ఇరాన్‌ ఎఫెక్ట్‌.. పాకిస్తాన్‌కు కొత్త కష్టాలు | Petrol And Diesel Rates Hike In Pakistan | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ ఎఫెక్ట్‌.. పాకిస్తాన్‌కు కొత్త కష్టాలు

Mar 9 2026 7:28 AM | Updated on Mar 9 2026 9:54 AM

Petrol And Diesel Rates Hike In Pakistan

లాహోర్‌: పాకిస్తాన్‌లో ఇంధన కొరత భయంతో పెట్రోల్‌ బంకుల వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద జరిగిన కాల్పుల్లో ఒక్కరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని సియాల్‌కోట్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల మేరకు.. శనివారం సియాల్‌కోట్‌లోని దాస్కా రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్‌ పంప్‌ వద్ద పెద్ద సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు తమ కారులో పెట్రోల్‌ పోయించుకున్నారు. వెంట తెచ్చుకున్న మరో రెండు క్యాన్లలోనూ పెట్రోల్‌ నింపాలంటూ వాదులాటకు దిగారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఒప్పుకోవని సిబ్బంది తెలపడంతో తీవ్ర హెచ్చరికలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొద్దిసేపటి తర్వాత తుపాకులతో బంక్‌ వద్దకు చేరుకుని సిబ్బందిపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో సిబ్బంది ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, శుక్రవారం పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటరుకు 55 రూపాయల మేర భారీగా పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే పలు ప్రాంతాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement