ తన పదవికి గురువారం రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సీపీగెట్–2026 ద్వారా పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సీట్లు లభించిన అభ్యర్థులు ప్రిన్సిపాల్ కార్యాలయంలో రిపోర్టు చేస్తున్నారు. గురువారం ఓ విద్యార్థి.. ప్రిన్సిపాల్ మనోహర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు. దీంతో మనస్తాపానికి గురైన మనోహర్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వర్తించబోనని రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిసి రాజీనామా లేఖ అందజేసినట్లు తెలిసింది. గొడవ ఎందుకు జరిగిందనే విషయం కూడా వివరంగా తెలిపినట్లు సమాచారం. ఆయన రాజీనా మా ను అఽధికారులు ఆమోదిస్తారా లేక నచ్చజెప్పి కొనసాగిస్తారా అనేది ఒకటిరెండు రోజుల్లో తెలియనుంది. అడ్మిషన్లు జరుగుతున్న కీలక సమయంలో రాజీనామా నిర్ణయం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
వైద్యసేవలు, వసతులు మెరుగ్గా ఉండాలి
● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశం ● పరకాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి తనిఖీపరకాల: పరకాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు, వసతులు మెరుగ్గా ఉండాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. గురువారం పరకాలలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యసేవలతో పాటు వివిధ విభాగాల్లో వసతులను పరిశీలించారు. జనరల్ మేల్, ఫిమేల్వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పక్కనే నిర్మితమవుతున్న భవనాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయా విభాగాల పేర్లను సూచించే విధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ కృష్ణను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఎంలు డాక్టర్ నారాయణ, డాక్టర్ బాలకృష్ణ, పరకాల మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఆర్టీఓ డీఎస్ వెంకన్న, టీజీ ఎంఎస్ఐడీసీ నందు పటేల్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఆర్‌అండ్‌టీ డీఈ లోరిన, అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ఆక్రమణలపై కలెక్టర్ సీరియస్ హసన్‌పర్తి: ప్రధాన రహదారి వెంట ఫుట్‌పాత్‌లను కబ్జా చేసుకోవడంపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సీరియసయ్యారు. ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మూడు రోజుల్లో వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. గురువారం బల్దియా కమిషనర్ వెంకన్నతో కలిసి గోపాలపురం కల్లుమండువా, జంక్షన్, చింతగట్టు క్యాంప్, రామారం, కాకతీయ యూనివర్సిటీ రెండో గేట్, భీమారం ప్రాంతాలను సందర్శించారు. రోడ్డు పరిస్థితి, ట్రాఫిక్ నిర్వహణ, ఆక్రమణలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రహదారులకు ఇరువైపులా బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, డబ్బాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ సీరియసయ్యారు. ఆయా ప్రాంతాల్లో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి వెంట ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తడంతోపాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు పనులు సత్వరం చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద పరిశుభ్రత పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. డివైడర్లు, మీడియంల మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ రాజారెడ్డి, ఎస్ఈ రాజ్‌కుమార్, అధికారులు లక్ష్మారెడ్డి, రవీందర్, శంకర్, ఈవికుమార్ పాల్గొన్నారు. -
ఓటర్ల సవరణలో జోరు!
ఠిసాక్షిప్రతినిధి, వరంగల్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊపందుకుంది. కొత్తగా పేర్లు చేర్చడం, పేర్లు తొలగించడం, చిరునామాలు మార్చడం, తప్పులను సరిచేయడం తదితర అంశాలపై ప్రజలనుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. జూన్ 15 నుంచి బుధవారం వరకు ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల పరిధిలో 62,500కు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటివరకు వేలాది దరఖాస్తులపై అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు 24,832 దరఖాస్తులు వచ్చాయి. పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల సవరణకు ఏకంగా 35,425 దరఖాస్తులు అందడం గమనార్హం. అనర్హుల పేర్ల తొలగింపు, అభ్యంతరాల కోసం 2,100 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 962 పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటర్ల నమోదుకు 140 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల విషయంలో వరంగల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ కొత్త ఓటర్ల నమోదుకు 9,221, విదేశీ ఓటర్ల నమోదుకు 55, పేర్ల తొలగింపునకు 319, వివరాల సవరణకు 11,963 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 21,558 దరఖాస్తులు అందాయి. తుది జాబితాపై ఆసక్తి.. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. తదుపరి దశలో అర్హత లేని దరఖాస్తులను తిరస్కరించడం, అభ్యంతరాలపై విచారణ, అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం వంటి ప్రక్రియలు జరగనున్నాయి. ఈ నెల 7 వరకు విడుదలైన ఈ నివేదికలో ఎన్ని నోటీసులు జారీ చేశారు? ఎన్ని దరఖాస్తులను తిరస్కరించారు? ఎన్ని దరఖాస్తులు తుది పరిష్కారం పొందాయి? సవరణ అనంతరం మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతకు చేరింది? అనే వివరాలను ప్రత్యేకంగా వెల్లడించలేదు. ఈ గణాంకాలు వెలువడితే ఉమ్మడి వరంగల్‌లో కొత్తగా చేరిన ఓటర్లు ఎంతమంది.. తొలగించిన ఓటర్లు ఎంతమంది.. వివరాలు సరిచేసుకున్న వారు ఎంతమంది.. తిరస్కరణకు గురైన దరఖాస్తులు ఎన్ని.. అనే పూర్తి చిత్రంపై స్పష్టత రానుంది. కొత్తగా ఓటర్ల నమోదు దరఖాస్తులు ఇలా 6,750 మహబూబాబాద్భూపాలపల్లి4,096ములుగుహనుమకొండజనగామ1,966 1,5851,214ఉమ్మడి వరంగల్‌లో 62,500 దరఖాస్తులు కొత్త ఓటర్ల నమోదుకు 24,832.. పేర్ల సవరణకు 35,425 తొలగింపునకు 2,100 దరఖాస్తులు.. 962 పేర్లు తొలగింపు అత్యధికంగా వరంగల్‌లో 21 వేలకు పైగా దరఖాస్తులుపేర్ల తొలగింపు దరఖాస్తులో హనుమకొండ జిల్లా ముందంజ.. పేర్ల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో హనుమకొండ జిల్లా ముందుంది. ఇక్కడ 1,281 దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 558 పేర్లు తొలగించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను సరిచేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులే అత్యధికంగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌లో 35,425 దరఖాస్తులు రావడం ఇందుకు నిదర్శనం. వీటిలో 5,811 దరఖాస్తులపై సవరణలు పూర్తయ్యాయి. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉమ్మడి జిల్లాలో 24,832 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 457 దరఖాస్తుల వివరాలు ఓటర్ల జాబితాలో నవీకరించారు. నియోజకవర్గం కొత్త తొలగింపు వివరాల ఓటర్లు సవరణవరంగల్ పశ్చిమ 5,564 866 6,723 పరకాల 1,186 415 1,835 నర్సంపేట 1,291 21 1,532 వరంగల్ తూర్పు 5,001 182 7,126 వర్ధన్నపేట 2,929 116 3,305 జనగామ 1,453 47 3,046 స్టేషన్‌ఘన్‌పూర్ 1,429 38 2,362 పాలకుర్తి 1,214 13 2,132 డోర్నకల్ 836 14 1,392 మహబూబాబాద్ 1,130 37 1,993 భూపాలపల్లి 1,585 261 2,004 ములుగు 1,214 90 1,975 -
గురువారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ప్రతీ ఓటరుకు రెండు ఓట్లు..● ప్రతీ ఓటరు (కార్మికుడు) రెండు ఓట్లు వేయాలి. క్లాస్–3 (రాష్ట్ర), క్లాస్–6 (రీజియన్)కు వేర్వేరుగా ఓట్లు వేయాల్సి ఉంటుంది. ● డ్యూటీలో ఉండి 9న పోలింగ్‌లో పాల్గొనే అవకాశం లేని కార్మికులకు ఈ నెల 15, 16 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. ● పోలింగ్ కోసం మొత్తం 39 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 10 మంది ప్రిసైడింగ్ అధికారులుండగా, మిగతా వారిలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. ● పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహిస్తారు. కానీ, ఫలితాలు అధికారికంగా విడుదల చేయరు. ● పోస్టల్ బ్యాలెట్‌ను ఈనెల 15, 16 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డిపోలో కేటాయించిన బాక్స్‌లో వేయాలి. ● వీటిని ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ చేస్తారు. తుది ఫలితాలు 17న ప్రకటిస్తారు. హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలకు వరంగల్ రీజియన్ పరిధిలో కార్మికశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 9న ఉదయం 5నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 3,042 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే డిపోల వారీగా, రీజినల్ మేనేజర్ కార్యాలయంలో పోలింగ్ బూత్‌లు గుర్తించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. బ్యాలెట్స్ బాక్స్‌లు సమకూర్చుకోవడంతో పాటు బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. నేడు (గురువారం) హనుమకొండలోని జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయనున్నారు. పోలింగ్ పర్యవేక్షకులుగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు మహబూబాబాద్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకట్‌రెడ్డి మహబూబాబాద్, భూపాలపల్లి, తొర్రూరు డిపోల్లోని పోలింగ్ స్టేషన్లను, వరంగల్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ భార్గవ్ వరంగల్–1, వరంగల్–2 హనుమకొండ, ఆర్ఎం ఆఫీస్, జనగామ, పరకాల, నర్సపేట, పరకాల డిపోల్లోని పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షిస్తారు. ముగిసిన ఎన్నికల ప్రచారం.. టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. ఈనెల 18న కార్మిక శాఖ గుర్తింపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటినుంచి యూనియన్లు ఎన్నికల ప్రచారం చేపట్టాయి. కార్మిక యూనియన్ ప్రధాన సంఘాలతోపాటు ఆయా పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల రాష్ట్ర, రీజియన్ నాయకులు డిపోల వారీగా ప్రచారం నిర్వహించారు. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డారు. చివరగా ఈ నెల 6న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి బహిరంగ సభ నిర్వహించగా, ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయూ, టీఎంయూ ఐక్య కూటమి బుధవారం బహిరంగ సభ నిర్వహించింది. కార్మికులకు ఏమేం చేస్తామో వివరించాయి. వరంగల్ రీజియన్‌లో రెండు ఐక్య కూటమిల మధ్య ముఖాముఖి పోటీ నెలకొనగా ఓటర్ల మద్దతు పొందేందుకు తీవ్రంగా శ్రమించాయి. విజయంపై ఎవరికివారు ధీమాతో ఉన్నారు. ఏర్పాట్లు పూర్తిచేసిన కార్మికశాఖ ముగిసిన ఎన్నికల ప్రచారం వరంగల్ రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు 9 డిపోల్లో ఒక్కో బూత్, ఆర్ఎం కార్యాలయంలో మరొకటి ఏర్పాటు 39మంది పోలింగ్ సిబ్బంది నియామకండిపోల వారీగా ఓటర్లు ఇలా.. -
ఎంపీపీఎస్ నిధుల దుర్వినియోగం
కాళోజీ సెంటర్: ఖానాపురం మండలం పెద్దమ్మగడ్డలోని ఎంపీపీఎస్ నిధుల దుర్వినియోగం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులు లేకపోవడంతో ఆ పాఠశాల మూతపడింది. దీంతో గతంలో పనిచేసిన ఎస్జీటీ యాకయ్య పాఠశాల నిర్వహణ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానిక స్కూల్ మేనేజ్మెంట్ (ఎస్ఎంసీ) కమిటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, ఆ నిధులను తన భార్య (మాజీ ఎంఈఓ) బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. ఎంఈఓ, ఎంపీడీఓ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అవినీతి నిజమేనని తేలుస్తూ డీఈఓ కార్యాలయానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా టీచర్ యాకయ్యను జూలైలో సస్పెండ్ చేశారు. ప్రభుత్వ సొమ్మును తన వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకున్న సదరు ఉపాధ్యాయుడి భార్య (మాజీ ఎంఈఓ)పై చర్యలు తీసుకోవడంలో మాత్రం విద్యాశాఖ తీవ్ర కాలయాపన చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఫైల్‌ను వెనక్కి పంపించిన ఆర్జేడీ ఆఫీస్.. ఆమైపె క్రమశిక్షణ చర్యల నిమిత్తం డీఈఓ కార్యాలయం నుంచి డీఈఓ రంగయ్యనాయుడు ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకుల (ఆర్జేడీ) కార్యాలయానికి ఫైల్ పంపించారు. నివేదిక సమగ్రంగా లేదంటూ ఆర్జేడీ కార్యాలయం ఆ ఫైల్‌ను వెనక్కి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ ఎంఈఓపై వచ్చిన నిధుల దుర్వినియోగం అభియోగంపై 2026 జూన్‌లో డీఈఓకు అప్పటి ఎంపీడీఓ, ఎంఈఓ నివేదిక సమర్పించారు. నివేదిక సమగ్రంగా లేదని విద్యాశాఖ ఆర్జేడీ వెనక్కి పంపించారు. సమగ్ర రిపోర్టు ఇవ్వాలని సూచించారు. దీంతో ఖానాపురం ఎంఈఓ చరణ్‌సింగ్, నర్సంపేట ఎంఈఓ సారయ్యను విచారణ అధికారులుగా నియమించారు. వారు కూడా రిపోర్టు అందజేసి సుమారు మూడు నెలలు అవుతోంది. డీఈఓ కార్యాలయంలోనే సంబంధించిన ఫైల్ కదలకుండా ఉంది. పాఠశాల నిధులు దుర్వినియోగమయ్యాయని మాజీ ఎంఈఓ భర్త యాకయ్యను జూలై 1న సస్పెండ్ చేశారు. ఈ విషయంపై ‘భర్తపై సస్పెన్షన్ వేటు.. భార్య సంగతేంటి’? శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అప్పటి ఎంఈఓ చరణ్‌సింగ్ డైట్ కళాశాలకు బదిలీ కాగా.. నర్సంపేట ఎంఈఓ సారయ్య ఉద్యోగ విరమణ చేశాడు. మాజీ ఎంఈఓపై విచారణ పేరుతో కాలయాపన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోనే ఫైల్సమగ్ర రిపోర్టు ఇవ్వలేదుఖానాపురం మాజీ ఎంఈఓపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ అధికారులను నియమించగా సమగ్ర రిపోర్టు ఇవ్వలేదని ఆర్జేడీ వెనక్కి పంపారు. తిరిగి మరో ఇద్దరు అధికారులను కూడా నియమించాం. వారు కూడా పూర్తి రిపోర్టు ఇవ్వ కుండా అన్ని జిరాక్స్ కాపీలు అందజేశారు. ఆ ఫైల్ చూడడానికి కొంత సమయం పడుతుంది. – బి.రంగయ్యనాయుడు, డీఈఓ -
‘పే నౌ’ నొక్కినా.. నో పేమెంట్!
సాక్షి, వరంగల్: వైద్య విద్యలో ఒక్కో సర్టిఫికెట్ విద్యార్థి భవిష్యత్‌కు కీలకమైన పత్రం. చదువు పూర్తయిన తర్వాత మరో యూనివర్సిటీలో చేరాలన్నా.. ఉన్నత విద్యకు వెళ్లాలన్నా.. విదేశీ విద్యకు దరఖాస్తు చేయాలన్నా.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నా మైగ్రేషన్, ట్రాన్ స్క్రిప్ట్ ధ్రువపత్రాలు అవసరం. అలాంటి పత్రాలను సకాలంలో అందించాల్సిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆన్లైన్ సర్టిఫికెట్ సేవల్లో సాంకేతిక సమస్యలు విద్యార్థులకు తలనొప్పిగా మారుతున్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో.. ‘పే నౌ’ అని చూపిస్తున్నా చెల్లింపు మాత్రం పూర్తవకపోవడంతో సర్టిఫికెట్ ప్రక్రియ అక్కడే నిలి చిపోతోంది. దీంతో దూరప్రాంతాల విద్యార్థులు ఆన్లైన్ కావడం లేదని వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులతోపాటు, కెరీర్ ఏమైపోతుందోనన్న తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ‘పే నౌ’ నొక్కితే.. ఎర్రర్ మెసేజ్ సర్టిఫికెట్ల కోసం ఫీజులు చెల్లించేందుకు ‘పే నౌ’పై క్లిక్ చేస్తే ‘‘ఆర్డర్ అమౌంట్ లెస్ దెన్ మినిమమ్ అమౌంట్ అలవుడ్’’ అనే సందేశం కనిపిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో చెల్లింపులు పూర్తికావడం లేదు. మరోవైపు దరఖాస్తుల స్టేటస్ మారకపోవడంతోనే ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చెల్లింపు చేయాల్సిన విద్యార్థికి పేమెంట్ గేట్ వే పనిచేయకపోతే.. ఆ లోపానికి విద్యార్థి ఎందుకు మూల్యం చెల్లించాలి? సాంకేతిక సమస్యను యూనివర్సిటీ గుర్తించి సరిచేసే వ్యవస్థ ఉందా? ‘పెండింగ్’ దరఖాస్తులను అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారా? అత్యవసరంగా సర్టిఫికెట్ కావాల్సిన విద్యార్థికి ప్రత్యామ్నాయ మార్గం చూపుతున్నారా? అన్న దానిపై సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రూ.0గా చూపుతున్న చార్జీ.. అసలు ఫీజెంత? విద్యార్థులు సమర్పించిన మరో రిక్వెస్ట్ డాక్యుమెంట్లో టోటల్ చార్జ్ రూ.0గా కనిపిస్తోంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ నంబర్లు కూడా నమోదు కావడంలేదు. యూనివర్సిటీకి సంబంధించిన 2026 నోటిఫికేషన్లలో మాత్రం ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికెట్ ఫీజు రూ.2వేలుగా, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఫీజుకు రూ.500 గా అధికారులు పేర్కొన్నారు. కోర్సు, సర్టిఫికెట్, దరఖాస్తును బట్టి ఫీజు మారవచ్చు. అసలు ఫీజు చెల్లించాల్సిన చోట ‘రూ.0’గా ఆర్డర్ అమౌంట్ ఏర్పడితేనే ‘మినిమమ్ అమౌంట్’ ఎర్రర్ వస్తుందా? పేమెంట్ గేట్‌వేలో సమస్యా? లేక సర్టిఫికెట్ మాడ్యూల్లో ఫీజు మ్యాపింగ్ లోపమా? ఇది అధికారులు తేల్చాల్సి ఉంది. హెల్ప్‌డెస్క్ ఉన్నా అంతంతే... కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలో 23,500మందికిపైగా విద్యార్థులున్నారు. వీరి కోసం మైగ్రేషన్, ట్రాన్ స్రిప్ట్ గైడ్, సర్టిఫికెట్ దరఖాస్తు సేవలు, ఆన్లైన్ పేమెంట్ ప్రక్రియకు మార్గదర్శకాలను కూడా యూనివర్సిటీ అందుబాటులో ఉంచింది. ఇంత పెద్ద వ్యవస్థలో ఒక్కో సర్టిఫికెట్ దరఖాస్తు ఎక్కడ ఆగిపోయిందో గుర్తించే ‘ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్’ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తోంది? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. హెల్ప్‌డెస్క్ నంబర్లకు ఫోన్ చేసినా సాంకేతిక బృందం పరిశీలిస్తోందనే కాలయాపన సమాధానాలే తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఈ మెయిల్ ఉన్నా విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్న ఆరోపణలున్నాయి. సాంకేతిక సమస్యలపై మాట్లాడేందుకు అధికారులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. బీడీఎస్ విద్యార్థి లావణ్య 2026, ఆగస్టు 24న సాయంత్రం 4.34 గంటలకు మైగ్రేషన్ న్యూ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. పోర్టల్‌లో అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్ 2026/29630గా నమోదైంది. ఒక కాపీ కావాలని పేర్కొన్నారు. అక్టోబర్ 5 నాటికీ ఈ దరఖాస్తు పెండింగ్గానే ఉంది. పేమెంట్ స్టేటస్ అన్ పెయిడ్‌గా కనిపిస్తోంది. అదేరోజూ ట్రాన్స్క్రిప్ట్ కోసం కూడా దరఖాస్తు చేశారు. దీనికి 2026/91314 అప్లికేషన్ నంబర్ ఉంది. ఇది కూడా పెండింగ్ ఉండడం గమనార్హం. అంటే దాదాపు 44 రోజులవుతోంది. కాళోజీ వర్సిటీలో మైగ్రేషన్, ట్రాన్స్క్రిప్ట్ దరఖాస్తులు పెండింగ్‌లోనే రూ.0గా చూపిస్తున్న ఆర్డర్ అమౌంట్.. ‘మినిమమ్ అమౌంట్’ ఎర్రర్ నెలల తరబడి సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల ఎదురుచూపులు, సాంకేతిక లోపంతో తిప్పలు -
ప్రాజెక్టుల పనులపై సమీక్ష
న్యూశాయంపేట: నీటి పారుదల, రైల్వే ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి, రాష్ట్రంలోని ప్రగతి, పీఎంజీ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై బుధవారం ఢిల్లీ నుంచి భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియేట్ కార్యదర్శి మనోజ్ గోవిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు హైదరాబాద్ నుంచి, కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. టీజీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా మమతనెక్కొండ: మండల కేంద్రంలోని టీజీ గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్‌గా మమతకు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని గురుకుల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ యాసం లావణ్య బుధవారం తెలిపారు. టీచర్ రజిని విద్యార్థినులను విచక్షణ రహితంగా దండించిన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిపిందే. అలాగే, విధుల్లో నిర్లక్ష్యం వహించడం కారణంగా ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి శ్రీదేవిని తప్పించి మమతకు అప్పగించారని ఆమె పేర్కొన్నారు. నేడు ఆయిల్‌పామ్ రైతులకు అవగాహన సదస్సుగీసుకొండ: కొనాయమాకులలోని పీడీఆర్ గార్డెన్స్‌లో గురువారం ఆయిల్‌పామ్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆయిల్‌పామ్ రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నంద్యాల కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. సదస్సుకు ఐసీఏఆర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎంవీ ప్రసాద్, డీహెచ్ఎస్ఓ ఆర్.శ్రీనివాస్‌రావు, శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ఆర్ రాజు హాజరవుతారని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ సాగు, రైతుల సమస్యలు, సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అసోసియేషన్ జిల్లా కోశాధికారి బాబురావు, గీసుకొండ మండల కమిటీ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి పాల్గొన్నారు. శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషినర్సంపేట: ప్రజల్లో శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి జనవిజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేస్తుందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర పరిశీలకుడు శ్రీనాథ్ అన్నారు. పట్టణంలోని సదాశివహాల్లో బుధవారం జనవిజ్ఞాన వేదిక జిల్లా ఆరో మహా సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ సాధించిన ఫలితాలు, శాస్త్రజ్ఞులు కనుగొన్న వివిధ శాసీ్త్రయ పరిశోధనలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని సూచించారు. బాలబాలికల్లో శాసీ్త్రయ అవగాహన పెంపొందించడం కోసం, మూఢ నమ్మకాలకు దూరంగా, అవసరమైన కనీస పరిజ్ఞానాన్ని అందించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్‌లో చెకుముకి పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈనెల 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ వీఎం జయుడు, ఐ.రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడిగా గుగులోత్ సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా పాక శ్రీనివాస్, కోశాధికారిగా బూరుగు నవీన్, ఉపాధ్యక్షులుగా వి.మాధవి, వి.శ్యాం, పాల కుమారస్వామి, కార్యదర్శులుగా సమ్మెట సురేశ్, పెరుమాండ్ల కుమార్‌రెడ్డి, ఆర్.సంతోష్‌కుమార్, సబ్ కమిటీల కన్వీనర్లుగా డాక్టర్ బి.శంకర్, చాగంటి యాకయ్య, వి.మాధవి, మోతె ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ పెండెం భాస్కర్, ఎండీ రాయబోస్, ఎల్.కిష్టయ్య, కె.నీలాద్రి, వి.మాధవరెడ్డి ఎన్నికయ్యారు. మార్కెట్‌కు రెండు రోజులు సెలవుఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10న అమావాస్య, 11న వారాంతపు సెలవు కావడంతో యార్డు బంద్ ఉండనుందని పేర్కొన్నారు. మార్కెట్ తిరిగి 12వ తేదీన పునఃప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు తేదీలను గమనించాలని, సెలవుల్లో మార్కెట్‌కు సరుకులు తేవొద్దని ఆమె కోరారు. -
రాహుల్ అరెస్టుపై భగ్గుమన్న అఖిలపక్షం
కాశిబుగ్గ: రాహుల్ గాంఽధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనమని, ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పోచమ్మ మైదాన్ నుంచి కాశిబుగ్గ సెంటర్ వరకు సాగిన పాదయాత్రలో పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం కాశిబుగ్గలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ. ఓటు హక్కు రక్షణ కోసం, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బాస్మియా, ఎస్‌యూసీఐ(సీ) నాయకుడు అడ్డుల సత్యనారాయణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు నవీద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేశ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ చైర్మన్లు చిలువేరు శ్రీనివాస్, రవీందర్ నాయక్, ఓర్సు తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కరుణాటి పార్వతమ్మ, నాయకులు అబ్బిడి రాజిరెడ్డి, పిన్నింటి అనిల్‌రావు, అత్తి కుమారస్వామి, ఇస్లావత్ సావిత్రి, పోశాల వెంకన్న, దాడి శివ, రవికుమార్, ఈగ దామోదర్, జన్ను అరుణార్, మహ్మద్ జానీ పాల్గొన్నారు. -
రేపు ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల పోలింగ్
పోలింగ్ ఇలా..హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలకు వరంగల్ రీజియన్ పరిధిలో కార్మికశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 9న ఉదయం 5నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 3,042 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే డిపోల వారీ గా, రీజినల్ మేనేజర్ కార్యాలయంలో పోలింగ్ బూ త్లు గుర్తించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. బ్యాలెట్స్ బాక్స్‌లు సమకూర్చుకోవడంతో పాటు బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. నేడు (గురువారం) హనుమకొండలోని జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయనున్నారు. పోలింగ్ పర్యవేక్షకులుగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు మహబూబాబాద్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకట్‌రెడ్డి మహబూబాబాద్, భూపాలపల్లి, తొర్రూరు డిపోల్లోని పోలింగ్ స్టేషన్లను, వరంగల్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ భార్గవ్ వరంగల్–1, వరంగల్–2 హనుమకొండ, ఆర్ఎం ఆఫీస్, జనగామ, పరకాల, నర్సపేట, పరకాల డిపోల్లోని పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షిస్తారు. ప్రతీ ఓటరుకు రెండు ఓట్లు.. ● ప్రతీ ఓటరు (కార్మికుడు) రెండు ఓట్లు వేయాలి. క్లాస్–3 (రాష్ట్ర), క్లాస్–6 (రీజియన్)కు వేర్వేరుగా ఓట్లు వేయాల్సి ఉంటుంది. ● డ్యూటీలో ఉండి 9న పోలింగ్‌లో పాల్గొనే అవకాశం లేని కార్మికులకు ఈ నెల 15, 16 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. ● పోలింగ్ కోసం మొత్తం 39 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 10 మంది ప్రిసైడింగ్ అధికారులుండగా, మిగతా వారిలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. ● పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహిస్తారు. కానీ, ఫలితాలు అధికారికంగా విడుదల చేయరు. ● పోస్టల్ బ్యాలెట్‌ను ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డిపోలో కేటాయించిన బాక్స్‌లో వేయాలి. ● వీటిని ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ చేస్తారు. తుది ఫలితాలు 17న ప్రకటిస్తారు. ముగిసిన ఎన్నికల ప్రచారం... టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. ఈ నెల 18న కార్మిక శాఖ గుర్తింపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటినుంచి యూనియన్లు ఎన్నికల ప్రచారం చేపట్టాయి. కార్మిక యూనియన్ ప్రధాన సంఘాలతోపాటు ఆయా పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల రాష్ట్ర, రీజియన్ నాయకులు డిపోల వారీగా ప్రచారం నిర్వహించారు. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డారు. చివరగా ఈ నెల 6న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూని యన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి బహిరంగ సభ నిర్వహించగా, ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయూ, టీఎంయూ ఐక్య కూటమి బుధవారం బహిరంగ సభ నిర్వహించింది. కార్మికులకు ఏమేమి చేస్తామో వివరించాయి. వరంగల్ రీజియన్‌లో రెండు ఐక్య కూటమిల మధ్య ముఖాముఖి పోటీ నెలకొనగా ఓటర్ల మద్దతు పొందేందుకు తీవ్రంగా శ్రమించాయి. విజయంపై ఎవరికివారు ధీమాతో ఉన్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన కార్మికశాఖ ముగిసిన ఎన్నికల ప్రచారం వరంగల్ రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు 9 డిపోల్లో ఒక్కో బూత్, ఆర్ఎం కార్యాలయంలో మరొకటి ఏర్పాటు 39మంది పోలింగ్ సిబ్బంది నియామకం -
సమన్వయంతో ఉత్సవాలకు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: జిల్లాలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు వేయిస్తంభాల గుడిలో, సద్దుల బతుకమ్మ పద్మాక్షమ్మ ఆలయంలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, పరకాల, హనుమకొండ ఆర్డీఓలు వెంకన్న, వెంకటేశ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, వివిధ శాఖల అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. సీఎం పర్యటనలోగా సమస్యలన్నీ పరిష్కరించాలి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చేలోగా క్షేత్రస్థాయిలో ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి దేవాలయ మాడవీధుల పనులను అధికారులు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. భూసేకరణ విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల వల్ల ఇళ్లు, స్థలాలు కోల్పోయిన అర్హులను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వారు ఖాళీ చేసిన ఇళ్లు, స్థలాల్లోకి ఇతరులు ప్రవేశించి తమకూ ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కొందరు కోర్టులకు వెళ్లి తప్పుడు నంబర్లు చూపిస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇలాంటివారిపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోర్టు విషయాల్లో సీనియర్ న్యాయవాదులను నియమించుకుని ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగొద్దు వరంగల్ అర్బన్: సద్దుల బతుకమ్మ, దసరా పర్వదినాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న సూచించారు. బుధవారం హనుమకొండలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత విభాగాల అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, డీఎఫ్ఓ శంకర్లింగం, ఎస్ఎఫ్ఓ రాజేశ్వరరావు, ఈఈలు రవికుమార్, సంజయ్‌కుమార్, మహేందర్, ఎంటమాలజిస్ట్ రజని పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ -
రీసర్వేతో భూసమస్యల పరిష్కారం
సంగెం: భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రీసర్వేను చేపట్టినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ లక్కినేని కిశోర్‌కుమార్ అన్నారు. వెంకటాపూర్‌లో భూముల రీసర్వేపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ సుమారు 125 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, తిరిగి ఇపుడు రీసర్వే చేపట్టినట్లు వివరించా. రీసర్వేలో భాగంగా జపాన్ టెక్నాలజీతో అధునాతనమైన రోవర్ల ద్వారా ఒక అంగుళం భూమి కూడా తేడా లేకుండా కొలతలు వేసి హద్దులు నిర్ణయిస్తారన్నారు. రైతులు తమ పట్టాపాస్ పుస్తకాల ఆధారంగా తమ వద్ద ఉన్న వివరాలను ఇవ్వాలని కోరారు. దాని ప్రకారం సర్వే చేపట్టి భూ రికార్డులను పరిశీలించి సర్వే వివరాలను నమోదు చేస్తారన్నారు. రైతులకు ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. రీసర్వే పూర్తయిన అనంతరం ప్రతీ రైతు భూమికి సంబంధించిన మ్యాప్, భూదార్ నంబర్‌ను కేటాయిస్తారని వివరించారు. గ్రామంలోని 182 సర్వే నంబర్లలో 1065.26 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో 17 సర్వే నంబర్లలో 237.30 ఎకరాలు ప్రభుత్వ భూమి, 827.36 ఎకరాల పట్టా భూమి ఉందని వివరించారు. సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్, ఉపసర్పంచ్ న్యాల ఉమేష్, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ లక్కినేని కిశోర్‌కుమార్ -
వీబీజీ రాంజీ పనుల తనిఖీ
దుగ్గొండి: మండలంలోని మందపల్లి, చాపలబండ గ్రామాల్లో వీబీజీ రాంజీ పనులను జెడ్పీ సీఈఓ వసంత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందపల్లి చెరువులో పూడికతీత పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత సమయం పనిచేస్తున్నారు, పని ఎంత చేస్తున్నారు, కూలి ఎంత వస్తుంది అని ఆరా తీశారు. చాపలబండ గ్రామంలో మండల సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఏపీఓ శ్రీనివాస్, ఈసీ రాజు, సర్పంచ్‌లు అల్లాటి ప్రభు, మారేడుగొండ శ్రీమాలతి, ఫీల్డ్ అసిస్టెంట్లు సుమలత, రాణి తదితరులు ఉన్నారు. -
‘పే నౌ’ నొక్కితే...ఎర్రర్ మెసేజ్
సర్టిఫికెట్ల కోసం ఫీజులు చెల్లించేందుకు ‘పే నౌ’పై క్లిక్ చేస్తే ‘‘ఆర్డర్ అమౌంట్ లెస్ దన్ మినిమమ్ అమౌంట్ అలవుడ్’’ అనే సందేశం కనిపిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో చెల్లింపులు పూర్తికావడం లేదు. మరోవైపు దరఖాస్తుల స్టేటస్ మారకపోవడంతోనే ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చెల్లింపు చేయాల్సిన విద్యార్థికి పేమెంట్ గేట్‌వే పనిచేయకపోతే...ఆ లోపానికి విద్యార్థి ఎందుకు మూల్యం చెల్లించా లి? సాంకేతిక సమస్యను యూనివర్సిటీ గుర్తించి సరిచేసే వ్యవస్థ ఉందా? ‘పెండింగ్’ దరఖా స్తులను అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారా? అత్యవసరంగా సర్టిఫికెట్ కావాల్సిన వి ద్యార్థికి ప్రత్యామ్నాయ మార్గం చూపుతున్నారా? అన్న దానిపై సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
వరంగల్
గురువారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2026‘పే నౌ’ నొక్కినా.. నో పేమెంట్!సాక్షి, వరంగల్: వైద్య విద్యలో ఒక్కో సర్టిఫికెట్ విద్యార్థి భవిష్యత్‌కు కీలకమైన పత్రం. చదువు పూర్తయిన తర్వాత మరో యూనివర్సిటీలో చేరాలన్నా.. ఉన్నత విద్యకు వెళ్లాలన్నా.. విదేశీ విద్యకు దరఖాస్తు చేయాలన్నా.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నా మైగ్రేషన్, ట్రాన్స్క్రిప్ట్ ధ్రువపత్రాలు అవసరం. అలాంటి పత్రాలను సకాలంలో అందించాల్సిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆన్లైన్ సర్టిఫికెట్ సేవల్లో సాంకేతిక సమస్యలు విద్యార్థులకు తలనొప్పిగా మారుతున్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో.. ‘పే నౌ’ అని చూపిస్తున్నా చెల్లింపు మాత్రం పూర్తి కాకపోవడంతో సర్టిఫికెట్ ప్రక్రియ అక్కడే నిలిచిపోతోంది. దీంతో దూరప్రాంతాల విద్యార్థులు ఆన్్లైన్ కావడం లేదని వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులతోపాటు, కెరీర్ ఏమైపోతుందోనన్న మానసిక ఆందోళనకు గురవుతున్నారు. రూ.0గా చూపుతున్న చార్జీ.. అసలు ఫీజెంత? విద్యార్థులు సమర్పించిన మరో రిక్వెస్ట్ డాక్యుమెంట్లో టోటల్ చార్జ్ రూ.0గా కనిపిస్తోంది. పేమెంట్ ట్రాన్సాక్షన్న్ నంబర్లు కూడా నమోదు కావడంలేదు. యూనివర్సిటీకి సంబంధించిన 2026 నోటిఫికేషన్లలో మాత్రం ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికెట్ ఫీజు రూ.2వేలుగా, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఫీజుకు రూ.500లుగా అధికారులు పేర్కొన్నారు. కోర్సు, సర్టిఫికెట్, దరఖాస్తును బట్టి ఫీజు మారవచ్చు. అసలు ఫీజు చెల్లించాల్సిన చోట ‘రూ.0’గా ఆర్డర్ అమౌంట్ ఏర్పడితేనే ‘మినిమమ్ అమౌంట్’ ఎర్రర్ వస్తుందా? పేమెంట్ గేట్‌వేలో సమస్యా? లేక సర్టిఫికెట్ మాడ్యూల్లో ఫీజు మ్యాపింగ్ లోపమా? ఇది అధికారులు తేల్చాల్సిన సాంకేతిక అంశమనే వాదన వినిపిస్తోంది. దీనిపై వర్సిటీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందనే డిమాండ్ విద్యార్థుల నుంచి వినిపిస్తోంది. హెల్ప్‌డెస్క్ ఉన్నా అంతంతే.. వర్సిటీ పరిధిలో 23,500మందికిపైగా విద్యార్థులున్నారు. వీరి కోసం మైగ్రేషన్, ట్రాన్స్క్రిప్ట్ గైడ్, సర్టిఫికెట్ దరఖాస్తు సేవలు, ఆన్్లైన్ పేమెంట్ ప్రక్రియకు మార్గదర్శకాలను కూడా యూనివర్సిటీ అందుబాటులో ఉంచింది. ఇంత పెద్ద వ్యవస్థలో ఒక్కో సర్టిఫికెట్ దరఖాస్తు ఎక్కడ ఆగిపోయిందో గుర్తించే ‘ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్’ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తోంది? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. హెల్ప్‌డెస్క్ నంబర్లకు ఫోన్ చేసినా సాంకేతిక బృందం పరిశీలిస్తోందనే కాలయాపన సమాధానాలే తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఈ మెయిల్ ఉన్నా విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆయా సాంకేతిక సమస్యలపై మాట్లాడేందుకు వర్సిటీ అధికారులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.బయోటెక్నాలజీ కీలకం బయోటెక్నాలజీ రంగం భవిష్యత్‌లో మానవాళి మనుగడలో కీలకంగా మారనుందని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాళోజీ వర్సిటీలో మైగ్రేషన్, ట్రాన్స్క్రిప్ట్ దరఖాస్తులు పెండింగ్‌లోనే.. రూ.0గా చూపిస్తున్న ఆర్డర్ అమౌంట్.. ‘మినిమమ్ అమౌంట్’ ఎర్రర్ నెలల తరబడి సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల ఎదురుచూపులు, సాంకేతిక లోపంతో తిప్పలు వర్సిటీ అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని విజ్ఞప్తిబీడీఎస్ విద్యార్థిని లావణ్య 2026, ఆగస్టు 24న సాయంత్రం 4.34 గంటలకు మైగ్రేషన్ న్యూ సర్టిఫికెట్ కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేశారు. పోర్టల్‌లో అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్ 2026/29630గా నమోదైంది. ఒక కాపీ కావాలని పేర్కొన్నారు. అక్టోబర్ 5 నాటికీ ఈ దరఖాస్తు పెండింగ్గానే ఉంది. పేమెంట్ స్టేటస్ అన్ పెయిడ్ గా కనిపిస్తోంది. అదేరోజూ ట్రాన్క్రిప్ట్ కోసం కూడా దరఖాస్తు చేశారు. దీనికి 2026/91314 అప్లికేషన్్ నంబర్ ఉంది. ఇది కూడా పెండింగ్గానే ఉండటం గమనార్హం. అంటే దాదాపు 44 రోజులవుతుంది. -
యువకులు క్రీడల్లో రాణించాలి
వర్ధన్నపేట: యువకులు క్రీడల్లో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎదగాలని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం పిలుపునిచ్చారు. వర్ధన్నపేట పట్టణ పరిధిలోని డీసీ తండాలో సేవాలాల్ యూత్ అసోసియేషన్ బాధ్యులు బుధవారం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కేశవపురం, ఎన్ఎస్ తండా క్రీడాకారులకు టాస్ వేసి స్వయంగా బ్యాట్ పట్టి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. యువతలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, క్రీడా స్ఫూర్తితో భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. క్రీడలు మానసికోల్లాసం, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రత్యేక రిజర్వేషన్లను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు కరిమిళ్ల సంపత్‌రావు, జన్ను రాములు, ప్రభాకర్, రాము నాయక్, సంతోష్‌నాయక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం -
మోదీ పాలన ప్రపంచానికి దిక్సూచి
వరంగల్ చౌరస్తా: ప్రజాసేవలో ప్రధాని మోదీ పాతికేళ్ల ప్రస్థానం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మైలురాయి అని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. బీజేపీ వికసిత్ సంకల్ప సభ–సేవా జ్యోతి కలశయాత్ర జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ చౌరస్తాలో జరిగింది. ఈ సందర్భంగా ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రధాని మోదీ పాలన ప్రపంచానికే దిక్సూచిగా మారిందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చేందుకు ప్రధానికి సహకరించాలని కోరారు. ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలు, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యేక స్క్రీన్లపై వీక్షించారు. అనంతరం పోచమ్మమైదాన్ జకోటియా కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ గోగుల రాణా ప్రతాప్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, సేవాజ్యోతి రాష్ట్ర కో కన్వీనర్ సిద్ధం నరేశ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎరగ్రోల్ల భరత్‌వీర్, కార్యవర్గ సభ్యులు జలగం రంజిత్ రావు, కుసుమ సతీశ్, రత్నం సతీశ్‌షా, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి -
108 సిబ్బందికి లైఫ్ సేవియర్ అవార్డు
వేలేరు: కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరిన వ్యక్తికి సకాలంలో ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి లైఫ్ సేవియర్ అవార్డు లభించింది. రైల్వే రక్షణ దళం హెడ్ కానిస్టేబుల్ సమాచారం మేరకు.. 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని రక్తస్రావాన్ని నియంత్రించి అత్యవసర ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈసందర్భంగా పైలట్ కుంట రవి, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు చైతన్యకు సంస్థ తరఫున లైఫ్ సేవియర్ అవార్డు అందజేశారు. హనుమకొండ జిల్లా కార్యక్రమ నిర్వాహకుడు శివకుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, డీఎంహెచ్ఓ అప్పయ్య చేతుల మీదుగా అవార్డును అందజేశారు. విద్యారణ్యపురి: ప్రణాళికాబద్ధంగా చదివితేనే విజయం సాధించవచ్చని వరంగల్ నిట్ గణిత విభాగం ప్రొఫెసర్ కె.కళాధర్ విద్యార్థులకు సూచించారు. బుధవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితశాస్త్ర విబాగం ఆధ్వర్యంలో ఐఐటీ, నిట్‌లో మాస్టర్ డిగ్రీల ప్రవేశాల కోసం జామ్ (జాయింట్ అడ్మిషన్స్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ఇన్ ఐఐటీ,నిట్)పై అవగాహన కార్యక్రమంలో ఆయన పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత గణిత విభాగాఽధిపతి డాక్టర్ ఇ.కొమురయ్య, అధ్యాపకులు సత్యనారాయణ, డి.వెంకన్న, మంగమ్మ, ఎ.శ్రీనాథ్, అనిల్‌కుమార్ హరిప్రసాద్, రోహిణి, వేణు పాల్గొన్నారు. హసన్‌పర్తి: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, నైపుణ్యాలు గుర్తించి వాటిని సరైన దిశలో ప్రోత్సహించడమే కౌశల్ బోఽధ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని డీఈఓ గిరిరాజ్‌గౌడ్ అన్నారు. హసన్‌పర్తి మండలం భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కౌశల్ బోధ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటోందని, ఉపాధ్యాయులు వాటిని గమనించి వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా శిక్షణలో పాల్గొన్న రిసోర్స్పర్సన్లు, ఉపాధ్యాయులకు ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల పాటు అక్టోబర్ 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10న అమావాస్య, 11న వారాంతపు సెలవు కావడంతో యార్డు బంద్ ఉండనుందని పేర్కొన్నారు. మార్కెట్ తిరిగి 12వ తేదీన పునఃప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు తేదీలను గమనించాలని, సెలవుల్లో మార్కెట్‌కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దని చైర్పర్సన్ కోరారు. హన్మకొండ అర్బన్ : జిల్లాలోని రెవెన్యూ శాఖలో పలువురు ఉద్యోగులకు పరిపాలనా సౌలభ్యం కోసం స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె.అమరేందర్ హనుమకొండ కలెక్టరేట్‌నుంచి భీమదేవరపల్లి తహసీల్దార్ కార్యాలయానికి, బీవీ నెహ్రూ భీమదేవరపల్లి నుంచి ఐనవోలు ఆర్ఐ కార్యాలయానికి, ఆర్.రాణి ఐనవోలు నుంచి హనుమకొండ కలెక్టరేట్‌కు, చాడా స్వాతికి హనుమకొండ కలెక్టరేట్ నుంచి హసన్‌పర్తి ఆర్ఐ కార్యాలయానికి స్థానచలనం కల్పించారు. -
కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం
హన్మకొండ చౌరస్తా: రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా బుధవారం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో అశోకా జంక్షన్లో కేంద్ర మంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు డీసీసీ భవన్ నుంచి జంక్షన్ వరకు ప్లకార్డులు, దిష్టిబొమ్మతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, గొట్టిముక్కుల రమాకాంత్‌రెడ్డి, వీసం సురేందర్‌రెడ్డి, అలువాల కార్తీక్, భీమా వినయ్ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.భగ్గుమన్న అఖిలపక్ష నాయకులుకాశిబుగ్గ: రాహుల్ గాంఽధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనమని, ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పోచమ్మ మైదాన్ నుంచి కాశిబుగ్గ సెంటర్ వరకు సాగిన పాదయాత్రలో పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం కాశిబు గ్గలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బస్మియా, ఎస్‌యూసీఐ(సీ) అడ్డుల సత్యనారాయణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు నవీద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేశ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ చైర్మన్లు చిలువేరు శ్రీనివాస్, రవీందర్ నాయక్, ఓర్సు తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కరుణాటి పార్వతమ్మ, నాయకులు అబ్బిడి రాజిరెడ్డి, పిన్నింటి అనిల్‌రావు,అత్తి కుమారస్వామి, ఇస్లావత్ సావిత్రి, పోశాల వెంకన్న, దాడి శివ, రవికుమార్, ఈగ దామోదర్, జన్ను అరుణార్, మహ్మద్ జానీ పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన సమాజానికి పాటుపడాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ధర్మసాగర్ : ఆరోగ్యకరమైన సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. మంగళవారం ధర్మసాగర్ పీహెచ్‌సీని ఆయన సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందితో కలిసి పిచ్చిమొక్కలు, చెత్తచెదారం, పరిసరాలను శుభ్రం చేశారు. అంతకుముందు ఆస్పత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి,పొడి చెత్తను వేరు చేయడం, చెత్తబుట్టల వాడకం, డ్రెయినేజీ కాల్వల నిర్వహణ, గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు రాజ్‌కుమార్, పుట్ట మహేందర్, అలేఖ్య, కవిత, గీత, రుచిత, శ్వేత, భారతి, సూపర్వైజర్ సులోచనతో పాటు హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, నర్సింగ్ అధికారులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
దసరాను వైభవంగా నిర్వహిస్తాం
ఖిలా వరంగల్: తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబించేలా సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సూచించారు. మంగళవారం వరంగల్ కరీమాబాద్‌లోని ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సీపీ శ్వేత, బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఉత్సవ కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, మెడిది మధుసూదన్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఉత్సవాలకు బతుకమ్మ మైదానాలు, ఉర్సు రంగలీల మైదానాన్ని చదును చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్యసేవలు, తాత్కాలిక మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పటిష్ట పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. దసరా సందర్భంగా రంగలీల మైదానంలో నిర్వహించే వేడుకలకు సుమారు 3 లక్షల మంది రానున్నారని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సౌండ్ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. సీపీ శ్వేత మాట్లాడుతూ బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ట్రాఫిక్ జామ్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం ఉత్సవ కమిటీకి సహరిస్తుందన్నారు. అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, వైవీ గణేష్, డీసీపీ కవిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్, డీఆర్ఓ విజయలక్ష్మీ, ఆర్డీఓ సుమ, డీసీపీ సలీమా, తహసీల్దార్ ఇక్బాల్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షులు గోనె రాంప్రసాద్, గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్‌రాజు, వడ్నాల నరేందర్, వంగరి కోటేశ్వర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘కుడా’ చైర్పర్సన్, అధికారులు గైర్హాజరు కాగా, రంగలీల మైదానంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల సమీక్ష సమావేశానికి కుడా చైర్పర్సన్ గుండు సుధారాణితో పాటు కుడా అధికారులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారు ఎందుకు హాజరు కాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడి కాలేదు. రాజకీయ విభేదాలతోనే హాజరు కాలేదన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి కొండా సురేఖ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష -
ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించాలి
హన్మకొండ : గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ట్రాన్స్జెండర్లకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.పూజ సూచించారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో ఎఫ్ఎంఎం సామాజిక సేవా సంస్థ, మోడరన్ అవేర్నెస్ సొసైటీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంయుక్తంగా ట్రాన్స్జెండర్లకు మానవ అక్రమ రవాణ నిర్మూలన, హక్కుల పరిరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి పూజ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ట్రాన్స్జెండర్లపై సమాజంలో ఇంకా వివక్ష కొనసాగుతోందన్నారు. చదువుకుని అర్హత కలిగిన ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ శాఖలతో పాటు ఇతర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్, ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఇన్చార్జ్ కె.రమేశ్, హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి కె.విశ్వజ మాట్లాడారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, కోఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నాయకులు లైలా, ఎస్సైలు శ్రావణి, సుధాకర్, ఏఎస్సై భాగ్యలక్ష్మి, కానిస్టేబుల్ రామారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పూజ -
భద్రత ప్రశ్నార్థకం!
●గురుకులాల్లో పిల్లలను పర్యవేక్షించే వ్యవస్థ ఏం చేస్తోంది? ● టీచర్ దాడి, ఎలుకల కాటు, అనారోగ్యం, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు ● వరుస ఘటనలతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులుసాక్షిప్రతినిధి, వరంగల్: పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మంచి విద్య, వసతి, భోజనం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకులాల్లో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలుకల కాటు నుంచి ఆహార కలుషితంతో అస్వస్థత, విద్యార్థుల మధ్య ఘర్షణలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. విస్తృతం ‘గురుకుల’ నెట్వర్క్.. హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో బీసీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల పంపిన నివేదిక ప్రకారం ఆయా సొసైటీల జాబితాలను పరిశీలిస్తే పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ సంస్థలు కలిపి సంఖ్య 61 ఉండగా 24,400 మంది విద్యార్థిని,విద్యార్థులు ఉన్నారు. ఒక్క ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ఈఐ పరిధిలోనే ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో 31 గురుకులాల్లో 12,400 వరకు విద్యార్థులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గేట్ దగ్గరే తల్లిదండ్రులు.. గురుకులాల్లో చదివే పిల్లలు వారాల తరబడి తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. పిల్లలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తల్లిదండ్రులకు తెలియదు. కొన్నిచోట్ల తల్లిదండ్రులను లోపలికి అనుమతించకపోవడంతో పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పిల్లలతో మాట్లాడేందుకు వచ్చిన పేరెంట్స్ గేటు బయటే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ మొక్కుబడిగా మారడం వల్ల కూడా అనర్థాలకు కారణంగా చెబుతున్నారు. దీంతో లోపల వారి పిల్లలు ఎలా ఉంటున్నారు? భోజనం ఎలా ఉంది? వసతి గదులు, మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? ఎవరైనా వేధిస్తున్నారా? అనారోగ్యంగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిల్లల్ని నమ్మి పంపుతున్నాం.. ‘పిల్లలను నమ్మి గురుకులాలకు పంపుతున్నాం.. మా కళ్లకు దూరంగా ఉన్నా.. అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో భద్రంగా ఉన్నారనే నమ్మకం కల్పించాలి. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ఘటన జరగకుండా చూడాలి’ అని హనుమకొండ జిల్లాకు చెందిన గురుకుల పాఠశాలలో చేరిన ఓ విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘గురుకులాల్లో చేర్పించిన పిల్లలందరూ రైతులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. పిల్లలకు మంచి భవిష్యత్ వస్తుందనే ఆశతో వారిని దూరంగా పంపుతున్నాం. అప్పుడప్పుడు కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నా.. నిర్వహణలో మార్పు లేదు. ఇకనైనా జాగ్రత్తలు తీసుకుని పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి’ అని వరంగల్ జిల్లాకు చెందిన పేర్లు చెప్పని ఓ గురుకుల విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. పాదం కింద ఎలుక కొరికిందని చూపిస్తున్న గూడూరులోని ఎంజేపీ బాలికల పాఠశాల విద్యార్థిని సాయి హర్షిత నెక్కొండ బాలికల గురుకుల పాఠశాలలో టీచర్ కొట్టగా గాయమైందని చేతిని చూపిస్తున్న బాలికఈ ఏడాది కలవరపెట్టిన ఘటనలు కొన్ని ● ఏప్రిల్ 26 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు మహాత్మా జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థి రాచర్ల కార్తీక్ మృతి కలకలం రేపింది. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ● జూన్ 30 : పరకాల మండలం మల్లక్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థిని శ్రీవాణి బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ● ఆగస్టు 3: వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 27 మంది బాలికలు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి రాగా ఆరోపణలపై విచారించారు. ● సెప్టెంబర్ 19: హనుమకొండ జిల్లా వంగర పీవీ రంగారావు బాలికల గురుకులంలో చదువుతున్న ఓ విద్యార్థిని సోదరి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి గురుకులంలో చేర్చుకోవాలనే విషయంలో ప్రిన్సిపాల్ నిరాకరించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం వివాదాస్పదమైంది. ● సెప్టెంబర్ 24: జనగామ జిల్లా పాలకుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థులను ఎలుకలు కరవడం చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు బాలికలను ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించినట్లు ప్రకటించారు. ● అక్టోబర్ 5: వరంగల్ జిల్లా ఖానాపురంలో ఇద్దరు గిరిజన బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఫోన్ ద్వారా వేధింపులే ఘటనకు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ● అక్టోబర్ 5: మహబూబాబాద్ జిల్లా గూడూరులోని బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఐదో తరగతి బాలికను ఎలుక కరిచింది. ● అక్టోబర్ 6: నెక్కొండ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 35 మంది ఐదో తరగతి విద్యార్థినులను ఇంగ్లిష్ టీచర్ రజిని తీవ్ర గాయ పర్చింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కలెక్టర్ సత్యశారద ఎంపీడీఓను విచారణ అధికారిగా నియమించారు. విచారణ నివేదిక మేరకు టీచర్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. -
కార్మికుల హక్కులు కాలరాసింది బీఆర్ఎస్
పరకాల : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పరకాల ఆర్టీసీ డిపోలో టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి అభ్యర్థుల తరఫున ప్రకాశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఐక్య కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆర్టీసీ కార్మికులను కోరారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఐక్య కూటమి అభ్యర్థులకు ప్రతి కార్మికుడు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా పనిచేస్తోందన్నారు. పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, కాంగ్రెస్ పట్టణ నాయకులు, ఐక్య కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి -
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి ఆలయంలో ఈ నెల 11నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాల ముందస్తు భద్రతా ఏర్పాట్లను మంగళవారం వరంగల్ సీపీ శ్వేత పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతల కోసం పోలీస్‌శాఖ చేపడుతున్న చర్యలను సీపీ అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, మట్టెవాడ, ఇంతేజార్గంజ్, మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్లు, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఆస్పత్రికి నగరంలోని శరత్ కంటి ఆస్పత్రిని రెఫరల్‌గా మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే ఆస్పత్రి సీనియర్ ఏసీఎంఎస్ డాక్టర్ ఐ.నిరంజన్‌రావు మంగళవారం తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధాధికారులు శరత్ ఐ హాస్పిటల్‌ను రైల్వేకు రెఫరల్‌గా మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. రైల్వే కార్మికులు, వారి కుటుంబాలు, రిటైర్డ్ కార్మికులు ఇక నుంచి కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సను శరత్ ఐ ఆస్పత్రిలో చేయించుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. హసన్‌పర్తి : హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను కమిషనర్ శ్వేత మంగళవారం అభినందించారు. పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 12 మంది క్రీడాకారులు వివిధ క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన ఏఆర్ అడిషనల్ డీసీపీ వి.శ్రీనివాస్, ఏసీపీ మధుసూదన్, ఏఆ ర్ ఏసీపీలు పి.అనంతయ్య, నాగయ్య, ఏసీపీ నర్సయ్య, ఎస్సైలు సురేష్, స్వర్ణలత, హెడ్‌కానిస్టేబుళ్లు ఓదెలు, శ్రీరాములు, కానిస్టేబుల్ వేణుచారి, తులసీదాస్‌లు సీపీని కలిశారు. కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో సికింద్రాబాద్ రైల్వే సేఫ్టీ అధికారులు పీసీఎస్ఓ బిజయ్‌కుమార్, ఏడీఆర్ఎం సంజీవరావు, చీఫ్ ట్రాక్ ప్లానింగ్ మేనేజర్ బల్విందర్ యాదవ్, డీఓఎం సుధీర్‌కుమార్‌తో పాటు పలు విభాగాల అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. రైల్వే లోకోపైలెట్ల కార్యాలయం రన్నింగ్ రూంకు వెళ్లి అక్కడ తనిఖీలు చేపట్టి, లోకోపైలెట్లతో జరిగిన ముఖాముఖి సమావేశంలో పలు విషయాలపై మాట్లాడారు. కాజీపేట రైల్వేస్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, ఏరియా ఆఫీసర్ ఫనికుమార్, ఎస్ఎస్ఈ రాజన్న, అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: పంటకోత ప్రయోగాలను నిర్దేశిత శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ప్రణాళిక, వ్యవసాయ శాఖల క్షేత్రస్థాయి అధికారులకు పంటకోత ప్రయోగాల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటకోత ప్రయోగాల ద్వారా సేకరించే దిగుబడి వివరాలు ప్రభుత్వం తీసుకునే కీలక విధానపరమైన నిర్ణయాలకు ఆధారంగా ఉంటాయని అన్నారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బి.సత్యనారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వి.విజయ్‌చంద్ర, అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందించాలి హన్మకొండ చౌరస్తా: గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన, సత్వర వైద్య సేవలను అందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలతో కలెక్టర్ మాట్లాడి అందుతున్న వైద్య సేవలపైన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. -
పొగ, మద్యం ముప్పు
సాక్షి, వరంగల్: పొగాకు.. మద్యం.. రెండూ ఆరోగ్యానికి హానికరమే. అయినప్పటికీ 15 ఏళ్లు పైబడిన వారిలో వీటి వినియోగం పూర్తిగా తగ్గలేదు. 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం వినియోగం వరంగల్ జిల్లాలో 40.7 శాతం, హనుమకొండ జిల్లాలో 44.8 శాతంగా నమోదైంది. మహిళల్లోనూ వరంగల్‌లో మద్యం వినియోగం 12.7 శాతం ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్హెచ్ఎఫ్ఎస్–6) వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాతో పొల్చుకుంటే మద్యం, పొగాకు వినియోగంలో హనుమకొండ జిల్లాలో పెరగడం గమనార్హం. యువత ఈ అలవాట్ల బారిన పడకుండా ముందస్తు అవగాహన, కౌన్సెలింగ్‌తో పాటు విక్రయాల నియంత్రణపై పోలీస్, ఎకై ్సజ్, వైద్య శాఖలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆయా విభాగ ఉన్నతాధికారుల మార్గదర్శనంలో వీటిని కట్టడి చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. ముఖ్యంగా పాఠశాలలతో పాటు బహిరంగ ప్రదేశాల్లోనూ పొగ సేవించడం ఎక్కువ వడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వీటిపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఎంతో మంది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారనే విమర్శలున్నాయి. తగ్గినా... ఇంకా గణనీయమే! వరంగల్ జిల్లాలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో 8.1 శాతం మంది ఏదో ఒక రకమైన పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. పురుషుల్లో ఈ శాతం 24.2గా ఉంది. ఇక మద్యం విషయానికి వస్తే మహిళల్లో 12.7 శాతం, పురుషుల్లో 40.7 శాతం మంది వినియోగిస్తున్నారు. అయితే ఎన్హెచ్ఎఫ్ఎస్–5తో పోలి స్తే ఆయా విభాగాల్లో తగ్గుదల నమోదైనా పురుషుల్లో మద్యం, పొగాకు వినియోగం గణనీ యంగానే ఉండటం ఆందోళనకర అంశంగా మారింది. గతంతో పొలిస్తే పెరిగింది.. హనుమకొండ జిల్లాలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో పొగాకు వినియోగం 1.7 శాతం, పురుషుల్లో 15.9 శాతంగా ఉంది. మద్యం సేవించే మహిళలు 3.3 శాతం ఉండగా, పురుషుల్లో ఏకంగా 44.8 శాతం ఉన్నారు. అంటే ఇక్కడ పురుషుల్లో మద్యం వినియోగం వరంగల్ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఉంది. ఎన్హెచ్ఎఫ్ఎస్–5తో పోలిస్తే హనుమకొండలో పురుషుల పొగాకు వినియోగం 14 నుంచి 15.9 శాతానికి, మద్యం వినియోగం 43.3 నుంచి 44.8 శాతానికి పెరిగింది. 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం వినియోగం ఆందోళనకరం వరంగల్ జిల్లాలో 40.7 శాతం... హనుమకొండ జిల్లాలో 44.8శాతం పొగాకు వినియోగం వరంగల్‌లో 24.2 శాతం, హనుమకొండలో 15.9 శాతం పోలీస్, ఎకై ్సజ్, ఆరోగ్య శాఖల సమన్వయ చర్యలు తీసుకుంటేనే నియంత్రణ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 గణాంకాలతో అంతటా చర్చఅనారోగ్య సమస్యలే..పొగాకు వినియోగంతో క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మద్యం అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం, గుండెతో పాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రజలు ఈ విషయాలను గుర్తించి వీటికి దూరంగా ఉండాలి. ఇప్పటికే అలవాటైన వారు వైద్యుల సలహా, కౌన్సెలింగ్ తీసుకోవాలి. పొగాకు, మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు, నియంత్రణ చర్యలు చేపడతాం. –డాక్టర్ బి.రాజారెడ్డి, డీఎంహెచ్ఓకట్టడికి కార్యాచరణ అవసరం...పొగాకు, మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు వైద్యశాఖ, పోలీస్, ఎకై ్సజ్, విద్యాశాఖలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలపై నిఘా పెంచడం, అక్రమ మద్యం విక్రయాలను అడ్డుకోవడం, గ్రామాలు, వార్డుల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్, డీ–అడిక్షన్ సేవలపై ప్రచారం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా యువత ఈ అలవాట్లకు బానిస కాకుండా ముందస్తు అవగాహన, కౌన్సెలింగ్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. –ఎం.పరశురాములు, సామాజికవేత్త -
రోజువారీ లక్ష్యంతో సర్వే పూర్తిచేయాలి
అదనపు కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్ : రోజువారీ లక్ష్యంతో భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.రవి సర్వేయర్లు, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్కతుర్తి మండలం కోతులనడుమ, హనుమకొండ మండలం పలివేల్పులలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన భూముల కొలతలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను సర్వేయర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి రీ సర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎన్.రవి మాట్లాడుతూ సర్వేయర్లు ప్రతిరోజూ 70 ఎకరాల భూమిని కొలిచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలన్నారు. రెండు రోవర్లను వినియోగిస్తూ సర్వే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వే బృందాలు ఉదయం 9 గంటలలోపే క్షేత్రస్థాయికి చేరుకుని రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. మరుసటి రోజు చేపట్టే సర్వే వివరాలను ముందుగానే సంబంధిత రైతులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, భూముల కొలతల శాఖ ఏడీ నూర్సింగ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎల్కతుర్తి నాయబ్ తహసీల్దార్ రమేశ్, సర్వేయర్లు, ఆర్ఐలు, రైతులు పాల్గొన్నారు. -
ముందస్తు అనుమతి తప్పనిసరి
కాశిబుగ్గ: ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైతే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో పాటు రికార్డు రూం, ల్యాబ్, పలు విభాగాలను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలిస్తూ సంతకం చేసిన వారు ఉన్నారా?లేరా? అంటూ పరిశీలించారు. అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయితే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అడ్మినిస్ట్రేషన్ అధికారిని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, త్వరలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్తున్న దృష్టా అన్ని పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. అనంతరం ల్యాబ్‌లో చేస్తున్న పరీక్షలను, రిపోర్టులను పరిశీలించారు. టెక్నాలజీ ఉపయోగించి, పేషంట్లకు త్వరగా సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీలో నోడల్ ఽఅధికారి డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ మధుకర్ యాదవ్, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు. కాగా కలెక్టర్ సత్యశారద పేషంట్ల సేవలతో పాటు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మూడు గంటలకు పైగా పరిశీలించడంతో అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు. కొందరు బయటకు వెళ్లిన ఉద్యోగులు కలెక్టర్ వచ్చారని తెలియగానే ఆగమేఘాల మీద వచ్చి తమ తమ సీట్లలో కూర్చున్నారని తెలిసింది. లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేయండి ఎంజీఎంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద మూడు గంటలకు పైగా వివిధ విభాగాల్లో పరిశీలన -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
రాయపర్తి: విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్‌ను అందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాయపర్తి మండలంలోని జగన్నాథపల్లిలో నిర్మించిన నూతన 33బై11కెవీ జగన్నాథపల్లి సబ్‌స్టేషన్‌కు సాంకేతిక చార్జింగ్ అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో ఇప్పటికే ఉన్న 33బై11కెవీ మైలారం, రాయపర్తి సబ్స్టేషన్లపై విద్యుత్‌లోడ్ భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. మైలారం, రాయపర్తి చుట్టు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడడంతో పాటు వోల్టేజీ స్థాయిలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ సరఫరా నాణ్యతను మరింత మెరుగు పర్చడానికి టీజీఎన్పీడీసీఎల్ చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ సీఈ సురేందర్, కన్స్ట్రక్షన్ సీఈ గౌతమ్‌రెడ్డి, వరంగల్ ఎస్ఈ ఆనందం, మహబూబాబాద్ ఎస్ఈ దర్శన్‌కుమార్, డీఈ జాటోతు హర్జి విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా జ్యోతి పూజ
గీసుకొండ: మండలంలోని ఊకల్‌లోని సుప్రసిద్ధ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి మండల దీక్ష చేపట్టిన స్వాముల సమక్షంలో మంగళవారం ప్రథమ మండల పూజలో భాగంగా జ్యోతి పూజను వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు తెలిపారు. ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించామని, జ్యోతి పూజ పూర్తయిన తర్వాతనే భక్తుల గృహాల్లో ఇతర ప్రాంతాల్లో స్వాములు భిక్షా కార్యక్రమాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమన్నారు. అనంతరం దీక్షా స్వాములతో పాటు విచ్చేసిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, అర్చకులు రాజేష్, కోశాధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వీబీజీరాంజీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి దుగ్గొండి: గ్రామాల శాశ్వత అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు వీబీజీ రాంజీ నిధులను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం మంగళవారం జరి గింది. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్‌లు అంశాల వారీగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుందతి, తహసీల్దార్ స మ్మక్క, ఏఓ శ్యామ్, ఎంపీఓ చంద్రమోహన్, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం రమేష్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. బీసీలు ఏకం కావాలి సంగెం: హక్కుల సాధన కోసం రాజకీయాలకతీతంగా బీసీలు ఏకం కావాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటాపాముల వెంకటరాములు పిలుపునిచ్చారు. ఈ నెల 16న వరంగల్‌లోని శివనగర్‌లో నిర్వహించనున్న బీసీల హక్కుల సాధన సమితి జిల్లా రెండో మహాసభల ప్రచారయాత్రను మంగళవారం సంగెం మండలకేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం చేసి కేంద్రానికి పంపించి తర్వాత ఒకసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. బీసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి, ప్రభాకర్, బక్కం రాజు, సాంబయ్య పాల్గొన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణన్యూశాయంపేట: ఇటీవల ప్రభుత్వం పోలీస్ శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వ రకు ఉచిత రెసిడెన్సియల్ శిక్షణ అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి హమీద్, ఎస్సీ స్టడీ సర్కిల్ ఉ మ్మడి జిల్లా సంచాలకులు డాక్టర్ కే.జగన్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హ నుమకొండ వడ్డేపల్లిలోని షెడ్యూల్ కులాల స్ట డీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాంచిలో శి క్షణ అందించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ల స్వీకరణకు ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. మరిన్ని వివరాలకు 9160606862 నంబర్లో సంప్రదించాలన్నారు. రైస్ మిల్లుల్లో తనిఖీలు నల్లబెల్లి: నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న రైస్ మిల్లులపై సివిల్ సప్లై రెవెన్యూ అధి కారులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా సివిల్ సప్లై అధికారి సంధ్యారాణి ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని శివశంకర్, సాంబశివ, హైమద్ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. మిల్లులో నిల్వ ఉన్న బియ్యం బస్తాలతో పాటు స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. బియ్యం నాణ్యతను నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. తనిఖీల్లో ప్రభుత్వ నిబంధనలు పా టించని మూడు మిల్లులను గుర్తించి స్టాక్ నిల్వలను సేఫ్ కస్టడీకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైస్ మిల్లుల యాజమానులు తప్పనిసరిగా సంబంధిత అనుమతులు రెన్యూవల్స్ పూర్తి చేసుకోవాని సూచించారు. ఆర్ఐ సంపత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆశ’లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి
నర్సంపేట: ఆశవర్కర్లకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం వెంటనే ఇవ్వాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆశ డే సందర్భంగా మంగళవారం పలు ప్రైమరీ హెల్త్ సెంటర్లను విజిట్ చేసి సమావేశాలు నిర్వహించారు. ఈ సంరద్భంగా యువరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఆశ వర్కర్‌కు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి నేటికి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న ఒక్క హామీ నెరవేరలేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఆశకార్యకర్తలు నిరవధిక సమ్మె చేయడానికి కూడా వెనుకడుగు వేయరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలువాల లలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్య, జిల్లా నాయకురాలు సుజాత, రమ, రజిత, రమ్య, జ్యోతి, కవిత, జ్యోత్స ్న, సృజన తదితరులు పాల్గొన్నారు. -
భద్రత ప్రశ్నార్థకం!
సాక్షిప్రతినిధి, వరంగల్: పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మంచి విద్య, వసతి, భోజనం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకులాల్లో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలుకల కాటు నుంచి ఆహార కలుషితంతో అస్వస్థత, విద్యార్థుల మధ్య ఘర్షణలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. విస్తృతం ‘గురుకుల’ నెట్వర్క్.. హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో బీసీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల పంపిన నివేదిక ప్రకారం ఆయా సొసైటీల జాబితాలను పరిశీలిస్తే పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ సంస్థలు కలిపి సంఖ్య 61 ఉండగా 24,400 మంది విద్యార్థినీవిద్యార్థులు ఉన్నారు. ఒక్క ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ఈఐ పరిధిలోనే ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో 31 గురుకులాల్లో 12,400 వరకు విద్యార్థులున్నట్లు ఆ గణాంకాలు చెబుతున్నాయి. గేట్ దగ్గరే తల్లిదండ్రులు.. గురుకులాల్లో చదివే పిల్లలు వారాల తరబడి తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. పిల్లలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తల్లిదండ్రులకు తెలియదు. కొన్నిచోట్ల తల్లిదండ్రులను లోపలికి అనుమతించకపోవడంతో పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. పిల్లలతో మాట్లాడేందుకు వచ్చిన పేరెంట్స్ గేటు బయటే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ మొక్కుబడిగా మారడం వల్ల కూడా అనర్థాలకు కారణంగా చెబుతున్నారు. దీంతో లోపల వారి పిల్లలు ఎలా ఉంటున్నారు? భోజనం ఎలా ఉంది? వసతి గదులు, మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? ఎవరైనా వేధిస్తున్నారా? అనారోగ్యంగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది కలవరపెట్టిన ఘటనలు కొన్ని.. ● ఏప్రిల్ 26 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు మహాత్మా జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థి రాచర్ల కార్తీక్ మృతి కలకలం రేపింది. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ● జూన్ 30 : హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థిని ఈకు శ్రీవాణి బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ● ఆగస్టు 3: వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 27 మంది బాలికలు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆహార కలుషితమే కారణమన్న ఆరోపణలపై విచారణ జరిపారు. ● సెప్టెంబర్ 7: ములుగు జిల్లా ఏటూరునాగారంలో పారిశుద్ధ్యం, నీటి సమస్యలపై విద్యార్థినులు ఆందోళనకు దిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరో ఘటనలో విద్యార్థి నాయకురాలు ముగ్గురు బాలికలను కర్రతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ● సెప్టెంబర్ 24: జనగామ జిల్లా పాలకుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థులను ఎలుకలు కరవడం చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు బాలికలను ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించినట్లు ప్రకటించారు. ● అక్టోబర్ 5: వరంగల్ జిల్లా ఖానాపురంలో ఇద్దరు గిరిజన బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఫోన్ ద్వారా వేధింపులే ఘటనకు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ● అక్టోబర్ 5: మహబూబాబాద్ జిల్లా గూడూరులోని బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఐదో తరగతి బాలికను ఎలుక కరిచింది. ● అక్టోబర్ 6: నెక్కొండ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 35 మంది ఐదో తరగతి విద్యార్థినులను ఇంగ్లిష్ టీచర్ రజిని తీవ్ర గాయ పర్చింది. ఈ ఘటనలో సుమోటోగా తీసుకున్న కలెక్టర్ సత్యశారద ఎంపీడీఓను విచారణ అధికారిగా నియమించారు. విచారణ నివేదిక మేరకు టీచర్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. గురుకులాల్లో పిల్లలను పర్యవేక్షించే వ్యవస్థ ఏం చేస్తోంది? టీచర్ దాడి, ఎలుకల కాటు, అనారోగ్యం, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు వరుస ఘటనలతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు తల్లిదండ్రులుపిల్లల్ని నమ్మి పంపుతున్నాం.. ‘పిల్లలను నమ్మి గురుకులాలకు పంపుతున్నాం.. మా కళ్లకు దూరంగా ఉన్నా.. అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో భద్రంగా ఉన్నారనే నమ్మకం కల్పించాలి. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ఘటన జరగకుండా చూడాలి’ అని హనుమకొండ జిల్లాకు చెందిన గురుకుల పాఠశాలలో చేరిన ఓ విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘గురుకులాల్లో చేర్పించిన పిల్లలందరూ రైతులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. పిల్లలకు మంచి భవిష్యత్ వస్తుందనే ఆశతో వారిని దూరంగా పంపుతున్నాం. అప్పుడప్పుడు కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నా.. నిర్వహణలో మార్పు లేదు. ఇకనైనా జాగ్రత్తలు తీసుకుని పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి’ అని వరంగల్ జిల్లాకు చెందిన పేర్లు చెప్పని ఓ గురుకుల విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
గోనె సంచుల గోల్‌మాల్‌పై ఆర్డీఓ విచారణ
నెక్కొండ: నెక్కొండ పీఏసీఎస్‌లో గోనె సంచుల గోల్‌మాల్‌పై మంగళవారం నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి విచారణ చేపట్టారు. ఇటీవల పీఏసీఎస్ పరిధిలోని రైతులు గోనె సంచుల డబ్బులు రాలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆర్డీఓ మంగళవారం విచారణ నిమిత్తం పీసీఏఎస్కు వచ్చారు. అయితే మూడు రోజుల క్రితమే రికార్డులు సిద్ధం చేయాలని సీఈఓ మేకల జనార్దన్, ఆఫీస్ బాయ్ సురేశ్ దృష్టికి తీసుకెళ్లినా.. రికార్డులు సిద్ధం చేయకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో ఎన్ని బస్తాల మొక్కజొన్నలు కొనుగోలు చేశారు? అందుకు ఎన్ని గోనె సంచులు అవసమయ్యాయనే వివరాలు తెలిస్తే రైతుల గోనె సంచుల లెక్క తేలుతుందన్నారు. రికార్డులు లేవని చెప్పడం సరికాదన్నారు. మరోవైపు పీఏసీఎస్ పరిధిలో గోనె సంచులు సుమారు 2.50 లక్షల బస్తాలు కొనుగోళ్లు జరిపామని, అందులో 1.34 లక్షల బస్తాలు రైతులకు ఇచ్చామని, సుమారు 1.16 లక్షల బస్తాలు రైతులవని సీఈఓ తెలిపారు. ఏదిఏమైనా గోనె సంచుల గోల్‌మాల్‌పై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అటు రైతులు.. ఇటు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా శ్రీపాల్‌రెడ్డి, నెక్కొండ ఏఎంసీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం
ఖిలా వరంగల్: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సూచించారు. మంగళవారం వరంగల్ కరీమాబాద్‌లోని ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సీపీ శ్వేత, బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఉత్సవ కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, మెడిది మధుసూదన్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఉత్సవాలకు బతుకమ్మ మైదానాలు, ఉర్సు రంగలీల మైదానాన్ని చదును చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్యసేవలు, తాత్కాలిక మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పటిష్ట పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. దసరా సందర్భంగా రంగలీల మైదానంలో నిర్వహించే వేడుకలకు సుమారు 3 లక్షల మంది రానున్నారని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సౌండ్ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. సీపీ శ్వేత మా ట్లాడుతూ బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ట్రాఫిక్ జామ్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం ఉత్సవ కమిటీకి సహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్‌కుమార్, వైవీ గణేష్, డీసీపీ కవిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీ సాల ప్రకాశ్, డీఆర్ఓ విజయలక్ష్మీ, ఆర్డీఓ సుమ, డీసీపీ సలీమా, తహసీల్దార్ ఇక్బాల్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షులు గోనే రాంప్రసాద్, గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్‌రాజు, వడ్నాల నరేందర్, కోటేశ్వర్, అధికారులు పాల్గొన్నారు. కుడా చైర్పర్సన్ గైర్హాజరు కాగా రంగలీల మైదానంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల సమీక్ష సమావేశానికి కుడా చైర్పర్సన్ గుండా సుధారాణితో పాటు కుడా అధికారులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారు ఎందుకు హాజరు కాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడి కాలేదు. రాజకీయ విభేదాలతోనే హాజరు కాలేదన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి కొండా సురేఖ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం -
ప్రజావాణికి 248 దరఖాస్తులు
వినతులు కొన్ని ఇలా.. ●ఉండటానికి ఇల్లు లేదు. దివ్యాంగుల కోటా కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవా లని సంగెంకు చెందిన వహదాబీ వినతి పత్రం అందించారు. ●ఖిలా వరంగల్ మండలం మామునూరు గ్రామ సరిహద్దులోని 0.34 గుంటల వ్యవసాయ భూమికి అక్రమ మ్యుటేషన్‌పై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని తిమ్మాపూర్‌కు చెందిన గంగిడి వీరారెడ్డి వినతిపత్రం ఇచ్చారు.న్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. మొత్తం 248 మంది తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు దరఖాస్తులు అందించారు. సమస్యలు విన్న కలెక్టర్ సత్యశారద.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖల వారీగా రెవెన్యూ శాఖ 90, జీడబ్ల్యూఎంసీ 61, హౌసింగ్ 13, డీఆర్డీఓ 24, ఇతర శాఖలకు సంబంధించినవి 48 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులక ఎండార్స్ చేశారు. అలాగే వరంగల్ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో రెవెన్యూశాఖకు సంబంధించి 5 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిషోర్‌కుమార్, వై.వి.గణేష్, జెడ్పీ సీఈఓ వసంత, డీఆర్ఓ విజయలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విశ్వప్రసాద్, హౌసింగ్ పీడీ విష్ణువర్థన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వీకరించిన కలెక్టర్ సత్యశారద త్వరగా పరిష్కరించాలని ఆదేశం -
అంగన్వాడీ సేవలపై మహారాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం
కాళోజీ సెంటర్: రాష్ట్రంలో అమలవుతున్న అంగన్వాడీ సేవలు, ఐసీడీఎస్, పోషకాహార కార్యక్రమాలు, కేంద్ర వంటశాల విధానాన్ని మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారుల బృందం సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది. మహారాష్ట్ర డబ్ల్యూసీడీ అదనపు కమిషనర్ విజయ్ క్షీర్సాగర్ ఆధ్వర్యంలో ఈ పర్యటన జరిగింది. మొదట ఎనుమాముల మార్కెట్లోని అక్షయపాత్ర కేంద్ర వంటశాలను సందర్శించిన అధికారులు ఆహార పదార్థాల నిల్వ, తయారీ, నాణ్యత, ప్యాకింగ్, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా విధానాన్ని పరిశీలించారు. సుందరయ్యనగర్, గుడెప్పాడ్ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీస్కూల్ విద్య, ఎదుగుదల పర్యవేక్షణ, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, లబ్ధిదారులతో మాట్లాడి సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ లైజనింగ్ అధికారి శివాల్కర్రెడ్డి, హనుమకొండ డీడబ్ల్యూఓ విశ్వజ, వరంగల్ సీడీపీఓ విద్య, పరకాల సీడీపీఓ స్వాతి, ఏసీడీపీఓ సింధు, సూపర్వైజర్లు లావణ్య, ఉమాదేవి, మంజుల, జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్, సుమలత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణాలు తీసిన అప్పులు.. ఇద్దరి ఆత్మహత్య
వేలేరు: అప్పుల బాధతో వేలేరు మండలం కన్నారానికి చెందిన కాశబోయిన కుమారస్వామి(32) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో ఉపాధి లేక 8 ఏళ్ల క్రితం హనుమకొండకు వలస వెళ్లాడు. గ్రామంలో ఉన్నప్పుడు వ్యవసాయ బావి తవ్వడం, మూడు, నాలుగు బోర్లు వేయడం, ఇల్లు నిర్మించుకోవడంతో దాదాపు రూ.15 లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఇదిలా ఉండగా.. కుమారస్వామికి గ్రామంలో ఐదెకరాల భూమి ఉంది. కానీ ఆ భూమిలో కేవలం 15 గుంటలు మాత్రమే తన పేరుమీద పట్టా అయ్యింది. మిగతా భూమి చుట్టు పక్కల రైతుల పేరుపై ఉంది. వారి నుంచి పట్టా చేయాలని పలుమార్లు పెద్ద మనుషులు, అధికారుల చుట్టూ తిరగడంతో కొంత అప్పు అయ్యింది. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన ఉదయం భార్య భాగ్యలక్ష్మితో గ్రామంలో పని ఉంది.. వెళ్లొస్తానని చెప్పి కన్నారం వచ్చాడు. మధ్యాహ్నం పురుగుల మందు తాగి భార్యకు ఇరుగుపొరుగు వారు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. అనంతరం స్థానికులు వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పురుగుల మందు తాగి రైతు.. ఐనవోలు: అప్పుల బాధతో మండలంలోని నందనం గ్రామానికి చెందిన రైతు ఈద రాజు(43) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. తన తండ్రి గతంలో వీఆర్ఓ ఉద్యోగం చేశేవాడు. వృద్ధుడైన కారణంగా.. తండ్రి ఉద్యోగ విధులు కూడా రాజు నిర్వర్తిస్తూ ఉన్నాడు. కొంతకాలంగా సాగులో దిగుబడి రాక పెట్టుబడికి అప్పులయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. గతనెల 26న అప్పుల విషయంలో బాధపడుతూ భార్యతో గొడవ పెట్టుకుని ఆవేశంగా రాజు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. పురుగుల మందు తాగినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతున్న అతడు సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి భార్య ఈద జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు. -
కడుపులో బిడ్డ.. కత్తెర కోత!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కడుపులోని బిడ్డ బయటకు రావాలంటే కోత తప్పట్లేదు. గర్భిణులకు ఒకప్పుడు సుఖ ప్రసవం (నార్మల్ డెలివరీ) జరిగేది. కానీ, నేడు సహజ ప్రసవాల స్థానంలో సిజేరియన్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి వరంగల్‌లోని పలు జిల్లాల్లో ప్రతీ పది ప్రసవాల్లో ఏడుకుపైగా సిజేరియన్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ వాటా ఏకంగా 80శాతం దాటగా, వరంగల్ 89.6, జనగామ 89.5 శాతంతో సెంచరీ మార్కుకు చేరువగా ఉన్నాయి. మిగిలిన నాలుగు జిల్లాల్లోనూ ఈ వాటా 80 శాతానికి పైగానే ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–6 (2023–24) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో 70 శాతం పైనే! సీ–సెక్షన్ల (సిజేరియన్లు) వాటా ఉమ్మడి వరంగల్ నాలుగు జిల్లాల్లో 70 శాతాన్ని దాటింది. హనుమకొండ జిల్లా 74.1 శాతంతో ముందంజలో ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి 70.4 శాతం, జనగామ 70.2 శాతం, మహబూబాబాద్ 70.1 శాతం నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల వాటా 80 శాతాన్ని దాటింది. జనగామ, వరంగల్ జిల్లాల్లో ఈ వాటా దాదాపు 90 శాతానికి చేరువైంది. జనగామలో 89.5 శాతం, వరంగల్‌లో 89.6 శాతం నమోదైంది. మహబూబాబాద్‌లో 87.5 శాతం, హనుమకొండలో 82.7 శాతం, భూపాలపల్లిలో 82.6శాతం, ములుగులో 81.9 శాతం ఉన్నాయి. అంటే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్రతీ పది ప్రసవాల్లో ఎనిమిదికి పైగా సీ–సెక్షన్లే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాల వాటా ప్రైవేట్‌తో పోలిస్తే ఎక్కువగా ఉన్నప్పటికీ.. సీ–సెక్షన్ల శాతం మాత్రం గణనీయంగానే ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కొన్ని జిల్లాల్లో ప్రతీ పది ప్రసవాల్లో ఆరు వరకు సిజేరియన్లు నమోదవుతున్నాయి. ప్రసవాలన్నీ దవాఖానాల్లోనే.. హనుమకొండలో ఆస్పత్రి ప్రసవాలు 100 శాతం నమోదయ్యాయి. అంటే ప్రసవాల కో సం ఆస్పత్రులను ఆశ్రయించే పరిస్థితి పూర్తిగా ఏర్పడినప్పటికీ.. అదే సమయంలో సిజేరియన్ల వాటా 74.1 శాతానికి చేరడం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశంగా మారింది. ఆస్పత్రి ప్రసవాల పెరుగుదల తల్లి, శిశువుల భద్రతకు అనుకూలమైన పరిణామమే. గర్భిణులకు ప్రసవానికి ముందునుంచే సుఖ ప్రసవం, సిజేరియన్ అవసరం అయ్యే పరిస్థితులు, ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.ఉమ్మడి జిల్లాలో ప్రతీ పది ప్రసవాల్లో ఏడు సీ–సెక్షన్లే సహజ ప్రసవాల (నార్మల్ డెలివరీ)కు ససేమిరా! ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే.. అయినా పెరుగుతున్న ఆపరేషన్ల వాటా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 80శాతానికి పైనే.. ప్రభుత్వ దవాఖానాల్లో 40–64 శాతం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–6 (2023–24) గణాంకాలు వెల్లడి -
ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
గీసుకొండ: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలోని వివిధ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల మేరకు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్, ప్రభుత్వ నిర్దేశించిన నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలని, అనధికార వ్యక్తులు, దళారుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతనల్లబెల్లి: వన్యప్రాణుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని నర్సంపేట ఎఫ్ఆర్ఓ నరేష్ అన్నారు. ఈ మేరకు మండలంలోని మేడపల్లి హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అడవులు, వన్య ప్రాణుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని, వన్యప్రాణులను వేటాడడం, వాటిని హాని కలిగించడం చట్టరీత్యా నేరమన్నారు. వన్య ప్రాణలులు గ్రామాలు, జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని భయపెట్టకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు వన్యప్రాణుల సంరక్షణ, వా టి ప్రాధాన్యత అంశంపై వ్యాచరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణమూర్తి, సెక్షన్ ఆఫీసర్ పద్మరావు, బీట్ ఆఫీసర్ కిరణ్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కమిటీ ఎన్నికగీసుకొండ: తెలంగాణ రాజీవ్ ఆరోగ్య శ్రీ జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కొండపర్తి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా మో టి మహేష్‌తో పాటు రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా నల్లబెల్లి అనిల్ ఎన్నికయ్యారు. పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలుదుగ్గొండి/నర్సంపేట రూరల్: దుగ్గొండి మండలంలోని వెంకటాపురం, నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామాల్లో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన పత్తి పంటలను జాతీయ పత్తి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగపూర్ పత్తి పరిశోధన స్థానం శాస్త్రవేత్త ప్రియాంక గైక్వాడ్ మాట్లాడారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగులో అధిక మొక్కలు ఉండి, పత్తి ఒకేసారి పక్వానికి వస్తుందన్నారు. దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. రాబోయే సంవత్సరంలో రైతులు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేవిధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, టెక్నికల్ ఏఓ కృష్ణారెడ్డి, ఏఓ శ్యామ్, శ్రీనివాస్, కల్పన, రైతులు దరావత్ శ్రీను, లింగమూర్తి, రాజు, ఏఈఓలు హనుమంతు, వైజయంతి, భారతి, విజయ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. జ్వరంతో నిండు గర్భిణి మృతి ● ఆదివారం కడుపులోని శిశువు మృత్యువాతనర్సంపేట రూరల్ : జ్వరంతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ఈ ఘటన నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన నిడిగొండ నవ్య (24)– ఈశ్వర్ దంపతులకు మొదటి బాబు జన్మించారు. బాబుకు ప్రస్తుతం నాలుగేళ్లు ఉన్నాయి. నవ్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. పదిరోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందించి ఇంటికి తీసుకెళ్లారు. ఎంతకు జ్వరం తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆదివారం నవ్య గర్భంలో ఉన్న శిశువు మృతిచెందింది. సోమవారం చికిత్స పొందుతూ నవ్య చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య ఉద్యమం
హన్మకొండ అర్బన్: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ శంఖారావం నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి, అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన సామాన్యులు, పేదల ఓట్లను తొలగించడాన్ని అడ్డుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ, తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నాయిని, రేవూరి, నాగరాజు ఇండియా కూటమి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన -
పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు
● తమ భూమి తమకు ఇప్పించాలని నిరసన శాయంపేట: మండలంలోని గోవిందాపూర్ గ్రామానికి చెందిన అడప దేవేంద్ర, రోడ్డ రామచందర్ తమకు వారసత్వంగా వచ్చిన భూమిని తమకే ఇవ్వాలని సోమవారం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈసందర్భంగా దేవేంద్ర, రామచందర్ మాట్లాడుతూ.. తమ భూమి సర్వే నంబర్లు 678/1, 678/ఏ లో ఉన్న నాలుగెకరాల భూమిని కుటుంబ అవసరాల నిమిత్తం విక్రయించేందుకు సిద్ధపడగా.. ఆరె మొగిలి చింతనిప్పుల భద్రయ్య, బొత్త కుమారస్వామి అడ్డుపడుతున్నారని వాపోయారు. ఈవిషయమై గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ కొనుగోలుదారు నుంచి తమకు రావాల్సిన డబ్బులు అందకుండా మధ్యవర్తులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాయిదాల పద్ధతిలో కొంత మొత్తం చెల్లించినప్పటికీ మిగతా డబ్బులు సర్వే నంబర్లో తప్పు ఉందంటూ తమను పోలీస్ స్టేషన్‌కు పిలించారని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌లో తమపై ఒత్తిడి తెచ్చి మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. సర్వే నంబర్లో తప్పు ఉన్న విషయం గుర్తించిన నేపథ్యంలో భూ విక్రయానికి సంబంధించి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ సంబంధిత వ్యక్తులు డబ్బులు స్వీకరించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం లేకుండానే మధ్యవర్తులు భూమి విక్రయానికి ప్రేరేపించారని ఇదిలా ఉండగా.. సబంధింత వ్యక్తులు తమ భూమిలోకి ప్రవేశించి ట్రాక్టర్‌తో దున్నుతున్నారని పేర్కొన్నారు. ఈవిషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించలేదని వాపోయారు. తమ భూమి విషయంలో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. కేసు నమోదు శాయంపేట : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట కొంత మంది మహిళలు, పురుషులు రోడ్డుపై కూర్చొని వాహనాదారులను, ప్రజలను అడ్డుకొని ఇబ్బందులకు గురిచేశారని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరమేశ్ తెలిపారు. సోమవారం సాయంత్రం భూపాలపల్లికి చెందిన రొడ్డ రామచందర్, రోడ్డ సరోజన, రోడ్డ శ్యామల, మండలంలోని గోవిందాపూర్ గ్రామానికి చెందిన అడప దేవేంద్రలు రోడ్డుపై కూర్చొని వాహనదారులను, సామాన్య ప్రజలను అడ్డుకొని ఆటంకం కలిగించారని తెలిపారు. పోలీస్ సిబ్బందిని కూడా అడ్డగించి వారి విధులకు ఆటంకం కలిగించారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అసోసియేట్ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు
కేయూ క్యాంపస్: కేయూ పరిధి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు రిజిస్ట్రార్ రామచంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆ ఎనిమిది మంది యూజీసీ 15 జీఓ ప్రకారం.. కేరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం (క్యాస్) ప్రొఫెసర్‌గా పదోన్నతికి అనర్హులుగా ఉన్నారు. ఈ జీఓ ప్రకారం.. ముఖ్యంగా ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా.. ఒక్కో అసోసియేట్ ప్రొఫెసర్ తమ గైడ్షిప్లో ఒక పరిశోధక విద్యార్థికి డాక్టరేట్ అవార్డు అయి ఉండాలనే నిబంధన ఉంది. ఈఎనిమింది అసోసియేట్ ప్రొఫెసర్లకు ఈనిబంధనతో వీరు ప్రొఫెసర్‌గా పదోన్నతికి అనర్హులుగా ఉన్నారు. అయితే గతంలో ఉన్న యూజీసీ 14 జీఓ ప్రకారం అయితే ప్రొఫెసర్‌గా పదోన్నతికి అర్హత ఉంటుందని భావించి వారంతా కలిసి న్యూఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ ) చైర్మన్‌కు గత కొంతకాలం క్రితంనేరుగా ఓలేఖను పంపినట్లు సమాచారం. తమకు క్యాస్ కింద ప్రొఫెసర్‌గా పదోన్నతికి అడ్డంకిగా ఉన్న నిబంధనను సడలించాలని, తమకు ప్రొఫెసర్‌గా గతంలోని 14 జీఓ ప్రకారం అవకాశం కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం వారు యూజీసీ చైర్మన్‌కు పంపిన లేఖకు సంబంధించిన ఒక కాపీని కూడా వర్సిటీ అధికారులకు అందించారు. కాగా, అసోసియేట్ ప్రొఫెసర్లు నేరుగా యూజీసీ చైర్మన్‌కు లేఖ ఎలా పంపుతారని, సర్వీస్ రూల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు ఇది విరుద్ధం అని వీసీ ప్రతాప్‌రెడ్డి ఈవిషయంలో సీరియస్‌గా పరిగణిస్తున్నారు. వీసీ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. త్రూ ప్రాపర్ చానెల్ వర్సిటీ ద్వారా యూజీసీ చైర్మన్‌కు లేఖ పంపాలని ఇష్టారీతిన లేఖ పంపినందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆ షోకాజ్ నోటీస్‌లో పేర్కన్నారు. నోటీసులు అందుకున్నది వీరే.. కేయూ కో–ఎడ్యూకేషనల్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమలత, వర్సిటీ క్యాంపస్‌లోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అర్చన, కేయూ పరిధి కొత్తగూడెం (మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల) ప్రస్తుత డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ పున్నంచందర్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రాము, డాక్టర్ పద్మజ, స్రవంతి షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరు వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. జారీ చేసిన కేయూ రిజిస్ట్రార్ యూజీసీ చైర్మన్‌కు నేరుగా లేఖ పంపడంపై వీసీ సీరియస్ -
కడుపులో బిడ్డ.. కత్తెర కోత!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కడుపులోని బిడ్డ బయటికి రావాలంటే కోత తప్పడం లేదు. గర్భిణులకు ఒకప్పుడు సుఖ ప్రసవం (నార్మల్ డెలివరీ) జరిగేది. కానీ, నేడు సహజ ప్రసవాల స్థానంలో సిజేరియన్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి వరంగల్‌లోని పలు జిల్లాల్లో ప్రతీ పది ప్రసవాల్లో ఏడుకు పైగా సిజేరియన్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ వాటా ఏకంగా 80శాతం దాటగా, వరంగల్ 89.6, జనగామ 89.5 శాతంతో సెంచరీ మార్కుకు చేరువగా ఉన్నాయి. మిగిలిన నాలుగు జిల్లాల్లోనూ ఈ వాటా 80 శాతానికి పైగానే ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–6 (2023–24) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో 70 శాతం పైనే!.. సీ–సెక్షన్ల (సిజేరియన్లు) వాటా ఉమ్మడి వరంగల్ నాలుగు జిల్లాల్లో 70 శాతాన్ని దాటింది. హనుమకొండ జిల్లా 74.1 శాతంతో ముందంజలో ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి 70.4 శాతం, జనగామ 70.2 శాతం, మహబూబాబాద్ 70.1 శాతం నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల వాటా 80 శాతాన్ని దాటింది. జనగామ, వరంగల్ జిల్లాల్లో ఈ వాటా దాదాపు 90 శాతానికి చేరువైంది. జనగామలో 89.5 శాతం, వరంగల్‌లో 89.6 శాతం నమోదైంది. మహబూబాబాద్‌లో 87.5 శాతం, హనుమకొండలో 82.7 శాతం, భూపాలపల్లిలో 82.6 శాతం, ములుగులో 81.9 శాతం ఉన్నాయి. అంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్రతీ పది ప్రసవాల్లో ఎనిమిదికి పైగా సీ–సెక్షన్లే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాల వాటా ప్రైవేట్‌తో పోలిస్తే ఎక్కువగా ఉన్నప్పటికీ.. సీ–సెక్షన్ల శాతం మాత్రం గణనీయంగానే ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కొన్ని జిల్లాల్లో ప్రతీ పది ప్రసవాల్లో ఆరు వరకు సిజేరియన్లు నమోదవుతున్నాయి. ప్రసవాలన్నీ దవాఖానాల్లోనే.. హనుమకొండలో ఆస్పత్రి ప్రసవాలు 100 శాతం నమోదయ్యాయి. అంటే ప్రసవాల కోసం ఆస్పత్రులను ఆశ్రయించే పరిస్థితి పూర్తిగా ఏర్పడినప్పటికీ.. అదే సమయంలో సిజేరియన్ల వాటా 74.1 శాతానికి చేరడం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశంగా మారింది. ఆస్పత్రి ప్రసవాల పెరుగుదల తల్లి, శిశువుల భద్రతకు అనుకూలమైన పరిణామమే. గర్భిణులకు ప్రసవానికి ముందునుంచే సుఖ ప్రసవం, సిజేరియన్ అవసరం అయ్యే పరిస్థితులు, ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.ఉమ్మడి జిల్లాలో ప్రతీ పది ప్రసవాల్లో ఏడూ సీ–సెక్షన్లే సహజ ప్రసవాల (నార్మల్ డెలివరీ)కు ససేమిరా..! ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే.. అయినా పెరుగుతున్న ఆపరేషన్ల వాటా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 80శాతానికి పైనే.. ప్రభుత్వ దవాఖానాల్లో 40–64 శాతం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–6 (2023–24) గణాంకాలు వెల్లడి -
ఎస్ఐఆర్ ఫేజ్–2లో పరకాల ఫస్ట్
పరకాల: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఫేజ్–2లో పరకాల నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఈసందర్భంగా సోమవారం పరకాల ఆర్డీఓ డీఎస్ వెంకన్నకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన తహసీల్దార్లను, ఎంపీడీఓలను, బీఎల్ఓ సూపర్వైజర్లను, బీఎల్ఓతో పాటు ఇతర ఎన్నికల సిబ్బందిని, బూత్‌లెవల్ ఏజెంట్లను కూడా ఎన్నికల ముఖ్య అధికారి అభినందించినట్లు తెలిపారు. అభినందనలు తెలిపిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి -
అసోసియేట్ అధ్యక్షురాలిగా తస్లీమా మహ్మద్
కాజీపేట అర్బన్: తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షురాలిగా ఉమ్మడి జిల్లా చిట్స్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ సోమవారం నియామక పత్రాలను తస్లీమాకు అందించారు. నియామకానికి సహకరించిన టీజీఓ అధికారులు, ఉద్యోగులకు తస్లీమా కృతజ్ఞతలు తెలిపారు. కేయూ క్యాంపస్: కేయూలోని విద్యాకళాశాల ప్రిన్సిపాల్, విభాగాధిపతి డాక్టర్ నల్లాని శ్రీనివాస్‌ను మరో సంవత్సరంపాటు పదవీకాలం పొడిగిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగించినందుకు ఆయన కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డికి, రిజిస్ట్రార్ రామచంద్రంకు కృతజ్ఞతలు తెలిపారు. గీసుకొండ: తెలంగాణ రాజీవ్ ఆరో గ్య శ్రీ వరంగల్ జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొండపర్తి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా మోటి మహేష్‌తో పాటు రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా నల్లబెల్లి అనిల్ ఎన్నికయ్యారు. -
ఉపాధ్యాయుడికి రాష్ట్రస్థాయి పురస్కారం
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో తెలుగు భాషోపాధ్యాయుడు డాక్టర్ వల్సపైడికి తెలంగాణ భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవన్లో నిర్వహించిన విద్యాసదస్సులో విద్యాపరిశోధన శిక్షణా సంస్థ డైరెక్టర్ రమేశ్ చేతులమీదుగా ఈపురస్కారాన్ని వల్సపైడి అందుకున్నారు. ఆయనను రాష్ట్ర విద్యా, పరిశోధనా, శిక్షణ సంస్థ డైరెక్టర్ రమేశ్, ఇతర బాధ్యులు సత్కరించి ప్రశంసపత్రం అందించారు. కాజీపేట: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి ఆటోడ్రైవర్లు, పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో సోమవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ‘అభయ మై టాక్సీ సేఫ్’ యాప్‌ను సీపీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో దాదాపు 12వేల ఆటోలకు క్యూ ఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ నంబర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామంటూ ఆటోడ్రైవర్లతో సీపీ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీ టి.సత్యనారయణ, సీఐలు వెంకన్న, జక్కుల శ్యాంసుందర్, ఎస్సైలు మంగ, శ్రావణ్ సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 7వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్యామల తెలిపారు. హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలోని మోడల్ కెరీర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్‌మేళాలో మెడిప్లస్ సంస్థలో వివిధ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. జూనియర్ అసిస్టెంట్ 100, ఫార్మసీ ఎయిడ్ 50, ఫార్మసిస్ట్ 40, సీఎస్ఏ 50, ఆడిట్ అసిస్టెంట్ 30 పోస్టులు కలిపి మొత్తం 270 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. నెలకు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు. డీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ, పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 19–32 ఏళ్ల యువత హాజరుకావొచ్చని సూచించారు. అభ్యర్థులు ఈనెల 7న ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ (బాలుర) ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరుకావాలని, వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని కోరారు. కాశిబుగ్గ: ‘ఉద్యోగాల పేరుతో దళారుల దందా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి స్పందించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంఽధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఎవరికీ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈనియామకాలు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిఽధిలో ఉంటాయని, ఉద్యోగాల విషయంలో తమ కార్యాలయానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లు మాత్రమే నమ్మాలని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఇలాంటి వారి గురించి తెలిస్తే తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో మంగళవారం సికింద్రాబాద్ రైల్వే సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టనున్నట్లు సోమవారం స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి సేఫ్టీ రైల్వే అధికారుల బృందం తనిఖీ నిమిత్తం కాజీపేట జంక్షన్‌కు ఉదయం చేరుకుని వివిధ విభాగాలకు వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సేఫ్టీ అధికారుల తనిఖీల సమాచారం తెలియడంతో కాజీపేటలో అన్ని రైల్వే విభాగాలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు. -
మురిసినమక్క రైతు
నర్సంపేట: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో అప్పుడప్పుడు కురిసిన వర్షాలు ఆరుతడి పంట రైతులకు కొండంత ఊరటనిచ్చాయి. వానాకాలంలో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులకు శ్రమకు తగ్గట్టు దిగుబడి రావడంతో రైతుల ముఖాల్లో చిరనవ్వులు వికసిస్తున్నాయి. పైగా మార్కెట్లో సైతం వ్యాపారులు మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తుండటంతో ఈసారి మక్క రైతులకు కలిసి వస్తుందని ఆ నందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 14 మండలా ల్లో మొక్కజొన్న పంట 18,208 ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్ సీజన్లో సాగైంది. అత్యధికంగా నర్సంపేట నియోజకవర్గలో సుమారు 11,900 ఎకరాల విస్తీర్ణంలో సాగు అయినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురియడంతో భూగర్భ జలాలు భారీగా అడుగంటి పోయాయి. వరి పంటతో పాటు ఇతర పంటలకు తడినీరు అందుతుందో? లేదో అన్న రైతులకు మొక్కజొన్న పంట ఈసారి ఆదుకుంటుంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.2,410 మద్దతు ధర కంటే వ్యాపారులు రూ. 2,500 వెచ్చించి కొనుగో లు చేయడం కొంత ఉపశయనం కలిగిస్తుంది. గత రబీలో ఇబ్బందులు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రబీ సీజన్లో మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు పలు రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. రికార్డుల ప్రకారం అత్యధికంగా మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులు అకాల వర్షాలతో పాటు మద్దతు ధర కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట ఎక్కువగా సాగు కావడం, దిగుబడులు కూడా అదే స్థాయిలో రావడంతో మార్కెట్లతో పాటు రోడ్లపై ఎక్కడ చూసిన మక్క రాశులే కనించాయి. మార్క్‌ఫెడ్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ లారీల కొరతతో పాటు గోదాంలో స్థలం లేకపోవడంతో మక్కరాశులు పేరుకుపోయాయి. దీంతో రైతులు ఆందోళనకు కూడా దిగారు. ఈసారి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దిగుబడిపై రైతుల సంతృప్తి.. ఈసారి ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు మొక్కజొన్న పంటను సాగు చేసి కాపాడుకుంటూ వచ్చారు. దేవుడు కరుణించి పంట చేతికి వస్తుండడంతో పాటు ఆశించిన స్థాయిలో ది గుబడి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. ఒక ఎకరం సాగు చేసిన రైతుకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గత పది రోజుల నుంచి నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు రైతులు మక్కలను విక్రయించడానికి భారీగా తీసుకువస్తున్నారు. మూడు ఎకరాల్లో సాగు చేశా మాకు ఉన్న ఐదు ఎకరాల్లో మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాం. భారీ వర్షాలు లేనప్పటికీ అప్పుడప్పుడు కురిసిన వర్షాలు మొక్కజొన్న పంటకు తడి నీరు అందింది. 150 బస్తాలను సోమవారం నర్సంపేట మార్కెట్లో విక్రయించాను. క్వింటాకు రూ.2,517ధర లభించింది. గత సంవత్సరం రూ.1,800లకే క్వింటా అమ్ముకోవాల్సి వచ్చింది. గతంతో పోల్చుకుంటే ఈసారి మొక్కజొన్న పంట ఆదుకుంది. –మారపాక రాజు, మాధన్నపేట గతంలో కంటే మేలుగతేడాది మార్కెట్లో ఎవరూ కొనలేదు. క్వింటాకు రూ.1,800 కూడా ధర లభించలేదు. ఈసారి వర్షాలు తక్కువ పడినా.. పంట బాగానే వచ్చింది. వ్యాపారులే స్వయంగా మంచి ధరకు కొంటున్నారు. ప్రభుత్వం ఇదేవిధంగా కాంటాలు త్వరగా పెడితే రైతులకు మేలు జరుగుతుంది. – బోడ మంగునాయక్, ఏనుగల్ తండాజిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలు (ఎకరాల్లో)2,918మొత్తం సాగు విస్తీర్ణం: 18,2081,6521,3361,047928849796729264వర్ధన్నపేటసంగెంనల్లబెల్లిపర్వతగిరిదుగ్గొండిగీసుకొండనర్సంపేటవరంగల్ఖిలా వరంగల్ఖానాపురంరాయపర్తిచెన్నారావుపేటనెక్కొండమొక్కజొన్న సాగుకు అనుకూలంగా వాతావరణం ఆశించిన మేర దిగుబడి వచ్చే అవకాశం మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు నర్సంపేట మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు2,6881,9531,8981,150 -
మై ట్యాక్సీ సేఫ్ యాప్ ఆవిష్కరణ
కాజీపేట: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి ఆటోడ్రైవర్లు, పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కాజీపేట ప్యారడౌజ్ ఫంక్షన్ హాల్లో సోమవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ‘అభయ మై టాక్సీ సేఫ్’ యాప్‌ను సీపీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో దాదాపు 12వేల ఆటోలకు క్యూ ఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ నంబర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామంటూ ఆటోడ్రైవర్లతో సీపీ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీ టి.సత్యనారయణ, సీఐలు పిట్టల వెంకన్న, జక్కుల శ్యాంసుందర్, ఎస్సైలు మంగ, శ్రావణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మొరం దోపిడీపై ఆర్డీఓ తనిఖీ
ఐనవోలు: కొండపర్తిలో మొరం తవ్వకాలు, తరలింపుపై ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలకు స్పందనగా అధికారులు క్షేత్రస్థ్ధాయిలో పరిశీలించారు. హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్ మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వేలాది మెట్రిక్ టన్నుల మొరం భారీ ఎత్తున తరలిపోయిందని గుర్తించారు. తరలిన మొరానికి ఫైన్ విధించాలని తహసీల్దార్ విక్రమ్‌కుమార్‌ను ఆదేశించారు. అనంతరం మైనింగ్ శాఖ ఆర్ఐ కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించినట్లు స్థానిక రైతులు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయికి రావడం స్వాగతించదగిన పరిణామమే అయినప్పటికీ.. ఇప్పటి వరకు అసలు ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తనిఖీలు క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టడానికి కాకుండా కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న టైంపాస్ వ్యవహారమే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుతో అనుమానాలు! ‘వందలాది టిప్పర్ల మొరం తరలిపోతుంటే స్థానిక యంత్రాంగం ఇన్నాళ్లు ఎందుకు నిఘా పెట్టలేదు? వేల క్యూబిక్ మీటర్ల విలువైన సహజ సంపదను కొల్లగొడితే కేవలం నామమాత్రపు ఫైన్ వేసి కేసును ముగించే ప్రయత్నం వెనుక ఆంతర్యం ఏంటి? తవ్వకాలకు ఉపయోగించిన భారీ యంత్రాలు జేసీబీ, ఇటాచీ, టిప్పర్లు ఎవరివి? వాటిని ఎందుకు సీజ్ చేయలేదు. మైన్స్ అండ్ మినరల్స్ శాఖ క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? క్షేత్రస్థ్ధాయిలో అక్రమంగా మట్టి తరలిందన్న విషయం గుర్తించిన అధికారులు అక్రమార్కులకు ఇబ్బంది కలుగకుండా ఫైన్ పేరుతో ఈ దందాను అధికారికంగా సర్దుబాటు చేస్తున్నారా’ అని స్థానికుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ నేరుగా మానిటర్ చేస్తూ సమగ్ర సర్వే ద్వారా తవ్వకాల పరిమాణాన్ని తేల్చి అసలు సూత్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య ఉద్యమం
హన్మకొండ అర్బన్: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్యే నా యిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకా శ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రజా స్వామ్య పరిరక్షణ శంఖారావం నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి, అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు. -
వినతులు సత్వరమే పరిష్కరించండి
● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఆమె అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. కలెక్టరేట్‌తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు మొత్తం 254 వినతులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డీఆర్డీఓ మేన శ్రీను, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరంగల్ ప్రజావాణికి 248 దరఖాస్తులు న్యూశాయంపేట: వరంగల్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. మొత్తం 248 మంది తమ సమస్యలను పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారదకు దరఖాస్తులు అందించారు. అందిన ప్రతీ ఫిర్యాదును పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. -
సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి కృషి చేయాలి
నర్సంపేట: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియపై నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతీ పట్టభద్రుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, పట్టణ అధ్యక్షుడు పంబి వంశీ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, రూపిక శ్రావణ్, చెన్నారావుపేట, నెక్కొండ, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
‘మైనింగ్’ ఆపండి.. రామప్పను కాపాడండి!
సాక్షిప్రతినిధి, వరంగల్: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక రామప్ప చెరువుకు సింగరేణి ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనితో పొంచిఉన్న ముప్పుపై పౌరులు, పౌరస్పందన వేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘మైనింగ్ ఆపండి, రామప్పను కాపాడండి’ నినాదంతో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఓపెన్‌కాస్ట్ బొగ్గుగని వల్ల ముప్పు పొంచి ఉందని, ఆ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ (కేహెచ్‌టీ) వినతిపత్రం సమర్పించింది. ఈ మేరకు ట్రస్టీ ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, వరంగల్ నగర మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, మండల పరశురాములు తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 3 టీఎంసీల చెరువుపై ప్రభావం? ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామం వద్ద సింగరేణి ప్రతిపాదించిన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ మైన్ రామప్ప చెరువు, దేవాలయానికి దిగువ వైపున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. గనిని సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వే ప్రతిపాదన ఉందని తెలిపారు. పీవీఎన్ఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు రామప్పకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్న తాజా అధ్యయనాలు కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 3 టీఎంసీల నీటిని నిల్వచేసి దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే రామప్ప చెరువుకు ముప్పు పొంచి ఉందనని తెలి పారు. చెరువు కింద భాగంలో 300 మీటర్ల లోతైన గని తవ్వితే భూగర్భజలాల ప్రవాహంలో మార్పులు, లీకేజీ వేగం పెరిగే అవకాశం ఉందని, దీనిపై జీఎస్ఐ నివేదికలోని పరిశీలనలను ఉటంకించిందని కేహెచ్‌టీ బాధ్యులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. బ్లాస్టింగ్ వల్ల రామప్ప ఆలయం ఇప్పటికే ఫ్లోర్ బీముల్లో పగుళ్లు, డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వంటి సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంది. అధికార యంత్రాంగం నో అన్నా.. పీవీఎన్ఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదిత దశలోనే ఉంది. 2021లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ప్రాజెక్టుకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) మంజూరుకు సిఫారసు చేసింది. 2026 సెప్టెంబర్‌లో రామప్పపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు శాసీ్త్రయ, పర్యావరణ అధ్యయనాలు పూర్తయ్యే వరకు ముందుకు వెళ్లరాదనే అభిప్రాయాన్ని ములుగు జిల్లా యంత్రాంగం వ్యక్తం చేసింది. ఇటీవల పాలంపేట ప్రత్యే క అభివృద్ధి సంస్థ సమావేశంలో కూడా ప్రాజెక్టు ప్రభావంపై సమగ్ర పరిశీలన, శాసీ్త్రయ అధ్యయనా ల అవసరాన్ని చర్చించారు. అన్ని అంశాలను పరిశీ లించిన తర్వాతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు నివేదికలు వెల్లడించినా సింగరేణి ముందుకు సాగడంపై కేహెచ్‌టీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కేహెచ్‌టీ వినతిపత్రం ‘రామప్ప’ పరిరక్షణకు ప్రజా ఉద్యమం 5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ చెరువుపై ‘హైడ్రాలిక్ గ్రేడియంట్’ ప్రభావంపై ఆందోళన -
మైనింగ్ ఆపండి.. రామప్పను కాపాడండి!
సాక్షిప్రతినిధి, వరంగల్: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక రామప్ప చెరువుకు సింగరేణి ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనితో పొంచిఉన్న ముప్పుపై పౌరులు, పౌరస్పందన వేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘మైనింగ్ ఆపండి, రామప్పను కాపాడండి’ నినాదంతో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఓపెన్‌కాస్ట్ బొగ్గుగని వల్ల ముప్పు పొంచి ఉందని, ఆ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ (కేహెచ్‌టీ) వినతిపత్రం సమర్పించింది. ఈ మేరకు ట్రస్టీ ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, వరంగల్ నగర మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, మండల పరశురాములు తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు. అధికార యంత్రాంగం నో అన్నా.. పీవీఎన్ఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదిత దశలోనే ఉంది. 2021వ సంవత్సరంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ప్రాజెక్టుకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) మంజూరుకు సిఫారసు చేసింది. 2026 సెప్టెంబర్‌లో రామప్పపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు శాసీ్త్రయ, పర్యావరణ అధ్యయనాలు పూర్తయ్యే వరకు ముందుకు వెళ్లరాదనే అభిప్రాయాన్ని ములుగు జిల్లా యంత్రాంగం వ్యక్తం చేసింది. ఇటీవల పాలంపేట ప్రత్యేక అభివృద్ధి సంస్థ సమావేశంలో కూడా ప్రాజెక్టు ప్రభావంపై సమగ్ర పరిశీలన, శాసీ్త్రయ అధ్యయనాల అవసరాన్ని చర్చించారు. ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)పై తుది నిర్ణయం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు నివేదికలు వెల్లడించినా సింగరేణి ముందుకు సాగడంపై కేహెచ్‌టీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అవుతోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామం వద్ద సింగరేణి ప్రతిపాదించిన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ మైన్ రామప్ప చెరువు, దేవాలయానికి దిగువ వైపున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. గనిని సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వే ప్రతిపాదన ఉందని తెలిపారు. పీవీఎన్ఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు రామప్పకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్న తాజా అధ్యయనాలు కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 3 టీఎంసీల నీటిని నిల్వచేసి దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే రామప్ప చెరువుకు ముప్పు పొంచి ఉందనని తెలిపారు. చెరువు కింద భాగంలో 300 మీటర్ల లోతైన గని తవ్వితే భూగర్భజలాల ప్రవాహంలో మార్పులు, లీకేజీ వేగం పెరిగే అవకాశం ఉందని, దీనిపై జీఎస్ఐ నివేదికలోని పరిశీలనలను ఉటంకించిందని కేహెచ్‌టీ బాధ్యులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. బ్లాస్టింగ్ వల్ల రామప్ప ఆలయం ఇప్పటికే ఫ్లోర్ బీముల్లో పగుళ్లు, డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వంటి సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంది.కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కేహెచ్‌టీ వినతిపత్రం ‘రామప్ప’ పరిరక్షణకు ప్రజా ఉద్యమం 5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ చెరువుపై ‘హైడ్రాలిక్ గ్రేడియంట్’ ప్రభావంపై ఆందోళన -
స్వల్పంగా పెరిగిన
భూగర్భ జలాలుసెప్టెంబర్లో జిల్లా సగటు నీటిమట్టం 5.98 మీటర్లు ● జిల్లాలో లోటు వర్షపాతంహన్మకొండ: వర్షాభావ పరిస్థితుల్లోనూ భూగర్భ జలాలు స్వల్పంగా పెరగడం రైతులకు ఊరటనిస్తోంది. జిల్లాలో 36శాతం లోటు వర్షంపాతం నమోదైనా భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి. భూమి ఉపరితలం నుంచి చూస్తే సెప్టెంబర్ మాసాంతంలో 5.98 మీటర్ల వద్ద భూగర్భ జలమట్టం ఉంది. జిల్లాలో 25 ప్రాంతాల్లో ఫీజో మీటర్ల ద్వారా నమోదైన భూగర్భ జలమట్టం వివరాలను భూగర్భజల శాఖ ప్రతినెలా చివరి వారంలో సేకరిస్తుంది. నైరుతి రుతుపవనాలకు ముందు సీజన్ మే మాసాంతంలో హనుమకొండ జిల్లా సగటు భూగర్భ జలమట్టం 6.17 మీటర్లు. జూన్ నాటికి 7.25 మీటర్లు, జూలై నాటికి 7.71 మీటర్లకు భూగర్భ జలమట్టం పడిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో క్రమంగా భూగర్భ జలమట్టం పెరిగింది. ఆగస్టులో 6.83 మీటర్లకు, సెప్టెంబర్ మాసాంతానికి అది 5.98 మీటర్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ మాసాంతంలో 3.40 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 2.58 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ ఏడాది జూలై మాసాంతంతో పోలిస్తే సెప్టెంబర్ మాసాంతానికి 1.73 మీటర్లు, ఆగస్టుతో పోలిస్తే 0.85 మీటర్లు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతేడాదితో పోల్చుకుంటే భూగర్భజలాలు ఈసారి పడిపోయి ఉండడం నీటి ఎద్దడికి సూచికగా కనిపిస్తోంది. 2,13,435 ఎకరాల్లో పంటల సాగు జిల్లాలో అన్ని పంటలు కలిపి గతేడాది వానాకాలంలో 2,27,957 ఎకరాల్లో సాగు చేయగా, ఈ వానాకాలంలో 2,13,435 ఎకరాల్లో సాగైంది. 14,522 ఎకరాలు తక్కువ సాగు చేశారు. ఇందులో వరి గతేడాది 1,45,601 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ వానాకాలంలో 1,20,446 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న గతేడాది 7,080 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 8,444 ఎకరాలు, పప్పు దినుసులు గతేడాది 395 ఎకరాలు కాగా, ఈ ఏడాది 4,486 ఎకరాలు, నూనె గింజలు గతేడాది 32 ఎకరాలు, ప్రస్తుతం 309 ఎకరాలు, పత్తి గతేడాది 74,849 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 75,747 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది కంటే వరి 25,155 ఎకరాల్లో తక్కువ సాగైంది. దీంతో భూగర్భ జల వినియోగం కొంత మేర తగ్గింది. దీనికితోడు గతనెల 24, 25 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి స్వల్పంగా నీరు చేరింది. దీంతో భూగర్భ జలాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. జిల్లాలో ఈనెల 3వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 824.5 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 524.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 36 శాతం లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాలోని 14 మండలాల్లో ఒక మండలంలో 50 శాతం లోటు ఉండగా 5 మండలాల్లో 41 నుంచి 49 శాతం లోటు ఉంది. మిగతా మండలాల్లో 17 నుంచి 37 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో నడికూడ మండలం చర్లపల్లిలో అత్యధికంగా 13.32 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. భీమదేవరపల్లి మండలం వంగరలో 11.60 మీటర్ల లోతులో, హసన్‌పర్తి మండలం నాగారంలో 10.82 మీటర్ల లోతులో, పెద్ద పెండ్యాలలో 10.23 మీటర్ల లోతులో ఉండగా, ధర్మసాగర్లో అత్యంత పైన 1.50 మీటర్ల లోతులో ఉన్నాయి.ప్రాంతాల వారీగా భూగర్భ జలమట్టం వివరాలు (మీటర్ల లోతులో) గ్రామం మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ధర్మసాగర్ 1.47 1.81 3.10 2.8 2.25 1.96 1,5 ఎల్కతుర్తి 6.50 7.10 7.40 7,25 7.85 8.45 8.62 హనుమకొండ 5.30 5.30 6.50 7.00 6.9 5.4 4.78 ఐనవోలు 4.40 5.30 5.50 5,2 5.95 4.05 2.48 వేలేరు 4.00 5.40 6.15 5.7 8.47 3.78 4.05 ఆత్మకూరు 2.15 1.48 3.20 3.3 3.57 2.95 2.47 దామెర 4.10 6.50 6.60 6.71 7.27 6.1 6.37 నడికూడ 0.80 1.20 2.50 3.02 2.9 2.3 2.08 పరకాల 2.70 2.70 3.10 3.08 3.51 2.1 2.01 -
‘ముల్కనూరు’ నమూనా దేశానికే ఆదర్శం
భీమదేవరపల్లి: దేశానికే ఆదర్శంగా నిలిచిన ముల్క నూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘం పనితీరు ఎంతో స్ఫూర్తిదాయకమని గ్రూప్ –1, 2, 3 ట్రైనీ అధికారులు కొనియాడారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో శిక్షణ పొందుతున్న 290 మంది అధికారులు రెండు రోజుల పాటు రెండు విడతల్లో ముల్కనూరు సహకార సంఘాన్ని సందర్శించి అధ్యయనం చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 3న మొదటి విడతలో 145 మంది, 4న రెండో విడతలో మరో 145 మంది సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి సొసైటీ ఆవిర్భావం, రైతులకు అందిస్తున్న రుణాలు, పొదుపు పథకాలు, విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత సేవలతో పాటు రైతు సంక్షేమ కార్యక్రమాలను సంఘం సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో సొసైటీ జనరల్ మేనేజర్ ఎం.రాంరెడ్డితో పాటు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. సంఘాన్ని సందర్శించిన గ్రూప్ –1, 2, 3 ట్రైనీ అధికారులు -
ఇండెంట్ ఇస్తేనే బ్రేక్ ఫాస్ట్
కాళోజీ సెంటర్ : పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అందించే అల్పాహారం, పాలు కార్యక్రమానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మరుసటి పనిదినానికి అవసరమైన అల్పాహారం ఇండెంట్‌ను ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల్లోపు ఎండీఎం యాప్‌లో నమోదు చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం నుంచి అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ అయ్యాయి. 7 మండలాల్లో బ్రేక్ ఫాస్ట్ అమలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌లో 7 మండలాలను ఎంపిక చేశారు. అయితే ఎయిడెడ్, యూపీఎస్ హైస్కూల్ పాఠశాలలు కలిపి జిల్లాలో మొత్తం 294 పాఠశాలల్లో సుమారు 19 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నారు. వరంగల్, ఖిలా వరంగల్ మండల పరిధిలో ఉన్న పాఠశాలలకు అక్షయపాత్ర ఫౌండేషన్, గీసుగొండ, సంగెం, నల్లబెల్లి, వర్ధన్నపేట, దుగ్గొండి మండలాల్లోని పాఠశాలల్లో హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా అమలు చేస్తున్నారు. వీరికి మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ ఇండెట్ ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఎండీఎం యాప్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీనిప్రకారం అక్షయ పాత్ర, హరి కృష్ణ ఫౌండేషన్ వారు విద్యార్థులకు అల్పాహారం అందజేస్తారు. అయితే యాప్‌లో టెక్నికల్ ఇబ్బందులు, అప్లోడ్ చేయడంపై అవగాహన లేకపోవడం, ఆన్లైన్లో ఆప్షన్లు రాకపోవడం వంటి కారణాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రాష్ట్ర అధికారులు ప్రతీ రోజు సెలవు దినాలు చూసుకొని యాప్‌లో ఎంట్రీ చేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన సమయం.. మరుసటి రోజు అల్పాహారం ఇండెంట్‌ను గతంలో మధ్యాహ్నం 12 గంటల్లోపు నమోదు చేయాలని ఆదేశాలు ఉండగా, ప్రధానోపాధ్యాయుల సౌకర్యార్థం ఆ గడువును మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. అయితే కొందరు హెచ్ఎంలు సరైన ఇండెంట్ నమోదు చేయకపోవడంతో అల్పాహారం సరఫరా చేసే ఏజెన్సీలు అవసరమైన పరిమాణంలో ఆహారాన్ని సిద్ధం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. జీరో ఇండెంట్‌తో అల్పాహారంలో కోత హెచ్ఎంలు ఇండెంట్ నమోదు చేసే సమయంలో విద్యార్థుల సంఖ్య, అవసరమైన పరిమాణాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సంబంధిత శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున ఇండెంట్ ‘జీరో’గా నమోదు చేసినా, ఆటో ఫార్వర్డ్ ద్వారా జీరోగా వెళ్లినా సిస్టమ్ దానిని అల్పాహారం అవసరం లేనట్లుగా పరిగణిస్తుంది. దీంతో సంబంధిత పాఠశాలకు ఆ రోజు అల్పాహారం సరఫరా చేయరు. ఇండెంట్ నమోదు చేయకపోవడం, తప్పుగా నమోదు చేయడం లేదా జీరో ఇండెంట్ కారణంగా అల్పాహారం సరఫరా కాకపోతే అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. జిల్లా విద్యాశాఖాధికారులు ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులు అందుబాటులో లేరు. ముందురోజు మధ్యాహ్నం 2 గంటల్లోపు ఇవ్వాల్సిందే! -
అమ్మవారి సన్నిధిలో వీపీ గౌతమ్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని రాష్ట్ర హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఈయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులను అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సద్వినియోగం చేసుకోవాలి.. న్యూశాయంపేట: సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓ కార్యాలయాలు, మండలాల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే గ్రీవెన్స్‌కు అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు. హన్మకొండ: తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 హనుమకొండ జిల్లా ప్రాంతీయ సమావేశం సోమవారం జరుగుతుందని ఆ యూనియన్ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పల్లా రవీందర్‌రెడ్డి భవన్లో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సమావేశానికి యూనియన్ సభ్యులు సకాలంలో హాజరు కావాలని మహేందర్‌రెడ్డి కోరారు. మేడారంలో మొక్కుల సందడిఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలసంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, సమర్పించారు. సంతానం కలగాలని మహిళలు రావి చెట్టు వద్ద ముడుపులు కట్టారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. హేమాచల క్షేత్రంలో పూజలుమంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు హేమాచల క్షేత్రం ఆదివారం భగవన్నామస్మరణతో మార్మోగింది. ఆలయంలోని స్వయంభూ స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొనేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. -
హిమం నుంచి సాగరం వరకు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘హిమం’ అంటే చలి.. మంచు.. కశ్మీర్ గుర్తొస్తుంది. ‘సాగరం’ అంటే సముద్రం.. కన్యాకుమారి గుర్తుకొస్తుంది. ఈ రెండు భిన్న భౌగోళిక ప్రపంచాలను ఒకే రైలు పట్టాలపై కలిపితే అదే హిమసాగర్ ఎక్స్‌ప్రెస్. దేశంలోని ఒక చివర నుంచి మరో చివర వరకు ప్రజలను తీసుకెళ్తున్న ఈ సుదూర రైలు 1984 అక్టోబర్ 3న తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పట్లో జమ్ముతావి–కన్యాకుమారి మధ్య నడిచిన ఈ రైలు.. ఆ తర్వాత దేశంలోనే అత్యంత దూరం నడిచే రైళ్లలో ఒకటిగా నిలిచింది. 2015లో జమ్ముతావి బదులు శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా వరకు పొడిగించారు. ఇప్పుడు ఈ రైలుకు 42 ఏళ్లు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ప్రయాణికులను మోస్తున్న ఈ రైలు ప్రస్తుతం భారత రైల్వేలో మూడో అత్యంత సుదూర రైలు సర్వీసుగా కొనసాగుతోంది. సుమారు 3,790 కి.మీ. దూరాన్ని దాదాపు 70 గంటల ప్రయాణంలో కవర్ చేస్తోంది. 12 రాష్ట్రాల మీదుగా.. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ దేశ భౌగోళిక వైవిధ్యానికి ఒక కదిలే అద్దం. జమ్మూకశ్మీర్ నుంచి ప్రారంభమై పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజ స్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మీదుగా ప్రయాణిస్తుంది. 12 రాష్ట్రాల మీదుగా సాగుతున్న ఈ సుదూర ప్రయాణం భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకే రైలులో ప్రయాణిస్తే.. ఉత్తర భారత వాతావరణం నుంచి దక్షిణ భారత తీరప్రాంత వాతావరణం వరకు మార్పును ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆధ్యాత్మిక పర్యటనకూ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. కాట్రాలోని శ్రీమాతా వైష్ణోదేవి నుంచి ప్రారంభమైన ప్రయాణం.. మార్గమధ్యలో తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను కలుపు తూ చివరికి కన్యాకుమారి వరకు తీసుకెళ్తుంది. అప్పట్లో ‘లాంగెస్ట్’.. ఇప్పుడు మూడో స్థానం హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే అత్యంత దూరం నడిచే రైలు ప్రయాణాల్లో అగ్రస్థానంలో ఉండేది. 2011లో దిబ్రూగఢ్–కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ రావడంతో ఆ రికార్డు మారింది. ప్రస్తుతం వివేక్ ఎక్స్‌ప్రెస్, అరొనై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల తర్వాత హిమసాగర్ మూడో స్థానంలో ఉంది. దేశాన్ని కలపడానికి రైల్వే పట్టాలు వేసిన కాలంలో పుట్టిన ఈ రైలు.. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ‘హిమం నుంచి సాగరం వరకు.. భారతదేశం ఒక్కటే’ అనే భావనకు కదిలే చిహ్నంగా నిలుస్తోంది.వరంగల్‌కు ప్రత్యేకమైన అనుబంధంహిమసాగర్ ప్రయాణంలో ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రైలు తెలంగాణలో రామగుండం, వరంగల్, ఖమ్మం స్టేషన్లలో మా త్రమే ఆగుతుంది. వరంగల్‌లో ఒక నిమిషం, ఖమ్మంలో మరో నిమిషం మాత్రమే ఆగుతుంది. రైలు వరంగల్ స్టేషన్‌కు చేరుకునే సమయం సుమారు 16:09 గంటలు కాగా.. 16:10కే బయలుదేరుతుంది. అంటే ప్రయాణికుడు రైలు ఎక్కడానికి, దిగడానికి కూడా గడియారం కన్నా వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నమాట. కాగా, హిమసాగర్ ఎక్స్‌ప్రెస్‌కు కాజీపేటలో స్టాప్ లేదు. ‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉంది. కాజీపేట నుంచి హిమసాగర్ కు మాత్రం కనెక్షన్ లేదు’ అంటూ రైల్వే ప్రయాణికులు సరదాగా వ్యాఖ్యానించే పరిస్థితి. వరంగల్ మీదుగా హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ 42 ఏళ్ల ప్రయాణం కశ్మీర్ కొండల నుంచి కన్యాకుమారి సముద్రతీరం వరకు.. 3,790 కిలోమీటర్ల దూరం.. 70 గంటల సుదీర్ఘ జర్నీ -
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
కాశిబుగ్గ: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని, ప్రజలు తమ ఓటు హక్కు ద్వా రా ఎన్నుకునే ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి అసలైన ప్రతినిధులని అన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థపైనే అనుమానాలు కలిగే పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నెల 7న వరంగల్ పోచమ్మ మైదాన్ నుంచి హనుమకొండ అంబేడ్కర్ వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలకు కీలకమైన ఎన్ని కల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సమావేశంలో మేరు సంఘ కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట్రాజం, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరవి పరమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బస్మీయా, రత్నమాల, సయ్యద్ ఫైజుల్లా, టీ డీపీ నాయకుడు రఘు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా నాయకుడు హకీమ్ నవీద్ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు -
భూగర్భంలోనే కాకతీయుల కళాఖండాలు
ఖిలా వరంగల్: కాకతీయ రాజధానిలో అనేక అద్భుతమైన కట్టడాలు, నిర్మాణాలు భూగర్భంలోనే దాగి ఉన్నాయని, ప్రజలు సహకరిస్తే వాటిని వెలికితీసి టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్లో కలెక్టర్‌ను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కాకతీయుల కట్టడాలను పరిరక్షించాలని వారు కోరుతూ జ్ఞాపికతోపాటు వినతిపత్రం అందజేశారు. అనంతరం, కలెక్టర్ మాట్లాడుతూ ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. శివమూర్తి, రంజిత్, వెంకటేశ్వర్లు, అఖిల్‌గౌడ్, అజయ్, సంజీవ్, అశోక్, మహేష్, గోవర్ధన్, శ్రీను, సంతోష్, రాజు, రాజశేఖర్, రమేష్, మనోహర్ పాల్గొన్నారు. ప్రజలు సహకరిస్తే చరిత్రను వెలికితీస్తాం సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం వరంగల్ కలెక్టర్ సత్యశారద -
సంక్షేమ శాఖలో ఇన్చార్జులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ అభివృద్ధి శాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. శాఖలో పూర్తిస్థాయిలో అధికారులు లేక అభివృద్ధి కుంటుపడుతోందన్న విమర్శలున్నాయి. తీసుకోవాల్సి న నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని, సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా శాఖల్లో అధికారులు కొందరు ఉద్యోగ విరమణ పొందగా, మరికొందరు బదిలీ అయ్యారు. దీంతో కింది స్థాయి అధికారులకు ఎఫ్ఏసీగా, పక్క జిల్లా అధికారులకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎఫ్ఏసీ, ఇన్చార్జ్ బాధ్యతలందుకున్న ఉద్యోగులు అదనపు భారంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఐదు నెలలుగా ఎస్సీ కార్పొరేషన్లో.. ఐదు నెలల క్రితం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉద్యోగ విరమణ పొందగా.. పక్క జిల్లా ఈడీకి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి పూర్తి స్థాయి అధికారిగా పక్క జిల్లాతో పాటు హనుమకొండ జిల్లా ఇన్చార్జ్గా డ్యూయల్ జాబ్ రోల్ చేస్తున్నారు. ఆరు నెలలుగా బీసీ వెల్ఫేర్‌లో.. జిల్లాలోని బీసీ వెల్ఫేర్ అధికారి ఆరు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందగా ఇన్చార్జ్ బాధ్యతలను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారికి అప్పగించారు. ఇటీవల పూర్తిస్థాయి అధికారి వచ్చినట్టే వచ్చి వారం రోజుల్లోనే ఉద్యోగ విరమణ పొందారు. దీంతో మళ్లీ ఇన్చార్జ్ పాలనే బీసీ వెల్ఫేర్ శాఖలో కొనసాగుతోంది. కుంటుపడుతున్న అభివృద్ధి ఖాళీల భర్తీల్లో గందరగోళంసీ్త్ర, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో ఈ ఏడాది జనవరిలో జిల్లా అధికారి ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి సీడీపీఓ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూర్తి స్థాయి అధికారి లేక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 55 టీచర్, 160 ఆయాల పోస్టుల భర్తీకి కేవలం 55 మంది టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. జారీ అయిన నోటిఫికేషన్లో రిజర్వేషన్లకు విరుద్ధంగా పోస్టులను కేటాయించారంటూ కలెక్టర్‌కు దమ్మన్నపేట సర్పంచ్ వినతిపత్రం అందించడం చర్చనీయాంశంగా మారింది.


