గుండు అఖిలేశ్‌కు 462 ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

గుండు అఖిలేశ్‌కు 462 ర్యాంకు

Mar 7 2026 9:38 AM | Updated on Mar 7 2026 9:38 AM

కాజీపేట అర్బన్‌: కాజీపే ట మండలం న్యూశాయంపేటకు చెందిన గుండు సరస్వతి శివకుమార్‌ కుమారుడు గుండు అఖిలేశ్‌ సివిల్స్‌లో 462వ ర్యాంకు సాధించారు. శివకుమార్‌ భూపాలపల్లిలో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. టెన్త్‌ వరకు వరకు హనుమకొండలోని వరంగల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో, ఇంటర్‌ ఓ ప్రైవేట్‌ కళాశాలలో, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఐదేళ్ల బీటెక్‌, ఎంటెక్‌ పూర్తిచేశారు. 2021లో ఐఈఎస్‌ ఇంజనీరింగ్‌ సర్వీస్‌లో ఇండియాలో 6వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఢిల్లీలో సీపీడబ్ల్యూ విభాగంలో సివిల్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అఖిలేశ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సమాజ సేవే లక్ష్యంగా సివిల్స్‌కు ప్రిపేరై.. 462వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఐపీఎస్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement