breaking news
Hanamkonda District Latest News
-
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి 2 వేల నుంచి 2,500 మంది రోగులు వస్తుంటారు. రద్దీకి అనుగుణంగా కౌంటర్లు పెంచాలని గతంలో ఈ ఆస్పత్రిని సందర్శించిన సమయంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఓపీ చిట్టీలు అందించే కంప్యూటర్ కౌంటర్లను, చికిత్సలు అందించే స్థలం నుంచి వృద్ధుల ఓపీ విభాగం వద్దకు తరలించాలని ఆదేశించారు. అనంతరం కంప్యూటర్ ద్వారా ఓపీ ఇచ్చే స్లిప్ గదిని ఔషధ పంపిణీకి అనుగుణంగా రెండు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు మరో నాలుగు కౌంటర్లను నూతనంగా ఏర్పాటు చేశారు. అప్పటికీ కొనసాగుతున్న నాలుగు కౌంటర్లకు అదనంగా మరో ఆరు చేరడంతో ఆ సంఖ్య పదికి పెరిగింది. నూతన కౌంటర్లను స్వయంగా మంత్రి సురేఖతో కలిసి కలెక్టర్ సత్యశారద స్వయంగా ప్రారంభించారు. ఈ సేవలు కాస్తా మున్నాళ్ల ముచ్చటగానే మారాయి. ప్రస్తుతం ఈ కౌంటర్ల సంఖ్యను ఎంజీఎం అధికారులు ఆరుకు కుదించారు. ‘2 వేల మంది ఓపీ రోగులకు ఆరు కౌంటర్లు చాలు, పది అవసరం లేదు’ అనేలా అధికారులు వ్యవహరిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈక్రమంలో బుధవారం ఆస్పత్రిలో 1, 2, 3వ నంబర్ కౌంటర్లు మూసివేసి ఉండగా, తెరిచి ఉన్న 10వ కౌంటర్, 4వ కౌంటర్లో సిబ్బంది లేకపోవడం గమనార్హం. మూడు గంటలు.. ఒక్కో కౌంటర్లో 400 మందికి జౌషధాలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఓపీ కొనసాగిస్తారు. 9.15 నిమిషాల తర్వాత ఓపీలో చికిత్స పొందిన రోగులకు మందులిస్తారు. 12 గంటలకు ఓపీ మూసేసినా 12.30 గంటల వరకు మందుల పంపిణీ జరుగుతుంది. సుమారు 3 గంటల్లో ఆరు కౌంటర్ల ద్వారా 2,500 మందికి మందులు పంపిణీ చేయడం సాధ్యం కాదనే విషయాన్ని కలెక్టర్ గుర్తించారు. కానీ ఎంజీఎం పరిపాలనాధికారులు గుర్తించకపోవడం గమనార్హం.మూసి ఉన్న 1, 2 నంబర్ కౌంటర్, తెరిచి ఉన్నా కౌంటర్లో లేని ఫార్మసిస్ట్ పది నుంచి ఆరు కౌంటర్లకు కుదించిన ఎంజీఎం సిబ్బంది ఔషధాల కోసం లైన్లో రోగుల తిప్పలు -
మరణంలోనూ వీడని స్నేహబంధం
ఐనవోలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయిన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన ఎండీ చిన్న యాకూబ్ (65), ఉడుతగూడెం గ్రామానికి చెందిన ఆకారపు వెంకట్‌రెడ్డి(69) 30 సంవత్సరాలుగా స్నేహితులు. వీరు సొంత పనుల నిమిత్తం ఎక్సెల్ వాహనంపై సాయంత్రం రాంపూర్ గ్రామానికి వెళ్లారు. రాత్రి స్వగ్రామాలకు వస్తుండగా వెంకటాపురం గ్రామ శివారుకు చేరుకోగా ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆకారపు వెంకట్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, చిన్న యాకూబ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతిచెందాడు. యాకూబ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వెంకట్‌రెడ్డికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు స్నేహితుల మృతితో ఒంటిమామిడిపల్లి, ఉడుతగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతులు రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతో ఒకే వైపు నుంచి వాహనదారులు రాకపోకలు చేస్తున్నారని, ఆ క్రమంలో ప్రమాదం జరిగి ఉంటుందని వెంకటాపురం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై ధాన్యం ఆరబోయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం ఎక్సెల్‌ను ఢీకొన్ని గుర్తు తెలియని వాహనం వెంకటాపురం శివారులో ఘటన ఒంటిమామిడిపల్లి, ఉడుతగూడెంలో విషాదం -
కీర్తి కిరీటం..టౌన్‌హాల్
హన్మకొండ అర్బన్: వరంగల్ నగరంలోకి అడుగుపెట్టగానే హనుమకొండ నడిబొడ్డున అత్యంత హుందాగా, రాజసం ఉట్టిపడేలా కనిపించే కట్టడం ‘టౌన్ హాల్’. మూడు ప్రధాన కూడళ్లను కలుపుతూ, నగర ప్రజలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలిని పంచుతున్న పబ్లిక్ గార్డెన్ (టౌన్ హాల్) నిర్మాణానికి శంకుస్థాపన చేసి సరిగ్గా వందేళ్లు పూర్తయ్యింది. 1924లో పునాది రాయి పడిన ఈ అపురూప కట్టడం, శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుని నేటికీ ఠీవిగా నిలబడి ఉంది. ఏడో నిజాం చేతుల మీదుగా ప్రారంభం.. వరంగల్ ప్రాంతం 1724లో నిజాం–ఉల్–ముల్క్ ఆధీనంలోకి వచ్చింది. అసఫ్ జాహీ వంశపాలన 200 సంవత్సరాలు (1724–1924) పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆ విజయానికి గుర్తుగా ఈ భవనాన్ని నిర్మించారు. అప్పటి కలెక్టర్ మౌల్వీ సయ్యద్ మహమ్మద్ నయిమొద్దీన్ 1334 ఫసిలీ (క్రీ.శ. 1924)లో ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ‘ఖాలెద్ ఉల్లాహ్, మాలిక–ఏ–సుల్తానేట్, షా–ఏ–డెక్కన్’ వంటి బిరుదులతో లిఖించారు. పదేళ్ల నిర్మాణ అనంతరం ఏడో నిజాం చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. దీని నిర్మాణాన్ని అప్పటి తాలూక్దార్ (కలెక్టర్) నాయూష్ యార్ జంగ్ బహదూర్ పర్యవేక్షించారు. 7 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మాణం.. ఈ పబ్లిక్ గార్డెన్ అసలు పేరు ‘మహబూబ్ బాగ్’. 7వ నిజాం ఉస్మాన్‌అలీఖాన్ తన తండ్రి మీర్ మహబూబ్‌అలీఖాన్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. మొత్తం 23 ఎకరాల్లో ఉద్యానవనం ఏర్పాటుకు, టౌన్‌హాల్ నిర్మాణానికి అప్పట్లోనే రూ.2 లక్షలు నిజాం మంజూరు చేశారు. సుమారు 7 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ‘బాగ్’ (తోట)ను తీర్చిదిద్దారు. అసఫ్ జాహీ నిర్మాణ శైలికి అద్దం పట్టేలా.. పాలరాతి కట్టడంలా మెరిసిపోయే ఈ భవనం రాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుగులో మరింత అందంగా కనిపిస్తుంది. విశాలమైన మెట్ల వరుసలు, మినార్లు, సుమారు 50 మంది సమావేశమయ్యే హాల్ దీని ప్రత్యేకత. ఇక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆవిష్కరించడం విశేషం. ఒకప్పుడు చిన్న జూపార్కు.. గతంలో ఈ పబ్లిక్ గార్డెన్లో చిన్నపాటి జంతు ప్రదర్శనశాల (జూ పార్కు) ఉండేది. వరంగల్ మున్సిపల్ చైర్మన్‌గా ఉమ్మారెడ్డి ఉన్న సమయంలో జింకలు, దుప్పులు, తాబేళ్లు, కుందేళ్లు, పావురాలతో ఈ ప్రాంతం సందర్శకులకు కనువిందు చేసేది. ప్రస్తుతం అవన్నీ కనుమరుగయ్యాయి. కానీ, ఆ కాలంలో ఏర్పాటు చేసిన బాలల గ్రంథాలయం మాత్రం నేటికీ కొనసాగుతోంది. సాంస్కృతిక వేదిక.. నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియం రెండున్నర దశాబ్దాల క్రితం ఇక్కడ జాతీయ నాయకుడు గోవింద వల్లభ్‌పంత్ పేరిట ఆడిటోరియం నిర్మించాలని భావించారు. ఆయన కుమారుడు కేసీ పంత్ చేత శంకుస్థాపన చేయించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ పేరుమీద ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం నిర్మించారు. ప్రస్తుతం నగరవాసులకు ఇది ప్రధాన సాంస్కృతిక వేదికగా సేవలందిస్తోంది.చారిత్రక కట్టడానికి వందేళ్ల చరిత్ర అసఫ్‌జాహీల 200 ఏళ్ల పాలనకు చిహ్నం నాడు‘మహబూబ్ బాగ్’.. నేడు ’పబ్లిక్ గార్డెన్’ 1924లో శంకుస్థాపన.. 1943లో ప్రారంభోత్సవం వరంగల్ వైభవానికి సాక్ష్యంగా నిలుస్తున్న కట్టడం‘తోడ్–ఫోడ్’ ఇస్మాయిల్ ఖాన్ కథఈ గార్డెన్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. నిజాం ప్రభుత్వ అధికారి మీర్జా ఇస్మాయిల్ వరంగల్‌లో పర్యటించినప్పుడు, ఈ ‘బాగ్–ఏ–ఆమ్’ చుట్టూ ఉన్న భారీ ప్రహరీని చూసి ఆశ్చర్యపోయారు. ప్రజల కోసం కట్టిన పార్కు వారికి కనిపించకుండా ఇంత ఎత్తు గోడలు ఎందుకని ప్రశ్నించి వెంటనే ఆ గోడలను కూల్చివేయమని ఆదేశించారు. అప్పటి నుంచి ఆయనకు ‘తోడ్–ఫోడ్’ (పడగొట్టే) ఇస్మాయిల్ అనే పేరు వచ్చిందని చెబుతారు. -
విద్యాపరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలి
కాళోజీ సెంటర్: విద్యాపరిరక్షణ ఉద్యమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ విద్యాపరిరక్షణ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.తిరుపతిరెడ్డి, ఎ.శ్రీనివాస్ రెడ్డి, గోవిందరావు, యాకయ్య, ఉప్పలయ్య, శ్రీని వాస్ పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ విద్యా పరిరక్షణ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. -
యువకుడి ఆత్మహత్య
కాజీపేట : మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కాజీపేట బాపూజీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకర్ పట్నం మండలం లింగాపూర్‌కు చెందిన గుర్రం రాం కిరణ్ (24) కొద్ది రోజులుగా రైల్వే డీజిల్ షెడ్లో అప్రెంటీస్ చేస్తున్నాడు. మిత్రులతో కలిసి బాపూజీనగర్ కాలనీలో గది అద్దె తీసుకుని డీజిల్ షెడ్‌కు వెళ్లొస్తుండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఏ తెలియని సమస్యతో మనోవేదనకు గురవుతున్నాడు. బుధవారం తెల్లవారు జామున గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మి త్రులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
పోలీస్ బాస్ సీరియస్.. ఇద్దరు ఊస్ట్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని మామునూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్, గన్‌మెన్ పి.రఘుపై అవి నీతి ఆరోపణాలు నిరూపణ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సస్పెన్షన్ వేటు వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొంత కాలంగా మామునూరు పోలీస్ స్టేషన్లో గతంలో పనిచేసిన ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్, సబ్ ఇన్స్పెక్టర్, గన్‌మెన్‌పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే వీరిని కాపాడేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై ఈనెల 24న ‘సాక్షి’లో ‘ఖాకీ పోస్టింగ్‌లపై ఖద్దర్ ముద్ర’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో ప్రధానంగా పోలీస్ ఉన్నత అధికారులు.. అవినీతికి పాల్పడిన కొందరు అధికారులపై విచారణలో నిరూపితమైనా చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని స్పష్టంగా ప్రచురించింది. అవినీతి ఆరోపణాలు ఎదుర్కొన్న ఇన్స్పెక్టర్ రమేశ్, గన్‌మెన్ రఘుపై డీసీపీ సమర్పించిన నివేదిక ఆధారంగా కమిషనరేట్ పోలీస్ బాస్ సస్పెన్షన్ వేటు వేసి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని నిరూపించారు. దీంతో ఒక్కసారిగా కమిషనరేట్‌లోని కొంత మంది అవినీతి అధికారుల్లో ఎప్పుడు వేటు పడుతుందోననే గుబులు మొదలైంది. అవినీతి అధికారులను కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేసినా ఆయన ఒత్తిళ్లు ఫలించలేదు. వర్ధన్నపేట సబ్‌డివిజన్‌లో ఓ ఇన్స్పెక్టర్ ఓ హత్యకేసులో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేసును అటకెక్కించినట్లు ప్రచారం సాగుతోంది. సదరు ఇన్స్పెక్టర్పై కూడా చర్యలు ఉండనున్నట్లు సమాచారం. ఇన్స్పెక్టర్ రమేశ్, గన్‌మెన్ రఘు సస్పెన్షన్ అవినీతి నిరూపణ కావడంతో ఇద్దరిపై వేటు పనిచేయని రాజకీయ ఒత్తిళ్లు.. -
అతి పెద్ద లిఖిత రాజ్యాంగం
హన్మకొండ: భారత రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగమని, దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులతో సీఎండీ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అధికారాలు, బాధ్యతలను సమన్వయపరుస్తూ ఎలా ఉండాలో రాజ్యాంగం నిర్దేశిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, కె.వెంకట రమణ, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, శ్రవణ్ కుమార్, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్ దాస్, జాయింట్ సెక్రటరీ శ్రీకృష్ణ, జీఎంలు గిరిధర్, శ్రీనివాస్, వాసుదేవ్, మల్లికార్జున్, నాగ ప్రసాద్, సామ్య నాయక్, హేమంత్ కుమార్, కళాధర్ రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
29న కేయూలో అందెశ్రీ యాది సభ
కేయూ క్యాంపస్: ప్రజాకవి, రచయిత డాక్టర్ అందెశ్రీ యాది సను ఈనెల 29న కేయూలో నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ సీతారాంనాయక్, తెలంగాణ ఉద్యమకారుల చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, డాక్టర్ వీఎస్ రెడ్డి, కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు తెలిపారు. కేయూ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రగీతాన్ని రచించి ప్రజాకవిగా పేరొందిన అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మొట్టమొదటిసారిగా అందెశ్రీకి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చి సత్కరించిందన్నారు. అందెశ్రీ యాది సభకు ఆచార్యులు, విద్యార్థులు, పరిశోధకులు, కళాకారులు, కవులు, రచయితలు, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. సమావేశంలో తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతి డాక్టర్ మామిడాల లింగయ్య, కవి పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు డాక్టర్ కర్రె సదాశివ్, ఎర్రబొజ్జు రమేశ్, నవీన్, రవిచందర్ పాల్గొన్నారు. తొలుత గెస్ట్‌హౌస్‌లో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
‘రిలయన్స్’ స్టోర్‌కు రూ.50 వేల జరిమానా
రామన్నపేట/ వరంగల్ అర్బన్: వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నందుకు ఓ స్టోర్‌కు జరిమానా విధించినట్లు బల్దియా సిబ్బంది తెలిపారు. వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని రిలయన్స్ స్మార్ట్ సూపర్‌స్టోర్ ఎదుట స్టోర్‌కు సంబంధించిన వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో బుధవారం రూ.50 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. జరిమానా చెల్లించే వరకూ క్రయవిక్రయాలు జరపకుండా స్టోర్‌ను బల్దియా సిబ్బంది ద్వారా మూసివేయించినట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ పేర్కొన్నారు. నేడు రైల్వే గ్రీవెన్స్ క్యాంప్ కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్‌లోని రైల్వే కమ్యూనిటీహాల్లో గురువారం రైల్వే స్టాఫ్ గ్రీవెన్సె క్యాంప్ నిర్వహిస్తున్నట్లు రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ కమిటీ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జి.ఆర్.సుధీర్‌కుమార్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ఉద్యోగుల నుంచి వినతులు తీసుకుంటామని తెలిపారు. రైల్వే ఏపీఓ గిరిజ, చీఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు వి.రాజేంద్రప్రసాద్, సి.వి.వి.రెడ్డి, బి.గణేశ్‌కుమార్, చీఫ్ ఓఎస్‌లు, ఇతర అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. -
ప్రభుత్వరంగ సంస్థల రక్షణకు పోరాటం
హన్మకొండ: ప్రభుత్వరంగ సంస్థల రక్షణకు ఐక్యంగా పోరాడాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి బి.ఉపేంద్ర చారి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండలోని వరంగల్–1, వరంగల్–2, హనుమకొండ డిపోల ఎదుట ఉపేంద్రచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు దాసోహం అంటున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రతిఘటిద్దామన్నారు. గత ప్రభుత్వం విధానాలే ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. ఆర్టీసీ ద్వారా విద్యుత్ బస్సులు నడిపితేనే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. పనిభారంతో కార్మికులు దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక చట్ట ప్రకారం సెలవు అడిగితే ఇవ్వడం లేదని, ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే డిపో మేనేజర్ చెప్తేనే సెలవు ఇవ్వని దౌర్భాగ్య స్థితి ఆర్టీసీలో నెలకొందని పేర్కొన్నారు. వేతన సవరణ చేయకుండా కార్మికులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు గండి కొడుతోందని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకే ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి–2025ని రద్దు చేయాలని, టీజీఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు ఎన్నికలు, సీసీఎస్‌కు ఎన్నికలు జరపాలని, రిటైర్ కార్మికులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు మహేందర్, శ్రీనివాసు, అశోక్, మోహన్, కార్మికులు పాల్గొన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ సెక్రటరీ ఉపేంద్రచారి -
అదుపు తప్పి గుంతలోకి వెళ్లిన ట్రాక్టర్..
● కిందపడి డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం ● వర్ధన్నపేటలో ఘటన వర్ధన్నపేట: ట్రాక్టర్ అదుపు తప్పి గుంతలోకి వెళ్లడంతో కిందపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కొండేటి బాబు(42).. రైతు కొండేటి సత్యం వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం వ్యవసాయ క్షేత్రంలో హార్వెస్టర్.. వరి కోస్తున్న క్రమంలో ధాన్యాన్ని ట్రాక్టర్ ట్రాలీలో నింపుకుని వస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి గుంతలోకి వెళ్లగా బాబు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శార ద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఎంజీఎం డిప్యూటీ సివిల్ సర్జన్‌గా మధుకర్
ఎంజీఎం: ఎంజీఎం డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ మధుకర్యాదవ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా విధులు నిర్వర్తించిన డాక్టర్ వసంతరావు పదోన్నతిపై సంగారెడ్డి డీఎంహెచ్ఓ బదిలీ అయ్యారు. కాగా, జనగామ జీజీహెచ్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ మధుకర్ యాదవ్‌ను పదోన్నతిపై ఎంజీఎం ఆర్ఎంఓగా బదిలీ చేశారు. బుధవారం ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, నాయకులు ఖాజా, లక్ష్మీప్రసాద్, వంశీ, ఆఫీస్ సూపరింటెండెంట్ అలీ, రాధాకృష్ణ, ఆనంద్ పాల్గొన్నారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలందించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గురువారం ‘డయల్ యువర్ డీఎం’ నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. ఈనెల 27న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్‌పర్తి, కమలాపూర్, వరంగల్ మండలాల ప్రయాణికులు, ట్రైసిటీ ప్రయాణికులు 89777 81103 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలివ్వాలని సూచించారు. వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ రెజ్లింగ్ పోటీల్లో వరంగల్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ క్రీడాకారులు మూడు బంగారు, మూడు వెండి, ఒక కాంస్య పతకంతో సత్తా చాటారు. పతకాలను సాధించిన క్రీడాకారులను బుధవారం హనుమకొండలోని జేఎన్ స్టేడియంలోని తన కార్యాలయంలో డీవైఎస్ఓ గుగులోత్ అశోక్‌కుమార్ అభినందించారు. అండర్–17 గ్రీకో రోమన్ స్టైల్లో ఎస్.మనోహర్ (48 కిలోలు), ఆర్.శ్రీకాంత్(55 కిలోలు) గోల్డ్ మెడల్స్, సీనియర్స్ రెజ్లింగ్ పోటీల్లో కె.అఖిల్ (63 కిలోలు) గోల్డ్ మెడల్ సాధించాడు. టి.వెంకటేశ్ (65 కిలోలు), ఆర్.దత్తు (55 కిలోలు), ఎ.రాహుల్ 57 కిలోల విభాగాల్లో రజత పతకాలు సాధించారు. ఇ.వరుణ్ 63 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన వారిలో ఉన్నారు. డీఎస్ఏ కోచ్‌లు జయపాల్, రాజు అభినందించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: భారత రాజ్యాంగం స్ఫూర్తిదాయక పుస్తకమని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి ప్రాథమిక హక్కులు, విధులను కల్పించిందని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన విలువలను ప్రతిఒక్కరూ గౌరవించి కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మెప్మా పీడీ జోనా, పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంతోనే సమాన ఫలాలు వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: దేశంలో అందరికీ సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని కలెక్టర్ సత్యశారద అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కలెక్టరేట్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. అధికారులు సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన
హన్మకొండ/గీసుకొండ: దీక్షా దివస్ స్ఫూర్తితో ప్రభుత్వంపై వరంగల్ నుంచి ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ప్రకటన వచ్చిందని స్పష్టం చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చిన కేటీఆర్‌కు బుధవారం పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు చేరుకుని కై టెక్స్ కంపెనీతో పాటు పార్కును సందర్శించారు. అక్కడి నుంచి హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. రాజ్యాంగ దివస్‌లో భాగంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మడికొండ లోని రెడ్డి కన్వెన్షన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్‌రెడ్డి కుమార్తె భార్గవిరెడ్డి, ఉదయ్‌రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అని, దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కారు రూ.160 కోట్లు ఖర్చుపెట్టిందని, బిహార్‌లో రాహుల్ గాంధీ డబ్బా కొట్టినా ఫలితం లేదని తూర్పారబట్టారు. బీసీలకు రేవంత్ ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. తడిగుడ్డతో గొంతు కోసిన ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని కోరారు. బీసీ లతో ఓట్లు వేయించుకుని, రిజర్వేషన్లు పెంచకుండా సీఎం మోసం చేశారని ఆరోపించారు. కేఎంటీపీతో 30 వేలమందికి ఉపాధి.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ) పూర్తయితే సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు. గతంలో ఆజంజాహి మిల్లు మూతబడి వైభవాన్ని కోల్పోయిన వరంగల్‌కు కేఎంటీపీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితేనే మంచిదని రాష్ట్రంలో అధికారం కోల్పోవడంపై కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయామనే బాధ లేదన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు రెడ్యానాయక్, సత్యవతిరాథోడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, సాంబారి సమ్మారావు, ఎల్లావుల లలితాయాదవ్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. దీక్షా దివాస్ స్ఫూర్తితో వరంగల్ నుంచి ప్రతిఘటన ఓట్లు వేయించుకుని బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
హన్మకొండ అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని బుధవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఆల్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా కమిటీల పిలుపు మేరకు చేపట్టిన ఈకార్యక్రమంలో కార్మికులు, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సారంపల్లి వాసుదేవరెడ్డి, హంసారెడ్డి, నున్న అప్పారావు, ఏ.ధర్మరాజు, ఎమ్మెస్ రావు, గుమ్మడి రాజుల రాములు, టి.ఉప్పలయ్య, పుల్ల అశోక్, బొల్లారం సంపత్, బొట్ల భిక్షపతి, వేలు రజిత తదితరులు పాల్గొన్నారు. వినాశకర విధానాలు వీడకపోతే ప్రతిఘటనే న్యూశాయంపేట: కేంద్రం వినాశకర విధానాలు వీడకపోతే ప్రతిఘటన తప్పదని కేంద్ర ప్రభుత్వ విధానాలతో అసమానతలు పెరుగుతున్నాయని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేశ్ అన్నారు. బుధవారం రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ ఏకశిల పార్కు నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈసందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కన్వీనర్ కె.బాబురావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో నాయకులు వివిధ సంఘాల నాయకులు మాధవి, ముక్కెర రామస్వామి, ఎలకంటి రాజేందర్, బాబు, రాచర్ల బాలరాజు, శ్రీనివాస్, మొగిలి, కుమారస్వామి, ప్రతాప్, కుమార్, బషీర్, సాయిలు, రాజన్న, వీరయ్య, మోహన్‌రావు, ఇస్మాయిల్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, రైతుల డిమాండ్ కలెక్టరేట్ల ఎదుట భారీ ధర్నా -
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే బిల్లు చెల్లిస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. వరంగల్ 22, 27వ డివిజన్ల పరిధి పలు కాలనీల్లో బుధవారం సీసీ రోడ్డు పనుల్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సీసీ రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, ఎస్ఈ సత్యనా రాయణ, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ సతీష్, ఏఈలు మురళీకృష్ణ, హబీబ్, టీపీబీఓ నవీన్ ఉన్నారు. చెత్త తరలించే వాహనాలపై ఆరా చెత్తను తరలించే వాహనాలు, ఎదురవుతున్న సమస్యలపై కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆరా తీశారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సిస్టంలో కమిషనర్ వాహనాల పనితీరు తెలుసుకున్నారు. మరమ్మతుల కోసం వెహికిల్ షెడ్డులో ఎన్ని వాహనాలను పార్కింగ్ చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
ఒక సీఐ..రెండు స్టేషన్లు!
కాజీపేట అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 14 ఎకై ్సజ్ స్టేషన్లను నెలకొల్పేందుకు ఈనెల 22వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్) జిల్లా పరిధిలో కాజీపేట, హనుమకొండ, వరంగల్ అర్బన్, ఖిలా వరంగల్ ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా, నూతనంగా హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌ను ప్రారంభించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో ఈనెల 24వ తేదీన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎకై ్సజ్ స్టేషన్‌ను ఆర్భాటంగా ప్రారంభించారు. హనుమకొండ సీఐకి హసన్‌పర్తి ఇన్చార్జ్ బాధ్యతలు.. హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న దుర్గాభవాని నూతనంగా ప్రారంభించిన హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఒక్క సీఐ రెండు స్టేషన్ల బాధ్యతలు చేపట్టాల్సి వస్తోంది. అదేవిధంగా హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్‌లోని ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లు సైతం ఇన్చార్జ్ పాలన హసన్‌పర్తి స్టేషన్‌కు కొనసాగించే అవకాశం ఉంది. హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని 25 వైన్స్, 41 బార్లలో సగం వరకు నూతన ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోకి, హనుమకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో హనుమకొండ, హసన్‌పర్తి ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలతోపాటు పలు డివిజన్లు, హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌కు, హనుమకొండ మండల పరిధిలో కొంత భాగం, హసన్‌పర్తి మండలంలో కొంత భాగం, కమలాపూర్ మండలం పూర్తి స్థాయిలో ఉంటుంది. పోస్టింగ్ లేకుండా ఎకై ్సజ్ స్టేషన్లు.. ఎకై ్సజ్ శాఖలో అధిక వైన్స్, బార్లు గల స్టేషన్లలో మరో స్టేషన్‌ను ప్రారంభించాలనే దిశగా ప్రభుత్వం ఏడాదిన్నర నుంచి అడుగులు వేస్తూ వచ్చింది. నూతన ఎకై ్సజ్ స్టేషన్‌కు సిబ్బందిని నియమించి స్టేషన్లను ప్రారంభిస్తే సిబ్బందికి ఇబ్బందులు తలెత్తవు. ఇందుకు భిన్నంగా సిబ్బందికి పోస్టింగ్ లేకుండా హడావుడిగా ఎకై ్సజ్ స్టేషన్‌ను ప్రారంభించారు. పర్యవేక్షణకు నూతన ఎకై ్సజ్ స్టేషన్లు.. ప్రభుత్వం వైన్స్, బార్ల పర్యవేక్షణ కోసం నూతన ఎకై ్సజ్ స్టేషన్లను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌ను ప్రారంభించుకున్నాం. ఎకై ్సజ్ నేరాల నివారణకు, మద్యంపై నిఘా పెంచేందుకు నూతన ఎకై ్సజ్ స్టేషన్ తోడ్పడుతుంది. నూతన ఎకై ్సజ్ స్టేషన్‌కు త్వరలో సిబ్బందిని ప్రభుత్వం కేటాయిస్తుంది. – చంద్రశేఖర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, హనుమకొండ జిల్లా సిబ్బంది లేకుండా హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్ ప్రారంభం -
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
హనుమకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో గురువారం నుంచి మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం కమలాపూర్ మండలంలోని గ్రామ పంచాయతీలను, పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అనంతరం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై సమీక్ష చేపట్టారు. జిల్లాలో మొదటి విడతలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లోని 69 గ్రామ పంచాయతీలు, 658 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం అధికారికంగా ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లా వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు, వ్యక్తులపై తనిఖీలు కఠినతరం చేసినట్లు అధికారులు వివరించారు. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిందని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల సహాయక కేంద్రం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక ఎన్నికల సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సహాయక కేంద్రం మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యేవరకు 24 గంటలు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన సందేహాలు, సాంకేతిక సమస్యలు, ఫిర్యాదుల వంటి విషయాల కోసం ప్రజలు 7981975495 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, ఎంసీసీ నోడల్ అధికారి ఆత్మారాం పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్/న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 317 గ్రామ పంచాయతీల్లో 2,754 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 3,83,738 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నేడు(గురువారం) రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగానే మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్లను ఈనెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. 30న స్కూృటినీ, డిసెంబర్ 1న అప్పీలు, 2న అప్పీళ్లపై పరిష్కారం, డిసెంబర్ 3న మధ్యాహ్నం వరకు ఉపసంహరణ గడువు ముగియగానే పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ సత్యశారద విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి పాల్గొన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో ఎన్నికల కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే టోల్‌ఫ్రీ నంబర్లు 1800 4253 424, 91542 52936, 0870 2530812కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు. పకడ్బందీ ఏర్పాట్లు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదినీ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల నిర్వహణపై పోలీసు కమిషనర్లు, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి.. ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జీపీ, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణపై ఆర్డీఓలు, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, ఏఆర్ఓలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లాలో మొదటి విడత భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఎన్నికలు 69 గ్రామ పంచాయతీలు, 658 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్న అధికారులు -
మూడు విడతల్లో ‘స్థానికం’
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఎట్టకేలకు మంగళవారం నగారా మోగింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో.. మూడు విడుతలుగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. వాస్తవానికి సెప్టెంబర్‌లోనే షెడ్యూల్ విడులైంది. రిజర్వేషన్లపై కోర్టు కేసు, వివాదం కారణంగా అక్టోబర్ మొదటి వారంలో రద్దయ్యాయి. కోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. రేపు నోటిఫికేషన్.. నామినేషన్ల ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 27న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేరోజు నుంచి మొదటి విడతకు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. రెండో విడతకు 30 నుంచి, మూడో విడతకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత ఎన్నికల సంఘం గుర్తులు కేటాయిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ పూర్తికాగానే 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించి కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 15,026 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. 25 రోజులపాటు ఎన్నికల కోడ్.. షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మాత్రం మినహాయింపు ఉంటుంది. కాగా, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలను కలిపే సరిహద్దుల్లో చెక్‌పోస్టులను నెలకొల్పేందుకు పోలీసు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేలా చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సుమారు 25 రోజులపాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడనుంది. ఇదిలా ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలెంజ్‌గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రధాన పార్టీలు మాత్రం గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించేందుకు దృష్టి సారించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ స్థానాలను అత్యధికంగా గెలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. హన్మకొండ అర్బన్ : జిల్లాలోని 210 గ్రామ పంచాయతీల్లో తుది జాబితాలో మొత్తం 3,70,871 మంది ఓటర్లుగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం ఓటర్లలో 1,80,666 పురుషులు, 1,90,201 మహిళలు ఉన్నారు. నలుగురు ట్రాన్స్జెండర్లు ఓటర్లుగా ఉన్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లదే హవా కొనసాగనుంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 9,535 మంది అధికంగా ఉండడం విశేషం. నూతన జీపీల్లో తొలిసారి పోలింగ్.. జిల్లాలో మూడు గ్రామ పంచాయతీలు తొలిసారిగా నూతన పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో ఆయా గ్రామ పంచాయతీల్లో మొదటిసారి పోలింగ్ జరుగనుంది. భీమదేవరపల్లి మండలంలోని సాయినగర్, వీరభద్ర నగర్, ఎల్కతుర్తి మండలంలోని రామకృష్ణపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏకగ్రీవ జీపీలకు నజరానా లేనట్లేనా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు తగ్గించేందుకు ఎన్నికల సంఘం కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. అందులో ముఖ్యంగా గ్రామ పంచాయతీతో పాటు వార్డుల సహా మొత్తం ఏకగ్రీవమైన జీపీలకు రూ.5లక్షల నజరానా ప్రకటించి అందజేశారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గాని, ప్రభుత్వం నుంచి గాని ప్రస్తుతం అలాంటి ప్రకటన ఎక్కడ వెలువడకపోవడంతో ఏకగ్రీవాలపై ఆసక్తి ఉన్న చోట్ల నిరాశే ఎదురవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించిన ఏకగ్రీవ పంచాయతీలకు ఎన్నికల అనంతరం మొండిచేయి చూపారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ నిధులు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన కూడా లేదు. హనుమకొండ జిల్లాలో ఎన్నికలు ఇలావిడత మండలాలు పంచాయతీలు వార్డులుమొదటి 3 69 658 రెండు 5 73 694 మూడు 4 68 634 మొత్తం 12 210 1,986 వరంగల్ జిల్లాలో ఎన్నికలు ఇలా..మొదటి 3 91 800 రెండు 4 117 1,008 మూడు 4 109 946 మొత్తం 11 317 2,754 మోగిన పంచాయతీ ఎన్నికల నగారా ఉమ్మడి వరంగల్‌లో అమల్లోకి వచ్చిన కోడ్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు మినహాయింపు మండల, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటుకు సన్నాహాలు పోటాపోటీగా ఆశావహులు.. గెలుపు గుర్రాలకే అవకాశం.. ప్రధాన పార్టీల కసరత్తు -
నేడు దీక్షా దివస్ సన్నాహక సమావేశం
నయీంనగర్: ప్రతీ సంవత్సరం నవంబర్ 26 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా నేడు (బుధవారం) పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులతో హనుమకొండలో జరిగే సన్నాహక సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, తెలంగాణ ఉద్యమకారుల ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమాల విజయవంతంపై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులే కడియం బ్రాండ్ అని ఆరోపించారు. కేంద్రంలో బిడ్డకు మంత్రి పదవి ఇస్తామంటే తండ్రి, బిడ్డ జంప్ చేస్తారని అన్నారు. సమావేశంలో రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు హరి రమాదేవి, కార్పొరేటర్లు సోదా కిరణ్, చెన్నం మధు, రంజిత్ రావు, పులి రజనికాంత్,రమేష్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కేటీఆర్ రాక బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ -
సాస్కి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
బల్దియా కమిషనర్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్ : సాస్కి పథకం ప్రతిపాదనలను డిసెంబర్ 15వ తేదీలోగా యుద్ధ ప్రతిపాదికన సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మినీ సమావేశ మందిరంలో బల్దియా, కుడా ఉన్నతాధికారులతో సాస్కి ప్రతిపాదనల సమర్పణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2నెలల నుంచి సాస్కి పథకంలో భాగంగా పలు ప్రతిపాదనలు సమర్పించేందుకు అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ పథకంలో నీటి సరఫరా, డ్రెయినేజీ నెట్వర్క్, జీఐఎస్, మున్సిపల్ ఆస్తుల మ్యాపింగ్, పాత బావుల పునరుద్ధరణ, పునరుజ్జీవనం, నైబర్‌వుడ్ అంశాల్లో పురోగతి వంటి వాటిని ఈ ప్రాజెక్ట్‌లో చేర్చినట్లు వెల్లడించారు. గడువులోగా నివేదికలు సమర్పిస్తే వరంగల్ నగరానికి ప్రోత్సాహక మొత్తం లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం (నేడు) సాయంత్రం వరకు ప్రాథమిక నివేదికలు అందజేయాలని కమిషనర్ కోరారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, బల్దియా ఈఈ సంతోష్ బాబు, కుడా ఈఈ భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కాజీపేట అర్బన్/కాజీపేటరూరల్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. న్యూశాయంపేట పీహెచ్సీలో వైద్య సేవల కోసం వచ్చిన వృద్ధురాలిని కలెక్టర్ మంగళవారం పలకరించారు. ఆరోగ్య మహిళా క్లినిక్ సేవలను పరిశీలించి మాట్లాడారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని, జనాభాకనుగుణంగా పరీక్షలు చేయాలని వైద్యులకు సూచించారు. పీహెచ్‌సీలోని ఓపీ నమోదు, ఫార్మసీ, ఆరోగ్యమహిళా రికార్డులు, ల్యాబ్ పరిశీలించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, కాజీపేట తహసీల్దార్ భావ్‌సింగ్, పీహెచ్సీ వైద్యులు మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందించాలి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. అయోధ్యపురంలోని ప్రభుత్వ పాఠశాల, దర్గా కాజీపేట జాగీరు ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించారు. విద్యార్థుల హాజరు పట్టిక, వంట గదిని పరిశీలించారు. అడ్మిషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మన్మోహన్, ఎంఈఓ మనోజ్‌కుమార్, తహసీల్దార్ భావ్‌సింగ్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయండిహన్మకొండ అర్బన్: సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి నోడల్ అధికారులు, ఎంపీడీఓలతో మంగళవారం టెలికాన్ఫరెనన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను నిరోధించేందుకు నిఘా బంృదాలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీల హోర్డింగులు, పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఉన్న రాతలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, లెక్కింపుల వరకు అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆర్డీఓలు, నోడల్ అధికారులు, డీఎల్పీఓలు తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ రాక.. పనులు లేక
కాజీపేట: కాజీపేటలోని ఎఫ్‌సీఐ గిడ్డంగులకు సీఎంఆర్ ధా న్యం రాక.. పనులు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు కాజీపేట పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పదుల సంఖ్యలో ధాన్యం లారీలు నిలిచి ఉండేవి. కానీ, ఈ ఏడాది ఇంకా సీఎంఆర్ రాకపోవడంతో బియ్యం గింజ కూడా కాజీపేట గోడౌన్లకు రావడం లేదు. ఎఫ్‌సీఐలో సుమారు 200 మంది సిబ్బంది ఉన్నారు. పనిలేకపోతే రోజూవారి విధానంలో జీతా లు చెల్లించడం హమాలీలకు నష్టమే కలిగిస్తుంది. గతంలో బస్తాలను ఎత్తడం ద్వారా వీరికి అదనంగా డబ్బు వచ్చేది. గత సంవత్సరం ఇదే సమయంలో తమకు పని కల్పించాలని హమాలీ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆందోళన చేసి సత్ఫలితాలను సాధించారు. కానీ, ఈ ఏడాది పనులు లేక హమాలీలు అవస్థలు పడుతున్నారు. జీతభత్యాలు తగ్గడంతో సిబిల్ స్కోర్ తగ్గుతుందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులు స్పందించి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని హమాలీలు కోరుతున్నారు. -
రిటైర్డ్ ఉద్యోగుల ఔదార్యం
కాజీపేట అర్బన్: వృద్ధాప్య దశలో మేమున్నాం మీకు అంటూ రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు ఔదార్యం చాటుకుంటున్నారు. ఉద్యోగ విరమణ పొందాం.. మన పని అయిపోయింది అనుకోకుండా రైల్వే మనకు ఎంతో ఇచ్చింది, తిరిగి కొంతయినా ఇచ్చేద్దాం.. మన స్నేహితులకు సేవలందిద్దాం అంటూ వృద్ధ పెన్షనర్లు ఇంటింటికీ తిరుగుతూ ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెన్షన్ తీసుకుంటు న్న రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి సంవత్సరం నవంబర్‌లో తాము జీవించి ఉన్నట్లు లైఫ్ సర్టిఫికెట్ అందించాలి. ఇందుకు ఆన్లైన్లో జీవన్ ప్రమాణ్ యాప్‌లో నమోదు చేసుకోవాలి లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాలి. లేనిపక్షంలో పెన్షన్ నిలిపివేస్తారు. కాజీపేట పరిధిలో సుమారు 1,700 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 100 మందికి పైగా ఇంటి నుంచి కదిలే పరిస్థితి లేదు. దీంతో పెన్షనర్స్ అసోసియేషన్ బాధ్యులు కట్టస్వామి, సూర్యనారాయణ పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి హోం టు బ్యాంకు పేరిట జీవన్ ప్రమాణ్ సేవలందజేస్తున్నారు. పెన్షన్ ఆగిపోకుండా పెన్షనర్స్‌కు సేవలందిస్తున్నారు. -
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
కేయూ క్యాంపస్ : చదువుతోపాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య సూచించారు. మంగళవారం కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్పోర్ట్స్‌డే సందర్భంగా వివిధ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భిక్షాలు మాట్లాడుతూ.. కళాశాలలో ప్రతి ఏటా విద్యార్థినులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్పోర్ట్స్ ఇన్చార్జ్ తూర్పాటి వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు త్రోబాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, రన్నింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యారణ్యపురి : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నుంచి మినహాయింపు ఇవ్వాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్) పిలుపు మేరకు టీఎస్‌యూటీఎఫ్ హనుమకొండ జిల్లా కమిటీ బాధ్యులు ప్రధానమంత్రికి ఈ–మెయిల్ ద్వారా మంగళవారం అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి.కిరణ్‌కుమార్ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి రెండునెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం దీనిపైన సమీక్ష చేయడం లేదన్నారు. సీనియర్ టీచర్లకు ఉద్యోగాలపై భరోసా ఇవ్వడంలేదని ప్రధాన మంత్రికి పంపిన వినతిలో పేర్కొన్నట్లు వారు వెల్లడించారు. ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం 2010 ఆగస్టు 28కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ అవసరం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల సర్వీస్చేసిన ఉపాధ్యాయులు టెట్ రాయాలని గతంలో ప్రభుత్వాలు పేర్కొనలేదని వారు తెలిపారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో విద్యాహక్కుచట్టం 2009ను సెక్షన్ 23ను సవరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ లింగారావు, ఎఫ్డబ్లూఎఫ్ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్రావు, బాధ్యులు రామ్మోహన్‌చారి పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు వరంగల్ డీడబ్ల్యూఓ రాజమణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29న ఓసిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల దివ్యాంగులు సదరం, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఓసిటీ ఇండోర్ స్టేడియంలో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: వరంగల్ పోతననగర్‌లోని లాండ్రో మార్ట్‌ను వినియోగంలోకి తేవాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లను ఆదేశించారు. లాండ్రో మార్ట్‌ను మంగళవారం మేయర్ పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లాండ్రో మార్ట్‌ని యంత్రాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆపరేషన్, నిర్వహణ కోసం టెండర్ పిలిచి సాధ్యమైనంత తొందరగా మార్ట్ ను వినియోగంలోకి తేవాలని సూచించారు. ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ మహేందర్, శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను, ఏఈ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. నాలాల్లో సిల్ట్ తొలగించాలి.. నాలాల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. హనుమకొండ పరిధిలోని అంబేడ్క ర్ భవన్, పిస్తా హౌస్ ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో సిల్ట్ తొలగింపును మేయర్ దృష్టి సారించి సిల్ట్‌ను తొలగించాలని సూచించారు. -
ట్రేడ్ ఫీజులో గోల్మాల్!
జీడబ్ల్యూఎంసీ వివరాలువరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ఖజానాకు చేరాల్సిన ఆదాయానికి శానిటరీ సిబ్బంది గండి పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవాలను దాచిపెట్టి, కమర్షియల్ వ్యాపారులతో కుమ్మక్కై తూతూమంత్రంగా ఫీజు విధించి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో వ్యాపార వైశ్యాలం, చెల్లిస్తున్న ట్రేడ్ లైసెన్స్ ఫీజును చూసి అవాకై ్కన జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. వరంగల్‌లో కూడా వ్యాపార, వాణిజ్య సంస్థల వైశాల్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కూడా శానిటరీ ఇన్స్పెక్టర్లు, వింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు. ఆదాయం పెంపుపై పురపాలక శాఖ దృష్టి.. స్థానిక సంస్థల బలోపేతం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఆదాయం పెంపుపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా 2020 సెప్టెంబర్‌లో ప్లింత్ ఏరియా ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు విధించాలని 147 జీఓ జారీ చేసింది. బల్దియా పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్‌లు, షాపులు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు వేలల్లో ఉన్నాయి. రెండున్నర ఏళ్లపాటు అధికారులు జీఓను తొక్కి పెట్టారు. ఈ జీఓ ఉత్తర్వుల అమలుపై ‘సాక్షి’ దినపత్రిక పలుమార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు స్పందించిన అధికారులు, సిబ్బంది ఆరు నెలలపాటు వ్యాపార సంస్థల కొలతలు వేసి ఫ్లింత్ ఏరియా ఆధారంగా ఫీజు విధించారు. నామామత్రపు ఫీజుతో సరి.. నగర వ్యాప్తంగా 1,77,666 అసెస్మెంట్లు ఉన్నాయి. అందులో కమర్షియల్ అసెస్మెంట్లు 35వేలకు పైగా ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్‌లు 26,650 ఉండగా.. రూ.5.27 కోట్లకు చేరింది. కార్పొరేషన్లో కాసుల వేటకు కాచుకొని కూర్చున్న ఓ వర్గానికి ఈ పునరుద్ధరణ కనక వర్షం కురిపిస్తోంది. మార్కెట్ డిమాండ్, వైశాల్యం కొలతల ఆధారంగా దుకాణాల ధరలు నిర్ణయిస్తారు. లెక్కలపై కనీస అవగాహన లేని జవాన్లు ఇష్టారాజ్యంగా కొలతలు వేసి మామ అనిపించారు. అంతేకాకుండా మాల్స్, పరిశ్రమలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల కొలతల్లో మాయాజాలం ప్రదర్శించి పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా ఉన్నారని సమాచారం. గతంలో ట్రేడ్ లైసెన్స్ ద్వారా ఏడాదికి రూ.2.60 కోట్ల ఆదాయం సమకూరేది. ఫ్లింత్ ఏరియా ఆధారంగా ఆదాయం కాస్త రూ.5.27 కోట్లకు చేరింది. నగరంలో మల్టీలెవల్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, కోల్డ్ స్టోరేజీలు, పరిశ్రమలు, 5 స్టార్ హోటళ్లు, ఆస్పత్రులు పెద్దఎత్తున వెలిశాయి. కానీ, ఆశించిన ఫీజు విధించడంలో జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. దీంతో బల్దియా ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడింది. అంతేకాకుండా నగరంలో వేలాదిగా ట్రేడ్ లైసెన్స్‌ల వ్యాపార సంస్థలున్నాయి. బల్దియా సిబ్బంది వాటి జోలికి వెళ్లడం లేదు. మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఉన్న భారీ, మధ్య తరహా దుకాణాల ట్రేడ్ లైసెన్స్‌లను రివైజ్డ్ చేస్తే బల్దియాకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికై నా బల్దియా ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే బల్దియాకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. రివైజ్డ్ చేస్తున్నాం.. ట్రేడ్ లైసెన్స్ ఫ్లింత్ ఏరియా వైశాల్యంలో తేడాలున్నాట్లు మా దృష్టికి వచ్చింది. మూడు రోజులుగా రివైజ్డ్ ప్రక్రియ ప్రారంభించాం. ఏ షాపును వదిలే ప్రసక్తే లేదు. వాస్తవ కొలతలకు అనుగుణంగా ఫీజు చెల్లించాల్సిందే. – రాజారెడ్డి, సీఎంహెచ్ఓ డివిజన్లు : 66 మహా నగర జనాభా: 12 లక్షలు భవనాలు (అసెస్మెంట్ల) సంఖ్య 1,77,666.. ఆదాయం రూ.172.14 కోట్లు కమర్షియల్ అసెస్మెంట్లు 31,638 .. ఆదాయం రూ.80 కోట్లు ట్రేడ్ లైసెన్స్‌లు : 26,650 మొత్తం బకాయిలు రూ. 9.27కోట్లు.. వసూళ్లు రూ.2.92 కోట్లు రివైడ్జ్ చేస్తే రూ.10 కోట్లపైనే ఆదాయంతూతూమంత్రంగా దుకాణాల వైశాల్యం నమోదు నిద్రమత్తులో జోగుతున్న ప్రజారోగ్యం అధికారులు గ్రేటర్ వరంగల్ ఆదాయానికి భారీగా గండి -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలోని రైస్ మిల్లర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 149 మిల్లులకు గాను 90 ఉపయోగంలో ఉన్నాయని, అందులో 57 మిల్లులకు ట్యాగింగ్ పూర్తయిందన్నారు. బ్యాంక్ గ్యారంటీ, ప్యాడీ క్లీనర్స్, టార్పాలిన్లు, గన్నీ బ్యాగ్‌లు, ఓపీఎంఎస్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు గోనెల రవీందర్రావు, సెక్రటరీ బూరెల సత్యనారాయణ, కోటేశ్వర్రావు, తోట సంపత్‌రావు పాల్గొన్నారు. -
6 నెలలకే.. పగుళ్లు!
వరంగల్ అర్బన్ : రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా ఉంది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరు. పది కాలాల పాటు మన్నికగా ఉండాల్సిన అభివృద్ధి పనులు అవినీతిమూలంగా మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని పాత కౌన్సిల్ హాలు దెబ్బతినడంతోపాటు ఇరుకుగా మారింది. దీంతో ఆధునికీకరణ కోసం రూ.2కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నాడు. రూ.కోటితో సివిల్ పనులు, రూ. కోటితో ఏసీలు, ఆడియో, ఎల్ఈడీ లైట్లు, 80 మంది కార్పొరేటర్లకు ఆధునిక సీట్ల పనులు చేపట్టారు. పాత కౌన్సిల్ హాల్ మేయర్, కమిషనర్, 66 మంది కార్పొరేటర్లకు సరిపడా సీట్లు ఉన్నాయి. కానీ, అన్ని విభాగాల వింగ్ అధికారులు, విలేకరులు కూర్చునేందుకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో గత ఐదేళ్లుగా మీడియాను అనుమతించడం లేదు. అంతేకాకుండా 2026లో డివిజన్ల పునర్విభజన ద్వారా 88 డివిజన్లుగా రూపాంతరం చెందనున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆరు నెలల కిందట పాత కౌన్సిల్ హాల్ పునరుద్ధరణకు రూ.2కోట్ల నిధులు కేటాయించారు. పాత కౌన్సిల్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అవే రూ.2కోట్లు వెచ్చిస్తే నూతన కౌన్సిల్ హాల్ నిర్మాణం జరిగేది.. బల్దియా ఇంజనీర్లకు ముందు చూపు కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల కోసం.. ప్రజాప్రతినిధులు చెప్పినట్లు తలూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. 50ఏళ్ల క్రితం హనుమకొండ కాంగ్రెస్ భవన్‌కు సమీపంలో బల్దియా కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయాన్ని ఎంజీఎం సమీపంలో భవనాన్ని నిర్మించి తరలించారు. భవనంతో పాటు కౌన్సిల్ హాల్ నిర్మించారు. ఇన్నేళ్ల కిందట నిర్మించిన పాత బిల్డింగ్, కౌన్సిల్ హాల్‌ను పూర్తిగా నేలమట్టం చేయాలి. ఆ స్థలంలో కొత్త భవనంతోపాటు కౌన్సిల్ హాల్‌ను నిర్మించాలి. కానీ, పాలకవర్గ పెద్దలు, ఇంజనీర్లు కేవలం పర్సంటేజీల కోసం మరమ్మతుల నాటకమాడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సిల్ హాల్ పునరుద్ధరణ పనులు చేసిన ఆరు నెలల కాలంలో పగుళ్లు పడుతుండంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రూ.2కోట్ల నిధులతో కొత్త కౌన్సిల్ హాల్ నిర్మాణం పూర్తవుతుందని ఇంజనీర్లే చెబుతున్నారు. పాత భవనం స్లాబ్‌కు మరమ్మతులు చేస్తుండగానే మరోవైపు స్లాబ్ పెచ్చులు ఉడిపోతున్నాయి. దీంతో ఉద్యోగులు, అధికారులు, కార్యాలయానికి వచ్చే పౌరులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లను తాళలేక పాత కౌన్సిల్ హాల్‌తోపాటు పాత బిల్డింగ్ రూ. 30లక్షలతో పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని, తామేమీ చేయలేమని ఇంజనీర్లు సమాధానం ఇస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. నిర్మాణ పనులపై క్వాలిటీ కంట్రోల్ కూడా చూసీచూడనట్లుగా నివేదిక సమర్పించడంతో బిల్లులు చెల్లింపులు చకచకా చెల్లింపులు చేసి, ఎవరికి వారు ప్రజాధనాన్ని వాటాలుగా పంచుకున్నారని పగళ్లను చూస్తే అర్థమవుతోంది. ఈ పనులపై లోతుగా విచారణ జరిపాలని, మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తాయని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. లోపాలుంటే కాంట్రాక్టర్లదే బాధ్యత బల్దియా పాత కౌన్సిల్ హాల్, పాత బిల్డింగ్ ఆధునికీకరణ పనుల్లో ఏమైనా లోపాలుంటే సంబంధిత కాంట్రాక్టర్లదే బాధ్యత. ఆ పనులను తిరిగి చేయాల్సిందే. పాతకాలం నాటి బిల్డింగ్ పటిష్టంగా ఉంటుందని భావించి పునరుద్ధరణ పనులు చేస్తున్నాం. – రవికుమార్, బల్దియా ఈఈ రూ.2కోట్ల నిధులతో కొత్త భవనం కడితే పోలా! ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదమంటున్న ఇంజనీర్లు పాత కౌన్సిల్, బిల్డింగ్ ఆధునికీకరణ పనుల్లో స్వాహాపర్వం విచారణ చేస్తే వెలుగుచూడనున్న అక్రమాలు ‘గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజావసరాలకు తగ్గట్టుగా భవనాలు, సిమెంట్ రోడ్లు, సైడ్ కాల్వలు, తాగునీటి సరఫరా పైప్లైన్ల పనులను నాణ్యతతో నిర్మిస్తున్నాం. నాసిరకంగా చేస్తే మాకు చెప్పండి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం.– అభివృద్ధి పనుల ప్రారంభంలో పాలకవర్గం పెద్దలు, ఉన్నతాధికారులు పదే పదే చెప్పే మాటలు. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పగుళ్లు.. బల్దియా కౌన్సిల్ హాల్, పాత భవనం పునరుద్ధరణ పనుల తీరువి. పాత భవనాల ఆధునికీకరణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు లోపించాయనడానికి ఉదాహరణలు. కౌన్సిల్‌హాల్ ఆధునికీకరణ పనులు చేసిన 6 నెలల్లోనే ఇలా నెర్రలు పడ్డాయి. మరోవైపు బల్దియా పాత బిల్డింగ్‌లకు మరమ్మతులు చేస్తుండగానే స్లాబ్ పెచ్చులు ఊడిపోతున్నాయి. -
జిల్లాలో మరో ఎౖకై ్సజ్ పోలీస్‌స్టేషన్
ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హసన్‌పర్తి: హసన్‌పర్తి మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్‌లో సోమవారం పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో స్థానిక స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్, నాగరాజు పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు.యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.నకిలీ మద్యం తయారీపై నిఘా ఉంచాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దుర్గాభవాని స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, అర్బన్ డీపీఓ చంద్రశేఖర్, ఎకై ్సజ్ సీఐ దుర్గాభవాని, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, దేవస్థాన చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి, మాజీచైర్మన్ జె.రవి, పుల్లా రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, మాజీసర్పంచ్ అనిల్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, దేవస్థాన ధర్మకర్త సురేశ్,మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘కుడా’.. విస్తరణ ఎక్కడ?
సాక్షి, వరంగల్: వరంగల్ నగరం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల మేర ఉన్న శివారు ప్రాంతాలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి దిశగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిని విస్తరించాలని నిర్ణయించినా ఇంకా పట్టాలెక్కేలా చూడడం లేదు. ‘కుడా’ పరిధి విస్తరణ ద్వారా వందలాది గ్రామాలు, పదుల సంఖ్యలో మండలాల్లో రోడ్లు, మురుగు నీటి పారుదల వ్యవస్థ, పార్కులు, కరెంట్.. తదితర మౌలిక వసతులు ప్రణా ళికాబద్ధమైన అభివృద్ధికి అస్కారం ఉంటుంది. పరిధి పెంచితే ప్రభుత్వానికి.. ప్రజలకు మంచిదే ‘కుడా’ పరిధిని పెంచడం ద్వారా ప్రధాన మండలకేంద్రాలు కలుపుకుని మొత్తం 82 గ్రామాలు అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీలోకి వస్తాయి. ఫలితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) ద్వారా కేంద్రం అందించే సాయం రెట్టింపయ్యే అవకాశముంటుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.72 వేలు ఉండగా, పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ 1.5 లక్షలుగా కొనసాగుతోంది. కుడా విస్తరణ ద్వారా వందల సంఖ్య గ్రామ పంచాయతీలు పట్టణ పరిధిలోకి చేరుతాయి. దీంతో వీటిని పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల నిధుల విషయంలో రూ.కోట్లలో అదనపు భారం తగ్గే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో అమలుచేసే వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. అనధికారిక లేఔట్లను నియంత్రించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మెరుగుపడే అవకాశముంటుంది. బృహత్ ప్రణాళిక అమలులో ఉండి ఈ ప్రాంతాలన్నీ పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయి. వరదలొచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ‘కుడా’ విస్తరణ ప్రతిపాదనలు ఏడాది దాటినా ప్రభుత్వం వద్దనే ఫైల్ అనుకున్నదే తడవుగా హెచ్ఎండీఏ పరిధి విస్తరణకు జీఓ ఇక్కడ కూడా నేతలు కలిసి పరిధిని పెంచాలంటున్న జనం ఇది జరిగితే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వంపై తగ్గనున్న భారం అనధికారిక లేఔట్లు తగ్గి అభివృద్ధికి అవకాశం ‘7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిని 2025 మార్చి 12న 10,472.723 చదరపు కిలోమీటర్లకు పరిధికి పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులను కలుపుతూ వస్తున్న 354 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు వెలుపల రెండు కిలోమీటర్లు బఫర్ జోన్‌గా నిర్ధారిస్తూ, అక్కడి ప్రాంతాలను కలుపుతూ హెచ్ఎండీఏ విస్తీర్ణాన్ని పెంచింది. ఇలా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు రూపొందించిన నెలల వ్యవధిలోనే చకచకా అమలు చేసింది’ ‘రాష్ట్ర రెండో రాజధానిగా పేరొందిన వరంగల్ నగరం కూడా అభివృద్ధి బాట పడుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు, మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిని 2738.19 (మరో 933.19) చదరపు కిలోమీటర్లకు పెంచాలంటూ గతేడాది అక్టోబర్‌లో ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తర్వాత దీన్ని ముఖ్య రాజకీయ నేతలు పట్టించుకోకపోవడంతో ఏడాది దాటినా ఎక్కడికక్కడే ఉంది. -
మహిళా సంఘాలకు వీఎల్ఆర్ నిధులు
మంత్రి సీతక్క హన్మకొండ అర్బన్: జిల్లాలోని 12 మండలాల పరిధి స్వయం సహాయక సంఘాల సభ్యులైన 9,046 మందికి వడ్డీ లేని రుణంగా రూ. 6.51 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ నిధులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో పంపిణీ చేయాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏటూరునాగారం నుంచి గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు చేయాలని సూచించారు. అర్హులైన ప్రతీ మహిళకు చీర అందేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేన శ్రీనివాస్, సెర్ప్ అధికారులు పాల్గొన్నారు. రుణాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి : వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరంగల్ జిల్లానుంచి వీసీలో కలెక్టర్ సత్యశారద, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రామిరెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు ఉమ, రాధిక, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమబావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నేడు (మంగళవారం) జిల్లాలో 10,357 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.6.52 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని సెగ్మెంట్లలో ఏకకాలంలో పండుగ వాతావరణంలో జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
వినడమేనా.. పరిష్కారం లేదా?
వరంగల్ అర్బన్ : ‘సమస్యలు పరిష్కరిస్తామని గొప్పలు చెప్పడమే తప్ప.. విన్నవించిన ఫిర్యాదులపై స్పందించకపోతే ఎలా? అంటూ పలు కాలనీల ప్రజలు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్లో అధికారులను నిలదీశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 89 ఫిర్యాదులు అందాయి. ఆయా విభాగాల వింగ్ అధికారులు వినతులు స్వీకరించారు. చేస్తాం, చూస్తాం.. అని కాలయాపన చేస్తున్నారు తప్ప, ఏ ఒక్క పని కూడా జరగడం లేదన్నారు. దీంతో ఆయా విభాగాల అధికారులు సంబంధిత విభాగం సిబ్బందిని పిలిచి పరిష్కారంపై నిర్లక్ష్యం వీడి, నిర్ణీత గడువులోగా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని సూచనలు చేశారు. మొత్తం 89 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ 44, ఇంజనీరింగ్ 23, రెవెన్యూ సెక్షన్‌కు 8, హెల్త్– శానిటేషన్‌కు 8, నీటి సరఫరా 4, ఉద్యానవన విభాగానికి 2 ఫిర్యాదు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, హెచ్ఓ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు అందినవాటిలో కొన్ని ఫిర్యాదులు.. ● దేశాయిపేట రోడ్డులోని చికెన్ సెంటర్ నిర్వాహకులు వ్యర్థాలను కాల్వల్లో వేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● వరంగల్ 12వ డివిజన్ డాక్టర్స్ కాలనీ–2, స్నేహనగర్‌లో పందుల సంచారంతో ఇబ్బందులు పడుతున్నామని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ● 36వ డివిజన్ చింతల్ ఆర్ఓబీ ప్రాంతంలో గార్డెనింగ్, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సమీప ప్రాంతాల ప్రజలు కోరారు. ● హనుమకొండ గోపాలపురం గ్రామ పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలో డ్రెయినేజీ నిర్మించాలని కాలనీ కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ● 1వ డివిజన్ 52–3–154 ఇంటినంబర్ ప్రాంతంలో వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 56వ డివిజన్ పరిమళ కాలనీలో రోడ్డు–15లో సీసీ రోడ్డుకు 20శాతం కాంట్రిబ్యూషన్ సొమ్ము చెల్లించామని, ఇంతవరకు నిర్మించడం లేదని అభివృద్ధి కాలనీ కమిటీ ప్రతినిధులు వాపోయారు. ● వీలిన గ్రామం ఎర్రగట్టు గుట్ట కిట్స్ కాలేజీ సమీపంలో నల్లా లేకున్నా బిల్లు వస్తుందని నితీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ● ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలో కుక్కల బాధ, వీధిలైట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు. ● 66వ డివిజన్ ముచ్చర్ల గ్రామం ప్రాథమిక పాఠశాలలో మట్టి రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని, సీసీ వేయాలని పాఠశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ● కోమటిపల్లిలో తాగునీరు. రోడ్ల సమస్యలు పరిష్కరించాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● హనుమకొండ బొక్కలగడ్డలో బల్దియా డ్రెయినేజీ మూసివేశారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుదారుల ఆవేదన బల్దియాకు 89 వినతులు -
సెంట్రల్ జోన్ డీసీపీ కవిత బాధ్యతల స్వీకరణ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సెంట్రల్ జోన్ డీసీపీగా దార కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమెను సెంట్రల్ జోన్ పరిధి అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఆమె గతంలో హైదరాబాద్ సైబర్ విభాగంలో పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఎంజీఎం: జిల్లాలోని క్లినిక్‌లు, ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నిబంధనలకు లోబడి పని చేయాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. సోమవారం ఆయన నగరంలోని గౌతమ్ హాస్పిటల్, అభినయ్ క్లినిక్‌లను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన అనుమతి పత్రాలతో పాటు టారిఫ్ లిస్ట్, సందర్శిస్తున్న డాక్టర్ల వివరాలు, ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్ల బంధువులతో మాట్లాడారు. మీరు సొంతంగా వచ్చారా? లేక ఎవరైనా పంపించారా? డాక్టర్ ఫీజు, ల్యాబ్, ఇతర పరీక్షలకు ఎంత తీసుకుంటున్నారు? వాటికి సంబంధించిన ధరల పట్టికను చూశారా? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరల పట్టికను పేషెంట్లకు కనిపించేలా ప్రదర్శించాలని నిర్వాహకులను ఆదేశించారు. అందించే సేవలకు ఎంత ఖర్చు అయ్యేదాన్ని బట్టి పేషెంట్లు వారికి అందుబాటులో ఉన్న క్లినిక్ లేదా ఆస్పత్రులకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. క్లినిక్, ఆస్పత్రులకు వచ్చే వారి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలన్నా. నిర్వాహకులు పేషెంట్లకు మానవీయ కోణంలో చికిత్స అందించాలన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. ఇన్స్పైర్, సైన్స్‌ఫేర్ కలిసి హనుమకొండలోని సేయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఈవైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2024–25 విద్యాసంవత్సరంలో ఇన్స్ఫైర్ అవార్డులకు ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టు ఎగ్జిబిట్స్ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాగా, ప్రధానాంశంగా వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రధానంశంగా పలు ఉప ఇతివృత్తాల్లో ఎగ్జిబిట్స్ను ప్రదర్శించనున్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులకు డిసెంబర్ 5న ‘రెడ్యూసింగ్ పొల్యూషన్’ అనే ఇతివృత్తంపై సెమినార్ నిర్వహించనున్నట్లు, ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసస్వామి తెలిపారు. వినతులు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల్ని కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి అందజేశారు. మొత్తం 159 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా 35 ఇందిరమ్మ ఇళ్లకు, 21 గ్రేటర్ హనుమకొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు, 18 వినతులు హనుమకొండ ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించి ఉన్నాయి. మిగతావన్నీ ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించినవి. వినతులు పరిశీలించి ఆయా శాఖలకు బదిలీ చేసిన కలెక్టర్, దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా పూర్తిచేయాలని, పెండింగ్‌లో ఉంచవద్దని శాఖాధికారులను ఆదేశించారు. అధికారులు తొలి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఆర్డీఓ మేన శ్రీను పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే నాయిని ఇంటి ముట్టడికి యత్నం
హన్మకొండ: బీఆర్ఎస్ ఎస్సీ సెల్, దళిత సంఘాలు చేపట్టిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంటి ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేసిన నాయిని రాజేందర్‌రెడ్డి సోమవారంలోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. నాయిని రాజేందర్‌రెడ్డి క్షమాపణలు చెప్పకపోవడంతో సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని నాయిని రాజేందర్‌రెడ్డి నివాసముంటున్న క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. హనుమకొండ కాళోజీ విగ్రహం వద్ద ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎస్సీ సెల్, దళిత సంఘాల నాయకులు డప్పు చప్పుళ్లతో ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి పోలీసు వాహనం ఎక్కించారు. మరికొందరు ఆందోళనకారులు కాళోజీ కూడలిలో నాయిని రాజేందర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, దళిత కార్పొరేటర్లు సంకు నర్సింగ రావు, ఇమ్మడి లోహిత రాజు, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ మేకల బాబు రావు, నాయకులు కంజర్ల మనోజ్, పున్నం చందర్, కొండ్ర శంకర్, సదాంత్, కోటి, హరినాథ్ పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌కు తరలింపు క్షమాపణ చెప్పాలని నేతల డిమాండ్ -
గడువు తీరిన సరుకులు తిరిగి పంపించాలి
న్యూశాయంపేట: గడువు తీరిన సరుకులు రిటర్న్ పంపించాలని వరంగల్ అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డీబీసీడీఓ పుష్పలత, డీ ఈఓ రంగయ్యనాయుడు, డీఏఓ అనురాధ, భాగ్యలక్ష్మితో పాటు జిల్లాలోని హాస్టల్స్ ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గుడ్ల టెండర్స్ సప్లై చేసిన వెంటనే పరిశీలించి ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేయాలన్నారు. కుళ్లిపోయిన కూరగాయలను పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ కళాశాలల్లో నిర్వహించే ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ)తో ఉద్యోగావకాశాలకు మార్గం చూపుతుందని ఇంటర్మీడియట్ విద్యాశాఖ వరంగల్ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. సోమవారం హనుమకొండలోని రోహిణి ఆస్పత్రి, నర్సింగ్ కళాశాలలో ఆర్డీఎఫ్ ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఆన్ జాబ్ ట్రైనింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, రోజు వారీగా నేర్చుకునే రికార్డులను పరిశీలించారు. -
ఖాకీ పోస్టింగ్‌లపై ఖద్దర్ ముద్ర!
వరంగల్ క్రైం: హైదరాబాద్ తర్వాత పెద్ద కమిషనరేట్‌గా పేరున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అధికారుల పోస్టింగ్‌లు గాలిలో దీపం మాదిరిగా మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్‌లు దక్కాలన్నా.. దక్కినవి పూర్తిస్థాయిలో కొనసాగాలన్నా అధికార పార్టీ నేతల అండదండలుంటనే సాధ్యమన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మరోసారి రుజువైనట్లు సెంట్రల్ జోన్ డీసీపీ నియామకంతో రుజువైందన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 13న వరంగల్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీగా పి.శ్రీనివాస్ బదిలీపై వచ్చి విధుల్లో చేరేందుకు వెళ్లగా.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మోకాలడ్డుకున్నారని, ఆయన విధుల్లో చేరితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతోపాటు రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సీరియస్‌గా తలదూర్చినట్లు సమాచారం. రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చి శ్రీనివాస్ బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న దార కవితను సెంట్రల్ జోన్ డీసీపీగా తీసుకొచ్చి నట్లు ప్రచారం సాగుతోంది. ఆరోపణలున్నా.. అండదండలుంటే చాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేయాలంటే అధికార పార్టీ నేతల అండదండలు ఉంటే చాలా.. ఇంకా ఏం అవసరం లేదన్న చర్చ నడుస్తోంది. కొంతమంది ఎస్హెచ్ఓలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రజాప్రతినిధుల అండదండలను అడ్డుపెట్టుకుని భూపంచాయితీల్లో తలదూర్చి నాలుగు రాళ్లు పోగేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కమిషనరేట్‌కు చెందిన పోలీస్ ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు గ్యాప్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. కొంతమంది ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన పోస్టింగ్‌లను సీపీ అంగీకరించకపోవడంతో ఏకంగా ఇన్చార్జ్ మంత్రితో ఒత్తిడి చేయించి పోస్టింగ్‌లు దక్కించుకుంటున్నట్లు తెలిసింది. ఈస్ట్‌జోన్ పరిధికి చెందిన ఓ ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన ఇన్స్పెక్టర్పై ఆరోపణలు రాగా, అతడిపై ఎలాంటి చర్యలు ఉండొద్దని హుకుం జారీ చేయడంతో పోలీస్ అధికారులు కేవలం నోటీసు జారీ చేతులు దులుపుకున్నట్లు కమిషనరేట్ వర్గాల ద్వారా తెలిసింది. సదరు ఇన్స్పెక్టర్ వ్యవహారం వాట్సాప్‌లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగినా చర్యలు తీసుకోకపోవడానికి ఆ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. మరో పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లపై అవినీతి ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. వారిపై చర్యలు తీసుకునేందుకు డీసీపీ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో తిరిగి నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో వీడియో రికార్డులు పకడ్బందీగా ఉన్నప్పటికీ.. సదరు అధికారులపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డుపడినట్లు సమాచారం. దీంతో వారిపై కూడా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇటీవల డీసీపీ శ్రీనివాస్‌కు పోస్టింగ్‌ను అడ్డుకున్న ప్రజాప్రతినిధులు? బాధ్యతలు చేపట్టకుండానే ఆయన వెనక్కి.. చెప్పినట్లు వినే పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోకుండా మంత్రాంగం ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతల మధ్య అంతరంవరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో గతంలో పనిచేసిన సీపీ అంబర్ కిషోర్ ఝాకు మిస్టర్ కూల్‌గా పేరుంది. అదేవిధంగా ప్రస్తుత సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌కు సమర్థవంతమైన అధికారిగా కొద్దికాలంలోనే పేరు వచ్చింది. కానీ, కమిషనరేట్‌లో చాలాకాలంగా పాతుకుపోయిన కొంతమంది అధికారులు సీపీ దృష్టికి వాస్తవాలు తెలియకుండా తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌కు వారిలో నచ్చిన బాధితులను మాత్రం సీపీని కలిసేందుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కమిషనరేట్ పాలనపై ఒకరిద్దరు ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోపక్క చాలామంది అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై దృష్టి పెట్టకపోవడంతో దొంగతనాల జోరు పెరిగింది. ఇప్పటికై నా సీపీ పాలనపై మరింత ఫోకస్ పెట్టాలని కమిషనరేట్ ప్రజలు కోరుతున్నారు. -
మాడవీధుల పనుల్లో వేగం పెంచండి
నయీంనగర్: భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణం, పురోగతి, సుందరీకరణ పనులతోపాటు రోప్ వే, గ్లాస్ బ్రిడ్జివే ఏర్పాటుపై కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులతో ఎమ్మెల్యే ఆదివారం ‘కుడా’ కార్యాలయంలో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు పనుల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి ఆలయ మాడ వీధుల విస్తరణకు ఉన్న అడ్డంకులను తొలగించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
రైతు సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: రైతు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి విమర్శించారు. హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఈ నెల 25న నిర్వహించనున్న రైతు దీక్ష సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. గోలి మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే రైతులను విస్మరించిందని దుయ్యబట్టారు. రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేయలేదని, సన్న ధాన్యానికి బోనస్, పంటలకు మద్దతు ధర ఇవ్వడం లేదని, కౌలు రైతుల ఊసే లేదని తూర్పారబట్టారు. ధాన్యానికి బోనస్ వెంటనే చెల్లించాలని, రైతు భరోసా అందించాలని, పంట ఉత్పత్తులకు మద్దతుధరతోపాటు బోనస్ చెల్లించాలని, ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద నిర్వహించనున్న రైతు దీక్షలో బీజేపీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు మల్లాడి తిరుపతి రెడ్డి, జగన్ మోహన్‌రెడ్డి, పెద్ది మహేందర్ రెడ్డి, పుల్యాల రవీందర్‌రెడ్డి, తీగల భరత్‌గౌడ్, రవీందర్‌యాదవ్, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి -
చెత్త తొలగింపులో నిర్లక్ష్యం తగదు
వరంగల్ అర్బన్/రామన్నపేట: చెత్త తొలగింపులో నిర్లక్ష్యం తగదని మేయర్ గుండు సుధారాణి హెచ్చరించారు. ఆదివారం వరంగల్ 29వ డివిజన్లోని పలు కాలనీల్లో, పోతన నగర్‌కు సమీపంలోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పేరుకుపోయిన చెత్త కుప్పలను పరిశీలించి పారిశుద్ధ్య జవాన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటా చెత్తను సేకరిస్తే రోడ్లు, మూలమలుపులు, ఖాళీ స్థలాల వద్ద ఎందుకు చెత్త పేరుకుపోతోందని ప్రశ్నించారు. ఇంటింటా చెత్తను అందించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం బల్దియా పోతననగర్‌లో నిర్వహిస్తున్న సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో చెత్త నిర్వహణ తీరును పరిశీలించి కంపాక్టర్ల పని తీరును పర్యవేక్షించారు. ఏజెన్సీ నిర్వాహకులు కంపాక్టర్లను సమర్థవంతంగా నిర్వహించాలని కంపాక్టర్ మరమ్మతుకు గురైతే చెత్త తరలింపులో జాప్యం కలగకుండా ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసి అందుబాటులో ఉంచాలన్నారు. మేయర్ గుండు సుధారాణి సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ తనిఖీ -
పేరుకే విచారణలు..
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం.. ఉత్తర తెలంగాణ రోగులకు పెద్ద దిక్కు. అయితే ఇంత పేరున్న ఆస్పత్రిలో వైద్య సేవలు పూర్తిగా అధ్వాన స్థితికి చేరున్నారు. ఫలితంగా ఆస్పత్రి పాలనపై రోగులతోపాటు వివిధ రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఎంజీఎంలో జరుగుతున్న తప్పిదాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ పలు ఘటనలపై విచారణ కమిటీలను నియమిస్తూ వస్తోంది. విచారణ కమిటీ సభ్యులు ఆస్పత్రికి రావడం.. హడావుడి చేయడం.. నివేదికలను డీఎంఈ, హెల్త్ సెక్రెటరీకి అందిస్తామని వెల్లడించడం .. అనంతరం ఎలాంటి చర్యలు లేకపోవడం పరిపాటిగా మారాయి. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు. సంవత్సర కాలంలో ప్రభుత్వం నియమించిన మూడు కమిటీల విచారణ వివరాలు వెల్లడికాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. రోగికి రక్తం మార్చి ఎక్కించిన ఘటనపై చర్యలేవి? కాజీపేటకు చెందిన ఓ మహిళ సెప్టెంబర్‌లో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స నిమిత్తం ఎంజీఎంలో అడ్మిట్ అయ్యింది. సదరు మహిళకు ‘ఓ’ పాజిటివ్‌కు బదులు ‘బి’ పాజిటివ్ రక్తం ఎక్కించారు. ఈ ఘటనతో ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఏఎంసీ తరలించి చికిత్సలు అందించారు. అనంతరం ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఎంజీఎంలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు పరికరాలు లేవంటూ హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఈ విషయం వివిధ పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయంపై ఏకంగా డీఎంఈ సైతం వచ్చి విచారణ చేశారు. డీఎంఈ స్వయంగా విచారణ చేసినా ఈ ఘటనపై చర్యలు లేకపోవడంపై అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిధులపై వినియోగంపై విజిలెన్స్ విచారణ.. ఎంజీఎం సూపరింటెండెంట్‌గా కిశోర్ విధులు నిర్వర్తించిన సమయంలో ఆరోగ్య శ్రీ నిధులు దుర్వినియోగమయ్యాని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సెప్టెంబర్ 30వ తేదీన త్రిసభ్య కమిటీ విచారణ అనంతరం నవంబర్ 13వ తేదీన ఆరోగ్య శ్రీ డీఎస్పీ నారాయణ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. కాగా, ఆరోగ్య శ్రీ నిధులతో ప్రస్తుత సూపరింటెండెంట్ చాంబర్‌ను లక్షలాది రూపాయాలు వెచ్చించి నిర్మాణం చేయడంతో లక్షలాది రూపాయాల ఔషధాలను బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరలకు కొనుగోలు చేసి జేబులు నింపుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ నివేదికలతో చర్యలు తీసుకుంటే తప్ప మరోమారు కమిటీల నియామకంపై నమ్మకం కలిగే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు.ఎంజీఎంలో రూ.2 కోట్ల కుంభకోణం జరిగిందనే విషయంపై గత నెల 30వ తేదీన డీఎంఈ స్పందించి విషయం తెలుసుకునేందుకు త్రిసభ్య కమిటీని నియమించి విచారణ చేపట్టారు. మహేశ్వరం ఆస్పత్రి సూపరింటెండెంట్ బి. నాగేందర్, ప్రొఫెసర్ వెంకటేశ్, నీలవేణి.. ఎంజీఎం చేరుకుని సుమారు నాలుగు గంటల పాటు విచారణ చేపట్టారు. ముఖ్యంగా స్టేషనరీ విభాగంలో టెండర్ లేకుండా ఏయే వస్తువులు కొన్నారు? అనే విషయాలను పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అయితే స్టేషనరీ అంటే కేస్ షీట్లేనా అంటూ ఆ విభాగంలో గత నాలుగు, ఐదు ఏళ్లుగా ఎంత మేర కొనుగోలు చేశారు.. మార్కెట్ ధరలకన్నా అధిక ధరతో కొన్నారా.. వాటికి ఇండెంట్ ఉందా లేదా అనే విషయాలను కమిటీ పట్టించుకోకుండా అధికారులు ఇచ్చినా కాగాతాలకే సభ్యులు పరిమితమైనట్లు ఆస్పత్రిలో చర్చ సాగుతోంది. ఆరోగ్య శ్రీ నిధులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు.. ఎలా ఖర్చు పెడుతున్నారు.. అనే విషయాన్ని కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించిదా లేదా అనే విషయంపై అనుమానాలు తలెతుత్తున్నాయి. ఎంజీఎంలో జరిగిన తప్పిదాలపై చర్యలేవి? మూడు కమిటీల నియామకాలు.. విచారణలు పూర్తి నిధుల దుర్వినియోగం శాఖాపరమైన చర్యలేవి? ప్రభుత్వ పని తీరుపై రోగులు, రాజకీయ పక్షాల విమర్శలు -
రెండు బైక్‌లు ఢీ.. తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడి మృతి
హసన్‌పర్తి: రెండు బైక్‌లు ఎ దురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ తాత్కాలిక పా రిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన వంగపహా డ్ శివారులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ఇల్లందుల సదానందం(38) స్థా నిక జీపీలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఇదే మండలం బుచ్చయ్యపల్లిలోని తన అత్తగారింటికి బైక్‌పై బయలుదేరాడు. వంగపహాడ్ శివారుకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మరో బైక్ సదానందంను ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడికి భార్య సుమలత, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
శిల్ప కళా సౌందర్యం మహాద్భుతం
ఖిలా వరంగల్ : కాకతీయుల నిర్మాణాలు, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతమని మహారాష్ట్ర కేడర్ డీఐజీ మోక్షిత పాటిల్( ఐపీఎస్) అన్నారు. చారి త్రక కాకతీయుల రాజధాని ఖిలావరంగల్‌కోట లో ని శిల్పాల ప్రాంగణాన్ని శనివారం మహారాష్ట్ర కేడ ర్ డీఐజీ మోక్షిత పాటిల్, ఆర్మీ రిక్రూట్మెంట్ అధి కారి కల్నల్ సునీల్, సౌత్ జోన్ డైరెక్టర్ ఏఆర్ఓ సి కింద్రాబాద్ సౌత్ జోన్ ఆర్మీ మేజర్ గౌరివ్తోపాటు ఓ కోచింగ్ సెంటర్లో గ్రూప్–2లో శిక్షణ పొందుతున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 200 మంది విద్యార్థులు వేర్వేరుగా సందర్శించారు. కీర్తితోరణాల మధ్య ఉన్న శిల్ప సంపదతోపాటు ఖుష్మాహాల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిల గుట్టను తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ గైడ్ రవియాదవ్ వివరించారు. నాటి కట్టడాలు, శిల్ప సంపద అద్భుతంగా ఉందని డీఐజీ కొనియాడారు. కోటను సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం టీజీ టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సౌండ్ అండ్ లైటింగ్ షోను తిలకించారు. వారి వెంట కేంద్రపురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్చార్జ్ గట్టి కొప్పుల అజయ్ ఉన్నారు. మహారాష్ట్ర కేడర్ డీఐజీ మోక్షిత పాటిల్ -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
● జిల్లా రిజిస్టార్ ప్రవీణ్‌కుమార్ ఖిలా వరంగల్: భూ రిజిస్టేషన్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకున్న ప్రజలకు మెరుగైన సేవలందించాలని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు శనివారం వరంగల్ హంటర్‌రోడ్డులోని ఖిలా వరంగల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కార్యాలయంలో సేవలు, ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డులు, సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించారు. సిబ్బంది పనితీరును సబ్ రిజిస్ట్రార్ వెంకట్లాల్ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో పత్రాలు ఆన్లైన్ నమోదవుతున్న తీరును పరిశీలించి మాట్లాడారు. స్లాట్ బుకింగ్ చేసిన ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని, పెండింగ్ లేకుండా రికార్డులు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి ● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏరువాక సాగుబడి ఖిలా వరంగల్: సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరల తోటలు సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అధ్యక్షతన ఏరువాక సాగుబడిపై ఖిలా వరంగల్‌లో శనివారం కూరగాయల తోటల పరిశీలన, అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, మట్టి సంరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ సాగుతో భూమి సారవంతంగా ఉంటుందని తెలిపారు. డీఏఓ అనురాధ మాట్లాడుతూ రైతులు ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గినైజేషన్)గా ఏర్పడితే పంట ఉత్పత్తులను మార్కెట్లో మంచి ధరకు విక్రయించవచ్చని తెలిపారు. ఆకు కూరల సాగులో పాటించాల్సిన పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, పంట కోత సమయం వంటి అంశాలపై వ్యవసాయ అధికారి విజ్ఞాన్ అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ అధికారి తిరుపతి మాట్లాడుతూ కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులకు రూ.8వేలు ప్రోత్సాహకం, హైబ్రిడ్ కూరగాయలు సాగు చేసే వారికి రూ.9,500 ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, మాజీ కార్పొరేటర్ దామోదర్, స్థానిక నేత బోగి సురేశ్, ఏఈఓ చంద్రకాంత్, రైతులు శ్రీనివాస్, రమేశ్, సాంబయ్య, కుమార్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సైన్స్‌ఫెయిర్‌కు ఏర్పాట్లు చేయాలి కాళోజీ సెంటర్: వరంగల్ ఉర్సు గుట్ట ప్రాంతంలోని తాళ్ల పద్మావతి పాఠశాలలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నుంచి నిర్వహించనున్న సైన్స్‌ఫెయిర్‌కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఉపాద్యాయుడు శ్రవణ్‌కుమార్ రూపొందిన సైన్స్‌ఫెయిర్ వెబ్‌సైట్‌ను శుక్రవారం కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మొౖబైల్ ఫోన్ ద్వారా క్యూర్ కోడ్‌ను స్కాన్‌చేసి సైన్స్‌ఫెయిర్ వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చునని పేర్కొన్నారు. -
టీజీ ఎన్పీడీసీఎల్లో ఇన్చార్జ్ పదోన్నతి..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో ఎట్టకేలకు ఇన్చార్జ్ పదోన్నతి కల్పించారు. నెలల తరబడి ఎదురుచూపులకు యాజమాన్యం ముగింపు పలికింది. కోర్టులో కేసులు విచారణ ఉండడంతో రెగ్యులర్ పదోన్నతికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫలితంగా పదోన్నతి ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తాయి. పదోన్నతి కల్పన తప్పని సరైనా కోర్టులో కేసులుండడంతో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో పాలన పరమైన ఇబ్బందులు తొలగించడంతోపాటు ఆశావహులను సంతృప్తి పరిచేందుకు యాజమాన్యం మధ్య మార్గంగా ఇన్చార్జ్ పదోన్నతి కల్పించింది. ఇన్చార్జ్ పదోన్నతితో ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూరవు. హోదా మాత్రమే మారుతుంది. ఈ క్రమంలో ముగ్గురు సూపరింటెండ్ ఇంజనీర్లకు చీఫ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు. అదే విధంగా ఆరుగురు డీఈలకు సూపరింటెండ్ ఇంజనీర్లగా, 21 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లకు డివిజనల్ ఇంజనీర్లగా, ఒక జనరల్ మేనేజర్‌కు జాయింట్ సెక్రటరీగా, ఇద్దరు అసిస్టెంట్ సెక్రెటరీలకు జనరల్ మేనేజర్లుగా, 8 మంది పర్సనల్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రెటరీలుగా, నలుగురు జూనియర్ పర్సనల్ ఆఫీసర్లకు పర్సనల్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించారు. ఏడుగురు అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పదోన్నతి.. ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఆపరేషన్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎ.సురేందర్‌కు ఇదే కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ ఆపరేషన్‌గా పదోన్నతి కల్పించారు. ఏడుగురు అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా, ఆరుగురు అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుుగా పదోన్నతి కల్పించారు. ఎమ్మార్టీలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎం.అన్నపూర్ణ దేవిని ఎమ్మార్టీ చీఫ్ ఇంజనీర్‌గా, కామారెడ్డి ఎస్ఈగా పని చేస్తున్న ఎన్.శ్రావణ్ కుమార్‌కు ప్లానింగ్, ఐటీ, స్కాడా చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి కల్పించారు. అదే విధంగా కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ పేషీలో డీఈ టెక్నికల్‌గా కొనసాగుతున్న సి.హెచ్.సంపత్ రెడ్డిని జనగామ ఎస్ఈగా నియమించారు. జనగామ ఎస్ఈగా పని చేస్తున్న వేణుమాధవ్‌ను ఆపరేషన్ జనరల్ మేనేజర్‌గా నియమించారు. సిరిసిల్ల సెస్ ఎండీగా కొనసాగుతున్న బి.భిక్షపతిని ఆపరేషన్–1 జనరల్ మేనేజర్‌గా నియమించారు. హనుమకొండ రూరల్ డివిజనల్ ఇంజనీర్‌గా కొనసాగుతున్న బి.సామ్యానాయక్ను కార్పొరేటర్ కార్యాలయంలో కమర్షియల్ జనరల్ మేనేజర్‌గా నియమించారు. వరంగల్ సర్కిల్ కార్యాలయం డీఈ టెక్నికల్ ఎ.ఆనందంను ములుగు ఎస్ఈగా నియమించారు. బెల్లంపల్లి డీఈ బి.రాజన్నను ఆసిఫాబాద్ ఎస్ఈగా నియమించారు. కార్పొరేట్ కార్యాలయంలో ఇండస్ట్రీయల్ రిలేషన్ జనరల్ మేనేజర్‌గా కొనసాగుతున్న శ్రీకృష్ణను జాయింట్ సెక్రటరీగా ఇదే కార్యాలయంలో నియమించారు. అసిస్టెంట్ సెక్రటరీలు కల్యాణ్, హేమంత్‌కు జనరల్ మేనేజర్‌గా పదో న్నతి కల్పించి ఇదే కార్యాలయంలో నియమించా రు. సీజీఆర్ఎఫ్ కార్యాలయం వరంగల్‌లో జనర ల్ మేనేజర్‌గా పని చేస్తున్న దేవేందర్‌ను ఇదే కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా నియమించా రు. సీజీఆర్ఎఫ్ నిజామాబాద్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న కిషన్‌ను కార్పొరేట్ కార్యాలయం అ కౌంట్స్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా నియమించారు. నెరవేరిన ఆశావహుల కోరిక ఫలించిన నెలల తరబడి ఎదురుచూపులు -
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శనివారం మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాతో కలిసి ఎన్‌హెచ్, పీఆర్, ఆర్అండ్బీ, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్, అటవీ, టూరిజం శాఖల అధికారులతో జాతరలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మల్లంపల్లి, కటాక్షపూర్ వద్ద జాతీయ రహదారి మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతరకు ముందస్తుగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తొద్దన్నారు. కాగా, రాత్రి సమయంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆదివాసీ మ్యూజియాన్ని సందర్శించి అందులోని పురాతన వస్తువులు, జీవన విధాన చిత్రాలను పరిశీలించారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌ను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, ఏపీఓ వసంతరావు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క జాతరలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష -
దళిత పక్షపాతి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దళిత పక్షపాతి అని టీపీసీసీ రాష్ట్ర దళిత విభాగం సీనియర్ వైస్ చైర్మన్(ఆర్గనేజైషన్) డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు శనివారం హనుమకొండలోని తన కార్యా లయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటిక కూడా లేదని తెలుసుకుని మూడెకరాల భూమిని కేటాయించిన ఘనత ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిది అన్నారు. కొన్ని దశాబ్దాల వర్గీకరణ కల నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి తన డిప్యూటీ సీఎం పదవి పోవడానికి బీఆర్ఎస్, కేసీఆర్ కాదా అని, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశించి పలుమార్లు కేసీఆర్‌ను ఏకిపారేసిన మీరు ఇ ప్పుడు బీఆర్ఎస్లో ఎలా చేరారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రశ్నించారే తప్ప దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లడలేదన్నారు. వినయ్‌భాస్కర్ స వాల్‌ను స్వీకరించి బస్టాండ్‌కు చేరుకున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అక్కడి చిరువ్యాపారుల్లో ధైర్యం నింపిన విషయాన్ని మరవొద్దన్నారు. ఎమ్మెల్యే నాయి ని వ్యాఖ్యలను వక్రీకరించి అవాక్కులు పేలితే స హించేది లేదన్నారు. దుప్పటి కోటి, ప్రసన్నకుమార్, భాస్కర్, రాజేందర్, పోచయ్య, కృష్ణ, వెంకట్, రమేశ్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ దళిత విభాగం నాయకుడు పెరుమాండ్ల రామకృష్ణ -
కేవీలో ఒకేషనల్ ల్యాబ్ నిర్మాణానికి భూమిపూజ
● జనవరి నుంచి అందుబాటులోకి.. కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం కడిపికొండలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో సెంట్రల్ సిలబస్‌తోపాటు వృత్తి విద్యా కోర్సులు అందించనున్నారు. ఇందుకు గాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పీఎంశ్రీ స్కీమ్‌లో భాగంగా రూ. 62లక్షలు మంజూరు కాగా అధికారులు శనివారం ఒకేషనల్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాగా, ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి జనవరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యతోపాటు ఉద్యోగావకాశాల కల్పన.. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒకేషనల్ ల్యాబ్ తోడ్పడనుంది. ఈ ల్యాబ్‌లో వృత్తి విద్య కోర్సులు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీని అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, కేవీలో నిర్మించనున్న ఒకేషనల్ ల్యాబ్ పరిశ్రమలకు ప్రతిభను అందించే వేదికగా నిలువనుంది. 25నుంచి ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ప్రాథమిక విద్యను బోధిస్తున్న 45 పాఠశాలల నుంచి 45 మంది ఇన్స్ట్రక్టర్లకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో శిక్షణ కొనసాగనుంది. ప్రీప్రైమరీ తరగతులు కొనసాగిస్తున్న ఆయా ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలకు డిసెంబర్ 1న ప్రీ ప్రైమరీ నిర్వహణ పర్యవేక్షణపై హెచ్ఎంలకు డీఆర్పీలు శిక్షణ ఇస్తారు. ఆయాలు, ఇన్స్ట్రక్టర్లు సరిగ్గా విధులు నిర్వర్తించేలా పలు అంశాలపై డీఆర్పీలు ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రీప్రైమరీ తరగతుల విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ఇన్స్ట్రక్టర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని కోర్సు డైరెక్టర్, హనుమకొండ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్ తెలిపారు. విద్యారణ్యపురి: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష– 2026కు డిసెంబర్ 5 వరకు గడువు ఉందని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడో తరగతి పరీ క్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పై ట్రేడ్లలో లోయర్ గ్రేడ్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులని తెలిపారు. లోయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ (లేదా) లోయ ర్ గ్రేడ్ పరీక్షకు సమాన ఉత్తీర్ణత సాధించినవారు సంబంధిత ట్రేడ్‌లో హయ్యర్ గ్రేడ్ పరీక్షకు హాజరుకావడానికి అర్హులని పేర్కొన్నారు. ఈపరీక్షలకు హా జరు కావాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.గౌట్. ఇన్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆధార్ జిరాక్స్, స్టడీ సర్టిఫికెట్ జతపర్చి డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
మహిళలకు అత్యధిక ప్రాధాన్యం
హన్మకొండ: మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ఆడిటోరియంలో వరంగల్ జిల్లా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సురేఖ హైదరాబాద్ నుంచి పాల్గొని వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ఎలాంటి అవకతవకలకు ఆ స్కారం లేకుండా పారదర్శకంగా చీరల పంపిణీ చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల్లో లేని 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో 1,19,818 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మహిళల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలో సర్పంచ్ ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ సీఎం మాటల రేవంతన్న కాదని, చే తల రేవంతన్న అన్నారు. రేవంత్ సర్కారు మహిళలకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తోందన్నారు. ఎమ్మె ల్యే కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఒక్క కు టుంబమే దోచుకుందని ఆరోపించారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రాంరెడ్డి, పాల్గొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
క్రీడాభివృద్ధి కోసం కృష్ణమూర్తి
డోర్నకల్‌లో పుట్టి పెరిగిన మండలోజు కృష్ణమూర్తి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించి రైల్వేలో 35 ఏళ్లకుపైగా ఉద్యోగం చేసి రిటైరయ్యారు. రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్‌లో ఉపాధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రీఫరీగా పని చేస్తున్నారు. ఏడు పదుల వయస్సులోనూ ఎక్కడా రాజీ పడకుండా వెయిట్ లిఫ్టింగ్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి వివిధ పోటీలకు పంపించి అవార్డులు దక్కించుకునేలా సహకరిస్తున్నారు. ఉద్యోగ విరమణతో ఇంటికే పరిమితం కాకుండా తనకున్న అనుభవాన్ని క్రీడా అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. -
అడవిని విడిచిన ఆజాద్
సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ నేత కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, ఆజాద్ అడవిబాట విడిచారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఆయన బీకే–ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించగా, శనివారం 37మంది సహచరులతో కలిసి రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయాడు. మూడు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆయన చివరకు జనజీవన స్రవంతిలో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆజాద్‌పై కొద్ది రోజులుగా లొంగుబాటు ప్రచారం.. ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న ఆయుధాలతో సహా తమ టీమ్‌తో లొంగిపోవడంతో.. ఆజాద్ కూడా లొంగిపోవడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ నెల 15న ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో 16నే ఆయన పోలీసులకు లొంగిపోయారన్నది కూడా వైరల్ అయ్యింది. వీటిపై స్పందించిన ఆజాద్ తండ్రి సమ్మయ్య తన కుమారుడికి ఎలాంటి హానీ తలపెట్టవద్దని, అరెస్ట్ చేసి అప్పగించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా? లేక ఆయన లొంగిపోయారా? అన్న చర్చ జరుగుతుండగా.. డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారన్న ప్రకటనతో సస్పెన్స్‌కు తెరపడింది. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు ఎన్కౌంటర్లలో మృతిచెందగా, కొందరు లొంగిపోయారు. ప్రస్తుతం బడే దామోదర్ అలియాస్ చొక్కారావుతో పాటు మరో 16 మందికి పైగా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. డీజీపీ ఎదుట లొంగిపోయిన కొయ్యడ సాంబయ్య దళసభ్యుడి నుంచి స్టేట్ కమిటీ సభ్యుడి వరకు ప్రస్థానం మూడు దశాబ్దాలుగా అజ్ఞాతవాసం.. డీకేఎస్‌జెడ్‌సీలో కీలకం ఆయన స్వస్థలం గోవిందరావుపేట మండలంలోని మొద్దులగూడెం అజ్ఞాతంలో మరో 16 మంది ఉమ్మడిజిల్లా వాసులు? 20 ఏళ్ల వయసులో పీపుల్స్‌వార్ గ్రూపులో చేరిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ మూడు దశాబ్దాలపాటు అజ్ఞాతంలో గడిపారు. దళసభ్యుడి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, బీకే ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా ఎదిగారు. దండకారణ్యం స్పెషల్ జోన్లో కీలకంగా వ్యవహరించిన ఈయనపై 50కి పైగా కేసులు ఉన్నాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు, ఏఓబీలోనూ పని చేసినట్లు పోలీసు రికార్డులోకెక్కగా, ఎన్ఐఏ హిట్‌లిస్టులో కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడానికి కేడర్‌కు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి పనులు చేయడంతోపాటు కొత్త రిక్రూట్మెంట్ బాధ్యతలు నిర్వహించారన్న పేరుంది. ఈ క్రమంలో దండకారణ్యంలో ఎన్కౌంటర్లు జరిగినప్పుడల్లా ఈయన పేరు వినిపించింది. -
‘స్థానిక’ ఎన్నికలకు పచ్చజెండా!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇందులో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై విధివిధానాలు సూచించారు. ఇప్పటికే కలెక్టర్లతో ఎన్నికల అధికారులు కాన్ఫరెన్స్‌ల ద్వారా ఆదేశాలిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై అధికారులు శనివా రంనుంచి కసరత్తు ముమ్మరం చేశారు. కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఆర్డీఓలు, వార్డుల రిజర్వేషన్లపై ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు. రెండు రోజుల్లోపే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు దూకుడు పెంచగా.. ఉమ్మడి వరంగల్‌లో 1,705 జీపీలు, 15,006 వార్డులకు త్వరలో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్లు.. ఈ నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగం పుంజుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్నందున.. అంతకు ముందే కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీలను నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు తెలియజేస్తారంటున్నారు. ఈలోగా రిజర్వేషన్ల ప్రక్రియ ముగించేందుకు జీఓ విడుదల కావడంతో అధికారులు తొందరపడుతున్నట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లు 50 శాతం మించరాదని జీఓలో పేర్కొన్నారు. కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, కులగణన ఆధారంగానే బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ రిజర్వేషన్లు కల్పించనున్నారు. రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. 2019లో రిజర్వేషన్లు ఇలా.. 2019 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లో 1,708 గ్రామ పంచాయతీలకు 1,664 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 1,664 సర్పంచ్ స్థానాల్లో 1,198 స్థానాల కోసం 2011 జనాభా ప్రకారం కేటాయించారు. 223 షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు కాగా, వందశాతం ఎస్టీ జనాభా ఉండడంతో 239 స్థానా లను వారికే కేటాయించారు. మహబూబాబాద్ జిల్లాలో 115, జనగామలో 37, జేఎస్ భూపాలపల్లి/ములుగులో 6, వరంగల్‌లో 77, హనుమకొండలో 4 గిరిజన పంచాయతీలు ఉన్నాయి. 2019లో బీసీలకు 24 శాతం కోటా కింద 223 స్థానాలు రిజర్వ్ చేశారు. అదే విధంగా అన్ రిజర్వుడ్(యు.ఆర్) 48 శాతం కింద 582 స్థానాలను ఆ కోటాలో కేటాయించారు. ఈసారి నిర్వహించే ఎన్నికల్లో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేస్తుండగా.. ఈ నెల 24వ తేదీ వరకు ఫైన ల్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఏ గ్రామ పంచాయతీ ఎవరికి కేటాయిస్తారో? అనే చర్చ పల్లెలను కుదిపేస్తోంది. రిజర్వేషన్లపై జీఓ విడుదల 50 శాతం మించకూడదని ఆదేశాలు కులగణన ఆధారంగా వార్డుల రిజర్వేషన్లు.. ఇదే ప్రాతిపదికన బీసీలకూ లాటరీల ద్వారా మహిళలకు సీట్ల కేటాయింపు పల్లెల్లో రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ సోమవారం ప్రకటించే అవకాశం -
సీనియర్లతో ఫ్రెండ్లీగా ఉండాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ హసన్‌పర్తి: జూనియర్ విద్యార్థులు సీనియర్లతో స్నేహపూర్వకంగా ఉండాలని వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, వీబీ.నిర్మలా గీతాంబ అన్నారు. నగరంలోని ఎస్వీఎస్ విద్యాసంస్థలో ‘చట్టాలపై అవగాహన యువతపై ప్రభావం’ అంశంపై నార్కొటిక్స్, పోక్సో, యాంటీ–ర్యాంగింగ్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలాగీతాంబ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు, కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ, సీనియర్ జడ్జి సాయికుమార్, సివిల్ జడ్జి ఉషా క్రాంతి, నార్కొటిక్ డీఎస్పీ రమేశ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పులి సత్యనారాయణ, పోక్సో–భరోసా ప్రతినిధి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య ధర్మసాగర్: వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మండలంలోని ఉనికిచర్ల గ్రామ శివారులో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న యూనిసిటీ వెంచర్ అభివృద్ధి, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లతో చేపట్టనున్న పనులకు ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చాహత్ బాజ్‌పాయ్, ‘కుడా’ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్తగా కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ రెండో వాహనాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శనివారం తన కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం వరంగల్ కమిషనరేట్ పోలీసులకు మరింత మెరుగైన సేవలందిస్తుందన్నారు. నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకుని రక్తమరకలు, వేలిముద్రలతోపాటు ఇతర సాక్ష్యాధారాలను సేకరిస్తారన్నారు. వాటిని ఈ మొబైల్ వాహనంలోని ఆధునిక పరికరాలతో పరీక్షించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్ కుమార్, గుణశేఖర్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, శ్రీనివాస్‌తోపాటు ఏసీపీలు, ఆర్ఐలు, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీగా దార కవితను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం కవిత హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ విభాగంలో పని చేస్తున్నారు. బదిలీపై వచ్చిన డీసీపీ కవిత సోమవారం విధుల్లో చేరనున్నట్లు సమాచారం. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో నేషనల్ మీన్స్‌కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఈనెల 23న నిర్వహించనున్నారు. ఈపరీక్ష నిర్వహణకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఎ.వెంకటరెడ్డి శనివారం తెలిపారు. పరీక్ష కేంద్రాలుగా హనుమకొండప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాక్టీసింగ్ హై స్కూల్, పరకాలలోని ఎస్ఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎన్ఎంఎంఎస్ ప రీక్షకు 750 మంది విద్యార్థులు హాజరవ్వనున్నారు. -
డీసీసీ అధ్యక్షుల నియామకం
● హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఇనగాల, వరంగల్‌కు అయూబ్‌ఖాన్ ● ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇనగాల వెంకట్రాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వెంకట్రాంరెడ్డి ప్రస్తుతం ‘కుడా’ చైర్మన్‌గా ఉన్నారు. పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఇనగాల కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. తెలంగాణ నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్‌గా, పీసీసీ సభ్యుడిగా, పరకాల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా పార్టీలో కొనసాగుతున్నారు. వెంకట్రాంరెడ్డి సతీమణి అవంతిరెడ్డి అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా, డీసీసీ పదవి కోసం అనేక రోజులుగా చూస్తున్న ఎదురుచూపులకు నేటితో తెరపడింది. అయూబ్‌ఖాన్‌కు అవకాశం.. వరంగల్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహ్మద్ అయూబ్‌ఖాన్ నియమితులయ్యారు. వరంగల్ నగరానికి చెందిన అయూబ్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌నుంచి పలువురు నాయకులు పార్టీలు మారినా ఆయన మారకుండా పార్టీ విధేయుడిగా ఉన్నారు. రాష్ట్రంలో మైనార్టీకి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానం భావించి అదే కోటాలో అయూబ్‌ఖాన్‌కు పదవి ఇచ్చింది. అయూబ్‌ఖాన్‌ను కాంగ్రెస్ నాయకులు కాశిబుగ్గలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
పూడిక తీయించండి
వరంగల్ అర్బన్: వరంగల్‌లోని నర్సంపేట రోడ్డులో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ మురుగు నీరు స్తంభించకుండా అత్యాధునిక యంత్రాలతో పూడిక తీయిస్తామని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఈనెల 17న ‘ఆకర్షణీయం.. భూగర్భశోకం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన మేయర్ సుధారాణి శనివారం బల్దియా ఇంజనీర్లు, ప్రజారోగ్యం అధికారులు, సిబ్బందితో కలిసి భూగర్భ డ్రెయినేజీని తనిఖీ చేశారు. అప్పటికప్పుడు వాహనాలు రప్పించి పూడికతీత పనులు చేయించారు. -
చెత్తను స్వచ్ఛ ఆటోలకు చేరవేయాలి
వరంగల్ అర్బన్ : నగరవాసులు చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని, అందజేయని వారికి నోటీసులు జారీ చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. రోడ్ల మీద, కాల్వల్లో వేస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. శనివారం వరంగల్‌లోని 24, 25, 28 డివిజన్లలో మేయర్ సుధారాణి తనిఖీలు చేశారు. ప్రతీ ఇంటినుంచి చెత్త సేకరణ ఏవిధంగా జరుగుతుంది.. తడి, పొడి చెత్తను వేరుగా అందిస్తున్నారా.. లేదా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. చెత్త డబ్బాల పంపిణీపై ఆరా తీశారు. మోడల్ వార్డులుగా తీసుకున్న 16 డివిజన్లలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం డ్రెయిన్లను శుభ్రం చేయాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం పోతననగర్‌లోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను సందర్శించి చెత్త తరలింపు వాహనాల పని విధానాన్ని పరిశీలించారు. ఆస్తులు, ట్రేడ్ లైసెన్స్‌లను రివిజన్ చేయాలి ఆస్తి, నీటిపన్నుల వసూళ్లలో పురోగతి కనిపించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెస్మెంట్లు, ట్రేడ్ లైసెన్స్‌లు, నల్లాల పునఃపరిశీలన చేయాలన్నారు. దేశాయిపేట నుంచి పోచమ్మమైదాన్‌కు కొత్త పైప్‌లైన్ దేశాయిపేట ఫిల్టర్ బెడ్నుంచి పోచమ్మ మైదాన్ వరకు 1950 కాలం నాటి పైప్‌లైన్ వల్ల తరచూ లీకేజీలు ఉత్పన్నమవుతున్నాయని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. పోచమ్మమైదాన్‌లో పైప్‌లైన్, డ్రెయినేజీ పనులు మేయర్ పరిశీలించారు. కొత్త పైప్‌లైన్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో వరంగల్ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్ తేజస్వి శిరీష్, అదనపు కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రవీందర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. అందజేయని వారికి నోటీసులు ఇవ్వండి నగర మేయర్ గుండు సుధారాణి -
పట్టణ నిరాశ్రయులను పక్కాగా గుర్తించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ అర్బన్ : పట్టణ నిరాశ్రయులను గుర్తించి వారి సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. నగరంలో నిరాశ్రయులను గుర్తించడానికి కొనసాగుతున్న సర్వే, స్వీపింగ్ యంత్రాల పనితీరును శుక్రవారం రాత్రి కమిషనర్ తనిఖీ చేశారు. హనుమకొండ చౌరస్తా, వరంగల్ రైల్వే స్టేషన్‌ను ప్రధాన రహదారుల్లో నిరాశ్రయులను పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఎలాంటి ఆవాసం లేకుండా ఉన్న వారిని సర్వేలో నమోదు చేయడంతో పాటు బల్దియా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్‌లకు తరలించాలన్నారు. వరంగల్ ప్రతాప్‌నగర్‌లోని హోమ్ షెల్టర్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, శానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు. ట్రేడ్ వసూళ్లపై దృష్టి పెట్టండిశానిటరీ ఇన్‌స్పెక్లర్లు, జవాన్లు ట్రేడ్ వసూళ్లపై సీరియస్‌గా దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ట్రేడ్ వసూళ్ల పురోగతిపై శానిటరీ ఇన్స్పెక్టర్లతో సమావేశమై సమర్థంగా చేపట్టేందుకు సూచనలిచ్చారు. నెల రోజుల నుంచి ట్రేడ్ వసూళ్లలో పురోగతి ఏ మాత్రం కనిపించడం లేదన్నారు. -
ఎంజీఎం వైద్యసేవల్లో నిర్లక్ష్యం
సాక్షి, వరంగల్: ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలపై నిర్లక్ష్యం ఉందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన ఆ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ.. రాత్రివేళ అత్యవసర కేసులు వస్తే ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల్లో అలసత్వం ఉందని పేర్కొన్నారు. తమ ప్రాంతం నుంచి వచ్చిన వారికి వైద్యం కోసం గత ఎంజీఎం ఉన్నతాధికారిని ఫోన్లో సంప్రదిస్తే స్విచ్ఛాఫ్ అని కొన్నిసార్లు, మరికొన్నిసార్లు స్పందించలేదని గుర్తు చేశారు. అందుకే అత్యవసర కేసుల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించి, షిఫ్ట్ పద్ధతిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డిని కోరారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు, వైద్య పరికరాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడుతామని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) కింద నిధులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని, మీరు కూడా దాతలను సంప్రదించి ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. అక్షయపాత్ర సేవలు విస్తరించాలి.. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని 119 ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం అందిస్తున్న అక్షయపాత్ర.. నియోజకవర్గ పరిధిలోని 14, 43 డివిజన్లు, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. కాగా, తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమావేశానికి హాజరుకాలేదు. రాత్రి వేళ ఎమర్జెన్సీ కేసుల్లో అలసత్వం వరంగల్ ‘దిశ’ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ -
రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక సమస్యలే..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎఫ్ఎస్టీ వెబ్సైట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సారథి ఆన్లైన్ పోర్టల్‌లోకి ఆర్టీఏ సేవలు మారాయి. ఈ తరుణంలో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం వాస్తవమే. కొంతమందికి సంబంధించిన డేటా కొత్త వెబ్సైట్లో కనిపించడం లేదు. ఇది రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్య. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. – సురేష్ రెడ్డి, డీటీసీ వరంగల్, హనుమకొండ● -
గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలపర్చడమే సమాచార హక్కు చట్టం లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ శాఖల దరఖాస్తుల స్థితిని ఆరా తీశారు. స్వీకరించిన ఆర్టీఐ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు. హనుమకొండ జిల్లాలో 340 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. అందులో 46 దరఖాస్తులు తక్షణమే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. మిగతా దరఖాస్తులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై విచారణ జరిపిన కమిషనర్, సంబంధిత పీఐఓ అధికారులు, దరఖాస్తుదారుల నుంచి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రమేశ్ రాథోడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్యరెడ్డి అధికారులతో సమీక్ష -
అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు రోహిణి
ఖిలా వరంగల్: డిసెంబర్ 12 నుంచి 15 వరకు హాంకాంగ్ యునెస్కో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘మోడల్ ఎథిక్స్ ఆఫ్ న్యూరో టెక్నాలజీ’ కాన్ఫరెన్స్‌కు రాష్ట్రం తరఫున వరంగల్ పెరకవాడకు చెందిన రంగరాజు రోహిణి ఎంపికై ంది. రోహిణి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె ఎంపికైంది. ఈమేరకు శుక్రవారం పెరకవాడలో ఆమెను యూనెస్కో తెలంగాణ స్టేట్ చాప్టర్ కో–ఆర్డినేటర్ ధర్మపురి రాజగోవింద్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత మండల పరశురాములు ఘనంగా సన్మానించారు. పేద విద్యార్థి రోహిణి అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాలను శుక్రవారం ప్రిన్సిపాల్ టి.మనోహర్‌తో కలిసి వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైక్రోబయాలజీ విద్యార్థులతో తరగతులు ఎలా జరగుతున్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. బయోటెక్నాలజీ విభాగంలో విద్యార్థులతో మాట్లాడారు. కేయూలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటవుతోందని, దీనిని సైన్స్, బయోటెక్నాలజీ విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. కాజీపేట అర్బన్ : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్ హైదర్ తెలిపారు. కాజీపేట మండలం కడిపికొండలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, వంట గదితోపాటు వసతులు పరిశీలించి మాట్లాడారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ పరేడ్‌ను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తనుగుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాజీపేట: కాజీపేట 63వ డివిజన్ వడ్డెర బస్తీలో శుక్రవారం వీధి కుక్కలు నలుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. రాకేశ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కుట్టు మిషన్ బాగు చేయించడానికి ఓ ఇంటికి వెళ్తుండగా.. వడ్డెర బస్తీలో రహదారిపై కుక్కలు వెంటపడ్డాయి. అదే సమయంలో అటుగా వచ్చిన సత్యనారయణ అనే పోలీస్ అధికారి అతడిని కాపాడడానికి ప్రయత్నించగా కుక్కలు ఇద్దరిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. వీరితో పాటు మరో ఇద్దరిపై అవే కుక్కలు దాడిచేశాయి. వడ్డెర బస్తీలో విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతున్నాయని, వాటి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జేఎన్ఎస్లో ఇటీవల నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతం కావడంతో శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను ఆర్మీ అధికారులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. కల్నల్ సునీల్ యాదవ్, మేజర్ ప్రకాశ్ చంద్రరాయ్ తదితర అధికారులు కలెక్టర్‌కు జ్ఞాపిక అందజేశారు. -
శనివారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2025
– 10లోuదామోదర్ పేరుతో ఫోన్ చేస్తున్నదెవరు? కాల్వపల్లికి చెందిన మావోయిస్టు అగ్రనేత బడే దామోదర్ పేరిట కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఫోన్లు వస్తుండడం కలకలంగా మారింది. తాను దామోదర్‌ను అంటూ ఫోన్ చేస్తున్న సదరు వ్యక్తి.. జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని కలిసి డబ్బులివ్వాలని సూచించడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఇద్దరు అధికార పార్టీ నాయకులు, ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్లు రావడం.. ఆ ఫోన్లో మాట్లాడిన పలు విషయాలను బహిరంగంగానే మాట్లాడుకుంటుండడం గమనార్హం. నిర్బంధం మధ్య దామోదర్ ఎక్కడున్నాడు? అన్న చర్చ జరుగుతున్న తరుణంలో దామోదర్ వాయిస్‌తో ఫోన్ చేస్తున్నదెవరు? ఒకవేళ దామోదరే అయితే ఎవరిని కలవమన్నారు? అనే అంశాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో చర్చసాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఎక్కడ? ఇటీవల సాగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆయన వ్యూహం ఏంటి? ఓ వైపు ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడంటుండగా.. మరోవైపు లొంగుబాటు ప్రయత్నం చేస్తున్నాడని వైరల్ అవుతోంది? ఈనేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, సౌత్‌బస్తర్, ఏఓబీలలో కీలకమైన బడే దామోదర్ ఎక్కడున్నాడు? ఏం జరుగుతోంది? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల ములుగు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన పేరిట ఫోన్ కాల్స్ రావడం, ఓ రాజకీయ నేతను కలవాలని సూచించడం కూడా కలకలం రేపుతోంది. దామోదర్ వ్యూహం ఏంటో? ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే దామోదర్‌ది సీపీఐ (మావోయిస్టు) ఉద్యమ చరిత్రలో ఓ అధ్యాయం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్ 21న కోవిడ్ బారిన పడి మృతిచెందగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బాధ్యతలను దామోదర్‌కు పార్టీ అప్పగించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కీలకంగా మారిన ఈయన ఈ ఏడాది జనవరిలో పూజారి కాంకేర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరలైంది. ఐదారు రోజుల తేడాతో దామోదర్ బతికే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ 11 నెలల వ్యవధిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం ఎన్నో ఉత్థానపతనాలను చూసింది. అగ్రనేతలు ఎన్కౌంటర్లకు గురికావడం.. కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఆయుధాలతో లొంగిపోవడం వంటి ఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఏఓబీ సరిహద్దు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో హిడ్మా సహా 13 మృతి చెందడం... పదుల సంఖ్యలో ముఖ్య నేతలు విజయవాడలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించడం ఆ పార్టీ మనుగడకు సవాల్‌గా పరిణమించింది. ఇదే సమయంలో బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తదితరులు సైతం లొంగిపోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటునుంచి ప్రకటన వెలువడలేదు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ ఆయన స్వస్థలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి లొంగుబాటు ప్రయత్నాలపై సోషల్ మీడియాలో వైరల్ ఆయన పేరిట నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్? -
చదువుతోపాటు కళల్లోనూ రాణించాలి
హన్మకొండ కల్చరల్ : విద్యార్థులు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు. వరంగల్ హంటర్‌రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం.. జానపద గిరిజన విజ్ఞానపీఠంలో శుక్రవారం ఎం.ఏ తెలుగు కోర్సు నూతన విద్యార్థుల స్వాగత వేడుక ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ వెంకన్న సరస్వతి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమని తాము పరిచయం చేసుకున్నారు. సీనియర్లు, జూనియర్ విద్యార్థులకు పెన్నులు బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం జూనియర్ అసిస్టెంట్ అమేర్ ఆలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ బాసాని సురేష్, చూరేపల్లి రవికుమార్, గోపాల్‌రెడ్డి, సునీత, సతీష్, విజయలక్ష్మి, విజ్ఞానపీఠం సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న -
ఆర్ఎంఎస్ కార్యాలయం తరలింపు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే మెయిల్ సర్వీస్ (ఆర్ఎంఎస్) కార్యాలయం నిర్వహణను కాజీపేట పోస్టల్ శాఖ కార్యాలయ ప్రాంగణానికి తరలించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. 1965లో ఉత్తరాల బట్వాడాకు కాజీపేటలో పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం 1980లో కాజీపేట రైల్వేస్టేషన్లో రైల్వే మెయిల్ సర్వీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అమృత్ భారత్ పనుల్లో భాగంగా ఆర్ఎంఎస్ కార్యాలయంలో కొంతభాగాన్ని తొలగించినట్లు చెప్పారు. కాజీపేట జంక్షన్లో ప్రస్తుతం స్పీడ్ పోస్టు హబ్ మాత్రమే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన ఆర్ఎంఎస్ కార్యాలయంతో అనుబంధం ఉన్న ఉద్యోగులు, ప్రజలు ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. -
ఔషధ పరిజ్ఞానంతో ఉన్నత ఉద్యోగం
మామునూరు : ఔషధ పరిజ్ఞానంతో పాటు టెక్నికల్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్నప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చని సినీ నటుడు, నంది అవార్డు గ్రహీత కేవీ.ప్రదీప్ అన్నారు. వరంగల్ బొల్లికుంట వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కమల్ యాదవ్ అధ్యక్షతన ఫార్మసిస్ట్ ఆస్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే అంశంపై రెండురోజులుపాటు నిర్వహించిన జాతీయ ఫార్మసీ వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జాతీయ శబ్ద మిమిక్రీ నిపుణుడు శ్రీనివాస్, మనశాస్త్ర నిపుణుడు జి.శివప్రసాద్, వాగ్దేవి విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్.వాణిదేవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. భారత ఔషధ రంగం అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిందని తెలిపారు. విద్యార్థులు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిగత అభివృద్ధి, లక్ష్యాలను అన్వేషించి ముందుకు వెళ్తే భవిష్యత్ అంతా ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిఫెసర్ డాక్టర్, కె. శరీష, డాక్టర్ టి. రవి చంద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నంది అవార్డు గ్ర హీత కేవీ.ప్రదీప్ ముగిసిన జాతీయ ఫార్మసీ వారోత్సవాలు -
దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేత
ఖిలా వరంగల్ : పాత ఇంట్లో పిల్లలతో సహా అద్దెకుంటున్న ఓ మహిళపై అల్లరి మూకలు దాడి చేసి ఇంట్లో సామగ్రి ఉండగానే పొక్లెయినర్‌తో ఇల్లు కూల్చివేశారు. ఇంటిని ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని ప్రాధేయపడిన ససేమిరా అంటూ దౌర్జన్యంగా మహిళ, పిల్లలను రోడ్డుపై నెట్టేసి విధ్వంసం సృష్టించారు. ఈఘటన శుక్రవారం సాయంత్రం ఖిలావరంగల్ తూర్పుకోటలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. తూర్పుకోటకు చెందిన అప్పని కవిత తన ముగ్గురు పిల్లలతో కలిసి గాండ్ల శారద, సూర్యనారాయణకు చెందిన ఇంట్లో 18ఏళ్లుగా అద్దెకుంటోంది. ఖాళీ చేయడానికి కనీసం 15రోజుల సమయం కావాలని సదరు మహిళ ఇంటి యజమానికి కోరింది. అయినా అవేమి పట్టించుకోకుండా శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా పదిమంది మహిళలతోపాటు కొందరు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న కవిత, తన పిల్లలపై దాడి చేసి వారిని వీధిలో నెట్టేసి విలువైన సామాన్లు ఇంట్లో ఉండగానే దౌర్జన్యంగా ఇంటిని క్షణాల్లో కూల్చివేసి వెళ్లిపోయారు. దీంతో సుమారు రూ.5లక్షల విలువైన ఫ్రీడ్జి, టీవీ, కూలర్, వంట సామగ్రి, బీరువా, నిత్యావసర సరుకులు, ధ్వంసమై మట్టిలో ఉన్నాయని, గ్యాస్ లీకేజీ అవుతోందని కవిత బోరునవిలపించింది. బాధితురాలు డయల్–100కు సమాచారం ఇవ్వగా మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాడిచేసిన వ్యక్తులు, ఆర్థికంగా నష్టం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కవిత శుక్రవారం రాత్రి వరంగల్ ఏఎస్పీ శుభంను కలిసి ఫిర్యాదు చేసింది. రూ.5లక్షల గృహోపకరణాలు ధ్వంసం మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు -
లక్ష్యాలు సాధించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిహన్మకొండ : వచ్చే మూడు నెలలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటలు పూర్తవుతున్నందున వ్యవసాయ సర్వీస్‌ల రిలీజ్ వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని, మెటీరియల్ అందుబాటులో ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల సర్వీస్ మంజూరు వేగవంతం చేయాలన్నారు. టీజీ ఐపాస్, హెచ్‌టీ సర్వీస్‌లపై సమీక్షిస్తూ సర్వీస్‌ల మంజూరులో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ వీసీలో చీఫ్ ఇంజనీర్ టి.సదర్లాల్, 17సర్కిళ్ల ఎస్ఈలు, కమర్షియల్ డీఈ జమున, ఏడీఈ మధుకర్, మౌనిక పాల్గొన్నారు. హన్మకొండ : నగరంలోని ములుగు రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయ నూతన భవనం, జిల్లా స్టోర్స్ నిర్మాణ పనులను ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సర్కిల్ కార్యాలయ భవనం వచ్చే ఏడాది జనవరి 26 నాటికి, వరంగల్ డిస్ట్రిక్ట్ స్టోర్స్‌ను డిసెంబర్ 31వరకు పూర్తయ్యేలా పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. జల్సాల కోసం చోరీ● నిందితుడి అరెస్ట్● బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు హన్మకొండ : జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తన బావ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. శుక్రవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం రావడంతో అతడిని పట్టుకొని అరెస్ట్ చేసి దొంగలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని కోఠిలో గల చాపల్ బజార్‌కు చెందిన ఐలవేని సాయిరోహిత్ రాపిడో నడుపుతూ జీవిస్తున్నాడు. అతడు ప్రస్తుతం బెల్లంపల్లిలో నివాసిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన సాయిరోహిత్ ఆరునెలల క్రితం మడికొండ పరిధిలోని కడిపికొండలోని తన బావ బూతగడ్డ సతీష్ ఇంట్లోనే దొంగతనం చేశాడు. చోరీ చేసిన బంగారాన్ని వరంగల్‌లో విక్రయించేందుకు అయోధ్యపురం గేట్ నుంచి కాజీపేట మీదుగా బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మడికొండ పీఎస్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే గేట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు సాయిరోహిత్ ను పట్టుకొని విచారించగా సతీష్ ఇంట్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్దనుంచి 47.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ పంపినట్లు ఇన్స్పెక్టర్ కిషన్ పేర్కొన్నారు. -
సతాయిస్తున్న..‘సారథి’
ఖిలా వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సారథి ఆన్లైన్ పోర్టల్‌లో తరుచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలన్నా.. మరో లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నా సులభంగా ఉండేది. మీ సేవలో దరఖాస్తు చేసుకొని ట్రయల్ రన్‌కు వెళ్తే సరిపోయేది. ప్రస్తుతం అమలవుతున్న సారథి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడం కష్టంగా మారుతోంది. కొంతమంది దరఖాస్తుదారుల డేటా చూపించడం లేదు. వాహనదారుడు సారథి వెబ్సైట్లో హెవీ లైసెన్స్ రెన్యూవల్ నమోదు చేయగా..కార్యాలయానికి వెళ్తే హెవీ లైసెన్స్ నంబర్ మాయమైంది. బ్యాడ్జీ లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు ఆన్లైన్లో నమోదు కావడం లేదు. దీంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. వైబ్సైట్లో తలెత్తుతున్న సమస్యలతో వాహనదారులు నెలల తరబడి తమ లైసెన్స్ రెన్యూవల్, మార్పు కోసం వేచి చూడాల్సి వస్తోంది. రెండునెలల నుంచి అవస్థలే.. కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం సారథి పరి వాహన్ వెబ్‌సైట్‌ను నూతనంగా తీసుకొచ్చింది. కా నీ ఇప్పుడు వాహన లైసెన్స్ దారులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. డ్రైవింగ్ లైసెన్స్‌కు వెబ్సైట్లో నమోదు చేయాలంటే 20 నిమిషాలు సమయం పడుతోంది. చివరికి వివరాలు నమోదు చేశాక సక్సెస్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడి ంది. కొంతమంది లైసెన్స్ దారుల డేటా మాత్రమే చూపిస్తూ.. ఇంకొంత మంది డాటా లేకపోవడంతో రెన్యూవల్‌తో పాటు స్థాయి పెంపుదలకు సంబంధించిన సమస్యలు తలెత్తున్నాయి. అంతేకాదు వాహనదారుల వ్యక్తిగత వివరాలు నమోదైన తర్వాత ఒకే కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని మీసేవ డేటా ఆపరేటర్లు చెబుతున్నారు. సాంకేతిక సమస్యతో డేటామాయం వాహనదారులకు తప్పని తిప్పలు ఆర్టీఏ కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు -
సీసీఐ ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ న్యూశాయంపేట : పత్తి కొనుగోళ్లపై సీసీఐ విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, కపాస్ కిసాన్ యాప్‌ను తొలగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం బి.చక్రపాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాన్ వెస్లీ హాజరై మాట్లాడారు. వర్షాల వల్ల రైతులకు అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు సమస్య పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రోజుకో నిబంధన పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని సూచించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి.సుదర్శన్‌రావు, నా యకులు ప్రభాకర్‌రెడ్డి, చుక్కయ్య, రాగుల రమేశ్, ఉప్పలయ్య, గొడుగు వెంకట్, వీరన్న, తిరుపతి, రాములు, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ
పాలకుర్తి టౌన్ : మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ కథనం ప్రకారం.. పాలకుర్తి సబ్–డివిజన్ మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ (ఉపకార్యనిర్వాహక ఇంజనీర్) కూనమళ్ల సంధ్యారాణి దేవరుప్పల మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన పైపులైన్ బిల్లు రూ.1.5లక్షల చెల్లింపునకు గాను పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్ కమ్మగాని సురేష్నుంచి రూ.10వేలు లంచం డిమాండ్ చేసింది. సురేష్.. మిషన్ భగీరథ కార్యాలయంలో ప్రైవేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహేందర్ నాయక్ ఫోన్ పేకు రూ.10వేలు పంపాడు. అదే సమయంలో ఏసీబీని ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం.. బాధితుడు సురేష్ ఆ ఫోన్ పేను స్క్రీన్ షాట్ తీసి శుక్రవారం సాయంత్రం డీఈ సంధ్యారాణికి చూపించాడు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో సదరు డిప్యూటీ ఈఈని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుడు సురేష్ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు ఎస్.రాజు, ఎల్,రాజు సిబ్బంది పాల్గొన్నారు. లంచమడిగితే ఫోన్ చేయండి.. ఈ సందర్భంగా ఏసీబీ డీఏస్పీ రమేశ్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వరంగల్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1046, వాట్సాప్ నంబర్ 94404 46106 కూడా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడితే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పైపులైన్ బిల్లు కోసం రూ.10 వేలు లంచం -
‘కడియం’ మరోసారి
● స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కలిసిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే ● వివరణకు మరింత సమయం కోరిన కడియం శ్రీహరి ● పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ఏం తేలనుంది? ● హాట్‌టాపిక్‌గా మారిన ‘అనర్హత పిటిషన్’ల విచారణసాక్షిప్రతినిధి, వరంగల్ : మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్.. సుప్రీం ఆదేశాలతో ఊపందుకున్న విచారణ ఉమ్మడి వరంగల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్.. పార్టీ ఫిరాయింపుల (బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిక) అభియోగం ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి, వివరణలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం ఈ నెల 23న హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు గురువారమే స్పీకర్ ప్రసాద్ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రెండు రోజుల ముందే శుక్రవారం స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు. ఆయన అభ్యర్థన మేరకు స్పీకర్ సమయం ఇస్తారా? లేదా?.. సమయం ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు? అన్న సస్పెన్స్ కొనసాగుతుండగా, ఈ ఎపిసోడ్లో కడియం శ్రీహరి వ్యూహం ఏమిటనేది పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరగుతోంది. స్పీకర్ నిర్ణయం కోసం వెయిటింగ్.. కేడర్‌తో సమాలోచనలు.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి శాసనసభ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేయడంతో కడియం శ్రీహరి శిబిరంలో అలజడి మొదలైంది. జూలై నుంచి మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉండగా.. ఆలస్యమైంది. సుప్రీంకోర్టు ఆగ్రహించి నాలుగు వారాల గడువు ఇవ్వగా.. స్పీకర్ ఇటీవల విచారణకు సంబంధించిన ప్రక్రియలో వేగం పెంచారు. ఈ నేపథ్యంలోనే నోటీసు అందుకున్న శ్రీహరి హైదరాబాద్‌లో మకాం వేసి నిపుణులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. స్పీకర్ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు మరోసారి గడువు కోరినట్లు సమాచారం. ఆయన అభ్యర్థనను స్పీకర్ ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారు? ఎన్ని రోజులు సమయం ఇస్తారు? అనే దానిపై శ్రీహరి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే నోటీసులు తీసుకున్నప్పటినుంచి శ్రీహరి.. భవిష్యత్ కార్యాచరణపై తనకున్న ముఖ్య నేతలు, కేడర్ సమాలోచనల్లో పడ్డారని అనుచరవర్గాల సమాచారం. స్పీకర్‌ను కలిశా.. సమయం కోరా.. శాసనసభాపతి గురువారం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం వారిని కలిశాను. వాస్తవానికి నాపై నమోదైన పిటిషన్‌పై 23న వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరేందుకు స్పీకర్‌ను కలిశా. నా అభ్యర్థన లేఖపై స్పీకర్ స్పందించి ఇచ్చే గడువు ప్రకారం వివరణ ఇస్తా. – కడియం శ్రీహరి, ఎమ్మెల్యే -
విద్యార్థులు ఎదిగేలా ప్రోత్సహించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టే అంకుర సంస్థలను ఏర్పాటుచేసే విధంగా ప్రోత్సహించాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి టీహబ్ ప్రతినిధులకు సూచించారు. కేయూలోని కెహబ్.. హైదరాబాద్ టీహబ్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)లో భాగంగా శుక్రవారం యూనివర్సిటీలో టీహబ్ ప్రతినిధులతో వీసీ ప్రతాప్‌రెడ్డి సమావేశమై ప్రతిపాదిత అంశాలపై చర్చించారు. ఒక ఐడియాతో వచ్చే విద్యార్థులను ఎంటర్ప్రెన్యూర్షిప్లుగా ఎదిగేలా టీహబ్ సహకారం అందించాలని కోరారు. అనంతరం టీహబ్ ప్రతినిధుల బృందం వివిధ విభాగాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. శిక్షణ, తోడ్పాటు అందించే విధానాన్ని టీహబ్‌కు సంబంధించిన అకాడమిక్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ) సీఈఓ రాజేష్ కుమార్ విద్యార్థులకు వివరించారు. ఈ బృందంతో కెహబ్ డైరెక్టర్, ప్రొఫెసర్ సవితాజ్యోత్స్న, రూసా నోడల్ ఆఫీసర్ కేయూ జియాలజీ విభాగ ం ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, కోఆర్డినేటర్ సిద్ధార్థ్ ఉన్నారు. టీహబ్ ప్రతినిధులు సీనియర్ మేనేజర్ స్వరూపరాణి, ప్రతినిధులు చేతన్, శ్రవణ్, చైతన్య శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి -
మహాజాతర భద్రతకు ఎస్డీఆర్ఎఫ్..
గోవిందరావుపేట : మేడారం సమ్మక్క–సారక్క మహాజాతరకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో భద్రత చర్యలు చేపట్టేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని చల్వాయిలోని టీజీఎస్పీ 5వ బెటాలియాన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బెటాలియన్‌లో శుక్రవారం రిజర్వ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమాండంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. జాతర సమయంలో భక్తుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకొని ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగానే ములుగు కలెక్టర్ దివాకర సమన్వయంతో ఎస్డీఆర్ఎఫ్ బృందం రామప్ప చెరువులో బో టింగ్ రైడ్, గజ ఈతగాళ్ల శిక్షణ (డీప్ డైవర్స్), నీటి విపత్తు నిర్వహణ (వాటర్ రెస్క్యూ) శిక్షణను చేపట్టి ందన్నారు. వాగులు, అటవీ మార్గాలు, రద్దీ కూడళ్ల వద్ద నిరంతరం పహారా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల భద్రతే తమ లక్ష్యమని, ఏ పరిస్థితికై నా వెంటనే స్ప ందించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సి ద్ధంగా ఉంటాయని అన్నారు. జాతర అవసరాల దృష్ట్యా సి బ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని అన్నారు. నీటి ప్రమాదాల నివారణ, భారీ జనసందోహంలో రక్షణ చర్యలు, అత్యవసర వైద్యసాయం, కమ్యూని కేషన్ వ్యవస్థల వినియోగం వంటి అంశాలపై వ్యా యామాలు నిర్వహించినట్టు తెలిపారు .ఆర్ఎస్సై రఘు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం -
‘మారథాన్’ను విజయవంతం చేయాలి
హన్మకొండ: వరంగల్ మహానగరంలో తొలిసారిగా నిర్వహించనున్న హాఫ్ మారథాన్‌ను విజయవంతం చేయాలని మారథాన్ నిర్వాహక కమిటీ ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రెడాయ్ వరంగల్ సౌజన్యంతో తెలంగాణ రన్నర్స్, వరంగల్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న నిర్వహించనున్న హాఫ్ మారథాన్ 21, 10, 5 కిలో మీటర్లుగా ఉంటుందన్నారు. ఆదివారం ఉదయం 5 గంటలకు హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం నుంచి మారథాన్ ప్రారంభమవుతుందన్నారు. అనంతరం మారథాన్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో మారథాన్ రన్నర్స్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, ఉదయ్ రెడ్డి, రవి, చరణ్, సరస్వతి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. రేపు ట్రాఫిక్ మళ్లింపువరంగల్ క్రైం: నగరంలో ఈనెల 23న హాఫ్ మారథాన్ ఉన్నందున ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు కాజీపేట, హనుమకొండ, వరంగల్ ట్రై సిటీ పరిధి పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ● హైదరాబాద్ నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు/బస్సులు ఫాతిమానగర్ నుంచి వడ్డేపల్లి చర్చి రూట్ మీదుగా తులసీ బార్– కేయూ జంక్షన్– నయీంనగర్– సీపీఓ జంక్షన్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలని సూచించారు. ● హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు/బస్సులు అశోకా జంక్షన్ మీదుగా ములుగురోడ్డు–పెద్దమ్మగడ్డ – కేయూసీ – తిరుమల బార్–వడ్డేపల్లి చర్చి–ఫాతిమా సెంటర్– కాజీపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాలి. ● హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు/బస్సులు ములుగు రోడ్డు – పెద్దమ్మగడ్డ – కేయూసీ మీదుగా వెళ్లాలి. ● ఖమ్మం నుంచి హనుమకొండ వచ్చే వాహనాలు/బస్సులు సీఎస్ఆర్ గార్డెన్ జంక్షన్ నుంచి డైవర్షన్ తీసుకుని పోతన జంక్షన్ వైపు నుంచి హనుమకొండకు వెళ్లాలి. కాగా, వంద ఫీట్ల రోడ్డులో ఒకవైపు నుంచి మాత్రమే వాహనాలు అనుమతించనున్నట్లు, సీఎస్ఆర్ గార్డెన్ జంక్షన్ నుంచి అదాలత్ వైపు, అంబేడ్కర్ జంక్షన్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు, ఫాతిమా జంక్షన్ నుంచి ఎన్ఐటీ వైపునకు ఈ సమయాల్లో ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదని సీపీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.నిర్వాహక కమిటీ ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి -
తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ వేదికగా వచ్చేనెలలో నిర్వహించనున్న ఓపెన్ టు ఆల్ తెలంగాణ గోల్డ్ కప్–2025, టీ20 టోర్నమెంటు కోసం జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్‌చందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండలోని టీసీఏ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్‌చందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి జట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 23న ఉదయం 10గంటలకు వరంగల్‌లోని ఓసిటీలో, హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో రెండు జిల్లాల జట్లను ఎంపిక చేస్తామన్నారు. ఆయా జట్లు ఈ నెల24న ఖమ్మంలో జరిగే ఈస్ట్ జోన్లీగ్ మ్యాచ్‌లో పాల్గొంటాయన్నారు. ఎంపికై న క్రీడాకారులకు యూనిఫాం, క్రికెట్ కిట్టు టీసీఏ ఉచితంగా అందజేస్తోందన్నారు. ఇతర వివరాలకు ఈస్ట్‌జోన్ కోఆర్డినేటర్లు తాళ్లపల్లి జైపాల్ 95811 24444, సమీ 90325 24193 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. రేపటినుంచి జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలు గ్రామీణ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ నెల 23, 24వ తేదీల్లో జిల్లాస్థాయి అండర్–14 బాలుర విభాగంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబ్‌బాద్ జిల్లాల్లో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో కూడిన ఆరు క్రికెట్ జట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా ఈ నెల చివరి వారం నుంచి నిర్వహించే వన్డే లీగ్ టోర్నమెంటులో పాల్గొంటుందని తెలిపారు. ఇందులో రాణించిన క్రీడాకారులను ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు రెండు రోజుల పాటు స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలోని కరుణాపురంలోని వంగలపల్లిలో గల డబ్ల్యూడీసీఏ క్రికెట్ క్రీడా మైదానంలో హాజరు కావాలని సూచించారు. 2011, సెప్టెంబర్ 1తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు మీసేవా ద్వారా జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, సొంత క్రికెట్ కిట్టుతో హాజరుకావాలని తెలిపారు. -
రూ.1,200 కోట్లతో డీపీఆర్ సిద్ధం
ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి..వరంగల్ అర్బన్ : వరంగల్ నగర వరద ముంపు శాశ్వత పరిష్కారానికి రూ.1,200 కోట్లతో డీపీఆర్ సిద్ధమైందని, అనుసంధానంగా భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాలను తెలంగాణ కై ్లమేట్ రెసిడెంట్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్షియేటివ్ (టీజీ–సీయూఆర్టీఐ) ఆధ్వర్యంలో ‘ప్రాథమిక అంచనా మిషన్‘కు చెందిన అర్బన్ డెవలప్మెంట్ సౌత్ ఏసియా హెడ్ ఆఫీస్‌కు చెందిన కార్లా బెర్క్, అర్బన్ మొబిలిటీ హెడ్ న్యూఢిల్లీకి చెందిన ఆళ్వారో చెర్రీల్, అర్బన్ డెవలప్మెంట్ సౌత్ ఏసియా పోర్ట్‌ఫోలియో లూకాస్ మయి, సీనియర్ అర్బన్ సెక్టార్ స్పెషలిస్ట్ న్యూ ఢిల్లీకి చెందిన కిరణ్ అవధానులతో కలిసి పరిశీలించారు. భూగర్భ డ్రెయినేజీ, నగర స్థితిగతులపై అధ్యయనం చేశారు. అనంతరం మేయర్ చాంబర్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, ప్రతినిధులు, అధికారులతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. సీవరేజ్ ప్రాజెక్టులు, నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై దృశ్య మాధ్యమం ద్వారా ప్రతినిధులకు వివరించారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ‘మోంథా తుపానుతో నగరంలో జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించి తక్షణ సహాయంగా రూ.12కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. నీటి సరఫరాకు రూ.544 కోట్లు మహానగరవ్యాప్తంగా నీటి సరఫరా కోసం రూ.544 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాస్కి కార్యక్రమంలో భాగంగా పురాతన బావులను 15 పునరుద్ధరించామని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ సాయినాథ్, అదనపు డైరెక్టర్ ఫణి, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, సీహెచ్ఓ రమేష్, డీఎఫ్ఓ శంకర్ లింగం, అధికారులు రవీందర్ రాడేకర్, మాధవి లత, హర్షవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి విదేశీ, స్వదేశీ నిపుణులతో సమావేశం -
‘సెన్సార్’.. బేజార్!
‘గ్రేటర్’లో ఏటీసీఎస్ అమలవుతున్న 12 జంక్షన్లలో వాహనాల రద్దీసాక్షి, వరంగల్: సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్లో నాలుగు రహదారులు ఉంటాయి. ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్‌లైట్, రెడ్‌లైట్ వెలుగుతూ సిగ్నల్ సైకిల్ నడుస్తుంది. అన్ని రోడ్లలో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు. అయినప్పటికీ ట్రాఫిక్ సైకిల్ సిగ్నల్‌లో మాత్రం మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్‌లైన్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా.. రెడ్‌లైట్లు ఉన్న రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై పడుతోంది. దీంతో అనేక చౌరస్తాల్లో సిబ్బంది మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తోంది. ఫిక్స్డ్ టైంతోనే ఆయా జంక్షన్లలో వాహనాల రద్దీ క్లియర్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు గ్రేటర్ వరంగల్‌లో అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టం (ఏటీసీఎస్)ను మూడేళ్ల క్రితం అమల్లోకి తెచ్చారు. ఎక్కువ రద్దీగా ఉండే 12 ట్రాఫిక్ జంక్షన్లలో ఇప్పటికీ మెజారిటీ అచేతనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. వీటిని పర్యవేక్షించాల్సిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కేవలం చిన్నపాటి మరమ్మతులకు పరిమితమవుతోంది తప్ప పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. రియల్ టైం ట్రాఫిక్ డాటాను ఆధారంగా చేసుకొని ఆటోమేటిక్‌గా ఎక్కువ వాహనాలు ఉన్న వైపు గ్రీన్‌సిగ్నల్ పడి ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన ఆ పరిస్థితి కనిపించడం లేదు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలోని నాలుగు జంక్షన్లలో ఫిక్స్డ్ టైంతోనే సిగ్నల్ సెట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఏటీఎస్సీ ఉన్న జంక్షన్లకు, మాన్యువల్ జంక్షన్లకు పెద్ద తేడా లేకుండా పోయిందని, ఏటీఎస్సీ సరిగా పనిచేస్తే ట్రాఫిక్ పోలీసు సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని కొందరు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సెన్సార్లు సరిగా పనిచేయక.. డివైడర్లు మధ్యలో లేక అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టం (ఏటీసీఎస్)తో నగరంలోని ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానమవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎన్ని వాహనాలు వస్తున్నాయని లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్ కెమెరాల్లో ఉంటుంది. ఇవి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమవుతాయి. అక్కడ సర్వర్‌లో ఉండే సాఫ్ట్వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్‌లైట్ పడేలా చేస్తోంది. గరిష్టంగా వంద సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రొటేషన్‌పై సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది. జంక్షన్లలో ఉన్న సీసీటీవీ కెమెరాల సెన్సార్లు 90 మీటర్లలోపు ఉంటేనే క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. జంక్షన్లలోని ఓ మార్గంలో ఉన్న వాహనాలు అంతకుమించి దూరంలో ఉండడంతో అవి క్యాప్చర్ చేయలేకపోతున్నాయి. అదే సమయంలో ఆయా రహదారుల్లోని డివైడర్లు కూడా రోడ్డుకు సరిగ్గా మధ్య భాగంలో లేవు. దీంతో ఓవైపు ఎక్కువగా వాహనాలు, ఇంకోవైపు తక్కువ వాహనాలు ఉండడం వల్ల కూడా ఈ ఏటీసీఎస్ సరిగా పనిచేయక ఫిక్స్డ్ టైంనే సెట్ చేసుకొని ట్రాఫిక్ సిబ్బంది సేవలందిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి అందుబాటులోకి తీసుకొచ్చినా ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉండడంపై వాహనదారులు మండిపడుతున్నారు. అయితే ఈ విషయమై బల్దియా కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ 12 జంక్షన్లలో ఏటీసీఎస్ అమలవుతోంది, కొన్ని ప్రాంతాల్లో సమస్య ఉంది వాస్తవమేనని క్లియర్ చేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న జంక్షన్లు న్యూశాయంపేట, మర్కజీ సెంటర్, పెగడపల్లి డబ్బాలు, ఎర్రగట్టుగుట్ట. బల్దియా ఆధ్వర్యంలో ఏటీసీఎస్ జంక్షన్లు.. వరంగల్ పోస్టాఫీస్, పోచమ్మమైదాన్, ఎంజీఎం సర్కిల్, ములుగు రోడ్డు, అశోకా జంక్షన్, సీపీఓ జంక్షన్, కేయూసీ జంక్షన్, గోకుల్ జంక్షన్, అదాలత్ జంక్షన్, వడ్డేపల్లి ఎక్స్ రోడ్డు జంక్షన్, కాజీపేట, కడిపికొండ బ్రిడ్జి. యథావిధిగానే వాహనదారుల వెయింటింగ్ సెన్సార్ల క్యాప్చర్ పరిమితి 90 మీటర్ల లోపు ఉండడమే కారణం పాత పద్ధతిలోనే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు ఇప్పటికై నా బల్దియా దృష్టి సారించాలంటున్న నగర ప్రజలు -
ఎయిర్‌పోర్ట్‌తో పారిశ్రామికాభివృద్ధి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: ఎయిర్పోర్ట్ నిర్మాణంతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ఇందుకు ఇళ్లు కోల్పోయిన వారు, భూ నిర్వాసితులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. ఇళ్లు కోల్పోయిన గాడిపల్లికి చెందిన 23 మంది, ఆర్అండ్ఆర్ కమిటీ సభ్యులతో గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ 23మంది పరిహారం తీసుకోవడానికి సమ్మతించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఆర్ అండ్ ఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి న్యూశాయంపేట: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఇసుక లభ్యత, రవాణా తదితర అంశాలపై సమీక్షించారు. కాగా, జలసంరక్షణ కేటగిరీ–2లో జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో అవార్డు అందుకున్న కలెక్టర్‌ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అభినందించారు. -
ఇంటింటికీ ఇందిరమ్మ చీరలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 9లోగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈవిషయంలో ముఖ్యమంత్రి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్షించి పంపిణీకి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు సెర్ప్, మెప్మా ద్వారా యూనిఫామ్ పేరుతో ప్రభుత్వం చీరలు అందజేయనుంది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్న చీరలు అధికారులు గ్రామస్థాయిలో పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించారు. గ్రామాల్లో పంపిణీ ప్రారంభించి డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన దసరా చీరల ధర సుమారు రూ.260 వరకు ఉండేది. నాణ్యత లోపించిందని విమర్శలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం పోచంపల్లి కోట చీరలు ఒక్కోటి రూ.800 ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సంవత్సరానికి రెండు చీరలు మహిళా సంఘాల సభ్యులకు యూనిఫామ్ పేరుతో అందజేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కలిపి సుమారు 3 లక్షల మంది వరకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లు డీఆర్డీఏ, మెప్మా అధికారులు లెక్కలు అందజేశారు. మెప్మా పరిధిలో 1,71,604 మంది సభ్యులు ఉండగా, మిగతావారు డీఆర్డీఏ పరిధిలో ఉన్నారు. ఆ లెక్కల ఆధారంగా ప్రభుత్వం జిల్లాకు చీరల కోటా అందజేశారు 9, 6 మీటర్ల నిడివి చీరలు మహిళలు వారి వయసు, అర్బన్, రూరల్ ప్రాంతాల వారు సంప్రదాయాల ప్రకారం ధరించే చీరలనే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయించింది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1,800కు పైగా మహిళల కోసం 9 మీటర్ల నిడివి చీరలను సిద్ధం చేయించారు. అర్బన్ ప్రాంతాల్లో మహిళల కోసం 6.3 మీటర్ల నిడివి చీరలు పంపిణీకి సిద్ధం చేశారు. చీరల పంపిణీ గతంలో మాదిరిగా రేషన్ డీలర్లకు అప్పగించకుండా ఈసారి గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అన్ని ఏర్పాట్లు చేశాం.. జిల్లాలో డిసెంబర్ 9 నాటికి మహిళా సంఘాలకు చీరలు పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టంగా ఆదేశించారు. అందుకు తగినట్లుగా జిల్లా కేంద్రానికి చేరిన చీరలను గ్రామాలకు తరలించి పంపిణీ ప్రారంభిస్తున్నాం. ప్రత్యేక అధికారులే చీరల పంపిణీకి గ్రామస్థాయిలో బాధ్యులుగా ఉంటారు. మహిళా సంఘాల సమన్వయంతో పంపిణీ పూర్తి చేస్తారు. – మేన శ్రీను, డీఆర్డీఓ పీడీ హనుమకొండ జిల్లాకు 2.90 లక్షల చీరలు డిసెంబర్ 9లోగా చీరల పంపిణీ మహిళా సంఘాలు, పంచాయతీ కార్యదర్శులకు పంపిణీ బాధ్యతలు -
సబ్జెక్ట్ ఫోరమ్స్ సమన్వయ కమిటీ ఏర్పాటు
విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లాలోని ఉన్నత పాఠశాలల సబ్జెక్ట్ ఫోరమ్స్ సమన్వయ కమిటీని గురువారం డీఈఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా అలిగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి (సోషల్ స్టడీస్) ఏకగ్రీవంగా, కోకన్వీనర్లుగా కొక్కుల సంపత్‌కుమార్ (ఆంగ్లం), అమరకొండ సంపతి (బయోసైన్స్), కోశాధికారిగా అమరభద్రయ్య (తెలుగు) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..సెకండరీ స్థాయి విద్యలోని వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థుల అభివృద్ధికి సంబంధిత ఉపాధ్యాయులు నూతన అంశాల అవగాహనకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో వివిధ సబ్జెక్టుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్‌రెడ్డి, కె.భద్రయ్య, సాదత్లీ, గౌస్‌పాషా, సంపత్‌కుమార్, కోలా రవికుమార్, ఎల్.భాస్కర్, బి.మహేష్, దొంతుల శ్రీనివాస్, శశికళాధర్, డాక్టర్ వాసు, సంపత్, నర్సయ్య, రాము, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.నేడు హనుమకొండకు అయోధ్యరెడ్డి.. హన్మకొండ అర్బన్: సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌కి రా నున్నారు. మధ్యాహ్నం 2గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్న సమావేశంలో ఆయన పా ల్గొని సమాచార హక్కు చట్టం అమలు పరిస్థితిపై జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం రెవెన్యూ, పురపాలక ఇతర శా ఖలకు సంబంధించిన సమాచార హక్కు అభ్యర్థనలు, ఫిర్యాదులు, అప్పీళ్లపై విచారణ చేపట్టనున్నారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: సీపీవరంగల్ క్రైం : డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ అనే నినాదంతో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను సీపీ గురువారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నియంత్రణలో ప్రజలు సైతం సహకరించాలని సూచించారు. ఎవరైన మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగాలకు పాల్ప డితే వెంటనే 87125 84473, 87126 85299 నంబర్లకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచనున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఆర్ఐ శివకేశవులు, ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఎస్సైలు పూర్ణచందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, నాగరాజు, ర్యాపిడో సంస్థ ప్రతినిధులు దుర్గారావు, సందీప్ పాల్గొన్నారు.దరఖాస్తుల ఆహ్వానంవరంగల్ స్పోర్ట్స్ : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ పథకం కింద 2025–26 సంవత్సరానికి జాతీయ యువత, కౌమార అభివృద్ధి పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. http:youth.yas.gov.in/scheme/npyad/ ngo/loginలో అర్హత కలిగిన వారు ప్రతిపాదనలు చేసుకోవచ్చని వివరించారు. ఎన్జీఓ దర్పన్ పోర్టల్ http://ngodarpan.gov.in లో నమోదు చేసుకున్న, చెల్లుబాటు అయ్యే ప్రత్యేక దర్పణ్ ఐడీని ప్రాసెస్ చేసే సంస్థలు మాత్రమే ఆర్థికసాయం కోసం అర్హులుగా పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన ఎన్పీఓ, ఎన్జీఓలు పైన తెలిపిన వెబ్సైట్ ద్వారా ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆఫీసులో సంప్రదించాలన్నారు. -
స్థానిక ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి
వీసీలో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని హన్మకొండ అర్బన్/న్యూశాయింపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకతవకలకు అవకాశం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ.. ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నికల సమయంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియామవళి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. హనుమకొండ కలెక్టరేట్‌నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, ఏసీపీ నర్సింహారావు, వరంగల్ కలెక్టరేట్‌నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, డీపీఓ కల్పన, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. ఓటర్ల రివిజన్‌పై సమావేశం ఓటర్ల రివిజన్‌పై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, ఈఆర్వోలు, అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఎలక్షన్ డీటీ రంజిత్‌కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తక్కళ్లపల్లి రవీందర్రావు (కాంగ్రెస్), కె.శ్యాం (టీడీపీ), బాకం హరిశంకర్(బీజేపీ), రజనీకాంత్ (వైఎస్సార్ సీపీ), అనిల్‌కుమార్ (బీఎస్పీ) పాల్గొన్నారు. -
అర్థమయ్యేలా పాఠాలు బోధించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ హసన్‌పర్తి : విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం మండలంలోని కోమటిపల్లి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, చింతగట్టులోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు జయగిరిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల నమోదును పరిశీలించారు. చింతగట్టు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల గైర్హాజరుకు గల కారణాలను అడిగారు. ఆంగ్లభాషపై పట్టు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, ఆయా సబ్జెక్ట్‌ల్లో నాణ్యమైన బోధనలతో పాఠ్యాంశాలు అర్థవంతంగా వివరించాలని సూచించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించగా సొంత భవనానికి భూమి కేటాయించాలని అధికారులు కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలిహన్మకొండ అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. ఏఎన్ఎంలు 12వారాల్లోపు ప్రతి గర్భిణి వివరాలు నమోదు చేయాలన్నారు. పోషణలోపం ఉన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించడంతోపాటు తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా వీలైనంత త్వరగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌతమ్ చౌహర్, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యులు శ్రీనివాస్, ఇఫ్తకర్ అహ్మద్, మంజుల, అశోక్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
సబ్ ఇంజనీర్‌కు గోల్డ్‌మెడల్
హన్మకొండ: తెలంగాణ అంతర్రాష్ట్ర క్రీడా పోటీల్లో టీజీ ఎన్పీడీసీఎల్ యువ ఇంజనీర్ డిస్కస్ త్రోలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకంతో మెరిశారు. ఈ నెల 17 నుంచి 19 వరకు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎమ్మార్టీ డివిజన్ ప్రొటెక్షన్‌లో సబ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాజారపు సందీప్ అత్యుత్తమ ప్రదర్శనతో డిస్కస్ త్రోలో మొదటి స్థానం సాధించారు. బంగారు పతకాన్ని అందుకున్నారు. విధులు నిర్వహిస్తూనే క్రీడల్లో రాణిస్తున్న రాజారపు సందీప్‌ను విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అభినందించారు. -
మార్చిలో కాజీపేట రైల్వే యూనిట్ ప్రారంభం
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (మల్టీపర్పస్ కోచ్‌ఫ్యాక్టరీ) వచ్చే సంవత్సరం మార్చి నాటికి ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అన్నారు. కాజీపేట రైల్వే యూనిట్లో జరుగుతున్న పనుల పురోగతి, మౌలిక వసతుల అభివృద్ధి, ఆయా విభాగాల నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల 30 ఏళ్ల కల త్వరలోనే నెరవేరబోతుందని, కాంగ్రెస్ పాలనలోనే ఇది సాధ్యమైందన్నారు. రైల్వే యూనిట్లో సంవత్సరానికి 600 కోచ్‌ల తయారీతో పాటు, వందేభారత్ కోచ్‌లను కూడా తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, 300 ఎకరాల్లో నష్కల్–ఘన్పూర్ మధ్య మరో రైల్వే ప్రాజెక్ట్ పీఓహెచ్ వర్క్‌షాప్ నిర్మాణానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే యూనిట్లో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాల కల్పన విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎంఈ ఆనంద్, జీజీఎం మురళీకృష్ణ, అధికారులు శర్మ, కృష్ణ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజును అయోధ్యపురం భూ నిర్వాసితులు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. రైల్వే పీఓహెచ్ వర్క్ షాప్‌నకు సన్నాహాలు భూ నిర్వాసితులకు ఉద్యోగావకాశం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు -
పత్తి కొనుగోళ్లు షురూ..
వరంగల్ : పత్తి కొనుగోళ్లు మళ్లీ షురూ అయ్యాయి. సీసీఐ నిబంధనలతో విసుగెత్తిన జిన్నింగ్ మిల్లర్లు, ట్రేడర్స్ ఈనెల 17వ తేదీన నిరవధిక బంద్ చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. దేశం మొత్తం అమలవుతున్న సీసీఐ నిబంధనలను సడలించాలంటే సమయం పడుతుందని అప్పటి వరకు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్కెటింగ్ కార్యదర్శులు మిల్లర్లు, ట్రేడర్లను కోరారు. దీంతో బంద్‌ను వాయిదా వేసుకున్న మిల్లర్లు, ట్రేడర్లు.. బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో రైతులు ఉత్సాహంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు పత్తి తరలించారు. మార్కెట్లో జెండా పెట్టగా గరిష్ట ధర రూ.6, 830 పలికింది. మొత్తం 2,401క్వింటాళ్లను ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్ పరిధిలో 31 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను నోటిఫై చేశారు. ఇందులో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 15, 03 చొప్పున సీసీఐ కేంద్రాలను ప్రారంభించింది. వీటిలో బుధవారం 611 మంది రైతుల వద్ద నుంచి 9,870 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. చెప్పిన ధరలకే విక్రయం... బంద్ ప్రభావం రైతులపై పడింది. సీసీఐకి విక్రయించాలంటే కపాస్ యాప్‌లో నమోదు, స్లాట్ బుకింగ్, తేమ శాతం 12కంటే ఎక్కువ ఉంటే తిరిగి పంపుతారనే భయంతో రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చి న పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. వ్యాపారులు చెప్పిన ధరలకు అమ్మక తప్ప లేదని రైతులు వాపోయారు. బుధవారం గరిష్ట ధర రూ.6,830 పలికినా తేమ శాతం బూచిగా చూపెట్టి క్వింటాకు రూ.5,000 నుంచి 6,300 ధర మాత్రమే చెల్లించారని రైతులు చెప్పారు.సీసీఐ సెంటర్లలో 9,870 క్వింటాళ్ల కొనుగోళ్లు ప్రైవేట్‌లో 2,401 క్వింటాళ్లు.. మద్దతు ధర క్వింటాకు రూ.8,110 వరంగల్ మార్కెట్లో గరిష్ట ధర రూ.6,830 -
టీజీ ఎన్పీడీసీఎల్కు ప్రతిష్టాత్మక అవార్డు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్కు ప్రతిష్టాత్మక ‘ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అండ్ లార్డ్ డిస్కం’ అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 12న జరిగిన 19వ ఇండియా ఎనర్జీ సమ్మిట్– 13వ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డ్స్ ఫర్ డిస్కమ్స్ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ అవార్డు అందుకున్నారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్లు ఈ అవార్డును సీఎండీ వరుణ్ రెడ్డికి అందజేశారు. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో తీసుకున్న వినూత్న చర్యలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నారు. సంస్థలోని ప్రతీ ఉద్యోగి కృషికి ఈ అవార్డు ప్రతిఫలమన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకట రమణ, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం పాల్గొన్నారు. -
మతోన్మాదుల మెడలు వంచేది కమ్యూనిస్టులే
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు వరంగల్: దేశంలోని మతోన్మాదుల మెడలు వంచేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీని వాసరావు అన్నారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా కు మ్రంభీం జిల్లా జోడే ఘాట్ నుంచి ప్రారంభమైన సీపీఐ బస్సు జాతా బుధవారం వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. నగరంలోని ములుగు రోడ్డు నుంచి పోచమ్మ మైదాన్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీ ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా అధ్యక్షతన పోచమ్మ మైదాన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దే శంలో నిరుద్యోగం పెరిగిందని, ఆర్థిక మాంద్యం ఏర్పడిందన్నారు. ఈక్రమంలో ప్రజలు కమ్యూనిస్టుల వైపు చూస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు మేకల రవి, పంజా ల రమేశ్, పనాస ప్రసాద్, లక్ష్మణ్, బద్రి, రమేశ్, బుస్స రవీందర్, ఏలేందర్, చంద్రకళ, చెన్నకేశవులు, శంకరయ్య, రాజు, శరత్, అక్బర్ పాషా, భవాని, యాకాంబ్రచారి, రాహేలా, జాన్‌పాల్, రవి, రమేశ్, సుధీర్, సువర్ణ, శ్వేత పాల్గొన్నారు. పరకాలలో ఘనస్వాగతం పలికిన శ్రేణులు పరకాల: రపజావ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా సీపీఐ నిలుస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పరకాల పట్టణానికి చేరుకున్న సీపీఐ బస్సు జాతా బృందానికి నాయకులు, కార్యకర్తలు డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగ తం పలికారు. మార్కెట్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి శ్రీని వాసరావు మాట్లాడారు. ఖమ్మంలో నిర్వహించనున్న పార్టీ వందేళ్ల ముగింపు ఉత్సవాలకు అధిక సంఖ్యలో తరలిరా వాలని పిలుపునిచ్చారు. నాయకులు కలవేన శంకర్, మరుపాక అనిల్‌కుమార్, జిల్లా నాయకులు దుప్పటి సాంబయ్య, సదా విజయలక్ష్మి, లంకదాసరి అశోక్ పాల్గొన్నారు. -
ఆడబిడ్డలకు సారె.. ఇందిరమ్మ చీర
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయమని ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై బుధవారం సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం నుంచి డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందన్నారు. సమావేశంలో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ జోనా, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, వరంగల్ జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రాంరెడ్డి, రెండు జిల్లాల,, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. వీడియో కాన్పరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి అధికారులతో సమీక్ష -
జల వనరుల పరిరక్షణకు కృషిచేయాలి
న్యూశాయంపేట: జల వనరుల పరిరక్షణ కోసం మరింతగా కృషిచేసి ఆదర్శంగా నిలవాలని రెవెన్యూశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. జల సంరక్షణ కేటగిరీ–2లో జాతీయ స్థాయిలో వరంగల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకుని కోటి రూపాయల నగదు బహుమతి అందుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అవార్డు అందుకున్న కలెక్టర్ సత్యశారదను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. కనులపండువగా కార్తీక దీపోత్సవం హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో కార్తీక మాసం బుధవారం సాయంత్రం ఆలయ ఈఓ రామల సునీత కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించారు. లక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి మహిళలు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల కూచిపూడి నృత్యాలు అలరించాయి. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం హుండీ లెక్కించారు. 64 రోజులకుగాను రూ. 65,93,481 ఆదాయం లభించిన ట్లు, నగదును యూనియన్ బ్యాంకులో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. విదేశీ కరెన్సీ 2,483 యూఎస్ఏ డాలర్లు, 55 ఆస్ట్రేలియా డాలర్లు, 1 0 సింగపూర్ డాలర్లు, 15 యూఏఈ దిరమ్స్, 3 ఖతర్ సెంట్రల్ లభించినట్లు తెలిపారు. విద్యారణ్యపురి: పాఠశాలల్లో సురక్షిత పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని 5.0ను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర పరిశీలకులు ప్రొఫెసర్ రవికాంత్ అన్నారు. పాఠశాలల పరిశీలన అనంతరం బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓతో కలిసి ఎంఈఓలతో నిర్వహించిన సమావేశంలో 5.0 అమలుపై సమీక్షించారు. తాను పరిశీలించిన పాఠశాలల్లోని పరిస్థితులను ప్రస్తావించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్ధులను ఆకర్షించేలా పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈనెల 20 నుంచి నిర్వహించనున్న బడిబయట పిల్లల సర్వేను ఖచ్చితత్వంతో చేయాలని సీఆర్పీలకు సూచించారు. సమావేశంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ బి.మహేశ్, జెండర్ కో–ఆర్డినేటర్ సునీత, ఎస్ఎస్సీ రఘునందన్‌రావు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో వృద్ధుల దినోత్సవం
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో జిల్లాస్థా యి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని బుధవా రం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద శారద హాజరై వేడుకలను ప్రారంభించి మాట్లాడా రు. కుటుంబ సభ్యులు వయోవృద్ధులకు మెరుగై న సేవలను అందించాలని కోరారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్ఫూర్తి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఉత్తమ సేవలందించిన వృద్ధులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, డీఎల్ఎస్ఏ అడ్వకేట్ సురేశ్, బ్రహ్మకుమారిస్ నుంచి సరిత సిస్టర్, వయోవృద్ధుల కమిటీ సభ్యుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహాజాతరకు ఆర్టీసీ సమాయత్తం..
హన్మకొండ : ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆర్టీసీ సమాయత్తమైంది.గత జాతర వైఫల్యాలు సమీక్షించుకుంటూ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తోంది. 2026 జనవరి 28, 29, 30, 31 తేదీల్లో వన దేవతల జాతర జరగనుంది. ఈ జాతరకు భక్తులను చేర వేయడంతో పాటు తిరుగు ప్రయాణంలో గమ్యస్థానాలకు చేరవేసేందుకు 2026 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిలాలతో పాటు మహారాష్ట్ర నుంచి బస్సులు నడిపేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఉచిత ప్రయాణంతో భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా గత జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా లక్షల సంఖ్యలో భక్తులను చేరవేయగా, ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈక్రమంలో ఈ జాతరకు కూడా బస్సులకు భక్తులు పోటెత్తుతారని ఆర్టీసీ భావిస్తోంది. దీంతో 4 వేల ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులు ముందుగా నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17 ప్రత్యేక పాయింట్ల నుంచి బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు బస్ పాయింట్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. చురుగ్గా సాగుతున్న పనులు.. మేడారంలో ఆర్టీసీకి కేటాయించిన స్థలంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. జేసీబీలు, డోజర్లతో స్థలాన్ని చదును చేస్తున్నారు. దీంతో పాటు క్యూ రెయిలింగ్ పనులు మొదలు పెట్టనున్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బస్సుల పార్కింగ్, మరమ్మతుల షెడ్, కార్మికులు, అధికారుల వసతి, తాగు నీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాటుతోపాటు, ప్రయాణికులు బస్సులు తిరిగి వెళ్లే క్రమంలో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, భక్తులు బస్సులోకి చేరేందుకు రెయిలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సులు ఎక్కేందుకు 50 క్యూ రెయిలింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఒక్కసారిగా తిరుగు ప్రయాణానికి వస్తే వెనువెంటనే బస్సులు సమకూర్చేందుకు తాడ్వాయి వద్ద 6 ఎకరాల్లో పార్కింగ్తో పాటు టికెట్ జారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దారి మధ్యలో బస్సులు ఫెయిలైతే 12 మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. క్యాంపులు కూడా ఏర్పాటు చేసి మెకానిక్‌లను అందుబాటులో ఉంచుతారు.2026 జనవరి 28, 29, 30, 31 తేదీల్లో మేడారం జాతర వివిధ చోట్ల నుంచి జాతరకు 4 వేల బస్సులు.. మేడారంలో ఆర్టీసీకి 50 ఎకరాలు కేటాయింపు చురుగ్గా సాగుతున్న పనులు ఉచిత ప్రయాణంతో భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా -
ఏం వ్యాపారం చేశారని వందల కోట్లు సంపాదించారు..
హన్మకొండ చౌరస్తా: హరీశ్‌రావు, రామారావు, సంతోష్‌రావు, వినయ్‌భాస్కర్‌లు వైట్‌కాలర్ క్రిమినల్స్ అని, ఏ వ్యాపారాలు చేస్తున్నారని వీరికి వందల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌజ్‌లు సమకూరాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీఆర్ఎస్ నాయకుల పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్కెట్లో పత్తి కొనుగోల్లు ఎవరు చేస్తారో కూడా తెలియని దుస్థితిలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఉన్నాడన్నారు. రూ.600కోట్ల అవినీతి చేశాడన్న ఆయన మరదలు కవిత చేస్తున్న ఆరోపణలపై ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సర్పంచ్‌ను గెలుచుకోలేరని, పైగా డిపాజిట్లు కోల్పోతారని అన్నారు. వినయ్‌భాస్కర్ ఒకప్పడు మంచిగా ఉండేవాడని, ఆ తర్వాత కబ్జాలు, రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు. సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రైతులను ఓదార్చని వీరు ఇప్పుడు ఆంబోతుల మాదిరిగా ఊళ్లపై పడి తిరుగుతున్నారన్నారు. అంతకుముందు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, టీపీసీసీ బాధ్యులు ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, నాయకులు పల్లకొండ సతీశ్, బంక సరళ, బత్తుల స్వాతి, వీసం సురేందర్‌రెడ్డి, పెరుమాండ్ల రామకృష్ణ, రామంచ ఐలయ్య, గరిగె రాజు, పెద్దమ్మ సురేశ్ పాల్గొన్నారు. హరీశ్‌రావు, వినయ్ భాస్కర్లు వైట్‌కాలర్ క్రిమినల్స్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
ఏం సాధించారని విజయోత్సవాలు
హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించారని విజయోత్సవాలు నిర్వహిస్తారని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేశ్ ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి హంటర్ రోడ్‌లోని సత్యం కన్వెన్షన్ వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కన్వెన్షన్‌లో నిర్వహించిన బీజేవైఎం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్‌రెడ్డి విజయోత్సవాలు జరుపుతామనడం విడ్డూరంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసి గెలిచిందన్నారు. ఓరుగల్లు నుంచి తన మొదటి పర్యటన ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బీజేవైఎం హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు తీగల భరత్ గౌడ్, ఎర్రగొళ్ల భరత్ వీర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. మడికొండలో గణేశ్‌కు ఘనస్వాగతం.. సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేవైఎం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైక్ ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేశ్‌కు మడికొండలో ఘనస్వాగతం పలికారు. నాయకులు తక్కళ్లపల్లి నిఖిల్‌రావు, పొనగోటి వెంకట్రావు, మహేందర్, అజయ్, కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ -
ముసాయిదా విత్తన బిల్లుపై సదస్సు
హన్మకొండ: వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం ముసాయిదా విత్తన బిల్లు–2025పై సదస్సు నిర్వహించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ఎ.విజయభాస్కర్ ముసాయిదా విత్తన బిల్లు–2025పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వరంగల్ డీఏఓ అనురాధ, ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్‌ఈఏసీ మెంబర్ యాదగిరి, శాస్త్రవేత్తలు, విత్తన ధ్రువీకరణ అధికా రులు, జాతీయ విత్తన సంస్థ, రైతు ఉత్పత్తిదారుల సంఘం, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
మాడ్యూల్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: ‘లెట్స్ ఎన్రిచ్ అవర్ ఇంగ్లిష్’ అనే 30 రోజుల కార్యక్రమానికి సంబంధించి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రిసోర్స్‌పర్సన్స్ రూపొందించిన మాడ్యూల్‌ను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల్ని పెంపొందించేందుకు కలెక్టర్ ఆలోచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థి ఎలాంటి బిడియం లేకుండా ఆంగ్లంలో సులభంగా మాట్లాడే యాక్టివిటీస్ ఇందులో చేర్చినట్లు తెలిపారు. ఈమేరకు బుధవారం నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లోని కాంప్లెక్స్ రిసోర్స్‌పర్సన్స్‌కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, బండారు మన్మోహన్, మాడ్యూల్ రూపకర్తలు రోజారాణి, పద్మావతి, పండరీ వాసు, కోలా రవికుమార్, సంపత్, మహిపాల్ పాల్గొన్నారు. -
వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత
హన్మకొండ అర్బన్: వయోవృద్ధులను గౌరవించడం మనందరి బాధ్యత అని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్ఓ గణేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ.. తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, సీడీపీఓలు విశ్వజ, స్వరూప, ఉమ, కార్పొరేటర్ మానస రాంప్రసాద్, సూపర్వైజర్స్, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ అనితారెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ప్రభాకర్‌రెడ్డి, రామ్మూర్తి, నర్సయ్య పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.భాస్కర్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చే శారు. ఇప్పటి వరకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళా శాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించగా.. ఆయన స్థానంలో భాస్కర్‌ను నియమించారు. వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులను భాస్కర్‌కు అందజేశారు. హన్మకొండ చౌరస్తా: పిల్లలు వదిలేసినంత మాత్రాన ఒంటరిగా ఉండొద్దని, వారికి సమాజం అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభిరామారావు అన్నారు. వృద్ధుల, తల్లిదండ్రుల సంక్షేమ చట్టం–2007 వారోత్సవాల్లోని వృద్ధాశ్రమంలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా.. హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు మాట్లాడుతూ.. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు, వృద్ధులకు న్యాయ సేవలందిస్తామన్నారు. ఇతర సమస్యలేమైనా ఉంటే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామలింగం, కేయూ కౌన్సిల్ సభ్యురాలు అనితారెడ్డి, శుభ పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పెరిగిన శిక్షల శాతం ● పలు కేసుల్లో నేరస్తులపై కోర్టులో నేర నిరూపణ.. ● సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న పోలీసులు ● బలమైన ఆధారాలు, సాక్ష్యాధారాల సేకరణ వరంగల్ క్రైం: తప్పు చేస్తే...శిక్ష తప్పదు అనే భయం నేరస్తుల్లో ఉంటేనే క్రైం రేట్ తగ్గుతుందని పోలీస్ అధికారుల భావన. నేరాల నిరూపణకు అవసరమైన ఆధారాలను సాంకేతిక పరిజ్ఞానంతో సేకరించడంతో శిక్షల సంఖ్య పెరుగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన వివిధ కేసుల్లో పోలీస్ అధికారులు పక్కా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో సమర్పించడం వల్ల నిందితులకు శిక్షలు పడుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు కూడా నిందితుల బెదిరింపులకు లొంగకుండా, ప్రలోభాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సాక్షులకు మేం ఉన్నాం...అనే భరోసాను కల్పించి సరైన సమయంలో కోర్టుల్లో వాంగ్మూలం ఇప్పిస్తున్నారు. దీంతో కోర్టులు ఆధారాలు, సాక్షులను విచారించి నేరం చేసిన వారికి శిక్ష విధించి జైలుకు పంపిస్తున్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో సుజాత అనే వివాహిత కుటుంబంలో జరుగుతున్న గొడవలను దృష్టిలో పెట్టుకుని తన తమ్ముడు వెంకట్ సహకారంతో భర్త శంకర్‌ను ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేశారు. ఈ కేసులో గత జూలై 14న ఇద్దరిని దోషులుగా పరిగణించి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పుఇచ్చింది. 2020లో గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మారంలోని సాయివైన్స్‌లో అర్ధరాత్రి బిర్యానీ కోసం జరిగిన గొడవలో వైన్స్‌లో పనిచేస్తున్న రమేశ్‌ను అక్కడే ఉన్న పాన్‌షాపు యజమాని ప్రభాకర్ బీర్ బాటిల్‌తో తల పగులగొట్టి హత్య చేశాడు. ఈ ఏడాది జూన్ 29న కోర్టు ప్రభాకర్‌కు జీవిత ఖైదు విధించింది. మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం.. కోర్టులో దోషులకు శిక్షలు పడేలా మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం. ఎస్హెచ్ఓలు, ఏసీపీ, డీసీపీ స్థాయిలో ప్రతీవారం కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష నిర్వహించి అక్కడ జరుగుతున్న వాదోపవాదాలకు అవసరమైన సాక్ష్యాలను సమర్పించడం, సాక్షులకు ధైర్యం చెబుతున్నాం. ముఖ్యంగా కేసు నమోదునుంచి శిక్ష పడే వరకు ప్రతీదశలో పోలీస్ అధికారులు దర్యాప్తును పద్ధతి ప్రకారం చేయడం వల్ల శిక్షలు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో వీటి సంఖ్య మరింత పెరుగుతుంది. – సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ●ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధి నారాయణగిరి గ్రామానికి చెందిన ఆలకుంట రాజు, గట్టమ్మ భార్యాభర్తలు. రాజు తరచూ గొడవ పడి ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసు ఇవ్వాలని అడుగగా ఇవ్వకపోవడంతో మంచం కోడుతో ఆమె తలపై బలంగా కొట్టడంతో చనిపోయింది. 2019లో నమోదైన ఈ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాజుకు 8 ఏళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో 2019లో పోక్సో కేసు నమోదైంది. సీతంపేట గ్రామానికి చెందిన ఓ బాలికను భూపాలపల్లి జిల్లా రవినగర్‌కు చెందిన ఆకుల సాంబ మాయ మాటలు చెప్పి అపహరించినట్లు రుజువు కావడంతో అతడికి కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 21న ఏడేళ్ల శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విధించింది. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధి అమ్మవారిపేటకు చెందిన మైదం కొంరయ్య తన భార్యకు ఉరి వేసి హత్య చేసినట్లు 2024లో కేసు నమోదు కాగా.. ఈ ఏడాది జూలై 1న అతడికి జీవితఖైదు విధించింది. 2018లో మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధి శివసాయి మందిరంలో పూజారిగా పనిచేస్తున్న దేవల్ల సత్యనారాయణ శర్మను స్పీకర్ ఎక్కువ శబ్దంతో పెడుతున్నావు అనే కారణంతో ఓ ముస్లిం యువకుడు కత్తితో దాడి చేశా డు. హత్యాయత్నం కేసులో నిందితుడికి ఈ ఏడాది జనవరి 24న జీవిత ఖైదు, రూ.15వేల జరిమానా విధించింది. -
ఇక.. బడిబయటి పిల్లల సర్వే
ఇంటింటికి తిరగనున్న సీఆర్పీలు, ఐఈఆర్పీలు ● ఉమ్మడి జిల్లాలో నేటినుంచి ప్రారంభంవిద్యారణ్యపురి: బడి బయటి పిల్లలను గుర్తించేందుకు నేటి(గురువారం)నుంచి సీఆర్పీలు ఇంటింటి సర్వే చేయనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. కొన్ని సామాజిక, ఆర్థిక పరిస్థితులతో కొందరు పిల్లలు పాఠశాలలకు దూరమవుతున్నారు. మరికొందరు ప్రాథమికస్థాయి విద్య తర్వాత మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారు. అలాంటి పిల్లలను గుర్తించి బడిబాట పట్టించేందుకు సర్వే నిర్వహించాలని విద్యాశాఖ రాష్ట్ర సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇటీవల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అందుకు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇంటింటి సర్వే సీఆర్పీలు, ఐఈఆర్పీలు తమతమ హ్యాబిటేషన్ స్థాయిలో ఇంటింటికెళ్లి సర్వే నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలో ఈ నెల 20నుంచి డిసెంబర్ 31వరకు సీఆర్పీలు 36 మంది, ఐఈఆర్పీలు 14మంది ఐదు ఫార్మట్లలో ఈ సర్వే చేయనున్నారు. పాఠశాలలకు రాని పిల్లలు, మధ్యలోనే చదువు మానేసిన పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది. రెండు రకాల గ్రూపులుగా పిల్లలు ఈ సర్వేలో రెండు రకాల గ్రూపులుగా పిల్లలను గుర్తించాలి. బడిబయట ఉన్న పిల్లల్లో 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సు వరకు, 15 ఏళ్లనుంచి 19 ఏళ్ల వయస్సు వరకు గల బడిబయట ఉన్నవారిని గుర్తిస్తారు. ఆయా పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. 2026, జనవరి 2న మండల స్థాయి సమీకరణ, సమస్యలు, వయస్సువారీగా, పాఠశాలల వారీగా వివరాలు సేకరించి తుది జాబితా రూపొందిస్తారు. అనంతరం డీఈఓలకు నివేదిస్తారు. వీరు జనవరి 12న తుది నివేదికను సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు అందజేయనున్నారు. అవసరమైతే ప్రత్యేక పాఠశాలలు కూడా.. బడిబయట ఉన్న బడీడు పిల్లల్లో వలసదారులు ఉంటే వారిని, వలసవెళ్లిన తల్లిదండ్రుల పిల్లలు ఉంటే వారిని ప్రత్యేకంగా ఈ సర్వే ద్వారా గుర్తిస్తారు. వీరికి అవసరమైతే ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తారు. అందులో సీజనల్ హాస్టళ్లుగా నాన్ రెసిడెన్షియల్‌గా ఏర్పాటు చేస్తారు. మిగతా బడిబయటి పిల్లలను హ్యాబిటేషన్ల వారీగా సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నారు. అందరికీ విద్య అందించాలనే సంకల్పం బడీడు పిల్లలందరికీ విద్య అందించాలన్నదే ఈ సర్వే లక్ష్యం. వివిధ కారణాలతో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలను చేర్పించనున్నారు. హనుమకొండ జిల్లాలో 36 స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సీఆర్పీలు హ్యాబిటేషన్ల వారీగా సర్వే నిర్వహించి వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. – మన్మోహన్, హనుమకొండ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ -
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం
వరంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాన్ అకాడమీ తరగతులు ● గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఉచిత డిజిటల్ క్లాసులు కాళోజీ సెంటర్: ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యావ్యవస్థ వేగంగా మారుతోంది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధించే పాఠాలకు తోడుగా విద్యార్థులకు సాంకేతిక ఆధారిత అభ్యాసం అందించడం అత్యవసరమైంది. ఈనేపథ్యంలో విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించేందుకు అంతర్జాతీయంగా పేరుగాంచిన ఖాన్ అకాడమీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత తరగతులు ప్రారంభించింది. జిల్లాలో 121 ప్రభుత్వ పాఠశాలలు, 10 కేజీబీవీలు, 6 టీజీఎంఎస్, 1 టీజీఆర్‌ఈఐ ఎస్, 1 యూఆర్ఎస్ మొత్తం 139 పాఠశాలలు ఉన్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు గణితం, సైన్స్ బోధించే ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు ఖాన్ అకాడమీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని డిజిటల్ తరగతులు వింటున్నారు. విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యాలు సాధించేలా కృషిచేస్తున్నారు. గణితంలో వీడియోలతో బోధన.. గణితంలో ముఖ్య భావనలను అర్థం చేసుకోకపోవడంతో విద్యార్థులు పట్టు సాధించలేకపోతూ వెనుకబడుతున్నారు. చిన్నచిన్న వీడియోలుగా సులభమైన భాషలో ఖాన్ అకాడమీ విద్యార్థులకు బోధన చేస్తోంది. కూడిక, తీసివేత, భిన్నాలు, బీజగణితం, జ్యామితి, త్రికోణమితిలో విద్యార్థి తప్పు చేస్తే వెంటనే ఎందుకు తప్పో చూపిస్తుంది. ఇది సమస్య పరిష్కార నైపుణ్యలను వివరిస్తుంది. వేగంగా నేర్చుకోవాలనుకునే వారు ప్రాథమికంగా బలోపేతం అవుతారు. సైన్స్‌లో యానిమేషన్ రూపంలో.. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్ర భావాల వీడియోలు ఉంటాయి. శక్తులు, చలనం, శక్తి ఆవర్తన పట్టిక, ప్రతి చర్యలు యానిమేషన్ రూపంలో అర్థమయ్యేలా చూపిస్తారు. సైన్స్ ఒక పాఠ్యపుస్తకం కాదు, కాన్సెప్ట్స్‌ను చూసే చేర్చుకునేందుకు ఖాన్ అకాడమీ సాయపడుతుంది. దీని ద్వారా ఆత్మవిశ్వాసం, విద్యార్థి వేగంలో నేర్చుకోవడంతో భయం, ఒత్తిడి తగ్గుతుంది. పాఠాలు అర్థంకాక పోతే మళ్లీ మళ్లీ చూడవచ్చు. దీని ద్వారా డిజిటల్ అక్షరాస్యత పెరుగుతుంది. ఖాన్ అకాడమీతో డిజిటల్ బోధన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక (డిజిటల్) ఆధారిత విద్య అందించడం అత్యవసరం. ఈనేపథ్యంలో ప్రభుత్వ విద్య బలోపేతం కోసం అంతర్జాతీయంగా పేరు గాంచిన ఖాన్ అకాడమీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠాలు బోధిస్తోంది. జిల్లాలో 90 శాతం మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – ఉండ్రాతి సుజన్‌తేజ, వరంగల్ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి -
ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం
మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ వరంగల్ అర్బన్: వరంగల్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని, మూడేళ్లకోసారి సెప్టిక్ ట్యాంకులను ఖాళీ చేయించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం వరల్డ్ టాయిలెట్డే ను పురస్కరించుకుని బల్దియా ప్రధాన కార్యాలయంలో సెప్టిక్ ట్యాంక్, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులు, శానిటేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఉత్తమ సేవలందించిన సెప్టిక్ ట్యాంక్, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులను శాలువాలతో సత్కరించారు. ఈసందర్భంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రతపై ప్రజల్లో అవగాహన కోసం సెప్టిక్ ట్యాంక్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ర్యాలీని మేయర్, కమిషనర్లు సంయుక్తంగా ప్రారంభించారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి ఖాజీపేట వరకు కొనసాగింది. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్, భాస్కర్, సూపరింటెండెంట్ దేవేందర్, ఆస్కీ ప్రతినిధి రాజ్‌మోహన్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఔట్‌సోర్సింగ్‌తోనే కలెక్షన్లు
వరంగల్ అర్బన్ : కొత్తగా నిర్మిస్తున్న, పూర్తయిన భవనాలు, సముదాయాలే టార్గెట్‌గా ఔట్సోర్సింగ్ చైన్మెన్లు, మరోవైపు బిల్ కలెక్టర్లు నిబంధనల పేరిట యజమానులను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేదని, ఒకవేళ ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం సాగుతోందని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. వామ్మో ఇంతమొత్తంలో తాము చెల్లించలేమని యజమానులు పేర్కొంటుండడంతో ఎవరికీ అనుమానం రాకుండా సదరు బిల్లింగ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు, వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ఇంజనీర్లు అభివృద్ధి పనుల పేరిట వర్క్ ఇన్స్పెక్టర్లను, లైన్మెన్లను పర్సంటేజీల కోసం వాడుకుంటున్నట్లు.. టిఫిన్ సెంటర్ నుంచి పెద్ద హోటల్ వరకు, ప్లాస్టిక్ షాపులు, కార్మికులు హాజరు వేసి విధులకు డూమ్మా కొట్టిన తదితర అంశాల్లో జవాన్ల ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్లు కాసుల బేరసారాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఉద్యానవన విభాగం, అర్బన్ మలేరియాలో ఇదే పరిస్థితి దాపురించిందని పలువురు చెప్పుకుంటున్నారు. నాలుగున్నర వంతు ఔట్సోర్సింగ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 700 మంది వరకు పర్మనెంట్ ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. ఔట్సోర్సింగ్, కార్మికులు, సిబ్బంది 3,208 మంది ఉన్నారు. అంటే ఒకవంతు పర్మనెంట్ ఉద్యోగులు ఉంటే.. నాలుగున్నర వంతులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోదాల వారీగా పంపకాలు.. ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా వసూలు చేసిన సొమ్మును తాము మాత్రం తీసుకోవడం లేదని, వివిధ హోదాల్లోని ఉన్నతాధికారుల వరకు వాటాలుగా ముట్టచెబుతున్నామని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు చెబుతున్నారు. పోస్టింగ్‌లు, అంతర్గత, ఇతర ప్రాంతాల్లో బదిలీలకు పాలక వర్గం పెద్దలు, ప్రజాప్రతినిధులుకు, అధికారులకు సొమ్ము చెల్లించుకోవాల్సి వస్తోందని నిట్టూరుస్తున్నారు. ఇలా బల్దియాలో ప్రతీ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోందనే విమర్శలున్నాయి. ఈ విషయంపై ఆయా విభాగాల అధికారులను వివరణ కోరితే అదేమీ లేదని సమాధానమిచ్చారు.తెల్లారితే డివిజన్లలో ఇంటింటా జల్లెడ నిబంధనల పేరిట అడ్డగోలుగా వసూళ్లు బల్దియాలో బరితెగిస్తున్న అవినీతిపరులు పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు ఆయా విభాగాల్లోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వసూళ్ల కోసం తమ వద్ద పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం కేటాయించిన డివిజన్లలో ఇంటింటా జల్లెడ పట్టాలని ఆదేశాలిస్తూ భవన నిర్మాణం జరుగుతుంటే రెక్కీ మాదిరిగా సదరు చైన్‌మెన్ అక్కడికి చేరుకుని పర్మిషన్ కాపీ అడుగుతున్నట్లు భవన యజమానులు చెబుతున్నారు. లేదంటే రూ.20వేల నుంచి భవన నిర్మాణాన్ని ఆధారంగా రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు వాపోతున్నారు. పర్మిషన్ ఉంటే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు, లేకపోతే రూ.లక్ష వరకు తీసుకుంటూ పన్ను విధిస్తున్నట్లు సమాచారం. చివరికి డీజిల్, ఫాగింగ్.. ప్రతీ పనిలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, కార్మికుల ద్వారా అక్రమ వసూళ్లకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ కారణాలు చెబుతూ వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
నేటినుంచి మళ్లీ పత్తి కొనుగోళ్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: పత్తి కొనుగోళ్లపై 48 గంటల ప్రతిష్ఠంభనకు తెరపడింది. కాటన్, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్, మార్కెటింగ్, సీసీఐ, వ్యవసాయశాఖల మంత్రులు, అధికారుల చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం, సీసీఐల నుంచి స్పష్టమైన హామీ రావడంతో బుధవారం నుంచి పత్తి కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం కాటన్, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం సైతం రైతులు పత్తి విక్రయాల కోసం రావొచ్చని ప్రకటించారు. 60 కేంద్రాలకు 39 ప్రారంభం ఈ సీజన్లో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ, మార్కెటింగ్, వ్యవసాయశాఖలు 60 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశారు. అందులో ఈ నెల 15 నాటికి 39 ఓపెన్ కాగా, 1,74,289.78 క్వింటాళ్ల పత్తిని సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రైతులను మోంథా తుపాను నిండా ముంచింది. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,110కు బదులు తేమ పేరుతో శనివారం కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,195లే ఇచ్చారని రైతులు చెబుతున్నారు. ఇలాగైతే పెట్టుబడులు రాక, అప్పుల పాలు కావాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్చలు, హామీ మేరకు పత్తి కొనుగోళ్లు కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్, సీసీఐ, సీఎండీ ఇతర అధికారులతో మంగళవారం చర్చలు జరిగాయి. వారం, పది రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా బంద్‌ను విరమించి కొనుగోళ్లు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. – బొమ్మినేని రవీందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ హైదరాబాద్‌లో సఫలమైన చర్చలు.. ఉమ్మడి వరంగల్‌లో 60 కేంద్రాల ప్రతిపాదన.. 39 చోట్ల కొనుగోళ్లు షురూ -
అతివేగంతోనే అత్యధిక ప్రమాదాలు
డీటీసీ సురేశ్‌రెడ్డి హన్మకొండ చౌరస్తా: మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జి.సురేశ్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని అశోకా హోటల్లో మంగళవారం రోడ్డు భద్రత, వివిధ చట్టాల ప్రమేయం, వినియోగదారుల హక్కులపై సదస్సు నిర్వహించారు. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా సురేశ్‌రెడ్డి హాజరయ్యారు. సదస్సులో పాల్గొన్న 28 వినియోగదారుల సంఘాల ప్రతినిధులు రోడ్డు భద్రతపై సూచనలిచ్చారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై తీర్మానం ప్రవేశపెట్టగా సెమినార్ ఆమోదించింది. దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్, మున్సిపల్ ఈఈ మాధవి, జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్, బూరుగుపల్లి శ్రవణ్‌కుమార్, మామిడి భీంరెడ్డి, సుప్రభ, ప్రవీణ్‌కుమార్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
5.O అమలు తీరు పరిశీలన
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సురక్షిత, శుభ్రమైన పాఠశాల 5.O కార్యక్రమ అమలు తీరును మంగళవారం రాష్ట్ర పరిశీలకులు ఎస్ఐఈటీ ప్రొఫెసర్ డాక్టర్ రవికాంత్ పరిశీలించారు. దామెర, పరకాల, నడికూడ, శాయంపేట మండలాల్లో ఆయన పర్యటించారు. దామెరలోని ఉన్నత పాఠశాల, శాయంపేటలోని కేజీబీవీ, పరకాలలో బాలుర ఉన్నత పాఠశాల, పులిగిల్ల ప్రాథమికోన్నత పాఠశాల, చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో స్వచ్ఛత గురించి హెచ్ఎంలు రోజువారీ కార్యాచరణ ప్రణాళికలు ఎలా అమలు చేస్తున్నారనేది తెలుసుకున్నారు. తరగతి గదులు, వంట గది, గ్రంథాలయం, ప్రయోగశాల, ఆటస్థలం, మూత్రశాలల్లో పరిశుభ్రతను పాటిస్తున్నారా లేదా? తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లో హెచ్ఎంలతో మాట్లాడారు. కాగా, బుధవారం పలు పాఠశాలల పరిశీలన అనంతరం ఆయన డీఈఓ కార్యాలయంలో సమీక్షించనున్నారు. రవికాంత్ వెంట హనుమకొండ జిల్లా కమ్యునిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఆయా మండలాల విద్యాఽధికారులు రాజేశ్, భిక్షపతి, రమాదేవి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు హనుమకొండలోని రెండు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వెంకటయ్య పరీక్షల తీరును పరిశీలించారు. ఈనెల 19న డిగ్రీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని వారు తెలిపారు. విద్యార్థుల గైర్హాజరుపై అదనపు కలెక్టర్ అసంతృప్తి హసన్‌పర్తి: విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరైతే ఫలితాలు ఎలా సాధ్యమవుతాయని అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి హసన్‌పర్తిలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల హెచ్ఎంను ఆదేశించారు. నషా ముక్త్ కార్యక్రమంలో భాగంగా, మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై పాఠశాలల్లోని రికార్డులు పరిశీలించారు. బాలుర పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా గ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోవడం వల్ల కట్టెల పొయ్యిమీదనే వంట చేస్తున్నట్లు బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు వెంకటరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వారిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎంఓ ఇన్చార్జ్ డీఈఓ వెంకట్, వన్మోహన్, ప్రధానోపాధ్యాయులు సుమాదేవి, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో బడిబయటి పిల్లల సర్వే అమలుపై జిల్లా స్థాయి కీలక సమావేశాన్ని కలెక్టరేట్లో ఈనెల 19న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. సమావేశానికి ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు, ఐఈఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌లు, కార్మిక, మహిళా శిశుసంక్షేమ, పోలీస్వంటి అధికారులు హాజరు కావాల్సి ఉంటుందని హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ మంగళవారం తెలిపారు. సర్వే చేపట్టడంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ, ధ్రువీకరణకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. సంబంధిత అఽధికారులు సమగ్ర వివరాలతో విధిగా సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. -
రేవంత్ మాటలు ఘనం.. చేతలు శూన్యం
వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయన చెప్పే మాటలు ఘనంగా ఉంటున్నాయని, చేతలు మాత్రం శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. మక్కలు, పత్తి యార్డుల్లోని రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో రైతుల పక్షపాతి ఒక్క కేసీఆర్ మాత్రమేనని, ఆయన మొట్టమొదటిసారిగా రైతుబంధ ఇచ్చి రైతులను ఆదుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. సీసీఐ అడ్డమైన ఆంక్షలు పెట్టి ఆగమాగం చేస్తున్నా రేవంత్‌రెడ్డి లేఖలు రాస్తూ పట్టించుకోవడం లేదన్నారు. పంటలకు బోనస్ ఇస్తామని అనడమే కానీ, ఇచ్చింది లేదన్నారు. ఎల్–1, ఎల్–2, కపాస్ యాప్, తేమశాతం వంటి తుగ్లక్ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. జూబ్ల్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్‌రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారని ఆరోపించారు. మక్క రైతులతో మాటామంతి.. అంతకుముందు అపరాల యార్డుకు వెళ్లిన హరీశ్‌రావు మక్కలను పరిశీలించారు. అమ్మడానికి వచ్చిన ములుగు జిల్లాకు చెందిన రైతులు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్యతో ముచ్చటించారు. మక్కలను ఎంతకు అమ్మారు? అని ప్రశ్నించగా రూ.1,825కు అని సమాధానం చెప్పారు. మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ఉంది కదా అని అంటే.. వారు ట్రేడర్‌కు అమ్మామని, ఆయన వెంటనే డబ్బులు ఇవ్వడమే కాకుండా పంట వేసేందుకు ముందుగా పెట్టుబడి పెడుతున్నందున విక్రయించామని చెప్పారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మక్కలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల మార్క్‌ఫెడ్ రైతులకు డబ్బులు చెల్లించలేకపోతోందని హరీశ్‌రావు అన్నారు. అందువల్ల క్వింటాకు రైతులు రూ.575 నష్టపోతున్నా ట్రేడర్లకే అమ్ముకుంటున్నారని వాపోయారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ టి.రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఒడితల సతీశ్‌కుమార్, నన్నపునేని నరేందర్, సరోగసి కమిటీ మాజీ సభ్యురాలు డాక్టర్ హరిరమాదేవి, ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్న సీఎం కాంగ్రెస్ పాలనలో కరెంటునుంచి కాంటా దాకా అన్నీ సమస్యలే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వరంగల్ ఏనుమాముల మార్కెట్ సందర్శన.. రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రి కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను తన్నీరు హరీశ్‌రావు సందర్శించి, రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, బోనస్ రాక, మరోవైపు యూరియా, రైతుబంధు, రైతు బీమా అందకపోవడంతో గోసపడుతున్న రైతులంతా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై శాపనార్దాలు పెడుతున్నారని విమర్శించారు. కేసముద్రం మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవని, పందులు, మేకలు తిరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. -
డ్రగ్స్ రహిత నగరానికి కృషి చేయాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి సమన్వయంతో పని చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల నుంచి జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం వరకు బల్దియా అధికారులు, సిబ్బంది, కార్మికులు వివిధ కార్మిక సంఘాలు కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరితో మేయర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ఈ సత్యనారాయణ సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్ ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఉప కమిషనర్లు సమ్మయ్య, ప్రసన్నారాణి, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు పెనాల్టీ తొలగింపును వినియోగించుకోవాలి.. అసెస్మెంట్లకు స్వీయ కొలతలు తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల 25 రెట్లు పెనాల్టీ నమోదైన నగరవాసులు ఈ పెనాల్టీ మినహాయించి రివైజ్డ్ పన్ను చెల్లించాలని, ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని మేయర్ సుధారాణి కోరారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. సమావేశంలో అదనవు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ఈ సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
జల సంరక్షణలో వరంగల్ మొదటిస్థానం
కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024–25 సంవత్సరానికి గాను జల సంచాయ్, జన్ భాగీదారి 1.0 అవార్డుకు దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ–2లో వరంగల్ జిల్లాకు మొదటిస్థానం దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ చేతుల మీదుగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అవార్డుతోపాటు రూ.కోటి నగదును అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల సమష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాంరెడ్డి ఉన్నారు. -
సంఘాలు, సమాఖ్యలు అభివృద్ధి పథంలో సాగాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలు అభివృద్ధి పథంలో సాగాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుని పొదుపుతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అమూల్, ముల్కనూరు సొసై టీ, విజయ డైరీని స్ఫూర్తిగా తీసుకుని ఇతర సొసైటీలు విజయపరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ.. సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా ఉత్తమ సహకార సంఘాలు, ఉత్తమ మహిళ సమాఖ్యలకు జ్ఞాపికలు అందించా రు. కార్యక్రమంలో సహకార యూని యన్ సీఎండీ అన్నపూర్ణ, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, డీసీఓ సంజీవరెడ్డి, కాకతీయ సహకార శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ యాకూబ్, నాబార్డు డీజీఎం చంద్రశేఖర్, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా మత్స్యశాఖ అధికా రి శ్రీపతి, డీసీసీబీ అధికారులు, సహకార సంఘాలు, మహిళా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలి హన్మకొండ అర్బన్: ప్రభుత్వ జూనియర్, వివిధ గురుకుల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించేలా కోచింగ్ ఇవ్వాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో ఇంటర్మీడిఝెట్ సాంఘిక సంక్షేమ, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ విద్యాలయాల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్ఓ వై.వి గణేశ్, డీటీడబ్ల్యూఓ ప్రేమకళ, బీసీ సంక్షేమాధికారి నరసింహస్వామి, వివిధ గరుకులాల ఆర్సీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
ఏనుమాముల.. వెలవెల
బోసిపోయిన పత్తియార్డు నిరవధిక సమ్మె చేపట్టిన ట్రేడర్స్, మిల్లర్స్ వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా కాటన్ జిన్నింగ్ మిల్లర్లు, ట్రేడర్లు సీసీఐ అమలు చేస్తున్న నిబంధనలను నిరసిస్తూ సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో విక్రయించేందుకు రైతులు ఒక్క బస్తా కూడా తీసుకురాకపోవడంతో మొత్తం వెలవెలబోయింది. పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులు, ట్రేడర్లు చేపట్టిన సమ్మె ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి విక్రయాలకు రాకపోవడంతో తూకం వేసి యంత్రాలు యార్డుల్లో మూలకు చేరాయి. సమ్మె చేపట్టిన ప్రైవేటు వ్యాపారులతో పత్తిని కొనుగోలు చేయాలని మార్కెట్లోని దడువాయిలు, కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమ్మైపె దృష్టి పెట్టడంతో రెండు రోజుల్లో సమ్మె విరమించే అవకాశం ఉందనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ అధికారులు మాత్రం పత్తి మిల్లుల్లోని కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు చేస్తామని అంటున్నారు. రెండు రోజుల క్రితం వరకు కొనుగోలు చేసిన పత్తిని ప్రైవేటు వ్యాపారులు యార్డుల్లో నిల్వ చేసినట్లు గుర్తించగా మార్కెట్ అధికారులు వాటిని తీసుకుపోవాలని ఆదేశించడంతో పత్తి బస్తాలను తీసుకువెళ్లారు. -
పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు : సీపీ
వరంగల్ క్రైం : ‘వాతావరణంలో పొగమంచు ప్రభావం పెరుగుతోంది. వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దు’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ప్రజలకు సూచించారు. పొగమంచు వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, రాత్రి, తెల్లవారుజామున రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవని పేర్కొన్నారు. పొగమంచు ఎక్కువగా ఉండే వేళల్లో వాహనాలను వేగంగా నడపొద్దని శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలని సూచించారు. తక్కువ వీక్షించే సామర్థ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, హెడ్లైట్లను బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవడంతోపాటు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని వివరించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మికంగా ఓవర్ టెక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్ప డొద్దని సూచించారు. పోలీసుల సూచనలతోపాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే వరంగల్ పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ వెల్లడించారు. వరంగల్ లీగల్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, వరంగల్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి విజయసేనారెడ్డిని సోమవారం బార్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా జడ్జిని శాలువాతో సత్కరించి, పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్ మాట్లాడారు. వరంగల్ జిల్లా కోర్టును వరంగల్ ప్రాంతానికి తరలించడం, ప్రత్యేక ఫ్యామిలీ కోర్టు మంజూరు, అడిషనల్ సబ్ కోర్టు ఏర్పాటు, కోర్టు హాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించేందుకు అనుమతి, బార్ అసోసియేషన్ భవనానికి లిఫ్ట్ ఏర్పాట్లపై విన్నవించగా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి దండావంతుల రమాకాంత్, సురేష్ పాల్గొన్నారు. హన్మకొండ : ప్రయాణికుల అవసరాల మేరకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో శ్రీశైలం, తిరుపతికి ఏసీ రాజధాని బస్సును ఆర్ఎం విజయభాను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతికి వెళ్లే బస్సు ప్రతిరోజూ ఉదయం 8:40కి, శ్రీశైలం బస్సు ప్రతిరోజూ ఉదయం 9గంటలకు హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నారు. వయా ఉప్పల్ రింగ్‌రోడ్, ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్ ద్వారా ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు. డిప్యూటీ ఆర్ఎం(ఆపరేషన్) భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ అర్పిత, బస్ స్టేషన్ మేనేజర్ మల్లేశం పాల్గొన్నారు. ఎంజీఎం: వరంగల్, భూపాలపల్లి, జనగామ జిల్లాల పరిధిలోని పలు మెడికల్ షాపుల్లో డ్రగ్స్ అండ్ కంట్రోల్ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఔషధ నియంత్రణ పరిపాలన ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ సంచాలకులు రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ తనిఖీల్లో ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం–1940 నిబంధనలు, 1945లోని నిబంధనలు ఉల్లంఘించిన పలు మెడికల్ దుకా ణాలకు నోటీసులు జారీ చేశామని పేర్కొ న్నారు. మత్తు అలవాటు కలిగించే మందులను, యాంటీబయోటిక్స్‌ను అర్హత ఉన్న వైద్యుల ప్రీస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతీ కొనుగోలు దారుడికి తప్పకుండా బిల్లు ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఔషధ నియంత్రణ అధికారి జున్ను కిరణ్ కుమార్, బాలకృష్ణ, పి.పావని తదితరులు పాల్గొన్నారు. -
పిండవుతున్న పచ్చని కొండలు
కాజీపేటకు పొంచి ఉన్న ఉపద్రవంకాజీపేట: ప్రాణ వాయువునిచ్చే పర్యావరణ కవచాలు సహజసిద్ధ పచ్చని కొండలు. ఇలాంటి ప్రకృతి సంపదను కొందరు చెరబడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ నగరానికి రక్షణ కవచంగా చుట్టూ పదుల సంఖ్యలో కొండలు, గుట్టలున్నాయి. ఇవి కొన్నేళ్లుగా కరిగిపోతున్నాయి. గుట్టలు, కొండలపై కురిసే వర్షం అక్కడినుంచే వాగులు, వంకల్లోకి వెళ్తుంది. ఇప్పుడు వాటి చుట్టూ ఉన్న కొండలను పిండి చేస్తున్నారు. గుట్టల నలువైపులా ఉన్న ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నారు. నీరొచ్చే మార్గాలు కనుమరుగవుతుండటంతో వర్షం నీరు ఎక్కడికి పోవాలి? నేరుగా పట్టణంలోకే రావాలి? అప్పుడు పరిస్థితి ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య లోపించిన సమన్వయం.. కాజీపేట చుట్టూ గుట్టలు, కొండలను తోడేసి అక్రమంగా మట్టి, రాయి, గ్రానైట్ వ్యాపారం చేస్తున్న వ్యాపారుల ఆటలను అధికారులు కట్టించలేకపోతున్నారు. వీటి రవాణాను ఎక్కడా తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. వాస్తవానికి మైనింగ్ శాఖ ఏడీలు, సర్వేయర్లు, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో తరచూ పర్యవేక్షించి ఎక్కడ అక్రమ రవాణా చేసినా పట్టుకుని చలానాలు విధించి, వాహనాలు సీజ్‌చేసి కేసు నమోదు చేయాలి. కానీ, ఈ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వీటి పనితీరు అంతంత మాత్రమేననే వాదనలు ఉన్నాయి. ఇప్పటికై నా రెండు శాఖల అధికారులు సమన్వయంతో కాజీపేట మండలంతో పాటు పట్టణంలో క్షేత్రస్థాయితో పర్యటన చేయాలని పలువురు కోరుతున్నారు. అప్పుడే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ క్వారీల నిర్వహణ వెలుగుచూసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తనిఖీలు చేయాలని స్థానికుల డిమాండ్ -
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు
హన్మకొండ : పదేళ్ల పాలనలో కేసీఆర్ రైతును రాజును చేస్తే.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలకు గురిచేస్తోందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలోఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 7లక్షల మంది పత్తి రైతులు ఉన్నారని తెలిపారు. తేమశాతం, కపాస్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో కొనుగోలు నిరాకరిస్తున్న సీసీఐ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి పత్తి కొనుగోలుపై నిర్దిష్ట విధానం లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లా నుంచి కొండా సురేఖ, సీతక్క అనసూయ మంత్రులుగా ఉన్న రైతులకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పత్తి రైతులు గోసపడుతుంటే రేవంత్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నేడు(మంగళవారం) ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి పత్తి రైతులతో మాట్లాడి నేరుగా సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్నేడు ఏనుమాముల మార్కెట్‌కు హరీశ్‌రావు వరంగల్ : పత్తి కొనుగోళ్లు బంద్ చేసినందున రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించేందుకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేడు (మంగళవారం) ఉదయం 9గంటలకు ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శిస్తారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యార్డును పరిశీలించి రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు. -
మేడం.. సమస్యలు పరిష్కరించండి
గ్రేటర్ గ్రీవెన్స్‌లో కమిషనర్‌కు వినతులువరంగల్ అర్బన్ : ‘మేడం.. మేం ఆస్తి, నీటి, చెత్త పన్నులు చెల్లిస్తున్నాం. కానీ మా కాలనీల్లో కనీస వసతులు లేవు. అభివృద్ధి పనులు చేయాలి’ అని పలు కాలనీల వాసులు బల్దియా కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్‌లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను కమిషనర్ ఆదేశించారు. గ్రీవెన్స్‌కు 86 దరఖాస్తులు రాగా అందులో టౌన్ ప్లానింగ్–33, ఇంజనీరింగ్– 29, రెవెన్యూ సెక్షన్‌కు–6, హెల్త్, శానిటేషన్–12, నీటి సరఫరా ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, డీఎఫ్ఓ శంకర్లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చిన కొన్ని సమస్యలు ఇలా.. ● 17వ డివిజన్లో విచ్చలవిడిగా పందులు తిరుగుతూ పిల్లలపై దాడులు చేస్తున్నాయని, 50వ డివిజన్లోని 1–9–1285 ప్రాంతంలోని వీధి కుక్కల అక్కడినుంచి తరలించాలని కాలనీవాసులు వేడుకున్నారు. ● 56వ డివిజన్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ● 17డివిజన్ శంభునీపేట కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదని స్వప్న, గోపి ఫిర్యాదు చేశారు. ● 29వ డివిజన్ రామన్నపేట శ్మశానవాటికలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సీపీఎం ఏరియా కమిటీ నాయకులు విన్నవించారు. ● 27వ డివిజన్ కృష్ణాకాలనీలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, న్యాయం చేయాలని 15కుటుంబాల సభ్యులు ఫిర్యాదు చేశారు. ● 55వ డివిజన్ భీమారంలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ కోసం 20శాతం కంట్రిబ్యూషన్ కోసం నిధులు వెచ్చించామని పనులు చేపట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండ కంచరకుంట 2019లో లేఅవుట్ ఉందని, రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానంగా తయారయ్యాయని కొత్తగా నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● 54వ డివిజన్ హనుమాన్ నగర్లో రోడ్లు అక్రమణకు గురవుతున్నాయని చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ● హనుమకొండ రాయపురలోని పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలు దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేయాలని కాలనీవాసులు దరఖాస్తు చేశారు. ● 1వ డివిజన్ ఎర్రగట్టుగుట్ట వద్ద పిల్లల పార్కు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరారు. ● 56వ డివిజన్ విష్ణుపురి కాలనీలో సమస్యలు పరిష్కరించాలని స్థానికులు విన్నవించారు. ● 2వ డివిజన్ వంగపహాడ్ మెయిన్ రోడ్డులో డ్రె యినేజీ అస్తవ్యస్తంగా మారిందని, నూతనంగా నిర్మించాలని కార్పొరేటర్ రవి ఫిర్యాదు చేశారు. -
కార్తీక రద్దీ..
కార్తీకమాసం చివరి సోమవారం శివాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. వేయిస్తంభాల ఆలయంలో భక్తులు ఉదయమే స్వామివారి దర్శనానికి బారులుదీరారు. దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా వరంగల్ శివనగర్‌లోని రామలింగేశ్వరస్వామికి అన్నపూజ నిర్వహించారు. శివలింగాన్ని ప్రత్యేకంగా రేబాన్ కళ్లద్దాలతో అలంకరించడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ/ఖిలా వరంగల్ -
ప్రతిరోజూ తడిచెత్త ప్లాంట్‌కు చేరాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : ప్రతి రోజు తడిచెత్త బయో కంపోస్ట్ ప్లాంట్‌కు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలో బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్మీ కంపోస్ట్ యూనిట్లో బయో కంపోస్ట్ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన ట్రయల్ రన్‌ను కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరానికి సంబంధించి శానిటేషన్ విధానంలో సుస్థిరమైన మార్పును తీసుకురావాలన్నారు. ఐదు బయో కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిర్వహణ తీరు తెలుసుకోవడానికి ట్రయల్ రన్లు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ మహేందర్, ఏఈ సంతోష్, శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, వావ్ ప్రతినిధి పవన్ పాల్గొన్నారు. మహిళా సంఘాల లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించాలి నగర పరిధిలోని మహిళా సమైక్య సంఘాలు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అమత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మా, హార్టికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ..మెప్మాతో పాటు హార్టికల్చర్ సమన్వయం చేసుకుంటూ మూడు పార్కుల్లో విధులు నిర్వహించడానికి స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీలను) గుర్తించాలని ఇందుకోసం అనుమతులు వచ్చాయన్నారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీహెచ్ఓ రమేష్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, హెచ్ఓ లక్ష్మారెడ్డి, టీఎంసీలు రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐ సాంకేతికతతో శానిటేషన్ నియంత్రణఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో శానిటేషన్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఐసీసీసీ కేంద్రంలో క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడే అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా శానిటేషన్తో పాటు ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్లపై సమావేశం నిర్వహించారు. ఐసీసీసీ ప్రతినిధులు కేంద్రం ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. వార్డులో స్వచ్ఛ ఆటోలన్నింటికీ రూట్ ఆప్టిమైజేషన్ చేశామన్నారు. -
నగరంలో కొత్తగా సిటీ డిపో
ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న ఆర్టీసీ అధికారులు ● పీఎం ఈ సేవా పథకంలో 100 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుహన్మకొండ : టీజీఎస్ ఆర్టీసీ.. వరంగల్ రీజియన్‌లో సేవలు విస్తరణకు పూనుకుంది. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఈ–బస్ సేవా పథకాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూరుస్తోంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ మహానగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. ఈ బస్సులను సిటీతోపాటు నగర శివారు గ్రామాలను నడిపేలా ఆ సంస్థ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వీటి నిర్వహణకు కొత్తగా సిటీ డిపో ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మహానగర పరిధిలోనే.. గతంలో సిటీ బస్సులు నడిపిన హనుమకొండ డిపో ప్రస్తుతం సిటీతోపాటు జిల్లా బస్సులు నడుపుతోంది. ఇప్పటికే రీజియన్‌లో 9 డిపోలున్నాయి. కొత్తగా ఏటూరునాగారం డిపో మంజూరు చేయగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. డిపో నిర్వహణ సజావుగా సాగాలంటే 100 బస్సుల సామర్థ్యం సరిపోతుంది. ప్రస్తుతం 9 డిపోలకు 1,005 బస్సులుండడంతో ఉద్యోగులపై పనిభారం పడుతోంది. నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మరో 100 బస్సులు సిటీకి రానుండడంతో కొత్త సిటీ డిపో ఏర్పాటు తప్పని సరైంది. మొత్తం రూ.20 కోట్ల ప్రాజెక్టు.. కొత్తగా బస్ డిపో ఏర్పాటు, ఎలక్ట్రిక్ బస్సులు రావడం మొత్తం రూ.20 కోట్ల ప్రాజెక్టు. ఇందులో రూ.10కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. డిపో ఏర్పాటుకు స్థలం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సమకూర్చాలి. ఈ క్రమంలో వరంగల్ మహానగర పరిధిలో డిపో ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు. రెవెన్యూ అధికారులను కలిసి స్థలం కోసం లేఖలు అందించారు. మరోవైపు ప్రజాప్రతినిధులను కలిసి ఆర్టీసీ అవసరమైన స్థలం కేటాయింపునకు సహకారం కోరాలనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. కొత్తగా డిపో ఏర్పాటు కు కనీసం 5 నుంచి 6 ఎకరాల స్థలం అవసరం. ఈ స్థలం నగరంతోపాటు విలీన గ్రామాల పరిధిలో లభ్యమైతే ఆర్టీసీ బస్సుల నిర్వహణ, రవాణాకు అనుకూలంగా ఉంటుంది. ఎంత త్వరగా స్థలం ఖరారు అయితే అంత త్వరగా డిపో నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్, చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసే పనులు మొదలవుతాయి. 100 బస్సులకు కనీసం 20 చార్జింగ్ పాయింట్లు అవసరమవుతాయి. ఉన్న స్థలం లీజుకు.. హనుమకొండ హంటర్ రోడ్డులోని ఆర్టీసీ టైర్ రిట్రేడింగ్ సెంటర్‌ను కరీంనగర్‌కు తరలించి ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. లీజుదారులు ఇందులో హోటల్‌తోపాటు ఫంక్షన్ హాల్ నిర్మించి ఆదాయం పొందుతున్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తించకుండా సొంత స్థలాన్ని లీజుకు ఇచ్చి, ఇప్పుడు సంస్థ సొంత అవసరాలకు ప్రభుత్వం, దాతలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ఆ స్థలం ఉంటే ఇప్పుడు ఆర్టీసీకి ఉపయుక్తంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగర పరిధిలో స్థలం కోసం అన్వేషణ ప్రస్తుతం వరంగల్ రీజియన్‌లో 9 డిపోలు.. ఏటూరునాగారంలో నిర్మాణమవుతున్న డిపో.. కొత్తదానితో 11కు చేరనున్న సంఖ్య ప్రస్తుతం ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో ఇలా.. డిపోలు 9 మొత్తం బస్సులు 1,005 ఆర్టీసీవి 572 అద్దె బస్సులు 321 అద్దె ఎలక్ట్రిక్ 112 -
ఆలయం..శిథిల విలాపం
రఘునాథపల్లి: కాకతీయుల కళా ప్రభకు చిహ్నంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక కట్టడాలున్నాయి. ఇందులో ప్రధానంగా వేయిస్తంభాల గుడి, రామ ప్ప తదితర ఆలయాలు ప్రసిద్ధి. వేయిస్తంభాల ఆల య నమూనాతో ఐదు వందల స్తంభాల ఆలయాన్ని కాకతీయులు జనగామ జిల్లా నిడిగొండలో ని ర్మించారు. అద్భుతంగా నిర్మించిన త్రికూటలయం (సూర్య దేవాలయం) నేడు కాలగమనంలో శిథిలమవుతోంది. గతంలో ధూపదీప నైవేద్యాలు అందుకున్న ఈ ఆలయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో శిథిలమవుతూ విలపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని పూర్వ వైభవంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. సందర్శించి మరిచిన ఎమ్మెల్యే.. 2025, జనవరి 3వ తేదీన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిడిగొండలోని త్రికూటలయాన్ని సందర్శించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుత ఆలయం శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎనిమిది నెలలు దాటింది. ఇప్పటికీ చారిత్రక నేపథ్యమున్న ఆలయ మరమ్మతులు ప్రారంభం కాలేదు. ఇప్పటికై నా ఎమ్మెల్యే, ఎంపీ, పురావస్తు శాఖ అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామస్తుల వినూత్న నిరసనలు ఆలయ పూర్వ వైభవం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేందుకు గ్రామస్తులు అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. త్రికూటాలయం వద్ద విద్యార్థులతో నిరసనలు, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దీపాలు వెలిగించడం, గురువారం పలు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛ్ స్మారక్ కార్యక్రమం చేపట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. నేలలో కూరుకుపోతున్న శివలింగాన్ని బయటకు తీశారు. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.పునరుద్ధరణ పేరిట పురావస్తుశాఖ అధికారులు 1996లో ఆలయాన్ని తీసి కళాకాండాలను పక్కకు పెట్టారు. పునరుద్ధరణ కోసం అప్పటి ప్రభుత్వం ఓ దఫా రూ. 20 లక్షలు, మరో దఫా రూ. 16 లక్షలు మంజూరు చేసింది. సంబంధిత కంట్రాక్టర్ ఆలయం చుట్టూ ప్రహరీ, ఇతర పునర్నిర్మాణ పనులు చేపట్టి నిధుల లేమితో నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపేశాడు. అంతే కాకుండా ఇక్కడి విలువైన శిల్పాలు చోరీకి గురి కాకుండా చౌకీదారుడిని నియమించగా.. అతనిని ఉప సంహరించడంతో శిల్పాలకు భద్రత లేకుండా పోయింది. కళాఖండాలను పక్కకు పెట్టడంతో నంది విగ్రహం, శివలింగం, పానిపట్టం భూమిలో కూరుకుపోతున్నాయి. ఇక్కడ కళాఖండాలలోని కొన్నింటిని పురావస్తు శాఖ అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్వహణ లోపంతో శిథిలమవుతున్న దుస్థితి శతాబ్దాల చరిత్ర.. చారిత్రక వారసత్వ సంపద కనుమరుగు దశాబ్దలకాలంగా పట్టించుకోని అధికారులు సందర్శించి వదిలేసిన స్థానిక ఎమ్మెల్యే -
ఆలయాన్ని పూర్వ వైభవంలోకి తీసుకురావాలి
కాకతీయులు అద్భుతంగా నిర్మించిన త్రికూటాయలం కాలగర్భంలో కలిసి శిథిలావస్థకు చేరింది. ఆలయాన్ని పూర్వవైభవంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. పునరుద్ధరణ పేరుతో ఆలయాన్ని కూల్చిన పురావస్తుశాఖ అధికారులు రెండు దశాబ్దాలుగా పట్టించుకోక పోవడం దారుణం. పక్కకు పెట్టిన కళాఖండాలలోని కొన్నింటిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి యుద్ధ ప్రాతిపాదికన ఆలయాన్ని పునరుద్ధరించాలి. –పెండెల ఎల్లయ్య, నిడిగొండ ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి ఘన చరిత్ర గల త్రికుటాలయాన్ని పునరుద్ధరణ పేర కళాఖండాలను పక్కనపెట్టి వదిలేశారు. అధికారులను పలు మార్లు కోరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న త్రికుటాలయంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవ తీసుకోవాలి. గ్రామస్తులతో కలిసి ఈ విషయాన్ని ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతాం. – కొంగరి నర్సింగరావు, నిడిగొండ -
భువనగిరిలో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
● 8 ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్న 80 మంది క్రీడాకారులు భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలబాలికల స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పి.సుభాష్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించేందుకు అనువైన మైదానాలు ఉన్నాయన్నారు. మొదటిసారిగా జిల్లాలో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. 800, 400, 200, 100, 50 మీటర్ల విభాగాల్లో జరిగిన పోటీల్లో 8 ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, పోటీల పర్యవేక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్, బాబురావు, వీవీ రెడ్డి, స్విమ్మింగ్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు గిరిధర్, శ్రీను, ఉమారావు, ఆంజనేయులు, నరసింహ, పీడీ రమేష్‌రెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారునాకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. 3వ తరగతి నుంచే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పటికే నాలుగుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాను. నా తల్లిదండ్రులు నన్ను ఎంతోగానే ప్రోత్సహిస్తున్నారు. -
ముగ్గురు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
హన్మకొండ: జగిత్యాల సర్కిల్లోని జగిత్యాల టౌన్–1 సెక్షన్ కార్యాలయంలో మద్యం సేవించిన ముగ్గురు విద్యుత్ ఉద్యోగులను యాజ మాన్యం సస్పెండ్ చేసింది. సదరు కార్యాలయంలో మద్యం విందు చేసుకున్నట్లు విచారణలో నిర్ధారణ కావడంతో అసిస్టెంట్ లైన్మెన్లు ఎ.ప్రభాకర్, జి.బాలకృష్ణ, వి.రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ జగిత్యాల డివిజన్ డీఈ గంగారాం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి స్పందిస్తూ విధులు నిర్వర్తించే ప్రదేశంలో ఉద్యోగులు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. విధుల నుంచి తక్షణమే తొలగిస్తామని తెలిపారు. ఈ మేరకు మెమో జారీ చేశారు. ప్రతీ ఉద్యోగి బాధ్యతతో వ్యవహరించాలని, సంస్థ ప్రతిష్టను కాపాడాలని, విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అపార్ట్మెంట్లో చోరీ ● రూ.1.30 లక్షల విలువైన రెండు ల్యాప్‌టాప్‌లు, 3వాచ్‌లు అపహరణ ఖిలా వరంగల్ : అపార్ట్మెంట్లోని తాళం వేసి ఉన్న ఓ ప్లాట్‌లో దుండుగులు చోరీకి పాల్ప డ్డారు. బీరువాలో ఉన్న రూ.1.30లక్షల విలు వైన రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు వాచ్‌లు ఎత్తుకెళ్లారు. మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్ కథనం ప్రకారం.. వరంగల్ రామ్ కీ ఎన్క్లేవ్ సమీపంలోని హంస కాకతీయ అపార్ట్మెంట్లోని ప్లాట్‌కు యజమాని ఇంద్రనీల్ చటర్జీ తా ళం వేసి ఊరెళ్లారు. గమనించిన దుండగులు శ నివారం అర్ధరాత్రి ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు వాచ్‌లు అపహరించుకెళ్లారు. ఆదివారం ఇంటికి చేరుకున్న చటర్జీ కుటుంబ సభ్యులు తాళం ధ్వంసమై ఉండడం చూసి ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి గమనించి చోరీ జరిగి నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సై సురేశ్ ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుడు చటర్జీ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమే శ్ ఆదివారం తెలిపారు. ‘కల్లోల భారతం’, ‘ నిజాం పాలన చివరి రోజులు’ పుస్తకాల ఆవిష్కరణ హన్మకొండ కల్చరల్: ప్రజ్ఞాభారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ‘ కల్లోల భారతం’, ‘ నిజాం పాలన చివరి రోజులు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. వరంగల్‌లోని ఐఎంఏ హాల్లో ప్రొఫెసర్ ఎల్లాప్రగడ సుదర్శన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో న్యాయవాది చామర్తి ప్రభాకర్, సాహితీవేత్తలు గన్నమరాజు గిరిజామనోహరబాబు, రామాచంద్రమౌళి, మాల్యాల మనోహరబాబు, సౌమిత్రి లక్ష్మణాచార్య పాల్గొని రచయిత కొవెల సంతోష్‌కుమార్ రాసిన ‘ కల్లోల భారతం’, కెఎం మున్షి రాసిన ‘ ఎండ్ ఆఫ్ ద ఏరా నిజామ్స్ రూల్ ఆఫ్ లాస్ట్ డేస్’ ఆంగ్లభాష గ్రంథాన్ని కస్తూరి మురళీకృష్ణ తెలుగులో అనువదించిన ‘ నిజాం పాలన చివరి రోజులు’పుస్తకాలను ఆవిష్కరించారు. కొవెల సంతోష్ మాట్లాడుతూ దేశంతో ఉగ్రవాదం, తీవ్రవాదం ఎలా పెచ్చరిల్లుతుందో, దేశసమగ్రతకు, శాంతి భంగం కలుగజేస్తున్నారో వివరించాన్నారు. అనంతరం సహజ కవి అందెశ్రీకి శ్రద్దాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాలకృష్ణ వందన సమర్పణ చేశారు. -
డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్ , ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఏఎల్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. రాజేందర్ ఆదివారం తెలిపారు. డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 18, 20, 22, 25, 27, 29, డిసెంబర్ 2,4 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19, 21, 24, 26, 28 డిసెంబర్ 1, 3, 5, 8 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 18, 20, 22, 25, 27, 29, డిసెంబర్ 2, 4, 6, 9, 11, 12, 15 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 44, ఖమ్మం జిల్లాలో 26, ఆదిలాబాద్ జిల్లాలో 46, మొత్తం.. 116 పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేశారు. 116 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 128 మంది అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. మొత్తం 1,35, 461మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని రాజేందర్ పేర్కొన్నారు. ఈనెల 15న సంబంధిత కేయూ వెబ్సైట్లో విద్యార్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. వెబ్సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ● కేయూ పరిధిలో 116 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 1,35, 461 మంది.. ● వెబ్సైట్లో విద్యార్థుల హాల్‌టికెట్లు -
వయోవృద్ధుల సేవలు సమాజానికి అవసరం
హన్మకొండ: సీనియర్ సిటిజన్స్ సేవలు నేటి సమాజానికి ఎంతో అవసరమని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్లో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ కాన్ఫడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబం నుంచి వ్యక్తిగత కుటుంబాలుగా మారుతున్న క్రమంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వయో వృద్ధులే వీరికి మార్గదర్శనం చేయాలన్నారు. వయో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలకు జిల్లా స్థాయి అధికారులు స్పందిస్తున్నారని, తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం–2007పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో మరో రెండు డే–కేర్ సెంటర్ల ఏర్పాటుకు కలెక్టర్‌తో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సీనియర్స్ సిటిజన్స్ కాన్ఫడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో సీనియర్ సిటిజన్స్ ఉద్యమం బలంగా ఉందన్నారు. సమావేశంలో కాన్పడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు విశ్వనాథం, నాగేశ్వర్ రావు, కార్యవర్గ సభ్యులు భూషిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాయకులు దామెర నర్సయ్య, రాపాక నర్సింహరాములు, ఈగ సత్యనారాయణ, నల్లా మనోహర్‌రెడ్డి, కొన్ రెడ్డి మల్లారెడ్డి, కటకం సంపత్, కోమటి రాజేందర్, కజాంపురం దామోదర్, తేరాల యుగంధర్, నాగులగాం నర్సయ్య, చిదురాల సత్యనారాయణ, మార్క రవీందర్‌గౌడ్, తాడూరి లక్ష్మీనారాయణ, గంగారపు యాదగిరి, గంటి సాంబయ్య, గోకారపు రాజేందర్ డే–కేర్ సెంటర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఉష, అసిస్టెంట్, వాణి పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జయంతి -
స్పోర్ట్స్ కోటాను 4శాతానికి పెంచేందుకు కృషి
వరంగల్ స్పోర్ట్స్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి క్రీడల అభ్యున్నతికి ప్రత్యేక క్రీడా పాలసీని అమలు చేస్తున్నారని, ఇప్పుడున్న స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 4శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్‌ను ఆదివారం ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్పోర్ట్స్ స్కూల్‌ను నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి పట్టుబట్టి వరంగల్‌కు తెచ్చుకున్నారన్నారు. స్పోర్ట్స్ పాలసీ ద్వారా పారదర్శకంగా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తిస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నా యిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమష్టి కృషితో నే హనుమకొండకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరైందన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో 4వ స్పోర్ట్స్ స్కూల్‌ను హనుమకొండలో ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా యుద్ధప్రాతిపదికన మంజూరు చేశారన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మా ట్లాడుతూ నేటి యువత మొబైల్స్, డ్రగ్స్‌కు వ్యసనంగా మారి ఆటలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా క్రీడాకారిణి జీ వాంజి దీప్తికి సీఎం రేవంత్‌రెడ్డి 500 గజాల స్థలం మంజూరు చేశారని, అయితే ‘కుడా’ ఇప్పటి వరకు కేటాయించలేదని, మంత్రి స్పందించి స్థలం కేటా యించేలా చూడాలని కోరారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, వీసీఅండ్‌ఎండీ సోనీబాలదేవి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రా మ్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, బల్దియా కమిషనర్ చౌహత్బాజ్పేయ్, డీవైఎస్ఓ అశోక్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. విజయ డెయిరీ పునరుద్ధరణకు డీపీఆర్ సిద్ధం చేయండి.. హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ పునరుద్ధరణ, మరమ్మతుల కోసం డీపీఆర్ సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ స్నేహ శబరీష్, విజయ డెయిరీ డీడీ శ్రవణ్‌కుమార్‌కు మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. హనుమకొండలోని అలంకార్ జంక్షన్ సమీపంలోని విజయ డెయిరీ వరంగల్ యూనిట్‌ను ఆదివారం మంత్రి పరిశీలించారు. 1969లో 15వేల లీటర్ల సామర్థ్యంతో ఇక్కడ డెయిరీ స్థాపించారని, పెరిగిన పాల సేకరణతో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందని, తద్వారా నాణ్యత నియంత్రణలో సవాళ్లు ఎదరవుతున్నాయని మంత్రికి పలువురు పాడిరైతులు తెలిపారు. రూ.25 కోట్లతో డెయిరీ ఆధునీకరణ, ఉత్పత్తి విస్తరణకు చర్యలు తీసుకోవాని విన్నవించారు. స్పందించిన మంత్రి శ్రీహరి ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు ఉన్నారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రాష్ట్రంలో 4వ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభం -
రుద్రేశ్వరస్వామికి అభిషేకాలు
హన్మకొండ కల్చరల్: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. సెలవు దినం కావడంతో భ క్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు, భజనలు నిర్వహించారు. మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు. రేపు స్వామివారి కల్యాణోత్సవం.. మాసశివరాత్రి సందర్భంగా మంగళవారం ఉదయం 10.35 గంటలకు రుద్రేశ్వరస్వామి కల్యాణం సామూహికంగా నిర్వహించనున్నట్లు ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. భక్తులు రూ.1,116 చెల్లించి రశీదు పొంది కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చునని, పాల్గొన్న దంపతులకు శేషవస్త్రాలు, తలంబ్రాలు, ప్రసాదం అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. -
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
వరంగల్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు బేజార్ అవుతున్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకుని స్లాట్ బుకింగ్‌తో మిల్లుల్లో అమ్మకాలు చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరీలుగా విభజించడం వల్ల మిల్లర్లలో భేదాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో 60 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. దశల వారీగా ఈనెల 15 వరకు 35 మిల్లులు కొనుగోలు చేసేందుకు కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసింది. ఈమిల్లుల్లో అధిక జిన్నింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొనుగోళ్లపై కూడా ఆంక్షలు పెట్టి తక్కువ మొత్తం కేటాయించండంతో నిర్వాహకులు అసంతృప్తిగా ఉన్నారు. అకాల వర్షాలతో పత్తి దిగుబడి తగ్గడం వల్ల ప్రస్తుతం కేటాయించిన మిల్లులకు సరిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ఎల్4 తర్వాత ఉన్న మిల్లులకు పత్తి కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయే ప్రమాదం నెలకొంది. పత్తి కొనుగోలు చేయకుంటే ఆయా మిల్లుల నిర్వహణ, పనిచేసే కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది. జిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే కార్మికులను నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి రప్పించారు. సీజన్‌కు ముందుగానే వీరితో మిల్లర్లు ఒప్పందం చేసుకున్న విధంగా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కార్మికుల వేతనాలు, మిల్లుల నిర్వహణ యాజమానులకు ఆర్థిక భారంగా మారింది. అసోసియేషన్‌లో చర్చించి కొనుగోళ్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దిగుబడి పడిపోవడంతో అన్ని మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్ల వినతిని సీసీఐ, కేంద్రం పట్టించుకోవడం లేదు. అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి.. ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. యురియా కొరత ఆర్థికంగా భారం కాగా, అధిక వర్షాలతో దిగుబడి పడిపోయిందన్న బాధలో రైతులు ఉన్నారు. ఇప్పుడు కొనుగోళ్లు బంద్ అంటూ మిల్లర్లు నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా గ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులు తమ ఏజెంట్లను పెట్టుకుని పత్తి కొనుగోళ్లు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న సమయంలో తూకం, ధరల్లో మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు చేసిన విధంగా పత్తిని సైతం ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీసీఐ నిబంధనలతో మిల్లర్లు బేజార్ ఇబ్బంది పడనున్న పత్తి రైతులు రాష్ట్ర ప్రభుత్వ వినతిని పట్టించుకోని కేంద్రం -
బీసీ రిజర్వేషన్లను సవరించాలి
హన్మకొండ: బీసీ రిజర్వేషన్ల సవరణ చేయకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని టీఎస్ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ హెచ్చరించారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి తెలంగాణ అమరువీరుల స్తూపం వరకు ఆదివారం నిర్వహించిన ర్యాలీనపి ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తామని అనడం సరికాదని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఉద్యమించాలని అన్నారు. అలాగే, కేంద్రంలోని బీజేపీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా స్పందించి రాజ్యాంగ సవరణ చేయాలని, లేకుంటే ఆ పార్టీకి జూబ్లీహిల్స్ ఫలితలే పునరావృతమవుతాయని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం ముమ్మాటికీ బీసీలదేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధాన పార్టీల మధ్య ఉండదని, బీసీ వర్సెస్ ఓసీల మధ్యనే ఉంటుందని అన్నారు. బీసీ జేఏసీ నాయకులు డాక్టర్ కూరపాటి రమేశ్, బొనగాని యాదగిరిగౌడ్, మూగల కుమార్ యాదవ్, చిర్ర రాజు గౌడ్, సంగని మల్లేశ్వర్, తమ్మెలా శోభారాణి, మాదం పద్మజాదేవి, బచ్చు ఆనందం, ఆరేగంటి నాగరాజు, భీమగాని యాదగిరి, ఐలి చంద్రమౌళి, వల్లాల జగన్, పెరుమాండ్ల అనిల్, తుపాకుల రవి, పంజాల మధు, కోలా ప్రతాప్, తేల్ల సుగుణ, కిశోర్, చాగంటి రమేశ్, హైమావతి, మౌనిక, ప్రమోద, మానస పాల్గొన్నారు. టీఎస్ బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ -
సీసీఐ నిబంధనలతో ఇబ్బందులు..
ప్రస్తుత సీజన్లో సీసీఐ మిల్లర్లపై కక్ష కట్టింది. లేనిపోని నిబంధనలు తీసుకొచ్చి రైతులు, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఎల్1, ఎల్2 విధానాలను తీసుకొచ్చి మిల్లర్లలో భేదాభిప్రాయాలను సృష్టించింది. కొన్ని మిల్లులకు అనుమతులు ఇవ్వడం, కొన్నింటికి ఇవ్వకపోవడంతో మిల్లులు బంద్ చేశారు. దీని వల్ల ఆయా మిల్లర్లకు ఆర్థిక భారం పడుతోంది. వసతులు లేని కారణంగా అనుమతులు ఇవ్వడం లేదని సీసీఐ అంటున్నది. షెడ్ లేకుంటే బేల్‌కు రూ.20, ప్రహరీ లేకుంటే బేల్‌కు రూ.10 మినహాయింపు చేస్తామని ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా మినహాయించుకుని అన్ని మిల్లుల్లో కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలి. అప్పటి వరకు బంద్ పాటిస్తాం. – చింతలపల్లి వీరారావు, కాటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు -
‘విశ్వ పరీమళ వీచిక’లో అందమైన పదబంధాలు
● కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ హన్మకొండ కల్చరల్: పల్లె జీవన సౌందర్యాన్ని అద్భుతంగా ఒడిసిపట్టి, అందమైన పదబంధాలతో అల్లిన ‘విశ్వ పరీమళ వీచిక’ కవిత్వం తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. వరంగల్‌కు చెందిన కవయిత్రి, రచయిత్రి డాక్టర్ వాణీదేవి దేవులపల్లి రచించిన విశ్వ పరీమళ వీచిక కవిత్వం, ఆమె సంపాదకత్వంలో వెలువరించిన యాసంగి ముచ్చట్లు కవితా సంపుటాల పుస్తకావిష్కరణ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల సెమినార్‌హాల్‌లో కవయిత్రి, రచయిత్రి అయినంపూడి లక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా అంపశయ్య నవీన్, విశిష్ట అతిథిగా కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, ఆత్మీయ అతిథులుగా గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, అమెరికాలోని ఐసీఎస్ వైస్ ప్రెసిడెంట్ రమణ దేవులపల్లి పుస్తకాలు ఆవిష్కరించారు. అనంతరం బన్న అయిలయ్య మాట్లాడుతూ తెలంగాణ పల్లె జీవనాన్ని రచయిత వాణీదేవి దేవులపల్లి తన కవిత్వం ద్వారా తెలియజేశారని అన్నారు. వాణీదేవి మాట్లాడుతూ ఊరు తన జీవనాడి అని, అనుభవాలే కవితలుగా జాలువారాయని పేర్కొన్నారు. 78 మంది కవులు రాసిన కవితలతో యాసంగి ముచ్చట్లు కవితా సంపుటిని వెలువరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మిట్టపల్లి సురేందర్ తన పాటలతో అలరించారు. కార్యక్రమంలో కవులు, రచయితలు పాల్గొననున్నారు. -
పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదగాలి
ఖిలా వరంగల్: పద్మశాలీల ఆడబిడ్డా.. మీకు పెద్ద దిక్కుగా ఉంటానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. పద్మశాలీలు ఐక్యత చాటుతూ పార్టీలకు అతీతంగా సంఘటితమై సామాజిక, ఆర్థిక, రాజకీయ శక్తి ఎదగాలని ఆమె సూచించారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్కోటలోని క్రీడామైదానంలో వరంగల్ జిల్లా, పట్టణ పద్మశాలి ప్రతినిధుల ఆధ్వర్యంలో పద్మశాలీల కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. ముఖ్యఅతిథులుగా మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, నాయకులు గుండు ప్రభాకర్, ఈగ మల్లేశం, సాంబారి సమ్మారావు హాజరై మాట్లాడారు. పద్మశాలీల అభ్యున్నతే లక్ష్యంగా సంఘాలు పనిచేయాలని, సమష్టిగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. పద్మశాలీలు ఏడాదిపాటు సుఖసంతోషాలతో ఉండేందుకే వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం పద్మశాలీలు సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, ప్రతినిధులు శామంతుల శ్రీనివాస్, వడ్నాల నరేందర్, కుసుమ సతీష్‌బాబు, గోరంటల రాజు, బైరి శ్యాం, డీఎస్ మూర్తి, బేతి అశోక్‌బాబు, చిప్ప వెంకటేశ్వర్లు, ఆడెపు వెంకటేశ్, బైరి మురళి కృష్ణ, తుమ్మ రమేశ్, కుమారస్వామి, రాజేందర్, క్రాంతికుమార్, సమ్మయ్య, బాసాని శ్రీనివాస్, మేరుగు అశోక్, గడ్డం రవి, కామేశ్వర్రావు, సుధాకర్, చందర్బాబు, కూచన క్రాంతి కుమార్, అకెన వెంకటేశ్వర్లు, బొమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కోటలో ఘనంగా పద్మశాలీల వనభోజన మహోత్సవం -
రేపు ఐక్యతా ర్యాలీ
హన్మకొండ: సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 18న ఐక్యతా ర్యాలీ నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కరెక్టర్ వెంకట్‌రెడ్డి ఐక్యతా ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ వరంగల్ ద్వారా ఎన్ఎస్ఎస్, ఎస్సీసీ సహకారంతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల నుంచి పోలీసు హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ సాగుతుందన్నారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందించడం, మాదక ద్రవ్యాల నుంచి విముక్తి కలిగించేందుకు నిర్వహిస్తున్న ర్యాలీలో యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేరా యువ భారత్ డిప్యూటీ డైరక్టర్ చింతల అన్వేశ్ పాల్గొన్నారు. -
నకిలీ వైద్యులపై కేసు
ఎంజీఎం: ఎలాంటి అర్హత లేకుండా శస్త్రచికిత్స చేసి యువకుడిని ప్రాణాపాయస్థితికి తెచ్చిన కొత్తపల్లి కౌసల్య, ఆమెకు సహకరించిన నకిలీ వైద్యుడు/ఆర్ఎంపీ బైరు చిట్టిబాబుపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేశ్‌కుమార్ తెలిపారు. ఇటీవల మంగళవారిపేటలో నకిలీ వైద్యులు నిర్వహించిన అర్షమొలల ఆపరేషన్ వికటించి ప్రాణాపాయ స్థితికి చేరుకుని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ కేసును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆదివారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఈ తనిఖీల్లో నకిలీ వైద్యుడు బైరు చిట్టిబాబు అక్రమంగా నిల్వ ఉంచిన డైక్లోఫెనాక్, జెంటామైసిన్, డెక్సామెతాసోన్, ఇతర ఇంజక్షన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేకుండా వైద్య సేవల పేరుతో ఇంజక్షన్లు ఇస్తున్నట్లు విచారణలో అతడు అంగీకరించాడని, కౌసల్య నిర్వహించిన ఆపరేషన్‌లో తాను మత్తు ఇంజక్షన్ మాత్రమే ఇచ్చానని తెలిపాడని బృంద సభ్యులు చెప్పారు. అనంతరం కొత్తపల్లి కౌసల్య ఆపరేషన్ చేసిన ఇంటి ప్రదేశాన్ని పరిశీలించారు. ఒక పరదా వెనుక అపరిశుభ్రమైన స్థలం, పాత బెంచ్‌ను ఆపరేషన్ టేబుల్‌గా చూపించడంతో విచారణ కమిటీ సభ్యులు విస్తుపోయారు. నెలకు రెండు మూడు ఆపరేషన్లు చేస్తున్నట్లు తనకు ఏ అర్హత లేదని ఆమె స్వయంగా తెలిపిందని వివరించారు. ఈ విధంగా కొందరికి ఇంతకుముందు కూడా వికటించిందని విచారణలో తెలిపిందన్నారు. ఈ సందర్భంగా నరేశ్‌కుమార్ మాట్లాడుతూ.. నకిలీ వైద్యుల సమాచారం తెలిస్తే తక్షణమే పోలీసులు, 91543 82727 వాట్సాప్ ద్వారా కౌన్సిల్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్లో టీజీఎంసీ కో ఆప్టెడ్ మెంబర్ డాక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు.టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ -
ఆకర్షణీయం.. భూగర్భ శోకం!
అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ● స్మార్ట్ సిటీ ప్రధాన రహదారులపైకి మురుగు నీరు కాశిబుగ్గ – నర్సంపేట రోడ్డులో స్మార్ట్‌సిటీ అండర్ డ్రెయినేజీ పైపులైన్ల చాంబర్లకు పై కప్పుల్లేక రోడ్లపై పారుతున్న మురుగునీరువరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలో ఆకర్షణీయ అభివృద్ధి పనుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. స్మార్ట్‌సిటీ రోడ్ల వెంట భూగర్భ డ్రెయినేజీల్లో నుంచి వెలువడుతున్న మురుగునీరు రోత పుట్టిస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం అంటేనే పాలకులకు, అధికారులకు దశాబ్దల తరబడిగా చిన్నచూపే అన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా అధునాతన డక్ట్‌ల నిర్మాణాలకు బదులుగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరిట చేపట్టిన మురుగునీటి పారుదల పైపులైన్ల వ్యవస్థను చూసి ప్రజలు, ముఖ్యంగా వ్యాపారులు, వాహనదారులు చీదరించుకుంటున్నారు. ఓపెన్‌గా ఉన్న చాంబర్లు మృత్యుకుహరాలుగా మారాయి. ప్రధాన రహదారుల్లోని వ్యాపార, వాణిజ్య నిర్వాహకులతోపాటు వినియోగదారులు, ప్రయాణికులు ఓపెన్ చాంబర్లలో పడిపోతామోనని భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లపై బురద నీరు, దుర్వాసన.. తూర్పు పరిధిలో అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీలు, రోడ్లపై మురుగు, బురద నీరు దుర్వాసన వెదజల్లుతున్నాయి. నెల, రెండు నెలలు కాదు. నాలుగేళ్లుగా ఓపెన్‌గా ఉన్న పైపులైన్ల చాంబర్లతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్‌లోని తూర్పు నియోజకవర్గ పరిధిలో 9, పశ్చిమ నియోజక వర్గంలో 2 స్మార్ట్‌సిటీ రహదారులకు ఏడాదిన్నర కిందట టెండర్లను పిలిచి, ఏడాది కిందట ఖరారు చేశారు. ఈ రహదారుల పనులు రూ.36 కోట్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కాంట్రా క్టును దక్కించుకున్నారు. నాలుగేళ్లుగా తూర్పు నియోజకవర్గంలోని 7 వ్యాపార, వాణిజ్య రహదా రుల్లో భూగర్భ డ్రెయినేజీ పనులు కొనసాగుతున్నా యి. రోడ్డు తవ్వి పైపులైన్ల నిర్మాణ పనులు చేపట్టారు. అస్తవ్యస్తం, ఆగమాగం.. తూర్పు నియోజకవర్గ పరిధి ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం, పోచమ్మమైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామా జంక్షన్, స్టేషన్ రోడ్డు, జేపీఎన్ రోడ్లలో భూగర్భ డ్రెయినేజీ కోసం పైపులైన్లను నిర్మించారు. కానీ, పైపులైన్లకు సంబంధించిన చాంబర్లను నిర్మించలేదు. ఈ రహదారులు అస్తవ్యస్తంగా మారి ముఖ్యంగా వ్యాపారస్తులు, వినియోగదారులు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్డుపై మురుగు నీరు పారుతోంది. నాలుగేళ్లుగా పనులు పెండింగ్‌లో ఉండడం, కనీసం ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఆస్తి, నీటి పన్ను చెల్లించడంతో నెల ఆలస్యమైతే వడ్డీ బాదే బల్దియా అధికారులకు అభివృద్ధి పనులు ఆలస్యమై సమస్యలు సృష్టిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వ్యాపారులు బాహాటంగా విమర్శిస్తున్నారు. అప్పడు ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కావడంతో ఇంజనీర్లు, ఉన్నతాధికారులు ప్రశ్నించేందుకు భయపడుతున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్‌కు 3 సార్లు నోటీసులు జారీ చేశాం స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా భూగర్భ డ్రెయినేజీని ర్మిస్తున్నాం. పైపులైన్లపై చాంబర్లపై కప్పులు ఏర్పా టు చేయాలి. కొన్నిచోట్ల ఫుట్‌పాత్‌లు తదితర పనులు చేపట్టాలని మూడు సార్లు నోటీసులు జారీ చేశాం. పనులు చేపట్టకపోతే చర్యలు ఉంటాయి. బల్దియా ద్వారా రెండు ప్యాకేజీలుగా రూ.80 లక్షల నిధులు కేటాయించాం. – సంతోశ్, బల్దియా ఈఈ మూతల్లేని చాంబర్లు.. ప్రమాదాల బారిన వాహనదారులు సంవత్సరాల తరబడి అభివృద్ధి పనులు పెండింగ్ ఇదేం సిటీ అంటూ ప్రజల పెదవి విరుపు -
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
రామన్నపేట: సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించవద్దని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఆదివారం నగరంలోని 22వ డివిజన్ పరిధి వాసవి కాలనీలోని ఇన్నర్ వీల్ క్లబ్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పత్రిక దినోత్సవాన్ని (నేషనల్ ప్రెస్ డే) ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, నేత్ర పరీక్ష, రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో టీఎస్జేయూ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందికొండ మోహన్, ఆవునూరి కుమారస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్‌రావు, షుకూర్, టీఎస్ జేయూ రాష్ట్ర నాయకులు నాగరాజు, నరేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథ్, గంగరాజు, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్, శరత్ ఐ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.రక్తదాన శిబిరంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ -
తెలంగాణ ఇమేజ్ పెంచుతాం
ధర్మసాగర్: చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇమేజ్ పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, డెయిరీ అభివృద్ధి, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాష్ట్ర మత్స శాఖ సంచాలకులు నిఖిల, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులతో కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఆయన మంత్రి చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల చెరువుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్యపిల్లలు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈమేరకు మత్స్య శాఖకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.123 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చేప పిల్లల, రొయ్యల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారులకు రూ.1.40 కోట్లతో బీమా చెల్లించినట్లు, మత్స్యకార సహకార సంఘాల్లో మత్స్యకారులకు సభ్యత్వం కల్పిస్తామన్నారు. గ్రిల్స్ ఏర్పాటు చేయాలి.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఇరిగేషన్ శాఖ అధికారులు తూముల ద్వారా నీళ్లు వదిలిపెట్టినప్పుడు చిన్న చిన్న చేప పిల్లలన్నీ కొట్టుకపోతున్నాయని, తద్వారా వారికి రావాల్సిన దిగుబడి రావడం లేదన్నారు. అందుకని సాగునీటి పారుదల శాఖ అధికారులు తక్షణమే ఐరన్‌తో చేసిన గ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో 12 లక్షల చేప పిల్లల్ని వదులుతున్నామన్నారు. గతేడాది 6 లక్షల చేప పిల్లలని వదలగా 250 టన్నుల వరకు దిగుబడి, రూ.25–30 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ సాయికుమార్, రాష్ట్ర తెలంగాణ ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, మత్స్య శాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్, డీడీ హనుమంతరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, చీఫ్ ప్రమోటర్ మల్లేశం, సోమయ్య, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, మత్స్య సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు. చేపల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం.. మంత్రి వాకిటి శ్రీహరి ధర్మసాగర్ రిజర్వాయర్‌లో చేపపిల్లల విడుదల -
మళ్లీ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: అర్ధంతరంగా ఆగిపోయిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై టీపీసీసీ మళ్లీ దృష్టి సారించింది. త్వరలోనే డీసీసీ రథసారథులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అక్టోబర్‌లో కార్యాచరణ చేపట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మార్గదర్శకాల మేరకు అక్టోబర్ 11 నుంచి 18 వరకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాల నుంచి 161 మంది డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ పడ్డారు. ఏఐసీసీ, టీపీసీసీ మార్గదర్శకాల మేరకు ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్లను తీసుకుని సీఎం, టీపీసీసీ చీఫ్‌కు అందజేశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటికేషన్ రావడం, హైకోర్టు స్టేతో రద్దు కావడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా డీసీసీల ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నిక ముగియగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం సిద్ధం కావాలని పార్టీ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే డీసీసీలను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావించి మళ్లీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ‘పారామీటర్’లు పక్కానా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. అధిష్టానం సంస్థాగత పదవులను కీలకంగా చూస్తోంది. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని కూడా చెప్తోంది. దీంతో డీసీసీ అధ్యక్షుడు జిల్లాస్థాయిలో కీలకం కానున్నారన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో ఇటీవల దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఆశావహులు పోటీపడ్డారు. పార్టీ నిబంధనల ప్రకారం.. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునేవారు కనీసం ఐదేళ్లపాటు క్రమశిక్షణతో, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వారై ఉండాలి. అలా... లేని దరఖాస్తులు ఏఐసీసీ పరిశీలకులు తొలగిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా పని చేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి అవకాశం ఉండబోదన్నారు. పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎంపికై న వారిని డీసీసీ పీఠానికి పరిగణనలోకి తీసుకోరని, అలాగే పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా అవకాశం కల్పించడం లేదని తేల్చిచెప్పారు. డీసీసీ అధ్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏఐసీసీ సూచించిన ఈ పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటే చాలా జిల్లాల్లో డీసీసీ పదవులకు సమర్థులను ఎంపిక చేయడం కష్టమేనన్న అభిప్రాయం పరిశీలకుల్లో వచ్చింది. ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు చాలామందే దరఖాస్తుదారుల్లో ఉన్నా.. అందులో నుంచి ఎంపికై న వారు పార్టీని సమర్థంగా నడిపించగలరా? అనేది ప్రశ్నగా ఉంది. దీంతో ఏఐసీసీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటారా? లేక జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు డీసీసీలను ఎంపిక చేస్తారా? ఏఐసీసీ గైడ్‌లైన్స్ సడలించి స్థానిక అవసరాలు, ప్రాథమ్యాలను గమనించి నియమిస్తారా? అసలేం జరగనుంది? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.పార్టీ హైకమాండ్ కార్యాచరణతో డీసీసీ ఎన్నికల కసరత్తుకు రంగంలోకి దిగిన పరిశీలకులకు పోటీపోటీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు అందాయి. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తథ్యమన్న ప్రచారం నేపథ్యంలో.. కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, కట్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్‌రావు, గోపాల నవీన్‌రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్‌రావు తదితరులు పోటీపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధుతో పాటు 18 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పరిశీలకులు ప్రకటించారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, మాసాన్‌పల్లి లింగాజీ తదితరులు రేసులో ఉన్నారు. ములుగు జిల్లాకు పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మహబూబాబాద్ నుంచి జె.భరత్‌చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, అంజయ్యతో పాటు 20 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం ఉంది. అయితే మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి ఆరు డీసీసీల కోసం 161 దరఖాస్తులు రాగా.. ఒక్కో జిల్లా నుంచి నాలుగు పేర్ల చొప్పున 24 మంది పేర్లను ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలనకు పంపారు. ఇందులో నుంచి ఎంపిక చేసేందుకు తాజాగా టీపీసీసీ ముఖ్యనేతల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ.. ఒక్కో జిల్లా నుంచి పరిశీలనలో నలుగురి పేర్లు ‘స్థానిక’, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తాత్కాలికంగా బ్రేక్ నియామకంపై నేటి కేబినెట్లో చర్చించే అవకాశం -
నేడు రాష్ట్ర పరిశీలకుడి రాక
విద్యారణ్యపురి: సురక్షిత, శుభ్రమైన పాఠశాల 5.0 కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు రాష్ట్ర పరిశీలకుడు హైదరాబాద్‌లోని డైట్ ప్రిన్సిపాల్ రవికాంత్ నేటి (సోమవారం) నుంచి 22వ తేదీ వరకు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సురక్షిత, పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు ‘సురక్షిత, శుభ్రమైన పాఠశాల 5.0’ కార్యక్రమం హనుమకొండ జిల్లాలో గత నెల 31న ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనుంది. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభు త్వ యాజమాన్యాల పాఠశాలలను రవికాంత్ సందర్శించి ఆయా పాఠశాలల్లో హెచ్ఎంలు అమలు చేసే రోజువారీ కార్యాచరణ ప్రణాళిక ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం డీఈఓ, ఎంఈఓలతో సమీక్షించనున్నారు. 21 నుంచి స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ తరగతులుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు తరగతులు ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనరావు తెలిపారు. ఈతరగతులు ఇంగ్లిష్ విభాగంలోని సెల్ట్ కార్యాలయంలో సాయంత్రం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్యాంపస్ విద్యార్థులు రూ.200, ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో నాన్ యూనివర్సిటీ ఫండ్ అకౌంట్లో ఈనెల 20లోపు చెల్లించి కోర్సులో చేరవచ్చని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 31 వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. బాలసముద్రం, అడ్వకేట్స్ కాలనీ, భీష్మనగర్, హంటర్ రోడ్డు, వరంగల్ పబ్లిక్ స్కూల్, జూపార్కు ప్రాంతంలో ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా వరంగల్ టౌన్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. రెడ్డిపాలెం, మొగిలిచర్ల, కొత్తపేట ఇండస్టీరియల్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) గ్రీవెన్స్ సెల్ సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నగర ప్రజలు గ్రీవెన్స్ సెల్ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సకాలంలో వచ్చి వినతులు అందించాలని కోరారు. అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలుహన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో కార్తీక మాసోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో చిన్నారుల కూచిపూడి నృత్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. లక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి మహిళలు, ఆలయ సిబ్బంది కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
చెత్తను ప్రక్షాళన చేయాలి
● తడి, పొడి చెత్తపై దృష్టిసారించాలి ● గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్: ఇంటింటా వెలువడుతున్న చెత్తను ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆటోలకు రూట్ ఆప్టిమైజేషన్ చేసినందున జవాన్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు వారికి కేటాయించిన డివిజన్లు, గృహాల నుంచి చెత్తను సేకరించి ఆటోలకు అందించేలా చూడాలన్నారు. ప్రస్తుతం బయో కంపోస్ట్ యూనిట్లు వచ్చాయని, బయో మిథనైజేషన్ ప్లాంట్ రాబోతోందని, విండ్రో కంపోస్ట్ యూనిట్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తడి చెత్త సేకరణకు వీలుగా 20 లీటర్ల సామర్థ్యం గల బిన్ను ఆటోలో ఏర్పాటు చేయాలన్నారు. రాంపూర్ డంప్ యార్డుకు చేరే చెత్త పరిమాణం తగ్గించాలని, చెత్త కంపోస్ట్‌గా మారాలన్నారు. సమావేశంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
రుద్రేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025●వేయిస్తంభాల ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రుద్రేశ్వరస్వామికి లక్షబిల్వార్చన నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్షబిల్వార్చనకు భక్తుడు చిట్టిరెడ్డి రాంరెడ్డి, లక్ష్మి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. – హన్మకొండ కల్చరల్ -
బాలల హక్కులు పరిరక్షించాలి
హన్మకొండ: నేటి బాలలే దేశ భవిష్యత్ అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సమితి, డాన్‌బాస్కో నవజీవన్ సంస్థ సమన్వయంతో బాలల దినోత్సవం నిర్వహించారు. హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. బాల్యం అందమైందని, ఆ అనుభూతిని ప్రతీ బాలుడికి, బాలికకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీడబ్ల్యూఓ జె.జయంతి మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలల సంరక్షణ కేంద్రం బాల బాలికలకు చిత్రలేఖనం, వ్యాస రచన, వక్తృత్వం, సింగింగ్, డాన్సింగ్వంటి పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈసందర్భంగా ఐసీడీఎస్ హనుమకొండ ప్రాజెక్ట్ పరిధి అంగన్వాడీ ప్రీ స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన నృత్యం అబ్బురపర్చింది. కలెక్టర్ వారిని అభినందించి బహుమతులు అందించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కపోతాలు, బెలూన్లు ఎగురవేశారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్ సందసాని రాజేంద్ర ప్ర సాద్, మాజీ చైర్పర్సన్ అనితారెడ్డి, సీడీపీఓ ఎం.విశ్వజ, బాల రక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అ దనపు అధికారి డాక్టర్ టి.మదన్ మోహన్‌రావు, ఆ యా శాఖల అధికారులు, బాధ్యులు డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, అశోక్‌రెడ్డి, ఎస్.ప్రవీణ్‌కుమార్, ఎస్.భాస్కర్, ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, పి.సంతోశ్‌కుమార్, మౌనిక, శ్రీనివాసులు, సునీత, చైతన్య, సుజాత పాల్గొన్నారు. పిల్లల కోసం రోజులో 15 నిమిషాలు కేటాయించాలిపేరెంంట్స్ తమ పిల్లల కోసం ప్రతిరోజూ 15 నిమిషాలు కేటాయించి వారి చదువు, తదితర అంశాలను పరిశీలించాలని, వారితో మాట్లాడాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండ జులైవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. తరగతి గదులు పరిశీలించారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులతో ముచ్చటించారు. సమావేశంలో ఎంఈఓ నెహ్రూ, హెచ్ఎం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టులో నిర్వహించిన దూరవిద్య డిగ్రీ పరీక్ష బీఏ, బీకాం, బీఎస్సీ (ఇయర్ వైజ్ స్కీం ఫస్టియర్, సెకండియర్, ఎక్స్) ఫైనల్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలను శుక్రవారం వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రంతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ ఇన్‌లో ఫలితాలను చూసుకోవచ్చని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. 17నుంచి మార్కెట్‌కు పత్తి తీసుకురావొద్దు వరంగల్ : తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ తీర్మానం మేరకు వరంగల్ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందించిన లేఖ ప్రకారం ఈనెల 17వ తేదీ నుంచి వరంగల్ మార్కెట్‌కు రైతులు పత్తి విక్రయానికి తీసుకు రావొద్దని వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేషం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి కొనుగోళ్లలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను 16వ తేదీవరకు పరిష్కారం కాని పక్షంలో 17వ తేదీ (సోమవారం) నుంచి ప్రైవేట్, సీసీఐ చేస్తున్న పత్తి కొనుగోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా నిలు పుదల చేసేందుకు అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని వివరించారు. అందువల్ల ముందస్తు సమాచారం ప్రకారం రైతులకు ఇబ్బంది కలుగకుండా సహకరించాలని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ కోరిందన్నారు. పట్ట పగలే చోరీ ● రూ.5లక్షల నగదు, 23 తులాల బంగారం అపహరణ పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. కల్లెడ గ్రామానికి చెందిన ఆదొండ సాయిలు కుటుంబం వ్యవసాయం చేస్తూ జీవ నం సాగిస్తున్నారు. సాయిలుకు ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడి వివాహం కా గా అతడి భార్యకి చెందిన బంగారు ఆభరణా లు, సాయిలు భార్యకి చెందిన బంగారు నగలు సుమారు 23 తులాలు బీరువాలో పెట్టి కోడలు తల్లిగారి ఇంటికి వెళ్లింది. సాయిలు, అతడి భార్య, కుమారుడు ఫంక్షన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదును ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న మామూనూరు ఏసీపీ వెంకటేశ్వర్లు, పర్వతగిరి సీఐ రాజగోపాల్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా సాయిలు ఇళ్లు ఊరికి చివరలో ఉంటుంది. ఈ క్రమంలో చుట్టు పక్కల వారు ఎవరూ లేక పోవడం, ఇంట్లో సీసీ కెమెరాలు లేనందున పోలీసులకు ఈ దొంగతనం ఘటన సవాల్‌గా మారనుంది. -
సహకార వారోత్సవాలు షురూ
హన్మకొండ : మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించే సహకార వారోత్సవాలను శుక్రవారం హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ప్రారంభించారు. ముందుగా సహకార పతాకాన్ని చైర్మన్ రవీందర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి 21వతేదీ వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలను ‘వికసిత్ భారత నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర’ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సహకార ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ ఎండీ వజీర్ సుల్తాన్, జీఎం జి.వి.ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, గంప స్రవంతి, రాజు, కృష్ణమోహన్, సీటీఐ ట్రైనింగ్ అధికారులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
వరంగల్ / ఖిలా వరంగల్: పత్తి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సీసీఐ అధికారులు పరిష్కరించాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ శివనగర్‌లోని సీసీఐ వరంగల్ రీజినల్ కార్యాలయం ఎదుట తెలంగాణ పత్తి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమతో నిమిత్తం లేకుండా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని, ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పించాలని కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై 11 శాతం సుంకాన్ని ఎత్తివేయడాన్ని వెనక్కి తీసుకోవాలని, కపాస్ కిసాన్ యాప్ అమలును ఉపసంహరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోకన్వీనర్ కృష్ణారెడ్డి, చెల్పూరు రాము, శోభన్ పాల్గొన్నారు. -
స్వచ్ఛత పాఠశాలల్లో తనిఖీలు
కాళోజీ సెంటర్: స్వచ్ఛతలో ముందుండే పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) పేరుతో ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్వచ్ఛతకు సంబంధించిన ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు ఆన్లైన్లో స్వీయ మదింపు ప్రక్రియ పూర్తి చేయగా రేటింగ్ ప్రకటించాయి. వరంగల్ జిల్లాలోని 14 పాఠశాలలు 5 స్టార్ రేటింగ్ తెచ్చుకున్నాయి. స్వచ్ఛత ఆధారంగా రేటింగ్.. స్వచ్ఛత ఆధారంగా మార్కులు సాధించి 4, 5 స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలను జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి కమిటీలు సందర్శిస్తాయి. స్వచ్ఛత కార్యక్రమాలు, విద్యార్థులను పరిశీలిస్తాయి. 3 స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలు జిల్లాస్థాయికి, 4 స్టార్ పొందినవి రాష్ట్రస్థాయి, 5 స్టార్ రేటింగ్ పొందిన పాఠశాలలు జాతీయస్థాయికి ఎంపికై తే ప్రోత్సాహకంగా రూ.లక్ష నగదుతోపాటు కేంద్రం పురస్కారం అందించనున్నారు. యాప్ ద్వారా అప్లోడ్ చేసిన పాఠశాలల తనిఖీ బాధ్యతలను జిల్లాలోని 44 స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు అప్పగించారు. వారి కాంప్లెక్స్ పరిధిలోనివి కాకుండా వేరే కాంప్లెక్స్ పరిధిలోని 5, 4 స్టార్ పొందిన పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనల మేరకు ఉన్నాయా లేవా అని ఈనెల 19 వరకు పరిశీలిస్తారు. నివేదిక తయారు చేసి జిల్లా కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీలో కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, మెంబర్స్‌గా డీఈఓ, ఇంజనీరింగ్ ఎస్సీ, డీఎంహెచ్ఓ, ఎక్స్పర్ట్ టీచర్లు ఉంటారు. ఇందులో ఒక హెచ్ఎం, గెజిటెడ్ హెచ్ఎం, పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్‌ను ఎంపిక చేశారు. హెచ్ఎంల టీం అందజేసిన నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అందులో నుంచి 8 పాఠశాలలను గుర్తించి రాష్ట్రస్థాయికి పంపిస్తుంది. పరిశుభ్రతను ప్రోత్సహించడమే లక్ష్యం.. పాఠశాలల్లో పరిశుభ్రత, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా జిల్లాలో 5, 4 స్టార్ పొందిన పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని 44 స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఈనెల 19 వరకు కొనసాగుతుంది. వారు ఇచ్చిన నివేదికను జిల్లా కమిటీ పరిశీలించి 8 ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపుతుంది. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొంది జాతీయస్థాయికి ఎంపికై న పాఠశాలలకు రూ.1 లక్ష నగదుతో పాటు కేంద్రం పురస్కారం అందజేస్తారు. – డాక్టర్ కట్ల శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ ఈనెల 19 వరకు 44 స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల పరిశీలన వరంగల్ జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక కానున్న 8 పాఠశాలలు -
జర్నలిస్టులు విలువలు పాటించాలి
కేయూ క్యాంపస్ : జర్నలిస్టులు విలువలను పాటించాలని న్యూఢిల్లీలోని ప్రముఖ దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో నిర్వహించిన జన్మధర్మ ఎంఎస్ ఆచార్య 7వ స్మారకోపన్యాసంలో జర్నలిజం–సాహిత్యంలో మారుతున్న పరిణామాలు అనే అంశంపై పలువురు ప్రసంగించారు. వార్తకు రంగు, రుచి, వాసన కాదని, వాస్తవికత కలిగి ఉండాలని తెలిపారు. తెలుగు జర్నలిజంలో ఓరుగల్లుకు చెందిన ఎంఎస్ ఆచార్య సేవలు మరువలేనివని కొనియాడారు. చాలా మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన ఘనత జనధర్మ, వరంగల్‌వాణి పత్రికకు దక్కుతుందని అన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో సత్యం, అసత్యం తేడా మసకబారిందని ఉద్ఘాటించారు. కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. నాడు కష్టకాలంలో జర్నలిజం బాధ్యతలను నిర్వర్తించిన గొప్ప వ్యక్తి ఎంఎస్ ఆచార్య అని వివరించారు. కేయూ ఇంగ్లిష్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.రాజగోపాలచారి, కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాఢభూషి శ్రీధర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం మాట్లాడారు. తొలుత ఎంఎస్ ఆచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ వి.పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేట్ ఎడిటర్ కృష్ణారావు -
ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్
● ఐదుగురు ఉపాధ్యాయినులు, ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలు మహబూబాబాద్ రూరల్ : అతివేగం.. అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఓ ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఐదుగురు ఉపాధ్యాయినులు, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని శనిగపురం శివారు కుమ్మరికుంట తండాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. కురవి మండలం నేరడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయినులు శుక్రవారం మహబూబాబాద్ నుంచి ఆటోలో బయలుదేరారు. శనిగపురం శివారు కుమ్మరికుంట తండా వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పచ్చిపాల మల్లేష్, ఉపాధ్యాయినులు చెన్నబోయిన రాధ, బానోత్ కళావతి, మద్దెల సింధూజ, వేల్పుగొండ శైలజ, నారపోగు స్వరూపకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో పైలట్ జక్కుల వీరన్న, ఈఎంటీ శ్రీనివాస్ క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓలు హర్షవర్ధన్, జగదీశ్వర్, సీఎంఓ రాంరెడ్డి వారికి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించిన ఉపాధ్యాయినులు రాధ, కళావతిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా మల్లేష్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. కాగా ఆటోను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో గాయపడిన ఉపాధ్యాయినులను డీఈఓ దక్షిణామూర్తి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, జీసీడీఓ విజయకుమారి, ఏఎస్సీ సంతోష్, స్పెషల్ అధికారులు, సీఆర్పీలు పరామర్శించారు. కొరవడిన అధికారుల పర్యవేక్షణ.. మహబూబాబాద్‌తో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి రాకపోకలు సాగించే ఇసుక రవాణా ట్రాక్టర్ల అతివేగంతో ప్రయాణాలు, ఇసుక అక్రమ నిల్వలపై పోలీసు, రెవెన్యూ, మైనింగ్, ఇతర సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ లోపంతో నిత్యం సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అడ్డుఅదుపు లేకుండా నడుపుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.దేవరుప్పుల : ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ బాలిక దుర్మరణం చెందింది. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు వాగు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఊర సృజన్‌కుమార్ కథనం ప్రకారం.. చిన్నమడూరు రెవెన్యూ పరిధి రంబోజీగూడెనికి చెందిన నక్కిరెడ్డి కృష్ణారెడ్డి కూతురు పూజ (13) చిన్నమడూరు హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం స్వగ్రామం నుంచి సైకిల్‌పై పూజ పాఠశాలకు వెళ్తుండగా చిన్నమడూరు వాగు వద్ద ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ గుర్రం కుమార్ వేగంగా వచ్చి ఆ బాలికను ఢీకొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా, వెంటనే సమాచారం అందుకున్న ట్రాక్టర్ యజమాని మైదం జోగేశ్వర్ బాలికను జనగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాలల దినోత్సవంలో అలుముకున్న విషాదం ఓ పది నిమిషాలైతే బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనే పూజ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అటు పాఠశాలలో, ఇటు ఇంటి వద్ద తీవ్ర విషాదం అలుముకుంది. బాలిక ప్రాణం తీసిన ఇసుక ట్రాక్టర్ -
రహదారులు రక్తసిక్తం
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం రహదారులు రక్తసిక్తంగా మారాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన ఒకరు, జనగామ జిల్లా రఘునాథపల్లి జాతీయ రహదారిపై గోవర్దనగిరి దర్గా సమీపంలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు, గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన మహిళ దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన రాజయ్య (48) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొయ్యూరు ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. మంథనిలో పెళ్లి ఉండటంతో రాజయ్య ఈనెల 13న తన బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మంథని నుంచి పెద్దతూండ్లలోని ఓ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి వెళ్లాడు. ఈక్రమంలో బైక్‌పై ఇంటికి వస్తుండగా పెద్దతూండ్ల రోడ్డు పక్కన ఉన్న పొలంలో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శుక్రవారం ఘటన స్థలానికి వెళ్లి చూడగా రాజయ్య మృతిచెంది ఉన్నట్లు ఎస్సై చెప్పారు. రాజయ్య భార్య ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గూడ్స్ వాహనం ఢీకొని యువకుడు.. రఘునాథపల్లి : బైక్‌ను వాహనం ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతిచెందాడు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రఘునాథపల్లి జాతీయ రహదారిపై గోవర్దనగిరి దర్గా సమీపంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన బిర్రు రవి మరో వ్యక్తి రాపాక వినోద్ (29)తో కలిసి బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నాడు. కాగా గోవర్దనగిరి దర్గా సమీపంలో వెనకాల అతి వేగంతో వచ్చిన గూడ్స్ వాహనం.. కారును ఢీకొంటూ వెళ్లి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న వినోద్ ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందగా, బిర్రు రవికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. గృహప్రవేశానికి వెళ్తూ.. అనంత లోకాలకు.. దుగ్గొండి : నూతన గృహప్రవేశానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన గద్దె గోపాల్‌రావు–హనుమాయమ్మ (55) దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం నర్సంపేట మండలం మర్రినర్సయ్యపల్లి గ్రామంలోని గోపాల్‌రావు బంధువులు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి దంపతులు బైక్ పై వెళ్తున్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి దాటగానే వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై మద్యం షాపు సమీపంలో వెనక నుంచి ఓ బొలెరో వాహనం స్వల్పంగా ఢీకొట్టి వెళ్లి పోయింది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో హనుమాయమ్మ రోడ్డు పై పడిపోగా గోపాల్‌రావు పక్కకు పడ్డాడు. ఇదే సమయంలో వెనకనుంచి వేగంగా వస్తున్న లారీ హనుమాయమ్మ నడుముపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే తుదిశ్వాస విడిచింది. గోపాల్రావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై రా వుల రణధీర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నర్సంపేట మార్చురీకి తరలించారు. లారీని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.బోలెరో వాహనం జాడ తెలియాల్సి ఉంది. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
● అదనపు డీసీపీ శ్రీనివాస్ వరంగల్ క్రైం : బాలల హక్కుల పరిరక్షణకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పోలీస్ శాఖ కృషి చేస్తున్నట్లు అదనపు డీసీపీ (సీఏఆర్) శ్రీనివాస్ తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, పోలీస్ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించిన వాకఽథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా అదనపు డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాలల రక్షణ కోసం జిల్లాలో వివిధ మాధ్యమాల ద్వారా బాల్య వివాహ నివారణ, బాలల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ముఖ్యంగా ఆన్లైన్ లైంగిక వేధింపులకు గురికాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బాలల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ గిరికుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్, సందసాని రాజేంద్రప్రసాద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్పర్సన్ అనితారెడ్డి, సీడీపీఓ విశ్వజ, బాల రక్షాభవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్.అవంతి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్, డెమో అశోక్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
వేతనాలు చెల్లించాలని ధర్నా
హన్మకొండ: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు, డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రతీ నెల జీతాలు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోందన్నారు. ఇప్పటి వరకు సెప్టెంబర్, అక్టోబర్ జీతాలు ఇవ్వలేదని, ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే రెండు నెలల వేతనం చెల్లించాలని, ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల సెలవులు మంజూరు చేయాలని, ఉద్యోగులకు డిప్యుటేషన్, బదీలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఎండీ రుక్మిద్దీన్, అరుణ్ కుమార్, మహేందర్, సురేశ్, నవీన్‌కుమార్, వినోద్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్, అనిత, విజేత, సుష్మ, అనూష, కనిష్క, ప్రవీణ్, సుదర్శన్, వినోద్, నరేశ్, రాకేశ్, రహమాన్, సందీప్ కుమార్, డీపీఎంయూ, పీడీఎంఓస్, డీటీసీఓ, జీఎంహెచ్, మిడ్ వేఫారిస్, ఎస్ఎన్సీయూ, సీఎల్‌ఎంసీ, టీ హబ్ ఉద్యోగులు, ఎన్‌ఎన్‌ఎంలు పాల్గొన్నారు.నల్ల బ్యాడ్జీలు ధరించి ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన -
చేప పిల్లల పంపిణీకి మోక్షం
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లాలో ఎట్టకేలకు ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీకి మోక్షం కలిగింది. సాధారణంగా చెరువుల్లో జూన్, జూలై నెలల్లో వదలాల్సిన చేప పిల్లల ప్రక్రియ దాదాపు 5 నెలల తర్వాత ప్రారంభిస్తున్నారు. ఆరు నెలల కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేప పిల్లలు ఎదుగుతాయా? అంటే మత్స్యకారులు అసాధ్యమనే సమాధానం చెబుతున్నారు. ఇప్పటికే ఆయా చెరువుల్లో అరకిలో సైజులో ఎది గిన చేపలకు, ఇప్పుడు వేసే సీడ్ ఆహారంగా మార డం తప్పితే పెద్దగా ఫలితం ఉండదని అంటున్నా రు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధిక శాతం చేపలు వరదలో కొట్టుకుపోయాయని, ఇప్పుడు వేసే చేప పిల్లలు కాస్త ఊరటనిస్తాయని మరికొందరు మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 813 చెరువులు.. హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా చెరువుల్లో కట్ల, రోహు, బంగారు తీగ, మెరిగ జాతి చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు రూపొందించారు. హనుమకొండ జిల్లాకు చేపపిల్లల పంపిణీ కాంట్రాక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందిన జయంత్ ఆక్వా ఫిష్ సంస్థ దక్కించుకుంది. ఒక చేప పిల్లకు రూ.1.82 పైసల చొప్పున టెండర్ ఖరారైంది. జిల్లా మొత్తంగా 813 చెరువుల్లో 2,20,54000 చేప పిల్లల (విలువ రూ.2,50,25000)ను పంపిణీ చేయనున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మంత్రి, ఎమ్మెల్యే రాక.. ఈ నెల 16న (ఆదివారం) ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఉచిత చేప పిల్లల పంపిణీ చేయనున్నట్లు హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి తెలిపారు. ఈ రిజర్వాయర్‌లో రూ.22.80లక్షల విలువైన 12,52,500 చేప పిల్లలను వదలనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్, తదిత అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. రేపు ధర్మసాగర్ రిజర్వాయర్‌లో విడుదల ఇప్పుడు వేసినా ఎదుగుదల అంతంతే.. -
పాఠశాలల్లో విద్యార్థి కేంద్రీకృత బోధన
కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి కేంద్రీకృత బోధన జరుగుతుందని వరంగల్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి(సీఎంఓ) కట్ల శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నరేంద్రనగర్ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల (పీటీఎం) సమావేశంలో విద్యార్థుల వ్యక్తిగత పురోగతిని తల్లిదండ్రలకు ఉపాధ్యాయులు వివరించారు. హెచ్ఎం వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులున్నారు. బాలలు ఉన్నతస్థాయికి ఎదగాలి రామన్నపేట: బాలలు ఉన్నతస్థాయికి ఎదగాలని వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎం.సాయికుమార్ అన్నారు. వరంగల్ ఆటోనగర్‌లోని బాలల పరిశీలక గృహంలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలిసీతెలియని వయస్సులో చేసిన తప్పులు తిరిగి చేయకుండా, చట్టవ్యతిరేక పనులకు స్వస్తి చెప్పి క్రమశిక్షణతో జీవనాన్ని కొనసాగించాలని సూచించారు. మంచి మిత్రులతో సహవాసం చేయాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా బాలురకు కల్పిస్తున్న వసతులు, ఆహార పదార్థాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. బాలలకు మంచి విద్య, సురక్షితమైన వాతావరణం, వసతులు కల్పించే బాధ్యత నిర్వాహకులు తీసుకోవాలని కోరారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సురేశ్, హోం సూపరింటెండెంట్ రమణమూర్తి, జువైనల్ బోర్డు మెంబర్లు సుభాష్, డాక్టర్ గోపికా రాణి, హోం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
మహబూబాబాద్ అర్బన్ : విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడు శుక్రవారం పాఠశాలకు సెలవు పెట్టాడని ప్రిన్సిపాల్ కోటయ్య వారికి తెలిపారు. బాలల దినోత్సవం రోజు బాలికలపై అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించి సస్పెండ్ చేయాలని, ఆడపిల్లల చదువులకు భద్రత లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఇందు భారతి సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై శివ పాఠశాలకు వచ్చి విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఓ మహిళా కానిస్టేబుల్‌ను విద్యార్థినులతో మాట్లాడించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అయితే అంధుడైన సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోవడంతో ప్రిన్సిపాల్‌ను పోలీస్ స్టేషన్ తరలించారు. దీనిపై డీఈఓను వివరణ కోరగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్‌కు సమాచారం అందించామని, శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోక్సో కేసు నమోదు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశామని మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. మహబూబాబాద్ పట్టణం కంకరబోర్డులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న ఇనుగుర్తి రవి పదిరోజులుగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సస్పెండ్ చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రుల ధర్నా -
కొలనులో బీజేపీ పడవ ప్రయాణం
● వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మిత స్థలంలో నాయకుల నిరసన వరంగల్ చౌరస్తా : వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్ నిర్మిత ప్రాంతంలోని కొలనులో గురువారం బీజేపీ నాయకులు పడవలు నడిపి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పడవలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి కొండా సురేఖ, మాజీ సీఎం కేసీఆర్‌కు ఈ కొలనులో ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.బీబిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం వల్ల వరంగల్ ప్రజలు బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరంగల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని మండిపడ్డారు. వరంగల్ బస్టాండ్ పేరుతో మాజీ ఎమ్మెల్యే నయవంచన చేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ అసమర్థతతో నిర్మాణానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హృదయ్, అమత్, స్మార్ట్ సిటీ వంటి ఎన్నో పథకాలకు భారీగా నిధులు కేటాయించి వరంగల్‌ను ప్రగతిదారిలో నడిపిస్తుంటే గతంలో బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం ఓరుగల్లు చరిత్రను భ్రష్టు పట్టించాయని విమర్శించారు. పేదల భూముల్ని కబ్జా చేయడంలో.. సెటిల్మెంట్ పనుల్లో ఆ పార్టీల నేతలు బీజీబిజీగా ఉన్నారని, ఇక వారికి ప్రజా సమస్యలు ఏం పడతాయంటూ ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరబ్రెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


