టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్‌.. ప్రైజ్‌మ‌నీ ఎన్ని కోట్లంటే? | T20 World Cup 2026: Team India bags a massive Rs 27.5 crore | Sakshi
Sakshi News home page

T20 WC 2026: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్‌.. ప్రైజ్‌మ‌నీ ఎన్ని కోట్లంటే?

Mar 9 2026 11:30 AM | Updated on Mar 9 2026 11:49 AM

T20 World Cup 2026: Team India bags a massive Rs 27.5 crore

పొట్టి ఫార్మాట్‌లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి చాటి చెప్పింది. టీ20 ప్రపంచకప్‌-2026 విజేతగా సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు నిలిచింది. గతంలో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన చోట మన జట్టు అద్భుతాలు సృష్టించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.

ఈ తుది పోరులో భార‌త జ‌ట్టు ఆల్‌రౌండ్‌షోతో అద‌ర‌గొట్టింది. ఈ చారిత్ర‌త్మ‌క విజ‌యంలో జ‌ట్టులోని ప్ర‌తీ ఒక్క‌రు కీల‌క పాత్ర పోషించారు. ఈ విజయాన్ని దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు ఎంత ప్రైజ్ మనీ దక్కిందో ఓసారి పరిశీలిద్దాం.

ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
విజేత‌ టీమిండియాకు రూ.27.48 కోట్ల నగదు బహుమతి లభించింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధికం . అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు రూ.14.65 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. సెమీఫైనలిస్ట్స్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జ‌ట్లు సుమారు రూ. 7.24 కోట్లు అందుకోనున్నాయి. 

గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయిన ప్రతి జట్టుకు దాదాపు రూ. 2.29 కోట్లు ల‌భించ‌నుంది. 2024 టీ20 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని 20 శాతం వరకు భారీగా పెంచారు. ఐసీసీ ఏకంగా ఈ ఏడాది వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్రైజ్‌మ‌నీని రూ.123 కోట్ల‌గా నిర్ణ‌యించింది. బీసీసీఐ సైతం భార‌త జ‌ట్టుకు భారీ క్యాష్ రివార్డును ప్ర‌కటించ‌నుంది.
చదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్‌
 

Advertisement
 
Advertisement
Advertisement