గృహ గణన పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

గృహ గణన పకడ్బందీగా నిర్వహించాలి

May 15 2026 9:50 AM | Updated on May 15 2026 9:50 AM

పరకాల ఆర్డీఓ నారాయణ

దామెర : జన గణనలో భాగంగా చేపట్టిన గృహ గణనను పకడ్బందీగా నిర్వహించాలని పరకాల ఆర్డీఓ డాక్టర్‌ నారాయణ సూచించారు. మండలంలోని పులుకుర్తి, సింగరాజుపల్లిలో మొదటి విడత గృహ గణనను బుధవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని అన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు గృహ గణనలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ జ్యోతివరలక్ష్మీదేవి, ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి, జీపీఓ మురళి ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement