అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది.
గతంలో 2007, 2024లో టైటిల్ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం.
ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.
టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.
సంజు సామ్సన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు.
అనంతరం న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), సాంట్నర్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్‌ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.


