ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఆయనే.. అధికారిక ప్రకటన | Ayatollah Ali Khamenei Son Mojtaba Has Iran new Supreme Leader | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఆయనే.. అధికారిక ప్రకటన

Mar 9 2026 7:06 AM | Updated on Mar 9 2026 10:00 AM

Ayatollah Ali Khamenei Son Mojtaba Has Iran new Supreme Leader

టెహ్రాన్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ (Ayatollah Ali Khamenei)ఎన్నికైనట్టు ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. కాగా, ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ముజ్తబాకు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయి.

ముజ్తాబా గాయం? 
తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్‌ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్‌ చనిపోయారు. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్‌ అదెల్‌ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్‌ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్‌ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంతమైన సాయుధ విభాగం ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి.  

Advertisement
 
Advertisement
Advertisement