ఫాస్ట్‌.. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌.. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌

Feb 20 2026 6:25 AM | Updated on Feb 20 2026 6:25 AM

ఫాస్ట

ఫాస్ట్‌.. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌

ఫాస్ట్‌.. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌

హన్మకొండ: పారదర్శకంగా రైతులకు పథకాలు అందజేసేందుకు ప్రభుత్వం ఫార్మర్‌ రిజిస్ట్రీని తీసుకొచ్చింది. ప్రతీ రైతు ఈ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ ద్వారా రైతులకు 11 అంకెల నంబర్‌ కేటాయిస్తారు. వ్యవసాయ సంబంధిత ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇది శాశ్వత గుర్తింపు సంఖ్యగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన రైతుల డిజిటల్‌ డేటాబేస్‌, ఫార్మర్‌ రిజిస్ట్రీ ద్వారా రైతుల ఆధార్‌ నంబర్‌, భూమి, ఇతర వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఈ రిజిస్ట్రేషన్‌ అయిన రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఎలాంటి గందరగోళానికి తావు ఉండదు. వేర్వేరు పథకాల కోసం పదేపదే పత్రాలను సమర్పించే బదులు, ఈ ఒక గుర్తింపు నంబర్‌ సులభమార్గం అవుతుంది.

రిజిస్ట్రీ చేసుకోకపోతే పథకాల నిలిపివేత..

ఫార్మర్‌ రిజిస్ట్రీ మోసాలు, నకిలీ ఎంట్రీల అవకాశాలను నివారిస్తుంది. ముఖ్యంగా చెల్లింపులో మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతు ఖాతాలోకి వెళ్తాయి. రైతు రిజిస్ట్రీ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు పొందడంలో ఆలస్యం జరిగే అవకాశముంది. పీఎం కిసాన్‌ పథకం వంటి చెల్లింపుల వాయిదాల్లో ఆలస్యం కావడం లేదా నిలిపేసే అవకాశముంది. ఈ క్రమంలో రైతు రిజిస్ట్రీ తప్పనిసరి. రైతు రిజిస్ట్రీ కోసం ఆధార్‌కార్డు నంబర్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం వివరాలు, ఆధార్‌ లింక్‌ అయిన మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ అవసరం. ఇప్పటి వరకు రైతు వేదికలు, మండల వ్యవసాయాధికారి కార్యాలయాల్లో జరిగిన రైతు రిజిస్ట్రీ ప్రక్రియ ఇప్పుడు గ్రామాల్లోనే చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాలకు చేరుకుని రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఈ నెల 28 వరకు రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వేగంగా ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం రైతులు 1,57,057 ఉండగా.. ఇప్పటివరకు 92,591 మంది రైతులు నమోదు చేసుకున్నారు.

రైతు రిజిస్ట్రీతో బహుళ ప్రయోజనాలు..

కేంద్ర, రాష్ట్ర ప్రఽభుత్వ పథకాలు సులభంగా పొందవచ్చు. రైతు వివరాలు కచ్చితంగా నమోదు చేసుకుంటే పారదర్శకతకు అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్‌ సహాయానికి ఫార్మర్‌ గుర్తింపు నంబర్‌ తప్పనిసరి. పంటల బీమా, రుణాలు, ఇతర ప్రభుత్వ ప థకాలు త్వరగా అందుతాయి. నగదు బదిలీ సా యం నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది.

ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలి..

రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవడం తప్పనిసరి, ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ రిజిస్ట్రీ అవసరం. రైతు కేంద్రీకృత సేవలకు బలమైన డిజిటల్‌ పునాదిని వేయడానికి ప్రభుత్వం అగ్రిస్టాక్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టింది. గ్రామాల్లో వ్యవసాయ విస్తరాణాధికారి ద్వారా రైతు నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ప్రతీ రైతు విధిగా తమ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ నెలతో ఈ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

– రవీందర్‌సింగ్‌,

జిల్లా వ్యవసాయాధికారి

గ్రామాల్లో ఈనెల 28 వరకు ప్రక్రియ పూర్తి

జిల్లాలో మొత్తం రైతులు

1,57,057 మంది

ఇప్పటి వరకు నమోదు చేసుకున్న వారు 92,591 మంది

ఫాస్ట్‌.. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ 1
1/1

ఫాస్ట్‌.. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement