చదవుకునే వయసులో..చదువు అంతగా నచ్చదు, బుర్రకు ఎక్కదు కూడా. టీనేజ్ వయసులో ఎడ్యుకేషన్ అనేది అత్యంత కీలకమైన టర్నింగ్ పాయింట్. పైగా ఆ టైంలో బాగా చదువుకుంటూనే త్వరగా సెటిల్ అవ్వగలం. కానీ ఆ ఏజ్‌లో చదువుకి డుమ్మా చెప్పేసింది. కొన్నాళ్లుకు గానీ జ్ఞానోదయం కాలేదు..తానెంత పెద్ద తప్పు చేసింది. దాంతో మళ్లీ పుస్తకాలు కుస్తీ పట్టీ చదవడమే కాదు..పీహెచ్‌డీ అందుకుంది ప్రోఫెసర్‌గా ఉద్యోగాన్ని కూడా పొందిందామె. ఆమె కథ చదువంటే భయపడే యువతకు స్ఫూర్తి, కనువిప్పు కూడా..!.
ఏ వ్యక్తికైనా చదువే మంచి గుర్తింపుని అందిస్తుంది. కానీ ఆ చదవుకే మధ్యలోనే స్వస్తి చెప్పింది జర్మన్‌కి చెందిన అన్నా షూత్. 17 ఏళ్ల టీనేజ్ వయసులో ఈ చదువులు నా వల్ల కాదంటూ కాలేజ్‌కి డుమ్మా కొట్టేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన తోటి స్నేహితులు కెరీర్‌లో తనకంటే ముందుకు సాగిపోవడం ఉండటం చూసి బాధకలగడం మొదలైంది అన్నాకి. ఏదైనా తప్పు చేశానా..ఇది సరైనాదేనా..అనే సందేహాలతో కొన్నాళ్లు గడిపేసింది.
ఇంక లాభం లేదు..తాను మళ్లీ చదివి గుర్తింపు తెచ్చుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యి..20ల టైంలో మళ్లీ కాలేజ్ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. క్లాస్‌రూమ్‌లో అందరికంటే పెద్దగా.. సవాళ్లు ఎదురైనా..అన్నింటిని పక్కన పెట్టి మరి మనసుపెట్టి చదివింది. అలా ఆమె 35 ఏళ్లకు పీహెచ్‌డీ సంపాదించింది. 42 ఏళ్ల వయసులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగాన్ని పొందిందామె. అయితే మళ్లీ చదువుని ప్రారంభిస్తున్నప్పుడు.." ఇదివరకటిలా చదవగలనా..సైన్స్‌లో సీటు సంపాదించడం కుదురుతుందా అని సందేహాలు వచ్చేశాయి. గానీ..చదవడం ప్రారంచాక..ఎలాగైనా..అనుకున్నది సాధించొచ్చనే అనే నమ్మకం డెవలప్ అయ్యి..నా లక్ష్యాన్ని చేరుకోలిగానంటోంది". అన్నా.
ఈ రోజు, షూత్ హెల్త్, మెడిసిన్ అండ్ లైఫ్ సైన్సెస్ ఫ్యాకల్టీలోని మాస్ట్రిక్ట్ విశ్వవిద్యాలయంలో గ్రూప్ లీడర్. ఆమె ఆంకాలజీ, అధునాతన మైక్రోస్కోపీ అండ్ బయోమెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలపై పరిశోధనలు చేస్తోంది. ఆమె ఈ శాస్త్రీయ పరిశోధనలతో పాటు, విద్యారంగంలో మానసిక ఆరోగ్య సవాళ్ల గురించి, ముఖ్యంగా STEM రంగంలోని మహిళ రాకపోవడం గురించి బహిరంగంగా మాట్లాడుతూ..చైతన్యపరుస్తుంటారామె.
ఇక్కడ అన్నా తొలుత చదువు వద్దనుకున్నా..మళ్లీ చదవాలనుకుని పుస్తకాలు కుస్తీ పట్టే క్రమంలో ఎంతో భావోద్వేగాన్ని ఫేస్ చేసుంటారు. కానీ వాటిన్నంటిని అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకోవడం నిజంగా ప్రశంసనీయం కదూ..!.
(చదవండి: వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..)


