breaking news
teamindia
-
అన్నా.. ఇది కల కాదు కదా! విజయ్ శంకర్ '3డి' విధ్వంసం
యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్ గ్లాస్గో కాస్మిక్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శనివారం డబ్లిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో డబ్లిన్ గార్డియన్స్ గ్లాస్గో కాస్మిక్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డబ్లిన్ గార్డియన్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్, డేవిడ్ విల్లీ, హ్యారీ టెక్టర్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. భారత మాజీ క్రికెటర్ విజయ్ శంకర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి శంకర్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు. 3 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. అతడి వీరోచిత పోరాటం ఫలితంగా డబ్లిన్ ప్రత్యర్ధి ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచగల్గింది. విజయ్ శంకర్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అన్నా.. ఇది కల కాదు కాదా? అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత క్రికెట్‌తో పూర్తి తెగదింపులు చేసుకున్న శంకర్.. ప్రస్తుతం విదేశీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఇక గ్లాస్గో బౌలర్లలో అలీ ఖాన్ నాలుగు, టైమల్ మిల్స్ మూడు వికెట్లు పడగొట్టారు.మున్సీ మెరుపులుఅనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని గ్లాస్కో.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ జార్జ్ మున్సీ(33 బంతుల్లో 50) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(30), లివింగ్‌స్టోన్)29) రాణించారు. గ్లాస్గో విజయం సాధించడంతో విజయ్ శంకర్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా అయిపోయింది.Shankar turning it on in the #ETPL 💥 pic.twitter.com/vHr3zsMwKf— European T20 Premier League (ETPL) (@etplofficial) September 12, 2026 -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్!
ఏషియన్ గేమ్స్-2026కు ముందు టీమిండియా మరొక కీలక పోరుకు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని భారత జట్టు.. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి రావడంతో భారత్ ఈసారి పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 సెప్టెంబర్ 13న ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ భారత తుది జట్టు ఎలా ఉండబోతోనేది ఆసక్తిరంగా మారింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టులోకి పునరాగమనం చేయడంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఒకవేళ సంజూ తొలి టీ20లో విఫలమైతే సూర్యవంశీని తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకురావాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా యూకే పర్యటనలో శాంసన్ విఫలం కావడంతో వైభవ్‌కు భారత్ తరపున ఓపెనర్‌గా ఆడే అవకాశముంది. అయితే ఇంగ్లండ్ టూర్లో మూడు మ్యాచ్‌లు వైభవ్ నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు.దీంతో ఆ సిరీస్‌లో ఆఖరి టీ20కు అతడిని పక్కన పెట్టి మళ్లీ సంజూకు ఛాన్స్ ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో సంజూ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అనంతరం జింబాబ్వే టూర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో సిరీస్ మొత్తం సూర్యవంశీనే భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఇంగ్లండ్ టూర్లో విఫలమైన వైభవ్.. జింబాబ్వేపై మాత్రం అదరగొట్టాడు. కానీ ఇప్పుడు వైభవ్ కంటే సీనియర్ అయిన శాంసన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని టీమ్ మేనెజ్మెంట్ భావిస్తుందంట.ఈ క్రమంలో తొలి టీ20లో శాంసన్ ఆడడం దాదాపు ఖాయమైనట్లే. మరోవైపు గాయాల నుంచి కోలుకుని వచ్చిన జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డిలు తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోనున్నారు. అదేవిధంగా జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న పేసర్ అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు కూడా ఢిల్లీ టీ20లో ఆడనున్నారు.అఫ్గాన్‌తో తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్చదవండి: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్.. ప్రకటన విడుదల -
నన్నే పక్కన పెడతారా? 10 వికెట్లతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్!
న్యూజిలాండ్‌తో రాబోయే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. సర్రే జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్కు బౌలింగ్ చేసే అవకాశం రాకపోయినా.. హెడ్డింగ్లీ వేదికగా ఎసెక్స్‌తో పోరులో మాత్రం అతడు చెలరేగిపోయాడు. తన స్పిన్ మయాజాలంతో ఎసెక్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఎసెక్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ యూపీ స్పిన్నర్ మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి కివీస్‌తో సిరీస్‌కు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని సెలెక్టర్లకు బలమైన సంకేతాలు పంపాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో యార్క్‌షైర్ విజయం సాధించింది.ఇటీవల శ్రీలంక పర్యటనలో కుల్దీప్ యాదవ్‌కు కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆడే అవకాశం లభించింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత టీమ్ మేనేజ్మెంట్ అతడిని సరిగ్గా ఉపయోగించుకోలేదనే విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్ మొత్తం మీద అతడికి కేవలం 25 ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో ఏకంగా అతడిని తుది జట్టు నుంచే తప్పించి, అతడి స్థానంలో సారాంశ్ జైన్‌కు చోటు కల్పించారు. అనారోగ్యం కారణంగానే కుల్దీప్కు విశ్రాంతి ఇచ్చామని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. కానీ అనారోగ్యం ఏమి లేదని, కావాలనే అతడిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారనే ప్రచారం గట్టిగా సాగింది. ఏదేమైనప్పటికి కుల్దీప్ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్మెంట్కు మరోసారి గట్టి సమాధానమిచ్చాడు.చదవండి: వైభవ్‌పై ఫిర్యాదు చేసిన తిలక్ వర్మ.. అసలేం జరిగిందంటే -
ఇదేమి బ్యాటింగ్ బ్రో.. 25 బంతులాడి డకౌటా?
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2లో డర్హమ్ తరపున ఆడుతున్న భారత వెటరన్ మయాంక్ అగర్వాల్ అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా మిడిలెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ తీవ్ర నిరాశపరిచాడు. సెకెండ్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన అగర్వాల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందిపడ్డాడు. 25 బంతులు ఎదుర్కొన్న ఈ కర్ణాటక బ్యాటర్.. తన ఇన్నింగ్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 19 ఏళ్ల మిడిలెక్స్ బౌలర్ సెబాస్టియన్ మోర్గాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 35 ఏళ్ల మయాంక్ అగర్వాల్ చివరిగా 2022లో శ్రీలంకపై చివరి మ్యాచ్ ఆడాడు. మొత్తంగా అతడు భారత జట్టుకు 21 టెస్టు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 36 ఇన్నింగ్స్‌లలో అగర్వాల్ 41.33 సగటుతో 1,488 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. అతడి కెరీర్ బెస్ట్ స్కోర్ 243 పరుగులగా ఉంది.ఈ డబుల్ సెంచరీని 2019లో హోల్కర్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌పై సాధించాడు. ఐపీఎల్-2026లో కూడా అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అంతకుముందు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అగర్వాల్ ఆడాడు.చదవండి: పాపం తిలక్ వర్మ.. ఒక్క పరుగు చేసి ఉంటే? -
ఏషియన్ గేమ్స్.. టీమిండియా బసపై బీసీసీఐ కీలక ప్రకటన!
ఆసియా క్రీడల్లో ఆటగాళ్లకు కల్పించే వసతి సౌకర్యాలు బాగా లేవని, భారత క్రికెటర్లు అలాంటి చోట ఉండటానికి ఇష్టపడటం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై క్రీడల నిర్వాహక కమిటీ అవసరమైతే ప్లేయర్లు తమకు నచి్చన హోటళ్లలో ఉండవచ్చంటూ వెసులుబాటు కూడా కల్పించింది.అయితే ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు స్పష్టతనిచ్చింది. టీమిండియా ఆటగాళ్లు నిర్వాహకులు కలి్పంచిన వసతి సౌకర్యాలనే వాడుకుంటారని, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. జపాన్‌లోని నగోయాలో నిర్వాహకులు మెరుగైన సౌకర్యాలే కల్పిస్తారని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. "విదేశీ పర్యటనల్లో మనకు లభించే ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు ఇప్పుడు ఉండకపోవచ్చనేది వాస్తవం. అయితే నిర్వాహకులు ఎలాంటి వసతి కల్పించినా మన ఆటగాళ్లు అక్కడే ఉంటారు. అద్భుతంగా కాకపోయినా అవి సౌకర్యంగానే ఉంటాయని నమ్ముతున్నాం. నగోయాలో ఉండే వసతి, వారు ఎంచుకున్న చిన్న తరహా హోటల్ గదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూశాం. అవి బాగానే ఉన్నాయి. కాబట్టి టీమిండియా ఆటగాళ్లు వాటినే వాడుకుంటారు. ఇక్కడ మేం ప్రత్యేకంగా తీసుకోవాలనుకున్నా ఎలాంటి పెద్ద హోటల్స్ లేవు. ఈవెంట్‌కు చాలా దూరంలో ఉండే ఒసాకా లేదా టోక్యోలలో బస చేయడానికి అవకాశం లేదు" అని శుక్లా పేర్కొన్నారు. అయితే వసతికంటే పిచ్, గ్రౌండ్, డ్రెస్సింగ్ రూమ్వంటి అంశాల విషయంలోనే తమకు కొంత సమస్య అనిపించిందని, దీనిని సమావేశంలో నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చామని శుక్లా అన్నారు. చదవండి: Asia Cup: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు -
రింకూ సింగ్ అట్టర్ ప్లాప్.. అయినా టైటిల్ కొట్టేశాడు
యూపీ టీ20 లీగ్-2026 విజేతగా రింకూ సింగ్ సారధ్యంలోని మీరట్ మేవరిక్స్ నిలిచింది. ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో లక్నో ఫాల్కన్స్‌ను 94 పరుగుల తేడాతో చిత్తు చేసిన మీరట్.. రెండో యూపీ టీ20 టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఓపెనర్ దివ్యాన్ష్ జోషి(40 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105) విధ్వంసకర సెంచరీతో కదం తొక్కాడు. అయితే కెప్టెన్ రింకు సింగ్ ఈ మ్యాచ్‌లో 2 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. లక్నో బౌలర్లలో అభినందన్ సింగ్ మూడు, భువనేశ్వర్ కుమార్, అజిత్ వర్మ, విప్రజ్ నిగమ్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో ఫాల్కన్స్ 16 ఓవర్లలోనే 109 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్ విశాల్ చౌదరి నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు.కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ?ఇక మీరట్‌ను జట్టును రెండో సారి ఛాంపియన్‌గా నిలపడంతో కేకేఆర్ కెప్టెన్సీ రేసులోకి రింకూ దూసుకొచ్చాడు. గత రెండు సీజన్లలో అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అయితే అతడు ఇటీవల ఆల్‌ఫార్మాట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కోల్‌కతా కెప్టెన్సీ పోస్ట్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో కేకేఆర్ యాజమాన్యం తమ జట్టు పగ్గాలను ఎవరికి అప్పగిస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితుల బట్టి తదుపరి కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్నే ఎంపిక చేసే అవకాశముంది. అతడు ఈ యూపీ టీ20 లీగ్‌లో జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 9 విజయాలు అందించాడు.చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్‌ప్లాప్ ప్లేయర్‌కు చోటు -
శుభ్‌మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌ని ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నమెంట్లో ఫాజిల్కా ఫాల్కన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్.. ఆదివారం మొహాలీ వేదికగా లుధియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఫాల్కన్స్‌కు శుబ్‌మన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తన టీమిండియా సహచరుడు, స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు.ఉత్కంఠ పోరుఅనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లుధియానా లయన్స్ విజయానికి కేవలం ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. మాధవ్ పఠానియా (37 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో లుధియానా గెలుపునకు 19 పరుగులు అవసరం కాగా.. 17 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. మరో ఒక్క పరుగు చేసి ఉంటే ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసేది. ఫాల్కన్స్ బౌలర్లలో విహాన్ మల్హోత్రా, దత్తా తలా రెండు వికెట్లు చొప్పున తీశారు.చదవండి: ఆ ఒక్కటి జింబాబ్వే కొంపముంచింది; ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా -
టీమిండియా ప్లేయర్ విధ్వంసం.. 6 ఫోర్లు, 8 సిక్సలతో వీర విహారం
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో మొహాలీ కింగ్స్ మరో సంచలన విజయం సాధించింది. శనివారం మొహాలీ వేదికగా జలంధర్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో మొహాలీ గెలుపొందింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన జలంధర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మొహాలీ బ్యాటర్లలో విశ్వనాథ్ సింగ్(40), కెప్టెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్(37), హర్జస్ సింగ్(37) రాణించారు. మొహాలీ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్, హర్ష్‌దీప్ సింగ్, తేజ్‌ప్రీత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.రమణ్‌దీప్ మెరుపులుఅనంతరం లక్ష్య చేధనలో మొహాలీ కింగ్స్ కెప్టెన్ రమణ్‌దీప్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రమణ్‌దీప్.. ప్రత్యర్ది బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడితో పాటు అన్మోల్ప్రీత్ సింగ్(29 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 178 పరుగుల లక్ష్యాన్ని మొహాలీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంతో మొహాలీ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది. ఇక రమణ్‌దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్‌దీప్‌కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్‌లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్‌రౌండర్ భావిస్తున్నాడు. -
క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి.. జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా
ఏషియన్ గేమ్స్-2026 ఆరంభానికి ముందే భారత క్రికెట్ జట్టు ఒక చారిత్రక మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జపాన్‌తో ఏకైక టీ20లో టీమిండియా తలపడనుంది. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం 'ఎక్స్' వేదికగా వెల్లడించింది."ఒలింపిక్స్-20236, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులకోసం ప్రయత్నిస్తున్న భారత్ ఆ దిశగా ‘స్పోర్ట్స్ 75’తో తొలి అడుగు వేయనుంది. జపాన్‌తో భారత్ ప్రత్యేక మ్యాచ్ ఆడనుంది. జపాన్ ప్రధాని సనాయె తకైచి, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇండియా, జపాన్ మధ్య క్రీడల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడమే దీని లక్ష్యమని" బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. కాగా ఆసియా క్రీడలకు బీసీసీఐ పూర్తి స్ధాయి భారత జట్టును పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం వదిలి క్రికెటర్‌గా.. ఎవరీ నయా సంచలనం?𝗛𝗶𝘀𝘁𝗼𝗿𝘆 𝗜𝗻 𝗧𝗵𝗲 𝗠𝗮𝗸𝗶𝗻𝗴!India🇮🇳 🤝 Japan🇯🇵#TeamIndia set to play a historic T20I against Japan to launch the celebrations of the 7️⃣5️⃣th Anniversary of India-Japan Diplomatic Relations. 👏👏@CricketJapan All The Details 🔽https://t.co/vxdhuT1tgp pic.twitter.com/DQmPncvefH— BCCI (@BCCI) September 4, 2026 -
ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోలేదా?.. అంతమాత్రాన క్రికెట్ అగిపోయిందా?
పాకిస్తాన్ క్రికెట్లో ప్రస్తుతం తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ టూర్లో వరుసగా రెండు టెస్టుల్లో ఘోర ఓటమి చవిచూడడంతో పాక్ జట్టులో కొన్ని అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుకు ముందు జట్టులోని మొత్తం ఏడు మంది ఆటగాళ్లను పాక్ క్రికెట్ బోర్డు స్వదేశానికి రప్పించింది. అక్కడితో ఆగకుండా కోచ్‌లు సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్‌ను సైతం వెనక్కి పిలిపించింది. మరోవైపు స్టార్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ ఫేక్ ఇంజ్యూరీ వివాదం కూడా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే తమ సొంత జట్టులోని లోపాలను సరిదిద్దుకోలేని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇతర జట్లపై తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆధునిక క్రికెట్లో ఎంతటి బలమైన జట్లయినా ఊహించని ఓటములను చవిచూడటం సాధారణ విషయమని తమ లోపాలను అతడు కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు."మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. సౌతాఫ్రికా నమీబియా చేతిలో, భారత్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. అంతమాత్రాన అక్కడితో క్రికెట్ ముగిసిపోయిందా? క్రికెట్లో గెలుపుటుముల సహజం. మాకు ఎవరైతే అవసరమో వారిని కచ్చితంగా జట్టులోకి తీసుకుంటాం. అంతే తప్ప వరుసగా విఫలమమ్యే వారిని ఇకపై జట్టులో కొనసాగించాం. మాకు ప్రతీ మ్యాచ్, ప్రతీ సిరీస్ కూడా చాలా ముఖ్యమని" అతడు పేర్కొన్నాడు.అదేవిధంగా ఇంగ్లండ్ పర్యటనలో తమ జట్టు ప్రదర్శన గురుంచి కూడా అతడు మాట్లాడు. "ఇంగ్లండ్ టూర్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. కానీ రాబోయో మ్యాచ్‌లు, సిరీస్‌లలో మేము తిరిగి పుంజుకుంటామని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే వన్డే, టీ20ల్లో మా విజయాల శాతం పెరిగింది. నేను విమర్శలకు భయపడను. నేను వచ్చిన తర్వాత పాక్ క్రికెట్ నాశనం అయిపోయిందన్న అన్న వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను కొత్త కోచ్‌లను తీసుకురాకముందు మన జట్టు ర్యాంకింగ్స్‌లో ఎలా ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. వన్డేల్లో 8వ స్ధానంలో ఉండేవాళ్లం.. ఇప్పుడు ఐదవ ర్యాంక్‌లో ఉన్నాము. అలాగే టీ20ల్లో తొమ్మిది నుంచి ఆరవ స్ధానానికి ఎగబాకాము" అని నఖ్వీ చెప్పుకొచ్చారు.చదవండి: 'హమ్మయ్య.. గంభీర్ ఫేవరెట్ ప్లేయర్లు వచ్చేశారు' -
'రిటైర్మెంట్ వరకు అతడే టీమిండియా కెప్టెన్'
టీ20 ప్రపంచకప్-2026 తర్వాత టీమిండియా కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ తప్పించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గానే పూర్తిగా ప్లేయర్‌గానే అతడిని జట్టు నుంచి పక్కన పెట్టేశారు. అతడి స్దానంలో అనుహ్యంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను భారత టీ20 జట్టు సారధిగా బీసీసీఐ నియమించింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరు సరికాదు చాలా మంది మాజీలు విమర్శించారు. అయితే భారత జట్టు పగ్గాలను చేపట్టిన ఆరంభంలోనే అయ్యర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడి సారథ్యంలోని టీమిండియా వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లలో ఓటమి పాలైంది. ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్‌గా అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అతడు కెప్టెన్సీలోనే భారత జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ తలపడనుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో అయ్యర్ ఆసీస్ దిగ్గజం, పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని, రిటైర్మెంట్ వరకు అతడే టీమిండియా కెప్టెన్‌గా ఉంటాడని పాంటింగ్ జోస్యం చెప్పాడు."శ్రేయస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్ 2025 వేలంలో శ్రేయస్ కోసం భారీగా ఖర్చు చేసినప్పుడే, అతడిపై నాకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అతడితో మళ్లీ కలిసి పనిచేయాలని అనుకున్నాను. ఒక ప్లేయర్‌గా అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టగలననే నమ్మకం నాకుంది. ఒక కెప్టెన్‌గా, టీమ్ లీడర్‌గా అయ్యర్‌తో పనిచేయడాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. భారత టీ20 జట్టు కెప్టెన్సీ అప్పగించి బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. తను టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే వరకు ఆ పదవికి అతడే సరైనోడు" అని ఇండియా టూడే ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! అస్సలు ఊహించి ఉండడు? -
అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. కేవలం 26 బంతుల్లోనే
షేర్-ఎ-పంజాబ్ T20 లీగ్ 2026 సీజన్‌ను అభిషేక్ శర్మ సారథ్యంలోని అమృత్సర్ సూర్మాస్ ఓటమితో ఆరంభించింది. ఆదివారం మొహాలీ వేదికగా మొహాలీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమృత్సర్ 19.5 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 26 బంతుల్లో మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. అతడితో పాటు నమన్ ధీర్(22 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 47), సహజ్ ధావన్(45) రాణించారు. మొహాలీ బౌలర్లలో తేజ్‌ప్రీత్ సింగ్ మూడు వికెట్లు, తన్మయ్ ధరణి, హర్‌ప్రీత్ బ్రార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అన్మోల్ సూపర్ సెంచరీఅనంతరం ఈ భారీ లక్ష్య చేధనలో మొహాలీ ఫస్ట్ డౌన్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్‌లతో 133 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ రమణ్‌దీప్ సింగ్(40 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 69) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా మొహాలీ జట్టు లక్ష్యాన్ని 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది.Abhishek Sharma ⚡️Saddi Apni League Sher E Punjab League 💪🏻 pic.twitter.com/CkUVTSty4H— Shreyas_reign_ (@Shreyas_reign_) August 31, 2026 -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఇక బ్యాటర్లకు చుక్కలే!
ఏషియన్ గేమ్స్-2026కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆసియా క్రీడల ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక గేమ్స్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. అయితే ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న బుమ్రా ఈ క్రీడలలో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు అతడు తన గాయం నుంచి శరవేగంగా కోలుకుంటున్నాడని ప్రముఖ క్రీడా జర్నలిస్ట్ సాహిల్ మల్హోత్రా వెల్లడించారు. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రా కచ్చితంగా ఏషియన్ గేమ్స్‌లో ఆడుతాడని సాహిల్ స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న బుమ్రా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మాత్రం దూరం కానున్నాడు. బుమ్రా చివరగా భారత తరపున ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మోకాలి గాయానికి గురయ్యాడు. దీంతో ఆ తర్వాత జరిగిన అఫ్గానిస్తాన్ టెస్టు, వన్డే సిరీస్‌లతో పాటు శ్రీలంక పర్యటనకు అతడు దూరమయ్యాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటున్నాడని టీమ్ మేనెజ్మెంట్ భావించింది. కానీ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో జట్టు నుంచి తప్పించారు.దీంతో అతడి స్దానంలో ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకున్నారు. కాగా బుమ్రా పూర్తిగా కోలుకున్నాకే బరిలోకి దించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎందుకంటే ఈ ఏడాది ఆఖరిలో భారత్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో కీలక టెస్టు సిరీస్‌లు ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరాలంటే భారత్‌కు ఈ రెండు సిరీస్‌లు చాలా ముఖ్యం. ఇక ఏషియన్ గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్-19 నుంచి ప్రారంభం కానున్నాయి.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. జింబాబ్వే పర్యటనలో గాయపడ్డ యువ ఫాస్ట్ బౌలర్, యార్కర్ల కింగ్ ప్రిన్స్ యాదవ్.. తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఆజ్ తక్ కథనం ప్రకారం.. ప్రిన్స్ యాదవ్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్నెస్ పరీక్షలను క్లియర్ చేసినట్లు సమాచారం. తద్వారా అఫ్గాన్‌తో సిరీస్ కోసం భారత జట్టు ఎంపికకు ప్రిన్స్ అందుబాటులో ఉండనున్నాడు. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ప్రిన్స్‌కు ఏమైందంటే?హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బౌలింగ్ చేస్తుండగా ప్రిన్స్ యాదవ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో 2.2 ఓవర్లు బౌలింగ్ చేసి ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మూడో టీ20కు అతడు దూరమయ్యాడు. అనంతరం ఈ ఢిల్లీ పేసర్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లో చేరి తన ఫిట్నెస్ను తిరిగి పొందాడు. కాగా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో భారత సీనియర్ జట్టు సెలక్టర్ల నుంచి అతడికి పిలుపువచ్చింది. తనకు లభించిన అవకాశాన్ని ప్రిన్స్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇప్పటివరకు భారత తరపున 3 వన్డేలు, 6 టీ20లు ఆడిన ప్రిన్స్ యాదవ్.. మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు.ఇప్పుడు ఈ రైట్ ఆర్మ్ పేసర్ అఫ్గానిస్తాన్‌పై సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు.చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యుద్భుతం.. 1932 తర్వాత -
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు బిగ్ షాక్
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనుకున్న భారత జట్టుకు నిరాశే ఎదురైంది. కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టును టీమిండియా డ్రా ముగించింది. ఐదో రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు అద్భుతమైన పోరాటం కనబరిచారు. నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. చివరి రోజున మిగిలిన 4 వికెట్లు సాధించి ఆలౌట్ చేయలేకపోయారు.యువ ఆటగాడు సోనల్ దినుష (264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్), లంక టెయిలాండర్ల పోరాటం ముందు మన బౌలర్లు తేలిపోయారు. దీంతో శ్రీలంక 429/9 స్కోరు వద్ద ఉన్నప్పుడు మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. అయితే ఈ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో టీమిండియా ఫైనల్ ఆశలపై ప్రభావం చూపింది.ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఉంటే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకునేది. కానీ ఇప్పుడు డ్రా కావడంతో ఐదో స్ధానానికే పరిమితమైంది. అంతేకాకుండా విజయాల శాతం 53.33 నుంచి 51.52కి పడిపోయింది. ప్రస్తుత సైకిల్లో గిల్ సేన ఇప్పటివరకు ఆడిన 11 టెస్టుల్లో ఐదు విజయాలు, రెండు డ్రాలు చేసింది. మరో నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (80), దక్షిణాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (55.56) జట్లు భారత్ కంటే ముందున్నాయి.భారత్ ఫైనల్‌కు చేరాలంటే?ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇంకా 7 టెస్టులు ఆడనుంది. ఇందుకు న్యూజిలాండ్‌తో 2, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లలో తలపడనుంది. భారత జట్టు ఫైనల్‌కు చేరాలంటే.. ఈ ఏడు మ్యాచ్‌లలో ఐదింట అయినా గెలుపొందాలి. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపైన కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కివీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది.చదవండి: IND vs SL: 90 బంతులు.. 12 పరుగులు! నీ ఓపికకు ఓ దండం సామీ? -
జట్టు నుంచి తీసేస్తామన్నారు.. జ్వరంతోనే ఆటోలో వెళ్లా: సిరాజ్
మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో ఈ హైదరాబాదీ అద్భుతాలు చేస్తున్నాడు. సంచలన స్వింగ్, నిలకడైన వేగంతో ప్రత్యర్ది బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అయితే ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న సిరాజ్.. తన ప్రారంభ రోజుల్లో పడిన కష్టాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో అండర్-23 జట్టు తరపున ప్రాక్టీస్‌కు హాజరయ్యానని సిరాజ్ చెప్పుకొచ్చాడు.అండర్-23 జట్టుకు సెలక్ట్ అయినప్పుడు చాలా సంతోషపడ్డా. అయితే టోర్నీకి ముందు నేను డెంగ్యూ జ్వరం బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. గ్లూకోజ్ లెవల్స్ పడిపోయాయి. దీంతో రెండు రోజుల పాటు ప్రాక్టీస్‌కు వెళ్లలేదు. ప్రాక్టీస్‌కు రాకపోతే జట్టు నుంచి తొలగిస్తామని మేనేజ్మెంట్ హెచ్చరించింది. అప్పటికే నా ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. శరీరంలో ఏమాత్రం శక్తి లేదు. కంటిన్యూగా సెలైన్లు ఎక్కుతునే ఉన్నాయి. సరైన టైమ్‌లో వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాణాలకే ప్రమాదం జరిగేది అని డాక్టర్లు చెప్పారు. కానీ జట్టులో చోటు కోల్పోతానే భయంతో ఉదయం ఐదు గంటలకే మా నాన్నను నిద్రలేపి పరిస్థితి వివరించాను.వెంటనే మా నాన్న ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఆడగలవా అని ప్రశ్నించారు. పర్వాలేదు నేను మేనెజ్చేసుకుంటా అని చెప్పా. దీంతో మా నాన్నే నన్ను స్వయంగా ఆటోలో ప్రాక్టీస్‌కు తీసుకెళ్లారు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా, రిపోర్టుల్లో డెంగ్యూ లక్షణాలు ఏవీ లేవని తేలింది" అని సిరాజ్ సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: 'బాబర్ ఆజం 250 రన్స్ చేయాలి'.. పాక్ జట్టును ఎగతాళి చేసిన బ్రాడ్ -
తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్‌ను గుర్తు చేశాడుగా! వీడియో
వీరేందర్ సెహ్వాగ్.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా పేరు గాంచాడు. ఈ మాజీ ఓపెనర్ తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. 1999లో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సెహ్వాగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి భారత జట్టు తరపున 374 మ్యాచ్‌లు ఆడాడు.ఈ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ కెరీర్లో 72 అర్ధసెంచరీలు, 38 సెంచరీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సెహ్వాగ్ అడుగు జాడల్లోనే తన పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా నడుస్తున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్.. తాజాగా తన తండ్రి బ్యాటింగ్ శైలిని గుర్తు చేస్తూ అభిమానులను అలరించాడు. మైదానంలో తండ్రిలాగే స్క్వేర్ డ్రైవ్, కవర్ డ్రైవ్ వంటి ఐకానిక్ షాట్లను ఆర్యవీర్ రీక్రియేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తండ్రికు తగ్గ తనయుడు అంటూ కొనియాడుతున్నారు. కాగా ఈ టోర్నీలో జూనియర్ సెహ్వాగ్‌కు కేవం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఓ మ్యాచ్‌లో విఫలమైనప్పటికి.. మరో మ్యాచ్‌లో 22 పరుగులతో ఆకట్టుకున్నాడు.చదవండి: IND vs SL: ధ్రువ్ జురెల్ సెంచరీ.. దెబ్బకు ధోని ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ತಂದೆಗೆ ತಕ್ಕ ಮಗ!😎😍#VirenderSehwag #AryavirSehwag #StarSportsKannada pic.twitter.com/rN8d8X9Eay— Star Sports Kannada (@StarSportsKan) August 24, 2026 -
రింకూ సింగ్ విధ్వంసం.. కేవలం 7 బంతుల్లోనే! వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో మీరట్ ఘన విజయం సాధించింది. మీరట్‌కు ఇది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం.కాగా ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన గోరఖ్‌పూర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. గోరఖ్‌పూర్ బ్యాటర్లలో అభయ్ ప్రతాప్ సింగ్(33) టాప్ స్కోరర్‌గా నిలిచారు. మీరట్ బౌలర్లలో జీషన్ అన్సారీ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.అనంతరం ఈ లక్ష్యాన్ని మీరట్ మావెరిక్స్ వికెట్ కోల్పోకుండా 6.4 ఓవర్లలో ఊదిపడేసింది. అయితే లక్ష్య చేధనలో మీరట్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ అక్షయ్ దూబే(9) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మీరట్ మావెరిక్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ రింకూ సింగ్ మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అందరిని ఆశ్చర్చపరిచాడు.అక్షయ్ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏకనా మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం ఏడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్.. 2 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 29 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అతడి స్ట్రైక్ రేట్ 414.29గా ఉండడం గమనార్హం. రింకూతో పాటు యువ ఆటగాడు స్వస్తిక్ చికారా(24 బంతుల్లో 44) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: మీకేం తెలుసు?: హర్షా భోగ్లేకు ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్That Rinku Singh special. 💥1️⃣ 6️⃣ 4️⃣ 6️⃣ 6️⃣ 4️⃣ 2️⃣ 🔥 pic.twitter.com/L57yTUFcTV— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) August 24, 2026 -
టీమిండియాకు గుడ్ న్యూస్.. విధ్వంకర వీరుడి బ్యాటింగ్‌కు లైన్ క్లియర్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(117) అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. ఇది అతడికి వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(50), రవీంద్ర జడేజా(43), యశస్వి జైశ్వాల్(45) రాణించారు.టీమిండియాకు గుడ్ న్యూస్అయితే రెండో రోజు ఆటకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. తొలి రోజు ఆటలో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ సితాన్షు కోటక్ ధ్రువీకరించాడు. పంత్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. రెండో రోజు అతడు బ్యాటింగ్‌కు రానున్నాడు అని కోటక్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.పంత్‌కు ఏమైందంటే?భారత ఇన్నింగ్స్ 57వ ఓవర్లో లంక పేసర్ లహిరు కుమార పంత్‌కు ఓ షార్ట్‌పిచ్ డెలివరీని సంధించాడు. ఆ బంతిని అతడు ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ఎడమ చేతి గ్లౌవ్పై తాకింది.దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. కానీ అతడి గాయం తీవ్రమైనది కాకపోవడంతో టీమ్ మేనెజ్మెంట్ ఊపిరిపీల్చుకుంది. -
IND vs SL: శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (16, 8) శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే అవుటై నిరాశపరిచాడు. ఈ క్రమంలో లెఫ్టార్మ్ స్పిన్ వీక్నెస్ను అధిగమించేందుకు గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రెండో టెస్టు కోసం ఇప్పటికే కొలంబో చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. రాహుల్, కుల్దీప్ వంటి సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి తీసుకున్నప్పటికి గిల్ మాత్రం నెట్స్‌లో చెమట్చోడ్చాడు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌ను గిల్ సుదీర్ఘంగా ఎదుర్కొన్నాడు. గిల్ తాజా నెట్ సెషన్‌కు సంబంధించిన వివరాలను భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఆ రోజు గిల్ నెట్ సెషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఆ కుడిచేతి వాటం బ్యాటర్ కొలంబో పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు."గిల్ బ్యాటింగ్ శైలి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు స్వేచ్ఛగా పరుగులు సాధించే బ్యాటర్. పిచ్ స్వభావం, బౌన్స్ అంచనా వేస్తూ కొలంబో పరిస్థితులకు అలవాటు పడేందుకే కాస్త ఎక్కవ సమయం నెట్స్‌లో గడిపాడు. ఇందులో ఎలాంటి ప్రత్యేకమైన ప్రణాళికలేమీ లేవు" అని బహుతులే పేర్కొన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. కొలంబోలోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. -
భారత వరల్డ్ కప్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు!
వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు.ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఉన్న యశస్వి జైశ్వాల్‌ను కాదని వైభవ్‌కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.తన డెబ్యూ సిరీస్‌లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు.ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో భువనేశ్వర్ అద్భుతంగా రాణిస్తుండడంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక చివరగా స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌కు ఈ కర్ణాటక మాజీ క్రికెటర్ అవకాశమిచ్చాడు.ప్రపంచకప్ టోర్నీకి ఉతప్ప ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్ -
గిల్ కాదు.. అతడితో జాగ్రత్త! శ్రీలంకకు దిగ్గజ క్రికెటర్ వార్నింగ్
శ్రీలంక క్రికెట్ జట్టు సొంత గడ్డపై టీమిండియాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూపంలో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం పంత్ అంత మంచి ఫామ్‌లో లేడు. ఇటీవల జరిగిన శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో కూడా రిషబ్ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి తనదైన రోజున ఓంటి చేతితో జట్టును గెలిపించే సత్తా అతడిది. ఈ క్రమంలోనే మహరూఫ్ తమ జట్టు హెచ్చరించాడు."నేను శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి ఉంటే, రిషబ్ పంత్ గురుంచి ఎక్కువగా ఆలోచించేవాడిని. అతడు జట్టుకు ఎక్స్-ఫాక్టర్. టెస్టు క్రికెట్లో కూడా టీ20 తరహా బ్యాటింగ్ చేస్తాడు. పంత్ క్రీజులో ఉంటే కేవలం అర గంటలోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. అతడికి టీమ్ మేనెజ్మెంట్ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ప్రభాత్ జయసూర్య వంటి అద్భుతమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నప్పటికి పంత్‌ను కట్టడి చేయడం అంత తేలిక కాదు" అని మహరూఫ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.భారత్‌తో తొలి టెస్టుకు శ్రీలంక జట్టుధనంజయ డి సిల్వా (కెప్టెన్), లహిరు ఉదారా, నిశాన్ మధుష్క, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమాల్, పసిందు సూరియబండారా, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంకచదవండి: Hundred Women 2026: ఎలిమినేటర్ ముంగిట సన్‌రైజర్స్ విధ్వంసం -
వైభవ్ కాదు.. అతడి సెలక్షన్ ఒక అద్భుతం!
పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్ టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు బ్యాకప్ బౌలర్‌ను వెతుకుతున్న సమయంలో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు గుర్నార్. 6 అడుగుల 5 అంగుళాల పొడవున్న ఈ రైట్ ఆర్మ్ పేసర్.. గంటకు 142 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. వన్డేల్లో తనను నిరూపించుకున్న గుర్నార్.. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో గుర్నూర్ అరంగేట్రం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుర్నూర్ బ్రార్‌పై టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గుర్నూర్‌కు మంచి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని జహీర్ కొనియాడాడు."అధిక వేగంతో బౌలింగ్ చేయగల యువ ఫాస్ట్ బౌలర్లు భారత జట్టులోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గుర్నార్ బ్రార్ వంటి యంగ్ పేసర్‌ను త్వరితగతిన జట్టులోకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అతడికి అద్భుతమైన టాలెంట్ ఉంది. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగలడు. కేవలం ఒక్క వేగమే కాదు సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో కూడా బౌలింగ్ చేయగలడు.అతడు సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని నేను నమ్ముతున్నానని ఓ ఇంటర్వ్యూలో జహీర్ పేర్కొన్నాడు. కాగా 26 ఏళ్ల గుర్నార్ బ్రార్ గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ తరపున గుర్నార్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 7 మ్యాచ్‌లలోనే 26 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఆ తర్వాత పంజాబ్ టీ20 లీగ్‌లో కూడా టాప్ వికెట్ టేకర్‌గా(22) అతడు నిలిచాడు. ఐపీఎల్లో మాత్రం అతడు ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయినప్పటికి అతడి టాలెంట్‌ను పరిగణలోకి తీసుకుని జాతీయ జట్టులో సెలక్టర్లు చోటిచ్చారు. అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన గుర్నూర్ తన సూపర్ బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 వన్డేల్లో అతడు 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పుడు టెస్ట్ జట్టులో కూడా అతడు చోటు కొట్టేశాడు.!చదవండి: Bhuvaneshwar Kumar: నేను ఎందుకు కాదంటాను? అంతా వాళ్ల చేతిలోనే ఉంది -
నేను ఎందుకు కాదంటాను? అంతా వాళ్ల చేతిలోనే ఉంది: భువీ
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ రీఎంట్రీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్-2027 కోసం సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే, తిరిగి జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నానని భువీ తెలిపాడు. కాగా 36 ఏళ్ల భువనేశ్వర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు టైటిల్స్‌ను సొంతం చేసుకోవడంలో ఈ యూపీ పేసర్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లతో భువీ సత్తాచాటాడు. దీంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్, రవి శాస్త్రి, దినేష్ కార్తీక్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం భువీని ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు తను రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు."జాతీయ జట్టు సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే నేను ఎందుకు కాదంటాను? భారత్ తరపున ఆడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దమే. కానీ నా చేతుల్లో లేని విషయం గురుంచి ఎక్కువ నేను ఆలోచించను. నన్ను తీసుకోవాలా లేదా అన్నది సెలక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉటుంది. అయితే నా శరీరం అలిసిపోయేంతవరకు క్రికెట్ ఆడుతూనే ఉంటాను. అందుకే యూపీ టీ20 లీగ్ ఆడేందుకు ఇక్కడికి వచ్చాను. అంతేతప్ప మెరుగ్గా రాణించి ఎవరినో ఆకట్టుకోవాలని అయితే ఇక్కడికి రాలేదు. ఐపీఎల్లో కూడా అంతే. జట్టు కోసం రాణించి మ్యాచ్‌లు గెలవాలన్నదే నా లక్ష్యం. ఎవరో ఏదో అన్నారని లేదా మరో చోట ఎంపికవ్వాలనే ఆశతో నేను ఆడడం లేదు" అని హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువీ పేర్కొన్నాడు. కాగా భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు.చదవండి: ఆ పేరంటే ద్వేషం: భారత బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్ -
శ్రీలంకతో తొలి టెస్ట్.. టీమిండియాకు గుడ్ న్యూస్
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో కుడి చేతి వేలికి గాయం కావడంతో తొలి టెస్టుకు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉంటాడా?లేదా? ఆందోళన అందరిలోనూ నెలకొంది.అయితే ఇప్పుడు గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు తిరిగి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది.ఈ చేతి వేలి గాయం కారణంగానే తొలి రెండు రోజుల ఆటకు మాత్రం అతడు దూరంగా ఉన్నాడు. మూడో రోజు ఫీల్డింగ్ రానప్పటికి బ్యాటింగ్ మాత్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గిల్ గైర్హజరీలో భారత కెప్టెన్‌గా రాహుల్ వ్యహరిస్తున్నాడు.ఇప్పటికే శ్రీలంకతో సిరీస్‌కు ఇన్ఫామ్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్‌లు గాయం కారణంగా దూరమయ్యారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్ట్‌లో ఆడేది అనుమానమే. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 363/8 డిక్లేర్ చేసింది.మొదటి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు ఆకట్టుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్, జడేజా, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 357/6 వద్ద డిక్లేర్ చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (164 బంతుల్లో18 ఫోర్లతో 142 ) భారీ సెంచరీతో కదం తొక్కాడు. నాలుగో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా 63 పరుగులు సాధించాడు. ఇక మూడో రోజు లంచ్ సమయానికి శ్రీలంక 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. -
'ఓటముల్లోనూ అదే శాంతం'.. శ్రేయస్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం
టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక ఏడు మ్యాచ్‌ల తర్వాత శ్రేయస్ అయ్యర్ గెలుపు రుచిని చూసిన సంగతి తెలిసిందే. అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ఐర్లాండ్ (0-2), ఇంగ్లాండ్ (0-4) సిరీస్‌లలో వరుస ఓటములను చవిచూసింది. అనంతరం జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను మాత్రం భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్ విజయం. అయితే శ్రేయస్ కెప్టెన్‌గా తొలి ఏడు మ్యాచ్‌లలో విఫలమైనప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లో ఈ ముంబైకర్ బ్యాట్‌తో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అయ్యర్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఫలితాలు అనుకూలంగా రాకపోయినప్పటికి శ్రేయస్ అయ్యర్ చాలా ప్రశాంతంగా వ్యవహరించాడని చోప్రా కొనియాడాడు."శ్రేయస్ అయ్యర్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అతడు ఎప్పుడూ ప్రతికూల విషయాల గురుంచి ఆలోచించడం, మాట్లడడం గానీ చేయడు. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుందనే సూత్రాన్నిఅతడు బలంగా నమ్ముతాడు. ఆ మైండ్‌సెట్ వల్లే జట్టులో ఎప్పుడూ నెగెటివిటీకి తావివ్వడు.ఆటగాళ్లు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలరు. సహజంగా క్రికెట్ లాంటి క్రీడల్లో ప్రతీ ఒక్కరిపై ఒత్తిడి ఎలానూ ఉంటుంది. అదనంగా కెప్టెన్ లేదా కోచ్ కూడా ఒత్తిడి పెంచితే ఆటగాళ్లు రాణించలేరు. కానీ అయ్యర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. చాలా కూల్‌గా ఉండి ఆటగాళ్లకు పూర్తి స్వేఛ్చను ఇస్తాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ జట్టులో మంచి వాతావరణాన్ని పెంపొందించే వారే నిజమైన కెప్టెన్" అని దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: భారత్‌తో టెస్టు సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం -
టీమిండియా వైపు దూసుకొస్తున్న నయా పేస్ గుర్రం.. ఎవరంటే?
టీమిండియా వైపు మరో పేస్ సంచలనం దూసుకొస్తున్నాడు. గంటకు 145 కి.మీ వేగానికి పైగా బంతులు విసిరి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత తరపున అదరగొట్టిన ఈ యువ పేసర్.. ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తాచాటాడు.అతడే 18 ఏళ్ల స్పీడ్‌స్టర్ దీపేష్ దేవేంద్రన్. దీపేష్ బుధవారం తిరుచ్చి గ్రాండ్ చోళాస్‌తో జరిగిన మ్యాచ్‌లో మధురై పాంథర్స్ తరపున టీఎన్‌పీఎల్ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే దేవేంద్రన్ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో 25 పరుగలిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.ఈ రైట్ ఆర్మ్ పేసర్ వికెట్లు ఎక్కువగా తీయకపోయినప్పటికి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 16వ ఓవర్ మొదటి బంతిని ఏకంగా 146 కి.మీ/గం వేగంతో విసిరి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. అదే ఓవర్లో మరో మూడు సార్లు 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసురుతూ, కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడి బౌలింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు అతడు కచ్చితంగా భారత సీనియర్ జట్టులోకి వస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే అతడి టీమ్మేట్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.కాగా గత కొంత కాలంగా దీపేష్ వైట్‌బాల్ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఆసియాకప్-2025 ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికి.. దీపేష్ టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి టోర్నీలోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై జరిగిన యూత్ టెస్టు సిరీస్‌లోనూ అతడు అదరగొట్టాడు.బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మొత్తంగా రెండు మ్యాచ్‌లు కలిసి దీపేష్ పది వికెట్లు పడగొట్టాడు. వినూ మన్కడ్ ట్రోఫీలోనూ తమిళనాడు తరఫున అతడు సత్తాచాటాడు. ఇక అండర్ 19 ప్రపంచకప్-2026ను భారత్ సొంతం చేసుకోవడంలో దీపేష్ది కీలక పాత్ర. సెమీస్, ఫైనల్లో కలిపి అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే మాదిరి లంక బ్యాటర్ల విధ్వంసం -
టీమిండియాకు మరో భారీ షాక్..!?
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలే అవకాశముంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంక టూర్‌కు దూరం కాగా.. ఇప్పుడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అందుబాటుపై కూడా సందేహాలు నెలకొన్నాయి.స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ సందర్భంగా సుదర్శన్ కాలి బొటనవేలికి గాయమైంది. సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. శ్రీలంకతో సిరీస్ సమయానికి సుదర్శన్ పూర్తిగా కోలుకుంటాడని భావించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. భారత జట్టులో అతడికి చోటు కల్పించింది.అయితే సిరీస్‌కు ముందు అతడు తన ఫిట్నెస్ నిరూపించుకోవాలని సెలక్టర్లు కండీషన్ పెట్టారు. కానీ సుదర్శన్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరి కొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ టెస్టు సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు మంగళవారం శ్రీలంకకు పయనం కానుంది.కానీ సుదర్శన్ మాత్రం భారత జట్టుతో కలిసి శ్రీలంకకు వెళ్లడం లేదని రేవ్‌స్పోర్ట్స్ తమ కథనంలో పేర్కొంది. సీవోఈ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లభించిన తర్వాతే అతడు కొలంబోలోని జట్టుతో కలిసే అవకాశం ఉందని రేవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది. సుదర్శన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిరిగి బ్యాటింగ్ ప్రారంభించాడు. త్వరలోనే అతడికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అతడు పాసైతేనే శ్రీలంక విమానం ఎక్కుతాడు. ఒకవేళ అతడు సిరీస్‌కు దూరమైతే తుది జట్టులో కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్‌కు అవకాశం దక్కనుంది. ఇక ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. అంతకంటే ముందు స్ధానిక జట్టుతో మూడు రోజుల వార్మాప్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
భారత్ కంటే ముందే పాక్ తరపున ఆడిన సచిన్..?
సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని సంతకం. మాస్టర్ బ్లాస్టర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు, అరుదైన రికార్డులను సాధించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే రోల్‌మోడల్. అయితే క్రికెట్ గాడ్‌గా పేరు గాంచిన సచిన్ కెరీర్లో ఎవరికీ తెలియని ఒక రహస్యముంది.భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడానికి రెండేళ్ల ముందే... సచిన్ పాకిస్తాన్ జట్టు తరఫున మైదానంలోకి దిగాడు. అవును మీరు విన్నది నిజమే. 1987లో బ్రబోర్న్ స్టేడియంలో పాక్ తరపున సబ్‌స్ట్యూట్‌గా సచిన్ ఫీల్డింగ్ చేశాడు.అసలేమి జరిగిదంటే?1987 ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ ఐదు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌లు ఆరంభానికి ముందు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా భారత్-పాకిస్తాన్ మధ్య 40 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు ముంబైలోని చార్రిత్మక బ్రబోర్న్ స్టేడియం వేదికైంది. ఈ మ్యాచ్‌కు సచిన్ బాల్ బాయ్‌గా ఉన్నాడు. అప్పటికి టెండూల్కర్ వయస్సు వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. అయితే లంచ్ బ్రేక్ సమయంలో పాక్ ఆటగాళ్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ విశ్రాంతి కోసం హోటల్‌కు తిరిగి వెళ్లిపోయారు.దీంతో మైదానంలో ఫీల్డింగ్ చేయడానికి ఇద్దరు సబ్‌స్ట్యూట్స్ అవసరమయ్యారు. వెంటనే అప్పటి పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్.. అక్కడి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఛార్జ్ దగ్గరకు వెళ్లి ఇద్దరు లోకల్ కుర్రాళ్లను సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్ పంపంచండి అని అడిగాడు. హేమంత్ ఎవరిని పంపాలా అని ఆలోచిస్తుండగా 13 ఏళ్ల సచిన్ నేను వెళ్తా అని ముందుకొచ్చాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాకిస్తాన్ గ్రీన్ జెర్సీ ధరించి మైదానంలో అడుగుపెట్టాడు. మైదానంలోకి వెళ్లిన సచిన్‌ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయమన్నారు. నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఒక భారీ షాట్ కొట్టగా... బంతి గాల్లోకి లేచింది. సచిన్ చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ కపిల్ కొట్టిన బంతి బౌండరీ అవతల పడింది. మాస్టర్ బ్లాస్టర్ ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా సుమారు 25 నిమిషాల పాటు మైదానంలోనే ఉన్నాడు. సచిన్ తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించాడు.ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు పాకిస్తాన్ జట్టు తరపున ఓసారి ఫీల్డింగ్ కూడా చేశాను. ఆ విషయం ఆయనకు గుర్తుందో లేదో అని సచిన్ రాసుకొచ్చారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అక్కడికి సరిగ్గా మూడేళ్ల తర్వాత టెండూల్కర్.. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ వంటి స్టార్లు ఉన్న పాక్ జట్టుపైనే తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
టీమిండియా రీఎంట్రీపై భువనేశ్వర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కవుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా భువనేశ్వర్‌ను తిరిగి పిలుపునివ్వాలని సెలక్టర్లను సూచించాడు.ఈ నేపథ్యంలో తన రీఎంట్రీపై భువీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోకి తిరిగి రావడమే లక్ష్యంగా తాను ఆడట్లేదని, ఆటపై ఇష్టంతోనే క్రికెట్‌ను కొనసాగిస్తున్నాని అతడు తెలిపాడు. భువనేశ్వర్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్, యూపీ టీ20 లీగ్స్‌లో మాత్రం క్రమం తప్పకుండా అతడు ఆడుతున్నాడు. ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలవడంలో భువీది కీలక పాత్ర. అతడిలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. అదే పేస్, స్వింగ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతడు రీఎంట్రీ ఇవ్వాలని మాజీలతో పాటు అభిమానులు కోరుకుంటన్నారు."నేను ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నానంటే దానికి కారణం ఆటపై ఉన్న ఇష్టమే. దేశం తరపున ఆడాలనే నా కలను ఇప్పటికే నెరవేర్చుకున్నాను. మళ్లీ తిరిగి భారత జట్టుకు ఆడేందుకు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మళ్లీ భారత జట్టుకు ఆడే అవకాశం వస్తే అది చాలా సంతోషం. కానీ నేను ఎప్పుడూ ప్రస్తుతం గురించే ఆలోచిస్తాను. నా చేతుల్లో లేని విషయం గురుంచి ఆలోచించను. ఆటపై ఇష్టమున్నంతవరకు కొనసాగుతాను. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, యూపీ క్రికెట్ లీగ్స్‌లో వీలైనంతవరకు పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉండేందుకు ఇష్టపడతాను. మిగిలిన సమయాన్ని నా కుటంబానికి కేటాయిస్తాను" అని ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో భువీ పేర్కొన్నాడు. 36 ఏళ్ల భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు. ఇప్పటివరకు అతడు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. -
రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే?
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల రహానే ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు.అతడి సారథ్యంలోనే భారత్ 2021లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రహానేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.రహానే పెన్షన్ ఎంతంటే?బీసీసీఐ మాజీ క్రికెటర్లను వారి అనుభవం, ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా మూడు విభాగాలగా విభజించింది. అత్యధికంగా 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు టాప్ కేటగిరీకి వస్తారు. వారికి ప్రస్తుతం నెలకు రూ.70,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు నెలకు రూ. 50,000 దక్కేది. కానీ 2022లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ మొత్తాన్ని రూ.70,000కు పెంచాడు. ఇప్పుడు భారత్ తరఫున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రహానే, అత్యున్నత పెన్షన్ స్లాట్‌లో ఉన్నాడు. అతడికి ప్రతీ నెల రూ.70,000 పెన్షన్ లభించనుంది. ఇక దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫస్ట్‌క్లాస్ మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేలు పెన్షన్ అందిస్తోంది. పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మందికి పైగా రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. -
'స్టార్ ప్లేయర్స్‌నే భయపెట్టాడు.. అయినా జట్టులో నో ఛాన్స్'
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్ నబీకి మరోసారి నిరాశే ఎదురైంది. అతడిని జట్టు ఎంపిక కోసం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ జట్టులో నలుగురు స్పెషలిస్ట్ పేసర్లకు సెలక్టర్లు అవకాశం కల్పించినప్పటికి.. గత రంజీ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన నబీకి మాత్రం చోటు దక్కక పోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు."ఆకిబ్ నబీని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే తెలియదు. అతడి వద్ద పేస్ తక్కువగా ఉండడంతోనే సెలక్ట్ చేయలేదని చాలా మంది చెబుతున్నారు. వాస్తవానికి పేస్‌తో పనిలేదు, ఒక బౌలర్ సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడా? లేదా అన్నది ముఖ్యం. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే నబీ టాలెంట్‌ను మనం చూశాం. రంజీ సీజన్ అసాంతం అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా అతడు కేఎల్ రాహుల్ వంటి సీనియర్ బ్యాటర్‌ను సైతం ఇబ్బంది పెట్టాడు. కాబట్టి అతడి ప్రదర్శనకు తగిన గుర్తింపు దక్కాల్సిందే. అతడు మంచి రిథమ్‌లో ఉన్నాడు. అతడిని వీలైనంత త్వరగా జట్టులోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా రంజీ ట్రోఫీ టైటిల్‌ను జమ్ముకాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. ఫైనల్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడు ఇప్పటివరకు 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 18.63 సగటుతో 162 వికెట్లు పడగొట్టాడు. అందులో పదిహేను ఫైవ్ వికెట్ల హాల్స్ ఉండడం గమనార్హం. -
ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ క్రికెట్‌కు రహానే గుడ్‌బై..(ఫొటోలు)
-
ఎవరికీ భయపడేదే లేదు!.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 వయస్సులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు జూనియర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్లో సత్తాచాటిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన మార్క్‌ను చూపించాడు. ఇటీవల జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైభవ్ రెండు హాఫ్ సెంచరీలు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.ఈ పర్యటనలో బ్లెస్సింగ్ ముజార్బానీ, రిచర్డ్ నగరావ వంటి స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కాగా సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ స్ధానానికి ఎసరు పెట్టాడు. ఈ చిచ్చరపిడుగు ఎంట్రీతో సంజూ జట్టులో చోటు కోల్పోయాడు.సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు సంజూ ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. ఇక జింబాబ్వే టూర్లో అదరగొట్టిన సూర్యవంశీ బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం ఈస్ట్ జోన్ జట్టు వైస్ కెప్టెన్‌గా సూర్యవంశీ ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా సూర్య వంశీ వ్యవహరించనున్నాడు. బీసీసీఐ అతడిని అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అతడికి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీంతో సూర్యవంశీపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంత చిన్న వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్ కావడం బీహార్ క్రికెట్‌కు ఎంతో గర్వకారణమని హర్ష వర్ధన్ కొనియాడాడు,.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బిహార్ వండర్ కిడ్ తాజాగా రాజస్తాన్ రాయల్స్ తరపున జడేజాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్‌కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "మీరు ఏ బౌలర్‌ను ఎదుర్కోవడానికి భయపడతారు? అని హోస్ట్ వైభవ్‌ను ప్రశ్నించాడు. ఇందుకు వైభవ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "ఇప్పటి వరకు అయితే ఎవరికీ లేదు" అని నాలుగు పదాల్లో తేల్చి చేప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా సూర్యవంశీ ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా, హాజిల్‌వుడ్, కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు. -
టీమిండియాకు కొత్త కోచ్.. ఎవరీ శుభదీప్ ఘోష్?
భారత సీనియర్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కాంట్రాక్ట్ ముగిసింది. ఈ ఇద్దరికీ ఎలాంటి పొడిగింపు ఇవ్వడంలేదని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా మంగళవారం వెల్లడించారు. టెన్ డస్కటే తిరిగి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జతకట్టనున్నట్లు సమాచారం. కోల్‌కతా జట్టుతో డస్కటేకు సుదీర్ఘ అనుబంధం ఉంది. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కేకేఆర్ జట్టులో ప్లేయర్‌గా ఉన్న అతడు... 2022 నుంచి 2024 వరకు ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. అదే సమయంలో గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా పనిచేయడంతో ఆ తర్వాత భారత జట్టు శిక్షణ బృందంలో సైతం అతడికి చోటు దక్కింది. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టి20 ప్రపంచకప్ గెలిచిన సమయంలో డస్కటే భారత కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. అయితే రెండేళ్లుగా టీమిండియాతో కలిసి పనిచేసినప్పటికీ అతడికి నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించలేదు. ఈ క్రమంలోనే బోర్డు అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు.కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఇక దిలీప్ స్ధానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ దేశవాళీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. శుభదీప్నకు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. అతడు డొమాస్టిక్ క్రికెట్లో అస్సాం, రైల్వేస్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఆల్‌రౌండర్ అయిన ఘోష్ ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్ రెండింటిలోనూ చెరో 17 మ్యాచ్‌లు ఆడాడు.ఘోష్ తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ను 2004లో ఆడగా, తర్వాతి ఏడాది తన లిస్ట్-ఎ కెరీర్‌కు ముగింపు పలికాడు. అనంతరం కోచ్‌గా తన ప్రయణాన్ని ప్రారంభించాడు. శుభదీప్ ఘోష్ గత 15 ఏళ్లుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) కోచింగ్ విభాగంలో కీలక సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జాతీయ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఘోష్ వ్యవహరించాడు.అంతేకాకుండా అండర్-19 ప్రపంచకప్(20244)లో భారత యువ జట్టుకు కూడా ఫీల్డింగ్ కోచ్‌గా అతడు సేవలు అందించారు. పలు పర్యటనలలో భారత్-ఎ జట్టు కోచింగ్ స్టాప్‌లో సైతం అతడు భాగమయ్యాడు. ఐపీఎల్-2014 సీజన్లో విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా ఘోష్ పనిచేశాడు.కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు అనుభవజ్ఞుడైన ఘోష్ రాకతో టీమిండియా ఫీల్డింగ్‌లో పూర్వ వైభవం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.చదవండి: CG 2026: వర్షంలోనూ తగ్గని జోరు.. ఆఖరి క్షణాల్లో అద్భుతం -
'అతడిని పక్కన పెట్టాల్సిన టైమ్ వచ్చేసింది'
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ... స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ మాత్రం మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. ఇంగ్లండ్ టూర్లో ఆశించిన స్థాయిలో రాణించలేపోయిన అభిషేక్.. జింబాబ్వే గడ్డపై అంతకంటే దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బదులుగా సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని శ్రీకాంత్ సూచించాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2026 హీరో శాంసన్‌ను జింబాబ్వే పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అతడి స్ధానంలో అవకాశమిచ్చారు. అంతకుముందు ఇంగ్లండ్ టూర్లోనూ మూడు మ్యాచ్‌లకు సంజూను తుది జట్టు నుంచి పక్కన పెట్టారు. అయితే ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం ఈ కేరళ ఆటగాడు ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ మెరుగ్గా రాణించడంతో ఆసియా గేమ్స్ నుంచి కూడా శాంసన్‌ను తప్పించే అవకాశముంది."అభిషేక్ శర్మ బలహీనతను ప్రత్యర్ధి జట్లు పసిగట్టేశాయి. వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడి ప్రదర్శనలు అంతంతమాత్రమే గానే ఉన్నాయి. అతడి విషయంలో సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పుదు. అభిషేక్ శర్మ స్ధానంలో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలి. అతడికి కచ్చితంగా సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని నమ్ముతున్నాను. అదేవిధంగా జింబాబ్వే పర్యటనలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన యువ పేసర్ మయాంక్ యాదవ్‌పై శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. మయాంక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 6.5 ఏకానమీ రేటుతో 5 వికెట్లు పడగొట్టాడు. -
"సవాళ్లకు మేం సిద్ధం".. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఆదివారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 35 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో మెన్ బ్లూ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తమ ఆటగాళ్లపై అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు.'ఈ సిరీస్‌లో మా ఆటగాళ్లు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. మూడు మ్యాచ్‌లలోనూ మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాము. కెప్టెన్‌గా ఇది నాకు మొదటి సిరీస్ విజయం. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమైనది మరోసారి చెబుతున్నాను.జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడేలా చూడటమే నా బాధ్యత. రాబోయే రోజుల్లో మాకు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.అయితే జట్టు సభ్యులు ఇదే తరహా ధైర్యాన్ని, పట్టుదలను మైదానంలో చూపిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించుకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే మా సిద్దాంతం అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ పేర్కొన్నాడు. -
'వరల్డ్‌కప్ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి'
దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2026 కోసం టీమిండియా తమ సన్నహకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ కోసం పటిష్టమైన జట్టును సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు.వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ గత నాలుగేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే భువీలో ఏ మాత్రం జోరు తగ్గలేదు.ఫిట్‌గా ఉండి తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలోనూ ఆర్సీబీ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అశ్విన్ కూడా భువీ తిరిగి పునరాగమనం చేస్తే చూడాలని ఉందని అన్నాడు."భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ గురుంచి సెలక్షన్ కమిటీ ఆలోచించాలి. ప్రస్తుతం భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదు. కాబట్టి జట్టుకు భువీ అవసరముందని అనిపిస్తోంది. అయితే మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు.కానీ షమీకి, భువీకి ఒక తేడా ఉంది. భువనేశ్వర్ వరుసగా రెండు సీజన్ల పాటు ఐపీఎల్ ఆడినప్పటికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. కానీ షమీ మాత్రం ఫిట్నెస్ పరంగా కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా భువనేశ్వర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అయితే వెంటనే అతడిని జట్టులోకి తీసుకోమని నేను చెప్పడం లేదు. కానీ ఓ అవకాశమిచ్చి ఇచ్చి చూడండి. అక్కడ రాణించగలిగితే అతడిని జట్టులో కొనసాగించండి. అతడు పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. లోయార్డర్‌లో బ్యాట్‌తో రాణించే సత్తా కూడా భువీకి ఉంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. -
అసలు మనిషేనా? ఆ షాట్లు చూసి షాక్ అయ్యా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 126 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ మార్క్‌ను సూర్యవంశీ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయష్కుడిగా అతడు రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై తన సహచర ఆటగాడు మయాంక్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని, ఐపీఎల్‌లోనే అతడి టాలెంట్ చూశాను అని మయాంక్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ నిలిచాడు."వైభవ్ బ్యాటింగ్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఐపీఎల్లో వైభవ్‌కు బౌలింగ్ చేసినప్పుడు, అతడు ఆడిన షాట్లను చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు తనతో కలిసి ఒకే జట్టులో ఉండటం చాలా సంతోషంగా ఉంది. అతడు భవిష్యత్తులో కచ్చితంగా గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడు.అతడిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఐపీఎల్లో మా బౌలింగ్‌ను వైభవ్ ఉతికారేశాడు. ఈ తొలి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ అతడికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే తన అరంగేట్ర సిరీస్‌లో అతడు అంతగా రాణించలేకపోయాడు. కానీ ఇప్పుడు జాతీయ జట్టు తరపున తొలి అర్ధశతకాన్ని సాధించాడు. ఏ ఆటగాడికైనా ఇది స్పెషల్ మూమెంటే" అని మయాంక్ పేర్కొన్నాడు.చదవండి: ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే? -
చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. సౌతాంప్టాన్ వేదికగా జరిగిన ఐదో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్‌ను 56 పరుగుల తేడాతో బ్రూక్ సేన చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.గత కొన్నాళ్లగా పేలవ ఫామ్‌తో సతమవుతున్న బట్లర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లను ఉతిరాకేశాడు. రోజ్‌బౌల్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. బట్లర్ కేవలం 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.బట్లర్ సాధించిన రికార్డులు ఇవే👉అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించి మూడో స్ధానానికి బట్లర్ చేరుకున్నాడు.👉108 పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. విరాట్ తన టీ20 కెరీర్లో 4,188 పరుగులు చేయగా.. బట్లర్ ఇప్పటివరకు 4,212 రన్స్ చేశాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో బాబర్ ఆజం(4,596) ఉండగా, రెండో స్ధానంలో రోహిత్ శర్మ(4,231) కొనసాగుతున్నాడు.👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్(125 నాటౌట్) పేరిట ఉండేది.👉తాజా మ్యాచ్‌తో లూయిస్ ఆల్‌టైమ్ రికార్డును జోస్ ది బాస్(131) బ్రేక్ చేశాడు. టీ20ల్లో బట్లర్‌కే ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా ఇంగ్లండ్ తరపున అత్యధిక స్కోర్ సాధించిన రెండో బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. తొలి స్దానంలో ఫిల్ సాల్ట్(141) ఉన్నాడు. -
బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. టీమిండియా ప్రధాన సమస్య అదే
టీ20 ప్రపంచకప్-2026 ఛాంపియన్ టీమిండియా ప్రస్తుతం తమ పేలవ ఆట తీరుతో అభిమానులను తీవ్ర నిరాశపరుస్తోంది. యూకే పర్యటనలో భారత జట్టు వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లను కోల్పోయింది. కనీసం రోజ్‌బౌల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టీ20లోనైనా గెలిచి టీమిండియా పరువు నిలబెట్టుకుంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ చివరి మ్యాచ్‌లో కూడా ఓటమి పాలై 4-0 తేడాతో సిరీస్‌ను ఇంగ్లండ్‌కు సమర్పించుకుంది. భారత్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. ఈ టూర్ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మన జట్టు విఫలమైంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ పక్కన పెడితే.. ప్రస్తుతం టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న మరో సమస్య మరో సమస్య 'ఫీల్డింగ్ వైఫల్యం'.చెత్త ఫీల్డింగ్ కారణంగా భారత్ ఘోర ఓటములను మూటకట్టుకోవాల్సి వస్తోంది. రోజ్‌బౌల్ వేదికగా జరిగిన ఐదో టీ20లోనూ భారత ఫీల్డింగ్ వైఫల్యం బయటపడింది. శివమ్ దూబే వదిలేసిన సునాయస క్యాచ్.. టీమిండియా ఓటమిని శాసించిందే అనే చెప్పాలి.కొంపముంచిన దూబేటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను అవుట్ చేసి ప్రసిద్ద్ కృష్ణ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆరో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ ఆఫ్ స్టంప్‌నకు వెలుపల ఒక షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు. ఆ డెలివరీని బ్రూక్ స్క్వేర్ లెగ్' వైపు పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని 'థర్డ్ మ్యాన్' దిశగా గాల్లోకి లేచింది. అయితే ఇన్ఫీల్డ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిన దూబే ఆ క్యాచ్‌ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ బంతి గమనాన్ని అంచనా వేయడంలో దూబే పూర్తిగా విఫలమయ్యాడు. బంతిని దాటి ముందుకు వెళ్లిపోయాడు. కనీసం బంతి అతడి చేతికి కూడా తాకలేదు. దీంతో లడ్డూలాంటి క్యాచ్ నేలపాలైంది ఇందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. 3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్.. ఆ తర్వాత భారత బౌలర్లను ఉతికారేశాడు.కేవలం 46 బంతుల్లోనే 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని హ్యరీ నెలకొల్పాడు. ఒకవేళ ఆ క్యాచ్‌ను దూబే అందుకుని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ సిరీస్ మొత్తంగా భారత్ మొత్తంగా 5 క్యాచ్‌లు డ్రాప్ చేసింది.చెత్త రికార్డుఈ ఒక్క సిరీస్‌లో మాత్రమే కాదు గత కొన్నాళ్లగా భారత ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. టీ20 ప్రపంచకప్-2026 నుంచి టీమిండియా ఫీల్డర్లు దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ క్యాచ్‌లను జారవిడుస్తున్నారు. ప్రస్తుతం అత్యంత చెత్త క్యాచ్ రికార్డు ఉన్న జట్లలో బంగ్లాదేశ్, ఐర్లాండ్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది.టీ20 ప్రపంచకప్‌లో అయితే మెన్ ఇన్ బ్లూ ఏకంగా 13 క్యాచ్‌లను నేలపాలు చేసింది. వీలైనంత త్వరగా భారత జట్టును తమ ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోపోతే మరిన్ని ఓటములను చవిచూడాల్సి వస్తోంది. ఇంగ్లండ్ టూర్ తర్వాత భారత ఫీల్డింగ్ కోచ్ పదవి నుంచి టి. దిలీప్ తప్పుకోనున్నట్లు సమాచారం. -
గంభీర్ కోటరీని వీడనున్న హైదరాబాదీ?
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు కోచింగ్ స్టాప్‌లో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియాను వీడేందుకు హెడ్‌కోచ్ గంభీర్ కోటరీలోని ఒకరు సిద్దంగా ఉన్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.అయితే ఇందుకు సంబంధించి తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. "జట్టును వీడబోతున్న ఆ సభ్యుడు మరెవరో కాదు, ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్" అని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ నిఖిల్ నాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దిలీప్ కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాప్‌లో చేరే అవకాశం ఉందని నిఖిల్ నాజ్ అంచనా వేశాడు. కాగా హైదరాబాద్‌కు చెందిన దిలీప్ వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను గెలిచిన భారత జట్టు కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. తొలుత రాహుల్ ద్రవిడ్ హయంలో ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన దిలీప్.. దాదాపుగా ఐదేళ్ల నుంచి భారత జట్టుతో కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అతడి కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించలేదు. కానీ విదేశీ కోచ్ కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికి, సరైన వ్యక్తి దొరకపోవడంతో మళ్లీ దిలీప్నే ఫీల్డింగ్ కోచ్‌గా భారత క్రికెట్ బోర్డు నియమించింది. అయితే ఈసారి మాత్రం ఫీల్డింగ్ కోచ్‌గా అతడు అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. తాజాగా భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యాలపై మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్లో ఫీల్డింగ్ ప్రమాణాలు అత్యంత దారుణంగా పడిపోయాయని అతడు మండిపడ్డాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్లల సిరీస్‌లో భారత ఫీల్డర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 6 క్యాచ్‌లు జారవిడిచారు. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌లోనూ భారత ఫీల్డర్లు 13 క్యాచ్‌లను విడిచిపెట్టారు."ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో భారత్ ఓడిపోవడాన్ని ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. దారుణమైన క్రికెట్ ఆడి సిరీస్‌ను కోల్పోయారు. అయితే గత రెండేళ్లగా భారత పురుషుల, మహిళల జట్లలో ఫీల్డింగ్ ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆ రెండు, మూడు క్యాచ్‌లు పట్టి ఉంటే వారు 180 ప్లస్ పరుగులు చేసేవారు కాదు. రెండో మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అయింది. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడం వల్ల భారత్ మ్యాచ్‌లను చేజార్చుకుంటోంది" అని పటేల్ పేర్కొన్నాడు. -
అప్పటి నుంచే విబేధాలు.. టీమిండియాను వీడనున్న కోచ్?
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత పురుషల క్రికెట్ జట్టు కోచింగ్ స్టాప్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక సీనియర్ సపోర్ట్ స్టాఫ్ సభ్యుడు తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత సదరు సభ్యుడు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.అయితే అతడు మేనెజ్మెంట్పై అసంతృప్తితో తప్పుకుంటున్నారా లేదా కొత్త కోచింగ్ బాధ్యతల కోసమా అనేది స్పష్టం కాలేదు. కానీ ఆ కోచ్ ఇప్పటికే ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో చర్చలు జరిపారని, త్వరలోనే ఆ జట్టు కోచింగ్ స్టాప్‌లో చేరనున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో మరొకరు కూడా తప్పుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత భారత హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. ఆ తర్వాత అతడి స్ధానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. అతడితో పాటు ర్యాన్ టెన్‌డెష్కాట్, అభిషేక్ నాయర్ సహాయక కోచ్‌లగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌లగా నియమితులయ్యారు. టి. దిలీప్‌ను యథావిధిగా ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌గా తప్పుకొని, కేకేఆర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తర్వాత సీతాన్షు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా గంభీర్ కోటరీలోకి చేరాడు. అప్పటి నుంచే విబేధాలు?అయితే గంభీర్ హయాంలో సొంతగడ్డపై భారత్ వరుసగా న్యూజిలాండ్ (2024), దక్షిణాఫ్రికా (2025) చేతుల్లో ఘోర టెస్ట్ సిరీస్ ఓటములను చవిచూసింది. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు-కోచ్‌లకు మధ్య, అలాగే సెలెక్టర్లకు-కోచింగ్ స్టాఫ్‌కు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. ఆ విభేదాలు ఇప్పుడు కూడా అలానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే సదరు కోచ్ టీమిండియాను వీడేందుకు సిద్దమయ్యాడు మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా టీ20 నంబర్ వన్ జట్టు అయిన భారత్‌కు యూకే పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటివరకు పర్యటనలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో ఈ వరుస వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలని గంభీర్‌ను బీసీసీఐ సూచింది. భారత్‌కు చేరుకున్న వెంటనే భారత కోచింగ్ బృందంతో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారు. ఇక జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. అయితే శ్రీలంక టెస్ట్ సిరీస్‌తో పాటు ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే హోమ్ సిరీస్‌లో గంభీర్ హెడ్‌కోచ్‌గా ఉండనున్నాడు. -
కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్.. భువనేశ్వర్‌కు చోటు
యూకే పర్యటనలో భారత పురుషల క్రికెట్ జట్టు తీవ్ర నిరాశపరుస్తోంది. ఈ టూర్లో టీమిండియా ఇప్పటివరకు కనీసం ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. పసికూన ఐర్లాండ్ చేతిలో క్వీన్ స్వీప్ అయిన భారత జట్టు.. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డపై కూడా అదే తీరును కొనసాగించింది. వర్షం కారణంగా మొదటి టీ20 రద్దవ్వగా.. ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ భారత్ ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌లలోనూ శ్రేయస్ సేన బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా భారత ప్రత్యామ్నాయ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశారు. ఆకాశ్ చోప్రా తన జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. కాగా ఐర్లాండ్ పర్యటనకు ముందు సూర్యకుమార్ యాదవ్‌ను భారత టీ20 కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. అతడి స్ధానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు. కానీ అయ్యర్ మాత్రం జట్టును విజయం పథంలో నడిపించలేకపోతున్నాడు. దీంతో చాలామంది సూర్యకుమార్ కెప్టెన్‌గా ఉండింటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఇక చోప్రా తన ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్‌కు కూడా అవకాశమిచ్చాడు. యూకే పర్యటనలో మొదటి మూడు మ్యాచ్‌లలో సంజూ విఫలం కావడంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత జింబాబ్వేతో టీ20లకు ఎంపిక చేసిన జట్టులో కూడడా శాంసన్‌కు చోటు దక్కలేదు. ఇక చోప్రా గత రెండేళ్లగా భారత టీ20కు దూరంగా ఉంటున్న యశస్వి జైస్వాల్‌కు ఓపెనర్‌గా అవకాశమిచ్చాడు. సంజూ, జైశ్వాల్‌లకు ఓపెనర్లగా ఛాన్స్ దక్కింది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండు టైటిల్స్‌ను అందించిన రజత్ పాటిదార్‌కు వైస్ కెప్టెన్‌గా అతడు ఎంపిక చేశాడు. పాటిదార్ ఇప్పటివరకు భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడలేదు. మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురెల్, నమన్ ధీర్‌లకు అవకాశమిచ్చాడు. జురెల్, టెస్ట్ వన్డేల్లో రెగ్యులర్ ఆటగాడైనప్పటికీ టీ20ల్లో మాత్రం లేడు. అదేవిధంగా ఆల్‌రౌండర్ల కోటాలో కృనాల్ పాండ్యా, అనుకుల్ రాయ్‌లకు చోటు దక్కింది. బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్‌లు ఉన్నారు. చోప్రా కేవలం ఇద్దరు పేసర్లను మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకున్నాడు.ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రజత్ పటిదార్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నమన్ ధీర్, కృనాల్ పాండ్యా, అనుకుల్ రాయ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్. -
బ్యాటింగ్ చేయడు.. బౌలింగ్ చేయడు? అతడు జట్టులో అవసరమా?
భారత క్రికెట్ జట్టు టీ20ల్లో వరుస ఓటములతో సతమవుతున్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా పేలవ ఆట తీరు కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లను కోల్పోయింది.ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్మెంట్పై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశ్నల వర్షం కురిపించాడు. భారత టీ20 జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఉన్నాడో తనకు ఆర్ధం కావడం లేదని జాఫర్ అన్నాడు. సుందర్ స్దానంలో మరొక ఆటగాడికి అవకాశమిస్తే బాగుంటుందని అతడు అభిప్రాయపడ్డాడు."వాషింగ్టన్ సుందర్‌ను ఏప్రాతిపదికన భారత టీ20 జట్టులో కొనసాగిస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. అతడి ఎంపిక నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. సుందర్ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటో కూడా తెలియడం లేదు. అతడిని ఫినిషర్‌గా ఆడించలేరు, అలాగని టాప్ ఆర్డర్లోనూ కూడా చోటు లేదు. ఇది మొదటి సమస్య. ఇక రెండో విషయానికొస్తే.. అతడు నిలకడగా నాలుగు ఓవర్లు వేసే బౌలర్ కూడా కాదు. అలాంటప్పుడు అతడిని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారు? ఎవరికైనా తెలిస్తే నాకు కాస్త చెప్పండి. వరుణ్ చక్రవర్తి ఆడకపోతే అతడికి ప్రత్నామ్నాయంగా కుల్దీప్ యాదవ్ లేదా మరెవరినైనా పరిశీలించాలి. శివాంగ్ కుమార్ రూపంలో భారత్‌కు మరో మంచి స్పిన్ ఆప్షన్ కూడా ఉంది. మిడిల్ ఓవర్లలో వికెట్లతో పాటు పరుగులు కట్టడి చేసే ఇద్దరు స్పిన్నర్లు భారత్‌కు అవసరం. కానీ ప్రస్తుతం భారత జట్టులో వరుణ్ రూపంలో ఒక్కడే మంచి స్పిన్నర్ కనిపిస్తున్నాడు" అని జాఫర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.వాస్తవానికి జాఫర్ ఒక్కడే కాదు చాలా మంది మాజీలు కూడా సుందర్ రోల్ ఎంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంగ్లండ్ టూర్లో తొలి మూడు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన సుందర్‌ను.. నాలుగో టీ20లో మాత్రం ఆడించారు. వరుణ్ చక్రవర్తి గాయం బారిన పడడంతో సుందర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కింది.కానీ సుందర్ మాత్రం తన లభించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన సుందర్.. అనంతరం ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి 19 పరుగులు సమర్పించుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లను గమనిస్తే సుందర్ ఒకట్రెండు ఓవర్లు మినహా ఎక్కువ బౌలింగ్ చేయడం లేదు. పోనీ బ్యాటర్‌గా అయిన సక్సెస్ అవుతాన్నాడంటే అది కూడా లేదు. అలాంటప్పుడు అతడిని ఒక ఆల్‌రౌండర్‌గా ఎలా ఆడిస్తున్నారో మేనెజ్‌మెంట్‌కే తెలియాలి . -
సంజూ శాంసన్ ఊహించని నిర్ణయం
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్న కేరళ క్రికెట్ లీగ్ (KCL 2026) మూడో సీజన్ నుంచి శాంసన్ వైదొలిగాడు. జూలై 11న జరగబోయే ప్లేయర్స్ వేలం కోసం కూడా అతడు తన కూఐడా పేరును నమోదు చేసుకోలేదు. ఈ విషయాన్ని కేసీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ నాజర్ మచాన్ ధ్రువీకరించారు. వ్యక్తిగత కారణాల వల్ల సంజూ ఈ ఏడాది సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని మచాన్ స్పష్టం చేశారు. గత సీజన్లో శాంసన్ 'కొచ్చి బ్లూ టైగర్స్' ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. కేవలం మూడు మ్యాచ్‌లలోనే ఓ అద్భుత సెంచరీతో సహా మొత్తం 221 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది సీజన్ వేలానికి ముందు అతడిని కొచ్చి విడుదల చేసింది.దీంతో శాంసన్ వేలంలోకి వస్తాడని అంతా భావించారు. కానీ అతడు ఇప్పుడు పూర్తిగా తప్పుకొని షాకిచ్చాడు. కాగా సంజూ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమవుతున్నాడు. యూకే పర్యటనలో ఉన్న శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌లలో తీవ్ర నిరాశపరిచాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమైన సంజూ.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో తర్వాత రెండు మ్యాచ్‌లకు అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. అంతేకాకుండా జింబాబ్వేతో సిరీస్‌కు సంజూను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్ధానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌కు అవకాశమిచ్చారు. అయితే మిగితా సీనియర్ బ్యాటర్లంతా ఉన్నప్పటికి ఒక్క శాంసన్‌నే జట్ట నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అతడిని కావాలనే పక్కన పెట్టారాని బీసీసీఐ సెలక్టర్లపై కొంతమంది విమర్శలు గుప్పించారు. కానీ గత 6 నెలలగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్నందునే సంజూకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల (Asian Games 2026)కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం సంజూకు చోటు దక్కింది. -
సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం
టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం(జూలై 8) తన 54వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా గంగూలీకి సంబంధించి ఓ అద్భుతమైన వార్త బయటకు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 'హాల్ ఆఫ్ ఫేమ్'లో గంగూలీకి చోటు దక్కబోతున్నట్లు రెవ్‌స్పోర్ట్స్ గ్లోబల్ తమ కథనంలో పేర్కొంది. అదేజరిగితే ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న 12వ భారత క్రికెటర్‌గా గంగూలీ నిలవనున్నాడు. ఈ జాబితాలో పురుషల విభాగం నుంచి.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, వినూ మన్కడ్. మహిళల విభాగం నుంచి డయానా ఎదుల్జీ, నీతూ డేవిడ్ మాత్రమే ఇందులో ఉన్నారు. కాగా ఐసీసీ హాల్ ఫేమ్‌ను 2009లో ప్రారంభించారు. ఇక గంగూలీ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా దాదాపు 17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలను అందించాడు. 21వ శతాబ్దంలో తన దూకుడుతో టీమిండియా రూపు రేఖలను మార్చిన ఘనత అతడిది. 2003 వరల్డ్ కప్ ఫైనల్ చేరడం, 2004లో పాకిస్తాన్లో టెస్ట్ సిరీస్ గెలవడం, ఇగ్లండ్, ఆస్ట్రేలియా లలో సిరీస్‌లను డ్రా చేసుకోవడం గంగూలీ కెప్టెన్సీ లో హైలెట్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ'కోల్‌కతా ప్రిన్స్’ తన కెరీర్లో భారత్ తరఫున 311 వన్డేల్లో 11,363 రన్స్, 113 టెస్టుల్లో 7,212 రన్స్ సాధించారు. బీసీసీఐ ప్రెసెడింట్‌గా కూడా దాదా పనిచేశారు.చదవండి: IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు -
టీమిండియాకు చుక్కలు చూపించాడు.. కట్ చేస్తే! భారీ రివార్డ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్ టూర్లో శ్రేయస్ కెప్టెన్‌గా విఫలమైనప్పటికి బ్యాటర్‌గా మాత్రం రాణించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 150.68 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు.ఈ ప్రదర్శన కారణంగా శ్రేయస్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 425 స్థానాలు ఎగబాకి 93వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెథల్ తొలిసారి టాప్-10 లోకి దూసుకొచ్చాడు. బెథల్.. మార్ష్, బ్రెవిస్ వంటి స్టార్ క్రికెటర్లను వెనక్కి నెట్టి 8వ స్ధానానికి చేరుకున్నాడు. కాగా మాంచెస్టర్ టీ20లో బెథల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 191 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినా.. బెథెల్ మాత్రం 46 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇందుకు ఫలితంగా ర్యాంకింగ్స్‌లో బెథల్కు భారీ రివార్డు లభించింది. తొలి రెండు స్ధానాల్లో భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆదిల్ రషీద్, సామ్ కరన్ తమ స్ధానాలను మెరుగుపరుచుకున్నారు. భారత్‌పై ఇప్పటివరకు 3 వికెట్లు పడగొట్టిన రషీద్, ఒక స్థానం ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నాడు. సామ్ కరన్ బౌలింగ్ జాబితాలో 71 స్ధానం, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో 13వ స్ధానం సొంతం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత ఆటగాడు శివమ్ దూబే టాప్-10 నుంచి బయటకు వెళ్లిపోయాడు.చదవండి: IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు -
సంజూకు మళ్లీ అన్యాయం..? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్!
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20 కెరీర్ మరోసారి సందిగ్ధంలో పడింది. మొన్న ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20కి తుది జట్టులో కోల్పోయిన సంజాకు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఈ నెలఖారులో జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఈ జట్టులో జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను తొలిసారి నేషనల్ టీమ్‌కు ఎంపిక చేశారు. అదేవిధంగా యధావిధిగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులో కొనసాగించారు. జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను వైభవ్ ఆరంభించనున్నాడు.వేటునా? విశ్రాంతా?సాధారణంగా జింబాబ్వే లాంటి పర్యటనలను సీనియర్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు అవకాశమిస్తారు. కానీ ఈసారి సీనియర్ బ్యాటర్లలో కేవలం సంజూ శాంసన్‌ను మాత్రమే పక్కన పెట్టడం పలు అనుమానాలకు తావనిస్తోంది. అతడిని కావాలనే తప్పించారా? లేదా రెస్ట్ ఇచ్చారా? అన్నది ఇంకా స్పష్టతలేదు.అయితే సంజూ ప్రస్తుతం కేవలం టీ20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్, జింబాబ్వే టూర్ల తర్వాత భారత్‌కు పెద్దగా టీ20 సిరీస్‌లు లేవు. మళ్లీ సెప్టెంబర్‌లో ఆసియాకప్ గేమ్స్‌లో టీమిండియా తలపడనుంది. అంటే దాదాపు రెండు నెలల విరామం లభిస్తోంది. అలాంటిప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్ ఆడే సంజూకు ‘విశ్రాంతి’ ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయిసంజూకు రెస్ట్ కాదని, కావాలనే పక్కన పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ హీరో అయిన సంజూకు మరోసారి అన్యాయం జరిగిందని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా పొట్టి ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన సంజూ.. యూకే టూర్లో మాత్రం విఫలమయ్యాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో రెండో టీ20కు అతడిని తప్పించి చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అవకాశమిచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన జట్టులోనే అతడికి చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో మాత్రం సంజూ సభ్యునిగా ఉన్నాడు. -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఒక్క మ్యాచ్‌కే పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే క్రికెట్ వర్గాలు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భారత్ తరపున డెబ్యూ చేసిన అతి పిన్నవయష్కుడిగా చరిత్రను తిరగరాసిన సూర్యవంశీ.. తన మొదటి మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు. సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన వైభవ్, తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 10 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో శాంసన్‌ను తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకు రావాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే మూడో టీ20లో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో కీలకమైన మూడో టీ20లో శాంసన్ తిరిగి ఆడనున్నట్లు సమాచారం.టీ20 ప్రపంచకప్-2026లో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన శాంసన్.. యూకే పర్యటనలో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని పక్కన పెట్టి వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. కానీ అతడు కూడా విఫలం కావడంతో సీనియర్ అయిన సంజూకే మళ్లీ అవకాశమివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలఖారులో జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌లో వైభవ్‌ను పూర్తి స్ధాయిలో ఆడించే యోచనలో మేనెజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మూడు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ జూలై ఆఖరిలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ సీనియర్ ప్లేయర్ అభిషేక్ శర్మకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఈ క్రమంలో వైభవ్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు అస్కారం ఉంది.చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం! -
"నేను మోసపోయాను".. పృథ్వీ షా కాబోయే భార్య ఇన్‌స్టా పోస్ట్ వైరల్
టీమిండియా ఆటగాడు పృథ్వీ షా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడి కాబోయో భార్య, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కొన్ని పోస్ట్‌లు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. "నన్ను చాలాసార్లు మోసం చేశాడు. అయినా నేను ఒక్క మాట కూడా అనలేదు. జీవితంలో ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత కూడా ఇలా జరుగుతుందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని ఆకృతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అంతేకాకుండా మరో పోస్ట్‌లో "సోషల్ మీడియాలో అతడి గురించి వచ్చే ప్రతి రూమర్ నిజమే" అంటూ పేర్కొంది. ఆ పోస్ట్‌లో ఆకృతి ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ,అది పృథ్వీ షాను ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లు పెట్టిన కొద్దిసేపటికే ఆమె వాటిని డిలీట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కాలేదు. నిశ్చితార్థం నాటి ఫోటోలు కూడా వారి ఖాతాల్లో ఉన్నాయి.కాగా చాలా కాలంగా ప్రేమలో ఉన్న పృథ్వీ షా ,ఆకృతి అగర్వాల్ ఈ ఏడాది మార్చి 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పృథ్వీ కెరీర్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నప్పటికి ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం కూడా లభించలేదు. అతడు ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
బంగ్లాదేశ్ వేదికగా ఆసియా కప్..!
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆసియాకప్-2027 టోర్నీకి సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. వచ్చే ఏడాది ఆసియాకప్ జూన్ 18 నుండి జూలై 4 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా ఈ ఈవెంట్ ఉపయోగపడనుంది. కాగా ఈ ఖండాంతర టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. అయితే రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆసియా కప్ వేదిక బంగ్లాదేశ్ నుంచి మారుతుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం బంగ్లాదేశ్ వేదికగా నిర్వహించేందుకు సముఖత చూపినట్లు తెలుస్తోంది. బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి.అదేవిధంగా ఈ ఏడాది ఆరంభంలో భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గోలేదు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్‌గా మాజీ క్రికెట్ తమీమ్ ఇక్భాల్ ఎంపిక కావడంతో.. బీసీసీఐతో కూడా సంబంధాలు మెరుగుపడ్డాయి. దీంతో ఈ ఏడాది ఆగస్టులో భారత్-బంగ్లా మధ్య వైట్‌బాల్ సిరీస్‌లు కూడా జరిగే అవకాశముంది. ఇక రొటేషన్ పాలసీ ప్రకారం.. ప్రస్తుతం ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడిగా ఉన్న మోహసిన్ నఖ్వీ పదవీ కాలం 2027 ఏప్రిల్‌తో ముగియనుంది.ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తరపున ఎవరో ఒకరు ఎంపికయ్యే అవకాశముంది. కాబట్టి ఆసియాకప్ దాదాపుగా బంగ్లా వేదికగా జరగనుంది. కాగా ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. -
భారత్‌తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు
టీమిండియాతో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జోస్ బట్లర్, సామ్ కరన్, జో రూట్, ఆదిల్ రషీద్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.అంతేకాకుండా దాదాపు ఎనిమిదిల నెలల తర్వాత స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు ఆర్చర్ దూరమయ్యాడు. ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో వన్డేలకు కూడా అతడిని ఎంపిక చేశారు. ఆర్చర్‌తో పాటు శ్రీలంక టూర్‌కు దూరమైన ఫాస్ట్ బౌలర్లు గుస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్‌లు కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే ఈ జట్టులో 22 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్కు చోటు దక్కింది. లిస్ట్-ఎ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండడంతో సీనియర్ జట్టుకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ ససెక్స్ యువ ఆటగాడు టీ20 జట్టులో కూడా సభ్యునిగా ఉన్నాడు. ఈ మూడు వన్డేల సిరీస్ జూలై 14 నుండి జూలై 19 వరకు జరగనుంది. భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలు:మొదటి వన్డే: జూలై 14 – ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్)రెండవ వన్డే: జూలై 16 – సోఫియా గార్డెన్స్ (కార్డిఫ్)మూడవ వన్డే: జూలై 19 – లార్డ్స్ (లండన్)ఇంగ్లండ్ వన్డే జట్టు:హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్. -
సంజూ శాంసన్‌కు భారీ షాక్..! జట్టు నుంచి రిలీజ్?
కేరళ క్రికెట్ లీగ్ (KCL)-2026 సీజన్ ముందు మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అయితే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను 'కొచ్చి బ్లూ టైగర్స్' ఫ్రాంచైజీ వేలంలోకి విడిచిపెట్టి అందరిని షాక్‌కు గురిచేసింది. గత సీజన్లో కొచ్చి తరపున 6 మ్యాచ్‌లు ఆడిన 186.80 స్ట్రైక్ రేటుతో 368 పరుగులు చేశాడు.అయినప్పటికి అతడిని రిటైన్ చేసుకోలేదు. అతడి అందుబాటుపై స్పష్టత లేకపోవడంతో కొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఎల్ మూడో సీజన్ ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. ఈ సమయంలో భారత జట్టుకు ఎలాంటి టీ20 మ్యాచ్‌లు లేవు. సంజూ ప్రస్తుతం కేవలం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నందున, అతడు కేసీఎల్ వేలంలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.అంతేకాకుండా గత సీజన్లో శాంసన్‌ను రూ. 26.80 లక్షలకు కొచ్చి కొనుగోలు చేసింది. కొచ్చి తమ వేలం బడ్జెట్ (రూ. 50 లక్షలు)లో సగానికిపైగా సంజూ కోసమే ఖర్చు చేసింది. దీంతో కొచ్చి జట్టు తమ బడ్జెట్లో 50 శాతానికి పైగా మొత్తాన్ని ఆదా చేసినట్లైంది. అతడిని రిలీజ్ చేయడానికి ఇదొక కారణం కూడా కావచ్చు. సంజూతో పాటు కేరళ మాజీ కెప్టెన్ సచిన్ బేబీని కూడా ఫ్రాంచైజీ విడుదల చేసింది.మరో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026 నుంచి తప్పుకొన్నాడు. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కారణంగా పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.చదవండి: IND vs SL: విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక -
టాస్ గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్ లక్ష్యం ఎంతంటే?
👉ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్, అభిషేక్ ఫిఫ్టీలతో రాణించగా.. ఆఖర్లో దూబే సిక్సర్ల వర్షం కురిపించాడు.👉ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.👉12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసిందిశ్రేయస్ అయ్యర్ (39), తిలక్ వర్మ (11) క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్ శర్మ (59) ఎల్బీగా వెనుదిరిగాడు.20 బంతుల్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిఫ్టీ సాధించాడు. 8 ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. దంచుతున్న అభిషేక్ శర్మఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. అభిషేక్ 16 బంతుల్లో 44 పరుగులతో ఆడుతుండగా, కెప్టెన్ అయ్యర్ ఆరు పరుగులతో సహకరిస్తున్నాడు. చెస్టర్-లె-స్ట్రీట్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి టీ20లో ఇంగ్లండ్-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. రవి బిష్ణోయ్‌కు కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది.తుది జట్లుఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
రిషబ్ పంత్ సంచలన నిర్ణయం
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026 సీజన్ నుంచి పంత్ వైదొలిగాడు. డీపీఎల్ మూడో సీజన్ వేలానికి ముందు 'పురాణీ దిల్లీ 6' ఫ్రాంచైజీ విడుదల చేయడంతో, అతడు తొలిసారి అక్షన్‌లో కనిపించబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది. కానీ బుధవారం జరిగిన వేలంలో పంత్ పేరు లేకపోవడంతో అందరూ షాకయ్యారు. అయితే జాతీయ విధుల కారణంగా అతడు డీపీఎల్ మూడో సీజన్ నుంచి తప్పుకొన్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసెడింట్ రోహన్ జైట్లీ తెలిపారు. రాష్ట్ర స్థాయి ఫ్రాంచైజీ లీగ్ కంటే పంత్‌కు దేశం తరఫున ఆడటమే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ ఏడాది డీపీఎల్ షెడ్యూల్ ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికి.. ఈ టోర్నమెంట్ జూలై 31 నుండి ఆగస్టు 30 మధ్య జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తలపడనుంది. పంత్ టెస్టు జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు.ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనెజ్మెంట్ కారణంగా డీపీఎల్‌కు దూరంగా ఉండాలని పంత్ నిర్ణయించుకున్నాడు. కాగా పంత్ ఐపీఎల్-2027 ముందు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే. -
'అదే టీమిండియా కొంపముంచింది'.. ప్లేయర్లపై గవాస్కర్ ఫైర్
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన ప్రస్థానాన్ని ఓటమితో ఆరంభించాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ అయింది. ఈ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌పై భారత్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోయిన రికార్డు లేదు. కానీ ఇప్పుడు వరుసగా మ్యాచ్‌లలోనూ ఓడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల నిర్లక్ష్య వైఖరిపై కూడా గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో ఒకరిద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదించలేక చతికలపడడం గమనార్హం."జూన్ 28(ఆదివారం) అనేది భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా నిలిచిపోతుంది. మ్యాచ్‌లో ఓడిపోవడం, సిరీస్‌ను కోల్పోవడం సహజం. కానీ ఏ జట్టు చేతిలో ఓడిపోయామనేది ముఖ్యం. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి, వాటిలో కొన్నింటిలో నేను కూడా భాగమయ్యాను. అయితే ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడం మాత్రం ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఘెర పరాభావంగా చెప్పుకోవాలి.ఒకవేళ ఐర్లాండ్ అద్భుతమైన క్రికెట్ ఆడి గెలిస్తే ఆ బాధ ఇంతగా ఉండేది కాదు. కానీ భారత ఆటగాళ్లలో కనిపించిన మితిమీరిన ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఓటమి ఎదురైంది. అదే నన్ను ఎక్కువగా బాధించింది. ఈ ఓటమి 1983 ప్రపంచ కప్ ఫైనల్లో వెస్టిండీస్ ప్రదర్శనను గుర్తు చేసింది. ఆ సమయంలో భారత బౌలర్లు తెలివిగా, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు.మ్యాచ్‌ను ఈజీగా ముగించేలా కనిపించిన వివ్ రిచర్డ్స్‌ను అవుట్ చేస్తూ కెప్టెన్ కపిల్ దేవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అప్పుడు వెస్టిండీస్ బ్యాటర్లు ఔటైన తీరును గమనిస్తే అతివిశ్వాసం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌లో భారత బ్యాటర్లు కూడా అదే తప్పు చేశారు" అని స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నారు.చదవండి: IND vs IRE: భారత్‌పై ఘన విజయం.. ఐర్లాండ్‌కు భారీ షాక్ -
భారత్‌పై ఘన విజయం.. ఐర్లాండ్‌కు భారీ షాక్
స్వదేశంలో టీమిండియాపై 2-0 తేడాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుని 24 గంటల తిరగకముందే ఐర్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ హెన్రిచ్ మలాన్ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఆరంభం వరకు తన పదవీ కాలం ఉన్నప్పటికి, వన్డే ప్రపంచకప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలాన్ తెలిపారు. కొత్త కోచ్‌కు జట్టు బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయమని అతడు పేర్కొన్నాడు. గత రెండు వన్డే ప్రపంచకప్‌లకు అర్హత సాధించలేకపోయిన ఐర్లాండ్ జట్టు, ఈసారి ఎలాగైనా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ 11వ స్ధానంలో ఉంది. ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వేలతో పాటు టాప్-8 స్థానాల్లో ఉన్న జట్లకు మాత్రమే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత లభిస్తుంది. మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఆధ్వర్యంలో జట్టును ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలని ఐర్లాండ్ భావిస్తోంది.కాగా హెన్రిచ్ మలాన్ హయంలో ఐర్లాండ్ ఎన్నో అద్భుత విజయాలను అందించింది. వరుసగా మూడు టీ20 ప్రపంచకప్‌లకు ఐరీష్ జట్టు క్వాలిఫై అయింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్‌ను ఓడించి ఐర్లాండ్ సంచలనం సృష్టించింది.అంతేకాకుండా అతడి నేతృత్వంలోనే పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లను కూడా ఐర్లాండ్ మట్టికరిపించింది. ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ టీ20 జట్టు అయిన టీమిండియాను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది.చదవండి: 'వారిని తప్పు పట్టడం సరికాదు.. కానీ ఐర్లాండ్ మాత్రం అద్భుతం' -
'వారిని తప్పు పట్టడం సరికాదు.. కానీ ఐర్లాండ్ మాత్రం అద్భుతం'
గత రెండేళ్లుగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న టీమిండియాకు పసి కూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. తమ సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ను ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. పాల్ స్టిర్లింగ్, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, జోష్ లిటిల్ వంటి సీనియర్లు లేనప్పటికి యువ ఆటగాళ్లతో కూడిన ఐరీష్ జట్టు పటిష్టమైన టీమిండియాను రెండు మ్యాచ్‌లలోనూ చిత్తు చేసింది.ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐర్లాండ్ టూర్లో భారత బ్యాటింగ్ యూనిట్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే ఈ ఘోర పరాభావం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న పరిస్థితి గురుంచి భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెష్కాట్ వివరించాడు. ఈ ఓటమి తామని తీవ్ర నిరాశపరిచందని అతడు చెప్పుకొచ్చాడు."మా ఆటగాళ్లంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇది నిజంగా నమ్మలేని పరిస్థితి. ఈ ఒక్క ఓటమి కారణంగా ఆటగాళ్లను విమర్శించడం సరికాదు. వారంతా వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులు. అయితే ఈ సిరీస్‌లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. ఐర్లాండ్ జట్టు బెసిక్స్ సరిగ్గా పాటించి మాపై విజయం సాధించింది. మా కంటే వారు మెరుగ్గా ఆడారు. ఈ సిరీస్ ఓటమి మాకు చాలా పాఠాలను నేర్పించింది. భారత్ వంటి ఉపఖండ పిచ్‌లపై ఎలా ఆడాలో మా ఆటగాళ్లకు బాగా తెలుసు. కానీ వేరే దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి తగినట్లుగా ఆడటం నేర్చుకోవాలని ఈ సిరీస్ నిరూపించింది. ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బంతిని స్ట్రెయిట్‌గా హిట్ చేసే అవకాశమివ్వలేదు. రెండు మ్యాచ్‌ల్లో మేము కేవలం కేవలం రెండు స్ట్రెయిట్ సిక్సర్లు మాత్రమే. భారత పిచ్‌లపై దూకుడుగా ఆడే శైలికి మనవాళ్లు అలవాటు పడిపోయారు. రాబోయో ఇంగ్లండ్ పర్యటనలో కూడా భారత్‌కు ఇలాంటి ఫాస్టెస్ట్ వికెట్లు ఎదురవుతాయి. అక్కడ గెలవాలంటే మనం మరింత తెలివిగా ఆడాల్సి ఉంటుందని" డెష్కాట్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: అతడికే మా మద్దతు.. వైభవ్ ఎదురుచూడాల్సిందే: కోచ్ -
'వరల్డ్‌కప్‌లో అతడు ఆడుతాడన్న నమ్మకం లేదు'
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయాలతో సావాసం చేస్తున్నాడు. తొలుత ఐపీఎల్-2026లో హార్దిక్ వెన్ను గాయానికి గురయ్యాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడంతో అతడు తన గాయం నుంచి కోలుకునేందుకు నేరుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లాడు. హార్దిక్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తుండడంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతాడని అంతా భావించారు. కానీ రిహాబిలిటేషన్ దశలోనే హార్దిక్‌కు మరో సమస్య ఎదురైంది.వైద్య పరీక్షల సమయంలో అతడి తొడ కండరాల గాయం బారిన పడినట్లు తేలింది. దీంతో పాండ్యా అఫ్గాన్‌తో వన్డేలతో పాటు ఇంగ్లండ్ టూర్‌కు కూడా దూరమ్యాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉన్నాడు.వన్డే ప్రపంచకప్-2027 ముందు హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆల్‌రౌండర్ ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతుండడం భారత జట్టు మేనెజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ ఫిట్నెస్ సమస్యల కారణంగా రాబోయో వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడన్న హామీ తాను ఇవ్వలేనని కైఫ్ అన్నాడు."హార్దిక్ పాండ్యా వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఆడుతాడన్న నమ్మకం నాకు లేదు. అతడి పరిస్థితి ఏంటో ఆర్ధం కావడం లేదు. ఏదేమైనప్పటికి హార్దిక్ బిగ్ మ్యాచ్ విన్నర్. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అతడి స్ధానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆ విషయం పాండ్యాకు కూడా తెలుసు. కానీ అతడి శరీరం సహకరించడం లేదు. 2023 నుంచి అతడు తరుచూ గాయాల బారిన పడుతూనే ఉన్నాడు. అతడి ఫిట్నెస్ గురుంచి సరైన అప్డేట్ ఎవరూ ఇవ్వడం లేదని" కైఫ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. -
వన్డే జట్టులో ‘సర్’ స్థానానికి ఎసరు....? గంభీర్, అగార్కర్ కొత్త వ్యూహం!
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో రవీంద్ర జడేజా పేరు లేకపోవడంతో.. సెలక్టర్లు అతడికి విశ్రాంతి ఇచ్చారని అంతా అనుకున్నారు.కానీ తాజాగా ఇంగ్లండ్‌తో వన్డేలకు సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టులోనూ జడ్డూకు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది. జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లను ప్రధాన స్పిన్ ఆల్రౌండర్లుగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.కాగా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా.. ప్రస్తుతం వన్డేలు, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ అతడికి ప్రత్యామ్నాయ ఆప్షన్స్ సెలక్టర్లు వెతుకున్నారు. ఇప్పటికే రెడ్‌బాల్ క్రికెట్లో జడ్డూ స్ధానంలో జట్టులోకి వచ్చిన మానవ్ సుతార్ తన సత్తాను నిరూపించుకున్నాడు. కానీ ప్రధాన టెస్ట్ సిరీస్‌లకు జడేజాకు తిరిగి పిలపునిచ్చే అవకాశముంది.వన్డేల్లో కూడా ఇప్పుడు సుందర్ లేదా అక్షర్‌లో ఎవరో ఒకరిని జడ్డూ బ్యాకప్‌గా తాయారు చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ టూర్‌కు టీమ్ ప్రకటన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు."రవీంద్ర జడేజా ఎలాంటి ప్లేయరో మాకు బాగా తెలుసు. 2027 ప్రపంచకప్‌నకు ఇంకా 15-16 నెలల సమయం ఉంది. ఈ లోగా ప్రత్యామ్నాయ బ్యాకప్ ఆప్షన్లను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించాం. అందుకే యువ ఆటగాళ్లను పరీక్షించేందుకే జడేజాకు విశ్రాంతినిచ్చామని" అగార్కర్ పేర్కొన్నాడు. కానీ అగార్కర్ వ్యాఖ్యలు బట్టి 37 ఏళ్ల జడేజా టీమిండియా వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికలలో లేనిట్లు ఆర్ధమవుతోంది.ఎందుకంటే జడేజా 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి 38 ఏళ్లకు చేరుకుంటాడు. దీంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్మెంట్.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఆటగాళ్ల కంటే యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని భావిస్తోంది. జడేజా ఇకపై కేవలం టెస్ట్ స్పెషలిస్ట్‌గానే కొనసాగే అవకాశముంది.జడేజా చివరగా భారత తరపున ఈ ఏడాది జనవర్లో న్యూజిలాండ్‌పై వన్డే మ్యాచ్ ఆడాడు. జడేజాకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 210 మ్యాచ్‌లు ఆడి 232 వికెట్లతో పాటు 2905 పరుగులు సాధించాడు. ఏదేమైనప్పటికి జట్టులో జడేజా లాంటి ఆల్‌రౌండర్ స్ధానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. -
ఇదంతా ఓ కలలా ఉంది.. మాటలు కూడా రావడం లేదు: వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ క్రికెట్ జట్టు తరపున అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. జూన్ 26న బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్న తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్‌కు భారత జెర్సీని అందజేశారు. హోటల్ గదిలో జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదగా తొలి భారత జెర్సీని వైభవ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీ ఎక్స్‌లో షేర్ చేసింది.ఈ సందర్భంగా సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ చిచ్చర పిడుగుకు '03' నంబర్ గల జెర్సీని కేటాయించారు. గతంలో టీమిండియా దిగ్గజాలు హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు ఈ నంబర్ జెర్సీని ధరించి ఆడిన సంగతి తెలిసిందే."బ్యాట్ పట్టుకున్న మొదటి రోజు నుంచి కన్న కల ఇది. ఈ రోజు ఆ కల సాకారమైంది. ఈ అపూరూప క్షణంలో నాకు మాటలు కూడా రావడం లేదు. అదంతా ఒక కలలా అనిపించింది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. నా క్రికెట్ ప్రయాణంలో అత్యంత కీలకమైన అడుగు పడినందుకు సంతోషంగా ఉంది. భారత జెర్సీని ధరించడం నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నాను" అని బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో వైభవ్ పేర్కొన్నాడు. అయితే వైభవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వడం కోసం రెగ్యూలర్ ఓపెనర్లైన సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మలలో ఎవరో ఒకరిని పక్కన పెట్టాలి. లేదంటే సంజూను ఫస్ట్ డౌన్లో ఆడించి వైభవ్‌కు ఓపెనర్‌గా పంపాలి. ఇదే జరిగితే కిషాన్‌ను తుది జట్టు నుంచి తప్పించాల్సి ఉంటుంది. మరి టీమ్ మేనెజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. Ladies & GentlemenThe moment the nation has been waiting for has arrived! Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw— BCCI (@BCCI) June 23, 2026 -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది.ఉమెన్స్ టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో హర్మన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2009లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి మహిళల టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్మన్.. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు రెండు వందల టీ20 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. హర్మన్‌కు ఇది 10వ టీ20 వరల్డ్‌కప్ కావడం గమనార్హం.కాగా మహిళల విభాగంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జాబితాలో హర్మన్(200) అగ్రస్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో న్యూజిలాండ్ లెజెండరీ ప్లేయర్ సూజీ బేట్స్ (184 మ్యాచ్‌లు) రెండో స్ధానంలో కొనసాగుతోంది. పురుషుల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (163) ఉన్నాడు.అత్యధిక టీ20లు ఆడిన టాప్ ప్లేయర్స్పురుషుల విభాగంలో: పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): 163 మ్యాచ్‌లు (అగ్రస్థానం) రోహిత్ శర్మ (భారత్): 159 మ్యాచ్‌లు (రెండో స్థానం) మహిళల విభాగంలో: హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్): 200 మ్యాచ్‌లు సూజీ బేట్స్ (న్యూజిలాండ్): 184 మ్యాచ్‌లు ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా): 177 మ్యాచ్‌లుకాగా తన కెరీర్లో హర్మన్ ఇప్పటివరకు ఆడిన 200 మ్యాచ్‌లలో 29.83 సగటుతో 4147 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 పరుగులుగా ఉన్నాయి. బౌలింగ్‌లో ఆమె 32 వికెట్లు పడగొట్టింది. -
టీమిండియాకు భారీ షాక్
అఫ్గానిస్తాన్‌తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసి మంచి జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్-2026లో ఎడమ కాలి గాయం బారిన పడిన వరుణ్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI COE)లో కోలుకుంటున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. అయితే వరుణ్ చక్రవర్తి రీప్లేస్‌మెంట్‌ను ఇంకా భారత క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల బట్టి చక్రవర్తి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వరుణ్ స్ధానంలో హర్ష్ దూబే లేదా కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసే అవకాశముంది. దూబే అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. కాగా భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ జూన్ 26 నుంచి జరగనుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో వన్డేలకు కూడా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు తిరిగొచ్చారు. కానీ యశస్వి జైశ్వాల్, సిరాజ్‌కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు.ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్డేటడ్):శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్-కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత జట్టు:శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గూరనూర్ బ్రార్. -
'నెక్స్ట్ సచిన్, కోహ్లి' అంటూ భజన.. వారు ఏమయ్యారో తెలుసు కదా?
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఈసారి అతడి ప్రదర్శన గురుంచి కాకుండా ప్రవర్తన గురుంచి చర్చ నడుస్తోంది. శ్రీలంక పర్యటనలో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు ఈ యువ బ్యాటర్ తీవ్రంగా రియాక్ట్ అవ్వడమే ఇందుకు కారణం.అతడి ప్రవర్తనను కొందరు తప్పుబడుతుంటే, మరొకరు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బీసీసీఐకి కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇప్పటివరకు విజయాలనే చూసిన వైభవ్.. కొన్ని సందర్భాల్లో వైఫల్యాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అప్టన్ అభిప్రాయపడ్డారు.కాగా ప్యాడీ అప్టన్ సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా తన సేవలను అందించాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ, 2009లో టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్ స్థానానికి చేరడంలోనూ ఆయనదే కీలక పాత్ర."వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే మైదానంలో చాలా సార్లు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. క్లిష్ట సమయాల్లో కూడా రాణించేందుకు అవసరమైన మైండ్ సెట్ అతడికి ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ ప్లేయర్ కూడా తన కెరీర్ అంతటా ఒకే విధమైన ఫామ్‌ను కొనసాగించలేడనే విషయాన్ని వైభవ్ గ్రహించాలి. అతడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ ఆ ఫామ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని ఆశించకూడదు. ఒకవేళ నేను కనుక ఇప్పుడు అతడితో ఉంటే.. తక్కువ స్కోర్లు రావడం, కొన్నిసార్లు విఫలం కావడం లేదా ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవడం వంటివి సహజమని అర్థమయ్యేలా చెప్పేవాడిని. ఇంతకంటే భిన్నంగా ఏమి జరగదు. ప్రతీ ఆటగాడు ఏదో ఒక దశలో తన ఫామ్‌ను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ బ్యాడ్ ఫామ్ నుంచి ఎంత వేగంగా బయటపడతాడనేదే అతడి కెరీర్‌ను నిర్ణయిస్తుంది. బయట నుంచే వచ్చే ఒత్తిడి, అనవసరపు చర్చలను సమర్ధవంతంగా ఎదుర్కొవడం వైభవ్ ముందున్న అతిపెద్ద సవాల్.ప్రపంచంలోనే అత్యంత మానసిక దృఢత్వం కలిగిన, ఎంతో అనుభవం ఉన్న మేటి అథ్లెట్లు సైతం కొన్నిసార్లు బయటి , విమర్శలు , ఇతరుల అభిప్రాయల వల్ల తమ ఏకాగ్రతను కోల్పోయి కెరీర్ నాశనం చేసుకున్నారు.అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారుగత 5-6 ఏళ్లలో భారతదేశంలో రాత్రికి రాత్రే స్టార్స్‌గా ఎదిగిన ఎంతోమంది యువ సూపర్ స్టార్లను మనం చూశాం. ఐపీఎల్లో ఒక సీజన్ అద్భుతంగా ఆడగానే.. వారిని తర్వాతి సచిన్ టెండూల్కర్ అనో, తర్వాతి విరాట్ కోహ్లీ అనో లేదా తర్వాతి ఎంఎస్ ధోని అనో పిలవడం మొదలుపెట్టేస్తారు. కానీ వారిలో చాలా మంది అడ్రస్ లేకుండా అయిపోయారు. వారు కేవలం సాధారణ ఐపీఎల్ ఆటగాళ్ల స్థాయికే పరిమితమైపోయారు. దీనికి ప్రధాన కారణం.. వారు కూడా ఈ బయటి హడావుడిలో, విపరీతమైన అంచనాల వలయంలో చిక్కుకుపోవడమే. ఎవరైనా తప్పులు చేయడం సహజం. వైభవ్ కూడా తప్పు చేశాడనేది నిజమే. కానీ ఎలాంటి ఒత్తిడి, ఆందోళన కారణంగా అలా చేశాడో నేను ఊహించగలను. ఈ ఊహించని ఘటన నుంచి కోలుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి అతడికి ఎవరు గైడెన్స్ ఇస్తారన్నది చాలా ముఖ్యం. రాబోయో రోజుల్లో అతడు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్నాడు. ప్రత్యర్థి జట్లు మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. వీటిన్నంటిని అతడు తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. ముఖ్యంగా ఫెయిలూర్స్‌ను కూడా అతడు స్వీకరించాలి. అంతే తప్ప సహనం కోల్పోకూడదు. ఈ 15 ఏళ్ల వండర్ కిడ్‌ను కేవలం టెక్నికల్‌గానే కాకుండా, మానసికంగా కూడా ఒక గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని" స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్యాడీ అప్టన్ పేర్కొన్నాడు. -
టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్
ప్రస్తుత తరం క్రికెట్లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్లో రాణించి టీమిండియాలోకి వచ్చినవారే. అయితే ఇప్పుడు ఒక 26 ఏళ్ల యువకుడు ఐపీఎల్‌తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్.అరంగేట్రంలో అదుర్స్పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్.. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో ధర్మశాల వేదికగా జరిగిన భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలనూ అతడు సత్తాచాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు.దీంతో తన కెరీర్‌లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడుతోంది. అతడికి సపోర్ట్‌గా మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ప్రస్తుత భారత జట్టులో నిలకడగా రాణించే మరొక ఫాస్ట్ బౌలర్ లేడు.ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భారత్ పేస్ బౌలింగ్ కష్టాలు తీరినట్లే అనే చెప్పాలి. ఈ పంబాబ్ స్పీడ్ స్టార్‌కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న బ్రార్.. ఫ్లాట్ పిచ్‌పైనైనా ఊహించని ‘స్టీప్ బౌన్స్’ రాబట్టగలడు. దీంతో భారత క్రికెట్‌కు మరో బుమ్రా దొరికాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రా కూడా తన కెరీర్లో తొలి రెండో వన్డేల్లో 6 వికెట్లే పడగొట్టాడు. ఇప్పుడు గుర్నూర్ కూడా యాదృచ్ఛికంగా 6 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో నో ఛాన్స్!గుర్నార్ బ్రార్.. 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు. కానీ గత మూడు సీజన్లలోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.కానీ మైదానంలో దిగకపోయినా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజ పేసర్ పర్యవేక్షణలో అతడు రాటు దేలాడు. మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుజ్ఞులైన బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, నెట్స్‌లో శ్రమించడం ద్వారా గుర్నూర్ ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.అదే టర్నింగ్ పాయింట్?కాగా గుర్నార్ బ్రార్ దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్ తరపున కేవలం 18 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అయితే గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగిన వన్డే సిరీస్ అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ చెప్పాలి. ఈ సిరీస్‌లో బ్రార్ దుమ్ములేపాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి సీనియర్ల కంటే అతడే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతడికి భారత జట్టులో నెట్ బౌలర్‌గా అవకాశం దక్కింది. ఇప్పుడు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లకు విశ్రాంతి ఇవ్వడంతో గుర్నూర్‌కు ప్రధాన జట్టులో చోటు కల్పించారు. తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా ఈ పంజాబ్ పేసర్ అందిపుచ్చుకున్నాడు. కాగా 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ సెలక్షన్ కమిటీ గుర్నార్‌ను భారత జట్టుకు ఎంపిక చేశారు.ఎందుకంటే అక్కడి పిచ్‌లపై పేస్, బౌన్స్ ఉన్న బౌలర్లు చాలా కీలకం కానున్నారు.చదవండి: టీమిండియాకు భారీ షాక్.. స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన స్టార్ ప్లేయర్ -
టీమిండియాకు భారీ షాక్.. స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన స్టార్ ప్లేయర్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది.దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్‌పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం పాటిల్‌ను అస్పత్రికి తరలించారు. ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో శ్రీయాంక ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగే అవకాశముంది. కాగా శ్రీయాంకు గాయాలేమి కొత్త కాదు. గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్‌తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఇప్పుడు వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది.ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్ సేన గ్రూప్-ఎ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది. ఇలాంటి సమయంలో శ్రేయాంక గాయం మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.చదవండి: ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?! -
మహిళల జట్టు టి20 ప్రపంచకప్...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)
-
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు?
టీమిండియాకు గుడ్ న్యూస్. టీ20 ప్రపంచకప్-2026కు ముందు గాయపడిన స్టార్ పేసర్ హర్షిత్ రాణా, ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు నెలలగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న హర్షిత్.. అఫ్గాన్‌తో మూడో వన్డేకు ముందు భారత జట్టుతో చేరనున్నట్లు సమాచారం.వాస్తవానికి అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో హర్షిత్ లేడు. కానీ ఇప్పుడు అతడు కోలుకోవడంతో గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానంలో జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఐర్లాండ్,ఇంగ్లండ్ పర్యటనలకు మాత్రం ముందే అతడిని ఎంపిక చేశారు.ఈ ఢిల్లీ క్రికెటర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఉన్నాడు. అతడు ప్రతి రోజూ 9-10 ఓవర్లు బౌలింగ్ చేస్తూ, తన బ్యాటింగ్‌పై కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాడని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. జూన్ 17 నాటికి అతడికి సీఓఈ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.సీఓఈ వైద్య బృందం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతడు నేరుగా మూడో వన్డేకు ముందు చెన్నైలో జట్టుతో కలవనున్నాడు. హర్షిత్ చివరగా భారత్ తరపున వన్డేల్లో ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌పై ఆడాడు. ఇప్పటివరకు 14 వన్డేలు ఆడిన రాణా.. 6.22 ఏకానమితో 26 వికెట్లు పడగొట్టాడు. అతడికి బ్యాట్‌తో రాణించే సత్తా కూడా ఉంది. దీంతో టీమ్ మెనెజ్‌మెంట్ అతడిని ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్చదవండి: వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్ -
వైభవ్ సూర్యవంశీ తమ్ముడి వీరవిహారం.. 10 ఏళ్లకే సూపర్ సెంచరీ
నయా బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెటర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే సెంచరీ బాది యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. తనకంటే సీనియర్ బౌలర్లను సైతం విడిచిపెట్టలేదు. మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఆ చిచ్చర పిడుగు ఎవరో కాదు వైభవ్ చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. ఇప్పుడు అన్న బాటలోనే ఆశీర్వాద్ కూడా అడుగులు వేస్తున్నాడు.ఆశీర్వాద్ తాజాగా బిహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఒక స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 'క్రికెట్ అకాడమీ తాజ్పూర్' తరపున ఆడిన జూనియర్ వైభవ్ 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 118.39గా నమోదైంది.తమ్ముడి క్లాస్ ఇన్నింగ్స్ చూసి మురిసిపోయిన వైభవ్ సూర్యవంశీ.. సోషల్ మీడియా ద్వారా ఆశీర్వాద్‌కు అభినందనలు తెలిపాడు. ఆశీర్వాద్ స్కోర్ కార్డ్‌కు సంబంధించి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అన్నకు తగ్గ తమ్ముడు అని కామెంట్లు చేస్తున్నారు.కాగా వైభవ్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. తద్వారా భారత జట్టుకు సెలక్ట్ అయిన అతి పిన్న వయష్కుడిగా సచిన్ రికార్డును సూర్యవంశీ(15) బ్రేక్ చేశాడు.ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ వైభవ్ అసాధరణ ప్రదర్శన చేశాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs AFG: మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం -
'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ'
హైదరాబాదీ, తెలుగు తేజం తిలక్ వర్మ భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ స్ధానంలో ఆ బాధ్యతలను తిలక్‌కు బీసీసీఐ అప్పగించింది. ఇకపై టీ20ల్లో శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా అతడు వ్యవహరించున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏషియన్ గేమ్స్‌కు జట్టు ఎంపిక సందర్బంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించడాన్ని భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. అదేవిధంగా ఐపీఎల్-2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఎందుకు జట్టులో తీసుకోలేదని అతడు సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు."తిలక్ వర్మకు కెప్టెన్‌గా అసలు అనుభవమే లేదు. అదేవిధంగా అతడు ఫామ్‌లో కూడా లేడు. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా సైతం లేదు. పాటిదార్ లాగా బౌలర్లను టార్గెట్ చేయలేడు. గత రెండు మూడు ఐపీఎల్ సీజన్ల నుంచి తిలక్ వర్మ ఆశించినంత మేర రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లోనూ నిరాశపరిచాడు.అయినప్పటికి వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. మరోవైపు భారత టీ20 జట్టులో వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కే అర్హత లేదు. అతడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున బౌలింగ్ కూడా చేయలేదు. కేవలం మిడిలార్డర్ బ్యాటర్‌గా ఆడాడు. టీమిండియాలో కూడా అతడు రెగ్యులర్‌గా బౌలింగ్ చేయడం లేదు. అలాంటప్పుడు అతడిని ఒక ఆల్‌రౌండర్‌గా ఎలా జట్టులోకి తీసుకున్నారో సెలక్టర్లకే తెలియాలి. అతడి స్ధానంలో పాటిదార్‌ను ఎంపిక చేయాల్సిందని" శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!? -
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే
జితేష్ శర్మ.. గతేడాది ఆఖరి వరకు భారత టీ20 జట్టులో ఫినిషర్‌గా, సెకండ్ వికెట్ కీపర్‌గా రేసులో ఉన్నాడు. కానీ టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఇషాన్ కిషన్ రీఎంట్రీతో పరిస్థితి తారుమారైంది. జితేష్ శర్మను పక్కన పెట్టి సెకెండ్ వికెట్ కీపర్‌గా కిషన్‌ను సెలక్టర్లు చోటు ఇచ్చారు.ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్ కాగా, అతడికి బ్యాకప్ కిషన్ ఉన్నాడు. అయితే కిషన్ తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తన పునరాగమనంలో ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ దుమ్ములేపాడు. వరల్డ్‌కప్‌తో పాటు ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ ఇషాన్ దుమ్ములేపాడు. కిషన్ అద్భుతంగా రాణిస్తుండడంతో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు జితేష్‌కు అవకాశం లభించడం లేదు. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు ప్రకటించిన భారత జట్లలోనూ జితేష్‌కు చోటు దక్కలేదు. అయితే 32 ఏళ్ల జితేష్ శర్మ ఆ కసి, కోపాన్ని విదర్భ ప్రీమియర్ లీగ్-2026లో తన తొలి మ్యాచ్‌లో చూపించాడు. ఐపీఎల్లో నిరాశపరిచిన ఈ విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్.. తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. ఈ టోర్నీలో 'నెకో మాస్టర్ బ్లాస్టర్' జట్టుకు సారథ్యం వహిస్తున్న జితేష్ శర్మ... 'ఇండియా వారియర్స్' తో మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ఆర్సీబీ ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 10 బంతుల్లోనే 5 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నెకో మాస్టర్ బ్లాస్టర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఇండియా వారియర్స్ జట్టు మ్యాచ్ చివరి బంతికి 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో జితీష్ టీమ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: వైభవ్‌కు ముందుంది అసలు పరీక్ష: సౌరవ్ గంగూలీ -
వైభవ్‌కు ముందుంది అసలు పరీక్ష: సౌరవ్ గంగూలీ
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి అడుగు దూరంలో నిలిచాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత టీ20 జట్లలో 15 ఏళ్ల వైభవ్‌కు చోటు దక్కింది.దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్‌ను సూర్యవంశీ అధిగమించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని ఇప్పుడే అంచనాల భారంతో ఒత్తిడికి గురిచేయకూడదని దాదా అభిప్రాయపడ్డాడు."వైభవ్ సూర్యవంశీకి ఇంకా కేవలం 15 ఏళ్లే. ఇప్పుడే అతడి నుంచి అద్భుతాలు ఆశించి ఒత్తిడి పెంచకండి. స్వేచ్ఛగా ఆడనివ్వండి. అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడటానికి అతనికి కొంత సమయం ఇవ్వాలి. అయితే వైభవ్ ఒత్తిడి గురుంచి పెద్దగా పట్టించుకోడని నాకు అనిపిస్తోంది.అందుకే ఐపీఎల్లో ఒక సంచలనం మారాడు. కానీ భారత్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడేటప్పుడు కాస్త ఒత్తిడి ఉండడం సహజం. అంతకుతోడు ఐపీఎల్ ఆడే పరిస్థితులకు, యూకే పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. అక్కడ బంతి సీమ్ అవుతుంది.బౌన్స్ , మూవ్మెంట్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త బంతిని ఎదుర్కొవడం బ్యాటర్లకు కష్టంగా ఉంటుంది. అయినప్పటికి వైభవ్ స్కిల్స్‌పై నాకు నమ్మకం ఉంది. అక్కడ కూడా అతడు అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను" అని గంగూలీ పేర్కొన్నాడు.అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్, గంగూలీ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. "వైభవ్ చాలా చిన్నవాడని, ఇంకా అనుభవం లేదని మనందరికి తెలుసు. కానీ అతడు తన ఆట తీరుతో సెలక్షన్ కమిటీ తలుపులు బద్దలు కొట్టి మరీ జట్టులోకి వచ్చాడు" అని డివిలియర్స్ అన్నాడు. కాగా భారత అండర్-19 జట్టు తరపున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా వైభవ్ తనను నిరూపించుకున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత కెప్టెన్‌గా -
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసేందుకు రంగం సిద్దమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో 15 ఏళ్ల సూర్యవంశీకి చోటు దక్కింది. దీంతో భారత జట్టు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ టెండూల్కర్‌ను వైభవ్ అధిగమించాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతి చిన్న వయస్సులోనే భారత జట్టు ఎంపికైన వైభవ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడిని క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్‌మాన్‌లతో పోల్చడం సరికాదని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా వైభవ్ టీమిండియాకు ఎంపికవ్వడం తమ కుటుంబానికి ఒక పెద్ద కల నెరవేరిన క్షణమని సంజీవ్ తెలిపాడు.సంజీవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సచిన్, బ్రాడ్‌మన్‌లతో వైభవ్‌ను పోల్చడం నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ లెజండరీ క్రికెటర్లు అత్యున్నత స్థాయిలో దశాబ్దాల పాటు రాణించి, దేశానికి ఎన్నో అద్భుత విజయాలు అందించారు. ప్రస్తుతం వైభవ్ వారి పాదాల దుమ్ముతో కూడా సమానం కాడు. కాబట్టి ఇలాంటి పోలికలు అస్సలు పెట్టవద్దు. అదేవిధంగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు కూడా లెఫ్ట్ హ్యాండరే. కాబట్టి లారా బ్యాటింగ్ వీడియోలను వైభవ్‌కు చూపించాను. గత కొన్నేళ్లుగా లారా, యువరాజ్ సింగ్, ఇతర క్రికెటర్ల బ్యాటింగ్ వీడియోలు కూడా వైభవ్ చూస్తున్నాడు.అయినప్పటికి అతడి ఆటతీరు పూర్తిగా విలక్షణంగా ఉంటుంది. అతడు ఎవరిని అనుకరించకుండా తనదైన శైలిలో క్రికెట్ ఆడతున్నాడని" పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో వైభవ్ దుమ్ములేపాడు. 776 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్!? -
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్!?
భారత క్రికెట్లో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసింది. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పించింది. అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలకు ప్రకటించిన భారత జట్లలో సూర్యకుమార్‌కు కనీసం ఆటగాడిగా కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. పేలవ ఫామ్ కారణంగానే సెలక్టర్లు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.భారత్‌కు ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌ను అందించినప్పటికి అతడి ఫామ్ మాత్రం దారుణంగా పడిపోయింది. ఐపీఎల్-2026లోనూ సూర్య రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్ 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ కారణాలతో అతడిని జట్టు నుంచి తప్పించారు.సూర్య రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?అయితే సూర్యకుమార్‌పై వేటు పడిన కొద్దిసేపటికే అతడికి సంబందించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. విమర్శలు, ఆన్లైన్ ట్రోలింగ్ వల్ల తీవ్ర నిరాశకు గురయ్యాను. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను" అంటూ సూర్యకుమార్ పేరుతో ఉన్న ఒక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా స్క్రీన్‌షాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.అయితే అది ఫేక్ పోస్ట్ అని తేలింది. @unreal_skyy అనే ఒక ఫేక్ అకౌంట్ నుంచి ఎవరో ఆకతాయి చేసిన పోస్ట్ అది. అంతే తప్ప స్కై నుంచి కానీ బీసీసీఐ నుంచి కానీ అతడి రిటైర్మెంట్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సూర్య ప్రస్తుతం ముంబై టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు.చదవండి: జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం? -
జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఊహించని షాకిచ్చింది. కెప్టెన్సీ బాధ్యతలతో పాటు పూర్తిగా జట్టు నుంచి కూడా అతడిని తప్పించింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ట్రోఫీ అందించినప్పటికీ, వ్యక్తిగత ఫామ్ లేమి కారణంగా సూర్యకుమార్‌పై వేటు వేశారు.అతడి స్దానంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏషియన్ గేమ్స్ కోసం జట్టు ఎంపిక సందర్భంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పూర్తి స్ధాయిలో దేశవాళీ క్రికెట్లో ఆడాలని సూర్య భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోయేషన్‌కు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఆడాలనేది తన కల అని స్కై ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన కలను నెరవేర్చుకునే దిశగా సూర్య అడుగులు వేయనున్నాడు. తన ఫామ్‌ను తిరిగి సాధించడానికి, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి దేశవాళీ టోర్నమెంట్లు ఆడాలని మిస్టర్ 360 ఫిక్స్ అయ్యాడు.అతడు చివరగా డొమాస్టిక్ క్రికెట్లో ఈ ఏడాది జనవరిలో ముంబై తరపున విజయ్హాజరే ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. రెడ్ బాల్ క్రికెట్ విషయానికి వస్తే గతేడాది జనవరిలో విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. సూర్యకుమార్ ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న దులీప్ ట్రోఫీ వెస్ట్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశముంది. సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టు తరఫున రెడ్ బాల్ క్రికెట్లో మొత్తం 14 సెంచరీలు సాధించాడు. అతడు ప్రస్తుతం ముంబై టీ20 లీగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు.చదవండి: టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన! -
అందుకే సూర్యను తప్పించాం: అగార్కర్
అందరూ ఊహించిందే జరిగింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. శ్రేయస్ గత మూడేళ్లగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. ఉన్నపళంగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.ఐపీఎల్-2024లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్‌ను అందించిన శ్రేయస్.. ఆ తర్వాత సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా అతడు విజయవంతమయ్యాడు. దేశవాళీ క్రికెట్లో సైతం ముంబై జట్టును నడిపించిన అనుభవం శ్రేయస్‌కు ఉంది.ఒక్క కెప్టెన్సీలోనే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా ఈ ముంబైకర్ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత టీ20 జట్టు బాధ్యతలను అయ్యర్‌కు అప్పగించారు. ఇక శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించడంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. శ్రేయస్ ఒక లీడర్‌గానూ, బ్యాటర్‌గానూ నిలకడగా రాణిస్తున్నాడని, అందుకే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామని అగార్కర్ తెలిపాడు."శ్రేయస్ ఇప్పటికే కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. అతడు గత కొన్నేళ్లుగా వేర్వేరు ఫ్రాంచైజీలను (ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్ కింగ్స్) సమర్థవంతంగా నడిపించడం మనం చూశాము. అయ్యర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచింది. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. గత టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యే రేసులో అతడు చివర వరకు ఉన్నాడు.కానీ టీమ్ కాంబినేషన్ కారణంగా అతడిని జట్టులోకి తీసుకోలేకపోయాము. భారత జట్టుకు వరల్డ్ కప్ అందించి, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఒక కెప్టెన్‌ను మార్చడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా సూర్యను తప్పించాల్సి వచ్చింది. రాబోయో రెండేళ్ల కాలం మాకు చాలా ముఖ్యం.సూర్యకుమార్‌తో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాము. అన్ని విషయాలను అతడికి వివరించాము. అందుకు అతడు సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అన్ని రకాలగా శ్రేయస్ అర్హుడని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అజిత్ పేర్కొన్నాడు. -
టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. సూర్యవంశీకి ఛాన్స్
టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడి స్ధానంలో జట్టు పగ్గాలను మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లకు జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు నియమించారు. వీటితో పాటు సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించారు. ఏషియన్ గేమ్స్‌లో కూడా టీమిండియా కెప్టెన్‌గా అయ్యర్ వ్యవహరించనున్నాడు.వైభవ్‌కు ఛాన్స్ఇక ఐపీఎల్-2026లో దుమ్ములేపిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కల్పించారు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయష్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.సూర్య ఖేల్ ఖతంఇక టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసినట్లే. సారధిగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2026ను అందించినప్పటికి.. పేలవ ఫామ్, భవిష్యత్తు ప్రణాళికల కారణంగా అతడిపై వేటు వేశారు. కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే సూర్యను తొలగించారు. గత కొంత కాలంగా టీ20లకే పరిమితమైన సూర్యను, ఇకపై మరి భారత జెర్సీలో చూడకపోవచ్చు.ప్రిన్స్ యాదవ్‌కు చోటుమరోవైపు వైభవ్‌తో పాటు ఈ ఏడాది సీజన్లో అదరగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. ప్రిన్స్ యాదవ్ ఇప్పటికే అఫ్గానిస్తాన్‌తో వన్డేలకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఐర్లాండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాఇంగ్లండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఆసియా క్రీడలకు భారత టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
టీమిండియాలోకి కొత్త కుర్రాడు.. ఎవరీ మానవ్ సుతార్?
టీమిండియా తరపున మరో యువ ఆటగాడు క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. భారత టెస్ట్ క్యాప్‌ను అందుకున్న 319వ ప్లేయర్‌గా సుతార్ నిలిచాడు.వాస్తవానికి హర్ష్ దూబేకు తుది జట్టులో ఆడే అవకాశముస్తుందని అంతా భావించారు. కానీ మేనెజ్మెంట్ మాత్రం సుతార్ వైపు మొగ్గు చూపింది. దీంతో ఎవరి మానవ్ సుతార్ నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ మానవ్ సుతార్?అతడి పూర్తి పేరు.. మానవ్ జగదుసకుమార్ సుతార్. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఆగస్టు 3, 2002న రాజస్థాన్‌లోని శ్రీ గంగనగర్లో జన్మించాడు. తన చిన్నతనం క్రికెటర్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమించాడు. మానవ్ శ్రీ గంగానగర్ జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి అండర్-14, అండర్-16 టైటిళ్లను అందించాడు. ఆ తర్వాత అతడు రాజస్తాన్ అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అక్కడ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచడంతో రాజస్తాన్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం మానవ్‌కు లభించింది. 2022 రంజీ సీజన్లో ఆంధ్రప్రదేశ్‌పై తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర రంజీ సీజన్లోనే సుతార్ దుమ్ములేపాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. కేవలం 6 మ్యాచ్‌లలోనే 39 వికెట్లు పడగొట్టి రాజస్తాన్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తొలి 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అతడు ఏకంగా 44 వికెట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తంగా ఇప్పటివరకు 29 రెడ్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన సుతార్.. 2.94 ఏకానమీ రేట్‌తో 129 వికెట్లు సాధించాడు. ఇందులో ఆరు ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి. 8/33 అతడి అత్యుత్తమ గణాంకాలగా ఉన్నాయి. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌కు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. అతడి పేరిట ఓ ఫస్ట్‌క్లాస్ సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనల కారణంగానే అతడిని జాతీయ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు.స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్నామ్యాయంగా అతడిని జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇండియా-ఎ తరపున కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ఇప్పుడు తన అరంగేట్ర మ్యాచ్‌లో సీనియర్ జట్టు తరపున ఎలా రాణిస్తాడో చూడాలి. కాగా 12 ఏళ్ల తర్వాత రాజస్తాన్ నుంచి భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన తొలి ప్లేయర్‌గా సుతార్ నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
నేడే భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకు ఛాన్స్?
2026 టీ20 వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత్ తమ తర్వాతి సిరీస్‌కు సమాయత్తమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో జరిగే సిరీస్‌లలో తలపడే భారత జట్లను నేడు సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. జూన్ 26న ప్రారంభమయ్యే ఈ టూర్లో భాగంగా ముందుగా ఐర్లాండ్‌తో 2 టి20లు జరుగుతాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 టి20లు, 3 వన్డేలు ఉంటాయి. వీటితో పాటు సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమ్‌ను కూడా అజిత్ అగార్కర్ నాయకత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. సూర్యకుమార్‌పై వేటు తప్పదా! రెండు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుల ఎంపికను మినహాయిస్తే రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. టి20 కెపె్టన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించడం ఖాయమైపోయింది. అతని సారథ్యంలో వరల్డ్ కప్ గెలుచుకున్న వెంటనే ఇది చోటు చేసుకోనుండటం గమనార్హం. 2025లో ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మ తన కెపె్టన్సీని కోల్పోయాడు. సూర్య విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే రోహిత్ ఆటగాడిగా తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. కానీ సూర్య టీమ్‌లో కూడా చోటు కోల్పోనున్నాడు. వరల్డ్ కప్ నెగ్గినా సుదీర్ఘ కాలంగా అతని ఫామ్ పేలవంగా ఉంది. వరల్డ్ కప్‌లో 9 ఇన్నింగ్స్‌లలో కలిపి 242 పరుగులే చేసిన సూర్య... ఐపీఎల్‌లోనూ దానిని కొనసాగిస్తూ 13 ఇన్నింగ్స్‌లలో 270 పరుగులే చేయగలిగాడు. 2028 టీ20 వరల్డ్ కప్, అదే ఏడాది జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని టి20 టీమ్‌ను సిద్ధం చేస్తున్న సెలక్టర్లు 36 ఏళ్ల సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. సూర్య స్థానంలో మరో ముంబైకర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో అతని నాలుగో స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నాడు. శ్రేయస్ 2023 డిసెంబర్లో భారత్ తరఫున చివరిసారిగా టి20 ఆడినా...ఐపీఎల్లో తన బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చిన అతని నాయకత్వంలో 2024లో కోల్‌కతా విజేతగా నిలవగా... 2020, 2025లో ఢిల్లీ, పంజాబ్‌కు రన్నరప్‌గా నిలిచాయి. లాంఛనమేనా! మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి రావడం లాంఛనమే కావచ్చు. అసాధారణ ఆటతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న వైభవ్‌ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఐపీఎల్లో ఏకంగా 237.30 సగటుతో అతను 776 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే భారత టీ20 జట్టు టాప్–3 అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్లతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్‌ను ఆడించడం కష్టంగా అనిపిస్తున్నా... ఆసియా క్రీడలకు మాత్రం అతను ఎంపిక కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. -
షాకింగ్.. అమ్ముడుపోని కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2026లో దుమ్ములేపిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు తన సొంత గడ్డపై ఊహించని షాక్ తగిలింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 'మహారాజా ట్రోఫి టీ20 లీగ్' వేలంలో రాహుల్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు.రూ.2 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన రాహుల్, చివరికి అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి రాహుల్‌ను ఏ జట్టు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అతడి అందుబాటుపై స్పష్టత లేకపోవడమేనని తెలుస్తోంది. జూన్ నెలలో భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉండనుంది.జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత జూన్ 13 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌లోనూ అతడు భాగం కానున్నాడు. అంతేకాకుండా జూలై రెండో వారంలో మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు కూడా రాహుల్ వెళ్లనున్నాడు.రాహుల్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ఈ లీగ్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ టోర్నీలో మ్యాచ్‌లు మొత్తం హుబ్లీ, మైసూర్, బెంగళూరు నగరాల్లో జరగనున్నాయి.చదవండి: 25 పరుగులకే ఆలౌట్.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్ -
భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్, భువనేశ్వర్‌కు చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ దాదాపు రెండు నెలల పాటు అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఒకవైపు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులు సృష్టిస్తే, మరోవైపు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన క్లాస్ ఏంటో చూపించాడు.అంతేకాకుండా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ వంటి వారు కూడా అంచనాలకు మించి రాణించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 ప్రదర్శనల ఆధారంగా ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టును దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక చేశాడు. ఈ 15 మంది సభ్యుల జట్టులో ఆర్సీబీ నుంచి అత్యధిక నలుగురు ఆటగాళ్లకు అశ్విన్ చోటిచ్చాడు. కానీ తన మాజీ జట్టు సీఎస్కే నుంచి మాత్రం అతడు కేవలం కేవలం ఒకే ఒక్కరికే అవకాశం ఇచ్చాడు. ఆర్సీబీ నుంచి ఛాన్స్ లభించిన వారిలో దేవ్‌దత్త్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా ఉన్నారు. విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడిని అశ్విన్ పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఈ జట్టులో ఓపెనర్లగా రాజస్తాన్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ, ఢిల్లీ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను అశ్విన్ ఎంపిక చేశాడు. మిడిలార్డర్లో పడిక్కల్, శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్ వంటి స్టార్లకు అవకాశమిచ్చాడు. ఆల్‌రౌండర్ల కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యాకు ఛాన్స్ దక్కింది. ఫినిషర్‌గా ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మను ఈ స్పిన్ మాంత్రికుడు సెలక్ట్ చేశాడు. అయితే అశ్విన్ తన ఎంచుకున్న జట్టులో స్పిన్నర్లగా శివాంగ్ కుమార్, హర్ష్‌దూబేలకు అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అశ్విన్ తన ఎంచుకున్న జట్టులో స్పిన్నర్లగా శివాంగ్ కుమార్, హర్ష్‌దూబేలకు అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ ఈ ఏడాది సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక రాజస్తాన్ నుంచి వైభవ్‌తో పాటు ధ్రువ్ జురెల్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్‌తో పాటు మహ్మద్ షమీ, అన్షుల్ కాంబోజ్‌లకు అశ్విన్ ఛాన్స్ ఇచ్చాడు.అశ్విన్ ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు ఇదేవైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, నితీష్ కుమార్ రెడ్డి, అశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, శివంగ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, హర్ష్ దూబే, మహమ్మద్ షమీ, ధృవ్ జురెల్చదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
టీమిండియాకు బిగ్ షాక్!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కాగా అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జూన్ 9న ముల్లాన్‌పూర్‌లో భారత జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు తొడ కండరాల గాయం బారిన పడడంతో విరాట్ సిరీస్ మొత్తానికే దూరం కావాల్సి వచ్చింది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ వైట్‌బాల్ సిరీస్‌కు కోహ్లి దూరం కావడం భారత్‌కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్‌ను అందించాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన విరాట్‌ను భారత జెర్సీలో చూడాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అతడు మళ్లీ జూలైలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో బరిలోకి దిగననున్నాడు.మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో ఆడటంపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. రోహిత్ కూడా ప్రస్తుతం తొడ కండరాల గాయంతోనే బాధపడుతున్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఫిట్నెస్ పరీక్షలలో అతడు పాసైతేనే జట్టులో కొనసాగనున్నాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్‌తో భర్తీ చేయనున్నారు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జూన్ 13 న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.అఫ్గానిస్తాన్‌తో వన్డేలకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్, కుల్దీప్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, హార్దిక్ పాండ్యాచదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని ట్విస్ట్!
టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను సారథిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందుకు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ఒప్పుకోలేదని, అతడికి బదులుగా సంజూ శాంసన్ పేరును సూచించాడని వార్తలు వచ్చాయి.అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. లాంగ్ టర్మ్ కెప్టెన్‌గా శాంసన్‌ను ఇప్పుడే నమ్మడం తొందరపాటు అవుతుందని గంభీర్‌కు అగార్కర్ తెలియజేసినట్లు సమాచారం. దీంతో తన మనసు మార్చుకున్న గంభీర్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.మరోవైపు భారత టీ20 జట్టు కెప్టెన్ మాత్రమే కాదు వైస్ కెప్టెన్ కూడా మారబోతున్నాడు. ఇప్పటివరకు డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్ స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. గురువారం జరగనున్నబీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.ఈ నెలఖారులో ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా కొత్త కెప్టెన్‌తో వెళ్లనుంది. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే తప్పించే యోచనలో బీసీసీఐ ఉంది. సూర్య టీ20 ప్రపంచకప్‌ను అందించినప్పటికి, అతడి పేలవ ఫామ్ కారణంగానే వేటు వేసేందుకు బోర్డు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే.. చివరగా 2023లో భారత తరపున టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడు కేవలం వన్డేలకు మాత్రం పరిమితమయ్యాడు. దీంతో అయ్యర్ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడం కష్టమని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. శ్రేయస్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం అతడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది.చదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
సూర్యకుమార్‌కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా తెలుగోడు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటుకు రంగం సిద్దమైంది. జూన్, జూలైలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకే ముందే సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ముంబై ఆటగాడు సారథిగా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించినప్పటికి.. అతడి ఫామ్ మాత్రం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు టీ20 ప్రపంచ నంబర్ వన్‌గా కొనసాగిన సూర్య.. ఇప్పుడు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోవాడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో అదే తీరును కనబరిచాడు. 13 ఇన్నింగ్స్‌లలో 270 పరుగులు మాత్రమే చేసి, 2017 తర్వాత సూర్యకుమార్ తన అత్యంత పేలవమైన ఐపీఎల్ సీజన్‌ను సూర్య చవిచూశాడు. ఈ క్రమంలోనే అతడి స్దానంలో మరొకరని సారథిగా నియమించాలని బోర్డు భావిస్తోంది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా అతడిని జట్టు నుంచి తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లతో చర్చలు జరిపిన బీసీసీఐ.. త్వరలోనే కొత్త సారథి పేరును అధికారికంగా ప్రకటించనుంది."సెలక్షన్ కమిటీ, బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్..హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో చర్చించి, ఇకపై టీ20ల్లో భారత జట్టు కొత్త కెప్టెన్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. సూర్య కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికి, అతడి ఫామ్, భవిష్యత్తు ప్రణాళికలు దృష్టిలో ఉంచుకుని బోర్డు కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు సిద్దమైంది. రాబోయే పర్యటనలకు సూర్యకుమార్‌ను జట్టు సెలెక్షన్‌కు కూడా పరిశీలించడం లేదు. ఈ విషయాన్ని త్వరలోనే అతనికి స్పష్టం చేస్తాం" అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో పేర్కొన్నారు.కాగా కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లతో పాటు హైదరాబాదీ తిలక్ వర్మ పేరు కూడా వినిపిస్తోంది. తిలక్‌కు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా శ్రీలంక పర్యటనలో భారత-ఎ జట్టు కెప్టెన్‌గా కూడా తిలక్ వ్యవహరించనున్నాడు. త్వరలోనే కొత్త కెప్టెన్ పేరును బీసీసీఐ ఖరారు చేయనుంది.చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన -
12 మ్యాచ్‌లు.. 40 రోజులు! టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2026 ఏడాదికిగాను తమ హోమ్ సీజన్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా కివీస్ జట్టు భారత్‌తో చారిత్రత్మక సిరీస్‌లో తలపడనుంది. భారత జట్టు ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్ పర్యటనకు రానుంది.ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. కివీస్ గడ్డపై ఒకే పర్యటనలో ఇంత పెద్ద మొత్తంలో (12 మ్యాచ్‌లు) సిరీస్ నిర్వహించడం ఇదే మొదటిసారి. తొలుత టీ20 సిరీస్, ఆ తర్వాత వన్డే, టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.స్వదేశంలో వెస్టిండీస్‌తో వైట్ బాల్ సిరీస్‌లు ముగిసిన వెంటనే టీమిండియా న్యూజిలాండ్‌కు పయనం కానుంది. భారత జట్టు దాదాపు రెండు నెలల పాటు న్యూజిలాండ్‌లోనే గడపనుంది. 2027 వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ ఇరు జట్ల సన్నద్ధతకు ఈ 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ చాలా ముఖ్యం."భారత్‌తో సిరీస్ కంటే గొప్పది మరొకటి లేదు. న్యూజిలాండ్ క్రీడాభిమానులకు ముందెన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన టూర్‌ను అందించాలని మేము భావిస్తున్నాం. విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు ఇక్కడికి వస్తుండటంతో అభిమానుల సందడి, క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే ఒకే టూర్లో స్వదేశంలో 12 మ్యాచ్‌లు నిర్వహించడం ఇదే తొలిసారి. భారత జట్టు రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. భారత్ ఆడే ప్రతీ మ్యాచ్ టిక్కెట్లు పూర్తిగా అమ్ముడవుతాయని మేము ఆశిస్తున్నామని" న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి గ్లెన్ క్రిచ్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2024లో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు.. టీమిండియాను టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గతేడాది వన్డే సిరీస్ కూడా కివీస్‌కు భారత్ సమర్పించుకుంది. ఈ పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంటూ.. కివీస్ గడ్డపైనే వారికి గట్టి బుద్ది చెప్పాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది.మ్యాచ్‌ల పూర్తి వివరాలు, వేదికలు:టీ20 సిరీస్ (అక్టోబర్ 22 - నవంబర్ 01)అక్టోబర్ 22: మొదటి టి20 – క్రైస్ట్‌చర్చ్ అక్టోబర్ 24: రెండో టి20 – క్రైస్ట్‌చర్చ్ అక్టోబర్ 27: మూడో టి20 – వెల్లింగ్టన్ అక్టోబర్ 30: నాలుగో టి20 – ఆక్లాండ్ నవంబర్ 01: ఐదో టి20 – హామిల్టన్వన్డే సిరీస్ (నవంబర్ 04 - నవంబర్ 15)నవంబర్ 04: మొదటి వన్డే – ఆక్లాండ్నవంబర్ 07: రెండో వన్డే – వెల్లింగ్టన్ నవంబర్ 10: మూడో వన్డే – హామిల్టన్నవంబర్ 13: నాలుగో వన్డే – మౌంట్ మాంగనుయ్నవంబర్ 15: ఐదో వన్డే – మౌంట్ మాంగనుయ్ టెస్ట్ సిరీస్ (నవంబర్ 19 - డిసెంబర్ 01)నవంబర్ 19-23: మొదటి టెస్ట్ – వెల్లింగ్టన్ నవంబర్ 27-డిసెంబర్ 01: రెండో టెస్ట్ –క్రైస్ట్ చర్చ్ -
టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?
అఫ్గానిస్తాన్‌తో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. మంగళవారం ముల్లాన్‌పూర్‌కు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్ కోసం రెగ్యులర్ టీమ్ సభ్యులతో పాటు అదనంగా నెట్ ప్రాక్టీస్ కోసం ఆరుగురు బౌలర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. పేసర్లు ఆఖిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, గుర్జప్నీత్ సింగ్ పేస్ బౌలింగ్‌ను నెట్స్‌లో భారత బ్యాటర్లు ఎదుర్కోనున్నారు.లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారి, ఎడంచేతి వాటం మణికట్టు స్పిన్నర్ శివాంగ్ కుమార్, ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. టెస్టు జట్టులోని ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐదు రోజుల వ్యవధిలో మూడు కీలక మ్యాచ్‌లు ఆడి తీవ్రంగా అలసిపోయారు.వేడి వాతావరణం నేపథ్యంలో వారికి తగినంత విశ్రాంతినిచ్చేందుకు నెట్ బౌలర్ల అవసరం ఏర్పడిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. టెస్టుకు ముందు భారత బ్యాటర్లకు తగినంత ప్రాక్టీస్ అవసరమని, అందుకే అదనపు బౌలర్లను ఎంపిక చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.కెప్టెన్‌గా రాహుల్!కాగా ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముల్లన్పూర్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ, కొంతమంది కీలక ఆటగాళ్లు ఇంకా జట్టుతో కలవలేదు. ఈ జాబితాలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు తన సహచరులు సాయి సుదర్శన్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన గుజరాత్ జట్టులో భాగంగా ఉన్నారు.అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఊహించని ఘటన వల్ల గుజరాత్ ఆటగాళ్లు తొలి బృందంతో కలిసి చండీగడ్‌కు చేరుకోలేకపోయారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు గిల్‌తో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా సిరాజ్ స్ధానంలో గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు భారత జట్టుశుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబే, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)నెట్ బౌలర్లు: గుర్జప్నీత్ సింగ్, అకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, శరన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివంగ్ కుమార్ -
'వైభవ్‌ను ఇప్పుడే టీమిండియాకు సెలక్ట్ చేయొద్దు'
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లు ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ టూర్‌కు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికవుతాడా లేదా అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరందుకుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వైభవ్ సెలక్షన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్‌ను ఇప్పుడే విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లకు ఎంపిక చేయడం సరికాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.తొలుత ఐపీఎల్ తరహా పిచ్‌ల(ఉప ఖండ పరిస్థితులు)పై జరిగే అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లలో వైభవ్‌ను ఆడించాలని అతడు సూచించాడు."ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా తమ స్ధానాలను సుస్ధిరం చేసుకున్నారు.. కచ్చితంగా వీరి తర్వాత స్ధానం వైభవ్ సూర్యవంశీదే. అయితే అతడిని భారత జట్టు ఎంపిక చేయాలనుకుంటే.. మొదట ఐపీఎల్ తరహా బ్యాటింగ్ అనుకూల పరిస్థితులన్న పిచ్‌లపై మాత్రమే ఆడించాలి. ఐపీఎల్ లాంటి పిచ్‌లపై జరిగే మ్యాచ్‌లలోనే అతడు అరంగేట్రం చేయాలి. అతడిని నేరుగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి విదేశీ కండీషన్స్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు.ఐర్లాండ్‌లో ఉండే పచ్చని పిచ్‌లు, ఇంగ్లండ్ తరహా వాతావరణంలో బంతి బాగా స్వింగ్ అవుతుంది. కెరీర్ ఆరంభంలోనే 15 ఏళ్ల కుర్రాడిని అలాంటి కఠినమైన పరిస్థితుల్లోకి నెట్టడం సరికాదు. ఇక ఓపెనింగ్ స్ధానం కోసం వైభవ్‌తో పాటు గిల్ కూడా పోటీలో ఉన్నాడు. కానీ ఈ రేసులో గిల్ ముందంజలో ఉన్నాడా లేక వైభవ్ సూర్యవంశీనా చెప్పడం చాలా కష్టం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వేచి చూడాలివైభవ్ భవిష్యత్తు గురుంచి..టీ20ల్లో దుమ్ములేపుతున్న వైభవ్.. 'రెడ్-బాల్' క్రికెట్లో (టెస్టులు) ఎలా రాణిస్తాడో అని చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే అతడి భవిష్యత్తు నిర్ణయించేది మనం కాదు. అది బీసీసీఐ బాధ్యత కూడా కాదు. అతడు ఒక స్వతంత్ర వ్యక్తి. అతడు తన కోచ్‌ల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అతడు కేవలం టీ20ల్లో మాత్రమే పరిమితమై, ఒక స్టార్‌గా మిగిలిపోవాలంటే తన ఇష్టమది. వైభవ్ 50 ఓవర్ల క్రికెట్ కూడా సరిపోతాడు. రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్-2023లో మొదటి 10 ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేవాడు. వైభవ్ కూడా రోహిత్ మాదిరే దూకుడుగా ఆడి జట్టుకు శుభారంభం అందించగలడు. అవసరమైతే రోహిత్ కంటే వేగంగా ఆడగలడని అని స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు! -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 19న ప్రకటించనుంది. ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ అండ్ కో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.వన్డేల్లో మాత్రం బుమ్రా ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, రాహుల్ వంటి శ్రేయస్ అయ్యర్, వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు.భారత జట్టులోకి ఆకిబ్ నబీ!ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. బుమ్రా గైర్హజారీలో మొహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేసే అవకాశముంది. అదేవిధంగా ఆకాష్ దీప్, హర్షిత్ ఇద్దరూ గాయపడటంతో ప్రసిద్ద్ కృష్ణ కూడా తిరిగి టెస్ట్ స్క్వాడ్‌లోకి రానున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంతిని పంచుకోనున్నాడు.భారత్ ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు తుది జట్టులో ఉండడానికి అస్కారం ఉంది.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా సిరీస్‌లో విఫలమైన దేవ్‌దత్త్ పడిక్కల్‌కు సెలక్టర్ల మరో అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమిళనాడు స్టార్ సాయిసుదర్శన్‌ను కూడా అఫ్గాన్ టెస్టుకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.ప్రిన్స్‌కు పిలుపు!మరోవైపు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఢిల్లీ స్పీడ్‌స్టర్ ప్రిన్స్ యాదవ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రిన్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ప్రిన్స్ సత్తాచాటాడు. హర్షిత్ రాణా గాయపడడంతో అతడి స్ధానంలో ప్రిన్స్ పరీక్షించాలని బీసీసీఐ భావిస్తుందంట.చదవండి: గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు -
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..! వైభవ్, భువీకి ఛాన్స్?
ఐపీఎల్-2026లో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. భువీ 36 ఏళ్ల వయస్సులోనూ తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. భువనేశ్వర్ ప్రస్తుతం 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో ఉన్నాడు. అతడి నిలకడైన ప్రదర్శన కారణంగానే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతోంది. దీంతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భువీని మళ్లీ భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే లెజెండ్ అంబటి రాయుడు తాజాగా తన భారత ప్రత్యామ్నాయ టీ20 జట్టును ఎంచుకున్నాడు. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను రాయుడు ఎంపిక చేశాడు. అదేవిధంగా అయ్యర్ డిప్యూటీగా కేఎల్ రాహుల్‌కు అతడు ఛాన్స్ ఇచ్చాడు. రాయుడు తన జట్టులో ఫ్రంట్‌లైన్ పేసర్‌గా భువనేశ్వర్ కుమార్‌కు అవకాశమిచ్చాడు. అదేవిధంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వైభవ్, రాహుల్‌ను ఓపెనర్లగా రాయుడు ఎంచుకున్నాడు. అదేవిధంగా మిడిలార్డర్లో పడిక్కల్, పాటిదార్ వంటి వారు స్టార్ బ్యాటర్లకు చోటు దక్కింది. రిజర్వ్ ప్లేయర్‌గా సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి వారు ఉన్నారు.కాగా వచ్చే నెలలో భారత జట్టు రెండు టీ20ల కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. దీంతో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ సూర్యవంశీ వంటి యువ సంచలనాలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.అంబటి రాయుడు ఎంపిక చేసిన భారత ప్రత్యామ్నాయ టీ20 జట్టు:వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, అన్షుల్ కాంబోజ్, మొహ్సిన్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్రిజర్వ్లు: సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, శివంగ్ కుమార్, ప్రిన్స్ యాదవ్ -
పంత్‌కు షాక్.. కిషన్‌కు జాక్‌పాట్!
ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే టీమిండియా జాతీయ విధుల్లో బీజీ కానుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్‌ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మే 19న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.ఈ సిరీస్‌లకు పలువురు సీనియర్లకు విశ్రాంతినిస్తూ, కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు సైతం అఫ్గాన్‌తో టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు న్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఇషాన్ కిషన్ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. రిజర్వ్ వికెట్ కీపర్‌గా పంత్ స్థానంలో ఇషాన్‌ను తీసుకునే అవకాశం ఉంది. పంత్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యతో ముంబై ఇండియన్స్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా అఫ్గాన్‌తో వన్డేల్లో ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. అతడు అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. నితీశ్ ప్రస్తుతం బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణిస్తున్నాడు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6న ముల్లాన్ పూర్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు.. 19 ఐపీఎల్ చరిత్రలోనే -
భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్!
వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ భారత ద్వితీయ శ్రేణి టీ20 జట్టును ఎంచుకున్నారు. తన ఎంపిక చేసిన జట్టులో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బిషప్ చోటు ఇచ్చారు.ఐపీఎల్-2026లో అద్భుతంగా రాణిస్తున్న మరో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు కాదని వైభవ్ వైపు ఆయన మొగ్గు చూపుడం గమనార్హం.వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఓపెనర్‌గా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఆయన ఛాన్స్ ఇచ్చారు.ఈ బ్యాకప్ ఓపెనర్‌గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్‌కు చోటు దక్కింది. ఓ ఇంటర్వ్యూలో బిషప్ మాట్లాడుతూ.. "నా జట్టులో ముగ్గురు ఓపెనర్లను తీసుకుంటాను. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం లెఫ్ట్ హ్యాండర్‌గా వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేస్తాను. అతడు అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్దంగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను" చెప్పుకొచ్చారు.ఇక మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, దేవ్‌దత్త్ పడిక్కల్, రజిత్ పాటిదార్ వంటి స్టార్ ప్లేయర్లకు బిషప్ అవకాశమిచ్చారు. ఆల్రౌండర్లగా కృనాల్ పాండ్యా, నితీశ్ కుమార్‌లను ఆయన ఎంచుకున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా ధ్రువ్ జురెల్‌కు ఛాన్స్ లభించింది.ముఖ్యంగా 35 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం విశేషం. దాదాపు మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న చాహల్‌ను, రవి బిష్ణోయ్‌ను పక్కన పెట్టి మరి ఛాన్స్ ఇచ్చారు. ఇక చివరగా ఫాస్ట్ బౌలర్ల విభాగంలో భువనేశ్వర్ కుమార్, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు ఉన్నారు.ఐర్లాండ్ టూర్‌కు వైభవ్!కాగా ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యలకు సీనియర్ జట్టులో చోటు దక్కే అవకాశముంది. వైభవ్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 237.65 స్ట్రైక్ రేట్‌తో 404 పరుగులు చేశాడు.ఇయాన్ బిషప్ ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు: శుభ్‌మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, దేవదత్ పడిక్కల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మొహ్సిన్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు -
టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ? వారికి లక్కీ ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబిజీగా గడపడనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. కాగా అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్ ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజులకే ప్రారంభం కానుంది.దీంతో ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సీనియర్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌ల దృష్ట్యా భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పరిధిలోకి రాదు. కాబట్టి సీనియర్లను ఈ మ్యాచ్‌లో రిస్క్ తీసుకోకడదని మేనెజ్మెంట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం టెస్టులకే పరిమితమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. అఫ్గానిస్తాన్‌తో టెస్టులో భారత జట్టును నడిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిషబ్ భారత తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్‌కు అతడు ఎంపికయ్యే సూచనలు కన్పించడం లేదు. దీంతో అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్‌లో అతడికి జట్టు పగ్గాలను అప్పగించేందుకు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. అప్పటివరకు పంత్‌కు విశ్రాంతి లభించనుంది. ఒకవేళ అతడు భారత వన్డే జట్టుకు ఎంపికైన తుది జట్టులో మాత్రం చోటు కష్టమే. పంత్ ఇప్పటివరకు భారత్ కెప్టెన్‌గా ఆరు మ్యాచ్‌లలో వ్యవహరించాడు.ఇక ఇది ఇలా ఉండగా.. అఫ్గాన్ టెస్టు మ్యాచ్‌కు దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో గుర్నూర్ బ్రార్ (ఫాస్ట్ బౌలర్), మానవ్ సుతార్ (స్పిన్నర్), హర్ష్ దూబే, ఆకిబ్ నబీ (ఫాస్ట్ బౌలర్), దేవ్ దత్ పడిక్కల్(బ్యాటర్) ఉన్నారు."ఐపీఎల్ ఫైనల్‌కు అఫ్గానిస్తాన్ టెస్టుకు మధ్య పెద్దగా గ్యాప్ లేదు. కాబట్టి ఆటగాళ్లు వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అఫ్గాన్‌తో వన్డే సిరీస్, ఇంగ్లండ్ వైట్‌బాల్ సిరీస్‌లు భారత్‌కు ఉన్నాయి. అఫ్గానిస్తాన్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు.భారత టెస్టు జట్టులోని కొంతమంది సభ్యులు దాదాపు రెండు నెలల పాటు బిజీబిజీగా గడపనున్నారు. దీంతో వారికి అఫ్గాన్‌తో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. గుర్నూర్, మానవ్ సుత్తార్, పడిక్కల్, హర్ష్ దూబేలు సెలెక్టర్ల రాడార్‌లో ఉన్నారని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా అఫ్గాన్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పూర్ వేదికగా జరగనుంది.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్ -
టీమిండియాకు భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలుత జూన్ 6 నుంచి 10 ముల్లాన్‌పూర్ వేదికగా భారత్-అఫ్గాన్ టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.స్టార్ పేసర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా ఈ ఏకైక టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆకాష్ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయంతోనే అతడు ఐపీఎల్-2026 సీజన్ నుంచి కూడా తప్పుకొన్నాడు. గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని రూ.కోటికి కేకేఆర్ సొంతం చేసుకుంది.కానీ అతడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వైదొలిగాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవాడనికి మరో రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. భారత టెస్టు సెటాప్‌లో ఆకాష్ దీప్ కీలక సభ్యుడు.జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తర్వాత టెస్టుల్లో మూడో పేసర్‌గా ఆకాష్ దీప్ ఉన్నాడు. చివరగా ఇంగ్లండ్ పర్యటనలో కూడా అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ సిరీస్‌లో 3 టెస్టులు ఆడిన ఆకాష్ దీప్..13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. మరి ఇప్పుడు అతడు గాయం కారణంగా దూరం కావడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతడి స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందో చూడాలి.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే? -
టీమిండియా కెప్టెన్ వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ 9 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ కోల్పోయింది.అయితే ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా హర్మన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(3016) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో ఆటపట్టును హర్మన్ అధిగమించింది. హర్మన్ ఇప్పటివరకు భారత కెప్టెన్‌గా 3017 పరుగులు చేసింది. ఈ జోహాన్స్‌బర్గ్ వన్డే హర్మన్ తన విశ్వరూపం ప్రదర్శించింది. హర్మన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచింది.మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీరేహర్మన్ప్రీత్ కౌర్-3017చమరి అటపట్టు-3016మెగ్ లానింగ్- 2619షార్లెట్ ఎడ్వర్డ్స్-2529సూజీ బేట్స్-2236చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం! -
టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం!
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస ఓటములతో సతమతవుతున్నప్పటికి.. ఆ జట్టు యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ముఖ్యంగా ఈ ఢిల్లీ పేసర్ రెడ్-సాయిల్ పిచ్‌లపై సరైన లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ప్రిన్స్ పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో నిలకడగా వికెట్లు తీస్తూ లక్నో ప్రధాన బౌలర్‌గా మారాడు. ఈ ఏడాది సీజన్లో ప్రిన్స్ యాదవ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో ఉన్నాడు.బుధవారం ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ప్రిన్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. యార్కర్ల వేయడంలో ప్రిన్స్ దిట్ట. దీంతో అతడిని వీలైనంత త్వరగా భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.ప్రస్తుత భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్లు లేరు. సిరాజ్ ఎక్కువగా టెస్టులకే మాత్రమే పరిమితమవుతున్నాడు. దీంతో బుమ్రాపై వర్క్‌లోడ్ పడుతోంది. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్ వంటి యువ సంచలనం జాతీయ జట్టులోకి వస్తే భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.आयरलैंड दौरे के लिए Prince Yadav का नाम फाइनल समझिए।Prince Yadav का चयन नहीं हुआ तो घोर जातिवाद समझिए। pic.twitter.com/xvqmzz0S5e— Comrade Yadav (@Comrade6989) April 15, 2026ప్రిన్స్ యాదవ్ డొమాస్టిక్ క్రికెట్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 14 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన ప్రిన్స్.. 5.15 ఏకానమితో 29 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 35 టీ20 వికెట్లు కూడా అతడి పేరిట ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో టీ20 జరిగే టీ20 సిరీస్‌లో భారత తరపున ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశముంది.చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్ -
ఐసీసీ సంచలన ప్రకటన.. ఆ టోర్నీలో భారత్‌కు నో ఛాన్స్
జై షా నాయకత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. మహిళల టీ20 ప్రపంచకప్-2026కు ముందు సరికొత్త టీ20 టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇందుకు ఐసీసీ టీ20 ఛాలెంజ్‌గా నామకరణం చేశారు. అసోసియేట్ దేశాలకు చెందిన జట్లకు తగిన గుర్తింపును కల్పించడమే లక్ష్యంగా ఈ టోర్నీని ఐసీసీ నిర్వహించనుంది.అందుకే ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి అగ్రశ్రేణి జట్లు పాల్గొనవు. ఈ చారిత్రాత్మక మొదటి సీజన్ రువాండాలోని కిగాలీ నగరంలో జరగనుంది. ఈ ఐసీసీ టీ20 ఛాలెంజ్ టోర్నీలో మొత్తం 5 జట్లు పాల్గోనున్నాయి.ఈ ఐసీసీ ఈవెంట్ ఏప్రిల్ 18 నుండి మే 1 వరకు జరగనుంది. ఈ టోర్నీని డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ప్రతి జట్టు ఇతర జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే గ్రూప్ దశలో ఒక్కో జట్టుకు 8 మ్యాచ్‌లు లభిస్తాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది.ఈ టోర్నీలో పాల్గోనే జట్లు ఇవేనేపాల్ (ఆసియా)యూఎస్ఎ (అమెరికా)ఇటలీ (యూరప్)వనాటు (ఈస్ట్ ఆసియా-పసిఫిక్)రువాండా (ఆఫ్రికా - ఆతిథ్య జట్టు)చదవండి: నా భర్త గురించి తప్పుడు ప్రచారం: వినోద్ కాంబ్లీ భార్య -
సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?
ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబీజీగా గడపనుంది. తొలుత జూన్‌లో స్వదేశంలో మూడు వన్డేలు, ఏకైక టెస్టు సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. అనంతరం మెన్ ఇన్ బ్లూ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.అయితే జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే ప్రధాన సిరీస్ దృష్ట్యా ఐరీష్ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి యువ జట్టును పంపాలని బీసీసీఐ భావిస్తుందంట. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఐపీఎల్లో దుమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీ ఆయూశ్ మాత్రే, ప్రిన్స్ యాదవ్ వంటి యువ ఆటగాళ్ల పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూడా ఐర్లాండ్ టూర్ కోసం సెలెక్టర్లు పిలుపునిచ్చే ఛాన్స్ ఉంది.కెప్టెన్‌గా సంజూ!అయితే ఈ టూర్‌కు రెగ్యులర్ సారధి సూర్యకుమార్ యాదవ్ దూరం కావడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు పగ్గాలను సంజూ శాంసన్‌కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజూ ఇప్పటివరకు జాతీయ జట్టుకు నాయకత్వం వహించికపోయినప్పటికి.. కేరళ జట్టుతో పాటు రాజస్తాన్ రాయల్స్‌ను లీడ్ చేసిన అనుభవం అతడికి ఉంది.సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన సూర్య.. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం విఫలమవుతున్నాడు. అయినప్పటికి అతడిని కెప్టెన్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ సముఖత చూపుతోంది. ఇంగ్లండ్ టూర్లో సూర్య మెరుగైన ప్రదర్శన చేస్తే.. 2028 ఒలింపిక్స్ వరకు భారత కెప్టెన్‌గా కొనసాగించే అవకాశముంది.చదవండి: నా భర్త గురించి తప్పుడు ప్రచారం: వినోద్ కాంబ్లీ భార్య -
వైభవ్, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్!
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం సమీర్ రిజ్వీ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్ విఫలమవుతున్న చోట రిజ్వీ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ యూపీ ఆటగాడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించాడు.లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ 6 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిజ్వీ(70 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి. 163 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ 8 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మళ్లీ రిజ్వీనే తన సంచలన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేసి ఢిల్లీకి రెండో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వచ్చి అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా రిజ్వీ రికార్డులెక్కాడు. రిజ్వీ ప్రస్తుతం 160 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా రిజ్వీకే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కడం గమనార్హం.భారత జట్టులోకి ఎంట్రీ?మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్న సమీర్ రిజ్వీని భారత జట్టుకు ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ప్రస్తుత భారత టీ20 జట్టులో టాపార్డర్ పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి మిడిలార్డర్ కొంచెం వీక్‌గానే ఉంది. దీంతో రిజ్వీ లాంటి ధీటైన బ్యాటర్ జట్టులోకి వస్తే భారత మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారనుంది.అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజ్వీ ప్రదర్శలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ఈ ఏడాది జూన్‌లో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.దీంతో భారత జట్టులో రిజ్వీకి చోటు దక్కే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత కొంత కాలంగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీని కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ యువ సంచలనం ఇటీవల తన 15వ ఏట అడుగుపెట్టడంతో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అర్హత సాధించాడు. అతడితో పాటు భారత అండర్-19 కెప్టెన్ అయూశ్ మాత్రే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఏడాది జూన్‌లో భారత అండర్-19 జట్టు రెడ్ బాల్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఒకవేళ ఈ టూర్‌కు మాత్రే, వైభవ్ ఎంపిక అయితే సీనియర్ జట్టులో వచ్చేందుకు వేచి ఉండక తప్పదు. అంతేకాకుండా భారత సీనియర్ జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ముగ్గురు ఓపెనర్లుగా ఉన్నారు. వీరి ముగ్గరు కూడా ఓపెనర్లగా విజయవంతమయ్యారు. వీరి గైర్హజారీలో వైభవ్‌కు భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఏదేమైనప్పటికి సమీర్ రిజ్వీ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఖాయమైనట్లు తెలుస్తోంది.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్! -
జింబాబ్వే టూర్‌కు టీమిండియా.. షెడ్యూల్ విడుదల
ఐపీఎల్-2026 సీజన్ తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లతో బీజీబీజీగా గడపనుంది. తొలుత జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌లో స్వదేశంలోనే జరగనుంది. అనంతరం ఐర్లాండ్ టూర్లో భాగంగా రెండు టీ20లు టీమిండియా ఆడనుంది.మెన్ ఇన్ బ్లూ అటు నుంచి అటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు టీ20లు , మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఆడనుంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూలై 1న మొదలై జూలై 19తో ముగియనుంది. అయితే అక్కడికి మూడు రోజుల తర్వాత టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది.తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జరగనుంది. జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి.అయితే వరుస సిరీస్‌ల నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, ఐపీఎల్లో రాణించిన యువ ఆటగాళ్లను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసే సూచనలు కన్పిస్తున్నాయి.భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్మొదటి టీ20: జూలై 23రెండో టీ20: జూలై 25మూడో టీ20: జూలై 26చదవండి: NZ vs SA: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ?
వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫుట్‌బాల్ ప్రపంచంలో లామిన్ యమల్ ఎంతటి సంచలనమో.. ఇప్పుడు క్రికెట్ వరల్డ్‌లో వైభవ్ కూడా అంతే ఫేమస్. కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయిలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం తన బ్యాటింగ్‌తో వణికిస్తున్న ఈ బిహార్ ఆటగాడు.. నేడు తన 15వ పుట్టిన రోజును జరపునకుంటున్నాడు. దీంతో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసేందేకు అర్హత సాధించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి. ఇప్పుడు సరిగ్గా ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒక్క రోజు ముందే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో సీనియర్ జట్టు తరుపున ఆడేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు.వైభవ్ జోరు కొనసాగుతుందా?తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్లో దుమ్ములేపిన వైభవ్ ఇప్పుడు.. ఐపీఎల్ 2026లో ఎలా రాణిస్తాడో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్లో వైభవ్ తన ఆడిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. అది కూడా శార్ధూల్ ఠాకూర్ వంటి సీనియర్ బౌలర్ బౌలింగ్‌లో కావడం గమనార్హం. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో 35 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్.. ఐపీఎల్ చరిత్రలో శతక్కొట్టిన అతి పిన్న వయష్కుడిగా రికార్డులెక్కాడు. అనంతరం అండర్-19 ప్రపంచకప్లోనై ఈ యువ సంచలనం సత్తాచాటాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో భారీ సెంచరీ వైభవ్(175) చెలరేగాడు. ఇప్పుడు అదే జోరును ఈ ఏడాది ఐపీఎల్లో కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.డేంజర్లో సచిన్ రికార్డు!భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయష్కుడిగా రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిగి ఉన్నాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల్లో టీమిండియా తరపున డెబ్యూ చేశాడు. ఇప్పుడు ఈ క్రికెట్ దేవుడు రికార్డు డేంజర్లో పడింది. వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశముంది. ఐపీఎల్ తర్వాత టీమిండియా రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అనంతరం అక్కడ నుంచి ఇంగ్లండ్ టూర్‌కు మెన్ ఇన్ బ్లూ వెళ్లనుంది. అయితే టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఐరీష్ టూర్‌కు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ జట్టు నుంచి పిలుపు వచ్చే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదే జరిగితే భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు. ఒకవేళ ఐర్లాండ్ టూర్‌కు ఎంపిక కాకపోయినా.. ఈ ఏడాది ఆఖరిలో జరిగే ఏషియన్ గేమ్స్‌లోనైనా అతడు భారత్ తరపున డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది.చదవండి: Evin Lewis: విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
దినేష్ కార్తీక్‌కు అరుదైన గౌరవం
భారత మాజీ క్రికెటర్, తమిళనాడుకు చెందిన దినేశ్ కార్తీక్‌పై తమకున్న అభిమానాన్ని చెన్నైస్ అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో చెన్నైస్ అమృత విద్యాసంస్థల వార్షిక క్రీడోత్సవంలో భాగంగా కార్తీక్ జెర్సీ నంబర్ 19 ఆకారంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమృత విద్యాసంస్థలకు చెందిన సుమారు మూడు వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా కలిసి ‘సీఏ♡డీకే19’ ఆకారంలో మానవహారాన్ని ఏర్పాటు చేసి అబ్బురపరిచారు.‘ఒక క్రీడాకారుడి జెర్సీని ప్రతిబింబించే మానవహారంలో అత్యధిక మంది విద్యార్థులు పాల్గొన్న రికార్డుగా ఈ వినూత్న కార్యక్రమానికి ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’... ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లలో చోటు లభించింది. చెన్నైస్ అమృత గ్రూప్ చైర్మన్ ఆర్.భూమినాథన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెటర్ దినేశ్ కార్తీక్, గౌరవ అతిథిగా తమిళనాడు డాక్టర్ ఎం.జి.ఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.నారాయణ స్వామి పాల్గొన్నారు.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే? -
మ్యాచ్‌లు గెలవరు.. మరి ట్రోఫీలను దొంగలిస్తారా?
టీ20 ప్రపంచకప్-2026 తర్వాత పాకిస్తాన్‌కు మరో ఘోర పరభావం ఎదురైంది. ఆదివారం ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 279 పరుగులకు ఆలౌటైంది.దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ కోల్పోయింది. బంగ్లాపై పాక్ ఓ వన్డే సిరీస్ ఓడిపోవడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో పాక్ జట్టపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ విమర్శల వర్షం కురిపించాడు.పాక్ క్రికెట్ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతుందని అక్మల్ మండిపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో కూడా పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కనీసం సెమీస్‌కు కూడా చేరకుండా సూపర్-8 స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది."ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి దారుణంగా ఉంది. నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లు కూడా పాక్‌తో సిరీస్ ఆడి, మనల్ని ఓడించి టెస్ట్ హోదా పొందాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 350 పరుగుల మార్క్ సులువుగా దాటేలా కన్పించింది. కానీ లిట్టన్ దాస్ నెమ్మదిగా ఆడడంతో 290 పరుగులకే పరిమితమైంది. అయినప్పటికీ మన జట్టు లక్ష్యాన్ని అందుకోలేకపోయింది" అని అక్మల్ ఓ ఛానల్ డిబేట్లో పేర్కొన్నాడు.అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీపై కూడా అతడు పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. మైదానంలో మ్యాచ్‌లు గెలవనప్పుడు.. ఐసీసీ ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తీసుకువస్తారా? అంటూ ఎద్దేవా చేశాడు. కాగా ఆసియాకప్-2025 ట్రోఫీని నఖ్వీ చేతుల మీదగా భారత్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. ఇప్పటికీ ట్రోఫీ ఛాంపియన్ భారత్ వద్దకు చేరలేదు.చదవండి: చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్ -
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
-
తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య దేవిషా శెట్టి త్వరలోనే పండింటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో శనివారం దేవిశా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ హ్యాపీ మూమెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.దీంతో సూర్య- దేవిశా దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరికి 2010లో ముంబైలోని ఆర్.ఎ పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఈ జంట 2016లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల తర్వాత తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. దేవిషా వృత్తిరీత్యా భరతనాట్యం కోచ్. ఆమె సూర్య కెరీర్ ఆరంభం నుంచి అతడికి అండగా ఉంటూ వస్తోంది. ఎన్నో సందర్బాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తన విజయాల్లో భార్య దేవిశా పాత్రను ఎప్పుడూ కొనియాడుతుంటారు. కాగా సూర్య ఇటీవల కెప్టెన్‌గా భారత జట్టుకు టీ20 ప్రపంచకప్‌ను అందించిన సంగతి తెలిసిందే.Baby shower of Suryakumar Yadav and Devika 😍❤️ pic.twitter.com/rYudGduOPE— Jeet (@JeetN25) March 14, 2026చదవండి: సన్‌రైజర్స్‌కు పాక్ ప్లేయర్ ఆడడం కష్టమే? -
ఓ ఇంటివాడైన టీమిండియా స్టార్ క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం ముస్సోరీ వేదికగా తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను అతడు వివాహమాడాడు. స్ధానిక సవోయ్ హోటల్లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు భారత స్టార్ క్రికెటర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు మాజీలు సురేష్ రైనా, చావ్లా, ఆర్పీ సింగ్ హాజరై సందడి చేశారు.India spinner Kuldeep Yadav and Vanshika Chadha have tied the knot, and their first wedding photos are now going viral on social media. #cricket #india #hindu pic.twitter.com/DU9V0o6U4q— Harish J (@harishj12) March 14, 2026ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరలవుతున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా కుల్దీప్-వంశిక జంటకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మార్చి 17న లక్నోలో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ధోని వంటి క్రికెటర్లతో పాటు పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.So happy you’ve found your forever love. Cheers to a beautiful life, Lil Bro 🫂❤️🧿 pic.twitter.com/m1awluiq8w— Yuzvendra Chahal (@yuzi_chahal) March 14, 2026కాగా వాస్తవానికి వీరి వివాహం గతేడాది నవంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే, 2026 టీ20 ప్రపంచకప్ దృష్టి సారించేందుకు కుల్దీప్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. కుల్దీప్-వంశికకు చిన్నతనం నుంచే పరిచయం ఉంది. వీరిద్దరి ఇళ్లు కాన్పూర్‌లో కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుల్దీప్ తిరిగి ఐపీఎల్‌పై దృష్టి పెట్టనున్నాడు. త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో అతడు చేరనున్నాడు. ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. -
కుల్దీప్ పెళ్లి సందడి.. డ్యాన్స్ చేసిన చాహల్! వీడియో
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు ఉత్తరాఖాండ్‌లోని ముస్సోరీలో ఘనంగా జరుగుతున్నాయి. కుల్దీప్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే శుక్రవారం జరిగిన హాల్దీ వేడుకలో కుల్దీప్ స్నేహితుడు, భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ సందడి చేశాడు.'ఓ రోమియో' సినిమాలోని "పాన్ కీ దుకాన్" పాటకు చాహల్ డ్యాన్స్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతేకాకుండా కుల్దీప్, వంశికలకు స్వయంగా పసుపు (హల్దీ) పూసి చాహల్ తన స్నేహాన్ని చాటుకున్నాడు.डेस्टिनेशन पर पहुंचते ही चहल अपने सबसे खास दोस्त कुलदीप यादव के साथ जमकर नाचे।Yuzi: कमबैक फिर कभी कर लेंगे पहले नाच लेता हूं कुलदीप भाई की शादी बार-बार थोड़ी होगी।😀pic.twitter.com/7eFQOwvhCf— Jaiky Yadav (@JaikyYadav16) March 13, 2026చాహల్‌తో పాటు క్రికెటర్లు రింకూ సింగ్, పియూష్ చావ్లా, భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలిప్ ఇప్పటికే ముస్సోరీకి చేరుకున్నారు. అదేవిధంగా ఈ వివాహ వేడుకకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లతో పాటు బీసీసీఐ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా కుల్దీప్ పెళ్లి గతేడాది డిసెంబర్లోనే జరగాల్సిండేది. కానీ టీ20 ప్రపంచకప్-2026 దృష్ట్యా కుల్దీప్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు.Yuzvendra Chahal applying haldi to Kuldeep Yadav and his wife Vanshika during the haldi ceremony before the wedding. 💛🫂Yuzi is applying haldi to everyone now we’ll have to see when it will be his turn. 😂❤️ pic.twitter.com/PW9ci5V3e8— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 13, 2026 -
'వరల్డ్‌కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి'
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మోహన్ శర్మ ఫిబ్రవరి 1వ తేదీన అనారోగ్యంతో కన్ను మూశారు. ఈ విషయాన్ని జితేష్ శర్మ ధ్రువీకరించాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో జితీశ్ తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం కంటే, తన తండ్రిని కోల్పోవడం తనను ఎంతగానే కలచివేసిందని జితేశ్ తెలిపాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ముందు వరకు జితీశ్ భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా ఉన్నాడు. అయితే ఇషాన్ కిషన్ రీ ఎంట్రీతో భారత టీ20 జట్టులో జితీశ్ స్ధానం గల్లంతైంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు ప్రపంచకప్ జట్టులోనూ జితీశ్ శర్మకు చోటు దక్కలేదు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను వికెట్ కీపర్లగా పరిగణలోకి తీసుకున్నారు. దీంతో జితీశ్ జట్టు నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ జట్టులోకి వచ్చిన కిషన్ మాత్రం తన ఎంపికకు న్యాయం చేశాడు.నేను మనిషినే.. "వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదని తెలిసినప్పుడు కొంత బాధ కలిగింది. ఎందుకంటే నేను కూడా మనిషినే. కానీ కొంత సమయం గడిచాక ఆ బాధ తగ్గిపోయింది. ఆ తర్వాత మా నాన్న అనారోగ్యం పాలయ్యారు. ఫ్రిబవరి 1న ఆయన మరణించారు. నేను మా నాన్నతో పాటు ఏడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నాను. ఆ సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది.. ప్రపంచకప్ కంటే మా నాన్నకు నేనే ఎక్కువ అవసరం అన్పించింది. ఆ తర్వాత వరల్డ్‌కప్‌లో చోటు దక్కపోయినందుకు ఎలాంటి బాధ అనిపించలేదు. ఎవరిపైనా కోపం కలగలేదు. దేవుడు ఆ ఏడు రోజులు నాన్నతో గడిపే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని. ఆ సమయంలో అతడిని నేను దగ్గరుండి చూసుకోగలిగాను. ఇంట్లో టీవీలో ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసి ఆనందించాను. బయట కూర్చొని మ్యాచ్ చూడడం కూడా చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఏదైమైనప్పటికి భారత జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.నా కెరీర్‌ను కొనసాగిస్తామా నాన్న లేని లోటు నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. దాన్ని ఎవరూ పూడ్చలేరు. ఇలాంటి సమయంలో మా నాన్న ఉంటే'బాధను పక్కన పెట్టి వెళ్లి ప్రాక్టీస్ చెయ్' చెప్పేవారు. కాబట్టి ఆబాధను దిగమింగుతూ నా క్రీడా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా జితీశ్ మళ్లీ ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగనున్నాడు. మరో భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కూడా వరల్డ్‌కప్ సమయంలోనే ప్రాణాలు విడిచారు.చదవండి: 'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం' -
'భారత్ గొప్ప జట్టేమి కాదు'.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అక్కసు
టీ20 వరల్డ్‌కప్-2026 ట్రోఫీని భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడోసారి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ టైటిల్ గెలిచినప్పటికీ, టోర్నీలో అత్యుత్తమ జట్టు దక్షిణాఫ్రికానేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ అసాంతం భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి, సూపర్-8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అదే విషయాన్ని స్టీవ్ హార్మిసన్ ప్రస్తావించాడు."న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యమే భారత్‌ను విజేతగా నిలిపింది. ఫ్లాట్ పిచ్‌లపై జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనే ఇతర జట్లకు, భారత్‌కు మధ్య తేడా చూపించింది. ఈ టోర్నీలో భారత్ అత్యుత్తమ జట్టు అని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో దక్షిణాఫ్రికానే అత్యుత్తమ జట్టు. టీమిండియా కేవలం 'బెస్ట్ మొమెంట్ టీమ్' మాత్రమే. మ్యాచ్ మలుపు తిరిగే కీలక సమయాల్లో వారు అద్భుతంగా రాణించి విజేతగా నిలిచారు. గ్రూపు స్టేజిలో భారత్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్లోనూ టీమిండియా ఇబ్బందులను ఎదుర్కొంది.కొంతమంది మ్యాచ్ విన్నర్ల కారణంగా ఓటమి నుంచి భారత్ గట్టెక్కింది. వారే భారత్‌కు బలం. ఇక టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా, సెమీఫైనల్లో ఫిన్ అలెన్ విధ్వంసం వల్లే ఓడిపోయింది. సూపర్-8లో భారత్‌ను సైతం సౌతాఫ్రికా ఓడించందని" టాక్స్పోర్ట్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు' -
టీ20 ప్రపంచకప్ బెస్ట్ టీమ్ ఇదే.. పాక్ నుంచి ఒక్కరు కూడా!
టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో టైటిల్‌ను ముద్దాడింది. ఇది భారత్‌కు మూడో టీ20 వరల్డ్‌కప్ విజయం కావడం గమనార్హం. మూడు టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీలను సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా మెన్ బ్లూ చరిత్ర సృష్టించింది. అయితే తాజాగా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. ఆకాశ్ చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా సంజూ శాంసన్, ఫిన్ అలెన్‌లను ఎంపిక చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్‌పై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు."శాంసన్ నాలుగు మ్యాచ్‌లు ఆడకపోయినా భారత్ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదడం నిజంగా అద్భుతం. అందుకే అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చా" అని చోప్రా పేర్కొన్నాడు.అదేవిధంగా సాహిబ్జాదా ఫర్హాన్, టిమ్ సీఫెర్ట్, పాతుమ్ నిస్సంక బ్రియన్ బెన్నెట్, ఐడెన్ మార్క్రమ్లు ఓపెనర్లగా రాణించినప్పటికి ఫిన్ అలెన్ వైపే తను మొగ్గు చూపుతున్నట్లు చోప్రా తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక వరుసగా రెండు మూడు స్ధానంలో ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్‌కు చోప్ర అవకాశమిచ్చాడు. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్‌కు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లగా అమెరికా పేసర్ షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీలకు ఛాన్స్ లభించింది. భారత్ నుంచి ఆరుగురు ఈ జట్టులో చోటు దక్కింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మాత్రం చోప్రా పరిగణలోకి తీసుకోలేదు.ఆకాశ్ చోప్రా ఎంచుకున్న టీ20 ప్రపంచకప్ బెస్ట్ ఎలెవన్ ఇదేసంజు శాంసన్, ఫిన్ అలెన్, ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీచదవండి: ఇండియా క్రికెట్‌ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్ -
ఇండియా క్రికెట్‌ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్-2026 టైటిల్‌ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం విషం చిమ్ముతున్నారు. పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ మరోసారి భారత్‌పై తన అక్కసు వెల్లగక్కాడు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అధిపత్యం క్రికెట్‌ను పూర్తి నాశనం చేసిందంటూ అక్తర్ ఆరోపించాడు."ఓ ధనిక పిల్లాడు.. పక్కవీధిలో ఉన్న పేద పిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం రండి అని చెబుతాడు. ముందుగా 8 జట్లలో నాలుగు జట్లను ఉంచుకొని, తర్వాత అందులో మూడు జట్లను ఇంటికి పంపించి చివరకు నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ చేస్తుంది కూడా అదే. ఇలా క్రికెట్‌ను భారత్ పూర్తిగా నాశనం చేసింది" అని ఓ ఛానల్ డిబేట్లో అక్తర్ పేర్కొన్నాడు.కాగా ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ కప్ గెలవాలని కోరుకుంటున్నట్లు అక్తర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వైపు భారత్‌ను విమర్శిస్తునే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై షోయబ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా ఉంటూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గంభీర్ సక్సెస్ అయ్యారని అక్తర్ కొనియాడాడు. మరో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ అమీర్ సైతం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.చదవండి: మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్ -
సంజూ శాంసన్ సక్సెస్ వెనుక భారత క్రికెట్ దిగ్గజం
భారత క్రికెట్ చరిత్రలో సంజూ శాంసన్ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2026లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. తిరిగి టైటిల్‌ను రిటైన్ చేసుకుంది.అయితే ఈ మెగా టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు దక్కకపోయిన అతడు ఎక్కడ నిరాశ చెందలేదు. తిరిగి జట్టులోకి వచ్చి సింహంలా గర్జించాడు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నుంచి తుది పోరు వరకు సంజూ దుమ్ములేపాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కి పైగా పరుగులు చేసి సత్తాచాటాడు. వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంజూ.. ఆ తర్వాత వరుసగా సెమీస్, ఫైనల్లో 89 పరుగులు చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. సంజూ మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. అయితే సంజూ శాంసన్ సక్సెస్ వెనక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సంజూ వెల్లడించాడు."అంతా కలలా ఉంది. ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. కివీస్‌తో సిరీస్‌లో వైఫల్యం తర్వాత నా కలలు చెదిరిపోయాయి. నేనేం చేయలేనా అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అండగా నిలిచాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సహకరించారు.గత రెండు నెలలుగా సచిన్ సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. సచిన్ చాలా సలహాలు ఇచ్చారు. ఆయనతో మాట్లాడటంతో మార్గనిర్దేశనం లభించింది. ఇది చాలా పెద్ద ఘనత. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు" సంజూ పేర్కొన్నాడు. -
సంజూ, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే
సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ త్రయం గురించే మాట్లాడుకుంటున్నారు. టీ20 వరల్డ్‌కప్-2026 వీరివల్లే భారత్ గెలిచిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అవును నిజమే. కానీ వీరితో పాటు మరో ఇద్దరు సైలెంట్ హీరోలు కూడా ఉన్నారు. భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలవడంలో వారిద్దరూ పోషించిన పాత్ర వెలకట్టలేనిది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతితో వికెట్లు తీయడం, బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం వారి స్పెషాలిటీ. ఒకరెమో తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు మంచి ఫినిషింగ్ అందించగా.. మరొకరు తన స్పిన్ మయాజాలంతో కివీస్ అగ్రశ్రేణి బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. వారే ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, అక్షర్ పటేల్.సిక్సర్ల దూబేఈ టోర్నీ అసాంతం దూబే అద్భతమైన ప్రదర్శన కనబరిచాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి వారు ఆరంభంలో దూకుడుగా ఆడితే, దూబే చివరిలో బ్యాటింగ్‌కు వచ్చి తనపని తాను చేసుకోపోయేవాడు. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మొత్తం విఫలమైనా.. దూబే మాత్రం రాణించాడు. కీలకమైన సెమీఫైనల్, ఫైనల్లోనూ తన మార్క్‌ను చూపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో సెకెండ్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ముంబై ఆటగాడు తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా దూబే బ్యాట్ ఝూలిపించాడు. భారత్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి తడబడుతున్న సమయంలో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా నీషమ్ వేసిన చివరి ఓవర్లో అతడు ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్ 255 పరుగుల భారీ స్కోరును అందుకోగలిగింది. దూబే మొత్తంగా 9 మ్యాచ్‌లలో 235 పరుగులు చేశాడు. దూబే ఆడిన చిన్న చిన్న ఇన్నింగ్స్‌లు ఈ రోజు భారత్‌ను విశ్వవిజేతగా నిలిపింది.అక్షర్ అదుర్స్భారత్ ఫైనల్‌కు చేరి కప్ కొట్టడంలో అక్షర్ది కీలక పాత్ర. వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో పటేల్ బంతితో రాణించకపోయినప్పటికి ఫీల్డింగ్‌లో మాత్రం అద్భుతాలు చేశాడు. అక్షర్ సంచలన క్యాచ్‌లతో హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ వంటి విధ్వంసకర ప్లేయర్లను పెవిలియన్‌కు పంపాడు.ఒకవేళ అక్షర్ ఆ క్యాచ్‌లను అందుకోపోయింటే కథ మరోలా ఉండేది. అప్పటికే ఇంగ్లండ్ భారత్‌ను ఓడించే అంత పనిచేసింది. ఫైనల్ మ్యాచ్‌లోనూ అక్షర్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ వంటి డేంజరస్ ప్లేయర్లను ఔట్ చేసి భారత్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ ప్రపంచ కప్‌లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?Crowd started chanting "Dube !! Show us your muscles" when they saw Shivam Dube😅❤ Then Shivam Dube finally started flexing his muscles😂🔥pic.twitter.com/hOLNZDv7uy— Gillfied⁷ (@Gill_Iss) March 9, 2026 -
టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
పొట్టి ఫార్మాట్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి చాటి చెప్పింది. టీ20 ప్రపంచకప్-2026 విజేతగా సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు నిలిచింది. గతంలో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన చోట మన జట్టు అద్భుతాలు సృష్టించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఈ తుది పోరులో భారత జట్టు ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. ఈ చారిత్రత్మక విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరు కీలక పాత్ర పోషించారు. ఈ విజయాన్ని దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు ఎంత ప్రైజ్ మనీ దక్కిందో ఓసారి పరిశీలిద్దాం.ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?విజేత టీమిండియాకు రూ.27.48 కోట్ల నగదు బహుమతి లభించింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధికం . అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు రూ.14.65 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. సెమీఫైనలిస్ట్స్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సుమారు రూ. 7.24 కోట్లు అందుకోనున్నాయి. గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయిన ప్రతి జట్టుకు దాదాపు రూ. 2.29 కోట్లు లభించనుంది. 2024 టీ20 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని 20 శాతం వరకు భారీగా పెంచారు. ఐసీసీ ఏకంగా ఈ ఏడాది వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీని రూ.123 కోట్లగా నిర్ణయించింది. బీసీసీఐ సైతం భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డును ప్రకటించనుంది.చదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్ -
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
-
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
-
న్యూజిలాండ్-భారత్ ఫైనల్.. టిక్కెట్ ధర ఎన్ని లక్షలంటే?
టీ20 వరల్డ్‌కప్-2026 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ తుది పోరును వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. అహ్మదాబాద్ ప్రస్తుతం 'క్రికెట్ ఫీవర్'తో ఊగిపోతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.బుక్‌మై షో యాప్ ద్వారా టికెట్లను విక్రయించారు. ప్రారంభ టిక్కెట్ ధర రూ. 2 వేలు కాగా.. గరిష్ట ధర రూ. 75000గా నిర్ణయించారు. అయితే టిక్కెట్లు దొరకని అభిమానులను ధళారులు టార్గెట్ చేస్తున్నారు.బ్లాక్ మార్కెట్లో ఒక్కో టిక్కెట్‌ను రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) కార్యదర్శి అనిల్ పటేల్ స్పందించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి ఫిజికల్ టిక్కెట్లను విక్రయించడం లేదని, కేవలం బుక్‌మైషో యాప్ ద్వారానే అధికారిక బుకింగ్స్ జరుగుతాయని స్పష్టం చేశారు. అడ్డదారుల్లో టిక్కెట్లు కొనవద్దని ఆయన హెచ్చరించారు.కేవలం టిక్కెట్లే కాదు, అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల్లో హోటల్ గదుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సాధారణంగా అహ్మదాబాద్ హోటల్లో ఒక రోజుకు ధర రూ. 4,000గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ క్రేజ్ కారణంగా ఈ ధరలు ఏకంగా 10 రెట్లు పెరిగాయి. అంటే ఒక్క రోజుకు రూ.40,000 పైగా వసూలు చేస్తున్నారు. -
టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
-
టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్. సెమీస్‌లో 7 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలుపు
-
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
-
టీమిండియా జోరుకు బ్రేక్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా జోరుకు సౌతాఫ్రికా బ్రేక్‌లు వేసింది. అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, సఫారీ బౌలర్ల ధాటికి విల్లవిల్లాడింది.లక్ష్య చేధనలో సూర్య కుమార్ సేన 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(42) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లోనూ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో సఫారీలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అదరగొట్టారు.మిల్లర్ అదుర్స్..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఇక భారత్ సెమీఫైనల్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో తలపడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో భారత్ ఆడనుంది. -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భారత బౌలర్‌గా
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. తన సూపర్ బౌలింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికాను బుమ్రా దెబ్బ తీశాడు. ఇన్ఫామ్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, రికెల్టన్ను బుమ్రా ఔట్ చేశాడు.మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో జస్ప్రీత్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. బుమ్రా ఇప్పటివరకు పొట్టి ప్రపంచకప్ హిస్టరీలో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(32), అర్ష్‌దీప్ సింగ్(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిద్దిరిని బుమ్రా అధిగమించాడు.టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరేజస్ప్రీత్ బుమ్రా-33 రవిచంద్రన్ అశ్విన్- 32అర్ష్‌దీప్ సింగ్- 32హార్దిక్ పాండ్యా-29రవీంద్ర జడేజా-22 -
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
-
క్రికెట్‌కు బ్రేక్.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ
నిన్నటివరకు మైదానంలో బౌలర్లను బెంబేలెత్తించిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్లాస్‌రూమ్‌లో కూర్చుని పరీక్షలు రాసేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలకు అతడు హాజరు కానున్నాడు. బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైభవ్ ఈ పరీక్షలు రాయనున్నాడు.వైభవ్ సూర్యవంశీ మా పాఠశాలలో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కానున్నాడు. అతడికి ఇప్పటికే అడ్మిట్ కార్డ్ అందించాము. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వైభవ్ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడు ఇంకా విద్యార్ధి కాబట్టి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదు. అందరితో కలిసే పరీక్షలు రాయనున్నాడు. అందుకు తగ్గట్టు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోడార్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ సిన్హా పేర్కొన్నారు.కాగా 14 ఏళ్ల వైభవ్ ఐపీఎల్-2025లో రాజస్తాన్ తరపున కేవలం 15 బంతుల్లో సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కూడా భారత్-ఎ జట్టు, అండర్-19 జట్టు తరపున సంచలన ప్రదర్శనలు చేశాడు. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో సైతం దుమ్ములేపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగులతో సత్తాచాటిన వైభవ్.. భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. మొత్తంగా 439 పరుగులు చేసిన వైభవ్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచాడు.చదవండి: వారెవ్వా జింబాబ్వే -
పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026లో భారత క్రికెట్ జట్టు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. పాక్‌తో పోరు నాటికి పూర్తిగా కోలుకోనున్నట్లు తెలుస్తోంది.అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత అభిషేక్‌కు తీవ్రమైన కడుపు సమస్య రావడంతో న్యూఢిల్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతడు చికిత్స పూర్తి చేసుకొని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. అయితే నమీబియాతో మ్యాచ్‌కు ముందు అభిషేక్ ప్రాక్టీస్ కూడా చేశాడంట. ఈ విషయాన్ని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ధ్రువీకరించాడు.నమీబియాతో మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడుతాడని నేను అనుకుంటున్నాను. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఈ రోజు అతడు ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని నాతో చెప్పాడని వరుణ్ అన్నాడు.2 కిలోలు తగ్గిన అభిషేక్అభిషేక్ శర్మ కూడా తన ఫిట్‌నెస్‌పై అప్డేట్ ఇచ్చాడు. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడిన అభిషేక్, చికిత్స సమయంలో రెండు కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తాను కేవలం పప్పు అన్నం మాత్రమే తింటున్నానని ఓ వీడియోలో అభిషేక్ పేర్కొన్నాడు. ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌కు అభిషేక్ దూరమైతే, భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రెండింటిలోనూ మెన్ ఇన్ బ్లూ సత్తాచాటింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో టీమిండియా ఓ ప్రపంచ రికార్డును తమపేరిట లిఖించుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా వరుసగా 8 విజయాలు సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండు విజయాలు నమోదు చేయడంతో ఈ అరుదైన భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత్ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు వరుసగా 8 విజయాలు నమోదు చేశాయి.టీ20 ప్రపంచకప్‌లో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లు ఇవేభారత్-10ఆస్ట్రేలియా-8దక్షిణాఫ్రికా-8ఇంగ్లండ్-7చదవండి: T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్ సింగ్ -
రియాన్ పరాగ్ విధ్వంసం.. పసికూనను చిత్తు చేసిన భారత్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో చివరి వార్మప్ మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు 130 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు.పరాగ్ కేవలం 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 పరుగులు చేశాడు. అతడితో పాటు నమన్ ధీర్ (39), అశుతోష్ శర్మ (35) మెరుపులు మెరిపించారు. గెర్హార్డ్ ఎరాస్మస్, రూబెన్ ట్రంపెల్మాన్ ,మాక్స్ హీంగో తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా, భారత బౌలర్ల ధాటికి కేవలం 12.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది.నమీబియా బ్యాటర్లలో డైలాన్ లీచర్(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్, మయాంక్ యాదవ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ తలా రెండు వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించారు. -
రేపటి నుంచే టీ20 వరల్డ్‌కప్.. టీమిండియాకు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం(ఫిబ్రవరి 5) దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఏ మాత్రం ఫలితం లేదు. ఈ క్రమంలో రాణా ఫిజియో సాయంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం అతడిని అస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు. అయితే స్కాన్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం.రాణా గాయం నుంచి కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పొట్టి ప్రపంచకప్ దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం బీసీసీఐ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశముంది. కెప్టెన్ల మీట్ సందర్భంగా భారత సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా హర్షిత్ అందుబాటుపై సందేహం వ్యక్తం చేశాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న వాంఖడే వేదికగా అమెరికాతో తలపడనుంది. ఒకవేళ హర్షిత్ టోర్నీ నుంచి తప్పుకొంటే ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. -
టీ20 వరల్డ్‌కప్ విజేత ఎవరో చెప్పేసిన సునీల్ గవాస్కర్
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్-2026కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం 20 జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుండగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు టైటిల్ ఫేవరేట్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ విజేత ఎవరన్నదిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. టీమిండియా తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకుంటుందని సన్నీ థీమా వ్యక్తం చేశాడు. "భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి అని భావిస్తున్నాను. ఫైనల్లో మాత్రం ఇంగ్లండ్, భారత్ తలపడడం ఖాయం. ఇంగ్లండ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లీష్ జట్టు సొంతం చేసుకుంది.అలాగే టీమిండియా కూడా టీ20ల్లో అసాధరణ ప్రదర్శన కనబరుస్తోంది. కాబట్టి ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి మెన్ ఇన్ బ్లూ టైటిల్‌ను రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని" గవాస్కర్ స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భారత్ తమ తొలి మ్యాచ్‌లో టోర్నీ ఆరంభం రోజునే ముంబై వేదికగా అమెరికాతో తలపడనుంది. -
రీఎంట్రీలో అదరగొట్టిన తిలక్ వర్మ
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తన రీఎంట్రీలో సత్తాచాటాడు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు నవీ ముంబై వేదికగా అమెరికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో తిలక్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. కేవలం 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. తొలుత 8 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి కాస్త ఆచితూచి ఆడిన తిలక్.. హర్మీత్ సింగ్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాది ఒక్కసారిగా జోరు పెంచాడు. వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్‌తో కలిసి తిలక్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే మంచి టచ్‌లో కన్పించిన తిలక్, అమెరికా పేసర్ శుభమ్ రంజన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ తర్వాత తిలక్ మంగళవారం(ఫిబ్రవరి 3)న జట్టుతో కలవనున్నాడు. తిలక్ దాదాపు నెల రోజుల నుంచి పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయినప్పటికి గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తొలి మ్యాచ్‌లోనే ఈ తరహా ప్రదర్శన చేయడం గమనార్హం.భారత్ భారీ స్కోర్‌కాగా జగదీశన్ నారయణ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ ఆయూష్ బదోని(60) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ జట్టు మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, శుభమ్, జస్దీప్ సింగ్ తలా వికెట్ పడగొట్టారు. -
టీమిండియా వరల్డ్ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026కు ముందు టీమిండియా భీకర ఫామ్‌లో ఉంది. ఈ మెగా టోర్నీ సన్నాహల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ అదరగొట్టింది. ఈ సిరీస్‌ను 4-1 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. శనివారం తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి టీ20లోనూ టీమిండియా దుమ్ములేపింది.కివీస్‌ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 61) సైతం సత్తాచాటాడు. 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ ఆఖరివరకు పోరాడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్‌తో విరుచుకుపడ్డ టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఇంగ్లండ్ వరల్డ్ రికార్డు బ్రేక్..అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు 250 ప్లస్ పరుగులు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా ఇప్పటివరకు నాలుగు సార్లు 250 పైగా పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే(3) రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది. అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు(69) కొట్టిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట(64) ఉండేది.చదవండి: 'స్కై' మళ్లీ నీలి రంగులోకి మారింది.. చాలా సంతోషంగా ఉంది: సూర్య -
'స్కై' మళ్లీ నీలి రంగులోకి మారింది.. చాలా సంతోషంగా ఉంది: సూర్య
టీ20 ప్రపంచకప్-2026కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి పోరు(ఐదో టీ20)లో టీమిండియా సత్తాచాటింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103) శతక్కొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(63), హార్దిక్ పాండ్యా(42) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో కివీస్ 225 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ నిలవగా.. సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. గతేడాది మొత్తం పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడిన సూర్య.. కొత్త ఏడాదిలో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు మూడు హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు."ఈ క్షణం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నా రిథమ్‌ను తిరిగి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్కై ఉన్నప్పుడు భయం ఎందుకని మురళీ కార్తీక్ గత సిరీస్‌లోనే చెప్పారు. నేను కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. నా బ్యాటింగ్‌లో కూడా ఎటువంటి మార్పులు చేసుకోలేదు.ఎందుకంటే నేను 'అవుట్ ఆఫ్ ఫామ్' లో లేను, కేవలం 'అవుట్ ఆఫ్ రన్స్'లో ఉన్నానని నాకు తెలుసు ఒక మంచి ఇన్నింగ్స్‌తో నా రిథమ్ తిరిగి అందుకోవచ్చన్న థీమాతో ఉండేవాడిని. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్‌లో నా ఫామ్‌ను తిరిగి సాధించాను.వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ముందు తిరిగి ట్రాక్‌లో పడడం ఆనందంగా ఉంది. గత ఏడాది కాలంగా ఆకాశం(స్కై) నీలి రంగులో కన్పించలేదు. కానీ ఒక క్రీడాకారుడి జీవితంలో ఎత్త పల్లాలు సహజం. ఇటువంటి సమయంలో అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుంటే తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. ఇప్పుడు నేను అదే పనిచేశాను. గత సిరీస్ తర్వాత దొరికిన విరామంలో సన్నిహితులతో గడిపాను. వారు చెప్పిన కొన్ని కీలక విషయాలు నన్ను ప్రేరేపించాయి. ఇక గెలిచినా, ఓడినా ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. ముంబైలో సౌత్ ఆఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్ తర్వాత, మాలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాము. మిగితా ఫార్మాట్లతో పోలిస్తే టీ20 ఫార్మాట్ బౌలర్లకు ఒక కఠిన పరీక్ష వంటిది. మనం భారీ స్కోరు చేసినప్పుడు, ప్రత్యర్థి జట్టు కూడా అంతే ధీటుగా బదులు ఇస్తోంది. కెప్టెన్, బౌలింగ్ యూనిట్‌పై ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. -
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ 272
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సంజూ శాంసన్ ఆరంభంలోనే ఔటైనప్పటికి మిగితా బ్యాటర్లు మాత్రం కివీస్ బౌలర్లను ఉతికారేశారు.వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. సంజూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు, శాంట్నర్, జేమిసన్, డఫీ తలా వికెట్ సాధించారు. -
టీ20 వరల్డ్ కప్‌లో 300 కొట్టే సత్తా వారికే ఉంది: రవి శాస్త్రి
టీ20 ప్రపంచకప్-2026కి మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి శ్రీలంక, భారత్ వేదికలగా షురూ కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్ల చొప్పున ఉంటాయి. భారత్, పాక్ గ్రూప్-ఎలో పోటీపడనున్నాయి.ఆఖరి నిమిషంలో బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశమిచ్చింది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న యూఎస్ఎతో తలపడనుంది. సొంతగడ్డపై జరగనుండడంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.అదేవిధంగా రన్నరప్ సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా ఈవెంట్లో 300 పరుగుల భారీ మార్కును దాటే సత్తా ఉన్న జట్లు ఏవనే విషయంపై శాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు."ఆస్ట్రేలియా, భారత జట్లకు 300 పరుగులు మార్క్ దాటే సత్తా ఉంది. ఈ రెండు రెండు జట్లలోనూ విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో ఎవరైనా ఒకరు సెంచరీ సాధిస్తే, జట్టు స్కోరు 300కు చేరువవ్వడం కష్టమేమీ కాదు. ఇక భారత్ ఢిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. టైటిల్‌ను రిటైన్ చేసుకునేందుకు మెన్ ఇన్ బ్లూ ప్రయత్నిస్తుంది. అంతుకుతోడు ఈ టోర్నీ సొంతగడ్డపై జరగుతోంది. కాబట్టి భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. టీ20 ఫార్మాట్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఆట మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. ఆ సమయంలో భారత్ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందన్నపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.అయితే భారత జట్టులో బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాటింగ్ పరంగా పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చు" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 300 పరుగులు పైగా చేసిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ కొనసాగుతోంది. -
టీమిండియాకు గుడ్ న్యూస్.. డేంజరస్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు!
టీ20 ప్రపంచకప్-2026కు టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అబ్డోమినల్ సర్జరీ తర్వాత తిలక్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు.అయితే శుక్రవారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగే సిమ్యులేషన్ మ్యాచ్‌లో తిలక్ పాల్గోనున్నాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ తన ఫిట్నెస్ను నిరూపించుకుంటే బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తుంది. ఒకవేళ బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తే తిలక్.. ఫిబ్రవరి 3న భారత జట్టుతో కలిసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా తొలుత న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ పూర్తిగా కోలుకుండా అతడి ఆడించి రిస్స్ తీసుకోడదని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే తిలక్ స్ధానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌ను ఆఖరి రెండు టీ20లకూ కొనసాగించారు. తిలక్ తిరిగి రీఎంట్రీ ఇస్తే జట్టు మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. మయాంక్ ఫిట్..మరోవైపు వెన్నునొప్పి కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న ఢిల్లీ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగే వార్మప్ మ్యాచ్‌లలో ఇండియా-ఎ తరపున మయాంక్ బరిలోకి దిగనున్నాడు. అదేవిధంగా కుడి భుజం గాయం నుంచి కోలుకున్న అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ యో-యో టెస్టు పాస్ అయ్యాడు.అతడు కూడా తిలక్‌తో కలిసి సిమ్యులేషన్ మ్యాచ్‌లో భాగం కానున్నాడు. ఇక కివీస్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అతడికి ఫిబ్రవరి 4న ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లకు వాషీ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.చదవండి: వరల్డ్‌కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్ -
వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా: సూర్యకుమార్
వన్డేల్లో న్యూజిలాండ్‌తో చేతిలో ఎదురైన పరభావానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం గౌహతి వేదికగా కివీస్‌తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే 3-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బౌలింగ్‌లో పర్యాటక జట్టును కేవలం 153 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపింది. ఓపెనర్ అభిషేక్ శర్మ( 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.ఫలితంగా 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మురళీ కార్తీక్ నుంచి కెప్టెన్ సూర్యకుమార్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలానే ఆధిపత్యాన్ని చెలాయించావా? అని కార్తీక్ ప్రశ్నించాడు."మా స్కూల్ ప్రిన్సిపాల్ , టీచర్లు క్రికెట్ ఆడేందుకు నాకు చాలా సమయం ఇచ్చేవారు. పరీక్షల సమయం, స్కూల్ టైమ్‌లో కూడా నాకు చాలా సెలవులు ఇచ్చారు. గ్రౌండ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడని. అక్కడే నేను ఆటలోని మెలకువలన్నీ నేర్చుకున్నాను. ఈ లక్ష్య చేధన గురించి మేం ముందే మాట్లాడుకున్నాం. మేము మొదట బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఒకే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాము.ఒకవేళ రేపు మ్యాచ్‌లో 20 పరుగులకే 3 వికెట్లు లేదా 40 పరుగులకే 4 వికెట్లు పడినా, పరిస్థితికి తగ్గట్టు ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు తెలుసు. మా జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. ఇక మా టాప్ 2-3 బ్యాటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు నా పనిని సులభం చేస్తున్నారు. ఇక బిష్ణోయ్ తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. బిష్ణోయ్ తన రోల్‌పై ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. అతడికి తన బలాలు ఏంటో తెలుసు. క్లిష్ట సమయాల్లో వికెట్లు అందించడం అతడిప్రత్యేకత. రవి చాలా జట్టులో ఉండడం మాకు ప్లస్ పాయింట్" అని సూర్య పేర్కొన్నాడు. కాగా భారత జట్టును కెప్టెన్‌గా సూర్యకుమార్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో 41 మ్యాచ్‌లు ఆడిన భారత్ 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. -
కోహ్లి వీరోచిత పోరాటం వృథా.. ఇండోర్‌లో భారత్ ఓటమి
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి విరోచిత సెంచరీతో పోరాడినప్పటికి జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కోహ్లి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. భారీ లక్ష్య చేధనలో భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం గిల్, కోహ్లి కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వరుస క్రమంలో గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), రాహుల్(1) వికెట్లు భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి(53), విరాట్ కోహ్లి కలిసి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత నితీశ్(53), జడేజా(12) వెంటవెంటనే ఔట్ కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా(52).. కోహ్లితో కలిసి మెరుపులు మెరిపించాడు. కానీ వరుస క్రమంలో హర్షిత్, కోహ్లి వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో చెలరేగారు. -
ఇదేమి నాకు కొత్త కాదు.. క్రికెట్ కూడా వదిలేయాలనుకున్నా: హర్షిత్ రాణా
టీమిండియా యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా తరుచూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ వల్లే అతడికి మూడో ఫార్మాట్లలో ఆడే అవకాశం దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ ఢిల్లీ ఆల్‌రౌండర్ టెస్టులకు దూరంగా ఉంటున్నప్పటికి.. భారత పరిమిత ఓవర్ల జట్టులో మాత్రం రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు.హర్షిత్ టీ20ల్లో పెద్దగా రాణించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. అయినప్పటికి ఏదో ఒక విధంగా అతడు ట్రోల్స్‌కు గురువుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్షిత్ రాణా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు."వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు నాకు బాగా తెలుసు. దాదాపు పదేళ్ల పాటు సెలక్షన్లలో నాకు నిరాశే ఎదురైంది. ఎన్నో ట్రయల్స్‌కు వెళ్లేవాడిని, కానీ ఫైనల్ లిస్ట్‌లో నా పేరు ఉండేది కాదు. ఇంటికి తిరిగి వచ్చి మా నాన్న ముందు ప్రతిరోజూ ఏడ్చేవాడిని. ఇప్పుడు ఏలాంటి వైఫల్యం ఎదురైనా దానిని తట్టుకోగలను. ఒకానొక దశలో క్రికెట్‌ను వదిలేయాలని అనుకున్నా. కానీ మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే మళ్లీ తిరిగి నిలబడ్డా" అని హర్షిత్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కూడా హర్షిత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు ఓవరాల్‌గా 13 వన్డేలు ఆడిన హర్షిత్ రాణా 23 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్-2026 భారత జట్టులో కూడా రాణా సభ్యునిగా ఉన్నాడు. -
భారత వరల్డ్‌కప్ జట్టులోకి ఓవరాక్షన్ స్టార్?
టీ20 ప్రపంచకప్-2026కు భారత్, శ్రీలంక వేదికలగా మరో 20 రోజుల్లో తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. రిషబ్ పంత్ ప్రస్తుతం టీ20 ప్రణాళికల్లో లేకపోయినప్పటికి.. స్క్వాడ్‌లో ఉన్న తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలు ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారాయి.ప్రపంచకప్ ఆరంభ సమయానికి తిలక్ కోలుకునే అవకాశమున్నప్పటికి.. వాషింగ్టన్ అందుబాటుపై మాత్రం సందిగ్ధం నెలకొంది. సుందర్ ప్రస్తుతం ప్రక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు కివీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.వాషీ కోలుకోవడానికి దాదాపు ఐదు వారాల సమయం పట్టనునున్నట్లు తెలుస్తోంది. అతడు పొట్టి ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అతడి అందుబాటుపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశముంది.వరల్డ్‌కప్ జట్టులోకి పరాగ్..మరోవైపు వాషింగ్టన్ సుందర్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరిని తీసుకోవాలన్నదానిపై సెలెక్టర్లు కసరత్తలు మొదలు పెట్టినట్లు సమాచారం. అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా పరాగ్‌కు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా పరాగ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంక పర్యటనలో పరాగ్ ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించాడు.లంకతో ఓ టీ20 మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వన్డే మ్యాచ్‌లో కూడా 9 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు సాధించాడు. ఈ పర్యటన ద్వారా రియాన్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, కీలక సమయాల్లో వికెట్లు తీయగలే సత్తా ఉంది అని నిరూపించుకున్నాడు. అయితే ఆ తర్వాత భుజం గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. రియాన్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు. అతడు దాదాపు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. పరాగ్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు.. బంతితో అద్భుతాలు కూడా చేయగలడు. కాబట్టి చాలా మంది మాజీలు వాషీకి సరైన ప్రత్యామ్నాయం రియాన్ అని అభిప్రాయపడుతున్నారు.చదవండి: కనీసం మూడో మ్యాచ్‌లోనైనా ఆడించండి: అశ్విన్ -
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్..
అండర్-19 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్ర నిరాశపరిచాడు. ఈ టోర్నీలో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యవంశీ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది.దీంతో స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్ తనదైన శైలిలో విరుచుకుపడతాడని అంతా భావించారు. కానీ 14 ఏళ్ల వైభవ్ మాత్రం తుస్సుమన్పించాడు. 2 పరుగులు చేసిన సూర్యవంశీ.. రిత్విక్ అప్పిడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ప్రత్యర్ధి జట్టు సంబరాల్లో మునిగితేలిపోయింది. బౌలింగ్‌లో మాత్రం వైభవ్ ఓ వికెట్ పడగొట్టాడు.వర్షం అటంకి..కాగా భారత్ లక్ష్య చేధనకు వరుణుడు అడ్డంకిగా మారాడు. 4 ఓవర్లలో భారత్ స్కోర్ 21/1 వద్ద ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. క్రీజులో అయూశ్ మాత్రే(15), త్రివేది(2) ఉన్నారు. అంతకుముందు భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం -
వారెవ్వా హర్షిత్.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి బంతితో అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వేను సంచలన బంతితో రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.కానీ భారత పేసర్లు రాణా, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రాణా వేసిన అద్భుతమైన డెలివరీకి కాన్వే దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ ఢిల్లీ పేసర్ కాన్వేకు గుడ్ లెంగ్త్ బాల్‌గా సంధించాడు.బంతి ఆఫ్ స్టంప్ దగ్గర పిచ్ అయ్యి లోపలికి దూసుకొచ్చింది. కాన్వే ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. వెంటనే హర్షిత్ రాణా తనదైన శైలిలో దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వైపు వేలు చూపిస్తూ చెప్పా కాదా అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు తొలి వన్డేలో రాణా రెండు వికెట్లతో పాటు 29 పరుగులు చేశాడు. తనపై విమర్శలు చేస్తున్నవారికి తన ప్రదర్శనలతో రాణా సమాధనమిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(112) అజేయ సెంచరీతో మెరిశాడు.చదవండి: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్Off stump out of the ground 🔥🔥Harshit Rana gets the opening wicket in fine fashion! ⚡️Updates ▶️ https://t.co/x1fEenI0xl#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/mYvTSD273W— BCCI (@BCCI) January 14, 2026 -
రాణించిన కివీస్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ టార్గెట్
రాజ్‌కోట్ వేదికగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బ్లాక్ క్యాప్స్ జట్టుకు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 117 పరుగులు జోడించి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. నికోలస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విల్ యంగ్(12) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. డెవాన్ కాన్వే కూడా వెంటనే పెవిలియన్‌కు చేరాడు. అయితే మిడిలార్డర్లో సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.మిచెల్ 71 బంతుల్లో 5 ఫోర్లు, 33 సిక్స్‌లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో అరంగేట్ర ఆటగాడు క్లార్క్(24) రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణన్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్ -
'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'
నితీశ్ కుమార్ రెడ్డి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గతేడాది భారత్ తరపున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీమ్ మెనెజ్‌మెంట్ విఫలమైందనే చెప్పుకోవాలి. ఒక సిరీస్‌కు ఎంపిక చేస్తే మరొక సిరీస్‌కు పక్కన పెట్టడం, ఒకవేళ ఎంపికైనా తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం వంటివి అతడి కెరీర్‌ను వెనుక్కి నెట్టిస్తున్నాయి. అంతేకాకుండా అతడిని ఆల్‌రౌండర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుని కేవలం బ్యాటింగ్‌కు పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన నితీశ్.. ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 100.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ పట్ల టీమ్ మెనెజ్‌మెంట్ కఠినంగా వ్యవహరించింది.న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. కానీ వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డే తుది జట్టులో మాత్రం నితీశ్‌కు చోటు దక్కలేదు.అతడిని కాదని స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్మెంట్పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. అతడికి అవకాశమివ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారని పఠాన్ మండిపడ్డాడు."నితీశ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ ఇవ్వనప్పుడు, అతడిని ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? టీమ్‌తో పాటు ఉంటాడు.. కానీ తుది జట్టులో కన్పించడు. అతడిని పక్కన పెట్టడానికి ఏదో సరైన కారణముంది. ఒకవేళ తుది జట్టులో చోటు ఇచ్చినా.. ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్, 8 స్ధానంలో బ్యాటింగ్‌కు పంపుతారు. ఇది సరైన విధానం కాదు. రెగ్యూలర్‌గా అవకాశమివ్వకపోతే ఎప్పటికీ అతడిని ఒక మంచి ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దలేరు. హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే నితీశ్‌కు వరుస అవకాశాలు ఇవ్వాలి. హార్దిక్ కూడా కెరీర్ ఆరంభంలో వరుస అవకాశాలు పొందడం వల్లే స్టార్‌గా ఎదిగాడన్న విషయం మర్చిపోవద్దు" అని స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్ -
IND vs NZ: 'ఈసారి కూడా వైట్ వాష్ చేస్తాము'
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం(జనవరి 11) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొదటి వన్డేకు వడోదరలోని బీసీఎ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అయితే ఏడాదిన్నర కిందట స్వదేశంలో భారత్‌ను టెస్టుల్లో వైట్‌వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు అదే ఫలితాన్ని వన్డేల్లో కూడా పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది.ఇదే విషయాన్ని తొలి వన్డేకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విల్ యంగ్ స్పష్టం చేశాడు. కివీస్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, భారత్‌ను ఓడించగలమని యంగ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా 2024 ఆఖరిలో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది.మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ వైట్ వాష్ చేసింది. బ్లాక్ క్యాప్స్ జట్టు 1955 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయంలో యంగ్‌ది కీలక పాత్ర. యంగ్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు."ఈసారి భిన్నమైన ఫార్మాట్లో క్రికెట్ ఆడేందుకు భారత్ పర్యటనకు వచ్చాము. మా జట్టు ప్రస్తుతం వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్ ప్లేయర్లు దూరంగా ఉన్నప్పటికి మేము మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఈ సిరీస్‌కు ముందు మేము స్వదేశంలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో వన్డేల్లో విజయం సాధించాము.గత భారత పర్యటనలో మేము సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఈసారి కూడా గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. భారత్‌లో మరొక సిరీస్ గెలవడమే మా లక్ష్యం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరి మెట్టుపై బోల్తా పడ్డాము. కానీ ఆ ఓటమిని మేము ఎప్పుడో మర్చిపోయాము.ఇప్పుడు మా దృష్టి కేవలం ఈ ద్వైపాక్షిక సిరీస్ పైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా గతేడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేతిలో కివీస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ భారత పర్యటకు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్,రచిన్ రవీంద్ర వంటి స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. వన్డే సిరీస్‌కు కివీస్ కెప్టెన్‌గా మైఖల్ బ్రెస్‌వెల్ వ్యవహరించనున్నాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో -
'అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి'
2025 ఏడాది.. టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా టెస్టుల్లో అయితే భారత్ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సమం చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికి.. సౌతాఫ్రికాపై ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది.రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో గిల్ సేన వైట్ వాష్‌కు గురైంది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ తప్పనిసారిగా గెలవాలి. ఈ నేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉతప్ప అభిఫ్రాయపడ్డాడు. పాండ్యా ప్రస్తుతం కేవలం వైట్ బాల్ క్రికెట్లో మాత్రమే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేసిన పాండ్యా.. ఇప్పటివరకు కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడాడు. చివరసారిగా పాండ్యా టెస్టుల్లో 2018లో ఇంగ్లండ్‌పై ఆడాడు. వెన్ను గాయం కారణంగా అతడు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 11 టెస్టుల్లో 532 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు."హార్దిక్ పాండ్యాను తిరిగి వైట్ బాల్ జెర్సీలో చూడాలనుకుంటున్నాను. పాండ్యా టెస్టు క్రికెట్లోకి తిరిగి వస్తే.. అతడికి ఏడో స్ధానం సరిగ్గా సరిపోతుంది. భారత్ లోయార్డర్ బ్యాటింగ్ కష్టాలు తీరిపోతాడు. అతడొక అద్భుతమైన ఆటగాడు. ఒకవేళ పాండ్యా టెస్టుల్లో తిరిగి ఆడేందుకు సముఖత చూపిస్తే.. సెలక్టర్లు గానీ, బోర్డు పెద్దలు గానీ నో చెప్పరు. ఎందుకంటే అతడు సూపర్ ఫామ్‌తో పాటు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 12 నుండి 15 ఓవర్ల వరకు సులభంగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుతం జట్టులోని మిగితా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎవరూ కూడా 20 ఓవర్లకు మించి బౌల్ చేయడం లేదు కాదు. నితీశ్ కుమార్ రెడ్డి కేవలం 12 ఓవర్ల లోపే బౌలింగ్ చేస్తున్నాడు. హార్దిక్ అంతకుమించి ఒకట్రెండు ఓవర్లు ఎక్కువగా బౌలింగ్ చేయగలడు. అతడు రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. కానీ ఇది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని" తన యూట్యూబ్ ఛానల్లో ఉతప్ప పేర్కొన్నాడు.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే!
టీ20 ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 40 రోజుల్లో భారత్, శ్రీలంక వేదికలగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. తిరిగి టైటిల్‌ను రిటైన్ చేసుకోవాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఛాంపియన్స్‌గా నిలస్తుందని భజ్జీ జోస్యం చెప్పాడు."టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు టీమిండియాకు ఎక్కువగా ఉన్నాయి. మన ఆటగాళ్లకు ఉపఖండ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఇది భారత జట్టుకు బాగా కలిసొస్తోంది. అయితే టోర్నీలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి కూడా భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనైనా ఆస్ట్రేలియా కచ్చితంగా టైటిల్ రేసులో ఉంటుంది. కాబట్టి కంగారూలను తక్కువగా అంచనా వేయకూడదు. సౌతాఫ్రికా కూడా గత కొంత కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అఫ్గానిస్తాన్ జట్టు కూడా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు.భారత్ వంటి ఉపఖండ పిచ్‌లలో వారు ఎవరినైనా ఓడించగలరు. నా వరకు అయితే .. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గాన్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయని అనుకుంటున్నాను"అని లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) సీజన్ 4 ప్రారంభోత్సవంలో భజ్జీ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2026కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ సింగ్ పటేల్, వాషింగ్టన్ పటేల్, వాషింగ్టన్ సందర్.చదవండి: రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. మెల్బోర్న్ పిచ్‌పై ఐసీసీ ఆగ్రహం -
గంభీర్‌కు పదవీ గండం!.. అతడితో చర్చలు జరిపిన బీసీసీఐ?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైనప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గంభీర్ పర్యవేక్షణలో సేనా(సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) దేశాలపై భారత్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా గత నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అతడిని వెంటనే ప్రధాన కోచ్‌గా తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో బీసీసీఐ కూడా హెడ్ కోచ్ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. టెస్టు జట్టు కోసం ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలన్న యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలో హెడ్ కోచ్ పదవి కోసం లెజెండరీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు ప్రతినిధులు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను లక్ష్మణ్‌ను తిరష్కరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) హెడ్‌గా ఉన్నాడు. అయితే ప్రస్తుత బాధ్యతలతోనే తను సంతోషంగా ఉన్నానని, సీనియర్ జట్టు కోచింగ్‌పై ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేశాడంట. కానీ మరోసారి లక్ష్మణ్‌తో చర్చలు జరిపేందుకు బోర్డు పెద్దలు సిద్దమైనట్లు సమాచారం. గంభీర్ మెడపై కత్తి..కాగా వన్డే ప్రపంచకప్-2027 ముగిసే వరకు బీసీసీఐతో గంభీర్ కాంట్రాక్ట్ ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన బట్టి అతడి కాంట్రాక్ట్‌ను బోర్డు పునః సమీక్షించే అవకాశముంది. గంభీర్ కోచింగ్‌లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది.గంభీర్ ముందు పొట్టి ప్రపంచకప్‌తో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం. మిగిలిన మ్యాచ్‌లలో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత క్రికెట్ జట్టుకు మరో ఎనిమిది నెలల వరకు ఎటువంటి టెస్టు సిరీస్‌లు లేవు.చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం -
టీమిండియాకు గుడ్ న్యూస్..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు.దాదాపు రెండు నెలల విరామం తర్వాత అయ్యర్ బుధవారం(డిసెంబర్ 24) తన మొదటి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోన్నట్లు సమాచారం. సుమారు గంటసేపు నెట్స్‌లో గడిపిన శ్రేయస్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.అతడు ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. శ్రేయస్ ఒకట్రెండు రోజుల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ ముంబై ఆటగాడు 4 నుంచి 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గోనున్నాడు.అనంతరం అతడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృంది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించింది. ఒకవేళ ఈ పరీక్షలో అయ్యర్ పాసైతే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది. కివీస్‌తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు.అయ్యర్‌కు ఏమైందంటే?అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. మూడు రోజుల తర్వాత అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకు తిరిగొచ్చిన అయ్యర్.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. అతడికి దాదాపు నాలుగు ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని పార్దివాలా సూచించారు.ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకోవడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఒకవేళ అయ్యర్ తన ఫిట్నెస్ను నిరూపించుకుంటే.. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.చదవండి: ఐపీఎల్ వద్దు పొమ్మంది.. కట్‌చేస్తే.. డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు! -
'అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్ టోర్నీకి రెడీ'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లి.. తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు.బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి శతక్కొట్టాడు. 299 పరుగుల భారీ లక్ష్య చేధనలో కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఢిల్లీ బాయ్ కేవలం 101 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. కోహ్లికి ఇది 58వ లిస్ట్-ఎ సెంచరీ. అదేవిధంగా ఇదే మ్యాచ్‌లో16,000 లిస్ట్-ఏ పరుగుల మైలురాయిని కూడా కోహ్లి అధిగమించాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్నాడు. అయినప్పటికి తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని కింగ్ నిరూపించుకుంటున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2027కు తాను సిద్దంగా ఉన్నానని తన ప్రదర్శనలతోనే సాటిచెబుతున్నాడు. 2025లో కోహ్లి 13 వన్డేల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. "విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కనబరిన జోరునే విజయ్ హాజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.. తన అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినప్పటికి.. ఎక్కడా కూడా అతడిలో తడబాటు కన్పించలేదు. విరాట్ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. అతడు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లి 302 పరుగులు చేశాడు.చదవండి: అదరగొట్టిన రింకూ సింగ్, ధ్రువ్ జురెల్.. చెలరేగిన జీషన్ అన్సారీ -
చాలా బాధపడ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా: రోహిత్ శర్మ
నవంబర్ 19, 2023.. భారత క్రికెట్ అభిమానులకు గుండె కోత మిగిల్చిన రోజు. అదే రోజు రాత్రి కోట్లాది భారతీయుల కలలు, ఆశలు ఒక్క ఓటమితో అవిరయ్యాయి. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. అనూహ్యంగా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. అయితే ఆ ఓటమిని ఇప్పటికీ అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రోహిత్ అప్పటి చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆ ఓటమి తనను ఎంతగానో కృంగదీసిందని హిట్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు."2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత నేను మానసికంగా కుంగిపోయాను. ఇకపై క్రికెట్ ఆడకూడదని, వెంటనే తప్పుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే ఆ టోర్నీ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. ఇక సాధించడానికి ఏమి మిగిల లేదన్పించింది. 2022లో కెప్టెన్సీ చేపట్టినప్పటి నుండి ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.అటువంటిది ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచిపోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. మళ్లీ నాకు నేనే ధైర్యం చెప్పుకొని నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చాను. మరోసారి లక్ష్యంగా దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాను. జీవితం అక్కడితో అగిపోదు.. కొత్తగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాను. ఆ పట్టుదలే 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా మమ్మల్ని నిలబెట్టింది" అని మాస్టర్స్ యూనియన్ కార్యక్రమంలో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా


