Hanamkonda
-
హౌస్ లిస్టింగ్‌ను వేగవంతం చేయాలి
వరంగల్ అర్బన్: జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను వేగంగా, సమర్థవంతంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సూచించారు. కాజీపేట పరిధి నక్కలగుట్ట, వరంగల్‌లోని కాశిబుగ్గ జీడబ్ల్యూఎంసీ సర్కిల్ కార్యాలయాలను ఆదివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. జనగణన వివరాల సేకరణ పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో నమోదవుతున్న వివరాలు, డేటా ఎంట్రీ పురోగతి, సిబ్బంది పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో ప్రతీ ఇంటి వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చే సేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్ర సన్నారాణి, అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ -
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిభావంతులు
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండ: ప్రైవేట్ విద్యాసంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రతిభావంతులని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన టాప్ ర్యాంకర్లకు ఆదివారం రూ.10 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడినని, ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకున్నానని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఐపీఎస్ అధికారిగా విజయం సాధించానని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం తన నియోజకవర్గంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలకు రూ.10 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘స్ఫూర్తి’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రజాప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, డీఈఓ రంగయ్య నాయుడు, జిల్లా సైనన్స్ అధికారి శ్రీనివాస్ రావు, ఏసీజీఈ అరుణ పాల్గొన్నారు. -
బినామీ కొలువులు!
రెగ్యులర్ కార్మికుల స్థానంలో ఇతరుల విధులువరంగల్ అర్బన్: నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. వీరిలో కొందరు విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్ల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి తోడు శాశ్వత ప్రాతిపదికన పనిచేసే కొందరు పారిశుద్ధ్య కార్మికులు తమ స్థానంలో మరొకరిని నియమించుకుని పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పాలకవర్గం లేదు. రెగ్యులర్ కమిషనర్ లేరు. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాలో ఉన్నట్లు సమాచారం. ప్రజారోగ్యం వదిలి ఇతర విభాగాలకు.. బల్దియా ప్రజారోగ్య విభాగంలో మొత్తం 2,667 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 30 శాతం మంది ఆ విభాగాన్ని వదిలి ఇతర విభాగాలకు వెళ్తున్నారు. కానీ, ప్రతీనెలా వీరికి బల్దియా పక్కాగా వేతనాలు అందిస్తోంది. కొందరు కార్మికులు కార్యాలయాల్లో, సర్కిల్ ఆఫీస్, వార్డు కార్యాలయాల్లో ఆఫీస్ సబార్డినేటర్లుగా చేరి టీ, కాఫీలు అందిస్తున్నారు. ఇంకొందరు వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు సహాయకులుగా పనిచేస్తున్నారు. మరికొందరు ప్లాస్టిక్ కవర్ల నిషేధం, డంప్ యార్డు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు సవ్యంగా సాగడం లేదు. వాస్తవానికి కార్మికులు ఎక్కడి వారు అక్కడ పనిచేస్తే సమస్యలు ఉత్పన్నం కావు. పారిశుద్ధ్య విభాగంలో కొందరు మరో విభాగానికి వెళ్లి పోతుండడంతో నగరంలో పలు డివిజన్లలో పారిశుద్ధ్య విభాగంపై ప్రభావం పడుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పని కార్మికుల కొరత ఉందంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికుల లెక్కలు పూర్తిగా వెలికి తీస్తే వాస్తవంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఆ సహసం చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఒకరి బదులు మరొకరు.. గ్రేటర్లో పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు 167 మంది ఉన్నారు. అందులో 70 శాతం మంది కేవలం ఉదయం వేళ ఫేస్ మొబైల్ యాప్‌లో అటెండెన్స్ వేసి ఇంటి ముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి సీనియార్టీ ప్రకారం.. నెలకు రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు వేతనాలు అందుతున్నాయి. వీరిలో 70 శాతం మంది పనులకు వెళ్లకుండా వేరొకరిని ఏర్పాటు చేసుకుని నెలవారీ శానిటరీ ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వేతనం ఇస్తున్నట్లు సమాచారం. అనారోగ్యం తదితర కారణాల వల్ల బదిలీ కార్మికుడితో పనిచేయిస్తూ వారికి నెలకు రూ.8 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరు తూతూమంత్రంగా పనిచేస్తున్నట్లు విమర్శలున్నాయి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేయకుండా బదిలీ కార్మికులను నియమిస్తే ఒక్కో శానిటరీ ఇన్స్పెక్టర్లకు రూ.6వేల నుంచి రూ.8వేల వరకు నెలవారీ మామూళ్లను ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇక జవాన్లు తామేం తక్కువంటూ రెగ్యులర్ కార్మికుల నుంచి రూ.వెయ్యి చొప్పున దండుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో బదిలీ కార్మికుడిని నియమిస్తే శానిటరీ ఇన్స్పెక్టర్కు రూ.2వేలు, జవాన్‌కు రూ.వెయ్యి చొప్పున ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈవిషయమై బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. డిప్యుటేషన్‌పై, బినామీ కార్మికులుగా పనిచేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకు నెలకు రూ.8 వేలు ఇస్తున్నట్లు ఆరోపణలు సహకరించినందుకు శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్ల వసూళ్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్టారాజ్యం -
మాక్‌డ్రిల్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: వివిధ శాఖల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్స్ పార్కు ప్రాంగణం, గుండు చెరువులో వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాక్‌డ్రిల్ జరగనుంది. ఈ మేరకు మాక్‌డ్రిల్ ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద ఆదివారం సాయంత్రం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరెల్లి బుచ్చయ్య స్కూల్లో పునరావాస కేంద్రం, హెల్త్ క్యాంపు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. వరదల సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర సహాయక చర్యలు, వైద్య సేవలు, తాగునీరు, ఆహార సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలని సూచించారు. మాక్ డ్రిల్ నిర్వహణలో పాల్గొనే రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్యం, విద్యుత్, ఆర్అండ్బీ, మున్సిపల్, పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వేగవంతమైన స్పందన, ప్రజలకు రక్షణ, శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుందని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలి
కాజీపేట అర్బన్: ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ సూచించారు. హంటర్‌రోడ్డులోని లయన్స్‌క్లబ్ హాల్లో పొన్నం మొగిలి అధ్యక్షతన ముదిరాజ్ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ల సన్మానంతో పాటు ఉగాది డైరీని ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండా ప్రకాశ్ హాజరై మాట్లాడుతూ ముదిరాజ్‌లు పదవులు వదులుకోవద్దని సూచించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ద్వారానే హైదరాబాద్‌లో ముదిరాజ్‌ల ఆత్మగౌరవ భవనానికి స్థలం, నిధులు మంజూరు చేయించామన్నారు. బీసీ–డీ నుంచి బీసీ–ఏలో చేర్చాలనే పోరాటంలో ముది రాజ్‌లు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల వెంకటనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ జిల్లా మత్స్యశాఖ చీఫ్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య, రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ శానబోయిన రాజ్‌కుమార్, జిల్లా మహాసభ ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం, నాయకులు సోమయ్య, బుస్సా మల్లేశం, బయ్య స్వామి, పులి రజినీకాంత్, పోలు అయర్ చంద్, గోనెల పద్మ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ -
కార్మికులను ఆదుకోవాలి
కాశిబుగ్గ: ఎంజీఎంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్ వర్కర్లు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య అన్నారు. మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు అధ్యక్షతన ఆదివారం ఎంజీఎంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకొర వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు తమ పొట్ట గొడుతూ జేబులు నింపుకుంటున్నారని ఆరో పించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంజీఎం హాస్పిటల్ కార్మికులు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గొర్రె నాగరాజు, అధ్యక్షుడిగా విజయ్, ఉపాధ్యక్షులుగా రాజేష్, అరుణ్‌కుమార్, భిక్షపతి, సహాయ కార్యదర్శులుగా లక్ష్మణ్, ఆనందం, శ్రీనివాస్, కమల, కోశాధికారిగా పవన్, రాజవీరు, లలిత, ప్రచార కార్యదర్శులుగా లింగమూర్తి, కరుణ, కిరణ్, సలహాదారులుగా స్వరూప, రమేష్, ఇందిర, సభ్యులను ఎన్నుకున్నారు. -
ఖర్చులను నియంత్రించుకోవాలి
ఖిలా వరంగల్: వినియోగదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఖర్చులను నియంత్రించుకోవాలని వినియోగదారుల దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి ఇన్చార్జ్ చైర్మన్, కార్యదర్శి మొగిలిచర్ల సుదర్శన్ సూచించారు. వరంగల్ శివనగర్‌లోని వినియోగదారుల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఆర్.ఆనందరావు అధ్యక్షతన ఆది వారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచ ఆందోళనకర పరిస్థితుల ప్రభావం ప్రతి వినియోగదారుడిపై ఉంటుందని, ఖర్చుపై ప్రణాళికాబద్ధమైన నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. జంక్‌ఫుడ్, ఇతర హోటల్ వంటకాలతో వచ్చే రోగాలపై మహిళలకు అవగాహన కల్పించాలని సుదర్శన్ కోరారు. అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తుల వ్యాట్‌ను తగ్గించాలని తీర్మానం చేశారు. జిల్లా ప్రతినిధులు లక్ష్మీనారా యణ, ఫజలుద్దీన్ అహ్మద్, రవికిరణ్, రామకృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు -
నేటి ‘గ్రేటర్’ గ్రీవెన్స్ రద్దు
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) జరిగే గ్రీవెన్స్ సెల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రత్యేకాధికారి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మాక్ ఎక్సర్సైజ్ (మాక్ డ్రిల్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగనున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని వివరించే మాక్ ఎక్సర్సైజ్ (డ్రిల్)ను నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నందున గ్రీవెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో యువతలో నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు యువజన క్రీడా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఉచిత శిక్షణ కోసం పరీక్షన్యూశాయంపేట: నిరుపేద మైనార్టీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించేందుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హనుమకొండ కుమార్‌పల్లి మార్కెట్ హైస్కూల్, వరంగల్ జిల్లా వారికి సుఫా హైస్కూల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. సుమారు 160 మంది దరఖాస్తులు సమర్పించినట్లు శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ ఫ్యాకల్టీలు తెలిపారు. కాగా, 140 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు ఫర్హానా తబస్సుమ్, ఆసిఫ్అఫ్జల్ తెలిపారు. ఖిలా వరంగల్: ఓరుగల్లు వీరత్వానికి పురిటిగడ్డ అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, సినీగేయ రచయిత కాసర్ల శ్యాం, ఓయూ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఖిలా వరంగల్ ఖుష్‌మహల్ ప్రాంగణంలో చేతనే కళావేదిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల నాగేశ్వర్ ఆధ్వర్యంలో కాకతీయ కళాజాతర ఉత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ నేల చారిత్రక వైభవంతోపాటు కళలు, సాహిత్యం, జానపద సంప్రదాయాలకు చిరునామాగా నిలిచిందని చెప్పారు. కాకతీయుల వారసత్వాన్ని కొనసాగించడం ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. గేయ రచయిత శ్రీనివాస్, గందె నవీన్, ఎడ్ల అశోక్‌రెడ్డి, పుల్లారావు, గోకారపు శ్యాం, సంగీత దర్శకుడు కార్తీక్, గాయకుడు కొల్లూరి యోగానంద్, కళాకారులు పాల్గొన్నారు. -
బదిలీల భయం
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్నతాధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాయినింగ్ పీరియడ్ లెక్కలు వేసుకుంటూ సర్వీస్ బుక్‌లతో కుస్తీ పడుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో పలుకుబడి ఉపయోగించుకుంటూ బదీలీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూనియన్ పేరు చెప్పుకుంటూ ఆఫీస్ బేరర్లుగా బదిలీల నుంచి మినహాయింపు, కోరుకున్న చోటకు వెళ్లేందుకు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. 40 శాతం ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉండడంతో నాలుగేళ్ల సర్వీస్ దాటిన వారందరికీ బదిలీల గండం ఏర్పడింది. ఇక్కడే తిష్ట.. ఎంజీఎంలో కొంతమంది ఉద్యోగులు బదిలీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం వదులకుని ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న ఉద్యోగులు అకౌంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల ఎంజీఎంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి అయితే జాయినింగ్ నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నా మళ్లీ బదిలీ నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మినిస్టీరియల్ విభాగం నుంచి ఐదుగురు ఉద్యోగులు బదిలీలు సిద్ధంగా ఉన్నారు. ఇక పెద్దాస్పత్రి పెద్ద పోస్ట్ అయిన సూపరింటెండెంట్ పోస్ట్ కోసం ఎంజీఎంలో పనిచేసిన ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఎంజీఎం ఆస్పత్రిని 24 అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉండడంతో పెద్ద పోస్టు కోసం భారీగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రావాలన్నా.. పోవాలన్నా భయమే! ఎంజీఎంలో పనిచేస్తున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతుండగా, ఇతర జిల్లాల్లోని అధికారుల్లో కొందరు ఎంజీఎం అంటే వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో గతంలో జరిగిన అవకతవకలపై తరచూ పత్రికల్లో రావడంతో వామ్మో, ఎంజీఎం మాకొద్దు అంటూ ఇక్కడ ఉద్యోగం చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంజీఎంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి మంచిర్యాలలో సూపరింటెండెంట్ పోస్టులో ఉండగా, ఎంజీఎంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి బదిలీపై ఇతర ఆస్పత్రికి వెళ్లి, తిరిగి ఎంజీఎంలో ఇన్చార్జ్గా కొనసాగడానికి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ పోస్టు కోసం ఎంజీఎంలోనే సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ గోపాల్‌రావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న డాక్టర్ సంధ్య కేఎంసీతో పాటు కాళోజీ యూనివర్సీటీలో కూడా పనిచేశారు. అయితే ఆమె బదిలీ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపోస్టు కోసం మహబూబాబాద్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఎంజీఎంలో పాతుకుపోయిన ఉద్యోగులకు స్థానచలనం తప్పదా? ఉన్నతాధికారి పోస్టుకు డిమాండ్ -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
డెంగీ రహిత సమాజానికి కృషి చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: డెంగీ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున చింతల్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అందరూ ఐక్యంగా డెంగీ నివారణ చర్యలు చేపట్టడంతోనే వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహించి, రక్త పరీక్షలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు, కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ రాజేశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు ఇఫ్తకార్ అహ్మద్, వైద్యులు అరుణ్, విజయ్‌కుమార్, దిలీప్, వేద కిరణ్, శ్రవణ్, అనిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి న్యూశాయంపేట: సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయాన్ని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, రెడ్‌క్రాస్ పాలక మండలి సభ్యులు ఇ.వి.శ్రీనివాస్, డీఎంహెచ్ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించాలి ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ, అధికారులు పాల్గొన్నారు. 34,782 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జిల్లాలో ఇప్పటి వరకు 34,782 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 32,098 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించగా 2,933 మంది రైతులకు రూ.40.64 కోట్ల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. అలాగే 19,780 మంది రైతుల నుంచి 1,00,624.15 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి సుమారు రూ.241.49 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. -
100కు డయల్ చేస్తే తక్షణ సాయం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హసన్‌పర్తి: ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 100కు డయల్ చేస్తే తక్షణ సాయం అందుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. జాగృతి పోలీస్ కళాబృందం హసన్‌పర్తిలో శనివారం కళాజాత ప్రదర్శన నిర్వహించింది. కార్యక్రమానికి కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తొలుత కల్లుకు అలవాటు పడి మెల్లమెల్లగా డ్రగ్స్ తీసుకునే స్థాయి వరకు చేరుతారని పేర్కొన్నారు. తప్పిదాలతోనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాలకు గురెతే 1930కు డయల్ చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇంటర్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ఆదిత్యను శాలువాతో సత్కరించారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్, ఎస్సై దేవేందర్, రవి, డాక్టర్ తహసిద్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ భార్గవ్, నాయకులు పావుశెట్టి శ్రీధర్, కిరణ్ పాల్గొన్నారు. -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్‌కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్‌లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
సామాజిక న్యాయసూత్రాలు తెలుసుకోవాలి
హన్మకొండ: భావోద్వేగాలకు సంబంధించిన నైపుణ్యాలుంటే నేరాలు జరగవని హనుమకొండ జిల్లా అదనపు న్యాయమూర్తి, జిల్లా పరిశ్రమలు, లేబర్ కోర్టు జడ్జి టి.శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ జెడ్పీ కార్యాలయ ఆవరణలోని వృద్ధుల డే కేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా పెంచాలన్నారు. తద్వారా వృద్ధాప్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని వివరించారు. అశోకుడు పురాతన కాలంలోనే తెలి పిన సామాజిక న్యాయసూత్రాలు అందరూ తెలు సుకోవాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాసేవాధికార సంస్థకు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామెర నర్సయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్ కె.అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాలాల్లో పూడికతీత పనులు పూర్తిచేయాలి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ/కాజీపేట/వరంగల్ అర్బన్: నాలాల్లో పూడికతీత పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి రాజాజీనగర్‌లో నాలాలో పూడికతీత పనులు, అశోకా జంక్షన్ నుంచి బుద్ధ భవన్ మీదుగా కాకతీయ యూనివర్సిటీ వరకు రోడ్డు, నిట్ ప్రధాన రహదారి వెంట కల్వర్టు, డ్రైనేజీ, 60, 61 డివిజన్లలో అభివృద్ధి పనులను పరిశీలించారు. బాలాజీనగర్ నాలా బ్రిడ్జి పూడికతీత పనులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చేపడుతున్న పనులపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తక్షణమే పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే నాయిని అధికారులను ఆదేశించారు. అశోకా జంక్షన్ నుంచి కేయూ రోడ్డు వరకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, ఆర్టీసీ బస్సులు సులభంగా రాకపోకలు సాగించేలా బస్టాండ్ నుంచి కాంగ్రెస్ భవన్ రోడ్డు మీదుగా కేయూ రోడ్డుకు అనుసంధానం చేసే ప్రతిపాదనలను పరిశీలించినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అంబేడ్కర్ జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు రూ.24 కోట్లతో అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, నాగరాజు పాల్గొన్నారు. -
మాక్ ఎక్సర్సైజ్ పకడ్బందీగా నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: రెవెన్యూ, పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో ఈనెల 18న మాక్ ఎక్సర్సైజ్ను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వివిధ శాఖల సమన్వయంతో రక్షణ, సహాయక చర్యలు ఎలా చేపడతామో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ నగర పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ ఫేజ్–2, వివేక్‌నగర్, సమ్మయ్యనగర్, ప్రగతినగర్, గోపాలపూర్, టీవీటవర్ కాలనీ, యూపీహెచ్సీ లష్కర్‌సింగారం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించే ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించాలని, బల్దియా స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డీఆర్వో కె.శ్రీనివాస్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఎంహెచ్ఓ అప్పయ్య, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, అగ్నిమాపక శాఖ అధికారి సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కళలు, క్రీడల్లోనూ రాణించాలి విద్యారణ్యపురి: విద్యార్థులు చదువుతోపాటు కళలు, క్రీడల్లోను రాణించాలని కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ సూచించారు. విద్యావారోత్సవాల్లో భాగంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల విద్యార్థులకు ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్డే నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్, క్రాఫ్ట్ వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం హనుమకొండ బాలభవన్ విద్యార్థుల ఏకదంతాయ వక్రతుండాయ నృత్య ప్రదర్శన, ఎంపీపీఎస్ విద్యార్థుల బంజార జానపద నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్, డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్, జీసీడీఈఓ సునీత, ప్లానింగ్ కోఆర్డినేటర్ బి.మహేశ్, అకడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మోహన్, ఎంఈఓ ఎ.శ్రీనివాస్, ఏసీజీఈ భువనేశ్వరి పాల్గొన్నారు. -
గాడి తప్పిన పాలన!
వరంగల్ అర్బన్: పరిపాలన బలోపేతం కోసం గత ప్రభుత్వం నాలుగేళ్ల కిందట వార్డు ఆఫీసర్లను నియమించింది. వారు క్షేత్రస్థాయిలో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పైస్థాయి ఉద్యోగులకు, అధికారులకు సమాచారం అందించాలి. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు ఫిర్యాదుదారులకు జవాబుదారీగా ఉండాలి. కానీ, అధికారుల పర్యవేక్షణాలోపం, వార్డు ఆఫీసర్ల పనుల్లో నిబద్ధత కొరవడిన కారణంగా పౌరసేవలు సకాలంలో అందట్లేదు. బల్దియాలో వందల సంఖ్యలో సమస్యలపై ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వార్డు ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం ఇక్కడ పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. వార్డు ఆఫీసర్ల విధులేంటంటే.. నగరంలో 66 వార్డులున్నాయి. వార్డుకో అధికారిని నియమించారు. వార్డు పాలన వ్యవస్థలో పౌర సేవల పట్టిక అమలు కోసం పనిచేయాలి. పౌరుల సౌకర్యార్థం పట్టికలను వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించాలి. ప్రజలు వార్డు కార్యాలయాల్లో అందించే ఫిర్యాదులపైనే కాకుండా సామాజిక మధ్యమాలు, కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఫిర్యాదులపై స్పందించి పరిష్కారం చూపాలి. ఆస్తి, నీటి, గార్బేజీ చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ సొమ్ము వసూలు చేయాలి. వార్డు ఆఫీసర్లు జనన మరణ ధ్రువ పత్రాల అసిస్టెంట్లుగా, విచారణ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించాలి. రోడ్లపై గుంతలు, మ్యాన్‌హోళ్ల మూతలు, రోడ్లపై మురుగునీరు, నీటి నిల్వ లు, నాలాల్లో ప్రవాహం అడ్డంకులు, పుట్‌పాత్ సమస్య, వీధిలైట్లు, రోడ్లు పక్కన మట్టికుప్పలు, ఇంటింటా చెత్త సేకరణ తీరు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, దోమల సమస్య, జంతు, పక్షుల కళేబారాలు, పెంపుడు కుక్కల లైసెన్స్, దివ్యాంగులకు, వృద్ధులకు గుర్తింపు కార్డులు, తాగునీటి సరఫరాలో కొరత, లీకేజీలను గుర్తించడం తదితర సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని సంబంధిత విభాగాధికారులకు, సిబ్బందికి సమాచారం చేరవేయాలి. ఎవరికి వారే.. వార్డు ఆఫీసర్లు కేవలం ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు, సామాజిక పింఛన్ల దరఖాస్తులకే పరిమితమయ్యారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యం తదితర విభాగాల పనులపై కన్నెత్తి చూడడం లేదు. ఆయా విభాగాలకు చెందిన చైన్మెన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లను శానిటరీ జవాన్లు, బిల్ కలెక్టర్లను భాగస్వామ్యం చేసుకోవాలి. కానీ, బల్దియాలో ఆ విధానం అమలు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నచిన్న పనులకు సైతం నగరవాసులు అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. సమస్యల సత్వర పరిష్కారం కోసం వార్డు ఆఫీసర్లకు ప్రభుత్వం సెల్ఫోన్లను అందించింది. నగరవాసులు ఫోన్ ద్వారా సమస్యలు తెలుపవచ్చు. కానీ, వార్డు ఆఫీసర్లే కాదు.. ఇతర విభాగాల సిబ్బంది కూడా ఫోన్లు ఎత్తడానికి ఇబ్బంది పడుతున్నారు. వాట్సాప్‌లో సందేశం పంపినా సమాధానం కరువవుతోందని పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీక్షల్లేవు.. సమస్యలు పరిష్కారం కావు.. వార్డుల్లో బల్దియాకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంనే వార్డు ఆఫీసర్లు కార్యాలయంగా ఎంచుకుంటున్నారు. నెలకోసారి డిప్యూటీ కమిషనర్లు వార్డు ఆఫీసర్లతో సమావేశమై ఫిర్యాదులు, పనితీరును సమీక్షించాల్సి ఉన్నా అవేమీ అమల్లోకి రావట్లేదు. ఇలా బల్దియాలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా నగర వాసులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఉన్నతాధికారులు వార్డు ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పౌరులు కోరుతున్నారు. బల్దియాలో వార్డు ఆఫీసర్ల పనితీరుపై విమర్శలు కార్యాలయాల్లేవు.. కొరవడిన సమన్వయం క్షేత్రస్థాయిలో సమస్యలతో నగరవాసులు సతమతం -
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పూర్ణచందర్, మయూరి, స్రవంతి, సతీశ్, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, శ్రీధర్‌రావు.. ఎమ్మెల్యే దంపతులను పూర్ణకుంభంతో స్వాగతించారు. ఎమ్మెల్యే దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో నూతన రథం నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వీలైనంత త్వరగా రథనిర్మాణం పూర్తి చేయాలని రథ శిల్పి ప్రవీణ్ ఆచార్యకు సూచించారు. -
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు
ఖిలా వరంగల్: రౌడీషీటర్లు శాంతిభద్రతలకు భంగం కలిగించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మామునూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటేశ్ నేతృత్వంలో స్థానిక రౌడీషీటర్లకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఈస్ట్ జోన్‌డీసీపీ అంకిత్ కుమార్ హాజరై మాట్లాడారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేరప్రవర్తన కలిగిన వ్యక్తులు చట్టబద్ధంగా, సమాజానికి హాని కలగకుండా ప్రవర్తించాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, గొడవలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. చట్టాలను గౌరవిస్తూ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అనుమానాస్పద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలిపారు. తమ పరిసరాల్లో ఎలాంటి నేర ఘటన జరిగినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఫోన్ నంబర్, చిరునామా లేదా వ్యక్తిగత వివరాల్లో మార్పులు వచ్చినప్పుడు వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ యాదవ్, జవ్వాజి సురేశ్, విశ్వేశ్వర్, సంగెం ఎస్సై వంశీ కృష్ణ పాల్గొన్నారు.రౌడీషీటర్లకు డీసీపీ అంకిత్‌కుమార్ కౌన్సెలింగ్ -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారుసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు.. మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్‌షాప్ షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గం.నుంచి మధ్యాహ్నం 01 గం. వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
పుస్తక పఠనంతోనే నిరంతర జ్ఞానం
రామన్నపేట: పుస్తక పఠనంతోనే నిరంతర విజ్ఞానం సాధ్యమని వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ రంగయ్యనాయుడు, వరంగల్ ఎంఈఓ వెంకటేశ్వరావు, మట్టెవాడ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె.అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ: బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.నిర్మల తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలెబుల్ స్కూల్ స్కీమ్ కింద ఒకటో తరగతి, ఐదో తరగతిలో అడ్మిషన్ కల్పించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాకు ఒకటో తరగతిలో 87 సీట్లు, 5వ తరగతిలో 88 సీట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ నెల 15 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు హనుమకొండ, హసన్‌పర్తి సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయం నుంచి దరఖాస్తు ఫామ్ పొంది, పూర్తి చేసిన దరఖాస్తులను అదే కార్యాలయంలో జూన్ 6న సాయంత్రం 5 గంటల్లోపు అందించాలని సూచించారు. వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్య, వైద్యం తర్వాత క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత మొదటి కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం హనుమకొండ రెడ్డికాలనీలోని వారాహి బాంక్వెట్ హాల్లో నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో నగరంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. అనంతరం జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్‌యాదవ్, తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి దుపాకి సంతోశ్‌కుమార్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు నాయకపు నాగరాజు, బొడ్డు విష్ణువర్ధన్, వల్లెం సుధాకర్, సంపత్, రాజు, రామకృష్ణ, దాసారపు సారయ్య, పరిపూర్ణచారి తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో 32 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్ ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ కలిపి 8,226 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 7,732 మంది (94 శాతం) హాజరయ్యారు. 494 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో 1,965 మంది విద్యార్థులకుగాను 1,811 మంది హాజరుకాగా.. (92 శాతం) 154 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ దేవాదాయఽ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 18 నుంచి ప్రతీ సోమవారం ధర్మవాణి కార్యక్రమం నిర్వహిస్తామని వరంగల్ దేవాదాయశాఖ డీసీ, అసిస్టెంట్ కమిషనర్ సునీత శుక్రవారం తెలిపారు. ప్రజలు, భక్తులు, అర్చకులు, ఇతర ఉద్యోగులు తమ సమస్యలను వివరించి, పరిష్కరించుకోవచ్చునని పేర్కొన్నారు. -
‘కారుణ్య’ దరఖాస్తుల పరిశీలన
వరంగల్ అర్బన్ : బల్దియా పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల కారుణ్య నియామకాల కమిటీ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఈఈ మహేందర్, రాజేశ్ పాల్గొన్నారు. కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. మొత్తం 42 దరఖాస్తులను పరిశీలించగా, అందులో 34 మంది అ భ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపా రు. మిగతా దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు వెల్లడించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరీదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కాగా, నేడు శనివారం వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఉపేంద్రశర్మ తెలిపారు. -
మా డిగ్రీ ఎప్పుడు పూర్తవుతుంది?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులు శుక్రవారం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తాము 2023–24 విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందామని, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తాము రెండో సెమిస్టర్‌లోనే ఉన్నామని, ఇప్పటికీ తమకు పుస్తకాలు సైతం ఇవ్వలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 7నుంచి డిగ్రీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండో సెమిస్టర్ విద్యార్థులు కొందరు ఆందోళనకు దిగారు. మూడేళ్లు కావొస్తున్నా.. తాము డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొంది మూడేళ్లు కావస్తోందని, ఆరో సెమిస్టర్లో ఉండాల్సి ఉండగా, ఇంకా రెండో సెమిస్టర్ పరీక్షలే ఇప్పుడు జరగుతున్నాయని, ఇలా అయితే, తమ డిగ్రీ ఎప్పటికి పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత వర్సిటీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఒక్క పుస్తకం ఇవ్వలేదని, పరీక్ష ఎలా రాస్తారని వారు ప్రశ్నించారు. విద్యార్థులు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్‌ను కలిసేందుకు యత్నించగా.. డైరెక్టర్ సురేశ్‌లాల్ అందుబాటులో లేరు. అక్కడినుంచి వారంతా రిజిస్ట్రార్ చాంబర్‌కు వెళ్లారు. రిజిస్ట్రార్ కూడా అందుబాటులో లేకపోవడంతో వీసీ చాంబర్ వద్దకు వెళ్తుండగా.. ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామ్రెడ్డి, పరీక్షల నియంత్రణాఽధికారి రాజేందర్ విద్యార్థులతో మాట్లాడారు. వెంకట్రామ్రెడ్డి దూర విద్యా కేంద్రం డైరెక్టర్ సురేశ్లాల్కు ఫోన్ చేసి విద్యార్థులతో మాట్లాడించారు. సురేశ్‌లాల్ మాట్లాడుతూ ‘వాస్తవంగా విద్యార్థులు ఆరో సెమిస్టర్లో ఉండాలని, ఇక నుంచి ప్రతీ మూడు నె లలకు ఒక సెమిస్టర్ చొప్పున మిగతా సెమిస్టర్లు పూర్తి చేస్తామని, స్టడీ మెటీరియల్ అందిస్తాం’ అని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న కేయూ పోలీస్టేషన్ పోలీసులు అక్కడికి వచ్చారు. మూడేళ్లు గడుస్తున్నా ఇంకా రెండో సెమిస్టర్‌లోనే.. ఇప్పటికీ ఒక్క పుస్తకం ఇవ్వలే.. కేయూ దూరవిద్య డిగ్రీ విద్యార్థుల ఆందోళన -
మాక్ డ్రిల్స్ స్పందన కీలకం
రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి దాసరి హరిచందన హన్మకొండ అర్బన్: వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, అటవీ అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపర్చడంలో మాక్ డ్రిల్స్ కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి దాసరి హరిచందన అన్నారు. టేబుల్‌టాప్ ఎక్సర్సైజ్కు సంబంధించి పలు జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగంతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రిటైర్డ్ మేజర్ జనరల్ సుధీర్ బాహల్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈసందర్భంగా దాసరి హరిచందన మాట్లాడుతూ.. ఈనెల 18న రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఎడీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల పాత్రలు, బాధ్యతలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన జనగామ ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే చిన్నారి ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్ శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్‌నంబర్ ఆధారంగా నరేష్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జనగామ జిల్లా చంపక్ హిల్స్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
కాజీపేట మీదుగా వేసవి 8 ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం కాజీపేట జంక్షన్ మీదుగా హైదరాబాద్–గోరఖ్‌పూర్ మధ్య అప్ అండ్ డౌన్ రూట్లో 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జూన్ 5, 12, 19, 26వ తేదీల్లో హైదరాబాద్–గోరఖ్‌పూర్ (07075) మధ్య ప్రయాణించే సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు 23:28 గంటలకు చేరుకుంటుంది. జూన్ 7, 14, 21, 28వ తేదీల్లో హైదరాబాద్–గోరఖ్‌పూర్ (07076) వెళ్లే సమ్మర్ స్పెషల్ ట్రైన్ కాజీపేట జంక్షన్‌కు మరుసటి రోజు 04:48 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా, చంద్రాపూర్, నాగపూర్ జంక్షన్, బేతుల్, ఈటార్సీ, భోపాల్, బీనా జంక్షన్, విజిల్ ఝాన్సీ జంక్షన్, ఒరాయ్, పొక్రాయన్, ఖాన్పూర్ సెంట్రల్, ఆష్భాగ్ జంక్షన్, లక్నో సిటీ, గోంటినగర్, బరబంకి జంక్షన్, గోండా జంక్షన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ వేసవి ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రుద్రేశ్వరుడిని దర్శించుకున్న జస్టిస్ తిరుమలాదేవి హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని బుధవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తిరుమలాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆలయ మర్యాదలతో జస్టిస్ తిరుమలాదేవి దంపతులను ఘనంగా స్వాగతించారు. ఆమె రుద్రేశ్వరుడిని దర్శించుకుని గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగు ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ తిరుమలాదేవి మాట్లాడుతూ.. తాను పలుమార్లు ఈ దేవాలయాన్ని సందర్శించి మొక్కుబడులు సమర్పించుకున్నట్లు తెలిపారు. దేవాలయాలు సమాజహిత కేంద్రాలుగా విరజిల్లాలని, పురాతన దేవాలయాల్లో పూజలు నిర్వహించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రముఖులను దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఆహ్వాన పత్రికలు అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. వారి వెంట కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ మోహన్‌శర్మ, ఆర్జేసీ రామకృష్ణరావు, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు. -
మనస్సు పెడితే మనోహరమే..
ఖిలా వరంగల్ : చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని మధ్యకోటలో పర్యాటక అభివృద్ధి పనులు కొనసాగడం లేదు. ప్రభుత్వం మనసు పెడితే మరింత మనోహరంగా కనిపిస్తుందని చరిత్రకారులు భావిస్తున్నారు. రాతికోట చుట్టూ విశాలమైన, లోతైన (నీటికోట) అగర్త చెరువు 60శాతం మేర నేటికి కనిపిస్తోంది. కాకతీయుల రాజధానిలోకి శత్రువులు అడుగు పెట్టేందుకు అవకాశం లేకుండా రక్షణగా అగర్త చెరువులో అప్పట్లో మొసళ్లను పెంచేవారు. నేడు మత్స్యకారులు చేపలు పెంచుతూ ఉపాధిని పొందుతున్నారు. నిలిచిన రూ.2కోట్ల అభివృద్ధి పనులు.. రాతికోట పక్కన తాచుపాములా వంపు సొంపులతో సుందరంగా (మోటు) అగర్త చెరువు కనిపిస్తుంది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ సత్యశారద, మంత్రి కొండా సురేఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వీరి ప్రతిపాదనలతో మోటు పునరుజ్జీవనం/స్పాంజ్పార్కు కోసం గతేడాది డిసెంబర్ 16న ప్రభుత్వం రూ.2కోట్ల నిధులు కేటాయించి పనులను మంత్రి ప్రారంభించారు. పర్యాటకులకు బోటింగ్, చెరువు గట్టుపై సేదదీరేందుకు టేబుల్స్, టీ స్టాల్స్, విశ్రాంతి గదులు, సాయంత్రం గ్రీనరీలో పర్యాటకులు కోట అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించి మొదటి దఫా రాతికోట ఉత్తర ద్వారం నుంచి తూర్పు ద్వారం వరకు అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఆదిలోనే అడ్డంకులు శంకుస్థాపన కాగానే అధికారులు పునరుజ్జీవనం కోసం మోటులోని నీటిని తొలగించి, పనులు ప్రారంభించారు. అంతలోనే పలువురు భూ నిర్వాసితులు పరిహారం కోసం పనులు అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఐదుగురు రైతులు ఐదెకరాల భూమిని కోల్పోతున్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని స్థానికులనుంచి ఒత్తిడి రావడంతో రైతులు నామమాత్రపు పరిహారంతోపాటు ఉపాధిని చూపిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మంత్రి దృష్టి సారిస్తే.. మోటును అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక పెరగడంతోపాటు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ దృష్టి సారిస్తే, అధికారులు తక్షణమే స్పందించి భూ నిర్వాసితులతో మాట్లాడితే.. పునరుద్ధరణ పనులు ప్రారంభమవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. పరిహారం చెల్లిస్తే సహకరిస్తాం.. మోటు పునరుద్ధరణ కింద ఐదుగురు రైతులు ఐదెకరాల భూమిని కోల్పోతున్నాం. ప్రభుత్వం నామమాత్రపు పరిహారంతోపాటు ఉపాధిని చూపిస్తే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో అధికారులు చర్చలు జరిపితే ఆభివృద్ధికి సహకరిస్తాం.. – బైరబోయిన శివాజీ, భూ నిర్వాసితుడు రూ.2కోట్లతో మోటు, గ్రీనరీ, తదితర పనులకు శంకుస్థాపన అడ్డుకున్న భూమి కోల్పోతున్న రైతులు నిలిచిన పునరుద్ధరణ పనులు పరిహారం చెల్లిస్తే సహకరిస్తామంటున్న రైతులు -
బల్దియాలో బదిలీలు
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా కమిషనర్ సీసీగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ సమద్‌ను కాశిబుగ్గ సర్కిల్ జీ1 సెక్షన్‌కు, వార్డు ఆఫీసర్ వి. సాయికుమార్‌ను సీసీగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న కె. సర్జన్ రాజుకు ఏ3 సెక్షన్, ఇక్కడ పనిచేస్తున్న వి.సునీల్ కుమార్ ఖమ్మం కార్పొరేషన్‌కు, సీనియర్ అసిస్టెంట్ శ్రవణ్ కుమార్‌కు కాశిబుగ్గ సర్కిల్ ఆర్టీఐ సెక్షన్‌కు, జూనియర్ అసిస్టెంట్ రతన్ సింగ్‌కు బల్దియా ఈ1 సెక్షన్‌కు, ఏ3 సెక్షన్ రామకృష్ణను 65వ డివిజన్ వార్డు ఆఫీసర్‌గా, ఆర్.భాస్కర్‌ను 20వ డివిజన్ వార్డు ఆఫీసర్‌గా స్థానం చలనం కల్పించారు. కె. నాగశ్రీని 20వ డివిజన్ వార్డు ఆఫీసర్‌గా, మేయర్ సీసీగా పనిచేసిన భరత్ కుమార్‌ను హెడ్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు స్థానం చలనం కలిగింది. వార్డు ఆఫీసర్ విద్యాసాగర్‌ను 45వ డివిజన్‌కు, మేయర్ అటెండర్ కె.రమేష్‌ను బల్దియా ప్రధాన కార్యాలయానికి, శ్రీనాథ్‌ను డిప్యూటీ కమిషనర్ అడ్మిన్‌కు అటెండర్‌గా బదిలీ చేశారు. వార్డు ఆఫీసర్ సస్పెన్షన్ ఆస్తి, నీటి చార్జీల వసూళ్లల్లో నిర్లక్ష్యం.. సమాచారం లేకుండా విధులకు హాజరు కానీ బల్దియా కాశిబుగ్గ సర్కిల్‌కు చెందిన వార్డు ఆఫీసర్ కంజర్ల ప్రశాంత్‌ను సస్పెండ్ చేస్తూ హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశాలు జారీ చేశారు. పురపాలక శాఖ రూల్ (1) సీసీఏ రూల్స్ వర్తిస్తాయని పేర్కొన్నారు. -
ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో బుధవారం కలెక్టరేట్లో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో బడిని కూడా అదే బాధ్యతతో చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. కలెక్టర్ చాహత్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి సర్పంచ్‌లు ముందుండాలని కోరారు. డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. డీఈఓ గిరిరాజు బాబు, అధికారులు, సర్పంచ్‌లు, ఎంఈఓలు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్.. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో 12వ జాతీయ స్థాయి ‘హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్–2026’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. 3 నుంచి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లను ఏ భారతీయ భాషలోనైనా రూపొందించవచ్చని, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తప్పనిసరి అని వివరించారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.2లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1.5 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్షతో పాటు ప్రత్యేక ప్రస్తావనకు ఎంపికై న నాలుగు చిత్రాలకు తలా రూ.50 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల సమాచారాన్ని విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంట్రీలను జూన్ 30లోగా పంపాలని తెలిపారు. -
ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులపై సమీక్ష
న్యూశాయంపేట: మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన మౌలిక వసతులు, రహదారి, విద్యుత్ తదితర అంశాలపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సుమ, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, ఎయిర్పోర్ట్ అధికారి నటరాజ్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ ఆనందం, అధికారులు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కాకుండా మద్దతు ధర అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,457 మంది రైతుల నుంచి రూ.213.45 కోట్ల విలువైన 88,937.20 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. -
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రాధాన్యత పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్‌ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్‌చార్జ్‌లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌లో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవీందర్ రావుని ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మేడ్చల్–మల్కాజ్గిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్‌ను గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్ వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పల్లా రాజేశ్వర్రెడ్డిసత్యవతిరాథోడ్ -
కాకతీయుల కళావైభవాన్ని చాటుదాం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 32 పరీక్షకేంద్రాల్లో మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ సెకండ్ లాంగ్వేజెస్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించారు. మొత్తంగా 4,187 మంది విద్యార్థులకుగాను 3,793మంది (90శాతం)పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. 394మంది గైర్హాజరయ్యారు. సెకండియర్ సెకండ్ లాంగ్వేజెస్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30గంటల వరకు నిర్వహించారు. 1,119 మందికిగాను 999 మంది( 89శాతం) హాజరు కాగా, 120మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు గోపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షకు 1,330 మందికి 1,259 విద్యార్థులు హాజరు కాగా 71 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 576 మందికి 548 మంది విద్యార్థులు హాజరుకాగా 28 మంది గైర్హాజరయ్యారన్నారు.యువతిపై లైంగిక దాడి ● నిందితుడి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు గీసుకొండ : ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం గీసుకొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని మనుగొండకు చెందిన తప్పురి ఉదయ్‌శంకర్ గ్రామంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత సదరు యువతి వివాహం గురించి ప్రశ్నించగా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. ఇటీవల అతను సదరు యువతి ఇంటిలో రాత్రి పూట చొరబడగా స్థానికులు పట్టుకుని ప్రశ్నించడంతో తాను ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై మాట్లాడగా ఉదయ్‌శంకర్, అతడి తండ్రి సమ్మయ్య, అక్క అన్నపూర్ణ బెదిరించారు. ఈ విషయమై బాధితులు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని, బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సమావేశంలో ఎస్సై కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.హన్మకొండ కల్చరల్: కాకతీయుల ఘన కీర్తి, సామ్రాజ్య కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుదామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని కాళోజీ కళా క్షేత్రంలో రేచర్ల రుద్రయ్య ప్రాంగణంలో చేతన కళా వేదిక ఆధ్వర్యంలో ఓరుగల్లు సాంస్కృతిక మహాసమ్మేళనం, కాకతీయ కళల జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు ఆకుల నాగేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథులుగా హాజరై ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ఆర్యవైశ్య నాయకులు గట్టుమహేష్బాబు, వరంగల్ శ్రీనివాస్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. కాకతీయుల కీర్తి, ప్రతిష్టలు పెంచేలా కళావేదిక ఉత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో నాటి వైభవం ఉట్టిపడేలా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉండడం మహాద్భుతమని కొనియాడారు. 800 ఏళ్ల చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. శిల్ప కళా సంపదను పరిరక్షిస్తూ యునెస్కో గుర్తించేలా అందరం బాధ్యతగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో వివిధ కళల కోర్సులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరగా మంత్రి అందుకు తగిన విషయాలపై చర్చిస్తానన్నారు. కాళోజీ కళాక్షేత్రం వేదికపై కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కళాకారులు, కళాజాతర ప్రతినిధులు, వెయ్యికి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాకతీయ కళల జాతర వేడుకలు ప్రారంభం -
నూతన లేబర్ కోడ్ల ప్రతుల దహనం
వరంగల్ చౌరస్తా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్ల ప్రతులను హంటర్ రోడ్డులో ఏఐసీటీయూ వరంగల్ జిల్లా గుమాస్తాల సంఘం ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐసీటీయూ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్ర ప్రతాప్ మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో యాకయ్య, బాబురావు, జగదీశ్వర్, రాజశేఖర్, శ్రీరాములు, రాధాకృష్ణ, వేణు, ఎల్ల య్య, ఎం.రమేష్, డి.రమేష్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎన్టీఏను వెంటనే రద్దుచేయాలి
విద్యారణ్యపురి: ఎన్టీఏను రద్దుచేసి నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ నీట్‌ను పకడ్బందీగా నిర్వహించడంలో ఎన్టీఏ విఫలమైందని విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేయూ అధ్యక్షుడు బీరెడ్డి జస్వంత్, బాధ్యులు నాగరాజ్ కుమార్, రవి, తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి కాశిబుగ్గ: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ పేరుతో 23లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడడం దుర్మార్గమని పేర్కొన్నారు. అనేక వ్యయ ప్రయాసాలకు గురై కష్టపడి చదివిన విద్యార్థులకు తీరని నిరాశ మిగిలిందని తెలిపారు. నిపుణులు సూచించిన విధంగా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. -
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు గురువారం అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. రాంనగర్, పోలీస్ హెడ్‌క్వార్టర్, విద్యానగర్, గోకుల్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 10.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: ఏషియన్ మాల్ సమీపంలోని సాయిబాబా మందిర ప్రాంగణంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల కోసం గురువారం ఉచిత యూరాలజీ వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్, మందిర పీఆర్వో నిమ్మల శ్రీనివాస్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ బీవీ.రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నయీంనగర్: ఈనెల 16న కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు శ్రవన్స్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ప్రెసిడెంట్ జి.శ్రవణ్ కుమార్ తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సందీప్, భరద్వాజ్, మణివర్మ, దీపక్ తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలు దాసరి ప్రసన్నరాణికి హైదరాబాద్‌లోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. భౌతిక శాస్త్రం విభాగంలో పరిశోధకురాలిగా మానిటరింగ్ అండ్ ఎవల్యూయేషన్ ఆఫ్ స్మార్ట్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ప్రసన్నరాణికి డాక్టరేట్‌ను వర్సిటీ ప్రదానం చేసింది. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేష్ పర్యవేక్షణలో ప్రసన్నరాణి తన పీహెచ్డీ పూర్తిచేశారు. కాజీపేట: కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్గా జె.శ్యాంసుందర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటివరకు పనిచేసిన ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి.. శాయంపేట మండలానికి బదిలీ అయ్యారు. వీఆర్‌లో ఉన్న శ్యాంసుందర్‌ను కాజీపేటకు బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రిత్ సింగ్ ఆదేశాలు జారీ చేయగా, శ్యాంసుందర్ బాధ్యతలు చేపట్టారు. కాజీపేట: కాజీపేట పట్టణానికి చెందిన వెనిశెట్టి నిర్మలాదేవి (67) నేత్రాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. స్థానిక వాసవి క్లబ్లో క్రియాశీలకంగా పనిచేసిన వెనిశెట్టి రఘు తల్లి నిర్మలాదేవి బుధవారం మృతి చెందారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల అంగీకారంతో నిర్మలాదేవి నేత్రాలను వైద్యుల పర్యవేక్షణలో రామయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ సిబ్బంది బుధవారం సేకరించారు. ఈ సందర్భంగా రఘు కుటుంబ సభ్యులకు ఐ బ్యాంకు సిబ్బంది ప్రశంస పత్రం అందజేశారు. హసన్‌పర్తి: తన ఇంటి ముందు డ్రెయినేజీ గుంత తవ్వారని జయగిరికి చెందిన రేణుకుంట్ల విజయ్ తెలిపాడు. ఈ మేరకు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్కు బుధవారం ఫిర్యాదు చేశాడు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కలిసి తన ఇంటి ముందు మురుగునీరు నిల్వ కోసం జేసీబీతో సుమారు 40 ఫీట్లలోతు గల పెద్ద గుంత తవ్వారని పేర్కొన్నాడు. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రామన్నపేట: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను వరంగల్‌లోని తన నివాసంలో రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. నాయకులు రాయబారపు సంతోష్‌కుమార్, నరేందర్, గట్ల రవీందర్, కళ్యాణ్ చక్రవర్తి, గూడూరు ప్రభాకర్, రామగిరి భిక్షపతి, సోమ పుల్లయ్య, రాకేష్ పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు గురువారం అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. రాంనగర్, పోలీస్ హెడ్‌క్వార్టర్, విద్యానగర్, గోకుల్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 10.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: ఏషియన్ మాల్ సమీపంలోని సాయిబాబా మందిర ప్రాంగణంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల కోసం గురువారం ఉచిత యూరాలజీ వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్, మందిర పీఆర్వో నిమ్మల శ్రీనివాస్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ బీవీ.రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నయీంనగర్: ఈనెల 16న కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు శ్రవన్స్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ప్రెసిడెంట్ జి.శ్రవణ్ కుమార్ తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సందీప్, భరద్వాజ్, మణివర్మ, దీపక్ తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలు దాసరి ప్రసన్నరాణికి హైదరాబాద్‌లోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. భౌతిక శాస్త్రం విభాగంలో పరిశోధకురాలిగా మానిటరింగ్ అండ్ ఎవల్యూయేషన్ ఆఫ్ స్మార్ట్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ప్రసన్నరాణికి డాక్టరేట్‌ను వర్సిటీ ప్రదానం చేసింది. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేష్ పర్యవేక్షణలో ప్రసన్నరాణి తన పీహెచ్డీ పూర్తిచేశారు. కాజీపేట: కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్గా జె.శ్యాంసుందర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటివరకు పనిచేసిన ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి.. శాయంపేట మండలానికి బదిలీ అయ్యారు. వీఆర్‌లో ఉన్న శ్యాంసుందర్‌ను కాజీపేటకు బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రిత్ సింగ్ ఆదేశాలు జారీ చేయగా, శ్యాంసుందర్ బాధ్యతలు చేపట్టారు. కాజీపేట: కాజీపేట పట్టణానికి చెందిన వెనిశెట్టి నిర్మలాదేవి (67) నేత్రాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. స్థానిక వాసవి క్లబ్లో క్రియాశీలకంగా పనిచేసిన వెనిశెట్టి రఘు తల్లి నిర్మలాదేవి బుధవారం మృతి చెందారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల అంగీకారంతో నిర్మలాదేవి నేత్రాలను వైద్యుల పర్యవేక్షణలో రామయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ సిబ్బంది బుధవారం సేకరించారు. ఈ సందర్భంగా రఘు కుటుంబ సభ్యులకు ఐ బ్యాంకు సిబ్బంది ప్రశంస పత్రం అందజేశారు. హసన్‌పర్తి: తన ఇంటి ముందు డ్రెయినేజీ గుంత తవ్వారని జయగిరికి చెందిన రేణుకుంట్ల విజయ్ తెలిపాడు. ఈ మేరకు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్కు బుధవారం ఫిర్యాదు చేశాడు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కలిసి తన ఇంటి ముందు మురుగునీరు నిల్వ కోసం జేసీబీతో సుమారు 40 ఫీట్లలోతు గల పెద్ద గుంత తవ్వారని పేర్కొన్నాడు. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రామన్నపేట: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను వరంగల్‌లోని తన నివాసంలో రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. నాయకులు రాయబారపు సంతోష్‌కుమార్, నరేందర్, గట్ల రవీందర్, కళ్యాణ్ చక్రవర్తి, గూడూరు ప్రభాకర్, రామగిరి భిక్షపతి, సోమ పుల్లయ్య, రాకేష్ పాల్గొన్నారు. -
వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్ ప్రారంభం
హన్మకొండ / కాశిబుగ్గ: హోప్‌ఫుల్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అత్యాధునిక 250 ఎల్‌పీహెచ్ వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్‌ను ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలు, దివ్యాంగులు, వృద్ధులు, అనాథ ఆశ్రమాలకు విద్యుత్ ఉద్యోగులు చేయూత అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. కాకతీయ మెడికల్ కళాశాల ప్రినిపాల్ డాక్టర్ సంధ్యారాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ మురళి, పీడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ బాలరాజ్, ఆర్ఎంఓ డాక్టర్ ప్రతాప్ కల్లోగి, టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, పి.మధుసూదన్, సి.ప్రభాకర్, హోప్‌ఫుల్ హార్ట్స్ సొసైటీ చైర్మన్ కేవీ.జాన్సన్, కార్యదర్శి ఫాతిమా రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఎన్హెచ్ఎం ఉద్యోగులు
ధర్మసాగర్ : తెలంగాణ రాష్ట్ర ఎన్హెచ్ఎం ఉద్యోగులు బుధవారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ మేరకు జాక్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు తెలిపారు. జాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పుట్ట మహేందర్‌రావు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు రుక్ముద్దీన్, సుమన్, నరేశ్, మహబూబాబాద్ జిల్లా జాక్ సభ్యుడు ఉమాకర్, హిమకర్, పవన్ కలిసిన వారిలో ఉన్నారు. పరామర్శ దామెర : మండలంలోని ఊరుగొండ మాజీ సర్పంచ్ గోగుల సత్యనారాయణరెడ్డిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పరామర్శించారు. సత్యనారాయణరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ధర్మారెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ జాకిర్అలీ, నాయకులు సునీల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డితో పాటు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. రోడ్డు ప్రమాద బాధితుడికి చేయూత భీమదేవరపల్లి : ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముల్కనూరు గ్రామానికి చెందిన అభిలాష్‌కు సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. అభిలాష్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న 2004–05 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మానవత్వంతో తలోకొంత జమ చేసి రూ.32 వేలు నగదును కుటుంబ సభ్యులకు అందించారు. కష్టకాలంలో ఆర్థికసాయం అందించిన శిశుమందిర్ పూర్వ విద్యార్థులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఖర్చుతో రెండు బోర్లు ఏర్పాటు భీమదేవరపల్లి : మండలంలోని గట్ల నర్సింగపూర్ గ్రామానికి చెందిన కావేరి సీడ్స్ అధినేత గుండవరం వెంకటభాస్కర్‌రావు సొంత డబ్బుతో గ్రామంలో రెండు బోర్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు కాలనీలకు చెందిన ప్రజలకు సరిపడా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ బొల్లంపల్లి అజయ్‌కుమార్ ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన వెంకటభాస్కర్‌రావు వెంటనే రెండు బోర్లు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మోటర్లు ఏర్పాటు చేయించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని సొంతంగా బోర్లు ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ అజయ్‌కుమార్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మధు, వార్డు సభ్యులు షెడ్రిక్, ఐలయ్య పాల్గొన్నారు. -
‘ఆది’కి మించి అదిరేలా..
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గతేడాది మే నెలలో నిర్వహించిన సరస్వతీనది ఆది పుష్కరాలకు మించి ఈనెల 21 నుంచి జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు భారీ ఎత్తున డెకరేషన్ ఏర్పాట్లు చేపట్టారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ కంపెనీతో సరస్వతీఘాట్ వద్ద తోరణాలు, డిజైన్స్, నందులు, ఏనుగు, ఇతర బొమ్మలు మర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈనెల 20 వరకు పనులనీ పూర్తి చేసేలాగా అక్కడే తమకు కావాల్సిన డెకరేషన్ తయారు చేసి రంగులు వేస్తున్నారు. అబ్బుర పరిచేలా సెట్టింగ్‌లు చేపడతుండగా గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంత్య పుష్కరాలకు భారీగా డెకరేషన్ ఏర్పాట్లు -
ఒక్క నిమిషం కచ్చితంగా పాటించండి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ : విద్యుత్ శాఖ సిబ్బంది ఒక్క నిమిషం నిబంధనను కచ్చితంగా పాటించాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 18 సర్కిళ్ల ఎస్ఈలు, ఆయా విభాగాల డీఈలు, ఎస్ఎఓలు, ఏఏఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పనిని ప్రారంభించే ముందు సిబ్బంది ఒక్క నిమిషం పాటు ఆగి, అన్ని భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా అని నిర్ధారించుకోవాలన్నారు. జూన్ 15 నుంచి వచ్చే ఏడాది వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు అన్ని 11కేవీ ఫీడర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ లైన్లలో సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏబీ స్విచ్‌లు బిగించాలన్నారు. 33 కేవీ, 11 కేవీ లైన్ల ఏఐ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. కొత్త జిల్లా స్టోర్లు, కొత్త ఎస్పీఎం షెడ్లు త్వరితగతిన అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, సీజీఎంలు రవీంద్రనాథ్, రౌతు చరణ్ దాస్, కిషన్, జీఎంలు శ్రీకాంత్, శ్రీనివాస్, మధుసూదన్ రావు, మల్లికార్జున్, కృష్ణ మోహన్, జయరాజ్, వెంకటకృష్ణ, ఉపేందర్, వాసుదేవ్, ప్రభావతి, డీఈలు అనిల్ కుమార్, నాగరాజు పాల్గొన్నారు. -
బండి సంజయ్‌పై రాజకీయ కుట్ర
భీమదేవరపల్లి : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. రెండున్నర ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై చేస్తున్న అరాచకాలు, సమస్యలపై ఒక్కసారి కూడా స్పందించని బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఆధారాలు లేని కేసులు ముందుకు తెచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపించారు. గత పదేళ్లుగా మాజీ సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్‌పై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు కొమురయ్య, పృథ్వీరాజ్, రాణాప్రతాప్, మల్లారెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
గేట్ లేక ఇబ్బందులు
కాజీపేట: కాజీపేట పట్టణంలోని బాపూజీనగర్ శ్రీవెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో ప్రహరీ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడున్నర సంవత్సరాల క్రితం మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మించి విజయనగర్ కాలనీవైపు గేట్ పెట్టకుండా వదిలేయడమే సమస్యాత్మకంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. గేట్ ఏర్పాటు చేయాలని కోరుతూ కూరగాయల వ్యాపారులు అనేకమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకుల చొరవ ఫలితంగా మార్కెట్లో చిరువ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పిస్తూ పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అసలు సమస్య ఇక్కడే.. మార్కెట్‌కు వెనుక భాగం ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు.. గేట్ పెట్టడానికి చేసిన ప్రయత్నాలను కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు. ఇది వ్యాపారులు, సమీప కాలనీవాసులకు మధ్య వివాదంగా మారడమేగాక సమస్య తీవ్రమై చిలికిచిలికి గాలివానగా మారింది. పుష్కర కాలం కింద ప్రభుత్వ స్థలంలో ప్రారంభమైన కూరగాయల మార్కెట్ చుట్టూ ప్రహరీ ఉన్నా విజయనగర్‌కాలనీ వైపు గేట్ లేకపోవడంతో పశువులు, పందులు, వాహనాలు మార్కెట్లో యథేచ్ఛగా సంచరిస్తూ వ్యాపారులు, కొనుగోలుదారులకు ప్రాణసంకటంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఆరునూరైనా సరే కాలనీ వైపు గేట్ పెట్టాల్సిందేనని వ్యాపారులు, తమకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ కాలనీవాసులు భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మార్కెట్‌కు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్న తరుణంలో గేట్ పెట్టనీయకపోవడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్‌కు ఒకవైపు గేట్ లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ఆకతాయిలు ప్రవేశించి మద్యం సేవించడం, దొంగలు కూరగాయలను ఎత్తుకెళ్తున్నారని చిరువ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తైనందునా అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వెంటనే గేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. కాజీపేట వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లోకి పశువులు, పందులు, కుక్కల సంచారం రాత్రివేళల్లో అసాంఘిక కలాపాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులు, వినియోగదారులు -
‘దేశంలో బాలికలకు రక్షణ కరువు’
వరంగల్ చౌరస్తా: దేశంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ చౌరస్తాలో బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమికి రమేష్‌బాబు, మాజీ కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, కుందారపు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేస్తేనే పారదర్శకంగా కేసు విచారణ హన్మకొండ: బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే బండి భగీరథ్ కేసు విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు దాస్యం విజయ్ భాస్కర్, నరెడ్ల శ్రీధర్, కుమార్, పానుగంటి శ్రీధర్, గండ్రకోట రాకేష్ యాదవ్, ప్రశాంత్, రాజేందర్, గువ్వ రాజేష్, సుమన్, వంశీ పాల్గొన్నారు. బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి వరంగల్ చౌరస్తా: బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ వద్ద బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి భవాని, జిల్లా ఉపాధ్యక్షురాలు చిట్యాల సువర్ణ, జిల్లా సహాయ కార్యదర్శి సింగారం విక్టోరియా, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆరెల్లి రవి, దామెర కృష్ణ పాల్గొన్నారు. కఠినంగా శిక్షించాలి కాశిబుగ్గ: బండి సాయి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలని 13వ డివిజన్ ఎంహెచ్ నగర్‌లోని మహిళలు డిమాండ్ చేశారు. సీపీఎం కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి మహమ్మద్ బషీర్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తాళ్లపల్లి స్వామి, జూపాక రాజు, దూరం సంపత్, సాంబయ్య, ఉడుత సుజాత, సునీత, మంగ, స్వరూప, అక్తర్, కావ్య పాల్గొన్నారు. -
మేలైన వంగడాలతో అధిక దిగుబడి
ధర్మసాగర్ : మేలైన వంగడాలను సాగు చేసి రైతులు అధిక దిగుబడులు సాధించాలని వరంగల్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ బైరి రాజు, రమ్యశ్రీ సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వరంగల్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు బైరి రాజు, రమ్యశ్రీ మండలంలోని ముప్పారం గ్రామాన్ని బుధవారం సందర్శించారు. భూసారం దెబ్బతినకుండా ఉండేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రైతులు అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తే జరిగే నష్టాన్ని, అనర్థాలను వివరించారు. రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని పెట్టుబడి తగ్గించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కుమార స్వామి, ఏఈఓ హరీశ్, రైతులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘బాలమంగళం’ వేసవి శిబిరం
హన్మకొండ చౌరస్తా : చిన్నారుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘బాలమంగళం’ బాలబాలికల వేసవి శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన శిబిరం 9 రోజుల పాటు విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కొనసాగింది. ఈ సందర్భంగా హనుమకొండ కాకాజీ కాలనీలోని శ్రీ వివేకానంద యోగా కేంద్రంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి మాధవ స్మారక సమితి అధ్యక్షుడు కోదాటి సుధాకర్ రావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎంజీఎం రిటైర్డ్ ఆర్ఎంఓ, ఆర్ఎస్ఎస్ వరంగల్ మహానగర్ సంఘచాలక్ డాక్టర్ బందెల మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికల్లో భారతీయ సంస్కృతి, సభ్యతను పెంపొందింపజేస్తున్న మాధవస్మారక సమితికి అభినందనలు తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, శారీరక దృఢత్వం పట్ల అవగాహన కల్పించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు ప్రదర్శించిన యోగాసనాలు, సైన్స్ ప్రదర్శనలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లెక్కల జలంధర్ రెడ్డి, మాధవస్మారక సమితి ప్రధాన కార్యదర్శి దాస్యం రామానుజం, కుటుంబ ప్రబోధన్ వరంగల్ విభాగ్ సంయోజక్ ఆర్.లక్ష్మణ్ సుధాకర్, విజ్ఞాన భారతి రాష్ట్ర కన్వీనర్ సత్తు రామనాథం, సంస్కృత భారతి పేట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 9 రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగిన క్యాంపు -
గేట్ లేక ఇబ్బందులు
కాజీపేట: కాజీపేట పట్టణంలోని బాపూజీనగర్ శ్రీవెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో ప్రహరీ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడున్నర సంవత్సరాల క్రితం మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మించి విజయనగర్ కాలనీవైపు గేట్ పెట్టకుండా వదిలేయడమే సమస్యాత్మకంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. గేట్ ఏర్పాటు చేయాలని కోరుతూ కూరగాయల వ్యాపారులు అనేకమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకుల చొరవ ఫలితంగా మార్కెట్లో చిరువ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పిస్తూ పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అసలు సమస్య ఇక్కడే.. మార్కెట్‌కు వెనుక భాగం ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు.. గేట్ పెట్టడానికి చేసిన ప్రయత్నాలను కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు. ఇది వ్యాపారులు, సమీప కాలనీవాసులకు మధ్య వివాదంగా మారడమేగాక సమస్య తీవ్రమై చిలికిచిలికి గాలివానగా మారింది. పుష్కర కాలం కింద ప్రభుత్వ స్థలంలో ప్రారంభమైన కూరగాయల మార్కెట్ చుట్టూ ప్రహరీ ఉన్నా విజయనగర్‌కాలనీ వైపు గేట్ లేకపోవడంతో పశువులు, పందులు, వాహనాలు మార్కెట్లో యథేచ్ఛగా సంచరిస్తూ వ్యాపారులు, కొనుగోలుదారులకు ప్రాణసంకటంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఆరునూరైనా సరే కాలనీ వైపు గేట్ పెట్టాల్సిందేనని వ్యాపారులు, తమకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ కాలనీవాసులు భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మార్కెట్‌కు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్న తరుణంలో గేట్ పెట్టనీయకపోవడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్‌కు ఒకవైపు గేట్ లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ఆకతాయిలు ప్రవేశించి మద్యం సేవించడం, దొంగలు కూరగాయలను ఎత్తుకెళ్తున్నారని చిరువ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తైనందునా అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వెంటనే గేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. కాజీపేటలోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లోకి పశువులు, పందులు, కుక్కల సంచారం రాత్రివేళల్లో అసాంఘిక కలాపాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులు, వినియోగదారులు -
పెళ్లికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
రేగొండ/నడికూడ: కుటుంబీకులతో కలిసి ఆనందంగా పెళ్లికి వెళ్లొస్తున్న ఓ బాలుడు మృత్యుఒడికి చేరాడు. కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రానికి చెందిన ఊర రాజు తన భార్య మౌనిక, కూతురు తన్విత, కుమారుడు హిమాన్షు(09)ను తన అన్న కొడుకు పెళ్లికి కారులో ములుగు జిల్లా ఇంచర్లకు పంపించాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి వస్తున్న క్రమంలో నారాయణపూర్ శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో హిమాన్షుతో పాటు తల్లి, అక్కకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆరెపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. హిమాన్షును మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. కాగా, నిన్నమొన్నటి వరకు నతమ కళ్లెదుట ఆడుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.హిమాన్షు మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది. కారు బోల్తా పడి బాలుడి మృతి నారాయణపూర్ శివారులో ఘటన -
అక్రమంగా గోవధ, మాంస విక్రయాలు
నయీంనగర్: గ్రేటర్ వరంగల్ మహానగర పరిధిలో బక్రీద్ పండుగ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ గోవధపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వీహెచ్‌పీ వరంగల్ మహానగర్ అధ్యక్షుడు కేసీరెడ్డి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ గోవధ, నిబంధనలకు విరుద్ధంగా మాంస విక్రయాలపై అధికారులు నిర్లక్ష్యం వహించడం అత్యంత దారుణమన్నారు. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోమాతను బహిరంగంగా వధిస్తూ హిందూ సమాజాన్ని రెచ్చగొడుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా గోమాంసాన్ని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరవ్యాప్తంగా గోమాంసాన్ని అమ్మే షాపులను వెంటనే కూల్చివేయాలని సూచించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు తోకల ఓంకుమార్, నాగరాజ నంగునూరి, దేవేందర్ రెడ్డి, శ్రీరామ రాకేష్, గండి నాగరాజు, శెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మెట్ల బావిని సందర్శించిన అధికారి
ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లోని మెట్ల బావిని హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి బుధవారం సందర్శించారు. ఎండ తీవ్రతకు బావి వద్ద ఎండిపోయిన మొక్కలను పరిశీలించారు. రోజు నీళ్లు చల్లాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట బావి పరిరక్షణ కమిటీ సభ్యులు బిల్లా రాజు, పోలెపాక రాజు, తదితరులు ఉన్నారు. హన్మకొండ: హనుమకొండ గాంధీనగర్‌లో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. గాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నయీంనగర్‌లోని శ్రీశరణ్య ఆస్పత్రి సహకారంతో కిడ్నీ వ్యాధులపై బుధవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయగా, గాంధీనగర్ ప్రముఖుడు ఏవీ.నరసింహారావు హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగార్జున రెడ్డి, సిబ్బంది, గాంధీనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెరువు వెంకటరాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాలవలస వెంకటరమణ, కోశాధికారి మాడిశెట్టి వీరేందర్, ప్రతినిధులు డి.కమలాకర్ రావు, కె.శ్రీనివాసరెడ్డి, కొండ యాదగిరి, మాదాటి రాజిరెడ్డి పాల్గొన్నారు. -
పంట వ్యర్థాలతో ఎరువు తయారు చేయాలి
● వ్యవసాయ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కిషోర్ కాజీపేట అర్బన్: పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలో గుంతలు తీసి వ్యర్థాలను అందులో వేసి ఎరువు తయారు చేసుకోవాలని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కిషోర్ సూచించారు. వ్యవసాయ కళాశాల, కాజీపేట మండల వ్యవసాయ శాఖ సౌజన్యంతో కాజీపేట మండలం వ్యవసాయాధికారి సంతోష్ ఆధ్వర్యంలో కాజీపేట మండలం కుమ్మరిగూడెం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వానాకాలం సాగులో మెరుగైన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, నేలలో సారం పెంచేందుకు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడాలని పేర్కొన్నారు. వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సంధ్య, హార్టికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్వప్న, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, కుమ్మరిగూడెం రైతులు పాల్గొన్నారు. -
పంట వ్యర్థాలతో ఎరువు తయారు చేయాలి
కాజీపేట అర్బన్: పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలో గుంతలు తీసి వ్యర్థాలను అందులో వేసి ఎరువు తయారు చేసుకోవాలని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కిశోర్ సూచించారు. వ్యవసాయ కళా శాల, కాజీపేట మండల వ్యవసాయ శాఖ సౌజన్యంతో కాజీపేట మండలం వ్యవసాయాధికారి సంతోష్ ఆధ్వర్యంలో కాజీపేట మండలం కుమ్మరిగూడెం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వానాకాలం సాగులో మెరుగైన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, నేలలో సారం పెంచేందుకు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడాలని పేర్కొన్నారు. వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సంధ్య, హార్టికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్వప్న, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
కార్మిక హక్కుల కోసం పోరాడుదాం
● మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ: కార్మికుల హక్కుల కోసం పోరాడుదామని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో కలిసి కార్మిక హక్కుల చైతన్య మాసోత్సవ సదస్సు వాల్‌పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు ఎనిమిదేళ్లుగా ఉద్యోగ, కార్మికుల హక్కుల సాధన, రక్షణ కోసం మే నెలలో కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ఉద్యోగ, కార్మిక హక్కుల చైతన్య మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉద్యోగులు, కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ నాయకుడు నాయిని రవి మాట్లాడుతూ గిగ్ వర్కర్లకు కార్మిక చట్టాలను వర్తింపజేసి, సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో త్రిచక్ర ఆటో సహకార సంఘం అధ్యక్షుడు ఈసంపల్లి సంజీవ, ఆయా కార్మిక సంఘాల నాయకులు రాజు, గొర్రె విజయ్, ఇస్మాయిల్, దూలం వెంకన్న, పున్నంచందర్, ఖలీల్, సదానందం, పానుగంటి శ్రీధర్, మహేందర్, శ్రీధర్ రెడ్డి, బాబు, శ్రీలత, విజయ, లక్ష్మి పాల్గొన్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దు
● ఎస్సై అశోక్దామెర : పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని ఎస్సై కొంక అశోక్ రైతులకు సూచించారు. బుధవారం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం మూలంగా పొగ గాలిలో కలిసి వాతావరణం కాలుషితం అవుతుందన్నారు. అదే విధంగా రహదారులపైకి పోగరావడం మూలంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయన్నారు. వ్యర్థాలను కాల్చే సమయంలో ఇతర పంటలకు మంటలు వ్యాప్తించే ప్రమాదం ఉంటుందని అన్నారు. అదే విధంగా విద్యుత్ వైర్లు, పైపులు, మోటర్లు కాలిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. -
గృహ గణన పకడ్బందీగా నిర్వహించాలి
● పరకాల ఆర్డీఓ నారాయణదామెర : జన గణనలో భాగంగా చేపట్టిన గృహ గణనను పకడ్బందీగా నిర్వహించాలని పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ సూచించారు. మండలంలోని పులుకుర్తి, సింగరాజుపల్లిలో మొదటి విడత గృహ గణనను బుధవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని అన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గృహ గణనలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఆర్ఐ భాస్కర్‌రెడ్డి, జీపీఓ మురళి ఉపాధ్యాయులు ఉన్నారు. -
డబుల్ రోడ్డు హామీ దండగేనా..?
ధర్మసాగర్ : మండల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ధర్మసాగర్.. రహదారి సమస్యతో సతమతం అవుతోంది. గతంలో ఓఆర్ఆర్ వద్ద నుంచి రిజర్వాయర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడుతామని నాటి ఎమ్మెల్యే, అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నేటికీ నెరవేరలేదని విమర్శలు వస్తున్నాయి. ధర్మసాగర్ మీదుగా వేలేరు మండలంలోని పలు గ్రామాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డుపై భారీ వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు నిత్యం రవాణా కొనసాగిస్తుండడంతో రోజురోజుకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతుంది. ఉదయం, సాయంత్రం రహదారి పూర్తిగా రద్దీగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు చిన్నది, వాహనాలు పెద్దవి అవడం మూలంగా ఎక్కడ ఏ ప్రమాదంజరుగుతుందోనని, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో పలు రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి పలుమార్లు హామీలు ఇచ్చినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిధుల కొరత, లేక అధికారుల నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లారీలు, ట్రాక్టర్లు వెళ్లే సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, చిన్నచిన్న వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతుండడంతో మిగతా వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. విద్యార్థులు, వృద్ధులు రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణానికి స్పష్టమైన గడువు ప్రకటించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నారు. బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలి భారీ వాహనాల రవాణాకు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు మాత్రమే వినిపిస్తున్నాయని, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మండల కేంద్రం అభివృద్ధికి కీలకమైన ఈ డబుల్ రోడ్డు పనులపై ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకుల హామీ నేటికీ నెరవేరని పరిస్థితి ఆగ్రహిస్తున్న వాహనదారులు -
బాస్కెట్ బాల్ కేరాఫ్ మానుకోట..
మహబూబాబాద్ : మానుకోట క్రీడలకు పుట్టినిల్లు. బాస్కెట్ బాల్, ఖోఖో క్రీడలకు కేరాఫ్. ఇందులో ప్రధానంగా బాస్కెట్ క్రీడలో వేలాది మంది రాణిస్తున్నారు. దీనికి కారణం సుమారు 65 సంవత్సరా లుగా ఒకే ప్రాంగణంలో ప్రతీ రోజు శిక్షణ ఇవ్వడ మే. అయితే సమ్మర్ మాత్రం ప్రత్యేకంగా క్యాంపులా నిర్వహించి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. బాస్కె ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరంలో ఆ క్రీడ నేర్చుకోవడానికి విద్యార్థులు ఆ సక్తి చూపుతున్నారు. అందుకు ప్రధాన కారణం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు ఉండడం, మెడిసిన్‌లో సీట్లు సాధించి పూర్తి చేసిన వారు ఉండడమే. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని బాస్కెట్ బాల్ కోర్టులో సుమారు 65 సంవత్సరాలుగా ఈ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. అలాగే, కరాటే, తైక్వాండో క్రీడలపై కూడా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ వేసవిలో క్రికెట్లో శిక్షణ ఇస్తున్నారు. వేల సంఖ్యలో రాష్ట్ర స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కొద్ది మంది మాత్రమే ఉండగా జాతీయ స్థాయిలో సుమారు 450 క్రీడాకారులు మంది ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో మాత్రం 2వేలకుపైగా ఉన్నారని కోచ్ వెలిశాల కుమారస్వామి తెలిపారు. ఈ క్రీడ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వారు సుమారు 40 మంది ఉన్నారు. వీరిలో కొందరు వారానికి ఒక్క రోజైన ఆ కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. సమ్మర్లో వంద మందికి పైగా శిక్షణ ఈ వేసవిలో ఉదయం 5:30 నుంచి ఉదయం 8:30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వ రకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో వందమందికి పైగా శిక్షణ పొందుతున్నారు. ముందుగా వాకింగ్, వ్యాయాయం చేయించి ఆ తర్వాత బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారు. బాల్స్, ఇతర పరికరాలు వారే ఉచితంగా ఇస్తున్నారు. 65 సంవత్సరాలుగా ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు. 30 సంవత్సరాలుగా కోచ్ కుమారస్వామి బాస్కెట్ బాల్ కోర్టులో సుమారు 30ఏళ్లులుగా కో చ్ కుమారస్వామి ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వేతనం లేకున్నా రోజూ ఉదయం, సాయంత్రం కోర్టుకు వచ్చి క్రీడాకారులకు మెళకువలు నేర్పిస్తున్నారు. సీనియర్ క్రీడాకారులు సుజిత్, గోగుల యాకయ్య రోజూ బాస్కెట్ బాల్ కోర్టుకు వచ్చి క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ కోచ్‌కు సపోర్టుగా ఉంటున్నారు.జాతీయ స్థాయిలో రాణిస్తున్న అండర్– 14 విభాగంలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న. బాస్కెట్ బాల్లో మంచి శిక్షణ ఇవ్వడం వల్లే నేను జాతీయ స్థాయికి ఎదిుగా. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే నా తపన. –జి. విశ్వతేజ్ప్రభుత్వం చేయూతనివ్వాలి ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనిచ్చి ప్రోత్సహించాలి. కోర్టులు, ఇతరత్రా ఆట స్థలాల విషయంలో నిధులు కేటాయించి క్రీడల అభివృద్ధికి కృషి చేయాలి. 65 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం బాస్కెట్‌బాల్ కోర్టు ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి అందులో సౌకర్యాలు కల్పించాలి. కోచ్‌లను కూడా గుర్తించాలి. –వెలిశాల కుమారస్వామి, కోచ్ రాష్ట్ర స్థాయిలో రాణించా రాష్ట్ర స్థాయిలో నాలుగు టోర్నమెంట్లో ఆడా. క్రీడతో మంచి గుర్తింపు వచ్చింది. పలు సర్టిఫికెట్లు వచ్చాయి. హ్యపీగా ఉంది. పాఠశాల వేళల్లో కాకుండా మిగతా సమయంలో మాత్రమే ఆడుతున్నా. – సీహెచ్. పునీత్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుస్తున్న క్రీడాకారులు ఈ క్రీడలో సుమారు 65 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ ఉదయం, సాయంత్రం వేళల్లో తర్ఫీదు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు -
తెలంగాణ ఉద్యమకారుడు సోని మృతి
కాజీపేట: కాజీపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎండి.సోని (60) బుధవారం మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో పోలీసుల లాఠీ దెబ్బలతో పాటు పలు పోలీసు కేసులు నమోదు కాగా, జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. కొద్దిరోజులుగా అస్వస్థతకు గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సోని మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌కు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న సోని మృతితో పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా సోనీ పార్థివ దేహాన్ని పలువురు బుధవారం సందర్శించి నివాళులర్పించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.హసన్‌పర్తి: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ హెచ్చరించారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధి లోని రౌడీ షీటర్లకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవి రుద్ధ పనులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఎస్సై దేవేందర్, రవి పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
పరకాల : మహిళలు అన్ని రంగాల్లో రాణించడంతో పాటు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం అవడమే పోచంపల్లి ఫౌండేషన్ లక్ష్యమని పోచంపల్లి ఫౌండేషన్ నిర్వహకులు కొక్కిరాల రాకేష్రావు, చందా కుమారస్వామి అన్నారు. అందులో భాగంగానే పట్టణంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో బుధవారం కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు. 45 రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి, కొక్కిరాల దీప్తి, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, భగవాన్‌రెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మమ్మ చెప్పిన కథ..
అమ్మమ్మ చెప్పిన కథ.. నారాయణ నమ్మకం..ఓ గ్రామంలో కిషన్ అనే షావుకారి ఉండేవాడు. అతడికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల వివాహం చేసినా.. కిషన్ తన సంపాదన, నిల్వ ఉన్న డబ్బులు, బంగారం విషయం మాత్రం ఎవరికీ చెప్పేవారు కాదు. ఇలా చెప్పకుండా ఇంటిలో అటుకుపై సంచిలో డబ్బులు దాచి పెట్టాడు. ఇంతలోనే అనారోగ్యంతో చనిపోయాడు. అతడి కుమారుడు రామయ్య తండ్రి ప్రారంభించిన వ్యాపారం చేసుకుంటున్నాడు. తండ్రి వద్ద సంవత్సరాలుగా పనిచేస్తున్న నారాయణ కుమారుడి వద్ద కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ దేవతల పండుగ సందర్భంగా ఊరంతా ఇల్లు శుభ్రం చేయడం, రంగులు వేయడం పనిలో నిమగ్నమయ్యారు. రామయ్య కూడా తన ఇంటిని శుభ్రం చేసే పనిని నారాయణకు అప్పగించారు. అటుకు మీద ఉన్న పాత సంచులు, బస్తాలు, సామాన్లు తీసి శుభ్రం చేస్తూ వ్యర్థాలు ఊరు చివరన ఉన్న పాతబావిలో పడేసేవారు. ఇందులో పాత సంచి మూట కట్టి ఉండడంతో బావిలో పడేయకుండా నారాయణ దానిని విప్పి చూశాడు. అందులో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు కనిపించాయి. దురాశకు పోకుండా ఆ మూటను తన యజమాని రామయ్యకు తిరిగి ఇచ్చేశాడు. దీనిని చూసిన రామయ్యకు కళ్లు చెదిరి పోయాయి. తన వద్ద పనిచేసే నారాయణ నిజాయతీ చూసి సంబుర పడ్డారు. అందులో నుంచి కొన్ని డబ్బులు, బంగారం నారాయణకు ఇచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన నారాయణ నేనేం చేశాను సేటు.. మీ ఇంట్లో ఉన్న మూటను మీకు ఇచ్చా..అంతే కదా అన్నాడు.. కాదు నారాయణ.. రూపాయి దొరికితే ఎవరు చూడకుండా జేబులో వేసుకునే ఈ రోజుల్లో.. లక్షల రూపాయలు, బంగారు ఆభరణాలు నాకు తిరిగి ఇచ్చావు. నీ నిజాయతీకి చేతులు జోడించి దండం పెట్టకుండా ఉండలేక పోతున్నానని మరోసారి చేతులు జోడించి దండం పెట్టాడు రామయ్య. నీతి : నిజాయతీ పరుడికి దక్కిన సముచిత గౌరవం మేకల నిక్షిత, 10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, మహబూబాబాద్ -
కేయూ, సైంట్ సంస్థకు మధ్య ఎంఓయూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీకి, సైంట్ లిమిటెడ్ సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం కోసం మంగళవారం యూనివర్సిటీలో చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ సైంట్ లిమిటెడ్ ప్రతినిధి బృందం కేయూను సందర్శించింది. అకడమిక్ కమిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆసంస్థ హెడ్ కార్పొరేట్ ఫంక్షన్స్ డాక్టర్ పీఎన్ఎస్ వి.నరసింహం, సీనియర్ లీడర్ ఎం.సునీల్‌కుమార్, సీనియర్ డైరెక్టర్ కృష్ణదేవి, డైరెక్టర్ గీత విద్యాశాఖ ప్రతినిధి రియాసుమన్ పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ వెంకట్రామ్రెడ్డి, రూసా నోడల్ అధికారి మల్లికార్జున్‌రెడ్డి, కేయూ పాలక మండలి సభ్యులతో చర్చించారు. పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, కామర్స్ తదతర విభాగాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్ వర్క్‌లు స్టార్టప్సంస్థల స్థాపనకు అవసరమైన నైపుణ్యాల కల్పనకు ఉన్న అవకాశాలను బృందంతో చర్చించారు. -
నర్సంపేటలో డ్రైవర్ శంకర్ విగ్రహం ఏర్పాటు
హన్మకొండ : ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ విగ్రహాన్ని నర్సంపేట బస్‌డిపోలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కిరణ్ తెలిపారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు ఎస్వైకె పాషా, కార్యదర్శి జితేందర్ రెడ్డితో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ మజ్దూర్ యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథామ రెడ్డిని.. చొల్లేటి కిరణ్ కలిసి శంకర్ విగ్రహం ఏర్పాటుకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌గా సహకరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని కిరణ్ తెలిపారు. కార్యక్రమంలో టీఎంయూ నాయకులు గడ్డం రవీందర్, ఎండీ గౌస్, మూడ్ రమేశ్ నాయక్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. విమానయాన రంగంలో విస్తృత అవకాశాలు కేయూ క్యాంపస్ : విమానయానరంగంలో విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని గణిత విభాగం సెమినార్‌హాల్‌లో పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. అనంతరం వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, కాంపీటివ్ కోచింగ్ సెల్ డైరెక్టర్ టి. నాగయ్య మాట్లాడారు. -
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద కాళోజీ సెంటర్: పదో తరగతిలో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే స్పెషల్ రెమీడియల్ సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ నరేంద్రనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సంపేట బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన క్యాంపులను కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ జూన్ మూడో తేదీ వరకు ప్రతీ రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటల తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. మొదటి రోజు గీసుకొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల నుంచి 70 మంది విద్యార్థులు నరేంద్రనగర్ పాఠశాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ, డీడబ్ల్యూఓ రాజమణి, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఈఓ, జీహెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులున్నారు. -
నగర సేవలు మరింత మెరుగుపడాలి
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ నగర సేవలు మరింత మెరుగుపడాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్.. అధికారులను ఆదేశించారు. మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలో పారిశుద్ధ్యం, ప్రజాసేవలు, ఆదాయ వనరుల బలోపేతం, వ్యర్థాల నిర్వహణ, వాహనాల వినియోగం, పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత వింగ్ అధికారులతో ఆమె సమీక్షించాకరు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధాన రహదారులపై సంచరించే వీధి పశువులను వెంటనే గోశాలలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. మరమ్మతులు చేసిన వాహనాల వినియోగ స్థితి, బయోమైనింగ్ పనుల పురోగతి, అక్రమ హోర్డింగ్స్ సర్వే, జీఐఎస్ సర్వే ప్రతిపాదనలు, స్వీపింగ్ యంత్రాల రోజువారీ పనితీరు అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీపీ రవీంద్ర రాడేకర్, ఉప కమిషనర్లు బి.శ్రీను, సమ్మయ్య, సీహెచ్ఓ రమేశ్, ఈఈలు రవి కుమార్, సంతోశ్‌బాబు, మాధవి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. జనగణను పరిశీలించిన: జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు హనుమకొండలోని 28వ డివిజన్ పరిధిలో గోవిందరాజుల గుట్ట, సత్యం లేన్, స్టేషన్ రోడ్ ప్రాంతాల్లో జరుగుతున్న జనగణన ఎన్యుమరేషన్ ప్రక్రియను హైదరాబాద్ జనగణన శాఖ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బరాజు పరిశీలించారు. ప్రతీ కుటుంబ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ‘ఎస్ఐఆర్’ మ్యాపింగ్ వేగంగా పూర్తి చేయండివరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ పురోగతిపై సోమవారం మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, పలు శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు. గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదు హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ -
సహజీవనంలో విషాదం..
● పెట్రోలు పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం ● పరిస్థితి విషమం.. జిల్లా ఆస్పత్రికి తరలింపు జనగామ: జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. సీఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పసుల అఖిల్ కుటుంబం కొన్నేళ్లుగా జనగామలో నివాసముంటోంది. ఈ క్రమంలో జనగామ మండలం పెద్దపహాడ్ శివారు ఓ తండా(తల్లిగారు), నర్మెట మండలానికి(అత్తగారు)కు చెందిన ఓ వివాహితతో అఖిల్ ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా కూతురు, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరి జీవనం సాగిస్తున్న క్రమంలో అఖిల్ పరిచయమయ్యాడు. రెండు నెలల క్రితం సదరు మహిళ జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ సమీపంలో కూల్‌డ్రింక్ షాప్ ప్రారంభించింది. ఈ క్రమంలో అఖిల్ ఆమైపె అనుమానం పెంచుకుని తరచూ గొడవలు పడేవారు. దీనిపై బాధిత మహిళ ఇప్పటి వరకు రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అఖిల్, అతని తల్లికి కౌన్సెలింగ్ నిర్వహించారు. నాలుగు రోజులకోసారి ఇద్దరు గొడవలు పడడం, మళ్లీ కలిసి ఉండడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో అఖిల్‌కు అనుమానం పెనుభూతంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాటిల్లో పెట్రోలు తీసుకుని కూల్‌డ్రిండ్ షాప్‌నకు చేరుకున్నాడు. అక్కడికి రాగానే మహిళతో వాగ్వాదం జరగగా ఆగ్రహంతో తన శరీరంపై పెట్రోలు పోసుకుని అక్కడే నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయాలతో పడిపోయిన అఖిల్‌ను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అఖిల్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సర్కార్ విద్యార్థికి రూ.లక్ష బహుమతి అందజేత
హసన్‌పర్తి: ఇంటర్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన హసన్‌పర్తిలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థి ముస్కు ఆదిత్యకు హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆదిత్యకు రూ.లక్ష చెక్కు అందించారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో హసన్‌పర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ముస్కు ఆదిత్య బీపీసీ విభాగంలో 993 మార్కులు సాధించాడు. బైపీసీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి 993 మార్కులు సాధించడం ఇంటర్ చరిత్రలో మొదటి సారి. ఈసందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి గోపాల్, ప్రిన్సిపాల్ సునీతను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంతటి ప్రతిభ కనబర్చచడం గర్వకారణమని పేర్కొన్నారు. -
నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం..
యోగా ఆసనాలు వేస్తున్న విద్యార్థినులుడ్యాన్స్ నేర్చుకుంటున్న విద్యార్థినులునాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. టీవీలో పాటలు చూస్తూ నృత్యం చేస్తుంటే మా నాన్న సెలవుల్లో శిక్షణకు పంపించేవాడు. ప్రస్తుతం నృత్యంలో కొంత నైపుణ్యం సాధించా. పాఠశాలతో పాటు శ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ అభినందనలతో పాటు అవార్డులు, రివార్డులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేసవి సెలవుల్లోనూ సిమ్మింగ్తోపాటు డ్యాన్స్ శిక్షణ తరగతులకు హాజరవుతున్నా. –కాజీపేటబి.రియాన్షా , 4వ తరగతి, కాజీపేట మహబూబాబాద్ అర్బన్: మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఆటాపాటలతో సందడి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించిన శిక్షణ(సమ్మర్ క్యాంపు) తరగతుల్లో ఉత్సాహంగా పాల్గొని తమకు నచ్చిన క్రీడ, ఆటాపాటలు నేర్చుకుంటూ సరదాగా గడిపారు. పిల్లల్లో మానసికోల్లాసం, ఆటాపాటల్లో నైపుణ్యం పెంచడానికి గత నెల 25వ తేదీ నుంచి మొదలైన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలకు హుషారుగా వచ్చి తర్ఫీదు పొందారు. డ్యాన్స్, కుట్లు, అల్లికలు, స్పోకెన్ ఇంగ్లిష్, వాలీబాల్, యోగా.. ఇలా 10 రకాల క్రీడాంశాలపై ఇచ్చిన శిక్షణలో సుమారు 300 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు సమ్మర్ క్యాంపులు ఇలా. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, ములుగు జిల్లా చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల, కొత్తగూడ సోర్ట్స్ స్కూల్లో వేసవి శిబిరాలు నిర్వహించారు. చిన్నబోయినపల్లి, మహబూబాబాద్‌లో క్యాంపునకు 100 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులకు శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ బేసిక్స్, ఆర్ట్, క్రాఫ్ట్, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మోహిందీ మేకింగ్, డిజైనింగ్ ఆన్ హ్యాండ్స్, అక్షరాస్యత, వ్యాసచరన, వ క్తృత్వం, కథ, రచన, కథలు చెప్పడం, పద్యాలు పాడడం, తెలుగు, ఇంగ్లిష్ స్పెల్–బీ, నృత్యం, పాటలు, సాంస్కృతి కార్యకలాపాలు, యోగా, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించారు. మోడల్ క్రీడ పాఠశాలలో.. కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 60 మంది బాలికలు, 60 మంది బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, జావెలిన్‌త్రో, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో శిక్షణ నిర్వహించారు. ఏప్రిల్ 25 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ శిక్షణలో విద్యార్థులకు పలు అంశాల్లో మెళకువలు నేర్పించారు.ఆడుతూ.. పాడుతూవేసవి సెలవుల్లో మండలంలోని పలు ప్రాంతాల్లోని చిన్నారులు బొమ్మల ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. విజ్ఞానంతోపాటు మానసికోల్లాసానికి సంబంధించిన ఆటలు ఆడుతున్నారు. టెడ్డీ బియర్లు, గురుగులతో ఆడుతూ రోజంతా ఉత్సాహంగా గడుపుతున్నారు. – ఏటూరునాగారం బొమ్మలతో ఆడుకుంటున్న చిన్నారులు చెట్టు నీడలో ఆటాపాట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో కరాటే అకాడమీ నిర్వాహకులు అబ్బు, హుస్సేన్ బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా కరాటే నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని మాస్టర్లు తెలిపారు. ఈ శిక్షణ నెల రోజుల పాటు కొనసాగుతుందని, కరాటేతో బాలికల్లో ఆత్మరక్షణ కలుగుతుందన్నారు. – ఏటూరునాగారంవేసవి సెలవుల్లో ఆడుతూ పాడుతూ గడపడం సంతోషంగా ఉంది. తెలుగులో లఘులు, గురులు, ఇంగ్లిష్‌లో గ్రామర్, యోగాలో సూర్య నమస్కారాలు, ఆసనాలు నేర్చుకున్నాం. ఈ శిబిరం నాకు నచ్చింది. – యామిని, బాలికల ఆశ్రమ పాఠశాల ఊరట్టం, మేడారం నేను ఇంగ్లిష్ మాట్లాడానికి ఈ స్పోకెన్ తరగతులు చాలా ఉపయోగపడుతున్నాయి. సహ విద్యార్థుల మధ్య స్పీకింగ్ భయం పోగొట్టడం, ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ సులువుగా ఉంది. – అక్షయ, బాలికల ఆశ్రమ పాఠశాల ప్రాజెక్ట్ నగర్, ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు చోట్ల సమ్మర్ క్యాంపులు నిర్వహించాం. ఈ శిబిరాలతో విద్యార్థుల్లో విజ్ఞానం, మానసిక దృఢత్వం పెంపొందుతుంది. పిల్లలు క్రమ శిక్షణ తో అన్ని అంశాలు నేర్చుకున్నారు. –దేశీరాం నాయక్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు, మానుకోట జిల్లా ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న మాస్టర్ హుస్సేన్వేసవి సెలవుల్లో ఇరుగుపొరుగు విద్యార్థులు ఒక చోట చేరి సందడి చేస్తున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలు ఇంట్లో ఉండకుండా చల్లదనం కోసం చెట్ల కిందికి చేరుతున్నారు. అక్కడ తమకు తోచిన ఆటలు ఆడుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. – వాజేడు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు శిబిరాలు -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
విద్యారణ్యపురి: ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఈనెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ మంగళవారం తెలిపారు. జిల్లాలో ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కలిపి 16,424 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 32 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 32 మంది డిపార్ట్మెంటల్ ఆపీసర్లను, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను 23 మందిని నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు ఫ్లయింగ్‌స్క్వా డ్ల బృందాలు, మూడు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను నియమించినట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమాచారం కోసం కంట్రోల్ రూమ్‌కు 93816 72094, 95027 43435లో సంప్రదించాలని గోపాల్ సూచించారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీస్ వాహనాల పాత విడిభాగాలను ఈ నెల 15న (శుక్రవారం) వేలం వేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ పోలీస్ వాహనాలకు సంబంధించి రిపేర్ చేయబడిన బ్యాటరీలు, టైర్లు, విడిభాగాలను వేలంలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కమిషనరేట్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఎంటీఓ)లో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 87126 85158, 94402 42895, 99495 68320 నంబర్లలో సంప్రదించాలని సీపీ సూచించారు. కేయూ క్యాంపస్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో ప్లేస్మెంట్ సెల్, మేజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోందన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. కేయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చిర్రరాజు మాట్లాడారు. ఈజాబ్ మేళాలో 12 ప్రముఖ సంస్థలు పాల్గొనగా విద్యార్థులు హాజరయ్యారు. కాశిబుగ్గ: ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బంది పేషెంట్లకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ నర్సెస్ డే సందర్భంగా ఎంజీఎంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి, నర్సింగ్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు అశ్విన్, ఎ.మధుకర్, నర్సింగ్ ఆఫీసర్ దయాశీల, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ వై.సుజాత, జ్యోతి, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీకేఎం ఆస్పత్రిలో... వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో నర్సింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రతిజ్ఞ చేశారు. కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు స్వరూప, బేబీ రాణి, జ్యోతిర్మయి, మురళి, పద్మ, దిలీప్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు జి.రమణ, జి.వసంత లీల, ఉమారాణి, సుధ, అనిత, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి న్యూశాయంపేట: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలించిన వెంటనే రశీదులు ఇవ్వాలని పేర్కొన్నారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఆర్డీఓ నాగపద్మజ, అధికారులు పాల్గొన్నారు. -
టీజీ ఆర్పీడీసీఎల్కు ఆప్షన్ల వెల్లువ..
హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు వెళ్లేందుకు విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. ఈ మేరకు ఆప్షన్లు ఎంచుకున్నారు. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుందో.. వెళ్లాలా? వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. ఊహించని విధంగా ఆర్పీడీసీఎల్కు వెళ్లేందుకు ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 30 నుంచి ఈ నెల 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీ ఆర్పీడీసీఎల్కు మొత్తం 2వేల మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్ కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షనల్ కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్ ఇచ్చారు. సీనియార్టీ ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఆప్షన్లో పొందుపరిచిన వివరాలు.. వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. ఈ జాబితాను పరిశీలించి ఆప్షన ఇచ్చిన వారి నుంచి సీనియార్టీ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఈ నెల 13(నేడు)న ఉద్యోగులను ఎంపిక చేసి బదిలీ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. వీరు ఈ నెల 15న ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలో రిలీవ్ అయి, 18న ఆర్పీడీసీఎల్లో రిపోర్టు చేయాలి. వీరికి 19న పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వుల మేరకు ఈ నెల 25వ తేదీ లోపు పోస్టింగ్ పొందిన స్థానంలో జాయిన్ కావాలి. దీంతో మూడో డిస్కం పూర్తి స్వరూపం ఈ నెల 25న రానుంది. 1,252 మంది ఉద్యోగులు ఆప్షన్.. టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్ మెన్లు 271 మంది, లైన్మెన్లు 116, లైన్ ఇన్స్పెక్టర్లు 31, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు 4, ఫోర్మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్లు 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్లు 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు 66, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు 10, అకౌంట్స్ ఆఫీసర్లు 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్లు 15, పర్సనల్ ఆఫీసర్లు 2, ఆర్టిజన్ గ్రేడ్‌కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు 6, ఒకరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆర్పీడీసీఎల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఆర్పీడీసీఎల్కు వెళ్తున్న ఉద్యోగులకు ఒక్క సారి మాత్రమే సత్వర పదోన్నతికి మినహాయింపు ఇస్తారు. బదిలీ ద్వారా పదోన్నతి పొందిన ఉద్యోగులు ఐదేళ్ల పాటు స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం లేదు. అదే విధంగా కంపెనీ బయటకు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి అర్హులు కారు. ఇప్పటికే ఆర్పీడీసీఎల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు. కంపెనీకి కావాల్సిన ఉద్యోగులు 2 వేలు ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది దరఖాస్తు.. పరిశీలన పూర్తి నేడు జారీ కానున్న బదిలీ నియామక ఉత్తర్వులు ఆర్పీడీసీఎల్కు బదిలీ అయిన వారు 15న రిలీవ్ ఈ నెల 25 లోపు ఉద్యోగంలో చేరాలి -
నీట్ రద్దు చేయడం బాధాకరం
రాజస్థాన్‌లో పేపర్ లీకై ందని నిర్ధారణ కావడంతో నీట్(యూజీ) పరీక్షను ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. నీట్ పరీక్ష కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. పరీక్ష బాగా రాశా. ఎక్కడో పేపర్ లీక్ అయిందనే సాకుతో నీట్ పరీక్షను రద్దు చేయడం బాధాకరం. ఇలాంటి ఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలి. – వంగపండ్ల గౌతమి, స్టేషన్ ఘన్పూర్చివరికి నిరాశే మిగిలింది..ఎంతో కష్టపడి నీట్–26 ఎంట్రన్స్ పరీక్ష రాస్తే నిరాశే మిగిలింది. ఇంటర్మీడియెట్‌లో అధిక మార్కులు సాధించి, నీట్ పరీక్ష కోసం సమయాన్ని వృథా చేయకుండా చదివాను. ఎక్కువ మార్కులు తెచ్చుకుని పేదలకు సేవ చేసే డాక్టర్ కోర్సు చదువుకోవాలనేది నా లక్ష్యం. రాజస్థాన్‌లో పేపర్ లీక్ అవడంతో మా ఆశలు నీరుగారాయి. మళ్లీ పరీక్ష రాస్తే గతంలో మాదిరిగా రాస్తామో, లేదోనని ఆందోళన చెందాల్సి వస్తోంది. – జోగు రక్షిత, వరంగల్ పేపర్‌లీక్.. అభ్యర్థులకు శాపమే..నీట్ పేపర్ లీక్‌కావడం, ఎన్టీఏ నీట్‌ను రద్దు చేయడంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు శాపంగా మారింది. నేను ఇంటర్ బైపీసీలో 1,000 మార్కులకు 984 మార్కులు సాధించా. నీట్‌కు ప్రిపేర్ అయి పరీక్ష బాగా రాశాను. మంచి మార్కులు సాధించి సీటు వస్తుందనే భావనతో ఉన్నా. పేపర్ లీకై ందని పరీక్ష రద్దు చేశారనడంతో కంగుతిన్నా. మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మళ్లీ ప్రశ్నపత్రం ఎలా వస్తుందో తెలియదు. – ఎం.రిషిత, పున్నేలు, ఐనవోలు -
ముగిసిన టీజీఎడ్‌సెట్– 2026
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–2027) లో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన టీజీఎడ్‌సెట్ –2026 ప్రశాతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకేంద్రంలో ఏడు, వరంగల్జిల్లా నర్సంపేటలో ఒకటి మొత్తం 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు ముందుగానే చేరుకున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 2,304మంది హాజరుకావాల్సి ఉండగా 1,886 మంది (81.86శాతం) హాజరయ్యారు. 418మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగగా 2,304 మందికి 1,926 మంది అభ్యర్థులు (83.59శాతం) హాజరయ్యారు. 378 మంది గైర్హాజరయ్యారని టీజీఎడ్‌సెట్ కన్వీన ర్ ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. కాగా, హనుమకొండలో పలు కేంద్రాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అంతకుముందు టీజీఎడ్‌సెట్ ప్రశ్నపత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి.. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డితోకలిసి ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, సెక్రటరీ పొఫెసర్ శ్రీరామ్‌వెంకటేష్, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, టీజీఎడ్‌సెట్ కన్వీనర్ బి.వెంకట్రామ్రెడ్డి, వివిధ విభాగాల డీన్లు రాంనాథ్ కిషన్, బి. సురేశ్‌లాల్, కె. రాజేందర్,జి. హనుమంతు, విద్యాకళా శాల ప్రిన్సిపాల్ నల్లానిశ్రీనివాస్ పాల్గొన్నారు. మొదటి సెషన్‌కు 81.86 శాతం, రెండో సెషన్ 83.59 శాతం మంది హాజరు పరీక్ష కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, వీసీ -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 20267ముగిసిన టీజీఎడ్‌సెట్–26 తెలంగాణలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన టీజీఎడ్‌సెట్–26 మంగళవారం ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. 410 /260గరిష్టం/కనిష్టం -
హజ్ యాత్రికులు క్షేమంగా వెళ్లి రావాలి
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ చౌరస్తా: యాత్రికులు క్షేమంగా హజ్ యాత్రకు వెళ్లి రావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవా రం హైదరాబాద్‌లోని హజ్ హౌస్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న బస్సును ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలని ప్రార్థించాలని భక్తులను కోరారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్, కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రు పాషా, అజ్మతుల్ల, అబూబకర్, ము స్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం కన్నాయిగూడెం: మావోయిస్టు ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మావోయిస్టు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని బుట్టాయిగూడేకి విచ్చేసి గ్రామస్తులతో మాట్లాడారు. ఇంతకాలం అడవిలో ఉండి ప్రజల కోసం పనిచేసిన తాను ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో తనకు పరిచయం ఉన్న కుటుంబాలు, అమరు ల కుటుంబాల ను పరామర్శించి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. -
టూరిజం హబ్‌గా వేయిస్తంభాల ఆలయం
హన్మకొండ కల్చరల్: టూరిజం హబ్‌గా వేయిస్తంభాల ఆలయం నిలుస్తుందని, దేవాలయ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నామని, యునెస్కోలో చేర్చడమే తమ ధ్యేయమని ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం హనుమకొండ శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. మంగళవారం జరిగిన పూజల్లో వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాగా, హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ఘనంగా జయంత్యోత్సవం, పూజలు నిర్వహించారు. శివప్రసాద్ దంపతుల సౌజన్యంతో అన్నప్రసాదాల వితరణ చేశారు. గుజ్జ సంపత్‌రావు భక్తుల కు మామిడిపండ్లు వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తదితరులున్నారు. -
అజ్ఞాతం వీడిన పసునూరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోశ్ ఎట్టకేలకు ఉద్యమ బాటను వదిలారు. పార్టీ సాధారణ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుడి వరకు ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కొనసాగిన ఆయన మంగళవారం అడవిబాటను వదిలి పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సోమిడి నుంచి జార్ఖండ్ వరకు.. పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1980 నుంచి పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా ఉన్న రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యూత్ లీగ్‌లలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. పులి అంజయ్య, క్రాంతి రణదేవ్, గోపగాని అయిలన్న అలియాస్ మహేశ్‌తో కలిసి వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన నరహరి.. అనతికాలంలోనే పోలీసులకు వాంటెడ్‌గా మారారు. నిర్బంధం తీవ్రం కావడంతో 1982లో పూర్తికాలపు కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యమ సహచరిని పెళ్లి చేసుకున్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏఓబీ, ఝార్ఖంఢ్‌లో మావోయిస్ట్ ఉద్యమ విస్తరణకు కీలకంగా పని చేశారు. నరహరి పలు ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ క్రమంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్‌గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్‌లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత నరహరి అలియాస్ విశ్వనాథ్ పార్టీ మెంబర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ప్రస్థానం నాలుగున్నర దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన అనుభవం జార్ఖండ్ ఇన్చార్జ్గా పనిచేసి లొంగిపోయిన నేత -
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, హనుమకొండ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగిపోయారు. నరహరి భార్యతో పాటు పోలీసులు ఎదుట లొంగిపోయారు. రెండు పదుల వయస్సులో పోరుబాట పట్టి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగారు. సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ–సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. వీరిలో రెండో కుమారుడు నరహరి.1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం ఆయనను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతోపాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి ఆర్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టారు. -
నేడు టీజీఎడ్ సెట్
● నిమిషం ఆలస్యమైతే నోఎంట్రీ ● 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ● హాజరుకానున్న 4,609 మంది అభ్యర్థులు కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం 2026–2027లో ప్రవేశాలకుగాను ఈనెల 12న (నేడు) ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్)నిర్వహించబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జి ల్లా కేంద్రంలో ఏడు, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒకటి మొత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో కాజీపేట సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, ములుగు ఎక్స్‌రోడ్‌లోని (గాయత్రీ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ), ఎర్రగట్టుగుట్టలోని ఐయాన్ డిజిటల్, హసన్‌పర్తి హైవేలోని నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్, గోపాల్‌పూర్‌లోని ఎన్ఎస్ గ్లోబల్ టెక్నాలజీస్, హనుమకొండ వడ్డేపల్లిలోని ఐయాన్ డిజిటల్, వరంగల్ జిల్లా నర్సంపేట లక్నెపల్లి సమీపంలోని బాలాజీ ఇన్స్టిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీజీఎడ్‌సెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్రెడ్డి సోమవారం తెలిపారు. టీజీఎడ్సెట్ను రెండు సెషన్లలో నిర్వహించబోతున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌కు 8: 30 నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండబోదు. రెండోసెషన్‌లో మధ్యాహ్నం 12: 30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రెండు గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుతించబోరు. మొదటి సెషన్లో 2,304 మంది, రెండో సెషన్లో 2,305 మంది మొత్తం 4,609 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. హాల్‌టికెట్, బ్లూలేదా బ్లాక్ పాయింట్ పెన్, ఐడీ ప్రూప్ తీసుకుని రావాలని వెంకట్రామ్రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. -
అన్నపూర్ణ బేస్ క్యాంపును అధిరోహించిన జంట
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా కేంద్రంలోని లోటస్కాలనీకి చెందిన అక్షయ్–బిందుశ్రీ దంపతులు హిమాలయాల్లోని స ముద్రమట్టానికి 4,130 మీటర్ల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ బేస్ క్యాంపునకు చేరుకొని తమ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చే శారు. కాగా, అక్షయ్ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్‌గా,బిందుశ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ప నిచేస్తున్నారు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరి చే వీరు ఈ యాత్రకు సిద్ధమైనట్లు తెలిపారు. మక్కలు, ధాన్యాన్ని కొనుగోలు చేయాలిహన్మకొండ అర్బన్: మక్కలు, ధాన్యాన్ని కొ నుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కొ నుగోలు కేంద్రాల్లో రవాణా, హమాలీల సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారని తెలిపారు. గన్నీ సంచుల కొరత కూడా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం సందర్శించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రైతు సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, సారంపల్లి వాసుదేవరెడ్డి, తేలూరి ఉప్పలయ్య, వాంకుడోత్ వీరన్న నాయక్, మంద సంపత్, కాడబోయిన లింగయ్య, దొగ్గల తిరుపతి, గుమ్మ డి రాజుల రాములు, మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య, రమేష్, రజిత, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం.రమ, ఉపేందర్, దూడపాక రాజేందర్, జీడిమట్ల అరుణ,తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026
మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికా రులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్‌లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్‌లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండడంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్‌కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాయల్టీ పెరిగే అవకాశం.. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్‌లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్‌కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్‌లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
విజ్ఞాన గనులు.. గిరిజన గురుకులాలు
న్యూశాయంపేట: పేద విద్యార్థులకు గిరిజన గురుకులాలు వరంగా మారనున్నాయి. వారికి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య, వసతి, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు ఇప్పుడు విజ్ఞాన గనులుగా విరాజిల్లుతున్నాయి. ప్రతిభ ఉండి పేదరికంతో ఇబ్బంది పడుతున్న గిరిజన, గిరిజనేతర విద్యార్థుల కోసం ఈ విద్యాసంస్థలు మరోసారి ద్వారాలు తెరుచుకున్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఐదు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నేరుగా ప్రవేశానికి అవకాశం.. గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పదో తరగతి పూర్తి చేసిన గిరిజన (ఎస్టీ) విద్యార్థులతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన గిరిజనేతర కోటా ప్రకారం ఎస్సీ, బీసీ, ఇతర వర్గాల విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష రాయక పోయినా లేదా మెరిట్ జాబితాలో వెనుకబడిన వారికి ఇదొక అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించింది. ఉచిత భోజన, వసతి, యూని ఫాం, పుస్తకాలతోపాటు నాణ్యమైన బోధన, పోటీ పరీక్షలకు (జేఈఈ, నీట్) ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తుంది. గిరిజన, గిరిజనేతర విద్యార్థులు నేరుగా అడ్మిషన్ పొందడానికి వీలుంది. బాలురకు ఒకటి, బాలికలకు నాలుగు కళాశాలలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు బాలికల గురుకుల కళాశాలలు, ఒకటి బాలుర గురుకుల కళాశాలలు ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని దేవన్నపేట గిరిజన సంక్షేమ గురుకుల (బాలికల) కళాశాల, జనగామ జిల్లా పరిధిలో పాలకుర్తి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల, వరంగల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, వరంగల్ జిల్లా నర్సంపేటలో గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సీట్ల భర్తీ.. ప్రతీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గూపుల్లో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు(34), ఓసీ/ఈబీసీ (1), బీసీ (1), ఎస్సీ (1), అనాథ (1), స్పోర్ట్స్ కోటా (1), పీహెచ్సీ (1)కి కేటాయింపులు ఉంటాయి. అర్హులైన విద్యార్ధులు తమ టీసీ, మెమో, స్టడీ సర్టిఫికెట్, పాస్‌ఫొటో, ఆదాయ, ఆధార్, కుల, ఆదాయ (రూరల్ పరిధి 1.50 లక్షలు, పట్టణ పరిధి రూ.2 లక్షలు) ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకుని నేరుగా వరంగల్ యాకత్‌పురలోని చింతల్‌బ్రిడ్జి వద్ద ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలను ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు సంప్రదించాలి. విద్యార్థులకు నాణ్యమైన బోధన, నీట్, జేఈఈలో శిక్షణ ఉమ్మడి జిల్లాలోని ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు షురూ దరఖాస్తుకు ఈనెల 16వ తేదీ వరకు గడువుగిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత శిఖిరాలు అధిరోహించడానికి మంచి అవకాశం. అర్హులైన వారు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా తమ సమీపంలోని గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. అవకాశం కోల్పోకుండా తమ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. – డీఎస్ వెంకన్న, ఆర్సీఓ వరంగల్, కరీంనగర్ రీజియన్ -
సెలవులు వినియోగించుకోండి
హనుమకొండ డీఈఓ గిరిరాజ్‌గౌడ్ హసన్‌పర్తి: విద్యార్థులు వేసవి సెలవులు వినియోగించుకోవాలని డీఈఓ గిరిరాజ్‌గౌడ్ అన్నారు. హసన్‌పర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి గిరిరాజ్‌గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11 నుంచి ఈనెల 25వ తేదీ వరకు శిక్షణ శిబిరం కొనసాగుతుందని, డ్రాయింగ్, పెయింటింగ్, వర్క్ ఎడ్యుకేషన్, డ్యాన్స్, మ్యూజిక్, కోడింగ్, ఆటలు, ఫన్ గేమ్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమాదేవి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మహేశ్, ఏఎంఓ మన్మోహన్, కళాశాల అభివృద్ధి కమిటీ కోశాధికారి చకిలం రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేజీవీవీలో... కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ప్రత్యేక వేసవి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి డీఈఓ గిరిరాజ్‌గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ సునీత, స్పెషల్ ఆఫీసర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. వేసవి సెలవులను వృథా చేయొద్దు: డీవైఎస్ఓవరంగల్ స్పోర్ట్స్: విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేయకుండా ఇష్టమైన క్రీడల్లో శిక్షణ పొందాలని హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కాజీపేట మండలం సోమిడిలో నిర్వహిస్తున్న తైక్వాండో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సోమవారం డీవైఎస్ఓ ప్రశాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇదొక చక్కటి అవకాశమని పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తే ఆరోగ్యంతోపాటు సాధించాలన్న ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. డీఎస్ఏ కోచ్‌లు కూరపాటి రమేశ్, రాయబారపు నవీన్, తైక్వాండో కోచ్ మోహన్‌లాల్, డీఎస్ఏ సిబ్బంది దుబాసి కిశోర్ పాల్గొన్నారు. -
విద్యార్థుల విజయం జిల్లాకే గర్వకారణం
● మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన విజయాలు జిల్లాకే గర్వకారణమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉర్సుగుట్ట సమీపంలోని ఆకుతోట కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో (యంగ్ ఆచీవర్స్ సన్మాన కార్యక్రమం) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్యశారద, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్డీఓ సుమ హాజరై 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో 550 మార్కులకు పైగా, ఇంటర్మీడియట్లో 980 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులతో పాటు రెండుసార్లు చదరంగం పోటీల్లో ప్రపంచ రికార్డు సాధించిన శ్రీయాంశ్ మురళీకృష్ణను ఘనంగా సత్కరించారు. తహసీల్దార్లు శ్రీకాంత్, ఇగ్బాల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు భాగ్యలక్ష్మి, పుష్పలత, రమేశ్, నారాయణరెడ్డి, డీవైఎస్ఓ అనిల్ పాల్గొన్నారు. -
బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: బాలికల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యంపై అవగాహన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. స్నేహ సమ్మర్ క్యాంపుల నిర్వహణపై డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ విశ్వజ, డీఈఓ గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, డీపీఓ లక్ష్మీ రమాకాంత్ తదితర అధికారులతో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌమార దశలో బాలికల్లో చోటు చేసుకునే శారీరక, మానసిక మార్పులపై అవగాహన కల్పించాలని సూచించారు. గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై బాలికలకు స్పష్టమైన అవగాహన కలిగించాలన్నారు. బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించాలని, ప్రతీ గ్రామపంచాయతీలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, డీపీఎం పద్మప్రియ, ఏపీఎం శ్రీలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, అధికారులు పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్ ’మ్యాపింగ్ వేగవంతానికి చర్యలు జిల్లాలో ‘ఎస్ఐఆర్’ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యా పింగ్ ప్రక్రియపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యాపింగ్ ప్రక్రియకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి నియమిస్తున్నామని తెలిపారు. డీఆర్ఓ శ్రీనివాస్, ఆర్డీఓలు రమేశ్ రాథోడ్, నారాయణ, తహసీల్దార్లు విజయలక్ష్మి, రవీందర్‌రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ జగత్సింగ్ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలి వరంగల్ అర్బన్: నగరంలోని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ ఆదేశించారు. వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు, రామన్నపేట, లక్ష్మీపురం, మట్టెవాడ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈఈ సంతోశ్‌బాబు, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, అధికారులు పాల్గొన్నారు. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
ఓరుగల్లు పీఠకాపరి బిషప్ విజయపాల్‌రెడ్డి కాజీపేట రూరల్: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని రోమన్ క్యాథలిక్ సంఘం 40 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తోందని ఓరుగల్లు మేత్రాసనం పీఠాధిపతి బిషప్ దుగ్గుంపుడి విజయపాల్‌రెడ్డి అన్నారు. దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కుల సాధన రౌండ్ టేబుల్ సమావేశం కాజీపేట ఫాతిమానగర్‌లో సోమవారం ఫాదర్ నవీన్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏటా ఆగస్టు 10న నిరసన దినం జరుపుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ కాంగ్రెస్ తరఫున, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు తెలిపారు. సీపీఐ నాయకులు రాజమౌళి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు మాట్లాడుతూ.. దేశంలో మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోలేదని, కులం ఉన్నంత కాలం ఎస్సీ హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రెవ.అశోక్‌పాల్, బోడ డిన్నా, ఫాదర్ జోసెఫ్, రాజమోహన్, పొలిమెర సృజన్‌కుమార్, ప్రవీణ్, ఎన్.కిరణ్, జన్ను ఈర్మియా, అరుణ్జెమ్స్, కొవడవటి రవి తదితరులున్నారు. -
దేవుడంటే రేవంత్‌రెడ్డికి లెక్కలేదు
ఖానాపురం: దేవుడు, బడులంటే సీఎం రేవంత్‌రెడ్డికి లెక్కలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. వ రంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో కూల్చివేసిన శివాలయాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, ఆలయం వద్ద 24 ఫీట్ల లోతు తవ్వి పూడ్చివేయడంలో కారణం ఏంటన్నారు. ఆర్కియాలజీ అధికారులు ఈనెల 7న ఫిర్యాదు చేస్తే కలెక్టర్ ఎందుకు కేసులు నమోదు చేయించడం లేదని ప్రశ్నించారు. గుప్తనిధుల కోస మే సీఎం రేంవత్‌రెడ్డి తవ్వకాలు జరిపించారని ఆరో పించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను అశోక్‌నగర్‌కు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ దేవాలయాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తే సీఎం రేవంత్‌రెడ్డి కూల్చివేస్తున్నాడని ఎద్దేవా చేశారు.రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసి మాటతప్పిన వారిలో దేశంలో తొలిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అనేక పా పాలు చేస్తున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కూల్చివేతపై కలెక్టర్ ఎందుకు నోరు విప్పడం లేదని, కూల్చివేతపై కాంగ్రెస్ పెద్దల్లో భయం పుట్టుకుందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, శంకర్‌నాయక్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రో ళ్ల శ్రీనివాస్, మర్రి యాదవరెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీపీ ప్రకాశ్‌రావు, సర్పంచ్ రమేశ్, నాయకులు వి ద్యాసాగర్‌రెడ్డి, కిషన్‌రావు, రాజశేఖర్, శ్రీనివాస్, వెంకటనారాయణ, కోటేశ్వర్రావు, వెంకటనర్స య్య, సంపత్, రాజు, దేవేందర్‌రావు పాల్గొన్నారు. శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు -
ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధ్యమే..
రామవరం అనే చిన్న ఊరిలో నవ్య, కావేరి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చదువులో ఇద్దరూ తెలివైన వారే. ఆ ఊరిలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరికి చదువుంటే చాలా ఇష్టం. నవ్యకు డాక్టర్ కా వా లని కోరిక. కాని ఆత్మవిశ్వాసం తక్కువ. ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే అదే ఆలోచించేది. కా వేరి ధైర్యవంతురాలే కాకుండా ఆత్మవిశ్వాసం ఎక్కువ. బాగా చదువుకుని లాయరై పేదలకు సేవ చేయాలనే కోరిక. ఇద్దరు కలిసి వెళ్తుంటే గ్రామంలో పనిపాటలేని కొందరు మీరు అమ్మాయిలు.. మీకు చదువు ఎందుకు చక్కగా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు. ఊరోళ్లు గొప్ప ఉద్యోగాలు చే యలేరు. మీ నుంచి కాదు అంటూ నిరుత్సాహ పరుస్తారు. నవ్య అదే ఆలోచించుకుంటూ నేను డాక్టర్‌ను కాలేనేమో అనే అనుమానంతో ఆలోచిస్తూ పెళ్లి చేసుకోవడమే మేలేమో అనుకుని నిర్ణయం మార్చుకుంటుంది. సంబంధం రావడంతో పెళ్లి చేసుకుంటుంది. కావేరి మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చదువుకుని లాయర్ అవుతుంది. ఎంతో మందికి సేవ చేస్తుంది. చాలా రోజుల తర్వాత నవ్య కావేరిని కలిసి తన కుటుంబ పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు వివరిస్తూ నేను ధైర్యంగా చదువుకుని ఉంటే ఈ రోజు డాక్టర్‌ను అయ్యి ఎంతో మందికి సేవ చేసేదాన్ని. నా పిల్లలను కూడా మంచిగా చూసుకునేదానంటూ బాధపడుతుంది. దీనికి కావేరి ధైర్యం చెప్పింది. ఇప్పటికి బాధపడకు. మించిపోయింది ఏమీలేదు. ఏదో ఉద్యోగం సంపాదించు నేను నీకు సాయం చేస్తానంటూ నవ్యకు భరోసా ఇచ్చింది. దీంతో నవ్య ఆగిపోయిన చదువు కొనసాగిస్తుంది. కావేరి సాయంతో నవ్య మంచి ఉద్యోగం సాధిస్తుంది. ఇద్దరు కలిసి పేదలకు సేవ చేస్తూ స్నేహితులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. –లింగాలఘణపురం నీతి: ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. – వై.అక్షయ, పదో తరగతి, లింగాలఘణపురం -
నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం
● గుండెపోటుతో డీఏఓ మృతి నర్సంపేట రూరల్: నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. డీఏఓ (డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తిస్తున్న తిప్పరి శ్రీనివాస్ (57) గుండెపోటుతో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన తిప్పరి శ్రీనివాస్ వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో మూడు సంవత్సరాల నుంచి డీఏఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయానికి శ్రీనివాస్ విధులకు హాజరయ్యారు. విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి కిందపడిపోయాడు. వెంటనే సహ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే సరికి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి ● మర్రిపల్లిగూడెంలో ఘటన కమలాపూర్ : ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. బీనవేని ఉమ, భిక్షపతి దంపతుల చిన్న కుమారుడు అజయ్(16) ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. సోమవారం తన బంధువులు ఇద్దరితో కలిసి గ్రామంలోని పెద్దిరెడ్డి చెరువులోకి ఈతకు వెళ్లాడు. ఈసమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మధు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. -
పెండింగ్ అర్జీలు వెంటనే పరిష్కరించండి
ప్రజావాణిలో హనుమకొండ కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. పాత ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసిన అర్జీలను తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 126 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం నూతన ప్రజావాణి పోర్టల్‌కు సంబంధించిన అంశాలను ఈడీఎం శ్రీధర్ కలెక్టర్ సమక్షంలో అధికారులకు వివరించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జీడబ్ల్యూఎంసీ సీహెచ్ఓ రాజారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమస్యలు సత్వరమే పరిష్కరించండి: వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 121 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ 31, నర్సంపేటలో 14 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీపీఓ కల్పన, డీఆర్డీఓ నాగపద్మజ, హౌసింగ్ పీడీ దామోదర్, అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు వారసత్వంగా రావాల్సిన అసైన్డ్ భూమికి జీపీఓ, ఆర్ఐలు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని నర్సక్కపెల్లికి చెందిన రవికుమార్, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి తమకు న్యాయం చేయాలని తిరుమలాయపల్లి గ్రామస్తులు వినతిపత్రాలు ఇచ్చారు. -
ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల
నేటి నుంచి కళాశాలల్లో ప్రవేశాలు విద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధి జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్ బోర్డ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం తొలుత యోచించి ప్రవేశాలకు జారీచేసిన షెడ్యూల్‌ను నిలిపివేసిన విషయం విధితమే. అయితే ఆ నిర్ణయాన్ని (విలీన ప్రక్రియను) ప్రభుత్వం మార్చుకొని ఈఏడాది యథావిఽధిగానే ఇంటర్ అడ్మిషన్లకు పచ్చజెండా ఊపింది. ఇంటర్ బోర్డు తాజాగా అడ్మిషన్లకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ ప్రవేశాలు కల్పించన్నారు. జూన్ 1 నుంచి తరగతులు.. మొదటి దశ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. టెన్త్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఆ తర్వాత ఒరిజినల్ టెన్త్ మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. -
నేటినుంచి జనగణన ప్రక్రియ
న్యూశాయంపేట : జిల్లావ్యాప్తంగా జనగణన–2027కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి, తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రణాళిక, గణాంక శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనాభా లెక్కలు రెండు విడతల్లో 33 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ (ఆదివారం) వరకు ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ జనగణన) ప్రక్రియ ముగిసింది. మలివిడతలో సోమవారం(నేటి) నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్స్ బ్లాక్‌ల వారీగా ఇళ్ల సంఖ్యను లెక్కించనున్నారు. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టే రెండో దశలో జనాభా పూర్తి వివరాలను నమోదు చేస్తారు. వివరాల సేకరణ.. జనగణనలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటిపేరు, కుటుంబ యజమానితో బంధుత్వం, వయస్సు, లింగం, చదువు, టీవీ, బైక్, కారు వంటి వివరాలను అధికారులు సేకరించి నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల కులం వివరాలు కూడా సేకరిస్తారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 14 మండలాల్లో (12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు) 1,237 హౌజ్ లిస్టింగ్ బ్లాక్స్ (హెచ్ఎల్బీస్) గుర్తించారు. ఇందుకు 933 మంది ఎన్యుమరేటర్స్ను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు 161 మంది సూపర్ వైజర్లను ఎంపిక చేసి ఇందులో భాగస్వాములు చేయనున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1,094 మంది సిబ్బంది పాల్గొననున్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు ఆదిరెడ్డి
కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్అండ్ సైన్స్‌కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొననున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణలపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందిందన్నారు. ప్రిన్సిపాల్‌తోపాటు పలువురు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు. విద్యారణ్యపురి : వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ పరీక్షకు ఉచిత శిక్షణను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ ఉచిత కోచింగ్‌ను ఈనెల 12 నుంచి ప్రారంభించినున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో 40 రోజుల ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ తెలిపారు. ఈ సారి కెమిస్ట్రీ సబ్జెక్టుతోపాటు ఇంగ్లిష్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, కామర్స్, మైక్రోబయాలజీ సబ్జెక్టులో కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ తమ సబ్జెక్టు విభాగాల అధిపతులను ఇతర వివరాలకు పీజీ కోఆర్డినేటర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కోరారు. నయీంనగర్ : చారిత్రాత్మక హనుమకొండ కలెక్టర్ బంగ్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆదివారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరిశీలించారు. కుడా హార్టికల్చర్ అధికారి ఆసిఫ్అలీ పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ గ్రీవెన్ సెల్‌ను నేడు (సోమవారం) నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. గ్రీవెన్స్ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం సూచించారు. జిల్లాలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ‘కుడా’ కార్యాలయం సమీపంలోని హనుమకొండ ఆర్డీఓ కార్యాలయం, పరకాల ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో వినిపించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లా, డివిజన్ స్థాయిలో.. న్యూశాయంపేట : ప్రభుత్వం ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రజావాణితో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఆయా ప్రజావాణిలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. -
ప్రపంచ యవనికపై వరంగల్ 5ఎఫ్
పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై..సాక్షి, వరంగల్/ గీసుకొండ : కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్.. టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుంచి వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దశల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ)కు సుస్థిర అభివృద్ధిని అందించనుంది. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికై న తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభాగాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వార్షికంగా రూ.1,990 కోట్ల వ్యాపార లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ‘పీఎం మిత్ర’ హోదాతో జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుని, అంతర్జాతీయ జౌళి మ్యాప్‌పై వరంగల్‌కు ప్రత్యేక స్థానం కల్పించనుంది. చారిత్రక కాకతీయ నగరం ఇప్పుడు పారిశ్రామిక రంగంలోనూ ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకోనుంది. ఈ పార్కు దేశంలోనే తొలి పీఎం మిత్ర పార్కుగా నిలవడం తెలంగాణకు, ముఖ్యంగా వరంగల్‌కు విశేష గౌరవంగా పేర్కొనవచ్చు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పార్కును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కై టెక్స్, యంగ్వన్, గణేశా కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి. కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ ద్వారా రూ.300 కోట్లు వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ అంతర్జాతీయ జౌళి మ్యాప్‌పై ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం దిశగా అడుగులు పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మోదీ హైదరాబాద్‌లో ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కలెక్టర్ సత్యశారద, అధికారులు పార్కు వద్ద వీక్షించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్ మాట్లాడుతూ.. కేఎంటీపీ నిర్మాణానికి రూ.1,695 కోట్లను అంచనా వేశారని, వాటిలో సుమారు రూ. 800, 900 కోట్ల వరకు పలు అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల పనులతో పాటు భూ సేకరణ పనుల నిమిత్తం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వి.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నట్లు వరంగల్ డీఈఐఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ కోర్సులో 3,263 మంది, ఒకేషనల్ కోర్సులో 329 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ కోర్సులో 2,083 మంది, ఒకేషనల్ కోర్సులో 182 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షల పర్యవేక్షణకు జిల్లా పరీక్షల కమిటీ, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు వివరించారు. ఏమైనా సందేహాలు ఉంటే 9240205555 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు కె.మాధవరావు, శారద, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
డాక్టర్ శ్రీలతకు అవార్డు
కాళోజీ సెంటర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత అందేకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డు అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతు ల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. డాక్టర్ శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. -
వాహనాల వేగానికి కళ్లెం పడేనా?
కాజీపేట–హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కడిపికొండ బ్రిడ్జి మీదుగా ఖమ్మం బైపాస్ రోడ్డుపై నిత్యం భారీ వాహనాలు వేగంగా వెళ్తున్నాయి.పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలి.. పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది. జఫర్‌గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
ఓరుగల్లు బిషప్‌గా ఫాదర్ విజయపాల్‌రెడ్డి
అధికారికంగా ప్రకటించిన వాటికన్‌సిటీ 14వ పోప్ లియో కాజీపేట రూరల్: ఓరుగల్లు కథోళిక పీఠం నూతన బిషప్‌గా ప్రస్తుత పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డిని నియమిస్తూ వాటికన్‌సిటీలో 14వ పోప్ లియో శనివారం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు కాజీపేట ఫాతిమానగర్‌లోని కెథిడ్రల్ చర్చిలో శనివారం విశాఖ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఉడుములబాల, ఖమ్మం పీఠకాపరి మోస్ట్ రెవరెండ్ సగినాల ప్రకాశ్.. పోప్ లియో అధికార ప్రకటన నియామకపు బిషప్ పత్రాన్ని చదివి వరంగల్ బిషప్‌గా విజయపాల్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం ఓరుగల్లు పీఠం ఫాదర్లు, చర్చి కమిటీ బాధ్యులు, ప్రజలు ఫాదర్ విజయపాల్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఫాదర్లు కొమ్మారెడ్డి జెసెఫ్, అనుకిరణ్, మర్రెడ్డి, టి.జోసెఫ్, మత్యాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 34 ఏళ్లుగా ఫాదర్ విజయపాల్‌రెడ్డి సేవలు వరంగల్ జిల్లా గీసుకొండ మనుగొండ గ్రామంలో రాయపురెడ్డి, ఆగ్నేసమ్మ దంపతులకు 1956 జనవరి 8న విజయపాల్‌రెడ్డి జన్మించారు. చిన్ననాటి నుంచే వినయం, మృదుత్వం, సేవాభావం గుణాలను ఆయన అలవర్చుకున్నారు. జాన్స్ మేజర్ మిషనరీలో తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, విద్యను పూర్తి చేశారు. 1992 ఏప్రిల్ 2న వరంగల్ డయాసిస్‌కు యాజకునిగా అభిషేకం పొందారు. ఖమ్మం డయాసిస్‌లో అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్‌గా, ఎలూరు డయాసిస్‌లో హాస్టల్ డైరెక్టర్‌గా, వరంగల్ డయాసిస్ దేవగిరి పట్నం పారిష్ ఫ్రీస్ట్గా, ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రినిపాల్‌గా, పాఠశాల ఉపాధ్యాయుడిగా, కాజీపేట లోడి సాంఘిక సంస్థ డైరెక్టర్‌గా, జనగామ క్రీస్తు జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ వరంగల్ డయాసిస్ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. -
పారదర్శకంగా మక్కల కొనుగోళ్లు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో మక్కల కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో శనివారం నాటికి 69,140 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలనే లక్ష్యం కాగా, అందులో 51,302 మెట్రిక్ టన్నులను గోదాంలలో నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వైవీ.గణేశ్, అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భాగంగా.. ఎడ్యుకేషన్ వారోత్సవాలు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వీయగణనను వినియోగించుకోవాలి.. కాశిబుగ్గ: జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ ద్వారా స్వీయ జనగణనను (సెల్ప్ ఎన్యుమరేషన్) సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్ నుంచి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎంఏ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సీపీఓ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు. -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్‌రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్‌రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
ప్రైవేటే దిక్కు..
కాశిబుగ్గ: సంతానం లేని పేదలకు అవసరమైన ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలు (ఫెర్టిలిటీ సెంటర్లు) అందుబాటులో ఉండడం లేదు. ఆర్థికంగా ఉన్న దంపతులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పిల్లలకు జన్మనిస్తారు. ఇటీవల కాలంలో సంతాన సాఫల్య కేంద్రాలు కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగా పుట్టుకొస్తున్నాయి. పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన ఈ సెంటర్లు పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరించాయి. సంబంధిత వైద్యులు సంతానం పేరుతో నెలల తరబడి వైద్యం అందిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐయూఐ, ఐవీఎఫ్ ద్వారా మహిళలకు గర్భం వచ్చేటట్లు చేస్తారు. దీనికోసం ఆర్థికంగా ఉన్న దంపతులు లక్షలాది రూపాయలు ఖర్చు చేయడానికి ముందుకు వస్తారు. ప్రస్తుతం హనుమకొండలో సుమారు 15, వరంగల్‌లో రెండు ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు సమాచారం. సీకేఎంలో పరీక్షలు.. తర్వాత గాంధీకి రెఫర్ వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో ఇన్ఫెర్టిలిటీ సెంటర్ లేదు. వైద్యులు మెడికల్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని గతేడాది మార్చి 15న ప్రారంభించారు. ముందుగా సంతానం సమస్యతో వచ్చినవారికి కౌన్సెలింగ్ ఇస్తారు. ఆ తర్వాత భర్త, భార్యకు అవసరమైన పరీక్షలు చేయిస్తారు. రిపోర్టుల ఆధారంగా వారికి సలహాలు ఇస్తారు. తర్వాత సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. కాగా, సీకేఎంలో వీరికి ప్రతిరోజు ఓపీ ద్వారా సేవలు అందిస్తారు. దంపతులకు మూడు నెలల పాటు సేవలు అందిస్తామని వైద్యులు చెబుతున్నారు. రూ.25 లక్షల నిధులు వృథా.. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి తర్వాత గత సంవత్సరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఫెర్టిలిటీ సెంటర్ మంజూరు చేశారు. దీంతో సంతాన లేమితో బాధపడేవారికి ఎంజీఎంలో ఫెర్టిలిటీ సేవలు అందిస్తారని ఆశిస్తే నిరాశే మిగిలింది. తొలుత ఓ భవనంలో ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించారు. పనులు సగం పూర్తయిన తర్వాత ఎంజీఎంను 24 అంతస్తుల సముదాయానికి మార్చే అవకాశం ఉండడంతో పనులు నిలిపివేశారు. ఈ పనుల కోసం రూ.25 లక్షల నిధులు వృథా అయినట్లు తెలుస్తోంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ అంతే.. అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎం నుంచి కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఫెర్టిలిటీ సెంటర్ మారినా ఫలితం లేకుండా పోయింది. ఇందులోని ఐదో అంతస్తులో దీనిని ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీని గురించి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించిన అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. అధికారులు స్పందించి ఫెర్టిలిటీ సేవలు ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. సీకేఎంలో సేవలు అందిస్తున్నాం.. సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో సంతానం లేనివారికి సంబంధిత వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తారు. ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా మెడికల్ మేనేజ్మెంట్ సేవలు మాత్రమే అందిస్తాం. దంపతులకు అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తాం. వారి సమస్యలు గుర్తించి, ఇతర ఆస్పత్రులకు రెఫర్ చే స్తాం. ప్రతీరోజు ఓపీ ద్వారా సేవలందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీదేవి, సీకేఎం ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం సీకేఎంలో మెడికల్ మేనేజ్మెంట్ సేవలకే పరిమితం సూపర్ స్పెషాలిటీలో అడుగడుగునా జాప్యం -
సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆదివారం కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల–సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ మంచిర్యాలలో ఉదయం 10–30 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్‌కు మధ్యాహ్నం 12–45 గంటలకు చేరుకొని వెళ్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మధిర–సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకొని వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక రైళ్లలో తరలివెళ్లనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. -
నేడు మాతృదినోత్సవం
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్న లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. చిన్నప్పటి నుంచి బాగా చదివి ఉద్యోగం సాధించాలని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించా. నన్ను చూసి మా అన్నదమ్ములు, అక్కా చెళ్లెళ్లు అందరూ బాగా చదివి మంచి పొజీషన్లో ఉన్నారు. నాన్న చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి అమ్మ మాతోనే ఉంటోంది. ఇప్పటికీ అమ్మతో మంచీ చెడు అన్నీ పంచుకుంటాం. అమ్మ నింపిన ధైర్యమే నా ఉద్యోగం. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్ -
వివరాలు నమోదు చేసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: స్వీయ జనగణనకు ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందని, జిల్లా ప్రజలంతా తప్పనిసరిగా కుటుంబ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. బాధ్యతగా పాల్గొని ఈ జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి స్వాగతం హన్మకొండ: భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం శమీరావు, టీఎస్ఐఐసీ ఎండీ శశాంకాకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి స్వాగతం పలికారు. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఆదివారం ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వారు హనుమకొండకు వచ్చారు. నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వారికి మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హన్మకొండ అర్బన్: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, స్వీయ జనగణన, విద్యా వారోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొని జిల్లాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హనుమకొండ నుంచి అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్డీఓ మేన శ్రీను, డీసీఓ సంజీవ్‌రెడ్డి, వరంగల్ నుంచి అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో తెలంగాణ పారా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గాడిపెల్లి ప్రశాంత్ అధ్యక్షతన శనివారం జరిగిన దివ్యాంగ క్రీడాకారుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ముప్పిడి రాజుకుమార్, సలహాదారుగా సింగారపు బాబు, ప్రెసిడెంట్‌గా నిషా ఇన్ననీ, నిర్వహణ కార్యదర్శిగా సీవీ జగన్నాథరావు, వైస్ ప్రెసిడెంట్లుగా బొట్ల కార్తీక్, దామెర మనీందర్, కోశాధికారిగా బల్లె రాజు, కార్యవర్గ సభ్యులుగా కృష్ణవేణి, జ్యోతి రఘువరన్, ప్రశాంత్, సంతోష్ ఎన్నికై నట్లు ప్రశాంత్ తెలిపారు. తమకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, పారా ఒలింపిక్స్ కమిటీ, ఖేలో ఇండియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దరఖాస్తుల స్వీకరణ రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణంహసన్పర్తి: ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌కు చెందిన చల్లా బతుకయ్య(42), లక్ష్మి (39) దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితం హసన్పర్తికి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడే షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శనివారం సాయంత్రం వారు బైక్‌పై హసన్‌పర్తి నుంచి హనుమకొండ వైపు బయల్దేరారు. హసన్‌పర్తి సెంటర్ నుంచి అరకిలో మీటరు దూరంలోని 10 రూపాయల టిఫెన్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈఘటనలో బతుకయ్య పైనుంచి లారీ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన లక్ష్మిని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. బతుకయ్య హెల్మెట్ ధరించినా ప్రాణాపాయం తప్పలేదు. -
ఆలయ అభివృద్ధికి కృషి
కాశిబుగ్గ: వరంగల్ ఓసిటీ కాశిబుగ్గలోని శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయంలో కల్యాణ మండపం నిర్మిస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం సీతారామాంజనేయ హరి హర పుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు ప్రత్యేక భిక్ష ఏర్పాటు చేశారు. నాయకులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, దాసరి రాజేశ్ పాల్గొన్నారు. హన్మకొండ: పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని అసోిసియేషన్ ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించారు. అనంతరం మంత్రిని సన్మానించారు. డాక్టర్లు వెంకటేశ్, శివశంకర్, అనుపచంద్, ఆశాజ్యోతి, స్వప్న, సంగీత, సుష్మ, భార్గవి, ప్రియాంక పాల్గొన్నారు. -
హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలి
నయీంనగర్: హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలని, ప్రజలకు బతుకుదెరువు అవకాశాలు కల్పించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. శుక్రవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన టీజేఎస్ ఉమ్మడి జిల్లా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. టీజేఎస్ ఏర్పాటునుంచి ఉద్యోగ, నిరుద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిందన్నారు. ప్రజా అవసరాలకు తగ్గట్టు పాలన జరగాలని, రియల్ ఎస్టేట్‌కు ప్రాధాన్యత తగ్గించుకోవాలని అన్నారు. ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి నియమించాలని కోరారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో పార్టీ పార్టీ 4వ ప్లీనరీ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు, ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని, ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు చిల్ల రాజేంద్రప్రసాద్, షేక్ జావిద్, నాయకులు రత్నం కిరన్, శివకుమార్, రాజేష్, బోనగాని రవీందర్, చిల్లా శ్రవన్‌కుమార్, సంధాని, మల్లేశం, రాధా కిషన్, రాజేష్, శివకుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం -
రక్తదాన ఆవశ్యకతపై అవగాహన అవసరం
● అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్ రావురామన్నపేట : తలసేమియా వ్యాధిపై, స్వచ్ఛంద రక్తదాన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని హనుమకొండ అదనపు డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్ రావు సూచించారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అవగాహన కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో బ్లడ్ బ్యాంక్, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మానవహారం నిర్వహించి అవగాహన కల్పించారు. బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ నిఖిల, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుబీనా అప్రోజ్, వైద్యాధికారి అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి ఎల్.చంద్రశేఖర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రేమలత, రామేశ్వరి,విప్లవ కుమార్, పద్మజ, జ్యోతి, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. -
సర్కారు భూమి కబ్జా
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటలోని సర్కారు భూములపై కబ్జాదారులు కన్నేశారు. ఓ పార్టీ నాయకుడు దర్జాగా తాను నిర్మిస్తున్న వెంచర్‌కు రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు పవిత్రమైన కై లాసిగిరి ప్రదక్షిణ రోడ్డు మార్గం కూడా మాయం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపేటలోని లక్ష్మీ టౌన్షిప్ సమీపాన ఉన్న ప్రభుత్వ భూమిని అందినకాడికి కొందరు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ పార్టీకి చెందిన నాయకుడు తన ప్రైవేట్ స్థలంలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఈ వెంచర్‌కు రావడానికి వీలుగా ప్రభుత్వ స్థలంలోనే రోడ్డు నిర్మించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి వెళ్లారు. చివరకు దీనిపై కేసు నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మళ్లీ వెంచర్ పక్కనే ఉన్న స్థలాన్ని కూడా కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాలభైరవ గుడి పక్కనే బండరాళ్లతో కూడిన స్థలాన్ని జేసీబీలు పెట్టి దర్జాగా చదును చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ 15 ఏళ్ల క్రితం బండ్ల బాట రోడ్డు మ్యాప్ ఉన్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ రోడ్డు మార్గాన్ని కబ్జా చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలోనే కార్మికులకు సంబంధించిన గుడిసెలు వేసి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, విల్లాలకు అనుకూలంగా రోడ్డు వేయడం, భూములను చదును చేయడం వెనుక ఎవరి మద్దతు ఉందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా మున్సిపల్, రెవెన్యూ అదికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకుని సర్కార్ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణ పనులు నిలిపేసిన అధికారులు వరంగల్ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ సమీపంలో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాన్ని వరంగల్ రెవెన్యూ అధికారులు శుక్రవారం పరిశీలించారు. భూములను పరిశీలించి, వివరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణస్వామి, సర్వేయర్ సందీప్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే నిర్మాణ పనులను ఆపాలని ఆదేశించారు. సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని వారు పేర్కొన్నారు. వెంచర్ కోసం రోడ్డు నిర్మాణ పనులు కై లాసగిరి ప్రదక్షిణ రోడ్డు మాయం -
రైతులకు చేరువలో ‘ఆకాశవాణి’
హన్మకొండ : ఆకాశవాణి వరంగల్ కార్యక్రమాలు రైతులకు చేరువగా వెళ్లాయని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి కొనియాడారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వాక్ థాన్ నిర్వహించారు. అందులో భాగంగా హనుమకొండ కేయూ క్రాస్‌లోని వరంగల్ ఆకాశవాణి ప్రాంగణం నుంచి కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు, తిరిగి ఆకాశవాణి ప్రాంగణం వరకు వాక్ థాన్ సాగింది. డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆకాశవాణి అనేక కార్యక్రమాలను రైతులకు చేరువ చేయడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు, అధికారులు ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం ఆకాశవాణి సేవలు అద్వితీయమన్నారు. వరంగల్ కేంద్రానికి దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని, స్థానికంగా ఉన్న ఎంతోమంది మేధావులు సైతం ఆకాశవాణి ద్వారా పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారని కొనియాడారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమ నిర్వహణ అధికారి, ప్రోగ్రాం హెడ్, స్టేషన్ ఇన్చార్జ్ ఇల్లందుల రవికుమార్ మాట్లాడుతూ.. ఆకాశవాణి వాకథాన్ విజయవంతమైందని అన్నారు. జూన్ 8వ తేదీ వరకు ఇలాంటి వినూత్న, సృజనాత్మక కార్యక్రమాలు మరెన్నో శ్రోతలకి అందించనున్నామని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం పీఆర్ఓ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆకాశవాణితో తన చిరకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి సిబ్బంది శ్రీనివాస్, శివ, నరేష్, విజయలక్ష్మి, శ్రీనివాసరాజు, శ్రీనివాస చారి, ఉషశ్రీ, రామ్మూర్తి, రామ్మోహన్, అనిల్ ప్రసాద్‌తో పాటు వ్యాఖ్యాతలు, విశ్రాంత ఉద్యోగులు, శ్రోతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ స్థానం సహపరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి -
సెలవుల్లో యోగాపై ఆసక్తి..
బచ్చన్నపేట : వేసవి సెలవుల్లో విద్యార్థులు యోగాపై ఆసక్తి చూపుతున్నారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా యోగా నేర్చుకుంటున్నారు. మండలంలో కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో యోగా గురువు మల్లేశం రోజు విద్యార్థులకు యోగాను నేర్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్ల లను యోగా తరగతులకు పంపిస్తున్నారు.చిన్నారుల్లో భక్తిభావం..గోవిందరావుపేట : వేసవి సెలవుల్లో సాధారణంగా చిన్నారులు సెల్ఫోన్లు, టీవీలతో సమయం గడుపుతుంటారు. కానీ మండలంలోని చల్వాయి గ్రామంలో చిన్నారులు హనుమాన్ మాలధరించి భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, భక్తి, సంస్కారం అలవడితే భవిష్యత్‌లో మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందనే ఆలోచనతో ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం స్నానాలు చేసి దేవాలయాలకు వెళ్లడం, భజనలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం, పెద్దలకు గౌరవం ఇవ్వడం వంటి అలవాట్లు చిన్నారుల్లో పెంపొందుతున్నాయి. ముఖ్యంగా సెల్ఫోన్లకు అలవాటు పడుతున్న ప్రస్తుత కాలంలో చిన్నారులను ఆధ్యాత్మిక వాతావరణంలో వల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లలకు మంచి మార్గం చూపిస్తున్నామని, చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమని, చిన్నప్పటి నుంచే భక్తి భావం అలవడితే జీవితంలో క్రమశిక్షణ పెరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. -
యువత ఉన్నతస్థాయికి ఎదగాలి
హన్మకొండ అర్బన్ : యువత అవకాశాలను వినియోగించుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి భారీ జాబ్ మేళాను శుక్రవారం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ మేళాకు వేలాది మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై మాట్లాడారు. జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి ఉన్నత విద్య చదివిన వారందరికీ 72 కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వరంగల్ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు. రక్తదానం, అవయవదానం వంటి సామాజిక అంశాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. నైపుణ్యాలను పెంపొందించుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా, తయారీ రంగాల్లో సుమారు 4 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. కేవలం డిగ్రీలు సరిపోవని, కమ్యూనికేషన్, సాంకేతిక నైపుణ్యాలు అవసరమని యువతకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. 72 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. ఆన్లైన్ ద్వారా 2,600 మంది నమోదు చేసుకోగా, మొత్తం 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్, అధికారులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మెగా జాబ్ మేళాలో 4 వేల మందికి ఉద్యోగావకాశాలు -
ఆడుదాం.. అష్టాచమ్మా
కాజీపేట : గ్రామాల్లో అష్టాచమ్మా ఆట ట్రేడ్‌మార్క్ గేమ్‌గా పేరుగాంచింది. ఈ ఆటను వేసవి సెలవుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కాలక్షేపం కోసం ఆడుతుంటారు.పల్లెలతోపాటు పట్టణాల్లోనూ చింతగింజలతో ఆడుతూ కనిపిస్తారు. అష్టా చమ్మాను కొన్ని ప్రాంతాల్లో చకార్ ఆటగా పిలుస్తారు. అష్టా చమ్మా ఆడే విధానం.. అష్టా చమ్మా ఆటను భూమిపై లేదా బండలపై చతురస్రాకారంలో 5 గడులు 25 వచ్చేలా గీయాలి. ఈ గీతల కోసం గ్రామాల్లో బొగ్గునే ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ 25 గడుల్లో 9 గడులను సేఫ్టీ రూంలుగా (గదులుగా) భావిస్తూ వాటిలో గుణాకారం వచ్చే విధంగా గుర్తిస్తారు. ఆ తర్వాత ఆట ఆడేందుకు విరగ్గొట్టిన నాలుగు చింత గింజలను (పాచికలుగా) ఆడేందుకు ఉపయోగిస్తారు. మొత్తం నలుగురు ఆడే ఈ ఆటలో ఒక్కొక్కరు తమ ఆట వస్తువులుగా ఏదైనా తీసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న, చిన్న రాళ్లు, చాక్లెట్లు, వేపగింజలు తదితరాలను తీసుకోవచ్చు. చింతగింజలు నలుపు రంగులో పడితే 8 గడులను దాటేందుకు అర్హత పొందినట్టు. అదే తెలుపు ఆకారంలో పడితే 4 గడులను దాటొచ్చు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆడుతూ ముందుకెళ్తారు. ఆడుతు వెళ్తున్న సమయంలో ఎదుటి వారి వస్తువు ఉన్న చోటా మనం ఆగేందుకు అవకాశం ఉంటే వారి వస్తువును తిరిగి వెనక్కి గడియలోకి పంపవచ్చు. ఆటలో గుణాకారపు ఆకారం గడిలో మనకు సంబంధించిన వస్తువులు ఉంటే అది సేఫ్టీ జోన్‌గా భావిస్తారు. కాపాడే సేఫ్టీ జోన్.. అదే బయట ఉన్నప్పుడు ప్రమాదకరంగా ఉన్నట్టు చింత గింజల ద్వారా వేసే పాచికలు ఎక్కువ విలువ పడే విధంగా వేస్తూ త్వరత్వరగా ఆటలోని గడియ మధ్యలో ఉన్న సేఫ్టీజోన్లో చేరితే వారు గెలిచినట్టు లెక్క. ఇలా ఎవరైతే చివరగా సేఫ్టీ జోన్లో చేరుతారో వారు ఓడినట్లు ఇలా నలుగురు కూర్చోని ఆడే అష్టా చమ్మా ఆట టైంపాస్తోపాటు వినోదాన్ని ఇస్తుంది. నలుగురు ఆడే ఆట ఇది.. -
ఆదాయ వనరుల పెంపుతోనే బలోపేతం
హన్మకొండ అర్బన్ : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆదాయ వనరులను పెంపొందించేందుకు స్థానిక సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సెంట్రల్ తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో ఎమ్మెల్యే నాగరాజు, సభ్య కార్యదర్శి పి.కాత్యాయనిదేవి, సభ్యుడు ఎస్. సుధీర్ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వనరులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు స్వీయ ఆదాయాన్ని పెంచుకుని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్య, పచ్చదనం, పన్ను వసూళ్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడితేనే గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భద్రకాళిని దర్శించుకున్న నోడల్ అధికారి హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కాత్యాయనిదేవి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అధికారులు ఆలయాన్ని సందర్శించిన కాత్యాయనిదేవిని పూర్ణకుంభంతో స్వాగతించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య -
విద్యార్థులకు నైపుణ్య ఆధారిత శిక్షణ
కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్య ఆధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో అధ్యాపకులకు, డీన్లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ–స్కిల్ డిజైర్‌తో అవగాహన ఒప్పందం ద్వారా ఫుల్ స్టాక్ జావా, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నామన్నారు. స్కిల్ డిజైర్ డైరెక్టర్ ముప్పల శ్రీకాంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలు వివరించారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనను కలిసిన పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం విభాగం అధిపతిగా ప్రొఫెసర్ టి.మనోహర్‌ను నియమిస్తూ రిజి స్ట్రార్ వి.రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండేళ్లుగా రాజ్‌కుమార్ విభాగా ధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం పూర్తవడంతో ఆ స్థానంలో మనోహర్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన ఆ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కూడా కొనసాగుతున్నారు. ఈ మేరకు వీసీ కె.ప్రతాప్‌రెడ్డి చేతులమీదుగా మనోహర్ ఉత్తర్వులు అందుకున్నారు. ఓఎస్డీ బి.వెంకట్రామ్రెడ్డి, అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ పాల్గొన్నారు. వరంగల్ క్రైం: ఉద్యోగంలో స్థాయి పెరిగినా కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఎస్సై భుజాలపై స్టార్స్‌ను అలంకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్‌లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్‌సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కాగా, కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్‌ఫ్యాక్టరీ) ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు లేదని రైల్వే అధికారులు తెలిపారు. పనులు పూర్తి స్థాయిలో కాలేదని పేర్కొన్నారు. -
జనగణనలో భాగస్వాములు కావాలి
వరంగల్ అర్బన్: జనగణన–27లో భాగంగా నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, స్వీయ గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ వేయిస్తంభాల ఆలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, అధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. ములుగు రోడ్ జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, ‘జనగణన–27లో పాల్గొని దేశాభివృద్ధికి సహకరిద్దాం’’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, మెప్మా సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, తెలంగాణ సాంస్కతిక సారథి బృందం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలి.. హన్మకొండ అర్బన్: జనగణన–27 విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కోరారు. శుక్రవారం జనగణన–27 అవగాహన ప్రచార వాహనాన్ని హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ నెలవారీ తనిఖీల్లో భాగంగా.. నగరంలోని రెడ్ క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎం గోడౌన్‌ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మత్స్యకారులకు అవగాహన సదస్సు హన్మకొండ చౌరస్తా: చెరువుల పరిశుభ్రత, నీటి నాణ్యత పరిరక్షణ, చేపల వ్యాధుల నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తే మత్స్య ఉత్పత్తి పెరిగి మత్స్యకారులకు అధిక ఆదాయం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ‘రైతు వారం’ ఐదో రోజు సందర్భంగా చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపల వ్యాధుల నియంత్రణ, చేపల అధికోత్పత్తి సాధనపై హనుమకొండలోని పద్మశాలి భవన్‌న్‌లో శుక్రవారం జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆధునిక మత్స్య సాగు పద్ధతులు, చెరువుల నిర్వహణ, చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. హైదరాబాద్ వ్యవసాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ నీలం పుష్పరాణి, జిల్లా మత్స్యశాఖ అధికారి పి.శ్రీపతి, మామునూరు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ గణేశ్ (ఆక్వాకల్చర్), ఎఫ్డీఓ (రిటైర్డ్), ఎస్.వేణుగోపాల్, డీఎఫ్‌సీఎస్ హనుమకొండ మల్లేశం, మత్స్యకారులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ -
పది రోజులుగా పనిచేయని సీటీ స్కాన్
కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 రోజుల నుంచి సీటీ స్కాన్ యంత్రం పనిచేయట్లేదు. దీంతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సిటీ స్కాన్ చేయించుకోవాలంటే ఇబ్బందిగా మారుతోంది. వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యులు సీటీ స్కాన్ ఎక్కడ చేయించుకోవాలో తెలియక ఆందోళనకు గురువుతున్నారు. దీంతో రోగులు ఎంజీఎం ఆస్పత్రి బాట పడుతున్నారు. మండుటెండలో సీటీ స్కాన్ కోసం పేషెంట్‌తో పాటు అటెండెంట్ ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్తుండడంతో వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అధిక భారం.. ప్రస్తుతం ఎంజీఎంలోని పేషెంట్లకే సీటీ స్కాన్ పరీక్షలు చేయడంలో క్యూ లైన్ పాటించాల్సి వస్తోంది. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి వచ్చిన పేషెంట్లకు కూడా సిటీ స్కాన్ చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. చివరకు సిటీ స్కాన్లు అధికంగా తీయాల్సి రావడంతో ఇక్కడి స్కాన్ పరికరం కూడా పనిచేయకుండా మూలన పడే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. కాగా, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని పరికరానికి సంబంధించిన వారెంట్ ముగియడంతో సంబంధిత టెక్నీషియన్లు హైదరాబాద్ నుంచి రావట్లేదని తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి రావాల్సిన బకాయిలు ఉండడంతో వారు రావట్లేదని సమాచారం. దీంతో స్కాన్ పరీక్షల కోసం ఇంకెన్ని రోజులు పడతాయో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి నట్లు అధికారులు చెబుతున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్ప్రతిలో రోగులకు ఇక్కట్లు -
సమయపాలన లేకుండా నీటి విడుదల
వాళ్ల ఇష్టం వచ్చినసమయానికి నీళ్లు వదులుతున్నారు. ఒక్కోసారి ఉదయం, మరోసారి రాత్రిపూట వదలడంతో తెలియక పట్టుకోలేకపోతున్నాం. గతంలోకంటే ఎండాకాలం నీరు తక్కువగా వస్తోంది. లైన్‌మన్‌ను అడిగితే పైప్‌లైన్ లీకేజీ ఉందని, అందుకే నీరు ప్రెషర్ తక్కువగా ఉందని చెబుతున్నాడు. – పిల్లల సామ్రాజ్యం, ఉర్సుబొడ్రాయి నల్లా వత్తలేదు నల్లా రాక, తాగు నీరు లేక బాగా ఇబ్బందవుతోంది. మాకు బోరు లేదు. నల్లా వత్తలేదు ఇలా అయితే ఎలా? ఇంటిల్లిపాదికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎండా కాలంలో నీళ్లు లేకుండా ఎలా ఉండగలం? క్యాన్ వాటర్ తాగేందుకు కొంటాం. కానీ ఇంటి అవసరాలకు ట్యాంకర్ కొనలేం కదా. – కూచన రాధ, 54వ డివిజన్, హనుమకొండరోజంతా నీళ్లకాడనే.. నల్లా నీరు ప్రెషర్ తక్కువగా వస్తోంది. సన్నటి ధారలా వస్తుండడంతో రోజంతా నీళ్లకాడనే ఉండాల్సి వస్తోంది. మేం పనికి వెళ్తేనే కుటుంబం గడుస్తుంది. నీటిదగ్గరే సమయమంతా గడిచిపోవడంతో పనికి పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. దీంతోపాటు ఏ సమయంలో నీటిని వదులుతారో అర్థంకాని పరిస్థితి. – భాగ్యమ్మ మైసయ్య నగర్ -
గ్రేటర్ ప్రత్యేకాధికారిగా చాహత్
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)లో గురువారం నుంచి ప్రత్యేకాధికారి పాలన ప్రారంభమైంది. హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ.కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియా పాలక మండలి పదవీ కాలం బుధవారంతో పూర్తయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే నాటికి ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది. గ్రేటర్ వరంగల్ ఇన్చార్జ్ కమిషనర్‌గా, స్పెషల్ ఆఫీసర్‌గా చాలాతక్కువ మంది కలెక్టర్లకు ఇలాంటి అవకాశం లభిస్తుందని సీనియర్ అధికారులంటున్నారు. ఒకరికే.. నాలుగు అదనపు బాధ్యతలు వరంగల్, హనుమకొండ జిల్లాలకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అత్యంత కీలకమయ్యారు. గ్రేటర్ వరంగల్ మహానగరం, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) రెండు జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. బల్దియా కమిషనర్‌గా పనిచేసిన ఆమె ఇటీవల పదోన్నతిపై హనుమకొండ కలెక్టర్‌గా నియామకమయ్యారు. ప్రభుత్వం కమిషనర్ పోస్ట్‌ను ఇంకా భర్తీ చేయలేదు. ఆమెనే కలెక్టర్‌గా, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్‌గా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) వైస్ చైర్‌పర్సన్‌గా, హనుమకొండ జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మీదట బల్దియా ప్రత్యేకాధికారిగా కొనసాగనున్నారు. ఇలా ఐదు కుర్చీల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. అయితే అన్నింటినీ చక్కదిద్దడం కత్తిమీద సామే అంటున్నారు విశ్లేషకులు. మహా నగర అభివృద్ధిని కొనసాగిద్దాం : ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ కిందిస్థాయి నుంచి వింగ్ అధికారి వరకు బాధ్యతాయుతంగా తమ విధులను సమన్వయంతో పనిచేస్తూ, మహా నగర అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేద్దామని గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వింగ్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సుమారు రూ.100 కోట్ల విలువైన పెద్ద ప్రాజెక్టులు వేగంగా అమలయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా రహదారులు, పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పన దృష్టి కేంద్రీకరించాలన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రజా ఫిర్యాదులకు తక్షణం స్పందించాలని, ఫైళ్లు ఎక్కడా నిలిచిపోకూడదని హెచ్చరించారు. యూజీడీ ప్రాజెక్ట్ డీపీఆర్ అంతిమ దశకు చేరుకున్నందున ఇంజనీరింగ్ అధికారులు అందుకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, ఎంహెచ్ఓ డా.రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, మహేందర్, మాధవీలత పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్‌పాయ్‌కి అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ కలెక్టర్‌కు నాలుగు అదనపు బాధ్యతలు ఇలాంటి అవకాశం రావడం అరుదు అంటున్న సీనియర్లు -
సౌరవిద్యుత్‌పై అవగాహన ఉండాలి
ఖిలా వరంగల్: సౌర విద్యుత్‌పై రైతులకు అవగాహన ఉండాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం తూర్పుకోటలో వ్యవసాయ, రెవెన్యూ, టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ పంప్సెట్లకు సౌర విద్యుత్ వినియోగిస్తే పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల సమీపంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. పీఎం కుసుం పథకాలపై వివరించారు. అనంతరం రైతులు, వినియోగదారుల కోసం రూపొందించిన విద్యుత్ భద్రత అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. జిల్లా వ్యవసాయాధికారి కె.అనురాధ, శాస్త్రవేత్తలు శ్రావణ్, హరి, ఏఓ విజ్ఞాన్, సాగుకు సంబంధించిన పలు కీలక అంశాలను రైతులకు వివరించారు. విద్యుత్ శాఖ డీఈ మల్లికార్జున్, తహసీల్దార్ ఇక్బాల్, మాజీ కార్పొరేటర్ సువర్ణ, రెడ్కో జనరల్ మేనేజర్ రాజేందర్, ఎస్ఈ ఆనందం, ఏడీఈ కిశోర్, ఏఈ రామకృష్ణ, చంద్రకాంత్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వీరేశ్‌బాబు, రైతులు పాల్గొన్నారు. వేసవి శిబిరాలను విజయవంతం చేయాలి..న్యూశాయంపేట: జిల్లాలో వేసవి శిబిరాల విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శిబిరాల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 10 వరకు నిర్వహించనున్న శిబిరాల్లో పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ నాగపద్మజ, అదనపు డీఆర్డీఓ రేణుక, డీపీఓ కల్పన, సంక్షేమాధికారి రాజమణి తదితరులు పాల్గొన్నారు. జాబ్‌మేళా ఏర్పాట్ల పరిశీలన.. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు కంపెనీలు రానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నిరుద్యోగ యువత వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు ఉన్నారు. నేడు కాళోజీ కళాక్షేత్రంలో జాబ్ మేళావరంగల్ స్పోర్ట్స్: యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం)బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈజాబ్ మేళాలో ప్రైవేట్ రంగానికి చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మార్కెటింగ్, సేల్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఐటీ, బిజినెస్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్ తదితర రంగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఖానాపురం ఎస్సైకి పురస్కారం
వరంగల్ క్రైం: మూగ జీవాల అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఖానాపురం ఎస్సై జి.రామ్మోహన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు. ఈ మేరకు గురువారం సీపీ కార్యాలయంలో నగదు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: ప్రజాపాలన – ప్రగతిప్రణాళికలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతు మేళాలో మూడు రోజులపాటు వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు అలాగే, అవగాహన స్టాల్‌ను కూడా నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య గురువారం తెలిపారు. 15 మందితో కూడిన వైద్యబృందంతో మూడు రోజుల పాటు రెండు షిఫ్టుల్లో వైద్య సేవలు అందించామని తెలిపారు. 229 మందికి బీపీ, 179 మందికి షుగర్, నాలుగు ఈసీజీ పరీక్షలు 375 ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒకరు ఫిట్స్, మరొకరు ఛాతి నొప్పితో బాధపడగా.. వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి స్టెబిలైజ్ చేశాక మెరుగైన సేవలకు 108 ద్వారా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈవైద్యశిబిరంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్‌రెడ్డి, డీఐఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ వి.అశోక్‌రెడ్డి, డాక్టర్ నవీన్ పర్యవేక్షించారు. వైద్య అధికారులు అరుణ్‌కుమార్, శ్వేత, స్వాతి, విప్లవకుమార్, పారామెడికల్ సిబ్బంది, ఆశవర్కర్లు సేవలందించారని అప్పయ్య తెలిపారు. వీసీలో రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి వరంగల్ అర్బన్/న్యూశాయంపేట: జనగణన–27 కార్యక్రమంలో భాగంగా ఇళ్ల, జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 11 నుంచి జూన్ 9వరకు నిర్వహించే ప్రక్రియను సవ్యంగా నిర్వహించాలని, స్వీయ గణనపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలందరికి తెలిసే విధంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. కాగా, స్వీయ గణన కోసం నేడు(శుక్రవారం) ఎంజీఎం కూడలి నుండి వెయ్యి స్తంభాల ఆలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్, అదనపు ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి చంద్రశేఖర్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఎంసీ రమేశ్, వరంగల్ నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నలుగురు ఇన్స్పెక్టర్ల బదిలీ వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డిని శాయంపేటకు, ఏహెచ్‌టీయూ ఇన్స్పెక్టర్ జె.శ్యామ్ సుందర్‌ను కాజీపేటకు, పీసీఆర్‌లో పనిచేస్తున్న ఏ.మహేందర్‌ను హసన్పర్తికి, ప్రస్తుతం హసన్‌పర్తిలో విధులు నిర్వహిస్తున్న వి.చేరాలును వీఆర్‌కు బదిలీ చేశారు. -
రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్ వ్యవస్థ, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్‌పాం లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ ఆపేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులు దానం చేయాలని నాడు వైఎస్ చెప్పారు.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఉచిత విద్యుత్ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు.. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్.రవి, సంధ్యారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.ఆయిల్‌పాం సాగు లాభదాయకం సేంద్రియ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా -
కేటీఆర్‌కు మతిభ్రమించింది
రామన్నపేట: రైతులకు బేడీలు వేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని, ఇప్పుడు వారిపై ప్రేమ ఉన్నట్లు కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు నటిస్తున్నారని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఆరోపించారు. వరంగల్ నగరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిపై పరుష పదజాలంతో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోవడంతో మతిభ్రమించిన కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు వరి వేసుకుంటే ఉరేనని అని అనలేదా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, కేజీ టు పీజీ ఉచిత విద్య పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో 641 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నది వాస్తవం కాదా, ఇలాంటి నీచమైన పరిపాలన చేసిన బీఆర్ఎస్ నేతలు.. సీఎం రేవంత్‌రెడ్డిపై పరుష పదజాలం ఉపయోగిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. నాయకులు ఎద్దు సత్యం, తూల రవి, శ్రీనివాస్, దాడి శివ, మాధవరెడ్డి, ఇండ్ల రవి, ఈగ దామోదర్, నాంపల్లి యాదగిరి, జన్ను అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ది సీఎం రేవంత్‌పై పరుష పదజాలం ఉపయోగిస్తే ఊరుకోం కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ -
తిట్ల పురాణానికి ఆద్యుడు సీఎం రేవంత్
హన్మకొండ: తిట్ల పురాణానికి ఆద్యుడు రేవంత్‌రెడ్డి అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించడం లేదని, పంటల కొనుగోళ్లు లేక రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. రైతు బంధు వంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు మంత్రి పదవులు కోసం పోటీ పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హామీల అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు అసహనంగా స్పందిస్తున్నారన్నారు. రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతు సంగ్రామ సదస్సు విజయవంతం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారని, పంటలు కొనుగోలు చేసే సామర్థ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, ఉడతల సారంగపాణి, తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, రామ్మూర్తి, నార్లగిరి రమేశ్, నయీముద్దీన్, పానుగంటి శ్రీధర్, బండి రజినీకుమార్, రవీందర్రావు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య -
నోటిఫికేషన్‌పై హర్షం
హన్మకొండ కల్చరల్: దేవాలయాల్లో పనిచేయడానికి గ్రేడ్ 1, 2, 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామనికి 190 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడడంపై తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్, గ్రేటర్ వరంగల్ జేఏసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ శర్మ, రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రచారి, రాష్ట్ర దేవాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కొండూరు కృష్ణమాచారి తదితరులు హనుమకొండ రాంనగర్లో దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి దేవాదాయశాఖ ఈఓల నియామకానికి ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉప ప్రధానార్చక, ప్రధాన అర్చక పోసుల్లో నియామకం చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దేవాదాయశాఖలో పనిచేస్తున్నారని, ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం నియామకాలు చేపట్టాలని కోరారు. మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయాలను చర్చించారు. అలాగే దేవాదాయశాఖలో 190 పోస్టులు కేబినెట్లో తీర్మానం చేసినందుకు అర్చక ఉద్యోగ జేఏసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఓరుగల్లునుంచే రైతుపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: ‘రైతుకు ఓపిక నశిస్తే భూకంపం పుడుతుందని పాలకులు గ్రహించాలి. భూమిని దున్నడం తెలిసిన రైతు నాగలి తిరగేసి కాంగ్రెస్‌ను బొంద పెడతారు.. వరంగల్ వేదికగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ హంటర్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతికి సంతాపంగా తొలుత ఒక నిమిషం మౌనం పాటించి, నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. జై కేసీఆర్ నినాదాలతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ‘కేసీఆర్ సారు మళ్లీ రావాలి. రైతు బంధు రాజ్యం రావాలి. రాబందుల పాల న పోవాలి’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. కాగా, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ వైఫల్యాలు, ప్రభుత్వ తీరును కేటీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. సదస్సుకు హాజరైన పలువురు రైతులు, రైతు ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ అభిప్రాయాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సదస్సులో గాయకులు మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్ పాటలతో హోరెత్తించారు. ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి.. రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన కంకులతో రూపొందించిన పసుపు చీరను కట్టుకున్నట్లుగా ఎడ్లబండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ఎడ్ల బండి, నాగలి వద్ద సెల్ఫీలు దిగారు. వేసవి తాపానికి అంబలి.. దాహానికి మజ్జిగ, మంచినీళ్లు సదస్సుకు వచ్చిన రైతులకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది రైతులకు తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి స్టాల్‌ను ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామన్న కేటీఆర్ జై కేసీఆర్.. సారు మళ్లీ రావాలి నినాదాలతో మార్మోగిన రైతు సంగ్రామ సదస్సు పాటలతో హోరెత్తించిన మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి అభిప్రాయాలు, కష్టాలు పంచుకున్న రైతులు.. పలు తీర్మానాలకు ఆమోదం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన నేతలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
5 ఏళ్లు.. రూ.3,331 కోట్లు.. 6,676 పనులు
వరంగల్ అర్బన్: ఐదేళ్లలో వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధికి రూ.3,331 కోట్ల వ్యయంతో 6,676 పనులు చేపట్టి, అత్యుత్తమ, ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఎక్స్ అఫీషియో, పాలక మండలి సభ్యులు, కమిషనర్, అధికారులు, ఉద్యోగుల సేవలు అమూల్యమైనవన్నారు. గ్రేటర్ వరంగల్ పాలక మండలి చివరి కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. 20 ఎజెండా అంశాలకు సంబంధించి రూ.76.56 కోట్ల అభివృద్ధి పనులకు సర్వసభ్య సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా పాలకవర్గం సమష్టిగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిందన్నారు. వరంగల్ ప్రజల దశాబ్దాల కల అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్ట్‌కు పునాది వేయడం కీలక విజయమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. స్మార్ట్ సిటీ పథకం ద్వారా ఆధునిక మౌలిక వసతులు, స్మార్ట్ రోడ్లు, జంక్షన్లు, చెరువుల సుందరీకరణ వంటి పనులు నగరానికి కొత్త రూపును తెచ్చాయని చెప్పారు. తాగునీటి సమస్యను అధిగమించి ప్రతీ రోజూ నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని, పారిశుద్ధ్య రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు. వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచాం. భవిష్యత్‌లో సమస్య లేకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. చర్చ జరిగిందిలా.. 5వేల నుంచి 6 వేల మందితో కూడిన డివిజన్‌గా పునర్విభజన చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు ప్రస్తావించారు. గ్రేటర్ స్థాయి తగ్గించకుండా 12 వేల నుంచి 15 వేల మందితో ఒక డివిజన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో మాట్లాడేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వకపోవడం సరికాదని కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అన్నారు. గత ఐదేళ్లలో డివిజన్ ప్రజలతో, కౌన్సిల్లో జరిగిన పరిణామాలపై పలువురు కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘ కాలం నడిచిన ప్రయాణం మధుర జ్ఞాపకంగా నిలుస్తుందన్నారు. రూ.1,24 కోట్ల పనులకు శంకుస్థాపన బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో రూ.95 లక్షలతో స్విమ్మింగ్ పుల్ నిర్మాణం, రూ.29 లక్షల జనరల్ ఫండ్‌తో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయం కోసం స్టాళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా బల్దియా ఆవరణలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్‌తో పాటు వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫొటో సెషన్ కొనసాగింది. ఆత్మీయ వీడ్కోలు.. గ్రేటర్ వరంగల్ పాలకమండలికి బుధవారం సాయంత్రం ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. సభ్యులకు మెమొంటో అందించి శాలువా కప్పి సత్కరించారు. మనుషులా.. గాడుదులా? కౌన్సిల్ సమావేశ మందిరంలో తాను కూర్చునే సీటు వద్ద తన నేమ్ ప్లేట్ పెట్టకుండా తనను అవమానపర్చారని ఎమ్మెల్సీ సారయ్య అసహనం వ్యక్తం చేశారు. ‘మనుషులా గాడుదులా’ అంటూ సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. మరింత అభివృద్ధి చేస్తాం.. వరంగల్ నగరాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం. నగరాభివృద్ధిలో భాగంగా ఎయిర్పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. ప్రజ లకు మెరుగైన జీవన వాతావరణం అందిస్తాం. – ఎంపీ కడియం కావ్య మౌలిక వసతులపై ఫోకస్ పెట్టాలి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. నగరానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తాం. స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్లు ఆ దిశగా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. – బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ పదవులు కాదు.. ప్రజా సేవే లక్ష్యం పదవులు శాశ్వతం కాదు. ప్రజల సేవే నిజమైన లక్ష్యం. ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుండాలి. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, ఎమ్మెల్యే, వర్ధన్నపేట కట్టుబడి పనిచేస్తాం.. ప్రతీ సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని, వేగంగా పరిష్కరించేలా పనిచేస్తాం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం. – చాహత్ బాజ్‌పాయ్, హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ అందరి సహకారంతో ఆదర్శనగర నిర్మాణం మేయర్ గుండు సుధారాణి చివరి కౌన్సిల్లో రూ.76.56 కోట్ల పనులకు ఆమోదం -
అటవీ సంరక్షణకు ప్రాధాన్యం
వరంగల్ డీఎఫ్ఓ నిఖిత న్యూశాయంపేట: జిల్లాలో అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారి బి.నిఖిత అన్నారు. ఇటీవల జిల్లా అటవీశాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బుధవారం ఆమె క్యాంపు కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారుల (ఎఫ్ఆర్ఓ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అటవీ చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు రవికిరణ్, రాధిక తదితరులు పాల్గొన్నారు. -
కల్లాల కాడ రైతుల ఎదురు చూపులు
కాంగ్రెస్ వాళ్లకే యూరియా.. వ్యవసాయంలో వ్యత్యాసం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ముందుగా యూరియా ఇస్తున్నారు. వాళ్ల పంటనే ముందుగా కొంటున్నారు. వర్షం వచ్చి వడ్లు తడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. అంతా అవినీతి, అక్రమాలకు నిలయంగా కాంగ్రెస్ పాలన నిలుస్తోంది. – సుబ్బారావు, రైతు, ఖానాపురం, వరంగల్ పండించిన పంటను ఎప్పుడు కొంటారు? పెట్టిన పెట్టుబడి ఎప్పుడు చేతికందుతుందని రైతులు కల్లాల కాడ.. మక్కల అమ్మకానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా, ఇప్పుడు ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు వేస్తున్నారు. – ఊకంటి రవి, రైతు, దుగ్గొండిరైతుబంధు పడట్లేదు.. యాక్సిడెంట్లో కాలు కోల్పోయినా కూడా కేటీఆర్‌ను చూసేందుకు, బీఆర్ఎస్పై మక్కువతో ఒక్క కాలితో నేలపై అతి కష్టమ్మీద సదస్సుకు వచ్చా. నాకు మూడెకరాల భూమి ఉంటే రైతు బంధు ఇస్తలేరు. కేసీఆర్ సారే సీఎం కావాలి. ఈసారి ఓటు వృథా చేసుకోం – ఎండీ, మక్బూల్, రైతు, కొత్తపేట, హనుమకొండ ● -
పార్కింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
నయీంనగర్: హనుమకొండ అశోక టాకీస్ ఎదురుగా ఉన్న 8వ డివిజన్ మున్సిపల్ స్థలంలో రూ.15 కోట్ల మున్సిపల్ ఎస్పీవీ నిధులతో నిర్మించనున్న మల్టీ లెవల్ సైంటిఫిక్ పార్కింగ్ సముదాయానికి బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నాలుగు అంతస్తులతో నిర్మించనున్న ఈ ఆధునిక పార్కింగ్‌లో ఒకేసారి 100 కార్లు, 100 టూవీలర్లు పార్క్ చేసే సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. నగర ట్రాఫిక్ సమస్యకు ఈ పార్కింగ్ కాంప్లెక్స్ శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందన్నారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, కార్పొరేటర్ బైరి లక్ష్మి ఉన్నారు. -
ఏం అభివృద్ధి చేశావో చర్చకు రా..
కేయూ క్యాంపస్: ‘వరంగల్ జిల్లాను ఎవరు అభివృద్ధి చేశారు? ఎంత అభివృద్ధి చేశారనే చర్చకు రా..’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన నీచ చరిత్ర బీఆర్ఎస్దే అని, దొంగ మాటలు, దొంగ కన్నీళ్లు కారుస్తూ రైతు సదస్సు నిర్వహించారన్నారు. సదస్సులో రైతులు అంతంత మాత్రంగా ఉన్నారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ ఉన్నారని ఆరోపించారు. రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రైతులకు బేడీలు వేసి కేసులు పెట్టిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. ఏనుమాముల మార్కెట్లో నాడు బీఆర్ఎస్ నేతలను రైతులు తరిమికొట్టారని గుర్తుచేశారు. పదేళ్లలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొకపోతే తరిమికొడతామన్నారు. బీఆర్ఎస్ అంటే బద్మాష్ రాష్ట్ర సమితి అని ఎద్దేవాచేశారు. సమావేశంలో రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసి ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్‌రావు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరళ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేటీఆర్‌కు సవాల్ విసిరిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
పంట ఉత్పత్తులను మార్కెట్లోనే విక్రయించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్లోనే విక్రయించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ, అనుబంధశాఖల ఆధ్వర్యంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం అధ్యక్షతన రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పత్తి, మొక్కజొన్న, మిర్చి, ధాన్యం తదితర పంటలను మార్కెట్లో విక్రయిస్తే మద్దతు ధరతో పాటు సరుకులు విదేశాలకు రవాణా చేసే సదుపాయం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ గణేశ్, మార్కెటింగ్ హైదరాబాద్ అదనపు సంచాలకులు ఆర్.లక్ష్మణుడు, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీయల్ వరంగల్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను బుధవారం అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాబ్‌మేళా పోస్టర్ ఆవిష్కరణ న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 8న (శుక్రవారం) హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. -
మంత్రి కొండా సురేఖ స్వీయ జనగణన
వరంగల్ అర్బన్: జనగణన–2027లో భాగంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండ రాంనగర్‌లోని తన నివాసంలో బుధవారం సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ పౌరుడు స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా జనగణన ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. ప్రజలంతా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని వినియోగించుకుని ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. మే 10 వరకు నమోదు చేసుకోవచ్చని, మే 11 నుంచి ఇంటింటికీ వచ్చే ఎన్యుమరేటర్లకు ఐడీ నంబర్‌ను తెలియజేయాలని సూచించారు. దీంతో తమ వివరాలు అధికారికంగా జనగణనలో నమోదవుతాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, రెవెన్యూ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి పద్మ అవార్డును ప్రదానం చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http:// padmaawards.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సేవలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రిక కటింగ్ ఫొటోలతో సహా (4) సెట్లు తయారు చేసి దరఖాస్తుకు జోడించి ఈనెల 25వ తేదీలోగా జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, హనుమకొండ జిల్లా, కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా, ఆఫీసులో అందజేయాలని సూచించారు. నిర్ణీత తేదీ తర్వాత వచ్చిన ధరఖాస్తులు తిరస్కరించనున్నట్లు ప్రశాంత్ తెలిపారు. హసన్‌పర్తి: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు కఠిన శిక్షణ పడేలా కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ మల్లారెడ్డిని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం అభినందించారు. కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ మల్లారెడ్డికి నగదు రివార్డు అందించారు. వంద కిలోల గంజాయి కేసులో ఐదుగురికి 20 ఏళ్ల శిక్ష పడడంలో రాజ మల్లారెడ్డి కీలక పాత్ర పోషించడంపై సీపీ అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదులు సమన్వయంతో పనిచేస్తే నిందితులకు శిక్షణ పడుతుందని చెప్పారు. కాశిబుగ్గ: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు షీ టీం ఆధ్వర్యంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. షీ టీం ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ.. కళాశాలలో ర్యాగింగ్ జరగలేదని, ఇద్దరు విద్యార్థినులు ఫోన్ విషయంలో గొడవ పడ్డారన్నారు. వెంటనే తాము వారికి నచ్చజెప్పి ఎలాంటి వివాదం లేకుండా చేశామని పేర్కొన్నారు. అలాగే బుధవారం ర్యాగింగ్ జరగలేదని సద రు విద్యార్థితో పాటు సోదరుడు కూడా యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ పోర్టల్‌కు మెయిల్ పెట్టారని ఆమె తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యిందని, కంప్లైంట్‌ను క్లోజ్ చేయండని మెయిల్లో పేర్కొన్నట్లు ప్రిసిపాల్ వివరించారు. న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఆస్తకిగల మైనార్టీ అభ్యర్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైన్, బౌద్ద, పార్సీ) ఆన్లైన్ ద్వారా ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారి, షరీఫన్ మసీద్ ఎదురుగా రెండవ అంతస్తులోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
సీఎంను గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధం
రేవంత్‌రెడ్డిని గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను గోస పెడుతూ 40 ఏళ్ల నాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల దగ్గరే పంట కొనుగోలు చేయగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎంత ఇస్తావంటూ అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు నా చాలెంజ్.. రైతు మేళాను రైతుల మార్కెట్లో పెట్టండి.. ఉరికిచ్చి కొడతారు. – ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలన రైతుల పాలిట రాబందుల పాలనగా మారింది. రైతులను గోస పెట్టుకుంటున్న రేవంత్ పాలన పోయి అన్నం పండించే రైతు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసే బీఆర్ఎస్ పాలన రావాలి. పడించిన పంటలో పావలా వంతు కూడా కొనకుండా రైతులను అరిగోస పెట్టుకుంటున్న ప్రభుత్వం చెర నుంచి రైతులకు విముక్తి రావాలి. – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి తెలంగాణ ఊపిరి మా సదస్సు పోరాటాలకు పుట్టినిల్లు వరంగల్‌లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే.. మీది ఏం సదస్సు, ఏం సభ అంటూ వెటకారంగా మాట్లాడారు. మాది తెలంగాణ ఊపిరి సదస్సు. రైతును రాజు చేయాలని, రైతు పక్షపాతి కేసీఆర్.. రైతుబంధు, రైతు భరోసా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పథకాలు తీసుకొచ్చా రు. కానీ, కాంగ్రెస్ సర్కారు వాటిని తుంగలో తొక్కింది. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ -
నేడే ఆఖరు
ముగియనున్న జీడబ్ల్యూఎంసీ సభ్యుల పదవీకాలంవరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల పదవీ కాలం నేడు ముగియనుంది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ చివరి సమావేశం నిర్వహించనున్నారు. ఐదేళ్ల చివరి రోజు వీడ్కోలు వేళ చివరి కౌన్సిల్ నిర్వహించడంపై సభ్యుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసమావేశంలో డివిజన్‌కు రూ.50 లక్షల నిధుల కేటాయింపులు, పరిపాలన, ఆర్థిక స్వావలంబన కోసం మరికొన్ని కీలక నిర్ణయాలు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. సమావేశంలో ఎజెండా అంశాలను అంత్యంత గోప్యంగా ఉంచారు. తారుమారు.. 2021 మే 2న ఓట్ల లెక్కింపు జరిగింది. 2021 మే 7 పాలక మండలి కొలువుదీరింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 66 డివిజన్లకు బీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాఽ దించారు. బీఆర్ఎస్కు చెందిన మేయర్ సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్ ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో గ్రేటర్‌లోనూ రాజకీయ పరిణామాలు తారుమారయ్యాయి. మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పలువురు కార్పొరేటర్లు ఆమెను అనుసరించారు. దీంతో కౌన్సిల్లో బలాబలాలు మారిపోయాయి. కాంగ్రెస్ సభ్యులు 34 మంది కాగా, బీఆర్ఎస్–21, బీజేపీ 11కు సంఖ్య చేరింది. మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సభ్యులు అడుగు ముందుకేసినా బెడిసికొట్టింది. ఈనేపథ్యంలో మేయర్, డిప్యూటీలు పదవుల్లో కొనసాగారు. కౌన్సిల్లో కో–ఆప్షన్ సభ్యుల ఉసేలేదు. ఎంతో మంది రాజకీయ నాయకులు ఆ పదవులు కోసం ఎదురు చూసి విసిగివేసారిపోయారు. వార్డు కమిటీల జాడ పత్తా లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు ఎవరంటే! వరంగల్ బల్దియా 1994లో మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటైంది. ఏడాది పాటు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగింది. 2000 సంవత్సరంలో ఏడాది, 2005లో మూడు నెలలు కొనసాగింది. మళ్లీ 2010 సెప్టెంబర్ 30న అప్పటి పాలకవర్గం గడువు ముగిసింది. దీంతో 2010 అక్టోబర్ 1 నుంచి అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. అదే ఏడాది నవంబర్ 30న కలెక్టర్ శ్రీధర్ బదిలీ అయ్యారు. అతడి స్థానంలో వచ్చిన రాహుల్‌బొజ్జా ఐదుసార్లు ప్రత్యేకాధికారిగా పనిచేసి రికార్డు సృష్టించారు. 2014లో కలెక్టర్‌గా కిషన్ బదిలీపై వచ్చారు. సుమారు ఏడాదిన్నర పాటు పనిచేసి కిషన్ బదిలీ కావడంతో వాకాటి కరుణ 2015 జనవరిలో ఇక్కడికి వచ్చారు. కలెక్టర్‌గా, ప్రత్యేకాధికారిగా కొనసాగారు. 2016 మార్చి 15 నుంచి ఐదేళ్ల పాటు పాలక వర్గం కొనసాగింది. 2021 మార్చి 15న మళ్లీ స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హన్మంతు 51 రోజులు కొనసాగారు. తాజాగా మరో మారు ఈనెల 7 నుంచి ప్రత్యేకాధికారి పాలన ఆరంభం కానుంది. ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగకపోతే మరోమారు పొడిగించే అవకాశాలుంటాయి. ఈలోగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. అవినీతి, ఆరోపణలు, పట్టింపులేమితో గడిపిన కొందరు కార్పొరేటర్లు ఐదేళ్లలో 22 కౌన్సిల్ సమావేశాలు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నేడు చివరి సమావేశం జీడబ్ల్యూఎంసీలో గురువారం నుంచి ప్రత్యేక అధికారి పాలనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. హనుమకొండ కలెక్టర్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాగా, ఇప్పటివరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతుమేళాను బుధవారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజులు అధికారులను ప్రజల ముంగిటికి పంపిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2022లో అద్భుతమైన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరవేరుస్తామని చెప్పి, సీఎం రేవంత్ నాయకత్వంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని కడుపునిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారన్నారు. కల్లాల వద్దకు వెళ్లి సినిమాలో ఫోజులు ఇచ్చినట్లు ఇచ్చి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారన్నారు. ఎన్ని మీటింగ్‌లు పెట్టుకున్నా, నాలుగు సార్లు ముక్కు నేలకు రాసినా రైతులు పట్టించుకోరన్నారు. ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ను గెలిపించాలని, సీఎం రేవంత్‌కు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులు కళ్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని దద్దమ్మలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనలేదని, తాము అన్నీ కొంటున్నామన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు మంత్రుల చేతులమీదుగా పత్రాలు అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యం ప్రభుత్వం పోయిందని కడుపునిండా విషం నింపేసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా ప్రారంభం వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు సందర్శించి వివరాలు తెలుసుకున్న అన్నదాతలు -
మూగజీవాలను తరలిస్తే చర్యలు
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హసన్‌పర్తి: మూగ జీవాలను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హెచ్చరించారు. మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్ కమిషనరేట్ పరిధి గో రక్షణ కమిటీలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఈ సమావేశంలో మూగజీవాల అక్రమ రవాణా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గోవుల అక్రమ రవాణా సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు విషయాన్ని అందించాలని సూచించారు. గోవులను రక్షించాలనే క్రమంలో రక్షణ కమిటీ సభ్యులు చట్టాలను అతిక్రమించొద్దన్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను వెంబడిస్తూ వేగంగా వాహనాలను నడపడం చాలా ప్రమాదకరమని సూచించారు. మూగజీవాలను అడ్డుకునే క్రమంలో నిందితులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సూచించారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, దార కమిత, ట్రెయినీ ఐపీఎస్ మనీష, నేహ్రా, ఏసీపీలు జీతేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, భీం శర్మ, సతీశ్‌బాబు, రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. సదస్సు ఏర్పాట్లను కేటీఆర్ డైరెక్షన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తదితర ముఖ్య నేతలు, సీనియర్లతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉమ్మడి వరంగల్ నుంచి సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేసిన నేతలు ఆ మేరకు సదస్సులో ఏర్పాట్లు చేశారు. కాగా, వరంగల్ నుంచే రైతుపోరుకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. విస్తృత ఏర్పాట్లు... రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గత నెల 26న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్‌కు ఎదురుగా ఉన్న సుమారు ఐదెకరాల స్థలంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేలా జర్మనీ టెంట్లు వేశారు. ఆ పక్కనే హాజరయ్యే రైతుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సదస్సుకు హాజరయ్యే రైతుల వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను సూచించారు. కొలంబో మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్‌తో పాటు, భారత్ పెట్రోల్ బంక్‌కు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్‌ఘన్‌పుర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హాల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్య నేతల రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు మంగళవారం ప్రెస్మీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకే రైతులు సదస్సుకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సదస్సు ప్రారంభంలో మొదట రైతు ప్రతినిధుల నుంచి ప్రభుత్వం వైఖరి, పరిపాలన విధానాలపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ప్రతినిధులను సదస్సులో మాట్లాడించనున్నారు. ఆతర్వాత మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా తమ ప్రసంగం ద్వారా అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం రైతు సదస్సు ద్వారా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. నేడు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు హంటర్‌రోడ్డులో 10వేల మందికి ఏర్పాట్లు ఉదయం 9 గంటలకే వచ్చేలా సమీకరణ మొదట ప్రభుత్వ వైఖరిపై రైతుల అభిప్రాయాలు అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసంగం ప్రతీ పల్లె నుంచి హాజరుకానున్న రైతు ప్రతినిధులు గులాబీమయమైన వరంగల్ నగరం ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించేందుకే రైతు సదస్సు విలేకరులతో బీఆర్ఎస్ నేతలు -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026జాప్యం లేకుండా రుణాలివ్వండివేసవి సెలవులంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అమ్మమ్మ, నానమ్మ ఇంటికి వెళ్లడం, వారు చెప్పే నీతి కథలు, ఆటవిడుపుగా బొమ్మలు గీయడం, స్నేహితులతో ఈత నేర్చుకోవడం, ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. ఇలాంటి అనుభవాలకు వేదికగా ‘సాక్షి’ నిలుస్తోంది. సెలవుల్లో పిల్లల సందడిపై నేటినుంచి వేస‘వి’కాసం అందిస్తోంది.హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధిదారులకు రుణాలు అందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ), జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల పురోగతిని బ్యాంకర్లతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. 2025–26 సంవత్సరానికి జిల్లాకు రూ.15,484.29 కోట్ల రుణ లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ.13,733.74 కోట్ల మేర సాధించినట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చిన డీఆర్డీఏ అధికారులను అభినందించారు. సమావేశం అనంతరం మహిళా సంఘాలకు రుణాల మంజూరులో కృషి చేసిన ఏపీఎంలు, సీసీలకు కలెక్టర్ ప్రశంసపత్రాలు అందజేశారు. అలాగే నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026–27ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీ శ్రావ్య, యూపీఐ డీజీఎం కమలాకర్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంతో మక్కలు కొనిపిస్తాం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్సంపేట/గీసుకొండ: రైతులు పండించిన మక్కలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతో కొనిపిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్, గీసుకొండ మండలం ఊకల్‌లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. నర్సంపేట మార్కెట్లో పర్శనాయక్‌తండాకు చెందిన మహిళా రైతు చెప్పిన మాటలు విని ఆశ్చర్యానికి గురయ్యారు. మక్కలు మార్కెట్‌కు తీసుకువచ్చిన నాటి నుంచి ప్రతీ పైసా తమ నుంచే వసూలు చేస్తున్నారని కేటీఆర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరోనా సమయంలో రైతులు పండించిన ప్రతీ గింజను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే 25 క్వింటాళ్లే కొంటామని నిబంధనలు పెట్టడం ఎంతవరకు సమంజసమని. మిగిలిన వాటిని ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. రైతులు అధైర్య పడవద్దని, కేసీఆర్ పంపితే తాను వచ్చానని, మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, నాయకులు పెద్ది స్వప్న, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, చింతం సదానందం, గోలి రాజయ్య, పోలీసు ధర్మారావు, దొంగల రమేశ్, జక్కు మురళి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గుర్రం రఘు, సిరిసె శ్రీకాంత్, చల్లా వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్, అజర్మున్నా, అంకతి నాగేశ్వర్రావు, రాయిడి రవీందర్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆది,సోమవారాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బచ్చన్నపేట : బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్క కనుకయ్య (45) తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం హమాలీ పని కోసం బైక్‌పై గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య కళ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ముల్కనూరులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి.. భీమదేవరపల్లి: గుర్తు తెలియని వాహ నం ఢీకొని మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంప రమేశ్(55) రోజుమాదిరిగానే సోమవారం ఉదయం వాకింగ్ వెళ్లాడు. అయితే ఓ గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య వసంత, కుమారుడు రోహిత్ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ట్రాక్టర్ ఢీకొని రాజుపల్లిలో ఉపాధి హామీ కూలీ.. శాయంపేట : బైక్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ ఉపాధి హామీ కూలీ మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతనిప్పుల రాధమ్మ (45) రోజు మాదిరిగానే ఉపాధి హామీ పనులకు వెళ్లింది. అనంతరం అదే గ్రామానికి చెందిన చింతం బుచ్చయ్య బైక్‌పై ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పంచనేని దేవేందర్ రావు ట్రాక్టర్‌పై వస్తున్నాడు. ట్రాక్టర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతో రాధమ్మ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని పరకాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చదరంగంలో చిచ్చరపిడుగులు
వరంగల్ స్పోర్ట్స్: మేధస్సుకు ఎంత పదును పెడితే ఆట అంత రక్తి కడుతుంది. ప్రత్యర్థిని ఓడించేందుకు చాకచక్యంగా ఆచితూచి అడుగులు వేయడమే చదరంగం. చదరంగంలో రాణించాలంటే మానసిక స్థైర్యం, ఓపిక, ఆలోచన శక్తి ఎంతో అవసరం. అలాంటి చదరంగంలో పదేళ్లు కూడా నిండని చిన్నారులు చిచ్చరపిడుగుల్లా చెలరేగుతున్నారు. జాతీయస్థాయి పతకాలు, అంతర్జాతీయ స్థాయి రేటింగ్‌తో దూసుకెళ్తున్న చిన్నారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చెస్ అంటే.. చెస్ అంటే తెలియని వారుండరు. కానీ, ఆడడమే కొంత కష్టం. 64 బాక్సుల్లో రెండు రుక్స్ (ఏనుగు), రెండు నైట్స్ (గుర్రం), రెండు బిషప్ (ఒంటె), ఒక కింగ్ (రాజు), ఒక క్వీన్ (రాణి) చొప్పున ఇరు పక్షాలకు ఉంటారు. వీటితో ఇరువురు తలపడడమే చదరంగం. చదరంగంలో విభాగాలు.. ● చదరంగంలో నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో క్లాసిక్ గంటన్నర సమయంపాటు ఆడే సుదీర్ఘమైన ఆట. అంతర్జాతీయ వేదికలపై ఈ ఆటను ఎక్కువగా ఆడుతుంటారు. ● ఐదు నిమిషాల్లోనే ఆట ముగించేది బ్రిడ్జి కాగా.. కేవలం మూడు నిమిషాలపాటు ఆడేది ర్యాపిడ్, ఈ ఆటలో రెండు సెకన్లు ఇంక్రిమెంట్‌గా ఇస్తారు. ● కేవలం నిమిషంలో ముగించే అత్యంత సాహోసోపేతమైనది బుల్లెట్ విభాగం. ఇంటర్నేషనల్ రేటింగ్.. వయస్సుతో సంబంధం లేకుండా నాలుగు విభాగాల్లోనూ క్రీడాకారుడి ఆట తీరును లెక్కించేది రేటింగ్. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఇంటర్నేషనల్ రేటింగ్ కోసం టోర్నమెంట్ నిర్వహిస్తుంటారు. అందులో సాధించిన పాయింట్ల వారీగా ర్యాంకింగ్ కేటాయిస్తారు.హనుమకొండలోని ఇన్స్టిట్యూట్లో చిన్నారులకు శిక్షణఇస్తున్న కోచ్ రాంప్రసాద్ చిన్న వయస్సులోనే పతకాల సాధన అంతర్జాతీయ రేటింగ్‌తో అద్భుతాలు -
బైక్‌ను ఢీకొన్న టిప్పర్
● ఇద్దరు యువకుల దుర్మరణం మామునూరు: బైక్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి వరంగల్ నక్కపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన కనిగిరి వెంకటరత్నం తన కుటుంబ సమేతంగా జగిత్యాల జిల్లా పెగడపల్లికి వలస వచ్చాడు. కుమారులు విష్ణువర్ధన్ (22), శేషయ్య (21)తో కలిసి ఆయన మేసీ్త్ర పనిచేస్తూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో ఉన్న పెద్దనాన్న కుమారుడిని చూసేందుకు ఆదివారం సాయంత్రం విష్ణువర్ధన్, శేషయ్య బైక్‌పై పెగడపల్లి నుంచి బయలుదేరారు. ఈక్రమంలో వరంగల్‌కు అర్ధరాత్రి చేరుకున్నారు. అన్న మరో అరగంటలో నెక్కొండకు చేరుతాం.. టీతాగుతూ సంతోషంగా ఫోన్లో మాట్లాడారు. నెక్కొండ రోడ్డు నక్కలపల్లి గ్రామ శివారుకు చేరుకున్నారు. అంతలోనే నెక్కొండ వైపు నుంచి వరంగల్‌కు వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ ముక్కలైంది. విష్ణువర్ధన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శేషయ్యను పోలీసులు క్షణాల్లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరి మృతితో పెగడపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఘటన స్థలానికి మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేరుకున్నారు. ఘోర రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి కనిగిరి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
విద్యుత్ భద్రత బాధ్యత కావాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ : విద్యుత్ భద్రత ఉద్యోగుల బాధ్యత కావాలని, విద్యుత్ ప్రమాదాలు లేని సంస్థ మన లక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్‌భవన్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పని చేసే ప్రాంతాల్లో ఒక్క నిమిషం నిబంధన పాటించాలన్నారు. ఒక్క నిమిషం ఆగి భద్రతాపరికరాలు ధరించి, లైన్ మీద అవగాహన తెచ్చుకునే పని చేసే నిబంధన తీసుకొస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో సాంకేతికతతో పని మొత్తం స్మార్ట్‌గా మారుతుందన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. దేశ అభివృద్ధిలో విద్యుత్ శాఖ కీలకంగా పనిచేస్తుందన్నారు. ప్రతీ వినియోగదారుడికి విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కలిగిస్తూ, క్షేత్రస్థాయిలో పనిచేసే సమయంలో సిబ్బంది విద్యుత్ భద్రత పరికరాలు కచ్చితంగా వాడాలని ఆదేశించారు. కార్యక్రమంలో హనుమకొండ ఎస్ఈ బి.సామ్య నాయక్, డి.ఈ టెక్నికల్ విజేందర్ రెడ్డి, హనుమకొండ టౌన్ డి.ఈ జి.సాంబారెడ్డి, డి.ఈ హనుమకొండ రూరల్ పి.మల్లికార్జున్, ఎ.డి.ఈలు ఇంద్రసేనారెడ్డి, వంశీ కృష్ణ, అశోక్, దేవేందర్, మధుకర్, శ్రీనివాస్ రెడ్డి, పైడయ్య, రాజేశ్వర్ రావు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం● కాపాడిన వాకర్స్ సభ్యులు ● పోలీసులకు అప్పగింత కాజీపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల వయసున్న కూతురుతో కలిసి వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా వాకర్స్ సభ్యులు చూసి కాపాడారు. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. కాజీపేట 63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి (30) సోమవారం ఉదయం ఇంట్లో గొడవ జరగడంతో తన కూతురును తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి వడ్డేపల్లి చెరువు వద్దకు చేరుకుంది. చెరువులోకి దిగుతున్న సమయంలో వాకింగ్ చేస్తూ అటుగా వచ్చిన కురుమని మహేందర్ రెడ్డి ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమయ్యారు. వెంటనే సమీపంలో ఉన్న సహచర వాకర్ల సహకారంతో బాధితురాలిని బయటకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. అనంతరం పోలీసులకు అప్పగించగా వారు కుటుంబీకులను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. తల్లీకూతుళ్లను కాపాడిన వాకర్స్ సభ్యులను సీఐ సుధాకర్ రెడ్డి అభినందించారు. -
మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
ఖిలా వరంగల్: మొక్కజొన్నలు అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారని, ప్రభుత్వం మొ ద్దు నిద్ర వీడి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే వ్యవసాయ మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలు చేపట్టి చూడాలని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని, హామీలు విస్మరించిన ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్పడం ఖాయమని వారు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి వారి సమస్యలను అ డిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి ద యాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా దిగుబడి తగ్గట్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆరో పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు. థంబ్ ఇంప్రెషన్ కోసం రైతుల వద్ద లంచం తీసుకుంటున్నారని విమర్శించారు. ఈనెల 6లోపు ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న కోనుగోళ్లు చేపట్టక పోతే మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్ కా ర్యాలయాలను రైతులు ముట్టడించడం ఖాయమన్నారు. 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు అన్నదాతలు పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు రాకేశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్, టి.రమేశ్‌బాబు, హరిరమాదేవి, లలితాయాదవ్, రాజశేఖర్, మల్లయ్య పాల్గొన్నారు. రైతులు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయం మాజీ మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సందర్శన -
ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి ఎమ్మెల్యే రూ.5 లక్షల ఆర్థిక సాయం
నర్సంపేట: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే సోదరుడు అజయ్‌రెడ్డి సోమవారం నర్సంపేటలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల నగదు, ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్, రాష్ట్ర యువనాయకుడు పడిదల నవీన్‌రావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, కౌన్సిలర్ వీణావిజేందర్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, పట్టణ కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లుగౌడ్, నల్లబెల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నర్సంపేట మండల ఉపాధ్యక్షులు గజ్జి రాజు, మధు, రాజు, యూత్ కాంగ్రెస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్, నాయకులు రాము, శ్రీనివాస్, గిరిగాని రమేశ్, కార్తీక్, ఆర్టీసీ ఉద్యోగులు రూపిక సుమన్, కె.రంగయ్య, మోహన్,తదితరులు పాల్గొన్నారు. నకిలీ నోట్ల ముఠా అరెస్ట్● రూ.28 లక్షల విలువైన ల్యాప్‌టాప్, ప్రింటర్స్, నకిలీ నోట్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ వరంగల్ క్రైం: నకిలీ నోట్లను తయారుచేసి చలామణి చేస్తున్న 8 మందిని వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ తెలి పారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు, రూ.1,48,000 నగదు, రూ.28 లక్షల విలువగల ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్స్, 13 సెల్ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో డీసీపీ అంకిత్‌కుమార్ వివరాలు వెల్లాడించారు. నిందితులు నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్, నీరటి శివ, నీరటి రంజిత్, గుడికందుల రవి, ములుగు గణపురానికి చెందిన పోరిక రాజ్‌కుమార్ అలియాస్ రాజు, ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన తనమాల రాజశేఖర్, భువనగిరి తాతానగర్‌కు చెందిన ముదురుకోల యాకంబరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రారకగూడేనికి చెందిన చేను సాయికిరణ్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కలర్ ప్రింట్ తీసి.. చలామణి చేసి నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అసలు రూ.100 నోట్లను ల్యాప్‌టాప్, ప్రింటర్ ద్వారా కలర్ ప్రింట్ తీసి చలామణి చేస్తున్నారని చెప్పారు. మిగిలిన ఐదుగురు నిందితులను విచారించగా తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు (1:3 నిష్పత్తి) తయారుచేసి ఇస్తామని చెప్పి రూ.500 నోట్ల పరిమాణంలో ఉన్న కాగితాలు హైపో ద్రావణంలో ముంచి నల్లగా మారిన తర్వాత ప్రజలకు ఇస్తూ మోసం చేస్తున్నారని చెప్పారు. నల్లకాగితాలు అసలు నోట్లుగా మారుతాయని నమ్మించి ప్రజల నుంచి అసలు నోట్లు తీసుకొని పరారైనట్లు ఆయన తెలిపారు. నిందితులు ములుగు గణపురం, సికింద్రాబాద్ మోండా మార్కెట్, వేంసూర్, కొత్తగూడెం, నర్సంపేట, సుబేదారి తదితర ప్రాంతాల్లో మో సం చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బాబులాల్, నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏఏఓ సల్మాన్‌పాషా, టాస్క్‌ఫోర్స్, నర్సంపేట సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
ప్రధాని సభను కేసీఆర్, రేవంత్ చూడాలి
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హన్మకొండ: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం ఎ.రేవంత్‌రెడ్డి వచ్చి చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అ ర్వింద్ అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్‌హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 లక్షల మందితో నిర్వహించే బహిరంగ స భకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ పంగనామాలు పెడితే.. రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ఆర్ఐలను మోసం చేశారని, కాంగ్రెస్ పాలనలో ఏజెంట్ల మో సాలు పెరిగాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటన బాజాప్తా పొలిటికల్ ట్రిప్ అన్నారు. పశ్చిమబెంగాల్లో పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని, తమిళనాడులో ఎన్డీఏ మద్దతుతో ప్రభుత్వం రానుందన్నారు. ఇ క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు. కనకదుర్గ అమ్మవారిమీద ఒ ట్టేసిన వ్యక్తి రాజకీయంగా, వ్యక్తిగతంగా నాశనమైపోతాడని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి అన్నారు. కొందరికి పార్టీలు పెట్టడం బిజినెస్ అయిపోయిందని కల్వకుంట్ల కవిత పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించా రు. ఇక నుంచి కేసీఆర్‌కు ఎటువంటి సంబరా లుండవన్నారు. వయోభారంతో ఉన్న కేసీఆర్‌ను టీవీ చూడనివ్వొద్దని, చూస్తే తట్టుకోలేడన్నారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ, కాళీప్రసాద్, దేవేందర్‌రెడ్డి, నాయకులు కీర్తిరెడ్డి పెసరు విజయ్‌చందర్ రెడ్డి, రావుల కిషన్, చాడ స్వాతి, సండ్ర మధు పాల్గొన్నారు. -
పిట్ట కొంచెం.. కూత ఘనం
ఈ చిత్రంలో చదరంగ పావులు కదుపుతున్న చిన్నారి పేరు హయాతి. వయస్సు 6 సంవత్సరాలు, హనుమకొండ భవానీనగర్‌లోని ఓ ప్లే స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. మాటలు కూడా సరిగా రాని ఈ చిన్నారి ఇప్పటి వరకు 15 వరకు టోర్నమెంట్లలో పాల్గొంది. అందులో ఐదింటిలో మొదటి స్థానంలో నిలిచిందంటే అతిశయోక్తి కాదు. 10 నెలలుగా రాంనగర్లో కోచ్ పవన్ వద్ద శిక్షణ తీసుకుంటున్న హయాతి పిట్ట కొంచె కూత ఘనం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. ప్రతి రోజు మూడు గంటలు చెస్ సాధన చేస్తోందని తల్లిదండ్రులు రవితేజ, సృజన చెబుతున్నారు. -
సేంద్రియసాగుపై దృష్టి సారించాలి
మామునూరు: ప్రకృతి సిద్ధమైన సేంద్రియ సాగుపై రైతులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. నేల స్వభావంతోనే పంట దిగుబడితోపాటు ఎరువుల ఖర్చులు తగ్గించుకోవచ్చునన్నారు. పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం బొల్లికుంట క్లస్టర్ రైతు భ వనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారి విజ్ఞాన్ అధ్యక్షతన రైతు వారో త్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ రసాయన ఎ రువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. అనంతరం వ్యవసాయ అధికారి విజ్ఞాన్ మాట్లాడుతూ నానో యూరియా వాడకం, ఎరువుల సమతుల్యం విని యోగంపై అవగాహన కల్పించారు. పశువైద్యుడు కిరణ్, ఏఈఓ సత్యప్రకాశ్, రైతులు పాల్గొన్నారు. -
నేడు ‘గ్రేటర్’ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా నేటి సోమవారం నుంచి ఇకపై ప్రతీ వారం డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి వినతులు స్వీకరించేందుకు ఆర్డీఓ ఆఫీస్‌లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పరకాల, హనుమకొండ ఆర్డీఓ కార్యాలయాల్లో సోమవారం వినతులు స్వీకరించనున్నట్లు, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందించాలని కోరారు. కాగా, ప్రతీ సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హన్మకొండ: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని, ఈ క్రమంలోనే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని జీఓ జారీ చేసిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకునేందుకు జారీ చేసిన జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెట్ బకాయిలు ఉన్నాయన్నారు. వరంగల్ ఉద్యమాల వేదిక అని, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిందన్నారు. రైతు సదస్సు తర్వాత మిగిలిన డిక్లరేషన్లపై పోరాడుతామన్నారు. కామారెడ్డిలో బీసీ సదస్సు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సదస్సు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. వరంగల్‌లో ఒక ఆర్టీసీ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించిందన్నారు. ప్రఽభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, విద్యార్థి సంఘం నాయకులు బైరపాక ప్రశాంత్, గండ్రకోట రాకేశ్‌యాదవ్, పస్తం అనిల్ కుమార్, రాజేశ్‌నాయక్, వివేక్, శ్యాంకుమార్ పాల్గొన్నారు. -
ప్రత్యేక విద్యా వారోత్సవాలు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ నెల 11 నుంచి ప్రత్యేక విద్యావారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విద్యావారోత్సవంలో భాగంగా రోజుకో కార్యక్రమంతో రోజువారీ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈఓలకు జారీ చేశారు. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా ఇటీవల హైదరాబాద్ నుంచి కలెక్టర్లకు, డీఈఓలకు వివిధ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక విద్యావారోత్సవాలు, ప్రీ ప్రైమరీ తరగతులపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్‌లెట్స్ మరమ్మతులు, లేని చోట నూతన టాయ్‌లెట్స్ నిర్మాణం, ఎస్సెస్సీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు రిమిడియల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను వచ్చే విద్యాసంవత్సరం వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడిబయటి విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలన్నారు. ఈవిద్యాసంవత్సరం 2026–27లో విద్యార్థులకు షూస్, టై, బెల్టులు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ఇలా.. ● మే 11న పీఎంశ్రీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులను ప్రారంభిస్తారు. ఈక్యాంపులో అకడమిక్, కోడింగ్, కళలు, క్రీడలు, యోగా నేర్పిస్తారు. ● 12న పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు పీఎంశ్రీ పాఠశాలల్లో రెమిడియల్ క్యాంపులు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ● 13న జిల్లా స్థాయిలో అందరు సర్పంచులను ఆహ్వానించి సమావేశం నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, అకడమిక్ కార్యక్రమాలు వివరించాల్సి ఉంటుంది. ● 14న బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని పాఠశాలలను శుభ్రపర్చి అలంకరించి ఇంటింటి కి ప్రవేశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులతో మెగా పీటీఎం ఉంటుంది. ● మే 15న పాఠశాలలు గ్రామ, కమ్యూనిటీ లైబ్రరీలో కార్యక్రమాలుంటాయి. పుస్తక ప్రదర్శనలు, పఠన పోటీలు నిర్వహిస్తారు. ● మే 16న మండల స్థాయిలో విద్యార్థులకు కళలు, హస్తకళలు, సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్య తదితర సాంస్కృతిక పోటీలు ఉంటాయి. పర్యావరణ హిత పదార్థాల వినియోగాన్ని ప్రొత్సహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాల్సి ఉంటుంది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతిభా ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపాల్సి ఉంటుంది. ● మే 17న ప్రతీ జిల్లాలో జవహర్ బాలభవన్‌లో విద్యార్థులకు కళలపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ● ప్రత్యేక విద్యావారోత్సవాల నిర్వహణకు ప్రతీ జిల్లాకు నిధులు విడుదల చేస్తారని సమాచారం. ఎస్సెస్సీ విద్యార్థులకు రిమిడియల్ క్యాంపులు ఈ నెల 11 నుంచి 17 వరకు వివిధ కార్యక్రమాలు -
హాల్ టికెట్ పోగొట్టుకున్న విద్యార్థికి పోలీసుల సాయం
కాజీపేట: నీట్ హాల్ టికెట్ పోగొట్టుకుని ఏడుస్తున్న వి ద్యార్థినికి కాజీపేట ట్రాఫిక్ పోలీసులు చేయూతనందించి పరీక్ష రాయించారు. హనుమకొండ నక్కలగుట్టలోని శ్రీచైతన్య హైస్కూ ల్కు నీట్ పరీక్ష రాయడానికి శ్రావ్య ఆదివారం చేరుకుంది. ప్రయాణ హడావుడిలో ఆమె హాల్‌టికెట్ ఎక్కడో పడిపోయింది. దీంతో గేట్ వద్ద ఏడుస్తూ ఉన్న శ్రావ్యను ట్రాఫిక్ సిబ్బంది రాజేందర్, సతీశ్ చూశారు. విషయం తెలుసుకుని స్పందించారు. శ్రావ్యను ద్విచక్ర వాహనంపై జిరాక్స్ సెంటర్ వద్దకు తీసుకెళ్లారు. సెల్ఫోన్లో ఉన్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీయించి పరీక్ష కేంద్రం వద్దకు తీసుకెళ్లారు.


