సౌదీ అరేబియాపై దాడి.. భారత్ స్పందన | Indian embassy No Indian Killed In Saudi Strike | Sakshi
Sakshi News home page

సౌదీ అరేబియాపై దాడి.. భారత్ స్పందన

Mar 9 2026 8:14 AM | Updated on Mar 9 2026 11:21 AM

Indian embassy No Indian Killed In Saudi Strike

పశ్చిమాసియాలో యుద్ధం నానాటికీ తీవ్రతరమవుతుంది. ఇరాన్‌,  గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు జనావాసాలపై సైతం దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో జరిగిన దాడి ఘటనపై అక్కడి భారత ఎంబసీ స్పందించింది. ఆ ఘటనలో భారతీయులెవరూ మృతిచెందలేదని ప్రకటించింది.

ఇరాన్‌ గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం భారత్‌కు తీవ్ర ఆందోళనకరంగా మారింది. మన దేశం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఆ దేశాలలోకి జీవనోపాధి కోసం వలస వెళుతుంటారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుండడంతో వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశమై ఇది వరకే భారత ప్రధాని మోదీ  గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్‌లో సంభాషించారు. అక్కడి ఇండియా ఎంబసీలు సైతం తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియాలోని భారత్ రాయబార కార్యాలయం స్పందించింది.

" నిన్న సాయంత్రం ఆల్‌ఖర్జ్‌లో జరిగిన ప్రమాదంలో భారతీయులెవరూ మరణించలేదు. ఇది ఉపశమనం కలిగించే అంశం. ఈ ప్రమాదంలో మన దేశానికి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డారు. అతనిని కౌన్సిలర్ షబీర్ కలిశారు. ఇది చాలా ప్రమాదకర మైన ఘటన" అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే నిన్న ఇరాన్‌ జరిపిన దాడుల్లో ఒక భారతీయుడితో పాటు బంగ్లాదేశ్ దేశస్థుడు మృతి చెందినట్లు సౌదీ అరేబియా పేర్కొనగా తాజాగా భారత్ దానిని ఖండించింది.

Advertisement
 
Advertisement
Advertisement