ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఎంపికలో బిగ్‌ ట్విస్ట్‌! | Khamenei Opposed Son Mojtaba Succession as Supreme Leader | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఎంపికలో బిగ్‌ ట్విస్ట్‌!

Mar 11 2026 8:21 AM | Updated on Mar 11 2026 10:22 AM

Khamenei Opposed Son Mojtaba Succession as Supreme Leader

టెహ్రాన్‌: ఇరాన్‌  తదుపరి  సుప్రీం లీడర్‌గా అయతుల్లా సయ్యద్‌ మొజ్తాబా ఖమేనీ ఎంపిక విషయంలో బిగ్‌ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తన కుమారుడు తన వారసుడిగా కొనసాగడం తనకు ఇష్టం లేదని అయతుల్లా అలీ ఖమేనీ వీలునామా రాసినట్లు తెలుస్తోంది.

అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో మొజ్తాబాను ఇరాన్‌ నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది. అయితే ఈ మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు పలువురు పెదవి విరిస్తున్నారు. తాజాగా, ట్రంప్‌ మాత్రమే కాదు  మొజ్తాబా తండ్రి, మాజీ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీకి సైతం ఇష్టం లేదని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.  

తన కుమారుడు మొజ్తాబా ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అర్హతలు లేవని, గతంలో పలు మార్లు చెప్పిన ఆయతుల్లా వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ తాజాగా, పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల్లో తన వారసుడిగా మొజ్తాబా అనర్హుడంటూ గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా న్యూయార్స్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది. అయినప్పటికీ, వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయని సామెత చందంగా ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ఒత్తిడి మేరకు  మొజ్తాబా ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడం అనివార్యమైంది.

ఇరాన్‌లోని ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య మార్పు కోసం కృషి చేస్తున్న నేషనల్  యూనియల్‌ ఫర్‌ డెమోక్రసీ ఇన్‌ ఇరాన్‌ (ఎన్‌యూడీఐ) రీసెర్చ్‌ డైరెక్టర్‌ ఖోస్రో ఇస్ఫహానీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఖోస్రో మాట్లాడుతూ.. మొజ్తాబాకు ఇరాన్‌ను నడిపించే శక్తి సామర్ధ్యాలు, అనుభవం, రాజకీయ అనుభవం లేదు. మొజ్తబా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయాడు. చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.

ఇరాన్ నాయకత్వ వారసత్వాన్ని సాధారణంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత షియా మత పెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌)కి ఉంది. మొజ్తాబా నియామకం అసెంబ్లీ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక జరగలేదు. బదులుగా, గత వారం ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌ ఎవరు అనే అంశంపై చర్చలు జరిగాయి. అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఐఆర్‌జీసీ తరుఫు ప్రతినిధులు సైతం హాజరయ్యారు. వారే కమిటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి  మొజ్తాబాను ఎన్నుకునేలా చేశారని చెప్పారు.

ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలతో మాకు మంచి సంబంధాలున్నాయి. ఖమేనీ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిన నిపుణుల సభ మొజ్తాబాకు ఓటు వేయలేదు. అతనిపై చాలా వ్యతిరేకత ఉంది. కానీ ఐఆర్‌జీసీ ఒత్తిడితో, అతన్ని వారసుడిగా పేర్కొన్నారు. సుప్రీం లీడర్‌ అంటే తాము చెప్పినట్లు నడుచుకునే నాయకుడే కావాలని ఐఆర్‌జీసీ చూస్తోంది. అందుకే మొజ్తాబాను ఎంచుకుంది. ఐఆర్‌జీసీ ఏది చెబితే అది చేసే మనస్తత్వం మొజ్తాబాది. ఐఆర్‌జీసీ ఆయన్ని ఓ తోలు బొమ్మలా చూస్తోందని’ ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement