వరంగల్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ వన్నాల వెంకటరమణ నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డాక్టర్ వన్నాల వెంకటరమణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. కాగా, తన సేవలు గుర్తించి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు, రాష్ట్ర నాయకులకు, జాతీయ బీజేపీ నాయకత్వానికి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డాక్టర్ వన్నాల వెంకట రమణ తండ్రి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు బీజేపీ మాజీ జాతీయ కౌన్సిల్ మెంబర్‌గా పని చేశారు.


