ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతి దాడుల మధ్య మధ్యప్రాచ్యంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. భారత విమాన యాన సంస్థలు , గల్ఫ్ విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాలను రద్దు చేశాయి.
ఫిబ్రవరి 28-మార్చి 5 మధ్య భారతదేశం-మధ్యప్రాచ్య మార్గాల్లో 1,770 విమానాలు రద్దయ్యాయి. అనేక మంది ప్రయాణీకులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే వీరిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో ఫరీదాబాద్‌కు చెందిన యువ పైలట్, 23 ఏళ్ల దీపిక అధానా, UAEలో చిక్కుకున్న 169 మంది భారతీయులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రయాణీకులను సురక్షితంగా ఢిల్లీకి తిరిగి తీసుచ్చి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇంత ఉద్రికత్తతల మధ్య విమానం బయలుదేరే ముందు "అమ్మా, బై బై. నేను తిరిగి వస్తానో లేదోనాకు తెలియదు" అని చెప్పి మిషన్‌కు బయలు దేరడంమాత్రమే కాదు ఎన్నో సవాళ్ల మధ్య అత్యంత సాహసంగా వ్యవహరించి సురక్షితంగా ఢిల్లీకి చేరడం పలువురిని భావోద్వేగానికి గురి చేసింది.
ఇదీ చదవండి: విమానం గాల్లో ఉండగా క్యాబిన్ క్రూ రీల్, ఎయిరిండియా విచారణ
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో బాధితుల బంధువులు, అదికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చిన తన కూతురిని చూసి దీపికా తల్లి కూడా తనకెంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దీపికా అధానా, కెప్టెన్ జస్వీందర్ కౌర్ నేతృత్వంలోని ఆరుగురు మహిళా సభ్యుల బృందం ఉన్నారు. యూఏఈలోని రాస్ అల్ ఖైమా (Ras Al Khaimah) విమానాశ్రయం నుండి యుద్ధ వాతావరణం వల్ల అక్కడ చిక్కుకుపోయిన 169 మంది భారతీయ ప్రయాణికులను సురక్షితంగా ఢిల్లీకి చేర్చారు.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటీ అంటే ఈ విమానాన్ని తొలుత స్నేహితురాలు నడపాల్సి ఉంది, కానీ బయలుదేరడానికి అకస్మాత్తుగా కేవలం రెండు గంటల ముందు, దీపికను ఆమె స్థానంలోకి రావాలని ఆదేశాలందాయి. ఈ బాధ్యతను అత్యంత సాహసోపేతంగా నిర్వహించి అందరి ప్రశంసలు దక్కించుకుంది.
ఎదురైన సవాళ్లు : ఈ రెస్క్యూ మిషన్ సమయంలో ఒక దశలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు తెగిపోయాయి. కొద్దిసేపు నెట్‌వర్క్ ఫెయిల్యూర్ కావడంతో ఉత్కంఠ నెలకొంది, కానీవెంటనే సంబంధాలు పునరుద్ధరించబడటంతో విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.
ఎవరీ దీపిక అధానా
హర్యానాలోని ఫరీదాబాద్ (తిగావ్ ప్రాంతం) చెందిన వారు దీపిక. తండ్రి యోగేష్ అధానా (ఆర్కిటెక్ట్), తల్లి బబ్లీ అధానా. ఆమె తాతయ్య అమృత్ సింగ్ అధానా కోరిక మేరకు దీపికా పైలట్ కావాలని నిర్ణయించుకుంది. 2020లో 12వ తరగతి పూర్తి చేసిన ఆమె, కరోనా కష్టకాలంలోనూ పట్టుదలతో చదివి కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది.
ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు


